Thread Rating:
  • 45 Vote(s) - 3.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(2) వారసుడు - completed
(30-06-2026, 07:04 AM)Kman50459 Wrote: Em Anna update aa bro as usual super vundi..please bro ilanaee updates istu vundadi bro..

(30-06-2026, 07:05 AM)arkumar69 Wrote: Namaskar superb brother keep going 

(30-06-2026, 07:28 AM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.

(30-06-2026, 09:27 AM)Jathirathnam Wrote: [Image: 4568e43b-09a0-46d1-9d7d-6ab30d717e8c.jpg]

⭐️ ⭐️ ⭐️
Three Guys one Dream


Thankyou very much
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Twaraga pettesthe, chadivi taristham raaga garu
[+] 1 user Likes murali99's post
Like Reply
Thumbs Down 
దుబాయ్ | లేమాన్స్ రేస్ 

రావు మోటర్స్ టీం అంతా దుబాయ్‌లో దిగింది. ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఫ్యామిలీ అంతా దుబాయ్ చూడడం. మిగతా వాళ్లంతా పనులు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. స్వర్ణ గొడ్డు చాకిరీ చేస్తుంది. అండర్ విష్ణు పని చేస్తుంది స్వర్ణ. దుబాయ్‌కి గోపీ రాలేదు. జోయా దుబాయ్ వచ్చింది కానీ ఇద్దరు దుబాయ్ తెలిసిన ఇంజనీర్లని తీసుకుని ఎక్కడికో వెళ్ళింది. దాని వల్ల అంతా స్వర్ణ మరియు విష్ణునే చూసుకుంటున్నారు. ఆ రోజు రేస్ ముగిసిన తరువాత షరీఫ్, విష్ణు ఇద్దరు తెల్లారి నుంచే గోపీ ఇంటి ముందు కాపలా కూర్చున్నారు. ఈ కొన్ని రోజుల్లో గోపీ దగ్గర చాలా నేర్చుకున్నారు. చాలా ట్రైన్ అయ్యారు. షరీఫ్ కూడా ఎడతెరిపి లేకుండా పని చేస్తున్నారు. గోపీ గురించి అడుగుతున్నాడు విష్ణు. రాజారావు టైముకి వచ్చేస్తాడు మీరు సిద్ధం కండి అని చెప్పేసాడు. రోజులు హడావిడిగా గడుస్తున్నాయి. ఇంకో రెండు రోజుల్లో రేస్ మొదలవుతుంది. జోయా వచ్చిందని తెలిసి తన కోసం వెతుకుతున్నాడు రాజారావ్. స్వర్ణని అడిగితే చెప్పింది. వర్క్ షాప్‌లో ఉంది. రాజారావు వెళ్లేసరికి ఫుల్ పనిలో ఉంది జోయా 

నల్లని కారు అప్పుడే పెయింట్ వర్క్ అయిపోయింది. అది మిత్సుబిషి కారు. మొత్తం మాడిఫై చేశారు. విండోస్ అండ్ టింట్ అద్ధాలు బిగిస్తున్నారు. పక్కనే కొత్త టైర్లు నాలుగు ఉన్నాయి. వాటి గ్రిప్ తేడాగా ఉంది. కార్ బానెట్ ముందు బంపర్లు అమర్చారు. కారుకి వచ్చిన ఇంజన్ మెటల్ షీట్ తీసేసి ఉంది అంటే ఇంకా గట్టిది బిగిస్తారా! కార్ బరువు కావాలనే పెంచుతున్నారా! అటు పక్కనే Nos సిలిండర్ ఉంది. 

ఏం చేస్తున్నావ్ జోయా !  బానెట్ తెరిచి చూసాడు. ఇదేం ఇంజిన్ ?

ట్విన్ టర్బో ఇంజన్ తాతయ్యా. పని చేస్తూనే చెప్పింది.

ఏమేమి మార్పులు చేసావ్ !

డ్రై సంప్ లుబ్రికేషన్ చేశాను. హై స్పీడ్ కార్నర్‌లో కూడా ఆయిల్ సప్లై ఆగదు. వాలవ్స్ ఎగ్జాస్ట్ అన్నీ టైటానియంతో చేసినవి. 

అవేంటి ?

క్రోమోలి రోల్ కేజ్(బలమైన బాడీ). ఫ్యూయల్ ట్యాంక్ కూడా సెల్ఫ్ సీల్ వేసాను. గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్. ఇంజన్ బే ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాను.

ఇది ?

ఆడాప్టివ్ సస్పెన్షన్ తాతయ్యా.. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం పెంచాను. ఫైర్ సిస్టం. ఒక ఆక్సిజన్ సిలిండర్. రెండు Nos సిలిండర్లు. బుల్లెట్ తగిలినా అత్యంత వేగం మీద ఇరవై కిలోమీటర్లు వెళ్లే టైర్లు అన్నీ తెచ్చాను.

ఆశ్చర్యపోయాడు రాజారావు. ఇది.. ఇది.. ఇది అద్భుతం. దీని టాప్ స్పీడ్ ఎంతా ?

380kmph. 0-100కి 2.5 సెకండ్స్ పడుతుంది. 

ఇంత వెయిట్ పెరిగినా అంత వేగం ఎలా సాధ్యం !

జోయా నవ్వింది. అది దాదా నాకు నేర్పించారు అంది. బదులుగా నవ్వాడు రాజారావు. గోపీ గురించి అడిగితే గోపీ దుబాయ్ వచ్చాడని చెప్పింది జోయా. ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తాడు అని అడిగితే నవ్వు మొహం పెట్టింది. 

★★

బుర్జ్ ఖలీఫా 

హై స్పీడ్ లిఫ్ట్ పైకి వెళుతుంది. ఒక గైడ్ కూడా ఉన్నాడు. గోపీ, జనని ఇద్దరు మౌనంగా నిలుచున్నారు. ఈ ఇద్దరు కలిసి ఉన్నారని ఎవ్వరికి తెలీదు. 

గోపీ అడిగినప్పుడు కాదంది కానీ అంతక ముందు రాత్రి వచ్చిన కల జననిని నిద్రపోనివ్వలేదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు గోపీ కళ్ళు మాత్రమే కలలోకి వచ్చాయి. అది తనని వాడు చూసే చూపు.

తనతో గడపడానికి గోపీ పెట్టే ఖర్చు. తనకిష్టమైన వాటిని ఎరగా వేసి అవి కొనిచ్చి ఇంకాస్త ఎక్కువ సేపు గడిపేవాడు. డైమండ్ రింగ్ కొంటానని ఆశ పెట్టి ఊరంతా తిప్పి, తనతో గడిపి, చివర్లో కొనిచ్చి మోసం చేసేవాడు. ఎన్నో ప్లాన్లు, ఎన్నో గిఫ్‌‌‍‍ట్లు. అంతా తనతో గడపడానికి. దుబాయ్‌లో కూడా తనతో ఒకరోజు గడిపితే వంద కోట్లు ఇస్తానని ఆశ పెట్టాడు గోపీ. కానీ వాడికి తెలియనిది ఏంటంటే అప్పటికే జనని కోరికలు తీరిపోయాయి. షేర్లు ఎప్పుడో తీసుకుంది. డబ్బు కావాల్సినంత ఉంది. చిన్నవి పెద్దవి కోరికలు గోపీనే తీర్చేశాడు. అయినా ఒప్పుకుంది జనని. మొదటిసారి గోపీ కోరిక తీర్చడానికి. 

లిఫ్ట్ తెరుచుకుంది. 122వ ఫ్లోర్. At.mosphere హోటల్. ప్రపంచ ప్రసిద్ధ హోటల్. ఒక అమ్మాయికి ఒక ఆడదానికి ఏమేమి కోరికలు ఉంటాయో అవన్నీ హై లెవెల్లో తీర్చుతున్న గోపీ వంక తీక్షణంగా చూస్తుంటే నవ్వాడు. ఇద్దరు వెళ్లి తిన్నారు. గోపీ విచ్చలవిడిగా తినేసి పొట్ట పట్టుకుని కూర్చుంటే నవ్వుకుంది. ఇదే గోపీ విషయంలో జనని మొదటిసారి నవ్వడం. 

నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉన్నావో మ్మా.. అన్నాడు గోపీ. జనని మొహంలో నవ్వు ఆగిపోయింది. తిన్నాక అన్నీ చూస్తూ తిరిగారు. తిన్నది మొత్తం అరిగిపోయినట్టు అనిపించింది.

148వ అంతస్తులో అత్యంత ప్రీమియం వ్యూ డెక్ ఉందని. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. జనని చిన్న పిల్లలా చెంగు చుట్టుకుని తిరుగుతుంటే చూస్తూ ఉండిపోయాడు గోపీ. చాలా సేపు అక్కడే గడిపి ఎంజాయి చేశారు. కాపుచ్చినో చెపితే దాని మీద కూడా భవనంతో డిజైన్ వేసి ఇచ్చారు. జనని కాఫీ తాగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. పెదాల మీద అంటిన కాఫీ చూసి నవ్వుతూ టిష్యూ ఇస్తే తుడుచుకుంది జనని. 

ఇవ్వాల్టితో మన అగ్రిమెంట్ ముగుస్తుంది కద మా అన్నాడు. జనని తల ఎత్తి చూసింది. థాంక్స్ మా.. నీకిష్టం ఉన్నా లేకపోయినా నన్ను భరించావ్. థాంక్యూ అని నవ్వాడు. బ్యాగ్ నుంచి చిన్న డాకుమెంట్ తీసి చేతిలో పెట్టాడు. అసెట్స్ ట్రాన్స్ఫర్ డాకుమెంట్. వంద కోట్లది. సైన్ చెయ్యమని పెన్ చేతికి ఇచ్చాడు.

జనని లేచి నిలుచుంది. నిన్నెప్పుడు నేను ప్రేమించలేదు గోపీ.. (గోపీ కూడా లేచాడు) జనని అద్దం వైపు నడిస్తే వెనకే వెళ్లి పక్కన నిలుచున్నాడు. నిన్నెప్పుడు నేను ప్రేమించాలని అనుకోలేదు. నాకు ఇద్దరు కొడుకులు ఉండగా బైట వాడితో నాకేంటి అన్న ఆలోచన మాత్రమే ఉండేది. నువ్వు నొచ్చుకున్నా నా దృష్టిలో అది అక్రమ సంతానం. ఆ వయసులో నీ మీద జాలి కంటే ద్వేషమే ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఆడవాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు. నిన్ను మీ తాతయ్య నాకు ఇచ్చినప్పుడు నన్ను అడగలేదు, ఆర్డర్ వేసాడు. అది నాకింకా చిరాకు తెప్పించింది. మీ నాన్నకి నిన్ను చూస్తే భయం. అందుకే నిన్ను పట్టించుకునే వాడు కాదు. నేనూ అంతే.. నాకేం అవసరం అనుకున్నాను. నువ్వు పడ్డ అవమానాలు నాకు తెలుసు, నువ్వు పడ్డ బాధలు నాకు తెలుసు, నీ భయాలు చాలా వరకు తెలుసు కానీ నాలో ఒకటే ప్రశ్న ఉండేది.. నాకేంటి అవసరం. ఈ పదిహేను రోజులు నువ్వెంటో నాకర్ధమైంది. నీతో ఉన్నప్పుడు చాలా సార్లు నా నవ్వుని కావాలని ఆపుకున్నాను. నీ మీద నాకు జాలి ఉంది, ఇలానే ఇంకొన్ని రోజులు కలిసి ఉంటే నీతో ఒక ఫ్రెండ్షిప్ పుడుతుందేమో.. (వెనక్కి తిరిగి  చూసింది)

కానీ నువ్వు నా కొడుకనే భావన మాత్రం కలగట్లేదు గోపీ. కొత్తగా నీ విజయాలు, నువ్వు సంపాదించుకన్న నీ పేరు చూసి నీ దగ్గరికి వచ్చి నా కొడుకన్నా అది నేను నటించడమే అవుతుంది. నా మనసులో నిన్నెప్పుడు నేను కొడుకుగా చూడలేదు. 

గోపీ జనని చెయ్యి పట్టుకున్నాడు. ఇంకా గట్టిగా నొక్కింది జనని. 

నాకు తెలుసు. నేనెప్పుడూ నీ మీద కోపం తెచ్చుకోలేదు అమ్మా.. మిగతా పిల్లలతో ఎలా ఉండేదానివో నాతోనూ ఏదో ఒకరోజు అలానే ఉంటావని ఎదురు చూసాను. ఎనీవే.. నాకు కావాల్సింది నాకిచ్చావ్. ఈ వంద కోట్లు ఎందుకు ఇస్తున్నానో తెలుసా.. నాకు నన్ను కన్న అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడు తెలుసుకోవాలని అనుకోలేదు కూడా.. నా మనసులో ఉన్న నా అమ్మవి నువ్వే.. నువ్వు నన్ను అంగీకరించకపోయినా నేనెప్పుడో నిన్ను అమ్మా అనేసుకున్నాను. కొడుకుగా మా అమ్మ కోసం నేను ఇవ్వాలనుకుంటున్నది.. ఇది నా చివరి కోరిక అనుకో.. నా కోసం తీసుకుంటావా అని అడిగాడు రెండు చేతులు పట్టుకుని. జనని కళ్ళలో నీళ్లు తిరిగినా బైటికి రానివ్వలేదు   తీసుకుంటానని తల నిలువుగా ఊపింది. అక్కడే గోపీ ముందే సంతకాలు చేసి డాకుమెంట్స్ తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది.

ఇది అంతా అయిపోయాక నిజంగానే వెళ్ళిపోతావా ?

హా..

ఉండు. అందరితో పాటు నువ్వు కూడా కంపెనీ చూసుకో. నీ షేర్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. జోయాని పెళ్లి చేసుకుని మంచి లైఫ్ లీడ్ చెయ్యి. 

లేదు. నేను ముందే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. నాకీ డబ్బు, హోదా, కంపెనీ కాదు కావాల్సింది. మొదటి నుంచి నాకో తోడు కోసం వెతుకుతూ ఉన్నాను. నీలో నాకది దొరకలేదు. ఇంట్లోను దొరకలేదు. జోయాలో దొరికింది. ఇక్కడ ఒక బుజ్జిది దొరికింది. తన పేరు నేహా.. తనలో నిన్ను చూసుకుంటాను. నా కుటుంబాన్ని కొత్తగా మొదలుపెడతాను అని నవ్వాడు.

దగ్గరికి వచ్చింది జనని. ఇద్దరు చూసుకుంటున్నారు. గోపీ వెనక అడుగు వేస్తుంటే దగ్గరికి రమ్మని హత్తుకుంది. జననిని ముట్టుకోలేక పోయాడు గోపీ. ఆల్ ద బెస్ట్ చెప్పింది జనని. థాంక్స్ అన్నాడు. వెనక్కి వచ్చేసి చిన్నగా నవ్వింది. ఇది నీ కోసం అంది మెల్లగా.. ఇందాక ఇచ్చిన హగ్ గుర్తుచేస్తూ.. Such a warmth అని ఫీల్ అవుతుంటే భుజం మీద కొట్టింది. ఇంకొన్ని రోజులు ఇలానే ఉంటే అమ్మలో చిలిపి తనంతో పాటు తన హ్యూమర్ కూడా తెలిసేది కదా అనుకున్నాడు గోపీ. ఆ రోజు రాత్రే జననిని టీంతో కలిపేశాడు. తెల్లారితే రేస్. జనని వచ్చినా గోపీ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయింది.

రాజారావు  జోయా కోసం చూసాడు. 
షెడ్ దగ్గర జోయా లేదు. తను బిల్డ్  చేసిన కారు కూడా లేదు. 

★★

దుబాయ్ రోడ్ల మీద పరిగెడుతుంది జోయా కారు. అందరూ రేస్‌కి వెళ్ళడానికి సిద్ధం అవుతుంటే గోపీ కూడా సిద్ధం అవుతున్నాడు. బుజ్జిదాన్ని తీసుకొచ్చారు. ఇంకో మూడు నెలల్లో పదమూడేళ్ళు నిండుతాయి. చూడగానే ఏడుస్తూ పరిగెడుతుంటే ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. గార్డ్స్ నుంచి ఒనర్స్ వరకు అందరూ సూట్స్ లోనే ఉన్నారు. ప్రతీ ఒక్కడు నల్ల కళ్ళ జోడు పెట్టుకుని ఉండటం ఇంకా చిరాకు తెప్పించింది. 

ఉన్నది మూడు అడ్డంకులు. ఒకటి రౌడీల హెడ్. ఒంకొకడు మెయిన్ హెడ్. మూడవది రేస్ ఇన్వెస్టర్. ప్రతీ సారి గోపీని ఉపయోగించుకుని వేల కోట్లు వెనకేసేవారు. కానీ ఈ సారి అది జరగదని అక్కడున్న గోపీతో పాటు తనతో పాటు పెరిగిన శీను వాళ్లకి కూడా తెలుసు. ఇంకో ఇద్దరు చావగా ముగ్గురు మాత్రమే మిగిలారు. అందరూ రెడీగా ఉన్నారు. ఎలాగైనా తన తాతయ్య కంపెనీతో తన వాళ్ళతో తిరిగి వస్తానని మాటిచ్చాడు గోపీ. అందరూ బెట్లు వేసేది కంపెనీని చూసి కాదు.. GG ఏ టీములో ఉన్నాడని. ఈ సారి ఎలాగైనా కాంట్రాక్టుతో పాటు మెయిన్ హెడ్ కూడా చావాలి. 

నలుగురు కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. మిగతా ముగ్గురు లోపల ప్లాన్ చేస్తే బైటున్న గోపీ తాతయ్యకి నిస్సహాయత స్థితిలో దొరికేలా ప్లాన్ చేశాడు. 1st stage సింపతీ దొరికింది. ఇంటికి వచ్చాక మౌనంగా పని చేసుకుంటూ ముందు ఇంట్లో వాళ్ళని గమనించాడు. తన 2% వాటా ఇస్తే తల్లి తన వైపు మగ్గు చూపుతుందేమో అనుకున్నాడు కానీ అలా జరగలేదు. తల్లి తరువాత అందరిలో కల్లా ఈజీగా మానిప్యూలేట్ అయ్యేది అమృతే అని తెలుసుకున్నాడు. గోపీ అనే వాడు తనని ఆరాధిస్తాడని నమ్మేలా చేశాడు. వెనకే తిరిగాడు. గోపీ అనే వాడిని ఈజీగా వాడుకోవచ్చని అమృతని నమ్మించాడు. కానీ అమృతకి స్వార్ధం ఎక్కువ అందుకే తాతయ్య ఇచ్చిన డిజైన్‌ని అమృత కారు నుంచి కొట్టేశాడు గోపీ..

అనుకున్నట్టే అమృత గోపీ మీదకి తోసింది. ఇంట్లో నుంచి ఎవ్వరు వెళ్ళమనకపోయినా తన మాటలతో ఆ భావం తెప్పించాడు. వాళ్ళ నాన్న ముందు ఒక్క మాట మాట్లాడాడు, పని జరిగిపోయింది. తాతయ్య ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు దీనంగా నడిచాడు. కరిగిపోయాడు రాజారావు. 2nd stage సింపతీ. 

ఊహించిన దాని కంటే త్వరగానే తాతయ్యతో కూడా ఉండే అవకాశం లభించింది. కంపెనీలోకి అడుగు పెట్టాడు. గమనించాడు. పియేగా ఉండమన్నాడు రాజారావు అది తన వల్ల అవ్వని పని. ఉన్న అతి కొద్ది సమయంలో తాతయ్య ఆఫీస్ బైట అవకాశం కోల్పోయిన ప్రీతి కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న ప్రీతీ అమ్మ గురించి తెలిసింది. తనకి తెలియకుండా సాయం చేశాడు. ప్రీతీ త్వరగా కనుక్కోవడానికి స్వర్ణ అనే ఆధారాన్ని మధ్యలో వదిలేశాడు. ఆలస్యంగానే కనుక్కుంది ప్రీతి. డిన్నర్‌కి వెళ్లి మంచితనంతో తనకి రుణ పడేలా చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంట పడే దాకా ఎదురు చూసాడు. మెల్లగా రేస్ గురించి ప్రీతీ బుర్రలో నాటాడు. చేస్తున్నది మంచి పని కాబట్టి ప్రీతీకి అనుమానం రాలేదు. తనతో పనులు చేయించుకున్నాడు. ఎంప్లాయిస్‌లో తన వైపున నిలుచునే వారిని సపోర్ట్ చేసుకున్నాడు.


వీటికి తోడు దేవుడు తన పక్కనే ఉన్నానంటూ స్వర్ణ ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యింది. చేసిన మంచి తిరిగి రావడం అంటే ఇదేనేమో అనుకున్నాడు. తాతయ్య మరో స్నేహితుడి ద్వారా వాళ్ళ ఆశయం తెలవడం ఇంకో మెట్టు. మధ్యలో దుబాయ్ వెళ్లి కావాలనే విష్ణుని ఓడించి వాడికున్న అహంకారం తీసేసాడు.  రేస్ అయిపోయాక వాడితో అన్న ఒకే ఒక్క మాట. Train more to beat me అని. అది వాడి కళ్ళలో ఆజ్యం పోసింది. పట్టుదలతో ఇంటికి వచ్చాడు. 



అంతకముందే అదృష్టం జఫర్ రూపంలో కనిపించాడు. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. అవసరం లేకపోయినా స్నేహం చేశాడు. వాడి ప్రవర్తన, చేష్టలు, ఆహార్యం తేడాగా ఉన్నా పనికొస్తాడని పక్కనే ఉంచుకున్నాడు. కానీ జఫర్ అమ్మాయి అని ఊహించలేదు. వాడితో చేసిన నిజమైన స్నేహం త్వరగా జోయాతో ప్రేమలో పడేలా చేసింది. బుజ్జిని కాపాడాలంటే బైట నుంచి తనకో నమ్మకమైన వాళ్లు కావాలి, అది జోయానే అని తనని ప్రేమించిన నాటి నుంచే ఫిక్స్ అయ్యాడు. జోయాని మాటలతో సిద్ధం చేస్తూ వచ్చాడు. చివరికి జోయాకి నిజం  చెప్పిన తరువాత, ముందు అలిగినా నేను ఒకటి అడుగుతాను దానికి కాదనకుండా సాయం చేస్తే ఈ మోసాన్ని మర్చిపోతాను అంది. అప్పటి వరకు నో సెక్స్ అన్న షరతు పెట్టుకున్నారు. అన్నిటికి సరే అన్నాడు గోపీ. ఇద్దరు కలిసి ప్లాన్ చెయ్యడం మొదలు పెట్టారు. గోపీ గతం మరింత తెలుసుకునే ప్రయత్నంలో ఇద్దరు విడిపోలేనంత దగ్గరయ్యారు. కారుకి కావాల్సిన పార్ట్స్ దుబాయ్ రాకముందే ఆర్డర్ పెట్టేసింది జోయా. గోపీ ఎప్పుడు పడితే అప్పుడు మధ్యలో మిస్ అవ్వడం వల్ల ఎవ్వరికి అనుమానం రాకుండా జోయా కవర్ చేసింది. తరువాత విషయం బషీర్ కనుక్కున్నా గోపీకి తన మనవడి రూపంలో సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే గేమ్‌లోకి నైట్ డ్రైవర్ స్పెషలిస్ట్ షరీఫ్ దిగాడు.


స్వర్ణని, ప్రీతీని వాడి అందరిలో నమ్మకం పుట్టించాడు. కంపెనీలో ఏ మార్పులు జరిగినా అందరికంటే ముందు గమనించేది జనని. తనకి ఆశ ఎక్కువ. ఎలాగైనా తాతయ్య   వాళ్లకి కారు తయారీ ఫండ్స్ విషయంలో అనుమానాలు రాకుండా జనని దూరం తెచ్చాడు. అదే అగ్రిమెంట్ బిట్వీన్ మదర్ అండ్ సన్. దీన్ని ఉపయోగించుకుని GG అనే రేసర్‌తో వంద కోట్లకి అగ్రిమెంట్ చేయించినట్టు మొత్తం ముందే ప్లాన్ చేశాడు గోపీ. తిరిగి అదే వంద కోట్లు గిఫ్ట్ రూపంలో జనని చేతికి ఇచ్చేసాడు. 

రాజారావు, బషీర్, జనని, అమృత, రమ్య, స్వర్ణ, విష్ణు, ప్రీతీ, అటు దుబాయ్ వాళ్ళనీ ఆఖరికి జోయాని.. చేతిలో ఉన్న ప్రతీ వనరుల్ని తనకి అనుగుణంగా ఎవ్వరికి అనుమానం రాకుండా వాడుకున్నాడు గోపీ.

అన్నీ కళ్లెదురుగా ఉన్న బుజ్జి దాని కోసం. బుజ్జిది ప్రేమగా గోపీని చూస్తుంటే ఇద్దరి చెవులకి బర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌...... అన్న ఇంజిన్ శబ్దం వినిపించింది. అందరూ కంగారుగా అలెర్ట్ అవుతుంటే గోపీ మొహంలో చిన్న నవ్వు చూసింది బుజ్జిది. దానికి తెలీకుండానే బుజ్జి మొహంలోకి నవ్వు వచ్చింది.

అదే నిమిషంలో గోడ బద్దలు అవ్వడం, మిత్సుబిషి కారు లోపలికి రావడం, అందులో నుంచి జోయా కిందకి దిగింది.అందరూ గన్స్‌తో కారు వైపు వెళుతుంటే గోపీ వెంటనే బుజ్జిదాన్ని పట్టుకుని కారుకి ఇంకో వైపు వెళ్ళాడు. అప్పటికే జోయా ఇంకో వైపు కూర్చుంది. బుజ్జిదాన్ని ముందు కారు ఎక్కించి గోపీ కూడా ఎక్కుతుంటే ఒక బుల్లెట్ సర్రున ఒంట్లో దిగింది. అయినా ఎక్కేసి అక్కడి నుంచి పోనించాడు. చేజ్ చేస్తారని ముందే తెలుసు, దానికి జోయా సిద్ధంగా ఉంది. బైటికి వెళ్ళగానే జోయాని, బుజ్జి దాన్ని రెడీగా ఉన్న షరీఫ్ కారులోకి ఎక్కించాడు. షరీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా గోపీ ఒక్కడే వేరే వైపు పోనించాడు. అందరూ గోపీ వెనక పడుతుంటే షరీఫ్ అక్కడి నుంచి చాకచక్యంగా కారుని తప్పించేశాడు.

★★

జాతీయ గీతం మొదలయింది. విష్ణు ఒక్కడే వరసలో నిలుచున్నాడు. అన్ని కంపెనీలు  రెండు రెండు టీములతో రేస్ చేస్తుంటే రావు మోటర్స్ మాత్రం ఒకటే టీంతో రేస్ చేస్తుంది. మిగతా అందరికీ రెండు కార్లు ఆరుగురు డ్రైవర్లు. ఇంకాసేపట్లో రేస్ మొదలవుతుంది గోపీతో పాటు షరీఫ్ కూడా మిస్ అయ్యాడు. అందరిలో కంగారు. 24 గంటలు ఆగకుండా జరిగే రేస్. గోపీ మొదలు పెట్టి పోసిషన్ సెట్ చేస్తే దాన్ని విష్ణు కంటిన్యూ చెయ్యాలి. రాత్రి పూట డ్రైవింగ్ షరీఫ్‌ది. తరువాత మూడు గంటలు విష్ణు నడిపితే ఆఖరి మూడు గంటల్లో రేస్ గెలిచే బాధ్యత గోపీది.

కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. రేస్ విష్ణు మొదలుపెడుతున్నాడు. గెలుస్తాం అనే ఆలోచనే లేదు. స్ట్రాటెజీ మిస్ అయితే ఎంత పోటు గాడు వచ్చినా మిస్ అవుతుంది. బ్యాకప్ డ్రైవర్ కూడా ఒకడే ఉన్నాడు. వాడు ఎలా నడుపుతాడో కూడా తెలీదు. రైఫల్‌తో షూట్ చెయ్యగానే అందరూ కారు ఎక్కారు. వింగ్‌మ్యాన్‌గా స్వర్ణ కూర్చుంది. పక్కనే ఇద్దరు ఇంజనీర్స్ మానిటర్ చేస్తున్నారు. 

అన్ని రేసుల్లా లైట్స్ తో ప్రారంభం అవ్వదు ఈ రేస్. కార్లన్నీ ముందు ఫ్రీఫ్లోలో తిరుగుతూ ఒక లాప్ వేస్తారు. తరువాత ముందున్న వింగ్ కారు తప్పుకోగానే రేస్ మొదలవుతుంది. 

కారులో హెల్మెట్ టైట్‌గా పెట్టుకుని కూర్చున్న విష్ణుకి స్వర్ణ మాటలు వినిపించాయి. 

విష్ణు.. There ?

ఎస్ 

షరీఫ్ వచ్చేసాడు. హి ఐస్ గుడ్. గోపీ కూడా వెనకే వచ్చేస్తున్నాడు. ఎవరీథింగ్ ఐస్ అల్రైట్ జస్ట్ స్ట్రాటెజీ చేంజ్ అంతే..

What is happening.. What.. Is.. Happ (అరుస్తున్నాడు విష్ణు)

కూల్ కూల్.. Take a deep breath. Trust your instincts. Trust your team. Trust your brother. Do you trust your brother ?

I do 

Do you ?

I do.. I do..

So.. Are we good to race ?

Yes.. 

Are we ?

Yes.. Yes.. విష్ణులో కొంచెం బూస్ట్ తెచ్చింది స్వర్ణ. రేస్ మైదలైంది. కార్లన్నీ వేగం పుంజుకున్నాయి. మొదటి నాలుగు లాప్స్ లోనే నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. విష్ణు భయపడిపోయాడు. స్వర్ణ మాటలకి రెస్పాండ్ అయినా మనసులో కంగారు తగ్గలేదు. మిగతా కార్లు, ఆ డ్రైవర్లు తనను డామినేట్ చేస్తున్నారని అనిపించింది విష్ణుకి. పదకొండు లాప్స్‌కి వచ్చేసరికి విష్ణు ఏడవ స్థానం నుంచి ఇరవై ఎనిమిదవ స్థానానికి పడిపోయాడు. 

This is bad అనుకుంది జోయా. పక్కనే ఉన్న బుజ్జిది మాత్రం జోయా చెయ్యి వదల్లేదు. రాజారావుకి జోయా జరిగింది చెప్పింది. రాజారావు తన లాయర్‌తో పాటుగా దుబాయ్‌లో తనకున్న కాంటాక్ట్స్ అందరి సపోర్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అనుకున్నది అయితే అయ్యింది కదా అని పక్కనే నిలుచున్న బుజ్జిని చూసాడు. గోపీ గురించి టెన్షన్ పడుతుంది జోయా.

 జఫర్.. అన్న గోపీ మాట వినగానే అందరూ చూసారు. రక్తంతో తడిచిన షర్టులో వెనక ఇద్దరు పుల్లీసులతో నిలబడి ఉన్నాడు గోపీ. బుజ్జిది ఏడుస్తూ పరిగెడితే అప్పటికప్పుడు గోపీని ట్రీట్మెంట్‌కి పంపించడం. సెక్యూరిటీ వాళ్ళతో లాయర్ మాట్లాడటం. జోయా కూడా గోపీ is no other than GG అని గోపీ అంతకు ముందు ఇచ్చిన ఫైల్ చూపించింది. అందులో గోపీ కేవలం రావు మోటర్స్‌కి మాత్రమే రేస్ చేస్తాడని అగ్రిమెంట్ ఉంది. సెక్యూరిటీతో పాటు బోర్డు కూడా అవన్నీ చూసారు. దీని వల్ల మంచే జరిగింది. గోపీ తనకోసం వస్తారని ముందే చెప్పాడు. ఇప్పుడు స్వయంగా బోర్డు అగ్రిమెంట్ చూసి ఓకే చెయ్యడం వల్ల ఇంకే ఆటంకం కలగదని రిలీఫ్ అయ్యారు. 

అనస్తీషియా ఇవ్వకుండా బుల్లెట్ తీస్తుంటే గోపీ పెట్టిన కేకలకి బుజ్జిది ఏడుస్తుంటే జోయా కూడా భయంగా బుజ్జిదాన్ని గట్టిగా కౌగిలించుకుంది. గోపీ స్పృహ కోల్పోయాడు. 

రేస్ మొదలయి మూడు గంటలు దాటింది. గోపీకి మెలుకువ వచ్చింది. పెయిన్ కిల్లర్లు వేసుకుని లేచి కూర్చున్నాడు. రేస్ మొత్తం అల్లకల్లోలం. విష్ణు ఇరవై ఏడో స్థానంలో ఉన్నాడు. స్వర్ణ ఎంత ప్రయత్నించినా తన వల్ల కావట్లేదు. విష్ణు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకో అరగంట చూసినా అదే పరిస్థితి. 

గోపీ విష్ణుని రమ్మని పిలిస్తే స్వర్ణ అదే చెప్పింది. 

గోపీ వచ్చాడా ?

అవును 

నాకెందుకు చెప్పలేదు అని అరిచాడు విష్ణు.

సారీ.. నిన్ను రమ్మంటున్నాడు. చేంజ్ పొజిషన్స్ అంది స్వర్ణ. విష్ణు లాప్ పూర్తి చేసుకుని వచ్చేసరికి గోపీ డ్రెస్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. కారు ఆగింది. విష్ణు దిగి కోపంగా అరుస్తుంటే విష్ణుని రెండు చేతులతో పట్టుకున్నాడు గోపీ. 

You did well.. You did well.. Relax. Re think. Re build. చెప్పేసి కారు ఎక్కాడు గోపీ. అప్పటికే టైర్లు, ఫ్యూయల్ నింపెశారు. ఇరవై ఏడవ స్థానం కాస్త ఇరవై తొమ్మిదవ స్థానం అయ్యింది. గోపీ కారు ముందుకు కదిలింది. 

విష్ణు భుజం మీద తట్టింది జోయా. చేతికి బాటిల్ ఇస్తే తాగేసి తల పట్టుకుని కూర్చున్నాడు. పడుకోమంటే కళ్ళు మూసుకున్నాడు. Relax Rethink Rebuild.. గోపీ చెప్పిన ఈ మూడు పదాలే మళ్ళీ మళ్ళీ జపం చేస్తున్నాడు. కళ్ళు తెరిచి స్క్రీన్ వైపు చూసాడు. Welcome GG అని కామెంటేటర్స్ తన గురించి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరు అలెర్ట్ అయ్యారు. అన్ని కెమెరాలు రావు మోటర్స్ కారునే చూపిస్తున్నాయి. ఒక్కసారిగా అందరికీ ఒక ఇండియన్ కంపెనీ పేరు వరల్డ్ వైడ్‌గా అనౌన్స్ అయిపోయింది. ఇక్కడే రాజారావు సగం గెలిచాడు. ఇక రేస్ గెలవాలి. 

విష్ణు లేచి కూర్చున్నాడు. దూసుకుపోతుంది గోపీ కారు. మొదటి లాప్ పూర్తవక ముందే ఇరవై నాలుగో స్థానానికి రెండవ లాప్ పూర్తయ్యే సరికి ఇరవైయ్యో స్థానానికి వచ్చేసింది. గోపీ రేస్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇది ఊహించాడు విష్ణు. రేస్‌కి రేస్ చేస్తున్న రేసర్లకి అందరికీ ఊపు  వచ్చింది. గోపీ ముందు ఉంటే తనని అందుకోవాలి కానీ ఇప్పుడు గోపీ వెనక ఉన్నాడు. తనని దాటనివ్వకుండా అడ్డుకోవాలి. అదే అందరి లక్ష్యం. 

తనకి గోపీకి బేరీజు వేసుకుంటున్నాడు విష్ణు. తను ముందుండి కూడా వెనకపడ్డాడు. కానీ గోపీ వెనక నుంచి ముందుకు దూసుకుపోతున్నాడు. అదే తనకి గోపీకి ఉన్న వ్యత్యాసం అని అర్ధమైంది. 

ఎవరో చెప్పినట్టు.  వేగం నడిపే కారులో కాదు, నడిపేవాడి నరంలో ఉంటుందట!

కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నాడు విష్ణు.
Relax  -  Rethink  -  Rebuild 
Like Reply
Anna superb Iex Iex Nice caption Relax Rethink Rebuild  Namaskar
[+] 3 users Like arkumar69's post
Like Reply
Nice update
Mr. V
[+] 1 user Likes VijayPK's post
Like Reply
Wow superb.....
[+] 1 user Likes gudavalli's post
Like Reply
Great update bro
[+] 1 user Likes Rakesh 18's post
Like Reply
Superb
.
[+] 1 user Likes amardazzler's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice bro...RELAX, RETHINK and REBUILD Namaskar
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Nice bro
[+] 1 user Likes Sasilucky16's post
Like Reply
Super super super super super super super super super super
[+] 2 users Like Gangstar's post
Like Reply
Superb... అదరగొట్టేశారు
Like Reply
ఏంటో గానీ... మీ కథ చదివితే పాత్రలు కథలో ఉన్నట్టు అనిపించవు, మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తారు. అదే మీ రైటింగ్ బలం.
జీవితం ఎప్పుడు పరుగెత్తమని కాదు... కొన్నిసార్లు ఆగమంటుంది, మళ్లీ ఆలోచించమంటుంది, కొత్తగా మొదలుపెట్టమంటుంది. మీ ఒక్క లైన్ అదే గుర్తు చేసింది. ❤️
[+] 1 user Likes Introvertt's post
Like Reply
Banger update
Like Reply
Wow superb superb AA రేసు కళ్ళ ముందే జరిగినట్టు గా ఉంది
Like Reply
అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు
Like Reply
Raaga bro em Anna update aa. Chala bagundi update iragadestunaru keep going..
Like Reply
Great Raaga. Superb writing with lot of minute technical details. You have such a good imagination power with writing skills, great going. I am eagerly waiting for your next update
Like Reply
Super update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)