15-06-2026, 10:16 PM
జుట్టుకి డై వేసుకోవడం అయ్యాక, రాధ బట్టల్ని చేతితో ఉతికి, వాటిని పిండకుండా, దండెం మీద వేసి, స్నానానికి వెళ్ళింది. 'వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు కదా. ఇంత కష్టపడడం ఎందుకు? ఉతికిన బట్టల్ని పిండకుండా వదిలేసేరేమిటి? ఆ బరువుకి దండం తెగి పడిపోతే ఏం చేస్తారు?' అనుకుంది జాగృతి. రాధ స్నానం చేసి వచ్చి, ఉతికిన బట్టలని డాబా మీదకి తీసుకెళ్ళి, అక్కడున్న దండాన్ని రిన్ తో తుడిచి, మడతలు పడకుండా బట్టలన్నింటినీ ఆరేసింది. రాధ పనితీరుకు జాగృతి ఆశ్చర్యపోతూ, 'బట్టలకి క్లిప్పులు మర్చిపోయారా ఈవిడ?' అనుకుంది.
రాధ మళ్ళీ ఎవరు తనని చూడటంలేదని నిర్దారించుకుని, తన జుట్టుని విప్పి ఆరబెట్టుకుంది. పైపైన కనపడే వెంట్రులకు మాత్రమే డై వేసుకుని, లోపల వెంట్రుకల్ని తెల్లగానే రాధ వదిలెయ్యడాన్ని జాగృతి గమనించింది.
'బట్టలకి క్లిప్పులు పెట్టడం మర్చిపోలేదన్నమాట. అవి అర్ సమయంలో ఈవిడ జుట్టుని ఎవరు చూడకుండా ఆరబెట్టుకుందన్నమాట!!' అనుకుంది జాగృతి. బట్టలు, జుట్టు ఆరేంతవరకు డాబా మీదే ఉండి, బట్టల్ని మడతపెట్టి, దాబా మీదనుండి కిందకి దిగింది.
అప్పుడే బయటనుండి వచ్చిన మాణిక్యాలరావు రాధ చేతికి డబ్బులిచ్చి, "నిన్నే వెతుకుంటున్నాను. ఎక్కడున్నావ్ ఇంతసేపూ. పెన్షన్ డబ్బులు వచ్చాయి. జాగ్రత్తగా దాచు. పొదుపుగా ఖర్చు చెయ్యి." అని చెప్పాడు.
"నా పొదుపు గురించి మీకు తెలియదా? క్లిప్పులకి, ఇస్త్రీకి కూడా ఖర్చుపెట్టాను నేను. చక్కగా మడతలు పడకుండా బట్టల్ని ఆరేసి, అవి ఎగిరిపోకుండా చూసుకుంటూ, ఆరేంతవరకు ఎండలోనే కూర్చుంటాను. నాకు జాగ్రత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తున్నామన్న పొగరుతో దుబారా ఖర్చులు చేసేవారికి చెప్పండి పొదుపు పాఠాలు." అని జాగృతిని చూస్తూ అంది రాధ.
మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూస్తూ, "మీ అత్తగారు చెప్పేది అర్ధమయ్యిందా? ఆవిడ దగ్గర పొదుపు నేర్చుకో. ఇంజనీరింగ్ చదివాను, ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు మా దగ్గర చూపించకు." అన్నాడు.
'ఎన్ని మాటలు అనిపిస్తోంది ఈవిడ. నేను ఈవిడ దగ్గర పొదుపు పాఠాలు నేర్చుకోవాలా? నాకేమన్నా జుట్టు తెల్లబడిందా ఈవిడలాగా? బట్టలు ఉతకటానికాని వెళ్ళి, ఎవరికీ కనపడకుండా హెయిర్ డై వేసుకుకోవడానికి. బట్టలు ఆరేంతవరకూ ఎండలోనే ఉన్నానని చెప్పి, ఎవరికీ కనపడకుండా జుట్టు ఆరబెట్టుకోవడానికి?' అని రాధని మనసులోనే తిట్టుకుంది జాగృతి.
మాణిక్యాలరావు జాగృతిని తిడుతుంటే, రాధ మోహంలో సంతోషంతో వెలిగిపోయింది. ఆ సంతోషంలో వంట చెయ్యడానికి వెళ్ళింది. 'ఇప్పటివరకూ శుచి శుభ్రత, పొదుపు పాఠాలని నేర్చుకోమని తిట్టించిన ఈవిడ, వంట ఎలా చేస్తారో, వంటింటిని ఎలా సర్దుకున్నారో చూద్దాం.' అనుకుంటూ వంటింటిలోకి చూసింది జాగృతి. వంటిల్లంతా బూజుతో, దుమ్ముతో నిండివుంది. డబ్బాలలో ఉండాల్సిన బియ్యం, పప్పులు, పోపు దినుసులులాంటివన్నీ ప్యాకెట్లలో ఉన్నాయి.
'వంటింటిని కూడా శుభ్రంగా ఉంచటం లేదు ఈవిడ. తన భర్త ఏమీ పట్టించుకోడు, తనేం చెప్పినా నమ్ముతాడన్న నమ్మకంతో తన గురించి అన్నీ మంచిగా చెప్పుకుని, నన్ను తిట్టిస్తోంది. ఏముంది ఈవిడ మనసులో?' అనుకుంది.
వంట చెయ్యడం అయ్యాక, రాధ మాణిక్యాలరావుని భోజనానికి పిలిచి, వండిన పదార్ధాలని వడ్డించింది. జాగృతిని లాగి, "రా అమ్మ. నువ్వు కూడా తిను. నీకొచ్చిన పని ఇదొక్కటే కదా." అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది.
రాధ అంటున్న మాటలు, ఆవిడ ప్రవర్తన జాగృతిని చాలా బాధపెట్టాయి. జాగృతికి తినాలనిపించలేదు. తినే కంచాల పక్కనే జుట్టు, దువ్వెన, మొహానికి రాసుకునే పౌడర్ ఉండడం చూసి, రాధ రిన్ తో కంచాలని కడిగిన విధానం గుర్తువచ్చి, జాగృతికి కడుపులో తిప్పినట్టు అయ్యింది. అసహ్యంతో, కన్నీళ్ళతో, తినకుండా అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది.
జాగృతిని వెళ్ళిపోవడాన్ని చూసి, "చూసారా దీని పొగరు. దీనికి పని నేర్పిస్తానని నా కొడుకుకి చెప్పాను. ఇది ఏమీ నేర్చుకోదు. ఇలాంటిదానితో నా కొడుకు బతుకు ఏమైపోతుందో ఏమో!! ఈవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే, నా కొడుకే వంట చేసుకుని, దీనికి పెట్టాలేమో!! ఈవిడ తిన్న కంచాలని కూడా వాడే కడుగుతాడేమో. నా ఖర్మ కొద్దీ వచ్చింది ఇలాంటి చదువుకున్న, ఉద్యోగం వెలగబెడుతున్న కోడలు." అని ఏడుస్తూ మాణిక్యాలరావుకు చెప్పింది రాధ.
మాణిక్యాలరావు కోపంతో, సమర్థ్ కి ఫోన్ చేసాడు. "మీ ఆవిడ ప్రవర్తన బాగులేదు. ఎవరి మాట వినదు. ఏ పని రాదు. మీ అమ్మ నేర్చుకోమని చెప్తున్నా, నేర్చుకోవడంలేదు. ఒక్క పనిలో కూడా సాయం చెయ్యలేదు. మీ అమ్మ కష్టపడి, వండి పెడితే, అది కూడా తినకుండా వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇలాంటి దానితో నువ్వు బతకలేవు. ఈ పిల్లని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగం మానేసి, పనులు నేర్చుకుని వస్తే, ముని దగ్గరికి వస్తుంది. లేదంటే ఇక ఆ అమ్మాయిని మర్చిపో." అని చెప్పాడు. రాధ కూడా ఫోన్ తీసుకుని, "నీకు ఈ పిల్ల సరైనది కాదని నేను ముందునుండి చెప్తున్నాను. నువ్వు వినలేదు. చక్కగా ఇంటి పనులు చేసుకునే ఇంకో పిల్లని ఇచ్చి పెళ్ళి చేస్తాను నీకు" అని చెప్పింది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)