Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#41
ఏజెంట్ రూహి వాసుదేవ్...17



Operation FISH

"మన భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి చైనా పెట్టుకున్న పేరు..." చెప్పడం ఆపి రూహి అందరి వంక చూసింది. మిగతా సభ్యులు అందరూ తనేం చెప్తుందా అని ఆసక్తిగా తననే చూస్తూ ఉన్నారు. బ్లాక్ కోబ్రా బృందం విజయవంతంగా చాంగ్ లీ మరియు అతని అనుచరుల స్థావరాన్ని సమూలంగా మట్టి కరిపించి అక్కడి నుంచి బయటకు వచ్చారు.

ఆ తరువాత రూహి తన వెంట తెచ్చిన హార్డ్ డిస్క్ లను సిస్టమ్ లో వేసి అందులో ఏముందో మొత్తం చూసింది. చైనా పథకం గురించి తెలిసి చాలా ఆశ్చర్యం మరియు ఆందోళన తనలో కలిగాయి.

అప్పుడే మిగతా అందరినీ సమావేశ పరిచి అసలు అదేంటో చెప్పడం మొదలుపెట్టింది.

"మీరు ఎప్పుడైనా Tsar బాంబ్ గురించి విన్నారా?"

ఆ పేరు వినగానే బ్లాక్ కోబ్రా బృందం లో ఉన్న అందరి మొహాల్లో ఒకలాంటి భయం పుట్టింది. నిలువునా వణికిపోయారు. చమటలు పట్టేసాయి.

"ఏంటి మేడమ్ మీరు అనేది. ఇప్పుడు ఆ బాంబు ఎందుకు గుర్తుకు వచ్చింది." అని వంశి వణుకుతున్న గొంతు తో అడిగాడు.

"చెప్పండి. ఆ బాంబు గురించి మీకు ఏమైనా తెలుసా?" అంటూ రూహి మరోసారి అడిగింది.

"బాగా తెలుసు మేడమ్. ఇప్పటిదాకా మన మానవ జాతి చూసిన అత్యంత భయంకరమైన అణు బాంబు అది.
Tsar అంటే రష్యన్ లో రాజులకే రాజు అని అర్థం.. అన్ని బాంబుల కంటే శక్తివంతమైనది కాబట్టే దానికి ఈ పేరు పెట్టారు. ఆ బాంబు కానీ పేలితే దాని చుట్టూ వంద కిలోమీటర్ల దాకా మొత్తం నామ రూపాలు లేకుండా నాశనం అవుతుంది. దానితో ఓ పెద్ద నగరాన్నే నాశనం చేయచ్చు. చనిపోయిన వారి బూడిద కూడా మిగలదు." అని పార్వతి తనకు తెలిసింది చెప్పింది. తను చెప్పింది వింటుంటేనే మిగతా వారిలో కాస్త భయం పుట్టింది.

రూహి తన వంక చూస్తూ...
"పార్వతి చెప్పింది నిజం. అంత శక్తివంతమైన బాంబు అది. కానీ దానిలో ఓ లోపం ఉంది. అదేంటంటే... ఆ బాంబు బరువు 27000 కేజీలు. అలాగే 30 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడువు ఉంటుంది. అంత పెద్ద బాంబు ను యుద్ధ విమానాల్లో తీసుకొని వెళ్లి శత్రువుల స్థావరం మీద దాడి చేయడం చాలా కష్టం. అందుకే దానిని అన్ని దేశాలు తయారు చేయడం ఆపేసి పక్కన పెట్టేసాయి. ప్రపంచ దేశాల శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఐక్యరాజ సమతి కూడా దానిని ఉపయోగించడం నిషేధించింది.

కానీ చైనా మాత్రం చాలా రహస్యంగా తమ మనుషులను మరియు లెక్కకు మించిన డబ్బును ఉపయోగించి రష్యా లో అత్యంత భద్రంగా దాచిన ఆ బాంబు డాక్యుమెంట్స్ కాపీ ని కొట్టేసారు. నేడు వారి దగ్గర ఉన్న ఆధునాతనమైన టెక్నాలజీ మరియు శాస్త్రవేత్తల తో దాని బరువు గణనీయంగా తగ్గించి, విస్ఫోటనం ఎన్నో రెట్లు పెంచేలా డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొరియా, చైనా నుంచి చాలా నెలలుగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, తెలివైన విద్యార్థుల ను అపహారించి రహస్య పరిశోధనలు చేయించారు. ఎట్టకేలకు వారు విజయవంతం అయ్యారు.

సరిగ్గా అదే సమయం లో మన భారతదేశం అమెరికా తో చేసుకోబోయే ఒప్పందం గురించి వారికి తెలిసింది. అదే జరిగితే మన దేశం అభివృద్ధి వైపు చాలా వేగంగా అడుగులు వేస్తుంది. అది వారిలో మన మీద ద్వేషాన్ని మరింతగా పెంచింది. అప్పుడే ఈ బాంబు ను మన మీద ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒప్పందం జరిగే సమయం లో ఈ పేలుడు జరిగితే, సొంత ప్రజలనే కాపాడుకోలేని అసమర్థతులుగా మనం మిగిలిపోతాం. దాంతో మిగతా దేశాలు మనతో ఒప్పందాలు, సంబంధాలు పెంచుకోవాలంటే ఆలోచిస్తాయి. దెబ్బకు అభివృద్ధి లో మన దేశం మరో పది అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. మనం ప్రాణాలతో ఉండగా ఆ పని జరగనివ్వకూడదు.

ఆ బాంబుకు సంబంధించిన విడి విడి భాగాలను ఇక్కడ ఎత్తుకొచ్చిన మనలాంటి వారి దగ్గర తయారు చేయించి వాటిని చైనా రాజధాని బిజింగ్ కి  60 కిలోమీటర్లు దూరం లో ఉన్న ఓ మైదాన ప్రాంతానికి రవాణా చేసారు. ఇప్పటికే ఆ బాంబు కు కావాల్సిన అన్ని భాగాలు అక్కడికి చేరుకున్నాయి. దాన్ని మన దేశం మీద ఆగష్టు 15వ తేదీన ప్రయోగించునున్నారని ఈ వీడియో లో తెలుస్తుంది.

దీనికి వారు పెట్టుకున్న పేరే operation Fish. అసలు ఆ Fish అంటే ఏంటి? ఈ దాడి ఎప్పుడు, ఏ నగరం మీద చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్నలు...
మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నార్త్ కొరియా నుంచి చైనా చేరుకోవాలి. అక్కడ మన దేశం మీద జరగబోయే దాడి ని ఆపాలి. లేకపోతే చరిత్ర ఎప్పుడూ చూడని ఓ పెద్ద విద్వంసం మన భారతదేశం చూడబోతుంది. "

రూహి చెప్పింది విని మిగతా బృందం భయం తో నోరు వెళ్ళబెట్టారు. అందరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది.

కాసేపటికి వంశీ పెదవి విప్పాడు.
"మేడమ్, మీరు చెప్పింది వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఈ దుర్మార్గులు ఇంత క్రూరమైన చర్యకు దిగుతారని కలలో కుడా అనుకోలేదు. ఇక్కడే నాదో సందేహం...
ఈ చైనా మన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ బాంబు ప్రయోగించాలని ప్లాన్ చేస్తే, మరి అదే రోజు చైనా అధ్యక్షుడు మన దేశ పర్యటన కు ఎందుకు వస్తున్నట్టు..?" అంటూ సందేహంగా అడిగాడు.

"ఇంకా అర్థం కాలేదా... ఇది కూడా వారి పథకం లో భాగమే. చైనా అధ్యక్షుడు ఇక్కడ ఉన్న సమయం లో బాంబు పేలితే ఈ ప్రపంచానికి వారి మీద అనుమానం రాదు కదా.. వారి వైపు ఎవరూ వేలు చూపించకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నారు.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, తనని ఎవరూ చూడటం లేదు అని అనుకుంటుంది అంట...
ఇప్పుడు చైనా కూడా అంతే.. కానీ వారికి మన భారతీయుల గురించి పూర్తిగా తెలీదు.
ఒక్కసారి రంగం లోకి దిగితే... శత్రువు పాతాళం లో దాక్కున్నా, ఆకాశం లో నక్కినా... వెతికి వెతికి పట్టుకుంటామని..."

"మేడమ్... మీరు చెప్పింది అంతా నిజమే.. ఇక్కడి నుంచి బీజింగ్ కు కేవలం 700 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. మనం విమానం లో వెళ్తే మన రాక ను శత్రువులు చాలా సులభంగా తెలుసుకొని జాగ్రత్త పడతారు. పోనీ రోడ్డు మార్గం లో వెళ్దాం అంటే, బార్డర్ దగ్గర చెకింగ్ చాలా కఠినంగా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని అక్కడికెళ్లి ఈ బాంబు ను ఆపగలం అంటారా..." అంటూ పార్వతి సందేహాపడుతూ అడిగింది.


రూహి ఒకసారి గాఢంగా శ్వాస తీసుకొని పెదవి విప్పింది.
 "కురుక్షేత్రం లో అభిమన్యుడి కి పద్మవ్యూహం లోకి వెళ్లే దారి తెలుసు. కానీ తిరిగి వచ్చే దారి తెలియక పోరాడి వీర మరణం పొందాడు.
కానీ మనకు... ఈ దుర్మార్గ శత్రువులు వేసిన పద్మవ్యూహం లోకి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. కానీ గుండెల నిండా దేశం కోసం చివరి శ్వాస దాకా పోరాడాలి అనే కాంక్ష మాత్రం రగులుతూనే ఉంది. దాని ముందు ఈ పరాయి కుక్కలు పన్నిన పథకం నిలువగలదా...
మన లక్ష్యం ఉన్నతంగా ఉంటే, అడ్డంకులు సైతం మన విజయానికి మెట్లుగా మారుతాయి.
పోరాడుదాం... ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కాదు, ఉపిరి ఉన్నంత వరకు పోరాడుదాం..
ఈ పోరాటం లో గెలిస్తే మన దేశపు మట్టిని వీరతిలకం గా దిద్దుకుందాం.. ఓడిపోతే ఆ మట్టిలోనే కలిసి దేశానికి వీరతిలకం అవుదాం. వందేమాతరం... వందేమాతరం... " అంటూ రూహి గర్వంగా పలికింది.

తన మాటలు మిగతా బృందం లో కూడా గెలవాలి అనే స్ఫూర్తి ని నింపాయి. దేశ భక్తి తో అందరి గుండెలు నిండాయి.

తరువాత అందరూ కలిసి అక్కడి నుంచి ఎలా చైనా చేరుకోవాలి, ఎవరెవరు ఏమి చేయాలి లాంటివి మాట్లాడుకున్నారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరడం కోసం వంశీ, పార్వతి వాహనం సిద్ధం చేయడానికి వెళ్లారు. దూరం నుంచి వారిని వెంబడిస్తూ వచ్చిన మనిషి అదంతా గమనిస్తూనే ఉన్నాడు.

వాళ్లు వెళ్ళిపోయాక రూహి, అయాన్ మాత్రం ఒంటరిగా ఉండిపోయారు. అయాన్ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ బయట పడటం లేదు. రూహి కాసేపు ఎదురుచూసి చివరకు...
"అయాన్... నేను ఆ చాంగ్ లీ ని చంపిన తరువాత నాకు ఏదో చెప్తాను అన్నావు కదా. ఏంటది " అని అడిగింది.

రూహి ఆ ప్రశ్న అడుగుతుంది అని అయాన్ కు ముందే తెలుసు. ఆ క్షణం తన ప్రేమ గురించి చెప్పాలని అనుకున్నాడు. కానీ గుండెల్లో మాత్రం చాలా భయంగా ఉంది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ప్రేమించడం సులువే, ఆ ప్రేమను తెలుపడమే చాలా కష్టమని మొదటిసారి తెలిసింది.

"మేడమ్.. అది... అది..." అంటూ చెప్పడం కోసం తడబడ్డాడు.

"అదే ఏంటి అయాన్..." రూహి తన కళ్ళలోకి చూస్తూ అడిగింది. అలా బయటకు అయితే అడిగింది కానీ, అయాన్ ఎలా చెప్తాడో, ఏం చెప్తాడో అని తన మనసులో కూడా కొంచెం సిగ్గు తో కూడిన బిడియం కదలాడుతుంది.

"ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మేడమ్ ."

"ఎలా ఏముంది నోటి తో చెప్పు." అని రూహి నవ్వుతూ అంది.

ఆ నవ్వు చూసిన తరువాత అయాన్ మనసు లో భయం కొంత తగ్గింది. ఇన్ని రోజులు తన మీద పెంచుకున్న ప్రేమను ధైర్యం లా మారుస్తూ...
"రూహి..." అని పిలిచాడు.

ఇప్పటిదాకా తన నోటి నుంచి మేడమ్ అనే పిలుపు మాత్రమే విన్న రూహి... మొదటిసారి తనని పేరుతో పిలవడం తో తన పేరు తనకే కొత్తగా అనిపించింది. అయాన్ వంక ఆశ్చర్యంగా చూసింది.

అయాన్ మెల్లగా చెప్పడం ప్రారంభించాడు.
"రూహి.. ఈ పేరు నా జీవితం లోకి ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ నేడు అదే జీవితం అయ్యింది. ఎంతలా అంటే నా ఎద సవ్వడి కూడా మీ పేరే కలవరించే లాగా...

మీతో నడవడం ఇష్టం. పాదం అలిసే దాకా కాదు, ప్రాణం పోయేదాకా...
మీతో మాట్లాడటం ఇష్టం. జాము జారే దాకా కాదు, కాలం కరిగిపోయేదాకా...
చివరగా..  నా గుండె చప్పుడు ఆగేదాకా మిమ్మల్ని ప్రేమించడం అంటే చాలా చాలా ఇష్టం.

మీతో కలిసి ఉండటం కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది.
మిమ్మల్ని చూడగానే తొలి చూపులోనే పడిపోయాను. ఎందుకు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ప్రేమ దూరమయ్యాక కారణాలు మిగులుతాయి కానీ ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవేమో...
నన్ను వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తాను అంటే మన RAW చీఫ్ ని బ్రతిమాలి మరీ బ్లాక్ కోబ్రా బృందం లోకి వచ్చాను. అసలు ఈ ఆపరేషన్ కోసం కొరియా దాకా వచ్చిందే మీకోసం...

మీ ధైర్యం, మీ నవ్వు, మీ తెగింపు, మీ మాటలు... ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అన్నిటికీ మించి దేశం కోసం ప్రాణాలను సైతం వదలడానికి సిద్ద పడే మీ దేశ ప్రేమను చూసి ప్రతి రోజు, ప్రతి క్షణం మీతో ప్రేమలో పడుతూ ఉంటాను.
మీరు మన దేశం మీద చూపించే ప్రేమలో... ఓ కొంచెం ఈ ప్రేమికుడి మీద చూపించండి. జీవితాంతం మీ చెయ్యి పట్టుకొని వెన్నంటే నడుస్తాను.
మీ విజయం లో చిరునవ్వు లా, ఓటమి లో ఓదార్పు లా... మీతోనే కలిసి బ్రతకాలని ఉంది. చివరకు దేశం కోసం ఊపిరి వదలాల్సి వస్తే మీతోనే కలిసి మువ్వన్నెల జెండా లో ఒదిగి ఈ మన్నులో కలిసిపోవాలని ఉంది.
I LOVE YOU రూహి... " అంటూ అయాన్ తన మనసులోనే మాట చెప్పాడు.

ఆ మాట వినగానే కొన్ని క్షణాలు రూహి అలాగే ఉండిపోయింది. తన మీద అయాన్ ఇంత ప్రేమను పెంచుకున్నాడు అని ఊహించలేకపోయింది. అలాంటి ప్రేమ దొరకడం తన అదృష్టం అనుకుంది. ఇప్పటికిప్పుడు తన కౌగిలి లో వాలిపోవాలని అనిపించింది. కానీ తన ప్రేమ కంటే ముందు తన కర్తవ్యం గుర్తొచ్చింది. అందుకే తన మదిలో ప్రేమను లోపలే దాచుకుంటూ...

"అయాన్, నువ్వు చెప్పింది వినగానే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నా లక్ష్యం ఈ చైనా పథకం నుంచి మన దేశాన్ని కాపాడటం మీద మాత్రమే ఉంది.
నీ మనసులోని మాట చాంగ్ లీ ని చంపినప్పుడు చెప్పావు.. నా సమాధానం ఈ పోరాటం లో విజయం సాధించిన తరువాత చెప్తాను.
ఒకవేళ ఈ యుద్ధం లో మరణిస్తే, నువ్వు అన్నట్టు మన దేశపు మట్టి కౌగిలిలో కలుసుకుందాం." అంటూ స్థిరంగా చెప్పింది.

"మీ సమాధానం ఏమైనా, మీ మీద నేను చూపించే ప్రేమ, గౌరవం లో ఇసుమంతైనా మార్పు ఉండదు మేడమ్..." అంటూ అయాన్ అక్కడి నుంచి కళ్ళ నీళ్లతో ముందుకు కదిలాడు.

రూహి తననే చూస్తూ ఉండిపోయింది. అయాన్ మనసును ఏమైనా బాధపెట్టానా అని తనలో ఓ ఆలోచన వచ్చింది. కానీ వెంటనే తనకు విక్రమ్ వాసుదేవ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి...
"కుటుంబం,  ప్రేమ... ఈ రెండిటిలో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన సంఘర్షణ మొదలైనప్పుడే, సామాన్యుడి కి సైనికుడి కి తేడా తెలుస్తుంది."

ఆ మాట గుర్తుకురాగానే తనని తాను సమాధాన పర్చుకుంది. గుండెల నిండా శ్వాస తీసుకొని తన ముందున్న భారతదేశ జాతియ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేసింది.

ఆ క్షణం ఆ మువ్వన్నెల జెండా కూడా తన దేశ భక్తి చూసి మురిసిపోతూ గర్వంగా వీచింది.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...17 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
ఏజెంట్ రూహి వాసుదేవ్...18



[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]




"మేడమ్... ఈ నార్త్ కొరియా నుంచి చైనా కు వెళ్ళడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
మొదటది... విమానం లో. అలా వెళ్తే మన పాసుపోర్టు కావాలి. అది చూడగానే చైనా లో మనం అడుగుపెట్టాం అని శత్రువులకు ముందే తెలిసిపోతుంది. సులభంగా మనల్ని పట్టేసుకుంటారు.
రెండోది... రోడ్డు మార్గం. బోర్డర్ దగ్గర అటు వైపుకు వెళ్లే అందరినీ క్షుణ్ణంగా చెక్ చేస్తారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మన ఫోటోలు వివరాలు ఇప్పటికే చైనా మిలిటరీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనల్ని చూడగానే పట్టుకుంటారు.
ఇక చివరి మార్గం.. సముద్రం. చైనా కొరియా ని కలుపుతూ ఎల్లో సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది. సముద్రం మీద గస్తీ కాసే సైనికుల కళ్ళు గప్పి మనం పడవలో వెళ్ళలేం. అలాగని అన్ని కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ కూడా వెళ్లలేం.
ఇప్పుడు మన ముందు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. మన చేతిలో ఏమి లేదు. ఆగిపోవడం తప్ప మరో అవకాశం కూడా లేదు." అంటూ వంశీ అప్పటిదాకా తను తెలుసుకున్నది మొత్తం చెప్పాడు.

"మార్గం లేదని పోరాడకుండా ఆగిపోయి ఉంటే అల్లూరి సీతారామ రాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్... వీళ్లంతా కేవలం వ్యక్తులు గానే ఉండేవారు.
చావు ఎదురుగా రంకెలు వేస్తున్నా, దాని తల వంచాలని పిడికిలి బిగించి కదిలారు కాబట్టే మహనీయులు అయ్యారు. అది మరిచారా " అంటూ రూహి పలికింది.

"మీరన్నది నిజమే మేడమ్. కానీ మనం నలుగురం మాత్రమే ఉన్నాం. మన దగ్గర మిగతా సైన్యం కూడా లేదు. వారిని ఎదురించగలమా..." అంటూ పార్వతి సందేహంగా అడిగింది.

"సీతమ్మను వెతకడానికి లంకకు బయలుదేరినప్పుడు రాముడు వెంట లక్ష్మణుడు మాత్రమే ఉన్నాడు. ఆ తరువాత వానర సైన్యం తోడైయింది. న్యాయం తన వైపు ఉండటం తో విభీషణుడు కూడా తన వెనుకే నిలిచాడు.
మన కర్తవ్యం లో నిజాయితీ ఉంటే ఆ దైవమే ఏదో ఓ రూపం లో మన వెంట నడుస్తుంది"

ఆ మాటకు మిగతా బృందం నిజమే అన్నట్టు తల ఆడించారు. రూహి వారి అందరి వంక చూస్తూ...

"కొరియా నుంచి చైనా చేరడానికి ఇందాక నువ్వు చెప్పిన మూడు మార్గాల తో పాటు మరో మార్గం కూడా ఉంది. "

ఆ మాట వినగానే మిగతా అందరు ఆశ్చర్యంగా ఏంటి మేడమ్ అది అని అడిగారు.

"చాంగ్ బై పర్వతాల అడవులు...".

ఆ అడవి గురించి వినగానే అయాన్ అలా నోరు తెరిచి ఉండిపోయాడు.

"ఏంటి మేడమ్ మీరు అనేది. ఆ అడవుల గురించి తెలిసే మాట్లాడుతున్నారా?" అని కంగారుగా అడిగాడు.

"బాగా తెలిసే మాట్లాడుతున్నాను." అంటూ రూహి స్థిరంగా పలికింది.

"ఏంటి అయాన్ ఆ అడవి గురించి వినగానే అంత కంగారు పడ్డావ్ " అంటూ పార్వతి అడిగింది.

అయాన్ తన నుదుటిన జారిన చమటను తుడుచుకుంటూ...
"ఆ చాంగ్ బై అడవులను ఇక్కడి ప్రజలు మరో పేరు తో పిలుస్తారు. అదే... ఎరుపు మేఘాల అడవులు అని...
ఎందుకో తెలుసా.. ఆ అడవిలో నిత్యం ఏదో చోట ఎర్రని నెత్తురు పారుతూనే ఉంటుంది. ఆ నెత్తురు అవిరై మేఘాలుగా మారి ఆ ప్రాంతం లో అప్పుడప్పుడు నెత్తుటి వర్షం కురుస్తుంది అని కొంతమంది అంటూ ఉంటారు.
ఆ అడవిలో చాలా క్రూర మృగాలు ఉన్నాయి. అంతే కాదు మనుషులను బ్రతికుండగానే కాల్చుకొని తినే నర రూప రాక్షసులకు సంబంధించిన ఆది వాసుల తెగ కూడా ఉంది.
వీటన్నటిని తప్పించుకున్నా సరే, చైనా లో కి చేరాలంటే దారిలో ఓ ఎడారి ని దాటాలి. ఆ ఎడారి లో ఎండ నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఆ వేడి ని తట్టుకొని ఆ ఎడారి దాటడం దాదాపు అసాధ్యం. అందుకే ఆ సరిహద్దు దగ్గర బందోబస్తు కూడా చాలా తక్కువగా ఉంటుంది."

అయాన్ చెప్పింది విని మిగతా బృందం మోహం లో నెత్తుటి చుక్క కూడా కరువైంది. భయం తో అలాగే బిగుసుకుపోయారు. అందరి గుండె వేగం తో పరుగులు తీసింది.

రూహి అందరి వంక చూస్తూ...
"మన ముందు ఇప్పుడు అంతకు మించిన మార్గం లేదు. సైనికుడిగా విధుల్లో చేరిన రోజే దేశం కోసం ప్రాణాలు ఇస్తామని ప్రమాణం చేసాము. అసలు సైనికుడు అంటేనే ఏ క్షణం మరణం ఎదురైనా మన జాతియ జెండా కప్పుకొని నవ్వుతూ పలకరించడానికి సిద్ధంగా ఉండాలి.

అసలు India అంటే ఏంటో తెలుసా...
I - Innocence... అంటే మోసం తెలియని అమాయకులం.
N - Nationalism... జాతీయతా భావం అణువణువునా నిండి ఉంటుంది.
D - Darling... మన భారత దేశమనే కాదు. సాయం కోరిన ఏ దేశమైనా సరే మనసారా సాయం చేస్తాం. అందుకే ప్రపంచ దేశాలకు మనం ఏంతో ఇష్టం...
I - Intelligence... ఈ ప్రపంచం లో ఉన్న గొప్ప గొప్ప మేధావుల్లో ఎక్కువ శాతం మన దేశం లోనే ఉన్నారు.
A - Action... ఒక్కసారి యాక్షన్ లోకి దిగితే ఎదురుగా ఎంత పెద్ద శత్రువు నిలబడిన లెక్క చేయం. వెన్నుచూపడం లాంటివి తెలీదు. కేవలం పోరాడటం మాత్రమే తెలుసు.

ఇప్పుడు కూడా అంతే...
ఇక్కడిదాకా వచ్చాం. ముందుకు వెళ్దాం.
పోరాడుదాం.. పోతే మన ప్రాణం.. అదే గెలిస్తే మాత్రం వంద కోట్ల ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం."

రూహి మాటలతో మిగతా బృందం గుండెల్లో కూడా స్ఫూర్తి రగిలింది. అందరూ మీ వెనుకే ఉంటాం మేడమ్ అని గర్వంగా అరిచి చెప్పారు. ఆ మాట తో రూహి పిడికిలి బిగించి ముందుకు కదిలింది. వెళ్తూ వెళ్తూ ఆ అడవి దాటడానికి వారికి కావాల్సినవి అన్ని సామాన్లు తీసుకున్నారు. అలాగే ఇండియా లోని మిగతా సైనికులకు ఫోన్ చేసి అప్పటిదాకా వారు తెలుసుకున్నది మొత్తం చెప్పారు.

ఆగష్టు 15 కు ఎక్కువ రోజుల సమయం లేకపోవడం తో ఆలస్యం చేయకుండా ఒక వ్యాన్ తీసుకొని ఆ అడవి వైపు కదిలారు. దారిలో రూహి చూపులు అయాన్ వైపు వెళ్తున్నా,
లక్ష్యం చేరేదాకా రూహి ని ఇబ్బంది పెట్టకూడదు అని అయాన్ బలంగా నిర్ణయించుకున్నాడు అందుకే తన వైపు కాకుండా బయటకు చూస్తున్నాడు.
రూహి మదిలో ప్రేమ, దేశం భక్తి రెండిటి మధ్య సంఘర్షణ అగ్ని పర్వతం లాగా జరుగుతున్నా బయటకు మాత్రం నిశ్చలమైన సముద్రం లాగా కూర్చుంది.

ఇంతలో వ్యాన్ నడుపుతున్న వంశీ దాన్ని ఓ పక్కకు ఆపాడు. ఎదురుగా రోడ్డు లేదు. మొత్తం రాళ్లు, రప్పలు, చెట్లతో నిండి ఉంది.
"ఇక్కడి నుంచి వ్యాన్ ముందుకు వెళ్ళదు మేడమ్. దిగి నడవాలి." అని చెప్పాడు.

అందరూ ఎవరి లగేజ్ వాళ్లు భుజాన వేసుకొని నడవడం మొదలుపెట్టారు. ఆ అడవి గురించి వారు విన్న దాని కంటే చాలా భయంకరంగా ఉంది. చుట్టూ గుబురుగా చెట్లు పెరిగి ఉన్నాయి. పైన ఆకాశం లో ఉన్న సూర్యుడి ని సైతం అడ్డంగా కప్పేస్తూ పగలే చీకటి తో రాత్రిని తలపిస్తుంది   దూరంగా ఎవేవో వింత జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అవి వింటుంటేనే అందరి వెన్నులో వణుకు పుట్టింది. వెంట తెచ్చుకున్న ఆయుధాలను చేతిలోకి తీసుకొని నడుస్తున్నారు.

నడిచే కొద్ధి ఆ అడవి మరింత దట్టంగా మారింది. మిగతా వారిలో భయం కూడా పెరిగింది. అక్కడక్కడా చచ్చి పడిపోయిన జంతువుల కలేబరాలు, మనుషుల పుర్రెలు, అస్థి పంజరాలు కూడా ఉన్నాయి.

ఇంకాస్త ముందుకు వెళ్ళగానే... దారికి అడ్డంగా అప్పుడే చనిపోయిన ఓ అడవి దున్నను రాబందులు తమ ముక్కులతో కనుగుడ్లను పొడిచి పొడిచి తినడం కనిపించింది. దాని పేగులు ఆ చోటు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తపు మరకలు చెట్టు మీద పడి ఎర్రగా అలాగే ఉన్నాయి. ఆ దృశ్యం చూస్తుంటేనే కడుపులో ఎవరో తిప్పినట్టుగా ఉంది. గుండెలు తీసే శత్రువుకైనా గుండె దడ రాక మానదు.

ఓ పెద్ద పులి నడిచినట్టుగా అక్కడ దాని అడుగులు గుర్తులు కూడా ఉన్నాయి. ఆ అడుగులు గుర్తులు వీరిలో భయం ఇంకా పెంచాయి. అక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అనిపించింది. అందుకే ఆ అడుగులకు వ్యతిరేక దిశ లో నడవడం మొదలుపెట్టారు.

అలా చాలా దూరం నడిచారు. దారిలో వారికి కొన్ని వన్య మృగాలు కూడా కనిపించాయి. వాటిని చూడగానే దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి నక్కి దాక్కున్నారు. అవి వాటి దారిన అవి వెళ్ళిపోయాక నిదానంగా కిందకు దిగి ముందుకు కదిలారు. మరి కొన్నిటిని వారి దగ్గర ఉన్న నిప్పుతో బయపెట్టారు. అలా చాలా సాహసం చేస్తూ వెళ్తున్నారు.

దారిలో ఒకసారి ఉన్నట్టుండి ఒక అడవి రక్త పింజరి పాము చెట్టు కొమ్మ మీద నుంచి పడగ విప్పి పార్వతి మీదకు దూకింది. సరిగ్గా అప్పుడే రూహి చూడటం తో తన పక్కనే ఉన్న కర్ర తో చాక చక్యంగా దాన్ని తప్పించింది. లేకపోతే పార్వతి ప్రాణం పోయేదే..

అప్పటికి ఆ ప్రమాదం నుంచి బయట పడ్డాం అనుకున్నారు. కానీ మరికొంత ముందుకు వెళ్లిన తరువాత అసలు ప్రమాదం ఎదురైంది. వీరు వెళ్లాలసిన చోటు కు మధ్యలో ఓ పెద్ద మైదాన ప్రాంతం లాంటిది ఉంది. రెండు వైపులా లోతైన లోయ ఉంది. వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఆ మైదానం లో అడుగు పెట్టాల్సిందే.. కానీ ఆ మైదానం లో పాములు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఒకటి రెండు కాదు... కొన్ని వందల పాములు దారి మొత్తం నిండిపోయి ఉన్నాయి.

[Image: image?pratilipiId=6755373532219780&name=...0&type=jpg]
[Image: image?pratilipiId=6755373532219780&name=...6&type=jpg]



అన్ని పాములని ఒక్క చోట చూడగానే వారి గుండె ఆగినంత పనైంది. నాగుపాము, రక్త పింజారి, కట్ల పాము, రాగి ముద్దల పాము, కొబ్రా, కొండచిలువ... లాంటి ఎన్నో రకాలు అడవి జాతి పాములు ఉన్నాయి. వాటిలో ఒక్కటి వీరి మీద కాటు వేసినా క్షణాల్లో ప్రాణం పోవడం ఖాయం.

అందరికీ గొంతులో తడి ఆరిపోయింది. ఇప్పుడు వాటిని తప్పించుకొని అటు వైపుకు ఎలా వెళ్లాలో ఎవరికి అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే రూహి ఆ పాములు ఉన్న మైదానాన్నీ ఒకసారి గమనించింది. దానికి రెండు వైపులా దూరం దూరంగా చెట్లు ఉన్నాయి. వాటిని చూసిన తరువాత ఒక ఆలోచన వచ్చింది.

భయం తో బిగుసుకుపోయిన బృందం వైపు తిరిగి...
"నేను ఆ చెట్ల మీదకు ఎక్కి.. ఒక్కో చెట్టు దాటుకుంటూ అటు వైపుకు వెళ్తాను. అలాగే నాతో పాటు ఒక తాడు ను తీసుకొని వెళ్లి, అటు వైపు కడతాను. మీరు ఆ తాడు సాయం తో చాలా సులభంగా అటు వైపుకు రావచ్చు." అని చెప్పింది.

"ఏంటి మేడమ్ మీరు మాట్లాడేది. పొరపాటున మీరు కింద పడితే... ఆ ఊహను కూడా భరించలేను. కావాలంటే మీ స్థానం లో నేను ముందుగా వెళ్తాను." అంటూ అయాన్ ముందుకు వచ్చాడు.

రూహి తనని ఆపింది.
"వద్దు అయాన్...
ప్రమాదం ఎదురైనప్పుడు అందరి కంటే చివర నిలబడేది పాలకుడు. ముందు నిలబడేవాడే నాయకుడు..
నేను ముందు వెళ్తాను. ఇది బ్లాక్ కోబ్రా టీం నాయకురాలి గా నా ఆదేశం." అని అంది.

ఆ మాటకు అయాన్ ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు. రూహి వెంటనే తమ వెంట తెచ్చిన తాడు ఒక చివరను అక్కడున్న ఒక చెట్టుకు కట్టింది. తరువాత బృందానికి బాయ్ చెప్పి చెట్టు ఎక్కబోయింది.
ఇంతలో అయాన్ వచ్చి కళ్ళ నీళ్లతో ఒక్కసారి తనను గట్టిగా కౌగిలించుకున్నాడు. రూహి మొదట ఆశ్చర్య పోయినా సరే తన ప్రేమను చూసి ఆప్యాయంగా హత్తుకుంది.

పార్వతి, వంశీ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు. కొన్ని క్షణాల తరువాత రూహి మెల్లగా చెట్టు ఎక్కింది. Raw ట్రైనింగ్ లో ఇలాంటివన్నీ బాగా నేర్పిస్తారు. కాబట్టి చెట్టు ఎక్కడం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఆ చెట్టు నుంచి మరో చెట్టు మీదకు దుకడమే చాలా కష్టంగా ఉంది. రూహి ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని దేశాన్ని, విక్రమ్ వాసుదేవ్ ని తలుచుకుంటూ... ఒక్కో చెట్టు దాటుతూ ముందుకు వెళ్తుంది.

మిగతా ముగ్గురూ ఏం జరుగుతుందా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇంతలో రూహి ఒక చెట్టు మీదకు దూకే సమయం లో కొమ్మ చాలా బలహీనంగా ఉండటం తో ఆది విరిగి కొంచెం కిందకు ఒరిగింది. పక్కనే ఉన్న మరో కొమ్మను పట్టుకొని నిలబడింది. అందరూ రూహి కి ఏమైనా అవుతుందా అని భయం తో అరిచారు. అయాన్ గుండె అయితే ఒక్క క్షణం ఆగింది.

కిందకు జారినా సరే పడకుండా రూహి తన కాళ్ళతో ఓ కొమ్మను గట్టిగా పట్టుకుంది. కానీ రూహి జడ మాత్రం దాదాపు నేలకు అనుకుంది. ఆ నేల మీద పాకుతున్న పాములు అవి చూసాయి. వెంటనే ఒక పాము ఆ జడ ను చుట్టుకుంది. అలాగే రూహి మీదకు రావాలని చూసింది. రూహి కి దాన్ని విసిరేసే అంత సమయం లేదు.

రూహి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన జేబులో ఉన్న చిన్న కత్తి తీసుకొని ఆ జడను అక్కడికి కత్తిరెంచేసింది. దేశం కంటే దేహం గొప్పది కాదు అని నమ్మే రూహి కి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు ఒక లెక్కా....
ఆ క్షణం తనకు దేశాన్ని కాపాడటం కంటే ఏది ఎక్కువ కాదు అనిపించింది.

తరువాత తను కాళ్ళతో పట్టుకున్న కొమ్మను అలాగే పట్టుకుంటూ పైకి లేచింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మిగతా చెట్లను కూడా చాలా జాగ్రత్తగా దాటింది. చెప్పినట్టుగానే అటు వైపుకు వెళ్లి తెచ్చిన తాడు ను అక్కడున్న ఓ చెట్టుకు కట్టింది.

మిగతా సభ్యులు ఒక్కొక్కరుగా ఆ తాడు ను పట్టుకొని పాకుతూ జాగ్రత్తగా అటు వైపు కు చేరుకున్నారు.. ముందు పార్వతి, తరువాత వంశీ... చివరగా అయాన్ వచ్చాడు. అయాన్ అటు వైపుకు రాగానే కళ్ళతోనే రూహి కి కృతజ్ఞతలు చెప్పాడు. రూహి ప్రేమగా తన చేతిని నిమిరింది.

ఇక అక్కడే ఉండటం మంచిది కాదు అని ముందుకు కదిలారు. దారి మొత్తం పెద్ద పెద్ద పదునైన రాళ్లు ఉన్నాయి. పొదల తో గుబురుగా ఉంది. ముళ్ల కంపలు గీరుకుంటున్నాయి. అయినా సరే వేటిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు.

అలా చాలా సేపు నడిచిన తరువాత బాగా అలిసిపోవడం తో ఒక చోట విశ్రాంతి కోసం ఆగారు. వెంట తెచ్చిన నీళ్లు తాగి వారి దాహం తీర్చుకున్నారు. అలా అందరూ సేద తీరుతున్న సమయంలో... ఉన్నట్టుండి పార్వతి బిగ్గరగా కేక వేసింది.

అందరూ ఏమైందా అని తను చూస్తున్న వైపు చూసారు. వారికి ఎదురుగా ఉన్న దాన్ని చూసి వారి గుండె ఆగినంత పనైంది. అలా నోరు తెరిచి భయం తో ఉండిపోయారు.

వారిని అంతలా భయపెట్టేలా వారి ముందు ఏముంది అంటే...




" ఏజెంట్ రూహి వాసుదేవ్...18 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 7 users Like SivaSai's post
Like Reply
#43
Excellent daring operation
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#44
Excellent narration!!
..as if it's happening right in front of us
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#45
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#46
Excellent story.  Engaging episode.
[+] 1 user Likes styleraja's post
Like Reply
#47
ఏజెంట్ రూహి వాసుదేవ్...19



రూహి బృందం కొరియా నుంచి చైనా వెళ్ళడానికి చాలా ప్రమాదం తో కూడిన చాంగ్ బై అడవుల మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ నిత్యం మరణం తాండవం చేస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా అడుగు పెట్టగానే పాముల తివాచి వారికి స్వాగతం చెప్పింది.

మొత్తానికి రూహి తెలివి వల్ల ఆ ప్రమాదం దాటి బయటకు రాగలిగారు. అలా మరి కాస్త దూరం నడిచిన తరువాత దాహం తీర్చుకుందామని ఒకచోట కాసేపు ఆగారు. ఇంతలో పార్వతి గట్టిగా అరవడం తో అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు.

వారికి ఎదురుగా ఉన్న దాన్ని చూసి వారి గొంతు లో తడి ఆరిపోయింది. భయం తో అలాగే బిగుసుకుపోయారు. వారిని అంతలా భయపెట్టేలా వారి ముందు ఏముంది అంటే.... సింహం.

పెద్ద సింహం. జూలూ విదిల్చి వారి ముందు నిలబడి ఉంది. దాని కళ్ళు కోపం తో ఎర్రగా మండుతున్నాయి. ఆ కళ్ళ వైపు చూస్తుంటేనే వణుకు పుడుతుంది. అప్పుడే ఏదో జంతువు ను వేటాడి వచ్చిందేమో, దాని మోహం మొత్తం ఎర్రని రక్తం తో తడిసి ఉంది. ఆ రక్తం తో అది మరింత భయంకరంగా కనిపిస్తుంది.

ఇంతలో ఉన్నట్టుండి ఆ సింహం పెద్దగా గాండ్రించింది. ఆ అరుపుకు వారి చుట్టు పక్కల చెట్ల మీద ఉన్న పక్షులు అన్ని దూరంగా ఎగిరిపోయాయి. ఆ గర్జన వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దాని కళ్ళ లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది.  ఇంతలో ఆ సింహం రూహి బృందం వైపు తీక్షణంగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేసింది. అందరికీ గుండె ఆగినంత పనైంది. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని వీరికి బాగా తెలుసు.

ఆ సింహం కళ్ళు మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. అందరూ అలా షాక్ లో ఉండగానే సింహం ఒక్క ఉదుటున ఎగిరి పార్వతి చెయ్యి పట్టుకుంది. పార్వతి అరుపు తో అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆ అరుపు విని రూహి ఈ లోకం లోకి వచ్చింది. ఎలా అయినా తనని కాపాడాలి అని నిర్ణయించుకుంది. తన పక్కనే ఉన్న పదునైన రాయి ఒకటి తీసుకొని బలమంతా ఉపయోగించి నేరుగా ఆ సింహం వైపు విసిరింది. అది వెళ్లి సింహం తల మీద బలంగా తగిలింది.

దెబ్బకు దాని నోటి తో కరిచి పట్టుకున్న పార్వతి చేతిని వదిలేసింది. పార్వతి చేతి నుంచి ఎర్రని రక్తం కారుతుంది. నొప్పి తో తను ఇంకా ఆర్త నాదాలు చేస్తూనే ఉంది. మరో వైపు దెబ్బ బలంగా తగలడం తో సింహానికి బాగా కోపం వచ్చింది. ఒక్కసారి గట్టిగా గాండ్రిస్తు ఆ రాయి విసిరిన రూహి వైపు తిరిగింది.

రూహి బెదరలేదు. తను కూడా సింహం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంది. ఆ క్షణం రెండు సింహలు ఎదురుపడితే ఎలా చూసుకుంటాయో అలా చూసుకుంటున్నారు. సింహం కళ్ళలో కోపం ఉంటే, రూహి కళ్ళలో ధైర్యమిచ్చిన తెగింపు కనపడతుంది. మిగతా బృందం ఇప్పుడు ఏమవుతుందా అని చూస్తున్నారు.

ఇంతలో సింహం కోపం గా రూహి వైపు పరుగు తీసింది. రూహి కూడా ఆ సింహానికి దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. మరో వైపు వంశీ పరుగున పార్వతి దగ్గరకు వెళ్లి తన చేతికి చికిత్స చేస్తున్నాడు. అయాన్ మాత్రం రూహి, సింహం వైపు పరిగెత్తాడు.

ముందు రూహి... వెనుక సింహం...
సింహం గర్జింపు లతో ఆ చోటు దద్దరిల్లింది.
క్షణాలు గడిచే కొద్ది వారి ఇద్దరి మధ్య దూరం తరిగింది.
ఇంతలో రూహి కి ఎదురుగా ఊడల మర్రి చెట్టు కనిపించింది. దాని ఊడలు, కొమ్మలతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోయింది. అలాగే ఆ చెట్టు కు ఒక పెద్ద తొర్ర కూడా ఉంది. రూహి ఆలస్యం చేయకుండా పరుగున వెళ్లి ఆ తొర్ర లో నుంచి దూరి ఇటు వైపు కు వచ్చింది.

తననే వెంబడిస్తూ వచ్చిన సింహం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ తొర్ర లోకి దూరింది. తల అటు వైపు వచ్చింది. కానీ దాని భారీ శరీరం మాత్రం ఇటు వైపు కు రాలేక ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక అలాగే ఆగిపోయింది.

రూహి ఆయాస పడుతూ అక్కడే కూర్చుంది. ఇంతలో అయాన్ పరుగున తన దగ్గరకు వచ్చాడు.

"నీకేం కాలేదు గా రూహి..." అని కంగారుగా అడిగాడు.

"నాకేం కాలేదు అయాన్. నేను బాగానే ఉన్నాను "

ఆ తొర్ర లో నుంచి బయటపడాలి అని సింహం వేగంగా తన శక్తి మొత్తం ఉపయోగించి పెనుగులాడుతుంది. ఇంతలో అయాన్ సింహం వైపు కోపంగా చూస్తూ తన జేబులో నుంచి తుపాకీ బయటకు తీసి దానిని కాల్చబోయాడు. రూహి తనని వెంటనే ఆపేసింది.

"అయాన్.. ఆగు.. ఈ అడవిలోకి కొత్తగా వచ్చింది మనం. దాని స్థావరం లో అది నివసిస్తుంది. అలాంటి దాన్ని చంపడం న్యాయం కాదు. "

"కానీ మేడమ్ అది ఆ తొర్ర లో ఎక్కువ సేపు ఉండదు. ఏ క్షణమైనా బయటకు రావచ్చు. మనం ఇక్కడి నుంచి పారిపోయినా సరే ఎక్కువ దూరం వెళ్లలేం. తప్పకుండా అది మన వెనకే వస్తుంది."

అయాన్ చెప్పినట్టుగానే సింహం శరీరం లో చాలా భాగం ఇప్పటికే ఇటు వైపుకు వచ్చేసింది. కొన్ని క్షణాల్లో అది దాని నుంచి బయటకు రావచ్చు.

రూహి వేగంగా ఆలోచించింది. ఒక్కసారి చుట్టూ చూసింది. అప్పుడే తనకు కాస్త దూరంలో ఓ చిన్న గుహ లాంటిది కనిపించింది. ఆ గుహ బయట ఓ పెద్ద బండరాయి కూడా ఉంది. వాటిని అలా చూడగానే రూహి కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అయాన్ కు ఏం చేయాలో చెప్పింది.

"మేడమ్ ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాలు పోతాయి." అని అయాన్ కంగారుగా అన్నాడు.

"దేశం బాగుండాలి అంటే రాజకీయ నాయకుడు డబ్బును, సైనికుడు ప్రాణాన్ని లెక్క చేయకూడదు"

ఆ మాట తో అయాన్ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి వంశీ, పార్వతి కూడా వచ్చాడు. అయాన్ వారికి ఏం చేయాలో చెప్పాడు. ముగ్గురూ గుహ పక్కనే ఉన్న చెట్ల వెనుక దాక్కున్నారు.

రూహి మాత్రం ఆ సింహం వైపు తిరిగి దాని వంకే చూస్తుంది. కొన్ని క్షణాలు తరువాత సింహం నిజంగానే తొర్ర నుంచి బయటకు వచ్చేసింది. బయటకు రాగానే రూహి వంక చూసింది. దాని కళ్ళు చింత నిప్పులు మాదిరి ఎర్రగా మండుతున్నాయి. కోపం తో దాని కడుపు ఎగసి ఎగసి పడుతుంది. పెద్దగా గర్జిస్తూ రూహి వైపు వచ్చింది. దాని కోసమే ఎదురుచూస్తున్న రూహి వేగంగా ఇందాక చూసిన గుహ లోపలకు పరుగు తీసింది. సింహం కూడా గుహ లోకి వెళ్ళింది. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఒక్క క్షణం దానికి ఏమి కనిపించలేదు.

అది తేరుకునే లోగా రూహి దాని మీద నుంచి దూకుతూ గుహ బయటకు దూకింది. దాని కోసమే చూస్తున్న వంశీ, అయాన్, పార్వతి వెంటనే అక్కడున్న బండ రాయి ని గుహ కు అడ్డంగా తోసారు. సింహం ఆ రాయి సందు లో నుంచి బయటకు రావాలని చూసింది. కానీ ఆ రాయి చాలా పెద్దది అవ్వడం, అందులో అది ఆ గుహ ముందున్న గుంత లో సరిగ్గా ఇరుక్కుపోవడం తో దాన్ని ఇంచు కూడా కదల్చలేక పోయింది. అలా బ్లాక్ కోబ్రా బృందం సింహాన్ని గుహ లో బందించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

"మేడమ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి." అని వంశీ అన్నాడు.

"ఒక్క క్షణం ఉండండి." అంటూ రూహి తన బ్యాగ్ లో నుంచి ఒక చిన్న టైం బాంబు ను బయటకు తీసింది. దాన్ని గుహ బయట ఉన్న రాయి కి అతికించి, మరో 8 గంటల్లో అది పేలే లాగా సెట్ చేసింది. మిగతా బృందం తన వంక ఆశ్చర్యంగా చూసారు.

"ఇలాగే వదిలేసి వెళ్తే ఆ సింహం చనిపోతుంది. ఇంకో 8 గంటల తరువాత ఈ బాంబు వల్ల రాయి పేలిపోతుంది. అప్పుడు ఆ సింహం దాని నుంచి బయటపడుతుంది. మన పని జరగడం కోసం ఓ జీవి ని చంపితే నా మనసు అది క్షమించదు. అందుకే ఇలా..." అంటూ అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

రూహి మాటలకు అందరూ తన వంక గర్వంగా చూసారు. దేశం కోసం ప్రాణాలు ఇస్తూ, శత్రువుల ప్రాణాలను తీస్తు... ఇలా అమాయక జీవిల గురించి కూడా ఆలోచించడం ఒక్క రూహి వాసుదేవ్ కే చెల్లింది అని మనసులోనే అనుకున్నారు.

ఆ తరువాత అందరూ తిరిగి అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టారు. దారిలో వారికి ఎలుగు బంటి, తోడేలు లాంటి క్రూర మృగాలు కూడా ఎదురు అయ్యాయి. చాక చక్యంగా నలుగురూ కలిసి వాటిని ఎదురించి పోరాడి తప్పించుకున్నారు.

అలాగే మరోసారి ఆకులు కప్పిన ఊబీ లో వంశీ పడిపోయాడు. ఆ ఊబీ తన శరీరాన్ని అంతకంతకు లోపలకు లాగేసుకుంటుంది. మిగతా బృందం తమ దగ్గర ఉన్న తాడు సాయం తో తనని బలంగా లాగి బయటకు పడేసారు. ఇలా ఎన్నో సాహసాలు చేస్తూ ఆ అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి క్షణం వారికి ప్రాణాలతో చెల గాటం లాగానే ఉంది.

చూస్తూ ఉండగానే  సమయం గడిచిపోయింది. మెల్లగా సూర్యుడు పడమర కొండల్లో వాలిపోవడం మొదలయింది. అప్పటిదాకా గుబురు చెట్లతో చీకటిగా మారిన అడవి మరింత దట్టమైన కారు చీకటిగా మారింది. దూరంగా రకరకాల జంతువుల అరుపులు వీరి గుండెల్లో భయాన్ని పెంచుతున్నాయి.

ఇక ఆ రాత్రి వేళ ముందుకు నడవడం కష్టమని అర్థమై అక్కడే విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకోగానే బ్యాగ్ లో నుంచి టెంట్ లు బయటకు తీశారు.

సరిగ్గా అప్పుడే ఓ బల్లెం వేగంగా వచ్చి వారి ముందున్న చెట్టు లోకి దిగింది. అందరూ భయం తో అది వచ్చిన వైపు తల తిప్పి చూసారు. ఎదురుగా ఉన్న వారిని చూసి గుండె ఆగినంత పనైంది.

ఎదురుగా వందల మందిలో నర మాంస భక్షకుల జాతి నిలబడి ఉంది. వారి చేతుల్లో ఆయుధాలు... కాగడాల వెలుతురు లో వారు మరింత భయంకరంగా ఉన్నారు.

బ్లాక్ కోబ్రా బృందం అలా ఆశ్చర్యం లో మునిగిపోయి ఉండగానే వారిని చుట్టు ముట్టారు.

ఇక నేటి తో మన ప్రాణం పోవడం ఖాయం అని అందరూ భయం తో బిగుసుకుపోయారు...
[+] 7 users Like SivaSai's post
Like Reply
#48
ఏజెంట్ రూహి వాసుదేవ్...20




[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]






రూహి బృందం ఆ భయంకరమైన అడవిలో క్రూర మృగాల బారి నుంచి తప్పించుకొని ఎలాగోలా సగం దూరం దాటేసారు. కానీ అప్పుడే అసలైన ప్రమాదం వారిని చేరింది. ఆ ప్రమాదం పేరే అడవి తెగ జాతి...

ఆ అడవుల్లో నివసించే ఆ జాతి కి మరో పేరు కూడా ఉంది. అదే నర మాంస భక్షకులు... ప్రతి రోజు అడవిలో జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు. ఎవరైనా మనిషి పొరపాటున ఆ అడవి లోకి ప్రవేశిస్తే బ్రతికుండగానే కాల్చుకొని తింటారు. అంతటి క్రూరులు... వారిని చూస్తేనే గుండెల్లో దడ పుడుతుంది. అంత భయానకంగా ఉంటారు. బ్లాక్ కోబ్రా బృందం ఇప్పుడు వారి చేతికే చిక్కింది.

ఎదురు తిరిగి పోరాడటానికి వారు వందల్లో ఉన్నారు. పైగా వారి చేతుల్లో పదునైన విల్లులు, కొడవళ్లు, బల్లెం లాంటి ఆయుధాలు ఉన్నాయి. అంత మందిని ఎదురించి గెలిచేంత సమయం వారి వద్ద లేదు. అందుకే రూహి మౌనంగా నిలబడిపోయింది.

ఇంతలో
"మేడమ్, మన దగ్గర ఉన్న తుపాకీ లతో ఎదురు తిరుగుదామా" అని అయాన్ చిన్నగా రూహి కి మాత్రమే వినిపించేలా అడిగాడు.

"మన తుపాకీల నుంచి తూటాలు బయటకు వచ్చే లోగా కొన్ని వందల బాణాలు మనల్ని చేరుతాయి. వీళ్ళు పైనున్న చెట్లలో కూడా నక్కి నక్కి మనల్ని గమనిస్తున్నారు. గుడ్డిగా పోరాడి ఓడిపోవడం కంటే ప్రస్తుతానికి లొంగిపోదాం. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం." అని సమాధానం ఇచ్చింది.

"ఏంటి మేడమ్ మీరు అనేది. మనం వెనకడుగు వేయడమా.."

"కొన్ని సార్లు యుద్ధం గెలవాలంటే కొన్ని అడుగులు వెనక్కి వేయక తప్పదు.
వెనక్కి వేసే ప్రతి అడుగు ఓటమి కోసం కాదు, గెలవడానికి బలం సమకూర్చుకోడానికి కూడా..." అని రూహి స్పష్టంగా చెప్పడం తో అయాన్ మౌనంగా ఉండిపోయాడు.

ఇంతలో ఆ జాతి వారు రూహి బృందాన్ని చుట్టు ముట్టారు.
వారి తల మీద జుట్టు ఎర్రని రంగులో ఉంది. కొంతమంది జుట్టు భుజాల దాకా ఉంది. కళ్ళకు ఏదో నల్లగా రాసుకున్నారు. అంతే కాకుండా మొహానికి కూడా అక్కడక్కడా తెల్లని సున్నం లాంటిది ఏదో పూసుకున్నారు. ప్రతి ఒక్కరూ కండలు తిరిగిన దేహల తో చాలా బలంగా ఉన్నారు. కాళ్ళు చేతులు మొత్తం మట్టి కొట్టుకున్నారు. వారి కళ్ళ లో కోపం, ఆనందం ఒకేసారి కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నారు.

రూహి బృందం అందరూ అలా భయం తో బిగుసుకుపోయి ఉండగానే వారు దగ్గరగా వచ్చి అందరి చేతులు వెనక్కి విరిచి ఏవో చెట్టు తీగల తో కట్టేసారు. అవి చాలా బలంగా ఉన్నాయి. అలాగే కాళ్ళను కూడా కట్టేసారు. తరువాత ఒక్కొక్కరిని కర్రకు కట్టి కాగడాల వెలుతురులో ఎత్తుకొని ముందుకు నడవసాగారు.

రూహి బృందానికి వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు. కానీ మౌనంగా చుట్టు చూస్తున్నారు. మధ్యలో ఓ చిన్న వాగు వచ్చింది. మోకాళ్ళ దాకా నీళ్లు ఉన్నాయి. అంత చీకట్లో కూడా ఆ నీళ్లలో అంత ధైర్యంగా నడుస్తున్నారు అంటే ఆ చోటు మొత్తం వారికి కొట్టిన పిండి అనిపించింది. పైగా వారి కాళ్లకు ఎలాంటి చెప్పులు లేవు. పదునైన రాళ్లు, రప్పలు లాంటివి ఎదురైనా సరే లెక్క చేయడం లేదు.

ఆకాశం మొత్తం నల్లని మబ్బులు కమ్మడం తో చీకటి మరింతగా ముసురుకుంది. ఆ చీకట్లో వారిని చూస్తుంటే ఎలాంటి వారికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే...

అలా అందరూ భయపడుతూ ఉండగానే కాసేపటికి నడుస్తున్న వారు ఆగిపోయారు. అందరినీ కర్రల నుంచి కిందకు దింపి నిలబడమని అన్నారు. రూహి తల పైకి ఎత్తి ఎదురుగా చూసింది. అది ఒక మైదాన ప్రాంతం లాగా ఉంది. దాని చుట్టు చాలా ఇళ్ళులు ఉన్నాయి. అక్కడ దొరికే ఆకులు, గడ్డి తో కలిపి ఓ గుడిసెల లాగా వేసుకున్నారు.
దట్టమైన మేఘాలు కమ్మడం తో పాటు ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి.

రూహి బృందాన్ని చూడగానే ఆ తెగ లోని ప్రజలు అందరూ వారిని చుట్టు ముట్టి ఏదో భాష లో అరుస్తూ ఆనందం తో కేకలు వేస్తున్నారు. అక్కడున్న ప్రజలకు సరిగా బట్టలు కూడా వేసుకోలేదు. అందరూ ఏదో చెట్టు ఆకును కప్పుకున్నారు అంతే... వారిని అంత దగ్గర నుంచి చూస్తుంటే ఒళ్ళు జలదరించింది.

ఆ మైదాన ప్రాంతం మధ్యలో మాత్రం ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు ముందు కుర్చీ లాంటిది ఉంది. ఆ కూర్చి చూడగానే అందరికీ ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ కూర్చి ని మనిషి పుర్రెలు, ఎముకల తో చేసారు. అంతే కాకుండా కూర్చి వెనుకాల పుర్రెల తో ఓ గోడ లాంటి దాన్ని కూడా కట్టారు. అన్ని పుర్రెలు అక్కడ ఉన్నాయి అంటే ఎంత మంది మనుషులను చంపి ఉంటారో అని ఊహిస్తుంటేనే శరీరం మొత్తం భయం తో చల్లగా అయిపోయింది.

ఇంతలో అరుస్తున్న వారంతా నిశ్శబ్దంగా మారిపోయారు. రూహి బృందం ఏమైందా అని ఒకసారి చుట్టు చూసారు.

మెడలో రకరకాల పూసల తో కుట్టిన దండ వేసుకొని, తల మీద పక్షి ఈకల తో చేసిన కిరీటం లాంటిది పెట్టుకొని, చేతిలో మనిషి వెన్నెముక తో చేసిన కత్తి లాంటిది పట్టుకొని... భయానికే భయం పుట్టించేంత భయంకరమైన రూపం ఒకటి వారి ముందుకు వచ్చింది. వాడి నోటి నుంచి ఏదో పొగ వదులుతున్నాడు. చీకట్లో నర రూప రాక్షసుడి మాదిరి కనిపించాడు. చూడగానే అతనే ఈ తెగ నాయకుడు అని అర్థమవుతుంది. పది మందిని ఒకేసారి మట్టి కరిపించేంత దృడంగా ఉన్నాడు.

వాడు వచ్చి ఆ పుర్రెల కుర్చీలో కూర్చున్నాడు. ముందుగా రూహి బృందం వైపు కాకుండా తన జాతి ప్రజల వైపు చూసాడు. అలా చుట్టు చూస్తూ ఉండగా వాడి చూపు ఓ ఆరు సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్ల దగ్గర ఆగింది.
ఆ పాప వైపు చూపుడు వేలు చూపిస్తూ దగ్గరకు రమ్మని సైగ చేశాడు.

ఆ పాప అయోమయంగా ఒకసారి తన వెనుక నిలబడిన వారి వంక చూసింది. తన వెనకున్నది ఆ పాప అమ్మ ఏమో, కను గుడ్ల నిండా నీళ్ల తో ముందుకు వెళ్ళమని ఆ పాపను తోసింది. ఆ పాప భయం భయం గానే నడుస్తూ ఆ నాయకుడి దగ్గరకు చేరింది. వాడు ఆ పాపను తన ఒళ్ళో కూర్చోమని సైగ చేశాడు. ఆ పాప బిగుసుకుపోయి నిలబడింది. వాడు గుడ్లు ఉరిమి చూసాడు. ఆ చూపుకు భయపడి పోయి ఆ పాప టక్కున కూర్చుంది.

ఆ తరువాత వాడి చేతులు ఆ చిన్న పాప శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ తడుముతున్నాయి. అలా తడుముతూ పెద్దగా నవ్వుతున్నాడు. అలా నవ్వినప్పుడు వాడి పళ్ళు చూడాలి. అచ్చం రాక్షసుడి కి మల్లె నల్లగా పదునుగా ఉన్నాయి. ఆ పాపని ఇందాక తోసిన ఆవిడ తల వంచుకుంది. మిగతా అందరూ కూడా మౌనంగానే ఉన్నారు.

ఆ దృశ్యం చూస్తుంటే రూహి రక్తం మరిగిపోయింది. దవడ కండరాలు, చేతి పిడికిలి బిగుసుకుంది. తన గుండెల్లో కోపం అగ్ని పర్వతం మాదిరి ఎగసింది. కానీ ఇప్పుడు తను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అందుకే మౌనంగా తల దించుకుంది.

అలా ఆ రాక్షసుడు ఆ చిన్న పిల్ల తో తన శరీర దాహం తీర్చుకున్న తరువాత, మెల్లగా రూహి బృందం వైపు వచ్చాడు. దగ్గర నుంచి వాడి రూపం మరింత క్రూరంగా ఉంది.

వాడు ఒక్కొక్కరిని గమనిస్తూ రూహి దగ్గరకు వచ్చి ఆగాడు. రూహి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడు. రూహి కి వాడిని చూస్తుంటేనే గుండె మీద ఎగిరి తన్నాలని అనిపించింది. బలవంతం మీద ఆపుకుంది. రూహి చేతులు కట్టేసి ఉండకపోతే ఈ పాటికే వాడి చెంప మీద తన చేతి గుర్తులు మిగిలి ఉండేవేమో...

వాడు మెల్లగా ముందుకు ఒంగి రూహి చెంప మీద ముద్దు పెట్టుకోవాలని చూసాడు. రూహి తన కోపాన్ని ఆపుకోలేక వేగంగా తన మోకాలి తో వాడి మగతనం మీద కొట్టింది.
ఆ దెబ్బ వాడికి కళ్ళు బైర్లు కమ్మాయి. కాసేపు నొప్పితో విల విల లాడిపోయాడు. రూహి వాడి వైపు ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టు చూసింది. వాడిలో కోపం మరింతగా పెరిగింది.

తన బృందం వైపు తిరిగి...
'కొరోక్రె రసడజాగస్క్.... " అని అరిచాడు.

ఆ పదం వినగానే మిగతా బృందం మొత్తం ఆనందం తో ఎగిరి గంతేశారు. రూహి కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను అలా ఆశ్చర్యం లో ఉండగానే...

కొంతమంది ఆ జాతి ప్రజలు వచ్చి ఆ మైదానం మధ్యలో కర్రలు పేర్చి.. దాని మీద కొన్ని జంతువుల మాంసం నుంచి తీసి కొవ్వు ను వేసి మంట వెలిగించారు. తరువాత ఆ మంట పైన కర్రల తో అటు ఇటు కట్టారు.

అప్పుడు రూహి కి అర్థమైంది. తనను బ్రతికి ఉండగానే కాల్చుకొని తినబోతున్నారు అని.. వెంటనే అయాన్ వైపు తిరిగింది.

"అయాన్.. నా చావు ఎలాగూ ఖాయం అయ్యింది. నేను చనిపోయినా సరే మన మిషన్ ఆగకూడదు. భారత దేశపు జెండా కల కాలం అలా స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి. ఈ రాత్రికి ఎలాగోలా మీరు ముగ్గురూ ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోండి. "

"మేడమ్ మీరు లేకుండా ఎలా... కావాలంటే మీ బదులు నేను ప్రాణం ఇస్తాను." అంటూ అయాన్ కళ్ళ నీళ్లతో పలికాడు.

"అయాన్ ఇప్పుడు నువ్వు ఆవేశంగా ఏదైనా చేస్తే నిన్ను కూడా నాలాగే కాలుస్తారు. అప్పుడు మనం ఇక్కడికి వచ్చిన ఆశయం ఆగిపోతుంది. కాబట్టి నా మాట విను...
నా మరణం ఓ విరామం మాత్రమే...
మన గడ్డ పై గెలవడానికి తప్పకుండా తిరిగి వస్తాను. అప్పటి దాకా సెలవు... వందేమాతరం..." అని పలికింది.

వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే... రూహి ఊహ ను నిజం చేస్తూ ఆ తెగ ప్రజలు కొంతమంది వచ్చి రూహి చేతులు కాళ్ళను ఒక కర్రకు కట్టేసారు. తరువాత ఆ కర్రను మంట వైపు తీసుకొని వెళ్లారు.

రూహి కళ్ళు ఆకాశం వంక చూస్తున్నాయి. ఆ కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి. అది చావు భయం తో కాదు... దేశం ప్రమాదం లో ఉంటే కాపాడలేక పోతున్నాను అనే బాధ తో...

దాదాపు మంట సమిపానికి తీసుకొచ్చారు. ఎగసి పడే ఆ మంట వేడి తనకు తాకింది. రూహి ఒక్కసారి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ ముందు మువ్వన్నెల జెండా కదలాడింది. తను కూడా తన తండ్రి లాగే దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నందుకు గర్వంగా ఉన్నా, మధ్యలోనే వెళ్తున్నాను అనే బాధ కూడా రగిలింది.

ఆ దేవుడు తనకు మరొక్క అవకాశం ఇస్తే బాగుండు అని చాలా బలంగా అనుకుంది. తన మాటను ఆ దేవుడు విన్నాడో లేదో తెలియదు కానీ, ప్రకృతి మాత్రం విన్నది.

అప్పటిదాకా సన్నగా వీస్తున్న గాలులు మరింత వేగంగా వీచాయి. గాల్లో తిరుగుతున్న పక్షలు తమ గూటికి చేరుకున్నాయి. ఎండుటాకులు సుడులు తిరుగుతూ గాల్లోకి లేచాయి. వాటి నడుమ... ఓ వెచ్చని నీటి చుక్క వచ్చి రూహి నుదుటిన కస్తూరీ లాగా చేరింది. అప్పుడు రూహి కళ్ళు తెరిచింది.

తన త్యాగం చూసి ఆ మేఘాలు కూడా కరిగిపోయాయి. వర్షించడం మొదలుపెట్టాయి.

ఆ వర్షానికి రూహి ని కాల్చడం కోసం వేసిన మంట క్షణాల్లోనే ఆరిపోయింది. రూహి మోహం మీద ఓ చిరునవ్వు విరిసింది. ఆ నవ్వు తో కృతజ్ఞత గా ఆకాశం వైపు చూసింది. ఆ ఆకాశం లో మేఘాల నడుమ నుంచి మరో చిరునవ్వు కనిపించింది.

ఆ నవ్వు... మరెవరిదో కాదు..
ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ ది...




" ఏజెంట్ రూహి వాసుదేవ్...20 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 8 users Like SivaSai's post
Like Reply
#49
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#50
(21-05-2026, 07:24 AM)SivaSai Wrote:
ఏజెంట్ రూహి వాసుదేవ్...20


...

అప్పటిదాకా సన్నగా వీస్తున్న గాలులు మరింత వేగంగా వీచాయి. గాల్లో తిరుగుతున్న పక్షలు తమ గూటికి చేరుకున్నాయి. ఎండుటాకులు సుడులు తిరుగుతూ గాల్లోకి లేచాయి. వాటి నడుమ... ఓ వెచ్చని నీటి చుక్క వచ్చి రూహి నుదుటిన కస్తూరీ లాగా చేరింది. అప్పుడు రూహి కళ్ళు తెరిచింది.

తన త్యాగం చూసి ఆ మేఘాలు కూడా కరిగిపోయాయి. వర్షించడం మొదలుపెట్టాయి.

ఆ వర్షానికి రూహి ని కాల్చడం కోసం వేసిన మంట క్షణాల్లోనే ఆరిపోయింది. రూహి మోహం మీద ఓ చిరునవ్వు విరిసింది. ఆ నవ్వు తో కృతజ్ఞత గా ఆకాశం వైపు చూసింది. ఆ ఆకాశం లో మేఘాల నడుమ నుంచి మరో చిరునవ్వు కనిపించింది.

ఆ నవ్వు... మరెవరిదో కాదు..
ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ ది...




" ఏజెంట్ రూహి వాసుదేవ్...20 " రచనకు రేటింగ్ ఇవ్వండి

For people who stay with nature, any clue from nature is either a good or bad omen!!!
Ruhi is saved!!!  horseride horseride horseride
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#51
Updates race emaina pettava bro . Okadaani venta okati ala vachhestunnai. Mee vision ki, mee stories ki, mee narration ki,  take a bow.
[+] 1 user Likes styleraja's post
Like Reply
#52
Daring operation
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#53
Update please
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
#54
ఏజెంట్ రూహి వాసుదేవ్...21


[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]






రూహి బృందం ఆ అడవిలో నర మాంస భక్షకులకు దొరికారు. వారి నాయకుడు అత్యంత క్రూరుడు మరియు నీచుడు. చిన్న పిల్లలను కూడా వదలని కామ పిశాచి. వాడు రూహి ని ముద్దు పెట్టుకోవాలని చూసాడు. దాంతో రూహి మరుగుతున్న తన రక్తాన్ని ఆపుకోలేకపోయింది. అందుకే తన బలమంతా ఉపయోగించి వాడి రెండు కాళ్ళ మధ్యలో కొట్టింది. దెబ్బకు వాడి కి దిమ్మ తిరిగిపోయింది.

కాసేపటికి తేరుకొని రూహి ని బ్రతికుండగానే మంటల్లో కాల్చమని ఆదేశించాడు. అది విని మిగతా వారు మైదానం మధ్యలో పెద్దగా మంటను సిద్ధం చేసారు. రూహి ని కర్రకు కట్టి ఆ మంటల్లో వేయడానికి తీసుకొని వెళ్లారు.

ఇంకొన్ని క్షణాల్లో తన ప్రాణం పోతుంది అని అందరూ అనుకున్నారు. రూహి గుండెల్లో దేశాన్ని కాపాడలేక పోయాను అనే బాధ కనిపించింది. సరిగ్గా అప్పుడే...

తన తెగింపు, ధైర్యం... మరణంలో కూడా మాతృ భూమి కోసమే ఆలోచించే తన త్యాగం చూసి ఆ ప్రకృతి కూడా కరిగి మేఘాలను చిలికి వర్షంగా మారి తనని అభిషేకించింది. ఆ వర్షానికి తనను కాల్చడానికి వేసిన మంట ఆరిపోయింది. అది చూసి అయాన్, పార్వతి, వంశీ మనసులోనే ఆ దేవుడికి ఎన్నో నమస్కారాలు పెట్టుకున్నారు. రూహి కృతజ్ఞతగా ఆకాశం వంక చూసింది. అక్కడ విక్రమ్ వాసుదేవ్ నవ్వుతూ చూస్తున్నట్టు అనిపించింది. తన తండ్రి తనతోనే ఉన్నాడని తృప్తిగా సంతోషించింది.

వేసిన మంట ఆరిపోవడం తో ఏం చేయాలో తెలియక ఆ జాతి ప్రజలు అందరూ వర్షం లో తడుస్తూనే దిక్కులు చూసారు.

ఇంతలో వారి నాయకుడు..
"కిలారో కింకో చా... కీర్ కోట్ కమరో... జాల్చ భి..." అని అరిచాడు.

రూహి బృందానికి ఆ మాట ఏంటో అస్సలు అర్థం కాలేదు. అయోమయంగా దిక్కులు చూసారు. అక్కడ తమని తినడం కోసం గుమి గూడిన ప్రజలు అందరూ ఒక్కొక్కరుగా తమ ఇళ్లలోకి వెళ్తున్నారు. రూహి కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారు అలా చూస్తూ ఉండగానే కర్రకు కట్టిన రూహి ని కిందకు దింపారు. తరువాత రూహి బృందం అందరినీ నడిపించుకుంటూ ఆ మైదానం పక్కనే ఉన్న గుడిసె దగ్గరకు తీసుకొని వెళ్లారు. అందరినీ అందులోకి తోసి కాళ్ళు చేతులు కట్టేసి తలుపు వేశారు.

వాళ్ళు వెళ్ళగానే...
"మేడమ్ మీకేమైనా అవుతుందేమో అని చాలా భయపడ్డాను." అని అయాన్ కళ్ల నీళ్లతో అన్నాడు.

"నాకేం కాదులే అయాన్. మన గమ్యం మంచి వైపు అయితే ఆ పంచ భూతలే తోడుగా ఉంటాయని విన్నాము, నేడు చూసాము." అని రూహి సమాధానం ఇచ్చింది.

"మేడమ్, ఇందాక వాళ్ళ నాయకుడు వాళ్ళతో ఏమని చెప్పాడు." అంటూ పార్వతి సందేహంగా అడిగింది.

"నాకు కూడా తెలీదు. బహుశా వర్షం పడుతుంది కాబట్టి, మనల్ని కాల్చుకొని తినడం కుదరదు కదా.. అందుకని ఈ రాత్రికి ఇక్కడ బంధించి ఉదయం వీరి సంగతి చూద్దామని చెప్పాడేమో అనిపిస్తుంది..."

"అంటే ఉదయం మనల్ని చంపుతారా..." భయంగా అడిగింది.

"అప్పటిదాకా మనం ఇక్కడ ఉండాలి కదా..  ఈలోగానే మనం ఇక్కడి నుంచి బయటపడాలి." అని రూహి ఆలోచనలో పడింది.

ఎవరు తప్పించుకోకుండా ఉండడానికి కాళ్ళను, చేతులు వెనక్కి విరిచి బలంగా ఆ అడవిలో దొరికే ఒక చెట్టు తీగలతో కట్టేసారు. రూహి తన బలమంతా ఉపయోగించి వాటిని తెంపుకోడానికి ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు.

మిగతా బృందం కూడ ప్రయత్నించింది. కానీ ఎవరి వల్ల కాలేదు.

"ఈ తీగ చాలా బలంగా ఉంది మేడమ్. దీన్ని తెంపడం మన వల్ల కావడం లేదు. ఇక్కడి నుంచి బయటపడటం కష్టమే.." అని పార్వతి బాధగా అంది.

"కష్టమని ఆపేస్తే మనిషి బ్రతుకు అమ్మ కడుపులోనే ఆగిపోయేదేమో... చివరిదాకా పోరాడుదాం." అంటూ రూహి ఒక్కసారి కాగడాల వెలుతురులో చుట్టు చూసింది.

వాళ్ళని బంధించింది ఒక పాత గుడిసె లో..  వర్షపు చినుకులు అక్కడక్కడా బొట్లు బొట్లుగా రాలుతూనే ఉన్నాయి. ఆ గుడిసె లో తమకు ఉపయోగ పడేలా ఎలాంటివి కనిపించలేదు. సరిగ్గా అప్పుడే తన చూపు ఆ గుడిసె కు ఒక మూలన ఉన్న కలుగు మీద పడింది.

అందులో నుంచి ఒక మూడు, నాలుగు ఎలుకలు ఆహారం కోసం బయటకు రావడం... అలికిడి విని వెనక్కి వెళ్లడం గమనించింది. అవి అడవిలో తిరిగే bandicoot (బండీకూట్ ) జాతికి చెందినవి అని అర్థమైంది. వాటి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. ఎలాంటి బలమైన వస్తువునైనా చాలా సులభంగా క్షణాల్లోనే కొరికేస్తాయి. అందుకే రూహి పాకుతూ వెళ్లి ఆ కన్నం ముందు తన చేతులను పెట్టి కదలకుండా కూర్చుంది. ఆ ఎలుకలు వచ్చి ఆ తీగను కోరుకుతాయేమో అని ఎదురుచూసింది. కానీ ఆ ఎలుకలు భయపడి బయటకు రావడమే ఆపేసాయి.

రూహి కి ఏం చేయాలో అర్థం కాలేదు. తమ ముందున్న చివరి అవకాశం కూడా నీరుగారి పోవడం తో రూహి ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడే తనకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ బండీకూట్ ఎలుకల జాతి కి రక్తమంటే చాలా ప్రీతి... ఆ వాసన తమ దగ్గరలో ఎక్కడున్నా సరే వెంటనే గుర్తుపడతాయి.

రూహి వెంటనే మోకాళ్ళ మీద లేచి కూర్చుంది. తన ముందు రాతి గోడ ఉంది. అందరూ తను ఏం చేస్తుందా అని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇంతలో రూహి తన తలను బలంగా గోడకేసి కొట్టుకుంది.

"మేడమ్ మీరేం చేస్తున్నారు. " అంటూ అయాన్ పెద్దగా అరిచాడు.

"అయాన్.. అరవకు... నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. కాసేపు మౌనంగా ఉండు.." అని రూహి అంది.

ఆ మాటతో మిగతా అందరూ మౌనంగా ఉండిపోయారు. రూహి మాత్రం తన తలను మరోసారి బలంగా గోడ కు కొట్టింది. ఈసారి తన తల నుంచి రక్తం జారింది. ఆ రక్తం గోడకు అంటుకొని కిందకు జారింది. రూహి వెంటనే ఇటు తిరిగి కూర్చుంది. ఆ రక్తం గోడ వెంబడి జారి తన చేతికి కట్టిన తీగ మీద పడింది.

రూహి తల నుంచి రక్తం కారుతూనే ఉంది. తన తల తిరిగినట్టు అనిపిస్తుంది. కానీ అవేవి లెక్కచేయకుండా కదలకుండా కూర్చుంది. ఆ క్షణం తను నెత్తుటి స్నానం చేసిన అపర భద్ర కాళీ లాగా కనిపించింది.

ఇంతలి తన ఊహను నిజం చేస్తూ ఆ ఎలుకలు మెల్లగా కలుగు లో నుంచి బయటకు వచ్చాయి. రూహి శ్వాస, గుండె చప్పుడు తప్ప ఇంకేమి వినిపించకుండా శిల్పం లాగా కూర్చుంది. ఆ ఎలుకులు ముందుగా ఆ గోడకు ఉన్న రక్తం తాగాయి. తరువాత రూహి చేతికి కట్టిన తీగ మీదకు పాకుతూ దాని మీద ఉన్న రక్తం తాగుతూ, దాన్ని కూడా కొరకడం మొదలుపెట్టాయి. వాటిలో కొన్ని ఎలుకలు మాత్రం రూహి చేతిని కొరుతున్నాయి. పదునైన వాటి పళ్ళు తన చేతిలోకి దిగుతుంటే రూహి కి పట్టరాని నొప్పి కలిగింది. కానీ కదిలితే ఎక్కడ అవి పారిపోతాయో అని అలాగే కూర్చుంది.

రక్తం జారుతున్నా, నొప్పి కలుగుతున్నా, ప్రాణం పోయేంత బాధ కలుగుతున్నా... రూహి అన్నిటిని పంటి బిగువున భరించింది. దేశాన్ని కాపాడటం కోసం తను చేస్తున్న త్యాగం, పడుతున్న కష్టం చూసి అక్కడున్న ప్రతి గుండె గర్వం తో ఉప్పొంగింది. కాసేపటికి రూహి చెప్పినట్టుగానే తన చేతికి ఉన్న తీగలు తెగిపోయాయి. పైకి లేచి ఆ ఎలుకలను దూరంగా తరిమి తన కాళ్లకు ఉన్న తీగలను కూడా విప్పేసుకుంది.

తరువాత ఆ గుడిసె లో వర్షం పడే దగ్గర నిలబడింది. వర్షపు చినుకులు తన తల మీద నుంచి రక్తం తో పాటు జారుతుంటే కొంచెం మత్తు వదిలింది. రక్తం తో తన చొక్కా మొత్తం తడిచిపోయింది. తరువాత అలాగే నొప్పిని ఓర్చుకుంటూ మిగతా బృందం కట్లు విప్పేసింది.

అయాన్ వేగంగా తన దగ్గర ఉన్న కర్చిఫ్ తో రూహి తల నుంచి రక్తం కారకుండా కట్టు కట్టేసాడు. కాసేపటి తరువాత రూహి పూర్తిగా కోలుకుంది.

"ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి " అని అంది.

అందరూ కలిసి మెల్లగా ఆ గది తలుపు సందు లో నుంచి బయటకు చూసారు. గది బయట ఇద్దరు కాపలా గా ఉన్నారు. రూహి అందరికీ సైగ చేసి, తలుపు ను లోపల నుంచి దబా దబా మంటూ కొట్టింది. కొన్ని క్షణాల తరువాత తలుపు తెరుచుకుంది. ఆ కాపలా వాళ్లకు రూహి బృందం కట్లు విప్పుకున్నారని తెలీదు. తెలిసే లోగా రూహి బృందం ఆ ఇద్దరి మీదకు దూకి బందించారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, అదే తీగలతో కట్టేసారు. తరువాత గది తలుపులు వేసి మెల్లగా బయటకు నడిచారు.

ఆ గదికి ముందే మైదానం మధ్యలో ఉన్న చెట్టు దగ్గర వీరి లగేజ్ ఉంది. ఆ వర్షం లో నిదానంగా వెళ్లి లగేజ్ తీసుకున్నారు.

రూహి మిగతావారి వైపు తిరిగి...
"మీరు ఇక్కడే ఉండండి. ఈలోగా నాకొక చిన్న పని ఉంది. చూసుకొని వచ్చేస్తాను" అని అంది.

"ఏంటి మేడమ్ అది.." అని వంశీ అడిగాడు.

"రాక్షస సంహారం.." అని దృడంగా పలికింది.

రూహి అక్కడి ఆటవిక జాతి నాయకుడి గురించి మాట్లాడుతుంది అని అర్థమైంది.

"ఎందుకు మేడమ్ ఇప్పుడు అదంతా..."

"మన కళ్ళ ముందే ఒక చిన్న పిల్ల తో అంత రాక్షసంగా ప్రవర్తించాడు. ఇక మనం లేని సమయం లో ఇంకెన్ని ఆగాయిత్యాలు చేస్తున్నాడో ఒక్కసారి ఊహించండి."

"చేస్తే చేయని. అయినా ఇది మన దేశం కాదు, వీరు మన ప్రజలు కాదు. మరేందుకు మేడమ్ ఈ సాహసం.."

ఆ మాటకు రూహి నవ్వుతూ...
"నిజానికి ఈ ప్రపంచం మొత్తం నా దేశమే.. దాని పేరు మానవత్వం.
సరిహద్దులు నేలకు మాత్రమే. మంచి చేయాలి అనుకునే మనషుల మధ్య కాదు.
ఇప్పుడు వాడిని వదిలేస్తే జీవితాంతం ఈ బాధ నన్ను వేదిస్తుంది. కాబట్టి వాడిని వదిలే ప్రసక్తే లేదు.
మీరు నాకోసం సరిగ్గా పది నిమిషాలు ఎదురు చూడండి. ఆలోగా నేను రాకపోయినా, మిమ్మల్ని ఎవరైనా చూసినా... నాకోసం ఆగకుండా మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోండి." అని పలికింది.

ఆ మాటకు మిగతా బృందం మొత్తం కదలకుండా నిలబడిపోయారు.

రూహి మాత్రం తన లగేజ్ లో తనకు కావాల్సిన వాటిని తీసుకొని, ధైర్యంగా ఆ నాయకుడి ఇంటి వైపు అడుగులు వేసింది. వర్షం పడుతూ ఉండటం తనకు కలిసి వచ్చింది. బయట ఎవరూ లేరు. అది కాక తన అడుగుల శబ్దం కూడా ఎవరికీ వినిపించడం లేదు.

రూహి ఆ నాయకుడి ఇంటి ముందుకు చేరుకొని మెల్లగా గది తలుపులు తెరిచింది. లోపల వాడు మంచి నిద్రలో ఉన్నాడు. వాడి మోహం చూడగానే ఇందాక ఆ పాప తో చేసింది మొత్తం గుర్తొచ్చింది. రూహి రక్తం మొత్తం మరిగిపోయింది. చేతిలోని తుపాకీ తీసుకొని వాడి గుండెల్లో కాల్చాలని అనుకుంది. కానీ వాడికి మరణానికి మించిన పెద్ద శిక్ష వేయాలని అనుకుంది.

అందుకే ఇందాక తన బ్యాగ్ లో నుంచి బయటకు తీసిన ఇంజక్షన్ చేతిలోకి తీసుకుంది. మెల్లగా వాడి దగ్గరకు వెళ్లి వాడి తోడ లో దాన్ని గుచ్చింది.

ఆ దెబ్బకు వాడికి మెలుకువ వచ్చింది. ఎదురుగా రూహి ని చూసి ఆశ్చర్యం తో అలా నోరు తెరిచి ఉండిపోయాడు. తేరుకొని రూహి ని పట్టుకోడానికి చేతులు చాపాడు.
ఈలోగా రూహి తన బలమంతా పిడికిలి లో బిగించి వాడి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దింది. దెబ్బకు వాడికి కళ్ళు బైర్లు కమ్మాయి. రక్తం కారింది. కొద్ది సేపు అలాగే ఉండిపోయాడు.

లేచి మళ్ళీ రూహి మీదకు వచ్చాడు. రూహి ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. దూరంగా ఎగిరి పడ్డాడు. ఆ క్షణం తను అడవి లో తిరిగే ఆడ పులి మాదిరి వాడి మీద విరుచుకుపడింది. రూహి బలం చూసి వాడి కి దిమ్మ తిరిగింది. తేరుకునే లోగా రూహి చేతి నుంచి పిడి గుద్దుల వర్షం కురిసింది.

కాసేపటికి తేరుకొని వాడు పైకి లేవాలని చూసాడు. కానీ కాళ్ళు సహకరించడం లేదు. ఎంత ప్రయత్నించినా తన రెండు కాళ్ళను కాస్త కూడా కదల్చ లేకపోయాడు.

"ఇక జీవితం లో నీ నడుము కింద భాగం పని చేయదు. కాసేపటికి నీ చేతులు కూడా చచ్చు బడి పోతాయి. ఎప్పటికీ ఇలాగే ఉండిపో... ఓ చిన్న పాప కన్నీటి చుక్క విసిరిన శాపం ఇదని జీవితాంతం కుమిలిపోతూ బ్రతుకు..." అని రూహి నవ్వుతూ అంది.

వాడికి తన మాటలు అర్థం కాక పోయినా అందులోని మర్మం అర్థమైంది ఏమో... భయం తో పెద్దగా అరవబోయాడు.

ఈలోగా రూహి వాడి నోటిని తన దగ్గర ఉన్న బట్ట తో కట్టేసింది. వచ్చిన పని అయిపోవడం తో రూహి మెల్లగా బయటకు నడిచింది.

అప్పటికే తన కోసం మిగతా బృందం ఎదురు చూస్తూ ఉన్నారు. రూహి క్షేమంగా రావడం తో ఊపిరి పీల్చుకున్నారు. తరువాత అందరూ కలిసి వారి స్థావరం నుంచి బయట పడాలని అడవి వైపు అడుగులు వేసారు.

సరిగ్గా ఒక పది అడుగులు వేయగానే ఎదురుగా చూసి వారి కాళ్ళు ఆగిపోయాయి. షాక్ కొట్టిన వారి లాగా నిలబడిపోయారు. గుండె వేగం అమాంతం పెరిగింది.
వారికి ఎదురుగా పది మంది నర మాంస భక్షకులు ఆయుధాల తో నిలబడి ఉన్నారు.

ప్రాణాలకు తెగించి తప్పించుకున్న వారి సాహసం వృధా అవునుందా అనే భయం అందరిలో మొదలైంది.
[+] 5 users Like SivaSai's post
Like Reply
#55
ఏజెంట్ రూహి వాసుదేవ్...22


[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]






రూహి తన తెలివి తో ఆ నర మాంస భక్షకుల స్థావరం నుంచి తప్పించుకొని, వాళ్ళ నాయకుడికి సరైన శిక్ష విధించింది.

ఆకాశం లో ఉరుములు, మెరుపుల తో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆ అర్ధరాత్రి చీకటి లో, వర్షం లోనే బృందం మొత్తం అక్కడి నుంచి తప్పించుకోడానికి బయలుదేరారు. సరిగ్గా అప్పుడే వారి దారికి అడ్డంగా పది మంది నర మాంస భక్షకులు వచ్చారు.

వారి చేతిలో పదునైన ఆయుధాలు కూడా ఉన్నాయి. వారు వీరందరికి ఒక రెండు వందల మీటర్ల దూరం లో నిలబడి ఉన్నారు. ఒక్కో అడుగు నిదానంగా వేస్తూ వీరి వైపే వస్తున్నారు. వారిని అలా ఎదురుగా చూడగానే అందరికీ గుండె కాసేపు ఆగినట్టు అనిపించింది. ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం వృధా అయ్యిందా అని భయం కలిగింది. కానీ రూహి మాత్రం భయపడకుండా వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది.

ఇంతలో...
"మేడమ్.. ఇప్పుడు మన ముందు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు కదా.. మన దగ్గర ఉన్న తుపాకీ లతో వారిని కాల్చేద్దామా.." అని అయాన్ చిన్నగా అడిగాడు.

"గన్ పేలిస్తే ఆ శబ్దానికి మిగతా ప్రజలు అందరూ నిద్ర లేస్తారు. వారందరిని ఎదుర్కొనే అన్ని బుల్లెట్లు కానీ, సైన్యం కానీ మన దగ్గర లేవు కదా. అప్పుడు మన పరిస్థితి మొదటికి వస్తుంది." అని రూహి సమాధానం ఇచ్చింది.

"దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది." అని అయాన్ దృడంగా చెప్పాడు.

తన కళ్ళలో కనిపించిన ధైర్యం చూసి రూహికి నమ్మకం వచ్చింది. వెంటనే తన లగేజ్ లో నుంచి తుపాకీ బయటకు తీసింది. తనని చూసి మిగతా వారు కూడా తుపాకీలు బయటకు తీసి లోడ్ చేసారు. ఎదురుగా ఉన్న అడవి మనుషులకు ఆ తుపాకీ లు అంటే ఏంటో తెలీదు. కోపంగా చేతిలో బల్లెం, కత్తులు లాంటివి తీసుకొని ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా వీరి వైపు వచ్చారు. వారి మధ్య దూరం మెల్లగా తగ్గుతుంది.

రూహి బృందం అందరికీ ఆ వర్షం లో కూడా చమటలు పడుతున్నాయి. తుపాకీలు ఎదురుగా వస్తున్న భక్షకుల వైపు గురి పెట్టి నుంచున్నారు. అయాన్ మాత్రం ఆకాశం వంక చూస్తున్నాడు. అందరూ అయాన్ ఏం చెప్తాడో అని తన వంకే చూస్తున్నారు.

ఇంతలో అయాన్
"షూట్ నౌ..." అని అరిచాడు.

ఆ మాటతో ఇంకేమి ఆలోచించకుండా అందరూ తాము గురి పెట్టిన వైపు కాల్చేశారు. సరిగ్గా అదే సమయం లో ఆకాశం లో ఓ పెద్ద ఉరుము మెరుపు కూడా వచ్చింది. ఆ శబ్దం లో వీరి తుపాకీ శబ్దం కలిసిపోయింది. దాంతో అక్కడ గుడిసెల్లో ఉండే వారికి ఇదంతా వినిపించే అవకాశమే లేకుండా పోయింది.

రూహి బృందం ప్రయత్నానికి మరోసారి ఆ ప్రకృతి సహకరించినట్టు అయ్యింది. అయాన్ తెలివి కి రూహి మనసులోనే మెచ్చుకుంది. ఎదురుగా ఉన్న పది మందిలో నలుగురూ నేల కూలిపోయారు. అయినా సరే మిగతా ఆరు మంది కొంచెం కూడా భయపడకుండా వీరి వైపే వస్తున్నారు. ఇంతలో మరోసారి ఉరుము రావడం, వీరు మరో నలుగురిని కాల్చడం చక చకా జరిగిపోయాయి.

దాంతో మిగిలిన ఇద్దరూ వీరి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వారిని కాల్చుదామంటే సమయానికి ఉరుము కూడా రాలేదు. ఏం చేయాలో తెలియక అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

ఈలోగా రూహి తుపాకీ వెనక్కి దాచి, సింహం లా వారి మీదకు దూకింది. ఎదురుగా మరణం రంకెలు వేస్తున్నా దాననికి ముక్కు తాడు వేయడానికి దూకే రూహి ధైర్యం చూసి మిగతా బృందం ఆశ్చర్యంగా అలా నిలబడిపోయింది.

వారు అలా చూస్తూ ఉండగానే ఆ అడవి మనిషి ల్లో ఒకడు తన కత్తి వేగంగా రూహి మీదకు విసిరాడు. రూహి చాలా చాక చక్యంగా దాన్ని తన చేతిలోకి తీసుకొని ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. వాడు దూరంగా పడ్డాడు. ఈలోగా తన మీదకు వచ్చిన రెండో వాడి గుండెల్లో ఆ కత్తి ని దింపింది. కాసేపు గిల గిల తన్నుకుంటూ వాడు చనిపోయాడు. ఈలోగా దూరంగా పడిన మొదటి వాడు అది చూసి ఏదో వింత వింత శబ్దాలు చేస్తూ పరిగెత్తుకుంటూ తమ గుడిసెల వైపు వెళ్ళాడు. రూహి కి వాడిని పట్టుకునే అవకాశం కూడా దొరకలేదు.

"వాడు వెళ్లి మిగతా వారిని తీసుకొని వచ్చేలోగా మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పదండి." అని రూహి అరవడం తో అందరూ ఈ లోకం లోకి వచ్చారు. తమ లగేజ్ తీసుకొని బలమంతా కాళ్ళలోకి తెచ్చి పరుగు పెట్టడం మొదలుపెట్టారు. అంత వర్షం లో రాళ్లు, రప్పలు, చెట్లు వేటిని లెక్క చేయకుండా ప్రాణాలు అర చేతిలో పట్టుకొని పరుగు తీశారు.

అలా వెళ్తూ ఉండగా వారి దారికి అడ్డంగా ఓ వాగు కనిపించింది. ఇందాక వారిని ఆ అడవి మనుషులు మోసుకొచ్చినప్పుడు ఆ వాగు మోకాళ్ళ దాకా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వర్షం బాగా కురవడం తో ఎక్కువ ఉదృతంగా పొంగి పొరులుతుంది. ఇప్పుడు అది ఎంత లోతు ఉందో కూడా తెలియడం లేదు. దాన్ని దాటి ఇప్పుడు అటు వైపుకు వెళ్లడం చాలా సాహసమే, ఎందుకంటే అప్పటికే ఎక్కడి నుంచో కొట్టుకొని వస్తున్న మోసళ్ళు కూడా ఆ వాగులో అక్కడక్కడా కొట్టుకుపోతూ కనిపించాయి.. ఏం చేయాలో అర్థం కాక అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

ఇంతలో దూరంగా ఆ భక్షకులు తమ వైపుకే వస్తున్నట్టు శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. అది వింటుంటేనే అందరికీ ఒళ్ళు జలదరించింది.
ముందేమో ముంచేసే వాగు...
వెనుక చంపేసే రాక్షసులు... మధ్యలో ఎటూ పోలేని పరిస్థితుల్లో నిలబడ్డారు.

ఎదురుగా ఉన్న దారులు అన్ని మూసుకొని పోయాయి. సరిగ్గా అప్పుడే రూహి చూపు ఆ వాగు పక్కనే ఉన్న చెట్లు మీద పడింది. అక్కడంతా పొడువైన వెదురు బొంగు చెట్లు ఉన్నాయి. వాటిని చూడగానే రూహి కి ఒక ఆలోచన వచ్చింది. తన బ్యాగ్ లో నుంచి పదునైన గొడ్డలి తీసి దాన్ని నరికింది. రెండే రెండు దెబ్బలకు అది నేల కూలింది. రూహి వెంటనే ఆ పొడువైన బొంగు ను వాగుకు అటు వైపు కు వంతెన మాదిరి వేసింది.

అది చూసి మిగతా వారికి కూడా రూహి ఆలోచన అర్థమైంది. వారు కూడా పనిలో పడ్డారు. అలా కొన్ని క్షణాల్లోనే ఆ బొంగులతో అటు వైపుకు వంతెన మాదిరి కట్టారు.

ఈలోగా ఆ అడవి మనుషులు తమ వైపుకు వేగంగా వస్తున్నట్టు వారి అరుపుల శబ్దం పెరగడం తో అర్థమైంది. ఇక ఆలస్యం చేయకూడదు అని అర్థమైంది. కానీ ఆ బొంగులు వీరు ఒక్క అడుగు వేయగానే పక్కకు దొరులుతున్నాయి.

దాని మీద నడవడం అస్సలు సులభం కాదు. అందుకే మిగతా బృందాన్ని వాటిని కదలకుండా పట్టుకోమని చెప్పి రూహి ముందుగా అటు వైపుగా నడిచింది. మధ్యలో కింద పడబోతే, పట్టు కోసం ఆ కర్ర మీద కత్తి వేటు వేసి పడిపోకుండా పట్టుకుంది. తను కింద పడబోయే దగ్గర పదునైన రాయి కూడా ఉంది. రూహి చెయ్యి ఏ మాత్రం పట్టు జారినా అది తన గుండెల్లో దిగుతుంది. రూహి తన ధైర్యం కోల్పోకుండా కష్టపడి తిరిగి ఆ కొమ్మల మీదకు ఎక్కింది. ఊపిరి బిగబట్టి మిగతా బృందం రూహి నే చూస్తూ ఉన్నారు.

చివరికు ప్రాణాలకు తెగించి రూహి ఎలాగోలా ఆ వంతెన దాటి అటు వైపుకు చేరుకుంది. తర్వాత అటు వైపు కర్రలు కదలకుండా తాడు తో బిగించి పట్టుకుంది. మిగతా వారిని కూడా రమ్మని సైగ చేసింది. ఈలోగా అడవి మనుషులు వారి సమీపానికి వచ్చారు. ముందుగా పార్వతి వంశీ పరిగెత్తగా వారి వెనుక అయాన్ పరుగు తీసాడు. ఆ అడవి మనుషులు వారి మీదకు బాణాల తో దాడి చేస్తుంటే అయాన్ తప్పించుకుంటూ, వారిని తుపాకీ లతో కాలుస్తూ ఇద్దరిని కాపాడుతున్నాడు.

పార్వతి వంశీ ఇటు వైపుకు వచ్చేసారు. అయాన్ కూడా మరో నాలుగు అడుగులు వేస్తె ఇటు వైపుకు వచ్చేసేవాడు. కానీ సరిగ్గా అప్పుడే ఓ బాణం వేగంగా వచ్చి అయాన్ కడుపు లో దిగింది.

అది చూసి రూహి గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. అయాన్ శరీరం నుంచి రక్తం రావడం మొదలైంది. అయాన్ కూడా రూహి కళ్ళలోకి చూసాడు. ఆ కళ్ళలో క్షమించు ప్రియతమా కడ దాకా రాలేకపోయాను అనే బాధ కనిపించింది. ఇంతలో ఇంకో బాణం కూడా వచ్చి అయాన్ కాలి లోకి దిగింది. అయాన్ అలాగే పక్కనే ఉన్న వాగులోకి పడిపోయాడు. వేగంగా పొంగి పొరులుతున్న వరద నీరు తనని ముందుకు తోసుకొని వెళ్ళిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

"అయాన్... అయాన్..." అంటూ రూహి ఏడుస్తూ అరిచింది. తను కూడా వాగులోకి దుకడానికి వెళ్తే పార్వతి తనని ఆపింది.

ఈలోగా అడవి మనుషులు వీరు వేసిన వెదురు బొంగుల వంతెన మీద నుంచి ఇటు వైపుకు రావడానికి బయలుదేరారు. వంశీ వేగంగా స్పందించి ఆ బొంగులకు ఇటు వైపు కట్టిన తాడు ను తేంపేసి వాటిని తమ చేతిలో ఉన్న గొడ్డలితో నరికేసాడు. దెబ్బకు దాని మీదకు వచ్చిన ఇద్దరూ భక్షకులు నీళ్లలో పడిపోయారు. మిగతా వారు అక్కడే ఆగిపోయారు. అది చూసి ఊపిరి పీల్చుకున్నాడు.

రూహి మాత్రం ఇంకా బాధలోనే ఉంది. వంశీ , పార్వతి మొదటి సారి తనని అలా చూస్తున్నారు. రూహి గుండె ముక్కలైంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కళ్ళ ముందే దూరమైతే కలిగే బాధ ను మాటల్లో చెప్పలేం. గుండెలవిసేలా ఏడుస్తూ రోదించింది.

ఆ క్షణం తన శరీరం ప్రకృతి కురిపించే వర్షం లో తడవగా... తన మనసు మాత్రం కన్నీటి వర్షం లో తడిచింది.


" ఏజెంట్ రూహి వాసుదేవ్...22 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 6 users Like SivaSai's post
Like Reply
#56
ఏజెంట్ రూహి వాసుదేవ్...23


[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]





అయాన్... అయాన్...
అంటూ రూహి గుండె పగిలేలా అరిచింది. కానీ అయాన్ తన పిలుపు వినలేనంత దూరంగా ఆ వాగులో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రూహి అలాగే తను వెళ్లిన వంక చూస్తూ ఉండిపోయింది. చాలా సంవత్సరాల తరువాత తన కంటి నుంచి కన్నీరు ఆగకుండా జారుతూనే ఉంది. అలా చాలా సేపు అక్కడే నిలబడి ఉంది. వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షం లో తన కన్నీరు కలిసి జారుతున్నాయి. తననలా చూసి పార్వతి, వంశీ కూడా భయపడ్డారు.

రూహి ఒక్కసారి కోపంగా నదికి అటు వైపు చూసింది. అక్కడ చాలా మంది నర మాంస భక్షకులు అలాగే నిలబడి ఉన్నారు. నది ప్రవాహం మరింతగా పెరగడం తో ఇటు వైపుకు రాలేక అక్కడే ఆగిపోయారు. వారిని చూడగానే రూహి లో కోపం మరింతగా పెరిగింది. తన ప్రేమను దూరం చేసినందుకు ఇప్పటికిప్పుడు వాళ్ళందరిని నరికేయాలని అనిపించింది. తన కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయా అన్నట్టు ఎర్ర బడ్డాయి. తన పిడికిలి కొండను సైతం పిండి చేస్తుందా అనేలా గట్టిగా బిగుసుకుంది. తన ఉగ్ర రూపం చూసి ఆకాశం కూడా జడిసిందేమో, ఆ అడవిలో వీరికి దూరంగా ఒక పిడుగు కురిపించింది.

ఇంతలో పార్వతి వచ్చి మెల్లగా రూహి ని ఓదార్చడానికి అన్నట్టు తన భుజం మీద చెయ్యి వేసింది. సరిగ్గా అప్పుడే రూహి చూపు పార్వతి వేసుకున్న చొక్కా మీద ముద్రించిన భారతీయ జెండా గుర్తు ను చూసింది. అది చూడగానే అప్పటిదాకా తనలో ఉన్న బాధ, కోపం తగ్గి కర్తవ్యం గుర్తొచ్చింది.

మన దేశాన్ని కాపాడాలి అనే ఆశయం ముందు తన ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని ప్రవహించే నదిని చూస్తు అయాన్ ని ఎలాగైనా కాపాడమని వేడుకుంది.

తరువాత లగేజ్ భుజాన వేసుకొని..
"మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి " అని అంది.

రూహి అంత త్వరగా ఆ బాధ నుంచి తేరుకుంటుంది అని మిగతా బృందం ఊహించలేదు. తన నుంచి ఆదేశం రాగానే వారు కూడా భుజాన బ్యాగ్ వేసుకొని బయలుదేరారు.

రూహి టార్చ్ ఆన్ చేసుకొని ముందు నడుస్తుంటే, తన వెనుక పార్వతి, వంశీ నడుస్తున్నారు. ఒక వైపు చీకటి, మరో వైపు జోరున కురిసే వర్షం, ఇంకో వైపు దట్టమైన అడవి... ఇవేవి వారిని ఆపలేకపోయాయి. చేతిలో ఆయుధాలు పట్టుకొని ఎటు వైపు నుంచి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక గంట పాటు ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉన్నారు.

అప్పటికి వర్షం కురవడం ఆగిపోయింది. రూహి దగ్గర ఉన్న టార్చ్ లో బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. చీకటి లో వెలుగు లేకుండా ముందుకు వెళ్లడం చాలా కష్టమని అనిపించింది. టైమ్ చూస్తే సరిగ్గా 1 గంట అయ్యింది. ఈ రాత్రికి అక్కడే పడుకొని ఉదయాన్నే తిరిగి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నారు.

కానీ రూహి కి ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడే వర్షం తగ్గింది. పులి, సింహం లాంటి క్రూర మృగాలు ఎక్కువగా వేటకు వెళ్ళేది రాత్రి సమయం లోనే... కాబట్టి అక్కడ కింద పడుకుంటే అవి ఎప్పుడైనా సరే తమ మీద దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఒక ఆలోచనకు వచ్చింది. పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీదకు ఎక్కి వాటి కొమ్మల మీద పడుకోవాలని అనుకుంది.

రూహి ఆలోచన విని పార్వతి, వంశీ కూడా అలాగే చేసారు. ముగ్గురూ ఆ చెట్టు మీదకు ఎక్కి పెద్ద పెద్ద కొమ్మల మీద, నిద్రలో కిందకు పడకుండా నడుముకు తాడు కట్టుకొని పడుకున్నారు. రోజంతా నడిచి అలిసిపోవడం తో పార్వతి, వంశీ త్వరగానే నిద్రలోకి జారుకున్నారు. కానీ రూహి కి మాత్రం ఇంకా అయాన్ కళ్ళ ముందే మెదులుతున్నాడు. తనతో గడిపిన ప్రతి క్షణం తన గుండెను మెలిపెడుతుంటే ఆ బాధను భరించలేకపోతుంది. తనలో ఆలోచనలు కమ్ముకుంటున్నాయి.

ఈ దేశం...
తన అక్క ఆరోహి ని దూరం చేసింది.
అందంగా సాగాల్సిన బాల్యం దూరం చేసింది.
తన ప్రాణం పోసిన తండ్రి విక్రమ్ ని దూరం చేసింది.
ఇప్పుడు తను ప్రేమించే అయాన్ ని దూరం చేసింది.
ఇన్నిటిని దూరం చేసిన దేశం కోసం తానేందుకు బ్రతకాలి అనే ఆలోచన తన ఆవేదన లో నుంచి పుట్టింది.

సరిగ్గా అప్పుడే విక్రమ్ వాసుదేవ్ తనతో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది.
"రూహి... అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోస్తుంది. అలాంటి అమ్మంటే మనకు ప్రాణం. తనకోసం ఏమైనా చేస్తాం.
మరి నిన్ను, నన్ను, అమ్మను... ఇలా ఎందరినో పుట్టిన దగ్గర నుంచి తనలో కలిసిపోయేదాకా మోసే ఈ నేలను ఇంకెంత ప్రేమించాలి. ఇండియా అంటే ఒక వ్యక్తి కాదు. కొన్ని కోట్ల మంది హృదయచప్పుడు.
ఒక సామాన్యుడు ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అని అడుగుతాడు. కానీ సైనికుడు మాత్రం, ఈ దేశం కోసం ఇంకా ఏమి ఇవ్వగలనా అని ఆలోచిస్తాడు. అదే ఇద్దరికీ తేడా...
మనం చేసే ఈ పోరాటంలో మన దగ్గర ఉన్నవన్నీ దూరం అవ్వచ్చు. కానీ మన గుండె ఆగేదాకా దాని చప్పుడు ఒక్కటే అయ్యి ఉండాలి. అదే... వందేమాతరం.. వందేమాతరం..."

ఆ మాట గుర్తుకు రాగానే తనలో కొన్ని క్షణాలు పాటు రేగిన ఆలోచన కు సిగ్గు పడింది. మౌనంగా ఆ చీకటిలో కన్నీరు కారుస్తూ... అయాన్ తలపుల తో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.

పక్షుల అరుపులు చేసే సంగీతంతో ఉదయం అందరికీ మెలుకువ వచ్చింది. రూహి లేచి కిందకు దిగింది. వర్షం లో తడిచిన నేల మీద అక్కడక్కడా పులి కాలి గుర్తులు కనిపించాయి. కింద కాకుండా చెట్టు మీద పడుకోవడం ఎంత మంచిదైందో అని మనసులోనే అనుకుంది. అప్పటికే పార్వతి, వంశీ కూడా నిద్ర లేచారు.

వెంటనే ముగ్గురూ ఫ్రెష్ అయ్యి, అక్కడ దొరికే పళ్ళతో ఆకలి తీర్చుకొని తిరిగి నడవడం మొదలుపెట్టారు. రూహి తన దగ్గర ఉన్న దిక్షుచి, మ్యాప్ సహాయం తో దారి చూపిస్తుంటే మిగతా ఇద్దరూ తనని అనుసరించారు.

అలా మరో గంట పాటు నడిచిన తరువాత వారికి ఒక చిన్న జలపాతం కనిపించింది. రూహి అక్కడ ఆగింది. దాహం గా ఉండటం తో ఆ నీళ్లతో వారి దాహం తీర్చుకున్నారు. చాలా తీయగా, చల్లగా ఉన్నాయి ఆ నీరు.. అలాంటి స్వచ్ఛమైన నీరు వారి జీవితంలో మొదటిసారి తాగారు. కాసేపు అక్కడే సేద తీరారు.

అప్పుడే రూహి...
"ఇంకాసేపట్లో మనం అడవి నుంచి బయటపడతాం." అని అంది.

ఆ మాట వినగానే పార్వతి, వంశీ మొహాలు ఆనందం తో వెలిగిపోయాయి.

రూహి వారి వంక చూస్తూ...
"అప్పుడే సంతోష పడకండి. మన ముందు ఈ అడవి కి మించిన ప్రమాదం ఒకటి ఎదురుచూస్తుంది. "

ఆ మాటకు వారి మొహాల్లో రంగులు మారిపోయాయి.
"ఏమంటున్నారు మేడమ్ మీరు.." అంటూ పార్వతి ఆశ్చర్యంగా అడిగింది.

"అవును. ఈ అడవికి ఆనుకొని ఓ ఎడారి ఉంది. దాన్ని దాటితేనే చైనా లో అడుగు పెట్టగలం. కానీ ఆ ఎడారి చాలా ప్రమాదకరం. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం లాంటివేవి ఉండవు. నిప్పులు కక్కుతూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఎడారి మృగాలు కూడా తిరుగుతుంటాయి. కానీ మన అదృష్టం ఏంటంటే అది ఎక్కువ దూరం ఉండదు. నా అంచనా ప్రకారం ఆగకుండా నడిస్తే సాయంత్రానికి దాన్ని దాటేయచ్చు. కానీ అప్పటిదాకా బ్రతికి ఉండడమే పెద్ద సాహసం..."

రూహి మాటలు వినగానే ఇద్దరికీ గొంతులో తడి ఆరిపోయింది. నుదురు మీద చమటలు పట్టాయి.

"భయపడకండి. ఇండియా ను కాపాడాలి అనే మన ఆశయం సాధించేదాకా నా ఊపిరి ఆగదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డెసి అయినా కాపాడుతాను." అని రూహి వారికి ధైర్యం చెప్పింది. ఆ మాటకు వారిలో భయం కొంచెం తగ్గింది.

ఎడారిలో నీళ్లు ఉండవని తెలిసి తమ దగ్గర ఉన్న బాటల్స్ లో నీళ్లు పట్టుకున్నారు. కానీ అవి ఎంత సేపు వారి దాహం ఆపుతాయో తెలియదు.

కాసేపటి తరువాత...
"సరే ఇక వెళ్దామా మేడమ్..." అని పార్వతి అడిగింది.

"వెళ్లే ముందు మనం ముందుగా ఒక పని చేయాలి." అని రూహి బదులిచ్చింది.

"ఏంటి మేడమ్ అది..."

రూహి వెంటనే ఆ జలపాతం పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది. దాని ఆకులు అరిటాకులు మాదిరి చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని నిదానంగా ఒక్కోటి తెంపి తీసుకొని వచ్చింది.

ఆ తరువాత తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు అన్ని పక్కకు విసిరేసింది. మిగతా వారిని కూడా అలాగే చేయమని చెప్పింది. ఎందుకో అర్థం కాకపోయినా కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుందని అర్థమై అలాగే చేసారు. తరువాత రూహి వారి దగ్గర ఉన్న తుపాకీ లు, బాంబులు, ఫస్ట్ ఎయిడ్, అలాగే ఈ పోరాటం కోసం వారి వెంట తెచ్చిన మిగతా ఆయుధాలు అన్ని తన బ్యాగ్ లో మాత్రమే పెట్టి... పార్వతి, వంశీ బ్యాగ్ లు ఖాళీ చేసింది.

వారికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. అయోమయంగా జరిగేది చూస్తూ ఉన్నారు. ఇంతలో రూహి, ఇందాక తెంపిన ఆకులకు వెనకాల తమ వెంట తెచ్చిన గమ్ రాసి ఖాళీ చేసిన రెండు బ్యాగ్స్ లో అతికించడం మొదలుపెట్టింది. అలా ఆ బ్యాగ్స్ లో కొంచెం కూడా చోటు లేకుండా బయటా, లోపలా చుట్టూ అతికించింది. ఆరడం కోసం కాసేపు అలా గాలికి పెట్టింది.

అప్పుడు...
"మేడమ్ ఆ ఆకులు ఏంటి.." అని వంశీ సందేహంగా అడిగాడు.

"ఇవి ముశాచి జాతి కి చెందిన చెట్టు ఆకులు... చాలా మందంగా ఉంటాయి. వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీళ్లలో పెడితే ఎన్ని రోజులు అయినా తాజాగా ఉంటాయి. అదే సమయం లో ఆ నీటిని పీల్చుకోవు, దాని ద్వారా బయటకు కూడా వెళ్లనివ్వవు. "

రూహి చెప్పింది విన్న తరువాత తను ఎందుకలా చేసిందో ఇప్పుడు అర్థమైంది. రూహి ఆ బ్యాగ్ లు తీసుకొని వాటిలో ఆ జలపాతం నీళ్లు నిండుగా పట్టింది. తను చెప్పినట్టుగానే ఆ బ్యాగ్ లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదు.

ఎడారిలో నీళ్లు అవసరమని అర్థమై... అసలు మరో దారే లేని చోట.. తన సూక్ష్మ బుద్ది తో ఆలోచించిన రూహి తెలివిని చూసి ఆ ఇద్దరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. పార్వతి, రూహి ఆ నీళ్లు ఉన్న బ్యాగ్ లు భుజాన వేసుకుంటే.. రూహి ఆయుధాలు ఉన్న బ్యాగ్ భుజాన తగిలించుకుంది. అన్ని ఆయుధాలు ఒక్కటే బ్యాగ్ లో ఉండటం తో చాలా బరువుగా ఉంది. అయినా సరే అలాగే ముందుకు నడిచింది.

అలా తిరిగి వారి ప్రయాణం మొదలుపెట్టారు. సరిగ్గా ఒక అరగంట నడిచిన తరువాత రూహి చెప్పినట్టుగానే వారి కళ్ళ ముందు ఎర్రని ఇసుక తివాచి స్వాగతం పలికింది.

కను చూపు మేరలో ఎటు చూసినా ఎర్రని ఇసుక తప్ప ఇంకేమి కనిపించడం లేదు. అప్పటికే ఎండ తో ఆ ఎడారి నిప్పులు కక్కుతుంది. దాని సెగ వారిని తాకింది. చూస్తుంటేనే భయం పుట్టింది. కానీ వారి ముందు మరొక దారి లేదు.

అందుకే ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ముందుగా రూహి ఆ ఎడారిలో అడుగు పెట్టింది. కాల్చేసే వేడి గాలి వారిని తాకింది. ఆ వేడిలో ముందు ముందు వారి ప్రయాణం ఊహించుకుంటుంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టింది.

-----------------------------------------------------------

హైదరాబాద్...

కూరగాయలు కొనడం కోసం సుజిత ఇంటి నుంచి మార్కెట్ కి బయలుదేరింది. ఆరోజు ఆదివారం కావడం తో చాలా మంది జనాల తో బాగా రద్దీగా ఉంది.

జలంధర్ మనుషులు సుజిత నే గమనిస్తూ ఉన్నారు. అంత మంది జనాల మధ్య నుంచి తనని కిడ్నాప్ చేయడం దాదాపు అసాధ్యం అని వారికి అర్థమైంది. అది కాక అక్కడక్కడా సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అందరూ దొరికిపోతారు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే జలంధర్ కు ఫోన్ చేశారు.

వీరు చెప్పింది విన్న తరువాత...
"సుజిత మార్కెట్ కు ఎలా వచ్చింది." అని అడిగాడు.

"ఆటో లో అన్న.."

"అయితే ఒక పని చేయండి. ఆ మార్కెట్ బయట ఉన్న ఆటో ని మీ చేతుల్లోకి తీసుకోండి. సుజిత ఆటో ఎక్కగానే అనుమానం రాకుండా నేరుగా ఇక్కడికి తీసుకొని రండి."

"అన్న, అక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. సుజిత మన ఆటో నే ఎక్కుతుంది అని నమ్మకం ఏంటి." అంటూ సందేహంగా అడిగాడు.

ఆ మాటకు జలంధర్ కి కోపం వచ్చింది.
"అరేయ్ సువ్వర్... ఇరవై మంది ఉన్నారు. మీ చేతుల్లో ఉన్న కత్తుల తో అక్కడ ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్ లు అందరినీ బెదిరించండి. అవసరమైతే చంపేయండి. నాకు మాత్రం ఆ సుజిత ఈరోజు కావాలి. తను లేకుండా వస్తే మీరంతా నా చేతుల్లో చస్తారు." అని అరిచాడు.

ఆ మాటకు వాడు భయపడి అలాగే అన్న అని ఫోన్ పెట్టేసి... ఆ రౌడీలు అందరూ ఆటో స్టాండ్ వైపు కదిలారు.

"ఒసేయ్ సుజిత..  ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు..." అంటూ జలంధర్ పళ్ళు పటపటమని కొరికాడు.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...23 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 7 users Like SivaSai's post
Like Reply
#57
Super update. Next inka Elanti situations edurkuntaro.
[+] 1 user Likes styleraja's post
Like Reply
#58
ఏజెంట్ రూహి వాసుదేవ్...24



రూహి బృందం నార్త్ కొరియా నుంచి చైనా వెళ్లడం కోసం ఎన్నో సాహసాలు చేసి చివరకు అడవి ని దాటి ఎడారిలో అడుగుపెట్టారు. అందులోకి అడుగు పెట్టగానే వేడి గాలి వారికి స్వాగతం పలికింది. నిప్పుల కొలిమి లో నడిచినట్టు అనిపించింది. ఎటు చూసినా ఎర్రని ఇసుక తప్ప ఇంకేమి కనిపించడం లేదు. ఈ ముగ్గురు తప్ప మరో జీవి ఈ ప్రపంచం లో ఉందా అని అనుమానం కలగక మానదు.

ఆ ఎండలో, ఇసుక లో ఒక్కో అడుగు తీసి ముందుకు వేయడం కూడా చాలా భారంగా అనిపించింది. కాని ఎలాగైనా గమ్యం చేరుకోవాలి అనే వారి ఆశయం నిలువనీయకుండా ముందుకు నడిపించింది.

అలా కొంచెం దూరం నడిచిన తరువాత రూహి దేనికోసమో తన జేబులు వెతుకుతూ కంగారు పడింది.

అది చూసి...
"ఏమైంది మేడమ్" అని వంశీ అడిగాడు.

"మనం వెంట తెచ్చిన దిక్షుచి కనిపించడం లేదు. "అని రూహి అంది.

"ఇప్పుడు అది లేకపోతే మనం ఈ ఎడారిలో ఎటు వైపని వెళ్తాం. బాగా చూడండి మేడమ్ మీ దగ్గరే ఎక్కడైనా ఉంటుంది."

"లేదు. మొత్తం వెతికాను. ఇందాక జలపాతం దగ్గర బ్యాగ్ లో నీళ్లు పట్టుకునే సమయంలో అక్కడే పడిపోయి ఉండాలి."

"అయితే నేను వెనక్కి వెళ్లి తీసుకొని రానా మేడమ్..." అని వంశీ అడిగాడు.

"వద్దు వంశీ. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్లి, తిరిగి వచ్చే లోగా చాలా సమయం అవుతుంది. అసలే చీకటి పడే లోగా ఈ ఎడారి దాటాలి." అని రూహి అంది.

"ఎటు వైపు వెళ్లాలో తెలియనప్పుడు మనం ప్రయాణం ఎలా చేస్తాం మేడమ్..." అని పార్వతి సందేహంగా అడిగింది.

"ఈ కష్ట సమయం లో మనకు ఒక్కరు సహాయం చేయగలరు..."

"ఎవరు మేడమ్.."

రూహి ఆకాశం వంక చూపించింది. మిగతా ఇద్దరూ అర్థం కాక అయోమయంగా చూసారు. రూహి వెంటనే తన బ్యాగ్ లో నుంచి ఒక గన్ తీసి తన ముందు ఇసుక లో గుచ్చింది.
ఎండకు ఆ తుపాకీ నీడ ఒక వైపు పడింది. దాని చుట్టూ ఒక వృత్తం గీసింది. అప్పుడు రూహి ఏం చెప్తుందో వంశీ, పార్వతి లకు అర్థమైంది. సూర్యుడి ఎండకు పడే నీడను బట్టి దిక్కులు కనిపెట్టి ముందుకు నడవడం అని తెలిసింది.

"ఫోన్లు, దిక్షుచి లు లాంటివేవి లేని సమయం లో మన పూర్వీకులు దిక్కులు తెలుసుకోవడం పాటించిన ప్రక్రియ ఇది.. నేడు మనకు సాయం చేయనుంది." అని రూహి అంది. అర్థమైంది అన్నట్టు ఇద్దరూ తల ఆడించారు.

తరువాత అలా నీడ పడే తీరు బట్టి వెళ్లాల్సిన దారి వైపు వారి అడుగులు సాగాయి. సమయం గడిచే కొద్ది ఎండ, వేడి మరింత గా పెరిగాయి. ఉక్క పోత తో మొత్తం తడిచిపోయారు.

వారి భుజాల మీద ఉన్న బ్యాగ్ లు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా రూహి వేసుకున్న బ్యాగ్... ఆయుధాలు అన్ని అందులోనే ఉండటం తో చాలా బరువుగా ఉంది. ఆ బరువు తగిలించుకొని నడవడం సాధారణ విషయం కాదు. అయినా సరే పంటి బిగువున నొప్పిని భరిస్తూ నడుస్తుంది.

చూస్తూ ఉండగానే సూర్యుడు నడి నెత్తి మీదకు కూడా వచ్చాడు. వారి ఒంట్లో ఉన్న శక్తి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. వెంట తెచ్చుకున్న నీటిని తాగుతున్నారు. కాని ఆ వేడికి కొన్ని క్షణాల లోనే ఆ నీరు చమట గా మారి ఆవిరి అయిపోతుంది. అసలు ఆ బ్యాగ్ లలో నీళ్లు తీసుకురావాలి అనే ఆలోచన రాకపోతే దాహం తో ఇంత దూరం వచ్చేవారు కూడా కాదు.

ఇప్పటికైతే చాలా ఆకలిగా కూడా ఉంది. అందరూ కడుపు పట్టుకొని నడుస్తున్నారు. ఎక్కడా ఒక చిన్న చెట్టు కూడా లేదు కాసేపైనా నీడలో తల దాచుకోడానికి.

ఇంతలో వంశీ ఉన్నట్టుండి... ఒక చోట ఆగాడు. తన ముందు రెండు గుడ్లు కనిపించాయి. ఏదో పక్షి పెట్టిన గుడ్లు లాగా అనిపించింది. అప్పటికే బాగా ఆకలి మీద ఉన్నాడు. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అమృతం దొరికినట్టు అయ్యింది. వెంటనే అందులో నుంచి ఒక గుడ్డు చేతిలోకి తీసుకొని పగలకొట్ట బోయాడు.

ఇంతలో
"వంశీ... ఆగు." అని రూహి అరిచింది.

ఏమైంది మేడమ్ అన్నట్టు తన వంక చూసాడు. రూహి ఆ గుడ్డు ను తన చేతిలోకి తీసుకుంది. ఆ గుడ్డు బయట భాగం చాలా మెత్తగా అనిపించింది.

అది గమనించగానే...
"ఇది పక్షి గుడ్డు కాదు. ఇక్కడ తిరిగే పాము గుడ్డు. సాధారణంగా పాము గుడ్డు బయట భాగం మనం చూసే కోడి గుడ్డు కంటే చాలా పలచగా ఉంటుంది. ఇది విషపూరీతం. తినడం మంచిది కాదు." అని అంది.

వంశీ రూహి వైపు ఒక చూపు చూసాడు. ఆ చూపు లో చేతికి దొరికిన దాన్ని తిననీయకుండా ఏదేదో చెప్తారు ఏంటి అని ప్రశ్నించినట్టు అనిపించింది.

"ఈ ప్రపంచం కళ్ళ తో చూసే దాకా ఎవరూ నిజాలు నమ్మరు కదా.. కావాలంటే నువ్వే చూడు..." అంటూ రూహి తన చేతిలో ఉన్న గుడ్డు ను కొంచెం దూరం లో ఉన్న రాయి మీద బలంగా కొట్టింది.

ఆ గుడ్డు పగలగానే అందులో నుంచి రెండు పిల్ల పాములు బయటకు వచ్చి వేగంగా ఇసుక లోకి దూరిపోయాయి. వాటిని చూడగానే వంశీ భయపడి తన చేతిలో ఉన్న గుడ్డు ను కింద పడేసాడు. తరువాత సారీ మేడమ్ అని అన్నాడు.

"ఇందులో నీ తప్పు లేదు లే వంశీ. నేటి సమాజం మనకు నమ్మకం కంటే అనుమానమే ఎక్కువ నేర్పించింది."

ఆ మాటకు వంశీ మౌనంగా ఉండిపోయాడు. కాసేపు అక్కడే కూర్చోవాలి అనుకున్నారు. రూహి తను వేసుకున్న బ్యాగ్ కిందకు దింపింది. అప్పుడే తన భుజాల వంక చూసుకుంది. బ్యాగ్ బరువుగా ఉండటం తో భుజాలు కందిపోయి అక్కడక్కడా ఎర్రగా రక్తం వస్తుంది. దాన్ని ముట్టుకుంటే ప్రాణం విల విల లాడింది. ఆ నొప్పిని భరిస్తూ రక్తం ఇంకా ఎక్కువ రాకుండా ఉండటం కోసం పక్కనే ఉన్న వేడి ఇసుక ను తీసి ఆ గాయల మీద బలంగా నొక్కి పట్టుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రాణం పోతున్నట్టు ఉంది. కాని స్వేచ్ఛగా ఎగిరే మన జాతియ జెండా ను తలుచుకుంటూ ఆ నొప్పిని పిడికిలి చాటున ఓర్చుకుంది.

"మేడమ్, ఆ బ్యాగ్ ని కాసేపు నేను మోస్తాను." అంటూ వంశీ ముందుకు వచ్చాడు.

కాని రూహి వద్దంది. ఎందుకంటే వంశీ కొంచెం లావుగా ఉంటాడు. తనకు ఆకలి కూడా ఎక్కువ. ఈ బరువు కూడా మొస్తే తను కాసేపటికే అలిసిపోయి పడిపోతాడు. అందుకే ఎంత నొప్పి కలిగినా భరిస్తూ తానే నడవాలని దృడంగా అనుకుంది.

కాసేపటి తరువాత అందరూ తిరిగి నడవడం ప్రారంభించారు. ఎండకు వాళ్ళు వేసుకున్న బూట్లు కూడా కాలిపోతున్నాయి. శరీరం మీద ఎవరో ఆకాశం నుంచి సూదులతో దాడి చేస్తున్నట్టు ఉంది. ఓ వైపు ఆకలి, మరో వైపు వేడి... మృత్యువు అంటే ఏంటో కళ్ళ ముందు మెదిలింది.

నడవడానికి ఓపిక కూడా ఉండటం లేదు. సరిగ్గా అప్పుడే ఆ ఎండకు కళ్ళు తిరగడం తో పార్వతి అలాగే వెనక్కి వాలి కిందకు పడిపోయింది. రూహి, వంశీ వేగంగా వచ్చి తన మోహం మీద నీళ్లు చల్లి లేపారు. కాసేపటికి తనకు మెలుకువ వచ్చింది. కాని అప్పటికే ఓ ఘోరం జరిగిపోయింది. పార్వతి భుజాన తగిలించుకున్న బ్యాగ్ లో ఉన్న నీరు మొత్తం తను వెనక్కి కిందకు పడటం తో ఆ ఎడారి ఇసుకలో కలిసిపోయాయి. అది వారికి దెబ్బ మీద దెబ్బ లాగా అనిపించింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పార్వతి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. రూహి ఏం కాదు ఇందులో నీ తప్పు ఏమి లేదు అని ఓదార్చించింది.

తనకైతే ఏమి కాదు అని ధైర్యం చెప్పింది. కాని రూహి గుండెల్లో మాత్రం చాలా భయం మొదటిసారిగా కలిగింది. ఎందుకంటే వంశీ బ్యాగ్ లో కూడా కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవి ఆ ముగ్గురికి కాసేపు కూడా చాలవు.
వంశీ ఇప్పటికే చాలా అలిసిపోయాడు. ఆకలికి నక నక లాడుతున్నాడు. పార్వతి కూడా ఇప్పటికే ఒకసారి స్పృహ తప్పింది. ఇంకా ఎంత దూరం నడవగలదో తెలియడం లేదు. ఈ పరిస్థితిలో గమ్యం చేరగలమా అని భయమేసింది. ఈ ఎడారి మార్గం ఎంచుకొని తప్పు చేసానా అని అనుమానం కలిగింది. కాని తన భయం బయటకు కనిపిస్తే బృందం మరింత డీలా పడుతుంది అని మనసులోనే దాచుకుంది.

ఓ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే... మదిలో టన్నుల కొద్ది భయం ఉన్నా, అందులో కొంచెం కూడా తన సైన్యానికి పంచకూడదు. పంచిన క్షణమే ఓటమికి మొదటి అడుగు పడినట్టు...

కాసేపటికి అందరూ తిరిగి నడవడం మొదలుపెట్టారు. రూహి ఊగించినట్టుగానే పావు గంట గడిచే లోగా తమ దగ్గర మిగిలిన నీళ్లు కూడా అయిపోయాయి. ఎండ మాత్రం తగ్గడం లేదు. ఒంట్లోని రక్తం కూడా ఆవిరి అవుతుందా అని అనుమానం కలిగింది. దారిలో అక్కడక్కడా కొన్ని జంతువుల కలేబరాలు కనిపించాయి. అలాగే కొంతమంది మనుషుల పుర్రెలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తే తమ పరిస్థితి కూడా అంతేనా అని అనుమానం వచ్చింది. దాహం తో నోరు పిడచ కట్టుకుపోయింది. ఆకలి తో కడుపు ఎముకలని అతుక్కుంది. మరణం వారి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది.

ఇంతలో వారు నుంచున్న ఇసుక మేడ కు దూరంగా ఓ చిన్న చెరువు కనిపించింది. దాన్ని చూడగానే ముగ్గురి మొహాలలో ఓ చిరునవ్వు విరిసింది. ఆనందం తో ఎగిరి గంతులు వేశారు. ముందు వెనుక ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అటు వైపు వెళ్లారు. తమ దాహం తీరనుంది అని అర్థమై ఒంట్లో ఉన్న శక్తి మొత్తం బయటకు తీసి పరిగెత్తారు.

ఆ చెరువు దగ్గరకు వెళ్లే కొద్ది వారి మోహం లో ఆనందం ఆవిరవడం మొదలైంది. ఆ ఇసుక మేడ నుంచి పూర్తిగా కిందకు వచ్చాక అర్థమైంది. అది చెరువు కాదు ఎండ మావి అని... అక్కడ నీళ్లు లేవని తెలిసిన తరువాత ఇక బ్రతుకుతామనే ఆశ బృందం లో చచ్చిపోయింది.

వంశీ అయితే శక్తి కొద్ది పరిగెత్తడం తో ఆయాసం తో అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. లేపినా లేవడం లేవలేదు. తన మోహం మీద చల్లడానికి నీళ్లు కూడా లేవు. పార్వతి, రూహి లకు ఏం చేయాలో అర్థం కాలేదు. రూహి మ్యాప్ వంక చూసింది. సగం దూరం దాటేశామని అర్థమైంది. ఇంకా సగమే.. ఎలాగైనా గమ్యం చేరుకోవాలని అనుకున్నారు.

కాని వంశీ లేచి నడిచేలా లేడు. ఇక చేసేదేం లేక ఖాళీ అయినా బ్యాగ్ ల ని కింద వేసి దాని మీద వంశీ ని పడుకోబెట్టి... లాగుతూ పార్వతి, రూహి నడవడం మొదలుపెట్టారు. ఆ ఎండలో నడవడమే కష్టం.. అలాంటిది వంశీ ని లాగుతూ నడవడం ఇంకెంత కష్టమో మాటల్లో చెప్పలేము. అలా మరో అరగంట నడిచిన తరువాత పార్వతి శరీరం లో కూడా ఓపిక మొత్తం ఆవిరై స్పృహ తప్పి పడిపోయింది.

రూహి తనని లేపడానికి ప్రయత్నించింది. కాని లేవలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టూ చూసింది. ఎక్కడా ఏమి కనిపించడం లేదు. ఆకాశం వంక చూసింది. నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు కనిపించాడు.

రూహి లో భయం మొదలైంది. కాని అది తనకేమైనా అవుతుంది అనేదానికంటే తనని నమ్మి వెంట వచ్చిన బృందానికి ఏమైనా అవుతుందా, దేశాన్ని కాపాడుతాను అనే మాటను నిలబెట్టుకోలేనేమో అనే భయం మరింత ఎక్కువగా ఉంది.

ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని ఎలాగైనా ఈ పోరాటం లో మృత్యువు మీద గెలవాలని అనుకుంది. అందుకే పార్వతి, వంశీ ఇద్దరి శరీరాలు లాగుతూ ముందుకు కదిలింది. పైన కాల్చేసే ఎండ.. భుజాల మీద మోయలేని బరువు... చేతులలో లాగాల్సిన బాధ్యత...
వెరసి విధి ని ఓడించడానికి ఓ పెద్ద సాహసమే చేస్తుంది. పైన వారికోసం అప్పటికే రాబందులు తిరగడం మొదలుపెట్టాయి.

బ్రతుకుతాము అనే నమ్మకం లేదు. కాని చివరి శ్వాస దాకా పోరాడాలని బలంగా నిర్ణయించుకుంది. ఓ వైపు తన శరీరం నుంచి రక్తం కారుతుంది. చేతులు రెండు శరీరం నుంచి ఊడిపోతాయా అన్నంత నొప్పిని కలిగిస్తున్నాయి. అయినా సరే విడువక ముందుకు నడిచింది.

అ క్షణం దేశం కోసం తను పడుతున్న కష్టం ఎవరైనా కళ్లారా చూసి ఉంటే... ఈ దేశం లో కులమతాల చిచ్చులు ఏనాడో సమసి పోయి అందరూ ఏకమై నిలిచేవారేమో...

అలా ప్రాణాలకు తెగించి రక్తమొడుతూ నడుస్తుండగా... రూహి చెవులను ఓ శబ్దం చేరింది. ఏంటా అని టక్కున వెనక్కి తిరిగి చూసింది.

ఎదురుగా రెండు ఎడారి తోడేళ్ళు... వాటి కలల్లో మాంసం దొరికింది అనే ఆశ కనిపిస్తుంది.

ఓ వైపు స్పృహ కోల్పోయిన బృందం...
మరో వైపు ఆకలి దప్పికాలతో సహకరించని శరీరం...
ఎదురుగా మృత్యువు...

వీటి మధ్య నుంచి తను ప్రాణాలతో బయటపడగలదా...
మృత్యువు తన కోసం ఎదురుచూస్తుంది. మరి దానిని ఎదురించి నిలువగలదా...
[+] 6 users Like SivaSai's post
Like Reply
#59
ఏజెంట్ రూహి వాసుదేవ్...25



రూహి బృందం ఎడారిలో ప్రయాణం మొదలుపెట్టింది. కాని కాసేపటికే ఆకలి దప్పికలకు తాలలేక వంశీ, పార్వతి స్పృహ కోల్పోయారు. అయినా సరే రూహి పట్టు వదలకుండా గమ్యం చేరాలని నిర్ణయించుకుంది.

ఒక వైపు మోస్తున్న బ్యాగ్ బరువుకు భుజాల నుండి రక్తం కారుతుంది. మరోవైపు వారిని లాగలేక చేతులు రెండు శరీరం నుంచి వేరవుతాయా అన్నంత నొప్పిని కలిగిస్తున్నాయి. పైనేమో దహించే ఎండ, భరించలేని దాహం, వీరి మృత్యువు కోసం ఆకాశంలో విహారిస్తూ ఎదురుచూస్తున్న రాబందులు... ఇలా తన చుట్టూ ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాని దేశం కోసం చివరి శ్వాస దాకా పోరాడుతాను అని తన తండ్రికి ఇచ్చిన మాట ముందు అవేవి రూహి ని ఆపలేక పోయాయి.

సరిగ్గా అప్పుడే... ఓ శబ్దం తన చెవులకు చేరింది. రూహి టక్కున వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా రెండు ఎడారి తోడేళ్ళు... వాటిని చూడగానే రూహి గుండె వేగం పెరిగింది. అవి రూహి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్నాయి. రూహి తెరిచిన వాటి నోటి వంక చూసింది. పదునుగా కత్తుల వలె ఉన్న వాటి పళ్ళు చూస్తుంటే తనలో మొదలైన దడ మరింత పెరిగింది.

తన భుజాన వున్న బ్యాగ్ లో తుపాకీ ఉంది. కాని తను వాటిని తీసే లోగా ఆ తోడేళ్ళు తన మీదకు దూకుతాయని అనుమానం వచ్చింది. మెల్లగా వాటి కళ్ళలోకి చూస్తూ ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ తోడేళ్ళు ఒక అడుగు ముందుకు వేసాయి. వాటి పక్కనే వంశీ పార్వతి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఆ తోడేళ్ళు వారిని పట్టించుకోకుండా రూహి నే గమనిస్తున్నాయి.

బహుశా తనని కూడా చంపేస్తే ముగ్గురిని కలిపి తినేయచ్చు అని వాటి పథకం ఏమో అని రూహి మనసులోనే అనుకుంది. అలా అనుకుంటూనే తన భుజాన ఉన్న బ్యాగ్ ని కిందకు దింపింది. అంతే తను ఊహించినట్టుగానే ఆ తోడేళ్ళు రెండు ఒకేసారి తన మీదకు దూకాయి. రూహి కి తేరుకునే సమయం కూడా లేదు. ఒక తోడేలు రూహి చేతిని కరుచుకుంటే, మరొకటి తన గొంతు కొరకాలని చూస్తుంది. రూహి తన రెండో చేత్తో దాన్ని ఆపుతుంది. వాటి బలం ముందు రూహి నిలువలేకపోతుంది. కొన్ని క్షణాలు ఆగితే తన ప్రాణం పోవడం ఖాయం..

సరిగ్గా అప్పుడే రూహి తన రెండో చేత్తో తన గొంతు పట్టుకోవాలని చూస్తున్న తోడేలు కళ్ళలోకి ఇసుక కొట్టింది. దానికి కళ్ళు కనపడక బిత్తర పోతుంటే... అదే అదునుగా కుడి కాలు లేపి ఒక్క తన్ను తన్నింది. అది కొంచెం దూరంగా పడింది. ఈలోగా పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని తన చెయ్యి కరుచుకున్న రెండో తోడేలు తల మీద బలంగా కొట్టింది. దెబ్బకు అది కుయ్యి మంటూ రూహి చేతిని వదిలేసింది.

రూహి లేచి నిలబడింది. తన చేతి నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం తో తన శరీరం మొత్తం తడిచిపోయింది. నెత్తుటి స్నానం చేసిన అమ్మవారి లాగా నిలబడి ఉంది. తుపాకీ ఉన్న బ్యాగ్ ఆ తోడేళ్ల వెనకాల ఉంది. దాంతో ఏం చేయాలో తెలియక ఒక్కసారి తన వంక చూసుకుంది. సరిగ్గా అప్పుడే తను వేసుకున్న బెల్ట్ గుర్తొచ్చింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుంది.

ఈలోగా తన చేతిలో దెబ్బ తిన్న తోడేలు తేరుకొని రూహి వంక కోపంగా చూసింది. మరో తోడేలు ఇంకా దాని కళ్ళలో పడిన ఇసుక మూలంగా సరిగా కనపడక కిందా మీద పడుతుంది. ఎదురుగా తోడేళ్లను చూసినా సరే రూహి కళ్ళలో ఇసుమంతైనా భయం కనిపించలేదు. పైగా దమ్ముంటే రా అని సవాల్ విసిరినట్టు అనిపించింది. అది చూసి ఆ తోడేలు కు కోపం నషాలానికి ఎక్కింది.

కోపంగా రూహి మీదకు దూకింది. దానికోసమే ఎదురుచూస్తున్న రూహి సరిగ్గా తనని చేరే సమయానికి పక్కకు జరిగి దాని గొంతును తన చేతిలో ఉన్న బెల్ట్ తో పట్టుకుంది.

ఊహించని ఆ చర్యకు ఆ తోడేలు బిత్తరపోయింది. కాని అప్పటికే ఆలస్యం అయ్యింది. దాని గొంతుకు బెల్టు బిగుసుకుంది. తప్పించుకోవాలని గిల గిల లాడుతుంది. కాని రూహి దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. బలమంతా ఉపయోగించి పట్టు బిగించింది. కొన్ని క్షణాలకు ఆ తోడేలు అలాగే అచేతనంగా పడిపోయింది.

రూహి కళ్ళు తెరిచి చూసింది. ఈలోగా ఎదురుగా రెండో తోడేలు పూర్తిగా తేరుకుంది. రూహి మీదకు దూకడానికి సిద్ధంగా ఉంది. రూహి ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. రక్తం కారడం ఎక్కువైంది. కాళ్ళు నిలబడలేక తడబడుతున్నాయి. ఓటమి నిశ్చయమైనా సరే పోరాటం మాత్రం ఆపకూడదు అని అనుకుంది. అందుకే తోడేలు వైపే అడుగు వేసింది. ఆ తోడేలు కూడా కోపంగా రూహి వంక చూస్తూ అడుగు ముందుకు వేసింది. ఒక్కసారి బిగ్గరగా ఊళ వేసింది. ఆ ఊళ కు చెవులు చిల్లులు పడతాయేమో అని భయమేసింది.

రూహి మాత్రం జడవకుండా నిలబడింది. ఇంతలో ఆ తోడేలు రూహి మీదకు ఎగిరింది. రూహి దాన్ని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అప్పుడే.... గాల్లోకి ఎగిరిన తోడేలు తలలో నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. అది అలాగే కిందపడిపోయింది. రూహి ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది. వంశీ చేతిలో తుపాకీ ఉంది. రూహి తన వంక కృతజ్ఞతగా చెప్పింది. వంశీ ఓ నవ్వు నవ్వి అలాగే మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు.

రూహి కూడా నిలబడలేక కింద పడిపోయింది. తన కళ్ళు ఆకాశం వంక చూస్తున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అప్పటిదాకా మొండిగా పోరాడిన ప్రాణం అలిసిందేమో... మెల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి. తనకర్థమైంది. లేచి అడుగు వేయడం తన వల్ల కాదని. విజయం సాధించలేక పోయాను అనే బాధ అణువణువు లో నిండింది. వెచ్చని తన కన్నీరు చెంప మీద జారింది.

ఇదే చివరి క్షణం, ఇక మళ్ళీ కళ్ళు తెరవలేనేమో అని అనిపించింది. ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని, తన జేబులో ఉన్న మువ్వన్నెల జాతియ పతాకం తీసి తన మీద కప్పుకుంది. ఓ సైనికుడికి అంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది అని మనసులోనే మురిసిపోయింది. ఆ మూడు రంగులను చూస్తూ అలాగే స్పృహ తప్పి కళ్ళు మూసుకుంది.

అలా రూహి బృందం మొత్తం స్పృహ తప్పి పడిపోయారు. వారి పక్కనే చనిపోయిన తోడేళ్ళు... వాటిని తినడం కోసం రాబందులు కూడా వచ్చాయి.

రూహి కళ్ళు మూసే క్షణం లో వారి ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోయిందని అనుకుంది. కాని కాలం వారి కథను మరోలా రాసింది...

--------------------------------------------------------------

కొన్ని గంటల తరువాత....

రూహి కి మెల్లగా మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి కాసేపు షాక్ లో ఉండిపోయింది. తనకెదురుగా ఆకాశం కనిపించడం లేదు. తను ఒక మంచం మీద పడుకున్నాను అని అర్థమై టక్కున లేచి కూర్చుంది. ఒక్కసారి చుట్టూ చూడగానే ఒక టెంట్ లో ఉన్నాను అని అర్థమైంది. అ టెంట్ లో తను తప్ప ఇంకెవరూ లేరు. తన గాయాలకు కట్టు కట్టి ఉంది. అలాగే చేతికి సెలైన్ కూడా పెట్టారు.

వెంటనే తన మిగతా బృందం ఏమైందో, అసలు తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలని రూహి మంచం మీద నుంచి ఒక అడుగు కిందకు వేసింది. కాని ఒంట్లో ఓపిక లేక, ఒక్క అడుగు కూడా వేయలేక అలాగే కింద పడింది. అ చప్పుడుకు బయట నుంచి ఓ వ్యక్తి పరుగున వచ్చి తనను పైకి లేపాడు. రూహి తన వంక ఆశ్చర్యంగా చూసింది.

"అక్క... మీకు కాసేపు విశ్రాంతి చాలా అవసరం." అని తనని తిరిగి మంచం మీద పడుకోబెట్టాడు.

రూహి తన వంక ఆశ్చర్యంగా చూసింది. ఈ ఎడారిలో తెలుగు మాట్లాడే వ్యక్తి ని చూసి కాసేపు షాక్ అయ్యింది.

"అక్క మీకేం ప్రమాదం లేదు. మీ బృందం కూడా పక్కనే ఉన్న టెంట్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరేం దిగులు పడకండి. మీరు ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నారు." అని అతను నవ్వుతూ చెప్పాడు. ఆ మాట విన్నాక రూహి మనసు కొంచెం కుదుటపడింది. అలాగే మరోసారి నిద్రలోకి జారుకుంది.

నాలుగు గంటల తరువాత రూహికి మరోసారి మెలుకువ వచ్చింది. ఈసారి తన గాయాలు పెద్ద నొప్పిగా అనిపించలేదు. ముందు కంటే ఇప్పుడు కొంచెం శక్తి వచ్చినట్టు అనిపించింది. మంచం దిగి నిలబడింది.
బయట అప్పటికే సాయంత్రం అయినట్టుంది. ఎండ లేదు. మెల్లగా చీకటి ముసురుకుంటున్నాయి. ఆ టెంట్ లో నుంచి బయటకు వచ్చింది.

ఇందాక తనని పలకరించిన అబ్బాయి తనని చూసి పరుగున తన దగ్గరకు వచ్చాడు.

"ఏంటి అక్క అప్పుడే లేచారు. ఇంకాసేపు విశ్రాంతి తీసుకోకపోయారా " అని ఆప్యాయంగా అడిగాడు.

"ఇప్పుడు పర్లేదు.." అని రూహి సమాధానం ఇచ్చింది.

"మీ అందరి కోసమే ఆహారం వండుతున్నాను.  కాసేపట్లో వేడి వేడి గా తిందురు.." అని నవ్వుతూ చెప్పాడు.

"ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు. మేము ఎక్కడ ఉన్నాం." అని రూహి ఆశ్చర్యంగా అడిగింది.

"నేనే అక్క... నేను ఇక్కడ నివసించే ధనికులు ఇంట్లో పని చేస్తాను. ఇక్కడ ధనికులు అందరూ కలిసి ఓ గ్రూపు లాగా ఏర్పడి అప్పుడప్పుడు ఇలా ఎడారిలో సఫారి కి రావడం, ఇక్కడ కనిపించే జంతువులను వేటడం... రాత్రి క్యాంపు వేయడం అలవాటే.. వారితో పాటు మాలాంటి పని వాళ్ళను కూడా తీసుకొస్తారు. ఇక్కడ వారికి వండి పెట్టి సవర్యలు చేయడానికి..

అలా ఈ రోజు ఎడారిలో తిరుగుతుండగా మాకు ఓ నక్క ఊళ వినిపించింది. దానికోసమని ఆ అరుపు వినిపించిన వైపు వచ్చాం. అప్పుడే అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న మిమ్మల్ని చూసాం. వెంటనే మా ఒంటెల మీద మిమ్మల్ని తీసుకొని మా క్యాంపింగ్ దగ్గరకు తీసుకొని వచ్చాం. మాతో పాటు ఓ డాక్టర్ కూడా ఉండటం తో ఆయనే మీ గాయాలకు చికిత్స చేశాడు. కడుపు నిండా భోజనం తింటే మొత్తం సెట్ అయిపోతారు." అంటూ ఆ కుర్రాడు జరిగింది మొత్తం చెప్పాడు.

"చాలా థాంక్స్.. ఈరోజు మీరు లేకపోయి ఉంటే మా ప్రాణాలు దక్కెవి కాదు.. అయినా ముక్కు మోహం తెలియని మమ్మల్ని ఎందుకు కాపాడాలని అనిపించింది." అని రూహి అడిగింది.

దానికి ఆ కుర్రాడు నవ్వుతూ ఓ వైపు చూపించాడు. రూహి తల తిప్పి చూసింది. అక్కడ ఓ కర్రకు స్వేచ్ఛగా రెప రెప లాడుతున్న భారత జాతియ జెండా కనిపించింది.

"నేను కూడా భారతీయున్నే అక్క..."

ఆ మాటకు రూహి గుండె గర్వం తో ఉప్పొంగింది. సరిహద్దులు దాటినా మన దేశ భక్తి కి సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది.

అప్పుడే రూహి
"ఇక్కడి నుంచి చైనా ఎంత దూరం..." అని అడిగింది.

"ఒక అరగంట నడిస్తే బోర్డర్ చేరుకోవచ్చు అక్క..." అని సమాధానం ఇచ్చాడు.

ఆ మాట వినగానే రూహి మనసు కు తన కర్తవ్యం గుర్తొచ్చింది. లేచి నిలబడింది. తన దేశం తనకు మరో అవకాశం ఇచ్చింది. ఈసారి పోరాటం లో గెలుపు నాదే.. అని గుండెల నిండా శ్వాస తీసుకొని పిడికిలి బిగించింది.

[+] 6 users Like SivaSai's post
Like Reply
#60
ఏజెంట్ రూహి వాసుదేవ్...26




"మనల్ని పట్టించుకోని దేశం కోసం మనమెందుకు ప్రాణాలు త్యాగం చేయాలి మేడం..." వంశీ ప్రశ్నించాడు.

రూహి కాసేపు ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఎడారిలో ఆకలి దప్పికాలతో వారి ప్రాణాలు పోవాల్సింది. ఒక భారతీయుడు వారిని చూసి కాపాడాడు. అంతే కాకుండా వారికి వైద్యం చేయించి కడుపు నిండా భోజనం పెట్టాడు. దాంతో అందరూ కోలుకున్నారు. అక్కడి నుంచి చైనా బోర్డర్ చేరుకోడానికి కేవలం అరగంట మాత్రమే పడుతుంది అని తెలిసింది.

త్వరగా అక్కడికి వెళ్దాం పదండి అని తను అందరినీ పిలిచింది. కాని ఇంతలో వంశీ ఇలా మాట్లాడుతున్నాడు. రూహి మరోసారి వంశీ వంక చూసింది.

"అవును మేడం. మీరు విన్నది నిజమే... ఇందాక న్యూస్ లో చూసాను. మన ఇండియా లో వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నారని ప్రేమికులను చంపేశారు అంట.
మా మతం గొప్పది, మా మతం గొప్పది అంటూ అల్లర్లు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ రాజకీయ నాయకులు కోట్ల కొద్ది స్కాం లు కూడా చేస్తున్నారు.
ఇలా కులం, మతం, డబ్బు, హోదా, అధికారం అంటూ దేశం లో ఎవరికి వారు స్వార్థం తో కొట్టుకొని చస్తుంటే... మనమెందుకు వారి కోసం బ్రతకాలి. నిన్న మనం ఈ ఎడారిలో చనిపోతే ఒక్కడైనా పట్టించుకునేవాడా....
మహా అంటే ఒకరోజు వాట్సాప్, ఫేస్ బుక్ లో స్టేటస్ పెడతారు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు మనమెవరో కూడా మర్చిపోతారు. మన కుటుంబాలు మాత్రం మనల్ని తలుచుకుంటూ నరకం చూస్తుంటాయి.
నన్ను పట్టించుకోని దేశం కోసం నేనెందుకు ప్రాణాలు వదలాలి.." వంశీ ఆవేశంగా పలికాడు.

మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిన వంశీ మాటల్లో రూహి కి న్యాయం ఉందని అనిపించింది. అలా మాట్లాడుతున్నప్పుడు వంశీ కళ్ళలో సన్నని నీటి పొర కమ్మడం కూడా గమనించింది. పార్వతి ఏమి మాట్లాడకపోయినా తన మనసులో కూడా ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి అని అర్థమైంది.

రూహి ఒక్కసారి ఊపిరి భారంగా పీల్చింది. తరువాత వారి వంక తిరిగి...
"వంశీ, నీకొక కథ చెప్తాను. కాసేపు వింటావా..
ఒక ఊర్లో ఓ చిన్న పాప ఉండేది. తనకు వాళ్ళ నాన్నంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే ప్రతి రోజు రాత్రి తన ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పుకోనిదే పడుకునేది కాదు. బేబీ బేబీ అని పిలుస్తూ తన వేలు పట్టుకొని తెగ అల్లరి చేసేది. తన నాన్నే తన ప్రపంచం అనుకునేది. ఇంతలో ఒకరోజు వాళ్ళ నాన్న పుట్టినరోజు రాబోతుంది. ఆ పాప చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా తనకు ఇచ్చిన పాకెట్ మని భద్రంగా దాచుకుంది. ఆ డబ్బులతో వాళ్ళ నాన్న కోసం ఓ మంచి వైట్ షర్ట్, ప్యాంటు కొనింది. వాళ్ళ నాన్న వస్తే ఆ బట్టలు ఇవ్వాలని, అవి చూడగానే తన కళ్ళలో కనిపించే ఆనందం చూడాలని... ఆ పాప వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

తరువాతి రోజు వాళ్ళ నాన్న ఊరి నుంచి తిరిగివచ్చాడు. కాని నడుచుకుంటూ కాదు.. నలుగురూ మోసుకుంటూ తెచ్చారు.
ఆ పాప పరుగున వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. పిలిచినా పలకడం లేదు. కదిలించినా కదలడం లేదు. ఆ పాపకు కన్నీరు ఆగడం లేదు.
తనకోసం కొన్న కొత్త బట్టలు తీసుకొని వచ్చింది.
'నాన్న, ఈ బట్టలు నీకోసమే కొన్నాను.  ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఉంటాను. చాకొలెట్లు తినడం తగ్గిస్తాను. బుద్దిగా ఉంటాను. ఒక్కసారి లే నాన్న...'

కాని వాళ్ళ నాన్న వైపు నుంచి సమాధానం లేదు. రక్తం తో తడిచిన తన చొక్కా చూసి ఇక ఎప్పటికీ నాన్న లేవడని అర్థమైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్న గుండెల మీద పడుకుంది. లాలి జో అని తనని జో కొట్టే గుండె చప్పుడు ఇప్పుడు మూగ బోయింది.

వాళ్ళ నాన్నని చూడటం కోసం కొన్ని లక్షల మంది వచ్చారు. గాల్లో తుపాకులు కూడా పేల్చారు. టీవీ లో ఎక్కడ చూసినా వాళ్ళ నాన్న గురించే... తరువాత తెలిసింది. దేశం లో ఎంతో మందిని కాపాడటం కోసం వాళ్ళ నాన్న ప్రాణం వదిలాడు అని.

కొన్ని రోజులకు అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. కాని ఆ పాప మాత్రం ప్రతి క్షణం వాళ్ళ నాన్న జ్ఞాపకాలతోనే గడిపేది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్న డైరీ చూసింది. అందులో ఓ పేజీ లో ఇలా రాసి ఉంది.

'మరణమా....
నాకు ఎదురుగా రాలేక చీకటి చాటున దాక్కొని, నా నీడలో నక్కి నన్ను వెంటాడుతూ...
ఏదో రోజు నా దరి చేరుతావని తెలుసు...

కాని నీకు తెలియంది ఏంటంటే...
నిజానికి ఓ సైనికుడు తను ఉద్యోగం లో చేరిన క్షణం నుంచి ప్రతి క్షణం తన చావు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు.
నువ్వు ఏ క్షణం నన్ను చేరినా నా మోహం లో నీ స్నేహితుడు భయాన్ని మాత్రం చూడలేవు. మృత్యువు నన్ను కబలించినా సరే, నా పెదాల మీద చిరునవ్వు మాత్రం చెరగదు. దేశం కోసం పాటుపడే సైనికుడి ప్రతి అణువు లోను వీరత్వమే ఉంటుంది.

అందరూ అంటుంటారు... రాజులు మాత్రమే చరిత్రలో మిగులుతారు అని..
కాని అది తప్పు... ఆ రాజుల చరిత్ర రాయడానికి ఓ సిరా లా మా సైనికుల రక్తమే వాడారు అనేది చదివే మనిషి మరిచినా, పుస్తకం మరుస్తుందా...

ప్రతి మనిషి ముగింపు మరణంలో ఉంటుంది.
కాని ఓ సైనికుడి ముగింపు మాత్రం తన దేశపు మట్టి లో ఉంటుంది. ఈ నేల ఉన్నంత కాలం బ్రతికే ఉంటాం..

నా మరణం అందరూ మర్చిపోవచ్చు. కాని నా నెత్తుటి తో వీర తిలకం అద్దుకున్న ఈ దేశం మరువగలదా...
నా ఊపిరి తో పురుడు పోసుకొని రెప రెప లాడే నా మువ్వన్నెల త్రివర్ణ పతాకం మరువగలదా...
నేను నిదురించే నేల మీద స్వేచ్చగా తిరిగే ఈ ప్రజల అడుగులు మరువగలవా....

దీనెమ్మ జీవితం దేశం కోసం బ్రతికితే ఎలా ఉంటుందో తెలీదు కాని...  దేశం కోసం చచ్చే క్షణం లో మాత్రం చాలా గర్వంగా ఉంటుంది. ఆ గర్వం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టి చావాలని ఉంది.'

ఆ మాటలు చదవగానే ఆ పాప కు ఏం చేయాలో అర్థమైంది. తను కూడా వాళ్ళ నాన్న లాగానే దేశం కోసం బ్రతకాలని అనుకుంది. ఆ పాప ఎవరో, ఆ తండ్రి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కాదా...
ఏజెంట్ రూహి వాసుదేవ్ D/o విక్రమ్ వాసుదేవ్...

మన దేశమంటే ప్రజలు మాత్రమే కాదు..  నేల... ఇక్కడ పారే నదులు.. మన భారతీయ సంస్కృతి... ప్రపంచానికి విజ్ఞానం అందించిన గ్రంధాలు... మేధావుల స్మృతులు... దేశ భక్తుల జ్ఞాపకాలు...
వీటన్నిటిని కాపాడుకోవడం మన బాధ్యత...

నా ప్రజలు నాకోసం నిలబడినా నిలబడకపోయినా... నేను మాత్రం నా దేశం కోసం చివరి క్షణం దాకా పోరాడుతాను. నిలబడతాను.

ఈ పోరాటం లో మీరు వెంట లేకపోతే ఒంటరిగానైనా యుద్ధం చేస్తాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు నడక మాత్రమే నేర్పించారు. కాని ఆ అడుగులు నడిచింది మాత్రం ఈ నేల మీదే అని మరువను.."

రూహి చెప్పడం ఆపి బ్యాగ్ భుజాన వేసుకొని చైనా బోర్డర్ వైపు అడుగులు వేసింది. కాసేపటికి తన అడుగుల వెనుక మరో రెండు జతల అడుగులు కూడా వెంట నడిచాయి. వెనక్కి తిరిగి చూస్తే వంశీ, పార్వతి...

"కోపంలో ఏదో తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఎప్పటికి మీ వెంటే మేము కూడా మేడం..." అని వంశీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. రూహి చిరునవ్వుతోనే వారికి సమాధానం ఇచ్చింది.

తరువాత అందరూ ఆగకుండా ఆ బోర్డర్ వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆకలి దప్పికలు తీరడం తో, అలాగే కంటి నిండా నిద్ర పోవడం తో వారిలో అప్పటిదాకా ఆవహించిన నిశ్శత్తువ దూరమై ఉత్సాహం గా కదిలారు. పైగా ఇందాక రూహి మాట్లాడిన మాటలు వారిలో స్ఫూర్తిని నింపాయి. అందుకే అడుగుల వేగం పెరిగింది.

అందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారు. ఎందుకంటే ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అందుకే సిద్ధంగా ఉన్నారు.

అప్పటిదాకా ఎటు చూసినా ఎర్రని ఎడారి కనిపించేది. కాని మెల్లగా ఆ ఇసుక మాయమై దాని స్థానం లో నేల, చెట్టు, పుట్ట కనిపించడం మొదలయింది. అది చూసాక బోర్డర్ కి దగ్గర పడ్డాం అని వారికి అర్థమైంది.

చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అలా వారి దారికి అడ్డంగా ఓ కొండ వచ్చింది. దాన్ని ఎక్కితే కాని ముందుకు వెళ్లలేం అని అర్థమై నిదానంగా దాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఆ కొండ అంచున ఓ పెద్ద లోయ ఉండటం తో నిదానంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. కాళ్లకు వేసుకున్న షు లు కూడా చిరిగిపోయి ఉండటం తో పదునైన రాళ్లు గుచ్చుకుంటున్నాయి. దారిలో ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు గీరుకుంటున్నాయి. కాని అవేవి లెక్క చేయకుండా ముందుకు సాగారు.

అలా కాసేపటి తరువాత ఆ కొండ మీదకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి ఎదురుగా చూసి కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలను దాటిన తరువాత అనుకున్న చోటుకు చేరువయ్యామని అర్థమై వారి మోహం లో ఆనందం విరిసింది. వారికి ఎదురుగా చైనా బోర్డర్ కనిపించింది.

ఇంకొన్ని అడుగులు వేస్తే గమ్యం చేరుకుంటారు. కాని ఆ చివరి అడుగులలో ఇంకెన్ని ప్రమాదాలు వారి కోసం ఎదురుచూస్తున్నాయో ముందు ముందు కాలమే సమాధానం చెప్పాలి.

--------------------------------------------------------------

హైదరాబాద్...

జలంధర్ చెప్పినట్టుగానే వాడి అనుచరులు మార్కెట్ బయట నిలిపిన ఆటో డ్రైవర్ల మెడ మీద కత్తులు పెట్టి అందరినీ తమ అధీనం లోకి తీసుకున్నారు. ఇక సుజిత బయటకు రావడం కోసం ఎదురుచూస్తూ నుంచున్నారు.

కాసేపటికి సుజిత కూరగాయలు కొని మార్కెట్ నుంచి బయటకు వచ్చింది. ఒకసారి చుట్టూ చూసింది. తనకు కొంచెం దూరంలో ఉన్న ఒక ఆటో ని పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న ఓ రౌడీ, తన చొక్కా మీద ఖాకి చొక్కా వేసుకొని సుజిత వైపు ఆటో పోనిచ్చాడు.

అక్కడున్నది జలంధర్ మనిషి అని తెలియక సుజిత ఆటో ఎక్కింది. అది చూసి ఆ రౌడీలు అందరూ మనసులోనే నవ్వుకున్నారు.

ఆటో కదిలింది.
ఆ ఆటో వెనుకే జలంధర్ మనుషులు కూడా కారులో వెంబడించడం మొదలుపెట్టారు.

ఊహించని ప్రమాదం లో చిక్కుకున్న సుజిత... దాని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి..
[+] 6 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)