Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...10
![[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]](https://static-assets.pratilipi.com/series/cover?seriesId=485271&version=e0736d03-46bd-484f-9de5-0ce122606d44)
అర్ధరాత్రి సమయం...
హైదరాబాద్ నగరం మొత్తం ప్రశాంతంగా పడుకొని ఉంది. అమావాస్య కావడం తో కటిక చీకటి అలుముకుంది. దూరంగా వీధి కుక్కల భౌ భౌ కబుర్లు వినిపిస్తున్నాయి. పగలంతా కష్టపడి అలిసిపోయిన మనుషులు ఆదమరిచి నిద్రిస్తున్నారు. అలాంటి సమయం లో.... ఒక నలుగురు అడుగులో అడుగు వేస్తూ, మొహానికి ముసుగు కప్పుకొని టెలికాం నగర్ లోకి అడుగుపెట్టారు.
వారు మరెవరో కాదు, జలంధర్ దగ్గర పని చేసే రౌడీలు.
ఏజెంట్ రూహి వాసుదేవ్ తల్లి సుజిత ను చంపడం కోసం వారు ఇక్కడికి వచ్చారు. మెల్లగా నడుస్తూ సుజిత నివసించే ఇంటికి చేరుకున్నారు. అంతకు ముందు రోజు సాయంత్రమే ఆ ప్రాంతం లో పక్కాగా రెక్కి నిర్వహించడం తో, ఆ చీకట్లో కూడా సుజిత ఉండే ఇంటి ని చాలా సులభంగా కనిపెట్టారు. అడుగుల శబ్దం రాకుండా ఉండటం కోసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు. కానీ వారి జేబులోని ఆయుధాలు మాత్రం అప్పుడప్పుడు శబ్దం చేస్తున్నాయి.
కాసేపటి తరువాత ఆ రౌడీలు సరిగ్గా సుజిత ఇంటి పిట్ట గోడ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక్కసారి అటు ఇటు చూసారు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఆ కాలని లో పని చేసే సెక్యూరిటీ కూడా నిద్ర ముంచుకు రావడం తో కూని రాగాలు తీస్తున్నాడు. అది ఈ రౌడీలకు కలిసి వచ్చింది.
ఆ కాలనీ లో ఉన్న ప్రతి ఇంటి గోడ మీద దొంగలు రాకుండా ఉండటం కోసం గాజు పెంకులు పేర్చి ఉన్నాయి. కానీ సుజిత నివసించే ఇంటి గోడ మీద మాత్రం అలాంటివేమి లేవు. అది చూసి తమ కోసమే అవి లేవేమో అని రౌడీలు నవ్వుకున్నారు.
అందరూ ఆ గోడ మీదకు ఎక్కి ఒకేసారి ఆ ఇంటి లోపలకు దూకారు. అంతే... ఒక్కసారిగా ఆ రౌడీల ప్రాణం పోయినంత నొప్పి కలిగింది. గట్టిగా అరవకుండా ఒకరి చేతిని ఒకరు నోట్లో పెట్టుకొని కొరికారు. అసలు ఏమైంది అంటే... సుజిత ఇంటి గోడ మీద గాజు పెంకులు లేవు కానీ, గోడ ఇవతల అంటే ఇంటి పెరట్లో అవి చల్లి ఉన్నాయి. అది కూడా చాలా పదునైన గాజు పెంకులు.. ఆ చీకట్లో రౌడీలు ఇంట్లోకి దుకగానే అవి వారి కాళ్ళ లోకి బలంగా దిగాయి. దెబ్బకు వారి కాళ్ళ నుంచి రక్తం చిమ్మింది. నొప్పికి విల విల లాడిపోయారు.
'గోడ మీద గాజు పెంకులు లేవు. ఈ సుజిత ఎంత తెలివి తక్కువది అనుకున్నాం. కానీ సరిగ్గా గోడ దూకే దగ్గర పెట్టింది. ఇప్పుడు అర్థమైంది ఎవరు తెలివి తక్కువ వారో..' అని ఆ రౌడీలు తమని తాము తిట్టుకున్నారు.
కాసేపు అక్కడే వారి కాళ్లలో దిగిన గాజు పెంకులు అన్ని జాగ్రత్తగా బయటకు తీసుకొని ముందుకు నడిచారు. ఇంటి ముందు వైపు ఉన్న తలుపు నుంచి లోపలకు వెళ్లడం సురక్షితం కాదని, వెనుక వైపు నుంచి వెళ్ళాలి అనుకున్నారు.
ఆ రక్తపు కాళ్ళతో మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు దగ్గరకు నడిచారు. అలా నడిచే దారిలో పచ్చని గడ్డి ఉంది. అసలే కాళ్లకు గాయాలు అవ్వడం తో... ఆ గడ్డి మీద నడిస్తే చల్లగా ఉంటుంది అనిపించి అందరూ ఆ గడ్డి మీద నుంచి అడుగులు వేశారు. సరిగ్గా రెండు అడుగులు వేసాక... ఆ రౌడీల అందరికీ నరకం అంటే ఏంటో కనిపించింది.
బయటకు శబ్దం రాకుండా గట్టిగా ఏడ్చారు. అసలేమైందో చూద్దాం అని కింద కూర్చొని ఆ గడ్డి లోకి చెయ్యి పెట్టి చూసారు. అప్పుడర్థమైంది... ఆ గడ్డి లో కారం చల్లి ఉంది అని. అసలే రక్తాలు కారుతున్న కాళ్ళు.. పైగా దాని మీద కారం... ఆ రౌడీలకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది. పుండు మీద కారం చల్లడం అంటే ఏంటో మొదటి సారి అర్థమైంది.
ఆ తర్వాత రౌడీలు అందరూ వారి చొక్కాలు విప్పి, కాళ్లకు కట్టుకొని ముందుకు నడిచారు. చివరకు ఇంటి వెనుక వైపుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తలుపు ను చూడగానే రౌడీల మోహం లో అప్పటిదాకా ఉన్న బాధ తగ్గి, మెరుపు వచ్చింది. ఆనందం తో సంబర పడ్డారు. ఎందుకంటే ఆ తలుపు కు ఎలాంటి తాళం వేయలేదు.
"చూసావా గురు... ఈరోజు ఆ సుజిత తన చావును ఆహ్వానించడం కోసం తనే తలుపుకు తాళం వేయడం ఎలా మర్చిపోయిందో.. " అని ఒక రౌడీ నవ్వుతూ అన్నాడు. అది విని మిగతా రౌడీలు కూడా నవ్వేశారు.
ఆ తరువాత మొదటి రౌడీ... మెల్లగా ఆ తలుపు మీద చెయ్యి వేసాడు. అంతే... కరెంట్ షాక్ కొట్టిన కాకి లాగా ఊగిపోయాడు. వాడే కాదు... వాడిని తాకిన మరో రౌడీ కూడా అలాగే కరెంట్ షాక్ తో గిల గిల లాడుతున్నాడు. అది చూసి మిగతా ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ఒక కర్ర తీసుకొని తలుపు ముట్టుకున్న రౌడీ చేతి మీద కొట్టాడు. దాంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ షాక్ కొట్టిన రౌడీల మొహాలు మాత్రం నల్లగా మాడిపోయాయి. నోట్లో నుంచి, చెవిలో నుంచి తెల్లని పొగలు కూడా వచ్చాయి. కాసేపటి తరువాత స్పృహలోకి వచ్చారు.
"మనం అనుకున్నంత పిచ్చిది కాదు రా ఆ సుజిత... మన అందరికీ బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుంది. ఈరోజు ఎలాగైనా దాన్ని చంపి తీరాలి." అని ఆ రౌడీలు మరింత కోపంగా ఊగిపోయారు.
తరువాత ఆ తలుపు పైన తగిలేలా ఉంచిన వైర్ ఒకదాన్ని గమనించారు. వెంటనే దాన్ని కర్ర సాయం తో పక్కకు లాగేసారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ తలుపు ముట్టుకున్నా సరే వారికి ఎలాంటి షాక్ కొట్టకపోవడం తో నవ్వుకున్నారు. అలా ఆ తలుపు తెరిచి వంట గదిలోకి అడుగు పెట్టారు. ఒక రెండు అడుగులు వేయగానే వారి కాళ్లకు ఒక దారం అడ్డుగా తగిలింది. ఆ దారం తగలగానే.. ఏమైందో అర్థం కాక ఆ రౌడీలు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
సరిగ్గా అప్పుడే... వారి తల మీద నుంచి ఏదో ద్రవం కారడం మొదలైంది. అది నేరుగా ఆ రౌడీల తలల మీద పడింది. అందరూ తల ఎత్తి పైకి చూసారు. పైన రెండు బాటిల్స్ నుంచి బ్రాందీ పడుతుంది. అది చూడగానే మొదట ఆశ్చర్యపోయినా సరే ఆ తర్వాత ఆనందించారు. అసలే కాళ్లకు తగిలిన గాయాలు నొప్పి ని ఇస్తుంటే, ఈ సమయం లో మందు దొరకడం తో పోటీ పడుతూ తాగారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే... మరో ప్రమాదం వారి కోసం సిద్ధంగా ఉందని.
పైన తగిలించిన సీసాలలో నుంచి సగం మందు కింద పడగానే, ఆ సీసాలకు కట్టిన మరో దారం బిగుసుకుంది. ఆ దారం ఆ సీసాల ముందు వైపు కట్టిన ఏదో వస్తువును బలంగా లాగాయి. అలా లాగగానే ఆ సీసాల ముందు వైపు ఒక నిప్పు రేగింది. బ్రాందీ ఆ నిప్పు ను తాకగానే ఒక పెద్ద మంటను రేపాయి.
ఇంకేముంది...అప్పటిదాకా పై నుంచి మందు పదితే ఆనందించారు. కానీ ఇప్పుడు నిప్పుల వర్షం కురిసింది. పైగా ఆ నిప్పు.. ఇందాక ఆ రౌడీల తలల మీద పడిన బ్రాందీ ని తాకింది. దెబ్బకు రౌడీల తలలకు నిప్పు అంటుకున్నాయి. అందరి తల మీద నిప్పు మండుతుంది. అది చూసి రౌడీలు భయపడిపోయారు. ఆ నిప్పుని ఆపాలని కింద మీద పడ్డారు. అలా వాళ్లల్లో వాళ్లే ఒకరి మోహం ఒకరు కాల్చుకున్నారు. చివరకు ఆ గదిలో మూలన ఉన్న సింక్ లో నీళ్లు రావడం చూసి పరుగున వెళ్లి మంటలు ఆర్పుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది.
ఆ నలుగురి రౌడీల తల మీద జుట్టులో సగం కాలిపొయింది. సగం జుట్టు, సగం గుండు తో వారి మోహం వారికే భయంకరంగా అనిపించింది. మొహాలు కూడా మాడిపోయాయి. ఒక రౌడీ ముక్కు అయితే కాలి పోయి ఎర్రని టమాటో మాదిరి అయ్యింది.
"అన్నా.. ఈ సుజిత మామూలుది కాదు. చూస్తుంటే మనం తనని చంపడానికి వచ్చినట్టు లేదు. తన చేతిలో చావడానికి వచ్చినట్టు ఉంది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పద.." అని ఒక రౌడీ భయంగా ఏడుస్తూ అన్నాడు.
"ఆగరా... ఇంత దూరం వచ్చాం. ఈరోజు మనకు జరిగిన దానికి బదులు తీర్చుకుందాం. దానిని చంపేసే వెళ్దాం." అని పళ్ళు కొరుకుతూ మరో రౌడీ పలికాడు.
ఇక చేసేదేం లేక నలుగురు రౌడీలు లేచి నిలబడ్డారు. మెల్లగా ముందుకు అడుగులు వేశారు. ఎటు వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయం భయంగా నడుస్తున్నారు. వంట గది లో నుంచి హల్ లోకి వచ్చారు. ఒక్కసారి చుట్టూ చూసారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం కనిపించలేదు. హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక రౌడీ ఆ హాల్ మధ్యలో ఒక ఆపిల్ పండు ఉండటం చూసాడు.
దానిని చూడగానే బాగా ఆకలిగా అనిపించింది. వెంటనే వెళ్లి ఆ ఆపిల్ ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. ఆ ఆపిల్ కి ఒక దారం కట్టి ఉందని... దాన్ని చేతిలోకి తీసుకోవడం తో ఆ దారం లాగబడింది అని... అది చూసి రౌడీలు అందరూ ఉలిక్కి పడ్డారు. ఎటు వైపు నుంచి ఏమి ముంచుకు వస్తుందో అని వణికిపోయారు. వారి ఊహను నిజం చేస్తూ... ఒక గుండు సూది వేగంగా వచ్చి ఒక రౌడీ సీటులోకి దిగింది. దాంతో వాడు నొప్పితో పెద్దగా అరిచాడు. ఇంతలో ఆ గది నలు మూలల నుంచి పదునైన గుండు సూదులు దూసుకొని వచ్చాయి. ఒకటి రెండు కాదు.. కొన్ని వందల సూదులు..
అవి ఆ రౌడీల అందరి శరీరాల లోకి వేగంగా దిగాయి. ఒళ్ళంతా గాయాలు, రక్తాల తో వారి ప్రాణం పోయినట్టు అనిపించింది. కాసేపటికి ఆ గుండు సూదుల వర్షం ఆగింది. మెల్లగా ఒక్కో రౌడి వారి శరీరం లో దిగిన గుండు సూదులు తీసుకున్నారు. అందరిలో సుజిత మీద కోపం మరింతగా పెరిగింది. ఈరోజు ఎలాగైనా తనని చంపేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ ఇంట్లో కింద వైపు ఎవరు లేరని అర్థమైంది. కచ్చితంగా సుజిత మేడ మీద ఉన్న గదిలోనే ఉంటుందని అనిపించి, పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. సరిగ్గా నాలుగు మెట్లు ఎక్కగానే... ఆ మెట్ల మీద చల్లిన నూనె కారణంగా ముందు నడుస్తున్న రౌడీలు కాలు జారి వెనుక వస్తున్న రౌడీల మీద ఎగిరి పడ్డారు. అలా వారంతా ఆ హల్ లో చెల్లా చెదురుగా పడి ఉన్న గుండు సూదుల మీద పడ్డారు. అవి వారి శరీరం లో మరింత లోతుగా దిగాయి.
దెబ్బకు వారి ప్రాణాలు పోయినట్టు అనిపించింది. ఒళ్ళంతా చిద్రమైంది. శరీరం మొత్తం గాయాలతో ఆ గదిలో పైకి లేవలేక ఆ రౌడీలు అలాగే పడిపోయారు. వారికి ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. భరించలేని నొప్పి కలిగింది.
సరిగ్గా అప్పుడే వారికి ఒక నవ్వు వినిపించింది. ఎవరా అని తల తిప్పి చూస్తే... ఎదురుగా మెట్ల పక్కనే ఉన్న గదిలో నుంచి సుజిత నవ్వుతూ బయటకు వచ్చి నిలబడింది.
తనని చూడగానే ఆ రౌడీల కు కోపం మరింతగా పెరిగింది. ఒక రౌడీ ఎలాగోలా పైకి లేచి తన మీదకు కోపంగా వెళ్ళాడు.
తనని పొడవడానికి కత్తిని గాల్లోకి లేపాడు. సుజిత ఆ కత్తిని ఒడుపుగా తప్పించుకొని తన చీరను పైకి ఎగ్గట్టి శివంగి లా మారి ఆ రౌడీ గుండెల మీద ఒకే ఒక్క తన్ను తన్నింది. వంద ఏనుగులు ఒకేసారి మీద పడ్డట్టు అయ్యింది. వాడు అమాంతం ఎగిరి దూరంగా పడిపోయాడు. ఆ రౌడీ నోట్లో నుంచి రక్తం వచ్చింది.
అది చూసి మిగతా రౌడీలు నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు. సుజిత కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. అపర భద్ర కాళీ లాగా నిలబడి ఉంది తను...
"ఒంటరిగా ఉంది. సులభంగా చంపేయచ్చు అని అనుకున్నారా... కానీ ఇక్కడ ఉన్నది ఎవరో మరిచారా...
దేశాన్ని కాపాడే సైనికుడు, తమ కుటుంబానికి కాపాడుకోవడం నేర్పరా...
నాకు కూరగాయలు కోయడం వచ్చు. అలాగే నీలాంటి పోరంబోకుల తలలు నరకడం కూడా వచ్చు.
మళ్ళీ ఇంకోసారి ఇలా వస్తే, ఈసారి వార్నింగులు ఉండవు. చంపడాలు మాత్రమే ఉంటాయి.
నా గుండెకున్నంత సహనం నా చేతిలోని ఆయుధానికి ఉంటుందని అనుకోను. ఆ తరువాత మీ ఇష్టం.
వెళ్లి ఈ మాట మిమ్మల్ని పంపిన వాడికి చెప్పండి.
చెప్పింది ఎవరని అడిగితే...
ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ భార్య... రూహి వాసుదేవ్ తల్లి... ఈ సుజిత వాసుదేవ్ చెప్పిందని చెప్పు..."
ఆ మాట వినగానే ఆ రౌడీలు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటి బయటకు పరుగు తీశారు.
సుజిత వాసుదేవ్... వారి వంక చూస్తూ నిలబడి ఉండి.
తనలో ఆ ధైర్యం చూసి పైనున్న విక్రమ్ వాసుదేవ్ కూడా గర్వంగా పొంగిపోయాడు.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...10 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,184 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,640
Threads: 2
Likes Received: 976 in 752 posts
Likes Given: 2,206
Joined: May 2019
Reputation:
11
16-05-2026, 12:43 PM
(This post was last modified: 16-05-2026, 12:44 PM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ comment section లో whistle (సీటీ) వేసే వీలులేదు గానీ ..
..ఉండుంటే .. సీటీగొట్టి.. టాపులేపేవాడ్ని..
Sujitha.. iragadeesindi!!
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,964
Joined: Jun 2019
Reputation:
2
Wow, i thought Sujitha would be a soft spoken, soft hearted mother and housewife. Good to see her other side of her character. Great writing.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...11
![[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]](https://static-assets.pratilipi.com/series/cover?seriesId=485271&version=e0736d03-46bd-484f-9de5-0ce122606d44)
"మేడమ్ మరోసారి ఆలోచించండి. ఇది మీ ప్రాణాలకే ప్రమాదం" పార్వతి ఆందోళనగా పలికింది.
"రాముడి బాణం, సైనికుడి పాదం... ముందుకు దూకాలే తప్ప వెనక్కి అడుగు వేయడం అంటూ ఉండదు." అంటూ రూహి దృడంగా సమాధానం ఇచ్చింది.
లీ జాంగ్ ద్వారా... ఇండియా మీద చైనా ఏదో పెద్ద ఉపద్రవం సృష్టించడానికి పథకం రచించింది అని బ్లాక్ కోబ్రా బృందానికి అర్థమైంది. దానికోసం చాలా మంది మేధావులను బలవంతంగా ప్రతి పది రోజులకు ఒకసారి వ్యాన్ లో ఎక్కించి ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు, తిరిగి వచ్చే సమయం లో వారి కళ్ళను, నాలుకను తీసేస్తున్నారు అని తెలుసుకున్నారు. అంతే కాకుండా అక్కడికి వెళ్లే చివరి బ్యాచ్ ఈరోజు రాత్రికే వెళ్తుందని కూడా తెలిసింది. అందుకే ఎలాగైనా సరే తను కూడా ఆ బ్యాచ్ లో కలిసిపోయి వారి స్థావరానికి చేరుకొని, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రూహి అనుకుంది.
కానీ అది చాలా ప్రమాదమని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు, అక్కడ ఎంతమంది శత్రువులు ఉంటారో తెలీదు.. అందులో ఏ ఒక్కరికి అనుమానం వచ్చినా అది రూహి ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే రూహి ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళడానికే సిద్దపడింది.
ఇంతలో...
"నేను కూడా మీతో పాటు వస్తాను మేడమ్..." అని అయాన్ అన్నాడు.
"వద్దు అయాన్. అది చాలా ప్రమాదకరం. ప్రాణాలు కూడా పోవచ్చు." రూహి హెచ్చరించింది.
"పర్లేదు మేడమ్. ఈ జన్మకు మీతో జతగా మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం కంటే మరో అదృష్టం ఉంటుందా..."
అయాన్ మాటలు వినగానే రూహి కళ్ళు కాసేపు ఆశ్చర్యపోయాయి. రూహి తనని వద్దని చెప్పలేకపోయింది.
తన మదిలో ఏదో తెలియని పులకింత... అది ప్రేమో, ఇష్టమో తెలియడం లేదు. కానీ ఈ భావన మాత్రం చాలా కొత్తగా అనిపించింది.
తను ఇలా ఆలోచనల్లో ఉండగానే...
"మేము కూడా మీతో పాటు వస్తాం." అని పార్వతి, వంశీ కూడా అన్నారు.
రూహి వారి వైపు తిరిగి...
"వద్దు. మీరు బయట ఉండటమే మన ఆపరేషన్ కి చాలా అవసరం. నేను ఎప్పటికప్పుడు లోపల ఏం జరుగుతుందో మీకు చేరవేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ ఏదైనా అనుమానంగా కనిపించినా, ఏదైనా ముఖ్య విషయం తెలిసినా సరే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి."
ఆ మాటకు వంశీ, పార్వతి సరే అన్నారు.
ఆ తరువాత బ్లాక్ కోబ్రా టీం మొత్తం తాము చేయబోయే పోరాటం గురించి చర్చించుకున్నారు. అలాగే ఎవరెవరు ఏమేమి చేయాలో కూడా రూహి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఇక రూహి, అయాన్ వారిని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది.
రూహి అందరి వంక చూస్తూ ఇలా చెప్పింది.
"ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద అడవిని కాల్చే కార్చిచ్చు అయినా సరే, ఏదో ఒక సమయంలో ఆరిపోక తప్పదు.
కానీ దేశం కోసం సైనికుడు చేసే త్యాగం కొన్ని కోట్ల హృదయాలలో దేశ భక్తి అనే అగ్గిని రగుల్చుతుంది. అది ఎన్నటికీ ఆరనిది. ఆ జ్వాల నుంచి ఎంతో మంది వీర సైనికులు పుడతారు.
ఈ పోరాటం లో మన ప్రాణాలు పోయినా సరే, విజయం మాత్రం మన దేశానికే రావాలి.
వందేమాతరం..."
"వందేమాతరం..." అంటూ మిగతా వారు కూడా ఎగసిపడే గుండె తో అరిచారు. అక్కడున్న గాలిలో ప్రతి అణువునా దేశ భక్తి నిండిపోయింది.
ఆ తరువాత రూహి, వంశీ అక్కడి నుంచి కదిలారు. సిటీ సెంటర్ కి చేరుకున్నారు. అక్కడే ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అలా కొన్ని గంటలు గడిచాయి. మెల్లగా చీకటి ముసురుకుంది. వీధి దీపాలు పరుచుకున్నాయి. కాసేపటికి జనాలు కూడా పలచబడటం మొదలైంది. అలా అందరూ ఎవరు పనుల్లో వారు ఉండగా... లీ జాంగ్ చెప్పినట్టుగా ఒక వ్యాన్ వచ్చి సిటీ సెంటర్ కి కాస్త దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశం లో ఆగింది.
చూడగానే అదే తాము ఎదురుచూస్తున్న వాహనం అని రూహి కి అర్థమైంది. ఎందుకంటే అందులో ఉన్న డ్రైవర్ కిందకు దిగే సమయం లో తన జేబులో తుపాకీ కనిపించింది, అలాగే ఆ వ్యాన్ మీద కూడా లీజా ఆటోమొబైల్స్ గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది.
రూహి వెంటనే అయాన్ కి సైగ చేసింది. తను కూడా అన్ని గమనించాను అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. ఆ వ్యాన్ ముందు డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. ఎలాగైనా సరే వాడిని బురిడీ కొట్టించి వారిద్దరూ వ్యాన్ లోకి వెళ్ళాలి అనుకున్నారు.
రూహి తన ఫోన్ నుంచి పార్వతి కి ఒక సందేశం పంపింది. పార్వతి వెంటనే రంగం లోకి దిగింది. తను చాలా అందంగా తయారు అయ్యింది. వయ్యారంగా నడుస్తూ ఆ వ్యాన్ డ్రైవర్ వైపు వెళ్ళింది. తనని చూసి వాడు అలా నోరు తెరిచి ఉండిపోయాడు. ఇంతలో పార్వతి వాడిని చేరుకొని, ఏదో అడ్రస్ కావాలి అన్నట్టు ఒక కాగితం బయటకు తీసి అడిగింది. వాడు తనని తాను మైమరచి పోయి దారి చెప్పడం లో మునిగిపోయాడు. అదే అదునుగా, పార్వతి చాలా ఒడుపుగా వాడి కోటు జేబులో ఉన్న వ్యాన్ కీస్ సంపాదించింది. వచ్చిన పని అయిపోవడం తో బాయ్ చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది.
పార్వతి నేరుగా రూహి ని చేరుకొని, ఆ వ్యాన్ కీస్ తనకు ఇచ్చింది. ఆ తరువాత... రూహి, అయాన్ పైకి లేచి నిలబడ్డారు. మెల్లగా వారి అడుగులు వ్యాన్ వైపు పడ్డాయి. వారు అలా నడుస్తూ తమ వైపే వస్తుంటే, వ్యాన్ డ్రైవర్ కి ఎందుకో అనుమానం కలిగింది అని తన చూపులు చెప్పకనే చెప్తున్నాయి.
ఇంతలో... వాడికి అనుమానం రాకుండా ఉండటం కోసం అయాన్ వెంటనే రూహి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఏదో కబుర్లు చెప్తూ నడుస్తున్నాడు. అలా అకస్మాతుగా తన చేతిని పట్టుకునేసరికి రూహి గుండె వేగం అమాంతం పెరిగింది. ఒక్క క్షణం మదిలో ఓ తీయని అలజడి రేగింది. తొలిసారి తన ఊపిరి భారంగా మారి, బుగ్గలు సిగ్గుతో ఎరుపు రంగు పులుముకుంటుంటే అణుచుకుంటూ అడుగులు వేసింది.
వారిని అలా చూసి ఆ డ్రైవర్ కూడా అనుమానం వదిలి ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా రూహి, అయాన్ వ్యాన్ కి వంద మీటర్ల దూరం లో ఉన్నారు అనగా.... డు. డు. డు.. అంటూ ఓ బండి ఆ వీధిలోకి వచ్చింది. అందరూ తల తిప్పి అటు వైపు చూసారు. ఒక దోమలు కొట్టే బండి, పొగ వదులుతూ వస్తుంది. పొగ తో ఆ రోడ్డు మొత్తం నిండిపోయింది. ఆ బండి నడుపుతున్న వంశీ రూహి ని చూసి సైగ చేశాడు.
రూహి వెంటనే అలర్ట్ అయ్యింది. దట్టమైన పొగ కమ్ముకోవడం తో ఏమీ కనిపించడం లేదు. రూహి, అయాన్ అదే సరైన సమయం అని వారి దగ్గర ఉన్న anti fog గ్లాసెస్ పెట్టుకొని వేగంగా వ్యాన్ వెనుక వైపుకు చేరుకున్నారు. తమ దగ్గర ఉన్న కీస్ సాయం తో వెనుక వైపు తలుపు తెరిచారు. అక్కడ సుమారు ఒక ఎనిమిది మంది కళ్ళకు గంతలు, కాళ్ళు, చేతులను తాళ్లతో కట్టేసి బంధించి ఉంచారు.
సరిగ్గా అదే సమయం లో పార్వతి కూడా మరో వ్యాన్ వేసుకొని అక్కడికి చేరుకుంది. పొగ దట్టంగా ఉండటం తో ఆ వ్యాన్ డ్రైవర్ కి అంతగా ఏమీ తెలియడం లేదు. ఇంతలో రూహి, అయాన్ అందులో నుంచి ఇద్దరిని పార్వతి వ్యాన్ లోకి ఎక్కించారు. పార్వతి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. తర్వాత రూహి, అయాన్ ఆ వెళ్ళిపోయిన వారి స్థానం లోకి ఎక్కి తమకు ఒకరికొకరు కట్లు కట్టుకున్నారు. ఆ తరువాత తన జేబులో ఉన్న వ్యాన్ కీస్ ని కిటికీ లో నుంచి బయటకు విసిరేసారు.
కొద్ది సేపు తరువాత... అలుముకున్న పొగ మొత్తం మెల్లగా తొలిగిపోయింది. వ్యాన్ డ్రైవర్ కీస్ కోసం తన జేబులో వెతికాడు. కానీ కనిపించలేదు. ఒక్కసారి చుట్టూ చూస్తే పక్కనే కింద పడి ఉండటం గమనించాడు. వెంటనే వాటిని తీసుకొని డోర్ తీసి లోపల అందరూ సరిగ్గా ఉన్నారా లేరా అని చెక్ చేసుకున్నాడు. మొత్తం ఎనిమిది లెక్క సరిపోవడం తో హమ్మయ్య అనుకున్నాడు. కానీ ఆ ఎనిమిదిలో రూహి, అయాన్ ఉన్నారు అని అస్సలు ఊహించలేకపోయాడు.
సరిగ్గా అప్పుడే...
ఒక నలుగురు చైనా వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని చూడటానికి చాలా బలిష్టంగా ఉన్నారు. వారు రాగానే వ్యాన్ డ్రైవర్ వారికి సెల్యూట్ చేసి, వ్యాన్ కీస్ వారికి అందించాడు. వారిలో ఒకడు వ్యాన్ ఎక్కి స్టార్ట్ చేశాడు. మిగతా వారు కారులో ఆ వ్యాన్ ని ఫాలో అవుతున్నారు.
రూహి, అయాన్ మెల్లగా తమ కళ్ళ గంతలు తీసి కిటికీ లో నుంచి తొంగి చూస్తున్నారు. వ్యాన్ నగరం దాటి బయటకు వెళ్తుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్తుంది అన్నది ఆ చీకట్లో వారికి అర్థం కావడం లేదు. అలా చాలా సేపు వారి ప్రయాణం జరిగింది. సుమారు ఒక రెండు గంటల తరువాత, వారి వ్యాన్ ఒక దగ్గర ఆగింది.
వ్యాన్ ఆగగానే రూహి, అయాన్ ఏమీ తెలియనట్టు మౌనంగా పడుకున్నారు. కాసేపటికి వ్యాన్ లో బందించిన అందరినీ కిందకు దించి, వారి జేబులు అన్ని వెతికి... ఫోన్లు తీసుకొని పగలకొట్టారు. తరువాత వరసగా నడిపించుకుంటూ ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. అలా కొద్ది దూరం నడిచిన తరువాత అందరి కళ్ళకు కట్టిన గంతలు తీశారు.
రూహి ఒక్కసారి చుట్టూ చూసింది. అదొక ఫ్యాక్టరీ లాంటిది. అంత రాత్రి వేళ కూడా పగలు అనిపించేంతగా విద్యుత్ దీపాలు వేసి ఉన్నాయి. చుట్టూ చాలా మంది చైనా సైనికులు ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆదునాథనమైన ఆయుధాలు ఉన్నాయి. అందరి కళ్ళలోనూ క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ ప్రదేశం మొత్తం కాపలా చాలా పక్కాగా ఉంది. వారి అందరినీ దాటి బయట నుంచి ఒక్కరు కూడా లోపలకు రాలేరు అని అర్థమైంది.
రూహి అలా చుట్టూ గమనిస్తూ ఉండగానే ఒకడు వచ్చి అందరికీ తలా ఒక కవర్ ఇచ్చాడు. దాన్ని తెరిచి చూస్తే ఒక తెల్లని గౌన్ లాంటి డ్రెస్ మరియు ప్యాంట్ ఉంది. అందరినీ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకోమని చెప్పాడు. అందరూ అలాగే చేసారు.
తరువాత ఒక చైనా సైనికుడు వచ్చి ఒక్కొక్కరిని వరుసగా మెటల్ డిటెక్టర్ తో బాడీ మొత్తం స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. అలా చెక్ చేస్తున్నప్పుడు రూహి చేతికి ఉన్న ఉంగరం చూసి మెషిన్ బీప్ మని మోగింది. వెంటనే దాన్ని తీసి విసిరేయమని ఆదేశించాడు.
కానీ రూహి తీయను అని అంది. అది వినగానే ఆ సైనికుడు రూహి చెంప మీద బలంగా కొట్టాడు. రూహి చెంప ఎర్రగా కందింది. పెదవి చిట్లి రక్తం కూడా వచ్చింది. అది చూసి అయాన్ కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ తనని ఆగమని రూహి కళ్ళతోనే సైగ చేసింది. ఆ సైనికుడు మరోసారి ఉంగరం తీసి విసిరేయమని అరిచాడు.
"ఇది నా ఎంగేజ్మెంట్ ఉంగరం. మా ఆయన చనిపోయాక తన గుర్తుగా మిగిలింది ఇది ఒక్కటే.. నా ప్రాణం పోయినా ఇది తీయను" అంటూ రూహి బదులు చెప్పింది
అది చూసి ఆ సైనికుడికి మరింత గా కోపం వచ్చింది. రూహి జుట్టు పట్టుకొని కింద పడేసాడు. కాలితో తన కడుపులో బలంగా తన్నాడు. కొంచెం కూడా జాలి లేకుండా బూటు కాలితో అలా తంటూనే ఉన్నాడు. రూహి శరీరం మొత్తం రక్తం వస్తుంది. అయినా కనికరం చూపించలేదు. రూహి ఆ నొప్పిని కూడా పంటి బిగువున భరించింది. అయాన్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నాడు.
సరిగ్గా అప్పుడే...
ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనని చూడగానే అక్కడున్న సైనికులు అందరూ నిటారుగా నిలబడి సెల్యూట్ చేసారు. తనే అక్కడున్న సైనికుల అందరికీ అధికారి అని అర్థమవుతుంది. అతను మాస్క్ ధరించి ఉండటం తో మోహం స్పష్టంగా కనిపించడం లేదు.
ఇంతలో అతను మెల్లగా రూహి ని కొడుతున్న సైనికుడి దగ్గరకు వచ్చాడు. ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. వాడు జరిగింది మొత్తం చెప్పాడు.
అది విన్న తరువాత...
"ఉంగరమే కదా.. వదిలేయండి. ఇలాంటి చిన్న వాటి కోసం సమయం వృధా చేయకు. మన ఆపరేషన్ మొదలుపెట్టడానికి టైమ్ దగ్గర పడుతుంది. త్వరగా రేపు ఉదయం నుంచే పని మొదలుపెట్టాలి." అని ఆదేశించి అక్కడి నుంచి ముందుకు కదిలాడు.
దాంతో వాడు రూహి ని వదిలేసి, అందరినీ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు. రూహి మెల్లగా పైకి లేచింది. తన ఒళ్ళంతా గాయాలు, రక్తం తో తడిచిపోయింది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా అనిపించింది. భరించలేని నొప్పిని కూడా తట్టుకుంటూ నిదానంగా అడుగులు వేసింది.
ఆ సైనికులకు కాస్త దూరంగా వచ్చాక...
"మీకేమైనా పిచ్చి పట్టిందా మేడమ్. ఆ ఉంగరం కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారా..." అని అయాన్ కళ్ళ నీళ్లతో అడిగాడు.
"ఇది మామూలు ఉంగరం కాదు అయాన్. మన ఫోన్లు అన్ని లాగేసుకుంటారు అని నాకు ముందే తెలుసు. అందుకే
ఆ రింగ్ లో లొకేషన్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాను. దీని సాయం తో మనం ఎక్కడ ఉన్నాము అనేది ఎప్పటికప్పుడు బయట ఉన్న మన బృందానికి చేరుతుంది. మన ఆపరేషన్ విజయవంతం అవ్వడానికి అది చాలా ముఖ్యం." అని రూహి నవ్వుతూ చెప్పింది.
రూహి తెలివి ని చూసి అయాన్ అభినందించకుండా ఉండలేకపోయాడు.
"మేడమ్.. వాడు అంతలా కొడుతున్నాడు. అయినా మీకు నొప్పిగా లేదా. అలా నవ్వుతున్నారు "
"వీళ్ళు కొట్టే దెబ్బలు నన్ను ఏమీ చేయలేవు. అయినా మన మువ్వన్నెల జెండా కోసం రక్తం చిందించే అదృష్టం దొరికినందుకు చాలా గర్వంగా ఉంది." అంటూ రూహి తన నుదుటన జారే రక్తాన్ని తుడుచుకుంటూ ముందుకు నడిచింది.
దేశ భక్తి నరనరాల్లో నింపుకున్న ఓ గొప్ప సైనికురాలిని చూసి... అయాన్ గుండె ఉప్పొంగింది.
మన జాతీయ పతాకం కూడా మరింత గర్వంగా రెప రెప లాడింది.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...12
![[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]](https://static-assets.pratilipi.com/series/cover?seriesId=485271&version=e0736d03-46bd-484f-9de5-0ce122606d44)
అప్పటికి రూహి, ఆ చైనా వారి స్తావరానికి వచ్చి మూడు రోజులు అయ్యింది. కానీ ఇంత వరకు వారు భారత దేశం మీద ప్రయోగించబోయే ఆయుధం ఏంటో కనిపెట్టలేకపోయింది. అక్కడ అందరికీ కొంచెం కొంచెం అవగాహన మాత్రమే వచ్చేలా పనులు ఇస్తున్నారు. కానీ పూర్తి ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎవరికీ తెలియనివ్వడం లేదు. రూహి, అయాన్ ఇద్దరూ వారి కాలేజ్ లో కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తీసుకోవడం తో అక్కడ ఏదోలా మేనేజ్ చేస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వారికి దొరికిపోయేవారు.
తమ దగ్గర ఎక్కువ సమయం లేదు, ఎలాగైనా సరే వచ్చిన పని త్వరగా పూర్తి చేయాలి అని రూహి కి బాగా తెలుసు. కానీ అదేలాగో అర్థం కావడం లేదు. పైగా అక్కడ సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా చైనా సైనికులు కాపలాగా ఉన్నారు. వారి కళ్ళు గప్పి తిరగడం చాలా కష్టం. సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది.
అలా ఆ రోజు రాత్రి రూహి ఆలోచనల్లో ఉండగా... మెల్లగా అయాన్ తన దగ్గరకు వచ్చాడు.
"మేడమ్, ఎలా ఉంది ఇప్పుడు మీకు?" అని నిదానంగా అడిగాడు.
రూహి మొదట ఆశ్చర్యపోయి, తరువాత కంగారుగా ఒకసారి చుట్టూ చూసింది. తమకు కాపలా గా ఎవరూ లేరు. నిజానికి అక్కడికి ఎత్తుకొని వచ్చిన 8 మందికి విడి విడిగా గదులు కేటాయించారు. ఎవరూ మరొకరితో మాట్లాడకూడదు. మాట్లాడితే ఇష్టమొచ్చినట్టు శిక్షించేవారు. ఇప్పుడు అయాన్ వారి కళ్ళు గప్పి రూహి గదిలోకి వచ్చాడు.
"ఏంటి అయాన్. నీకేమైనా పిచ్చా. ఎందుకిలా వచ్చావు. పొరపాటున నిన్ను ఎవరైనా చూస్తే." అని రూహి కంగారుగా అడిగింది.
"మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. అయినా బయట ఎవరూ లేరు లే మేడమ్. మీకెలా ఉంది ఇప్పుడు " అని అడిగాడు.
"దెబ్బలు దాదాపు తగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు."
ఆ మాట వినగానే అయాన్ కళ్ళలో ఓ ఆనందం కనిపించింది. అది చూసి రూహి మనసులో కూడా సంతోషం కలిగింది.
"మేడమ్. ఆగష్టు 15 ఎంతో దూరంలో లేదు. ఆలోగా వీరి గుట్టు కనిపెట్టి మట్టుబెట్టాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. తరువాత ఏం చేయాలో ఏమైనా ఆలోచించారా?" అని అడిగాడు.
"అదే తెలియడం లేదు అయాన్. ఈ ఆపరేషన్ గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు. దీనికి సంబంధించిన మొత్తం వివరాలు ఈ బిల్డింగ్ లో ఉన్న ఒక రహస్య గదిలో పెట్టారు. కానీ దాని తెరవాలంటే రెండు కావాలి. ఒకటి తాళం, రెండోది వేలి ముద్ర...
ఆ రెండు ఈ చైనా సైన్యాధ్యక్షుడు చాంగ్ లీ దగ్గర మాత్రమే ఉంటాయి. తనకు తెలియకుండా తన నీడను కూడా తాకలేము. అలాంటిది వాటిని ఎలా తీసుకొని రావాలో తెలియడం లేదు. " అని రూహి పలికింది.
"మరి ఇప్పుడెలా మేడమ్."
"అదే ఆలోచిస్తున్నాను. వాడికి సంబందించిన వాటిలో మనకు పనికొచ్చేది ఒక్కటి దొరికినా చాలు. ఒకే ఒక్క అవకాశం. దెబ్బకు వాడికి చుక్కలు కనిపించాలి."
అప్పుడే అయాన్ కి ఒక విషయం గుర్తొచ్చింది.
"మేడమ్, ఆ చాంగ్ గురించి నేను ఒకటి గమనించాను. వాడికి అమ్మాయిల పిచ్చి చాలా ఉంది. ప్రతి రోజు రాత్రి వాడి గదికి అమ్మాయిలను పిలిపించుకోవడం నేను చూసాను. అదేమైనా మనకు ఉపయోగపడుతుంది అంటారా "
అ మాట వినగానే రూహి ఆలోచనలో పడిపోయింది. చాంగ్ కి అమ్మాయిలంటే ఇష్టమని మొదటి రోజే తనకు తెలుసు. ఎందుకంటే రెండు మూడు సార్లు తనని తినేసేలా చూసాడు. కానీ తను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అయాన్ చెప్తుంటే, ఈ ఆపరేషన్ గురించి తెలుసుకోవడానికి అదొక్కటే దారి అనిపించింది.
"సరే అయాన్.. ఒక పని చెయ్. రేపు మనం వర్క్ చేయడానికి ల్యాబ్ కి వెళ్తాం కద. అక్కడ వీలైతే ఎలాగోలా కొంచెం క్లోరొఫారం సంపాదించు. నేను ఈలోగా ఆ చాంగ్ ని ముగ్గులోకి దింపుతాను. వాడి గదికి వెళ్తాను. ఎలాగోలా మనకు కావాల్సిన వాటిని సంపాదిస్తాను. రేపు రాత్రికే వాడికి ముహూర్తం పెట్టాలి. మన దగ్గర అస్సలు సమయం లేదు."
"మేడమ్ మీరు చెప్తుంది చాలా ప్రమాదకరం. ఏ మాత్రం తేడా వచ్చినా..." అంటూ అయాన్ ఆగిపోయాడు.
"మహా అంటే ఏమవుతుంది. వాడు నన్ను అనుభవిస్తాడు. లేదా నా ప్రాణం తీస్తాడు. ఈ రెండిటిలో ఏది జరిగినా నాకు బాధ లేదు. దేశం కోసం ఆయుధం పట్టాను. కానీ ఇప్పుడు అదే దేశం కోసం నా దేహాన్ని ఓ ఆయుధం లా మార్చుకోబోతున్నాను. మన దేశం ముందు నా దేహం ఎక్కువ కాదు. ఓ కుక్క నా మీద చెయ్యి వేస్తె నేను మలినం అయిపోను కద. ఆ మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా విహారిస్తున్నంత కాలం ఈ రూహి వాసుదేవ్ ఊపిరి ఆడుతూనే ఉంటుంది." అని స్పష్టంగా పలికింది.
అయాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. దేశం కోసం ఒక అమ్మాయి అత్యంత ముఖ్యమైనది గా భావించే శీలం సైతం తృణ పాయంగా వదులుకోడానికి సిద్ద పడిన రూహి ని చూసి గర్వం తో తన గుండె మొత్తం నిండిపోయింది. అలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు తన మీద తనకే గౌరవం పెరిగింది.
వీరు ఇలా నిలబడి ఉండగానే... వారి గది బయట ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం అయ్యింది. ఇప్పుడు ఆ గదిలో అయాన్ ని చూస్తే అంతే సంగతులు. అయాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. రూహి వెంటనే అయాన్ ని మంచం మీదకు లాగి, ఇద్దరికి కలిపి దుప్పటి కప్పింది. బయట నుంచి చూస్తే ఒకరే పడుకున్నట్టు ఉంది.
ఊహించని ఆ చర్యకు అయాన్ కాసేపు షాక్ అయ్యాడు. కానీ కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఓ చైనా సైనికుడు ఆ గదిలోకి ఒకసారి తొంగి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అయాన్, రూహి మాత్రం అలాగే ఉన్నారు. రూహి పడుకొని ఉంటే, తన మీద అయాన్ ఉన్నాడు. వారి ఇద్దరి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే. అయాన్ అంత దగ్గరగా ఉండటం తో జీవితంలో అప్పటిదాకా తెలియని సిగ్గు రూహి దరి చేరింది. తన బుగ్గలు మందారం లాగా ఎర్రగా కందిపోయాయి. కనురెప్పలు క్షణానికి ఓ సారి మూసుకుంటున్నాయి. ఇక అధరాలు అదే పనిగా వణికిపోతున్నాయి. అయాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఆ ఏసీ గదిలో కూడా ఇద్దరికి చమటలు పట్టాయి. ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉండిపోయారు. వారి మధ్య చేరిన దూరం కూడా మెల్లగా కరిగిపోయింది. అయాన్ అలాగే ముందుకు జరిగాడు. రూహి గుండె వేగం పెరిగింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది.
రూహి ఆ తీయని అలజడి భరించలేక కళ్ళు మూసుకుంది. అయాన్ అలాగే ముందుకు జరిగి రూహి నుదుటి మీద ఓ ముద్దు పెట్టాడు. రూహి కి దక్కిన మొదటి ముద్దు అది. ఎందుకో తెలీదు తన మనసంతా గాల్లో తేలినట్టు అనిపించింది. కొన్ని క్షణాలు ఇద్దరూ కదలకుండా అలాగే ఉండిపోయారు. కాసేపటికి తేరుకొని అయాన్ ముందుగా పైకి లేచి నిలబడ్డాడు.
రూహి సిగ్గు పడుతూ అలాగే కూర్చుంది. అయాన్ వైపు కూడా చూడలేకపోతుంది.
ఇంతలో అయాన్ మెల్లగా నోరు తెరిచాడు.
"మేడమ్... రేపు ఆ చాంగ్ మీద చేయబోయే సాహసం విజయవంతం అయ్యాక మీకొక విషయం చెప్తాను. ఎన్నో రోజులుగా నాలోనే దాచుకున్న సంగతి అది. రేపు మీ ముందు పరుస్తాను. వెళ్ళొస్తాను మేడమ్ " అని పలికి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
రూహి తననే చూస్తూ ఉండిపోయింది. తన మనసులో రేపు అయాన్ ఏం చెప్తాడో బాగా తెలుసు. ఆ మాట వినే క్షణం కోసం మది ఇప్పటి నుంచే తెగ మురిసిపోయింది. జీవితంలో ఇదివరకు ఎన్నడూ తెలియని హాయి అది. ఎలా మదిని ఆపాలో తెలియక రూహి ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
అలా రేపటి గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.
-----------------------------------------------------------
హైదరాబాద్...
"అరేయ్ ఏమంటున్నార్రా... నలుగురు రౌడీలు వెళ్లి ఒక్క ఆడ పిల్లను చంపలేక, దాని చేతిలో చావు తప్పించుకొని వచ్చారా?" అంటూ జలంధర్ కోపంగా అరిచాడు.
"అన్నా.. తను ఆడపిల్ల కాదు. ఆడ పులి లాగా ఉంది. మేము ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు తన కళ్ళలోకి చూడాలి. అసలు భయమన్నదే లేదు. పైగా తెగించి బరిలోకి దిగిన సైనికుడి లాగా నుంచుంది. నా చిన్నప్పుడు రుద్రమదేవి పరాక్రమం గురించి చదివినా, కానీ మొదటి సారి రాత్రే చూసినా..." అంటూ భయపడుతూ ఓ రౌడీ చెప్పాడు.
"అంత ధైర్యవంతురాలా తను... అయితే ఆ ధైర్యం నేను కూడా తప్పకుండా చూడాల్సిందే. కానీ దాన్ని చంపే ముందు ఒక్కసారి తనివితీరా కోరిక తీర్చుకొని చంపాలని ఉంది. అలాంటి ఆడదాన్ని అనుభవిస్తేనే మజా.."
"అన్న... ఆ సుజిత దాని ఇంట్లో ఉన్నంతవరకు మనం ఏమి చేయలేము. అది కాక ఇప్పుడు తనకు మనం మళ్ళీ వస్తామని బాగా తెలుసు. తప్పకుండా తన జాగ్రత్త లో తను ఉండే ఉంటుంది. తొందరపడి అక్కడికి వెళ్తే అందరం దొరికిపోతాం"
"నువ్వు చెప్పింది నిజమే. సరే ఒక పని చేయండి. ఎవరైనా కొత్త కుర్రాడికి చెప్పి తన కదలికల మీద నిత్యం ఓ కన్ను వేసి ఉంచమని చెప్పు. సరైన సమయం దొరకగానే ఎత్తుకొని మన స్తావరానికి వచ్చేయండి. దానికి మన సత్తా ఏంటో చూపిద్దాం." అంటూ జలంధర్ పళ్ళు కొరుకుతూ పలికాడు.
"సరే అన్న.. " అంటూ ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జలంధర్ ఆలోచనలో పడిపోయాడు. సుజిత మీద కోపం ఎక్కువగా ఉంది. తనకు అప్పజెప్పిన పని ఆగిపోవడం అంటూ ఉండదు, అలాంటిది మొదటిసారి సుజిత మూలంగా జరగకపోవడం తో పట్టరాని కోపం కలిగింది. తనని ఎత్తుకొని వచ్చాక నరకం చూపించి మరీ చంపాలి అని కసిగా అనుకున్నాడు.
" . ఏజెంట్ రూహి వాసుదేవ్...12 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,184 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,964
Joined: Jun 2019
Reputation:
2
Patriotic, action oriented story
Posts: 1,640
Threads: 2
Likes Received: 976 in 752 posts
Likes Given: 2,206
Joined: May 2019
Reputation:
11
(17-05-2026, 10:35 AM)Sunny73 Wrote: Patriotic, action oriented story
Dhurandhar.. ye moolaki deeni meeda?
writer evaro kaani.. iragadeestunnaru!!
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
. ఏజెంట్ రూహి వాసుదేవ్...13
రూహి, అయాన్ చైనా వారి స్థావరానికి వెళ్ళిపోయాక వంశీ, పార్వతి ఓ వ్యాన్ లోనే ఉంటున్నారు. రూహి చేతికి ఉన్న ఉంగరం ద్వారా తను ఎక్కడున్నది ఎప్పటికప్పుడు తమకు తెలుస్తూనే ఉంది. కాబట్టి వీరు కూడా ఆ స్థావరానికి కాస్త దూరం లో మాటు వేసి ఉన్నారు. లోపల ఏమైందో, రూహి ఎలా ఉందో అనే టెన్షన్ వారిలో చాలా ఉంది. కానీ వారికి అప్పజెప్పిన పని సక్రమంగా చేయాలని కంటికి రెప్పలా ఆ చైనా సైనికుల మీద ఓ కన్ను వేసి ఉంచారు.
అప్పుడే వారికి మరో విషయం తెలిసింది. చైనా అధ్యక్షుడు ఆగష్టు 15 వ తేది న మన భారతదేశాన్ని సందర్శించడానికి వస్తున్నాడు అని. అదే రోజున చైనా వారు మన దేశం మీద దాడి ప్లాన్ చేసారు. అలాంటి సమయం లో అదే రోజు అతను ఇండియా రావడం అనేది ఎందుకో వారికి అసలు అర్థం కాలేదు. వెంటనే ఈ సమాచారం రూహి కి చేర వేయాలి అనుకున్నారు. కానీ రూహి వెళ్లే ముందే చెప్పింది. నేను చెప్పేదాకా నన్ను కలవడం కోసం ఎలాంటి పని చేయకండి అని. అందుకే వీరు రూహి నుంచి వచ్చే కాల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
సరిగ్గా అదే సమయం లో... ఒక వ్యక్తి పార్వతి, వంశీ లని రహస్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు. బ్లాక్ కోబ్రా బృందం నార్త్ కొరియా లో అడుగు పెట్టిన సమయం నుంచి వీరిని వెంబడిస్తూ ఉన్న వాడు. అతని చూపుల వెనుక ఉన్న మర్మం ఏంటో ఇంకా అంతుచిక్కలేదు.
------------------------------------------------------------
చాంగ్ లీ... చైనా సైన్యాధ్యక్షుడు. పనిలో చాలా క్రూరంగా ఉంటాడు. ఎంతలా అంటే ఏదైనా చిన్న అనుమానం వచ్చినా సరే వారి కళ్ళ ముందే కాళ్ళు, చేతులు, ఆ తరువాత ఒక్కో భాగం నరకుతూ నరకం చూపించి మరీ చంపుతాడు. ప్రాణాలు తీయడం అంటే చాలా సరదా.. అసలు తన ఉద్దేశం లో మనిషి ప్రాణానికి విలువ అంటూ ఉండదు. అతని చుట్టు పక్కల వారు అందరూ అతనిని ముద్దుగా రక్త పిశాచి అని అంటూ ఉంటారు.
అంతటి క్రూరమైన వాడు కాబట్టే, చైనా భారతదేశం మీద చేయబోతున్న ఈ ఉగ్ర దాడి కి అధికారి గా అతనిని నియమించారు. అతడి కనుసన్నల్లో గాలి కూడా అనుమతి లేకుండా లోపలకి రాదు. మొత్తం ఆ పథకానికి సంబంధించిన వివరాలు అన్ని ఓ రహస్య గదిలో దాచాడు. దానిని తెరిచే కీ, మరియు ఫింగర్ ప్రింట్ మాత్రం తన దగ్గరే ఉన్నాయి.
ప్రతి బలవంతుడి పరదా వెనుకా ఎవరికీ తెలియకుండా దాచుకోవాలనుకునే ఓ బలహీనత ఉంటుంది. అలాగే చాంగ్ లీ కి కూడా ఓ బలహీనత ఉంది. అదే అమ్మాయిలు...
అమ్మాయిలు అంటే పిచ్చి. రోజుకొకరు కావాలి అనుకుంటాడు. ఇప్పుడు ఆ బలహీనతనే తన బలంగా చేసుకోవాలి అని రూహి వాసుదేవ్ అనుకుంది.
అనుకున్నదే తడువుగా ఆ రోజు వీరు పని చేస్తున్న సమయంలో చాంగ్ లీ అక్కడికి వస్తే, కావాలనే ఏదో వంక తో తనని తాకుతుంది. కన్ను గీటుతూ, పెదవి మీటుతూ రెచ్చగొట్టింది. కానీ చాంగ్ లీ మాత్రం రూహి ని చూసి చూడనట్టు ఉంటున్నాడు. రూహి రోజంతా వాడి చూపు తన మీద తిప్పుకునే పనిలోనే పడింది.
అదే సమయం లో రూహి చెప్పినట్టుగానే అయాన్, ఎవరూ గమనించకుండా ల్యాబ్ లో నుంచి క్లోరోఫారం ఒక చిన్న గాజు సీసా లో తీసుకొని జేబులో దాచుకున్నాడు.
చూస్తూ ఉండగానే సూర్య కిరణాలు పడమర దిక్కును ముద్దు పెడుతూ తన ఒళ్ళో జారిపోవడం మొదలైంది.
అప్పటికే చాంగ్ లీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చాంగ్ లీ తప్పక తన వలలో పడతాడు అని రూహి లో మాత్రం నమ్మకం అలాగే ఉంది.
సాయంత్రం అవడం తో అప్పటిదాకా పని చేసిన అందరినీ కూడా తమ పని అయిపోయాక వారి వారి గదులకు వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ అక్కడే ఓ సమస్య ఉంది.
ఆ ల్యాబ్ వదిలి వెళ్లే ముందు అక్కడ చైనా సైనికులు ఒక్కొక్కరిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. వారి కళ్ళు గప్పి ఏ వస్తువు కూడా బయటకు తీసుకొని వెళ్లలేము. అది చూడగానే అయాన్ గుండె వేగం పెరిగిపోయింది. తన జేబులో ఉన్న క్లోరొఫారం బాటిల్ వారికి దొరికిపోతుందేమో అని భయమేసింది. తన ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. తనకు ఏదో అవుతుంది అనే భయం కంటే మేడమ్ చెప్పిన పని చేయలేకపోతున్నాను అనే భయమే ఎక్కువగా ఉంది.
సరిగ్గా అప్పుడే తన ముందుకు రూహి వచ్చి నుంచుంది. అయాన్ దగ్గర నుంచి ఆ బాటిల్ తను తీసుకుంది. అయాన్ ఊపిరి బిగబట్టి ఇప్పుడు రూహి దాన్ని ఎలా ఆ గది దాటిస్తుందా అని చూస్తున్నాడు. ఇంతలో రూహి ఇప్పుడే వస్తాను అంటూ ఆ ల్యాబ్ లో ఉన్న బాత్రూం లోకి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వెంట తీసుకొని వెళ్ళింది.
అప్పటికే ఆ చిన్న సీసా ను ఎలా తీసుకొని వెళ్లాలో రూహి మది లో ఓ ప్లాన్ ఉంది. ఒక్కసారి ఊపిరి బిగబట్టింది.
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉన్న కత్తెర తీసుకొని తోడ దగ్గర చిన్నగా కోసింది. ఎర్రని రక్తం చిమ్మింది. పంటి బిగువున ఆ నొప్పిని ఓర్చుకుంది. ఆ సీసా పట్టేంత కోసి, ఆ తరువాత ఆ సీసా ను తన తోడ లోపలకు తోసింది. అలా చేస్తుంటే తన ప్రాణం పోయినంత నొప్పి కలుగుతుంది. తన గుండెల్లో ఎలాగైనా సరే మన భారత దేశాన్ని గెలిపించాలి అని రగులుతున్న జ్వాల ముందు ఆ నొప్పి చాలా చిన్నగా అనిపించింది.
ఇంతలో రక్తం కారడం ఎక్కువ అయ్యింది. వెంటనే తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో ఆ కోసిన దగ్గర కుట్లు వేసుకొని రక్తం కారకుండా మొత్తం బ్యాండేజ్ తో కట్టు కట్టుకుంది. RAW ఏజెంట్ గా శిక్షణ ఇచ్చే సమయం లో ఇలా శరీరంలో దాచి ముఖ్యమైన వివరాలు ఎలా తీసుకెళ్ల వచ్చో శిక్షణ ఇచ్చారు. అది తనకు ఇప్పుడు ఉపయోగపడింది.
తరువాత నిదానంగా బయటకు వచ్చింది. నడవడానికి చాలా చాలా నొప్పిగా ఉంది. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని మామూలుగా నడవడానికి ప్రయత్నిస్తుంది. అడుగు ముందుకు వేసిన ప్రతి సారి గుండెల్లోకి ఓ కత్తి దిగినంత నొప్పిగా ఉంది. కానీ పిడికిలి బిగించి ఓర్చుకుంటుంది. మెల్లగా ల్యాబ్ దాటి బయటకు వెళ్లాలని అటు వైపు నడిచింది. తన వెనుక అయాన్ కూడా బయటకు నడిచాడు.
చైనా సైనికుడు రూహి ని చెక్ చేస్తున్నాడు. తన చేతులతో అక్కడక్కడా కావాలనే తడుతూ చెక్ చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న డిటెక్టర్ ని ఉపయోగించి కూడా చెక్ చేస్తున్నాడు. కానీ రూహి ఆ గాజు సీసా ని తన శరీరం లోపల దాచడం తో అది కూడా కనిపెట్టలేకపోయింది. తరువాత తనని తన గదిలోకి వెళ్ళమని ఆదేశించాడు.
అయాన్ కి ఏమి అర్థం కాలేదు. రూహి ఆ సీసా ని ఎలా తీసుకొని వెళ్ళింది అని. తన చూపు... అప్పటిదాకా రూహి నిలబడి ఉన్న చోటు మీద పడింది. అక్కడ ఎర్రని రక్తం....
అది చూడగానే షాక్ అయ్యాడు. రూహి చేసిన పని అర్థమై కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేశం కోసం తను పడుతున్న తపన చూసి గుండె మొత్తం గర్వం తో నిండిపోయింది. కానీ ఇప్పుడు ఆ రక్తం చూస్తే ఆ చైనా సైనికుడి కి అనుమానం రావచ్చు. వాడు అటు వైపు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏ క్షణమైనా చూడచ్చు.. ఎలా ఆ ప్రమాదం ఆపాలా అని ఆలోచించాడు.
అప్పుడే తన పక్కన ఓ గాజు గ్లాస్ కనిపించింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన వచ్చింది. వెంటనే కళ్ళు తిరిగినట్టు నటిస్తూ ఆ గ్లాస్ మీద పడ్డాడు. గ్లాస్ పగిలింది, అలాగే అయాన్ ఒంటి మీద కూడా అక్కడక్కడా గాయాలు అయ్యి రక్తం కారింది. అది చూసి మిగతా సైనికులు వచ్చి అయాన్ ని పైకి లేపారు.
ఏమైంది అని అడిగితే కళ్ళు తిరిగాయి అని అబద్దం చెప్పాడు. ఇద్దరూ సైనికులు తనని పట్టుకొని నడిపించుకుంటూతన గదికి తీసుకొని వెళ్లారు. ఇందాక అక్కడ పడిన రక్తం కూడా అయాన్ దే అని అనుకోవడం తో వారికి రూహి మీద అనుమానం రాలేదు.
ఇంకో వైపు... రూహి గదిలోకి రాగానే తన తోడ దగ్గర వేసిన కుట్లు విప్పేసి సీసా బయటకు తీసి, తన గదిలో దాచేసింది. అక్కడ రక్తం ఏరులై పారుతుంది. ప్రాణం పోతున్నట్టు ఉంది. భరించలేని నొప్పి తనలో కలిగింది. నోట్లో తన చొక్కా కుక్కుకొని పెద్దగా అరిచి మౌనంగా ఓర్చుకుంది. కానీ తొందరగా ఆ కాలికి చికిత్స చేయకపోతే చాలా ప్రమాదమని తనకు బాగా తెలుసు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తను ఉన్న గదిలో ఓ మంచం ఉంది. ఆ మంచానికి ఒక మూల కొంచెం పదునుగా ఉంది. దానికి తన కాలి నుంచి కారే రక్తం కొంచెం రాసి, ఆ తరువాత తన గదిలో ఉన్న అలారం గట్టిగా నొక్కింది.
అలా నొక్కితే చైనా సైనికులు వస్తారు. ఇప్పుడు కూడా ఒక నలుగురు పరుగున వచ్చారు. గదిలోకి రాగానే రక్తపు మడుగులో పడి ఉన్న రూహి కనిపించింది. తన కాలి నుంచి రక్తం కారుతూనే ఉంది
ఏమైంది అని వారు కంగారుగా అడిగారు. మంచం చివర కాలికి తగిలి కోసుకుంది అని అబద్దం చెప్పింది. వారు అక్కడ చూసి తను చెప్పింది నిజమని నమ్మారు. తరువాత తనని ఎత్తుకొని ఆ స్థావరం లోనే ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. ఆయన వెంటనే తన కాలికి చికిత్స చేసి, కుట్లు వేసాడు. అలాగే రక్తం బాగా పోవడం తో వేరే రక్తం కూడా ఎక్కించాడు. రూహి కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. ప్రాణం పోయేంత నొప్పి తనలో ఉన్నా సరే తన మోహం లో మాత్రం తనకు కావలసింది సంపాదించాను అనే ఆనందం కలిగింది.
భారతదేశాన్ని కాపాడటం కోసం మరో అడుగు ముందుకు వేసాను అనే తృప్తి తో మెల్లగా నిద్రలోకి జారుకుంది.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...14
రూహి వాసుదేవ్ కు మెలుకవ వచ్చే సమయానికి మిగతా బృందం అంతా అప్పటికే ల్యాబ్ కి వెళ్లిపోయారు. కళ్ళు తెరిచి చూస్తే, డాక్టర్ దగ్గర కాకుండా తన గదిలో పడుకొని ఉంది. వెంటనే తన మంచం కింద ప్రాణాలకు తెగించి సంపాదించి దాచిన క్లోరో ఫారం సీసా ఉందా లేదా అని వెతికింది. అది కనిపించడం తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
లేచి ఒక్కసారి తన కాళ్ళు వైపు చూసుకుంది. తోడ దగ్గర చాలా నొప్పిగా ఉంది. కానీ రాత్రి తో పోలిస్తే చాలా నయం. ఇలాంటి గాయాలు తనకు సాధారణమే. ఒక సైనికురాలి గా ప్రమాణం చేసిన రోజే ఇలాంటి వాటికి సిద్దపడి వచ్చింది. కాబట్టి ఆ నొప్పి తనను ఎక్కువగా బాధించలేదు. పంటి బిగువున భరిస్తూ లేచి సిద్దమైంది.
అలాగే మెల్లగా ల్యాబ్ వైపు అడుగులు వేసింది. అప్పటికే అక్కడ మిగతా వారు పని చేస్తూ కనిపించారు. రూహి కూడా తన పనిలోకి దిగింది. రూహి ని చూడగానే అయాన్ ఒక్కసారి చుట్టూ చూసాడు, ఎవరూ తనని గమనించడం లేదు అని తెలిసి వేగంగా తన వైపు వచ్చాడు.
"ఎలా ఉంది మేడమ్ మీకు?" అని అడిగాడు.
"పర్లేదు ఇప్పుడు." అంటూ రూహి తనకు సమాధానం ఇచ్చింది.
"ఎందుకని మేడమ్ మీరు ఇలాంటి పని చేసారు. మీకు ఏమైనా అయితే. అయినా ఎవరైనా శరీరం కోసి తీసుకొని వెళ్తారా?" అంటూ కళ్ళ నీళ్లతో అడిగాడు.
"కొందరికి డబ్బంటే పిచ్చి, మరికొందరికి వస్తువుల మీద పిచ్చి ఉంటుంది. నాకు మాత్రం మన దేశం అంటే పిచ్చి... శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడటం కోసం నా గుండె చప్పుడు ఆగిపోయే చివరి క్షణం దాకా పాటు పడుతూనే ఉంటాను. దాని కోసం అవసరం అయితే నా గుండె నే చీల్చమని చెప్పినా ఆనందంగా ఇచ్చేస్తాను అయాన్."
రూహి మాటలకు అయాన్ కళ్ళలో నీళ్లు మరింతగా తిరిగాయి.
"మీలాంటి గొప్ప సైనికురాలి తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడమ్. ఇండియా లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది " అంటూ రూహి చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా నిమిరాడు.
రూహి లో అప్పటిదాకా ఉన్న నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. మనసుకు నచ్చిన వారి స్పర్శ క్షణకాలమైనా సరే, నొప్పించే ఎంతటి భాదైనా అదే క్షణం లో తుడిచేయదా...
ఇద్దరూ అలాగే నుంచున్నారు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. కాలం సమాధానం చెప్పని ఎన్నో ప్రశ్నలకు ఇరువురి కళ్ళలో జవాబులు దొరికాయి. మాటల్లో చెప్పలేని ఊసులు ఎన్నో ఆ మౌనం లో ఒకరి మది మరొకరి మది తో పంచుకుంది.
వారు అలా ఉండగానే ఆ ల్యాబ్ లో ఉన్న సైనికులు సెల్యూట్ చేసిన శబ్దం వినిపించింది. ఇద్దరూ టక్కున తల తిప్పి చూసారు. ఆ ల్యాబ్ లోకి చాంగ్ లీ వస్తూ కనిపించాడు. తనని చూడగానే రూహి అయాన్ ని దూరంగా వెళ్ళమని సైగ చేసింది. అయాన్ అలాగే వెళ్ళాడు.
రూహి కి బాగా తెలుసు.. ఆ చాంగ్ లీ తప్పకుండా తన కోసం వస్తాడని. ఎందుకంటే నిన్న తను వాడిని కావాలనే రెచ్చగొట్టింది. తన ఊహను నిజం చేస్తూ చాంగ్ లీ రూహి దగ్గరకు వచ్చాడు.
రూహి వాడి వైపు చూస్తూ కొంటెగా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే... అలాగే చాంగ్ లీ కూడా అయ్యాడు.
"నిన్న రాత్రి నీ కాలికి ఏదో దెబ్బ తగిలింది అంట కదా..." అని గంబీరమైన గొంతు తో అడిగాడు.
"అవును. మంచం చివర పదునుగా ఇనుప చువ్వ ఉంది, అది చూసుకోలేదు."
"మరి ఆ నొప్పితో కూడా ల్యాబ్ కి ఎందుకు వచ్చావ్ "
"ల్యాబ్ కి వస్తేనే కదా మరి మిమ్మల్ని చూడగలం." అంటూ రూహి తన కళ్ళలోకి చూస్తూ మత్తుగా పలికింది.
ఆ మాటకు చాంగ్ లీ మోహం లో కూడా ఓ చిరునవ్వు వచ్చింది.
"నేనంటే అంత ఇష్టమా " అని ప్రశ్నించాడు.
"నా కళ్ళలో కనపడటం లేదా?" రూహి ఎదురు ప్రశ్నించింది.
"అయితే ఈ రాత్రికి కలుద్దాం. నీ ఇష్టం ఎంతుందో చూస్తాను." అంటూ కన్ను కొట్టాడు.
రూహి సిగ్గు పడింది. చాంగ్ లీ తనని చూస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూహి వాడు వెళ్లిన వైపే చూస్తూ...
'ఈ రాత్రికి నా ఇష్టం కాదు, నా సత్తా చూపిస్తాను' అని మనసులోనే అనుకుంది.
తను వెళ్ళిపోయాక ఆ రాత్రి ఏమి చేయాలో మనసులోనే ఓ పథకం వేసుకుంది. తరువాత అయాన్ కలిసి తను ఏం చేయాలో కూడా అర్థమయ్యేలా చెప్పింది.
"చాలా పెద్ద సాహసమే చేస్తున్నారు. జాగ్రత్త మేడమ్."
"ప్రాణాలతో తిరిగొస్తే మన మువ్వన్నెల జెండా ఎగరేస్తాను, అక్కడే మరణిస్తే ఎగిరే ప్రతి జెండాలో నిండి ఉంటాను. అంతే తేడా..." అంటూ రూహి ముందుకు కదిలింది. ఆ క్షణం మన దేశానికి ఓ రూపం ఉంటే కచ్చితంగా రూహి ప్రేమను చూసి మనసారా తనని తన గుండెలకు హత్తుకునేదేమో...
---------------------------------------------------------------
అదే రోజు రాత్రి....
రూహి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చీకటి పడిన తరువాత రూహి ని తన గది కి తీసుకొని రమ్మని చైనా సైనికులకు చాంగ్ లీ ఆదేశించాడు. దేశం కోసం తన దేహం సైతం తృణ పాయంగా వదులుకోడానికి రూహి ముందుకు కదిలింది. చాంగ్ లీ ని మురిపించి మైమరిపించి తన పనిని సాధించడం కోసం రూహి ఈరోజు చీర
కట్టుకుంది. అప్పటికే తన గదిలో చాలా జాగ్రత్తగా దాచిన క్లోరో ఫారం బయటకు తీసి తన చీర కొంగులో దాచుకుంది. ఈరోజు ఎలాగైనా వాడికి మత్తు ఇచ్చి తనకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలని దృడంగా నిశ్చయించుకుంది.
తన ఆలోచనలు ఇలా ఉండగానే చాంగ్ లీ గది దగ్గరకు చేరుకుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు. వారి వాలకం చూడగానే రూహి కి ఒక అనుమానం వచ్చింది. తప్పకుండా వారు తనని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తరువాతే లోపలకు పంపిస్తారు అని అర్థమైంది. అదే జరిగితే తను తెచ్చిన క్లోరో ఫారం వారికి దొరికిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు తను ఇన్ని రోజులు పడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది. అందుకే ఏం చేయాలా అని ఆలోచించింది. చివరకు ఒక ఆలోచన వచ్చింది.
తను ఆ గదిలోకి వెళ్లకుండా ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కనే ఉన్న వాష్ రూమ్ లోకి వెళ్ళింది. కొద్ది సేపటి తరువాత బయటకు వచ్చింది. తిరిగి చాంగ్ లీ గది వైపు అడుగులు వేసింది. తను ఊహించినట్టుగానే మొదట తనని ఓ గది లోకి తీసుకొని వెళ్లారు. అక్కడ అమ్మాయిలు తనని క్షుణ్ణంగా చెక్ చేసారు. రూహి దగ్గర ఏమి దొరకకపోయే సరికి అప్పుడు తనని చాంగ్ లీ గది లోకి పంపించారు.
లోపలకు అడుగు పెట్టగానే గుప్పుమంటూ సిగరెట్ పొగ, మందు వాసన రూహి ని చేరింది. ఆ వాసనకే తన కడుపులో తిప్పినట్టు అయ్యింది. తట్టుకొని నిలబడి కాసేపటికి తేరుకుంది.
ఒక్కసారి చుట్టూ చూసింది. తనకు కాస్త దూరం లో చాంగ్ లీ ఒక సోఫా లో కూర్చొని ఉన్నాడు. తన నోట్లో సిగార్ పైప్ ఉంది. ఎదురుగా టేబుల్ మీద మందు గ్లాస్ కనిపించింది. తన కోసమే ఎదురుచూస్తున్నాడు అని తన కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా రూహి ని చీర లో చూడగానే చాంగ్ లీ మోహం లో ఓ వెలుగు వచ్చి చేరింది. తనని చూసి మైమరచిపోయాడు.
"డార్లింగ్ ఇక్కడికి రా... " అని పిలిచాడు.
కోపం తో రూహి పిడికిలి బిగుసుకుంది. కానీ బలవంతంగా ఆపుకుంది. అక్కడ వాడిని ఒక్క దెబ్బతో మట్టి కరిపించగలదు. కానీ ఆ గది లో అన్ని చోట్లా కెమెరా లు ఉన్నాయి. ఆ కెమెరాలో కనిపించే దృశ్యాన్ని ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆ గదిలో ఒక చిన్న పెనుగులాట జరిగినా సరే మొత్తం సైనికులకు సందేశం పంపిస్తుంది. అప్పుడు తను దొరికిపోతుంది. కానీ ఆ నిఘా వ్యవస్థ ను ఆఫ్ చేసే స్విచ్ చాంగ్ లీ దగ్గర మాత్రమే ఉంటుంది. తను వచ్చిన పని పూర్తి అయ్యేదాకా అక్కడ చాలా ఆచి తూచి అడుగులు వేయాలి అనుకుంది. అందుకే పట్టరాని కోపం వచ్చినా నవ్వుతూ తన దగ్గరకు నడిచింది.
"ఇక్కడ కూర్చో అంటూ..." తన పక్కన చూపించాడు.
రూహి రాని నవ్వును తెచ్చుకుంటూ అలాగే కూర్చుంది.
చాంగ్ లీ వెంటనే రూహి బుగ్గ మీద ముద్దు పెట్టుకోడానికి వచ్చాడు.
"అప్పుడే నా.. కాసేపు ఆగండి " అంటూ రూహి నవ్వుతూ తనని దూరంగా తోసింది.
తరువాత ఎదురుగా ఉన్న మందు ను గ్లాస్ లో పోసి వయ్యారంగా అందించింది. వాడు కళ్ళతోనే రూహి ని తింటూ, గడ గడ మంటూ తాగేసాడు.
అప్పుడే రూహి చూపు ఎదురుగా గోడ మీద పడింది. ఆ గోడ కు భారతదేశ చిత్రపటం, మరియు జెండా తగిలించి ఉన్నాయి. వాటి మీద కత్తులతో గుచ్చి ఉన్నాయి. దాన్ని చూడగానే రూహి రక్తం మరిగిపోయింది. తనకు వస్తున్న కోపానికి ఆ చాంగ్ లీ తల కాయ ను ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది. కానీ నిస్సహాయ స్థితి లో ఆగిపోయింది.
ఇంతలో చాంగ్ లీ, రూహి ఆ గోడ వంక చూడటం చూసాడు.
"ఏంటి అది చూస్తున్నావా.. అదే మనం చేయబోయే ఆపరేషన్. చరిత్ర ఇంతకు ముందు చూడని ఘోరమైన విధ్వంసం అది. మరో నాలుగు రోజుల్లో భారతదేశం మొత్తం ఉలిక్కి పడుతుంది. చైనా పేరు చెప్తేనే భారతీయులు అందరూ ఉలిక్కిపడతారు." అంటూ చాంగ్ లీ నవ్వుతూ పలికాడు.
'ఎవరు ఎవరి పేరు చెప్తే బయపడతారో తొందర్లో నువ్వే చూస్తావ్ రా... నేను ఉండగా నా దేశం లో మొలచిన గడ్డి పోచ కు కూడా హాని రానివ్వను. నీలాంటి తీవ్రవాదుల గుండెల మీద నా దేశపు మువ్వన్నెల జెండా ను సగర్వంగా ఎగరేస్తాను.' అంటూ రూహి మనసులోనే అనుకుంది.
"అయినా పడక గదిలో సుఖాలకు తప్ప పదాలకు చోటు ఇవ్వకూడదు. నీ అందం నన్ను పిచ్చి ఎక్కిస్తుంది. ఈ రాత్రికి నా దాహం తీర్చుదువు రా." అంటూ రూహి ని లాగి మంచం మీదకు విసిరేసాడు.
తరువాత చాంగ్ లీ తను వేసుకున్న చొక్కా విప్పాడు. రూహి చూపు వాడి మెడలో వేసుకున్న ఓ చైన్ మీద పడింది. ఆ చైన్ లో చిన్న బటన్ లాంటిది కనిపించింది. ఈ నిఘా వ్యవస్థ ఆపే స్విచ్ అదే అని తనకు అర్థమైంది. కానీ తొందరపడి తప్పు చేయకూడదు, తెలివిగా పని పూర్తి చేయాలని అనుకుంది.
ఇంతలో...
"నువ్వు కూడా త్వరగా బట్టలు విప్పు..." అంటూ చాంగ్ లీ రూహి ని ఆదేశించాడు.
"అదేదో మీరే చేయచ్చు కదా..." అంటూ రూహి వయ్యారంగా బదులు ఇచ్చింది.
ఆ మాటకు చాంగ్ లీ మనసు లో ఆనందం ఉరకలు వేసింది. రూహి దగ్గరగా చేరుకున్నాడు. రూహి సిగ్గు పడుతూ మెలికలు తిరిగింది. వాడి కళ్ళలో కామం కదలాడింది. అలాంటి సమయం కోసమే రూహి ఎదురుచూస్తుంది.
వాడికి దొరకకుండా దూరంగా జరిగి, తను చిన్నప్పుడు నేర్చుకున్న డాన్స్ వేయడం మొదలుపెట్టింది. నెమలి లాగా హొయలు ఓలుకుతూ తను చేసే నాట్యం చూసి చాంగ్ లి మైమరచి పోయాడు.
రూహి కళ్ళు మూసుకొని ఒక్కసారి తన గుండెల నిండా గాలి పీల్చుకుంది. తన కళ్ళ ముందు జాతియ జెండా కప్పుకొని సగర్వంగా భారతదేశ ఒడిలో నిద్రిస్తున్న ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ కనిపించాడు. నీ పేరు నిలబెడతాను, మన దేశాన్ని కాపాడుతాను నాన్న.. అంటూ మనసులోనే అనుకొని పాట పాడడానికి గొంతు విప్పింది.
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీతెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము."
చాంగ్ లీ కి ఆ పాట అర్థం తెలియదు. తెలిసి ఉంటే తన మోహం లో రంగులు వేరేలా ఉండేవేమో... కానీ అందంగా నాట్యమాడుతున్న రూహి ని చూస్తూ తనలో కోరికలు బుస కొట్టాయి.
చమట తో తడిచిన రూహి అందం చూసి చాంగ్ లి పిచ్చివాడు అయ్యాడు. ఆ క్షణం తను ఒక దేవ కన్య లాగా కనిపించింది.
"నీ రూపం చూస్తుంటే నాలో తెలియని కోరికలు రేపుతున్నాయి." అని మత్తుగా పలికాడు.
"నా రూపమే కాదు, నా నుంచి వచ్చే సువాసన కూడా అలాగే ఉంటుంది " అంటూ రూహి రెచ్చగొడుతూ పలికింది.
"నిజమా..." అంటూ చాంగ్ లీ అడుగు ముందుకు వేసాడు.
"కావాలంటే మీరే చూడండి..." అంటూ రూహి తన చీర కొంగు ను పక్కకు తీసేసింది.
రూహి ని అలా చూడగానే చాంగ్ లీ మతి పోయింది. మెల్లగా ముందుకు జరిగి, తనతో ఆ రాత్రి ని ఊహించుకుంటూ రూహి చీర కొంగును మొహానికి గట్టిగా హత్తుకొని గాలి పీల్చాడు.
తనకు తెలియని విషయం ఏంటంటే రూహి క్లోరొఫారం ఎలా లోపలకు తీసుకురావాలో బాగా ఆలోచించి దాన్ని తన చీర కొంగు మీద చల్లుకొని వచ్చింది. అది తెలియక దాన్ని పీల్చిన ఒక్క క్షణం తరువాత చాంగ్ లీ అలాగే రూహి మీద స్పృహ తప్పి పడిపోయాడు.
రూహి వెంటనే వాడి మెడలో ఉన్న స్విచ్ నొక్కింది. మొత్తం కెమెరాలు అన్ని ఆఫ్ అయ్యాయి. అప్పుడు రూహి మోహం లో ఓ నవ్వు వచ్చింది.
"ఈ ఏజెంట్ రూహి వాసుదేవ్ ఉండగా నా దేశం మీదకు రావాలని చూస్తే ఎలా వదులుతాను అనుకున్నావ్ రా కుక్క..." అంటూ వాడి చేతిని ముందుకు లాగి గుండెల మీద ఒక్క తన్ను తన్నింది.
చాంగ్ లీ ఎగిరి దూరంగా పడ్డాడు. రూహి ఉగ్ర రూపం చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే...
తన గుండె కోపం తో ఎగసి పడుతుంది. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. పిడికిలి బిగుసుకుంది.
ఆ క్షణం రూహి వాసుదేవ్ బరిలో దిగిన భద్రకాళి లాగా నిలబడింది.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...14 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,184 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,964
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,640
Threads: 2
Likes Received: 976 in 752 posts
Likes Given: 2,206
Joined: May 2019
Reputation:
11
sooper keka update.
Though a bit illogical, Roohi patriotism is next level!!!!
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...15
![[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]](https://static-assets.pratilipi.com/series/cover?seriesId=485271&version=e0736d03-46bd-484f-9de5-0ce122606d44)
చాంగ్ లీ మెల్లగా కళ్ళు తెరిచాడు. స్పృహలోకి వచ్చాక ఒక్కసారి చుట్టూ చూసి కాసేపు షాక్ అయ్యాడు. తన గదిలో తనే బందీగా కుర్చీలో కట్టేసి ఉన్నాడు. అలాగే తన మెడలో ఉండాల్సిన చైన్ కూడా లేదు. దాంతో అ గది నిఘా వ్యవస్థ ను కూడా ఆఫ్ చేసారు అని అర్థమైంది. అసలేం జరిగిందో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. గదిలోకి వచ్చిన రూహి అంద చందాలు చూసి మైమరచిపోతూ తన చీర కొంగు ను గట్టిగా మొహానికి అద్దుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో అసలు గుర్తులేదు.
తను ఇలా ఆలోచిస్తూ ఉండగానే
"దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందా..." అనే గొంతు వినిపించింది.
చాంగ్ లీ టక్కున తల తిప్పి కుడి వైపు చూసాడు. అక్కడ గోడకు తగిలించిన భారత జాతీయ పతాకం ముందు రూహి కూర్చొని ఉంది. తను ఆ జెండా మీద గుచ్చిన కత్తులు ఇప్పుడు రూహి చేతిలో ఉన్నాయి. అప్పుడు చాంగ్ లీ కి తానెవరో అర్థమైంది. ఇండియా నుంచి ఒక ఏజెంట్ ఇక్కడికి వచ్చింది అని తెలుసు. కానీ ఓ అమ్మాయి తన దాకా రాలేదు అని తనని అస్సలు పట్టించుకోలేదు. కానీ నేడు తన ఎదురుగా కూర్చుంది తనే అని తెలియగానే, తెలియకుండానే తనలో వణుకు పుట్టింది. నుదుటి మీద నుంచి చమటలు కారాయి.గుండెల్లో దడ మొదలయింది.
రూహి మెల్లగా తన వైపు అడుగులు వేసింది. వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ...
"నేనెవరో అర్థమైందా చాంగ్ లీ..."
"నా పటిష్టమైన సైన్యం దాటి నువ్వు ఇక్కడిదాకా వచ్చావా? ఇదంతా నేను నమ్మలేను " అని ఆశ్చర్యపోతూ అడిగాడు.
"సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకొని పోయి భద్రంగా అశోక వనం లో దాచాడు. తన చుట్టూ వందల మంది సైనికులు కాపలాగా ఉన్నారు. శత్రు దుర్బెధ్యమైన కోట కూడా తన సొంతం. అన్నిటికీ మించి రాముడికి సీత కు మధ్య ఓ పెద్ద సముద్రమే ఉంది. అయినా సరే సీతమ్మను కలవాలనే రాముడి ప్రేమ ముందు అవేవి ఆపలేకపోయాయి.
అలాగే నా మాతృ దేశాన్ని కాపాడాలనే నా ఆశయం ముందు నువ్వు, నీ సైన్యం నన్ను ఎప్పటికీ ఆపలేరు.
మన సంకల్పం ఎంత గొప్పదైతే మన అడ్డంకులు అంత చిన్నవి గా కనపడతాయి."
చాంగ్ లీ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. వాడు తేరుకునేలోగా రూహి ఆ గది లో ఉన్న మానిటర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఆ మొత్తం ఫ్యాక్టరీ లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూడచ్చు. వెంటనే తన దగ్గర ఉన్న రిమోట్ సాయం తో అయాన్ ఉన్న గదిలో లైట్ మూడు సార్లు ఆఫ్ చేసి ఆన్ చేసింది.
రూహి అక్కడికి వచ్చే ముందే అయాన్ కి అలాంటి సిగ్నల్ రాగానే తన పని మొదలుపెట్టమని చెప్పి వచ్చింది. రావాల్సిన సిగ్నల్ రాగానే అయాన్ మెల్లగా తన గది లో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ కాపలా గా ఇద్దరు చైనా సైనికులు తిరుగుతున్నారు. వారి మీద చాలా చాక చక్యంగా దాడి చేసి స్పృహ తప్పించి తన గదిలో బందించాడు. ఆ తరువాత వారి బట్టలు ధరించి చాంగ్ లీ గది వైపు అడుగులు వేసాడు.
రూహి అప్పటికే అక్కడున్న సైనికులను వేరే చోటుకు వెళ్ళమని చాంగ్ లీ సెల్ నుంచి సందేశం పంపించింది. అది చాంగ్ లీ నే చెప్పాడు ఏమో అనుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు అడ్డుగా ఎవరూ లేకపోవడం తో అయాన్ చాలా సులభంగా చాంగ్ లీ గది దాకా వచ్చాడు. రూహి వెంటనే తలుపు తెరిచి తనని లోపలకు రానిచ్చింది.
అయాన్ రూహి ని సురక్షితంగా చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. రూహి కూడా తనని అలాగే గుండెలకు హత్తుకుంది. ఇద్దరు కొన్ని క్షణాలు పాటు అలాగే ఉన్నారు. మాటల్లో చెప్పలేని మధుర భావాలు మది తో పంచుకున్నారు. కాసేపటికి అయాన్ అక్కడ కట్టేసి ఉంచిన చాంగ్ లీ ని చూసాడు. కోపంగా గన్ తీసుకొని తన వైపు అడుగు వేయబోయాడు. రూహి తనని ఆపేసింది.
"అయాన్... ముందు మనం చేయాల్సిన పని చాలా ఉంది. అసలు ఈ నార్త్ కొరియా మరియు చైనా కలిసి మన దేశం మీద ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఈ చాంగ్ లీ దాచిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో వెతకాలి. వాటిని ఇక్కడే ఒక రహస్య గదిలో దాచాడు. ఆ గది ఎక్కడుందో వెతకాలి."
ఆ మాటకు అయాన్ అవును అన్నట్టు తల ఆడించాడు.
"మేడమ్ ఈ ఫ్యాక్టరీ చాలా పెద్దది. మొత్తం అన్ని గదులు వెతుకుతూ వెళ్లినా ఈ రాత్రి సరిపోదేమో. పైగా బయట గస్తీ కాస్తున్న చైనా సైనికుల కళ్ళు గప్పి వెతకడం అంటే పెద్ద సాహసమే. ఎలా ఆ పని పూర్తి చేస్తాం." అని అనుమానంగా అడిగాడు.
"దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది." రూహి స్పష్టంగా చెప్పింది.
"ఏంటి మేడమ్ అది." అంటూ అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
రూహి వెంటనే తన ముందున్న ప్రాజెక్టర్ స్క్రీన్ వైపు చూపించింది.
"ఇదే ఈ ఫ్యాక్టరీ బ్లూ ప్రింట్.. మొత్తం 108 గదులు ఉన్నాయి. ప్రతి గది ముందు ఇద్దరు సైనికులు కాపలా గా ఉన్నారు. వారు ఈ చాంగ్ లీ ఆదేశానుసారం పని చేస్తారు. అంతే కాదు ప్రతి గది ముందు సీసీ కెమెరా లు ఉన్నాయి. కాబట్టి వీడి దగ్గర నుంచి వారిని ఆ గదులో ఒక్కోటి తెరవమని చెప్పిద్దాం. అందులో ఏముందో చూద్దాం. ఏ గదినైతే ఆ సైనికులు తెరవలేక పోతారో ఆ గదిలోనే మనకు కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఆ రహస్య గది తెరిచే తాళం చాంగ్ లీ దగ్గర మాత్రమే ఉంటుంది. అదే తన మెడలో వేసుకున్న ఈ కీ..." అంటూ రూహి తన పథకం చెప్పింది.
"అంతా బాగుంది కానీ, ఇప్పుడు చాంగ్ లీ వారిని తలుపులు తెరవమని చెప్తాడు అంటారా..."
"వాడు చెప్పక్కరలేదు. ఎలా చెప్పించాలో నాకు తెలుసు" అంటూ... తన వేలికి ఉన్న ఉంగరం బయటకు తీసి దానిని ఎదురుగా ఉన్న సిస్టమ్ కి కనెక్ట్ చేసింది. అందులో తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాంగ్ లీ మాట్లాడిన ప్రతి మాట రికార్డు అయ్యి ఉంటుంది. అందులో నుంచి తనకు కావాల్సిన పదాలను వెతికి వాటిని కలుపుతూ ఓ ఆడియో టేప్ తయారు చేసింది. తరువాత దాన్ని ప్లే చేసింది.
"తొందరగా మీరు కాపలా కాస్తున్న గది తెరిచి అందులో ఏముందో చెప్పండి..." అని పలికింది.
ఆ మాట వింటే ఎవరైనా సరే చాంగ్ లీ నే చెప్పాడేమో అన్నట్టు ఉంది. రూహి తెలివి చూసి అయాన్ కూడా ఆశ్చర్యపోయాడు.
రూహి వెంటనే ఒక్కో గది ముందు ఉన్న సైనికులకు ఇంటర్ కామ్ లో కనెక్ట్ అయ్యి తను తయారు చేసిన ఆడియో వినిపించింది. అయాన్ కూడా ఇంకో వైపు నుంచి అదే పని చేస్తున్నాడు. అలా ఒక అరగంట తరువాత మొత్తం అన్ని గదులు వెతికేశారు. కానీ ఆ రహస్య గది మాత్రం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు.
రూహి కి అయాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. తాము ఎక్కడ తప్పు చేసారో తెలియలేదు. ఇప్పుడు ఎటు వైపు అడుగు వేయాలో తెలియక నిరాశ గా నిలబడి పోయారు.
అప్పుడే వారికి చాంగ్ లీ నవ్వు వినిపించింది. ఇద్దరు తల తిప్పి చూసారు.
"ఏంటి రూహి, నువ్వు వెతికేది దొరకలేదు కద. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఆ రావణాసురుడిని నేనే. రావణుడి ప్రాణం కడుపులో ఉన్నట్టు నా రహస్యం నాలోనే ఉంటుంది. నన్ను దాటి బయటకు రాదు. నీకు ఎప్పటికీ అది దొరకదు " అంటూ మరింత పెద్దగా నవ్వాడు.
ఎంత కష్టపడినా సరే అక్కడే ఆగిపోవడం తో రూహి లో కోపం కట్టలు తెంచుకుంది. తన పక్కన ఉన్న వస్తువులు అన్ని చెల్లా చెదురుగా విసిరేసింది. ఆ వస్తువులు వెళ్లి పక్కనే ఉన్న షెల్ఫ్ కి తగిలి అక్కడున్న బొమ్మలు కూడా కింద పడి విరిగిపోయాయి. చాంగ్ లీ నవ్వు మరింతగా పెరిగింది. ఆ నవ్వు వింటుంటే రూహి లో ఆవేశం మరింత ఎక్కువైంది. తన పక్కనే ఉన్న కత్తి తీసుకొని వాడి మీదకు వెళ్ళింది.
సరిగ్గా అప్పుడే...
"ఆవేశం కనిపించే వెలుగును కూడా కప్పేస్తుంది. ఆలోచన కటిక చీకటి లోను దారి చూపుతుంది." అనే మాట వినిపించింది.
రూహి టక్కున ఆగి వెనక్కి తిరిగి చూసింది.
"ఈ మాట మీ నాన్న గారు ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ చెప్పారు. అప్పుడే మర్చిపోయారా మేడమ్." అంటూ అయాన్ గుర్తుచేసాడు.
ఆ మాట తో రూహి ఆగిపోయింది. ప్రశాంతంగా అక్కడే కింద కూర్చుంది. నాన్న రూపం గుర్తురావడం తో తనలో ఆవేశం తగ్గి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనల్లో నుంచి ఇందాక చాంగ్ లీ చెప్పిన మాట గుర్తొచ్చింది.
"రావణుడి ప్రాణం తన కడుపులో ఉన్నట్టు ఆ రహస్యం కూడా నాలోనే ఉంటుంది. " అని..
ఆ మాట పదే పదే మనసులో మననం చేసుకుంది. ఈ ఫ్యాక్టరీ లో ఉన్న ప్రతి గది వెతికేసాం. ఇక మిగిలింది ఈ చాంగ్ లీ గది మాత్రమే.. అంటే ఆ రహస్య గది కూడా ఇక్కడే ఉందా.. ఆ ఆలోచన రాగానే రూహి కళ్ళు మెరిసాయి.
"అయాన్.. ఆ రహస్య గది కి చేరే మార్గం ఈ గదిలోనే ఉంది. జాగ్రత్తగా వెతుకు." అని ఆదేశించింది.
రూహి నుంచి ఆ మాట రాగానే చాంగ్ లీ మోహం లో నవ్వు మాయం అయ్యి రంగులు మారాయి. అది చూసాక రూహి అనుమానం నిజమైంది.
ఇద్దరు ఆ గది మొత్తం క్షుణ్ణంగా వెతికారు. కానీ ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. అది మీకు దొరకదు అన్నట్టు చాంగ్ లీ మనసులోనే నవ్వుకున్నాడు.
సరిగ్గా అప్పుడే రూహి చూపు... వారికి ఎదురుగా ఉన్న షోకేస్ షెల్ఫ్ మీద పడింది. అక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఇందాక కోపం లో వస్తువులు విసిరినప్పుడు ఆ షెల్ఫ్ లో ఉన్న అన్ని బొమ్మలు కొంచెమైనా పక్కకు జరిగాయి. కానీ మధ్యలో ఉన్న ఏనుగు బొమ్మ మాత్రం అలాగే కదలకుండా ఉంది.
రూహి మెల్లగా దాని దగ్గరకు వెళ్ళింది. ఆ ఏనుగు బొమ్మను చేతిలోకి తీసుకోవాలని చూసింది. కానీ అది రాలేదు. ఈసారి దాన్ని బలంగా ఎడమ వైపుకు తిప్పింది. అంతే...
పెద్ద శబ్దం చేస్తూ ఆ షెల్ఫ్ పక్కకు జరిగింది. రూహి, అయాన్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు. ఆ షెల్ఫ్ పక్కకు జరిగి అక్కడొక తలుపు ప్రత్యక్షం అయ్యింది. దాన్ని చూసి రూహి లో ఆనందం కలిగింది. వెంటనే తన దగ్గర ఉన్న కీ, మరియు చాంగ్ లీ వేలి ముద్ర సాయం తో దాన్ని తెరిచింది.
లోపల ఒక హార్డ్ డిస్క్ కనిపించింది. వాటిలోనే తమకు కావాల్సిన సమాచారం ఉందని అర్థమైంది. వాటిని చూస్తే అసలు చైనా ఇండియా మీద ఏం చేయబోతుందో అర్థమవుతుంది. అప్పుడు మనం సులభంగా కాపాడుకోవచ్చు అనుకొని తనలో సంతోషం కలిగింది. తను అలా ఆనందంలో మునిగిపోయి ఉండగా...
"మేడమ్.. ఒకసారి ఇటు రండి." అని అయాన్ గట్టిగా పిలిచాడు. రూహి వేగంగా అటు వెళ్ళింది.
"మేడమ్ ఇందాక నేను చంపిన సైనికులను మిగతా సైనికులు చూసారు అనుకుంటా.. వారంతా ఈ గది వైపే వేగంగా వస్తున్నారు. సుమారు వంద మంది దాకా ఉంటారు." అంటూ అయాన్ కంగారుగా పలికాడు.
రూహి వెంటనే అక్కడున్న శాటిలైట్ ఫోన్ నుంచి బయట తమ కబురు కోసం ఎదురుచూస్తున్న పార్వతి, వంశీ లకు ఫోన్ చేసింది.
"ఎలా ఉన్నారు మేడమ్." అని అడిగారు.
"కుశల ప్రశ్నలకు సమయం లేదు. దీపావళి పండగ చేసుకోవాలి. టపాసులు తీసుకొని లోనికి వచ్చేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
"ఏంటి మేడమ్ మీరు అనేది. బయట వంద మంది ఉన్నారు. వారిని ఎదురించలేము. వెనుక వైపు నుంచి పారిపోదాం పదండి"
"ఎదురుగా ఎంత మంది ఉన్నా నేడు నా పాదం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. పారిపోవడం కాదు పరిగెత్తిద్దాం..." అంటూ రూహి స్థిరంగా పలికింది.
"చావంటే భయం లేదా మేడమ్ మీకు." అని అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
"సైనికుడంటే చావుకు భయపడటం కాదు, చావుకు భయం నేర్పాలి. ఒక్కొక్కడిని పరిగెత్తించి కొడదాం.. ఇంకోసారి ఇండియా పేరు చెప్తే వణికిపోవాలి."
అది విని చాంగ్ లీ పెద్దగా నవ్వాడు.
"అది నీ వల్ల కాదు. ఈరోజు మా వాళ్ళ చేతిలో మీ ప్రాణాలు పోవడం ఖాయం. ఆ తరువాత మీ దేశాన్ని ఓడించి మా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను." అంటూ బిగ్గరగా నవ్వాడు.
ఒక క్షణం తరువాత ఆ నవ్వు స్థానం లో పెద్ద ఆర్త నాదం మొదలయింది. ఎందుకంటే అప్పటికే రూహి చేతిలో నుంచి ఓ కత్తి వేగంగా వచ్చి చాంగ్ లీ చేతిని నరికేసింది.
చాంగ్ లీ నొప్పి తో విల విల లాడిపోయాడు.
రూహి వాడి కళ్ళలోకి చూస్తూ...
"మరుగుతున్న నా రక్తం మీద ఒట్టు, ఉవ్వెత్తున ఎగసిపడే నాలోని దేశ భక్తి మీద ఒట్టు,..
నీ యబ్బ నీకు, నీ దేశానికి దమ్ముంటే నా భారత దేశపు ఓ మట్టి గడ్డను తాకి చూడు రా చూద్దాం.. నిన్ను, నీలాంటి తీవ్రవాదుల తలలు నరికి నా దేశానికి కంచె వేయకపోతే నేనసలు విక్రమ్ వాసుదేవ్ కూతురినే కాదు. నా పేరసలు రూహి వాసుదేవే కాదు."
అంటూ తన చేతిలోని కత్తి ఆ చాంగ్ లీ గుండెల్లోకి దింపింది
రూహి పరాక్రమం చూసి అయాన్ గుండె కూడా క్షణ కాలం వణికింది. రూహి మాత్రం శత్రు సంహారం చేయడానికి తుపాకీ పట్టుకొని బయటకు నడిచింది.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...15 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
ఏజెంట్ రూహి వాసుదేవ్...16
![[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]](https://static-assets.pratilipi.com/series/cover?seriesId=485271&version=e0736d03-46bd-484f-9de5-0ce122606d44)
"మేడమ్.. బయట చాలా మంది చైనా సైనికులు నిలబడి ఉన్నారు." అని అయాన్ కంగారుగా అన్నాడు.
"ఎంత మంది ఎదురుగా ఉన్నా, అడ్డుగా ఓ సంద్రమే వచ్చినా, నేడు ఆ తీవ్రవాదుల శవాలతో వంతెన నిర్మించి మరీ ముందుకు వెళ్తాను. నా ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టు దాకా పోరాడుతూనే ఉంటాను." అంటూ రూహి స్థిరంగా చెప్పింది.
"మనం గెలవగలం అంటారా "
"ఉరకలు వేస్తున్న నా నెత్తురు మీద ఒట్టు... ఈరోజు వాళ్లలో ఒక్కడు కూడా మిగలడు."
"వారి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి మేడమ్ "
"మన సంకల్పం బలంగా ఉంటే ప్రపంచమే మనతో నడుస్తుంది. " అంటూ రూహి తన పక్కనే ఉన్న ఒక షెల్ఫ్ తెరిచింది.
అందులో ఆధునాతనమైన చాలా తుపాకీలు వరుసగా ఉన్నాయి. ఇందాక రహస్య గది కోసం వెతుకుతున్న సమయం లో రూహి వాటిని చూసింది. చాంగ్ లీ దేశ విదేశాల నుంచి వాటిని తెప్పించాడు. కానీ నేడు అవి ఇలా తన శత్రువులకే ఉపయోగ పడతాయని కలలో కూడా ఊహించి ఉండడు.
రూహి, అయాన్ అందులో నుంచి తమకు కావాల్సిన ఆయుధాలు తీసుకున్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మరియు హెల్మెట్ కూడా ధరించారు. రూహి సంపాదించిన హార్డ్ డిస్క్ భద్రంగా జేబులో దాచుకుంది. తరువాత అక్కడ సీసీ కెమెరా లో రికార్డు అవుతున్న దృశ్యాలని తన ఫోన్ కి కనెక్ట్ చేసింది.
"అయాన్, మన శత్రువు వేసే ప్రతి అడుగు మనకు ముందే తెలుస్తుంది. ఆ మాత్రం చాలు వారిని మట్టుబెట్టడానికి...
మన శత్రువుకు తన ముందు వారి దేశముంది అనే ధైర్యం ఉండచ్చు,
కానీ వాడికి తెలీయని విషయం ఏంటంటే.. ఒక ప్రమాదం ఎదురైతే మన భారతదేశ సరిహద్దు ముందు నిలబడి దానికి ఎదురు పడేది ముందు మనమే అని...
వీరికి, వీరి లాగే మన దేశం మీద ఆధిపత్యం చెలాయించి అణగదొక్కాలని చూసే వారికి... అందరికీ వినపడేలా, గుండెలు అదిరి పడేలా మన అడుగులు వేసే సమయం వచ్చింది."
అయాన్ అర్థమైంది అన్నట్టు తల ఆడించాడు. ఈ లోగా కెమెరా లో వారు ఉన్న గదికి రెండు వైపుల నుంచి ఒక ఇరవై మంది సైనికులు చుట్టు ముట్టి వారి వైపే వస్తున్నట్టు కనిపించింది.
ఇద్దరూ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని.
"భారత్ మాతా కి జై..." అని ఒకేసారి అరిచి బరిలోకి దూకారు.
అప్పుడు ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. దానికి రెండు వైపులా కాస్త దూరం లో నిలబడిన తీవ్రవాదులు ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు. వారు తెరుకునే లోగా ఒక స్మోక్ బాంబు బయటకు వచ్చింది. కళ్ళు మూసి తెరిచే లోగా ఆ చోటు మొత్తం పొగ తో నిండిపోయింది.
చైనా సైనికులు కాసేపు తడబడి, కళ్ళు నులుముకుంటూ చూసారు. సరిగ్గా అప్పుడే ఆ పొగ లో నుంచి ఓ రూపం మెల్లగా బయటకు వచ్చింది. అది ఎవరో కాదు... ఏజెంట్ రూహి వాసుదేవ్.
తనని అలా చూసి వారు షాక్ అయ్యి నోరు తెరిచి ఉండిపోయారు.
రూహి వారి వంక చూస్తూ...
"హ్యాపీ దీపావళి..." అని అంటూ తుపాకీ ఎక్కుపెట్టి కాల్చింది.
అది నేరుగా తన ముందున్న తీవ్రవాది నుదుటి మీద దిగింది. అది చూసి మిగతా వాళ్లు భయపడిపోయారు. కానీ వారు తేరుకునే లోగా రూహి చెతిలోని ఆయుధం నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది. ఈలోగా అయాన్ కూడా అటు వైపు నుంచి కాల్చడం మొదలుపెట్టాడు.
బుల్లెట్ల నుంచి చాలా ఒడుపుగా తప్పించుకుంటూ ఆ ఇద్దరూ కలిసి ఇరవై మందిని పదే పది నిమిషాల్లో మట్టి కరిపించారు. కానీ వారికి బాగా తెలుసు.. ఆ ఫ్యాక్టరీ లో ఇంకా ఎనభై మంది దాకా చైనా సైనికులు ఉన్నారని.. వారిని కూడా మట్టి కరిపించాలని అనుకున్నారు.
ఇంతలో మరికొంతమంది చైనీయులు వారి వైపు వస్తున్నట్టు రూహి ఫోన్ హెచ్చరించింది. వెంటనే ఒకసారి చూట్టు చూసింది. అక్కడ చనిపోయిన చైనా సైనికుల జేబులో నుంచి యువాన్ నోట్లు తీసుకొని వాటికి ఓ దారం కట్టింది. ఆ దారం మరో చివర తను ఇందాక చాంగ్ లీ గది లో తీసుకున్న బాంబ్ పిన్ కు కట్టింది.
తరువాత అయాన్ ను తీసుకొని ఆ చోటుకు దూరంగా వెళ్ళింది. ఇంతలో అక్కడికి చేరుకున్న చైనా సైనికులు.. ఆ నోట్ల కట్టను చూసి వారి కళ్ళు మిల మిలమంటూ మెరిసాయి. వెంటనే ఆ నోట్లను ఒకరికొకరు తమకే కావాలని లాక్కున్నారు. అలా లాగినప్పుడు దానికి కట్టిన బాంబు పిన్ బయటకు వచ్చింది. ఢాం అని పెద్ద శబ్దం చేస్తూ పేలింది. దెబ్బకు ఒకేసారి ఇరవై మంది చైనా సైనికుల శరీరాలు గాల్లోకి లేచి కిందపడ్డాయి. సైనికుడి చూపు ఎప్పుడూ కంటికి కనిపించే దాని మీదే కాదు, దాని వెనుక ఉన్న ప్రమాదం గురించి కూడా ఆలోచించాలి అని చెప్పే పాఠం అది.
మిగిలిన సైనికులు రూహి, అయాన్ తప్పించుకోకుండా ఫ్యాక్టరీ ని జల్లెడ పడుతున్నారు. ఈలోగా రూహి మిగతా వారి కోసం కూడా ఓ పథకం ఆలోచించింది. వేగంగా తాము రోజు పని చేసే ల్యాబ్ దగ్గరకు వెళ్ళింది. ఆ ల్యాబ్ లో కెమికల్స్ చాలా తక్కువ మొతాదు లోనే ఉంటాయి. ఏ రోజుకారోజు తెప్పిస్తుంటారు. అయినా సరే ఒక్కసారి అక్కడున్న కెమికల్స్ ని బాగా గమనించి అయాన్ కి ఏం చేయాలో చెప్పింది. ఇద్దరూ మొహానికి ల్యాబ్ మాస్క్ పెట్టుకొని ఆ పనిలో పడ్డారు. కొన్ని క్షణాల తరువాత వారు ఓ గ్యాస్ ని తయారు చేసారు. రూహి దాన్ని ఓ గ్లాస్ కంటైనర్ లో తీసుకుంది.
ఒకసారి తన ఫోన్ వంక చూసింది. మిగతా సైనికులు ఇంకా రూహి, అయాన్ కోసం వెతుకుతునే ఉన్నారు. ఈసారి రూహి వారికి తాము ల్యాబ్ లో ఉన్నట్టు తనే సందేశం పంపింది. ఆ తరువాత ఆ గ్యాస్ ఉంచిన కంటైనర్ కి ఒక బాంబు అతికించి దానికి టైం సెట్ చేసింది. అది సరిగ్గా ఒక ఐదు నిమిషాల్లో పేలుతుంది. చైనా సైనికులు ఇక్కడికి రావడానికి కూడా అంతే సమయం పడుతుంది.
ఈలోగా రూహి, అయాన్ ని తీసుకొని పక్కనే ఉన్న కిటికీ ద్వారా ఆ ల్యాబ్ లో నుంచి బయట పడింది. వారు అలా వెళ్లిన కాసేపటి తరువాత ఒక ముప్పై మంది సైనికులు తుపాకీల తో వచ్చి ఆ ల్యాబ్ ని నలువైపుల నుంచి చుట్టు ముట్టారు. వారు అలా వచ్చిన కొన్ని క్షణాల తరువాత రూహి ఉంచిన గ్లాస్ కంటైనర్ పేలి అందులో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వచ్చింది.
అక్కడికి వచ్చిన సైనికులకు ఏం జరిగిందో అర్ధమయ్యే లోగా ఆ గ్యాస్ వారి శ్వాస ద్వారా లోపలకు వెళ్ళింది. ఆ గ్యాస్ మరేదో కాదు. Tear Gas...
వారు దాన్ని పీల్చిన కాసేపటికి ఒళ్ళంతా చమటలు పట్టాయి. దగ్గు ఎక్కువై శ్వాస తీసుకోవడం భారంగా మారింది. చూపు మసకబారింది. ముక్కు, చెవులు మండటం మొదలైంది. కొన్ని క్షణాల తరువాత ఆ ల్యాబ్ లో ఉన్న చైనా సైనికులు అందరూ స్పృహ తప్పి పడిపోయారు. వారు తిరిగి లేవడానికి కనీసం మరో రెండు, మూడు గంటలు అయినా అవుతుంది.
రూహి, అయాన్ మిగతా వారి పని పట్టడం కోసం బయలుదేరారు. వారు ఆ ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న మీటింగ్ హాల్ దగ్గర ఉన్నారని తెలిసింది. మెల్లగా అటు వైపు వెళ్లారు. మిగిలిన ఆ కొద్ది మందిని కూడా పూర్తి చేస్తే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని అనుకున్నారు. ఇంతలో వారు ఊహించినట్టుగానే వారికి ఎదురుగా ఒక నలుగురు చైనా సైనికులు నడుస్తూ కనిపించారు.
రూహి వెంటనే వారి వద్దకు వెళ్లి వెనుక నుంచి తుపాకీ ఎక్కు పెట్టింది. వారు మెల్లగా వెనక్కి తిరిగారు. కానీ రూహి ఊహించినట్టుగా వారి కళ్ళలో భయం లేదు. మోహం లో ఆనందం ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని అర్థమై ఒకసారి చుట్టు చూసింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఒక పాతిక మంది దాకా తమని తుపాకీ లతో చుట్టు ముట్టారు. వారంతా రూహి ని, అయాన్ ని చూసి నవ్వుతున్నారు.
"మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావే.. ఈరోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నరకం చూపించి మరీ చంపుతాం." అని నవ్వుతూ అన్నారు.
కానీ రూహి మోహం లో భయం కానీ, ఆందోళన కానీ లేవు. పైగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి చైనీయిల నవ్వు ఆగిపోయి ఆశ్చర్యం మొదలయింది. రూహి వారి వంక చూస్తూ...
"నన్ను చంపాలంటే మీ చేతుల్లో తుపాకీలు ఉంటే సరిపోవు. ఆ తుపాకీ కాల్చే గుండెలో దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న వాడిని ఆ దేవుడు ఇంకా పుట్టించలేదు.
అయినా మీకో విషయం చెప్పనా...
డిపార్ట్మెంట్ మొత్తం మా బృందాన్ని ముద్దుగా బ్లాక్ కోబ్రా టీం అంటారు. ఎందుకంటే ఆ పాము కాటు వేస్తె బ్రతకడం చాలా కష్టం. విషం నేరుగా నీ గుండెకు ఎక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీస్తుంది. ఇప్పుడు ఆ బ్లాక్ కోబ్రా కాటు వేస్తె ఎలా ఉంటుందో చూస్తారా..."
చైనా సైనికులు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
ఇంతలో రూహి...
"బ్లాక్ కోబ్రా..." అని అరిచింది.
ఆ చైనా సైనికుల వెనుక నిలబడి ఉన్న వంశీ, పార్వతి.. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నారు. రూహి నుంచి ఆదేశం రాగానే ఇద్దరు చెరో వైపు నుంచి తుపాకీల తో చిరుత పులులు మాదిరి బరిలోకి దూకారు.
వారిని చూసి చైనా సైనికులు బిత్తర పోయారు. ఈలోగా రూహి, అయాన్ కూడా తమ పని మొదలుపెట్టారు. బ్లాక్ కోబ్రా బృందానికి కూడా కొన్ని గాయాలు అయ్యాయి. అయినా సరే లెక్క చేయకుండా ఆకలి తో పంజా విసిరే సింహం లాగా వేటాడటం మొదలుపెట్టారు. సరిగ్గా ఒక పది నిముషాలు తరువాత ఆ ఫ్యాక్టరీ లో ఒక్కడు కూడా మిగలలేదు. మొత్తం అందరినీ మట్టు బెట్టారు.
ఆ గది మధ్యలో రాణి రుద్రమదేవి మాదిరి తుపాకీ తో ధైర్యంగా రొమ్ము విరిచి నిలబడిన ఏజెంట్ రూహి వాసుదేవ్ ని చూసి బ్లాక్ కోబ్రా బృందం గర్వం తో సెల్యూట్ చేసారు.
వారి కళ్ళకు తను ఓ నడిచే డైనమేట్ లాగా కనిపించింది. అలాంటి ఓ గొప్ప సైనికురాలి ని చూసినందుకు అక్కడున్న అందరి గుండెల్లో దేశ భక్తి ఉప్పొంగింది.
-------------------------------------------------------------
హైదరాబాద్...
"అన్న.. నీకొక గుడ్ న్యూస్.. ఆ సుజిత ఇప్పుడే ఇంటి నుంచి మార్కెట్ కి బయలుదేరింది."
ఫోన్ లో ఆ మాట వినగానే జలంధర్ మోహం మతాబు లాగా వెలిగిపోయింది.
"తన వెంట ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు.
"ఎవరూ లేరు అన్న.. ఒంటరిగా వెళ్తుంది."
"మన వాళ్ళని ఓ ఇరవై మందిని తీసుకొని వెళ్ళండి. అదును చూసి తనని ఎత్తుకొని వచ్చేయండి. ఈరోజు దానికి సరైన గుణపాఠం చెప్పాలి." అని జలంధర్ అన్నాడు.
"సరే అన్న.." అంటూ అటు వైపు నుంచి ఫోన్ పెట్టేసారు.
'ఒసేయ్ సుజిత.. నా మనుషులకే చుక్కలు చుపిస్తావా. ఈరోజు నీకు నరకం చూపిస్తాను.' అని జలంధర్ మనసులోనే కసిగా అనుకున్నాడు.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...16 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,964
Joined: Jun 2019
Reputation:
2
The team recovered the hard disk... It is only the beginning of the story.
Posts: 1,640
Threads: 2
Likes Received: 976 in 752 posts
Likes Given: 2,206
Joined: May 2019
Reputation:
11
How will Sujitha fight it in the open?
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
(19-05-2026, 10:47 AM)Sunny73 Wrote: The team recovered the hard disk... It is only the beginning of the story.
Yes
•
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,184 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
|