11-05-2026, 02:08 PM
Excellent update
|
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
|
|
12-05-2026, 06:41 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 33
సయ్యద్, కళింగతో మాట్లాడి ల్యాబ్ లొకేషన్ రావడంతో షారుక్ వాళ్ళతో కలిసి మిలిటరీ ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు బషీర్.
************** ఫ్యాక్టరీ గోడౌన్ లో యోధ దగ్గరకి వచ్చి నలుగురు మాత్రం పారిపోయారు మిగతా వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళు మనం ట్రేసింగ్ చీప్ పెట్టిన కారులోనే వెళ్లారు." అని చెప్పింది నీతూ. "గుడ్!" అని చెప్పి తన లాప్టాప్ ఆన్ చేసి కార్ లోకేషన్ చూసి "మిలిటరీ ల్యాబ్ వైపు వెళుతున్నారు అక్కడ అభిర్ ఏజెంట్స్ ఉన్నారు కానీ వాళ్లకి హెల్ప్ గా మన వాళ్లు కూడా వెళ్లాలి." అని చెప్పాడు యోధ. "ఇక్కడి నుంచి పారిపోయిన నలుగురు మనల్ని చూశారు అక్కడ మనలో ఎవరిని చూసినా యంగ్ వాళ్ళు ల్యాబ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి కొత్త వాళ్ళని పంపించాలి." అని చెప్పింది దీప్తి. "అలా అయితే! క్యూబ్, పూజా, గబ్బర్ సింగ్ కంప్యూటర్ దగ్గర ఉన్నారు కదా వీళ్ళని ఎవరు చూడలేదు ఆ ముగ్గురిని పంపించండి." అని చెప్పాడు భూషణ్. "నన్ను కూడా ఎవరు చూడలేదు వీళ్ళతో పాటు నేను కూడా వెళతాను కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు ఉంటుంది." అని చెప్పాడు గుప్తా. ఆ మాటకి కాసేపు ఆలోచించి పూజా వైపు చూసి "జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు కదా!" అని అడిగాడు యోధ. "నో ప్రాబ్లం సార్! నేను ఉన్నాను కదా ఇలాంటి విషయాలు నాకు కొట్టిన పిండి." అని గొప్పగా చెప్పాడు గబ్బర్ సింగ్. "కెప్టెన్ అనుమానం కూడా నువ్వు ఉన్నావనే!" అని చెప్పింది నీతూ. "మీ నలుగురు అక్కడ ఏం జరుగుతుందో మాత్రం చూడండి అవసరమైనప్పుడు ఎంటర్ అవ్వండి. మిగతా విషయాలు మొత్తం అభీర్ ఏజెంట్స్ చూసుకుంటారు." అని చెప్పాడు యోధ. "సరే! ఇంతకీ అక్కడికి వచ్చిన ఏజెంట్స్ పేర్లు ఏమిటి వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగింది పూజా. "నో! వాళ్ళు ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు పేర్లు మాత్రం లింగి, గుడ్డు వాళ్ళని కలిసినప్పుడు 'జై భవాని' అని చెప్పండి అదే కోడ్!" అని చెప్పాడు యోధ. "మీరు ఫాస్ట్ గా వెళ్లాలి ల్యాబ్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో కూడా మనకి తెలియదు." అని చెప్పింది దీప్తి. "సరే!' అని చెప్పి క్యూబ్ వైవు చూసి "స్టార్ట్ అవుదామా?" అని అడిగింది పూజా. "సరే! నేను డ్రైవింగ్ చేస్తాను మిమ్మల్ని క్షణాల్లో అక్కడికి తీసుకువెళ్తాను." అని చెప్పాడు క్యూబ్. జీప్ కీస్ ఇచ్చి "జాగ్రత్త హెవీ ఇంజన్! ఎక్స్ లెటర్ మీద కాలు పెడితే స్టార్టింగ్ 100 స్పీడ్ వెళుతుంది." అని చెప్పాడు రాఖి. "నో ప్రాబ్లం!" అని కీస్ తీసుకుని ముగ్గురితో కలిసి వెళ్ళాడు క్యూబ్. అక్కడి నుంచి పూజా వాళ్ళు వెళ్లడంతో నాయక్ కి మెసెజ్ చేసాడు యోధ. మీటింగ్ లో నుంచి బయటకు వస్తూ మెసేజ్ చూసి యోధ కి కాల్ చేసాడు నాయక్. ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జైహింద్ సార్! ఇక్కడ అంత క్లియర్ మీరు అనుమానించినట్లే నలుగురు ల్యాబ్ దగ్గరికి వెళ్లారు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ అభీర్ ఏజెంట్స్ ఉన్నారు మన వాళ్లు కూడా వెళుతున్నారు." అని చెప్పాడు యోధ. "ఓకే! ఉన్ని కృష్ణన్ కి కాల్ చేసి సెక్యూరిటీ డోర్ లాక్ చేయమంటాను ఇంకా ఎవరూ లోపలికి వెళ్ళలేరు." అని చెప్పి చైనా అంబసీతో మీటింగ్ అయింది యంగ్, భూపాల్ సింగ్ లు వాళ్ల ల్యాబ్ లో నుంచి ఇంపార్టెంట్ వస్తువుని దొంగలించి ఇండియాకి వచ్చారు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. " అని చెప్పాడు నాయక్. "సార్" ఆ ఇద్దరిని వెతుకుతున్నాము అని చెప్పండి ఈలోపు ఇండియాలో దాక్కున్న టెర్రరిస్టులు మొత్తం క్లోజ్ అయిపోతారు." అని చెప్పాడు యోధ. "కరెక్టే! కానీ ఈ ఇన్సిడెంట్ తో మిలటరీ ఎంట్రీ అయ్యింది అని వాళ్లకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు ప్రోలాంగ్ చేయలేము కానీ యంగ్ ని ఆ విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా చాలా డేంజర్!" అని చెప్పాడు నాయక్. "సార్! నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానికి టుడేస్ టైమ్ కావాలి అప్పటివరకు డిస్కషన్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడికి ఒక మిలిటరీ ట్రక్ పంపించండి బాడీస్ క్లియర్ చేస్తాము." అని చెప్పాడు యోధ. "ఓకే! ఇప్పుడే పంపిస్తాను ఇంతకీ నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు నాయక్. "టూ డేస్ వెయిట్ చేయండి సార్ అన్ని విషయాలు క్లియర్ గా చెబుతాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి సుహా వైపు చూసి "మన విఠలాచార్యని అర్జెంటుగా ఇక్కడికి రమ్మని కాల్ చెయ్!" అని చెప్పాడు యోధ. ఆ మాట విని నవ్వుతూ "ఓకే! నీ ప్లాన్ నాకు అర్థమైంది." అని ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ పక్కకు వెళ్ళింది సుహా. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఇంతకీ ఈ విఠలాచార్య ఎవరు?" అని డౌట్ గా అడిగింది దీప్తి. "టెన్షన్ ఎందుకు వస్తాడు కదా మీరే చూడండి వాడు ఒక అద్భుతమైన సృష్టికర్త!" అని నవ్వుతూ చెప్పాడు యోధ. ************ కార్ లో ల్యాబ్ దగ్గరికి వెళుతూ డ్రైవింగ్ చేస్తున్న క్యూబ్ వైపు చూసి "ఇలా వెళితే మనం వెళ్లినట్లే!" అని వెటకారంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. ఆ మాటకి క్యూబ్ వైపు చూసి "పుష్పక విమానాన్ని డ్రైవింగ్ చేసిన వాడివి ఈ కార్ కుడా అదే అనుకుని స్పీడ్ గా వేళ్ళు!" అని చెప్పాడు గుప్త. "సరే! అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోని ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి." అని చెప్పాడు క్యూబ్. ఆ మాటకి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ "నేను రాకెట్ ని పైకి పంపించేదాన్ని నాకు స్పీడ్ అంటే భయం లేదు." అని చెప్పింది పూజా. "నేను ఆ రాకెట్ లో జర్నీ చేసే టైప్!" అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్. "సరే మీ ఇష్టం!" అని గేర్ మార్చి ఎక్సలేటర్ ని గట్టిగా ఒక్క తొక్కు తొక్కి "ల్యాబ్ లొకేషన్ కి వచ్చేసాము కిందకి దిగండి." అని చెప్పాడు క్యూబ్. క్యూబ్. "అయ్య బాబోయ్! సుయ్ మని మెరుపు మాత్రమే కనిపించింది. ఇంతకీ మనం ఉన్నామా? పోయామా?" అని కంగారుగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "నీకు ఆ మెరుపైనా కనిపించింది నాకు అది కూడా కనిపించలేదు." అని రెండు చేతులతో తల పట్టుకుని చెప్పింది పూజా. "మా బాస్ వెహికల్ ఇంతకన్నా ఫాస్ట్ గా వెళుతుంది దినికే భయపడుతున్నారా..?" అని కిందకి దిగాడు గుప్తా. స్లోగా కిందకి దిగి "మిలిటరీ ల్యాబ్ ఉన్న లోకేషన్ ఇదే కానీ ఇక్కడ ఏమి కనిపించడం లేదు." అని అడిగాడు గబ్బర్ సింగ్. "అది మిలటరీ సీక్రెట్ ల్యాబ్ తెలుసుకోవడం చాలా కష్టం! బయటికి నార్మల్ ఇల్లు లేదా షాప్ లాగా కనిపిస్తుంది." అని చెప్పింది పూజా. "అదిగో అక్కడ ఇద్దరు కూర్చుని ఉన్నారు నాకు తెలిసి వాళ్లే మీ ఏజెంట్స్ అనుకుంటా!" అని చెప్పాడు క్యూబ్. "సరే పదండి." అని చెప్పి కూర్చున్న ఇద్దరి దగ్గరకి వెళ్ళి "హలో మిస్టర్! మీ ఇద్దరి పేర్లు ఏమిటి?" అని అడిగాడు గబ్బర్ సింగ్. ఆ మాట విని కర్ర ఆడించుకుంటూ లేచి నుంచుని "నా పేరు లింగి సార్ వాడు నా తమ్ముడు గుడ్డు!" అని చెప్పాడు. అక్కడికి వస్తున్న క్యూబ్ వైపు చూసి "నువ్వు కరెక్ట్ గానే గెస్ చేసావు మనం వచ్చింది వీళ్లకోసమే!" అని చెప్పాడు గబ్బర్ సింగ్. "మేము మీ ఇద్దరికీ హెల్ప్ గా ఉండడానికి వచ్చాము ఇంతకీ ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలి?" అని అడిగింది పూజా. "ఏమో మేడం నాకు కనపడదు." అని చెప్పాడు లింగి. "ఏంటి నీకు కనపడదా..! మేము చెప్పింది వినపడుతుంది కదా ల్యాబ్ లోకి ఎటు వెళ్ళాలో చెప్పు!" అని అడిగాడు గబ్బర్ సింగ్. "ఏమో సార్ నా తమ్ముడు గుడ్డు కి వినపడదు." అని చెప్పాడు లింగి. "ఒరేయ్! నీకు కనపడదు వాడికి వినపడదు సరే మేము చెప్పింది నీకు వినపడుతుంది వాడికి మేము కనపడుతున్నాము ల్యాబ్ లోపలికి ఎటు వెళ్ళాలో చెప్పండి." అని గట్టిగా అరిచేడు గబ్బర్ సింగ్. "ఏమో సార్! నాకు కనపడదు కదా ఎలా వెళ్లాలో నాకు ఎలా తెలుస్తుంది." అని చెప్పాడు లింగి. ఆ మాటకి గుడ్డు దగ్గరికి వెళ్లి "ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలి?" అని గట్టిగా అరుస్తూ అడిగింది పూజా. "మేడం! మీరు ఎంత అరిచిన వాడికి వినపడదు ఏదైనా ఉంటే నాతో చెప్పండి." అని చెప్పాడు లింగి. "ఓరి మొగడా! ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలో చెప్పు మేము మీ ఇద్దరికీ హెల్ప్ చేయడానికి వచ్చాము." అని చెప్పాడు గబ్బర్ సింగ్. "ఏమో సార్! నాకు కనపడదు కదా!" అని అమాయకంగా పేస్ పెట్టి చెప్పాడు లింగి. ఆ మాటకి అయోమయంగా చూస్తూ "నేను చచ్చిపోతా లేకపోతే వీళ్లిద్దరిని చంపేస్తాను." అని కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్. "మీ ఇష్టం సార్! నాకు కనపడదు నా తమ్ముడికి వినపడదు ఏదైనా చేసుకోండి." అని చెప్పాడు లింగి. "ఆ ఇద్దరు మనల్ని ఏజెంట్స్ అనుకోవడం లేదు యోధ చెప్పిన కోడ్ చెప్పండి అప్పుడు కరెక్ట్ గా మాట్లాడతారు." అని చెప్పాడు గుప్తా. లింగు, గుడ్డులను చూసి ఏడుస్తూ గుప్త చెప్పిన మాట విని "హ.. మర్చిపోయాను జై భవాని!" అని చెప్పాడు గబ్బర్ సింగ్. "ఆ కోడ్ మీరు వచ్చినప్పుడే చెప్పాల్సింది ఇంత డిస్కషన్ ఉండేది కాదు కదా!" అని చెప్పాడు గుడ్డు. ఆ మాట విని గుడ్డు వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! నీకు వినపడుతుందా..? మరి ఇప్పటి దాకా అంత యాక్షన్ చేసావ్ ఏమిటి రా..!" అని ఏడుస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "నాకు వినపడదు మీ లిఫ్ మూమెంట్ చూసి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటాను." అని చెప్పాడు గుడ్డు. "సరే! ఒక పక్కకు వెళ్లి నుంచోండి కార్ లు ఆగిన సౌండ్ వచ్చింది టెర్రరిస్టులు వచ్చారు అనుకుంటా!" అని చెప్పాడు లింగి. "ఇక్కడ దగ్గరలో కార్లు ఏమి కనబడడం లేదు నీకు సౌండ్ ఎలా వినిపించింది?" అని డౌట్ గా చూస్తూ అడిగింది పూజా. "లింగి చెప్పింది కరెక్టే దూరంగా రెండు కార్లు ఆగాయి పదండి మనం పక్కకు వెళ్లి నిలబడదాము." అని చెప్పాడు క్యూబ్. అక్కడి నుంచి వెళుతూ "ఈ ఇద్దరు మామూలు ఏజెంట్స్ కాదు వీళ్ళకి కత్తులు తుపాకులు అక్కర్లేదు మాటలతో చంపేస్తారు. ఆ కోడ్ చెప్పబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళ టార్చెర్ కి ఏ గోడకో తలబాదుకుని చచ్చిపోయేవాడిని!" అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు గబ్బర్ సింగ్.
12-05-2026, 06:43 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 34
నాయక్ తో ఫోన్లో మాట్లాడి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి సుహా వైపు చూసి మన విఠలాచార్యకి కాల్ చేసి ఇక్కడికి రమ్మను అని చెప్పాడు యోధ.
తన దగ్గరికి వచ్చి జై భవాని అని కోడ్ చెప్పడంతో రెండు కార్లు ఆగినా సౌండ్ వచ్చింది టెర్రరిస్టులు వస్తున్నారు అనుకుంటా మీరు పక్కకు వెళ్ళండి అని పూజా వాళ్లకి చెప్పాడు లింగి ********** ల్యాబ్ ఉన్న ఏరియాకి వచ్చి "సార్! పంపించిన లొకేషన్ ఇదే కానీ ఇక్కడ ల్యాబ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం!" అని చూస్తూ చెప్పాడు బషీర్. "ల్యాబ్ దగ్గర కచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది సీక్రెట్ ప్లేస్ కాబట్టి సివిల్ డ్రెస్ లో ఉంటారు అక్కడ ఇద్దరు ఉన్నారు కొంచెం దూరం నలుగురు ఉన్నారు." అని చూస్తూ చెప్పాడు షారుఖ్. కారులో నుంచి దిగి వేరే కార్ లో ఉన్న తన మనుషుల వైపు చూసి "నేను చెప్పే వరకు కిందకు దిగకండి గన్స్ కూడా బయటకి కనబడకూడదు." అని చెప్పాడు బషీర్. "సరే బాయ్!" అని గ్లాస్ క్లోజ్ చేసుకుని లోపల కూర్చుని ఉన్నారు. కారులోకి చూస్తూ "ఖాసీం, రజాక్! మీరిద్దరూ అక్కడ ఉన్న నలుగురు దగ్గరికి వెళ్ళండి. నేను షారుక్ ఆ ఇద్దరి దగ్గరికి వెళతాము చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏమాత్రం అనుమానం రాకూడదు." అని చెప్పాడు బషీర్. "సరే!" అని రజాక్ తో కలిసి పూజ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఖాసీం. అది చూసి "వాళ్ళిద్దరూ మన వైపే వస్తున్నారు మీరు ముగ్గురు సైలెంట్ గా ఉండండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్. అడుగుల చప్పుడు విని గుడ్డు భుజం మీద చేయి వేసి వేళ్ళు కదిలించాడు లింగి. "అన్న! ఇద్దరు మన దగ్గరికి వస్తున్నారు ఇద్దరు ఆ ఏజెంట్స్ దగ్గరికి వెళ్లారు, వెనుక కారులో ఆరుగురు ఉన్నారు మొత్తం పదిమంది రెండు నిమిషాలు పడుతుంది చంపేద్దామా?" అని అడిగాడు గుడ్డు. "కంగారు పడకు వాళ్ళు ఒకసారి దెబ్బతిన్నారు కచ్చితంగా జాగ్రత్త పడతారు నాకు తెలిసి దూరంగా స్నైపర్స్ ఉంటారు వాళ్లు మన దగ్గరికి రాగానే ఎర్రటి చుక్క ఒంటి మీద పడి కదులుతూ ఉంటుంది సరిగ్గా గమనించు." అని చెప్పాడు లింగి. "కరెక్టే అన్న! వాళ్ళు మన దగ్గరికి వస్తూ చెవిలో ఉన్న మిషన్ లో మాట్లాడుతున్నారు." అని చెప్పాడు గుడ్డు. లింగి వాళ్ళ దగ్గరికి వచ్చి "మేము మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తున్నాము ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి." అని అడిగాడు బషీర్. "అవునా సారు! అయితే వెళ్ళండి మాకు ఎందుకు చెబుతున్నారు." అని అమాయకంగా ఫేస్ పెట్టి చేతిలో కర్ర ఆడించుకుంటూ చెప్పాడు లింగి. "ఏంటి నీకు కళ్ళు కనపడవా..? మారి ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు షారుఖ్. "నాకు కళ్ళు కనపడవు సారు, నా తమ్ముడికి వినపడదు ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అంటే చూపించుకోవడానికి వచ్చాము మీకు ఏమైనా తెలుసా..?" అని అడిగాడు లింగి. "ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఉండవు." అని చెప్పాడు బషీర్. "సారు! మీకు కళ్ళు బానే కనబడతాయి కదా మారి హాస్పిటల్స్ లేని ప్లేస్ కి వచ్చి ల్యాబ్ ఉందా అని మమ్మల్ని అడుగుతారు ఏంటి?" అని వెటకారంగా అడిగాడు లింగి. "బాయ్! విడికి కళ్ళు లేకపోయినా పొగరుకు ఏమి తక్కువ లేదు, మేము అడిగింది మిలిటరీ ల్యాబ్ గురించి నీకు ఏమైనా తెలుసా?" అని షారుఖ్. "ఏమో సార్" మీరు చెప్పింది నా తమ్ముడికి వినపడదు ఎలా చెబుతాడు? " అని చెప్పాడు లింగి. ఆ మాటకి విచిత్రంగా చూస్తూ "నీకు వినపడుతుంది కదా!" అని అడిగేడు బషీర్. "ఏమో సార్! నాకు కనపడదు." అని చెప్పాడు లింగి. ఆ మాటకి కోపంగా చూస్తూ "ఒరేయ్ మెంటల్ నా కొడకా..! నేను అడిగింది ఏంటి? నువ్వు చెప్పేది ఏమిటి? తెలిస్తే తెలుసు అని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేకపోతే కాల్చిపారదొబ్బుతాను." అని చెప్పాడు షారుఖ్. అది చూసి నవ్వుకుంటూ "వాళ్లకు కూడా ఇరిటేషన్ తెప్పించినట్లు ఉన్నాడు ఇప్పుడు చూడండి." అని తన దగ్గరికి వచ్చిన ఇద్దరి వైపు చూసి "ఏంటి సర్ వెతుకుతున్నారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్. ఆ మాటకి దగ్గరికి వెళ్లి "మేము వెతుకుతున్నామని నీకు ఎలా తెలుసు?" అని అనుమానంగా అడిగాడు రజాక్. "అది కాదు సార్! అటు ఇటు చూస్తుంటే ఏమైనా వెతుకుతున్నారేమో తెలియకపోతే చెబుదామని అడిగాను." అని స్లోగా చెప్పాడు గబ్బర్ సింగ్. "మీ నలుగురు ఇక్కడ ఏం చేస్తున్నారు? ల్యాబ్ కి సెక్యూరిటీగా ఉన్నారా?" అని అడిగాడు ఖాసీం. "ఏమే సార్! మిలిటరీ ల్యాబ్ గురించి మాకు తెలియదు." అని చెప్పాడు గబ్బర్ సింగ్. ఆ మాటకి గన్ బయటికి తీసి "నేను ల్యాబ్ గురించి అడిగితే నువ్వు మిలటరీ ల్యాబ్ అంటున్నావు అంటే నీకు అన్ని విషయాలు తెలుసు మర్యాదగా ఆ ల్యాబ్ కి ఎలా వెళ్లాలో చెప్పు!" అని అడిగాడు ఖాసీం. చేతిలో గన్ వైపు భయంగా చూస్తూ క్యూబ్ వైపు చూసి "సార్ అడుగుతున్నారు కదా! నేనొక్కడినే మాట్లాడాలా..? మీ ముగ్గురు మాట్లాడరా..?" అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు గబ్బర్ సింగ్. "నువ్వే కదా! వచ్చే వెధవల్ని నేను డీల్ చేస్తాను మీ ముగ్గురు సైలెంట్ గా ఉండండి అన్నావు, మళ్ళీ మాట్లాడడం లేదని అరుస్తున్నావేమిటి!" అని కోపంగా అడిగాడు క్యూబ్. ఆ మాటకి షాక్ అయ్యి ఎదురుగా కోపంగా ఉన్న ఖాసీం వైపు చూసి "సార్! నేను మిమ్మల్ని నిజంగా వెధవలు అనలేదు అతను కావాలని అలా చెబుతున్నాడు." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. "మనకి వాళ్లతో గొడవ ఎందుకు ల్యాబ్ చూపిస్తే సరిపోతుంది కదా!" అని చెప్పి రజాక్ వైపు చూసి "ఆ సందు చివరికి వెళ్ళండి అక్కడ పెద్ద ల్యాబ్ ఉంది వెళ్ళగానే బ్లడ్ తీసి టెస్ట్ చేసి వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తారు." అని చెప్పింది పూజా. ఆ మాట విని దూరంగా ఉన్న బషీర్ వైపు చూసి "బాయ్! వీళ్ల నలుగురికి ల్యాబ్ గురించి తెలుసు కావాలని నాటకాలు ఆడుతున్నారు." అని పిలిచాడు రజాక్. ఆ మాట విని లింగి వాళ్ళ వైపు చూసి "మీరు ఇక్కడ నుంచి పోండి ఇంకొకసారి నా కంటికి కనిపించరో కాల్చిపడేస్తాను." అని చెప్పి గబ్బర్ సింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చారు బషీర్. అక్కడికి వసు సూట్ కేసు పట్టుకున్న గుప్తా వైపు చూసి "దాంట్లో ఏముంది?" అని అడిగాడు షారుఖ్. "ఈ సూట్ కేస్ లో బుక్ ఉంది ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో దాంట్లో ఉంటుంది మీ గురించి చూడమంటారా..!" అని అడిగాడు గుప్తా. ఆ మాట విని విచిత్రంగా చూస్తూ "బాయ్! వీళ్ళు నలుగురు మెంటల్ గాళ్ళు లాగ ఉన్నారు." అని చెప్పాడు ఖాసీం. అంతలో అక్కడికి వచ్చిన లింగి వాళ్ళ వైపు చూసి "మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు?" అని కోపంగా అడిగాడు బషీర్. "సారు! ఇందాక మిలటరీ ల్యాబ్ గురించి అడిగారు కదా గుర్తుకు వచ్చింది నాతో పాటు వస్తే తీసుకువెళతాను." అని చెప్పాడు లింగి. ఆ మాటకి సంతోషంగా చూస్తూ "కరెక్ట్ గా చూపిస్తే నీకు డబ్బులు కూడా ఇస్తాను." అని చెప్పి ఖాసీం వైపు చూసి "ఎందుకైనా మంచిది వీళ్ళ నలుగురిని కూడా తీసుకురండి." అని చెప్పాడు బషీర్. "నాకు డబ్బులు వద్దులే సారు రెండు కళ్ళు ఇప్పించండి పెట్టుకుంటాను." అని గుడ్డుతో కలిసి ముందుకు వెళ్ళాడు లింగి. "సరే! ఇస్తాను కానీ ముందు ల్యాబ్ చూపించు." అని చెప్పాడు బషీర్ ఖాసీం తో పాటు లింగు వాళ్లకు వెనకాలే వెళుతూ ఉన్నారు గబ్బర్ సింగ్ వారు మెయిన్ రోడ్డు నుంచి ఒక సందులోకి తీసుకువెళ్లి "సార్! ల్యాబ్ ఇక్కడే ఉంది నేను కళ్ళు అడిగాను కదా మీ నలుగురిలో ఎవరివి ఇస్తారు?" అని అడిగాడు లింగి. "ఏంట్రా? పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా..!" అని గన్ బయటికి తీసాడు బషీర్. ఆ మాట విని చేతి కర్రలో ఉన్న కత్తి తీసి బషీర్ గొంతులో పొడిచి స్పీడ్ గా బయటికి తీసి పక్కనే ఉన్న రజాక్ గుండెల్లో పొడిచాడు లింగి. అది చూసి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు గబ్బర్ సింగ్, పూజా లు. అది చూసి కోపంతో గన్ తీసి షూట్ చేయబోతున్న ఖాసీం, షారుఖ్ ల మీదకి దూకి తన చేతిలో ఉన్న కత్తులతో తల మీద పొడిచాడు గుడ్డు. నలుగురిని చంపడం చూసి భయంతో వణుకుతూ "ఏంట్రా? ఇంత దారుణంగా చంపారు మీ మాటలకి చేతలకి అసలు సంబంధం లేదు." అని టెన్షన్ చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. "సరేగాని! ఆ కారులో ఉన్న ఆరుగురిని కూడా ఇక్కడికి తీసుకురా..!" అని చెప్పాడు లింగి. "అక్కడ స్నేపర్ గన్స్ తో మన వైపే ఎయిమ్ చేసి ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడు." అని చెప్పాడు గుడ్డు. "ఏంటి స్నైపర్స్ ఉన్నారా..? ఆ విషయం తెలిసి కూడా నలుగురిని చంపేశారా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "అందుకే కదా సందులోకి తీసుకొచ్చి చంపాము లేకపోతే ఇందాకే చంపేసేవాళ్ళము." అని చెప్పాడు లింగి "ఏంటి! వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయడానికి మనల్ని పంపించారా..!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది పూజా. గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "త్వరగా వెళ్లి వాళ్ళ ఆరుగురు కూడా తీసుకురా ఆయుషు తీరిపోయే సమయం వచ్చింది." అని చెప్పాడు గుప్తా. ఆ మాటకి ఉలిక్కిపడి చూసి "నువ్వు ఉండవయ్యా బాబు! టెన్షన్తో చచ్చిపోతుంటే నీ బుక్కు గోల ఒకటి, అక్కడికి వెళితే నా ఆయుషు తీరిపోతుంది." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. "సరే! నేను వెళ్లి ఆ ఆరుగురు ఇక్కడికి తీసుకు వస్తాను మీరు రెడీగా ఉండండి." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు క్యూబ్. చనిపోయి కిందపడి ఉన్న బషీర్ వాళ్ల వైపు చూసి "అక్కడ అయితే బులెట్ తగిలి హాయిగా చచ్చేవారు అనవసరంగా ఇక్కడికి వచ్చి దారుణంగా చచ్చారు." అని చెప్పాడు గబ్బర్ సింగ్. "ఆ నలుగురి చావు వీళ్ళిద్దరి చేతిలో రాసిపెట్టి ఉంటే అక్కడ ఎలా చస్తారు." అని చెప్పాడు గుప్తా. "ఏంటి! వీళ్ళ చేతిలో రాసిపెట్టి ఉందా? ఎవరు రాసారు నువ్వు రాసావా..?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "అవును నేనే రాశాను." అని స్టైల్ గా నుంచొని చెప్పాడు గుప్తా. ఆ మాట విని లింగు చూసి "విన్నావా..? ఇతను రాశాడు అంట!" అని చెప్పాడు గబ్బర్ సింగ్. "ఏమో సార్ నాకు కనపడదు నా తమ్ముడికి వినపడదు." అని చెప్పాడు లింగి. ఆ మాటకి గుప్త వైపు విచిత్రంగా చూస్తూ "నలుగురిని కసా కసా పొడిచి ఇప్పుడు అమాయకంగా పేస్ పెట్టి ఎలా మాట్లాడుతున్నాడో, ఇది చూడడానికి నేను ఇంకా బతికి ఉన్నాను, నా చావు ఎప్పుడో మీరు రాయలేదా..?" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు గబ్బర్ సింగ్. బుక్ ఓపెన్ చేసి చూస్తూ "నీ చావు నీ పెళ్ళాం చేతిలోనే రాసిపెట్టి ఉంది." అని చెప్పాడు గుప్తా. "అవునా? ఇంకా ఆ బుక్కు మూసేయ్! నన్ను హిమాలయాలకు తీసుకువెళ్తాను అని చెప్పారు కదా ఇంక అక్కడే ఉంటాను జన్మలో ఇంటికి వెళ్ళాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్. " రుద్రం భజే! ఎపిసోడ్ 34 " రచనకు రేటింగ్ ఇవ్వండి.........
13-05-2026, 01:02 AM
Marvelous update. Comedy touch kuda baane undi
13-05-2026, 05:34 AM
(This post was last modified: 13-05-2026, 05:35 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
రుద్రం భజే! ఎపిసోడ్ 35
బషీర్ వాళ్ళ నలుగురిని చంపి గబ్బర్ సింగ్ వాళ్ళ వైపు చూసి వెళ్లి ఆ కారులో ఉన్న ఆరుగురిని కూడా ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు లింగి.
************* లింగి చెప్పడంతో "నేను వెళ్లి వాళ్ళని తీసుకు వస్తాను." అని చెప్పి వేళుతూ తన మీద పడుతున్న రెడ్ డాట్స్ చూసుకుని నవ్వుతూ కార్ దగ్గరికి వెళ్లి "బషీర్ భాయ్ మిమ్మల్ని రమ్మంటున్నాడు." అని చెప్పాడు క్యూబ్. ఆ మాట విని కార్ దిగుతూ "బాయ్ సిగ్నల్ ఇస్తానన్నాడు నిన్ను పంపించాడు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు వాళ్లలో ఒకడు. "ఆ విషయం నాకు తెలీదు కారులో ఉన్న ఆరుగురిని దూరంగా ఉన్న ఇద్దరి స్నైపర్స్ ని కూడా రమ్మని చెప్పాడు తర్వాత మీ ఇష్టం!" అని అక్కడి నుంచి బయలుదేరాడు క్యూబ్. అది చూసి "ఆగు ఆగు!" అని దూరంగా ఉన్న స్నైపర్స్ రమ్మని సిగ్నల్ ఇచ్చి క్యూబ్ వెనకలా వెళుతూ "మేము వెతుకుతున్న వాళ్ళు దొరికారా..?" అని అడిగాడు వాళ్ళలో ఒకడు. "హా.. దొరికారు వాళ్ళని తీసుకుని బషీర్ వాళ్ళు రెడీ గా ఉన్నారు మీరు కూడా వస్తే ఇంకా వెళ్లొచ్చు!" అని చెప్పి సందు చివర కనిపిస్తున్న పూజా వైపు చూసి సైగ చేశాడు క్యూబ్. అది చూసి "అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్యూబ్ తీసుకు వస్తున్నాడు రెడీగా ఉండండి." అని చెప్పింది పూజా. "సరే! మీరు ఆ బాడీలు తీసుకొని వెనక్కి వెళ్ళండి వాళ్ల సంగతి మేము చూసుకుంటాము." అని చెప్పాడు లింగి. నాలుగు బాడీల్ని అక్కడ నుంచి వెనక్కి లాగుతూ "ఇంత బరువు ఉన్నారేమిటి!" అని ఆయాస పడుతూ బుక్ చూసున్న గుప్త వైపు చూసి "కాస్త హెల్ప్ చేయొచ్చు కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్. అంతలో అక్కడ ప్రత్యక్షమైన యమకింకారుల వైపు చూసి "మీకు బొత్తిగా టైమ్ సెన్స్ లేకుండా పోతుంది ఇంత లేటుగా వస్తారా..?" అని కోపంగా అడిగాడు గుప్తా. ఆ మాటలు విని తలపైకి ఎత్తి చూసి "ఆ బుక్ చూసి చూసి నీకు పిచ్చి ఎక్కిందా ఏమిటి? ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగింది పూజా. 'ఓహో మర్చిపోయాను మీ కళ్ళకు మాయా కమ్ముకుని ఉంటుంది కదా!' అని మనసులో అనుకుని "మా అసిస్టెంట్స్ వచ్చారు మీరు తప్పుకోండి ఆ నలుగురిని వాళ్ళు పక్కకి తీసుకువెళతారు." అని చెప్పాడు గుప్తా. ఆ మాట విని వెనక్కి తిరిగి అక్కడ నల్లగా లావుగా ఉన్న ఇద్దరిని చూసి ఉలిక్కిపడి "వీళ్లిద్దరు ఎప్పుడు వచ్చారు?" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్. "మా వాళ్లు కరెక్ట్ టైం కి వస్తారు కానీ ఈసారి కాస్త లేట్ అయింది." అని చెప్పాడు గుప్తా. "హమ్మయ్య!" అని నడుము పట్టుకుని కాస్త ముందుకు వచ్చి వెనక్కి తిరిగి నలుగురు బాడీ కనిపించకపోవడంతో "మీ వాళ్ళు అప్పుడే తీసుకు వెళ్లిపోయారా..? అంత ఫాస్ట్ గా ఉన్నారా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "ఏంటి? నలుగురిని అంత ఫాస్ట్ గా ఇద్దరు తీసుకువెళ్లిపోయారా..? అసలు వాళ్ళు మనుషులేనా?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా. "మా వాళ్ల గురించి మీకు ఇప్పుడు తెలియదులే టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుంది ముందు ఇక్కడికి వచ్చే వాళ్ళ సంగతి చూడండి." అని చెప్పాడు గుప్తా ఆ మాట విని గన్ బయటికి తీసి వణుకుతున్న చేతిని గట్టిగా పట్టుకుని "మేడమ్ మీరు బయపడకండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్. "సరే! ముందు నువ్వు భయపడకు." అని చెప్పి గబ్బర్ సింగ్ వెనకాల నుంచుని చూస్తూ ఉంది పూజా. అంతలో క్యూబ్ తో పాటు అక్కడికి వచ్చి లింగి వాళ్ళ వైపు చూసి "బషీర్ భాయ్ ఎక్కడ?" అని అనుమానం గా అడిగాడు వాళ్ళలో ఒకడు "నాకు ఎందుకో అనుమానంగా ఉంది అక్కడ రక్తం ఉంది ఏంటి?" అని గన్ బయటికి తీసాడు వాళ్ళలో ఒక ఒకడు. అది చూసి "గన్ బయటికి తీసేడు షూట్ చెయ్!" అని గబ్బర్ సింగ్ ముందుకు తోసింది పూజా. ముందుకి పడుతూ చేతీలో ఉన్న పేలడంతో గన్ తీసిన వ్యక్తి తలలోకి వెళ్ళింది బుల్లెట్. బుల్లెట్ తగిలిన మనిషి వెనక్కి పడిపోవడం చూసి "వీళ్లని చంపేయండి." అని గట్టిగా అరిచాడు వాళ్ళలో ఒకడు. ముందుకు వస్తున్న మిగతా వాళ్ళ గొంతులో కనురెప్ప వ్యవధిలో కత్తులు దింపి వెనక్కి తిరిగి గబ్బర్ సింగ్ వైపు చూసి "మీరు దూరం నుంచి కూడా గురి తప్పకుండా చాలా కరెక్ట్ గా షూట్ చేశారు. " అని మెచ్చుకుంటూ చెప్పాడు గుడ్డు. ఆ మాట విని అయోమయంగా చూస్తూ పైకి లేచి పూజ వైపు చూసి "నన్ను ఎందుకు తోసేవు? కింద పడిపోయే కంగారులో ట్రిగ్గర్ కి నా వేలు తగిలింది." అని కంగారుగా చెప్పాడు గబ్బర్ సింగ్. అక్కడికి వస్తు "నువ్వు కావాలని ఆ మనిషిని షూట్ చేయలేదా?" అని అనుమానంగా అడిగాడు క్యూబ్. "నేను షూట్ చేయడం ఏంటి నా బొంద! కింద పడిపోతుంటే వేలు తగిలి పేలిపోయింది అన్యాయంగా నా చేతిలో ఒకడు చచ్చిపోయాడు." అని చెప్పాడు గబ్బర్ సింగ్. "అతని చావు నీ చేతిలో రాసిపెట్టి ఉంది నువ్వు చంపాలి అనుకోకపోయినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది." అని చెప్పాడు గుప్తా. అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి "యోధ! ఇక్కడ అంత క్లియర్ మనవాళ్ళు నేను చెప్పినట్లు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు." అని చెప్పింది పూజా. ఫోన్ మాట్లాడుతున్న పూజ దగ్గరికి వెళ్లి "మేడం! నా గురించి కూడా కొంచెం చెప్పండి." అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు గబ్బర్ సింగ్ "ల్యాబ్ సీసీ కెమెరాలో జరిగేదంతా నేను చూస్తూనే ఉన్నాను కానీ, అక్కడ లింగి వాళ్ళు చాలు మీరు వెనక్కి వచ్చేయండి." అని చెప్పాడు యోధ. ఆ మాట విని చుట్టూ చూస్తూ "మొత్తం చూసేసావా? ఇదిగో లింగి మాట్లాడతాడంట!" అని ఫోన్ ఇచ్చింది పూజా. ఫోన్ తీసుకుని "జై భవాని! మేము ఇక్కడ ఉండగా ఎటువంటి భయం లేదు మీ పనిలో మీరు ముందుకు వెళ్ళండి మా అభిర్ సేనా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది." అని చెప్పాడు లింగి. "చాలా థాంక్స్!" అని చెప్పి ఫోన్ పెట్టేసేడు యోధ. ఫోన్ తీసుకుంటూ "నేను వాడిని షూట్ చేసి చంపకపోతే ఈరోజు నీ పని అవుట్! ఆ విషయం నీకు తెలుసా..? అని అడిగాడు గబ్బర్ సింగ్. "ఏమో సార్! నాకు కనబడదు నా తమ్ముడికి వినపడదు." అని చెప్పాడు లింగి. "బాబోయ్ ఆపరా బాబు! చంపడానికి నీకు బుల్లెట్స్ కూడా అవసరం లేదు." అని దండం పెడుతూ అక్కడి నుంచి కారు దగ్గరికి పరిగెత్తాడు గబ్బర్ సింగ్. ************* ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చిన గబ్బర్ సింగ్ వాళ్ళని చూసి "మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చినందుకు కంగ్రాట్స్!" అని చెప్పింది సుహా. ఆ మాటకి నవ్వుతూ స్టైల్ గా గన్ తిప్పుతూ "యోధ సర్ బుల్లెట్స్ వేస్ట్ చేయద్దు అన్నారని నేను ఒక్క బుల్లెట్ మాత్రమే యూస్ చేశాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్. "అది కూడా నేను ముందుకు తోయడం వల్లే!" అని వెటకారంగా చూస్తూ లోపలికి వెళ్ళింది పూజా. భూషణ్ వాళ్ళతో ఉన్న ధర్మ దగ్గరికి వెళ్లి "సార్! మనం వచ్చిన పని అయింది ఇంకా వెళదామా?" అని అడిగాడు గుప్తా. "మీ పని ఇంకా అవలేదు చాలా ఉంది కాసేపు వెయిట్ చేయండి." అని చెప్పాడు నంద. ఆ మాట విని డౌట్ గా చూస్తూ "మళ్ళీ ఇక్కడికి ఎవరైనా వస్తున్నారా..?" అని అడిగాడు ధర్మ. అంతలో అక్కడికి కారు రావడం చూసి "అదిగో మాటల్లోనే వచ్చేసాడు." అని చెప్పాడు నంద. కారులో నుంచి దిగుతున్న మనిషిని చూసి బుక్ ఓపెన్ చేసి "ఇతని పేరు విఠల్! చావు ఇంకా దగ్గర పడలేదు ఇంకా చాలా టైమ్ ఉంది." అని చెప్పాడు గుప్తా. ఆ మాటకి నవ్వుతూ "కాసేపు వెయిట్ చేయండి మీకు తెలుస్తుంది." అని చెప్పాడు నంద. కార్ దిగిన విఠాల్ దగ్గరికి వెళ్లి షేక్ అండ్ ఇస్తూ "హాయ్! నీ కోసమే వెయిట్ చేస్తున్నాము." అని లోపలకి తీసుకెళ్లి కంప్యూటర్లో యంగ్, భూపాల్ సింగ్ లో ఫోటోలు చూపించి "ఈ ఇద్దరి లాగ మాలో ఇద్దరిని తయారు చేయాలి టుడేస్ మాత్రమే టైమ్ ముంది." అని చెప్పాడు యోధ. "అవునా? అని కంప్యూటర్ లో ఫోటోలు చూస్తూ అంత ఫాస్ట్ గా రెడీ చేయాలి అంటే కొంచెం కష్టమే! మీరు వెళ్ళేది బోర్డర్ దాటి అనుమానం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది." అని చెప్పాడు విఠల్. "అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కాలేదు." అని డౌట్ గా చూస్తూ అడిగింది దీప్తి. "తన పేరు విఠల్! మేమందరం ముద్దుగా విఠలాచార్య అని పిలుస్తాము, మేకప్ క్రియేటివిటీ తో మనం చూపించిన మనిషి ఫేస్ ఎలా ఉంటుందో అలాగా మనల్ని తయారు చేయగలడు. కాకపోతే బాడీ స్ట్రక్చర్ కూడా కొంచెం మ్యాచ్ అవ్వాలి మేము ఇలా చేసి చాలాసార్లు బోర్డర్ దాటి ఎంటర్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళము." అని నవ్వుతూ చెప్పేడు యోధ. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ దూరంగా ఉన్న ధర్మ గుప్తాలని చూసి "ఆ ఇద్దరు అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతారు." అని చెప్పాడు విఠల్. ఆ మాట విని "మనకి భూలోక ప్రయాణం ఉంది అంటే వెంటనే తిరిగి వెళ్ళడం కుదరదు అని నేను ముందే అనుకున్నాను." అని చెప్పాడు గుప్తా. "అంటే! ఆ ఇద్దరు లాగా మమ్మల్ని తయారు చేస్తాడా.? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి?" అని అనుమానంగా అడిగాడు ధర్మ. "హిమాలయాలకి కైలాస పర్వతం దగ్గర పొంచి ఉన్న రాక్షసుల దగ్గరకి మీతో పాటు మేము కూడా ప్రయాణం అవుతాము." అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్. "అవునా? రాక్షస సంహారంతో పాటు ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం కుడా అవుతుందన్నమాట సరే మేము సిద్ధం!" అని చెప్పాడు ధర్మ. విఠల్ చెప్పింది విని "సరే! ఆ ఇద్దరిని రెడీ చెయ్ నాయక్ సార్ దగ్గరికి తీసుకు వెళదాము." అని చెప్పాడు యోధ. "అది సరే! దీనికి వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి కదా!" అని డౌట్ గా అడిగింది సుహా. "ఆ ఇద్దరిని నేను ఒప్పిస్తాను." అని చెప్పాడు భూషణ్. ఆ మాట విని భూషణ్ వైపు చూస్తూ "ఇప్పటివరకు అక్కడ ఉన్నాడు కదా మన వెనక్కి ఎప్పుడు వచ్చాడు? " అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.
13-05-2026, 05:37 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 36
ఫ్యాక్టరీ గోడౌన్ దగ్గరికి వచ్చి భూపాల్ సింగ్, యంగ్ ఫోటోలు చూసి వీళ్ళలాగా తయారు చేయడానికి వాళ్ళిద్దరూ కరెక్ట్ గా సరిపోతారు అని ధర్మ, గుప్తాలని చూపించాడు విఠల్.
************* విఠల్ చెప్పింది విని "అసలు ధర్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా!" అని అడిగినా దీప్తి మాట విని "నేను ఒప్పిస్తాను." అని వెళ్ళాడు భూషణ్. "భూషణ్ ఇప్పుటి వరకు అక్కడే ఉన్నాడు కదా మన వెనక్కి ఎప్పుడు వచ్చాడు?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా. "అవును! వీళ్లు చాలా మిస్టేరియస్ గా ఉన్నారు ఇలాంటి ఏంజెంట్స్ ని నేను ఇప్పుడు వరకు చూడలేదు." అని చెప్పింది నీతూ. "మేడం! ఆ గుప్తా అయితే బుక్కు తీసి ఎవరి చేతిలో ఎవరు పోతారో చెప్పేస్తున్నాడు నా గురించి కూడా ఒక భయంకరమైన నిజం చెప్పాడు." అని డల్ గా చెప్పాడు గబ్బర్ సింగ్. "గుప్త చెప్పింది నేను విన్నాను నా దగ్గర ఒక ఐడియా ఉంది విఠల్ దగ్గరికి వెళ్లి నీ వేషం కుడా మార్చేయమను అప్పుడు మీ ఆవిడ నిన్ను గుర్తుపట్టదు." అని చెప్పింది పూజా. ఆ మాట విని సంతోషంగా విఠల్ దగ్గరికి వెళ్లి "సార్! చిన్న రిక్వెస్ట్ నన్ను ఎవరు గుర్తు పట్టకుండా మార్చగలరా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్. ఆ మాటకి తలతిప్పి గబ్బర్ సింగ్ వైపు చూసి "నీకు మేకప్ వేయాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ అధికారి అని చెప్పు చాలు ఎవరు నమ్మరు." అని చెప్పాడు విఠల్. "మీరు చెప్పింది కరెక్టే!" అని మాట్లాడకుండా వెనక్కి వచ్చాడు గబ్బర్ సింగ్. ధర్మ, గుప్తాలని వెంటపెట్టుకుని వచ్చి "వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు కానీ ఒక కండిషన్ ఉంది." అని చెప్పాడు భూషణ్. "ఏంటి ఆ కండిషన్!" అని అడిగాడు యోధ. "నా చేతిలో కర్ర గుప్తా చేతిలో సూట్ కేస్ ఎప్పుడూ ఉంటాయి దానికి ఓకే అంటేనే మేము అక్కడికి వెళతాము." అని చెప్పాడు ధర్మ. 'ఇంకా నయం ఆ రెండు మోయడానికి నేను కూడా రావాలని చెప్పలేదు.' అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్. ఆ మాట విని గబ్బర్ సింగ్ వైపు చూసి "ఆ రెండు మోస్తూ నువ్వు మా వెనకాల వచ్చిన అభ్యంతరం లేదు." అని చెప్పాడు గుప్తా. ఆ మాట విని పక్కనే ఉన్న పుష్కర్ వైపు చూసి "నేను మనసులో అనుకున్నా మాట గుప్తాకి ఎలా వినిపించింది?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "నువ్వు మాట్లాడిన మాట మా అందరికీ కూడా వినిపించింది మనసులో అనుకుంటున్నాను అనుకుని పైకి మాట్లాడేసావు." అని చెప్పింది పూజా. ఆ మాటకి ఆలోచిస్తున్న గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "ఏంటి నువ్వు మనసులో అనుకుంటే పైకి వినపడుతుందా..?" అని నవ్వుతూ అడిగాడు క్యూబ్. "అవును సార్! మీకు కూడా వినిపించిందా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "నాకు కూడా వినిపించిందిలే కానీ అలా జరగకుండా ఉండాలంటే నా అప్పు తీర్చేయ్ అప్పుడు నీ మనసులో మాట నీలోనే ఉంటుంది." అని చెప్పాడు క్యూబ్. ఆ మాట విని క్యూబ్ ని కిందనుంచి పైకి చూసి "ఎవరు నువ్వు? నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నావు." అని అడిగాడు గబ్బర్ సింగ్. "సరే నీ కర్మ!" అని చెప్పాడు క్యూబ్. ధర్మ, గుప్తాల వైపు చూసి "మీ కండిషన్స్ ఓకే ముందు స్క్రీన్ టెస్ట్ చేయించుకోండి." అని చెప్పాడు యోధ. "సరే!" అని విఠల్ తో పాటు రూమ్ లోకి వెళ్లారు ధర్మ, గుప్తాలు. అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారుగా చూస్తూ "స్విచ్ ఆఫ్ చేశాను అనుకున్నాను." అని చెప్పి నెమ్మదిగా బయటికి తీసాడు గబ్బర్ సింగ్. బయటికి తీసిన ఫోన్ ని చూసి "ఇది బషీర్ ఫోన్ కదా నీ దగ్గర ఉంది ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు ముష్రు. "అదా! ఎలాగో పోయాడు కదా వాడికి ఫోన్తో పనేముందిలే కొత్త మోడల్ లాగా ఉంది అని తీసుకున్నాను." అని బిత్తర చూపులు చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. "నువ్వు వెధవ పని చేసినా ఉపయోగపడే పని చేశావు." అని ఫోన్ తీసుకుని చుసి "సయ్యద్ కాల్ చేస్తున్నాడు." అని మష్రూ వైపు చూసి "లిఫ్ట్ చేసి నేను ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాను బహిర్ వాళ్ళు ఆ ఇద్దరి కోసం ల్యాబ్ దగ్గరకు వెళ్లారు అని నమ్మేటట్లు చెప్పాలి." అని చెప్పాడు యోధ. "ఓకే సార్!"అని ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి "సయ్యద్ భాయ్! నేను ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాను బషీర్ వాళ్ళు ల్యాబ్ దగ్గరకు వెళ్లారు." అని చెప్పాడు ముష్రు. ఫోన్లో మాట్లాడుతున్న సయ్యద్ వైపు చూసి లాప్టాప్ లో లొకేషన్స్ చూస్తూ ఫోన్ తీసుకుని "ముష్రు! యంగ్ లోకేషన్ ఆ వస్తువు లొకేషన్ నువ్వు ఉన్న ఏరియా లోనే కనబడుతుంది ఎలాగైనా లోపలికి వెళ్లి మన వాళ్ళ మీద ఎటాక్ చేసిన వాళ్లతో ఒక్కసారి మాట్లాడించు." అని చెప్పాడు కళింగ. "సార్! మనవాళ్లే లోపలికి వెళ్లలేకపోతున్నారు నేను ఎలా వెళ్ళగలను? వాళ్లతో ఫోన్ ఎలా మాట్లాడించగలను?" అని కంగారుగా చెప్పాడు ముష్రు. "ఎలా వెళ్తావో ఎలా మాట్లాడిస్తావో నువ్వే డిసైడ్ చేసుకో ఇది చేస్తే నీ లైఫ్ మారిపోతుంది." అని చెప్పాడు కళింగ. ఫోన్లో కళింగ చెబుతుంది విని 'ఒప్పుకో!' అని సైగ చేసేడు యోధ. "ఓకే సర్! మీ కోసం ట్రై చేస్తాను." అని చెప్పాడు ముష్రు. "గుడ్! నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని ఫోన్ కట్ చేశాడు కళింగ. ఫోన్ పెట్టేసిన కళింగ దగ్గరికి వెళ్లి "సైంటిస్ట్! ఆ ముష్రుని కుడా లోపలికి ఎందుకు వెళ్ళమన్నావు? అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే వాడు బయటే ఉండాలి." అని చెప్పాడు సయ్యద్. "నువ్వు ఒక విషయం మర్చిపోయావు సయ్యద్! ఒక్కసారి మనతో ఫోన్లో మాట్లాడిన వాడు మళ్ళీ మాట్లాడలేదు ముష్రూ మాత్రమే మాట్లాడుతున్నాడు. అంటే యంగ్ వాళ్ళు ఎవరి హ్యాండ్ ఓవర్ ఉన్నారో ముష్రు కుడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాడు, వాళ్లే వీడితో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ వస్తుంది దీని వెనకాల ఉన్న వాడు మనతో మాట్లాడుతాడు చూస్తూ ఉండు." అని చెప్పాడు కళింగ. "అంటే! బషీర్ వాళ్ళందరూ చచ్చిపోయారా..?" అని కంగారుగా అడిగాడు సయ్యద్. "నాకు తెలిసి అక్కడికి వెళ్లినా నీ మనుషులు ఎవరు బతికి లేరు." అని చెప్పాడు కళింగ. అక్కడికి వస్తూ "అవును కళింగ చెప్పింది కరెక్ట్! నేను ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడాను వాళ్ళ మాటల్లో నాకు కాన్ఫిడెన్స్ కనిపించింది. నా డౌట్ నిజమైతే యంగ్ వాళ్ళు మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉండి ఉంటారు." అని చెప్పాడు చింగ్ యా. "అలా అయితే ఆ వస్తువు యంగ్ ఇద్దరు మన చేతిలో నుంచి పోయినట్టేనా..!" అని కంగారుగా అడిగాడు సయ్యద్. జింగ్ తో కలిసి అక్కడికి వస్తూ "నేను ఉండగా అలా జరగదు." అని చెప్పాడు రేపాలా. ఆ మాట విని "ఏం చేస్తావు? నువ్వు వెళ్లి తీసుకు వస్తావా..?" అని అడిగాడు సయ్యద్. "నేను కాదు జింగ్ తో పాటు నా మనుషులు వెళ్లి బోర్డర్ లో ఉన్న ఇండియన్ మిలిటరీ సోల్జర్స్ ని ప్రాణాలతో తీసుకువస్తారు తర్వాత ఏం చేయాలో తెలుసు కదా!" అని నవ్వుతూ చెప్పాడు రేపాలా. ఆ మాట విని "ఏంటి! బోర్డర్లో ఉన్న ఇండియన్ సోల్జర్స్ ని కిడ్నాప్ చేస్తారా...? అది అయ్యే పని కాదు వెళ్లిన వాళ్లు వెనక్కి రారు." అని చెప్పాడు చింగ్ యా. "అక్కడికి వెళ్ళేది నీ మనుషులు సయ్యద్ మనుషులు కాదు నేను సృష్టించిన సైన్యం! అక్కడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి." అని చెప్పాడు రేపాలా. ************* ఫ్యాక్టరీ దగ్గర ముష్రు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని "కళింగ మనతో ఫోన్ ఎందుకు మాట్లాడించమన్నాడు? ఒక వేళ మష్రూ మీద అనుమానం వచ్చిందంటారా..?" అని అడిగాడు యోధ. "నాకు తెలిసి డెఫినెట్గా అనుమానం వచ్చింది." అని చెప్పింది సుహా. "సరే! ఒకవేళ అనుమానం వచ్చింది అనుకోండి మనతో మాట్లాడించమని ఎందుకు చెప్పాడు? ఏం మాట్లాడతాడు?" అని డౌట్ గా అడిగాడు రాఖి. "యంగ్ ని ఆ వస్తువుని తీసుకుని అక్కడికి రమ్మని చెపుతాడు." అని చెప్పాడు నంద. "ఫోన్లో చెబితే మనం తీసుకువెళ్లి వాళ్ళకి అప్ప చెబుతామా ఏంటి!" అని అడిగింది నీతూ. "మనం అక్కడకి వచ్చేలాగా ఏదో చేయబోతున్నారు." అని ఆలోచిస్తూ చెప్పాడు యోధ. ఆ మాట విని ముష్రు వైపు చూసి "అసలు ఆ ల్యాబ్లో యంగ్ లాంటి వాళ్ళని తయారు చేయడమేనా ఇంకా వేరే ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా...?" అని అడిగింది దీప్తి. "యంగ్ మీద చేసిన ప్రయోగం చాలా చిన్నది అది ఇంకా పూర్తి అవలేదు ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది." అని చెప్పాడు ముష్రు. "అవునా? అయితే మరి ఆ ల్యాబ్ లో చేస్తున్న ప్రయోగాలు ఏమిటి?" అని అనుమానంగా అడిగింది సుహా. "ఈ భూమి మీద మనకి తెలిసిన జంతువులు కొన్ని మాత్రమే ఎప్పుడు చూడనటువంటి అంతరించిపోయిన జంతువులు కొన్ని వేల జాతులు ఉన్నాయి. అంతరించిపోయిన జాతులలో కొన్ని మానవుడికి ఉపయోగపడేవి ఉన్నాయి కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి. అలా ఉపయోగపడే కొన్ని జాతుల జంతువులను, పక్షులను తిరిగి సృష్టించడానికి యునైటెడ్ అమెరికా కొన్ని దేశాలుతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంత మంది సైంటిస్టులను ఎంపిక చేశారు. ఆ సైంటిస్టులలో కళింగ కూడా ఒకడు కొన్ని టీములుగా విడిపోయి అంతరించిపోయిన జంతువులు పక్షుల డీఎన్ఏలు సేకరించడం మొదలుపెట్టారు. ప్రపంచ నలుమూలల నుంచి సేకరించిన డిఎన్ఏ లని టెస్ట్ చేసి వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయని వాటి వల్ల మనిషి మనుగడకే ప్రమాదం అని గ్రహించి ఆ డిన్ఏలను టెస్ట్ చేయడం బ్యాన్ చేశారు. ఆ టైమ్ లోనే టిబేట్ లో కళింగ కి చైనా మిలిటరీ జనరల్ చింగ్ యా పరిచయం అయ్యాడు." అని చెప్పాడు ముష్రు. తను చెప్పింది విని "ఆ ల్యాబ్ లో ఆ జంతువుల డిఎన్ఏలతో ఏమైనా ప్రయోగాలు చేశారా..?" అని డౌట్ గా అడిగింది దీప్తి. "ఎస్!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముష్రు. "కృత్రిమంగా ఏ జంతువులైన తయారు చేశారా..?" అని అనుమానంగా అడిగింది సుహా. " రుద్రం భజే! ఎపిసోడ్ 36 " రచనకు రేటింగ్ ఇవ్వండి
13-05-2026, 05:54 AM
13-05-2026, 06:12 AM
Sooper unnay updates..
Guddu Lingu episodes reminded of the earlier story!!
14-05-2026, 06:34 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 37
ముష్రు చెప్పింది విని ల్యాబ్లో ఏ డిఎన్ఎతో అయినా కృత్రిమంగా జంతువును సృష్టించిరా.. అని అడిగింది దీప్తి.
*********** దీప్తి అడిగినాదానికి సైలెంట్ గా ఉన్న ముష్షు దగ్గరికి వెళ్లి "ఏంట్రా? ఏ డైనోసార్ నైనా మళ్ళీ పుట్టించారా...?" అని కంగారుగా అడిగింది పూజా. "డీఎన్ఏ క్లోనింగ్ ప్రాసెస్ లో మూడు రకాలు ఉంటుంది ఒకటి ఈమధ్యకాలంలో అంతరించిపోయినా జంతువులను సులభంగా క్లోనింగ్ ద్వారా మళ్ళీ సృష్టించొచ్చు ఆ ప్రయోగం అన్ని దేశాలలో చేస్తున్నారు. రెండవది కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల డీఎన్ఏలు దొరికినప్పుడు వాటిని ప్రాసెసింగ్ చేసి పోలికలు ఉన్న జంతువు డిఎన్ఏ తో మిక్స్ చేసి అంతరించిపోయిన జంతువులు మళ్ళీ సృష్టించవచ్చు. మూడోది మీరు అడిగిన డైనోసార్ లాంటి జంతువు దానిని డిఎన్ఏ ఇప్పటివరకు ఎక్కడ లభించలేదు అటువంటి వాటిని మళ్లీ సృష్టించి కృత్రిమంగా జంతువును సృష్టించడం ఇప్పటివరకు ఎవరు చేయలేదు అది సాధ్యం కాదు మేము టిబెట్ లో ఉన్నప్పుడు కళింగ కి చింగ్ యా పరిచయమయ్యాడు వాళ్లు మీ దగ్గర ఉన్న వస్తువు కోసం వెతికే క్రమంలో హిమాలయాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన కొన్ని జంతువుల కళేబరాలు దొరికాయి అక్కడకి మమ్మల్ని తీసుకువెళ్లి చూపించాడు. అక్కడే ఉన్న వాటిలో ఎక్కువగా మంచు తోడేళ్ల కళేబరాలు ఉన్నాయి అవి ఇప్పుడున్న తోడేళ్లు కన్నా నాలుగు రెట్లు పెద్దగా బలిష్టంగా ఉంటుంది మనిషిని ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేస్తుంది. ఆ మంచు తోడేలు యొక్క పన్ను తలభాగం దొరకడంతో వాటి ద్వారా డీఎన్ఏ ప్రాసెసింగ్ చేసి క్లోనింగ్ లో తోడేళ్లను సృష్టించాడు వాటిని చూస్తేనే మనం భయంతో ముందు చనిపోతాము. ఆ ల్యాబ్ చుట్టూ నైట్ టైమ్ అవే సెక్యూరిటీగా ఉంటాయి అందుకే అక్కడికి ఎవరు వెళ్లిన వారు ఎవరు తిరిగి రాలేకపోయారు. ఆ ప్రయోగంలో ఉండగానే మాకు రేపాలా పరిచయం అయ్యాడు అతని దగ్గర ఉన్న విద్యతో కళింగ, యంగ్ తయారు చేశాడు కానీ అతని బ్లడ్ తో తయారైన జంతువు 24 గంటల కన్నా ఎక్కువ టైమ్ బ్రతకదు. కానీ ఆ జంతువు చనిపోయిన తర్వాత దాని నుంచి ఒక కొత్త రకం వైరస్ గాలిలో కలుస్తుంది అందుకోసమే ఫార్మా కంపెనీ వాళ్ళు కళింగ కి కొన్ని వేల కోట్లు ఫండింగ్ ఇచ్చారు ఆ ప్రయోగం చేసే లోపు మీరు యాంగ్ ని కిడ్నాప్ చేశారు." అని చెప్పాడు ముష్రు. "ఆ ల్యాబ్ దగ్గరికి వచ్చిన రేపాల కళింగకి వేరే ప్రయోగం గురించి ఏమి చెప్పలేదా..?" అని అడిగాడు నంద. "రేపాలా కొన్ని గ్రంథాలు తీసుకువచ్చాడు దాని ద్వారా ఒక లిక్విడ్ ని తయారు చేశారు దాంతో హిమాలయాలలో ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్లి ప్రయోగం చేశారు ఆ లిక్విడ్ పోయగానే అక్కడ ఉన్న మంచు మొత్తం కరిగిపోయింది. మంచు కరిగిపోవడంతో అక్కడ ఒక గుహ బయటపడింది లోపలి నుంచి చాలా భయంకరమైన శబ్దాలు వినిపించాయి రేపాలా ఆ గుహలోకి వెళ్లి నెలరోజుల తర్వాత బయటికి వచ్చాడు లోపల ఏం చేశాడో ఎవరికీ తెలియదు. ఆ విషయం తెలిసి చింగ్ యా అటువంటి లిక్విడ్ నాకు కావాలి అని అడిగాడు దానికోసమే ఇప్పుడు ల్యాబ్లో ప్రయోగం జరుగుతుంది అది సక్సెస్ అయింది అంటే ఇండియాకి రక్షణ కవచం లాగా ఉన్న హిమాలయాలు ఇంకా ఉండవు." అని చెప్పాడు ముష్రు. "ఏంటి? రేపాలా, కళింగ కలిసి ఒక లిక్విడ్ ని సృష్టించారా..? దాంతో మంచు కరిగిపోతుందా..?" అని ఆశ్చర్యంగా అడిగింది దీప్తి. "ఎస్! వన్ ఎంఎల్ లిక్విడ్ తో రెండు కిలోమీటర్ల వరకు మంచు కరిగిపోతుంది." అని చెప్పాడు ముష్రు. "ఆది జరిగి హిమాలయాలు కరిగిపోతే ఈ సృష్టి అంతమవుతుంది భూమి మీద ఎవరు బతికి ఉండరు." అని చెప్పాడు నంద. "అవును! హిమాలయాల అడుగున భయంకరమైన వైరస్ ఉంది అది మంచు కప్పి ఉండడం వల్ల బయటికి రావడం లేదు ఆ మంచు కరిగిపోతే అది బయటికి వస్తుంది అప్పుడు నంద చెప్పింది జరుగుతుంది." అని చెప్పాడు ముష్రు. ఆ మాట విని యోధ వైపు చూసి "నువ్వు వెంటనే కళింగతో మాట్లాడు మనం ఆ ల్యాబ్ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి." అని చెప్పింది సుహా. "మనుషుల ప్రయోజనం కోసం ప్రయోగాలు చేస్తే కొంతమంది వాటిని మనుషుల్ని అంతం చేయడానికి వాడుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళని హిమాలయాలో తొక్కి చంపాలి." అని కోపంగా ముష్రు చేతికి ఫోన్ ఇచ్చి "కళింగ కి కాల్ చెయ్!" అని చెప్పాడు యోధ. "ఆ ప్రయోగాలు చేస్తున్నారు ఓకే మారి ఈ వస్తువు కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?" అని డౌట్ గా అడిగింది నీతూ. "ఆ వస్తువు దొరికితేనే ఈ ప్రయోగం చేస్తారు అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు." అని చెప్పాడు ముష్రు. "అది తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు మన ల్యాబ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన్ని కలుద్దాము." అని చెప్పాడు నంద. కళింగ కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తున్న ముష్రుని ఆపి "యోధ! మనం ఈ విషయాలన్నీ సార్ తో ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత ఫోన్ మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది." అని చెప్పింది నీతూ. "అవును! ఆ వస్తువు లేకపోతే ప్రయోగం చేయరు అని చెబుతున్నాడు కదా అది మన దగ్గర ఉన్నంతవరకు వాళ్ళు ఏమి చేయరు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి." అని చెప్పింది దీప్తి. "సరే!" అని చెప్పి భూషణ్ వాళ్ళ వైపు చూసి "మీరందరూ ఇక్కడే ఉండండి నేను దీప్తి, నీతూ వెళ్లి సార్ ని కలిసి వస్తాము." అని బ్యాగ్ లో ఉన్న పద్మన్ని తీసుకుని జేబులో పెట్టుకుని రాఖీ వాళ్ళ వైపు చూసి "టేక్ కేర్!" అని చెప్పి కార్ లో బయలుదేరేడు యోధ. అక్కడినుంచి యోధ వాళ్ళు వెళ్లడంతో "మీ ముగ్గురం పైన ఉంటాము ఏదైనా అవసరమైతే పిలవండి." అని స్నైపర్ గన్స్ తీసుకొని ఫ్యాక్టరీ పైకి వెళ్లారు సుహా వాళ్ళు. క్యూబ్ వాళ్ళతో పాటు ట్యాంక్ మీద కూర్చుని "నన్ను ఒక విషయం వెంటాడుతుంది యమధర్మరాజు ఇక్కడికి వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ కి ఎలా కనిపించాడు? ఆయనా మానవులకి కనిపించరు కదా!" అని అనుమానంగా అడిగాడు భూషణ్. "గబ్బర్ సింగ్ కంటికి మాయ ఉన్న కనిపిస్తుంది అందుకే అతన్ని యోధ దగ్గరికి వచ్చేటట్లు చేసాను." అని చెప్పాడు నంద. "అవునా? అయితే గబ్బర్ సింగ్ ని ఒక ఆట ఆడుకోవచ్చు!" అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్. కంప్యూటర్ ముందు కూర్చుని సీసీ కెమెరాలో చూస్తూన్న పూజ దగ్గరికి వెళ్లి "మేడం! మీరు అంతరిక్షంలోకి రాకెట్స్ ప్రయోగించినప్పుడు లోపల కుక్కనో పిల్లినో పెట్టి పంపుతారు మనిషిని ఎందుకు పంపించారు." అని డౌట్ గా అడిగాడు గబ్బర్ సింగ్. ఆ మాటకి కోపంగా చూస్తూ "వేరే గ్రహాలలో మనుషులు ఉండరు ఆత్మలు ఉంటాయి ఒకవేళ మనుషులు ఉన్న వాళ్ళకి శక్తులు ఉంటాయి వాళ్లని మనుషులు కనిపెట్టలేరు కుక్కలు పిల్లలు మాత్రమే కనిపెడతాయి అందుకునే వాటిని పంపిస్తాము." అని వెటకారంగా చూస్తూ చెప్పింది పూజా. "మేడం! అప్పుడప్పుడు నాకు కూడా గాలిలో ఏవో ఆకరాలు కనిపిస్తూ ఉంటాయి." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్. అక్కడికి వస్తూ "నువ్వు గత జన్మలో ఏ కుక్కవో పిల్లి వో అయి ఉంటావు అందుకే నీకు కనిపిస్తున్నాయి ఈసారి రాకెట్ లో నిన్ను పంపించే ఏర్పాటు చేయమంటను." అని చెప్పాడు క్యూబ్. "నువ్వు ఆగవయ్య బాబు! నేనేదో టైం పాస్ కి మాట్లాడుతుంటే నన్ను రాకెట్ లో పంపిస్తావా ముందు మేకప్ ఎంత వరకు వచ్చిందో వెళ్లి చూడు." అని విసుగ్గా చెప్పాడు గబ్బర్ సింగ్. "సరే కానీ! మనం త్వరలో హిమాలయాలకి వెళ్లబోతున్నము కదా ఆ ల్యాబ్ దగ్గర ఉన్న తోడేళ్లతో ఎలా ఫైట్ చేయాలో ఆలోచించావా..?" అని చెప్పాడు క్యూబ్. "ఆ ముష్రు గాడు చెప్పాడు కదా అది మనిషిని ఒక్క దెబ్బకి రెండు ముక్కలు చేస్తుందని ఇంకా దాంతో ఫైట్ చేసే పనేముంది ఎదురుపడితే సాష్టాంగం పడి నమస్కారం చేయడమే! అది దయ తలిస్తే ప్రాణాలతో వదులుతుంది లేకపోతే మన బాడీ కుడా మంచు కింద ఉండిపోతుంది ఏ కళింగ లాంటివాడో తవ్వి బయటకి తీస్తాడు." అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు చెబుతుంటే గుర్తుకు వచ్చింది రావణాసురుడి సైన్యం ఒకసారి అలకాపూరిని వెతుకుతూ వెళ్లి ఒక గుహలో చిక్కుకుపోయారు అనే విషయం తెలిసింది. అప్పుడు రావణబ్రహ్మ మరో సైన్యాన్ని పంపించారు ఎంత వెతికిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ముష్రు చెప్పిన దాన్ని బట్టి రేపాలా వెళ్ళిన గుహ అదే అనుకుంటున్నాను అంటే ఆ రాక్షసులను మళ్ళీ బ్రతికించి భూమి మీదకు తీసుకు వస్తున్నాడు." అని అనుమానంగా చూస్తూ చెప్పాడు భూషణ్. "ఓరి బాబోయ్! ఆ రాక్షసులు మళ్లీ పుడితే వాళ్ళని చంపడానికి ఆంజనేయ స్వామి రావలసిందే!" అని చెప్పింది పూజా. "నా స్నేహితుడు వాళ్ళ కోసమే హిమాలయాల్లో ఎదురుచూస్తున్నాడు అనుకుంటా తప్పకుండా వస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు భూషణ్. "ఏంటి? ఆంజనేయ స్వామి నీ ఫ్రెండా..? ఎప్పుడు కలిసావు బాబు!" అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్. "హనుమ దగ్గరకు వెళ్లి కలవడం ఎవరి తరం కాదు ఆయనే మనల్ని కలవాలి అనుకోవాలి అప్పుడు మాత్రమే ఆయన్ని మనం చూడగలము." అని చెప్పాడు భూషణ్. ************ ల్యాబ్ లో ఉన్నికృష్ణన్ తో మాట్లాడుతున్న నాయక్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి "సార్! ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాము." అని చెప్పాడు యోధ. "నేను కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి." అని అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి స్క్రీన్ ఆన్ చేసి "బోర్డర్లో మన మిలిటరీ క్యాంప్ మీద ఎటాక్ జరిగింది 18 మంది సోల్జర్స్ కనపడటం లేదు అక్కడ దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూడండి." అని చెప్పాడు నాయక్. ఆరుగురు తో కలిసి బోర్డర్ దగ్గర ఉన్న ఇండియన్ మిలిటరీ క్యాంప్ దగ్గరికి వస్తున్న జింగ్ ని ఆశ్చర్యంగా చూస్తూ "సార్! నేను వీడిని చంపి సముద్రంలో పడేసాను మళ్ళీ ఎలా బతికి వచ్చాడు? " అని చెప్పాడు యోధ. "వీడియో మొత్తం చూడు షాకింగ్ విజువల్స్ చాలా ఉన్నాయి." అని చెప్పాడు నాయక్. ఆ మాట విని టెన్షన్ గా స్క్రీన్ మీద వస్తున్న వీడియో చూస్తూ ఉన్నారు ముగ్గురు.
14-05-2026, 06:36 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 38
ల్యాబ్ దగ్గరికి వచ్చిన యోధ వాళ్ళని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి స్క్రీన్ ఆన్ చేసి మిలిటరీ క్యాంప్ మీద జరిగిన ఎటాక్ విజువల్స్ చూపించాడు నాయక్.
ఆ వీడియోలో ఉన్న జింగ్ ని చూసి సార్ నేను వీడిని చంపేసి సముద్రంలో పడేసాను మళ్ళీ ఎలా బతికాడు అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు యోధ. ************* యోధ చెప్పింది విని కంప్లీట్ వీడియో చూడండి "చాలా మిస్టీరియస్ గా ఉంది." అని చెప్పాడు నాయక్. వీడియో చూస్తూ "మన సోల్జర్ షూట్ చేస్తున్న వాళ్ళకి బుల్లెట్స్ తగలడం లేదు ఏమిటి?" అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది నీతూ. "డాడ్! ఒక్కసారి పాస్ చేయండి." అని చెప్పి జూమ్ చేసి "అక్కడికి వచ్చిన వాళ్ళ కళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వాళ్లు కచ్చితంగా మనుషులు కాదు." అని చెప్పింది దీప్తి. వీడియో చూస్తూ "సార్! వీళ్లు మన సోల్జర్స్ ని చంపలేదు స్పృహ తప్పేటట్లు చేసి కిడ్నాప్ చేసారు అంటే మన దగ్గర ఉన్న వస్తువు, యంగ్ కోసం ఇదంతా చేస్తున్నారు." అని చెప్పాడు యోధ. "కరెక్ట్! కానీ జింగ్ వెనకాల వచ్చిన ఆరుగురు ఫేస్ లు మనవాళ్లు ఐడెంటిఫై చేశారు వాళ్ళు లాస్ట్ ఇయర్ బోర్డర్లో జరిగిన షూట్ అవుట్ లో చనిపోయిన టెర్రరిస్టులు బాడీ లు కుడా పాకిస్తాన్ మిలటరీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ వీడియో చూపించి మనం అడగడానికి కుడా సరిపోవు అంతర్జాతీయ వేదిక మీద చూపించిన చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వస్తారు అనే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు." అని చెప్పాడు నాయక్. "సార్! ముష్రు చెప్పినట్టు కళింగ దగ్గర రేపలా అనే ఒక తాంత్రికుడు ఉన్నాడు. అతనే చనిపోయిన వాళ్ళ బాడీ లోకి వేరే ఆత్మల్ని పంపించి మళ్ళీ బ్రతికిస్తున్నాడు అంట అలాంటి వాళ్ళని నలుగురిని కజకిస్తాన్ లో మేము కుడా చూసాము వాళ్ళని నేను చంపెను."అని చెప్పాడు యోధ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "బుల్లెట్ తగిలిన చావని వాళ్ళు నీ చేతిలో ఎలా చనిపోయారు?" అని అడిగాడు నాయక్. "యోధ! ఆ నలుగురి కాపాలం పగిలిపోయేలాగా కొట్టాడు అప్పుడు చనిపోయారు." అని చెప్పింది దీప్తి. "ఈ కళింగ సైన్స్ ని మైథాలజీని మిక్స్ చేసి ప్రపంచానికి సవాల్ విసిరుతున్నాడు." అని చెప్పాడు నాయక్. "సర్! మంచి మీద సవాల్ విసిరిన వాడు ఇప్పటివరకు ఎవరు గెలవలేదు ఫ్యాక్టరీ దగ్గరికి విఠలాచార్య వచ్చాడు యంగ్, భూపాల్ సింగ్ రెడీ అవుతాన్నారు, మీరు ఓకే అంటే వాళ్ళని తీసుకువెళ్లి హ్యాండ్ ఓవర్ చేసి మన సోల్జర్స్ ని తీసుకొస్తాను." అని చెప్పాడు యోధ. "ఎటువంటి నెగోషేషన్ చేయకుండా నువ్వు అక్కడకి ఎలా వెళతావు అయినా నీ ప్లాన్ చాలా డేంజర్ అక్కడ రెండు దేశాల ఆర్మీ కూడా ఉంటుంది." అని చెప్పాడు నాయక్. "మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి కళింగతో మాట్లాడదాము అతను నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు." అని చెప్పాడు యోధ. "అలా అయితే! ఈ మిషన్ కంప్లీట్ అయ్యేంతవరకు మీ టీమ్ కి ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధం లేదు." అని స్మైల్ ఇచ్చాడు నాయక్. "నాకు అదే కావాలి సార్ అప్పుడే పైనుంచి ఎటువంటి ఆర్డర్స్ ఉండవు అక్కడ ఏం జరిగినా మీకు కుడా హెడేక్ ఉండదు." అని నవ్వుతూ చెప్పాడు యోధ. ఆ రూమ్ లోకి వస్తూ "సార్! యంగ్ మీద చేసినా ప్రయోగం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కరెక్ట్ చెప్పాలంటే ఇతను ఇంకా రెడీ అవ్వలేదు ఇతని బ్లడ్ వల్ల భారీ ఆకారంలో పెరిగిన జంతువులు నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అది ఎలాంటిది అంటే మనిషి ఇచ్చావనివ్వదు బతకనివ్వదు బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కటిగా చెడిపోతూ ఉంటాయి ఇంక అతను జీవితాంతం మెడిసిన్ యూస్ చేస్తూనే బతకాలి కావాలనే యంగ్ ని ఈ విధంగా తయారు చేశారు అనుకుంటున్నాను. అతనన్ని క్యూర్ చేయడం కొంచెం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు కానీ అతను బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది." అని చెప్పాడు ఉన్నికృష్ణన్. "మీరు వెంటనే యంగ్ ని క్యూర్ చేసే పనిలో ఉండండి అతని మీద చేసిన ప్రయోగం గురించి ప్రతిదీ వివరంగా ఒక వీడియో రెడీ చేయండి మనవాళ్లు ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు రెండు దేశాల ఆర్మీ అక్కడికి రాకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు నాయక్. "ఓకే సార్!" అని చెప్పాడు ఉన్ని కృష్ణన్. "యోధ వైపు చూసి మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళదామా?" అని అడిగాడు నాయక్. "ఎస్ సార్!" అని చెప్పి ల్యాబ్ దగ్గర్నుంచి కార్ లో గోడౌన్ దగ్గరికి బయలుదేరారు అందరు. ఫ్యాక్టరీ దగ్గరికి యోధ తో కార్ లో వచ్చిన నాయక్ ని చూసి "మనం ఆయనకి ఏజెంట్లు లానే కనపడతాము ఎవరు నోరు మెదపకండి." అని చెప్పాడు నంద. ట్యాంక్ వెనకాల నిద్రపోతూ ముగ్గురు మాటలు విని "ఏంటి? ఏజెంట్స్ లాగా కనపడతారా..? అంటే వీళ్ళు నిజమైన ఏజెంట్లు కాదా!" అని కంగారుగా క్యూబ్స్ వాళ్ళ వైపు చూసి "మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడే మీ సంగతి తెలుస్తాను." అని పరిగెత్తుకుంటూ వెళ్లి నాయక్ కనపడడంతో సెల్యూట్ చేసి యోధ వెనకాలే వెళుతూ "సార్! మీకు ఒక సీక్రెట్ చెప్పాలి భూషణ్ వాళ్ళు ముగ్గురు ఏజెంట్లు కాదు." అని నెమ్మదిగా చెప్పాడు గబ్బర్ సింగ్. "ఆ విషయం నాకు తెలుసు!" అని చెప్పాడు యోధ. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఈ విషయం మీకు తెలుసా మరి వాళ్ళు ఏజెంట్లు కాకపోతే ఎవరు? " అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్ ఫ్యాక్టరీ లోపలకి వెళుతు భూషణ్ వాళ్ళ వైపు చూసి "నేను పంపించిన ముగ్గురు ఏజెంట్స్ నీకు హెల్ప్ ఫుల్ గా ఉన్నారు కదా!" అని అడిగాడు నాయక్. "ఎస్ సార్! మేము ఇదంతా చేయగలిగము అంటే ఆ ముగ్గురు వల్లే!" అని చెప్పాడు యోధ. ఆ మాటలు విని అయోమయంగా చూస్తూ "అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. నాయక్ సర్ ఇక్కడ నుంచి వెళ్లే లోపు ఈ ముగ్గురు విషయం తేల్చేయాలి ప్రమోషన్ కొట్టేయాలి." అనుకున్నడు గబ్బర్ సింగ్. ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి ముష్రు చేతికి ఫోన్ ఇచ్చి "కళింగ కి కాల్ చెయ్ మాట్లాడతాను." అని చెప్పాడు యోధ. "సరే సార్!" అని ఫోన్ చేసాడు ముష్రు. ఫోన్ లిఫ్ట్ చేసి "ఏంటి ముష్రు? లోపలికి వెళ్ళావా? వాళ్లలో ఎవరినైనా కలిసావా?" అని అడిగాడు కళింగ. "సార్! నేను లోపలికి వెళ్ళాను అప్పటికే మన మనుషులందరూ చనిపోయారు నన్ను కూడా చంపబోయరు కానీ మీతో ఒక్కసారి మాట్లాడమని రిక్వెస్ట్ చేశాను ఫోన్ ఇస్తున్నాను భూపాల్ సింగ్ ని కిడ్నాప్ చేసిన వాళ్ల లీడర్ తో మాట్లాడండి." అని యోధకి ఫోన్ ఇచ్చాడు ముష్రు. ఫోన్ తీసుకుని "ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు యోధ. "ఆ విషయం నీకు అనవసరం మా వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసావు నువ్వు మిలటరీ నా.. RAW నా..?" అని అడిగాడు కళింగ. "నువ్వు చెప్పిన రెండు కాదు, పేరు చెప్పడానికి భయపడే వాడితో నేను మాట్లాడను నాకు సమఉజ్జి అయిన రేపాలాకి ఫోన్ ఇవ్వు వాడితోనే మాట్లాడుతాను." అని చెప్పాడు యోధ. ఆ మాటకి షాక్ అయి "నీకు రేపాలా తెలుసా? అసలు ఎవరు నువ్వు? నీకు ఏమీకావాలి?" అని అడిగాడు కళింగ. "నేను రేపాలా తో మాత్రమే మాట్లాడుతాను మళ్ళీ నీ నోటి నుంచి మరో మాట వచ్చింది అంటే పద్మంలో అక్కడికి వచ్చి నా శక్తిని ఉపయోగించి నువ్వు తయారు చేసిన మంచు తోడేలు తోనే నిన్ను చంపిస్తాను." అని చెప్పాడు యోధ. ఆ మాట విని రేపాలా వైపు కంగారుగా చూస్తూ "వీడెవడో నీ కన్నా పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు నీతోనే మాట్లాడుతాను అంటున్నాడు." అని టెన్షన్ చూస్తూ ఫోన్ చెప్పాడు కళింగ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నాతో మాట్లాడతాడా? నాకు సమవుజ్జి అయినవాడా..?" అని ఫోన్ తీసుకుని "ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు రేపాలా. "నీ నలుగురు మనుషుల కాపాలలు పగలగొట్టి చంపినవాడిని!" అని చెప్పాడు యోధ. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నీకు దైవశక్తి సహాయం చేస్తుందని నాకు తెలుసు! కానీ ఇది కలికాలం వాళ్ళ శక్తి భూమి మీద పనిచేయదు. కాబట్టి నువ్వు ఈ కలికాల బ్రహ్మ రేపాలాని నమ్ముకో ఆ ఇద్దరిని పద్మన్ని తీసుకొని నా దగ్గరకురా... నీకుకావాల్సింది నేను ఇస్తాను." అని చెప్పాడు రేపాలా. "సరే! రేపు సూర్యోదయం అవ్వగానే నా ప్రయాణం ఇచ్చిన మాట మీద ఉండు అక్కడ ఏదైనా తేడా జరిగిందో హిడిచి వంశంలో మిగిలిన ఒక్కడు ఉండడు." అని చెప్పాడు యోధ. "సరే! మీరు కారకొరం పర్వతాల పోస్టు దగ్గరికి రండి అక్కడ మీకోసం వెహికల్ రెడీగా ఉంటుంది ఇండియన్ మిలటరీని తప్పించుకునే రావలసిన బాధ్యత మీదే ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆపారు." అని చెప్పాడు రేపాలా. "సరే!" అని ఫోన్ పెట్టేసాడు యోధ. ఫోన్ పెట్టేసిన యోధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఆ రేపాలా ఎవడు? వాడి గురించి నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పిన ప్రతి దానికి వాడు సరే అని ఎందుకు అన్నాడు?" అని డౌట్ గా అడిగాడు నాయక్. "కొన్ని విషయాలు తెలియకుండా ఉండడమే బెటర్ సార్!" అని భూషణ్ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ "మీకు చెప్పినట్లు నా టీమ్ తో అక్కడికి వెళతాను మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తాను." అని చెప్పాడు యోధ. "మరి యంగ్, భూపాల్ సింగ్ వాళ్లకి హ్యాండ్ ఓవర్ చేస్తే డేంజర్ కదా!" అని అడిగాడు నాయక్. "మన విఠలాచార్య రెడీ చేసే యంగ్ వాళ్లని హ్యాండ్ ఓవర్ చేస్తాము వాళ్ల గురించి అసలు విషయం తెలుసుకునే లేపు కథ ముగించేస్తాము." అని చెప్పాడు యోధ. "నువ్వు ఒక విషయం మర్చిపోయావ్ మీకు హెల్ప్ చేయడానికి ఇండియన్ మిలిటరీ ఆ ప్లేస్ కి ఎంటర్ అవ్వలేదు." అని చెప్పాడు నాయక్. "మీరు చెప్పినట్లు రెండు దేశాల మిలటరీ కుడా అక్కడ లేకుండా చేయండి చాలు మిగతా సంగతి మా టీమ్ చూసుకుంటుంది." అని చెప్పాడు యోధ. "ఓకే! అక్కడికి నీ టీమ్ మెంబెర్స్ ఎవరెవరు వెళతారు." అని అడిగాడు నాయక్. "ఆ విషయం నేను చెబుతాను." అని సూట్ కేస్ పట్టుకొని యంగ్ వేషంలో బయటికి వచ్చాడు గుప్తా. " రుద్రం భజే! ఎపిసోడ్ 38 " రచనకు రేటింగ్ ఇవ్వండి..
|
|
« Next Oldest | Next Newest »
|