Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
Awesome update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Nice updateee....
Like Reply
nice update
Like Reply
Good story turning update, and early update is appreciated
Like Reply
Nice emotional ga baga rasaru andi
Like Reply
Nice good
Mr. V
Like Reply
Great update
Like Reply
Chinchwsav
Like Reply
Super update brk
Like Reply
Superb twist lu
Like Reply
(06-05-2026, 12:08 AM)Back Wrote: ఓ రోజు మీ తాతయ్య ఏడాది నిండని నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆఫీసులో మీ నాన్న తన సెకెరటరీతో చేసిన తప్పు వల్ల నువ్వు పుట్టావ్. నిన్ను మీ అమ్మని ఎలా వదిలించుకోవాలో మీ నాన్నకి అర్ధం కాలేదు, మీ అమ్మని చంపించేసాడు. అది మీ తాతయ్యకి తెలిసింది. మీ నాన్న జైలుకి వెళ్లకుండా కాపాడి అలానే నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నాకు నిన్ను ముట్టుకోవడం కూడా ఇష్టం లేదు, కానీ నా ఇష్టాయిష్టాలు డబ్బున్న ఇంట్లో ఎవరు పట్టించుకోరని నాకు తెలుసు. నాకిష్టం లేకుండానే నీకు పాలు పట్టాను. నాకిష్టం లేకుండానే నిన్ను సాకాను. నటించాను. నువ్వు బాధ పడ్డా ఇదే నిజం. నేను నిన్నెప్పటికీ కొడుకులా ఒప్పుకోను. మీ నాన్న పైకి మాములుగా ఉన్నా లోపల నువ్వంటే అసహ్యం. నిన్ను చుసిన ప్రతీ సారి చేసిన తప్పు గుర్తుకువచ్చి నీ మీద ఇంకా కోపం పెంచుకునేవాడు. మొదట్లో నిన్ను చంపేద్దామని చాలా సార్లు ప్రయత్నించాడు, కానీ ఆ విషయం మీ తాతయ్యకి తెలిసిన తరువాత ఆయన భయపడి ఆగిపోయాడు. అందుకే నిన్ను ఎవరేమన్నా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరూ నిన్ను సహించేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో మీ తాతయ్య తప్ప అందరూ నిన్నొక పనిమనిషిలా చూసేవాళ్ళే. అంతా చెప్పి గోపిని వంక చూసింది జనని.


గోపి మోహంలో కన్నీళ్లు లేవు, బాధా లేదు. ఏమైనా మాట్లాడతాడేమో అని చూసింది జనని. గోపి వెనక్కి తిరిగి షెల్ఫ్ నుంచి ఫైల్ తీసి దెగ్గరికి వచ్చి ఇస్తే జనని ఫైల్ తీసుకుంది. గోపీ ఇంకేం మాట్లాడకపోయేసరికి నేను వెళతాను అంది జనని. ఇంటి నుంచి బైటికి రాగానే గీత కనిపించేసరికి ఆగిపోయి వెంటనే పట్టించుకోనట్టు వెళ్లి కారు ఎక్కి మొగుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కారు వెళ్లిపోతుంటే చూస్తున్న గోపిని చూసి గీత వెంటనే కిందకి వెళ్ళిపోయింది.

అవన్నీ వాడికెందుకు చెప్పావ్ అని అరిచాడు జగపతి.
ఫైల్ నా చేతికి వచ్చింది. దాని కోసం చెప్పాను అంది జనని.

ఏమైనా అన్నాడా నిన్ను, నన్నేమైనా అన్నాడా ?
లేదు.. ఒక్క మాట కూడా అనలేదు.
సరే నువ్వు త్వరగా వచ్చేయి. దాన్ని చెక్ చేయించాలి అంటే సరే అంది జనని. కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

కిందకి వచ్చేసిన గీత తను చూసింది, విన్నది మొత్తం జఫర్‌కి చెప్పేసింది. జఫర్ వెంటనే మంచం దిగి మెట్లు ఎక్కి పైకి వెళ్లి చూస్తే తలుపు పెట్టేసి ఉండటంతో కిందకి వచ్చేసి రాజారావుకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది.

***

సిస్టంస్ రన్ అవుతున్నాయి. గోపీ ఇచ్చిన డిజైన్ కంపైలేషన్ జరుగుతుంది.

రాజారావు లోపలికి వచ్చాడు. అమృత తాతయ్య దెగ్గరికి వచ్చి నిలబడింది. ఎక్కడిదాకా వచ్చింది అని అడిగాడు రాజారావు.

CAD చెక్ అయిపోయింది. సిములేషన్ టెస్ట్ జరుగుతుంది. రెసిస్టెన్స్, స్పీడ్ & బాలన్స్ అన్నీ దాదాపు 89 - 96% నొ ఎర్రర్ వస్తుంది. ఎలా తాతయ్యా గోపీ ఇదంతా ఎలా చేయగలిగాడు. ఇది తనదేనా లేదంటే ఎక్కడైనా దొంగలించాడా!

రాజారావు నవ్వాడు. మీరందరు గోపీని తక్కువ అంచనా వేశారు. ఆ రోజు వాడు జఫర్‌తో కలిసి కార్ రిపేర్ చేసినప్పుడే నేను ఎంక్వయిరీ చేశాను. ఈ కోడింగ్ ప్రాసెస్ అంతా చేసింది స్వర్ణ.

స్వర్ణా ! ఎవరు ?

మన ఇంట్లో పని మనిషిగా చాలా ఏళ్ళు పని చేసింది. గోపీ తనని చదివించాడు. తను ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. అండ్ షి ఈజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్.

అనుకున్నాను. ఇదంతా గోపీ వల్ల అయ్యే పని కాదు. తనని మనం హైర్ చేసుకుందాం తాతయ్యా. తను ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తుందో దానికి డబల్ ఆఫర్ చేద్దాం. తాతయ్యని మెప్పించాను అన్నట్టు చూసింది అమృత.

రాజారావు చిన్నగా నవ్వాడు. నువ్వింకా చాలా నేర్చుకోవాలి అమృతా.. ప్రయత్నించి చూడు అని వెళ్ళిపోతుంటే జఫర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో జఫర్ చెప్పింది వినగానే చేతిలో ఉన్న ఫైలు విసిరికొట్టాడు రాజారావు, అక్కడే ఉన్న అమృత భయపడింది. రాజారావు ఫోను వింటూనే ఆఫీస్ లోకి వెళ్ళాడు. వెనకే వచ్చిన అమృతని బైటికి వెళ్లిపొమ్మని సైగ చేస్తే అమృత బైటికి వెళ్ళిపోయింది. ఫోన్ కట్ చేసి జగపతిని రమ్మని ప్రీతీకి చెప్పాడు. అరగంటలో జగపతి, జనని ఇద్దరు రాజారావు ముందు ఉన్నారు.

వాడి మనసు విరగ్గొట్టి మీరేం సాధిద్దామని. ఇంతవరకు వాడిని వేధించింది చాల్లేదా?

జనని, జగపతి నోట నుంచి మాట పేకలలేదు. రాజారావు జనని వంక అసహ్యంగా చూసి వెళ్ళిపోండి అని అరిచాడు. ఇద్దరు బైటికి వెళ్లిపోయారు.

అమృత డిజైన్ టెస్టింగ్ అయిపోగానే జగపతి తన దెగ్గరున్న ఫైలుని టెస్టింగ్‌కి ఇచ్చాడు. అమృతకి చూడగానే అర్ధమైంది అది గోపీదే అని. జగపతి మావయ్య తనకి పోటీ రావడం అమృతకి నచ్చలేదు. ఆఫీస్ అయిపోయాక స్వర్ణ గురించి వెతుకులాట మొదలుపెట్టింది. గోపీకి ఫోన్ చేస్తే ఎత్తలేదు.

***

చీకటి పడింది. రాజారావు కారు గీత ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని మెట్లు ఎక్కి గోపీ ఇంటి తలుపు కొట్టాడు. తీయలేదు. గోపీ అని పిలిచినా, తలుపు బాదినా సమాధానం రాలేదు. రాజారావు కిందకి వచ్చేసాడు. జఫర్‌తో గీతతో మాట్లాడి వెళ్ళిపోయాడు. జఫర్ గోపీ ఇంటి తలుపునే చూస్తుంటే గీత ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. కాసేపటికి హిమజ కూడా వచ్చింది. ఇద్దరు జఫర్‌కి ఇరువైపున కూర్చున్నారు. గోపీ గురించి మాట్లాడుతుంటే హిమజ జఫర్‌ని గమనించింది.

నీకు గోపీ అంటే ఇష్టం కదా అని అడిగింది హిమజ. ఆ ప్రశ్నకి జఫర్ కంగారు పడుతుంటే గీత మధ్యలో కల్పించుకుని హిమజని తిట్టింది.

***

ఆఫీస్ అయిపోయాక ఇంటి ముందు ఆగిన కంపెనీ క్యాబ్ నుంచి దిగింది స్వర్ణ. ఇంట్లోకి వెళుతుంటే అమృత కనిపించి ఆగింది. హాయ్ మేడం ఎలా ఉన్నారు అని పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టింది.

గోపీ దెగ్గరున్న కార్ డిజైన్స్ నువ్వే చేశావాని తెలిసింది. 

అవును గోపీ చేయించుకున్నాడు అంది స్వర్ణ.

వాట్.. 

ఎస్, ఐడియా గోపీది. నేను పని చేశాను.

ఓకే.. ఐ విల్ కం టు ద పాయింట్. నువ్వు నా కింద పని చెయ్యడానికి నీకెంత కావాలి? అని చెక్ బుక్ తీసింది.

అయోమయంగా చూసింది స్వర్ణ. వెంటనే అమృత గారు, నాకు నా ఆఫీస్‌లో కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి లేకపోయినా నేను మీ కింద పని చెయ్యలేను.

ఎందుకు అని అడిగింది అమృత కోపంగా 

గోపీకి ఇష్టం లేదు.

నువ్వు గోపీ కింద పనిచెయ్యట్లేదు. అయినా గోపీ మాటని మేమే పట్టించుకోము, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావ్. నువ్వెప్పుడూ చూడనంత అమౌంట్ రాసిస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చేయి.

స్వర్ణ నవ్వింది. అది అమృతకి నచ్చలేదు. 

చూడు అమృతా(ఈసారి గారు గీరు అని వాడలేదు) నీ దెగ్గర డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. కాసింత జ్ఞానం కూడా ఉండాలి. సారీ ఐ రిజెక్ట్ 

అమృత కోపంగా.. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం తీయించడమే కాదు, ఇంకెక్కడా రాకుండా కూడా చెయ్యగలను అంది 

ఆల్ ద బెస్ట్ అంది స్వర్ణ. అమృత వెళ్లిపోతుంటే.. నువ్వు తలుచుకున్నట్టు నేను కూడా తలుచుకోగలను. నా దెగ్గరా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను పిలిచినా ఇన్వెస్టర్స్ వస్తారు. అదే గోపిని వాడి మూడు సంవత్సరాలలో నిన్ను నీ కంపెనీని నామరూపాలు లేకుండా చేయగలను. నీకు, మీకెవ్వరికి గోపీ గురించి ఏమి తెలీదు.

అమృత వెళ్ళిపోయాక చాలా సేపు అదే తలుచుకుంది స్వర్ణ. ఏరో డైనమిక్స్ అనే సబ్జెక్టులో గోపీ సర్టిఫికెట్స్ లేని మాస్టర్. వాడెంటో నాకు తెలుసు అనుకుంది. జరిగింది గోపీకి చెపుదామని ఫోన్ చేస్తే గోపీ ఎత్తలేదు. 


***

భూమి చుట్టూ సూర్యుడు రెండు సార్లు తిరిగాడు.

ఆంటీ నేనిక వెళతాను. గోపీ ఎలా ఉన్నాడో అంది జఫర్. ఇంకేమి ఇబ్బంది లేదు గనక గీత కూడా సరేనంది. జఫర్ వేగంగా పైకి పరిగెత్తి తలుపు కొట్టింది. గోపీ తీయలేదు. వెంటనే రెండు సార్లు గోపీ అని పిలిస్తే తలుపు తెరిచాడు. నిద్ర మొహంతో ఉన్న గోపీని చూసి ఆగోపోయింది. లోపలికి దారిచ్చాడు. ఇల్లంతా చిందరవందర. టిఫిన్ తెస్తావా అని అడిగితే బైటికి వెళ్ళాడు గోపీ.

గోపీ వచ్చేంతలో త్వరగా స్నానం చేసి ఇల్లు మొత్తం పైపైన సర్దింది. గోపీ వచ్చాక టిఫిన్ తినేసి ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యింది. గోపీ మాత్రం పడుకున్నాడు.

రెడీ అవ్వవా అని అడిగితే గోపీ ఏం మాట్లాడలేదు. 

నువ్వు ఇంకెక్కడైనా చూసుకో.. నేను ఒంటరిగా ఉంటాను. కావాలంటే ఎదురు హిమజ ఆంటీ వాళ్ళ పోర్షన్ ఖాళీగా ఉంది. మాట్లాడతాను.

అలాగే అని బైటికి వచ్చేసింది జఫర్.
 
[+] 1 user Likes Munna2349's post
Like Reply
Nice story
Like Reply
Super super super super super super super
Like Reply
మీ కథ చాలా అంటే చాలా బాగుందండీ. నిజానికి మీ కథ కి నేను పెద్ద అభిమాని నీ

అంటే ఈ కథ రోజు అప్డేట్ ఇస్తే బాగుండు అని ఆశ పడతాను కానీ అది కుదరదు అనుకోండి కానీ మీకు ఒక విషయం చెప్పాలండి నిజానికి ఈ సైట్ లో సెక్స్ కథలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా గూగుల్ లో సెక్స్ అని కొడితే ఎన్నో వీడియోలు వస్తాయి కానీ ఇలాంటి కథలు మాత్రం ఇంకెక్కడ దొరకవు మీలాంటి వాళ్లు రాస్తే తప్ప.

మీరు గోపి పాత్ర నీ మలిచిన తీరు కూడా అద్భుతం అంటే దేనికి బాధపడకుండా తటస్థంగా ఉండటం మనసులో ఎంత బాధ ఉన్న పైకి చూపించకుండా ఒక మౌన ముని లాగా మీరు గోపి పాత్ర నీ తీర్చిన తీరు అత్యద్భుతం


నిజానికి మీ ఫోన్ పగిలినప్పుడు మీరు ఆ మాట చెప్పాక చాలా బాధ వేసింది ప్రస్తుతానికి నేను బెవర్స్ అండి లేకపోతే మీ ఫోన్ రిపేర్ కి నేను మనీ ఇచ్చేవాడిని మీ కథ అంత నచ్చిందండి నాకు


మీ తర్వాత అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న . త్వరగా తర్వాత భాగం ఇస్తారు అని మీ అభిమాని
[+] 2 users Like Mahesh12345's post
Like Reply
Excellent update
Like Reply
అద్భుతంగా వ్రాస్తున్నారు. సూపర్ అప్డేట్. 
Like Reply
Nijanga ja naniki valla ayanaki koncham kuda humanity ledu...anni yellu gopi ni himsincharu...swarna jaffar aa heroine? Evarina parledu mana hero ki andaga unte chalu..superb story bro
Like Reply
Thankyou very much all
Thanks for the comments
You guys made my day


Update kaavalaa ??
Like Reply
Nice update
Like Reply




Users browsing this thread: shakehand, Sree123, 5 Guest(s)