Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
Wow superb superb
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బావుంది బ్రో, ఇంకా ఏం చెప్పాలో తోచడం లేదు...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Super update brother keep rocking
Like Reply
Excellcent update bro
Like Reply
Superb!
Like Reply
Super update
Like Reply
Waah.. twist.. manchi writing
Like Reply
Superb
Like Reply
ఈ నాలుగు ఐదు రోజులు నా దెగ్గరే ఉందువు పదా అంది గీత. జఫర్ ముందు వద్దన్నా గీత, హిమజ బలవంతం చేసేసరికి కాదనలేకపోయింది జఫర్. రెండు జతల బట్టలు తీసుకుని గీత ఇంటికి వెళ్ళింది. గది చూపిస్తే మంచం మీద కూర్చుంది. కాసేపటికి హిమజ వెళ్ళిపోయాక గీతా, జఫర్ ఇద్దరే మిగిలారు.

ఆంటీ.. మీ ఆయన! అంది జఫర్.

కంగారుపడకు. ఆయన క్యాంపుకి వెళ్లారు.

క్యాంప్ అంటే..

మొదట బిజినెస్ చేసేవారు, తరువాత నష్టం వచ్చిందని ఇప్పుడేదో చేస్తున్నారు. అదేంటో నాకు తెలీదు, నాకు వివరంగా చెప్పలేదు. అందుకే క్యాంప్ అంటాను అని నవ్వింది గీత. మొన్నే వెళ్ళారు. ఇప్పుడల్లా రారులే.. నీకు భయం లేదు అంటే జఫర్ అలాగే అంది. అయినా నువ్వు ఇన్ని రోజులు గోపీతోనే ఉంటున్నావ్, కలిసి తిరుగుతున్నారు, మొన్న నీ నడక చూసినప్పుడే ఒక క్షణం ఆగిపోయాను నేను, వాడికి అసలు అనుమానం రాలేదా అంటే నవ్వింది జఫర్. లేదని నవ్వుతూనే తల అడ్డంగా ఊపింది.

గోపీ తింగరోడు ఆంటీ.. అలా అని ముద్దపప్పేం కాదు. కాకపోతే నన్ను పూర్తిగా నమ్మేశాడు. ఎప్పుడైనా నాకు గడ్డం, మీసం లేదని ఏడిపిస్తుంటాడు. 

అవును అంది గీత. నిన్ను ఇంతగా నమ్మాడు కదా. నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో 

జఫర్ మొహంలో చిన్న బాధ గమనించింది గీత. లేచి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని వెళ్ళింది.

గోపీకి ఫోన్ చేసింది జఫర్.

ఎలా ఉందిరా ఇప్పుడు ?
బానే ఉంది.

ఆఫీస్‌కి వస్తావా?
లేదు, ఇక్కడ తెలిసిన చుట్టాలున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చా, రెండు రోజుల్లో వస్తా.

ఓహ్.. మరి ఇక్కడా.. సరే నేను చూసుకుంటాలే. ఎంజాయి అంటే హ్మ్ అని ఉ కొట్టి పెట్టేసింది. ఏమంటున్నాడు అంది గీత నవ్వుతూ.. చుట్టాలంటికి వచ్చాను, రెండు రోజుల్లో వస్తానని చెప్పాను అంది జఫర్. అయితే ఈ రెండు రోజులు దాగుడుమూతలు అన్నమాట అని ఇద్దరు నవ్వుకున్నారు.

***

ఒక్కడే షెడ్‌లో జఫర్ పని చూస్తున్నాడు గోపీ. జఫర్ ఎలా పనిచేస్తాడో అర్ధం చేసుకోవడానికే చాలా టైం పట్టింది. సాయంత్రం అయ్యేసరికి తాతయ్యని ఇంట్లో డ్రాప్ చేసాడు. బండి మీద ఇంటికి వచ్చాడు. 

బండి శబ్దం వినగానే కిటకీలో నుంచి తొంగి చూసింది జఫర్. గోపీ పైకి వెళ్ళిపోయాడు. తలుపు తీసి లోపలికి వెళితే అన్నం కూరా వండేసి ఉన్నాయి. హమ్మయ్యా అనుకున్నాడు గోపీ. వెంటనే జఫర్‌కి ఫోన్ చేసాడు.

ఎలా ఉందిరా ఇప్పుడు?
తగ్గింది.

సరే..
హా..

ఉంటా అయితే 
హా..

సరే బై అని పెట్టేసాడు గోపీ. స్నానం చేసి అన్నం తిన్నాడు. ఒక్కడే గది నుంచి బైటికి వచ్చి ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు. రోజూ ఈ టైంకి జఫర్ చెవిలో తూనీగలా చిరాకు తెప్పించేవాడు. ముందు తను గెలకడం ఆ తరువాత వాడితో డొక్కలో గుద్దించుకోవడం.. ఇప్పుడు చాలా రోజుల తరువాత మళ్ళీ ఒంటరితనం ఆవహించింది. స్వర్ణకి ఫోన్ చేసాడు.

గోపీ.. అంది స్వర్ణ 
ఏం డూయింగు?

ఇప్పుడే తినేసి కూర్చున్నా. నువ్వు?
నేను కూడా 

చెప్పడం మర్చిపోయా ఆ ప్రీతీ నీకోసం వెతుకుతుంది.
దేనికి?

డెబ్భై లక్షలు పెట్టి వాళ్ళ అమ్మని బతికిస్తే వెతకదా.. డబ్బు కట్టింది నేనే అని తెలుసుకుని నా ఆఫీస్ దాకా వచ్చింది. మీకెలా తెలుసు, నాకెందుకు సాయం చేశారు అని చాలా అడిగింది. నోటికొచ్చినవి చెప్పి పంపించేసాను. నువ్వే అని చెప్పేద్దామా అనుకున్నా.. మళ్ళీ నీకిష్టం లేదు కదా అని ఆగిపోయా.. 

అదే మంచిదిలే..

హా.. హాస్పిటల్ బిల్స్ టాక్స్‌లో కలిపేస్తా.. అదొక బెనిఫిట్ నీ వల్ల నాకు. ఇక్కడికి రావచ్చు కదా 

వస్తాలే..
ఏంటి డల్‌గా ఉన్నావ్ 

అదేం లేదు. బోర్ కొడుతుంది.
నీ ఫ్రెండ్ లేడా 

వాడు  ఎటో వెళ్ళాడు 
ఇక్కడికి వచ్చేయి మరి 

ఇప్పుడు అంత దూరం రాలేనులే.. గుడ్ నైట్ 
స్వర్ణ హలో.. అంటున్నా పెట్టేసాడు. 

పొద్దున్నే కళ్ళు తెరిచి చూస్తే రోజూ కనిపించే జఫర్ మొహం కనిపించలేదు. బ్రష్ చేసుకుని బైటికి వెళ్ళాడు. కాఫీ చెపితే అది చెండాలంగా ఉంది, అక్కడే పారబోసి ఇంకో టీ కొట్టు దెగ్గరికి వెళ్ళాడు. ఇంకో నాలుగైదు తిరిగినా ఎవరూ జఫర్‌లా కాఫీ పెట్టివ్వలేదు. చేసేది లేక ఇంటికి వచ్చి జఫర్‌కే ఫోన్ చేసాడు.

ఒరేయి ఈ కాఫీ ఎలా పెట్టాలి? పాలు ఎక్కడున్నాయి. కాఫీ పొడి ఎక్కడుంది?
నవ్వాడు జఫర్ 

ముందు స్టవ్ ఆన్ చెయ్యి 
ఆ చేశా.. 

ఫ్రిడ్జ్ లో కింద మూలకి చిన్న గిన్నెలో పాలు ఉంటాయి చూడు. కాఫీ పొడి పాకెట్లు కారం డబ్బా పక్కన ఉంటాయి.

అదెక్కడుంది?
ఉప్పు డబ్బా పక్కన 

ఆ దొరికింది. 
ముందు పాలు కాగపెట్టు 

ఆ పెట్టా 
సింలో పెట్టు 

ఆ పెట్టా 
మరిగాయా 

ఇంకా లేదు.
అయితే ఆగు.

ఏం పని మీద వెళ్ళావ్ 
ఊరికే వచ్చాను. వీళ్ళని కలిసి చాలా రోజులు అవుతుంది.

హా.. పొంగుతున్నాయి 
స్టవ్ ఆపు 

ఆపేసా
కాఫీ పొడి పాకెట్ చించి అందులో పొయ్యి 

హా పోసా 
పంచదార కూడా వెయ్యి 

హా వేసా 
బాగా కలుపు 

హా స్పూన్ ఎక్కడుంది. ఆ.. కలిపా 
గ్లాసులో పోసుకుని తాగేయి 

ఒరినీ ఇంతేనా!
అంతే అని నవ్వాడు.

సిప్ వేసాడు. నువ్వు చేసినట్టు రాలేదురా 
ఒక్క సారికే ఎలా వస్తుంది..

అంతేలే.. సరే త్వరగా వచ్చేయి. నిన్ను తాతయ్య అడిగాడు. ఆయనకి కూడా చెప్పు అంటే సరే అని పెట్టేసింది జఫర్. తాతయ్యకి ముందే చెప్పేసింది. గోపీ అలా అనేసరికి చిన్నగా నవ్వుకుంది. ఫోన్ పక్కన పెట్టి గీత కోసం వంటింట్లోకి వెళ్ళింది.
Like Reply
షెడ్‌లో ఉంటే ప్రీతీ వచ్చి సర్ పిలుస్తున్నారు అని చెప్పింది. తాతయ్య దెగ్గరికి వెళ్ళాడు గోపీ. రాజారావుతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఇంజనీర్స్ అని పరిచయం చేసాడు. నీకు సాయం చేస్తారు అని చెపుతుంటే జఫర్ వచ్చాక వాడికే ఇవ్వు అన్నాడు గోపీ. 

మరి నువ్వేం చేస్తావ్ 
నేను వాడికి సాయం చేస్తున్నా.. అంతవరకే. నువ్వు డ్రైవర్‌గా రమ్మన్నావ్. వస్తున్నా. అంతే అని లేచాడు.


వన్ సెకండ్ గాయ్స్ అంటే బైటికి వెళ్లిపోయారు వాళ్ళు. మనవడి వంక కోపంగా చూసి నిన్నటి దాకా బానే ఉన్నావ్ కదరా.. ఇప్పుడేమైంది మళ్ళీ నీకు. తిన్నగా ఉండలేవా 

అవన్నీ నా వల్ల కాదు తాతా.. ఇంజిన్ ఒక్కటే పూర్తి అయితే సరిపోదు. దానికి తగ్గ బాడీ కావాలి, ట్రాన్స్‌మిషన్‌కి తగ్గ సాఫ్ట్వేర్ కావాలి. ఇదంతా అయ్యాక అప్పుడు బైట దేశాల్లో ప్రచారం చేసుకుని రేసింగులకి తీసుకెళ్లి అక్కడ గెలిచి అందరికి నిరూపిస్తే గానీ రావు మోటర్స్ ఇంటర్నేషనల్ అవ్వాలన్న నీ కల నెరవేరదు. నువ్వు మొన్నటి దాకా బానే ఉన్నావ్. జఫర్ గాడు ఇంజిన్ గురించి చెప్పడం, నేను నా దెగ్గర డిజైన్స్ ఉన్నాయని చెప్పడం వల్లే కద నీకు ఆశ పుట్టింది.

తప్పా అన్నాడు రాజారావు ఆవేశంగా 

కాదు, కానీ ఇదంతా నా వల్ల కాదు. నేనింత ప్రెషర్ తీసుకోలేను. జఫర్ గాడికి ఈ పని అంటే ప్యాషన్, నీకు ఇదే జీవితం, వీళ్లందరికి ఇదే పని. నేనలా కాదు.. ఏదో వాడితో మాటలు కలుపుతూ వాడు చెప్పిన రెండు నట్లు బిగించాను. 

లోపలికి ఎప్పుడు వచ్చిందో కానీ అమృత వచ్చిన సంగతి వీళ్ళు గమనించలేదు.

ఎందుకు తాతయ్యా గోపీని ఇబ్బంది పెడుతున్నావ్ అని అమృత గొంతు వినగానే ఇద్దరు తల తిప్పి చూసారు. అమృత వచ్చి కుర్చీలో కూర్చుంది.

డోర్ నాక్ చెయ్యకుండా రావడమే కాకుండా తనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎదురు కుర్చీలో కూర్చుంది అమృత. కోపంగా పిడికిలి బిగించి చూసాడు రావు. గోపీ అది గమనించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని లేచి బైటికి వెళ్ళిపోయాడు.

తాతయ్యా ఈ ప్రాజెక్ట్ నాకివ్వు. నీ కోరిక నేను నెరవేరుస్తా.. చిన్న పిల్లలా గోముగా అడిగింది అమృత. రాజారావుకి అమృతకి ఏం కావాలో అర్ధమైంది. అసలు ఈ ప్రాజెక్టు ఎంత కాలం పడుతుందో ఎలా తయారు అవుతుందో తనకి నాలెడ్జ్ కూడా లేదు. 

నేను ఈ ప్రాజెక్టకి హెడ్‌గా ఉంటా తాతయ్యా. నన్ను నమ్మండి. మీరు ఇచ్చే డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేస్తా అంది నమ్మకంగా 

ఆలోచించి చెప్తాను అన్నాడు రాజారావు. అమృత బైటికి వచ్చింది. గోపీ కోసం వెతికితే నడుస్తూ కనిపించాడు. వేగంగా వెళ్లి తన పక్కనే నడిచింది. గోపీ అమృతని చూసి చిన్నగా నవ్వాడు.

తాతయ్య నన్ను ఈ ప్రాజెక్టుకి హెడ్‌గా ఉండమన్నారు 
కంగ్రాట్స్ 

అంతేనా! నీకేం అభ్యంతరం లేదా!
నాకెందుకు అభ్యంతరం 

నీ దెగ్గర డిజైన్ ఉంది కదా 
ఉంది 

నాకు నీ డిజైన్ ఇస్తావా.. ఇన్ని రోజులు వీళ్లందరి మధ్యలో కాంపిటీషన్ అని గొడ్డులా కష్టపడుతున్నాను. అయినా ఫలితం లేదు. నువ్వు సాయం చేస్తే నాకు ఈ కంపెనీలో గుర్తింపు ఉంటుంది. నీకెంత కావాలో చెప్పు అంది చెక్ బుక్ తీసి 

రేపు వాల్యుయేషన్ చేయించి నా లాయర్‌తో కబురు పెడతాను. డిజైన్‌కి పేటెంట్ పేపర్స్ కూడా రెడీ చేయించాలి, అదంతా అయ్యాక చూద్దాం అన్నాడు గోపీ..  బిత్తరపోయింది అమృత. తన మొహం చూసి గట్టిగా నవ్వితే అయోమయంగా చూసింది. కంగారుపడకు రేపు ఫైల్ ఇస్తాను అని నవ్వాడు గోపీ. 

అమృత ముందు నవ్వినా వెంటనే సారీ.. అని తల దించుకుంది.

దేనికి?

నీ మీద అసూయా, కుళ్ళు పుట్టేసాయి. ఒక్కసారి చెడ్డదానిలా ఆలోచించేసాను.


ఏం చేద్దామని అని కన్ను ఎగరేసాడు గోపీ.

నవ్వుతూ గోపీ భుజం మీద కొట్టింది. నాకొక సారి డిజైన్ చూపించవా అంటే పేపర్ మీద గీసి చూపించాడు. పది నిమిషాలు దాని గురించి మాట్లాడితే చాలా విషయాలు తెలిసాయి. వావ్ అనుకుంది అమృత. గోపీ కనక సీరియస్‌గా తమకి కాంపిటీషన్ వస్తే ఆరుగురిలో ఎవ్వరూ సరిపోము అనుకుంది అమృత. గోపీ.. నైట్ డిన్నర్‌కి వెళదామా అని అడిగింది. సరే అన్నాడు గోపీ.

జఫర్ నుంచి ఫోన్ వస్తుంటే వెంటనే ఎత్తాడు.

చెప్పరా.. ఎక్కడున్నావ్?  వస్తున్నావా?
లేదు, ఇంకో రెండు రోజులు..

సరే.. చెప్పు 
ఊరికే చేశా 

రేయి నీకోటి చెప్పాలి. ఇందాక అమృత డిన్నర్‌కి పిలిచింది.
ఓహ్.. వెళుతున్నావా 

హా.. అదేంటో నువ్వెళ్ళాక బాగా కలిసొస్తుంది నాకు. సరే సరే తను పక్కనే ఉంది. నువ్వు కూడా త్వరగా వచ్చేయి.. అని పెట్టేసి అమృత వైపు తిరిగాడు.

ఎవరు అని అడిగింది అమృత 
జఫర్ 

నాకు తన నంబర్ ఇవ్వు అంటే ఇచ్చాడు గోపీ.

***

ఆఫీస్ అయిపోయాక త్వరగా ఇంటికి వచ్చాడు. బండి గేటు దెగ్గరే ఆపేసి ఎలా రెడీ అయ్యి వెళదామా అని వేగంగా గేటు తీస్తుంటే పక్కన కారు కనిపించి ఆగిపోయాడు. గేటు తీస్తూనే గీతతో మాట్లాడుతున్న అమ్మ కనిపించింది. పక్కన ఎవరూ లేరు.. తనొక్కటే వచ్చింది.

మొన్న నా బర్తడే రోజు పని ఉండి రాలేక ఇవ్వాళ వచ్చిందా. నన్ను చూడాలనిపించిందా. లేదంటే నాతో ఏదైనా పని పడిందేమో.. ఎక్కువగా ఊహించుకుంటున్నానని తెలుసు.

గోపీని చూసిన గీత, అదిగో వచ్చేసాడు అని నవ్వింది. జనని కూడా నవ్వింది. గోపీని చూసి ఎలా ఉన్నావ్ అని అడిగింది. గోపీ ముందు ఆశ్చర్యపోయినా, ఆ వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగినా.. ఇదంతా అబద్దం అని తెలుసు. పక్కనే గీత ముందు చెడ్డది కాకుండా అమ్మ నటిస్తుందని అర్ధమయ్యి బాగున్నా.. పైకి వెళదాం అని మెట్లు ఎక్కుతుంటే వెనకే నడిచింది జనని.. అప్పటివరకు అందంగా నవ్వుతున్న ఆమె మొహం మెట్లు ఎక్కుతున్నప్పుడు మాములుగా చిరాకుగా మారిపోయింది.

తలుపు తీస్తే లోపలికి వచ్చింది జనని. సూటిగా అడిగాడు గోపీ.. మీకివ్వడానికి నా దెగ్గర ఇంకేం లేవు. ఏంటి నాతో పని అని తల్లి వంక చూసాడు. 

మీ నాన్న పంపించారు. నీ దెగ్గర కార్ డిజైన్ ఉందటగా, నిన్ను అడగమని పంపించారు. 

నేనెందుకు ఇవ్వాలి. నాకేంటి లాభం 

పేరెంట్స్... అని ఏదో చెప్పబోయింది జనని 

నా 2% వాటా ఇచ్చేసాను.

మీ నాన్న అడగమన్నారు, అడిగాను. నువ్వు ఇస్తావో ఇవ్వవో అది నీ ఇష్టం, తీసుకుంటాడో లేదో ఆయన ఇష్టం. ఆయన నిన్ను అడగమన్నాడు అడిగాను అని వెళ్లిపోతుంటే.. ఎందుకు నేనంటే అంత అసహ్యం మీకు. అంత తప్పు ఏం చేశాను. మిగతా వాళ్ళు ఎటు పోయినా నాకు అనవసరం, నాన్న పట్టించుకోకపోయినా కూడా పర్లేదు.. నీకెందుకు నేనంటే అంత అసహ్యం.. నీకే అన్యాయం చేసాను అని అడిగాడు గోపీ. 

జనని సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే.. నేను అడిగిన వాటికి నిజం చెప్తే డిజైన్ ఇచ్చేస్తాను అన్నాడు గోపీ.. ఆగింది జనని. వెనక్కి తిరిగి చూసింది.

నువ్వు నాకు పుట్టలేదు. నువ్వు నా కొడుకువి కాదు. నువ్వొక అబద్దానివి. ఇరవై ఏళ్లుగా నిన్ను, అబద్దాన్ని ఇష్టం లేకుండా మోస్తున్నాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. 


ఓ రోజు..
Like Reply
రాత్రి నా మొబైల్ స్క్రీన్ పగిలింది. అంతకముందే పగిలింది. ఈ సారి డామేజ్ ఇంకా ఎక్కువైంది. టైపింగ్ చేస్తుంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడి నరకం కనిపిస్తుంది. వచ్చే నెల పదో తారీకు జీతం పడి ఫోను బాగు చేయించే వరకు నేను అప్డేట్ ఇవ్వలేను. కావున update అని ఎవరు అడగకండి. వచ్చే నెల పదిహేనవ తేదీన తరువాత కథ పోస్టు చేస్తాను.

ధన్యవాదాలు 
[+] 10 users Like Raagaa's post
Like Reply
nice update
Like Reply
కథనం బాగుంది
[+] 1 user Likes ppkumar's post
Like Reply
(22-04-2026, 04:17 PM)Jalsaa Wrote:
రాత్రి నా మొబైల్ స్క్రీన్ పగిలింది. అంతకముందే పగిలింది. ఈ సారి డామేజ్ ఇంకా ఎక్కువైంది. టైపింగ్ చేస్తుంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడి నరకం కనిపిస్తుంది. వచ్చే నెల పదో తారీకు జీతం పడి ఫోను బాగు చేయించే వరకు నేను అప్డేట్ ఇవ్వలేను. కావున update అని ఎవరు అడగకండి. వచ్చే నెల పదిహేనవ తేదీన తరువాత కథ పోస్టు చేస్తాను.

ధన్యవాదాలు 


Namaskar
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
Super twist lu babaeo
Like Reply
Nice update
Like Reply
Superb narration..
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice update andi.. ayo wait chestam andi me update kosam
Like Reply
(22-04-2026, 04:17 PM)Jalsaa Wrote:
రాత్రి నా మొబైల్ స్క్రీన్ పగిలింది. అంతకముందే పగిలింది. ఈ సారి డామేజ్ ఇంకా ఎక్కువైంది. టైపింగ్ చేస్తుంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడి నరకం కనిపిస్తుంది. వచ్చే నెల పదో తారీకు జీతం పడి ఫోను బాగు చేయించే వరకు నేను అప్డేట్ ఇవ్వలేను. కావున update అని ఎవరు అడగకండి. వచ్చే నెల పదిహేనవ తేదీన తరువాత కథ పోస్టు చేస్తాను.

ధన్యవాదాలు 

Story lo twist kante.. idi inka kastamga undi.
We will be waiting
[+] 1 user Likes ash.enigma's post
Like Reply




Users browsing this thread: chinni77, lathashalini, pr_delhi, utkrusta, 9 Guest(s)