Thread Rating:
  • 55 Vote(s) - 3.49 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

(2) వారసుడు - completedCompleted

తెల్లారి జఫర్ కళ్ళు తెరవగానే కళ్ళెదురుగా తన పక్కనే పడుకున్న గోపి కనిపించాడు. రాత్రి సినిమా హాల్లో గోపి భుజం మీద పడుకోవడం. బండి మీద నిద్ర ఆపుకోలేక గోపీని వాటేసుకుని పడుకోడం అన్నీ గుర్తుకువస్తుంటే వాడి బుగ్గలు ఎరుపెక్కాయి. నిన్న రాజారావుతో ఇద్దరు కలిసి మాట్లాడటం, కలిసి ఇంజిన్ బిగించడం, ఇద్దరు హైఫై కొట్టుకోవడం అన్నీ తలుచుకుంటున్నాడు. అలా తననే చూస్తుంటే గోపీ కదలడం చూసి అటు వైపుకు తిరిగి పడుకున్నాడు. 

రోజూలానే గోపి లేవకముందే లేచి రెడీ అయ్యి కూర్చున్నాడు. బైట సూర్యుడి వెలుగులో కాఫీ కప్ పట్టుకుని ఆలోచిస్తుంటే నిద్ర మొహంతో వచ్చాడు గోపి. బ్రష్ చేసుకుని వస్తే జఫర్ లేచెళ్లి గోపికి కూడా కాఫీ తెచ్చిచ్చాడు. ఇద్దరు ఎదురెదురు కూర్చుని కాఫీ తాగుతుంటే గోపీ తననే చూస్తుండడం గమనించి తల పక్కకి తిప్పేసాడు.

కాఫీ చాలా బాగుంది అన్నాడు గోపి.
షుక్రియూ
ఆ మాట నేను చెప్పాలి అని గోపీ నవ్వుతూ అనేసరికి జఫర్ కూడా నవ్వాడు.
నీ ఏజ్ ఎంతా ?
ఎందుకు ?
అంటే నీకింకా మూతి మీద మీసం కూడా రాలేదు, గడ్డం కూడా మొదలవలేదు. ఇంత చిన్న వయసులో నీకు ఇంత మెకానిక్ పని ఎలా వచ్చింది, నీకు చదువుకోవడం ఇష్టం లేదా ?

మా నానాతో కలిసి కార్లు రిపేర్ చెయ్యడమే నా చదువు. నానానే నా గురువు. 

నానా అంటే?

మా నాన్న వాళ్ళ నాన్న 

అవునా.. మరి మీసం?

లేచి నిలుచున్నాడు జఫర్. గోపి భయపడి లేచి నిలబడుతూ నిన్ను ఇబ్బంది పెట్టేలా ఉంటే ఇంకేమి అడగను అన్నాడు. జాఫర్ చెయ్యి చిన్నదే కానీ దెబ్బ బలంగా తగులుతుంది, అది ఎలా సాధ్యమో మొన్న ఇంజిన్ రిపేర్ చేస్తున్నప్పుడు తెలిసింది గోపికి. 

జఫర్.. నీకేమైనా గోల్స్ ఉన్నాయా అని అడిగాడు మళ్ళీ వెంటనే..

ఉన్నాయి అన్నాడు జఫర్. గోపి చెప్పమంటే నాకంటూ ఓ కంపెనీ.. కొంచెం పేరు ప్రతిష్టలు వీటితో పాటు పక్కనే నన్ను ప్రేమించే మనిషి.. ఇవి చాలు అని చెపుతుంటే గోపి వావ్ అన్నట్టు చూసాడు, ఆ చూపుకి జఫర్ వెనక్కి తిరిగాడు. వెంటనే మళ్ళీ గోపిని చూసి మరి నీకు? అని అడిగితే నాకేం లేవు అని మాములుగా లోపలికి  వెళ్ళిపోయాడు. లక్ష్యం లేని మనుషులు ఉంటారా అనుకున్నాడు జఫర్. గోపి కూడా రెడీ అయ్యాక ఇద్దరు రాజారావు దెగ్గరికి బండి మీద స్టార్ట్ అయ్యారు. 

ఎంట్రో సైలెంటుగా ఉన్నావ్ అన్నాడు గోపి
ఏం లేదు. ఇవ్వాళ పెద్ద చర్చలే జరుగుతాయి మన ఇద్దరి గురించి..
అవునురా.. అనవసరంగా నోరు జారాను
నిన్నటి నుంచి నీ ఫోను మోగుతూనే ఉంది.
అందుకే సైలెంటులో పెట్టేశా.. విషెస్ చెప్పడానికిలే..
మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడవా?

ఉన్నపళంగా ప్రేమ, డబ్బు కురిపిస్తే నాకు నచ్చదు. ఏదైనా నిదానంగా శ్రమతో దక్కించుకోవాలి. సడన్‌గా వచ్చేవి వస్తుంటాయి పోతుంటాయి అవంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. జఫర్  ఏం మాట్లాడకపోయేసరికి గోపీనే అరె.. నువ్వెవరినైనా లవ్ చేసావా ? అని అడిగాడు.

లేదు. మరి నువ్వు ?
నేను ఒకప్పుడు లవ్ చేశాను కానీ ఇప్పుడు అవేమి లేవు.. కానీ క్రష్ ఉందిరా 
ఎవరి మీదా?
అమృత ఉంది కదా..
ఓహ్హ్
ఏంట్రా అంత పెద్ద దీర్ఘం తీసావ్. కొంపతీసి నీకు కూడా నచ్చిందా అంటే వీపు మీద గుద్దాడు జఫర్.

అబ్బాహ్.. వీడితో ఏం మాట్లాడినా తప్పే. 

వెనక జఫర్ నవ్వుకున్నాడు. మొబైల్లో మెసేజ్ చూసి తాతయ్య వాళ్ళు ఆఫీస్ కి వెళ్లిపోయారట, మనల్ని త్వరగా రమ్మంటున్నారు అంటే గోపీ  సరేనని నేరుగా ఆఫీస్ వైపే పోనించాడు.

***

ఆఫీసు లోపలికి వెళ్తుంటేనే అందరూ గోపిని, జఫర్‌ని వింతగా చూడటం చూసి జఫర్ కొంచెం ఇబ్బందిపడి ముందు నడిచాడు. రాజారావు బోర్డు మీటింగ్ పెడుతున్నాడని, ఇద్దరినీ త్వరగా రమ్మంటున్నాడని చెప్పింది ప్రీతీ. ఆమె మొహం సంతోషంగా ఉంది. అదే అడిగాడు..

ఏంటి ప్రీతీ గారు సంతోషంగా ఉన్నారు
ఒక్క రోజులో అద్భుతం జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా ?
నమ్మను
అయితే నీకు నా సంతోషం చెప్పినా అర్ధం కాదు గోపి..

ఏదైతే ఏంటిలే నువ్వు హ్యాపీ కదా.. సూపరు.. అని లోపలికి నడిచాడు. ఉత్సాహంగా ఉన్న ప్రీతీ మొహం చూసి ఏమైంది అని అడిగాడు జఫర్. గోపీ నవ్వుతూ తరువాత చెప్తాలే అనేసరికి ఇద్దరు లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల చాలా మంది ఎదురుచుస్తున్నారు. ఇద్దరు వెళ్లి రాజారావు పక్కన కాళీగా ఉన్న రెండు కుర్చీల్లో సర్దుకుని కూర్చున్నారు. రాజారావు నవ్వుతూ పలకరించాడు. జఫర్  నుంచి పలకరింపు వచ్చింది కానీ గోపీ అసలు చూడలేదు. చెత్త ఎదవ అని తిట్టుకున్నాడు మనసులోనే మనవడిని.

సీన్ ఓపెన్ చేసాడు రాజారావు. బోర్డుని, కంపెనీని, తమని, ఇన్వెస్టర్లని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ జఫర్ గురించి గోపి గురించి, ఇద్దరు కలిసి చేస్తున్న ప్రాజెక్టు గురించి చిన్న ఇంట్రో ఇచ్చి ఇక్కడ నుంచి జఫర్ కంటిన్యూ చేస్తాడని కూర్చున్నాడు. తనకు తెలిసిన అందరూ గోపీని ఆశ్చర్యంగా చూస్తుంటే గోపీ అసలు తల ఎత్తలేదు. వాడి కళ్ళు టేబుల్ కింద స్నేక్ గేమ్ ఆడుతున్న వాడి ఫోన్‌నే చూస్తున్నాయి. నోకియా 1100ని మోజు పడి తీసుకున్నాడు.

రాజారావు ఒక్కసారిగా అందరి ముందు జఫర్ అనేసరికి అయోమయంగా  చూశాయి వాడి కళ్ళు, వెంటనే గోపి వైపు చూసాడు, గోపి కూడా జఫర్ పేరు వినపడగానే ఫోన్ పక్కన పెట్టి తల ఎత్తి చూసాడు. తన వంక చూసి ధైర్యంగా వెళ్ళు అని తల ఊపుతుంటే జఫర్ మెల్లగా లేచి అందరి ముందుకు వెళ్ళాడు. భయమేసింది, అందరూ తననే చూస్తుంటే బెరుకు పుట్టి మళ్ళీ గోపి వైపు చూసాడు. ఏమైందో ఏమో గోపి కళ్ళలో తన కళ్ళు లాక్ అయ్యాయి. జఫర్ మాట్లాడటం మొదలుపెట్టాడు.  ఇక మిగతావాళ్ళ గురించి పట్టించుకోలేదు, తనకి తెలిసినదంతా గోపికి చెపుతుంటే గోపి కూడా శ్రద్ధగా విన్నాడు. అంతా అయిపోయాక గోపి చూపులో చిక్కుకున్న తన కళ్ళని బలవంతంగా దృష్టి మరల్చి పక్కకి చూసాడు. ముందు రాజారావు, ఆ వెంటనే అందరూ చెప్పట్లు కొడుతుంటే జఫర్ కళ్ళు సంతోషంగా మెరిసాయి. ఇంతకముందు డ్యూయల్ ట్రాన్స్‌మిషన్ మీద నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడు నమ్మకంగా చూసారు. జఫర్ వెంటనే అక్కడి నుంచి వచ్చేసి గోపి పక్క చైర్లో కూర్చుంటే గోపి తన భుజం మీద చెయ్యి వేసి సూపర్ రా అంటుంటే జఫర్ గోపి చేతిని కొట్టేసాడు. 

ఓరినీ.. మెచ్చుకోవడం కూడా తప్పేనా అన్నాడు గోపి. రాజారావు ఇదంతా చూసి మనసులో ఈ ఎర్రిపూకు గాడు ఇంకా తెలుసుకోలేదు అని తల కొట్టుకుంటూ కుర్చీలో నుంచి లేచి మిగతా స్పీచ్ పూర్తి చేసాడు. చివరికి ప్రాజెక్ట్ అప్రూవల్‌కి వోటింగ్ పెట్టగా ఇంకో ఇద్దరు, పవన్ చేతులు ఎత్తలేదు. రాజారావు కోపంగా చుసిన ఒక్క చూపు పవన్ చెయ్యి ఎత్తేలా చేసింది, వాడి కళ్ళలో భయం అందరికీ నవ్వు తెప్పించింది.

అంతమందిలో ఒక్కరికి మాత్రం ఇది నచ్చలేదు. కానీ అందరికంటే తనే ముందు లేచింది. లేచి దెగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పింది అమృత. రాజారావు గర్వంగా గోపిని చూడటం తనకి నచ్చలేదు. మెల్లగా బైటికి వచ్చేసింది. అమృత బైటికి వచ్చేయడం కూడా ఎవ్వరు పట్టించుకోలేదు, దీనికి ఇంకా బాధేసింది. అమృత పిడికిలి బిగించి ఆలోచిస్తుంటే తన అన్నయ్య పవన్ కోపంగా బైటికి రావడం చూసింది. (వీడితో చేతులు కలపడం కంటే నా రెండు చేతులు పొయ్యిలో పెట్టడం నయ్యం అనుకుని పిడికిలి వదిలింది) 

అలా మీటింగ్ పూర్తయింది.

***

మూడు రోజుల్లో ప్రాజెక్ట్ మొదలవుతుందని ఈ రెండు రోజులు ఎంజాయి చెయ్యమని వదిలేసాడు రాజారావు.

ఇంటి దెగ్గర గోపి కింద మొక్కలతో కుస్తీ పడుతుంటే పై నుంచి నిలబడి చూస్తున్నాడు జఫర్. ఒక్కడే పని చేస్తుంటే చూసి దెగ్గరికి వచ్చింది గీత. పక్కన మనిషి వచ్చినట్టు అనిపిస్తే తల ఎత్తి చూసాడు. చీరలో దాగున్న గుండ్రని బొడ్డు కనిపించింది. వెంటనే తల ఎత్తి చూసాడు, గీత నవ్వుతుంటే హమ్మయ్యా గమనించలేదు అనుకుని పలకరించాడు. గీత కాళ్ళు మడిచి కూర్చుని చెట్ల గురించి అడుగుతూ ముచ్చట్లు పెడుతుంటే అప్పుడే మెట్లు ఎక్కుతున్న హిమజ కూడా ఈ ఇద్దరినీ చుసి ఆగింది. అలాగే పై నుంచి వీళ్ళనే గమనిస్తున్న జఫర్‌ని కూడా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి జఫర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు.

నీతో పాటు ఉండే అబ్బాయి అసలు మాట్లాడడా.. నేనొక సారి పలకరిస్తే పారిపోయాడు అంది గీత. గోపీ నవ్వుతూ వాడంతే, ఈ మధ్యనే వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు. తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఆంటీ.. అదీ కాక ఊరి నుంచి వచ్చినవాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో వాడికింకా తెలీదు. మిమ్మల్ని చూడగానే భయపడి ఉంటాడు.

ఆలా ఉంటే కష్టం కదా అంది గీత. అవును అన్నాడు గోపి. ఇంతవరకు జఫర్ ప్రవర్తన గురించి, వాడి ఆలోచనా విధానం గురించి ఒక్క ముక్క కూడా అర్ధంకాలేదు గోపీకి. బాగా మాటల్లో పడితే మాత్రం ప్రశాంతంగా నవ్వుతాడు. తిడతాడు. ముట్టుకుంటే కొడతాడు. తను చెప్పే సొల్లంతా ఓపికగా వింటాడు. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంటే గీత అడిగింది, ఏం లేదని మాటలు చెపుతుంటే ఇద్దరు ముచ్చట్లలో పడ్డారు.

ఆ అబ్బాయి సాయిబులు కదా, నమ్మచ్చు అంటావా అంది గీత. ఒక చూపు చూసాడు గోపి. నీ ఇంటి మీద బాంబు వెయ్యడులే కంగారు పడకు అన్నాడు. ఆలా కాదు గోపీ అని గీత ఏదో చెపుతుంటే. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ జఫర్ క్యారెక్టర్ మాత్రం గోల్డ్. వాడికి మనిషి వెనకాల మాట్లాడటం,  గోతులు తవ్వడం.. ఇవేవి వాడికి చేతకాదు. 24 కాదు 48 కారెట్ గోల్డ్ ఆడు అంటే అలాగేనంది గీత.

సాయంత్రం కిందకి దిగాడు జఫర్. గోపీ ఏదో చెపుతుంటే గీత గోపీ భుజం మీద పడి పడీ నవ్వుతుంది. అది చూడగానే జఫర్ మోహంలో నవ్వు పోయింది. వెంటనే పైకి వెళ్లిపోతుంటే పిలిచాడు గోపి. జఫర్ వెనక్కి తిరిగాడు. జఫర్ చేతిలో బండి తాళాలు కనిపించాయి, మొన్న బండి నేర్పిస్తానని చెప్పింది గుర్తుకువచ్చి, ఉండరా కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను అంటే అలాగే  అన్నాడు జఫర్.

జఫర్‌ని చూసి  హాయ్ అని పలకరించింది గీత, చెయ్యి ఎత్తి హాయ్ అన్నాడు. గీత ఇంకేదో మాట్లాడుతుంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ బండి పక్కన నిలబడ్డాడు. జఫర్  నడక చూసి ఒక క్షణం వింతగా చూసి అదే టైములో గోపీ వచ్చి గీత మొహం చూసి ఏమైంది అని అడిగితే ఏం లేదంది. గోపి మొహం తుడుచుకుని బండి తీయ్యి రా అంటే జఫర్ బండిని గేటు బైటిదాకా నడిపించాడు. గోపి వెనక ఎక్కి స్టార్ట్ చెయ్యమని చెపుతుంటే గీత లోపలికి వెళ్ళిపోయింది.

జఫర్  బండి స్టార్ట్ చెయ్యగానే భుజాల మీద రెండు చేతులు వేసి పట్టుకున్నాడు గోపి. చురుగ్గా వెనక్కి ఒక చూపు విసిరాడు జఫర్. బండి ఆగిపోయింది. గోపి కోపంగా చూస్తూ ఏంటీ.. వదిలేస్తే దేనికో దానికి గుద్దుతావ్ అంటే మళ్ళీ అటు వైపు తిరిగి బండి స్టార్ట్ చేసాడు. ఇక పోనీ అంటే క్లచ్ వదలగానే ముందుకు  బండి దూకింది. గోపీ జఫర్ మీద పడ్డాడు. గోపి మెల్లగా జఫర్ చేతి మీద తన చెయ్యి వేసి క్లచ్ ఎలా వదలాలో చెయ్యి నొక్కుతూ క్లచ్ నొక్కిస్తే సరే అన్నాడు. జఫర్ బుగ్గలు ఎరుపెక్కాయి. బండి స్టార్ట్ చేసి మెల్లగా నడుపుతుంటే బానే నడుపుతున్నావ్ కదరా అన్నాడు గోపి. క్లచ్ ఒక్కటే సమస్య, మిగతాదంతా వచ్చు అన్నాడు జఫర్. సరే.. కాసేపు నడుపుకో అని నడుము మీద రెండు చేతులు వేసి పట్టుకొగానే సడన్ బ్రేక్ కొట్టాడు జఫర్. బండి పడుతుందేమో అని భయపడ్డాడు గోపి, ఏమైందని అడిగితే కోపంగా చూసాడు. నడుము మీద చేతులు తీ అన్నాడు కఠినంగా. 

గోపి కోపం నషాళానికి అంటింది. నేనేం చెక్కగాడిని కాదు, ఏదో ఫ్రెండ్షిప్‌లో పట్టుకున్నాను. నువ్వేదో స్వచ్ఛమైన మగాడివి మిగతావాళ్ళు కాదు అన్నట్టు బిల్డప్పు. గట్టిగా మాట్లాడితే మూతి మీద మీసం రాలేదు, గడ్డం కూడా లేదు. నీ కనుబొమ్మలు కూడా చిన్నవే.. లిప్ స్టిక్ పెట్టుకున్నట్టు ఆ పెదాలు చూడు. నీ చేతి మీద కూడా సరిగ్గా వెంట్రుకలు లేవు. ఆ చర్మం చూడు మెత్తగా అని చేతిని గిల్లి..  చెక్కగాడివి నువ్వా నేనా అని కోపంగా తిట్టేసాడు గోపి.

ఇద్దరి మధ్యా పది క్షణాల మౌనానికి జఫర్ తల కిందకి దీంచేసాడు. వాడి కంట్లో నీళ్లు తిరిగాయి. గోపికి భయం వేసింది. రేయ్.. సారీరా నేను కావాలని అనలేదు. ఇద్దరం ఒకటే రూములో ఉంటాం, ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. పైగా ఇద్దరం కలిసిపోయాం. నేను ముట్టుకున్నప్పుడల్లా నువ్వు అలా కోపంగా చూస్తుంటే ముందు పట్టించుకోకపోయినా తరువాత నాకు చిరాకు వచ్చేది. నీ మీద నాకేం మోజు కాదురా, నా జీవితంలో ఒక మనిషితో ఇంత దెగ్గరగా, ఇంత స్నేహంగా ఉన్నది నీతోనే.. నువ్వలా కసురుతుంటే బాధగా ఉంది. కోపంలో మాటలు బైటికి వచ్చేసాయి. నిజంగా సారీ.. ఇక నేను ముట్టుకోను. పదా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు.

జఫర్ బండి స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు. గోపి మెలకుండా వెనక కూర్చుంటే జఫర్ తన చేతిని వెనక్కి పోనించి గోపి చేతిని పట్టుకుని నడుము మీద వేసుకున్నాడు. గోపీ నవ్వుతూ నాకు తెలుసురా ఎలా మాట్లాడితే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో.. ఎలా ఉంది నా యాక్టింగ్ అని రెండు చేతులతో జఫర్ నడుము పట్టుకుని పిసికేసాడు. జఫర్  ముందు ఇబ్బంది పడ్డా తరువాత సిగ్గుగా నవ్వి ఏడిసావ్ లే.. పోనీ అని వదిలేస్తున్నా.. ఎక్కువ చేస్తే.. అని మోచేత్తో డొక్కలో పొడిచాడు. అబ్బాహ్.. రేయి.. అని జఫర్ వీపు మీద దెబ్బ వేసి పోనీ పోనీ స్పీడ్ పెంచు ఇవ్వాళ బిర్యానీ తిందాం అని భుజాలు రుద్దాడు. జఫర్  బుగ్గలు మళ్ళీ ఎర్రబడ్డాయి.

బైటికి వెళదాం అంటే జఫర్ నేనే చేస్తాను అన్నాడు. బిర్యానీ వాసన గీతకి, హిమజకి ఇద్దరికీ తగిలింది. గీత పైకి వచ్చి అడిగితే గోపీ చెప్పాడు. జఫర్ ఇబ్బంది గమనించి గీత కిందకి వెళ్ళిపోయింది. అయ్యాక తెచ్చిస్తే ఏమైనా సాయిబులు బిర్యాని చేసినట్టు ఇంకెవ్వరు చెయ్యలేరు అంది మెచ్చుకుంటూ.. గోపీ తనని చూస్తూ మొన్న ఏదో అన్నావ్ అన్నాడు. అది కూడా నిజమే కదా అని తింటుంటే గీత భుజం మీద గిచ్చాడు గోపీ.. 

గీత ముందు ఆశ్చర్యపోయినా గోపీలో ఇంకో చూపు కనిపించకపోయేసరికి స్నేహంగా నవ్వింది. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

ఈ మూడు రోజుల్లో గోపి, జఫర్ ఇద్దరు ఊరంతా తెగ తిరిగేశారు. ఇద్దరి మధ్యా స్నేహం ఇంకా ముదిరింది. జఫర్ ఇంకా ఓపెన్ అయ్యాడు. ఇద్దరు నవ్వుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైంది. జఫర్‌కి వంటలో సాయం చేస్తున్నాడు గోపి. ఈ ఇద్దరు తెగ తిరగడం కింద ఇంట్లో ఉన్న గీతతో పాటు ఎదురింట్లో ఉన్న హిమజ కూడా గమనిస్తుంది. లేట్ నైట్ వస్తుంటే ఓ రోజు వార్నింగ్ కూడా ఇచ్చింది గీత. శుక్రవారం పొద్దున్నే గోపీ లేచేసరికి తల స్నానం చేసి కూర్చున్నాడు జఫర్. నన్ను కూడా లేపచ్చు కదరా అంటే లేపాను నువ్వు లేవలేదు అన్నాడు.


రేయి నువ్వు మస్జీద్ కి వెళ్ళవా.. శుక్రవారం పక్కా వెళ్తారు కదా.. నువ్వెంటి ఎప్పుడూ ఇంట్లోనే చేస్తావ్!

నాకు అంతమందిలో నచ్చదులే.. అయినా నమాజ్ అక్కడే చెయ్యాలని రూల్ లేదు. నాకు ఒంటరిగా చెయ్యడమే ఇష్టం. ఎక్కువగా దువా చేస్తాను.
అంటే..?

అంటే నేను నా దేవుడితో మాట్లాడుకుంటాను. నాకు కావాల్సినవి అడుక్కుంటాను. కష్టాలు చెప్పుకుంటాను.. అన్నీ..

ఒహ్హ్.. అయితే నేను  కూడా నా దేవుడితో మాట్లాడుకోవాలి, మొక్కుకోవాలి.

ఏమని.. నవ్వాడు జఫర్.

తిరుపతి లడ్డు తినాలని మొక్కుకున్నా.. అన్నవరం ప్రసాదం కోసం మొక్కుకున్నా. ఇప్పుడు శబరీ వెళ్లాలని మొక్కుకుంటా అంటే పగలబడి నవ్వాడు జఫర్. దేవుడిని నమ్మవా అని అడిగితే.. నమ్ముతాను కానీ ఏమి అడగను, ఎలాగో నాకేమి ఇవ్వడు. జఫర్ మాట మార్చుతూ ఇంకేం మాట్లాడతావ్ అంటే.. ఏమో మాటలన్నీ నీతోనే మాట్లాడుతున్నా కదరా ఆయనతో ఇంకేం మాట్లాడాలి అంటే ఒకలా చూసాడు జఫర్. 

కాఫీ పెడతాను.. అని జారుకున్నాడు.

స్వర్ణ నుంచి మెసేజ్ : ఈ వారం చివరి లోపు నన్ను కలవలేదంటే ఇంకెప్పటికీ నన్ను కలవకు

నిజమే.. వీడితో తిరగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్వర్ణని అసలు తలుచుకోలేదు. కలిస్తే ముందు పొట్లాడుతుంది అని నావ్వుకున్నాడు.

*** 

ఇవ్వాళ ప్రాజెక్టు మొదలవుతుంది కదా.. త్వరగా రమ్మని తాతయ్య ఫోన్ చేసాడు అని గోపి అంటే నేనెప్పుడో రెడీ నువ్వే ఇంకా గాడిదలా తొంగున్నావ్ అని జఫర్ నవ్వుతుంటే రేయి అని లేచాడు.. జఫర్ అల్లరిగా బైటికి పరిగెత్తితే గోపి వీడికి ఎక్కువైంది అనుకుంటూ టవల్ అందుకుని స్నానం చేసి వచ్చాడు. ఇద్దరికీ కాఫీ పెట్టి ఎదురు చూస్తున్నాడు జఫర్. తాగేసి చెప్పులు వేసుకుని గది తాళం వేస్తుంటే జఫర్ కడుపు పట్టుకున్నాడు. అనుమానంగా గజ్జల్లో చెయ్యి పెట్టి నొక్కి చూసాడు. ఒంటికి ఏమవుతుందో అర్ధమైంది.

ఏమైందిరా!
నాకు ఒంట్లో బాలేదు, నువ్వెళ్లు
అదేంటి ఇవ్వాళ నీకు ఇంపార్టెంట్ కదా..
నా వల్ల అవ్వదు. అయినా నువ్వు ఉన్నావుగా.. నువ్వెళ్లు అన్నాడు జఫర్.
పోనీ కాసేపు ఆగి వెళదామా.. లేదంటే హాస్పిటల్ కి వెళదామా?

వద్దు. ముందు తాళం తెరువు అంటే గోపీ తాళం తీసాడు. జఫర్ వెంటనే నడుము చుట్టు టవల్ కట్టుకుని బాత్రూంలోకి దూరాడు. పది నిమిషాలు గడిచినా జఫర్ బైటికి రాలేదు. రేయి వస్తున్నావా లేదా అని గోపి అడిగితే నువ్వెళ్లు.. ఇవ్వాళ నేను రాను అనేసరికి గోపి తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరే నువ్వు వచ్చేయి అన్నాడు రాజారావు. గోపి జఫర్‌కి చెప్పేసి ఒక్కడే వెళ్ళిపోయాడు.

***

ఎండలో ఆటో దిగి ఇంటికి నడుస్తుంది హిమజ. పిల్లాడి కాలేజ్ ఫీజు కట్టి వస్తుంది. ఎండకి, ఒంటికి పట్టిన చెమటకి అసహనంగా నడుస్తుంటే మెడికల్ షాపులో జఫర్ కనిపించి నడక వేగం తగ్గించింది.

అన్నా పేపర్లో కట్టి ఇవ్వరా అని అడిగితే అలాగే ఇచ్చాడు మెడికల్ షాపు వాడు. అది తీసుకుని బ్యాగులో పెట్టుకుని వెళుతుంటే అప్పటికే అదేంటో అర్ధమైన హిమజ నిర్ధారించుకోవడానికి మెడికల్ షాపు లోకి వెళ్ళింది.

చెప్పండి మేడం
ఇప్పుడు ఒకబ్బాయి వచ్చాడు కదా.. అతనేం తీసుకెళ్లాడు ?
వాళ్ళ అక్కగారికి  ప్యాడ్స్ మేడం.. మీరెవరు?
నేను వాళ్ళ ఎదురింట్లోనే ఉంటాను. నాకూ తీసుకురమ్మని చెప్పారు అందుకే..
అయితే తను తీసుకెళ్లాడు మేడం.

హిమజ బైటికి వచ్చింది. అప్పటికే జఫర్ వెళ్ళిపోయాడు. హిమజ వేగంగా ఇంటికి నడిచి వెళ్లేసరికి జఫర్ తన గది తలుపులు వేసుకోవడం చూసి వేగంగా గేటు తీసుకుని గీత ఇంటి తలుపు కొట్టింది. రెండో సారికి తలుపు తీసింది గీత. ఎదురుగా హిమజని చూసి ఏంటీ ? అని అడిగింది. ఏదో విషయం లేకపోతే హిమజ తన ఇంటి తలుపు తట్టదని గీతకి తెలుసు.

పైన ఆ పిల్లోడు మెడికల్ షాపులో వాళ్ళ అక్కకి అని చెప్పి ప్యాడ్స్ కొనడం చూసాను.
ఎహె ఊరుకో..
నిజమే.. పరిగెత్తుకుంటూ వచ్చి పైకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
ఎవరికైనా తీసుకున్నాడేమో !

హిమజ ఒప్పుకోలేదు. చూస్తే తప్పేంటి. నాకేదో తేడా కొడుతుంది వాడి విషయంలో.. పైగా సాయిబుల పిల్లోడు. చుస్తున్నావుగా ఈ మధ్య ఏం జరుగుతుందో.. మొన్న కాశ్మీర్లో అందరిని కాల్చేశాడు ఒకడు. గోపీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అలా ఏం జరగదులేవే అంటే హిమజ కొట్టేస్తూ మళ్ళీ చూస్తే తప్పేంటి అంది. హిమజ వినేలా లేదని సరే పదా అని తన వెనకే వెళ్ళింది. ఇద్దరు పైకి వెళ్లి తలుపు కొడితే ఎవరూ అన్న జఫర్ గొంతు విని నేనే అంది గీత.

ఓ సారి తలుపు తెరువు అంది హిమజ తలుపుని నెడుతూ.. పది నిమిషాలు ఆంటీ అన్నాడు జఫర్. ఇప్పుడే తెరువు అంది హిమజ. అయినా తెరవలేదు. గీత వదిలెయ్యవే అని చెపుతున్నా వినలేదు హిమజ. తలుపు కొడుతూనే ఉంది. నువ్వు తలుపు తెరవకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తాను అని బెదిరించేసరికి జఫర్ భయపడి తలుపు తెరిచాడు. ఎదురుగా టవల్లో ఉన్న జఫర్‌ని చూసారు ఇద్దరు. గీత స్పష్టంగా గమనించింది, టవల్ కింద పాదం దెగ్గర ఎర్రగా రక్తం. కాళ్ళ మీద వెంట్రుకలు లేవు. హిమజ అంతే వేగంగా టవల్ లాగేసింది. జఫర్ నిజం బయట పడిపోయింది. తొడల మధ్య రక్తం చూడగానే హిమజకి, గీతకి ఇద్దరికీ అర్ధమైంది జఫర్ మగాడు కాదని. జఫర్ కళ్ళలో భయం, కంగారు, అవమానం జరిగిన బాధని  చూడగానే గీత వెంటనే టవల్ అందుకుని నడుము చుట్టు చుట్టి ప్యాడ్స్ ఎక్కడా అని అడిగితే తల దించుతూ చెయ్యి ఎత్తి చూపించింది. గీత హిమజా.. అంటే హిమజ ప్యాకెట్ చించి గీతకి ఇచ్చింది.

గీత దెగ్గరుండి బాత్రూంకి తీసుకెళ్లి సాయం చేసింది. అంతా అయ్యాక జఫర్ బట్టలు వేసుకున్నాడు. మంచం మీద కూర్చుంటే ఇద్దరు చెరో వైపు తన పక్కన కూర్చున్నారు. గీత తన భుజం మీద చెయ్యేస్తే తల ఎత్తి చూసింది జఫర్.
గోపికి తెలుసా తెలీదా అని అడిగితే తెలీదని తల ఊపింది. హిమజ, గీతా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

ఎందుకిలా అని అడిగితే చెప్పింది. ఆ సమాధానం హిమజకి, గీతకి ఇద్దరికీ నచ్చింది. నీ నిజం బైటికి రాదులే కంగారుపడకు అంటే జఫర్ కృతజ్ఞతగా చూసింది. హిమజ మంచినీళ్లు తెచ్చి ఇస్తే తాగి థాంక్స్ చెప్పింది. కాసేపు ఊరికే కూర్చున్నారు. హిమజ లేచి బండలు తుడిచింది. 

గీత నవ్వితే జఫర్ కూడా చిన్నగా నవ్వింది. అయితే గోపీని ఎర్రి పప్పని చేస్తున్నావన్నమాట అని హిమజ నవ్వితే ఇద్దరూ నవ్వారు. గీత అనుమానంగా వాడికి మరీ అమ్మాయికి అబ్బాయికి తేడా తెలీదా! అని అడిగితే గోపీ ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నాడని, అమ్మా నాన్న ఉన్నా లేనట్టేనని రాజారావు ద్వారా, గోపీ ద్వారా తను విన్నది చెప్పింది. ఇద్దరు ముందు గోపీ కోసం బాధ పడ్డా మళ్ళీ జఫర్‌ని చూసి నవ్వారు. గోపీకి తెలిసినప్పుడు వాడి మొహం చూడాలి అంది నవ్వుతూ.. జఫర్ కూడా నవ్వేసింది.


జఫర్ అని పిలిస్తే తల ఎత్తి చూసింది.
నీ అసలు పేరేంటి ?
జఫర్ నుంచి వచ్చిన స్పష్టమైన అమ్మాయి గొంతు విన్నారు గీత, హిమజ.

నా పేరు ****
Like Reply

chaduvtunnattu ledu choostunnattu undi, excellent!
[+] 6 users Like Rishabh1's post
Like Reply

(21-04-2026, 04:52 AM)Rishabh1 Wrote:  chaduvtunnattu ledu choostunnattu undi, excellent!

Thankyou
[+] 1 user Likes Raagaa's post
Like Reply

Super update
[+] 2 users Like Vizzus009's post
Like Reply

Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply

(21-04-2026, 04:11 AM)Jalsaa Wrote:  
జఫర్ అని పిలిస్తే తల ఎత్తి చూసింది.
నీ అసలు పేరేంటి ?
జఫర్ నుంచి వచ్చిన స్పష్టమైన అమ్మాయి గొంతు విన్నారు గీత, హిమజ.

నా పేరు ****

Very good story, Jalsaa garu!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply

నిజం గానే ఇది ఒక బెస్ట్ స్టోరీ కాకపోతే మీరు అప్డేట్స్ ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుంది .

లేకపోతే సీరియస్ గా చెప్తున్న xossipy సైట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ కథ
[+] 3 users Like Mahesh12345's post
Like Reply

Awesome update
[+] 1 user Likes Veerab151's post
Like Reply

nice update bro.
[+] 1 user Likes hisoka's post
Like Reply

Nice update
[+] 1 user Likes ned.ashok's post
Like Reply

Excellent...
[+] 1 user Likes Introvertt's post
Like Reply

Best, narration, good story, even if no sex scenes also, no problem but sto as a story very good going, plz continue and frequent updates are needed
[+] 1 user Likes Paty@123's post
Like Reply

Super
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply

Wow nice update andi
[+] 1 user Likes Nani666's post
Like Reply

Wonderful update... plz continue
[+] 1 user Likes tallboy70016's post
Like Reply

Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply

nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply

Super update please keep writing
[+] 1 user Likes Ahmed's post
Like Reply

Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)