08-04-2026, 11:47 AM
Update ivvandi sir
|
(4) వారసుడు
|
|
13-04-2026, 10:57 AM
(This post was last modified: 13-04-2026, 11:48 AM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
వారం రోజులకి గోపీ, జఫర్ ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఒకే రూములో సర్దుకుపోయారు. జఫర్ జోలికి ఎంత తక్కువ వెళితే అంత మంచిదని అర్ధమైంది గోపీకి, ఒకరోజు నీకు మీసాలు రావా అని అడిగితే కొట్టినంత పని చేసాడు. వాడు మంచి మెకానిక్ అని అర్ధమైంది, టాటా మోటార్స్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ విభాగంలో రాజారావు నియమించాడు. పర్సనల్ గా ఏదో ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాడని తెలిసింది గోపీకి.
మనవడికి బండి కొనిచ్చాడు రావు. జఫర్,గోపి ఇద్దరు కలిసి వచ్చి వెళ్తున్నారు. ఇద్దరు బండి మీద ఇంటి వరకు వచ్చి అక్కడ నుంచి రావు గారి కారులో ఆఫీసుకి వెళతారు. సాయంత్రం మళ్ళీ కారులో ఇంటి వరకు వచ్చి రావు గారిని డ్రాప్ చేసి ఇక్కడనుంచి బండి మీద ఇంటికి వెళతారు. ఈ మధ్య అమృత కూడా తరచూ వీళ్లతోనే ఆఫీసుకి వెళుతుంది. దానికి కారణం కూడా ఉంది, ఇంతవరకు తమ పిల్లల్లో ఎవ్వరు రాజారావుకి దెగ్గర కాలేదు, కాస్తో కూస్తో అమృత పక్కన ఉండేది. ఏదో ఒకరోజు తనని తాను నిరూపించుకుని తాతయ్యకి వారసురాలిగా కంపెనీని, ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కోరిక అమృతది. ఇప్పుడు ఎవ్వరు ఊహించనట్టుగా గోపి తాతయ్య పక్కన చేరాడు. గోపీని ఎవ్వరు పట్టించుకోకపోయినా కనీసం వాళ్ళిద్దరి మధ్యా సంబంధం ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అన్న అనుమానంతో అమృత కూడా వీళ్ళకి దెగ్గరగా ఉంటుంది.
***
శుక్రవారం తల స్నానం చేసి బైటికి వచ్చాడు గోపి. ఎప్పటిలానే జఫర్ ముందే రెడీ అయ్యి కూర్చున్నాడు. జఫర్ ఎన్ని సార్లు చెప్పినా గోపీ పట్టించుకోడు. బాత్రూంలోనే బట్టలు వేసుకుని రమ్మంటే నవ్వుతాడు. మంచి మూడ్‌లో ఉంటే ఉన్న టవల్ కూడా విప్పి డ్రాయర్ మీదే రెడీ అవుతాడు. ఈ ఘోరాలన్నీ చూడలేక జఫర్ మొహం కప్పుకుని బైటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే గోపీని చచ్చేలా కొడతాడు జఫర్. గోపీకి కూడా వాడేం చేసినా నవ్వులాటగానే ఉంటుంది. జఫర్ కోపంతో కూడుకున్న మొహం, వాడి పీల గొంతు, వాడి ప్రవర్తనా.. ముందు వింతగా అనిపించినా తరువాత మొదలైన స్నేహంతో చూస్తే అవన్నీ పిల్లతనంగా కనిపించి నవ్వుకుంటాడు.
గోపీ రెడీ అవుతుంటే చూస్తున్నాడు జఫర్. ఏంటి ఇవ్వాళ హుషారుగా ఉన్నావ్ అని అడిగితే ఇవ్వాళ నా పుట్టినరోజురా అని పాట పాడుతూనే చెప్పాడు గోపీ. ఓహ్హ్ అంటూనే లేచి చెయ్యి ఇచ్చాడు జఫర్. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. గోపీ ఆపకుండా చేతిని పిసుకుతుంటే ఎడమ చేత్తో కడుపులో ఒక్కటి గుద్దాడు. దేనికిరా గాడిదా అని తిడితే వెనక్కి తిరిగి వాడి ఎర్రని పెదాలతో నవ్వుకుని పక్కకి వచ్చేశాడు. ఇద్దరు కలిసి ఆఫీసుకి బైలుదేరారు. ఒక్కనిమిషం ఆగు అంటే ఆగాడు గోపి.. జఫర్ వచ్చి నోరు తెరువు అంటే తెరిచాడు, జఫర్ తన చేతిలో ఉన్న చెక్కరని గోపీ నోట్లో పోసి హ్యాపీ బర్తడే అని ముందుకు నడుస్తుంటే గోపీకి ఎమోషనల్ అనిపించింది. జఫర్ వెనక నడుస్తూ వాడి భుజాలు రెండు పట్టుకుని నొక్కి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని ఇంకా దెగ్గరికి వస్తుంటే గోపి డొక్కలో గుద్దాడు జఫర్. గాడిదా.. అమ్మా.. అని గోపి వెనక నడుస్తుంటే జఫర్ సిగ్గు పడుతూ వేగంగా కిందకి వెళ్ళిపోయాడు.
తాతయ్య దెగ్గరికి వచ్చాక ఆయన వెళదామా అని అడిగితే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి వెళ్ళాడు. పైన అమ్మ గది తలుపు మీద కొడితే అది తీసే ఉంది. కమిన్ అంది జనని. ఆమె అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంది, అద్దంలో చిన్న కొడుకుని చూసి వెనక్కి తిరిగి చూసింది. ఓ క్షణం కొడుకు వంక చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తే ఏమి లేదన్నాడు. జనని మళ్ళీ అద్దం వైపు తిరిగి మేకప్ లో మునిగిపోతుంటే గోపి బైటికి వచ్చేశాడు. జగపతిరావు కూడా అప్పుడే స్నానం చేసి వచ్చాడు. జనని గోపి వచ్చిన సంగతి చెప్పింది. ఏంటటా ? aని అడిగితే ఏమి చెప్పలేదు, డబ్బులు ఏమైనా కావాలేమో అంది. ఇచ్చావా అంటే లేదు వెళ్ళిపోయాడు అంది. ఇద్దరు రెడీ అవ్వడంలో మునిగిపోయారు.
అమ్మ దెగ్గర నుంచి పెద్దనాన్న కూతురు రమ్య అక్క గదికి వెళితే గోపిని చూసి పలకరించింది. మాట్లాడాక వెళ్లిపోతుంటే గోపీ.. అని పిలిచింది, వెనక్కి తిరిగి చూసాడు. నాకు గుర్తులేదనుకున్నావా అని నవ్వుతూ దెగ్గరికి వచ్చి వాటేసుకుంటూ హ్యాపీ బర్తడే అంది. థాంక్స్ అన్నాడు గట్టిగా పట్టుకున్నాడు. నీకో చిన్న గిఫ్ట్ అని టేబుల్ దెగ్గరికి వెళ్లి బాక్స్ తెచ్చి ఇచ్చింది. తెరిచి చూస్తే వాచ్ ఉంది. థాంక్స్ అక్కా అని చేతికి పెట్టుకున్నాడు. బాగుంది అంటే బుగ్గ గిల్లింది. గోపి వాచ్ చూసుకుంటూ నవ్వుతూ బైటికి వస్తుంటే అప్పటికే జఫర్ చెప్పేసినట్టున్నాడు. తాతయ్య, అమృత ఇద్దరూ విషెస్ చెప్పారు. ముగ్గురిని ఆఫీసులో దించేసాక అటు ఇటు తిరుగుతుంటే ప్రీతి కనిపించింది. ఏమైందండీ ప్రీతీ గారు, ఆ రిసెప్షన్ టేబుల్ వదిలి రారు కదా ఏమైంది అని అడిగాడు. ప్రీతీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే ఆమె మొహంలో కంగారు చూసి స్వర్ణకి ఓ సారి హాస్పిటల్‌కి వెళ్లి రమ్మని మెసేజ్ పెట్టాడు.
అలా రావుని వదిలాడో లేదో, ఆయన నుంచి ఫోను రాగానే మళ్ళీ లోపలికి వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు గోపి. చెప్పరా.. అంటే ఏముంది చెప్పడానికి అన్నాడు.
ఏమిచ్చింది మీ అమ్మ, వాచ్ బాగుంది.
ఇది రమ్యక్క ఇచ్చింది
రావుకి అర్ధమైంది, సరే ఏం కావాలో అడుగు ఇస్తాను
డెబ్భై లక్షలు కావాలి
ఎందుకురా !
విష్ణు అన్న బర్తడేకి మూడు కోట్ల కారు ఇచ్చావ్. అమృతకి కోటిన్నర పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిచ్చావ్. పవన్ గాడికి కోటి రూపాయల కారు. రఘు అన్నకు కూడా.. అని లిస్ట్ చదువుతుంటే సరే అన్నాడు రావు. కానీ కాష్ ఎందుకు అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు. గోపీతో కష్టమని తెలిసి చెక్ రాసి ఇచ్చేసాడు. అలానే రేపటి నుంచి పర్సనల్ సేకరేటరీ బాధ్యతలు కూడా నీవే అంటే చెక్ ఇచ్చిన ఆనందంలో సరే అన్నాడు
జఫర్ ఎలా ఉన్నాడు ?
వాడికేం.. ఎక్కడున్నా బతికేస్తాడు.
వాడి గురించి నీతో మాట్లాడాలి.. తను అబ్బాయి..
సాయంత్రం చెప్పు. చాలా పనులున్నాయి అని లేచాడు గోపి. చెప్పేది వినరా అంటే సాయంత్రం వింటాలే.. అయినా వాడి గురించి భయపడాల్సిన పనిలేదు, నాకు బెస్ట్ ఫ్రెండులా అయిపోయాడులే.. అదీ కాకా మంచి మెకానిక్ అని కూడా విన్నాను. నువ్వేం కంగారుపడకు.. వాడిని నేను చూసుకుంటాలే అని చెక్కు చూసుకుంటూ సంతోషంగా బైటికి పరిగెత్తాడు.
వీడొకడు.. అన్నిటికి తొందర ఎక్కువే.. వాడు అబ్బాయి కాదని చెపుదామనుకుంటే వినిపించుకోకుండా పోయాడు. అయినా ప్రస్తుతానికి ఇద్దరికీ అదే మంచిదిలే.. ఒకే గదిలో ఉంటున్నారు. ఏదైనా తప్పు జరిగితే పైకి పోయాక రెహ్మాన్ గాడు నా తాట తీస్తాడు. తరువాత జఫర్ గురించి నిజం తెలిసిన రోజున మనవడు మొహం ఎర్రిపువ్వులా పెడతాడేమో అనుకుని నవ్వుకుంటూ పొద్దున ప్రీతీ ఇచ్చిన ఫైల్స్ చేతిలోకి తీసుకున్నాడు రాజారావు .
13-04-2026, 11:46 AM
(This post was last modified: 13-04-2026, 11:54 AM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
ఫోన్ చేస్తే స్వర్ణ వచ్చింది. తనకి విషయం చెప్పి తాతయ్య ఇచ్చిన చెక్కు తీసి ఇచ్చాడు. నాకేంటి అంది స్వర్ణ, ఏం కావాలో చెప్పు అంటే పుట్టిన రోజు సందర్భంగా ఒక ముద్దివ్వు అంది. ముందు ఆశ్చర్యపోయిన తన గురించి ఎలాగో తెలుసు కాబట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు ఇస్తానులే అంటే ప్రామిస్? అంది. గోపీ ప్రామిస్ వేసాడు. అయితే ఓకే అంటూ నవ్వుతూ గోపీని హత్తుకుని హ్యాపీ బర్తడే గోపీ అని తుర్రుమంది. పోయిన సారి స్వర్ణ వాటేసుకున్నదానికి ఈసారి వాటేసుకున్నదానికి తన సళ్ళ సైజు పెరిగింది అనిపించింది. తనకి తెలీకుండానే కింద కడ్డీ వెచ్చబడుతుంటే ఆలోచనని కొట్టేస్తూ మూడ్ నుంచి బైటికి రావాలంటే జఫర్ గాడే కరెక్ట్ అని వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
అంతా తిరుగుతూ జఫర్ ఏం చేస్తున్నాడో చూద్దామని వెళితే అప్పటికే వాడు ఫుల్లు పనిలో ఉన్నాడు. కారు ఇంజిన్‌తో కుస్తీ పడుతున్నాడు. గోపిని చూసి చిన్నగా నవ్వాడు. గోపి అంతా కలియజూస్తూ.. సొంత వర్కుషాపు. ఒక్కడివే పని చేస్తావ్. రికమండేషన్ జాబ్ అంటే ఇలా ఉండాలి అన్నాడు. జఫర్ కోపంగా చూస్తుంటే ఊరికే గెలుకుదామాని అని నవ్వాడు. రెంచీ విరిచేస్తా అన్నట్టు చూపించి మళ్ళీ పనిలో పడింది. గోపీని కసిరినప్పుడల్లా తన పెదవుల మీద మెరిసే మెరుపంటే జఫర్ కి బాగా ఇష్టం. ఎప్పటిలానే గోపీకి కనపడకుండా నవ్వుకున్నాడు. గోపిని చూస్తే ఊరికే నిలుచుని తననే చూస్తున్నట్టు అనిపించి అలా కాళీగా తిరక్కపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే రేపటి నుంచి అన్నాడు గోపి రెంచి పట్టుకుని వేలికి పెట్టుకుని తిప్పుతూ.. మరి ఇవ్వాళ ? అని అడిగితే ఇవ్వాళ ఏం లేదు అన్నాడు. అయితే ఆ 12mm రెంచి తీసుకుని ఇది బిగించు అన్నాడు జఫర్. గోపీ సరేనంటూ రెంచి తీసుకుని వెళ్లి బిగిస్తుంటే జఫర్ ఆశ్చర్యపోయాడు. ఏది బిగించాలి అని అడగలేదు గోపీ.. అక్కడ అన్ని భాగాల్లో జఫర్ ఇప్పుడేం పని చేస్తున్నాడు, తరువాత వాడికి ఏ భాగం అవసరం పడుతుంది అని నిమిషాల్లో పట్టేసాడు గోపి.
ఇంజిన్ మొత్తం విప్పేసి ఉన్నా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నీకు తెలిస్తే చాలు నువ్వు మెకానిక్ అయిపోయినట్టే అన్న తన తాతయ్య రెహ్మాన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీకు మెకానిక్ పని తెలుసా! అని అడిగితే నా తాత రావు మోటార్స్ కంపెనీ ఓనర్ అన్నాడు నట్లు బిగిస్తూ.. మీ ఇంట్లో అందరికీ వచ్చా! అని అడిగితే తల తిప్పకుండానే నాకు వచ్చు అన్నాడు. గోపీని మాటల్లో పెట్టి అసలు గోపికి ఎంత తెలుసు అని తెలుసుకోవడం మొదలుపెట్టాడు జఫర్. ఇద్దరి మధ్యా ఇంకో కొత్త కనెక్షన్ ఏర్పడుతుందని దాని వల్ల వాళ్ళ చేతుల్లో ఉన్న ఇంజిన్ రూపు రేఖలు మారిపోతాయని వాళ్లకి తెలీదు.
***
చీకటి పడింది. అమృత, రావు ఇద్దరు గోపీ కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ చేస్తే ఎత్తడంలేదు. జఫర్ నుంచి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేసరికి ఇద్దరు జఫర్ వర్కుషాపు వైపు వెళ్లారు. లోపల ఇద్దరు గ్రీజు పూసుకుని, మసితో ఉండడం చూసి అమృత ఆశ్చర్యపోయింది. రాజారావుది కూడా అదే పరిస్తిధి. గోపి కారు కింద రిపేర్ చేస్తుంటే జఫర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అయ్యిందా అని అరిచాడు జఫర్. కారు కింద నుంచి గోపీ నవ్వులు వినిపిస్తే కోపంగా కాలుతో తన్నాడు. గోపీ నవ్వుతూ ఏం గొంతురా నీది.. అయ్యిందా.. అంట. గోపీ మాటలకి పైన కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న జఫర్ సిగ్గు పడ్డాడు.
రెంచితో రెండు సార్లు కొట్టినట్టు శబ్దం వచ్చింది. జఫర్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఒక నిమిషం నడిచి మళ్ళీ ఆగిపోయింది. వెనక సైలెన్సర్ నుంచి నల్లని పొగ కమ్మేసింది. గోపి మళ్ళీ కింద రెంచితో రెండు సార్లు కొట్టాడు. జఫర్ ఇంజిన్ ఆపేసాడు. ఐదు నిమిషాల తరువాత రిపేర్ చేసి కారు కింద నుంచి బైటికి వచ్చాడు గోపి. అమృతని తాతయ్యని చూసి వాళ్ళ పక్కన నిలుచున్నాడు. వాళ్ళ ఎదురుగా జఫర్ కారులో కూర్చుని ఉన్నాడు. మొహం అంతా మసి నిండిన గోపిని చూసి చిన్నగా నవ్వాడు జఫర్. గోపీ స్టార్ట్ చెయ్యమని సైగ చేస్తే స్టార్ట్ చేసాడు. ఇదంతా చూస్తున్న రాజారావు, అమృత మాత్రం ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. జఫర్‌కి గోపీ చేతి సాయం చేస్తున్నాడేమో అనుకుంది అమృత. కానీ ఒక్కడే కారు కింద రిపేర్ చేసి పైకి రావడం తను నమ్మింది నిజం కాదని చెపుతుంది మనసు.
రెండు నిమిషాలు అయినా ఇంజిన్ ఆగిపోలేదు. వెనక సైలెన్సర్ నుంచి నల్లని పొగ మెల్లగా తగ్గింది. ఇంజిన్ సౌండ్ కూడా ఇప్పుడు స్థిరంగా ఉంది. గోపీ నవ్వుతూ చెయ్యి ఎత్తితే జఫర్ కారు దిగి వచ్చి గోపి వైపు చెయ్యి ఎత్తితే గోపి తన చేతిని కొట్టాడు. ఇద్దరు పక్కన నిలుచుని చూస్తుంటే ఏంటిది అని అడిగాడు రాజారావు.
డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్(DCT) అన్నాడు జఫర్. దీని మీద మూడు సంవత్సరాలుగా తాతయ్య పని చేస్తున్నాడు. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం నాకు వచ్చింది అన్నాడు జఫర్.
మిగతా వాటికీ దీనికి ఏంటి తేడా అని అడిగింది అమృత.
ఇప్పుడు ఉన్న పార్షే, ఆడి ఇవన్నీ DCT వాడుతున్నా అవి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు, ఓవర్ హీట్ సమస్యలు ఉన్నాయి. స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు జెర్కులు ఇవ్వడం, గేర్ టైమింగ్ సరిగ్గా ఉండదు. కానీ మన కారులో ఆ సమస్య ఉండదు. ఫుల్లీ డెవలప్డ్ DCT. చాలా సాఫ్ట్ చాలా రిలైయబుల్. ఎంత దూరం వెళ్లినా కారు ఆగదు, దాని పవర్ కూడా తగ్గదు. గోపి అవునని తల ఊపాడు.
మీరు రేసుల గురించి మాట్లాడుతున్నారా ! ఆశ్చర్యపోతూనే ఉన్నాడు రాజారావు
ఓ విధంగా చెప్పాలంటే అవును అన్నాడు గోపి. వీళ్ళ తాతయ్య మాములోడు కాదు.
రాజారావు మోహంలో ఆనందంతో పాటు కొత్త ఆలోచనలు పుట్టడం గమనించాడు జఫర్, వెంటనే కానీ సమస్యలు ఉన్నాయి తాతయ్య అన్నాడు.
ఏంటవి ?
ఇప్పుడున్న సాఫ్ట్వేర్ దీనికి సపోర్ట్ అవ్వదు. దీనికి కొత్తది డిజైన్ చెయ్యాలి. ప్రస్తుతానికి ఇది చూడటానికి తప్ప ఎందుకూ పనికి రాదు అని నిరాశగా కారుని చూస్తూ తల దించాడు జఫర్. గోపి తన భుజం నొక్కుతూ చూద్దాం అంటుంటే ఓ పక్క ధైర్యంగా ఉన్నా తన భుజం నొక్కుతున్న గోపి వంక కోపంగా చూసింది. గోపి అది చూసి వెంటనే చెయ్యి తీసేస్తూ నాలిక కొరుక్కుంటే జఫర్ నవ్వుకున్నాడు.
అంటే ఇప్పుడు ఇది నడవదా, ఏంటి సమస్య, మీకేం కావాలి అని అడిగాడు రాజారావు.
ప్రెడిక్టివ్ షిఫ్టింగ్ సిస్టం. దీనికి తగ్గ TCU కావాలి. అంటే అంది అమృత. ట్రాన్స్ మిషన్ కంట్రోల్ యూనిట్.. చెప్పాడు గోపి. జఫర్ చెపుతూ కారుకి ECU ఎలానో క్లచ్‌కి TCU అలా. మరి స్టార్ట్ అయ్యిందిగా అంది అమృత సందేహంగా. జఫర్ కారు దెగ్గరికి వెళ్లి బానెట్ మీద చెయ్యి పెట్టి ఇంజిన్ ఫీల్ అవుతూ స్టార్ట్ మాత్రమే అయ్యింది అని ఆగి గోపి వైపు చూసి థాంక్స్ అన్నాడు. అమృత, రాజారావు ఇద్దరు ఆశ్చర్యపోయారు. గోపి నవ్వుతూ నువ్వు ఇంట్లో వంట ఒండినదానికి దీనికి చెల్లుకు చెల్లు అని బైటికి వెళ్ళిపోయాడు. రాజారావు జఫర్ తో గోపి గురించి అడిగాడు.
గోపీ.. మెకానిక్.. ఎలా !
మీ కంపెనీలో ద బెస్ట్ మెకానిక్ కానీ ఇంజనీర్‌ని కానీ తీస్తే గోపి టాప్ త్రీలో ఉంటాడు తాతయ్య. అది నేర్చుకుంటే వచ్చినది కాదు, తను ప్రతీది ఫీల్ అవుతున్నాడు. కారు చేసే చిన్న చిన్న శబ్దాలు కూడా గోపికి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుస్తుంది. మా తాతయ్య తరువాత మళ్ళీ అంతటి నైపుణ్యం చూసింది గోపీలోనే.. ఈ పనికి అలవాటు పడితే గోపీని ఎవ్వరు ఆపలేరు.. అని పొద్దున నుంచి తను గమనించిన విషయాలు చెప్పాడు.
తనెక్కడ నేర్చుకున్నాడు? ఎవరు తన గురువు ? జఫర్ అడుగుతుంటే అప్పుడే వచ్చాడు గోపి. జఫర్ మసి మొహం చూసి ఇంకెంతసేపురా వెళ్లి కడుక్కోపో అంటే జఫర్ వెళ్ళిపోయాడు. రాజారావు మనవడి వైపు తిరిగి నువ్వెప్పుడు నేర్చుకున్నావురా ఇదంతా అని అడిగితే నవ్వాడు గోపి. అమృత చెప్పు అని అడిగితే.. నేను ఎక్కడా నేర్చుకోలేదు, మన గరాజ్‌లో పాడైన కార్లు ఉన్నాయి కదా వాటిని గెలుకుతూ నేర్చుకున్నా.
మాకెప్పుడు కనపడలేదే అని రాజారావు అమృత వైపు చూస్తే అమృత కూడా చూడలేదంటూ తల ఊపింది. ఇద్దరు గోపి వైపు చూసారు. గోపి నవ్వాడు. మీరెప్పుడు నన్ను పట్టించుకున్నారు? నాకు మీరంతా దూరం కదా.. అయితే చెట్ల దెగ్గరా లేదంటే కార్ల దెగ్గరా కూర్చునేవాడిని. ఏదైనా తెలియకపోతే మన పర్సనల్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగి తెలుసుకునేవాడిని.
ఎప్పటినుంచి చేస్తున్నావ్ ఇదంతా !
మూడు సంవత్సరాల నుంచి.. నా దెగ్గర మూడు కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి అని సంబరంగా చెప్పాడు గోపి.
అమృత ఆసక్తిగా చూసింది. ఎక్కడున్నాయి, నేను చూడచ్చా అని అడిగితే నవ్వాడు గోపి.
జఫర్ వచ్చేసరికి వెళదాం ఆకలి వేస్తుంది అన్నాడు. అమృతకి తన డిజైన్స్ గురించి చెప్పకుండా దాటవేయడం రాజారావుని మనవడి మీద ప్రత్యేక దృష్టి పడేలా చేసింది. గోపి అంత తేలికగా తీసేసేవాడు కాదని, ఇంట్లో అందరి కన్నా మనవడిలో విషయం రెండు ఆకులు ఎక్కువగానే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఒకరకంగా నా అస్త్రం దొరికింది అన్న సంతోషం కనిపించింది రాజారావులో.. గోపీని అమృతని మార్చి మార్చి చూసాడు. మెదడులో పురుగు గట్టిగా తిరిగింది.
అమృత మళ్ళీ డిజైన్స్ గురించి అడుగుతుంటే రాజారావు దీని గురించి చాలా మాట్లాడాలి, ఇవ్వాళ్టికి చాలు, వెళదాం పదండి అన్నాడు. అమృతని తాతయ్యని ఇంటి దెగ్గర డ్రాప్ చేసాక జఫర్ తోపాటు బండి ఎక్కాడు. రేయి బండి నేర్చుకుంటావా అని అడిగితే ఇప్పుడే కాదులే అని వెనక కూర్చున్నాడు జఫర్. ఇలా ఎన్ని రోజులురా అంటే ప్రస్తుతానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. జఫర్ గోపి భుజం మీద చెయ్యి వేసాడు, అదీ మొదటిసారి. ఇవ్వాళ గోపీ పుట్టినరోజు కదా అని బైట తిందాం అన్నాడు జఫర్. గోపి కూడా అలాగేనని తీసుకెళితే ఇద్దరు తినేశారు. అక్కడే చిన్న బేకరీ కనిపిస్తే కేక్ కట్ చేయించాడు. గోపీ మళ్ళీ ఎమోషనల్ అవుతూ జఫర్ ముందుకు వెళ్లి గట్టిగా వాటేసుకుంటే రెండో క్షణంలోనే వెనక్కి తోసి గుండె మీద ఒక్కటి తన్నాడు. కింద పడి నొప్పితో గోపి తిడుతుంటే వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు. బండి దెగ్గరికి వెళ్ళిపోతూ నన్ను ముట్టుకోకు నాకు నచ్చదు అన్నాడు. కోపంగా చూసాడు గోపీ..
సినిమాకి వెళదామా అంటే ముందు వద్దు అనుకున్నా గోపీ కోసం వెళ్ళాలనిపించింది. సరే అన్నాడు. ఇరవై రూపాయల టికెట్ తీసుకుంటే నవ్వాలో ఏడవాలో తెలీక గోపి వైపు చూస్తుంటే ఆట మొదలయింది పదా అని చెయ్యి పట్టుకుని లాగుతుంటే గోపీ మొహం చూస్తూ వాడి పక్కనే నడిచాడు. అటు పక్కన వేరేవాడు కూర్చుంటే ఇబ్బందిగా చూసాడు జఫర్. ఏమైంది అంటే ఏం లేదు అన్నాడు. పోనీ సీట్ మారుతావా అంటే గోపి పక్కన కూడా ఇంకొకడు ఉండేసరికి వద్దులే అన్నాడు. ఇరవై రూపాయల టికెట్లో ఉన్నవాళ్లు అంతా మాస్ కాండిడేట్లు. ఈలలు వేస్తూ గోల చేస్తుంటే బాగున్నా తన పక్కన కూర్చున్న వాడి చెయ్యి తగలడం జఫర్ కి నచ్చలేదు. గోపికి దెగ్గరగా జరుగుతూ తల ఎత్తి సినిమా చూస్తుంటే మెడ నొప్పి పుట్టింది. పొద్దున నుంచి కష్టపడటం వల్ల అలిసిపోయి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తల గోపి భుజం మీద ఆనుకుని నిద్రపోతుంటే గోపి గమనించి భుజం పడుకోవడానికి వీలుగా పెట్టి సినిమా చూస్తున్నాడు.
***
రాత్రికి రాత్రి గోపి, జఫర్ ప్రాజెక్టు విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. అమృత ఏ ఉద్దేశంతో చెప్పినా అందరి కళ్ళలో ఆశ పుట్టింది. ముందు అమృత చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. ఒక వేళ నిజమే అయితే ఆ డిజైన్స్, DCT చేజిక్కించుకొవాలి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రాత్రి రాజారావు కూడా నిద్రపోలేదు.
సినిమా హాల్ ఇంటర్వెల్ మధ్యలో లేస్తే అలిసిపోయిన జఫర్ లేస్తాడని అలానే కూర్చున్నాడు గోపి. ఇవ్వాళ వాడి కష్టం చుసిన తరువాత వాడంటే గౌరవం పెరిగింది. బలం లేని జఫర్ చేతులు, మణికట్టు చూసి బలం గురించి ఆలోచిస్తే నవ్వొచ్చింది. జఫర్ మొహం చూసి తెలీకుండా నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయేలా ఉన్నావు కదరా అనుకున్నాడు. ఫోనుకి ఆగకుండా మెసెజెస్, కాల్స్ వస్తుంటే చూసాడు. ఇంటి దెగ్గర నుంచి ఎప్పుడూ లేనిది ఇంట్లో వాళ్ళందరి దెగ్గర నుంచి బర్తడే విషెస్ వస్తున్నాయి. అనవసరంగా నోరు జారాను అనుకున్నాడు గోపి. ఇది అమృత పనే అని తెలుసు. మళ్ళీ సినిమా మొదలైయ్యేసరికి అందులో లీనం అయిపోయాడు.
13-04-2026, 12:39 PM
Bro update Chala bagundi
Kasta past ga update ivandi please
13-04-2026, 01:56 PM
Super super super super super super super super super
13-04-2026, 01:57 PM
Superb update, story baga nachindi, plz continue with frequent updates
13-04-2026, 04:31 PM
(This post was last modified: 13-04-2026, 04:33 PM by Introvertt. Edited 1 time in total. Edited 1 time in total.)
Superrr...continueee
13-04-2026, 09:09 PM
(This post was last modified: 13-04-2026, 09:09 PM by Terminator619. Edited 1 time in total. Edited 1 time in total.)
Superb update bro....70 lakhs tho sonthanga project chestada mana hero...jaffar ammaya?
14-04-2026, 08:24 AM
(13-04-2026, 11:46 AM)Jalsaa Wrote: Nice story Jalsaa garu!!! |
|
« Next Oldest | Next Newest »
|