Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
అంతే “ ఏం చెపుతున్నారు మీరు. ఆవిడ ఇంటర్ చదివిందేమో. ఆయన బ్యాంకు మేనేజర్. పెద్ద పోస్ట్ లో ఉండి అలా చెయ్యటమేమిటీ? మరీ స్టైల్ ఆవిడకి. పైగా ఆవిడని వెనకేసుకొస్తున్నారా ? మా ఊరిలో భర్త ఎదురుగా నుంచునుంటే భార్య కుర్చీలో కూడా కూర్చోదు తెలుసా” అని కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని ఖరాఖండిగా చెప్పింది మాధురి.
భార్య కు కాళ్ళు పట్టటం భూతద్దం లో నుండి చూస్తున్న మాధురి ఆలోచనాసరళికి బిత్తర పోయాడు శ్రీకర్. ‘
*****
అర్ధరాత్రి అయ్యింది. శ్రీకర్ కి కంటి మీద కునుకు రావటం లేదు. తెల్లవారు ఝామున క్యాంప్ కు కూడా వెళ్ళాలి. శ్రీకర్ మాధురిని తన చేతులలోకి తీసుకుని , చిలిపి చేష్టలతో మురిపించి , లాలించి శృంగార రాజ్యం లో విహరింపచేసి అప్పటికి ముప్పై రోజులు గడిచింది. వెన్నెల రాత్రులు కంటి ముందే వృధాగా కరిగిపోయాయి.
ఇన్నాళ్ళు మాధురితో అంటీ ముట్టనట్లు ఉంటూ, ఆమె పడక చేరే వేళ లాప్ టాప్ లో తల దూర్చి సీరియస్ వర్క్ లో మునిగి ఉన్నట్లో లేదా అలసి నిద్రపోతున్నట్లో నటించేస్తున్నాడు శ్రీకర్.
శ్రీకర్ మాధురి కేసి చూసాడు. ఆమె కనురెప్పలు అల్లల్లాడాయి. రెస్ట్ లెస్ గా అటూ ఇటూ దొర్లుతోంది. మొహంలో ఏదో అశాంతి.
“అలా అల్లల్లాడే బదులు తనంత తానుగా ‘రా రా శ్రీకరా’ అన్ని నన్ను చుట్టేసి, ‘నా కోరిక తీర్చు’ అని డిమాండ్ చెయ్యొచ్చుగా ....’చాలెంజ్’ విసరొచ్చుగా, ఆ ముందు అడుగు వెయ్యదే “ అంటూ మన్మధుని కోరలలో చిక్కుకున్న శ్రీకర్ మధనపడుతున్నాడు.
మరల ఆమెకేసి చూసాడు. క్యాంప్ కు వెడితే రేపటి నుండి ఈ ‘కనువిందు’ కూడా కరువవుతుంది అని అనుకుంటే అతనికి దిగులుగా ఉంది. మబ్బు పట్టిన ఆకాశంలో మెరుపులాగా ఉంది మాధురి. తన శంఖం లాంటి మెడ ‘ముద్దులతో పూరించమని’ అతనిని ఊరిస్తోంది. నడుము సొంపు పదిహేనురోజుల కంట్రోల్ ని పటాపంచలు చేస్తోంది. వంపు తిరిగిన పెదవులు వలపు బాణాలు విసురుతున్నాయి. ‘ఎన్నాళ్ళు మమ్మల్ని ఇలా మూగగా ఉండమంటావు?’ అని మాధురి కాలి పట్టీలు నిలదీస్తున్నట్లు ఉన్నాయి. ఆవేశం పొంగి ఆమెను ఆక్రమిoచు కోవాలని గబ గబా బెడ్ కేసి నడిచాడు.
అంతలోనే “నా మనసులో ఉన్న విషయం తనకు అర్ధమవుతోందా ? నిజంగా నా వర్కే మా సంగమానికి అడ్డం అనుకుని కోరికలను చంపుకుంటోందా?” అనుమానం వచ్చి ఆగిపోయాడు.
తనని లేపి ఆవేశంగా కౌగిలిలో చుట్టేసి “ ఇన్నాళ్ళు నేను దూరంగా ఉంటుంది నా వర్క్ వలనో, లేదా అలసటతో నిద్రపోయో కాదు. పిచ్చి మొహమా, కోరికలను అణచుకుని ఇన్నాళ్ళు ఎలా ఉండగలుగుతున్నావు? స్త్రీ అయినంత మాత్రాన నీకు కోరిక ఉండదా?
లాప్ టాప్ లో తల దూర్చి పని చేస్తున్నట్లు ఫోజు కొడుతున్న నన్ను ‘ఈ టైం లో లాప్ టాప్ తో పనేంటి నన్ను టాప్ చేసి ‘టాకిల్’ చెయ్యి ‘ అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళవచ్చుగా !
నేను కోరిక వ్యక్త పరిచినపుడు మాత్రమే నీవు సహకరిస్తే అదీ ప్రేమే నేమో కాని నాకు కావలసినది ‘దాసీ ప్రేమ’ కాదు. నీ జీవిత ‘భాగస్వామి’ తో విరహాన్ని , వాంఛను వ్యక్త పరచలేనపుడు అది ఆలుమగల బంధమే కాదు. నేను నిన్నేదో ఉద్దరించిన వాడిని కాదు, నువ్వు నా సేవకురాలివి కాదు. మనం సమఉజ్జీలం మధూ. ‘సై అంటే సై’ అన్నట్లు ఉండాలి. ఎప్పుడూ నీ చాయస్సే నా , నాకూ ‘చాయస్’ ఉంది ‘పోవోయ్’ అని చనువుగా చెప్పగలగాలి . మధూ... దీనిలో గెలుపు ఓటములు లేవు. విజయం ఇద్దరిదీ . అర్ధం చేసుకోవూ’ అని చెప్పాలనిపించింది శ్రీకర్ కి. అసలే సున్నిత మనస్కురాలు, మనసు కష్ట పెట్టుకుంటుందేమో అనే భయం అడ్డు పడింది.
అలా మదనపడుతున్న శ్రీకర్ కి మెరుపులాంటి ఆలోచన మదిని తట్టింది. అది అమలు చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు.
*****
గత మూడు రోజుల్లో ఎన్ని సార్లు ఫోన్ చేసినా పై పైన పొడి మాటలు తప్ప మాధురిలో తన సహజమైన నవ్వు, హుషారు లేవు. తప్పనిసరిగా క్యాంప్ లో ఉన్నా శ్రీకర్ మనసంతా ఇంటి మీదే. క్యాంపు ముగించుకుని ఇల్లు చేరాడు. మాధురి ఎప్పటి లాగా మామూలుగా అన్నీ అందిస్తూ కనిపెట్టుకుని ఉన్నా ఏదో తేడాగా అనిపిస్తోంది. తన మౌనం శ్రీకర్ కు అసౌకర్యంగా ఉంది. ‘తన మనసు కష్టపెట్టానా’ అని అతని మనసులో బాధ. భోజనం ముగించి బెడ్ రూమ్ లోకి వెళ్లి లాప్ టాప్ లో మొహం దూర్చుకుని కూర్చున్నాడు.....
‘రాణి గారు వేంచేస్తున్నారహో’ అని కాలి పట్టీలు తమ శబ్దంతో ప్రకటిస్తుండగా మాధురి పడక గదిని చేరింది. ఆమె తలలోని మల్లెల సువాసనలకు శ్రీకర్ మనసులో రొమాంటిక్ భావాలు గుప్పుమన్నాయి. అసలు ఏమవుతోందో అర్ధమయ్యేలోపే శ్రీకర్ దగ్గరకు వచ్చి, మెడ చుట్టూ చేతులేసి చెంప మీద ఓ ముద్దెట్టి, మునిపంటితో కొరికింది. చేతిలో లాప్ టాప్ తీసి ప్రక్కన పడేసి గాఢమ్ గా కౌగిలించుకుంది ...... అరచేయి తెరిచి, చేతిలో రాసినది చూపించింది. అది చూసి ‘అవునా’ అంటూ పూరించిన ఉత్సాహంతో మాధురిని చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి ప్రక్కన చేరాడు. అప్పుడే విరిసి, స్వేచ్చా గాలులు పీలుస్తున్న కుసుమం లాగా ఉన్న తను అంతలోనే ముడుచుకు పోతూ ‘బరితెగింపు కాదా...’ తడబడుతూ సందేహాలు అడిగింది.
“కోరిక పురుషునికే కాదు స్త్రీ కి ఉంటుంది. ఉన్నప్పుడు వ్యక్త పరచుకోవటమూ ఉండాలి. భార్య, భర్త ఇష్టానికి అనుగుణంగా మసలటమే కాదు, తన ఇష్టానికి అనుగుణంగా తనని మలచుకోవటమూ మగడు ఇష్ట పడతాడు. భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ , ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ పొందే సుఖం, ఆనందాలు ఏక పక్షంగా సాగే అనుభవం, సంతోషం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి”
శ్రీకర్ మాటలతో సందేహాలు ఆపి సరసాలకు తెర తీసి , ‘శయనేషు రాణి’ అయ్యింది...అడ్డుపడుతున్న శత్రువులు సిగ్గు , బిడియాలను తరిమికొట్టి సరస సామ్రాజ్యాని ఏలి, రసరాజ్య కోటమీద విజయకేతనాన్ని ఎగురవేసింది.
ఆటలో గెలిచిన క్రీడాకారిణి తన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నట్లుగా , వయ్యారంగా పడుకుని, అనుభవాన్ని నెమరవేసుకుంటూ మాధురి. తన పాదాల మీద తల పెట్టుకుని సేదతీరుతూ శ్రీకర్.
“మధూ , ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. నా చిన్నప్పడు అమ్మ, నాన్నను ఏదన్నా కొత్త వస్తువు అడగటానికి మొహమాటం అడ్డు వస్తే ఓ పేపర్ మీద రాసి వాళ్లకు కనపడేటట్లు పెట్టే వాడిని. ‘ఏమిట్రా ఇంత మొహమాటం’ అని నవ్వుకుని, కొని ఇచ్చేవాళ్ళు. అది గుర్తుకొచ్చే , నా మనసు నువ్వు గ్రహించుకోవాలని అంత పెద్ద లెటర్ టైప్ చేసి, మెయిల్ చేసాను. కాని నీ మౌనం నాకు ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా! ‘నిన్ను ఇబ్బంది పెడుతున్నానా’ అని బెంగ పడ్డాను. కాని నా మూడు పేజీల ఉత్తరానికి జవాబుగా నువ్వు నీ అరచేతిలో రాసి చూపించిన ఆ పదాలు ....’
‘చట్ , పో ‘ అని వాటిని ఉచ్చరించపోతున్న శ్రీకర్ ని చెప్పనీయకుండా నోరు మూసేసింది. అతను ఆ పదాలను నెమరు వేసుకుంటూ, హాయిగా నవ్వాడు. సిగ్గుగా నవ్వుతూ తనూ జత కలిపింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
శ్రీనివాస్..ద సోల్జర్ - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సోల్జర్ శీనివాస్! తన భర్త.
దేశంకోసం అనుక్షణం తపిస్తూ, దేశరక్షణలో సరిహద్దు వెంబడి పహారా కాస్తూ శత్రు సైనికుల చొరబాటును నిరోధించే్ పులి.
తన పెళ్లై ఏడాదయింది. శీనివాస్ సెలవు మీద వచ్చి హడావుడిగా తనను చుసి, మూడుముళ్లేసి సొంతం చేసుకుని, మూడు రాత్రుల మధురిమను తన గుండెల్లో ప్యాక్ చేసి మళ్లీ వస్తానని చెప్పి డ్యూటీలో జాయినైపోయాడు.
అప్పటినుంచీ పున్నమిరాత్రి, విచ్చిన పువ్వులు, మంచి గంధం లాంటివన్నీ శ్రీనివాస్ గాఢ పరిష్వంగం గుర్తుచేసి, మనసును పిచ్చెకిస్తుండేవి. స్నానిస్తున్నప్పుడు, బట్టలు కట్టుకుంటున్నప్పుడు శరీరంలోని అణువణువూ అతను కేంద్రీకరింపజేసిన స్పర్శానుభూతులు గిలిగింతలు పెడుతూండేవి. ఏం చేయగలం? దేశాన్ని కాపాడ్డం అతని విధి. తనకు, అతనికోసం విరహోత్కంఠితలా ఎదురుచూసే శిక్ష విధించింది విధి.
రేపు తెల్లారితే ఉగాది.
ఎండలు మండిపోతున్నా, చెట్లు లేచివుళ్ల దుస్తులేసుకుని, విరిసిన పుష్పాలతో గాలి తెమ్మెరలపై సయ్యాటలాడుతున్నాయి.
మామిడి చెట్లకున్నపిందెలు చెట్లకి కొత్తందాన్ని సంతరింపజేశాయి. వేప చెట్లు తెల్లటి పూతతో వెలుగులో కూడా వెన్నెల ముసుగేసుకున్నట్టున్నాయి. కోకిల కమ్మని కూజితాల భావగీతాలు అందరి మనసుల్నీ మైమరపిస్తున్నాయి. కొత్త సంవత్సరపు మొట్టమొదటి పండగ, అంతేకాకుండా నా పెళ్లై సంవత్సరం కూడా కాలేదు అంచేత మా ఇంటికి కూడా నాన్న పేయింట్లేయించి తోరణాలు కట్టించాడు.
"పెళ్లయిన తర్వాత మీ జంటకి వచ్చిన మొదటి ఉగాది పండగ, అల్లుడుగారు సెలవు దొరకలేదన్నాడు కాని ఎలాగైనా వీలు చూసుకుని వస్తే ఎంతబావుండేది?"అన్నాడు మైథిలీ తండ్రి భూషణ్ రావుగారు.
"ఆ(..నేను ముందే చెప్పాను మిలట్రీలో పనిచేసే అతనికి మనం పిల్లనివ్వొద్దని. విన్నారు కాదు. తండ్రీ కూతుళ్లిద్దరూ వంత పాడుకుని నా నోరు మూయించి మరీ ఒప్పుకున్నారు. చిలకా గోరింకల్లా అలా అలా తిరుగుతూ అచ్చటా ముచ్చటా తీర్చుకోడానికి అతనికి ఓ సెలవు దొరకదు. అమ్మాయిని కాపురానికీ తీసుకెళ్లలేడు. ఒకవేళ ముందు ముందు తీసుకెళ్లినా ఏ ఊళ్లో అమ్మాయి ఏం కష్టపడుతోందో అని నా మనసంతా ఒకటే బెంబేలెత్తిపోతుంటుంది. ఇంకా పెళ్ళయి సంవత్సరమైనా కాలేదు, ఇంతకు ముందు పండగల్లానే, అల్లుడు గారు ఈసారీ రాలేకపోయారు." కూతురి పట్ల మమకారాన్నీమాటల్లో బాధగా వ్యక్తం చేసింది సోమిదేవమ్మ.
మైథిలి కంటి కొలనుల్లో ఒక బాష్పం అసంకల్పితంగా చోటుచేసుకుంది.
*****
తెల్లవారు ఝామున నాలుగు గంటలు!
ఇంటి తలుపు టక టక చప్పుడయింది.
పాలేరు పాండురంగడు ఎవరా? అనుకుంటూ తలుపు తెరచి..‘అయ్యగారూ అల్లుడు గారొచ్చేరండోయ్’ అని గట్టిగా అరిచాడు. ఆ ఇంటికి పూర్తిగా తెల్లారిపోయింది.
ఆరడుగుల ఆజానుబాహుడు, అరవింద దలాయతాక్షుడు, అందగాడు శ్రీనివాస్ తన సూట్కేస్ తో లోపలికి అడుగెట్టి "హైద్రాబాదు ఆఫీసులో ఒక కాన్ఫిడెన్సియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి రెండురోజులు వెళ్లమంటే..నేను పండగ కోసం అతికష్టం మీద మరో రెండురోజులు తీసుకుని ఇక్కడికి వచ్చాను"అన్నాడు.
"రావయ్యా..రా..పండక్కి రావేమోనని ఎంతో భయపడిపోయాం. అమ్మాయయితే మీకోసం ఒళ్లంతా కళ్లుచేసుకుని కలలు కంటోంది. తనని అలా చూస్తుంటే మాకెంత బాధ కలిగేదో! మొత్తానికి మీరొచ్చారు మాకదే సంతోషం. మా ఇంటికి ఉగాది వచ్చేసింది. అమ్మాయ్! అల్లుడుగారికి కాళ్లు కడుక్కోడానికి చెంబుతో నీళ్లిచ్చి మీ గదిలోకి తీసుకెళ్లు..ప్రయణ బడలిక పోయేదాకా రెస్ట్ తీసుకుంటారు"అన్నాడు.
మైథిలీ సిగ్గుల మొగ్గై, తనువూ మనసూ పురి విప్పిన నెమలి అవుతుంటే భర్త వంక వాలు చూపులు చూస్తూ చెంబుతో నీళ్లు, తుడుచుకోడానికి టవల్ ఇచ్చింది.
ముఖం కాళ్లూ చేతులూ కడుక్కున్న శ్రీనివాస్ భార్య వెంట తమ గదిలోకి వెళ్ళాడు. అప్పటి దాకా చిన్నగా భార్యను అనుసరించిన శ్రీనివాస్ గదిలోనికెళ్లంగానే గొళ్ళెం వేసి మైథిలీని గట్టిగా ఆలింగనం చేసుకుని అనువణువును ముద్దులతో ముంచెత్తసాగాడు. అసలే బలాఢ్యుడు, ఆపై మిలట్రీలో కండపుష్టి పెంచుకున్నవాడు. పరిపూర్ణ మగాడు. మన్మధుడు అతన్ని పూర్తిగా ఆవహించాడు. అతని ప్రేరేపణకు ఆమె మొగ్గ దశ నుంచీ క్రమ క్రమంగా విరిసిన పువ్వవుతూ సంపూర్ణంగా సహకరించసాగింది. అనుభూతులు..మధురానుభూతులై..మనసు మూలల్లో మల్లెల పేటికల్లో కమ్మటి స్మృతుల్లా పేరుకుపోతున్నాయి.
చాలాకాలం తర్వాత చెలియలికట్ట దాటిన యవ్వనోద్రేకం, క్షణం వృధాకానివ్వడం లేదు..అలా మూడు నాలుగు సార్లు మన్మధసామ్రాజ్యాన్ని ఏలిన తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇద్దరికీ మెలకువ వచ్చింది. ఊళ్లలోని ఇళ్లలో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు కాబట్టి, హడావుడిగా బట్టలు సవరించుకుని తలుపు తీసుకుని బయటకు తుర్రుమంది మైథిలీ. ఆ వెనకే తలొంచుకుని బయటకొచ్చాడు శ్రీనివాస్.
అందరూ గుంభనగా వాళ్లిద్దరివంకా చూసి చిన్నగా నవ్వుకున్నారు.
తలంట్లూ, కొత్తబట్టల పర్వాలయ్యాక దగ్గర్లోని శ్రీ వేణుగోపాల స్వామి గుడికి వెళ్లి అర్చన చేయించుకుని అక్కడి ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుని ఇంటికొచ్చారు. ఇంట్లో తయారు చేసిన ఉగాది పచ్చడిలో కాస్తంత బెల్లం ఎక్కువేసి "అల్లుడుగారూ, మీరు హఠాత్తుగా వచ్చి మాకు పండగ మధురానుభూతిని ఘనంగా పంచారు. సంవత్సరమంతా ఇలాగే మధురంగా ఉండాలని ఉగాది పచ్చడిలో కాస్త తీపెక్కువేశాను"అంది సోమిదేవమ్మ.
సాయంత్రం గుడికెళ్లి పంచాంగ శ్రవణం విన్నారు. అందరి రాశిఫలితాల్లో ఆదాయం, ఆనందపుపాళ్లెక్కువే ఉన్నాయి. సంతోషం మిన్నంటింది.
ఆరాత్రి మళ్లీ ఆగది వాళ్లిద్దరి సమాగమానికీ సిద్ధమైంది. అలుపెరుగని అనుభూతుల పోరులో ఇద్దరూ స్వర్గపుటంచులు చూశారు.
రెండురోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. మరో కొద్దిసేపట్లో శ్రీనివాస్ హైద్రాబాదుకి బయల్దేరుతాడు.
అందరూ అతనికి వీడ్కోలు పలకడనికి సిద్ధమవుతున్నారు. అందరి మనసులూ ఉదాసీనంగా ఉన్నాయి. మైథిలీదైతే చెప్పనక్కర్లేదు..ప్రాణమే విడిపోతున్నంత బాధ ముఖంలో ద్యోతకమవుతోంది.
"అల్లుడుగారూ..మీరసలు వచ్చినట్టే లేదు. పండగ సంబరన్ని మీతో తెచ్చి మళ్లీ తీసుకుపోతున్నట్టు ఉంది, మళ్లీ ఎప్పటికొస్తారో "అన్నారు మామ, అత్తగార్లు.
"ఈ ఉగాది తర్వాత మరో పండగొస్తోంది. రెండునెలల్లో నాకు కశ్మీర్ నుంచి హైద్రాబాదుకు ట్రాన్స్ఫర్ ఉంది. అక్కడే మా కొత్తకాపురం. ఈ ఊరు నుంచి జస్ట్ సిక్స్ అవర్స్ జర్నీ..అందరూ హాప్పీయేగా, అసలు ఈ విషయం సస్పెన్స్ గా ఉంచుదామనుకున్నాను.. కానీ మీ అందరి బాధ ముఖ్యంగా నా స్వీట్ హార్ట్ మైథిలీ వేదన చూసి చెప్పెయ్యాలనిపించింది. సో..మళ్ళీ త్వరలోనే మనందరం కలుస్తాం..ఒకే.."అని కారెక్కేశాడు.
అందరూ ముఖాలూ ఆనంద జ్యోతులయ్యాయి..చేతులూపుతూ వీడ్కోలు చెప్పారు. మైథిలీ మాత్రం చిరుసిగ్గుతో, కళ్లతో ఏదో స్వీట్ నథింగ్స్ చెప్పింది అది కారు రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూసి అర్ధం చేసుకున్నాడు సోల్జర్ శ్రీనివాస్.
*****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
అమృత - రామదుర్గం మధుసూధన రావు
అబ్బా.. ఇంకెంత దూరం..
ఇలా అనుకోవడం ఇప్పటికి ఇరవై సార్లు.
చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో మెలికలు తిరిగిన తారు రోడ్డుపై బస్సు వెళుతోంది. కిటికీ నుంచి చెట్లు చేమలు కొండలు గుట్టలు అలా కదలిపోతున్నాయి. అయినా కదులుతోంది బస్సే కదా.. వాటె సిల్లీ డౌట్. చిన్నగా నవ్వుకున్నాను. ఎన్నో ఏళ్ళ తరువాత అమృతను చూడబోతున్నాను. ఈ భావనే చాలా అద్భుతం అనిపిస్తోంది. తనను చూసి దాదాపు అయిదేళ్ళు దాటుతోంది. రెండు నెలల కిందట డిగ్రీ స్నేహితులందరూ అపురూపంగా అలమ్నయ్(పూర్వం విద్యార్ధుల సమావేశం) చేసుకున్నాం. ఉద్యోగరీత్యా ఢిల్లీలో వున్నా కేవలం ఈ కార్యక్రమం కోసమే నాలుగు రోజులు సెలవు పెట్టుకుని మరీ వచ్చాను. దాదాపు అందరూ కలుసుకున్నాము. అమృత తప్ప. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ తన గురించి ఎంక్వయిరీ చేస్తూనే వున్నాను. బిజీగా వున్నందున రాలేకపోయిందని వెంకట్ చివర్లో చల్లగా చెప్పాడు.
"ఆహా ఇక్కడ మనకేమో పనీపాట లేదాయే.. "నా గొంతులో కోపం, వెటకారం కలగలసి ధ్వనించాయి.
" అది కాదురా మాధవ్ రెండ్రోజుల ముందే అమృత ఇన్ ఫార్మ్ చేసింది. నువ్వు డిసప్పాయింట్ అవుతావేమోనని మేమే చెప్పలేదు. " వెంకట్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
" అది కాదురా నెల నుంచే ప్లాన్ చేసుకున్నామా. వస్తుందని అనుకున్నా, సర్లే ఏం చేద్దాం " నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. అమృత అడ్రస్ అడగాలనిపించినా ఎందుకో అడగలేక పోయా, రెండు రోజుల కిందట వున్నట్టుండి అమృత నుంచి ఉత్తరం .
ఎందుకు రాలేకపోయానో క్లుప్తంగా వివరిస్తూ మన వాళ్ళని చాలా మిస్ చేసుకున్నా ఓ రకంగా దురదృష్టవంతురాలిని సారీ అంటూ రాసింది. నీలి రంగు కాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు చూడగానే గత స్మృతులు తరంగంలా గుండెను మెత్తగా తాకాయి. లెటర్ వెనుక ఫ్రం అడ్రస్ చూసాక మనసు నిలవలేదు. ఎలాగైనా సరే అమృతను చూడాలని నిర్ణయించుకున్నాను. తనకు చెప్పకుండా వెళ్ళి సర్ ప్రైజ్ చేయాలన్న కుతూహలం కూడా తోడయ్యింది. ఫలితం .. ఇదిగో ఈ ప్రయాణం. బస్సు కుదుపుతో ఆగింది. నా ఆలోచనలకూ బ్రేక్ పడింది. బ్యాగు సర్దుకుని కిందకు దిగాను. మారుమూల పల్లెలో వుంటోందని తెలిసింది కానీ మరీ ఇలా అడవి మధ్యలో వుంటుందనుకోలేదు. ఎవరినైనా అడిగితే తప్ప ఊరు చేరుకోవడం కష్టమే. ఇంతలో ఓ మనిషి నా వైపే వస్తున్నాడు. మాసిన గడ్డం, భుజం పై తువాలు, నన్ను ఎగాదిగా చూసి " మాధవ సారూ అంటే మీరేనా " అడిగాడు. ఆశ్చర్యం వేసింది. ఇంత అడవిలో నా కోసం ఓ దూత.
" నా పేరు నర్సిమ్మ. మిమ్మల్ని తోడ్కొని రమ్మని అమృతమ్మ పంపింది సార్. తెల్లారు నుంచి ఈడనే వున్నా పదండి " నా బ్యాగు అందుకున్నాడు. వద్దని వారించినా వినేలా లేదు.
నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పి వుంటారు? ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. హూ. సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే తను ఏకంగా షాకే ఇచ్చిందే అనుకుంటూ అతన్ని అనుసరించా.
************
" వేచి వున్నందుకు ధన్యవాదాలు..! "
చిర పరిచిత గొంతు. పుస్తకం లో మునిగి పోయిన నేను చటుక్కున తలెత్తా.
అమృత .. నవ్వుతూ వచ్చి కూర్చుంది. తనను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం గుండెల్లోంచి గొంతులోకి వచ్చినట్టయింది. బహుశ నా జీవితం లో ఎగ్జయిటెడ్ క్షణాల జాబితాలో ఇది ముందు వుంటుందేమో. కాటన్ చీరలో పొందికగా కనిపిస్తోంది. తను ఏం మారలేదు. కళ్ళజోడు వెనుక కళ్ళల్లో ఆ మెరుపు, ఆ చిలిపి నవ్వు, కోటేరు లాంటి ముక్కు, నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టలు... కాకపోతే ముక్కు పుడక కొత్తగా కనిపిస్తోంది. " ప్రయాణం బాగా సాగిందా" ఆప్యాయంగా అడిగింది.
" మామూలుగా కాదులే , ఒళ్ళంతా హూనం. "
అందుకే నిన్ను డిస్టబ్ చేయకూడదని బయటికెళ్ళా. బాగానే నిద్ర పోయినట్టున్నావుగా.
"అంత లేదు. సగం మెలుకువ గానే వుంది. జస్ట్ రెస్ట్ అంతే." " మరి గురక పెట్టావని నర్సిమ్మ అన్నాడే. " నవ్వును పెదాలతో బిగపట్టింది. " అవునా నిజంగానా, " ఆశ్చర్యంగా అడిగా.
" అర్రే .... మరీ అంతలా ఆశ్చర్యపోకు జస్ట్ అలా అన్నా అంతే. మాధవ్ సారీ! రిసీవ్ చేసుకోలేకపోయాను. అర్జెంట్ మీటింగ్ వుంటే వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. అవునూ ఊరికి దూరంగా ఇల్లేంటి?" " ఊరికే " మళ్ళీ నవ్వు..
" సాధ్యమైనంత వరకు అన్ని కాలుష్యాలకు దూరంగా వుండాలని " అమృత బదులిచ్చింది.
" ఎలా వున్నావ్? " నా గొంతులో ఆతృత.
అమృత చిన్నగా నవ్వేసింది
చొరవగా నా చేతిలో పుస్తకం తీసుకుని చూసింది. పెదాలపై చిన్న నవ్వు మెరిసి మాయమయ్యింది.
" ఓహో చలం మైదానమా. బాగుంది, ఇన్ని పుస్తకాలున్నా మళ్ళీ ఇదేనా మంచి పుస్తకం ఎన్ని సార్లయితే ఏముంది" అనాలనుకున్నా అంతలోనే తనే అందుకుంది. "అవును అయిదేళ్ళ నుంచీ ఈ ఒక్క పుస్తకమే చదువుతున్నావా? లేదా చదవడం మానేసావా. " మాట పూర్తి కాకముందే గలగలా నవ్వు. తనేం మారలేదనడానికి ఇంకేం రుజువులు అక్కర్లేదనిపించింది. చొరవ నవ్వులో స్వచ్చత తను మాత్రమే అందంగా పలికే అరే .. ఓహో అలాగా! అనే ఊత పదాలు అన్నీ సేం టూ సేం. కాకపోతే రంగు మాత్రం కాసింత తగ్గినట్టుంది.
" నీ లైబ్రరీ వండర్ ఫుల్ ఇన్ని పుస్తకాలే.. !"
" థాంక్స్! కానీ అన్నీ చదివేసానని అనుకోకేం, ఈ ప్రయాణం ముగిసేలోగా చదివేయాలని మాత్రం వుంది."
"మనం ఆశా జీవులం కదా! " అంది అమృత తమాషాగా భుజాలెగరేస్తూ " అవును ఇల్లు ఎలా వుంది? తోట చూసావా పద పద " నెక్స్ట్..
ఇద్దరం బయటకి వచ్చాం. చుట్టూ కొండలు, మధ్యాహ్నం ఎర్రగా ఎండ కాస్తున్నా చెట్లు ఉండడంతో వేడి తెలియడం లేదు. కాంపౌండ్ ఆనుకుని వరుసగా కొబ్బరి చెట్లు సరిహద్దు కాపలా కాస్తున్న సైనికుల్లా వున్నాయి.
గులాబి, చామంతి, మందారం, పారిజాతం, నిద్ర గన్నేరు... రకరకాల పూల తీగలు చెట్లు కంటికింపుగా కనిపిస్తున్నాయి. మరో పక్క పచ్చగా పరుచుకున్న ఆకు కూరలు, అక్కడక్కడ గుమ్మడి తీగలు, మధ్యలో నడవడానికి వీలుగా దారి.
పచ్చని తోట మధ్య ఇళ్ళు ఆశ్రమం లా వుంది. అమృత తోట ఎలా పెంచిందో వివరిస్తుంటే బుద్ధిగా వెనకాలే నడుస్తున్నా. " అవును నేనేం బోరు కొట్టించడం లేదు కదా." వున్నట్టుండి అమృత వెను తిరిగింది. " అబ్బే భలే దానివే ఇట్స్ ఇంట్రస్టింగ్ " తడబడుతూ బదులిచ్చా.
గంట తరువాత..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
" మాధవ్ ఏమాత్రం సిగ్గు లేకుండా, సారీ సిగ్గు పడకుండా తినేయ్." ముసి ముసిగా నవ్వుతూ అంది. "అమ్మూ... స్టాప్ రోటీన్ జోక్స్. .." వెంటనే నాలుక కరుచుకున్నా. అమ్మూ అనేసా.. ఏమనుకుంటుందో.. అప్పట్లో నేనొక్కడ్నే.. అమృతను అమ్ము అని పిలిచేవాణ్ణి. ఆ ఆరాధనకు అదో ట్యాగ్ గా భావించే వాణ్ణి . విచిత్రం ఏమిటంటే.. ఎవర్నీ ఏ విషయం లోనూ ఎంటర్ టైన్ చేయని అమృత నేను అలా పిలిచినా కాదనక పోవడం. అది ఇప్పటికీ వండరే.
కానీ అమృత ఇదేం గమనించినట్టు లేదు.
" సరే సరే ఇక మాటల్లేవ్ ..ఓన్లీ యాక్షన్. సరేనా లాగించు మరి." వంటకాలు చూడగానే ఆకలి ఆవురావురంది. గుమ్మడి కాయ సాంబార్, చింత పచ్చడి, ఆవకాయ, ఆలూ వేపుడు, అప్పడాలు, వడియాలూ వేడి వేడి అన్నం పచ్చని అరటి ఆకులో ఆహ్వానిస్తున్నాయి. అన్నీ నాకూ ఇష్టమైనవే. అసలు ఈ మెనూ చూస్తుంటే చాలా ప్లాన్ డ్ గా చేసినట్టుంది. ఆ క్షణం లో నా డైటింగ్ కెలోరీ లెక్కలు ఏవీ గుర్తుకు రాలేదు. అమృత కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా కాలం తర్వాత తృప్తిగా భోంచేసాను.
" అడగడమే మరిచా.. మరి నువ్వు..."
" ఆహా సారు గారికి ఇప్పుడు గుర్తొచ్చామా.. " నవ్వేసింది. " ఓకేసారి చెప్పను గానీ నేనే సర్వ్ చేస్తా. " " వద్దులే బాబూ, తమరు అలా వసారాలో తీరిగ్గా కూర్చుంటే పది నిముషాల్లో వస్తా." " అవునులే అమ్మాయిలు తాము తింటున్నప్పుడు ఎవరూ చూడకూడదనుకుంటారట. " ఆటపట్టించాను. " ఎక్స్ క్యూజ్ మీ తమరు అలా దయచేస్తారా.." అమృత గట్టిగా అనేసరికి నవ్వుతూ బయటికి నడిచా
*******
రాత్రి 8.00 గంటలు
ఆకాశం అద్భుతంగా వుంది. పిండారబోసినట్లు తళ తళ మెరుస్తూ వెన్నెల గాలికి కదిలే ఆకులపై వెండి కిరణాలు తళుక్కుమంటున్నాయి. పువ్వుల పరిమళాలు మోసుకొస్తున్నాయి. గాలులు శరీరాన్ని అలా నిమురుతుంటే ఏదో తెలియని పారవశ్యం మామిడి చెట్టు కింద చిన్న చప్టా పై ప్రశాంతంగా కూర్చున్నా. నిశ్శబ్ధంగా ప్రవహిస్తోంది. ఇంట్లోంచి ఘంటసాల పాట మనసున మనసై.. గాలి అలలపై తేలాడుతూ చిన్నగా మనసును తాకుతోంది. డాక్టర్ చక్రవర్తి లోని పాట. డిగ్రీ రోజుల్లో ఈ పాటను ఎన్ని సార్లు పాడుకున్నానో. ఫ్రెండ్స్ కలిస్తే చాలు. ఈ పాట పాడమని పట్టుబట్టేవారు. ఆ రోజుల్లో నేనో చిన్న సైజు ఎస్. పీ. ని కానీ గ్రూపులో ఆ పాటే నన్ను ప్రత్యేకం గా నిలబెట్టింది. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చూస్తుంటే వెన్నలంతా మేసి ఏరు నెమరేస్తోంది ఏటి కడుపున దాగి తోట నిదురోతోంది అన్న నండూరి వ్యాక్యాలు గుర్తొస్తున్నాయి. అదృష్టమంటే అమృతదే! ప్రతిరోజూ ఇలా ప్రకృతిని మనసారా ఆస్వాదించే చ్హాన్స్ ఎందరికి వస్తుంది? డిల్లీ జనారణ్యం లో ఇరుకిరుకుగా బతికేస్తున్న నాకు ఈ వాతావరణం ఓ అపురూప దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. అమృతను చూడాలన్న నా ఆలోచనకు నేనే థాంక్స్ చెప్పుకున్నా. ఒకవేళ ఆ ఆలోచనే రాకుంటే ఇంత చక్కటి ప్రాంతం చూసేవాణ్ణి కాదేమో. ఇంతలో అమృత వచ్చి కూర్చుంది. ఉడికించిన పల్లీల ప్లేటు ముందుంచింది. కొన్ని క్షణాలు గడిచాయి.
"మాధవ్ ఇప్పుడు చెప్పు ఎలా వున్నావ్?"
"అది అడగాల్సింది నేను. ఉదయం నా ప్రశ్నకు బదులివ్వనేలేదు. మీ వారెక్కడ?"
" వాతావరణం చాలా హాయిగా వుంది. మనసుకు ఇష్టమైన మాటలైతే బెటర్ అనుకుంటా " అమృత మాటల్లో ఏదో మార్మికత. అయిదేళ్ళ తర్వాత కలుసుకున్నాం.. " ఎలా వున్నామో తెలుసుకోనక్కర్లేదా? " నిష్టూరంగా అడిగాను. " ఏముంది డిగ్రీ అయ్యాక నా పెళ్ళి . అంతా హడావిడిగా అయిపోయింది. ఆ మరుసటేడే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ సంపాదన బాగా వుంటుందటగా" ట కారాన్ని వత్తి పలికింది.
"మరి నువ్వు"
" మాధవ్ అందరి ఆలోచనలు ఒకేలా వుండవు కదా. తనకు డబ్బంటే ఇష్టం.. నాకు ఇలాంటి బతుకంటే ఇష్టం. పొంతన కుదరనప్పుడు ఎవరికేది ఇష్టమో అది చేయడమే మంచిది. " నెమ్మదిగా అంది.
"ఆయన ఇండియా వస్తుంటారా."
".. నా కాపురం ఎలా వుంది? ఎంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు? ఇవేగా నువ్వడగాలనుకున్న ప్రశ్నలు. పెళ్ళయిన ఏడాదికి ఆయన , నేను చెరోదారి అయ్యాం. డైవోర్స్ కాలేదు గానీ.. ఎవరి బతుకు వారిదే. తను దుబాయిలో, నేను ఇక్కడ. బీయెడ్ చేశాక ఈ ఊళ్ళో టీచర్ గా చేరాను. ఇక్కడ పేదల బతుకులు, అందులోనూ చిన్నారుల జీవితాలు చూసాక నా శక్తి మేరకు ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. వాత్సల్య పేరిట సేవా సంస్థ ప్రారంభించా. మన క్లాస్ మేట్ రమేష్ యూ.ఎస్ లో వున్నాడు. నీకు తెలుసుగా తను అక్కడి ఎన్నారైలతో నా ప్రోగ్రాం లను స్పాన్సర్ చేయిస్తున్నాడు. టీచర్ గా వున్నప్పుడు ఈ పల్లెను చాలా దగ్గరగా పరిశీలించాను. పల్లెల్లో పిల్లల ఎదుగుదల, చదువు ఎంత కష్టమో తెలిసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్డే మీల్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఫలితం అంతంత మాత్రమే. పథకాలు మంచివే. డెలివరీ లో ఎన్నో లోపాలు. అదేదో అంటారే.. ఇచ్చే చేతులు పుచ్చుకునే చేతుల మధ్య మరిన్ని చేతులో అని , అలా వుంటుంది వ్యవహారం.
ఈ పిల్లలే నా ఉపాధి మార్గం అవుతున్నప్పుడు వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. అప్పట్లో నా వంటరితనం కూడా కారణం కావచ్చు. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆర్గనైజేషన్ నిర్వహించాను. కానీ రెండు పడవలపై ప్రయాణం కష్టమనిపించింది. అందుకే పూర్తిగా దీనికే అంకితమయ్యా, నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనే తాపత్రయం లేదు కాబట్టి స్వచ్చందంగానే నడిపిస్తున్నా. దేశం , సమాజం ఉద్దరిస్తున్నానన్న భారీ డైలాగులు కొట్టలేనుగానీ, చేతనైన సాయం చేస్తానన్న తృప్తి మాత్రం వుంది. అన్నిటికీ మించి ఊరి వాళ్ళు నన్ను నమ్మారు. ఇదిగో ఈ ఆశ్రమం పిల్లలూ ఇవే నా ప్రపంచం. అమృత మాటల్లో తన ఆలోచనల్లో సీనియారిటీ సీరియస్ నెస్ బాగా నచ్చింది. మునుపటికన్నా తనపై అభిమానం పెరుగుతున్న ఫీలింగ్. అంతేకాదు, నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసిందో కూడా అర్ధమయింది. రమేష్ తో ఎఫ్.బీ లో చాట్ చేస్తూ చెప్పాను. బహుశా తను ఇన్ ఫార్మ్ చేసి వుంటాడేమో.
అమృత మాటలు కొనసాగిస్తూ..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
"...ఇక నా వైవాహిక జీవితమంటావా.. ఏడడుగులు పెళ్ళిలో నడిచామే గానీ ఆ తరువాత అడుగులు కలవలేకపోయాయి. తప్పెవరిదని వాదించడం కన్నా ఎవరంతట వారుండడమే మేలనుకున్నాం. తనూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇది నా ప్లాష్ బాక్ "అమృత ఆగింది. కాసేపు నిశ్శబ్ధం.
మరీ ఈ విషయం కనీసం నాకు తెలపాలనిపించలేదా. క్షణం నా వైపు చూసి మెల్లగా నవ్వేసింది.
" ఏంటి మాధవ్ చెబితే ఏమవుతుంది. ప్రాబ్లమే కాదనుకున్నప్పుడు క్యాజువల్ గా తీసుకోవడమే మంచిదేకదా. అప్పుడు మీరందరు భాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. నిజం చెప్పాలంటే అసలు నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. అయినా ఇదో ముగిసిన సంఘటన. మొదట్లో ఒంటరితనం కాస్త బాధనిపించింది. అప్పుడప్పుడు మన వాళ్ళు కొందరైనా గుర్తొచ్చేవారనుకో."
" ఆ లిస్ట్ లో నా పేరు వుందా."
"హా..హ్హా.."
"అనుకున్నా ఇంకా అడగలేదేంటా అని. తమర్ని ఎలా మర్చిపోతాం సార్. అంది.. " ఓకే ఇప్పుడు నవ్వు ..హాపీ కదా.. క్వైట్ హాపీ.. ఐయాం లీవింగ్ ఇన్ మై ఓన్ వరల్డ్." అమృత అలా అనడంతో కాస్త మనసు కుదుటపడింది. "మాధవ్ వాతావరణం ఎంతో ప్లజంట్ గా వుంది. అనవసర కబుర్లు ఎందుకు. నీ పాట విని ఎన్నేళ్ళయింది. అప్పట్లో నీ పాటకు వీరాభిమానిని. అందులోనూ కిశోర్ "ముసాఫిర్ హూమే యారో" నీ గొంతులో మ్యాజికల్ గా పలికేది. ఒక్కసారి పాడవా ప్లీజ్. అమృత అడగుతుంటే కాదనలేకపోయా.. గొంతు సవరించుకున్నా. పాట కాగానే అమృత చిన్నపిల్లాలా వావ్ అంటూ అరిచింది.
సిల్సిలా కభీ కభీ , చిత్ చోర్ లో జబ్ దీప్ జలే బాలూ మెలోడీలు మధు మాస వేళలో , పూచే పూల లోన పాటలు పట్టుబట్టి పాడించుకుంది. డిగ్రీ రోజుల్లో రోజూ పాటల సెషన్ నడిపే వాళ్ళం. నేను, రాజూ, మాధురీ పాడుతుంటే అమృత రమేష్ లు అద్భుతంగా పాటను వివరించేవారు. అదో అందమైన అనుభవం. వెన్నెల రాత్రిలో పాటలతో జ్ఞాపకాలపై కప్పుకున్న పరదాలు నెమ్మదిగా తొలుగుతున్నాయి. చివరిగా కరుణశ్రీ పుష్ప విలాపం పాడగానే అమృత చప్పున నా చేతులు పట్టుకుంది.
అద్భుతంగా పాడావు. మనసుకు ఎంత రిలీఫ్ గా వుందో తెలుసా. అంటూంటే తన కళ్ళల్లో ఊరిన చెమ్మ ఆ వెలుగులో ముత్యం లా మెరిసింది. చూస్తుండగానే రాత్రి పదిగంటలు అయింది.
" ఓకే మాధవ్ జీ ఈ వెన్నెల రాత్రిని సుమధుర సంగీత విభావరిగా మార్చినందుకు ధన్యవాదములు. " నాటకీయంగా నమస్కరించి ఫక్కున నవ్వేసింది.
*************
పడుకున్నానన్న మాటే గానీ ఓపట్టాన నిద్రపట్టడంలేదు. తల విదిలించి లేచి బయటకు వచ్చి కాసేపు వసారాలో పచార్లు చేసా. పక్క గదిలో అమృత ప్రశాంతంగా నిద్ర పోతోంది. కిటికీలోంచి కనిపిస్తున్న ఆ మనోహర దృశ్యాన్ని అప్రయత్నంగా చూస్తుండి పోయాను. తెలీకుండానే గది గుమ్మం దాకా అడుగులు పడ్డాయి. చూస్తున్న కొద్దీ కొత్త అందం ఏదో అమృతలో కనిపిస్తోంది. ఒక్కసారి చూస్తే గుర్తుండి పోయే రూపం తనది. అన్నిటికీ మించి పెదాలపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు. కిటికీలోంచి వెన్నెల కిరణాలు తనపై పడుతుంటే పోత పోసిన శృంగార శిల్పం లా వుంది... పరవశంతో కూడిన మైకం కమ్ముకొస్తుంటే మనసు వశం తప్పుతోంది. అలా ఎంతసేపున్నానో నాకే తెలీదు. అమృత మరో వైపు తిరిగింది.....................................
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
![[Image: image.jpg]](https://i.ibb.co/m5hQdZwL/image.jpg)
.........................................చటుక్కున ఈ లోకం లోకి వచ్చాను. ఒక్కసారిగా తల విదిల్చా. ఛా ! తప్పుచేస్తున్నానా అనిపించింది. వెంటనే గదిలోకి వచ్చేసాను. లాభం లేదని బ్యాగ్ లోన్చి జండుబాం తీసి కళ్ళకు పట్టించి పడుకున్నా. ఎంత పని జరిగింది. ఒకవేళ అమృత చూసి వుంటే? మై గాడ్..! ఒక్కసారిగా పాతాళం లో పడిపోతున్న ఫీలింగ్!
కళ్ళు మూసుకున్నా, మనసు అమృత చుట్టే తిరుగుతోంది. డిగ్రీ మూడేళ్ళు తనను ఎంతగా ఆరాధించే వాణ్ణో నా కన్నా తనకే తెలుసు. క్లాస్ మేట్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ అదేంటో తను నా పై ఆసక్తి కనబరచిన సంఘటన ఒక్కటి కూడా లేదు. అయినా మనసులో ఏదో నమ్మకం. తన మనసులో నేనున్నానని, ఆలోచనలు వెనక్కి వెళుతున్న కొద్దీ జీవితం ఇప్పటి కన్నా పచ్చగా, మధురం గా అనిపించసాగింది . ఈ అయిదేళ్ళలో ఎప్పుడూ ఇంత ఆనందించిన క్షణాల్లేవు. డిగ్రీ కాగానే నాన్న ఆకస్మాత్తుగా కనుమూయడం, కారుణ్య నియామకంగా ఉద్యోగం రావడం .. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ ఒకదాని వెనుక ఒకటి వరుస సంఘటనలన్నీ మహా ప్రవాహం లా వచ్చి నా జీవితాన్ని లాగేసాయి. ఈ సందడిలో పెళ్ళిచేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. రాలేదు అనడం కన్నా అనుకోలేదు అంటేనే బెటర్. అలా అనుకోకపోవడానికి అమృతపై నా క్రష్ కారణమా? అంటే నా వద్ద సమాధానం లేదు. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నా
.
**********************
"కల్యాణ గోపాలం.. కరుణాల వాలం" నారాయణ తీర్థుల తరంగం వున్ని కృష్ణన్ గొంతులోంచి స్వరధారలా వుబికి వస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచాను. పాట ఎంత అద్భుతంగా వుంటుందో, ఎన్ని సార్లు విన్నా గుండె ఇట్టే కరిగిపోతుంది. కిటికీలోంచి చూస్తే... అప్పుడప్పుడే తెల్లారుతున్న మనోహర దృశ్యం కనిపించింది. రూం నుంచి బైటికి వచ్చాను. అమృత లేచినట్టుంది. ఆ మసక వెలుతురులో బ్లూ జీన్స్, జుబ్బా వేసుకుని మొక్కలకు నీళ్ళు పడుతున్న తనను చూస్తుంటే "చీకటి నవ్విన చిన్ని వెలుతురివా... వాకిట వెలసిన వేకువ తులసివా" అన్న తిలక్ పద్యమే గుర్తొచ్చింది. బహుషా తిలక్ మనో ఫలకం పై ఇలాంటి దృశ్యమే మెరిసిందేమో! టీపాయ్ పై వున్న పేపర్ తిరిగేస్తుంటే అమృత వచ్చింది.
"హాయ్.. గుడ్ మార్నిగ్.. త్వరగా ఫ్రెషప్ అయిరా.. అంటూ" లోపలికి వెళ్ళింది. నేరుగా తన మొహం లోకి చూడలేకపోయాను. నిన్న రాత్రి తప్పు చేశానేమోనని మనసులో తెలీని అలజడి. మౌనం గా వెళ్ళి ఫ్రెషప్ అయ్యాను. త్వరగా ఇక్కడ్నుంచీ బైట పడటం అనిపించింది. చకచకా సూట్కేసు సర్దుకున్నాను. "కాఫీ రెడీ" అమృత కేకతో బైటికి వచ్చా. టీపాయ్ పై కాఫీ కప్ పొగలు కక్కుతోంది.
మౌనం గా సిప్ చేస్తుంటే
"ఏంటీ డల్ అయిపోయావు. డిల్లీ గుర్తొచ్చిందా" అంది అమృత.
"ఆ.. వెళ్ళాలిగా పనులు బోల్డెన్ని వున్నాయి" నా గొంతు నాకే కృతకంగా వినిపించింది.
"ఓకే సర్ యాజ్ యూ లైక్. అయితే ఓ కండీషన్ .. ఇవాళ ఊర్లో చిన్న పిల్లల కార్యక్రమం వుంది. అది చూసుకుని వెళ్దువు గానీ సరేనా!అమృత మాటలకు నో చెప్పలేకపోయాను. నా మనసులో భావాలు తెలిస్తే ఎంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యేదో ఊహించుకుంటూనే తలూపాను.
కార్యక్రమం చక్కగా సాగింది. పిల్లలపై అమృతకున్న ప్రేమ కన్నా .. ఆ ఊరి ప్రజలకు ఆమెపై వున్న నమ్మకం అడుగడుగునా కనిపించింది. వారితో తను మమేకమైన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత నన్ను పరిచయం చేసింది. చివర్లో వెళుతూ వెళ్తూ
"అమృతా అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి రావచ్చా?" అడిగా నవ్వుతూ తలూపింది. రెండడుగులు వేసి ఆగాను.
"నీ కాంటాక్ట్ నెం.."
గట్టిగా నవ్వింది.
నాకూ ఇవ్వాలనే వుంది. ఏం చేయను? సెల్ వాడనుగా...! అంటుంటే
పెదాలపై బలవంతం గా నవ్వు పులుముకుంటూ కదిలాను.
...........సరిగ్గా పదిరోజులు తర్వాత .. అమృత నుంచి
నా కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి.
మాధవ్.. ఈ పాటికే నువ్వు బిజీగా మారిపోయి వుంటావని అనుకుంటున్నాను. జీవితం ఇలాగే వుంటుంది మరి. నడుస్తున్న కొద్దీ కొన్ని దృశ్యాలు వెనుకవుతుంటాయి. అవి గతం అనే ఖాతాలో జమవుతుంటాయి. నన్ను కలిసినప్పుడు ఎంత ఉద్వ్వేగానికి లోనయ్యావో నాకు తెలుసు. ఆ రోజు రాత్రి గుమ్మం వద్ద నిలుచుని నా వైపు తదేకంగా చూసింది కూడా తెలుసు. ఓ మాట చెప్పనా... నువ్వు వెనుదిరిగి గదిలో వెళ్ళిన ఆ క్షణాన నీ పై గౌరవం రెట్టింపయింది. మాధవ్ నా గతం మీ కెవరికీ చెప్పలేదు. నేను అనాధగా పెరిగాను. బంధాలు, అనుబంధాలపై పెద్దగా అవగాహన లేదు. డిగ్రీ కాన్వొకేషన్ రోజున నువ్వు ప్రపోజ్ చేయాలనుకున్నట్టు తెలిసే నేను రాలేదు. ఎందుకంటే రెండు రోజుల కిందటే మీ నాన్న లోకం నుంచి నిష్క్రమించడంతో మీ కుటుంబం కుంగి వుంది. నీ పై బాధ్యత వుంది. ఈ వ్యవహారం వల్ల దెబ్బతినరాదనుకున్నా. ఆ తర్వాత కొద్ది కాలానికే నా పెళ్ళి జరిగిపోయింది. కానీ ఇప్పటికీ నా ఆలోచనల్లో వున్నావని తెలుసుకున్నాను. అది వద్దని చెప్పడానికే ఈ ఉత్తరం. బాధ్యతలు ఓ కొలిక్కి వచ్చిన ఈ సమయం లో మంచి అమ్మాయిని జీవితం లో ఆహ్వానించు. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన నాతో నీ ప్రయాణం సాఫీగా సాగదు. బహుశా నాకు కూడా అంతేనేమో! ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ వాత్సల్య . ఓ మాట చెప్పనా.. జీవితం పాతబడిందని ఓ ఎల్ ఎక్స్ లో పెట్టి వదిలించుకోలేం కదా. పాత అనుభవాలను మోసుకుంటూ వున్నాన్నాళ్ళు సాగిపోవాల్సిందే. నాకు నచ్చిన రీతిలో స్వేచ్చగా బతకడానికి అలవాటుపడ్డాను. మళ్ళీ జీవితం లో ఏ రకంగా ఆంక్షలు వచ్చినా భరించే స్థితిలో లేను. మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే. వాత్సల్యకు నీ ప్రోత్సాహం అవసరం. ఈ సారి జంటగా వస్తావని ఆశిస్తున్నా - చిరునవ్వుతో అమృత.
నిశ్శబ్ధం గా ఉత్తరం మడిచాను. ఏదో చెప్పలేని భావన మనసులో ముప్పిరిగొంటోంది. జీవితం పై తనకున్న స్పష్టతకు మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఎవరికైనా వారి జీవితంపై ఎక్స్ పెక్ టేషన్స్ వుండటం సాధారణమే. నాలాగా . అయితే కొందరికే జీవితాన్ని యధాతధం గా స్వీకరించాలన్న వాస్తవ స్పృహ వున్న మనస్థితి వుంటుంది. అమృత లాగా . నిజమే తనకు గతం పై అవగాహన వుంది. భవిష్యత్తుపై స్పష్టత వుంది. స్వేచ్చగా రెక్కలార్చాలనుకుంటున్న అమృతను ప్రేమపంజరం లో బంధించాలనుకోవడం ఎంత వరకు సబబు? మెల్లగా నా భావోద్వేగం చల్లారి, వాస్తవాలోచనలు కుదురుకోసాగాయి. పోలిక సరి అవునో కాదో తెలీదు గానీ, అమృత ఉత్తరం... అయోమయం లో వున్న అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన గీతలా అనిపించింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
కేకిసలు – ఎలక్ట్రాన్
అడగందే అమ్మయినా పెట్టదంటారు. యిది అమ్మ విషయంలో కొద్దిపాటి అతిశయోక్తిగా వాడినా, వాస్తవానికి లోకంలో ఏ పనీ అడగందే కానీ జరగదు. ఓటు కోసం వచ్చినాయన ఒంటి చేతి దణ్ణంతో ఓటడిగితే, ఆయన ఎంపికై నాయకుడైన తర్వాత వెయ్యి నమస్కారాలు చేసినా కోరికలు తీరుస్తాడని ఎక్కడా లేదు. బిచ్చం దగ్గర్నుంచీ, సినిమాల్లో వేషాల వరకూ అడిగితే కాని వెయ్యరు, కాళ్లా వేళ్ళా పడితే కాని యివ్వరు. ఏతా వాతా తేలిందేమిటంటే జీవితంలో అదగందే ఏమీ దొరకదనీ, ఎవరైనా చెప్పందే ఎవరూ ఏమీ చెయ్యరనీ, ఖర్చుతో కూడినదైనా కాక పోయినా ఏ పనీ అడగనిదే జరగదనీ.
కళాకారులకి ఊపిరి అభిమానుల ప్రశంసలు. నోటి మాటలుగా కాక తక్షణంగా స్పందించి చేసే కరతాళ ధ్వనులు వక్తలకీ, గాయకులకీ, వాయిద్య కారులకీ, వేదికనేక్కిన ప్రతి వారికీ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అయితే యిటీవలి కాలంలో ప్రేక్షక, వీక్షక మహాశయులకి రసాస్వాదన తగ్గిన కారణంగానేమో కళలకి సంబంధించి తక్షణ స్పందన లోపించి, వేదిక మీద ఎంతటి రక్తి కలిగించిన ప్రదర్శన జరిగినా ఏవో మంద్ర స్థాయి మొక్కుబడి చప్పట్లు తప్పించి హోరెత్తించేవిగా ఉండటల్లేదు. దాంతో కళాకారులందరూ కార్యక్రమం ఆరంభం ఎంత గొప్పగా ఉన్నా క్రమేపీ నీరసించిపోయి నిస్తేజమైన ప్రదర్శనలోకి జారి పోతారు. కళాకారులకి నిర్వాహకులిచ్చే సంభావనలు వేరు, ప్రేక్షకుల హస్త తాళాలు వేరు! కీర్తికి సోపానాలు హర్షధ్వానాలే. కళాకారులను ఉత్సాహ పర్చాలంటే కరతాళ ధ్వనులు అత్యవసరమని గుర్తించడంతో కార్యక్రమ నిర్వహణ కోసం ఓ నూతన కుహనా సంస్కృతి ఏర్పడింది. అడిగీ, చెప్పీ చప్పట్లు కొట్టించడం. కార్యక్రమాల్ని నిర్వహించే ‘ లంగరు’ అంటే ‘యాంకర్’ వృత్తి ప్రవీణులు పాశ్చాత్యదేశాల్లోనే కాకుండా మన భారతంలో కూడా రూపుదాల్చారు. ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియని ప్రేక్షకులకి దిశా నిర్దేశం చేసే ఈ వ్యాఖ్యాన కర్తలు లేదా కార్యక్రమ సారథులు కొద్ది మినహాయింపులతో దాదాపు ప్రతి సభలోనూ ప్రముఖమైన పాత్రవహిస్తున్నారు.
తెలుగు ప్రాంతంలో ‘ఉశిఝాసు’ అనే వ్యాఖ్యాతాంగన మరియు లంగరు యువతి వాగ్దేవి కటాక్షంతో ఆవిర్భవించింది. ఆ యువతి కార్యక్రమ నిర్వహణా బాధ్యతని నెత్తి మీద వేసుకొని యిటూ కళాకారుల్లోనూ, సందు దేరికితే చాలు వేదిక మీదకు చేరుకొనే అనేకానేకమైన ప్రముఖుల్లోనూ, ఎప్పుడు స్పందించాలో తెలియని ప్రేక్షక, వీక్షకుల్లోనూ కొత్త ఊపిరులు పోయనారంభించింది.
“ అందరికీ ఘనమైన స్వాగతం! యిప్పుడు ఈ కార్యక్రమ ప్రాయోజకులు నిమ్మ రసం నిరంజన్ గారూ, వారి సంస్థ తయారు చేసే నిమ్మ రసం సీసాలూ, డబ్బాలూ మీకు కొత్త కాదు. స్వాగత ద్వారం వద్ద యివ్వ బడిన నిమ్మ రసం, వీరి తయారీ మీద మీ విశ్వాసాన్ని మరింత పెంచిందనే అనుకొంటాను. అందుకని మీ గొంతు తడిపి స్వాగతమిచ్చిన నిమ్మ రసానికి జోరుగా చప్పట్లు కొట్టి మీ అభిమానాన్ని తెలియజేయండి!” అంది ‘మైక్’ తో వేదికనంతా కలయ దిరుగుతూ. ‘తేరగా దొరికిందని తెగ తాగడం కాదు, యిచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి మహాశయులారా!’ అన్న అంతరార్థం స్ఫురించడంతో చప్పట్లు హోరెత్తి పోయాయి. “యిక్కడ జన గణ మన పడే దాకా ఉండి వెళ్ళే వారికి మరో సారి నిమ్మ రసం యివ్వబడుతుంది. అందుకు మీ హర్షం వ్యక్తం చేయండి!” అనడంతో కరతాళ ధ్వనులు మరో మారు మారుమ్రోగాయి.
“నిరంజన్ గారు ‘వర్షంలోనూ దాహం’ అనే చలన చిత్రాన్ని తీస్తున్నారన్న సంగతి మీకు తెలిసిందే. మీ అభిమాన నాయికానాయకులతో ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకొని మరో పక్షం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం తాలూకు పాటల విడుదల శ్రవణ సంబరమిది. అంటే ఆడియో సీడీ రిలీజ్ ఫంక్షన్ అన్నమాట! ముందుగా నిర్మాత నిరంజన్ గార్ని వేదిక మీదకు రావల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఊఁ! ఆయన కుర్చీ లోంచి లేచారు, యిదుగో వచ్చేశారు, యిలాగేనా ఆయన్ని స్వాగతించేది? జోరుగా చప్పట్లతో అభినందనలు తెలియ జేయండి మరి!” అంది ఉశిఝాసు. చప్పట్లు మోగాయి.
‘నా డబ్బుతో జరుగుతోందీ వేడుక. వేదిక మీదకు నన్ను నేనే పరోక్షంగా నీ ద్వారా ఆహ్వానించుకున్నట్లే ఉశిఝాసూ! బాగు బాగు! నాకు సొమ్ములు వెద జల్లడం వచ్చును కాని మాటలు వెద జల్లడం రాదు! నాకే కనక మాటల గారడీ వస్తే నీ స్థానంలో నేనే ఉండేవాణ్ణి! సినిమా తీసే సరికే చుక్కలు కనబడ్డాయ్! పైగా ఈ పాటల మాటల హారతికి మరో ఖర్చు!” అనుకొన్నాడు నిరంజన్. ప్రేక్షకులకి చేతులెత్తి అన్ని దిశలా తిరిగి నమస్కరించాడు. ‘ నాచేత చేతులెత్తేయించకండి ప్రేక్షక దేవుళ్ళారా!’ అనుకొంటూ.
“ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతాన్నందించిన వారు మీరు విపరీతంగా అభిమానించి, మెచ్చే ‘దేవీమణిచక్రి’ గార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ సినిమాలో మృదంగ నాదాలు అంటే డ్రమ్ బీట్స్ అదిరి పోయాయని నిర్మాత గారు చెప్పారు. ఆ నాదాలకి మించిన కరతాళ ధ్వనులతో ‘దేవీమణిచక్రి’ గారికి స్వాగతం పలకండి!” అంది ఉశిఝాసు.
‘దేవీమణిచక్రి’ హుందాగా వేదిక మీదకు రావడంతోనే సభా మందిరంలో హస్తతాళాలదిరాయ్.
హీరో, హీరోయిన్లు ఎప్పుడొస్తారెప్పుడొస్తారని?’ ప్రేక్షకుల్లో గోల మొదలైంది. ఉశిఝాసు యిబ్బందిలో పడింది. అతి చురుకు నాయకుడు ‘నేత్రానంద్’ ముందు వరసలో కూర్చుని సిద్ధంగాఉన్నా , నాయిక నటీమణి ‘అనుకజాతమ’ సభా ప్రాంగణానికి వెనక వైపున నిలబడిన అలంకార వాహనంలో తన అందాలకి తుది మెరుగులు దిద్దించుకొంటోంది.
“మీ ఆతృత నాకు తెలియంది కాదు. దారిలో ఆమె అభిమానులు అడ్డుకొన్న కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలింగిదనీ, సెక్యూరిటీ ఆఫీసర్లు దారి కలిగిస్తున్నారని సమాచారం అందింది. అమె త్వరలోనే వచ్చేస్తున్నారు. సినిమాలో నాయికానాయకుల నటనా విశేషాలు రెండు విధాలు. ఒకటి సంభాషణలకీ, అభినయనానికీ సంబంధించినది. రెండవది నాట్య గానాదులకు సంబంధించినది. నాట్య గానాదులు ఈనాటి మన భారత దేశీయ చలన చిత్రాలకు ప్రాణాలనడంలో సందేహం లేదు. అయితే నాదం, గానం లేనిదే నాట్యం లేదు. ఈ చిత్రంలో అద్భుతమైన ‘దేవిమణిచక్రి’ గారి సంగీతానికి శృంగార భరితమే కాకుండా, సంక్లిష్టమైన పాద విన్యాసాలతో నృత్య దర్శకత్వం చేసిన ‘రాఘవ దేవా’ ని ఘనంగా ఆహ్వానించండి.” సభా ప్రాంగణం చప్పట్లతో నిండిపోయింది.
“భావ యుక్తమైన గీత రచన చేసిన సిరి చంద్ర గారిని వేదిక మీదకు పిలిస్తున్నాను. చప్పట్లతో పలకరించండి.” ఆ పలకరింపుల్లో పస లేదు.
“అన్ని అంశాలనీ తగు పాళ్లలో మేళవించి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మలచిన దర్శకుడు ‘వినాశీనుపూరీ’ గారిని స్వాగతించండి.” హర్ష ధ్వానాలు మిన్నంటాయ్.
“మీరందరూ ఆసక్తితో ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. ప్రాంగణం లోకి యిప్పుడే నిర్మాతల, దర్శకుల, నాయకుల, ప్రేక్షకుల అభిమాన తార ‘అనుకాజతమ’ అడుగు పెట్టారు. అలశ్యమెందుకు........?” అందరూ లేచి వెనక వైపుకు చూశారు. ‘ అనుకాజతమ’ వయ్యారంగా అడుగులు వేసుకొంటూ వేదిక దిశగా పయనించింది. యువ నాయకుడు నేత్రానంద్ కుర్ఛీలోంచి లేచి ‘అనుకాజతమ’ దారినడ్డగించి, ఆమె చేతిని దొరకబుచ్చుకొన్నాడు. యిద్దరూ కలిసి అతి నెమ్మదిగా వేదిక నెక్కారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తోన్న ‘టీవీ’ ప్రేక్షకుల కోసం ఆ దృశ్యాన్ని అతి మందగ మనంలో నాలుగు సార్లు మరీ మరీ బుల్లి తెర మీద చూపించారు.
సభా మందిరమంతా చప్పట్లతో కాదు కాని ఈలల తోటీ, కేకల తోటీ నిండి పోయింది. కాస్త సద్దు మణిగిన తర్వాత “యిప్పుడు లయ బద్ధమైన మీ కేకిసలు......అయ్యా, ఆగండాగండి! కేకసలూ, కేకిసలూ అంటే చప్పట్లకి పర్యాయ పదాలు! అందుకని మిమ్మల్ని కొట్టమన్నది చప్పట్లని కానీ , పెట్టమన్నది కేకలు కాదు! ఆగకుండా కనీసం ఒక నిముషామైనా కరతాళ ధ్వనులు వినిపించండి!” అని ఒక చేత్తో మైకు ఎత్తి పట్టుకొని, రెండో చేత్తో మైకు మీద బాద సాగింది. అందరూ అలాగే చేతులు పైకెత్తి భజన రీతిలో చప్పట్లు కొట్టారు. ఉశిఝాసు హీరో, హీరోయిన్ల వైపు మెప్పు కోసం చూసి నిరాశ పడింది. ఎందుకంటే వారిరువురి దృష్టీ ప్రేక్షకుల వైపే సారించి ఉన్నాయి. అదీ కాక సదరు నటీ మణి మాటి మాటికీ మొహం మీద పడే జుత్తుని సవరించుకొంటూ యమగా హావ భావాలు ప్రదర్శిస్తూ ఉంది. ఆమెకు ఉశిఝాసు తెలుగు మాటలు అర్థం కావటల్లేదు. ఆమెకు అర్థమయ్యేవి చప్పట్లూ, ఈలలూ, కేకలూ!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
“ఈ సినిమా కాలేజీ వార్షిక దినోత్సవ సంబరాల దృశ్యంతో ప్రారంభమౌతుంది. నాయికా, నాయకులు విజృభించి పోతూ పోటాను పోటీగా పాడే పాటట! విశిష్ట అతిథిగా ఆహ్వానితులైన జగద్విఖ్యాత దర్శక, నిర్మాత ‘రాఘవేంద్ర నారాయణ రావు గారు’ ఆడియో సీడీని ఆవిష్కరించి ఆ పాటని వినిపిస్తారు. ఘనంగా ఆయన్ని స్వాగతించండి!” అంది. కరతాళ ధ్వనులు నీరసంగా వినిపించాయి. వేదిక వెనకనున్న ప్లాస్మా తెర మీద నాయకుడి పిడికిలీ, నాయిక నాభీ, కింద ‘జీన్ పాంటూ’ కనబడ్డాయి. చప్పట్లు అదిరిపోయాయి. అదే అదనుగా, ఆ చప్పట్లు ముగియక ముందే ప్రముఖ దర్శక నిర్మాత, మూడడుగుల వ్యాసం గల ఓ గుండ్రటి ప్లాస్టిక్ ఫలకం మీది ముచ్చి రేకుని ఛిద్రం చేసి, అందరికీ ఎత్తి చూపాడు. దాని మీద కూడా అవే పిడికిలీ, నాభీ రంగుల్లో ముద్రించి ఉన్నాయి. తర్వాత అందమైన ఓ చిన్న పెట్టి లోంచి చిన్న సీడీలు తీసి అందరికీ పంచాడు. మొదటి పాటని ఆవిష్కరించాడు. ‘ యింకో సారి ప్రముఖ దర్శక నిర్మాతని చప్పట్లతో అభినందించండి’ అనే అవసరం కలగ నందుకు ఉశిఝాసు ఊపిరి పీల్చుకుంది. ఎందు కంటే నాభి బొమ్మ ప్లాస్మా తెర మీద కనబడ్తున్నంత సేపూ చప్పట్ల జోరు తగ్గ లేదు.
“యిప్పుడు చిత్రంలోని ఈ మొదటి పాటని నృత్య కళా కారులు నృత్య రూపంలో మీ ముందుంచుతారు. నాయికా-నాయకుల ఉత్తేజ కరమైన ఈ నృత్యం కోసం మీరు చిత్రం చూడాల్సిందే! క్లాసులు బంకు కొట్టి, ఆఫీసులు ఎగ్గొట్టి, మొదటి ఉదయం ఆటకి టికెట్ వంపులు తిరిగిన బారుల్లో నిల్చుని కొంటారో, లేక నల్ల బజార్లో కొని చూస్తారో మీ యిష్టం! అదేమిటి అలా నిశ్శబ్దం వహించారు? నా మాటలు మీకు రుచించ లేదా?”
సమాధానంగా చప్పట్ల దరువులతో సభా మందిరం దద్దరిల్లి పోయింది. వేదిక మీదనున్నవారందరూ దిగి తమ ఆసనల్లో కూర్చున్నారు. నేపథ్యంలో ఆ పాట వినబడ్తూండగా రంగ స్థల కళాకారులు నృత్యం చేశారు. నాయిక, నాయకుడు ఒకరి నొకరు చూసుకొంటూ కాస్తగా పెదవి విరిచారు. వెయ్యి ముక్కలుగా తీసి, అద్భుతంగా జోడించిన తెర మీది నృత్యాల్ని ఆదరించే ప్రేక్షకులకి ఈ కళా కారుల నృత్యం అంతగా రుచించ లేదు. అయితే నాయికా, నాయకులు కూడా తాము పెదవి విరచడంలో అర్థం లేదని గ్రహించలేదు.
“వీరి నృత్యమే యింత పసందుగా ఉంటే, తెర మీద మీ ప్రియతమ నాయికా నాయకుల నృత్యం యింకెంతటి పులకింతలు కలిగిస్తుందో ఊహించుకోండి. ఊహా గానాలెందుకు, చూసి తరించండి! రుచి చూపించిన ఈ కళాకారులకి హర్ష ధ్వానాలతో అభినందనలు తెలియజేయండి!”
చాలామంది అరచేతులు అంటించారు కాని ధ్వనులు మట్టుకు వినబడలేదు!
“యిక రెండవ పాట స్వయంగా ‘దేవీమణిచక్రి’ గారే విడుదల చేస్తారు. పాట నేపథ్యంలో వినపడ్తుంది. అదే సమయంలో దర్శకుడు ‘వినాశీనుపూరీ’ సంగీత దర్శకుణ్ణి పుష్ప గుచ్చంతో, దుశ్శాలువతో సత్క రిస్తారు.” అందమైన పాట వరస కోసమూ, గౌరవ ప్రదమైన సత్కారం కోసమూ కలిపి చప్పట్లు కొట్టించింది ఉశిఝాసు.
మూడో పాటని నిర్మాత నిరంజన్, నాలుగో పాటని దర్శకుడు ‘వినాశీనుపూరీ’, అయిదో పాటని ఆ సినిమాకి మరోలా జీవం పోశారన్న హాస్యబ్రహ్మ ‘నారాయణానందాలీ’, ఆరో పాటని నాయికా నాయకులు సంయుక్తంగానూ విడుదల చేశారు. పాట విడుదలకీ, పాట విడుదలకీ మధ్య పరస్పర ప్రశంశలూ, స్వోత్కర్షలూ పుష్కలంగా చోటు చేసుకొన్నాయి. ఒక్కొక్క పొగడ్తకీ, స్వోత్కర్షకీ చెప్పీ, అడిగీ చప్పట్ల పర్వం కొనసాగించింది ఉశిఝాసు.
చివరగా ఇంగ్లీష్ లో మాట్లాడబోయి తెలుగులోకి జారిన నాయకుదూ, ‘నాకు తెలుగు రాదు. అయినా ప్రయత్నిస్తాను!” అన్న ఒక్క వాక్యం తెలుగులో ముద్దుగా అని, వెంటనే తనకి వచ్చిన రీతిలో యింగ్లీష్ లోకి మారి నాయికా, ‘ప్రేక్షకులే తమకి సర్వస్వం, వారే తమకి ఆరాధ్య దేవతలు’ అంటూ ఉపన్యాసాలు ముగించారు. వారిరువురూ మాట్లాడుతోన్నంత సేపూ ప్రాంగణమంతా చప్పట్లతో కాకుండా ఈలలతోటీ, కేకలతోటీ నిండి పోయింది. ఉశిఝాసు తెలివిగా మౌనం వహించింది. తర్వాత ఉశిఝాసు అందరికీ, అందరి తరఫునా, పేరు పేరునా ధన్యవాదాలర్పించింది. మొదటి పిలుపులో వేదిక నెక్కి వెనక వరసలో కూర్చున్న గీత రచయితకీ, నేపథ్య గాయకులకీ, రంగస్థల కళాకారుల ప్రదర్శనల తర్వాతా, పాటల విడుదల సమయంలోనూ మళ్ళీ పిలుపు రాలేదు. వాళ్ళు నాలుగైదు సార్లు ఆశా భావంతో ఉశిఝాసు వైపు చూశారు. ‘ నేనేం చేయ గలను? మాట నాది కాని, సభా నిర్వహణ కార్యక్రమం రాసిచ్చింది వారే!” అన్నట్టు కళ్ళ తోటే సముదాయించింది.
‘నేపథ్య వాయిద్యాల ఘోషలో గీతంలోని సాహిత్యపు సొంపులు కాని, గాయకుల నైపుణ్యం గాని సినీ ప్రేక్షకుల అవగాహనకు ఎలానూ రావు! కనబడేదల్లా ఎదల పొంగులూ, నాభి లోయులూ, నడుము కదలికలూ, జఘనాల మీద దరువులూ, ఒంటి చేతి పోరాటాలు,రెండర్థాల మాటలూ తప్ప మరేమీ మీ కావు! సరేలే దీనికింత చింతించాలా?” అని గేయ రచయితలూ, నేపథ్య గాయకులూ తమ్ము తాము సమాధాన పరచుకొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉశిఝాసు వీలైనంతగా కరతాళికల జల్లులు కురిపించి యిల్లు చేరింది.
భర్తా, కొడుకూ టీవీ కి అతుక్కుపోయి కూర్చుని మరేదో పాటల పోటీ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఓ సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. టీవీలోంచి కరతాళ ధ్వనులు వినవస్తున్నాయి. తల్లిని చూడగానే, ‘మమ్మీ! యింతవరకూ నీ ప్రోగ్రాం చూశాం. అదిరిందనుకో!” అన్నాడు పదేళ్ళ కొడుకు.
“అలా అనేసి ఊరుకుంటే కుదరదు! చప్పట్లు కొట్టాలి!” అన్నాడు భర్త.
“చప్పట్లూ, గిప్పట్లూ అంటే చేతులు విరగ్గొడ్తాను! నోరు మూసుక్కూర్చోండి!” అంది ఉశిఝాసు తిక్కతిక్కగా. కలపబోయిన భర్త చేతులు మధ్యలోనే భయం భయంగా ఆగిపోయాయి! టీవీ కేసి చూస్తూ ‘గాన గంధర్వుడికే పాట్లు తప్పటల్లేడు. నేనెంత?” అనుకొంటూ సోఫాలో కూలబడింది.
స్పందించి చేసే కరతాళ ధ్వనులకీ, సభా మర్యాదకోసం చేయించే కరతాళ ధ్వనులకీ అంతరముంటుంది. అయితే స్పందనా, సభా మర్యాదా-రెండూ తెలియని ప్రేక్షకులున్నంత కాలం- వ్యాఖ్యాతలకు చెప్పి చప్పట్లు కొట్టించే తలనొప్పి తగ్గదు!
ముక్తాయింపు: యింత గొడవెందుకు? ఆంగ్ల హాస్య టీవీ ప్రదర్శనల్లోలాగా కళా మందిరాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు కృత్రిమ కరతాళ ధ్వనులు ఏర్పాటుచేస్తే పోతుందిగా?
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
పక్కింట్లో చెప్పా... - ఆకెళ్ళ శివప్రసాద్
రో జూలాగే రొమాంటిగ్గా తయారయి ఫినిషింగ్ టచ్ లా పెదాలకి లిప్ స్టిక్ అద్ది, అద్దంలో తనని తానే ముద్దు పెట్టుకుంది మల్లీశ్వరి. 'యింత అందమైన విగ్రహాన్ని చూసినా నిగ్రహంగా ఎలా వుంటున్నాడే మీ ఆయన' అన్న పిన్ని మాటలు గుర్తు కొచ్చాయి. కిశోర్ యిష్టపడే పెళ్ళిచేసుకున్నాడు. అంత కన్నా యిష్టంగా హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కంపెనీకి వెళ్ళే రోజు వరకు నిరంతర ప్రణయానందంలో ముంచేశాడు. సెలవులయి కంపెనీకి వెళ్ళి వొచ్చాకా కధే మారిపోయింది. అలసటతో వస్తున్నాడు. అలరించకుండా నిద్రపోతున్నాడు. కంపెనీలో పని ఒత్తిడి పెరిగినప్పుడేగా ఇలాంటి 'రిలాక్సేషన్' కావాలి! ఊహా! ల్యాప్ టాప్ ముందే న్యాషీతో మొదలుపెట్టి కునుకులో జారుకుంటున్నాడు.
ఆ రోజు కిశోర్ వచ్చేసరికి - టీవీలో వసందైన హిందీ సిన్మా లో పాట వస్తోంది. హీరో, హీరోయిన్లు సముద్రం ఒడ్డున వంటిమీద గుడ్డలు వున్నాయో లేవో కూడా పట్టించుకోకుండా రెచ్చి పోతున్నారు. కిశోర్ దృష్టి అటుపడిన వెంటనే, వచ్చిన అవకాశం అంది పుచ్చుకున్నట్లు మల్లీశ్వరి అతని పెదాలతో తన పెదాలు కలిపింది. కాసేపు ఆనందమిచ్చిన తమకం. తమకంలోంచి పుట్టిన వేడి.
కిటికీ లోంచి జాలువారుతున్న వెన్నెల కిరణాలు ఇటుగా చూసి సిగ్గుపడిపోయాయి. కాసేపే... ఆ తరువాత... పాతపాటే... అలసట బాటే!!
మల్లీశ్వరి ప్రతి రోజులా నిరాశపడకుండా, పిన్ని ఫోన్ లో ఛెప్పిన సలహాను అమలు చేస్తూ - "యివాళ మధ్యాహ్నం టూ నాట్ ఫోర్ లో వుండే శ్రీదేవి అడిగింది మీవారు బెడ్ రూమ్ లో ఎలా వుంటారని... కొత్తగా పెళ్ళయిన వాళ్ళంటే అదో ఆసక్తి వుంటుంది... పెళ్ళయి పిల్లలు పుట్టినా వాళ్ళాయన అస్సలు వదిలి పెట్టడట... నుదురు మీద మొదలయిన ముద్దులయాత్ర చిటికెన వేలు దాకా సాగవలసిందేనట... నన్ను అడిగింది..."మల్లీశ్వరి మాట పూర్తి కాకుండానే కిశోర్ గురక వినిపించింది. మల్లీశ్వరి విరహం గోడల్ని తాకింది!
మర్నాడు -
మళ్ళీ కధ బెడ్ రూమ్ కి వచ్చేసరికి -
"ఒన్ నాట్ సిక్స్ లో వుండే మార్గరెట్ కి అస్సలు సిగ్గులేదు..." అని మొదలుపెట్టే సరికి -
"ఎవరు?" కిశోర్ టక్కున అడిగాడు.
"అదేనండి... ఇవాళ మీరు బైక్ తీస్తుంటే టైట్ జీన్స్ వేసుకుని అందరిని రెచ్చగొట్టేటట్టు ఏదో హిందీ పాట పాడ్తోంది... ఆవిడ... బెడ్ రూమ్ బ్యాడ్ రూమ్ కావాలిట... బ్యాడ్ అంతా బెడ్ మీద గుడ్ గా జరగాలి... అని అడిగితే... నేను సిన్సియర్ గా మీరు అలిసిపోయి పడుకుంటున్నారని చెప్పేశా... హ్యాపీ లేని సంపాదన ఎందుకు?... డబ్బులతో ముద్దులు కౌగలింతలు రావుగా... అసలు తప్పునీది అని అరచి... తలుపులు మూసుకున్నవెంటనే తలపులన్నీ నా మీదే వుండేటట్టు చేసుకోవాలంది..."
ఈ సారి మల్లీశ్వరి మాటలు పూర్తిగా వినకుండా మల్లీశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు. అపార్ట్ మెంట్ లో ఆడవాళ్ళందరకి తను 'చేస్తున్న' పని తెలిసిందనేసరికి 'ఇగో' దెబ్బతింది.
మల్లీశ్వరికి కావలసింది అదే!!
మళ్ళీ మర్నాడు పాత కధే!
మల్లీశ్వరికి విరహం తప్పలేదు!!
ఆ మర్నాడు -
కిశోర్ కంపెనీ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఎప్పటిలాగే నిద్రకి ఉపక్రమిస్తుంటే -
మల్లీశ్వరికి ఫోన్ వచ్చింది -
ఫోన్ లో మాట్లాడుతూ మల్లీశ్వరి కాస్త గట్టిగానే -
"...ఆ... ఆ... పిన్నీచెప్పు... నన్నేం చెప్పమంటావ్... కిశోర్ గారు పడుకుంటున్నారు... కాసేపాగి ఫోన్ చేస్తే ఆయన నిద్రకి డిస్టర్బ్ వుండేది కాదు... పాపం... అదొకటే తక్కువ... ఎంత ప్రేమగా చూసుకుంటారని... మా అపార్ట్ మెంట్ లో వాళ్ళు చెప్పడం... వాళ్ళు ఆయనకి ఏం చెప్తారు?... మా దగ్గరుండే నార్త్ ఇండియన్ ఆంటీ అలిసి పోతున్నారంటే 'అచ్చా ఫుడ్ కిలావ్' అని డ్రై ఫ్రూట్స్ యిచ్చింది... కిశోర్ కి వాటిని తినే ఓపిక కూడా లేదు... మలయాళీ ఆంటీ అయితే 'యోగ' నేర్చుకోమను...'సంయోగ యోగం' బావుంటుంది అంది... ఆవిడ దగ్గరకి నన్నే కాదు కిశోర్ ని రమ్మంటోంది... రసం లేక నీరసంగా వుందేమో పళ్ళరసం యిమ్మని యింకోరి సలహా... మా అపార్ట్ మెంట్ లో ఈ విధంగా పాపులర్ అయినామనుకో... కిశోర్ గమనించడం లేదు గానీ ప్రొద్దున్నే జాలి పడ్తున్నారు ఆయన్ని చూసి..." అనేసింది.
కళ్ళలోకి ఎక్క బోయిన నిద్రమత్తు టక్కున కిశోర్ కి ఎగిరిపోయింది. రోజూ కంపెనీకి వెళ్తున్నప్పుడు 'పని'గట్టుకుని అపార్ట్ మెంట్ లో వున్న వాళ్ళందరు 'తననే' చూస్తున్నారా? మలయాళీ ఆంటీ అందుకే నవ్విందా? మార్గరెట్ కొంటె చూపులో అర్ధమదా?... ఒకావిడకి పెద్దావిడని సెంటర్ వరకు లిఫ్ట్ యిస్తే 'ఆల్ ది బెస్ట్ చెప్పడంలో అర్ధమింతవుందా?...
యిలా చాలా చాలా వూహించేసుకుని -
సామూహికంగా అందరూ తనలోని 'మొగాడి' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఫీలై పోయాడు - దానికి తోడు - మల్లీశ్వరి బంధుమిత్రులకి కూడా జిల్లాల వారీగా తన 'మగతనం' ప్రతిభ చాటేస్తోందా?... 'నో' అలా జరగకూడదు!!
తనని తాను 'ఫ్రూవ్' చేసుకోవాలి!!
ఫోన్ లో మాట్లాడుతున్న మల్లీశ్వరిని అమాంతం తనవైపు లాక్కున్నాడు - ఫోన్ లో అప్పుడే పిన్ని అంటోంది -
"తన భార్య మాట ఎలా వున్నా పక్క ఆడవాళ్ళు తన గురించి 'తక్కువగా' వూహించడం ఏ మొగాడు తట్టుకోలేడు..." అని ఆతరువాత -
మల్లీశ్వరి ఫోన్ కట్ చేసే అవకాశం కిశోర్ యివ్వలేదు. అక్కడి శబ్ధాలకి పిన్ని మురిసిపోయి సీన్ వూహించుకుని ఆనందపడింది. పక్కింటి వాళ్ళకి చెప్పకుండా చెప్పేనని చెప్పమన్నా పిన్ని సలహాని రహస్యంగా దాచుకుని కిశోర్ కౌగిలలో కరిగిపోయింది మల్లీశ్వరి!!!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
ఎ రొమాంటిక్ జర్నీ - లాస్య రామకృష్ణ
బెం గుళూరు లో ని MNC లో జాబ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండటం వల్ల తరచూ బెంగుళూరు టు హైదరాబాద్ ప్రయాణం నాకు అలవాటే. ప్రయాణం లో అలసట తెలియకుండా ఉండడానికి నేను పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఈ సారి ప్రయాణం లో నాతో పాటు రవీందర్ సింగ్ రచించిన 'ఐ టూ హాడ్ ఎ లవ్ స్టొరీ' అనే బుక్ చదువుదామని తెచ్చుకున్నాను. ఇంతలో ఎవరో 'హాయ్' అని పలకరించారు. ఆ పిలుపు వినగానే పుస్తక పఠనం లో నిమగ్నమయిన నేను వెంటనే బయటపడ్డాను.
'హాయ్' అని బదులిచ్చాను. అందంగా ఉంది. కర్లీ లూస్ హెయిర్ గాలికి ఊయలలూగుతూ ఉంది. మొన్నొచ్చిన సినిమాలో సమంతకి ఈ అమ్మాయికీ చాలా పోలికలు ఉన్నాయి. బొట్టు పెట్టుకోలేదు. చీర కట్టుకుంది. వాయిస్ కూడా హస్కీ వాయిస్.
'హాయ్ అండి' అని బదులిచ్చాను. నా పక్క సీటు కి వచ్చిన అమ్మాయి అనుకుంట. 'ఐ యాం అనిత. సీట్స్ ఎక్స్చేంజి చేసుకుందామా. నాకు విండో దగ్గర కూర్చోవడం ఇష్టం. బుక్ చేసుకుంటున్నప్పుడు కుదరలేదు. సరేలే బస్సులో అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను' అని అంది.
సాధారణం గా ఎవరైనా అమ్మాయి ఇంత అందంగా రిక్వెస్ట్ చేస్తే ఎవరు కాదనగలరు. ఖలేజా సినిమాలో మహేష్ బాబు డైలాగు గుర్తొచ్చింది. 'ఏం అడిగిందండి' అని సునీల్ అనగానే, 'కదా బస్ ఉండుంటే నేనే లిఫ్ట్ ఇచ్చేవాడిని.' అనే రేంజ్ లో మహేష్ బాబుని పడేసిన అనుష్కలా అడిగితే సామాన్య మానవుణ్ణి నేను మాత్రం కాదనగలనా.
కట్ చేస్తే సీట్స్ ఎక్స్చేంజి అయిపోయాయి. సాధారణం గా అమ్మాయిలందరూ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు లేడీస్ పక్కనుండే సీట్స్ ని బుక్ చేసుకుంటారు. మరి ఈ అమ్మాయి ఏదైనా హడావిడిలో ఉందేమో.
ఇప్పటివరకు నేను ఒంటరిగా చేసిన ప్రయాణాలలో అబ్బాయిలే నా పక్క సీటులో ఉండేవారు. అమ్మాయి అందులో సమంత లాంటి అమ్మాయి నా పక్కన కూర్చోవడం ఇదే మొదటిసారి.
ఆ అమ్మాయితో మాట్లాడాలనిపించింది కానీ అమ్మాయిలతో మాట్లాడే అలవాటు పెద్దగా లేనందువల్ల ఎలా మాట్లాడాలో తెలియలేదు . పుస్తకం చదువుదామని అనుకున్నా ఇది ఇదివరకటిలా బోర్ కొట్టే ప్రయాణం కాదు కదా నా మనసు పుస్తకం పై కి వెళ్ళట్లేదు. ఎలాగోలా మనసుకి సర్ది చెప్పుకుని నేను పుస్తకం చదవడం ప్రారంభించాను. ఇంతలో ఆ అమ్మాయే నాతో మాటలు కలపడానికి ప్రయత్నించింది.
'ఏ బుక్ చదువుతున్నారు, ఈ బుక్ చదువుతున్నారా' అని ఆశ్చర్యం గా అడిగింది.
'అవునండి, ఎందుకలా అడిగారు' అని అడిగాను.
'అదేం లేదండి, ఈ నవల్ లో హీరోయిన్ చనిపోతుంది. ట్రాజెడీ లవ్ స్టొరీ' అని చెప్పింది.
'చెప్పేసారా, ఎవరైనా కథ చివరలో ఏమవుతుందో ముందే చెప్పేస్తే నాకు ఆ కథ పై ఇంట్రెస్ట్ పోతుంది' అని అన్నాను.
'అయ్యయ్యో, మీకు ఇంట్రెస్ట్ పోగొట్టాలని అలా చెప్పలేదు. వయసులో ఉన్నారు. ఇలాంటి ట్రాజెడీ లవ్ స్టోరీస్ ఎందుకు చదవడం అని అనిపించి ముందే చెప్పేసాను, ఐ యాం సారీ' .
'మరి మీరు కూడా వయసులోనే ఉన్నారు. మీరు చదివారు కదా'.
'లేదండీ, నేను చదవలేదు. ఏదైనా బుక్ చదివే ముందు నేను రివ్యూస్ చదువుతాను. అలా తెలిసింది. మీకెలాగైతె కథ ముందుగా తెలిసిపోతే కంటిన్యూ చెయ్యలేరో అలాగే నాకు ట్రాజెడీ కథలు చదవడం ఇష్టం లేదు.' అని చెప్పింది.
అందంగా లేనా? అసలేం బాలేనా? నీ ఈడు జోడూ కాననా అనే పాట వినబడుతోంది. వెంటనే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి 'హాయ్ రా, ఎలా ఉన్నావు? హా వస్తున్నా. బస్సులోనే ఉన్నా. ఇంకా నా మీద కోపం పోలేదారా. యు ఆర్ చో చ్వీట్ కదూ. హాయిగా నిద్రపో. ఐ విల్ బి దేర్ బై టుమారో మార్నింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్' .
ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపు నాకు టెన్షన్. కొంపదీసి ఈమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా. అలా అయితే నా పరిస్థితి ఏంటి.
ఇంతలోనే నాకు నేనే సర్దిచేప్పుకోవడం ప్రారంభించాను. 'అయినా ఈ ప్రేమలు దోమలూ మా ఇంటా వంటా లేవు. హాయిగా అమ్మా నాన్నా తెచ్చిన సంబంధం చేసుకోవాలనే ఇప్పటివరకు నా ఉద్దేశ్యం. అరె అదేంటి. ఇప్పటివరకు అంటే ఇప్పట్నించి నా ఉద్దేశ్యం మారిందా. ఏమో అంతా దేవుడి చేతిలోనే ఉంది.'
'ఆ ఫోన్ లో మాట్లాడినది ఎవరో తెలుసుకుంటే సమస్య తీరిపోతుంది. కానీ ఎలా అడగను. రెండు ముక్కలు సరదాగా మాట్లాడగానే నేను ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకునేంత చనువు వచ్చిందా అని గనక ఆ అమ్మాయి రివర్స్ అయితే... ' అని ఆలోచనలతో సతమవుతుండగా ఆ అమ్మాయి నా మనసులో మాట కనిపెట్టినట్లుగా ముసి ముసిగా నవ్వుతోంది.
'ఏం అయిందండీ. ఇంత సేపూ బాగానే ఉన్నారు కదా, ఎనీ ప్రాబ్లం' అని తనదిన స్టైల్ లో హస్కీ వాయిస్ లో అడిగింది.
'అబ్బెబ్బే, ఏం లేదండీ. మీరెక్కడ దిగాలండి బెంగుళూరు లో' అని టాపిక్ డైవెర్ట్ చెయ్యాలి అన్నట్టుగా అడిగాను. అవసరమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కూడా
'హేబ్బాల్ లో దిగాలండి. మై ఫ్రెండ్ పిక్స్ అప్ మీ ఫ్రం దేర్' అని చెప్పింది. అదే తెలుగులో చెప్పుంటే 'నా ఫ్రెండ్ నన్ను పిక్ అప్ చేసుకుంటుంది లేదా చేసుకుంటాడు అనే సరికి నాకు క్లారిటీ వచ్చేది కదా. ఇలాంటి సందర్భాల లో నే నాకు ఇంగ్లీష్ ని కనిపెట్టిన వాడంటే పిచ్చి కోపం'
'ఓహ్ ఫ్రెండ్, హి హి హి' అని బ్రహ్మానందం స్టైల్ లో ఒక నవ్వు నవ్వాను. ఇంకా డీటెయిల్స్ అడిగితే నా మీద అనుమానం రావొచ్చు
పొడి పొడి డైలాగు ల తో నే అమ్మాయిలు పడిపోతారని మహేష్ బాబు సినిమాల ద్వారా నేర్చుకున్నాను. కానీ నాకు త్రివిక్రమ్ అనే రైటర్ లేడుగా. ఒక వేళ అటు ఇటు గాని అయితే, నాకు ఇంట్రెస్ట్ లేదనుకుని తను తప్పుకోవచ్చు.
నో నో నో.. నా స్టైల్ నే ఫాలో అవుదామని ప్రయత్నించాను. ఎలాగైనా మాటలు కలపాలి. సినిమాల గురించయితే నేను నిర్విరామంగా గంట సేపు మాట్లాడగలను. 'ఒరేయ్ అప్పుడు వన్ సైడ్ కాన్వర్సేషన్ అవుతుందిరా' అని నా మనసు హెచ్చరించిది. ఆ హెచ్చరికను గుర్తుంచుకుని వన్ సైడ్ కాకుండా జాగ్రత్తపడాలి అనుకున్నాను.
'మీరు రీసెంట్ గా చుసిన సినిమా ఎంటండి' అని అడిగాను
'ఏంటోనండి సినిమాలంటే ఇంట్రెస్ట్ పోతోంది. ఇదివరకటిలా సినిమాల పై న ఆసక్తిఉండట్లేదు. మాక్సిమం డౌన్లోడ్ చేసుకుని చూస్తుంటాను. రీసెంట్ గా అంటే 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చూసాను. ఏంటో బోరింగ్ గా అనిపించింది' అని అంది.
'ఓహ్ ఆ సినిమా చూసారా. హీరోయిన్ సమంత బాగా నటించింది కదా. కొంచెం మీకు సమంత కి దగ్గర పోలికలు ఉన్నాయండి' అని అనగానే ఆమె లో ని అమితానందం గమనించాను. ఒక్కసారిగా సమంత నటించిన సినిమాలో తనని తానూ ఉహించుకుందేమో ఎంత సేపటికి ఆలోచనలోనే ఉంది.
'హలో హలో' అని చిటికేసి లేపాను
'ఓహ్! సారీ...చాలా మంది ఈ కాంప్లిమెంట్ ఇచ్చారండి. యు నో వన్ థింగ్? 'ఏమాయ చేసావే' సినిమా తరువాత నుండి నేను జీన్స్ వేసుకోవడం మానేసాను తెలుసా. ఓన్లీ శారీస్.'
గౌతం మీననూ. నీకేంటి సినిమాలు తీసేసి హ్యాపీ గా ఉంటావు. ఇక్కడ చూడు సినిమా సినిమా కి హీరోయిన్ లా తయారయి అమ్మాయిలందరూ ఇలా అబ్బాయిలని పడేస్తున్నారు. నువ్వొచ్చి చెప్తావా నా ప్రేమ సంగతి. అని మనసులో ఆ సినిమా తీసిన డైరెక్టర్ ని తిట్టుకున్నాను.
అలా మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుండగా మెల్లగా నిద్రపట్టేసింది.
తెల్లారి లేవగానే ఆ అమ్మాయిని విడిచి వెళ్లాలే అని బాధ. పేస్ బుక్ అకౌంట్ తీసుకుందామని అనుకుంటుండగా బస్సు బెంగుళూరు లో హేబ్బాల్ వద్ద ఆగింది.
బస్సు దిగాను
ఇంతలో
"ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యరం "
అనే రింగ్టోన్ వినపడింది. నన్ను దాటుకుంటూ అచ్చు గబ్బర్ సింగ్ సినిమా లో ని శృతి హస్సన్ లా ఒక అమ్మాయి నడచుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి వెనకాతలే నా పాదాలు నన్నడగకుండానే కదిలాయి
దిస్ ఈస్ ఎన్ ఎండ్ లెస్ జర్నీ
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
స్నానం - మద్దూరి నరసింహమూర్తి
అత్తవారింటికి వచ్చిన కొత్తలో అత్తగారు కోడలు కౌసల్యని పిలిచి –
"అమ్మాయి, ఈ రోజు వరకూ అబ్బాయి బాగోగులు నేనే చూసుకున్నాను. ఇప్పుడు నీ చేతుల్లో అబ్బాయిని పెడుతున్నాను. ఇకమీదట నువ్వే వాడికి అన్నీను. ముఖ్యంగా సాలు మున్నూరు కాలం స్నానానికి వేడి నీళ్లుండాలి వాడికి. పొరపాటున చన్నీళ్ళు పోసుకుంటే ఆరోజు నుంచి వారం రోజుల వరకూ జలుబుతో బాధపడతాడు. అందుకే ఎప్పుడేనా తీర్థ యాత్రలకు వెళ్తే, అక్కడున్న నదులలో కానీ పుష్కరుణలలో కానీ స్నానం చేయక సంప్రోక్షణతోనే నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా" అని జాగ్రత్తలు చెప్పేరు.
"అలాగే అత్తయ్యా, మీరేమీ బెంగపెట్టుకోకండి. ఇక మీదట నేను చూసుకుంటాను" అని కౌసల్య అత్తగారికి మాటిచ్చింది.
కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలికి కొన్నాళ్ళు ఏకాంతం ఇచ్చినట్టు అవుతుంది తీర్థయాత్రలకు వెళ్లినట్టు అవుతుంది అనుకున్న కృష్ణారావు తల్లితండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరేరు.
వారు అలా వెళ్లిన తరువాత ఒక రోజు ఉదయం కౌసల్య –
"ఏమండీ మీకు చన్నీళ్ళ స్నానం అంటే భయమా, పడదా" అని అడిగింది.
"ఏమో. పడదు అన్న భయమేమో"
"అయితే ఈరోజు నేను చెప్పినట్టు చేయండి మీకు భయం పోతుంది"
"ఏమిటది"
"మనిద్దరం ఒకరినొకరం గట్టిగా కౌగలించుకొని కలిసి స్నానం చేద్దాం. మన మధ్య పుట్టే వేడికి మీకు నీళ్లలో చల్లదనము తెలియదు"
"నిజంగా అలా జరుగుతుందంటావా"
"ప్రయత్నించడంలో తప్పులేదుగా పైగా లాభం ఉండొచ్చేమో"
"లాభమా, అదేమిటి"
"ముందు స్నానాలగదిలోకి పదండి లాభమేంటో తెలుస్తుంది. నేను వీధి తలుపు, పెరటి తలుపు గడియలు పెట్టి వస్తున్నాను"
రెండు నిమిషాల తరువాత వచ్చిన కౌసల్య –
"ఇంకా లుంగీతోనే ఉన్నారా విప్పి అక్కడ అలా పడేయండి" అని,
అతను చూస్తూండగా తన బట్టలు ఒక్కొక్కటి విప్పడం ఆరంభించి ఆఖరికి పూర్తిగా నగ్నంగా నిలబడి –
"నన్ను చూస్తూంటే ఇప్పుడు మీలో వేడి పుడుతోందా"
-2-
"ఇప్పుడిప్పుడే పుడుతోంది, కొంచెం దగ్గరకిరా" అంటూ దగ్గరగా వచ్చిన కౌసల్యని కృష్ణారావు తమకంతో గట్టిగా కౌగలించుకున్నాడు.
కౌసల్య కూడా కూడా దీటుగా ప్రతిస్పందించింది.
భార్యాభర్తలిద్దరూ ఆ వేడికి కరిగిపోతూ స్నానాలగదినే పడకగదిగా భావిస్తూ చాలా సేపు ఉండిపోయేరు.
"నన్ను కౌగలించుకుంటే మీలో వేడి పుట్టి చన్నీళ్ళ స్నానం హాయిగా చేయగలరని నేను చెప్తే, ఇదేమిటి వేళకాని వేళలో ఇలా చేసేరు"
"నువ్వలా నిలబడితే చూస్తూ ఎలా ఉండగలను చెప్పు. నాకైతే చాలా బాగుంది, నీకు బాగులేదా"
"నాక్కూడా బాగుందనుకోండి. మనం వచ్చిన పని వదిలి ఇలా అయిపోయేమేమిటి అన్నదే నా ఆలోచన. సరే. అయిందేమిటో అయింది. ఇప్పుడు మీకు చాలా వేడి పుట్టింది కదా, నేను ఇలాగే నిలబడి ఉంటాను, హాయిగా చల్లటి నీళ్లతో స్నానం చేసేయండి"
"ఇందాకా పుట్టిన వేడి ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి నువ్వలా నిలబడితే చాలదు, వచ్చి నన్ను కౌగలించుకో. ఇద్దరం ఒకేసారి స్నానం చేద్దాం"
"అలాగే. కానీ మీరు కౌగలింతతోనే ఆపేయాలి"
"అలాగే. ముందు నువ్వు వచ్చి నన్ను కౌగలించుకొని నాలో వేడి పుట్టించు"
కౌసల్య వచ్చి భర్తని బిగియారా కౌగలించుకొనేసరికి –
కృష్ణారావు కూడా దీటుగా ప్రతిస్పందించేడు.
ఈసారి కూడా కౌగిలింతతో ఆగలేకపోయేరు.
ఆ రోజుకి ఇద్దరూ వేడినీళ్లతోనే స్నానం కానిచ్చి - ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టుగా చల్లబడ్డారు.
రెండో రోజు చేసిన ప్రయత్నంలో ముందురోజులాగే భార్యని గట్టిగా కౌగిలించుకొని - వేడినీళ్లు కాకుండా చన్నీళ్ళు కాకుండా - నులివెచ్చని నీళ్లతో స్నానం చేయగలిగేడు కృష్ణారావు.
-3-
రెండు రోజులు సాగిన ఆనందానుభూతులలాగే సాగిన మూడోరోజున భార్యని ఇంకా గట్టిగా కౌగిలించుకొని చన్నీళ్లతోనే స్నానం చేయగలిగేడు కృష్ణారావు.
ఆ విధంగా కృష్ణారావు చన్నీళ్ళ స్నానం చేసే ప్రయత్నంలో –
తీర్థయాత్రలకు వెళ్లిన కృష్ణారావు తల్లితండ్రులు వచ్చేవరకూ –
--దొరికిన ఏకాంతాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.
తీర్థయాత్రల తరువాత వచ్చిన కృష్ణరావు తల్లి—
కొడుకు చన్నీళ్ళ స్నానం చేయడం, అలా చేసినా ఏమాత్రం అనారోగ్యం లేకుండా ఉండడంతో ఆశ్చర్యంగా కోడలిని పిలిచి –
“అమ్మాయి, అబ్బాయి చేత చన్నీళ్ళ స్నానం ఎలా చేయించగలిగేవు, అలా చేసినా వాడికి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఎలా ఉంచగలిగేవు" అని ఆనందంతో అడిగేసరికి –
ఏమి జవాబు చెప్పాలో తెలియక సిగ్గుతో క్రిందచూపులు చూస్తున్న కోడలిని చూసి ఏదో అర్ధమైనట్లుగా –
"అబ్బాయి స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, వాడికేమి కావాలేమో చూడు. నేను మామగారితో గుడికి వెళ్లి వస్తాను" అని వెళ్లిపోయిన అత్తగారికి మనసులోనే నమస్కారం చేసుకుంది కౌసల్య.
అప్పటినుంచి – కృష్ణరావు తల్లితండ్రులు ఎక్కువగా తీర్థయాత్రలకు కాలం వినియోగిస్తున్నారు.
*****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
పెళ్ళైన కొత్తలో - తాత మోహనకృష్ణ
సుహాస తో సందీప్ పెళ్ళి జరిగి ఒక నెల అవుతోంది. సుహాస ఒక చక్కని చుక్క..చూడడానికి బాపు బొమ్మ లాగ అందంగా ఉంటుంది. సందీప్ ఒక ప్రైవేట్ కంపెనీ లో పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఒక రోజు సాయంత్రం భార్య బట్టలు సర్దుతుంటే....
"అబ్బా..! ఏమిటి ఈ చిలిపి చేష్టాలు.." అంది భర్య సుహాస
"నేను ఏం చేసాను..డియర్..!"
"మీరు మరీ పోకిరి గా తయారైపోతున్నారు..మీ చేతులు ఎప్పుడూ తిన్నంగా ఉండవ్.."
"ఏం చేశాను చెప్పు..ప్రతీ భర్త భార్యతో రొమాంటిక్ గా చేసేదే..కదా.."
"ఛా..! ఏమిటి ఇది..చూడండి..నా పెదాలని ఎలా కొరికేసారో.."
"సినిమా లో మాత్రం ఎంత సేపు హీరో ముద్దులు పెట్టినా..అలా చూస్తావు..లైసెన్స్ ఉన్న మొగుడు పెడితే మాత్రం..అప్పుడే చాలు అంటావు.."
"పెట్టుకోండి..నాకు మాత్రం నచ్చదా చెప్పండి..! ఈ పెదాలు మీ కోసమే కదా..! నా శరీరంలో అణువణువు మీకే సొంతం..జస్ట్ బ్రేక్ ఇమ్మంటున్నాను అంతే..!"
"అయితే వన్ మినిట్ బ్రేక్ తీసుకో.."
అయినా ఇంక చాలు..తొందరగా లెండి ..ఫ్లైట్ కి టైం అవుతుంది..ఇక్కడ నాతో ఇలాగ సరసాలు ఆడుతూ కూర్చుంటే.. ఫ్లైట్ కాస్తా తుర్రు మంటుంది..
"ఖచ్చితంగా వెళ్ళలంటావా సుహా..?"
"ఆఫీస్ పని కదా..వెళ్ళరా మరి..? వెళ్ళకపోతే, మీ బాస్ ఊరుకుంటాడా...?"
"బాగా ఆలోచించుకుని చెప్పు సుహా...నేను వెళ్ళిపోతే, రెండు రోజులు నేను లేకుండా ఉండగలవా..? అసలే కొత్త పెళ్లికూతురివి...నువ్వు 'ఎస్' అంటే, ఇక్కడే ఉండిపోయి..రాత్రంతా నీతో ముచ్చట్లు ఆడుతాను..."
"పదండి..." అని సుహాస...సర్దిన బ్యాగ్ ని ఇచ్చి.. భర్త ని క్యాబ్ ఎక్కించి ఎయిర్ పోర్ట్ కు పంపించింది. సందీప్ మధ్య దారిలో ఫోన్ చేసాడు..
"సుహా...ఎలా ఉన్నావు..? రమ్మంటావా చెప్పు..బాస్ కు ఏదో చెప్పి వచ్చేస్తాను.."
"ఇప్పుడే వెళ్లారు..అప్పుడే ఫోన్..? బుద్ధిగా వెళ్ళండి.." అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుహాస
సుహాస స్నానం చెయ్యడానికి రెడీ అయి...బాత్రూం లోకి వెళ్ళి షవర్ ఓపెన్ చేయగా..తలపై నుండి పడిన నీళ్లు కాళ్ళ వరకు జారీ..వొంట్లో విరహాన్ని రెట్టింపు చేసాయి. వెంటనే, భర్త గుర్తొచ్చాడు. సుహాస కి భర్త తనని వదిలి టూర్ కి వెళ్లడం ఇష్టం లేదు. కానీ, ఆఫీస్ పని అని తప్పక పంపించింది. వెంటనే, మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరా..? అని బాత్రూములోంచి టవల్ చుట్టుకుని గబగబా బెడ్రూమ్ లోకి వచ్చింది సుహాస.
"మళ్ళీ ఫోన్ ఎందుకు చేశారు..?"
"వాతావరణం బాగోలేదని ఫ్లైట్ డిలే అయ్యింది. ఇప్పుడు ఏం చేయమంటావు సుహా..? "
"మీరే గుర్తుకు వస్తున్నారు..ఉండలేకపోతున్నాను..నేనే ఎయిర్ పోర్ట్ కు వచ్చేస్తాను..మీతో పాటు టూర్ కి వస్తాను..."
"మంచి డెసిషన్ తీసుకున్నావు సుహా...నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను..తొందరగా రా.. ఫ్లైట్ డిలే చేత ఇక్కడ నాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు.."
క్యాబ్ లో ఎయిర్ పోర్ట్ కు బయల్దేరిన సుహాస తన పెళ్ళిచూపులు ఎంత చిలిపిగా జరిగాయో గుర్తు చేసుకుంది..
ఆ రోజు తన పెళ్ళిచూపులు... పెళ్ళి కొడుకు ఫోటో చూసి, ఓకే చేసింది సుహాస. కానీ, అతను ఎలా మాట్లాడతాడో, కోపంగా ఉంటాడో, సరదాగా ఉంటాడో అని తెగ టెన్షన్ పడింది. అసలే, సరదాగా, చిలిపిగా ఉండే భర్త రావాలని ఎప్పుడూ అనుకునేది.
గుమ్మం బయట ఏదో కార్ ఆగింది...
"పెళ్ళివారు వచ్చారు.. చెంబు తో నీళ్ళు తీసుకురండి .." అని నాన్న గొంతు వినిపించింది..
అంతవరకూ ఎంతో ధైర్యం..ఇప్పుడు కాస్త గుండె దడ..అనిపించింది సుహాసకి. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు పెళ్ళివారు. 'అమ్మాయి వచ్చేస్తుంది..కూర్చోండి..' అన్న నాన్న మాటలు వినిపించాయి. వెంటనే, రూమ్ లోంచి నన్ను బయటకు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. కాఫీ ట్రే ని తీసుకుని వెళ్ళాను. ముందుగా పెళ్ళి కొడుకుకి కాఫీ కప్ ని ఇచ్చాను. కాఫీ అందుకుని..ఒక సిప్ చేసి.. 'చాలా బాగుంది..' అని నా నడుము కేసి చూసి అన్నాడు.
మళ్ళీ సర్దుకుని.."కాఫీ చాలా బాగుంది.." అని గట్టిగా అన్నాడు.
'రసికుడే...' అని మనసులో అనుకున్నాను..
తర్వాత ఇద్దరినీ విడిగా మాట్లడుకోమని పక్క గదిలోకి పంపించారు పెద్దలు. రూమ్ లోకి ఇద్దరం వెళ్ళాము..
"ఇందాకల కాఫీ చాలా బాగుందన్నారు..అంత బాగుందా..?" అడిగింది సుహాస
"మీకు తేలియదా..? అంత అందంగా ఉంటేనూ.."
"రసికులే..నాకు కాబోయే శ్రీవారు.."
"మీరు మాత్రం తక్కువ..కాఫీ చేతికి ఇస్తూ...కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎక్కడో గురి పెట్టి కొట్టారు.." అన్నాడు సందీప్
"అవునా..?"
"వంగి మరీ అంతగా కష్టపడకండీ...నా కొలతలు..36-24-36..మీకు నేను నచ్చానని నాకు తెలుసు..నాకు మీలాంటి రసికుడే భర్త గా రావాలని ఎప్పుడూ ఆ దేవుడ్ని కోరుకున్నాను.." అంది సుహాస
"అయితే..దేవుడు కరునించాడా మరి..?"
"ఆ దేవుడు కరుణించాడు..ఈ దేవుడు..కరుణిస్తే, పెళ్ళి చేసుకుని..సంతోషంగా ఉంటాను.."
"సరే.." అని ఇద్దరూ నవ్వుకున్నారు..
ఎయిర్ పోర్ట్ రావడం తో..హార్న్ సౌండ్ తో ప్రస్తుతంలోకి వచ్చింది సుహాస. క్యాబ్ దిగి..దూరాన భర్తను చూసి...పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకుంది...
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
పెళ్ళానికి ప్రేమతో.. - తాత మోహనకృష్ణ
అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో..పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. అనిల్ తను ఇష్టపడిన అమ్మాయి అనన్య ను పెళ్ళి చేసుకునేది అక్కడే. ముహూర్తం టైం సమీపిస్తుంది. తాళి కట్టడం..తలంబ్రాలు.. హడావిడి అంతా అయ్యింది. దంపతులు ఇద్దరు..ఒకరిని ఒకరు చూసుకుని..ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అందం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు అనన్య ఉంది. అనిల్ చాలా అదృష్టవంతుడని..అందరూ మాట్లాడుకుంటున్నారు.
"అమ్మాయి అనన్య..! ఈరోజు రాత్రికే మీకు మొదటి రాత్రి. పూర్వం రోజుల్లో అయితే, అన్నీ చెప్పి గదిలోకి పంపించేవాళ్లం. ఇప్పుడు..ఇంటర్నెట్ వచ్చిన తర్వాత..అన్నీ ముందే తెలిసిపోతున్నాయి.." అంది అత్తగారు
"సరే..అత్తయ్య..!" అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ..రెండు చేతులతో తన ముఖాన్ని దాచే ప్రయత్నం చేసింది అనన్య..
"నేనూ, మీ మావయ్యగారు కలిసి..అలా తీర్ధ యాత్రలు చేసి వస్తాము..మీకూ కాస్త ప్రైవసీ ఉంటుంది..అబ్బాయి తో కుడా చెప్పు.."
"అలాగే అత్తయా! " అంది అనన్య..
"ఏమండీ! ఊరుకోండి..మీరు మరీను..వేలా పాలా లేదా? ఎప్పుడు చూసినా అదే ద్యాస మీకు.."
"ఏమిటి ఊరుకునేది అనన్య! పుట్టి ముప్పై సంవత్సరాలు ఊరుకునే ఉన్నాను కదా! ఇంకా ఊరుకో మంటే ఎలా ?.."
"ముప్పై సంవత్సరాలూ ...బుద్ధి మంతులు కదా మరి.."
"నిజం కాదా! కాలేజీ లో ఎంత మంది అమ్మాయిలు వెంట పడ్డా..చలించలేదు తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ రాత్రి ఊరి చివర అమ్మాయిలతో పార్టీ అంటే, ఒక్కసారి కుడా వెళ్ళలేదు తెలుసా..?"
"అంటే, నా భర్త శ్రీ రామచంద్రుడు..పేరుకు తగ్గట్టు రామ్ గారు..!"
"అవును..ముప్పై ఏళ్ళ నుంచి లోపల దాగిన ఆ విరహం...ఆ అగ్నిగుండం ఇప్పుడు కుడా బద్దలు కాకపొతే...ఎలా చెప్పు..!"
"మనకి మూడు రాత్రులు అయ్యాయి కదా..ఇంకా చల్లార లేదా స్వామి..?"
"పాతికేళ్ళకు పెళ్ళి చేసుకుని ఉంటే, ఇప్పటికి ఆ లెక్క చాలా పెద్దది గా ఉందేది కదా..ఐదు సంవత్సరాలు లేట్...అంటే ఆలోచించు..వడ్డీ తో కవర్ చెయ్యాలి..మరి!"
"అంత మాత్రానికే...రాత్రీ పగలు ఏకం చేస్తారా ఏమిటి? ఇప్పుడు టైం ఎంతో తెలుసా?" నవ్వుతూ అంది అనన్య
"ఎంతేమిటి..?" తెలియనట్టు అడిగాడు రామ్
"బెడ్ రూమ్ లో ఏసి వేసుకుని..చీకట్లో దుప్పట్లో నుంచి నన్ను పట్టుకుని పడుకుంటే, మీకు టైం ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు టైం పన్నెండు..రాత్రి కాదు...మధ్యాహ్నం. క్రికెట్ లో అయినా....ఇన్నింగ్స్ కు ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు ఒక అరగంట బ్రేక్ ఇస్తారు...మీరు మరీను..." అంది అనన్య
"నువ్వు మాత్రం ఎంజాయ్ చెయ్యట్లేదా అనన్య..పెళ్ళైన కొత్తలో అందరూ అంతే కదా!" పెళ్ళాం బుగ్గ గిల్లి అన్నాడు రామ్
"కాదు! మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్నింగ్స్ ఆడుతున్నారు..రసికులే.."
"ఇంతగా అడుగుతున్నావు కాబట్టి..ఇన్నింగ్స్ బ్రేక్..లో ఫ్రెష్ అయ్యి ఉండు..ఈలోపు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను..తినేసి..సెకండ్ ఇనింగ్స్ స్టార్ట్ చేద్దాం.."
"అలాగే లెండి..!" అని చిలిపిగా బుగ్గ గిల్లి...పక్క లోంచి లేచి..బయటకు వెళ్ళింది అనన్య..
"ఫుడ్ చాలా బాగుంది కదా అనన్య.."
"అవునండి! ఇంట్లో అత్తయ్య మావయ్య మన కోసమే, తీర్ధ యాత్రలు అని చెప్పి వెళ్లారు. ఇందాకల, అత్తయ్యగారు ఫోన్ చేసి..రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు..ఈ లోపు మీరు అడిగినవన్నీ ఇవ్వమన్నారు.."
"అత్తయ్యగారి మాట గౌరవించు..! నాకు అన్నీ ఇవ్వాలి.."
"సరే ప్రభు!..ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారా.. ఏమిటి ?"
సాయంత్రం అయ్యేసరికి అనన్య నిద్ర లేవలేదు..
"అనన్య! అనన్య! ఇక లే..అలా బయటకు వెళ్దాము. ఇంట్లో ఎంతసేపని ఉంటాము చెప్పు..!"
"ఒంట్లో అదో లాగ ఉండండి..లేవాలని లేదు.." అంది అనన్య
"అయ్యో! వొళ్ళు కాలిపోతుంది అనన్య..! పదా.. డాక్టర్ దగ్గరకు వెళ్దాము.."
"వద్దు లెండి..."
"ఐ యాం సారీ అనన్య..నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను..."
"పర్వాలేదండి..ఆమాత్రానికేనా..నేను ఏమి అనుకోలేదు..మీ ఆనందమే నా ఆనందం.."
"ఉండు.. మెడికల్ షాప్ కి వెళ్లి..కనీసం మాత్ర తెస్తాను..."
"తగ్గిపోతుంది...ఏమి అక్కర్లేదు.." అని నీరసంగా అంది అనన్య
"ప్రేమంటే..అన్నీ రకాలుగా ఉండాలి అనన్య..నాకు నువ్వంటే, చాలా ఇష్టం..నీకు ఒక ముల్లు గుచ్చుకున్నా..విల విల లాడిపోతాను.." అని కంట తడి పెట్టుకున్నాడు..
"ఏమండీ! ఎందుకు చిన్న పిల్లాడిలాగ ఏడుస్తున్నారు..నాకేమైందని..చిన్న జ్వరం..అంతే..! దేవుడికి దణ్ణం పెట్టుకుంటున్నారా?"
"నీ జ్వరం నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలని..చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే నాకు జ్వరం వస్తే, చేసేది.."
"ఏమిటండీ...మరీను.."
"ఉండు..టాబ్లెట్ తీసుకోస్తాను..అంతవరకు..పడుకో..."
"ఇదిగో..అనన్య..టాబ్లెట్.."
"అప్పుడే వచ్చేసారా...?"
"ముందు టాబ్లెట్ వేసుకో.."
"వేసుకుంటాను స్వామి! కాస్త వాటర్ అందుకోండి.."
"వేసుకుని పడుకో అనన్య ..బయట ఫుడ్ వద్దులే..నేనే వంట చేస్తాను.."
"పెళ్ళాన్ని ఇంత బాగా చూసుకునే భర్త దొరకడం నా అదృష్టం..! " అని అనుకుని పడుకుంది అనన్య
*****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
వంశీమోహనం - నాగమంజరి గుమ్మా
"మోహనా" గుసగుసగా పిలిచాడు వంశీ. "ఊఁ" పలికింది మోహన "ఇటు చూడు" కాటుక దిద్దిన వాల్చిన కనురెప్పలు పైకెత్తి సిగ్గుగా చూసింది మోహన. "అందాల వదనమ్ము అలివేణి అధరమ్ము నల్లని కనుదోయి నాకుముద్దు" ఆ మూడింటికి మూడు ముద్దులు అంటూ మోహన ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా చుంబించాడు వంశీ. "నునుపైన చెక్కిళ్ళు నువ్వు పూ నాసిక చిట్టి చుబుకముల చేతు ముద్దు" మళ్ళీ మరో మూడు ముద్దులు ఉహు నాలుగు… "లెక్క తప్పారే" "చెక్కిళ్ళు రెండు కదా" "శ్రీకారమును బోలు చెవులు రెండింటికి ముంగుర్ల కిత్తును మరొక మూడు" "ఊఁ" "కంఠ సీమ కొక్కటి కటి సీమ కొక్కటి కరములు పదములు కాచె నాల్గు" "కనుల కనిపించు అందాల కాంచినాను ముద్దు ముద్దుగా మురిపాల ముద్దులిస్తి భాను గాంచని పరువాల బయలు పరచు సఖియ దాసుడౌదు నిజము జన్మవరకు" కురులను తప్పించి మెడ వెనుక ముద్దు పెట్టాడు. మోహన అరచేతులు తన చేతులతో పట్టుకొని కనులపై ఉంచుకున్నాడు వంశీ. వంశీ ఒక్కొక్క చేష్ట ఒక్కో మెట్టుగా పరవశింపజేయగా అదిరే తన అధరాలతో వంశీ పెదవులు అందుకుంది. తేనెలూరే అధరాలు అందగానే అరచేతులు విడిచి చిక్కిన నడుమును చేత చిక్కించుకున్నాడు. "వదలరా బాబూ… ఒక్కడివే కూర్చుని నిద్రపోతున్నావని జిలేబి నోటికి పెట్టి నిద్రలేపుదామనుకుంటే నన్ను నీ దగ్గరకు లాక్కుంటావేం?" నెత్తి మీద తట్టాడు వంశీ స్నేహితుడు విశ్వం. గబుక్కున కళ్ళు తెరిచి విశ్వాన్ని వదిలేసాడు వంశీ. "మామూలుగా లేపొచ్చు కదరా… జిలేబి నోటికి ఇస్తే మోహనే అనుకున్నాను" సర్దుకుంటూ చెప్పాడు వంశీ. "సర్లే.. సంగీతం మాష్టారి అమ్మాయికి, సాహిత్యం చదువుకున్న నీ మోహనకి, రాత్రంతా పద్యాలు చెప్తూ కూర్చుంటావా ఏమిటి? ఇక్కడే వదిలేస్తే నీ బుర్రలో యతులు, ప్రాసలు, గణాలు తిరుగుతాయి కానీ అలా ఊరు చూసి వద్దాం పద. పల్లెటూరు చాలా బాగుంటుందట. నేను సాయంత్రం వెళ్లిపోతాను." బలవంతంగా వంశీని బయలుదేరదీసాడు విశ్వం. ******** మోహనను తొలిసారి నన్నయ విశ్వవిద్యాలయం లో ఒక కార్యక్రమంలో పత్ర సమర్పణకు వెళ్ళినపుడు చూసాడు వంశీ. అప్పుడు తను "నన్నయ నుండి నేటి వరకు పద్యం ప్రయాణం" అనే అంశంపై పత్రసమర్పణ కోసం వచ్చాడు. మోహన "శ్రీనాధుని కవిత్వంలో సీసపద్యం" అనే అంశంపై పత్రసమర్పణ చేసింది. మోహన తర్వాత పేరు తనది. కానీ మోహన రూపమే తప్ప, ఆమె చెప్పినదేదీ తలకు లెక్కలేదు వంశీకి. తన పత్ర సమర్పణ ఎలా చేసాడో కూడా జ్ఞాపకం లేదు. అందరివి అయ్యేవరకు అక్కడే కూర్చుని శ్రద్ధగా వింటూ, అవసరమైన విషయాలు రాసుకుంటోంది మోహన. కార్యక్రమంలో చివరి వ్యక్తి మాట్లాడడం పూర్తి కాగానే, లేచి తనవైపుకు రావడం గమనించి ఆశ్చర్యపోయాడు వంశీ. "నమస్తే అండీ, నా పేరు మోహన. ఇందాక మీరు 'నన్నయ నుంచి నేటివరకు…' పత్ర సమర్పణ చేసారు కదా, నేను మొదటి రెండు నిమిషాల విషయం సరిగా వినలేదు. మీ దగ్గర మరొక ప్రతి ఉందా? ఉంటే ఇవ్వగలరా?" పత్ర సమర్పణ అవగానే అది అక్కడి వారికి ఇచ్చేస్తారు… అందుకే మోహన "మరొక ప్రతి ఉందా?" అని అడిగింది. "అలా బయటకు వెళదాం రండి" అని చెప్పి, దారి తీసాడు వంశీ. బయట చెట్టు కింద ఉన్న బెంచీ వైపు వెళ్లి కూర్చున్నారు "నా పేరు వంశీ. నా దగ్గర వేరొక ప్రతి ఇక్కడ లేదు. నేను రాసిన విషయం ప్రతి ఒక్క అక్షరం నాకు గుర్తుంది. మీరు ఎక్కడ నుండి మొదలు పెట్టేరో చెప్పండి, నేను ఆ ముందరి ఖాళీ పూర్తిచేస్తాను" అన్నాడు వంశీ. మోహన తను రాసింది చూపించింది. ముందు వినలేకపోయిన అంశాలను వివరించాడు వంశీ. ఆకుపచ్చని లంగా జాకెట్టు, మిరపపండు రంగు వోణి, చెవులకు లోలాకులు, పొడుగాటి జడ.. మోహన… పేరుకు తగ్గట్టు మోహనంగా ఉంది. యధాలాపంగా అడిగినట్లు సాయంత్రం ఏ రైలుకు వెళ్తోందో కనుక్కున్నాడు. తాను వెళ్లే రైలే. కానీ బోగీలు వేరు. ఏదైతే ఏం? స్టేషన్ వరకు కలిసే వెళ్లారు. 'చదువు ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎం. ఏ తెలుగు మొదటి సంవత్సరం. విశాఖపట్నం పక్కనే ఉన్న పల్లెటూరులో నివాసం. తండ్రి సంగీత విద్వాంసుడు. అందుకే కూతురి పేరు మోహన. తండ్రి కీర్తనలు పాడటమే కాకుండా భావగీతాలు కూడా రచిస్తారు. ఆసక్తి గల కొద్దిమంది పిల్లలకు, పెద్దలకు ఇంట్లోనే తరగతులు నిర్వహిస్తూ ఉంటారు.' అదీ ఆ సాయంత్రం రైలు వచ్చేలోపల మోహన నుంచి సేకరించిన వివరాలు. వంశీ ప్రభుత్వ కళాశాల లో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు పద్యాలు, కథలు లాంటి సాహిత్య ప్రక్రియలు కూడా చేయడం, అవి పత్రికలకు పంపితే అచ్చుకావడం కూడా జరిగింది. మోహన రూపం, చదువు, కుటుంబ నేపధ్యం బాగా నచ్చాయి వంశీకి. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు మోహన విషయం చెప్పాడు. వాళ్ళు కూడా మరేమీ ఆలోచించకుండా వెంటనే మోహన తల్లిదండ్రులను సంప్రదించడం ఇరువర్గాలకు అంగీకారం కుదరడంతో నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడం జరిగిపోయాయి. మోహన చదువు అయ్యేవరకు పెళ్లి వద్దని వంశీ చెప్పడంతో ఆగేరు. అప్పుడప్పుడు కళాశాల గ్రంథాలయంలో కలుస్తూ ఉంటారు మోహన, వంశీ. లేదా వంశీ వాళ్ళింటికి మోహన, మోహన ఇంటికి వంశీ వచ్చిపోతూ ఉంటారు. అభిప్రాయాలు తెలుసుకోకుండా, అపరిచితుల్లా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు వంశీకి. అందుకే పెద్దలచే కుదర్చబడిన ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దవారి అనుమతి తోనే సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు. మొత్తానికి మోహన చదువుకు ఆటంకం లేకుండా మంచి మార్కులతో పాసయింది. ఆ నెలలోనే పెళ్లి ముహూర్తం కుదిరింది. మోహన అందం ఎంత కవ్విస్తున్నా, మనసును అదుపులో పెట్టుకొని, ఆ రోజు కోసమే ఎదురు చూసాడు వంశీ. ముందు రోజు రాత్రి ఏడు గంటలకు వంశీ మోహనులకు పెళ్లి అయ్యింది. ఈ రాత్రికే శుభకార్యం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అటు ఇటు తిరిగి అలసిపోయిన కొత్త జంట భోజనాలయ్యాక ఎవరింట్లో వారు హాయిగా సాయంత్రం వరకు నిద్రపోయారు. ఇంతలో పెళ్లికి వచ్చిన స్నేహితుడు విశ్వం వచ్చి వంశీని నిద్రలేపేసాడు. అనుకున్న సమయానికి పెద్దలందరూ చేరి, మోహన, వంశీలతో పూబంతులాట ఆడించారు. కొన్ని నాణాలు వంశీ చేతిలో పోసి, గుప్పెట నిండా తియ్యమని అవి సరి సంఖ్యలో ఉన్నాయో, బేసి సంఖ్యలో ఉన్నాయో మోహనతో చెప్పించారు. మోహన కొంగులో పువ్వులు, ద్రాక్షపళ్ళు పోసి, మోహన దోసిటిలో తీసుకున్నది పండో పువ్వో వంశీతో చెప్పించారు. ఇంకా ఏవో అనేక ఆటలు ఆడించి, దంపతులకు తాంబూలాలిప్పించి, వారిలో బెరుకు పోగొట్టి, గదిలో పాలు, పళ్ళు పెట్టి బయటకు వచ్చి తలుపేశారు. తనుకూడా లోపల గడియ పెట్టి, మోహన వైపు చూసాడు వంశీ. పాలకడలిలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లా ఉంది మోహన. తెల్లని చీరలో మెరిసిపోతోంది. మెడలో పచ్చగా తాళిబొట్టు, నల్లపూసలు, ఒక హారం. చెవులకు లోలాకులు, చేతులకు పెళ్లిగాజులు, తలనిండా పూలు. పెళ్లిలో వేసిన నగలు, అలంకారాలు లేవు. నిత్యం పలకరించుకునేవారే అయినా ఎందుకో మూగబోతున్నట్లుగా ఉంది. చల్లని వాతావరణం వేడెక్కిస్తోంది వంశీని. "మోహనా" పిలిచాడు వంశీ. "ఊఁ" ఆ పలకడంలో తానాశించిన మాధుర్యమో, నిత్యమూ వినే స్వరమో లేదు… సంకోచం, బిడియం కనబడుతున్నాయి. తొలిరేయి సిగ్గు అనుకున్నాడు. మోహన చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. ఎన్నోసార్లు సినిమాకి వెళ్ళినపుడు, గ్రంథాలయంలో మాట్లాడుకునేటపుడు కూడా అలా మోహన చేయి తన చేతిలోకి తీసుకునేవాడు వంశీ. కానీ ఇప్పుడు మోహన చేయి కంపిస్తోంది. అంత శీతల వాతావరణం లో కూడా చిరు చెమటలు పట్టాయి మోహన నుదుటిపైన. "మోహనా, కూర్చో.. ఇదిగో పాలు తాగు" గోరువెచ్చని పాలు మోహన నోటికి అందించాడు. కొంచెం తాగి పక్కన పెట్టేసింది మోహన. "మోహనా! ఏమైనా ఇబ్బందిగా ఉందా? మీ అమ్మగారిని పిలవనా?" అడిగాడు వంశీ. తల అడ్డంగా ఊపింది. "మరి? తలనొప్పిగా ఉందా?" "ఉహూ… భయంగా ఉంది" చెప్పింది మోహన. ఆశ్చర్యపోయాడు వంశీ. "నా దగ్గర భయంగా ఉందా?" "ఉహు.." "రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నాం కదా… ఇప్పుడెందుకు భయం?" "ఏమో" "సరే! పడుకుంటావా?" "ఊఁ" "నిన్ను ముట్టుకోవచ్చా? దానికి కూడా భయమేస్తుందా?" గుసగుసగా అడిగాడు వంశీ. తల వంచుకునే తలూపింది మోహన. దగ్గరగా పొదువుకున్నట్లు పట్టుకొని మంచం దగ్గరకు తీసుకువచ్చి, ఒక్క ఉదుటన నడుం కింద ఒక చేయి పెట్టి, పైకి లేపి మంచంపై పడుకోపెట్టేసాడు. ఎగిరిపడి గుండెల మీద చేయి వేసుకుంది మోహన. నవ్వేసాడు వంశీ. "పిచ్చీ … పడుకో" అన్నాడు. పక్కనే పడుకుని ముంగురులు సవరించాడు. పెదవులపై మీటాడు. పెదవులు వణుకుతున్నాయి. గోరింటతో ఎర్రగా పండిన వేళ్ళను ముద్దాడాడు. ఎటువంటి స్పందనా కనిపించలేదు మోహనలో. వంశీవైపు తిరిగి కళ్ళుమూసుకుని ఉంది. లేచి పారాణి పాదాల వైపు చూసాడు. పచ్చగా పసుపు రాసిన పాదాలు, అంచులకు పారాణి పైన సన్నని పట్టీలు, ఆపై పూల అంచు గల తెల్లని చీర… తమకం ఆపుకోలేక పాదాలపై ముద్దు పెట్టాడు. పాదాలు వెనక్కు తీసుకుంది మోహన… చిన్నగా నిట్టూర్చి, మళ్ళీ మోహన పక్కన మేను వాల్చాడు. నడుంపై చేయివేసి దగ్గరకు లాక్కుని హత్తుకుని పడుకున్నాడు. అడ్డుచెప్పలేదు మోహన. మర్నాడు అందరూ కలిసి విశాఖపట్నం వెళ్లిపోయారు. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నారు. ఆ రాత్రి కూడా అలాగే గడిచిపోయింది. మూడవనాడు మళ్ళీ అందరూ యానాళ్లకు మోహన పుట్టింటికి వచ్చారు. సాయంత్రం ఏదో పని ఉందని మోహన, వంశీ ఇద్దరూ విశాఖపట్నం వచ్చారు. హఠాత్తుగా మబ్బులు పట్టి వేసవికాల వర్షం మొదలైంది. వంశీ కుటుంబం అంతా పల్లె లోనూ, వీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వర్షం కారణంగా రాలేకపోతున్నామని, వారందరినీ మర్నాడు ఉదయం రమ్మని, కంగారు పడవద్దని, ఇంటికి చేరుకున్నామని చెప్పాడు వంశీ. వరండాలో వర్షాన్ని చూస్తూ కూర్చున్నాడు వంశీ. మోహన వంటింట్లోకి వెళ్లింది. వంశీ వెనకాలే వచ్చి, నడుంపట్టుకుని, ఒక చేత్తో నోరు మూసి, గోడకి అదిమిపెట్టాడు. మోహన తోసేయబోతూ ఉంటే, తన పాదాలతో మోహన పాదాలు నొక్కిపెట్టాడు. ఆధారాలు అందుకోబోతూ ఉండగా ఎలాగో చేయి తప్పించి వంశీని ఒక్క ఉదుటన తోసేసింది. స్టౌ అరుగు మీద ఉన్న నీళ్ల గిన్నె కిందపడి పెద్దగా చప్పుడయ్యింది. "ఏమిటయ్యింది మోహనా?" అంటూ లోపలికి వచ్చాడు వంశీ. "అబ్బే ఏమి లేదు. చేయి తగిలి గిన్నె కిందపడింది. అంది మోహన. తెప్పరిల్లి, ఇంకా ఆలస్యం చేయకూడదని, ఊహలు నిజమయ్యే ప్రమాదం ఉందని గ్రహించింది మోహన. గబగబా బజ్జీలు వేసి వేడిగా తీసుకువచ్చి వంశీకి అందించింది. "పాటలు వింటూ, బజ్జీలు తింటూ, వర్షాన్ని చూస్తుంటే బావుంది కదూ" అన్నాడు వంశీ. వర్షం వలన తొందరగా చీకటైపోయినట్లు అనిపించింది. లోపలకి వెళ్లి, వంట చేసి వంశీని పిలిచింది మోహన. వంశీ, మోహన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వంట చాలా బాగా చేసింది మోహన. కాసేపు మళ్ళీ వర్షాన్ని చూస్తూ కూర్చున్నారు. దాదాపు నాలుగు గంటలు కురిసింది.. ఇప్పుడు జల్లుగా మారింది. ఏవేవో మాటలు… మధ్యలో మౌనాలు… బాగా తిన్నాడేమో వంశీకి ఆవలింతలు వస్తున్నాయి. లేచి గదిలోకి నడిచాడు. పక్కపై వాలబోతుంటే మోహన స్నానాల గది వైపు చూపించింది. "ఇప్పుడా" అన్నాడు వంశీ… "తప్పదు" అంది మోహన. తువ్వాలు భుజంపై వేసి, స్నానాలగదిలోకి నెట్టింది. "బట్టలు బయటే పెట్టాను. వచ్చి కట్టుకోండి" అని చెప్పి, గదిలో గబగబా సర్ది, వేరే గదిలోని స్నానాల గదిలోకి స్నానానికి వెళ్ళింది మోహన. స్నానం చేసి వచ్చి గదిలో చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. మంచంపై తెల్ల దుప్పటి. పక్కనే బల్లమీద తమలపాకు చిలకలు, పళ్ళు, పాలు… "అబ్బో!" అనుకున్నాడు. ఇంతలో మోహన తెల్లచీరలో వచ్చింది. "ఏయ్ ఏమిటిది?" అన్నాడు ఉత్సుకతగా…. "భయం పోయిందా?" "ఊఁ, కానీ భయం కాదు… అప్పుడు అందరిలో సిగ్గు… అలా చెప్తే మీరు వదలరు. అందుకే భయం అన్నాను" "అమ్మదొంగా" "ఊఁ" అరచేతులతో ముఖం కప్పుకుంది మోహన. "నాకు వేడిగా ఉంది" అన్నాడు వంశీ. "అదేంటి ఏసీ ఇంకా చాలలేదా?" గబుక్కున చేతులు ముఖం మీద నుండి తీస్తూ అడిగింది మోహన. "గదిలో వేడి కాదు, గుండెల్లో వేడి" మోహన చేయి పట్టుకుని, తన గుండెల మీద ఉంచుకొని చెప్పాడు. ఇద్దరూ కలిసి మంచంవైపు నడిచారు. పాలు పంచుకున్నారు. పండు కొరికి ఇచ్చాడు వంశీ. తానో ముక్క కొరికింది మోహన. తమలపాకు చిలక చిటికెన వేలితో అందించింది. నగుమోము చూడ ముద్దౌ మగనికి తమలపు చిలుకలు మడువగ ముద్దౌ సొగసులు పరువగ ముద్దౌ మగటిమి చూడ తొలిరేయి మగువకు ముద్దౌ గుసగుసగా వంశీ చెవిలో చెప్పింది మోహన.. "అమ్మో గడుసు పిల్లా… నన్నే మించిపోయావే" అలాగే మోము పట్టుకుని పెదవులు అందుకున్నాడు. తమకపు టధరాలు ఒక్కటయ్యాయి. వంశీ వేళ్ళు మోహన జుట్టు కుదుళ్లను పట్టుకున్నాయి… మోహన గోళ్లు వంశీ వీపుపై నెలవంకలు చిత్రించాయి. వంశీ లాల్చీ, మోహన చీర ఎలా వేరుపడ్డాయో తెలీదు. వంశీ మోహన అధరాలు వదలి నుదురు, నాసిక, చెక్కిళ్ళు ఇలా వరుసగా ముద్రలు వేస్తూ వస్తున్నాడు. పరువాలు బిగుసుకుంటున్నాయి. మోహన తనువు సుమధనువు అయ్యింది. వంశీ వేళ్ళు మోహన నడుం పై నాట్యం చేసాయి. మోహన కళ్ళు అరమోడ్పులయ్యాయి. నాభిలో మాణిక్యాన్ని నాలుకతో అందుకున్నాడు వంశీ. ఒళ్ళంతా వయ్యారి కోట అయ్యింది. మరి కొంచెం కిందకి జరిగాడు వంశీ… మోహన గొంతులో కలకూజితాలకు బయటి నుంచి కోకిల బదులుగా కూసింది. వంశీ శిఖరాగ్రాలకు, పాతాళానికి ఒకేసారి ముప్పేట దాడి జరిపాడు. కాసేపటికి ముందు వెనుకలుగా ఇద్దరినీ విజయం వరించింది. పానుపుకు వసంతాభిషేకం జరిగింది. రాత్రి వానకి తడిసిన మొక్కలు ఉదయాన్నే తాజాగా సుమబాలల నందిస్తే, తుమ్మెదలు మోహనరాగంలో వంశీరవాన్ని ఆలపిస్తూ పదే పదే తేనెలు గ్రోలుతూ పూల చుట్టూ తిరుగుతున్నాయి. ****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
సుభద్రార్జునీయం - Bodapati Ramesh
“సుభద్రా...సుభద్రా” తలుపు తడుతున్నాడు అర్జునరావు.
‘ఆ..ఆ..వస్తున్నా’ అన్న మాటలు వినబడటం తప్ప ఎవరూ తలుపు తీసే ప్రయత్నం కనిపించకపోవటంతో అర్జునరావు కోపం ఎక్కువై తలుపు తట్టే ప్రయత్నం ఉధృతం చేసి, అది తలుపు తీసిఎదుట నిలబడ్డ కూతురు మీదుగా ప్రయాణం చేసి వంటింటి దిశగా సాగిపోయింది.
“ఇంట్లో వాళ్ళంతా ఏమయ్యారు చేతులు పడిపోయేట్లు తలుపులు బాదుతున్నా ఎవరు వినిపించుకోలేదు. మీ అమ్మేది? సర్లే ఒక గ్లాసు మంచినీళ్లు నా ముఖాన కొట్టు.అసలే గొంతు
తడారిపోయింది “అంటూ చివాట్ల వర్షం కురిపించింది అతని కోపం.
“ఏమిటండీ ఆ గావు కేకలు” అంటూ అతని భార్య సుభద్ర చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ “నువ్వు మంచి నీళ్ళు తీసుకురావే” అని కూతుర్ని పురమాయించింది.
“మీరొచ్చే ముందే స్నానానికి వెళ్ళాను. స్నానాల గదిలోకి మీరు చేసే హడావుడి వినిపించింది. అమ్మాయి సరిగా వినిపించుకోలేదు.నేను కసురుకునేసరికి తలుపు తీసింది”అంటూ స్నానానికి వెళ్ళే ముందు ముడి పెట్టుకున్న జడను విప్పింది.
జడ కోసలు నీళ్ళల్లో తడిసినట్లున్నాయి. ఆ నీటిబొట్లు చింది అప్పుడే తండ్రికి ఇవ్వటానికి కూతురు తీసుకొచ్చిన నీళ్ళ గ్లాసులో పడటంతో అర్జునరావు చికాకు ఇంకా ఎక్కువయింది.
“ఊ... ఏంటా అర్ధం లేని పనులు ఆ సబ్బు నీళ్ళన్ని మంచి నీళ్ళ గ్లాసులో పడ్డాయి. ఛీ ఛీ ఈ ఇంట్లో మంచి నీళ్ళు తాగే ప్రాప్తం కూడాలేదు”అంటూ ఆ నీళ్ళగ్లాసును విసిరి నేల మీద కొట్టి అవతలికి వెళ్లిపోయాడు.అమ్మాయి కూడా బిక్క ముఖం వేసి, అంత కంటే ఏం చేయాలో తెలియక నిలబడిపోయింది.
బట్టలు మార్చుకుని ముందుగదిలో ఈజిచైర్లో స్థిమితపడ్డ అర్జునరావు వద్దకు బార్య మంచి నీళ్ళు, కాఫీ తీసుకు వచ్చింది.అవి రెండు అందుకుంటూనే,
“ఇవేమ్ బట్టలు .మొగుడు ఆఫీసు నుండి వచ్చేసరికి కళకళలాడుతూ కాఫీ గ్లాసుతో ఎదురు
రావాలి “అన్నాడు కాస్త చిరునవ్వు చిందిస్తూ.
“నేను అటువంటి షోకులు వెలగబెట్టే రకం కాదు”.
ఈసారి చికాకు పడటం ఆమె వంతయింది
“ఇంటికి రాగానే ఆవిలేవు ఇవి లేవు అంటూ పంచాంగం మొదలు పెడతావు.అసలు ఇంటికి రావతమే బుద్ధి తక్కువ అనిపిస్తోంది.”
దానికి ఘాటయిన సమాధానం ఇవ్వగలిగినా ఆ సమయం లో అతనిని రెట్టించలేక ఖాళీ గ్లాసును తీసుకుని అవతలికి వెళ్లిపోయిందామె.శారీరకంగా అవతలికి వెళ్ళిపోయినా వంట చేస్తున్న సుభద్ర ఆలోచనలు తన భర్త చుట్టూ తిరుగుతున్నాయి.
అతని సంపాదనను బట్టి చూస్తే మధ్య తరగతి కుటుంబం అని చెప్పవచ్చు.ఆమెకు ఉద్యోగానికి కావలసిన అర్హతలున్నాఅతనితో వివాహమైన సంవత్సరానికే అమ్మాయి పుట్టటంతో ఆ ఆలోచనకు అంతరాయం ఏర్పడి మరి రెండేళ్లకు అబ్బాయి పుట్టటంతో ఆమెను సాధారణ గృహిణిగా స్థిరపరిచింది.దేశ కాల ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా అంతటితో ఆపేసి అతను ఇంక్రిమెంట్ కూడా పుచ్చుకున్నాడు..
అర్జునరావు స్వతహాగా మంచివాడే నని ఆమె అభిప్రాయం. అందుకు విరుద్ధంగా ఆలోచించటానికి ఆమెకు ఎటువంటి దాఖలాలు కనిపించవు..దుర్వ్యసనాలు లేని మనిషి. ఉన్నది ఒకటే వ్యసనం, చిరు కోపం.అయితే అది తాటాకు మంట వంటిది. కానీ అతని చిరుకోపం అవతలి వారి హృదయం లో రెల్లు గడ్డిలా రాజుకుంటుందని అతనికి తెలియదు.అన్నీ తాను అనుకున్నట్లుగానే జరగాలనుకుంటాడు.సాధాసాధ్యాలు అతనికి అనవసరం. అది అతని మనస్తత్వం అని మొదట్లో సరిపెట్టుకున్నా పెరుగుతున్న వయసు ఆమెలో చిరాకు పెంచుతోంది.అర్జునరావుకు చిరు కోపం అని ఆమె గ్రహించే సంఘటన పెళ్ళయిన మొదట్లోనే జరిగింది.
పెళ్ళయిన తర్వాత చాలా రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని, అదీ కాక అర్జునరావుకు శలవు కూడా ఎక్కువ రోజులు లేకపోవటంతో మూడు నిద్రలలోనే ఆ కాస్త’ అడ్డు’ కూడా తొలగించేయాలని ఇరువైపు పెద్దలు నిర్ణయించారు.’ ఇప్పుడే ఎందుకు’ అని అర్జునరావు సణిగినా ఎవరూ ఖాతరు చేయలేదు.
ఎన్ని సినిమాలు చూసినా , ఎన్ని పుస్తకాల్లో చదివినా మొదటి రాత్రి ప్రస్తావన వస్తే మగవారు మురిసిపోవటం ,మగువలు ముడుచుకుపోవటం కద్దు. ఈ ముహూర్తాలు అట్టహాసం నాన్సెన్స్ చాదస్తం అంటూ కొంతమంది ఎగతాళి చేసినా ఆన్ని అనుకూలంగా ఉన్న ముహూర్తంలో వీరిద్దరిని ఒకటి చేస్తే ముందుముందు వీరి సంసారం సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. అయితే పెద్దలు అనుకున్నట్లుగా ఆ రోజు జరుగుతుందా లేదా అనేది మర్నాడు పరిశీలనలో గాని తెలీదు.
తను ఆరోజు పగలంతా పెళ్ళికి వచ్చిన బంధువులతో కాలక్షేపం చేసింది. తనకు ముందుగా తెలియకపోయినా కర్ణాకర్ణిగా విషయం గ్రహించింది..” ఇంకాసేపయితే మేం నీకుకనబడమ్ మరదలు పిల్లా” అంటూ ఒక వదిన గారు,” అన్నగారిని ఎలా ఆకట్టుకుంటావో” అని ఆరాటపడే ఒక మరదలు లాంటి చిలిపి కబుర్లతో మధ్యాన్న భోజనాలు పూర్తయినాయి.
ఇంకా కబుర్లు కొనసాగటంతో ఒక పెద్దావిడ “ఏమర్రా సుభద్రను ఇంకా వదిలేయ్యండి. పగలు కొంతసేపు నిద్ర పోనియ్యండి. రాత్రికి నిద్ర ఉంటుందో ఉండదో” అంటూ మూసిమూసినవ్వుల సలహా ఇచ్చింది.
“పో మామ్మా” అంటూ తను సిగ్గు పడింది.
“ఇప్పట్నుంచే పొమ్మంటావేమిటే భడవాఖానా “అంటూ ఆవిడ తన బుగ్గలు సాగతీసి భుజం మీద చరిచింది.
అందరూ గలగలా నవ్వుకున్నారు.
సాయంత్రమయ్యింది.పెద్దగా అలంకారాలు లేకపోయినా తనను ఆరోజు అందంగానే తయారు చేసారనే దానికంటే ఉన్న అందానికి మెరుగులు దిద్దారని చెప్పవచ్చు.
రాత్రి భోజనాలు కూడా పూర్తయినాయి”వదినా పాలగ్లాస్ రెడీ” అంటూ ఎదురొచ్చింది ఆడపడుచు.
“మరిది గార్ని జాగ్రత్తగా చూసుకో” అంటూ సలహా ఇక్కింది పెద్దక్క
వీటన్నిటికి తన చిరునవ్వే సమాధానం.
మార్చి నెలే అయినా పగలు ఎండ ఎక్కువగా రాత్రికి వాతావరణం చల్లబడుతోంది.ముందు గదిలో హడావుడి మొదలయింది.వీరికి పడక అక్కడ ఏర్పాటు చేశారు.
ఆ ఏర్పాట్లు భర్త తనిఖీ చేసినట్లున్నాడు. “అబ్బే ఇవేమీ బాగా లేదు “అంటూ తన అభిప్రాయం చెప్పేశాడు.
అల్లుడితో ఇంకా చనువు లేకపోవటంతో నాన్నగారు కంగారు పడుతూనే కారణం అడిగారు.
“ముందు గదిలో ఏమిటండీ అసహ్యంగా దీనికి ఫాన్ కూడా లేదు. కిటికీలు తేరీస్తే రొద్దంటా కనిపిస్తుంది. మూసేస్తే ఊపిరాడదు”.
“ఫాను తెప్పిస్తాను” అంటున్నారు నాన్న.
ఇవన్నీ అవతల గదిలో కూర్చున్న తనకు వినిపిస్తూనే ఉన్నాయి.
“లాభం లేదండీ .ఇంకెక్కడైనా ఏర్పాటు చేయండి” అని తెగేసి చెప్పాడు
మళ్ళీ ఇంట్లో పెద్దలంతా సమావేశమయ్యి మధ్య గదిలోకి పడకను మార్చారు. ఆ గదిలో సీలింగ్ ఫాను కూడా ఉండటంతో తన భర్త సరే అన్నట్టున్నాడు.
ఇదంతా గమనిస్తున్న ఒక బంధువు” ఏమే సుభద్రా మీ ఆయన గట్టి వాడే సుమా”అంటూ సర్టిఫికేట్ ఇచ్చింది.
“ మాట గట్టిదయితే సుఖమేముంది. మాటతో పాటు ...” ఇంకొకావిడ కిసుక్కుమంది.
తను కొరకొరా చూడటంతో అందరూ సర్దుకున్నారు.
ఇవన్నీ చూసిన తనకు భర్త అంటే ఏర్పడి కాపురాని కొచ్చిన తర్వాత బలపడింది.
“ఏం చేస్తున్నావ్ అన్న భర్త పిలుపుతో ఊహాలోకం నుండి వాస్తవం లోకి వచ్చింది.
“ఏమిటంత దీర్ఘంగా వంట ముందేసుకుని ఆలోచిస్తున్నావు. ఆ గిన్నెలో కూర మాడిపోయి కంపు వాకిట్లోకి వస్తోంది”. అన్నాడు అర్జునరావ్.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
ఆసలే చిరాకుగా ఉందేమో” తినే వస్తువుని కంపు కొడుతోందని ఎవరూ అనరు” అన్నది.
“చాలే నాకు చెప్పొచ్చావు అధ్వాన్నంగా ఉంటే తినే దాన్నయినా అట్లాగే అంటారు.” అంటూ విసురుగా అవతలికి వెళ్లిపోయాడు.
ఆమెకు కళ్లనీళ్ళ పర్యమతమైంది.
ఆ రాత్రి వాళ్ళంతా అశాంతిగానే భోంచేశారు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ, పెద్దలు చురచురలాడుతూను.
పిల్లలిద్దరూ పుస్తకాలు తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.
సుభద్ర తమ పడకగదిలోకి అడుగు పెట్టేసరికి అర్జునరావ్ మామగారు కొనిచ్చిన మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఇటువంటి సమయం లో అతను ప్రశాంతంగా చిరు నవ్వులు చిందిస్తూ ఉంటాడని ఆమెకు భర్త వైఖరి సుపరిచితమే.
“ఇప్పుడా రావటం” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు.
“ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు. అయినా కళ్ళు కాయలు కాశాయా ఏమిటి?”.
“ఇట్లా దగ్గరకొచ్చి చూస్తే తెలుస్తుంది”.
అతను భార్యను దగ్గరకు తీసుకున్నాడు.
ఆమె కూడా కొంచం చలించినా, తమాయించుకుని “నేనొకటి అడుగుతాను ఏమి అనుకోకండేం.” అన్నది.
“ముందు...”
అతని కళ్ళల్లో కోరికల జీరలు
“నేను చెప్పేది వినండి.”
“ఊ. ఏమిటో తొందరగా కానీ” చిరునవ్వు వెనక చిరాకు.
“అదే నేనడిగేది మీతో ఏదయినా చెబుదామంటే చిర్రుబుర్రులాడతారు.అందుకనే మీరంటే నాకు భయం.
“ఇక అయిపోయినట్లేనా?”
ఆమె శరీరం మీద అతని చేతుల ప్రయాణం
ఆమెలో స్పందన శూన్యం.ప్రయాణం ఆగిపోయింది.
“ఎందుకట్లా చిరాకుగా ఉంటారు. అది ఎంతమందికి మనస్తాపం కలిగిస్తుందో ఒక్క క్షణం ఊహించండి.ప్రతి చిన్న విషయానికి కసురుకుంటారు.దానితో మన పిల్లలకి వారి వయసుతోపాటు మీమీద భయం కూడా పెరుగుతోంది. అది కొన్నాళ్లు పోతే ఏవగింపుగా మారి మీరంటే అగౌరవం ఏర్పడుతుంది.మీకు వాళ్ళకు మధ్య అగాధం ఏర్పడి నేను సతమతమవ్వాలి.ఎదిగే పిల్లలున్న మన ఇంట్లో ప్రతి చిన్న విషయానికి మీరు కల్పించుకోవటం ,కసురుకోవటం తగ్గించాలి.తగ్గించటం కాదు.పూర్తిగా మానేయాలి.నాకు వయసుతో పాటు అనారోగ్యం వస్తోంది.మీరు చెప్పినట్లుగా, మీకు నచ్చేటట్లుగా చేయాలంటే ప్రతిసారీ కుదరకపోవచ్చు.పిల్లలకు కూడా ఇది వ్యక్తిత్వం ఏర్పడే వయసు. అటువంటప్పుడు మనం వాళ్ళకు స్వేచ్చ ఇవ్వాలి.అలా అని మనం వాళ్ళని గాలికి వదిలేయకూడదు.”
ఆమె తన ఉపన్యాస ధోరణిని ఆపి భర్త ముఖం లోకి చూసింది.అతని ముఖం లో చిరాకు కనిపించటం లేదు.చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండటంతో” నేను చెప్పేదేమిటంటే” .
“కోపగించుకోవటం మానేయాలి. చికాకు పడకూడదు.పోనీ ఒక పని చేస్తావేమిటి”అన్నాడు అర్జునరావ్ ఆమె ఉపన్యాసానికి అడ్డుకట్ట వేసి.
సుభద్ర ఏమిటన్నట్లు చూసింది.
“వంటల్లో ఉప్పు, కారం,పులుపు తగ్గించు పరమసాత్త్వికంగా తయారవుతాను. అన్నీ సర్దుకుంటాయి “అంటూ నవ్వేశాడు.
(నవ్వాలి మరి. ఆ వాతావరణం అలాంటిది)
“అదిగో అదే వద్దనేది.అదేమిటి.నాకు కోపం రాకూడదని నువ్వు కోపం తెచ్చుకుంటావేమిటి?”
“ఏమిటో మీ అలవాట్లు నాకు అబ్బుతున్నాయి.ఏడడుగుల సావాస దోషం. ఇన్ని సంవత్సరాల సంసార దోషం ఆమె కూడా భర్త నవ్వులో శృతి కలిపింది.
“తొందరగా తెల్లవారితే బాగుండును “అన్నాడతను, దిగాలుగా ముఖం పెట్టి.
ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది
“ ఇవాళ ఉపన్యాసాలతోనే తెల్లారిపోయేట్లుంది. ఒక పని చెయ్యి. ఏదయినా పురాణ కధలు చెప్పు. జాగారం చేసిన పుణ్యం దక్కుతుంది.సర్లే పడుకో”.
“అంతే లెండి. నా అవసరం మాటలు చెప్పటానికి పనికిరాదు. ముందే చెబుతున్నాను. మీరు మీ పద్ధతులు మార్చుకుంటేనే.....”
“సర్లే అట్లా అంటే కుదరదు. కొన్నాళ్లు చూడు. అంతే గాని నోటీసయినా
ఇవ్వకుండా...... “బుంగమూతి పెట్టేశాడు.
ఆమె భర్తకు దగ్గరగా జరిగింది.
గదిలో నశ్శబ్ధమ్ మారుమోగుతోంది.ఎక్కడినుంచో వార్తలు వినిపిస్తున్నాయి
‘ఇరు పక్షాలవారు తమ సమస్యల్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి’
@@
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,930
Threads: 167
Likes Received: 12,564 in 2,461 posts
Likes Given: 8,318
Joined: Nov 2018
Reputation:
864
అందె ఉంగరం - శశికళ ఓలేటి
వెంకటి చెప్పిన కధలు:-
ఒకప్పుడు ఆ సాయంసంజలను గోధూళివేళ అనేవారేమో కానీ ఇప్పుడు మాత్రం... ఆవులమట్టెలతో కాకుండా ఇసుక, సిమెంట్ తోలే లారీలూ, పోక్లెయినర్లు తవ్వి, పైకి చిమ్మే మట్టితో ధూళిధూసర వర్ణంలోకి చేరుకున్న సాయంధూళి వేళది.పొద్దుగూకడంతో...మూటాముల్లె సర్దుకుని పనివారంతా... ఒకరూ ఒకరూ నిష్క్రమించడంతో.... నిర్మానుష్యమై సామ్రాజ్యాన్ని కోల్పోయిన చక్రవర్తిలా మౌనంగా, బెంగగా నిలుచుండి పోయాయి నిర్మాణంలో ఉన్న ఆ ఆకాశహర్మ్యాలు! వాటికి తోడుగా నిలుచున్న భారీక్రేన్లతో పాటూ.... ఆ కట్టడాలకు వెనకాల సరుగుడు గడంచీల మీద కూర్చుని మంచి వయసులో ఉన్న ఒకజంట కూడా ఉంది. వాళ్ళు రాములప్పాయి, హరప్పడూ!
" నేనడిగింది ఏంచేసావ్? "....రాములు మొహమాటంగా అడిగింది!
" కళ్ళుమూసుకో యేస్ ఓపాలి! ఈ గుంటకన్నీ తొందరే".... అంటూ ముద్దుగా విసుక్కుంటూ... సిమెంట్ బస్తాల వెనక దాచిన బేగ్ పట్టుకునొచ్చాడు హరప్పడు!
దాంట్లోంచి ఒక్కటొక్కటిగా వస్తువులు బయటకు తీసి..." ఈపాలి కళ్ళు తెరువు రామూ..." అన్నాడు!
కళ్ళు తెరిచిచూసిన రాములుకు ... ఆ సంధ్యకాంతుల్లో ప్రతిఫలిస్తున్న ఆ స్వర్ణకాంతులకు మనసు ఉప్పొంగిపోయింది.
ఆనందంతో హరప్పడిని కౌగిలించుకుని..." ఏటిది హరీ! నేనడిగిందేటి? నువ్వు తెచ్చిందేటి? ".... అంటూ గోముగా కోప్పడింది!
" మరందుకేనేస్ ఇన్నిదినాలు పట్టినాది! నచ్చినాయా లేదా సెప్పేస్! " అంటూ తొందరచేసాడు హరి.
" ఇయిగో... ఈ లోలాకులు, బుట్టలూ మన బేబీకి. ఈ తాళిబొట్టూ-నాను సెయినూ.... మనిద్దరం ముడెట్టుకోడానికి. పైనల్ గా ఇంగో నువ్వడిగిన అందె ఉంగరం. అంత మోజేటే బాబూ నీకు ఆ అందుంగరం అంటే! షాపాడి సేత వంద ఉంగరాలు తీయించి ఇది సెలక్ట్ చేసినా! సూడు... సిమ్మాద్రప్పన్న కొండనాగా పైకంటా వొంపు తిరిగి... కొండమీన దేవుడల్లే ఈ కెంపుపొడి సివరన! "..... గొప్ప భావకతతో హరి చెప్తుంటే.... అబ్బురంగా చూస్తూ బుగ్గమీద ఒక ముద్రేసింది రావులు!
తన చీరకొంగు చివర్న ముడేసిన ఉంగరం బయటకు తీసింది రావులు! హరివేపుకు చెయ్యి జాపి..." అరప్పడూ... ఇంకో నీకోసమిది. ఎంకన్నబాబు ఉంగరం!"!
" సానా బావుందే! డబ్బెక్కడిది పిల్లా నీకు. మొన్ననే కదా... బేబీ వొయిద్యానికి బోల్డు కర్చు పెట్టీసినావు గదా...!" అన్నాడు హరి.
" నీకెందుకేస్ నానెలా తెచ్చానో! మా శోభమ్మగారి పెనివిటికోసం కొన్నారంట. అయ్యగారికి పట్టలేదని నాకమ్మీసినారు. నెలానెలా జీతం పట్టీసుకోమన్నా" ... చిరుకోపంతో రావులు మొహం ముడుచుకుంది!
" బంగారం కుదిరిన నాడే మంచి టయామని మా అమ్మ సెప్పేది. నడు! ఉంగరాలు మార్చీసుకుందారి! ".... అంటూ రావుల్ని తొందరచేసాడు హరప్పడు!
ఇద్దరి ఆకారాలనూ పరకాయించి చూసింది రావులు! సిమెంట్ పనికి మట్టికొట్టుకుపోయిన పొడుగులాగూ, చొక్కాతో అతనూ... నాలుగిళ్ళ పాచిపనులు చేసొచ్చి నలిగిపోయిన కాటన్ చీరలో తనూ!
కళ్ళలో సన్నటి నీటిపొర! " ఏటిది హరీ! మన జీయితాలు ఇంకొప్పుడూ ఇంతేనా! పనిచేసే ఇళ్ళల్లో పాపగార్ల పెళ్ళిళ్ళు చూసినపుడు నాకు చక్కగా మనువుచేసుకోలని వుండేది. ఇలాటి అందె ఉంగరం పెట్టించుకోలని చాలా కోరిక! మా యమ్మ దొంగదాయి... నాకు పదేనేల్లు..అప్పుడు! ఆల్ల తమ్ముడికిచ్చి... పోలాలమ్మ గుడిముందు తాళిబొట్టు కట్టించీసింది. ఆడు కాల్సుకుతినీసినాడు నాలుగేళ్ళు. బేబీ పుట్టాకా లారీలో పోయినోడు మరి రానేదు. ఎవతినో లేపుకుని పోయాడని క్లీనరు రాజుగాడు సెప్పినదాకా మాకు ఆడి అయిపే లేదు! బేబీకి పదమూడేళ్ళు ఉప్పుడు. ఆడు సచ్చినట్టే నాకు! ....
రాములప్పయి ఏడిస్తే విలవిలలాడిపోతాడు హరప్పడు! " ఊరుకోయేస్! నాకు మాత్రం వొవరున్నారు? మా మవయ్య లారీ ఎక్కించి ఈ వూరు తెచ్చీటప్పుడు నావొయిసు పదారేళ్ళు. ఆయనతో పాటూ తాపీపనులకెళ్ళి... పదేసి ప్లోరులు గడంచీలెక్కి ప్లాస్టరింగులూ, పెయింటింగులూ...చేసా! ఆ తరవాత ఇటుకకట్టుడు, పిల్లర్లేయడం.... రాడ్ బెండింగూ , స్లాబులూ, స్కఫోల్డింగూ అన్నీ నేర్సుకున్నా! మీ ఇంటికి అద్దెకొచ్చానా... నా దశ తిరిగిపోనాది. తాపీమేస్త్రి అయిపోనాను! నువ్వు దొరికీసినావు. ఎవురేమనుకుంటే అనుకోనీ! మీ యమ్మ గెంటేత్తే బయటకు పోదారి! బేబీ నా సొంతకూతురు లెక్క! పిల్లను బాగా సదివిద్దారి! "...... అంటూ భరోసాగా చెప్పాడు హరి!
" ఓ పని సేద్దాం హరీ! ఈ యాదివారం సిమ్మాచలం యెళ్దాం. ఈ తాళిబొట్టు కట్టీసీయి నాకు. సరిపోద్ది. వాగే వోళ్ళు నోరుమూయిద్దారి! ".... ఆ చీకట్లు చిక్కబడుతున్న నిశీధి సాక్షిగా.... ఆ అసంపూర్తి గోడల మధ్య ఒకరిచేతిలో ఒకరు చేయేసుకుని.... వాగ్దానాలూ, భవిష్యత్ ప్రణాళికలూ చేసుకున్నారు అమాయకంగా!
అడ్డుగోడలెయ్యడానికి వారిమధ్య ఆర్ధికతారతమ్యాలు లేవు. ఇద్దరిలో ఎవరుపెద్దో ఎవరుచిన్నో కూడా తెలీదు! కులాల సారూప్యం అసలు తెలీదు! తెలిసినదల్లా ఇద్దరికీ ఒకరితోడు ఒకరికి కావాలని.
ఆ రాత్రి ఆ నక్షత్రాల కాంతిలో మిలమిలలాడుతున్న ఆ కొద్దిపాటి బంగారం సాక్షిగా వారిద్దరూ భార్యాభర్తలుగా ప్రధానం, ప్రమాణం చేసుకున్నారు!
నాలుగేళ్ళు హాయిగా గడిచిపోయాయి. హరప్పడు పూర్తిస్థాయి మెయిన్ మేస్త్రీ అయిపోయాడు. కొలతలేయడంలో, ఎస్టిమేట్లు వెయ్యడంలో, అనుకున్న సమయానికి పని కంజాయింపు చెయ్యడంలో హరప్పడు తరవాతే అని పేలెర్లిపోయాడు! ముగ్గురు కంట్రాక్టర్లకు హరప్పడే పెద్దమేస్త్రీ!
శ్రీకాకుళం నుండి లేబర్ని తేవాలన్నా, తాండవ, శారద, నాగావళి నుండి ఇసకలారీలు తెప్పించాలన్నా హరప్పడి భరోసాయే వాళ్ళకు!
తనని గౌరవంగా సొంతమనిషిలా చూసుకునే శోభమ్మగారిల్లు తప్పా మిగిలిన ఇళ్ళల్లో పనులు మానేసింది రాములప్పాయి.
వాళ్ళ కూతురు బేబీ ఇంటరు సీఈసీ ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. .... ఈలోపున హరప్పడి పనినేర్పు దగ్గరనుండి చూసిన ఓ బేంకాయన... హైదరాబాదు వచ్చేసి తనకూ, తన నలుగురి స్నేహితులకూ మణికొండలో కాంట్రాక్టు తీసుకుని ఇళ్ళు కట్టిపెట్టమని పిలిచాడు!
అది వాళ్ళ జీవితంలో అతిపెద్ద నిర్ణయం! ఉన్న ఊళ్ళో కలోగంజో తాగి సంతృప్తిగా బతికేయాలా లేక తెలీని మహానగరానికి వలసపోయి రిస్కు తీసుకోవాలో తెలీని సందిగ్దత. రాములప్పాయే ధైర్యం చేసింది. బేబీ భవిష్యత్తు కోసం వలసపోవడమే ఉత్తమమనుకుంది.
కానీ పెట్టుబడి? లక్షరూపాయిల బంగారం, రెండులక్షలు పిల్లకోసం చీట్లుకట్టి సంపాదించిందీ చేతిలో ఉంది. కానీ మరో రెండులక్షలయినా ఉంటే కానీ పని జరగదు. ఆ సమయంలో "నేనున్నానంటూ"...తను నమ్ముకున్న శోభమ్మగారే అక్కరకొచ్చింది రాములికి.
కొందరుంటారు. వాళ్ళకు పెద్ద గడుసుతనాలూ, లెక్కలూ, తారతమ్యాలూ తెలీవు. స్నేహమంటే స్నేహమే! "ఈ బాపనమ్మకు ఆ పనిదాయితో స్నేహమేంటో!".... అని ఇరుగూపొరుగూ నవ్వినా ఆ శోభమ్మకు లెక్కలేదు. రాములప్పాయి బంగారానికి తన బంగారాన్ని కొంత కలిపి... బేంక్ లోన్ తీయించి అవసరమైనంత సొమ్ము రాములు చేతిలో పెట్టింది ఆవిడ!
ఆరోజు తనవేలినుండి అన్యమనస్కంగా..అందె వుంగరం తీయబోతున్న రాముల్ని చెయ్యట్టుకుని ఆపింది ఆవిడ. ఆవిడకు తెలుసు ఆ అందె ఉంగరమంటే రాములికి ఎంత ప్రేమో!
"ఆ దూరదేశం వలస పోతున్నవాళ్ళు మళ్ళీ ఆవేపులకు తిరిగి వస్తారో లేదో? తన బంగారం తాకట్టు విడిపిస్తారో లేదో? ..... ఈ యోచనే లేదు ఆవిడకు. "సాయమడిగింది! చేసాను! "....అంతే! ఆ తరువాత తన భర్తచేతిలో ఆమె పడ్డ పుర్రాకులు ఆ పెరుమాళ్ళకే ఎరుక!
కలిసొచ్చే రోజులొచ్చినపుడు చేసిన కష్టానికి వందరెట్ల ఫలం ఇస్తాడేమో భగవంతుడు.
రెండులారీల్లో లేబర్నీ, పనిముట్లనూ వేసుకుని హరప్పడూ, రాములప్పాయి కూతురితో సహా మణికొండ చేరారు. అప్పుడప్పుడే పెరుగుతున్న ఐటీ వలన ఆరోజుల్లో మణికొండలో విస్తృతమైన గృహనిర్మాణాలు మొదలయ్యాయి.
ఆ బేంక్ ఉద్యోగులవి ...ఒకే వీధిలో ఒకేలాంటి ఐదిళ్ళ కాంట్రాక్టు కావడంతో.... ఆర్కిటెక్ట్ ప్లాన్ చేతిలో పెట్టడమేంటి చకచకా అల్లుకుపోయాడు హరి.
పాలిటెక్నిక్ కాలేజీలో లో కార్పెంటరీ నేర్చుకుని కొత్తమోడల్స్ లో ఉడ్ వర్కులు చేస్తున్న తెలిసిన ఇచ్ఛాపురం కార్పెంటర్ని కుర్రాళ్ళనేసుకుని వచ్చేయమన్నాడు. అందరినీ ఓ రెండంతస్థుల ఇంట్లో పెట్టాడు. అందరికీ వంట రాములే!
ఐదిళ్ళ పనులు ఏభై ఇళ్ళయి.... ఐదంతస్థుల భవనసముదాయాలయ్యి.....అయిదారేళ్ళలో చిన్నస్థాయి కాంట్రాక్టర్ నుండి నమ్మకస్థుడయిన బిల్డర్ గా ఎదిగాడు హరి! కాస్త చదువబ్బి పోర్టులో చిన్న ఉద్యోగం చేసుకునే బావమరిది గోవిందును తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టారు! రాములు చెల్లెలు అచ్చయమ్మ... నర్సీపట్నం రోడ్డు మీద కాకాహోటల్ నడిపే తన మొగుడూ, పనోళ్ళతో మణికొండలో వాలిపోయి.... లేబర్ భోజనాలకు ఇంచార్జి అయిపోయింది. విశాఖపట్నం, విజీనగరం, సిక్కోలు నుండి పరివారాన్నంతా హైదరాబాదు తెచ్చి... తలో పనిలోపెట్టేసారు ఇద్దరూ!
ఇంతకీ శోభమ్మగారి బంగారం తాకట్టు విడిపించిందా లేదా అనికదా మన సందేహం! చేతిలో అడ్వాన్సులు పడడమేంటి... ఆఘమేఘాల మీద వూళ్ళో వాలి.... మంచి కంచిపట్టుచీర కొని.... పువ్వుల్లో పెట్టి మరీ శోభమ్మగారి బంగారాన్ని అప్పగించింది రాములప్పాయి! అంతే కాకుండా ప్రతీ కార్తీకపౌర్ణమికీ ఆవిడ పుట్టినరోజుకు విధిగా ఆవూరొచ్చి... బట్టలుపెట్టి , కాళ్ళకు దణ్ణవెట్టి... ఆ మర్నాడు సముద్రస్నానం చేసి మరీ విమానం ఎక్కేది రావులు! శోభమ్మగారి అబ్బాయి హైదరాబాదులో ఇల్లుకట్టుకోవాలని అనుకుంటే.... సగం ఖర్చుకే ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిపెట్టించింది మొగుడుచేత!
లా పూర్తిచేసి కోర్టుకెళ్తున్న బేబీకి... ఆస్థి, అంతస్థు చూసి మరీ తమ కులపోళ్ళ అబ్బాయే... హైకోర్టు లాయరుగారబ్బాయికి.... స్థలాలమ్మేసి కోటిన్నర ఖర్చుపెట్టి... అంగరంగ వైభవంగా పెళ్ళిచేసారు.
వూళ్ళనుండి రైళ్ళూ, బస్సులూ ఎక్కిమరీ ఆ పెళ్ళికొచ్చిన బంధువులందరూ.... పక్కకొప్పులెట్టి, అడ్డపొగతాగుతూ, వడ్డిభాష మాట్లాడుకుంటూ పెళ్లిమండపంలో అటూయిటూ తిరుగుతూ ఉంటారని.... నాగరీకులయిన మగపెళ్ళివారు వాళ్ళను చూసి నవ్వడానికీ చిరాకుపడ్డానికీ వీల్లేదని ముందే కండీషను పెట్టారు హరీ-రాములూ ... కోటిరూపాయిలు వాళ్ళ చేతికిస్తూ!
జనాలు కాలం కలిసిరావడం చూసారు కానీ ... ఇంత వైభవంగా కలిసిరావడం బహుశా ఈజంటకే జరిగినట్టుంది అనుకోసాగారు! . రాజు వెడలె రవితేజములలరగ.... అన్నట్టు పరివారాన్నంతా వెంటేసుకుని తిరిగేవారు హరప్పారావు గారు అలియాస్ హరప్పడు! రామలక్ష్మి అలియాస్ రాములప్పయ! నరదృష్టికి నాపరాళ్ళు పగులుతాయి కదా! అలాగే....వీరి కుటుంబదుర్గానికీ బీటలు మొదలయ్యాయి!
ముగ్గురుపిల్లలు పుట్టుకొచ్చాకా....వాళ్ళ పెళ్ళయిన పదిహేనేళ్ళకు బ్లడ్ కేన్సర్ తో అల్లుడు హఠాత్తుగా పోయాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే భర్త మరణానికి బేబీ కుంగిపోయింది. ముద్దులకూతురిని ఆ స్థితిలో చూసి విరాగులయిపోయారు ఆ దంపతులిద్దరూ! ఆ దుఃఖోద్వేగానికి రాములికి గుండెజబ్బు మొదలయింది. రోజూ కేజీకి తక్కువ కాకుండా బంగారునగలు పెట్టుకుని, పట్టుచీరలు తప్పా మారు కట్టని రాములప్పాయి భారీశరీరానికి జబ్బులవలనా, విరక్తి వలనా... నూలుచీరా, పుస్తెలుతాడూ తప్పా ఏం వేసుకున్నా భారంగా అనిపించేది!
మరికొన్ని ఒడిదుడుకుల మధ్య రాములప్పాయికి అరవైయేళ్ళు వచ్చాయి. హరప్పడి పుట్టుపూర్వోత్రాలు తెలియనందున... ఆమె పుట్టినరోజునే షష్టిపూర్తిగా చెయ్యాలని ... అప్పుడప్పుడే విషాదంలోంచి బయటపడ్డ కూతురూ, కుటుంబ సభ్యులూ తలపోసారు.
తమవూరిలోనే చెయ్యాలని రాములూ, హరి పట్టుపట్టడంతో.... ఆ వూరిలోనే ఘనంగా ఏర్పాట్లు చేసి.... అంగరంగవైభవంగా తన తల్లితండ్రుల పెళ్ళిజరిపింది కూతురు. అదే పెళ్ళిలో.... మేనకోడలి మీద ప్రేమతో అవివాహితుడిగా ఉండిపోయిన తమ్ముడు గోవిందు చేతిలో కూతురు చెయ్యి పెట్టి అప్పగించింది రాములు. భర్తతో తమను నమ్ముకున్న వారందరికీ ఇవ్వదలుచుకున్నది ఇప్పించేసింది. బంగారాన్నీ సగం కూతురుకిచ్చి మిగిలిందంతా బంధువులకు పంచేసింది!
మతిపోయినదానిలా ఒకటీ ఒకటీ నగలు ఒలిచేసి ఇచ్చేస్తుంటే....అందరూ ఖిన్నులైపోయారు ఆమె చేష్టలకు. ఆరాత్రి హడావిడి ముగిసి... అందరూ ఎవరితావులకు వారు చేరారు!
రాములప్పాయి, హరప్పడూ... తాము ఆవూర్లో కొనుక్కున్న అపార్ట్ మెంట్ కు వచ్చారు. మొత్తం ఇల్లంతా పూలతో అలంకరించి... " వెల్కమ్ టు న్యూలీ వెడ్" అని గులాబీపువ్వులతో రాయించింది బేబీ! ఇద్దరూ అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
హాయిగా స్నానం చేసి మెత్తని తెల్ల నూలుచీర కట్టుకుంది రాములు. తెల్లగా పిండారపోసినట్టు వెన్నెల బాల్కనీ అంతా! హరప్పడు వచ్చి భార్యపక్కన ఉయ్యాలలో కూచున్నాడు. ముప్ఫై ఐదేళ్ళ క్రితం తామిద్దరూ ఊసులుచెప్పుకుని... బాసలు చేసుకున్న ప్రదేశమది. మౌనంగా ఆ అందమైన రోజులన్నీ మననం చేసుకుంటున్నారు ఇద్దరూ! ఇంతలో హరి ఏదో గుర్తొచ్చినట్టు... జేబూలోంచి చిన్నపెట్టె తీసాడు. మృదువుగా రాములమ్మ చెయ్యి తనచేతిలోకి తీసుకుని... దాంట్లోంచి తీసిన వస్తువు చేతిలో పెట్టాడు. అది అతిఖరీదయిన పెద్దపెద్ద వజ్రాలు పొదిగిన అందె వుంగరం! వెన్నెలకాంతికి మరింత మిరుమిట్లు కొల్పుతోంది ఆమె అరచేతిలో.
రాములమ్మ కుడిచేతి మధ్యవేలుకు పెట్టమని సూచించింది. ఎందుకంటే ఆమె ఉంగరం వేలుకు ఇప్పటికీ... అరిగిపోయి... వంపుతిరిగిపోయి....బంగారం రంగు వెలిసిపోయి...పాత అందె ఉంగరం అలాగే ఉండిపోయింది.
దాన్ని లాగబోయాడు హరప్పడు.
" అది ఊడిరాదు హరీ! ఆ వేలుచూడు ఎలా బలిసిపోయిందో! ఉండనీ దాన్ని! ఇన్ని నగల్లో నాకిష్టమయిన నగ అదొక్కటే! నీ మొదటి కష్టార్జితం! ....! .... ఆ చిరుచలిలో భారంగా వస్తున్నాయి ఆమె మాటలు. అతనేమీ మాట్లాడలేదు. ఆ పెట్టె తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు... తన వేలికున్న పాత వెంకన్న బాబు ఉంగరం కేసే తదేకంగా చూసుకుంటూ!
మీరు ఊహించింది నిజమే. ఆ రాత్రి భర్త పరిష్వంగంలో సుఖంగా నిద్రపోయిన రాములప్పాయి మరి లేవలేదు.
ఆమె దేహాన్ని ఆమెకు అత్యంత ప్రియమయిన ఆ " అందె ఉంగరం" తోనే దహనం చేసారు! కాష్టం చల్లారేకా కాటికాపరి బూడిదంతా వెతుక్కున్నాడు...కానీ ఎక్కడా పిసరంత బంగారం జాడా దొరకలేదు. బహుశా ఆమె ఆత్మతోనే ఆ అందె ఉంగరం కూడా ఆవిరైపోయినట్టుంది!
రాములప్పాయి పోయాకా హరప్పడూ మరెంతో కాలం లేడు. తన జీవితాన్నే మార్చేసిన తన అదృష్టదేవతను వెతుక్కుంటూ పోయాడు!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
|