Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
భాగం - 1
అది 2020 సంవత్సరం,
డిసెంబర్ నెల, 14 తేదీ,
సమయం రాత్రి 11:00,
అది దట్టమైన నల్లమల అడవులు...
ఆ అడవిని ఆనుకొని హైవే ఉంది.
రహదారిపై ఒక ఇన్నోవా కార్ చాలా వేగంగా పరుగులు తీస్తోంది..
అందులో ఒక ఫ్యామిలీ, ఒంగోలు నుంచి శ్రీశైలం వైపు వెళుతోంది..
ఆ కారులో భార్య భర్తలైన సుమిత్ర, అజయ్ ఇద్దరు పిల్లలు అఖిల్, సంజయ్ ఉన్నారు.
అజయ్ డ్రైవ్ చేస్తున్నాడు...
అతని పక్కనే ఉన్న సుమిత్ర మాట్లాడుతూ...
" మా అమ్మ చెప్తే విన్నారు కాదు..!! ఈరోజు అమావాస్య మంచిది కాదు..! రేపు ఉదయం బయలుదేరమని...!! ఇప్పుడు చూడండి. బాగా చీకటి పడిపోయింది..అరగంట నుంచి చూస్తున్నాను.. ఈ రోడ్డుపై ఒక్క వేరే వెహికిల్స్ కూడా కనిపించడం లేదు.. అసలు మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నామా..??"అని భయంగా అడిగింది..
దానికి అజయ్ నవ్వుతూ....!!
" ప్రతిదానికి ఎందుకలా భయపడతావ్..డియర్..?? డోంట్ వర్రీ..!! మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాము..
రేపు నాకు శ్రీశైలంలో అర్జెంట్ వర్క్ ఉంది. రమ్మని ఫోన్ వచ్చింది. అందుకే అర్జెంటుగా బయలుదేరా..!! ఆఫ్ డే వర్క్. అది అయిపోగానే తిరిగి మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు.. అంతగా ఇష్టం లేక పోతే. నువ్వు పిల్లలతో కలిసి, మీ అమ్మ గారి ఇంట్లోనే ఉండి పోవచ్చు కదా..!"అని నవ్వాడు.
దానికి సుమిత్ర కోప్పడుతూ...!!
"నేను ఉండిపోతానని అన్నాను..!!
కానీ మీరే బలవంతంగా తీసుకువచ్చారు కదా..!!"అని అంది..
అజయ్ నవ్వుతూ.." నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలాగ డియర్..?? అంటూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి ప్రేమగా తీసుకోబోతుండగా..!!
సుమిత్ర కెవ్వున అరిచింది..
అజయ్ ఏమైందో అని ఖంగారు పడుతూ రోడ్డుపైకి చూడగా.. ఒక లారీ వారి మీదకు దూసుకు రాబోయింది..
అజయ్ వెంటనే తన బండి ని పక్కకు తిప్పగా రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న లోయలోకి కారు దూసుకెళ్లిపోసాగింది..
సుమిత్ర భయంతో గట్టిగా అరుస్తుండగా....
ఆ అరుపులకు,వెనక సీట్లో పడుకొని ఉన్న పిల్లలు నిద్ర లేచిపోయారు..
వారిద్దరూ కూడా భయంతో అరవసాగారు..
అజయ్ కార్ ని కంట్రోల్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు..
అయినా ఆ కారు గుంతలలో పడుతూ, లేస్తూ పెద్దపెద్ద కుదుపులకు లోనవుతు,కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద చెట్టుని గుద్దుకొని ఆగిపోయింది...
ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్దం వచ్చింది..
ఆ కారు చెట్టుని ఢీకొన్న వేగానికి, అందరూ సృహ తప్పి పోయారు. కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఉండటంవల్ల, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు...
అలా ఒక గంట సేపటి తర్వాత అజయ్ కి మెలుకువ వచ్చింది...
కంగారుగా తన పక్కన ఉన్న సుమిత్ర ని చూసాడు. సృహ లో లేదు. వెనుక ఉన్న పిల్లల్ని చూశాడు వాళ్ళు కూడా సృహ లో లేరు..బాగానే ఉన్నారు..
వారందరికి ఏమీ కాలేదని.. క్షేమంగా ఉన్నారని, తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
మెల్లగా కారు దిగాడు.. చుట్టూ చూసాడు....
చుట్టూ మంచు విపరీతంగా కురుస్తోంది..
పైగా ఆరోజు అమావాస్య..
ఎటు చూసినా చిమ్మ చీకటి..
కీచురాళ్ళ గొడవలతో, నక్కల ఊళలలతో,
ఆ అడవి ప్రాంతం అంతా భయానక వాతావరణాన్ని తలపిస్తుంది...
అసలు తను ఎక్కడున్నాడో కూడా తనకి అర్థం కాలేదు..
ఒకసారి కార్ ని పూర్తిగా చెక్ చేసాడు.
కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది.. హెడ్ లైట్ లు కూడా పనిచేయడం లేదు..
మొబైల్ తీసి చూశాడు.. సిగ్నల్ లేదు..
కానీ ఫోన్ పని చేస్తుంది.. వెంటనే తన మొబైల్లో ఉన్న టార్చ్ ఆన్ చేశాడు..
ఉన్నట్టుండి కీచురాళ్ళ శబ్దం ఆగిపోయింది .
"ఎలాగైనా అర్జెంట్‌గా ఇక్కడ నుంచి బయట పడాలి..!!" అని తన మనసులో అనుకొని..
కార్ డోర్ ని అన్ని వైపుల నుంచి గట్టిగా లాక్ చేసాడు..
మెల్లగా తన సెల్ టార్చ్ లైట్ సహాయంతో ముందుకు కదిలాడు.
చిన్న చిన్న గుంతలతో, పెద్ద పెద్ద రాళ్లతో చాలా అస్తవ్యస్తంగా ఉంది.
అలా ఒక పది నిమిషాలు నడిచిన తర్వాత
ఒక చిన్న నడకదారి కనిపించింది...
ఆ నడకదారిలో కొంచెం ముందుకి వెళ్ళగా,
అతనికి దూరంగా అక్కడ ఒక పెద్ద రాళ్లగుట్ట కనిపించింది. దానికి కొంచెం దగ్గరగా వెళ్లి చూడగా లోపల ఒక చిన్న గుహ ఉంది..
లోపల జంతువులు ఏమైనా ఉంటాయేమోనని, అక్కడే పడి ఉన్న
ఒక కర్ర తీసుకుని, ఆ సెల్ టార్చ్ వెలుగులో గుహ లోపలికి వెళ్ళాడు..
లోపల జంతువులు ఏమీ లేవు...!!
బయటకు చిన్నగా కనిపించినా...!!
లోపల పది మందికి సరిపడే అంత విశాలంగా ఉంది...
ఈ రాత్రికి తలదాచుకోవడానికి సరైన ప్రదేశం దొరికిందని గ్రహించి,
ఆ గుహ బయటకు వచ్చాడు..
ఈ రాత్రికి అక్కడే ఉంటే మంచిదని, సుమిత్ర ని, పిల్లలని,అక్కడికి తీసుకు రావాలని వాళ్లకోసం బయలుదేరాడు..
గుహ లోపలికి వేరే జంతువులు వెళ్లకుండా,చీకట్లో సులభంగా గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుందని,
గుహ ముందు ఒక చిన్న మంట వేస్తే మంచిదని, అక్కడ చుట్టూ ఉన్న కట్టెపుల్లలు అన్నిటిని గుహ దగ్గరికి ఏరు కొచ్చాడు...
అందులో కొన్ని కట్టెలు తీసి గుహ ముందు వేశాడు...
అజయ్ కి సిగరెట్ తాగే అలవాటు ఉంది..
తన జేబులో ఉన్న లైటర్ తీసి, ఆ కట్టెలను వెలిగించాడు..
ఆ మంట అంటుకున్న తర్వాత, తన వాళ్ళని తీసుకొద్దామని కారు ఉన్న వైపు బయలుదేరాడు..
అజయ్ వేగంగా నడుస్తున్నాడు...
తనకి దూరంగా ఎవరో నడుస్తూ తన దగ్గరకి వస్తున్నట్టుగా కనిపించింది..
ఒక్కసారిగా తను నడవడం ఆపేశాడు..
ఆ ఆకారం వేగంగా తన వైపు రాసాగింది..
ఎవరో తెలియక.. భయంతో కాళ్లు కదలడం లేదు.
అలా కదలకుండా నిలబడి, ఉండిపోయాడు.
అలా ఆకారం దగ్గరకు రాగానే... ఎవరో చూద్దామని..మెల్లగా సెల్ టార్చ్ ని ఆ ఆకారం వైపు తిప్పాడు..
ఆ వెలుగులో సుమిత్ర కనిపించింది...
అజయ్ ఆశ్చర్యంతో "సుమిత్ర నువ్వేంటి ఇక్కడ...?? అని అరిచాడు..
ఆ మాటకి సుమిత్ర ఏడుస్తూ వచ్చి, అజయ్ ని కౌగిలించుకుంది...
అజయ్ కంగారుపడుతూ "పిల్లలు ఎక్కడ.? అని అడిగాడు..
దానికి సుమిత్ర ఆశ్చర్యపోతూ..!!
"మీతో లేరా..!!??"అంటూ ఏడవసాగింది.
అజయ్ సుమిత్ర భుజాలని గట్టిగా పట్టుకొని "అసలేం జరిగిందో చెప్పు" అంటూ అరిచాడు.
దానికి సుమిత్ర " నాకు మెలుకువ వచ్చేసరికి, కార్ లో మీరు, పిల్లలు కనిపించలేదు.. నాకు చాలా భయం వేసింది. మీ కోసం వెతుక్కుంటూ ఇటువైపుగా వస్తుంటే, మీరే కనిపించారు.."అంటూ జరిగింది చెప్పింది.
పూర్తిగా విన్న అజయ్ ఏడుస్తున్న సుమిత్ర ను ఓదారుస్తు...!!
"సరే ఏడవకు...!! ముందు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడ దగ్గరలో ఒక గుహ ని చూశాను. అది బాగుంది.
ఈ రాత్రికి మనమందరం అక్కడే ఉందాం..ముందు అక్కడికి వెళ్దాం పద..!!" అంటూ సుమిత్ర చేయి పట్టుకొని,వేగంగా ఆ గుహ వైపు పరుగులు తీశాడు...
కొంతసేపటికి ఇద్దరూ ఆ గుహ వద్దకు చేరుకున్నారు.. గుహ ముందు అజయ్ వెలిగించిన, కట్టెలు మండుతూనే ఉన్నాయి..
అజయ్ సుమిత్ర తో.." నేను వచ్చేంతవరకు నువ్వు అక్కడే ఉండు.జాగ్రత్త..!!
ఈ మంట ని ఆరిపోకుండా చూడు.. పిల్లల గురించి నువ్వేమీ కంగారు పడకు...!! పిల్లలు ఎక్కడున్నా, నేను వెతికి తీసుకు వస్తాను..."ధైర్యం చెప్పి వాళ్ళని వెతకడానికి కారు ఉన్న వైపు బయలుదేరాడు..
పిల్లల కోసం వెతుకుతూ కారు ఉన్న వైపు కి వెళ్ళాడు..
కొంతసేపటికి కారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు..
కారు దగ్గర నుంచుని చుట్టూ చూస్తూ.. "అఖిల్...!! సంజయ్..!!ఎక్కడున్నారు" అంటూ అరవసాగాడు.
కానీ వాళ్ళ జాడ తెలియలేదు...
ఏమైందో అని ఖంగారు పడుతూ మెల్లగా చుట్టుపక్కల వెతకసాగాడు..
అలా కొంతదూరం వెళ్లగా....
అతనికి దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది.. అంత చీకట్లో కూడా దాని ఆకారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది..
ఒకవేళ పిల్లలు అక్కడ ఉంటారేమో అని అనిపించి, వెతకడానికి తన చేతిలో ఉన్న టార్చ్ సహాయంతో మెల్లగా ఆ చెట్టు వైపు నడవసాగాడు....
అలా కొంత సేపు నడిచిన తర్వాత..
ఆ చెట్టు కి కొంత సమీపంగా చేరుకోగానే..
అతనికి పిల్లల ఏడుపులు వినిపించాయి..
వెంటనే అజయ్ "అఖిల్,సంజయ్" అంటూ పిలిచాడు..
వెంటనే అటు పక్క నుంచి "డాడీ" అంటూ పిల్లల అరుపులు వినిపించాయి..
వెంటనే ఆ వైపుకు వేగంగా పరిగెత్తాడు.....
ఆ పిల్లల అరుపులు వినిపించిన చోటికి చేరుకోగానే పిల్లలిద్దరూ ఏడుస్తూ కనిపించారు..
అక్కడికి వచ్చిన తమ తండ్రిని చూడగానే ఏడుస్తూ పరిగెత్తుకొని వచ్చి తండ్రిని వాటేసుకున్నారు...
అజయ్ కూడా ఆనందంతో పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు..
అజయ్ మోకాళ్లపై కూర్చుని, పిల్లలిద్దరి కన్నీళ్లు తుడుస్తూ...!! "భయపడకండి రా..! నేను వచ్చేసాగా..! నాతో రండి..!"అంటూ పిల్లలిద్దరి చేతులు పట్టుకొని గుహ వైపు నడకసాగించాడు..
అలా వారు గుహ వైపు నడుస్తూ ఉండగా..
అఖిల్, సంజయ్, అజయ్ తో.."మమ్మల్ని వదిలి, నువ్వు మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ..?? " అని అమాయకంగా ప్రశ్నించారు..
"అదేంట్రా..!!?? మీరు కనిపించటం లేదని, మమ్మీ వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది.."అని అన్నాడు.
"మరి మమ్మీ ఎక్కడ..?" అని అడిగారు పిల్లలు.
" మమ్మీ ఒక సేఫ్ ప్లేస్ లో ఉంది.. ఇప్పుడు మనం కూడా అక్కడికే వెళ్తున్నాం..!!
రేపు మార్నింగ్, మనం మన ఊరు వెళ్లి పోదాం."అని పిల్లలతో అన్నాడు..
కొంతసేపటికి అజయ్, పిల్లలతో కలిసి గుహ వద్దకు చేరుకున్నాడు..
గుహ ముందు కట్టెలు వెలుగుతూనే ఉన్నాయి..
కానీ సుమిత్ర కనిపించలేదు...
కంగారుగా గుహ లోపలికి వెళ్లి చూడగా..
సుమిత్ర నిద్రపోతూ కనిపించింది...
అప్పటివరకు కంగారుపడిన అజయ్ నవ్వుకుంటూ..." దీనికి ఇంత టెన్షన్ లో కూడా దీనికి నిద్ర ఎలా పడుతుందో అర్థం కావట్లేదు"అని మనసులో అనుకున్నాడు..
పక్కనే ఉన్న పిల్లలతో.."పిల్లలు..!! జాగ్రత్తగా ఉండండి..!! మమ్మీ నిద్రపోతోంది..!! డిస్టర్బ్ చెయ్యకండి..!! నేను మన కారు దగ్గరకు వెళ్లి మన లగేజ్ తో పాటు, మీరు తినడానికి ఏమైనా తీసుకు వస్తాను. మమ్మీ నిద్రలేస్తే ఈ విషయం చెప్పండి.సరేనా...!!"
అని పిల్లలతో చెప్పాడు..
"ఓకే డాడీ" అని ఇద్దరు సమాధానమిచ్చారు..
అజయ్ తన కారు దగ్గరికి బయలుదేరాడు...
పిల్లలిద్దరూ చలికి తట్టుకోలేక గుహ ముందు మండుతున్న మంట దగ్గరకు వచ్చి కూర్చున్నారు...!!!
అలా చలి కాగుతున్న వాళ్లకి, వెనుకనుంచి
"పిల్లలూ...!!!"
అన్న పిలుపు వినిపించింది..
వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు....!!
అజయ్ తన సెల్ టార్చ్ వెలుగులో కారు వైపు నడుస్తూ ఉన్నాడు..
చలి విపరీతంగా ఉంది..
దాని నుండి తప్పించుకోవడానికి తన జేబులో నుండి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు.
అలా కొంత దూరం నడిచిన తరువాత సడన్ గా కాలికి ఏదో అడ్డు తగిలి ముందు పడిపోయాడు..
చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఎగిరిపడింది..
అజయ్ పైకి లేచి నుంచున్నాడు..
అతని సెల్ ఫోన్ దూరంగా పడి ఉంది..
కానీ దాని టార్చ్ వెలుగుతూనే ఉంది..
కింద పడ్డ సెల్ ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాడు.. దాని మీద దుమ్ము పడిందేమో అని దులుపుతుండగా...
అతని చేతికి ఏదో తడిగా తగిలింది..
ఆ సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో " చేతికి తడిగా తగిలింది ఏమిటి??"అని చూడగా...
"అది రక్తం..........!!"
అజయ్ ఒక్క సారిగా షాక్ తిన్నాడు..
తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చిందని చుట్టూ చూడసాగాడు..
ఆ సెల్ ఫోన్ పడిన చోటు నుంచి అతనికి
దారలు కట్టి రక్తం కనిపించసాగింది..
రక్తం ఎక్కడి నుంచి వస్తుందో అని భయం భయంగా p ఆ రక్తం ఉన్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు.....
అలా కొద్ది ముందుకి వెళ్ళగా ఒక దట్టమైన పొదలు కనిపించాయి...
ఆ పొదల దగ్గర నుంచి రక్తం వస్తోంది...
వణుకుతున్న కాళ్ళతో ఆ పొదల దగ్గరికి చేరుకున్నాడు...
మెల్లగా ముందుకు వంగి, ఆ పొదల ని పక్కకి జరిపాడు..
తన సెల్‌ఫోన్ టార్చ్ ని పొదల వైపు తిప్పాడు.
ఒక్కసారిగా షాక్ తిని, భయంతో వెనక్కి పడిపోయాడు..
ఎందుకంటే.....!!!!
ఆ పోదలలో ఒక శవం ఉంది.....!!
అది" సుమిత్రది"
ఆమె శరీరమంతా ఏదో క్రూరమృగం దాడి చేసినట్టు పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి.
పొట్ట భాగమంతా చీలిపోయి పేగులు బయటకు వచ్చాయి..
అలా సుమిత్ర శవాన్ని చూడగానే భళ్ళున వాంతి చేసుకున్నాడు...!!!
ఇంతకుముందే కదా...!!
తను సుమిత్రని చూశాడు..!!
"మరి ఇప్పుడు ఇలా తనని చంపింది ఎవరు..??"
అని ఆలోచిస్తుండగా ఒక్కసారిగా అజయ్ కి ఒక్కసారిగా పిచ్చెక్కిపోయింది.
అతనికి పిల్లలు గుర్తుకు వచ్చారు...
"ఒకవేళ పిల్లలకి కూడా ఏదైనా జరిగిందేమో... అన్న ఆలోచన వచ్చింది..
ఆ ఆలోచన రాగానే శరీరమంతా భయంతో వణికిపోయింది...
వెంటనే గుహ ఉన్న వైపు పరుగు తీశాడు...
కాళ్లకి కాళ్లు తగిలి మధ్యమధ్యలో పడి పోసాగాడు.. అయినా వెంటనే పైకి లేచి వేగంగా పరుగెత్తసాగాడు...
అలా పడుతూ లేస్తూ, కొద్దిసేపటికి గుహ దగ్గరికి చేరుకున్నాడు...
గుహ ముందు వెలుగుతున్న మంట ఆరిపోయి ఉంది...
అజయ్ వెంటనే గుహ ముందుకు వెళ్లి, లోపలికి చూసాడు.
చీకట్లో ఏమి కనిపించటం లేదు.
భయంగా లోపల ఉన్న పిల్లలని "అఖిల్, సంజయ్.. ఎక్కడ ఉన్నారు మీరు.." అంటూ ఏడుస్తూ పిలవసాగాడు.
"డాడీ...!!"అంటూ బలహీనంగా సంజయ్ గొంతు వినిపించింది...
వెంటనే తన సెల్ టార్చ్ తీసుకొని గుహ లోపలికి వెళ్ళాడు..
అక్కడ అ ఆ లోపల ఉన్న రక్తపు మడుగులో నేలపై పడి ఉన్న పిల్లలను చూసి భయపడిపోయాడు...
రక్తపు మడుగులో ఉన్న పిల్లలిద్దరిలో అఖిల్ చనిపోయాడు.. సంజయ్ మాత్రమే కొనఊపిరితో ఉన్నాడు..
తన తండ్రిని చూడగానే మెల్లగా తన చేతిని పైకి లేపాడు...
అజయ్ ఏడుస్తూ వేగంగా రక్తపు మడుగులో ఉన్న సంజయ్ దగ్గరికి వెళ్లి కింద కూర్చుని తన ఒడిలోకి తీసుకున్నాడు.
"నాన్నా..!!సంజయ్ ఏమైందిరా..?? ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు..?? అంటూ ఏడవసాగాడు..
సంజయ్ మాత్రం పైకి చూస్తూ ఉండిపోయాడు....
"ఏమైందిరా..!! ఎవరు మిమ్మల్ని ఇలా చేసింది..?? అంటూ ఏడుస్తూ అడగగా...
చెయ్యి పైకి చూపించి ప్రాణాలు వదిలేశాడు..
అజయ్ ఏడుస్తూ గుహ పైకి చూశాడు...
ఆ గుహ పై భాగంలో...!!
తలకిందులుగా ఏదో వేలాడుతూ ఉంది.
వెంటనే తన సెల్ టార్చ్ తీసి ఆ వైపు తిప్పాడు...
ఆ వెలుగులో తలకిందులుగా వేలాడుతూ, తెల్లటి జుట్టు, వికృతమైన రూపం తో ఒక భయంకర పిశాచి కనిపించింది...
అది మెల్లగా తన తలని అజయ్ వైపు తిప్పింది...
భయంకరమైన, పదునైన కోరలు కలిగిన దాని నోటిని పెద్దగా తెరిచి ఒక్కసారిగా అజయ్ మీదకి దూకింది........!!!!
అంతే.......!!!!
రెండు రోజుల తర్వాత......!!!
ఇంకా ఉంది.....!!
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
New story start chesinaduku thanks
Posts: 3,475
Threads: 163
Likes Received: 10,962 in 2,210 posts
Likes Given: 7,219
Joined: Nov 2018
Reputation:
758
ఆరంభం ఆసక్తికరంగా ఉంది!
పిశాచి రాక మలుపు తిప్పబోతుందా!!
శివసాయి గారు....ఇక ముందు కూడా మరిన్ని కథలు వస్తాయనుకుంటాను
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 2
రెండు రోజుల తర్వాత....!!!
డిసెంబర్ 16.
అది శ్రీశైలం సెక్యూరిటీ అధికారి స్టేషన్.....!!
సమయం ఉదయం 10:00 అవుతుంది..
స్టేషన్ లో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉన్నారు..
ఆ స్టేషన్ ముందు ఒక స్కార్పియో వచ్చి ఆగింది..
అందులో నుంచి వయసుపైబడిన ఇద్దరు మగ వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కారు దిగారు... వారి ముఖాలు విచారంగా ఉన్నాయి....!!
వాళ్ళ నలుగురు స్టేషన్ లోపలికి వచ్చారు.
వాళ్లని చూస్తూనే అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యం ఎవరు కావాలి అని అడిగాడు..
అందులో ఒక ముసలాయన మాట్లాడుతూ..
"మేము ఎస్ ఐ గారి ని కలవాలి బాబు..! చాలా అర్జెంట్!!" అని చెప్పాడు.
అసలు విషయం ఏంటో చెప్పండి అని అడిగాడు సత్యం..
ఆయన విచారంగా మా అల్లుడు కోడలు మా మనవళ్ళు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. దాని గురించి అర్జెంటుగా మాట్లాడాలి..."అని ఆయన అన్నాడు.
సరే ఒక నిమిషం ఉండండి ఎస్ఐ గారికి చెప్పి వస్తాను అని చెప్పి సత్యం ఎస్ఐ క్యాబిన్ లోకి వెళ్ళాడు.
ఒక నిమిషం పూర్తవకుండానే బయటకు వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు..
అక్కడే ఎస్సై గా విధులు నిర్వహిస్తుంది.
28 ఏళ్ల ఆదిత్య.
వాళ్ళందరూ లోపలికి వెళ్లారు.
వాళ్ళని చూడగానే ఆదిత్య కూర్చోండి అని చెప్పగానే అందరూ అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చున్నారు..
చెప్పండి..! ఏంటి మీ కంప్లైంట్..??" అని అడిగాడు ఆదిత్య.
నమస్తే సార్..!! నా పేరు రఘునాథరావు. ఈమె నా భార్య సుశీల.
ఆయన మా వియ్యంకుడు కృష్ణమూర్తి, ఆయనగారి భార్య ప్రమీల." అంటూ అందరినీ పరిచయం చేశాడు.
తమ పరిచయం చేయగానే అందరూ ఆదిత్య కి నమస్కారం పెట్టారు.
ఆదిత్య కూడా నమస్కారం పెడుతూ చెప్పండి మీరు వచ్చిన విషయం ఏంటి..?
అని అడిగాడు.
సార్ గత రెండు రోజుల నుంచి నా కూతురు అల్లుడు మనవళ్ళు కనిపించడం లేదు. వారి ఫోన్ కి ఎంత ప్రయత్నించినా కలవటం లేదు. మా అల్లుడు ఏదో పనిమీద శ్రీశైలం బయలుదేరారు.. కానీ వాళ్లు ఇక్కడికి చేరుకోలేదు. మేం కూడా ఎంతగానో ప్రయత్నించి చూశాము. కానీ ఫలితం లేకపోయింది.. చివరిగా మీకు కంప్లైంట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము."అంటూ కన్నీళ్ళతో చెప్పాడు..
ఆ మాటలకు ఆదిత్య " ప్లీజ్ బాధపడకండి.
చివరిసారిగా మీరు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడారు.. అని అడిగాడు.
ఆ మాటకి సుశీల.." చివరి సారిగా ప్రమీల నాతో..! రాత్రి 11 గంటలకు మాట్లాడింది బాబు..! శ్రీశైలం వెళ్ళగానే ఫోన్ చేస్తామని చెప్పింది.. కానీ ఇప్పటివరకు వాళ్ల నుంచి ఫోన్ రాలేదు..!!" అని చెప్తూ కన్నీరు తుడుచుకుంది..
"ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటారు..?"అని అజయ్ తండ్రైన కృష్ణమూర్తిని అడిగాడు ఆదిత్య..
"మాది హైదరాబాదులో కన్స్ట్రక్షన్ బిజినెస్ బాబు.. ఇక్కడ ఒక ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. పేమెంట్ కూడా అంతా పూర్తి అయిపోయింది. లాండ్ డాక్యుమెంట్ ల మీద సైన్ కోసం అబ్బాయి కోడలు పిల్లలతో కలిసి, శ్రీశైలం బయల్దేరాడు. కానీ ఇప్పటివరకు వారి జాడ లేదు"
అని భయపడుతూ చెప్పాడు.
ఆదిత్య కొంతసేపు ఆలోచించి...
"ఆ లాండ్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా..!!? అని అడిగాడు..
"లేదు బాబు..!! అలాంటిదేమీ లేదు...?
అంతా సవ్యంగానే ఉంది. మాకు ఎవరి వైపు నుంచి ఇబ్బందులు రాలేదు.." అని చెప్పాడు..
వాళ్లు ఏ కార్ లో వెళ్లారో..!! ఆ కార్ నెంబర్, కలర్ ఏంటో..చెప్పగలరా..?? అని ఆదిత్య అడిగాడు.
దానికి సమాధానంగా ఆ కార్ సి బుక్ జిరాక్స్ కాపీలను దానికి సంబంధించిన కొన్ని కాగితాలను ఆదిత్య కి అందించాడు...
వాటిని పరిశీలించిన ఆదిత్య వారితో...
"మీరేం కంగారు పడకండి.. ఒక మిస్సింగ్ కంప్లైంట్ రాసి ఇవ్వండి.. రెండు రోజుల్లో వాళ్ళు ఎక్కడున్నా..!! వారి ఆచూకీ కనిపెడతాం." అని అన్నాడు..
ఆదిత్య చెప్పినట్టు మిస్సింగ్ కంప్లైంట్ రాసిచ్చాడు కృష్ణమూర్తి.. ఆ తరువాత అందరూ పైకి లేచి... ఇంకేది మాట్లాడలేక,ఆదిత్య నమస్కరించి" వెళతాము సార్" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు..
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కానిస్టేబుల్ సత్యం ని తన కేబిన్ లోకి పిలిచాడు ఆదిత్య.
రాగానే ఆదిత్య కి సెల్యూట్ చేశాడు సత్యం.
కృష్ణమూర్తి రాసిచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ని,
వైట్ ఇన్నోవా కార్ డీటెయిల్స్ ని సత్యం కి ఇస్తూ..,
"ఎలాగైనా రెండు రోజుల్లో ఈ కారు ఎక్కడుందో నాకు తెలియాలి.. "అని అన్నాడు.
ఎస్ సార్..!! అంటూ సెల్యూట్ చేసి , ఆ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు సత్యం.
అలా రెండు రోజులు గడిచిన తరువాత..
డిసెంబర్ 18, 11:00...!!
స్టేషన్లో కానిస్టేబుల్స్ నిద్రపోతున్నారు..
బయట చలి విపరీతంగా ఉంది...
ఎస్ఏ ఆదిత్య ఇంటికి కూడా వెళ్లకుండా. తన కేబిన్ లో కూర్చుని, ముఖ్యమైన పెండింగ్ పైల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు..
ఒక్కసారిగా ఆ స్టేషన్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అయ్యింది..
ఆ ఫోన్ ని రిసీవ్ చేసుకున్నాడు కానిస్టేబుల్ సత్యం.
ఆ ఫోన్ సంభాషణ పూర్తయిన వెంటనే..
సత్యం, ఆదిత్య కాబిన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు..
కంగారు పడుతున్న సత్యం ని చూసి..!!
" ఏమైంది సత్యం..!! అంత కంగారు పడుతున్నావ్..??"అని అడిగాడు ఆదిత్య
" సార్..!! మనం వెతుకుతున్న ఇన్నొవా కారు దొరికింది..!!"అని చెప్పాడు సత్యం.
" ఎక్కడ దొరికింది.!!?" అని ఆతృతగా అడిగాడు ఆదిత్య.
"తుమ్మలబైలు అనే ఊరికి దగ్గరలో ఉన్న ఒక చిన్న లోయలో, చెట్టుకి గుద్దుకొని ఉందట సార్..!!"అని చెప్పాడు.
"అందులో మనుషులు ఎవరైనా ఉన్నారా..?"
అని అడిగాడు ఆదిత్య.
"లేదు సార్..!! అటువైపుగా వెళుతున్న కొందరు
ఆ లోయలో కారు గుద్దుకొని ఉండడం చూసి,
మనకి ఫోన్ చేశారు..!!బండి నెంబర్ కూడా వారు చెప్పిన దానికి కరెక్ట్ గా సరిపోయింది"అని చెప్పాడు..
అది విన్న ఆదిత్య వెంటనే పైకి లేచి..
"స్టేషన్ లో ఎంత మంది కానిస్టేబుల్స్ ఉన్నారు..??"అని అడిగాడు.
"ఏడుగురు ఉన్నాం సార్..!!"అని చెప్పాడు.
సరే..!! ఇద్దరిని ఇక్కడ ఉండమని చెప్పు..!! మిగిలిన వారు నాతో రండి..."అని అన్నాడు.
డిపార్ట్మెంట్ కార్ లో ఆదిత్య అందరితో కలిసి,
ఆ స్పాట్ కి బయల్దేరాడు....
డిపార్ట్ కారు వేగంగా పరుగులు తీస్తోంది...
తుమ్మలబైలు శ్రీకాకుళానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అక్కడినుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళితే..
వారు చేరుకునే ప్రదేశం వస్తుంది.
కారు ఆ స్పాట్ కి చేరుకుంది..
అందరూ కారు దిగారు...
అప్పటికి సమయం రాత్రి 12:00 అయ్యింది..
అసలే అడవి ప్రాంతం కావడం వల్ల,
చలి చాలా తీవ్రంగా ఉంది..
అక్కడ కొంతమంది కుర్రాళ్ళు నుంచున్నారు..
సెక్యూరిటీ అధికారి కార్ ని చూడగానే వారి దగ్గరకు వచ్చారు..
వారి దగ్గరికి రాగానే ఆదిత్య వారి వైపు చూసి...."మీరేనా..?? ఇక్కడ కార్ ని చూసింది..!?"అని అడిగాడు.
వారిలో ఒక కుర్రాడు.."అవును సార్..!!
చూసింది నేనే..!!"అని చెప్పాడు...
వయసు 20 సంవత్సరాలు ఉంటాయి...
"ఎక్కడ ఆ కారు..?? అని అడిగాడు.. ఆదిత్య.
"నాతో రండి సార్..! చూపిస్తాను .!!" అంటూ వారిని తమతో ఆ లోయలోకి తీసుకు వెళ్ళాడు..
ఆ లోయలో అయినా కొంత దూరం నడిచిన తరువాత వారు వెతుకుతున్న కారు కనిపించింది..
ఆదిత్య కార్డు ఉన్న ప్రదేశం నుంచి పైనున్న రోడ్డు వైపు చూసాడు... కొంచెం దూరంగానే ఉంది.
ఎస్సై అనుమానంగా ఆ కుర్రాడి వైపు చూస్తూ....!! "అంత పైనుంచి ఈ చీకట్లో.....!(ఈ కార్ నీకు ఎలా కనిపించింది..??"అని అడిగాడు..
"అది..!! సార్...!! ఎలాగంటే...??" అంటూ నసిగాడు ఆ కుర్రాడు..
"ఊ.! చెప్పు.!!"అని గద్దించాడు ఆదిత్య..
"సార్..!! మేము అందరం కాలేజీ ఫ్రెండ్స్, సార్..!!
అప్పుడప్పుడు మా పేరెంట్స్ కి తెలియకుండా
శ్రీశైలం నుంచి ఇక్కడకు వచ్చి మందు కొడుతూ ఉంటాము.. ఇదే మా రెగ్యులర్ స్పాట్..!!"అని చెప్పాడు..
"అంటే కరోనా వల్ల కాలేజీస్ లేవని, పేరెంట్స్ కి తెలియకుండా ఇక్కడ కొచ్చి మీరు చేసే పనులు ఇదన్నమాట..!!" అని తిట్టాడు సత్యం..
ఆ మాటకి కుర్రాళ్ళు అందరూ తలవంచుకున్నారు..
వాళ్ళ మాటలకి ఆదిత్య నవ్వుకున్నాడు...
మిగతా కానిస్టేబుల్స్ వంక చూస్తూ...
"చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తారేమో వెతకండి..!!"
అని చెప్పాడు.
అందరూ టార్చ్ లైట్లు వేసి చుట్టుపక్కల వెదకసాగారు..
మరి" వీళ్ళ సంగతి ఏం చేద్దాం సార్..!!"
అని కుర్రాళ్ళని చూపించి అడిగాడు సత్యం..
ఆ మాటలకు ఆదిత్య నవ్వుతూ...!!
" వదిలే సత్యం..!! ఏదో కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు...!! మనకి ఎందుకులే ఈ గొడవ అని వదిలేయకుండా బాధ్యతగా మనకి ఫోన్ చేశారు..!! చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయ్...!!"అని చెప్పి ఆదిత్య కూడా టార్చ్ లైట్ తీసుకుని వెతకసాగాడు..
సత్యం ఆ కుర్రాళ్ళ వైపు కోపంగా చూస్తూ..
" మీరు చేసింది మంచి పని కాబట్టి ఈసారి వదిలేస్తున్నా..!! ఇంకోసారి పేరెంట్స్ కి తెలియకుండా ఇలా బయట తిరిగారో..!! మా లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది.. ఇక బయల్దేరండి..!!"అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళను పంపించి వేశాడు..
అంతలో అక్కడ వెతుకుతున్న ఒక కానిస్టేబుల్
"సార్..!! అర్జెంటుగా రండి...!!"అంటూ గట్టిగా అరిచాడు..
ఆ కానిస్టేబుల్ అరిచిన వెంటనే అందరూ అతను ఉన్న చోటికి పరిగెత్తారు..
ఆ కానిస్టేబుల్ కి పొదలలో సుమిత్ర శవం కనిపించింది...
ఆ శవం మొత్తం పురుగుల తో నిండిపోయింది..పొట్టబాగం చీలిపోయి...ప్రేగులన్ని బయటకొచ్చి,చాలా భయంకరంగా ఉంది ఆ శవం..
అలా ఆ శవాన్ని చూసిన కానిస్టేబుల్
ఒకడు వాంతి చేసుకున్నాడు.
ఆ శవం ఉన్నచోట విపరీతంగా దుర్వాసన రాసాగింది... అందరూ ఆ దుర్వాసన భరించలేక, తమ తమ కర్చీఫ్ లు తీసుకొని, ముక్కులకు అడ్డం పెట్టుకున్నారు..
"ఈ శవం ఎవరిది అయి ఉంటుంది సార్..?"
అని భయంగా అడిగాడు సత్యం..
"నా గెస్ కరెక్ట్ అయితే..!! ఈ శవం సుమిత్ర ది అయి ఉంటుంది.."అని చెప్పాడు ఆదిత్య
"ఇంత ఘోరంగా ఎవరు చంపారు సార్..!?"
అని అడిగాడు సత్యం.
"నాకు అదే అర్థం కావట్లేదు సత్యం.. ఒకవేళ ఈమె భర్త ఈవిడను చంపాడేమోనని అనుకుంటున్నా..!!" అని అన్నాడు ఆదిత్య..
ఆదిత్య వెంటనే సత్యంతో..." డాగ్స్ స్క్వాడ్
నీ అర్జెంటుగా పిలిపించండి."అన్నాడు ఆదిత్య..
సత్యం వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి
ఈ విషయాన్ని చెప్పాడు....!!
అరగంటలోనే డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంది...
వెలుతురు కోసం ఆ ప్లేసులో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు...
సెక్యూరిటీ అధికారి డాగ్స్ తాము ఉన్న ఆ ప్రదేశం నుంచి వాసన చూస్తూ వేగంగా అడవిలోకి పరుగెత్తసాగాయి...
ఆదిత్య మిగిలిన కానిస్టేబుల్స్.. వాటిని అనుసరించారు...
ఆ సెక్యూరిటీ అధికారి డాగ్స్, వేగంగా పరిగెత్తి,ఒక గుహ వద్ద ఆగిపోయాయి.
అది అజయ్ వాళ్లు చనిపోయిన గుహ...!!
ఆ గుహ నుంచి దారుణమైన దుర్వాసన రాసాగింది..
ఆదిత్య తన ముక్కుకి కర్చీఫ్ అడ్డుపెట్టుకొని,
ఒక టార్చ్ లైట్ తీసుకొని.. గుహ లోపలికి వెళ్ళాడు..
ఆ గుహ లోపలికి వెళ్ళిన వెంటనే.. ఆదిత్య వేగంగా బయటకు వచ్చాడు. ఏదో భయంకర పిశాచి చూసినట్టు కంగారు పడిపోసాగాడు..
మిగిలిన కానిస్టేబుల్స్ లోపలికి వెళ్లబోతుంటే....!! వాళ్లని వద్దని వారించాడు..
"ఏమైంది సార్..!!" అని అందరూ భయంగా అడిగారు...
" ఎవరు లోపలికి వెళ్ళకండి..!! వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి, అంబులెన్స్ ని క్లూస్ టీం ని, ఫోరెన్సిక్ టీం నీ, అందర్నీ అర్జంట్ గా రమ్మని చెప్పండి.."అని చెప్పి గుహ ముందు కూర్చుండిపోయాడు..
సత్యం వైపు చూస్తూ "ఒక వాటర్ బాటిల్ తీసుకురా..!" అని అన్నాడు.
సత్యం వాటర్ బాటిల్ అందిస్తూ...
"ఏమైంది సార్..!! లోపల ఏం జరిగింది.."
అని అడిగాడు.
"లోపల శవాలన్ని, నెత్తుటి మడుగులో ఉన్నాయి.. ఎవరు చంపారో కానీ చాలా క్రూరంగా చంపారు..
శరీర భాగాలన్నీ చిందరవందరగా ఉన్నాయి.. చూడడానికే నాకు చాలా భయం వేసింది సత్యం.. "
అని అన్నాడు ఆదిత్య...
ఆ మాటలు విన్న సత్యం బెదిరిపోయాడు.
ఎందుకంటే ఆదిత్య చాలా ధైర్యం కలవాడే కానీ అలాంటి వాడే భయపడ్డాడు అంటే...!
గుహ లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకున్నాడు. గుహ లోనికి వెళ్లి చూద్దామని అనుకున్న తన ప్రయత్నాన్ని వెంటనే మానుకున్నాడు.
సమయం రాత్రి 1:30 నిమిషాలు అయింది.
కంట్రోల్ రూం నుంచి సమాచారం అందుకున్న తర్వాత.. అంబులెన్స్, క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం.. అందరూ అక్కడికి చేరుకున్నారు..
ఒక అరగంట లోనే తమ పనిని పూర్తి చేశారు.. శవాలన్ని ఎక్కించుకొని అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పరుగులు తీశాయి..
అక్కడ ఆదిత్య అతని కానిస్టేబుల్స్ మాత్రమే మిగిలారు....
ఇంకా ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని అందరిని తల వైపు వెళ్లి వెతకమన్నాడు..
ఆదిత్య చెప్పినట్టు అందరూ తలో వైపు వెళ్ళి వెతకసాగారు..
ఆదిత్య ఒంటరిగా మరో వైపు వెళ్ళి వెదకసాగాడు... తన దగ్గర ఉన్న వాకీటాకీతో అందరికీ సూచనలు ఇస్తున్నాడు
ఆదిత్య కొంత ముందుకి వెళ్ళగా.. తన వెనుకగా అడుగుల చప్పుడు వినిపించింది..
వెనక్కి తిరిగి చూడగా దూరంగా దట్టమైన
చెట్ల మధ్య తనకి ఒక ఆకారం తన వైపూ నడుస్తూ కనిపించింది...
దాన్ని చూసి " ఏం సత్యం..!! నాతో పాటు వస్తున్నావ్..!! నీకేమీ కనిపించలేదా..!!" అని అడిగాడు..
అటువైపు నుంచి ఏం సమాధానం లేదు..
ఇంతలో తన వాకి టాకీ లో " సార్...!! ఇక్కడ మాకు
ఏ ఆధారాలు లభించలేదు..!! మమ్మల్ని వెనక్కి వచ్చే మంటారా..!!" అని అడిగాడు.. కానిస్టేబుల్..
"ఎవరు మాట్లాడేది..!!?? " అని అడిగాడు ఆదిత్య..
"నేను సార్..!! సత్యం నీ..!!" అని అటువైపునుంచి సమాధానం వచ్చింది.
"వ్వాట్ట్...!!" అంటూ గట్టిగా అరిచాడు ఆదిత్య...
ఇంకా ఉంది......!!
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 3
"వ్వాట్ట్.."అని గట్టిగా అరిచాడు ఆదిత్య..
ఆదిత్య అరుపు విన్న సత్యం కంగారు పడుతూ..
" ఏమైంది సార్...!!" అని అడిగాడు.
సత్యం అలా అడుగుతుండగానే తనకి ఆకారం కనిపించిన వైపు చూశాడు ఆదిత్య..
ఈసారి అక్కడ ఎవరూ కనిపించలేదు..
ఆదిత్య కి మతిపోయింది... అదంతా తన భ్రమ లేక అక్కడ వేరే ఏదైనా ఉందా..!!? అంటూ ఆలోచించసాగాడు..
అవతల నుంచి వాకీటాకీ లో సత్యం
"సార్ సార్ " అంటూ అరుస్తున్నాడు..
"ఆ సత్యం చెప్పు..!!"అన్నాడు ఆదిత్య..
"ఏమైంది సార్..!! ఎందుకు అలా అరిచారు." అన్నాడు..
"ఏం లేదు..!? అందరూ ఎక్కడ ఉన్నారు.?" అని అడిగాడు ఆదిత్య.
"అందరం ఇక్కడే గుహ దగ్గర ఉన్నాం సార్." అని సమాధానమిచ్చాడు..
"సరే అక్కడే ఉండండి నేను వస్తున్నా.." అంటూ వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు..
కానీ ఆదిత్య కి కూడా తెలియని విషయం ఏంటంటే...
ఆదిత్య అక్కడినుంచి బయలుదేరగానే..
అతని వెనక ఒక తెల్లటి పొగ ప్రత్యక్షమై..!
ఒక భయంకర పిశాచి లా మారిపోయింది.
అది ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఉంది..
గుహ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ దగ్గరికి ఆదిత్య వచ్చాడు.
"ఏమైనా క్లూస్ దొరికాయా..?"అని అందరిని అడిగాడు.
"బాగా చీకటిగా ఉంది సార్..!! అయినా మొత్తం వెతికి చూసాము.మాకు ఏమీ దొరకలేదు.." అని చెప్పాడు.. సత్యం..
"సరే..!! రేపు ఒకసారి పొద్దున్నే వచ్చి చూద్దాం..
ఇక బయల్దేరదాం.." అని అన్నాడు...
అందరూ కారు దగ్గరకు బయలుదేరారు..
ఆదిత్య ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు..
సత్యం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు..
మిగిలిన కానిస్టేబుల్స్ అందరూ వెనకాల కూర్చున్నారు..
కారు బయలుదేరబోతుండగా...
ఆదిత్య కార్ నుంచి అజయ్ కార్ గుద్దుకొన్న చెట్టు వైపు చూశాడు..
ఆ వైపు చూడగానే ఆదిత్య కి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి..
ఎందుకంటే.....!!
తను అంతకు ముందు చెట్లమధ్య చూసిన ఆకారం
ఆ చెట్టు దగ్గరే ఉంది....
అది ఆదిత్య వైపు చూస్తూ ఉంది..
చీకట్లో దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ..
ఆదిత్య కి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. తను చూస్తుంది.
తను చూస్తుంది.. నిజామా..!!కలా..!! అనుకుని కళ్ళు నలుపుకుని ఆ వైపు చూశాడు. అయినా సరే
ఆ ఆకారం అక్కడే ఉంది..
ఆదిత్య ఆ వైపే చూస్తూ ఉండడంతో..
సత్యం "ఏమైంది సార్..!" అంటూ ఆదిత్య భుజంపై చెయ్యి వేసాడు..
ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు..
"ఏమైంది సార్..!! అంతలా ఉలిక్కిపడ్డారు.. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది..??" అని అడిగాడు సత్యం..
ఆదిత్య మిగిలిన వారిని భయపెట్టడం ఇష్టం లేక..
" ఏం లేదు.!! జస్ట్ మాములుగా చూశాను అంతే..!! బండి పోనీ..!!"అని సత్యం కి చెప్పి, తన సీట్లో వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు...!!
కారు ని స్టేషన్ వైపు వేగంగా పోనిచ్చాడు సత్యం....!!
అందరూ స్టేషన్ కి చేరుకున్నారు..!!
ఈ విషయం మీడియా వారికి లీక్ అయింది.
ఆదిత్య స్టేషన్ కి చేరుకోగానే.. మీడియా వాళ్లు ఆదిత్యని చుట్టుముట్టారు..
అసలే టెన్షన్ తో తనకి చాలా చిరాగ్గా ఉంది. పోనీ ఏమి చెప్పకుండా ఉంటే మీడియా వాళ్లు ఏదేదో రాసి రచ్చరచ్చ చేస్తారు..
అందుకని అక్కడ జరిగిన దాని గురించి పూర్తిగా వివరించి,త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని చెప్పి వాళ్లందరినీ పంపించి వేశాడు..
ఆ తరువాత మీడియాలో ఆ న్యూస్ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది..
కారడవిలో 4 దారుణ హత్యలు.. అంటూ..
అన్ని ఛానల్ లో ఆ హత్యల గురించి తమ ఛానళ్లలో పబ్లిసిటీ చేయసాగాయి..
అప్పటికే సమయం తెల్లవారుజామున మూడయ్యింది..
ఇంతలో ఆదిత్య ఫోన్ రింగ్ అయ్యింది..
ఆ ఫోన్ ఏసిపి కరుణాకర్ నుంచి వచ్చింది.
అయినా ఆదిత్య తో మాట్లాడుతూ..
" ఏంటి ఆదిత్య?? ఏమైంది అక్కడ?? మీడియాలో ఒకటే గోల..!!" అని అడిగాడు..
ఆదిత్య దానికి వచ్చిన అజయ్ సుమిత్ర కేసు గురించి, తను గుహ దగ్గర చూసిన శవాలన్నిటి గురించి ఏసీపికి రిపోర్ట్ చేశాడు.. తను చూసిన ఆకారం గురించి మాత్రం చెప్పలేదు..
ఈ విషయం విన్న కరుణాకర్.."సీఐ సుందరయ్య కి హెల్త్ బాలేదు.. ఈ కేసులో ముందుకు వెళ్లడానికి నేను అన్ని రకాలుగా నీకు పర్మిషన్ ఇస్తున్నాను..!! ఇక నుంచి నీకు మీ సీఐ అవసరం లేదు."అని చెప్పాడు..
"థాంక్యూ సర్..!!"అని చెప్పి ఫోన్ పెట్టేశాడు..
అప్పటికి సమయం తెల్లవారుజామున 4:00 అయింది..
ఆదిత్య కి తెలియకుండానే తనకి నిద్రపట్టేసింది..
టేబుల్ మీద తల పెట్టుకొని నిద్రపోయాడు..
ఉదయం 8:00.. లకు సత్యం వచ్చి ఆదిత్యని నిద్రలేపాడు..
" గుడ్ మార్నింగ్ సార్..!! టీ తీసుకోండి"
అని టీ అందించాడు..
"థాంక్స్ రా.. సత్యం..!!"అని చెప్పి అతని చేతిలో టీ కప్ అందుకున్నాడు..
"సార్..!! ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సార్..!!" అంటూ ఒక ఫైల్ ని అతని ముందు పెట్టాడు..
ఆ ఫైల్ చూస్తూ సత్యంతో..
"సరే..!! ఒక వన్ అవర్ వరకు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు" అని అన్నాడు.
"సార్..!! అజయ్, సుమిత్ర పేరెంట్స్ వచ్చారు సార్..!! అని చెప్పాడు సత్యం.
" ఎప్పుడు వచ్చారు?...!! అని అడిగాడు ఆదిత్య.
"జస్ట్ ఇప్పుడే వచ్చారు సార్..!!"అని చెప్పాడు సత్యం.
" సరే లోపలికి పంపించు" అంటూ ఫైల్ ని పక్కన పెట్టాడు..
అజయ్ తండ్రి, సుమిత్ర తండ్రి లోపలికి వచ్చారు...
లోపలికి వస్తూనే ఆదిత్య కూర్చోమనడంతో కుర్చీలో కూర్చున్నారు...
ఆదిత్య కి వాళ్ళని చూస్తే చాలా బాధ కలిగింది..
కన్న బిడ్డలు మనవళ్ళు దారుణంగా చనిపోయారు.. వారి పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ కలిగించక మానదు.....
"క్షమించండి సార్..!! మీ వారి కార్ ని కనిపెట్టగలిగాం.కానీ...!!
మీ వాళ్ళని కాపాడలేకపోయాము.."అని బాధపడ్డాడు ఆదిత్య..
"అసలు ఏమైంది సార్...!?? ఎలా చనిపోయారు..? వాళ్ళని అంత ఘోరంగా ఎవరు చంపారు..? అసలు అంత అవసరం ఎవరికి ఉంది..??"
అంటూ ఏడవసాగాడు అజయ్ తండ్రి రఘునాథరావు..
" కనీసం వాళ్ళ శవాలను కూడా మమ్మల్ని చూడనివ్వటం లేదు. మా ఆడవాళ్ళు హాస్పిటల్ దగ్గర గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుమిత్ర తండ్రి కృష్ణమూర్తి..
ఆదిత్య తన సీట్లోంచి లేచి వాళ్ళ దగ్గరకు వచాడు..
"చూడండి సార్..!! వాళ్ల చనిపోవడానికి కారణం మనుషులా..?? క్రూరమృగాలా..?? అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది.. మీ వాళ్ళ శవాలు చూడడానికి
చాలా భయంకరంగా ఉన్నాయి.. మీరు పెద్దవారు.. వాటిని చూస్తే తట్టుకోలేరు.. పోస్టుమార్టం పూర్తయ్యింది. మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, సాయంత్రం కల్లా మీ వాళ్ళ శవాలను మీకు అప్పగిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి" అని అన్నాడు ఆదిత్య..
వాళ్ళు తల దించుకొని ఏడుస్తూ ఉన్నారు తప్ప సమాధానం ఇవ్వట్లేదు..
తిరిగి ఆదిత్య మాట్లాడుతూ.."నేరస్తులు ఎవరో నాకు పూర్తిగా తెలిసిన తరువాత మొదట మీకే చెప్తాను...!! ఇప్పుడు దయచేసి వెళ్ళిపోండి.. మీ ఆడవారికి
ఈ సమయంలో మీరు దగ్గర ఉండటం చాలా ముఖ్యం"అని అన్నాడు ఆదిత్య..
ఆ మాటలకి వాళ్ళిద్దరూ పైకి లేచి
"సరే సార్..! మేము ఉంటాం..!!"అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు..
వాళ్ళు వెళ్ళిపోగానే ఆదిత్య ఆ ఫైల్ ఓపెన్ చేశాడు...
ఫైల్ ని క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆదిత్య కి ఒకటి అర్థం అయింది..
సుమిత్ర ని, మిగిలిన వారిని, ఏదో ఒక క్రూర జంతువు ఎటాక్ చేసింది చంపిందని.. కానీ అది ఏ క్రూర జంతువో తెలియటం లేదని ఉంది..
పోస్టుమార్టం రిపోర్టులో కూడా అదే ఉంది.
ఆదిత్య కి బుర్ర పని చేయలేదు..!!
పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వారి బాడీ లని వారి తల్లిదండ్రులకు అప్పగించారు..
ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి..
రాత్రి 9 గంటలు అయింది..
ఆదిత్య కి బుర్ర పని చేయడం లేదు..
అసలే సరిగా నిద్ర లేక తనకి పిచ్చెక్కినట్టుగా ఉంది..!!
ఇక లాభం లేదని గ్రహించి..!!
పక్కనే ఉన్న సత్యంతో.." నేను ఇంటికి వెళ్తున్నాను.. ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చెయ్..!!"అని చెప్పి తన బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు..
ఆదిత్య కి ఎవరూ లేరు.. అనాధ..
తల్లి చిన్నప్పుడే చనిపోయింది.. తండ్రి
ఈ మధ్యనే చనిపోయాడు.. అప్పటినుంచి ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నాడు..
ఇంటికి చేరుకున్నాడు ఆదిత్య..
అప్పుడు టైం 10:00 అయింది...
స్నానం చేసి టేబుల్ పై వంట మనిషి చేసిన భోజనం తిని పడుకున్నాడు..
ఇంట్లో ఎవరూ లేరు..!! ఒక్కడే ఉన్నాడు...
బాగా అలసట గా ఉండటంతో పడుకున్న వెంటనే నిద్ర పోయాడు ఆదిత్య...!!
అలా కొద్ది గంటలు గడిచిన తరువాత..!!
"ఆదిత్యా.. ఆదిత్యా..!!"అని ఎవరో పిలుస్తూ ఉండడంతో ఒక్కసారిగా నిద్ర లేచాడు..
చుట్టూ చూసాడు. చీకటిగా ఉంది..కరెంటు పోవడంతో ఎవరూ కనిపించటంలేదు..!!
తన బెడ్ పక్కనే టేబుల్ పై ఉన్న సెల్‌ఫోన్ తీసి టైమ్ చూసుకున్నాడు..
రాత్రి 12 గంటల ఇరవై నిమిషాలు అయింది..
వెంటనే తన పక్కన ఉన్న సర్వీస్ రివాల్వర్ తీశాడు...
టేబుల్ పై ఉన్న టార్చ్ లైట్ తీసుకున్నాడు..
మెల్లగా మంచం దిగాడు...!!
తన సర్వీస్ రివాల్వర్ ని తీసి, ట్రిగ్గర్ లాగి అన్‌లాక్ చేశాడు.
మెల్లగా తన గది మొత్తం కలియ చూసాడు..
ఎవరూ కనిపించలేదు....
తరవాత హాల్ వైపు వెళ్ళాడు..
అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు..
ఇంతలో ఒక్కసారిగా గాలి గట్టిగా వీచడం మొదలయ్యింది..
కిటికీ తలుపులు టపా టపా కొట్టుకుంటున్నాయి.
ఆదిత్య గుండె వేగం పెరిగింది...
అనుమానం తీరక మొత్తం ఇల్లంతా వెతికి చూశాడు..
కానీ ఎవరూ కనిపించలేదు..
ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకొని, అదంతా తన భ్రమ అయ్యి ఉంటుందని, అనుకుని తన గదిలోకి వెళ్ళాడు...
టార్చ్ లైట్ ఆఫ్ చేశాడు..
సెల్ ఫోన్ లో మార్నింగ్ 8 గంటలకు అలారం పెట్టుకొని, దానిని తన పక్కనే పెట్టుకుని పైకి చూశాడు...
ఆ సెల్‌ఫోన్ వెలుగు తన పైన ఉన్న రూఫ్ పై పడింది..
ఆ పైన కనిపించిన భయానక దృశ్యాన్ని చూసి ఆదిత్య బిగుసుకుపోయాడు...
ఎందుకంటే ఆపైన తలకిందులుగా వేలాడుతూ ఒక భయంకర పిశాచి ఆదిత్య వైపే చూస్తూ ఉంది...
అది ఒక్క సారిగా తన భయంకరమైన నోరు తెరిచి ఆదిత్య మీదికి దూకింది......
అంతే....!!!
ఇంకా ఉంది.....!!
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Story line awesome Sivagaru.
Modalettatame.. oka range lo start chesaru.. pls continue
•
Posts: 67
Threads: 0
Likes Received: 23 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2021
Reputation:
0
•
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 4
ఒక్కసారిగా తన వికృతమైన నోరు తెరిచి ఆదిత్య మీదకి దూకింది....
ఆదిత్య మీద కూర్చొని అతని పీక గట్టిగా పుచ్చుకుంది......
ఆదిత్య దాన్ని చేతుల నుండి బయట పడాలని ఘోరంగా ప్రయత్నిస్తున్నాడు...
కాని అతని బలం సరిపోవడం లేదు...!!
అది ఆదిత్య మీద కూర్చుని, తన నోరు తెరిచి, భయంకరమైన కోరలు బయటపెట్టి,
అతని మెడ కోరక బోయింది.
ఆదిత్య ఒక్కసారిగా....!!
"నో......!! " అని గట్టిగా అరుస్తూ మంచం మీద నుంచి లేచాడు......!!!
భయంతో ఆదిత్య శరీరమంతా చెమటలు పట్టేసాయి...!!
చుట్టూ చూశాడు.. ఎవరు లేరు...
రూఫ్ పైన కూడా చూశాడు.
ఎవరూ కనిపించలేదు....
ఇదంతా కలా..?? అని అనుకుంటూ మంచం పైనుంచి లేచాడు....
తన బెడ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి, మంచి నీళ్లు తాగాడు..
తన మెడ నొప్పి గా అనిపించింది.
బెడ్ దిగి, లైట్ ఆన్ చేసి, అద్దంలో ఒకసారి తన మెడను చూసుకున్నాడు.
మెడ పై నల్లగా చేతి వేళ్ళ గుర్తులు కనిపించాయి....
ఆ గుర్తులు చూడగానే ఆదిత్య కి మతిపోయింది....
అప్పుడు ఆదిత్య అర్థమయ్యింది......
తనకి వచ్చింది కల కాదని,నిజమని.......
అలా ఆలోచిస్తూ మంచం పైన వెల్లకిలా పడుకొని,పైకి చూస్తూ ఉండిపోయాడు.....!!
అతని మనసులో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి.....!!
"అసలేం జరుగుతోంది.?
జరుగుతుంది బ్రమా..?? నిజమా..??"
అసలు ఇది ఎందుకు నా వెంట పడుతోంది.?
అజయ్ ఫ్యామిలీ చనిపోవడానికి కారణం కూడా ఇదే నా..??" అనుకుంటూ
ఇటువంటి ఆలోచనలతో ఆదిత్య బుర్ర వేడెక్కిపోయింది...
ఎప్పుడు పడుకున్నాడో..?? తెలియకుండానే నిద్రపోయాడు..!!
కిర్ర్..!! కిర్ర్..!! అంటూ ఉదయం ఎనిమిది గంటలకు ఆదిత్య ఫోన్ అలారం మోగింది..
ఆ సౌండ్ కి ఒక్కసారిగా ఉలిక్కిపడి, మంచం మీద నుంచి లేచాడు ఆదిత్య...!!
సెల్ ఫోన్ తీసుకొని అల్లారం ఆఫ్ చేశాడు..
టైం చూసుకున్నాడు 8:00 అయింది...
వెంటనే బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చాడు...
తను వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతుంది...
ఫోన్ తీసి చూశాడు...
ఫోన్ చేస్తోంది.. కానిస్టేబుల్ సత్యం...
ఫోన్ ఎత్తి " ఆ సత్యం చెప్పు ఏంటి..??"అని అడిగాడు ఆదిత్య..
" గుడ్ మార్నింగ్ సార్...!! స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను..!! మీ కోసం ఎవరో వచ్చారు..?? మీ బంధువులు అని చెప్తున్నారు సార్..??"అని అన్నాడు..
" మా బంధువులా..??" అని ఒక క్షణం ఆలోచించి...
"సరే..!! వాళ్ళను అక్కడే కూర్చోమని చెప్పు.. ఒక టెన్ మినిట్స్ లొ నేను అక్కడికి వస్తున్నాను.."అని చెప్పి వచ్చింది ఎవరా అని ఆలోచిస్తూ స్పీడ్ గా రెడీ అయ్యాడు..
బైక్ స్టార్ట్ చేసి స్టేషన్ వైపు బయలుదేరాడు..
ఆదిత్య మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది..!!
ఆదిత్య అసలు పేరు ఆదిత్య రావు..
ఆదిత్య తండ్రి పేరు విష్ణు రావు....
తల్లి పేరు శ్రీ లక్ష్మి..
ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.....!!
విష్ణురావు తండ్రిగారి పేరు..గోవింద రావు..
ఆయన విజయవాడలో పేరుమోసిన పండితులు..
యజ్ఞ యాగాదులు, గొప్ప గొప్ప క్రతువులు చేయించడంలో దిట్ట..
జ్యోతిష్య శాస్త్రంలో ఆయనది అందెవేసిన చెయ్యి..
అలాంటి కుటుంబంలో జన్మించాడు.. ఆదిత్య తండ్రి..
వాళ్లు విజయవాడలో ఒక అగ్రహారం లో ఉండేవారు...!!
విష్ణురావు కి, వేదాధ్యయనం మీద ఇష్టం లేదు...!! మామూలుగా కాలేజీకి వెళ్లి చదువుకొని, ఏదైనా ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది.. అదే విషయాన్ని తన తండ్రి అయినా గోవింద రావు తో చెప్పాడు..
తనకు ఇష్టం లేకపోయినా..
కొడుకు ఇష్టాన్ని గ్రహించి, ఆయన కూడా సరేనన్నాడు...
తను అనుకున్నట్టే కాలేజీ చదువు పూర్తి చేశాడు..
విజయవాడ లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం సంపాదించాడు..
అదే బ్యాంకులో తన సహోద్యోగి అయిన,
శ్రీ లక్ష్మి ని ప్రేమించాడు..
శ్రీ లక్ష్మి కి ఎవరూ లేరు..చిన్నప్పుడే తన తల్లి తండ్రి చనిపోవడంతో, మేనమామల వద్ద పెరిగింది...!!
వారిద్దరూ అలా రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు...
తన ప్రేమ విషయాన్ని తండ్రితో చెప్పాడు విష్ణురావు...
శ్రీలక్ష్మీ ది వేరే కులం....!!
దాని కారణంగా చూపించి గోవింద రావు
వారి ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు..!!
తండ్రి ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు విష్ణురావు..!!
కానీ తండ్రి ఎంతకూ ఒప్పుకొక పోయేసరికి,విజయవాడలో అయితే తన తండ్రికి తెలిసిపోతుందని....
దూరంగా శ్రీశైలం పారిపోయి అక్కడ గుడిలో పనిచేసే స్నేహితుల సహాయంతో
శ్రీ లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు..
ఈ విషయం తెలిసిన గోవింద రావు తన మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు..
కొడుకుని ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాడు..!!
విష్ణురావు కూడా విజయవాడలో ఉండలేక, శ్రీశైలం బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు...!!
ఒక సంవత్సరం తర్వాత...
తనకి ఆదిత్య పుట్టినా సరే..!!
తన తండ్రి కనికరించలేదు.....!!
నావల్ల మీరిద్దరూ విడిపోయారని..
విష్ణురావు తో బాధపడేది శ్రీలక్ష్మి...
ఆమెను ఓదార్చేవాడు విష్ణురావు..!!
ఒకనాడు గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ది శ్రీలక్ష్మి చనిపోయింది..
అప్పుడు ఆదిత్య కి ఐదు సంవత్సరాలు ఉంటాయి..!! ఆ వయసులో తల్లిని పోగొట్టుకున్నాడు....!!
విష్ణురావు ఆదిత్య ను తల్లిలేని లోటు తెలియకుండా పెంచాడు...!!
ఆదిత్య కి తన తండ్రి గురించి గొప్పగా
చెప్పేవాడు విష్ణురావు..!!
"మరి తాత గారు మన దగ్గరికి ఎందుకు రావడం లేదు..??" అని ఆదిత్య అడిగిన ప్రతీసారి.." నేను మీ తాత గారి విషయంలో ఒక తప్పు చేశాను రా..!! అందుకే ఆయనకి ఇంకా నామీద కోపం పోలేదు..!! ఎప్పటికైనా ఆయనకు నామీద కోపం తగ్గుతుందని
ఒక ఆశ..!!"అని చెప్పేవాడు..
ఆదిత్య కి చిన్నప్పటి నుండి సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వాలనే కోరిక..
తన కొడుక్కి ఇష్టమైనట్టుగానే సెక్యూరిటీ అధికారి జాబ్ కి ప్రోత్సహించాడు.. విష్ణురావు...!!
కష్టపడి జాబ్ తెచ్చుకొని, శ్రీశైలంలోని పోస్టింగ్ వేయించుకున్నాడు ఆదిత్య..
అలా ఒకరోజు ఆదిత్య డ్యూటీలో ఉండగా..
తన తండ్రికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది...!! వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు..!! ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది...!!
ఇది గమనించిన డాక్టర్ ఆదిత్య ని పిలిచి..
" సారీ సార్..!! మీ నాన్నగారికి వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనది..!!
ఆయన బతికేది కొద్ది నిమిషాలు మాత్రమే.!
మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు..!!"అని చెప్పి వెళ్లిపోయారు..
ఆదిత్య తండ్రి మంచంపై చావుబతుకుల మధ్య ఉన్నాడు...
కొడుకుని దగ్గరికి పిలిచాడు..
ఆదిత్య ఆయన దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు.!!
ఆయన ఆదిత్య తో.."రే నాన్న..!! నాకు
మా నాన్న ని.. చూడాలని కోరికగా ఉంది.!"
అని అన్నాడు..
ఆ మాటకి వెంటనే ఆదిత్య.."అయితే తాతగారికి కబురు పంపించమంటారా..?"అని అడిగాడు..
దానికి విష్ణురావు కన్నీళ్ళు పెట్టుకుంటూ...
" వద్దురా..!! మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం..!! కానీ ఆయన మాట కాదన్నందుకు నా మీద కోపం.అంతే..!!
నేను చనిపోతున్నాను అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు..!! నీకు ఒక విషయం తెలుసా..
నేను మీ అమ్మ ,శ్రీశైలం వచ్చిన తర్వాత కూడా.. మాకు తెలియకుండా మనుషులను పంపించి మా యోగక్షేమాలు తెలుసుకునేవారు...!!
మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆయన రాకపోవడానికి
కారణం....!!
మీ అమ్మ చనిపోయినట్టు ఆయనకి నేను తెలియనివ్వలేదు..!!
నేను పోయిన తర్వాత ఎప్పుడైనా ఆయన నుంచి నీకు కబురు వస్తే, తప్పకుండా వెళ్ళు.. ఎప్పటికైనా మీరిద్దరూ కలుస్తారని నా ఆశ.."అని ఆ మాటలు చివరి మాటగా అంటూ చనిపోయాడు...
అలా ఆదిత్య మనస్సు గతం నుంచి బయటకు వచ్చింది..
కొంతసేపటికి స్టేషన్ కు చేరుకున్నాడు...
స్టేషన్ బయట కుర్చీలలో ఒక నలుగురు పురోహితులు కూర్చుని ఉన్నారు...!!
వాళ్లు ఆదిత్యను చూడగానే నమస్కరించారు...
ఆదిత్య కూడా నమస్కరిస్తూ...!!
తన కాబిన్ లోకి తీసుకు వెళ్ళాడు..
వారందరినీ కూర్చోబెట్టి..
"చెప్పండి..!! నా గురించి వచ్చారంట కదా..!
అని అడిగాడు..
వారిలో ఒకతను మాట్లాడుతూ...!!
" నా పేరు సత్యనారాయణ రావు..!
మీ తండ్రిగారి కి అన్నగారిని అవుతాను..! అంటే నీకు పెదనాన్నని అవుతాను..!!"అని అన్నాడు..!!
ఆ మాట కు ఆదిత్య..!! " చాలా సంతోషం అండి..!! మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.. తాతయ్య గారు ఎలా ఉన్నారు..??"అని అడిగాడు ఆదిత్య..
"ఆయన బాగానే ఉన్నారు..
నిన్ను,నాన్నగారిని అమ్మని,చూడాలని అంటున్నారు.. అందుకనే మీకోసం వచ్చాను.!! నాన్నగారు అమ్మా..!!ఇంటిదగ్గర ఉన్నారా..?? అని అడిగాడు..
నా మాటకి బాధగా ఆదిత్య తలవంచుకున్నాడు...!!
ఆదిత్య తలవంచుకునేసరికి సత్యనారాయణ రావు ఆందోళన పడుతూ..
" ఏమైంది బాబు..??"అని అడిగాడు..
ఆదిత్య బాధగా " అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందండి...
నాన్నగారు కూడా ఈమధ్యనే చనిపోయారండి..!!" అని అన్నాడు..
" ఏంటి..?? విష్ణురావు కూడా చనిపోయాడా..??"అంటూ ఆయన ఆశ్చర్యపోయాడు...
" అవునండి..!! నాన్నగారు చనిపోయి సంవత్సరం అయింది.."అన్నాడు ఆదిత్య..
సత్యనారాయణ రావు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు...!!
కొద్ది నిమిషాలు మౌనం రాజ్యమేలింది..
మరల సత్యనారాయణ రావు మాట్లాడుతూ..
"చూడు బాబు జరిగిందేదో జరిగిపోయింది.. పోయిన వారు కావాలన్న తిరిగి రారు... ఇప్పుడు ఆయనకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు.. కాబట్టి నువ్వు మాతో పాటు వచ్చి ఆయనకి మెల్లగా ఈ విషయం చెప్తే అర్థం చేసుకుంటారు.. కాబట్టి దయచేసి నువ్వు మాతో రావాలి.."అని అన్నాడు..
ఆదిత్య ఆలోచనలో పడ్డాడు....!!
ఒకపక్క అజయ్ ఫ్యామిలీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి...!! ఈ కేసు గురించి తన మీద చాలా ప్రెజర్ వుంది..!! అందుకని కొంత సేపు ఆలోచించాడు...!!
తనకి తన తండ్రి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి...!! ఆయన చనిపోతూ నేను తాతగారు కలవాలని ఆశపడ్డారు...!! అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు..
వెంటనే మొబైల్ తీసుకొని.. ఏసీపీ కరుణాకర్ కి ఫోన్ చేశాడు...
ఆయనతో మాట్లాడుతూ...!! " సార్..!!
అర్జెంటుగా టుడేస్ లీవ్ కావాలి..!!"అని అడిగాడు..
మిస్టర్ ఆదిత్య..!! పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ టైంలో లీవ్ ఇవ్వడం కుదరదు..!! మీరు లేకపోతే ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు..??"అని అన్నాడు..
" సార్..!! నాకు టు డేస్ చాలు..! ఈ టుడేస్ ఏమేం పనులు చేయాలో.. నేను సత్యానికి చెప్తాను..!! ఇన్వెస్టిగేషన్ కి వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు..!! ఒకవేళ ఎమర్జెన్సీ అయితే నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను.."అని చెప్పాడు ఆదిత్య..
"ఓకే క్యారీ ఆన్ " అని చెప్పి ఫోన్ పెట్టేసాడు కరుణాకర్..
ఆదిత్య వెంటనే వాళ్ళతో కారులో విజయవాడ బయలుదేరాడు...
విజయవాడ చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది...
కారు ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది..
ఒక్కొక్కరుగా కారు దిగారు..!!
అందరూ లోపలికి వెళ్లి పోతుంటే..!!
ఆదిత్య మాత్రం కారు దగ్గర
ఉండి పోయాడు..
అది చూసిన సత్యనారాయణ రావు..
అక్కడే ఆగిపోయావే..?? ఆదిత్య!!
లోపలికి రా అంటూ పట్టుకొని లోపలికి తీసుకు వెళ్ళి పోతుంటే...
"అక్కడే ఆగండి.." అంటూ ఉరుము లాంటి
కంఠం తో వాళ్లనే నిలబెట్టేశాడు.. గోవింద రావు..
ఆ అరుపుకి ఎక్కడి వాళ్ళు అక్కడే కొయ్యల్లా నిలబడిపోయారు..
ఎవరికి ఆయన ఎందుకలా అరిచాడో అర్థం కాలేదు...
తన పక్కన ఉన్న మనుషుల కి సైగ చేసాడు గోవింద రావు..
వాళ్లు బిందెలతో పసుపు నీళ్ళు తెచ్చి అందరి ముందు పెట్టారు..
వాటిని చూపిస్తూ...!!"ప్రక్షాళన చేసుకుని ఇంట్లోకి రండి" అని చెప్పి వెళ్ళిపోయాడు..
ఆదిత్య కి ఆయన పద్ధతి వింతగా తోచింది.
ఒకవేళ తన తల్లిది వేరే కులం కావడం చేత
అలా పసుపు నీళ్ళు పోసుకొని రమ్మన్నాడేమో అని బాధపడ్డాడు..
తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం...
మారుమాట్లాడకుండా గుమ్మం బయటే పసుపు నీళ్లు పోసుకుని లోపలికి వచ్చాడు.
ఇష్టం లేకుండా పసుపు నీళ్లు పోసుకున్న ఆదిత్యకు అవి పోసుకున్న తర్వాత శరీరం తేలికగా అనిపించింది.. గుండెల మీద ఉన్న బరువు తగ్గినట్లు అనిపించింది..
ఒక క్షణం ఆదిత్య కి గోవింద రావు పసుపు నీళ్లు పోసుకోమని చెప్పింది.
తన మంచికేమో అని అనిపించింది..
లోపలికి వచ్చిన ఆదిత్యకు అక్కడ ఉన్న పనివాళ్ళు ఒక గదిని చూపించారు..
లోపలికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు ఆదిత్య..
అప్పటికే సమయం సాయంత్రం తొమ్మిది గంటలయింది...
ఒక పని వాడు ఆదిత్య దగ్గరకు వచ్చి
" అయ్యగారు..!!మిమ్మల్ని తన గదిలోకి పిలుస్తున్నారు" అని చెప్పారు..
ఆదిత్య అతని వెంట వెళ్లాడు..
ఆ పనివాడు ఒక గదిని చూపించి తను వెళ్ళి పోయాడు..
ఆదిత్య ఆ గదిలోకి వెళ్ళాడు...
లోపల ఒక పడక కుర్చీ లో కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు గోవింద రావు.
ఆదిత్య లోపలికి రావడం గ్రహించి..
" రా బాబు..!! ఇక్కడ కూర్చో..!!" అని తన ముందు ఉన్న ఒక కుర్చీ చూపించాడు.
ఆదిత్య మొదట ఆయన కాళ్ళకు నమస్కరించి తర్వాత కూర్చున్నాడు.
"నీ పేరేంటి బాబు..!!"అని అడిగాడు గోవింద రావు..
" ఆదిత్య రావు, తాతగారు.." అని చెప్పాడు ఆదిత్య..
"ఆదిత్య రావు..!! మంచి పేరు.. ఆదిత్య అంటే సూర్యుడు.. వంశానికి వెలుగు తెస్తావు..!!"అని అంటూ..
" ఆదిత్య...!!వాడికి నామీద కోపం పోలేదా..!! ఒక్కడివే వచ్చావు..!! మీ అమ్మ కూడా రాలేదు..!! అని అడిగాడు.. గోవింద రావు.
ఆ మాటకి ఆదిత్య బదులు చెప్పలేదు..!!
ఆదిత్య అలా మౌనంగా తలవంచుకొనేసరికి
గోవింద రావు ఆదిత్య అర చేయి పట్టుకున్నాడు..
అప్పుడు అతని చేతి పై రెండు కన్నీటి బొట్లు పడ్డాయి...
ఏమైంది..నాయనా..?? ఎందుకు ఏడుస్తున్నావ్....?? అని ఆదుర్దాగా అడిగాడు గోవింద రావు...
"అమ్మ నాన్న చనిపోయారు. తాతగారు.. !!" అని ఏడుస్తూ చెప్పాడు ఆదిత్య...
ఒక్క క్షణం ఆ మాట విన్న గోవింద రావు నిర్ఘాంతపోయి శూన్యం లో కి చూస్తూ ఉండిపోయాడు...!!
మన శరీరంలో శక్తి అంతా పోయినట్టు కుర్చీలో కూలబడి పోయాడు.... గోవింద రావు..
అది చూసిన ఆదిత్య కంగారు పడ్డాడు..
"తాతగారు..!! తాతగారు..!!" అంటూ ఆయన బుజాలు పట్టుకొని గట్టిగా ఉపాడు..
ఆయన ఆ షాక్ నుంచి బయటకు వచ్చాడు
బయటకు వచ్చిన వెంటనే తన కొడుకు ని తలుచుకుని ఏడవసాగాడు .
ఆదిత్య ఆయనని ఓదార్చ సాగాడు....
కొంతసేపటికి ఆయన తేరుకొని...!!
" ఆ రోజునే నేను వాళ్ల పెళ్లికి ఒప్పుకుని ఉంటే, ఈ రోజున నా కళ్ళ ముందు వాళ్ళు ఉండేవారు..!! కులం అంటూ వాడిని దూరం చేసుకున్నాను.." అంటూ బాధపడ్డాడు గోవింద రావు...
ఆదిత్య గోవింద రావు ని ఓదార్చాడు..
ఆదిత్య, గోవింద రావు ఆ రాత్రి భోజనం పూర్తయిన తరువాత మేడపైన చాలాసేపు మాట్లాడుకున్నారు..
తన చిన్ననాటి కబుర్లు అన్నీ..తల్లి గురించి తన తండ్రి గురించి గోవింద రావు తో చెప్పాడు ఆదిత్య...
అవన్నీ విన్న గోవింద రావు...!!
" అవన్నీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే వింటున్నాను ఆదిత్య... కులం పేరు చెప్పి అనవసరంగా మిమ్మల్ని దూరం పెట్టాను..'అని బాధపడ్డాడు.
ఆదిత్య మాట్లాడుతూ...!!
" తాతగారు...!! మీ మనసులో ఇప్పుడు కులం మతం అంటూ భేదాలు లేవు కదా..??'అని అడిగాడు..
" లేవు నాయనా..!! అయినా ఎందుకు అలా అడుగుతున్నావ్..?? అని అడిగాడు గోవింద రావు...
"మరి ఆ పట్టింపులు మీకు లేకపోతే..?? ఇంటిలోకి రాకుండానే నా మీద పసుపు నీళ్లు ఎందుకు పోయించారు..??"అని అడిగాడు ఆదిత్య .
ఆ మాటలకు గోవింద రావు నవ్వాడు...
" అవి నీ కోసం కాదు..!!"అని మళ్ళీ నవ్వాడు గోవింద రావు..
"నాకోసం కాదా.? మరి ఎవరి కోసం?"
అని అడిగాడు ఆదిత్య .
"నీతో పాటు ఒక దుష్ట శక్తి వచ్చింది.. అది నీతో పాటు లోపలికి రావాలని చూసింది. దానికోసమే నీ మీద పసుపు నీళ్ళు పోయించాను."అని చెప్పాడు గోవింద రావు..
" దుష్టశక్తులు, దయ్యాలు ఈ కాలంలో కూడా ఉన్నాయా..? తాతగారు..
మీరు కూడా వాటిని నమ్ముతున్నారా..??"అని అడిగాడు ఆదిత్య.
చూడు నాయనా..!! కంటికి కనిపించింది మాత్రమే నిజం...!! కనబడినది అబద్ధం అని అనుకోకూడదు.. దుష్ట శక్తులు ప్రేతాత్మలు అనేవి ఉన్నాయి.."అని అన్నాడు గోవింద రావు..
"ఏమో తాతగారు..!! నాకు వాటి మీద నమ్మకం లేదు..!!"అని అన్నాడు ఆదిత్య..
గోవింద రావు ఆ మాటలకు సమాధానం చెప్పకుండా ఆదిత్య వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు..
అది గమనించిన ఆదిత్య ." ఏమైంది తాతగారు..?? అలా చూస్తున్నారు..?"అని అడిగాడు...
ఆ మాటకి గోవింద రావు చిన్నగా నవ్వుతూ..
"ఏమీ లేదు..!! ఎప్పుడైనా నా అవసరం ఉంటే తప్పకుండా పిలువు నాయనా...!!"అని అన్నారు..
"తప్పకుండా తాతగారు..!!" అని అన్నాడు ఆదిత్య..
" సరే ఇప్పటికే బాగా ఆలస్యమయింది..!!
మీకు ఏదో ముఖ్యమైన పని ఉందని అన్నావు కదా...!! వెళ్లి పడుకో..!! పొద్దున్నే బయలుదేరాల్సి ఉంటుంది..!!" అన్నాడు గోవింద రావు..
"అలాగే తాతగారు..!!" అంటూ తన గదికి వెళ్ళిపోయాడు ఆదిత్య....!!
ఆదిత్య వెళ్ళిపోయిన తరువాత ఆ మేడ పైన అటూ ఇటూ నడుస్తూ గోవింద రావు మేడపై నుంచి తన ఇంటి గేటు వైపు చూడసాగాడు...!!
ఆ వైపు చూస్తూ ఉన్న గోవింద రావు కి కళ్ళు కోపం తో ఎరుపెక్కాయి...
ఎందుకంటే....!!
ఆ గేటు బయట ఒక నల్లని ఆకారం ఎర్రటి కళ్ళతో కోపంగా గోవింద రావు వైపే చూస్తూ ఉంది......
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 5
గోవింద రావు తన ఇంటి గేటు బయట ఉన్న భయంకర ఆకారం వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు....!!
అలా కొంతసేపు చూసిన తర్వాత
ఆ ఆకారం మాయమైపోయింది..!!
ఆ తర్వాత గోవింద రావు మేడ పైన
కొంత సేపు ఉండి, తరువాత తన గదికి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి.......!!!
సమయం అర్ధరాత్రి 12:20..!!!!
ఒక్కసారిగా కరెంటు పోయింది....!!!
కరెంటు పోవడం వల్ల ఇల్లంతా చీకటి అలముకుంది....!!
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు....!!
ఆరోజు అమావాస్య కావడం వల్ల,
పూర్తి చీకటి గా ఉంది..
ఆదిత్య కూడా తన గదిలో గాడ నిద్ర లో ఉన్నాడు.
ఇంతలో టక్.. టక్.. టక్.. మంటు
ఆదిత్య గది తలుపును గట్టిగా ఎవరో కొట్టసాగారు..
ఆ శబ్దానికి ఆదిత్య కి మెలుకువ వచ్చింది..
మెల్లగా మంచం మీద నుంచి పైకి లేచాడు.
చుట్టూ చీకటి గా ఉంది.. ఏమి కనిపించడం లేదు...
ఇంతలో తలుపు మీద మళ్లీ ఎవరో గట్టిగా కొడుతున్నట్లు శబ్దం రాసాగింది..
"ఎవరది..!!??"అని అడిగాడు ఆదిత్య..
కానీ అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు..
కానీ తలుపు మీద ఎవరో కొడుతున్నట్టు శబ్దం రాసాగింది..
తలుపు కొడుతుంది ఎవరో ఆదిత్యకు అర్థం కాలేదు...
గది మొత్తం చీకటిగా వుండడం చేత తన సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేశాడు..
ఇక మంచం మీద నుండి లేచి ఎవరో చూద్దామని.. తలుపు వైపు నడిచాడు..
మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాడు...
అంతా చీకటిగా ఉంది.
ఎవరూ కనిపించటం లేదు..
గది బయటకు వచ్చి చూశాడు..
కానీ ఎవరూ కనిపించలేదు...
ఒకసారి తన సెల్‌ఫోన్ టార్చ్ లైట్ తో ఇల్లంతా కలయదిరిగాడు...
కానీ ఎవరూ కనిపించలేదు....
ఇక ఎవరూ లేరని నిర్ధారించుకుని తన గదిలోకి వెళ్ళబోతుందగా.....!!
ఉన్నట్టుండి ఎక్కడినుంచో
ఒక స్త్రీ ఏడుపు వినిపించసాగింది...
ఆ ఏడుపు ఎంతో వేదనతో కూడి,కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా,భయానకంగా ఉంది...
అది విన్న ఆదిత్య ఒక్కసారిగా ఆగిపోయాడు.....!!
మెల్లగా వెనక్కి తిరిగి, ఆ ఏడుపు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు...
ఆదిత్య మెల్లగా నడుచుకుంటూ ఇంటి వెనుక భాగాన ఉన్న పెరడుకు చేరుకున్నాడు..
ఆ పెరడు భాగం చాలా విశాలమైనది...
దాన్ని ఆనుకొని ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది..
అది కూడా విష్ణురావు కి చెందినదే....!!
సరైన సంరక్షణ లేక ఆ స్థలం అంతా
పిచ్చి పిచ్చి మొక్కలుతో, చెట్లతో
ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది.
ఆ పెరడుకి, ఖాళీ స్థలానికి మధ్య ఒక గోడ ఉంది... దానికి ఒక గేటు కూడా ఉంది...
ఆదిత్య తనకు ఏడుపు వినిపిస్తున్న వైపు నడుచుకుంటూ పెరడుకి దగ్గరగా వచ్చాడు..
అక్కడికి వచ్చేసరికి ఆ ఏడుపు ఇంకా పెద్దగా వినిపించసాగింది..
ఆ ఏడుపు అక్కడ ఉన్న పెద్ద ఖాళీ స్థలం నుంచి వస్తోంది..
ఆదిత్య మెల్లగా నడుచుకుంటూ
ఆ ఖాళీ స్థలానికి ఉన్న గేటు దగ్గరకు వచ్చాడు..
ఆ గేటుకి గడియ వేసి ఉంది..
ఆదిత్య ఆ గేటుకి ఉన్న గడియ తీశాడు...
గేటు ఓపెన్ చేసి, ఆ ఖాళీ స్థలం లోకి వెళ్లబోతుండగా...
ఆదిత్య భుజంపై ఒక చెయ్యి పడింది...
భయంతో ఉలిక్కిపడి,ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు..
అక్కడ చేతిలో క్యాండిల్ పట్టుకుని
ఆ ఇంట్లో నౌకరు, అతని పక్కనే గోవిందరావు ఉన్నారు...
గోవిందరావు, ఆదిత్య తో..!!
"ఇంత అర్ధరాత్రి వేళ పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఆదిత్య..!!??" అని అడిగారు..
ఆదిత్య ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకొని...
"ఇక్కడ నాకు ఎవరో ఒక ఆమె ఏడుస్తున్న శబ్దం వినిపించింది.. అందుకే ఇక్కడికి వచ్చాను. తాతగారు..!!". అని సమాధానమిచ్చాడు..
దానికి గోవిందరావు నవ్వుతూ...
"అదంతా నీ భ్రమ..!!
ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా వెళ్లి పడుకో...!!
పొద్దున నువ్వు బయలుదేరాలి.."అని అన్నాడు.
దానికి ఆదిత్య..! " సరే తాతగారు..!!!
నేను వెళ్లి పడుకుంటాను.." అంటూ ఇంట్లోకి నడవసాగాడు..
గోవింద రావు కూడా ఆదిత్య వెనకాలే నడుస్తూ ఉన్నట్టుండి ఒక్క క్షణం బొమ్మలా కదలకుండా ఆగి పోయాడు...
ఆదిత్య మాత్రం నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పోయాడు...!!
ఆదిత్య లోపలికి వెళ్ళి పోయిన తర్వాత గోవింద రావు మెల్లగా తల తిప్పి వెనక్కి చూశాడు....
వెనక్కి తిరిగి చూస్తే.....!!!!!!!
ఆ గేట్ కి అవతల వైపు నల్లగా భయంకరంగా ఉన్న ఒక వికృత ఆకారం నుంచుని గోవింద రావు వైపు కోపంగా చూడసాగింది....
గోవింద రావు కూడా దాని వైపు కళ్ళెర్ర జేసి కోపంగా చూసి, ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు..
మరుసటి రోజు తెల్లవారింది......!!
సమయం ఉదయం 8:00..
ఒక పని వాడు వచ్చి ఆదిత్య ని నిద్రలేపాడు.
ఆదిత్య నిద్ర లేచాడు...
ఆ పనివాడు ఆదిత్య కి నమస్కారం పెడుతూ.."తాతగారు..!! మిమ్మల్ని త్వరగా స్నానం చేసి పూజ గదికి రమ్మన్నారండి.."అని చెప్పాడు..
"ఆ సరే..! వస్తున్నానని చెప్పు..!!"అని చెప్పి త్వరగా రెడీ అవడానికి వెళ్ళాడు...
ఒక అరగంటలో ఆదిత్య రెడీ అయ్యాడు..
ఆ తర్వాత పూజ గదికి వెళ్ళాడు...
అక్కడ గోవింద రావు పూజలో ఉన్నారు...
ఆదిత్య ని చూసిన గోవింద రావు అక్కడ కూర్చోమన్నట్లుగా సైగ చేశారు..
ఆదిత్య ఏమీ మాట్లాడకుండా ఆయన ముందు కూర్చున్నాడు....
పూజ పూర్తయిన తర్వాత గోవింద రావు ఆదిత్య కి పూజ గది లో ఉంచిన ఒక కాగితాన్ని ఆదిత్య చేతికి అందించారు.
" ఏంటి తాత గారు ఇది..??" అని ఆదిత్య అడిగాడు..
"ఇది నీ జాతకం..!!"అని అన్నారు...
ఆ కాగితాన్ని ఆయన చేతిలోనుండి తీసికొని ఆదిత్య పరిశీలించ సాగాడు...
గోవింద రావు మాట్లాడుతూ...!!
" చూడు ఆదిత్య..!! నీ జాతకం చాలా బాగుంది..!! కానీ....!??"అంటూ మధ్యలోనే ఆపేశాడు..
"కానీ..?? ఏమైంది తాతగారు..??"అని అడిగాడు ఆదిత్య..
"ప్రస్తుతం నీ జాతకరీత్యా దుష్ట గ్రహ పీడిత ప్రభావం అధికంగా ఉంది... కాబట్టి నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. నిత్య దైవ స్మరణ, నిత్య దైవ దర్శనం ఎప్పుడు మానకూడదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి..!!"అని గోవింద రావు ఆదిత్య తో చెప్పారు...
అది విన్న ఆదిత్య " అలాగే తాతగారు..!! మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను.. వెళ్లొస్తాను.." అని ఆయన పాదాలకు నమస్కరించాడు..
ఆదిత్య ఆయన పాదాలు తాకిన వెంటనే గోవింద రావు ఒక్కసారిగా ఉలిక్కిపడి
తన పాదాలకి నమస్కరిస్తున్న ఆదిత్య వైపు చూశారు...
మరు క్షణమే తేరుకొని....
"దీర్ఘాయుష్మాన్ భవ..!!"అంటూ ఆదిత్య ని దీవించి పైకి లేపారు..
తన మెడలో ఉన్న రుద్రాక్ష మాలను తీసి, ఆదిత్య మెడలో వేసారు...
ఆదిత్య ఆ రుద్రాక్ష మాలని చూసి, గోవింద రావు వైపు చూశాడు..
ఆయన ఆదిత్య తో " ఇది ఎల్లప్పుడూ నీతోనే ఉంచుకో.. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి.. జాగ్రత్తగా వెళ్లి రా నాయనా...!!"అంటూ సాగనంపారు..
సమయం ఉదయం 10 గంటలు.....!!
ఆదిత్య తన లగేజ్ అంతా సర్దుకుని తాతగారికి వెళ్లి వస్తానని చెప్పి, కారులో శ్రీశైలం వైపు బయలు దేరి వెళ్ళి పోయాడు..
ఆదిత్య కారు వెళ్ళిన వెంటనే అక్కడకు ఆదిత్యకు పెదనాన్న వరసయ్యే సత్యనారాయణ రావు అక్కడికి వచ్చాడు...
గుమ్మంలోనే నుంచి ఉన్న గోవింద రావు ని చూస్తూ.." ఆదిత్య వెళ్లిపోయాడా..!! చిన్నాన్న..?? "అని అడిగాడు.
ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఊపాడు.
అలా మౌనంగా ఉన్న గోవింద రావు నీ, సత్యనారాయణ రావు.." ఏమైంది చిన్నాన్న..?? అలా దిగులుగా, మౌనంగా ఉన్నారు..!!
ఏదైనా సమస్యా...??"అని అడిగాడు..
"అవును" అని సమాధానం ఇచ్చాడు గోవింద రావు..
"ఏం సమస్య చిన్నాన్న...??"అని రెట్టించి అడిగాడు సత్యనారాయణ రావు..
" మన ఆదిత్య పెద్ద ప్రమాదం లో ఉన్నాడురా..!!"అని దిగులుగా అన్నాడు గోవింద రావు
" మన ఆదిత్య కి ప్రమాదమా..?? అసలు ఏమైందో పూర్తిగా చెప్పండి చిన్నాన్న..??"
"వాడి చుట్టూ ఒక భయంకరమైన దృష్ట శక్తి తిరుగుతోంది..! అది వాడి చావు కోసం ఎదురు చూస్తోంది...! నిన్న రాత్రి కూడా వాడిని చంపాలని చూసింది..! కానీ సమయానికి నేను అక్కడ ఉండబట్టి సరిపోయింది..! లేకపోతే వాడికి చాలా ప్రమాదం జరిగి ఉండేది..! ఇక్కడ ఉన్నంతవరకు వాడికి ఎటువంటి ప్రమాదం ఉండదు.. కానీ ఎక్కువ కాలం ఇక్కడ ఉంచడం కుదరదు కదా...!! కాబట్టి తప్పక పంపించాల్సి వచ్చింది...!!"అని బాధగా చెప్పాడు.. గోవింద రావు....
" మరి ఇప్పుడు ఎం చేద్దాం..?? చిన్నాన్న..??" అని అడిగాడు సత్యనారాయణ రావు..
"ఆ దైవమే వాడిని కాపాడాలి...!!"అంటూ తన రెండు చేతులు గాలిలోకి ఎత్తి నమస్కరించాడు గోవింద రావు...
సమయం రాత్రి 8:00...!!
ఆదిత్య చాలా చిరాకుగా ఉన్నాడు..
దానికి కారణం....
ఆదిత్య ఇంకా శ్రీశైలం చేరలేదు....!!
ఏమిటో తెలియదు బయలుదేరిన దగ్గర నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి..
విజయవాడ నుండి బయలుదేరిన తర్వాత
నంబూరు దగ్గర మూడు గంటల పైనే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు..
ఆ తర్వాత గుంటూరులో కారు చెడిపోయింది... అక్కడ ఒక గంట పైనే ఆలస్యం అయ్యింది..
అలా ఒక చోట రోడ్డు రిపేర్ పనులనీ ప్రయాణం చాలా మెల్లగా సాగింది..
చలికాలం కావడం చేత త్వరగా చీకటి పడింది..వారి ప్రయాణానికి పొగమంచు ఒక అడ్డంకిగా మారింది...
ప్రస్తుతానికి శ్రీశైలానికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు..
ఆదిత్య చిరాకుగా డ్రైవర్ తో....!!
"ఇంకా ఎంతసేపు పడుతుంది డ్రైవర్..??"అన్నాడు..
"సారీ సార్...!! నేను కూడా స్పీడ్ గా నే వెళ్ళడానికి ట్రై చేస్తున్నా...!! కానీ ఇవాళ టైం అస్సలు బాలేదు...!!ఒకదాని తర్వాత ఒకటి కలిసి వచ్చినట్టుగా జరిగాయి...!! ఒక గంట ఓపిక పట్టండి సార్..!! శ్రీశైలానికి వెళ్ళిపోదాం..!!"అని అన్నాడు డ్రైవర్ ఆదిత్య తో..
ఆదిత్య కూడా చేసేదేమీ లేక సైలెంట్ గా మొబైల్ తీసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాడు....!! ఇంకా శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం చూపిస్తోంది...!!
ఫోన్ ఆఫ్ చేసి రోడ్డు వైపు చూడసాగాడు ఆదిత్య...!!
ఆరోజు పొగమంచు చాలా ఎక్కువగా ఉంది..
ఆ పరిస్థితులలో కూడా వారి కారు వేగంగా రోడ్డుపై పరుగులు తీస్తోంది..
ఇంతలో ఒక్కసారిగా వాళ్ళ కారు ముందు కి ఒక ఆకారం పరిగెత్తుకుని అడ్డుగా వచ్చి నుంచుంది..
"ఏయ్.......!!!!" అంటూ ఆదిత్య, డ్రైవర్ ఇద్దరు ఒక్కసారిగా అరిచారు..
ఆ ఆకారాన్ని ని పక్కకి తప్పించి,
ఒక్క సారిగా బ్రేక్ వేయగానే కారు పల్టీలు కొట్టింది..
కొంతసేపటికి........!!!
పల్టీ కొట్టిన కారు రోడ్డు పక్కగా పడి ఉంది..
ఆ కారులో ఆదిత్య, డ్రైవర్ సృహా తప్పి ఉన్నారు..
ఇద్దరూ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల,
తలకి తీవ్ర గాయాలు ఏమీ తగలలేదు...
కొంతసేపటికి ఆదిత్య కి సృహా వచ్చింది..
మెల్లగా కష్టపడి కారు బయటకు వచ్చాడు..
కాలికి గాజు ముక్క గుచ్చుకోవడం వల్ల,
గాయమై రక్తం కారుతోంది....
ఆదిత్య తన బ్యాగ్ ఓపెన్ చేసి, అందులో ఉన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి,
ఆ గాయానికి కట్టు కట్టుకున్నాడు...!!
మెల్లగా కుంటుకుంటూ డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు... ఎలాగోలా కష్టపడి అతన్ని బయటకు లాగాడు...
అతని నేలమీద పడుకోబెట్టి, బ్రతికి ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ముక్కు దగ్గర వేలుపెట్టి శ్వాసని పరీక్షించాడు..
అతనికి శ్వాస ఆడుతుంది... బ్రతికే ఉన్నాడని సంతోషపడ్డాడు....కానీ అతని నడుము పక్కన గాజుముక్క గుచ్చుకొని ఉంది.. దాని వల్ల రక్తం కారి పోతుంది...
దాన్ని ఎలాగైనా ఆపాలని తన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉన్న కాటన్ (దూది) తీసుకుని,
గాజు ముక్క తీసేసి, గాయాన్ని అదిమి పట్టి కట్టు కట్టాడు.. రక్తస్రావం కొంత మేర తగ్గింది. కానీ పూర్తిగా ఆగలేదు.
చుట్టూ చీకటిగా ఉంది... పొగమంచు విపరీతంగా కురుస్తోంది...
ఆదిత్య కి తన మొబైల్ గుర్తొచ్చింది...
డ్రైవర్ ని నేలపై పడుకోబెట్టి, కారులో ఉన్న తన మొబైల్ వెతకసాగాడు.. కొంతసేపటికి మొబైల్ దొరికింది....!! అది స్విచ్ ఆఫ్ అయి ఉంది.
వెంటనే తన ఫోన్ ఆన్ చేశాడు.. కానీ సిగ్నల్ లేదు... ఎవరి సహాయం కోసం పిలవాలన్నా అవకాశం లేకుండా పోయింది....
తన బ్యాగ్‌లో టార్చ్ లైట్ తీసుకున్నాడు...
డ్రైవర్ ను జాగ్రత్తగా రోడ్డు పక్కన పడుకో బెట్టి, అతనికి కొద్ది దూరంలో ఒక మంట వేశాడు...
ఎవరైనా వస్తారేమోనని రోడ్డు కి రెండువైపులా చూడసాగాడు..
అతని నిరీక్షణకు ఫలితంగా ఒక పది నిమిషాలకి
ఒక బైక్ శ్రీశైలం దారివైపుగా రాసాగింది..
ఆదిత్య దానికి ఎదురెళ్లి, ఆ బైక్ ని ఆపాడు..
ఆ బైక్ మీద ఇద్దరు యువకులు ఉన్నారు...
ఆ బైక్ మీద వెనకాల కూర్చున్న యువకుడు
గాయాలతో ఉన్న ఆదిత్య ని చూసి
"ఏమైంది మీకు..?? ఎవరు మీరు??"
అని అడిగాడు..
" నాపేరు ఆదిత్య..!! శ్రీశైలం సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఎస్ఐని.. మేము వస్తున్న కార్ కి యాక్సిడెంట్ అయింది.. డ్రైవర్ కి పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి...
ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా అందడం లేదు.. డ్రైవర్ పరిస్థితి బాలేదు.. దయచేసి మీరు వెళ్లేదారిలో ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ చేయండి..."అని రిక్వెస్ట్ చేశాడు...
బండి డ్రైవ్ చేస్తున్న యువకుడు బండి దిగుతూ..
" తప్పకుండా సార్..!! ఇంతకి డ్రైవర్ ఎక్కడ..??"అని అడిగాడు...
"అదిగో అక్కడే ఉన్నాడు.." అని మంటూ వెలుగుతున్న వైపు చేయి చూపించాడు..
బైక్ నీ వేగంగా డ్రైవర్ ఉన్న దగ్గరికి పోనిచ్చాడు..
అతన్ని ఎత్తుకొని బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొన్నారు..
" జాగ్రత్తగా తీసుకెళ్లండి..
రక్తం కారిపోతుంది.."అని వారితో అన్నాడు..
" డోంట్ వర్రీ సార్...!! మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము.!మరి మీరు ఎలా వస్తారు..?"
అని సందేహంగా అడిగాడు యువకుడు..
" నా సంగతి వదిలేయండి.. ముందు అతని కాపాడండి.." అని అన్నాడు..
"ఓకే సార్..!!" అని బైక్ స్టార్ట్ చేసి వేగంగా శ్రీశైలం వైపు పోనిచ్చారు..
వాళ్ళు వెళ్ళిపోగానే ఆదిత్య తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు...
పడిపోయిన కారు దగ్గరకు వెళ్లి, బ్యాక్ సైడ్ డోర్ ని బలవంతంగా ఓపెన్ చేసాడు..
అందులో సీటు విరిగి ఆదిత్య ముందు పడింది..
దానిని చేతిలోకి తీసుకొని, చలి నుంచి తప్పించుకోవడానికి మంట దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నాడు...
చుట్టూ మంచు విపరీతంగా పడుతోంది...
ఎవరైనా వస్తారేమోనని టార్చ్ లైట్ వేసి రోడ్డు వైపు చూడసాగాడు ఆదిత్య..
ఆదిత్య రోడ్డు వైపు చూస్తుండగా
ఆ పొగమంచులో నుండి ఒక ఆకారం ఆదిత్య వైపు నడుచుకుంటూ రాసాగింది..
ఆదిత్య కి ఒక్కసారిగా తన కారు కి అడ్డు వచ్చిన ఆకారం గుర్తొచ్చింది...
దాన్ని చూడగానే ఆదిత్య కి పట్టలేనంత కోపం వచ్చింది..
దాని వైపే కోపంగా చూస్తూ..!! " హేయ్..!! ఎవరు నువ్వు..?? నీకేమైనా పిచ్చి పట్టిందా..!!
మా కారు కి ఎందుకు అడ్డం వచ్చావ్..??" అని అరిచాడు.
ఆ మాటకి ఆకారం ముందుకు రాకుండా వెనక్కి వెళ్లి చీకట్లో కలిసిపోయింది...
" హేయ్ ఆగు..?? ఎక్కడికి వెళ్లి పోతున్నావ్..?? " అంటూ ఆ ఆకారం వైపు వేగంగా ఉంటూ నడవసాగాడు.. కానీ ఎక్కువ దూరం నడవలేకపోయాడు..
విపరీతమైన చలి వల్ల, కాలికి తగిలిన నొప్పి మరింతగా పెరిగిపోయింది..
ఇక దాని వెంట పడడం అనవసరమనీ,
తను చలిమంట వేసుకున్న వైపు తిరిగాడు..
అటు తిరిగిన ఆదిత్య పెద్దషాక్ తగిలినట్టు బిగుసుకుపోయి అలానే ఉండిపోయాడు..
ఎందుకంటే.....!!
అంతకు ముందు తను ఉన్నచోట చూసిన ఆకారం.. ఇప్పుడు తను చలి మంట వేసిన దగ్గర ఉంది..
ఇంకా ఉంది.....!!!
Posts: 3,475
Threads: 163
Likes Received: 10,962 in 2,210 posts
Likes Given: 7,219
Joined: Nov 2018
Reputation:
758
కథ, కథనం ఆసక్తికరంగా ఉన్నాయి
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 6
అంతకు ముందు తను చూసిన ఆకారం తను వేసిన చలిమంట దగ్గర నుంచొని ఉంది....
పొగమంచు తీవ్రంగా ఉండటం వల్ల, దాని మొఖం కనిపించటంలేదు...
కానీ చలి మంటల వెలుగులో దాని ఆకారం
మసక మసకగా కనిపించసాగింది....!
ఆదిత్య బుర్ర మొత్తం దాని ఆలోచనలతో వేడెక్కి పోయింది...
"అసలు ఏమిటి ఇది..?? మనిషా..?? లేక నిజంగా దెయ్యమా..?? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా...!! ఇంతలోనే అక్కడికి ఎలా వెళ్ళింది..? "అని మనసులో అనుకుంటూ దానివైపే చూస్తూ నుంచున్నాడు..
ఆదిత్య చూస్తూ ఉండగానే, అది పక్కనే ఉన్న లోయ లోపలికి వెళ్లసాగింది.
ఆదిత్య దానిని ఎలాగైనా పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు...
ఎలాగైనా దానిని ఆపడానికి కాలిమీద షూట్ చేద్దామంటే,తన దగ్గర గన్ లేదు.
ఇక వేరే మార్గం లేక...!!
దాని వెంట పడి పట్టుకోవాలని,
అది వెళ్లిన వైపే నడవసాగాడు.
ఆదిత్య తన గాయం కారణంగా
మెల్లగా కుంటుకుంటూ చలి మంట దగ్గరకు చేరుకున్నాడు.
ఆకారం వెళ్ళిన వైపు అంతా చిమ్మ చీకటి గా ఉంది. ఆ చీకటిలో దానిని వెతికేందుకు తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేశాడు..
ఎందుకైనా మంచిది అని, కార్లో ఉన్న టూల్ కిట్ నుండి ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాడు...
మెల్లగా ఆకారం వెళ్లిన వైపే టార్చ్ లైట్ వేసుకొని నడవడం ప్రారంభించాడు...
ఆ ప్రాంతం మొత్తం......!!!
పొగమంచు విపరీతంగా కురుస్తోంది..!!
ఆకాశం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకున్నాయి..!!
చుట్టూ కీచురాళ్ళ శబ్దం తో ఆ ప్రాంతం అంతా గోలగోలగా ఉంది...
రాళ్లు చిన్న ,చిన్న, గోతులతో దారి మొత్తం చాలా అధ్వానంగా ఉంది..
ఆదిత్య మెల్లగా నడవసాగాడు...
అలా కొంత దూరం నడిచి, ఆ లోయ కింది భాగానికి చేరుకున్నాడు.....!!
కిందికి చేరుకున్న తర్వాత టార్చ్ లైట్ తో ఆకారాన్ని వెదకసాగాడు....
ఆదిత్య టార్చ్ లైట్ తో వెతుకుతుండగా..
ఇంతలో...........!!!
అప్పటివరకు గోల గోల గా ఉన్న
ఆ ప్రాంతమంతా ఉన్నట్టుండి ఏదో మంత్రం వేసినట్టు నిశ్శబ్దంగా మారిపోయింది..
అలా టార్చ్ లైట్ తో వెతుకుతుండగా ఆదిత్య వెనకనుండి ఉన్నట్టుండి ఏదో వేగంగా వెళ్ళింది..!!!
ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన వెనక వైపు టార్చ్ లైట్ వేసి చూశాడు..!!
ఎవరు లేరు...!!
మరలా ఆదిత్య వెనక నుంచి ఏదో వేగంగా వెళ్ళింది..
ఆదిత్య ఉలిక్కిపడి అదేమిటో అని
టార్చ్ లైట్ వేసి చూశాడు..
కానీ ఏమీ కనిపించలేదు....!
ఆదిత్య మనసు ఎందుకో కీడు శంకించ సాగింది...!
ఇంకా తను అక్కడ ఉండటం మంచిది కాదని ఆదిత్య అర్థం అయింది...
వెంటనే తిరిగి రోడ్డుమీదకి వెళ్లబోతుండగా......!!
ఆ కటిక చీకట్లో ఉన్నట్టుండి ఒక స్త్రీ ఏడుపు వినిపించ సాగింది...
కడుపులో పేగులు మెలి తిప్పుతున్నట్లు, మహా వికృతంగా ఉందా రోదన......!!
ఆ ఏడుపు వినగానే ఒక్కసారిగా ఆదిత్య శరీరం ఝల్లుమంది..
గుండె వేగం పెరిగిపోయింది.
భయంతో ఒక్క క్షణం కొయ్య బారి పోయాడంటే...!!
ఆ ఏడుపు ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు....
వెంటనే తేరుకున్న ఆదిత్యకి అప్పుడు గుర్తొచ్చింది.....
ఆ ఏడుపే ముందురోజు రాత్రి తను తన తాతగారి ఇంట్లో విన్నాడు...
ఆ క్షణం ఆదిత్య కి తన మీద దుష్టశక్తుల ప్రభావం ఉందన్న తాతగారి మాటలు గుర్తొచ్చాయి....!!!
వెంటనే తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తడిమి దైవ స్మరణ చేసుకున్నాడు...!!
ఇంకా అక్కడ ఉండడం ఏ మాత్రం తనకి క్షేమం కాదని గ్రహించిన ఆదిత్య వేగంగా రోడ్డు వైపు నడవబోతుండగా..
ఇంతలో ఆ భయంకర స్త్రీ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది..
ఆ ఏడుపు ఎందుకు ఆగిపోయిందో అని ఆదిత్య ఆలోచిస్తుండగా అతని వెనకనుండి "అబ్బా...!!ఇక్కడున్నారా మీరు...!!" అని పిలుపు గట్టిగా వినిపించింది..
ఆ పిలుపుకి ఆదిత్య గుండె ఝల్లుమంది..!! ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు...
అతని వెనుక దూరంగా సత్యం టార్చిలైట్ పట్టుకొని అతని వైపు వస్తున్నాడు...
ఆదిత్య ఆశ్చర్యపోతూ...!!!
"నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటి....?? అసలు నేను ఇక్కడ ఉన్నాను. అని నీకెలా తెలిసింది ..???"అని అన్నాడు..
"ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, మీరు ఇక్కడ ఎక్సిడెంట్ అయి దెబ్బలతో ఉన్నారని....!!
మీకు సహాయం కావాలని చెప్పారు.." అని అన్నాడు సత్యం.
"నువ్వొక్కడివే వచ్చావా..?? మిగతా వాళ్ళు రాలేదా...!!??" అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య..
సత్యం ఆదిత్య దగ్గరికి వచ్చి..."ఇద్దరు సిక్ లీవ్ లో ఉన్నారు సార్.!! ఇద్దరు మాత్రమే స్టేషన్ లో ఉన్నారు...!! మీ కోసం నేనొక్కడినే అంబులెన్స్ తో ఇక్కడికి వచ్చాను... కానీ మీరు కనిపించక పోవడంతో మీ కోసం వెతుకుతున్నాను. అంబులెన్స్ మీ కోసం రోడ్ మీద వెయిట్ చేస్తోంది..."అని సమాధానమిచ్చాడు....
ఆ మాటలు విన్న ఆదిత్య తేలికగా ఊపిరి పీల్చుకుని...." సత్యం..!! మనము ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు.. వెళ్లిపోవాలి..." అంటూ పైకి లేచి..
" సత్యం నాకు దెబ్బలు తగిలాయి..!!
నడవడానికి కొంచెం సాయం చెయ్..!!" అని తన చేయి చాపాడు..
సత్యం మాత్రం చెయ్యి అందుకోకుండా ఆదిత్య తో "అంటే సార్...!! ఇక్కడ చీకటి ఎక్కువగా ఉంది..!! మనం వేగంగా వెళ్లాలంటే నేను టార్చ్ లైట్ తీసుకుని ముందు మీకు చూపిస్తూ వెళ్తాను...!!
మీరు మెల్లగా నా వెనకాల రండి..!! లేకపోతే ఆలస్యం అవుతుంది.." అంటూ ఆదిత్య సమాధానం కోసం ఎదురు చూడకుండా ముందుకు కదిలాడు..
ఆదిత్య కూడా సరే..! అంటూ తన
టార్చ్ లైట్ తీసుకొని మెల్లగా కుంటుకుంటూ ముందుకు కదిలాడు....!!
ముందు టార్చ్ లైట్ పట్టుకొని సత్యం దారి చూపిస్తూ నడుస్తూ ఉండగా...!!
అతని వెనుక ఆదిత్య నడవసాగాడు....!!
అలా ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు నడుస్తూ ఉండగా సత్యం లోయ పైకి కాకుండా కిందకి నడవసాగాడు..
అది గమనించిన ఆదిత్య నడవడం ఆపి..
సత్యంతో.." అదేంటి...?? ఇటు వైపు వెళ్తున్నాం...?? పైకి కదా మనం వెళ్లాల్సింది.??" అని అడిగాడు...
సత్యం నడవటం ఆపి, వెనక్కి తిరిగి చూడకుండా " ఈ వైపు దారి
పైకి వెళ్ళడానికి బాగుంటుంది సార్..!! నేను ఈ వైపు నుండే వచ్చాను..!! రండి...!!" అని అంటూ ఆదిత్య సమాధానం కోసం ఎదురు చూడకుండా నడక ప్రారంభించాడు..!!
ఆదిత్య చేసేదేమీ లేక సత్యాన్ని అనుసరించాడు..
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు...!!
ఆదిత్య కి సత్యం ప్రవర్తన వింతగా తోచింది..
ఎందుకంటే స్టేషన్ మొత్తం మీద సత్యం ఒక్కడే తనతో చనువుగా ఉంటాడు.. అలాంటిది తను అంత సైలెంట్ గా ఉండడం ఇదే మొదటిసారి....!!
ఏదో విధంగా సత్యంతో మాట్లాడాలని
" స్టేషన్లో విశేషాలేంటి సత్యం...??"అని అడిగాడు ఆదిత్య..
" విశేషాలు ఏమి లేవు సార్..!! అంతా మామూలే...!!" అని అన్నాడు సత్యం..
"అయితే విశేషాలు ఏమీ లేవు అంటావ్..??"
అని నవ్వుతూ అడిగాడు ఆదిత్య...
" మా దగ్గర ఏముంటాయి సార్..!! విజయవాడ లో ఉన్న మీ తాత గారి దగ్గర నుంచి వచ్చింది మీరు..!! విశేషాలు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి...???" అన్నాడు సత్యం....
"ఏయ్ సత్యం ఆగు...!!"అని అరిచాడు ఆదిత్య..
సత్యం నడుస్తున్న వాడు కాస్తా ఆదిత్య అలా అరిచేసరికి ఒక్కసారిగా
ఆగి పోయాడు...
" నేను విజయవాడలో మా తాత గారింటికి వెళ్ళాను అని నీకు ఎలా తెలుసు...??"అని అడిగాడు ఆదిత్య..
" మీరే చెప్పారు కదా సార్...!!"అని బదులిచ్చాడు సత్యం..
" నువ్వు అబద్దం చెప్తున్నావ్ సత్యం..!!
నేను అందరితో, నీతో సహా అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నానని చెప్పాను...!! అంతే గాని మా తాతగారు ఇంటికని చెప్పలేదు. మరి నీకెలా తెలిసింది...??"అని గద్దించాడు ఆదిత్య...
సత్యం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అటువైపు తిరిగి నుంచొని ఉన్నాడు....
ఆదిత్య కి సత్యం మీద, ఒక్కసారిగా కోపం అనుమానం పెరిగిపోయాయి...
" మాట్లాడవే సత్యం..?? నిన్నే అడిగేది..??"
అని కోపంగా అరిచాడు ఆదిత్య....!!
సత్యం లో మాత్రం ఎటువంటి కదలిక లేదు..
సత్యం అలా మాట్లాడకుండా నిలబడేసరికి ఆదిత్య కి కోపం వచ్చి సత్యం భుజంపై చేయి వేసి " అలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి..?? నిజం చెప్పు..!!" అని అరుస్తూ...
సత్యాన్ని తన వైపు తిప్పాడు......!!
అంతే.......!!!!
సత్యం ఒక భయంకర పిశాచి గా మారిపోయాడు.....
ఆ భయంకర రూపాన్ని చూసిన ఆదిత్య గట్టిగా అరుస్తూ వెల్లకిలా పడి పోయాడు....!!!!
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 7
ఆ భయంకర రూపాన్ని చూసిన ఆదిత్య గట్టిగా అరుస్తూ వెల్లకిలా పడి పోయాడు...
ఎర్రటి కళ్ళతో,పదునైన కోరలతో, ఊడలు వంటి జడలతో,నలుపు రంగుతో కూడిన దృఢమైన శరీరంతో అతి భయంకరంగా ఉంది.
అది కోపంతో కోరలు బయట పెట్టి,
ఆదిత్య మీదకి దూకబోతుండగా,
ఆదిత్య ప్రాణభయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.....
అలా కళ్లు మూసుకుని కొన్ని క్షణాల పాటు భయంతో అదే స్థితిలో ఉండి పోయాడు.
కొంతసేపటికి ఆదిత్య తన కళ్ళు తెరిచాడు.
ఇప్పుడు తన ఎదురుగుండా ఆ రాక్షసి లేదు. ఆదిత్యకి తనని చంపకుండా ఎందుకు వదిలేసిందో అర్థం కాలేదు.
ఆలా కొన్ని క్షణాల పాటు ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు..
కొంతసేపు గడిచిన తర్వాత తన పక్కనే పడి ఉన్న టార్చ్ లైట్ తీసుకోని ఆ రాక్షసి కోసం చుట్టూ చూశాడు.కానీ అది ఎక్కడా కనిపించలేదు..
ఇక తను అక్కడ ఉండడం మంచిది కాదని, వెంటనే ఆ ప్రదేశం నుండి బయటపడాలని భావించి, వేగంగా పైకి నడవసాగాడు...
అలా తన గాయం వల్ల కలిగే నొప్పి కూడా లెక్కచేయకుండా చీకట్లో టార్చి లైటు వేసుకుని ఆదిత్య వేగంగా లోయ నుంచి పైకి ఎక్కసాగాడు....
ఆలా నడుస్తుండగా ఆదిత్య చేతిలో ఉన్న టార్చిలైట్ ఉన్నట్టుండి వెలగడం ఆగిపోయింది....
అయినా సరే ఆదిత్య ఆగిపోకుండా వేగంగా నడవసాగాడు...!!
అలా వేగంగా నడుస్తున్న ఆదిత్యను చీకట్లో ఏదో వేగంగా ఢీకొట్టింది....
అది ఢీకొట్టిన వేగానికి ఆదిత్య తూలిపొయి,
లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోసాగాడు...
అలా దొర్లుకుంటూ వెళ్లి, ఒక పెద్ద బండరాయిని ఢీ కొట్టాడు..
అది తలకి బలంగా తగిలింది...
ఆ దెబ్బకి ఆదిత్య సృహ కోల్పోయాడు..
అలా కొంత సేపు గడిచిన తర్వాత....
ఆదిత్య కి మెళుకువ వచ్చింది...
తలకి దెబ్బ బలంగా తగిలింది..
చేతితో తడిమి చూసుకున్నాడు..
చేతికి ఏదో కొద్దిగా తడి తగిలింది...
అది రక్తమని ఆదిత్య కి అర్థం అయ్యింది..
వెంటనే తన షర్టు చించి, తలకి తగిలిన దెబ్బకి కట్టు కట్టుకున్నాడు.
మెల్లగా పైకి లేచాడు...
చుట్టూ చూశాడు..కటిక చీకటి......!!!
ఏమీ కనిపించటం లేదు..
టార్చ్ లైట్ ఎక్కడో పడిపోయింది...!!
ఆదిత్య తన జేబులను తడిమి చూసుకున్నాడు...
తన జేబులో సెల్‌ఫోన్ ఉంది... కానీ సిగ్నల్ లేదు..
సెల్‌ఫోన్ లో, టార్చ్ లైట్ ఆన్ చేశాడు...
తను ముళ్ళ పొదల మధ్య పడిపోయాడు.
మెల్లగా పైకి లేచాడు....!!
అక్కడ పక్కనే పడి ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని, దాని ఆసరాతో మెల్లని నడక ప్రారంభించాడు...
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..
ఒక్కసారిగా గట్టిగా వీచడం మొదలైంది..
ఆకాశం మొత్తం దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి...
ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో, పెద్దవాన మొదలైంది...
ఆ గాలికి ఆదిత్య సరిగా నడవలేకపోతున్నాడు.. వర్షం కారణంగా నేల మొత్తం బురద గా మారిపోయింది.
కాళ్ళు పట్టు తప్పుతున్నాయ్...
అయినా సరే...!!
ఆదిత్య అక్కడ నుండి ఎలాగైనా బయటపడాలని రోడ్డు పైకి మెల్లగా ఎక్కసాగాడు..
అలా ఎక్కుతూ ఉండగా...!!
వర్షం కుండపోతగా కురవ సాగింది...
ఆదిత్య సగం దూరం వచ్చేసరికి,
పై నుంచి నీటి ప్రవాహం,బురద ఎక్కువై,
ఒక్కసారిగా కిందికి రావడంతో..
ఆదిత్య కాళ్ళు పట్టు తప్పి కిందికి జారిపోయాడు..
అలా జారు కుంటూ వెళ్లి, ఒక పెద్ద బావి లాంటి అగాధంలో పడిపోయాడు...
దాన్ని ఆనుకొని ఒక పెద్ద చెట్టు ఉంది. అది పూర్తిగా ఎండిపోయి ఉంది..
ఆదిత్య ఆ అగాధంలో పడి పోయే ముందు మొదట ఆ చెట్టుకు తగులుకుని వెళ్ళాడసాగాడు.. కానీ కొమ్మ బలహీనంగా ఉండడం వల్ల, అది విరిగి ఆ అగాధంలో పడిపోయాడు..
ఆ అగాధంలో ఆదిత్య ఏమీ కనిపించడం లేదు... ఆకాశంలో మెరిసే మెరుపుల వల్ల, ఆ అగాధం కొద్దికొద్దిగా కనిపించసాగింది..
పైనుంచి పడడం వల్ల, ఆదిత్య కి కుడి చెయ్యి విరిగింది..!!
ఆ భాదని భరిస్తూ.. ఆ అగాధం నుండి ఎలా బయటపడాలి అని ఆకాశం వైపు చూస్తూ ఆలోచించసాగాడు...
ఆదిత్య అలా పైకి చూస్తున్నప్పుడు ఆకాశం పెద్దగా మెరిసింది..
అలా ఆకాశం మెరిసినప్పుడు ఒక ఆకారం ఆ అగాధం పైన కనిపించింది..
కానీ స్పష్టంగా కనిపించడం లేదు...
ఒక్కసారిగా ఆకాశం పెద్దగా మెరిసింది...
ఒక పెద్ద పిడుగు ఆ సమీపంలో పడి,
ఆ ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా కాలిపోయింది...
ఆ మంటల వెలుగులో ఆ రూపం స్పష్టంగా ఆదిత్య కి కనిపించసాగింది..
అది ఎవరో కాదు...
అంతకుముందు తన మీద దాడి చేయాలని చూసిన భయంకర రాక్షసి.........!!
ఆదిత్య చూస్తుండగానే అది మెల్లగా
ఆ అగాధం గోడల మీద నుండి లోపలికి రాసాగింది...
దాన్ని చూసిన ఆదిత్య భయంతో తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను పట్టుకోబోయాడు..
కానీ అది అతని మెడలో లేదు...
ఎక్కడో జారిపోయింది...
ఆదిత్య కి ఒక్కసారిగా ధైర్యం మొత్తం సన్నగిల్లి పోయింది...
తనకి చావు సమీపించింది అని భయపడి కళ్ళు మూసుకుని పరమేశ్వరుడిని ప్రార్థించసాగాడు....
అక్కడ విజయవాడలో.....!
గాఢనిద్రలో ఉన్న గోవింద రావు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు..!!
లేచిన వెంటనే పూజ మందిరం వైపు నడవసాగాడు..!!
గోవింద రావు గది బయట నిద్రపోతున్న పనివాడు అలికిడి అవ్వడంతో నిద్ర లేచి, పూజా మందిరం వైపు వెళ్తున్న గోవింద రావు దగ్గరకు వెళ్ళాడు..
గోవింద రావు ను ఏదో అడగబోతుంటే
పనివాడిని మాట్లాడవద్దు అన్నట్లుగా చేయి చూపించి,"నువ్వు వెంటనే వెళ్లి, సత్యనారాయణ రావునీ పిలుచుకు రా..!త్వరగా...!!" అంటూ తన పూజ మందిరంలో కూర్చున్నాడు...
ఆ పనివాడు మారు మాట్లాడకుండా వేగంగా అదే వీధిలో ఉండే సత్యనారాయణ రావు దగ్గరకు వెళ్లి "అయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు" అని చెప్పి వేగంగా వెంట తీసుకువచ్చాడు...
సత్యనారాయణ రావు కూడా ఏమైందో అని ఖంగారు పడుతూ గోవింద రావు ఇంటికి చేరుకున్నాడు..
కానీ ఇంటి లోకి రాగానే పూజామందిరంలో కూర్చుని ఉన్న గోవింద రావు ని చూస్తూ ఆయన దగ్గరకు వెళ్లి ఏమైంది చిన్నాన్న..?? త్వరగా రమ్మని కబురు పంపారు..!! అని అడిగాడు...
ఇప్పుడు మాట్లాడే సమయం లేదు..
అక్కడ ఆదిత్య పెద్ద ప్రమాదంలో ఉన్నాడు.. ఇప్పుడు మన సహాయం తనకి కావాలి...
నేను చెప్పినట్టు చెయ్..
ఒక చిన్న హోమ గుండాన్ని సిద్ధం చెయ్..అని చెప్పాడు. సత్యనారాయణ రావు వెంటనే ఒక చిన్న హోమ గుండాన్ని సిద్ధం చేశాడు..
వెంటనే ఇద్దరూ కలిసి హోమ గుండం లో సమిధలు,నెయ్యి పోసి రగిల్చారు...
సత్యనారాయణ రావు తో "నువ్వు మృత్యుంజయ మహా మంత్రాన్ని జపిస్తూ ఉండు.. నేను మహా శక్తి ఆవాహన చేస్తాను.." అని అంటూ గోవింద రావు హోమగుండంలో నెయ్యి పోస్తూ.. శక్తి ఆవాహన మంత్రాలు పఠించ సాగాడు..
సత్యనారాయణ రావు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించసాగాడు....
అక్కడ లోయలో....
తగలబడుతున్న చెట్టు వెలుగులో ఆ భయంకర రాక్షసి ఆదిత్య కి స్పష్టంగా కనిపించసాగింది.. మెల్లగా ఆ అగాధం లోకి
పాకుతూ ఆదిత్య వైపు రాసాగింది...!!
ఆదిత్య భయపడుతూ ఎటు వెళ్ల లేక దాని వైపే చూస్తూ ఉండిపోయాడు...
అక్కడ సత్యనారాయణ రావు, గోవింద రావు,
బిగ్గరగా మంత్రాలు చదువుతూ క్రతువుని జరిపించ సాగారు..
ఆదిత్య మెడలో ఉండే రుద్రాక్ష మాల జారీపోయి,
ఆ అగాధం కి కొద్ది దూరంలో నేలపై పడి పోయి ఉంది..
ఆ భయంకర రాక్షసి ఆదిత్య దగ్గరకు మెల్లగా సమీపించసాగింది..
అది ఆదిత్య దగ్గరకు వచ్చింది...
దగ్గరకు రాగానే ఆదిత్య గొంతుని గట్టిగా పట్టుకుని, పైకి లేపి విసిరేసింది..
ఆదిత్య ఎగురుతూ వెళ్ళి ఒక గోడను గుద్దుకొని కిందపడిపోయాడు.
అసలే శరీరమంతా గాయాలు, పైగా చెయ్యి కూడా విరిగిపోయి ఉంది.. ఇప్పుడు అది విసిరి కొట్టడం వల్ల, శరీరమంతా రాళ్లతో గాయాలయ్యాయి...
మరల అది ఆదిత్య వైపు కోపంగా చూస్తూ
ఆదిత్య దగ్గరకు వెళ్ళసాగింది..
అటుపక్క విజయవాడలో గోవిందరావు ఇంట్లో పూజ నిర్విఘ్నంగా జరుగుతోంది... ఇద్దరు మంత్రాలను పఠిస్తూ, హోమ గుండానికి సమిధలు నెయ్యి సమర్పిస్తున్నారు...
ఇంకా ఉంది......!!!!!
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 67
Threads: 0
Likes Received: 23 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2021
Reputation:
0
•
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
06-03-2026, 07:03 AM
(This post was last modified: 06-03-2026, 07:05 AM by SivaSai. Edited 2 times in total. Edited 2 times in total.)
Part - 8
ఆదిత్య కి గట్టి దెబ్బలు తగిలి ఉండడం వల్ల, గాయాల నుంచి రక్తస్రావం అధికంగా అవ్వడం వల్ల, సృహ తప్పి పడిపోయాడు.
సృహ తప్పి నేలపై పడి ఉన్న ఆదిత్య వైపు ఆ భయంకర రాక్షసి చంపడానికి అతని దగ్గరకు వెళ్తోంది....!!
విజయవాడలో....!!!
గోవింద రావు సత్యనారాయణ రావు నిరాటంకంగా హోమాన్ని జరిపిస్తున్నారు...!!
మంత్రాలని జపిస్తూ మూలికలతో కూడిన
ఒక మూటను హోమ గుండానికి సమర్పించాడు గోవింద రావు....!!
అలా సమర్పించిన వెంటనే హోమగుండంలో అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లాయి....
వెను వెంటనే అవి శాంతించి హోమజ్వాలల నుంచి ఒక కాంతి రేఖ ప్రత్యక్షమై మాయమై పోయింది...
అక్కడ లోయలో.....!!!
ఉరుములు మెరుపులతో వర్షం కుంభవృష్టిగా కురువ సాగింది....!!
ఆకాశంలో విపరీతమైన మెరుపులు పుట్టాయి...
పిడుగుల శబ్దాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది...!!
ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక పిడుగు
రుద్రాక్ష మాలకి కొద్ది దూరంలో పడింది...
పిడుగు దానికి దగ్గరగా పడటంతో
అక్కడ ఒక చిన్న ప్రేలుడు సంభవించింది.
ఆ దాటికి ఆ రుద్రాక్ష మాల ఎగిరి,
ఆ అగాధం లో ఆదిత్య కి దగ్గరలో పడింది.
అప్పుడే ఆకాశం నుంచి ఒక కాంతి రేఖ రుద్రాక్ష మాల మీద పడింది..
కాంతిరేఖ పడిన వెంటనే ఆ రుద్రాక్ష మాల కాంతివంతంగా మెరిసిపోతూ, వెలుగులు విరజిమ్మసాగింది...
ఆ భయంకర రాక్షసి దాని వైపు చూస్తూ ఉండగానే,
ఆ రుద్రాక్ష మాల వెలుగులు చిమ్ముతూ
ఒక పెద్ద సర్పం లాగా మారిపోయింది....!!!
అది ఆరడుగులు పైన పొడవుతో పడగ విప్పి, వెలుగులు విరజిమ్ముతూ ఆ రాక్షసిని చూసి,
కోపంతో బుసలు కొడుతూ,ఆదిత్య మీదకి వెళ్తున్న
ఆ భయంకర రాక్షసికి అడ్డు గా నిలబడింది...
తనకి అడ్డుగా వచ్చినందుకు ఆవేశంతో ఆ సర్పం మీదకి దాడి చేయడానికి ఆ రాక్షసి వెళ్లబోతుండగా....!!!
ఆ సర్పం తన పొడవైన తోకతో దాని శరీరాన్ని చుట్టి దూరంగా విసిరేసింది..
ఆ రాక్షసి తిరిగి ఆ సర్పం పై దాడి చేద్దామని ఎంత ప్రయత్నించినా, దాని శక్తి ముందు ఆ రాక్షస శక్తి నిలవలేకపోయింది.
ఆ సర్పం ఆ రాక్షసి పై ఇష్టం వచ్చినట్టు దాడి చేయ సాగింది..
అంతటితో ఆగకుండా తన నోరు తెరచి అగ్నిగోళాలు సృష్టించి,ఆపకుండా వర్షంలా దానిపై కురిపించింది......!!
ఆ సర్ప శక్తి దాటికి తట్టుకోలేక,
ఆ భయంకర రాక్షసి వికృతంగా కేకలు వేస్తూ అక్కడ నుండి మాయమై పోయింది....!!
మరల ఆ సర్పం తన భారీ రూపాన్ని విడిచి,
ఒక మామూలు సర్పం లాగా మారిపోయింది...
అది అలా పాకుతూ వెళ్లి, ఆదిత్య మీదకు వెళ్లి, అతని మెడకు చుట్టుకొని, రుద్రాక్ష మాల గా మారిపోయింది....!!
కొంతసేపు గడిచిన తరువాత.....!!!
వర్షం పెద్దది కావటం వల్ల నిరంతరాయంగా వర్షపు నీరు ముఖం మీద పడడంతో కొద్ది సేపటికి ఆదిత్యకి తెలివి వచ్చింది.
ఒక్క క్షణం తనకి ఏమవుతుందో, ఎక్కడున్నాడో.. ఆదిత్య కి అర్థం కాలేదు..అంతా గందరగోళంగా ఉంది..
కొంతసేపు కుదుటపడిన తర్వాత...!!
పరిస్థితి అర్థమై, ఆ రాక్షసి కోసం చుట్టూ చూశాడు. కానీ అది ఎక్కడా కనిపించలేదు.. తనని చంపకుండా ఎందుకు వదిలిందో.? ఆదిత్య కి అర్థం కాలేదు..!!
పైకి లేవటానికి ప్రయత్నించాడు.. కానీ తన శక్తి సరిపోలేదు.. బయటికి వెళ్దాం అంటే దారి కనిపించలేదు..
ఆదిత్య బాధతో నిట్టూరుస్తూ..!!
కూర్చున్నవాడు వెనక్కి వాలి,
గుండెలపై చేయి వేసుకున్నాడు...
అప్పుడు తగిలింది అతని చేతికి రుద్రాక్ష మాల....!!
ఆశ్చర్యంతో..వెంటనే దాన్ని తీసి చూసుకున్నాడు..
తన మెడలో కి ఎలా వచ్చిందో అర్థం కాలేదు..
కానీ అది మెడలో ఉండడం వల్లే ఆ రాక్షసి తనని ఏమీ చేయలేక పోయిందని ఆదిత్య కి అర్థమైంది..!!
దాన్ని తన మెడలో వేసిన తాత గారికి మనస్ఫూర్తిగా తన మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు..
ఇక వెంటనే బయట పడే దారి కోసం ఆలోచించసాగాడు..
వర్షం చాలా ఉధృతంగా వస్తుంది.
ఆకాశం మొత్తం ఉరుములు మెరుపులతో బీభత్సంగా ఉంది..
ఆదిత్య పైకి చూస్తూ రుద్రాక్షమాల చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకుని తనకు బయటపడే దారి చూపించమని ప్రార్థించ సాగాడు...
ఉన్నట్టుండి ఆ అగాధం మొదల అంచులు విరిగిపడ్డాయి..
ఆ విరిగి పడిన చోటు నుంచి విపరీతంగా వర్షపు నీరు లోపలికి చొచ్చుకుని రాసాగింది..
చొచ్చుకు వస్తున్న ఆ వర్షపు నీటితో వేగంగా
ఆ ప్రాంతమంతా నిండిపోసాగింది.
లోపల విపరీతంగా నీళ్ళు రావడం వల్ల,
ఆదిత్య మెల్లగా ఆ నీటిలో తేలసాగాడు..
ఒక అర్థగంట లోనే ఆ అగాధం నుండి తేలుకుంటూ బయట పడ్డాడు...
ఆదిత్య నుంచునే శక్తి లేక మెల్లగా పాక్కుంటూ దగ్గరలో ఉన్న చెట్టు కి ఆనుకొని కూర్చున్నాడు...
అక్కడ నుంచి ఎలా బయటపడాలో అని ఆదిత్య ఆలోచిస్తున్నాడు ...
అక్కడ ఆదిత్య కారు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో...
సెక్యూరిటీ అధికారి వెహికల్, అంబులెన్స్ యాక్సిడెంట్ జరిగిన కారు దగ్గర ఆగాయి..
సత్యం తో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్, శ్రీను, పైడిరాజు, అంజయ్య, వీరితోపాటు
అంతకుముందు ఆదిత్య తో మాట్లాడిన ఇద్దరు యువకులు కారు దిగారు..
అందరూ రైన్ కోట్ లు వేసుకొని ఉన్నారు..
వర్షం విపరీతంగా కురుస్తోంది...
అందరూ యాక్సిడెంట్ అయిన కారు దగ్గరికి చేరుకున్నారు...
సత్యం ఆ యువకులతో..
" ఆయనను చూసింది ఇక్కడైనా..?"అని అడిగాడు..
" అవును సార్..!!"అని బదులిచ్చాడు
ఆ యువకులలో ఒకడు..
" మరి ఎక్కడ..!!??" అని ప్రశ్నించాడు సత్యం..
"ఏమో సార్..!??" మాతో ఇక్కడే ఉంటాను.
అని చెప్పారు..!! ఒకవేళ వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికైనా వెళ్లి ఉంటారు.."
అని సమాధానమిచ్చాడు.
సత్యం మిగిలినవారితో..
" అందరం తలో దిక్కుకు వెళ్ళి వెతుకుదాం..!!"
అని
అంజయ్య, పైడిరాజు ల వైపు చూస్తూ..!!
"అన్నా..! మీ ఇద్దరు రోడ్డుకి రెండు వైపులా వెతుకుతూ ముందుకు వెళ్ళండి.. ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫాం చేయండి.. శ్రీను నువ్వు నాతోపాటు లోయలోకి రా...."అని వాళ్ళ తో చెప్పి..
ఆ ఇద్దరు యువకుల వైపు చూస్తూ...!"మీరిద్దరూ ఇక్కడే అంబులెన్సు దగ్గర ఉండండి.."అని చెప్పి వాళ్ల చేతికి ఒక వాకి టాకీ ఇచ్చి"ఒకవేళ మా సార్ తిరిగి వస్తే మాకు తెలియజేయండి.." అని చెప్పి వెతకడానికి బయలుదేరాడు..
ఇద్దరు కానిస్టేబుల్స్ రోడ్డు కి రెండువైపులా వెతకడానికి వెళ్లారు..
సత్యం, శ్రీను తో కలిసి
ఆదిత్య ని వెతకడానికి లోయ లోపలికి వెళ్ళసాగాడు..
వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది....
లోయ లోపలికి వెళ్ళే దారి అసలే అధ్వానం....!!
పైగా ఈ వర్షం వల్ల, అడుగు తీసి అడుగు పెట్టడానికి చాలా కష్టంగా ఉంది...!! అడుగు జారుతోంది.!!
ఇద్దరూ టార్చ్ లైట్ తీసుకొని...
" సార్..!! ఆదిత్య సార్..!! ఎక్కడున్నారు.?"
అని అరుస్తూ చుట్టుపక్కల వెతకసాగారు..
కానీ వాళ్ల అరుపులకంటే ఉరుముల శబ్ధాలే గట్టిగా వినబడుతున్నాయి.....
ఇద్దరు లోయ లోపలికి కొంత దూరం కిందకి దిగిన తర్వాత.....!!
"సత్యం ఇది చూడు" అని శ్రీను పిలిచాడు..
శ్రీను దగ్గరికి వెళ్లాడు సత్యం..
శ్రీను మాట్లాడకుండా నేలకేసి చూపించాడు.
అక్కడ ఒక టార్చ్ లైట్ అనిపించింది..
సత్యం దాన్ని చేతిలోకి తీసుకుని ఆన్ చేయడానికి చూశాడు.. అది వెలగలేదు..
" ఒక వేళ ఇది సార్ ది అయి ఉంటుందా..??. వెతుకుదాం పదా..!!" అంటూ శ్రీను ని
తొందర పెట్టాడు..
ఇద్దరు వేగంగా తమకి టార్చ్ లైట్ దొరికిన వైపు వేగంగా నడుస్తూ వెళ్ళసాగారు..
అలా మరి కొంత దూరం వెళ్ళిన తరువాత
వారికి ఆదిత్య చెప్పులు కనిపించాయి...
"మనం కరెక్ట్ గానే వెళ్తున్నామ్మ్..!! త్వరగా పద..!!"అంటూ సత్యం శ్రీను ని తొందర పెట్టాడు..
అలా వారు కొద్దిగా ముందుకి వెళ్ళగానే...!!
అప్పటివరకు ఉరుములు, మెరుపులు శబ్దాలు, వర్షం వల్ల వచ్చే గోల తప్ప వేరే శబ్దాలు లేని ఆ ప్రదేశంలో.....!!!
ఉన్నట్లుండి నక్కలు వికృతంగా ఊళలు వేయడం మొదలు పెట్టాయి...!!
మరలా ఆ స్త్రీ వికృత రోదన మొదలైంది..
అప్పుడు దాక ఆదిత్య ని వెతకడానికి వేగంగా నడుస్తున్న ఇద్దరూ ఒక్కసారిగా షాక్ తగిలినట్టు ఆగిపోయారు...
మరోవైపు.....!!!
అంజయ్య, పైడిరాజు ఇద్దరు రోడ్డుకిరువైపులా ఆదిత్య గురించి వెతకసాగారు..
అసలే కారు చీకటి, పైగా భీకరంగా కురుస్తున్న వర్షం,
వీటి వల్ల వాళ్ళు ఏమి సరిగ్గా చూడలేకపోతున్నారు..
అయినా సరే వాళ్ళ బాధ్యత మరవకుండా
అలా వెతుకుతూ చాలా దూరం వచ్చేసారు.
దగ్గర దగ్గరగా వాళ్ళు వెతకడం మొదలు పెట్టిన ప్రదేశం నుండి ఒక కిలో మీటర్ దూరం పైనే వచ్చేసారు..
" ఒరేయ్ పైడ్రాజు..!! సారు ఇంత దూరం వచ్చి ఉండరేమో అనిపిత్తాంది రా.....!?"అన్నాడు అంజయ్య
అంజయ్య వంక విచిత్రంగా చూశాడు పైడిరాజు..
"ఎందుకంటే ఆ కుర్రోళ్ళు ఆయనకి దెబ్బలు తగిలాయని సెప్పారు కదా..!! కాబట్టి ఇంత దూరం వచ్చుండడు....?"అన్నాడు అంజయ్య..
"వచుండరని నీకెట్ట తెలుసు..!!?"అనడిగాడు పైడిరాజు
"ఎందుకంటే వర్షం సూడు..!!
దీనమ్మ సావా కొడతాంది..! కాలికి దెబ్బ ఉన్నోడు..!! ఇంతదూరం వర్షం లో ఎట్టా వత్తాడ్రా..??"
అని అడిగాడు అంజయ్య...
పైడ్రాజు కొంతసేపు ఆలోచించి..
" నువ్వు సెప్పేది నిజమే రా...!! మరిప్పుడు ఏం సెద్ధాం..??"అని అడిగాడు..
"ఇటేపు ఏతకడం మానేసి, అటేపు పోయి నేతుకుదాం..!!" అని సలహా ఇచ్చాడు అంజయ్య...
సరే అని ఇద్దరూ వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా....
ఉన్నట్టుండి ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది..
ఆ మెరుపు వెలుగులో వాళ్ళకి దూరంగా ఒక ఆకారం కనిపించింది....
వెను తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఒక్క క్షణం ఆగి పోయారు......
Posts: 438
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Part - 9
ఆ మెరుపు వెలుగులో వాళ్ళకి దూరంగా ఒక ఆకారం కనిపించింది....
వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్న ఆ ఇద్దరు
ఆ ఆకారం కనిపించిన వైపు చూస్తూ ఉండిపోయారు..
"రేయ్ పైడ్రాజు...!! ఆడ కనిపిత్తాంది మన ఆదిత్య సారెనంటావా..??"ఆ ఆకారం వైపు నుంచి చూపు మరల్చకుండా పైడిరాజు ని అడిగాడు అంజయ్య...
" నాకెట్టా తెలుసు రా...?? ఆడేమైనా ముఖం కనపడతాందా..?? ఇంత రాత్రి ఏల
ఇంకెవరుంటారు..!!??
మన సారే అయ్యుంటాడు..!!"అని అన్నాడు అంజయ్య..
ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే... ఆకారం నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోసాగింది..
ఆ ఆకారం ముందుకి వెళ్ళి పోవడం చూసిన అంజయ్య కంగారు పడుతూ...
" రేయ్...!! పైడ్రాజు...!! సారు మనల్ని సూసినట్లు లేడు.. ముందుకి పోతున్నాడు రా...!!"అని అన్నాడు...
పైడిరాజు కూడా కంగారు పడుతూ...!!
" సారు ఆగండి..!!"అని అరుచుకుంటూ
ఆ ఆకారం వద్దకు పరుగెట్టాడు..
అంజయ్య కూడా అతని వెనకాలే పరుగెత్తసాగాడు..
విపరీతమైన వర్షం కారణంగా చేతిలో టార్చ్ లైట్ లో ఉన్నా సరే..!! ముందు వాళ్ళకి సరిగ్గా ఏదీ కనిపించడం లేదు...
వాళ్ళిద్దరు వేగంగా ఆ ఆకారం కనిపించిన
చోటు కి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు.. టార్చ్ లైట్ల తో చుట్టూ చూశారు.. కాని ప్రయోజనం లేదు....!!
" యాడికి పోయాడు రా..సారు...??
మనకి ఈడనే కనపడ్డాడు కదరా...??!!"అని అన్నాడు అంజయ్య
పైడి రాజు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా టార్చ్ లైట్ వేసి చుట్టూ చూడసాగాడు...!!
అక్కడినుంచి మరి కొద్ది దూరంలో అదే ఆకారం పైడిరాజుకి కనిపించింది....
వెంటనే అంజయ్య తో....
"రేయ్ అంజయ్య...!! ఆడ సూడు....!!"అక్కడ కనిపిస్తున్న ఆ ఆకారం వైపు చూపించాడు..
పైడిరాజు చూపించిన వైపు ఉన్న ఆకారాన్ని చూసి అంజయ్య ఆశ్చర్యపోతూ....!!!
" ఓర్ని...!! ఇప్పుడు దాకా ఈడనే ఉన్నాడు కదరా..!! అప్పుడే అంత దూరం ఎప్పుడు పోయాడు...!!
సరే రా పోయి తీసుకొద్దాం...!!"అని అంటూ ముందుకు వెళ్లబోతుండగా పైడిరాజు, అంజయ్య చెయ్యి పట్టుకుని ఆపేశాడు..
"ఎందుకురా..? ఆపినావు .??" అని అడిగాడు అంజయ్య...
అప్పుడు దాకా ధైర్యంగా ఉన్న పైడిరాజు మనసులో ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది.
అంజయ్య తో......!!
" రేయ్...! నాకేదో అనుమానంగా ఉంది రా....!
వెనక్కి వెళ్ళిపోదాం పదా....!!"అంటూ భయపడసాగాడు...
" అదే ఎందుకు అని అడుగుతున్నా...??"
అని అడిగాడు అంజయ్య...
" రేయ్..!! కూసింత బుర్రెట్టి ఆలోచించు..!! ఇప్పుడు దాకా ఈడున్నొడు....!! ఇప్పటికిప్పుడు ఆడకెట్టా పోయాడ్రా....!!??"అని అడిగాడు పైడి రాజు
అంజయ్య కొంతసేపు ఆలోచించి..
" అసలే చీకటి.. పైగా ఈ వర్షంలో ఏం కనిపిస్తాది రా...?! నువ్వేం బయపడమాక ...
వెళ్దాం పద...!!"అంటూ పైడిరాజు చెయ్యి పట్టుకుని ఆకారం వద్దకు వెళ్లబోతుండగా...
ఆ ఆకారం వాళ్ళ చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న లోయలోకి వెళ్ళిపోసాగింది....
అలా లోయలోకి వెళ్ళడం చూసిన అంజయ్య కంగారు పడిపోతూ...
" ఈయనేంది రా బాబు...!!
అట్టా లోయలోకి పోతన్నాడు...!!
రేయ్ పైడ్రాజు...!! తోరగా రారా..!!"
అంటూ పైడిరాజు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళబోతుండగా....
పైడిరాజు చేయి విదిలించుకొని...
" నాకెందుకో చాలా భయంగా ఉండాదిరా..!! నేను రాను..!! నువ్వు ఒక్కడివే పో..!!"అని అన్నాడు...
దానికి అంజయ్య కోప్పడుతూ.....!!
" రేయ్ పిరిగొడ్డు...!! వస్తే రా...!!నే పోతుండ...!!" అంటూ పైడిరాజు సమాధానం కోసం ఎదురు చూడకుండా వేగంగా ఆకారం వెళ్ళిన వైపు పరిగెత్తాడు...
పైడిరాజు ఎటూ వెళ్ళకుండా అలాగే రోడ్డుపై నిలుచుండిపోయాడు.....!!
అక్కడ సత్యం, శ్రీను ల పరిస్థితి......!!!
భయంకరమైన స్త్రీ వికృత రోదన.....
నక్కల ఊళలతో....
ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణాన్ని
తలపిస్తోంది...
ఆ అరుపులు వింటున్న శ్రీను అయితే భయంతో వణికిపోసాగాడు....
సత్యం మాత్రం కొంత ధైర్యంగా ఉన్నాడు..
"సత్యం..! మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి.. నాకు చాలా భయంగా ఉంది."అన్నాడు శ్రీను...
" చూడు శ్రీను.. ఇది అడవి.. ఇక్కడ ఇలాంటి అరుపులన్ని మామూలే....నువ్వు అనవసరంగా భయపడుతున్నావు." అని అన్నాడు సత్యం.
" సరే నువ్వు చెప్పేది నిజమే... అలాంటి అరుపులన్నీ మామూలే... మరి ఎవరో స్త్రీ ఏడుపు వినిపిస్తోంది.. దీనికి ఏమంటావు...??"అని అడిగాడు శ్రీను..
ఆ ప్రశ్నకి సత్యం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు....
మళ్లీ శ్రీను మాట్లాడుతూ..."నాకెందుకో మనం ఇక్కడ ఉంటే ప్రమాదం అనిపిస్తోంది.మనం వెళ్లి మిగతా వాళ్ళని పిలుచుకు వద్దాం..!!"అని అన్నాడు...
సత్యానికి కూడా అదే మంచిది అనిపించింది.
"సరే పద..!! మిగతా వాళ్ళని పిలుచుకు వద్దాం.."అంటూ ఇద్దరూ కలిసి వెనుదిరిగారు.
ఇద్దరూ వెనుదిరిగి కొద్దిగా ముందుకు వెళ్ళగానే...
ఆ స్త్రీ ఏడ్పు , నక్కల ఊళలు, అకస్మాత్తుగా ఆగిపోయాయి......
ఒక్కసారిగా వాతావరణం మరింత భయంకరంగా మారిపోయింది....
గాలి మరింత ఉధృతంగా వీచసాగింది...!!
పెద్ద పెద్ద వాన చినుకులకు..ఆ ఈదురు గాలి తోడై , వాళ్ళ మోఖానికి రాళ్లు తగిలినట్టు తగలసాగాయి..
వాళ్లకి అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టమైపోయింది...
అయినా సరే ఒకరి చేయి ఒకరు పట్టుకుని టార్చ్ లైట్ ల వెలుగులో మెల్లగా ముందుకు వెళ్ళసాగారు...
ఒక్కసారిగా వరద నీరు వచ్చినట్టు వాళ్ల కాళ్ల కింద వర్షపునీటి ప్రవాహం ఎక్కువైంది...
సత్యం వెనకాలే వస్తున్న శ్రీను జారిపోయాడు..
సత్యం శ్రీను చేయి పట్టుకోవడం తో తను కూడా జారిపోయాడు...
వాళ్ల చేతుల్లో ఉన్న టార్చ్ లైట్ లు కూడా జారి పడిపోయాయి.....
అలా జారిపోతున్న సత్యం చేతికి ఒక చిన్న మొక్క తగిలింది.. ఒక చేత్తో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు.. మరొక చేత్తో శ్రీను ని గట్టిగా పట్టుకున్నాడు..
మెల్లగా ఇద్దరు పైకి లేచారు...
పైకి లేచిన ఇద్దరు చుట్టూ చూడసాగారు..
కారు చీకటిగా ఉంది
ఆ చీకట్లో శ్రీనుకి కొద్దిదూరంలో వెలుగుతున్న
టార్చ్ లైట్ కనిపించింది..
వెంటనే వెళ్లి దాన్ని తీసుకున్నాడు...
ఆ టార్చ్ లైట్ వెలుగులో మరొక దాని కోసం కూడా వెతికాడు..
అది దాని పక్కనే ఉంది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ అది వెలగడం లేదు..
దాన్ని తీసుకెళ్ళి సత్యానికి ఇచ్చాడు..
సత్యం కూడా దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నించాడు..కానీ పనిచేయడం లేదు..
"మరి ఇప్పుడు ఏం చేద్దాం??"
అని అడిగాడు శ్రీను..
"మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి.
మన పరిస్థితి ఏమీ బాగోలేదు. పద పోదాం."అంటూ బయలు దేరారు...
వర్షం భీకరంగా కురుస్తూనే ఉంది...!!
గాలి కూడా చాలా గట్టిగా వేస్తోంది...
సత్యం టార్చ్ లైట్ తీసుకొని ముందు వెళ్తుండగా వెనకాలే శ్రీను వస్తున్నాడు.
ఇద్దరూ జాగ్రత్తగా మెల్లగా నడవసాగారు..
అలా నడుస్తూ ఉండగా సత్యం శ్రీనుతో... "శ్రీను..! ఈ ప్రదేశాన్ని గుర్తుపట్టావా...??"
అని అడిగాడు
"లేదు..!!అయినా ఇది ఏ ప్రదేశం.??"అని అడిగాడు...
" ఈ మధ్య ఒక ఫ్యామిలీ హత్య జరిగింది గుర్తుందా...??"అని అడిగాడు సత్యం
" నాకు గుర్తుంది...!! ఆ స్పాట్ కి నేను కూడా వచ్చాను కదా.. ఆ రోజు...!!"అన్నాడు శ్రీను..
"ఆ ప్రదేశం గుర్తుందా...!!??"అడిగాడు సత్యం...
"ఆ..! గుర్తుంది..! తుమ్మలబైలు ప్రాంతం అది..!! అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావ్...??"అని అడిగాడు శ్రీను...
" ఎందుకంటే..!! ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అదే...!!"అని చెప్పాడు సత్యం..
ఆ మాట విన్న శ్రీనుకి గుండె దడదడ లాడింది..
ఆ రోజు అతను చూసిన ఆ భయంకర శవాలు అతని కళ్ళముందు కదలాడాయి..
"ఏమంటున్నావ్ సత్యం...!! నువ్వు చెప్పేది నిజమా..??"అని అడిగాడు..
"నిజమే..!! నాకు ఇందాక మనం కారు దిగినప్పుడు తుమ్మలబైలు బోర్డు చూశాను.. నాకు కూడా అప్పుడే అర్థమైంది...!!"అని చెప్పాడు సత్యం...
"అయితే మనం వెంటనే వెళ్లి పోవాలి..
త్వరగా పధా...!!"అని కంగారు పెట్టాడు శ్రీను....
సత్యం కూడా నడక వేగం పెంచాడు.....!!
శ్రీను కూడా సత్యం తో పాటు వేగంగా నడవసాగాడు....
వారు నడుస్తున్న దారిలో రెండు వైపులా
గుబురు గుబురుగా పెరిగినా పెద్ద పెద్ద ముళ్ల పోదలు ఉన్నాయి..
వాటిని తప్పించుకుంటూ ముందుకు నడుస్తున్నారు...!!!
అలా వేగంగా నడుస్తున్నప్పుడు
శ్రీను కాలుజారి, ఆ పొదలలో పడ్డాడు..
ఒక పదునైన కొమ్మ శ్రీను భుజంలోకి దిగబడింది...
శ్రీను బాధతో గట్టిగా అరిచాడు....
సత్యం వెంటనే శ్రీనునీ పైకి లేవదీసి, దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు......
రక్తం ధారాపాతంగా కారుతోంది...
శ్రీను బాధతో అరవసాగాడు....
సత్యం మెల్లగా శ్రీను భుజంలో దిగబడిన కొమ్మ ని బయటకు తీసాడు...
కొమ్మ బయటకు తీసిన వెంటనే రక్తం వెల్లువల బయటకు వచ్చింది....
సత్యం ఆ గాయాన్ని గట్టిగా అదిమి పట్టాడు.
తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి, దగ్గర్లో ఉన్న కొన్ని మొక్కల నుండి ఆకులు పీకి,
వాటిని చేతులతో నలిపి, ఒక ముద్దలా చేసి, గాయానికి అదిమిపెట్టి కట్టు కట్టాడు..
శ్రీను ఆ బాధ భరించలేక, మెలికలు తిరిగిపోసాగాడు...
"కొంచెం ఓర్చుకో శ్రీను..!! పైకి వెళ్లాక అంబులెన్సు దగ్గర నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను...."అంటూ పైకి లేవ దీయడానికి ప్రయత్నించాడు...
పైకి లేచి నుంచున్న తర్వాత శ్రీను
తన ఎడమ కాలు పట్టుకొని బాధగా అరిచాడు..
ఏమైందని సత్యం చూడగా...
ఎడమకాలికి కూడా గాయం అయింది....
ఎడమ మోకాలి కింద భాగంలో లోతుగా
చీరుకు పోయి, రక్తం కారసాగింది..
సత్యం శ్రీను ని తిరిగి జాగ్రత్తగా చెట్టు దగ్గర
కూర్చో పెట్టేసాడు...
రక్తస్రావం కావడంవల్ల, శ్రీను మెల్లగా సృహ కోల్పోతున్నాడు....
సత్యం ఆలోచనలో పడ్డాడు...
శ్రీను ని తీసుకు వెళ్లే పరిస్థితి లేదు..
అలాగని తీసుకు వెళ్లకపోతే రక్తస్రావం ఎక్కువగా జరిగి, ప్రాణం పోయే ప్రమాదం ఉంది..
ఎలాగైనా మిగిలిన వారితో ఇక్కడకు వచ్చి, అంబులెన్స్‌లో హాస్పటల్ కి తీసుకెళ్ళాలి..
ఇంక ఈ ఆలోచన సరైనదని అనిపించింది..
శ్రీను తో " నువ్వు ఇక్కడే ఉండు.. నేను వెళ్లి మిగతా వాళ్ళని తీసుకు వస్తాను.."అని చెప్పాడు సత్యం...
మైకంలో ఉన్న శ్రీను సమాధానం చెప్పకుండా
" ఊ..!" అంటూ బదులిచ్చాడు.
సత్యం శ్రీను ని వదిలిపెట్టి, వేగంగా రోడ్డు వైపు వెళ్ళసాగాడు..
అలా సత్యం శ్రీను ని వదిలి పెట్టిన కొద్ది సేపటికే శ్రీను కి మెళుకువ వచ్చింది....
చుట్టూ కారుచీకటి..!!
మెరుపుల వెలుగులలో తప్ప ఆ ప్రదేశం కనిపించడం లేదు..
శ్రీను కంగారుపడుతూ" సత్యం.. సత్యం.."గట్టిగా పిలవసాగాడు...
ఆ భయంకరమైన స్త్రీ రోదన మరలా వినిపించ సాగింది
శ్రీనుకి భయం మరింతగా పెరిగిపోవడంతో ఇంకా గట్టిగా అరవసాగాడు.....!!
ఇంతలో........!!!
ఒక పెద్ద మెరుపు మెరిసింది.
ఆ మెరుపు వెలుగులో శ్రీను పక్కనే
ఒక నల్లటి ఆకారం కూర్చుని ఉంది..
ఇంకా ఉంది....!!
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
•
|