Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - శుచి శుభ్రత
#21
నా కోడలు
[Image: N.jpg]
అత్తగారి కథలు - పార్ట్ 12


సమర్థ్, జాగృతిల పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి. పెళ్ళి ఇంకోవారంలో ఉందనగా, జాగృతిని తన ఇంటికి తీసుకువెళ్లాడు సమర్థ్. జాగృతి వద్దని చెప్తున్నా వినలేదు. 



సమర్థ్ వాళ్ళమ్మ రాధకి, కాబోయేకోడలు పెళ్ళికిముందు అత్తగారింటికి రావడం నచ్చలేదు. అలా రావడం అశుభమని జాగృతి మీద కోప్పడి, ఇంట్లోకి రానివ్వలేదు. "ఇందులో జాగృతి తప్పులేదు, తను వద్దని చెప్తున్నా, నేనే తీసుకువచ్చానని" సమర్థ్ చెప్పినా వినలేదు రాధ. రాధ కోపాన్ని చూసిన జాగృతికి, వెనక్కితిరిగి వెళ్ళిపోవాలనిపించింది. సమర్థ్, జాగృతిని వెళ్ళద్దని చెప్పి, రాధని బతిమాలుకున్నాక, చాలాసేపటితరువాత జాగృతిని ఇంట్లోకి రానిచ్చింది. 



తనకి నచ్చిన తీరులో జాగృతిని అలంకరిస్తూ, "అమ్మాయిలు ఇలా ఉంటేనే మామీనాక్షికి నచ్చుతారు. ఈ ఊరిలో అందరూ ఇలాగే తయారవుతారు. " అని జాగృతితో చెప్పింది రాధ. 
రాధ తనని తయారుచేసిన విధానం జాగృతికి నచ్చకపోయినా, అప్పుడే రాధ కోపాన్ని చూసిన జాగృతి, ఆ విషయాన్ని రాధకి చెప్పలేకపోయింది. 'ఈవిడ ఆడపడుచుకి నేను ఎందుకు నచ్చాలి? ఆవిడ కోసం నేనెందుకు మారాలి? నాలా నేనుందుకు ఉండకూడదు. ' అనుకుంటూ పక్కవీధిలోనున్న రాధ ఆడపడుచు మీనాక్షి ఇంటికి వెళ్ళింది జాగృతి, రాధతో. 



రాధని, జాగృతిని చూసి సంతోషపడింది మీనాక్షి. "నీక్కాబోయే కోడలు కదూ. ఫొటోలో చూసాను. ఆయ్. పెళ్ళికి ముందే అత్తగారింటికి వచ్చేసిందే? నువ్వెలా ఒప్పుకున్నావ్? ఇంతకీ ఇప్పుడొచ్చింది? ఆయ్. " అంటూ గోదావరియాసలో రాధని పలకరించింది మీనాక్షి. 



"ఇప్పుడే వచ్చింది. వెంటనే నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. నీ అలక తీరి, ఇప్పటికైనా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షీ. " అంది రాధ. 



"నీక్కాబోయేకోడలిని ఇన్నాళ్లు చూడలేదు. కోపం ఉండదా మరి? ఆయ్. " అంది మీనాక్షి నవ్వుతూ. 



"రాధా, నేనూ ఒకే వయస్సువాళ్ళం. మంచి స్నేహితులం. అన్ని విషయాలు ఒకళ్ళతోఒకళ్ళం పంచుకుంటాం. తను చూపించిన పిల్లని నేను నా కోడలిగా చేసుకున్నాను. ఆయ్. రాధ కూడా నేను ఎంచిన పిల్లని కోడలిగా చేసుకోవాలికదా. కానీ, మీ పెళ్లిచూపులు, పెళ్లిమాటలు వేరే ఊరిలో జరిగాయి. రాధ నన్ను తీసుకెళ్లలేదు. ఆయ్. అందుకే మాట్లాడడం మానేసాను. " అంది మీనాక్షి జాగృతితో. 



"మీ అత్తయ్యగారేరి? ఆవిడకి కూడా నాక్కాబోయే కోడలిని చూపిస్తాను. " అంది రాధ. 



"అత్తగారండీ. మా రాధ తనకి కాబోయే కోడలిని తీసుకొచ్చింది. " అని కూర్చున్నచోటునుండే అత్తగారిని అరిచిపిలిచింది మీనాక్షి. మీనాక్షి భర్త, ముగ్గురు కొడుకులు వచ్చారు. కానీ, మీనాక్షి అత్తగారు రాలేదు. 



"మా అత్తగారికి బ్రహ్మచెవుడు. వినపడదు. గట్టిగా అరవాలి. " అని తలకొట్టుకుంటూ అంది మీనాక్షి. మీనాక్షి ఒకళ్ళతో మాట్లాడుతూ, ఇంకొకరిని చూడడాన్ని గమనించింది జాగృతి. 'మీనాల్లాంటి కళ్ళు అన్న పేరున్నఆవిడకి మెల్లకళ్ళు. ఆవిడ అత్తగారి బ్రహ్మచెవుడని వెక్కిరిస్తోంది. ఇంతకీ ఈ అత్తాకోడళ్లు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో!!' అనుకుంది జాగృతి. 



మీనాక్షి అత్తగారు కళ్లద్దాలు సరిచేసుకుంటూ, "నీకు కాబోయేకోడలు కదే రాధా. అయ్. " అని, మళ్ళీ అనుమానంగా చూస్తూ, "ఫోటోలోలాగ లేదేమిటే?" అని రాధని అడిగింది. 



"ఫోటోలో హుందాగా ఉన్న పిల్ల, ఇప్పుడు పల్లెటూరిపిల్లలా ఉందేంటి అనుకున్నాను. అప్పుడే మీ పద్ధతిలోకి మార్చేసావా?" అని రాధని అడిగాడు మీనాక్షి భర్త. 



"తప్పేముంది? కోడళ్ళని మొదటినుంచి మన పద్ధతిలోకి మార్చుకుంటేనే మంచిది. తరువాత మారుద్దామన్నా లొంగరు. నేను అనుభవిస్తున్నాను కదా. " అని తలపట్టుకుంది మీనాక్షి. 



"నీకేం తక్కువ చేసింది అది? నా పిన్ని మనవరాలిని కోడలిగా చేసుకున్నావ్. ఇంటిపనులన్నీ చక్కగా వచ్చు దానికి. " అంది రాధ, మీనాక్షితో. 



"చదువు సంధ్యా లేనిదాన్ని తెచ్చావ్. పనిసాయమైన చేస్తుందా అంటే అదీ లేదు. ఎంతసేపూ ఆ చంటిపిల్లకి పాలిస్తున్నాను అంటూ అంతపనీ నాచేతే చేయిస్తుంది. ఇంతకీ అదెక్కడ?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే, అందరికీ కాఫీలు పట్టుకునిరా. " అని అరిచింది మీనాక్షి. అందరెదురుగా మీనాక్షి తన కోడలిగురించి మాట్లాడిన విధానం జాగృతికి నచ్చలేదు. 'కూర్చున్నచోట నుండి కదలకుండా అత్తగారిని, కోడలిని పిలుస్తూ, పనులన్నీ ఈవిడే చేస్తున్నట్టు చెప్తోందేమిటి?' అనుకుంది జాగృతి. 



"అండీ అత్తయ్యగారండీ. తెస్తున్నానండి. ఇప్పుడే పాలు పెట్టానండి. " అని వంటిట్లోనుంచి చెప్పింది మీనాక్షి కోడలు. 'ఒకే వాక్యంలో అండీ అని నాలుగుసార్లు అంది. మీనాక్షి కోడలు బాగా భయస్తురాలైన అయ్యిండాలి లేదా వీళ్ళు బాగా భయపెట్టి అయినా అయ్యుండాలి. ' అనుకుంది జాగృతి. 



మీనాక్షి మాటలకి, మీనాక్షి పెద్దకొడుకు మొహం మాడిపోయింది. జాగృతిని చూసి, మాట మార్చడానికి ప్రయత్నిస్తూ, "చెల్లెమ్మా నువ్వు చాలా పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నావంట కదా? 
ఆయ్. " అని అడిగాడు. జాగృతి నవ్వుతూ అవునని చెప్పింది. "వాడు నా పెద్దకొడుకు. మా ఊళ్ళోనే తెలుగు మాస్టారుగా చేస్తున్నాడు. " అని చెప్పింది మీనాక్షి. 



"ఆయ్. నాక్కుడా చదువయ్యాక, నీలాగా, బావలాగ పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చెయ్యాలనుందక్కా. " అన్నాడు మీనాక్షి మూడోకొడుకు. 



"నాకు కూడా కంప్యూటర్స్ వచ్చు అక్కా. ఇక్కడ నా ఫ్రెండ్ తో కలిసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. వర్డ్, ఎక్సెల్ క్లాసులు నేనే తీసుకుంటాను. ఆయ్. సంపాదనే పెద్దగా లేదు. మీ కంపెనీలో ఉద్యోగాలేమైనా ఉంటే చూస్తావా అక్కా?" అని జాగృతిని అడిగాడు మీనాక్షి రెండో కొడుకు. 



"నేను చేస్తున్న కంపెనీలో అయితే కష్టం. సి, జావా లాంటి కోర్సలు ఏమైనా చెయ్యండి. అప్పుడు తప్పకుండా ప్రయత్నిద్దాం. " అంది జాగృతి. అక్కా, చెల్లీ అంటూ వరసలు కలిపి మాట్లాడడం నచ్చింది జాగృతికి. కానీ, ప్రతిసారి ఆయ్ అని ఎందుకు అంటున్నారో, దాన్ని అర్ధం ఏమిటో తెలియలేదు జాగృతికి. 



"నువ్వు దీన్ని ఉద్యోగం అడగటం ఏమిటిరా? నీకన్నా ఎక్కువ వచ్చా దీనికి?" అని మీనాక్షి రెండో కొడుకు మీద అరిచింది రాధ. జాగృతి ఉద్యోగం గురించి అందరూ గొప్పగా మాట్లాడడం, ముఖ్యంగా మొగవాళ్ళు పొగుడుతూ మాట్లాడడం నచ్చలేదు రాధకి. 



"చెల్లమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తోంది కదత్తా. ఉద్యోగం ఇప్పించగలదేమో. ఆయ్. వాడి ప్రయత్నాలు ఏవో వాడిని చూసుకొని. " అన్నాడు మీనాక్షి పెద్దకొడుకు. 



"మొగవాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తుందా? అంతుందా దీనికి? అయినా ఆడవాళ్లు, భర్తని, పిల్లల్ని చూసుకుంటే చాలు. బ్యాగులూపుకుంటూ ఉద్యోగాలకి వెళ్ళి ఎవరిని ఉద్దరించనక్కరేలేదు. " అంది రాధ కోపంగా కళ్ళెర్రజేస్తూ. రాధ ఎందుకు అలా అరుస్తోందో అర్ధంకాక, అందరూ ఒకళ్ళమొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. జాగృతికి మళ్ళీ రాధ కోపాన్ని చూసి, భయం వేసింది. 'నేను ఉద్యోగం చెయ్యటం ఈవిడకి ఇష్టంలేకపోతే పెళ్ళిచూపుల్లోనే చెప్పుండాల్సింది. కొంపదీసి, పెళ్ళయ్యాక ఉద్యోగం మాన్పించేస్తారా?' అనుకుంది మనసులో. 



"ఇంతకీ నా కోడలేది?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే. ఎప్పడికి తీసుకొస్తావ్ కాఫీలు?" అని అరిచింది మీనాక్షి. 



"అత్తయ్యగారండీ. తెచ్చేస్తున్నానండి" అంటూ వచ్చింది మీనాక్షి కోడలు. ఒకచేత్తో కాఫీ కప్పులున్న ప్లేట్ పట్టుకుని, ఇంకో చేత్తో, చెంకలోనున్న పిల్ల పడిపోకుండా పట్టుకుంది. 



"ఏమే. ఏం చేస్తున్నావ్ ఇంతసేపూ?" అని కోడలిని అడిగింది మీనాక్షి. 



"పిల్ల ఇప్పుడే లేచిందండి. ఆకలికి ఏడుస్తుంటే.. " అని మొహమాటంగా, చెప్పింది మీనాక్షి కోడలు. 



"చెప్పనా. ఇదీ దీన్ని వరస. ఎప్పుడూ పని ఎగ్గొట్టడానికి, పిల్లకి పాలిస్తున్నానండి అని చెప్తుంది. " అంది మీనాక్షి కోడలిని వెక్కిరిస్తూ. మీనాక్షి కోడలు మొహం మాడిపోయింది. 'చిన్న పిల్లకి పాలిస్తుంటే కూడా వెక్కిరిస్తారా? వీళ్ళేం మనుషులు?' అనుకుంది జాగృతి. మీనాక్షి కోడలు చేతిలోనున్న కాఫీ ప్లేట్ అందుకోవడానికి వెళ్ళి, "మీ పేరేంటండి?" అని అడిగింది జాగృతి. 



"నా కోడలు అని చెప్పాను కదా? మళ్ళీ అడుగుతావేం?" అంది మీనాక్షి జాగృతితో. 'కోడలిని, అదీ, ఇదీ అని పిలుస్తున్నారు. ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకోవడానికి, సాయం చెయ్యటానికి ఎవరూ వెళ్ళలేదు. కనీసం ఆవిడ పేరుని కూడా చెప్పనివ్వటం లేదు. వీళ్ళ పద్దతి ఏమీ బాగులేదు. ' అనుకుంది జాగృతి. 



అందరూ కాఫీలు తాగడం అయ్యాక, కాఫీ కప్పుల్ని తీసుకుని, మీనాక్షి కోడలితో మాట్లాడానికి వంటిట్లోకి వెళ్ళింది జాగృతి. పిల్లని ఎత్తుకుని, ఏడుస్తూ, వంటపని చేస్తోంది మీనాక్షి కోడలు. "మీరు ఒక నిమిషం కూర్చోండి. నేను చేస్తాను. " అంది జాగృతి, మీనాక్షి కోడలితో. 



"వద్దు వదినా. నేను చేసుకుంటాను. " అని కళ్ళు తుడుచుకుంటూ, "సారీ. మిమ్మల్ని వదిన అని పిలుస్తున్నాను. కానీ, మిమ్మల్ని నా పరిస్థితుల్లో ఊహించలేకపోతున్నాను. " అంది మీనాక్షికోడలు. 



"అదేమిటి అలా అంటున్నారు?" అంది జాగృతి అనుమానంగా. 



"నాకైతే, చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి, ఇలాంటి సంబంధం చేసుకున్నాను. మీరు ఇంజనీరింగ్ చదివి, పెద్ద పొజిషన్లో ఉన్నారని విన్నాను. మీరెలా ఈ సంబంధం ఒప్పుకున్నారో అర్ధం కావటంలేదు. " అని మొహమాటంగా అడిగింది మీనాక్షి కోడలు. 



"మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మొహమాటపడద్దు. " అంది జాగృతి. 



"మా అన్నయకి మీరు నచ్చారని, ఈ పెళ్ళికి ఒప్పుకుందిట మా పెద్దమ్మ. మీరు ఉద్యోగం చెయ్యటం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. బ్యాగులూపుకుంటూ ఆఫీసులకి వెళ్ళే ఆడవాళ్లంటే నాకు ఇష్టం లేదని నాతో సార్లు చెప్పింది మా పెద్దమ్మ. మీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను. పెళ్ళి తరువాత మీ ఉద్యోగం మాన్పించేస్తానని మా అత్తగారికి చెప్పింది. " అంది మీనాక్షి కోడలు. 



"ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా?" అని అడిగింది జాగృతి. 



"తెలియదు. తెలిసినా అన్న ఏమీ చెయ్యలేడు. మా పెద్ధమ్మంటే అన్నకి చాలా భయం. ఇంట్లో అందరూ మా పెద్దమ్మ మాటే వింటారు. " అని చెప్పింది మీనాక్షి కోడలు. 



జాగృతికి తన భవిష్యత్తు, మీనాక్షి కోడలి రూపంలో కళ్ళముందు కనపడింది. ఈ పెళ్ళి అయితే, ఈ అత్తగారికి కోడలిగా మాత్రమే మిగిలిపోతానని, "నా కోడలు" అనిపించుకుంటూ, తనని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతానని జాగృతికి అర్ధం అయ్యింది. 



'ఇలాంటి సంబంధం చేసుకుని, జీవితాంతం ఏడ్చేకంటే, చేసుకోకుండా ఉంటేనే మంచిది. ' అని నిర్ణయించుకుని, తన ఇంటికి వెళ్తూనే, ఈ పెళ్ళి కాన్సల్ చెయ్యమని ఇంట్లోవాళ్ళకి చెప్పింది. 



పేరు కూడా తెలియని మీనాక్షి కోడలికి, పెళ్ళికిముందే తన ఇంటికి తీసుకువెళ్లిన సమర్థ్ కి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. 
***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
పెళ్ళికి ముందు గొడవ
[Image: P.jpg]
పార్ట్ 13

జాగృతికి, సమర్థ్ కి పెళ్ళై 20 సంవత్సరాలు అయ్యింది. పెళ్లిరోజు ఉదయంనుండి, జాగృతికి పెళ్ళికిముందు జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి. 



*********************************************



జాగృతి నెమ్మదస్తురాలు, ఇంజనీరింగ్ చదివింది. హుందాగావుండే అమ్మాయి. జాగృతి, చెన్నైలో, ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేరోజుల్లో, సమర్థ్ తో పెళ్ళిచూపులు జరిగాయి. 



పెళ్ళిచూపులకి ముందు, సమర్థ్ ఫోటోని జాగృతి చూడలేదు. చామనఛాయకన్నా తక్కువ రంగులో, గుండుతో, పొట్టతో, చమటలు కారుతూ, మెంతి రంగు షర్ట్ వేసుకుని, అమ్మ బ్యాగ్ భుజాన వేసుకుని వచ్చాడు సమర్థ్. 'బాగా చదువుకున్నాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు!! మరి ఇలా ఉన్నాడేంటి?' అనుకుంది జాగృతి. మొదటి పరిచయంలోనే, "కడుపొస్తే ఉద్యోగం మానేస్తావా?" అన్న సమర్థ్ మాటకి, జాగృతికి ఒళ్ళుమండి, తనకి అబ్బాయి నచ్చలేదని వాళ్ళ అమ్మ లతకి చెప్పింది. సమర్థ్ కి, జాగృతి చాలా నచ్చి, జాగృతిని తప్ప, ఇంకెవ్వరిని చేసుకోనని వాళ్ళ అమ్మ రాధకి చెప్పాడు. 



ఎన్ని రోజులైనా, జాగృతివాళ్ళనుండి సమాధానం రాకపోవడంతో, జాగృతికి తను నచ్చలేదమో, తను జాగృతితో మాట్లాడింది తప్పేమో అన్న అనుమానం సమర్థ్ కి వచ్చింది. మెయిల్స్ లో, మెసేజెస్ లో జాగృతికి క్షమాపణ చెప్పాడు. "పెళ్లితరువాత నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు. నిన్ను నేను ఉద్యోగం మానెయ్యమని అడగను. " అని వాగ్దానం చేసాడు సమర్థ్. రాధ చేత లతకి ఫోన్ చేయించి, పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేసాడు. 
 
**********************************************************



సమర్థ్ ఉద్యోగం బెంగుళూరులో అవడంవల్ల, జాగృతిని చూడాలనుందని, బండి మీద తనతో సరదాగా తిరగాలనుందని, వీకెండ్స్ లో బెంగళూర్ రమ్మని చాలా సార్లు అడిగాడు సమర్థ్. పెళ్ళికిముందు తనకి అలాంటివి ఇష్టంలేదని, రానని చెప్పింది జాగృతి. ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోవాలి, పరిచయం పెంచుకోవాలి అంటూ, తరచూ జాగృతికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. తన గురించి సమర్థ్ ఎక్కువగా చెప్తుండడాన్ని, జాగృతి గురించి అడగకపోవడాన్ని గమనించింది జాగృతి. 'సమర్థ్ తీరే ఇంతా? లేక నన్ను ఇంప్రెస్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా?' అనుకుంది. 



ఎలాగైనా జాగృతిని కలిసి, జాగృతి చేత ఇష్టపడేటట్టు చేసుకోవాలని అనుకున్నాడు సమర్థ్. ఇంటర్వ్యూల కోసం అయితే, జాగృతి తప్పకుండా బెంగళూర్ వస్తుందన్న ఆలోచనతో, "పెళ్ళి తరువాత, నువ్వెలాగూ బెంగళూర్లోనే ఉద్యోగం చెయ్యాలి కదా. ఇక్కడ కంపెనీల్లో అప్లై చెయ్యడం మొదలుపెట్టు. నీ రెస్యూమె నాకు పంపించు. మా కంపెనీలో కూడా అప్లై చేస్తాను. " అన్నాడు. సమర్థ్ కి రెస్యూమె పంపించి, తను కూడా కొన్ని కంపెనీల్లో అప్లై చేసింది జాగృతి. 



రెండు కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. వాళ్ళు జాగృతిని ఇంటర్వ్యూ కోసం బెంగళూర్ రమ్మన్నారు. జాగృతి బెంగళూర్ వస్తున్న విషయం విని సమర్థ్ చాలా సంతోషించాడు. "ఇంటర్వ్యూ ఏ కంపెనీల్లో?" అని అడిగాడు. 



"సన్ మైక్రోసిస్టమ్స్, డెల్" అని చెప్పింది జాగృతి సంతోషంగా. 



"అంత పెద్ద కంపెనీల్లో నీకు ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నావా?" అన్నాడు సమర్థ్ అనుమానంగా. 



"నేను ఇప్పుడు చేస్తున్నది కూడా పెద్ద కంపెనీయే కదా. ఏమో రావచ్చేమో? ట్రై చెయ్యటంలో తప్పేముంది?" అంది జాగృతి నమ్మకంగా. 



"సర్లే. నీకు వచ్చినప్పుడు చూద్దాంగాని, మా కంపెనీలో HR కి నీ రెస్యూమె పంపించాను. వాళ్ళు ఇంటర్వ్యూ కి పిలుస్తారు. నువ్వొకసారొచ్చి, మొహం చూపిస్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. " అన్నాడు సమర్థ్ గర్వంగా. 



సమర్థ్ కి, గొప్పలు చెప్పుకోవడం అలవాటన్న విషయం జాగృతికి అర్ధమయ్యింది. కానీ, జాగృతికి తన మీద తనకి నమ్మకముంది. "రెస్యూమె ఫార్వర్డ్ చెయ్యటం వరకు పర్వాలేదు కానీ, నేను చూసుకుంటాను అంటున్నారేమిటి? అలా వచ్చే ఉద్యోగం నాకు వద్దు. నా అంతట నేను తెచ్చుకోగలను. మీరు నాకోసం కష్టపడనక్కరలేదు. " అంది కోపంగా. 



"సరే. నువ్వు ముందు బెంగుళూరు రా. వచ్చాక మిగతావన్నీ మాట్లాడుకుందాం. " అని సమర్థ్ మాటదాటవేసాడు. 



***************************************
 
జాగృతి బెంగుళూరు వెళ్ళి, రెండు కంపెనీల్లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చి, రెండింటిలోనూ సెలెక్ట్ అయ్యింది. 



ఇంటర్వ్యూలు అయ్యాక, జాగృతిని కలుస్తానన్నాడు సమర్థ్. జాగృతికి, సమర్థ్ ని ఎలా గుర్తుపట్టాలో అర్ధం కాలేదు. జాగృతి పెళ్ళిచూపులకి ముందు సమర్థ్ ఫోటో చూడలేదు. పెళ్ళిచూపుల్లో, సమర్థ్ అన్న మాటకి వచ్చిన కోపంతో, జాగృతి పెళ్ళిచూపుల తరువాత కూడా సమర్థ్ ఫోటో చూడలేదు. గుండుతో, పొట్టతో, చమటలు కారుతూ వచ్చిన సమర్థ్ మాత్రమే జాగృతికి గుర్తున్నాడు. 'ఇప్పుడూ అలానే ఉండి ఉంటాడా? ఏమైనా మారి ఉంటాడా? చూద్దాం. ' అనుకుంది జాగృతి. 



జాగృతి తన ఆలోచనల్లో తానుండగా, ఒకతను, బండి మీద స్పీడ్ గా వచ్చి, జాగృతి ఎదురుగా సడన్ బ్రేక్ వేసి, బండి ఎక్కమన్నాడు. అతన్ని చూసి భయపడి, వెనక్కి జరిగింది జాగృతి. "తొందరగా ఎక్కు జాగృతి. ఇంటర్వ్యూ కి టైం అవుతోంది. " అన్నాడతను. గొంతుని బట్టి, జాగృతికి అర్ధమయ్యింది వచ్చినతను సమర్థ్ అని. 



'పెళ్ళిచూపుల్లో చూసినట్టుగా అస్సలు లేడే!! కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని, ఎగురుతున్న జుట్టు తో, బండి మీద స్టైల్ గా వచ్చాడు!! పర్వాలేదు, స్మార్ట్ గానే ఉన్నాడు. ' అని జాగృతి అనుకునేలోపు, సమర్థ్ కున్న ఫ్రెంచ్ బియర్డ్, ఛాతి కనపడేటట్టు కిందవరకు విప్పున్న షర్ట్ బటన్స్ జాగృతి కళ్ళపడ్డాయి. 'పెళ్ళిచూపుల్లో చూసిన మనిషి నచ్చలేదనుకుంటే, ఇప్పుడు రౌడీలా, ఈ అవతారంలో కూడా నచ్చలేదు. ఇంతకీ అసలు సమర్థ్ ఎలా ఉంటాడు? అలానా, ఇలానా, లేక ఇంకేదైనా వేరే అవతారంలో కూడా ఉంటాడా?' అర్ధంకాలేదు జాగృతికి. 



"ఏమిటి ఆలోచిస్తున్నావు. ఇంటర్వ్యూ కి టైం అవుతోంది. పద. " అన్నాడు సమర్థ్, జాగృతిని కుదుపుతూ. 



"ఇంటర్వ్యూస్ అయిపోయాయి. " అంది జాగృతి. 



"నువ్వు వచ్చావని, మా కంపెనీలో ఇంటర్వ్యూ పెట్టించాను. ఇప్పుడు వెళ్ళాల్సింది అక్కడికి. " అన్నాడు సమర్థ్. 



'నేను అటెండైన ఇంటర్వూస్ గురించి అడుగుతాడనుకుంటే, సమర్థ్ ఇప్పటికిప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టించాడేంటి? ఎప్పటిలాగే నా గురించి అడగకుండా, తన గొప్పే చూపించుకుంటున్నాడు. నేను సెలక్టయిన విషయం చెప్పడం అనవసరం. ఈ ఇంటర్వ్యూ కూడా అటెండైతే పోయేదేముంది. ' అనుకుని, "నా అంతట నేను వెళ్తాను. మీరు బయలుదేరండి. " అంది జాగృతి. 



"ఏమిటి మొహమాటామా? పెళ్ళి చేసుకోబోయేవాళ్లమేగా! ఎన్నో రోజులనుండి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నానో తెలుసా. ఇప్పటివరకూ నా బండి మీద ఎవరినీ ఎక్కనివ్వలేదు. నువ్వే మొదటిదానివి. ఎక్కు ప్లీజ్. " అని బతిమాలాడు సమర్థ్. సమర్థ్ లో రొమాంటిక్ ఆంగల్ ని చూసి, నవ్వుకుని, సమర్థ్ బండి ఎక్కి, దూరంగా కూర్చుంది జాగృతి. 



"అంత దూరంగా కూర్చున్నావ్. పడిపోతావేమో. దగ్గరకి రావచ్చు. భుజం మీద చెయ్యి కూడా వేసుకోవచ్చు. " అన్నాడు సమర్థ్ నవ్వుతూ. జాగృతి, సమర్థ్ మాట విననట్టు ఉండిపోయింది. 



సమర్థ్, జాగృతిని తన ఆఫీస్ కి తీసుకువెళ్ళి, అందరికీ పరిచయం చేసాడు. పెళ్ళినిశ్చయమైనందుకు అందరూ అభినందలు తెలిపాక, ఇంటర్వ్యూ రూంలోకి వెళ్ళింది జాగృతి. వెళ్ళిన పది నిమిషాల్లోనే, కోపంగా బయటకొచ్చిన జాగృతిని చూసి, "ఏమయ్యింది? అలావున్నావ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదా?" అని అడిగాడు సమర్థ్ కంగారుగా. 



"కాలేదు. " అంది జాగృతి ముభావంగా. 



"నా ఆఫీస్ వాళ్ళ దగ్గర నా పరువుపోయింది. ఎలా ఇప్పుడు?" అన్నాడు సమర్థ్ తలపట్టుకుంటూ. 



"మీ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదని మీకు కోపంగా ఉందా? ఎందుకు 
సెలెక్ట్ అవ్వలేదో మీకు తెలియదు కదూ?" అని అడిగింది జాగృతి. 



"నువ్వు సమాధానాలు చెప్పి ఉండవ్. ఇంకేముంటుంది కారణం. " అన్నాడు సమర్థ్ కోపంగా. 



"అవును. సమాధానం చెప్పలేకపోయాను. మీకు కారణం తెలియనట్టు నటించకండి. మీకు తెలుసు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు, నా స్కిల్స్ వేరు అని. అయినా కూడా నాకు తెలియకుండా, నా రెస్యూమెని వీళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మొత్తం మార్చేశారు మీరు. అవునా? అబద్దం రెస్యూమె పెట్టి, నన్ను ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఎలా? ఇలా చేస్తే, ఎవరు సెలెక్ట్ అవుతారు? నాకు అస్సలు సంబంధంలేని ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూలో. నాకు అబద్దాలు చెప్పి, ఉద్యోగం తెచ్చుకోవడం ఇష్టంలేదు. అందుకే, ఈ ఉద్యోగం నాకు సరిపోదని చెప్పి, బయటకి వచ్చాను. " అంది జాగృతి. 



"నువ్వు ఏదోఒకటి చెప్తే, నేను తరువాత మేనేజ్ చేసుండేవాడిని. ఉద్యోగం నీకు సరిపోదని ఎందుకు చెప్పావ్? ఇక్కడే తెచ్చుకోలేనిదానివి, సన్ మైక్రోసిస్టమ్స్, డెల్ లో తెచ్చుకుంటానని గొప్పలు ఎందుకుకొట్టావ్?" అన్నాడు సమర్థ్ చిరాకుగా. 



సమర్థ్ చేసిన పనికి, అంటున్న మాటలకి జాగృతికి కోపంగా ఉంది. "ఇన్నాళ్ల నుంచి గొప్పలెవరు కొడుతున్నారు? పెద్ద కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకోలేనని ఇన్నాళ్లు నన్ను తక్కువచేస్తూ మాట్లాడారు కదా. ఈ రోజు నేనిచ్చిన రెండు ఇంటర్వ్యూల్లోను సెలెక్ట్ అయ్యాను. మీకీవిషయం ఇక్కడికి రాకముందే చెప్దామనుకున్నాను. కానీ, ఎప్పుడూ మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడమేతప్ప, నా గురించి ఎప్పుడైనా అడిగితే కదా నా గురించి మీకు తెలిసేది. " అని కోపంగా నడుస్తూ, సమర్థ్ ఆఫీస్ నుండి బయటకి వెళ్ళిపోయింది జాగృతి. 



జాగృతి విషయంలో తను మళ్ళీ తప్పుచేసాడన్న విషయం అర్ధమయ్యింది సమర్థ్ కి. జాగృతి వెనక పరిగెడుతూ, క్షమించమని కోరాడు. "ఇక మీతో మాట్లాడాల్సింది నాకేమిలేదు. నేను వెళ్తున్నాను. " అని వెనక్కి తిరిగి వెళ్ళింది జాగృతి. 



"సారీ చెప్తున్నాను కదా. కోపం తగ్గించుకో. పద. మా అక్క ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ అందరి ఎదురుగా వద్దు. " అన్నాడు సమర్థ్, జాగృతిని బతిమాలుతూ. 



"నేను రాను. ఇక రావాల్సిన అవసరం కూడా లేదు. " అంది జాగృతి. సమర్థ్ చేసిన పనికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. 
 
"అలా నాకు. నా తప్పు నాకు అర్ధమయ్యింది. సారీ. ఇంకెప్పుడూ నిన్ను తక్కువ చెయ్యను. ఎంత కష్టపడి అందరినీ మన పెళ్ళికి ఒప్పించానో తెలుసా? నిన్ను తప్ప ఇంకెవ్వరిని నేను చేసుకోననంటే, మా అమ్మకి కూడా నా మీద కోపం వచ్చింది. " అని జాగృతి చేతులుపట్టుకుని బతిమాలాడు సమర్థ్. 



'సమర్థ్ కి గొప్పలు ఎక్కువ. మాటతీరు కూడా సరిగ్గా లేకపోయినా, ఇంతలా ఇష్టపడుతున్నాడుకదా. పెళ్ళి తరువాత నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంటాడులే. ' అనుకుని సమర్థ్ తో వాళ్ళ అక్క పల్లవి ఇంటికి వెళ్ళింది జాగృతి. 



పెళ్ళిచూపులకి పల్లవి రాలేకపోయినందువల్ల, జాగృతి, పల్లవిని కలుసుకోవడం అదే మొదటిసారి. సమర్థ్ బండి మీద నుండి దిగుతున్న జాగృతిని చూస్తూనే, "పెళ్ళికిముందే, బండి మీద షికారులు కొడుతున్నారు ఇద్దరూ. " అంటూ రాధకి ఫోన్ చేసి చెప్పింది పల్లవి. 'ఇదేమిటి? మొదటి పరిచయంలోనే నా గురించి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తోందీవిడ?' అనుకుంది జాగృతి. 



కాసేపటి తరువాత, సమర్థ్ కి ఫోనిస్తూ, "అమ్మ నీతో మాట్లాడతానంది. " అంది పల్లవి. రాధ ఏమంటుందా అని భయపడుతూ, ఫోన్ తీసుకున్నాడు సమర్థ్. 



"అవును వచ్చిందమ్మా.. ఊరికనే కాదు.. ఇంటర్వూస్ ఉన్నాయని వచ్చింది.. మేము ఎక్కడా తిరగలేదు.. లేదు, భుజం మీద చెయ్యి వెయ్యలేదు.. దూరంగా ముళ్లమీద కూర్చున్నట్టు కూర్చుంది. నిజం. నమ్ము. " అన్నాడు సమర్థ్, రాధతో మాట్లాడుతూ. సమర్థ్ చెప్తున్న సమాధానాల్ని బట్టి, రాధ ఎం అడిగి ఉంటుందో అర్ధమయ్యింది జాగృతికి. 'ఈవిడకి నా మీద బాగానే అనుమానాలు ఉన్నట్టున్నాయి. ' అనుకుంది మనసులో. 



తరువాత జాగృతి కి ఫోన్ ఇచ్చాడు సమర్థ్. "అమ్మ నీతో మాట్లాడతానంటోంది. జాగ్రత్త. " అన్నాడు. జాగృతితో కాబోయే అత్తగారితో మాట్లాడడం అదే మొదటిసారి. పెళ్ళిచూపుల్లో, జాగృతిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు రాధ. సమర్థ్ భయాన్ని చూసి, రాధతో మాట్లాడడానికి జాగృతికి కూడా భయంవేసింది. 



రాధ, జాగృతితో, "నా కొడుకు నచ్చలేదా నీకు? " అని అరుస్తూ అడిగింది. రాధ ఆ సమయంలో, అలాంటి ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు జాగృతి. ఏం చెప్పాలో అర్ధంకాక, సమర్థ్ ని, పల్లవిని చూసింది. సమర్థ్, పల్లవి కూడా జాగృతి ఏం చెప్తుందా అని చూసారు. 



"ముందు మా వాడి బండి ఎక్కను అన్నావంట. ఎక్కిన తరువాత, దూరంగా ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నావట. భుజం మీద చెయ్యి వెయ్యమన్నా వెయ్యలేదట!! ఏంటి చెప్పు? ఏం తక్కువ నా కొడుకుకి? నువ్వేదో పెద్ద అందగత్తెనని, చదువుకున్నదానివని, ఉద్యోగస్తురాలినని ఫీల్ అయిపోతున్నావేమో. నాకొడుకు, నిన్ను చేసుకుంటాననడం నీ అదృష్టం. నీకన్నా మంచి సంబంధాలు చాలా వచ్చాయి మాకు. 25 లక్షలు ఇస్తామంటూ ఒకళ్ళు ఇంకా మా వెనకపడుతున్నారు. ఆ పిల్ల చక్కగా 10th పాస్ అయ్యింది. నీలాగా బాగ్ ఊపుకుంటూ ఆఫీసుకి వెళ్ళదు. చక్కగా ఇంటిపట్టునే ఉంటుంది. కడుపొచ్చినా నేను చూడక్కరలేదు. చెప్పు. ఏం చెయ్యమంటావ్? పెళ్ళి కాన్సల్ చేసెయ్యమంటావా?" అంది రాధ గదమాయిస్తూ. బిత్తరపోయింది జాగృతి. 



'ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది? అందుకేనేమో సమర్థ్ ఈవిడని పెళ్ళిచూపుల్లో మాట్లాడనివ్వలేదు. సమర్థ్ తో మాట్లాడాడుతూ, నా మీద అనుమానాలు వ్యక్తం చేసినావిడ, ఇప్పుడు పెళ్ళికి ఎందుకు ఎక్కనన్నావని, ఎక్కి ఎందుకు దూరంగా కూర్చున్నావని, భుజంమీద చెయ్యవెయ్యలేదని తిడుతోందేమిటి? ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తున్న నా కంటే, 10th చదివి, ఇంట్లో ఉండే పిల్లని మంచి సంబంధం అంటోందేమిటి? పెళ్ళిచూపుల్లో, సమర్థ్ అన్న మాటలు ఈవిడన్నమాట అయితే?' అనుకుంది జాగృతి. జాగృతికి, రాధ మాటతీరు, ఆలోచన తీరు అర్ధం కాలేదు. 



జాగృతి సమాధానం చెప్పకపోవడంతో విసిగిపోయిన రాధ, భర్త మాణిక్యాలరావుకి ఫోన్ ఇచ్చి, "నేను ఈ పెళ్ళి కాన్సల్ చేయించేస్తాను. ఇంటర్వ్యూకి వచ్చిందంట. " అని కోపంగా వెళ్ళిపోయింది. పరిస్థితి అర్ధంచేసుకున్న సమర్థ్, జాగృతి చేతిలోని ఫోన్ తీసుకున్నాడు. 



సమర్థ్, మాణిక్యాలరాతో మాట్లాడుతూ, "పెళ్ళికి ముందే అన్నీ అయిపోవడమేమిటి నాన్నా?.. ఏం జరిగింది మా ఇద్దరి మధ్య?.. ఏం మాట్లాడుతున్నారు మీరు?.. అసలు అక్క, అమ్మకేం చెప్పింది? అమ్మ మీకేంచెప్పింది?" అని అడిగాడు తలపట్టుకుంటూ. 



"అదంతా ఇప్పుడెందుకులేకానీ, నీకో ఫోటో ఈమెయిల్ చేశాను. చూసావా? ఆడపడుచు కట్నంగా వచ్చిన డబ్బుతో, అక్కకో నగ కొన్నాం. అక్కకి చూపించు. మీ ఆవిడకి కూడా అలాంటిదే కొన్నాం పెళ్ళిలో పెట్టడానికి. ఆవిడకి కూడా చూపించు. నీతోనే తిరుగుతోంది కదా. ఉంటాను. " అన్నాడు మాణిక్యాలరావు. సమర్థ్ కి, జాగృతి కి వాళ్ళేం తప్పు చేసారో అర్ధంకాలేదు. 



సమర్థ్, మాణిక్యాలరావు పంపిన ఫోటోని పల్లవి కి, జాగృతికి చూపించాడు. పల్లవి, ఆ ఫోటోని చూసి, "ఇద్దరికీ ఒకలాంటిదేనా? నాకేమి స్పెషల్ గా చేయించలేదా?" అంటూ కోపంగా వెళ్ళిపోయింది. జాగృతి చూస్తూనే, మొహం తిప్పేసుకుంది జాగృతి. షర్ట్ బటన్స్ కిందవరకూ విప్పుకుని, మేడలో నగ వేసుకుని, షాపులో మాణిక్యాలరావు తీయించుకున్న ఫోటో అది. 'సమర్థ్ కి రౌడీలా షర్ట్ బటన్స్ కిందవరకూ ఇప్పుకునే అలవాటు ఇక్కడనుండి వచ్చిందన్నమాట' అనుకుంది జాగృతి. 



కోబోయే అత్తగారింట్లోవాళ్లందరి మాటతీర్లకి, ప్రవర్తనలకి జాగృతికి మతిపోయింది. 'నలుగురికి నలుగురూ ఇలా ఉన్నారేంటి? నాకిది సరైన సంబంధమేనా? ఈ పెళ్ళి జరిగితే, ఇలాంటి వాళ్ళ మధ్య నేను బతకగలనా? మా వాడు నచ్చలేదా అని రాధ అడిగినప్పుడు నచ్చలేదని చెప్పేసుండుంటే బాగుందేమో! ఈ గోల తప్పేది. ' అనుకుంది. 



చెన్నై వెళ్ళగానే, జరిగినదంతా లతకి వివరంగా చెప్పింది జాగృతి. "ఈ సంబంధం నాకు కరెక్ట్ కాదనిపిస్తోందమ్మా. వాళ్ళ మాటతీర్లు, ఆలోచనలు, ప్రవర్తన ఏదీ నాకు నచ్చలేదు. నేను ఆ ఇంట్లో ఇమడలేననిపిస్తోంది. పెళ్ళి కాన్సల్ చెయ్యండమ్మా. ప్లీజ్. " అని బతిమాలుకుంది. 



"నువ్వు చెప్పిందంతా నాకు అర్ధమయ్యింది. కానీ, మీ నాన్నగారు పోయిన సంవత్సరంలో నీ పెళ్ళి చెయ్యాలి. అందరికీ పెళ్ళి శుభలేఖలు కూడా పంచేసాం. ఇప్పడు నువ్వు వద్దన్నా, కాబోయే మీ అత్తగారు కాన్సల్ చేస్తానన్నా, అందరి పరువులు పోతాయి. అబ్బాయికి నువ్వంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. పెళ్లయ్యాక, నీ గురించి మారతానని కూడా చెప్పదన్నావు కదా. నిన్ను ఇష్టపడినవాడు నీకోసం తప్పకుండా మారతాడు. నిన్నంకా బాగా అర్ధం చేసుకుంటాడు. మిగతావాళ్లందరూ ఎలా ఉంటే నీకెందుకు? కంగారుపడకు. అంతా మంచే జరుగుతుంది. " అని జాగృతికి నచ్చచెప్పింది లత. 



సమర్థ్ కి, జాగృతికి పెళ్ళి జరిగింది. 



******************************************************
'20 ఏళ్ళు ఇలాంటి మనుషుల మధ్యలో, అనుమానాల మధ్యలో, ఎలా బతికానా?' అనుకుంది జాగృతి. 






***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#23
అందరూ హీరో హీరోయిన్లే
[Image: A.jpg]
 (అత్తగారి కథలు - పార్ట్ 14)
రచన: L. V. జయ
 
పెళ్ళి తరువాత మొదటిసారి ఆఫీసుకి వెళ్ళింది జాగృతి. స్నేహితులు, కొలీగ్స్ అందరి అభినందలు అందుకున్నాక, కంప్యూటర్ ముందు కూర్చుని, పని మొదలు పెట్టాలనుకుంది కానీ, ఎంత ప్రయత్నించినా, పని మీద ద్యాస కుదరలేదు. అత్తగారింట్లోనున్న జరిగిన కొన్ని విషయాలు గుర్తువచ్చి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 



జాగృతిని గమనిస్తున్న స్వప్న, దగ్గరికి వచ్చి, "జాగృతీ, అంతా ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమయిందో చెప్పు" అని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. ప్రాణస్నేహితురాలు వచ్చి అడగడంతో, మనసులోని బాధ బయటకి వచ్చింది జాగృతికి. 



********************************************* 
జాగృతి ఆడపడుచు పల్లవి, "ఏదైనా సినిమా చూద్దామమ్మా. " అంది వాళ్ళ అమ్మ రాధతో. 



"హిందీ సినిమా చూద్దాం. నీ ఫేవరెట్ హీరోయిన్ జుహీచావ్లా సినిమా పెట్టు" అంటూ పల్లవికి సౌంజ్ఞ చేసింది రాధ. పల్లవి 'ఖయామత్ సి ఖయామత్ తక్' పెట్టింది. 



"అవునూ, మనం హిందీ సినిమా చూస్తుంటే, మరి ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడకి హిందీ రాదుగా పాపం. " అంది రాధ, జాగృతిని ఉద్దేశించి. 



"నాకు హిందీ వచ్చండి. మీరిద్దరూ చూడండి. నాకు సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు. " అంటూ అక్కడినుండి లేచింది జాగృతి. 



"అన్నీ అబద్దాలే. దీనికెలా హిందీ వస్తుంది? మనం నార్త్ లో ఉన్నాం కాబట్టి, మనందరికీ వచ్చు. దీని బతుకంతా ఆంధ్రాలోనే కదా అయిపొయింది. " అంది రాధ, జాగృతిని వెక్కిరిస్తూ. 



రాధ మాటతీరు జాగృతికి నచ్చలేదు. 'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ప్రతిదానికి నన్ను, మా వాళ్ళని ఎలా అవమానించేలా అని చూస్తున్నారు ఈవిడ! అది, ఇది, అని మాట్లాడుతున్నారు! ఏమిటి నాతో ఈవిడాకున్న ప్రాబ్లెమ్?' అనుకుని, "ఆంధ్రాలో ఉంటే, హిందీ రాకూడదనేమి లేదుకదండి" అంది రాధతో. 



"నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు కదా మా పిల్లల్లాగా. తెలుగులో పుట్టిపెరిగావ్ పాపం. నీకేం వస్తుంది అని అడిగాను" అంది రాధ. 



'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఈవిడ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను.' అనుకుని, "భాష నేర్చుకోవడాని కేముందండి. ఎపుడైనా నేర్చుకోవచ్చు." అంది జాగృతి సౌమ్యంగా. 



"నీకెంత హిందీ వచ్చొ చూస్తాను. మాతోపాటు సినిమా చూడు అయితే. " అంటూ జాగృతిని బలవంతంగా కూర్చోబెట్టి, పల్లవి పెట్టిన సినిమా చూడమంది. 



సినిమా మొదలవకముందే, "మా పల్లవి, అచ్ఛం జుహీచావ్లా లాగా ఉంటుందని, మా నార్త్ వాళ్ళందరూ అంటారు. ఈ సినిమాలో జుహీచావ్లా లాగ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో, మా పల్లవికి కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు అలానే చేయించాను. చక్కగా తయారయ్యి, కాలేజీకి వెళ్ళితే, పల్లవి అందాన్ని చూసి, ఆడపిల్లలందరూ కుళ్లిపోయేవాళ్ళు, అబ్బాయిలు వెనకపడేవారు. BA అవ్వగానే, పెళ్ళిచేసేసాం. వెంటవెంటనే చక్కగా ఇద్దరు పిల్లల్ని కనేసింది. " అంటూ పల్లవిని పొగుడుతూ, జాగృతిని తిట్టింది రాధ. 



పాతజ్ఞాపకాలని గుర్తుతెచ్చుకుని మురిసిపోయింది పల్లవి. 



"సమర్థ్ ని ఏమనేవారమ్మా? పవన్ కళ్యాణ్ అని కదా. " అని అడిగింది పల్లవి, రాధని. 



"అవును. ఆంధ్ర వెళ్తే చాలు, సమర్థ్ ని అందరూ పవన్ కళ్యాణ్ తో పోల్చేవాళ్ళు. వాడి జుట్టు కూడా పవన్ కళ్యాణ్ జుట్టులాగా ఉంటుంది. ఇక్కడ కాలేజీలో, వాడు క్రికెట్ ఆడుతుంటే, వాడు జుట్టు అలా అలా ఎగరెయ్యటం చూడడానికి ఆడవాళ్ళందరూ వాడి చుట్టూ చేరేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడే వాడికి పెళ్ళిసంబంధం వచ్చింది తెలుసా. ఏ విత్తు వేస్తే, ఆ పంట పండుతుందంటారు. నేను కాబట్టి, అంత అందమైన పిల్లల్ని కన్నాను. " అంది రాధ గర్వంగా. 
 
"నాన్నని శోభన్ బాబు అనేవారు కదమ్మా. నాన్న గురించి కూడా చెప్పు. " అంది పల్లవి, రాధని ప్రోత్సహిస్తూ. 



"మీ నాన్నని ఇప్పటికీ అందరూ శోభన్ బాబు అనే పిలుస్తారు. ఆయన స్టేజ్ ఎక్కి, 'భలే మంచి రోజు, పసందైన రోజు' అని పాడుతుంటే, పెళ్ళైన ఆడవాళ్లు కూడా, చప్పట్లు కొట్టడం మర్చిపోయి ఆయన్నే చూస్తుండిపోయేవారు. అలాంటి అందమైన భర్తని చేసుకున్నందుకు నన్ను చూసి కుళ్ళిపోయేవారందరూ. " అంది రాధ మురిసిపోతూ. 



"నువ్వు, నాన్నా మొదటిసారి కలిసినప్పుడు ఏమైందో చెప్పమ్మా. ప్లీజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. " అని రాధని అడిగింది పల్లవి. 



పల్లవి, రాధని ఏదైనా చెప్పమని అడిగిన ప్రతిసారి, రాధ, పల్లవిని చిరాకుగా జాగృతిని చూడడాన్ని జాగృతి గమనించింది.



 'వీళ్లిద్దరు కావాలనే ఈ విషయాలని నా ముందు మాట్లాడుతున్నారు అని అర్ధం అవుతోంది. కానీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. ' అనుకుంది జాగృతి. 



రాధ కళ్ళుమూసుకుని, గతస్మృతుల్ని నెమరువేసుకుంటూ, "అప్పుడు నాకు పదహారేళ్లు. చాలా చిన్న పిల్లని. తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను. నవలలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది నాకప్పుడు. నేను చేసుకోబోయే అతను, ఆ నవలల్లోని హీరోలా ఉండాలనుకునేదాన్ని. ఒకరోజు, లంగా ఓణీ వేసుకుని, మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని, యద్దనపూడి సులోచనారాణి నవల చదువుకుంటున్నాను. 



అచ్చం నేను చదివే నవలలోని హీరోలా, పెద్ద కాలరున్న షర్ట్, బెల్ బాటమ్ ప్యాంటు, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, బూట్స్ వేసుకుని, సిగరెట్ కాలుస్తున్న మనిషి మా ఇంటివైపే వస్తుండడం చూసాను. మొదటిచూపులోనే, అతని మీద మనసు పారేసుకున్నాను. అతను నేనున్న కిటికీ దగ్గరికి వచ్చి, 'రాధ ఇల్లు ఇదేనా?' అని నన్ను అడిగితే, నా మనసులో వీణలు మోగినట్టు అయ్యింది. 



సిగ్గుతో పరిగెత్తి లోపలకివెళ్ళి, ఇలాంటతను నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. తరువాత తెలిసింది, అతను నన్ను చూడడానికే వచ్చాడని. పెళ్లిచూపులు జరగకుండానే, అతను నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నపుడు నా అనడానికి అవధులు లేవు. గొప్పింటి సంబంధమని, కట్నం అడగలేదని, శోభన్ బాబు లాగా ఉన్నాడని అందరూ అంటుంటే, నేనెంత అదృష్టవంతురాలనో తెలిసి మురిసిపోయాను. నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత కుళ్లిపోయారో తెలుసా?" అంది రాధ సిగ్గుపడుతూ. 



అప్పుడే వచ్చిన మాణిక్యాలరావు, రాధ చెప్పిందంతా విని, "చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని నిన్ను చూసి అబ్బాయిలందరూ పాడేవారని చెప్పవేం వాణిశ్రీ. " అన్నాడు. 



రాధ మొహం సిగ్గుతో కందిపోయింది. "నేను వాణిశ్రీ లాగ ఉంటానని అందరూ అంటారు. మన కుటుంబాన్ని చూసి, నాకు ఎంత గర్వంగా ఉంటుందో. అందరం అందమైన వాళ్ళమే కదా. " అంది రాధ మురిసిపోతూ. 



మాణిక్యాలరావు వెళ్ళగానే, జాగృతిని చీదరంగా చూస్తూ, "మనఇంటికి ఇలాంటిది వచ్చిందేమిటో! అసలు సమర్థ్ కి ఇదెలా నచ్చిందో అర్ధంకావటంలేదు. ఒక్క అవయవం కూడా సరిగ్గాలేదు ఈవిడకి. ఆడపిల్ల లక్షణాలు అస్సలేవు. అందుకే దీనికి పెళ్ళి కూడా ఇంత లేట్ అయ్యింది. 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#24
ఇంజనీరింగ్ చదివిందని గొప్ప. దీని చదువు నాకెందుకు, నాలిక గీసుకోవడానికి. ఇక బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారో, పుట్టే పిల్లలు ఎలా ఉంటారో? అసలు దీని మొహం సమర్థ్ ఎలా చూడగలుగుతున్నాడో?" అంది రాధ. 



జాగృతి, మెరిట్ లో ఇంజనీరింగ్ చదివింది. పెద్ద ఐటీ కంపెనీలో, మంచి ఉద్యోగం చేస్తోంది. చూడడానికి సింపుల్గా, హుందాగా ఉంటుంది. అందంగా ఉండాలని, హీరోయిన్ లా కనపడాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. చదువు, ఉద్యోగం తప్ప ఇంకేమి ఆలోచించని జాగృతి, రాధ అంటున్న మాటలని, చూస్తున్న చూపులని తట్టుకోలేకపోయింది. 'వీళ్ళు నన్ను ఇన్ని మాటలు అని, వీళ్ళ గురించి నేను కూడా అనుకునే అధికారాన్ని నాకు ఇచ్చారు. 



నిజంగానే ఈవిడ అనుకుంటున్నట్టు, ఈవిడ కుటుంబ సభ్యులు అంత అందంగా ఉన్నారా? సమర్థ్ తప్ప మిగతావాళ్లందరూ నాకన్నా పొట్టివాళ్ళే! అందరూ లావుగానే ఉన్నారు!! చిన్నకళ్ళతో, బారపళ్ళతో, నోరువిప్పితే 32 పళ్ళు కనపడేటట్టుగా ఉంటూ, కీచుగొంతుతో మాట్లాడుతున్న పల్లవి, మిస్ ఇండియా అయిన జుహీచావ్లాలాగా ఉందా?! 



మొగాళ్ళని ఆకర్షించుకునేలా తయారవ్వడం, పిల్లల్ని కనడం ఇవేనా ఆడవాళ్ళకుండాల్సిన లక్షణాలు? పెళ్లికోసం మాత్రమే డిగ్రీ చదువుకున్న పల్లవిని, నన్నూ ఎలా పోల్చగలరు? చామనచాయకన్నా తక్కువ రంగుతో, పొట్టతో, బండగా ఉన్న సమర్థ్, పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడా? 



కాకిపిల్ల కాకికి ముద్దు అంటే ఇదేనేమో! ఇక ఈవిడకి, నోట్లో నాలుగు పళ్ళు ఉన్నాయి. కనీసం నాలుగున్నర అడుగులు కూడా లేని ఈవిడ, తనని తను వాణిశ్రీతో పోల్చుకుంటోంది. బాబోయ్ ఇదేం అందం పిచ్చి. ఒంటినిండా స్ఫోటకం మచ్చలున్న ఈవిడ భర్త, శోభన్ బాబు! 



వీళ్లిద్దరికీ మొదటి చూపులోనే పుట్టిన ప్రేమ! దానికో కథ!! గురివింద గింజ, తన నలుపెరగదు అని, ఇలాంటివాళ్ళని చూసే అంటారేమో!! ఇంత వయసొచ్చినా, ఆ సిగ్గెంటో? ఆ గొప్పలేంటో!!' అనుకుంది జాగృతి. 



************************************************************



"చదువు, సంస్కారం ఉన్నవాళ్ళింటికి వెళ్లాననుకున్నాను. కానీ అందం పిచ్చి, హీరో హీరోయిన్లతో పోల్చుకుని వాళ్ళంటికి వెళ్ళాను. వీళ్ళకి నా మంచితనం, చదువు, సంస్కారం అక్కరలేదు. మా అత్తగారి మాటలు, చూపులు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది స్వప్న" అని కళ్లనీళ్లు పెట్టుకుంది జాగృతి. 



"అయ్యో. జాగృతీ. బాధపడకు. ఎలాంటివాళ్ళకైనా సినిమాలపిచ్చి, అందంపిచ్చి ఎక్కువగానే ఉంటున్నాయి. నీకలాంటి అలవాట్లులేవని అందరూ నీలాగే ఉండరుగా. మీ అత్తగారు, ఆవిడ గొప్ప ఎంత చెప్పుకున్నా పర్వాలేదుకాని, నిన్ను ఇంతలా అవమానించడం తప్పే. నువ్వు బాధపడకుండా ఉండాలంటే, నేనొకటి చెప్తాను. చేస్తావా?" అంది స్వప్న. చెప్పమంది జాగృతి. 



"వాళ్ళనివాళ్ళు సినిమా హీరోహీరోయిన్లతో పోల్చుకున్నారు కదా, మరి నువ్వెలా ఉంటావో వాళ్ళకి తెలియదను కుంటున్నావా?" అంది స్వప్న. 



"అంటే? నాకు అర్ధం కాలేదు. " అంది జాగృతి. 



"నిన్ను మొదటిసారి చూసినప్పుడే, నువ్వు సిమ్రాన్ లాగ ఉన్నావని అనుకున్నాను నేను. " అంది స్వప్న. 



"అబ్బా. నువ్వు కూడానా?" అంది జాగృతి తలపట్టుకుని. 



"చెప్పింది విను. నిన్ను హీరోయిన్ పోలిస్తే, నీకు నచ్చదని నాకు తెలుసు. అందుకే, ఇన్నాళ్ళు నీకీ విషయం చెప్పలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనే కాదు, నిన్ను, నీ పర్సనాలిటీని, పొడుగుజుట్టుని, డిగ్నిటీనీ చూసి, మన ఆఫీసులోవాళ్ళందరూ కూడా అలానే అనుకుంటారు. నువ్వు ఇంత సింపుల్గా ఉన్నా, నీ వెనక ఎంతమంది అబ్బాయిలు పడ్డారో తెలుసా? " అంది స్వప్న. 



"ఆపు స్వప్న. ప్లీజ్" అంది జాగృతి చిరాకుగా. 



"నేను చెప్పేది నీకు అర్ధంకావటంలేదు. ఇంతమందికి నువ్వు సిమ్రాన్ లాగ అనిపించినప్పుడు, మీ వాళ్ళకి అనిపించే ఉంటావుగా? నువ్వు బాగుంటావని మీ అత్తగారికి, ఆడపడుచుకి తెలుసు. ఆ కుళ్లుతోనే నిన్ను ఏడిపిస్తున్నారు." అంది స్వప్న. 



"నన్ను కావాలనే ఏడిపిస్తున్నారు. ఆ విషయం నాకు అర్ధం అయ్యింది. " అంది జాగృతి. 



"ఇంకెప్పుడైనా మీ అత్తగారు నిన్ను వెక్కిరిస్తే, నేను సిమ్రాన్ లాగా ఉంటానని అందరూ అంటరాని చెప్పు. గొప్పలు చెప్పి, నిన్నంక అవమానించదు. " అని సలహా ఇచ్చింది స్వప్న. 



"ఇంతకీ నన్ను కూడా అందం పిచ్చున్నవాళ్లతో కలిపేసావ్. " అంది జాగృతి కోపంగా. 



"తప్పదు జాగృతి. ఎలాంటివాళ్ళని అలాంటి మాటలతోనే కొట్టాలి. అప్పుడే వాళ్ళకి అర్ధమవుతుంది. " అంది స్వప్న. 



స్వప్న ఇచ్చిన సలహాకి, ధైర్యానికి, జాగృతి మనసు కుదుటపడి, "ఇంతకీ, అందరం హీరోహీరోయిన్లమే అన్నమాట. నిజంగా ఇలా చెప్పాలంటావా?" అంది నవ్వుతూ. 



"నేను నీకు చెప్పినవేవి, నువ్వు వాళ్ళతో చెప్పవని నాకు తెలుసు. 'అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేనిదే ఎగిరెగిరి పడుతుంది' అంటారే. నువ్వు అలాంటిదానివి. నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు. వాళ్ళకి చెప్పకు. కానీ మనసులో అనుకో. నీకు మనశ్శాంతి అయినా వస్తుంది. " అంది స్వప్న, జాగృతిని హత్తుకుని. 
 
***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#25
అత్తగారి హాస్యం
[Image: A.jpg]
 (అత్తగారి కథలు - పార్ట్ 15)
రచన: L. V. జయ
 
సమర్థ్ తో పెళ్ళి తరువాత అత్తగారింట్లో అడుగుపెట్టింది జాగృతి. మొదటిరోజు, కొత్తదంపతుల చేత సత్యనారాయణవ్రతం చేయిస్తున్నామంటూ బంధువుల్ని, చుట్టుపక్కలవారందరిని పిలిచారు సమర్థ్ తల్లితండ్రులు రాధ, మాణిక్యాలరావు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. 



ఉదయాన్నే మొదలుపెట్టిన వ్రతం పూర్తయ్యేటప్పటికీ, మధ్యాహ్నం మూడు దాటింది. భోజనాలు ఎప్పుడు పెడతారా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఆకులు వేసి, వండిన పదార్థాలని వడ్డించేలోపే, ఆకలికి ఆగలేకపోయిన పిల్లలు వచ్చి కూర్చున్నారు. వడ్డనలు పూర్తయ్యి, తినడం మొదలుపెడదామని అందరూ అనుకుంటున్న సమయానికి, మాణిక్యాలరావు తమ్ముడు శివరామ్ వచ్చి, "భోజనకాలే భగవత్ ప్రార్ధన అంటారు. పిల్లలెవరైనా ఒక శ్లోకం చెప్పేస్తే, అందరం తినడం మొదలుపెట్టచ్చు. " అన్నాడు. ఆకలితోనున్న పిల్లలు శివరాం మాటని పట్టించుకోకుండా తినడం మొదలుపెట్టారు. 



అది చూసిన రాధ, "తెలుగుమాస్టారుకి ఎంత గౌరవముందో కనపడుతోంది. మనవాళ్ళే నీ మాట వినకపోతే, ఇక కాలేజ్ లో పిల్లల సంగతేంటో? అక్కడా కూడా నీకొచ్చే గౌరవం ఇంతేనా?" అంది శివరామ్ ని వెక్కిరిస్తూ. 



'మరిదిన్న గౌరవం కూడా లేకుండా, అందరిముందూ శివరాం ని, రాధ వెక్కిరించటం, అందరూ చూసి నవ్వటం, తట్టుకోలేకపోయింది ఆయన భార్య అన్నపూర్ణ. "పిల్లలు తింటున్నారు కదా. వాళ్ళు చెప్పకపోతేనేం, నేను చెప్తాను. " అని, అన్నపూర్ణ స్తోత్రం చెప్పడం మొదలుపెట్టింది. 



మధ్యలోనే చప్పట్లుకొట్టింది రాధ. "నీ భర్త పరువుని నిలబెట్టడానికి బాగానే ప్రయత్నించావుగానీ, నీ పేరుని కూడా నిలబెట్టుకో. అన్నపూర్ణవి కదా, ఇక స్తోత్రాన్ని ఆపి, తినే అదృష్టాన్ని అందరికీ ప్రసాదించు. " అంది విసుగ్గా. ఈ సారి అన్నపూర్ణని చూసి నవ్వారందరూ. 'రాధ గురించి తెలిసి కూడా, అనవసరంగా ఆవిడ నోట్లో నోరు పెట్టానని' అనుకుంది అన్నపూర్ణ. 



అందరూ భోజనాలు చెయ్యడం మొదలుపెట్టాక, రాధ, మాణిక్యాలరావు అన్న ఆనందరావు దగ్గరికి వెళ్ళి, "బావగారు. మీకు అన్నీ సరిగ్గా కనపడుతున్నాయోలేదో? కొంచెం చూసుకుని తినండి. " అంది నవ్వుతూ. 



"మా ఆయనకి సరిగ్గా కనపడకపోవడమేమిటి? ఆయకేమి చూపు మందగించలేదు. " అంది ఆనందరావు పక్కనే ఉన్న ఆయన భార్య సావిత్రి. 



"అక్కా, నీకీ విషయం తెలియదన్నమాట అయితే. బావగారు ఒకసారి ఎవరికీ చెప్పకుండా, సెకండ్ షోకి వెళ్లారుట. దొంగతనంగా ఇంట్లోకొచ్చి, వంటింట్లో అన్నం తింటుంటే, చారుగిన్నెలోంచి మిరపకాయ పాక్కుని బయటొచ్చినట్టు కనపడిందిట. తీరా చూస్తే, అది బొద్దింక. ఇప్పుడు చెప్పు. బావగారికి నిజంగానే కళ్ళు సరిగ్గా కనపడతాయా?" అని గట్టిగా నవ్వింది రాధ. రాధ మాటలకి చుట్టాలందరూ నవ్వుతుంటే, సావిత్రి మొహం మాడిపోయింది. 



"రాత్రిపూట చీకట్లో కళ్ళు సరిగ్గా కనపడకపోతే, చిన్నప్పటినుండే చూపు మందగించిందంటావా?" అంది సావిత్రి కోపంగా. రాధ గురించి పూర్తిగా తెలిసిన ఆనందరావు, సావిత్రిని ఊరుకోమని సౌంజ్ఞ చేసాడు. 



అందరి భోజనాలు అయ్యాక, "పెళ్ళి హడావిడిలో మనమెవ్వరం సరిగ్గా ఫోటోలు తీయించుకోలేకపోయాం. ఇప్పుడు అందరూ తీయించుకుందాం రండి. ఫోటోగ్రాఫర్ ని పిలుస్తాను. నాకు అస్సలు సరైన ఫోటోలు లేవు. " అంది రాధ. 



"ఇప్పుడే కదా కడుపునిండా తిని, కిళ్ళీలు వేసుకున్నాం. పెదవులు ఎరుపెక్కి, పొట్టలు పైకొచ్చున్నాయి. ఇప్పుడు ఫొటోలేమిటి? హాయిగా కాసేపు పడుకోవాలనుంది. " అన్నాడు మాణిక్యాలరావు. 



"ఆడవాళ్ళ పెదవులు ఎరుపెక్కినా పర్వాలేదుగాని, పొట్టలు పైకొస్తేనే బాగుండదు. ఇంత వయసొచ్చినా ఇవేం పనులు అనుకుంటారు మిమ్మల్ని చూసి. " అంది రాధ అదోరకంగా నవ్వుతూ. 



"అయినా నువ్వెలా పడినా పర్వాలేదు కానీ, నేను అందంగా, సన్నగా కనపడాలి ఫొటోల్లో. " అంది తనని తాను చూసుకుంటూ. 



"వయసు నాకుమాత్రమే వచ్చింది. ఈవిడకి రాలేనట్టుంది. ఎంత వయసొచ్చినా, అందగత్తెననే అనుకుంటుంది. " అనుకున్నాడు మాణిక్యాలరావు, రాధకి వినపడకుండా. పక్కనే ఉన్న శివరాంకి, ఆనందరావుకి, మాణిక్యాలరావు అన్న మాటలు వినపడి నవ్వుకున్నారు. 



శివరాం వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ, "వదినా, మీరు అందంగా, సన్నగా కనపడడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఎప్పుడూ చెయ్యని ఒక పని చేస్తే చాలు. " అన్నాడు. 



"ఏమిటో చెప్పు" ఆతృతగా అడిగింది రాధ. 



"ఏమి లేదు. ప్రతీదానికి, అన్నని వెనక్కి తోసి, మీరే ముందుంటారు కదా. ఈసారి కనీసం ఫోటోల కోసమైనా, అన్నని ముందుంచి, మీరు అన్న వెనక నిలబడండి. అప్పుడు సన్నగా, అందంగా కనపడతారు. " అన్నాడు రాధకి సలహా ఇస్తున్నట్టు. 



ఆనందరావు కూడా, ఇదే సమయం అనుకుని, "అవునమ్మా. మా వాడిని ముందుంచి, నువ్వు ఒక్కసారి వాడి వెనక నించో. మాకు కూడా చూడడానికి బాగుంటుంది. పాపం ఎప్పుడూ వాడిని నీ వెనకే చూసాం. " అన్నాడు నవ్వుతూ. 



మాణిక్యాలరావుకి, రాధ ఏ మాత్రం గౌరవమివ్వదని తెలిసిన బంధువులందరూ రాధని చూసి నవ్వారు. భోజనాలప్పుడు జరిగిన అవమానానికి, శివరామ్, ఆనందరావులిద్దరూ ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ అర్ధమయ్యింది. రాధ మాత్రం ఇదేమి పట్టించుకోనట్టు, ఫొటోగ్రాఫర్ ని పిలిచింది. 



జంటలందరినీ వరసగా మెట్లమీద నించోబెట్టి, కెమెరావైపు నవ్వుతూ చూడమన్నాడు ఫోటోగ్రాఫర్. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఫోటో సరిగ్గా రాకపోయేటప్పటికీ, పైవరసలోనున్న జంటని, కెమెరావైపు సరిగ్గా చూడమని చెప్పాడు. 



"ఆ పైవరసలోనున్నవాళ్ళు నీవైపు చూడనట్టుంటారు. కానీ, నీ వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ మెల్లకళ్ళు. ఫోటో సరిగ్గా రాదుకానీ, నీ పని నువ్వు చెయ్యి. " అంది రాధ, ఫొటోగ్రాఫర్ తో. 



పై వరసలోనున్న రాధ ఆడపడుచు మీనాక్షి, మీనాక్షి భర్త సుందరరావు మొహాలుమాడిపోయాయి. "అందరిముందూ ఈ విషయం చెప్పాలా వదినా?" అంది మీనాక్షి కోపంగా. 



"ఉన్న విషయమే కదా చెప్పాను. మీరిద్దరూ ఎవరిని చూస్తారో ఎవరికీ తెలియదుమరి. పాపం ఫోటోగ్రాఫర్ కి మాత్రం ఎలా తెలుస్తుంది. " అంది రాధ. 



రాధ మాటలకి మీనాక్షికి ఒళ్ళుమండింది. "నువ్వు కూడా నవ్వుతూ కెమెరా వైపు చూడకు వదినా. ఫోటో సరిగ్గా రాదు. పాపం. కింద వరసలో నాలుగు పళ్ళు మాత్రమే మిగిలాయి కదా మరి నీకు. " అంది కోపంగా. 



మీనాక్షి అలా అంటుందని రాధ ఊహించలేదు. అందరూ తనని చూసి నవ్వుతుంటే, రాధ తలదించుకుంది. 






"హాస్యంగా అంటే ఎందుకలా అయిపోతున్నావ్ మీనాక్షి, సరదాగా తీసుకోవచ్చు కదా. " అంది. 



"నేను సరదాగానే తీసుకుంటున్నాను వదినా. నువ్వు కూడా తీసుకో. తల దించుకోకు. జుట్టుకి పూర్తిగా రంగువేసుకోలేదు కదా నువ్వు. నీ ముసలితనం అంతా కనపడిపోతోంది. " అంది మీనాక్షి రాధ మీద కక్ష తీర్చుకుంటున్నట్టు. ఈ సారి రాధ మొహం మాడిపోయింది. 



'ఇంటికి పిలిచి, అందరిముందూ సొంతవాళ్ళ పరువు తీసింది రాధ. తొమ్మిదో క్లాస్ పాసయ్యిన ఈవిడ, తెలుగుపండితుడైన మరిదిని అంది. బావగారన్న గౌరవం లేకుండా, ఆయన చూపు మందగించిందంది!! ఈవిడేదో చాలా అందంగా ఉన్నట్టు, ఇంటి ఆడపడుచుని, ఆవిడ భర్తని వెక్కిరించింది. భర్త గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడింది. ఏం మనిషో? ఈవిడ సరైన బుద్ధి చెప్పారందరూ' అనుకున్నారు చుట్టాలందరూ. 



'ఎవరినీ వదలని ఈవిడ నన్నెంత అంటుందో? ఈవిడతో నేనెంతపడాలో? సరదా పేరుతో, అందరినీ వెక్కరిస్తూ మాట్లాడే రాధలాంటివాళ్లది హాస్యమా? వెటకారమా?' అనుకుంది జాగృతి. 



***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#26
అత్తగారిల్లు
[Image: A.jpg]
Gayatri Tokachichu[img=1x1]file:///C:/Users/Jahnavi/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image001.gif[/img]
 
ఉదయం పదిగంటలు.
 
గాఢనిద్రలో ఉంది భావన. సెల్ ఫోన్ మ్రోగింది. బద్ధకంగా చూసింది. అమ్మ.
 
"ఏమిటి?"అంది ఆవులిస్తూ.
 
"నిద్ర లేచావా?"అడిగింది రాగిణి.
 
"ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా!చెప్పు!"
 
"కాస్త ఫ్రెష్ అయ్యిరా!నీతో మాట్లాడాలి!"
 
"ఇప్పుడేనా అమ్మా!కాసేపు పడుకోనీ!"గునుస్తూ అంది భావన.
 
"నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి!మాట్లాడాలి నీతో!ఓకేనా!"అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి.
 
భావన ప్రక్కన చూసింది. విశాల్ నిద్రపోతున్నాడు. భావనకు విశాలుతో పెళ్లయింది. పెళ్లయ్యాక మూడు నిద్దర్ల తర్వాత ఇద్దరూ హనీమూనుకు కేరళ వచ్చారు.ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి.అక్కడ విశాల్ తల్లి తండ్రులు హిమబిందు,రఘురాములు ఉన్నారు. విశాల్ ఉద్యోగం బెంగుళూరులో. భావన తల్లి తండ్రులు రాగిణి, మోహనులు. భావన, విశాలుది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ పదిరోజుల హనీమూన్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు.
 
స్నానం చేసి వచ్చింది భావన. విశాల్ ని తట్టి లేపింది.
 
"అబ్బా!"అంటూ ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన ముద్ద మందారంలా మెరిసి పోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసికొని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పట్టు వదిలించుకొని
"ముందు స్నానం చేసి రండి విశాల్!నాకు ఆకలేస్తుంది."అంది గారాబంగా.
 
"తప్పదా!"
 
"తప్పదు!కదలండి!"అంటూ అతడిని లేపింది.
 
విశాల్ బాత్ రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది. చుట్టూ చెట్లు. రమణీయమైన ప్రకృతి.
'అమ్మ ఫోన్ చెయ్యమంది కదా!'అనుకొని తల్లికి ఫోన్ చేసింది.
 
 
"నేను చెప్పింది శ్రద్ధగా విను!"
 
"వింటున్నాను చెప్పమ్మా!"
 
"మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా!అక్కడ ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు!పెళ్లి కుదరటం, హడావుడి, పెళ్లి పనులు, వెంటవెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడటానికి కుదరలేదు.మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు. ఉద్యోగం చేస్తోంది కదా! కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలాగా ఉంది.అక్కడున్నన్ని రోజులూ నైటీ వేసుకోకు!వాళ్ళ పద్ధతులు అవీ చూడు!జీన్స్, టీ షర్ట్స్ వేసుకోకు!పంజాబీ డ్రస్సులే వేసుకో!అలారం పెట్టుకొని ఏడింటికే నిద్రలే!బద్ధకంగా తిరగకు!మంగళ సూత్రాలు వేసుకో!దిండుక్రింద పెట్టి మర్చిపోకు!డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను!సోఫాలో కూర్చుని తినకు!... ఇంకా గుర్తు రావటం లేదు. వస్తే చెప్తాను!..."
 
"అలాగే అమ్మా!నువ్వు వర్రీ పడకు!నేను జాగ్రత్తగా ఉంటాను."
 
"విసుక్కోకు!వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా!నేను చెప్పినవేవీ కష్టమైనవి కాదు. కాస్త శ్రద్ధ పెట్టాలి!ఈ నెల్లో పెళ్లి చేసుకొని పై నెల్లో విడాకులు తీసికొంటున్నారు. నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం. కొంచెం సర్దుకుపోతే చాలు!అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు.ఈ పది రోజుల్లో నిన్నేమన్నా హర్ట్
చేసేటట్లు మాట్లాడుతున్నాడా?"
 
"అదేమీ లేదమ్మా!బాగానే ఉన్నాడు. ఇప్పుడే కదా పెళ్లయ్యింది. తర్వాత తర్వాత తెలుస్తుంది. ఇప్పటికి ఫర్వాలేదు. "
 
"నువ్వు భయపడకు!కానీ జాగ్రత్తగా ఉండు!"రాగిణి కంఠంలో దిగులు ధ్వనించింది.
 
"దిగులు పడకమ్మా!నేను బాగానే మేనేజ్ చేస్తాను."తల్లికి బదులిచ్చింది భావన.
 
"ఆ... మర్చిపోయాను. బొట్టు పెట్టుకో!పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో!నీ సూట్ కేస్ లో ఉంటాయి చూడు!"
 
నవ్వింది భావన.తల్లి ఆరాటం అర్థం అవుతోంది.
 
రూంలోకి వచ్చాడు విశాల్.
 
"అమ్మా!మళ్ళీ చేస్తాను!విశాల్ వచ్చాడు. నువ్వు దిగులు పడకు!అంటూ ఫోన్ పెట్టేసింది.
 
 
పెళ్లి చూపుల దగ్గర్నుంచి పెళ్లిదాకా హడావుడి. భావన, విశాల్ పెళ్లిలోపల అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉన్నాకూడా భావనకు పెళ్లి అంటే కొంచెం భయంగా, దిగులుగా ఉంది. అమ్మా, నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు. భర్తతో కలిసి బ్రతకడం.. తనకు విలువ ఇస్తాడో? ఇవ్వడో? అతడి అలవాట్లు, వ్యక్తిత్వం ఎలా వుంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది. ఇగో క్రాష్ వస్తే ఎలాగ? ఎన్నో అనుమానాలు... ఇంకెన్నో సందేహాలూ మనసుని పీడిస్తూ ఉన్నాయి.కొంత ధైర్యంతో, కొంత భయంతో పెళ్లి చేసుకొంది. పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికెనవేలు పట్టుకొని వివాహం అనే బంధంతో తన వాళ్ళను వదిలి అతడి జీవితభాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నాకూడా ఈ హనీమూన్ ట్రిప్పులో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్దికొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది.
విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించటం, ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం, ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతడిపట్ల ఇష్టాన్ని కలుగచేస్తూఉంది.
 
సాయంత్రం ట్రివేండ్రంలో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్, భావనలు.
విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిదయ్యింది.
ఇంటికి రాంగానే పిల్లలకు ఎఱ్ఱనీళ్లతో దిష్టి తీసింది హిమబిందు.
 
"మీరు వెళ్లి స్నానాలు చేసి రండి!భోంచేద్దాం!"అన్నాడు రఘురామ్.
 
భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది.
ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ నలుగురూ భోజనం చేశారు. అత్తగారికి, మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన. ఇద్దరూ మెచ్చుకొన్నారు.
 
"మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము. అప్పుడు విశాల్, వినోద్ చాలా చిన్న పిల్లలు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది."అంది హిమబిందు.
 
హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తోంది . ఇంకా రెండేళ్లు సర్వీసు ఉంది. రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటులో సీనియర్ ఆఫీసరుగా చేసి రిటైర్ అయ్యాడు.
 
 
 
రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకొని పడుకుంది భావన.
 
తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది. హనీమూన్ లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్ తో గడిపింది.పంజాబీ డ్రస్సులు, చీరలు కూడా ఉన్నాయి.
'చీర కట్టుకోనా!లేక పంజాబీ డ్రస్సా?'అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది. లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు, ఎరుపు పూలు ఉన్నాయి.
'ఇది బాగుంటుందిలే 'అనుకొని చీర కట్టుకొంది. పెళ్ళికి ముందే చీరలు కట్టుకోవటం నేర్చుకుంది. ఎక్కడ జారిపోతుందో అని భయం.అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది. జడ వేసుకొంది. సూట్ కేసులో పెట్టిన క్రొత్త మంగళ సూత్రాలు మెళ్ళో వేసుకొంది.పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి. బొట్టు పెట్టుకొని, పాపిట్లో సింధూరం కూడా పెట్టింది. రెండు చేతులకూ గాజులు కూడా వేసుకుంది.
అంతా అయ్యాక అద్దంలో చూసుకొంది భావన.
 
'ఎంత ముద్దొస్తున్నావ్ భావనా!'అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది. నిద్ర పోతున్నాడు. అతడిని లేపుదామనుకొని 'వద్దులే 'అనుకొని టైము చూసింది. ఏడు గంటలు. తలుపు తీసికొని హాల్లోకి వచ్చింది.
 
 
సోఫాలో కూర్చుని పేపర్ చదువుతోంది హిమబిందు.
 
"అప్పుడే లేచేశావా!ఇంకొంచెం సేపు పడుకోలేక పోయావా!ఇంత త్వరగా లేచి ఏం చెయ్యాలి?"అంది కోడలిని మురిపెంగా చూస్తూ.
 
నవ్వింది భావన.
 
"చీర బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు చీరలు కట్టుకోవటం వచ్చా?"
 
"ఇప్పుడిప్పుడే కట్టుకోవటం నేర్చుకుంటున్నాను "అంది భావన.
 
"ఈ రోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను. తర్వాత శని, ఆది వారాలు ఎలాగూ సెలవే కదా!కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది."
 
"మామయ్య గారేరి?"అడిగింది భావన.
 
"మేడమీద మొక్కల దగ్గర ఉంటారు. పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు. నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట ఎనిమిదింటికల్లా చేసి కాలేజీకి వెళ్లిపోతాను. కొరవ సవర ఉంటే రఘు చేస్తారు. ఈ పూట టమాటో బాత్ చేశాను. వంట కాసేపట్లో అయిపోతుంది."
 
ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది.
 
"నువ్వు మేడమీదకు వెళ్లి రఘుకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా!నేను కాస్తదేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను."అంది హిమబిందు.
 
"అలాగే!"అంటూ పేపర్ తీసికొని మేడమీదికి వచ్చింది భావన.
 
 
రఘురామ్ కూరగాయలు కోస్తున్నాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#27
మొక్కలు అంటే కొద్దిగా పూలమొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన కానీ మేడ మొత్తం మొక్కలే. పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధమొక్కలు ఇంకా లతలు ఎన్నో. మంచి పరిమళభరితమైన సమీరం మనసును మరిపించింది. అక్కడక్కడా చక్కర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు, పసుపు రంగు పిట్టలు, పిచ్చుకలు... రమ్యంగా ఉంది తోట.
విశాల్ లో తండ్రి పోలికలు ఎక్కువ. కనుముక్కు తీరు అంతా తండ్రి ముక్కులోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక.
 
కోడలిని చూడంగానే "రామ్మా!అప్పుడే లేచేశావా!"అన్నాడు ఆప్యాయంగా.
 
అవునన్నట్లు నవ్వింది భావన.
 
అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది.
 
"జాగ్రత్త తల్లీ!జారిపడకుండా నడువు!"అన్నాడు రఘురామ్.
 
అక్కడ ఒక వైపు చెక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది.
 
"అక్కడ కూర్చుందాం!"అంటూ ఉయ్యాలను చూపించాడు.
 
జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు. నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు. చిన్న డిష్షులో లేత లేత వంకాయలు పట్టుకొని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురామ్.
 
"ఇలా కూర్చోమ్మా!"
 
చీర పైకి పట్టుకొని కూర్చుంది భావన.
 
"రిటైర్ అయ్యిన దగ్గర్నుంచి ఈ తోట పెంచుతున్నాను. పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట తోటపనికి కేటాయిస్తే చాలు!"
 
"చాలా బాగుంది తోట.ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు."ప్రశంసించింది భావన.
 
"పెద్ద కష్టం కాదు. నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసికొన్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ ట్రైనింగుకు వెళ్తుంటాను. వాళ్ళు సూచనలు ఇస్తారు. మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పక్కింటి వాళ్ళకూ, ఎదురింటి వాళ్ళకూ పంపిస్తాను. మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది. నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను. ఈ రోజు నేను చేసిన కూర తిందువు గానీ!నీకు ఏ కూర అంటే ఇష్టం?"
 
"ఏమైనా తింటాను."మొహమాటంగా అంది భావన.
 
"అలా అంటే కుదరదు. మొహమాట పడకు!"
 
''' మీకు బాగా వచ్చిన కూర ఏదైనా... నేను కూడా చేస్తాను. "
 
"నీకు వంట వచ్చా?"
 
"అంత రాదు..."నసిగింది భావన.
 
నవ్వాడు రఘురామ్.
 
"పెళ్లయిన కొత్తల్లో బిందూకు కూడా వంట అస్సలు రాదు. రకరకాల ప్రయోగాలు చేసేది. నీకు అన్ని కూరలు ఎలా చెయ్యాలో పుస్తకంలో వ్రాసి పెట్టాను. అది తీసికెళ్ళు!ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి!ఇక్కడ మాత్రం నేను, బిందు చేసిపెడతాము. సాంబారు, మజ్జిగ పులుసు, పిండిమిరియం ఇవన్నీ నా స్పెషల్స్. ఈ రోజు బిందూని పప్పు, అన్నం మాత్రం వండమన్నాను. నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా!నీ కోసం ఏం చెయ్యను?"
 
రఘురామ్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు.
 
"ఒకే!నువ్వు మొహమాట పడుతున్నావు. పిండి మిరియం, చారు, గుత్తివంకాయకూర చేస్తాను. సరేనా!"
 
తలఊపింది భావన
 
"ఇంకో విషయం విను!నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషనుకు వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా ఫర్వాలేదు. నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో!ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా!"నవ్వాడు రఘురామ్.
 
పెద్దగా నవ్వింది భావన.
 
"నువ్వు నీలాగా ఉండు!పెళ్లవంగానే నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు!"
 
'సరే!'అన్నట్లు తల ఊపింది భావన.
 
రఘురామ్ తోటలో ఉన్న ఔషధమొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు.
ఇంతలో రఘురామ్ సెల్ ఫోన్ మోగింది.
 
"చూడు!గంట దాటి పోయింది. బిందూ పిలుస్తోంది. పద!కిందికి వెళ్దాము!"
 
ఇద్దరు కలిసి క్రిందికి వచ్చారు.
 
అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు. భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి.
అందరూ కలిసి టిఫిన్ తిన్నారు.
హిమబిందు పెళ్ళి ఆల్బమ్స్ వచ్చాయని తీసికొని వచ్చింది. నలుగురూ కలిసి సరదాగా పెళ్ళి ఫోటోలు చూసారు. హిమబిందు లేచి టీ కలిపి తీసికొని వచ్చింది
భావన మొహమాట పడింది.
 
"నేను కలిపేదాన్ని కదా అత్తయ్యా!"అంది 
 
"బెంగుళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడైనా కాస్త రెస్టుగా ఉండు!"నవ్వింది హిమబిందు.
 
రఘురామ్, విశాల్ వేసే ఛలోక్తులతో ఆ పూట గడిచింది.
 
భోజనాలకు కూర్చున్నారు నలుగురు.
 
నిజంగానే గుత్తివంకాయ కూర చాలా బాగుంది. పిండిమిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది. చారు అమోఘం.పాయసం, బజ్జీలు. కొత్త కోడలికి కొసరికొసరి వడ్డించింది హిమబిందు.
అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు.
భోజనాలయ్యాక రఘురామ్,విశాల్ కారు సర్వీసింగుకు ఇచ్చి వస్తామని బయటికి వెళ్లారు.
 
అత్తాకోడళ్ళు కబుర్లలో పడ్డారు.
 
"ఎలా ఉంది కొత్త జీవితం?ఎలా ఉన్నాడు విశాల్? నీకు నచ్చాడా?"
 
హిమబిందు నవ్వుతూ అడిగే సరికి సిగ్గుపడింది భావన.
 
"మీరు ఒకరికొకరు కొత్త. అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. నేను ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని. నేను పాఠం చెప్తున్నాననుకోకు!పెళ్లయిన కొత్తల్లో భార్యా భర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొత్త మోజు అంటారు కదా!అదే! తర్వాత తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి. ఇగో హర్ట్ అయ్యిందనో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్లల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకని?పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం, కనీసం అలవాట్లు, అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం, హడావుడి పెళ్లిళ్లు, ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం. వెరసి విడాకులకు పరిగెత్తటం.
భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి విలువ, గౌరవం. వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి. కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు.
నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా, మా ఆయనను, పిల్లల్ని చూసుకున్నాను. కొద్ది పాటి సర్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఆడవాళ్ళం. మగవాళ్ళకంటే మనలో ఓర్పు సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి. అలా అని అన్నింటికీ భర్త ముందు దిగజారిపోనవసరం లేదు. ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి. మరొకసారి కాస్త తగ్గి ఉన్నా ఫర్వాలేదు. అమ్మ, నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయం కదా!అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి. మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్ గా తీసికోవాలి.
విశాల్ కు కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను. నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు!ఒక వేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి!ఇద్దరూ చర్చించుకోండి!నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు.... "
ఆగింది హిమబిందు.
 
"నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్యా!ఉద్యోగం చేస్తూ, ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తోంది. విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది. నేను మాట్లాడాను. తను సపోర్ట్ ఇస్తానన్నాడు... కానీ..."
 
"ఇద్దరూ ఏమేమి పనులు చెయ్యాలో విభజించుకోండి!కాస్త అటూ ఇటూ అయినా కలిసి చేసుకోండి!డబ్బు విషయంలో కూడా. క్రమశిక్షణ చాలా అవసరం. ఇద్దరూ మాట్లాడుకొని అమలు చేయండి!సాధ్యమైనంతవరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి."
 
అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థం అయింది భావనకు. హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ. అలా ఉండటం తనకు చేత అవుతుందా!తనకు మొహమాటం ఎక్కువ. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడటం అస్సలు చేతకాదు. తల్లి తండ్రుల చాటున ముద్దుగా పెరగటంతో పెద్దగా ఎవ్వరితోనూ ఘర్షణ అన్నది రాలేదు. ఇప్పుడు ఇది పెళ్ళి. అమ్మ, నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాబంగా ఎవరు చూసుకుంటారు?
 
భావన ఆలోచిస్తూ ఉండటంతో మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టింది హిమబిందు.
 
"ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో!దానికి సంబంధించి నేను చెప్పటం కంటే రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి. చాలా చిన్నవే.' నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఇతరులను ఎలా గెల్చుకోవాలి?' అనే వ్యక్తిత్వవికాస పుస్తకాలు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, మన గౌరవానికి భంగం కలగకుండా జీవితభాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది."
 
హిమబిందు లేచి తన బెడ్ రూంలో రాక్ లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకు ఇచ్చింది.
 
ఇంతలో బెల్ మోగింది.
 
రఘురామ్, విశాల్ వచ్చారు.
 
సాయంత్రం విశాల్ తో బెంగుళూరులో పెట్టబోయే సంసారానికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవటానికి వెళ్ళింది భావన. వీళ్ళు వచ్చేసరికి రాత్రి ఎనిమిదయ్యింది. తిరిగి తిరిగి షాపింగ్ చెయ్యటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్, భావనలు.
 
రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకొంది భావన.ఫలహారాలు చేసి యాదగిరిగుట్టకు వెళ్దామన్నాడు రఘురామ్.
పొద్దున్నే పులిహోర, దధ్యోజనం వడలు చేశారు రఘురామ్, హిమబిందులు.
తినటానికి అన్నీ పెట్టుకొని బయల్దేరారు నలుగురు.
పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళుకూడా పిల్లల్లాగా మారిపోయారు.
 
అప్పుడప్పుడు రఘురామ్ తమ పెళ్లయిన కొత్తల్లో ఎలా ఉండే వారో, ఇద్దరికీ మధ్య వచ్చే చికాకులు, కలహాలు ఎలా ఉండేవో, పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరూ ఎలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళో చెప్తూ ఉన్నాడు.
 
ఆ రోజంతా సరదాగా గడిచింది.
 
మూడో రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు. అతడు అన్న పెళ్లయ్యాక ఢిల్లీ వెళ్ళాడు. అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. విశాల్, వినోదుల సరదా కబుర్లతో గడిచింది.
మధ్యలో హిమబిందు భావనను తీసికొని బజారు వెళ్లి రాగిణికి మోహనుకు బట్టలు తీసికొంది. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చరంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన.
అలా బజారులో అత్తగారితో తిరిగుతూ మాట్లాడటం భావనకు చాలా అనందాన్ని కలిగించింది.
ఇంటికి వస్తూ ఉంటే ఐస్క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు.
ఎప్పుడన్నా తల్లి తండ్రులతో బయటికి వెళ్తే ఐస్ క్రీమ్ తినిరావటం అలవాటు భావనకు.
 
'అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు '. అనుకొంది భావన.
 
నాలుగోరోజు. ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి.
ఆరోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగుళూరు వెళ్తున్నాడు. భావనను పదిరోజుల తర్వాత బెంగుళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్, రాగిణులు.
 
పదిరోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది భావనకు. పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది హిమబిందు.
 
"మరీ ఏమైనా ప్రాబ్లెమ్ వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకొని నాతో చెప్పు!అత్తగారిని అనుకోకు!నాతో ఫ్రీ గా ఉండు!మొహమాట పడకు!"అంది హిమబిందు.
 
రఘురామ్ కోడలి దగ్గరికి వచ్చాడు.
 
"మాకు కూతుళ్లు లేరు. కోడళ్ళనే కూతుర్లుగా భావిస్తాము. నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు!మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు. నేను కూడా నీ ఫ్రెండ్ ని అనుకో!సంకోచాలు అసలే వద్దు!వీడితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతూ ఉండు!కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి!"
 
అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన.
 
సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పటానికి అందరూ స్టేషనుకు వచ్చారు.
ట్రైన్ కదిలే దాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్. బెంగుళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
 
ట్రైన్ కదిలింది.
 
'వీళ్ళందరూ తన వాళ్ళు 'అనుకుంటూ దూరమవుతున్న భర్తను, అత్తమామల్ని, మరిదిని చూస్తూ సీట్లో జారగిలపడింది భావన.
 
అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్త మామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇస్తోంది. తల్లి తండ్రులు, అత్తమామలు కలిసి చేసిన పెళ్ళి. ఆ పెళ్లిని చిన్నతనంతో, అవగాహనా రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దలూ తమ వంతు బాధ్యతని తాము నిర్వర్తిస్తున్నారు. ఇక ముందుకు వెళ్తూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరి పైనా ఉంది.
భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది. విశాల్ తో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళ సూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తళుకులీనుతూ ఆమెలో భద్రతాభావాన్ని పెంచుతోంది.
రైలు వేగం పుంజుకొంది.
 
సమాప్తం.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#28
అత్తగారికో ఉత్తరం
[Image: image-2026-01-24-143212117.png]        
- శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
 
  కిటికీలోంచి బయట కనిపిస్తున్న మంచు గడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తుంది ప్రసూన. 
   
  అమెరికా రావాలని ఎంతగా తహతహలాడిందో ఇప్పుడు ఇండియా వెళ్లిపోవాలని అంతగానూ తొందరపడుతుంది. మనసంతా అత్తగారి మీదే ఉంది. పాపం ఆముసలి వయసెంతగా తల్లడిల్లిందోనని తలంపుకొచ్చేసరికి మనసు మనసులో లేదు. ఒక్కసారైనా అత్తగారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని పదేపదే అనిపిస్తుందామెకు. ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈమధ్య. అందుకే ఫోన్ చేసి మాట్లాడేకంటే ఒక ఉత్తరం ముక్క రాసి పలకరిస్తే...ఆవిడకు సంతృప్తి...తనకు ప్రాశ్చాత్తాపం తీరుతుందనిపించింది. అనుకున్నదే తడవుగా కాగితంపై కలాన్ని పెట్టింది. 
 
  గౌరవనీయులైన అత్తయ్య గారికి,
  నమస్కరించి,
 
  ఎలా వున్నారు...? మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. 
ఇక్కడ నేనూ, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్యా అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనుమడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. 
 
  అమెరికాకు వచ్చామే గానీ...మీగురించే తలంపు. అసలు ఈవయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేసామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నాస్వార్థం చూసుకున్నందుకు నేనెంతగా మనస్తాపం చెందానో చెప్తే నమ్మరేమో...?
 
  పెళ్ళైన తోడనే మీదగ్గరకు కోడలుగా వచ్చానే గానీ...చాలా కాలం మీకు నేను, నాకు మీరు విరోధులుగానే ఉన్నాం. అత్తగారిలా హుకుం జారీచేసేవారని నేనూ...కోడలుగా నేను మీకు గౌరవం ఇవ్వడం లేదని మీరూ ఎవరికివారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాడుముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేసాం. నాగురించి మీరూ...మీగురించి నేనూ ఇరుగుపొరుగు వారితో చెప్పుకుని మన ఇంటిపరువు మనమే బజారుకీడ్చుకున్నామేమో...? మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో....మీకోడలు ఇలా అంటుందని మీతో ... ఉన్నవాటికి మరో నాలుగు విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి...మనలో మనకే తెలీని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగువారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేది కాదు. 
 
   తర్వాత తర్వాత ఆలోచిస్తే తెలిసింది...పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలుగా మీఇంటికొచ్చిన కొత్తవాతావరణం....నాలో ఏదో తెలీని సంకుచిత భావంతో అలా ప్రవర్తించానని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేటయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులూ చేసేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రమెక్కువ. నాకు వచ్చీరాని పనులు...వచ్చీరాని వంటలు. ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకుపోయింది. నేనేమీ చేయడం లేదని ...కోపంగా ఉన్నారని గంభీరంగా వుండే మీ ముఖం చూస్తే అర్థమైపోయేది. 
 
   మీరు చెప్పకపోయినా మీ ఆలోచనల్లో నేనూ ఉండేదాన్నని నాకూ అర్థమయ్యింది. ఎప్పుడూ కూడా నువ్వు ఆపని చెయ్...ఈ పని చెయ్ అని నాకెప్పుడూ పురమాయించలేదంటే...అలా చెప్పి చేయించుకోవడం మీకిష్టం లేకనే. చేసేది ఏమైనా ఉంటే చెప్పకుండా చేయాలని, ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని ఇలాంటి చాదస్తంలో మీరుండేవారు. 
 
  రాను రాను...ఒకరికి ఒకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి..పిల్లవాడు కాస్తా పెళ్లీడుకెదిగిపోయాడు.
మీరు వృద్దాప్యంలోకి, మేము నడి వయసుకీ వచ్చేసాం. నాకొచ్చిన అనుభవంలో....నా కొడుక్కి పెళ్లి చేస్తే నాకోడలు దృష్టిలో అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలని పించింది. అనుకున్నట్టుగానే...మీమనవుడికి పెళ్లి చేసాను. కొడుకూ కోడలూ అమెరికా వెళ్లిపోయారు. నా గురించి కోడలికి గానీ...కోడలు గురించి నాకు గానీ తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. 
 
   ఈలోపు మీరు జారి కాలు విరక్కొట్టుకోవడంతో ..మీ సేవలకు అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో... నా మనుమడిని చూడ్డానికి అమెరికా వెళ్లలేకపోయాననే నిరాశ ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసే దిక్కువరూ కనిపించక ...మాకు మరో మార్గం కనిపించక మా కోరిక తీర్చుకోడానికి...మిమ్మల్ని వృద్దాశ్రమంలో పెట్టేసి...మరీ అమెరికా వచ్చేసాం. మా వీసా గడువు ఆర్నెల్లు వున్నా...మూడ్నేల్లకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపించిస్తుంది.
 
   అత్తయ్యా...త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం. నన్నూ..మీ అబ్బాయినీ క్షమించరూ...!!*
 
                         ఇట్లు
                        మీకోడలు
                        ప్రసూన.
   
    మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందపరిచి ఉత్తరాన్ని పూర్తిచేసింది. తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తగారితో ఇన్నేళ్లూ గడిపిన సహచర్యం...ఈ మూడు నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగతోడుకుంది ప్రసూన.
 
   వయసు పెరిగేకొలదీ ...జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అత్తగారితో ఆవిధంగా గడిచిపోతే...ఆ తర్వాత మరోలా జీవితంలో విసిగిపోయింది.
 
     అత్తగారికి ఓపిక పోయి ఒంట్లో సత్తువ లేని వయసొచ్చాకా ఆవిడనెంతగానో రాపాడించడం కూడా గుర్తుకొస్తున్నాయి. తెల్లారితే చాలు ఈముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూ ఉంటుంది. కొంచెంసేపు పడుకుందామనుకున్నా నిద్రపోనీయదు అని విసుక్కున్న రోజులూ...అన్నం నములడ్డం లేదు...కొంత మెత్తగా చేయమని చెప్పిన మాటకు తానెంతగానో రాద్ధాంతం చేసిన రోజులూ... చెప్పిన మాటలు వినిపించకపోవడంతో పదేపదే చెప్పలేక.. కసురుకున్న రోజులూ... పొరపాటున బట్టల్లో మలమూత్రాలు అయిపోతే...వాటిని పెంటకుప్ప మీద పడేసి ఇల్లంతా ఫినాయిల్ తో కడిగేస్తూ ఆవిడపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇదేనా...ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పర్చుకున్న పగ ప్రతీకారం...???
ఇవన్నీ తప్పించుకోడానికే కదా...కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికి అప్పచెప్పి... అక్కడ నుంచి ఈ అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేసాను..అనుకుంటూ తనను తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన.
 
   ఎంతైనా....అనుభవం ప్రతి మనిషికీ పాఠం అవుతుందేమో...? 
 
   తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలికి రాకూడదనే...కోడలికి అత్తగా కాకుండా అమ్మగా వుందామనుకున్నా అందమైన ఊహ తనకిప్పుడు ఊగిసలాడుతుంది. 
 
   తన కోడలు ఎప్పుడైతే తనకు విలువివ్వలేదో...అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటుచేసుకుంది ప్రసూనకు.
 
   "అత్త అమ్మా కాదు....కోడలు కూతురూ కాదు" 
    
    ఇది నిజమేనేమో...? కోడలికి అమ్మగా వుండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు. చేస్తున్న ప్రతిపనికీ ఏదోరకంగా కోడలు తప్పుపట్టడం తన మనసుకి కష్టంగానే ఉంది. కోడలి ప్రవర్తనతో తనూ సర్దుకుపోలేక అత్తగారికుండే అహంకారమే ఆమె లోనూ తొంగిచూస్తుంది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#29
కూతురు ఏమాటన్నా కన్నతల్లి సర్దుకుపోగలదు. అలాగే కన్నతల్లి చెప్తేనే ఆకూతురుకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అది వారిద్దరి మధ్యా వుండే పేగు బంధం అలాంటిది. దీన్ని ఎవరూ తప్పుపట్టలేము. కానీ ఈబంధం రక్తంలో వచ్చింది కాదుకదా...తెచ్చిపెట్టుకున్న బంధాల్లో అరమరికలు తక్కువే వుంటాయనిపించింది. 
 
   అమెరికా వచ్చినప్పటినుంచీ....తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పుల్ని ఇట్టే గమనిస్తుంది ప్రసూన. 
  
    ఇక్కడ అన్ని హంగులూ ఉంటాయి. బయట తిరుగుతున్నంత సేపూ కొత్తలోకంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. మళ్లీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే. కొడుకూ కోడలు ఆఫీసులకు వెళ్లిపోతూ మనుమడిని కూడా ప్లే కాలేజ్లో దింపేస్తారు. ఆసమయమంతా...ఇంట్లో పనిచేసుకుంటూ...వాళ్ళు తిరిగి వచ్చేసరికి...అన్నీ సమకూర్చిపెట్టడం అయిపోతుంది. శని ఆదివారాలు కాస్తా కొడుకూ కోడలూ పార్టీలు షికార్లంటూ తిరుగుతారు. బయటకు వెళ్లాలనిపించి ఎక్కడికైనా తీసుకెళ్లమని కొడుకూ కోడల్ని అడుగుదామని వున్నా... అభిమానం అడ్డొస్తుంది. అదీగాక... చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవుడికి పెడుతుంటే...కోడలికి నచ్చడం లేదు. పిల్లాడికి ఏవిపడితే అవి పెట్టేయొద్దని మొహం మీదే చెప్పేసింది. వాడికి స్నానం చేయించినా...ఆటలాడించినా... ముద్దు చేయడం, పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. వాటన్నిట్టికీ తల ఆడిస్తూ...చేయాలి. ఎలాంటి పొరపాటు వచ్చినా. ..లేనిపోని భేదాభిప్రాయాలు అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయపడింది. కలిసిన కొద్దిరోజుల్లోనే మనస్పర్థలు మొలకెత్తడానికి చిన్న చిన్న మాటలు చాలనిపించింది. అలాంటి రోజులు ఇకపై చోటుచేసుకోకూడదని ...అక్కడుండి వారికి సేవలు చేసేకంటే....అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవడంలోనే తృప్తి ఉంటుందని తెలిసొచ్చింది. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పచెప్పి రావడం...క్షమించరాని నేరమే... తనను తాను తప్పుపట్టుకుంటూనే ఉంది ప్రసూన. 
 
   తన అత్తా కోడలు నడుమ తన జీవితమేమిటో తనకిప్పుడు బాగా అర్థమయ్యింది. అటు అత్తగారికి కోడలుగానూ...ఇటు కోడలికి అత్తగారిగానూ తనవంతు బాధ్యత వహించడానికే తాను పుట్టాననుకుంది. 
 
  ప్రస్తుతం...తన కొడుకు దగ్గరకంటే... తన అవసరం వయసుడిగిన అత్తగారికే వుందనిపించింది. ఆమెను క్షమించమని తల్చుకుంటూ మనసును సర్దిచెప్పుకుంది ప్రసూన...!!*
 
         ****     ****   **** 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#30
కోడలి గుణపాఠం
[Image: image-2026-02-01-165251241.png]          
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
 
   "పిల్లలు కాకపోతే పెద్దలు చేస్తారటోయ్ అల్లరి" నాపిల్లలు చేస్తున్న అల్లరిని ఆపుతూ కేకలేశానని తన మనుమల్ని వెనకేసుకొస్తూ నాతో అన్నారు అత్తగారు.
 
   "ఇది మరీ బావుంది అత్తయ్యా...! వాళ్ళు చేసే అల్లరేమైనా బాగుందా...? సోఫాలు ఎక్కి తొక్కుతూ కోతులల్లే దూకుతున్నారు. తోకలోకటే తక్కువ" అన్నాను.
 
   "ఇదిగో కామాక్షీ! ఇప్పుడే చెప్తున్నా...మళ్లీ నా మనుమల్ని కోతులూ కొండముచ్చులూ అంటే ఊరుకునేది లేదు" అన్నారు నన్ను రెచ్చగొడుతూ.
 
   "ఊరుకోండి అత్తయ్యా...! వీళ్ళు వేసే గెంతులకు కింద ఫ్లాట్ వాళ్ళు ఒకటే గోల. మేముండాలా వద్దా అంటూ. వాళ్ళకి మీరే సమాధానం చెప్పండి అయితే." అన్నాను వంటగదిలో వంటచేసుకుంటూ.
 
    నేను గట్టిగా అనేసరికి ఏమనుకున్నారో ఏమో...? "రండిరా... నాగదిలోకి పోదాం" అన్నారు.
 
    అబ్బే వాళ్ళు మాటెక్కడ వింటారు...? వంశీకి పదేళ్లు నిండినా కుదురు రాలేదు. వాడికంటే రెండేళ్లు చిన్నవాడైన అఖిల్ తో సమానంగా అల్లరిచేస్తాడు. ఈలోపు చెక్క సోఫా మీద నుంచి దబ్బున పడ్డాడు చిన్నోడు. అలా పడ్డంతో...వాడి తలకు
దెబ్బతగలడంతో పాటూ...సోఫా ఒరిగిపోయి దాని కాలు కూడా విరిగింది. దెబ్బతగలడంతో వాడు ఒక్కటే ఏడుపు. గదిలోకి దూరిన మా అత్తగారు పరుగున బయటకు వచ్చారు. 
 
   "అయ్యయ్యో...! బంగారం లాంటి కుర్చీ విరిగిపోయిందే. ఇది మా పుట్టింటివాళ్ళు నా పెళ్ళికి సారెగా ఇచ్చిన సోఫా సెట్" అంటూ...విరిగిపోయిన కుర్చీని చూసుకుంటున్నారు. 
   
   నా పిల్లాడికి దెబ్బ ఎక్కడ తగిలిందోనని తలరుద్దుతూ నేను చూసుకుంటున్నాను. అనుకున్నట్టే దెబ్బ తగిలిన చోట బొప్పి కట్టడం చేతికి తగిలింది. అదృష్టం కొద్దీ కన్నం పడలేదు. గబగబా ఫ్రిడ్జ్ లోంచి ఐసు ముక్క తీసి వాడి తలపై పెట్టాను. 
   
   అప్పుడు చూసారావిడ...మనుమడికి గట్టి దెబ్బే తగిలినట్టు. వాడిని ఊరుకోబెట్టడానికన్నట్టు...
    
  " అరెరే...! నీకు దెబ్బ తగలలేదురా. తగిలింది నా సోఫాకి. చూడు...దాని కాలు ఎలా విరిగిపోయిందో" అంటూ నానమ్మ అనేసరికి పకపకా నవ్వేశారు పిల్లలిద్దరూ.
 
   మా ఆదుర్దాలో మేముండగా కిందనున్న ఫ్లాట్ ఓనర్స్ రానే వచ్చారు. "మీ పిల్లలు చేసే అల్లరికి అనారోగ్యంతో ఉన్న మా మావగారి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఒకసారి మీరొచ్చి వినండి...దబ్బు దబ్బున్న ఎలా శబ్దాలు వస్తాయో" అంటూ గట్టిగా కేకలేశారు. 
 
   నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుకుని ఇకపై పిల్లల్ని అదుపు చేస్తానని చెప్పి పంపేసరికి...ముగ్గురికి ముగ్గురూ గదిలోకి దూరిపోయారు. అదేంటో గానీ...కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మనుమలతో పాటూ చిన్నపిల్లలైపోతారు ఈ నానమ్మా, అమ్మమ్మలు అనుకున్నాను.
 
  తలుపు గడియపెట్టి వచ్చి...వారున్న గదిలోకి వెళ్ళాను. ముగ్గురికి ముగ్గురూ పిల్లుల్లా వున్నారు. 
 
  "చూసారు కదా...పిచ్చి అల్లరి చేస్తే ఇలాంటి దెబ్బలే తగులుతాయి. నానమ్మ సోఫా కూడా విరిగిపోయింది. కింద ఇంటివాళ్ళ వార్నింగ్ కూడా వచ్చింది. ఇవన్నీ కోరి తెచ్చుకోవడమే."
 
   "అత్తయ్యా! ఈకరోనా కాలంలో స్కూళ్ళు లేక, బయటకెళ్లి ఆడుకోలేక ఇంట్లోనే ఉండిపోవడం వల్ల పిచ్చి అల్లరి చేయడం నేర్చుకున్నారు. స్కూళ్ళు తీసేవరకూ అయినా...వీళ్ళ అల్లరికి కంట్రోల్ చేయకపోతే కష్టం. వాళ్ళని మీరు వెనకేసుకొస్తూ ఉండక...భగవద్గీత శ్లోకాలు, రామాయణం, మహాభారతం, నీతి కథల్లాంటివి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూ చేయాల్సిన పని. అంతగా అయితే కింద కూర్చోబెట్టి...వాళ్ళతోపాటూ యే వైకుంటపాళీ ఆటో, లూడూ , చదరంగం లాంటి ఆటలు ఆడించండి. వాళ్ళ అల్లరిని మాత్రం సపోర్ట్ చేసి మాట్లాడకండి" అన్నాను.
 
   "అలాగేలేవే! ఇకనుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను గానీ...మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆ చెక్క సోఫా కాలుని వెంటనే రిపేరు చేయించి పెట్టు. నీకు పుణ్యముంటుంది" అన్నారు.
 
  అత్తగారు అలా అంటుంటే...ఆవిడను చూసి జాలేసింది.
 ఎంతైనా...పుట్టింటి వారిచ్చిన వస్తువులపై ఎవరికైనా ప్రాణమే కదాని...!!*
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#31
కోడలొచ్చింది

[Image: K.jpg]
శ్రీదేవి సోమంచి
[Image: png;base64,R0lGODlhAQABAHcAMSH+GlNvZnR3Y...ICRAEAOw==]"ఇంకేంటి అహల్యా! వాసు పెళ్ళి కుదిరిపోయింది. కోడలొస్తుంది. అంతా తీరికే" ఫ్రెండ్సు అన్నమాటలు పదేపదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాలమీద చిన్ననవ్వు విరిసింది.
నిజమే. కోడలొస్తే యింటి బాధ్యతలనుంచి తనకి కొంతేనా విముక్తి. ముందు వారంరోజులు పల్లెటూళ్ళో వుండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరసపెట్టి అక్కచెల్లెళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళి తలో రెండురోజులూ వుండాలి. ఢిల్లీలో వుండే అన్నగారు, ముంబాయిలో
వుండే తమ్ముడూ ఎప్పుడూ అంటూవుంటారు- "ఒక్క వారం రోజులేనా వుండేలా రావే. ఊరంతా
చూద్దువుగాని అని.
వాళ్ళు రమ్మనీ అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమనీ చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు.వెళ్ళినా ఒక్కరోజుమించి వుండలేదు. ఏవో అజ్ఞాతబంధాలు తనని వుండనివ్వవు.
ఇక్కడ యిబ్బందిపడుతున్నారేమో. వేళకి వండుకున్నారో, తినారో లేదో! ఎన్నో సందేహాలు. అంతా కలిసి
వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్టాఫీసులో. ఎప్పుడూ లీవు దొరకదు. మరోవైపు పిల్లల చదువులు.
వాసు భార్య వస్తే యింటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళిరావచ్చు....ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి.
"స్నేహా! ఫ్రిజిలోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చివ్వవే." అంది కూతురితో,
ఆపిల్ల ఓ చేతో నోట్ బుక్, మరోచేత్తో తల్లి అడిగినవీ తీసుకుని వచ్చి, వాటిని ఆవిడకిస్తూ -
"ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక వంటింట్లోకి అడుగే పెట్టను" అంది.
తల్లి చెప్పే చిన్నచిన్న పనులు, కోరే సహాయాలూ స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్ గా చదువుకుంటున్నప్పుడైతే
కోపం కూడా వస్తుంది. ఇంటిపనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి ఇలాంటి పుమాయింపులు చెయ్యటం వింతగానూ అనిపిస్తుంది. ఒక్కర్తే వుండటంచేత వంటింట్లో బోరు కొడ్తుందేమో, వదినొస్తే మంచి కంపెనీ! అనుకుంది.
"ఆ<! వదిన కోసమే నేనూ చూస్తున్నానులేవే! నాగదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా
వుంటాయని నాన్నగారు కోప్పడుతుంటారా, అమ్మేమో తనకి తోచినట్టూ సర్దేస్తుందా, తర్వాత
నాక్కావల్సినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్. నారూమ్
ఛార్జి తనకిచ్చేస్తాను" అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ.
అందరిమాటలూ వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి . అలాగే నవ్వొచ్చి పెదాలనీ, మనసునీ పలకరించిన మరో వ్యక్తి వాసు... కోబోయే పెళ్ళికొడుకు.
కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి
వసంతంలా... అనుకోవడం లేదెవరూ. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకి తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి వూపిరి పీల్చుకుందామనుకుంటున్నారు.
వాసుకి సెటిలైన అమ్మాయి సృజన. చామనఛాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్ళలో
కలిసినట్టుంటుంది. చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది. పెళ్ళిచూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్స్ చెప్పింది. వాళ్ళది యిదే వూరు. ట్రాన్సర్ల బెడదలేదు. చాలా యిష్టపడి వప్పుకున్నారు ఇద్దరూ !
అహల్యా ప్రసాదరావూ కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయిగాబట్టి, గృహిణిగానే వుండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని
భార్యవైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య, భర్త సంశయాలని.
"ఈ రోజుల్లో ఎందరు వుద్యోగాలు చెయ్యటంలేదు? అలాగే నా కోడలూను. మనకేమంత ఆస్తులున్నాయి? పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం? ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆసరాగానూ వుంటారు, మననుంచీ ఆశించరు " అంది.
ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు.
...
ఎంతో ఎదురుచూసిన పెళ్ళి... వాసు పెళ్ళి అవనే అయింది. కొత్తకోడలింకా
పాతబడనేలేదు- ఆఫీసుకి తయారైంది.
"అదేంటమ్మా! పదహార్రోజుల పండుగయేదాకానేనా వుండవా?" తెలతెలబోతూ అడిగింది అహల్య.
"ప్రొబేషన్లో వున్నానుకదండీ! లీవు పీరియడ్ కి ప్రొబేషన్ పొడిగిస్తారు. అందుకే ఎక్కువ లీవు పెట్టలేదు" అంది.
అహల్య యింకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. "వెళ్ళి జాయినవనీ, అహల్యా!ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు" అన్నాడు.
సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం ఆరింటికి.
వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండు , భార్యతో వెళ్తూ వీళ్ళనీ రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి
రాత్రి పదిన్నర. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు.
అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు.
* * *
పొద్దున్న ఆరింటికి లేస్తుంది సృజన. ఒక్కొసారి ఆరున్నరకూడా ఔతుంది. లేచి, గబగబ స్నానం చేసి వంటింట్లో కొస్తుంది. అప్పటికే అహల్య లేచేసి వుంటుంది. స్టామీద ఒకవైపు పొగలు
చిమ్ముతున్న పాలు, మరోవైపు
హిస్ మంటూ కుక్కరూ వుంటాయి..
"అయ్యో! మీరు కుక్కరు పెట్టేసారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా?" అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటినుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది.
ఉ<హు< అలాంటిదేం జరగదు. కామ్ గా మిగిలినపని అందుకుంటుంది. గబగబ
అయిందనిపించి, వాసుకి పెట్టి, తను తిని బైటపడ్తుంది. ఆరింటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్సై స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగుపెట్టేసరికి సగం వంటైపోయి వుంటుంది.అప్పుడూ ఏమీ మాట్లాడదు. పద్దతీ మార్చుకోదు.
రాత్రి పదింటికి లైట్ ఆరిపోతుంది. మళ్ళీ పన్నెండింటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రివేళ అంతసేపు లైట్ వేసుకొని ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటుంటారా?
ఉదయం సృజన లేచేసరికి ఆరు దాటిపోతోంది తరుచుగా.
...
"ఈ పిల్ల పద్దతి నాకేం నచ్చలేదండీ!  ఎంతకాలం కొత్తకోడలు? చకచక నాలుగు పనులూ చేసుకోవాలిగానీ అంతా నావంతన్నట్టు తూచితూచి చేస్తుంది. పొద్దున్నేమో పదింటిదాకా లేవకపోవడం. పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగేనా వుండటం? బుద్ధి
ఉండద్దూ, ఆ తల్లికి? ఇదేం పెంపకం?” ప్రసాదరావుతో అంది అహల్య.
కోడలు వస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయి అనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరి,  అదే బాధ్యత.  ఉక్రోషంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"ఏవో పనులు చేస్తూనే వుంది కదు, అహల్యా?" అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్తూ.
"ఉ<హు< నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలిగానీ. నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం? రాగానే
వంటింట్లోకి ఎందుకురాదు?"
"తొందరపడకు " హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగటం అతనికి బాధని కలిగించింది.
...
“ ఇంట్లో పని, ఆఫీసులో పని ఆపైన ఈ టెస్టులు అసలు పాసౌతానా? ఉ<హు<.
నావల్లకావటం లేదు. కొద్దిరోజులు మా అమ్మవాళ్ళింట్లో వుంటాను... ”
కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అంది సృజన . నిన్నమొన్నటిదాకా ఏ బాధ్యతలూ లేకుండా పెరిగి,
ఒక్కసారి యింతమంది మధ్యకొచ్చిపడేసరికి గిజగిజలాడిపోతోంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతోంది. అమ్మ , పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి యిక్కడ ఎదురౌతున్న కటుత్వం గాయపరుస్తోంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కరు పెట్టడం, కొన్ని కూరలు చెయ్యడం, సాంబారు చెయ్యటం వచ్చు. అదీ పెళ్ళికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేదో చేస్తూనే వుంది. టైం చాలటంలేదు. ఆఫీసులో రోజు లేటు.
సృజన అన్న ఆ కొద్దిమాటల్లోనూ ఆమె అంతర్యాన్ని విన్నాడు వాసు. "అమ్మావాళ్ళతో మాట్లాడతాను" అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని.
పెళ్ళికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తిఛాయలు కనిపిస్తున్నాయి అవిడ ఆశించినట్టు కోడలు యింటిని అల్లుకుపోవడం లేదని.
ముప్పయ్యేళ్ళుగా యింటికీ వంటకీ అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించంటంలో తప్పులేదు.
మరి సృజన? ఇంట్లోనూ ఆఫీసులోనూ ఎంతకని చెయ్యగలడు? అందులోనూ పెళ్లైన కొత్తలో?
ఆమె పుట్టింట్లో ఇద్దరూ ఆడపిల్లలే. చదువూ, వుద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనులమీద పెద్దగా దృష్టి పెట్టలేదు.
పెళ్ళి చేసుకోవటంతో సరికాదు. యింకా పెద్దబాధ్యతేదో తనపైన వుందనిపించింది వాసుకి.
...
"ఇప్పుడది పుట్టింటికి పనికిరా?" తెల్లబోతూ అడిగింది అహల్య
ఆఫీసులో ఏవో టెస్టులున్నాయమ్మా! రొటీన్ మారిందికదా, ఇబ్బందిపడుతోంది" అన్నాడు వాసు..
అతని మాటలింకా పూర్తికానేలేదు, విరుచుకుపడింది. "ఇప్పుడంత కొంపలంటుకుపోయే
ఎగ్జామ్సేం వున్నాయి? తర్వాత రాసుకొమ్మను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేక హాస్టలు కొచ్చిందా?"
"తనది. టెంపరరీ పోసింగ్. ప్రొబేషన్లో వుంది. అది పూరైయి పరీక్షరాస్తే రెగ్యులరౌతుంది. కేడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబులిటీ వస్తుంది." నచ్చజెప్పబోయాడు వాసు.
"ఐతే?"
“వాళ్ళింట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని..."
"ఇక్కడేం కష్టమొచ్చిందట? తిని కూర్చొవడమేగా? ఆ తిండికూడా మంచం దగ్గరికే పంపించమనా?" అహల్య బైటపడిపోయింది. వాసు నిర్మిణుడైపోయాడు. అది సృజన యింట్లోలేని సమయం.
ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. "వాసూ! నీకెలా మంచిదనిపిస్తే అలాగే
చెయ్యి, నువ్వేం చిన్నవాడివికాదు. పెళ్ళైనవాడివి. అన్నిటికీ మమ్మల్నడగడం దేనికి?" అన్నాడు. |
వాసు తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపటమే ఉత్తమమనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కోలీగ్స్ లో అత్తలంటే కోడళ్ళకీ , వీళ్ళంటే వాళ్లకీ ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తనింట్లో కూడా అంతేనా? దిగ్ర్భాంతిగా వుంది.
"అహల్యా! నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా?" భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటవేస్తుంది. పిజీ చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో
నెగ్గుకొచ్చి వుద్యోగం సంపాదించుకుంది. వాసూ, హరీ, స్నేహలకీ ఆ అమ్మాయికీ తేడా కనిపించదు. మరి అహల్యలో ఎందుకామెపట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయిక వైరమా లేక అసూయా?
భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది.అతనిముందు తన అసంతృప్తిని పరిచింది. "ఇదేమిటి? కోడలోస్తే నాకు కొంత ఆసరా ఔతుందనుకున్నాను. ఓ కొడుకుని
నాకు దూరంగా తీసుకుపోవటమా, తను నాకు చేసే సాయం?" అంది
అతను చిన్నగా నవ్వాడు. “ఎదుటివారినుంచీ ఆశించడం, వాళ్ళకి మనం ఏదో యివ్వాలనుకోవటం - యీ రెండూ చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్యా! కోడలు తీసుకోవడానికి
నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టిచెయ్యాలనుకుంటున్నావు   ...తను చేసేవిధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం
చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లూ, ఇన్ని సామాన్లూ, పనులూ అవసరం లేదు. ఏదో ఇంత వండుకు తిని ఆఫీసుకి పరిగెత్తటం తిరిగొచ్చాక వోపిక వుంటే మళ్ళీ వంట...లేకపోతే బయట
తినటం..."
"తనొక్కతేనా, ఉద్యోగం చేస్తోంది? " మధ్యలోనే ఆపి వుక్రోషంగా అడిగింది. "ఏదో ఒక ఉద్యోగం వుంది. ప్రమోషన్లనీ వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల తనకెందుకవన్నీ?”
ప్రసాదరావుకి నవ్వూ, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో, మూర్ఖత్వమో అర్ధమవలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది.
"చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పుదులెండి. అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకుని ఆఫీసుకు వెళ్లి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చిపెట్తాను." అంది తనే మళ్ళీ.
ప్రసాదరావు సూటిగా చూసాడామెని "ఎవరికి చేస్తున్నాను నువ్వు ?నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకీ పిల్లలకీ చేస్తున్నావు. నీ బాగుకోసం చేస్తున్నావు. ఎవరో బైటిపిల్ల నీ యీ
బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలీడం లేదు... అహల్యా! ఇంట్లోవుండి నువ్వేదో
కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. వుద్యోగంతో నేనూ విసిగిపోయాను. పెళ్ళి పిల్లలు,కుటుంబం - అనేవి నీ స్వేచ్చని ఎలా అరికట్టాయో, నా విషయంలోనూ అంతే చేసాయి... అహల్యా! నువ్వే ఈ పనులు చెయ్యాలనిగానీ, యిలాగే చెయ్యాలనిగానీ, నీ పుట్టింటికీ, అన్నదమ్ముల దగ్గరికీ
వెళ్ళరానిగానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు. కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు యీ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే యిక్కడంతా
అస్తవ్యస్తమౌతుందేమోనని భయపడ్డావు.... నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని
సృజనకీ యివ్వు. నువ్వు యివ్వకపోయినా వాళ్ళ స్వేచ్చని వాళ్ళు వదులుకోరు. మరో విషయం.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#32
పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన అహాలని నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా
వుండటానికి. వాళ్లమధ్య అనుబంధాన్ని పెరగనీ. వాసునిబట్టి నువ్వుగానీ నిన్నుబట్టి వాసు కాదు.
తొందరపాటుతో తెగేదాకా లాగకు." అనేసి ప్రసాదరావుకూడా వెళ్ళిపోయాడు.
లోపల స్నేహ, హరితో అంటోంది.
"వదిన పాపం మంచిది కదన్నయ్యా! అమ్మెందుకని యిలా మారిపోయింది? మననేమో చదువు చదువని అంటుంది. వదిన చదువుకుంటుంటే యిలా మాట్లాడుతోంది".
"పెళ్ళయ్యాక చదువులూ, ఎగ్జామ్సు అంటే ఎలా కుదుర్తుందే? చిన్నపిల్లవి నీకు తెలీదివన్నీ.అమ్మ... మనకోసం ఎంత కష్టపడ్తోంది? ఆమెనలాగే కష్టపడమని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా?" అన్నాడు హరి అసహనంగా.
అన్నీ కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు. ఎవరిదారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక,
ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవటం. కోడలొచ్చి తనకి
ఆసరా యిస్తుందనే కోణంలోంచీకాక, కన్న ముగ్గురు పిల్లల్నీ లైఫ్ లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే
దిశగా అహల్య ఆలోచించి వుంటే యీ అసంతృప్తి వుండేదికాదు.
...
ఆరోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమెపట్ల అతనికిగల వున్నతాభిప్రాయాలు మూలాలలో
కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్నీ అనువుగా చేసిపెట్టుకుని, ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమే మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోందని అనిపించింది. ఏమిటి, మగవాడు పెళ్లి ద్వారా
పొందేది? భార్య సంతోషంగా వుంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న
కుటుంబంలో తనూ, సృజనా భాగమా లేక తామిదరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవలసిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకీ ఆకాంక్షలకీగల విలువేంటి? క్రాస్ రోడ్స్ లో వున్నట్టనిపించింది వాసుకి..
అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి తనవరకూ తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది. స్నేహ.
ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు! తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికారపరిధికీ వాళ్ల స్వేచ్ఛకీ హద్దుగీత గీసినట్టనిపించింది... ఇంకా?
సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేదీ వుండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్టు పాసౌతుంది. ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తుంటాయి.
అవి రాస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. కెరీర్... దాన్ని నిరంతరం ముందుకి తీసుకెళ్లాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాపోబాబో పెద్ద కాలేజీకెళ్ళదాకా
తమతో కలిసుంటారేమో! అదేనా తను మంచిగా వుంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లివుంది. అంతేనా, యీ పెళ్ళినుంచి తాను పొందబోయేది? తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టింది. అహల్యం, కళ్ళలోంచి నీళ్ళు
జారిపడ్డాయి.
పక్కమంచం మీద వున్న ప్రసాదరావు గమనించాడు. “వాసు పెళ్ళికి
ముందు నీకెలాంటి కష్టాలు వుండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు."
అన్నాడు వ్యంగంగా... అహల్య తీవ్రంగా గాయపడింది.
...
సృజన తోడులేకపోవడం వాసుకి వెల్తిగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడున్నాడు. అలావెళ్ళినప్పుడు
ఒకొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతోంది. పెళ్ళవడంతో
కొడుక్కి కొత్త బంధం ఏర్పడి, కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించటం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని  వియ్యాలవారింట్లో అందంగా ప్రెజెంట్ చేయబడటం అతనిద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయినుంచి స్మార్ట్ జీవితభాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలా ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్దికొద్దిగా జరుగుతూ వస్తోంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టనిపిస్తోంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడంలేదు. అహల్య దీనికి మినహాయింపుకాదు...
...
సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది.
"ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్ళిచేసేసారు" అని ,"ఆవిడకేమిటో నా వునికే యిష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది.నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నాగురించి ఏవోచెప్తుంటుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా వుంటాడు. ఎందుకమ్మా, అంత యిష్టం లేకుండా పెళ్ళిచెయ్యడం?" అంది
"పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదౌతుందని బాహాటంగా వప్పుకుంటాం. మగవాడి విషయంలో
కూడా అదే నిజమైనా అలా వప్పుకోలేరు. అతనింకా తన కొడుకే, తన చెప్పుచేతల్లోనే వుండాలని
ఆశిస్తారు. క్రమంగా అర్థమౌతుంది. అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి" అంది సృజన తల్లి.
ఆవిడా అత్తచేతుల్లో ఆరళ్ళుపడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది.
ఇదంతా యిద్దరు స్నేహితుల మధ్యకి మూడోవ్యక్తి ప్రవేశంలాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవటంకూడా జరుగుతుంది.
వాసు ప్రేమ పట్ల సృజనకెలాంటి సందేహం లేదు. కానీ దానిమీద అత్తగారి ప్రభావంఎంత వుంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది.
...
ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనని తీసుకొచ్చేసాడు వాసు.
"మంచిది చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతాం" అని సృజన తల్లితండ్రులు చెప్పినావినలేదు. ఇంకొక్క క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి వుండలేని స్థితికొచ్చేసాడు.
ఇంటికి రాగానే అహల్య అననే అంది. “ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం, పద్ధతి ఏమీ తెలీవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావుకదా, పెద్దవాళ్ళువెంటబెట్టుకుని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా?" అని
"మీ అబ్బాయే వద్దన్నారండీ!” సృజన మామూలుగా అనేసింది.
అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు.
"వదినా!" అంటూ వుత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది.
ఈ పరిస్థితంతా చూసాక ప్రసాదరావు ఒక కచ్చితమైన నిర్ణయానికి కొచ్చాడు.
...
"ఇప్పుడు లీవెందుకు పెట్టారు?" ఆశ్చర్యంగా అడిగింది అహల్య కొద్దిరోజులు అందరిళ్ళకీ తిరిగొద్దాం. నువ్వూ అనుకుంటున్నదేగా?“ జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా, అతను ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే నమ్మక తప్పులేదు.
"కొద్ది రోజులు మనం బైటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది. ఈ యిల్లు తనదికూడాననే ఆలోచన కలుగుతుంది." అనికూడా అన్నాడు ప్రసాదరావు.
ఈ యిల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది? ఇంత అనుబంధం
పెంచుకున్నది? అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు.
కొడుకు పెళ్ళవ్వాలి. కోడలు రావాలి. ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి . అతిల్లే లోకంగా బతకాలి కానీ
ఆమె ఆయింట్లో భాగం కాదు. పరాయిదే. ఎక్కడినుంచో వచ్చినదే. ఎవరింటికో చెందినదే.
అమెదంటూ ఏదీ వుండకూడదు... భార్య ఆలోచనలు యీ స్థాయిని దాటవనిపించిందతనికి.
****
ఒక్కొక్కరింటికీ వెళ్తూ వుంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం
తెరుచుకుంటున్నట్టనిపిస్తోంది అహల్యకి. ఇదివరకూ కూడా వాళ్ళతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ యిప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరిళ్ళలోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
ప్రసాదరావు అన్నకొడుకు సింధీ అమ్మాయిని ప్రేమించాడట. పెళ్ళి చేసుకుంటానన్నాడట.
"అలా ఎలా కుదుర్తుంది? కులం, గోత్రం, సాంప్రదాయం..." అని వీళ్ళంటే-
"నాలాగే బీటెక్ చదివి, నాతోపాటే జాబ్ చేస్తున్న అమ్మాయైతే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగానీ మీరు అన్ని లెక్కలూ వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదుర్తుంది?
ఐనా పెళ్ళిచేస్కునేది నేను, కాపురం చేసేది నేను. నాకు వీలుగా వుండాలా, మీకా?" అన్నాడట.
"అదికాదురా! ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో వుద్యోగాలు చెయ్యట్లేదంటావా? వీడికా సింధీపిల్ల వచ్చింది... అంతే"
తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న.
"కులాలు మతాలు అర్థాలు మారిపోయాయేమోలే అన్నయ్యా! కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తోంది. డాక్టరు చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ యింజనీరునే. కంపాటిబులిటీ కోసమేమో!" అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్పు.
"ఈయనెప్పుడూ పిల్లల పక్షమే" అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు.
అక్కడినుంచీ అహల్య అక్కగారింటికి వెళ్లారు.ఆవిడ కూతురూ, అల్లుడూ అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి.
“నాకూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా వుందే అహల్య! మావారి మేనత్త కొడుక్కేగా దాన్నిచ్చినది? బైటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి, ఆచారం. దీనికి ఆవిడ వునికే
గిట్టదు. ఇప్పుడా పెద్దావిడ్ని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం! ఆవిడెంత బాధపడ్తోందో!" అంది.
ఆమె కూతుర్ని కదిలిస్తే-
“ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేసామని పిన్నీ? ఓపిగ్గా వుంది. మడి కట్టుకుని వండటం నావల్లకాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపుల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ
చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు... ఇంక అమెరికా అంటావా, వెళ్ళక యిక్కడే వుండి మేం చేసేదేముంది? ఆవిడ్నీ తీసికెళ్తామన్నాం రానంది. అమ్మానాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే యిది వాళ్ళకి అక్కర్లేని
బాదరబందీ. ఒకవేళ వాళ్ళు పిల్చినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లినని ఇగో. మేం మాత్రం అవసరంలేని త్యాగాలు చెయ్యాలి..." అంది.
ప్రసాదరావు పొయెటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము
కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్ధమవలేదు.
అహల్య అన్న యింట్లో మరోరకం సమస్య. కొడుకూ కోడలూ దెబ్బలాడి వేరుపడ్డారట.
అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా, "ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటి పెట్టుకుని
వుంటారు? వాళ్ళకీ మనకీ యింటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసెలా వుంటారు? ఎక్కడ
యింటరాక్షన్స్ వుంటాయో సహజంగానే అటువైపు ఆకరించబడతారు" అని ఫిలాసఫి మాట్లాడినా,
అహల్య వదినమాత్రం తన బాధని దాచుకోలేకపోయింది.
"ఎంత అపురూపంగా పెంచానే
అహల్యా వాడిని? అలాంటిది నామాట విషమైంది. భార్య బెల్లమైంది." అంది.
"బావుందే, నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుంది, దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి, ఎవరేనా?" అని అన్నగారంటే అహల్యకి
నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడ్తుందని ఆపుకుంది.
"రోలొచ్చి మద్దెలతో మొరపెట్టున్నటుందిలే బావా! మాయింట్లోనూ ఓ కోడలుంది.
వాసుమీది పెత్తనం వదులుకోవడానికి యీవిడ సిద్ధంగా లేదు. విసుర్లు, కసుర్లు... " ప్రసాదరావు
నోరిప్పాడు.
నిజమా అన్నట్టు చూసారు అహల్య అన్నావదినలు. అహల్య చిన్నపిల్లే అయింది. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. "నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తోందన్నయ్యా. కానీ వాడిమీది ప్రేమ.... వాడు నాకు దూరమౌతాడేమోనన్న బెంగ... నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా యీయనకూడా ఆ పిల్లవైపే మాట్లాడతారు. నన్నర్థంచేసుకోరు." అంది.
విషయం కొంత సీరియసేనని అర్థమైంది అహల్య వదినకి. “సరే! ఈవిషయాలన్నీ
తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి, భోజనాలకి లేవండి" అంది మాటమార్చి.
వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యనీ కొడుకుని తీసుకుని మేనత్తమామల్ని చూడటానికొచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపమూ కనబడలేదు అహల్యకి. సాయంత్రందాకా వుండి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి వదినా మరదళ్ళు చాలా సేపు మాట్లాడుకున్నారు.
"ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్యా! పెళ్ళితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమయాడనిపించి, అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని...."అహల్య వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది.
“వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంటవడం, బాబు పుట్టడం జరిగింది. వాడు... నామనవడు నా కొడుకురక్తం... నా భర్త రక్తం... ఇలా అనుకుంటుంటే నామనసు వుప్పొంగిపోయేది. వాడిని ఒక్కక్షణం కూడా వదిలి పెట్టి
వుండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మీనా వాడిని సరిగా ఎత్తుకోలేదేమో! పెంచట్లేదేమో! ఇలాంటి ఆలోచనలొచ్చేవి. రాత్రివేళవాడు కాస్త కంయిమంటే చాలు, వెంటనే
లేవలేదని మీనామీద కోపం వచ్చేది. పొద్దున్న లేవగానే అంత మొద్దు నిద్రేమిటని కోప్పడేదాన్ని.
అహల్యా! అది చాలా మంచి పిల్లగాబట్టి ఎంతో ఓర్చుకుంది"
"..."
"భార్యని అపురూపంగా చూసుకుని ఆమెని గౌరవించి, ఆమె అభిప్రాయాలని
మన్నించేవాడిని ఎంతో వున్నతంగా భావిస్తాం. మన భరలు అలా వుండాలని ఆశిస్తాం. కానీ కొడుకలా వుంటే వోర్వలేం. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే వుండిపోవాలని మన కోరిక. అతను
ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ వుంటే సహించలేం...ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్యా! ఆఖరికి ఒక్కరోజు మీనా బయటపడింది . ప్రఫుల్ ని నిలదీసి
అడిగింది-
మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదూర్చడం?తొమ్మిదినెలలు మోసి కన్నదాన్ని, నాకొడుకుని నేను పెంచుకోలేనా? - అని.
ప్రఫుల్ కి కూడా నా పద్ధతి నచ్చనట్టే వుంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత
పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపొమ్మన్నారు. మీ అన్నయ్య."
“అదేంటొదినా! మనవలు మనకి మాత్రం ముద్దుకాదా? వాళ్ళని దగ్గరికి తియ్యడం తప్పా?" చప్పున అడిగింది అహల్య.
"నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లితండ్రుల తర్వాతే ఎవరేనానట. భార్యాభర్తల మధ్య, తల్లితండ్రులకీ పిల్లలకీ మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన
కుటుంబబంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకూ అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు
పుట్టినట్టే తల్లివడిలో వుండిపోడు. పారాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చునుగానీ వాళ్ళ ప్రపంచంలోమాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళమీద చూపించామో, దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ళ పిల్లలమీద ప్రకటిస్తారు."
“మరి మనం?"
“నాకు మీ అన్నయ్యా, నీకు ప్రసాదూ లేరా?"
"అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది యిదేనా?”
"ఏమీ మిగలకపోవటమేమిటి? నువ్వు పెళ్ళి చేసుకున్నావు. వాసు పుట్టాడు. మిగిలిన యిద్దరూ పుట్టారు. వాసు పెళ్ళైంది. వాళ్ళకీ పుడతారు. మనం పెర్పెచ్యువేట్ కావటం లేదూ?
అదంతా మిగులేగదమ్మా?"
అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ... ఏదో ఆవేదన....
ఇంకేదో ఆర్తి... అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెల్తిపడింది.
“ఎందుకు ఏడుస్తావు, అహల్యా! మగవాళ్ళలా అంటీముట్టనట్టు వుండేలా మనని పెంచరు.
అనుబంధాలూ, ప్రేమా అంటూ రంగరించిపోస్తారు. సృష్టికి మనమే ఆధారమని అభూతకల్పనలు
చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టూ దాటుతుంటే
అర్థమౌతుంది, మనదంటూ ఏదీ లేదని. పెళ్ళిచేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని చక్కగా పెంచటం-అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత?” అని ఆగింది అహల్య వదిన.
“ఆ తర్వాత?” అప్రమేయంగా అడిగింది అహల్య.
“మనం దాటిన స్టేజిలన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి... ఏ అత్తా తన కోడలు మంచిదని ఏ కోడలూ అత్త మంచితనాన్ని వప్పుకోదు.ఇది కొత్తగా వచ్చినది కాదు. ఉమ్మడి కుటుంబాలలోనూ వుండేది. దీన్ని సాంప్రదాయక వైరం అంటారు. కానీ నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని, తనవాళ్ళని, అక్కడ తనకుండే స్వేచ్ఛాస్వతంత్రాలని వదులుకుని జీవన శైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏపాటి సహకరిస్తున్నామో! కావాలంటే ఆమెమీద ఆంక్షలు పెడతాం. సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలూ, సాంప్రదాయాలూ ప్రేమని పుట్టించవు. కుటుంబాలను
నిలబెట్టవు. మనుషులని కలిపి వుంచవు" అంది.
అహల్య ఆలోచనలో పడింది.
అవతలి గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు "మాకోడలు... సృజన చాలా-
తెలివైన పిల్ల. నాకా అమ్మాయిని చూసే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా! మంచికల్చరున్న కుటుంబంలోంచి వచ్చింది. వాసుకి చక్కటిజోడీ. కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు. వాసు
పెళ్ళయేదాకా తనేగా, యింట్లో అన్ని పనులూ చేసుకునేది? ఇందరికోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చేయబోయినా చెయ్యనిచ్చేది కాదు... అలాంటిది... ఇప్పుడా అమ్మాయితో వంతుపోతోంది... సూటిపోటి మాటలంటోంది. అసహనంతో రగిలిపోతోంది. తను వాసునించి ఏం ఆశిస్తోందో తెలీదు. వాడు పెళ్ళికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటోందా? సృజనని
పట్టించుకోవద్దనుకుంటోందా? ఇంట్లో యిదివరకులేని అశాంతి యిప్పుడు చోటుచేసుకుంది."
ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. "ఒక కొత్త వ్యక్తి యింట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనడంకన్నా సర్దుబాటు సమస్యలనో యిగోప్రాబ్లమ్సనో అనటం
సబబేమో ప్రసాద్! ఆడవాళ్ళకోసం వంటింటిని సృష్టించి, దానికి వాళ్లని పట్టాభిషిక్తులని చేసినది ఒకప్పుడు
మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే... కోడలు పరాయిదనే కోణంలోంచీ ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లల్లాంటిదే అనుకుంటే, మన పిల్లలనుంచీ ఎదురయ్యే సమస్యలే ఆమెనించి కూడా ఎదురౌతున్నాయని
అర్థమౌతుంది. మే పెద్దవాళ్ళమయాం. ఇంకా ఎంతకాలం మీమాట వినాలి? - అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వవికాసంలో భాగమనుకుంటాం. కోడలుమాత్రం అలాంటిదికాదా? మరో |
విషయం... ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు
స్నేహితుడి భార్యౌతుంది. స్నేహితుడి భార్యపట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే యీ గొడవలు తలెత్తవు. కానీ అదే చెయ్యలేకపోతున్నాం" అన్నాడు.
"..."
"వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక , వ్యవసాయం, వ్యాపారం, పెద్దకుటుంబాలలో సహకారం కోసం అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాలకోసం కలిసి వున్నారు. ఇప్పుడు అలాంటివేం లేవు.ఐనా కూడా మనుషులు కలిసి వుండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్లని కలిపి వుంచేది. అది ఒక్కరోజులోనో, ఒక సాంప్రదాయంతోనో పుట్టేది కాదు"
ఆ తర్వాత వాళ్ళా విషయాన్నొదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. అదయ్యాక రాజకీయాగురించిన చర్చలో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది - ఇద్దరు ఆడవాళ్ళు వంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారాని. వెంటనే
జవాబు కూడా దొరికింది - భర్తలమీదో, అత్తలమీదో, కోడళ్ళమీదో చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ల అసంతృప్తి అక్కడే మొదలౌతుంది.
మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు, అహల్యని తనింటికి తీసుకెళ్ళడానికి. “మీనానీ బాబునీ యిక్కడ చూసానుకదరా, మరోసారి వస్తాను” అంది అహల్య మామూలుగా. అతను
చిన్నబుచ్చుకునేసరికి బయల్దేరింది. దార్లో అన్నాడతను. "అమ్మావాళ్ళనుంచీ వేరే వచ్చేసానని
కోపంగా వుండచ్చు అత్తా! కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్ళిచేసారు,
ఆమెని ప్రేమగా చూసుకొమ్మన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు యిద్దరూ ఒకటే . తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటిబిడ్డమీద కేంద్రీకరిస్తారు. రెండోబిడ్డ పుట్టగానే యిద్దరి మధ్యా పంచుతారు. మరోవ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనకటిలా వుండటం ఎలా సాధ్యం.
మీనాని ప్రేమించడానికీ అమ్మని గౌరవించడానికీ ఏమిటి సంబంధం? రెండూ వేర్వేరు విషయాలు కావా?”
అతను వ్యక్త పరిచిన భావాలకి అహల్య నివ్వెరబోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రపుల్ లో ఎంత మెచ్యూరిటీ?!
అతనే మళ్ళీ అన్నాడు. “మావైపునించీ కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే. మాకుండే కంఫర్డ్స్ కూడా. ఎక్కువే. అలాగే వత్తిళ్ళు. నాన్నా, మామయ్యా వాళ్ళలాగా ఏ యిరవయ్యేళ్ళకో వుద్యోగంలో చేరితే అరవయ్యేళ్ళదాకా నిశ్చింతగా చెయ్యగలిగేవి కావు. ప్రతిక్షణం మా వుద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయ్యాలి. బాస్ ని యింప్రెస్ చెయ్యాలి. కాలంతో పరిగెడ్తూ మా స్కిల్స్
పెంచుకోవాలి. నువ్వుత్త వెధవ్వి అని ఎవరేనా మొహం మీదే అన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్ . ఇంటికొచ్చాక ప్రశాంతంగా వుందామనుకుంటే
అమ్మకీ మీనాకీ పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు యిద్దరినుంచీ కూడా సంతోషమేకావాలి” అన్నాడు.
మాటల్లోనే యిల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా, కళాత్మకంగా వుంది. ఆ యింట్లో ప్రఫుల్ తనెలా వుండాలనుకుంటున్నాడో
అలా వుంటాడు. అతనొక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుడిలా అనిపించలేదు.
అంటే ఆత్మీయత లేదని కాదు. అదతని కొడుకుని చూడగానే పొంగివచ్చింది. వాడిని ఎత్తుకుని
ముద్దు పెట్టుకుంది.
...
వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడంలేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది. పుస్తకాలు చదువుతోంది. మ్యూజిక్ క్లాసులకి కూడా వెళోందట. మార్నింగ్ వాక్, యీవెనింగ్ వాక్ చేస్తోంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లేనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది. కానీ అందులో వెల్తి వుంది. కారణం - యిప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది.
అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది రెండు విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య యిమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూకాదు, నవ్వుతూ.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#33
     శుచి శుభ్రత
[Image: acb93b_8fc3bea86bb64863994c4cd41b110923~mv2.jpg]






     L. V. జయ

సమర్థ్ తల్లితండ్రులు రాధ, మాణిక్యాలరావు పల్లెటూళ్ళో పుట్టి పెరిగినవాళ్ళు. మాణిక్యాలరావు నార్త్ ఇండియాలో, సెంట్రల్ గవర్నెమెంట్ ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక, సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు.  




జాగృతి పట్నంలో పుట్టి, పెరిగిన అమ్మాయి. ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తోంది. తల్లితండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో, అన్ని రకాల వసతులతో, సదుపాయాలతో పెరిగింది.



జాగృతికి, సమర్థ్ తో పెళ్ళి తరువాత, రాధ సమర్థ్ తో, 'మీ ఆవిడకి పని నేర్పి పంపిస్తానని,' చెప్పి, వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళింది. రాధ పద్ధతులు, అలవాట్లు, జాగృతికి తెలియకపోయినా,  పనివాళ్ళు లేకుండా అన్ని పనులు రాధే చేసుకుంటుండడం చూసి, రాధకి పనిలో సాయం చెయ్యటానికి ప్రయత్నించింది.



కానీ రాధ, "నాకు శుచి శుభ్రతలెక్కువ. ఎవరి పనీ నచ్చదు నాకు. అందుకే పనిమనిషిని కూడా పెట్టుకోకుండా అన్ని పనులు నేనే చేసుకుంటాను." అని గసిరి, జాగృతిని పని దగ్గరికి రానివ్వలేదు. 'పని నేర్పిస్తానని చెప్పి, పని దగ్గరికి కూడా రానివ్వటం లేదేమిటి ఈవిడ?' అనుకుంది జాగృతి. జాగృతికి కూడా శుభ్రత ఎక్కువే అయినా, రాధకి భయపడి దూరంగా ఉండిపోయింది.    



ఆ రోజు రాత్రి రాధ, మాణిక్యాలరావు తో, "చూసారా. ఇది ఒక్క పనిలో కూడా నాకు సాయం చెయ్యలేదు. చక్కగా తిని కూర్చుంటోంది. ఇంటికి కోడలు వచ్చినా, నా పని ఏమీ తగ్గలేదు. నా బతుకులో ఏ తేడా రాలేదు. అంతా నా ఖర్మ." అని భాదగా చెప్పింది.



మాణిక్యాలరావు, జాగృతిని పిలిచి, "అత్తగారు, అలా కష్టపడుతుంటే, పనిలో చెయ్యందించకుండా కూర్చున్నావేం? ఇదేనా మీ ఇంటివాళ్ళు నీకు నేర్పించారు?" అని తిట్టాడు.  మాణిక్యాలరావు మాటలకి జాగృతి బాధపడినా, 'పనిలో సాయంచేస్తానంటే గసిరి, ఇప్పుడు చెయ్యటంలేదని వాళ్ళ అయన చేత నన్ను తిట్టిస్తున్నారేమిటి ఈవిడ!! ఈవిడ మనసులో నా మీద ఎదో ఉంది. ఈవిడ ఎదో దాస్తున్నారు. ఏమిటో చూద్దాం.' అనుకుని రాధని గమనించడం మొదలుపెట్టింది.



మర్నాడు ఉదయం జాగృతి లేచిన సమయానికి, రాధ పెరట్లోనుంది. 'ఇంత ఉదయాన్నే లేచి, ఇక్కడ ఏం చేస్తున్నారు?' అని వంటిటి గుమ్మం దగ్గరనుంచి రాధని చూసింది జాగృతి. రాధ నోట్లో ఉండాల్సిన పళ్ళు, ఆవిడ చేతిలో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. రాధ వాటిని బాగా తోమి, నోటులో పెట్టుకుంది. జాగృతి దృష్టి కిటికీ మీద పడింది. కిటికీనిండా పడున్న ముగ్గుపిండి మధ్యలో, ముగ్గు పిండి డబ్బా, సుద్దముక్కలు, పేస్ట్, బ్రష్ లు, టంగ్ క్లీనర్లు, వాటి పక్కనే పెరట్లోకి వేసుకునే చెప్పులు, పువ్వుల బుట్ట ఉన్నాయి. 'శుచి శుభ్రత ఎక్కువని చెప్పినావిడ, నోట్లో పెట్టుకునే వస్తువుల్ని ఇలాంటి చోట పెట్టారేమిటి?' అనుకుంది జాగృతి.



రాధ, చెప్పులు వేసుకుని వెళ్ళి, పువ్వులు కోసుకొచ్చి, వాటిని బుట్టలో వేసి, పూజ గది ముందు పెట్టింది. 'చెప్పులు, దేవుడి కోసం పువ్వులు పెట్టె బుట్ట అన్నీ ఒక్కచోటనా?' అని ఆశ్చర్యపోయింది జాగృతి.



ముగ్గు డబ్బా తీసుకుని ఇంటిబయట ముగ్గువేసి వచ్చి, "పట్నంవాసులకి ముగ్గులు వెయ్యడం వచ్చో, రాదో?" అని  మాణిక్యాలరావుకి వినపడేలా అంది రాధ. తరువాత, రాధ వంటింటిలోనున్న గిన్నెలు తోమడానికి వెళ్ళింది. రాధ వెనకే వెళ్ళింది జాగృతి. రాధ గిన్నెలను ముందు విమ్ సబ్బుతో తోమి, కడిగి, తరువాత బట్టలుతికే రిన్ పౌడర్తో తోమి, మళ్ళీ కడిగింది. కడిగిన గిన్నెలలో పాలు కాచి, కాఫీ కలిపి, మాణిక్యాలరావుకిస్తూ, 'ఇలా మిలమిల మెరిసేటట్టు గిన్నెలు తోమగలదా ఈ పట్నం ఆవిడ?' అంది.



మాణిక్యాలరావు, జాగృతిని పిలిచి, "చూడమ్మాయ్. ఉదయాన్నే లేవడం, శుభ్రంగా పనులు చేసుకోవడం మీ అత్తగారి దగ్గర చూసి నేర్చుకో. పనుల్లో సాయం చేస్తుంటే అవే వస్తాయి. ఖాళీగా కూర్చుంటే ఏమీ రావు." అని చెప్పాడు.



"నన్ను చూసి నేర్చుకోవడం కూడానా!!  అది నా మాటే వినటం లేదు. చదువుకున్నానన్న పొగరు దానికి." అని చెప్పింది రాధ. మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూసి, "పోనీ. నువ్వు దగ్గరుండి నేర్పించు. నేర్చుకుంటుందేమో చూద్దాం." అన్నాడు రాధతో.



జాగృతి, 'ఈవిడకి నన్ను తిట్టించడమే అసలు పనిలా ఉంది. ఈవిడ దగ్గర నేనేం నేర్చుకోవాలి? ఉదయాన్నే లేచి, ఎవరికీ కనపడకుండా కట్టుడు పళ్ళు తోమడం నేర్చుకోవాలా? లేక బట్టలుతికే రిన్ పౌడర్ తో గిన్నెలని తోమడం నేర్చుకోవాలా? అసలు ఆ పొడి పొరపాటున కడుపులోకి వెళితే ఏమవుతుందో ఈవిడకి తెలియదేమో.' అనుకుంది. 

   

రాధ తరువాత, ఉతకాల్సిన బట్టల్ని తీసుకుళ్తుంటే, జాగృతి రాధ వెనకే వెళ్ళింది. 'గిన్నెలనే రిన్ తో శుభ్రం చేసినావిడ, బట్టల్ని ఎలా ఉతుకుతుందో?' నని చాటునుండి చూసింది. పది చెంచాల రిన్ లో బట్టల్ని నానబెట్టి, తనని ఎవరూ చూడటంలేదని నిర్దారించుకుని, నల్ల రంగు హెయిర్ డై తీసి, జుట్టుకి రాసుకుంది రాధ.



'ఓహో. ఇందుకా ఎవరికీ కనపడని చోటికి వచ్చి, బట్టల్ని ఉతుకుతున్నారు ఈవిడ!! ఇలాంటివన్నీ నాకు తెలియకూడదని నన్ను దగ్గరికి రానివ్వటం లేదేమో.' అనుకుంది జాగృతి.



జుట్టుకి డై వేసుకోవడం అయ్యాక, రాధ బట్టల్ని చేతితో ఉతికి, వాటిని పిండకుండా, దండెం మీద వేసి, స్నానానికి వెళ్ళింది. 'వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు కదా. ఇంత కష్టపడడం ఎందుకు? ఉతికిన బట్టల్ని పిండకుండా వదిలేసేరేమిటి? ఆ బరువుకి దండం తెగి పడిపోతే ఏం చేస్తారు?' అనుకుంది జాగృతి. రాధ స్నానం చేసి వచ్చి, ఉతికిన బట్టలని డాబా మీదకి తీసుకెళ్ళి, అక్కడున్న దండాన్ని రిన్ తో తుడిచి, మడతలు పడకుండా బట్టలన్నింటినీ ఆరేసింది. రాధ పనితీరుకు జాగృతి ఆశ్చర్యపోతూ, 'బట్టలకి క్లిప్పులు మర్చిపోయారా ఈవిడ?' అనుకుంది.



రాధ మళ్ళీ ఎవరు తనని చూడటంలేదని నిర్దారించుకుని, తన జుట్టుని విప్పి ఆరబెట్టుకుంది.  పైపైన కనపడే వెంట్రులకు మాత్రమే డై వేసుకుని, లోపల వెంట్రుకల్ని తెల్లగానే రాధ వదిలెయ్యడాన్ని జాగృతి గమనించింది.



'బట్టలకి క్లిప్పులు పెట్టడం మర్చిపోలేదన్నమాట. అవి అర్ సమయంలో ఈవిడ జుట్టుని ఎవరు చూడకుండా ఆరబెట్టుకుందన్నమాట!!' అనుకుంది జాగృతి. బట్టలు, జుట్టు ఆరేంతవరకు డాబా మీదే ఉండి, బట్టల్ని మడతపెట్టి, దాబా మీదనుండి కిందకి దిగింది.



అప్పుడే బయటనుండి వచ్చిన మాణిక్యాలరావు రాధ చేతికి డబ్బులిచ్చి, "నిన్నే వెతుకుంటున్నాను. ఎక్కడున్నావ్ ఇంతసేపూ. పెన్షన్ డబ్బులు వచ్చాయి. జాగ్రత్తగా దాచు. పొదుపుగా ఖర్చు చెయ్యి." అని చెప్పాడు.



"నా పొదుపు గురించి మీకు తెలియదా? క్లిప్పులకి, ఇస్త్రీకి కూడా ఖర్చుపెట్టాను నేను. చక్కగా మడతలు పడకుండా బట్టల్ని ఆరేసి, అవి ఎగిరిపోకుండా చూసుకుంటూ, ఆరేంతవరకు  ఎండలోనే కూర్చుంటాను. నాకు జాగ్రత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తున్నామన్న పొగరుతో దుబారా ఖర్చులు చేసేవారికి చెప్పండి పొదుపు పాఠాలు." అని జాగృతిని చూస్తూ అంది రాధ. 



మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూస్తూ, "మీ అత్తగారు చెప్పేది అర్ధమయ్యిందా? ఆవిడ దగ్గర పొదుపు నేర్చుకో. ఇంజనీరింగ్ చదివాను, ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు మా దగ్గర చూపించకు." అన్నాడు.



'ఎన్ని మాటలు అనిపిస్తోంది ఈవిడ. నేను ఈవిడ దగ్గర పొదుపు పాఠాలు నేర్చుకోవాలా? నాకేమన్నా జుట్టు తెల్లబడిందా ఈవిడలాగా? బట్టలు ఉతకటానికాని వెళ్ళి, ఎవరికీ కనపడకుండా హెయిర్ డై వేసుకుకోవడానికి. బట్టలు ఆరేంతవరకూ ఎండలోనే ఉన్నానని చెప్పి, ఎవరికీ కనపడకుండా జుట్టు ఆరబెట్టుకోవడానికి?' అని రాధని మనసులోనే తిట్టుకుంది  జాగృతి.



మాణిక్యాలరావు జాగృతిని తిడుతుంటే, రాధ మోహంలో సంతోషంతో వెలిగిపోయింది. ఆ సంతోషంలో వంట చెయ్యడానికి వెళ్ళింది. 'ఇప్పటివరకూ శుచి శుభ్రత, పొదుపు పాఠాలని నేర్చుకోమని తిట్టించిన ఈవిడ, వంట ఎలా చేస్తారో, వంటింటిని ఎలా సర్దుకున్నారో చూద్దాం.' అనుకుంటూ వంటింటిలోకి చూసింది జాగృతి. వంటిల్లంతా బూజుతో, దుమ్ముతో నిండివుంది. డబ్బాలలో ఉండాల్సిన బియ్యం, పప్పులు, పోపు దినుసులులాంటివన్నీ ప్యాకెట్లలో ఉన్నాయి.



'వంటింటిని కూడా శుభ్రంగా ఉంచటం లేదు ఈవిడ. తన భర్త ఏమీ పట్టించుకోడు, తనేం చెప్పినా నమ్ముతాడన్న నమ్మకంతో తన గురించి అన్నీ మంచిగా చెప్పుకుని, నన్ను తిట్టిస్తోంది. ఏముంది ఈవిడ మనసులో?' అనుకుంది.  



వంట చెయ్యడం అయ్యాక, రాధ మాణిక్యాలరావుని భోజనానికి పిలిచి, వండిన పదార్ధాలని వడ్డించింది. జాగృతిని లాగి, "రా అమ్మ. నువ్వు కూడా తిను. నీకొచ్చిన పని ఇదొక్కటే కదా." అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది.



రాధ అంటున్న మాటలు, ఆవిడ ప్రవర్తన జాగృతిని చాలా బాధపెట్టాయి. జాగృతికి తినాలనిపించలేదు. తినే కంచాల పక్కనే జుట్టు, దువ్వెన, మొహానికి రాసుకునే పౌడర్ ఉండడం చూసి, రాధ రిన్ తో కంచాలని కడిగిన విధానం గుర్తువచ్చి, జాగృతికి కడుపులో తిప్పినట్టు అయ్యింది. అసహ్యంతో, కన్నీళ్ళతో, తినకుండా అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది.



జాగృతిని వెళ్ళిపోవడాన్ని చూసి, "చూసారా దీని పొగరు. దీనికి పని నేర్పిస్తానని నా కొడుకుకి చెప్పాను. ఇది ఏమీ నేర్చుకోదు. ఇలాంటిదానితో నా కొడుకు బతుకు ఏమైపోతుందో ఏమో!! ఈవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే, నా కొడుకే వంట చేసుకుని, దీనికి పెట్టాలేమో!! ఈవిడ తిన్న కంచాలని కూడా వాడే కడుగుతాడేమో. నా ఖర్మ కొద్దీ వచ్చింది ఇలాంటి చదువుకున్న, ఉద్యోగం వెలగబెడుతున్న కోడలు." అని ఏడుస్తూ మాణిక్యాలరావుకు చెప్పింది రాధ.



మాణిక్యాలరావు కోపంతో, సమర్థ్ కి ఫోన్ చేసాడు. "మీ ఆవిడ ప్రవర్తన బాగులేదు. ఎవరి మాట వినదు. ఏ పని రాదు. మీ అమ్మ నేర్చుకోమని చెప్తున్నా, నేర్చుకోవడంలేదు. ఒక్క పనిలో కూడా సాయం చెయ్యలేదు. మీ అమ్మ కష్టపడి, వండి పెడితే, అది కూడా తినకుండా వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇలాంటి దానితో నువ్వు బతకలేవు. ఈ పిల్లని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగం మానేసి, పనులు నేర్చుకుని వస్తే, ముని దగ్గరికి వస్తుంది. లేదంటే ఇక ఆ అమ్మాయిని మర్చిపో." అని చెప్పాడు. రాధ కూడా ఫోన్ తీసుకుని, "నీకు ఈ పిల్ల సరైనది కాదని నేను ముందునుండి చెప్తున్నాను. నువ్వు వినలేదు. చక్కగా ఇంటి పనులు చేసుకునే ఇంకో పిల్లని ఇచ్చి పెళ్ళి చేస్తాను నీకు" అని చెప్పింది. 



రాధ గురించి జాగృతికి పూర్తిగా అర్ధమయ్యింది. ఏ ఉద్దేశంతో, తనతో అలా ప్రవర్తించిందో తెలిసింది. ఉద్యోగం ఎట్టి పరిస్థితిలోనూ మానకూడదని నిర్ణయించుకుంది. కానీ అప్పటికి సమర్థ్ గురించి ఏమీ తెలియని జాగృతి, తను ఎలాంటివాడో, వీళ్ళ మాటలు విని ఎం నిర్ణయం తీసుకుంటాడో అనుకుంది.



మాణిక్యాలరావు చెప్పిదంతా విన్న సమర్థ్, "వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే, ఇంకా తిని పడుకుంటుంది నాన్నా. అమ్మ దగ్గర కూడా పని నేర్చుకోవటంలేదంటే, ఎలాంటిదో తెలుస్తోంది కదా. నా దగ్గరకే పంపించండి. చూస్తూండండి. ఉద్యోగం మాన్పించి, దాని చేత పని చేయించి, దాని తిక్క ఎలా కుదురుస్తానో." అని చెప్పాడు. సమర్థ్ మాటలకి రాధ సంతోషించింది.



తరువాత, జాగృతికి ఫోన్ చేసాడు సమర్థ్. "నువ్వింక అక్కడ ఉండలేవన్న సంగతి నాకు అర్ధమయ్యింది. తొందరగా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. రేపటికి నీకు టికెట్ కొని పంపిస్తాను." అని చెప్పాడు.



జాగృతి, సమర్థ్ దగ్గరికి వెళ్ళాక, జరిగిందంతా అడిగి తెలుసుకుని, అర్ధం చేసుకున్నాడు. జాగృతి చేత సమర్థ్ పనులు చేయిస్తున్నాడో లేదో, ఉద్యోగం మాన్పించాడోలేదోనని తెలుసుకోవడానికి రాధ, సమర్థ్ కి ఫోన్ చేసింది.



"చక్కగా పనులు చేస్తోందమ్మా. ముగ్గుపిండి మధ్యలో బ్రష్ లు, టాంగ్ క్లీనర్ లు, చెప్పులు, పూల బుట్టలు ఉంచదు. గిన్నెలను రిన్ తో తోమదు. వంటింటిట్లో బూజులు ఉండవు. ఇల్లంతా ఇంద్రభవనంలా ఉంచుతోంది. ఇంక వంట అంటావా? ఇన్నాళ్లు రెస్టారంట్ లో తిన్నవాడిని నేను. అంతకన్నా చక్కగా వండుతోంది. నేను కూడా ఇప్పుడు అన్నీ పనులు తన దగ్గర నేర్చుకుంటున్నాను. ఎప్పటికైనా పనికొస్తాయి కదా. ఏమంటావ్?" అని చెప్పాడు.



వింటున్న రాధ బుర్ర తిరిగింది. మొహం మాడిపోయింది. జాగృతి చేత ఉద్యోగం మానిపించాలని, జాగృతి పరువుని తీద్దామనుకుంది. కానీ ఇప్పుడు తన పరువే పోయింది.   

***

ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)