Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 30


   లలిత అన్న మాటలకి సత్యవతి గారు రోషంగా మీ అమ్మాయే కాదు పనిమంతురాలు.. నా మనవరాలు కూడా పనిమంతురాలే అని చెబుతుంది.

దానికి భార్గవి అయోమయంగా ఈవిడ ఏంటి శిల్ప ని ఇంత వెనకేసుకొస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది. మాధవి వెంటనే అవును..  వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా....

పొద్దుటే లేగమంటే లెగదు.   పూజ దగ్గర సర్ధమంటే  తెలియదంటది. కిచెన్లో పని అంటే తెలియదంటది. చాలా కష్టం అండి మీ మనవరాలితో..

మీరేమో మా మనవరాలు కి అన్నీ తెలుసు అని చెబుతున్నారు అని వెటకారంగా అంటుది. అయ్యో నేను చెబుతుంది శిల్ప గురించి కాదు...

నా పెద్ద మనవరాలు అవని గురించి అని గొప్పగా చెబుతుంది.  అంతే భార్గవి గుండెలో రాయపడుతుంది. ఇప్పుడు ఈవిడ అవిని ఎందుకు తీసుకొస్తున్నారు అని..

దానికి ఇందిరాగారా ఆశ్చర్యంగా ఏంటి మీకు ఇంకొక మనవరాలు కూడా ఉందా..  మాకు ఆ విషయం తెలియదే..

ఆరోజు మాకు ఒక్కతే కూతురని చెప్పారు అని భార్గవి వంక కోపంగా చూస్తారు.  దానికి తల్లి కూతుర్లు ఇద్దరు గుటకలు మింగుతూ ఉంటారు.

సత్యవతి గారు ధనుంజయ్  వంక చూస్తూ అదేంటి ధనుంజయ్ అవని గురించి ఏమీ చెప్పలేదా నీకు ఇద్దరు కూతుర్లు కదా..  ఒక్కతే కూతురు అని ఎలా చెప్పావు అని సీరియస్ అవుతారు.

ధనుంజయ్ కి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు.  ఇందిరా గారు కోపంగా ఇప్పుడు తలదించుకుంటే ఏమి ఉపయోగం..

ఇంతకీ పెద్ద మనవరాలు ఎక్కడ ఉంటుంది.  ఆమె భర్త ఏమి చేస్తావుంటాడు అని అడుగుతారు.  దానికి సత్యవతి గారు అయ్యో మా మనవరాలకు ఇంకా పెళ్లి అవ్వలేదండి అని చెబుతారు.

దానికి ఇందిరాగారి కోపంగా పెద్ద మనవరాలు పెళ్లి అవ్వకుండా చిన్న మనవరాలు పెళ్ళి చేస్తారా.. ఆ విషయం మళ్ళీ మా దగ్గర దాచారు. ఇదేనా మీ పద్ధతి అని సీరియస్ అవుతారు.


మీ దగ్గర ఏ పద్ధతులు లేవు కాబట్టే మీ మనవరాలు కి కూడా ఒక్క పద్ధతి రాలేదు.  ఇంకా మీరు ఎన్ని విషయాలు మా దగ్గర దాచారో..

పెళ్లిలో ఏదో దోషం జరిగింది అని మా సిద్ధాంతి గారు కూడా అందుకే చెప్పి ఉంటారు. నేను శిల్పతో ఎన్ని పూజలు చేపిస్తున్న.. ఎన్ని ఉపవాసాలు చేపిస్తున్న ఇంకా దోష నివారణ జరగలేదు ఏమిటా అని కలవర పడుతున్నాము.

భార్గవి నీ పెద్ద కూతురు మీద ప్రేమ లేదా లేకపోతే నీకు పుట్టలేదా అసలు.. మీకు ఒక్కతే కూతురే అని ఆ రోజున మాకు ఎలా చెప్పావు అని  సూటిగా అడుగుతారు.

భార్గవికి నుంచున్న చోట భూమి కదిలిపోతున్న  ఫీలింగ్ వస్తుంది. ధనుంజయ్  వంక సూటిగా చూడలేక పోతుంది.  సత్యవతి గారు వెంటనే అవునండి తను భార్గవికి పుట్టిన కూతురు కాదు.

నా కొడుకుకి, నా పెద్ద కోడలు రజిత కి పుట్టిన కూతురు. అవిని పుట్టిన సంవత్సరం తర్వాత  అనుకోకుండా మెట్లపై నుంచి పడి చనిపోయింది.

భార్గవి రజిత కి దూరపు బంధువు.  అవిని నీ బాగా చూసుకోవడంతో ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుందని మేమే పెళ్లి చేసాము అని చెబుతారు.

మాధవి గారు ఆశ్చర్యంగా అలా ఏలాగా మెట్లపై నుంచి పడిపోయారు అని అడుగుతారు. దానికి సత్యవతి గారు నాకు అదే అనుమానం ఉంది.

రజిత అనుకోకుండా పడిపోయిందా.. ఎవరైనా తోసి ఉంటారా అన్నది నాకు అనుమానం వస్తుంది అని వారగా భార్గవి వంక చూస్తారు.

భార్గవి టెన్షన్ గా చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. సత్యవతి గారికి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇందులో భార్గవి హస్తం ఉండి ఉంటుంది అది ఏమిటో కనిపెట్టాలి అని ఫిక్స్ అయిపోతారు.

ధనుంజయ్  ఆశ్చర్యంగా సత్యవతి గారి వంక చూస్తూ అమ్మ ఏంటి నువ్వు అనేది అంటే... ఇప్పుడు మన ఇంటి విషయాలు ఎందుకు లే తర్వాత మాట్లాడుకుందాం.

నీ కూతుర్ని చూడాలని వచ్చావు కదా చూసుకుని మాట్లాడేయాల్సిన మాట్లాడటం అయిపోతే మనం బయలుదేరుదాం అని సైలెంట్ అవుతారు.

ఇందిరా గారు మాత్రం చాలా కోపంగా ఉంటారు. మీరు మా దగ్గర చాలా విషయాలు దాచేశారు అని..

లలిత గారు చూపు చాలా చిరాగ్గా ఉంటుంది. ధనుంజయ్ కి తల కొట్టేసినట్టు ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక మేము బయలుదేరుతాము అత్తయ్య గారు అని అంటాడు. దానికి ఆవిడ ఏమీ మాట్లాడదు.

మొదటిసారి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించిన పెద్దావిడ ఇప్పుడు మాట్లాడటానికి అసహ్యించుకుంటున్నారు అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అర్థమవుతుంది.

భార్గవి వంక కూడా చూడకుండా ఇంకా వెళదామా అమ్మ అని అంటాడు.  భార్గవి వెంటనే తేరుకొని పెద్దమ్మ గారు అవని అప్పుడే పెళ్లి చేసుకోను అంది.

మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అలా చెప్పాను గాని నాకు నా పెద్ద కూతురు అంటే నాకు పంచప్రాణాలు అని చెబుతుంది.

అవునా అని లలిత గారు సాగదీస్తారు.  అవునండి అని ఎంతో వినయంగా చెబుతుంది. ఇక ఆ టాపిక్ కట్ చేయాలని శిల్ప ఎందుకు ఇలా చిక్కపోయింది.

ఆరోగ్యం ఏమైనా బాగోలేదా అని ఆందోళనగా అడుగుతుంది.  అయ్యో మీ అమ్మాయి ఆరోగ్యానికి బాగానే ఉంది.

  దోషం తోలగడానికి సిద్ధాంతి గారు చాలా పెద్ద పూజ చెప్పారు. అమ్మాయి  ఉదయం మాత్రమే కొంచెం అల్పాహారం తీసుకుని రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఆకలి వేస్తే పళ్ళు మాత్రమే తినాలి.

మేమే చూస్తూ ఉండలేక రెండి ఇడ్లీలు, ఒక దోస అయినా పెడుతున్నాము అని అమాయకంగా చెబుతారు. ఏమిటి అని భార్గవి ఆశ్చర్యంగా అడుగుతుంది.

అంత కొంచమే తింటే అమ్మాయి ఏమైపోతుంది. పైగా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా...

ఆ సిద్ధాంతి గారి ఎవరు నాకు చెప్పండి నేను ఒకసారి మాట్లాడతాను అని భర్త వంక చూస్తుంది. ధనుంజయ్ మందు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన అవిని విషయంలో భార్గవి అలాగే చేసింది కదా...

అదే తిరిగి శిల్ప కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏమి స్పందించను.  మీకు ఏది మంచిదైతే అదే చేయండి చెల్లెమ్మ అని చెప్పి ఇంకా బయలుదేరుతారు అని చెప్పి స్పీడ్ గా బయటకు వచ్చేస్తాడు.

శేషగిరి,  సత్యవతి గారు ఇందిరాగారి వంక చూసి చిన్న చిరునవ్వుతో వెళ్లి వస్తాము అని చెప్పి బయటకు వచ్చేస్తారు.

భార్గవికి ఏమి చేయాలో అర్థం కాక కూతురు వంక చూస్తూ భర్త వెనకాల బయటికి వస్తుంది.  ధనుంజయ్ కారు జై సింహ మాన్షన్ దాటి బయటికి రాగానే సత్యవతి గారు కారు ఆపు ధనుంజయ్ అని చెబుతారు.

ఏమైందమ్మా  అని అడుగుతాడు.  ఒక్క నిమిషం భార్గవి వైపు తిరిగి నీ ఫోను పర్సు ఇలా ఇవ్వు.  అలాగే ధనుంజయ్ ఒకసారి నీ భార్యని ఇలాగే ఫోటో తియ్యి  అని చెబుతారు.

ఎందుకమ్మా అని అయోమయంగా అడిగితే ముందు చెప్పింది చెయ్ అని గట్టిగా మాట్లాడతారు.  సరే అని ఫోటో తీస్తాడు. ఫోటో తీయడం అవ్వగానే కారు దిగు భార్గవి అని చెబుతారు.

ఎందుకు అత్తయ్య గారు అని కంగారుగా అడుగుతుంది. నువ్వు ఇక్కడి నుండి మన ఇంటి దాకా కాలినడకనే రా.. ఎక్కడైనా ఆటో ఎక్కినా క్యాబ్ బుక్ చేసుకుందామని తెలిసినా... అలాగే ఒంటి మీద ఉన్న నగలు ఎవరికైనా ఇచ్చి లిఫ్ట్ తీసుకున్న  వారం రోజుల దాకా నువ్వు మన ఇంటి గేటు బయట ఉంటావు.

నీ వెనకాల మన మనిషి ఉంటాడు. ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చినట్టు ఉన్నా సరే నాకా విషయం తెలిసిపోతుంది. తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి నువ్వే బాధ్యురాలు అవుతావని కోపంగా అంటారు.

ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు అని అడుగుతుంది. మొదటి తప్పు మీకు ఒక్కతే కూతురు అని చెప్పడం. అవని గురించి ఎక్కడా చెప్పకపోవడం.

రెండవ తప్పు ఈరోజు నా దగ్గర అబద్ధం చెప్పి తీసుకురావడం.   దానికి నువ్వు శిక్ష అనుభవించవలసిందే అని గట్టిగా చెబుతారు.

భార్గవి కోపంగా అంత దూరం ఎవరైనా నడిచి రాగలరా నేను కారు దిగను అంటే...  సరే అయితే నేను నా భర్త కారు దిగి మేము నడిచి వస్తాము.

అది నీకు ఇష్టమైతే ధనుంజయ్..  నీ భార్యని తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పి కారు దిగబోతుంటే... అమ్మ నువ్వు ఆగు అని భార్గవి వంక చూస్తూ కారు దిగు అని చెబుతాడు.

ఏమిటి అని  ఆశ్చర్యంగా చూస్తుంది. మర్యాదగా చెబుతున్నాను కారు దిగి అమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ రా..

ఏమైనా పిచ్చి వేషాలు వేసావని నాకు తెలిసిందో అమ్మ కోపాన్ని కాదు నా కోపాన్ని చూడాల్సి వస్తుంది దిగు అనే అరుస్తాడు.

భార్గవి ఏమీ చేయలేక కారు దిగుతుంది. ధనుంజయ్ ఎవరికో ఫోన్ చేసి భార్గవిని ఫాలో చేయమని చెబుతాడు. భార్గవిని దింపి ధనుంజయ్ కారు ముందుకు వెళ్ళిపోతుంది.

భార్గవి ఇంకా తప్పక నడవడం మొదలు పెడుతుంది. ఏమిటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఈ మధ్యన నేను వేస్తున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోతున్నాయి.

ఎప్పుడు నా మాట వినే నా భర్త ఈరోజు నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. మళ్లీ ఎలాగైనా ఈయననినా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ఎలా అని ఆలోచిస్తూ నడవడం మొదలు పెడుతుంది.

కార్లో వెళుతున్న ముగ్గురు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు.  ధనుంజయ్ మెదడులో మాత్రం మాధవి సత్యవతి గారు అన్న మాటలే తిరుగుతూ ఉంటాయి.

రజిత అనుకోకుండా మెట్ల పైనుంచి పడిపోయిందా,  ఎవరైనా తోసారా ఎలా తెలుసుకునేది. నా చుట్టూ చాలా జరిగాయి.

ఇందులో గాని భార్గవి హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం  నేను ఇచ్చే పనిష్మెంట్ నుంచి జీవితంలో తప్పించుకోలేదు అని కోపాన్ని అంత స్టీరింగ్ మీద చూపిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

సత్యవతి గారు కొడుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీలో ఈ ఆలోచన రావాలి అప్పుడే నిజ నిజాలు అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని సైలెంట్ అయిపోతారు.

కారు దీగి లోపలికి వెళ్ళగానే ధనుంజయ్ అమ్మ అని పిలుస్తాడు.  చెప్పు ధనుంజయ్ అనగానే.. రజిత గురించి నీకు ఎందుకు అనుమానం వచ్చింది అని అడుగుతాడు.

నీకు రాలేదా అని సూటిగా అడుగుతారు.

దానికి ధనుంజయ సమాధానం ఏమిటి..

కథ కొనసాగుతుంది..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
chala bagunnai bro updates
keep continue
Like Reply
Super Story.. excellent gaa rasthunnaru.. vikram avani la madya scenes too super.. feel good andi.. i never read this much good story in the recent days.. keep going

Waiting for next episode
Like Reply
చిక్కు ముడులు విడుతున్నాయా?

మరింత బిగుస్తున్నాయా!

బాగుంది మిత్రమా, ఈ కథ!
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Super update
Like Reply
Nice letter size penchandi
yr):
Like Reply
Baboi.. endi bhayya ee arachakam?
Gaali kooda dooranantha tight ga raastunnav!!

Innaallu ekkadunnav bro!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(07-01-2026, 10:45 AM)VijayPK Wrote: Nice letter size penchandi


Okay Next Update Nuchi Untundi
[+] 1 user Likes SivaSai's post
Like Reply
great updates and nice story telling... please continue
Like Reply
Super
Like Reply
అప్డేట్ బాగుంది .... వెయిటింగ్ for another Update....
Msr@441
Like Reply
Update kosam roju chusthuna Baga rasthunaru koncham pedha update ivara
Like Reply
(07-01-2026, 09:20 PM)Gurrala Rakesh Wrote: Update kosam roju chusthuna Baga rasthunaru koncham pedha update ivara

Festival 3 Days Double Dhamaka
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Part - 31


   లోపలికి వెళుతున్న సత్యవతి గారిని ఆపి నీకు ఎందుకు అంత అనుమానం వచ్చిందమ్మా అని అడుగుతాడు. నీకు రాలేదా ధనుంజయ్ అని సూటిగా అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లునములుతు ఉంటాడు.

విరక్తిగా ఒక నవ్వు నవ్వి గదిలోకి వెళ్ళిపోతారు. ధనుంజయ్ సైలెంట్ గా తన ఆఫీసు రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటాడు.

అక్కడ నిలువెత్తు రూపంలో ఉన్న రజిత ఫోటో ని చూస్తూ ఉంటాడు. నవ్వుతూ మహాలక్ష్మి లాగా ఉన్న భార్య రూపాన్ని చూస్తూ ఉంటాడు.

నీది అనుకోని ప్రమాదమా...  అనుకుని జరిగిన ప్రమాదమా రజిత అని ఫోటో వంక తీక్షణంక చూస్తూ ఉంటాడు.

నీ విషయంలో అవిని విషయంలో నేను చాలా నిర్లక్ష్యం వహించాను. నీ మీద నాకు ప్రేమ ఉంది అనుకున్నాను కానీ నేను చాలా స్వార్థపరుడుని అని ఈ రోజే తెలిసింది.

నన్ను క్షమిస్తావ రజిత అని ఫోటోని తడుముతు బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఎంతసేపు అలాగా నిలబడి ఉన్నాడో తనకే తెలియదు.

మెల్లిగా కళ్ళు తెరిచి నిజంగా నీది గనక హత్య అయితే కనుక అది ఎవరైనా సరే వాళ్ళని ప్రాణాలతో ఉంచను. మన కంపెనీ ఫంక్షన్ రోజున అవని ని  నా పెద్ద కూతురుగా అందరికీ పరిచయం చేసి కంపెనీ బాధ్యతలు కూడా అప్పచెబుతాను అని చెబుతాడు.

  కాసేపు అక్కడే గడిపి బయటికి వస్తాడు. కిందకి రాగానే తల్లి తండ్రి అక్కడ హాల్ లోనే కనిపిస్తారు కానీ వాళ్ళ వంక చూడలేకపోతున్నాడు.

ధనుంజయ్ వచ్చి అంతసేపు  అయినా సరే సత్యవతి శేషగిరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారు.. ఎంతసేపైనా తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడకపోవడంతో అమ్మ అని పిలుస్తాడు.

ఏంటి అన్నట్టుగా చూస్తారు.మీరు ఇద్దరు ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నారు అంటే... ఇన్నాళ్లు అలాగే నోరు మూసుకుని ఉన్నాం కదా ఇప్పుడు అదే పని చేస్తున్నాము అని చెబుతారు.

ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు అని బాధగా అంటాడు. మేము నోరు ఒకటే మూసుకున్నాము. నువ్వు నోటితో పాటు కళ్ళు కూడా మూసుకున్నావు కదా...


ఇంకేముంటాయి మన మధ్యన మాటలు అని చెప్పి సైలెంట్ అవుతారు. ఏం మాట్లాడాలో తెలియక ధనుంజయ కూడా మౌనాన్ని ఆశ్రయిస్తాడు.

  సర్వెంట్ వచ్చి సార్ డిన్నర్ రెడీ అని చెబుతోంది. బోంజనం చేద్దురు  రండి అమ్మ అని పిలుస్తాడు.మాకు ఆకలిగా లేదురా ధనుంజయ్.

ఈరోజు మీ భార్య, భర్తలు చేసిన దానికి అక్కడే కడుపు నిండిపోయింది. నువ్వు వెళ్లి తృప్తిగా భోజనం చెయ్ అని చెప్పి భర్తను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది.

ధనుంజయ్ కూడా మౌనంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పడుకున్నాడు.  భార్గవి వచ్చింద లేదా అని కూడా పట్టించుకోలేదు.

భార్గవి ఆ రోడ్లు పట్టుకుని నడుచుకుంటూ ఎప్పటికో అర్ధరాత్రికి ఇంటికి చేరుకుంటుంది. నడక అలవాటు తప్పి చాలా సంవత్సరాలు అవ్వడం వలన నడిచి నడిచి కాళ్లు పీకుతూ ఉంటాయి .

ఒళ్లంతా చెమటలు కారిపోతూ ఉంటాయి.చాలా చిరాగ్గా అనిపిస్తుంది. గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకోవాలి అనుకుంటూ డోర్ నాకు చేస్తుంది.

ఏంతకీ తలుపు తెరుచుకోదు. ఇంక ధనుంజయ్ తలుపు తీయడని అర్థమయ్యి శిల్ప రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుతుంది. అలసిపోయిన శరీరంతో అలాగే మంచం మీద పడిపోతుంది.

ఎప్పుడో మర్నాడు మధ్యాహ్నం కి మేలుకువ వస్తుంది. మగతగా లెగిసి చూస్తుంది. ఒళ్లంతా నొప్పులు పట్టేసి ఉంటాయి.

టైమెంతయింది అని గడియారం వంక చూస్తే మధ్యాహ్నం ఒంటిగంట చూపిస్తుంది.  ఏంటి నేను ఇంత సేపు పడుకున్నాను.

అయినా నన్ను ఎవరూ లేపలేదు ఏంటి... ఈయన ఆఫీస్ కి వెళ్లే ముందు అయినా నాకు చెబుతారు కదా అని రాత్రి సిచువేషన్ మర్చిపోయా కంగారుగా లెగుస్తోంది.

తను వంటిపైన ఉన్న శిల్పా నైట్ వేరు చూసుకుని ఇలా బయటికి వెళితే అంతే సంగతులు.  నా చీరలన్నీ ఆ రూమ్ లో ఉన్నాయి కదా అని మెల్లిగా డోర్ తీసుకొని వాళ్ళ గది వైపుకు వెళుతుంది.

గది తలుపు తెరుస్తూ ఉంటే ఎంతకీ తెరుచుకోదు. ఇదేంటి మా రూము తలుపు తెరుచుకోవడం లేదు.  ఎవరు లాక్ చేసి ఉంటారు అని కోపంగా సర్వెంట్ ని పిలుస్తుంది .

సర్వెంట్ అక్కడకు వచ్చి చెప్పండి మేడం అనగానే... మా రూమ్ డోర్ ఎవరు లాక్ చేశారు అని గట్టిగా అరుస్తుంది. దానికా సర్వెంట్ భయపడుతూ సార్ లాక్ చేసుకుని వెళ్లారు.

అలాగే మీ సారీస్ అండ్ థింగ్స్ అన్నీ కూడా ఆ రూమ్ లో పెట్టించారు అని ఒక రూమ్ వైపు భయంగా చూపిస్తుంది. ఏ రూమ్ అని కోపంగా అడుగుతుంది.

వేలు పెట్టి ఒక రూమ్ చూపిస్తుంది.  సరే అని చెప్పి ముందు ఫ్రెష్ అవ్వాలి తర్వాత ఆయనతో మాట్లాడతాను అని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది.

అంతే ఆ రూమ్ చూడగానే నోటి మాట రాకుండా అయిపోతుంది. అది అచ్చు అవని రూము ఎలాగైతే ఉండేదో అలాగే ఉంటుంది.

అంటే ఈయన అవని రూమ్ చూశారా అని టెన్షన్ పడుతుంది. టెన్షన్ గా వెళ్లి అక్కడ మంచం మీద కూర్చుంటుంది.

ఆ మంచం చాలా అన్ కంఫర్ట్ గా ఉంటుంది.  ఏంటి ఇలాగుంది చిరాగ్గా... అస్సలు మెత్తగానే లేదు.

ఎలా పడుకుంటాను అనుకుంటూ ముందు ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి గబగబ స్నానం చేసి చీరలు ఉన్న సెల్ఫ్ డోర్ తీస్తుంది.

అందులో నాలుగే నాలుగు చీరలు కనిపిస్తాయి.అదేంటి చీరలు నాలుగే ఉన్నాయి.  ఈయన అలిగారు కదా... నాలుగు రోజుల మించి నాకు దూరంగా ఎక్కడ ఉండగలుగుతారు లే  అందుకే మిగిలినవి అక్కడ నుంచి నాలుగు చీరలు ఇక్కడ పెట్టించారని అని గర్వంగా అనుకుంటుంది.

ఒక చీర తీసుకొని కట్టుకుంటుంది. అక్కడ రెడీ అవ్వడానికి కూడా మేకప్ కి సంబంధించిన ఏమీ కనిపించవు.

తిలకం, కాటుక, దువ్వెన మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి ఏమీ చేయలేను కాబట్టి బొట్టు పెట్టుకుని బయటకు వస్తుంది.

కిందకి రాగానే కాంతం అని  గట్టిగా పిలుస్తుంది. చెప్పండి అమ్మ అని ఒక సర్వెంట్ వస్తుంది. నాకు భోజనం వడ్డించు అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది.

అమ్మగారు అని నసగుతుంది. ఏమైంది అని కోపంగా అడుగుతుంది.  అది అది అని అంటూ ఉంటే...అబ్బ తొందరగా చెప్పవే బాగా ఆకలేస్తుంది.

రాత్రి నుంచి ఫుడ్డు లేదు అని అరుస్తుంది. ఇదంతా హాల్ లో కూర్చున్న సత్యవతి గారు వింటూ ఉంటారు. కానీ ఏమీ మాట్లాడరు.

అవని పాపకు ఎలాగైతే ఫుడ్ పెట్టారో అలాగే మీకు కూడా పెట్టమని  సార్ ఆర్డర్ అమ్మ అని చెబుతుంది.ఏంటి అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేసి అడుగుతుంది.

మీరు పని చేస్తేనే  అవని అమ్మకి ఒక పూట పెట్టినట్టుగా మీకు పెట్టమన్నారు పని చేయని రోజున మీకు ఏమి పెట్టొద్దు అని చెప్పారు అని చెబుతోంది.

వెంటనే కోపంగా అత్తగారి  వంక చూస్తూ చూశారా అత్తయ్య మీ అబ్బాయి ఏం చేస్తున్నారు అన్నది.

కొద్దిగా తిని ఎలా ఉంటానో కొంచెం మీరైనా చెప్పాలి కదా అని అడుగుతుంది. దానికి సత్యవతి గారు భార్గవి వంక చూస్తూ ఆ రోజున అవిని కి అలా పెడుతూ ఉంటే నువ్వైనా నేనైనా ధనుంజయ్ ని ఆపగలుగమా ... ఈరోజు నేను చెప్పడానికి అని చురక అంటిస్తారు.

ఇంకా ఏమీ మాట్లాడలేక ప్రస్తుతానికి నాకు చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు పని గురించి ఆలోచిస్తాను అని వెళ్లి కూర్చుంటుంది.

క్షమించండి అమ్మ అని కాంతం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తే గాని భోజనం ఉండదా అని రుసరుసలాడుతూ ఉంటుంది.

ఆయన ఎవరి నుండి సమాధానం రాదు.రాత్రికి ఆయనతో గట్టిగా మాట్లాడాలి అని ఇప్పుడు నేను ఏం పని చేయాలి అని కిచెన్లోకి వెళుతుంది.

కాంతం భయంగా పక్కకు తప్పుకొని సాయంత్రం టైం అవుతుంది కదా స్నాక్స్ ఏమైనా రెడీ చేస్తారా  అమ్మ  అని భయంగా అడుగుతుంది.

తప్పుతుందా అని కోపంగా అంటూ ఏమి ప్రిపేర్ చేయాలో అని ఆలోచిస్తుంది. దానికి కాంతం పెద్దమ్మ గారు కట్లెట్స్ చేయమన్నారు అమ్మ అని చెబుతుంది.

ఇప్పుడు ఈవిడ చెప్పినవన్నీ నేను చెయ్యాలా అనుకుంటూ కట్లెట్స్ కి  కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకుని ప్రిపేర్ చేస్తుంది.

బాగా ఆకలి మీద ఉండడం లేదా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసి అత్తగారికి, మామ గారికి ఇచ్చి గబగబా ప్లేట్లో  పెట్టుకుంటూ ఉంటుంది.

వెంటనే కాంతం అమ్మగారు అని పిలుస్తుంది.  మళ్ళీ ఏమైంది అని అరిస్తే...మీకు కొలత ప్రకారం పెట్టమన్నారు అమ్మ అని చెబుతుంది.

ఏంటి ఇది కూడా ఆయనే చెప్పారా..అయినా ఇక్కడ ఎవరూ చూడడం లేదు కదా అంటే  పైకి వేలు పెట్టి చూపిస్తుంది.

అక్కడ కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. అంటే  నా మీద చాలా కోపంగా ఉన్నారా అనుకుని సరే ఎన్ని పెట్టమన్నారు చెప్పు అని నిలబడుతుంది.

వెంటనే కాంతం అవిని కి పెట్టిన బౌల్ తీసుకువచ్చి అందులో కొలత ప్రకారం పెడుతుంది. అది చూడగానే భార్గవి కి చాలా భయం వేస్తుంది.

ఏంటి ఇలా జరుగుతుంది ఈయనకు అన్ని నిజాలు తెలిసిపోయినయా ఏంటి అనుకుని టెన్షన్ పడుతూ ఆకలి అన్న సంగతి మర్చిపోతుంది.

కాంతం అమ్మగారు అని కదుపుతుంది. ఏమైందే అంత గట్టిగా అరుస్తున్నావు అని విసుక్కుంటుంది. అప్పటినుంచి  పిలుస్తున్నాను మీరే పలకడం లేదు ఆకలిగా ఉందన్నారు కదా తినండి అమ్మ అంటే...

హ హ అనుకుంటూ తింటూ ఉంటుంది. స్నాక్స్ తిన్నాక హమ్మయ్య అనుకుంటుంది. అది పొట్ట నిండకపోయినా కొద్దిగా శక్తి మాత్రం వస్తుంది.

బుర్రకు పదును పెడుతూ ఉంటుంది. ఏం చేసి ధనుంజయ్ ని  మళ్లీ లైన్ లో పెట్టుకోవాలి అని. భార్గవి ఆలోచనల పసిగట్టిన సత్యవతి గారు ఒక నవ్వు నవ్వుతారు.

ఎందుకు అత్తయ్యనవ్వుతున్నారు అని అడుగుతుంది.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 32


   సత్యవతి గారి నవ్వు చూసి భార్గవి కోపం తో ఎందుకు అత్తయ్య నవ్వుతున్నారు అని అడుగుతుంది. దానికి సత్యవతి గారు నీ పరిస్థితి చూసి నవ్వు వచ్చింది.

ఎందుకో తెలుసా తల్లి లేని పిల్ల ని బాగా చూసుకుంటావు అనుకుని నిన్ను తీసుకువస్తే ఆ బంగారు తల్లి కి అన్నింటిని దూరం చేసావు.

ఇప్పుడు నువ్వు, నీ ముద్దుల కూతురు చుట్టూ అన్ని ఉన్నా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి నవ్వు రాకుండా ఎలా ఉంటుంది అంటారు.

ఆ మాటలికి భార్గవి కి కోపం వస్తున్న ఏమి మాట్లాడలేక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.

బెంగళూరు...
విక్రమ్, అవని ఫ్లాట్ కి తీసుకు వచ్చి సోఫా లో కూర్చో బెట్టి కిచెన్ లో కి వెళ్లి వాటర్ తెచ్చి ఇస్తాడు. అవని ఇబ్బందిగ గ్లాస్ తీసుకుని మీకు ఎందుకు అండి శ్రమ అనగానే....

మీరు తీసుకున్న దాని కంటేనా అని ముందు వాటర్ తాగు అని పక్కన కూర్చుంటాడు. ఆ మాటల కే అవని కి అనందంతో  కన్నీళ్లు వస్తూ ఉంటాయి.

అవి ఎందుకో అర్ధం అయ్యిన అర్ధం కానట్టు గా ఉండి ఇవి చాలా వాల్యూబుల్ అవని. అనవసరం గా వేస్ట్ చేయకు అని చొరవ గా తుడుస్తాడు.

దానికి అవని ఎమోషనల్ అవ్వుతు ఇవి బాధతో వచ్చినవి కాదు నా కోసం ఒక్కళ్ళు ఉన్నారు అన్న... వెంటనే ఏమి మాట్లాడుపోయిందో  గుర్తుకు వచ్చి అదే మీ లాంటి ఫ్రెండ్ ఉన్నాందుకు చాలా హ్యాపీ అని చెబుతున్నాను అని మాట దాటేస్తుంది.

అవని మాటలు కి నవ్వుకుని ఈ రోజు నేను కుక్ చేస్తాను అని కిచెన్ లో కి వెళ్ళతాడు. మీకు వంట వచ్చా అని ఆచ్చర్యంగా అడుగుతుంది.

నా గురించి ఏమి అనుకుంటున్నావు అని వెనిక్కీ తిరిగి అడుగుతాడు. మీరు బిజినెస్ పర్సన్ కదా కుకింగ్ వచ్చు అంటే మరి ఆచ్చర్యంగా ఉండదా అనగానే....

వెయిట్, వెయిట్ నేను బిజినెస్ పర్సన్ అని నీకు ఎవ్వరు చెప్పారు అని అడుగుతాడు.  దానికి నీళ్లు నమూలుతు మీ స్టైల్ చూసి అలా అనుకున్నాను అని తల కిందకి దించేస్తోంది.

పరవాలేదు నన్ను బానే అబ్సర్వ్ చేస్తున్నారు అంటాడు. దానికి ఏమిని చెప్పాలో తెలియక ఏమి ప్రిపేర్ చేస్తున్నారు అని టాపిక్ డైవర్ట్ చేస్తోంది.

నన్ను బానే డైవర్ట్ చేయడానికి చూస్తునవ్వు కదా అనుకుని గుడి కి వెళ్లారు కదా అందుకే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తాను.

మీరు ఇలా కూర్చొని కబుర్లు చెప్పండి అని హ్యాండ్ స్లీవ్స్ పైకి ఫోల్డ్ చేసుకుని కటింగ్ స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ చాలా ఫాస్ట్ గా అండ్ స్టైల్ గా కట్ చేసి కుక్ చేస్తూ ఉంటే కళ్ళు నోరు వదిలేసి మరి చూస్తూ ఉంటుంది.

అవని ఎక్స్ప్రెషన్ కి నవ్వుకుని ఏమైంది అవని ఆలా చూస్తున్నావు అంటే...అస్సలు నమ్మలేక పోతున్నాను మీరు ఇలా కుక్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు అని చాలా క్యూరిసిటీ తో అడుగుతుంది.

విక్రమ్ కి కూడ చాలా హ్యాపి గా అనిపిస్తుంది. తన గురుంచి తన భార్య కి చెప్పడం. హయ్యర్ స్టడీస్ కి అబ్రాడ్ వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను.

స్ట్రెస్ అనిపించినప్పుడు అల్లా కుక్ చేసేవాడిని .బట్ ఇప్పుడు మాత్రం అని అవని ఫేస్ వైపు చూస్తాడు. ఏమి చెబుతాడా అని చాలా ఆత్రంగా చూస్తూ ఉంటుంది.

ఇప్పుడు మాత్రం నా బెష్టి కి చేస్తున్నాను అని చాలా ఇంటెన్సీ వాయిస్ తో చెబుతాడు. ఆ మాటలకి అవని కుంచెం కంగారు గా విక్రమ్ వైపు చూస్తుంది.

అదే నువ్వు నాకు ఫ్రెండ్ వి కదా ఆ విషయం చెప్పాను అని చెబుతాడు .  ఆ మాటకి రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూనే కుకింగ్ ఫినిష్ చేస్తారు.

కం అవని ఫుడ్ రెడీ అయ్యిపోయింది అని ప్లేట్ లో సర్వ్ చేసి ఇస్తాడు. మీరు తెచ్చుకోండి అనగానే ముందు నువ్వు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందొ అని టెన్షన్ గా చూస్తాడు.

ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తుంది. అవని ఒపనియన్ కోసం చాలా ఆత్రం గా చూస్తూ ఉంటాడు. అవని కళ్ళు తెరిచి సూపర్ గా ఉంది.

నా లైఫ్ లో ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు అండ్ నాకు ఈ రోజు చాలా హ్యాపీ గా ఉంది అని చెబుతూ మీరు తెచ్చుకోండి అంటుంది.

విక్రమ్ ఆ కంప్లిమెంట్ కి చిన్నగా సిగ్గుపడుతూ ఎన్ని కోట్లు ప్రాఫిట్ వచ్చిన రాని సంతోషం నీ చిన్న కంప్లిమెంట్ కి వస్తుంది.

ఎక్కేసావు పిల్ల బాగా ఎక్కేసావు. ఇంక లాభం లేదు. తొందరగా ఈ గేమ్ కి ఫుల్లస్టాప్ పెట్టీసీ అర్జెంటు గా హనీమూన్ కి వెళ్ళిపోవాలి అనుకుంటూ ప్లేట్ లో ఉన్నా ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు.

అవని మాత్రం చాలా సంతోషం గా ఉంటుంది.విక్రమ్ అవని వంక చూస్తూ నేను ఈవెనింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వెళుతున్నాను అని చెబుతాడు.

వెంటనే నవ్వుతు ఉన్నా అవని ఫేస్ మొత్తం డల్ అయ్యిపోతుంది.  అలా చూడగానే విక్రమ్ కి కూడ చాలా కష్టం గా ఉంటుంది. కానీ తప్పదు కదా అని అవని సమాధానం కోసం చూస్తాడు.

అవని ఫేస్ లో కనబడుతున్న రకరకాల ఎక్సప్రెషన్స్ ని చూస్తూ ఉంటాడు. అవని ఇవేమి పట్టించ్చుకోకుండా తన మనస్సులో ఇప్పుడు వరుకు విక్రమ్ గారు నాతో ఉండడంమే ఎక్కువ.

అక్కడ శిల్ప ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని తనకు తానే సమాధానం చెప్పుకుని నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తూ ఎన్నిటికి ఫ్లైట్ అని అడుగుతుంది.

ఈవెనింగ్ 7కి అని చెబుతాడు. నేను రానా అని చాలా స్లో వాయిస్ తో అడుగుతుంది. ఆ వాయిస్ లో కనిపిస్తున్న బాధ విక్రమ్ మనుస్సు కి చేరుతుంది.

నాతో వస్తావా అని అడుగుతాడు. అవని కలవారుపాటుగా ఏమిటి అని అడిగితే అదే ఎయిర్పోర్ట్ కి వస్తావా అని అడుగుతున్న అని అంటాడు.

ఆ మాటేకే చాలా హ్యాపీ గా ఫీల్ అవ్వుతు తప్పకుండా అని ఏ టైమ్ కి స్టార్ట్ అవ్వాలి అని అడుగుతుంది. నేను చెబుతాను కాసేపు రెస్ట్ తీసుకో అని విక్రమ్ ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.

ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి అవని ఫ్లాట్ డోర్ నాకు చేస్తాడు అవన్నీ కూడా  రెడీగా ఉంటుంది వెళదామా  అని ముందుకు నడుస్తాడు.

విక్రమ్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటుంది. ఈ జన్మలో మీకు భార్యను అయినా మీతో కలిసి  నడవలేను.. భగవంతుడు రాసిన రాతను ఈ మనుషులు తమ స్వార్థం కోసం మార్చేస్తున్నారు.

అమ్మే ఉండి ఉంటే నాకు ఈ ఒంటరితనం ఉండి ఉండేది కాదు కదా.. ఇక నా జీవితానికి ఒంటరితనమే ఆ భగవంతుడు వ్రాశాడేమో అనుకుంటూ నడుస్తూ ఉంటుంది.

విక్రమ్ ఆగి ఉన్నది కూడా చూసుకోకుండా వెళ్లి విక్రమ్ ని గుద్దుకుంటుంది. ఏ పడతావు జాగ్రత్త అని పడిపోతున్న అవిని నీ పట్టుకుంటాడు.

అవిని నడుము విక్రమ్ చేతిలో  ఇమిడిపోతుంది.మరొక చేతితో అవని చేయి పట్టుకుంటాడు. ఒక్క నిమిషం  ఇద్దరికి కళ్ళు లాక్ అయిపోతాయి.

ఇద్దరి కళ్ళల్లో అనంతమైన ప్రేమ కనబడుతుంది కానీ అది ఒకరికొకరికి ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల్లో లేరు. అలా ఎంతసేపు ఉన్నారు తెలియదు కానీ ఇద్దరికీ ఆ ఫీల్ బాగా నచ్చింది.

నడుం మీద చెయ్యి తీయాలని విక్రమ్ కి లేదు. విక్రమ్ చేతిలో నుంచి బయటికి రావాలని అవనికి లేదు. విక్రమ్ తనకి తెలియకుండానే అవని నీ ముందుకి లాక్కుంటున్నాడు.అవినీ కూడా తనకు తెలియకుండానే విక్రమ్ కి దగ్గరికి వెళ్ళిపోతుంది.

ఇంతలో విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది . ఇద్దరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి పక్కకు తిరుగుతారు. ఎవరికి వారు ఏంటి నేను ఇలా అయిపోయాను అనుకుని సైలెంట్ గా లెఫ్ట్ ఎక్కుతారు.

కానీ ఆ సైలెన్స్ కూడా ఇద్దరికీ నచ్చుతుంది..ఇద్దరికీ తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి అని పైకి చెప్పలేదు నిస్సహస్థితి.

సైలెంట్ గా ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు.  ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే కొద్ది  అవిని ki చాలా దిగులుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగాలని ఉంటుంది అడగలేదు.

అడిగితే ఏ హక్కుతో అడుగుతున్నావు అంటే ఏమని చెప్పగలను. ఫ్రెండ్ అంటే రెండు రోజులకే ఇంత బాండింగా అంటే సమాధానం నా దగ్గర లేదు చేతిలో నలిపేసుకుంటూ ఉంటుంది.

తన పరిస్థితి అర్థం అయినా విక్రమ్ రెండు రోజుల్లో వెనక్కి వస్తున్నాను.  ఇక్కడ నాకు ఆఫీసులో వర్క్ ఉంది.  నీకు ఏదైనా అవసరం అయితే శ్రీని అడుగు హెల్ప్ చేస్తాడు.

అంతేగాని ఒక్క దానివే ఎక్కడికి వెళ్లొద్దు సరేనా అని చిన్న పిల్లలకు చెప్పినట్టు చెబుతూ ఉంటాడు. అన్నిటికి బుద్ధిగా తల ఊపుతూ ఉంటుంది.

నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు.  దానికి అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటుంది. మరీ ఎక్కువ ఊపకు తల ఊడిపోతుంది.

అసలే ఆ బ్రెయిన్ ఉండేది కొంచెం. మళ్ళీ అది ఊడింది అనుకో నాకే కష్టం అని అంటాడు. అంటే నాకు బ్రెయిన్ లేదా  అని అడుగుతుంది.

అదే కదా నేను చెప్పేది ఉండి ఉంటే నువ్వు మీ ఆయనకు దూరంగా ఉండవు కదా అని ఓరగా చూస్తాడు.  అవని సైలెంట్ అయిపోయి నేను కావాలని దూరంగా లేను.

పరిస్థితులు అలాగ వచ్చాయి. నా భర్త నాకు ఎంత దూరంలో ఉన్నా నాతోనే ఉన్నట్టు. శారీరకంగా మాత్రమే నాకు దూరంగా ఉన్నారు కానీ ఆయన ఎప్పుడూ మానసికంగా నాతోనే ఉంటారు.

ఈరోజు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అంటే నా భర్త వల్లే అని చెబుతుంది.  సడన్గా కార్ బ్రేకేసి ఏంటి అని అడుగుతాడు.

ఏమీ లేదు జస్ట్ క్యాజువల్ గా చెప్పాను అంటే... లేదు నువ్వు ఏదో దాస్తున్నావు నన్ను  ఫ్రెండ్ గా అనుకోవడం లేదు  కదా అనగానే....

అలా ఏమీ లేదు నువ్వు నాకు ఎప్పటికీ కావలసిన వాడివే అని చెబుతుంది. అలాగైతే ఏమైంది చెప్పు కొంచెం గట్టిగానే అడుగుతాడు.

దానికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటే కళ్ళు తుడుచుకుని ఆడపిల్లలకు అమ్మ ఉండాలి. అమ్మ లేకపోతే తండ్రి ప్రేమా అయినా ఉండాలి.

అవేమీ లేకపోతే ఆడపిల్ల జీవితం చాలా నరకం అయిపోతుంది.  ఈరోజు నేను అనాధగా మిగిలి పోవడానికి తల్లి లేక పోవడమే.

అనుకోని పరిస్థితుల్లో నా భర్తతో నాకు వివాహం అయింది. అదే పరిస్థితులు దూరం అవడానికి కారణం అయ్యింది. అప్పుడే నా ప్రాణాలు పోవాలి ఆయన మాటలే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయి.

ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను అని చెప్పి నవ్వుతుంది.  ఆ నవ్వులో జీవం లేదు అని విక్రమ్ కూడా తెలుసు.

విక్రమ్ చేతులు స్టీరింగ్ పైన గట్టిగా బిగిసుకుంటాయి. స్పీడ్ గా ఎయిర్పోర్ట్ కి డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

విక్రమ్ ఏమీ ఆలోచిస్తున్నాడు..
కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
Very deep and romantic update.
Alage.. Bhargavi ki mundu mundu crocodile festival telustundi
Like Reply
super story.. avani life loo happy movements kosam waiting.. supergripping story
Like Reply
Nice update
Like Reply
తదుపరి ఎపిసోడ్ గురించి సూపర్ అప్డేట్
Like Reply
Super excited
Like Reply




Users browsing this thread: Mahesh5432