Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
21-12-2025, 04:20 PM
(This post was last modified: 22-12-2025, 07:55 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ కథ పూర్తిగా కల్పితం..
కళ్యాణ మండపం...
ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.
రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.
అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.
కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.
ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు.
పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.
ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.
పెళ్లికి వచ్చిన బంధువు వర్గం అంతా ఈ సంబంధం మాకు ఎందుకు కుదరలేదు అని బాధపడుతూ, పెళ్లికూతురు తండ్రి అదృష్టానికి ఈర్షపడ్డారు .
పెళ్ళికాని అమ్మాయిలు అయితే తమ కలల రాకుమారుడు వేరొకరి సొంతం అవుతున్నందుకు తెగ బాధ పడిపోయారు.
ఇంతలో పూజారి గారు పెళ్ళికూతురుని తీసుకురండి అని చెబుతారు. పెళ్ళికూతురని ఆమె స్నేహితులు తీసుకు వస్తూ ఉంటారు. వారి ఆచారం ప్రకారం ముసుగు వేసుకుని ఉంటుంది.
పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెడతారు.ఇద్దరి మధ్యన తెర అడ్డుగా ఉంటుంది. పూజారి గారు వధువుతో పూజ చేయిపిస్తూ మంత్రాలు చెప్పిస్తుంటే, వధువు తల్లి అయిన భార్గవి వచ్చి అమ్మాయి రెండు రోజులు మౌనవ్రతం లో ఉంది అండి.
పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని అమ్మవారికి మొక్కుకుంది అని చెబుతుంది. అందరూ వధువు భక్తికి మురిసిపోతారు వధువు తండ్రి అయిన ధనుంజయ్ గారు కూతురిని చూసి పొంగిపోతారు.
ధనుంజయ కళ్ళు ఎవరినో వెతుకుతాయి కానీ అతనికి నిరాశ ఎదురవుతుంది.
కన్యాదాన పూజలో వధువు కుడి చేతి మణికట్టుపై ఉన్న పుట్టుమచ్చ చూసి వరుడికి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.
ఆ పుట్టుమచ్చ పెసరబద్ధంత పెద్దగా ఉంటుంది.
కన్యాదానం పూర్తయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేస్తారు.
తరువాత తాళి కట్టినప్పుడు వరుడు ఎంతో సంతోషంగా కడుతూ ఉంటే, వధువు కంటలో నుండి నీళ్లు జలజలా కారుతాయి..
ఒక కన్నీటి బొట్టు వచ్చే వరుడు పాదాలపై పడుతుంది.
వరుడు అర్థం కాక వధువు వంక అనుమానంగా చూస్తూ ఉంటే, భార్గవి వచ్చి మీతో వివాహానికి తను చాలా సంతోషంగా ఉంది అని వరుణ్ణి డైవర్ట్ చేస్తుంది.
తలంబ్రాల ఘట్టంలో కూడా వధువు వణుకుతూ ఉంటుంది. పెళ్లి ఘట్టాలు అన్నీ పూర్తి అయ్యాక అప్పగింతల అప్పుడు వధువు తన నానమ్మ అయిన సత్యవతి గారికి దగ్గరికి వెళుతూ ఉంటే భార్గవి వచ్చి వధువును హత్తుకుని భయపడకు మేమందరం నీ వెనకాల వస్తున్నాము అని చెప్పి సాగనంపుతుంది.
వధువు, వరుడు ఒక కారులో, మిగిలిన వాళ్ళందరూ ఎవరి కారులో వారు బయలుదేరతారు.
కార్ స్టార్ట్ అవ్వగానే వరుడు,, తమకు డ్రైవర్ కి మధ్య ఉన్న డోర్ వేసేస్తాడు. ఆ కారు చాలా లగ్జరీస్ కారు. అన్ని రకాల హంగులు ఉంటాయి.
వెంటనే వరుడు వధువు చేయి పెట్టకు పట్టుకుని నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా!! ఎవరి బలవంతం మీద నువ్వు ఒప్పుకోలేదు కదా అని గంభీరంగా అడుగుతాడు.
అతని మాటలోనే గంభీరానికే భయపడుతుంది. వధువు భయం అర్థం అయ్యి కూల్ గా మాట్లాడతాడు భయపడకు నిజం చెప్పు అని...
దానికి వధువు ఇష్టమే అని తల ఊపుతుంది. మౌనవ్రతం ఎన్ని రోజులు అని అడుగుతాడు?? రెండు రోజులు అని తన వేళ్ళు చూపిస్తుంది.
వధువు చేతి వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. వరుడు తన చేయి పక్కన వధువు చేయి పెట్టి చూసి చిన్నగా నవ్వుకుంటాడు.
ఇంతలో కార్ ఒక అందమైన మాన్షన్ ముందు ఆగుతుంది. అది జై సింహా మాన్షన్. పెళ్లి గురించి మాన్షన్ మొత్తం అందమైన పువ్వులతో అలంకరించబడి ఉంటుంది .
జై సింహా ఫ్యామిలీ తరతరాల నుంచి చెయ్యని బిజినెస్ అంటూ లేదు. కాలేజ్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు, వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు అన్ని రకాల బిజినెస్ లు చేస్తున్నారు.
చారిటీస్ కూడా రన్ చేస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్ లో 25% చారిటీస్కు ఉపయోగిస్తున్నారు.
ఇద్దరినీ గుమ్మం ముందు ఆపి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు. వధువుకి చాలా టెన్షన్ గా ఉంటుంది.
వరుడు వధువు వంక చూసి చిన్నగా నవ్వుతాడు. వధువు ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలా తను మాట్లాడేది అని...
కథ కొనసాగుతుంది.....
I Kindly Request To Readers Please Rate Us.........
This is Not Sex Story Totally Family, Romance And Thriller Story................
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 2
గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు.
దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నేను నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు.
వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే, వధువు కంగారుగా విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి, విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు. లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.
ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు.
దానికి లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది.
దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన కళ్యాణ గారు ముసిముసగా నవ్వుకుంటారు.
విక్రమ్ శిల్ప కుడి కాలు లోపలికి పెట్టి వస్తారు. విక్రమ్ చెల్లి అయిన నివేదిత వాళ్ళ అమ్మ గారిని అడుగుతుంది. వదిన ఎప్పుడు ముసుగు తీయాలి అని...
దానికి శిల్ప టెన్షన్ తో ముసుగుని గట్టిగా పట్టుకుంటుంది. నీకెందుకే అంత తొందర అంటూ వినయ్ అక్కడికి వస్తాడు. చిన్నన్నయ్య అని గారంగా పిలుస్తుంది.
దానికి ఉన్నదే ఆ కంగారు కదా అని అంటూ భరత్ అక్కడికి వస్తాడు. బావా అంటూ గుర్రుగా చూస్తుంది.
శిల్పతో భరత్ హాయ్ చెల్లమ్మ నేను నీకు అన్నయ్యని అవుతాను. అలాగే నీ భర్తకి బావ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు.
వినయ్ కూడా హాయ్ వదిన నేను నీకు బుల్లి గారాల మరిదిని అని పరిచయం చేసుకుంటాడు.
నివేదిత మళ్ళీ అడుగుతుంది మూసుకు ఎప్పుడు తీస్తారు అని...
రేపు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. రేపు రాత్రికి కార్యం జరుగుతుంది.
ఎల్లుండి శిల్ప పూజ చేసిన తర్వాత ముసుకు తీస్తామని ఇందిరా గారు చెబుతారు.
అన్నయ్య ఎప్పుడు చూస్తాడు అంటే... నువ్వు చిన్నపిల్లవు ఇంకా ఎక్కువగా అడగకు అని చిరు కోపంగా చెప్పి, వదినని రూమ్ కి తీసుకెళ్లని ఇందిరా గారు చెబుతారు.
శిల్పా రూమ్ లోకి వెళ్ళగానే శిల్ప మేనమామ అయిన సునీల్, మేనత్త అయిన బిందు లోపలికి వస్తారు.
సునీల్ లోపలికి వస్తూనే క్షమించండి. కొంచెం ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయ్యాము అని చెబుతారు.
ఎందుకు అంత కంగారు పడుతున్నారు? శిల్పా మా అమ్మాయి రూములో ఉంది అని చెప్పి...
సర్వెంట్ ని పిలిచి గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లమంటారు బిందూకి వ్రతం వరకు శిల్పని కలవడం కుదరదు.
వ్రతానికి విక్రమ్, శిల్ప కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. శిల్ప తల్లిదండ్రులైన ధనుంజయ్, భార్గవి, నానమ్మ, తాతయ్యలైన సత్యవతి, శేషగిరి గారు వస్తారు.
వ్రతం అంత ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వ్రతం పూర్తయిన తర్వాత లలితగారు వంశపారపర్యంగా వస్తున్న నగలను శిల్పకు అందిస్తారు.
శిల్ప మొహమాటం పడుతుంటే, తీసుకో శిల్పా అవి ఇంటి కోడళ్ళకి చెందవలసినవి. నీకు ఇంకా వినయ్ కి వచ్చే భార్యకు మాత్రమే చెందుతాయి. అని చెప్పి శిల్పకు అందిస్తారు.
శిల్పా అవి తీసుకోగానే భార్గవి వచ్చి అవి శిల్ప చేతిలో నుంచి తీసుకుంటుంది. విక్రమ్ మేనత్త అయిన మాధవి గారు డైమండ్ సెట్ ప్రెసెంట్ చేస్తారు..
లలిత గారు అది చూసి ఇప్పుడు ఎందుకు వదిన అంటే,, నా కూతురికి మేము పెట్టుకుంటున్నాం అని మాధవి భర్త అయినా రమేష్ గారు చెబుతారు.
వ్రతం పూర్తిచేసి విక్రం కి శిల్ప కి రూమ్లో భోజనం ఏర్పాటు చేస్తారు. నివేదిత ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. శిల్ప ముసుగు లోపలికి చేతిని తీసుకువెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది.
భోజనం అయిన తర్వాత విక్రమ్ నివేదితను పిలిచి, నివి బయట 5 మినిట్స్ మేనేజ్ చెయ్ అని చెబుతాడు.
దానికి నివి ఓహో..... లెజెండ్ విక్రమ్ గారు రొమాంటిక్ పర్సన్ అయ్యారా..అని టీస్ చేస్తుంది.
ఒక నవ్వి నవ్వి విక్రమ్ చెల్లిని పంపిస్తాడు. విక్రమ్ శిల్ప దగ్గరికి వచ్చి నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు.
ఆ గిఫ్ట్ చూసిన శిల్ప రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది....
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• ABC24, ash.enigma, coolguy, gora, Gurrala Rakesh, K.rahul, Nivas348, ram123m, Sachin@10, Sunny73, The Prince, yekalavyass
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 3
శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్, ఇక్కడ ఉన్నది మనిద్దరమే.
భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది.
మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే కార్యం వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు.
ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది.
విక్రమ్, శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది.
ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు.
శిల్ప నచ్చింది అని తల ఊపుతుంది. విక్రమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పెట్టనా అని అడుగుతాడు.
ఆ బాక్స్ విక్రమ్ చేతికి ఇస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న నల్లపూసలు, గ్రీన్ స్టోన్ రింగ్ ఆమెకు పెట్టి రింగ్ పెట్టిన చేతిని కిస్ చేస్తాడు.
శిల్ప చిన్నగా వణుకుతుంది. దానికి విక్రమ్ జస్ట్ రిలాక్స్ అని చెబుతూ ఉంటే... శిల్ప విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
శిల్ప ఎందుకో కంగారు పడుతుంది అని అర్థమయ్యి... నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే, డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది.
విక్రమ్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ నివి, భార్గవి ఉంటారు.
భార్గవి విక్రమ్ చూస్తూ.... అది అల్లుడుగారు కార్యం అయ్యేవరకు ఇద్దరు ఒకచోట ఉండకూడదని చెప్పి, శిల్ప ని తీసుకు వెళుతుంది. శిల్ప తన చీర కొంగుతో విక్రమ్ తొడిగిన రింగ్ చేతుని కవర్ చేస్తుంది.
అది చూసి విక్రమ్ నవ్వుకుంటాడు. పరవాలేదు.. తెలివైంది. ఎవరైనా చూస్తే టీస్ చేస్తారని బాగానే కవర్ చేసింది అనుకుంటాడు.
సాయంత్రం శిల్పా, విక్రమ్ ను తీసుకుని ధనుంజయ్ వాళ్ళ ఇంటికి వెళతారు.
విక్రమ్, శిల్ప ఒక కారులో వెళ్తారు. విక్రమ్ శిల్పతో నువ్వు నన్ను చూస్తున్నావు ముసుగులోనుంచి. కానీ..నిన్ను చూడడానికి మాత్రం నేను రాత్రి వరకు వెయిట్ చేయాలి అని చెబుతాడు.
దానికి శిల్ప తలవంచుకుంటుంది. శిల్ప సిగ్గు చూసి విక్రm❤️ చిన్నగా నవ్వుకుంటాడు.
పెళ్లి ఒక మ్యాజిక్ కదా! తెలియని ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది.
శిల్ప నువ్వు అస్సులు టెన్షన్ పడకు. మన ఇంట్లో అందరూ బాగా కలిసి పోతారు.
బిజినెస్ ఫీల్డ్ లోనే మేము సీరియస్ గా ఉంటాము. అది తప్పదు. బట్ ఇంట్లో అలా ఉండము.
అమ్మ, అత్తయ్య,, నివి నీతో బాగా కలిసి పోతారని చెబుతూ ఉంటే శిల్ప విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
ఎందుకు కంగారుపడుతున్నావ్?? నేను ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను అని చెప్పి చేయి ప్రెస్ చేస్తాడు.
ఇంటి ముందు కారు ఆగుతుంది. విక్రమ్, శిల్ప కారు దిగి లోపలికి వెళతారు.
లోపల కు వెళ్లగానే ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. విక్రమ్ ను రెస్ట్ తీసుకోమని ఒక రూమ్ లోకి తీసుకువచ్చి వదులుతారు.
విక్రమ్ వెళ్లి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళ ముందు మేలు ముసుగులో ఉన్న శిల్ప రూపం కనిపిస్తుంది.
శిల్ప రూమ్ లోనికి వెళ్లే ముందు వెనక్కి తిరిగి నన్ను ఎందుకు చూసింది. తన స్పర్శ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది అనుకుంటాడు .
రాత్రి గర్భధారణ పూజ సమయానికి విక్రమ్ ఫ్యామిలీ అందరూ వస్తారు. ఒక ఇందిర గారు తప్ప.
పూజారి ఇద్దరి చేత గర్భాదాన పూజ చేయించి, పెద్దలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు.
జంటగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శిల్ప ను విక్రమ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. శిల్ప విక్రమ్ పాదాలు తాకి గట్టిగా పట్టుకుంటుంది. శిల్ప కన్నీటి చుక్క విక్రమ్ పాదాలపై పడుతుంది.
శిల్ప ప్రవర్తన అర్థం కాక విక్రమ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. భార్గవి వచ్చి శిల్పను రెడీ చేసి తీసుకు వస్తానని రూములోకి తీసుకు వెళుతుంది.
లలిత గారు కూడా వస్తాను అంటే వద్దు వదినగారు, అమ్మాయి సిగ్గుపడుతుంది.
నేను రెడీ చేసి తల్లిగా నేను చెప్పవలసిన చెప్పి తీసుకో వస్తానని చెప్పి లోపలికి తీసుకు వెళుతుంది.
విక్రమ్ ని గదిలోకి పంపిస్తారు. శిల్ప ను అందంగా రెడీ చేసి ముసుగు వేసి తీసుకు వస్తుంది
సత్యవతి గారి పాల గ్లాసు ఇచ్చే జాగ్రత్తలు చెప్పి విక్రమ్ ఉన్న గదిలోకి పంపిస్తారు.
శిల్ప విక్రమ్ గదిలోకి వెళ్లిన తరువాత, విక్రమ్ ఫ్యామిలీ అంతా మాన్షన్ కి వెళ్ళిపోతారు.
ఆ గది మొత్తం సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు. ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులతో నిండిపోతుంది. అరోమా క్యాండిల్స్ తో విక్రమ్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.
విక్రమ్ శిల్పని చూసి ఎందుకు తలుపు దగ్గర నిలబడిపోయావు...ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అని అంటే... లేదు అని కంగారుగా తల ఊపుతుంది.
విక్రమ్ నవ్వుతూ ముందుకు వచ్చే శిల్ప చేయి పట్టుకుంటాడు.
ఆ టచ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నిన్నటి నుంచి టచ్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ రావడం లేదు ఏంటిది అని ఆలోచిస్తూ... శిల్ప ను తీసుకోవచ్చి మంచం మీద కూర్చోబెడతాడు.
ముసుగు తియ్యనా అని శిల్ప ని అడుగుతాడు. దానికి సరే అని తల ఊపుతుంది.
మెల్లిగా శిల్ప మొఖంపై ఉన్న ముసుగు తీసి తన ముఖం చూస్తాడు. శిల్ప చాలా అందంగా ఉంటుంది. ఆ అందంతో ఎవరినైనా కట్టే పడేయచ్చు అన్నట్టుగా ఉంది.
బ్యూటిఫుల్ అంటాడు. దానికి శిల్ప నవ్వుతుంది. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది విక్రమ్ కి.
శిల్ప చేయి పట్టుకోగానే నెగటివ్ వైప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది.
శిల్ప మెడ వంక చూస్తాడు. తను ఇచ్చిన నల్లపూసలు ఉండవు.
డౌటుగా మాట్లాడుతూ, చేతులు పట్టుకొని తను పెట్టిన ఉంగరాన్ని చూస్తాడు. ఆ ఉంగరం ఉండదు. వేరే మోడల్ ఉంగరం ఉంటుంది.
శిల్ప చేతులను చూస్తాడు. సాయంత్రం వరకు అరచేతుల వరకు ఉన్న గోరింటాకు ఇప్పుడు మోచేతులు దాకా కనిపిస్తుంది.
కుడి చేతి మణికట్టుపై తన చూసిన పుట్టుమచ్చ కూడా లేదు. ఏదో తప్పు జరుగుతుంది అని విక్రమ్ కి అర్థమయ్యి శిల్ప వంక కోపంగా చూస్తూ.... రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోతాడు.
కోపంగా విక్రమ్ ఎక్కడికి వెళుతున్నాడు??
ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి??
కథ కొనసాగుతుంది....
The following 15 users Like SivaSai's post:15 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, Gurrala Rakesh, horseride, K.rahul, k3vv3, Nivas348, ram123m, Sachin@10, Sunny73, The Prince, utkrusta, Viking45, yekalavyass
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,237 in 2,025 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
725
అసక్తికరమైన ఆరంభంతో పాటు ఓ మలుపులో ఉంచారు.
బాగా వ్రాస్తునారు.
•
Posts: 4,300
Threads: 9
Likes Received: 2,775 in 2,140 posts
Likes Given: 9,998
Joined: Sep 2019
Reputation:
29
•
Posts: 2,695
Threads: 0
Likes Received: 1,283 in 1,072 posts
Likes Given: 10,322
Joined: May 2019
Reputation:
19
•
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 4
కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంటే... సీరియగా చూసి డ్రైవర్ని కారు తీయమని తను మాన్షన్ కి వెళ్ళిపోతాడు.
సత్యవతి, భార్గవి శిల్ప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు. దానికి శిల్ప తెలియదమ్మా అని చెబుతుంది.
సరే నువ్వు రెస్ట్ తీసుకో.. రేపు వెళ్లి అసలు ఏం జరిగిందో అని అల్లుడు గారిని అడుగుదామని భార్గవి ని శిల్ప కి తోడుగా ఉండమని చెప్పి, సత్యవతి బయటకు వస్తుంది.
ఏమైందమ్మా అని ధనుంజయ్ అడగగానే, శిల్పకు ఏమీ తెలియదు అంటుంది.
రేపు వెళ్లి మాట్లాడితే గాని, విషయం ఏమిటో తెలియదు అని చెబుతుంది.
విక్రమ్ తన మాన్షన్ లో కారు దిగి సీరియస్గా లోపలికి వస్తాడు. విక్రమ్ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు.
ఏమైంది విక్రమ్.. ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, అక్కడ శిల్ప ని ఒంటరిగా వదిలేసి అని లలిత గారి అడుగుతారు.
దానికి విక్రమ్ అమ్మ అని గట్టిగా అరుస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఏమైంది విక్రమ్ అని కళ్యణ్ గారు, రమేష్ గారు చెరో పక్కన కూర్చుని అడుగుతారు.
దానికి విక్రమ్ బాధగా కళ్ళు మూసుకుని చాలా మోసం జరిగిందమ్మా అని చెబుతాడు.
మోసం ఏమిటి నాన్న అని...ఇందిరాగారు అడిగితే..
నేను తాళి కట్టింది ఒకరికి, ఇప్పుడు గదిలోకి వచ్చింది ఇంకొకరు అని చెబుతాడు.
ఏంటి అని అందరూ గట్టిగా అరుస్తారు. ఒక్క నిమిషం అందరికీ ఏమి మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు.
విక్రమ్ మేనత్తయిన మాధవి గారు ముందుగా తేరుకుని నువ్వు అమ్మాయిని గదిలోనే కదా చూడడం.. నీకు ఎలా తెలిసింది అని అడుగుతారు.
దానికి అత్తయ్య పెళ్లి సమయంలో గానీ, వ్రతం జరుగుతున్నప్పుడే గాని తన స్పర్శ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.
కానీ ఇప్పుడు గదిలో ఉన్న అమ్మాయి చేయి తగలగానే నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.
అంతేకాదు అత్తయ్య, నేను తాళి కట్టిన అమ్మాయికి గోరింటాకు అరచేతిలో మాత్రమే ఉంది. కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంది.
కానీ గదిలోకి వచ్చిన అమ్మాయి మోచేతి వరకు మెహందీ ఉంది. నేను వ్రతం అయిన తర్వాత నల్లపూసలు, ఒక రింగు గిఫ్టుగా ఇచ్చాను అని చెబుతాడు.
అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఇలా ఎలా అని?? భరత్ ఆలోచిస్తూ బావ మెహేంది ఏమైనా మళ్లీ పెట్టుకుందేమో!! ఇప్పుడు ఇన్స్టంట్ మెహందీలు వస్తున్నాయి కదా అలాగా అని..
లేదు భరత్ అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్నది కాదు అంటాడు. అంతలో నివి కి కూడా ఒక డౌట్ వస్తుంది.
నైట్ టైం అని గోల్డ్ తీసి ఉండొచ్చు కదా అనగానే,
దానికి విక్రమ్ నల్లపూసలు అంటే నువ్వు చెప్పింది నిజం అనుకోవచ్చు. బట్ రింగ్ అలా కాదు.
అది నేను స్పెషల్ గా డిజైన్ చేయించాను. నేనే స్వయంగా తన చేతికి పెట్టి ఫిక్స్ చేశాను.
ఆ ఉంగరం ఎప్పుడు తన చేతికి ఉండాలని ఒక కోడితో ఫిక్స్ చేశాను. అది తీయాలి అంటే ఆ కోడ్ యూస్ చేయాలని చెబుతాడు.
ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆ టైంకి సర్వెంట్స్ అందరూ సర్వెంట్ క్వార్టర్స్ కి వెళ్ళిపోవడం వలన ఈ విషయం బయటికి వెళ్లలేదు.
వెంటనే ఇంద్ర గారు మనకి ఈ విషయం తెలిసినట్టు ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియకూడదు. అసలు ఏం జరిగిందో తెలిసే వరకు అంటారు.
దానికి లలితగారు రేపు శిల్ప ను అందరికీ చూపించాలి కదా! అత్తయ్య. పైగా రెండు రోజుల్లో రిసెప్షన్ కూడా ఉంది కదా అనగానే, ఇంద్ర గారు ఆలోచనలో పడతారు.
ఈ సమస్య నుంచి జై సింహ ఫ్యామిలీ ఎలా బయటపడతారు??
కథ కొనసాగుతుంది...
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 5
ఆ రాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అందరికీ ఆ రాత్రి చాలా భారంగా గడుస్తుంది.
ఉదయం లలిత గారు పరధ్యానంగా పూజ చేసి వస్తారు. ఇంటి మొదటి వారసుడు పెళ్లిలో ఇలా జరిగింది ఏమిటి అని...
ఇందిరాగారు కోడల్ని చూసి ఎందుకు లలిత అంత డల్ గా ఉన్నావ్ అని అంటారు.
దానికి లలిత అంతా తెలిసి కూడా అలా అడుగుతున్నారు ఏంటి అత్తయ్య అని అంటే....
అది నిజమే కానీ రాత్రి ఏం చెప్పాను. మనకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియకూడదని చెప్పాను కదా! పైగా సర్వెంట్స్ అందరూ ఉన్నారు.
నలుగురు వచ్చి పోయే ఇల్లు ఇది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇంటి ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెబుతారు.
అంటే ఏంటి అత్తయ్య అమ్మాయిని ఒప్పుకోవాలా అని అడుగుతారు. ఒప్పుకోవాలి అని చెప్పడం లేదు.
అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము .మన విక్కీ చేసుకుంది వేరే అమ్మాయిని అయితే అమ్మాయిని కనిపెడదాం అంటారు.
కానీ అత్తయ్య అరోజు మనం చూసి వచ్చిన అమ్మాయి శిల్ప నే కదా అంటే,, కంగారు పడకు లలిత.
ధనుంజయ్ ఫ్యామిలీ వచ్చాక మాట్లాడదాం. వాళ్ళు వచ్చాక నేను మాట్లాడతాను.
అందరూ సైలెంట్ గా ఉండండి. ముఖ్యంగా విక్కీ ని అని చెబుతారు. దానికి సరే అని కిచెన్ లోకి వెళ్లి హెడ్ కుక్కకి ఏం చేయాలో చెబుతారు.
విక్రమ్ రాత్రి లేటుగా పడుకోవడం వల్ల, చాలా లేటుగా లెగుస్తాడు.
పెళ్లి జరిగిన సంతోషం లేదు. ఎవరైనా తొలిరాత్రి జాగారం చేసి, ఉదయం లేటుగా లెగుస్తారు.
కానీ నా పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అసలు నా పెళ్లి ఎవరితో జరిగిందో తెలియక, ఆలోచిస్తూ నిద్రకు దూరం అయి లేటుగా లేచాను.
నా పెళ్ళిలో గోల్మాల్ చేసిన ఎవరిని వదలను అనుకుంటూ బాత్రూంలోకి వెళతాడు. షవర్ కింద నుంచి జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు.
వధువు కంగారు పడటం, తాళి కట్టేటప్పుడు తన కాళ్లపై కన్నీళ్లు పడడం, తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం, ఏదో చెప్పాలని ప్రయత్నించడం అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.
వధువు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా...భార్గవి తీసుకువెళ్ళడం. పెళ్ళిలో మౌనవ్రతం అని చెప్పడం చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా భార్గవి మీద. వధువును తలుచుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నిన్ను వదలను.
నువ్వు ఏం సమాధానం చెబుతావో నేను వినాలి. నా కుటుంబ పరువు ప్రతిష్టలతో, నా మనసుతో ఆడుకున్న ఎవ్వరిని వదలను అని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు.
ఈ విక్రమ్ ఆట ఆడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని వధువుని తలుచుకుని కోపంతో కళ్ళు తెరిస్తాడు. అక్కడ ఒక గదిలో కూర్చుని ఏడుస్తున్న ఒక అమ్మాయికి ఆగకుండా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి.
విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు.
కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు?? ఏం చేయాలో నాకు తెలుసు.
ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు.
అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ఎవరి వచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు.
ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.
ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.
లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు. శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది.
విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...
హాల్లో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక!
శిల్ప తాతగారైన శేషగిరి గారు మాట్లాడుతూ మా వల్ల ఏమైనా తప్పు జరిగిందమ్మా అని ఇందిరా గార్ని ఉద్దేశించి మాట్లాడుతారు.
దానికి ఇందిరాగారు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడుగుతారు.
రాత్రి అబ్బాయి గదిలో నుంచి చాలా కోపంగా బయటికి వచ్చాడు. మేము ఎవ్వరం పిలుస్తున్న పలకకుండా వచ్చేసాడు.
మాకు చాలా కంగారు వచ్చింది. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెబుతారు.
విక్రమ్ మాత్రం భార్గవి నే చూస్తున్నాడు. భార్గవి ఫేసులో మారుతున్న రంగులను చూస్తున్నాడు.
శేషగిరి గారు అడిగిన దానికి ఇందిరాగారి సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, coolguy, gora, Nivas348, ram123m, Sachin@10, Sunny73, The Prince, utkrusta, yekalavyass
Posts: 707
Threads: 2
Likes Received: 480 in 328 posts
Likes Given: 638
Joined: May 2019
Reputation:
5
Wowwww!!
Endi bhayya ee araachakam. Gisunti story sadivi yaad kooda ledu.
Emaina raastunnava nuvvu??
Wonderful is a small word for you!!
•
Posts: 670
Threads: 7
Likes Received: 1,372 in 432 posts
Likes Given: 1,014
Joined: Dec 2022
Reputation:
82
lapataa ladies ??
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ
•
Posts: 4,300
Threads: 9
Likes Received: 2,775 in 2,140 posts
Likes Given: 9,998
Joined: Sep 2019
Reputation:
29
•
Posts: 10,853
Threads: 0
Likes Received: 6,385 in 5,205 posts
Likes Given: 6,169
Joined: Nov 2018
Reputation:
55
•
Posts: 174
Threads: 0
Likes Received: 148 in 84 posts
Likes Given: 111
Joined: Apr 2023
Reputation:
2
Pratilipi lo story kada bro
•
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 6
ఇందిరా గారు శేషగిరి గారికి చెబుతారు. మీ వలన ఏ తప్పు జరగలేదు అని...
వారు అబ్బాయి ఎందుకు అలా వచ్చేసాడు అని అడుగుతారు.
దానికి ఇందిరా గారు చిన్న పొరపాటు జరిగింది అని గంభీరంగా చెబుతారు. ఆ మాటలకి భార్గవికి చెమటలు పడతాయి.
విక్రమ్ భార్గవి ని చూస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళలో పొరపాటు ఏమిటా అని కంగారు ఉంటే, భార్గవి కి మాత్రం దొరికిపోయామా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
విక్రమ్ కి అర్థమవుతుంది భార్గవి నే ఏదో చేసింది అని. ఇందిరా గారు ఏం చెబుతారా అని శిల్ప ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు.
ఇందిరాగారు అందరిని చూస్తూ చెబుతారు. నిన్న రాత్రి మీ ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత నాకు ఒక ఫోను వచ్చింది అని.. ఒక నిమిషం ఆగుతారు.
అంతే భార్గవికి టెన్షన్ పెరిగిపోతుంది. అది చూసిన విక్రమ్.. అత్త అప్పుడే అంత టెన్షన్ పడితే ఎలా?? నీకు ముందుంది ముసళ్ళ పండగ అనుకుని భార్గవి టెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి అండి అన్ని టెన్షన్ పడుతూ అడుగుతుంది భార్గవి. దానికి ఇందిరా గారు మా సిద్ధాంతి గారి నుంచి అని చెబుతారు.
అప్పుడు భార్గవి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఏం చెప్పారు అమ్మ అని శేషగిరి గారు అడిగితే...
అమ్మాయి జాతకంలో చిన్న లోపం కనిపిస్తుంది. కార్యం జరిపించవద్దు. అలాగే ఆరు నెలల వరకు అమ్మాయిని ఎవరికీ చూపించవద్దు.
మీ కుటుంబ సభ్యులు తప్ప. ఎవరూ అమ్మాయిని మొఖం చూడకూడదు. ఇంట్లో ఉన్న సర్వెంట్స్ తో సహా అని చెప్పారు.
అది అప్పటికప్పుడు గదిలో ఉన్న అల్లుడు గారికి ఎలా తెలిసింది అని భార్గవి అనుమానంగా అడుగుతుంది.
దానికి ఇందిరా గారు నవ్వుతూ ప్రస్తుతం ప్రజల్లో పక్కనున్న వాళ్ళని అయినా మర్చిపోతున్నారు కానీ ఫోన్ ని వదలడం లేదు కదా! అదేంటి చెవిలో పెట్టుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటే....ఎయిర్ బర్డ్స్ నానమ్మ అనే వినయ్ అందిస్తాడు.
అవి ఉండగా ఇన్ఫర్మేషన్ ఎంత సేపు వెళుతుంది అనగానే భార్గవి సైలెంట్ అయిపోతుంది. వెంటనే నేను, విక్రమ్ కి చెప్పాను అని..
భార్గవి దానికి ఈ రోజుల్లో కూడా ఇవి నమ్ముతారా పెద్దమ్మ గారు అంటే... సత్యవతి కోడల్ని మందలిస్తుంది.
ప్రతీది తీసిపాడేయకూడదు అని... ఇందిరా గారు వెంటనే మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే, మాకు లేదు అంటారు.
దానికి భార్గవి ముఖం వెలిగిపోతుంది. లలిత గారి అదేంటి అత్తయ్య గారు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది.
మళ్ళీ ఇందిరా గారు చెప్పడం మొదలుపెడతారు. మేమైతే మా సిద్ధాంతి గారు చెప్పింది పూర్తిగా నమ్ముతాం. తరతరాల నుంచి మా కుటుంబానికి సిద్ధాంతి కుటుంబానికి చక్కటి అనుబంధం ఉంది.
సిద్ధాంతి గారు మాకు ఇంకో విషయం కూడా చెప్పారు. పెళ్లిలో ఏదో లోపం జరిగింది మీకు తెలియకుండా అని.. భార్గవి నెత్తి మీద ఒక థౌసండ్ వాళ్ళ బాంబు వేస్తారు.
తొందరపడి కార్యం జరిపించిన, అమ్మాయిని ఇంటికోడలుగా ఇప్పుడే పరిచయం చేసిన, అమ్మాయికి అని గ్యాప్ ఇస్తారు.
అందరూ ఏం చెబుతారా అని ఇందిరాగారి వంక చూస్తారు. ఇందిరా గారు బాధగా ముఖం పెట్టి అమ్మాయికి ప్రాణగండం అని చెప్పారు అంటారు..
శిల్పా ఫ్యామిలీ ఏంటి అని అరుస్తారు. జై సింహ ఫ్యామిలీ ఇందిరా గారి మైండ్ గేమ్ కి షాక్ తో అలా చూస్తూ ఉంటారు.
భార్గవి గట్టిగా నో అని అరుస్తుంది. అందుకే విక్రమ్ కి మీకు ఎలా చెప్పాలో తెలియక అలా వచ్చేసాడు అని చాలా బాధగా చెబుతారు.
ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు అనే ధనుంజయ్ అడుగుతాడు. సొల్యూషన్ కూడా చెప్పాను. మీకు నమ్మకం ఉంటే పాటించండి. నమ్మకం లేకపోతే మీ ఇష్టం అనే బాల్ వాళ్ల కోర్టు లో వేస్తారు..
అందరూ ఆలోచనలో పడతారు సింహ ఫ్యామిలీ మాత్రం ఇందిరాగారి తెలివికి ఆశ్చర్యపోతారు.
కర్ర విరగకుండా, పాము చావకుండా అంటే ఇదేనేమో అని...
భార్గవిని చూసే విక్రమ్ కిల్లింగ్ స్మైల్ ఇస్తాడు.
ఇప్పుడు ఏం చేస్తావు అత్త అని??
ఇప్పుడు శిల్ప ఫ్యామిలీ నిర్ణయం ఏమిటి??
కథ కొనసాగుతుంది...
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
23-12-2025, 11:22 PM
(This post was last modified: 23-12-2025, 11:26 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 7
ఆ లెటర్ చదివిన సత్యవతి, శేషగిరి గారికి కన్నీరు ఆగడం లేదు. ఎంత పని చేసావు అవిని అని బాధపడతారు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని కూర్చుంది. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి తలపై నుంచి కూడా స్కార్ఫ్ కట్టుకుంది.
ఫుల్లుగా కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకొని ఉంది. చాలా టెన్షన్ తో తన ఎక్కాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంచెం సేపటికి తను ఎక్కాల్సిన ట్రైన్ రాగానే స్పీడ్గా వెళ్లి ట్రైన్ ఎక్కి కూర్చుంది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుని ట్రైన్ ఎక్కేసింది.
జైసింహ మాన్షన్.....
పొద్దుటే శిల్ప రూమ్ డోర్ నాకు చేసిన సౌండ్ వస్తుంది. మత్తుగా నిద్రపోతున్న శిల్ప కు ముందుగా సౌండ్ వినిపించదు.
ఇంకా కొంచెం గట్టిగా కొట్టిన తర్వాత ఉలుక్కుబడి లెగుస్తుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి తలుపులు ఎవరు కొడుతున్నారని భయపడుతుంది.
శిల్ప అని బయట నుంచి అరుస్తారు. వెంటనే శిల్ప ముసుగు వేసుకొని వెళ్లి తలుపుతీస్తుంది.
ఎదురుగుండా లలిత గారు ఉంటారు. చెప్పండి అత్తయ్య గారు అంటే తెల్లారి పోయినా ఇంకా నువ్వు లెగలేదు అని లేపడానికి వచ్చాను అని చెబుతారు.
అప్పుడే తెల్లారిపోయిందా అని క్లాక్ వంక చూస్తుంది. అది చూస్తే అది ఉదయం 4:00 చూపిస్తుంది. అత్తయ్య గారు ఇంక నాలుగే అయ్యింది అంటుంది.
అవును. ఈ పాటకి నువ్వు లేచి పూజ గది ముందు శుభ్రం చేస్తూ ఉంటావ్ అనుకున్నాను. ఇంకా లెగలేదని లేపడానికి వచ్చాను అని చెబుతారు.
దానికి శిల్ప కొత్త ప్లేస్ కదా! రాత్రి నిద్ర పట్టలేదు. లేట్ అయిందని చెబుతుంది.
సర్లేమ్మ లేచి ఫ్రెష్ అయ్యి రా .... పూజ గది దగ్గర శుభ్రం చేయాలని చెప్పి వెళతారు.
ఇంత పొద్దుటే లెగాలా అనుకొని ఫ్రెష్ అయి వెళుతుంది. ఇంకా ఎవ్వరు కనిపించలేదు.
అదేంటి అత్తయ్య గారు ఎవరూ రాలేదు అంటే... అప్పుడే రారు. ముందు శుభ్రం చెయ్యి అని గట్టిగా చెబుతారు.
పూజగది బయట మాత్రమే శుభ్రం చేపిస్తారు. గది లోపలికి రానివ్వలేదు. గార్డెన్ లోనికి పంపి పువ్వులు తెప్పిస్తారు. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి ఉదయం 5:00 అవుతుంది.
ఇక్కడ పని అయిపోయింది రెస్ట్ తీసుకోవాలి అనగానే, ముగ్గు పెట్టమంటారు. నాకు ముగ్గు రాదు అని శిల్ప అనగానే, పరవాలేదు మేము నేర్పిస్తాము అని... రంగి అని సర్వెంట్ ని పిలిచి అప్పచెబుతారు.
అవి అన్ని పూర్తయ్యేటప్పటికీ శిల్పకి నడుం పట్టేస్తుంది. నడుము పట్టుకుని లోపలికి వచ్చిన శిల్పని చూసి ఇప్పటికి ఇది చాలు అనుకుని, రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోమంటారు.
దొరికిందే ఛాన్స్ అనుకుని గబగబా లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని పడుకుంటుది.
విక్రమ్,వినయ్, భరత్ వర్కౌట్ స్ ఫినిష్ చేసుకుని రెడీ అయి వస్తారు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.
శిల్ప తప్ప అందరూ ఉంటారు. ఇందిరాగారి విక్రమ్ తో నీకు ఆరు నెలలు టైం ఇచ్చాను. ఈ లోపు ఫినిష్ అవ్వాలి అంటే సరే అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్కు బయలుదేరుతారు.
నివేదిత చేతికి టిఫిన్ ప్లేట్ ఇచ్చి శిల్పతో ఫ్రెండ్షిప్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెబుతారు. సరే అని ప్లేట్ తీసుకుని శిల్ప రూమ్ లోనికి వెళుతుంది.
శిల్ప మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. ఏంటో దీని రాజభోగం అనుకుని.... నిద్ర లేపుతుంది.
ప్లీజ్ మమ్మీ కొంచెం సేపు పడుకుంటాను అని అటు తిరిగి పడుకుంటుంది. వదిన అని గట్టిగా పిలుస్తుంది.
దెబ్బకు ఉలుకుబడి లేచి కూర్చుంటుంది. ఏంటి వదిన నువ్వు ఇంకా లెగలేదా?? మన ఇంట్లో ఇంత సేపు పడుకుంటే గ్రానీకి కోపం వస్తుంది.
టిఫిన్ తిను అని చెబుతుంది. ఒక్క నిమిషం అని ఫ్రెష్ అయ్యి వస్తుంది. ముసుగు ఉంచుకుని టిఫిన్ చేస్తూ ఉంటుంది.
పర్లేదు వదిన ముసుగు తీసేయ్, మనిద్దరమే కదా అని చెప్పి ముసుగుతీస్తుంది. శిల్ప ని చూసి అబ్బా వదిన ఎంత అందంగా ఉన్నావు.
పెళ్లి చూపుల్లో కన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. అచ్చు మోడల్ లాగా ఉన్నావ్ అని పొగుడుతుంది. దానికి శిల్ప చాలా సంతోష పడిపోతుంది.
టిఫిన్ కంప్లీట్ అయ్యాక వదిన మనిద్దరం ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్ అని చెయ్యి ఇచ్చి, నువ్వు నాకు బ్యూటీ టిప్స్ చెప్పాలి వదిన .
ఇంత అందంగా ఉండడానికి అని ఇంకా మునగ చెట్టు ఎక్కిస్తుంది. శిల్ప ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది.
ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి?
కథ కొనసాగుతుంది....
Posts: 4,300
Threads: 9
Likes Received: 2,775 in 2,140 posts
Likes Given: 9,998
Joined: Sep 2019
Reputation:
29
•
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
5 hours ago
(This post was last modified: 5 hours ago by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 8
విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. కారు దిగి ఆఫీస్ వంక చూస్తాడు
V. J. S గ్రూప్...
అది విక్రమ్ ముత్తాతగారు స్థాపించారు. అంచెలంచలేక ఎదుగుతూ ఇప్పుడు ఒక గొప్ప స్థానానికి వచ్చింది.
అది వి జె ఎస్ గ్రూప్ యొక్క మెయిన్ బ్రాంచ్. 30 అంతస్తుల బిల్డింగ్. ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఉన్న బ్రాంచెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు.
బిల్డింగ్ పైన వ్రాసి ఉన్న నేమ్ చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన కంపెనీకి, మన వంశానికి మచ్చ తీసుకురాను. రానివ్వను ..
అనుకుని... గంభీరంగా ఆఫీసులోనికి ఎంటర్ అవుతాడు. విక్రమ్ చూడగానే ఆఫీస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది.
దించిన తల ఎత్తకుండా వర్క్ చేస్తున్నారు. అమ్మాయిలు మాత్రం ఓరకంటూ విక్రమ్ చూస్తూనే ఉంటారు. ఏమంటాడు రా..... బాబు.
పెళ్లి అయిపోయినా సరే మనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు.
వినయ్, భరత్ కూడా సైట్ వర్క్ ఫినిష్ చేసుకుని ఆఫీస్కు వస్తారు. ఒక వ్యక్తి వచ్చి విక్రమ్ సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు కలవాలి అని చెప్తాడు.
రిసిప్షన్స్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పంపిస్తుంది. విక్రమ్ పీఏ 30 త్ ఫ్లోర్ లో ఉంటారు. ఆయన కలిస్తే విక్రమ్ సార్ దగ్గరికి తీసుకువెళ్తారు అని చెబుతోంది.
ఓకే అని చెప్పి,, లిఫ్ట్ లో 30 త్ ఫ్లోర్ కి వెళ్లి, విక్రమ్ పీఏ అయినా ఆనంద్ ని కలిసి,
హాయ్ సర్, ఐయామ్ రిషి. విక్రమ్ సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెబుతాడు. ఓకే అని చెప్పి విక్రమ్ క్యాబిన్ కి తీసుకువెళ్తాడు.
ఎక్స్క్యూజ్మీ సార్ అనగానే, కామెన్ అని చెబుతాడు. ఆనంద్, రిషి లోపలికి వెళ్ళగానే విక్రమ్ ని విష్ చేస్తారు. విక్రమ్ హెడ్ మూవీ చూసి ,
ఆనంద్ తొ భరత్, వినయ్ ని రమ్మన్నానని చెప్పు. అలాగే ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఎలాంటి డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి పంపిస్తాడు. భరత్ వినయ్ వచ్చాక డోర్ ని లాక్ చేసేస్తారు.
ఇప్పుడు చెప్పండి రిషి మీరు తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు. దానికి రిషి తన తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చెబుతాడు.
ధనుంజయ్ గారికి రెండు పెళ్లిళ్లు అనగానే... విక్రమ్ వాట్ అంటాడు.
అవును సర్. ధనంజయ గారి మొదటి భార్య పేరు రజిత.. వీరికి ఒక కూతురు అవని అని చెబుతాడు. విక్రమ్ పెదవులు అవని అని పలుకుతాయి.
అవిని పుట్టిన తర్వాత ధనుంజయ్ గారికి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. పట్టిందల్లా బంగారం అయింది.
భార్గవి రజిత గారి పిన్ని కూతురు. అవని మొదటి పుట్టినరోజుకి అని భార్గవి రజిత గారి ఇంటికి వచ్చింది.
అవని పుట్టినరోజు నాడు ఏమి జరిగిందో తెలియదు గానీ, రజిత గారి మెట్ల పైనుంచి జారి కింద పడ్డారు. హాస్పిటల్ కి తీసుకువెళ్ల ప్రయోజనం లేదు.
మొదటి పుట్టిన రోజునే అవకి ని తల్లి దూరమైంది. తండ్రి బాధలో ఉంటే, నానమ్మకు అలవాటు పడింది.
ఆ టైంలోనే రజిత పిన్ని గారు కూతురిని తీసుకుని వచ్చి పాపను చూసే వంకతో అక్కడే ఉన్నారు. భార్గవి అవిని జాగ్రత్తగా చూసుకుంటూ, ధనుంజయ్ గారికి దగ్గరయింది.
సత్యవతి గారు కూడా అవిని కి తల్లి అవసరం ఉంటుందని, భార్గవి తో ధనుంజయ్ పెళ్లి జరిపించారు.
కానీ ధనుంజయ గారికి అవని మీద ఎంత ప్రేమ ఉన్నా, అవిని ని చూసినప్పుడల్లా రజిత గారు గుర్తుకు వస్తున్నారని, అవిని తొ తక్కువ మాట్లాడేవారు..
ఈ లోపు భార్గవి ప్రెగ్నెంట్ అవ్వడం, శిల్ప పుట్టడం జరిగింది. రజిత జ్ఞాపకాల్లోంచి రావడానికి శిల్ప తొ అటాచ్మెంట్ పెంచుకున్నారు.
అవిని కి అన్ని ఇస్తున్నాను అనుకున్నారే కానీ, విలువైన తండ్రి ప్రేమను ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అవిని తండ్రి ప్రేమ కోసం అల్లాడుతూనే ఉంది.
ఇదే అదునుగా భార్గవి తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెంచింది. అది ఎంత దూరం అంటే అవిని సర్టిఫికెట్ లో గార్డియన్గా శేషగిరి గారి పేరు మాత్రమే ఉంది అని. సర్టిఫికెట్స్ చూపిస్తాడు.
ఎక్కడికి వెళ్లినా శిల్ప ఒక్కతే కూతురు అన్నట్టుగా భార్గవి క్రియేట్ చేసింది. మీ సంబంధం వెళ్ళినప్పుడు కూడా ధనుంజయ్ గారు అవిని నే మీకు ఇచ్చి చేయాలి అనుకున్నారు.
కానీ ఏం జరిగిందో తెలియదు... అవిని ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు, అప్పుడే చేసుకోనని చెప్పింది. మీ సంబంధం వదులుకోలేక శిల్పకి ఖాయం చేశారు అని చెబుతారు.
అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం తెలిసింది సార్ అనగానే... ఏంటిది అని అంటే..
నిన్న అవనిగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇంట్లో అనుకుంటున్నారు.
బట్ నా ఎంక్వైరీలో తెలిసినంతవరకు అవని గారికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు.
పార్ట్ టైం జాబ్ చేస్తూనే తను స్టడీస్ కంప్లీట్ చేశారు. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అని నా ఎంక్వైరీ లో తెలిసింది.
అంతే కాదు సార్, భార్గవి గారు ఎంత దారుణంగా క్రియేట్ చేశారంటే.... అవిని కి ఎవరూ లేరు. ఒక గార్డెన్ దయతో చదువుకుంటుంది. శిల్ప ఒక్కతే ధనుంజయ్ గారి కూతురు అన్నట్టుగా క్రియేట్ చేశారు.
ఏ ఫంక్షన్ కి వెళదామన్నా అవని రాను అని చెప్పడం అవిని ని వదిలేసి, ఫ్యామిలీ మొత్తం వెళ్లడంతో... అవిని ఉనికి వారి బంధువులు కి తెలియకుండా అయిపోయిందని చెప్పి..
అవిని డీటెయిల్స్ అన్ని ఇచ్చి, ఇంక నేను వెళతాను సార్ అంటే... అవిని ఎక్కడికి వెళ్లిందో తెలుసుకో...
అలాగే శిల్ప డీటెయిల్స్ అన్ని తెలుసుకో రిషి అని చెబుతాడు. ఓకే అని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. ఎందుకన్నయ్య అని వినయ్ అడుగుతాడు
Posts: 133
Threads: 8
Likes Received: 588 in 93 posts
Likes Given: 1,037
Joined: Aug 2024
Reputation:
20
Part - 9
విక్రమ్ ఏం చెబుతాడా అని వినయ్, భరత్ చూస్తూ ఉంటారు. దానికి విక్రమ్ వాళ్ళిద్దరూ వంక చూస్తూ ఎందుకంటే నేను తాళి కట్టింది అవని కి కాబట్టి అంటాడు.
. పక్కనే బాంబు పడినట్టు, ఇద్దరు గట్టిగా అరుస్తారు ఏంటి అని... ఎందుకు అలా అరుస్తారని చిరాకుపడతాడు.
మరి అరవక ఏం చేయాలి? అయినా నీకు ఎలా తెలుసు... అవిని కే తాళి కట్టావని వినయ్ అడుగుతాడు.
దానికి విక్రమ్ అవని కాదు. వదినా అని పిలువు అని చెబుతాడు. విక్రమ్ మాటలోని సీరియస్ కి భయపడి ఓకే... వదిన అని ఎలా తెలిసింది అంటాడు.
ఈవినింగ్ అందరికీ ఒకేసారి చెబుతాను అని సిస్టం లో తల దూర్చుతాడు. ఇంకా అడిగినా చెప్పడు అని అర్థమయ్యి వినయ్, భరత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు.
జై సింహా మాన్షన్....
ఈసారి మాధవి గారు వెళ్లి శిల్పని పిలుస్తారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా తలుపు వేసుకొని కూర్చుంటావు.
బయటికి రా! వస్తేనే కదా... మాతో పరిచయం పెరిగేదని చెప్పి, బయటకు తీసుకొస్తుంది.
ఇందిరా గారు, లలిత, నీవి ఉంటారు. శిల్ప అక్కడికి వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
కూర్చోమ్మా ఎందుకంత మొహమాటం అని కూర్చోబెడతారు. ఫ్రీగా ఉండు మా నీవి ఎలాగో నువ్వు కూడా అంతే కదా అని కబుర్లు చెప్తారు.
దానికి శిల్ప హమ్మయ్య ఇలా ఉంటే చాలు. మెల్లమెల్లగా నా కబుర్లతో వీళ్ళు మాయ చేయొచ్చు అనుకుంటుంది.
కానీ శిల్ప కి తెలియదు కదా ఎదురుగుండా ఉన్నది తిమింగలం అని.
మాధవి శిల్ప ని అడుగుతుంది నీకు వంటలు ఏమి వచ్చు అని.... దెబ్బకి పాపకు పులమారుతుంది.
దేవుడా మనకి చాకు పట్టుకోవడమే రాదు. ఇంకేం వంటలు వస్తాయి అని... చెప్పమ్మా అని అడిగితే
అది పిన్ని గారు అని నాంచుతుంది. అర్థమైంది... చూసావా వదిన నీ కోడలికి వంట రాదంట.. లైఫ్ లాంగ్ నువ్వు చేయాల్సిందే అని వెటకారంగా అంటారు.
దానికి శిల్ప మన ఇంట్లో కుక్ ఉన్నాడు కదా అని అడిగితే.... కుక్ అయినా,, సర్వెంట్స్ అయినా హెల్ప్ చేస్తారు. వంట మాత్రం మనమే చేయాలి అంటారు.
దేవుడా నా పరిస్థితి ఏంటి ఇలా అయింది. కక్కలేను, మింగలేను. విక్రమ్ ని లైన్ లో పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ.... విక్రమ్ గదిలోకి వెళ్ళకూడదు అంటున్నారు.
ఎలాగైనా ఈరోజు విక్రమ్ తో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది. శిల్ప ను కదుపుతూ ఏమైంది నీకు... అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు.
అబ్బే ఆదేం లేదు పిన్ని గారు, చెబితే నేర్చుకుంటాను అంటుంది. దానికి లలిత గారు నేను నేర్పిస్తాను పదా అని కిచేన్ ల్లోకి తీసుకువెళ్తారు.
నీకు వంట రాదు కాబట్టి సింపుల్ గా చేద్దాం అంటారు. అలాగే అత్తయ్య గారు అని తల ఊపుతుంది.
ముసుగులో ఉండడం వల్ల శిల్ప ఎక్స్ప్రెషన్స్ ఎవ్వరికి కనిపించవు. బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది.
ఫస్ట్ స్వీట్ చెయ్యి, తర్వాత ఆకూర పప్పు, ఒక ఫ్రై, పచ్చడి, ఒక కూర ఇవి చాలు ఈ పూటకి అంటారు. అంతే దెబ్బకి గెలాక్సీ మొత్తం కనపడుతుంది.
ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏమీ లేదు అత్తయ్యగారు అని అంటది.
ఈరోజుకి కుక్ వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాడు. రేపటినుండి నువ్వే చేద్దువు అని చెప్పి.. కుక్ కి చెప్పి బయటికి వస్తుంది.
అలవాటు లేని పని కదా! చేసేటప్పటికి ఫుల్లుగా. చెమటలు పెడతాయి. అవి అన్ని టేబుల్ మీద సర్దేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది.
లేడీస్ అందరూ లంచ్ కి కూర్చుంటారు. శిల్ప కూడా కూర్చోబోతే అయ్యో శిల్ప అప్పుడే తినకూడదు అమ్మ అంటారు.
ఎందుకని అత్తయ్య గారు అంటే... అందరూ భోజనాలు అయ్యాక తిని, ప్లేట్లు తీసి అప్పుడు తినాలి అని చెప్తారు . ఏంటి ఎంగిలి పళ్ళాలు తియ్యాలా అని అరుస్తుంది.
ఎందుకు శిల్ప అరుస్తున్నావు. ఇక్కడ పద్ధతులు పాటించాలి. లలిత ఇప్పటివరకు అలాగే చేసిందని ఇందిరాగారు గట్టిగా చెప్తారు.
చేసేది ఏమీ లేక వాళ్ళు తినేంత వరకు ఉండి అప్పుడు భోజనానికి కూర్చుంటుంది. అదేంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అంటే... మరి ఇంకా ఎక్కడ కూర్చోవాలి అత్తయ్య గారు అని అడుగుతుంది.
రూమ్ లోనికి వెళ్ళు,, అక్కడికి పంపిస్తాము అని ఒక ప్లేట్ లో కొద్దిగా అన్నము, పప్పు, ఫ్రై మాత్రమే తీసుకువెళ్లి ఇస్తారు.
అదేంటి అత్తయ్య గారు, ఇంత కొంచమే పెట్టారు అంటే... నీ ఫిజిక్ చాలా బాగుంటుంది శిల్ప. ఫుడ్డు ఎక్కువ తింటే పాడైపోతుంది.
మన ఇంట్లో పనులు కూడా తక్కువే కదా! అని చెబుతారు. ఏంటి పనులు తక్కువ అంటే పనులు ఎక్కువైతే నా పరిస్థితి ఏంటి అని మనసులోనే అనుకుని భోజనం చేస్తుంది.
రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి లలిత గారి వెళ్ళిపోతారు. అలవాటు లేని పనులుకు అలిసిపోయి ఫోన్ దగ్గరికి వెళ్లకుండానే పడుకుండిపోతుంది.
. విక్రమ్ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి హాల్లో కూర్చుంటాడు. రూమ్ లో నుంచి చూసిన శిల్ప ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తోంది.
ఎవరూ లేరు అని నిర్ధారణ చేసుకొని రూమ్ బయటకు వస్తుంది. విక్రమ్ దగ్గరికి వచ్చే లోపల లలితగారు వస్తారు. వెంటనే శిల్ప రూమ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
ఏంటి విక్రమ్ బాగా అలసటగా ఉన్నావు అంటే... నథింగ్ అమ్మ . ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు.
ఇందిరా గారి దగ్గరికి వెళ్లి నేను అందరితో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ టైంలో శిల్ప లేకుండా చూడండి అని అంటాడు.
అందరూ ఇంటికి చేరుకున్న శిల్ప కు మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి డ్యూటీ అప్పచెబుతారు. అందరూ ఇందిరాగారి రూమ్ లోనికి వెళతారు.
ఇప్పుడు విక్రమ్ ఏం చెబుతాడు??
సింహా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది.....
Posts: 4,300
Threads: 9
Likes Received: 2,775 in 2,140 posts
Likes Given: 9,998
Joined: Sep 2019
Reputation:
29
•
|