Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
ఇక అనిల్ తనది తక్కువ కులమైనా తన వారందరిని వదిలేసి వచ్చిన మోహినిని కన్నీరు పెట్టించకుండా బాగా చూసుకుంటున్నాడు. నిజంగా అనిల్ తెలివైనోడు, ధైర్యవంతుడు, మంచివాడు కూడా. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు అనిల్-మోహిని లు షాపింగ్ కి వెళ్ళారు. అక్కడ మోహిని పెద్ద చెల్లి శ్రావణి పనిచేస్తుండటం చూసింది.
జరిగింది చెల్లి ద్వారా తెలుసుకుంది. తాను చనిపోయానని చెప్పినందుకు మోహిని ఏడవలేదు కానీ.. ! తండ్రి సిగ్గుతో ఇంటివద్దే ఉంటు అమ్మను, చెల్లెళ్లను పట్టించుకోక పోవటంతో వాళ్ళ పరిస్థితికి ఏడ్చింది. తన భార్య బాధ తన బాధగా భావించి శ్రావణికి బిజినెస్ చేసుకునేందుకు తాను డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. అంతేనా..
అమ్మ, నాన్న, చెల్లి- శ్రావణి సంపాదనపై ఆధారపడుతున్నారని తెలుసుకుని బిజినెస్ ఏర్పాట్లు పూర్తి అయ్యేవరకు శ్రావణికి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు.
"అక్క బావా డబ్బులు ఇస్తున్నారని మాత్రం చెప్పకూడ"దని.
ఇన్నాళ్ళకి మోహినికి అనిల్ కి ప్రశాంతత దొరికినట్లు అయింది. ఎందుకంటే.. !ఎంత ప్రేమించినోడినైనా తల్లిదండ్రులుకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నందుకు ఆడదిగా మోహినికి బాదపెడుతుంది కదా.. ? అలాగే తక్కువ కులం వాడైనా మంచి లక్షణాలు ఉన్నా పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అంటే అనిల్ మోహిని తల్లిదండ్రులుకు మోసం చేసినట్లు కాదా.. ? ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసి త్రుప్తి పడ్డారు.
అనిల్ తన కంపెనీలో ప్రమోషన్ అయ్యాడు. ఒకరోజు తాను పనిచేస్తున్న కంపెనీ ఇంటర్వ్యూకి మరదలు స్పందన రావటం చూశాడు. విషయం అర్థం చేసుకుని స్పందనకు పిలిచి తన బాస్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడే ఉద్యోగం ఇప్పించాడు.
ఇద్దరు కూతుళ్లు సంపాదిస్తుండటంతో ఆనందరావు బయటకు వచ్చాడు.
తక్కువ కులపోడికి పెళ్లి చేసుకుంటే ఆపలేని వాడు మిగిలిన కూతుళ్ళు అలాంటి బుద్దులే వచ్చి వాళ్ళు కూడా అలాగే పోతారని వెక్కించిన ఇరుగుపొరుగు వాళ్ళకి సమాధానం చెప్పటానికి.
"పెద్ద కూతురు చచ్చిపోయినా మిగిలిన కూతుళ్ళు తన కుటుంబం బాధ్యత కోసం కష్టపడ్డారని అందరితో చెప్తుండేవాడు. పెద్ద కూతురు ఏడాది పిండ ప్రధానం చేస్తున్నాడనే విషయం స్పందనకు తెలిసి
"అక్క బావే నాకు కంపెనీలలో ఉద్యోగం ఇప్పించారని బావ లేకపోతే నాకు ఉద్యోగం రాద" ని చెప్పింది.
శ్రావణి కూడా బావకిచ్చిన షరతు పక్కనపెట్టి
" షాపింగ్ మాల్ లో పని చేస్తున్నప్పుడు అక్కతో కలిసి వచ్చాడని నన్ను చూసి బిజినెస్ చేసుకునేందుకు పది లక్షలు, కుటుంబం బాధ్యత కోసం మరో రెండు లక్షలు ఇచ్చాడని బావ వలనే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాన"ని చెప్పింది.
అక్కంటే నీకెందుకు ఇంత ద్వేషం. కులము కులము అని ఏడ్చే ఈ ఇరుగుపొరుగు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడైన వచ్చి సహాయం చేశాడా.. ? కనీసం పలకరించారా.. ? తక్కువ కులపోడికి చేసుకుందని ఎవడినైతే నువ్వు అవమానించావో వాడే ఇన్నాళ్లు మనకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవడిచ్చిన డబ్బులుతో మనం ఇన్నాళ్లు బతికాము.. ? మన కులపోడైతే మాత్రం అక్కని జాగ్రత్తగా చూసుకుంటాడని గ్యారెంటీ ఇవ్వగలవా.. ?
పిల్లలు ఒక వయసకి వచ్చాకా తమకు ఏమి కావాలో తెలుసుకోలేనంత అమాయకులు కాదు. అనవసరంగా ఈ లోకంలో తల్లిదండ్రులు పంతానికి పోయి పిల్లలు ప్రేమను అర్థం చేసుకోవటంలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే మాత్రం కూలిపోవటం లేదా.. ఒక మనిషి ఎలాంటివాడనేది చూడాలి కానీ ఏ కులపోడనేది అనవసరం ఇప్పటికైనా మారండి అక్కబావని ఇంటికి పిలిచి గర్వంగా అక్కను అత్తారింటికి పంపండి ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ కూడా° అని శ్రావణి తల్లిదండ్రులును ఒప్పించింది.
తన కూతురు ఇన్ని మాటలు ఎక్కడ నేర్చిందో కానీ.. చాలా చక్కగా చెప్పిందని ఆమె చెప్పిన ప్రతిదాంట్లో నిజం ఉందని తానే అనవసర కుల ప్రస్తావన తెచ్చి ఆరోగ్యం పాడుచేసుకున్నానని బాదపడి కూతురు అల్లుడిని ఇంటికి పిలిపించి మోహినికి శ్రీమంతం చేసి ఊరువాడ అందరికీ పిలిపునిచ్చాడు. ఆనందరావు మారినందుకు మోహిని అనిల్ ఎంతో ఆనందించారు.
**** **** **** **** **** ****
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
దొంగ మొగుడు
రచన: తాత మోహనకృష్ణ
"అన్నా.. ! నీకు ఆడపిల్ల పుట్టింది.. "
"ఏమిటి చెల్లీ.. ! ఆడపిల్లా.. ?"
"అదేమిటి అన్నా.. ? అలా డీలా పడిపోయావు.. ?"
"ఈ దొంగకు యువదొంగ పుడతాడు అనుకున్నాను చెల్లీ..
నువ్వైనా.. ఒక దొంగ కొడుకుని కనవే.. చెల్లీ.. ! నా చిట్టి తల్లిని ఇచ్చి పెళ్ళి చేస్తాను.. " అన్నాడు భీముడు..
"ఏమో లే అన్నా.. ! నీ బావ కుడా నీలాగే ఉండాలని చెప్పి.. ఒక గజ దొంగ కి ఇచ్చి నాకు పెళ్ళి చేసావు. ఎప్పుడూ.. రాత్రి ఇంట్లో ఉండడు.. నీకు అల్లుడు సంగతి ఏమో మరి.. !" అంది చెల్లి.
భీముడికి చిన్నప్పుడు చదువు అబ్బలేదు. వాళ్ళ నాన్న ఒక ఘరానా దొంగ. కాలేజ్ కి చదువుకోమని పంపిస్తే, బడిలో ఉన్న పుస్తకాలు, పెన్సిల్స్ అన్నీ కొట్టుకొచ్చేవాడు భీముడు. దొంగ కడుపున దొంగే కదా పుట్టేదని.. చదువు మానిపించేసి.. కొడుకుకి దొంగతనం లో డిగ్రీ చేయించాడు. రోజు రోజుకు ఎదుగుతున్న కొడుకుని చూసి.. తండ్రి గర్వపడ్డాడు. చిల్లర దొంగ నుంచి.. గజ దొంగ స్టాయి కి ఎదిగాడు భీముడు.
'ఒక తండ్రిగా నాకు ఇంకేమిటి కావాలని.. ' అనుకుని భీముడి తండ్రి రిటైర్ అయ్యాడు. పెన్షన్ లేని జీవితం.. ఏం చేస్తాడు? ఇంట్లోనే ఉంటూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకుంటూ.. కాలం వెళ్ళదీసేవాడు..
భీముడిది ఇప్పుడు తిరుగులేని హస్తవాసి. చెయ్యి వేసేడంటే చాలు.. ఎలాంటి తాళం అయినా ఓపెన్ అవాల్సిందే. కూతురిని బాగా చదివించాలన్న భీముడి కోరికా ఫలించలేదు. అరా కొరా చదువుతో ఆపేసింది అమ్మాయి మంగ. తల్లి గారాబం చేత.. ఇంట్లోనే ఉండి.. ఇంటిపని, వంట పని చూసుకునేది. మంగ వయసుకు వచ్చే నాటికి ఆమె తల్లి మరణించింది.
అప్పటినుంచి ఇంట్లోనే ఉంటూ, తండ్రికి వండి పెడుతుంది మంగ. కాలక్షేపానికి సినిమా సీడీ లు తెమ్మని నాన్నని అడిగేది. 'మన వృత్తి కి సంబంధించిన సినిమాలు చూస్తాను నాన్నా' అని చెప్పి.. ఒక రోజు 'దొంగ' సినిమా, ఆ తరువాత దొంగలకి దొంగ, గజదొంగ, జేబుదొంగ, మంచిదొంగ.. రోజుకొక దొంగ సినిమా సీడీ తెమ్మని అడిగేది మంగ. కూతురి ఏది అడిగితే అది ఇవ్వడం తప్ప తిట్టింది ఎప్పుడూ లేదు భీముడు. చిన్నతనంలో కొండ మీద కోతిని తెమ్మంటే, కొండెక్కి కోతిని తెచ్చాడు భీముడు. 'ఆవకాయ పెట్టాలి.. మామిడి తోటలో కాయలు తీసుకురా నాన్నా.. !' అంటే.. రాత్రికి రాత్రి వెళ్లి తోటంతా దోచేసి తెచ్చాడు భీముడు.
ఒంటరి ఆడపిల్లని పెంచడం నా వల్ల కాదు. అసలే.. పెద్ద దొంగతనాలకి ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందో తెలియదు.. అమ్మాయిని ఒకరి ఇంట్లోనూ ఉంచలేను, కాబట్టి పెళ్ళి చేసేయాలని అనుకున్నాడు భీముడు.
"నీకు ఎలాంటి మొగుడు కావాలో బాగా ఆలోచించుకుని చెప్పు తల్లీ.. నా బాధ్యత తీరిపోతుంది.. "
"అలాగే నాన్నా.. !" అంది మంగ
"నేను బయటకు పోతున్నాను.. వచ్చేటప్పుడు ఏ సీడీని తెమ్మంటావు చెప్పు.. ?"
"నాకు దొంగ మొగుడు కావాలి.. "
"అలాగే.. రాత్రి ఆ షాప్ లో సీడీ కొట్టుకుని వచ్చేస్తాను లే మంగ.. "
"మనిషిని ఎలాగ కొట్టుకొస్తావు నాన్న.. ! నిన్న నువ్వు అడిగినదానికి బాగా అలోచించి.. నాకు ఒక దొంగ మొగుడిగా కావాలి అంటున్నాను.. "
కూతురి ఏది అడిగినా.. తెచ్చే భీముడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. నా కూతురికి అన్నీ నా ఆలోచనలే.. ! ఇది ఎవరినైనా అడిగే విషయం కాదు. అలగనీ.. ఎవరూ నా కొడుకు దొంగా అని చెప్పుకోరు. తన చెల్లికీ.. కూతురు పుట్టింది.. ఆ ఆశా పోయింది. తనకి తెలిసిన దొంగలకి కొడుకులు ఉన్నారో లేదో.. ? ఒకవేళ ఉన్నా.. దొంగతనంలో ఉన్నారో లేదో తెలియదు.. అడగాలని కుడా అనిపించలేదు.
దొంగలు తిరిగే చోట్లు అన్నింటికీ వెళ్లి వాకబు చేసాడు. సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో అంటించిన ఫోటోలు పరిశీలించాడు. రైల్వే స్టేషన్ లో, అన్ని చోట్ల అంటించిన ఫోటోలు చూసాడు. వాడిపోయిన వంకాయ ముఖాలే అందరివీ అనుకుని.. ఆశలు వదులుకున్నాడు.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
తోటి దొంగ స్నేహితుడు ఇచ్చిన సలహాని అనుసరించి.. పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. మూడు రోజుల తర్వాత.. ఇంటికి ఒక పోస్టల్ వ్యాన్ వచ్చింది.
'ఇదేంటి.. నా ఇంటికి వస్తే.. సెక్యూరిటీ అధికారి వ్యాన్ రావాలి కానీ.. ఇంటికి పోస్టల్ వ్యాన్ వచ్చింది ఏమిటి.. ?' అని అనుకున్నాడు భీముడు. వ్యాన్ లోంచి ఒక రెండు బస్తాల లెటర్స్ పడేసి వెళ్ళిపోయాడు వ్యాన్ లో మనిషి. మన ఊరు ఏమీ గొడ్డు పోలేదు.. దొంగలకేమీ లోటు లేదు.. అనుకుని.. ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాడు. ఒక నెలకి మొత్తం అన్నీ ఉత్తరాలు చదివి.. కొంత మంది యువ దొంగలని సెలెక్ట్ చేసాడు. ఒక ముగ్గురిని మాత్రం తేల్చుకోలేకపోయాడు భీముడు..
"అమ్మాయి.. మంగా.. ! ఈ ముగ్గురిలో ఎవరు నచ్చారో చెప్పు.. నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను" అన్నాడు భీముడు.
"నీ ఇష్టం నాన్నా.. !"
"ఈ అబ్బాయి దొంగతనాలు యాభై, ఇతను నలభై, ఇతను తొంబై.. పైగా నాలుగు బిరుదులు కుడా ఉన్నాయి. చూడడానికి కుడా చాలా చక్కగా ఉన్నాడు. ఇతనిని రేపు పెళ్ళి చూపులకి రమ్మని చెబుతాను.. " అన్నాడు భీముడు.
మర్నాడు పెళ్ళిచూపులకి వచ్చిన పెళ్ళికొడుకుని భీముడు పలకరించాడు..
"మీ ఊరిలో అందరూ కులాసా.. ?"
"ఇంట్లో అందరూ కులాసా.. మరి ఊరు విషయం ఎందుకు.. ?" అని ముఖం పెట్టాడు పెళ్ళికొడుకు.
"మన దొంగలు ఎప్పుడూ ఊరిలో అందరూ బాగుండాలని కోరుకోవాలి.. అప్పుడే మన చేతికి బోలెడంత పని.. ఇంతకీ ఎలా వచ్చారు బాబు.. ?"
"మా ఇంటి ఎదురుగా సైకిల్ ఖాళీగా ఉంటే, వేసుకుని వచ్చేసాము.. నేనూ, నాన్న.. "
"భలే అల్లుడు.. నా తర్వాత.. నా అల్లుడు నా అంతటి వాడు అవాలన్నదే నా కోరిక.. "
"తప్పకుండా మామా.. "
"స్వీట్స్ చాలా బాగున్నాయి.. మీ అమ్మాయిలాగే.. ఇంతకీ స్వీట్స్ ఎక్కడ కొన్నారు మామా.. ?"
"కొనడము మా ఇంటా వంటా లేదుగా.. ! కొట్టుకు వచ్చేయ్యడమే బాబు.. అంతే.. !"
"ఇంతకీ నేను నచ్చానా.. మంగ గారు.. ?"
"థియరీ లో ఓకే.. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంది.. "
"అంటే.. ఏం చెయ్యాలి.. ?" అడిగాడు పెళ్ళికొడుకు.
"నా ఎదురుగా.. దొరికిపోకుండా బ్యాంకు లో దొంగతనం చెయ్యాలి.. అప్పుడే మన పెళ్ళి.. " అంది మంగ నవ్వుతూ..
"అదెంత పని.. నాకు ఓకే.. ఈ లోపు మా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి మామా.. " అన్నాడు పెళ్ళికొడుకు
***********
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
కోడలు ఇన్ - అత్త అవుట్
రచన: తాత మోహనకృష్ణ
పెళ్ళి గురించి అందమైన కల లేనిది ఎవరికి? పెళ్ళి కాని అబ్బాయిలందరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుందామా.. అని ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే పెళ్ళాం, వాళ్ళకు ఇష్టమైన సినిమా హీరోయిన్ లాగానో, లేకపోతే ఒక మిస్ వరల్డ్ లేదా మిస్ యూనివర్స్ లాగానో ఉండాలని కలలు కంటారు. ఇలాగే మన హీరో బాలు కుడా ఆలోచిస్తున్నాడు. చేసేది ఒక ప్రైవేటు కంపెనీ లో మంచి ఉద్యోగం.. 'వంటి మీదకి పాతిక వచ్చి.. నాకూ ఒక తోడు కావాలి' అని రోజూ గుర్తు చేస్తూనే ఉంది. అదే మాట వాళ్ళమ్మకి రోజూ గుర్తు చేస్తున్నాడు బాలు.
"ఒరేయ్ బాలు! అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా! అమ్మ చేతి వంట తినకుండా ఉండలేవు, అమ్మను చూడకుండా ఒక్క రోజు కుడా ఉండలేవు.. అందుకే, బయట ఊరిలో ఉద్యోగం వచ్చినా, వెళ్ళనని మొండికేసావు. పెళ్ళి చేసుకుంటే.. నన్ను ఎలా చూసుకుంటావు.. ? పెళ్ళాం వస్తే, నన్ను మర్చిపోవు కదా.. !?"
"అమ్మా! నువ్వు టీవీ లో సీరియల్స్ బాగా ఫాలో అయిపోతున్నావు.. అందుకే, నీకు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి.. డైలాగ్స్ కుడా అలాగే ఉన్నాయి. నీకు అర్ధమయ్యే విధంగా.. ఆ సీరియల్స్ భాష లోనే చెబుతాను విను..
"అమ్మా! నిన్ను బాగా చూసుకుంటాను.. అమ్మ అంటే దైవం.. నువ్వే ఫస్ట్. పెళ్ళాం కొత్త.. సెకండ్. నాకసలే పెళ్ళాం కొత్త.. భయంగా ఉంటుంది.. కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలి అమ్మా!"
"నా మంచి కొడుకు.. అమ్మంటే నీకు ఎంత ప్రేమో.. వేరే కాపురం అది పెట్టమాకు.. ! పెళ్ళాం చెప్పినా వినకు. నీకు నేను అన్నీ చేసి పెడతాను. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు.. "
"అందంగా ఉండాలి, తెలివి ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి.. నిన్ను ఇంకా బాగా చూసుకోవాలి.. "
"మా బంగారమే.. " అని మురుసిపోయింది తల్లి జానకమ్మ
కిందటి సంవత్సరం మొదలైన కొత్త సీరియల్ 'కోడలు ఇన్ - అత్త అవుట్' లో కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలు లాగ కొంపదీసి తనని ఇంట్లోంచి బయటకు పంపదు కదా వచ్చే కొత్త కోడలు.. ? అని మనుసులో అనేక ఆలోచనలు జానకమ్మ కి. తెలివితేటలు ఉంటే, పొగరుగా ఉండి.. వేరే కాపురం పెట్టే ఆలోచన చేస్తుందేమో వచ్చే నా కోడలు.. ఏం చెయ్యాలబ్బా.. ? అని ఆలోచనలోపడింది జానకమ్మ. అప్పుడే గుర్తొచ్చింది.. 'తెలివైన అత్త' సీరియల్ లో అత్త ఆలోచనలాగా 'చదువుకుంటేనే కదా తెలివితేటలు.. లేకపోతే చెప్పినట్టే వింటుంది కోడలు.. ' అని అనుకుంది జానకమ్మ.
అనుకున్నట్టుగానే కొడుకు పెళ్ళి కోసం పిల్ల వేట మొదలుపెట్టింది జానకమ్మ. ఆ ఊరు, ఈ ఊరు.. అన్ని చోట్ల చూసింది. చదువు.. తెలివి రెండూ తక్కువ ఉన్న అమ్మాయి దొరకలేదు. ఈ లోపు పక్క వీధిలో ఉన్న మాస్టారి అమ్మాయి కి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఒక రాయి వేద్దాం అని వెళ్ళి ఎంక్వయిరీ చేసింది. ముందు రోజు చూసిన 'పెళ్ళి చూపులు' సీరియల్ స్క్రిప్ట్ ని గుర్తుపెట్టుకుని.. పెళ్ళిచూపులకి బయల్దేరింది జానకమ్మ.. కొడుకుని వెంటబెట్టుకుని..
"నీ పేరు ఏమిటి.. ?" అడిగాడు బాలు
"కావ్య.. " అంది పెళ్ళికూతురు
"ఒరేయ్ బాలు! అమ్మాయిని బాగా చూసుకో.. కావాలంటే విడిగా మాట్లడుకో.. పెళ్ళంటే నూరేళ్ళ పంట.. "
"అలాగే అమ్మా.. "
"అమ్మా.. !నాకు అమ్మాయి బాగా నచ్చింది.. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కానీ.. నా కన్నా ఎక్కువ ఇంట్లో నీతోనే ఉంటుందిగా.. నీకూ నచ్చాలి కదా" అన్నాడు బాలు
"సంతోషం బాలు! అలాగే.. !" అంది జానకమ్మ
'పెళ్ళి చూపులు' సీరియల్ స్క్రిప్ట్ ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుని మొదలుపెట్టింది జానకమ్మ..
"అమ్మాయి.. ! నువ్వు కొంచం అలా నడిపించి చూపించు.. "
"అలాగే.. ఆంటీ.. " అని ఒక నాలుగు అడుగులు వేసింది కావ్య.
"అమ్మాయి.. ! అలా.. గట్టిగా పాడి వినిపించు.. "
"అలాగే ఆంటీ.. " అని ఏదో తెలియని ఒక రాగం అందుకుంది.
"అమ్మాయికి.. దైవ భక్తి ఉందా.. ?"
"వదిన గారు.. ! మా అమ్మాయి పెద్ద చదువులు చదువుకోకపోయినా.. దైవ భక్తి మాత్రం చాలా ఉందండి.. ! కొత్త కొత్త పూజలు, నోములు అవీ చేస్తూ ఉంటుంది.. "
"మా అమ్మ నన్ను మరీ పొగుడుతుంది.. ఎన్ని చేసినా.. మా ఆయన కోసమే.. మా అత్తగారి కోసమే కదా.. " అంది కావ్య.
"అమ్మాయికి చాలా భక్తి అనుకుంటా.. ! ఆ మాత్రం భక్తీ ఉండాలి.. " అంది జానకమ్మ.
"ఒరేయ్ బాలు! నాకు అమ్మాయి ఓకే.. ముహూర్తాలు పెట్టించేయమంటావా.. ?"
"అలాగే అమ్మా.. !"
కొడుకు పెళ్ళి వైభవంగా జరిగిందని తల్లి జానకమ్మ చాలా ఆనందపడింది. కొత్త కోడలు ఇంట్లో పనంతా చెయ్యడం, కమ్మగా వంట చెయ్యడం చేత.. కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని ఆకట్టుకుంది కావ్య. 'నేను భయపడినట్టుగా కోడలు ఏమీ లేదని.. ' మనసులో చాలా ఆనందపడింది జానకమ్మ. కొడుకుతో కోడలు సరదాగా ఉండడం.. వారి సరదాలు చూసి.. 'పెళ్ళైన కొత్తలో' సీరియల్ లో లాగ నా కొడుకు కోరుకున్నట్టుగానే అమ్మాయి ఉందని మురుసిపోయింది.
ఇలా ఉంటుండగా ఒక రోజు..
"అత్తయ్యా.. ! మేము కొత్త ఇంటికి మారిపోదామని అనుకుంటున్నాము.. "
"పెళ్ళయి సంవత్సరం కుడా అవలేదు.. అప్పుడే ఎందుకు.. ?" అంది జానకమ్మ.
"మంచి ఇంటికి వెళ్లడం తప్పా అత్తయ్యా!"
"ఒరేయ్ బాలు! నువ్వైనా చెప్పరా నీ పెళ్ళానికి.. నిజంగా కొత్త ఇంటికి వెళ్లిపోతారా మీరు.. ?"
"అవునమ్మా! కావ్య చెప్పింది నిజమే.. !పెద్ద ఇల్లు తీసుకున్నాము.. "
"నన్ను ఇంట్లోంచి పంపించేసి.. ఇద్దరూ వేరే కాపురం పెడతారా? నేను ఏదైతే భయపడ్డానో అదే చేస్తున్నావా బాలూ.. !"
"లేదు అత్తయ్యా! మీ భయం నాకు అర్ధమైంది.. నాకు మా అమ్మ ఎంతో.. మీరూ అంతే.. ! మిమల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాము చెప్పండి.. ? మీరు టీవీ లో సీరియల్స్ ఎక్కువగా చూసి.. అన్నీ అలానే ఉహించుకుని.. భయం పెంచేసుకున్నారు అత్తయ్యా! అంతే.. ! మన అందరమూ కలిసి కొత్త ఇంట్లో ఒకే చోట ఉంటాము.. "
" 'నా కోడలు బంగారం' సీరియల్ లో కోడలే.. అచ్చంగా నా కోడలు.. నేనే అనవసరంగా భయపడిపోయాను.. " అని నవ్వుతూ అంది జానకమ్మ..
***********
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!..
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన పవిత్ర భారతదేశం సనాతనులు దైవజ్ఞులు పండితోత్తములు అయిన మహాఋషులకు నిలయం. అస్తికతకు ప్రత్యక్ష సాక్ష్యం మన పూర్వీకులందరూ... ఋషి సంతతి. కృత ద్వాపర త్రేతాయుగాల్లో దేవ దానవులు వసించారు. ఎప్పుడూ దైవత్వానికి, దానవత్వానికి వైరం. మనం ఖర్మ సిద్ధాంతపు.... ’పునరపి జననం.... పునరపి మరణం, (పుట్టుట గిట్టుటా... గిట్టుటా (మరణం) పుట్టుటా... పై వేదవాక్కు అర్థం. జన్మరాహిత్యమో...మోక్షం అది సిద్ధించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. గిట్టాలి. పుట్టాలి. మంచిని అదే పుణ్యాన్ని మన ఆచరణలతో దైవ భక్తితో సాధించుకోవాలి. మనం చూచే గొప్పవారు గతించిన కీర్తిశేషులు కాలచక్ర భ్రమణంలో మరణ జనన మూలంగా ఆయా స్థితిలను పొందినవారే!.... కొందరికి వారి గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో కలిగిన వారు వున్నారు. ఆ మాటలు వినేటందుకు చోద్యంగా వుంటాయి కాని అది నిజం... మరు జన్మకు అది సాక్షి....
అది రాజస్థాన్ భూభాగం...
త్రిపురాంతక్ అనే చిన్న గ్రామం.
అక్కడికి కింజర్ అనే మరో గ్రామం ముఫ్ఫై కిలోమీటర్లు.
పేదకుటుంబీకులు, రామ్‍లాల్, లక్ష్మి భార్యా భర్తలు. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం. ఆ ఫలింపు వారి జీవనాధారం.... రామ్‍లాల్, లక్ష్మి దంపతులది మంచి అన్యోన్యమైన సంసారం. వారి వివాహం జరిగిన మూడు సంవత్సరాలు సంతతి లేదు.
ఆ వూరి పెద్ద ఆనంద్ బాబు సంపన్నుడు. ఆంజనేయస్వాముల వారి భక్తుడు. ఆయనకు ఆ వూరిలో ఒక '' సోదరుడు పేరు ఫకీరా. ఆయన కన్నా వయస్సులో పెద్దవాడు. ఇరువురూ మంచి స్నేహితులు.
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయాలనే సంకల్పం రామ్‍లాల్‍కు కలిగింది.
వూర్లోని వారికందరికీ తన అభిప్రాయాన్ని చెప్పి సాయం కోరాడు. వారివారికి తోచిన ధన సాయం చేశారు గ్రామస్థులు. '' వర్గీయులు పది ఇళ్ళవారు ఉన్నారు. వారికి పెద్ద ఫకీరా. గొప్ప భక్తిపరుడు. "ఈశ్వర్ అల్ల తేరే నామ్" అని పాడేవాడు. గుడ్డల వ్యాపారి.
రామ్ తన నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాడు కానీ సాయం కోరలేదు. చందాగా వచ్చిన ధనం శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి సరిపోయేలా లేదు. తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి స్వామి వారి విగ్రహాన్ని నిర్మింప నిర్ణయించుకొన్నాడు రామ్‍లాల్.
ఆ విషయాన్ని విన్న ఫకీరా రామ్‍లాల్‍ను కలిశాడు.
"అరే భాయ్! ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలనుకొన్నవటగా!.... వూరంతా చందా దండావట! మరి నన్ను అడగలేదేం!....." చిరునవ్వుతో అడిగాడు ఫకీరా.
"అన్నా!.... తప్పుగా అనుకోకు. నేను నాకు నమ్మకం లేని పనిని చేయను. మీకు విగ్రహారాధనపై నమ్మకం లేదుగా.... అందుకే అడగలేదు" వినయంగా జవాబు చెప్పాడు రామ్‍లాల్.
ఫకీరా నవ్వాడు.
"ఎందుకన్నా నవ్వుతున్నావ్?"
"సాయం వేరు, నమ్మకం వేరు కదా!...."
"అవును...."
"నేను ఇస్తే తీసుకోవా!"
"మీరుగా ఇస్తే తీసుకొంటాను"
"అయితే నన్ను అడగవన్నమాట!"
"ఉహూ!" తల ఆడిస్తూ చెప్పాడు రామ్‍లాల్.
రెండు క్షణల తర్వాత "తప్పుగా అనుకోకండి" అనునయంగా చెప్పాడు.
"రామూ! నీ సంకల్పం చాలా మంచిది. నాకు రామాయణ కథ పూర్తిగా తెలుసు. పవనసుత హనుమాన్ జీ, బల్‍వావ్ గ్రేట్ గ్రేట్ వారు... చిరంజీవి భయ్యా!..." నవ్వుతూ చెప్పాడు ఫకీరా.
జేబులోనుంచి కొంత సొమ్ము తీసి రామ్ లాల్ చేతిలో వుంచి, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయాడు. లెక్కపెడితే అది పాతిక వేలు.
మూడు మాసాలలో నలభై అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఆకర్షణీయమైన రంగులతో సర్వాంగ సుందరంగా ఊరి గవిడిలో (Entrance) వెలసింది. మంచి రోజున వేదమంత్రాలతో ఘనంగా స్వామి వారి సంప్రోక్షణ పూజ, నైవేద్యాదులు జరిగాయి. రామ్‍లాల్ అర్థాంగి లక్ష్మి నెల తప్పింది. నవమాసాలు నిండాయి. పాప పుట్టింది. పావని అనే పేరు పెట్టారు.
*
పావనీ ఎంతో అందంగా వుండేది. ఆనోట ఈనోట ఆ మాట (అందం) పడి ఊర్లోని అమ్మలక్కలు రామ్‍లాల్ ఇంటికి వచ్చి పావనిని చూచి సంతోషించి, మనసరా దీవించి వెళ్ళేవారు. ప్రతి సాయంత్రం లక్ష్మి పాపకు దిష్టి తీసేది.
"హే పవసూత! తండ్రి న బిడ్డకి నీవే రక్ష," ఆ వీరాంజనేయ స్వామిని మనసారా వేడుకొనేది లక్ష్మి.
పావని ఆరోగ్యంగా వుండేది. అల్లరి, ఏడుపు ఎప్పుడూ లేదు. బోర్లా పడడం..... బోసి నవ్వులు నవ్వడం, అమ్మా నాన్నలను గుర్తుపట్టి కేరింతలు కొట్టడం చేసేది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. అంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అని ఆ స్వామిని మనసారా కొలిచేవారు.
పావనికి మూడు సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఆమె అంజనేయ స్వామి వారి విగ్రపు అరుగుమీదనే వుండేది. ఆ చిరంజీవితో ఈ పాప మాట్లాడేది. ఆయన తనకు జవాబు చెప్పిన అనుభూతిని పొందేది.
కొందరికి పావని ఆ చర్య ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రధమంలో లక్ష్మి రామ్‍లాల్ కూడ ’ఏదిరా ఇది!’ అని అయోమయ స్థితిలో వుండేవారు. రోజులు గడిచేకొద్ది ’పాప చిన్నవయస్సులోనే మంచి భక్తురాలు’ అనుకొని సంతోషించేవారు.
కింజర్ గ్రామం లక్ష్మి అమ్మగారి వూరు. ఆ ఊరిలో రామాలయం ఉంది. లక్ష్మి తండ్రి రఘునాథన్. ఆ ఆలయ అజమాయిషి కర్త. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతామాత శ్రీరాముల పూజలను ఉత్సవాన్ని ఘనంగా జరిపించేవాడు. ఆ ఉదయం నుండి సాయంత్రం శ్రీరామచంద్రుని ఊరేగింపు ముగిసి, ఆ మాతాపతిలు ఆలయానికి చేరేవరకూ మంచినీళ్ళను కూడా త్రాగకుండా ఉపవాసం ఉండేవాడు రఘునందన్. వారి సతీమణి జానకి కూడ అలాగే వుండేది.
రఘునందన్‍కు లక్ష్మి పెద్దకూతురు. ఆమె కాక వారికి మరో ఇరువురు ఆడసంతానం. అహల్య, సుమతి. వారిరువురూ కవల పిల్లలు. లక్ష్మి పుట్టిన ఆరు సంవత్సరాలలో వారిరువురూ జన్మించారు. పావనీ పుట్టుక ముందు సంవత్సరం క్రిందట రఘునందన్ అర్థాంగి జానకి విష జ్వరంతో సరైన వైద్య సదుపాయాలు లేక మరణించింది. అహల్య, సుమతీ తల్లిలేని పిల్లలైనారు.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
బంధువులు, హితులు రఘునందన్‍తో.... ’పిల్లలు చిన్నవారు కదా పెంచి పెద్ద చేయాలి కదా, అందునా ఆడపిల్లలు తల్లి అవసరం వారికి ఎంతైనా ఉంటుంది. నీవు మరో పెండ్లి చేసుకో!" అన్నారు. బలవంతం చేశారు. బ్రతిమిలాడారు.
కానీ.... రఘునందన వారి మాటలను వినిపించుకోలేదు. ఆ పిల్లలను సవతి తల్లి సరిగ్గా చూడదని అతని భయం. ఆ కారణం మరో వివాహాన్ని అతను చేసుకోలేదు. తల్లీ, తండ్రి తానే అయ్యి వారిని పెంచి పెద్ద చేశాడు రఘునంద.
జానకి బ్రతికి వుండగ పుట్టిన కవల పిల్లల వయస్సు పన్నెండు సంవత్సరాలు, లక్ష్మి వయస్సు పదునెనిమిది సంవత్సరాల ప్రాయంలో, ఆ దంపతులు తమ మేనల్లుడు రామ్‍లాల్‍తో లక్ష్మి వివాహాన్ని జరిపించారు. అది ఆ ఇంట్లో జరిగిన గొప్ప శుభకార్యం.
ప్రస్తుతంలో అహల్యా సుమతీల వయస్సు పదహారు సంవత్సరాలు. వారు ప్లస్ టు చదువుతున్నారు.
*
ప్రతి సంవత్సరం తాను జరిపించే శ్రీరామనవమి ఉత్సవానికి రఘునందన్ తన అల్లుడు రామ్‍లాల్, కూతురు లక్ష్మి, మనుమరాలు పావని ఆహ్వానించారు. అప్పటికి వారు ఆ వూరికి వచ్చి ఒక సంవత్సరం గడిచింది.
ఇంటికి వచ్చిన బావ అక్కలను అహల్య, సుమతిలు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. చిన్నారి పావనిని ఎత్తుకొని ముద్దులాడారు.
పావని అహల్య చేతుల నుండి క్రిందికి జారింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. అహల్యా, సుమతిలు భయపడ్డారు. పావనీ ఏడుపుకు కారణం తెలియనివారు ఆశ్చర్యపోయారు. తమ అక్క లక్ష్మిని పిలిచారు. లక్ష్మి వారిని సమీపించింది.
పావని.... వేగంగా ఆ ఇంటిని, వెనుక పెరటి భాగాన్ని కన్నీటితో వేగంగా తిరిగింది. పొంగి వచ్చిన ఏడుపుతో బోరున ఏడుస్తూ వుంది పావని.
అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. బిడ్డకు ఏమైందనే ఆవేదన....
పావనీ!... రఘునందనను సమీపించింది ఏడుస్తూ....
"ఏమయ్యా!... నన్ను మరిచిపోయావా! ఎలా వున్నావు? నేను... నేను... నీ జానకినీ.... నీ జానకినీ...."
రఘునందన చేతులు పట్టుకొని భోరున ఏడ్చింది పావని.
అందరి పరిస్థితి అయోమయం....
"జానకి.... జానకి..." రఘునందన పెదాలు అప్రయత్నంగా పలికాయి.
పావనీ, అహల్యా సుమతీలను సమీపించింది. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
"ఏమ్మా!....అహల్యా, సుమతీ ఎలా వున్నార్రా!..... మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకొంటున్నాడా!" దీనంగా కన్నీటితో అడిగింది.
అహల్యా, సుమతీలకు అయోమయ పరిస్థితి..... వారి నయనాల్లో కన్నీరు. అప్పటికి పెద్దవారైన రఘునందన్‍కు, రామ్‍లాల్ లక్ష్మీలకూ విషయం అర్థం అయ్యింది.
’ఈ పావని ఎవరో కాదు!.... ఎవరో కాదు!..... చనిపోయిన నా భార్య లక్ష్మి....’ అనుకొన్నాడు రఘునందన్.
"నా కూతురు పావని ఎవరో కాదు నా లక్ష్మి తల్లి.... మా అత్తయ్యా!’ అనుకొన్నాడు రామ్‍లాల్.
"నా కూతురు పావని నాకు జన్మనిచ్చిన తల్లి...’ అనుకొంది లక్ష్మి.
రఘునందన వేగంగా ఇంటినుండి బయటికి నడిచాడు. తన ప్రక్క ఇంట్లో వున్న డాక్టర్ లక్ష్మణ్ జీకి విషయాన్ని చెప్పాడు. లక్ష్మణ్‍జీ ఆశ్చర్యపోయాడు.
తన మందుల సంచిని చేతికి తీసుకొని....
"పదండి. నేను పాపను చూస్తాను" అన్నాడు అయోమయ స్థితిలో.
ఇరువురూ రఘునందన ఇంట్లోకి వచ్చారు.
పావనీ తన ఇరువురు కూతుళ్ళను ఏం చదువుతున్నారని అడిగింది.
"అమ్మా!....అమ్మా!.... మీరువురువూ బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. గొప్పవారు కావాలి. మీ నాన్నను బాగా చూసుకోవాలి" దీనంగా కన్నీటితో చెప్పింది.
ఇంట్లోకి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ జీ ఆ మాటలను విన్నాడు ఆశ్చర్యపోయాడు.
అతన్ని చూచిన (పావని) లక్ష్మి!.....
"ప్యారా భయ్యా! లక్ష్మణ్ జీ ఆప్ కైసే హో.... పత్నీ బచ్చే సభీ కుశల్ మంగళ్ హోనా!"
చిరునవ్వుతో అడిగింది పావని.
లక్ష్మణ్‍జీకి విషయం అర్థం అయ్యింది.
"పూర్వజన్మ జ్ఞాపకాలు" అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి.
"డాక్టర్ సాబ్! నా బిడ్డ!...." ఆ తరువాత మాట్లాడలేకపోయాడు రామ్‍లాల్ ఆవేదనతో....
"లక్ష్మణ్ మామా! మేర బేటీ.... మేర బేటీ....! బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో ఆ తరువాత ఏమీ చెప్పలేకపోయింది లక్ష్మి.
అహల్యా, సుమతీలు కన్నీటితో ఆశ్చర్యంగా చూస్తున్నారు.
లక్ష్మణ్ జీ కొన్ని క్షణాలు ఆలోచించాడు.
పావనిని సమీపించాడు.
"దీదీజీ అప్ తోడ్ సమై ఆరాంకీజియే!..." ఎత్తుకొని మంచాన్ని సమీపించాడు. పడుకోబెట్టాడు. లక్ష్మికి సైగచేసి పాప చేతులను పట్టుకొమ్మని సూచించారు డాక్టర్ లక్ష్మణ్ జీ.
లక్ష్మి పాప తలవైపున విచారంగా కూర్చుంది. మెల్లగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
డాక్టర్ లక్ష్మణ్ జీ పావనికి ఇంజక్షన్ చేశాడు.
"అమ్మా!....." అరిచింది పావని.
అందరూ బెదిరిపోయి పావని ముఖంలోనికి చూచారు. లక్ష్మి పావనిని తన హృదయానికి గట్టిగా హత్తుకొంది.
పావనీ కళ్ళు మూసింది.
"మీరెవరూ భయపడకండి.... బాధపడకండి... ఏమీకాదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. కొంతసేపు ప్రశాంతంగా నిద్రపోతుంది.. రెండు గంటల తర్వాత నేను మళ్లా వచ్చి చూస్తాను" లక్ష్మణ్‍జీ వెళ్ళిపోయాడు.
అందరూ పావని ముఖంలోకి కన్నీటితో దీనంగా చూస్తున్నారు.
పావని ప్రశాంతంగా నిద్రపోయింది.
జరిగిన సంఘటన వలన వారందరికీ అర్థం అయ్యింది. మరుజన్మ ఉన్నదని. ఆ చిన్నారి పావని రామ్‍లాల్ ఇంట (త్రిపురాంతక్‍లో) పాప.... (అక్కడ) రఘునందన్ ఇంట (కింబర్‍లో) అమ్మ (ఇక్కడ) అని....
*
సమాప్తి
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
మంచితనం
రచన: L. V. జయ
జాగృతి చెన్నై లో ఒక IT కంపెనీ ఉద్యోగం చేస్తూ కృష్ణన్ గారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేది.
కృష్ణన్ గారు, సుమతిగారు మంచి దంపతులు. చాలా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. కృష్ణన్ గారు రిటైర్ అయ్యారు. ఆయన భార్య సుమతి గారు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు.
ఆ రోజు శనివారం. జాగృతి ఇంట్లోనే ఉంది. సుమతి గారు బ్యాంకు కి వెళ్లారు. కృష్ణన్ గారు బయట కూర్చొని పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు.
ఎండలో, ప్రతి ఇంటికి వెళ్తూ, ఎదో పేపర్ చూపిస్తూ కనపడ్డాడు ఒక అబ్బాయి కృష్ణన్ గారికి. కృష్ణన్ గారి ఇంటికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి. అబ్బాయికి 14 -15 వయసు ఉంటుంది. మాసిన బట్టల్లో వున్నాడు. అక్కడక్కడా చిరిగి ఉంది. చాలా నీరసంగా, వొళ్ళంతా చమటలతో వున్నాడు.
అబ్బాయి చేతిలో పేపర్ తీసుకుని చదివారు కృష్ణన్ గారు. "నేను 9th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్ చదవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి డబ్బులు లేవు. నేను బాగా చదువుకుని, ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని పోషించాలి. దయచేసి మీకు తోచినంత సాయం చెయ్యండి" అని ఇంగ్లీష్ లో రాసి ఉంది. అది చదివి, లోపలకి రమ్మని ఎన్ని సార్లు పిలిచినా ఆ అబ్బాయి రాలేదు.
జాగృతిని పిలిచి, "ఈ అబ్బాయికి తెలుగు మాత్రమే వచ్చనుకుంటా. లోపలకి రమ్మను.ఏమి తిన్నట్టు కూడా లేడు. చాలా సేపటి నుండి ఎండలో తిరిగినట్టు వున్నాడు పాపం". జాగృతి ఆ అబ్బాయిని అడిగింది. ఏమి తినలేదని చెప్పాడు అబ్బాయి.
లోపలకి రమ్మని జాగృతి చాలా సార్లు చెప్పాక, భయంగా వచ్చాడు. కృష్ణన్ గారు, ఆ అబ్బాయిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ప్లేట్ లో అన్నం, కూర ,పప్పు పెట్టి తినమన్నారు.
"వద్దు అక్కా. వద్దని చెప్పు అంకుల్ కి " అన్నాడు అబ్బాయి జాగృతిని చూస్తూ.
"పర్వాలేదు. తిను. చాలా నీరసంగా వున్నావు." అంది జాగృతి. కృష్ణన్ గారు చాలా సార్లు తినమని చెప్పాక చెయ్యి కడుక్కుని వచ్చి, ప్లేట్ తీసుకుని కింద కూర్చున్నాడు అబ్బాయి. కృష్ణన్ గారు లేపి, కుర్చీలో కూర్చోబెట్టి, పక్కనే తను కూడా ఆ అబ్బాయి పక్కనే కూర్చొని తిన్నారు. జాగృతి కూడా వాళ్ళ పక్కనే కూర్చుని తింది. చాలా మొహమాటంగా తిన్నాడు అబ్బాయి.తింటున్నంత సేపు కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి ఆ అబ్బాయికి.
తినడం అయ్యాక,జాగృతి తో అన్నారు కృష్ణన్ గారు "ఆ అబ్బాయిని అడుగు. ఎక్కడ నుండి వచ్చాడు? చెన్నై ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు?".
"నీ పేరేంటి? ఎక్కడ నుండి వచ్చావ్? చెన్నై ఎందుకు వచ్చావ్?" అడిగింది జాగృతి.
"నా పేరు గిరి అక్కా. మాది తడ. ఆంధ్రానే. తమిళనాడు బోర్డర్ దగ్గర ఊరు. నాన్న ఉద్యోగం చేసేవాడు. తాగుడు అలవాటు అయ్యి, చాలా మంది దగ్గర అప్పులు చేసాడు. ఇప్పుడు లేడు.ఇంట్లో వున్నవి అన్నీ అమ్మిన అమ్మ ఆ అప్పులన్నీ తీర్చలేకపోయింది. ఎవరూ తెలియని చోటికి వెళ్ళిపోదామని, రైల్వే స్టేషన్ కి వచ్చి, ట్రైన్ ఎక్కి, ఇక్కడికి వచ్చాము." అని ఏడుస్తూ చెప్పాడు గిరి.
"అయ్యో. ఏడవకు. మీకు చుట్టాలు ఎవరూ లేరా?" అడిగింది జాగృతి.
"ఉన్నారు అక్కా. చుట్టాల దగ్గర కూడా అప్పు చేసాడు నాన్న." అన్నాడు అబ్బాయి.
"మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మకి పని దొరికిందా?" అడిగింది జాగృతి.
"ఇళ్ళు కట్టే చోట కూలీగా దొరికింది అక్కా." చెప్పాడు అబ్బాయి.
"మరి ఏంటి ప్రాబ్లెమ్. నువ్వు ఎందుకు ఇలా పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు అయితే?" అడిగింది జాగృతి.
"అమ్మ కి వచ్చేది అద్దెకి, తినడానికి సరిపోతోంది. అక్కడ వాళ్ళు నన్ను కూడా కూలి పని చెయ్యమన్నారు. అమ్మకి అది ఇష్టం లేదు. నన్ను చదివించాలి ఉంది. నాకు కూడా చదువుకోవాలని ఉంది." చెప్పాడు గిరి. జాగృతి కి చాలా బాధ అనిపించింది గిరి గురించి విని. కాని 'చాలా మంది ఇలా ఏదేదో చెప్తారు. గిరి చెప్పింది నమ్మచ్చా? లేక అందరి లాంటి వాడేనా' అనుకుంది మనసులో.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
మువ్వల రిక్షా
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
శ్రీధర్ అమెరికాలో పేరున్న ఐటీ ఇండస్ట్రీ యజమాని. అమెరికా లో సిటిజెన్షిప్ కూడా వుంది. చిన్న సంసారం. భార్య, కొడుకు.. అంతే.బోలెడు డబ్బు. ఎక్కడో ఇండియాలో వున్న చిన్న గ్రామం లో పుట్టి ఈ రోజు అమెరికాలో స్థిర పడటం.. అంతా తన తల్లిదండ్రుల పుణ్యం.
యిరవై సంవత్సరాల తరువాత, యిప్పుడు తన పుట్టిన గ్రామం బేతవోలు కి వెళ్ళవలిసిన అవసరం పడింది. ఆ గ్రామం సర్పంచి గారి ఫోన్ రావడంతో ఇండియాకి బయలుదేరాడు, ఆ గ్రామం లోని పొలాలు అమ్ముకోవడానికి.
రైల్వేస్టేషన్ దగ్గర పది ఆటోలు, వాళ్ళకి కొద్ది దూరం లో పాత రిక్షా దగ్గర నిలబడి, ‘ఈ రోజైనా గిరాకీ దొరుకుతే బాగుండును, రెండు ముద్దలు తినవచ్చు’ అనుకుంటూ నీరసంగా వచ్చే జనాన్ని చూస్తున్నాడు వెంకన్న. దిగిన నలుగురిలో యిద్దరు నడుచుకుంటూ వెళ్లిపోయారు, యిద్దరు ఆటో ఎక్కి వెళ్లిపోయారు.
మళ్ళీ రైలు సాయంత్రం వరకు లేదు. ఈ పూట కూడా పస్తే అనుకుంటూ రిక్షా ని తన గుడిసె వున్న వీధికి పోనిచ్చాడు.
మువ్వల చప్పుడు విని బయటకు వచ్చి, ‘మొగుడు ఈ రోజేనా పది రూపాయలు తెస్తే అన్నం తినవచ్చు’ అని ఆశగా చూసింది రిక్షా వెంకన్న వైపు, పుల్లమ్మ.
“ఆటోలు కార్లు వచ్చిన ఈరోజుల్లో మన రిక్షా ఎవ్వడు ఎక్కటం లేదు, ఈ రోజు పస్తే” అంటూ గ్లాస్ తీసుకుని నీళ్ల కుండ వైపు నడిచాడు వెంకన్న.
“వుండు, గుడి పూజారి గారి భార్య ని అడిగి ప్రసాదం తెస్తాను. తిని పడుకో” అంటూ వడివడిగా వెళ్ళింది.
హైదరాబాద్ లో విమానం దిగిన శ్రీధర్ కి తన మాతృభూమి స్పర్శ తో కళ్ళలో నీళ్లు తిరిగాయి. యిరవై గంటల ప్రయాణంతో ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఈ రోజుకి హైదరాబాద్ లోనే ఉండిపోయి రేపు రాత్రి బయలుదేరి తన గ్రామం వెళ్ళాలి అని వున్నా, తను వచ్చిన పని త్వరగా పూర్తిచేసుకుని మళ్ళీ త్వరగా అమెరికా వెళ్ళిపోవటం మంచిది అనుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి వెళ్లి తన ఊరు మీదగా వెళ్లే రైలు ఎక్కాడు.
తెల్లవారి ఆరుగంటలకు బేతవోలు స్టేషన్లో ఆగింది ట్రైన్. చిన్న స్టేషన్ అవడంతో ట్రైన్ యిక్కడ ఎక్కువ సేపు ఆగదు. బ్యాగ్ తీసుకుని కిందకు దిగి చుట్టూ చూసాడు. చిన్నప్పుడు స్టేషన్ ఎలావుందో అలాగే వుంది. మెల్లగా బయటకు రాగానే ఆటోవాళ్ళు చుట్టూముట్టి ‘ఎక్కడకి సార్, రండి తీసుకుని వెళ్తాము’ అంటూ చేతిలోని బ్యాగ్ ని లాకుంటున్నారు.
‘వుండండి, నాకు ఒక్క ఆటో చాలు’, అంటూ కొద్ది దూరం లో వున్న రిక్షాని చూడగానే ఒక్కసారిగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి శ్రీధర్ కి. తన కాలేజ్ చదువు మొత్తం రిక్షా లోనే వెళ్లి వచ్చేవాడు. ఇన్నాళ్ళు పెద్ద పెద్ద కారులో తిరిగిన తనకి యిప్పుడు యింకోసారి రిక్షా ఎక్కాలి అనిపించి, ఆటో వాళ్ళను తప్పించుకుని రిక్షా వైపుకి నడిచాడు.
తనవైపు కి వస్తున్న అతనికోసం రిక్షాని ముందుకి తీసుకుని వచ్చాడు వెంకన్న ఇతనైనా రిక్షా ఎక్కుతాడేమో అని. రిక్షా మువ్వల చప్పుడు విన్న శ్రీధర్ కి ‘అరే, ఈ రిక్షా నేను చిన్నప్పుడు ఎక్కిన రిక్షాలా వుందే’ అనుకుంటూ, ‘ఊరిలోకి తీసుకుని వెళ్ళాలి, వస్తావా’ అన్నాడు వెంకన్నని.
“అందుకేగా బాబూ ఉదయం నుంచి యిక్కడ వుంది, కూర్చోండి” అంటూ రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు.
“ఎవరింటికి బాబూ?” అన్నాడు మెల్లగా రిక్షా తొక్కుతో.
“సర్పంచ్ గారింటికి, అది సరే గాని యిరవై సంవత్సరాల క్రితం ఈ వూరి పిల్లలని బడికి తీసుకుని వెళ్ళేవాడు ఒక రిక్షా అతను, అతను యిప్పుడు వున్నాడా, అతని పేరు వెంకన్న, నన్ను కూడా తన రిక్షాలో కాలేజ్ కి తీసుకుని వెళ్ళేవాడు” అన్నాడు శ్రీధర్ మెల్లగా లేచి రిక్షా సీట్ మీద కూర్చుంటో.
అప్పటివరకు రిక్షాలాగుతున్న వెంకన్న వెనుకకి తిరిగి తన సీట్ మీద కూర్చుని వున్న పట్నంబాబు ని చూసి ఒక్కక్షణం తెల్లబోయి, రిక్షా ఆపి, “నువ్వు.. మీరు కారణం గారి చంటబ్బాయా?” అన్నాడు.
“అవును, నువ్వు హీరో వెంకన్నవా?” అన్నాడు రిక్షా దిగి వెంకన్న చేతులు పట్టుకుని.
“అవును బాబు! ఆ వెంకన్ననే, యిన్ని సంవత్సరాల తరువాత యిప్పుడు నిన్ను చూడటం నిజంగా నమ్మలేకపోతున్నా చంటిబాబు” అన్నాడు ముడతలుపడ్డ మొహం మీద ఆనందం తో.
“అవును. కాలేజీ చదువులు అవగానే విదేశాల్లో చదవటానికి వెళ్లిపోయాను, తరువాత నాన్నగారు పోవడం తో యిహ ఈ వూరితో పనిలేకుండా పోయింది. సరే.. ముందు చెరువు దగ్గర వున్న నీ యింటి వైపు నుంచి తీసుకుని వెళ్ళు బాబాయ్! మీ పిల్లలు ఏంచేస్తున్నారు, యింత ముసలితనం లో కూడా నువ్వు రిక్షా తొక్కడం ఎందుకు?” అన్నాడు శ్రీధర్.
ఒక్కసారి ఆగి ఓపిరి గట్టిగా తీసుకుని, “నా పిల్లలందరూ ఇంగ్లీష్ దేశం లో వున్నారు” అన్నాడు నవ్వుతూ.
“అయితే యింకా ఈ రిక్షా తొక్కడం ఏమిటి?” అన్నాడు శ్రీధర్.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
“మీరే నా పిల్లలు బాబు, మిమ్మల్ని కాలేజీకి తీసుకుని వెళ్ళటం, రావడం.. అంతే. నాకు ఆదేముడు మిమ్మల్నే పిల్లలుగా చూసుకుని సంతోషించమన్నాడు, కానీ ఒక రోజు మీరందరూ పెద్ద చదువులకి వెళ్ళిపోతారని, మళ్ళీ నేను- నా రిక్షా మిగిలిపోతామని అనుకోలేదు” అన్నాడు.
రిక్షా లాగుతూవుంటే శ్రీధర్ దిగి తోస్తున్నాడు.
“కూర్చో బాబు! ఎంతసేపు అలా నడుస్తావు, నేను తొక్కగలను లే” అంటూ శ్రీధర్ ని బలవంతంగా రిక్షాలో కూర్చోపెట్టి తను రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు వెంకన్న.
“అదిగో ఆ గుడిసే మాది” అంటూ దానిముందు నుంచి వెళ్తోవుండగా, మువ్వల చప్పుడు విని గుడిసె లోనుండి వెంకన్న భార్య బయటికి వచ్చి మొగుడి రిక్షా లో మనిషి ని చూసి, ‘అమ్మయ్య.. ఈ రోజు నాలుగు మెతుకులు వండుకోవచ్చు’ అనుకుని భర్తకి సైగ చేసింది త్వరగా రమ్మని.
“ఏమిటి అంటోంది మీ ఆవిడ?” అన్నాడు శ్రీధర్.
“పిచ్చిది బాబు, నాలుగు రోజులనుంచి గిరాకి లేదు, పస్తులు వుంటున్నాము, ఈ రోజు గిరాకి దొరికింది అని త్వరగా రమ్మంటోంది” అన్నాడు.
ఆమాటతో వెంకన్న పరిస్థితి అర్థమైంది శ్రీధర్ కి.
“దిగండి బాబు, సర్పంచ్ గారి యిల్లు యిదే” అన్నాడు.
ఒక మాదిరి పెద్ద బిల్డింగ్. రిక్షా చప్పుడు విని లోపలనుంచి సర్పంచ్ రమణ బయటకు వచ్చి, “శ్రీధర్ గారా, రండి” అంటూ లోపలికి రమ్మన్నాడు.
శ్రీధర్ పర్స్ నుంచి అయిదు వందల నోట్ తీసి వెంకన్న చేతిలోపెట్టి, “సాయంత్రం ఒకసారి వస్తే ఊరంతా తిరుగుదాం” అన్నాడు.
“యింత డబ్బు వద్దు బాబు, ఒక యాభై రూపాయలు ఇవ్వండి. బియ్యం కొనుక్కుంటాం” అన్నాడు వెంకన్న.
“ఈ డబ్బు నేను ఈ ఊరిలో వున్నన్ని రోజులు నన్ను తిప్పడానికి.. వుంచు” అని లోపలకి వెళ్ళిపోయాడు సర్పంచ్ గారితో.
“కోర్ట్ యిన్ని సంవత్సరాలకి పొలం మీదే అని, పొలం ఆక్రమించిన అతను అయిదు లక్షల రూపాయలతో మీ పొలం మీకు ఇమ్మని జడ్జిమెంట్ యిచ్చింది. యిరవై ఎకరాల పొలం మీరు యిక్కడ లేరు కదా అని నాయుడు ఆక్రమించేసాడు, మొత్తానికి మీ పొలం మీకు దక్కింది” అన్నాడు సర్పంచ్ రమణ.
“అంతా మీ సహాయం వల్లనే యిది జరిగింది, మీకు కృతజ్ఞతలు” అన్నాడు శ్రీధర్.
“మీరు ఆ గదిలో సామాను పెట్టుకుని స్నానం చెయ్యండి, ఏసీ కూడా వుంది. పూజారి గారి ఇంటినుంచి మీకు భోజనం వస్తుంది” అన్నాడు రమణ.
సాయంత్రం సర్పంచ్ గారి కారులో వెంకన్నని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పొలం అప్పగించటానికి నాయడుగారు రెడీగా వున్నాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, అది పొలం కాదు పెద్ద తోట. కొబ్బరి, మామిడి, మొదలగు చెట్లు కొంత భాగం, కొంత భాగం పచ్చటి పైరుతో నిండి వుంది.
“పంతులుగారి తాలూకా ఎవ్వరు లేకపోవడం తో నేను ఈ పొలాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. అయితే ఈ పొలం వలన నేను కూడా కొంత ఆస్తి సంపాదించుకున్నాను, అది ఒక్కటే తృప్తి, యిదిగో ఈ కుర్రాడు యిక్కడ కాపలా వుంటున్నాడు. అతను నమ్మకస్తుడు, మీరు ఉండమంటే వుంటాడు” అన్నాడు నాయుడు ఒక బరువైన కవర్ చేతికి యిస్తో.
“ఇదేమిటి?” అన్నాడు శ్రీధర్,
“కోర్ట్ వారు యిన్నిరోజులు మీ పొలం నేను వుంచుకున్నందులకు అయిదు లక్షలు పెనాల్టీ మీకు ఇవ్వమన్నారు” అన్నాడు నాయుడు.
“బలేవారే, మీరు ఏ ఉద్దేశ్యం తో పొలం తీసుకున్నా చాలా అందంగా తీర్చిదిద్దారు. నేను కూడా యింత బాగా మైంటైన్ చెయ్యలేను. ఈ డబ్బు అక్కర్లేదు” అంటూ కవర్ తిరిగి నాయుడు చేతిలోపెట్టేసాడు శ్రీధర్.
నాయుడు అక్కడ నుంచి వెళ్ళగానే పొలం అంతా తిరిగి చూసారు. లోపల రెస్ట్ తీసుకోవడానికి రెండు గదుల బిల్డింగ్, అక్కడకి కొద్ది దూరంలో వాచ్మాన్ కి ఒక షెడ్డు కూడా వున్నాయి.
“మీరు వుండేది అమెరికాలో, మరి ఈ పొలాన్ని ఎలా చూసుకోగలరు, అమ్మేసుకుంటారా?” అని ఆడిగాడు సర్పంచ్ గారు శ్రీధర్ ని.
“అదే ఆలోచిస్తున్నాను, ముందు రేపు రిజిస్ట్రార్ ఆఫీసులో పొలం మా నాన్నగారి పేరు మీదనుంచి నా పేరున మారిన తరువాత ఆలోచన చెయ్యాలి” అన్నాడు. ఆ రాత్రి అంతా అదే ఆలోచన, శ్రీధర్ ఒకసారి అమెరికా ఫోన్ చేసి భార్య తో, కొడుకు తో మాట్లాడి పడుకున్నాడు.
సర్పంచ్ గారు ముందే మాట్లాడి వుండటం తో, రిజిస్టర్ ఆఫీస్ లో పని త్వరగానే అయ్యింది.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
డాక్యుమెంట్ వచ్చే లోగా శ్రీధర్ కిందకి వెళ్లి డాక్యుమెంట్ రైటర్ తో యింకో డాక్యుమెంట్ రాయించాడు.
వెంకన్న, వెంకన్న భార్య యిద్దరూ పొలంలో ఉండి దాని మీద వచ్చే ఆదాయం వారి జీవితాంతం వరకు అనుభవించే హక్కు, శివాలయం పూజారి గారికి ప్రతీ సంవత్సరాo పది బస్తాలా ధన్యం యిచ్చే విధంగాను, వెంకన్న, అతని భార్య తదానంతరం మొత్తం పొలం శివాలయం కి చెందే విధంగా వీలునామా రాసి రిజిస్టర్ చేయించాడు.
వీలునామా చదివి సర్పంచ్ రమణ, “దీనికోసమా యిన్ని సంవత్సరాలనుండి కోర్టులో తిరిగింది” అన్నాడు.
“చూడండి రమణ గారు, ఈ ఊరు వచ్చే అప్పుడు పొలం అమ్ముకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ చిన్నప్పుడు నేను కాలేజ్ కి వెళ్ళను అని మారం చేసినప్పుడు, నన్ను బలవంతంగా రిక్షాలో తీసుకుని వెళ్లిన వెంకన్న తిండిలేక పస్తులు వుంటున్నాడని తెలుసుకున్నాను. ప్రతీ ఆదివారం శివాలయం లో ఆడుకుని ప్రసాదం తిని ఇంటికి రావడం నాకు బాగా గుర్తు.
యిప్పుడు ఈ పొలం అమ్ముకుని డబ్బుతీసుకుని వెళ్ళలిసినంత అవసరం లేదు. అందుకే ఈ వీలునామా. ఈ వీలునామాలో రాసినవి సక్రమంగా జరిగేటట్లుగా చూసే బాధ్యత మీ మీద పెడుతూ వీలునామా రాసాను” అన్నాడు.
విషయం తెలుసుకున్న వెంకన్న శ్రీధర్ కాళ్ళ మీద పడబోతోవుంటే ఆపి, “తప్పు బాబాయ్, యిహ నీ మకాం తోటకు మార్చు. ఆ తోటకి నువ్వే యజమానివి. నువ్వు తిని, నీ లాంటి బీధవాళ్ళకి సహాయం చేసి జీవితం ధన్యం చేసుకో” అన్నాడు వెంకన్నని కౌగిలించుకుని.
శుభం
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
ఒకరికొకరు
రచన : సుస్మితా రమణ మూర్తి
“అయ్యగోరూ! ఇల్లు ఊడిసాను. తడిబట్ట ఎట్టినాను. అంట్లు తోమినాను. బట్టలు అన్నీ ఉతికి, ఆరేసీనాను. అన్ని
పనులు అయిపోనాయి”
“ అయితే ఇక వెళ్ళు”
పని మనిషి కదలలేదు.
ప్రశ్నార్థకంగా చూసారు పురుషోత్తం.
“ రేపు రానండి. ఆదారు కారుడు పనుంది. అమ్మగోరు పూజలో ఉన్నారు. ఆరికి సెప్పండి”
“ మేము పనులు చేసుకునే ఓపిక లేకనే కదా?నిన్ను పెట్టుకుంది. సర్లే! ఎవరినైనా పంపించు. రోజు పైసలు వెంటనే ఇచ్చేస్తా!” పని మనిషి మాటలకు ఫైలులో పెట్టబోయే కాగితాలు బల్లపై ఉంచుతూ అన్నారు పురుషోత్తం.
“ ఒక్క రోజయితే ఎవురూ రారండి..మా పిలదాన్ని అంపుతా. దానికిచ్చే వంద, నా జీతంలో పట్టుకోకండి!”
ఆమె మాటలకు తలూపారు వారు. తను వెళ్ళి పోయింది.
ఎనభైకి దగ్గర పడిన పురుషోత్తం విశ్రాంత ప్రభుత్వ అధికారి. డెబ్బయి దాటిన సీతమ్మ గృహిణి. ఆ ఇంట్లో ఇద్దరూ ఒకరి
కోసం ఒకరుగా జీవిస్తున్న అన్యోన్య దంపతులు. వారి అబ్బాయి, అమ్మాయి, పిల్ల పాపలతో వేరే ఊర్లలో ఉంటున్నారు.
స్వదేశంలోనే ఉంటున్నా, వారి కష్ట సుఖాలు, బాగోగుల పరామర్శలు అన్నీ ఫోన్లోనే! పురుషోత్తం, సీతమ్మ
దంపతులు తమ బాధ్యతగా పిల్లలను పెంచి, పెద్ద చేసారు. విద్యా, బుద్దులు నేర్పించారు. పెళ్ళిళ్ళు చేసారు. ఒక్క
నాడూ వారినుంచి ఏమీ ఆశించలేదు. అందరిలాగే పిల్లలు, మనవలు, మనవరాళ్ళు తమ ఎదుట ఉంటే బాగుండునని
ఆశ పడ్డారు. ఎవరి బతుకులు వారివే కావటంతో ఇద్దరూ ఒకరి కొకరుగా మిగిలిపోయారు. పది నిమిషాల తర్వాత సీతమ్మ పూజ గదిలోంచి వచ్చింది. పనిమనిషి విషయం పురుషోత్తం భార్య చెవిలో వేసారు.
“ అంతా విన్నానులెండి! దాని పిల్ల వస్తుందిగా!.. మరీ ఓపిక లేని బతుకులు అయిపోయాయి మనవి. ఎంత కాలమో ఇలా?.. ఇద్దరికి ఒకేసారి పిలువు వస్తే బాగుంటుంది. మన రాతల్లో ఏముందో?.. ”
భార్య వేదాంత ధోరణి భర్త చెవులకు సోకలేదు. వారి ధ్యాసంతా ఫైలులో కాగితాలు సర్దడంలోనే ఉంది.
“ లేచిన దగ్గర నుంచి అదే పనిగా ఆ కాగితాలు చూస్తున్నారు. అవి అంత అవసరమా అండీ?”
భార్య ప్రశ్నకు, భర్త వివరంగా చెప్పారు.
“ఈ జీవిత చక్రం ఉంది చూసావూ!.. ఎవరిది ముందు ఆగుతుందో, ఎవరిది వెనుకో, రెండూ ఒకే సారో..
తెలియదు కదా?.. అందుకనే మన జాయింట్ బేంకు అకౌంట్ల వివరాలు, నా పెన్షన్ కాగితాలు, ఈ ఇంటి
డాక్యుమెంట్లు, మన ఆధార్, పేన్, హెల్త్ కార్డుల వివరాలు..ఇలా మనకు సంబంధించిన అన్ని ఒరిజనల్సుకి జిరాక్స్ కాగితాలు ఈ ఫైలులో ఉంచుతున్నాను. ఒరిజినల్స్ అన్నీ ఓ బేగులో పెట్టి లోపల బీరువాలో ఉంచాను “
“ అర్థమైందండీ!.. ఆ బేగు గురించి ఇదివరకే చెప్పారు. నాకు బాగా గుర్తుంది. మీ ముందు చూపుకి జోహార్!”
భార్య మెచ్చుకోలుకి సంతోషించారు వారు.
“ మనకు రాను రాను జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది కదా?.. అందుకే అన్ని విషయాలు అప్పుడప్పుడు నీకు చెబుతూ నేనూ గుర్తు పెట్టుకుంటున్నాను.
ఇలా కాగితాలన్నీ ఒకేచోట ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెతుకులాట ఉండదు” అవునన్నట్లుగా ఆమె తలాడించింది.
“ ఈ ఫైలులోని కాగితాలు నీవు కూడా వీలున్నప్పుడల్లా చూస్తుంటే, అందులోని విషయాలు బాగా గుర్తుంటాయి”
“ మీరుండగా నాకు ఎందుకండీ ఇవన్నీ?.. పుణ్య స్త్రీగా ఎప్పటికైనా మీ చేతుల మీదుగానే పోతానండీ నేను”
“ నీ ధోరణి నీదేగాని నా మాట వినవు కదా?.. ముఖ్యమైన కాగితాలు ఈ గ్రీన్ ఫైలులో ఉన్నాయన్న విషయమైనా
గుర్తుంచుకో!”
“ అలాగేనండీ!” అంటూ భర్త పక్కన కూర్చుంది ఆమె.
“ మూడ్రోజుల క్రితం నాకో పాడు కల వచ్చిందండీ!.. ”
“ కలలు ఎప్పుడూ కల్లలే! మన గజి బిజి ఆలోచనలే కలలు! భయపడడం అనవసరం”
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
“అదే కల రెండోసారి కూడా తెల్లవారు జామున వచ్చిందండీ! భయంగా ఉందండీ! అందుకే ఆంజనేయ స్వామి గుడిలో
పూజలు, శివాలయంలో అభిషేకం చేయించాను. ఆ పంతులు గారికి నాకల చెబితే- వారూ మీలాగే అన్నారు. కలలన్నీ నిజాలు కావన్నారు. మన ఆలోచనలే కలలన్నారు. భయపడ వద్దన్నారు. ఎందుకైనా మంచిది ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకో మన్నారు “
“ఇంతకీ నీకు ఎలాంటి కల వచ్చిందో చెప్పు”
“ నేను నిద్రలోనే పోతానని.. “
“ పంతులు గారు చెప్పారు కదా?.. భయపడకు. పూజలు చేయించావు. దోషాలేఁవైనా ఉంటే పోతాయిలే!”
“ ఏఁవండీ! ఈ ఏడాది ప్రారంభంలో మాఅక్క పిల్లలు వచ్చినప్పుడు, వారితో షిర్డీకి పంపించారు నన్ను. మరోసారి
తిరుపతికి పంపించారు. మీరు కీళ్ళ నొప్పుల వలన నడవలేక, రాలేక పోతున్నా నన్ను పంపిస్తున్నారు”
తన ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకున్నందుకు భార్య వేపు ప్రేమగా చూసారు వారు.
“ మీకు ఎప్పుడూ చెప్పలేదండీ! పంతులు గారు కూడా ఆదే సలహా ఇచ్చారండీ! ఎన్నాళ్ళనుంచో నాకూ అదే కోరిక
ఉందండీ! ఇదే నా చివరి కోరిక అనుకోండి.. ”
భార్య నోటిపై చేయి ఉంచుతూ అన్నారు పురుషోత్తం.
“ అలా అనకు. ఈ చివరి దశలో మన ప్రతి చిన్న కోరిక తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆతర్వాత పైవాడి దయ! ఇంతకీ ఆ కోరికేమిటి?“ అంటూ భార్య వేపు చూసారు పురుషోత్తం.
కాసేపు తటపటాయిస్తూ చెప్పింది తను. “ కాశీ యాత్రండి!
పంతులు గారు కాశీ నాధుని దర్శనం చేసుకోమన్నారు”
“అంతేనా?.. అలాగే చేసుకో! మన అపార్టుమెంట్లో ఉంటున్న గణపతి ట్రావెల్స్ ఓనర్ రామకృష్ణ గారివి రెండు బస్సులు కాశీ యాత్రకు బయలు దేరుతున్నాయి. ఒక బస్సేమో ఈ నెలాఖరులో బయలు దేరుతుంది. ఆ బస్సులో రామకృష్ణ గారు వారి అమ్మ, నాన్నలను తీసుకు వెళుతున్నారు. వారితో నిన్ను పంపిస్తాను. ఇక రెండో బస్సు రెండు నెలల తర్వాత బయలు దేరుతుంది. ఎందులోనైనా వెళ్ళొచ్చు. నీ కోరిక తప్పక తీరుతుంది”
“ అది కాదండీ! మన ఆరోగ్యం బాగుండాలని, మీతో కలసి ఆ కాశీనాధుని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానండీ!”
భార్య మాటలకు పురుషోత్తం అవాక్కయారు. అవునంటే వారి ఆరోగ్య పరిస్థితి యాత్రలు చేయడానికి అనువుగా లేదు. కాదంటే ఆమె మనసు గాయపడుతుంది. చివరకు ఆమె మాట కాదనలేక పోయారు. పురుషోత్తం భార్యతో కాశీ యాత్రకు అయిష్టంగానే బయలుదేరారు. భర్త తన కోరికను మన్నించి నందుకు పొంగిపోయింది సీతమ్మ.
****
బస్సు కాశీకి దగ్గర పడుతుండగా నిద్రలోంచి దిగ్గున లేచింది సీతమ్మ. ఒళ్ళంతా చెమటతో నిండి పోయింది.
“మళ్ళీ అదే కలండీ! నాకెందుకో భయంగా ఉందండీ! కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోకుండానే పోతానేమోనండీ!.. ఒకవేళ నేనిలా మీ చేతుల మీదే పోతే..మీరే నా చితాభస్మం గంగా నదిలో.. ..”
ఆమె చేతులు బిగుసుకున్నాయి. శరీరం చల్లబడింది.
*****
పురుషోత్తం పిల్లలకు ఫోను చేసినా ప్రయోజనం లేకపోయింది. కొడుకు ఆరోగ్యం బాగులేక ఆసుపత్రిలో ఉండటం వలన రాలేక పోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూతురు ఫోను కలియలేదు. బస్సు యజమాని సహాయంతో పురుషోత్తం భార్య అంత్య క్రియలు అక్కడే కానిచ్చారు.
భార్య కోరినట్లే చితాభస్మం గంగా నదిలో కలిపి, వెను తిరిగినప్పుడు, ఒళ్ళు తూలి నదిలో పడిపోయారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పోయారు.
నదీమ తల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారి పోయారు వారు.
మీచేతి మీదుగానే నేనని— అనుకున్న సీతమ్మ గారి అభీష్టం అలా నెరవేరడం పైవాడి లీల!
ఒకరి కోసం ఒకరం— అన్న భావన గుండె నిండా నింపుకున్న పురుషోత్తం ఊహించని విధంగా నదిలో పడి అనంత విశ్వంలోకి గువ్వలా ఎగిరి పోవడం కూడా ఆ విధాత చిద్విలాసమే!
/ సమాప్తం /
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
అమ్మి.. అమ్మ.. అత్త!..
రచన: సిహెచ్. సీఎస్. రావు
తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలత రావుగారు క్లాస్ గదిలో ప్రవేశించారు. పిల్లలు నమస్కారాన్ని తెలిపారు. ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో.... "ఈరోజు నేను మీకు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన గొప్ప చరిత్ర నాయకీమణులు చిత్తూరుకోట (రాజ్యం) మహారాణి పద్మావతి, ఓరుగల్లు (వరంగల్) మహారాణి రుద్రమదేవి గురించి చెబుతాను శ్రద్ధగా వినండి. మన ఈ పరమపవిత్ర భారతదేశానికి ప్రపంచ చరిత్రలో గొప్ప విశిష్టత ఉంది. కారణం మన పూర్వీకులు ఆడవారిని తమతో సమానంగా భావించేవారు.... గౌరవించేవారు.... అభిమానించేవారు.
ఆ కఠిక సత్యం ప్రకారం మన దేశ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వీర నారీమణులు.
1. మహారాణి పద్మావతి వీరికి మరో పేరు పద్మిని (1351-1400 CE) Common Era)
వీరి దేశభక్తి, వీరత్వం, త్యాగం, జీవిత బలిదానం అసమానం.... అద్వితీయం. ఆమె సింహాళ (శ్రీలంక) రాజ్యపు యువరాణి. అపురూపమై అద్వితీయమైన అందచందాలు ఆమెకు సొంతం. చిత్తూరు కోట రాజు రతన్‍సేన్ (మౌర్య వంశస్థులు) పద్మావతి అందాన్ని గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విని, సాహసోపేతంగా అన్వేషణ సాగించి, పద్మావతిని కలిసికొని, తన వివరాలు ఆమెకు తెలియజేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకొని వారిని చిత్తూరు కోటకు తీసుకొని వచ్చాడు రతన్‍సేన్. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ఆక్రమించి రతన్ సేన్‍ను బంధించి చెరసాలలో వుంచాడు. వారి రాజగురువు ’కుంభాల్నెరుదేవ్పాలు, పద్మావతిదేవి అందానికి ఆకర్షితుడై తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అల్లాఉద్దీన్ షరతులను అంగీకరించిన రతన్‍సేన్ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. పద్మావతి కుంభాల్నెరుదేవ్పాలు స్వభావాన్ని, కోరికను రతన్‍సేన్‍కు తెలియజేసింది. దేవ్పాలు, రతన్‍సేన్ ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇరువురూ మరణించారు. పద్మావతీ అందచందాలను గురించి విన్న అల్లావుద్దీన్ చిత్తూరు కోటను ముట్టడించారు. చిత్తూరు సైన్యం అతన్ని ఎదురించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యం ధాటికి చిత్తూరు సైన్యం తట్టుకోలేక ఓడిపోయింది. రాణి పద్మావతి తన అంతఃపుర సహచరులు (ఆడవారు) జౌహార్ (అగ్నిలో ప్రయోపవేశం) దీపాల జ్వాలల్లో స్వీయ ఆత్మాహుతి చేసుకొని, అల్లాఉద్దీన్ ఖిల్జీని లక్ష్యాన్ని ఓడించి, తమ రాజ్య గౌరవాన్ని ఆ రీతిగా కాపాడుకొన్నారు ఆ మహారాణి పద్మినీదేవి. ఈ చేదు విచారకరమైన సంఘటన 1303లో జరిగినది.
2. రెండవ మహానాయకి మహారాణి రుద్రమదేవి :-
ప్రతి స్త్రీ మూర్తి (ఈ దేశాన) త్యాగానికి ప్రతిరూపం.... మహారాణి రుద్రమదేవి ఆంధ్ర అతివల పౌరుష సావాసాలకు దేశభక్తికి గొప్ప నిదర్శనం. కాకతీయ వంశంలో జన్మించి ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. వీరి జననం శా.శ (శాలివాహన శకం) 1261 మార్చి 25. ఆమె తండ్రిగారు గణపతిదేవుడు. తల్లి సోమలదేవి. గణపతిదేవుడు రుద్రమదేవిని చిన్నతనం నుంచి మగబిడ్డను పెంచినట్లు పెంచి రాజ్య రక్షణకు కావలసిన అన్నిరంగాలలో సద్గురువులు చెంత శిక్షణను కల్పించారు. వారికి పుత్ర సంతానం లేని కారణంగా వారు ఆమెను రుద్ర దేవుడని (నామకరణం చేసి) పిలిచేవారు. యుక్త వయస్సులో రాజ్యపాలనా విషయంలో రాణి రుద్రమదేవి తండ్రికి మంచి మంచి సలహాలను ఇచ్చేది. ఆమె వివాహాన్ని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించారు గణపతిదేవుడు. రుద్రమదేవికి ఇరువురు కుమార్తెలు. పెద్దకుమార్తె పేరు ముమ్మడమ్మ. ఈమె భర్తపేరు మహాదేవుడు వారి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ (దేవి) ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ దేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ. కాకతీయ రాజులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269లో రుద్రమదేవి రుద్ర మహారాజు బిరుదంగా కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.
కానీ.... ఓర్వలేని సామంతులు ఒక మహిళ పాలకురాలు కావడాన్ని సహించలేక తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యులు క్రిందికి, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు క్రిందికి వెళ్ళినాయి. పాకసాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరశింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేశారు. రుద్రమ తన సేనలతో కలసికట్లుగా ఆ తిరుగుబాట్లనన్నింటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నింటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది. కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమికొట్టింది. వేరేదారి లేక యాదవరాజు మహాదేవుడు సంధికి వచ్చి, యుద్ధనష్ట పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలను రుద్రమదేవికి చెల్లించాడు. రుద్రమదేవి తాను స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసింది. కాయస్త రాజు అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. రుద్రమదేవికి గల ఇతర బిరుదు రాయగజకేసరి. 1289 లో మహారాణి రుద్రమదేవి రణరంగంలో వీరమరణం పొందారని నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో ఆ వీరవనిత నిర్యాణాన్ని గురించి వివరించబడింది. అతివలు అబలలు కారు సబలలు అని నిరూపించిన మహావీర నాయకురాలు మహారాణి రుద్రమదేవి. వీరి జీవితకాలం 1261 నుండి 1289 వరకు. మన తెలుగు వారి ప్రాంతంలోకి అడుగును పెట్టనీయకుండా ''లతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమదేవి."
గంట మ్రోగింది. తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతారావు గారి పిరీయడ్ ముగిసింది. "రేపు కలుద్దాం" అని చిరునవ్వుతో చెప్పి క్లాస్ గది నుండి బయటికి నడిచారు.
మరుదినం విద్వాన్ ఉభయ భాషా ప్రవీణులు (తెలుగు సంస్కృతము) ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతా రావు గారు క్లాసు గదిలోనికి వచ్చారు. పిల్లలనందరినీ పరీక్షగా చూచారు.
"నిన్న మనం మన దేశానికి స్వాతంత్ర్యం లభించక ముందు మన సంస్కృతిని, మన సిద్ధాంతాలను గొప్పగా నమ్మి, మన ఆనాటి విరోధులపై వీరోచిత పోరాటాన్ని సాగించి వీరమరణం పొందిన, చిత్తూరు మహారాణి పద్మావతి దేవిని గురించి, మన ఆంధ్రభూమిన జన్మించిన వీరనారీమణి మహారాణి రుద్రమదేవిని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈనాడు పందొమ్మిదవ శతాబ్దంలో మన పాలకులైన ఆంగ్లేయులను నిరసిస్తూ, వారితో స్వతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరులైన వీరనారీమణులు, కమలాదాస్ గుప్త, కల్పనాదత్, ప్రీతీలతలను గురించి మీకు వివరిస్తాను.
3. కమలాదాస్ గుప్త : (జననం 11మార్చి 1907 - నిర్యాణం 19 జూలై 200) (జీవితకాలం 93 సంవత్సరాలు)
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీరవనిత. ఆంగ్లేయులపై ఐదుసార్లు తుపాకిని ప్రేల్చింది. ఐదుసార్లు గురి తప్పింది. తొమ్మిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. జైలునుండి విడుదలైన తర్వాత 1939లో దాస్ కాంగ్రెస్ పార్టీలో (బెంగాల్) చేరింది. 1942 నుండి 1945 వరకూ మరలా జైలు శిక్ష అనుభవించింది. ఆంగ్లేయులను ఎదిరించడమే జీవిత ఆశయంగా వారితో పోరాడిన వీరనారీమణి. అంతేకాకుండా వారు గొప్ప కవయిత్రి. కథలు, పాటలు (కవితలు) ఎన్నో వ్రాశారు. ఎన్నో అవార్డులు సాధించారు. వీరిని 1984లో నోబుల్ ప్రైజుకు మన ప్రభుత్వం ఎంపిక చేసింది.
4. కల్పనాదత్ :- వీరి జననం 27 జూలై 1913 నిర్యాణం 8 ఫిబ్రవరి 1995 (జీవితకాలం 82 సంవత్సరాలు).
భారత స్వాతంత్ర్య ఉద్యమ కర్త సూర్యసేన్ నేతృత్వంలో సాయుధ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరాంగన. భయం అన్నది ఆమెకు తెలియదు. తన దేశభక్తి పూరిత సంభాషణలతో ఎందరో ఆడవారిలో చైతన్యాన్ని కలిగించింది. తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసిన మహాత్యాగి. స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ నిరంతరం ప్రజల మధ్యన వుంటూ వారిని స్వాతంత్ర్యాభిలాషులుగా మార్చిన స్త్రీమూర్తి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, వారికి మన గవర్నమెంటు 1979 జూన్ 6వతేదిన్ పూణెలో ’వీర మహిళ’ అవార్డును ఇచ్చి సత్కరించారు. దేశంలో జరిగిన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వనితలలో వీరిది ప్రముఖ పాత్ర.
5. ప్రీతిలత :- జననం 5 వ తేది మే 1911 - నిర్యాణం 24వ తేది సెప్టెంబరు 1932 (21సంవత్సరాలు జీవితకాలం)
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
జననం చిట్‍గాంగ్. భారత స్వాతంత్య పోరాటంపై చిన్న వయస్సు నుండీ ఆసక్తి. హైకాలేజీ చదువు (Chittogram) చిటోగ్రామ్‍లో మరియు డాకాలో ముగించి పై చదువులకు కలకత్తాకు వచ్చారు. బితుని కాలేజ్‍లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ చదివి ప్రధమ శ్రేణిలో ముగించారు. కాలేజీ టీచరుగా ఉద్యోగం ప్రారంభించారు. వారికి నిక్‍నైంమ్ రాణి. ఆకాలంలో పాలక బ్రిటీష్ వారు వారి పహర్‍టలి క్లబ్ ముందు కుక్కలు భారతీయులకు ప్రవేశం లేదని బోర్డును తగిలించారు. దాన్ని చూచిన ప్రీతీలత మనస్సుకు ఎంతో ఆవేదన కలిగింది. ప్రీతీలత సూర్యసేన్ స్థాపించిన ఆంగ్లేయులకు వ్యతిరేక సమాజంలో చేరింది. పదిహేను మంది భారతీయ స్వాతంత్యవాదులతో ఆ క్లబ్‍లో ప్రవేశించింది. ఆయుధాలతో (తుపాకులు) ఇరువర్గాలకు జరిగిన కాల్పులలో ఒక వ్యక్తి (భారతీయుడు) మరణించాడు. పదకొండుమందికి తీవ్రగాయాలు బ్రిటీష్ వారి కాల్పుల వలన ఏర్పడ్డాయి. బ్రిటీష్ సెక్యూరిటీ ఆఫీసర్లు బ్రతికిన అందరినీ పట్టుకొన్నారు. వారి చేతుల్లో చిక్కి చావడం కంటే ఆత్మాహుతి చేసుకోవడం శ్రేయస్కరమని ప్రీతిలత తనకు తానుగా సెనైడ్ త్రాగి (మ్రింగి) వీరమరణాన్ని పొందినది. ఆమెకున్న అపారదేశభక్తి, ఆంగ్లేయుల పట్ల వున్న తీవ్రనిరసనకు ఆమె స్వయంగా చేసుకొన్న సైనెడ్ త్రాగి ఆత్మాహుతి ప్రత్యక్ష సాక్ష్యం. ఆమెది చరిత్రపుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన వీరమరణం.
6. బినాదాస్ : జననం 24 జనవరి 1911 (కృష్ణానగర్, బెంగాల్), నిర్యాణం 26 డిశంబర్ 1986 (జీవితకాలం 75 సంవత్సరాలు)
రుషికేస్‍లో మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించిన వారిలో, నిర్భయంగా ఎదిరించిన వీర వనిత. తనకు 21 సంవత్సరాల వయస్సున బెంగాల్ గవర్నర్‍ను కలకత్తా యూనివర్శిటీలో జరిగిన కాన్ ఒకేషన్ సమయంలో గవర్నర్ (Strnley jarson) ప్రసంగం నచ్చక అతన్ని కాల్చిన వీరవనిత. వీరు (chahatri Sanga) చహత్రీ సంఘం సభ్యురాలు. ఎందరో స్త్రీలకు స్వాతంత్య సమరంలో పాల్గొనేటందుకు ఉత్తేజపరచిన గొప్ప కార్యకర్త. వీరి భర్తగారి పేరు జతిష్‍చంద్ర భూమిక్. వీరికి ఇరువురు సంతతి. మగపిల్లలు, వారు ప్రేమ్ కిరణ్, కైలాస్. మనకు స్వాతంత్యం సిద్ధించిన తరువాత (1947 ఆగస్టు 15వ తేది) మన గవర్నమెంటు ఆమె సాహసోపేత సత్ సమాజ నిర్మాణానికి చేసిన సేవలకు గౌరవంగా వారికి 1960లో పద్మశ్రీ అవార్డును బహూకరించారు. 26 డిశంబర్ 1986 ఆమె శవాన్ని రోడ్డు ప్రక్కన మార్గాన నడుచువారు గుర్తించారు. సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలియజేశారు. ఆ చివరిదశలో వారి ఆ దుస్థితికి కారణం ఏమిటి! విధి బలీయమైనది.
బాలురు మరియు బాలికలారా!.... రెండు రోజులుగా నేను మీకు చెప్పిన మహారాణి పద్మిని, మహారాణి రుద్రమదేవి, కమలాదాస్ కల్పనా దాస్, ప్రీతీలత, బినాదాస్ గొప్ప దేశభక్తులు సమాజోద్దారకులు. వారి దృష్టిలో కులమతాలు లేవు. అందరూ భారతీయులనే పవిత్రభావన. వీరేకాదు... ఇంకా ఎందరో మహనీయులు మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. జైళ్ళకు వెళ్ళారు. ఆంగ్ల సెక్యూరిటీ ఆఫీసర్ల చేత లాఠీదెబ్బలు తిన్నారు. కొందరు వారిచేత కాల్చి చంపబడ్డారు. కొందరు ఉరితియ్యబడ్డారు. వారంతా భావి భారత పౌరులైన మీకందరికీ మనందరికీ ఆదర్శమూర్తులు.
ప్రస్తుతంలో మనం సర్వస్వతంత్రులం. దేశంలో హిందువులు, ''లు, క్రిస్టియన్స్, బౌద్దులు ఇంకా.... ఎందరో వున్నారు. మన దృష్టి మనకందరికీ వుండవలసినది సమభావన. ఎవరి మతం సిద్ధాంతాలు, నమ్మకాలు వారివి వారికే సొంతం. పరస్పర విమర్శలు తగదు. స్నేహం సౌభ్రాతృత్వాలను మనస్సున వుంచుకొని అందరూ భారతీయులమని భావించి కలసి మెలసి అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ఏకతా భావనతో జీవితాన్ని గడపాలి. కుల మార్పులు, ప్రేమ పేరుతో వర్ణాంతర వివాహాలు మత మార్పులు తగదు. తప్పు. అందరినీ సృష్టించింది ఆ సర్వేశ్వరుడనే విశ్వాసం మనందరి హృదయాల్లో వుండాలి. ఐకమత్యంతో జీవితాన్ని సాగించాలి. ఎవరినీ ఏ విషయంలోనూ విమర్శించకూడదు. వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేక చర్చ మహాపాపం.... పాతకం. ముఖ్యంగా అతివలను వేధించడం, వారికి బాధను కలిగించడం దానవత్వం. ఈ ప్రపంచంలో ఉండేవి రెండే జాతులు. ఆడ... మగ... ఒకరులేనిదే మరొకరు లేరు. బాలులారా!.... మీరు ప్రతి స్త్రీ మూర్తిని గౌరవించాలి.... ఆదరించాలి..... అభిమానించాలి. వారు ఆపదలో వుంటే చేయకలిగిన సాయం చేయాలి. అది మీ ధర్మం. మానవత్వం. బాలికలారా!.... మీ జీవితంలో మూడు ప్రధాన దశలు.
1. అమ్మి పాత్ర (మీ బాల్యం) పుట్టిన నాటినుంచి వివాహం అయ్యేంతవరకూ ఈ దశ. మీరు పుట్టిన ఇంట అమ్మా, నాన్న సోదరీ సోదరుల ప్రేమానురాగాలతో.... ఆనందంగా గడిచిపోతుంది.
2. వివాహం, పిల్లల అనంతరం పాత్ర అమ్మ: మీ సంతతి వలన మీకు ఆ హోదా (పేరు) లభిస్తుంది. మీ వూరు, ఇంటిపేరూ మారిపోతాయి. పుట్టింట అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అమ్మా, నాన్నలు మీవారు. అత్తగారి ఇంట అత్తామామలు, బావమరుదులు, బావలు, మరదళ్ళు, వదినలు వుంటారు. మీరు మీ పుట్టింటి వారిని ఏ రీతిగా ప్రేమాభిమానాలతో చూచుకొంటారో, అదే రీతిగా అత్తవారింటి వారిని చూచుకోవాలి. వారి వలన మీరు కొన్ని విమర్శలకు గురి అయినా సహనంతో వారిని గౌరవించి అభిమానించాలి. మీ మంచితనంతో వారిని గెలవాలి. మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణతో, వారికి మన దేశ పవిత్ర చరిత్రను మన గొప్ప నాయకుల ఆదర్శాలను, జీవిత విధానాన్ని, త్యాగాలను గురించి చెప్పి నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదే. అదేరీతిగా భర్తకు కార్యాషు దాసి కరణేసు మంత్రి, భోజ్యేషుమాత, శయనేసు రంభగా అంటే తల్లిగా, మంత్రిగా, (హితుడిగా) మాతగా, ప్రియురాలిగా మీ జీవితాంతం వర్తించాలి. వృద్ధాప్యంలో పరస్పర అవగాహనతో మంచి మిత్రులుగా ఒకరికొకరు సహాయం చేసుకొంటూ దైవచింతనతో జీవితాన్ని ప్రశాంతగా గడపాలి. అత్తామామలను అనాధ ఆశ్రమాల పాలు చేయకూడదు. వారి బిడ్డను వారికి దూరం చేయరాదు. మీరంతా నేడు విద్యార్థులు. బాగా చదివి ఉన్నతులు కావాలి. భావిజీవితంలో మీరు ఎవరెవరూ ఎటువంటి పదవులను, జీవిత విధానాలకు చేరుకుంటారో అది సర్వేశ్వరుల నిర్ణయం. అస్థికతను గౌరవించాలి. అభిమానించాలి. మనవారందరూ సిద్ధాంతాలను అంటే.... సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, సౌభ్రాతృత్వాలను పాటించారు. వీటన్నింటినీ ఈ వయస్సు నుండే అలవరచుకోవాలి. పాటించాలి.
3. అత్తగారి పాత్ర :- ఈ పాత్ర నిర్వహణ కోడలు ఇంటికి వచ్చాక స్త్రీ జీవితంలో ప్రారంభం అవుతుంది. మీకు కూతురు ఎంతో, మీ అబ్బాయిని వివాహం చేసుకొని అతన్ని నమ్మి తన కన్నవారిని సోదరసోదరీలందరికీ దూరమై మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను మీ కన్న కూతురులా చూచుకోవాలి. ప్రేమించాలి.... అభిమానించాలి. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం (వేరు వేరుగా) ఏ ధర్మశాస్త్రాలలోనూ లేదు. వచ్చిన కోడలు అమాయకురాలైతే తనలో తాను ఏడ్చుకుంటుంది. గడుసుదైతే మీ కుమారుడికి మీ గురించి (అత్తగారు) చిలవలు వలవలు చెప్పి, వేరు కాపురాన్ని పెట్టిస్తుంది. అలా పెట్టకలిగిన వ్యక్తి ధన్యుడు. కారణం తన తల్లితత్వం అతనికి చిన్న వయస్సు నుండీ తెలుసు కదా!. కోడలు రాగానే ఆమె తన చెల్లిని చూచేతీరు, భార్యను చూచే రీతిని గురించి, ఆలోచించి ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యను సమర్థించలేక, విడిగా వేరు కాపురం పెడితే రచ్చలు జరగవని ఇరువురి మధ్యన (అమ్మ, ఆలి) తాను నలిగిపోకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకొంటాడు. వేరుకాపురం పెడతాను. పోతే అమాయకుడైనవాడు, తల్లిని అతిగా గౌరవించి అభిమానించేవాడు, భార్యకు నచ్చచెప్పలేనివాడు, ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా, ఆఫ్ట్రాల్ ఆడమనిషి, నా భార్య కదా అని తన ఇల్లాలిని విమర్శించడం, తిట్టడం, ఇంకా ఆవేశం పెరిగితే కొట్టడం లాంటి చర్యలకు దిగజారిపోతే, ఆ యువతి (అతని భార్య) నేటి కాలంలో దాదాపు చదువు విషయంలో భార్యాభర్తలు సరిసమానం తానూ ఉద్యోగం చేసి సంపాదిస్తున్న కారణంగా ఆ భర్తమీద విసుగు, విరక్తి, ద్వేషం పెరిగి విడాకులకు సిద్ధం అవుతుంది. ఆడవారికి ఆడవారే శత్రువులు కాకూడదు. మంచి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా కలిసిమెలసి ఉంటూ, కుటుంబాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ అత్తపాత్ర చాలా క్లిష్టమైనది. కూతురిలా కోడలిని చూచుకోవాలన్న గొప్ప మనస్సు ఆ అత్తపాత్రకు అతి ముఖ్యం. అప్పుడే ఆ సంసారంలో అందరూ కలిసి ఆనందంగా జీవించగలరు." మేడంగారు చెప్పడం ఆపేశారు. చేతి వాచీని చూచారు.
"బాల బాలులారా!.... మీ అందరి భవిష్యత్తు బాగుండాలని, మీరు మీ సాటివారి మన్ననలను పొందాలని, మీ జీవన యాత్రను ఆనందమయంగా సాగించాలని ఇదంతా మీకు చెప్పాను. రేపు ఆదివారం శలవు. ఎల్లుండి సోమవారం నుండి ఫైనల్ పరీక్షలు.... బాగా చదవండి. పరీక్షలన్నింటినీ బాగా వ్రాయండి. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కండీ. మీ అందరికీ నా శుభాశీస్సులు" నవ్వుతూ ముగించారు సుమలతా రావుగారు. లాంగ్ బెల్ గంట మ్రోగింది.
తెలుగు ప్రధాన పండితులు, ఉభయ భాషా ప్రవీణులు సుమలతారావుగారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల గదినుండి బయటికి వచ్చి నడిచారు.
పిల్లలందరూ.... పుస్తకాలను సర్దుకొని క్లాస్ రూం నుండి బయటికి వారి వారి ఇండ్లకు బయలుదేరారు.
*
సమాప్తి
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
రచన: తాత మోహనకృష్ణ
"భాగ్యం! భాగ్యం! ఎక్కడున్నావే! ఒకసారి ఇలా రా!"
"వంటింట్లో పనిలో ఉన్నాను.. చెప్పండి ఏమిటి?"
"ఆదివారం స్పెషల్ వంటకం చేస్తావా? దాని కోసం సరుకులు తెచ్చుకుంటావని పిలిచాను.. "
"ఏవండీ.. ! అన్ని పనులు నేనే చెయ్యలా?"
"చెయ్యాలి! అన్నీ చెయ్యాలి.. నేను ఆఫీస్ కు వెళ్ళట్లేదు మరి.. "
"ఉదయం వెళ్లి సాయంత్రం వస్తారు.. దర్జాగా.. ఫ్యాన్ కింద కూర్చొని చేసే పనీ.. ఒక పనేనా.. ? నేను చూడండి.. ఇంట్లో పని.. బయట పని.. అన్నీ చేసుకోవాలి.. ఎండైన, వానైనా.. బయటకు వెళ్ళాలి కదా!.. "
"మగాడ్ని.. సంపాదించి తేవడం నా వంతు.. ఇల్లు అంతా చూసుకోవడం ఆడదానిగా నీ వంతు"
"అదేమిటండి!.. మాకు రోజు రోజుకు పనులు ఎక్కువ అయిపోతున్నాయి.. కొంచం హెల్ప్ చెయ్యండి!"
"లేదు భాగ్యం!.. నేను ఎంత అలసిపోయి ఇంటికి వస్తున్నానో తెలుసా?.. కాళ్ళు నొప్పులు.. వొళ్ళు నొప్పులు.. "
"మాకూ ఉంటాయండి నొప్పులు.. !" అంది భాగ్యం.
"ఇంట్లోనే కదా! మీరు తిరగడం.. మీకేంటి కష్టం" అని గట్టిగా అడిగాడు భర్త.
"అలా అనకండి.. సరుకుల కోసం బయటకు వెళ్ళాలి.. బయట పనులు కుడా ఎక్కువే ఉంటాయండి! ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయే రోజులు ఎప్పుడు వస్తాయో?.. "
"బ్రహ్మంగారి పుస్తకం చూసి చేబుతానులే.. అప్పటి దాక తప్పదు మరి.. చెయ్యాలి" అని వెటకారం చేసాడు భ.
రోజూ.. భాగ్యం ఉదయాన్నే నిద్ర లేచి.. ఇంట్లో భర్త కు వంట చేసి.. ఆఫీస్ కు బాక్స్ ఇవ్వాలి. భర్త ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత.. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి.. పనిమనిషిని పెట్టుకునే అంత వెసులు బాటు లేదు ఇంట్లో. తర్వాత బయటకు వెళ్లి సామాన్లు తెచ్చుకోవాలి.. అన్నీ చేసుకోవాలి పాపం.. ఎండైనా.. వానైనా.. వొంట్లో బాగోలేకపోయినా సరే!..
"కాలింగ్ బెల్ మోగింది.. ఎవరో వచ్చినట్టున్నారు.. " అనుకుని తలుపు తీయడానికి వెళ్ళింది భాగ్యం.
"కాంతం! నువ్వా! ఎలా ఉన్నావు.. ?"
"ఏదో.. ఇలా ఉన్నానే.. "
కాంతం.. అదే కాలనీ లో ఉండే భాగ్యం స్నేహితురాలు
"ఏమిటే విషయాలు?.. చేతికి ఏమైందే.. ?" అడిగింది భాగ్యం.
"మొన్న వంట చేస్తున్నప్పుడు కాలింది.. " చెప్పింది కాంతం.
"మరి రెస్ట్ తీసుకోవచ్చుగా.. ?"
"ఇంట్లో పని ఎవరు చేస్తారు?.. అసలే మా ఆయన కు చాలా కోపం.. టైం కి అన్నీ చేసి పెట్టాలి.. " అంది కాంతం.
"మీ ఆయన ఇంటి పనిలో నీకు సహాయం చేస్తారా.. ?"
"లేదు భాగ్యం.. అన్నీ నేనే చూసుకోవాలి.. "
"ఇక్కడా.. అదే పరిస్థితి కాంతం"
"నీకూ.. నాకూ కాదే.. అందరి ఆడవారి పరిస్థితి ఇంతే.. ! మనమందరం మీటింగ్ పెట్టుకోవాలే!.. కాలనీ మీటింగ్.. ఈ ఆదివారం అందరం కలుద్దాం.. "
"ఆదివారం వద్దే!.. ఆ రోజే అన్ని రోజుల కన్నా.. ఎక్కువ పనుంటుంది.. మొగుళ్ళు ఇంట్లో ఉంటారు కదా!. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతూనే ఉంటారు.. "
"పోనిలే! శనివారం పెట్టుకుందాం.. అయితే అందరికీ కబురు చేస్తాను.. "
"అలాగే.. " అని చెప్పి వెళ్ళింది కాంతం
"అనుకున్న ప్రకారం.. శనివారం అందరూ కలిసారు. ఆడవారందరూ తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. అందరిదీ.. ఇదే సమస్య.. మగవారికైనా.. ఆదివారం, పండుగలకి సెలవుంది.. కానీ మనికి మాత్రం అప్పుడే పని ఎక్కువ ఉంటుంది.. అస్సలు తీరిక ఉండదు. మనకీ ఒక రోజు సెలవు కావాలి కదా !" అని అందరూ చర్చించుకున్నారు..
"అందరూ.. ఇకమీదట.. ఆదివారం సెలవు కావాలని.. భర్తలను అడుగుదాం.. "
"ఒప్పుకోరు.. తిడతారు.. " అని అందరూ అన్నారు.
"మరి వంట, ఇంటిపనులు ఎవరు చేస్తారు.. ఆ రోజు?"
"మగవారు చెయ్యాలి.. సంసారంలో వారు కుడా సగ భాగమే కదా!.. ఒక్క రోజు చెయ్యలేరా?"
"అడిగి చూద్దాం!" అని నిర్ణయించుకున్నారు అంతా.. మళ్లీ వచ్చే శనివారం కల్లుదాం అని అందరూ వెళ్ళిపోయారు..
ఇంటికి వచ్చి భాగ్యం.. భర్తతో..
"ఏమండీ! మిమల్ని ఒక విషయం అడగాలి.. "
"చెప్పు భాగ్యం.. "
"నాకు ఆదివారం సెలవు కావాలండీ.. ప్రతి ఆదివారం.. అందరు ఆడవారు తీసుకుంటున్నారు"
"ఎందుకో.. ?"
"రెస్ట్ కోసం అండి.. " అంది భాగ్యం.
"కుదరదంతే!.. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు?" అని తిట్టాడు భర్త.
అందరింట్లో.. సుమారు ఇదే పరిస్థితి నడిచింది..
శనివారం మీటింగ్ లో అందరూ ఇదే మాట చెప్పారు.. మొగుళ్ళు ఒప్పుకోవట్లేదని..
"అయితే ఒక చట్టం తీసుకువద్దాం.. "
"చట్టమా.. ?" అని ఆశ్చర్యంగా అడిగారు అందరూ..
మనకి బోలెడు సంఘాలు ఉన్నాయి.. వాళ్ళ సహాయం తో ఉద్యమాలు చేద్దాం.. వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. నాకు తెలిసి.. మహిళల అందరికీ ఇదే సమస్య ఉంటుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా మన లాంటి అక్కాచెల్లెళ్ళ కష్టాలు చూసి స్పందిస్తారు.. అందరూ వెళ్లి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమాలు చాలా రోజులు నడిచాయి. రోజు రోజుకూ ఎందరో ఆడవాళ్ళు ఉద్యమాల్లో చేరుతున్నారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక ఊపు ఊపింది.. ఈ ఉద్యమం. ఈ వార్త ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది.
"మన ఆడబిడ్డలు ఇంత కష్టపడుతున్నారా? ఈ రాష్టంలో.. ! ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఆదివారం నుంచి.. ప్రతీ ఆదివారం.. మన రాష్ట్రంలో ఉన్న మహిళల అందరికీ ఇంటిపని నుంచి సెలవు ప్రకటిస్తున్నాను. ఆర్డర్ పాస్ చేస్తున్నాను.. అందరూ మద్దతు ఇవ్వాలి.. " అని ఆర్డర్ పాస్ చేసారు ముఖ్యమంత్రి గారు
"ఆ రోజు మరి ఇంటి పని ఎవరు చేస్తారు సార్.. ?" అడిగారు మంత్రులు..
"ఆ ఆర్డర్ లో ఇది కూడా కలపండి.. అవకాశముంటే.. పనివాళ్ళ చేత.. లేకపోతే.. ఇంట్లో మగవారు చేసుకోవొచ్చు.. ఎక్కడా ఆడవారి ప్రేమేయం లేకుండా.. !"
అది ఎన్నికలు దగ్గర పడే సమయం కాబట్టి.. ఆడవారి బిల్ వెంటనే పాస్ అయిపోయింది. మగవారంతా వంటింట్లో.. గరిటలు పట్టుకుని వంటలు మొదలుపెట్టారు. వంట పుస్తకాలకు డిమాండ్ బాగా పెరిగింది. వంటల కోసం కోచింగ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేసారు కొంత మంది..
ఆడవారంతా.. ఆదివారం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉండే రోజులు వచ్చేసాయి..
ఒక ఆదివారం భాగ్యం.. భర్త తో..
"ఏవండీ! కొంచం కాఫీ ఇస్తారా..? గొంతు తడి ఆరిపోతోంది.. !"
**************
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
సుజన ధైర్యం
రచన: నీరజ హరి ప్రభల
“అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా !” అడిగింది సుజన తన తల్లిని.
“ ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు” వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
“సరే!” అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన.
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.
చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు.
సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ కాలేజీలో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. కాలేజీలో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది.
వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది.
సుజన కాసేపు స్ధిమితపడ్డాక “అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే “సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను “ అన్నారు క్లాసులో అందరిముందూ.
నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని “నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు” అన్నాను.
“అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి.” అన్నారు ఆయన.
క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో “నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను” అనగానే నందిని వెళ్లిపోయింది.
మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా కాలేజీ బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ కాలేజీకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది”. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన.
కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.
“గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ” అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి.
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది.
“చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. ” అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది.
“ సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు.
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము.
దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు.” అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి.
సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై “నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను “ అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు.
“ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం “ అంది వైదేహి.
“సరే!” అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి “ చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ కాలేజీకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం” అన్నాడు ఆనంద్.
“కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు” అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.
కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు.
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల కాలేజీకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు.
హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని “నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి సెక్యూరిటీ ఆఫీసర్లు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా “ అన్నాడు వెంకట్.
వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు.
ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.
హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. “జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన కాలేజ్ ఫస్టు రావాలి. సరేనా!” అన్నారు హెడ్మాస్టారు.
ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో కాలేజీలో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి కాలేజ్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ కాలేజీలో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు.
సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి.
సమాప్తం.
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
పాత గుడ్డలు
రచన : సుస్మితా రమణ మూర్తి
“అమ్మగోరూ! పాత గుడ్డలుంటే పడేయండమ్మా! అట్టుకు పోతాను” పనిమనిషి రత్తాలు వినయంగా అడిగింది.
“మూడు నెలల క్రితం నావి నాలుగు చీరలు, పొట్టయిన పిల్లల బట్టలు పది జతల దాకా, మావారివి అరడజను
జతలు..పెద్ద మూట కట్టుకుని తీసుకుపోయావు కదే!?.. నా చీరల్లో ఒక్కటి కూడా నీవు కట్టుకోవడం చూడనేలేదు.
ఈ బట్టలన్నీ ఏంచేస్తున్నావే!?.. ”
“అదేటమ్మా! మీలాంటి పెద్దోల్లు కట్టి ఇడిసేసిన పాత గుడ్డలే, మాలాంటోల్లకు కొత్త బట్టలు కదమ్మా?.. ఆరునెలలకో
మారు మా ఊరికి, నాను పనిసేసే ఇల్లనుంచి బట్టలు పోగేసి అట్టుకుపోతున్నానమ్మా! మా ఊరోల్లు ఆ గుడ్డలు
సంబరంగా కట్టుకుంటున్నారమ్మా!”
పనిమనిషి సమాధానంతో అమ్మ గారి ఆశ్చర్యం పటాపంచలైంది.
“నీవు కట్టుకుంటున్నవి కొత్త చీరలే కదా ?”
“అవునమ్మ గోరూ!.. మీరు, నాను పనిచేస్తున్న మిగతా ఇల్లోల్లు పెతి సంకురేతిరికి సీరలు ఎడతారు కదా?.. నా
ఒంటిపైవి అయేనమ్మా!”
ఆ సందేహం కూడా తీరింది అమ్మగారికి.
ఆఫీసుకి బయల్దేరుతున్న అయ్యగారి ఆలోచనలు మాత్రం పనిమనిషి మాటల్లోని నిజాయితీని తూకం వేయసాగాయి.
భార్య చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పి వెళ్ళిపోయాడు.
“ అమ్మగోరూ! పాత గుడ్డలు ఇస్తానంటే ఉంటానండీ!”
అమ్మగారు దాని మాటలు పట్టించుకోలేదు. పనిమనిషి మరోమారు అడిగింది.
“ఇప్పుడవన్నీ చూసే ఓపిక నాకు లేదే! తర్వాత చూద్దాంలే!” అనేసరికి తను వెళ్ళిపోయింది.
సాయంత్రం భర్త ఆఫీసు నుంచి రాగానే
ఆమె ఆత్రంగా అడిగింది.
“పాత బట్టలు ఎందుకు రత్తాలుకి ఇవ్వొద్దని చెప్పారు?”
“మన పని మనుషుల పాత బట్టల నిర్వాకం మన కమ్యూనిటీ వాసులందరికీ త్వరలోనే తెలుస్తుంది “
“సర్లెండి! మీరు చెప్పినట్లు పాత బట్టలన్నీ పక్కన పెట్టాను”
“వెరీ గుడ్! నీకు తీరుబడి ఉన్నప్పుడు, కుట్లు ఊడిన వాటిని మిషనుపై సరి చేయు. అ తర్వాత వాటిని వాషింగ్
మెషీన్లో వేయు. ఇస్త్రీ నేను చేస్తాను”
‘ఇంతిదిగా చెబుతున్నారంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉండే ఉంటుంది!’ మనసులో అనుకుందామె.
“సెలవులని పిల్లలు అత్తయ్య, మావయ్యల దగ్గరకు పంపించి చాలా రోజులైందండీ! వీలు చూసుకుని తీసుకు రావాలండీ!”
“అలాగే!”
*****
“నాన్న గారికి గుండె నొప్పని అన్నయ్య ఫోన్జేస్తే చాలా భయం వేసిందండీ! మిమ్మల్నీ గాభరా పెట్టేసాను”
“అది గుండె నొప్పి కాదని, గేస్ట్రిక్ ప్రాబ్లెమని డాక్టర్లు చెప్పారు కదా! ప్రశాంతంగా ఉండు”
తిరుగు ప్రయాణంలో అయ్య గారి ప్రేమ పూరిత ఓదార్పుకి ఆమె తృప్తిగా కళ్ళు మూసుకుంది. పదినిముషాల తర్వాత
కారు కుదుపుకి ఆమె కళ్ళు తెరిచింది.
“కారు ఆపారేమండీ?.. ” ఆత్రంగా అడిగింది.
“వెనుక టైరుకి గాలి పోయినట్లుంది “అంటూ డ్రైవింగు సీట్లోంచి దిగి చూసాడు తను.
ఒక టైరులో గాలి పోయింది.
మరో గంటన్నర ప్రయాణం!
మధ్యలో ఈ అవాంతరం!..
“సార్! పంక్చరైంది. స్సేరుందా?.. పావుగంటలో మార్చేస్తాను” జిడ్డు మరకల బట్టల్లో పాతికేళ్ళ యువకుడు ఎదురుగా నిల్చున్నాడు.
తలూపుతూ కారు డిక్కీ తెరిచారు అయ్యగారు. అరగంటలో పని పూర్తి చేసాడతను. పంక్చరు అయిన టైరుని కూడా
బాగు చేసాడు. చేసిన సహాయంకి మూడొందలు వాడికిస్తూ ఆశ్చర్యంగా అడిగారు— “కారు ఆగగానే పిలవకుండానే
ఎక్కడ నుంచి ఊడిపడ్డావు నీవు!?”
సమాధానంగా ఎదురుగా ఉన్నపంక్చరు షాపు చూపించాడు
వాడు.
ఈలోగా రెండు ప్లేస్కులతో ఒకడు వచ్చాడు. “ అయ్యగారూ! గరమ్ గరమ్ చాయ్! ఇమ్మంటారా?.. లేక పాలు
ఇమ్మంటారా?”
అమ్మ గారు,అయ్యగారు టీలు తీసుకున్నారు. పరిసరాలను చూస్తూ,వేడి వేడి టీ తాగుతున్నారు ఇద్దరూ.
విశాలమైన ఆరోడ్డు రాత్రైనా వస్తూ పోతున్న వాహనాలతో చాలా రద్దీగా ఉంది.
పౌర్ణమి రాత్రి కావడంతో వెన్నెల వెలుగుల్లో పట్ట పగలుగా ఉంది. రోడ్డుకి ఇరువైపుల అక్కడక్కడ మూతి బిగించిన
గోతాములు చిందరవందరగా పడి ఉన్నాయి. టీ తాగుతున్న ఇద్దరి దృష్టి వాటిపై పడింది. ఆశ్చర్యంగా వాటివేపు
చూడసాగారు.
“అవా సార్! మీలాంటోల్లు పని మనుషులకు పాత బట్టలు ఇస్తుంటారు. వందల కోట్ల బడా బాబులు కొందరు
గోతాముల్లో, అసలు వాడని కొత్త బట్టలతో బాటు, పాత బట్టలు కూడా కుక్కేసి అప్పుడప్పుడు అలా
పడేయిస్తుంటారు”
వాడి మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
“అటు చూడండి సార్! కొందరు గోతాములు విప్పి బాగున్న వాటిని ఓపక్క, బాగులేని వాటిని మరోవేపు పోగులు
పెడుతున్నారు”
“అలా ఎందుకు చేస్తున్నారు?” అమ్మ గారి ప్రశ్నకు జవాబు చెప్పాడు వాడు—” బాగున్ప బట్టలను వాడుకుంటారు. బాగులేని వాటిని కార్లు,లారీలు క్లీనింగు సెంటర్లకు అమ్మేసు కుంటారు”
మరోసారి ఆశ్చర్యపోయారు ఇద్దరూ.
వాడికి ధేంక్స్
•
Posts: 3,191
Threads: 159
Likes Received: 10,239 in 2,026 posts
Likes Given: 6,390
Joined: Nov 2018
Reputation:
726
ఉచితాలు - అనుభవాలు
రచన: పెద్దాడ సత్యనారాయణ
అదొక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయము. మధ్యాన్నము క్యాంటీన్లో సిబ్బంది లంచ్ చేస్తున్నారు.
“హాయ్ నర్సింగ్! ఈమధ్య లో రెండు రోజులు లంచ్ కి వస్తున్నావ్ ఏమిటి. కూర్చొ” అని పక్కన ఉన్న సీట్ ఇస్తాడు వెంకట్.
“ఏం చెప్పాలి రా.. ఉచిత బస్సు సౌకర్యం వచ్చినప్పటి నుంచి దోస్తుల ఇంటికి, తల్లిగారింటికి చూడాలనుకున్నప్పుడల్లా వెళ్ళిపోతుంది” అని జవాబు ఇస్తాడు నర్సింగ్.
చాలామంది ఇళ్లల్లో ఇదే లెక్క రా. నా భార్య నిన్న సిద్దిపేట పోయింది. ఎప్పుడొస్తుందో తెలవదు” అన్నాడు వెంకట్..
లంచ్ అయిన తర్వాత అందరూ తమ సెక్షన్స్ లోకి వెళ్లిపోతారు.
***
నర్సింగ్ భార్య శాంతి తల్లిగారింటికి వెళుతుంది. ఇంట్లో తండ్రి తప్ప తల్లి కనిపించలేదు.
“నాయనా! అమ్మ యాడికి వెళ్ళింది?”
“అమ్మ కరీంనగర్ పోయింది. వాళ్ళ అమ్మగారిని చూసి మూడు ఏళ్ళు అయింది. ఉచిత బస్సు సౌకర్యం ఉందని వారం దినాలు ఉండి వస్తానని చెప్పింది” అన్నాడు తండ్రి.
“నాయనా, ఇప్పుడు నేను వంట చేయాలా?”
“వద్దు బిడ్డ, ఇద్దరము హోటల్ కి వెళ్లి భోం చేసివద్దాము”.
“సరే నాయనా” అంది శాంతి.
ఇద్దరు హోటల్ కి వెళ్తారు. హోటల్ బిల్లు 300 అవుతుంది.
‘చ.. నాకు బస్సు చార్జీ 200 మిగిలింది అనుకుంటే నాయనికి 300 ఖర్చు అయ్యింది’ అనుకుని, “నాయనా! నువ్వు కూడా నాతో హైదరాబాద్ వచ్చేయి” అంటుంది.
“మీ అమ్మ ఎప్పుడు వస్తుందో తెలవదు. వారం అని చెప్పినా రెండు దినాల్లోనే రావచ్చు” అన్నాడు తండ్రి.
***
నర్సింగ్ సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తనే వంట చేసుకోవాలని గుర్తుకొచ్చింది. బద్ధకముగా ఉన్నందు వలన హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసి వచ్చాడు మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ చేద్దాం అని బయలుదేరబోయాడు. ఇంతలో శాంతి తలుపు తోసుకుని లోపలికి వచ్చింది.
“నేను టిఫిన్ చేయలేదు. హోటల్ కి వెళ్లి టిఫిన్ చేద్దామా” అంటాడు నర్సింగ్.
“వద్దు, నేను పది నిమిషాల్లో రెడీ చేస్తాను” అని చెప్తుంది శాంతి.
“ఏమైంది శాంతి జల్ది వచ్చేసినావు?” అడిగాడు నర్సింగ్.
“అదే.. మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినది” అని చెప్తుంది.
మరుసటి రోజు ఆఫీసులో లంచ్ టైంలో సుశీల రాగిణి తో “నీవు డైటింగ్ చేస్తున్నావా.. చిక్కిపోయావ్?” అంటుంది.
“డైటింగా పాడా.. ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత నా పెనిమిటి పెట్రోల్ సేవింగ్ ఆని అన్ని పనులకు నన్నే పంపిస్తున్నాడు” అని తన బాధ చెప్తుంది రాగిణి.
రాగిణి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత భర్తతో “నావల్ల మీకు 1300 బస్సు పాస్ మిగిలింది. బయట పనులకు నేను తిరగడం వల్ల వెయ్యి రూపాయలు మిగిలింది. ఆ డబ్బులు నాకు ఇస్తే మంచి చీర కొనుక్కుంటాను” అంటుంది.
“రాగిణీ! నువ్వు కష్టపడటము నాకు ఇష్టం లేదు. ఇకమీదట నేనే వెళ్లి సరుకులు తెస్తాను” అంటాడు ఆమె భర్త.
మరుసటి రోజు రాగిణి సుశీలకు థాంక్స్ చెప్తుంది.
అక్కడ వెంకటరావు భార్య ఉచిత బస్సు అని హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని, భర్తకు కూడా తెచ్చేది. బస్సు టికెట్ కంటే టిఫిన్ ధరే ఎక్కువ అయ్యేది. ఈ నిజం తెలుసుకొని ఉచిత ప్రయాణాలు మానుకొని ఇంట్లోనే టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.
***
•
|