Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - నేను నా అమ్మమ్మ
#41
నాన్నమ్మ
[Image: n.jpg]
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
 
 
రాజశేఖరం కి కొడుకు కృష్ణకాంత్, కూతురు సుమ. రాజశేఖరం అతని భార్య రమా కొడుకు ని, కూతురు ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
డబ్బుకి కొదవ లేకపోవడం తో పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు.



పిల్లల చదువులు, వాళ్ళకి కావలిసినవి కొనడం దగ్గరనుండి యిల్లు నడపడం వరకు రమ చూసుకునేది. రాజశేఖరం ఉదయం ఆఫీస్ కి వెళ్తే రాత్రికి గాని వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా వుండేవాడు.



పిల్లల చదువు అయిపొయింది, ఉద్యోగాలు కూడా వచ్చాయి. అమ్మాయి బెంగళూరు లోను, అబ్బాయి మద్రాస్ లోను వున్నారు.



ఏమండీ ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దాం అండీ, ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం, పెళ్లి కాస్తా చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరం తో రమ.



ఏదైనా బెంగళూరు లో పని చేస్తున్న అబ్బాయి అయితే మంచిది, చూద్దాం బెంగళూరు లో మా స్నేహితులకి చెప్పివుంచాను. కుదిరితే ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం. అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ, మనం పెళ్లి చేసేదాకా వుంటాడా లేకపోతే ఎవ్వరైనా తెచ్చి, యిదిగో మీ కోడలు అని అంటాడా అని భయం గా వుంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం.



ఛీ పాడు, బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి మాటలు, వాడికి అన్నీ మీ బుద్ధులే, రాముడిలాంటి వాడు అంది రమ భర్త బుగ్గ గిల్లుతో. అవుననుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిది అయినా బయట ఆకర్షణ గురించి చెప్పలేము అంటూ లేచాడు.



విచిత్రం కూతురుకి, కొడుక్కి యిద్దరి ఉద్యోగాలు హైదరాబాద్ కి ట్రాన్సఫర్ అయ్యాయి.



రాజశేఖరం దంపతుల ఆనందంకి అంతులేదు. అమ్మయ్య పిల్లలిద్దరు తమదగ్గరికి వచ్చేసారు తను రిటైర్ అవుతున్న సమయం కి అనుకున్నాడు రాజశేఖరం.



రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడటం విని పిల్లలిద్దరు తండ్రితో నాన్నా మీకు మంచి ఫాలోయింగ్ వుందే అన్నారు. మరి ఏమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయతీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది, మీరు కూడా మీ ఉద్యోగాలలో నిజాయితీ తో వుండండి, అదే మనకి శ్రీరామరక్ష అన్నాడు.



రిటైర్ అయిన రెండు నెలలోనే కూతురు సుమ కి పెళ్లి ఘనంగా చేసాడు. అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడం తో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. యిహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో.



యిహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్ లో ఉండేడట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య.



నాన్నా, మా ఆఫీసులో నాతోపాటే పని చేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడటానికి వస్తాము అంటున్నారు మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్.



మాట విని తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లబోయారు. అంటే నీ సంబంధం నువ్వే వేతకున్నావా? యింతకీ వాళ్ళు మన వాళ్లేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం.



మనవాళ్లే డాడీ, మనకంటే నిష్టగా వుంటారు, వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్.



ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తో. నేను అనేది ఏముంది, మనవాళ్లే అంటున్నాడుగా రానియండి, మాట్లాడి వీడి పెళ్లికూడా చేసి మనం తీర్ధయాత్రాలకు వెళ్దాం అంది రమ.



తల్లినుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని కబురుపెట్టేసాడు కృష్ణకాంత్.






శుక్రవారం నుంచి మొదలెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి టిఫిన్ చేద్దాం అని తల్లితో కృష్ణకాంత్.
మీ నాన్నా ఉప్మా చేస్తాను అంటున్నారు అంది నవ్వుతో, చచ్చాము, నాన్నా ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది, వద్దు హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు.






ఆదివారం రానే వచ్చింది. రాబోయే అతిధులకోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకునివచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్. ఎందుకైనా మంచిది అని రాజశేఖరం తన బావమరిది ని కూడా పిలిచాడు మధ్యవ్యక్తి గా వుండటానికి.



తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లులో అతిధులు ఇంటిముందుకి వచ్చారు. వాళ్ళకి ఎదురువెళ్లి లోపలికి తీసుకొని వచ్చి కుర్చోపెట్టాడు. పెళ్లికూతురు బాగానే వుంది అయితే నుదుటిన కనీకనిపించని బొట్టుతో. చాదస్తం రమ లోపల దేముడి గదినుంచి కుంకం తెచ్చి పెళ్లికూతురుకి,మిగిలిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది. వేసవికాలం ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లికూతురు రమ్యా.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమా, చిన్నబోట్టులో కూడా బాగానే వుంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం.



నా పేరు సుబ్బారావు, నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ ని, మా అమ్మాయి, మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారుట, ఇద్దరూ యిష్టపడ్డారు, మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతు పెళ్లికూతురు తండ్రి.



ముందు టిఫిన్ కానివ్వండి, మిగతా విషయాలు పెద్దగా ఏమీలేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు, నేను హోటల్ ఫుడ్డు తినను, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకు వెళ్లి ఇద్దరు డ్రైవర్స్ ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు.



ఆయన తో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం, మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముంది అండీ, గవర్నమెంట్ కారుతోపాటు డ్రైవర్ ని యిచ్చింది అన్నాడు కొద్దిగా గర్వాంగా సుబ్బారావు.



మరి రేపు రిటైర్ అయితే కారు వుండదు, డ్రైవర్ ఉండడు కదా, అప్పుడు ఆటోనే గతి, అందుకే నేను సర్వీస్ లో వుండగానే అదిగో మామిడిచెట్టు కింద వున్న ఇన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం.



దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని, కట్నకానుకులు ఏమి లేవని తెలుసుకుని, తాంబులాలు పుచ్చుకుని త్వరలో ముహూర్తం పెట్టి తెలియచేస్తాను అని వెళ్లిపోయారు సుబ్బారావు, అతని సమూహం.



పెళ్లికూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్య తో రాజశేఖరం. మనం అడ్డంతగలకుండా వుంటే వాళ్లే సవ్యంగా వుంటారు. ఒకరికి ఒకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ.



పెళ్లి జరగడం, ఏడాది దాటిన తరువాత కొడుకు కి కొడుకు పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ కి వెళ్లినతరువాత మనవడిని చూసుకునే పని రాజశేఖరంది, రమ ది. యిట్టే అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు 
కృష్ణకాంత్ తనకి, రమ్య కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని, కొద్దిరోజులలో అక్కడకి వెళ్ళాలి అని చెప్పాడు.



తల్లిదండ్రులు ఉన్నచోటు నుంచి కదలం అనడంతో, కృష్ణకాంత్, రమ్య, కొడుకు వేణు ని తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక్కసారిగా యిల్లు బోసిపోవడం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్లిపోవడం తో లోలోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు. రమ గొల్లు మని, కొడుకు, కూతురు కి ఫోన్ చేసింది.



సాయంత్రం కి చుట్టాలు అందరూ చేరుకుని పని కానిచ్చారు. అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకి తగిలించి, తల్లిని తనతోపాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్.






ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు, కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. నేను మూల గదిలో కూర్చుని వింటున్నా నీకు వినిపిస్తోందా, నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి.



నెలలు గడుస్తున్నాయి, రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటు అయిపొయింది.



ఏమిటే సౌండ్, ఎవ్వరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించారా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూవుంటే, రమ్య యింతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో. ఎక్కడే, టీవీ సౌండ్ తో ఫోన్లో నాకే పిచ్చ ఎక్కుతోంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి, మన ఇంటా వంటా లేవు పూజలు, ఏమిటో మీ అత్తగారి పిచ్చ అంటూ తల్లి మాట్లాడటం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య, అత్తగారు ఎక్కడ వింటారో అని.



రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకి కూడా యిబ్బంది, కాబట్టి ఆవిడ ని వృద్ధాఆశ్రమం లో వుంచితే ఆవిడకి కూడా ఫ్రీగా వుంటుంది ఆలోచించండి అంది.



బాగుండదు, అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్.



రాత్రి కృష్ణకాంత్ కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పి తో తెల్లవారిజామున నిద్రపోయాడు. ఆఫీస్ కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటోంది టీవీ పెద్దగా పెట్టుకుని.



అమ్మా టీవీ ఆపు, నేను ఆఫీస్ కి వెళ్లిన తరువాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్.



లేచావరా అబ్బాయి, యిటురా ఒక్కసారి అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చేదేమో అనుకుని, ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. యిలా కూర్చో అని కొడుకు ని కూర్చోమని, అబ్బాయి నేను ఒక్కమాట చెప్పాలి శాంతంగా విను. ఉదయం ఆఫీస్ కి వెళ్లి రాత్రి వస్తావు. రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు. యిహ నాతో మాట్లాడే టైం వుండటం లేదు.



అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా మంచి వృద్ధాఆశ్రమంలో చేరాలి అని. నువ్వు ప్రయత్నం లో వుండు అంది కొడుకుతో.



నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్.. పాపం తను నా విషయం లో జోక్యం చేసుకోదు, నాకే ప్రశాంతత భరించలేక వృద్ధాఆశ్రమంలో అయితే నా వయసువాళ్ళు వుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది. నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాఆశ్రమంకి నన్ను పంపించు అంది.



అమ్మా నాకు స్వంతంత్రం లేదు, అక్కయ్య ని అడిగి కానీ ఏమి నిర్ణయం తీసుకోలేను, చూద్దాం అని లేచి వెళ్ళిపోయాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#43
 
ఆఫీసులో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లి తో ప్రాబ్లెమ్, ఆవిడ నిర్ణయం చెప్పాడు. పోనీ నీ దగ్గరికి పంపనా అని ఆడిగాడు.
 
నాకు అదే ప్రాబ్లెమ్, నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తో వుంటుంది. తరువాత ఫోన్ చేయమంటుంది. యిక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్ కి వచ్చింది, మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు, అటువంటిది అమ్మని ఇక్కడకి తీసుకుని వచ్చి బాధ పెట్టేబదులు, అమ్మ కోరినట్టుగా చెయ్యటం మంచిది అంది అక్కగారు. సరే చూస్తాను అని చెప్పాడు కృష్ణకాంత్.



ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాఆశ్రమంలో తల్లిని చేర్పించాడు. అమ్మా ఇప్పుడు మమ్మల్ని వదిలి యిక్కడ వుండటం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు భాగవతం కూడా చూడని, నచ్చకపోతే మన యిల్లు ఎలాగో వుంది అని సర్ది చెప్పింది కొడుకు కి.



కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ, నానమ్మ పడుకుందా, సౌండ్ లేదు అన్న కొడుకు హర్ష తో, నానమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య.



అదేమిటి సడన్ గా, నాకు చెప్పనే లేదు అన్నాడు హర్ష.



ఆరునెలలు గడిచిపోయాయి. ఒకరోజు కాలేజ్ నుంచి వస్తోనే పుస్తకాల సంచి మంచం మీదకు విసిరి, తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష.



ఏమైంది రా, కోపం, మార్క్స్ యిచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్లి. ముందు నాన్నమ్మ ఎక్కడకి వెళ్లిందో చెప్పు అన్నాడు మొహం అంతా ఎర్రగా చేసుకుని. ఎన్నిసార్లు చెప్పాలి, అత్తా వాళ్ళ ఊరు వెళ్ళింది అని అంది.



అబద్దం చెప్పకు అమ్మా, రోజు మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాఆశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్లారు. అక్కడ నాన్నమ్మ మంచం మీద పడుకుని వుంది. నాకు కళ్ళు తిరిగిపోయాయి నాన్నమ్మ ని అక్కడ చూడటం తో. అంతకు ముందే మా ప్రిన్సిపాల్ చెప్పారు, ఎటువంటి పరిస్థితిలో మీ తల్లిదండ్రుల ని ఆశ్రమం కి పంపకండి, మిమ్మల్ని చదివించి పెద్దచేస్తే మీరు చేసే పని యిలా వుండకూడదు, వాళ్ళు వున్నంతవరకు మీరు చిన్న పిల్లలే అంది. తీరా చూస్తే మన నాన్నమ్మే అక్కడ వుంది అన్నాడు.



చూడు నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, నానమ్మ రోజు టీవీ లో ఏదో ఒకటి చూస్తోవుంటుంది. నీ చదువు సాగదు. నాన్నమ్మ కి కూడా యిక్కడ ఫ్రీగా ఉండలేకపోతూన్నారు అంది రమ్య.



మరి నేను కూడా కాలేజ్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాను మరి నన్నుకూడా ఆశ్రమం కి పంపించు, నానమ్మ దగ్గర వుంటాను అన్నాడు హర్ష.



నోరు మూసుకుని అన్నానికి రా, వూరుకుంటూ వుంటే పెద్ద మాటలు ఎక్కువ అయ్యాయి అంది రమ్య. నేను రాను, నాన్నమ్మ వస్తేనే అన్నం తింటాను, కాలేజ్ లో అందరికి చెప్పేస్తాను మా నాన్న, అమ్మా మా నానమ్మ ని వృద్ధాఆశ్రమంలో పెట్టేసారు అని అన్నాడు. ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది.



సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి వాడు యింత వరకు అన్నం తినలేదు అంది. కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్లి ఏమిటి నీ మొండితనం, నేను కావాలి అని నాన్నమ్మ ని పంపలేదు, రోజు టీవీ సౌండ్ పెట్టి నీ చదువు కి, నాకు మీ అమ్మకి మనసు కి శాంతి లేకుండా చేస్తోంది, ఆలా అని విసుక్కుంటే బాధ పడుతుంది అన్నాడు.



మరి చిన్నప్పుడు నువ్వు నానా అల్లరి చేసేవాడివి అన్నావు కదా, మరి నాన్నమ్మ నిన్ను ఎందుకు యింట్లో వుంచింది. నువ్వు చెప్పినట్టు నేను వినాలి, కానీ నాన్నమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు. నాన్నా యింట్లో నాతో మాట్లాడటం అంటే హోమ్ వర్క్ చేసుకో, మార్కులు చెప్పారా లాంటి మాటలే గాని, నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడారు, నాన్నమే నేను కాలేజ్ నుంచి రాగానే అన్నం పెట్టి, రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు.



కొడుకుకి మా మీద వున్న అభిప్రాయం, వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్ధం చేసుకున్న కృష్ణకాంత్ కి అవును అమ్మ యింట్లో వుంటే ఎలా వున్నావురా అని అడిగేది, టిఫిన్ తింటున్నప్పుడు పలకమారితే టీవీ వదిలేసి వచ్చి తలమీద తడుతో చిరంజీవ, చిరంజీవ అని దీవించిది, యిప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం, తప్పు చేసాను అనుకుని, కంచం లో అన్నం కూర కలుపుకుని కొడుకు దగ్గరికి వచ్చి, రేపు ఉదయం మీ నాన్నమ్మ ని తీసుకుని వచ్చేద్దాం, యిహ ఎక్కడకి వెళ్ళదు, అన్నం తిను అన్నాడు.



ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాఆశ్రమంకి బయలుదేరుతో వుండగా, వుండండి నేను వస్తున్నాను, అత్తయ్య గారిని తీసుకుని రావడం కి అంది



ఎందుకు రా నేను యిక్కడ బాగానే వున్నాను అంది రమ కొడుకు కృష్ణకాంత్ తో. నువ్వు బాగున్నా, మేము మీరు లేకపోతే బాగా లేము, ఇల్లంతా నిశ్శబ్దం, ఎవ్వరి దారి వాళ్ళది అత్తయ్యా అంది కోడలు రమ్య.



నానమ్మ నువ్వు రాకపోతే నేను కూడా యిక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో, యిక్కడ వుండటానికి నీకేమి ఖర్మరా తండ్రి అంది మనవడిని దగ్గరికి తీసుకుంటూ. మరి నాన్న వుండగా యిక్కడ వుండటానికి నీకు మాత్రం ఏమి ఖర్మ నానమ్మ పదా వెళ్ళిపోదాం, దారిలో హోటల్ లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకు ని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్ కి.



మీ తల్లిదండ్రులు కు మీరెప్పుడు చిన్నపిల్లలే, వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే.



 శుభం
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#44
అత్తగారు ఆవకాయ
[Image: aa.jpg]
రచన : సీత మండలీక
ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు రమణమ్మ గారి హడావిడి ఇంతా అంతా కాదు.
ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు.
చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు.



“బాబూ రఘు , రేపు శనివారం నీకు సెలవే కదా?” అని అడిగారు రమణమ్మ గారు.
“ఏమేనా పనుందా అమ్మా” అన్నాడు రఘు.
“అదేరా బాబూ, ఆవకాయ రోజులు వచ్చేయి కదా! కాయలు తెచ్చుకోవాలి. నువ్వూ, నాన్న
ఇంట్లో ఉంటే, నేను, పద్మ వెళ్తాం” అన్నారు రమణమ్మ గారు
ఆ మాట చెవిలో పడే సరికి రఘు భార్య పద్మకి గుండెల్లో రాయి పడింది.
తన పెళ్లయి, నాలుగేళ్లయింది. అప్పట్నుంచి, ఆవకాయ రోజులు వచ్చేయంటే ఆఫీస్ కి
వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చేది. అత్తగారి వెంట వెళ్లి, ప్రతీ మామిడి కాయల షాపు దగ్గిర
ఆగడం, కాయ పుల్లగా ఉందొ లేదో అని చూడడం, తన వంతయింది. ఆ చూడడం కూడా షాపు
వాడిచ్చిన కాయ కాకుండా ఆవిడ ఎంచిన కాయ రుచి చూడాలి. ‘ఆలా తీయకూడదమ్మా’ అని
వాడన్నా, ఒకటా, రెండా, వంద కాయలు కొంటామని దబాయించి మరీ కాయ కట్ చేయించి
కొరకమనేది.
“నా నోరు పుల్లగా అయిపొయింది అత్తయ్యా! రుచి చూడ లేక పోతున్నా”నంటే
“పద్మా! నేను కొరికేనంటే నా కట్టుడు పళ్ళు విరగనేనా విరుగుతాయి లేక కిందేనా పడతాయి.
విరిగితే 25000 రూపాయలు ఖర్చు అని ఆలోచిస్తున్నాను” అన్నారు రమణమ్మ గారు.
‘వద్దు లెండి, దాని బదులు నేనే చూస్తా’నని పద్మ మాటిచ్చింది.
“మాగాయికి బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది పద్మా . ఏడాదికొక్క సారి కష్టపడమ్మా”
అంటూ ఓదార్చేవారు రమణమ్మ గారు. .
క్రిందటేడాది ఈ మామిడి రుచులతో పద్మకి నోరు,పెదాలు అన్నీ ఇన్ఫెక్ట్ అయి డాక్టర్
కి మందులకు 1000 రూపాయలయ్యింది. 15 రోజులు భోజనం చెయ్యడం కూడా కష్టమైంది
క్రిందటి వారంలో చిన్నవి, పెద్దవి ఊరగాయ జాడీలు, ఊరగాయ కలిపే అయిదారు
రకాల టబ్బులు, తోమడం.. తుడవడం, ఎండలో పెట్టడం జరిగింది. అందువల్ల అత్తగారికి, తనకి కూడా నడుం నెప్పి, ఒళ్ళు నెప్పులు వచ్చి ఏ కరోనా వచ్చిందో అని భయపడి ఒక రోజంతా వేరే గదులలో కూర్చున్నారు. మర్నాడు నెప్పులు తగ్గడంతో 'అమ్మయ్య! బతికేం' అనుకున్నారు.
ఆ తరవాత వచ్చింది ఆవకాయ కాయల ఎంపిక. ఊరగాయ చూడడానికి ఎర్ర గా ఇంపుగా ఉండాలి ఆలా అని మరీ కారంగా ఉండకూడదు . కమ్మగా ఉండాలి. మంచి కారాలు వీరయ్య షాపులో దొరికేయని ఆవిడ స్నేహితురాలు దుర్గ చెప్పేరుట. ఆవిడ కూడా అత్తయ్యలా ఊరగాయలు పెట్టడడంలో దిట్ట
ఈ ఎండ లో ఈవిడకి ఈ సరదా ఏమిటో, కొంచెం కూడా బాధ పడక వెన్నెలలో
విహారంలా. ఆ కారాలు బాగుంటాయని దుర్గ చెప్పింది కదా ఇక మన ఆవకాయకి తిరుగు
ఉండదు అని ఒక నాలుగైదు సార్లు వల్లించేరు.
అయినా ఊరగాయ బాగుండాలంటే కాయ కూడా ప్రశస్తం గా ఉండాలని మర్చి
పోయేరా? ఆమ్మో అది కలలో కూడా మరువరు. ప్రస్తుతం గుండలు మంచివి కుదురుతాయన్న
సంతోషం తో బయల్దేరి కారాల వీరయ్య షాప్ వెతికి పట్టుకుని కారాలు కొండం మొదలు పెట్టేరు
మళ్ళా ఈ ఏడాది కూడా అదే పద్దతి.
అత్తగారికి ఇష్టమైన సువర్ణరేఖ కాయలు దొరకడం తో ఆవిడ చాలా ఆనంద
పడిపోయారు.
“ఈవేళే కాయలు కోసేము అమ్మగారు! కాయలు ముట్టుకోడానికి వీల్లేదు. నేనే అన్నీ
మంచివి ఏరి ఇస్తాను. కాయ 20 రూపాయలకి తగ్గను. మీ ఇష్టం” అన్నాడు కాయలమ్మే అతను.
“అయ్యో బాబూ! అలా ఎలాగ ? కాయ 5 రూపాయలు ఎక్కువ తీసుకో. గట్టి కాయ నేనే
ఏరుకుంటాను. ఒకటా రెండా నూరు కాయలు కావాలి” అన్నారు రమణమ్మ గారు.
5 రూపాయలు ఎక్కువ అనగానే “సరే లెండి!” అని, ఆ వేళే కోసిన కాయలు పెట్టిన గోనె
రమణమ్మ గారి ముందుంచేడు
మామిడి కాయలకి 2500 రూపాయలు అయిందని పద్మ లోలోన బాధ పడినా, పైకి
మాత్రం నవ్వుతూ 'ఈ ఏడాది ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది అత్తయ్యా' అంటూ తన
ఉద్దేశ్యం చెప్పింది.
రమణమ్మ గారు పొంగిపోతూ “పద్మా, ఎప్పుడేనా కాయ బాగుండాలి. డబ్బు కి చూస్తే
లాభం లేదు. ఏడాదంతా ఉండవలిసింది” అని ఆవకాయ గురించి మాట్లాడుతూ, “పద్మా నూరు
కాయలు పైన గోనెలో 25 కాయలు ఎక్కువున్నాయి. కాయలన్నీ చాలా బాగున్నాయి. వదిలేస్తే
మళ్ళా దొరకవు. రఘు కి పులిహార ఆవకాయ ఇష్టం. అమ్మలు కి తురుము పచ్చడి ఇష్టం. పాపం
అమెరికా లో ఉండడం కాదు గాని, దాని నాలిక రుచి పోయింది. అందుకే ఈ 25 కూడా
తీసుకుంటున్నాను. మరో 625 అవుతున్నాయి కదా” అని షాపువాడికి మొత్తం డబ్బులు ఇప్పించి
మామిడి కాయల గొనె, కార్ డిక్కీ లో పెట్టించింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#45
పద్మకి ఈ వ్యవహారంతో అత్తమీద చాలా కోపం వచ్చింది . తన చేత ఆఫీస్ సెలవు
పెట్టించి తనని వెంట తిప్పుకుంటోంది. వచ్చే ఏడాది తను అస్సలు సెలవు పెట్టకూడదు
అనుకుంది. కాని నాలుగేళ్లయి, ఇదే అవుతోంది. ముందు వాళ్ళమ్మాయి లలితని వెంట
తిప్పుకునేవారని రఘు చెప్పేడు.
అత్తయ్యకి ఆవకాయ పెట్టడం ఒక హాబీ అనుకుంటాను డబ్బు, శ్రమ వెచ్చించిన
హాబీ. పద్మ ఎన్నో విషయాలు ఆలోచన చేస్తూ డ్రైవ్ చేస్తుండగా “పద్మా“అని పిలుపు
వినిపించింది.
“అత్తయ్యా! పిలిచారా?” అంది పద్మ.
“ఏమిటి పద్మా అలా పరధ్యాన్నంగా గా ఉన్నావు” అని అడిగారు అన్నారు రమణమ్మ గారు.
“ఏం లేదత్తయ్యా! ఎండకదా కొంచెం తల నెప్పి గా ఉంది” అంది పద్మ
“ డోంట్ వర్రీ. ఇంటికెళ్ళగానే ఒక క్రోసిన్ మాత్ర తో స్ట్రాంగ్ కాఫీ చేసి ఇస్తాను తగ్గి
పోతుంది” అని అన్నారు అత్తయ్య
“థాంక్యూ అత్తయ్యా”అని తన డ్రైవింగ్ లో మనసు పెట్టింది పద్మ
“పద్మా, ఇంటికి వెళ్ళగానే ఒక పాత చీర తడిపి కాయలన్నీ గట్టిగా తుడిచి ఒక పాత
పొడి చీర తో తుడిచి ఒక గంట ఫేన్ కింద పెట్టి ఆరేద్దాం. రెండు గంటలకల్లా వెంకట్ వస్తాడు
వాడు ముక్కలు కొట్టేస్తే ఆవకాయలన్నీ సాయంత్రం పెట్టేస్తాను” అని సులువుగా నోటితో ఒక
అయిదు నిమిషాల్లో ఆవకాయ పెట్టేసారు అత్తయ్య
వెంకట్ ప్రతీ ఏడూ రావడం పద్మకి కళ్ళముందు కదిలింది. ప్రతీ ఏడూ వాడి కోసం
చవక రకం రైన్ కోటు కొని కాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగులు కట్టుకోమని చాల హడావిడి చేసేవారు. ఇదికాక
వాడి చేతులకి గ్లోవ్స్ వేయించి వారు. ఇవన్నీ వేసుకుని నేను పని చెయ్యలేకపోతునమ్మా అంటే
వాడికి కాయకి అదనం గా ఒక రూపాయ ఆశ పెట్టి వాడి చేత పని చేయించేవారు. కాయలు
కొట్టినప్పుడు అవి ఎగిరి వాడి ఒంటి మీద పడకూడదు. అందుకే ఈ ప్రయత్నం అంతా
వెంకట్ రావడం తో వాడితో చెయ్యి పట్టుకున్నంత పని చేసి సమానమైన సైజుల్లో
ముక్కలు కొట్టించేరు. దానికి వాడే కత్తి ఇంట్లోఉన్నదే దానిని కడిగి తుడిచి ఎండ బెట్టి తయారు
చేసేవారు.
రాత్రి 8 గంటలయ్యేక ఇంకా ఎవరూ రారని తేల్చుకుని అప్పుడు ఊరగాయలు
కలపడం ఆరంభించేరుఅత్తయ్య
‘ఏమిటి రమణా నా రూమ్ లో ఆరంభించేవు ఈ ఆవకాయ పని. అదా ఏ సామాను
గదిలో కనిపించకుండా దాచేసేవు” అంటూ మామ గారు అనడం వినిపించింది. ఇక్కడ
పడుకుంటే నాకు దగ్గు ఆయాసం రావడ తధ్యం అని నవ్వుతూ అన్నారు.
“మీరు ఓ పని చెయ్యండి బాల్కనీ లో ఈ ఒక్కరోజూ పడుకోండి. అక్కడ మంచం
వేస్తాను. రేపు మీ బెడ్ రూమ్ ఖాళీ అయిపోతుంది” అని ఒక సులువు చెప్పేసేరు.
“నువ్వు చాలా సులువు గా చెప్పేవు గానీ అక్కడ నన్ను దోమలు ఒళ్ళంతా కుట్టేసి చంపేస్తాయి” అన్నారు మామగారు.
అంతా వింటున్న రఘు, “నాన్నా! మీరు నా కంప్యూటర్ రూమ్ లో హాయిగా ఏ సి వేసుకుని
పడుకోండి” అన్నాడు.
అది విన్నాక విశ్వనాధం గారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు
“అత్తయ్యా, ఈవేళ ఊరగాయ కలిపి మీరు పడుకోండి. రేపు ఇద్దరం కలిసి తొక్కు పచ్చడి, మాగాయి పులిహార, ఆవకాయ పెడదాం” అని చెప్పి పద్మ పడుకుంది
రాత్రి 12 గంటల వరకు చాదస్తం గా కారాలు, ఉప్పు కొలుస్తూ ఊరగాయ కలిపేసరికి రాత్రి ఒంటి
గంట దాటింది .
‘ఏమిటో పద్మ '100 కాయలా అత్తగారూ' అంది గాని, లలితకి అమెరికాకి పంపడానికి 5 కిలోలు, దాని స్నేహితులు ఊరగాయ బాగుందన్నారుట.. ఓ నలుగురికి మరో 4 కిలో లు ... ఇక్కడ నా వాళ్ళు, ఆయన వాళ్ళు .. అందరికీ రుచికి కొంచెం ఇవ్వగా ఇంకా ఎంత మిగులుతుంది. ఓ 5 కిలోలు తప్ప.
అమెరికాకి అన్నీ ప్యాక్ చేసి పంపాలి. డబ్బు అవుతుంది మరి. ఏడాదికొకసారి తప్పదు ఈ డబ్బు
ఖర్చు.’... ఇలా ఆలోచిస్తూ నిద్ర లోకి జారారు రమణమ్మ గారు. ఇలా ముగిసింది ఈ ఏడు అత్తగారి ఆవకాయోపాఖ్యానం.

***శుభం***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#46
ఆత్మీయత
విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
[Image: A.jpg]
రచన : లక్ష్మీ రావు త్రిగుళ్ళ
 
ఢాం ఢాం గిన్నెల చప్పుడు పెద్ద పెద్దగా వినపడుతుంది. బాత్రూంలో స్నానం చేస్తున్న మనోజ్. పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అనుకుని గబగబా స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు.



వస్తూనే “అర్చనా.. ఒకసారి ఇలారా” అంటూ గట్టిగా పిలిచాడు. అర్చన రాలేదుకానీ ఆమె విసిరిన గిన్నె దఢాలుమని వచ్చి మనోజ్ కాలికి తగిలింది. కుయ్యో అంటూ వంట ఇంటివైపు చూసాడు.



‘అయ్యబాబోయ్.. ఇది మనింటి భాగోతమేనా! అయిపోయింది. అంటే ఈ రోజు నేను ఆఫీసునుండి లేటుగా వచ్చాను. వస్తూనే బాత్రూంలో దూరిపోయాను. అదన్నమాట ఈ విసరడాలు. తప్పుతుందా వెళ్ళి బ్రతిమాలు కోవడాలు అర్చన మూతి వంకలు తిప్పడం.. ఇవన్ని షరా మాములే కదా! కొత్తగా ఏదన్నా ఉంటే కనుక భయపడాలి’ అనుకుంటూ పిల్లిలా అడుగులో అడుగువేస్తూ అర్చన వెనకాల వచ్చి నిలుచున్నాడు.



“అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి.. తనొక్కడే కష్టపడి వస్తున్నాను అనుకుంటున్నాడా? ఇంతలేటుగా రావడమే కాకుండా పాటలు పెట్టుకొని అరగంట నుండి జలకాలాడుతున్నాడు, ఏం నేనొక్కదాన్నే తేరగా దొరికాను.. పిల్లలను చూస్తే చిన్నవాళ్ళు, ఇద్దరం కలిసి చెరొకపని చేసుకుందాము అని నెత్తి నోరు కొట్టుకున్నా రోజు ఇదే రామాయణం.



ఇక నావల్ల కాదు నేను ఉద్యోగం మానేసి చక్కగా ఇంటిపట్టున ఉంటాను, ” అంటూ మనోజ్ ను చూస్తూ రుసరుసలాడుతూనే కడిగిన గిన్నెలు బుట్టలో వేస్తుంది అర్చన.



తప్పు చేసినవాడిలా తల కిందకు వంచుకొని. “సారి అర్చన .. నేను కావాలనే లేటుగా రాలేదు డియర్, మా ఫ్రెండ్ సురేశ్ కు యాక్సిడెంట్ అయితే అందరం కలిసి హాస్పిటల్ కు వెళ్ళి చూసివస్తున్నాము, హాస్పిటల్ నుండి వచ్చాను అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ముందు స్నానం చేసిరమ్మని మెడ పట్టి గెంటివేస్తావు అవునా? అందుకని స్నానానికి వెళ్ళాను అంతే కదోయ్” అడిగాడు అర్చన చుబుకం పట్టుకుని.



ఒక్కసారిగా చల్లబడిపోయింది అర్చన. “ఏమిటండి మీరనేది? సురేశ్ అన్నకు యాక్సిడెంట్ అయిందా? అయ్యో! ఇప్పుడెలా ఉంది, దెబ్బలు బాగా తగిలాయా? నాకు చెబితే నేను ఆఫీసునుండి అలాగే వచ్చేదాన్ని” అంది బాధపడుతూ.



“ఆ తగిలాయి కొంచెం బాగానే.. కాకపోతే ఎక్కడ ఎముకలు విరగలేదు అది సంతోషం, అదిసరే అర్చనా.. నీకు అంత తొందరెందుకు, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటాము కదా! ఈ లోపల పిల్లల హోం వర్క్ చేయిస్తే అయిపోతుంది, ఈ మాత్రం దానికే ఓ నశాళానికి అంటే కోపంరావడం, ఆ కోపాన్ని దేనిమీద పడితే దానిమీద చూపెట్టడం ఇదేం బాగాలేదు అర్చన. ఎందుకంటే చూడు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న గిన్నెలన్ని ఎలా నొక్కులు పడ్డాయో, ” గిన్నెలు చూపెడుతూ అన్నాడు మనోజ్.



“ఏమిటోనండి .. మా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువయింది, ఒకరిమీద చాటుకు ఒకరు మాట్లాడుకోవడాలు ఇవన్ని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, ఇంటికి వస్తే బోలెడంతపని ఉంటుందాయే, ” అంది తలపట్టుకుని.



“అర్చనా .. పోని ఒకపని చేద్దామా? అడిగాడు మనోజ్. చెప్పండి అన్నట్టుగా తలెత్తింది.



“నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగాను విను, మొత్తం వినకుండానే నామీద విరుచుకుపడకు సరేనా? మీ అమ్మ ఒక్కతే ఆ పల్లెటూరిలో ఉంటుంది కదా! మరి కొన్నాళ్ళపాటు ఆవిడను పిలుచుకుందాము, కనీసం ఇంతవంటచేసి పెట్టినా చాలుకదా! ఏమంటావు డియర్” అడిగాడు.



“బాగానే ఉంటుంది కానీ మా అమ్మ తెలిసిన వాళ్ళింట్లో వంటలు చేస్తుంది. అది వదిలి రమ్మంటే ఏమంటుందో, మన దగ్గరకు వస్తే ఆమెకు వచ్చే డబ్బులన్ని పోతాయి. ఆమె ఖర్చులకు ఎవరిస్తారు.. రేపేదైనా రోగమో నొప్పో వస్తే ఎలాగా” అంది అర్చన.



“అర్చనా.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు .. ఆమె నీకన్నతల్లి. మరిచిపోయావా? ఆమెకు ఉన్నది నువ్వొక్కదానివే. మంచైనా చెడైనా చూడావలసిన బాధ్యత నీదికాదా? ఆమెకు
ఇప్పటినుండి మనమీద పడి ఉండడం ఇష్టంలేదంటే సరేలే అనుకున్నా, ” అన్నాడు అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తూ.



“ఆ.. ఆ అది ఇప్పుడు నేనేమన్నానని, ఆమెకు నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది అన్నాను అంతేగాని, మా అమ్మ వస్తానంటే నేనెందుకు వద్దంటాను, రేపే అమ్మకు ఫోన్ చేసి రమ్మంటాను సరేనా, కాస్తా కాఫీ పెట్టండి తలనొప్పిగా ఉంది, ” అంటూ ఆ ముచ్చటను అక్కడితో ఆపేసింది. అర్చన మనసులో రకరకాల ఆలోచనలు జోరీగల్లాగ తిరుతున్నాయి.



తల్లిని పిలిపించుకోవడంలో ఆమె ఉద్దేశం అంతా వేరుగా ఊహించుకోసాగింది. మనోజ్ కు సంతోషంగా ఉంది. ఆమెకు అర్చన తప్పా ఎవరులేరు. కష్టమో సుఖమో మాతోపాటుగా
ఉండిపోతుంది అనుకున్నాడు.



“అమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా” అడిగింది అర్చన తల్లిని. అర్చన వాళ్ళమ్మ వంటచేసే వాళ్ళింట్లో ఫోన్ ఉంటుంది. ఆ నెంబర్ అడిగి తీసుకుంది ఎప్పుడన్నా తల్లితో మాట్లాడొచ్చని.



“ఆ బాగున్నానే తల్లి.. అల్లుడు పిల్లలు అందరు కులాసాగా ఉన్నారా, ఏమిటో రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను, నాకేమో వాళ్ళ ఫోన్ నుండి చెయ్యరాదు రోజు వాళ్ళను అడుగుతుంటాను నువ్వేమైనా ఫోన్ చేసావా అని, ” అంది అర్చన తల్లి సుందరమ్మ.



“అయ్యో అమ్మా.. నేను కూడా రోజు అనుకుంటాను నీకు ఫోన్ చెయ్యాలని, ఏది ఒక్క క్షణం కూడా తీరిక దొరకడంలేదు, ఆఫీసు పని ఇల్లు పని చెయ్యలేక చస్తున్నాననుకో, ఏమిటో సంపాదన కోసం తిండికూడా సరిగా తినలేకపోతున్నానంటే నమ్ము,” అంది అర్చన.



“అయ్యో అలాగైతే ఎలాగే తల్లి, ఎవరైనా వంటావిడను పెట్టుకోకపోయావా? నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు ఉద్యోగం చెయ్యకే పిల్లలను చూసుకో చాలు అన్నాను, అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడు సరిపోతుంది ఎంతలో ఉంటే అంతలోనే సర్ధుకుంటే సరిపోతుంది” అంది సుందరమ్మ.



“నేనింత చదువు చదివి ఇంట్లో గిన్నెలు కడుగుతూ ఉండమంటావా? అమ్మా .. నీకు తెలియదు ఈరోజుల్లో పిల్లలను చదివించాలన్నా ఇల్లు కొనాలన్నా మా ఇద్దరి జీతాలు ఏ మూలకు సరిపోవు తెలుసామ్మా? ఖర్చులు చాలా పెరిగిపోయాయి ఇంకా వంటావిడనేం పెట్టుకుంటాము, అసలు పనిమనిషులే దొరుకుతులేరు నాకు, అన్ని పనులు నేనే చేసుకోవాలి” అంది బాధపడుతూ అర్చన.



“అదేమిటి అంత పెద్ద పట్నంలో పనివాళ్ళు దొరకరా” ఆశ్చర్యపోతూ అడిగింది.



“దొరకక కాదు.. మేము ఉదయం ఏడుకల్లా పిల్లలను వాళ్ళ ట్యూషన్ టీచర్ దగ్గర దింపి మేము ఆఫీసుకు వెళ్ళేసరికి టైం సరిపోతుంది, మళ్ళి వచ్చేసరికి ఏడయిపోతుంది అప్పుడు రమ్మంటే ఏ పనివాళ్ళు రామంటున్నారు” చెప్పింది అర్చన.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#47
“అమ్మా నిన్నొకమాట అడగమన్నాడు మీ అల్లుడు, నువ్వెలాగు ఒక్కదానివే ఉంటున్నావు కదా! మందికి ఎవరికో వంటచేస్తూ కష్టపడుతున్నావు, మా దగ్గర ఉండి మాకు నీ చేతితో చేసి పెట్టొచ్చు కదా మీ అమ్మను అడుగు అన్నారు” అంది అర్చన.



“అర్చనా .. అల్లుడిగారు అడిగారా? ఎంతమాట ఆయన అడిగిన తరువాత నేను రాకుండా ఉంటానా చెప్పు? అయినా నువ్వు ఇబ్బంది పడుతుంటే నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు” నిష్టూరంగా అంది సుందరమ్మ.



“నీకు చెపుదామనే అనుకున్నా! నువ్వు బాధపడతావేమోనని చెప్పలేదు, ఆ నువ్వు ఎప్పుడు వస్తావు? ఆ ఇల్లు కూడా అమ్మేసి వచ్చావంటే మాతోపాటుగా ఇక్కడే ఉండిపోవచ్చన్నారు ఈయన, మేము రేపాదివారం వస్తాము అన్ని పనులు చేసుకొని వచ్చేద్దాము సరేనా అమ్మా” అడిగింది ప్రేమగా.



“అలాగేలే నాకు మాత్రం ఎవరున్నారు మీరు కాకపోతే ఎప్పటికైనా నీకు చెందవలసిందే” అంది సుందరమ్మ. అలా అన్నదే కానీ అర్చన దుడుకు స్వభావం తనకు తెలియనిది కాదు. నోటికి హద్దు పద్దు ఉండదు. తీరా అక్కడకు వెళ్ళాక ఇబ్బంది పడతానేమోనని ఆలోచించసాగింది సుందరమ్మ.



“అర్చనా.. మీ అమ్మతో మాట్లాడావా ఏమన్నది” అడిగాడు మనోజ్.



“అవును మీకు చెప్పలేదు కదూ! నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, తినడానికి కూడా టైం ఉండడంలేదు, కాస్త నువ్వు వస్తేనన్న నాకు చేదోడు వాదోడుగా ఉంటావు
కదా! మాకు మాత్రం ఎవరున్నారమ్మ నువ్వు కాకపోతే, అక్కడ ఒంటరిగా ఉంటూ మందికెవరికో చాకిరి చేసే బదులు, నీచేత్తో పిడికెడు ముద్ద మాకు పెడితే మేము సంతోషంగా ఉంటాము, నువ్వు మాతోనే ఉండాలి అన్నాను. తప్పకుండా వస్తాను అందండి” చెప్పింది అర్చన. తల్లితో మాట్లాడిన మాటలకంటే వేరుగా చెప్పింది.



“మరింకేం.. వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకవద్దాము అర్చనా” అన్నాడు.



“అలాకాదు .. మనం వెళ్ళి రెండురోజులు అక్కడ ఉండి, ఇంటివిషయాలు అన్ని చక్కబరుచుకోని వద్దాము, మా అమ్మను మళ్ళీ ఆ పల్లెటూరుకు పంపిచేది లేదు” అంది.



“సరే మంచి ఆలోచననే కానీ! మీ అమ్మ ఉంటుందంటావా ఇక్కడ” అడిగాడు నమ్మకంలేక.



“మీకెందుకవన్ని నేను మా అమ్మను ఒప్పిస్తాను కదా!” అంది ధీమాగా.



అనుకున్నట్టుగానే సుందరమ్మ దగ్గరకు వెళ్ళి. ఆ మాటలు ఈ మాటలు చెప్పి మొత్తానికి ఇల్లు బేరానికి పెట్టింది అర్చన. ఇల్లంతా సర్ధేసి అవసరంలేని సామానంతా తీసివేసింది.
సుందరమ్మ ప్రాణం ఉసూరుమనసాగింది ఎన్నో ఏళ్ళనుండి తనను అంటిపెట్టుకున్న ఇల్లు సామాను పోతుంటే మనసంతా విలవిలలాడింది. అంతలోనే మనసు రాయిచేసుకుని ఎప్పటికైనా దాని దగ్గరకు పోవలసినదానినే. ఎప్పుడైతే ఏముందిలే అనుకుంది.



అర్చనకు తల్లి వచ్చినప్పటినుండి వంటఇంటి జోలికి పోవడం మానేసింది. “అర్చనా! మీ అమ్మ పెద్దావిడ కదా! పాపం పనంతా ఆవిడమీదనే వేస్తున్నావు, పోని పనిమనిషిని అయినా పెడదామంటే నువ్వు ససేమిరా అంటున్నావు, అక్కడ హాయిగా ఉన్నదాన్ని తీసుకవచ్చి పనంతా చేయిస్తున్నావు” నిష్టూరంగా అన్నాడు మనోజ్.



“అబ్బ మీకేం తెలియదు మీరూరుకోండి, మా అమ్మకు ఈ పనంతా అలవాటే, ఒంట్లో బాగాలేనప్పుడు ఎలాగు ఆమెకోసం మనిషిని పెట్టాలి, ఇప్పటినుండి ఖర్చు ఎందుకు
అయినా మా అమ్మేమి పరాయివాళ్ళకు చెయ్యడంలేదు, ఇలాంటి విషయాలన్ని మీరు పట్టించుకోకపోవడం మంచిది” గట్టిగా చెప్పింది భర్తతో.



ఛీ ఛీ ఏం మనిషో నోట్లో తలపెట్టడం పాపం. పెద్దావిడ అక్కడ ఒక్కర్తే ఉంటుందని ఎలాగైనా కూతురు దగ్గరకు వస్తుంది అనుకుంటే. ఆమెను బాగా ఉపయోగించుకుంటుంది అర్చన.
ఇలా చేస్తుందనుకుంటే ఆమెను రమ్మని అనకనేపోదును అనుకుంటూ తనలో తానే బాధపడసాగాడు మనోజ్.



సుందరమ్మకు గడియ తీరికలేదు గవ్వెడు ఆదాయం లేదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మనవడు మనవరాలు బాగా మచ్చికైనారు. అర్చనకు ఆఫీసు పనితోనే సరిపోతుంది ఇంటికి వస్తూనే తలనొప్పని లేకపోతే అలసిపోయానని కాఫీ తాగి కాసేపు పడుకుండిపోతుంది. మనోజ్ వచ్చాక సాయంకాలం ఏదైనా టిఫిన్ తింటాడని తయారుగా చేసి పెడుతుంది సుందరమ్మ.



అందరికి అన్ని విధాల చేసిపెడుతుండడంతో కాస్త ఒళ్ళుచేసారు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎటొచ్చి సుందరమ్మకే తీరికలేకుండా పోయింది తిన్నవా ఆరోగ్యం బాగుందా అనే అడిగే నాథుడేలేడు. పొరబాటున మనోజ్ అడుగుదామని నోరు తెరిస్తే. మా అమ్మకేంటండి ఉక్కు శరీరం. వాళ్ళమ్మ వాళ్ళు అలా పెంచారు మా అమ్మను. అంటూ మాట దాటవేస్తుంది అర్చన. నోరెత్తలేక గమ్మున ఉండిపోతాడు మనోజ్.



“అర్చనా.. నాకు ఒంట్లో బాగుండడంలేదు, ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడైనా పడిపోతానేమొనని భయంగా ఉంది, దగ్గరలో ఎవరైన డాక్టర్ ఉంటే తీసుకెళ్ళమ్మ” ఒకరోజు అడిగింది అర్చనను. వచ్చిన నాలుగేళ్ళనుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంది. వయసు మీదపడుతుంది విశ్రాంతి అనేదే లేకుండాపోయింది.



“ఏమైందమ్మా.. కళ్ళు తిరుగుతున్నాయా, పైత్యం అయిందేమో ఇదిగో ఈ అల్లం ముక్కలు చప్పరించు తగ్గిపోతుంది, నాకు ఆఫీసుకు సెలవులు లేవు తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే” అంటూ గబగబా తల్లి చేసిన టిఫిన్ తిని వెళ్ళిపోయింది.



సుందరమ్మకు మనసు ఉసూరుమనిపించింది. ఒంట్లో ఓపికలేకపోయినా పిల్లలను తయారుచేసి కాలేజ్ కు పంపింది. వాళ్ళు వెళ్ళగానే కళ్ళుమూసుకుని పడుకుందంటే
సాయంకాలం అర్చన వచ్చి లేపితేగాని లేవలేదు పాపం అంతగా అలసిపోయింది. మగతగా కళ్ళుతెరిచి చూసి. “అయ్యో .. నువ్వు ఆఫీసునుండి వచ్చేసావా అర్చనా?” అడిగింది కంగారుగా లేవబోతూ.



“అబ్బా అమ్మా.. నాకు తల పగిలిపోతుంది నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదుగాని, నాకు కాస్తా కాఫీఇవ్వు అయినా ఈవేళప్పుడు పడుకున్నావేంటి? ఇల్లంతా చిందరవందరగా
ఉంది సర్దాలి కదా? ఇంటికి ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు” అంది రుసరుసలాడుతూ.



ఒక్కమాట మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నట్టుగా కళ్ళుమూసుకుని పడుకుంది మనసులో బాధపడుతూ.



“ఏంటి నాకు తలపగిలిపోతుందని చెప్పినా కూడా లేవడం లేదేంటమ్మా? ఈ రోజేంటి కొత్తగా చేస్తున్నావు, నీకు మీ ఊరిమీద మనసు పడిందా ఏంటి కావాలంటే నిన్ను మీ ఊరికి పంపిస్తాలే, ఈ మధ్యలో చాలా చూస్తున్నా నువ్వు ఏపని సరిగా చెయ్యడంలేదు, అయినా నీకు మాకంటే ఆ ఊరివాళ్ళే ఎక్కువయ్యారు, సరె సరె కానీ! పడుకున్నది చాలు లేచి నాకు కాఫీ పెట్టివ్వు” అంది రుసరుసలాడుతూ.



“అయ్యో తల్లి. అంత మాటలెందుకే.. నాకు లేచే ఓపికలేకనే ఇలా పడుకున్నాను, ఇప్పుడే నీకు కాఫీ పెట్టి తెస్తాను కోపానికి రాకు, ” అంటూ బలవంతంగా లేచి తూలుకుంటూ వెళ్ళి కాఫీ
తెచ్చి ఇచ్చింది. ఓరకంట తల్లిని గమనిస్తూనే ఉంది తప్పా కొంచెమైనా జాలిపడలేదు. పైగా తన ఆలోచనా సరళిలో వేగంగా ఆలోచించింది. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా తననుకున్న విషయం వెంటనే అమలు చెయ్యాలని ఎదిరిచూసింది.



జవసత్వాలుడిగిపోయిన కన్నతల్లి లేవలేకా వంటచేస్తుంటే టీవి చూడడంలో మునిగిపోయిన అర్చన. భర్త రాగానే కమ్మగా పుల్లగా అమ్మచేసిన వంట తింటూ అమ్మ అనారోగ్యం గురించి ఆలోచించే మనసులేని కన్న కూతురిని చూస్తుంటే
కడుపు తరుక్కుపోయింది సుందరమ్మకు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#48
మర్నాడు ఉదయం సుందరమ్మను లేపి త్వరగా తయారవ్వు అని చెబితే ఎంతో సంతోషపడింది ఆ పిచ్చి తల్లి. తనంటే తన కూతురికి ప్రేమ ఉంది అందుకే తనను ఇంత పొద్దుటే హాస్పిటల్ కు తీసుకవెళతా అంటుంది. పాపం తనే కన్న కూతురి మనసు అర్ధం చేసుకోలేకపోయింది. మనసులో అనుకుంటూ నిస్సత్తువగా ఉన్నా లేచి గబగబా తయారయ్యి టిఫిన్ కాఫీ చేసిపెట్టింది. మనోజ్ తల్లితో మాట్లాడితే ఏం విషయం చెబుతాడోనని అతని వెంటే ఉండసాగింది అర్చన. పిల్లలను కాలేజ్‌కు పంపించి తల్లిని తీసుకొని బయలుదేరారు.



“పిల్లలు మీరు వచ్చేవరకు అమ్మమ్మ ఉండదు కదా! అందుకని అమ్మమ్మకు దగ్గరగా రండి ఒకసారి, ” చెప్పింది అర్చన పిల్లలతో. పిల్లలు వచ్చి “ అమ్మమ్మ నువ్వు తొందరగా వచ్చెయ్యి” అంటూ ఇద్దరు గట్టిగా కౌగిలించుకుని వెళ్ళిపోయారు.



ఇదేమి అర్ధంకానీ సుందరమ్మ “అదేమిటే పిల్లలతో అలా చెప్పావు? వాళ్ళు చూడు ముఖాలు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు, నేను మళ్ళిరానేమోనని బాధపడుతూ వెళ్ళారు. పాపం వాళ్ళకు అలా ఎందుకు చెప్పావే” అడిగింది సుందరమ్మ.



“ఆ ..అది మనం వచ్చేవరకు సాయంకాలం అవుతుందనుకో వాళ్ళు ట్యూషన్‌కు వెళ్ళిపోతారు కదా! అందుకని అలా చెప్పాను పద పద టైం అవుతుంది” అంది తల్లి ముఖంలోకి చూడలేక.



హాస్పిటల్‌ కు వెళ్ళి డాక్టర్ కు చూపించాక అటునుండి అటే ఓల్టేజి హోమ్ కు తీసుకవెళ్ళారు. అక్కడున్నవాళ్ళందరిని కలుసుకుని తల్లిని పరిచయం చేసి తన కోసం ఇచ్చిన గదిలో తల్లిసంచి పెడుతూ. “అమ్మా .. ఇక నుండి నువ్వు ఇక్కడనే ఉంటున్నావు. నువ్వు పని చెయ్యలేకపోతున్నావు. మేము ఆఫీసుల వెళితే ఒక్కదానివే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.
పొరపాటున మేము ఇంట్లో లేని సమయంలో నీకేమన్నా అయితే ఎంత కష్టం చెప్పు? అందుకే నీ అల్లుడు నేను ఆలోచించి ఇక్కడకు తీసుకవచ్చాము. వీళ్ళు చాలా బాగా
చూసుకుంటారమ్మా నిన్ను. మేము వారం వారం వస్తుంటాము. ఇదిగో నీ సంచిలో నాలుగు కొత్త చీరలు కొని పెట్టాను. పాతవి కూడా తెచ్చాననుకో. నీకు ఏ అవసరం వచ్చినా వాళ్ళను అడుగు సరేనా” అంటూ తల్లిని గట్టిగా కౌగిలించుకుని “మా అమ్మా బంగారం“ అంది వెళుతూ.



మనోజ్ తలెత్తి అత్తగారి ముఖంలోకి చూడలేక తలదించుకొని నిలుచున్నాడు.



“అర్చనా.. చాలా మంచిపని చేశావమ్మా, జవసత్వాలుడిగిన తల్లిని అక్కరలేదని చెప్పకనే చెబుతూ, అవతల విసిరి పడెయ్యకుండా మంచి చోటు చూపావు, నీకు చేసిన మేలు వృధాపోలేదు మంచి ఆలోచన చేశావు. కాకపోతే నువ్వు నాతో ఒక్కమాట చెబితే నేను నీకోసం దాచిన బంగారం డబ్బులు అన్ని నా మనవరాలికి, మనవడికి ఇచ్చి తృప్తిగా వచ్చేదాన్ని. చూడమ్మా.. నువ్వు భయపడిపోయావు కదూ! ఈ ముసలిది మంచాన పడితే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు.. చాకిరి ఎవరు చేస్తారని భయపడిపోయావు కదూ! నీకా
భయమవసరం లేదు, ఎందుకంటే నీకు తెలియదు నేను చాలా డబ్బు కూడబెట్టుకున్నాను.
నీ గురించి నాకు బాగా తెలుసు కదా! నువ్వు చిన్నప్పటి నుండి అవసరపూర్తి మనిషివని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదన్నానాడు నన్ను చూసుకోవడానికి మనిషి అవసరం. ఆ మనిషికి డబ్బులిస్తేనే కదా నన్ను చూసుకుంటారు? అందుకని, నేను మన ఊరిలో మన ఇంట్లో పని చేసే రత్తాలు చనిపోతే, దాని కొడుకు శీనును దత్తత తీసుకున్నాను. వాడు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చాడు.



నా డబ్బులన్ని వాడి దగ్గరనే ఉన్నాయి. నువ్వు ఇంట్లోలేని సమయంలో వాడు వచ్చి నన్ను కలిసి వెళుతుంటాడు. నాతో నీ అవసరం తీరిపోయింది కదా! కడుపున పుట్టిన నీకు నా ఉనికి భారమైంది, అనాథగా మారిపోతున్న శీనును నా కొడుకుగా తీసుకున్నందుకు దేవుడు నా మీద దయతలచాడు. ఈ పని నువ్వేప్పుడో చేస్తావని నాకు తెలుసు.
చాలా సంతోషం నువ్విక వెళ్ళొచ్చు.



బాబు మనోజ్! నీకు నామీద ప్రేమ ఉన్నా నా బిడ్డకు భయపడి నువ్వేమి చెయ్యలేని పరిస్థితని నాకు తెలుసు. నా బిడ్డ చేసినపనికి నువ్వెందుకు తలదించుకుంటావు నాయన.. నేనెక్కడున్నా బాగానే ఉంటాను. క్షేమంగా వెళ్ళండి” అంటూ గొంతు దుఃఖంతో పూడుకపోగా తలుపువైపు వేలు చూపెడుతూ అంది.



నోటమాట రాక తల్లివైపు చూస్తూ చేసిన చెడ్డపనికి సిగ్గుతో చితికిపోయింది అర్చన. తనెంత మూర్ఖంగా ఆలోచించిందో అర్ధమైంది. కన్నతల్లిని ఆనాథగా చేసినందుకు కుమిలి పోయింది. చదువు సంధ్యలు లేకపోయినా గొప్ప మనసుతో తల్లి చేసిన మంచిపనికి, అహర్నిశలు తన కోసం కష్టపడి చదువులు సంధ్యలు నేర్పిస్తే తనేం చేసింది. సంస్కారం మరిచిపోయి తలెత్తుకోలేని పని చేసింది. కన్నీళ్ళతో తల్లి పాదాలు కడిగిన అమ్మ మనసు మారదు నేను చేసిన పనికి.



“అమ్మా.. నన్ను క్షమించమని అడిగా అర్హత కూడా నాకులేదు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి మనసుతో నీకు సేవచేసి ఋణం తీర్చుకుంటాను, ” అంది బోరుమని ఏడుస్తూ.



సుందరమ్మ కూతురిని దగ్గరకు తీసుకుని ఓదార్చలేదు. చూపుడువేలు ఇంకా తలుపువైపే పెట్టి ఉంచింది వెళ్ళిపోండి అన్నట్టుగా.



మారు మాటాడకుండా వెళ్ళిపోయారు అర్చనవాళ్ళు.
ప్రశాంతంగా మంచంమీద కూర్చొని సేదతీరిన మనసుతో ఆత్మీయతను పంచే కొడుకుగాని కొడుకు రాక కోసం ఎదురు చూస్తోంది.



॥॥ శుభం॥॥
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#49
నగరంలో వంటావిడ
 
[url][Image: image-2025-10-21-134231789.png][/url]
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
 
“నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను అడిగి లాభం ఏముంది ఆ మొండి మనిషి ని అడుగు’ అంటుంది.. మీరు మాత్రం హైదరాబాద్ పట్టుకుని వుంటారు. అక్కడైనా, నా దగ్గరైనా మీరు చేసే పని ఏముంటుంది.. గంటల తరబడి యూట్యూబ్ చూడటం, ఫోన్లో మాట్లాడుకోవడం” అన్నాడు తండ్రి శ్రీకాంత్ తో కొడుకు వినయ్.



“నాకు రాకూడదు అనికాదు రా, ప్రయాణాలు చెయ్యలేకపోతున్నాను అంతే. మీ మొగుడు పెళ్ళాలు యిద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, మనవడు కాలేజీకి. అమ్మకి వంటా, నాకు ఫోన్, పెద్ద మార్పు ఏమి వుంటుంది?” అన్నాడు కొడుకు తో శ్రీకాంత్.



“అదేమిటి డాడీ, వంట కి వంటమనిషి వుంది అని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయారా” అన్నాడు కొడుకు వినయ్.



“వంటమనిషి వుంటే మంచిదే, అమ్మకూడా యిక్కడ నాకు వంట చేసి బాగా అలిసిపోయింది, అక్కడ కి వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లే. నాకు కూడా కాళ్ళు నొప్పి, అక్కడకి వస్తే మనవడు, నువ్వు కొద్దిగా కాళ్ళమీద కూర్చుంటారు, హాయిగా వుంటుంది, వచ్చే వారం కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, ట్రైన్ లో అంతసేపు కూర్చోలేను” అన్నాడు శ్రీకాంత్.



“అవును.. వంటమనిషి మనవాళ్లేనా, ముంబయిలో మన వాళ్ళు దొరుకుతారా?” అని ఆడిగాడు కొడుకుని.






“ఆ.. మనవాళ్లే! జానకమ్మ పేరు, అయితే మరాఠి తప్పా ఏమి రాదు, యిప్పుడే కొద్దిగా హింది నేర్చుకుంటోంది” అన్నాడు వినయ్.



“వంటకి బాష తో పని ఏముంది, మీ అమ్మ వచ్చి ఆవిడకి అన్ని వంటలు నేర్పుతుందిలే” అన్నాడు.



అమ్మయ్య, మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు నాన్న, వచ్చిన తరువాత తను పంపితే గాని వెళ్లారు మనవడిని వదిలి అనుకున్నాడు వినయ్.



ఉదయం ఫ్లైట్ లో బయలుదేరి ముంబై చేరుకున్నారు అదిదంపతులు. ఎయిర్పోర్ట్ కి కొడుకు వినయ్ వచ్చి తల్లిదండ్రులని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. పేరు కి ముంబై కానీ ఎన్ని పెద్ద బిల్డింగ్స్ వున్నాయో వాటికి మించి గుడిసెలు వున్నాయి. విపరీతంగా ట్రాఫిక్.



ఉదయం టిఫిన్ తినకుండా బయలుదేరటం తో 12 గంటలకే శ్రీకాంత్ కి నీరసంగా అనిపించింది. “అమ్మాయి.. నాకు అన్నం పెట్టేసేయ్, షుగర్ పడేడట్లు వుంది” అన్నాడు కోడలితో.



కంచంలో టొమోటో పప్పు, బెండకాయ వేపుడు వడ్డించింది కోడలు. నోట్లో పెట్టుకుని “బాగానే వండింది వంటావిడ” అన్నాడు శ్రీకాంత్.



అన్నం తిని, సోఫాలో కూర్చుని టాబ్లెట్స్ వేసుకుంటో, “ఏమో అనుకున్నాను కానీ, జానకమ్మ గారు బాగానే వండింది” అన్నాడు చదువుకుంటున్న మనవడితో



“జానకమ్మ ఎవ్వరు తాత, ఎప్పుడు పేర్లు తప్పే చెప్తావు, ఆవిడ పేరు మంగమ్మ, మన పనిమనిషి” అన్నాడు. మనవడి మాటకి శ్రీకాంత్ గుండెల్లో రాయి పడింది.



సాయంత్రం కొడుకు రాగానే ఆడిగాడు, “నిత్యం త్రికాల సంధ్యవంధానం చేసే నాకు పనిమనిషి ని తీసుకుని వచ్చి జానకమ్మ అని చెప్పి ఆ వంట తినిపిస్తావా, యింత ఘాతకం కి ఒడికట్టావ్ ఎందుకు” అన్నాడు.



“డాడీ హైదరాబాద్ లో మీరు తిన్న హోటల్ లో వంటవాడు అవధాని గాని, రావు గాని అనుకుంటున్నారా, అక్కడ తినగా లేనిది, యిప్పుడు మంగమ్మ అనగానే యిబ్బంది కలిగింది. చూడండి డాడీ ఈ నగరం లో మనిషి దొరకడమే కష్టం, సద్దుకోవాలి” అన్నాడు నవ్వుతు.



“రేపటి నుంచి ఆవిడ చేసిన వంట నేను తినను, నాకు అమ్మ వండుతుంది సెపరేట్ గా” అనేసి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.



‘నాన్నకి నిజంగానే కోపం వచ్చింది అనుకుంట’ అనుకుంటూ, “అసలు ఆవిడ విషయం నాన్నకి ఎవ్వరు చెప్పారు?” అన్నాడు భార్య తో.



“యింకెవ్వరు.. మన నారదుడు మీ అబ్బాయి వున్నాడు గా..” అంది.



మర్నాడు మంగమ్మ వచ్చి యిల్లు, అంట్లు తోమేసి, రాజమ్మ గా మారిపోయి చేతులు శుభ్రం గా కడుక్కుని వంట మొదలుపెట్టింది.



శ్రీకాంత్ భార్య ని పిలిచి “నేను ఆ వంట తినను, నువ్వు నాకు సెపరేట్ గా అన్నం కూర పప్పు వండు, కొద్దిగా ఆలస్యం అయినా పరవాలేదు” అన్నాడు.



“మీ చాదస్తం తో నా ప్రాణం మీదకి వచ్చింది, వంటావిడ చేసిన వంట వదిలేసి, మళ్ళీ నేను వండుతాను అంటే కోడలు ఏమనుకుంటుంది ఆండి, వడ్డన నేను చేస్తాను, కొద్దిగా యిక్కడ వున్ననాళ్ళు గొడవ పెట్టకండి, వచ్చే నెల వెళ్ళిపోదాం” అంది శ్రీకాంత్ భార్య.



“అయితే నేను శబరి లా పళ్లు తిని బతుకుతాను, అంతే తప్పా ఆ వంట నేను తినను” అన్నాడు. దానితో వంటావిడ వంట అయిన తరువాత, శ్రీకాంత్ కి వండి పెట్టడం చేస్తోంది.



నాలుగు రోజులు గడిచిన తరువాత ఈ విషయం వంటావిడ కి తెలిసిపోయింది. “అమ్మా! నేను వండిన వంట సార్ కి నచ్చడం లేదని, మళ్ళీ సెపరేట్ గా సార్ కి వండుతున్నారు, యింతోటీ దానికి నేను ఎందుకు, రేపటి నుంచి నేను రాను, మీరే వండుకోండి” అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.



“చెడకోట్టేదాకా మీకు నిద్ర పట్టలేదు కదా డాడీ, యిప్పుడు పర్వాలేదు, అమ్మ చేస్తోంది. రేపు మీరు వెళ్ళిపోతే మా గతి ఏమిటి, ఈ ముంబైలో ఉదయం 7 గంటలకు బయలుదేరితే కాని ఆఫీస్ టైమ్ కి చేరం. ఇహ మీ మకాం యిక్కడే, మనవడిని చూసుకుంటో వుండిపోండి” అన్నాడు వినయ్.



“నేను ఎప్పుడు యిక్కడికి వచ్చి వుండిపోవాలో నాకు తెలుసు, ఉదయమే లేచి పిల్లాడికి నాలుగు మెతుకులు వండుకోండి, నేను యిక్కడ వుండిపోతే అక్కడ రైతు మనపోలం కాస్తా లాగేస్తాడు. ఓపిక తగ్గినప్పుడు అన్నీ అమ్మేసి నీ దగ్గరికి ఎల్లాగో రాకతప్పదు, యిప్పుడు మమ్మల్ని వెళ్ళని, కావాలంటే ఆ మంగమ్మ నీ పిలిచి వండించుకోండి మేము వెళ్లిపోయామని చెప్పి” అన్నాడు శ్రీకాంత్. అనుకున్న ప్లాన్ ప్రకారం మొగుడు పెళ్ళాం హైదరాబాద్ వెళ్లిపోయారు.



పదిరోజులు కొడుకు ఫోన్ కూడా చేయ్యలేదు, తండ్రి తన మాట వినలేదు అని.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#50
శ్రీకాంత్ ఫోన్ చేస్తే మనవడు ఫోన్ తీసి, “నాన్న జిమ్ కి వెళ్ళాడు, నీకో సంగతి చెప్పానా, కొత్త వంటమనిషి వచ్చింది, హింది తప్పా ఏమి రాదు. నువ్వు బాగా హింది నేర్చుకో” అన్నాడు. మనవాళ్లేనా అని అడగబోయి, పిల్లాడిని ఎందుకు అడగటం అని వూరుకున్నాడు.






వారం రోజుల తరువాత వినయ్ తండ్రి కి ఫోన్ చేసి “నాన్న.. మీరు అమ్మా వెంటనే బయలుదేరి ముంబై రావాలి, యిప్పుడు కొత్తగా పెట్టుకున్న వంటమనిషి ఏది వండిన బిర్యానీ వాసన వస్తోంది, అదికాక పప్పులు అవి తెలియకుండా తీసుకుని వెళ్లిపోతోంది” అన్నాడు



“దానికోసం యిప్పుడు నేను రావడం ఎందుకు రా, మానిపించేయండి” అన్నాడు.



“అంత సులువు కాదు డాడీ, ఒక సంవత్సరం అగ్రిమెంట్ రాసాము, మధ్యలో మానిపించితే సంవత్సరం జీతం అంటే లక్ష రూపాయలు యిచ్చుకోవాలి. మీరైతే ఎటువంటి వారినైనా విసుగు తెప్పించి చెడకొట్టి వాళ్లంత వాళ్ళు వెళ్లిపోయేడట్లు చెయ్యగలరు” అన్నాడు.



“అంటే నీ ఉద్దేశ్యం నేను అందుకే పనికి వస్తాను అన, సరే రెండు మూడు రోజులలో అప్పడాలు ఎండిపోతాయి, అవి పట్టుకొని వస్తాము, పర్సు బీరువాలో పెట్టుకో, బయట పెట్టకు” అని హెచ్చిరించాడు శ్రీకాంత్.



నాలుగు రోజుల తరువాత సామాను సద్దుకుని ముంబై చేరుకున్నారు. పెట్టి తనకి యిచ్చిన రూంలో పెట్టుకుని వంటగది గుమ్మం లో నుంచుని, “ఈ రోజు వంట ఏమిటి?” అన్నాడు.



“హింది మే భోలో” అంది ఆ వంటావిడ.



“ఆజ్ ఏమి వండుతున్నారు హై” అన్నాడు.



శ్రీకాంత్ హింది అర్ధం కాక, “మేడం ఇదర్ ఆవో, సాబ్ క్యా పూచ్ రే” ఆంది మా కోడలు తో.



“కద్దు దాల్, నారియాల్ చట్నీ” అంది వంటావిడ.



“మై నై తింటా, వంకాయ మెంతికారం హై, మామిడి పప్పు హై, ఓ అచ్చా రైతా” అన్నాడు తనకి వచ్చిన హిందీలో శ్రీకాంత్.



“ఓ సబ్ నై అత, జాకె బాహర్ బైటో” అంది వంటావిడా మొహమాటం లేకుండా.



“దేఖో నాకు పసంద్ వాలా చెయ్యాలి హై, మేరా మాట సునో అంతే” అన్నాడు.



ఇంతలో శ్రీకాంత్ భార్య వచ్చి, “మీరు ఎందుకు వంటవాళ్ళ తో మాటలు, నాకు చెప్పండి, నేను ఆవిడకి నేర్పుతాను” అంది.



“నీకు హిందీలో అయిదు మార్కులు, నాకు ఏడు మార్కులు, నీ కంటే నేనే హిందీలో ఆవిడకి చెప్పగలను” అంటూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు శ్రీకాంత్.



తండ్రి రంగంలోకి దిగినందుకు వినయ్ కి సంతోషం కలిగింది.



రెండో రోజు వంటావిడ రాగానే, “వినండి, ఈ దిన్ పాటోలీ, గోంగూర చుట్నీ బనాన హై” అన్నాడు.



“ఓ సబ్ నై ఆత, పాలక్ టొమోటో దాల్ బనాత” అంది శ్రీకాంత్ ని పట్టించుకోకుండా.



“ఓ అమ్మా! పాలక్ టొమోటో దాల్ కిడ్నీ కరాబ్ చేస్తుంది హై, నాకో” అన్నాడు.



“నాకో కాదు నకో అనాలి, నువ్వు హిందీలో ఎందుకు తాత మాట్లాడుతావు, అమ్మకి చెప్పు, అమ్మ వంటామికి చెప్పుతుంది” అన్నాడు మనవడు.



“ఏమో రా.. నా హింది ఆవిడ వంట ఒకేలా వున్నాయి, రెండు రోజులనుండి నోరు చచ్చిపోయింది” అన్నాడు.
“అదేమిటి నిన్న సాయంత్రం వడా సాంబార్ తిన్నావుగా” అన్నాడు మనవడు.



“అవి టిఫిన్, అన్నం దారి అన్నం దే” అన్నాడు.



అలా నాలుగురోజులు గడిచాయి. ఉదయమే వంటావిడ వచ్చి “సాబ్ వాకింగ్ కు జాతా నై” ఆంది మా కొడలితో.



“సాబ్ అప్ కు కుకింగ్ సీకాతం బోల్ రే” ఆంది నవ్వుతు.



“అరే బాప్ మరగయా, కేటరింగ్ వాలా కు యితన కుకింగ్ నై ఆత, మేరేసే నై హోత కామ్ కర్నా. ఇనూ కబ్ జాతా” అంది వంటావిడ.



“ఇదర్ రైనేకు ఆయా, నై జాత” ఆంది కోడలు.



శ్రీకాంత్ వీళ్ళ మాటలు విని “ఈ రోజు క్యా వండుతారు హై” అన్నాడు.



దానితో ఆవిడకి ఒళ్ళుమండినట్టు వుంది, “హమ్ నౌకరి చోడ్ దీయా, అప్ కు క్యా హోనా అమ్మా సే బనాదేవ్” అంటూ వంటగదిలోనుంచి బయటకి వచ్చి మా అబ్బాయి తో “హమ్ యిదర్ కామ్ నై కరసక్త” అంది.



“అదేమిటి? వన్ ఇయర్ అగ్రిమెంట్ వుందిగా” అన్నాడు వినయ్..



“మాప్ కరో సాబ్! అప్కా పితాజీ మేరా సిర్ కాజారే, క్షమా కర్కే మేరేకు చోడ్ దేవ్” అని వెళ్ళిపోయింది.



“అమ్మయ్య! డాడీ సాధించారు, మొత్తానికి వదిలిపోయింది. మీ హింది మాట్లాడటం మరి యింత దరిద్రం గా వుందేమిటి డాడీ” అన్నాడు వినయ్.



“చుప్ బైట్, హింది మేరా సెకండ్ లాంగ్వేజ్” అన్నాడు శ్రీకాంత్ వంటగది వైపు చూస్తో.



శుభం
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#51
శతమానము
[Image: S.jpg]       
రచన : సుదర్శన రావు పోచంపల్లి



వసంత పూర్ణిమ సకల ఐశ్వర్యాలతో తులతూగుచున్న వృద్ధ ముత్తైదువ- భర్త సౌత్రామణి భానువు కాని ఇప్పుడు 90 ఏండ్లు దాటిన అపరదిశాంబరమణి- ఇద్దరు ఆదర్శ దంపతులు- సంప్రదాయాలను గౌరవించి పాటించేవారు- పెళ్ళినాటి మంగళ సూత్రము భార్య మెడలో ఎట్లున్నదో నాడు పెండ్లి కుమారుడుగా ధరించిన ఉంగరము ఇంకా చేతి వ్రేలికి తొడిగే ఉంచుతాడు సౌత్రామణి భానువు.



నలుగురూ ఆడపిల్లలే- వరుసగా భారతి- హారతి- ఇందుమతి-, హైమవతి. అందరికీ పెళ్ళిలయి ఎవరి అత్తవారింటికి వారు పోతారు- మనుమలు మనుమరాండ్లు కూడ. ఐతె తల్లి దండ్రులు వృద్ధులైనందున నలుగురిలో ఎవరో ఒకరు తప్పకుండా వీరిదగ్గర ఉండవలసిందే ఉంటుంటారుకూడ.



ఒక నాడు చిన్న కూతురు హైమవతి బజారుకు పోతూ తన పుస్తెలు తీసి గూటిలో పెట్టి పోతుంది- తల్లి వసంత పూర్ణిమ కంట్లో పడుతుంది. ఎంత అపచారం- ఎంత అపచారం అనుకుంటూ కూతురు రాగానే చీవాట్లు పెడుతుంది తల్లీ! నువ్వు చేసిన పనేమిటి అని-



నీ పేరే మంగళగౌరి ఐన పార్వతి పేరు- భర్త ఆయుస్సుకు రక్షణగా ఉండే మంగళ సూత్రాన్ని ఎట్టి పరిస్థితిలోను తీయగూడదమ్మా. అది ఎంతో తప్పు అంటుంది.
అమ్మా! అంత చిన్నదానికే ఇంత కోపమెందుకమ్మా- రోజుల్లోనైతె కొందరమ్మాయిలు పెళ్ళినాడొకనాడే ఉంచుకొని మంగళ సూత్రాన్ని ఎక్కడో పడేస్తారు- గాజులుండవు, బొట్టుండదు, మట్టెలుండవు, ముక్కుపుల్లా ఉండదు- చీరలు లంగా హోణీలు కూడా బరువే. వాళ్ళు బ్రతుకుతులేరా? అని ఎదురు ప్రశ్న వేస్తుంది హైమవతి.



అవును. నాకీ ముసలితనాన ఉన్మాదమెక్కువై నిన్ను కోప్పడుతున్నాను- మీరంటే కాలపు పిల్లలు చదువుకున్నారు- లోకాన్ని చూస్తున్నారు. మాలాంటివాళ్ళు చెప్పినా బుర్రకెక్కించుకోలేనంత చదువుకున్న వారైతిరి అంటుంటె మళ్ళీ అదేమి నిష్టూరమమ్మ.. సరెలే, ఇక నుండి నీ మాటనే వింటానమ్మ అని తల్లి మెడలో రెండు చేతులేసి చిన్న పిల్లలా చెబుతుంది హైమవతి.



వెంటనే గూటిలో పెట్టిన మంగళ సూత్రము తీసి మెడలో వేసుకుంటుంది హైమవతి. -



సరెనమ్మా! నీ పనులన్నీ ముగించుకొని రా. నేనొక కథ చెబుతాను అంటుంది వసంత పూర్ణిమ. ఐనా తోటివాండ్లు తొడ కోసుకున్నరు గదా అని మనము మెడ కోసుకుంటమా- నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అంటుంది హైమవతితో తల్లి వసంతపూర్ణిమ.



ఒక గంటలో పనులు ముగించుకొని ఇక చెప్పమ్మా కథ ఏమిటొ అనుకుంటూ తల్లి చెంతన కూర్చుంటుంది హైమవతి.
కథ చెబుతాను, ఓపికగా విను అంటూ- పూర్వము మన దేశాన్నేలిన రాజులలో హరిశ్చంద్ర, నలోరాజ, పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్జున షడైతే షట్ చక్రవర్తి అని ఆర్గురు పేరెన్నికగల చక్రవర్తులుoడేవారు- వారిలో హరిశ్చంద్రుడు మహా సత్య నిరతుడు కావడము చే సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది.



హరిశ్చంద్రుని సత్యమెంత గొప్పదో పరీక్షించుదామని విశ్వామిత్రుడను ఋషి హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి కొంత సొమ్ము ఈయమంటాడు- హరిశ్చంద్రుడు సరె అని వాగ్దానము చేస్తాడు- విశ్వామిత్రుడు అప్పుడే సొమ్ము గైకొనక రాజ్యములో కరువు కాటకాలు వచ్చి ధనాగారములో సొమ్ము అయిపోయిందని తెలిసి, అప్పుడు తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చమంటాడు-



మాట నిలబెట్టుకొను క్రమములో హరిశ్చంద్రుడు తన రాజ్యము కోల్పోవుటే కాక ప్రాణానికి ప్రాణమైన, గర్భవతియైన భార్య చంద్రమతిని, కాల కౌశికుడను నాతని దగ్గర దాసిగా అమ్మి తాను వీరబాహుడను నాతని దగ్గర కాటికాపరిగా చేరుతాడు. కొంతకాలానికి చంద్రమతి ప్రసవించి లోహితాస్యుడు అనబడే కొడుకును కంటుంది.



కొడుకు కొంత పెద్దవాడై కాలకౌశికుని శిష్యులతో అడవికి పోతాడు- దురదృష్టవశాన అక్కడ పాముకాటుకు గురై మరణిస్తాడు లోహితాస్యుడు.



చంద్ర మతికి వార్త తెలిసి మిగుల దుఃఖిస్తది- కొడుకు కొరకు పోతానంటె యజమాని భార్య పనులన్ని పూర్తి చేసి పొమ్మని ఆజ్ఞాపిస్తది- చేసేది లేక అర్థ రాత్రివరకు పనులు ముగించుకొని కొడుకు శవదహనానికి శ్మశానము పోతుంది- అంతరాత్రి దహన ఏర్పాట్లు చేస్తుంటె కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కాటి సుంకము చెల్లించనిదే దహనానికి వీలు లేదంటాడు-



చంద్రమతి విలపిస్తూ తన వద్ద సొమ్ము లేదంటుంది- అప్పుడు కాటి కాపరైన హరిశ్చంద్రుడు



దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతులీరెండలన్
మలియింపన్ దిశల్ ద్వదీయ గళ సీమన్ బాల సూర్య
కలితంబై వెలుగొందుచున్న మాంగల్యంబు కాబోలు నే
వెలకైనన్ దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ జెల్లదే



అంటాడు.



మాటలకు వశిష్ఠ మహముని వరాన నా మెడలోని మంగళ సూత్రము నా భర్తకు తప్ప వేరెవరికి కనబడదే.. ఇతడే నా భర్త అని హరిశ్చంద్రునికి లోహితాస్యుడు తమ కొడుకే అని విలపించుతూ తెలుపుతది చంద్రమతి-



కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడూ మిగుల దుఃఖించి. సుంకము చెల్లించవలసిందే/ మీ యజమానురాలు దగ్గర అడుక్కరా అంటడు. అదీ సత్య నిరతి అంటె అంటుంది వసంత పూర్ణిమ-



మంగళ సూత్రము విలువేమిటో నీకు అర్థమయ్యేటట్టు చెబుతాను అంటూ వివాహ కార్యక్రమము ముగియగానే



శతమానం భవతి
శతాయుః పురుషశ్యతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.



అని దీవించుతారు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#52
అందరికి సుపరిచితమైన వేద మంత్రం ఋషులు మనకందించిన వేదాలలోనుండి గ్రహింపబడినది. వివాహమైన లేదా హిందూ శుభకార్యమైనా ఆశీర్వచనంతో ముగించడం ఆనవాయితీగ వస్తుంది- నూతన దంపతులను నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో ఆనందంగా జీవించమని క్లుప్తంగా దీని అర్థం.



మంత్రానికి అంత శక్తి ఉన్నదా అని సందేహము కలుగక మానదు- నిష్ష్ఠా గరిష్ఠులైన ఋష్యాదులు, పురోహితులు, విద్య బోధించిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇతర పెద్దలు ఇచ్చిన ఆశీర్వచనాలు, దీవెనలు అత్యంత శక్తివంతమైనవి- వేదమంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఆశీర్వచనం పొందుట ఆవశ్యకరం.
సూర్యోపస్థానంలో "పశ్యేమ శరదశ్శతం నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం " అని చెప్పబడింది. నిండు నూరేళ్ళు సూర్యుని చూడగలగాలి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.



శతమానం భవతి అని వివాహమే కాక ఇతర సందర్భాలలో ఆశీర్వదించవచ్చును. ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు చాలా మందికి సందర్భోచితమైన మాటలురాక అక్షతలు వేసి ఊరుకుంటారు- పసిపిల్లలను చిరంజీవ ఆయుష్మాంభవ, దీర్ఘాయుష్మాంభవ, విద్యాప్రాప్తిరస్తు అని దీవించవచ్చు- సుమంగళియైన స్త్రీలను దీర్ఘ సుమంగళీభవ యని దీవించ వచ్చును.



ఆయుష్మాంభవ అనేది ఉత్తమమైన ఆశీర్వచనం. సంపూర్ణ ఆరోగ్యముతో కూడిన ఆయుష్యు లేనపుడు ఎంత సంపద ఉన్న ఏమి ప్రయోజనం. మీ నాన్నగారు నేను మాత్రం ఇంత వయస్సు వచ్చినా మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి అంటుంది వసంత పూర్ణిమ.



ఇంకా మంగళ సూత్రాన్ని గురించి వివరంగా చెబుతా విను అంటూ వసంత పూర్ణిమ హైమవతితో చెబుతుంది.



మంగళ సూత్రము బయటికి కనిపించకూడదు- భర్తకు తప్ప అది అన్యులెవరికి కనిపించరాదు- భర్తకు అమంగళం- ముత్తైదువలు విషయాన్ని గట్టిగా పాటించాలి, తెలిసిందా? అంటుంది వసంత పూర్ణిమ.
మంగళ సూత్రానికి అంత విలువ ఇచ్చినందున చంద్రమతి తన భర్త హరిశ్చంద్రునికి తప్ప తన తాళి అన్యులకు కనబడకుండ వశిష్ట మహాముని వద్ద వరము పొందింది తెలుసా అంటుంది వసంత పూర్ణిమ.
ఒక మామూలు తాడుకు పసుపు పూసిన తాడుకు మంగళ సూత్రము అను పేరు వచ్చింది-



స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక కుటుంబంగా బ్రతకడానికి స్త్రీ పురుషులిరువురు ఇష్టపడి సూత్రము కాబోయే భార్య మెడలో ధరింపజేస్తాడు భర్త- విశేషమైన జీవన విధానానికి వివాహము అంటారు.



భార్య మెడలో సూత్రము ఉండుటవలన కుటుంబము ఎన్నో మంగళములను పొందుటచే దానిని మంగళ సూత్రము అంటారు.



మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించేవారున్నారో అంతగా నిర్లక్ష్యము చేసేవారు లేకపోలేదు. కాని మంగళ సూత్రము అనేది అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయము.



అగ్ని సాక్షిగా ఎన్నో ప్రతిజ్ఞలు చేసిన తరువాతనే మంగళ సూత్ర ధారణ జరుగుతుంది. వివాహానికి చిహ్నంగా స్త్రీ మంగళ సూత్రము ధరించితే పురుషుడు కుడిచేతి ఉంగరపు వ్రేలికి ఉంగరం ధరిస్తాడు. మంగళ సూత్రాన్ని మాంగల్యం, తాళిబొట్టు, పుస్తె, శతమానము అని గూడా అంటారు. మంగళ సూత్రములో బంగారు పుస్తెతో పాటు నల్లపూసలు, పగడాలు, ముత్యాలు మొదలగునవి గూడ గ్రుచ్చుకుంటారు. సంస్కృతంలో మంగళమంటే శుభప్రదం- సూత్రం అంటే తాడు. మంగళ సూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు.



మంగళ సూత్ర ధారణ చేసేటప్పుడు-
మాంగల్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతాం అను మంత్రం పఠింపజేస్తారు.



సాధారణంగా హిందూ మత సంప్రదాయం లో మహిళల వైవాహిక స్థితి తెలిపే ఐదు సంకేతాలు 1. మంగళ సూత్రము, 2. కాలి మట్టెలు, 3. కుంకుమ, 4. గాజులు, 5. ముక్కు పుడక.
మంగళ సూత్రము మంచి సంకల్పముతో ధరించే యజ్ఞోపవీతము వంటిది.



ఒక మామూలు తాడుకు పసుపు పూసిన తాడుకు మంగళ సూత్రము అను పేరు వచ్చింది-



భార్య మెడలో సూత్రము ఉండుటవలన కుటుంబము ఎన్నో మంగళములను పొందుటచే దానిని మంగళ సూత్రము అంటారు.
.
మంగళ సూత్రము మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు అంటే మన హిందూ సంప్రదాయము ప్రకారము మూడు అనే అంకెకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళము అని భావిస్తారు. అందుకే మంగళ సూత్రానికి మూడుముళ్ళు వేస్తారు.



వివరంగా చెప్పాలంటె మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి- పెళ్ళి సందర్భములో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది. పెళ్ళంటే ఒక్క భార్య శరీరముతోనే కాదు మొత్తం మూడు శరీరాలు మమేకం అవడము అనే అర్థం లో మూడు ముళ్ళు వేస్తారట-
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్విత బంధానికి గుర్తు- అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.



శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంతవరకు భర్తకు ఆయుష్షు ఉంటుంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటె భర్త చనిపోయినట్లుగా భావిస్తారు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#53
ఇక పెండ్లిలో ఏడు అడుగుల సంగతి కూడా విను అంటూ వసంత పూర్ణిమ కూతురు హైమవతికి వివరిస్తుంది-



తాళి కట్టిన అనంతరం వధూ వరులు హోమం చుట్టు ఏడు ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే- ఏడు అడుగులు వేయడం జీవిత భాగస్వామితో ఏడు జన్మలవరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమే చెబుతారు-
అంతే కాకుండ ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్థం కూడా ఉన్నది.



మొదటి అడుగు- అన్న వృద్ధి.
రొండవ అడుగు- బల వృద్ధి.
మూడవ అడుగు- ధన ప్రాప్తి.
నాల్గవ అడుగు- సుఖ వృద్ధికి.
ఐదవ అడుగు- ప్రజా పాలనకు.
ఆరవ అడుగు- దాంపత్య జీవితానికి.
ఏడవ అడుగు- సంతాన అభివృద్ధికి.



అని ముగిస్తుంది వసంత పూర్ణిమ-



అమ్మా! నీకివన్ని ఎట్ల తెలుసు? అని అడుగుతుంది హైమవతి-



నేను నా చిన్నతనాననే మా అమ్మ చెబితే విని దీనికి సంబంధించిన పుస్తకము ఎన్నోసార్ల చదివితే నాకు ఒంటబట్టింది అంటుంది వసంత పూర్ణిమ.



అమ్మా! తాతయ్య, అమ్మమ్మకు ముప్పది ముళ్ళు వేసి ఉండవచ్చునా? అని కొంటెగా అడుగుతూ వాళ్ళు ఇంత కాలమైనా ఇంకా బ్రతికే ఉన్నారు అని నవ్వుతూ తల్లిని అడుగుతుంది హైమవతి.



వాళ్ళు బ్రతికి ఉంటె నీకు కడుపు మంటేమిటే.. వాళ్ళు చక్కగా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉన్నారు- నేను మీ నాన్నగారు కూడా సంప్రదాయాలు పాటించుచున్నాము కనుకనే అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాము అంటుంది వసంత పూర్ణిమ-



అమ్మా! ఇంత వివరంగా చెప్పినందుకు నీకు పాదాభివందనము అంటూ తల్లికి చెంతనే ఇదంతా వింటున్న తండ్రికి నమస్కరిస్తుంది హైమవతి.



ఇక ముందు మేమూ మీ బాటే పడుతాము అనుకుంటూ లేచి తన పనులు చేసుకొవడానికి పోతుంది హైమవతి.



సమాప్తం.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#54
ఇరుగు పొరుగు
[Image: i.jpg]
రచన: కిరణ్ విభావరి



పక్కింటి వాళ్ళతో తగాదాలు పెంచుకుంటే పెరుగుతాయి.
మాటకు మాట జవాబుగా వస్తుంది.
ఒకరు ఒక మెట్టు దిగితే అవతలి వారు మరో మెట్టు దిగుతారు.
పోరు నష్టం, పొందు లాభం అని తెలియజెప్పే కథను డైనమిక్ రైటర్ కిరణ్ విభావరి గారు రచించారు.
కథ ప్రారంభిద్దాం.



"ఏం పోయే కాలం వచ్చిందర్రా ? మాస్కులు అవీ మా ఇంటి ముందు పడేస్తున్నారు. మేం జబ్బు పట్టి పోవాలనా? పాడు మనుషులు .. పాడు బుద్దులు." అమ్మమ్మ ఎవరిని తిడుతుందా అని బయటకి వచ్చి చూసాను. పక్కింటి ఉమాదేవి గారు మాస్కులు మా బాల్కనీలో పడేశారు. అది చూసిన మా అమ్మమ్మ వాళ్ళను ఏకబీకిన తిడుతోంది. వాళ్ళూ కూడా ఘాటైన సమాధానాలు ఇస్తూ ఏదో అంటున్నారు.



రేప్పొద్దున ఇలాగే మాస్కులతో, ఉమ్ములతో, నోటి తుంపరులతో యుద్దాలు జరుగుతాయేమో నాకు భవిష్యత్తు లీలగా కనిపించింది. అమ్మమ్మ ఆవేశపడుతూ గుండెలు పట్టుకుని కుర్చీలో కూలబడింది. నీళ్ళ చెంబు అందిస్తూ, "ఎందుకే అంతలా ఆవేశ పడతావ్? మెల్లిగా నేను రాము గారికి చెప్పేవాడిని కదా !" అంటూ ఆవిడ పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుని చెప్పాను. నా చిన్నతనంలోనే మా తల్లి తండ్రి ఇద్దరూ ఒక యాక్సిడెంటులో చనిపోతే, నన్నూ తమ్ముడిని కంటికి రెప్పలా పెంచింది.



"మామూలుగా చెబితే వినే రకాలా అన్నయ్య " మోహన్ అమ్మమ్మకి సపోర్ట్ చేస్తూ అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. మా ఆవిడ ఒక గ్లాసులో సోడా పట్టుకు వచ్చింది. "నీకెందుకు రేఖ శ్రమ. మోహన్ కి చెబితే తెచ్చేవాడు కదా" అంటూ అమ్మమ్మ రేఖ చేతిలోని గ్లాసు పుచ్చుకుంది. రేఖ నిండు గర్భిణి కావడం మూలాన అమ్మమ్మ తనను జాగ్రత్తగా ఉండమని పదే పదే చెబుతూ ఉంటుంది.



"అన్నయ్య..ఓనరు రెంట్ అడిగాడు. కరెంట్ బిల్లు కూడా కట్టాలి " మోహన్ బిల్లు ఎంతైందో చెప్పాడు.



"హ్మ్మ్...సరే" అంటూ తలాడించాను. కానీ మనసులో ఏదో గుబులు. ఎలా కట్టాలి? మాది ప్రవేటు కాలేజ్. ఫీజులు వసూలు చెయ్యలేనిది, డబ్బులు ఎక్కడనుండి తేవాలి అని మా మేనేజ్మెంట్ నెల సాలరీ ఇవ్వలేదు. వచ్చే నెల కూడా ఇస్తారనే నమ్మకం లేదు. తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా ఒక్కడి సంపాదన మీద నా కుటుంబం అంతా ఆధార పడి ఉంది. సేవింగ్స్ కూడా పెద్దగా లేవు. ఇప్పుడెలా రా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చున్నాను.



"అన్నిటికీ రామయ్య తండ్రి ఉన్నాడురా. ఆయన చూసుకుంటాడు లే. " నా మనసుని గ్రహించి , అమ్మమ్మ సముదాయించింది. నవ్వి ఊరుకున్నాను.



*****



వంటింట్లోంచి ఏదో పెద్ద శబ్దం వస్తే, పరుగున అందరం అటు వెళ్ళాం. రేఖకు పురిటి నొప్పులు మొదలైనట్టు ఉన్నాయి. కింద నేల మీద కాళ్ళు బార్లా చాపి కూర్చుని , నొప్పితో విలవిల లాడుతోంది. నాకు కాళ్లూ చేతులూ ఆడక," మోహన్ తొందరగా వెళ్లి ఆటో పిలుచుకుని రా' అంటూ వాడిని పురమాయించారు. "వరండాలో తీసుకుని పోదాం. గాలి ఆడుతుంది" అని అమ్మమ్మ చెప్పగానే, మెల్లగా రేఖను వరండాలోకి తీసుకుని వచ్చాం. నొప్పులకు తాళలేక రేఖ అరుస్తుంటే, నాకు కళ్ళు నిండుకున్నాయి.



 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#55
మోహన్ దిగులుగా వచ్చాడు. లాక్ డౌన్ కారణంగా ఒక్క ఆటో కూడా దొరకలేదు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తోందట. నాకేం చెయ్యాలో పాలు పోలేదు. అంతలో ఉదయం గొడవ పెట్టుకున్న ఎదురింటి ఉమాదేవి గారు గేటు తీసుకుని పరుగున వచ్చారు.
"ఏంటి పిన్ని నొప్పులు స్టార్ట్ అయ్యాయా?" అంటూ అమ్మమ్మను అడిగింది. అమ్మమ్మ బాధగా అవునన్నట్టు తల ఊపింది. వెంటనే పరుగున వాళ్ళింటికి వెళ్లి, వాళ్ళాయనను వెంటేసుకు వచ్చింది. వాళ్ళ కారులో రేఖను , దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తీసుకు వెళ్లాము. డాక్టర్లు ప్రసవ వేదన పడుతున్న నా భార్యను ఐసియు లోకి తీసుకు వెళ్ళి, తలుపులు వేశారు.
ఏదో కొంత గండం గట్టెక్కినట్టు అయ్యింది. "పొద్దున్న జరిగినదానికి ఏం అనుకోకు ఉమ.." అమ్మమ్మ ఉమాదేవి గారి భుజం మీద చెయ్యేసి చెప్పింది.
మన భారతీయ సంస్కృతిలో ఇరుగు పొరుగు ఆత్మీయతలు కలహాలు కవ్వింపులూ ఇవన్నీ ఒక భాగమే. ఈరోజున తిట్టుకుని కొట్టుకున్న వాళ్ళూ తెల్లారికల్లా కలిసిపోతూ ఉంటారు. ఉమాదేవి గారిని చూస్తే భలే ముచ్చట వేసింది. పొద్దున్న జరిగినది మనసులో పెట్టుకోకుండా లాక్ డౌన్ వేళలో కూడా సహాయం చేసిన ఆమె పెద్ద మనసుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
"మాది తప్పులే పిన్ని. మా అత్త గారి సంగతి నీకు తెలుసు కదా. 40 రూపాయలు పెట్టీ కొన్న మాస్కూ ఒక్క రోజుకి వాడి పడేస్తామా అని ఉతికి ఆరవేసారు. అయితే క్లిప్పు పెట్టకపోవడం చేత గాలికి అది మీ ఇంట్లో పడింది. ఎవరికైనా బాధ వేస్తుంది లే. అసలే కరోనా కాలం" ఉమాదేవి జరిగింది చెప్పుకొచ్చారు.
" మా అమ్మమ్మ కూడా అంతే ఆంటీ " మా మోహన్ నవ్వుతూ అన్నాడు.
అంతలో "కంగ్రాట్స్ అండి..మీకు మహాలక్ష్మి పుట్టింది." అని నర్స్ నవ్వుతూ చెప్పేసరికి, అందరి మొహాలు వెలిగిపోయాయి. "మొత్తానికి తల్లి బిడ్డ క్షేమం...అంతా నీ వల్లే ఉమా. నీ ఋణం తీర్చుకోలేనే" అమ్మమ్మ ఉమ గారి చేతులు పట్టుకుని చెబుతుంటే, "అయ్యో.. అంత మాటలెందుకు పిన్ని " అంటూ కౌగలించుకుంది.
జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసాకా, నా బిడ్డను చూడడానికి గదిలోకి వెళ్ళాను. బంగారు బొమ్మలా ఉంది. "నీ యింట మాలక్ష్మి పుట్టిందిరా" అమ్మమ్మ దిష్టి తీస్తున్నట్లు చేతులు తిప్పి, తలకు నొక్కుకుంటూ చెప్పింది. మాటను నిజం చేస్తూ, మూడు నెలల జీతంతో విలువ చేసే, పిఎఫ్ అమౌంట్ నా ఖాతాలో జమ అయ్యింది అనే సందేశం రాగానే, ఉద్వేగభరితంగా అమ్మమ్మను ముద్దు పెట్టుకున్నాను. "కరోనా కాలంలో ముద్దులు నిషేధం" మోహన్ నవ్వుతూ అంటుంటే, అందరి నవ్వులూ జతకూడాయి.
***శుభం***


 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#56
అమ్మమ్మ కథ - ఆపాసా
[Image: A.jpg]
నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన వందల కథల్లో ఒక చిన్నకథ ఇది. రెండు లైన్లు కూడా ఉండదు.
బహుశః తరతరాలుగా చెప్పుకున్న కథ అయుంటుంది. అందుకే ఈకథ నేనెవరికి చెప్దామని ప్రయత్నించినా, అది మొదలెట్టగానే,
“చాల్లేవోయ్! పెద్ద చెప్పొచ్చావు! మాకీ కథ ఏనాడో తెలుసు!” అనేవాళ్ళు.
అయితే ఆ కథా కమామీషు, అదెప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు మా అమ్మమ్మగారు నాకు చెప్పాల్సి వచ్చిందీ అనేది మరికొన్ని పంక్తుల కథ.
ఆ వరసలకి శ్రీకారం చుట్టే ముందు అమ్మమ్మగారి గురించి చెప్పాలి కదా! అది మాత్రం కొంచెం పెద్దదే, ఈరోజుతో అయిపోదు. బహుశః రేపు ముగుస్తుంది. ఆ తరవాత ఆమె చెప్పిన కథతో మా అమ్మమ్మ కథ ముగిస్తాను.
అమ్మమ్మని తలచుకునేసరికల్లా, నేననే ఏంటి, ఎవరికైనా ఆనందమే! ఎక్కడలేని హుషారే!
ఎందుకంటే, ఎప్పుడో సెలవుల్లో కాని అమ్మమ్మావాళ్ళ ఊరు వెళ్ళం.
అలా ఎప్పుడన్నా మా స్నేహితులు, “మేం ఈ సెలవుల్లో మా అమ్మమ్మా వాళ్ళూరు వెళుతున్నామోచ్! నువ్వెళ్ళవుగా!” అనేవాళ్ళు, నన్నూరిస్తూ.
నేను ఉడుక్కునేవాణ్ణి. కానీ అది బయటపడనీకుండా, రోషంగా, “పొండిరా! మీరైతే అప్పుడప్పుడే వెళ్తారు. అప్పుడే మీకు అమ్మమ్మ ఉండేది. మాకైతే ఎంచక్కా మా అమ్మమ్మా వాళ్ళిల్లే మాయింటికొచ్చేసింది!” అని వాళ్ళమాటని తిప్పికొట్టేవాణ్ణి. తెలిసిన వాళ్ళు నోరు మూసుకునేవాళ్ళు. తెలియని వాళ్ళు నేనెందుకలా అన్నానో ఇతరులని అడిగి తెలుసుకునేవాళ్ళు.
అప్పుడు వాళ్లకి కూడా మా అమ్మమ్మగారి గురించి తెలిసేది.
“గం.భ.స. దొడ్డమ్మగారికి ...” అని సంబోధిస్తూ పోస్టు కార్డులొచ్చేవి, మాయింటికి.
ఒకసారి ఆమెని, “గం.భ.స. అని ఎందుకు రాస్తారు? ప్రియమైన దొడ్డమ్మగారికి అని చక్కగా రాయొచ్చుగా” అనడిగితే, అప్పుడు చెప్పారావిడ, నా మాతామహులు కాలం చేశారు కనుక, అలా “ప్రియమైన దొడ్డా” అనో, ఎంత చనువున్న వాళ్ళయినా “మై డియర్ దొడ్డా!” అనో అనకూడదు. అది సభ్యత కాదు. నువ్వు మాత్రం పెద్దాడివయ్యాక, నాకు “మై డియర్ అమ్మమ్మా! అని మొదలెట్టి ఎలావున్నావు? అని కుశలప్రశ్నలు వేసి, నువ్వక్కడ ఎలావున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో, అన్నీ వివరంగా రాయి.” అని చెప్పారు.
నేనప్పుడు, “నాకా అవకాశం రాదు అమ్మమ్మా! నేనెక్కడుంటే నువ్వక్కడేవుంటావు. ఎందుకంటే, నిన్నూ నాతోపాటే తీసుకెళిపోతానుగా!” అన్నాను.
ఆవిడ మురిసిపోయింది. ఎంతలా అంటే, నన్ను టక్కున అక్కున చేర్చేసుకుంది. “మా నాయన! మా నాయనే! నేను చచ్చిపోతానురా!” అని ఆనందంతో కళ్ళంబడి నీళ్ళు పెట్టేసుకుంది.
ఆవిడంతే! అలా ఎన్నిసార్లు చచ్చిపోయిందో!
అలా ఆవిడ ఎప్పుడు నన్ను దగ్గరకు తీసుకున్నా, ఆమె నేత చీర స్పర్శ ఇచ్చే ఆనందంలో ములిగిపోయేవాణ్ణి. అలాగని మా స్నేహితులిళ్ళల్లో తలచెడిన బామ్మగార్లలా, మా అమ్మమ్మగారు తెల్లటి మల్లు పంచె కట్టుకుని, ‘సిటీ సెక్యూరిటీ ఆఫీసర్’లా తెల్లని యూనిఫారంలో ఉండేవారు కారు.
చక్కని కోడంబాకం, మీనంబాకం, వెంకటగిరి రంగు రంగుల నేత చీరలు, మంచి మంచి జరీ అంచులున్నవే కట్టుకునేవారు. హుందాగా ఉండేవారు. చక్కగా తలకి నూనె రాసుకుని జుత్తు దువ్వుకునేవారు. జడ వేసుకునేవారు కాదు గాని, తలకి వెనుకవైపుకి వచ్చేలా చుట్ట చుట్టి ముడి వేసుకునేవారు. బయటకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ ముడికి పిన్నులు పెట్టుకునేవారు. తలలో పూలు పెట్టుకునేవారు కారు, కానీ నుదుటను మాత్రం గుండ్రంగా చక్కటి విభూతి బొట్టు పెట్టుకునేవారు. రెండు చేతులకీ బంగారుగాజులు వేసుకునేవారు. రోజూ రెండు పూటలా పూజ చేసుకునేవారు.
మా మాతామహులు “ఒకవేళ నేను కాని, ముందు పోతే, ఇప్పుడెలా ఉన్నావో అలాగే ఉండాలి, అలంకరించుకోవాలి. కట్టు, బొట్టు, జుట్టు అన్నీ. వేటిలోను భేదం రానక్కరలేదు. ఎవరయినా, నిన్నలావుండాలి ఇలావుండాలి అని నిర్బంధిస్తే, నువ్వు నిక్కచ్చిగా ‘ఇది మావారి చివరి కోరిక. నేనిలాగే ఉంటాను.’ అని నిర్భయంగా చెప్పు.” అన్నారుట.
అందుకనేనేమో మాతో పాటు, హరికథలకి, నాటకాలకి, సభలకి, సమావేశాలకి, నిస్సంకోచంగా వచ్చేవారు. సినిమాలకి కూడానండోయ్!
అయితే, మాతోపాటు ఆవిడ వచ్చేవారో, మేమే ఆమెతోపాటు వెళ్ళేవాళ్ళమో; నాకు ఇప్పటికీ అర్థం కాదు!
ఒకసారి అలాగే ‘జగదేకవీరుని కథ సినిమా ఫస్ట్ షో చూసి ఇంటికొచ్చాం. అప్పుడు నేను ఒకటో క్లాసనుకుంటాను. వచ్చీ రాగానే, మా అమ్మమ్మగారితో,
“అమ్మమ్మా! నేను ఐదుగురు అమ్మాయిల్ని పెళ్ళాడుతాను.” అని ఆలవోకగా చెప్పేశాను. అదేదో అంత సులువయిన పనన్నట్టు.
ఆమె, కసరలేదు, తిట్టలేదు, కోప్పడలేదు.
“ఎందుకు నాన్నా ఐదుగురు? ఒక్కరు చాలుగా!” అని ఆప్యాయంగా నన్నుదగ్గరకి తీసుకుని, అప్పటి నా చిన్ని బుఱ్ఱలో ఏముందో తెలుసుకుందామని, బుజ్జగిస్తూ అడిగారు.
నాకేం తెలుసు ఆమె తెలివితేటలు!
పిచ్చి వెధవలాగా, నా మనసులో ఉన్నది, యథాతథంగా, వాగేశాను.
“ఒకరు నా కాళ్ళు పట్టడానికి, ఒకరు నాకు పళ్ళు తినిపించడానికి, ఒకరు నాకు పాయసం అందించడానికి, ఒకరు విసనకర్ర విసరడానికీ.” అన్నాను.
“నలుగురే అయారు. మరి ఐదో అమ్మాయో? ఆమె ఎందుకు? నిన్ను పెళ్ళి చేసుకుని ఆమె ఏం చేస్తుంది?” అని ఆరా తీశారు.
నేను అమ్మమ్మవైపే జాలిగా చూస్తూ, “ఇంట్లో, నువ్వొక్కర్తివే అన్నీ చేస్తున్నావుగా. అందుకు. నీకు సాయం చెయ్యడానికి.” అన్నాను.
మళ్ళీ మా అమ్మమ్మ నన్ను ఆనందంతో హత్తుకుని, ఎప్పటిలాగే ఆమె అలవాటు ప్రకారం, చచ్చిపోయింది.
ఆ తరవాత మర్చిపోకుండా ఆమె, ఆ నా మాటలు, ఎన్నోసార్లు ఇద్దరికి చెప్పి మురిసిపోయింది.
ఒకరు అడిగిన వాళ్ళు. ఇంకొకరు అడగని వాళ్ళు. వాళ్ళిద్దరికే!
అక్కడితో అయిపోలేదు.
అలాగే ఆ తరవాతి సంవత్సరమే అనుకుంటాను ‘గుండమ్మ కథ మరో విజయావారి సినిమా. అప్పటికి నేను మూడవతరగతికి వచ్చేశాను. “ఇదేంటి? రెండు సినిమాలకీ మధ్య గ్యాప్ ఒక సంవత్సరమేగా! ఒకటో క్లాసు నుండి రెండుకి కదా రావాలి. మరి మూడోతరగతిలో ఎలావున్నాడు!” అని ఆశ్చర్యపోకండి! కరక్టే!
కానీ మా అమ్మమ్మా మజాకా!
ఆవిడ శిక్షణలో పెరిగాను. నిజానికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః! సిద్ధం నమః!’ అని ఓనమాలు దిద్దించింది మా నాన్నగారే అయినా, ‘అమ్మమ్మ దగ్గర్నుంచి అంమమ్మ’ వరకు అక్షరాలు నేర్పింది మాత్రం మా అమ్మమ్మే.
నా హుషారు చూసి, మా వీధి పురపాలక (పూరిపాక కాదు, మ్యున్సిపల్) బడిలో చేర్చడానికి, మా పెద్దక్క నన్ను తీసుకువెళ్ళింది.
అమ్మగారు (టీచర్. అదేమో నాకు తెలీదు. లేడీ టీచర్లనందర్నీ మరి అప్పట్లో అలాగే పిలిచేవాళ్ళు), మా అక్కతో, “వీడికి తలమీంచి చెయ్యి వేసి, అవతల చెవి పట్టుకోరా అంటే, చెవి సరిగా అందనైనా లేదు! ఇప్పట్నుంచే కాలేజ్లో వేసేస్తారా! ఎన్నేళ్ళే వీడికి? ఆరేళ్ళన్నా వచ్చాయా?” అనేసరికి మా పెద్దక్క అడ్డగానో, నిలువుగానో తెలిసీ తెలియకుండా అదోలా బుఱ్ఱూపింది.
“ఇంకా ఎంతమందున్నారే నీకు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ; మీయింట్లో?” అని ఉరిమింది.
మా అక్క గాభరాపడింది. “అదేమో! నాకు తెలీదు!” అంది.
ఈవిడ అయోమయంగా మా పెద్దక్క వైపు చూసింది, ఆ సమాధానానికి.
అప్పుడు తిరిగి మా అక్కే, ధైర్యం తెచ్చుకుని, “అదేమో! నాకు తెలీదు! మా అమ్మమ్మగారు, ‘ఇంట్లో వీడి అల్లరి భరించలేకపోతున్నాం, బడికి పంపించేస్తే సరి! తిక్క కుదురుతుంది వెధవకి!’ అన్నారు. నాతో ప్రత్యేకంగా మీ పేరు చెప్పి, మీ దగ్గరకి పంపించారు. ఆవిడ మీకు, “ఎలాగైనా వీణ్ణి మీ కాలేజ్లో చేర్చెయ్యండి. వీడికి చదువు చెప్పడం, నావల్ల కావటం లేదు.” అని చెప్పమన్నారు.” అని ఒక్క గుక్కలో చెప్పేసి, అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది.
ఆవిడ చేటంత మొహం (అంటే ఎంత విశాలమో నాకు తెలీదు) చేసుకుని,
“ఎవరూ! దొడ్డమ్మగారా!” అని, మారుమాటాడకుండా నన్ను బళ్ళో చేర్చేసుకుంది.
ఆరోజే మా అమ్మమ్మ మాట, ఇంట్లోనే కాదు బయట కూడా చెల్లుతుందని నాకు తెలిసింది.
దటీజ్ మై అమ్మమ్మ!
--: oo(O)oo :--
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#57
అలా అమ్మమ్మగారి ధర్మమా అని బడిలోకి, మా అమ్మగారి (టీచర్) ఒడిలోకి చేరాను. ఆవిడ చెప్పేవన్నీ వెంటనే అప్పజేప్పేసేవాణ్ణని, నేనంటే ముద్దు! అందుకే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాళ్ళు. అలాగని అనుకునేవాణ్ణి. అదే అన్నానో రోజు గొప్పగా, ఆ కాలేజ్లోనే వేరే తరగతిలో చదివే మా చిన్నక్కతో.
అసలు నాకలా అన్నీ అంత త్వరగా ఒంటబట్టేయడానికి కారణం, మా అమ్మమ్మ. ఆవిడ శిక్షణ. క్రమశిక్షణ.
రోజూ సాయంత్రం పూట చల్లబడ్డాక, మేమంతా ఆటలు ఆడుకుని ఇంటికి చేరాక, నూతి దగ్గర స్నానాలు చెయ్యడమో, కాళ్ళూ చేతులు మొహం కడుక్కోవడమో చేశాక, ఏడు-ఏడున్నరకల్లా భోజనాలు చేసేసేవాళ్ళం.
అప్పుడు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలం మేమందరం, పెద్ద డాబా మీదకి వెళ్ళిపోయేవాళ్ళం.
అలా పెద్ద డాబా మీదకి చేరేసరికి, మా అమ్మమ్మగారు ఒకరి తరవాత ఒకరి చేత పద్యాలు, పాటలు, ఎక్కాలు, కథలు, చెప్పించేవాళ్ళు. అలా నాకు అన్నీ వేగంగా వచ్చేశాయి.
మా అమ్మమ్మగారు కొన్నాళ్ళు మా మాతామహులు పోయిన కొత్తల్లో, సంగీతం పాఠాలు చెప్పేవారుట. అయినా, మా చిన్నక్కని మాకు తెలిసిన బంధువులు ఒకాయన దగ్గరకి గాత్రం నేర్చుకోమని (అతనికి ఆ ఆర్జన కొంత ఆదరువుగా ఉంటుందని), ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గంట పంపించేది.
అప్పట్లో మాకు, బడి, ఉదయం 7 నుండి 11 వరకు; తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు రెండు పూటలా ఉండేది.
అలాగే ఆ తరవాత అక్కడి సంగీత కాలేజీలోనే మా పెద్దక్కయ్య వీణ, మా చిన్నక్కయ్య గాత్రం నేర్చుకున్నారు.
నిద్రలొచ్చే టైముకి క్రింద గదుల్లోకి వెళిపోయేవాళ్ళం. వేసంకాలం అయితే, డాబా మీదే పడకలు. ఆ పక్కలు వెయ్యడంలాటి భారీ పనులన్నీ మా పెద్దమామయ్య, చిన్న మామయ్య చేసేవాళ్ళు. వాళ్ళు అప్పటికే హైకాలేజీ! మా నాన్నగారి పెళ్ళికి మా పెద్దమామయ్యకి రెండేళ్ళే. చిన్నమామయ్యయితే పుట్టనేలేదు.
మా మాతామహులు పోయేటప్పటికి మా పెద్దమామయ్య నాలుగో క్లాసు, చిన్న మామయ్య రెండు చదువుతున్నాడు కాబోలు. అప్పటికి మా పెద్దక్కని ఇంకా బడిలో వెయ్యలేదు. మా అన్నకి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయిట. ఆసమయంలో మా అమ్మమ్మగారు పడే బాధలు చూడలేక, పిల్లల చదువులకి, వారి అభివృద్ధికి, అన్ని విధాల బాగుంటుందని తలచి, మా స్వస్థలం విజయనగరంలో మా స్వంతయింట్లో ఉండమని ఆమెని సంరక్షకురాల్ని చేశారు. అలా మా అమ్మమ్మగారిల్లే మాయింటికి వచ్చేసింది. మాకు ఇప్పటికీ రెండిళ్ళు లేవు. ఒకటే!
అదే మాయిల్లు. అదే మా అమ్మమ్మగారిల్లు.
అలా మేమంతా కలిసే పెరిగాం. ఒకటిగా. గుండమ్మ కథ వరకే కాదు. ఆ తరవాత కూడా.
అలా ‘జగదేకవీరుని కథ’ సినిమా తరవాత ఓరోజు సాయంత్రం, మా అమ్మగారు (మా టీచర్) మాయింటికి వచ్చారు.
అప్పుడు మా అమ్మమ్మగారు, మా అమ్మగారితో, “అదేంటే విడ్డూరం! శాంక్షన్ అయి ఇన్నాళ్ళయినా, ఇంకా ఒకటో తరగతి పిల్లలకీ, రెండో తరగతి పిల్లలకీ బెంచీల్లేవా? ఉత్తి నేలమీద కూర్చుంటున్నారా! ‘వీడు నీ ఒళ్ళో కూచుంటున్నాడని’ వీడి చిన్నక్క చెప్పేవరకు నాకు బెంచీల్లేవని తెలీలేదు. ఎన్నాళ్ళిలా? నన్నొచ్చి అడగమంటావా మీ హెడ్మాష్టర్ని?” అని నిలదీశారు.
అమ్మమ్మ కూడా మా వీధి బడి ఫర్నీచర్ కోసం, బీరువాలకోసం కొంత విరాళం ఇచ్చారని మా చిన్నక్కకి తెలుసు. అందుకే మా అమ్మమ్మకి ఇంకా బెంచీల్లేవని పితూరీ చేసిందేమో! అనుకున్నాను.
ఆమె బెదిరిపోయింది. “లేదు దొడ్డమ్మగారూ, తయారయిపోయాయి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తాయి. అయినా వీడికి నా దగ్గర చదువయిపోయింది. నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఒక్క క్షణం నిలకడగా ఉండడు. వీణ్ణి రెండో క్లాసుకి ప్రమోట్ చేసేస్తున్నాను. అది చెప్దామనే వచ్చాను.” అన్నారావిడ.
మా అమ్మమ్మగారు, “అంటే ఈ బడుద్ధాయిని భరించలేక నీ ఒళ్లోంచి తోసేస్తున్నావన్నమాట!” అన్నారు.
మా అమ్మగారు “ఎంత మాట, ఎంత మాట” అని భలేగా, సున్నితంగా, సుకుమారంగా, చప్పుడవకుండా లెంపలేసుకున్నారు.
“సర్లే!” అన్నారు.
అలా నాకు చేరిన సంవత్సరమే, ఒకటవ తరగతి నుండి ప్రమోషన్ వచ్చి, రెండవతరగతి పరీక్షలు రాశాను.
గుండమ్మ కథకల్లా మూడవ తరగతి.
అలా గుండమ్మ కథకల్లా, రెండో తరగతిలో ఉండడానికి బదులు, మూడవ తరగతికి వచ్చేశాను. (ఆ రోజుల్లో నాలాటి అల్లరివాళ్ళకందరికీ అదే శిక్ష!)
ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావు అనుకుంటాను కారులో సర్రుమని వచ్చి ఒక ఇంటిముందు ఆగుతాడు. ఆ దృశ్యం నా మనసులో ఎలాటి ముద్ర వేసిందంటే, చెప్తే మీరు నవ్వుతారు.
ఇంటికొచ్చాక మా అమ్మమ్మతో, “నేను పేద్దవాణ్ణయ్యాక ఒక పేద్ద బంగళా కట్టిస్తాను. అందులో బోల్డన్ని గదులు, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి.” అని ఇంకా చాలా చాలా వర్ణించానుట.
నాకు బాగా గుర్తుండిపోయింది మాత్రం,
“మనింట్లో వాళ్ళందరూ క్రింది భాగంలోనే ఉంటారు. అక్కడా పనివాళ్ళుంటారు కానీ, అందరికంటే ఎక్కువమంది పనివాళ్ళు పై అంతస్తులో, మా అమ్మమ్మకి అంటే నీకు, సపర్యలు చెయ్యటానికి ఉంటారు. ఆ మొత్తం అంతస్తంతా నీ ఒక్కర్తికోసమే.
బంగళా మెయిన్ గేటు నుంచి నువ్వుండే అంతస్తు వరకు, అక్కడనుంచి రెండో వైపు గేటు వరకు, అలా గుఱ్ఱపునాడా ఆకారంలో వెడల్పయిన పెద్ద రోడ్డు, వంతెనలా వేయిస్తాను.
ఎందుకంటే, నువ్వు బయటనుండి కారులో వస్తే, సర్రుమని సరాసరి పై అంతస్తులోని నీ గది గుమ్మంవరకు నీ డ్రైవరు నీ కారుని సునాయాసంగా తీసుకువెళిపోవాలి. పనివాళ్ళు కారు తలుపు తీస్తే, నువ్వు కారు దిగి సరసరా నీ రూములోకి వెళిపోవాలి. అందుకు.”
ఆరోజు కూడా మా అమ్మమ్మగారు, పాపం, నేను కట్టిన గాలిమేడలో తేలిపోయారు. కారులో ఆమె అంతస్తులోకి వెళిపోయారు. ఎప్పుడూలాగే నన్నామె ముద్దులతో ముంచెత్తేశారు.
నా ఊహకి, ఆమె మళ్ళీ “నే చచ్చిపోతానురా నాన్నా!” అని ఆనందంతో మురిసిపోయారు. కన్నీళ్లు కార్చేశారు.
అలా ఎన్నో సినిమాలు, నాటకాలు, సంగీత కచేరీలు వగైరాలు జరుగుతుండగా, మా పెద్దమామయ్య విజయనగరంలో చదువు చాలించి, ఉద్యోగం దొరికిందని, సంపాదన కోసం మధ్య ప్రదేశ్ వెళ్ళాడు. అది కూడా ఎక్కడ? సరిగ్గా మా నాన్నగారు పని చేస్తున్న ఊరికి దగ్గరలోనే.
మా చిన్నమామయ్యకి విశాఖపట్నం గవర్నమెంట్ పోలిటెక్నిక్ కాలేజీలో సీటొచ్చి హాస్టల్­లో చేరాడు.
అప్పటికి విజయనగరంలో మా అమ్మమ్మగారి సంరక్షణలో మా స్వంతింట్లో నేను 5, పెద్ద తమ్ముడు 3, రెండో చెల్లి 1 వ తరగతి, మాయింటిదగ్గర పురపాలక ప్రాథమిక పాఠశాలలో; మా చిన్నక్క బ్రాంచి కాలేజీలో, అన్న పెద్ద కాలేజీలో (రెండూ హై స్కూళ్ళే, పేరుకు మాత్రం కాలేజీలు) చదువుతూ, మా పెద్దక్క ప్రయివేట్­గా మెట్రిక్­కి ప్రిపేర్ అవుతూ మిగిలిపోయాం.
--: oo(O)oo :--
మరికొన్నాళ్ళకి మా అమ్మమ్మగారు, “పెద్దాడు వెళ్ళిన ఊరు ఒట్టి అడవి ఊరు. ఒక హోటల్ లేదు. పాడూ లేదు. ఏ వస్తువుకావాలన్నా పొరుగునున్న పట్నంనుంచే తెచ్చుకోవాలి. వీడికి సరయిన తిండయినా లేకపోతే ఎలాగా! వాడి ఆరోగ్యం పాడయిపోతుంది. వాడి దగ్గరకి వెళిపోతాను.” అన్నారు.
ఏం చేస్తాం! మేమంతా ఆమెను చుట్టేసుకుని బావురుమన్నాం. “నువ్వు లేకపోతే మేమెలావుంటాం!” అని బెంబేలుపడిపోయాం!
అప్పుడావిడ “నేను కూడా మీలాగే ఇదంతా నడుపుతున్నది, నడిపిస్తున్నది, నేనేనని ఇన్నాళ్ళూ భ్రమలో ఉన్నానర్రా! నడిపేది, నడిపించేది పైవాడు! నాలాగే మీరూ నడవండి.” అని బుజ్జగించారు.
అలా భారంగా కొన్నిరోజులు గడిచాయి. మాకు వేసవి సెలవులు ఇచ్చారు.
అప్పుడు మొదటిసారి మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాం. అక్కడ మా అమ్మమ్మా, పెద్దమాఁవయ్యే ఉన్నది. మాఁవయ్య ఉదయం సైకిలుమీద ఆఫీసుకి వెళ్తే, తిరిగి ఏ రాత్రికో కాని వచ్చేవాడు కాడు.
అమ్మమ్మావాళ్ళింటికి ఉత్తరం వైపు నడకదారిలో రెండు కిలోమీటర్ల పైన నడచుకుని వెళ్తే, అక్కడొక హైకాలేజీ ఉండేది. దక్షిణం వైపు ఒక కిలోమీటరు నడిస్తే కాని హైవేకి చేరం. అక్కడకి వెళ్తే కాని దుకాణాలు కనిపించవు. అవి కూడా ఓ రెండో మూడో ఉండేవి. అంతే! వాటిలో మనకి కావలసిన వస్తువులు సమయానికి దొరికాయా అదృష్టం! లేకపోతే పట్నం పోవాల్సిందే.
మా అమ్మమ్మగారింట్లో నాలుగురోజులుండి, మా వాళ్ళంతా మా నాన్నగారి దగ్గరకి వెళిపోయారు. నేను మాత్రం మా అమ్మమ్మగారి దగ్గరే ఉండిపోయాను.
ఒకరోజు, నడచుకుంటూవెళ్ళి, ఆ పల్లెటూర్లో హైకాలేజీ ఎక్కడుందో కనుక్కుని, అక్కడకి వెళ్ళాను. అక్కడ హెడ్­మాష్టారు, మరొక వ్యక్తి మాత్రమే, అతని గదిలో కూర్చునివున్నారు.
నేను మాష్టారితో, నిర్భయంగా, “ఐ యాం తెలుగు మీడియం ఫిఫ్త్ పాస్” అని ఇంగ్లీషులో మొదలెట్టి వచ్చీరాని హిందీ, ఎక్కువగా తెలుగు, అక్కడక్కడ ఇంగ్లీషు ముక్కలు జోడించి నాక్కావలసినది అడిగేశాను.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#58
అతను నా బాధని అర్థం చేసుకుని, ఇంగ్లీషులోనే, నాకర్థమయేలా, “వచ్చే నెల ఒకటో తారీఖున వచ్చి ఆరవ క్లాసులో జాయిన్ అవచ్చు. ఈలోగా మీ పెద్దవాళ్ళని, నీ ఐదో క్లాస్ పాస్ సర్టిఫికేట్, మీ కాలేజ్ నుంచి టి.సి. తీసుకుని వచ్చి నన్ను కలవమను.” అని చెప్పారు.
“నీకు ఎడ్మిషన్ ఇస్తాను గాని, ఇక్కడంతా హిందీవే, హిందీ మీడియమే! మొదట్లో నువ్వు కొంచెం కష్టపడాలి. ఫరవాలేదులే!” అని భరోసా ఇచ్చారు.
సమయం చూసుకుని అమ్మమ్మకి చెప్పాలి అనుకున్నాను.
మా అమ్మమ్మగారు, ఇంచుమించు ప్రతిరోజూ, ఏదోవొకటి కొని పట్టుకురమ్మని నన్ను హైవేకి పంపించేవాళ్ళు. నేనూ సంతోషంగా ఎగురుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి కావలసినవి కొని తెచ్చేసేవాణ్ణి.
అలాగే ఒకరోజు అర్జంటుగా పచ్చిమిరపకాయలు కావాలంటే, పరుగెత్తుకుని వెళ్ళి తెచ్చాను. అప్పుడు మెల్లిగా ఆమెతో, కాలేజీ ఎడ్మిషన్ గురించి చెప్పాలని తలచి, మరోలా మొదలెట్టాను.
“అమ్మమ్మా నేను ఇక్కడ నీతో ఈవూర్లో ఉండకపోతే, నీకూ మాఁవయ్యకీ చాలా కష్టం కదా!” అన్నాను.
వెంటనే ఆవిడ సంబరపడిపోతూ, “అవునురా నాన్నా! నువ్విక్కడే ఉండిపో! ఎంచక్కా నాదగ్గరేవుండి చదువుకోవచ్చు. మిగిలిన వాళ్ళని విజయనగరం వెళ్ళి తెలుగులోనే చదువుకోనీ.” అంటారని ఊహించాను.
అబ్బే! అలా అనలేదు.
“నేనూ విజయనగరంలో ఉన్ననాళ్ళూ ‘వీళ్ళకి నేనే దిక్కు! నేనే మొత్తం ఈయింటి భారాన్నంతా లాగుతున్నాను. నేను లేకపోతే, పాపం, వీళ్ళేమైపోతారో!’ అని సరిగ్గా ఇప్పుడు నువ్వు నాగురించీ ఎలా అనుకుంటున్నావో, నేనూ అలాగే మీగురించి అనుకునే దాన్ని. కానీ చూశావా! మీ పెద్దక్క అందుకుంది. నేను లేకపోయినా బండి సాగుతోంది. ఆగిపోలేదు.
అలా మనమెవరం, ‘ఎద్దుబండి కింద కుక్క’లా గర్వంగా ఫీల్ అయిపోనక్కరలేదు.” అన్నారు, ఆవిడ.
“ఎద్దుబండి కింద కుక్కా! అదేమిటది?” అనడిగాను.
అప్పుడు వివరంగా ఆ కథ చెప్పారు.
చివరకి, “అందుచేత నిజానికి నడిపేది ఆ బండివాడు, బరువు లాగేది ఆ ఎద్దు అయితే, దాని నీడలో సురక్షితంగా నడిచే కుక్కలాటి వాళ్ళం మనం!
కానీ, ‘మనమే అంతా! మనం లేకపోతే ఇంకేం లేదు!’ అని, మనం ఉన్నంతకాలం విర్రవీగుతాం!
నిజానికి నడిపించేది ఆపైవాడు, అది ఆరోజే చెప్పానుగా!
ఎలా జరగనున్నది అలా జరుగుతుంది. మనం మాత్రం మన పని మనం చేసుకుంటూపోవడమే!
అంతవరకే!
నాకర్థమయిందిలే నీ ట్రిక్కు.
ఈవంకన, ఇక్కడుండిపోదామని, తెలుగు నుంచి ఇప్పుడు హిందీ మాధ్యమంలో ఇక్కడ చదివీసుకోవచ్చని, నీ ఎత్తు! నాకు తెలీదనుకున్నావేంటి!” అని నన్నాశ్చర్యంలో ముంచేశారు!
“అమ్మ అమ్మమ్మా!” అనుకుని దిగ్భ్రాంతి చెందాను.
నేను తేరుకునేలోగా నా మార్గాన్ని తిరిగి మళ్ళిస్తూ, “పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యక, విజయనగరం వెళ్ళి శుభ్రంగా మన మాతృభాషలో చదువుకో. బుద్ధిమంతుడవనిపించుకో!” అన్నారు.
ఆ తరవాత నా చదువు అక్కడ సాగి, తిరిగి నేను ఉద్యోగ ప్రయత్నాల కోసం మధ్య ప్రదేశ్ చేరాను.
సరిగ్గా అప్పుడే మా మాఁవయ్యకి వైజాగ్ ట్రాన్స్­ఫర్ అయింది.
అలా మరికొన్నేళ్ళ తరవాత నాకు మాఁవయ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
“ఒరేయ్! అమ్మమ్మకేం బాగులేదు! నిన్నే కలవరిస్తోంది. ఒకసారి రారా! నిన్ను చూసయినా కోలుకుంటుందేమో!” అని ఆర్తితో అడిగాడు.
నేను ఆఘమేఘాల మీద వైజాగ్ పరుగెత్తాను.
ఆసుపత్రికి చేరి, అమ్మమ్మని చూడ్డానికి ఆ స్పెషల్ రూంలోకి అడుగుపెట్టాను.
నోట్లోంచి, ముక్కులోంచి గొట్టాలు, మెడ దగ్గర నెక్­లైనర్స్, సెలైన్. ఇవేవీ కాదు, నేను చూస్తున్నది.
ఆమె కళ్ళు!
కళ్ళు నిర్మలంగా మూసుకునేవుంది. అవి చూశాను.
పసి పిల్లాడిలా ఆమె బుగ్గల్ని తపతపలాడించాను. చలనం లేదు.
అప్పుడన్నాడు మాఁవయ్య “స్పృహలో లేదు! వస్తే ఈరోజు స్పృహ రావచ్చు! లేకపోతే, కోమాలోకైనా వెళిపోవచ్చు. చెప్పలేం!” అన్నాడు.
అప్పుడు ఆమె బెడ్ పైనే, ఆమె పక్కనే కూచుండిపోయాను. చంటిపిల్లాడిలా ఆమె గుండెలపై వాలిపోయాను.
“ ‘నువ్వే చెప్తావుగా మనం ఎద్దుబండి కింద కుక్కల్లా కాకుండా, మనం చెయ్యవలసిన పనులేం మిగిలున్నాయో సరిగా తెలుసుకుని అవి పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడమే మన పని అని. ‘లే! అమ్మమ్మా! మనం చెయ్యవలసిన పనులింకా చాలా మిగిలున్నాయి. ...” అని నా మాటలు ఇంకా గుండెలు దాటి, బయటకు రానేలేదు. కాని,
ఆమె మెదడుకి చేరినట్టు, అమ్మమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది.
రెప్పలార్పకుండా నావైపు చూసింది.
“వచ్చేవా నాన్నా!” అన్నదేమో మరి! నా చెవులకది వినిపించలేదు.
ఆ తరవాత ఆనందంతో ఆమె ఎప్పుడూ అనే మాటా వినిపించలేదు
నా కళ్ళకి మాత్రం ఆమె కళ్ళనుండి కారుతున్న అశ్రుధారలే కనబడుతున్నాయి.
కొద్ది క్షణాల్లో అవి కూడా ఆగిపోయాయి.
ఆశ్చర్యం! ఇంకా ఆమె రెండు కళ్ళూ రెప్పలార్పకుండా నావైపే చూస్తున్నాయి.
ఈలోగా సిస్టర్ పిలిచింది కాబోలు గబగబా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.
నేనిక కళ్ళార్పకుండా నన్నే చూస్తున్న మా అమ్మమ్మ కళ్ళ వైపు చూడలేకపోయాను.
గది బయటకి వచ్చేశాను.
అదీ అమ్మను కన్న అమ్మ, అమ్మమ్మ
మా అమ్మమ్మ!
ఎద్దుబండి కుక్కలా కాకుండా, ఎప్పటికప్పుడు తన కర్తవ్యాన్ని ఎరిగి తన బాధ్యతల్ని తెలుసుకుని, తను చెయ్యగలిగినది చేసి, సాగిపోయింది.
ఆరోజు ఆమె నాకా కథ చెప్పివుండకపోతే, గుణపాఠం నేర్పివుండకపోతే, ‘నేను నిమిత్తమాత్రుణ్ణి’ మాత్రమేనన్న జ్ఞానం, కలిగివుండేది కాదు!
ఈరోజుకీ అంతా నేనే, అంతా నా వలనే, అని ‘ఎద్దుబండి కింద కుక్క’లా భ్రమల్లోనే ఉండిపోయివుండేవాణ్ణేమో!
--: oo(O)oo :--
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#59
అమ్మమ్మ కథలు :- 1



అమ్మమ్మ కథలు :- 1

        అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల వద్ద విన్న కథలు అందరికీ ఎంతో ఆనందానుభూతి కలిగించేవి. అందరూ , డెబ్భై సంవత్సరాలు పైబడిన వారు కూడా వారి పెద్దవాళ్లను గుర్తు చేసుకొని అనుభూతి చెంది, అనుభవాలు కామెంట్స్ లో చెప్పితే అందరూ ఆనందిస్తారు. అలా అందరూ  ఆనందాన్ని పొందాలని చేసిన చిరు ప్రయోగంతో కూడిన ప్రయత్నం.

               @@@@@

     పదవ తరగతి చదువుతున్న చిరంజీవి తన తాతయ్య తో కలిసి "ఆదిత్య 369" సినిమా చూస్తున్నాడు. చాలా నచ్చింది. తనకు గొప్ప శాస్త్రవేత్త అవ్వాలని, ఒక అద్భుతమైన వస్తువు కనిపెట్టాలని కోరిక. తల్లిదండ్రుల కన్నా తాతయ్యతోనే ఎక్కువ చనువు.
   అందుకే అన్ని విషయాలు తాతయ్య తో పంచుకుంటాడు. ఆ తాతయ్య సామాన్యుడు కాదు. గొప్ప జ్యోతిష్కుడు, దేవీ ఉపాసనతో ఎన్నో మంత్ర సిద్ధులు సంపాదించుకున్నాడు. ఆయుర్వేద వైద్యం తెలిసినవాడు.

   సంపాదన కోసం కాకుండా ఆ ఊరి ప్రజలకు ఉచిత చికిత్స చేస్తూ, తన శక్తులను మంచికే ఉపయోగించే వాడు. ఎవరికీ నాకీ శక్తులు ఉన్నాయని చెప్పేవాడు కాదు. కొందరికి మాత్రమే ఆ విషయం తెలుసు.

    సినిమా చూడడం అయ్యాక...
        "తాతయ్యా!  ఒక టైం మిషన్ కనిపెడితే అందరూ పూర్వ కాలానికి వెళ్లి పూర్వీకులను చూసి, వారినుంచి తెలియనివి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా!" అన్నాడు చిరంజీవి

  "కానీ అది సాధ్యం కాదు కదరా!" అన్నాడు తాతయ్య.
 
  కానీ ఆ సినిమా చూసినప్పటినుంచీ అదే ఆలోచన చిరంజీవిలో. ఇంటర్  తనకిష్టమైన సైన్స్ తో పూర్తి చేసి, సెలవుల్లో మళ్ళీ తాతయ్య ఊరికి వెళదామని అనుకున్నాడు.

   ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటున్న కొడుకును గమనించిన తండ్రి విషయం ఏమిటని అడిగాడు. ఆ సినిమా చూసినప్పటినుంచి తనకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు చిరంజీవి. అప్పుడు తండ్రి...
    "మీ తాతయ్య వద్ద ఎన్నో మంత్ర సిద్ధులు ఉన్నాయి. నీ ఆలోచన మంచిదే కాబట్టి ఆయన నీకు సహకరిస్తారు. గట్టిగా పట్టుబట్టు. ఏదైనా మంత్ర సాధన చేయమంటే చేసి, విజయం సాధించు!" అని చెప్పి, ఉత్సాహపరిచాడు తండ్రి

                #####

    "తాతయ్యా! నాకు నువ్వు మంచి విషయాలు చెప్పేందుకు వున్నావు. తెలియని విషయాలు చిన్నప్పటి నుంచీ నీ వద్ద తెలుసుకుంటున్నాను! కానీ అందరికి తాతయ్యలు వుండరు కదా! వాళ్ళ అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలను చూడాలనుకునే వారికి, వారి నుంచి  మంచి విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారికి, ఎవరికి అపకారం జరుగని రీతిలో ఉండేది కనిపెట్టడానికి ఏదైనా మార్గం చెప్పవా? ఎంత కష్టమైన సాధన అయినా చేస్తాను" అని వెంటపడి అడిగాడు.
చివరకు వాళ్ల తాతయ్య...
   
     "రెండురోజులు ఆగు! చూసి చెబుతాను!" అని చెప్పాడు.

   ఆ మాటకు సంతోషించాడు చిరంజీవి.

                  ***

       ఓ రోజు చిరంజీవిని దగ్గరగా పిలిచి, ఇలా చెప్పాడు.
   "మయశిల్పి విచిత్ర మైనవి ఎన్నో తయారు చేసాడు.  మానవాళికి ఉపయోగ పడే నీ ఈ కోరికను ఆయనకు చెప్పి, ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని సాధన చెయ్యి! ఆయన అనుగ్రహం లభిస్తే నీ కోరిక త్వరలోనే సిద్ధిస్తుంది!" అని మంత్రోపదేశం చేసాడు.

    అలా ఉపదేశం పొందిన  ఆ మంత్రాన్ని దీక్షగా సాధన చేసాడు. చివరకు మయశిల్పి ప్రత్యక్షం అయ్యి అనుగ్రహించాడు.
   "ఇదిగో నువ్వు అడిగిన టైం మిషన్! ఇది ఎవ్వరికీ కనిపించదు నీకు తప్ప! కేవలం ఎవరైనా మనసులో నిన్ను తలుచుకుని వారి పేరు, ఊరు , వారి అమ్మమ్మ/ నానమ్మ /తాతయ్య పేరు ఫీడ్ చేస్తారు.
  ఆ వివరాలు నీకు చేరగానే నీవు ఈ మిషన్ లో ఫీడ్ చేయ్యాలి.  కాలంతో సంబంధం లేకుండా ఎవరు కోరుకుని, నీకు వివరాలు పంపితే, నువ్వు ఫీడ్ చేయగానే వాళ్ళు వారి అమ్మమ్మ కాలం కు వెళ్ళిపోయి, వారు చెప్పే విషయాలు విని ఆనందిస్తారు. అంతేకాదు అవి గుర్తుంటాయి కూడా వాళ్లకు!" అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు మయశిల్పి.
    ఎంతో సంతోషించిన చిరంజీవి ఆ మిషన్ ముందు కూర్చున్నాడు.

   మరి నేను నా వివరాలు చెప్పి మా అమ్మమ్మ వద్దకు కథలు వినడానికి వెళుతున్నా!

    ఇంకా ఆలస్యం దేనికి? మీరూ మనసులో తలుచుకుని చిరంజీవికి వివరాలు పంపండి. ఇంకో విషయం! అప్పుడు మనతో మంచిగా ఉండని నానమ్మలు ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఓకే నా...!

               ######

  అమ్మమ్మ చుట్టూ నేనూ మా చెల్లెళ్ళు కూర్చున్నాం. నేను అమ్మమ్మ వొళ్ళో తల పెట్టి పడుకోగానే, మా చెల్లెళ్ళు పోటీ పడ్డారు. రోజు ఒకళ్లకు ఛాన్స్ అని సర్దిచెప్పింది అమ్మమ్మ.

   "అమ్మమ్మా! ఓ మంచి కథ చెప్పవా?" అని అడిగింది మా చెల్లి.
"సరేకాని ముందు నేను చెప్పిన పద్యం చెప్పండి! తర్వాత కథ!" అనగానే బుద్ధిగా తలవూపాం.

  "చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
  బంగారు మొలత్రాడు పట్టుదట్టి,
  సందె తాయితులు సిరి మువ్వ గజ్జెలు
  చిన్ని కృష్ణా! నిన్ను చేరికొలుతూ!"

   ఇది చదివి చిన్నికృష్ణుడికి నమస్కరించాం.

  "ఒక మంచి కథ చెబుతాను అందులో నీతి ఏంటో మీరు చెప్పడానికి ప్రయత్నించాలి. సరేనా!"

   1. నమ్మకం : కథ

      ఒక ఊరికి వ్యాపార నిమిత్తం వచ్చిన వ్యాపారి అన్ని పనులు చూసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ ఊరి నుంచి తన ఊరికి  మధ్యలో నది ఉంది. గబగబా అతను వచ్చేసరికి చివరి పడవ వెళ్లి పోయింది. ఎలా వెళ్లడం? అని అక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు.

     అనుకోకుండా ఆ వైపుగా వచ్చిన ఒక సాధువు పలకరించి...
  "ఎందుకు నాయనా ఏడుస్తున్నావు?" అని అడిగాడు.

  " స్వామీ! ఏమి చెప్పమంటారు! వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చి, సరుకు అంతా అమ్మేసి, ధనం తీస్కుని వచ్చేసరికి, ఆఖరు పడవ వెళ్లి పోయింది. ఎలా ఇంటికి వెళ్ళేది? అని ఏడుస్తున్నాను!" అన్నాడు.

"రేపు ఉదయమే వెళ్ళొచ్చుగా!"

ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#60
"రేపు ఉదయమే వెళ్ళొచ్చుగా!"

   "స్వామి! ఎల్లుండే నా కూతురి వివాహం! రేపు వియ్యలవారు అడిగిన ధనం ఇవ్వాలి లేదంటే పెళ్లి ఆగిపోతుందని ఏడుస్తున్నాను!" అన్నాడు వ్యాపారి బాధగా

   అతని పరిస్థితి చూసిన ఆ సాధువుకు జాలి కలిగింది. వెంటనే తన వద్ద ఉన్న ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, ఏదో రాసి, మొత్తం మడిచిపెట్టి ఆ వ్యాపారి చేతికి ఇచ్చి, ఇలా చెప్పాడు..

   "ఇది చేతిలో పెట్టుకుని నదిపైన అడుగులు వేస్తూ నడుచుకుంటూ గబగబా ఆవలి ఒడ్డుకి వెళ్ళు! ఎటూ చూడకుండా వేగంగా వెళ్లు! నువ్వు క్షేమంగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటావు"  అని చెప్పాడు సాధువు
    ఆయన మడిచి ఇచ్చిన ఆ కాగితం పిడికిట పట్టుకుని 'జై గురుదేవా!' అంటూ సాధువును తలచుకుంటూ నది పైన నడుచుకుంటూ టకటకా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతున్నాడు ఆ వ్యాపారి.
     చివరికి ఆఖరు పడవను కూడా దాటేసి, వెళ్ళసాగాడు. ఇక మరో రెండు అంగల్లో ఒడ్డుకు చేరుకునేవాడు. అతడిలో సంతోషం, కుతూహలం కూడా పెరిగిపోయింది.
   "నది పైన నడిచే అంతటి  శక్తి ఇచ్చిన ఈ కాగితంలో ఏముందో! ఓసారి చూద్దాం!" అని అనుకుని కుతూహలంతో  ఆ కాగితం తెరిచి చూస్తాడు.
    అందులో "శ్రీరామ" అని తారకమంత్రం రాసి ఉంది.

   "ఓస్! ఇంతేనా! పేరు రాసి ఉందా?  ఇంకేముందో అనుకున్నా! ఎంత గొప్ప మంత్రం ఉందేమో అనుకున్నా!" అని పగలబడి నవ్వాడు

  ఆ వెంటనే నీళ్ళల్లో బుడుంగుమని మునిగాడు.

     నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ బుద్దివచ్చి, అజ్ఞానాన్ని క్షమించమని సిద్ధుని తలుచుకోగానే ఆ నామమే చెబుతూ ఉండు ఒడ్డుకు క్షేమంగా చేరతావు అని వినబడింది.
ఇక ఎంతో ఉత్సాహంగా రామ నామం చెబుతుంటే, నీటి ప్రవాహంలో పెద్ద అల వచ్చి ఆ వ్యాపారిని ఒడ్డుకు నెట్టి వేసింది. బ్రతుకు జీవుడా అనుకుని తప్పుగా మాట్లాడినందుకు చెంపలు వాయించుకుని ఇంటి ముఖం పట్టాడు.

దీనిలో నీతి చెప్పండి పిల్లలూ! అంది అమ్మమ్మ.

మేము ఆలోచిస్తుంటే తనే చెప్పింది.

"
ప్రతి మనిషి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు  చేసే ఏ పని అయినా త్రికరణ శుద్ధిగా చేయాలి. అనుమానంతో చేస్తే ఆ పని చెడిపోతుంది"
  "అయితే అమ్మమ్మా! ఆ వ్యాపారి నదిని దాటి ఒడ్డుకు వచ్చాక, ఆ కాగితం విప్పి చూస్తే ఏమీ అయ్యేది కాదు కదా!" అంది మా చిన్న చెల్లి.

   "పని అయిపోయాక హేళనగా మాట్లాడినా కూడా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎప్పుడు కూడా ఎవ్వరినీ హేళనగా మాట్లాడరాదు! భగవంతుడి నామం మంత్రం. నామాన్ని హేళనగా మాట్లాడితే, దైవనింద చేసినట్లే! అందుకని ఎప్పుడూ వినయంతో ఉండాలి" అని చెప్పింది

బుద్ధిగా తల ఊపి,
   " ఇక నిద్ర వస్తోంది. పడుకుందాం!" అంది తను

  "అలాగే! కానీ మళ్ళీ నేను చెప్పింది చదివి పడుకోండి!" అంది.
అమ్మమ్మ ఇలా చిన్నికృష్ణుడి పైన పాట చెప్పింది.

నందగోప కుమార నవనీత చోరా!
రుక్మిణీ సత్యభామకు మనోహారా!
ముత్యాల హారాలు కదులంగ లేరా!
ముద్దు ఇచ్చి పోర మోహనాకారా!
జో.. జో... జో..  II 2II

నిన్నరాత్రి వేళ మా ఇంటికొచ్చి నిలువుటద్దం తెచ్చి ఇచ్చినాడూ,
నీలాల బావిని తెచ్చిచ్చినాడు
నీడ చూతము రారే అని పిలిచినాడూ..
     II నందగోప II జో..జో

పిల్లనగ్రోవొక్కటి తెచ్చిచ్చినాడూ,
పిలువవే గోపెమ్మ ప్రేమతో హరినీ
జో... జో... జో
II
నందగోప కుమార II

   చెబుతూనే నిద్రపోయాం.

మరి మీరూ...
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: