Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#21
''మనవరాలు ఝాన్సీ తల్లి.. నా ముద్దుల మనవరాల.. అమ్మ.. తల్లి.. మన పెద్ద కుటుంబంలో నువ్వే ఆఖరి పెళ్లికూతురు. నేను ఒక మాట అడుగుతాను మొత్తం 50 మంది ఆడవాళ్లు చుట్టూరు ఉన్నారు కదా మన కుటుంబంలోని వాళ్ళు.. వీళ్ళందరూ ఎదురుగా మాత్రం సిగ్గుపడకుండా చెప్పాలి.. అదేరా.. అదే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా.. '' అంటూ అడిగింది. 



అమ్మాయి ఏం సమాధానం చెబుతుందో అని అందరూ చుట్టూ చేరి ఆత్రుతగా వింటుండగా ఝాన్సీ రాణి అమ్మమ్మకు బాగా దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పకుండా చెయ్యి పైకి ఎత్తి బాగా లాగి ఒక చెంప కాయ కొట్టింది. 



''చంపేస్తుంది బాబోయ్ నా మనవరాలు చంపేస్తుంది రండి బాబోయ్ '' అంటూ గట్టిగా కేకలు పెట్టింది వరాలమ్మ. 



ఆకాశంలో సడన్గా కారు మేఘాలు కమ్ముకున్నట్టు ఆడవాళ్లు తాలూకా మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లోంచి వర్షాకాలంలో కప్పల వలె బిలబిల మంటూ వచ్చేసి ఝాన్సీరాణి చేసిన పనిని గ్రహించి వాళ్ళ వాళ్ళ పెళ్ళాం ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళ వెనకాతలే వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి మరి నిలబడ్డారు.. అప్పుడు మండువా లోగిలి లో అక్కడ పెద్ద తిరునాళ్లు జరుగుతున్నట్టుగా ఉంది వాతావరణo. 



''నిండా 20 ఏళ్లు లేవు ఎంత పని చేసింది''



''వయసులో పెద్దది.. అమ్మమ్మ అని ఆలోచించాలి కదా. ముసలావిడ దవడ మీద లాగిపెట్టి లెంప కాయ కొడుతుందా?''



''అలా కొట్టడానికి కుర్ర పిల్లకు ఎన్ని గుండెలు?''



''ఇప్పుడు పోనీలే కదా అని ఊరుకున్నాం అనుకో రేపొద్దున మన ఆడవాళ్ళను కూడా ఇలాగే కొడు తుంది'''



''అందుకనే దీనిని మూల గదిలో పెట్టి మనందరం కలిసి చితగ్గొట్టేద్దాం''



''ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఎలాంటి వాళ్ళని బట్టే'''



ఇలా.. కన్న తండ్రి, బాబాయిలు, మావయ్యలు, పెద నాన్నలు సహా అక్కడ వచ్చి చేరిన మగరాయుళ్లందరూ ఎవరికి తోచిన కసిని వాళ్ళు వెళ్ళగక్కేస్తున్నారు. 



''ఏమ్మా, అమ్మమ్మను అసలు అలా దవడ మీద లెంపకాయ ఎందుకు కొట్టావు చెప్పు. అందరూ కోప పడుతున్నారు కదా ఎందుకు కొట్టాలనిపించింది నీకు చెప్పు'' అంటూ ముందుకు వచ్చి కూతుర్ని నిలదీసింది ఝాన్సీరాణి తల్లి. 



ఝాన్సీరాణి తలదించుకోకుండా తలపైకెత్తి వీరనారిలా ఇలా చెప్పింది.. 



''ఊరుకుంటానా.. చెప్తా వివరంగా.. చెప్తా వినండి. నా మీద కేకలు పెట్టిన ఇక్కడ ఉన్న మగాళ్ళ అందరి నోళ్లు మూయిస్తా. ఆడవాళ్ళ నోళ్లు కూడా మూయిస్తా.. ఇక్కడ పెళ్లయిన నాకు పిన్ని వరస అమ్మలు, వాళ్ల కూతుర్లు, పెళ్లి అయిన పెద్దమ్మలు పెద్దమ్మ కూతుళ్లు 25 మంది వరకు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కరైనా వాళ్ల పెళ్లి చూపుల సమయంలో కాబోయే మొగుడిని తల పైకెత్తి ముందుగా చూశారా లేదా చెప్పండి. 



ముందుగా పెళ్లి అయిపోయినవాళ్ళు తర్వాత పెళ్లి కావలసిన వాళ్లను నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చోపెడుతూ ఏమనేవారు.. వచ్చిన సంబంధం బాగానే ఉంది.. బాగానే ఉంది పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు.. బాగానే ఉన్నాడు.. అని మీలో మీరే అనేసుకుంటూ నిర్ణయాలు మీరే తీసేసుకుంటూ పెళ్లికా బోతున్న ఆడపిల్ల మనసును ఏమాత్రం తెలుసుకో కుండా పెళ్లిళ్లు చేసి పడేశారు. 



మన ఖర్మ కాలి మన మొగుళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికారు అని మీలో మీరే అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను చాటుకుంటా చాలాసార్లు విన్నాను. అలా మీరు మొగుళ్లను పెళ్లి చూపుల్లో చూడకపోయినా పెద్దలను ఎదిరించలేక ముసలావిడకు భయపడి, సిగ్గుపడుతూ తిరిగి మాట చెప్పలేక ఎలాగోలా పెళ్లిళ్లు చేసుకుని తగలడ్డారు. మీకు నిజంగా పెళ్లి అయిన వాడు నచ్చకపోయినా కొన్నాళ్లు బాధలు పడి కర్మలు అనుభవించి అయి ష్టంగా ఎలాగో మొగుళ్ళతో సెట్ అయిపోతున్నారు. పైగా వెధవ బోడి నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ అచ్చొచ్చిందట. 



ఇన్నాళ్లు అలా జరిగాక.. పిచ్చి సాంప్రదాయం అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో నాకు కాబోయే మొగుడుని తల పైకెత్తి చూస్తానని ముసలిది ఎలా అనుకుంది. నీకు మొగుడు నచ్చాడా.. అని.. ఎలా ప్రశ్నించిందీ అంట. అందుకే ఒళ్ళు మండి కోపం వచ్చి అమ్మమ్మ అని చూడకుండా దాని దవడ మీద లాగి లెంపకాయ కొట్టాను.. తప్పా. మా అమ్మమ్మ కదా నా ఇష్టం. '' అంది ఝాన్సీరాణి వీరనారిలాగున. 



ధనాధన్ అంతే.. ఇంచుమించు అక్కడ ఉన్న ఆడం గులు అంతా అదే బాధకు లోనయి తమ తమ మొగు ళ్ళ అష్ట వంకరలని మననం చేసుకుంటూ.. తమతమ మొగుళ్ళ వంక చిరాకుగా, అసహ్యంగా చూస్తూ.. 



''అవును.. మన ఝాన్సీ రాణి చెప్పింది నిజమే. మొగుళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నామురా బాబు'' అని తమలో తమ గొనుక్కుంటూ.. సరైన మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోలేకపోయామే అని నెత్తి బాదుకుంటూ గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. పాపం.. 



''లాగి పెట్టి కొడితే కొట్టింది కానీ మన ఆడజాతి హృదయ బాధను విప్పి చెప్పింది మన చిట్టి ఝాన్సీరాణి అనుకుంటూ మిగిలిన ఆడంగులు అంతా ఝాన్సీరాణి ని మనసారా అభినందించి ముద్దు పెట్టుకున్నారు. 



ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మగరాయుళ్లంతా తోక ముడుచుకుంటూ జారుకున్నారు. 



*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఫలించిన అమ్మమ్మ దీవెన
[Image: 3.jpg]
రచన: పూడిపెద్ది వెంకట సుధారమణ
 
"వనజా... ఇక్కడకి రా, నీకు జాగా ఉంచాను, ఇటు రా " అని జలజ పిలుస్తున్నా పట్టించుకోకుండా, తన తల్లి పక్కన కూర్చుంది వనజ పెళ్ళి భోజనానికి.



"ఏమ్మా వనజ, ఏంటి కత, అమ్మ పక్కన కూర్చున్నావు, నీ ఆరో ప్రాణాన్ని వదిలేసి" అన్న అత్తయ్య మాటలకి చిరునవ్వే సమాధానం అయ్యింది.



ఆవిడ అంతటితో ఊరుకోకుండా ""ఏమిటి జలజా.. ఏమయ్యిందే ఇలా విడి విడిగా కూర్చోని భోజనం చేస్తున్నారు. దాదాపుగా ఇరవై ఏళ్ళనుండి మీరు కలిసే భోజనం చెయ్యడమే చూసాము మేమంతా. ఇదే మొదటి సారి కదా ఇలా విడిగా కూర్చోవడం, ఇంతసేపు కలిసే ఉన్నారు కదే, మరిప్పుడేమయ్యింది" అంది.



"ఏం లేదత్తా" అంది జలజ కూడా నవ్వుతూ.



ఇదంతా గమనించిన అక్కడ వారంతా, ఏమై ఉంటుందని ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. భోజనాలు అయ్యేకా మళ్ళీ ముద్దుగుమ్మలు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని హాయిగా తిరగనారంభించారు, అసలు విషయమే పట్టించుకోకుండా.



ఇలా నాలుగు సార్లు జరిగేకా, వనజ మామూలుగానే వుంది గానీ జలజ మాత్రం లోలోపల కాస్త బాధ పడింది. ఎందుకిలా చేస్తోంది వనజక్క అని ఆలోచిస్తూ.



మరో ఫంక్షన్లో కూడా అలా విడి విడిగా కూర్చోవటం చూసిన వాళ్ళ అమ్మమ్మ ఇంక ఉండబట్టలేక "ఏమిటర్రా, ఏం జరిగింది, చాలారోజులుగా గమనిస్తున్నాను మీ ఇద్దరినీ, కలిసే వస్తారు. కలిసే తిరుగుతారు మళ్ళీ కలిసే వెళ్ళిపోతారు. మరి భోజనం మాత్రం కలసి చేయటం లేదు ఎందుకు" అని అడిగేసింది.



"అదంతే అమ్మమ్మ.. నేను భోజనానికి మాత్రం దాని పక్కన కూర్చోను" అంది నవ్వుతూనే వనజ.



అది విని జలజతో సహా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. జలజ మాత్రం ఆలోచనలో పడింది ఎందుకా అని. ఏమీ అర్థం కాలేదు కానీ ఊరుకుంది, ఎప్పుడో అప్పుడు తెలుస్తుందిలే అని. అయినా ఇద్దరూ ఎప్పటిలాగే ఉన్నారు.



సాయంత్రం ఫంక్షన్ అయిపోయి అందరూ ఇంటికి బయలుదేరుతుండగా జలజ ఏదో మరచిపోయానంటూ లోపలికి వెళ్ళగానే అదే అదనుగా వనజ మేనత్త "ఏమే వనజా.. నువ్వు మీ చెల్లి పక్కన ఎందుకు కూర్చోవట్లేదు భోజనానికి, ఏమీ లేదని మాత్రం చెప్పకు" అంది.



మారు చుట్టూ చూసుకొని, జలజ అక్కడ లేదని నిర్ధారించుకొని మెల్లగా "ఏం లేదత్తయ్యా, అది మధ్య డైటింగు పేరుతో ఏమీ తినటం లేదు, వడ్డన చేస్తున్న వాళ్ళతో అన్నీ వద్దు వద్దు అనడం లేదా కొంచెం కొంచెం వెయ్యమనడంతో వాళ్ళు దానితోపాటు పక్కన ఉన్న నాకు కూడా సరిగా వెయ్యకుండా కొంచెం వేసి వెళ్లిపోతున్నారు. ఇలా చాలా సార్లు జరిగింది, అందుకని నేను వేరేగా కూర్చోని భోజనం చేస్తున్నాను. నా సంగతి మీ అందరికీ తెలుసుగా, నేను అన్నీ ఎక్కువగానే వేయించుకుంటాను కదా, అలా అని నేను తిండిపోతును కాను సుమా, కాకపోతే అన్నీ రుచి చూసి ఏది ఎలా వుందో తెలుసుకొని, బావుంటే తినండి అనీ, లేకపోతే తినొద్దని మీ అందరికీ చెప్తాను కదా. అంటే ఒక రకంగా నేను సమాజ సేవ చేస్తున్నాను అన్నమాట " అంది నవ్వుతూ వనజ.



"ఓహో, మరైతే దానికీ ఆవిషయం చెప్పొచ్చు కదుటే, పాపం విషయం తెలియక అది లోలోపల మధనపడుతోంది అని నాకు అర్థమయ్యింది, పాపం దాని మొహం చూస్తే జాలేస్తోంది" అంది వనజ మేనత్త.



"వద్దు అత్తయ్యా.. చెప్తే నాకోసం డైటింగు మానేస్తుంది, పాపం బరువు తగ్గడానికి అది నానా ప్రయత్నాలు చేస్తోంది కదా, అవి నా వల్ల చెడిపోకూడదని, అందుకే చెప్పలేదు. అయినా దానికీ అర్థమయ్యిందిలే అందుకే నన్నేమీ అడగలేదు కూడా" అంది వనజ.



అప్పుడే అటుగా వస్తూ వీళ్ళ సంభాషణ అంతా విన్న జలజ తేలికపడ్డ మనసుతో పరిగెత్తుకొని వచ్చి వనజని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది.



అమ్మమ్మ వారి అనుబంధానికి మురిసిపోతూ, పెద్దకూతురి కూతురు వనజని, చిన్నకూతురి కూతురు జలజనీ దగ్గరకు తీసుకొని ఇద్దరి నెత్తిన రెండు మొట్టికాయలు వేసి, ఆనందంగా అక్కున చేర్చుకొని, కలకాలం ఇలా మీరిద్దరూ కలిసే ఉండాలంటు దీవించింది.



అప్పుడే ఎవరో వెనుక నుండి "ఇద్దరినీ ఒకే ఇంటికి కోడళ్ళుగా పంపేస్తే సరి" అని అరిచారు. అందరూ అవునవును అంటూ వంత పాడారు.



"వనజ పుట్టగానే మా కోడలు అనుకున్నాం, వీళ్ళిద్దరి అనుబంధం చూసి మధ్యే మా చిన్నబ్బాయికి జలజని అనుకున్నాం. ఇక త్వరలో వాళ్ళ పెళ్ళిళ్ళే" అంది వనజ మేనత్త.



అప్పటికే వాళ్ళిద్దరూ ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళడానికి, వారి పెద్దవాళ్ళంతా అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు కనుక, వాళ్ళిద్దరూ అమ్మమ్మ కాళ్ళకి నమస్కరించి "నీ దీవెన తప్పక ఫలిస్తుంది అమ్మమ్మా.." అన్నారు ఇద్దరూ ఒకేసారి.



అందరూ తేలికపడ్డ మనసులతో, ఆనందంగా బయలుదేరారు ఇళ్ళకి.
*****


 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#23
అమ్మమ్మగారిల్లు
[Image: A.jpg] 
రచన: పిట్ట గోపి



నవమాసాలు మోస్తూ ఎంతో వేదన, ఒత్తిడి, బాధలు, చివరకు పురిటి నొప్పులు నడుమ మనల్ని కన్నది అమ్మ. అమ్మ పిల్లల కోసం చేయని త్యాగం జగంలో ఏదీ లేదని అందరికీ తెలిసిందే. అమ్మ ఒక ధైర్యం, ఒక బలం, ఒక ప్రేమ, ఒక నమ్మకం ఇలా చెప్పుకుంటు పోతే అమ్మకు సాటి ఏదీ రాదు. అలాంటి అమ్మకే అమ్మ ఉంటే ఇంక అమ్మ ఎంత ధైర్యంగా ఉంటుంది.. అమ్మ ఉందని అమ్మ ధైర్యం ఎంతో.. అమ్మ ఉందని పిల్లల ధైర్యం అంతే. అలాంటప్పుడు అమ్మమ్మ ఉందని పిల్లల ధైర్యం ఇంకెంత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 



పిల్లలకు ఆపద వచ్చినా ప్రాణం కూడా పణంగా పెట్టేంత ధైర్యం అమ్మకు ఉంటే ధైర్యం కూడా అమ్మమ్మ నుండే పుట్టాలి. అంతటి శక్తి అమ్మమ్మకు ఉంది. జగములో ఏమీ ఆశించకుండా తమ కూతురు, లేదా కొడుకు పిల్లలపై అమితమైన ప్రేమను కనబరిచే వ్యక్తులు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలే. అందులోనూ కూతురు పిల్లలంటే అమ్మమ్మకి ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. 



రాజు దాదాపు పదేళ్ళ తర్వాత తాళ్ళవలసలో అడుగు పెట్టాడు. బస్సు దిగగానే అతడిలో ఉరకలెత్తే ఉత్సాహం, చిన్ననాటి జ్ణాపకాలు, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమలు, మామయ్య, మేనత్తల మందలింపులు, పిన్నమ్మ, బాబాయ్ ఓదార్పులు, బావమరుదులు, మేనకోడల్లు, తమ్ముళ్లు, చెల్లెళ్ళ తో చేసే సరదా చేష్టలు, ఊరి పిల్లలతో కలసి కొబ్బరి తోటల్లో ఆటలు, తర్వాత పంట పొలాల్లో వ్యవసాయ బోరు వద్ద స్నానాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ అతడిలో కదలాడుతున్నాయి. ఈపాటికే అర్థం అయి ఉంటుంది రాజు అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడని. 



బస్సు దిగినప్పుడు ఎంత ఉత్సాహం చూపాడో ఊరి లోపలికి వెళ్ళేందుకు కూడా అంతే ఉత్సాహం చూపాడు. ఊరు పొలిమేర దాటగానే అతడిలో ఉత్సాహం క్రమేణా సన్నగిల్లిపోతోంది. కారణం తాను ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన ఊరులా లేదు. 



ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇళ్లు, ఇళ్ల ముందు సిమెంటు రోడ్లు, ఎటు చూసినా కొత్త ముఖాలు, ఊరికి వచ్చిన కోడళ్ళు, వాళ్ళ పిల్లలు బహుశా.. అని ఊహించుకున్నాడు. మునుపటి ఉత్సాహం ఇప్పుడు లేదు రాజులో. దారిలో కనపడిన వారెవరూ అతడిని పట్టించుకోలేదు. 



కేవలం పెద్దలు, ముసలివాళ్ళు మాత్రమే పలకరించారు. 
చిన్నప్పుడు తనతో తిరిగి చిందులేసిన తన పెద్ద మామ పెద్ద కొడుకు తిరుపతి ఎదురుపడి తలెత్తి పలకరించి 
"ఇంటికి వెళ్ళు బావా, పిల్లలను కాలేజ్లో డ్రాప్ చేసి వస్తా " అని వెళ్ళాడు. 



 ఇంటికి వెళ్ళిన రాజుకి దెబ్బమీద దెబ్బపడినట్లు అయింది. పిన్నమ్మలు, వాళ్ళ పిల్లలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. అమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారనే ఆనందం ఉన్నా.. ఇల్లు ముక్కలు అయి మూడు ఇళ్లుగా రూపాంతరం అయింది. ఇది చాలక అడ్డుగోడలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు అంత పెద్ద ఇటుకల ఇల్లు, దానికి ఆనుకుని ముందు భాగం, చొప్పదండుతో నిర్మించిన చిన్న పాక.. అందరూ కలిసి ఉండే ఇల్లు ఇలా అయిపోయింది. 



ఇక్కడకి మేనమామలు అర్జెంట్ గా రమ్మని పిలవటం, గతంలో ఎప్పుడు తాను వెళ్ళినా ముందు పలకరించే అమ్మమ్మ ఇప్పుడు కనపడకపోవటంతో రాజులో కలవరం మొదలయ్యింది. ఒక మేనమామ వచ్చి రాజు భుజం పై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేస్తుండగా అమ్మ, పిన్నమ్మలు ఏడుపందుకున్నారు. అప్పటికి కానీ రాజుకి అర్థం కాలేదు, అమ్మమ్మ ఛనిపోయిందని. రాజు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అమ్మమ్మ జ్ఞాపకాలను తలుచుకున్నాడు. 



 ఈరోజుల్లో ఎవరైనా పుడితే ఆసుపత్రిలో పుడుతున్నారు కానీ పాతికేళ్ళ వెనుక మాత్రం అమ్మమ్మగారింటి వద్దే పుట్టేవాళ్ళు. అమ్మమ్మకు ఆరుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు పెద్ద కొడుకు రాజు, మరియు మరో ఇద్దరు తమ్ముళ్లు. పెద్ద కొడుకు యొక్క పెద్ద కొడుకు తిరుపతి. తిరుపతికి ఇద్దరు తమ్ముళ్లు. 
చిన్న కూతురు, చిన్న కొడుక్కి తప్ప అందరికీ పెళ్ళై పిల్లలు ఉన్నారు. 



 అందరిని ఒకే ఇంట్లో ఎటువంటి మనస్పర్థలు లేకుండా చూసిన అమ్మకు అమ్మే అమ్మమ్మ. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#24
అసలు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి అల్లరి భరించలేని తల్లిదండ్రులును చూశాం. కానీ.. ! అంతమంది పిల్లలు ఉన్నా.. ఎంత అల్లరి చేసినా.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఏం తెచ్చినా అందరికీ సమానంగా పంచిపెట్టి, ఇంటిని ప్రశాంతంగా, ఆనందంగా నడపటం అంటే మాటలు కాదుకదా. అమ్మమ్మ ఊరిలో అమ్మమ్మకు తాతయ్యకు ఉండే గౌరవమే వేరు. 




అలాంటిది వారి మనమలుగా అమ్మమ్మ విలువ వాళ్ళకి చిన్నప్పుడు తెలియకపోయినా.. ఒక వయసు వచ్చాక తెలియదా... ? అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు, మేనమామలు తిడతారు, తాతయ్య కోప్పడతాడు.



 ఎవరు ఎలాంటి భావోద్వేగాలు చూపించినా అమ్మమ్మ మాత్రం ప్రేమ అనే ఒకే ఒక్క ఆయుధం మనమలపై ఉపయోగిస్తుంది. 



అలాంటి అమ్మమ్మకు, ఊరికి.. వయస్సు వచ్చాక దూరం అవ్వల్సి వచ్చింది రాజుకి. కుటుంబం, పిల్లల కారణంగా దుబాయ్ లో పన్నిండేళ్ళగా పని చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో సొంత ఊరిలో బిజినెస్ చేసుకుందామని అమ్మమ్మను పదే పదే చూడ్డానికి కూడా వెళ్ళొచ్ఛని, చిన్నప్పుడు తమకు ఏది కావాలంటే అది కొనిపెట్టే అమ్మమ్మకు ఏది కావాలంటే అది కొనవచ్చని అనుకున్నాడు. 



ఎప్పుడో శుభకార్యం జరిగితే తప్ప అమ్మమ్మ ఊరు ఎరుగని వ్యక్తిలా మారాడు రాజు. ఏడాది కాలంగా అతడి ఫోన్ కూడా పని చేయని పరిస్థితి. అదృష్టం కొద్దీ అమ్మమ్మ పోయిన నాలుగు రోజుల తర్వాత ఫోన్ పని చేయటంతో హుటాహుటిన రమ్మన్న మేనమామ పిలుపుమేరకు వచ్చాడు. 



ఎప్పుడూ మేటర్ చెప్పకుండా పిలిచి ఆనందంలో ముంచ్ఛెత్తే మేనమామ ఇప్పుడు కూడా ఏదో శుభకార్యం కోసం పిలిచాడని ఉత్సాహంతో వచ్చిన రాజుకి తమను ప్రాణం కన్న ఎక్కువగా చూసే అమ్మమ్మ లేకపోవడంతో రోదించాడు. అది కూడా బతికుండగా ఒక్కసారి కూడా ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. 



అమ్మమ్మ దగ్గర ఉంటే సున్నపుకాయలో చిల్లర పైసలు తీసుకుని కొనుక్కునే తాము ఈరోజు డబ్బులు సంపాదించే స్థానంలో ఉండి కూడా ఏనాడూ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మమ్మ లేని ఊరు రాజుకు ఎందుకో ఎడారిలా కనిపిస్తుంది. మిగతా మనుమలంతా తనవితీర ఏడ్చి అమ్మమ్మకు కన్నీటి వీడ్కోలు పలికి ఉంటారు. రాజు మాత్రం అమ్మమ్మ చివరి చూపునకు కూడా నోచుకోలేదు. 



మనుషులు దూరమయితే తప్ప కొందరు దగ్గరకు రాలేరు. వాళ్ళ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. అమ్మమ్మ, అమ్మమ్మ ఊరంటే అందరికీ మక్కువే. అమ్మమ్మే లేకపోతే ఊరుకి విలువే ఉండదు మనుమల మనసులో. 



**** **** **** **** **** ****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#25
మరో వందేళ్లు
[Image: m.jpg]
రచన: సుజాత తిమ్మన
 
కనుకొలుకుల్లో అమ్మమ్మ రూపం కదలాడుతూ ఉంటే గుండెను కోసుకుని ఉబికి వెచ్చే కన్నీళ్లు చెంపలపై దారలు కట్టసాగాయి..



"చిన్నారి!"



అమ్మమ్మ ప్రేమతో పిలిచే పిలుపు ఇక మళ్ళీ నాకు వినిపించదు..



! నేనెంత తప్పు చేసాను.. దాదాపు పదకొండేళ్ళ అవుతుందేమో అమ్మమ్మని చూసి.. ఆవిడ అమ్మ కంటే ఎక్కువ.. పురిటిలోనే నన్ను తనచేతుల్లోకి తీసుకుంది.. నానమ్మ మూడోసంతానం కూడా ఆడపిల్లే.. అని మెటికలు విరుస్తుంటే.. అమ్మ గుక్కపట్టి ఏడుపు అట..



అందుకే నేనే పెంచుకుంటా.. అని తన ఊరుకి తీసుకొనిపోయి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అమ్మమ్మా తాతయ్యా.. పదమూడేళ్ల వయసులో తాతయ్య కాలం చేసారు.. అప్పటి నుంచి అన్ని తానై చూసుకుంది.. అమ్మ నాన్న ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చేవాళ్ళు.. పల్లెటూరు కావడం మూలంగా పదవతరగతి అవగానే హాస్టల్ లో ఉంచి చదివించింది..



మొత్తానికి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నా.. అప్పుడే అమ్మమ్మకి బాగా సుస్తీ చేసింది.. టవునుకి తీసుకోని వచ్చి పెద్దాసుపత్రిలో జాయిన్ చేసి పదిరోజులు అమ్మమ్మ దగ్గరే ఉన్నా.. అప్పుడు ఆమెకు నేను తన అమ్మలా కనిపించానట.. డిశ్చార్జ్ అయి వచ్చేస్తుంటే.. అమ్మమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టరు (కుర్ర డాక్టర్ ) రోజు ఎదో వంకతో నాతో మాట్లాడాలని చూసేవాడు..



గమనించినా.. నేను బయటపడలేదు.. అమ్మమ్మతో మాట్లాడుతూ వివరాలు అన్ని కనుక్కున్నాడు.. ఇంటికి వచ్చేసాక ఇక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను గాక వెళ్ళను.. అని తెగేసి చెప్పేశా.. అలా చదువు ఆగిపోయింది.. అమ్మమ్మకి చెట్లన్నా.. పంటలన్నా.. చాలా ఇష్టం.. ప్రతి మొక్కని ఎంతో ప్రేమతో పెంచుకునేది.. తాతయ్య తరువాత తనే పొలంలోకి వెళ్లి ప్రతి పంట.. ప్రతి చెట్టు.. గురించి వాకబు చేస్తూ కూలీలతోటే గడిపేది పగలంతా.. ఆవిడతోటి నేనుకూడా.. పొలాల మధ్యలోనే పెరిగాను..



రోజుల్లో ఎరువులు కూడా సేంద్రియమే.. విత్తనాలు శుద్దిచేసుకోవటం అన్ని స్వయంగా చేసుకునేవాళ్ళు.. ప్రతి పనిలోనూ అమ్మమ్మ దగ్గర ఉండి చేయించేది.. అందుకే నాకు కూడా పొలం గురించి పంటల గురించి బాగా అవగాహనా ఏర్పడింది..



రెండునెలలు గడవక ముందే పేరయ్యగారు సంబంధం ఉంది అంటూ డాక్టరుగారి ఫొటో వివరాలు చూపించారు.. అమ్మమ్మకి కూడా బాగా నచ్చాడు.. నన్ను అడిగితె.. నేనేమంటాను.. సిగ్గుల మొగ్గయ్యాను..



అమ్మానాన్నలకు కబురుపెట్టి అటువైపు ఇటువైపు మాట్లాడుకుని.. మొత్తానికి నా పెళ్లి డాక్టరుగారితో జరగడము.. అయనకి ఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు రావడము.. అలా ఆయనతో పాటునేను అమ్మమ్మని వదిలి రాజధానికి వెళ్లిపోవడము జరిగిపోయింది..



రెండేళ్ల వ్యవధిలో ఒక కూతురు.. ఒక కొడుకు.. మధ్య మధ్యలో ఊరికి వెళ్లినా చాలా తక్కువగా ఉండడానికి సమయం చిక్కేది.. పిల్లల చదువులు.. ఉద్యోగాలు.. కూతురు అమెరికాలో సెటిల్ అవ్వడంతో అమ్మమ్మ వందేళ్ల పుట్టినరోజుకు కూడా రావడానికి కుదరలేదు.. వందేళ్లు నిండినవి అంటే అందరు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు.. ఆవిడ అప్పటికి కూడా ఎంతో చురుకుగా తన పని తనే చేసుకునేదట.. తన నలుగురు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు కూడా వెళ్లిపోయారు.. మనవళ్లు.. మనవరాళ్లు.. ముని పిల్లలను కూడా చూసింది..



నిజంగా తన గురించి ఒక గ్రంధమే వ్రాయవచ్చు.. ఆవిడ దగ్గర నేను పెరగడం నేను జన్మలో చేసుకున్న పుణ్యమో..! ఎంత పుణ్యం చేసుకున్నా.. ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయానే అని బాధ.. నాకోసం చాలా కలవరించిందట..
కారు ఊరి పొలిమేర దగ్గరికి వచ్చేసింది.. ఎదో తెలియని తన్మయత్వం.. గాలిలోనే ఉంది.. అవును అమ్మమ్మ ఆత్మ మెత్తగా నన్ను తడుముతూ ఉంది..



***********
లాయరు గారు నా చేతిలో ఒక కవరు పెట్టారు.. "తులసమ్మగారు మీకు ఇవ్వమన్నారమ్మా.. మీ కోసం చాలా కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసారు.. "యశోద వచ్చిందా.. "అని ఊరికే అడిగే వాళ్ళమ్మా.. " అయన కళ్ళు కూడా చెమరించాయి.. నిజమే మరి.. తులసమ్మ అంటే ఊరి మొత్తానికి ఆదుకున్న అపర అన్నపూర్ణమ్మ.. ఆవిడని తలచుకోనివాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో.. !



కవరులో వీలునామాతో పాటు ఒక ఉత్తరం నన్ను ఉద్దేశించి వ్రాయించింది..



చిన్నారి ! బంధమో తెలియదు కానీ ఏడుగురు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన తరువాత నీవు నాకు బాద్యతవి అయ్యావు.. మానవరాలిగా కాక నాలో భాగంగా పెంచుకున్నారా.. అందుకే నీమీదే నా ప్రాణం.. నీదగ్గర వచ్చి ఉండమన్నావు ఎన్నో సార్లు.. కానీ మట్టిని.. ఇంటిని వదిలి కూడా రాలేను.. అందుకే ఇక్కడే ఉండిపోయాను.. ఆస్తులన్నీ అందరికి పంచి ఇచ్చాను తాతగారి హయాములోనివి.. నీకు ఇస్తున్న పదెకరాల స్థలం మాత్రం నీవు ఊరికే బీడు పోనివ్వకుండా.. పచ్చని పొలాలుగా పంటలు పంచాలి.. ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ.. పాతరోజులు మళ్ళీ రావాలి.. వచ్చిన ఆదాయం శరణార్ధులకు ఖర్చుపెట్టు.. ఇది నా ఆఖరి కోరిక..



పొలం అంతా నేను అప్పుడు కొంత అప్పుడు కొంత కూడబెట్టి కొన్నది.. కాబట్టి దీనిలో ఎవరికీ హక్కు లేదు.. పూర్తిగా నీపేరు మీద దాఖలు చేయించాను.. అమ్మలు.. పచ్చదనంలో నన్ను చూసుకోరా..
ఇట్లు అమ్మమ్మ.. తులసమ్మ..



*********
Like Reply
#26
చదివినంతసేపు నేను ఏమి పోగొట్టుకున్నానో అర్ధం అవుతుంటే.. ఇక ముందుకు నేను చేయవలసిన పనుల గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి.. అమ్మమ్మ లేని ఇల్లు ఎంతో వెలితిగా అనిపిస్తుంది.. ప్రతి వస్తువు ఆమె అనుభూతులను పంచుతూ ఉన్నాయి.. ముందుగా భర్త శ్రీకాంత్ కి విషయం అంతా వివరంగా చెప్పి వీలు చేసుకుని ఒకరోజు కోసమయినా రమ్మని చెప్పాను.. వైద్యంలో ఎన్నో మెళకువలు తెలుసుకుంటూ తనే ఒక మెడికల్ ఇంస్టిట్యూట్ ని స్థాపించి అవసరం అయినవాళ్లకు ఉచితంగా కూడా వైద్యం చేస్తున్నారు శ్రీకాంత్.. అయన రాలేదు కానీ కొడుకు అజయ్ వచ్చాడు..



మార్కెటింగ్లో యంబిచేసిన అజయ్ సొంత బిజినెస్ చేస్తూ ప్రస్తుతం " క్వాలిటీ " సూపర్ మార్కెట్ అధినేత అయ్యాడు.. దాదాపు అన్ని మహానగరాలలో  సూపర్ మార్కెట్స్ ఉన్నాయిఅయినా నా విషయంలో శ్రద్ధతీసుకుని వచ్చాడు అంటే.. నిజంగా చాలా సంతోషం వేసింది.. పొద్దున్నే భూములు చూడటానికి పాలేరును వెంటతీసుకుని బయలుదేరాము.. అంతా డొంకదారి..
అయినా అజయ్ చిన్నపిల్లాడిలా ఆనందపడుతున్నాడు.



. "మమ్మీఅమ్మమ్మగారి ఇల్లు పాతకాలం నాటిది అయినా ఎంత విశాలంగా..  కళాకండంలా ఉంది.. ఆకాలంలోని వస్తువులు కూడా ఇంకా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు.. చెక్కు చెదరలేదు మమ్మీ.. అయ్యోఅదేమిటి లేక్.. ఇన్నిక్రేన్స్ ఒకే దగ్గర.. బాప్రే.. !" ఆశ్చర్యంతో కేరింతలు కొడుతుంటే.. పక్కనే ఉన్న పాలేరు కోటేశం 'బలేవారే సినబాబుగారు.. " నవ్వుతూ అంటున్నాడు..



అవునాన్నా.. ! మా అమ్మమ్మ చాలా పద్దతిగా ఉండేవారు.. పనివాళ్ళతో పాటు తాను తిరుగుతూ ప్రతి వస్తువును శ్రద్దగా శుభ్రం చేయించేవారు.. " అమ్మమ్మ గురించి చెప్పమంటే.. ఇలా చెప్పుకుంటూ పోతాను..



****



పొలంలోకి అడుగు పెట్టగానే నేను పదిహేనేళ్ల పిల్లనయిపోయాను.. నలభైఏళ్లు వెనక్కి వెళ్లి..



కోటేశం చెప్పుకుంటూ పోతున్నాడు నడుస్తూ.. "దాదాపు ఏడేళ్లవుతుందమ్మా..  భూమిలో పంటలేసి.. భావులెండిపోయినవి.. నీటి ఎద్దడి.. తులిశమ్మగారు కాలు చెయ్యి ఆడినంతకాలం పొలం మంచిగా పండించారు..  తరువాతే పట్టించుకునేవాళ్ళు లేక ఇలా బీడయిపోయింది.. కానీ శ్రద్దగా చూసుకుంటే మంచి దిగుబడి వచ్చే పంటలు పండుతాయి.. సారవంతమయిన నేలమ్మా.. అయినా మీకు తెలియంది కాదు గా.. "



ఏప్రిల్ నెల కావడం మూలాన ఎండబాగా కాస్తుంది.. అలవాటు లేని అజయ్ చెమటలు తుడుచుకుంటూ.. ఉష్.. ఉష్ అనుకుంటూ అటు ఇటూ చూస్తూ నడుస్తున్నాడు..



********
ఇంటికి తిరిగి వచ్చినతరువాత అజయ్ తో అన్ని విషయాలు చర్చించుకున్నాము.. సిటీకి వెళ్లి అక్కడ నేను చేసేది ఏమి లేదు.. కోడలు అన్ని సమర్ధవంతంగా చూసుకుంటుంది.. కాబట్టి అమ్మమ్మ కోరిక ప్రకారము నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేయించాలని నిర్ణయించుకున్నాను.. దానికి అజయ్ కూడా ఒప్పుకున్నాడు..



శ్రీకాంత్ అయితే.. ' వయసులో నీకు ఇవన్నీ అవసరమా యషు!' అని అడ్డు చెప్పబోయాడు కానీ 'మీలాగే నేను కూడా ఇష్టమయిన పని చేయాలనుకుంటున్నా..  సరికి అడ్డుచెప్పకండిఅని బతిమాలుకున్నా..



నా స్నేహితురాలు పక్కఊరిలోనే వుంది అని తెలిసి వెళ్లి కలిసాను.. గట్టిగా వాటేసుకుని కళ్లనీళ్లు పెట్టేసుకుంది నిర్మల.. ఒకటా రెండా.. నలభయ్యేళ్ళు అయింది నన్ను చూసి.. తన భర్త కాలంచేసారని.. ఒక్క కొడుకు సిటీలో ఉద్యోగంతో అక్కడే సెటిల్ అయ్యాడని.. ఎకరం పొలం చిన్న ఇల్లు తన ఆస్తి.. అలాగే గడుపుతున్నానని చెప్పి బాధపడింది.. నేను తీసుకున్న నిర్ణయం చెప్పి.. తనని కూడా నాతో పాటు ఉండమని ఒత్తిడి చేశాను.. ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో నేను ఉండలేనని చెప్పడంతో ఒప్పుకుంది..



ముందుగా పొలంలో బోర్ లు నాలుగు వేయించాను.. వ్యవసాయం లోని మెళకువలు గురించి రైతు సంఘాలకి వెళ్లి కనుక్కున్నాను.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కారిక్రమాలలో విత్తన శుద్ధి ఒకటని తెలుసుకుని వాటిల్లో పాల్గొని విత్తనాలు ఎలా శుద్ధి చేయాలో తెలుసుకున్నాను.. ఆవు మూత్రం, . ఆవు పేడబెల్లంపప్పుల పొడిపుట్టమన్ను కలిపి ఘనద్రవజీవామృతం తయారుచేయటం.. వరి పైరుకు చల్లతెగులు తగిలితే ఎలా మజ్జిగతో మందును తయారుచేసి పిచికారీ చేస్తారో.. అన్ని సేంద్రీయ పద్ధతులన్నీ కూలంకుషంగా నేర్చుకుని.. గ్రామం లోని యువతని ఒక్కచోట చేర్చి అన్ని విషయాలు తెలియజేసి.. పంటలు బాగా పండితే.. ఎవరు దున్నుకుంటే  భూమిలో పండిన పంట వాళ్ళకే అని చెప్పాను.. అందుకే యువత అంతా ముందుకు వచ్చారు..



ఋతుపవనాలతో నల్లని మేఘాలుగా వచ్చి వర్షం కురిపించగానే.. పొలం పనులలోకి దిగాను.. అన్నిటిలోను నాకు తోడుగా నిర్మల వెంటనే వుంది.. పదెకరాల భూమి ఆరునెలలు తిరిగేసరికల్లా.. పచ్చని పంటనించే బంగారు భూమిగా మారిపోయింది.. ఏపుగా ఎదిగిన పైరు కళ్ళకి ఇంపుగా.. మనసుకు నిండుగా.. ఇదే విదంగా రెండేళ్లు మంచి దిగుబడి వచ్చింది.. చిన్నప్పుడు నేర్చుకున్న విత్తన శుద్ధిలోని మెళకువలు ఉపయోగించి ఇంటిదగ్గరే మంచి నాణ్యమయిన విత్తనాలను తయారు చెయ్యటం మొదలుపెట్టాము.. మా విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి ఇతర రైతులకు సబ్సిడీ ధరలకు విక్రయించేది.. ఇవన్నీ చెయ్యటంలో ఎంతో సంతృప్తిని పొందుతూ.. అమ్మమ్మని తలుచుకుంటూ ఉన్నా..



అందరికి అన్నిపంచి ఇచ్చినా.. ఇంకా మిగిలిన డబ్బుతో  ఇంటిని అనసూయ ఆశ్రమంగా మార్చి.. శరణార్ధులకు ఆశ్రయం కల్పించాను..  చుట్టూ ప్రక్కల గ్రామాలకంతటికి మేలయిన సలహాలని ఇస్తూ.. కావలసినవాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ.. అనసూయమ్మకి వారసురాలిని అనిపించుకున్నా..  రోజు అమ్మమ్మ మా అందరిని వదిలి వెళ్లిపోయిన రోజు.. అమ్మమ్మ చిత్రపటానికి తోటలో పోసిన సన్నజాజి పూల మాల వేస్తూ.. 'వందేళ్లు నీవు బ్రతికావు.. మరో వందేళ్లు మమ్మల్ని బ్రతికిస్తూ.. నీవు బ్రతికే ఉంటుంన్నావు అమ్మమ్మా.. 'అనుకుంటూ అంజలి ఘటించాను.



********సమాప్తం********
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#27
స్థితప్రజ్ఞస్య కా భాషా….
 
[Image: v.jpg]
రచన: వసుంధర
కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు.
అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు.
'స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్'
స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు.
కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, సాధారణ వ్యక్తులు సైతం స్థిత ప్రజ్ఞులుగా ఎలా మారవచ్చో ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చాలా చక్కగా వివరించారు.
చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలుని చంపడానికి కొందరు పైనుంచీ కర్రలతో కొడుతున్నారు. దారిలో వెడుతున్న సాధువు దృశ్యం చూసి, “తాబేలుని తిరగేసి కొడితే సులభంగా చస్తుంది. అది మీకు తెలియకుండా చేసి తాబేలు ప్రాణాలు కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడో కదా!” అని వెళ్లిపోయాడు.
సాధువు దేవుణ్ణి మెచ్చుకున్నాడా, లేక తాబేలు చావుకి కారకుడయ్యేడా అన్నది విడమర్చి చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం నాది సాధువు పరిస్థితి. నా భార్య వసుధ తాబేలు. ఆమె చావుని కోరేవారు కొందరున్నారు. వారి కోరికను సఫలం చేసే చిట్కా నాకు తెలుసు.
వసుధకీ నాకూ పెళ్లై నాలుగేళ్లయింది. మాకింకా పిల్లలు లేరు. కారణం జాగ్రత్తపడడం కాదు. వసుధ శరీరం మాతృత్వానికి అనుకూలంగా లేదన్న విషయం మాకు పెళ్లయిన రెండేళ్లకే తెలిసింది. మూడేళ్ల చికిత్స, లక్షల్లో ఖర్చు. రెండూ చేస్తే ఆమె శరీర పరిస్థితి గర్భధారణకు సానుకూలం కావచ్చన్నారు. సత్ఫలితానికి గ్యారంటీ ఇవ్వలేదు.
పురుడు మగువకు పునర్జన్మ అంటారు. కానీ వసుధకి అది జన్మవిముక్తి కావచ్చని డాక్టర్ల భయం. అద్దె గర్భం సూచించారు కానీ దానికీ లక్షలు ఖర్చవుతుంది. పైగా వసుధకి అదిష్టం లేదు. మా బిడ్డని తనే నవమాసాలూ మోసి కంటానంటుంది.



మనకి పిల్లలొద్దుఅని నేను గట్టిగా అంటే వసుధ వింటుంది. కానీ అనను. అనకపోతే వసుధ కూడా నన్ను తప్పు పట్టదు.
నేను మళ్లీ మా అమ్మానాన్నలకి దగ్గరవడానికి మాకు పిల్లలు అవసరమని తనకి తెలుసు. అదీకాక తనవల్లే- నేనూ, మావాళ్లూ విడిపోయామని తనలో అపరాధభావం కూడా ఉంది. పిల్లల వంకతో మావాళ్లు నన్ను రెండో పెళ్లికి బలవంతపెట్టే అవకాశముందన్న భయం కూడా ఆమెలో ఉంది. పైకి అనదు- నేను నొచ్చుకుంటానని!



రెండో పెళ్లి విషయంలో ఆమెది భయం కాదనీ, నిజమేననీ నాకు తెలుసు. కానీ ఆమెకి చెప్పలేదు- ఎలా చెప్పాలో తెలియక!
మాది ప్రేమ పెళ్లి. దాని భవిష్యత్తు ఇప్పుడు వసుధ మాతృత్వంతో ముడిపడింది. తను రిస్కు తీసుకుంటానంటోంది. ఒప్పుకుంటే నేనామెను ఆత్మహత్యకు ప్రోత్సహించినట్లే! ఇంకా చెప్పాలంటే అది హత్య కూడా!



నేను స్వార్థపరుణ్ణి కావచ్చు కానీ దుర్మార్గుణ్ణి కాను. ఇక హంతకుణ్ణి కావడమంటే- ఆలోచనే తట్టుకోలేను.
అందుకే మధ్యేమార్గంగా మా అమ్మమ్మని ఎన్నుకున్నాను.
-----
మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.
సమాజంలోనైనా సామాన్యులదే మెజారిటీ. స్థితప్రజ్ఞులది మైనారిటీ. దుర్మార్గుల సంఖ్య మైనారిటీ చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, దుర్మార్గులుగా మారే సందర్భాలు సామాన్యులకి కూడా తరచుగా ఏర్పడుతుంటాయి.
అలా మా ఇంట్లో నేను సామాన్యుణ్ణి. మా అమ్మమ్మ స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుంది. అమ్మమ్మకు చిన్నతనంలోనే భర్త పోయాడు. అప్పటికామెకు ఇద్దరు కూతుళ్లూ, కొడుకూ.
ఇరవై ఎకరాల పొలముంది. మంచి మనసు. జాలిగుండె. అందర్నీ ఇట్టే నమ్మేస్తుంది. ఎవరి గురించీ పొల్లుమాటనదు.
తనపై నింద వేసినవారిని కూడా తప్పు పట్టదు. వీలైనంతలో సాయం చేస్తుంది. ప్రాణం పోతున్నా దేహీ అనదు.
ఇలా చెప్పుకుంటారు ఆమె గురించి. ఆమెతో సాన్నిహిత్యముంటే అది నిజమేననిపిస్తుంది.
కూతుళ్లు పెళ్లవగానే అత్తారింటికి వెళ్లిపోయారు. కొడుకు చదువయ్యేక పెళ్లి చేసుకుని
ఇల్లరికం వెళ్లిపోయాడు. తను మాత్రం డెబ్బై నిండినా పిల్లల వద్దకు వెళ్లదు. స్వగ్రామంలోనే ఉంటోంది.
అమ్మమ్మది పెద్ద చెయ్యి. అయినవాళ్లకి పెట్టుపోతల్లో లోటు రానీదు. తన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించదు. ఇప్పటికి తనకి మిగిలింది ఇల్లూ, నాలుగెకరాల పొలమే ఐనా, అవే తనకి ఎక్కువంటుంది.
ఒంటరిదయ్యేక, అమ్మమ్మ దైవధ్యానంలో పడింది. నిత్యం ఆంజనేయస్వామి ఉపాసన చేసేది. ఫలితంగానేమో ఆమెకి అపూర్వశక్తి వచ్చిందంటారు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడెక్కడి విశేషాలో చూసి చెప్పగలదు. భవిష్యత్తులోకీ తొంగిచూడగలదు. చాలామంది ఆమె వద్దకు వచ్చి ప్రశ్నలడిగి లబ్ది పొందిన విశేషాల్లో కొన్నింటికి నేనూ ప్రత్యక్షసాక్షిని.
కొందరికి నిధులు, లంకెబిందెల ఆచూకీ చెప్పింది. కొందరికి అరుదైన పత్రాలు ఎక్కడున్నాయో చెప్పింది. కొందరికి వ్యాపారం లాభసాటో చెప్పింది. కొందరికి దొంగల్ని పట్టిచ్చింది. కొందరిళ్లలో అపార్థాలు పోగొట్టింది. ఐతే ఎదుటివారికి తనవల్ల లక్షల్లో లాభమొచ్చినా సరే, తను మాత్రం నామమాత్రంగా నూటొక్క రూపాయలే తీసుకునేది.
అదేంటి అమ్మమ్మా!’ అని నేనంటే, ‘స్వామి నాకు చెబుతున్నాడు. అందుకాయన నన్నేమడగడం లేదు. ఆయన చెప్పిందే చెప్పే నేనెలా అడుగుతాను? తీసుకునే నూటొక్క రూపాయలూ కూడా నాక్కాదు. ఇచ్చినవాళ్ల పేరున అర్చన జరిపిస్తానుఅంది అమ్మమ్మ.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#28
చిత్రంగా అనిపించింది. డబ్బుకోసం కాకపోతే, ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? పేరు కోసమా అనుకుంటే- అమ్మమ్మ తన గురించి ప్రచారం చేసుకోదు. ఆమెవల్ల లబ్ది పొందినవారే ఆమెకు ప్రచారకులు. అలా ఆమెవద్దకు వచ్చివెళ్లేవాళ్ల సంఖ్య చెప్పుకోతగ్గదే ఐనా-
మీడియాలోకి ఎక్కేటంత గుర్తింపు ఆమెకి లేదు.
హేతువాదిని కాబట్టి అమ్మమ్మ అపూర్వశక్తిని కొట్టిపారెయ్యాలి. అలా చెయ్యను. అలాగని ఆమె అపూర్వశక్తిని నమ్మనూ లేను.
కొందరికి ఎదుటివాళ్ల ఆలోచనల్ని చదివే నేర్పు ఉంటుంది. తెలిసిన విశేషాల్ని సమకూర్చి- జరిగిన పాత విశేషాల్నీ, జరుగబోయే కొత్త విశేషాల్నీ ఊహించే ప్రతిభ ఉంటుంది.
అలాంటివాళ్లు చెప్పింది నిజమైతే అది కాకతాళీయం. జనం అలా అనుకుందుకు ఇష్టపడరు. వారి శక్తిని గౌరవిస్తారు.
వాళ్లు చెప్పింది నిజం కాకపోతే- జనం వారి శక్తిని శంకించడానికి ఇష్టపడరు. అలాంటివి మర్చిపోయే ప్రయత్నం చేస్తారు.
అలాంటి ప్రతిభావంతుల్లో కొందరు జ్యోతిష్కులుగా స్థిరపడతారు. కొందరు బాబాలౌతారు.
అమ్మమ్మ తను బాబాని అనదు. తనది జ్యోతిష్కమనదు. ఆమె వద్దకొచ్చేవారు ప్రశ్నతో వస్తారు. జవాబు అందుకుని వెడతారు.
అమ్మమ్మ జవాబు తప్పు అయిన సందర్భం ఒక్కటీ నాకు తెలియదు. ఐనా నేనామె శక్తిని ఒప్పుకోను.
ఇక అమ్మమ్మతో నా అనుబంధం విషయానికొస్తే- పిల్లలెవరికైనా అమ్మమ్మలంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కానీ ఆమె మనవలు, మనవరాళ్లలో- ఆమెకు నేను, నాకు ఆమె మరింత ప్రత్యేకం.
అమ్మమ్మ నీతులు చెబితే కథల్లా ఉండేవి. కథలు చెబితే ప్రవచనాల్లా ఉండేవి. పాట పాడితే లలితగీతంలా ఉండేది. తెలిసినవాళ్ల గురించే చెప్పినా- వాళ్ల గురించి అంతవరకూ తెలియనివెన్నో తెలిసేవి. ఆమె కళ్లతో చూస్తే ప్రపంచంలో అంతా మంచివాళ్లే. ఎవరిలోనైనా చెడు కనిపిస్తే- అది మనలోపం!
అమ్మమ్మా! నువ్వో సూతమహర్షివిఅన్నానోసారి.
దానికామె నవ్వి, “నువ్వు నాకు శౌనకుడివి. ఐతే నువ్వొక్కడివే శౌనకుడివిఅని, “నువ్వు
చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అంది.
మామూలుగా అందనుకున్నాను కానీ- స్వార్థాన్ని అదుపు చేసుకోవడం ఎంత కష్టమో-
వసుధతో పెళ్లయినాకే తెలిసింది.
-----
పెళ్లంటే నూరేళ్లపంట కావచ్చు. కానీ ప్రేమ నూరేళ్లపంట కాదు.
పెళ్లికి ప్రాతిపదిక ప్రేమ ఐతే అప్పుడు పెళ్లీ నూరేళ్లపంట కాదు.
చేదు నిజాన్ని నేను వసుధని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక గ్రహించాను.
అదీ వసుధ కాదు- నేను మాత్రమే గ్రహించాను.
పాపం, వసుధ ఇంకా ప్రేమనీ, పెళ్లినీ కూడా నూరేళ్లపంట అనే అనుకుంటోంది.
నేను మాత్రం నా మనసులో ఏముందో బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాను. నిజానికి వసుధకి ప్రేమపై నమ్మకం లేదు. ప్రేమించానంటూ నేనే తన వెంటబడ్డాను. అలాగని నాదీ ప్రేమ అనుకోను.
నేను ఆఫీసులో చేరిన రెండేళ్లకు నాకు పెర్సనల్ అసిస్టెంటుగా చేరేదాకా వసుధ ఎవరో కూడా నాకు తెలియదు.
ఆఫీసుకి ఇంచుమించు వళ్లంతా కప్పిన చుడీదార్లో వచ్చేది.
బాపు-రమణల సినిమాల్లో హీరోయిన్లలా మేకప్ లేని అందం. కళ్లలో- అందాన్ని రెట్టింపు చేసే అమాయకత్వం.
ఆఫీసులో ఆమెకి డ్యూటీ తప్ప మరేం పట్టేదికాదు. ఐతే పలకరించినవారికి ఆహ్లాదకరమైన చిరునవ్వుతో బదులిచ్చేది.
పియ్యే కావడంవల్ల నాతో సన్నిహితంగా ఉండేదామె. అప్పుడు నాలో మగాడికి మనసు చలించేది. ఐతే అది ప్రేమ కాదు.
మనసు మంచిది, వయసు చెడ్డది అన్నాడు సినీకవి. కానీ చెడ్డతనంలో మనసు వయసుకేమీ తీసిపోదని- వయసులో ఉన్న మగాడిగా నాకు తెలుసు. మగాడికి వసుధ కావాలనిపించింది.
పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు కాబట్టి ఆమెపై నాకున్నది మోహమే కానీ, ప్రేమ కాదు. అదీకాక అప్పటికే నా మేనమామ వెంకట్రావు కూతురు వేణిని నాకు అనుకుంటున్నారు. ఏడాదిలో తన డిగ్రీ పూర్తి కాగానే, నిశ్చితార్థం- వెంటనే పెళ్లి అని లోపాయికారీ కబురు. అందుకు నేను అభ్యంతరం చెప్పనూ లేదు.
వేణి కురూపి కాదు కానీ అందగత్తె కూడా కాదు. నాకైతే ఆకర్షణీయంగా అనిపించదు. ఐతే నా మేనమామ ఎంత డబ్బైనా ఇచ్చి వరుణ్ణి కొనగల ఆస్తిపరుడు. డబ్బు నాకు చేదు కాదు.
రూపం విషయానికొస్తే, మేమూ కాస్త ఉన్నవాళ్లమే ఐనా. ‘అందం కొరుక్కు తింటామా?’ అంది అమ్మ. ఇక్కడ సమస్య ఏంటంటే, వసుధది కొరుక్కు తినాలనిపించే అందం కావడం.
అంటే వేణిని పెళ్లాడే ముందు నాకు వసుధపై ఉన్న మోహం తీరాలి. ఆలోచన తప్పని నాకు అనిపించలేదు.
పెళ్లికిముందు మగాడు ఎలా తిరిగినా, పెళ్లయ్యేక మాత్రం భార్యకే కట్టుబడి ఉంటే- మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చెయ్యొచ్చట. అందుకని పెళ్లికిముందు ఎలాగో తిరగడమే నియమంగా పెట్టుకునే మగాళ్లున్నారు.
వాళ్లని ఆదర్శంగా తీసుకున్నాను.
వసుధ ఉద్యోగిని. వయసులో ఉంది. ఆపైన నేనామెకు బాస్.
ప్రయత్నిస్తే లొంగుతుందనే నమ్మకం. మా సంబంధాన్ని రహస్యంగా ఉంచితే అది తప్పుగా భావించదనీ నాకు నమ్మకమే.
నిజానికి నాది ఆశ. దాన్ని నమ్మకంగా భ్రమిస్తున్నానని అనుమానముంది. ఐనా నా ఆలోచన మారలేదు కానీ ఇతరత్రా ఏమాత్రం చనువివ్వని ఆమెకు నా మనసులో ఉద్దేశ్యం తెలియజేసేదెలా?
అందులోనూ- ఆమె ఎప్పటికప్పుడు నన్నెక్కడుంచాలో అక్కడే ఉంచుతోంది.
కాలేజి రోజుల్లో మురళి అనే మిత్రుడుండేవాడు. అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేవాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#29
(05-09-2025, 10:30 PM)k3vv3 Wrote: అందులోనూ- ఆమె ఎప్పటికప్పుడు నన్నెక్కడుంచాలో అక్కడే ఉంచుతోంది.
కాలేజి రోజుల్లో మురళి అనే మిత్రుడుండేవాడు. అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేవాడు.

Interesting story, K3vv3 garu!!! Looks like the hero is a selfish person..Let us see how this story ends.

clp); clp);
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#30
యువతీయువకులకి పరస్పరం ఆకర్షణ సహజం. అందుకు ఇద్దరికీ తాత్కాలికమైన ఆసరా ఇచ్చేదే ప్రేమ. నూటికి తొంబైతొమ్మిది ప్రేమలు అలాంటివే. కొన్నాళ్లు ప్రేమికుల్లా కలిసి తిరగడం, తర్వాత విడిపోవడం. పూర్వం దాన్ని మోసం అనేవారు. ఇప్పుడు దాని పేరు లవ్ బ్రేకప్. మోసపోయానని అనుకునే బదులు లవ్ బ్రేకప్ అంటే గౌరవంగానే కాదు, గొప్పగా కూడా ఉంటుంది. బ్రేకప్ సంప్రదాయం పుంజుకున్నాక సమాజంలో ప్రేమజంటల సంఖ్య పెరుగుతోందిఅన్నాడు.
నేను బ్రేకప్ కోసమే వసుధని ప్రేమించాలనుకున్నాను. అందుకు ఏకాంతంలో మురళి చిట్కాలు వాడాను.
వసుధ నా పియ్యే కదా, ఆఫీసులో మా ఇద్దరికీ ఏకాంతం తరచుగానే లభిస్తూంటుంది. కాఫీకి పిలిచాను, రానంది. తన పుట్టినరోజు తెలుసుకుని ఖరీదైనదే గిఫ్టిచ్చాను, వద్దంది. తన అందాన్ని పొగిడాను, అయిష్టంగా వింది తప్ప థాంక్సు కూడా చెప్పలేదు.
మరే దారీ తోచక, “నేను నిన్ను ప్రేమిస్తున్నానుఅని చెప్పేశాను ఓసారి.
ఆమె నన్నదోలా చూసి, “మీ ఇంట్లో చెప్పారా?” అంది.
ఖంగు తిన్నాను. అది ప్రశ్నో, షరతో తెలియలేదు. అందుకని, “ఇది అర్థం లేని ప్రశ్న.
చెప్పానని నీతో అన్నాననుకో. చెప్పానో లేదో నీకెలా తెలుస్తుంది?” అన్నాను.
మీరు ఇంట్లో చెబితే చాలు. నాకు తెలియడమెందుకు?” అందామె.
అర్థం కాలేదు, “అంటే?” అన్నాను.
మీ పెద్దలు ఒప్పుకుంటే, నా అన్నావదినెలు వాళ్లని కలుసుకుంటారుఅంది వసుధ. అర్థమయింది. నేను ప్రేమ గురించి మాట్లాడితే ఆమె పెళ్లి గురించి మాట్లాడుతోంది. “మరి నీకు అభ్యంతరం లేదా?” అని జవాబు వినడానికి చెవులు రిక్కించాను. నన్ను కాస్త పొగుతుందేమోనని ఆశ!
అభ్యంతరమెందుకు?” అందామె.
నా ఛాతీ ఉబ్బింది, “అంటే నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావా?” అన్నాను.
అమ్మానాన్నా ఉన్నప్పుడు ప్రేమంటే కొంత తెలిసేది. ఇప్పుడు నాకు ప్రేమంటే తెలియదుఅందామె.
గతుక్కుమన్నాను.
తనకు అమ్మానాన్నా లేరనీ, అన్నావదినెలకు భారంగా ఉంటోందనీ- మాటల సందర్భంలో చెప్పిందోసారి. నేపథ్యంలో ఇప్పుడన్నది గుండెలు పిండేసే మాట. కానీ నేను ముందుకెళ్లాలంటే, గుండెను దూరం పెట్టక తప్పదు.
ప్రేమించకుండా పెళ్లెలా చేసుకుంటావ్?” అన్నాను అట్నించి నరుక్కొద్దామని.
పెళ్లయ్యాకనే ప్రేమంటే తెలుస్తుందని ఎక్కడో చదివానుఅందామె.
అర్థమైపోయింది నాకు. ఆమె ప్రేమకు లొంగదు. ఆమెను స్వంతం చేసుకోవాలంటే పెళ్లి చేసుకోక తప్పదు.
అందంగా ఉంది. మంచమ్మాయి. ఉద్యోగం చేస్తోంది.
పెళ్లి చేసుకోవచ్చు- పర్యవసానానికి తట్టుకోగలిగితే….
మేనక కోసం విశ్వామిత్రుడు ఏళ్ల తరబడి చేసిన తపోఫలాన్ని వదులుకున్నాడు. ఐనా
ఆయన మేనకని పెళ్లీ చేసుకోలేదు, కూతురి బాధ్యతా తీసుకోలేదు.
వసుధ నాకిప్పుడో మేనక. ఎటొచ్చీ తనకితానుగా నా వెంటబడలేదు కాబట్టి- ఆమెను నా దాన్ని చేసుకుందుకు నేనామెను పెళ్లి చేసుకోక తప్పదు.
నాది మోహమేనని తెలుసు. ఐనా దానికి ప్రేమ అన్న పేరెట్టి ఇంట్లో చెప్పాను.
పెద్ద గొడవయింది. నేను దృఢంగా ఉన్నాను.
మాకూ వెంకట్రావు మామయ్యకీ చెడిపోయింది. నేను దృఢంగా ఉన్నాను. ఆవేశంలో అమ్మ, నాన్న కూడా నాతో తెగతెంపులు చేసుకుంటామన్నారు. నేను దృఢంగా ఉన్నాను.
అప్పుడు రంగంలోకి దిగింది అమ్మమ్మ. అమ్మమ్మకి నా మరదలు వేణి అంటే కూడా చాలా ఇష్టం. నాకూ, వేణికీ పెళ్లి చెయ్యలన్న ఆలోచన మొదట తనలోనే పుట్టిందట. అలా మొదలెట్టి, నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నేను దృఢంగా ఉన్నాను.
అప్పుడు అమ్మమ్మ అమ్మకీ, మామయ్యకీ నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. వాళ్లూ దృఢంగా ఉన్నారు.
వాణ్ణి సమర్థిస్తే- నీకూ మాకూ కూడా చెడిపోతుందిఅని వాళ్లామెను హెచ్చరించారు కూడా.
తర్వాత అమ్మమ్మ వసుధతో మాట్లాడింది. తర్వాత నాతో, “వసుధ చాలా మంచిది. తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది. మీ మధ్య తేడాలొచ్చినా నీవల్లే తప్ప తనవల్ల జరుగవు. విషయం మర్చిపోకుఅంది. నిజానికది నాకు హెచ్చరిక. అప్పటికది దీవెన అనుకున్నాను నేను.
కానీ నాలుగేళ్ల కాపురం తర్వాత-
-----
నాతో దాంపత్యజీవితాన్ని అంకితభావంతో స్వీకరించింది వసుధ.
ఆమె అందం, అమాయకత్వం, మంచితనం, నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. క్రమంగా నాకే ఆమెపై మోహం చల్లారింది.
అమ్మా నాన్నల కోపం ఇంకా అలాగే ఉంది. వాళ్ల సంపదకి ప్రస్తుతం నా తమ్ముడే ఏకైక వారసుడు.
నామీద కోపంతో నా మేనమామ వెంకట్రావు డబ్బుపోసి నా పెళ్లయిన ఆర్నెల్లకే నన్ను తలదన్నే అల్లుణ్ణి తెచ్చుకున్నాడు. అల్లుడి వైభోగం విన్నాక నేనేం కోల్పోయానో తెలిసొచ్చి, ‘అందం కొరుక్కు తింటామురాఅన్న అమ్మ మాట జీవితవాస్తవంలా తోస్తోంది.
ఇప్పుడు వసుధ అందం కొరుక్కు తినాలనిపించడంలేదు. ఆమెనే కొరికి చంపెయ్యాలనిపిస్తోంది.
ఐనా మధ్యతరగతిలో దుర్మార్గంతో పాటే సంస్కారమూ కొంతైనా సహజీవనం చేస్తుంది కాబట్టి- మనసులోని అసంతృప్తిని వసుధకి కూడా తెలియనివ్వకుండా రోజులు గడిపేస్తుంటే- అనుకోకుండా ఘోరం జరిగిపోయింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#31
పెళ్లై ఏడాదైనా తిరిగిందో లేదో, వేణి భర్త కారు ప్రమాదంలో చనిపోయాడు.
మనసులో ఎంత కోపమున్నా, రక్తసంబంధంకదా! ఓదార్పుకి మామయ్యింటికి వెళ్లాను. అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని వసుధని మాత్రం తీసుకెళ్లలేదు.
ఆశ్చర్యంగా అక్కడ అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య అంతా నాపట్ల సుహృద్భావం చూపించారు. మామధ్య ఏమీ జరుగనట్లే మసిలారు.
మేమంతా మళ్లీ ఎప్పటిలా కలిసిపోగలమని ఆశ పుట్టింది నాలో.
ఐతే, వెళ్లేటప్పుడు అమ్మ నన్ను పక్కకు పిలిచి, “పిల్లలు పుట్టే యోగ్యత లేనిదానికి పెళ్లామయ్యే అర్హత లేదు. ఎలాగో అలా దరిద్రాన్ని వదిలించుకో. మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చుఅనడంతో నా భ్రమలన్నీ తొలగిపోయాయి.
అప్పుడు మాకు కాస్త దూరంలో అమ్మమ్మ ఉంది. తనా మాటలు విన్నట్లే ఉంది.
ఒక్కసారి నేను వీడితో మాట్లాడతాను. కాస్త పక్కకి వెడతావా?” అంది అమ్మతో.
అమ్మ అక్కణ్ణించి వెళ్లిపోయేక, “మీ అమ్మ చెప్పిందాన్నిబట్టి నీకేమర్థమయింది?” అంది అమ్మమ్మ నాతో.
ఒకసారి అమ్మ మాటలు విశ్లేషించుకున్నాను మనసులో.
అర్థం కావడానికేముంది- మేం మళ్లీ కలవాలంటే- వసుధకి పిల్లలు పుట్టాలి. లేదూ- వసుధని వదుల్చుకోవాలి. అదే అమ్మమ్మకి చెప్పాను.
అమ్మమ్మ తల అడ్డంగా ఊపింది, “ఇది సమయం కాదని డొంకతిరుగుడుగా చెప్పింది మీ అమ్మ. నాకలాంటి బాధ లేదు కాబట్టి సూటిగా చెబుతున్నా, వినుఅంది.
ఆమె చెప్పింది విని షాక్ తిన్నాను.
వేణి ఇప్పటికీ నన్నే ఇష్టపడుతోందిట. తండ్రి బలవంతంమీద పెళ్లి చేసుకుని అయిష్టంగా కాపురానికెళ్లింది. ఇప్పుడు భర్త పోతే పోయేడన్న దిగులు కూడా లేదు తనలో.
నేను వసుధని వదుల్చుకుంటే, వేణిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మామయ్య ఉద్దేశ్యం. దానికి అమ్మ సపోర్టుంది.
మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చుఅన్న అమ్మ మాటల వెనుక ఇంత గూఢార్థముంది.
అమ్మలో అంత దుర్మార్గమా అని ఆశ్చర్యపడుతుంటే, “ఇంతకీ నీకు ఆశ్చర్యం కలిగిందా, కోపమొచ్చిందా?” అంది మనసు.
కిరీటం ఇట్టా పెట్టుకుంటావా, ఇట్టా పెట్టుకుంటావా?” అన్నరాజరాజ చోరసినిమాలో సరదా డైలాగులాంటిది కాదు ప్రశ్న!
నా వ్యక్తిత్వాన్ని సవాలు చేసే ప్రశ్న అది!
నాదాకా వచ్చేసరికి ఇబ్బందిగా ఫీలై, మనసుని పక్కకి తోసి, “ఇంతకీ నేనేం చెయ్యాలని నీ ఉద్దేశ్యం?” అన్నాను అమ్మమ్మతో.
మనుమరాలు జీవితం బాగుపడాలని అమ్మమ్మకీ ఉంటుంది. తనెంత మంచిదైనా తనదాకా వస్తే ఆలోచనలు వేరే వెడతాయి.
అమ్మమ్మ నా ప్రశ్నకి తడుముకోలేదు, “మనసు చిక్కబట్టుకుని ఇంటికెళ్లు. వసుధతో ఇక్కడ జరిగింది చెప్పు. ఇద్దరూ ఆలోచించుకుని నిర్ణయానికి రండిఅంది.
ఆశ్చర్యపోయాను.
నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!’ అని హెచ్చరించిన అమ్మమ్మ- ఇప్పుడు అమ్మ మాటల్లోని స్వార్థాన్ని నిరసించకుండా, ఆలోచించమని అంటుందేమిటి?
స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుందనుకున్న అమ్మమ్మలో ఇంత స్వార్థమా?
బాగా ఆలోచిస్తే అమ్మమ్మ నేననుకున్నంత గొప్పది కాదనిపించింది. ఆమె అపూర్వశక్తీ పూర్తిగా నిజం కాదనిపించింది.
తనకే గనుక అపూర్వశక్తి ఉంటే- నా పెళ్లికీ, వేణి పెళ్లికీ పర్యవసానాలు ముందే తెలిసేవి. ముందే హెచ్చరించేది!
విషయం స్ఫురించగానే వసుధని వదుల్చుకునే విషయంలో, అమ్మమ్మ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను.
స్వార్థం తెలివిని మింగేస్తుందంటారు. కానీ అది నా తెలివికి పదునెక్కించింది. నా మనసులో పథకం రూపు దిద్దుకుంది….
-----
ఇంటికెళ్లేక అమ్మమ్మ మాటలు మినహాయించి, మామయ్యింట్లో జరిగింది చెప్పాను. ముందు వసుధకి కలిగింది సంతోషం, “అంటే మీవాళ్లు మనవాళ్లయ్యే సమయం దగ్గర్లోనే ఉందిఅంది.
అది నీ ప్రాణాలకి రిస్కు. రిస్కు నాకిష్టం లేదుఅన్నాను మనస్ఫూర్తిగా కాకపోయినా.
నాకేమీ కాదు. మీరున్నారుఅంది వసుధ. అప్పుడు నాకామె గొర్రెలా కనిపించింది.
అద్దంలాంటి ఆమె ముఖంలో నేను కసాయి రూపంలో ప్రతిఫలించాను.
మాతృత్వంపైన కాంక్షో, నన్ను మావాళ్లతో కలపాలన్న అభీష్టమో, అసహాయతో చెప్పలేను.
ఆమె తన ప్రాణాలు రిస్కులో పడినా సరే, తల్లి కావడానికే నిశ్చయించుకుంది.
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఆమె తల్లి కావాలంటే నేనామోదించాలి. ఆమోదిస్తే- అది హత్యే అంది మనసు. కాదనడం ఆత్మవంచనే ఔతుంది. చివరికి నన్నెంతగానో నమ్మిన వసుధకి కూడా మనసులో ఏదో మూల చివుక్కుమనకుండా ఉండదు.
ముందే ఆలోచించుకున్న పథకం ప్రకారం- అప్పుడామెకు అమ్మమ్మ అపూర్వశక్తిని మరింత గొప్పగా వివరించి, “ఓసారి తన సలహా తీసుకుందాంఅన్నాను.
నాకైతే విషయంలో ఎవరి సలహా అక్కర్లేదు. నిర్ణయం ఐపోయిందిఅంది వసుధ దృఢంగా.
నీకోసం కాదు. నాకోసంఅన్నాను లౌక్యంగా.
ఏదో యథాలాపంగా అడగడం వేరు. విషయమై పనికట్టుకుని ఆమెవద్దకెళ్లడం బాగుండదుఅంది వసుధ.
అదీ ఆలోచించాను. మీ అన్నావదినెల్ని తీసుకెడదాంఅన్నాను ఠక్కున.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#32
వసుధ వదిన పద్మ తండ్రికి కూతురు, తర్వాత కొడుకు, తర్వాత పద్మ. అంతా పెళ్లిళ్లై కాపురాలు చేసుకుంటున్నారు. ఆయన రెండేళ్ల క్రితం చనిపోయాడు. పోయేముందు తను కొన్న స్థలాల్లో రెండింటిని చెరో ఆడపిల్ల పేరిటా వ్రాసి, కాగితాలు పోస్టులో పంపేట్ట. ఇటీవల స్థలాల ధర బాగా పెరగడంతో పద్మ అక్క వాటిని అమ్మబోతూ, విషయం చెల్లికి చెప్పింది. అంతవరకూ పద్మకి స్థలం గురించి తెలియదు. తండ్రి పంపేడంటున్న కాగితాలు పద్మకి అందలేదు. అక్క మాటమీద స్థలాన్ని చెల్లికివ్వడానికి అన్నగారు ఒప్పుకోవడం లేదు. రెణ్ణెల్లుగా వాళ్లింట్లో విషయమై గొడవలౌతున్నాయి.
మా అమ్మమ్మని ప్రశ్న అడుగుదాం. పని జరిగిందీ, మీవాళ్లకి లాభం. మనకీ ఆమె సలహామీద ధైర్యంఅన్నాను.
వసుధ కళ్లలో తడి. “మీకు నామీదే కాదు. మావాళ్లమీద కూడా ఎంత కన్సర్న్ అండీఅంది.
గతుక్కుమన్నాను. నా ఆలోచనే వేరు. గత అనుభవాల్ని బట్టి అమ్మమ్మ కాగితాల ఆచూకీ చెప్పగలదనే నా నమ్మకం. ఐతే మెడికల్ సైన్సుకే కొరుకుపడని సమస్య వసుధది. ఐనా తన మనుమరాలు వేణి భవిష్యత్తు బాగుండాలని, తప్పక వసుధని తల్లి కమ్మని ప్రోత్సహిస్తుంది అమ్మమ్మ. అన్నగారి విషయంలో జరిగిన అద్భుతమే తన విషయంలోనూ జరుగుతుందని వసుధ నమ్ముతుంది. నా నిజాయితీని కూడా నమ్ముతుంది.
మీ వాళ్లకి ఫోన్ చెయ్యిఅన్నాను వసుధతో.
-----
అంతా అనుకున్నట్లే జరిగింది.
మీ ఇంటిపక్క విజయేశ్వరి అని ఒకావిడుంది. మీరింట్లో లేకపోతే, ఉత్తరాన్ని ఆమె తీసుకుంది. అదామె తన బీరువా లాకర్లో ఎడం పక్క మూలగా దాచి, తర్వాత విషయం మర్చిపోయింది. ఆమెకి మతిమరుపెక్కువ కదా! ఐనా ఫరవాలేదు. కవరింకా పెట్టినచోటే ఉంది. వెళ్లి తెచ్చుకోండిఅంది అమ్మమ్మ వసుధ అన్నా వదినెలతో.
తమ ఇంటిపక్క విజయేశ్వరి గురించి ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్పడంతో వసుధ అన్నావదినెల అశ్చర్యానికి అంతు లేదు.
పద్మ వెంటనే విజయేశ్వరికి ఫోన్ చేస్తే అమ్మమ్మ చెప్పింది నిజమేనని తేలింది. కాగితాలు దొరికాయి.
వసుధ అన్నావదినెలు అమ్మమ్మకు సాష్టాంగపడిపోయారు.
అబద్ధమెందుకూ క్షణంలో నేనే షాక్ తిన్నాను.
పద్మకి క్షణంలో వచ్చిన లాభం లక్షల్లో ఉండొచ్చు. కానీ అమ్మమ్మ వాళ్ల దగ్గర నూటొక్క రూపాయలు మాత్రమే తీసుకుంది.
ఎలాగూ వచ్చాం కదా అన్నట్లు మా సమస్య కూడా అమ్మమ్మకి చెప్పాను. వేణికి అమ్మమ్మగా- తనేం చెబుతుందని ఊహించానో, ఇంచుమించు అదే చెప్పింది అమ్మమ్మ.
నీకు మహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుడుతుంది. అత్తవారి ఆదరణ లభిస్తుంది. ఐతే నీ పురుడు హాస్పిటల్లో కాదు. ఇక్కడే ఊళ్లో నా ఇంట్లో పోస్తానుఅంది అమ్మమ్మ.
అమ్మమ్మ పట్ల అరాధనాభావంతో చూస్తున్న వసుధ కళ్లలో సంతోషంతో కూడిన మెరుపు కనిపించింది.
అర్థమైపోయింది నాకు. అమ్మమ్మలో స్వార్థం దుర్మార్గం స్థాయి కూడా దాటిపోతోంది.
అమ్మమ్మా! నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ, పురుడు మంచి హాస్పిటల్లో పోయడం మంచిదేమో!” అన్నాను.
అమ్మమ్మ నవ్వి, “డాక్టర్లు వాళ్లు చెప్పాల్సింది చెప్పారుకదా! వాళ్లకి తెలిసినంతవరకూ వాళ్లు చెప్పింది నిజమే! కానీ లోకంలో విజ్ఞానానికి అందని విశేషాలు చాలా ఉన్నాయి. అవి చర్చలతో అర్థం కావు. స్వామి నాకు చెప్పాడు- వసుధకి ఇక్కడ పురుడు పొయ్యమనీ, అందుకు మనూరి మంత్రసాని ఎల్లాయమ్మ సాయం తీసుకోమనీ. పురుడు పొయ్యడంలో తనకి తెలిసిన ఒడుపులు- పేరుపడ్డ వైద్యులకి కూడా తెలియవని పేరు. నీకు తెలుసో తెలియదో, అప్పుడప్పుడు పట్నంనుంచి తనకోసం కబురొస్తుంటుంది. తనకి అనుభవమే తప్ప, శిక్షణ లేదు. వయసుమీద పడ్డప్పట్నించీ మంత్రసాని పని మానేసింది కానీ, నేను చెప్పిన కేసులు మాత్రం కాదనదు. మా ఆధ్వర్యంలో వసుధ పండంటి బిడ్డని ఎత్తుకోవడం గ్యారంటీ. అదే గ్యారంటీ ఇచ్చే డాక్టరుంటే మాత్రం వసుధ పట్నంలోనే పురుడు పోసుకోవచ్చుఅంది.
అమ్మమ్మ ఇచ్చే గ్యారంటీ మేలు చేసేది వసుధకా, వేణికా అన్నది నాకు అనుమానమే! కానీ పట్నంలో అలాంటి గ్యారంటీ ఇచ్చే డాక్టర్లు, హాస్పిటల్సు లేవు.
అక్కడున్న గ్యారంటీ- ఖర్చుకే!
మా ఇద్దరి ఓటూ అమ్మమ్మకే పడింది…..
-----
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#33
వసుధకి మూడో నెల. హాస్పిటలుకి తీసుకెడితే డాక్టర్లు బాగా తిట్టారు. వసుధ మాత్రం చాలా సంతోషంగా ఉంది.
చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలులా ఉంది వసుధ. అమ్మ, నాన్న, మామయ్య, అత్త, వేణి- అదృశ్యంగా ఉన్నారు ఆమె చుట్టూ. పెద్దదౌతున్న పొట్ట ఆమె మృత్యురహస్యంలా ఉంది. రహస్యం తెలిసీ, ఉపేక్షిస్తున్న వాళ్లం నేను, అమ్మమ్మ!
అపరాధభావం వేధిస్తుంటే, తప్పించుకునే దారి వెదుకుతుంటే- అప్పుడు తట్టింది నాకు! వేణికి నేనంటే ఇష్టం. ఇష్టమే ఆమె భర్త అకాలమరణానికి కారణమైంది. అంటే- మన అభీష్టం మంచిదైతే- దేవుడే దారి చూపిస్తాడు. వసుధ విషయంలోనూ ఏది మంచో ఏది చెడో నిర్ణయం దేవుడికే వదలడం మంచిది.
అదే చేశాను. వసుధకి ఐదో నెల రాగానే అమ్మమ్మ ఇంట్లో దిగవిడిచి వచ్చాను.
తర్వాత అంతా యాంటీక్లైమాక్స్-
అంతా అమ్మమ్మ చెప్పినట్లే జరిగింది.
వసుధకి సుఖప్రసవమై శ్రీమహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది.
చూడ్డానికి అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, వేణి కూడా వచ్చారు. పాపని ముద్దులాడారు.
వసుధని స్నేహభావంతో పలకరించారు.
అమ్మమ్మ ఇంట్లో ఉన్నందున వసుధ గురించి నాకు హాస్పిటలు ఖర్చులు కూడా లేవు. పురుడు పోసిన మంత్రసాని ఎల్లాయమ్మని కానుకలతో ముంచెత్తాలనుకున్నాను. కానీ అమ్మమ్మ, “తనిప్పుడు వెయ్యిన్నూట పదార్లు మించి ఒక్క పైసా తీసుకోదురాఅంది. మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.
సమాజంలో లబ్దప్రతిష్ఠులైన చాలామంది రాగద్వేషాలకు అతీతం కాదనడానికి ఎన్నో నిదర్శనాలున్నా- వారిని వేదికలపైస్థితప్రజ్ఞులుఅని పొగడ్డం రివాజు. నాకు తెలిసిన స్థితప్రజ్ఞుల జాబితా వెయ్యమంటే- ఇంతవరకూ నేను వెయ్యగల పేరు అమ్మమ్మది మాత్రమే. వసుధ పురుడు తర్వాత ఇప్పుడా జాబితాలో అమ్మమ్మకు తోడుగా ఎల్లాయమ్మ కూడా చేరింది!
నాకూ జాబితాలో చేరాలని ఉంది. అందుకు ఏం చెయ్యాలి?
నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అన్న అమ్మమ్మ మాటలు చెవుల్లో గింగురు మన్నాయి.….
------


 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#34
(13-09-2025, 05:02 PM)k3vv3 Wrote: నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అన్న అమ్మమ్మ మాటలు చెవుల్లో గింగురు మన్నాయి.….
------  

Nice, K3vv3 garu!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#35
దత్తత
[Image: d.jpg]
రచన : బివిడి ప్రసాదరావు



"రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను.
"సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్.
తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం.
కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్.
***
ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం.
రూం వద్దకి చేరాం.
నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్పాగా" చెప్పాను.
"లంచ్ టైంకి వచ్చేస్తావా." అడిగాడు కిరణ్.
"సాధ్యపడితే వచ్చేస్తా. లేటైతే ఫోన్ చేస్తా." చెప్పాను.
"సరే. నువ్వు నా బైక్ తీసుకెళ్లు." కిరణ్ చెప్పాడు.
నేను బైకు పుచ్చుకున్నాను.. స్టార్ట్ చేశాను.
కిరణ్ రూం వైపు కదిలిపోయాడు.
నేను.. నా పనికై కదిలాను.
దార్లో.. బైక్ లో పెట్రోల్ పోయించాను.
నేను ఆఫీస్ లో చేరిన రోజునే.. కిరణ్ నన్ను కోరి కలిశాడు. అతడి రూంలో..
షేరింగ్ పేమెంట్ తో.. నాకు వసతి చూపించాడు.
కిరణ్ చాలా చొరవైన వాడు. చురుకైన వాడు. నాకు ఇట్టే నచ్చేశాడు.
నేను.. కిరణ్ తో కలిసి.. అతడి బైక్ మీదే.. ఆఫీస్ కి వెళ్లడం.. తిళ్లకి వెళ్లడం..
రూంకి రావడం.. సదా సవ్యంగా సాగిపోతున్నాయి.
నేను ఉద్యోగ రీత్యా ఊరు రాగానే.. కొత్త ప్లేస్.. అనే భావం రాకుండా పోయింది
కిరణ్ మూలంగా.
కిరణ్ ది రాజమండ్రి. తండ్రి, తల్లి, చెల్లి ఉన్నారట. తండ్రి క్లాత్ షాప్ రన్ చేస్తున్నాడట.
కిరణ్ తొలుతగా కాకినాడలో జాబ్ చేసేవాడట. ట్రాన్స్ఫర్ మీద గుంటూరుకి వచ్చి ఏడాదవుతుందట. ఒక కొలీగ్ పరిచయంతో.. ఇప్పుడు మేము ఉంటున్న రూంలోకి షేరింగ్ చెల్లించి చేరాడట. కొలీగ్ ట్రాన్స్ఫర్ కావడం.. ప్లేస్ లోకి నేను రావడంతో.. అతడి ప్లేస్ లోకి.. కిరణ్.. నన్ను ఆహ్వానించుకున్నాడట.
నేను విజయవాడ నుండి ఇక్కడకి వచ్చాను.
నాకు తల్లిదండ్రులు.. తోబుట్టువులు లేరు.
మాది కొత్తపేటట. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు ఒక బస్సు ప్రమాదంలో చనిపోయారట. నన్ను అమ్మమ్మ చేరతీసి.. తను ఉంటున్న బుర్లంకకి నన్ను తీసుకు వచ్చేసిందట.



అమ్మమ్మ మూడిళ్లల్లో ఉదయం పూట పని మనిషిగా తిరుగుతూ.. మిగతా సమయంలో కూలి పనులు చేస్తూ.. నన్ను పెంచింది. చదివించింది.
నేను డిగ్రీ పట్టా పొందిన రోజునే.. అమ్మమ్మ గుండె పోటుతో.. సడన్ గా మరణించింది.
అమ్మమ్మ ఉన్నన్నాళ్లు నా కోసమే తపించింది.. శ్రమించింది. నన్ను చాలా ఇదిగా సాకింది.



నా చిన్నప్పుడు.. అమ్మమ్మ పని చేస్తున్న ఒక ఇంటి వారు.. నన్ను దత్తతకి అడిగారట. వాళ్లకి సంతాన యోగ్యత లేదని.. అమ్మమ్మ నా పట్ల పడుతూన్న అవస్థలని గమనించి.. నన్ను తమకి ఇచ్చేస్తే.. పెంచుకుంటామని ప్రాధేయపడ్డారట.
అమ్మమ్మ ససేమిరా అనేసిందట. తను పస్తులు ఉండైనా.. నన్ను పెంచి పెద్ద చేసుకుంటానని.. నా కాళ్ల మీద నేను నిలబడిన రోజున.. నా నీడన చక్కగా తను బతుకుతానని.. అమ్మమ్మ గట్టిగా చెప్పేసిందట.



పాపం అమ్మమ్మ.. నన్ను నిలబెట్టేసి.. తను పోయింది.
నేనే ఆమె తపనని తీర్చలేకపోయాను. అందుకు నేను చాలా చింతిస్తున్నాను.
అమ్మమ్మ పేరున ఏమైనా చేయాలి. ఆమె నా చెంత పొందాలనుకున్న స్వేద..
ఆమె లాంటి వారికి చవి చూపాలి. తద్వారా.. ఆమె పట్ల నా కర్తవ్యం సక్రమంగా నిర్వహించి పెట్టాలి.



అందుకై.. నేను ఆలోచన చేశాను. ఒక నిర్ణయానికి వచ్చేశాను. పని మీదే వెళ్తున్నాను.
ఎడతెరిపి లేని హారన్ ధ్వనితో తేరుకున్నాను.
వెనక్కి చూశాను. లారీ..
బైక్ ని.. రోడ్డు అంచుకి చేర్చాను.
నన్ను దాటుకొని.. లారీ వెళ్లి పోయింది.
నేను స్తిమితమై.. నేను వెళ్ల తలచిన చోటు వైపుకి.. స్థిరంగా బైక్ ని నడిపాను.
కొంత సేపటికి చోటుని చేరుకున్నాను.



బైక్ ని బయట.. ఒక పక్కన నిలిపి.. అక్కడ ఆఫీస్ రూం లోకి నడిచాను.
అక్కడ నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
అక్కడ అతను.. గుమస్తాట. నన్ను కూర్చోమన్నాడు.
నేను గుమస్తా ఎదుట.. కుర్చీలో కూర్చున్నాను.



"ఏం కావాలి" గుమస్తా మెల్లిగా అడిగాడు.
"మీ ఆశ్రమము నుండి.. ఒక పెద్దావిడ పోషణ బాధ్యతని.. నేను తీసుకో తలిచాను." నికరంగా చెప్పాను.
"అంటే.. సరిగ్గా చెప్పండి" గుమస్తా అడిగాడు.
వెంటనే ఏమి చెప్పాలో.. ఎలా చెప్పాలో.. నాకు అర్ధం కాలేదు.
"అదే.. ధన సహాయం చేస్తారా.. ఎంత.. ఎలా చేయాలనుకుంటున్నారు."
గుమస్తా అప్పుడే అడిగాడు.
"అదేమీ.. అలానేమీ కాదు. నాతో పాటు ఉంచుకుంటూ.. ఆవిడని నా అమ్మమ్మ మాదిరిగా పోషించుకుంటా." చెప్పాను.



గుమస్తా ఏమీ అనడం లేదు. నన్నే చూస్తున్నాడు.
"పద్ధతి చెప్పితే.. ఒక పెద్దావిడని చేర తీస్తాను." చెప్పాను.
కొంత సంభాషణ తర్వాత.. గుమస్తా నన్ను ఒక హాలు లోకి తీసుకు వెళ్లాడు.
అక్కడ.. పది.. పదిహేను మంది.. పెద్దవారు ఉన్నారు.
అక్కడ.. ఒక పక్కన.. వంట పనులు జరుగుతున్నాయి.
"ఆడవాళ్లు నలుగురే ఉన్నారు. వాళ్లలో ఒక్కరే ఒంటరి వారు. మిగతా ముగ్గురుకి భర్తలు ఉన్నారు." చెప్పాడు గుమస్తా.



నేను అటే చూస్తున్నాను.
" పసుపు రంగు చీరలో ఉన్న ఆవిడే.. ఒంటరిది." గుమస్తా చెప్పాడు.
ఆవిడని చూశాను.
ఆవిడని గుమస్తా పిలిచాడు.
ఆవిడ మా వద్దకి వచ్చింది.
"నీకు వసతి.. వేరే చోటున కల్పిస్తే.. వెళ్లగలవా" ఆవిడని అడిగాడు గుమస్తా.
ఆవిడ ఆయోమయమవుతుంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#36
"అంటే.. నన్ను మరో చోటుకి పంపించేస్తారా. వద్దు వద్దు. నేను ఇక్కడే ఉండి పోతాను. ఇక్కడ వాళ్లతో నాకు బాగుంది." చెప్పింది ఆవిడ.
గుమస్తా నన్ను చూశాడు.
నేను ఆయన్నే చూస్తున్నాను.
"ఇక్కడ వారిపై.. ఎట్టి ఒత్తిడి తేకూడదు. ఆశ్రమము యజమాని.. చాలా పకడ్బందీగా ఉంటారు." గుమస్తా చెప్పాడు.
నేనేమీ అడగలేకపోతున్నాను.



ఆవిడ గందికగా తన వారిని పిలవగా.. వాళ్లు మా వద్దకి వచ్చారు.
వాళ్లతో.. "నన్ను ఇక్కడ నుండి పంపేస్తారట" ఆవిడ చెప్పుతుంది.
"అబ్బే.. అదేమీ లేదు." గుమస్తా తంటాలు పడుతున్నాడు.
నేనేమీ అనలేకపోతున్నాను.
"ఈయన.. ఒక ఆవిడని చేరతీసి.. తన అమ్మమ్మలా పోషిస్తానని వచ్చాడు. అందుకే.." గుమస్తా చెప్పుతున్నాడు.



"అయ్యో.. వద్దొద్దు.. పెనమ్మీద నుండి పొయ్యిలోకి తిరిగి పడడం మాకు వద్దు.
ఏదో మీ చలువతో.. పంచన బతుకు ఈడుస్తున్నాం. మా వాళ్ల దాష్టికం నుండి విముక్తి అయ్యామనుకుంటున్నాం. దయచేసి తిరిగి రొచ్చులోకి మాలో ఒక్కరినీ తోసేయకండి. మమ్మల్ని ఇక్కడ.. ఇలా బతకనీయండి." ఎవరో.. ఒక పెద్దాయన గడగడా అన్నాడు.
నేను అవస్థ అవుతున్నాను.. అయోమయమవుతున్నాను.
అది గమనించినట్టు.. గుమస్తా.. నన్ను అక్కడ నుండి తిరిగి ఆఫీస్ రూంలోకి తీసుకు వచ్చేశాడు.



ఇద్దరం ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం.
"మీ పని కాదు" చెప్పాడు గుమస్తా.
"అయ్యో.. అలా అనేస్తారేమిటి. ఎంతో ఆలోచించి వచ్చాను. నేను అనుకున్నట్టు కుదిరితే.. రెండు గదుల ఇల్లు ఒకటి అద్దెకి తీసుకోవాలని.. కావలసిన సామాగ్రిని కొనుగోలు చేసుకోవాలని.. నాతో వచ్చిన ఆవిడని చక్కగా చూసుకోవాలని.. అబ్బో.. ఎన్నెన్నో అనుకొని.. వచ్చాను" చెప్పాను.
గుమస్తా నన్నే చూస్తున్నాడు.



అంతలోనే ఒక ఆయన మా వద్దకి వచ్చాడు.
గుమస్తా లేచి నిల్చున్నాడు.
వచ్చిన ఆయన.. గుమస్తా ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు.
గుమస్తా కదిలి.. నా పక్క కుర్చీలో కూర్చున్నాడు.
నాతో.. "ఆయన ఆశ్రమము యజమాని" చెప్పాడు గుమస్తా.
అలాగే.. నా రాక గురించి.. గుమస్తా ఆయనకి వివరించాడు. మరియు హాలులో జరిగింది కూడా చెప్పాడు.



యజమాని నన్నే చూస్తూ.. "ఇక్కడ వారికి నచ్చని పని ఏమీ నేను చేపట్టను.. చేపట్టలేను." చెప్పాడు. ఆయన గొంతు గంభీరంగా ఉంది.
"సార్" అన్నాను.
"అవును. నేను మక్కువగా.. బాధ్యతగా.. ఆశ్రమము నిర్వహిస్తున్నాను.
ఇక్కడ చేరిన వారు.. నన్ను ఎంతగానో నమ్మి ఉన్నారు. వారిని నిరాశ పర్చను."
చెప్పాడు యజమాని.



ఆయన నాతో మాట్లాడుతున్నా.. ఆయన నన్ను ఎగాదిగా చూస్తున్నాడు. నేను గుర్తించాను.
"ఏమిటి సార్.. అలా చూస్తున్నారు.. నన్ను అనుమానిస్తున్నారా. మీకు హామీ ఇస్తాను.. కావాలంటే బాండ్ రాయమన్నా రాస్తాను.. నాకు మాత్రం.."



యజమాని నాకు అడ్డు పడి.. "అబ్బెబ్బే.. నిన్ను.. నేను.. ఏమీ అనుమానించడం లేదు. కానీ.. నీ ముఖం మీది మచ్చతో.. కాస్తా తికమక అవుతున్నాను" చెప్పాడు.
నిజమే.. నా ముఖం మీది మచ్చ.. కొట్టొచ్చినట్టు ఉంటుంది. అర చేయి అంత బూడిద రంగు మచ్చ.. నా కుడి బుగ్గ మీద ఉంది.



"పుట్టుకతో వచ్చిన మచ్చ సార్.. పుట్టు మచ్చ పెద్దది.. అంటుంటారు" చెప్పాను.
"నీది బుర్లంకా.. నీ అమ్మమ్మ కాసులమ్మా.." అడిగాడు యజమాని.
"అవును సార్" అన్నాను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#37
"నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు.. ఉద్యోగ రీత్యా బుర్లంకలో ఉండేవాడిని.
అప్పుడు నీ అమ్మమ్మ మా ఇంటి పని మనిషి. నాకు ట్రాన్స్ఫర్ కావడంతో.. ఊరు
నుండి వెళ్ల వలసి వచ్చింది. తర్వాత మీ కబుర్లు మాకు తెలియవు.. నిజానికి.. నిన్ను దత్తత ఇమ్మని.. నేను.. నా ఆవిడ.. నీ అమ్మమ్మని ఎంతగానో కోరాం. కానీ నీ అమ్మమ్మ కాదనేసింది. సర్లే. ఇంతకీ నీ అమ్మమ్మ ఎలా ఉంది" అడిగాడు యజమాని.
"అమ్మమ్మ చనిపోయింది సార్" చెప్పాను. పిమ్మట తర్వాతి కబుర్లు చెప్పాను.



"అవునా.. నీ అమ్మమ్మ ప్రేరణతో ఆలోచనకి వచ్చావా. గుడ్. నిజానికి మాకు పిల్లలు లేక.. లేమితో కృంగినా.. నా భార్య చొరవతో.. మాటతో.. నేను ఆశ్రమంని స్థాపించాను. ఇక్కడ వారిని.. పిల్లలు మాదిరిగా చూసుకుంటూ.. వాళ్లతో ఆత్మీయతని.. ఆనందాన్ని చవి చూడగలుగుతున్నాం" చెప్పాడు యజమాని చాలా నిశ్చలంగా.
నేను మరో సారి ప్రయత్నించాను.



"నీ ఆలోచన అభినందనీయమే. కానీ.. నేను ఇక్కడ వాళ్లని ఇబ్బంది పర్చలేను" చెప్పేశాడు యజమాని.
నేను తటపటాయిస్తున్నాను.
"మీరు మరో చోట లేదా మరోలా ప్రయత్నించండి. మీ తలంపు మంచిది." చెప్పాడు గుమస్తా.



"అవునవును" అన్నాడు యజమాని.
అప్పుడే.."సార్.. నాదో విన్నపం" అన్నాను.
నేను యజమానినే చూస్తున్నాను.
"చెప్పు" ఆయన అన్నాడు.



"అదే.. మరి.. గతంలో నన్ను.. మీరు దత్తత తీసుకోవాలనుకున్నారు. అప్పుడు మీకు కుదర లేదు. అప్పుడు మీరు నొచ్చుకొనుంటారు. ఇప్పుడు నేను.. మిమ్మల్ని దత్తత కోరుకుంటున్నాను. అప్పటి వ్యధ ఎరిగిన మీరు.. ఇప్పుడు నాకు కాదనకండి
సార్.. నా అమ్మమ్మ మీది అనురాగంని ఆవిడకి పంచుతాను సార్. పెళ్లి కూడా మానుకొని.. నా పూర్తి ఖాళీ సమయాల్ని నాతో ఉండే ఆవిడకి కేటాయించాలని.. ఆవిడని సాకాలని తలుస్తున్నాను సార్" చెప్పాను.



"ఇక్కడ వారు.. నన్ను నమ్మి ఉన్నారు. వీళ్లల్లో ఒక్కరినీ నేను నిరాశ పర్చలేను" చెప్పాడు యజమాని.
నేను మాట్లాడలేకపోయాను.
నిముషాలు గడిచి పోతున్నాయి.
నేను తంటాలు పడుతున్నాను.



"నాది ఒక మాట.. కాదు.. ఒక సలహా.. నీ ఆలోచన దొడ్డది.. కనుక.. నువ్వు అర్ధం చేసుకోగలవు అనుకుంటూ చెప్పుతున్నాను.. పైగా నువ్వు ఒంటరివి కనుక..
నువ్వే.. మా చెంతకి వచ్చేయ్.. అప్పుడు.. ఒక అమ్మమ్మే కాదు.. ఎందరో అమ్మల.. ఎందరో నాన్నల.. సేవకి కూడా నువ్వు పాత్రుడువి అవుతావు" చెప్పాడు యజమాని.
నేను గమ్మున ఉండిపోయాను కొద్దిసేపు.
పిమ్మట తేరుకున్నాను.
లేచి.. నిల్చున్నాను.



యజమాని ప్రతిపాదనకి ప్రతీకగా.. ఆయనకి నమస్కరించాను.
"మహా భాగ్యం.. అవసరమైతే.. ఉద్యోగం వదిలేసి.. పూర్తి సమయం.. ఇక్కడే ఉండి పోయి.. మీతో కలిసి పని చేస్తూ.. మా అమ్మమ్మ బుుణము తగ్గించుకుంటాను" చెప్పేశాను ఏక బిగిన.
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#38
అమ్మమ్మ గారి ఇల్లు
[Image: a.jpg]
రచన: మయూఖ



నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి అమ్మ చెప్పింది మావయ్య ఫోన్ చేశాడని, అమ్మమ్మగారిల్లు అమ్మేస్తున్నట్టు చెప్పాడని.. నేను ఒక్క క్షణం షాక్ తిన్నాను. ఇంటితో తన అనుబంధం జ్ఞాపకాలు ఏమీ లేకుండా చేసేస్తాడా? 



అమ్మమ్మతో, తాతయ్యతో తను గడిపిన మధుర క్షణాలు ఇప్పటికీ తన దగ్గర పదిలంగా ఉన్నాయి అనుకుంటూ ఆలోచనల నుంచి బయటపడి,



"ఎందుకు అమ్ముతున్నాడు? ఇల్లు అమ్మకపోతే మావయ్యకి గడవదా! ఎప్పుడు ఫోన్ చేశాడమ్మా?" అంటూ కోపంగా అన్నాను.



"మీనా! స్థిమితపడు. నీకు ఇంటితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. అయినా మావయ్య అక్కడ ఉండటం లేదు కదా! అందుకని అమ్మేస్తున్నాడేమో" అంది అమ్మ నాకు నచ్చచెప్పుతున్నట్లుగా.



నా ఆలోచనలు అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి.



***
మేము హైదరాబాదులో ఉండేవాళ్లం. నాన్న .జి. ఆఫీసులో పనిచేసేవారు. ఎప్పుడూ క్యాంపులకి ఎక్కువ వెళ్లేవారు. నేను, అమ్మ, చెల్లి ఉండేవాళ్ళం. వేసవికాలం వచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎప్పుడెప్పుడు అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోదామా అని ఉండేది. అప్పుడు నేను ఐదో క్లాసు చదువుతున్నాను. చెల్లి రాధా మూడో క్లాసు చదువుతోంది. మాకు పరీక్షలు అయిపోయిన వెంటనే అమ్మ, చెల్లితో కలిసి అమ్మమ్మగారి ఊరు బయలుదేరే వాళ్ళం.



హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకి బస్సు ఎక్కితే మర్నాడు తెల్లవారుజామున రావులపాలెంలో దిగేవాళ్ళం. కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉండేది మా అమ్మమ్మ గారి ఊరు. చాలా పల్లెటూరు.



తాతయ్య సైకిల్ మీద మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నాకు ఇష్టమని గుర్రబ్బండి తీసుకువచ్చేవారు. రావులపాలెంలో రిక్షాలు ఉన్నా ఎక్కే వాళ్ళం కాదు. 



ఎందుకంటే గుర్రపు బండి అంటే నాకు ఇష్టమని తాతయ్య ముందు రోజే గుర్రపు బండి తాతతో చెప్పేవారు.
"రేపు మా మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తోంది బండి కట్టాలి" అని. 



రోజుల్లో హైదరాబాద్ అంటే అంత గొప్ప. నాకు గుర్రాన్ని అదిలించడం అంటే ఇష్టంగా ఉండేది. చెర్నాకోల్ నేనే తీసుకునేదాన్ని. 



ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ, పిన్నులు మాకు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించేవారు. నేను గలగల లాడుతూ మాట్లాడేదాన్ని.



అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దది. అటు 3 గదులు, ఇటు మూడు గదులు మధ్యలో పెద్ద పెద్ద హాళ్లు ఉండేవి. వంటిల్లు వెనకవైపు ఉండేది. ముందు పెద్ద ఖాళీ స్థలం ఉండేది, దానిలో పువ్వుల మొక్కలు అందంగా గాలికి ఊగుతూ స్వాగతం పలుకుతున్నట్టు ఉండేవి.



మా అమ్మ పెద్దది. అమ్మ తర్వాత ఇద్దరు పిన్నులు, ఒక మావయ్య ఉన్నారు. అందరూ మమ్మల్ని గారంగా చూసేవారు. 



తాతయ్యకి పొలం ఉండేది రెండు ఆవులు కూడా ఉండేవి. సంవత్సరమే వాటికి చిన్న తువ్వాయి పుట్టిందట. తెల్లగా ఎంత ముద్దుగా ఉండేదో. దాంతో ఆడుకునేదాన్ని.



తాతయ్య మేము ఊరికి వచ్చామంటే ముంజి కాయలు, పనస పళ్ళు తోట నుంచి తెప్పించేవారు. ముంజి కాయలు తాతయ్యే స్వయంగా కొట్టి మాకు స్పూన్ తో తీసి ఇచ్చేవారు. ముంజులని ఒళ్ళు పేలకుండా ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసేవాళ్ళం.



పనస పళ్ళు కోసి తొనలు తీసి ఇచ్చేవారు. తోట నుంచి మల్లెపూలు తెప్పించేది అమ్మమ్మ. పెద్ద పిన్ని లక్ష్మి నాకు, చెల్లికి పువ్వుల జడలు కుట్టేది. అమ్మమ్మ ఇంటికి దగ్గరలో కాలువ ప్రవహించేది. సాయంత్రాలు రోజు చిన్న పిన్ని రాజీ మమ్మల్ని కాలువకి తీసుకు వెళ్ళేది. 



అమ్మమ్మ "రాజి! పిల్లలు జాగ్రత్త! చెంబు తీసుకువెళ్ళు. గట్టుమీదనే స్నానం చేయించు" అని జాగ్రత్తలు చెప్పేది.



అమ్మమ్మ పొద్దుటే మడి కట్టుకుని దేవుడికి పూజ చేసి, హారతి ఇచ్చేది. గంట శబ్దానికి నేను లేచే దాన్ని. గబగబా హారతి అందుకుంటుంటే అమ్మ కోప్పడేది."పాచి మొహంతో ఏమిటి అని. కానీ అమ్మమ్మ "పోనీలే చిన్నపిల్ల" అనేది. రాత్రుళ్లు నేను, చెల్లి అమ్మమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. రామాయణం, భారతం కథలు కథలుగా చెప్పేది. వింటూ పడుకునే వాళ్ళం.



రావులపాలెం లో టూరింగ్ టాకీస్ ఉండేది. తాతయ్య గుర్రం బండి తెప్పిస్తే మేము అందరం సినిమాకు వెళ్లేవాళ్ళం. మధ్యలో తినడానికి జంతికలు, చేగోడీలు అమ్మమ్మ పొట్లం కట్టి ఇచ్చేది. తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లేవాళ్ళం. అక్కడ బోరింగ్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళం.



తాతయ్య మామిడికాయలు కోస్తే అమ్మమ్మ ఆవకాయ పెట్టేది. ఎన్నని చెప్పను? ఎన్నో జ్ఞాపకాలు. రాత్రి నులక మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి పడుకునే వాళ్ళ౦. ఆరుబయట చల్లగాలికి ఎయిర్ కూలర్లు అవసరం ఉండేవి కావు. మేము హైదరాబాద్ వచ్చేస్తుంటే మాకు బట్టలు, తినుబండారాలు, కూరగాయలు, బస్తా బియ్యం పంపేది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని.



"ఏడవకు మీనా! మళ్లీ వద్దు గానిలే, దసరా సెలవులకు రండి" అనేది.



కానీ నాన్న వేసవికాలం లోనే పంపించేవారు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అమ్మమ్మతో నా బంధం ఇంకా బలపడిపోయింది. పిన్నులు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మామయ్య కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆఫీసులో పనిచేసే తన కొలిగ్నే పెళ్లి చేసుకున్నాడు.
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#39
అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చిందని తాతయ్య ఫోన్ చేస్తే నేను, అమ్మ వెళ్ళాం. అమ్మమ్మ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాం. లేవలేని పరిస్థితిలో ఉంది. మనిషిని పెట్టారు. పెద్ద డాక్టర్లకి చూపిస్తే వయస్సు రీత్యా రికవరీ కావడం కష్టం అన్నారు.



అమ్మమ్మ చివరి మజిలీ వరకు నేను, అమ్మ అక్కడే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మ వద్దని తాతయ్య దగ్గర మాట తీసుకుంది అమ్మమ్మ.



అమ్మమ్మ లేని ఇంటిలో తాతయ్య ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక మాతో పాటే హైదరాబాద్ తీసుకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. అమ్మమ్మ భౌతికంగా లేకపోయినా జ్ఞాపకాలన్నీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. నేను రాను అన్నారు తాతయ్య.



అమ్మ, పిన్నులు వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు తాతయ్య దగ్గర ఉంటున్నారు. మధ్య మధ్యలో నేను కూడా వెళ్లే దాన్ని. అమ్మమ్మ పోయిన రెండు మూడు సంవత్సరాలకే తాతయ్య కూడా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు.



తాతయ్య మాట ప్రకారం మామయ్య ఇల్లు అమ్మకుండా ఉంచేసాడు. ఇల్లు శుభ్రం చేయడం అంతా మా పాలేరు చూసుకునేవాడు. వాడే పొలాలు కూడా చూసేవాడు. ప్రతి సంవత్సరం అమ్మ, పిన్నులు అక్కడికి వెళ్లేవారు. అమ్మతో నేను, చెల్లి కూడా వెళ్లేవాళ్ళం. అందుకే ఇంటితో నా అనుబంధం పెనవేసుకుపోయింది.
******
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా పెళ్లి, పిల్లలు, నాన్నగారు పోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అమ్మని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇన్ని జరుగుతున్నా, అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం మాత్రం మానలేదు. నా పిల్లలకి కూడా అలవాటు చేశాను నా అమ్మమ్మగారిల్లు.



అటువంటిది ఇప్పుడు ఇల్లు అమ్మకం విషయం చెప్పేటప్పటికి తట్టుకోలేకపోయాను. మావయ్యకి ఫోన్ చేశాను. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాను నాకు కోపం వచ్చిందని, అర్థమైంది.



"లేదు మీనా! ఇల్లు అమ్మడానికి కారణం ఇల్లు పాతబడిపోయింది. చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులు లేచాయి. దాని మధ్యలో మన ఇల్లు చిన్నగా ఉంది. అది కాక పక్క బిల్డింగ్ వాళ్లు ఇల్లు కావాలని ఎంతైనా ఇస్తామని నాకు ఫోన్ చేశారు" అన్నాడు మావయ్య.



"ఓహో! అందుకేనా! డబ్బుకు ఆశపడి ఇల్లు అమ్మేస్తానంటున్నావ్ మావయ్యా ! పాడి గేదె వట్టిపోయిందని కసాయి వాడికి అమ్ముతామా! ఇది అంతే! పాత పడిపోయిన, ఇంటితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలు మమ్మల్ని ఇంటి నుంచి దూరం చేయలేవు. నీకు డబ్బు కావాలంటే ఇల్లు నాకు అమ్మెయి. అంతె తప్ప బయట వాళ్లకు అమ్మకు మామయ్య" అని ఫోన్ పెట్టేసాను. 



తరువాత మావయ్య ఏమనుకున్నాడో ఇంటిని నా పేరు మీద రాసేశాడు. నేను ఆరోజు ఆవేశంతో మావయ్యని అలా అన్నాను కానీ తర్వాత చాలా బాధపడి, "సారీ" చెప్పాను.



నాకు ఇంటిని ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించాను. తరువాత నా ఆలోచనకి ఒక రూపం వచ్చింది. అమ్మని తీసుకుని ఊరు వెళ్లాను. ఊరి పెద్దలతో మాట్లాడి ఏమి చేయాలో చెప్పి, కావలసిన డబ్బు ఇచ్చి వచ్చేసాను.



పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఊరి ప్రెసిడెంట్ సదానందం నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు చెబుతున్నారు. నేను తగిన సూచనలు ఇస్తున్నాను.
పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సదానందం గారు నాకు ఫోన్ చేసి చెప్తే, నేను మా పిన్ని లకి మామయ్యకి అన్ని విషయాలు చెప్పి అందర్నీ అమ్మమ్మ గారి ఊరు రమ్మని చెప్పాను.



ఆరోజు రానే వచ్చింది. మేమందరం కలిపి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాము. ఇంటిముందు పెద్ద బ్యానర్ "సీతారామ గ్రంథాలయం ప్రారంభోత్సవం" అని పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది. ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అది చూసి మావయ్య ఆశ్చర్యపోయాడు. సదానందం గారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఊరి పెద్దలు అందరూ వచ్చారు.



యువతి యువకులు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ సదానందం గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ "ఊరిలో ఉండి మనం ఎవరూ చేయలేకపోయిన పనిని అమ్మమ్మగారి ఊరు మర్చిపోకుండా ఊరికే ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో శ్రీమతి మీనా రఘురాం గారు ఎంతో పెద్ద మనసుతో ఊరి యువతీ యువకులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యం తో కంప్యూటర్ సెంటర్ ని, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. 



దీన్ని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియ జేసుకుంటున్నాను" అంటూ సదానందం గారు మాట్లాడారు. నేను చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. మావయ్య నాకేసి అభినందన పూర్వకంగా చూశాడు.



అందరం లోపలికి వెళ్ళాం. షెల్ఫ ల్లో పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవడానికి కావలసిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకి కావలసిన రామాయణ, భారతాలు, వివిధ రచయితల పుస్తకాలు అందంగా కనిపిస్తున్నాయి. 



కుర్చీలు, టేబుల్స్ పక్కగా ఉన్నాయి. రెండో గదిలో టేబుల్స్, వాటి మీద కంప్యూటర్లు, కూర్చోవడానికి ఆఫీసు చైర్లు ఉన్నాయి. ఊరిలో పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవడం కోసం బయటకు వెళ్ళనవసరం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టాను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#40
నేను ఏవైతే చేయాలనుకున్నానో అన్నీ రూపు దాల్చాయి.
నాకు చాలా తృప్తిగా అనిపించింది. రూపేణా అమ్మమ్మ గారి ఇల్లు పదిమందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. మిగిలిన పోర్షను అంతా మా ఆధీనంలోనే ఉంది.



పిన్నులు అడిగారు ఇంత డబ్బు ఎక్కడిది అని.



"అమ్మమ్మ నాకు ఒక ఎకరం పొలం రాసిందిట. దాని బాపతు డబ్బంతా తాతయ్య తను చనిపోయే ముందు నాకు ఇచ్చారు. అంతవరకు నాకు తెలియదు. అప్పుడే అనుకున్నాను అందరికీ ఉపయోగపడే పని చేయాలని వారి పేరు మీదే ఏదైనా చేయాలని అనుకున్నాను. మావయ్య ఇల్లు నా పేర రాసినంత మాత్రాన నాది కాదు. మన అందరిదీ. ఇంటికి హక్కు దారులు మనందరం. ఎప్పటిలాగే అందరం కూడా ఇక్కడికి ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు". అన్నాను.



"మీనా! వారసుడిగా నేను చేయలేని పని మనవరాలి వైనా నువ్వు చేశావు. అమ్మమ్మ తాతయ్యల పేరుని చిరస్థాయిగా నిలబెట్టావ్. అమ్మమ్మ, తాతయ్యలా విగ్రహాలు నేను తయారు చేయిస్తాను. వాటిని ప్రాంగణంలో ఏర్పాటు చేద్దాం." అన్నాడు మామయ్య.



"అలాగే అన్నాం సంతోషంగా. 



నేనే కనుక అమ్మేస్తే ఈపాటికి ఇక్కడో బిల్డింగ్ లేచేది. కానీ ఊరితో మన అనుబంధం తెగిపోయేది. కానీ ఇప్పుడు మన ఇంటి తో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉన్నాయి. దీనికి కారణం మీనా నువ్వే" అన్నాడు మనస్ఫూర్తిగా.



అందరూ నేను చేసిన పని కి అభినందనలు తెలిపారు. ఇంతకు మీకు చెప్పలేదు కదూ! అమ్మమ్మ పేరు సీత. తాతయ్య పేరు రామారావు. నేను చేసిన పనికి వాళ్లు ఆశీర్వదిస్తున్నట్టుగా చిరుజల్లులు కురిసాయి.



 సమాప్తం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: