Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఇల్లు మారిపొమ్మన్నాడు. నాకు మనసు శాంతిగా ఉండటం లేదంటే నిత్యం ఆచరించుకునే చిన్న చిన్న చిట్కాలు, పూజలు చెప్పాడు. క్రమక్రమంగా అతను నా జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాడు. మొదట్లో ఒకసారి అడిగినప్పుడు చెప్పాను.
నీతో షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని, కానీ లాంగ్ టర్మ్ చేయాలనిపిస్తుంది. నాకు అతని మీద ధైర్యం వచ్చింది. నా సెల్ నంబరు చెప్పి కాల్ చేయమన్నాను. అతను కాల్ చేసాడు.
మాటలు కలిశాక అతని మీద ఇంకా గురి ఏర్పడింది. మెల్ల మెల్లగా నా విషయాలు ఒక్కొక్కటీ చెప్పడం మొదలు పెట్టాను.
'నా దాంపత్య జీవితం సరిగా లేదని, నీతో పిల్లల్ని కని, వాళ్ళని చూసుకుంటూ, పెంచుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తానని', దయచేసి ఏమీ అనుకోకుండా అతని అభిప్రాయం చెప్పమని, అడిగాను.
అతను నిర్ఘాంతపోయాడు.
ఇన్ని రోజులు సెర్చింగ్ దేనికో అర్ధమైంది అతనికి. నాతో ఎలా చెప్పాలో కన్ఫ్యూజ్ అయినట్టుంది.
చాలా దీర్ఘంగా, దానివల్ల సమస్యలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కొక్కటీ వివరణగా చెబుతూ జీవితాన్ని ఎలా మలచుకోవాలో నాకు నూరిపోసాడు.
అప్పటివరకూ ఇలాంటి ఆలోచన్లతో ఉన్న నాలో క్రమేపి మార్పు కనిపించి ఎలా లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలో తెలియడం మొదలైంది.
"అయితే నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు జీవితకాలం స్నేహితుడుగా నువ్వుండి పొగలవా! ?" అని అడిగాను.
"నీలో మార్పు రావడం వరకే నా అవసరం నీకుంటుంది. తరువాత నేను కనుమరుగైపోతాను"అనేవాడు. ◆ ◆ ◆ఒకరోజు మా అత్తగారి పోరు, ఇంట్లో గొడవలు అన్నీ ఎక్కువై నాకు చనిపోవాలనిపించింది. మధ్యాహ్నం రెండింటికి ముహూర్తం పెట్టుకున్నాను.
అతన్ని కాల్ చేయవద్దని చెప్పాను. మెయిల్స్ రాయవద్దని మెసేజ్ ఇచ్చాను.
అతన్నుండి స్ట్రాంగ్ మెయిల్ వచ్చింది. ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావకూడదో విపులంగా, స్ఫూర్తిదాయకంగా ఉందది.
లాస్టులో"నా నంబరు నాది కాదు, అది వైజాగ్ రైల్వే స్టేషన్లో దొరికిన సిమ్. దాన్ని రీఛార్జి చేసి వాడుకుంటున్నాను. ఆ నంబర్ ఎవరిదో తెలియదు. ఆ సిమ్ పట్టుకుంటే నేను దొరకను" అని చెప్పాడు.
నేను ఆశ్చర్యపోయాను! ! ! చాటింగ్ చేస్తూ అన్నీ వివరంగా, విపులంగా చెబుతూ ప్రమాద పరిస్థితుల్లో దొరక్కుండా అతను పాటించే టెక్నిక్స్, పైగా మోసం చేయాలనుకుంటే ఎప్పుడో నన్ను మోసం చేయవచ్చు. కానీ అలాంటివాడు కాదతను. ◆ ◆ ◆చాలా రోజులు గడిచిపోయాయి. ఎన్ని మెయిల్స్ చేసినా అతన్నుండి రిప్లై రాలేదు. చాలా బతిమాలాను. కాళ్ళు పట్టుకుంటానన్నాను. పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటానన్నాను.
ఎంతగా ఏడ్చానో తెలియదు. అలా రాసి రాసి రిప్లై రాదనుకునే సమయంలో అతన్నుండి మెయిల్ వచ్చింది.
“నది గురించి నేను రాసిన మెసేజ్ చదువుకో, ఎప్పుడైనా అదే జరుగుతుంది. ఈ సమాజంలో నువ్వు ఒకరితో, నేనొకరితోనూ ఫిక్స్ అయిఉంటున్నాం. వేరు వేరుగా మనిద్దరం ఇలా చేసినా సమాజం ఒప్పుకోదు. దురదృష్టవశాత్తు మనిద్దరం ఇలా కలిసాం. మరోరకంగా కలిసుంటే మున్ముందుకు స్నేహం సాగిపోయేదేమో తెలియదు.
రోజుల తరబడి, గంటల తరబడి నీ తెలివితేటల్ని ఇలా వృధాగా పోనీయకు. నువ్వొక గుర్తింపుగా, ఆదర్శంగా ముందుకు సాగిపో. అన్యాయం అయిపోతున్న ఇలాంటి ఆడవాళ్లకి అండగా నిలబడి అవసరమైతే చైతన్యపరచు.. "
దీని తర్వాత మళ్ళీ మెయిల్స్ రాలేదు. దాని ముందు మాత్రం'కెమెరామెన్ గంగతో రాంబాబు'సినిమాలో తమన్నా డ్రింకింగ్ గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చాడు. అతన్నుండి కమ్యూనికేషన్ కట్ అయింది.
◆ ◆ ◆
నెల రోజుల తర్వాత అతన్నుండి మెయిల్ వచ్చింది.
"ఏమీ అనుకోకు నీలా, ఇదే ఆఖరి మెయిల్. మరెప్పుడూ మెయిల్స్ చేయకు. నన్ను వెదకాలని చూడకు. నీకో నిజం చెప్పి నిష్క్రమించాలని ఈ మెయిల్ చేస్తున్నాను. నిజానికి నేను మగవాడ్ని కాదు. మగ గొంతుకతో మొబైల్ లో వాయిస్ మార్చి మాట్లాడిన ఆడదాన్ని, నీలాగే చాటింగ్ చేసి మోసపోయి, జీవితంలో ఓ గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నదాన్ని, నన్ను క్షమించు. నీలాంటి వాళ్ళని కొంత మందినైనా చైతన్య పరచాలనే కాంక్షతోనే నేను ఈ పని చేసాను. ఇక ఉంటా".
మెయిల్ చదివి నేను షాకయ్యాను. నేను ఊహించలేదు. ఏ మాత్రం అనుమానం రాకుండా చివరికంటా తీసుకువచ్చింది.
గ్రేట్ అనిపించింది.
తెరలు తెరలుగా నా ఆలోచనలన్నిటికీ ఆకృతి ఏర్పడి జవాబులుగా విడిపోవడం మొదలు పెట్టాయి. ఏదొక వ్యామోహంలో పడి చాటింగులమ్మట నేను చేస్తున్న సమయాలు, చాలా రోజులుగా నా తీరు చూసుకుంటే భయమేసింది. మరెప్పుడూ టైమ్ వృధా చేసుకుంటూ, చాటింగ్ ల జోలికి పోలేదు..
◆ ◆ ◆ఆగని చైతన్యంతో విశ్వం మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుపోతున్నాడు.
◆
సమాప్తం.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆత్మవిశ్వాసం
రచన: Ch. ప్రతాప్
పూర్వం కోసల దేశం లో నివసించే నారాయణాచార్యులు అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందోళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి. అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన నారాయణాచార్యులు యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.
రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? అన్నీ సాఫీగా గడిచిపోతున్నప్పుడు అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగిల్చి తద్వారా విలువైన జీవితపు పాఠాలు నేర్పించడమే కదా విధి యొక్క ముఖ్య కర్తవ్యం. యొనారాయణాచార్యులు భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు. జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు. ఇంతటి ముళ్ళ పొద లాంటి కిరీటం తలపై పెట్టుకొని తిరిగేకంటే జీవితానికి ముగింపు పలకడమే మంచిదన్న అభిప్రాయానికి కూడా ఆ దశలో వచ్చేసాడు.
ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు. ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు నారాయణాచార్యులు.
" మహాశయా, ఈ లోకంలో ఎవరికీ రానంత కష్టాలు నాకు వచ్చాయి. సాఫీగా సాగుతున్న జీవితపు నావ ఒక్కసారిగా నడిసంద్రంలో మునిగిపోయంది. ఏ దిక్కూ తోచక, నడి సంద్రంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఇక ఈ జీవిత భారాన్ని మోయడం నా వలన కాదు. అందుకే ఈ గృహస్థు ఆశ్రమానికి స్వస్థి పలికి సన్యాసంలో కలిసిపోదామనుకుంటున్నాను, లేదా ఆత్మహత్య చేసుకొని ఈ కష్టాల మయమైన జీవితాన్ని చాలించుదామనుకుంటున్నాను. ఏది శ్రేయో మార్గమో నాకు సెలవివ్వండి" అన్ని కణ్ణీళ్ళ పర్యంతమై ప్రార్ధించాడు నారాయణాచార్యులు.
ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు, నేర్పు మనం అలవరచుకోవాలి.
కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు. చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి, రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి. కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.
సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించడం ఎంతో అవసరం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము” అని ఉద్భోదించారు.
అమృతతుల్యమైన ఆ మాటలకు నారాయణాచార్యులుకు జ్ఞానోదయం అయ్యింది. తానెంత తెలివి తక్కువగా ఇంతకాలం ఆలోచించాడో అర్ధం అయ్యింది. ఆ సాధువు మాటలను మదిలో జాగ్రత్తగా పదిలపరచుకున్నాడు. జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
మనవ(వా)డు
రచన: సురేఖ పులి
‘సఖీ’ అని ముద్దుగా శకుంతల ముద్దుల మనవడు పిలుస్తాడు. ఆ పిలుపు ఇద్దరికీ సఖ్యతగా వుంది.
రూపేష్, రక్షిత ప్రేమించి, పెద్దలను ఎదిరించి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. సంవత్సరంలోపే బాబు పుట్టాడు. అంతే, పసివాడ్ని చూడగానే స్వర్గాన్ని భూమ్మీద చూశారు. పెళ్లికి అభ్యంతరాలు చెప్పిన పెద్దలందరి సంతోషాలకు హద్దుల్లేవు. బుజ్జి బాబును ఏ దేవుడితో పోల్చాలి? ఏ వీరుడితో సమానం? హు.. ఎవ్వరూ సరిపోరు!
రుద్ర పేరుతో నామకరణ జరిగింది. మెటర్నిటీ సెలవు అయిపోయిందని, యదావిధిగా ఆఫీసు పనిలో నిమగ్నమైన జంటకు తంటాలు మొదలైనాయి.
తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది. శకుంతల కొడుక్కి-కోడల్కి ఎంతో నచ్చ చెప్పింది. మొండి పట్టుదల! ఈగో!! ఏ గోనో.. విదేశాల ఆకర్షణో.. విడాకులతో చెరో చోటుకు ‘గో’ అయ్యారు.
రుద్రుడ్ని హృదయానికి హత్తుకుంది శకుంతల.
***
కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సంపాదించి, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ గా వున్న శకుంతలకు అన్ని హంగులతో పెళ్లి చేశారు పెద్దలు. రూపేష్ కడుపులో ప్రాణం పోసుకుంటున్న సమయంలో తండ్రి ఆయువు పూర్తి అయింది.
పరమశివుడే కాదు, ఎందరో శకుంతల వంటి అభాగినుల కంఠంలో విషాన్ని ఇముడ్చుకొని జీవితాలు సాగిస్తున్నారు.
ఒంటరి అయినా రుద్రుడి పెంకం ఒక మహత్తర మలుపు, అదొక అదృష్టంగా ఆమోదించుకున్న స్త్రీకి మానసిక, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు గోరంతలు.
ఉద్యోగంలో స్థిరపడిన ఆనందంలో “సఖీ, ఇప్పుడంతా కాష్ లెస్ షాపింగ్, అందుకే నీకో గిఫ్ట్” అని ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాడు.” వద్దు-కద్దు అనక, వాడుక అలవాటు చేసుకున్నది.
“ఇప్పుడు సర్దు బాటుగా వుంది కదా, పనిమనిషిని పెట్టుకుందామా సఖీ?”
“ఓటరైడి, ఆధార్ కార్డు లెక్కల్లోనే సీనియర్ సిటిజన్ను, నేనింకా పడుచు సఖీనే రా!” అని కొట్టి పారేసింది.
“నీ శక్తికి కారణం ఏంటి, చవన్ ప్రాస్, బూస్ట్ ఆర్ ఎనీ అదర్ సీక్రెట్?” రుద్ర నవ్వుతూ అన్నాడు.
“నిన్ను క్రమశిక్షణతో పెంచే క్రమంలో నన్ను నేను మరచి పోవడం.” వాస్తవాన్ని చెప్పింది.
“అడగకూడని మాట అడుగుతున్నా.. జవాబు దాటేయోద్దూ..”
“నువ్వు అడగబోయే విషయం నాకు తెల్సు.. అయినా అడుగు..” మనవడి తలకు గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేస్తూ అంది.
“ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నా, అన్ని విషయాల్లో నీకు నా పెంపకంలో విసుగు లేదు. మరి నీ కొడుకు, కోడలు నా పట్ల ఎందుకింత బాధ్యతారహితంగా వున్నారు.”
“రుద్రా.. ఇప్పటికే ఈ ప్రశ్న వంద సార్లు అడిగావు, ఇదే చివరి సారి చెపుతున్నా నా కొడుకు, కోడలు అంటున్నావే కానీ, నా తల్లిదండ్రులు అనలేక పోతున్నావు, ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తల గానే కాదు అసమర్థ తల్లిదండ్రులు కూడా! బాధ్యతలను ఎదుర్కోలేని పిరికివాళ్ళు. ఇప్పుడు మనం బాగానే వున్నాం కదా, వాళ్ళ టాపిక్ ఎందుకు?”
మారు మాట్లాడలేదు, నాయనమ్మకు చిరాకు తెప్పించే మాటలు ఇక మానేశాడు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆన్లైన్ లో పెళ్లి సంబంధాలు చూసే నెపంతో శకుంతల “నీ ల్యాప్ టాప్ లో నేను కూడా కొంచెం ఏదైనా రాసుకునేట్టు, ఈజీ గా జమా, ఖర్చులు వేసుకునేట్లు నేర్పించరా.”
“సఖీ.. నీ ఫోన్ లో అన్నీ సదుపాయాలు వున్నై, ఓపిగ్గా చూడు.”
“రోజంతా ఖాళీగా వుండే నీ ల్యాప్ టాప్ ను నేను వాడొద్దా? నాకు నువ్వే నేర్పించాలి.. అంతే.” పట్టుదలకు మారుపేరు నాయనమ్మ అనుకొని ‘వర్డ్, ఎక్సెల్’ నేర్పించాడు.
శకుంతలకు సోషల్ మీడియా ఎంతో లాభదాయకంగా వుంది. జీమెల్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో చురుకుగా వుంటూ ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరో తో సంప్రదించి రుద్ర ప్రొఫైల్ పెట్టింది. వారంలో ఎక్సెల్ షీట్లో తనకు అన్ని విధాల నచ్చిన అమ్మాయిల డాటా తయారు చేసింది.
“నువ్వు ఏదో గొప్ప పని చేస్తావని అనుకున్నా సఖీ, మొత్తానికి అమ్మాయిల డేటానా!? అంటూ కొంత సంతోషం, మరికొంత ఆశ్చర్యం వ్యక్తపరిచాడు మనవడు.
“ఇది గొప్పను మించిన పని, లేకుంటే నీకు పెళ్లీడు వచ్చిన సంగతి నీకు తెలియక పోయినా నాకు తెల్సు, ఎందుకంటే నాకు ముచ్చటైన మనవరాలు కావాలి.”
“అయితే ఒప్పుకుంటున్నవా, నువ్వు సీనియర్ సిటిజన్ అని.” బుజాలు కుదుపుతూ అడిగాడు.
“ఆఫ్ కోర్స్! నువ్వు కూడా నా మనోబలాన్ని కాదనలేవు.”
దగ్గరుండి అమ్మాయిల డేటాను రుద్ర చేత షార్ట్ లిస్ట్ చేయించింది. అంత పెద్ద జాబితాలో ‘ఓకే’ అనుకున్న ఐదుగురికి ఇంట్రెస్ట్ పంపించింది. తిరుగుటపాలో జవాబులతో పాటు వీడియో కాల్ చేశారు. అందరూ బాగానే ఉన్నట్టు తోచింది. కొడుకు విడాకుల సంగతి విషయం చెప్పక, ఫారిన్ లో సెటిల్ అయ్యారని అబద్ధం చెప్పింది.
“చాలా సంతోషం, మరి పెళ్లి కుదిరితే మా అమ్మాయి మీ మనవడు కూడా ఫారిన్ లో సెటిల్ అయ్యేట్టు ప్లాన్ ఉంటే; అర్జెంట్ గా పెళ్లి జరిపిద్దాం, కట్నం కూడా మీ రేంజ్ లో ఇచ్చేందుకు మేము రెఢీ!” అన్న ముగ్గుర్ని డిలీట్ చేయగా ఇద్దరు మిగిలారు.
మన దేశంలో ఏం తక్కువైంది? మనుషులకు ఫారిన్ పిచ్చి పోదా??
ఉన్నది సరిపోదు! లేనిది కావాలి!!
***
“నేను మా మనవడు వచ్చి అమ్మాయిని చూస్తాము, మీ అనుకూలమైన డేట్, టైమ్ చెప్పండి?” అని ఫోన్ చేసినా, జవాబు రాలేదు. “ఎదురు చూస్తున్నాం.” అని వాట్సప్ రిమైండర్ పెట్టింది. మిగిలిని ఇద్దరిలో రుద్రకు అంత్యంత నచ్చిన అమ్మాయి ‘చెంగల్వ’ తల్లి జవాబు మెయిల్ చేసింది.
శకుంతల గార్కి నమస్కారం, మీరు అబ్బాయిని అన్నీ అయి; అంటే ఏకచత్రాధిపత్యం వహిస్తూ పెంచారు, బాగానే వుంది. కానీ శుభమా అని మీరు మా అమ్మాయిని చూడడానికి వస్తే ముత్తైదువలతో రాగలరు. మీరు పెద్దవారు అర్థం చేసుకొని ఉంటారు. ఇది మన పద్దతుల భాగమని తెలియ చేస్తున్నాం. అంతే, పొరపాటుగా అనుకోకండి.
చదివిన శకుంతల నిట్టూర్చింది. కానీ రుద్ర రౌద్ర రూపం దాల్చి, “ముత్తైదువ కావాలా? మా సఖి అందమైన మనసు మూర్ఖులకు తెలియదు.” అంటూ తాండవం చేశాడు.
మిగిలిన అమ్మాయి ‘సన్నిహిత’ పెద్దలకు రాబోయే ఆదివారం మేము వస్తున్నాం అంటూ రుద్ర దుర్ముహూర్తం, యమగండం మొదలగు వాటిని ఖాతరుచేయక చెప్పేశాడు.
మనుషులు ఎంత పురోగమనం వైపు నడిచినా, నమ్మకాలకు దూరంగా; మూఢనమ్మకాలకు దగ్గరగానే ఉంటారు, కానీ మారాలి అని ప్రయత్నించరు.
శకుంతల కొడుకును గూగుల్, ఫేస్ బుక్ లో వెతికి చాటింగ్ చేసి ఫోన్, ఈమెయిల్ ఐడి వివరాలు తెలుసుకొని తానిచ్చిన టెస్టింగ్ మెయిల్ సమాధానం భద్రపరచుకుంది. చిక్కుముడి చివర్లు పట్టుకుంది.
***
సిటీ ఎంత మార్పు చెందినా, ఇరుకు సందులు విశాలం కాలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రజలు. అక్కడ నివాసమున్న వారు అలవాటు పడ్డారేమో కానీ కొత్తగా ప్రవేశించిన వారికి తిప్పలు తప్పవు. అవస్థ పడుతూ, ఇరుకైన మెట్లు ఎక్కి సన్నిహిత ఇల్లు చేరుకున్నారు. వీధులే కావు, ఇల్లు కూడా చాలా ఇరుగ్గా వుంది.
‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అని వెనకటికి వర్ణించిన అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చుంది. సన్నిహితను చూసి పరస్పరం ‘బావుందని’ కళ్ళ భావనలతో ప్రకటించుకున్నారు. అదే పనిగా గమనిస్తున్న సన్నిహిత తమ్ముడు వీరి కళ్ళ భాషను పసిగట్టి, ఫలహారాలు, జూస్ తెచ్చాడు.
అమ్మాయి ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం, చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కళ గల అందం!
“ఏమైనా మాట్లాడమ్మా.” అంది శకుంతల. సన్నిహిత రెండోసారి రుద్ర వంక చూసింది. రుద్ర చూపు మరల్చు కున్నాడు.
“నాకు వంట రాదు.” సన్నిహిత ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పింది, కాదు, అబద్ధం చెప్పింది.
తెల్లటి శరీరఛాయతో, ఖరీదైన బట్టల్లో ఆరోగ్యంగా కన్పిస్తున్న రుద్రను సంబోధిస్తూ “బాబు, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు.” అమ్మాయి తల్లి భగవతి అంది.
“నాకు మీ అమ్మాయి నచ్చింది, నేను నచ్చానో లేదో తెలుస్కోవచ్చా?”
జవాబు రాలేదు. “నోరు తీపి చేసుకోండి.” అంటూ భగవతి స్వీట్ అందించింది.
సన్నిహిత గబుక్కున “ప్లీజ్.. తినకండి, అమ్మ అలాగే అంటుంది. అతికితే గతక దంటారు, అందుకని మీరు ఏమీ తినొద్దు.” చెప్పకనే తన సమ్మతిని తెలియజేసింది.
“మూఢాచారాలకు నేను దూరం.” అని రుద్ర స్వీట్, ఖారా తిన్నాడు. శకుంతల జూస్ తీసుకుంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
వెనువెంటనే సన్నిహిత తండ్రి సాంబశివ కూడా ఆనందంగా స్వీట్ తీసుకున్నారు. వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ‘ఇంటికెళ్లాక ఫోన్ చేస్తామని, జాతకాలు కుదరలేదని, కట్నం సరిపోదని’ ఏదో వంకతో జారుకున్నాయి.
“మీ ఇంటికి మేము ఎప్పుడు రావాలో చెబితే..” భగవతి ఆతృత వెళ్లబుచ్చింది.
“మీరు ఎప్పుడైనా రావచ్చు.” అని గూగుల్ లొకేషన్ షేర్ చేసింది శకుంతల.
***
రూపేష్.. నువ్వూ, రక్షిత రావాలి, మీ చేతుల మీదుగా రుద్ర పెళ్లి జరగాలి. ప్లీజ్.. అని మెయిల్ పెట్టింది.
ఎన్నో విషయాల కోసం ఓర్పుగా ఎదురు చూసిన శకుంతలకు ఈ సారి తోచడం లేదు. ప్రతీ ఐదు నిమిషాలకు జవాబు వస్తూదేమో అని మెయిల్ చూసి నిరాశ పడ్డది.
ఆశ-నిరాశ పోటీ పడుతున్నా సహనం కోల్పోలేదు. వారం తర్వాత జవాబు వచ్చింది.
అమ్మా, థాంక్స్! చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు కూడా నీ మాట వినక పోతే.. వి అర్ నో వేర్! పెళ్లికి మాత్రమే కాదు. పర్మనెంట్ గా వస్తాము. మేమిద్దరం విడాకులు విత్ డ్రా చేసుకోవాలనుకున్నాం. ప్రత్యక్షంగా అన్ని వివరంగా చెప్తాను. అక్కడ విల్లా కొన్నాను, వచ్చే ఏడాది లోపు మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. పెళ్లి ఖర్చులకు వెనకాడకుండా ప్లాన్ చేయండి. రుద్రను దగ్గరగా తీసుకోవాలని మా ఇద్దరికీ కోరికగా వుంది.
‘ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యు.. లవ్ యు మా’..
పరిపూర్ణమైన ఆనందం అంటే ఇదేనేమో!
రుద్ర మెయిల్ చూశాడు. సఖి సంతోషం ముఖ్యం అనుకున్నాడు.
మన జీవితమే ఒక్కోసారి మోయలేనంత భారం అనిపిస్తుంది. కొత్తగా ఒక మనిషిని జీవిత భాగస్వామిగా తీసుకు రావడం అంటే మాటలు కాదు. ఈ సంసారం ఎలా ఈదటం అని వాపోయి దూరం పోయే కంటే చిన్న సరిపోయే హెచ్చరికలు లేక కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి.
***
రుద్ర తాళి ముడి వేస్తుంటే, ఈ వివాహబంధం ప్రాణం వున్నంత వరకు ఆలుమగలు ఆరోగ్య ఆనందాలతో కలిసి వుండాలిని ముక్కోటి దేవతలను మొక్కుకుంది ప్రియమైన సఖి!
పెళ్లి సామాన్యంగా జరిగినా, రిసెప్షన్ మాత్రం గొప్పగా సాగింది.
“మీ సైడ్ చుట్టాలు, బంధువులు చాలా తక్కువ అన్నారు, ఇదేంటి ఇంతలా జనం వస్తున్నారు?” రిసెప్షన్ స్టేజి పైన కొలువు దీరిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో గుసగుసలాడింది.
“వీళ్లంతా అమ్మానాన్నల సంతోషానికి నిదర్శనం.” అర్థం కాలేదు నవ వధువుకు.
అలసట మూలంగా నడుం నొప్పి, కీళ్ల నొప్పితో మొదటి వరుస సోఫాలో కూర్చుని వేదిక పైన జంటను తిలకిస్తున్నది శకుంతల.
రిసెప్షన్ స్టేజి ఎక్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్న సహృదయులందరికీ కొడుకు ఘనతను గొప్పగా చెబుతూ పరిచయం చేస్తూ ఆశీర్వాదాలను ఆస్వాదిస్తున్నారు రుద్ర తల్లిదండ్రులు.
“ఇన్నాళ్ళూ రుద్ర మన వాడని తెలియదు, తెలిస్తే మీతో వియ్యం అందుకునే వాళ్ళం.”
“మనవాడు కాదండీ, అదిగో ఆవిడ-నా సఖి గారి ‘మనవడు’ అని మనసులో సవరణ చేసుకున్నాడు రుద్ర.
*******
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆనందానికి ఆరు సూత్రాలు
రచన: సిహెచ్. సీఎస్. రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"రంగయ్య బావా!..... నమస్కారం...." చేతులు జోడించాడు నవ్వుతూ నారాయణమూర్తి.
చేతిలోని దినపత్రికను క్రిందికి దించి నేరుగా చూచాడు రంగయ్య. వారికి ఒక ఆడ, మగ పిల్లలు. సిటీలోని హాస్టల్లో వుంటూ చదువుతున్నారు. అమ్మాయి శాంతి పదవతరగతి. అబ్బాయి రఘు ఎనిమిదవ క్లాసు. శలవు రోజుల్లో ఇంటికి వస్తారు. తల్లితండ్రి మాటలను జవదాటరు. ఎదురుగా తన బావమరిది అమెరికా వాసి, సైంటిస్ట్ నారాయణమూర్తి. అతని చెల్లెలు గౌతమి రంగయ్య గారి అర్థాంగి.
"రారా నారాయణా!... ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి?" సింహద్వారం వైపు చూచి....
"గౌతమీ!.... మీ సోదరులు వేం చేశారు. రా!..." బిగ్గరగా పిలిచాడు రంగయ్య.
రంగయ్య భూస్వామి. తాతతండ్రులు అర్జించిన ఆస్తిపాస్థులు గొప్పగానే వున్నాయి. అతను పంచను ఎగ్గట్టి కండువాను తలకు చుట్టి అరకపట్టి (నాగలితో) చేలను దున్నుతాడు. వ్యవసాయానికి సంబంధించి అన్నిపనులూ ఇద్దరు పాలేర్లు వున్నా తనూ శ్రమిస్తాడు. కారణం ’ఆరోగ్యమే మహాభాగ్య’ అని నమ్మిన మహామనిషి. వయస్సు యాభై సంవత్సరాలు. అర్థాంగి గౌతమికి వారికి ఎనిమిది సంవత్సరాలు వ్యత్యాసం. జీవితాన్ని చాలా క్రమబద్ధంగా నడిపే మనిషి రంగయ్య.
నారాయణ వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వయస్సు నలభై ఐదు.
గౌతమి వరండాలోనికి వచ్చింది.
తమ్ముణ్ణి చూచి......
"ఏరా నారాయణా!... అంతా కుశలమే కదా!.... ఊర్లో అమ్మా నాన్నా, ఆ దేశంలో నీ భార్య పిల్లలూ క్షేమమే కదా!....." ఆప్యాయంగా పలకరించింది గౌతమి.
"గౌతమీ!.... అంతా కుశలమే అమ్మా!" జవాబు.
"అవును ఏం అన్నా!..... చాలా తగ్గిపోయావు? ఏమిటి కారణం?" నారాయణను పరిశీలనగా చూస్తూ అడిగింది గౌతమి.
విరక్తిగా నవ్వాడు నారాయణ.
"వయస్సు అవుతూ వుంది కదమ్మా!" విరక్తిగా చెప్పాడు నారాయణ.
"అమెరికాలో వున్నావు. సైంటిస్ట్ వి. డాలర్ల రూపంలో మంచి జీతం. సొంత ఇల్లుని కట్టుకొన్నానని ఫోన్ చేశావు. అన్నీ గొప్పగా వుండి నీవు ఎందుకురా ఇలా తగ్గిపోయావు. నా ఊహలో, నీవు ఏదో సమస్యలో బాధపడుతున్నట్లుగా అనిపిస్తూ వుందిరా!" సాలోచనగా అన్నాడు రంగయ్య.
"బావా!.... మీ ఊహ సరైనదే. మీ సోదరి శ్యామలకు పాశ్చాత్య నాగరీకత వ్యామోహం. మరి నాకు మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే ఎంతో అభిమానం, గౌరవం. దానికి తాను పూర్తి వ్యతిరేకం. ఆమె ఆ తత్త్వం నాకు ఎంతో ఆవేదనను కలిగిస్తూ వుంది బావా!" విచారంగా చెప్పాడు నారాయణ.
రంగయ్య నిట్టూర్చాడు.
"అంగట్లో అన్నీ వున్నాయి. కానీ అల్లుడి నోట్లో శని వుంది’ అన్న సామెతలా ఉంది నీ జీవితం" విచారంగా చెప్పాడు రంగయ్య.
"మీ మాట యదార్థమే బావా!.... ఇద్దరు పిల్లలు గౌతమ్, అమ్మాయి పరిమళ. తల్లిని గౌరవించినట్లు నన్ను గౌరవించరు. నా మాటలను లెక్క చేయరు. తల్లి మాట వారికి వేదవాక్కు బావా!..." దీనంగా చెప్పాడు నారాయణ.
-"అన్నయ్యా!.... అమెరికాను వదలి మన దేశానికి తిరిగి రాకూడదా!.... ఇక్కడికి వచ్చారంటే వారి తత్త్వంలో మన ఈ పరిసరాల ప్రభావంతో మార్పు కలుగవచ్చుగా!... అందరం ఒకే ప్రాంతంలో వున్నట్లు వుంటుందిగా!... అది నీకు ఆనందమేగా!..." అభిమానపూర్వకంగా అడిగింది గౌతమి.
"అమ్మా!.... ఆ ప్రయత్నాన్ని చేశాను. ఆ తల్లి బిడ్డలకు భారత్‍కు రావడం ఇష్టం లేదు. వారికి ఆ దేశం, వుంటున్న ప్రాంతం, బాగా నచ్చింది. కానీ నాకు మన ఈ దేశం అన్నా, మన ప్రాంతం అన్నా, మన మనుషులు తీరు అంటే ఎంతో ఇష్టం. ఆ దేశంలో వారి మధ్య నా పరిస్థితి ’వడ్లతోటే తట్ట ఎండాల్సినట్లుగా వుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనశ్శాంతి లేకుండా చేశాడు" విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.
"కొందరికి మన స్వదేశం కన్నా అమెరికా, బ్రిటన్ అంటే ఎంతో మోజు. నీవారి పరిస్థితీ అలాగే వుంది. నీ మాటలను బట్టి!...." సాలోచనగా చెప్పాడు రంగయ్య. కొన్ని క్షణాల తర్వాత.... "సరే!..... విచారించకురా!.... ప్రతి సమస్యకూ కాలం పరిష్కారాన్ని చూపుతుంది. విచారంతో కృంగిపోయి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసికోకుండా, దైవాన్ని నమ్మి నీ కష్టాలను ఆ పరంధాయునికి విన్నవించుకొంటే.... వారు తప్పక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. లేచి రండి, టిఫిన్ చేద్దురుగాని" అనునయంగా చెప్పింది గౌతమి.
రంగయ్య నారాయణమూర్తి కుర్చీలనుండి లేచి ఇంట్లోకి నడిచారు. డైనింగ్ టేబుల్‍ను సమీపించారు.
గౌతమి, వేడివేడి ఇడ్లీలు, అల్లంచెట్ని (పచ్చడి), కొబ్బరి చట్నీలను రెండు ప్లేట్లలో వుంచి, భర్త, అన్నగార్ల ముందు వుంచింది.
ఇరువురూ ఆనందంగా ఆరగించారు.
"బావా!...."
"ఏంటి నారాయణ!"
"టిఫిన్ అయిన తరువాత మీ ప్రోగ్రాం ఏమిటి?..."
"అలా చేలల్లోకి వెళ్ళి పైరుకు సరిపడా నీళ్లు వున్నాయా లేక నీరు నింపాలా, కలుపు మొక్కలు ఏమైనా ఎదిగాయా చూచుకొనేదానికి వెళతాను. నీవూ నాతో వస్తావా?...." అడిగాడు రంగయ్య.
"అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా బావా!....తప్పకుండా వస్తాను." ఆనందంగా చెప్పాడు నారాయణమూర్తి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఇరువురూ చేతులు బేసిన్‍లో కడుక్కున్నారు.
గౌతమి ఇరువురికీ కాఫీ గ్లాసులను అందించింది. బావామరుదులు కాఫీ త్రాగి, గౌతమికి చెప్పి, చేల వైపుకు బయలుదేరారు.
*
అరగంటలో వారిరువురూ రంగయ్య పది ఎకరాల పంటభూమిని సమీపించారు. ఆ పదిఎకరాలు రెండుకార్లు పండుతాయి. మంచినీటి వసతి కల ప్రాంతం. భూమి మధ్యలో ఒక వేపచెట్టు, దాని చుట్టూ గుండ్రటి ఆకారంలో అరుగు, అరుగు పై నిలబడితే వారి భూమి నాలుగు వైపులా చూచుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఐదుగంటలకు అక్కడికి వచ్చి తన భూమి చుట్టూ ఒక ప్రదిక్షణం చేసి, ఆ అరుగుమీద కూర్చొని, ఒక గంటసేపు దైవాన్ని ధ్యానించడం రంగయ్య అలవాటు. ఒకవైపు నుంచి నేరుగా ఆ అడుగువరకూ రోడ్డు ఉంది. హద్దులమీద వారి తండ్రి బసవయ్యగారు నాటిన తాటిముట్టెలు ఇప్పుడు తాటి చెట్లుగా బాగా ఎదిగి, ఋతుధర్మ ప్రకారం ఆడచెట్లు తాటికాయలను కాస్తాయి. ఇప్పుడు ఆడచెట్లు కాయలతో వున్నాయి. చేలల్లో నీరు పెడుతున్న పాలేరు పాండు వీరిని చూచి పరుగున వారిని సమీపించాడు.
నారాయణకు తాటికాయలను చూడగానే ముంజెలు తినాలని నోరూరింది. తన బాల్యం గుర్తుకొచ్చింది.
"దండాలు బాబుగారూ!...." చేతులు జోడించాడు పాండు.
"పాండూ బాగున్నావా!... నేను గుర్తున్నానా!..." చిరునవ్వుతో అడిగాడు నారాయణమూర్తి.
"అయ్యగారూ!.... మిమ్మల్ని నేను ఎట్టా మరిచిపోయానండే. మీరు మా అయ్యగారి బామ్మర్ది కదా!..." నవ్వుతూ చెప్పాడు పాండు.
"రేయ్!..... పాండూ!...."
"బామ్మరది గారి చూపు ఎక్కడుందో నీకు తెలుసా!...." అడిగాడు రంగయ్య.
"వారి మనసులో ఏముందో నాకేం తెలుసయ్యా!..." విచారంగా చెప్పాడు పాండు.
రంగయ్య వేలితో తాటిచెట్లను చూపించాడు.
"ఓ.... తాటికాయలా!...." నవ్వుతూ అన్నాడు పాండు.
"అవును పాండూ! ముంజలను తినాలని వుంది!...." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నారాయణమూర్తి.
"ఓస్ అంతేకదా!... మీరు అరుగుమీద కూసోండి సామీ... నేను చెట్టు ఎక్కి ఒక గెలను తీసుకొస్తా..." వేగంగా పాండు తాటిచెట్ల వైపుకు నడిచాడు.
అరగంట లోపల ఒక తాటి గెలతో అరుగున సమీపించాడు.
దాదాపు ఇరవై కాయలున్నాయి ఆ గెలలో.
కత్తితో కోసి తాటికాయలను నారాయణకు, రంగయ్యకు అందించాడు పాండు.
ఇరువురూ తలా ఐదు కాయలలోని ముంజలను బొటనవేలితో తీసుకొన్నారు. పాండూ మిగతా కాయలను చివ్వి ముంజలను తీసి తాటి ఆకు మూగంలో వేసి కట్టాడు.
"అయ్యా!.... ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మగారికి ఇవ్వండి" ప్రీతిగా చెప్పాడు.
"అలాగే పాండూ!..." అన్నాడు రంగయ్య.
పాండూ తన పనికి వెళ్ళిపోయాడు.
"బావా!.... ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం పైరుగాలి ఆ అమెరికాలో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా దొరకదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్వగా ఉంది బావా!.... నీవు చాలా అదృష్టవంతుడివి." అభిమానపూర్వక అభినందనలను తెలియజేశాడు నారాయణమూర్తి.
"ఆ..... నారాయణా!... ప్రాప్తాప్రాప్తాలు దైవాదీనం. మన తల వ్రాతను వ్రాసి ఆ సర్వేశ్వరుడు మనలను ఈ భూమి మీదకు పంపాడు. మన జీవితం, మనలలాట లిఖిత ప్రకారమే సాగుతుంది. నీకు ఆ సర్వేశ్వరులు నిర్దేశించింది అమెరికా. నాకు ఏర్పరచింది పల్లెటూరు. ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకొనవలసింది, మనకు వున్నా దానితో సంతృప్తి చెందడం. అత్యాసకు దూరంగా వుండటం. నారాయణా!... ఏదో ఆ కాలంలో బియ్యేదాకా చదివించాడు మా నాన్నగారు. వారు నాకు నేర్పిన విషయాలను నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. మనకు లేనిదాన్ని గురించి ఎప్పుడూ విచారపడకూడదు. వున్నాదాంతో తృప్తి చెందాలి. మన చుట్టూ వున్నవారిని అభిమానించాలి. నేను నా జీవితగమనంలో పాటించేవి ఆరు సూత్రాలు.
ఒకటి:- దైవం మీద నమ్మకం. ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక అరగంట ఆ దైవాన్ని ధ్యానించడం నాకు నచ్చిన పేరుతో, ఆ జగత్ రక్షకులను శతకోటి నామాలు. అది నీకూ తెలిసిన విషయమే!....
రెండు:- సదా సత్యాన్ని పలకడం. అబద్ధాన్ని నీ మాటల్లో దరికి చేరనీయకుండా వుండడం. అటువంటి వారి సాంగత్యాన్ని (అబద్ధాలు చెప్పేవారి) వదలడం. ధర్మాన్ని ద్వేషించకూడదు పాటించడం (కర్తవ్యాన్ని) గిట్టని వారిని అభిమానించడం.
మూడు :- క్రమం తప్పకుండా ఉదయాన్నే ఐదుగంటలకు లేచి వ్యాయామం చేయడం, జాగింగ్, ఆసనాలు, ప్రాణాయామం, క్రమబద్ధంగా చేయడం.
నాలుగు :- ఆహార విషయంలో ’మితం’ అన్నది చాలా ముఖ్యం. రుచిగా వుందని అతిగా భోజనం చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది. శరీరంలోని రకరకాల వ్యాధుల మూలం మన ఆహారపు అలవాట్లు. ఉత్తమమైనది శాకాహారం.
ఐదు :- నీకు వున్నంతలో పేదవారికి నీ ఆశ్రయితులకు దానం చేస్తూ సర్వేశ్వరార్పణమస్తు, అనుకొంటూ చిరునవ్వుతో హృదయపూర్వకంగా చేయడం. మనం చేసే దానం, ప్రతిఫలాపేక్షారహితంగా వుండాలి.
ఆరు:- మనకంటే పెద్దలను, పసిపిల్లలను, గురువులను, బంధుమిత్రులను, ప్రేమతో అభిమానించడం, గౌరవించడం. మనకు కీడు చేసినవారికి మనం చేయగలిగిన మేలు చేయడం.... సుమతీ శతకకర్త యోగి వేమన వ్రాశారు. ’అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి (గొప్పవాడు) సుమతీ!....
దీన్ని నీవు నీ బాల్యంలో చదివి వుంటావు."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
చెప్పడం ఆపి రంగయ్య నారాయణమూర్తి ముఖంలోకి చిరునవ్వుతో చూచాడు.
నారాయణమూర్తి విచారంగా రంగయ్య ముఖంలోకి చూచాడు.
"నారాయణా!.... సూక్తులను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకూడదు. మన పెద్దలు వారి భావితరాల వారు, గొప్పవారుగా ధర్మబద్ధులుగా నీతి నిజాయితీలతో బ్రతకాలని మన కోసం ఎన్నో గ్రంథాలు వ్రాశారు. చదివినదాన్ని, విన్నదాన్ని పాటించటం మన జీవితం ప్రశాంతంగా సాగేదాని అతి ముఖ్యం. నా తండ్రి... నా గురువులు, నేను చదివి నేర్చుకొన్న వాటిని నాకు నచ్చిన వాటిని పాటిస్తూ నా జీవితాన్ని సాగిస్తున్నాను. నీవు నాకంటే గొప్పవాడివి. ఎన్నో విషయాలు తెలిసినవాడివి. నీకు నేను చెప్పేటంతటి వాడిని కాను. కానీ..... నీ మనోవేదనను అర్థం చేసుకొన్నా. ఏదో నాకు తోచిన ’ఆనందానికి ఆరు సూత్రాలు, నేను పాటించేవాటిని నీకు చెప్పాను. తప్పుగా అనుకోకు. నేను చెప్పింది నీ మంచికోరి, ఆలోచించుకో బావా నారాయణమూర్తి" చిరునవ్వుతో చెప్పాడు రంగయ్య.
నారాయణమూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి.
"బావా!.... మీరు చెప్పిన విషయాలను బట్టి.... నాకు నా కర్తవ్యం బోధపడింది. నేనెవరు?.... నిమిత్తమాత్రుణ్ణి. నా ధర్మాన్ని నేను పాటించాలి. భార్య కాని, పిల్లలు కాని, నేను వారికి చేయవలసింది చేయడమే నావంతు. మీరు చెప్పిన ఆరుసూత్రాలను పాటించి నాకు ఆనందాన్ని నేనే కల్పించుకొంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు నా కళ్ళు తెరిపించారు. నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు బావా!.... ధన్యవాదాలు..." ఎంతో వినయంగా చేతులు జోడించాడు నారాయణమూర్తి....
"సరే! పద.... మీ చెల్లెలు మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది" నవ్వుతూ అన్నారు రంగయ్య.
కన్నీటిని తుడుచుకొని, పాండూ కట్టిన తాటిముంజల ముంగాని చిరునవ్వుతో తీసుకొన్నాడు నారాయణమూర్తి.
ఇరువురూ ఇంటివైపుకు బయలుదేరారు.
*
సమాప్తి
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
వీకెండ్స్
రచన: L. V. జయ
"రేపు మీ నాన్నగారి తద్దినం".ఆఫీస్ లో ఉండగా జాగృతి వాళ్ళ అమ్మ లత ఫోన్ చేసి చెప్పారు.
"అవును అమ్మా. గుర్తు వుంది" అంది జాగృతి.
"ఆయన పోయి 20 ఏళ్ళు అయ్యింది." అన్నారు బాధగా లత.
"20 ఏళ్ళు అయిపోయాయి అంటే నమ్మలేకపోతున్నాను అమ్మా." జాగృతి కి కూడా బాధగా ఉంది.
"రేపు తమ్ముడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన వెంటనే ఫోన్ చేస్తాను. నువ్వు కూడా దణ్ణం పెట్టుకుని తిను" అని చెప్పారు లత.
"సరే మీరు ఫోన్ చేశాకే తింటాను " అని చెప్పి ఫోన్ పెట్టింది జాగృతి.
చుట్టూ కొలీగ్స్ మాట్లాడుకుంటున్నవి వినపడ్డాయి. వీకెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
' ఫ్రైడే వస్తే చాలు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అని తప్పకుండా అడుగుతారు'. జాగృతి వాళ్ళు కూడా వీకెండ్లో ఎక్కడైనా వెళ్తూవుంటారు. వీకెండ్ కి ఎక్కడికి వెళ్ళాలి అని జాగృతి భర్త, సమర్థ్ ముందే ప్లాన్ చేస్తాడు. ఈ సారి ఏమి చెయ్యలేదు ఇంట్లోనే ఉండాలి కాబట్టి.
ఆ వీకెండ్ అంతా తన చిన్నప్పటి విషయాలు ముఖ్యంగా వీకెండ్స్ గుర్తువచ్చాయి జాగృతి కి.
అవి అన్ని సమర్థ్ తో, పిల్లలు శాన్వి, సార్థక్ లతో చెప్పింది.
"చిన్నప్పుడు వీకెండ్ అంటే ఒక రోజే. ఆదివారం. అందరూ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. కానీ మా ఇంట్లో మాత్రం ఆదివారం రాకుండా ఉంటే బాగుణ్ణు అనుకునేవాళ్లం".
"ఏం" అడిగారు పిల్లలు ఆశ్చర్యంగా.
"దానికి కారణం మీ తాతగారు. ఆయన కాలేజ్ లో హెడ్ మాస్టర్ గా చేసేవారు. చాలా స్ట్రిక్ట్. కాలేజ్ లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో ఇంట్లో మా అందరికి కూడా అంతే భయం. పైగా ఆయనకి విపరీతమైన శుచి శుభ్రత. ఇల్లు, ఇంట్లో మనుషులు, వస్తువులు ఎంత శుభ్రంగా వున్నా, ఆయనకి ఎక్కడో ఎదో చోట ఎదో ఒకటి బాగులేనట్టు అనిపించేది. ఆదివారం వచ్చిందంటే చాలు మా ఇంట్లో శుచి శుభ్రత కార్యక్రమాలు మొదలు అయ్యేవి. నేను, మావయ్య ఎంత బాగా చదువుకున్నా, ఎక్కడో ఎదో లోటు కనపడేది. చదువులు, రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ అయ్యేవి".
"అందరూ ఆడుకుంటూ ఉంటే మీరు ఆ రోజు కూడా చదువుకునేవారా?" అడిగారు శాన్వి, సార్థక్.
"అవును. ఆదివారం అయినా కూడా ఉదయాన్నే లేవాలి. లేచిన వెంటనే బెడ్ మీద వున్న దుప్పటిని దులిపి నీట్ గా వెయ్యాలి. పళ్ళు తోముకోవటం అయిన వెంటనే వాష్ బేసిన్స్ క్లీన్ అయిపోవాలి. స్నానాలు అయిన వెంటనే బాత్రూమ్స్ క్లీన్ అయిపోవాలి".
"ఎందుకు?" అడిగారు పిల్లలు.
"ఇలాంటివి వాడిన వెంటనే క్లీన్ చెయ్యాలి. లేకపోతే మరకలు పడతాయి, బాక్టీరియా పెరుగుతుంది అనేవారు. అది అయిన తరువాత ఒంటి మీద వేసుకునే వాటి శుభ్రత".
"అంటే" అడిగారు పిల్లలు.
"బట్టలు, చెప్పులు, షూస్" నవ్వుకుంటూ చెప్పాడు సమర్థ్. జాగృతి వాళ్ళ నాన్నగారిని సమర్థ్ చూడలేదు .వాళ్ళ పెళ్ళికి ముందే ఆయన పోయారు. కానీ జాగృతి మాటల్లో ఆయన గురించి కొంత తెలుసుకున్నాడు. ఎప్పుడు జాగృతి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినా సమర్థ్ కి చాలా నవ్వు వస్తుంది.
"అవును. అమ్మమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటే తాతగారు చెప్పులు, షూస్ క్లీన్ చేసేవారు."
"ప్రతి వారం క్లీన్ చెయ్యాలా షూస్?" అడిగింది శాన్వి .
"అవును. వారానికి ఒక్కసారి అయినా ఇవి క్లీన్ చెయ్యాలి. ఎక్కడెక్కడ తిరిగి వస్తాయో కదా అనేవారు. ఉతకడం అయ్యాక, ఇద్దరూ కలిసి గోలాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేవారు."
"గోలాలు అంటే?" అడిగింది శాన్వి.
"వాటర్ ట్యాంక్స్"చెప్పాడు సమర్థ్. సమర్థ్ కి చాలా నవ్వు వస్తోంది ఇదంతా వింటూ.
"అవి ఎందుకు ప్రతి వారం క్లీన్ చెయ్యడం?" మళ్ళీ అడిగింది శాన్వి.
"వాటిల్లో నీళ్లు, తడి ఎక్కువ సేపు ఉండిపోతే కలరా, డియేరియా, టైఫాయిడ్ లాంటివి వస్తాయి అనేవారు. తరువాత, డాబా మీదకి బట్టలన్ని తీసుకుని వెళ్లి ఆరేసేవారు తాతగారు. బట్టలకి క్లిప్స్ పెట్టేవారు కాదు."
"అలా ఎందుకు? ఎగిరిపోతాయి కదా పెట్టకపోతే?" అడిగాడు సార్థక్.
"క్లిప్స్ పెట్టిన చోట మడతలు పడిపోతాయని అవి పెట్టావారు కాదు. ఆరేసిన బట్టలు ఎగిరిపోకుండా, పక్షులు రెట్టలు వెయ్యకుండా బట్టలు ఆరేంతవరకు ఎండ లో కూర్చునే వారు."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
సమర్థ్ కి మళ్ళీ నవ్వు వచ్చింది.
"ఆ టైం లో చందమామ పుస్తకం లో కథలు, సీరియల్స్ చదివి, మంచి కథలు కట్ చేసి ఫైల్ చేసి తరువాత బుక్ బైండ్ చేసేవారు. విక్రమ్ బేతాళ కథలు, విక్రమార్కుడు సాలభంజికల కథలు ఇవన్నీ మీకు చెప్పానుగా. అవన్నీ తాతగారు తయారుచేసిన బుక్స్ లో చదివినవే. ఈ బుక్స్ ని మా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అడిగి తీసుకువెళ్లేవారు చదవడానికి. ఇప్పటికీ వున్నాయి మా దగ్గర ఆయన బైండ్ చేయించిన బుక్స్ అన్నీ. మేము హాలిడేస్ లో ఎన్నిసార్లు చదివేవాళ్ళమో ఆ బుక్స్ అన్నీ."
"ఈ సారి మేము కూడా చదువుతాం" అన్నారు పిల్లలు ఇద్దరూ.
"అమ్మమ్మ రోజు పూజ చేసుకున్నా, ఆదివారం ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ సేపు పూజ చేసేవారు. అమ్మమ్మ కి శ్లోకాలు బయటకి చదివే అలవాటు ఉంది కదా అవి వింటూ మాకు కూడా అన్ని నోటికి వచ్చేసాయి."
"అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ తయారుచేసేవారు. భోజనాలు అయ్యాక, ఆరిన బట్టలని ఇస్త్రీ చేస్తూ నన్ను, మావయ్యని మా టెక్స్ట్ బుక్స్ తెమ్మని చెప్పి అందులో అప్పటి వరకు అయ్యిన చాఫ్టర్స్ లో క్వశన్స్ అడిగేవారు. ఎక్కడ నుంచి ఏమి అడుగుతారో అన్న భయంతో ఇద్దరం అన్ని ముందే చదువుకునేవాళ్ళం. ఒకవేళ ఏదైనా చెప్పలేకపోతే అవి వచ్చేంత వరకు చదివించేవారు. ఆ టైం లో ఆయన వారం మొత్తం న్యూస్ పేపర్స్ లో వచ్చిన ముఖ్యమైన కథలని, సీరియల్స్ ని, సైన్స్ ఆర్టికల్స్ ని కట్ చేసి ఫైల్స్ లో పెట్టేవారు. వాటిని తరువాత వేరేగా బుక్ బైండ్ చేయించేవారు."
"రోజంతా పని, చదువేనా? రెస్ట్ లేదా?" వెక్కిరిస్తూ అన్నాడు సమర్థ్.
"ఇవన్నీ అయ్యాక అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే మంచం కిందో, ఫ్యాన్ కో వున్న చిన్న బూజు కనపడేది. మంచం కిందకి నన్ను, మావయ్యని దూరి అవి క్లీన్ చేయమని చెప్పి, తను స్టూల్ వేసుకుని ఫ్యాన్ క్లీన్ చేసేవారు. ఫ్యాన్ క్లీన్ చేసాక, అది మెరవాలని ఆయిల్ రాసి ఫ్యాన్ మెరుస్తుంటే చూసి ఇది క్లీనింగ్ అంటే అని ఆనందపడేవాళ్లు. ఆదివారం ఇంట్లో వస్తువులు అన్నీ తళతళా మెరిసిపోయేవి."
జాగృతి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటే, సమర్థ్ కి అసలు నవ్వు ఆగటం లేదు.
"ఇక సాయంత్రం ఐదు అయ్యాక, ఎక్కడైనా వెళ్దాం అని చెప్పి రెండు కిలోమీటర్లు దూరం లో వున్న సిటీ మెయిన్ సెంటర్ వరకు నడిపించి అక్కడ ఆగి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్ళాలి అని. ఎక్కడికో వెళ్లాలో నిర్ణయించుకున్నాక మళ్ళీ రెండు, మూడు కిలోమీటర్లు నడిపించి ఫ్రెండ్స్ ఇళ్లకో, చుట్టాల ఇళ్లకో తీసుకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు వచ్చేది మాకు ఫ్రెండ్స్ తో ఆడుకునే అవకాశం."
"అబ్బా. ఇదేం లైఫ్ అమ్మా. రోజంతా పని, చదువు, నడక. వీకెండ్ హ్యాపీనెస్ ఏముంది ఇందులో. బోర్ కొట్టించావ్ ఇంత సేపు ఇదంతా చెప్పి." అన్నారు శాన్వి, సార్థక్.
"మేము అలానే అనుకునే వాళ్ళం. ఇంటి చుట్టుపక్కల వున్న వాళ్ళు, ఫ్రెండ్స్, అందరూ పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఉంటే మేము మాత్రం ఏమిటి ఇలా పనివాళ్ళలాగా రోజంతా ఎదో ఒక పని చేసుకుంటున్నాం అని. కానీ పెద్ద అయ్యాక తెలిసింది ఎంత బాగా పెంచారో అని. వాళ్ళకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు, ఎన్నో మంచి అలవాట్లు నేర్పారని. చదువు ధ్యాసలో, భక్తి లో పూర్తిగా వుంచేవారని. ఎక్కడికి వెళ్లాలన్నా, నడిపించి తీసుకెళ్లి చాలా
ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, ఇద్దరూ కలిసి వంట తో సహా అన్ని పనులు చేస్తూ, నా చేతా, మావయ్య చేతా ఒకేలాగా పనులు చేయిస్తూ, మా ఇద్దరినీ ఒకేలాగా చూస్తూ ఆడ, మగకి తేడా చూపించకుండా పెంచారు."
"నేను ,మావయ్య ఇద్దరూ ఇంజనీరింగ్ చదివాము. మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరికీ రోజూ పూజ చెయ్యటం అలవాటు అయిపొయింది. నీటుగా ఉండడం అలవాటు అయిపొయింది. అన్ని పనులు చేసుకోవడం వచ్చు. ఎవరి మీదా డిపెండ్ అవ్వకుండా బతకడం వచ్చు. వీలయినంత ఎవరికైనా సాయం చేస్తాం. ఇద్దరూ ఆరోగ్యం గా, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వున్నాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే కదా."
"చిన్నప్పటి విషయాలు అంటే గుర్తుకు వచ్చేవి, ఈ ఆదివారాలే. చిన్నప్పుడు ఎంత బాధపడినా, మమల్ని తీర్చి దిద్దినవి ఈ ఆదివారాలే. మమల్ని సమాజం లో నిలబెట్టినవి ఈ ఆదివారాలే. "
"నిజమే అమ్మా. సారీ, ఇందాక అలా అన్నందుకు. మీరు మమల్ని అలానే పెంచండి. మాకు బాగా చదువుకుని, సొంతగా కంపెనీస్ పెట్టాలని ఉంది ?" అంది శాన్వి.
శాన్వి తమ్ముడు సార్థక్ కూడా " నాకు అలానే ఉండాలని ఉంది " అన్నాడు.
" మీరు మా మాట వింటూ పెరిగితే అలానే అవుతారు మరి. వింటారా? " అడిగింది జాగృతి .
" తప్పకుండా " అని పిల్లలు ఇచ్చిన సమాధానం తో చాలా ఆనందంగా సమర్థ్ ని చూసింది జాగృతి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
అప్పటికి అర్ధం అయ్యింది సమర్థ్ కి ఇన్నాళ్లు జాగృతి తన తల్లితండ్రుల గురించి ఏం చెప్పాలని అనుకుందో. ఇన్నాళ్లు విననందుకు జాగృతి కి సారీ చెప్పి పిల్లలతో
"తల్లితండ్రులు పిల్లలకు ఇవ్వాల్సినవి ఆస్తులు, డబ్బులు, ఇళ్ళు కావు. మంచి అలవాట్లు, మంచి సంస్కారం, భక్తి, చదువు, సేవ చేసే గుణం, ఇవన్నీ. సేవ, ముందు ఇంట్లో మొదలు అవ్వాలి. అమ్మకి ఇవన్నీ వాళ్ళ పెంపకం ద్వారా చూపించారు. మనం కూడా ఇక నుంచి వీలయినంత ఒకరికి ఒకరు సాయం చేసుకుందాం. బయటవాళ్ళకి సాయం చేద్దాం." అని చెప్పాడు .
ఇప్పటి వరకు జరిగిన వీకెండ్స్ అన్నీ ఒక ఎత్తు. ఈ వీకెండ్ ఒక ఎత్తు. జాగృతి ఆనందానికి హద్దులు లేవు.
***సమాప్తం***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
అక్క మరో అమ్మ
రచన: తాత మోహనకృష్ణ
చిన్నప్పటినుంచి మా అక్కా. . నేను ఈ ఊరిలోనే ఉన్నాము. ఇప్పుడు నాకు ఉద్యోగం రిత్యా. . వేరే ఊరు వెళ్ళాల్సి వస్తోంది. మా అక్కంటే, నాకు చాలా ఇష్టం. అమ్మ తర్వాత నన్ను అంతే ప్రేమగా చూసుకుంది అక్క. అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడం చేత, అక్కే అమ్మ లాగ నా కోసం అన్నీ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, తన సొంత కొడుకు లాగ చూసుకుంది. ఇంత చేసిన అక్క కి నేను ఏమిటి చెయ్యగలను. . ? ఇక్కడే, ఈ ఊరిలోనే ఉంటే, అక్కకి, బావగారికి సహాయపడుతూ. . నా మేనల్లుడుని ఆడిస్తూ ఉండేవాడిని. కానీ, ఏం చేస్తాం. . ? నా భార్య సుజాత మాట వినాలి. అసలే చాలా పట్టుదల, ముక్కు మీద కోపం గల అమ్మాయి సుజాత. .
*****
నాకు ఎప్పటికి ఉద్యోగం రాకపోతే, మా నాన్న కన్నా. . మా అక్క చాలా బాధ పడింది. మా నాన్నగారికి తెలిసిన సర్కిల్ లో ఒక సంబంధం ఉందంటే, నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. అమ్మాయి ఒక మోస్తరుగా ఉంది. . చామన చాయగా ఉంది. కానీ, మంచి కుటుంబం అని నాన్న చెప్పడం తో, పెళ్ళికి ఒప్పుకున్నాను. పైగా, ఉద్యోగం లేని నాకు. . పిల్లనిచ్చి ఉద్యోగం వేయిస్తానని నాకు కాబోయే మావగారు అన్నారు. మా నాన్న, అక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి. . సంబంధం ఓకే చేసాను.
నా పెళ్ళి బాగానే జరిగింది. ఇప్పుడు నాకు మా మవగారు తన పలుకుబడి తో బెంగుళూరు లో ఉద్యోగం వేయించారు. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మా అక్క, బావగారికి, ముద్దుల మేనల్లుడుకి బాయ్ చెప్పి. . నేను, సుజాత బయల్దేరాము. ఒక రోజు ట్రైన్ లో ప్రయాణం తర్వాత బెంగుళూరు చేరుకున్నాము. సుజాత కుడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. మా మావగారి పలుకుపడి అక్కడ బాగా ఉందని నాకు అర్ధమైంది. ఒక విధంగా నేను చాలా లక్కీయే అనిపించించి.
*****
నా భార్య తో నా జీవితం చాలా హ్యాపీ గా సాగిపోయింది. ఇద్దరమూ కలిపి సంపాదించడం తో, మాకు డబ్బుకు లోటు లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అక్క ని చూడడానికి ఊరు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు ఎన్నో కానుకలు తీసుకుని వెళ్ళేవాడిని. అందరూ చాలా హ్యాపీ అయ్యేవారు. నా మేనల్లుడుకి ఇష్టమైన కొత్త రకం వాచ్
ని ఎప్పుడూ వాడికోసం తీసుకునేవాడిని.
కొంత కాలానికి మాకు ఒక పాప పుట్టింది. నా అక్కకి కోడలు పుట్టిందని నా మనసులో నేను అనుకున్నాను. కానీ, సుజాత మాత్రం ఎప్పుడూ అలా అలోచించలేదు. కాలం తో పాటు సుజాతకి స్టేటస్ ఫీలింగ్ కుడా బాగా ఎక్కువ అయ్యింది. ఇంట్లో ఏ పనీ చేసేది కాదు. పనిమనిషి ఉన్నా, ఇంట్లో మిగతా పనంతా నేనే చేసేవాడిని. పిలిచి పిల్లనిస్తే. . ఇంతేనేమో అనుకునేవాడిని.
కాలం చాలా వేగంగా గడిచిపోయింది. మా అమ్మాయి శాంతి అప్పుడే కాలేజీలో చదువుతోంది. నా మేనల్లుడు అక్కడే ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఉద్యోగం లేక చాలా బాధ పడతూ. . ఈ జీవితం వద్దని ఆత్మహత్య చేసుకునే టైం లో నా అక్క. . . ధైర్యం చెప్పి, నేను ఉన్నానని చెప్పి, నాకు పెళ్ళి చేసి జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా అక్క ఋణం తీర్చుకునే టైం వచ్చిందని అనిపించింది. ఇక్కడ బెంగుళూరు లో నాకు తెలిసిన కంపెనీ లో ఉద్యోగం కోసం అప్లై చేయమని కిరణ్ కి చెప్పాను. వెంటనే, బయల్దేరి రమ్మని కుడా చెప్పాను.
ఒక వారం లో నా మేనల్లుడు కిరణ్ బెంగుళూరు కి వచ్చాడు. స్వతహాగా తెలివైన కిరణ్, వెంటనే ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు. తన ఫ్రెండ్స్ తో పాటు ఆఫీసు కి దగ్గరలో హాస్టల్ లో ఉన్నాడు. చిన్నప్పటినుంచి కిరణ్ గురించి ఎక్కువగా చెప్పడం చేత, ఇంకేమో మరి. . . శాంతికి బావంటే, చాలా ఇష్టం ఏర్పడింది. సుజాతకి ఎప్పుడూ కిరణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ నేను మాత్రం అప్పుడప్పుడు హాస్టల్ కి వెళ్లి కిరణ్ ని కలిసేవాడిని. వెళ్ళేటప్పుడు కిరణ్ కి ఇష్టమైన వంటకాలు నేనే చేసి తీసుకుని వెళ్ళేవాడిని.
నాకు కుడా తెలియని విషయం ఏమిటంటే, నా శరీరంలో పెరుగుతున్న అనారోగ్యం. ఒకరోజు డాక్టర్ దగ్గరకు జనరల్ చెకప్ కోసం వెళ్తే, విషయం తెలిసింది. డాక్టర్ చెప్పిన విషయం సుజాత కు చెప్పాను. మీకు ఏమీ అవదని కొట్టి పడేసింది. భర్త అంటే, అంత ప్రేమ మరి. . . ! భర్త ను దగ్గరుండి కాపాడుకోవాల్సిన భార్య ఇలా అనేసరికి. . నాకూ నా ఆరోగ్యం పైన ఆసక్తి పోయింది. ఎందుకో, ఆఖరిసారిగా కిరణ్ దగ్గరకు వెళ్ళాలనిపించింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆ రోజు నన్ను చూసిన కిరణ్ . . .
"మావయ్యా. . ! ఏమిటి అలా ఉన్నావు. . ? ఏమైంది. . ?" అని అడిగాడు
"ఏమీ లేదు. నా కూతురు శాంతి కి నువ్వంటే, చాలా ఇష్టం. ఏది ఏమైనా. . ఎవరు ఏమనుకున్నా. . నీకు నీ మరదలు మీద పూర్తి హక్కు ఉంది. ఎప్పటికైనా అది నీదే. దానికి నువ్వంటే ఎంతో ప్రేమ. పెళ్ళి చేసుకో . . " అని నా మనసులో మాట చెప్పాను. .
ఆ రోజు రాత్రి. . అక్క తో చాలా సేపు మాట్లాడాను. కిరణ్ అంటే శాంతికి చాలా ఇష్టమని చెప్పాను. మా అమ్మాయిని కోడలిగా చేసుకోమని అక్క దగ్గర మాట తీసుకున్నాను. సుజాత తో ఎదురుగా చెప్పలేక, ఇదంతా నా డైరీ లో రాసాను.
'మంచి ఉద్యోగం లో సెటిల్ అయిన కిరణ్ కి. . నా కూతురిని అప్పగించాను. అక్క ఋణం ఈ విధంగా తీర్చుకుంటున్నాను. . ఈ జీవితానికి ఇది చాలు. . ఇంక నాకు ఏమైనా పర్వాలేదు. . ' అని అనుకుని ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఆ తర్వాత నేను ఇంక లేవలేదు. .
*********
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
భిన్నత్వంలో ఏకత్వం
రచన: కొల్లా పుష్ప
ముంబైలో ట్రైన్ దిగేసరికి చిన్న కొడుకు మురళి ఎదురు వచ్చాడు. "బాగున్నావా అమ్మా" అంటూ చేతిలో లగేజీ తీసుకున్నాడు. "బాగున్నాను బాబు నీవు కోడలు పిల్లలు బాగున్నారా"? అంది అన్నపూర్ణమ్మ కారు ఎక్కుతూ.
"ఆ బాగున్నారమ్మ , నువ్వు ఎప్పుడు వస్తావా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు" అన్నాడు మురళి డ్రైవర్ కు రూట్ చెప్తూ.
గంట తర్వాత ఇంటి దగ్గరికి చేరేసరికి కోడలు మంజుల "బాగున్నారా అత్తయ్య" అంటూ చేతిలో బ్యాగు తీసుకుంది.
వేడివేడిగా వంట చేసి పెట్టింది తిన్నాక "పడుకోండి అత్తయ్య పొద్దున్న మాట్లాడుకుందాం బాగా అలసిపోయారు" అంటూ కోడలు మంజుల లైటు ఆపి బెడ్ లైట్ వేసింది.
@@@
ఉదయం లేచే సరికి అందరూ ఆఫీసులకి స్కూళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు.
మనవడు ఐదవ క్లాసు, మనవరాలు మూడో క్లాసు చదువుతున్నారు.
"అమ్మా నా పుట్టినరోజు నాడు కాలేజీకి ఏ డ్రెస్ వేసుకోవాలి" అని అడుగుతుంది ముద్దు ముద్దుగా వాళ్ళ అమ్మని.తనని చూడగానే "నానమ్మ" అంటూ వచ్చి వాటేసుకుంది. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది అన్నపూర్ణమ్మ.
ఇంతలో కొడుకు, కోడలు రెడీ అయి వచ్చారు. "అత్తయ్య అన్ని టేబుల్ మీద పెట్టాను టైం కు తిని మందులు వేసుకోండి, సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది పాప పుట్టినరోజు కదా! చిన్న పార్టీ ఉంది అందుకు కావలసిన వన్నీ కొనుక్కొని వస్తాము" అన్నది కోడలు మంజుల.
అచ్చం తెలుగింటి ఆడపడుచులా తయారైన కోడల్ని చూసి సంబరపడింది అన్నపూర్ణమ్మ. వాళ్ళు వెళ్ళగానే అన్ని పనులు పూర్తి చేసుకుని బాల్కనీలో నిలుచుంది.
అన్నీ కూడా 10, 12 అంతస్తుల భవనాల సముదాయాలు అందరూ బిజీ బిజీగా ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతున్నారు.
చిన్న కొడుకు మురళి ఐదవ అంతస్తులో ఉంటాడు. పెద్దకొడుకు విశాఖపట్నంలో ఉంటున్నాడు. భర్త చనిపోయాక ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటుంది.
ఇంతలో ముందు వరండా లో ఏదో గలాటా వినిపించింది అటువైపు కిటికీ తీసి చూసింది.
ఒకతను హిందీలో, ఒకతను తమిళంలో తిట్టుకుంటున్నారు. తనకు భాష తెలియకపోయినా వాళ్ళ హవ భావాలను బట్టి వాళ్లు దెబ్బలాడుకుంటున్నారని తెలిసింది.
ఇంతలో వాళ్ళు ప్రక్కనుంచి పక్క ఫ్లాట్ అమ్మాయి విజయ "ఆంటీ బాగున్నారా" అని పలకరించింది. "బాగున్నానమ్మ వాళ్ళిద్దరూ ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు" అని అడిగింది అన్నపూర్ణమ్మ. " నిన్న రాత్రి సెల్లార్లో వాళ్ళ పిల్లలు కొట్టుకున్నారట అందుకని" అని చెప్పేసి నాకు ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్లిపోయింది .
ఎవరు కలుగ చేసుకోలేదు అలిసిపోయె దాకా తిట్టుకొని ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు. 'అయ్యో
మనవరాలు పుట్టినరోజుకి బట్టలైనా కొన్నాను కాదు, మతిమరుపు దాన్ని.
చేతిలో డబ్బులు పెడదాంలే' అనుకున్నది.
***
పాప పుట్టినరోజు ఇంకా రెండు రోజులు ఉండగా ఫ్లాట్స్ లో అందరికీ ఫోన్లు చేసి మెసేజ్ లు పెట్టి చెప్పారు పైన టెర్రస్ మీద బర్త్డే పార్టీ ఉందని.
ఆరోజు రానే వచ్చింది అందరూ పిల్లలను తీసుకుని వస్తున్నారు. కోడలు "వెల్కమ్, వెల్కమ్" అంటూ వాళ్లను ఆహ్వానించింది.
అందరూ రకరకాల డ్రెస్సులతో వాళ్ళందరూ వాళ్ళ ఆచారానికి తగ్గట్టుగా వస్తున్నారు.
కన్నడ ,మలయాళం, మరాఠీ, పంజాబ్, తమిళనాడు కొందరైతే జర్మన్ ,రష్యా వాళ్ళు కూడా ఉన్నారు. 'వాళ్లందర్నీ చూస్తుంటే ఒక మినీ భారతదేశం కదలి వచ్చిందా' అనిపించినట్లు ఉంది అన్నపూర్ణమ్మ కు.
అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి పాస్ ఆన్ బాల్ గేమ్ ఆడించింది.
ఎవరైతే ఓడిపోతారో వాళ్లు ఏదో ఒక ఎక్టివిటీ చేయాలి పిల్లలందరూ చూడముచ్చటగా ఉన్నారు. వాళ్లకు వయసుకు తగ్గట్టు పాటలు, డాన్స్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషలో.
మధ్య మధ్యలో ఒక పాప "ఆంటీ నీరు బేకు" అన్నది.
ఒక బాబు "అంకుల్ ముజే బాత్రూం జానా హై" అని ఇంకొకరు.
ఒక పాప "ఐ వాంట్ గిఫ్ట్"అని ఒకరు.
ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక భాషలో మాట్లాడుతున్నారు. మురళి వాటన్నిటికీ అర్ధాలు చెప్తున్నాడు తల్లి అన్నపూర్ణమ్మ కు.
తనకి భాష రాకపోయిన పిల్లల ఆటపాటలు చూసి చాలా ఆనంద పడింది.
కేక్ కట్ చేసే టైం వచ్చింది పాప పట్టు పరికిణిలో మెరిసిపోతుంది.
అందరూ "హ్యాపీ బర్త్ డే అంటూ ఇంగ్లీషులో చెప్పారు. కోడలు మంజుల పిల్లలందరి చేత తెలుగులో "పుట్టినరోజు శుభాకాంక్షలు" చెప్పించింది.
అందరూ తమదైన శైలిలో చక్కగా చెప్పారు.
ఆరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం కూడా అందుకని కోడలు మంజుల వారి చేత "దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్" అంటూ తెలుగులో గురజాడ అప్పారావు గారు రచించిన పాట పాడించింది.
అందరికీ గిఫ్ట్ లు ఇచ్చాడు కొడుకు మురళి వెళ్లిపోయే ముందు అందరి చేత జనగణమన పాడించింది కోడలు.
జనగణమనలో చెప్పినట్లు పంజాబు, సింధు, మరాఠా, ద్రావిడ, ఉత్కళ ,వంగ అన్ని రాష్ట్రాలు ఒక్క తీరుగా ఉండాలి పిల్లల లాగా. ముందు రోజు దెబ్బలాడుకున్నా కానీ అందరూ ఆరోజు కలిసిపోయి ఆడుకుంటున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే అనిపించింది. ఈ పిల్లలను చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిందే పెద్దవాళ్లు.
'ఇలాగే దేశమంతా ఐక్యతగా ఉండగలిగితే భరతమాత గర్విస్తుంది. భారతదేశం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉంటుంది' అనుకుంది ఆనందంగా అన్నపూర్ణమ్మ.
శుభం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
భలే స్నేహితులు
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
“మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, తలుపులు విరిగేడట్లు కొడుతున్నాడు, ఆ వంకాయలు నేను తరుగుతాను కానీ ముందు వెళ్లి తలుపు తీయండి, ఎప్పుడో భోజనం కి టిఫిన్ కూడా తినకుండా వంకాయలు తరగడం మొదలెట్టారు” అంది స్వప్న.
“నీకు వంకాయలు అంటే చిన్న చూపు కదా, ఏరి మరి పొట్లకాయ వండుతావు. అందుకే ముందే తరిగి పెడితే వండుతావని..” అంటూ లేచి వెళ్లి తలుపు తీసాడు మూర్తి.
“యేమిటిరా బారేడు పొద్దుయేక్కినా తలుపులు బిగించుకుని కూర్చుంటారు, ఏం చేస్తున్నారు” అంటూ లోపలికి వచ్చాడు సుబ్బారావు.
“పగలైనా రాత్రి అయినా ఈ వయసులో మనం చేసేది ఏముంది కానీ, ఏమిటి అంత కంగారు పడుతున్నావ్” అన్నాడు నవ్వుతు మూర్తి.
“వుండరా! మా చెల్లమ్మ చేతితో యిచ్చిన కాఫీ తాగుతో చెప్తాను” అన్నాడు వంటగది వైపు చూస్తో.
“కాఫీ కి ముందు అత్తయ్య హోటల్ నుంచి తెప్పించిన గారెలు కూడా రుచి చూడరా” అన్నాడు మూర్తి.
“వడలు మీ ఇద్దరికి సరిపడి తెప్పించుకుని వుంటారు, నాకు కాఫీ చాలులే” అన్నాడు సుబ్బారావు.
“ఎందుకో రా ఉదయం ఎడమ కన్ను అదిరింది, ఎందుకైనా మంచిది అని యింకో ప్లేట్ ఎక్సట్రా తెప్పించనులే, వేషాలు వెయ్యకుండా ముందు గారెలు తింటే నే కాఫీ” అన్నాడు మూర్తి.
“బాగానే వుంది మీ స్నేహితుల సరసం”, అంటూ యిద్దరికి లారీ టైర్ అంత పెద్ద సైజు వడల ప్లేట్స్ అందించింది స్వప్న. “వదినని కూడా తీసుకుని రావలిసింది అన్నయ్య” అంది సుబ్బారావు తో.
“ఎలా వుంది రా గారే/’ అని అడిగాడు సుబ్బారావు ని మూర్తి.
“మా అత్తగారు చేసినట్టు వున్నాయి, నీకు ఈ అత్తయ్యా హోటల్ ఎక్కడ దొరికింది రా నా ప్రాణానికి” అన్నాడు సగం తిని వదిలిసిన ప్లేట్ ని పక్కన పెడుతో.
“దాని దుంప తెగా, ఎంత మోసం చేసింది” అంటూ సగం కొరికిన వడ ని ప్లేటులో పడేసాడు మూర్తి.
కాఫీ పట్టుకుని వచ్చిన స్వప్న “ఏమిటి ఎవ్వరు తినకుండా కూర్చున్నారు?” అంది.
“బాగుండలేదు గాని చెరో రెండు బిస్కట్స్ యివ్వు, ఆదివారం మొత్తం నాశనం చేసింది అత్తయ్య హోటల్” అన్నాడు మూర్తి భార్య తో.
“ఒరేయ్ నాకు బిస్కెట్ వద్దుకాని, కొద్దిగా మాదిఫలరసం వుంటే ఇవ్వరా నాలుకకి రాసుకుంటాను” అన్నాడు సుబ్బారావు.
“ఆపరా బాబూ, ముందు నువ్వు అంత హడావిడి గా వచ్చిన పనిఏమిటి, సింహాద్వారం ని టేకు తో చేయించుకునేది యిందుకే, నీలాంటి వాళ్ళు ఎంత భాదిన విరగకుండా వుంటుంది అని” అన్నాడు మూర్తి.
“ఏమిలేదురా, రేపు మా నాన్నగారి తద్దినం, ఆయన వున్నన్నాళ్లు పనసపోట్టు దొరికితే చాలు, లాటరి తగిలినంత ఆనందంతో కూర వండించుకుని తినే వాళ్ళు. యిన్నాళ్ళు ఈ విషయం గుర్తుకు రాలేదు. నిన్న మీ చెల్లెలు అంది మావగారికి పనసపోట్టు కూర యిష్టం కదా, మీ ఫ్రెండ్ వాళ్ళ తోటలో పనస చెట్టు విరగ కాసింది, అడిగి రెండు కాయలు తీసుకుని వచ్చి రేవు బ్రాహ్మన్స్ కి కూర వండి వడ్డీస్తే పితృదేవతలు సంతోషిస్తారు అంది. ఆడవాళ్లు గమనించినట్టు మనం గమనించలేము రా, అది ఎప్పుడు చూసిందో మీ దొడ్లో పనస చెట్టుని” అన్నాడు సుబ్బారావు.
“నీకు ఎలాగో కూరలు తరగడంలో నైపుణ్యం వుంది కాబట్టి ఒక పెద్ద సైజు పనసకాయ పొట్టు కొట్టి రేపు ఉదయం ఏడుగంటలకల్లా మా ఇంటికి తీసుకుని రా, రేపు మా నాన్నగారి తద్దినం ఆయన కిష్టమైన పనసపోట్టు కూర తో సంతృప్తి పరుస్తాను’ అన్నాడు సుబ్బారావు.
“ఒరేయ్ ఏదో తోటకూర, పాలకూర లాంటివి తరిగి మీ చెల్లెలు కి సహాయం చేస్తానని, నన్ను పనసపోట్టు కొట్టమంటానికి నీకు నోరు ఎలా వచ్చింది రా సుబ్బారావు” అన్నాడు మూర్తి.
“పనస కాయ పొట్టు కొట్టడం, పనస పండు వలవడం రానివాడివి పనస చెట్టు ఎందుకు పెంచుతున్నావు, వెధవ వేషాలు వెయ్యక రేపు పనస పొట్టు సప్లై బాధ్యత నీదే, నీకు పుణ్యం వస్తుంది లేరా, పద మంచి పదునైన కాయ సెలెక్ట్ చేస్తాను” అంటూ లేచాడు సుబ్బారావు.
యిహ వీడిని తప్పించుకోవడం కష్టం అనుకుని తోటలోని పనస చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు మూర్తి.
“ఒరేయ్ ఆ మూడో వరుసలోని రెండో కాయ, అదే బూడిద గుమ్మడి కాయంత వుంది చూడు అది కోసి, పొట్టు కొట్టుకుని రా” అంటూ “ఒరేయ్ మీ దొడ్లో బచ్చలి పాదు వుంది అని చెప్పలేదేమిటి రా, కొంత బచ్చలి ఆకు తీసుకొని వస్తే కందా బచ్చలి కూర చేయిస్త. భోక్తలు ఆనందంగా తింటారు” అన్నాడు సుబ్బారావు.
“నీ మొహం రెండు వేడి కూరలు, వేడిచేసి మంచం ఎక్కితే నీకు పాపం పట్టుకుంటుంది, అందుకే బచ్చలి ఆకు తీసుకొని వెళ్ళు, పనసపోట్టు కూర మీ అమ్మ తద్దినానికి తీసుకుని వెల్దువుగాని” అన్నాడు మూర్తి.
“వద్దులేరా, మొదట పనస పొట్టు కూర పెడతాను అనుకుని మానెస్తే మంచిది కాదు. అసలే పితృదేవతలతో పని, పనస పొట్టు తీసుకొని రా” అని వెళ్ళిపోయాడు సుబ్బారావు.
అన్నం తిని మెల్లగా నిచ్చిన తీసుకొని తోటలోకి వెళ్తున్న భర్తని చూసి స్వప్న, ‘ఏమిటి నిచ్చేన వేసుకొని పనసకాయ కోసేద్దామని అనుకుంటున్నారా, చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో, లోపలికి పదండి” అంది.
‘ఎలాగే, వాడికి రేపు పనసపోట్టు అందించాలి అంటే యిప్పుడు పని మొదలు పెట్టాలి’ అన్నాడు మూర్తి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
“నేను మీకు ఒక ఉపాయం చెప్పి ఈ గండం గట్టేక్కిస్తాను” అని చెవిలో ఏదో చెప్పింది మూర్తి కి.
రాత్రి అంతా కలత నిద్రతో గడిపి ఉదయమే స్నానం చేసి పనస పొట్టు ని సంచిలో పోసుకుని సుబ్బారావు ఇంటికి బయలుదేరుతున్న భర్తతో “యింకా 8 గంటలు కూడా కాలేదు, టిఫిన్ తిని వెళ్ళండి” అంది స్వప్న.
“సుబ్బారావు యింట్లో తింటాలే” అన్న మూర్తి ని చూసి నవ్వుతో, “బాగానే వుంది, ఈ రోజు తద్దినం పెడుతో టిఫిన్ లు తినరoడీ, ముందు ఈ నాలుగు మైసూర్ బజ్జిలు తిని వెళ్ళండి, పక్క వీధిలో వున్న మీ ఫ్రెండ్ ఇంటికి రెండు నిమిషాలలో వెళ్ళచ్చు” అంది.
ఏమో అనుకున్నాడు గాని వేడి వేడి బజ్జిలు తింటో వుంటే హాయిగా అనిపించింది మూర్తికి.
తిండి పని కానిచ్చుకుని, సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు.
సంచితో మూర్తి ని చూసిన సుబ్బారావు మొహం చాటంత చేసుకుని “పనస పొట్టు తెచ్చేసావు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు మా యింట్లో భోజనం చెయ్యచ్చుగా” అన్నాడు.
“ఏమోరా, తద్దినం భోజనం అయిన వాళ్ళు తప్పా బయట వాళ్ళు తినకూడదు అంటారు, అందుట్లో మీ చెల్లెలు కి మహా పట్టింపు” అని చెప్పి తిరిగి వచ్చేసాడు మూర్తి.
ఉదయమే స్వప్న యిచ్చిన కాఫీ తాగుతో, “నిన్న సుబ్బారావు పనస పొట్టు బాగా లాగించి వుంటాడు, అందుకనే ఫోన్ కూడా చెయ్యలేదు” అన్నాడు మూర్తి.
“వస్తారు లేండి స్నేహితుడి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు” అంది స్వప్న నవ్వుతు.
“యిదిగో తోటలో ఏదో చప్పుడు అవుతోంది, ఏ గొడ్డో వచ్చిందేమో చూడు” అన్నాడు మూర్తి పేపర్ అందుకుంటో.
“ఏమండీ ఒకసారి అర్జెంటుగా యిటు రండి” అని భార్య అరుపులు విని, ఏ మేకో, గొడ్డో వచ్చి వుంటుంది అని కర్ర తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ పనస చెట్టుని పరిశీలన గా చూస్తున్న సుబ్బారావు, నవ్వుతున్న స్వప్నని చూసి, “నువ్వు తోటలోకి ఎప్పుడు వచ్చావు రా?” అన్నాడు మూర్తి.
“ఒరేయ్ ఆ కర్ర యిటు యివ్వరా, ముందు నిన్ను నాలుగు వుతకాలి, చెట్టు కి వున్న కాయలు వున్నట్టే వున్నాయి, నాకు పనస పొట్టు ఎక్కడ నుంచి తెచ్చావురా” అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి “ముందు అలా కూర్చొని మీ చెల్లమ్మ యిచ్చే కాఫీ తాగు, తరువాత జరిగింది చెపుతాను” అన్నాడు మూర్తి.
“ఒరేయ్ నువ్వు ఒకసారి నా వంక చూడరా, నాకు యిప్పుడు డబ్భై ఏళ్ళు, నీకు కూడా అంతే, ఈ వయసులో కూడా తండ్రి తద్దినం తండ్రికి యిష్టమైన కూరలతో పెట్టాలని నువ్వు అనుకోవడం నాకు చాలా ఆనందం వేసింది. అయితే నేను ఆ కడవంత పనసకాయని పొట్టు కొట్టి తీసుకుని రమ్మన్నావు, అది నా వల్ల అవుతుందా చెప్పు, అందుకనే రైతుబజార్ కి వెళ్లి మంచి పదునైన పనస కాయ కొట్టించి తీసుకుని యిచ్చాను, ఏ బాగుండలేదా” అన్నాడు మూర్తి.
“బాగుంది కానీ, కొద్దిగా మాగుడు వాసన వచ్చింది, అదికాక యింటికి వెళ్లిన తరువాత అనుకున్నాను, పాపం వాడి వల్ల ఏమవుతుంది అంత పనసకాయ కొట్టడం, నేనే బజార్ తీసుకొని వెళ్లి కొబ్బరి బొండాం కొట్టే వాడికి డబ్బిచ్చి కొట్టించు కుంటే బాగుండేది అని. కూర తిన్న తరువాత తెలిసింది నువ్వు ఏదో యిటువంటి పని చేసివుంటావని. అందుకే దొడ్డి దారిన వచ్చి పనస చెట్టు వంక చూస్తే, ఎక్కడ కాయలు అక్కడే వున్నాయి” అన్నాడు సుబ్బారావు.
“సారి రా నీ కోరిక తీర్చలేకపోయాను, రేపాదివారం మనమిద్దరం ఒక కాయను తీసుకొని వెళ్లి పొట్టు కొట్టించి మీ చెల్లెలు చేత పనస పొట్టు కూర, మామిడికాయ పప్పు వండించుకుని తిందాం. మా చెల్లెలు ని కూడా తీసుకుని ఉదయమే వచ్చేసేయి, టిఫిన్, భోజనం యిక్కడే” అన్నాడు మూర్తి.
శుభం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
కాలగమనం
రచన: విజయా సుందర్
"మమ్మీ! మమ్మీ.."
తన గదిలో నుండి గావు కేకలు పెడుతున్న మనవరాలు 'స్మిత' గొంతు విన్న సూరమ్మ, 'దీని నోటి నుంచి కోపంలో కూడా ఈ ముదనష్టపు పిలుపు తప్ప రాదు కదా' అని తిట్టుకుంటూ తన గదినుండి బయటకు వచ్చి, "ఎందుకే అలా అరుస్తావు? మీ మమ్మీ ఈ టైం లో ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నదీ?" అంటూ సాగదీసింది.
"ఓ ఓల్డ్ లేడీ! నువ్వు వచ్చావా...డిస్గస్టింగ్ " అంటూ విసవిసా నడుచుకుంటూ వచ్చి, టేబిల్ మీద పెట్టిన తన మొబైల్ తీసుకుని ఇంగిలీషులో తల్లి మీద అరిచి, 'ఓల్డ్ లేడీ ' అంటూ తన మీద ఏదో చెప్పింది.
అంతా అలా మ్రాన్పడి చూస్తున్న సూరమ్మ, ఏమీ తినకుండా మళ్లీ బైటకి వెళ్లబోతున్న మనవరాలిని, తిని వెళ్ళమని చెప్పింది మార్దవమైన గొంతుతో. స్మిత అదేమీ పట్టించుకోకుండా, మళ్లీ మళ్లీ బ్రతిమాలుతున్న నాయనమ్మని విసుగ్గా చురచురా చూసి, "యూ ఓల్డ్ లేడీ... ఎందుకే ఆ షిట్ తినమని వేధిస్తావు?" అంటుంటే సూరమ్మ ఇంకా ఊరుకోలేక, ఇంగ్లీష్లో, "యు హావ్ గ్రోన్ దిస్ టాల్ ఈటింగ్ దాట్ షిట్ ఓన్లీ.. బెటర్ మైండ్ యువర్ టంగ్ యు యంగ్ లేడీ" అన్నది ధాటిగా!
అవాక్కయింది అమ్మడు, పల్లెటూర్లో పేడ మనిషి గా తన లెక్కలోని ఈవిడ ఇంత చక్కని ఉచ్చారణతో ఇంగ్లీష్ మాట్లాడటమా అని! ఈమెకి తెలియదు పెళ్ళైన కొత్తలో, సూరమ్మ ని భర్త మెట్రిక్ కి కట్టించి, ఇంగ్లీష్ పేపర్ చదవటం అలవాటు చేశాడని. కాస్త జోరు తగ్గించి, .. "నో వే నేను అవి తినలేను" అంటూ వెళ్ళిపోయింది.
'హు! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా నా పిచ్చి గానీ' అనుకుని నిట్టూర్చిందావిడ!
నవనాగరికత మాత్రమే జీవనవిధానమని, ఇంగ్లీష్ లో మాట్లాడటం మాత్రమే సంస్కారామని తమ ఇంటి పద్ధతులుకి తిలోదకాలిచ్చేసిన కామేశ్వరి ఉరఫ్ కామేషి పిల్లలు స్మిత, శ్రీకాంత్ లను కూడా అదే పద్దతిలో పెంచింది. భర్త మురారి మాట చెల్లకుండా తన నోటితో అదుపు చేసేసింది. అత్తగారు సూరమ్మ భర్త కాలం చేశాక, కొడుకు తన దగ్గరకి వచ్చి ఉండమన్నా, ఆవిడ కోడలి పద్దతులకి ఇమడలేక పల్లెటూళ్ళో ఒంటరిగానే ఉంటున్నది. మురారి బలవంతం మీద అప్పుడప్పుడూ వస్తోంది.
శ్రీకాంత్ అర్ధరాత్రి దాటుతుండగా, కొద్దిగా తూలుతూ వస్తూ తన గదిలోకి వెళ్తుంటే సూరమ్మ విస్తుపోయి చూసింది. ఇంకో గంటకి కోడలు గేటు దగ్గర సిగరెట్ నుసి దులిపి నోట్లో పెట్టుకుని పీలుస్తూ, దింపడానికి వచ్చిన ఆయన చెయ్యి పట్టుకుని ఊపేస్తుండటం, వరండాలో కూర్చుని, ఆ కుటుంబ తీరు తెన్నులకి అతలాకుతలమైన మనసుతో వగస్తున్న సూరమ్మ భరించలేకపోయింది! ఎంతో ఆవేశంగా లేచి వాకిట్లోకి వెళ్లబోయింది.
తాళం తీసుకుని లోపలికి వచ్చిన కామేశ్వరి అత్తగార్ని అక్కడ చూసి, "అదేమిటీ.. మిమ్మల్ని పది రోజులయ్యాక తెమ్మని అతనికి చెప్పానే... అప్పుడే ఎందుకు వచ్చారు?"
సూరమ్మ తానింకా ఎందుకు బ్రతికున్నానా అనుకుంటూ, "అతనెవరో?" అన్నది పళ్ళ బిగువున తన మనసుని బిగబట్టుకుని.
అసలు ఆ కోడలు ఆవిడ ఉనికిని భరించలేక అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్న ఆలోచనే లేని ఆమె విసవిసా లోపలికి వెళ్ళిపోయింది.
మేడ మీద ఉన్న కొడుకు దగ్గరకి వెళ్ళి సూరమ్మ, " ఏమిటిరా ఈ సంసారం తీరు? అసలు నువ్వు కళ్ళు తెరుచుకుని ఉన్నావా?"
అప్పుడే మందు ఫిక్స్ చేసుకుంటున్న మురారి, " అమ్మా! నేను బ్రతికి ఉన్న శవాన్ని. నన్నేమీ అడగకు. నీకు కావాల్సినంత కాలక్షేపం నీ గదిలో ఏర్పరిచాను, నీకు కావాల్సిన వంట విశాలమ్మ గారు చేసి పెడతారు. నువ్వు హాయిగా ఉండు, నన్ను హాయిగా ఉండనివ్వు. ఈ కాస్త సమయం నాది. అమ్మా!, మా అమ్మవు కదూ... నన్ను ఇలా వదిలేసి నువ్వు పడుకో. రేపు ఆదివారం కదా. మనిద్దరం ఒక ప్రశాంతమైన చోటికి వెళదాము. అక్కడ నేను నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను. నా చిన్న నాటి ముచ్చట్లు, చెల్లాయి జీవితం లోని మధురిమలు నాకు పూసగుచ్చినట్లు చెప్పాలి. నేనింక ఎన్నో రోజులు బ్రతకనమ్మా" అంటూ పసిపిల్లవాడిలా ఏడుస్తున్న చెట్టంత కొడుకుని అక్కున చేర్చుకుని తల నిమురుతూ ఉండిపోయింది, కారిపోతున్న కన్నీళ్ళు తుడుచుకునే ప్రయత్నమైనా చెయ్యని ఆ కన్నతల్లి!
పగిలిపోతున్న గుండెని చిక్కపట్టుకుని, గబగబా తన గదిలోకి వచ్చింది. 'ఆఖరి మాట ఏమిటీ నా బాబిగాడన్నది', ఏమిటి ఎక్కవ రోజులు బతకడా? అంటే... నిర్వేదంలో అన్నాడా? లేక ఏదన్నా నయం చెయ్యలేని జబ్బు చేసిందా? ఏమయ్యింది నా చిట్టి తండ్రికి?'. సూరమ్మకి మురారి, వాడి చెల్లెలు వాగ్దేవి చిన్నతనం గుర్తుకొచ్చింది...
ముచ్చటైన దాంపత్యం సూర్యలక్ష్మి, గోవిందరావులది! అన్యోన్యమైన ఆ జంటకు మురారి జన్మించాక మరీ ఆనందం అంబరమంటింది. పెళ్లయిన ఐదేళ్ళదాకా సంతానం కలగకపోతే చుట్టపక్కాలు ఎకసెక్కాలాడారే గానీ, గోవిందరావు, ఆయన తల్లిదండ్రులూ చిన్న మాట కూడా అనలేదు కోడల్ని. పైపెచ్చు, "లోపం నీలోనే ఉండి ఉంటుందని అనుకోవడం ఎందుకే పిచ్చి పిల్లా... మా అబ్బాయిలో కూడ ఉండవచ్చు కదా. అయినా మీకేం వయసు మించి పోలేదు. నాకూ మూడేళ్ల తర్వాతే కడుపు పండింది. అదీ వీడి తరవాత మళ్లీ రానేలేదు. నువ్వేమీ అందరి మాటలూ మనసులో పెట్టుకోకు" అని ఓదార్చే అత్తగారిలో ఆ అమ్మవారినే చూసుకున్న సూర్యలక్ష్మి తన బాధని భర్త ప్రేమ, అత్తమామల ఆప్యాయతలో మర్చిపోగలిగింది.
అత్తగారి నమ్మకం వమ్ముపోకుండా మురారి కడుపులో పడ్డాడు. ఇంట్లో అందరి ఆనందానికి హద్దే లేదు. వాడి ముద్దు ముచ్చటల్లో ఏడాది తిరిగ లేదు, వాగ్దేవి కడుపున పడ్డది. ఆనందం రెట్టింపు అయ్యే సమయంలోనే, అనుకోని విపత్తు సంభవించింది!
గోవిందరావు తండ్రికి ఊళ్ళో ముమ్మురంగా ఉన్న విషజ్వరం సోకి నిమిషాల మీద, డాక్టర్ దగ్గరకి వీసుకువెళ్లే వ్యవధి ఏ మాత్రమూ ఇవ్వకుండా మృత్యువు కబళించింది. ఇంత ఆకస్మాత్తుగా సంభవించిన భర్త మృత్యువుని తట్టుకోలేని ఇల్లాలు గోవందరావు తల్లి ఆయనని తీసుకు వెళ్తున్నప్పుడు విరుచుకు పడిపోయిన ఆమె ఇంక లేవలేదు. నిస్పృహతో ఆహారం తీసుకోక బలహీనమైన ఆమెని కూడా విషజ్వరం కబళించేసింది. గోవిందరావు, సూర్యలక్ష్మి ఈ వరస మరణాలకు తట్టుకోలేకపోయారు.
చిన్న పిల్ల వాడు ఉన్నాడు కనక, సూర్యలక్ష్మి కడుపుతో ఉన్నది కనుక ఆ ఇంట్లో ఉన్న ఇద్దరూ మౌనంగా బ్రతుకు ఈడుస్తున్నారు. సూర్యలక్ష్మి తల్లిదండ్రులు, అప్పట్లో అది రివాజు కాకపోయినా అనుకోని కష్టం వచ్చిన కూతురి దగ్గర ఉన్నారు.
బలహీనంగా ఉన్న సూర్యలక్ష్మికి కాన్పు కష్టమై ఆపరేషన్ చేశారు.డాక్టర్ ఇంక పిల్లలు కలగడం ఆమె ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదని ఎంత చెప్పినా, ఆమె అత్తగారికిచ్చిన మాట తప్పి తానుగా పిల్లల్ని కనడం మాననని తెగేసి చెప్పింది. గోవిందరావు పుట్టిన కూతుర్ని చూసి ఏ కొద్దిగా సంతోషించాడో కానీ తల్లిదండ్రుల మరణం ఆయనలో ఆశ అనేది లేకుండా చేసి, ఒక వేదాంతిలా మార్చేసింది. భార్య నిర్ణయానికి, "ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది" అని నిర్వేదంగా ఉండిపోయాడు.
తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడన్నట్లు, గోవిందరావు మానసిక ధైర్యం రోజురోజుకీ దిగజారి పోతున్నది. దానికి తోడు మూడేళ్ళ మురారికి డబుల్ టైఫాయిడ్ వచ్చింది.
పసిపిల్లవాడు అల్లాడిపోతున్నాడు ఎంతకీ జారని జ్వరంతో. నెలల పిల్ల వాగ్దేవి, ఈ జ్వరము పిల్లవాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న భార్య అవస్థ... మళ్లీ ఏదో జరగబోతున్నది అని బెంగపడిపోయాడు. ఏ జబ్బు లేకపోయినా మంచానికి అంటుకు పోతున్న భర్త ని చూసి, తెచ్చిపెట్టుకున్న ధైర్యం తో సంసారాన్ని నడుపుతున్న సూర్యలక్ష్మికి, పుట్టింటి వాళ్ల ఆసరా మాత్రమే కొండంత అయింది.
పట్నం నుండి డాక్టరుని పిలిపించి మురారి జబ్బు నయం చేసుకోగలిగారు గానీ... ఇంక జీవితం విసిరే సవాళ్ళని తట్టుకోలేనంటూ గోవిందరావు తనువు చాలించాడు.
సూర్యలక్ష్మికి లోకం చీకటయింది. అగాధం లోకి కూరుకుపోతున్న మనసుని పగ్గాలేసి పట్టుకున్నది, తన కన్నీళ్లు తుడుస్తున్న బుడి బుడి నడకల తమ కలల పంట మురారి, చిక్కుముళ్ళల్లో పుట్టిన చిన్నారి వాగ్దేవిని అక్కున చేర్చుకుని, జీవన సంగ్రామానికి నడుం కట్టింది, ఆ ఇల్లాలు!
భగవంతుని దయవల్ల డబ్బుకేమీ కొరత లేనందున, తన అన్నదమ్ముల అండదండలతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయగలిగింది. తల్లి దండ్రులు దాటిపోయారు.
కొడుకు మురారి ఇంజనీరింగ్ చదువుతుండగానే, తెలిసిన చుట్టాల్లో మంచి సంబంధం వస్తే వాగ్దేవి పెళ్లి చేసేసింది. చాలా మంచి ఇంట్లో పడ్డది. హాయిగా కాపురం చేసుకుంటున్నది.
ఒకరోజు తనతో చదువుకుంటున్నదని, కామేశ్వరిని తీసుకొచ్చాడు మురారి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది... కానీ మనుషుల పొడ గిట్టనిదానిలాగా ఉన్న ఆమె ప్రవర్తన చూసి, కొడుకు ఆమెని పెళ్లి చేసుకుంటానన్న సంగతి చెప్పినప్పుడు నయాన, ఆఖరికి భయాన కూడా చెప్పింది... ఆ అమ్మయితో కొడుకు సుఖఃపడలేడని, అందం శాశ్వతం కాదనీ. పోగాలం దాపురించాక ఎవరి చేత చెప్పించినా వినలేదు. పెళ్లి అయిన నెల రోజులేమన్నా సుఖంగా ఉన్నాడేమో.ఆ తరవాత నరకం చూపిస్తున్నది మనిషి ముసుగులో ఉన్న ఆ రాక్షసి!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేదు. ఆవిడ ఉద్యోగం చెయ్యదు. పల్లెటూళ్ళో ఆస్తి ఎందుకు, అమ్మి పారేసి తల్లిని తమతో ఉండమంటుంది. ఆవిడ మనస్తత్వం తెలిసిన మురారి రెండోసారి తల్లిని కదిలించే ప్రయత్నం చెయ్యలేదు. భార్య మాట వ్యతిరేకించినది అదొక్కటి, తల్లి మాట విన్నదీ పల్లెటూరులో ఆస్తి అమ్మకుండా ఉండటం. మొత్తం తగలేసి అందరూ వీధిని పడ్డప్పుడు ఆదుకునేది ఈ ఆస్తేనని సూరమ్మ కూడా కఠినంగా ఉండిపోయింది.
తెల్లవారుతుండగా, ఒక జులపాల వాడితో తూలుకుంటూ గదిలోకి వెళ్తున్న మనవరాల్ని నిర్వేదంగా చూసింది ఆవిడ, ' అయిపోయింది ఈ కుటుంబం పరువు, ప్రతిష్ఠ! అసలు కుటుంబమే కూలి పోయాక ఇంకా ఏమిటి' అనుకున్నది.
ఆరోజు మురారి చక్కగా గడ్డం గీసుకుని, తలారా స్నానం చేసి, తెల్లని లాల్చీ పైజామా వేసుకుని, తల్లి చక్కగా అలంకరించి పూజ చేసిన దేవుడి ఫోటోకి దణ్ణం పెట్టుకుని, తల్లి చేసిన పులిహోర, చక్కెరపొంగలి, దద్ద్యోజనం ఎంతో ఆబగా తిన్నాడు...ఎన్నాళ్ల నుండో తిండి లేని వాడి లా తింటున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది. ఇక్కడ ఈ ర్రాక్షసుల మధ్య అతన్ని వదిలి, తన ఆత్మాభిమానం నిలుపుకున్న తన మీద తనకే అసహ్యం వేసింది సూరమ్మకి. దాంతో పాటు ఏవో తీర్మానాలు మనసునిండా సుడులు తిరగసాగాయి!
ఇద్దరూ ఒక సుందర నందనవనం లాంటి ఉద్యానవనానికి వెళ్లారు. ఊరవతల తనకోసం ఏర్పాటు చేసుకున్న ఏకాంత మందిరం. అక్కడికి వెళ్తూనే మురారి మరో మనిషై పోయాడు. అక్కడ చిన్న సరసులో నడయాడుతున్న బాతులతో కబుర్లు చెప్పాడు, చెట్టు మీద తన రాగాలాపన తో సందడి చేస్తున్న కోయిలతో గొంతు కలిపి కృష్ణ రావు గారి పాట పాడాడు. తల్లి కళ్లల్లో మెరుస్తున్న ఆనందం అతనికెంతో తృప్తినిచ్చింది.
తల్లి ఒళ్ళో తలపెట్టుకుని అడిగి అడిగి చెప్పించుకున్నాడు, తండ్రి, తాత మామ్మలతో గడచిన తన బాల్యాన్ని. తాను ఎత్తుకు మోసిన చిన్నారి వాగ్దేవి కబుర్లు... ఇల్లాలయి, ఇద్దరు బంగారు తల్లుల తల్లి అయ్యి భర్తతో అందమైన, ఆనందమైన జీవితం గడుపుతున్న చెల్లెలి గురించి వింటూ పులకించిపోయాడు!
"ఇంత అభిమానమున్న నేను చెల్లిని చూసేందుకు ఎందుకు వెళ్లనని కదా నీ సందేహం? వద్దమ్మా నా నీడ కూడా దాని మీద పడకూడదు. నా పెళ్ళాం రాక్షసి దాని పెళ్లికి ఎన్ని అవరోధాలు తెచ్చిపెట్టింది... బావ మంచిముత్యం కనుక దాని మాటలు, అది సృష్టించిన ఉత్తరాలు నమ్మలేదు."
కొడుకు మాటలతో అంతా గుర్తు వచ్చింది, ఈర్శ్యతో వాగ్దేవి మీద, కామేశ్వరి కల్పించిన నిందలు!
అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మురారి. అన్నీ విని సూరమ్మ, "బాబీ నేను నిన్నొక్క వరం అడుగుతాను ఇస్తావా నాన్నా" అన్నది.
కరిగిపోయాడు కొడుకు, " అమ్మా! చెప్పమ్మా ఏదైనా సరే చేస్తాను. నేను ఎప్పుడూ నీ దగ్గరనించీ తీసుకోవడమే కానీ ఇవ్వలేదు" అన్నాడు.
తన కోరిక చెప్పింది సూరమ్మ.
" అమ్మా! నేనే అడుగుదామనుకున్నాను. నువ్వే ఇచ్చావు నాకా వరం. నేను ఉద్యోగం రిజైన్ చేసాను. ఆ రాక్షసి కుటుంబానికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళ పేరు మీద మార్చి అన్నీ రెడీ చేసేసాను. నువ్వు ఇప్పుడు ఇలా అడగకపోతే నేను రిశీకేశ్ లో స్వామీజీ దగ్గరకి వెళ్లిపోయేవాణ్ణి! నా రోజులు ఇంక రెండు నెలలు మహా అయితే"
కొడుకు నోరు మూసింది సూరమ్మ.
"నువ్వు నా మాట పూర్తిగా వింటే అన్నీ చక్కబడతాయి. నీకేం తక్కువని చావాలి? మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టు" అని రకరకాలుగా జీవితం పట్ల ఆశ కలిగించింది.!
ముందు కొడుకుని తీసుకుని తమ ఊరు వెళ్లి, కొన్నాళ్ళు ఉన్న మందులు వాడుతూ, అప్పుడు పట్నం తీసుకెళ్లి మెరుగైన వైద్యం, మంచి ఆహారం, విశ్రాంతి తో మురారి అనుకున్న దానికంటే ముందే హై బీపీ, షుగర్, అల్సర్. అన్నీ తగ్గించుకున్నాడు. అక్కడ్నించీ అల్లుడి సహకారంతో అన్ని పుణ్యక్షేత్రాలూ తిప్పింది.
అసలు తన ఉనికి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లి సాంగత్యంలో ఆధ్యాత్మిక జీవనం అలవరచుకున్నాడు. ఎంతో ప్రశాంతత!
గుడిలో నిరంతరం కీర్తనలు పాడే అనుపమ విధి వంచితురాలు. తాను కూడా కీర్తనలు మళ్లీ సాధన చేసి పాడేవాడు. ఆ నేపథ్యంలో ఇద్దరికీ మంచి స్నేహం కలిసింది.
ఉత్తమ ఆభిరుచులు కలిగిన అనుపమ వైపు సహజంగానే ఆకర్షింపబడ్డాడు మురారి. భర్తను కోల్పోయిన అనుపమకు కూడా తన బాధను మురారి సాంగత్యం సేదదేరుస్తున్నట్లుగా ఉన్నది. వాళ్లిద్దరూ తమది స్నేహమే అనుకుంటున్నా, సూరమ్మ ఆలోచనలు వాళ్ళని ఒకటి చేస్తే....దెబ్బతిన్న పక్షులు రెండూ సాంత్వన చెందుతాయేమో అనుకుంటున్నది! రాగల కాలమే తీర్పు చెప్పాలి!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
తెలుగు - పార్ట్ 1
రచన: లక్ష్మి మదన్
రాధమ్మకు మేఘాలలో తేలి పోయినంత సంతోషంగా ఉంది. 15 రోజుల క్రితం భర్త ఆమెను పిలిచి..
"ఇదిగో, ఉన్నావా?" అని పిలిచాడు భాస్కరం.
"ఉండక ఎక్కడికి పోతాను ఏంటో చెప్పండి" అన్నది చిరాకుగా రాధమ్మ...
"మంచి మాట చెప్తాను అనుకుంటే ఆచిరాకుగా మొహం పెడతావ్ ఏంటి" అని విసుక్కున్నాడు భాస్కరం..
"అదేం లేదండి స్టవ్ మీద కూర పెట్టాను మాడిపోతుందని సరేలెండి స్టవ్ బంద్ చేసి వస్తాను" అంటూ లోపలికి వెళ్లి స్టవ్ బంద్ చేసి చేతులు కడుక్కొని వచ్చి భాస్కరం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
"సంతోషమైన వార్త వెంటనే చెప్పాలనుకుంటే నీ విసుగుతో నాకు మూడంతా పోయింది సరేలే... కొడుకు కోడలు మరియు బిడ్డ అల్లుడు అమెరికా నుండి ఒకేసారి వస్తారట. ఈశుభవార్త చెప్పాలని నిన్ను పిలిచాను" అన్నాడు భాస్కరం సంతోషంగా...
"ఏంటి.. పిల్లలు అంతా వస్తారా.. అందులో అందరూ ఒక్కసారి వస్తున్నారా అయ్యో ఏం చేయను.. పనులన్నీ ఎలా అవుతాయి" అంటూ ఒకపక్క సంతోషం, ఒకపక్క టెన్షన్ పడుతూ కుర్చీలో నుండి లేచి అటు ఇటు తిరగసాగింది రాధమ్మ.
"అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు రాధమ్మ" అన్నాడు భాస్కరం.
"మీకు అలాగే అనిపిస్తుంది. నేను ఎన్ని పనులు చేసుకోవాలి.. ఇల్లంతా సర్దాలి, పిల్లలకు గదులు ఏర్పాటు చేయాలి. పక్క బట్టలన్నీ మార్చాలి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి.. అసలే అమెరికా నుండి వస్తున్నారు. వాళ్లకు కావాల్సిన పిండి వంటలు అన్ని చేసి పెట్టాలి.. ఎన్నుంటాయండి" అన్నది రాధమ్మ ఇంకా హడావుడి పడుతూనే...
"అదేంటే వాళ్లంతా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలే కదా! ఇవాళ కొత్తగా దుమ్ము ధూళి వస్తుందా వాళ్ళకి ఏంటే నీ అర్థం లేని మాటలు మరీ ఇంత అతి పనికిరాదు సుమా!" అన్నాడు భాస్కరం..
"వాళ్లు వెళ్లి 12 ఏళ్లు అయింది ఇప్పటివరకు పిల్లలు మన ఇల్లు చూడలేదు వాళ్లకు ఈ డస్ట్ పడుతుందో లేదో కాళ్లకు చేతులకు మట్టి అంటుకుంటుందా అని పిల్లలు ఏమనుకుంటారో!" అన్నది రాధమ్మ..
"సరేలే నీ బాధలు నువ్వు పడు. అవసరమైన సరుకులు లిస్టు ఇవ్వు, నేను తెచ్చి పెడతాను. ఆ తర్వాత మిగతావన్నీ నువ్వు నిదానంగా చేసుకో" అన్నాడు భాస్కరం.
వీళ్ళు ఉండేది చిన్న పల్లెటూరు. రాధమ్మ పుట్టి పెరిగింది కూడా పల్లెటూర్లోనే. ఎక్కువ చదువుకోలేదు కూడా.. భర్త టీచర్ ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళేది. అన్ని చిన్న చిన్న ఊళ్లే. పిల్లలను మాత్రం ఐదవ తరగతి నుండి పట్నంలో హాస్టల్లో ఉంచి చదివించారు.. ఏమీ తెలియలేదు రాధమ్మకు.. తెలుగు తప్ప ఇంగ్లీషు హిందీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు... పిల్లలు ఎన్నో సార్లు చెప్పారు "నాన్న దగ్గర కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో అమ్మ, ఎక్కడికైనా వెళ్లినా, ఎవరైనా వచ్చినా నీకు సులభంగా ఉంటుంది" అని..
ససేమిరా అంటూ రాధమ్మ ఆ చదువుల జోలికి వెళ్లలేదు...
ఎప్పుడు చూసినా ఇంట్లో పని. అప్పడాలు వడియాలు చేయడం, పిల్లలకు ఇష్టమైన పిండి వంటలు చేసి భర్తకి ఇచ్చి అమెరికాకు పంపించడం, స్వయంగా పిండి గానీ రవ్వ గాని ఇంట్లోనే విసురుకోవడం, ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవడం, ఇంకా కుదిరితే చీరల మీద ఎంబ్రాయిడరీ చేసుకోవడం.. ఇలాంటివంటే చాలా ఇష్టం. ఆమె జీవితం ఇలాగే గడిచిపోతుంది...
ఒకసారి కేబుల్ టీవీ వాళ్ళ దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చింది.. వాళ్ళు కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఏదో బి తో ఉన్న పేరు చెప్పి ఇలా చేయాలి అన్నారు. ఎన్ని సార్లు బి చెప్పినా విలాగే అర్థమయింది రాధమ్మకు. అప్పుడు వాళ్లు బి ఫర్ బాంబే అమ్మ అని అన్నారు. అంటే సులభంగా అర్థం కావడానికి. కానీ ఆ విషయం రాధమ్మకి అర్థం కాక "బాంబే ఏంటి బాంబే.. మేము వనపర్తి లో ఉంటే నువ్వు బాంబే అంటావేంటి. కేబుల్ కనెక్షన్ బాంబేలో ఇస్తావా ఏంటి" అంటూ మాట్లాడేసింది..
అక్కడే ఉన్న పిల్లలు గట్టిగా నవ్వారు...
"నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఫోన్లో వాడు అలా మాట్లాడితే తప్పులేదు కానీ నేను అరుస్తున్నానని నవ్వుతున్నారా" అని కోపం తెచ్చుకుంది రాధమ్మ..
"అది కాదమ్మా ఏదైనా అక్షరంతో పేరు చెప్తే మనకు అర్థం కాకుంటే ఏదైనా ఊరు పేరు కానీ వస్తువు పేరు కానీ చెప్తారు అప్పుడు మనకు అర్థమవుతుంది" అని చెప్పాడు అక్కడే ఉన్న కొడుకు విక్రాంత్.
"ఇవన్నీ నాకేం తెలుసు" అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ.
చదువు రాకపోయినప్పటికీ తెలివితేటల్లో మాత్రం ఏ మాత్రం తగ్గదు.. ఇంటిని చక్కబెట్టుకోవడం ఖర్చు లెక్కలు చూసుకోవడం పొదుపుగా వాడుకోవడం తెలుసు...
ఇక రాధమ్మ హడావుడి ఇంత అంతా కాదు ఇద్దరు పని వాళ్ళని మాట్లాడుకొని ఇల్లంతా అంగుళం అంగుళం కూడా పరీక్షించి శుభ్రం చేయించింది పడకగదులకైతే సున్నాలు కూడా వేయించింది... బాత్రూమ్స్ క్లీన్ చేయించి ఇలా ఒకటేమిటి ఇంటిని అద్దంలా తయారు చేసింది...
ఇక భాస్కరం కిరాణా షాపుకు ఇంటికి తిరగడమే సరిపోయింది తెచ్చిన సామాన్లు సరిపోలేదని ఇంకా కొన్ని మరిచిపోయానని ఇలా పంపిస్తూనే ఉంది..
అతను కూడా రాధమ్మ ఆత్రుతను అర్థం చేసుకొని చెప్పిన పనల్లా చేసుకుంటూ పోతున్నాడు...
భాస్కరం రిటైర్ అయిన కూడా అతనికి ఊరికే ఉండడం ఇష్టం లేక ఒక కాలేజ్లో పని చేస్తున్నాడు.. ఇక అతను కాలేజీకు లీవ్ పెట్టి ఇంట్లో పనులన్నీ చూసుకోవడానికి నిర్ణయించుకున్నాడు.
ఎన్నో రకాల పిండి వంటలన్నీ చేసి డబ్బాలు నింపించింది...
ఇక మధ్యాహ్నం వరకు వాళ్లు వస్తారని తెలిసింది భర్త భాస్కరం అద్దెకు కార్ తీసుకొని పట్నం వెళ్ళాడు వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి...
భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసింది... పులిహోర మామిడికాయ పప్పు వంకాయ పులుసు బెండకాయ వేపుడు దోసకాయ పచ్చడి అన్ని చేసి పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధమ్మ...
ఇంతలో వాకిట్లో కారు చప్పుడు అయ్యింది. ఒక్క పరుగున వాకిట్లోకి వెళ్ళింది...
ఇంటి ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ లగేజ్ కి ఒక కారు సరిపోదని మరొక కారు పట్నంలో అద్దెకి తీసుకొని వచ్చారు ముందుగా పిల్లలు దిగారు... పిల్లలని ఎప్పుడైనా ఫోన్లో చూడటమే తప్ప వాళ్ళని ఇప్పటివరకు చూసింది కూడా లేదు... ఒక్కసారి మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది రాధమ్మకు గబా గబా వాకిట్లోకి పరిగెత్తి కూతురు పిల్లలని కొడుకు పిల్లలని రెండు చేతులతో దగ్గరకు తీసుకుంది...
వాళ్లకు నానమ్మ తాతయ్య ఎవరో తెలియనే తెలియదు ఒక్కసారి ఆ పిల్లలు చేతులు విదిలించుకుని..
"ఏ వాట్ ఇస్ దిస్" అని అన్నారు..
ఇంతలో కొడుకు కోడలు కూతురు అల్లుడు కార్ల నుండి దిగారు...
"వాళ్లని కంగారు పెట్టకమ్మా కాస్త సర్దుకోని అలా గట్టిగా హత్తుకుంటే వాళ్లకు ఊపిరాడదు" అన్నారు వాళ్లు..
బిత్తర పోయింది రాధమ్మ ఇన్నాళ్లకు పిల్లలను చూస్తున్న అనే సంతోషంతో పట్టుకుంటే ఇలా అన్నారు ఏంటి అని అనుకొని సరేలే అని తనకు తాను సర్ది చెప్పుకొని లోపలికి నడిచింది..
అందర్నీ సంతోషంతో పలకరించింది... కోడలు ఇల్లంతా పరికించి చూస్తూ మొహం చిట్లించుకొని..
"మా సామాను ఏ గదిలో పెట్టమంటారు" అని అడిగింది.
"ఇదిగో ఈ గదిలో పెట్టమ్మా రెండు గదులు శుభ్రం చేయించాను" అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది..
గదిలో పెద్ద పందిరి మంచం దానిమీద చక్కగా పరిచిన కొత్త దుప్పటి... పక్కనే పెద్ద కిటికీ కిటికీలో నుండి కనిపిస్తున్న ముద్దమందారం చెట్టు మరియు మల్లె చెట్టు చక్కని గాలివీస్తుంది.. గది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కొంచెం సంతృప్తిగా చూసింది కోడలు నీరజ.
బయటకు వచ్చి కూతురిని మరో గదిలోకి తీసుకెళ్లింది "ఇదిగో దీపా నువ్వు ఈ గదిలోపెట్టుకో అయినా నీకు చిన్నప్పటినుండి ఈ గది అంటే ఇష్టం కదా" అన్నది రాధమ్మ.
అందరూ స్నానాలు చేసి వంటింట్లోకి వచ్చారు ఇంట్లో భోజనాల బల్ల లేనందువల్ల అందరికీ పీటలు వేసి కంచాలు పెట్టి వడ్డించింది రాధమ్మ.
పిల్లలు ఏవేవో అడుగుతున్నారు ఒక్క ముక్క కూడా రాధమ్మకు అర్థం కావడం లేదు వాళ్లకు తెలుగు అసలే రాదట ఇంట్లో బయట అంతా ఇంగ్లీషులో మాట్లాడతారట...
ఆ మాటలను ఇటు కొడుకు అటు కూతురు గొప్పగా చెప్పుకోసాగారు..
వాళ్లకు తెలుగు రాదమ్మ.. నువ్వు వాళ్లతో ఎలా మాట్లాడుతావో ఏంటో ఇంగ్లీష్ నేర్చుకోమంటేనేమో నేర్చుకో వు.." అన్నది దీప..
గ్రానీ గ్రాండ్పా అంటూ పిలసాగారు ఆ పిలుపులే నచ్చలేదు భాస్కరంకు గాని రాధమ్మకు గాని చక్కగా నానమ్మ తాతయ్య అని పిలిస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నారు..
అసలు పిల్లలు భోజనమే సరిగా చేయలేదు వాళ్లకు ఈ వంటలు ఏవి నచ్చలేదట..
“అమ్మ ఇంకా ఇవే వంటలు చేస్తున్నావా నువ్వు ఎప్పుడు మారతావు కొత్త వంటలు నేర్చుకోలేవా పిల్లలకి ఈ వంటలు ఎక్కువ అలవాటు లేవు" అని చెప్పాడు విక్రాంత్..
బుర్ర తిరిగిపోసాగింది రాధమ్మకు" దూరదేశంలో ఉన్నంత మాత్రాన మాతృభాషను దూరం చేసుకుంటారా చిన్నప్పుడు తిన్న తిండ్లను మరిచిపోతారా..".. అని అనుకున్నది..
భోజనాలు అయ్యాక అందరూ ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అలసిపోయి ఉన్న వాళ్లంతా వెంటనే నిద్రపోయారు.
తర్వాత వంటింట్లో రాధమ్మ కూర్చొని భోంచేసింది అక్కడికి వచ్చిన భాస్కరం ఆమె వంటిల్లుసర్దడం సహాయం చేశారు....
=================================================================
ఇంకా ఉంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
క్యాస్ట్ ఫీలింగ్
రచన: పిట్ట గోపి
ఈరోజుల్లో చాలామంది యువతి యువకులకు చదువంటే లెక్కలేదు, ప్రేమంటే పిచ్చి, తల్లిదండ్రులు బాద పట్టదు. గురువులంటే గౌరవం ఉండదు, ఇది వరుస. పిల్లలేమో మంచి, చెడు అని చూడకుండా ఏది నచ్చితే అది చేసుకుంటున్నారు. లోకంలో ప్రేమించని వారు లేరు. అందరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. కానీ.. ! ప్రేమించే వయసు ఏదో.. మనస్ఫూర్తిగా ప్రేమించే వారి పేరు కూడా చెప్పలేరు. పిల్లలు ఏ దారిన పోతున్నారో కనిపెట్టలేని తల్లిదండ్రులుపై కొందరు మేధావులు పెదవి విరుస్తుంటారు.
కానీ.. అందరి తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకు కూర్చోలేరు కదా.. ? మోసం చేస్తు, అబద్ధాలు చెప్తు, నాటకాలు ఆడుతు తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చకుండా పిల్లలు ఆరాచకాలకు బలవుతున్న తల్లిదండ్రులుపై కొంతమందైనా జాలి చూపాలి. ఇది కొంతమంది తల్లిదండ్రులుకు మాత్రమే. ఇది ఒక దశ.
కొంతమంది ప్రేమించుకునే ప్రేమికులు నిజంగా ప్రేమంటే దానికి ఒక అర్ధాన్ని చూపిస్తారు. నిజాయితీగా ప్రేమిస్తారు. ప్రేమంటే దానికి కులం, మతం, పేద, ధనిక అంటు ఏ అవధులు ఉండవు కదా అయితే.. ! ఇక్కడ కొందరి ప్రేమ ఓడిపోవటానికి తల్లిదండ్రులు ప్రధాన కారణం అవుతున్నారు. ప్రేమంటే అంత ఆషామాషీ కాదు. ఇరువురికి నచ్చాలి.
నమ్మకం ఏర్పడి అది బలపడితే ఆ బంధాన్ని ప్రేమజంట అంటారు. కొందరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని కలిసి బతకాలని నిర్ణయించుకున్నాక చివరిగా తల్లిదండ్రులు పరువు అనే పాపానికి బలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు మనసులో మరువలేని జ్ణాపకాలతో గుండె రాయి చేసుకుని ప్రేమించిన వాళ్ళని వదిలి తల్లిదండ్రులు తెచ్చిన వాడితో చస్తూ బతుకుతుండగా, ఎవరో కొద్దిమంది ధైర్యం చేసి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు.
ఆ కోవకు చెందిన ప్రేమ జంటే అనిల్- మోహిని.
అనిల్ మోహినిల ప్రేమ కాలేజ్ స్థాయి నుండే కొనసాగటంతో ఇప్పుడు అనిల్ సాప్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కూడా మోహిని అతడిని మరిచిపోలేకపోయింది. అంతగా వారి ప్రేమ బలపడింది. అనిల్ ఇతర కులానికి చెందినవాడైనా మోహిని కులం చూడలేదు. అనిల్ ప్రేమని చూసింది. అప్పుడప్పుడు బయట కలిసి తిరుగుతుండేవాళ్ళు.
అలా ఒకరోజు వీళ్ళ తిరుగుడు మోహిని ఊరి వాళ్ళు కొందరు చూసి మోహిని తల్లిదండ్రులు ఆనందరావు-మాణిక్యం గారికి తెలిపారు. అంతే తక్కువ కులం వాడికి ప్రేమించిందని మోహినిని తిట్టారు. అతడినే పెళ్లి చేసుకుంటానని మోహిని మొండికేయగా కొట్టారు. నిజంగా ఇది విడ్డూరమే.
ఎందుకంటే.. ! పెద్ద కూతురు అని తమని బాగా చూసుకుంటుందని అల్లరిముద్దుగా పెంచారు. ఏది కావాలంటే అది కొని తెచ్చారు. అలాంటి తల్లిదండ్రులు జీవితాంతం ప్రేమించిన వాడితో కలిసి బతకుతానంటే మాత్రం అడ్డు చెప్తున్నారు. మోహిని వలన మిగిలిన ఇద్దరు కూతుళ్ళు శ్రావణి స్పందనలు కూడా ఇలాగే చేస్తారని.
ఇక్కడ ఈ తల్లిదండ్రులు అతడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, మంచి లక్షణాలు ఉన్నవాడు అనేవి ఆలోచించటం లేదు.
ఎవరో మనం ఇబ్బందుల్లో ఉంటే ఒక్క ముద్ద కూడా పెట్టని మన కులపోళ్ళు,, మన ఇరుగుపొరుగు, తక్కువ కులపోడికి ప్రేమించిందని చెప్పుకుంటున్నారని తమ పరువు పోతుందని కూతురు ప్రేమను కాదంటున్నారు. అక్కడితో ఆగక తమ కులానికి చెందిన వాడితో పెళ్లికి సిద్దం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మోహిని బాదను అక్షరాలు కూడా వర్ణించలేవు. ప్రేమించినోడిని దూరం చేసుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు తల్లిదండ్రులుకు చెప్పకుండా అనిల్ తో గుడిలో పెళ్ళి చేసుకుంది
అగ్రశ్రేణి కులం అమ్మాయి, తక్కువ కులపోడికి పెళ్లి చేసుకుందని ఊరువాడ చెప్పుకుంటుంటే ఆనందరావు పరువుపోయిందని సిగ్గుతో నా కూతురు చచ్చిపోయిందని శవంలేని చీతికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశాడు. అప్పటి నుండి ఇద్దరు కూతుళ్ళని, బార్యని పట్టించుకోకుండా ఇంట్లోనే సిగ్గుతో ఉంటు బతికేవాడు ఆనందరావు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|