Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
దానికతడు పక్కున నవ్వేసాడు “విషయం తెలియకుండానే క్షమాపణ కోరే ప్రస్తావన ఇప్పుడెందుకూ! ఐనా పరవాలేదు. ముందుస్తు బైల్ లా క్షమించేస్తున్నాను. చెప్పు”
“యాక్చువలీ నేను మిమ్మల్ని హేట్ చేస్తుండేదానని- ఇతడెందుకు దాపురించాడురా బాబూ- అనుకుంటూ- దానికసలు కారణం ఉంది. ఆ కెనడా టిప్పుసుల్తానులా మీరు కూడా మంచి పొడవు. అంతేకాదు. అతడి రూపు రేఖల్లోని ఛాయలు మీలో కూడా కొన్ని ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నేను మిమ్మల్ని హేట్ చేయనారంభించాను. కోపం లేదు కదా! ”
అతడు మరొకసారి నవ్వేసాడు;లేదన్నట్టు తల అడ్డంగా ఆడిస్తూ— ఈ సారి ఆమె అతడి చేతుల్ని నిమురుతూ అంది- “మరైతే మనం ఇకనుండి స్నేహంగా ఉందాం. చిరకాలం స్నేహంగా ఉంటూ ఒకరికి మరొకరు తోడుగా మిగిలిన శేష జీవితాన్ని కలసి గడుపుదాం. ఐ ప్రామిస్- నేను మీకు మంచి సహచరిగా ఉంటాను. నేను పైకి యేబైలో ఉన్నట్టు కనిపిస్తాను గాని- నాకు వయసు యేభై ఐదు. మైనస్ ఇన్ టూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. కాదా మరి! ”
కృష్ణమూర్తి బదులివ్వలేదు. లేచి నిల్చుని కప్పుకున్న దుప్పటిని తీసిపారేసాడు. ఆమెను అమాంతం రెండు చేతులతో నూ ఎత్తుకుని గిర్రు గిర్రున తిప్పసాగాడు; ఇప్పుడతను అల్పసంతోషి కాడన్న వైనం మళ్ళీ మళ్లీ గుర్తుకుతెచ్చు కుంటూ,శోభనం రాత్రి శారదను అలాగే మోహావేశంలో తిప్పిన సంబరాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ--
ఇకపైన ఒంటరితనం వాళ్ళ దరిదాపులకు కూడా రాకుండా అదాటున దాటి వెళ్లిపోతుందేమో!
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
పాచిక
రచన: డా: కిరణ్ జమ్మలమడక
11 ఏళ్ళ ఇషా "అమ్మా కాటన్ ఇవ్వు "అని అడిగింది వాళ్ళ అమ్మ సుభద్రని.
వద్దన్నా తన భర్త అశోక్ ఈ బంగ్లా కొని తాను మాత్రం ఢిల్లీ లో కూర్చున్నాడు అని, చిరాకుతో వుంది సుభద్ర.
"కాటనా? ఎందుకు దెబ్బ తగిలిందా? " అని అడిగింది ఆ చిరాకుతోనే.
"లేదు, చెవుల్లో ఏవేవో విష్పర్స్ లాగ సౌండ్స్ వొస్తున్నాయి "
అప్పుడు సుభద్ర అంతగా పట్టించుకోలేదు, "సరే బాత్రూం లో అల్మారాలో వుంది చూడు, అలానే ఆ గీజర్ కూడా ఆఫ్ చెయ్యి " అంది.
ఇది జరిగిన రెండు రోజులకి, సుభద్రకి కూడా లీలగా యేవో గుసగుసలు వినపడటం మొదలుపెట్టాయి, మొదట తన భ్రమ అని కొట్టిపారేసింది కానీ రోజులు గడిచేకొద్దీ, గుసగుసలు సంభాషణల వలె పెద్దవిగా మారాయి. అప్పడప్పుడు ఇషా కూడా అదే కంప్లైంట్ చేయటంతో ఒకేసారి ఇద్దరికీ ఎందుకు ఒకేలాంటి భ్రమ కలుగుతుందని కొంత సందేహపడినా పెద్దగా పట్టించుకోలేదు సుభద్ర.
ఒక సాయంత్రం, సుభద్ర చదువుకుంటున్నప్పుడు, ఆమె తన కంటి మూలలో నుండి నీడలను చూసింది. తల తిప్పి చూస్తే ఫర్నీచర్ మరియు షెల్ఫ్లు తప్ప మరేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ఆ నీడలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆమె దృష్టి అంచున నృత్యం చేస్తూ, అనిర్దిష్ఠమైన అశాంతి భావాన్ని పెంపొందిస్తున్నాయి.
ఆ మర్నాడు, ఇషా కి, విపరీతమైన తలనొప్పి రావటం మొదలు పెట్టింది. అది తగ్గక పోయేసరికి ఆమె పని మనిషి సాయంతో డాక్టర్ ని కలవడానికి వెళ్ళింది. ఆ డాక్టర్ కొన్ని కంటి పరీక్షలు చేసి, టీవీ తగ్గించమని, ఎక్కువ వెలుగులో ఉండమని సలహా ఇచ్చి, కొన్ని విటమిన్ మాత్రలు, బలం టానిక్కు ఇచ్చాడు.
ఇంటికి తిరిగి ఒస్తుండగా ఆ పనిమనిషి "నా మాట విని దిష్టి తియ్యండమ్మా! " అని చెప్పింది.
ఆ మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, మనిషి, భయపడినప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనపడతాడు, తనకి పెద్దగా నమ్మకం లేకపోయినా, తప్పు ఐతే కాదు కదా ప్రయత్నిద్దామని తన సాయంతో ఆ దిష్టి కార్యక్రమం కూడా పూర్తి చేసింది. మర్నాడు తాను మామూలుగానే కాలేజ్ కి వెళ్ళటం తో సుభద్ర ఊపిరి తీసుకుంది, తనకి కూడా ఆ తలనొప్పి రావటం గమనించింది కానీ పెద్దగా పట్టించుకోలేదు.
ఆ రోజు రాత్రి అవే ఆలోచనలతో సుభద్ర, ఆమె కూతురు, ఇషా పడుకున్నారు.
సుభద్రకు, ఆ గుసగుసలు మరింత గట్టిగా వినపడసాగాయి. మరలా ఆ నీడలు తనకు కనపడుతున్నాయి. తనకు ఏమి చెయ్యాలో అర్థంకావటంలేదు. ఇంక తప్పక, పనిమనిషికి ఫోన్ చేసి రమ్మని అడిగింది ధైర్యం కోసం. పనిమనిషి వెంటనే వొచ్చింది. అందరూ కలిసి హల్లో పడుకున్నారు. ఇందాకటంత తీవ్రంగా లేకపోయినా ఇంకా ఆ అలోచనలు, ఆ గుసగుసలు వీడిపోలేదు సుభద్రను.
రోజులు వారాలుగా మారేకొద్దీ సుభద్ర ఆలోచనలు విచ్చలవిడిగా మారాయి. ఆమె చూపు మందగించింది. సుభద్ర చాలా చిన్న పనిని కూడా గుర్తుంచుకోవడానికి కష్టపడుతోంది. మనస్సు అంతా, గందరగోళంతో నిండిపోయింది. ఒకప్పుడు కేవలం భ్రమలుగా ఉన్న నీడలు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంక తప్పేటట్టులేదని, తన తమ్ముడు, అతీత్ కి ఫోన్ చేసి విషయాలు ఏమి చెప్పకుండా ఊరికే ఒంటరిగా బోర్ కొడుతోందని, ఇషా అడుగుతోంది అనే మిషతో రమ్మనిచెప్పింది.
***
"హాయ్ అక్కా !" అని అంటూనే, అతీత్ ఇషా ని ఎత్తుకున్నాడు.
ఒక చిన్న నవ్వు నవ్వింది సుభద్ర.
"అదేంటి అక్కా! ఇలా అయిపోయావు, అన్నం తినటంలేదా ? మొహం అంతా అలా నల్లగా అయిపోయింది " అన్నాడు కంగారుగా..
"ఏంలేదు చెపుతా పద" అని ముందు ఇంటికి పద భోజనం చేద్దువుగాని అని తొందరపెట్టింది.
అందరూ కార్ లో బయలుదేరారు.
"కుశల ప్రశ్నలు అయ్యాక, చెప్పు అక్కా ఏమైంది " అని అడిగాడు అతీత్.
దానికి ఇషా "మా ఇంటిలో దెయ్యం వుంది, అది మాతో మాట్లాడుతుంది కూడా.. ఇంకా అమ్మకి అప్పుడప్పుడు కనపడుతుంది " అని ఇషా అనగానే, సుభద్ర ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది.
"ఇషా ! " అని గట్టిగా అరిచింది, ఎవరు చెప్పారు నీకివన్నీ అని అడిగింది.
దానికి అతీత్ "ఇషా జోక్ చేస్తోంది, మనల్ని భయపెట్టటానికి అవునా ఇషా ?" అని అన్నాడు.
ఇషా, “లేదు అతీత్ మామ!, నిజంగానే, నాకు రోజు మాటలు వినపడతాయి. అమ్మకి, కనపడతాయని, మా పనిమనిషి చెప్పింది " అనగానే ఇషా కి ఈ విషయాలు ఎలా తెలిసియో తెలిసింది సుభద్రకు. అతీత్ కి, విషయం పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా ఏవోవో ప్రశ్నలు అడగబోయాడు అతీత్ ఇషా ని, ఇంటికెళ్లి మాట్లాడుకుందాం అని సుభద్ర టాపిక్ డైవర్ట్ చేసింది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
"అక్కా చెప్పు ఏం జరిగింది ?” అడిగాడు అతీత్.
"ఏమో రా, నాకూ ఏమి అర్థం కావటం లేదు, ఇషా చెప్పింది నిజం, నాకు రోజు చిన్న గా గుసగుసలు వినపడుతున్నాయి, రోజంతా, ఏవేవో ఆకారాలు కనపడుతున్నాయి, మొదట బెడ్ రూమ్ లో వున్న పెద్ద పెయింటింగ్ నల్లగా భయంకరంగా అయిపోయింది, దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టాము.
మా పనిమనిషేమో, ఎవరో మంత్రగాడు వున్నాడు వాడు చిటికెలో వెళ్లగొడతాడు, బాగుచేస్తాడు అని అంటోంది. వాళ్ళ ఊరిలో చాలా మందికి బాగుచేసాడంట. అతడిని తీసుకొస్తాను అని అంటోంది. ”
దానికి అతీత్ ఫక్కున నవ్వి "అక్కా, నువ్వు మొదటగా చూడవల్సినది ఒక సైకియాట్రిస్ట్ ని, అంతే గాని యిలా దెయ్యాలు భూతాలు అని నమ్మటం కాదు " అన్నాడు.
వెంటనే, సుభద్ర "నాకు ఆ విషయం తెలియదంటావా, నేను సైక్రాయిస్టుని కలవలేదు అనుకుంటున్నావా, ఆ ప్రయత్నం కూడా అయ్యింది " అంది.
"మరి ఏమన్నాడు సైక్రాయిస్టుని కలిసినప్పుడు "
"అవన్నీ భ్రమలే అని, ముందు కొంత కౌన్సెలింగ్ ఇచ్చాడు. కానీ తరువాత ఇంకా రిపీట్ అవ్వటం, మరలా ఇంకా ఎక్కువ అవ్వటం వలన, స్కిజోఫ్రెనియా అని కొన్ని మందులు ఇచ్చాడు "
"మరి ఏమి ప్రయోజనం కనపడలేదా ?"
"లేదు, రోజు రోజుకూ, మరింత దిగజారుతూ వొచింది నా పరిస్థితి "
"మరి బావ అశోక్ కి చెప్పలేదా ?"
"అశోక్ ఎక్కడో వున్నాడు, పైగా డాక్టరుకే ఇంకా నా పరిస్థితి అర్థం కావటంలేదు, ఇంకా అశోక్ ఏమిచెయ్యగలడు, వెంటనే రావటం తప్ప.. సరే నిన్ను ఒక సారి కలిసి నీతో ఒక మాట చెప్పి అశోక్ కి చెపుదామని " అని చెప్పింది సుభద్ర తలదించుకుని, కళ్ళలో ఉబికివొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. ఆ రాత్రి, అతీత్, సుభద్రతో పాటే అదే గదిలో పడుకున్నారు.
అర్థరాత్రి, సుమారు మూడు గంటలకు, అతీత్ కి ఎందుకో మెలుకువవొచ్చి చూసే సరికి సుభద్ర బిగుసుకుకుపోయీ.. తల అడ్డంగా ఊపుతోంది, ఊపిరి అందుతున్నట్టులేదు. కళ్ళు తెరిచే వున్నాయి కానీ నోటమాట రావటం లేదు. ఆందోళనకరంగా వుంది. సుభద్రని నిద్రనుండి లేపే ప్రయత్నం చేసాడు కానీ సుభద్ర ఈ లోకంలోలేదు. ఊపిరి అందడంలేదని అర్థమయ్యింది. అతీత్, వెంటనే పక్కన వున్న ఇషా ని నిద్రలేపి, సుభద్రని ఇంటి బయటకు తీసుకువొచ్చాడు.
వెంటనే అక్కడ వున్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థిని గమనించిన ఎమర్జెన్సీ డాక్టర్లు, వెంటనే ఆక్సిజన్ పెట్టారు.కావలిసిన పరీక్షలు చేశారు. ప్రత్యేకంగా ఏది కారణం అని ఎవరు చెప్పలేకపోయారు. అసలే నీరసముగా వుంది. బాగా బలహీనపడటం వలన ఇలా ఫిట్స్ లాగ వొచ్చాయేమో అని చెప్పారు. కొన్ని పరీక్షలు కూడా చేయించమని చెప్పారు. ఇంక లాభంలేదని, హాస్పిటల్ కి దగ్గరలో ఒక హోటల్ లో రూమ్ తీసుకొని, ఇషాని అక్కడ ఉండమని చెప్పి, కొంతసేపటికి అతీత్ మరలా సుభద్ర దగ్గరకు వొచ్చాడు. తాను మెల్లిగా ఒక రెండు గంటలకు తేరుకుంది. పక్కనే వున్న అతీత్ ని చూసి, చిన్నగా నవ్వింది.
"అక్కా ఏమైంది ?" అడిగాడు అతీత్.
"ఏమో రా ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎవరో గుండెలపైనా కూర్చొని ఉన్నట్టు అనిపించింది. ఊపిరి సరిగా ఆడటంలేదు. నోరు పెగలలేదు ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టు అనిపించింది "
ఇంతలో డాక్టర్ వొచ్చి, వైటల్స్ బాగానే వున్నాయి, స్ట్రెస్ అవచ్చు, కొన్ని పరీక్షలు చేద్దాం, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లిపోండి అని డాక్టర్ చెప్పగానే, అతీత్ మనసు కుదుటపడింది. కానీ సుభద్ర మోహంలో చిన్న అలజడి కనిపించింది.
అది గమనించిన అతీత్ "అక్కా, పక్కనే వున్న హోటెల్లోనే ఇంకొన్ని రోజులు ఉందాం. నేను వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా.. నువ్వు వర్రీ అవ్వకు " అని చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి హోటల్ రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఇషా ని గట్టిగా కావిలించుకొని, కాసేపు నిద్రపోయింది సుభద్ర. ఇంతలో తెల్లవారటం తో, ఇషా ని, సుభద్ర ని అక్కడే ఉండమని చెప్పి అతీత్, ఇంటికి బయలు దేరాడు.
మొదట ఆ స్టోర్ రూంలో పెట్టిన పెయింటింగ్ ని పరిశీలించాడు అతీత్. ఆ పెయింటింగ్ తో పాటు మరికొన్ని పైంటింగులు అలా నల్ల రంగులోకి మారి కొంచెం భయంకరంగానే వున్నాయి. ఇల్లంతా, ప్రతి గది కలియతిరిగాడు. ఏమి అనుమానాస్పదంగా కనపడలేదు. నిజానికి అతీత్ దేనికోసం వెతుకుతున్నాడో తనకే తెలీదు.
ఇంతలో, అలసిపోయిన అతీత్, నేను వెళ్లి స్నానం చేసి వొస్తాను, వేడినీళ్లు రెడీ చెయ్యమని చెప్పాడు. దానికి పనిమనిషి అవి ఎప్పుడూ రెడీనే అని అంది.
స్నానం చేసి వోచిన అతీత్, ఆ గది అంతా వెతకడం మొదలుపెట్టాడు. ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని.. కానీ యెంత వెతికినా అతీత్ కి ఎలాంటి క్లూ దొరకలేదు. పైగా తలనొప్పి రావటం మొదలుపెట్టింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
అక్క చెప్పిన లక్షణాలను బట్టి ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్ అని అనుకున్నాడు. స్చిజోఫ్రీనియా కి సంబంధించిన మందులు కూడా వాడింది అని తెలియగానే, ఇది మానసిక సమస్య కాదని, అర్థం అయ్యింది. తనలో తానె తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు అతీత్.
"ఈ ఇంటిలో ముగ్గురు వున్నారు, అందులో పనిమనిషికి పెద్దగా ఏమి ఎఫెక్ట్స్ లేవు/ ఎందుకంటె ఆమె ఇక్కడకు ఎక్కువ రాదు. వొచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా ఇషా, అక్క సుభద్ర..
ఇషా కూడా ఎక్కువ సేపు ఈ గదిలో ఉండదు, తాను రోజు కాలేజ్ కి వెళ్ళిపోతుంది ఎక్కువ సేపు బయటే ఉంటుంది. ఇంకా అక్క సుభద్ర మాత్రం ఇక్కడే ఉంటుంది, ఈ గదిలోనే "
పనిమనిషి ని పిలిచి, ఆ గ్యాస్ గీజర్ ఆఫ్ చెయ్యి, అసలే గ్యాస్ ధర పెరిగిపోయింది అన్నాడు.
“అశోక్ గారు.. గ్యాస్ గీజర్, అమ్మగారి బాత్రూమ్ లో పైన పెట్టించారు. ఎప్పుడూ వేడినీళ్లు రావాలని గీజర్ కు స్విచ్ పెట్టించలేదు" అని చెప్పింది.
అతీత్ కి, అది కొంత ఆశ్చర్యం కలిగించింది. బావ మరీను, యెంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా 24 లు వేడి నీళ్లు రావాలని స్విచ్ లేకుండా చేస్తాడా ? అని ఆలోచిస్తూ వుండగానే అతనికి ఒక విషయం తట్టింది.
అదే " గ్యాస్, గ్యాస్ లీక్.. "
వెంటనే అక్కకి ఫోన్ చేసాడు, " అక్కా నీకు COHgb టెస్ట్ చేశారా ? " అని అడిగాడు.
" COHgb ? అదేంటి.. ఇంకా అంతా డిటైల్డ్ గా చూడలేదు, ఇప్పుడే రిపోర్ట్స్ వొచ్చాయి.. చాలా పేజీలు ఉంటే ముఖ్యమైనవి మాత్రమే చూసా "
" ఒకే. చేయక పొతే వెంటనే చెయ్యమని చెప్పు, నేను అన్ని వివరంగా చెపుతా" అన్నాడు.
వెంటనే, తాను, ఇంటి వెనక అమర్చిన ఆ గ్యాస్ గీజర్ వున్న చోటికి వెళ్లి, ఆ పైపులను గమనించసాగాడు. ఆ పైపులను వెంబడించగా, సరిగ్గా బాత్రూం కిటికీ దగ్గర ఒక జాయింట్ చుట్టూ పసుపు మరకలు ఉండటం గమనించాడు.
వెంటనే పనిమనిషికి ఫోన్ చేసి, గీజర్ బాగు చేసేవాడిని, రమ్మని చెప్పాడు.
ఇంతలో, సుభద్ర దగ్గరనుండి ఫోన్..
" నువ్వు చెప్పాక COHgb టెస్ట్ చేశారురా.. , 12 % అని చూపిస్తోంది "
"నార్మల్ యెంత ?"
“2% కంటే తక్కువ” అంది సుభద్ర షాక్ లోనే.
"ఇక్కడ గీజర్ లీక్ అవుతోంది, అందులోనుండి కార్బన్ మోనాక్సైడ్ మెల్లిగా లీక్ అవుతోంది. అందువలనే నీకు ఇదంతా . వెళ్లి డాక్టర్ ని కలువు, నేను ఇది బాగుచేయిస్తా " అని ఫోన్ పెట్టేసాడు.
ప్లంబర్ తో, ఆ పైప్ రిపేర్ చేపించి, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ ని అక్కడ ఏర్పాటు చేయించాడు.
సుభద్ర డాక్టర్ దగ్గరకు వెళ్ళింది.
"డాక్టర్, COHgb లెవెల్స్ బాగా ఎక్కువ వున్నాయి.. అరౌండ్ 12 % అని "
ఆ మాట వినగానే డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.
“12 %.. ఇది చాలా ఎక్కువ..” అన్నాడు డాక్టర్ ఆశ్చర్యంగా.
"ఏమో డాక్టర్. కొంతకాలంగా మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతోందట. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, మాకు అస్సలు తెలియలేదు "
"ఓహ్ అవునా.. కార్బన్ మోనాక్సైడ్ కి రంగు వాసన ఏమి ఉండదు, ఇది చాలా కాలంగా మీ ఇంటిలో నుండి లీక్ అవుతోంది. ఎందుకైనా మంచిది ఇషా కు కూడా ఈ టెస్ట్ చేద్దాం. మీరు చాలా అదృష్టవంతులు, తొందరగా తెలుసుకున్నారు. లేకపోతె మరి కొన్ని వారాల్లో మీరు చనిపోయేవారు".
విషయం తెలుసుకున్న అశోక్, వెంటనే తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. అతీత్, దగ్గరుండి సుభద్ర ని, ఇషా ని చూసుకోసాగాడు.
అనుకున్నట్టుగానే, ఇషా శరీరంలో కూడా రక్తం లో కూడా కొంత మేర కార్బన్ మోనాక్సయిడ్ ఛాయలు, కనపడటం తో, ఇద్దరినీ కొంతకాలం హాస్పిటల్ లో ఉంచి వారి శరీరం నుంచి ఆ విష వాయువును పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో డాక్టర్, అతీత్ అనుమానాలను ధృవీకరించారు. కార్బన్ మోనాక్సైడ్ కు ఎక్సపోజ్ అవటం వలన వల్ల భ్రాంతులు అదే హాలోజినేషన్స్, గందరగోళం ఇంకా ఊపిరి అందకపోవటం లాంటివి జరుగుతాయని చెప్పాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆ రోజు రాత్రి
అందరు కలిసి కబుర్లు చెప్పుకొని, భోజనం చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళడానికి లేచారు.
"అశోక్ బావ, అక్క జాగ్రత్తా .., ఓ రాత్రి వేళ లేచి చూస్తే జడుసుకుంటావ్, భయమైతే నన్ను లేపు " అన్నాడు అతీత్ కొంటెగా.
అశోక్ దానికి చిన్నగా నవ్వేస్తూ "ప్రాబ్లెమ్ ఫిక్స్ చేసేసావుగా.. అలా ఏమి జరగదులే " అని.
అందరూ నవ్వుకుంటూ వారి వారి గదుల్లోకి వెళ్లి పడుకున్నారు.
అతీత్, ‘గీజర్ కి పవర్ యే కాదు, గ్యాస్ ఆపే ఏవిధమైన స్విచ్ ఎందుకు లేదు ?’ అన్న అనుమానం వెంటాడుతూనే వుంది.. ఎవరిని అనుమానించాలి. పనిమనిషినా ? ప్లంబర్ నా ? వేరే ఎవరినైనా నా? లేక.. బావ నా ? అని ఆలోచిస్తున్నాడు.
అశోక్ కి నిద్ర పట్టలేదు, తన దగ్గరవున్న వేరే ఫోన్ లో "మిషన్ నాట్ డన్ " అని ఎవరికో మెసేజ్ పెట్టాడు. నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతూ.. పక్కనే వున్న వాళ్ళ ఫామిలీ ఫోటోని నేలకేసి కొట్టాడు అసహనంగా..,
చాలా నిరుత్సహాంగా వుంది అశోక్ కు తన పాచిక పారనందుకు.
*****
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 1,970
Threads: 4
Likes Received: 3,089 in 1,410 posts
Likes Given: 4,102
Joined: Nov 2018
Reputation:
61
(14-05-2025, 01:58 PM)k3vv3 Wrote: అశోక్ దానికి చిన్నగా నవ్వేస్తూ "ప్రాబ్లెమ్ ఫిక్స్ చేసేసావుగా.. అలా ఏమి జరగదులే " అని.
అతీత్, ‘గీజర్ కి పవర్ యే కాదు, గ్యాస్ ఆపే ఏవిధమైన స్విచ్ ఎందుకు లేదు ?’ అన్న అనుమానం వెంటాడుతూనే వుంది.. ఎవరిని అనుమానించాలి. పనిమనిషినా ? ప్లంబర్ నా ? వేరే ఎవరినైనా నా? లేక.. బావ నా ? అని ఆలోచిస్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడ ఫిక్స్ అయ్యింది..అశోక్ కి మొదలవబోతుందా అతీత్ మూలంగా?....
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
గది
రచన: ఎం. కె. కుమార్
ఆ గది లోపల అడుగుపెట్టిన వెంటనే వారికి ఒక వింత శూన్యత చుట్టుకొచ్చింది.
అది చీకటి కాదు, అది వెలుతురు లేకపోవడం కాదు.
అది ఊపిరిలో తేమలా, గుండెలో చిన్న దడలా ఉండేది.
గది పెద్దగా లేదు. నాలుగు గోడలు. ఒక పాత టేబుల్.
చప్పుడ్లేని పెద్ద అద్దం. ముడుచుకు పడుకున్న మంచం.
మంచంపైన రెండు మడిచిన దుప్పట్లు.
ఇవి అన్నీ నిశ్శబ్దంగా ఒకటి కొకటి చూస్తున్నట్టు కనిపించాయి.
దీపం వెలుగుతో ఆ గదిలోని వస్తువులకి సొంపైన నీడలు ఏర్పడ్డాయి.
టేబుల్ పైన కొన్ని పాత పుస్తకాలు ఉన్నాయి.
వాటిపై దుమ్ము పేరుకుంది. అద్దం మాత్రం అసహజంగా శుభ్రంగా ఉంది.
మేఘన నెమ్మదిగా మెట్టుపైన కూర్చుంది. "ఇక్కడ చలిగా ఉంది, నాన్నా, " అంది.
హరి తల ఊపుతూ "ఇది తేమ కాదు. ఇది తలపు.
ఇది గది. ఆత్మనెంతవరకు మనల్ని అంగీకరించిందో తెలియని స్పర్శ. "
దీపాన్ని మంచం పక్కన పెట్టాడు.
గదిలో వాతావరణం నెమ్మదిగా మారుతున్నట్టు అనిపించింది.
చిరు గాలివీచినట్టుగా పాత తలుపు చప్పుడిచ్చింది.
మేఘన ఒంటి చుట్టూ దుప్పటి చుట్టుకుని నిద్రపోవాలని యత్నించింది.
కానీ ఆమెకి మెలకువే ఎక్కువ. ఆమె కళ్ళు నిద్రకు అనుమతించలేదు.
గడియారము 10. 30 చూపించింది.
గది మౌనం లోపల మృదువుగా మెలికలు తిరిగింది.
అప్పుడప్పుడు చప్పుడు లేదని అనిపించే ఈ మౌనం..
గుండెల్లో గుట్టు చప్పుడు లాగ విసిరివేస్తూ ఉంది.
“నాన్నా..” మేఘన పిలిచింది.
“ఏమ్మా?” హరి మెల్లగా.
“నిజంగా మీరు నమ్ముతున్నారా? ఆమె ఆత్మ ఇక్కడే ఉందని?”
హరి చిరు నవ్వుతో అన్నాడు.
“నాకు నమ్మకం ఉండకపోతే.. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు.
కానీ నన్ను ఈ గది ఏదో విచారంగా ఆహ్వానించిందిలే.. అది నిజం. ”
మేఘన తల వంచింది.
“నాకు ఇంకా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ ఉండటం.. భయంగా ఉంది.
గమనించారా నాన్నా? ఈ గది శ్వాస తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ”
హరి చిన్నగా నవ్వాడు. "ఒక్కో గదికి జీవితం ఉంటుంది.
మనం ఆ జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించం.
కానీ కొన్ని గదులు.. ఎవరో మిగిలిపోయిన వాళ్ల క్షణాలతో బ్రతుకుతుంటాయి. "
గడియారము 11. 15.
దీపం కొబ్బరి నూనె వాసన రేగింది.
వెలుగు తక్కువయింది.
ఆ వెలుతురే ఇప్పుడు గదిలో వెండి నీడలు తయారుచేస్తోంది.
ఆ నీడల్లో ఒక నిశ్శబ్ద సంభాషణ సాగుతోంది.
మేఘన గమనించింది.
అద్దంలో తమ ప్రతిబింబాలు తేలికగా కంపించాయి. కానీ ఒక క్షణం ఆమెకి అద్దంలో తానే కాకుండా ఇంకొక ఆకృతి కనపడినట్టు అనిపించింది.
నిశ్శబ్దంగా చేతిని అద్దం వైపు చూపించింది.
“నాన్నా.. ఆ అద్దంలో..”
హరి అద్దాన్ని చూశాడు.
కేవలం ఆ ఇద్దరి ప్రతిబింబాలే.
కానీ మేఘన చూపులో పట్టు ఉండటంతో, హరి అద్దం ముందు నెమ్మదిగా నడిచాడు.
మల్లె తీగలా చేతిని అద్దం మీద నెమ్మదిగా ఉంచాడు.
చల్లదనం, తేమ, కొన్ని తపించే అణువులు..
ఇవన్నీ ఆ అద్దం లోపల దాగినట్టు అనిపించాయి.
“ఇది ఆమె చూసిన అద్దం, ” హరి అన్నాడు.
“ఇది ఆమె చివరి ప్రతిబింబాన్ని మోస్తున్న అద్దం.
కొన్నిసార్లు ప్రతిబింబం దాగిపోతుంది కానీ చచ్చిపోదు. ”
గడియారము 11. 45.
మేఘన ఒళ్ళు దగ్గరకి కూర్చుంది. “నిద్ర రావడం లేదు నాన్నా, ” అంది నిస్సత్తువగా.
“నిద్రిస్తే నువ్వు మళ్ళీ కలలలో ఆమెని చూస్తావేమో.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
బహుశా ఆమె అలా తన కథ చెబుతుంది, ” అన్నాడు హరి.
గదిలో ఆ మాటల వెనకే, బయట ఎలుకలు గంతులేసిన శబ్దం.
ఓపికగా వినిపించే నెమ్మదైన అశాంతి. మేఘన కళ్ళు మూసుకుంది.
రాత్రి 12:43.
గడియారం వైపు తలతిప్పిన హరి, చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు.
అలా తల తిప్పిన క్షణాన, గడియారపు గాజు కవర్ నెమ్మదిగా తడుముకుని, స్వల్పంగా జారిపోవడాన్ని చూశాడు.
ఒక రకమైన అసహజమైన చలికాలపు తీగలా అది నిశ్శబ్దంలో ఒలికింది.
వెంటనే.. కిటికీ దగ్గర నుండి వాన వచ్చినట్టు తడిగా, కొంచెం నలిపినట్టు, కిటికీ అడ్డుగా వదలబడిన నీటి చప్పుడు లాంటి శబ్దం వినిపించింది.
హరి మెల్లగా కూర్చున్నాడు.
మేఘన పక్కనే నిద్రలోకి జారిపోయినట్టే కనిపించింది.
కానీ ఆ శబ్దాలు అవి మామూలు శబ్దాలు కావు.
వాటిలో ఏదో ఉచ్ఛ్వాసం ఉంది. ఏదో అనుభూతి ఉంది.
ఒక మెత్తటి గొంతు..
అది గదిలో ఎక్కడో నెమ్మదిగా పలికింది.
“భావాలు ఎవరికీ చెప్పలేక.. నేనే.. లోపల మిగిలిపోయాను..”
ఆ గొంతు విన్న క్షణంలోనే మేఘన కళ్ళు ఒక్కసారిగా తెరుచు కున్నాయి. ఆమె తలెత్తి, చేత్తో కిటికీ వైపు చూపించింది.
“నాన్నా.. !” ఆమె స్వరం ఒక రకమైన కలవరం కలిగించి పలికింది. “చూశారా?”
హరి తల తిప్పి చూశాడు. కిటికీ వద్ద తెల్లటి చీరలో ఓ స్త్రీ ఆకృతి.
అది కేవలం ఒక క్షణం మాత్రమే! ఆ క్షణం ఎప్పటికీ నిలిచిపోయినట్టుగా అనిపించినా, నిజంగా అది ఒక క్షణమే!
ఆమె నిలబడింది. ఓ ఊపిరి తీగలా.
మేఘన చేతిలోని దుప్పటిని గట్టిగా పట్టుకుంది. ఆమె స్వరం కంపించింది. “నాన్నా, అది ఎవరు? నేను నిజంగా చూశా కదా?”
హరి వెంటనే తల నమ్మకంగా ఊపాడు. “చూశావు మేఘన. నువ్వు చూసింది ఆమెనే కావచ్చు.
ఎవరో కాదు.. మనం ఎందుకు ఇక్కడ ఉండాలనుకున్నామో.. అదే గుర్తు చేస్తోంది. ” హరికి తెలుసు మేఘన ఎందుకు ఆమెను చూడగలుగుతుందో.
అతను తలెత్తి, పక్కనే ఉన్న పాత టేబుల్ మీద ఉన్న పుస్తకాలను గమనించాడు.
వాటిలో పసుపు రంగు కవర్ ఉన్న ఒక పాత పుస్తకాన్ని తీసుకున్నాడు.
పుస్తకంపై చిన్న అక్షరాల్లో “అనసూయ, మాటలు అంతరించని వేళ” అని వ్రాయబడి ఉంది.
“నువ్వు గుర్తుంచుకున్నావు కదా, ” హరి మెల్లగా అన్నాడు. “ఆమె భావాలు ఎప్పుడూ రాస్తూ ఉండేదని చెప్పారు. ఈ పుస్తకం అదే కావచ్చు. ”
పుస్తకం తెరవుగా, దుమ్ము పొగ ఒక్కసారి పైకి లేచింది.
దాని వాసన, పాత కాలపు మట్టివాసన, కొంచెం మెత్తగా తడి తగిలిన పేపర్ వాసన.
మేఘన కూర్చుని, తండ్రి చేతుల్లో ఉన్న పుస్తకాన్ని చూడగా.. ఆమె చేతులు స్వల్పంగా వణికినట్టు అనిపించింది.
హరి ముందుగా పుస్తకాన్ని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలో వ్రాయబడి ఉంది.
“అందరికీ చెప్పలేనివి ఉంటాయి. నా మౌనం కూడా అలాంటిదే. మౌనంగా అరిచిన ప్రతి మాట.. ఈ పుటల్లోనే ఉంది. ” – అనసూయ.
మేఘన గొంతు తిరిగింది. “నాన్నా.. అది ఆమెగానే అనిపిస్తోంది. ఆ గొంతు.. పక్కనే ఉన్నట్టు. మన దగ్గరే. ”
గది లోపల గాలిలో ఒత్తిడి మారినట్టుగా అనిపించింది.
అంతకుముందు ఉన్న తేమ, ఇప్పుడు మిగిలిపోయిన కన్నీటి రేణువులా మారింది.
హరి రెండో పేజీ తెరిచాడు. చుక్కలు పెట్టిన చేతి రాత. పగిలిన హృదయం నుంచి జారిన భావాలు
“నా మనసు ఏదో చెప్తుంది. కానీ నన్ను నమ్మే వాళ్లే లేరు. నా నవ్వు వెనకాల కన్నీరు ఉంది.
గది గోడలే నా పరవశం. అద్దమే నా మిత్రం. ఆ అద్దంలో నేను నన్నే చూడలేదు. నా మౌనం చూసింది. ”
ఈ పదాలను చదివిన హరి స్వరం మృదువయ్యింది. “ఒక్కో మాట ఒక్కో బరువు. ఇది రాత కాదు. ఇది ఓ ఊపిరి. ”
మేఘన గాజుల చప్పుడు విన్నట్టు తల తిరిగి చూసింది. ఆ అద్దం ముందు ఆపసోపాలు మిగిలినట్టు కనిపించింది.
“నాన్నా, గమనించారా? ఆ అద్దం దగ్గర ఏదో మారుతున్నట్టుంది. నా మనసు చెబుతోంది, ఆమె మనల్ని చూడాలనుకుంటోంది. మాట్లాడాలనుకుంటోంది. ”
హరి పుస్తకాన్ని మళ్ళీ తెరిచి మరో పేజీ తిప్పాడు. ఈసారి ఆ రాత నెమ్మదిగా, కొంచెం గందరగోళంగా ఉంది.
“నేను పోతానేమో అనుకున్నా. కానీ నేను మిగిలిపోయాను. నా గాత్రం గాల్లో లయమైంది.
నా ఎద నిండిన భావాలు మాత్రం.. గోడలపై రాసుకున్నాను. వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. కానీ నన్ను చదవగలవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. ”
పక్కనే వెలిగిన నెయ్యి దీపం ఆ తరుణంలో కొట్టుకుంటూ కనపడింది.
ఒక్క క్షణం ఆ దీపం వెలుగు అంతా అద్దం మీద పడింది. అద్దంలో మేఘన ప్రతిబింబం లేదు.
ఆమె కంగారు పడ్డట్టు, “నాన్నా.. నేను అద్దంలో కనిపించడం లేదు, ” అంది.
హరి ఒక్కసారి ఆశ్చర్యపోయినా, తను భయపడకుండా మేఘన భుజంపై చేయి పెట్టాడు.
“బహుశా ఆమె తనకోసమే మనల్ని తీసుకొచ్చిందేమో. మనం పుస్తకంలోకి మరింత లోతుగా చూడాలి. ”
ఆ తరువాతి పేజీలో ముడతలు పడ్డ కాగితం తడిగా అనిపించింది.
మాటలు తడిసి ముద్దయ్యాయి. చదవటం కష్టం. కానీ కొన్ని మాటలు స్పష్టంగా ఉన్నాయి.
“తనివి లేకుండా బ్రతకడం కన్నా.. ఊహల్లో బ్రతకడం బాగుంటుంది. ఈ గదిలో ప్రతి మూలన నా మౌనం నాటాను.
ఎవరో ఒక రోజు వినాలి. నేను మిగిలిపోవడానికి కారణం ఉంది. అది మీరే కనుగొనాలి. ”
ఈ మాటలు చదివిన తర్వాత, గది ఒక్కసారిగా ఉష్ణత కోల్పోయినట్టు అనిపించింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఆ గదిలో వెలుతురు నెమ్మదిగా తగ్గింది. కానీ దీపం బలంగా వెలుగుతోంది.
మేఘన తన గుండె చప్పుళ్లు వినిపిస్తున్నట్టు భావించింది.
“నాన్నా.. ఈ పుస్తకం చివరలో ఏదైనా ఉంటుంది? ఆమె మిగిలిపోవడానికి ఏమైనా చెప్పిందా?”
హరి తలూపి “మనం పూర్తిగా చదవాలి. ఆమె చెప్పిన ప్రతి మాట, ప్రతి మౌనం.. ఒక సంకేతం కావచ్చు. ”
ఇది ఓ పాత గది. చిన్న గదే కానీ నాకైతే ప్రపంచంలా ఉంది.
ఈ గదిలోనే నా రోజులు మొదలవుతాయి. ఇక్కడే ముగుస్తాయి కూడా.
గోడలపై ఓ పసుపు బొట్టు వేసినట్లు రంగు తేలిపోయింది.
ముళ్లు పెట్టిన తలుపు మూయగానే వంకరగా ఓ చిన్న శబ్దం చేసింది. ఆ శబ్దం నా కంటికీ నిదురకీ మధ్య ఉండే గీత.
ఆ శబ్దం వచ్చిందంటే రాత్రి మొదలైపోయిందన్న అర్థం. అదే నా నిద్రకి గంట.
నా పేరేంటో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు దాని విషయంలో నాకే ఆసక్తి లేదు.
ఈ గదిలో నాకు పేరు లేదు. నన్ను తలుచుకునే వాళ్ళెవ్వరూ లేరు. వనమాల తప్ప. కానీ ఈ సంవత్సరం..
వనమాల రాలేదు.
పెద్ద పండుగలప్పుడు, ఏటా ఒకసారి ఆమె వచ్చేది. నా చేతిలో వున్న పుస్తకాన్ని మెల్లగా తీసుకుని, నన్ను చూస్తూ ముసురుగా నవ్వేది.
"ఇంకా రాసుకుంటున్నావా అక్కా?" అని అడుగుతుంది.
ఆమె కూచొని, తన తెచ్చుకున్న భోజనం తినిపించేది. నన్ను బలవంతంగా మాటలాటలోకి లాగేది. నేను చిరాకు పడేదాన్ని. కానీ.. నాకు బాగా ఉండేది.
ఈ సంవత్సరం వనమాల తన కూతురితో వచ్చింది. పక్క గదిలో పాలు ఉడకడానికి పెట్టిన గిన్నెలో నీరు కదలాడిన శబ్దంలా, ఆమె మాటలు దూరంగా వినిపించాయి.
"అక్కకి తెలీదు అమ్మా, ఇదంతా మార్చాలి.. చీరలు చుస్తే భయం వేస్తుంది నాకు.. గదిలో వాసన భరించలేనంత ఉంది. అన్నీ గదిలోనే అయితే ఎలా అమ్మా.. "
అంతే. మర్నాడే వనమాల తిరిగిపోయింది. కంచంలో తినిపించిన పులిహోర వాసన మిగిలింది.
ఆమె లేదు. ఆమె కూతురు నాకు తలనొప్పి. ఆమె కనుల్లో ఉన్న అసహ్యం నాకు తెలుసు.
నన్నెవ్వరూ చూడలేదు.
గది తలుపు తాకలేదు ఎవరూ.
ఓరగా కడుపు మ్రగ్గినప్పుడు కింద ఫలితాల్లేని టిఫిన్ బాక్స్.
రోజూ అదే చపాతీ. కడుపు నిండదు. కానీ తినలేక ఆపుతాను.
ఈ గదిలో ఓ అల్మారీ ఉంది. అది నా భారాన్ని మోయడానికే ఉంది.
అందులోనే నా చీరలు ఉన్నాయి. పాత చీరలు. కొన్ని గట్టిగానే ఉన్నాయి.
కొన్ని ముడుచుకుపోయాయి. కానీ అవే నాకు ప్రియమైనవి. ఒక్కొక్కటి ఒక పాటలా ఉంటుంది. ఒక గుర్తుగా ఉంటుంది.
ఒకటి గులాబీ రంగు చీర. అది తొలిసారి బంగారం కొన్న రోజు కట్టుకున్నాను.
అప్పటికి నాయన బతికే ఉన్నారు. అప్పట్నించి ఆ చీర కట్టే రోజు నాకు పండగ.
ఇంకొకటి ముదురు నీలి. వాన రోజు మా ఇంటి బుగ్గల పూలు తొంగి చూస్తున్నట్టు కనిపించేది.
ఒక పసుపు రంగు చీర, వనమాల ఇచ్చినిది. కొత్తగా వచ్చిన సంవత్సరం రోజు కట్టుకున్నాను.
అలాగెన్నో చీరలు. ఒకటి కట్టుకునే ముందు నేను పాత బట్టలలో చెయ్యి పెట్టి, మెల్లగా తీసి, మడతని నెమ్మదిగా తెరిచి చూస్తాను.
వాసన.. పాత కమ్మదనపు వాసన. ఒక్కసారి ఆ వాసన కొచ్చాక, గతం చెరిపిపెట్టలేం. నా కన్నీరు ఆగదు.
ఒక్కొక్కసారి నేనే నా జ్ఞాపకాల్లో చిక్కుకుంటాను. ఆ జ్ఞాపకాలు అంత తేలిక కాదు.
గట్టిగా ఊపిరి పీలుస్తాను. నా బెడ్డు పక్కన ఉన్న పుస్తకాన్ని తీసుకుంటాను.
ఇదే నా దినచర్య పుస్తకం. ఇందులోనే నా రోజులు నడుస్తాయి. ఒక్క రోజు వదలకుండా రాస్తాను.
"ఈరోజు వర్షం. బెల్ మోగలేదు. "
"రాత్రి భయం వేసింది. కాని తలుపు మూసుకోవడం మర్చిపోలేదు. "
"ఒక పక్షి అరవడం వినిపించింది. గోడకు అద్దం పెట్టి చూశాను. నా ముఖం ఎలానో ఉంది. "
"వనమాల రాలేదు. "
"తన కూతురు చూసి భయపడ్డాను. "
"ఇదే నా గది. నా బాధలు, నా పాటలు, నా చీరలు ఇవే నా ప్రపంచం. నేను వెళ్ళను. "
ఇది వ్రాయడం ఆపాలనిపించదు. ఒక్కో వాక్యం రాస్తూ, ఒక్కో దుఃఖపు చుక్క రాలుస్తాను.
నా అక్షరాలు కూడా ఒంటరిపాటగా కనిపిస్తాయి. నా చేతి రాత కూడా వదిలిపోయేలా ఉంది.
ఏమవుతుందో అర్థం కాదు. కానీ ఈ గదిలోంచి నేను బయటికి రావాలనుకోను.
ఈ గదే నాకు ప్రపంచం. ఇది నాకు గది కాదు. నా నెమలికొండలే. నా మధుర గీతాల గది.
అక్కడ ఒక మూలలో చిన్న గాజు సీసా ఉంది. అది గులాబీ తైలం.
ఇప్పటికీ నేను దాన్ని ముద్దగా మెడలో రాసుకుంటాను.
నా చర్మం మృదువుగా ఉంటుందని నమ్ముతాను. ఎవ్వరూ చూసే పరిస్థితే లేదు. కానీ నాకేనా? నాకు నేను ఉండాలిగా.
చూపులేని దేవుడు ముందు దీపం పెట్టుకున్నట్టు, ఈ గదిలో ఒక్క దీపం వెలిగిస్తాను.
అది మసకవుతున్నా, నేనే చమురు పోయను. అది ఒంటరి వెలుగే అయినా, అది నా ఆశ.
నా గడియారాన్ని రోజూ వెనక్కి తిప్పుతున్నా ఆ గడియారాన్ని ఏదో ఊహగా చూస్తాను.
ఒక్కోసారి గోడలతో మాట్లాడతాను.
"ఏం చేద్దాం గోడా, వనమాల రాలేదు కదా?"
గోడ చెప్పదు. కానీ మౌనంగా అలిగి నిలబడుతుంది.
అదే నాకు తృప్తి. ఆ మౌనం కూడా నాకు తోడుగా ఉంటుంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
ఒకసారి నా పుస్తకంలో ఇలా రాసుకున్నాను.
"వినే శబ్దం లేదు. కనబడే కాంతి లేదు. అయినా నేను బతికేస్తున్నాను. "
ఒక మరుసటి రోజు ఇలా రాసుకున్నాను
"వెనక నిలబడిన మిగతా దుస్తులు నన్ను నిశ్శబ్దంగా చూస్తున్నాయి. నేనో గులాబీ పువ్వు. ముడుచుకుపోయాను. కానీ వాడిపోలేదు. "
ఇంకొక రోజు ఇలా
"నాకింకా పాదరక్షలు ఉన్నాయి. కానీ నడవాలి అనిపించదు. ఎందుకంటే ఈ గదిలో నేనే.. నేనే. "
ఈ కథలో ఎటూ వెళ్లనవసరం లేదు. అది ఇదే గదిలో పూర్తవుతుంది. ఇదే గదిలో మొదలైంది కూడా.
ఇదే నా దినచర్య.
నాకు బయట ప్రపంచం లేదేమో. కానీ నాకు నా గదిలో సముద్రం ఉంది.
అది తేలికగా ముంచదు. కానీ లోతుగా ఆలోచింపజేస్తుంది.
నన్ను ఎవ్వరూ చూడలేదని వాపోయాను. కానీ ఈ గదే నన్ను రోజూ చూస్తోంది.
ఇందులో ఉన్న నా మాటలే నన్ను విని మాన్పుతున్నాయి.
ఈ గదిలో నేను ఉండిపోతాను.
ఎందుకంటే..
"ఇది నా గదే. నా బాధలు, నా పాటలు, నా చీరలు ఇవే నా ప్రపంచం. నేను వెళ్ళను. "
ఆ గది తలుపు మెల్లగా తెరుచుకుంది.
పెద్దగా ఏమీ మారలేదు. గదిలో పసుపు రంగు గోడలూ, గాలి చప్పుళ్ల మధ్య చలచలలాడే పాత తెరలూ.
ఒక మూలగా కూర్చున్న చిన్న మకరందపు కుర్చీ, పైపైనే చిన్న కొయ్యల టేబుల్.
అంతా అక్కడే ఉన్నాయి. కానీ ఒక చిన్న భారం గదిలో ఉందనిపించింది.
అనసూయమ్మ గది.
ఆమె లేరు. కానీ ఆమె ఉన్నట్టు ఉంది.
మేఘన గదిలో అడుగు పెట్టి నిలబడింది. కళ్లల్లో ఏదో అలజడి.
భయం కాదు, బాధ కాదు. అవి కలిసిన ఏదో. వాడిన గులాబీ పూల వాసన మిగిలిన చీరలకెక్కిన వాసన ఆమె ముక్కున చుట్టుకుపోయింది.
మౌనంగా ఆ చీరల దిండును తాకింది.
ఆ గది అంతా జ్ఞాపకాలతో నిండినట్టుంది. ప్రతి వస్తువు ఒక మాట మాట్లాడినట్టుంది.
తలుపు పక్కనే చిన్న ఆల్మారీ. అందులో చీరలు మడిచి పెట్టినవి.
ఒక్కోటి ఒక వర్ణకవితలా ఉంది. పసుపు రంగు చీర అది ఆమె చివరిసారి వనమాల కోసం కట్టుకున్నదేమో.
ముదురు నీలి చీర.. ఒక వేడుక రోజున అందరిని తనవైపు తిప్పుకున్న రోజు గుర్తుండేలా.
కిటికీ పక్కన ఒక చిన్న నల్లబొచ్చాయి పెట్టె. అందులో కొన్ని పాత ఉంగరాలు, పసుపు రేఖలతో నిండిన చిన్న నోట్బుక్. మొదటి పేజీ.
“నన్ను ఎవరూ పట్టించుకోకపోయినా, నేను రాస్తాను. నా గొంతుక వింటారు ఒక రోజు. ”
హరి గది ముందునుంచి చూస్తూ ఉండిపోయాడు. ఆ గది ఇప్పుడు ఖాళీ అయినా, ఆమె వాక్యాలు గోడల్ని తడిపేసినట్టున్నాయి.
ఆ గదిలో ఎవ్వరూ పెద్దగా కాలం గడపలేదు. చిన్నప్పుడు మేఘన.. వనమాల కూతురు..
ఒక్కసారి చీరల మధ్య దాక్కుని ఏడ్చింది. తల్లి మీద కోపంతో.
అనసూయమ్మ అప్పుడు ఆమె తల నిమిరి ఒక్క మాట చెప్పింది.
“ఏదీ నిగూఢం కాదు తల్లీ, మన బాధ కూడా లోపలే బంధించుకుంటే, అది మనల్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. ”
ఆ మాట మేఘనకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడు కలిగింది.
ఇప్పుడు ప్రతి గోడపై ఆ వాక్యాల ప్రతిధ్వని వినిపించింది.
“నాన్నా, ” మేఘన నెమ్మదిగా మాట మొదలుపెట్టింది, “ఆమె తపించేది గుర్తింపు కోసం.
ఆమెకు బాధలను వ్యక్తీకరించే వాళ్లు అవసరం. అందుకే ఆ గదిలో తన జ్ఞాపకాలతో కలిసి జీవిస్తుంది. ”
హరి ఊపిరి పీల్చాడు. గళం కొంచెం దిగజారినట్లుంది.
“మనిషి శరీరం పోయినా, భావనలు మిగుల్తాయి. ఒకరిని పూర్తిగా విస్మరిస్తే.. వారు తమ ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటారు. ”
గదిలో మళ్లీ మౌనం ఏర్పడింది. కానీ ఈసారి అది భయపెట్టేదిగా కాదు.. గౌరవంగా.
ఆ ఇద్దరూ క్రమంగా ఆ గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు.
పాత పుస్తకాలను, నోట్లు, చీరలు మెల్లగా దించి, మడిచి పెట్టారు.
కానీ ఏదీ విస్మరించలేదు. అన్నింటినీ ఒక చిన్న జ్ఞాపికగా చేర్చారు.
పాత ముద్దపూర్ణమైన కాగితాలు తీసి చదివారు.
“ఇన్నేళ్ళుగా నన్ను ఎవ్వరూ అడగలేదు. ‘నువ్వేంటి అనసూయ?’ అనేటటువంటి ప్రశ్న.
అందుకే ఈ పుస్తకంలో నేను నేనుగా వ్రాసుకున్నాను. ”
“నాకు కూడా వేదనలు ఉన్నాయి. కానీ వాటిని ఏవైనా పాటల మధ్య ముడిపెట్టాను. ఏవరైనా వింటారా అని ఆశపడ్డాను. ”
ఒక్కో వాక్యం, ఒక్కో స్మృతి. పాత పదాల గుండెలో కొత్త అర్థం.
చివరికి ఆ నోట్బుక్ చివరి పేజీ
“ఇది నా గదే. నా బాధలు, నా పాటలు, నా చీరలు.. ఇవే నా ప్రపంచం. నేను వెళ్ళను. ”
అదే చివరి వాక్యం. గడిపెట్టినట్టు, అంతే.
ఆ వాక్యం చూసి మేఘన మౌనంగా కన్నీరు తుడుచుకుంది. హరి చేతిలోని పుస్తకాన్ని మూసి పెట్టాడు.
ఆ గదిలో ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసి, ఒక తలపు మూలగా ఏర్పాటు చేశారు. పేరు పెట్టారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
"అనసూయ భావగది".
పక్క గోడపై ఒక చిన్న ఫొటో.
అనసూయమ్మ నవ్వుతో, చేతిలో గులాబీ తైలం సీసా పట్టుకొని. దాని క్రింద ఒక పంక్తి.
“మాటల లేని మనసులు.. గదుల మధ్య విరుపుగా మారకుండా ఉండాలంటే, జ్ఞాపకాలు బలంగా నిలవాలి. ”
ఆ రాత్రి..
ఆ గది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ ఈసారి, అది ఒంటరితనపు నిశ్శబ్దం కాదు. అది ఒక గౌరవంతో కూడిన నిశ్శబ్దం.
గాలి కదిలే శబ్దం, కిటికీ వెనుక ముసురు వెలుతురు, పుస్తకాల్లోంచి లేవని భావనలు.. ఇవన్నీ అక్కడే ఉన్నాయి.
ఆమె లేదు. కానీ ఆమె ఉనికి ఆ గదిలో శాశ్వతమైంది.
సమాప్తం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
శ్రీమతి 2.O
రచన: తాత మోహనకృష్ణ
రాజేశ్వరి కి పెళ్ళయి ఇరవై సంవత్సరాలు దాటింది. భర్త తో హ్యాపీ గానే ఉంది. పిల్లలు చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇంట్లో ఉన్నది తను, భర్త రామారావు మాత్రమే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలను చూస్తే, వాళ్ళు లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో.. అని తెగ ఫీల్ అయ్యేది రాజేశ్వరి. నేటి జనరేషన్ స్పీడ్ ని చూసి.. తను కుడా ఆ స్పీడ్ ని అందుకోవాలని అనుకుంది రాజేశ్వరి. పెళ్ళైన కొత్తలో.. ఇంత ఎంజాయ్ చెయ్యడానికి లేదు తనకి.. ఆ రోజులే వేరు కదా.. ! అని తన గతం గుర్తు చేసుకుంది..
*****
"మన అమ్మాయి రాజేశ్వరికి మంచి సంబంధం వచ్చింది.. " అన్నాడు భార్య తో రాజీవ్.
"అబ్బాయి ఏం చేస్తున్నాడండీ.. ?".
"గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు.. "
"అమ్మాయిని కుడా ఒక మాట అడగండి.. " అంది భార్య.
"అమ్మాయి రాజేశ్వరి నా మాట ఎప్పుడూ కాదనదు. అయినా, మనకన్నా బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పు.. !" అని సమర్దించుకున్నాడు రాజీవ్.
అప్పట్లో.. రాజేశ్వరికి ఒక్క మాట కుడా చెప్పకుండా, పెళ్ళి ఖాయం చేసేసారు. రామారావు కు మాత్రం అమ్మాయి బాగా నచ్చింది.. ఒప్పుకున్నాడు. తండ్రి మాటకు విలువ ఇచ్చి పెళ్ళి చేసుకుంది రాజేశ్వరి. భర్త ఎప్పుడూ ఆఫీస్ తో బిజీ గా ఉండేవాడు. ఇంట్లో వంట, ఇంటి పని చేసుకోవడం.. అత్తగారికి, మావగారికి సేవలు చెయ్యడం.. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్త కు సేవలు చెయ్యడం.. ఇలాగే రాజేశ్వరి జీవితం సాగిపోయేది. ఎప్పుడైనా.. ఒక సినిమాకి తీసుకుని వెళ్ళేవాడు రామారావు. ఆ తర్వాత పిల్లలు పుట్టేసారు. వాళ్ళని పెంచి, పెద్ద చెయ్యడానికే సరిపోయింది ఇన్ని సంవత్సరాలూ..
కొన్నాళ్ళకి అత్తగారికి ఒంట్లో బాగోలేకపోవడం.. ఆమెకి దగ్గరుండి.. మంచం పైనే అన్ని సేవలు చేసేది రాజేశ్వరి. ఆ తర్వాత కొంత కాలానికి అత్తగారు కాలం చేసారు. ఆ తర్వాత మావగారి వంతు. ఆయనకీ సేవలు చేసింది రాజేశ్వరి. ఆయన కాలం చేసిన తర్వాత.. రాజేశ్వరి కి నలభై దాటేసాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అయ్యారు.. చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇప్పుడు కొంచం తీరిక ఉన్నా.. వయసు లేదు.. ఓపిక తగ్గింది.
*****
అప్పుడే.. రోబో సినిమా చూసింది రాజేశ్వరి.. నా చిన్నప్పుడు ఉన్న సినిమాలే వేరు అనుకుంది రాజేశ్వరి.. ఆ తర్వాత రోబో శ్రీమతి 2. O వచ్చింది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది.
'నేను ఎందుకు మారకూడదు.. ? ఇప్పుడు లైఫ్ ని ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చెయ్యకూడదు.. ? ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ? శ్రీమతి నుంచి శ్రీమతి 2.O గా మారతాను' అని డిసైడ్ చేసుకుంది రాజేశ్వరి..
ఆ రోజు సాయంత్రం.. నీట్ గా రెడీ అయి.. భర్త కోసం వెయిట్ చేస్తోంది రాజేశ్వరి..
"ఏమండీ! ఈ రోజు ఎందుకు ఇంత లేట్ అయ్యింది.. ?"
"ఎవరండీ మీరు.. ? నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను.. సారీ.. " అని చెప్పి వెళ్ళబోయాడు రామారావు..
"నేనేనండీ.. మీ శ్రీమతి రాజేశ్వరి.. "
"అవును.. గుర్తుపట్టనేలేదు.. ఎంత మారిపోయావు.. హెయిర్ స్టైల్ మార్చావు.. ఎప్పుడూ చీరకట్టే నువ్వు.. ఈ డ్రెస్ లో మెరిసిపోతున్నావు.. "
"అట్టే.. పొగడకండీ.. ! ఇదేమి చూసారు. నేను పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నవన్నీ.. లేటెస్ట్ గా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను.. "
"ఏమిటో.. అవి.. ?"
"మీరు రేపటి నుంచి.. నన్ను 'డార్లింగ్' అని అనాలి.. నేను మిమల్ని 'రామ్' అంటాను.. "
"అదేమిటి.. ?"
"ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇలానే భర్తలను పిలుస్తారు.. "
"ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకుని.. గిరి గిర తిప్పాలి.. సినిమా లో హీరో చేసినట్టుగా.. మొన్న కొత్తగా పెళ్ళైన రాధ ని వాళ్ళాయన తిప్పడం చూసాను రామ్"
"పెళ్ళైన కొత్తలో.. అయితే చాలా స్లిమ్ గా ఉండేదానివి. ఇప్పుడు ఏమో రుబ్బు రోలు లాగ ఉన్నావు.. ఎలా తిప్పను.. ? నా నడుము పడిపోతుందే.. !"
"నొప్పికి మందు రాస్తాను లెండి.. తిప్పండీ!.. పెళ్ళైన కొత్తలో అడగలేకపోయాను.. "
"అంతే అంటావా మరి.. !"
"అంతే.. !!!"
మొత్తానికి రామ్ కష్టపడి.. శ్రీమతి కోరిక తీర్చడానికి ప్రయత్నించగా.. నడుము పట్టేసింది. చెప్పిన ప్రకారమే.. రాజేశ్వరి మందు పూసింది.. తన కోరిక ఒకటి తీరినందుకు చాలా హ్యాపీ అయింది రాజేశ్వరి.
"ఇప్పుడు నొప్పి తగ్గిందా రామ్.. ?"
"ఇప్పుడు బాగానే ఉందిలే.. "
"నెక్స్ట్ మన పెళ్ళిరోజు వస్తోంది కదండీ! ఆ రోజు సూపర్ గా ప్లాన్ చేస్తున్నాను. ఒకప్పుడు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నా లైఫ్ ని.. ఇప్పుడు కొత్త గా లేటెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను.. "
"దానికి నేను ఇంకా ఏమిటి చెయ్యాలో.. ?"
"మీకు మాత్రం ఎంజాయ్ చెయ్యాలని ఉండదా చెప్పండీ.. ! రేపు మనం ఉదయం సినిమా కు వెళ్ళాలి.. మర్చిపోకండీ.. ! కార్నెర్ సీట్స్ బుక్ చెయ్యండి. ఆ తర్వాత.. ఏం చెయ్యాలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు.. అంతే.. ! ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత మంచి హోటల్ లో ఫుడ్ తిని.. ఎంజాయ్ చేద్దాం "
"తప్పదా.. రాజేశ్వరి.. ?"
"ఇప్పట్లో భర్తలు.. ఇంకా చాలా చేస్తున్నారు.. నా కోసం ఈ మాత్రం చెయ్యలేరూ రామ్.. ? " అని బుగ్గ గిల్లింది రాజేశ్వరి
"ఇలా ఒక్కసారిగా అన్నీ అడిగితే.. ఎలాగే రాజేశ్వరి.. "
"రాజేశ్వరి కాదు.. మర్చిపోతున్నారు.. "
"అ.. అదే.. డార్లింగ్.. ఎలా చెప్పు.. ?"
"తప్పదు రామ్.. "
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
శ్రీమతి 2.O
రచన: తాత మోహనకృష్ణ
రాజేశ్వరి కి పెళ్ళయి ఇరవై సంవత్సరాలు దాటింది. భర్త తో హ్యాపీ గానే ఉంది. పిల్లలు చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇంట్లో ఉన్నది తను, భర్త రామారావు మాత్రమే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలను చూస్తే, వాళ్ళు లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో.. అని తెగ ఫీల్ అయ్యేది రాజేశ్వరి. నేటి జనరేషన్ స్పీడ్ ని చూసి.. తను కుడా ఆ స్పీడ్ ని అందుకోవాలని అనుకుంది రాజేశ్వరి. పెళ్ళైన కొత్తలో.. ఇంత ఎంజాయ్ చెయ్యడానికి లేదు తనకి.. ఆ రోజులే వేరు కదా.. ! అని తన గతం గుర్తు చేసుకుంది..
*****
"మన అమ్మాయి రాజేశ్వరికి మంచి సంబంధం వచ్చింది.. " అన్నాడు భార్య తో రాజీవ్.
"అబ్బాయి ఏం చేస్తున్నాడండీ.. ?".
"గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు.. "
"అమ్మాయిని కుడా ఒక మాట అడగండి.. " అంది భార్య.
"అమ్మాయి రాజేశ్వరి నా మాట ఎప్పుడూ కాదనదు. అయినా, మనకన్నా బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పు.. !" అని సమర్దించుకున్నాడు రాజీవ్.
అప్పట్లో.. రాజేశ్వరికి ఒక్క మాట కుడా చెప్పకుండా, పెళ్ళి ఖాయం చేసేసారు. రామారావు కు మాత్రం అమ్మాయి బాగా నచ్చింది.. ఒప్పుకున్నాడు. తండ్రి మాటకు విలువ ఇచ్చి పెళ్ళి చేసుకుంది రాజేశ్వరి. భర్త ఎప్పుడూ ఆఫీస్ తో బిజీ గా ఉండేవాడు. ఇంట్లో వంట, ఇంటి పని చేసుకోవడం.. అత్తగారికి, మావగారికి సేవలు చెయ్యడం.. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్త కు సేవలు చెయ్యడం.. ఇలాగే రాజేశ్వరి జీవితం సాగిపోయేది. ఎప్పుడైనా.. ఒక సినిమాకి తీసుకుని వెళ్ళేవాడు రామారావు. ఆ తర్వాత పిల్లలు పుట్టేసారు. వాళ్ళని పెంచి, పెద్ద చెయ్యడానికే సరిపోయింది ఇన్ని సంవత్సరాలూ..
కొన్నాళ్ళకి అత్తగారికి ఒంట్లో బాగోలేకపోవడం.. ఆమెకి దగ్గరుండి.. మంచం పైనే అన్ని సేవలు చేసేది రాజేశ్వరి. ఆ తర్వాత కొంత కాలానికి అత్తగారు కాలం చేసారు. ఆ తర్వాత మావగారి వంతు. ఆయనకీ సేవలు చేసింది రాజేశ్వరి. ఆయన కాలం చేసిన తర్వాత.. రాజేశ్వరి కి నలభై దాటేసాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అయ్యారు.. చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇప్పుడు కొంచం తీరిక ఉన్నా.. వయసు లేదు.. ఓపిక తగ్గింది.
*****
అప్పుడే.. రోబో సినిమా చూసింది రాజేశ్వరి.. నా చిన్నప్పుడు ఉన్న సినిమాలే వేరు అనుకుంది రాజేశ్వరి.. ఆ తర్వాత రోబో శ్రీమతి 2. O వచ్చింది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది.
'నేను ఎందుకు మారకూడదు.. ? ఇప్పుడు లైఫ్ ని ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చెయ్యకూడదు.. ? ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ? శ్రీమతి నుంచి శ్రీమతి 2.O గా మారతాను' అని డిసైడ్ చేసుకుంది రాజేశ్వరి..
ఆ రోజు సాయంత్రం.. నీట్ గా రెడీ అయి.. భర్త కోసం వెయిట్ చేస్తోంది రాజేశ్వరి..
"ఏమండీ! ఈ రోజు ఎందుకు ఇంత లేట్ అయ్యింది.. ?"
"ఎవరండీ మీరు.. ? నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను.. సారీ.. " అని చెప్పి వెళ్ళబోయాడు రామారావు..
"నేనేనండీ.. మీ శ్రీమతి రాజేశ్వరి.. "
"అవును.. గుర్తుపట్టనేలేదు.. ఎంత మారిపోయావు.. హెయిర్ స్టైల్ మార్చావు.. ఎప్పుడూ చీరకట్టే నువ్వు.. ఈ డ్రెస్ లో మెరిసిపోతున్నావు.. "
"అట్టే.. పొగడకండీ.. ! ఇదేమి చూసారు. నేను పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నవన్నీ.. లేటెస్ట్ గా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను.. "
"ఏమిటో.. అవి.. ?"
"మీరు రేపటి నుంచి.. నన్ను 'డార్లింగ్' అని అనాలి.. నేను మిమల్ని 'రామ్' అంటాను.. "
"అదేమిటి.. ?"
"ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇలానే భర్తలను పిలుస్తారు.. "
"ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకుని.. గిరి గిర తిప్పాలి.. సినిమా లో హీరో చేసినట్టుగా.. మొన్న కొత్తగా పెళ్ళైన రాధ ని వాళ్ళాయన తిప్పడం చూసాను రామ్"
"పెళ్ళైన కొత్తలో.. అయితే చాలా స్లిమ్ గా ఉండేదానివి. ఇప్పుడు ఏమో రుబ్బు రోలు లాగ ఉన్నావు.. ఎలా తిప్పను.. ? నా నడుము పడిపోతుందే.. !"
"నొప్పికి మందు రాస్తాను లెండి.. తిప్పండీ!.. పెళ్ళైన కొత్తలో అడగలేకపోయాను.. "
"అంతే అంటావా మరి.. !"
"అంతే.. !!!"
మొత్తానికి రామ్ కష్టపడి.. శ్రీమతి కోరిక తీర్చడానికి ప్రయత్నించగా.. నడుము పట్టేసింది. చెప్పిన ప్రకారమే.. రాజేశ్వరి మందు పూసింది.. తన కోరిక ఒకటి తీరినందుకు చాలా హ్యాపీ అయింది రాజేశ్వరి.
"ఇప్పుడు నొప్పి తగ్గిందా రామ్.. ?"
"ఇప్పుడు బాగానే ఉందిలే.. "
"నెక్స్ట్ మన పెళ్ళిరోజు వస్తోంది కదండీ! ఆ రోజు సూపర్ గా ప్లాన్ చేస్తున్నాను. ఒకప్పుడు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నా లైఫ్ ని.. ఇప్పుడు కొత్త గా లేటెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను.. "
"దానికి నేను ఇంకా ఏమిటి చెయ్యాలో.. ?"
"మీకు మాత్రం ఎంజాయ్ చెయ్యాలని ఉండదా చెప్పండీ.. ! రేపు మనం ఉదయం సినిమా కు వెళ్ళాలి.. మర్చిపోకండీ.. ! కార్నెర్ సీట్స్ బుక్ చెయ్యండి. ఆ తర్వాత.. ఏం చెయ్యాలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు.. అంతే.. ! ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత మంచి హోటల్ లో ఫుడ్ తిని.. ఎంజాయ్ చేద్దాం "
"తప్పదా.. రాజేశ్వరి.. ?"
"ఇప్పట్లో భర్తలు.. ఇంకా చాలా చేస్తున్నారు.. నా కోసం ఈ మాత్రం చెయ్యలేరూ రామ్.. ? " అని బుగ్గ గిల్లింది రాజేశ్వరి
"ఇలా ఒక్కసారిగా అన్నీ అడిగితే.. ఎలాగే రాజేశ్వరి.. "
"రాజేశ్వరి కాదు.. మర్చిపోతున్నారు.. "
"అ.. అదే.. డార్లింగ్.. ఎలా చెప్పు.. ?"
"తప్పదు రామ్.. "
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
మర్నాడు.. పెళ్ళిరోజు ఉదయం సినిమా కు బయల్దేరారు ఇద్దరు. కార్నెర్ సీట్స్ లో సినిమా చూస్తునప్పుడు.. ఏదో తేడ అనిపించింది రామారావు కు. పెళ్ళాం చేస్తున్న కొత్త ముచ్చట అనుకుని ఊరుకున్నాడు. ఇంటర్వెల్ లో లేచి చూస్తే, జేబులో పర్సు లేదు. ఎవడో కొట్టేసాడని లబో దిబో అన్నాడు. ఆ దిగులకి రామారావు కి తలనొప్పి వచ్చేసింది.
"మీకోసం అమృతాంజన్ తెచ్చానండీ.. డోంట్ వర్రీ.. " అని తలకి పూసింది రాజేశ్వరి..
కొంచం సర్దుకున్న తర్వాత.. మంచి హోటల్ కి వెళ్లారు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని..
"ఈ రోజుల్లో అందరూ.. వెరైటీ ఫుడ్ తింటారు. ఈ కొత్తగా ఉన్న డిషెస్ అన్నీ ఆర్డర్ చేసెయ్యండి.. " అని ఆర్డర్ వేసింది రాజేశ్వరి..
ఆర్డర్ చేసిన కొత్త డిషెస్ అన్నీ వచ్చాక, ఒక పట్టు పట్టారు ఇద్దరు. ఫుడ్ తిన్నాక.. ఇంటి దారి పట్టారు. ఆ రోజు రాత్రి ఎంతో మధురంగా ఉహించుకున్న రాజేశ్వరికి.. నిరాశే మిగిలింది. కడుపులో ఉన్న గందరగోళానికి రాత్రంతా బాత్రూం లోనే ఎక్కువ సేపు గడిపాడు రామారావు. ఉదయానికి నీరసించి.. హాస్పిటల్ లో చేరాడు. వచ్చిన బిల్ చూసి.. పాపం షాక్ అయ్యాడు రామారావు.
"దీనికన్నా.. ఇంట్లో నువ్వు కమ్మగా వండిపెడితే.. తింటూ.. ఓటీటీ లో కొత్త సినిమా చూస్తుంటే.. ఎంతో హాయిగా ఉండేది.. మన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి.. " అని భార్యను మందలించాడు రామారావు..
**********
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
గ్రహాంతరవాసి
రచన: G. S. S. కళ్యాణి
పట్నంలో ఉంటున్న కొడుకు రమేష్ దగ్గర కొన్ని వారాలు గడుపుదామని పల్లెటూరినుండీ వచ్చిన ఆనందరావు మొబైల్ ఫోను ఫయరింజిన్ సైరెన్ లాంటి శబ్దంతో గణగణమంటూ ఆగకుండామోగింది. ఆ అరుదైన రింగ్ టోన్ చేసిన చప్పుడుకి ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న తొమ్మిదినెలల అర్జున్ ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు.
"అదేమి రింగ్ టోన్ నాన్నా? గుండెల్లో దడపుట్టేటట్లుంది! ఇంకోదానికి మార్చుకోవచ్చు కదా?", అన్నాడు రమేష్ తన కొడుకు అర్జున్ ను ఎత్తుకుని ఊరుకోపెడుతూ.
"మీ నాన్నగారికి సరిగ్గా వినపడదు కదా?! అందుకే ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినపడేలా గట్టి రింగ్ టోన్ పెట్టుకున్నారు!", చిరాగ్గా ముఖం పెట్టిన అర్జున్ ని తన చేతుల్లోకి తీసుకుంటూ రమేష్ తో అంది ఆనందరావు భార్య పార్వతి.
పార్వతీ రమేష్ ల సంభాషణ పట్టించుకోకుండా, "హలో!" అంటూ ఫోన్ పట్టుకుని ఇంటి బయటకు వెళ్ళిపోయాడు ఆనందరావు.
"హలో ఆనందరావు గారూ! నేనూ! మీ ఎదురింటి రంగనాథం మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలండీ", అన్నాడు రంగనాథం కంగారుగా.
"ఏమిటీ? ఏం జరిగిందీ?? కొంచెం వివరంగా చెప్తారా?", ఆందోళన చెందుతూ అడిగాడు ఆనందరావు.
"మీరు వార్తలు చూడలేదా? నిన్న రాత్రి మీ ఇంటి మేడ పైకి గ్రహాంతరవాసులు దిగారు!! వాళ్ళు మన ఊరిని ఏం చేస్తారో అని అందరూ భయపడిపోతున్నారు!", అసలు విషయం చెప్పాడు రంగనాథం.
ఆ మాటలు విన్న ఆనందరావు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయ్. హడావుడిగా పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళి, బెడ్రూంలో ఉన్న సూట్ కేసులు ముందుగదిలోకి లాక్కుంటూ వచ్చి, "పార్వతీ! పద! తొందరగా మనింటికి వెళ్ళాలి!", అన్నాడు ఆయాసపడుతూ. ఎందుకన్నట్లు ఆనందరావు వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది పార్వతి.
"ఏమైంది నాన్నా? ఎందుకంత కంగారుగా ఉన్నావ్? ముందు నువ్వు కూర్చో", అంటూ మంచినీళ్ళు తీసుకురమ్మని తన భార్య విమలకు సైగ చేశాడు రమేష్.
"మన ఇంట్లోకి గ్రహాంతరవాసులొచ్చారటరా! వాళ్ళు ఏ పని మీదొచ్చారో మనకు ఏ హాని తలపెట్టారో ఏమో! తలుచుకుంటూ ఉంటే ఒణుకు పుడుతోంది", అన్నాడు ఆనందరావు తనకు పట్టిన చెమటలు కండువాతో తుడుచుకుంటూ.
"ఊరుకోండి నాన్నా! గ్రహాంతరవాసులేంటీ? మన ఇంటికి రావడమేంటీ? నీకెవరో అబద్ధం చెప్పినట్లున్నారు. అనవసరంగా కంగారు పడకు", అన్నాడు రమేష్.
"లేదురా! ఆ విషయం వార్తల్లో కూడా వచ్చిందని అంటూ ఉంటే అబద్ధం ఎలా అవుతుందీ?", విమల తెచ్చిన నీళ్ళు అందుకుంటూ అన్నాడు ఆనందరావు.
"ఏ ఛానెల్ వాళ్ళు చెప్పారూ?", అడిగాడు రమేష్.
"ఏమో! నాకదంతా తెలీదు. నేనైతే బయలుదేరుతున్నానురా. పార్వతీ! త్వరగా రా!", అన్నాడు ఆనందరావు.
"గ్రహాంతరవాసులను ఇంతవరకూ చూసినవాళ్ళెవ్వరూ లేరట. ఇంతవరకూ వచ్చిన వార్తలన్నీ అనుమానాలేకానీ నిజమని నిరూపించిన దాఖలాలేవీ లేవు. నేను ఎంబ్రాయిడరీ క్లాసుల్లో చేరాను కదా! రేపటినుంచీ క్లాసులు మొదలవుతాయి. రమేష్ మొత్తం కోర్సుకు ఫీజు కట్టేశాడు. నేను క్లాసులకు వెళ్ళకపోతే డబ్బులన్నీ వృధా అయిపోతాయి. మరోసారి మీరు విన్నది నిజమో కాదో తెలుసుకోండి", అంది పార్వతి ఆనందరావుతో.
"అబ్బా! నువ్వూ నీ క్లాసుల గోలా! అవన్నీ కాలక్షేపం కోసమే తప్ప మనకు వాటివల్ల ఉపయోగమేమీ ఉండదు. నువ్వొచ్చినా రాకపోయినా నే వెడుతున్నా అంతే!", ఇక చర్చకు ఆస్కారం లేకుండా తేల్చి చెప్పేశాడు ఆనందరావు.
చేసేది లేక ఆనందరావుతో తమ ఊరికి బయలుదేరింది పార్వతి. ఆనందరావుకు అసలే హై బీపీ షుగరూ ఉన్నాయనీ, బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని సందేహించిన రమేష్, పార్వతీఆనందరావులను తన కారులో పల్లెటూరికి తీసుకెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని వారితో బయలుదేరాడు. రెండుగంటల కారు ప్రయాణం తర్వాత తమ ఇంటి పరిసరాలకు చేరుకున్నారు ఆనందరావు దంపతులు. ఆ సమయానికి తమ ఇంటి ఆవరణకు కొద్ది దూరంలో కొందరు గ్రామస్థులు గుమిగూడి ఏదో విషయం చర్చించుకుంటున్నారు. కారు దిగుతూనే ఆనందరావు వారి వద్దకు వెళ్ళాడు. ఆనందరావు వెంట రమేష్ కూడా వెళ్ళాడు.
ఆనందరావును చూస్తూనే పాలవ్యాపారి మల్లేశం, "రండి రండి! మీకోసమే అంతా ఎదురుచూస్తున్నారు! గ్రహాంతరవాసులు నిన్న రాత్రి మీ డాబాపైకి దిగారు", అని అన్నాడు.
"అవునయ్యగారూ! వాటిలో ఒక గ్రహాంతరవాసి మాకు సుస్పష్టంగా కనపడింది. అది గుండుగా ఉంది! దాన్నుండీ గుప్పుగుప్పుమని ఒకటే నల్లటి పొగలు", భయమూ, ఆశ్చర్యమూ కలగలిపిన కంఠంతో అంది ఆనందరావు పనిమనిషి మాణిక్యం.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
"ఆ తర్వాత 'ఠపీ'మని పెద్ద శబ్దంతో ఆ గ్రహాంతరవాసి మాయమైపోయింది. పత్రికలకోసం సమాచారం సేకరించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ఇప్పుడే మీ ఇంటి ప్రహరీ గోడ దూకి, డాబాపైకి వెళ్ళారు ఆనందరావుగారూ!", చెప్పాడు రంగనాథం.
"అమ్మబాబోయ్! మీరు చెప్పేది వింటూ ఉంటే నాక్కూడా గుండె దడొచ్చేస్తోంది!! మేడ మీద నాకెంతో విలువైన వస్తువులున్నాయ్. బహుశా వాటికోసమే ఆ గ్రహాంతరవాసులు వచ్చి ఉంటారు!", అంది పార్వతి.
అంతలో డాబాపైకి వెళ్ళిన ఇద్దరు యువకులు పరిగెత్తుక్కుంటూ ఆనందరావు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆనందరావు ఇంటివైపు బెదురు చూపులు చూస్తూ, "ఆ ఇంటి యజమాని మీరే కదండీ?", అని అడిగారు.
"అవును నేనే. ఇంతకూ డాబాపైన ఏముందీ?", ఆతృతగా అడిగాడు ఆనందరావు.
"అమ్మో! చాలా భయంకరంగా ఉందండీ!", అన్నాడు ఆ యువకుల్లో ఒకడు.
"అంతా నల్లటి మసి! ఏవో కొన్ని మట్టి బొమ్మల్లాంటివి ఉన్నాయి. వాటి ఆకారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గుండె కాస్త బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ బొమ్మల్ని చూడకుండా ఉంటే మంచిదండీ", చెప్పాడు యువకుల్లో మరొకడు.
"భగవంతుడా! ఏమిటీపరీక్ష?! నా ఇంటిని నువ్వే కాపాడాలి!", భయంతో వణుకుతూ కళ్ళు గట్టిగా మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఆనందరావు.
యువకులు చెప్పిన సంగతులు విన్న పార్వతికి మాత్రం మనసులో ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.
రమేష్ ని పక్కకు పిలిచి, "ఒరేయ్ రమేషూ! నాకేదో అనుమానంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి మన ఇంటి డాబా పైకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసి రా!", అంది పార్వతి.
రమేష్ కొంచెం ఆలోచించి, "సరేనమ్మా! చూసొస్తా", అంటూ ఇంటి వైపుకు ధైర్యంగా వెళ్ళాడు.
"ఆగరా! నేను కూడా నీకు తోడుగా వస్తా!", అంటూ రమేష్ వెంట వెళ్ళాడు ఆనందరావు.
గ్రామస్థులంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూడసాగారు.
ఒక పావుగంట గడిచాక రమేష్ తో కలిసి ఆనందరావు ఆయాసపడుతూ జనం దగ్గరకు వచ్చి, "కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అందరూ ప్రశాంతగా మీ మీ ఇళ్లకు వెళ్ళచ్చు", అని అన్నాడు.
"అసలేం జరిగింది ఆనందరావుగారూ? ఆ వచ్చినది గ్రహాంతరవాసులు కాదా??", అసహనంగా అడిగాడు రంగనాథం.
"గ్రహాంతరవాసులూ కాదూ! ఇంకేదో అనుకోని ఉపద్రవమూ కాదు! మా ఆవిడ డాబాపైన రాత్రిళ్ళు కాసేపు పని చేసుకోవాలని చెప్పి లైటు పెట్టమని అడిగింది. దానికోసం ఒక పైపు పెట్టి దాని చివర బల్బు పెట్టాను. వైరింగులో ఏదో తప్పు చేసినట్లున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి", అన్నాడు ఆనందరావు.
"వైరింగులో పొరపాటు కాదేమోనండీ! నిన్న గాలి దుమారం వచ్చింది. ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోయి, తేలికపాటి వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపోయాయ్. అక్కడక్కడా కరెంటు తీగలు మండిపడ్డాయ్. అలా ఏదో జరిగి మంట వచ్చుంటుంది", అన్నాడు మల్లేశం.
"మసి ఎందుకుందో విషయం తెలిసింది. మరి ఆ భయంకరమైన ఆకృతులు ఏమిటి సార్? కచ్చితంగా అవి మన భూమి మీద చేసిన బొమ్మలైతే కావు. మరవి ఎక్కడినుంచీ వచ్చుంటాయ్?”, ఆనందరావుని అడిగాడు ఒక పత్రికా విలేకరి.
"ఓ! అదా?! అదీ... మీకెలా చెప్పాలో తెలియట్లేదయ్యా! మా ఆవిడ గతంలో పట్నం వెళ్ళినప్పుడు కుండలూ, మట్టి బొమ్మలూ తయారు చేసే పాటరీ క్యాంపులో చేరింది. అక్కడ నేర్చుకున్న విద్యనుపయోగించి కొన్ని కళాకృతులు చేసే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని భయపెట్టిన ఆ అర్థంకాని బొమ్మలు అవే!", మొహమాటపడుతూ అసలు సంగతి చెప్పాడు ఆనందరావు. అక్కడున్నవారంతా ఒకరి చెవులొకరు కొరుక్కోవడం మొదలుపెట్టారు.
అంతలో రమేష్, "కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది! అక్కడ కొన్ని కుండ ముక్కలున్నాయి. మా అమ్మకు కుండ చెయ్యడం రాదు. అవేంటో, అసలు అవి ఎక్కడినుంచీ వచ్చాయో అర్థం కావట్లేదు", అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.
"నువ్వుండరా రమేషూ! ఆ కుండ గురించి నేను చెప్తా! మీ నాన్న లైటు పెట్టారు కానీ దాన్ని ఆర్పడానికి స్విచ్ పెట్టలేదు. మేము ఊళ్ళో లేనప్పుడు డాబామీద లైటు వెలుగుతూ ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయని నేనే ఆ బల్బుమీద పాత కుండొకటి బోర్లించిపెట్టా. ఇలా జరుగుతుందని అస్సలూహించలేదు", అంది పార్వతి.
ఆనందరావు, రమేష్ లు పార్వతి అన్నది విని అవాక్కయ్యారు. జరిగినదంతా గ్రహాంతరవాసుల పని కాదని తెలుసుకున్న గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంతవరకూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని వార్తలు సేకరిద్దామని వచ్చిన పత్రికా విలేకరులు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. డాబా శుభ్రం చేసుకునే పనిలో ఆనందంగా పడిపోయింది ఆనందరావు కుటుంబం.
అప్పుడొచ్చింది ఒక నిజమైన గ్రహాంతరవాసి! ఆనందరావు పడేసిన మట్టి బొమ్మలను రహస్యంగా తన గ్రహానికి పట్టుకెళ్ళడానికి.
*****
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
అమ్మ
![[Image: image-2025-06-19-093616571.png]](https://i.ibb.co/TMgmcsLc/image-2025-06-19-093616571.png)
రచన: డి. మెహబూబ్ బాషా
సేకరణ: కర్లపాలెం హనుమంత రావు
"నాన్నోయ్!"
"చెప్పు తల్లీ!"
"అమ్మ ఎక్కడి కెళ్ళింది?"
"వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది."
"అమ్మకు కూడా అమ్మ ఉందా?"
"నీకు వున్నట్టే అమ్మకూ ఓ అమ్మ ఉందమ్మా."
"ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది?"
"తన ఇంట్లో."
"ఆ ఇల్లు ఎక్కడ వుంది?"
"మన ఊరికి చాలా దూరం."
"మనం కూడా అక్కడికి వెళదాం నాన్నా!."
"ఆ ఊరు చాలా దూరం. మనం అంత దూరం వెళ్ళలేం."
"మరి అమ్మ అంత దూరం ఎలా వెళ్ళింది?"
"అమ్మకు దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు."
"అమ్మకు ఇచ్చిన శక్తిని దేవుడు మనకు ఎందుకు ఇవ్వలేదు?"
"దేవుడికి అమ్మ అంటే ఇష్టం."
"దేవుడికి నువ్వంటే ఇష్టం లేదా?"
"దేవుడికి మనుషులందరూ సమానమే అయినా పిల్లలకు జన్మ నిచ్చే తల్లులంటే ఎక్కువ ఇష్టం."
"ఎందుకలా?"
"ఎందుకంటే తొమ్మిది నెలలు పిల్లల్ని కడుపులో మోసి జన్మ నిస్తారు కాబట్టి."
"అమ్మ కూడా నన్ను తొమ్మిది నెలలు మోసిందా నాన్నా?"
"అవునమ్మా."
"ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోస్తున్నావు కదా."
"నేను మోసేది నా భుజాల పైన. నాకు నువ్వు బరువు అనిపిస్తే నిన్ను కిందికి దించుతాను. కాని అమ్మకు ఆ అవకాశం లేదు. నిన్ను తన కడుపులో మోసింది కనుక బరువు అనిపించినప్పుడు కిందికి దించే మార్గం లేదు. నువ్వు పుట్టేవరకు రాత్రీపగలు తొమ్మిది నెలల వరకు ఎన్ని ఇబ్బందులు కలిగినా సంతోషంగా నిన్ను మోసింది."
"మరి నన్ను అంత ఇష్టపడి మోసిన అమ్మ నన్ను వదిలి తన అమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా?"
"నీకు నీ అమ్మ పైన ప్రేమ వున్నట్టే నీ అమ్మకు కూడా తన తల్లిపైన ప్రేమ ఉంటుంది కదా. అందుకే ఆమె దగ్గరికి వెళ్ళింది."
"అమ్మ మన ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తుంది?"
"ఆ సంగతి ఆమె నాకు చెప్పలేదమ్మా."
"అమ్మకు ఫోన్ చేసి అడుగు నాన్నా."
"అక్కడికి ఫోన్ తగలదు. ఎందుకంటే నీ అమ్మ వున్న ఊరిలో టవర్లు లేవు."
"ఫోన్ తగలకపోతే అమ్మకి ఉత్తరం రాయి నాన్నా."
"అక్కడికి ఉత్తరాలు కూడా వెళ్ళవు తల్లీ."
"అలాగైతే మనమే అక్కడికి వెళదాం నాన్నా. అమ్మను చూడకుండా నేను ఉండలేను."
"అమ్మకు బదులు నేను వున్నాను కదమ్మా."
"నీతో పాటు నాకు అమ్మ కూడా కావాలి నాన్నా."
"నీకు అమ్మ లేని లోటు నేను తీరుస్తానమ్మా."
"కాని అందరు పిల్లలకి నాన్నలతో పాటు వాళ్ళ అమ్మలు కూడా వున్నారు కదా నాన్నా. నాకెందుకు అమ్మ లేదు?"
"నీకు అమ్మనీ, నాన్నని నేనే తల్లీ."
"అమ్మ అమ్మే అవుతుంది. నువ్వు అమ్మ ఎలా అవుతావు? నాకు నీతో పాటు అమ్మ కూడా కావాలి నాన్నా."
"అమ్మ పనులన్నీ నేనే చేస్తాను. ఇక అమ్మతో నీకేం పని?"
"నేను అమ్మతో ఆడుకుంటాను."
"అమ్మ అనుకొని నాతోనే ఆడుకో."
"అమ్మ నన్ను ఒడిలో పడుకోబెట్టుకొని కథలు చెప్పేది."
"నేను కూడా చందమామ కథలు చెబుతాను."
"అమ్మ నాకు రోజూ రాత్రి చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది."
"నేను కూడా అలాగే తినిపిస్తానమ్మా."
"అమ్మ జోలపాట పాడి నన్ను నిద్రపుచ్చేది."
"నేను కూడా అలాగే చేస్తాను తల్లీ."
"అయినా అమ్మ లాగ నువ్వు చెయ్యలేవు నాన్నా."
"అలా అనుకోవద్దు. ప్రతి బిడ్డకీ అమ్మ ప్రేమ కనిపిస్తుంది. కాని నాన్న ప్రేమ కనిపించదమ్మా."
"ఎందుకు కనిపించదు?"
"ఎందుకంటే నాన్న తన బిడ్డల పట్ల ప్రేమను ప్రదర్శించడు. మనసులోనే దాచుకుంటాడు. కాని అమ్మకు అలా దాచుకోవటం సాధ్యం కాదు. మనసులో వున్న మొత్తం ప్రేమను ఎప్పటికప్పుడు బయట పెడుతుంది. అమ్మ ప్రేమ జలపాతం లాంటిది. వుధృతంగా, ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. నాన్న ప్రేమ నది లాంటిది. మెల్లగా, ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కాని రెండిట్లో ఉండేది మమకారం అనే స్వచ్ఛమైన నీరే!"
"నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నాన్నా."
"నీది ఇంకా చిన్న వయసు కదమ్మా. నా మాటలు నీ చిట్టి బుర్రకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా ఎదగాలి."
"నేను ఎప్పుడు ఎదుగుతాను నాన్నా?"
"నీకు మీ అమ్మ వయసు వస్తే ఎదిగినట్టు లెక్క."
"అమ్మ వయసు నాకు ఎప్పుడు వస్తుంది?"
"నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ పెళ్ళై ఓ బిడ్డ పుట్టినప్పుడు నీకు అమ్మ వయసు వస్తుంది. అప్పుడు నా మాటలన్నీ నీకు అర్థమవుతాయి."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
"మళ్ళీ నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నాన్నా."
"చెప్పాను కదమ్మా. నువ్వు పెద్దయ్యాక అర్థమవుతాయని."
"కాని నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావనిపిస్తోంది."
"ఎందుకలా అనిపిస్తోంది?"
"మన పక్క ఇంట్లో వుండే చంటి వాళ్ళమ్మ కొన్ని రోజుల ముందు చంటిని తీసుకొని చంటి అమ్మమ్మ ఊరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కాని అమ్మ వెళ్ళి చాలా కాలమైంది. ఇంతవరకు తిరిగి రాలేదు. ఎందుకు రాలేదు? నిజం చెప్పు నాన్నా?"
"నేను నిజమే చెప్పాను తల్లీ. మీ అమ్మ తిరిగి రాకపోతే నేనేమి చెయ్యగలను?"
"చంటి వాళ్ళమ్మ చంటి వల్ల నాన్నతో కొట్లాడి వెళ్ళిందని చంటి చెప్పాడు. అమ్మ కూడా నీతో పోట్లాడి వెళ్ళిందా నాన్నా?"
"లేదమ్మా. నాతోనే కాదు, ఇంకెవరితోనూ పోట్లాడే అలవాటు మీ అమ్మకు లేదు."
"లేకపోతే నేను సతాయిస్తున్నానని నా పైన అలిగి అమ్మ తన అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా?"
"ఏ తల్లి కూడా తన పిల్లలపై అలగదు. మీ అమ్మ కూడా ఎప్పుడూ నీ పైన అలగలేదు తల్లీ."
"అలాగైతే నన్ను వదిలి అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా? చంటిని వాళ్ళమ్మ తీసుకు వెళ్ళినట్టు అమ్మ నన్ను ఎందుకు తన వెంట తీసుకెళ్ళలేదు? చెప్పు నాన్నా?"
"ఎందుకమ్మా, అమ్మ గురించి అంతగా ఆరాట పడుతున్నావ్? అమ్మకు బదులు నేనున్నాను. అమ్మలా నిన్ను ఎత్తుకు తిరుగుతున్నాను కదా."
"అమ్మలా ఎత్తుకోలేదు. అమ్మ నన్ను తన నడుంపై ఎత్తుకొనేది. నువ్వు భుజాల పైన ఎత్తుకున్నావ్. అమ్మలా ఎందుకు ఎత్తుకోలేదు?"
"అమ్మ తను చూసేదంతా నీకు కనపడాలని అలా ఎత్తుకొనేది. అయితే నాకు కనపడని ప్రపంచం కూడా నీకు కనపడాలని నిన్ను నా భుజాల పైకి ఎత్తుకున్నాను. మంచిదే కదా."
"మరి నీకు నా పైన అంతగా ప్రేమ ఉంటే అమ్మ గురించి ఎందుకు అబద్ధం చెబుతున్నావ్ నాన్నా?"
"నేను చెప్పింది నిజం కాకపోవచ్చు. కాని అబద్ధం కూడా కాదు."
"మళ్ళీ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావ్."
"నీకు అర్థం చేసుకొనే వయసు వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెబుతాను, సరేనా?"
" వద్దు నాన్నా. నాకు ఇప్పుడే అన్ని విషయాలు చెప్పెయ్."
"అలా మారాం చెయ్యకూడదు తల్లీ. నాన్న చెప్పింది వినాలి."
"అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా. అమ్మ గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెబుతున్నావ్. నిజం చెప్పటం లేదు."
"నువ్వింకా చిన్న పిల్లవి. కొన్ని విషయాలు నీకు అర్థం కావు."
"అలా అనుకోవద్దు. నాకు బాగానే అర్థమవుతుంది. నాకు రోజూ రాత్రి కలలో అమ్మ కనిపిస్తుంది. పడవలో వెళ్ళిపోతూ నాకు టాటా చెబుతుంది. అమ్మ నిజంగానే పడవలో వెళ్ళిపోయిందా నాన్నా?"
"భగవంతుడా, నీకు అలాంటి కల వస్తోందని నాకు తెలీదు. నువ్వు ఎప్పుడూ ఆ కల గురించి నాకు చెప్పలేదు."
"ఇప్పుడు చెబుతున్నాను కదా. అమ్మ నిజంగా పడవలో తన అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా?"
"నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా?"
"చెప్పు నాన్నా, రోజూ అమ్మ గురించే ఆలోచిస్తున్నాను. అమ్మను చూడకుండా నేను ఉండలేను."
"చెబుతానమ్మా. ఇంత చిన్న వయసులోనే నీకు దేవుడు ఇంతటి ఆలోచనా శక్తి ఇచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. బహుశా గుండెల నిండా తల్లి పట్ల వున్న నీ ప్రేమను చూసి దేవుడు కూడా చలించినట్టున్నాడు. నీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెబుతా, విను. ఏడాది క్రితం మా పొలంలో ఎరువులు వేయటానికి నేను ఎద్దుల బండిలో వెళుతుంటే నాకు తోడుగా మీ అమ్మ కూడా వస్తానని చెప్పి నిన్ను ఎత్తుకొని బండెక్కింది. మేం పొలంలో ఎరువు చల్లాక భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గాక మేం బండిలో ఇంటికి బయలుదేరాం. దారి మధ్యలో ఓ వాగు వుధృతంగా పారుతోంది. అయినా ధైర్యం చేసి బండి ముందుకు నడిపాను. అవతలి ఒడ్డు సమీపించే వరకు బండి బాగానే వెళ్ళింది. ఒడ్డు నాలుగు అడుగుల దూరంలో ఉండగా ఓ ఎద్దు తూలి పడటంతో బండి నీటిలో మునగసాగింది.
నేను వరదలోనే కిందికి దిగి ఎద్దును లేపటానికి ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు. ఇక మేం వరదలో కొట్టుకు పోవటం ఖాయమని అర్థమయ్యాక నీ అమ్మ కనీసం నిన్నైనా కాపాడాలనుకొని నిన్ను ఒడ్డు పైకి విసిరేసింది. మరుక్షణం బండి బోల్తా పడటంతో మీ అమ్మ వరదలో కొట్టుకు పోయింది. నా కాలు బండి చక్రంలో ఎరుక్కోవటంతో నేను వరదలో కొట్టుకు పోలేదు కాని నీటిలో మునిగి ఉక్కిరి బిక్కిరి అయ్యాను. చివరికి ఎలాగోలా కాలు బయటికి తీసి వరదలో ఈదటానికి ప్రయత్నించాను. అదృష్టవశాత్తు ఓ చోట ఒడ్డు పై నుంచి వేళ్ళాడుతున్న ఓ చెట్టు కొమ్మ చేతికి అందటంతో అతి కష్టంగా నేను ఒడ్డుకి చేరుకోగాలిగాను. కాని బండి చక్రంలో ఇరుక్కున్న నా కాలి ఎముక విరగటం వల్ల నడవలేకపోయాను.
అయినా కుంటుకుంటూ నీ అమ్మ నిన్ను విసిరేసిన చోటికి చేరుకున్నాను. ఒడ్డు పక్కనే వున్న పొదల్లో చిక్కుకొని ఏడుస్తున్న నిన్ను చూసి నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నిన్ను ఎత్తుకొని కొంత దూరం నడిచి స్పృహ తప్పి పడిపోయాను. రాత్రంతా ఇద్దరం అక్కడే వున్నాం. తెల్లవారాక ఊరి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు. కాని సకాలంలో వైద్యం అందకపోవటం వల్ల డాక్టర్లు నా కాలు కొంత భాగం తీసేశారు. నీ అమ్మ వరదలో చాలా దూరం కొట్టుకుపోయి శవంగా తేలింది. ఆ తల్లి సరైన సమయంలో నిన్ను ఒడ్డు పైకి విసిరేసి ఉండకపోతే నువ్వు కూడా చనిపోయేదానివి. నీ అమ్మ నీకు జన్మ నివ్వటమే కాదమ్మా, పునర్జన్మను కూడా ఇచ్చింది."
(వుధృతంగా ప్రవహిస్తున్న ఓ వాగులో చిక్కుకున్న ట్రాక్టర్ లో వున్న ఓ తల్లి తను నీటిలో మునిగిపోయే ముందు తన పసిబిడ్డను ఒడ్డుపైకి విసిరి కాపాడటానికి విఫల యత్నం చేసింది. ఆ హృదయ విదారక దృశ్యాన్ని కళ్ళారా చూశాక మదిలో మెదిలిన భవొద్వేగాలకు అక్షర రూపమే ఈ చిన్న కథ)
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
రహస్య స్నేహితుడు!
రచన: ఉండవిల్లి.ఎమ్
నది ఒడ్డున నేను౼
నన్ను చూడగానే నది ఉరకలేస్తూ పరుగెడుతూ ఒడ్డుకంటా వచ్చి నా కాళ్ళను తడిమి తడిమి నిమురుతుంది. నామీద దీనికెందుకింత పిచ్చి ప్రేమ, గల గలా నవ్వుతూ తరగలు తరగలుగా కదలి మెదిలి ఏదో చెప్పాలని చూస్తుంటుంది.
నేను నది ఒడ్డున నడుస్తూ వెళుతుంటాను. ఏదో ఒక అలికిడి చేస్తూ, పరవళ్లు తొక్కుతూ నాతోపాటే వస్తుంది. నడుస్తూ నడుస్తూ నేనెళ్లిపోతాను. నా ఆనవాళ్లు కూడా కన్పించవు. మరెప్పటికీ తిరిగి రావేమో!
అప్పుడు ఇదేం చేస్తుంది?నా జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ నిరీక్షణలతో, ఆ జన్మాఅంతం ఎదురుచూస్తుందా? జీవితకాలం నిలబడలేని అనుబంధాల్ని చూసి గుడ్డిగా కేరింతలు కొట్టడం.. నాకు నదిని చూసి జాలేసింది. మెయిల్ లోని ఈ మెసేజ్ చూసాక నాకు మనస్సంతా అదోలా అయిపోయింది. అసలు ఎప్పటికీ అర్ధం కాడు విశ్వం. ఎవరెస్టు శిఖరం లాంటి వాడతను. అతడొక స్పందన, ఇన్స్పిరేషన్. నిజంగానే! మాయం అయిపోయాడు. అతన్నుండి మెయిల్స్ రావడం మానేసాయి. మరేవిధమైన క్లూస్ లేవు.
వెబ్ సైటులో మొదట పరిచయమైనపుడు నీ గురించి చెప్పు అన్నప్పుడు "నాపేరు విశ్వం, నాదొక ప్రైవేట్ కంపెనీ, పెళ్లయింది, పిల్లలు. అప్పుడప్పుడు ఏమీ తోచక గదిలో ఒంటరిగా వెబ్ సైటులోకి వస్తాను. చాటింగ్ చేస్తుంటాను. ఈరోజు నీతో చేస్తున్నట్లు" అన్నాడు.
"నీకు పెళ్ళయిందా?"ఆశ్చర్యంగా అడిగాను.
"అయింది. అయితే ఫ్రెండ్షిప్ చేయవా? అయినా షార్ట్ టర్మ్ చేయాలనా, లాంగ్ టర్మ్ చేయాలనా? చాలా మంది ఇలాగ అడుగుతుంటారు. అందుకే నేనూ అడిగాను" అన్నాడు విశ్వం.
"అలా అనికాదు. నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నాకు ఇంటెలిజెంట్ కావాలి" అన్నాను.
"అయితే నన్నొదిలేయ్, నేను ఇంటెలిజెంట్ కాదు" అన్నాడు. ◆ ◆ ◆కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే మెయిల్ చేసాను.
ఈలోపు విశ్వం నుంచి ఏమీ రాలేదు. సహజంగా ఈలోపు అబ్బాయిలు, అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాలుగా మెసేజెస్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇతను అలా అన్పించలేదు. కంటిన్యూ చేసి చూడాలని అన్పించింది.
చాలా సెంటిమెంటల్ అతను. సామాజిక దృక్పధం ఉన్న మనిషిలా అన్పించాడు. రాను రాను చాలా విషయాల్లో నాలెడ్జి ఉన్న మనిషిలా కన్పించాడు.
ఒకరోజు నేనడిగాను"లైఫ్ లో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?ఎవర్నైనా ప్రేమించావా?" అని.
"నా లైఫ్ అన్ని దిశలకి స్ప్రెడ్ అయిపోయింది. నేనెరని ప్రేమించలేదు. సమయం లేదు. ఎవర్నైనా ప్రేమించాలని అనుకున్నా ఒకలాంటి భయం. ఎవర్నీ ప్రేమించలేకపోయాను. ఇప్పుడు ప్రేమించలేనంత బిజీబిజీగా జీవితం పరుగెడుతోంది. " అన్నాడు.
"అయితే నీకు పెళ్లి కాలేదన్నమాట" అని అడిగాను.
"అయింది"
"ఎవర్నీ ప్రేమించలేకపోతున్నానన్నావు?"అన్నాను.
"కానీ, ఒకామె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ మాట పెళ్లయ్యాక చెప్పింది. బంధువుల అమ్మాయే. " అన్నాడు.
"ఓహ్.. నువ్వు ఆశ్చర్యంగా ఉన్నావే" అని, మళ్ళీ నేనే చెప్పాను. "నేనొక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా జీనియస్, పాటలు బాగా పాడేవాడు. ఆల్బమ్ రిలీజ్ చేసాడు. కంప్యూటర్స్ లో టాప్. నన్ను బాగా ప్రేమించేవాడు. " అన్నాను.
"అయితే, నాతో చాటింగులెందుకు?" అతనడిగాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,747 in 1,941 posts
Likes Given: 5,703
Joined: Nov 2018
Reputation:
680
"అతను చనిపోయి మూడు సంవత్సరాలైంది. అలాంటి వ్యక్తి కోసమే వెబ్ సైట్ లలో వెదుకుతున్నాను. ఎవరూ కన్పించడం లేదు. " అని చెప్పా.
"చూడు నీల, ఈ ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది. కళల్లో రాణించిన వాడు డబ్బు సంపాదించలేడు, కీర్తి వస్తుంది. డబ్బు సంపాదించే వాడు కళల్లో రాణించలేడు. ఎక్కడైనా రేర్ గా జరుగుతుంది ఎవరైనా ఒకరి విషయంలో.. "
"అవును నిజమే, నేను కూడా చాలా మందిని చూసాను. నీ మాటల్ని ఒప్పుకుంటున్నాను"అన్నాను.
"నువ్వు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావు విశ్వం?"అని మరోసారి అడిగాను.
"డబ్బు సంపాదిస్తూ పోవడం నాకిష్టం లేదు. పబ్లిక్ లోకి పూర్తిగా వెళ్ళిపోయి సేవ చేయాలనేది నా జీవితపు లక్ష్యం. ఏమవుతుందో తెలియదు. ◆ ◆ ◆చాలా రోజుల తర్వాత..
"నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు. నేనేమో ఎలా సంపాదించాలో తెలియక చదివిన సైన్సు డిగ్రీలు ఉద్యోగానికి తప్ప జీవితంలో కావాల్సినంత ధనం సమకూరడానికి ఉపయోగం లేకుండా పోయింది. ఏదైనా ఉపాయం చెప్పు" అన్నాను.
"ఒక సంపన్న కుటుంబం లోంచి అట్టడుగు స్థాయికి దిగజారిపోయి ఒంటరిగా నేను ఒక్కోమెట్టు ఎక్కుతూ పోరాటం చేస్తూ పైకొస్తున్నవాడిని, నేనెప్పుడూ జీవితాన్ని పోరాటం చేసే గెలవమని చెప్తాను. పోరాడి పోరాడి గెలవడమే నా లక్ష్యం. నీ తెలివితేటలు చాటింగులో కాదు, నీ జీవితంలో ఉపయోగించు" అన్నాడు.
అతని మాటలు నచ్చేవి నాకు. ఏ విషయం లోనైనా కమర్షియల్ గా అతను ఆలోచించలేడు. అన్నిట్లోనూ మానవతావాదం చొచ్చుకుపోయి ఉంటుంది.
"ఏమిటి నిన్న మెయిల్ చేయలేదు. ఏం చేస్తున్నావు?"అని అడిగాను.
"పుస్తకం చదువుతున్నాను" అన్నాడు.
" ఏ పుస్తకం?"
"హస్తరేఖలు"
"ఓహ్.. నువ్వు అస్త్రాలజీ చెప్తావా! ?"
"చెప్పను, చదువుతాను నాలెడ్జి కోసం"
"ప్లీజ్ నాకోసం చెప్పవా?"అని అడిగాను.
"నాకు డీప్ గా తెలీదు" అన్నాడు.
"నీకు తెలిసినంతే చెప్పు" అన్నాను.
బతిమాలాక"నీ ఎడమ అరచేయి ప్రింటు పంపించు" అన్నాడు. మూడు ప్రింట్లు పంపించాను.
"నీ చేతిలో రవిరేఖ, ఆయుస్సురేఖ మీద నుండి పైవరకు వెళ్ళింది. ఏవైనా కళలో గొప్పగా రాణిస్తావు. నువ్వు ఎక్కడ పనిచేసినా నీ మాటే పైనుంటుంది. ఎడ్యుకేషన్ బావుంటుంది"అన్నాడు.
"నీ నక్షత్రం ఏమిటి?" అని అడిగాడు.
"చిత్త" అని చెప్పాను.
"అయితే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత బావుంటుంది. చేతిలో రవిరేఖ కూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నీ డెవెలప్మెంట్ చూపిస్తుంది. నీ దాంపత్య జీవితం సరిగా ఉండదు. నిత్యం దైవాన్ని ఆరాధించే వారికి ఏవిధమైన దోషాలు ఉండవు. నీది గుండ్రటి ముఖం" అన్నాడు.
చాలా కరెక్టుగా చెప్పాడు.
"ఇంకా చెప్పు" అన్నాను.
"అంత డీప్ గా నాకు తెలీదు" అన్నాడు.
అతని మీద నాకు గురి కుదిరింది. నాకొక ఇల్లు కావాలని వెతుకుతుంటే నాకొక మంచి సలహా ఇచ్చి సేవ్ చేసాడు. బ్యాంకింగ్ గురించి చాల విషయాలు చెప్పాడు. అర్ధమవుతున్న కొద్దీ అతనొక నిధిలా కన్పించాడు. అన్ని విషయాల్లోనూ అతని సలహాలు తీసుకోవడం అలవాటైంది. సైకాలజీని అతను పూర్తిగా రీసెర్చ్ చేసిన వాడిలా మాట్లాడేవాడు.
"ఎప్పుడూ ఇలాంటి విషయాలేనా ముద్ధపప్పులాగా?ఇంకా ఏమైనా హాట్ గా చెప్పు" అన్నానోకసారి.
"మీరున్న ఇంటికి నైరుతి మూల ద్వారం ఉన్నట్లు అన్పిస్తుంది. ముందు అది చెప్పు! " అన్నాడు.
"అవునని" చెప్పాను.
ఈఇంట్లోకి మీరు వచ్చిన దగ్గర్నుండీ, నీకు ఇలా చాటింగులు చేసి మగవాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది అవునా?" అన్నాడు.
"అవును నిజమే " అన్నాను.
ఈ ఇంటికి వచ్చి తొమ్మిది నెలలు అయింది. అంతక ముందు ఇలా చాటింగులు చేయాలనిపించేది కాదు. ఇలాంటి ఆలోచన్లు కూడా చిరాగ్గా ఉండేవి. ఇక్కడికొచ్చాక ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని చెప్పాను అతనితో.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|