Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆమె అక్కడ నుంచి నిష్క్రమించి తన తాత అయిన హోత్రవాహన రాజర్షి చెంతకు చేరింది. తనకు భీష్ముడి వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పింది. హోత్రవాహనుడు తన మనుమరాలికు జరిగిన అన్యాయానికి ఉగ్రుడై, తపోశక్తితో ఒక గులాబీమాలను సృష్టించి, అంబకు ఇచ్చి "అంబా! ఈమాల ఎవడు మెడలో ధరిస్తాడో, వాడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు. కావున నీవు ఎవరైనా వీరుడి మెడలో వేసి యుద్ధానికి పురిగొల్పు. విజయం నీదే!" అని దీవించి పంపాడు హోత్రవాహనుడు.
మాలను గైకొన్న అంబ దేశదేశాల రాజులను కలిసి విషయాన్ని వివరించి ఈమాలను ధరించి భీష్ముడిని సంహరించమని అర్థించింది. అందులకు ఏ రాజు సాహసించక నిరాకరించారు. చివరకు ద్రుపద మహారాజును వేడుకుంది.
"జగదేకవీరుడైన భీష్ముడితో యుద్ధంలో గెలువడం అసాధ్యం" అని చెప్పి అంబను పంపి వేశాడు.
అంబ నిరాశ చెంది గులాబీ మాలను కోట గుమ్మానికి తగిలించి అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ భీష్ముడిని వధించడం కోసం ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేసింది.
ఈశ్వరుడు ప్రత్యక్షమై "భీష్ముడిని సంహరించడం ఈ జన్మలో నీ వలన సాధ్యపడదు. వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి నీ కోరిక నెరవేర్చుకుంటావు. " అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆనంతరం అంబ చితి పేర్చుకుని ఆత్మాహుతి చేసుకుంది.
అటు కొంత కాలానికి ద్రుపదుడు తనకు సంతానం లేని కారణంగా బిడ్డల కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై " ద్రుపదా! నీ భార్యకు తొలి కాన్పులో ఆడబిడ్డ పుడుతుంది. ఆడబిడ్డను మగబిడ్డగా పెంచు. కాలక్రమంలో నీ రాకుమార్తెకు పురుషత్వం సంక్రమిస్తుంది. కావున సకల విద్యలు నేర్పు. వీరుడిగా తీర్చిదిద్దు. మరికొంత కాలానికి నీకు ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ పుడుతారు. "
వరమిచ్చాడు శివుడు.
అచిరకాలంలోనే ఆడబిడ్డ జన్మించింది. శిఖండి అని పేరు పెట్టి, మగ దుస్తులు వేసి పెంచాడు. ద్రోణుడి దగ్గరకు పంపి సమస్త విద్యలు నేర్పించాడు. శస్త్రాస్త్రాలు అధ్యయనం చేయించాడు. వీరాధివీరుడిగా మలిచాడు. ఒకనాడు శిఖండి కోట గుమ్మానికి వ్రేలాడుతున్న గులాబీమాలను మెడలో వేసుకొనగా ద్రుపదుడు చూసి తీవ్రంగా మందలిస్తాడు.
శిఖండికి యుక్త వయసు రాగానే, పురుషుడిగా మారక మునుపే దశార్ణ దేశపు రాజు హేమవర్మ కుమార్తె యువరాణితో వివాహం జరిపించాడు. ఆనాటి రాత్రి శోభన సమయంలో యువరాణి శిఖండి స్త్రీ అని గుర్తించి, కోపంతో బాధతో తండ్రి దగ్గరకు పోతుంది. తండ్రి, జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతాడు.
శిఖండి ఏమి చేయడానికి పాలుపోక చింతాక్రాంతయై అడవిలోకి పోయింది. అడవిలో స్థూలకర్ణుడనే యక్షుడు చాల కాలంగా అక్కడే నివాసం ఉంటున్నాడు. స్థూలకర్ణుడికి భయపడి ఆ సమీపములోకి ఎవరు పోరు. యక్షుడు ఏమైనా చేయనీ అని యక్షుని ఆశ్రమ సమీపంలోనికి పోతుంది శిఖండి.
స్థూలకర్ణుడు శిఖండిని చూసి " కుమారి! నీకు భయం లేదా? ఇక్కడిదాకా వచ్చావు " అడుగుతాడు.
శిఖండి "చావడానికే వచ్చాను" అంటూ తాను ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదీ.. తన కథనంతా చెబుతుంది. శిఖండిపై జాలిపడి స్థూలకర్ణుడు "నా పురుషత్వాన్ని పది రోజుల పాటు నీకు ఇస్తాను. నీ స్త్రీత్వం నాకు ఇవ్వు. సమస్యలన్నీ పరిష్కరించుకున్నాక తిరిగి వచ్చి నా పురుషత్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వం నీవు తీసుకో" అంటాడు.
అందులకు శిఖండి అంగీకరించి కృతజ్ఞతలు తెలుపుకొని పురుషత్వాన్ని పొంది కోటకు పోతుంది. తనకు పురుషత్వం ప్రాప్తించిన విషయం తల్లిదండ్రులకు తెలుపుతుంది. వారు మహానందపడతారు.
తన కూతురికి అన్యాయం జరిగిందన్న ఆవేశంతో, ససైన్యంతో ద్రుపదుడిపై దండెత్తి వస్తున్న దశార్ణ దేశ ప్రభువైన హేమవర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతాడు శిఖండి. ఉగ్రుడైన హేమవర్మకు తన పురుషత్వాన్ని నిరూపించుకుంటాడు శిఖండి.
హేమవర్మ "తన తొందరపాటు చర్యకు క్షమించమ" ని ద్రుపదుణ్ణి , శిఖండిని కోరుతాడు. హేమవర్మకు, అతని సైన్యానికి వారం రోజుల పాటు గానాభజాలతో ఆతిథ్యమిచ్చి సంతృప్తిగా పంపుతాడు ద్రుపదుడు.
కుబేరుడు స్థూలకర్ణుడు ఉన్న అడవి గుండా పుష్పవిమానములో పోతూ స్థూలకర్ణుడి ఆశ్రమంలో దిగి స్థూలకర్ణుడిని పిలుస్తాడు. స్థూలకర్ణుడు స్త్రీరూపం నందు ఉన్నందున సిగ్గుతో ఇంటి బయటికి రాలేడు. తన సహచరుడిని పంపి స్థూలకర్ణుడిని బయటికి రప్పించాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీరూపంలో ఉండడం చూసి కోపించి "ఇక నుండి స్త్రీగానే ఉండు" అని శపించాడు.
స్థూలకర్ణుడు కుబేరుడి పాదాలపై బడి వేడుకొనగా "స్థూలకర్ణా! ఇది దైవ సంకల్పంతో జరిగినది. ద్రుపదుడు కుమారుడి కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై "ద్రుపదా! కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు కాలక్రమంలో పురుషత్వం సంక్రమిస్తుంది” అని వరమిచ్చాడు. అది నీ వలన జరిగింది. కావున ఇలా జరగడం దైవ సంకల్పం. శిఖండి మరణించగానే నీ పురుషత్వం నీకు వస్తుంది" అని తెలిపి కుబేరుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు.
పది దినముల తరువాత శిఖండి స్థూలకర్ణుడి దగ్గరకు వచ్చి "మహాత్మా! నీ పురుషత్వం తీసుకుని నా స్త్రీత్వం నాకు ఇవ్వు. నీ సహాయానికి కృతజ్ఞుడను మహానుభావా!" అంటాడు.
స్థూలకర్ణుడు శిఖండికి జరిగిందంతా చెప్పి " నా పురుషత్వం జీవితాంతం నీవే ఉంచుకో" అంటాడు. శిఖండి అందులకు సంతషించి మహానందంతో స్వగృహానికి పోతాడు.
కాలాంతరంలో ద్రుపదునికి ఒక కుమారుడు దృష్టద్యుమ్నుడు, ఒక కుమార్తె ద్రౌపది జన్మిస్తారు. కాలక్రమంలో ద్రౌపది పాండవులను పెళ్లాడుతుంది. దృష్టద్యుమ్నుడు కురుక్షేత్రం యుద్ధంలో పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడై యుద్ధభూమిలో సైన్యాన్ని నడుపుతాడు.
కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండి పాల్గొని పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పాండవుల సేనాధిపతులలో ఒకడిగా వ్యవహరిస్తాడు. యుద్ధంలో కౌరవుల వీరులను అనేకులను సంహరిస్తాడు. కృపాచార్యుని ఓడిస్తాడు. శిఖండి అశ్వద్ధామతో యుద్ధంలో తలపడినప్పుడు ఇద్దరూ సమాన స్థాయిలో యుద్ధం చేస్తారు. ఇద్దరూ గాయపడతారు.
కౌరవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడై సమరం సలుపు తున్నప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో "సుయోధనా! యుద్ధంలో నా వలన నీకు మేలు జరగాలంటే యుద్ధం భూమిలో శిఖండి నాకు ఎదురు పడకుండా చూడండి. నేను ఆడవారితోను, మధ్యలో పురుషత్వం సంక్రమించిన వారితోనూ యుద్ధం చేయను. నేను వారిని చూడగానే అస్త్ర సన్యాసం చేస్తాను. శిఖండి అంగనాపూర్వుడు. కాబట్టి జాగ్రత్త పడండి. " అని చెబుతాడు.
భీష్ముడి మరణ రహస్యం భీష్ముడి ద్వారా తెలుసుకున్న పాండవులు యుద్ధం పదవరోజున భీష్ముడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగగా వారి మధ్యకు శిఖండి వచ్చి భీష్ముడిని ఎదుర్కుంటాడు. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. శిఖండి భీష్ముడి మీదకు తొలి బాణం ప్రయోగించాడు. ఆ తరువాత అర్జునుడు భీష్మునిపై అనేక బాణాలను శరపరంపరగా సంధించాడు. ఆ శరాఘాతాలకు భీష్ముడు నేలకు ఒరిగాడు. భీష్ముడు నేలపై పడకుండా అర్జునుడు శరములతో అంపశయ్య అమర్చుతాడు. ఆ అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వరకు విశ్రాంతి తీసుకుని ఉత్తమ లోకాలకు వెళ్లిపోతాడు భీష్మ పితామహుడు. శిఖండి భీష్ముడిని సంహరిస్తానన్న శపథం నెరవేరింది.
పద్దెనిమిదవ రోజు కౌరవుల పక్షాన అందరూ చనిపోయి అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలి ఉంటారు. రణభూమిలో, చీకటిలో, మృత కళేబరాల మధ్య దుర్యోధనుడు తోడలు విరిగి దీనావస్థలో పడి ఉండడం చూస్తారు ముగ్గురు. అశ్వద్ధామ సార్వభౌముడిని అట్లా దీనస్థితిలో చూడగానే ఉద్వేగానికి గురై " రాజా ఏదైనా కోరిక ఉంటే చెప్పు నెరవేరుస్తాను. " అంటాడు స్థిరచిత్తుడై.
"అశ్వద్ధామా! పంచ పాండవులను సంహరించడమే నా కోరిక, అశ్వత్థామా! నిన్ను సర్వ సైన్యాధిపతిని చేస్తున్నాను. వారిని సంహరించి నా కోరిక తీర్చు!" అంటాడు దుర్యోధనుడు మరణిస్తూ..
"ఎలాగైనా పాండవులను సంహరించి దుర్యోధనుడి చివరి కోరిక తీర్చాలి" అనుకుంటాడు అశ్వద్ధామ. కృతవర్మ కృపాచార్యులతో చర్చిస్తాడు.
"ఈరాత్రి సమయంలో పాండవులు గాడ నిద్రలో ఉంటారు. ఇప్పుడైతే వధించడం సులువు” అని తలచి అశ్వద్ధామ కృతవర్మను, కృపాచార్యుడిని వెంటబెట్టుకొని పాండవుల శిబిరాలలోకి ప్రవేశించి, నిద్రిస్తున్న ఉపపాండవులను పాండవులే అని భ్రమపడి వధిస్తాడు. ప్రక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. అదే శిబిరంలో నిద్రిస్తున్న శిఖండి అలికిడికి మేల్కొని ఆయుధం అందుకొని అశ్వద్ధామను ఎదుర్కొంటాడు. ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఉండడం వలన అశ్వద్ధామ ఖడ్గానికి బలై మరణిస్తాడు శిఖండి.
శిఖండి మరణించడంతో అతని లోని పురుషత్వం తొలగి, స్థూలకర్ణుడిని చేరుతుంది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కార్తవీర్యార్జునుడి కథ
[font=var(--ricos-font-family,unset)]![[Image: image-2025-04-22-135237473.png]](https://i.ibb.co/TBm7fYzV/image-2025-04-22-135237473.png)
[/font]రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కార్తవీర్యార్జునుడు త్రేతాయుగానికి చెందిన రాజు షట్చక్రవర్తులలో ఒకడు. గొప్ప చక్రవర్తి. వీరాధి వీరుడు. సత్ప్రవర్తనుడు. ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించిన పాలకుడు.
యదువు పెద్దకుమారుడు సహస్రజిత్, చిన్నకుమారుడు క్రోష్టుడు. బలరామకృష్ణులు, యాదవులందరూ ఈక్రోష్టుడి వంశంవారే. సహస్రజిత్ కొడుకు శతాజిత్, అతని కొడుకు హెహయుడు. ఇతని వలనే హైహయవంశం ఏర్పడింది. హైహయవంశంలో మహిష్మవంతుడు, కృతవీర్యుడు, కార్తావీర్యార్జునుడు గొప్ప చివరి రాజులు. పరశురాముడు కార్తావీర్యార్జునుడిని అతని కుమారులను సంహరించడం వలన హైహయవంశం అంతమైంది.
హైహయ వంశీయుడైన కృతవీర్యుడు వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్న అరూప దేశాన్ని మహిష్మతిపురంను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆమహారాజు కుమారుడే కార్తవీర్యార్జునుడు. పుట్టుకతోనే శాపవశాన చేతులు లేకుండా పుట్టాడు వీరి గురువు గర్గమహర్షి.
కొంత కాలానికి కృతవీర్యుడు వయసు పైబడి వార్డక్యంతో మరణించాడు. ప్రజలు కార్తవీర్యార్జునుడిని రాజై రాజ్యాన్ని పరిపాలించమని కోరారు.
"నేను వికలాంగుడిని. రాజ్యాన్ని ఎలా పాలించగలను. నాకు రాజ్యం వలదు. రాజ భోగములు వలదు" అని వైరాగ్య భావనతో ప్రజల కోరికను తిరస్కరించాడు కార్తవీర్యార్జునుడు.
గురువు గర్గమహర్షి " కార్తవీర్యార్జునా! నీకు ఈ అవిటితనం పోవాలంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఆయన కృపను, కరుణను పొందితే ఆ మహాత్ముడి కటాక్షం వలన నీకు వికలాంగత్వం పోయి తేజోవంతమైన మహావీరుడవుతావు. అయితే ఆయన అనుగ్రహం అంత సులువు కాదు. ఆయన చూడడానికి అసహ్యంగా కనబడుతాడు. కుక్కలతో ఆడుకుంటూ ఒకసారి, మధువు సేవిస్తూ ఒకసారి, బంగి తాగుతూ ఒకసారి, స్త్రీలతో కలిసి చిందులేస్తూ ఒకసారి కనిపిస్తాడు. అవేవి పట్టించుకోకుండా ఆయనను సేవిస్తే కరుణించి వరాలు వొసగి అనుగ్రహిస్తాడు. " అని తెలిపి దత్తాత్రేయుడి సన్నిధికి కార్తవీర్యార్జునుడిని పంపుతాడు.
గురువు మాట తలదాల్చి శ్రద్ధాభక్తులను హృదయంలో నిలుపుకొని దత్తాత్రేయుడి ఆశ్రమానికి బయలుదేరుతాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు ఎన్ని వన్నెలు చిన్నెలు చూపిన, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన చరణాలు పట్టుకొని ఇడువకుండా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు కార్తవీర్యార్జునుడు. ఎట్టకేలకు కార్తవీర్యార్జునుడి అకుంఠిత దీక్షకు, అమేయ భక్తి ప్రపత్తులకు అనుగ్రహించి, నిజరూపం దాల్చి వరములు కోరుకోమన్నాడు దత్తాత్రేయుడు.
కార్తవీర్యార్జునుడు " స్వామి! దయామయా! కరుణాసాగరా! ఇన్నాళ్లకు నాపై కృప కల్గిందా దేవా!
పరందామా! నాకు నాలుగు వరములు అనుగ్రహించండి పరమాత్మా!" అంటూ అనేక విధాలుగా వేడుకున్నాడు.
"కోరుకో! కార్తవీర్యార్జునా! నీకు వరములను ప్రసాదిస్తాను" అని అభయం ఇచ్చాడు దత్తాత్రేయుడు.
"1. నాకు వెయ్యి చేతులు కావలెను. యుద్ధభూమిలో నేను వెయ్యి చేతులతో కనిపించవలెను. వెయ్యి చేతులతో ఆయుధాలు ప్రయోగించ గలగవలెను. ఇంట్లో మామూలుగా కనిపించవలెను
2. ఈ భూమండలాంతటినీ జయించి సామర్థ్యంతో పాలించవలెను
3. నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలెను.
4. నేను యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ నా కంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలెను. ఈ వరములను దయతో ప్రసాదించండి ప్రభు!" కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు
"తదాస్తు! నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తున్నాను. ఉత్తమ పరిపాలకుడవై ప్రజలను ఏలి ప్రసిద్ధి గాంచు కార్తావీర్యార్జునా!" దీవించి దత్తాత్రేయుడు వరములను వొసగినాడు. తక్షణం కార్తావీర్యార్జునుడికి సహస్ర బాహువులు, దివ్య తేజస్సు, అద్భుత లావణ్య రూపం, సకలాయుధ సహితంగా స్వర్ణరథం సిద్ధించింది.
అంతట దత్తాత్రేయుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అనేక స్తోత్రంలతో కీర్తించి, సెలవు గైకొని తన రాజ్యంనకు పోయాడు కార్తావీర్యార్జునుడు. రాజ్యాభిషేక్తుడై, అశ్వమేధ యాగం చేసి, వరబలంతో భూమండలాంతటినీ జయించి, సమస్త జీవులపై అదుపు అధికారం సాధించి ధర్మధీక్షతో, న్యాయ బద్దంగా పాలించసాగాడు కార్తావీర్యార్జునుడు.
కార్తావీర్యార్జునుడు ఒకసారి తన దేవేరులతో కలిసి నర్మదా నదిలో క్రీడిస్తూ, నర్మదా నది ప్రవాహానికి తన సహస్ర బాహువులను అడ్డుగా పెట్టి నదీ గమనాన్ని నిలువరించాడు. నదీ ప్రక్కగా ప్రవహిచి సమీపములో ఉన్న రావణుని సైనిక శిబిరాల మీదుగా ప్రవహించింది. రావణుడు కోపించి కార్తావీర్యార్జునుడిపైకి యుద్ధానికి దండెత్తి వచ్చాడు. కార్తావీర్యార్జునుడు రావణుడిని యుద్దంలో ఓడించి చెరశాలలో బంధించాడు. రావణుడి తాత పులస్త్యుడు కార్తావీర్యార్జునుడి దగ్గరికి వచ్చి రావణుడిని విడిచి పెట్టుమని కోరగా రావణుడిని బంధవిముక్తుని చేసి సగౌరవంగా సాగనంపాడు.
కార్తావీర్యార్జునుడి పాలనను కిన్నెర కింపురుష గంధర్వులు ప్రశంసించారు. సకల లోకాలలో కీర్తించ బడినాడు. దానితో అతని లోనికి గర్వం అహంకారం అహంభావం ప్రవేశించి విర్రవీగాడు. వరబలంతో బలగర్వంతో దేవలోకాలను జయించాడు. ఇంద్రుడిని కూడ పీడించాడు కార్తావీర్యార్జునుడు
ఒకనాడు అగ్ని దేవుడు కార్తావీర్యార్జునుడి దగ్గరకు వచ్చి "రాజా! నాకు ఆకలిగా ఉంది. ఆహారం కావాలి. నీవు రక్షణగా నిలబడితే ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నా ఆకలి తీర్చుకుంటాను" అర్థిస్తూ అడిగాడు.
మదోన్మత్తుడై ఉన్న కార్తావీర్యార్జునుడు " ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నీ ఆకలి తీర్చుకో అగ్నిబట్టారకా! " అంటూ అనుమతినిచ్చి అండగా నిలిచాడు కార్తావీర్యార్జునుడు.
అగ్ని గిరినగరారణ్యాన్ని యథేచ్ఛగా స్వాహా చేస్తూ అడవిలోని పల్లెలను, ఆశ్రమాలను కూడా కాల్చివేశాడు. ఆ అరణ్యంలోనే ఉన్న వశిష్టుని ఆశ్రమాన్ని కూడా దహనం చేశాడు. దానితో వశిష్టుడు కోపించి రక్షణగా నిలిచిన రాజును "కార్తావీర్యార్జునా! దురాంకారముతో, మదాంభావంతో చెలరేగిపోతున్నావు! నీ అంతం సమీపించింది. నిన్ను ఒక ముని కుమారుడు నీ సహస్ర బాహువులను తెగ నరికి నీ మస్తకాన్ని త్రుంచుతాడు" అని శపించాడు వశిష్ట మహర్షి. కార్తావీర్యార్జునుడు బలమదంతో శాపాన్ని లెక్క చేయలేదు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
దేవతలందరూ వైకుంఠం చేరి కార్తావీర్యార్జునుడి ఆగడాలు శృతి మించి, మితిమీరాయని, అతని పీడనం నుండి తమను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారికి అభయం ఇస్తూ
" కార్తావీర్యార్జునుడిని సంహరించే సమయం ఆసన్నమైంది. నేను పరశు రామావతారం ఎత్తి హతమార్చుతాను. కార్తావీర్యార్జునుడు నా సుదర్శన చక్రాయుధమే. ఒకనాడు సుదర్శనుడు ' నా వలనే నీవు ఎందరినో రాక్షసులను, లోకకంటకులను సంహరించావు. నేను లేకుంటే నీవు చంపలేక పోయేవాడివి' అని మిడిసిపడినాడు. అట్లైన కార్తావీర్యార్జునుడిగా నీవు భూలోకమునందు జన్మించు! నేను పరశురాముడిగా అవతారం దాల్చి నీతో తలపడతాను. అప్పుడు నీవు లేకున్నా నేను జయించలేనేమో నీవే చూస్తావు" అని సంఘర్షించాము. ఆకారణంగానే సుదర్శనుడు భూమిపై జన్మించాడు" అని గతాన్ని చెప్పి దేవతలను పంపించాడు శ్రీమహావిష్ణువు.
అనంతరం విష్ణుమూర్తి భూలోకంలో పరశురాముడిగా జమదగ్ని రేణుకా ముని దంపతులకు జన్మించి, పెరిగి పెద్ద అవుతాడు. సకల విద్యలు, శాస్త్రాస్రాలు అభ్యసించి మహావీరుడుగా ఎదుగుతాడు పరశురాముడు
చాల కాలం తరువాత ఒకనాడు అడవి క్రూర మృగాలు గ్రామాలపై బడి బాధిస్తున్నాయి. వాటిని వేటాడి మిమ్మల్ని వాటి నుండి రక్షించండి అన్న ప్రజలు విన్నపము మీద వేటకు బయలుదేరుతాడు కార్తావీర్యార్జునుడు. దినమంతా క్రూర జంతువులను వేటాడి, అక్కడే వున్న జమదగ్నిమహర్షిని దర్శించడానికి ఆశ్రమానికి తన సైన్యంతో సహా వెళుతాడు కార్తావీర్యార్జునుడు.
జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇంట్లోలేని
సమయంలో జమదగ్ని మహర్షి, ఆశ్రమవాసులు రాజును, సైన్యాన్ని ఆదరించి, సేదదీర్చి, రాజుకు సైనికులకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించి సంతృప్తి పరుస్తారు. రాజు - ఇంతమంది సైనికులకు భోజనాలు పెట్టిన ఆశ్రమవాసుల్ని చూసి విస్మయవిబ్రాంతుడైతాడు.
కార్తావీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సమీపించి "మహర్షి! ఇంత పెద్ద సైన్యానికి ఎలా భోజనం ఏర్పాటు చేశారు. మీ దగ్గర అంత ధాన్యం లేదు కదా! ఎలా సాధ్యం అయింది. " అడిగాడు.
" మహారాజా! ఇది నా గొప్పతనం కాదు. నా దగ్గర దైవ ప్రసాదితమైన కామదేనువు సంతతికి చెందిన ఒక గోవు ఉన్నది. దాని మహిమ వలననే మీకు ఆతిథ్యం ఇయ్యడం సాధ్యమైంది. " వివరించాడు జమదగ్ని మహర్షి.
" ఇలాంటివి రాజు దగ్గర వుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయ గలడు. కాబట్టి మహర్షి! ఈ గోవును నాకు ఇవ్వండి. బదులుగా మీకు ఏమి కావాలంటే అవి ఇస్తాను. భూమి, ధాన్యం, ధనం, బంగారం ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఆవును మాత్రం నాకివ్వండి. మీరివ్వకపోతే బలవంతంగానైనా తీసుకపోవలసి వస్తుంది. కాబట్టి మీరే సగౌరవంగా ఇచ్చి పంపుతే గౌరవంగా ఉంటుంది" నయానా భయానా చెప్పాడు కార్తావీర్యార్జునుడు. జమదగ్ని మహర్షి నిర్ద్వంద్వంగా నిరాకరించాడు.
కార్తావీర్యార్జునుడు బలవంతంగా గోవును తోలుకొని తన రాజధాని మహిష్మతి నగరాన్ని చేరుతాడు. ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడై మహిష్మతి నగరంపై దండెత్తి, భీకరాకృతి దాల్చి కార్తావీర్యార్జునుడి సమస్త సైన్యాన్ని సంహరించాడు. కార్తావీర్యార్జునుడితో జరిగిన మహభయంకర యుద్ధంలో అతడి సహస్ర బాహువులను, తలను ఖండిస్తాడు పరశురాముడు.
"అసువులు బాసిన కార్తావీర్యార్జునుడి పార్థీవ దేహం నుండి సుదర్శనుడు బయటికి వచ్చి పరశురాముడికి నమస్కరించి "నా గర్వం, అహంకారం, అహంభావం తొలగి పోయాయి ప్రభు. విశ్వప్రభువైన నీతోనే గర్వించి ఆత్మ స్థుతి చేసుకున్నాను. నా గొప్పదనం నీ వలన సంప్రాప్తించినదే అని గుర్తించలేని అజ్ఞానిని. క్షమించు ప్రభు!" పరశురామావతారమూర్తిని స్థుతించి, వైకుంఠం జేరి, చక్రాయుధ రూపు ధరించి శ్రీ మహావిష్ణు దివ్యాస్తంను అలంకరించాడు సుదర్శనుడు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఏకలవ్యుడి కథ
విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]కాశీవరపు వెంకటసుబ్బయ్య
యాదవ వంశంలో అంధక శాఖకు చెందిన రాజు శూరసేనుడు. శూరసేనుడు, మారిష దంపతులకు తొమ్మిది మంది కుమారులు, ఐదు మంది కుమార్తెలు. శూరసేనుడు మధరను పరిపాలిస్తుండేవాడు. కొంతకాలానికి శూరసేనుడు తన బావైన ఉగ్రసేనుడికి మధర పాలనా బాధ్యతలు అప్పగించి ఆవులు పెంపకం వృత్తి చేపడతాడు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. కంసుడి చెల్లెలు దేవకి. శూరసేనుడి కొడుకులలో పెద్దవాడు వాసుదేవుడుకి కంసుడు తన చెల్లలైన దేవకిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు.
ఈ వాసుదేవుడి దేవకి పుత్రులే బలరామకృష్ణులు. ఇక శూరసేనుడి కుమార్తెలలో శ్రుతదేవ ఒకతి. మరో కమార్తె వృంద. ఈమెను కుంతిభోజుడు పెంచడం వలన కుంతి అని పేరు వచ్చింది. ఈమె కుమారులే పాండవులు. కృష్ణుడి మేనత్తలు ఐదుగురు. అందులో కుంతి కుమారులు తప్ప మిగతా నలుగురు మేనత్తల కుమారులు కృష్ణుడికి శత్రువులు కావడం చిత్రమైన విశేషం.
శూరసేనుడు శ్రుతదేవని సూతరాజైన కేకయదేశరాజు కుంగేకయేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కేకయరాజు సుక్షత్రియుడు కాదు. సూతకులస్తుడు. క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వారిని సూతులు అంటారు. సూతులకు క్షత్రియులకు సత్సంబంధాలు ఉండేవి.
క్షత్రియులు సూత కులస్తులను తమతో సమానంగా గౌరవించేవారు. పిల్లను ఇచ్చేవారు. పిల్లను చేసుకొనేవారు. సూతులు రథకారులుగా, సైన్యాధిపతులుగా, మంత్రులుగా, రాజ్యాలు ఏలే రాజులుగా ఉండేవారు. కుంతి తొలి చూలు కర్ణుడు కూడా సూతుల ఇంట పెరిగి అంగ రాజ్యాన్ని పాలించే రాజు అవుతాడు. ఒక సూతకన్యను, ఒక క్షత్రియకన్యను వివాహం చేసుకొన్నాడు.
అలాగే కేకయ రాజ్యాన్ని పాలించే రాజు కేకయుడు సూతులందరికి నాయకుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మాళవి. ఈమె కుమారుడు బాణుడు అను పేరుతో పుట్టి కీచకుడుగా ప్రసిద్ధి గాంచాడు. రెండవ భార్య శ్రుతదేవ. ఈమె కుమార్తె చిత్ర అను పేరుతో పుట్టి సుధేష్ణగా పెరిగి విరాటరాజును పెళ్లాడుతుంది.
శ్రుతదేవకు కేకయరాజైన కుంగేకయేశ్వరుడికి పుట్టినవాడు ఏకలవ్యుడు. ఇతనికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శత్రుఘ్నుడు. ఇతడు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవించాయి. పూర్వం రాజులకు కొడుకు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవిస్తే కుల క్షయము, వంశ నాశనము జరుగుతుందనీ నమ్మకం బలంగా ఉండేది.
ఏకలవ్యుడు పుట్టినరోజు కూడా పురోహితులు ఈ బాలుడి వలన వంశనాశనం జరుగుతుందని చెప్పుతారు. దానితో బాలునిపై ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న దేశశ్రేయస్సు కోసం, వంశక్షేమం కోసం మమకారాన్ని వదులుకుని నట్టడివిలో విడిచిపెట్టి వస్తారు. ఏకలవ్యుడి పుట్టుకను బట్టి కృష్ణుడికి బావమరిది వరస, పాండవులకు అన్నదమ్ముల వరుస అవుతాడు.
దుతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా అనేక దుశ్శకునాలు కలిగాయి. అప్పుడు కూడా పురోహితులు. అతని వల్ల కలిగే కష్టనష్టాలు, దూషణ నాశనాలు వివరించి చెప్పి అతన్ని అడవుల్లో విడిచి రమ్మంటారు. అందుకు దుతరాష్ట్రుడు మొదటి కొడుకని పుత్రవ్యామోహముతో అడవిలో విడిచి రావడానికి అంగీకరించడు.
ఏకలవ్యుడిని అడివిలో విడిచిపెట్టి వచ్చాక ఆటవిక తెగల రాజైన అరణ్యధన్వుడు అతని భార్య సులేఖలకు దొరుకాడు. బాలుడిని పరమానందంగా తీసుకుని పోయి ఏకలవ్యుడు అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అరణ్యధన్వుడు ఏకలవ్యుడికి స్వయంగా విలు విద్యను నేర్పి వీరుడిగా తీర్చిదిద్దుతాడు.
ఏకలవ్యుడు అడివికి తిరుగులేని యువరాజు అయ్యాడు. అటవిక జాతులన్నిటినీ ఒక చత్రం క్రిందికి తెచ్చాడు. అందరికి చదువు, యుద్ధ విద్యలు నేర్చుకునే ఏర్పాటు చేశాడు. పక్షులు, జంతువులు, కౄరమృగాలు అన్నింటనీ అదుపాజ్ఝలో ఉంచుకున్నాడు. అటవీ తెగల ప్రజలు సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతలు ఏర్పాటు చేసి అమ్ముకునే వీలు కల్పించాడు. అడవిలో ఉండే మైదాన ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి ప్రజల చేత వ్యవసాయం చేయించాడు.
అటవికుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించి పోకుండా అటవికుల నృత్యం, అటవికుల సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకోవడం కోసం, ప్రదర్శించడం కోసం ఒక సాంస్కృతిక భవనం నిర్మించి ప్రోత్సహిస్తాడు. అటవీ జనానికి ఇష్టుడు, ఆప్తుడు అయ్యాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడంటే తెగల ప్రజలందరికీ అపారమైన ప్రేమ అభిమానం.
అరణ్యధన్వుడు అటవి తెగలకు రాజే కాదు మగద చక్రవర్తి అయిన జరాసంధుడికి సామంతుడు, సర్వసైన్యాధ్యక్షుడు కూడా. అరణ్యధన్వుడి చెల్లెలు కాంతార. కాంతార కూతురు వనజ.
వనజ అడివికే అందం, చూడు చక్కని రూపవతి, అడవి మల్లె తీగలా ఉంటుంది. ఆమెకు ఆరడుగుల ఎత్తు ఉండి, అపురూపమైన అందం కలిగిన, బలాడ్యుడైన ఏకలవ్యుడంటే అమితమైన ప్రేమ, ప్రాణాధికం. అతడిని చూడందే ప్రొద్దు పోదు. ఆమెకు అతడిదే లోకం. ఏకలవ్యుడికి కూడా వనజంటే వల్లమాలిన అభిమానం,
కొండలు కోనలు, పర్వత సానువులు, లోయలు, జలపాతాలు, సెలయేర్లు, పచ్చిక బయల్లు అన్నీ వీరి విహారస్థలాలే. కోతికొమ్మచ్చులు, జలకాలాటలు, వేట, ఏనుగుల సవారీలు, గుర్రపు స్వారీలు వీరి విహారాలలో భాగాలు. పొదరిల్లులు, గుహలు వీరి విశ్రాంతి ప్రదేశాలు. కనులు పండుగగా ఉండే ఈ జంటకు తెగల పెద్దలు వివాహం జరిపించాలని ఎప్పుడో నిర్ణయించారు.
ఓ దినం అరణ్యధన్వుడు ఏకలవ్యుడిని పిలిచి " నాయనా ఏకలవ్యా! నాకు వార్డక్యం పైబడుతున్నది. నా బాధ్యతలు నీవు చేపట్టవలసి ఉన్నది. దానికి ముందు నీవు సద్గురువును ఆశ్రయించి మరిన్ని గొప్ప యుద్ధ విద్యలను అభ్యసించి తిరుగులేని మహావీరుడుగా తిరిగి రావాలి" అని కర్తవ్యాన్ని సూచించాడు.
తండ్రి మాట అనుసరించి ఏకలవ్యుడు విశేష ప్రతిభావంతమైన విద్యల కోసం ద్రోణాచార్యుడి దగ్గరకు పోయి తనను శిష్యుడిగా చేర్చుకోని క్షాత్ర విద్యలను నేర్పమని కోరుతాడు.
ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి ముఖ వర్చస్సును తీక్షణంగా గమనించి ‘ఇతనికి క్రోదావేషాలు అధికమని, భవిష్యత్తులో దుష్టులతో కలుస్తాడని దుర్మార్గులకు సహాయంగా నిలుస్తా’డని తన యోగశక్తితో గ్రహించి "నేను క్షత్రియులకు తప్ప ఇతరులకు శస్త్రాస్త్రాలు నేర్పను " అని చెప్పి వెనక్కి పంపి వేస్తాడు.
తిరిగి వచ్చిన ఏకలవ్యుడు సమున్నతమైన స్థానంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని బంక మట్టితో తయారు చేసుకుని, ఆ విగ్రహమే గురువుగా భావించి, ఆ విగ్రహం ముందు శస్త్రాస్త్రాలను దీక్షతో అధ్యయనం చేసి అభ్యాసం చేస్తాడు. కఠోరమైన సాధనతో అస్త్రప్రయోగ ఉపసంహరణాది సమస్తంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు ఏకలవ్యుడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అస్త్రవేగంపై నియంత్రణ సాధిస్తాడు. శబ్ధభేధి విద్యను అభ్యసించి కైవసం చేసుకుంటాడు. విల్లు విద్యలో అర్జునుడికి సరిసాటిగా ఎదుగుతాడు.
ఒకరోజు ఏకలవ్యుడుండే అడివికి ద్రోణాచార్యుడు తన శిష్యులైన కౌరవులు పాండవులతో వేటకుక్కలతో వేటకు వస్తాడు. ఒక కుక్క ఏకలవ్యుడు విలువిద్య సాధన చేస్తున్న వైపుగా వస్తుంది. ఏకలవ్యుడి విచిత్ర వేషధారణ చూసి మొరిగి చికాగు పరుస్తుంది. ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూసేంతలో కుక్క నోటిలో ఏడు బాణాలు దెబ్బ తగలకుండా రక్తం రాకుండా వెస్తాడు. కుక్క నోటినిండా బాణాలతో ద్రోణుడి దగ్గరకు పోతుంది..
‘ఇంతటి నైపుణ్యంగా బాణాలు ప్రయోగించిన విలుకాడు ఎవరూ?’ అనుకుంటూ ద్రోణుడు శిష్యులతో కలిసి కుక్క వెంట ఏకలవ్యుడిని సమీపించాడు. గురువు ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతించాడు. ద్రోణాచార్యుడిని ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, మెడలో పూలమాల వేసి, పాదక్షాళన జేసీ, పాదాలపై పూలు జల్లి, నీళ్ళు తలపై చల్లుకుంటాడు. ఈ కార్యక్రమంలో తెగల ప్రజలందరూ అత్యుత్సాహంగా పాల్గొన్నారు.
సంతుష్టుడైన ద్రోణుడు, "ఏకలవ్యా! నీవు అస్త్రవిద్యలను అభ్యసించడానికి నావద్దకు వచ్చినప్పుడు నేను నేర్పును అన్నాను కదా! మరి ఈ విలువిద్యా నైపుణ్యం ఎలా సాధించావూ?" అని ఏకలవ్యుడిని అడిగాడు.
"గురువర్యా! మీరే నా గురువులు. మీరు కాదన్నాక నేను తిరిగి వచ్చి మీ మూర్తిని విగ్రహంగా మొలుచుకొని, ఆ విగ్రహమే త్రికరణ శుద్ధిగా గురువుగా భావించి, తదేక దీక్షతో విలువిద్య సాధన చేశాను. తమరి దయవల్ల ధనుర్విద్యా ప్రపూర్ణుడను అయ్యాను గురుదేవా!" నిష్కపటంగా విన్నవించాడు.
ద్రోణుడు ఆలోచించాడు. ’కుక్క మొరిగిందనే చిన్న కారణానికే కోపంతో దాని నోరును బాణాలతో నింపాడు అంటే ఇతనికి కోపము అదుపులో ఉండదని, ఇలాంటి వ్యక్తి దగ్గర ఇంతటి గొప్ప విలువిద్యలు ఉంటే భవిష్యత్తులో ఇతని వలన సమాజానికి, దేశానికి హాని జరగవచ్చ’ని మనసులో అనుకున్నాడు.
" ఏకలవ్యా! నీవు నన్ను గురువుగా భావిస్తున్నావు కదా! మరి గురుదక్షిణ ఇవ్వలేదేమీ?" అడిగాడు ద్రోణుడు కపటం కడుపు దాచుకుని.
"గురువర్యా! ఏమి కావాలనో నిర్మొహమాటంగా సెలవియ్యండి గురుదేవా! నిరభ్యంతరంగా నిస్సంకోచంగా సమర్పించుకుంటాను" విన్నవించాడు నిష్కల్మషమైన హృదయంతో ఏకలవ్యుడు.
"అయితే ఏకలవ్యా! నీ కుడిచెయ్యి బొటనవ్రేలు ఇమ్ము" అంటాడు నిర్దయుడైన ద్రోణుడు.
ద్రోణుడి వాక్కులు విన్న ప్రజలు హాహాకారాలు చేశారు. “అన్యాయం అక్రమం దుర్మార్గం" అని విలపించారు. వనజ బోరున గుండెలవిసేలా ఏర్చింది.
అరణ్యధన్వుడు " ఏమయ్యా బాపడూ! నువ్వేమైనా విద్య నేర్పావా! గురు దక్షిణ ఎలా అడుగుతున్నావు, ఏ అర్హత ఉంది నీకు. ఎవరైనా ధన కనక వాస్తు వాహనాలు గురుదక్షిణగా అడుగుతారు. నీవేంటి బొటనవ్రేలు అడుగుతున్నావు? అంటే మావాడు విలువిద్యలో రాణించ కూడదనే కుబుద్ధితో అడుగుతున్నావు.
మావాళ్ళు ఎదగ కూడదని, మిమ్మల్ని మించి పోకూడదని కుట్రతో, అగ్రవర్ణ దురహంకారంతో అడుగుతున్నావు. నీ కోరికలో న్యాయం లేదు కాబట్టి గురుదక్షిణ ఇవ్వడు పో!" అంటూ గద్దించాడు.
"ఆమాటే ఏకలవ్యుడిని చెప్పమనండి. ఇక్కడి నుండి తక్షణమే వెళ్లి పోతాను" అన్నాడు ద్రోణుడు ఏకలవ్యుడి వాగ్దానంపై నమ్మకంతో.
ఏకలవ్యుడు " నాన్నా! మాట తప్పడం వీర లక్షణం కాదు. మాట తప్పి చరిత్రహీనుడను కాలేను. ఎంత కష్టమైన ఎంత నష్టమైనా వాగ్ధానం నెరవేర్చుకోవడమే నీతివంతుని విధానం. కాబట్టి వాగ్ధానం నెరవేర్చడంలో అడ్డు తగలవద్దు నాన్నా!” అని చెప్పి తన నడుముకు ఉన్న సురకత్తిని తీసుకుని కుడిచేతి బొటన వ్రేలిని తటాలున ఖండించి ద్రోణుడి పాదాలు చెంత పెట్టాడు. ఆ చర్యతో అక్కడ ఉన్న అందరూ దిగ్భ్రాంతి కి గురైనారు. ద్రోణుడు కూడా చలించి పోయాడు.
"శభాష్ మహావీరా! నీ యశస్సు దిగంతాలకు వ్యాపిస్తుంది. నీ కీర్తి ఆచంద్రార్కం నిలుస్తుంది. నీను సమస్త లోకాలు ప్రశంసిస్తాయి. నీకు శుభం కలుగు గాక" అని పలికి ద్రోణుడు తన శిష్యులతో కలిసి వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడి జనమంతా శోక సముద్రంలో మునిగి పోయారు.
ఆ తరువాత కూడా ఏకలవ్యుడి అస్త్రవిద్యా సాధన నిరాటంకంగా సాగింది. అటు కొంత కాలానికి వనజకు ఏకలవ్యుడికి వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు అరణ్యధన్వుడు. ఆ వివాహానికి మగధ చక్రవర్తి జరాసంధుడు, అతని స్నేహితుడు చఏదఇరఆజ్య భూపాలుడైన శిశుపాలుడు, పూండ్రవాసుదేవుడు, సామంతరాజులు, మిత్రరాజులు పాల్గొన్నారు. ఏకలవ్యుడి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. కాలక్రమంలో ఆ దంపతులకు ఇద్దరు మగ సంతానం కలిగింది.
జరాసంధుడు చేసిన ఒకానొక యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా పాల్గొని ఆ యుద్ధంలో మరణించాడు అరణ్యధన్వుడు. తండ్రి మరణాంతరం ఆటవిక తెగల, జాతుల నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది ఏకలవ్యుడికి. తండ్రి వారసత్వంగా వచ్చిన మగధ సామ్రాజ్య సైన్యాధ్యక్ష పదవిని కూడా స్వీకరించాల్సి వచ్చింది. ద్రోణుడు తలంచి నట్లుగానే దుష్టులైన జరాసంధుడితోను, శిశుపాలుడితోను, పౌండ్రక వాసుదేవుడితోను కలిశాడు ఏకలవ్యుడు.
శిశుపాలుడి తరుపున భీష్మకునితో రాయబారం నెరపి రుక్మిణీని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు ఏకలవ్యుడు. మగద రాజ్య సైన్యం, చేది రాజ్య సైన్యం, పుండ్ర రాజ్య సైన్యమును కలిపి మహా సైన్యం తయారు చేశాడు ఏకలవ్యుడు. కృష్ణుడిపై జరాసంధుడు చేసిన పద్దెనిమిది దండయాత్రలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ముందుండి సైన్యాన్ని నడిపించాడు. శస్త్రాస్త్రాల ప్రయోగంలోను యుద్దపాటవంలోను నైపుణ్యాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందుతాడు ఏకలవ్యుడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
గదా యుద్ధంలో మహా పండితుడైన బలరామునితో గదా యుద్ధంలో పాల్గొని బలరామునితో "ఏకలవ్యా! నీవు గొప్ప వీరుడివి" అని పొగర్తలు అందుకున్నాడు.
"మహా వీరా! దైవాంశ సంభూతా! నీతో గదా యుద్ధంలో తలపడడం వల్ల నేను గొప్ప అదృష్టవంతుడినయాను దేవా!" అనుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు ఏకలవ్యుడు.
జరాసంధుడు కృష్ణుడిపై చేసిన చివరి దండయాత్రలో కృష్ణుడితో ఏకలవ్యుడు ద్వంద్వ యుద్దములో పాల్గొని కృష్ణుడి చేతిలో మరణిస్తాడు.
మరణిస్తూ, "శ్రీకృష్ణదేవ! నీ చేతిలో మరణించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ధన్యమైంది. నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి స్వామీ" అంటూ కృష్ణపరమాత్మను వేడుకుంటాడు ఏకలవ్యుడు.
"ఏకలవ్యా! నీవు నీతివంతుడివి. నిష్కల్మషమైన జీవితం నీది, నిర్మలమైన మనసు నీది. అయితే దుష్టుల సహవాసం చేశావు. దుర్మార్గుల వైపు యుద్ధం చేశావు. అందుకే ఇలా మరణించవలసి వచ్చింది. నీకు అరణ్యధన్వుడు తండ్రి కాదు. నా మేనత్త శ్రుతదేవకు కేకయరాజుకు పుట్టినవాడివి. నాకు మేనత్త కొడుకువి.
నువ్వు పుట్టినప్పుడు అపశకునాలు సంభవించాయని, నీ వలన వంశనాశనం జరుగుతుందని అడవిలో విడిచి పెట్టారు. అరణ్యధన్వుడు నిన్ను చేరదీసి పెంచుకున్నాడు. " అని ఏకలవ్యుడి జన్మరహస్యం తెలిపాడు కృష్ణుడు.
"పరమాత్మ! నా జన్మ పవిత్రమైనది. దేవా! లోకాపాలకా! నన్ను నీలో కలుపుకుని నాకు ముక్తి ప్రసాదించు స్వామి" ప్రార్థించాడు ఏకలవ్యుడు.
"లేదు ఏకలవ్యా! నీవు ఇంకొక జన్మ ఎత్తవలసి ఉంది. నేర్పని విద్యకు అన్యాయంగా గురుదక్షిణగా బొటనవ్రేలు కోరినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి కదా! శేషం ఉండకూడదు. ద్రుపదుడు ద్రోణుడిని సంహరించే కుమారుడి కోసం, అర్జునుడిని వివాహం చేసుకోనే కూతురు కోసం చేస్తున్న యజ్ఞగుండం నుండి ఆయుధ సహితంగా, సశరీరంతో, నవయవ్వనంతో, ధృష్టద్యుమ్నుడు అను పేరుతో నీవునూ, ద్రౌపది ఆవిర్భవిస్తారు.
రాబోయే కురు పాండవ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల సైన్యాధిపతిగా సైన్యాన్ని రణరంగంలో నడిపిస్తావు. ఎందరో వీరులను ఓడిస్తావు. ద్రోణుడిని సంహరిస్తావు. పద్దెనిమిది దినములు జరుగు యుద్ధంలో చివరి వరకు ఉంటావు.
తన తండ్రి ద్రోణుడిని చంపిన కోపముతో నిద్రిస్తున్న నిన్ను అశ్వద్ధామ సంహరిస్తాడు. అక్కడితో జన్మ పరంపరల నుండి నీకు విముక్తి కలిగి వైకుంఠంలో నా దగ్గరకు వస్తావు. " అని భవిష్యత్తు ఆచరణను వివరిస్తాడు శ్రీకృష్ణుడు.
"ఈ సమస్త సృష్టిని నడిపించేవాడివి. నీ సృష్టిని నీ ఇష్టం వచ్చినట్లు నడిపించుకో ప్రభు! నీ ఆజ్ఞా బద్ధులం మేము. " భక్తిప్రపత్తులతో నమస్కరించి కన్ను మూశాడు ఏకలవ్యుడు.
ఏకలవ్యుడి తరువాత అతని పెద్ద కుమారుడు కేతుమాన్ అరణ్య రాజ్యానికి రాజవుతాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసి భీముడి చేతిలో మరణిస్తాడు. యుద్దానంతరం ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగానికి సంబంధించిన గుర్రం అరణ్య రాజ్యంలో ప్రవేశించినప్పుడు అశ్వరక్షకుడైన అర్జునుడిని ఏకలవ్యుడి చిన్న కుమారుడు ఎదిరించి ఓడిపోయి, అర్జునుడికి లొంగిపోయాడు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఇది పౌరాణిక కథ కాదు, జానపదం
పొలిమేర - పార్ట్ 1
[font=var(--ricos-font-family,unset)]![[Image: image-2025-05-05-171553712.png]](https://i.ibb.co/vxzqcc43/image-2025-05-05-171553712.png)
[font=var(--ricos-font-family,unset)]'[/font]పొలిమేర పార్ట్[font=var(--ricos-font-family,unset)] 1/2' [/font]తెలుగు కథ[/font]
రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]కాశీవరపు వెంకటసుబ్బయ్య
రాయలసీమలోని రెండు గ్రామాలు అనిమెల, దద్దనాల.
చాలా కాలం క్రితం అనిమెల గ్రామంలో జాతర జరిపి, వేట ఇచ్చిన జంతువు తాలూకు రక్తాన్ని అన్నంలో కలిపి గ్రామ శివారులో, పొలాల్లో జల్లుతారు.
దీన్నే పొలి అంటారు.
దద్దానాల గ్రామం వాళ్ళు ఆ పొలిని ఒంటికి అంటించుకుని తమ గ్రామ సరిహద్దుల్లోకి వెళతారు. దీన్నే పొలిని ఎత్తుకొని వెళ్ళడమంటారు.
అప్పటినుండి అనిమెల గ్రామంలో కరువుకాటకాలు మొదలయ్యాయని ఆ గ్రామస్థులు భావిస్తారు. అది మూఢ నమ్మకమని చెప్పినా వినరు. దద్దానాల గ్రామం నుండి పొలిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి ఆ పనికి సుంకన్నను పంపుతారు.
ఈ ప్రయత్నంలో ఏం జరిగిందో రచయిత కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు రాయలసీమ మాండలికంలో ఉద్విగ్నభరితంగా రచించారు. ఇక కథలోకి వెళదాం.
ఒరేయ్య! సుంకన్నా! ప్యాటకు పొయి గొడ్లకు తౌడు చెనిక్కాయచెక్క త్యాపోరాబ్బి! పచ్చిమ్యాత యాడా చేలల్లో ల్యాకపోయె. ఆటి మోగాన అయన్నా బేచ్చే ఇన్ని పాలిచ్చాయి. ఈకరువు కాలంలో అయ్యే మనకు ఆదరువు. బెర్రీన (తొందరగా) పోయిరాపో నాయిన! ఇంగో మాట. ఆ జమడక్కు పిల్లోడు మార్కట్టులో కనపడ్తే ఇత్తనాల లెక్కడుగు. పోయినేడు వానలు పడ్తే చేలల్లో ఇత్తు కుందామని ఇత్తనం గింజలు తెచ్చుకొంటిమి. వానలు పడకపోయె. ఇత్తనాలు మిగిలిపోయె.
జమ్మడక్కు పిల్లోడు ఆమనికి లెక్కిచ్చానని ఇత్తనాల గింజలు తీస్కపోయి వోల్ల చేలల్లో ఇత్తుకొని యేడాది కావచ్చాన్యా లెక్కైతే ఇంగా ఇయ్యకపోయె. ఇబ్బుడన్నా ఇచ్చాడేమో అడిగి తీస్కరాపో! ఈ యేడన్నా వానలు కురుచ్చే ఇత్తనం ఇత్తుకుందాం. గ్నాపకంగా అడుగి రప్పిన (త్వరగా) i ఎనక్కి తిర్కొని రాపో పాపోడా!" సుంకన్న అమ్మ తిరిపాలమ్మ నిరాస నిండిన గొంతుతో చెప్పుతాంది కొడుకుతో.
"పోయేచ్చగాని యనుములకు జొన్నచొప్పా, వరిచెత్తా, చెనిక్కాయకట్టె, పెసరపొట్టు రొంతరొంత వుంది. గాట్లో యేయ్యి. ఎద్దులకు జొన్నబియ్యం కడుగునీళ్ళు తాపి గాటికాడ కట్టేయ్. అయి గుడకా తింటయ్!" అన్సెప్పి ఎగాసగా పడి ఊరి నడుమ వున్న రాగిమానుకాడికి వచ్చినాడు సుంకన్న.
ఆడ పిచ్చయ్య తిప్పిరెడ్డి మరికొందరు ప్యాట (ప్రొద్దుటూరు)కు పోను ఆటో కోసరం ఎదురు సూచ్చా రాగిచెట్టు అరుగుమీద కుచ్చోండరు.
"ఏమోయ్ సుంకన్నా! నువ్వు గుడకా ప్యాటకు వచ్చాండవా?" పిచ్చయ్య పలకరించినాడు.
"ఔను మామా! బొత్తిగా పసులకు తిండిలేదు తౌడూ గానుగ చెక్కా తెచ్చామని ప్యాటకు పోతాండ మామా! పొలాల్లో యాడ సూసిన పచ్చగడ్డి మొలక మొల్చక పోయె. పచ్చిమ్యాత ల్యాకపోతే పసులెట్టా పాలిచ్చాయి. పాలీయకపొతే మనకెట్లా గడుచ్చాది. ఈగడ్డు పరిచితి నుంచి యెట్టా బయటపడాలో తెలిడం ల్యా. ఏం తిప్పిరెడ్డి మామా! ఊరక కుచ్చోనుండావ్! నువ్వన్నా రోంత దోవ చెప్పు రాదు!" సుంకన్న బాదంతా ఒలకబోసినాడు.
"సూచ్చాండవ్ కదోయ్! వాతావర్నం! మనం మోరలు పైకెత్తి ఎంత మోత్తుకున్నా! దేవుడు కనికరించడోయ్! మూడేండ్లాయ వానలు పడక. ఏరు పారక. చెరువుకు నీళ్ళు రాక. చేలల్లో ఊపచెత్త కుడక మొల్చక. చేలన్నీ వరుపొచ్చి బిసాంబరంగా (శూన్యంగా) కన్పడ్తాండయ్! జనం బతికి బట్టగట్టడం కట్టమేనోయ్!" తిప్పిరెడ్డి యాట్టపడుతా అన్యాడు.
పక్కనే కుచ్చున్న ఎర్రయ్య మాట కల్పుతా "ఊరంతా అలివిగాని వరుపెత్తుకుండాది. (వరుపు-కరువు)తిన్ను తిండిలేదు. పసువులకు మ్యాత లేదు. నీళ్ళు గుడకా ఏట్లో మనిస్సిలోతు చెలిమె తీస్కొని తెచ్చుకుంటా వుండారు. అయీ రేపోమాపో వొట్టిపోవొచ్చు. మడుస్సులంతా ఘోరెండలకు ఊసబెండ్లలా దోరి (బలహీన)పోతాండరు. ఏం బతుకు తీ మందీ " బాదంతా ఎల్లగక్కినాడు యర్రయ్య.
"ముసలయ్య తాతా! ఇరుగుపొరుగు వూర్లన్నీ అంతోయింతో బాగనే వుండయ్! మన వూరేందో ఇంత అద్దుమానంగా వుండాది. వూరికేందన్నా గాచారం పట్టు కుందంటావా తాతా!?" ఒగిసిలో పెద్దోడైనా ముసలయ్యను సుంకన్న అడుగుతుండంగానే అబ్బుడే అక్కడికొచ్చిన అంకాల్రాయుడు మాటందుకున్యాడు.
"ఊరికి నిజ్జంగానే చెడు గాలం దాపరించినాది. మూడేల్లాపొద్దు వూరిట్టా వుండేది కాదు. అందరాల మనమూ పాడిపంటల్తో కళకళాడ్తాండేవోళ్ళం. మూడేల్లా ఆ ఇరుబోగోళ్ళో (దరిదాపుల్లో) మన అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరిగినాది. ద్యావర్లో మన పొలిని దద్దనాలోళ్ళు మనల్ని ఆదమరింపించి ఎత్తక పోయినారు. ఆడికీ మన కుర్రోళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని యంటబన్యారు. వాళ్ళు దొరకుండా పొలిమేర దాట్నారు. ఆ పొద్దునుంచి ఈ పరిచితి ఒనగూడినాది. మన పొలి మనం తెచ్చుకున్యా దాక మన బతుకులింతే. " అంకల్రాయుడి మాటల్లో యేదన ఉట్టిపన్యాది.
ఇంత లోపల ఆటో ప్యాట్నుంచి వొచ్చినాది. సుంకన్నతో పాటు అందరూ ఆదరబాదరమని ఆటో ఎక్కి కుచ్చున్యారు. ఆటో నిండు మనిసిలా కదిలి ప్యాటకు పోయినాది.
ప్యాట మార్కెట్లో గాయగూరలు, తిరువాతనూన్య (వంటనూనె), పసులకు బియ్యంతౌడు, చనిక్కాయచెక్క తీస్కొని మార్కెట్టు బయిటికి వచ్చేసరికి జమ్మడక్క (జమ్మలమడగు) పిల్లోడు బండెన్న రోడ్డు మీద పోతా కన్పించ్చినాడు. "రేయ్ బండెన్నా!" యని సుంకన్న పిల్చేటప్పటికి బండెన్న నిలబన్యాడు. I
"ఏంబ్బీ యేడాది ఐతాన్యా ఇత్తనం గింజల లెక్కీయ్యక పోతివి. ఇయనీకి బుద్ది పుట్టలేదా! అమ్మ 'ప్యాట్‌లో నువ్వు కనపడ్తే లెక్క ఇప్పిచ్చుకరా' అన్యాది. ఇబ్బుడన్నా ఇయబ్బీ. శాన కసాల (అవసరం) గా వుండాది. " అని అడిగినాడు సుంకన్న.
"యాడిదన్నా లెక్కా. ఇల్లు జరగడమే ఈదల మాదలగా వుండాది. మీరిచ్చిన ఇత్తనం గింజలు చేలో ఇత్తినాక వాన పడక న్యాల్లోనే కుళ్ళిపోనాయ్. పెల్లాం బిడ్డలకు కూడు కుడక పెట్టల్యాక పోతాండాను. పొలాలు వదిలేసి ప్యాటకు కూలి పన్లు చేయడానికి వొచ్చాండన్నా! బతకడానికి శాన ఇబ్బందులు పడ్తాండన్నా!" శాన ధీనంగా చెప్పకున్యాడు బండెన్న.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆ మాటలు ఇనేసరికి గుండెలు బరువెక్కి సుంకన్న మనస్సు బాదతో కలుక్కుమని మెలికె దిరిగినాది.
"లెక్క ఇయకుంటేమి లేబ్బి. పెళ్ళాం బిడ్డల్ని పచ్చులు పెట్టాకు. ఏదోక కట్టంచేసి పిల్లల కడుపు నింపు సాలు. నాకు లెక్క యిచ్చినట్టే " అన్సెప్పి ఇంటి దోవ పట్నాడు సుంకన్న.
ఇంటికి రాంగానే "సుంకన్నా! ఊరి పెద్దలంతా మూడమాన్ల కాడ గుమికూడి నారంట. నిన్ను రమ్మన్యారు. ఊరి సంగతేందో మాట్టాడుతారంట. పోయిరాపో నాయిన !" పుట్టన్న కొడుక్కు చెప్పినాడు.
"పొయచ్చాగానీ, ఎనుముల్ను మేపకరాను పోయిన తమ్ముడు, పొయ్యిలోకి పుల్లలు ఏరకరాను పోయిన చెల్లెలు యింటికి వచ్చినారా నాయినా" తండ్రి పుట్టన్నను అడిగినాడు.
"ఇంటికి వొచ్చినాం న్నా!" అంటూ చెల్లెలు నూకాలమ్మ, తమ్ముడు బంగారయ్య అన్నకు ఎదుర్గా వొచ్చి నిలబన్యారు.
"ఓ.. వొచ్చినారా? సరేలే ఐతే. " సుంకన్న సమాదాన పన్యాడు.
"నువ్వు బెర్రీన కాళ్ళుమోఖం కడుకొని రాపో! సర్రి(గంజి) గాచిన ఉడుకు మీదనే తాగుదువు. మల్లా మూడు మాన్లకాడికి పోను ఆల్చమైతాది" తిపాలమ్మ సుంకన్నతో సెప్పినాది.
"అట్టేమ్మ" అని జాలాట్లోకి బోయి కాళ్లు మొఖం కడుకొని దండ్యెం మీది తుండుగుడ్డతో తుడ్చుకొని సర్రి తాగి దస్తుగుడ్డ బుజాన ఏసుకొని ఊరి పెద్దలంతా గుంపైన మూడుమాన్ల కాడికి ఎలబార్తాంటే మారెన్న అదాటు (ఎదురు) పన్యాడు.
"యాడికన్నా! నువ్వొచ్చాండవ్!" పలకరించినాడు సుంకన్న.
" నీ కోసమేబ్బీ! మూడుమాన్ల కాడ పెద్దలంతా మీటింగు పెట్నారు. ఇంటికొకరు రమ్మంటే అందరూ వచ్చినారు. యయ్యాలకు నువ్వు రాకపోతే పిల్చుక రాపోని నన్ను పంపినారు."
"అట్టనా! పదపదా! పోదాం!" అని బిరబిరా ఇద్దరూ పోయినారు.
మూడుమాన్ల కాడు అరుగుల మీద కొండాడ్డి తిప్పిరెడ్డి చెంగలనాయుడు అచ్చంనాయుడు అంకల్రాయుడు పిచ్చయ్య ఎర్రయ్య పుల్లారావు తిక్కరావు పోలయ్య పేరయ్య అంకన్న మాచంరాయుడు కూకొనివుండారు జనమంతా చుట్టూత నిల్బడివుండారు.
"సుంకన్న వచ్చినాడు సంగతేందో మొదుబెట్టండ్రీ" పేరయ్య కదిలిచ్చినాడు.
కొండాడ్డి మెల్లగా లేచి గోశ సర్దుకొని చెప్పడం మొదబెట్నాడు
"యావన్మందికీ తెలియజేయడం యేమనగా - నిజానికి మనకు తెలియని ఇసయమేమి కాదు. మూడేండ్లాగా వానచుక్క పడడమేల్యా. చేలు పండడమేల్యా. వూర్ని వరుపు చుట్టుకున్యాది. ఎండ మండుతాంది. ఎర్రగాలి కాగు (ఎర్ర దుమ్ము) దూమరం లేచ్చాంది. జనం తిండికి నీళ్ళుకు తొద (బాధ) పర్తాండరు. బక్క జీవాలు సచ్చిపోతాండయ్.
బోరపొంతలు (రాబందులు) పీతిరి గద్దలు తిరుగుతాండయ్. సీతవలు గుడ్లగూబలు పైడికంటీలు (బంగారు కన్నుల పక్షి, రాత్రుళ్ళు తిరిగే పక్షి) రేత్రుల్లు ఇకారంగా అరుచ్చాండయ్. చేండ్లు బీడ్లైనాయ్. ఏరు ఎండి పోయినాది. చెరువు వొట్టి పోయినాది. రైతులు పక్కూర్లకు కూలి పన్లకు పోతాండరు. కొందరు ప్యాటకు బేల్దారి పన్లు సేసుకోను పొతాండరు. కొందరైతే బతుకతెరువు కోసరం దూరాబారం యిండ్లు ఇడిచి వలస పొతాండరు. వోల్ల యిండ్లల్లో గబ్బిలాలు సేరి పిల్లలేపుకుంటుండాయి.
ఇట్టాటి పరిచితి మనకు ఎందుకొచ్చినాది. దద్దనాలోళ్ళు మన పొలిని ఎత్తక పొయినప్పటి నుంచే మన బతుకులు ఇట్టా కాలి పొతాండయ్. కుటుంబాలకు కుటుంబాలు ఇగలంపగలమై(చిందరవందరై)అలాంపలాం(అల్లకల్లోలం) లైనాయ్. కడంత కాలం ఇట్టా గొడాటకం బరాయించలేం. మన పొలి మల్లా మనూరికి తెచ్చుకునెంత వరకు మన బతుకులు ఇట్టే ఒగిరిచ్చా (అయాసం) వుంటాయ్. " అని సితిగతి ఇవరించినాడు కొండాడ్డి.
చెంగల్నాయుడు లేసి "వచ్చే మంగలారం దద్దనాల్లో పెద్దమ్మ ద్యావర. ఆ ద్యావరకు పొయ్యి మన పొలి మనం తెచ్చుకోవాల. ఈ పనికి ఎవరు పూనుకుంటారు? చెప్పండ్రి. ఊరు కోసరం వూరి బాగ్గోసరం ఎవరు ముందు కొచ్చారు? వోళ్ళకు వూరికి దిగదాల ఏటిగట్టున పదెకరాల బూమి ఇచ్చాం. వూర్లో యింటికి, పసుల్దొడ్డికి, వామి ఏసుకోడానికి, కల్లానికి యాబై సెంట్లు సలం ఇచ్చాం. వారి కుటుంబానికి లచ్చ రూపాయలు పోగుజేసి ఇచ్చాం.
ఆ పెయత్నంలో పానాలు పోతే ఆకుంటుంబానికి పంచాయతీ నెల బత్తెం యిచ్చూ బతుకంతా సూసుకుంటాది. వారి పిల్లలను సదివించి పయోజికుల్ని చేచ్చాది. కాబట్టి ఎవరైనా సాసం చేయేచ్చు. " ఆయప్ప మాట్టాన్యకాడికి మాట్టాడి కూకున్యాడు.
ఐనా గూడ ఒక్కరూ ముందుకు రాల్యా. అదేంత పానం మీది పనో అందరికి తెల్సు. అట్టందుకే అందరూ గమ్మున నుండి పోయినారు. యెంతసేపు సూసినా మందిలోంచి ఒక్కడూ చెయెత్తలేదు. సూచ్చూసి పుల్లారావు నిల్బడి,
"ఆలోసించండి! కరువు బోడానికి యేమేమి చెయాలో అన్నీ చేసినాం. ఆవుల పబ్బం ఆడించ్చినాం. ఇరాటపరవం సెప్పిచ్చినాం. అద్దరాతిరి పెళ్ళిగాని ఆడపిల్లల్ను అంగమొల(నగ్నంగా) వూరిసుట్టూ తిప్పినాం. పగిలిపోయిన రోళ్ళు, ఇరగిపోయిన రోకుళ్ళు, ఒక్కిలిపోయిన రాతి పనిముట్లు, పాత పొరకలు, పాత చాటలు, వూరి బయటికి బండ్లతో తోలినాం.
కప్పల పెండ్లిళ్ళు సేసినాం. ఐనా కరువు పోల్యా. కడగండ్లు పోల్యా. సితి ఆరోగోరంగానే(చాల ఘోరంగా) ఉండాది. మన దరిద్దరం పొవాలంటే దద్దనాలోళ్ళు తీస్కపోయిన పొలి తిర్గి తీస్క రావడమే. ఇంగ యేరొక దోవ కన్పల్యా. మనూరి బాగ్గోసరం యువకులు త్యాగం చెయాల. ఈపనికి యేవరు సమర్తులో తేల్చి సెబ్బండ్రి" అని పుల్లారావు " ఇస్సుబ్బా" అనుకుంటా నీరసంగా అరుగు మీద కూలబన్యాడు.
జనంలో ఉలుకూ పలుకూ లేదు. చెయేత్తడానికి ఈడిగల(ధైర్యం లేక) పన్యారు. ఒకరి మోగాలు ఒకరు సూసుకున్యారు. గుసగుసా గునపోసుకున్యారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అబ్బుడు అంకాల్రాయుడు లేసి తువాల ఇదిలిచ్చి బుజాన యేస్కొని సెప్పడం మొదులు బెట్నాడు-
"వూర్లో అందరికీ ఆవజివాలు (జవసత్వాలు) కుంగిపొయినాయి. బతుకులు సూచ్చే పంగదెంగులు (చెడిపోవడం) పదారబాట్లైనాయి. యెవరికీ బొట్టుపానం లేదు. కన్లల్లో పానంబెట్టుకొని ఊసబెండ్లలా ఈలకర్సుక(నేల కరుచుక)పోయి వుండారు. గెట్టిగా పడమటి గాలీచ్చే ఒగుడాకులా (పండాకు) బారడు దూరం పడేట్టు వుండారు. ఈల్లెవరూ ఈపనికి సమర్తులుకారు. ఒక్క సుంకన్నైతేనే తగినోడు. ఈ కార్యం సాదించగల సత్తా వున్నోడు. ఓర్పు నేర్పు చురుకుదనం పట్టుదల గలోడు. అంతోయింతో గెట్టిగా బలంగా వున్నోడు. వూరికి యేదన్న మేల్సేయాలన్న ఆసియం వున్నోడు. అతను దప్ప యేవడి వొల్లా గాదు. " అంకాలడ్రాయుడి మాటలకు అందరూ ఆసగా సూసినారు సుంకన్న దిట్టు.
"ఔనూ.. ఔనూ.. సుంకన్నే సమర్తుడు. " అని జనమంతా పలికనారు.
సుంకన్న ఉలికిపాటుగా అదిరి పన్యాడు. అదే జనంలో కుడ్చున్న చదువుకున్న జంబులన్న లేచి పంచాయతీ తీర్మానం తప్పు దోవ పడుతునందకు చింతించి "అయ్యా పెద్దలారా! వానరాక పోవడానికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం గ్గాని పొలి ఎత్తకపోవడం కాదు. అది వఠ్ఠి మూడనమ్మకం. పొలి తీస్క రావడంలో ప్రాణాలు పోతే అది మీ మూర్ఖత్వం, మీ మూడనమ్మకం కారణమవుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోకండి. వానలు ఆలస్యమైనా పడతాయి" అన్యాడు ఆందోళనపడతూ..
"చదవుకున్నోళ్ళు అట్టే అంటారు. ఆయన్ను వదిలైండ్రీ" అని ఆయన మాటల్ని పూచిక పుల్ల మాద్రిగా తీసిపారేసినారు జనం. సుంకన్న దిట్టు తిరిగి చెప్పమన్నట్టు ఆసగా సూసినారు.
"అయ్యలారా! నాగ్గూడా వూరికేదన్న మేలు సేయాలని వుండాది. గానీ నా అమ్మనాయినలు ముసలలోళ్ళు. తమ్ముడు చెల్లెలు న్యాదర(లేత) పిల్లోల్లు. నాకేమన్నైతే వాళ్ళు అన్నాయమైపోతారు. నేదప్ప వాళ్ళకు దిక్కులేదు. " ఇచారంగా చెప్పుకున్యాడు సుంకన్న.
జనం సుంకన్నను బతిమాలినారు. "వూరి యువకులంతా బెట్టబోయివుండారు. నువ్వే రోంత గెట్టిగా వుండావు. నువ్వు మాతరమే పొలి త్యాగలవు. నువ్వు పొలి తీసుకొని పరిగెత్తి వొచ్చే పొలిమేరలో మేమంతా అయుదాలతో సిద్ధంగా వుంటాం. నీ యంటబడొచ్చే దద్దనాలోళ్ళకు ఎద్రు నిల్బడి పోరాడ్తం. నీకేం బయం లేదు. " పోద్బలంగా (ధైర్యం) చెప్పినారు.
"ఊర్నీ ఈ ఇపత్తు నుంచి తప్పిచ్చాల. గానీ పొలి త్యావడమంటే జనాన్ని ఆదమరింపించి సైగ్గా (శబ్దం చేయకుండ) దెచ్చేది కాదు. అందరికీ ఇనబడేట్టుగా కేకేసి చెప్పి వాళ్ళకు చిక్కకుండా ఉరికెత్తి రావాల. అట్టాడప్పుడు మన అదుట్టం బాగల్యాక నా పానానికి ముప్పొచ్చే. నా వోళ్ళు యేంగావాల? ఇదీ ఉరకల పరుగుల యవ్వారం" అనమానం పన్యాడు సుంకన్న.
అబ్బుడికబ్బుడు పంచాయతీ పెద్దలు కాగితాలు తెప్పించి ఊరికి దిగదాల (క్రింది) యేటి గట్టునున్న పదేకరాల బూమి ఊర్లో పడమటీది నున్న యాబై సెంట్లు సలం, అందులో నున్నా రేకులిల్లు, పసుల్దొడ్డి, కల్లంతో సహ రాచ్చినారు. లచ్చ రుపాయలు పోగుజేసి సుంకన్న చేతిలో బెట్న్యారు. సుంకన్న కేమన్నైతే గ్రామ పంచాయతీ సుంకన్న కుటుంబానికి నెలనెలా బత్తెమిత్తూ పిల్లల్ని చదివిచ్చి పయోజుకుల్ని సేసేటట్టూ నిర్నయం సేసి పంచాయతీ బుక్‌లో రాసినారు.
ఇంగ తప్పదన్నట్టు ఒప్పుకొని యకాయకిన యింటికి బోయి అమ్మనాయినకు ఇసయం సెప్పినాడు సుంకన్న. తల్లిదండ్రులు బోరున ఏర్చినారు.
"ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతుకుదాం నాయిన. మనకొద్దు ఈపనీ. మనకొద్దు కొడకా!" అన్సెప్పీ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయినారు.
"నాకేం గాదులేమ్మా! సున్యాసంగా పొలి తీస్కొచ్చాను. పొలిమేర కాడ మనోళ్ళు ఆయుదాల్తో వుంటారు. బయపడాల్సిన పన్లేద"ని సెప్పి పంచాయిదిచ్చిన లెక్కా, బూమి పట్టాలు ఇచ్చినాడు. ఇంగా పంచాయతీ ఏమేమి నిర్నయాలు దీస్కొందో సెప్పినాడు.
"ఈ యేమీ నీ కన్నా యెక్కువ కాదు నాయినా! నువ్వే మాకు ఎదిగొచ్చిన పిల్లోడివి. నీ మీదే మా పానాలుండాయి. బతికుంటే కూలోనాలో చేసుకొని బతకొచ్చు. మా మాటిను బిడ్డా!" బతిమలాడినారు తల్లిదండ్రులు.
"అమ్మా! నాయినా! నాకేం గాదు. మీరు బాదపడి నన్ను బాద పెట్టకండ్రీ. ఊరికి మేల్సేసే అవకాషం మనకొచ్చింది. అది గొప్పనుకుంటాను నేను. ఇంగేం మాట్టాడకండ్రీ. పొలి తెచ్చానని ఊరికి మాటిచ్చిన." కరాకండిగా సెప్పినాడు సుంకన్న.
* * *
1970కి మునుపటి సంగతి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కలర్ సినిమాలు వొచ్చాండేవి. అనిమెలకు దగ్గిరుండే కమలాపురం లాంటి సిన్న టవున్లల్లో టెంట్లుండేవి. దసరాబుల్లోడు కలర్ సినిమా వొచ్చిందని ఎద్దులబండి కట్టి ఆడమొగ పిల్లాజల్లా యింటిల్లపాది బోకుశాలగా సూడను పోయినారు. అప్పట్లో అదో ఇసిత్రం కలర్ సినిమాంటే. ఆదినాల్లో వూరూర ద్యావర్లు జరిగేవి. మూడనమ్మకాల మీద జనానికి నమ్మకం యేక్కువ వుండేది. అప్పటి కతయిది.
అనిమెల దద్దానాల మద్దిన దూరం పది కిలో మీటర్లు. అనిమెల గండేటి ఒడ్డున, దద్దనాల పాగేటి ఒడ్డున వుండాయి. మొదట్లో అనిమెల్లో సకాలంలో వానలు గురిసి, ఏరు పారి, చెరువు నిండి, పంటలు దండిగా పండి, పాడి మెండుగా పెరగి ఊరు కళకళాడ్తుండినాది.
దద్దనాల్లో వానలు కురువక, ఏరు పారక, చెరవు నిండక, పంటలు పండక, పసువులకు మేతల్యాక నానాక ఇబ్బందులు పడేటోళ్ళు. చెప్పను అలివిగాని ఇడుములు ఇక్కట్లు అనబయించేవోళ్ళు.
అట్టాటబ్బుడు అనిమెల అన్నెందాల బాగున్నందున ఆ వూరిపై దద్దనాలోళ్ళ కన్నుపన్యాది. అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరేగేబ్బుడు అనిమెల పజలు అజాగరతగా ఉండేది సూసి దద్దనాలోళ్ళు వోళ్ళ పొలిని ఎత్తుక పోయినారు. అనిమెలోళ్ళు ఎగాసగా పడి ఆయుదాలందుకొని యంటపడే సరికి ఊరుదాటి పొలిమేర గూడా దాటిపోయినారు.
అప్పట్నుంచి అనిమెలను కరువు తొందుకొని నలిపి సంపుతాంది. తమ పొలి తాము తెచ్చుకుంటేగాని తమ ముందటి వైబోగం తమకు దిరిగి రాదని అనిమెలోళ్ళు నిర్నయించుకున్యారు. ఈ పమాదకర కార్యాన్నీ నెరవేర్చేకి సుంకన్న పూనుకున్యాడు.
[font=var(--ricos-font-family,unset)]====================================================================[/font]
ఇంకా వుంది[font=var(--ricos-font-family,unset)]..[/font]
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 1,971
Threads: 4
Likes Received: 3,090 in 1,411 posts
Likes Given: 4,103
Joined: Nov 2018
Reputation:
61
నాది కూడా రాయలసీమనే గానీ ఈ యాస చానా కష్టంగా వుందబ్బీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి...బహుశా నా ముందు తరం వాళ్ళు మాట్లాడేవాళ్ళేమో.
ఈ పొలిబియ్యం/పొలికూడు నేను కూడా చూసాను నా చిన్నప్పుడు. అమ్మోరి జాతరప్పుడు మా వూర్లో ఎనుబోతులని బలిచ్చి ఆ రక్తాన్ని వండివార్చిన అన్నం తో కలిపి ఊరంతా, ఊరి పొలిమేర వరకు చల్లేవాళ్ళు. డప్పు కోట్టే వాడు, పొలన్నం చల్లేవాడు తప్ప అందరూ ఆ టైంలో ఇళ్లలోకెళ్ళి తలుపేసుకునేవారు.
థ్యాంక్యు భయ్యా చిన్నప్పటి జ్ఞాపకాలను తాజా చేసినందుకు.
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
(07-05-2025, 06:10 PM)Uday Wrote: నాది కూడా రాయలసీమనే గానీ ఈ యాస చానా కష్టంగా వుందబ్బీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి...బహుశా నా ముందు తరం వాళ్ళు మాట్లాడేవాళ్ళేమో.
ఈ పొలిబియ్యం/పొలికూడు నేను కూడా చూసాను నా చిన్నప్పుడు. అమ్మోరి జాతరప్పుడు మా వూర్లో ఎనుబోతులని బలిచ్చి ఆ రక్తాన్ని వండివార్చిన అన్నం తో కలిపి ఊరంతా, ఊరి పొలిమేర వరకు చల్లేవాళ్ళు. డప్పు కోట్టే వాడు, పొలన్నం చల్లేవాడు తప్ప అందరూ ఆ టైంలో ఇళ్లలోకెళ్ళి తలుపేసుకునేవారు.
థ్యాంక్యు భయ్యా చిన్నప్పటి జ్ఞాపకాలను తాజా చేసినందుకు.
ఈ కథలో యాస నా అంచనా ప్రకారం 80-100 సంవత్సరాల నాటిది, అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే!!!
దీనిలో సంఘటణలు మీ చిన్నతనం గుర్తు తెచ్చాయనడం ఇక్కడ సహజతను వెల్లడిస్తోంది.
ముదావహం :shy:
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• Uday
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పొలిమేర - పార్ట్ 2
'పొలిమేర పార్ట్ 2/2' తెలుగు కథ
దద్దనాల్లో ఊరి నడింగల పెద్దేప్మాను కాడ ఊరి పెద్దలు పెద్దాడ్డి తిక్కాడ్డి బస్సిరెడ్డి చెల్లంనాయుడు తిమ్మానాయుడు కాటంరాయుడు మంచల్రాయుడు పెంటయ్య పెద్దబొట్లాచారి నామాలయ్య పోతురాజు అప్పల్రాజు సన్నన్న బుల్లెన్న సంటెన్న పాలన్న సాలన్న తలుపులన్న కొమర్రావు చిన్నారావు కన్నయ్య నల్లప్ప జాలప్ప ఆవులయ్య ఎద్దులప్పతో పాటు వూరి జనం గుమిగూడినారు.
బస్సిరెడ్డి ముందుగాల లేచి "అందరికి దండాలు. మనూర్లో ద్యావర జరిగి మూడేండ్లైతాంది. మూడేండ్ల కొకతూరి పెద్దమ్మ ద్యావర జరపడం ఆనవాయితీ. అమ్మోరి దయవొల్లా కరువుకాటకాలు ల్యాకుండా రోగంరోట్టా రాకుండా పైరు పచ్చలతో పిల్లాజల్లా చల్లంగా వుండాం. అందుగ్గాను ఈతూరి అమ్మోరి ద్యావర అందరూ కల్సికట్టుగా నిల్బడి వైబోగంగా సేచ్చాం. గాబట్టి ఎవరి వంతు వాళ్ళు పన్సేసి అమ్మోరికి ఏ కొతుకు రాకుండా జరపాల. యేదన్న వాటం (విధానం) దప్పుతే పెద్దమ్మతల్లి మాంతమైన దేవత. అన్ని ఇసయాల్లో మెల్కువగా వుండాల.
అన్నీసరే! అనిమెలోళ్ళు అమ్మోరి పొలి ఎత్తక పోవడానికి రావచ్చు. ఒగిసోలంతా జాగిరిగా ఉండాల. వాళ్ళ పొలి మనం ఎత్తకొచ్చినాంచి కరవుకాటకాల్తో అలమటిచ్చి అల్లాడి పోతాండరు. వాళ్ళు పొలి తీస్కక పోవడానికి తప్పక వొచ్చారు. ఓగన్నేసి వుండాల." అన్సేప్పి కుచ్చున్యాడు బస్సిరెడ్డి.
తిమ్మానాయుడు ఉషారుగా లేసి "ద్యావర గొప్పగా జరగాలంటే తీరువ ఈతూరి బారీగ ఏస్కోవాల! అన్నీ సరుకులు పిర్రమై పోయినై. తీరవలు రాబట్టే పని చెల్లంనాయుడికి ఒప్పగిచ్చాం. అమ్మోరికి పసుపు కుంకుమ గందోడి సాంబ్రాణి నిమ్మకాయలు టెంకాయలు నైద్యానికి సరుకులు అమ్మోరికి కొత్తగుడ్డలు అవుట్లు టపాకాయలు తెచ్చే బాద్యత కొమ్మర్రావుది. అమ్మోరి బొమ్మ సేసే బాద్యత కన్నయ్యది.
గుడి కట్టిచ్చే వంతు పెదబొట్లాచారికి. అమ్మోరి కత చెప్పే ఆసాదోళ్ళును తప్పెటోళ్ళను మెళాలోళ్ళను తుడుమోళ్ళను కొమ్మోళ్ళను దండోరోళ్ళను పురమాయించే పని అప్పల్రాజుకు. ఎక్కువ తక్కువలు బుల్లెన్న సూసుకుంటాడు. ఒగ్యాల అనిమెలోళ్ళు పొలెత్తక పోనీకి వొచ్చే కన్పెట్టడానికి కాటంరాయుడు పోతురాజోళ్ళు ఉంటారు." అన్నీ పూసగుచ్చినట్టు సెప్పి కూకున్యాడు తిమ్మానాయుడు.
ఆ ఎనక మంచాల్రాయుడు "అద్సరే! ద్యావర దున్నపోతు మూడేండ్లుగా చేలల్లోబడి ఎట్టిగా తిని ఆంబోతులా బోబల్చినాది. దాన్ని పట్టడానికీ ఎవని వొల్లాగాదు. అమ్మోరి ముందర దాన్ని నరికే మొగోడెవడో ముందది దేల్సండ్రి." అని గురుతు సేసినాడు.
నల్లప్ప నిల్బడి "ఇంగెవరూ మన పాలన్న సాలన్నలే. ఓ ఇరబైమందిని ఎంటేస్కొనిబోయి ద్యావర దున్నపోతును పట్టకొచ్చారు. అమ్మోరికి వోళ్ళే బలిచ్చారు." అనే నల్లప్ప.
జనమంతా "ఔనౌను, వోళ్ళైతేనే సరిగ్గా సరిపోతారు" చప్పట్లుగొట్టి జైకొట్టి బలపర్చినారు జనం.
అదే జనం మద్దినున్న యామయ్య పైకి లేచి " మీ ఎర్రికాకపోతే అమ్మోరికి ఆకలేమిట్రా! మీ అమాయకత్వం కూలా! పచ్చి సీయలు తినడానికి ఆమేమన్నా జంతువా? ఎందుకు ఈ జీవ హింస. ఇది మూడత్వంతో చేసే చేష్ట" అని అరిచి చెప్పినాడు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటలు గాల్లో కల్సిపోయినాయి.
* * *
యాన్మందికి సబండు కులాలకు తెలపడం ఏమనగా వొచ్చే మంగలారం మన దద్దనాల్లో పెద్దమ్మ ద్యావర జరుగుతాదని ఊరి పెద్దలు నిర్నయించినారు. అందుగ్గాను ఊరి జనమంతా యాటలు కాయకప్పూరం ద్యావరకు కావాల్సిన వన్నీ తెచ్చుకోవాల్సిందిగా తెలియజెప్పడమైందోహో!" అంటూ తప్పెట కొడ్తున్న పాపన్న చాటింపేసినాడు.
ఇన్నె ఇసయమైనా దండోర ఇనగానే జనంలో యెక్కడలేని ఉషార కమ్ముకున్యాది. పిల్లోల్లు పట్టరాని సంతోసంతో ఎగుల్లేచ్చాండరు.
ఎవరికీ వాళ్ళు ప్యాటకు పోయి గుడ్డలుగుసుర్లు ద్యావరకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్యారు. మైదుకూరు సంతకు బోయి పొట్టేల్లు మేకపోతులు కోడిపుంజులు తెచ్చుకున్యారు. ఇండ్లకు సున్నాలు రంగులు పూసుకున్యారు. ఇంటింటికి చుట్టాలుపక్కాలు పిల్చుకున్యారు. ఇండ్లకు పందిర్లు ఏసి ఇంటి ముంగిట ముగ్గులేసినారు. వూరంతా రంగురంగుల కాగితాలతో అలంకరించుకున్యారు. ఈదులన్నీ కరెంట్ లైట్లతో రాతిరి పూట గుడక పట్టపగులు తీర్న ఉండెట్టు సేసినారు. ఊరంతా సందడి సందడిగా ఉండాది.
సాలన్న పాలన్న ఇద్దరూ అన్నదమ్ములు వూరికి ఎగుదాల బూమల్లో చల్లాటకం (ఆనందంగా ఎగురుట) ఆడ్తా మేచ్చాండే దున్నపోతును పట్టకరాను ఇరవైమంది కుర్రోళ్ళను ఎంటేసుకోని బోయినారు. దున్నపోతు బాగా బల్సీ కొమ్మలు దిరిగి వుండాది. మడుస్సుల్ని సూచ్చానే ముందర్కాళ్ళు నేలకు రాచ్చా కొమ్ముల్తో మార్కున్యాది. జనాన్ని చెలిగి పారేచ్చాంది. అందరూ తలాదిక్కు ఎడంగా పరిగెత్తినారు.
పాలన్న పగ్గాన్నీ ఉరిగా సేసీ దూరం నుంచే దాని మెడకు పడేట్టూ ఇసిరేసినాడు. అది కొమ్ముల్ని దాటుకొని మెడకు బిగిచ్చుకున్యాది. అంతలోపల సాలన్న ఎనక నుంచి తోక బట్టుకొని యాలబన్యాడు. పాలన్న ముందుపక్క సాలన్న ఎనకపక్క బిర్రుగా (గట్టిగా) పట్టుకోవడం వొల్ల దున్నపోతు ఎటూ కదల్లేక బుస్సులు కొడ్తా నిలబన్యాది. ఎడంగా జరిగినోలందరూ వొచ్చి తలాదిక్కు పట్టుకొని కిందేసినారు. దున్నపోతును గుదిగాళ్ళుగట్టి గుదిగాళ్ళ మద్దిన పొడుగాటి బడెను దూర్చి బడెకు అట్ట పదిమంది ఇట్ట పదిమంది బుజాలకు ఎత్తుకొని మోసుక బోయినారు. వూరికి నడుమున్న పెద్దేప్మానుకు కట్టేసినారు. జనం కోలాఅలంగా ఉచ్చొహంగా సూడ్నీకి వొచ్చినారు.
కన్నయ్య మరికొందరు జంగమెట్టకు బోయి కుమ్మర మట్టిని తెచ్చి ఊరేలపల బొమ్మల్సత్రం బయల్న కుచ్చోని పెద్దమ్మ అమ్మోరి బొమ్మను సేసినారు. అమ్మోరి ఇగ్రహం అద్దుబుతంగా కుదిరిన్యాది. అమ్మోరిని ఎత్తైన పీటెపై నిల్పి పానపతిట్ట సేసి పట్టు చీరేగట్టి బంగారు నగలు అలంకరించ్చినాడు కన్నయ్య.
పెద్దబొట్లాచారి ఊర్లో నాల్దోవల కూడల్లో నాలగుదిట్లా నాల్గుంజలు పాతి నాల్గుంజల్ను కల్పుతూ ఎదురుకట్టెల్తో గుడి కట్నాడు. గుడికి కప్పులా కొత్త తెల్లటి సైన్ గుడ్డలు గప్పి తూర్పు దిట్టు వాకిలి బెట్టి రంగుకాగితాల్తో పూలదండల్తో అలంకరించినాడు.
అమ్మోరిని గుడిలో నిల్పడానికి ఊరిపెద్దలు, జనం మేళతాళాల్తో బొమ్మల్సత్రం కాడికి అమ్మోరిని త్యాను బయల్దేరినారు..
కన్నయ్య అమ్మోరి మోగానికి పస్పు రాసి కుంకుమ బొట్లుబెట్టి నిమ్మకాయల దండ, పూల్దండ అమ్మోరి మెల్లో ఏసి టెంకాయలు గొట్టి నిమ్మకాయలు గోసి బలిపోతును "కోబలీ" అని బలిచ్చి పీటెపై వున్న అమ్మోరిని పీటెతో సహ నన్నెత్తి పైకి ఎత్తుకొని వూరిదిట్టు కదిలినాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"కళాజొగో" అంటా జనమంతా బూమి దద్దరిల్లేటట్టూ అర్చినారు. ఔట్లు టపాకులు కాల్చినారు. తప్పెట్లు కొట్టినారు. తుడుం వాంచినారు. కొమ్ము ఊదినారు. చిందులోళ్ళు చిందేసినారు. ఆసాదోళ్ళు అమ్మోరి కత చెప్పుకుంటా సాగినారు. ఆ యంటే కన్నయ్యా అమ్మోరితో ఎలబారినాడు. వారెనుకే జనం నడిసినారు. ఊరి నడుమున ఏర్పాటు సేసుకున్న గుల్లో అమ్మోరిని నిల్పినాడు కన్నయ్య.
పూజారి సంటెన్న అమ్మారి సుట్టూ యాప్మండలు పర్చి అమ్మోరి ముందర పెద్ద ఇస్తరేసి కుంభాకూడు అందులో కుమ్మరించి గుండ్రంగా ముద్దగా సేసినాడు. గండదీపం ఎలిగించి సాంబ్రాణి, దూపం నిప్పులపై ఏసి ఊతకడ్డీలు ముట్టించినాడు. అమ్మోరి దగ్గిర గటం (సారాయి) బెట్టినాడు. టేంకాయల్గొట్టి నిమ్మకాయలుకోసి అమ్మోరిని పూలమాలల్తో పూజించి "పెద్దమ్మ తల్లో! సల్లంగా సూడమ్మ తల్లో!" అని గెట్టిగా అరిచి మొక్కినాడు. జనంగూడ దిక్కులకు ఇన్పడేట్టు అరిచి మొక్కినారు.
ఆసోదోళ్ళు అమ్మోరి కత పాడుతున్నారు. తప్పెట్లు తుడుములు కొమ్ములు మారుమోగు తున్నాయి. టపాసులు ఔట్లు పేల్తాండాయి. చిందోళ్ళు చిందేచ్చాండరు. పులేషగాళ్ళు అడులేచ్చాండరు. కట్టె తప్పేటోళ్ళు తిప్పుతాండరు. జనం ఇరగబడి సూచ్చాండరు. ఊరంతా రద్దూ రాయబరంగా వుండాది. నడి రాతిరి ఒంటి గంట నుంచి యాటలు ఆగతీయడం మొదలైతాయి.
* * *
అనిమెల్లో సుంకన్న నిండు కడవ నీళ్ళు పోసుకున్యాడు. ఉతికిన గుడ్డలు ఏసుకున్యాడు. కుటుంబంతో కల్సి బువ్వ తిన్యాడు. ఊరి జనం ఎనకమ్మడి రాగా పోలేరమ్మ గుడికి బోయినాడు. పోలేరమ్మకు పూల్దండేసి టెంకాయ కొట్టి కప్పూరం ఎల్గించి అమ్మోరికి ఆరతిచ్చినాడు. అనుకున్న కార్యం అనుకున్నట్టు జర్గాలని మనసారా మొక్కినాడు. ఎనక్కిదిరిగి అందరి దిట్టూ సూసి దండం బెట్టినాడు. అమ్మానాయినలకు దయిర్యం సెప్పినాడు. తమ్ముడ్ని చెల్లెల్ని గుండెలకు అత్తుకొని బాగ చదువుకొని అమ్మానాయినలకు మంచి పేరు త్యావాలని బుద్దిమాటలు సెప్పినాడు.
అమ్మానాయినలు తమ్ముడూ చెల్లెలు కుమిలికుమిలి ఏడ్చినారు. ఎవరికీ కన్నీళ్లు ఆగలేదు. సుంకన్నకు యేం కాకూర్దని అందరూ ఎయ్యి దేవుల్లను ఏడుకున్యారు. ఒగ చనగాలం పగిడాలలో వుండే మేనత్త అక్కమ్మ కూతురు నేరేలమ్మ మతికొచ్చి మన్సులోనే తనుకులాడినాడు (బాధపడాడు).
"ఆమెకు పొలి తెచ్చే ఇసయం తెల్సింటే గిమగిమాంటే ( ససేమిరా) వినుకొనుండేది కాదు. సపిచ్చే (ససేమిరా) పొలిత్యాను పోనిచ్చేది కాదు" అనుకున్యాడు.
పెద ముత్తైదులు సుంకన్నకు కుంకుమ బొట్టుబెట్టి అరతిచ్చినాక దద్దనాల దిట్టు కదిల్నాడు సుంకన్న. యువకులంతా నానారకాల ఆయుదాలతో సుంకన్నను అనుసరించినారు.
అనిమెల పొలిమేర సేర్నాక -
"సుంకన్నా! దయిర్యంగా పోయిరా! నువ్వు పొలెత్తుకొని రాంగానే నీ యంటబడొచ్చిన దద్దనాలోళ్ళను మేం ఆయుదాల్తో ఎదుర్కుంటాం. నీకు పోలేరమ్మ తోడుంటాది." అని దమ్ముగా సెప్పినారు అనిమెల యవకులు.
"సరే జాగర్తగా ఇక్కడే వుండండి" అని సెప్పి తానొక్కడే ఎలబారిబోయి దద్దనాల్లో ద్యావర జరిగే గుంపులో కల్సిబోయినాడు సుంకన్న.
ద్యావర జరిగే తావున తప్పెట్లు తుడుం కొమ్ము చిందుల చప్పుల్లతో రవరవమంటూ రవద్ధూలి లేసిపోతాండది. దద్దనాలకు సుట్టుండే ఇరవై నాల్గు పల్లెలు ద్యావరకు రావడంతో జన సముద్దరం లాగుండాది వూరంతా.
ఇంటియింటి నుంచి బోనాలు పొట్టేల్లు మేకపోతుల్తో మేళతాళాల్తో ఊరేగింపుగా చిందు తొక్కుకుంటా అమ్మోరి అంచుకొచ్చి పూజారి సంటెన్నకు బోనాలిచ్చి పొట్టేన్లు మేకపోతుల్ను చెట్లకు మాన్లకు కట్టేచ్చాండరు జనం.
సంటెన్న వోల్ల దగ్గిర్నుంచి బోనాలు కాయకప్పూరం నిమ్మకాయలు పస్పుకుంకుమ పూల్దండలు తీస్కుంటుండాడు.
రాతిరి నడిజాము దాటి ఒంటి గంటైనాది. యాటలు బలీయడం మొదులు బెట్నారు. యాటకొడవళ్ళు కనుమాటి గంగమ్మ ద్యావర్లో కొనకొచ్చినారు. యాటకొడళ్ళు మాంచి పదున్తో వుండాయి.
ముందు మొక్కుబడి బస్సిరెడ్డిది. ఆయప్ప యాటనే నరికినారు. ఆయప్పెనుక తిమ్మనాయుడిది. ఆతరువాత మంచాల్రాయుడు చిన్నయ్య పోతురాజు జాలప్ప సన్నన్న బుల్లారావు వొర్సగా వోళ్ళ వోళ్ళ యాటల్ని నరికినాక వూరందరియీ ఒకటెనుక ఒకటి యాటల్ని నరుక్కుంటా వుండారు. యాటను నరికేబ్బుడు జనం"కోబలి" అని ఆకాసం అంటేలా అరుచ్చాండరు. సంటెన్న యెవరి యాటను నరకినబ్బుడు వోళ్ళ టెంకాయగొట్టి వోళ్ళ బోనం కూడు అమ్మోరికి పెట్టి మిగతాది వోళ్ళకే ఇచ్చాండడు.
ఊరందరీ యాటలై పోయేసరికి నెత్తురు కాల్వలై పారినాది. యక్కడ్సూసిన రనారగతం. నరికిన యాటల్ని కొందరు దగ్గిరలోని చెట్లకు యాలదీసి చర్మాల్ని ఒలిచి కడుపులో బండారం (లివర కిడ్నీలు హర్ట్ లంగ్స్ బోటి) తీసి కసురు కడిగి దట్యాలను (చర్మం తీసిన కళేభరాలు) యింటికి తీస్కపోతాండరు. అప్పటికి తెల్లార్జాం నాలుగైంది. ఇంగ పొలిబలిచ్చినాక ఆసాదోడు కుంభాకూడు రగతం చాటలో కల్పి ఊరిసుట్టూ పొలి సల్లాల. పొలి సల్లేబ్బుడు పక్కూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా ఆయప్పకు కాపలాగా పక్క వూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా యంటంబడి కుర్రోళ్ళంతా ఈటెలు యాటకొడవళ్ళు గండ్రగొడ్డెళ్ళు తీస్కొని కోబలీకొబలీ యని అర్చుకుంటా పరిగెత్తి పోతారు. అమ్మోరిని తెల్లారక తలికే వూరి పొలిమేరలో ఇడిచిపెట్టి రావాల!
సాలన్న పాలన్న ఓ ఇరవై మంది దున్నపోతును పట్టకొచ్చినారు. దున్నపోతు బుస్సలు కొడ్తాంది. కోమ్ముల్తో కుమ్ముతాంది. దున్నపోతును అమ్మోరి దగ్గిరికి తీస్కొచ్చి ముందర పదిమంది యనక పదిమంది ఇరగ బట్టుకున్యారు. పాలన్న పదునైన బారీ యాటకొడవలి తీస్కొని దున్నపోతును నరకడానికి సిద్దంగా నిలబన్యాడు. అన్న సాలన్న తమ్ముడు పాలన్నకు నరికే వాటం సెబుతాండడు.
"దున్నపోతు మెడమీద ఇక్కడ నరుకుతే సులబంగా తెగిపడ్తాది" అని ఏలుబెట్టి చూపినాడు."సరే"నని పాలన్న నరకడానికి యాటకొడవలి పైకెత్తి బిర్రుగా బలంగా పట్టుకున్యాడు. పాలన్న కండ్లు ఎర్రబడి భీకరంగా కన్పడ్తాండడు. అబ్బుడు సీమ చిటుక్కుమంటే ఇనబడేట్టు సప్పిడి సేయకుండా ఉండారు జనం. అందరిలోనూ ఏమైతుందో ఎలావుతుందోనని జనం బిర్రాబిగిచ్చుకొని నోటమాటరాక ఊరక సూచ్చాండరు. అంత పెద్ద జీవాన్ని నరకడమంటే మాటలు కాదని జనం బయం.
తమ్ముడు యెక్కడ తప్పోతాడో యని సాలన్న మల్లొక తూరి "ఇక్కడ.. ఇక్కడ.. సరిగ్గా ఇక్కడ నరకు" అని తన తలను దగ్గిరికి సాపి ఆత్రంగా సూపబోయాడు. అన్న అట్టా మల్లా సెబుతాడని తెలీక అబ్బుడే పాలన్న ఉషారుగా చురుగ్గా ఉద్రేకంగా ఒక్కయేటున నరిక్యాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అంతే! దున్నపోతు తలకాయతో పాటు అన్న తలకాయ కూడ తెగి అమ్మోరి ముందర పన్యాది. పజలందరూ సూచ్చాండంగానే చనంలో ఇంత గోరం జర్గిపోయినాది. సంతోసంగా జర్గుతాండే ద్యావర ఇసాదంగా మారినాది. ఏడుపులు పెడబొబ్బులతో ఆచోటంతా గోలగోల అయినాది. సాలన్న పెళ్ళాం మరిడమ్మ కూతురు ఈరినమ్మ కొడుకు మోదుగులయ్య రోదన అలివి కాలే. వలవలా ఏర్చి నెత్తి నోరు బాదుకుంటుండారు. పాలన్న ఏడుపును ఏదనను ఎవరూ ఆపల్యాక పోయినారు.
"పాలన్నా! నీదేం తప్పు లేదురా! మీయన్నా రొండోతూరి సెబ్బుతాడని నీకు తెలీక నరికినావు. పొర్పాటు నీదికాదు. తీరా నరికేప్పుడు సెప్పడం మీయన్నా సేసిన పొర్పాటు. ఐనా అలా జరగాలని వుందేమో! మడుసులం మనకేం తెల్సు? అందుకే జరిపోయినాది. బాదపడి లాబం లేదు. నువ్వు నిబ్బరించుకొని నీ వదినను పిల్లల్ను ఓదార్చు" వూరి పెద్దలంతా చెప్పి నెమ్మది పర్చినారు పాలన్నను.
పెద్దలంతా అబ్బటికబ్బుడు పెద్దమ్మ మాన్యం బూముల్ని శాసిపితంగా సాలన్న కుటుంబమే సేద్యం సేసుకొని బతకొచ్చని నిర్నయం తీసుకున్యారు.
ఇట్టాటి పరిచితి ఉండగానే సుంకన్న సిన్నగా జనాన్ని తొలగదొబ్బుకొని అమ్మోరి గుడి దగ్గిరకొచ్చి అమ్మోరికి మొక్కి, పార్తాండే నెత్తురు కుడికాలికి పూసుకొని జనం ఎలపలికి వొచ్చినాడు. ఊరిసుట్టూ పొలి సల్లక తలికే పొలి ఎత్తక పొవాలని సుంకన్నకు ముందుగాలనే తెలుసు.
బయలుకు వొచ్చిన సుంకన్న"అర్రరోయ్! మీ వూరి పొలి మా వూరికి ఎత్తక పోతాండా రోయ్!" అనీ గెట్టిగా కేకేసి అనిమెల దిట్టు ఉడాయించినాడు సుంకన్న. అంత గందరగోళంలోనూ కాటంరాయుడు సుంకన్న మాటలు ఇన్యాడు. చనాల్లో తేరుకొని జనాన్ని యవకుల్ని సమాయత్త పరచినాడు. యువకులంతా యాటకొడళ్ళు మచ్చుకత్తులు ఈటెలు గండ్రగొడ్డెళ్ఫు తీస్కొకొని సుంకన్నను యంబడించినారు.
వూరి యెలపల వడివడిగా ఉరికెత్తుతాండడు సుంకన్న. పొలిమేర ఐదు కిలోమీటర్లు వుండాది. దద్దనాలోళ్ళు కేకలేసుకుంటా యంబడించి వొచ్చాండరు. సుంకన్న చిక్కకుండా కాలికొద్దీ పరిగెడ్తాండడు. ఆ పరుగులో పట్టుదల కన్పడ్తాండది. కాటంరాయుడు అతని మడుసులు "ఎలాగైనా దద్దనాల పొలి అనిమేలకు పోగూడ్ద"ని సుంకన్నను యంటాడుతా వొచ్చాండరు.
"ఏమైనా పొలి అనిమేలకు చేర్చాల" ని పరుగులో ఏగం పెంచినాడు సుంకన్న. మొదటి మైలురాయి దాట్నాడు.
“నరకూ! పొడచూ! కోబలీ”యని దద్దనాలోళ్ళ అరుపులు కేకలు వీపెనుకే ఇనపడ్తాండయ్ సుంకన్నకు. సుంకన్నను పట్టుకోవడానికి కాటంరాయుడు, పొలిని పొలిమేర చేర్చడానికి సుంకన్న బిస్సగా పరిగెడ్తాండరు. సుంకన్న రెండవ మైలరాయి దాట్నాడు. సుంకన్న పరిగెత్తే ఏగంలో తలగుడ్డ ఎగిరిపోయినాది. చొక్కా ఊడిపోయినాది. పంచ రాలిపోయినాది. బనిగెను డ్రాయరు మాతరమే వొంటి మీద వుండాయి.
"పానం పోయినాసరే పొలిని మాతరం అనిమేలోళ్ళకు అందిచాల" సుంకన్న దుడంగా నిర్నయించు కున్యాడు. మూడవ మైలురాయి గూడా దాటుకున్యాడు. కాటంరాయుడి గుంపు అందుజాపులకు వొచ్చాండాది. యారముట్లు ఇసుడ్తాండరు. ఈటె సుంకన్న ఎడమపక్క రాసుకుంటా బోయినాది. గొడ్డెలి కుడిదిట్టు ఇసురుకుంటా బోయినాది. మచ్చుకత్తి తలకాయ మీద ఎంటికలు తగులుకుంటా బోయినాది. ఐనా సుంకన్న పరుగు తీచ్చానే వుండాడు.
నాలగోవ మైలురాయి గూడా చావుజంపుల దాట్నాడు. కాటంరాయుడోళ్ళు కిందామిందా పడ్తా వొచ్చాండరు. సుంకన్న శాయసత్తుల పరిగెత్తుతానే వుండాడు. ఇంగా అనిమెల పొలమేర ఇరవై అడుగులే వుండాది. సుంకన్న ఉద్దేగంగా అడుగులు ఏచ్చాండడు. పొలిమేరలో వున్న అనిమెలోళ్ళు "రా.. సుంకన్నా! పరిగెత్తు.. సుంకన్నా!" అంటూ సేతులూపుతా అరుచ్చాండారు. అందరిలోనూ బయాందోలన సోటు సేసుకున్యాది.
ఇంతలోపల పొలిమేర పదడుగులు ఉందనగా దద్దనాలోళ్ళు సుంకన్నను అందుకున్యారు. కాటంనాయుడు అటాత్తుగా బయానకంగా సుంకన్నను యాటకొడవలితో తలకాయ నరికినాడు. తల ఎగిరి ఆంత దూరం పన్యాది. ఆ తావంతా రానారగతమైనాది. ఐనప్పటికీ మొండెం పరిగెత్తుతాపోయి అనిమెల పొలిమేర అవతల పన్యాది.
బెడిల్ బెడిల్ అని ఉరిమినాది. పెటిల్ పెటిల్ అని మెరుపు మెరిసినాది. ఆ మెరుపు వెలుగులో పొలి రాసుకున్న కాలు అనిమెల పొలిమేరలో పడి ఉండడాన్ని దద్దనాలోళ్ళు అనిమెలోళ్ళు సూసి ఆచర్యపన్యారు.
"సచ్చి సాదించినాడు రా..! మొగోడు రా..! వీరుడు రా..!" అనుకుంటా ఎనిక్కి ఎలబారినారు దద్దనాలోళ్ళు సేసేది ఇంకేమి లేక.
ఉరుం మీద ఉరుం, మెరుపు మీద మెరుపు మెరిసినాది. మోడాలు గుంపులు గుంపులు కొండలెక్క ఆకాసంలో పరిగెత్తా వొచ్చాండయ్. పుల్లచినుకుల్తో మొదలు బెట్టిన వాన జడివానగా మారి దడిగట్టి నిలకురిసినాది. ఒక వీరుడు మరణించినందుకు ఓపలేని బాద అందర్లో అలుముకున్యాది.
అందరితో పాటు పొలిమేరలో వున్న జంబులన్న"మీ మూర్ఖత్వానికి ఒక మంచి మనిషిని బలి తీసుకున్నారు కదరా!" అని విపరీతంగా బాదపన్యాడు.
సుంకన్న శవాన్ని ఏడ్చుకుంటా! తలలు బాదుకుంటా! తడ్చుకుంటా! మోసుకొని పోయినారు అనిమెలోళ్ళు.
దప్పికగొన్న బూములు దప్పిక దీడ్చుకున్నాయి. పానంబోయిన చెట్లు చేమలు పానం బోసుకున్నాయి. అన్ని జీవరాసులు ఊపిరి పోసుకున్నాయి. యేరు పారినాది చెరువులు కుంటలు నిండినాయి. దొరువులు దొర్లినాయి. అలుగులు పొర్లినాయి. పొలాలన్నీ పచ్చదనం నింపుకున్యాయి. అనిమెలకు మల్లా ఆకుపచ్చ కళొచ్చినాది.
వానలు పడడమూ, పడకపోవడమూ సహజమైనా.. జనం వాన కోసం ప్రయత్నించినపుడు వానలు పడితే మూడనమ్మకాలకు బలం పెరుగుతుంది
===========================================================
***సమాప్తం***
===========================================================
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కాశీయాత్ర
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
కాశీకి తీర్థయాత్ర హిందూమతంలో కాశీనగరానికి యాత్రను సూచిస్తుంది. హిందూమతం లోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ నగరానికి ముక్తి సాధించేందుకు వీలు కల్పిస్తారనే నమ్మకం కారణంగా యాత్రికులు వెళుతుంటారు.
ఈ తీర్థయాత్ర యొక్క ప్రాముఖ్యత స్కాందపురాణంలో వివరింబడినది. హిందూ సాహిత్యంలో కాశీ ఒక
ముఖ్యమైన తీర్థంగా పేర్కొనబడినది. నగరం లోని కాశీ విశ్వనాథ దేవాలయం శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటి.
మేము మొత్తం 120 మందిమి కాశీ యాత్రకు బయలు దేరాము. సాయికృష్ణా ట్రావెల్స్ ధ్వారా ఓ 40 మందిమి మాత్రమే ఫ్లైట్ల్స్ లో వెళ్ళాము. మేము 18 వ తారీఖ నవంబర్ 2023 నాడు బయలుదేరి లక్నోకు వెళ్ళాము. ఉద్యమం 10. 30 కు చేరుకున్నాము. రైలు ప్రయాణీకులు రావటము ఆలస్యమగుట వలన బజారు లన్నీ 2, 3 గంటలు తిరిగాము. ఈ లోపున రైలు ప్రయాణీకులు కూడా మాతో కలిసారు.
మొత్తం 120 మంది 3 బస్సులలో “నైమిషారణ్యము” బయలుదేరాము. మార్గమధ్యము లోనే మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అయిపోయినవి. మా ట్రావెలర్స్ వారివెంట ఎల్లప్పుడూ క్యాటరింగ్ వ్యాన్ ఉంటుంది. ఏ పూట కా పూటే వండి పెడతారు. మాకంటే ముందుగా వారు చేరుకుని మా సౌకర్యాలన్నీ వాళ్ళు చూస్తారు.
సాయంత్రం చీకటి పడువేళకు మేము నైమిషారణ్యము చేరుకుంటిమి. ఆ రోజు సత్రాలలో బస చేసి
రాత్రి భోజన కార్యక్రమాలు యధావిధిగా నిర్వర్తించి, తెల్లవారు ఝామునే లేచి స్నానాదులు కావించుకుని
పుణ్యక్షేత్ర సందర్శనకు బయలుదేరాము.
“నైమిషారణ్య మహాత్యము. ”
నైమిషారణ్యం పవిత్ర తపోభూమి. ఎనభై ఎనిమిది వేలకుపైగా ఋషులు, ముునులు తపస్సు చేసిన
పుణ్యభూమి. ఈ నైమిషారణ్యము ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో గోమతి నది తీరానికి ఉంది.
ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిషారణ్యం పాంచాల రాజ్యానికి, కోయల రాజ్యానికి మధ్య
నున్న ప్రదేశం.
ఉగ్రశ్రావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాలతో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే
శ్రీరామచంధుడు అశ్వమేధ యాగము చేసిన సమయంలో, లవకుశులు ఇక్కడకు వచ్చి, వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశమని కూడా ప్రసిద్ది.
నైమిషారణ్యం ముల్లోకాలలోను ప్రఖ్యాతి గాంచిన ఉత్రమ పుణ్యతీర్థం. శివుడికి అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు చేసే పాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు, శ్రాద్దకర్మలు, యజ్ఞాలు మొదలగునవి ఒకసారి చేసినా, ఏడు జన్మల పాపాలన్నీ పోతాయని అనేక పురాణాలు విశదీకరించాయి.
చూసిన ప్రదేశాలు- వాటి మాహాత్యాలు:
నైమిషారణ్య చరిత్ర— కలియుగం ప్రారంభమయ్యే ముందు ఋషులు, మునులు బ్రహ్మ గారి దగ్గరకి వెళ్ళి ప్రార్థించిరి.. ‘మాకు కలియుగ ప్రభావము లేని ప్రదేశం చూపించండి. మేము అక్కడకి వెళ్ళి పూజలు, యజ్ఞాలు చేసి యత్యుత్తమ ఫలం ప్రాప్తించేలా చేయండి’ అని బ్రహ్మ గారిని వేడుకొనిరి.
ఋషుల అభ్యర్థన మన్నించి, బ్రహ్మగారు మనసు ద్వారా ఒక చక్రాన్ని ( మనోచక్రం). నిర్మించి , ఆ చక్రాన్ని విసిరి, ఇలా చెప్పెను “ఈ చక్రం యొక్క ఇరుసు(నేమి) ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం పరమ పవిత్ర మవుతుంది. అక్కడకు వెళ్ళండి. ” అని.
బ్రహ్మగారి మనోమయ చక్రం బ్రహ్మాండం నుంచి భూమి ని చుట్టుతూ ఈ అరణ్యానికి వచ్చింది. బ్రహ్మగారి మనోమయ చక్రం యొక్క ఇరుసు ( నేమి) ఇక్కడ పడింది కనక ఈ అరణ్యానికి నేమి ( ఇరుసు) +శీర్ష( పడిన)+ అరణ్య =
నైమిషారణ్యం అని పేరు వచ్చింది.
చక్రతీర్థం——- బ్బహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడ భూమి మీద పడిందో అక్కడ పరమ
పావనమయిన పుష్కరిణి. (లోతైనచెరువు ) నిర్మించబడినది. దానినే చక్రతీర్థం అందురు.
మేమందరం పుణ్యస్నానాలని ఆచరించాము. చక్రతీర్థలో స్నానం, ఆచమనం, దానం, ధర్మకార్యాలు
మొదలైనవి చేసినచో, వాటన్నింటికీ విశేషమైన ఫలితం లభిస్తుంది.
లలితాదేవి—— దక్షప్రజాపతి కూతురు సతీదేవి తండ్రి చేత అవమానింపబడి, దక్షయజ్ఞానికే తన దేహాన్ని ఆహుతి ఇచ్చేసింది. శివుణి గణాలు అప్పుడు ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేసాయి. ఇదంతా తెలుసుకుని శివుడు ఆ యజ్ఞవాటికకు వచ్చి, సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖితుడై ఆ మృత కళేబరం చేత బట్టి, తిరుగుతూ తిరుగుతూ తన పనులన్నిటిమీద విరక్తి చెందాడు. దాంతో సృష్టి సంహార క్రియ ఆగిపోయింది. సృష్టి యంతా అస్తవ్యస్తం అయిపోయింది.
అప్పుడు జగత్ కళ్యాణ కారకుడైన విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా నరికి భూమండలమంతా విసిరెను. ఎక్కడైతే ఆ భాగాలు పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలయ్యాయి.
ఈ నైమిషారణ్యంలో సతీదేవి యొక్క హృదయభాగం పడింది. అందుచేత ఈ శక్తీపీఠం లలితాదేవిగా
పిలువబడింది.
సూతగద్ది:
ఈ ప్రదేశంలో సూతమహర్షి ఎనభై ఎనిమిది వేల ఋషులకు శ్రీమధ్బాగవతము, ఇంకా అనేక పురాణాలు వుపదేశించారు. మనం తరచుగా చేసుకునే సత్యనారాయణ వ్రతం కూడా సుత, శౌనకాది మహామునులు శిష్యులకు వుపదేశించిన స్థలం ఇదే.
శౌనకగద్ది:
శౌనక మహర్షి మొదలైన మహా ఋషులందరూ లోకహితం, లోక కళ్యాణార్థం, స్వర్గప్రాప్తి కొరకు వేల సంవత్సరములు తపస్సు చేసి జ్ఞానసిద్ది పొందిన ప్రదేశం.
హనుమాన్ గడీ, పాండవుల మెట్ట——-
రామారావణ యుద్దం జరుగుతున్న సమయంలో మాయావి అయిన అహిరావణుడు శ్రీరామడిని, లక్ష్మణుని మాయోపాయముచే అపహరించెను. హనుమంతుడు అది గ్రహించి ఆ అహిరావణుడితో యుద్దం చేసి ఆ మాయావిని చంపి, రామలక్ష్మణులను విడిపించి, తన భుజస్కంధాలపై కూర్చోపెట్టకుని మొదటిగా నైమిషారణ్యములో అడుగుపెట్టెను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అందుకనే ఇక్కడ హనుమంతుడి భారీవిగ్రహం, ఆయన భుజస్కంధాలపై కూర్చున్న రామలక్ష్మణులు మనకు దర్శనమిస్తారు. ద్వాపరయుగంలో పాండవులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేశారని అంటారు. అందుకనే ఈ కొండని పాండవుల మెట్ట అని కూడా అందురు.
మిశ్రితతీర్థం, దధీచి తపస్థలం——
దధీచి మహర్షి దానవసంహరణార్థం తన ఎముకలను ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చి ఇచ్చిన ప్రదేశం. ఆ సమయమున సకల భూమండలములోని జలరాశులను
ఇచ్చటకి రప్పించి ఆయన పుణ్యస్నానాదులు నిర్వహించిన ప్రదేశము. దధీచిమహర్షి ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధమే ఇంద్రుని ఆయుధము. ఆయన తపశ్శక్తి అంతయు అందులో నిక్షప్తమై యున్నది.
ఇవే కాకుండా నైమిషారణ్యములో ప్రతి ఇల్లు ఒక దేవాలయము. ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలున్నాయి.
ఇదొక పవిత్ర స్థలము. కలిదోషం లేని ఈ భూమి మీద నడిస్తేనే మానవులు పాపాల నుండి విముక్తు
లవుతారని ప్రసిద్ది.
నైమిషారణ్యమును చూసిన కిష్కింద జ్ఞాపకం వస్తుంది. అదేనండీ.. మన హనుమంతుల వారి బంధు పుత్ర మిత్ర సమేతంగా మనకు కనబడతారు. వానరాలు జాస్తి. ఒక్క మనిషుంటే పది వానరాలుంటాయి.
కానీ అవి మనని ఏమీ చేయవు. ప్రక్క నుంచి వెళ్ళిపోతూంటాయి. నాకు అలా స్వీయానుభవమైంది.
మెట్లు దిగి వస్తుంటే నా అంత వానరము, నా ప్రక్కనుంచి దిగుకుంటూ వెళ్ళింది.
మధ్యాహ్నము భోజనాలు కానిచ్చి “ చలో అయోధ్య- రామజన్మభూమి” కి “జైశ్రీరామ్, జైజైశ్రీరామ్”
అని నినాదాలు చేసుకుంటూ బయలుదేరాము. దాదాపు మూడు గంటల ప్రయాణం తరవాత అయోధ్య చేరుకున్నాము.
రామమందిరము——
ప్రస్తుతం రామాలయ పనులు మొదటి దశ పనులు పూర్తి అయి, రెండవ దశ పనులు శరవేగముతో సాగుతున్నవి. 22. 01. 2024 నాడు శ్రీరాముడి మూలవిరాట్టు విగ్రహస్థాపన
జరగగలదని అక్కడి మహంతులు తెలిపారు. ఈ రామాలయ పునరుద్దరణ పనులను గుజరాత్ కి చెందిన “సోమ్‌పురా ఫామిలీ” చేపట్టింది.
అయోధ్యలో రామమందిరం 2. 77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్థు నుంచి గర్భగుడి శిఖరం
వరకూ 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు,
ఒక్కో అంతస్తు 20 అడుగులతో, మొదట అంతస్తులో 160, రెండవ అంతస్తు లో 74 స్తంభాలతో నిర్మాణ పనులు దాదాపు పూర్తి యగుచున్నవి.
నిర్మాణపనులు చాలా చురుకుగా కొనసాగుచున్నవి. శిల్పకళానైపుణ్యము అనన్యం, అసమానము,
శిల్పుల చేతిలో గండ్రశిలలు సయితం వెన్నముద్దల వలె జాలువారుతున్నాయా అన్నట్లు గా యున్నవి.
సీతారసోయ్ఘర్, హనుమాన్‌గఢీ దర్శించుకుని సాయంకాలమునకు సరయూ నదికి చేరుకున్నాము.
రామ చరిత్రకు సజీవ సాక్ష్యం—- గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదులు మన దేశంలో ఉన్నాయి. ఇవి అన్ని విధాలుగా ప్రసిద్ది చెందిన నదులు. అయితే యావత్ భారతమంతయూ భక్తి శ్రద్దలతో, ప్రేమాభిమానాలతో పూజించుదునే ఒక అవతార పురుషుల్ని జీవితంలో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఈ నదులకు లేదు. అటువంటి మహధ్బాగ్యం
పట్టిన నది కేవలం సరయూ నది ఒక్కటే.
అక్కడ కొంతమంది పుణ్యస్నానాలు చేశారు. అక్కడ నుండి హరహరమహదేవ్ అనుకుంటూ కాశీకి పయనమయ్యాము. దాదాపు అర్దరాత్రికి కాశీ పట్టణ ప్రవేశము జరిగింది. అస్లీఘాట్ దగ్గరలో కల “మార్వాడా సేవా సంఘ్” సత్రములో బస
చేసితిమి. కాశీలో ఉన్నన్ని రోజులు అక్కడే. సకల సదుపాయాలతో ఉన్నదా సత్రం. మంచి వెలుతురు,
ధారాళమైన స్వచ్చమైన గాలి, సూర్యకిరణాలు మొదలగు వన్నియూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడు
కొన్నదా సత్రం.
కాశీ క్షేత్ర విశేషాలు. ————
మొదటి రోజు వ్యాసకాశీ, సంకటమోచన హనుమాన్ మందిర్, తులసీ మానస మందిర్, దుర్గామందిర్, గవ్వలమ్మ, సారనాథ్, బిర్లామందిర్+ బెనారస్ హిందూ యూనివర్సిటి
మొదలగునవి దర్శించాము.
సారనాథ్ స్థూపం—- ‘ సారంగనాథ్, ఇసిపట్టన, ఋషిపట్టణ, మిగదయ లేదా మృగదన అని కూడా పిలుస్తారు. వారణాసికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో, గంగా మరియు వరుణ నదుల సంగమానికి సమీపంలో ఉన్న ప్రదేశం.
పురాతన మలగండి కుటీ విహార శిథిలాలు నేటికి మనకు అగుపడుచుండును.
సుమారు 528బిసిఈ నాటి సారనాథ్, 35 సంవత్సరాల వయస్సులో గౌతమబుద్దుడు జ్ఞానోదయం పొందిన తరువాత బోధ్ గయలో తన మొదటి ప్రవచనమును బోధించెను. అతని మొదటి ఐదుగురు శిష్యులు ‘ కౌండిన్య, అస్సాజీ, భద్దియా, వస్సా, మహానామా.
జ్ఞానోదయం ఫలితంగా బౌధ్దసంఘం మొదట ఉనికిలోకి వచ్చింది. మహాపరినిబ్బన సూత్రం( దిఘా నికాయ యొక్క సూత్రం- 16) ప్రకారం, బుద్దుడు సారనాధ్ ను తన భక్త అనుచరులు సందర్శించి, భక్తి భావాలతో చూడవలసిన నాలుగు తీర్థ ప్రదేశాలలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇతర మూడు ప్రదేశాలు లుంబినీ( బుద్దుని జన్మస్థలం,) భోద్గయ( బుద్దుడు జ్ఞానము పొందిన ప్రదేశము ) మరియు కుశినగర్ బుద్దుడు పరినిర్వాణం పొందిన ప్రదేశం).
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము—-
మదన్మోహన్ మాలవ్యా 1916 లో డా. అనీబెసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి కాశీ నరేషుడు స్థలము కేటాయించాను. ఇది ఆసియా
లోనే అది పెద్ద విశ్వావిద్యాలయము. 1916లో స్థాపించబడినది. భారతదేశ జాతీయ ప్రాముఖ్యత కలిగిన
విశ్వవిద్యాలయము.
1300 వందల ఎకరాల విస్తీర్ణంలో వారణాసి యొక్క దక్షిణ అంచున గంగా నది ఒడ్డున ఉన్నది. ప్రాంగణం మధ్యలో శ్రీవిశ్వనాథ మందిరము కలదు.
తులసీమానసమందిర్—- ఇతర దేవాలయాల వలె అది పురాతనమైనది కాదు. 1964 లో నిర్మించబడినది. ఇది రాముడికి అంకితమగు చేయబడింది. మరియు తులసీదాస్ రామచరితమానస్ రాసిన అదే స్థలంలో ఉంది. అవధి భాషలో వ్రాసిన రామచరితమనస్ యొక్క శ్లోకాలతో చెక్కబడిన తెల్లటి గోడలు మనకు దర్శనమిస్తాయి.. దీనిని తులసీ బిర్లా మానస మందిర్ అని కూడా పిలుస్తారు.
ఇక్కడ తులసీదాస్ విగ్రహము, రామలక్ష్మణ, సీతా సమేతముగా హనుమంతుని అందమైన
చిత్రాలు కలవు.
కాశీ క్షేత్ర మహిమ—-
కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ స్థలమహాత్యం గురించి సంపూర్ణంగా వివరించడంతో అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో.. ?
సముద్రంలో నీటి బిందువు లాంటి ఈ సంక్షిప్త సమాచారం తెలియ జేయడం జరుగుతోంది.
హిందువులు జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించాలి. మా దంపతులు ఇది రెండవ సారి కాశీ
రావడము. ఈ క్షేత్రదర్శనం వలన బాహ్య సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవు
తుంది. చిత్త శుద్దితో ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి, ఆత్మజ్ఞానం
కలిగిస్తుంది.
1. కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ క్షేత్రం అనేది బ్రహ్మ దేవుని సృష్టిలోనిది కాదు.
2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న నగరం. శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం.
3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక నగరం.
4. స్వయంగా శివుడు నివాసంగా ఉండే నగరం.
5. ప్రపంచంలో మునులకి అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.
6. కాశీ భువిపై వెలసిన సప్త మోక్షద్వారాలలో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లంగాలలో కాశీ ఒకటి.
మరునాడు ప్రాతఃకాలముననే లేచి స్నానాదులు కావించుకొని కాశీ విశ్వేశ్వర దర్శనం మరియు
అభిషేకం గురించి తెల్లవారు ఝామున 4. 30 గంటలకు క్యూలో నించున్నాము. 5. 30కల్లా స్పర్శ
దర్శనం కావించుకుని అభిషేకమునకు ఆలయ ఆవరణ లో కూర్చున్నాము.
అభిషేక మహాత్మ్యము-
విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేక ప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. అందువలన శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది.
జలం పంచభూతాలలోనూ, శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. ”అప ఏవ ససర్జాదౌ” అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృజించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.
మంత్రపుష్పంలోని — ‘ యోపా మాయతనంవేద’ ఇత్యాది మంత్రాలలో నీటి యొక్క ప్రాముఖ్యం విశదీకరింపబడింది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది.
భగవంతుని పదహారు ఉపచారాలతో పూజిస్తారు. ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.
‘ప్రజాపాన్ శతరుద్రీయా అభిషేకం సమాచరేత్’ అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయా పటిస్తూ
అభిషేకం చెయ్యాలి. పూజయా అభికేహేమో హోమోత్తర్పణ ముత్తమ్మా - తర్పణాఛ్చ జపః శ్రేష్టో హ్యాభిహేకః పరో జపాత్’
పూజ కంటే హోమము- హోమము కంటే తర్పణమ్- తర్పణం కంటే జపము- జపంకంటే అభిషేకం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతారు.
మేము పంచామృతాలతోనూ, జలం తోనూ అభిషేకించు ఆ జలమును తీసుకువెళ్ళి విశ్వనాథ లింగం మీద పోసి మరల స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చాము.
కాశీ అనగా( మెరుస్తున్న) అని అర్థం. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 లో ఇండోర్ కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి నిర్మించారు. కాళీవిశ్వనాథ్, గంగానది మధ్య దూరంను సరళతరం చేయడానికి కారిడార్ నిర్మించారు. దానిని నడవా యందురు. ఆలయ వైశాల్యం యాభైవేల చదరపుమీటర్లు
పెంచారు. నలభైకి పైగా శిథిల దేవాలయాలను పునర్నిర్మించారు. యాత్రికుల సౌకర్యార్థం ఇరవై
మూడు కొత్త భవనాలు నిర్మించారు.
మందిరం లోని ప్రధాన దేవతాలింగం అరవై సెంటీమీటర్ల పొడవు, తొంభై సెంటీమీటర్ల చుట్టుకొలతలో వెండి పానవట్టం లో ఉంది. ప్రధాన దేవాలయం చతుర్భుజాకారంలో తుట్టె ఇతర దేవతా మూర్తుల ఆలయాలతో ఉంటుంది.
లోపలి గర్భగృహ లేదా గర్భాలయానికి దారితీసా సభాగృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమరంగు శిల. ఇది గర్భగుడిలో ప్రతిష్టించబడి, వెండి పానవట్టం పై ఉంటుంది. మందిర నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి దానిలో ఆలయం పై ఒక శిఖరం ఉంటుంది. రెండవది
బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం.
ఆలయానికి సంబంధించిన 15. 5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి. 1835 లో మహారాజా రంజిత్‌సింగ్ ఇచ్చిన మూడు గోపురాలు స్వచ్చమైన బంగారంతో చేయబడ్డాయి.
కాశీవిశ్వనాథ్ ఆలయానికి, మణికర్ణిక ఘాట్‌కు మధ్య గంగానది వెంబడి శ్రీకాశీవిశ్వనాథ్ ధామ్ కారిడార్ ను నిర్మించారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అన్నపూర్ణ మందిరము-
ప్రస్తుత ఈ ఆలయాన్ని పదునెనిమదవ శతాబ్దంలో మరాఠా మొదటి పీష్వా బాజీరావ్ నిర్మించెను. పెద్ద స్తంభాల వాకిలితో గర్భగుడి ఉంటుంది. ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవీ
చిత్రపటం ఉంటుంది. ఈ ఆలయంలో దేవత రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి బంగారంతో, మరొకటి ఇత్తడితో.
ఇత్తడి విగ్రహం రోజువారీ దర్శనం కోసం అందుబాటులో ఉంది. బంగారు విగ్రహాన్ని సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే చూడవచ్చు. అన్నకూట్ రోజున. అమ్మవారి ఎదురుగా కొంచం ప్రక్కగా ఆడవాళ్ళందరూ కుంకుమార్చన చేశారు లలితా పారాయణంచేస్తూ.
ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం అంతా మాయ ( భ్రమ) అని వ్యాఖ్యానించెను. ఆహారదేవత అయిన పార్వతీదేవి కి రూపం వచ్చి, భూమిపై ఉన్న మొత్తం ఆహారాన్ని అదృశ్యం చేయడం ద్వారా ఆహారం ప్రాముఖ్యతని ప్రదర్శించారని నిర్ణియించుకుంది. ప్రపంచం మొత్తం ఆకలితో నకనక లాడుతూ బాధపడటం ప్రారంభించింది. శివుడు చివరకు ఆహార ప్రాముఖ్యతను గుర్తించి, ఆమె వాకిట వద్దకు
వచ్చి ఆహారం కోసం వేడుకొన్నాడు. పార్వతిదేవి సంతసించి, శివుడికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించి, తన భక్తులకోసం వారణాసిలో వంటగదిని తయారు చేసింది.
అక్కడి అన్నప్రసాదశాలలో ఆరోజు అన్నప్రసాదాన్ని స్వీకరించాము.
విశాలాక్షి ఆలయం—-
వారణాసి జంక్షన్ నుండి ఐదు కి. మీ. దూరంలో శ్రీకాశీవిశాలాక్షి ఆలయం గంగానది ఒడ్డున మీర్ఘాట్ వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం 52 శక్తిపీఠాలలో విశాలాక్షి మణికర్ణిక ఒకటి. సతీదేవి కర్ణకుండలం( చెవిపోగు) ఇక్కడ పడిపోయిందని చెబుతారు. అందుకే మణికర్ణిక అని ఆమె పేరు పెట్టారు. కళ్ళు కూడా ఇక్కడే పడిపోయాయి కాబట్టి విశాలాక్షి అని కూడా పిలుస్తారు. నల్లరాయితో చెక్కబడిన అద్భుతమైన మూర్తి అమ్మవారిది. ఆమె కుడిచేయి అరచేతిలా కమలాన్ని కలిగి ఉంది. అయితే ఆమె క్రిందటికి తిరిగిన ఎడమ చేయి అరచేతి ఖాళీగా దూరంగా చూస్తోంది. అమ్మ వారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని
కాలభైరవ ఆలయమునకు బయలుదేరాము.
కాలభైరవ ఆలయం- ఈ ఆలయం పాత నగరంలో, కాశీవిశ్వనాథుని ప్రధాన ఆలయానికి మరియు ఘాట్లకు కొద్ది దూరంలో ఉంది.
సంప్రదాయాల ప్రకారం శివుడు ఈ రూపంలో భయాన్ని పోగొడతాడు. అఘోరాలు మరియు తాంత్రికుల ప్రార్థన కేంద్రంగా ప్రసిద్ది చెందిన కాలభైరవ మందిరం అపారమైన మతపరమైనా విలువలను కలిగి ఉందని నమ్ముతారు. శతాబ్దాలుగా వెలుగుతూ పవిత్రమైన అఖండ దీపం ఈ మందిరంలో ఆకర్షణీయమైన అంశం.
ఈ దీపం యొక్క నూనెలో ఔషద విలువలు గల గుణాలు ఉన్నాయని భావిస్తారు. కాలభైరవ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఆలయానికి ముందు భాగంలో కాలభైరవుడి గుడి రక్షణగా ఒక ప్రవేశద్వారం ఉంటుంది. ఆలయం లోపల సుందరమైన ప్రాంగణం ఉంది. ప్రధాన ఆలయం ప్రాంగణం మధ్యలో ఉంది. కాలభైరవుని విగ్రహం వెండి రంగులో ఉంటుంది.
ఈ విగ్రహం కుక్క విగ్రహంపై అమర్చబడి, త్రిశూలం కలిగి ఉంది. ఈ ఆలయాల దర్శనం కానిచ్చుకుని మా సత్రమునకు బయలుదేరాము.
సాయంత్రం గంగా హారతిని దర్శించుకున్నాము. ఎంతో వైభవోపేతంగా, కనులపండుగగా, కాశీపట్టణం
జ్యోతులతో వెలిగిపోతూ ఉంది.
పరమ పవిత్రమైన వారణాసి నగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ సాయంత్రం వేళ గంగానదికి నిర్వహించే హారతి యాత్రికులు, భక్తులకు కన్నుల పండుగలా
అనిపిస్తుంది.
ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అధ్బుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో
, మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. యుగాల నుండి పవిత్ర గంగానదిని
ఆరాధించకుండా ఏ రోజూ గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ
ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాలిసిన కార్యకలాపాల్లో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని
చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తూంటారు.
గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతీ, కుర్తాతోపాటు పొడవైన గంచా( తువ్వాలు) ధరిస్తారు. ఐదు ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపంవంటి ఇతర పూజా సామగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్దం చేస్తారు.
వారు నిర్వహించే ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి గల భక్తులు నగరం నలుమూలలనుండే కాకుండా దేశంలోనూ, బయటి దేశాలనుంచి వస్తూంటారు. చాలామంది ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు దశాశ్వమేధఘాట్ ఒడ్డున పడవలు ఆపి ఉంచుతారు. చక్కని హారతి దృశ్యాన్ని. తిలకించి సత్రానికి చేరుకున్నాము.
మరునాడు పంచగంగా స్నానానికి వెళ్ళాము. కాశీమహాక్షేత్రంలో గంగానది తీరాన 64ఘాట్లు ఉన్నప్ప
ట్టికి అందులో ప్రధానమైనవి ఐదు మాత్రమే. వాటిలో అస్సీ, కేదార్, దశాశ్వమేధ, పంచగంగ మరియు మణికర్ణిక ఘాట్లు ఉన్నాయి.
అస్సీఘాట్— దుర్గాదేవి ‘ శుంభ-నిశంభ’ రాక్షసులను చంపిన తరువాత, తన ఖడ్గాన్ని నదిలో( అస్సి
అని పిలుస్తారు) విసిరిందని పురాణాల ప్రకారం. ఈ ఘాట్‌కు ఆపేరు వచ్చింది. అక్కడ స్నానం చేసి
కేదార్ ఘాట్‌కు బయలుదేరాము.
కేదార్ఘాట్—- గౌరీ కేదారేశ్వరాలయానికి నిలయమైన కేదార్ఘాట్ వారణాసిలోకి ఐదు పవిత్ర
ఘాట్ లో ఒకటి. కాశీ భారతదేశ భక్తి మండలిని విశ్వసించినట్లే, కేదారాన్ని కాశీ- కేదార్ ఖండం
యొక్క మండలిని నమ్ముతారు. కేదార్ఘాట్ లో గౌరీ కేదారేశ్వరాలయం గౌరీకుండ్ ఉన్నాయి. కేదార్టఘాట్కు ఆదిమర్ణిక అని నమ్ముతారు. ఈ ఘాట్‌లో కూడా స్నానమాచరించి తదుపరి ఘాట్ దశాశ్వమేధకు బయలుదేరాము.
దశాశ్వమేధ ఘాట్— గంగానది పై ఉన్న వారణాసిలోకి ఒక ప్రధాన ఘాట్. ఇది విశ్వనాధఆలయానికి సమీపంలో ఉంది. ఘాట్‌కు సంబంధించిన రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి- శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ దీనిని సృజించెను. మరియు మరియు మరొక కథనం ప్రకారం బ్రహ్మ ఇచ్చట
పది అశ్వమేధ యాగాలు చేశారని ప్రతీతి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ప్రస్తుత ఘాట్‌ను 1748 లో పేష్వాబాలాజీబాజీ రావు నిర్మించెను. మరల 1774 లో అహల్యాబాయి
హోల్కర్ పునర్మించారు. అక్కడ కూడా పుణ్యస్నానములాచరించి పంచగంగ ఘాట్‌కు బయలు
దేరాము.
పంచగంగ ఘాట్— పంచగంగా ఘాట్ లేదా బిందుమాదవ్ ఘాట్ గంగానది ఒడ్డున కలదు. మరియు
ఈ ప్రదేశంలో సంగమించు ఐదు పవిత్రనదుల పేర్లు పెట్టబడింది. గంగా, సరస్వతి, ధూమపాప, యమునా మరియు కిరణ్. గంగా నది మాత్రమే కనబడి, మిగిలిన నాలుగు అతీంద్రియ వ్యక్తీకరణులుగా మారినట్లు భావిస్తున్నారు. మహాభారత కాలంలో భృగుమహర్షిచే నిర్మించబడిందని నమ్ముతారు. ఇచ్చట కూడా పుణ్యస్నానా లాచరించి మిట్యమధ్యాహ్నానికి మణికర్నికా ఘాట్‌కు బోట్లో
వెళ్ళాము. ఈ ఐదు ఘాట్ ల ప్రయాణమా బోట్లలోనే సాగినది.
మణికర్ణికా ఘాట్—- గంగానదిపై ఉన్న పవిత్ర ఘాట్ల లో అత్యంత పవిత్రమైన శ్మశానవాటికలలో
ఒకటి. ’ హిందూమతంలో మరణం అనేది ఒకరి కర్మ ఫలితం ద్వారా గుర్తించడాన్ని మరొక జీవితానికి
ప్రవేశద్వారం గా పరిగణించబడుతుంది. మానవుల్ని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్చిన్నం చేస్తుందని నమ్ముతారు. ఇక్కడ సతీదేవి చెవిపోగులు పడిన కారణంగా ఈ పేరు వచ్చింది. ఇది శక్తిపీఠం కూడా.
ప్రతిరోజూ వందలాదిమంది మణికర్ణికా ఘాట్ వద్ద దహన సంస్కారాలు చూసేందుకు, మృతులకు నివాళులు అర్పించేందుకు వస్తూంటారు. ఇక్కడ కూడా పుణ్య స్నానాలాచరించి సత్రానికి తిరుగు ప్రయాణమైతిమి.
సాయంత్రము ఆ రోజు అందరికీ విశ్రాంతి. షాపింగ్‌లకు వెళ్ళేవాళ్ళు షాపింగ్‌లకూ, దర్శనాల గురించి కొందరూ అందరూ తలో దోవన వెళ్ళాము.
మరునాడు తెల్లవారుదాము రెండు గంటలకే బయలుదేరాము మూడు బస్సుల్లో గయకు.
అక్కడ విష్ణుగయలో పితృదేవతలకు పిండప్రదానాలు, విష్ణుపాదాల దగ్గర పిండాలు వదలడం మరియు మాంగళ్యగౌరీ శక్తిపీఠం చూశాము.
కాశీనుంచి ఏడు గంటల ప్రయాణము గయకు. అక్కడ స్నానాదులు కావించుకొని పితృదేవతల కార్య
క్రమములకు కూర్చున్నాము.
గయయెక్క ప్రాముఖ్యము—- కొండలతో చుట్టుముట్టబడిన గయా నగరం. “ఫల్గు” అనే పవిత్ర నది, నగరం నడిబొడ్డున కలదు. ఇక్కడ మత విశ్వాసాల ప్రకారం పిండప్రదానం( శ్రాద్దకర్మ) కోసం దైవికగమ్యం. రామలక్ష్మణులు, సీతామ్మవారితో కలిసి దశరథమహారాజుకు పిండప్రదానం చేశారని పురాణకథనం. ఈ నగరం చుట్టూ మూడు వైపులా చిన్న రాతి కొండలతో( మంగళగౌరి, శంగస్థాన్,
రామ్శిల మరియు బ్రహ్మయోని) తూర్పు వైపున ఫల్గు నది కలదు.
గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని ప్రార్థించగా, ఆయన కోరుకున్న వర ప్రభావంతో ఆయన తల, నాభి, పాదం ప్రాంతాల్లో గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి. శిరోగయ మధ్యగా, పాదగయ గా పిలువబడే వీటిలో శిరస్సుకు సంబంధించినది గయాక్షేత్రం గాపిలువబడుచున్నది.
పాదగయను పిఠాపురం గా వ్యవహరిస్తున్నారు. శ్రాద్దకర్మ కార్యక్రమము ముగిసిన తరువాత పిండాలు తీసుకుని వెళ్ళి విష్ణు పాదాల దగ్గర వదులుతారు.
ఆ పిదప మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ముగిసిన పిదప మాంగళ్యగౌరీ దర్శనానికి బయలుదేరాము.
మంగళ గౌరీ దేవాలయము—— ఇక్కడ మా సతీదేవి వక్షోజాలు పడినందువలన, ఈ ఆలయం పోషణకు చిహ్నం గా భావిస్తారు. ఎవరైతే తన దగ్గరకి కోరికలు మరియు వరాలకై అమ్మ దగ్గరకి వస్తారో, వారి సకల కోరికల తీరి విజయవంతంగా తిరిగి వెళతారని ప్రగాఢ నమ్మకం.
మరల తిరుగు ప్రయాణం కాశీకి. దాదాపు అర్దరాత్రి దాటినది.
మరుసటిరోజు మన బస చేసిన సత్రములోనే “సహస్రలింగార్చన” పూజలు జరిగినవి. వచ్చిన బృంద
సభ్యులంతా పాల్గొనిరి. ఆడువారందరూ కుంకుమార్చన పూజలు చేసిరి.
సహస్రలింగార్చన—— కార్తీకమాసానికి సమానమైనది ఏది లేదు. గంగా నది మించి ఇతర నదేది లేదు. కాశీక్షేత్రము వంటిది ఈ భూమండలం మీద ఏదీ లేదు.
కనుక కార్తీకమాసంలో శివలింగార్చన చేయటం భక్తి ముక్తి దాయకాలుగా మనయొక్క పురాణాలు మనకు చెబుతున్నాయి. మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చు అనగా ‘ వల్మీకము“ అనగా పుట్టమన్నుతో చేసిన శివలింగము కలియుగమున విశేషమని చెప్పబడినది. శాస్త్రంలో మనకు వల్మీకము నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని అనేక వైదిక కార్యక్రమాలలో వినియోగిస్తారు. కనుకనే పుట్టమన్నును పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతుంది. ఇక శాస్త్ర సంబంధ విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చేసి అర్చించటం సత్వర విశేషఫలితం ఇస్తుంది.
పరమేశ్వరునకు కంఠము నందు అలంకారం అయిన నాగేంద్రుడికి నివాసస్థలం అయిన పుట్ట శివుడికి ఎంతో ప్రీతిని కలిగించును.
“మృత్తికల హనమే పాపం యన్మయా దుష్కూృతాం కృతం” అన్న వేదవాక్యం మనకు మృత్తిక స్పర్శనంవల్ల చేతనే, మనయొక్క చెడు స్వభావం, స్వయంకృత పాదములు తొలుగునని పురాణములు చెబుచున్నవి.
అందుకనేనపుట్టమన్ను పవిత్రమైనది.
పుట్టమన్ను శివలింగ రూపముగా మట్టిముద్దను చేసిన, అర్చన, అభిషేకం చేయటం సాధారణం,
సులభమైన మార్గము. మహాలింగార్చన లో 365 లింగములను ఒక క్రమ పద్దతి లో వేద మంత్రము
లతో కైలాస మహా యంత్ర రూపముగా అమర్చి శివలింగాకృతిని ఏర్పరచి మహాన్యాసముతో దేహ ఇంద్రియశుద్ది చేసుకొని నమక చమకములతోనఅభిషేకం చేస్తారు.
ఈ ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి చేసినను, ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితం పొందగలరు. ఇక సర్వోత్కృష్టమైన సహస్ర లింగార్చనా వేదమంత్రములతో పదహారు దశలలో ( ఆవరణములు) 1128 లింగములని ఒకదాని తరువాత ఒకటి శివప్రోక్తకైలాస రహస్య మహా యంత్ర ప్రకరణం ప్రకారంగా ఏర్పరుస్తూ చేయటం ఒక మహా అద్భుతం.
హైదరాబాద్ నుంచి వచ్చిన వేదభ్రాహ్మణులు మాతో ఈ కార్యక్రమము చేయించారు. 1128 లింగములు
చేసి ప్రొద్దున సంకల్పము, పూజా విధులు నిర్వహించాము. ఆడవారందరూ లలితా పారాయణ చేస్తూ
కుంకుమార్చన చేశారు. ’లక్ష ‘పారాయణము చేశారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|