15-04-2025, 11:52 PM
Excellent update sirji
Adultery బావ నచ్చాడు
|
16-04-2025, 05:36 AM
(15-04-2025, 12:32 PM)JustRandom Wrote: Episode - 18 JustRandom garu!!! Nice update Andi!!! Story is very interesting...Looks like this story is moving towards Spandana and Kittu's alliance (unless you give another twist..) ![]() ![]() ![]() ![]() ![]()
16-04-2025, 11:35 AM
Episode - 19
రాత్రి పదిన్నర అయింది. స్నానం చేసొచ్చి నైటీ వేసుకుని కూర్చుంది స్పందన. కిట్టుకి మెసేజ్ చేసింది. రాత్రి కాల్ చేస్తాను అన్నాడు. వెయిట్ చేస్తోంది. టెన్షన్ గా ఉంది. కళ్ళు మూసుకుని, ఊపిరి కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. కిట్టు కాల్. చేతులు చిన్నగా వోణికాయి. ఆన్సర్ చేసి స్పీకర్ లో పెట్టి బెడ్ మీద కూర్చుంది. కిట్టు: హలో. స్పందన: హలో. కిట్టు: తిన్నావా? స్పందన: తిన్నాను.. నువ్వు? కిట్టు: తిన్నాను. సారీ కొంచం లేట్ అయింది కాల్ చేయడానికి. స్పందన: అయ్యో పర్లేదు. ఎలా ఉంది అంకుల్ కి. కిట్టు: పర్వాలేదు. స్పందన: నీతో మాట్లాడుతున్నారా? కిట్టు: హా. అంటే ఎక్కువ ఏమి మాట్లాడట్లేదు. మాట్లాడితే వింటున్నారు. ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు. స్పందన: పోనీ లే. అదే మంచింది. కిట్టు: హ్మ్మ్ చెప్పు. స్పందన ఒక క్షణం ఆగింది. కిట్టు: హలో. ఉన్నావా? స్పందన: ఉన్నాను. నువ్వే చెప్పాలి. కిట్టు నవ్వాడు. స్పందన: ఎందుకు నవ్వుతున్నావు? కిట్టు: లొడ లొడ మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు ఇలా వింతగా ఉంది. కిట్టు ఆలా సరదాగా అనేసరికి కొంచం రిలాక్స్ అయింది. స్పందన: అవును. రెండు రోజుల క్రితం వరకు అంతా వేరే లాగా ఉంది. కిట్టు: హ్మ్మ్. మీ అమ్మగారు మాట్లాడారా? స్పందన: హా. నీతో మాట్లాడాను అని కూడా చెప్పింది. కిట్టు: హ్మ్మ్.. ఇంకేమన్నారు. స్పందన: ముందు నువ్వు చెప్పు. నీతో ఏమంది. కిట్టు: ఏమి లేదు. డైరెక్ట్ గా చెప్పారు. సమీర కి పెళ్లి ఇష్టం లేదు. కాబట్టి అది కాన్సల్ చేద్దాము అన్నారు. స్పందన: హ్మ్మ్.. నాకు కూడా అదే చెప్పింది. కిట్టు: ఇంక నీ మీద న ఒపీనియన్ ఏంటి అని అడిగాను. స్పందన: మరి ఏమి చెప్పావు. (మనసులో కుతూహలం పెరిగింది) కిట్టు: నీతో మాట్లాడాలి అని చెప్పాను. అంతే. ఇప్పుడు నువ్వు చెప్పు. స్పందన: నాకు అదే చెప్పింది. అక్కకి పెళ్లి ఇష్టం లేదు. ఆగిపోయింది. కానీ మీ ఫామిలీ మా అమ్మకి బాగా నచ్చింది. నువ్వు కూడా బాగా నచ్చావు. అందుకే ఎలాగూ నాకు పెళ్లి చెయ్యాలి కదా అని నన్ను అడిగింది. కిట్టు: ఓకే. బలవంత పెట్టట్లేదు కదా? స్పందన: లేదు. నా ఇష్టం అనే చెప్పింది. కిట్టు: హ్మ్మ్.. ఏమనుకుంటున్నావు? స్పందన: నువ్వు చెప్పు. కిట్టు: లేడీస్ ఫస్ట్. స్పందన: నో జెంట్స్ ఫస్ట్. కిట్టు: అలా అయినా ముందు నువ్వే చెప్పాలి. స్పందన కి అయిదు సెకెన్ల తరువాత అర్థం అయింది జోక్. స్పందన: ఏయ్! ఏంటి కిట్టు. ఇంత సీరియస్ విషయంలో కూడా జోక్ వేస్తావు. కిట్టు: అంతా సీరియస్ కాబట్టే కాస్త టెన్షన్ తగ్గించుకుందాము. స్పందన: నీకు కూడా టెన్షన్ ఉండ? కిట్టు: మరి ఉండదా? స్పందన: నీకెందుకు టెన్షన్? కిట్టు: నీకెందుకు ఉంది? స్పందన: నేను అమ్మాయింది బాబు. అందులో నువ్వు డైరెక్ట్ గా వచ్చిన సంబంధం కాదు. నిన్నటి దాక మా అక్కని చేసుకోవాలి అనుకున్నావు. ఇప్పుడు నన్ను అంటున్నావు. రేపొద్దున ఇంకొకళ్ళు నచ్చితే? స్పందన ఆలోచించకుండా పుసుక్కున అనేసింది. కిట్టు సైలెంట్ అయ్యాడు. స్పందన మాటలు గుచ్చుకున్నాయి. స్పందన: సారీ నా ఉద్దేశం అది కాదు. కిట్టు: పర్లేదు. టెన్షన్ లో ఉన్నావు. తప్పు లేదు అలా అనుకోవడంలో. కానీ పెళ్లి నేను కాన్సల్ చెయ్యలేదు. సంబంధం నేను ప్రపోస్ చెయ్యలేదు. అది గుర్తిస్తే నీకు నా మీద ఆ అనుమానం రాదు. నీకు అనుమానం ఉంటే మనము ఈ టాపిక్ ఆపేద్దాము. స్పందన ఖంగారు పడింది. నోరు కంట్రోల్ లేదు అని తనని తానె తిట్టుకుంది. స్పందన: సారీ కిట్టు. నా ఉద్దేశం అది కాదు. అంటే నేను నిన్ను అనట్లేదు. కానీ.. కిట్టు: నేను టాపిక్ ఆపేద్దాము అన్నాను పాపా. మనము ఫ్రెండ్షిప్ ఆపేద్దాము అనలేదు. ఖంగారు పడకు. స్పందన మోహంలో చిన్న నవ్వు వచ్చింది. హమ్మయ్య అనుకుంది. కిట్టు: నీకు ఇష్టం లేకపోతే అది కూడా వద్దు. స్పందన: నో నో. నాకు మన ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇలా ఉన్న ఎలా ఉన్నా. కిట్టు: అంటే? స్పందన: అంటే... ఒకవేళ మనము ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నా... నాకు ఫ్రెండ్షిప్ ఉండాలి. అది నాకు ముఖ్యం. కిట్టు: నాకు కూడా. మనము ముందు మంచి ఫ్రెండ్స్. అది నేను ఎప్పటికి మర్చిపోను. అలాగే నువ్వు కూడా మర్చిపోకు. స్పందన: అయితే నువ్వు కన్సిడర్ చేస్తున్నావా? కిట్టు: హ్మ్మ్. నీకు నిజం చెప్తాను. ఉన్నది ఉన్నట్టు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కొనసాగించాలి అనుకుంటున్నాము కాబట్టి. అసలు నాకు పెళ్లి వద్దు అనుకున్నాను. దానికి కారణాలు నీకు చెప్పాను. స్పందన కి కిట్టు చెప్పిన ఎఫైర్ గుర్తొచ్చింది. గుండెలో సలుపు మంది. అంటే ఆల్రెడీ ఆడవారి రుచి ఎరిగిన వాడు అన్న మాట గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అది అవసరమా? కిట్టు: నా అఫైర్స్ గురించి నీకు కూడా చెప్పాను. కొత్త రేలషన్శిప్ లోకి వచ్చేప్పుడు నిజాయితీగా రావాలి అని నా ఉద్దేశం. అందుకే ఇబ్బందికర విషయాలు కూడా చెప్పాను. కానీ నేను ఎప్పుడు కూడా నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నదా, ఏమి చేశారు, అఫ్ఫైర్లు ఉన్నాయా అనేది అడగను. నీ గతం నీ అనుభవం. నేను ఏమి చెయ్యలేను. కానీ నా అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. స్పందన: అక్కడే నాకు చిన్న ప్రాబ్లెమ్ ఉంది కిట్టు. నువ్వు ఇష్టంతో కాదు. వేరే వాళ్ళ కోసం పెళ్లి అంటున్నావు. మా అక్క ఎలా ఒప్పుకుందో నాకు తెలీదు. కానీ నాకు అలా కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనట్లేదు. కానీ పెళ్లి కావాలి అని పెళ్లి చేసుకునే వాడు కావలి. కిట్టు చిన్నగా నిట్టూర్చాడు. స్పందన: అందులో ఇప్పుడు ఈ పరిస్థితులు. నాకు అందుకే టెన్షన్ గా ఉంది. కిట్టు: నువ్వన్నది నిజమే. కానీ నేను ఏ కారణం లో పెళ్లి చేసుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు. పెళ్లి అయ్యాక ఎలా ఉంటాను అనేది ముఖ్యం. అది నేను అయినా, నువ్వు అయినా ఎవరైనా. ఆ విషయానికి వస్తే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెళ్లి అయ్యాక ఎలా ఉంటాడో తెలీదు కదా. నాకు అయినా అంతే. మీ అక్క ముందే చెప్పేసింది. లేదు పెళ్లి చేసుకున్నాక కూడా చెప్పచు. అప్పుడు ఎలా ఉండేదో. మనకి తెలియని వాటిగురించి మనము ఏమి చేయలేము. స్పందన కి కిట్టు మాటలు అర్థం అయ్యాయి. నిజమే కదా అనుకుంది. స్పందన: హ్మ్.. కరెక్ట్ ఏ అనుకో. కిట్టు: ఇప్పుడు కూడా నేను ఆగి వేరే చేసుకోవచ్చు. అది ఎలాంటిది వస్తుందో, ఎవరో నాకు కూడా తెలీదు. నా అదృష్టం నాకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా అనుకున్నాను. కానీ.. స్పందన కి కుతూహలం. స్పందన: కానీ ఏంటి? కిట్టు: కానీ నిన్న మీ అమ్మగారు ఒక మాట అన్నారు. నీకైనా మా అమ్మాయికి అయినా వేరే ఎదో సంబంధం చూడాల్సిందే. కానీ మీరు ఒకరికి ఒకరు పరిచయం ఉన్నవారు కాబట్టి ఒకసారి ఆలోచించమన్నారు. ఒప్పుకుంటే నెలలో పెళ్లి చేయచ్చు అన్నారు. స్పందన: నెలలో నా. నాకు ఆ మాట చెప్పలేదు. కిట్టు: ఓహ్. స్పందన: హ్మ్మ్.. నాకు అదే చెప్పింది. కిట్టు: సరే ఒకటి అడుగుతాను. నిజం చెప్పు. మీ అమ్మ నా గురించి చెప్తే నీకు వచ్చిన ఆలోచన ఏంటి? స్పందన: హ్మ్మ్తె.. ముందు భయం వేసింది. అక్కకి అన్యాయం చేస్తున్నాను అని. కానీ అమ్మ వివరించి చెప్పింది. ఆ పెళ్లి కథ ముగిసినట్టే అని. తెలిసిన అబ్బాయి. నువ్వు కూడా చూసావు. ఆలోచించు అని. కానీ మా అమ్మకి తెలియదు కదా మనము ఫ్రెండ్స్ అని కొన్ని సీక్రెట్ లు కూడా చెప్పుకున్నాము అని. సరే నీ గురించి ఆలోచిస్తే నాకు భయం వేయలేదు. టెన్షన్ ఉంది. కానీ ఎవడో స్ట్రేంజర్ అనే భయం లేదు. పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అన్న భయం మాత్రమే ఉంది. కిట్టు: హ్మ్మ్. నాకు అంతే. స్పందన: మరి ఏమి చేద్దాము? కిట్టు: నా ఉద్దేశం నేను చెప్తాను. నీ ఉద్దేశం నీది. అమ్మ నాన్న కోసం పెళ్లి అనుకున్నాను. అనుకోకుండా నీ సంబంధం వచ్చింది. మన స్నేహం ఏమి ఏళ్ళ తరబడి ఉన్నది కాదు. ఇప్పటి దాకా నాకు నీ గురించి అన్నీ నచ్చినాయి. అందుకే, నిన్ను చేసుకోవాలి అన్న ఐడియా ఐకి నేను ఓపెన్. నువ్వు ఒకే అంటే నాకు అభ్యంతరం లేదు. కొంచం ఆక్వర్డ్ గా ఉండచ్చు మొదట్లో మీ అక్కతో. కానీ మనము అందరమూ మెచూర్డ్ మనుషులం. అది సద్దుకుంటుంది. స్పందన కి మనసులో ఆనందం. భయం. ప్రశ్నలు. ఇలా ఎన్నో కలగలిపిన ఆలోచనలు. ఇప్పుడు తాను ఏమి చెయ్యాలి. కిట్టు: సరే పాపా. పడుకో. టైం మూడు అవుతోంది. పొద్దున్నే చిన్న పనులు ఉన్నాయి. స్పందన: ఏమి పనులు? లీవ్ పెట్టలేదు? కిట్టు: పెట్టాను. కానీ పెళ్లి కాన్సల్ కదా. చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అలా బెడ్ మీద పడుకుంది. ఆలోచనల ప్రవాహం వచ్చింది. కిట్టు ఒప్పేసుకున్నాడు. వద్దు అనాలా? అనడానికి కారణం లేదు. మంచోడు. అక్క విషయం పక్కన పెడితే, ideal అబ్బాయి. సెన్స్ అఫ్ హ్యూమర్ ఉంది. ఏ విధంగా చుసిన నో చెప్పడానికి కారణం లేదు. కానీ అక్క విషయం ఏంటి? ఆలోచనలో రెండు గంటలు గడిచిపోయాయి. ఉదయం వంటింట్లో చిన్న శబ్దాలు అయ్యాయి. వెళ్లి చూసింది. అమ్మ లేచేసింది. సరోజ: ఏంటి నాన్న అప్పుడే లేచావు? స్పందన: అసలు పడుకోలేదు అమ్మ. అదే టైం కి సమీర రూమ్ లోంచి బయటకి వచ్చింది. సరోజ: కాఫీ తాగుతారా? ఇద్దరు తల ఊపారు. ***** ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతున్నారు. సరోజ: వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది? స్పందన: పర్లేదట. రెస్ట్ తీసుకుంటున్నారు. సమీర వైపు చూసింది స్పందన. మొహం కాస్త తేరుకున్నట్టు ఉంది. బహుశా సరిగ్గా నిద్రపోయినట్టుంది. పెళ్లి కాన్సల్ అయ్యాక అక్క మొహం కొంచం బెటర్ గా ఉంది. సరోజ: చెప్పమ్మా. ఇంకేంటి విశేషాలు. స్పందన సందేహించింకి అక్క ముందు చెప్పడానికి. సమీర అది గమనించింది. సరోజ: పర్లేదు చెప్పు. స్పందన: నేను ఏమి అనలేదు. కానీ కిట్టు ఒకే అన్నాడు. సమీర: హమ్మయ్య (అని రెండు చేతులు జోడించుకుని పైకి చూసి దేవుడికి దణ్ణం పెట్టింది) స్పందన ఊహించలేదు అక్క రిలీఫ్ ఫీల్ అవుతుంది అని. సరోజ: మరి నువ్వేమన్నావు? స్పందన: ఇంకా ఏమి చెప్పలేదు. కానీ నో చెప్పడానికి నాకు కారణాలు కనిపించట్లేదు. సరోజ చిన్నగా నవ్వింది. కూతురు మనసు అర్థం అయింది. సరోజ: అక్క ఏమి అనుకోదు. మనసులో ఉన్నది చెప్పు. స్పందన ఏమి అనలేదు. సరోజ ఇద్దరు కూతుళ్ళని రమ్మని చేతులు చాపింది. ఇద్దరు వచ్చి తల్లి అటు ఇటు కూర్చున్నారు. తల్లి చెరో భుజం మీద తలలు వాల్చి ఉన్నారు. సరోజ ఇద్దరిని తలా మీద చిన్నగా ముద్దు పెట్టింది. తలా నిమురుతూ అంది. సరోజ: చిన్న తల్లి, నువ్వు ఇష్టం అని చెప్తే అక్క బాధ పడదు. చాలా సంతోషిస్తుంది. సమీర: నా పెళ్లి కాన్సల్ అయినందుకు నాకు బాధ లేదు చెల్లి. పెద్ద భారం తగ్గినట్టుంది. కానీ ఒక మంచి కుటుంబం నా వల్ల బాధ పడుతోంది అని ఉంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నేను చేసిన తప్పు సరిదిద్దడమే కాక నీకు ఒక మంచి మొగుడు వస్తాడు. నా ఆనందానికి హద్దులు ఉండవు. స్పందన కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. అది బాధ కాదు. ఆనడం కాదు. ఏంటో తెలీదు. స్పందన: మరి నువ్వేమి చేస్తావు అక్క? మమ్మల్ని వదిలేసి ఏటో వెళ్ళిపోతా అని అంటున్నావు. సమీర: అది మిమ్మల్ని వదిలి కాదు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. సమాజానికి ఏదోకటి చెయ్యాలి అని. సాఫ్ట్వేర్ ఉద్యోగం బానే ఉంది. కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అందుకే, NGO లో చేరుతా అన్నాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను. వర్క్ పరంగా తిరుగుతాను. వీలున్నప్పుడు వస్తాను. స్పందన: అంటే దూరంగా ఉంటావా? సమీర: నువ్వు అమెరికా లో ఉన్నప్పుడు కూడా దూరమే ఉన్నాము. కానీ మన మధ్య ఎమన్నా దూరం వచ్చిందా? లేదు కదా. ఇది కూడా అంతే. నువ్వు ఎప్పుడు నా చిట్టి చెల్లివే. స్పందన: మరి నీ ట్రీట్మెంట్? సరోజ: అది నేను చూసుకుంటాను. స్పందన కళ్ళల్లోంచి నీళ్లు ధారాళంగా వస్తున్నాయి. అక్క అమ్మ ఇద్దరికీ క్లారిటీ ఉంది. కిట్టు ని చేసుకుంటే ఏది ఉన్నా లేకపోయినా, అమ్మ అక్కలతో తన చనువు మాత్రం పోదు. మిగతా విషయాలు అన్నీ అవే సద్దుకుంటాయి. స్పందన: సరే అమ్మ. సరోజ: ఏంటి సరే? స్పందన: నేను కిట్టుని చేసుకుంటాను. సమీర స్పందన చేతిని ముద్దు పెట్టుకుంది. సరోజ ఇద్దరు కూతుళ్ళని దెగ్గరికి తీసుకుని వాటేసుకుంది. ఇంకా ఉంది
16-04-2025, 12:01 PM
నిజంగా ఇలాంటి సిచ్ఛ్యువేశన్ లో వాళ్ల మానసిక స్థితి ఏలా ఉంటుందో బాగా రాసారు...
16-04-2025, 01:56 PM
Finally oppenchesaru bayya
pelli (next update) epudu mari
16-04-2025, 04:26 PM
Wow superb final ga opeskunaru ah blouse kutinchina mata prathi palam okate ayye lagane unnaru Inka emaina twist lu pettara yendi
16-04-2025, 04:44 PM
Good narration
The story name came in this update Thanks for the story Keep going |
« Next Oldest | Next Newest »
|