Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
10-04-2025, 09:05 AM
(This post was last modified: Yesterday, 02:03 PM by k3vv3. Edited 5 times in total. Edited 5 times in total.)
మనలో చాలా మందికి అమ్మమ్మలతో చాలా మాంచి అనుబంధాలు, తీపి గుర్తులు ఉంటాయి.
వాటిని పునశ్చరణ చేసుకోవడానికి మాత్రమే ఈ కథలు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
"అమ్మమ్మగారిల్లు"
ఆప్యాయత అనురాగం మమకారం
"ఒరేయ్ పండు.. లేరా!
బారెడు పొద్దెక్కిన ఇంకా ఆ మొద్దు నిద్ర వదలవు".
అని అమ్మ పిలుపు నా కమ్మటి నిద్రలోకి చేరుకుంది.
"అబ్బా!! కాసేపు ఉండమ్మ", అని నేను బద్దకంగా...
"ఏదో కాలేజ్ ఉన్నట్టు అప్పుడే లేపుతావు, నిన్నటి నుండి కాలేజ్ కి వేసవి సెలవలు కూడా ఇచ్చేశారు కదా వాడికి, కాసేపు పడుకోని వాడిని" అని నాన్న.
"హా.. మీదెం పోయింది! ఎక్కడో గోదారి అవతలకి వెళ్ళాలి మా పుట్టింటికి. సుమారు నాలుగైదు గంటల ప్రయాణం ఆ భానుడి ప్రతాపం తట్టుకుని, బస్సులు మారుతూ ఉరుకులు పరుగులతో వెళ్ళాలంటే, ఆ నొప్పి వీళ్ళని తీసుకెళ్ళి ఆక్కడ దింపి వచ్చే నాకు తెలుస్తుంది, మీకేం మీరు బాగానే మాట్లాడతారు.
నిన్నటి వరకూ ఎప్పుడెప్పుడు తీసుకెళ్తావ్ అని పేచీ పెట్టీ మరీ విసిగించాడు. ఇప్పుడేమో చడీ చప్పుడు లేకుండా ఎలా పడుకున్నాడో?. నాకేం మీకిష్టం లేకపోతే ఇందులో ఇక నా బలవంత మేముంది". అని అమ్మ
"అబ్బబ్బా ఇక చాలు ఆపవే నీ నస.." అని నాన్న
ఆ చర్చంత విన్న నేను నిద్ర లో నుండి ఉలిక్కి పడి లేచి, కింద మంచం వైపు చూశాను. దాని పై చెల్లి లేదు, మంచం కాలిగా ఉంది. ఆదమరుపుగా పక్కకి తిరిగే లోపు, అది వేరే గదిలో నుండి వస్తూ నుండి అప్పటికే ప్రయాణానికి సిద్దమవుతూ కనిపించింది.
"ఏరా..!! నువ్వు రావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి" అని అది,
"వాడు రాడేమో? మీరు వెళ్లి రండి" అని నాన్న. అసలే నన్ను నిద్ర లేపకుండా అమ్మతో తిట్టించింది కాక, వాళ్ళ వెటకారపు మాటలకి, అప్పటికే నెమ్మదిగా తెరుచుకుంటున్న నా కళ్ళు రెండూ పెద్దవయ్యాయి. చూసింది చాల్లే! ఇక వెళ్లి తొందరగా ప్రయాణమవ్వు అన్నట్టు వాళ్ళ చూపులు.
బస్ కూడా హార్న్ కొడుతూ ఊళ్ళోకి వెళ్ళింది. దాంతో అమ్మ "ఇక వీడితో పెట్టుకుంటే ఈ రోజు ప్రయాణం సాగినట్టే." అన్న మాటలు నా చెవులను తాకాయి. అది తిరిగి వచ్చే లోపు నేను రెఢీ అవ్వాలి. లేదంటే ఈ రోజు ఈ బస్ మిస్ అయితే, మళ్లీ రేపటికి వాయిదా పడుతుంది ఈ ప్రయాణం అన్న భయం నాలో.
అదరబాదరా గా ఎలానో రెఢీ అవ్వక తప్పేదే కాదు.
అంతిష్టం మాకు మా అమ్మమ్మగారి ఊరు వానపల్లి అంటే.
అసలు మాకు వేసవంటే ఆ ఊరు, అక్కడికి వచ్చే అమ్మ తరుపు బంధువులు. నాకు, మా చెల్లికి ప్రతీ వేసవి విడిది, స్వర్గాన్ని తలపించే ఆ ప్రదేశమే.
అమ్మ చెప్పినట్టు ఎక్కడో గోదారి అవతల,
తూర్పు గోదావరి జిల్లా వానపల్లి.
బస్సు ఎక్కింది మొదలు, అక్కడికి చేరేవరకు ఎప్పుడెప్పుడు చేరుతామా అన్న ఆలోచనలతోనే ఆ ప్రయాణం కొనసాగేది.
పదుల సంఖ్యలో ఊళ్ళని, పట్టణాలను దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది.. అక్కడుండే పరిసరాలలో పట్టణాల్లోనీ మేడలు, పల్లెల్లో కాపుకొచ్చిన పంట, పాడి పశువులు, అరటి తోటలు, ఇటుకల బట్టీలు, ఫ్యాక్టరీలు, వాగులు - వంకలు, గుళ్ళు - గోపురాలు ఒకటా రెండా..ఎన్నో భూలోక అందాలన్నీ, మా ఈ రెండూళ్ళ మధ్యలోనే ఉన్నట్టనిపించేవి.
వెళ్లి వచ్చే ప్రతిసారీ ఆ పెరవలి హనుమంతుని భారీ కాయ విగ్రహానికి, బస్సు అద్దాల నుండి మేము మొక్కని కోరికలంటూ లేవు. ఇక ఆ సిద్ధాంతం రాగానే గోదారి బ్రిడ్జి పై వెళ్తుంటే, ఆ గోదావరి నీటిపై నుండే వీచే ఆ చల్లటి గాలి బస్సు కిటికీల ద్వారా మా మనసు లోగిళ్ళలో దూరి కితకితలు పెడుతుంటే ఆ అనుభూతి వర్ణించగలమా..??
అల.. బస్సు కిటికీ అద్దాలనుండి చూస్తూ ప్రతీ అనుభూతిని ఆస్వాదిస్తూ సాగేది మా ప్రయాణం.
అమ్మమ్మ వాళ్ళ ఊరి పొలిమేర రాగానే, ప్రతి గడప చూస్తూనే ఉండేవాళ్ళం. వాళ్లిల్లు రోడ్డు పక్కనే, అందరి ఇల్లుల్లు (పెంకుటిల్లు) ఒకేలా ఉండడం వల్ల మాకు కనుక్కోవడం కొంచెం కష్టంగానే అనిపించినా.
అమ్మకి పుట్టినిల్లు కాబట్టి తనకి సునాయాసమే.
ఆటో లోనుండి దిగగానే ఆ విశాలమైన పెంకిటింటిని చూసి మనసు తరించి పోయేది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
ఆప్యాయంగా ఆహ్వానించే వీధి అరుగు, గదులు, మధ్యలో విశాలమైన మండువ, వరండా, వెనుక వసారి, ఓ పెద్ద వంట గది, సువిశాలమైన ప్రాగణం. ఇంట్లోకి రమ్మని మనసారా స్వాగతించే చేతి పంపు కుళాయి.
పెద్ద పెద్ద మేడలు కోసం ఎగబడుతున్న ఈ రోజుల్లో, నాకీ పెంకుటిల్లు లాంటి ఇల్లు నిర్మించాలని ఉందని చెప్తే అందరూ వింతగా చూస్తారు. పాతకాలపు వాడనని హేళన చేస్తారు.
అయినా... మండువా లోగిళ్ళలాంటి ఇంటిని నిర్మించాలనేది నా చిరకాలపు వాంఛ!
ఇక అమ్మ తరుపు బంధువులు, వాళ్ళ పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. దాదాపు ఒక పదిహేను మంది వరకూ పిల్లలు, మా అల్లరి తట్టుకోవడం ఇంట్లో పెద్ద వాళ్ళందరికీ ఒకింత సవాలుతో కూడుకున్నదే. ఆ అల్లరిని అదుపు చేయడం ఎవరి తరమయ్యేది కాదు, ఒక్క ఆ హిట్లర్ కి (చిన్న మామయ్య) తప్ప. ఇక ఆ చిన్న మావయ్య పేరు (ఆది బాబు) వింటేనే ప్యాంట్లు తడిచేవి మాకందరికీ.
కానీ, అమ్మమ్మకి మాత్రం ఆ మాత్రం చూడముచ్చటగా ఉండేది. తను చెప్పిన కథలు, పాడిన జోలలు ఇప్పటికీ నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి.
పెద్ద, రెండో మావయ్యలదీ హోటల్. పెద్ద మావయ్యది ఎంటి దగ్గరే అయినా, రెండో మావయ్యది మాత్రం ఎక్కడో మైలు దూరాన సినీ టాకీస్ ఎదురుగా, అక్కడే వాళ్ళ ఇల్లు కూడా. ఆ పక్కనే చిన్న మావయ్య బడ్డీ దుకాణం.
మేమొ ఆ ఊరు వెళ్తే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే వుండేవాళ్ళు. ఒక్కోసారి.. మేమంతా కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడున్న టాకీస్ ఆ ఊరికి అదొక్కటే. టీవీ లో ప్రసారమయ్యే పాత సినిమాలే అందులో ఆడినా, మా సరదాల కోసం రెండో మావయ్య ఆ టాకీస్ కి పంపేవారు.
కొత్త సినిమాలైతే, వాళ్ళకున్న డీవీడీ ప్లేయర్లోనే చూసేవాళ్ళం.
ఆ రోజుల్లో అవి చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేవి. చిరంజీవి ఇంద్ర సినిమా ఎన్ని సార్లు చూశామో లెక్కేలేదు.
హోటల్ పని ఒత్తిడి వల్ల అసలు ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎక్కువ తీరిక ఉండేది కాదు. మధ్యాహ్నం మాత్రం అందరూ ఆ మండువా(హల్) లో సేదతీరుతూ, చిన్నా పెద్ధా తేడా లేకుండా ఆట పాటలతో సరదాగా గడిపేవాళ్ళం.
వేసవంటే ఎప్పుడో కానీ, వర్షించని మేఘాలు. ఆ మండువా తెర ద్వారా మేఘాల నుండి జారే వర్షపు జలపాతంలో తడుస్తూ గోల చేయడమంటే మాకొక మధురానుభూతది.
వడగళ్ల వానలో తడుస్తూ, ఆ ఐసు ముక్కలను పోటీపడి మరీ ఏరుకోవడం మహా సరదా...
వీధి అరుగుపై కూర్చుని , వచ్చి వెళ్ళే కార్లను లెక్కపెట్టడం సాయంత్రపు కాలక్షేపం.
శ్రీనుగాడి అమాయకత్వం, నాగ్గాడి చలాకి తనం, చిన్ని గాడి కష్ట పడే తత్వం, (అంతా నాకు అన్నయ్యలే).
పెద్ద బావ గడుసు తనం, చిన్నోడి తింగరితనం(పెద్ద మావయ్య గారి అబ్బాయిలు), ఫణిగాడి (రెండో మేనమామ గారి అబ్బాయి) స్నేహాభావం. పల్లవి, దీపక్ (హిట్లర్ కూతురు, కొడుకు) ల పెంకితనం, అల్లరితనం. ఫణి, వెంకీ(లక్ష్మక్క పిల్లలు) ల కల్లా కపటతత్వం...
మా దేవక్క (పెద్దనాన్న గారి అమ్మాయి) చేసే ఆవకాయ ఇడ్లీ గోరుముద్దలు, ఇందు అక్క నేర్పిన దాగుడు మూతలు, చిన్న బుజ్జక్క ఆడించే అష్ట చెమ్మా, పెద్ద బుజ్జక్క పంచిన మమకారం, లక్ష్మక్క చెప్పే ఊసులు, ఉన్న ఒక్క మరదలితో (రెండో మావయ్య గారి అమ్మాయి) మిగిలిన పిల్లలంతా ఆట పట్టిస్తుంటే సిగ్గుపడిన సరదా క్షణాలు ఎన్నో.. ఎన్నెన్నో...
పెద్దమ్మల ఆప్యాయతలు, పెదనాన్నల అనురాగాలు,
మేనమామాలతో సరదాలు, మేనత్తలతో వేళాకోళాలూ
వీటన్నింటికీ తోడు అమ్మమ్మ చూపే ఎనలేని గారాబం.
పొద్దస్తమాను మా అన్నదమ్ములకు (నాకు , ఆ చిన్ని గాడికి) ఆ మావయ్య ల హోటల్ లోనే చాకిరేవు సరిపోయేది. అరె! పాపం చెల్లెళ్ళు గార్ల పిల్లలు, ఎప్పుడో కానీ రారు, చుట్టం చూపుకు వచ్చారు! అని జాలి కూడా ఉండేది కాదు వాళ్ళకి. పొద్దు పొద్దున్నే లేపేవారు. నేనింకా పర్లేదు వేసవి లో మాత్రమే, చిన్ని గాడు(పెద్దమ్మ గారి అబ్బాయి) కాలేజ్ జీవితం అంతా, అక్కడ దానికే సరిపోయింది. అంత చేసినా, చిన్న తప్పు చేస్తే కసిరేవారు, తిట్టేవారు. అప్పట్లో అవి భయాన్ని, కోపాన్ని కలిగించినా, ఈ రోజు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటున్నాం అంటే అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే. వాళ్ళ పడ్డ ప్రతి కష్టం మాకు ఆదర్శమే.
పెద్ద మావయ్య దగ్గర నుండి అలవరుచుకున్న సంస్కారం.
నడి మావయ్య నేర్పిన సహనం, ఓపిక.
చిన్న మావయ్య పెట్టిన క్రమశిక్షణ.
అందరికీ మేనమామ పోలికలోస్తాయి అంటారు కదా!!, మాకు మాత్రం గుణ గణాలు కూడా వారు పెట్టిన భిక్షే.!
ఇక అక్కడ నెల్లాళ్ళు పాటు జరిగే గ్రామ దేవత పల్లాళ్ళమ్మ ఉత్సవం ఒక విశిష్టత. జాతరలో దర్శనమిచ్చే బొమ్మల కొలువులు, సర్కస్లు, రంగుల రాట్నాలు, మిఠాయి దుకాణాలు, ఊరేగింపులు, అబ్బో చెప్తుంటే తనివి తీరదు.. మళ్ళీ అక్కడికి వెళ్ళినా.. ఆ రోజులైతే తిరిగి చేరుకోలేము.
పిల్లల్లో ఎవరికేం కొన్నా ఒక్కటే కొనాలి, లేకపోతే ఒక మహా యుద్దమే. ప్రశాంతత తో కూడిన ఆ ఇల్లు కాస్తా వేసవిలో యుద్ద వాతావరణాన్ని తలపించేది మా అల్లరితో.
ఇంతలో జూన్ రెండో వారం రానే వచ్చేది,
సెలవులు అయిపోయాక అక్కడి వాతావరణాన్ని, అమ్మమ్మని విడిచి రావాలంటే మా అందరి కళ్ళు, కన్నీటి సంద్రంలా తడిచి ముద్దయ్యేవి. తనని పట్టుకుని బోరున విలపించేవాల్లం. మా వేదన విని అమ్మమ్మతో పాటు ఆఖరికి ఆ ఆకాశం కూడా ఓర్చుకోలేక ఆ కాలంలోనే వర్షాన్ని సృష్టించి తమ గోడును వెళ్ళబుచ్చుతున్నయా అన్నట్టనిపించేది.
ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చెరపలేని మధురానుభూతులు మరుపురాని జ్ఞాపకాలుగా ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.
అందుకే అమ్మమ్మగారిల్లు ఎప్పటికీ "ఓ భూలోక స్వర్గధామమే."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
18-04-2025, 09:28 AM
(This post was last modified: 18-04-2025, 09:29 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అమ్మమ్మ
అమ్మమ్మ వంటగది మాకు ఎప్పుడూ వింతగా ఉండేది. అది అమ్మమ్మ ప్రపంచం. అమ్మ, పిన్ని తప్ప వేరే ఎవరికీ అక్కడ ప్రవేశం ఉండేది కాదు. అమ్మమ్మ, తాతయ్య ఉండేది శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూళ్ళో. అమ్మ కాకుండా ఒక పిన్నీ, ఇంకో ముగ్గురు మామయ్యలు ఉండేవాళ్ళు నాకు. అందరూ వాళ్ళ కుటుంబాలతో సెలవుల్లో తాతగారి ఊరు చేరుకునేవాళ్ళం. ఇంతేకాకుండ ఇంకా మిగిలిన చుట్టాలు కూడా చేరేవాళ్ళు మాతో.
మొత్తం ఒక నలభైమంది పిల్లలు, ఇరవైమంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళమేమో. తాతగారిల్లు సెలవుల్లో కళకళ లాడేది. అయినా ఇంకా కొంతమంది ఆ ఇంట్లో ఉండడానికి బోలెడు ఖాళీ ఉండేది అంటే ఆ ఇల్లు ఎంతపెద్దదో మీరు ఊహించుకోవచ్చు. అమ్మమ్మకి వంటపనిలో సాయంగా అమ్మా, పిన్నీ ఉండేవాళ్ళు. మిగిలిన ఆడవాళ్ళకీ మగవాళ్ళకి ఎవరికీ ఆ గదిలో ప్రవేశం ఉండేది కాదు. కారణం పూర్వం నుండి ఉన్న మడీ ఆచారాలు కారణం.
ప్రధానంగా వ్యవసాయ కుటుంబం కావడంతో పనిచేసే మనుషులు కూడా సుమారు పది పదిహేను మంది ఉండేవాళ్ళు. వీళ్ళే కాకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళూ తాతయ్య గారింట్లో పని చేసేవారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.....
ఉదయం కోడి కూసే వేళకి అమ్మమ్మ నిద్రలేచేది. దేవునికి దణ్ణం పెట్టుకొని, కాలకృత్యాలు ముగించుకొని వంట గదిలోకి వెళ్ళి వంటగదిలో ఉన్న కట్టెల పొయ్యిని పేడతో శుభ్రంగా అలికేది . ఆ పని ఇంట్లో ఉన్న కోడళ్ళ చేత చేయించొచ్చు.కానీ ఎందుకో కోడళ్లతో ఆవిడకి సఖ్యత ఉండేది కాదు. పేడతో కట్టెల పొయ్యిని అలికి ముగ్గులు పెట్టి, స్నానం చేసి వచ్చి, పూజ గదిలో దీపారాధన చేసేది. అప్పటికి అమ్మా, పిన్నీ తమ పనులు పూర్తిచేసుకొని వంటగదిలోకి వెళ్ళి పెద్దవాళ్ళకి కాఫీ ఏర్పాట్లు చేసేవారు. పిల్లలకు ఉదయం గ్లాసు పాలు ఇచ్చేవారు.
మా ఇళ్ళల్లో మొదటినుండి క్రమశిక్షణ అలవాటు. మొదట పనిలోకి వెళ్ళే పాలేర్లకి టీ లు భోజనాలు సిద్ధం చేసి, ఉదయం తొమ్మిదో గంటకి వాళ్ళని పొలం పనులకి పంపించాలి. ఆ టైం లోగా పాలేర్ల పిల్లలకి భోజనాలు పెట్టి పంపిస్తే వాళ్ళు బళ్ళోకి వెళ్లడమో, ఆడుకోడానికి వెళ్లిపోడమో జరిగేది. తరువాత సెలవులు కోసం వెళ్ళిన మమ్మల్ని ఇంకో గదిలో కూర్చోపెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ లో రాగి జావ తప్పనిసరిగా ఉండేది. నాకేమో ఆరోగ్య సమస్యలుండేవేమో, ఉదయాన్నే పెట్టిన రాగిజావ లేదా అన్నం పడేది కాదు. అందరిలోకి ప్రత్యేకంగా పెడితే మిగిలిన పిల్లలతో ఇబ్బంది అవుతుందని అమ్మమ్మ కోప్పడి అదే తినమనేది.
నాకు మొదటినుండి అమ్మదగ్గర చేరిక ఎక్కువ. అమ్మ వంటగదిలోనుండి బయటికి వచ్చేది కాదు. నేనేమో వంటగది కి ఉన్న ఒక కిటికీ దగ్గర అమ్మకోసం ఎదురుచూస్తూ గడిపేవాణ్ణి. పెద్దవాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు అమ్మ నాకు ఒక ఇడ్లి తినిపించేది. నాకేమో అంతకంటే ఎక్కువ తింటే అసలు పడేది కాదు. మళ్ళీ పదకొండు గంటలయ్యేసరికి పనివాళ్ళకోసం వంటలు చెయ్యాలి. వాళ్లంతా కారం బాగా తింటారేమో, ప్రత్యేకంగా కూరలు చెయ్యాల్సి వచ్చేది. అప్పటికే వాళ్ళకి భోజనాలు తీసుకెళ్లడానికి వచ్చే మనిషి వందసార్లు అరిచి గోల పెట్టేవాడు టైం అయిపోతోంది తొందరగా గిన్నెల్లో పెట్టేసి ఇస్తే తీసుకెళ్తా అంటూ కంగారు పెట్టేవాడు.
ఆ టైం కి మా పిల్ల బ్యాచ్ ఆటలు ఆడి , మళ్ళీ ఆకలి అంటూ వంటగది చుట్టూ తిరిగేవాళ్లు. నేను ఎప్పుడో కానీ, వాళ్ళతో ఆటలకి వెళ్ళేవాడిని కాదు. స్వతహాగా నెమ్మదిగా ఉండే నేను నా జోలికి వచ్చేవాళ్ళని పెద్దా చిన్నా తేడాలేకుండా నా పద్ధతిలో కొట్టేవాణ్ణేమో, నన్ను ఆటల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు.
అమ్మమ్మ వంటగదిలో వచ్చే సువాసనలు అందరిలో ఆకలి పుట్టించేవి. రోజూ లంచ్ కి కనీసం రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, పులుసు అప్పడాలు వడియాలు, గడ్డపెరుగు ఇది కాకుండా ఒకటో రెండో స్వీట్ లు ఉండవలసిందే. నాకు ఇప్పటికీ ఆ అలవాటు పోలేదు. లంచ్ టైం లో తప్పకుండ స్వీట్ ఉండవలసిందే. లేకపోతె భోజనం చేసినట్లు అనిపించదు.
మధ్యాహ్నం కాసేపు వంటగదికి విరామం ఉండేది. ఆ టైం లో అమ్మమ్మ నిద్రపోతుందన్నమాట. అప్పుడు మనలో ఆకలి విజృంభిస్తుంది. నెమ్మదిగా అమ్మ పక్కన చేరి, అమ్మకి కాళ్ళు నొక్కుతూ, కబుర్లలో దించేవాణ్ణి. వంటగదిలో ఏమైనా తినడానికి ఉన్నాయేమో వాకబు చేసేవాణ్ణి. పాపం పిచ్చి అమ్మ. మన ప్లాన్ తనకి తెలీదు కదా. చేగోడీలు, జంతికలు, కాజాలు, అరిసెలు, సున్నుండలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేది. ఉదయం నుండి అలిసిపోయిన అమ్మ ని చిన్న పిల్లని చేసి సులభంగా మోసం చేసేసేవాణ్ని.
పిల్లలంతా పొలం వైపు ఆటలకి వెళ్తే, నేను మాత్రం ఇంట్లోనే పుస్తకం చదువుకుంటూ, అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న టైం లో కిచెన్ లోకి వెళ్ళి ఒక సున్నుండ నోట్లో పెట్టుకొని, ఒకటో రెండో స్వీట్లు, చేగోడీలు, జంతికలు నిక్కర్ జేబుల్లో నింపుకొని అంతే నిశ్శబ్దంగా వంటగది తలుపు మూసేసి బయటికి వెళ్లిపోయేవాడిని. విచిత్రం ఏమిటంటే అమ్మమ్మ ఎలా కనిపెట్టేదో ఏయే తినుబండారాలు తగ్గాయో లెక్క చెప్పేసేది. నేను చేసిన పని అమ్మకి నాకు తప్ప మూడో కంటికి కూడా తెలిసేది కాదు. ఇద్దరం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్ళం.
సాయంత్రం అమ్మకి, పిన్ని కి కిచెన్ లో పనేమీ ఉండేది కాదు. కేవలం కోడళ్లతో పనిచేయిస్తూ అమ్మమ్మ అజమాయిషీ చేసేది. అప్పుడు అమ్మా, నేను చేసే అల్లరికి అస్సలు హద్దుండేది కాదు. జామచెట్లకు మిగిలిన ఒకటీ అరా కాయలు కోసుకునేవాళ్ళం. లేదా కబడ్డీ, బాడ్మింటన్ లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్యలోకి రావడానికి ఎవరూ సాహసించేవాళ్ళు కాదంటే నమ్మండి. మా ఆటల్లో రూల్స్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అదీ మాకు నచ్చినట్లు. అందువలన మా ప్రపంచంలోకి ఇంకెవరికీ ప్రవేశం ఉండేది కాదన్నమాట.
రాత్రి డిన్నర్ అయ్యాకా అమ్మమ్మ పిల్లలందరిని కూర్చోపెట్టి మంచి మంచి కథలు చెప్పేది. ఆ కథలు కూడా రామాయణం, భారతం లాంటివి మాత్రమే కాదు.. విలియంటెల్, కౌంట్ అఫ్ మాంటెక్రిస్టో, అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్, ఆలివర్ ట్విస్ట్ లాంటి కథలు అక్షరం పొల్లుపోకుండా చెప్పేది. అమ్మమ్మ ఏం చదివిందో మాకు తెలిసేది కాదు. సెలవులకు వెళ్ళినప్పుడు మొదలు పెట్టిన నవల కథని, మేము తిరిగి మా ఇళ్ళకి చేరే రోజు సరికి పూర్తి చేసేది.
సెలవులు చక్కగా గడిపేసి ఇంటికి తిరుగు ముఖం పట్టిన మాకు, చక్కని అనుభూతిని మిగిల్చేది అమ్మమ్మ. అప్పుడప్పుడు కోప్పడ్డం, విసుక్కోడం లాంటివి ఉన్నా ఎప్పుడూ ఎవరిమీద చెయ్యి చేసుకోడం మాకు కనిపించేది కాదు. పిల్లలూ, వాళ్ళ పిల్లలూ, వాళ్ళ కుటుంబాలను అందరిని సమానంగా ప్రేమించే అమ్మమ్మ పూర్ణాయుష్షు పూర్తి చేసుకుని దేవుడి పిలుపు అందుకుని వెళ్లిపోయిన ధన్యజీవి.
(నా చిన్న నాటి జ్ఞాపకాలనుండి)
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
అమ్మమ్మ అనుభవం
[img=12x12]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image001.gif[/img] [img=13x13]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image001.gif[/img]
"అమ్మా జానకీ !!! నువ్వు, అల్లుడుగారు పిల్లాడిని రాష్ట్రం దాటించి చదివించాలని అనుకుంటున్నారట,, మీ నాన్నగారు అన్నారు., నిజమేనా!?" అని ఆయాసంగా తన కూతురుని అడిగింది రత్నమాల.
"అమ్మా!! ముందు నువ్వు ఆ కర్రల సంచి నా చేతికి ఇచ్చి, ఇలా సోఫాలో కూర్చో!! " అంటూ జానకి ఆ సంచి తీసుకుని పక్కన పెట్టి, వంట గది నుండి చల్లటి కడవ నీళ్లు తీసుకువచ్చి తల్లి చేతిలో పెడుతూ.,
"మంచి నీళ్లు తాగి, ఓ రెండు క్షణాలు ప్రశాంతంగా కూర్చో అమ్మా!! ప్రయాణ బడలిక తగ్గిన తరువాత మెల్లగా అన్ని విషయాలు మాట్లాడుకుందాము...." అంది.
"సరేలేవే !!,,, నేను వస్తున్న విషయం అల్లుడు గారికి ఎప్పుడు చెప్పావు!?. పాపం!! ఆయన ఇంత ఎండన పడి తన కార్యాలయం నుండి నా దగ్గరకు వచ్చి, జాగ్రతగా ఇంటి దగ్గర దింపి, మళ్లీ బైటినుండే వెళ్ళిపోయారు., కనీసం గుక్కిడు నీళ్లు కూడా నోట్లో పోసుకోలేదు!! " అని రత్నమాల బాధ పడింది.
"అమ్మా!! ఆయన ఏ పని అయినా తనకు నచ్చితేనే చేస్తారు. నువ్వేమీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు వస్తున్నావు అని మీ అల్లుడు గారు అన్నీ ముందే సిద్ధం చేసుకుని ఉన్నారు., ఇంకలేమ్మా!! భోజనం సిద్ధంగా ఉంది, తినేసి సాయంత్రం వరకు పడుకో,, మీ అల్లుడు గారు కార్యాలయం నుండి వచ్చాక ప్రశాంతంగా మాట్లాడుకుందాము!!" అని జానకి రత్నమాలకు భోజనం వడ్డించడానికి లోపలకు వెళ్ళింది..
'అమ్మకి అసలు విషయం ఎలా చెప్పాలి!, ఆయన పిల్లాడిని తప్పకుండా ఆ పాఠశాలలో చేర్చడానికి నూటికి నూరు శాతం సిద్ధం అయ్యారు' తల్లికి భోజనం వడ్డించి వచ్చిన జానకి మనసులో అనుకుంటూ, ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది సిద్ధం చేసే పనిలో పడింది.
ప్రయాణం వల్ల అలసిపోయిన రత్నమాల కూతురు చెప్పినట్టు సేద తీరింది. జానకి సాయంత్రం వంటకు కావాల్సినవి సిద్ధం చేసుకుని తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదువుతూ కూర్చుంది.. ఆమెకు అక్షరాల మధ్య కాలం నెమ్మదిగా గడిచినా, అలసిపోయిన శరీరానికి పట్టిన నిద్ర వల్ల రత్నమాలకి మాత్రం, ఏదో గారడీలాగా మరో గంటకే సాయంత్రం అయ్యినట్టుగా మెలకువ రాసాగింది..
ఈలోపు జానకి భర్త రామ్మూర్తి రావడం, స్నానం చేసి బట్టలు మార్చుకొని దూరదర్శని ముందు కూర్చున్నాడు.
'అమ్మ అసలు ఎందుకు వచ్చింది అన్న విషయం ఇంకా భర్తకి తెలియదు, తెలిస్తే ఎలా స్పందిస్తాడో??' అని జానకి మనసులో ఆలోచిస్తూ కంగారుగా, కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈలోపు బయట అలికిడికి రత్నమాల మేల్కొని గది నుండి కళ్ళు, మొహం తన పైట కొంగుతో తుడుచుకుంటూ బయటకు వచ్చింది.
"అమ్మా జానకీ!! అల్లుడు గారు వచ్చారా??" అని మెల్లగా నడుస్తూ ముందు గదిలోకి వచ్చింది.
"ఆయన వచ్చారు అమ్మా! ఏదో మాట్లాడాలి అన్నావు కదా!!" అని తన ఆలోచనల మధ్య కంగారులో రత్నమాలని ఇరకాటంలో పడేసినట్టు చేసింది జానకి..
పక్కనే కూర్చున్న రామ్మూర్తి "అవునా!! ఏమిటి అత్తయ్య గారూ !! విషయం చెప్పండీ...." అని తన గంభీరమైన గొంతుతో అన్నాడు.
"అదేనండీ!! పిల్లాడ్ని ఆంగ్ల మాధ్యమంలో చదివించటానికి మీరు పక్కరాష్ట్రం పంపిస్తున్నారని మీ మావయ్య గారు అన్నారు!! " అని రత్నమాల ఏదో చెప్తూ ఉంటే, మధ్యలో అందుకున్న రామ్మూర్తి, "అవునండీ!! పంపుతున్నాను. ఒక ఉద్యోగం కోసం కొన్ని వందల మంది పోటీ పడుతున్న ఈ రోజుల్లో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఆంగ్ల మాధ్యమంలో చదువు అనేది చాలా ముఖ్యమైనది..
దీని గురించి నేను నిర్ణయం తీసుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాను!!.." అని తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పాడు.
"మీకు ఆంగ్ల మాధ్యమాల్లో చదువు కావాలంటే, ఇక్కడే ఏదైనా ఒక మంచి పాఠశాలలో చేర్పించండీ.., అంతేగానీ, ఇలా పక్క రాష్ట్రానికి పంపించడం ఎందుకూ అనీ....."
"మీ మనసులో ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో చెప్పండి అత్తయ్య గారూ!!..."
"ఇప్పుడు అభివృద్ధి అని చెప్పుకుంటున్న ఈ చదువుల్లో మార్కుల కోసం విద్యార్థులు పడే వేదన తప్ప మరేం లేదు. అలాంటి ఈరోజుల్లో పిల్లలకి మంచి సంస్కారం నేర్పాలీ అంటే, పిల్లల దగ్గర తల్లో, నాన్నమ్మో, అమ్మమ్మో లేదా చక్కని మన కుటుంబ వాతావరణమో ఉంటే బావుంటుంది కదా!!....."
"అక్కడ కూడా ఇలానే ఉంటుందండీ!! మీరు కంగారు పడకండి., మన పిల్లవాడి, మిగిలిన పిల్లల బాధ్యత నిమిత్తం నియమించిన మహిళా ఉద్యోగులు , పంతులు గార్లు ఇంకా తోటి పిల్లలు ఉంటారు. అలాగే ఆడుకోవడానికి కూడా చాలా పరికరాలు, ఆటసామాగ్రి ఉంటాయి., మంచి ఆహారం కూడా.., ఇంకేం కావాలండీ!!" అని అసహనంగా అన్నాడు రామ్మూర్తి.
"అందరూ ఉంటారు గానీ, వాడి అవసరాలు తీర్చి అన్నీ అర్థం అయ్యేలాగా చెప్పడానికి మన భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరూ లేకపోతే వాడి పరిస్థితి ఏంటి??. పైగా వాడు ఇంకా చిన్న పిల్లాడు, ఇలా అయితే వాడికి అర్థం కాని ఆ భాషలో ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది!!.." అని గట్టిగా అంది రత్నమాల.
జానకి ఏం మాట్లాడకుండా తల దించుకుని, మల్లెలు మాలగా కడుతూ తల్లి, భర్తల మధ్య సంభాషణలు వింటూ, ఇక తప్పదు అని అనుకుంటే అమ్మని గానీ, భర్తను గానీ శాంత పరచడానికి సిద్ధంగా ఉంది.
"ఏంటండీ అత్తయ్య గారూ!! మీరు ఇంకా భాషా ! తెలుగు! అర్థం కాదు! అని అంటారు. ఈ రోజు పిల్లలు పుట్టుకతోనే అన్నీ నేర్చుకుంటున్నారు., మీకు పిల్లాడి మీద ప్రేమ ఉందీ పంపవద్దు అంటే అందం గానీ, ఇలా అంటారేంటీ!?, నాకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టే ఈ పని చేస్తున్నాను!! " అని రామ్మూర్తి కూడా కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
"అల్లుడుగారూ!! మీకు తెలియదని కాదు!! పుట్టిన బిడ్డలకి అమ్మ భాషలోనే ఆది నుండి అన్నీ నేర్పితేనే, ఈ ఆధునిక సమాజంలో చీకు చింతా లేకుండా బ్రతుకుతారు. సంపాదిస్తూ బ్రతకడం వేరు, సంతోషంగా బ్రతకడం వేరు.. ఇప్పుడు మీరేమో, పిల్లలు భవిష్యత్తులో బాగా సంపాదించాలీ అని, చదువుల కోసం దూరంగా పంపుతారు.., వాళ్లు పెద్ద అయిన తరువాత సంపాదిస్తారు తప్ప సంతోషంగా ఉండరు.,, ఆ తర్వాత, వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగానే పెట్టి, అదే ప్రేమ అనే భ్రమలో తమ సంపాదనతో వెలకట్టి చూస్తారు,, అంతే నాయనా!!.." అని తన అవేదనను వెళ్లగక్కింది రత్నమాల.
"అంటే!! ఇంటి నుండి దూరంగా పెట్టి చదివిస్తే, వాళ్ళు మమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేస్తారు అంటారు అంతేనా!!"
"నేను అలా అనడం లేదు. ఇంటి నుండి దూరంగా పోతే అమ్మ నాన్నల విలువ తెలిసి కష్టపడి చదువుకుంటారు అనే రోజులు కాలంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా చెడు తప్ప మరేం లేదు, అన్ని రకాల చెడు వ్యాపకాలు అరచేతి దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే కదా!! కాబట్టి, కనీసం వాడికి కొంచెం వితరణ జ్ఞానం వచ్చేంత వరకూ అయినా పిల్లల్ని ఇంటి దగ్గరే పెంచుదాము అంటున్నాను!!...."
"మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అందరూ పద్దతిగా ఉన్నారా ఏంటి??"
"నేను చెప్పేది పూర్తిగా వినండి!!.." అని కూతురి మొహం చూస్తూ... సౌమ్యం నిండిన గొంతుతో రత్నమాల, "అవును ఒక కుటుంబంలో పిల్లలు పెరగటానికీ, అలాగే ఖరీదైన వసతిగృహాల్లో పెరగటానికి చాలా వ్యత్యాసం ఉంది. అలా పెరిగిన పిల్లలు నాలుగు గోడల మధ్య, మహా అయితే ఓ పది మంది అదే వయసు ఉన్న పిల్లల మధ్య పెరుగుతారు.., వాళ్ళకి సమాజం గురించి ఏం తెలుస్తుందీ,, ఏమీ తెలియదు. ఎందుకంటే, నేను అలాంటి వాళ్ళను కళ్ళారా చూసాను.., అప్పటి వరకు అణిచిపెట్టిన వాళ్ళ మనసులోని కోరికలకు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే వాళ్ళు ఏం చేస్తారు?? అప్పటి వరకు నాలుగు గోడల మధ్య బందీగా ఉండి, ఒక్కసారిగా సమాజంలోకి వస్తే వాళ్ళు సమాజంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు..?? ఈ విషయాలేవీ ఈకాలం తల్లిదండ్రులు ఆలోచించరు కేవలం చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంతో బయటకు రావాలనే ఆలోచిస్తారు" అంది.
అప్పటి వరకు తల దించుకుని తల్లీ, భర్త మధ్య సంభాషణలు వింటున్న జానకి తల పైకి ఎత్తి, 'అవును కదా!!' అన్నట్టు మొహం పెట్టి భర్త వంక ఆశగా చూడసాగింది.. అది గమనించిన రామ్మూర్తి తన మాటల్లో ఉన్న ఆవేశం తగ్గించి, తను కూడా మెల్లగా, "చూడండి అత్తయ్య గారు!! ఇప్పుడు ఉన్న లోకం పోకడలను బట్టి మనం ముందుకు సాగాలి అంతే, వందలో తొంభై మంది పిల్లలు ఇప్పుడు ఇలానే చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు!! " అన్నాడు.
"ఉపాధి కోసం చదువు కాదండీ!!, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటమే చదువు యొక్క ముఖ్య ఉదేశ్యం కావాలి కానీ, తల్లిదండ్రులు ఆశ, ఇంకా కళాశాల యాజమాన్యాల దురాశ వల్ల చదువు అంటే కేవలం ఉపాధి మాత్రమే అనే ముద్ర వేశారు. అందుకే చెరసాలలో ఖైదీలుగా పిల్లల్ని చూస్తూ, వాళ్లలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలను తొక్కిపెట్టి, చదువు!!
చదువు!! అని బండకేసి రుద్దుతున్నారు. నా మనవడికి అలాంటి చదువు వద్దు!! అమ్మానాన్నల మధ్య ఆప్యాయంగా పెరగనిద్దాం అంటున్నాను!!....."
అత్తగారి మాటలు రామ్మూర్తిని సంకోచంలో పడేసినా, తను తీసుకున్న నిర్ణయం కూడా ఏమీ తప్పు కాదన్న నమ్మకంతో, "పిల్లలు మన దగ్గర పెరిగితే అన్నీ అవసరానికి దొరికి, వాళ్ళకి కష్టం తెలీదు. ముద్దు చేస్తే మొండితనం పెరుగుతుంది!. మాట వినరు!, చీటికీ మాటకి గొడవలు పడుతూ, పెద్దవారి మీద ఆధారపడిపోతూ ఉంటారు! ఇలా ఎన్నెన్నో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండీ నేను!!!...." అన్నాడు.
"అయ్యో అల్లుడు గారు!!, పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి ఒక పరిమితి తర్వాత, పిల్లలకి బాధ్యత తెలిపేలాగా మార్పు చెందాలి.,, అంటే పిల్లలు ఇంట్లో పెరిగితే, వాళ్ళ చిన్నవయసు నుండీ, నాన్న పడుతున్న కష్టం వెనుక బాధ్యతనీ, అమ్మ పడుతున్న కష్టం వెనుక ప్రేమనీ చూస్తూ పెరుగుతారు..., అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల మనసు అర్థం అవుతుంది అంటున్నాను!!! ఇది వాస్తవం నాయనా!!!..."
రత్నమాల మాటల్లో నిజం లేకపోలేదు అని రామ్మూర్తి కి మెల్లగా అర్థం అవుతున్నది కానీ, తను తీసుకున్న నిర్ణయం మార్చుకోవటానికి తన అహం అడ్డు వచ్చో లేక, ఆధునిక ప్రపంచ పోకడలకు భ్రమించో "ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఇలా చేస్తున్నారండీ??... బడి నుండి రాగానే దూరదర్శని ముందో, లేకపోతే, అమ్మా నాన్నల చరవాణిని లాక్కుని దాని చేతిలో పెట్టుకుని కాలం వృధా చేస్తున్నారు తప్ప ఇంకేం చెయ్యరు!!!..." అని రత్నమాల మాటలకి అడ్డుకట్ట వెయ్యాలని చూశాడు.
" నాయనా!! నేను మీకు చెప్పేంత దానిని కాదేమో!! కానీ, నేను చూసిన మనుషులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాను వినండి!!.." అని పక్కనే ఉన్న జానకిని కూడా అదిలించి, "నువ్వు కూడా విను అమ్మాయ్!!" అంటూ, "కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వేసుకునే బట్టలు, ప్రముఖ తయారీదారులవా? కాదా? అని చూస్తున్నారు తప్ప, వాళ్ళు సమాజంలో ఎలా మెలుగుతున్నారో అని కూర్చో బెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ.., పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చెయ్యాలి అనుకుంటారు అని ఆలోచించటం లేదు!!....."
"అయితే పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చుని పుస్తకాలు పట్టుకోవాలి అంటారా ఏంటండీ??" అని మెల్లగా వెటకారం ధ్వనించగా అన్నాడు రామ్మూర్తి..
"నేను అలా అనడం లేదు అండీ... జీవితంలో తాను ఎన్ని బాధ్యతలు మొయ్యలో అని ఒక అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది..?? తన నాన్నను చూస్తేనే తెలుస్తోంది!... ఒక కుటుంబంలో నాన్న అనే స్థానం లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తాను సమాజంలో ఎలా మెలుగుతున్నాడో?? తన కొడుక్కి ఆ తండ్రి తప్పకుండా చెప్పాలి... అప్పుడే ఆ కొడుక్కి తన మీద వున్న బాధ్యత ఏంటో తెలుస్తోంది!!. తండ్రి తన కొడుక్కి అమ్మను నువ్వు ఎలా చూసి గౌరవిస్తున్నావో అలాగే సమాజంలో మిగిలిన స్త్రీలను కూడా అలాగే గౌరవించాలి అని తప్పకుండా కొంత సమయం వెచ్చించి అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఒక తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు,, గొడ్డును బాదినట్టు బాదకుండా, ఆ తప్పు వల్ల వచ్చే పర్యవసానాలు గురించి క్షుణ్ణంగా చెప్పి, ఆ తప్పును మళ్ళీ చెయ్యకూడదు అని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పే ఓపిక అయితే అమ్మానాన్నలకి ఉంటుంది లేదా
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
ఏ అమ్మమ్మకో, నాన్నమ్మకో ఉంటుంది తప్ప, ఈ ఆడ ఉద్యోగస్తులకూ, ఇంకా పిల్లల చుట్టూ పని చేసే వాళ్ళకో ఉండదు అంటున్నాను!!!..." అని ఒక కొడుకు వృద్ధి వెనుక తండ్రి బాధ్యత ఎలా నిర్వర్తించాలో?? అని అల్లుడుకి సున్నితంగా చెప్పింది.
తల్లి మాటలు వాస్తవాలు తెలుపుతూ, తన భర్త మనసులో మార్పు తీసుకువస్తున్నాయని జానకికి అర్థం అయ్యింది.. తను కూడా అమ్మకి వత్తాసు పలకాలని "ఒక ఆడపిల్లకి మొదటి గురువు అమ్మే. అమ్మే అన్నీ చెప్పాలి... తాను ముందుగానే సమాజపు పోకడల మధ్య నలిగి వుంటుంది. ఆ దుస్థితి మరో ఆడపిల్ల పడకూడదు అంటే అమ్మే ఖచ్చితంగా తన అనుభవాలు ఉదాహరణలుగా చెపుతూ తన బిడ్డకి సమాజాన్ని మరో కోణం వైపు చూపించాలి, ఎదుర్కొనే ధైర్యాన్ని నింపాలి. ఆడపిల్ల మంచి గురించి చెప్పటానికి తల్లికి ఉన్నంత స్వేచ్ఛ తండ్రికి కూడా ఉండదు. సొంత తండ్రికి కూడా కూతురి దగ్గర కొన్ని పరిమితులు ఉంటాయి.... అలాంటిది!! చిన్న వయసులోనే పిల్లల్ని హాస్టల్లో పెంచాలి అనుకోవడం మంచి నిర్ణయం కాదేమో!! " అని తన ముందు ఆడుకుంటున్న కూతుర్ని వడిలోకి తీసుకుంటూ చాలా దృఢంగా చెప్పింది.
అత్త గారికి భార్య తోడవడంతో రామ్మూర్తి ఆలోచనలో పడ్డాడు. 'ఇప్పటి వరకూ ఎప్పుడూ, నా నిర్ణయానికి ఎదురు చెప్పని జానకీ కూడా నా నిర్ణయం మార్చుకుంటే బావుంటుందన్న చూపుతో నన్ను చూస్తూ మాట్లాడుతుందంటే!! బహుశా నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో??' అని మనసులో అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
రామ్మూర్తి మనఃస్థితి గమనించిన రత్నమాల "చిన్న వయసులోనే పిల్లలకి ఏదయినా చెపితే బుర్రలోకి ఎక్కుతుంది, ఒక్కసారి యవ్వనంలో పడ్డారా!! మన మాటలు వాళ్ళ చెవి దగ్గరకు కూడా వెళ్లవు, ఇంకా చెప్పాలీ అంటే, ఆ మాటలు వెగటుగా, పాతరకపు మాటలులాగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఆ వయసులోనే మంచి మంచి విషయాలు చెప్పాలి, అప్పుడే అవి బుర్రకి ఎక్కుతాయి. అమ్మ ప్రేమ, తండ్రి బాధ్యత తెలిసినప్పుడే తప్పు చెయ్యడానికి పిల్లలు ఆలోచిస్తారు. ఆ ఆలోచనే వాళ్లలో తప్పు చెయ్యాలి అనే భావం పోయేలా చేస్తుంది. పిల్లల మీద తల్లిదండ్రులు వత్తిడి ఉన్నంత వరకు వాళ్ళకి ఉతీర్ణత అవటమే కావాలి అని అనుకుంటారు తప్ప మరో ఆలోచన ఉండదు. అందుకే పిల్లలని దగ్గరకు తీసుకుని మనసారా చెప్పాలి" అని అంది.
రామ్మూర్తి రత్నమాల మాటలని సంగ్రహంగా ఆలోచిస్తూ మరో మాట మాట్లాడకుండా అలానే తన మౌనాన్ని కొనసాగించాడు. ఒక్కసారిగా అతను, "మరి పిల్లలు ఇంట్లో ఉంటే మొండితనం, పొగరు ఇంకా బద్దకం పెరగదు అంటారా!!" అని అనుమానంగా అడిగాడు.
"పెరగదు అని నేననండీ!!,, ఖచ్చితంగా పెరుగుతుంది., కాబట్టి, తల్లిదండ్రులు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేయించాలి.., వాళ్ళ శక్తి మేరకు. వాళ్ళకి ప్రేమ పంచాలి తప్ప గారాబం చెయ్యకూడదు. ఇంట్లో, 'ఛీ!! నేను చేయను' అనే పని నుండి, మీరు ఉండండి! నేను చేస్తాను!!' అని పిల్లలు అనే విధంగా పెంచాలి. అప్పుడే వాళ్ళలో మీరు అన్న ఆ లక్షణాలు దరి చేరకుండా ఉంటాయి... ఇప్పటి వరకూ నేను చెప్పినవన్నీ మీరు చెయ్యాలి అంటే పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకోవాలి.... అప్పుడే ఇవన్నీ నూటికి నూరు శాతం సాధ్యపడతాయి" అని చెప్పి, ఒక పెద్ద నిటూర్పు విడిచింది రత్నమాల.
ఇన్ని చెప్పినా భర్త నిర్ణయంలో మార్పు రాలేదు అనుకుని ఇంక చేసేదేం లేక "అమ్మా!! నేను తినడానికి అన్నీ సిద్ధం చెస్తాను. నువ్వు ఆయన వస్తే తినేసి పడుకుందాము.." అని నిరాశగా వంట గది వైపు అడుగులు వేసింది.
రత్నమాల పైకి లేస్తుంటే కరవాణి మోగింది, ఎవరిది అని చూస్తే అల్లుడిది.. దాంట్లో పేరు 'మావయ్య' అని ఉంది.
అప్పటికే తన మనసు మార్చుకున్న రామ్మూర్తి కరవాణి చేతిలోకి తీసుకుని, "హా మావయ్య గారు!! చెప్పండీ!!...."
అన్నాడు.
జానకి తండ్రి పరంధామయ్య , "ఎలా ఉన్నారండీ!! మీరు, అమ్మాయి, మనవరాలు క్షేమమేనా!! అని పరామర్శించి, "విషయం ఏంటంటే, అదేనండి!! రేపు మీ అత్తగారు తిరిగి ఇక్కడికి వస్తుంది కదా!! వచ్చేటప్పుడు మర్చిపోకుండా తనని పిల్లాడివి నూలు దుస్తులు, మెత్తగా ఉండేలా తీసుకురమ్మని చెప్పండి.., అలాగే, వేసవికాలం సెలవులు ఎప్పుడు అవుతాయో చెప్పితే, ఓ వారం రోజుల ముందు చంటోడ్ని ఇంట్లో దింపుతాను.. ఇప్పటికే జానకి, 'పిల్లాడు ఇంటి దగ్గర లేడని బెంగగా ఉంది నాన్నా!! పంపించండి వాడిని, మీరు దింపిన వెంటనే హాస్టల్లో వేస్తారు ఆయన.., అప్పుడు బెంగ మరీ ఎక్కువ అవుతుంది' అంటుంది.., కనీసం ఆ వారం రోజులు అయినా పిల్లాడు జానకి దగ్గర ఉంటే బాగుంటుందని నా తాపత్రయం..." అని అన్నాడు..
రాము మనస్ఫూర్తిగా నవ్వుతూ, "అయ్యో మావయ్య గారు!! మీరు చేసినా నేను చేసినా వాడి మంచి కోసమే కదా!! నేను లోకం తీరు బట్టి అలా ఆలోచించాను అంతే!, వాడి భవిష్యత్ రాష్ట్రం మారితే బావుంటుంది అని ఆలోచించాను తప్ప, నేను తీసుకున్న నిర్ణయం వెనుక చెడును ఆలోచించలేక పోయాను. ఆ చివరి వారం కూడా పిల్లాడు మీతో పాటే ఉంటాడు.., అంతగా జానకీకి చూడాలనిపిస్తే, వీలుంటే ముగ్గురం రేపే అక్కడే వస్తాము.. కుశగాడిని ఇప్పుడు చదువుతున్న బడిలోనే కొనసాగిద్దాము.." అని తన మాటలు విని ఆగి, చూస్తున్న జానకి వంక చూస్తూ కరవాణి పెట్టేశాడు.
భర్తను చూస్తూ, అతను తండ్రితో మాట్లాడిన మాటలు విన్న జానకి, పరుగున వెనక్కి వచ్చి తల్లిని హత్తుకుని, కృతజ్ఞతగా ఆమె చెయ్యి పట్టుకుని, ఆనంద బాష్పాలతో ముద్దుల వర్షం కురిపించింది..
*********శుభం*********
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
సారి!!! అమ్మమ్మ
[img=1x1]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image002.gif[/img]
తప్పు క్షమాపణ తల్లిదండ్రులు
అమ్మ వెళ్ళొస్తానే.... అని కూతురు అల్లుడు మనవరాలు పండుగ ముగించుకొని వెళ్తుoటే మనసంతా ఏదో వెలితి. కుతురు అల్లుడుతో కలిసి దాని అన్నయ్యలు చేసిన అల్లరి పండుగంతా మాఇంట్లొనే ఏమో అని అనిపించింది. నా పెద్ద కొడుకు రెండేండ్ల ప్రాజెక్ట్ ముగించుకొని వారం కిందటే అమెరికా నుంచి వచ్చాడు. నా ఇద్దరు అబ్బాయిలు నా కూతురు అల్లుడు అందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. మా ఇల్లే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగుంది. మా పెద్దోడంటుంటాడు బావ మనమే ఒక కంపెనీ పెట్టేద్దాం అని.. అందరు చాల రోజుల తర్వాత కలిసారు ... ఇహ ఒకటే కబుర్లు... అవి ఎంతకీ పూర్తికావు. భోజనానికి కూడా తీరికలేనన్ని కబుర్లు. ప్రేమగా మందలించి బలవంతాన లేపాలి. వారి నాన్నకు పిల్లల ముచ్చట్లు అర్థం కాకపోయినా అబ్బో ఏదో పేద్ద సంబరం....మధ్యమధ్యలో కబుర్లు చెప్పుకొని చెప్పుకొని అలసిపోతారేమో అని పండ్లు ఫలహారాలు అన్ని వున్నచోటికే సప్లియర్ పని అందుకున్నారు వాళ్ళ నాన్న....
మొత్తనికి నా భాగ్యం అందర్నీ ఒప్పించింది బెంగళూరుకు మారిపోవడానికి ...దానికి బిడ్డ పుట్టడంతో ఒక ఏడాదిపాటు సెలవు తీసుకున్నది. ఇప్పుడు ఇంక సెలవులు అయిపోయాయీ.. మనవరాలి ఆలనా పాలన కోసం మమ్మల్ని బెంగళూరుకు వచ్చేయమని... ఎటూ నాకొడుకులు ఇద్దరు బెంగళూరు లోనే వుద్యోగం.. మళ్లి అందరు కలిసి ఉండొచ్చు అన్నది దాని ప్లాన్. .. ఈయన టీచర్ గా రిటైర్డ్ అయ్యారు... నాకు ఏ అభ్యన్తరము కనిపించలేదు. ఏంటంటే ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాము అలవాటైన చోటు పైగా సొంతిల్లు అక్కడో అపార్టుమెంటు.. ఇలా ఏవో చిన్న చిన్న భాధలు తప్పిస్తే అందరo ఒకేచోటుంటామన్న సంతోషం ముందు అంతా దిగ దుడుపే. ... అది ఈ మధ్య కొత్తగా ఇల్లు కొన్నది. దాని అపార్ట్మెంట్లోనే మాకు అద్దెకు ఇల్లు చూసింది...ఇంకో నెలలో మదనపల్లె వదిలి బెంగళూరు నివాసం.అందుకే ఎన్నో ఏండ్లు బట్టి ఉంటున్న వూరు వదిలి వెళ్తున్నందుకు పండగ ఇక్కడే ఘనంగా చేసుకోవాలనుకున్నాము. అనుకోకుండా మా పెద్దాడుకుడా సరిఅయిన సమయానికి వచ్చాడు... మా పెద్దడికి పెళ్లి వయసు వచ్చింది ....పిల్లను చూసే భాద్యతను కూడా వాళ్ళకే అప్ప చెప్పాను... అది ఏదో పెద్దరికం వచ్చిన దానిలా నాకొదిలెయ్యి అన్నయ్యకు పెళ్ళాన్ని చుసేపూచి నాదంటూ భోజనాలు ముగించుకొని బెంగళూరు బయలుదేరారు. రాత్రికి కూడా కష్టపడకుండా కెరీరు కట్టించిపంపాను. ఏంటో అది వెళ్తుంటే బెంగగా అనిపించింది.. అందుకే వాళ్ళు వెళ్తున్నవైపే చూస్తూ ఉండిపోయా. కొడుకులిద్దరు ఈవారం ఇక్కడే ఉండి పనులన్నీ ముగుంచుకొని పైవారం వెళ్తారు... ఎంతైనా తల్లికి కూతురుతో వున్న అనుబంధం ఎక్కువ. అందులో ఒకటే కూతురు... మావారి పిలుపుతో ఈ లోకంలోకొచ్చా . మూడు రోజులుగా విశ్రాంతి లేకుండా కష్ట పడుతున్నావు కాస్త నడుంవాల్చు అని మావారి చిరుకోపం. నిజమే బాగా అలసటగా అనిపించింది వెళ్లి పడుకున్నానో లేదో ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు. లేచేపాటికి సాయంత్రం నాలుగు. అమ్మో రెండు గంటలపాటు పడుకున్నానా అని లేచి బయటకు వచ్చా... ఎందుకో మావారి ముఖంలో విపరీతమైన ఆందోళన మనసు కీడు శంకించింది. పిల్లలిద్దరూ ఇంట్లో లేరు. ఏమైందో అడగాలన్నా భయం వేసింది. ఆయనకు చమట్లు పడుతున్నాయి కనీసం నేను లేచివచ్చానన్న ధ్యాస కూడా లేదు. ఏమిటో విషయం అని అడిగే లోపు ఫోను మోగింది ఒక్క ఉదుటున ఫోను తీసుకొని అలాగే కుప్పకూలిపోయారు. ఆ ఫోను నేను తీసుకొని అటువైపు ఎవరా అని చూసాను. మా పెద్దవాడు. ఏమైంది అని అడిగిననాకు సమాధానం ఇవ్వకుండా నీవు నాన్న ఇప్పుడే రండి అని ఫోను పెట్టేసాడు. ఈ లోపు చిన్నవాడు కారు తీసుకొని వచ్చాడు. ఏమైందో ఏవ్వరు చెప్పటం లేదు. మనసుకు ఏదో లీలగా అనిపిస్తోంది కళ్ళు వర్షిస్తున్నాయి మాట పెగలటం లేదు. నా మనసు చెబుతున్నది నిజం కాకూడదని దేవుని వేడుకుంటున్నంతలో కారు హాస్పిటల్ ముందు ఆగింది. మా పెద్దవాడు ఎదురొచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. అర్థం అయ్యింది.. అనుకున్నంత అయ్యింది . నా బంగారు తల్లికి నూరేండ్లు నిండిపోయాయి. వెళ్లి చూద్దును కదా కూతురొక్కటే అనుకున్నా మరణంలోకూడా ఇద్దరు కలిసే పోయారు. ఒక అందమైన జంట కనుమరుగైపోయింది...మరి పాప పాపెక్కడ అని అడుగుదాం అనుకొనేంతలో డాక్టరమ్మ వచ్చి పాప మృతుంజయురాలు అని అంత ఆక్సిడెంట్ లో కూడా వంటిమీద చిన్నగాయo కూడా లేదు అని చెప్పింది.... నా భాగ్యం తన భాగ్యాన్ని తన గుర్తుగా వదిలివెళ్లింది. . కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. జరగాల్సిన తంతులన్నీ మా ఇంటి నుంచే జరిగిపోయాయి. ఇంకా పచ్చబొట్టు పారాణి ఆరనే లేదు... ఇంటికి వెళ్ళొస్తానని దేవుని దగ్గరకు వెళ్లిపోయారు. భగవంతుని మీద కూడా కోపం రాలేదు ఆయనకు ఇష్టమైన వాళ్ళనే...... పండగకు వచ్చి ఇంటిని ఆనందమయం చేసి ఇంతలో నే శున్యాన్ని నింపి వెళ్లిపోయింది. వియ్యంకులు పాప భాద్యతను నాకే ఇచ్చారు. నాకు కావాల్సింది అదే. ఈ విషయంలో ఎవరు కాదన్నా వినకూడదనుకున్నా కానీ అందరు సంతోషంగా ఒప్పుకున్నారు. అమ్మమ్మ ను కాస్త అమ్మనయ్యాను. పది నెలల పసికందు అమ్మ కోసం వెతుకుతున్నట్టు దిక్కులన్నీ చూసేది. ఏమిటో ఏమీ తెలియని పసిహృదయం. కాలం కౌగిలిలో ఒక చరిత్ర ముగిసింది మరో చరిత్రకు అంకురార్పణ చేస్తూ.
వియ్యంకుల సలహా మేరకు బెంగళూరులో భాగ్యం ఇంట్లోనే మేము... తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని... వారు ఎంతో అపురూపంగా కట్టుకున్న ఇంట్లో మేము. విధిని తప్పించడం సాధ్యమా... క్షణం కూడా మరుపుకు రావట్లేదు... మరవడం అసాధ్యం కేవలం పోయినవాళ్లతో పోలేము కాబట్టి ఈ జీవయాత్ర కొనసాగించాల్సిందే... వియ్యంకుల వారి మంచితనం అల్లుడు సంపాదనను మొత్తం నా చిన్ని భాగ్యానికి రాసి దానికి గార్డియన్ గా మా పెద్దవాడిని చేశారు. చిన్నికి నేనే అమ్మ అమ్మమ్మ ....పిల్లను అల్లారుముద్దుగా పెంచుతున్నాము.
పెద్ద వాడికి సంబందాలు వచ్చినంత వేగంగా వెనక్కుపోతున్నాయి. చిన్ని భాద్యత మీద పడుతుందేమోనని. నేను మావాడితో చెప్పా మేము మదనపల్లె వెళ్ళిపోతాము ఇక్కడే వుంటే నీకు పెళ్లి అవుతుందో కాదో అంటే వాడు ససేమీరా అన్నాడు. చిన్నిని ఒప్పుకున్నవాళ్లతోనే నా పెళ్లి అని ఖరాఖండిగా చెప్పాడు. అన్నయ్య మాటే తనదికూడా అంటూ మా చిన్నోడుకూడా. ఈకాలంలొ తల్లి తండ్రులే అడ్డంకి అనుకొనే వాళ్ళు ఇంక చిన్నిని ఎక్కడ ఒప్పుతారు. చూస్తుండగానే చిన్నికి మూడో పుట్టినరోజు కానీ కొడుకులిద్దరూ బ్రహ్మచారులు. అయినవాళ్లు కానివాళ్ళు ఆప్తులు అందరిదీ ఓకే మాట. నాకు నిజం అనిపించింది. ఇప్పటికే ఓ రెండు పాతిక సంబంధాలు వెనక్కు వెళ్ళుంటాయి. నిజానికి వారు చిన్ని కోసం ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన పనిలేదు నేను బతుకున్నంతవరకు నాదే భాద్యత... వారి సంపాదన కూడా అవసరం లేదు. అయినా ... కాలం అలాంటిది భార్య భర్త మాత్రమే ఉండాలనుకునే రోజుల్లో ఏ భాద్యత లేదంటే ఎవడు వింటాడు. ఇక ఎవ్వరు చెప్పినా వినకూడదు అనిపించి మదనపల్లే వెళ్లిపోవడానికె సిద్ధపడ్డా ... కానీ మా పెద్దాడు చిన్నాడు ఇద్దరు నాతొ ఓ పెద్ద యుద్ధమే చేశారు. చెల్లి ని చిన్నిలో చేసుకుంటున్నాము అదికూడా మాకు బాగా దెగ్గరయ్యింది నీవే కాదు మేముకూడా దాన్ని వదిలి ఉండలేము అని మళ్లి నా నోరు మూయిoచేశారు ... మావారు పాపo త్రిశంకు స్వర్గం లో వున్నారు. ఇక చేసిది ఏమిలేక అన్నీ మూసుకొని ఉండిపోయా... యధావిధి గా పెళ్లి సంబంధాలు చూస్తూ ..... అనుకోకుండా ఒక రోజు గుడిలో మా దూరపు చుట్టరికం వాళ్ళు ఎదురుపడ్డారు. మాట మాట కలుపుతూ పెద్దవాడికి ఏమైనా సంబంధాలుంటే చూడమన్నాను. ఎవరో ఎందుకు నా కూతురే వుంది అన్నారు. మీకు ఇష్టమైతే చూడండి అని కానీ కట్న కానుకలు అవి ఇచ్చుకోలేము అన్నాడు... ఇప్పుడు కట్న కానుకలు ఎవరికి కావలి పిల్ల బాగుండి చిన్ని ని కూడా ఒప్పుకుంటే చాలు అని చిన్ని విషయం చెప్పాను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
వారు సంతోషాంగా ఆమోదించారు. ఒకసారి పెళ్లి చూపులకు రమ్మన్నారు. పెళ్లి చూపులలో తెలిసిన విషయం ఏమిటంటే వారు బాగా చితికి పోయినప్పుడు అయినవాళ్లు కూడా ఆదుకోవడానికి నిరాకరిస్తే మా నాన్న చేయూత వల్ల వారు ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి ఇవాళ వారింటికి పిల్లనిచ్చే భాగ్యo వచ్చినందుకు సంతోషపడ్డారు. పెద్దవాళ్లు ఎప్పుడో చేసిన పుణ్యం ఈరోజు నాకు ఉపయోగపడింది. మనసులోనే మా తండ్రికి పాదాభివందనం చేసుకున్నాను. వారిది అభిమానం.... మరి పిల్లకు ఆతర్వాత గొడవలు వద్దు అని ఆ అమ్మాయినే సూటిగా అడిగా. తనకు ఎటువంటి అభ్యంతరము లేదంది ...మావాడిని అడిగాను చిన్ని కోసం బలవంతంగా చేసుకోకని అది రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కలకాలం వుండాల్సింది మీ ఇద్దరు కాబట్టి నచ్చితేనే చేసుకో లేకపోతె ఇంకా చూద్దాం అన్నాను. వాడు తనకు నిజంగానే నచ్చిందని చెప్పాడు ...ఆ మాట వినగానే నిర్జీవమైన ఈ శరీరంలోకి జీవం వచ్చిందనిపించింది. మావాడి పెళ్లి అనుకున్నట్టుగా కుదిరినందుకు చాల సంతోషంగా అనిపించింది. ఇదే సంతోషం అనుకుంటున్నంతలో అతనొచ్చి మా తమ్ముడు కూతురు కూడా పెళ్లీడు కొచ్చింది మీ చిన్నబాబు కు పెళ్లి చేసేట్టయితే చూస్తారా అని అడిగాడు. జాతకo ఇస్తానన్నాడు. ఏ జాతకము వద్దు పిల్ల ఉంటే ఇప్పుడే చూపించండి... ఇద్దరికి నచ్చితే అంతకన్నా ఏమికావాలి అన్నాను. చిన్నోడికి కూడా అదే చెప్పాను బలవంతం లేదని.. ఇద్దరికి ఇద్దరు నచ్చడం తో ఒకే వేదిక ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు జరిగిపోయాయి. శుభకార్యాల కరువుతో అల్లాడుతున్న మా ఇంట్లో కి ఒకే సారి వసంతం వచ్చినట్లు అనిపించింది. ఓ శుభ ముహుర్తాన అక్క చెల్లెల్లు కాపురానికి వచ్చారు. భగవంతుని దయవల్ల కోడళ్ళిద్దరు ఉత్తములు. చిన్నిని వారు కూడా చాల అపురూపంగా చూసుకుంటున్నారు... ఏ గొడవ లేకుండా అందరo ఒకే ఇంట్లో ..చిన్ని లేకపోతె ఇది సాధ్య పడేది కాదేమో. పెద్దోడింట్లో కొన్నిరోజు చిన్నోడినట్లు కొన్ని రోజులు ఉండాల్సివచ్చేది. చిన్ని వల్లే అక్కాచెల్లెళ్లు తోడికోడళ్లు ఇంక గొడవలేమి లేవు . ఒక శుభముహుర్తం లో ఇద్దరు నీళ్లు పోసుకున్నారు. ఇద్దరికి కొడుకులే. మళ్ళి నా ముగ్గురు బిడ్డల్లాగా వీళ్లు ముగ్గురు అదే ఆనందంగా . ..కాలం చాల వేగంగా తిరిగింది. మా ముగ్గురు పిల్లల్ని చూస్తు భాగ్య విషాదం నుండి అందరం పూర్తిగా కోలున్నాము. ముగ్గురు కాస్త ఐదు మందయ్యారు... పిల్లలిద్దరూ వద్దంటున్నా వారి తండ్రి ముగ్గురు భాగాలేసుకొని లంకంత ఇల్లు కట్టారు. ఒక శుభముహుర్తంలో అందరం కొత్తింటికి వెళ్ళిపోయాము. ఇల్లు ఖాళీచేస్తున్నప్పుడు నా కూతురు నన్ను వదిలి వెళ్లిపోతున్నారా! ! అని అడుగుతున్నట్టు అనిపించింది. ఎవ్వరితో, దేనితో ఎక్కువ అనుబంధం పెంచుకోకూడదు సంతోషం కన్నా వేదనే ఎక్కువ.. ఇల్లు నిజంగా చాల సౌకర్యంగా వుంది. మా పిల్లలిద్దరూ వద్దని చెప్పినా వినిపించుకోకుండా వంటమనిషి ని కూడా పెట్టేసారు . నిజమే ఎంత ఒద్దికగా వున్నా పని, డబ్బు ఈ మాయదారి టీవీ తోనే గొడవలు. అందరి రూములకు టీవీలు అందరు కల్సి చూడడానికి హల్లో మరో టీవీ. పని దగ్గర గొడవలేకుండా వంటమ్మాయి. ఇక పేచీ కి ఏ ఆస్కారం లేదు. ఇలా ఎవరి గదులవల్ల కాదు కానీ నిజంగా నాకోడళ్లు ఉత్తములు. ఈ కాలంలో ఎవరుంటారు అని నేను ఒకప్పుడు నొసలు చిట్లించినదానినే. నాకూతురు కాబట్టి వినయ విధేయతలు అని ఒకింత గర్వo కూడా. కానీ నిజానికి నాకూతురి కంటే ఓపికగల వాళ్ళు నా కోడళ్ళు. మునుపటి మనిషిని అయ్యుంటే కొంత పేచీ వచ్చేదేమో అమ్మమ్మ ను అమ్మ నయ్యాక నాలోనూ చాల మార్పు వచ్చింది జీవితానుభవం పరిణితిని పెంచింది. . సగం గొడవలు అత్తా కోడళ్ళకె.. చూస్తుండగాననే వారాలు నెలలయ్యాయి నెలలు ఏండ్లుయ్యాయి . చిన్ని పెద్దమనిషి పండుగ మేనమామలిద్దరు తండ్రి గాను మేనమామలుగాను రెండు భాద్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. నా పిల్లలు ముగ్గిరిలాగ నా మానవoడ్లు మనవరాలు మధ్య కూడా అదే అనుబంధం అంతే కాదు అందరు చదువులో కూడా ఆణిముత్యాలు . చూస్తుండగానే కేసెట్ రిజల్ట్స్ వచ్చాయి. చిన్నికి చాలా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది . అందరి ఆనందానికి హద్దులు లేవు. అదీ బెంగళూరు లోనే ఇది మరింత సంతోషం. వారి తాత గారు తమ మనవరాలు మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్నందుకు కాలేజికి వెళ్ళడానికి బండి కొనిచ్చాడు. పాపo ఇన్ని ఏండ్లు గడిచినా క్రమంతప్పక వచ్చి వెళ్తారు. ఆనవాయితీగా దసరా పండుగకు వారింటికి పిల్చుకెళ్తారు... వారి మానవరాలికి ఎక్కడా తక్కువ చేయలేదు. చిన్నికి తల్లి తండ్రి లేరన్నమాటే కానీ వాళ్ళున్నా ఇంతకన్నా గొప్పగా అయితే చూసేవారు కాదు. కానీ నేను ఇప్పుడప్పుడే బండి మీద వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ప్రతి రోజు రోడ్లమీద ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి అంత మాత్రానికే రోడ్డుమీదికెళ్ళము అంటే ఆలా అని అందరు నన్ను ఒప్పించారు అందులోనూ కాలేజ్ కూడా మరీ దూరమేమియు కాదు అందువల్ల నేను ఒప్పుకున్నాను. చూస్తుండగానే అది మెడిసిన్ నాలుగో సంవత్సరం లోకి వచ్చేసింది. మానవoడ్లు కూడా మంచి కొలేజిల్లో చేరారు. భగవంతుని దయ వల్ల రోజులు ప్రశాంతంగా గదుడుస్తున్నాయి. ఈ మధ్య నా వంట్లో కూడా బాగుండటంలేదు అందుకే మెడిసిన్ అవ్వగానే దాని పెళ్లి చేసేయాలి అని అనుకున్నా. కానీ మామాలిద్దరు అది చదివినంత చదవని పెళ్ళికి తొందర పెట్టొద్దు అని చెప్పేసారు. ఇన్నేళ్లు చూసుకున్నవాళ్ళు ఇకపై చూసుకోరా... వారిని అనుమానిస్తే దేవుడు కుడా నన్ను క్షమించడు అనిపించి నేను ఊరుకుండిపోయా. ఇవాళెందుకో మరీ నలతగా ఉండడంతో వెళ్లి పడుకుండిపోయా. బాగా నిద్ర పట్టేసింది. లేచి బయటికి వచ్చాను. హాల్లో గంభీరమైన వాతావరణం మళ్లి ఆ భయానకమైన రోజును గుర్తు చేస్తూ..... స్మశాన నిశబ్దం అక్కడే కూర్చుండిపోయా అర్థం అయ్యిoది ....ఈసారి ఏమిటో ఎవరో కూడా తెలుసుకోవాలనిపించలేదు. చిన్నాడు కారు తీసుకొని వచ్చాడు. అందరం కలిసి హాస్పిటల్ కు వెళ్ళాము. అసలేమీ జరిగిందో తెలుసుకోవాలనిపించలేదు. పెద్దోడొచ్చి ఇరవైనాలుగు ఘంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు డాక్టరు అన్నాడు. ఈలోపు మానవoడ్లు వచ్చారు... ఆంటే చిన్ని చిన్ని కేమైనట్టు. అడగాలనుకుంటున్న మాట పెగలట్లేదు దేవుడా! !! మళ్ళి ఆక్సిడెంట్ రూపంలో హతవిధీ!!! అని అనుకున్న. ఐసీయూలో ఉంది. ఎవ్వరిని పంపించటంలేదు అని చెప్పాడు... ఈలోపు సెక్యూరిటీ ఆఫీసర్లు పంచానామాకొచ్చారు. ఏదో సీరియస్ గా మాటలు నడుస్తున్నాయి. కాసేపటికి వారు డాక్టర్ తో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ గొడవలో గమనించనేలేదు చాల మంది తన క్లాసుమేట్స్ వున్నారు. అందులో ఒక అబ్బాయితో మా పెద్దాడు చిన్నాడు ఇద్దరు కలిసి చాల కోపం తో మాట్లాడుతున్నారు. ఓహో ఆ అబ్బాయే ఆక్సిడెంట్ కు కారణం కాబోలు.... కావాలని చేసుండడు కదా మన గ్రహపాటు. ఇంకా వాడితో మాటలు తెగలేదు అంటే కొంపదీసి ఆసిడ్ దాడిలాంటిది. ... మనసు కు చాల భయం వేసింది. అప్పుడడిగా చిన్నికేమైంది అని. మావారు ఇచ్చిన సమాధానంతో కళ్ళు బేర్లు కమ్మి కళ్ళుతిరిగి పడిపోయా. మెలుకువ వచ్చి చుసేపాటికి ఆసుపత్రి బెడ్డు మీదున్న. డాక్టర్లు మారెo పర్వాలేదు అని చెప్పివెళ్లిపోయారు. ఈలోపు పెద్దవాడు వచ్చి అమ్మ నీవేమి బాధపడకు చిన్ని కి ప్రణాపాయo లేదని డాక్టర్లు చెప్పారు అని సంతోషంగా చెప్పాడు. నేను చిన్నిని చూడకుండానే ఇంటికి వచ్చేసాను. వారo తర్వాత చిన్ని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఈ వారం లో కనీస ఒక్కసారి కూడా చిన్ని ని చూడడానికి వెళ్ళలేదు. పాపం కోడళ్ళిద్దరు చాల చక్కగా చూసుకున్నారు. అది ఇంటికి వస్తూనే ఏమిటి అమ్మమ్మ నీవు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు అని గారాలు పోతూ అడుగుతుంటే ఆ చంపా ఈ చంప చళ్ళు మని వాయిoచా!!!!... నా చర్యకు అందరు విస్తుపోయారు. చిన్నోడు పెద్దోడు కంగారుగా నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. చిన్ని కూడా ఏడుపు కండ్లతో నా వైపే చూస్తోంది. . జీవితంలో మొదటిసారి అదంటే నాకు చాల అసహ్యమేసింది. నాకంటిముందుoటే చంపేస్తాను నాముందునుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను అందరు జడుసుకున్నారు. దాన్ని నన్ను కోర్చుపెట్టారు. నాకు కోపం పిచ్చి స్థాయిలో వుంది. అది అడుగుతోంది ఎందుకు అమ్మమ్మ అంత కోపంగా వున్నావు అని లేచొచ్చి మళ్లి చెంప చళ్ళు మనిపించా . కాలు కింద పెడితే కాలు అరుగుతుందేమోనన్నట్లు పెంచితే నీవు చేసిన నిర్వాకమేమిటి . వాడెవడో నీ ప్రేమను కాదన్నాడని మనస్తాపమ్ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా. మీ అమ్మవాళ్లతో నీవు పోయినా బాగుండేది. మృతుంజయురాలు అంటే ఎంత సంతోషపడ్డానో తెలుసా. అమ్మమ్మ వయసులో నీకు అమ్మనయ్యా నీకు అమ్మ లేని లోటు తెలియకూడదని కంటికి పాప లాగ కాపాడుకున్నా . మీ తాత!!! చేత కాకపోయినా పాపం ఎంతో చేశారు నీకోసం. మీ నాయనమ్మ వాళ్ళు వారి కొడుకును నీలో చూసుకున్నారు....మీ మామయ్యలు నిన్ను కాదన్న సంభంధం ఎంత మంచిదైనా కాదన్నారు. నిన్ను ఒప్పుకున్నవాళ్ళ నే పెళ్లి చేసుకుంటామని పెళ్లీడు అయిపోవస్తున్నా అలాగే వున్నారు కానీ నిన్ను కాదన్న వాళ్ళను చేసుకోనేలేదు. మా అందరికి నీతో రక్త సంభంధం వుంది కానీ మీ అత్తయ్యలకు ఏమి సంభందం!!!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
తల్లి తండ్రులు లేని దానివని వారు తమకు దేవుడిచ్చిన బిడ్డ అని వారి బిడ్డలకంటే ఒక ముద్ద నీకే ఎక్కువపెట్టారు. ..మేమంతా అంత విలువలేని వాళ్ళమే నీకు !!!!. వాడేదో నీ ప్రేమను కాదన్నాడని వళ్ళు బలుపెక్కి చావడానికి సిద్హపడతావా. మరి నిన్ను మేము పాతికేళ్లుగా కంటికి పాపలాగా గొప్పగా చూసుకున్న మా ప్రేమకు నీవు విలువేమిచ్చినట్టు. నీవు మా ప్రేమకు విలువ ఇవ్వలేదని మమ్మలన్దరిని మూకుమ్మడిగా చావమంటావా. ఇంత స్వార్థపరురాలివి అనుకోలేదు. ఛీ !!! నీ మొహం నాకు చూపించకు అని భూమ్యాకాశాలు ఏకం చేస్తూ చెప్పా. మా పెద్దోడు సర్ది చెప్పడానికి వచ్చాడు. అది చిన్నపిల్ల అమ్మ తనను కాదనేపాటికి ఏదో ఆవేశంలో ఇలా మరి వయసు అలాంటిది అని సర్ది చెబుతున్నాడు. దానికి అవసరానికన్నా ఎక్కువ ఇచ్చామేము అనిపించింది. ప్రేమ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు..... అందరూ నచ్చచెప్పటానికి ప్రయతిస్తున్నారు అది కూడా నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరింది. క్షమించమని అడిగింది. ఇంత మంది త్యాగాలకు, ప్రేమ అభిమానానికి విలువలేని దాన్ని క్షమించే ప్రశ్నయే లేదు అని ఖరాఖండిగా చెప్పేసాను. నేను ఆవేశం తగ్గాక మాట్లాడుతాలే అని అంతా అనుకున్నారు. చిన్ని కూడా రోజు క్షమించమని అడుగుతోంది. కోడళ్ళు వకాల్తా పుచ్చుకున్నారు. . అయినా కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు. నా ఖంఠంలో ప్రాణముండగా దాన్ని క్షమించను. అది చేసింది ముమ్మాటికీ క్షమించరాని తప్పు. వాడెవడో కాదంటే నిలబడి వాడ్ని తల తన్నేవాడిని తెచ్చి చూపాలి... లేదా ఇంతమంది నన్ను ఇష్టపడేవాళ్ళున్నప్పుడు పొర అని చెప్పాలి... అంతే కాని ఇంత మంది ప్రేమ ప్రేమే కాదు వాడిది మాత్రమే ప్రేమ అంటే... ఇదా ప్రేమంటే... ప్రేమంటే నాకొడుకులది నా కొడళ్లది... చిన్నిది బలుపు... ఏమో అందరూ చెబుతున్నా నా మనసు ఒప్పుకోవటంలేదు..... ఏమో రేపెప్పుడైనా కోపం తోగ్గోచ్చేమో!!! మాట్లాడొచ్చేమో!!! కానీ నావరకైతే క్షమించే ప్రశ్నయే లేదు. కొన్నింటికి క్షమాపణలుండవు అంతే ... కాని తల్లి మనుసు అన్నింటిని క్షమించేస్తుందేమో...చిన్ని తొందరపాటును కూడా అందుకు నేను మినహాయిoపు కాదేమో...
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,607
Threads: 151
Likes Received: 8,569 in 1,750 posts
Likes Given: 4,865
Joined: Nov 2018
Reputation:
610
"అమ్మమ్మ వ్యధ "
బాధ సహనం అమ్మమ్మ
" ధైర్యవంతురాలు అమ్మమ్మ..."
తనని రెండో పెండ్లోనికి ఇచ్చి పెండ్లి చేసినా...
కడుపుతో ఉన్నప్పుడు కుక్క కాటుకు తన కాలు జబ్బు పడినా..
సొంత కూతురిలా చూసుకుంటున్న పెంచిన కూతురు కాలం చేసినా...
ఇరవై ఏళ్ల క్రితం కట్టుకున్నోడు శాశ్వతం గా దూరమైనా..
బాధ పడలేదు...
లేదు లేదు బాధపడినా బయట పడ లేదు.
పెద్ద కూతురుకి ముక్కుపచ్చలారకుండానే పెళ్లి చెయ్యాల్సోచ్చిన,
అమాయకురాలైనా రెండో అమ్మాయిని అయ్య చేతిలో పెట్టాల్సి వచ్చినా...
చివరికి మిగిలిన చిన్న పిల్లకి పెళ్లి చేసి సుదూరంగా సాగనంపాల్సొచ్చినా,
భయపడలేదు...
లేదు లేదు భయపడినా బయట పడలేదు.
పని లేక తిరుగుతున్న పెద్దోడు గురించి కానీ, ఉమ్మట్లోంచి వేరుపడిన రెండోవొడు గురించి కానీ, చిర్రు బుర్రు లాడే చిన్నోడి గురించి కానీ బెంగ పడలేదు...
లేదు లేదు బెంగ పడినా బయట పడలేదు.
అందుకే అమ్మమ్మ ధైర్యవంతురాలు
"పాడైపొయింది అమ్మమ్మ..."
కూతురిగా, సోదరిగా, ఆలిగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మ గా, ఆఖరికి తాతమ్మగా ఎన్ని తరాలకి సేవలందించిందో ఆ సహనశీలి...
ఏ రోజు టైం కి తినింది లేదు...టైం కి పడుకున్నది లేదు...
రోజూ కోడి కూయకముందే తన నిద్ర సమాప్తం
యెనిమిది పదుల వయసు పైబడుతున్నా ఎప్పుడూ ఎదోకటి పులుముకోవడం , తడుముకోవడం.
ఆ బోధ కాలుతోనే ఇప్పటివరకూ అవన్నీ నెట్టుకొచ్చింది మరి.
అందుకే పాపం అమ్మమ్మ పాడైపోయింది...
"మూగబోయింది అమ్మమ్మ..."
అయినవాళ్ళు.. కానివాళ్లు... ఇంట్లో వాళ్ళు... ఇరుగుపొరుగు వారితో... ఎన్ని అపవాదులు మూటకట్టుకుందో...
చిన్నోల్లతో పెద్దొల్లతో ఈ వయసులో కూడా ఎన్ని మాటలు పడుతుందో..
పది పదిహేనేళ్ళ క్రితం తన మాటకి పెద్దరికాన్ని అలంకరించినా..
ఇప్పడు అదే మాటలని చేదస్థం అని అక్షేపించినా...
మాటు మాట్లాడలేని నిస్సహాయురాలు అమ్మమ్మ
అందుకే అమ్మమ్మ మాటే కాదు మనసు కూడా మూగబోయింది.
"పిచ్చిదైపోయింది అమ్మమ్మ..."
దాదాపు ఏడెండ్ల క్రితమే కాలం చేసిన పెద్ద కూతురు బాధ నుండి ఇంకా తేరుకొనేలేదు,
అంతలోనే ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే ఆ పెధ్దోడు కూడా ఇప్పుడు ఇలా...
ప్రేగు తెంచుకు పుట్టినోల్లని కళ్లముందే ఆ క్యాన్సర్ మహమ్మారి కభళిస్తుంటే పాపం ఆ కన్న హృదయం విల విల లాడుతోంది, ఆ పిచ్చి తల్లి తల్లడిల్లుతోంది
అందుకే పాపం అమ్మమ్మ పిచ్చిధైపోయింది.
"ఆశ పడుతుంది అమ్మమ్మ..."
ఒకప్పుడు తన ముంగిట అల్లర్లు చేస్తూ... కబుర్లు చెప్పే మనుమలని చూసే మురిసిపోయిన అమ్మమ్మ
ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్లయి ఎక్కడెక్కడో స్థిరపడ్డాక కనీసం ఫోనైన చేసి క్షణమైనా మాట్లాడకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది.
(చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నా అందులో నేనొకడిని)
అందుకే అమ్మమ్మ ఆశ పడుతుంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|