Posts: 3,657
Threads: 23
Likes Received: 16,608 in 3,780 posts
Likes Given: 2,433
Joined: Dec 2021
Reputation:
1,017
13-03-2025, 09:54 PM
(This post was last modified: 13-03-2025, 09:56 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
విశ్వాసం నేర్పిన చిరుపరిచయం
నా చిన్ని స్నేహం కుక్కపిల్ల.
గడిచే సమయాన్ని
మూతి కూటికి వాడతావో,
ముడ్డి సుఖానికి వాడతావో,
మన చేతిలోనే ఉందని
చెప్పింది సబ్బుబిళ్ళ.
పుల్ల మండుతూ వెలుగునిస్తూ,
గాలికి ఆరుతుంది, అగ్గిపుల్ల.
కోపం నవ్వుకి,
తాపం ముద్దుకి,
ఆవేశం మాటకి,
జీవితం కాలానికి,
కరిగిపోవాల్సిందే అని తెలియచేస్తుంది.
ఆడపిల్ల
సహనాన్ని
సరసాన్ని
మమకారాన్ని
సంద్రంలా చూపిస్తుంది.
వెటకారాన్ని
అలకని
కోపాన్ని
వర్షంలా కురిపిస్తుంది.
?
Posts: 3,657
Threads: 23
Likes Received: 16,608 in 3,780 posts
Likes Given: 2,433
Joined: Dec 2021
Reputation:
1,017
చెమ్మ తిరిగిన కన్నులూ మోసము చేయునులే
నవ్వు నిండిన పెదవులూ గోసను దాచునులే.
మంది మంచి కోరిన నీకు బాధ తప్పదులే
నీకు బాధని కలిగించేది కూడా ఆ మందేలే.
చెడు చేద్దాం అనుకున్నా
మంచి చేద్దాం అనుకున్నా
మంది పోగవడం సహజం.
మంచి చేసినా
చెడు చేసినా
పేరు రావడమే నిజం.
నీకు చేసుకునే మంచీ మందికి చెడు అవ్వొచ్చు
మంది చేసుకునే మంచీ నీకు చెడుగా మారొచ్చు.
స్వార్ధం అనేది మంచి చెడుల నిర్వచనం ఇస్తుంది.
కాలం అనేది తప్పు ఒప్పుల తీర్పు చెపుతుంది.
ఓటమి అనేది ఎప్పుడూ నిన్ను దోషిని చేస్తుందీ.
గెలుపు అనేది న్యాయం యొక్కా అర్థం రాస్తుంది. - ẞ|π√
.
•