Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
తీర్థప్రసాదాలను తీసుకొని ముందు లావణ్య, శార్వరీలు వెనకాల ప్రణవి, దీప్తి ఆలయం నుండి బయటికి వచ్చారు. ముందున్న మండపంలో కూర్చొని ఐదు నిముషాలు ధ్యానంతో కళ్ళు మూసుకున్నాడు.
ముందుగా కళ్ళు తెరిచిన ప్రణవి లావణ్యను సమీపించి కూర్చుంది. ఆమె ప్రక్కన దీప్తి. లావణ్య కళ్ళుతెరిచి తన ఎదురుగా కూర్చొని వున్న ప్రణవిని చూచింది. శార్వరీ దీప్తి ప్రక్కన జరిగి కూర్చుంది.
"వదినా!.. బాగున్నావా!"
"వున్నాను.. కానీ మనస్సు బాగాలేదు. దానికి కారణం ఏమిటో నీకు తెలుసు."
అవునన్నట్లు సాలోచనగా లావణ్య తలాడించింది.
"లావణ్యా!.. నాకు ఒక కోరిక వుంది. దాన్ని నీవే తీర్చగలవు"
"ఆ కోరిక.. దీప్తి.. ఈశ్వర్ల వివాహమేగా!" చిరునవ్వుతో అడిగింది లావణ్య.
"అవును వదినా!" దీనంగా చెప్పింది ప్రణవి.
లావణ్య, శార్వరీ దీప్తి ముఖాల్లోకి చూచి "ఇరువురూ వెళ్ళి నవగ్రహాలను ప్రదక్షిణలు చేసిరండి" చెప్పింది లావణ్య.
ఆ ఇరువురూ వెంటనే లేచి నిలబడ్డారు.
"రా శారూ!" అంది దీప్తి.
"పద వదినా!"
ఇరువురూ నవగ్రహ మండపం వైపు నడిచారు.
"వదినా! నీ కోర్కె విషయంలో నాకు మీ అన్నయ్యకు పరిపుర్ణ సమ్మతం. కానీ!.."
"ఈశ్వర్కు ఇష్టం లేదా వదినా!.."
"వాడు మా మాటను మీరడు!"
"మరి నీ సందేహం ఏమిటి?"
"నా సందేహం మా అన్నయ్య విషయంలో! ఆయన దీప్తి, ఈశ్వర్ వివాహానికి అంగీకరిస్తాడంటావా!"
"అంగీకరించడు. దీప్తిని తన స్నేహితుడు పరంజ్యోతి కొడుకు డాక్టర్ దివాకర్కు ఇచ్చి వివాహం చేయాలనేది వారి నిర్ణయం. త్వరలో వారు దీప్తిని చూచి అన్ని విషయాలూ మాట్లాడుకొనే దానికి వస్తారట. ఈ విషయాన్ని మీ అన్నయ్యే నాకు చెప్పాడు. వాళ్ళు నా ఇంటికి రాకూడదు. దీప్తిని చూడకూడదు" తన నిశ్చితాభిప్రాయాన్ని గంభీరంగా చెప్పింది ప్రణవి.
"అన్నయ్య నిర్ణయం అలావుంటే నీవు ఎలా ఆపగలవు వదినా!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.
"వదినా!.. ఆపాలి.. దానికి నాకు నీ సహాయం కావాలి!"
"అంటే?"
"రేపు వారు రాబోతున్నారనగా ముందురోజు రాత్రి దీప్తిని నేను నీ ఇంటికి కోడలిగా పంపుతాను. దీప్తి నీ ఇంట్లో కాలుపెట్టిన క్షణం నుంచి.. అది ఈశ్వర్ భార్య. నీ కోడలుగా నీ యింట్లోనే వుంటుంది. వారిరువురికీ వివాహం జరిపించే బాధ్యత నీవు మా అన్నయ్య తీసుకోవాలి" దీనంగా చెప్పింది ప్రణవి.
"వదినా!.. నీవు!.." ఆగిపోయింది లావణ్య.
"కొత్త సమస్యను సృష్టించి.. మీరు మోయలేని భారాన్ని మీ తలపై పెడుతున్నాననేగా నీవు అనాలనుకొన్నది. ఈ కారణంగా మీ అన్నయ్య రెచ్చిపోతాడని పగ శతృత్వాలు పెరుగుతాయనేగా నీ సందేహం!"
"అవును వదినా!"
"దీప్తి మేజర్ వదినా!.. చిన్నపిల్ల కాదు. తనకు నచ్చినవాడిని వివాహం చేసుకొనే హక్కు, అర్హతా ఇప్పుడు దీప్తికి వున్నాయి. మీ అన్నయ్య నన్ను నోటికి వచ్చినట్లు తిట్టబోతాడు. నేను ఆయన మాటలను లెక్కపెట్టబోను. నాకు కావలసిందల్లా మన దీప్తి ఆనందంగా వుండడమే!.. ఒక తల్లిగా నా బిడ్డ విషయంలో నాకు అలాంటి కోరిక వుండటం న్యాయమా.. అన్యాయమా లావణ్యా!" దీనంగా అడిగింది ప్రణవి.
లావణ్య కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మౌనంగా వుండిపోయింది.
"వదినా!.." లావణ్య భుజంపై తట్టింది ప్రణవి.
లావణ్య కళ్ళు తెరిచి నవ్వింది.
"వదినా!.. దీప్తి నా యింటి కోడలే అవుతుంది. అన్నయ్యలో నాలో ప్రవహించే రక్తం ఒకటేగా!.. పగను, విరోధాన్ని పెంచుకోవాలనే పట్టుదల వాడికి వుంటే.. నాకు ప్రేమ బంధుత్వాన్ని పెంచుకోవాలనే పట్టుదల వుంది. దీప్తిని గురించి నీవు దిగులుపడకు. అది నా యింటి నా కోడలు" అంది లావణ్య.
"ఎంతోకాలం తర్వాత కలసుకొని మనం అరమరికలు లేకుండా మాట్లాడుకున్నాము వదినా! నా నిర్ణయాన్ని నీవు అంగీకరించావు. నాకు చాలా సంతోషంగా వుంది" ప్రీతిగా ప్రణవి లావణ్య చేతులు పట్టుకొంది.
ఆలయంలో ప్రవేశించిన మాధవయ్యను చూచింది లావణ్య. "లే వదినా! ఇక మనం వెళ్దాం. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా గోరంతలను కొండంతలు చేసి చెప్పే మాధవయ్య నారదుడు ఆలయంలోకి వచ్చాడు" అంది లావణ్య.
ఇరువురూ లేచారు. దీప్తి శార్వరీ వారిని సమీపించారు. నలుగురూ గుడి నుండి బయటికి నడిచారు.
ప్రజాపతి ఊర్లో లేని కారణంగా నిర్భయంగా ప్రణవి దీప్తితో రైల్వేస్టేషన్లో కలుసుకున్నారు. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, శార్వరీలు దీప్తి ప్రణవీలను స్టేషన్లో కలుసుకొన్నారు. హౌరా ఎక్స్ ప్రెస్లో వారు చెన్నైకి బయలుదేరారు. కంపార్టుమెంటులో ఎక్కిన వారందరికీ వీడ్కోలు చెప్పి ఆనందంగా ప్రణవి ఇంటికి వెళ్ళిపోయింది.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 979
Threads: 0
Likes Received: 1,469 in 853 posts
Likes Given: 3,748
Joined: Jun 2020
Reputation:
63
(24-02-2025, 11:28 AM)k3vv3 Wrote: ఇరువురూ లేచారు. దీప్తి శార్వరీ వారిని సమీపించారు. నలుగురూ గుడి నుండి బయటికి నడిచారు.
ప్రజాపతి ఊర్లో లేని కారణంగా నిర్భయంగా ప్రణవి దీప్తితో రైల్వేస్టేషన్లో కలుసుకున్నారు. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, శార్వరీలు దీప్తి ప్రణవీలను స్టేషన్లో కలుసుకొన్నారు. హౌరా ఎక్స్ ప్రెస్లో వారు చెన్నైకి బయలుదేరారు. కంపార్టుమెంటులో ఎక్కిన వారందరికీ వీడ్కోలు చెప్పి ఆనందంగా ప్రణవి ఇంటికి వెళ్ళిపోయింది.
====================================================================
ఇంకా వుంది..
Nice update, K3vv3 garu!!!
clp); clp); clp);
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 15
రైలుబండి చెన్నై వైపు పరుగు లంఘించింది. వారి ఆ ప్రయాణం ఢిల్లీకి. చెన్నై నుంచి విమాన పయనం.
వదినా మరదలు అయిన దీప్తి, శార్వరీలు ఎంతో సరదాగా మాట్లాడుకోసాగారు. వారి అన్యోన్యత మాటలను విని హరికృష్ణ, లావణ్యలు ఒకరినొకరు చూచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.
శార్వరీతో మాట్లాడుతూనే దీప్తి, ఈశ్వర్ను క్రీకంట గమనిస్తూనే వుంది.
చేతన్ భగత్ వ్రాసిన ’వన్ ఇండియన్ గర్ల్’ ఇంగ్లీషు నవలను ఈశ్వర్ చదువుతున్నాడు. మధ్య మధ్యన దీప్తి నవ్వును.. మాటలను విని పుస్తకం చాటునుంచి ఆమె చర్యలను గమనిస్తున్నాడు.
దీప్తి, ఈశ్వర్ల నయన సంభాషణను హరికృష్ణ, లావణ్యలు గమనించారు. వారి పెదవులపై చిరునవ్వు. మనస్సున ఆనందం. రైలు చెన్నై చేరింది. ఈశ్వర్ స్నేహితుడు మురుగన్ పంపిన టవేరా కారు డ్రైవర్, వారిని ఎయిర్ పోర్టుకు చేర్చాడు. డ్రైవర్కు ఈశ్వర్ ఐదువందలు ఇచ్చాడు. అతను వద్దుసార్ అన్నాడు. బలవంతంగా అతని జేబులో పెట్టాడు ఈశ్వర్. అతని ఆ చర్యకు దీప్తికి ఎంతో ఆనందం.
"అత్తయ్యా!.. ఎవరి ఋణాన్ని మనం వుంచుకోకూడదు కదూ!"
"ఆఁ.. ఆఁ.. అవును పద" అంది లావణ్య.
లగేజీని ట్రాలీలో సర్దేదానికి ఈశ్వర్కు దీప్తి, శార్వరీ సాయం చేశారు.
ఒక ట్రాలీని ఈశ్వర్ మరో ట్రాలీని దీప్తి తీసుకొని ఎంట్రీ సెక్యూరిటీ చెక్ ముగించుకొని.. బోర్డింగ్ కార్డులను తీసుకొని.. ఏరో బ్రిడ్జి ద్వారా స్పెయిన్ జెట్ బోయింగ్లో ప్రవేశించారు. ’ఇ’రోలో ’డి’ సీటు శార్వరికి, ’ఇ’ సీటు ఈశ్వర్కు, ’ఎఫ్’ సీటు దీప్తికి.
"అన్నయ్యా!.. నేను కిటికీవైపు కూర్చుంటాను" అంది శార్వరి.
"అలాగే అమ్మా!.. కూర్చో!"
"అది నా సీటు.." అంది దీప్తి.
"చిన్నపిల్ల శారూ కూర్చుంటానన్నది కదా!.." ప్రశ్నార్థకంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.
"మరి నేనెక్కడ?"
"శారూ ప్రక్కన కూర్చో!"
"మరి మీరు!.."
"అన్నయ్య నీ ప్రక్కనే కదా కూర్చోవాలి వదినా! ఈ మూడు సీట్లు మనవేగా!"
"ఓహో!.. అలాగా సరే!" అమాయకంగా ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అంది దీప్తి.
ముగ్గురూ కూర్చున్నారు. వారి వెనుక సీట్లో కిటికీ వైపు లావణ్య, ప్రక్కన హరికృష్ణ, అతని ప్రక్కన గిరిదాదాడీవాలా కూర్చున్నారు. బెల్ట్ పెట్టుకోమనే సందేశం. పైలెట్ పేరు, సహాయకుని పేరు, ఎయిర్ హోసెస్ట్ పేర్లు, వూర్లు వివరణం- సీనియర్ ఎయిర్ హోసెస్ట్ తొలుత హిందీలో, తర్వాత ఆంగ్లంలో తెలియజేసింది.
ఓ జూనియర్ ఎయిర్ హోసెస్ట్, బెల్టు పెట్టుకొనే విధానాన్ని, విమానంలో ఆక్సిజన్ కొరవడినప్పుడు లగేజ్ కేజ్ బాటమ్ నుంచి క్రిందికి జారే ఆక్సిజన్ మాస్క్ వివరాలను, ప్రమాదవశాత్తు విమానం నీటిపై దిగవలసి వచ్చినప్పుడు సీటు క్రింద వున్న రక్షా జాకెట్ను ఏ విధంగా ఉపయోగించాలనే విధానాన్ని, ఆయా పరికరములను చూపుతూ, ప్రసారానుసారంగా అభినయం చేసింది. చివరగా రెండున్నర గంటలలో విమానం ఢిల్లీ చేరగలదని చెప్పి, ప్రసంగాన్ని ముగించింది సీనియర్ ఎయిర్ హోసెస్ట్.
విమానం రన్వేలో ప్రవేశించి.. నేల విడిచి ఆకాశంలోకి ఎగిరింది. కొద్ది నిముషాల్లో ముఫ్ఫై వేల అడుగుల ఎత్తున విను వీధిలో.. దేశంలో ఉత్తరపు వైపున వున్న ఢిల్లీ వైపుకు గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో ముందుకు సాగింది.
నవల ’వన్ ఇండియన్ గర్ల్’ చదువుతున్నాడు ఈశ్వర్. శార్వరీ కొంతసేఫు కిటికీ గుండా కనిపించే దూదిపింజల్లాంటి తెల్లని మేఘాలను చూచి తలను దీప్తి వైపు త్రిప్పింది.
దీప్తి స్పైస్ జెట్ మంత్లీ మ్యాగజైన్ చదువుతూ ఉంది. మధ్యమధ్యనా ఈశ్వర్ ముఖంలోకి చూచేది.
అతను ఎంతో ఏకాగ్రతతో నవలను చదువుతున్నాడు.
"వదినా!.. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా వుంది!" నవ్వుతూ చెప్పింది శార్వరి.
"ఎందుకు?"
"మనమంతా కలిసి విమానంలో వాణి అక్కయ్యను చూచేటందుకు ఢిల్లీకి వెళుతున్నందుకు.."
"అవును శారూ!.. నాకూ చాలా సంతోషంగా వుంది. బావా! మరి మీకు" ఈశ్వర్ చేతిపై తట్టి అడిగింది.
దీప్తి చేతి తాకిడికి.. ఈశ్వర్ చేతినుండి నవల క్రిందికి జారింది. దీప్తి క్రింద పడబోయిన నవలను తన చేతుల్లోకి తీసుకొంది.
నవ్వుతూ "సారీ బావా!" అంది.
చిరుకోపంతో దీప్తి ముఖంలోకి చూచిన ఈశ్వర్ ఆమె ముఖ భంగిమను చూచాడు. అప్రయత్నంగా అతని పెదవులపైన చిరునవ్వు.
"కావాలనే అంతా చేశావు కదూ!" మెల్లగా అడిగాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"కాదు" బుంగమూతితో చెప్పింది దీప్తి.
"అబద్ధం చెప్పకూడదు"
"నేను చెప్పింది నిజమే బావా!" దీనంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది.
కొన్ని క్షణాల తర్వాత..
"మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది దీప్తి.
"ఏ విషయంలో!"
"మన ఈ ప్రయాణ విషయంలో"
కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు ఈశ్వర్.
అతను మనస్సులో ’చాలాకాలం తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వాణి అక్కయ్యను చూడబోతున్నాను. ఈ మా ప్రయాణానికి దీప్తి కారణం. ఆమె అమెరికాలో వుండి ఉంటే యిలాంటి సుదినం వచ్చేది కాదు’ అనుకొన్నాడు ఈశ్వర్.
ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూచాడు.
దీప్తి ఆనందంతో అందంగా నవ్వింది.
"దీపూ!.. నీవు చాలా మంచిదానివి. మా ఈ ప్రయాణానికి కారణం నీవే!"
"నేను కాదు బావా!.. మీ మంచి మనస్సు."
దీప్తి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ ఆనందంగా నవ్వాడు ఈశ్వర్.
"మనం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నీ హాస్పిటల్ భవనం ఎంతో సుందరంగా వుంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాను. హాస్పిటల్ నేమ్ బోర్డు కూడా తయారుగా ఉంటుంది. తిరిగి వచ్చాక మంచిరోజు చూచుకొని పురోహితుని పిలిపించి సాంప్రదాయబద్ధంగా పూజను జరిపించి.. బోర్డును తగిలిద్దాం. మరోమాట.. నీకు సహాయంగా అనుభవం కల ఇరువురు నర్సులను కూడా ఏర్పాటు చేశాను. డాక్టర్గా.. ఈ ప్రాంతంలో నీకు మంచిపేరు రావాలని.. అందరి అభిమానాన్ని నీవు పొందాలని నేను కోరుకుంటున్నాను" ఎంతో ప్రీతిగా మెల్లగా చెప్పాడు ఈశ్వర్.
అయస్కాంతానికి అంకితం అయిన ఇనుప ముక్కలా ఆశ్చర్యానందాలతో అన్నయ్య మాటను.. దీప్తి ముఖ భంగిమలను చూచి శార్వరి ఆనందంగా కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ.. నవ్వుకొంది. ’భగవాన్ మా అన్నా వదినల వివాహం త్వరలో జరగాలి’ అనుకొంది శార్వరి.
రామయోగి.. తన కుమారుడు కళ్యాణ్తో ఫోన్లో దీప్తి ఫలానారోజున ఢిల్లీకి వస్తున్నదని, ఆమెతో మామిడీ ఊరగాయను పంపుతున్నానని చెప్పాడు.
కళ్యాణ్ ఈ విషయాన్ని తన అర్థాంగి వాణికి తెలియజేశాడు. ఎంతో ఆనందంతో వాణి గంతులేసింది.
వాణి, కళ్యాణ్లు దీప్తిని రిసీవ్ చేసుకొనేదానికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టుకు వచ్చారు.
స్పెయిస్ జెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలు లగేజ్ని బెల్ట్ పైనుంచి తీసుకొని ట్రాలీలో వుంచుకొని విమానాశ్రయం బయటికి వచ్చాయి. వారి వెనకాల హరికృష్ణ, లావణ్యలు. ఎంతో ఆత్రంగా దీప్తి కోసం ఎదురు చూస్తున్న వాణి, కళ్యాణ్ ఆ ఐదుగురుని చూచి.. ఆశ్చర్యంతో తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.
"ఏమండీ!.. ఇది కలా నిజమా!" పారవశ్యంతో అడిగింది వాణి.
ఆ ఆశ్చర్యాన్నుంచి తేరుకొన్న కళ్యాణ్, వాణి భుజంపై చెయ్యివేసి..
"ఇది కల కాదు నిజమే!.. దీప్తితో అమ్మా, నాన్న ఈశ్వర్, శార్వరీలు కూడా వచ్చారు" అన్నాడు. వారినందరినీ చూస్తూ చేతులు జోడించాడు కళ్యాణ్.
తనవారినందరినీ చూచిన వాణి కళ్ళల్లో ఆశ్రువులు నిండాయి. వాణిని.. చూచిన దీప్తి తన చేతుల్లో ట్రాలీని వదలి పరుగున వాణిని సమీపించి..
ఆమె భుజాలను పట్టుకొని "వదినా!.. నేను గుర్తున్నానా మీ దీప్తిని. ఈ కన్నీళ్ళేమిటి వదినా!.. ఇప్పుడు మనమంతా ఎంతో సంతోషించవలసిన సమయం. అటు చూడండి. మిమ్మల్ని చూడాలని అమ్మా నాన్న, ఈశ్వర్ బావా, నీ చెల్లి శార్వరీ, నేను వచ్చాము" తన హ్యాండ్ కర్చీఫ్తో వాణి కన్నీటిని తుడిచింది దీప్తి.
దీప్తి వదలిన ట్రాలీని శార్వరి తన చేతులతో ముందుకు త్రోసికొని వాణిని సమీపించింది.
"అక్కా!.." గద్గద స్వరంతో శార్వరీ వాణిని కౌగలించుకొని భోరున ఏడ్చింది. చిన్న సోదరి కౌగిలిలో చిన్నపిల్లలా వాణి మారి శార్వరి భుజంపై వాలి కన్నీరు కార్చింది.
హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్ వాణిని సమీపించారు. ఆ ముగ్గురి కళ్ళల్లో ఆశ్రువులు..
శార్వరి భుజంపైన వున్న తన తలను పైకెత్తి వాణి, తనకు చేరువైన ఆ ముగ్గురినీ చూచింది.
భావావేశంతో ముందుకు నడిచి వంగి తన తల్లిదండ్రుల పాదాలను తాకబోయింది. వాణి ఐదుమాసాలు గర్భవతి. కూతురి స్థితిని గమనించిన లావణ్య ఆమె భుజాలను పట్టుకొని ఆపి.. తన అక్కున చేర్చుకుంది.
భోరున ఏడుస్తూ వాణి "అమ్మా!.. నన్ను క్షమించగలవా!" దీనంగా అడిగింది.
ఆ మాట విన్న హరికృష్ణ, ఈశ్వర్ చలించిపోయారు. ఇరువురూ ఆమె భుజాలపై తమ చేతులు వుంచారు.
"అమ్మా!.. వాణీ.. ఏడవకు తల్లీ!.." గద్గద స్వరంతో చెప్పాడు హరికృష్ణ.
"అక్కా!.. ఏడవకు.. అందరూ మనల్నే చూస్తున్నారు. పద యింటికి పోదాం" అన్నాడు బొంగురుపోయిన కంఠంతో ఈశ్వర్.
కళ్యాణ్.. రెండు టాక్సీలలో వారి లగేజ్ను ఎక్కించాడు. అతనికి దీప్తి, శార్వరీలు లగేజ్ను అందించారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"తల్లీ వాణీ!.. నీవు ఒట్టి మనిషివి కాదురా!.. ఏడవకు, పదమ్మా!" లావణ్య వాణి భుజంపై చేయి వేసింది. ఇరువురూ టాక్సీని సమీపించారు. కళ్యాణ్ వెనుక డోర్ను తెరిచారు. ఇరువురూ లోన కూర్చున్నారు.
కళ్యాణ్ ఈశ్వర్ను సమీపించి "ఈశ్వర్! మీరు మామయ్యగారు, శార్వరి, దీప్తి ఆ టాక్సీలో రండి. డ్రైవర్కు చెప్పాను. అతను మా టాక్సీ వెనకాలే వస్తాడు సరేనా!"
హరికృష్ణవైపు చూచి.. "మామయ్యగారు!.. మీరు టాక్సీలో కుర్చోండి" ముందువైపు డోర్ తెరిచాడు.
హరికృష్ణ టాక్సీలో కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ వెనుక సీట్లో కూర్చున్నారు.
కళ్యాణ్ వెళ్ళి ముందున్న టాక్సీ ముందు సీట్లో కూర్చున్నాడు. రెండూ టాక్సీలు ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరాయి.
"అమ్మా వాణీ!" కూతురు ముఖంలోకి చూచింది లావణ్య.
"ఏమ్మా!.."
"నీ ఆరోగ్యం బాగుంది కదా! లేడీ డాక్టర్ను కలిశావా!"
"ఇప్పటికి మూడుసార్లు కలిశానమ్మా! అంతా సవ్యంగా వుందని చెప్పింది."
"ఇప్పుడు ఎన్నోనెల!"
"ఐదవ నెలమ్మా!"
లావణ్య కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళనుండి కారిన కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.
వాణి తల్లి ముఖంలోకి చూచింది. ’నా గురించి నా తల్లి బాధపడుతూ వుంది. వారికి చెప్పకుండా నేను తీసుకొన్న నిర్ణయం వారి దృష్టిలో, అందరి దృష్టిలో కూడా తప్పే.. మూడేళ్ళ తర్వాత ఈనాడు వీరినందరినీ ఇలా కలుస్తానని నేను ఏనాడూ వూహించలేదు. వీరంతా కలిసి వచ్చారంటే నా తప్పును ఒప్పుగా స్వీకరించి.. నన్ను క్షమించారన్నమాట. నా జీవితంలో ఈరోజు ఎంతో సుదినం. దేవుడు దయామయుడు. నా కోర్కెను తీర్చాడు’ అనుకొంది వాణి. కొన్ని క్షణాల తర్వాత..
"అమ్మా!.."
"ఏం తల్లీ!.."
"దీప్తి అమెరికా నుండి ఎప్పుడు వచ్చిందమ్మా!"
"మూడు నెలలు అయింది."
"దీప్తి మీతో ఎలా రాగలిగిందమ్మా!.. మామయ్య ఒప్పుకున్నాడా!.."
"వాడా!.. ఒప్పుకోవడమా!" విరక్తిగా నవ్వింది లావణ్య. "వాడి హృదయం నిండా మాపై పగ, కక్ష. వాడు తప్పుచేసి మమ్మల్ని విరోధులుగా భావిస్తున్నాడు" విచారంగా చెప్పింది లావణ్య.
’దీనికంతటికి కారణం నేనే కదా!’ అనుకొని విచారంగా తలను దించుకొంది వాణి.
తనమాటలు.. వాణి హృదయానికి బాధ కలిగించాయనై గ్రహించిన లావణ్య.
"వాడు తప్ప.. ఆ ఇంటివారు నా వదిన, దీప్తి, సీతాపతి అందరూ ఎంతో మంచివారు. ఈనాడు మేము ఇలా వచ్చేదానికి కారణం సీతాపతి, దీప్తి. నా మేనల్లుడు, మేనకోడలు."
"సీతాపతి బాగా ఎదిగిపోయి వుంటాడుగా. ఏం చేస్తున్నాడమ్మా!"
"వైజాగ్లో బి.టెక్ చదువుతున్నాడు. వాడు చాలా మంచివాడు. చిన్న వయస్సులోనే వాడికి మీ తాతయ్యలా గొప్ప వ్యక్తిత్వం, ఎంతో బంధుప్రీతి" ఆనందంగా చెప్పింది లావణ్య.
శార్వరికి, సీతాపతికి వయస్సులో ఎంత వ్యత్యాసమమ్మా!" అడిగింది వాణి.
"ఒకటిన్నర సంవత్సరం.. అవును ఇప్పుడు వారి వయస్సును గురించి ఎందుకు అడిగావు?" చిరునవ్వుతో అడిగింది లావణ్య.
వాణి తల్లి ముఖంలోకి చూచింది. కొన్నిక్షణాలు తర్వాత.. "నా మూలంగా విడిపోయిన మన రెండు కుటుంబాలు, బాంధవ్యాలను కలుపుకొని అందరూ పూర్వంలా ఆనందంగా వుండాలనేది నా కోర్కె" నవ్వుతూ చెప్పింది వాణి.
"నీ కోర్కె.. నా, మీ నాన్నగారి అభిప్రాయం. కానీ ఆ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో మనకు తెలియదు కదా!" సాలోచనగా చెప్పింది లావణ్య.
మౌనంగా కూర్చొని వున్న కళ్యాణ్ వైపు చూచింది లావణ్య.
"అల్లుడుగారూ!.. మా సంభాషణ మీకు!.." లావణ్య పూర్తి చేయకమునుపే..
"వినేదానికి చాలా ఆనందంగా వుంది అత్తయ్యగారూ!.. మీ మామగారి మనస్తత్వాలను గురించి వాణి నాకు చెప్పింది. మేము మిమ్మల్ని తలచుకోని రోజంటూ లేదంటే మీరు నమ్మగలరా!" చిరునవ్వుతో చెప్పాడు కళ్యాణ్.
లావణ్య నవ్వుతూ అల్లుడు కూతురి ముఖాల్లోకి చూచింది. ’ఈడు జోడు బాగుంది. నా అల్లుడు మంచి అందగాడు’ అనుకొంది.
వెనుక సీటు విశాలంగా లేని కారణంగా ఈశ్వర్ ఎడమవైపు డోర్ వైపున ముడుచుకొని కూర్చున్నాడు. మధ్యన విమానంలో లాగే దీప్తి. రోడ్డు మిట్టపల్లాల్లో దీప్తి చేయి తన చేతికి తగలడం.. నడుముకు క్రింది భాగం.. ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడం, ఈశ్వర్కు ఇబ్బందిని కలిగించాయి.
"అభీకెతనా దూర్ హై డ్రైవర్ సాబ్!" అడిగాడు ఈశ్వర్.
"బహుత్ దూర్ హై సాబ్!" అన్నాడు డ్రైవర్.
ఓరకంట తనను దీప్తి చూచే చూపులు ఈశ్వర్లోని సహనానికి భంగం కలిగిస్తున్నాయి.
"బహూత్ మీన్స్.. కెతిన్ కిలోమీటర్!" అసహనంగా అడిగాడు ఈశ్వర్.
"ఖరీబ్ దస్ కిలోమీటర్!" చెప్పాడు డ్రైవర్.
"అభీ దస్ కిలోమీటర్!.." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"హా జీ!.."
"బావా!.." దీర్ఘం తీస్తూ పిలిచింది దీప్తి.
"ఏమిటి?.." అసహనంగా అడిగాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"మనం మాట్లాడితే డ్రైవర్ అటెంషన్ మిస్ అవుతుంది బావా!.."
"అన్నయ్యా!.. ఎలా నడపాలో అతనికి తెలుసు కదా!.." అంది శార్వరి.
దీప్తి, శార్వరీల ముఖంలోకి చురచురా చూచాడు ఈశ్వర్.
పదిహేను నిమిషాల తర్వాత.. రెండు టాక్సీలు ఓ మల్టీస్టోరెడ్ ఫ్లాట్స్ ముందు ఆగాయి. అందరూ టాక్సీల నుంచి దిగారు.
కళ్యాణ్, ఈశ్వర్ లగేజీలను దించారు. కళ్యాణ్ డ్రైవర్లకు టాక్సీ ఫేర్ ఇచ్చాడు. వారు వెళ్ళిపోయారు.
లగేజీనంతా లిఫ్టులో పెట్టి కళ్యాణ్ రెండవ అంతస్తులో వున్న తన ఫ్లాట్ ముందు వుంచి తలుపు తీసి క్రిందికి వచ్చాడు.
అందరూ రెండవ అంతస్థులోని వాణి, కళ్యాణ్ త్రిబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్లో ప్రవేశించారు. వెయిన్ని మూడువందల యస్.ఎఫ్.టి ఆ ఫ్లాట్ విస్తీర్ణం. మూడు బెడ్ రూంలకు అటాచ్డ్ బాత్రూమ్స్, విశాలమైన హాలు, డైనింగ్ రూమ్.
కాళ్ళు కడుక్కొని లావణ్య ఇంట్లోని అన్ని భాగాలను చూచింది. హరికృష్ణ కూడా ఆమె వెనకాలే తిరిగాడు.
"ఇల్లు బాగుంది కదండీ!.." అడిగింది లావణ్య.
"చాలా బాగుంది" చెప్పాడు హరికృష్ణ.
వంటింట్లో అందరికీ కాఫీ తయారుచేయడాని వెళ్ళిన వాణి వెనకాలే దీప్తి, శార్వరీ కూడా వెళ్ళారు.
"అక్కా!.. మేము ఇక్కడ వుండబోయే రోజుల్లో.. ఇంటి పనులన్నీ నేను, దీప్తి వదినా చూసుకుంటాము. నీవు నాకు డైరెక్షన్ చెయ్యి.. సరేనా!" నవ్వుతూ చెప్పింది శార్వరి.
"అవును వదినా!.. శారూ చెప్పిన మాటను మీరు వినాలి" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"సరేలేవే.. అలాగే" అంది వాణి.
స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్పై వుంచింది వాణి.
"మిగతా పని మేము చేస్తాము. మీరు వెళ్ళి అత్తయ్యా మామయ్యలతో మాట్లాడండి" అంది దీప్తి.
హరికృష్ణ, లావణ్యలు హాల్లోని సోఫాలో కూర్చున్నారు.
ఈశ్వర్ ఇల్లంతా తిరిగి చూచి వంటగదిలో ప్రవేశించాడు.
"బావగారూ! ఇక్కడ మీకేం పని? వెళ్ళి హాల్లో కుర్చోండి. ఐదు నిముషాల్లో అద్భుతమైన కాఫీని అందిస్తాం. ఏం శారూ!" ఓరకంట ఈశ్వర్ను చూస్తూ చెప్పింది దీప్తి.
"అవును వదినా!" ఈశ్వర్ ముఖంలోకి చూచి నవ్వుతూ చెప్పింది శార్వరి.
"వదినా మరదళ్ళు ఒకేమాట మీద వున్నారు. ఈశ్వర్, ఏమిటి విశేషం!" నవ్వుతూ చెప్పింది వాణి.
"అక్కా!.. వదిన చాలామంచిది. అదే విశేషం!" నవ్వింది శార్వరి.
చురచురా ఈశ్వర్ ముఖంలోకి చూస్తున్న దీప్తి చూపులను గమనించింది వాణి. బదులుగా ఈశ్వర్ పెదాలపైన చిరునవ్వు. అతన్ని చూచింది. ఆమెకు కలగవలసిన అనుమానమే కలిగింది.
"వాళ్ళు కాఫీ తెస్తారట రా. మనం హాల్లోకి పోదాం" ఈశ్వర్ చేతిని పట్టుకొంది వాణి. ఇరువురూ హాల్లోకి వచ్చారు. కళ్యాణ్ "వాణీ! ఇలారా" అని పిలిచాడు.
వాణి అతన్ని సమీపించింది.
"చేతులు జోడించి అమ్మా నాన్నలవైపు తిరుగు."
వాణి అతని అభిప్రాయాన్ని గ్రహించి కళ్యాణ్ చెప్పినట్లుగానే చేసింది. కళ్యాణ్ చేతులు జోడించాడు. ఇరువురూ హరికృష్ణ లావణ్య వైపుకు తిరిగారు.
"అత్తయ్యా!.. మామయ్యా!.. నా మూలంగా వాణి తప్పుచేసింది. మీ మనస్సులను యిరువురం నొప్పించాము. మీరు పెద్దవారు. మా తప్పును మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆనందంగా మాతో కలిసి ఉండండి" ఎంతో వినయంగా చెప్పాడు కళ్యాణ్.
హరికృష్ణ, లావణ్యలు లేచి వారిని సమీపించారు. మోడ్చిన వారి చేతులను విడదీశారు.
"ఇప్పుడు మీమీద మాకు ఎలాంటి కోపం లేదు అల్లుడుగారు. మీ ఇరువురినీ చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా వుంది" చెప్పాడు నవ్వుతూ హరికృష్ణ.
"అవునమ్మా!" అంది లావణ్య చిరునవ్వుతో.
ప్లేట్లో కాఫీ గ్లాసులను పెట్టుకొని ముందు దీప్తి, వెనుక శార్వరీ హాల్లోకి వచ్చారు. ముందు హరికృష్ణకు, లావణ్యకు, కళ్యాణ్కు, వాణీకి కాఫీ గ్లాసులను అందించింది దీప్తి.
"శారూ!.. ఈ గ్లాసును మీ అన్నయ్యగారికి ఇవ్వు!" అంది దీప్తి.
క్షణం తర్వాత.. "చెల్లెలంటే వారికి అభిమానం జాస్తి కదా!.. అందుకే శారూను ఇవ్వమంటున్నా!"
ఓరకంట ఈశ్వర్ను చూస్తూ చెప్పింది దీప్తి.
శారూ వెంటనే గ్లాసును ఈశ్వర్కు అందించింది.
"వదినా!.., ఇచ్చేశాను" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
"గుడ్ శారూ!" నవ్వుతూ అంది దీప్తి.
కాఫీని సిప్ చేసిన హరికృష్ణ..
"కాఫీ చాలా బాగుందమ్మా! కలిపింది ఎవరు?" అని అడిగాడు.
"నేను మామయ్యా!" వెంటనే చెప్పేసింది దీప్తి.
"నీవేనా!" హరికృష్ణ అడిగాడు.
"అవును" అంది దీప్తి.
"అందుకే అంత బాగుంది" నవ్వాడు హరికృష్ణ.
కల్మషం లేని వారి నవ్వు ముఖంలోకి చూచి.. అందరూ నవ్వారు ఒక్క ఈశ్వర్ తప్ప.
నవ్వును ఆపి.. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూచారు.
"ఏరా నీకు నవ్వు రాలేదా!" అడిగింది వాణి.
"వచ్చింది. కానీ నవ్వలేదు."
"ఎందుకని?"
"మీకందరికీ కాస్త వ్యత్యాసంగా కనుపించాలని!" నవ్వాడు ఈశ్వర్ దీప్తిని చూస్తూ కళ్ళెగరేస్తూ.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పరవశంతో దీప్తి నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
వాణి ఆ ఉభయుల ముఖ భంగిమలను గమనించింది. ఆమెకు నాలుగేళ్ళ క్రిందటి తన కళ్యాణ్ ప్రేమకలాపం గుర్తుకు వచ్చింది. ఆనందంతో నవ్వుంది.
మధ్యాహ్న భోజనానికి కావలసిన వంటకాలను లావణ్య తయారుచేసింది. దీప్తి, శార్వరీలు ఆమెకు సహాయకులుగా వర్తించారు. భోజన సమయంలో.. కళ్యాణ్ తండ్రి తన చేతికి ఇచ్చిన మామిడి ఊరగాయల బాటిల్స్ ను డైనింగ్ టేబుల్ పైన వుంచి..
"అన్నయ్యగారూ!.. బాబాయ్ గారూ ఈ ఊరగాయలను నాతో మీకోసం పంపారు వేసుకోండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.
ఆమె కలుగోలుపుతనానికి కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు.
"నీ చేత్తోనే అందరికీ వడ్డించమ్మా!" అన్నాడు కళ్యాణ్.
అందరికీ వడ్డించి చివరగా ఈశ్వర్ను సమీపించింది.
"బావా!.. మీకు.."
"వెయ్యి దీపు!"
’దీపు’ అన్న ఈశ్వర్ పదాన్ని విన్న వాణి ఆ ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూచింది. ఆమెకున్న అనుమానం తీరిపోయింది. సరదా సంభాషణలతో అందరూ ఆనందంగా భోజనం చేశారు.
ఆ రాత్రి భోజనానంతరం.. లావణ్య, వాణి ఓ గదిలో, దీప్తి శార్వరీ మరో గదిలో, కళ్యాణ్ ఈశ్వర్ మూడవ గదిలో హరికృష్ణ హాల్లో పడుకొన్నారు.
తల్లీ, కూతురు గతాన్ని గురించి, ప్రస్తుతంలో తమ రెండు కుటుంబాల మధ్యన వున్న భావాలను గురించి, ప్రజాపతి, ప్రణవి, దీప్తి, సీతాపతుల అభిప్రాయాలను గురించి, దీప్తి, సీతాపతుల పట్ల తనకు తన భర్తకు వున్న నమ్మకాన్ని గురించి, దీప్తికి ఈశ్వర్పైన, సీతాపతికి శార్వరి పైన ఉన్న ప్రేమాభిమానాలను గురించి వివరంగా మాట్లాడుకొన్నారు.
అంతా విన్న వాణి "అమ్మా!.. నేడు నా జీవితంలో గొప్ప పర్వదినం. నాలుగేళ్ల తర్వాత నీ ప్రక్కన పడుకొని నీ చేతిని నాపైన వేసికొని నా చిన్ననాటిలా.. నీ మాటలను వినే అవకాశాన్ని నాకు ఆ సర్వేశ్వరుడు కల్పించాడు. నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా మనస్సుకు శాంతిగా వుందమ్మా!" తన తలను తల్లి ఎదకు ఆనించి ఆమె వీపుపై చేయి వేసి చిన్నపిల్లలా మారిపోయింది వాణి. కూతురి తలను తన హృదయానికి ప్రేమతో హత్తుకొంది లావణ్య. "పండంటి మగబిడ్డకు తల్లివి అవుతావమ్మా" మనసారా దీవించింది.
"అమ్మా! ఓ మాట అడగనా!.."
"అడుగు తల్లీ!.."
"నాకు మన ఇంటికి రావాలని ఉందమ్మా!"
"నీ కాన్పు మన ఇంట్లోనే జరుగుతుందమ్మా! ఎవరు ఏమనుకున్నా నేనూ, మీ నాన్న లెక్కచేయము. ఇది మా స్వవిషయం. ఇందులో జోక్యం కల్పించుకొనే హక్కు ఎవరికీ లేదు. నీ కోర్కె తప్పక తీరుతుందమ్మా. నిశ్చింతగా వుండు" ఎంతో ప్రీతిగా చెప్పింది లావణ్య.
"అమ్మా మరో మాట!.."
"ఈశ్వర్, దీప్తిలు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారమ్మా ఆ విషయం వారిని చూచిన తొలిగంటలోనే నాకు అర్థం అయింది. వారిరువురికి వివాహం జరిపిస్తే బాగుంటుందమ్మా!"
"నీవు గ్రహించింది నిజం. మీ అత్తయ్య ప్రణవి నిర్ణయమూ అదే. ఈశ్వర్, దీప్తీల వివాహం త్వరలో తప్పక జరుగుతుంది. అంతేకాదు నాకు కాబోయే అల్లుడు నా మేనల్లుడు సీతాపతే. వాడికి శార్వరి అంటే ఎంతో ఇష్టం. మన కుటుంబ సభ్యులందరి మీదా వాడికి ఎంతో గౌరవం. మంచి మనస్సు వున్న వారికి కొంత ఆలస్యం అయినా, వారి మంచి సంకల్పాలు తీరుతాయమ్మా! పొద్దుపోయింది నిద్రపో!" తన మనస్సులోని అన్ని విషయాలను పెద్ద కూతురితో వివరంగా చెప్పింది లావణ్య.
నాలుగేళ్ల తర్వాత తల్లితో.. ఆనాటి ప్రేమాభిమానాలను చూచి వాణి సంతోషంతో కళ్ళు మూసుకొంది.
ఒకే మంచంపై పడుకొన్న కళ్యాణ్, ఈశ్వర్లు మంచి స్నేహితుల్లా ఉద్యోగాల గురించి, భవిష్యత్ జీవితానికి సంబంధించి వారి మనసుల్లో వున్న అభిప్రాయాలను గురించి మాట్లాడుకొన్నారు.
"బావా!.. అన్నయ్య దినకర్ అమెరికా నుండి రాడు. ఒకవేళ.. రావాలనుకొన్నా అతని నిర్ణయాన్ని వదిన అంగీకరించదు. వారి ఇద్దరు పిల్లలు పుట్టింది అక్కడనే. అమ్మా నాన్నలు మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో పెంచారు. మేము కోరిన రీతిగా చదివించారు. వారు మాపట్ల చేయవలసిన ధర్మాన్ని చక్కగా పాటించారు. రోజురోజుకు వారికి వయస్సు పెరుగుతూ వుంది. అన్నయ్య వదినల తత్వం వారికి ఎంతో బాధాకరం. ఆ కారణంగానే నేను వారితోటే వుండాలని నిర్ణయించుకొన్నాను. వారి ఆనందమే నా ఆనందం. వారి సంతోషం కోసం.. వారి తనయుడిగా నేను ఏమైనా చేసేదానికి సంసిద్ధం. అదే వారిపట్ల నా ధర్మం" ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్.
"ఈశ్వర్!.. మీ అక్కయ్య నాతో ఎన్నోసార్లు చెప్పింది నీ మంచితనాన్ని గురించి. తల్లితండ్రుల ఆనందం కోసం నీవు తీసికొన్న నిర్ణయాన్ని గురించి. అప్పట్లో ఆ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. కానీ.. నేడు నిన్ను చూశాక.. నీ మాటలను విన్నా తర్వాత.. నీ నుండి నేను కొంత నేర్చుకొన్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ఈశ్వర్. నేను మరచిన ధర్మాన్ని నాకు గుర్తుచేశావు" కాస్త ఆవేశంగానే చెప్పాడు కళ్యాణ్.
కొన్నిక్షణాల తర్వాత మంచం నుంచి లేచి హాల్లోకి నడిచాడు. కళ్ళు మూసుకొని వున్న హరికృష్ణను పరీక్షగా చూచి దుప్పటిని కాళ్ళవరకూ సవరించి గదిలోనికి వెళ్ళిపోయాడు కళ్యాణ్.
మంచంపై పడుకొని పైన తిరుగుతున్న ఫ్యాన్ను తదేకంగా చూస్తూవుంది దీప్తి. దాదాపు పదినిముషాలుగా మౌనంగా వున్న దీప్తిని చూచి శార్వరి..
"వదినా!.."
దిగాలుపడి శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.
"ఏ విషయాని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్. నాతో చెప్పవా నేనేదైనా సాయం చేయగలనేమో!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"ఏ విషయాని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్. నాతో చెప్పవా నేనేదైనా సాయం చేయగలనేమో!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
"శారూ!"
"మా నాన్న గుర్తుకు వచ్చాడు!"
"మామయ్యనా!.."
"అవును.."
"ఈ సమయంలో ఆయన గుర్తుకు రావడం ఏమిటి? రావలసింది మా అన్నయ్య కదా!" నవ్వింది శార్వరి.
"అది కాదే!.. మనం తిరిగి వెళ్ళిన తర్వాతనే నా పెళ్ళిచూపులు.."
"ఎవరితో?.."
"పరంజ్యోతి కొడుకు దివాకర్తో!"
"నీవు ఒప్పుకొన్నావా?"
"లేదు.. అంతా ఆయన ఇష్టమే!"
"నేను మా అన్నయ్యతో చెప్పనా వదినా!" క్షణాం తర్వాత "శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని లేపుకెళ్ళినట్లు నిన్ను లేపుకొని రమ్మని" గలగలా నవ్వింది శార్వరి.
"శారూ!.. నేను బాధపడుతుంటే.. నీవు ఎలా నవ్వుతున్నావే!" దీనంగా శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.
"వదినా!.. నీ మనస్సులో మాటను అన్నకు చెప్పు. పంతానికి దిగితే మా అన్నయ్య కూడా తక్కువ వాడు కాదు. ఇప్పుడు నీ చేతిలో మంచి అవకాశం వుంది. రేపు నీ స్నేహితురాలి పెళ్ళి కదా!.. నీతో అన్నయ్యను తోడుగా తీసుకొని వెళ్ళు. మార్గంలో నీవు చెప్పదలచుకొన్న విషయాన్ని అన్నయ్యతో చెప్పేసేయి."
"ఆయన నాతో వస్తాడా?"
"నీవు మా అమ్మను అడుగు. అమ్మ మాటను అన్నయ్య ఎన్నడూ కాదనడు సరేనా!"
కొన్నిక్షణాలు ఆలోచించింది దీప్తి. "ఆఁ నీ ఐడియా బాగుంది. అలాగే చేస్తాను" ఆనందంగా చెప్పింది.
"వదినా!.. నేను నీ శ్రేయోభిలాషిని."
"ఆ శారూ!.. నిజంగానే!"
"సరే వదినా!.. ఇక నిద్రపో!.. నాకూ నిద్ర వస్తుంది!"
ఇరువురూ కళ్ళు మూసుకున్నారు.
హాల్లోకి వచ్చి హరికృష్ణను చూచి తిరిగి వెళుతున్న కళ్యాణ్ కాలికి సోఫా తగిలింది. హరికృష్ణ కళ్ళు తెరిచాడు. అతన్ని చూచాడు. ’చాతుర్వర్ణా మయాసృష్ట్యా’ అన్నారు గీతా కృష్ణుడు. మానవ జీవిత గమనాన్ని సక్రమంగా.. శాంతియుతంగా సాగేటందుకు ఆచర్య వారి సంకల్పరీతిగానే జరుగుతూ వుందేమో!.. ఏది ఏమైనా.. కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కలవాడు. తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. చూస్తుంటే నా బిడ్డ వాణి అన్నివిధాలా ఆనందంగా వున్నట్లుంది. ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి! సంతోషం’ అనుకొన్నాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 979
Threads: 0
Likes Received: 1,469 in 853 posts
Likes Given: 3,748
Joined: Jun 2020
Reputation:
63
08-03-2025, 08:58 PM
(This post was last modified: 08-03-2025, 08:59 PM by TheCaptain1983. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-03-2025, 09:57 AM)k3vv3 Wrote: "ఎందుకని?"
"మీకందరికీ కాస్త వ్యత్యాసంగా కనుపించాలని!" నవ్వాడు ఈశ్వర్ దీప్తిని చూస్తూ కళ్ళెగరేస్తూ. Eswar's character is nice!!!. Actually, all the characters' narration and their way of thinking is good.
•
Posts: 979
Threads: 0
Likes Received: 1,469 in 853 posts
Likes Given: 3,748
Joined: Jun 2020
Reputation:
63
(08-03-2025, 10:09 AM)k3vv3 Wrote: హాల్లోకి వచ్చి హరికృష్ణను చూచి తిరిగి వెళుతున్న కళ్యాణ్ కాలికి సోఫా తగిలింది. హరికృష్ణ కళ్ళు తెరిచాడు. అతన్ని చూచాడు. ’చాతుర్వర్ణా మయాసృష్ట్యా’ అన్నారు గీతా కృష్ణుడు. మానవ జీవిత గమనాన్ని సక్రమంగా.. శాంతియుతంగా సాగేటందుకు ఆచర్య వారి సంకల్పరీతిగానే జరుగుతూ వుందేమో!.. ఏది ఏమైనా.. కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కలవాడు. తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. చూస్తుంటే నా బిడ్డ వాణి అన్నివిధాలా ఆనందంగా వున్నట్లుంది. ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి! సంతోషం’ అనుకొన్నాడు.
====================================================================
ఇంకా వుంది.. I check daily for this story's update.
Very nice story, K3vv3 garu!!!
clp); clp); clp); yr):
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
మీ కోసం ఐదు రోజులకో అప్డేట్ ఇస్తాను, ఈ ధారావాహికానికి
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 979
Threads: 0
Likes Received: 1,469 in 853 posts
Likes Given: 3,748
Joined: Jun 2020
Reputation:
63
(08-03-2025, 09:55 PM)k3vv3 Wrote: మీ కోసం ఐదు రోజులకో అప్డేట్ ఇస్తాను, ఈ ధారావాహికానికి
ధన్యవాదములు, K3vv3 garu!!!
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 16
మరుదినం ఉదయం ఆరున్నరకు తల్లి ఆదేశం ప్రకారం ఈశ్వర్, దీప్తిని తన స్నేహితురాలు డాక్టర్ రాధ వివాహానికి కార్లో బయలుదేరారు.
బయలుదేరబోతున్న దీప్తిని పిలిచింది వాణి.
"ఏం వదినా!" వాణిని సమీపించింది దీప్తి.
వాణి నవ్వుతూ "మంచి అవకాశం... సద్వినియోగం చేసుకో మరదలా!" దీప్తి బుగ్గను సున్నితంగా గిల్లింది వాణి.
సిగ్గుతో తలదించుకొని ’సరే’ అన్నట్లు తలాడించి హాల్లోకి వచ్చి అందరికీ చెప్పి బయలుదేరింది దీప్తి.
ముందుసీట్లో ఈశ్వర్ ప్రక్కన కూర్చొని వున్న దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూచింది. అతను దీక్షగా ముందున్న రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు. ఆ ఉదయం అతను తలస్నానం చేశాడు. శిరోజాలు నొసటిపైకి జారి మెల్లగా ఏసీ కార్లో అటూ ఇటూ కదులుతున్నాయి. చక్కటి నాసిక, విశాలమైన కళ్ళు నొసలు, కళ్ళకు అద్దాలు బాలీవుడ్ హీరోలా ఠీవీగా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఈశ్వర్.
’మనిషి మంచి అందగాడు... అందుకే పొగరు... పదిహేను నిముషాల ముందు బయలుదేరాము. నోరు తెరిచి ఒక్కమాట మాట్లాడ్డేం!’ అనుకొంది దీప్తి.
బయలుదేరే ముందు వాణి తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పెదవులపైన చిరునవ్వు. గొంతు సవరిస్తూ ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఈశ్వర్ దృష్టి యధాతథంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతూ వుంది దీప్తి. సీట్లో అటూ ఇటూ కదిలింది. ఆమె స్థితిని గమనించిన ఈశ్వర్...
"ఏం!... ఏదైనా సమస్యా!..." అడిగాడు.
"అవును..."
"ఏమిటిది?"
"మీరే!..." వెంటనే చెప్పేసింది దీప్తి.
"నేనా!..." క్షణంసేపు ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.
"అవును!... అవును!..."
"నేనేం చేశాను?"
"నాతో మాట్లాడ్డం లేదుగా!"
ఆశ్చర్యంగా చూచాడు దీప్తి ముఖంలోకి ఈశ్వర్.
చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ చురచురా చూచింది దీప్తి.
"డ్రైవింగ్ చేస్తున్నాగా దీపూ!" అనునయంగా చెప్పాడు.
"డ్రైవింగ్ చేస్తే మాట్లాడకూడదా?"
"మాట్లాడకూడదు!"
"మాట్లాడవచ్చు.... మనస్సు వుంటే...!"
"అంటే.... నాకు మనస్సు లేదంటావా!" ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.
దీప్తి చిరుకోపంతో ముఖాన్ని చిట్లించి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ... "నాకు కనబడటం లేదు" అంది.
ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి నిట్టూర్చి "నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు?"
’ఓ నా తింగరి బావా! నేను చెబితే గాని నీకు అర్థం కాదా! నా మాటలు, ముఖ భంగిమలు, చూపులు నీకు అర్థం కాలేదా! లేక నన్ను ఆటపట్టించేదానికి నటిస్తున్నావా!’ అనుకొంది దీప్తి.
"అడిగింది నిన్నే! ఏం కావాలి? అడుగు!" ఈశ్వర్ ఆ మాటల్లో దీప్తికి అధారిటీ వినిపించింది.
చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"అడగనా!" అంది.
"అడుగు"
"నాకు... నీవు కావాలి" నవ్వుతూ నాలుకను బయటికి తీసి పెదవుల మధ్యన ఆడించింది.
ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి చిరునవ్వుతో ముఖాన్ని రోడ్డు వైపుకు త్రిప్పాడు.
"నేను మనవూరికి తిరిగి వెళ్ళగానే నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసివున్నారు మీ మామగారు!" విచారంగా చెప్పింది దీప్తి.
"వాడెవడు?" ఆవేశంగా అడిగాడు ఈశ్వర్.
"పరంజ్యోతి కొడుకంట!"
"ఆ పెళ్ళిచూపులు జరుగవు" మెల్లగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్.
"బావా!..." ఆశ్చర్యంతో అంది దీప్తి.
"అవును... వాడు మీ ఇంటికి నిన్ను చూచేదానికి రాబోడు."
"బావా!... ఎలా ఆపగలవు?"
"వెయిట్ అండ్ సీ!"
"బావా!"
"ఏం... నీకు నా మాట మీద సందేహమా!"
"అ...వు...ను" మెల్లగా అంది దీప్తి.
"నా మాట నమ్ము. సందేహపడకు దీపూ!" తన ఎడం చేతిని దీప్తి కుడిచేతిపై వుంచాడు ఈశ్వర్.
దీప్తి ఆనందంగా నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
ఈశ్వర్ తన ఎడంచేతిని దీప్తి తలపై వుంచి సున్నితంగా కదిలించాడు. "నీవు... నాదానివి" అన్నాడు మెల్లగా.
ఆ మాటలు విన్న దీప్తి పరవశంతో కళ్ళు మూసుకొంది.
ఈశ్వర్ తన ఎడమ చేతితో దీప్తి కుడిచేతిని పట్టుకొన్నాడు. సున్నితంగా చేతిని నొక్కి వదిలేశాడు. దీప్తి ముఖంలోకి చూచాడు. ఆమె ఆనందంగా కళ్ళు మూసుకొని ఉంది. కొన్ని క్షణాల్లో వారి కారు రాధ... వివాహం జరిగే కళ్యాణ మండపం ముందు ఆగింది.
ఇరువురూ కారునుండి దిగారు. మండపంలోకి ప్రవేశించారు. రాధ వున్న గదిలోనికి వెళ్ళరు. పెండ్లి కూతురు అలంకరణలో వున్న రాధ... దీప్తిని చూచింది. లేచి... పరుగున వచ్చి దీప్తిని కౌగలించుకొంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"రావేమో అనుకొన్నానే!" అంది.
"రాకుండా ఎలా వుంటానే. వస్తానని చెప్పానుగా! అటు చూడు..."
ఈశ్వర్ను చూపుతూ...
"నా బావ... ఈశ్వర్ అడ్వకేట్" నవ్వుతూ చెప్పింది దీప్తి.
ఈశ్వర్ను చూచి రాధ చేతులు జోడించింది.
"నమస్కారమండీ!" అంది.
నవ్వుతూ "నమస్తే..." అన్నాడు ఈశ్వర్.
దీప్తి చెవి దగ్గరకు నోటిని చేర్చి "దీపూ!... మీ బావ చాలా అందంగా వున్నాడే!" ఈశ్వర్ విషయంలో తనకు కలిగిన భావాన్ని నిస్సంకోచంగా వెల్లడించింది రాధ.
ముహూర్త సమయం ఆసన్నమయింది. వధూవరులు వేదికపైన కూర్చున్నారు. పురోహితులు మంత్రాలు చదవడం ప్రారంభించారు. పెద్దలందరూ మాంగల్యాన్ని తాకారు. దీప్తి, ఈశ్వర్లు కూడా తాకారు.
’ఇలా నా మెడకు కట్టబోయే మంగళసూత్రాన్ని మా పెద్దలందరూ ఎప్పుడూ తాకుతారో!’ ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అనుకొంది దీప్తి.
మాంగల్యధారణ జరిగింది. వచ్చిన వారంతా అక్షింతలతో దంపతులను దీవించారు. దీప్తి తాను తెచ్చిన గిఫ్టును రాధకు అందించింది. భోజనానంతరం రాధ ఆమె భర్త త్రివిక్రమ్కు చెప్పి ఈశ్వర్, దీప్తిలు బయలుదేరారు.
ఈశ్వర్ కారును నడుపుతున్నాడు చిరునవ్వుతో దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ వుంది. అది గమనించిన ఈశ్వర్...
ఏంటి దీపూ!..... అలా చూస్తున్నావ్!" అడిగాడు చిరునవ్వుతో తనూ నవ్వుతూ...
"ఏమీ లేదన్నట్లు తలూపింది దీప్తి.
"నీవు నవ్వితే... చాలా బాగుంటావు దీపు."
"అలాగా"
"అవును... నీపై వరుసన వున్న మధ్య రెండు పళ్ళు పెద్దగా మల్లెమొగ్గల్లా నీవు నవ్వినప్పుడు మెరుస్తాయి."
"అయితే... మిగతా పళ్ళల్లో మెరుపు లేదా" అమాయకంగా అడిగింది.
"ఉంది దీప్తీ ఆ రెండు కాస్త వెడల్పు కాబట్టి అవి ప్రత్యేక ఆకర్షణ."
రోడ్డు ప్రక్కన వరుసగా ఉన్న బంగారు షాప్స్ ను చూచింది దీప్తి.
"బావా!.... కారును ఆపండి"
"ఎందుకు?"
"చిన్నపని వుంది"
"ఎక్కడ?"
"ఆ షాపులో" ఎడమచేతి చూపుడు వ్రేలితో బంగారు షాపును చూపింది దీప్తి.
ఈశ్వర్ కారును ఆపాడు. ఇరువురూ కారు దిగి షాపులో ప్రవేశించారు.
"ఏం కొనాలి దీపూ!..."
"కాసేపు ఆగండి సార్!... మీకే తెలుస్తుంది."
గోల్డ్ రింగ్స్ వున్న కౌంటర్ వద్దకు వెళ్ళి రింగ్స్ ను చూపమని అడిగింది దీప్తి. కౌంటర్లో వున్న వ్యక్తి రింగ్స్ ను చూపించాడు. ఐదారు చూచి ఒకదాన్ని చేతికి తీసుకొని....
"బావా!... మీ చేతిని ఇలా ఇవ్వండీ."
"నాకా!..."
"మాట్లాడకూడదు. ఓన్లీ యాక్షన్ ప్లీజ్" చిరునవ్వుతో చెప్పింది దీప్తి. తన కుడిచేతిని దీప్తి కుడిచేతికి అందించాడు ఈశ్వర్.
ఈశ్వర్ చేతి మధ్య వేలుకు వుంగరం వున్నందున... తన చేతిలోని వుంగరాన్ని చూపుడు వ్రేలికి తొడిగింది. అది ఆ వ్రేలికి ఖచ్చితంగా సరిపోయింది.
"బాగుందా! బావా!..."
"చాలా బాగుంది."
"బిల్ ప్లీజ్!" సెల్స్ మేన్తో చెప్పింది దీప్తి.
వేయింగ్ మిషన్పై వుంగరాన్ని వుంచి.... బరువును చూపించి ఐదునిముషాల్లో బిల్లును వుంగరాన్ని వుంచిన చిన్నబాక్స్ ను సెల్స్ మెన్ దీప్తికి అందించాడు. కార్డు ద్వారా పేమెంట్ చేసింది దీప్తి.
తననే పరీక్షగా మాట్లాడకుండా చూస్తున్న ఈశ్వర్ను చూచి....
"థాంక్యూ బావా!... నా పని అయిపోయింది పదండి" నవ్వుతూ చెప్పింది దీప్తి.
ముందు ఈశ్వర్ వెనుక దీప్తి నడిచి కారును సమీపించి కూర్చున్నారు. ఈశ్వర్ కారును స్టార్ట్ చేయబోయాడు.
"బావా!... వన్ మినిట్!"
"వన్ మినిట్ ఆ!..."
"అవును..."
"వన్ మినిట్లో ఏం చేస్తావ్!"
పాకెట్ను విప్పి వుంగరాన్ని చేతికి తీసుకొంది దీప్తి.
"మీ కుడిచేతిని చూపించండి."
ఆశ్చర్యంగా చూచాడు ఈశ్వర్.
"చూపించండి మహాశయా!" చిరునవ్వుతో కోరింది దీప్తి.
ఈశ్వర్ తన కుడిచేతిని ముందుకు సాచాడు.
తన చేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ కుడిచేతి చూపుడు వేలికి తొడిగింది.
"ఇక పదండి... స్టార్ట్!" గలగలా నవ్వింది దీప్తి.
ఆమె చర్యకు ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు.
’నా చేతి వ్రేలికి యాభై ఆరువేల డైమండ్ రింగ్ను తొడిగింది ఇది నేను ఆమెకు ’నీవు నా దానివి’ అని చెప్పిన దానికి నాకు బహుమానమా! మరి తనకు నేనూ ఏదో ఒకటి యివ్వాలిగా!... అవును... ఇవ్వాలి!... అతని దృష్టి తన కుడిచేతి చిటికెన వ్రేలికి వున్న వజ్రపుటుంగరం పై నిలిచింది. వెంటనే దాని ఊడదీసి....
"దీపూ! ఏదీ నీ వామహస్తం!" నవ్వుతూ అడిగాడు ఈశ్వర్ చిరునవ్వుతో.
దీప్తి తన ఎడమచేతిని అతని ఎడమ చేతిలో వుంచింది. తన కుడిచేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ దీప్తి ఎడమచేతి చూపుడు వ్రేలికి తొడిగాడు.
"నచ్చిందా దీపూ!..." ప్రీతిగా అడిగాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆ వుంగరాన్ని దీప్తి తన కళ్ళకు అద్దుకొంది. చిరునవ్వుతో.... "బావా!... ఈ క్షణంలో నా మనస్సున నా ఎదలో ఇంతవరకూ లేని సంతోషం నిండివుంది. నా పాలిట ఈ రోజు ఎంత గొప్ప సుదినం బావా!..." ఆనందా పారవశ్యంతో అతని ఎడమచేతిని తన కుడిచేత్తో పట్టుకొంది దీప్తి.
ఈశ్వర్ "దీపూ!... నాకూనూ!... ఇప్పుడు కారు స్టార్ట్ చేయనా!" మెల్లగా అడిగాడు.
"చేయండి బావా!" అంది ఆనందంతో దీప్తి.
ఈశ్వర్..... కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు.
కొన్నిక్షణాల తర్వాత.....
"దీపూ నీకో విషయం తెలుసా!"
"ఏమిటి బావా అది"
"మన సాంప్రదాయం ప్రకారం వుంగరాలు మార్చుకొంటే..."
"పెండ్లి అయిపోయినట్లేగా" ఈశ్వర్ పూర్తిచేయకముందే నవ్వుతూ చెప్పేసింది దీప్తి.
ఈశ్వర్ సాలోచనగా "అవును దీపూ!" అన్నాడు.
"బావా!..."
"చెప్పు!..."
"మామయ్యా అత్తయ్యా... వాణి వదిన కళ్యాణ్ అన్నయ్యలకు ఏం చెబుతారు?"
"జరిగింది చెబుతాను."
"అంటే?"
"నేను దీపు వుంగరాలు మార్చుకొన్నామని."
"బావా! మనం తొందరపడ్డాం కదూ!" భయంతో అడిగింది దీప్తి.
"జరిగిపోయినదాన్ని గురించి బాధపడకు. నేను వుంటాగా నీకు తోడుగా!" కళ్ళు ఎగరేసి నవ్వాడు ఈశ్వర్.
"నాకు భయంగా వుంది బావా!" మెల్లగా అంది దీప్తి.
"భయపడకు నీ ప్రక్కన నేను వుంటానుగా!" తన ఎడంచేత్తో దీప్తి వీపుపై తట్టాడు ఈశ్వర్.
ఈశ్వర్ మాటలకు దీప్తికి ఆనందం కలిగింది. చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచింది దీప్తి.
"మొత్తానికి నన్ను ముగ్గులోకి దించేశావ్!" కొంటెగా నవ్వాడు ఈశ్వర్.
ఆ నవ్వులో స్వచ్ఛత, అభిమానం, ప్రేమ వున్నాయి. దీప్తి తన అదృష్టాన్ని తలచుకొని మురిసిపోయింది.
పావుగంట తర్వాత వారు వాణి ఇంటికి చేరారు. జరిగిన విషయాన్ని ఈశ్వర్ తన తల్లికి, దీప్తి తన వదిన వాణికి వివరించారు.
దీప్తి, ఈశ్వర్ దంపతులు కావాలనే కోర్కె అందరికీ వున్నందున వారంతా సంతోషించారు.
కళ్యాణ్ మూడురోజులు ఆఫీస్కు శలవు పెట్టి.... హరికృష్ణ.... లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలను రాజధాని నగరంలోని అన్ని ముఖ్యప్రాంతాలకు తీసుకెళ్ళి చూపించాడు. ఆ విహారంలో దీప్తి, ఈశ్వర్లు మరింత సన్నిహితులైనారు. వారంరోజులు తర్వాత ఈశ్వర్, శార్వరీలు హైద్రాబాద్కు, హరికృష్ణ, లావణ్య, దీప్తిలు చెన్నైకి బయలుదేరడానికి సిద్ధం అయినారు. అంతవరకూ వారి అందరితో కలిసి ఎంతో ఆనందంగా వున్న వాణి దిగాలుపడింది.
లావణ్య కూతురును సమీపించి... "అమ్మా!... బాధపడకు ఏడవనెలలో నీకు సీమంతపు వేడుకను జరిపేటందుకు ఊరికి తీసుకొని వెళ్ళేదానికి నేను మీ నాన్నగారు వస్తాము. అది ఎన్నోరోజులు లేదు కదా. రెండు నెలలు,... తల్లీ ఆరోగ్యం జాగ్రత్త!" అనునయంగా చెప్పింది లావణ్య.
హరికృష్ణ కళ్యాణ్ను సమీపించి "అల్లుడుగారూ! అమ్మాయిని జాగ్రత్తగా చూచుకోండి. మేము ఏడవ మాసంలో వస్తాము" మెల్లగా చెప్పాడు.
"అలాగే మామయ్యగారూ!" వినయంగా చెప్పాడు కళ్యాణ్.
"ఈవారం రోజులు మనమంతా కలిసి వుండడం వలన నాకు మన వూరు... పరిసరాలు, పదేపదే గుర్తుకు వచ్చాయి అమ్మా!" ఆనందాశ్రువులతో చెప్పింది వాణి.
"మరో రెండు నెలల్లో మన వూరికి రాబోతున్నావు కదా తల్లీ!" పవిటకొంగుతో కూతురి కన్నీటిని తుడిచింది లావణ్య. ఆ క్షణంలో ఆమె కళ్ళలోనూ కన్నీరు తుడుచుకుంది.
దీప్తి సెల్ మ్రోగింది. ఆన్చేసి "హలో" అంది.
"అమ్మా దీప్తీ! ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెంటనే రావాలి" అన్నాడు ప్రజాపతి.
అందరి చూపులూ దీప్తి వైపుకు మళ్ళాయి.
సెల్మూసి దూరంగా చేతిని జరిపి...
"నాన్న!" అంది దీప్తి. క్షణాం తర్వాత "ఈరోజే బయలుదేరుతున్నాను నాన్నా!" బేలగా మెల్లగా చెప్పింది దీప్తి.
"సరే!.... జాగ్రత్తగా రా!" అన్నాడు ప్రజాపతి.
ఈశ్వర్ దీప్తిని సమీపించాడు.
"దీపూ!... భయపడకు. నేను శార్వరిని హైదరాబాద్లో దించి టార్మ్ ఫీజు కట్టి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి రెండుమూడు రోజుల్లోనే మనవూరికి వస్తాను."
దీప్తి మౌనంగా తలాడించింది. దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూచింది. వాణి వాళ్ళ కారు మరో ప్రైవేట్ టాక్సీలో అందరూ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఈశ్వర్, శార్వరి హైదరాబాదు వైపు, హరికృష్ణ, లావణ్య, దీప్తి చెన్నై వైపు ఫ్లయిట్లో బయలుదేరారు. వాణి, కళ్యాణ్ కారు వారి ఇంటి వైపుకు సాగింది.
చెన్నైలో దిగగానే... దీప్తి, ఈశ్వర్కు ఫోన్ చేసింది. వీలైనంత త్వరగా వస్తానని చెప్పాడు ఈశ్వర్. హరికృష్ణ, లావణ్య, దీప్తి గూడూరుకు చేరారు.
దీప్తి ఇంటికి చేరే సమయానికి ప్రజాపతి ఫ్యాక్టరీలో వున్నాడు. ప్రణవి అన్ని విషయాలను దీప్తిని అడిగి తెలుసుకొంది. పూసగుచ్చినట్లు వివరంగా తాము ఢిల్లీ వెళ్ళిననాటి నుండి తిరిగి వారంరోజుల తర్వాత ఎయిర్పోర్టుకు చేరేవరకూ జరిగిన అన్ని విషయాలను విపులంగా తల్లికి వివరించింది దీప్తి. చివరగా ఈశ్వర్ తానూ వుంగరాలు మార్చుకొన్న విషయాన్ని చెప్పి ఈశ్వర్ తనకు ఇచ్చిన వజ్రపుటుంగరాన్ని ప్రణవికి చూపించింది దీప్తి. ప్రణవి ఎంతగానో సంతోషించింది. తన భర్త కారణంగా అయినవారికీ, పుట్టి పెరిగిన ఊరికి దూరం అయిన వాణి... తన కూతురు మూలంగా తల్లితండ్రి, తమ్ముడు, చెల్లిని కలిసినందుకు ఆమెకు పరమానందం. హైదరాబాదులో దిగగానే ఈశ్వర్ సీతాపతికి ఫోన్ చేసి... పరంజ్యోతి కుమారుడు డాక్టర్ దివాకర్ ఫోన్ నెంబరు నోట్ చేసుకొన్నాడు. దీప్తికి ఫోన్ చేసి పెళ్ళిచూపులు ఎప్పుడని అడిగాడు. నాన్న ఫ్యాక్టరీలో వున్నాడని... ఆయన ఇంటికి వస్తే గాని ఆ వివరం తెలియదని చెప్పింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఈశ్వర్... దివాకర్కు ఫోన్ చేశాడు.
"హలో!.... డాక్టర్ దివాకర్ హియర్... మే ఐ నో హూమ్ ఐ యాం స్పీకింగ్!"
"ఈశ్వర్!"
"ఈశ్వర్!... హూ యీజ్ ఈశ్వర్?"
"దివాకర్!"
"యస్"
"నీవు తెలుగోడీవా? తెల్లోడివా?"
"వాట్... నీవు!"
"యస్... నీవు!"
"మై నేమ్ ఈజ్ డాక్టర్ దివాకర్"
"ఆఁ... ఆఁ... నీపేరు దివాకర్... డాక్టర్ దివాకర్వి! ఆ వివరాలు నాకు తెలుసు తమ్ముడూ!"
"తమ్ముడా?"
"కాకపోతే అన్నయ్య అనుకో"
"యు ఆర్ వేస్టింగ్ మై టైమ్!... వాట్ డు యు వాంట్?"
"ఒరేయ్ అన్నాయ్!... దివాకరా!.... తెలుగులో... అదే మన భాషలో మాట్లాడలేవా!..."
"ఏం మాట్లాడాలి?"
"నిన్ను గురించి"
"నన్ను గురించా!"
"అవును!"
"ఎవరితో?"
"ఆ విషయం నీకెందుకు?"
"నేను నీ శ్రేయోభిలాషినిరా!"
"రా!"
"అవునురా!"
"వు హ్యానో మ్యానర్స్!"
"అబ్బా!... మళ్ళా ఇంగ్లిపీసులో మొదలెట్టావా! దివాకరా!... నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు పెళ్ళిచూపులకి పోయి చూడబోయే ఆ పిల్ల అదీ డాక్టరే! నా మరదలు. అంటే నా మేనమామ కూతురు. దానికి నాకు ఎంతోకాలం నుంచి అఫైర్."
"అఫైర్!"
"అవును."
"మీరు చెప్పేది నిజమేనా!"
"నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందిరా! అంతేకాదు... మరో విషయం!"
"అదేమిటి?"
"మా ఇద్దరికీ గాంధర్వ వివాహం కూడా జరిగిపోయింది. ఆలోచించుకో!... అలాంటి పిల్లని నీవు పెళ్ళిచూపులకు వెళ్ళి చూడాలా!"
"ఇంతకు నీవెవరు?"
"ఒరేయ్! చెప్పాను కదరా... నా పేరు ఈశ్వర్ అని!"
"ఆ పిల్ల మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు. అమెరికా రిటన్. డాక్టర్"
"బాబూ దివాకర్! నా లవర్ వివరాలు నాకు తెలియవా!... నీవు నాకు చెప్పాలా! ఇంకా విను... అది పుట్టుకతో నాకు వరసకు మరదలై... వయస్సు వచ్చాక లవర్ అయింది. అంతేకాదు అది నా మేనమామ కూతురు. చెప్పాల్సిన వివరాలన్నీ చెప్పేశా!... పెండ్లి చూపులకు వెళతావో!..., మానుకొంటావో!... అది నీ ఇష్టం... బైరా బ్రదరూ!... నీ శ్రేయోభిలాషి ఈశ్వర్" నవ్వుతూ ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.
దివాకర్ వెంటనే తన తండ్రి పరంజ్యోతికి ఫోన్ చేసి తనకు ఈశ్వర్ చెప్పిన వివరాలన్నీ చెప్పాడు. ఆ పిల్ల తనకు ఇష్టం లేదన్నాడు.
అంతావిన్న పరంజ్యోతి...
"ఓరినా పిచ్చి కొడకా!. ఆ పిల్ల కోట్లకు వారసురాలు. మనకు ఆ పిల్లకంటే దాని ఆస్థి ముఖ్యం. నీవు ఎన్నేళ్ళు ఎంతమందికి సూదులు, దబ్బళాలు గుచ్చి, గోళీలు ఇచ్చి, కోటి రూపాయలను సంపాదిస్తావ్! దాని మెళ్ళో తాళి కట్టూ ఆస్తికి వారసుడివైపో!... నీకు నచ్చిన... నీవు మెచ్చిన మరో కాంతమ్మతో సెటప్ పెట్టుకో. జీవితాన్ని దర్జాగా, మంచి భవంతి, ఖరీదైన కార్లు, ఇంట్లో హాస్పిటల్ పరివారం, సమాజంలో సెలబ్రిటీ హోదా! వీటన్నింటినీ దక్కించుకో!.... జీవితాన్ని అన్నివిధాలా ఆనందంగా అనుభవించరా!.... నామాట విను. ఎల్లుండి మనం పెళ్ళిచూపులకు గూడూరికి వెళుతున్నామ్ ఏమంటావ్!"
దివాకర్ ఆలోచనలో పడ్డాడు. "అరగంటలో నీకు ఫోన్ చేస్తా డాడ్!" అన్నాడు.
అనేకవిధాలుగా ఆలోచించిన దివాకర్ చివరికి తండ్రి మాటే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాడు. పరంజ్యోతికి పోన్ చేసి... "డాడ్! మీ మాటే నా మాట!" ఆనందంగా చెప్పాడు.
పరంజ్యోతి ప్రజాపతికి ఫోన్ చేసి "ఎల్లుండి శుక్రవారం పెళ్ళిచూపులకు వస్తున్నాము" చెప్పాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 979
Threads: 0
Likes Received: 1,469 in 853 posts
Likes Given: 3,748
Joined: Jun 2020
Reputation:
63
(16-03-2025, 10:10 AM)k3vv3 Wrote: పరంజ్యోతి ప్రజాపతికి ఫోన్ చేసి "ఎల్లుండి శుక్రవారం పెళ్ళిచూపులకు వస్తున్నాము" చెప్పాడు.
====================================================================
ఇంకా వుంది..
Very good updates, K3vv3 garu!!! Nice twist in the end. Let us see how the story goes forward.
clp); clp); clp); yr):
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 17
"బావా! వాళ్ళు రేపు వస్తున్నారు. నేనేం చేయాలి!" ఆందోళనగా ఫోన్ చేసింది దీప్తి.
"వస్తున్నారా!" ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"అవును" నొక్కి చెప్పింది.
"అంటే నేను చెప్పింది వాడికి అర్థంకాలేదన్న మాట."
"మీరెప్పుడు వస్తున్నారు బావా!"
"ఎల్లుండి"
"ఈ రాత్రికి బయలుదేరలేవా!"
"రాలేను దీపూ! ఓ అర్జంటు కేసు వుంది. కేస్ నోట్ ప్రిపేర్ చేయాలి. ఎల్లుండే విచారణ."
"వాడి ముందు కూర్చోవడం నాకు ఇష్టం లేదు" ఆవేశంగా చెప్పింది దీప్తి.
"అయితే నేను చెప్పినట్లు చేయగలవా!"
"ఏం చేయాలో చెప్పండి!"
"హైదరాబాదుకు వచ్చేయి!"
"ఎప్పుడు?"
"ఈ రాత్రికే చార్మినార్ ఎక్స్ ప్రెస్లో బయలుదేరు. నేను ఉదయాన్నే నిన్ను సికింద్రాబాద్ స్టేషన్లో కలిసికొంటాను."
"నాన్న ఇంట్లోనే వున్నారు. అసాధ్యం" దీనంగా చెప్పింది.
"ఫోన్ కట్ చేస్తున్నాను. పది నిముషాల్లో నేను నీకు ఫోన్ చేస్తాను" అని సెల్ కట్ చేశాడు.
తల్లి లావణ్యకు ఫోన్ చేశాడు. విషయాన్ని చెప్పాడు. చివరగా....
"అమ్మా!... దీప్తికి అతని కంటబడటం ఇష్టం లేదు. నీవే ఏదైనా చేయాలమ్మా."
"దీపూ నాకు అంతా చెప్పింది. నేను చూచుకొంటాను. నీవు త్వరగా నీ పనిని ముగించుకొని రా!" అనునయంగా చెప్పింది లావణ్య.
"సరే అమ్మా!.... దీపూ జాగ్రత్త!"
"అది నా కోడలురా!.... దానికి అవమానం జరిగితే అది నాకూ జరిగినట్లే.... జరగనియ్యను. నీవు నిర్భయంగా వుండు."
"మంచిదమ్మా!" ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.
దీప్తికి ఫోన్ చేశాడు.
"బావా! వస్తున్నావా!" ఆత్రంగా అడిగింది దీప్తి.
"లేదు... అమ్మతో మాట్లాడాను. నీ అవమానం తనకూ అవమానమట. అంతా తనే చూచుకొంటుందట."
"అబ్బా!... చాలా టెన్షన్గా వుంది బావా!" సెల్లో వేరే కాల్ వస్తున్న సవ్వడి. "బావా! వేరే కాల్ వస్తుంది. బహూశా అత్తయ్యదేమో కట్ చేస్తున్నాను" సెల్ కట్ చేసి వచ్చిన కాల్ నెంబరును చూచింది దీప్తి. అది లావణ్య కాల్. సెల్ మ్రోగింది.
"అత్తయ్యా!" ఆత్రంగా అంది దీప్తి.
"అవును నేనే... సెల్ మీ అమ్మకు ఇవ్వు."
"అలాగే..." ప్రక్కనే వున్న ప్రణవికి సెల్ అందించింది దీప్తి.
"చెప్పండి వదినా!" అడిగింది ప్రణవి.
లావణ్య తాను చెప్పదలచుకొంది పదిసెకండ్లలో చెప్పేసింది. చివరగా "వదినా! ఏం చేయాలో అర్థం అయింది కదూ!"
"అర్థం అయింది వదినా!"
"సరే!... జాగ్రత్త" సెల్ కట్ చేసింది లావణ్య.
ప్రణవి దీప్తి చేతిని తన చేతిలోనికి తీసుకొంది. తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ఏదో చెప్పింది. ఆ గదినుంచి బయటికి వచ్చింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఫ్యాక్టరీ నుంచి ప్రజాపతి తిరిగి వచ్చాడు.
కారుదిగి... వరండాలో ప్రవేశించి....
"ప్రణవీ! నా మిత్రుడు అతని భార్యా, కొడుకు డాక్టర్ దివాకర్ బాబు రేపు పదిగంటలకు మన ఇంటికి వస్తున్నారు. తొమ్మిది గంటలకల్లా అమ్మాయిని బాగా అలంకరించి సిద్దంగా వుంచు" చెప్పాడు ప్రజాపతి.
ప్రణవి మౌనంగా తలదించుకొంది.
"ఏం మాట్లాడవు?"
"కుదరదండి" మెల్లగా చెప్పింది ప్రణవి.
"ఏమిటీ?" ఆవేశంతో అన్నాడు ప్రజాపతి.
"అవును... అమ్మాయి ఇంటికి దూరం!" విచారంగా నటనతో చెప్పింది ప్రణవి.
"నీవు చెప్పేది నిజమేనా!" ఆవేశంగా అడిగాడు ప్రజాపతి.
"ఏమిటండీ మీరు అలా అడుగుతున్నారు? కావాలంటే మీరే మీ అమ్మాయిని అడగండి" ఎంతో అమాయకంగా చెప్పింది ప్రణవి.
"ఛీ...ఛీ... నేనేమిటే అమ్మాయిని అడిగేది!" ముఖం చిట్లించి చెప్పాడు ప్రజాపతి.
"వారికి పైవారంలో మరో మంచిరోజు చూచుకొని రమ్మని వెంటనే చెప్పండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది ప్రణవి.
తనగదిలో కూర్చొని తల్లితండ్రికి మధ్యన జరిగే సంభాషణను వింటూ ఆనందంగా నవ్వుకొంటూ వుంది దీప్తి.
ప్రజాపతి సెల్ మ్రోగింది.
"హలో!... ఆ... నీవా పరం, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను"
"ఏ విషయాన్ని గురించిరా!" పరంజ్యోతి కంఠం తీవ్రంగా ఉంది.
ఆ విషయాన్ని గమనించిన ప్రజాపతి... వేగంగా తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు.
"పరం! ముందు నేను చెప్పే మాట విను. ఇంట్లో నెలసరి వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు. అదీ అమ్మాయికి. రేపటి మీ ప్రోగ్రాం మార్చుకోవాలి" అనునయంగా చెప్పాడు ప్రజాపతి.
"ఇదేనా నీవు చెప్పదలచుకొన్నది?"
"అవును పరం!" వందనంగా జవాబు చెప్పాడు ప్రజాపతి.
"సరే! నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు!"
"అడుగు!"
"నీ అల్లుడు ఈశ్వర్ని దీప్తి ప్రేమిస్తుందా!"
"ఏమిటా మాట.. నో...నో... నా కూతురు నిప్పు!"
"నీ కూతురు నిప్పో... ఉప్పో... నేను చెప్పిన మాటను ఆ ఈశ్వర్గాడు నా కొడుకుతో చెప్పాడు. వాడు అబద్ధం ఎందుకు చెబుతాడ్రా."
"కడుపు మంటతో చెప్పి వుండవచ్చు. నా కూతురికి నీ కొడుక్కు జరుగబోయే వివాహాన్ని ఆపేటందుకు అలా చెప్పి వుండవచ్చు. ఆ ఇంటిమీద కాకి మా ఇంటిమీద వాలదురా!... అలాంటిది నా కూతురు వాణ్ణి ప్రేమించడమా!... అబద్ధం... ఈ ఈశ్వర్ గాడు చెప్పింది పచ్చి అబద్ధం. నా మాటను నమ్ము పరం!..." ముందు ఆవేశంగా చెప్పి చివరికి అనునయంగా ముగించాడు ప్రజాపతి.
"మరి మేము ఎప్పుడు రావాలి?"
"నాలుగు రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు రండి. ముందురోజు నాకు ఫోన్ చెయ్యి."
"అలాగే ప్రజా!..." పరంజ్యోతి సెల్ కట్ చేశాడు.
ప్రజాపతి మనస్సులో అనుమానం... ’దీప్తి ఆ ఈశ్వర్ గాడిని ప్రేమిస్తూందా!... ఈశ్వర్ గాడు దీప్తిని ప్రేమిస్తున్నాడా! పరంజ్యోతి చెప్పిన మాటలు నిజమా!... అబద్ధమా! ఏది ఏమైనా దీప్తి వివాహం దివాకర్తో జరగి తీరాలి. ఎవరైనా అడ్డు తగిలితే వాణ్ణి నరికేస్తాను. దీప్తి వివాహం దివాకర్తోనే జరిపిస్తాను’ అనుకొన్నాడు ప్రజాపతి.
ఆ నిర్ణయాన్ని తీసుకొన్నాడు కాని... అతని మనస్సులో ఓ మూల దీప్తి మీద అనుమానం! దీప్తిని గురించి ఆలోచిస్తూ కుర్చీలో సాలోచనగా కూర్చున్నాడు ప్రజాపతి.
"ప్రణవీ!" బిగ్గరగా పిలిచాడు.
ఆ పోలికేకను విన్న ప్రణవి ప్రజాపతి ఆఫీస్ గదిని సమీపించింది. ద్వారం ముందు నిలబడి...
"ఏమండీ!... ఏం కావాలి!" మెల్లగా అడిగింది.
"లోనికిరా!"
ప్రణవి గదిలోకి ప్రవేశించింది. క్షణంసేపు అతని ముఖంలోకి చూచి తలదించుకొంది.
"కూర్చో!"
అతనికి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది.
’ఎందుకో ఇంత మర్యాద! ఏం శాసించబోతున్నారో!’ అనుకొంది ప్రణవి.
"నేను చెప్పేది జాగ్రత్తగా విను!"
అలాగే అన్నట్లు తలను ఆడించింది ప్రణవి.
"నాలుగురోజుల తర్వాత... పరంజ్యోతి, వాడి భార్య, కొడుకు డాక్టర్ దివాకర్ మన అమ్మాయిని చూచేదానికి వస్తున్నారు. ఈ రోజు నుంచి నీవుగాని, అమ్మాయిగాని నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"కనీసం... గుడికి" మెల్లగా తలదించుకొని అడిగింది ప్రణవి.
"వెళ్ళకూడదు" శాసించినట్లు హెచ్చుస్థాయిలో చెప్పాడు ప్రజాపతి.
"అలాగేనండీ!..." మెల్లగా చెప్పింది ప్రణవి.
"ఇక నీవు వెళ్ళవచ్చు!..."
ప్రణవి కుర్చీ నుంచి లేచి... వేగంగా బయటికి నడిచింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో తనకు నమ్మకస్తులైన నలుగురిని ఇంటి కాపలాకు వుంచాలని నిర్ణయించుకొన్నాడు. గది నుండి బయటికి నడిచి కార్లో నూనె ఫ్యాక్టరీకి బయలుదేరాడు ప్రజాపతి.
ఆ రోజు ఉదయం ఈశ్వర్ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడు. స్నానం, టిఫిన్ అయిన తర్వాత హాల్లో కూర్చుని హిందూ న్యూస్ పేపర్ను చూస్తున్న ఈశ్వర్ను హరికృష్ణ లావణ్య సమీపించారు. ఎదుటి సోఫాలో కూర్చున్నారు. వారిని చూచిన ఈశ్వర్ నవ్వుతూ "నాన్నా!... అమెరికా నుండి ఇ అండ్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ బ్రౌన్ చెన్నైకి వచ్చారట. వారంరోజులు వుంటారట. పేపర్లో చదివాను. వారికి మన విష్ణును చూపించాలని నా అభిప్రాయం. మీరేమంటారు నాన్నా!..."
"నీ నిర్ణయం మంచిదే ఈశ్వర్" అన్నాడు హరికృష్ణ.
వాకిట్లో పోస్ట్ మెన్....
"సార్ పోస్టు!..." పిలుపు.
ఈశ్వర్ వేగంగా వెళ్ళి అతను అందించిన కవర్ను చేతికి తీసుకొన్నాడు. వ్రాసింది శివరామకృష్ణ.
"నాన్నా!... మామయ్య వ్రాశారు" ఉత్తరాన్ని హరికృష్ణకు అందించబోయాడు.
"కూర్చో!... విప్పి నీవే చదువు" అన్నాడు హరికృష్ణ.
ఈశ్వర్ కవర్ చించి ఉత్తరాన్ని బయటికి తీశాడు.
"ఉత్తరం చాలా పెద్దదిగా ఉంది. విషయం ఏమై ఉంటుందండీ!" సందేహంతో అడిగింది లావణ్య.
"వాడు చదువుతాడుగా విను..." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
ప్రియాతి ప్రియమైన హరికి...
పెదనాన్నగారి మాటను కాదని వూరిని, అయినవారినీ వదిలాను. చెన్నైకి వెళ్ళిపోయాను. మనిషికి ధన సంపాదనే ముఖ్యం అని భావించాను. వ్యాపారాభివృద్ధి కోసం వైజాగ్ చేరాను. రేయింబవళ్ళు కష్టపడ్డాను. డబ్బును సంపాదించాను. పిల్లలను వారి ఇష్టానుసారంగా బాగా చదివించాను. సముద్రాలను దాటించి వారి ఇష్టానుసారంగా విదేశాలకు పంపాను. రెక్కలొచ్చిన పక్షులు గూటిని విడిచి ఆకాశానికి ఎగిరిన రీతిగా వారు దేశాన్ని, నన్ను, నా భార్యని వదలి సుదూర తీరాలకు వెళ్ళిపోయారు. వారి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకొన్నారు.
వారి దృష్టిలో మేము తల్లిదండ్రులుగా కాకుండా చుట్టాలుగా మారిపోయాము. ఎప్పుడో... నిశిరాత్రిలో ఫోన్లో నాలుగు మాటలు... అంతే. మమ్మల్ని గురించి పట్టించుకోవలసిన బాధ్యతను వారు మరిచిపోయారు. మగపిల్లలే కాదు... ఆడపిల్లలూ అలాగే మారిపోయారు.
చచ్చేంతవరకూ... వారిని ఏ విషయంలోనూ చేయి చాచి అడగకూడదని స్నేహితునితో కలిసి వ్యాపారాన్ని పెంచాను. ఎంతో శ్రమించాను. లక్ష్యాన్ని సాధించాను. ఇదంతా చేసింది విష్ణు కోసం. వాడి శేష జీవితం ఆనందంగా సాగాలనే లక్ష్యంతో... కానీ... దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లు నేను ఎంతగానో నమ్మిన నా పాట్నర్, హితుడు దండాయుధపాణి నన్ను మోసం చేశాడు.
తను వారిని కంపెనీలో ప్రవేశపెట్టి తన బలాన్ని పెంచుకొన్నాడు. లెక్కను తారుమారుచేశాడు. కాంట్రాక్ట్ వ్యాపారం నష్టాల పాలైందని మొసలి కన్నీరు కార్చాడు. చుట్టూ వున్న అతని వారు వంత పాడారు. పువ్వులను అమ్మిన చోట కట్టెలను అమ్ముకొనే స్థితికి తీసుకొని వచ్చాడు. ఆఫీస్లో వారంతా ఒక్కటి. నేను ఏకాకినైపోయాను. శత్రుశేషం.... ఋణశేషం వుండకూడదు గదా! ఆస్తినంతా ఎంతో ప్రీతిగా మూడు కోట్లతో నిర్మించిన ఇంటితో సహా... అమ్మి అప్పులను తీర్చాను.
గూడూరు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట ఎలా నా భార్యతో చెన్నైకి వెళ్ళానో... అలాగే... నీ సన్నిధికి మన వూరికి నీ చెల్లెలు ఊర్మిళ, విష్ణులతో తిరిగి వస్తున్నాను. నీవు నా తప్పులను మన్నించి నాకు ఆశ్రయాన్ని కల్పిస్తావనే ఆశతో... వారంరోజుల్లో వస్తున్నాను. నా ఇంటికి బాగు చేయించు... నేను నా శేష జీవితాన్ని ఆ ఇంట్లోనే, నా వూర్లోనే గడపదలచుకొన్నాను. నీవు తప్పక నాకు సాయం చేయగలవనే ఆశతో!!!
ఇట్లు
నీ... శివరామకృష్ణ
ఈశ్వర్ ఏకధాటిగా ఉత్తరాన్ని చదివి ముగించాడు. ఆ ముగ్గురి మనస్సులు, ముఖాలు ఒకే రీతిగా విచారంగా మారిపోయాయి.
ఈశ్వర్ సెల్ మ్రోగించి ఆన్ చేశాడు. అది దీప్తి కాల్.
"హలో!..."
"బావా!"
"అవును"
"ఎప్పుడు వచ్చారు?"
"ఉదయాన్నే!"
"ప్రజాపతి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు?"
"ఏంటీ!"
"అదే... మీ మామగారు... నన్ను!..."
"ఈశ్వర్!... దీప్తి కదూ... ఇలా యివ్వు"
ఈశ్వర్ ఫోన్ను లావణ్యకు అందించాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|