Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - శ్రీరామ కోటి
#41
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
శుభాంగి
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-01-15-213732504.png][/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



యదువంశంలో ఎందరెందరో రాజులు, మహా రాజులు, రాజర్షులు, మహానుభావులు మరెందరో అవతార పురుషులు, అంశావతార పురుషలు ఉన్నారు. వారంత యుగ ధర్మాన్ని పాటిస్తూ వారి వారి రాజ్యాలను విస్తరించారు. ప్రజలను కన్న బిడ్డలవలే కాపాడారు. ప్రజల శక్తి యుక్తులను, మంచి చెడులను గమనించి వారిని తగిన విధంగా ఆదరించారు. వారి వారి ధర్మాలను వారు ధర్మ బద్ధంగా నిర్వర్తించారు. అనేక మంది మహానుభావులను, ఋషులను, మహర్షులను, బ్రహ్మర్షులను సేవించారు. 



రాజసూయాది రకరకాల యాగాలను చేసి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాల వరాలను పొందారు. అనేకమంది అసురులను అంత మొందించారు. అవనిమాతకు ఆనందాన్ని కలిగించారు. అలాంటి యదువంశ రాజులలో దశార్హ మహా రాజు ఒకడు. అతని మహోన్నత పరిపాలన కారణంగానే అతని పేర దశార్హ మహా రాజ్యం ఏర్పడింది. దశార్హ మహా రాజు సుపరిపాలనలో రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించేవారు. 



 దశార్హ మహారాజ పుత్రిక శుభాంగి. పేరుకు తగిన ఆకారం కలది. పని చేసేటప్పుడైన ఆమె ఎదురు వస్తే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి అని రాణి మందిరంలోని వారేకాదు రాజ్యంలోని చాలా మంది అనుకునేవారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు సహితం వారు యజ్ఞయాగాది శుభకార్యాలను చేసేటప్పు డు శుభాంగినే తమకు ఎదురురమ్మనేవారు. వయసు తో నిమిత్తం లేకుండా ప్రతి శుభ కార్యంలో శుభాంగికే ప్రథమ తాంబూలం ఇచ్చేవారు. 



 శుభాంగి ఋషుల సేవన, మహర్షుల సేవన, బ్రహ్మర్షుల సేవన వేదపురాణేతిహాసాలన్నిటిని చక్కగా వంట పట్టించుకుంది.. వేద మంత్రాలలోని విజ్ఞాన అంశాలను, వేద మంత్రోచ్ఛారణలోని శారీక విజ్ఞాన అంశాల ను తనకు తెలిసినంత మేర తన స్నేహితురాళ్ళకు, రాజ మందిరాలలోని పరిచారికా సమూహంనకు చక్కగా వివరించి చెప్పేది. శుభాంగిని సందర్శిస్తే చాలు సమస్త రోగాలు మటుమాయం అవుతాయి అని దశార్హ రాజ్యం లోని ప్రజలు అనుకునేవారు. ఆమెలో అశ్వనీదేవతల అంశ ఉందనుకునేవారు. 



 శుభాంగి సంప్రాప్తయౌవనవతి అయ్యింది. శుభాంగిని చూడగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రెండు చేతులెత్తి నమస్కరించేవారు. 



 హస్తినాపురం ను పరిపాలించే మహారాజు సంవరుణు. అతని ధర్మపత్ని తపతి వారి ముద్దుల కమారుడు కురువు. వేద పురాణేతిహాసాల విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాది విద్యలను, రాజనీతి విద్యలను, భవబంధ సంబంధ విద్యలను సమస్తం శాస్త్రోక్తంగా అభ్యసించాడు. అటుపిమ్మట తన రాజ్యం లోని అన్ని ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించాడు. ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూసాడు. వారి కష్టాలను చూడటమేగాక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. 



 రాజ్యప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంలో కుమారుడు కురువు చూపించే ఆసక్తిని గమనించిన సంవరణ మహారాజు పుత్రునికి మకుటాభిషేకం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని తపతి కి చెప్పాడు. అందుకు తపతి, "నాథ! మీ ఆలోచన మహా శ్రేష్టంగా ఉంది. విషయం లో మన కుల గురువు వసిష్ట మహర్షిగారిని కూడా సంప్రదించండి. వారి దివ్య ఆలోచన మేరకు ముందడుగు వేయండి. " అని అంది. 



 తపతి మాటలను విన్న సంవరణ మహారాజు, " దేవీ మన మూల గురువు, కుల గురువు అయిన వసిష్ట మహర్షి నేను పనిని చేసేటప్పుడయిన ముందుగా నీ ధర్మపత్ని సలహా తీసుకో అని అంటారు. 



  హస్తినాపురం కు నీ వలన జరిగిన మేలు అంతా యింత కాదు. ఒకప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం తో హస్తినాపురం లో సూర్యుని రశ్మి ప్రవేసించడమే కష్టమైపోయింది. అప్పుడు ప్రజల దేహాలు మంచు గడ్డల్లా మారి పోసాగాయి. అప్పుడే సూర్య పుత్రిక వైన నిన్ను నేను వివాహం చేసుకుని హస్తినాపురం తీసుకు వచ్చాను. అశ్వనీ దేవ తేజంతో ప్రకాశించే నువ్వు హస్తినాపురం రాగానే నీ శరీర తేజస్సును విస్తరింపచేసావు. 



నీ శరీర తేజస్సులోని విపరీతమైన వేడి ప్రభావంతో హస్తినాపురం లోని మంచుదనం కరిగిపోయింది. వాతావరణ సమతుల్యత ఏర్పడింది. నాటినుండి ప్రజలు ఆనందంగా జీవించసాగారు. అందుకే వసిష్ట మహర్షి నువ్వు రాజ్య సంరక్షణ దేవతవు అని అంటారు. " అని అన్నాడు. 
 
 సంవరణుడు వసిష్ట మహర్షిని, హితులను, పురోహి తులను తదితరులను సంప్రదించి ఒక శుభ ముహూర్తాన కురువుకు మకుటాభిషేకం చేసాడు. సూర్య భగవానుని అనుగ్రహంతో, వసిష్ట మహర్షి అనుగ్రహంతో, నీ తల్లి తపతి అనుగ్రహంతో హస్తినాపురం ను పరిపాలించమని కుమారునికి చెప్పాడు. కురు మహారాజు అలాగే అన్నాడు. 



 కురు మహారాజు వసిష్ట మహర్షి ఆదేశానుసారం తన తండ్రి సంవరుణుడు మీద కత్తి కట్టిన పాంచాల రాజు మీదకు యుద్దానికి వెళ్ళాడు. పాంచాల రాజు కురు మహారాజు నడుమ కనీవినీ ఎరుగని రీతిన సమరం జరిగింది. కురు మహారాజు గజ బలం చూసి పాంచాల రాజు భయపడ్డాడు. సమరావనిలో ఏనుగులన్నీ ఒక్కసారి ఘీంకరించాయి. శబ్దానికి పాంచాల రాజు సైన్యంలో వణుకు పుట్టింది. 



మత్య్స, వరాహ, కూర్మాది ఆకారాల రథాలతో, గుర్రాల సకిలింపులతో సమరాంగణం విచిత్ర శోభను సంతరించుకుంది. శత్రువుల ఊహలకు అందకుండా రకరకాల వ్యూహ నైపుణ్యాలతో కురు మహారాజు కదనరంగంలో చెలరేగిపోయాడు. పాంచాల రాజు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. చివరకు పాంచాల రాజు కాళ్ళ బేరానికి వచ్చాడు. 



 కురు మహారాజు పాంచాల రాజు ను క్షమించాడు. తనకు సామంత రాజు గా ఉండమని కురు మహా రాజు పాంచాల రాజును కోరాడు.. పాంచాల రాజు అందుకు సమ్మతించాడు. సామంత రాజ ధర్మాన్ని అనుసరించి పాంచాల రాజు వసిష్ట మహర్షి తో తన రాజ్యంలో మహా యాగం చేయించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#43
 ఒకనాడు శుభాంగిని దర్శించిన మహర్షులు "అమ్మా శుభాంగి. అశ్వనీ దేవ తేజోవిలాసిని! వేద పురాణే తిహాసాలను సమస్తం చక్క గా అభ్యసించావు. సుపరిపాలనకు దశ అర్హతలను సంపాదించుకున్న దశార్హ మహారాజు సుపుత్రికగ పదికి మించి అనేక శుభార్హతలను సంపాదించుకుని శుభాంగి వయ్యావు.. 



 గగనానికి వెలుగునిచ్చేవాడు శ్రీ సూర్య నారాయణుడు అయితే దశార్హ దేశానికి వెలుగునిచ్చే దానివి నువ్వు. నువ్వు శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం కూడా పొందావంటే నిన్ను మించిన వారు భువిలో, దివిలో మరెక్కడా ఉండరు. కావున శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం పొందడానికి నువ్వు తపస్సు చెయ్యి. నీ చరిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. " అని అన్నారు. 



 శుభాంగి మహర్షుల మాటలను అనుసరించి శ్రీ సూర్య నారాయణ మూర్తిని ధ్యానిస్తూ తపస్సు చేయసాగింది. 



ఒకనాడు వశిష్ట మహర్షి కురు మహారాజు మందిరానికి వెళ్ళాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించాడు. 



అంత వశిష్ట మహర్షి, " కురు మహారాజ! మీ పూర్వీకులు హస్తి మహారాజు పేరు మీద హస్తినాపుర రాజధాని ఏర్పడింది. నీ తల్లి సాక్షా త్తు సూర్య నారాయణుని పుత్రిక. నువ్వు నీ చిన్న తనం లోనే సూర్య మండలాన్ని సందర్శించావు. తండ్రిని మించిన తేజస్సు తో ప్రకాశిస్తున్నావు. నీ తలిదండ్రులు వివాహం చేసుకున్న కొత్తలో వారెక్కువ కాలం దేవలోకాల లో, పవిత్ర వనాలలోనే గడిపారు. నువ్వు పవిత్ర వనంలోనే వారికి పుట్టావు.
 
నీ తండ్రి సంవరుణుడు పవి త్ర వనంలో ఉన్నప్పుడు నేనే హస్తినాపురంలో అనేక శాంతి యాగాలను జరిపించాను. అలా హస్తినాపురం పవిత్ర పురం గా మారింది. అలాంటి పవిత్ర పురమును నువ్వు మరింత పవిత్ర పురంగ మార్చు. సుపరిపాలన చేసి వంశ కర్తగా పేరు తెచ్చుకో. " అని అన్నాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి మాటలను శిరసా వహిస్తానని మహర్షికి మాట యిచ్చాడు. 



 కురు మహారాజు రాజ్యంలోని దుర్గపరిఖాదుల ను మరింత పటిష్టం చేసాడు. హస్తినాపురంలో గొప్ప గొప్ప హర్మ్యాదులను నిర్మించే ప్రజలకు సహకరించా డు. రథగజతురగభటాదుల సంఖ్యను పెంచాడు. హస్తినాపురం ను అందంగ తీర్చిదిద్దాడు. తాతగారైన సూర్య భగవానుని సేవలో కాలం గడపసాగాడు. 
 శుభాంగి పర్ణశాలల నడుమన ఉన్న పర్వత ప్రాంతాన తపము చేయసాగింది. ఆమె తపో ప్రభావాన సూర్య మండలం అతలాకుతలం అయ్యింది. సూర్య భగవానుడు శుభాంగి ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్య భగవానుని చూచిన శుభాంగి సూర్య తేజాన్ని తట్టుకునే శుభదేహాన్ని తనకివ్వమని కోరింది. 



సూర్య భగవానుడు తథాస్తు అంటూ "శుభాంగి, నువ్వు నా కుమార్తెకు బంధువు అవుతావు. నా కుమార్తె పుత్రుని వంశ కర్తవు చేస్తావు. అశ్వనీ దేవతల తేజస్సు తో మరియు నా తేజస్సు తో ప్రకాశించే నీ శుభ అంగమైన తనువును మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఎవరు తాకిన వారు సర్వ రోగాలనుండి విము క్తి పొందుతారు.. అశ్వినీ తేజో విలాస శ్రీసూర్య నారాయ రూప శుభాంగీ తనూలత.. అంటూ నీ పేర విజ్ఞానాత్మక మంత్ర తేజం ఆవిర్భవిస్తుంది. " అని ఆశీర్వ దించాడు. 



 కురు మహారాజు కలలో శుభాంగి దివ్య రూపము కనపడింది. కురు మహారాజు చిత్ర కారులను పిలిపించి తన కలలో కనపడిన వనిత రూపురేఖలను వివరించాడు. సూర్య మండలంలో ప్రకాసిస్తున్న శుభాంగి చిత్ర పటాన్ని ఒక చిత్ర కారుడు చక్కగ చిత్రించాడు. 



చిత్ర పటాన్ని చూసిన వసిష్ట మహర్షి "కురు మహా రాజ, సుందరి దశార్హ మహారాజు కుమార్తె శుభాంగి. తపో మార్గాన సూర్య భగవానుని ప్రత్యక్షం చేసుకున్న పుణ్య స్త్రీ. దశార్హ మహారాజుకు మన హస్తినాపురం రాజులన్నా, మన హస్తినాపురం అన్నా మహా గౌరవం. నీ వివాహ విషయం మాట్లాడటానికి దశార్హ మహారాజు దగ్గరకు నేనే ప్రత్యేకంగా వెళతాను.", అని అన్నాడు. 



కురు మహారాజు తన మూల పురోహితుడు, తన వంశ సంరక్షకుడైన వసిష్టుని మాటలను విని మహదానంద పడ్డాడు. 



 వశిష్ట మహర్షి దశార్హ మహారాజు ఆస్థానానికి వె ళ్ళాడు. దశార్హ మహారాజు వశిష్ట మహర్షిని తగిన రీతి లో సత్కరించాడు. పేము బద్దలతో తయారు చేయబడిన ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. 



అప్పుడు వశిష్ట మహర్షి " దశార్హ మహారాజ! నేను ఇక్కడకు ఒక శుభ కార్యం నిమిత్తం వచ్చాను. అదేమిటో చెబుతాను విను. చంద్రవంశ రాజులలో సంవరణ మహారాజు కు గొప్ప పేరు ఉంది. సంవరణ మహారాజు హస్తినాపురం ను పరిపాలిస్తున్నాడు. అతని ధర్మపత్ని తపతి సూర్య భగవానునికి కుమార్తె. పుణ్య దంపతులకు పుట్టిన వాడే కురు మహారాజు. 



 యదు వంశ రాజులలో నీవెలా ప్రజానురంజక పాలన చేసి దశార్హ వంశ కర్తవయ్యావో అలాగే కురు మహారాజు వంశ కర్త గా మారాలని పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. కురు మహారాజు నీ కుమార్తె శుభాంగిని యిష్ట పడుతున్నాడు. నువ్వూ, నీ కుమార్తె శుభాంగి యిష్టపడితే కురు మహారాజు తలిదండ్రులు ప్రత్యక్షంగా మి మ్ములను కలిసి వివాహ మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. " అని అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న దశార్హ మహారాజు మహర్షిని రోజు విశ్రాంతి తీసుకోమని మహర్షికి రాజ మందిరంలోని ప్రత్యేక పర్ణశాలను విడిది మందిరంగా ఏర్పాటు చేసాడు. వశిష్ట మహర్షి పర్ణశాల లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శుభాంగి వశిష్ట మహర్షి ని కలిసి సాష్టాంగ ప్రణామాలర్పించింది. 



వశిష్ట మహర్షి శుభాంగిని ఆశీర్వదించాడు. అనంతరం కురు మహారాజు గుణగణాలను, రాజ్యాన్ని పరిపాలిస్తున్న విధానాన్ని శుభాంగికి తెలిపాడు. అనంతరం "అమ్మా ! శుభాంగి, నీ దివ్య తేజో యశస్సు ప్రభావాన నీ తండ్రి దశార్హ వంశ కర్త అయ్యాడు. అలాగే నీ ధర్మపతి కురు మహారాజు కురువంశ కర్త కావాలి" అన్నాడు. 



"మీ ఆశీర్వాద బలమే సర్వ శుభాలకు మూలము" అని శుభాంగి వశిష్ట మహర్షి కి మరోమారు నమస్కరించింది. 
 మహారాజుల, మహర్షుల, శుభాంగి బంధువుల, కురు మహారాజు బంధువుల సమక్షంలో శుభాంగి కురు మహారాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుభాంగి, కురు మహారాజులను శ్రీ సూర్య నారాయణుడు ఆశీర్వదించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#44
శుభాంగి మాటలను అనుసరించి కురు మహా రాజు ప్రజల ఐశ్వర్యాభివృద్ది నిమిత్తం మహర్షులతో అనేక యాగాలు చేయించాడు. నిరుపేదల జీవనానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాడు. 



శుభాంగి కురు మహారాజు తో కలిసి తన రాజ్యాన్నంత సందర్శించింది. రాజ్యంలోని అనేకానేక పవిత్ర ప్రదేశాలన్నిటిని గుర్తించింది. శుభాంగి సూచించిన ప్రదేశంలో శ్రీ సూర్య నారాయణుని ఆశీర్వాదంతో కురు మహారాజు దివ్య తపస్సు చేసాడు. పతిదేవుని తపస్సుకు శుభాంగి తగిన విధంగా సహకరించింది. 



కురు మహారాజు తపస్సుకు మెచ్చిన పంచ భూతాలు, తదితర దేవతలు కురు మహారాజు పరిపాలనలో అతని రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుందని వరాలను ఇచ్చారు. కురు మహారాజు తపస్సు చేసిన ప్రాంతానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. కురుక్షేత్రం ను మరింత పవిత్రం చేసే నిమిత్తం కురు మహారాజు, ధర్మపత్ని శుభాంగి మాటలను అనుసరించి భూమినంత తనే స్వయంగా దున్నాడు. 



అతనికి ఇంద్రుడు సహాయంగా వచ్చాడు. శుభాంగి కురుక్షేత్రం లో అమృత ధాన్యం పండించమని భర్త కు చెప్పింది. కురు మహారాజు భార్య మాటలను అనుసరించి అమృత ధాన్యం పండించాడు. ధాన్యాన్ని నిరుపేదలకు పంచాడు. కురు మహారాజు నిరుపేదల, వసిష్టాది మహర్షుల సహాయసహకారాలతో అనేక యజ్ఞయాగాదులు చేసాడు. కురు మహారాజు కాలంలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పాడిపంటలతో రాజ్యం సుభిక్షంగా వర్థిల్లింది. 



శుభాంగి ప్రజలను విద్యావంతులను చేయడంలో తనవంతు సహాయం తను అందించింది. ప్రజలలో సాహిత్య జిజ్ఞాసను కలిగించింది. అందరికీ ఉపయోగపడే నూతన వస్తు రూపకల్పన చేయమని ప్రజలను ప్రోత్స హించింది. ప్రజలలో సహృదయతను పెంచింది. 



 కురు మహారాజు సుపరిపాలనలో హస్తినాపురం పాడి పంటలతో, సిరిసంపదలతో తులతూగింది. చంద్ర వంశ రాజులలో కురు మహారాజు వంశ కర్త అయ్యాడు. 



శుభాంగి కురు మహారాజు దంపతులకు పుట్టిన పుత్రుని పేరు విదూరధుడు. 



                     శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#45
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#46
సారస్వతి
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-01-25-123929607.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



"అగ్నిమీళే పురోహితం... యజ్ఞస్య దేవమృత్విజం.. హోతారం రత్నధాతమమ్" అని నిరంతరం ఋగ్వేద స్తుతుల అలల శబ్ద స్వరాలతో ప్రవహించే పవిత్ర నది సరస్వతీ నది. ఏడు పుణ్య నదులలో సరస్వతీ నదిది ప్రథమ స్థానం. అనేక పాయలుగ ప్రవహించే సరస్వతీ నది తరంగాల శబ్దం వేద పఠనంలోని ఉదాత్తానుదాత్తాది స్వరాలను గుర్తు చేస్తుంది. ఆయా స్వరాల నడుమన ఉన్న గణ చక్రాలను తెలియచేస్తుంది. "అగ్నిమీళే పురో హితం" అనే పాదం 8 అక్షరాలతో 13 మాత్రలతో 18 ఉచ్ఛారణా స్వరాలతో 83 స్థానాన ఉన్నదన్న సత్యం సరస్వతీ నది తరంగాల సుస్వరాలను పరిశీలించే వేద గణితో పాసకులకు సునాయాసంగా తెలిసిపోతుంది.



అలాంటి పుణ్య సరస్వతీ నది బ్రహ్మవర్తం ప్రాంతాన ప్రవహిస్తుంది. అక్కడే దృషద్వతి నదికూడ ఉంది.
దృషద్వతి బ్రహ్మ కుండలంలో జన్మించింది . ఋగ్వేద సంకలన ఋషుల ఆశ్రమ ఛాయలన్నీ రెండు నదుల నడుమనే కనపడతాయి.



సరస్వతీ నది అలల మీద తేలియాడే హంసలు జ్ఞాన కళికలులా ప్రకాశిస్తుంటాయి. కళికలను చూస్తే చాలు. మానవ మేధస్సులోని అమాయకత్వం ఆవిరైపోతుంది. చురుకుదనం చురకత్తుల్లా మారి అజ్ఞాన సంహారం చేస్తుంది. ఆయా అలల మీద నిలిచే నురుగు వివిధ దేవళాల ఆకారాలతో ఆద్యాత్మిక చింతనను పెంచి పోషిస్తుంది.
బ్రహ్మవర్తం ప్రాంతమంటే సరస్వతీ నదికి మహా యిష్టం. అక్కడే సరస్వతీ నది పుణ్యస్త్రీగ అవతారమెత్తింది. ఆమె పుణ్య స్త్రీగా అవతారమెత్తడానికి కారణం ఏమిటంటే... రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.



బ్రహ్మవర్తం లో నివసించే ప్రజలు వేద మంత్రోచ్ఛారణ లోని గణ చక్రాల గణిత తేజస్సును, ఆద్యాత్మిక తేజ స్సును గమనించడానికి సరస్వతీనది పుణ్య స్త్రీ అవతారమెత్తింది అనేది ఒక కథ.  ఇలా మరో నాలుగు కథలు ప్రచారంలో ఉన్నాయి. సరస్వతీ నది పుణ్య స్త్రీ రూపం చూచి దృషద్వతి కూడా పుణ్య స్త్రీ రూపం ధరించింది. ఇద్దరు నదీమ తల్లులు కలిసి అలల మీద ఆడిపాడారు.



అలల కింద ధ్యాన ముద్రలో కొంత కాలం గడిపారు. ఆపై దృషద్వతి సరస్వతి దగ్గర సెలవు తీసుకుంది. సరస్వతీ  బ్రహ్మవర్త ప్రాంతానికి వచ్చే దేవతలకు, మహర్షులకు, బ్రహ్మర్షులకు జ్ఞాన జలాన్ని ఇచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. పుణ్య స్త్రీ ని కొందరు ఉభయభారతి అని అంటారు. ఎక్కువమంది మాతా! జ్ఞాన స్వరూపిణీ! సరస్వతీ అనే పిలుస్తారు.



ఒకసారి దేవేంద్రుడు అహల్యాదులకు చేసిన పాప భారంతో కటిక చీకటి ఆకారంగా మారిపోయాడు. ఆకారంతోనే అక్కడికి వచ్చా డు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రునికి జ్ఞాన జలాన్ని ప్రసాదించింది. దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని స్వీకరించాడు
దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని తాగగానే తన స్వస్వరూపాన్ని ధరించి దేదీప్యమానంగా వెలిగిపోయాడు. తను చేసిన తప్పులన్నిటిని తలచుకుని జ్ఞాన స్వరూపిణి సరస్వతి  ముందు తలవంచాడు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రుని కరుణించింది. 



దేవేంద్రుడు జ్ఞాన స్వరూపిణి ని సరస్వతిని నదిలా కాకుండా దేవీదేవతగ పూజించాడు. దేవీదేవత దేవేంద్రుని కోరిక మీద తను పుట్టిన పిప్పల వృక్ష చరిత్ర ను చెప్పింది. పిప్పలాది మహర్షుల గురించి చెప్పింది.



అలాగే తన కుమారుడు సరస్వతను, కుమార్తె సారస్వతిని దేవేంద్రునికి పరిచయం చేసింది. 



వేద మంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ నది బ్రహ్మత్వ మథనం నుండి పుట్టిన దేవీదేవత ఇద్దరు బిడ్డలను చూచి దేవేంద్రుడు "అద్భుతం మహాద్భుతం" అని అనుకున్నాడు. బ్రహ్మ సృష్టి ని పలు రీతులలో స్తుతించాడు.



 ఆపై దేవేంద్రుడు సారస్వతి వేద పఠనం విని మహదానంద పడ్డాడు. వేద పఠనంలో శాస్త్రీయంగా పఠించడం ముఖ్యం కానీ స్త్రీపురుష బేధం లేదనుకున్నాడు. మనుషులు సృష్టించే ఆచార నియమాలు వేరు. కా ధర్మం సృష్టించే ఆచార నియమాలు వేరు అనుకున్నాడు.



దేవేంద్రుడు దేవీదేవత దగ్గర సెలవు తీసుకు న్నాడు . ఇంద్రలోకం వెళ్ళాడు . తన ధర్మం తాను నిర్వర్తించ సాగాడు. అలా కొంత కాలం గడిచిపోయింది . ఒకానొకప్పుడు నిశాజ్ఞ అనే రాక్షసుడు దేవేందుని పై దండయాత్ర చేసాడు.



సరస్వత  తల్లి ఆజ్ఞ ను అనుసరించి దేవేంద్రునికి సమరంలో సహాయం చేసాడు. నిశాజ్ఞ సరస్వత ముందు నిలబడలేక పారిపోయాడు. సరస్వత దేవేంద్రునికి ఇంద్రలోకం అప్పగించి బ్రహ్మవర్తం వచ్చేసాడు. సరస్వతను తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి , సోదరి సారస్వతి ప్రశంసించారు. 



సారస్వతి ప్రకాశవంతమైన అందాన్ని, పదునైన తెలివితేటలను చూచిన తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి, సోదరుడు సరస్వత సారస్వతికి మంచి వరుని చూడాలనుకున్నారు. బ్రహ్మవర్తాన వసించే మహర్షుల, బ్రహ్మర్షుల సేవలు చేస్తూ, సారస్వతి అందరి మన్ననలను పొందసాగింది. జ్ఞానం కోసం అక్కడికి వచ్చిన వారి అభ్యాస సామర్థ్యాన్ని అనుసరించి వారిని జ్ఞానవంతులను చేయసాగింది.



పూరువంశ రాజు మతినారుడు. మంచి పరిపాలనా దక్షుడు. శత్రు రాజుల అహంకారాన్ని అణిచిన మహా పరాక్రమవంతుడు. మానవతావాదాన్ని నెత్తికి ఎత్తుకున్న మహాత్ముడు. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సని నమ్మిన ప్రజానురంజక పరిపాలకుడు..



ఒకానొక సమయంలో అతని  రాజ్యంలో కరువుకాటకాలు అధికమయ్యాయి. జీవరాశులన్నీ ఆహారం నిమిత్తం అల్లాడసాగాయి. వర్షాలు లేక భూములు బీటలు వారాయి. రాజ్యం లోని భయంకర కరువు ను కళ్ళార చూసిన మతినార మహారాజు "రాజ్యంలో కరువుకాటకాలు నశించాలి అంటే  ఏం చెయ్యాలి?" ని పురోహితులను, మహర్షులను అడిగాడు.



మతినార మహారాజు మాటలను విన్న పురోహితులు, మహర్షులు,"ఋక్షక పుత్ర..  మతినార మహారాజ! ప్రకృతి కాలుష్యం అధిక మైనప్పుడు రాజ్యంలో కరువుకాటకాలు పెరుగుతుంటాయి. అవి తొలగాలంటే సృష్టి రక్షకుడైన విష్ణు మూర్తి ని పూజించాలి. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#47
యజ్ఞో వై విష్ణుః అంటే యజ్ఞం విష్ణు స్వరూపం. యజ్ఞం చేయడం వలన వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటుంది. పశుపక్ష్యాదులు యజ్ఞయాగాదుల నుండి వచ్చిన గాలులను పీల్చడం ద్వారా మహాఆరోగ్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా యజ్ఞ యాగాదుల వద్ద ఉన్న ధేనువులు కామధేనువులుగ శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటాయి. యజ్ఞంలో వాడే నెయ్యి , పాలు , వివిధ ధాన్యాలవలన సంప్రాప్తించిన భస్మంతో అనేక ఔషదాలను తయారు చేయవచ్చును.  
 
యజ్ఞాలు ఆరు రకాలుగా ఉంటాయి. అవి ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం, స్వాద్యాయ యజ్ఞం,  యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం,సంశిత యజ్ఞం. యజ్ఞాలన్నిటినీ నువ్వు ఇంతకు ముందే శాస్త్ర పద్దతిన ఆచరించావు. ఇక ప్రజల క్షేమం, రాజ్య క్షేమం కోరుకునే రాజు సత్త్ర యాగం చెయ్యాలి. 13 రోజులు మొదలుకొని 100 రోజుల వరకు సత్త్ర యాగం చెయ్యాల్సి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల పాటు చేసే సుదీర్ఘ  సత్త్ర యాగం కూడా ఒకటి ఉంది." అని  చెప్పడంతో మతి నార మహారాజు సత్త్ర యాగం చేయడానికి మంచి ప్రదేశం సూచించమని మహర్షులను అడిగాడు. 



మహర్షులందరు ఏక కంఠంతో, "జ్వాల ఋక్షకుల పుత్ర! మతినార మహారాజ! ఋగ్వేదంలో సరస్వతీ నది రమారమి 50 పర్యాయాలు వివిధ నామ ధేయాలతో స్తుతించబడింది. అందుకే సరస్వతీ నది అలల కదలికలో 50 పవిత్ర కళలు కనపడుతుంటాయి. అందలి ఒక కళ మేథో తేజస్సును పెంచుతుంది. మరో కళ మేథో తేజస్సులో సురత్వాన్ని కలుపుకుని ప్రకాశిస్తుంది. ఇంకా కళలలో సంగీత కళ, యోగకళ వంటి కళలు ఉన్నాయి. అందుకే సరస్వతీ నది లోని నీటిని జ్ఞాన జలం అని అంటారు. అలాంటి సరస్వతీ నది ఒడ్డున ఉన్న బ్రహ్మవర్త ప్రదేశం నువ్వు చేసే సత్త్ర యాగం కు పవిత్ర ప్రదేశం" అని అన్నారు.



మతినార మహారాజు సరస్వతీ నది ప్రాంతాన ఉన్న బ్రహ్మవర్తం ను తన సత్త్ర యాగ కార్యక్రమానికి ఎంచుకున్నాడు. మతినార మహారాజు సరస్వతీ నది దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ప్లక్ష వృక్షాన్ని, కామ్యక వనమును సందర్శించాడు. సరస్వతీ దృషద్వతులను చూసాడు. అనేక పాయలతో ప్రవహించే సరస్వతీ నదిని చూసాడు. పాయపాయన ప్రకాశించే ప్రమోద జ్ఞాన కళలను చూసాడు. సురుల జన్మ సుర నదుల జన్మ అతి పవిత్రం అనుకున్నాడు. కొంత కాలం తను అక్కడ ఉండటానికి తగిన కుటీరాలను ఏర్పాటు చేయించాడు. 
మహర్షుల ఆదేశానుసారం, వృత్తాకార దీర్ఘచతు రస్రాకార చతురస్రాకార త్రిభుజాకార కూర్మాకార, మత్స్యాకార, వరాహాకారాది యజ్ఞ వేదికలను వేద గణాను సారం కొందరు ఋషులు పదుగురి సహాయంతో నిర్మించారు. మరికొందరు ఋషులు సత్త్ర యాగానికి కావాల్సిన వస్తువులను, ధినుసులను సమస్తం ఏర్పాటు చేయ సాగారు. 



ఋషులకు కొందరు రాజ భటులు, కొందరు రాజ్య ప్రజలు సహాయంగా ఉన్నారు. అక్కడి వారం దరికి సరస్వత, సారస్వతీ తగిన విధంగా సహాయం చేయడమేగాక సరస్వతీ నదిలో ప్రదేశంలో ఎలాంటి నీరు ఉంటుంది అన్న పవిత్ర విషయాలన్నిటిని ఋషులకు, మహర్షులకు చెబుతున్నారు.  మతినార మహారాజు సత్త్ర యాగంలో తను పాటించవలసిన నియమాదులను మహర్షుల ద్వారా తెలుసుకుంటూ , సరస్వత, సారస్వతిని గమనించలేదు. 



అధ్వరులు , పురోహితులు, ఋషులు, మహర్షుల ఆధ్వర్యంలో సత్త్ర యాగం ప్రారంభమైంది. యజ్ఞ వేదికల నుండి ఎగసి పడే అగ్ని దేవుని కాంతులలో సరస్వతీ నది సరికొత్త కాంతులను సంతరించుకుంది. మహర్షుల మంత్రాలకు అనుకూలంగా సరస్వతీ నది, అలల నృత్యం చేయసాగింది. నృత్యం నటరా జునే మంత్ర ముగ్దుడిని చేయసాగింది.



మతి నార మహారాజు మండలం పాటు సత్త్ర యాగం చేసాడు.. యాగానంతరం పుణ్య స్త్రీ రూపంలో ఉన్న జ్ఞాన స్వరూపిణి సరస్వతీ నది మతినార మహారాజు కు దర్శనం ఇచ్చింది. మతినార మహారాజు రాజ్యం లో వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణ సమతుల్యత పెరగసాగింది.. అది తెలిసి మతినార మహారాజు మిక్కి లి సంతోషించాడు. 



సత్త్ర యాగం మరో పదిరోజులు మరింత విజయవంతంగ ముగిసింది.   ఒకనాటి పున్నమి రాత్రి జ్ఞాన జలం తాగుతున్న సారస్వతిని మతినార మహారాజు చూసాడు. సారస్వతి తెల్లని కాంతులు విరజిమ్మే శరత్కాల మేఘంలా ఉంది. శరదృతు చంద్రబింబం లా ఉంది. మతి నార మహారాజు నెమ్మదిగా సారస్వతి దగ్గరకు వెళ్ళా డు. సారస్వతిని అతి దగ్గరగా చూసిన మతినార మహా రాజుకు రాజహంసలు, జాజిపూల దండలు ,కురిసే మంచు గుర్తుకు వచ్చాయి . మతినార మహారాజు సారస్వతిని చూస్తూ , తనని తాను పరిచయం చేసుకున్నాడు. అప్పుడు సారస్వతి తను సరస్వతీ నది కుమార్తె సారస్వతిని అని చెప్పింది.



సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు మనసు క్షణం పాటు సుందర జగతిన విహరించింది. మతినార మహారాజు జగతిలో వెండికొండను, ఆది శేషుని, రెల్లు పూలను, మల్లెపూలను, కల్ప వృ క్షం ను, పాల సముద్రం ను, తెల్ల తారలను, ఆకాశ గంగ ను వాటి నడుమ విహరించే సారస్వతిని చూసాడు. వెంటనే మతినార మహారాజు కు సారస్వతి మీద అభి మానం తో కూడిన అనురాగం జనించింది.



అంతవరకు సత్త్ర యాగం జరుగుతున్నప్పుడు తనూ , తన సోదరుడు సరస్వత, మహర్షులకు ఎలా సహాయపడింది వివరిస్తూ, సత్త్ర యాగం లో వెయ్యవలసిన హయ్యంగ వీనాదులగురించి సారస్వతి మతి నార మహారాజు కు చెప్పింది. సారస్వతి జ్ఞానం మతినార మహారాజు మేథస్సును మరింత పదును చేసింది.



మతినార మహారాజు తన మేథో సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాడు. తన మేథో సామర్థ్యం కొంత పెరగటానికి సారస్వతియే ప్రధాన కారణం అని గమనించాడు. దానితో సారస్వతి మీద అనురాగం అంతకు ముందున్నదానికంటే రెట్టింపయ్యింది. తన ఎదలో సారస్వతి మీద ఉన్న అభిమానం బాధ్యతతో కూడుకున్నదని మతినార మహారాజు మనసులో అనుకున్నాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#48
సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు  సత్త్ర యాగ నియమాలను పెంచాడు..మరింత నియమ నిష్టలతో సత్త్ర యాగం చేసాడు. దానితో తన రాజ్యంలో విజ్ఞాన బలం పెరిగింది. ప్రజల ఆలోచనాధోరణి మారింది. శ్రమశక్తి పెరిగింది. ఇదంతా తెలిసిన మతి నార మహారాజు సారస్వతిలో చదువుల తల్లి సరస్వతి ని చూసాడు. సారస్వతి మీద భక్తి బాధ్యతలతో కూడిన ప్రేమాభిమానాలను పెంచుకున్నాడు.



మతినార మహారాజు మనోభావం గ్రహించిన సారస్వతి తనూ తన సోదరుడు జ్ఞాన జలం తాగి ఎలా ఎదిగింది మతినార మహారాజు కు చెబుతూ రాజుకు జ్ఞాన జలం అందించింది. సారస్వతి ఇచ్చిన జ్ఞాన జలాన్ని మతి నార మహారాజు తన రాజ్యంలోని వారందరికి అందించాడు. ప్రజలలో మహా తేజస్సుతో కూడిన శక్తి వచ్చింది. వారిలో "కరువు రక్కసిని తరిమి కొడదాం" అన్న సదాలోచన పెరిగింది.



సరస్వతీ నది అలల మీద ఏర్పాటు చేసిన సారస్వతి జన్మదిన వేడుకలకు మతినార మహారాజు,అతని అనుచరులతో పాటు వచ్చాడు.  వేడుకకు హయగ్రీవ స్వామి కూడా వచ్చాడు. జ్ఞాన స్వరూపిణి సరస్వతి హయగ్రీవ స్వామిని తన గురువుగా అందరికీ పరిచ యం చేస్తూ, "హయగ్రీవ స్వామి వేద సంరక్షకుడు. వేద జ్ఞాన తేజోవిలాసి. విష్ణు స్వరూపుడు. సుందరానంద హయగ్రీవ తేజం అంటూ హయగ్రీవ స్తోత్రం తో స్వామిని పూజించింది.



హయగ్రీవ స్వామి సరస్వతీ నది పుణ్యస్త్రీగ మారడానికి కారణం ఇలా చెప్పాడు.



"ఒకసారి దుర్వాసన మహర్షి వేద మంత్రాలను శ్రుతి మించిన ఉచ్ఛారణ తో ఉచ్ఛరించాడు. అప్పుడు సరస్వతీ నదిలోని అలలు హేళన చేసినట్లు ఎగసి పడినవి. అందుకు దుర్వాసుడు కోపించి సరస్వతీ నది.. నువ్వు మానవ కాంతవై జన్మించి ఇద్దరు బిడ్డలకు తల్లివవుదువుగాక అని శపించాడు. శాప ప్రభావం తో సర స్వతి నది ఉభయభారతి అయ్యి సారస్వతికి, సరస్వత కు తల్లి అయ్యింది.  సారస్వతి కారణ జన్మురాలు" అని  హయిగ్రీవ స్వామి చెప్పాడు. 



గుర్రపు తలతో తెల్ల ని వస్త్రాలతో తెల్లని రంగుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్న హయగ్రీవ స్వామి ని అందరూ స్తుతించారు.



అనంతరం సారస్వతి "సరస్వతీ మాత బ్రహ్మముహూర్తం లో వాగుపాసకుల నాలుక మీద ఉంటుంది. ఓం ఐం ఐం ఐం హ్రీం హ్రీం హ్రీం  సరస్వత్యైః నమః అని ప్రార్దిస్తే తల్లి కరుణిస్తుంది" అని మతినార మహారాజు కు చెప్పింది. 



సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు "శ్వేత స్వరూపిణి అయిన సరస్వతి మాత, సరస్వతి నది జ్ఞాన తేజం కనులార చూసాను. మనసార తల్లి చరణ సేవ చేసాను. మరి నీల సరస్వతీ మాత స్వరూపం ఎలా ఉంటుంది? తల్లి ని ఎలా పూజించాలి?" అని సారస్వతిని అడిగాడు.



మతినార మహారాజు మాటలను విన్న సారస్వతి, "సరస్వతీ నది పుణ్య స్త్రీగా మారి జ్ఞాన స్వరూపిణి అయ్యింది. జ్ఞాన స్వరూపిణియే నా తల్లి. ఇక నీల సరస్వతీ మాత మా అమ్మ ప్రతిరూపమే.



నీల సరస్వతీ మాత  సర్వశత్రు క్షయంకరి. భక్తులకు వరదాయిని. శత్రువుల పాలిట భయంకర నీల స్వరూపిణి. తల్లి సౌమ్య రూపంలో ఉంటుంది. క్రోధ రూపం లో ఉంటుంది. చండ రూపంలో ఉంటుంది. హూంకారమయ నీల సరస్వతి బలిహోమ ప్రియురాలు. తల్లిని మనసు పెట్టి ప్రార్థిస్తే మంచి బుద్ధిని, యశస్సు ను, కవిత్వమును ప్రసాదిస్తుంది. సరస్వతీ మాత జ్ఞానానికి, వాక్కుకు ప్రధాన దేవత అయితే నీల సరస్వతి జ్ఞానానికి అవగాహనకు ప్రధాన దేవత. నీల సరస్వతి హోమం మహోన్నత హోమం" అని నీల సరస్వతి హోమం చేసే విధి విధానాలను చెప్పింది. 



సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు నీల సరస్వతిని పూజించి మరలా సత్త్ర యాగం చేసాడు.ఇలా మతినార మహారాజు సరస్వతీ నది ఒడ్డున 12 సంవత్సరాల పాటు మహానిష్టతో సత్త్ర యాగాన్ని చేసాడు. మహారాజు చేసే సత్త్ర యాగానికి సారస్వతి  అన్ని విధాలుగా సహకరించింది. దానితో మతినార మహారాజు రాజ్యంలోని కరువుకాటకాలు సమస్తం  తొలగిపోయాయి. ప్రజలందరూ ఆనందంగా జీవించసాగారు. విషయం తెలిసి మతినార మహారాజు మిక్కిలి సంతోషించాడు. సత్త్ర యాగాన్ని ధర్మ బద్ధం గా ముగించాడు.



మతినార మహారాజు సత్త్ర యాగాన్ని ముగించే ముందు యాగాగ్ని దేవుని మనసార చూసాడు. యాగాగ్నిలో సారస్వతి నవ వధువు గా మతినార మహారాజుకు దర్శనం ఇచ్చింది.



మతినార మహారాజు జ్ఞాన స్వరూపిణి సరస్వ తిని ప్రత్యేకంగా కలిసాడు. తన సత్త్ర  యాగ ప్రయోజ నం నెరవేరిందని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి చెప్పా డు. సత్త్ర  యాగ సమయంలో సారస్వతి తనకు చేసిన సహాయం మొత్తాన్ని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి పూస గుచ్చినట్లు చెప్పాడు. యాగాన్ని లో సారస్వతి దర్శన మిచ్చిన సంగతిని కూడ చెప్పాడు . సారస్వతి తన మనసుతో ఎలా పెనవేసుకు పోయింది చెప్పాడు.



జ్ఞాన స్వరూపిణి సరస్వతి మతినార మహారాజు మాటలను విని చిరు దరహాసం తో తన సమ్మతిని తెలిపింది. అంత సారస్వతి మతినార మహారాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . . పుణ్య దంపతులకు పుట్టిన కుమారుని పేరు త్రసుడు. త్రసుని మనుమడు దుష్యంత మహా రాజు.



                    శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#49
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#50
రథంతరి                                
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-01-31-102834557.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



తను ఎన్నుకున్న విజ్ఞాన ప్రపంచ అంచులను తాకుతూ, ఆద్యాత్మిక ప్రపచంలో ఆహ్లాదంగా, నిస్వార్థంగా, నిర్మలంగ నివసించి పరవసించే ప్రతివారు మానవులకే కాదు, దేవతలకు కూడ ఆదర్శవంతంగా నిలుస్తారు. అలాంటి వారు దేవతలకు సహితం అప్పుడప్పుడు అవసర మవుతుంటారు. అలాంటి వారిని అసురులు కూడా తమ వశం చేసుకోవాలని చూస్తారు. అయితే వారు అసురులకు చిక్కరు. అలాగని వారు అసురులకు దూరంగానూ ఉండరు. వారు అత్యవసరం అనుకుంటే అసురులకు దగ్గరయ్యి అసురులలోని అసురత్వాన్ని అంత మొందించి అసురులను సురులుగ మలుస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు రథంతరి. 



ఇలను పవిత్రంగా ఉంచడానికి మహర్షులతో అనేక యాగాలు చేయించిన ఈలనుని కుమార్తె రథంతరి. ఈలనుని మహర్షులు అనేక పవిత్ర నామధేయాలతో పిలిచేవారు. కొందరు మహర్షులు ఈలనుని దీప్తివంత అంటే మరికొందరు సోమవంత అని, ఇంకొందరు హోత అని పిలిచేవారు.. వేద ధర్మాలకు అనుగుణంగా ఈలనుడు ప్రకృతిని పరిరక్షించేవాడు. భూమి మీద పుట్టి, చెట్లలో పెరిగే అగ్నిని సంరక్షించేవాడు. చెట్టులోని అగ్ని తో సురయాగాలు చేయించేవాడు. 



 పుట్టుకతోనే సోమవంత తేజంతో ప్రకాసించిన తన కుమార్తెను చూసిన ఈలనుడు మహదానంద పడ్డాడు. వశిష్టాది మహర్షుల ఆదేశానుసారం ఈలనుడు తన కుమార్తెను చేతులలో ఉంచుకుని యాగాగ్ని నడుమ నిలబడి కుమార్తెకు "రథంతరి" అని నామకరణం చేసాడు. 



 రథంతరి కిలకిల నవ్వులను చూసి ప్రకృతి పరవసించిపోయేది. లేళ్ళు చెంగు చెంగున ఎగిరేవి. కుందేళ్ళు మహదానందంతో గంతులు వేసేవి. రథంతరి కిల కిల నవ్వులకు అనుగుణంగా యాగాగ్నులు ఎగసిపడేవి. పర్ణశాలల దగ్గర పచ్చదనం కళకళలాడేది. 



 రథంతరికి ఈలనుడు తనకు తెలిసిన విద్య లన్నిటిని నేర్పించాడు. "తండ్రి తనయుని లేదా తనయ ను చూచినట్లు యాగాగ్ని చూడాలి " అని ఈలనుడు రథంతరికి నూరిపోసాడు. అలాగే తనకు తెలిసిన మహర్షులు, బ్రహ్మర్షులందరిని పిలిపించాడు. వారందరి చేత నానా విధము లైన యాగములు చేయించాడు. 



ఆయా యాగాదులు చేసే విధానం అంతటిని తన కూతురు రంథంతరి ని దగ్గరుండి చూసి నేర్చుకోమన్నాడు. రథంతరి తండ్రి మాటలను అనుసరించి మహర్షులు, బ్రహ్మర్షులు చేసే యాగాదులన్నిటిని ప్రత్య క్షంగా చూచింది. ఆయా యాగాల అంతరార్థాలను ఔపాసన పట్టింది. యాగ నైవేద్యాదులను నిరుపేదలకు పెట్టి, వారి కడుపు నింపింది. వనంలో లభించే ఔషద మొక్కలతో నిరు పేదల గ్రామాలకు వెళ్ళి వారికి వైద్యం చేసింది. 



 అనంతరం బ్రహ్మర్షులు రథంతరిని బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని ప్రోత్స హించారు. రథంతరి బ్రహ్మర్షుల మాటలను అనుసరించి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసింది. రథంతరి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేస్తుందని తెలుసుకున్న నిరుపేదలు రథంతరి తపస్సు విజయవంతం కావాలి అని వారు కూడా వారికి తెలిసిన పూజలు చేసారు. 



 బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరు కోమని రథంతరిని అడిగాడు. అప్పుడు రథంతరి, "ఆరోగ్యమే మహాభాగ్యము. అనారోగ్యమే పలు సమస్యలకు నిలయం.. కావున పదుగురి అనారోగ్యాన్ని తగ్గించే సామర్థ్యం నాకు ప్రసాదించు బ్రహ్మ దేవ. " అని వరం కోరు కుంది. 



 రథంతరి కోరికను విన్న బ్రహ్మ దేవుడు మిక్కిలి సంతోషించాడు. , "రథంతరి, నువ్వు మానవుల ఆరోగ్యాన్నే కాదు, దేవతల ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తావు. " అని రథంతరిని ఆశీర్వదించి బ్రహ్మ దేవుడు అంతర్థానమైపోయాడు. రథంతరి ఆనంద హృదయ సంద్రాన తేలియాడింది
.................... 
 త్రస మహారాజు తన కుమారుడు ఇలినుడుని తన తర్వాత రాజుగ ప్రకటించాడు. అందకు సామంత రాజులందరు సంతోషించారు. ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహారాజు మిక్కిలి సంతోషించాడు. తరంతర మహారాజు సామంత రాజులు ఇలినుడుకి గొప్ప గొప్ప బహుమతులను అందించారు. 



 సామంత రాజుల సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని ఇలినుడు గుర్తించాడు. అంత సామంత రాజులతో ఇలినుడు "సామంత రాజులారా! మీ సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని నేను గమనించాను. మా జననీజనకులు కాళింద త్రసల సాక్షిగా చెబుతున్నాను. మీ కించిత్ ఖేదమేమిటో అర్థం చేసుకు న్నాను. మన మన రాజ్యాలలో అంటు రోగాల బెడద, మూర్చ రోగాల బెడద కొంచెం ఎక్కువగానే ఉంది. దీనిని రూపు మాపడానికి మా జననీజనకులు బాగానే కృషి చే సారు. అయితే ఫలితం మాత్రం స్వల్పంగా దక్కింది. నేను సమస్యల మీదనే ఎక్కువ గా దృష్టి పెడతాను అని మీకు మాట ఇస్తున్నాను. 



 ముఖ్యంగా తురుడు, జఢుడు వంటి మన త్రు రాజులు పదిమంది వరకు ఉన్నారు. వారు మా తండ్రిగారు త్రస మహా రాజు గారిని, మా తాతగారు, త్రస మహారాజు తండ్రి గారైన మతినారు మహారాజు గారిని సమర రంగాన ఎదుర్కొనలేక వారి వారి కుటిల మనస్తత్వం గల మనుషులను మన రాజ్యాలకు పంపి మన తటాకములను, చెరువులను, కాలువలను, బావులను జలమున్న ప్రతి ప్రాంతాన్ని రసాయన లేపనాలతో కలుషితం చేస్తున్నారు. జలాన్ని తాగిన మన జనం చనిపోవడం లేదు కానీ రకరకాల అంటురోగాలకు గుర వుతున్నారు. 



 శత్రు రాజులు కొంతమంది మహా తెలివిగా ప్రవర్తి స్తున్నారు. వారికి మన ప్రజల శక్తి సామర్థ్యాల మీద, మన ప్రజల జ్ఞానం మీద ముఖ్యంగా మన ప్రజల అదృష్ట దీపికల మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే వారు ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తున్నారు కానీ వారిని చంపే ప్రయత్నాలు చేయడం లేదు. 



అనారోగ్యం తో మన ప్రజలు ఎవరైనా వారి వారి రాజ్యాలకు వెళితే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రజల శక్తి యుక్తులను, అదృష్ట దీపికలను వారు తమకు అనుకూలంగా వినియోగించు కుంటున్నారు. అయితే మన ప్రజలు అధిక శాతం మంది అనారోగ్యానికి గురైనప్పటికీ రాజ్యాన్ని వదలడం లేదు. వారి దేశభక్తి నిజంగ అద్భుతం. అమోఘం. అనిర్వచనీయం. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#51
అనారోగ్యం తో మన ప్రజలు ఎవరైనా వారి వారి రాజ్యాలకు వెళితే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రజల శక్తి యుక్తులను, అదృష్ట దీపికలను వారు తమకు అనుకూలంగా వినియోగించు కుంటున్నారు. అయితే మన ప్రజలు అధిక శాతం మంది అనారోగ్యానికి గురైనప్పటికీ రాజ్యాన్ని వదలడం లేదు. వారి దేశభక్తి నిజంగ అద్భుతం. అమోఘం. అనిర్వచనీయం. 



 ఇక మీదట శత్రు రాజుల మనుషులు మన రాజ్యాలలోకి రాకుండా మనం మరిన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. మన ప్రజలను మనం మరింత జాగ్రత్తగా కాపా డుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల విషయం లో నేను ముందుంటాను అని మీకు మాట ఇస్తున్నాను. అలాగే తురు సంహారం త్వరలోనే జరుగుతుంది అని మీకు మాట ఇస్తున్నా ను. 



ఇక మా తండ్రి గారైన త్రస మహారాజు గారి మాటలను అనుసరించి అర్హులకు తగినట్లుగా ధనమిస్తాను. యాచకులను నిరాశ పరచను. రాజసభలో మనసుకు ప్రీతి కలిగించేది, మేలైనది, ఉచితమైనది, సత్యమైనది, తీయనిది, విస్తృతం కానిది ధర్మంగా ఉండే మాటలే మాట్లాడతాను.. అలాంటి మాటలు మాట్లాడే సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాను. " అని అన్నాడు. 






 ఇలినుడి మాటలను విన్న సామంత రాజు లు, "దండితాహితవీర ! సూరినిధాన ! దానవినోద !" అని ఇలినుడిని రకరకాలుగా ప్రస్తుతిస్తూ మనఃపూర్వకము గా మహదానందం పొందారు
........... 
 రథంతరి తన ప్రాణ స్నేహితురాళ్ళు తినిస, వేదస, రథద్రువు మొదలైన వారందరితో కలిసి సోమ వనమును పెంచసాగింది. ఆకులు లేకుండా ఆకు పచ్చని సన్నని కాండంతో ఏపుగ పెరుగుతున్న సోమ వనమును చూచి రథంతరి మిక్కిలి సంతోషించింది. 



 రథంతరి " ఓమ సోమ" అంటూ సోమ మొక్కల గురించి పరిపూర్ణంగ పరిశోధన చేయసాగింది. సుషోమ, అర్జికీయ అనే ప్రాంతములలో సోమ అధికం గా దొరుకుతుంది అని తెలుసుకుంది. చెలికత్తెలతో రథంతరి సుషోమ, అర్జికీయలకు వెళ్ళింది. అక్కడి సోమ మొక్కల సువాసనకు రథంతరి తనువు మైమరచిపోయింది. ఆమెకు తన ఆయుష్షు మరో నాలుగు సంవత్స రాలు పెరిగిందా? అని అనిపించింది.



 రథంతరి సోమ తీగల నుండి వచ్చే తెల్లని పా లను చూసింది. అలాగే సోమ తీగలకు ఉన్న తెల్లని పువ్వులను, ఆకు పచ్చని పువ్వులను చూచింది. అంత చెలికత్తెలతో, "చెలికత్తెలారా! సోమ రసం అంటు వ్యాధులను పోగొడుతుంది. మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది. మంచి నిద్రను కలిగిస్తుంది. శరీరం మీద ముడుతలను తగ్గిస్తుంది. యౌవన శోభను పెంచుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులను నిరోధిస్తుంది. సోమ రసం ను మరి కొన్ని ఔషదాలతో కలిపితే అది మరిన్ని వ్యాధులను తగ్గిస్తుంది. మానవుని మాధవునిగ మలుస్తుంది. ఇలాంటి పవిత్ర ఔషద సంపదను మనం ముందు యుగాలవారికి అందించాలి. " అని అంది. 



రథంతరి మాటలను విన్న తినిస, " చెలీ రథంతరి, ముం దు యుగాలవారు ఇలాంటి ఔషదాలు ఉన్నాయంటే అసలు నమ్ముతారా?" అని అడిగింది. 



" నమ్మకపోవచ్చు. అయితే వారు పరిశోధనలు చేసి చివరికి మొక్కల దగ్గరకే వస్తారు. కంటికి కనపడే దానిని ఎవరైనా సరే నమ్మి తీరాల్సిందే. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా వైద్య పరిశోధనలు చేసే వారిని సతతం ప్రశంసించాల్సిందే.. 



మాయ మాటలతో, మాయ మందులతో మనుషులను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. గంధర్వులు సోమ రసం గురించి అధికంగా ప్రచారం చేస్తుంటారు. వారికి మనలాంటి వారు కూడా తోడుంటే వైద్య పరంగా మానవాళికి మనం చేయగలిగిన ఉపకారం మనం చేసినట్లవుతుంది. " తినిసతో రథంతరి అంది. 



 పసుపు రంగు కాండం తో ఉన్న సోమ మొక్కలు గురించి రథంతరి ఎక్కువగా పరిశోధనలు చేసింది. ఆమె పెంచే సోమవన సంరక్షకులుగా రథగుప్తి, రథన కుడ్యలు వంటి వారు ఉన్నారు. వారంతా ఆమె తండ్రి ఈలనుని ఆంతరింగికులు. 



 రథంతరి పవిత్రమైన సోమ మొక్కలు మరి కొన్ని కావాలని బ్రహ్మ దేవుని కోరింది. సుర డేగల ద్వారా బ్రహ్మ దేవుడు రథంతరికి సోమ మొక్కలు పంపాడు. 



 రథంతరి తన వనంలో పెరిగిన సోమ మొక్కల కాండములను పరిశీలించింది. చంద్ర కిరణాలతో ఊపిరి పోసుకున్న హిమరాయితో వాటిని చంద్రశిల మీద నూరింది. అంత లేపనములో శ్రేష్టమైన మేకపాలను కలిపింది. ద్రవాన్ని నల్లమట్టితో తయారు చేసిన కుండ లో ఉంచింది. కుండను హోమాగ్ని నడుమనున్న త్రిభుజాకార తిన్నె మీద ఉంచింది. కుండలోని ద్రవం గట్టి పడింది. ద్రవాన్ని మూర్చ పోయిన మేక మీద ప్రయో గించింది. 



లేపన ప్రభావంతో నాలుగు నిమిషాలలో మేక మూర్చ తగ్గిపోయింది. ఆపై మనిషి మీద ప్రయోగించింది. కొందరు మూర్చ పోయిన మనుషులకు లేపనం పని చేసింది కానీ అందరికీ పని చేయలేదు. అంత రథంతరి లేపనములో మరికొన్ని మూలికలను కలిపింది. 



 రథంతరి తినిస, వేదసల సహాయంతో సోమ వనంలో చిన్న సరసును ఏర్పాటు చేసింది. పున్నమి వెన్నెలలో కొన్ని సోమ మొక్కలనుండి స్రవించే సోమ రసం సరసు లోని జలములో ప్రవహించేటట్లు చేసింది. సరసులో జలకాలాడేవారి చర్మవ్యాధులు సమస్తం పోసాగాయి. పాలరాతీతో నిర్మించిన సరసును రథంతరి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించేది. రథంతరి తయారు చేసిన సోమ లేపనము మూ ర్చరోగులకు బాగా పని చేయసాగింది.
......... 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#52
ఇలినుడు తురు రాజు మీద యుద్దం ప్రకటించాడు. తురు రాజు, అతని సైన్యం తమ రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెరువులలో శత్రువుల నిమిత్తం రకరకాల విషపూరిత మత్స్యముల వస్త్ర ధారణతో తిరగ సాగారు. తురురాజు వ్యూహాన్ని గమనించిన ఇలినుడు చేపలు పట్టు గాలపు ముల్లుల వస్త్ర ధారణ తో తన సైన్యాన్ని చెరువులలోకి దింపాడు. తను పెద్ద గాలపు ముల్లు వస్త్రాన్ని ధరించి, వలతో చెరువులోకి దూకాడు. 



ఇలినుడు రూపాన్నిచూచి తురు హడలిపోయాడు. చెరువుల్లో సమరం భయంకరంగా జరిగింది. కడకు తురు సైన్యంలో ఎక్కువ భాగం చనిపోయింది. కొనవూపిరితో ఉన్న సైన్యం గాలాలకు చిక్కింది. కొనవూపిరితో తురు రాజు ఇలినుడు వలలో పడ్డాడు. ఇలినుడు వలను చెరువు గట్టు మీదకు విసిరాడు. వలలోనే తురు రాజు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇలా తన శత్రువులైన అయిదు మంది రాజులను ఇలినుడు సంహరించాడు. 



 ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహా రాజు ఇలినుడి విజయాలను ప్రశంసించడానికి ఇలినుడి రాజమందిరానికి వచ్చాడు. తరంతర మహారాజును తగిన విధంగా ఇలినుడు ఆహ్వానించాడు.



 తరంతర మహారాజు ద్వారా రథంతరి సోమ వన మొక్కల గురించి, ఆమె వైద్యం గురించి ఇలినుడికి తెలిసింది. రథంతరిని ప్రత్యేకంగా కలవాలని ఇలినుడు తరంతర మహారాజు తో అన్నాడు. 



 ఒకనాడు బృహస్పతి రథము నీతి ఘోషము రథంతరి పర్ణశాల ముందుకు వచ్చి ఆగింది. అందులో బృహస్పతి శిష్యులు ఉన్నారు. వారంతా మూర్చరోగులని గ్రహించిన రథంతరి వారందరికి మంచి లేపనమును అందించి వారిని రోగ విముక్తులను చేసింది. అలాగే విష్ణువు రథము శతానందం మీద కొందరు మూర్చ రోగులు రథంతరి పర్ణశాలకు వచ్చి వారు రోగ విముక్తులు అయ్యారు. 



 రథంతరి దేవతలకు సహితం వైద్యురాలు అయ్యిందని తెలిసిన అసురగణం, " రథంతరిని మచ్చిక చేసుకుని ఆమె వైద్యం మనకు ఉపయోగపడేటట్లు చెయ్యమని" అసురి అనే రాక్షసిని రథంతరి దగ్గరకు పంపింది. అసురి రథంతరి దగ్గరకు వచ్చింది. తన మంత్ర తంత్ర విద్యలన్నిటిని రథంతరి ముందు ప్రదర్శించింది. తను వచ్చిన పనిని తెలియచేసింది. 



అప్పుడు రథంతరి, " చూడు అసురి.. వైద్యమనేది మహత్తరమైన కళ. దానిని స్వార్థ చిత్తంతో చేస్తే సరైన ప్రయోజనం దక్కదు. 



ఇక సోమ రస వైద్యం పదుగురికి ఉపయోగపడే వారికే ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ముందుగా అసురత్వాన్ని వదులుకో " అని అంది. 



 రథంతరి మాటలను అసురి పట్టించుకోకుండా, రథంతరి దగ్గర ఉన్న కొంత సోమ రసాన్ని తన వంటి మీదన ఉన్న పుండుల మీద పోసుకుంది. వెంటనే సురి దేహం మీదన ఉన్న పుండ్లునుండి అగ్ని పుట్టింది. మంటలను తట్టుకోలేక అసురి తనని రక్షించమని రథంతరి కాళ్ళ మీద పడింది.



 రథంతరి త్రికరణ శుద్ధిగా భగవంతుని ధ్యానించి సోమ రసం ను అసురి మీద చల్లింది. అసురి శరీరం మీద ఉన్న మంటలు తగ్గాయి. పుండులు తగ్గలేదు.



 అసురి రథంతరి మాటలను అనుసరించి వేదా భ్యాసం చేసింది. నిరుపేదలకు శ్రమదానం చేసింది. పరోపకార గుణంతో మెదలసాగింది. అప్పుడు రథంతరి అసురి దేహం మీద ఉన్న పుండ్లుకు సరైన సోమ రసం ఇచ్చింది. అసురి శరీరం తేజోవంతంగా మారింది. ఆపై అసురి రథంతరి స్నేహితురాలిగా ఉండిపోయింది. 



 తరంతర మహారాజు ఆధ్వర్యంలో శ్వావ్యాస మహర్షి ప్రజా క్షేమ యాగాలకు శ్రీకారం చుట్టాడు. యాగాలను రథంతరి నేతృత్వంలో జరిపిస్తే బాగుంటుంది అని తరంతర రాజు శ్వావ్యాస మహర్షి తో అన్నాడు. అందుకు శ్వావ్యాస మహర్షి అంగీక రించాడు. 



 తరంతర రాజు రథంతరిని ప్రత్యేకంగా కలిసాడు. శ్వావ్యాస మహర్షి యాగాల సంగతిని రథంతరికి చెప్పా డు. రథంతరిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. రథంతరికి ప్రత్యేకంగా పద్మ యాగ రథాన్ని ఏర్పాటు చేసాడు. అదే సమయంలో తరంతర మహారాజు ఇలినుడు గురించి కూడా రథంతరికి చెప్పాడు. ఆపై ఇలినుడిని సాదరంగా ఆహ్వానించి తీసుకురండి అని తరంతర మహారాజు ఆంతరంగిక సచివుని పంపాడు. 



 యాగానికి రథంతరితో పాటు అనేకమంది మహర్షులు, రాజులు వచ్చారు. తరంతర మహారాజు అందరిని సాదరంగా ఆహ్వానించాడు. తరంతర మహా రాజు ఇలినుడుకు రథంతరిని పరిచయం చేసాడు. 



 ఇలినుడు రథంతరి విజ్ఞానం గురించి రథంతరి ని అడిగి తెలుసుకున్నాడు. ఆపై తన రాజ్యంలో ఉన్న మూర్చ రోగాలగురించి, జల కాలుష్యం గురించి రథంతరికి చెప్పాడు. రథంతరి ముందుగా జలంలో కలపాల్సిన సుగంధ దినుసులు గురించి చెప్పింది. ఆపై సరోవరాల సమీపాన చేయవలసిన యాగాల గురించి చెప్పింది. 



  యాగానికి ఇలినుడి రాజ్యం నుండి రథవీతి  మహర్షి తన కూతురు తో సహా వచ్చాడు. అలాగే దేవేంద్రాదులు కూడా వచ్చారు. యాగ సమయంలో స్వల్ప అనారోగ్య సమస్య వలన దేవేంద్రుడు మూర్చ పోయా డు. అప్పుడు వశిష్ఠుని కోరిక మేర రథంతరి దేవేంద్రుని మూర్చకు మందు ఇచ్చింది. దేవేంద్రుడు యథాస్థితికి వచ్చాడు. 



 రథవీతి కుమార్తెకు చాలా కాలం నుండి వివాహం కావడం లేదని అక్కడివారందరికి తెలుసు. అందుకు కారణం మూర్చరోగం. రథవీతి కుమార్తె ను చూచిన శ్వావ్యాస మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. అందుకు రథవీతి మహర్షి తనను కుమార్తె మూర్చ రోగం గురించి చెప్పి, తన కుమార్తె ను వాంఛించవద్దని శ్వావ్యాస మహర్షి కి చెప్పాడు. 



 రథంతరి రథవీతి కుమార్తె గురించి తెలుసుకుంది. ఆమెకు " ఓమ సోమ.. సోమ సోమ ప్రభావే సర్వ సూక్ష్మ క్రిమి సంహార.. అంటూ చక్కని మందు ఇచ్చింది. 



 అనంతరం రథంతరి కోరిక మీద రథవీతి మహర్షి తన కుమార్తె ను శ్వావ్యాస మహర్షి కి ఇచ్చి వివాహం చేసాడు. తన రాజ్యంలోని రథవీతి కుమార్తె కు వివాహం అయినందుకు ఇలినుడు మిక్కిలి సంతోషించాడు. అందుకు ప్రధాన కారణం అయిన రథంతరిని పలు రీతుల్లో స్తుతించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#53
 తన రాజ్యంలో గోసంపదను జఢు సైన్యం తమ రాజ్యానికి మళ్ళిస్తుంది అని ఇలినుడికి తెలిసిం ది. ఇలినుడు వెంటనే గో సంరక్షణకు బయలు దేరాడు. అప్పుడు రథంతరి " ఇలిన మహారాజ! అమానుషంగా, అక్రమంగా, ఆహవనీతి రహితంగ వ్యవహరించేవారికి ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెబితే బాగుంటుంది. గోటితో తీసివేయడానికి అనుకూలంగా ఉన్న శత్రు సైన్యానికి గొడ్డలిని ఉపయోగించవలసిన పనిలేదు. మీ రాజ్యంలో యజుర్వేద తేజంతో ప్రకాశించే మేకలు అనేకం ఉన్నాయి కదా? అవే మీ గో సంపదను రక్షిస్తాయి. మీ మేకలను ఒకచోటకు చేర్చండి. " అని అంది రథంతరి. 



 తన రాజ్యంలో ఉన్న మేకలన్నిటిని ఒక చోటకు తీసుకురమ్మని ఇలినుడు సైనికులను ఆజ్ఞాపించాడు. వారు ఇలినుడు చెప్పింది చేసారు. 



 రథంతరి యజుర్వేద మంత్రాలను చదువుతూ మేకలన్నింటికీ సోమ రసం పట్టించింది. మేకలన్నీ జఢు సైన్యం మీద దాడి చేసాయి. ఎడమ చేత కర్ర పట్టుకుని మేక ముఖంతో ఉన్న యజుర్వేద పురుషుడు సమర రంగాన ఆవిర్భవించాడు. 



 రథంతరి మహర్షులతో కలిసి యజుర్వేద మంత్రాలను ఆలపించసాగింది. పసుపు రంగు తేజస్సుతో మేకలన్నీ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాయి. అలాగే మేక ముఖంతో ఉన్న దక్ష ప్రజాపతి యజుర్వేద పురుషునికి నమస్కరిస్తూ సమర రంగంలో నిలబడి శత్రువులను చీల్చి చెండాడాడు. 



రథంతరి కోరిక మేర అసురి జఢు సైన్యం లో ఉన్న అసురులందరిని మట్టి కరిపించింది. 



 జఢుడు సమర రంగాన మరణించాడు. జఢు సైన్యం భయంతో సమర రంగాన్ని వదిలింది. రథంతరి ఇలినుడు యజుర్వేద పురుషునికి, దక్ష ప్రజాపతి కి సాష్టాంగ పడి నమస్కరించారు. 



 అనంతరం పెద్దల మునుల కోరికను అనుసరించి ఇలినుడు రథంతరి వివాహం చేసుకున్నారు. 



వివాహానికి యజుర్వేద పురుషుడు, దక్ష ప్రజాపతి కూడా వచ్చారు. దక్ష ప్రజాపతి అక్కడి వారందరికి తన కుమార్తె సతీదేవి వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసాడు. 



 భర్త మాటలను అనుసరించి రథంతరి కాలుష్యమైన పురిష్టీ నదిని పరిశుభ్రం చేసింది. శృతకవన, వృద్ద, దహ్య అను పేర్లు కలవారు పురుష్టీ నదిలో స్నా నం చేసి తమ అంటు రోగాలను పోగొట్టుకున్నారు. రథంతరి పురుష్టీ నదిలోని నీటిని సోమ రసంతో ప్రతి రోజూ పరిశుభ్రంయించేది. 



పదిరోజులకు ఒక పర్యాయం నదిలోని నీటిని మార్పించేది. రాజ్యంలోని సమస్త నదీ తటాకాదులలోని జలాన్ని రథంతరి పరిశుభ్రం చేయించింది. రథంతరి కృత్రిమ మరుత్తుల సృష్టి చేసింది. అందుకు ఆమెకు తోడుగా అసురి, వేదస, తినిస వంటి ఆమె స్నేహితురాళ్ళు ఉన్నారు. దానితో ఇలినుని రాజ్యంలో వాయు కాలుష్యము తగ్గింది. ఇలా ఇలిన ర్మపత్నిగా రథంతరి మరింత పేరు ప్రతిష్టలను తెచ్చుకుంది. 



 రథంతరి మాటలను అనుసరించి ఇలినుడు తన రాజ్యంలోని దేవాలయాల దగ్గర సోమరస గానుగలను ఏర్పాటు చేయించాడు. సోమ రసం మానవుని మాధవునిగా మలుస్తుందని ప్రచారం చేయించాడు. తన రాజ్యంలోని వారందరిచేత ఋగ్వేదం లోని ఏడవ మండలాన్ని వల్లెవేయించాడు. 



 జఢుని సోదరుడు ఇలినుడు రాజ్యం మీదకు అసుర పక్షులను పంపాడు. అది గమనించిన రథంతరి అసుర పక్షులకు అడ్డంగ పెద్ద పెద్ద దుంగలను అసురి చేత అడ్డు పెట్టించింది. దుంగలను చీల్చుకు వెళ్ళే విషసూదులను సైన్యం తో ప్రయోగింప చేసింది. 



సూదులు దుంగలను చీల్చుకుంటూ వెళ్ళి అసురపక్షులను జఢుని సోదరుని చంపేసాయి. శత్రు రాజులందరు మరణించినందకు ఇలినుడు మహదానందపడ్డాడు. అలాంటి రథంతరి ఇలినుడుల కుమారుడే దుష్యంతుడు. పుణ్య దంపతులకు దుష్యంతునితో పాటు సూర, ప్రస , భీమ, వసు అనే సంతానం కూడ ఉన్నారు. 



 దుష్యంతుడు సోమ మొక్కల పెంపకం విషయంలో ఎక్కువ శాతం తల్లి రథంతరితోనే గడిపే వాడు. రథంతరి కుమారునితో, " నాయన దుష్యంత! నిరంతరం జ్ఞానం కలవారి చరితలను అభ్యసించాలి. సజ్జన సాంగత్యం తో కదలకుండా ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరిచిపోకుండా క్రమం తప్పకుండా అనుసరించాలి. సద్గుణాలున్న సోదరులను, బంధువులను అభిమానించాలి. " అని అనేక ధర్మా ధర్మాల తారతమ్యాలను తెలియచేసేది. 



 దుష్యంతుడు చిన్న తనం నుంచే అడవులలో పులుల ను సింహాలను వేటాడి పట్టుకునే వాడు. వాటిని మచ్చిక చేసుకునే వాడు. గాయపడ్డ వాటికి మందులు ఇచ్చేవాడు. ఆపై సమస్త విద్యలను అభ్యసించి రాజయ్యాడు.



సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#54
కథ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#55
యశోధర
[font=var(--ricos-font-family,unset)] [/font]
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-02-07-130826463.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు






ప్రస్థలను రాజధానిగా చేసుకుని త్రిగర్త రాజ్య భువనాధీశుడు యశోపిత త్రిగర్త రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె యశోధర. యశోధర పేరుకు తగినట్లుగా రాజనీతి, కుటుంబనీతి, సమాజ నీతి, వేద పురాణేతిహాస నీతి, మనునీతి, మానవనీతుల మూలాలెరిగి మసులుకునే పరిపూర్ణ విజ్ఞానవంతురాలు. మహా యశస్సు కలిగిన ధైర్యవంతురాలు. సుపరిపాలన దక్షత కలిగిన సుశిక్షుతురాలు. యశోధర దుర్జనుల పాలిట సింహ స్వప్నం. సజ్జనుల పాలిట ఆపన్న హస్తం. పరోప కారుల పాలిట పరమామృత తేజం. 



 యశోధర పితృ దేవుని ఆదేశానుసారం ఎల్లవేళలా మూడు నదులు ప్రవహించే త్రిగర్తను సుసంపన్నం చేయసాగింది. అవకాశవాద ధర్మాన్ని అనుసరించేవారి మెడలు వంచేది. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మంచి మార్గాన కష్టపడేవారిని యిష్టంగా అభిమానించేది. 



 ఒకానొకప్పుడు విపాసా నది సమీపాన ఉన్న జన నిశ గ్రామం దేవతా సంచారానికి బహుదూరంగ ఉండేది. అక్కడివారు యజ్ఞయాగాదులు అంటే అసహ్యించు కునేవారు. విచ్చలవిడితనమంటే మహా యిష్టపడేవారు. పర సంపదను, పర స్త్రీలను అపహరించడమే ప్రధా కర్తవ్యంగా భావించేవారు. దైవ ధూషణంటే అదే ధర్మ పథం అనేవారు. 
 త్రిగర్త రాజ్యాన్ని ఆనుకుని ఉన్న జననిశ గ్రామం వంక చూడటానికే దేవతలు సహితం భయపడుతున్నారు అని తెలుసుకున్న యశోధర సుసైన్యంతో జననిశ గ్రామం వెళ్ళింది. ఆమె సుసైన్యంలో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. అందు సంసప్తక బృందం కూడా ఉంది. చేసిన ప్రతిజ్ఞ నుండి ఏనాడూ వెను తిరగని సంసప్తక బృందం జననిశ గ్రామం లోని రాక్షస భావ జాలం కలవారినందరిని సూక్ష్మ వలయ సమరం లో మట్టి కరిపించింది. అప్పుడు యశోధర కత్తి పట్టనవసరం లేకపోయింది. 



 యశోధర జననిశ గ్రామ వాసులతో, "మహా జనులారా! యజ్ఞ యాగాదుల వలన ప్రకృతి సంరక్షింప బడుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి. పాడి పంటల తో గ్రామం పచ్చగా ఉంటుంది. 



అప్పుడు గ్రామ దేవతల కరుణ పుష్కలంగా ఉంటుంది. 
దేవతా సంచారం గల ప్రాంతంలో హింస తగ్గుతుంది. అలాంటి పవిత్ర ప్రాంతాల్లో మహోన్నత మానవ శక్తి మాధవ శక్తిగా ఎదుగుతుంది. మహోన్నత గమ్యం మన కళ్ళముందు తారాడుతుంది. కాబట్టి మీరు మారండి. రక్కస భావాలకు తిలోదకాలు వదలండి. మీకు నేను ఎల్లప్పుడూ దండిగా అండగా ఉంటాను. " అని ప్రజల మనసుకు నాటుకునేటట్లు చెప్పింది. 



జననిశ గ్రామం నడుమ మత్స్యకూర్మవరాహవామనాది యజ్ఞ వేదికలను నిర్మింప చేసింది. వేదికల నడుమ పద్మ వేదికను నిర్మింప చేసింది. యజ్ఞ వేదికలకు తన యశస్సును కొంత ధార పోసి అక్కడ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసింది. 



 యశోధర త్యాగానికి సంతసించిన దేవతలు జననిశ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. అక్కడి జనంలో సాత్వికత ఎదిగేటట్లు చేసారు. దానితో యశోధర కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. 



 యశోధర కీర్తి ప్రతిష్టలకు తగిన వరుని తీసుకువచ్చి, ఆమె వివాహం చేయాలని ఆమె తండ్రి యశోపిత దేశదేశాల నుండి యువ రాజుల చిత్ర పటాలను తెప్పించి, వాటిని ప్రత్యేక మందిరాన ఏర్పాటు చేసాడు. ప్రశాంత సమయంలో పెళ్ళి కొడుకుల చిత్ర పటాలున్న గదిని సందర్శించమని యశోపిత తన కుమార్తె యశోధరకు చెప్పాడు. యశోధర తండ్రి ఆనతిని శిరసా వహించింది. తన చెలికత్తెలతో చిత్ర పటాలను తిలకించి చిలిపి కవితలను అల్లింది. 



 చంద్రవంశ రాజు భరతుని వంశాన జన్మించిన సుహోత్రుడు తన కుమారుడు హస్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేసాడు.. పట్టాభిషేకానికి అంగ వంగ కళింగ కాంభోజ టేంకణ పుళింద బాహ్లీక విదర్భ విదేహ సాళ్వ సింధు మత్స్య గాంధార అంబష్ఠ మల్ల చేది వత్స త్రిగర్తాది అనేక రాజ్యాల రాజులు, సామంతులు హాజరయ్యారు. 



పట్టాభిషేక మహోత్సవానికి త్రిగర్త రాజ్య రాజు యశోపిత, యువరాణి యశోధర ఆమె ముఖ్య అనుచర గణం, ప్రాణ స్నేహితురాళ్ళు సత్య ధర మొదలైనవారు, వారికి సంబంధించిన బంధుగణం కూడ హాజరయ్యింది. 



 యశోధర హస్తి మహారాజు పట్టాభిషేకం కు హాజరవ్వడమే కాకుండా సుహోత్రుని అభ్యర్థన మేరకు తమ నృత్య కళాకారిణులతో త్రిగర్త, విహంగ, అచల వ్యూహాల నృత్యాలను చేయించింది. అక్కడి వారందరినీ ఆనందింప చేసింది. యశోధరే ఆయా నృత్యాల రూప కల్పన చేసింది. అందుకు హస్తి మహారాజు యశోధర ను ప్రత్యేకంగా అభినందించి సన్మానించాడు. సన్మాన సభను చూచిన రాజులందరు యశోధరను పలు రీతుల్లో అభినందించారు.
 
పదనెక్కిన చురకత్తుల ప్రతాపజ్వాలల ప్రభ, మహోన్నత మానవీయ సహృదయ గౌరవ మర్యాదల ప్రభల నడుమ యశసిస్తున్న హస్తి మహారాజు ముఖాన్ని చూచిన యశోధర "హస్తి మహారాజు కారణ జన్ముడు. చరిత్ర.. కాదు కాదు.. యుగయుగాల చరిత్ర శాశ్వతంగా గుర్తు పెట్టుకునే పని ఏదో ఒకటి చెయ్యడానికే భారత దేశాన హస్తి మహారాజు జనించాడనిపిస్తుంది" అని మనసులో అనుకుంది. 



పట్టాభిషేక మహోత్సవం కు వచ్చినవారందరికి సుహోత్రుడు ప్రత్యేక విడిది మందిరాలను ఏర్పాటు చేసాడు. హస్తి మహారాజు తల్లి సువర్ణాదేవి యశోధరకు ప్రత్యేక విడిది మందిరం ఏర్పాటు చేసింది. విడిది మందిరం దేవేంద్ర లోక మందిరాలను మించిన అందం తో కళకళలాడుతుంది. విడిది మందిరాన్ని చూచిన యశోధర ప్రాణ స్నేహిరాలు సత్యధర, "చెలి యశోధర, ఇలాంటి విడిది మందిరాలను మనం దేవేంద్ర లోకాదులలో చూడగలమేమో గానీ భూలోకంలో మాత్రం చూడలేం కదా?" అని యశోధరతో అంది. 



"నిజం చెప్పావు సత్యధర. హస్తి మహారాజు తండ్రి సుహోత్ర మహారాజు వంద రాజ సూయాగాలు పైగా చేసారు. అలాగే లెక్కకు మించిన అశ్వ యాగాదులను చేసారు. గజబలాన్ని, అశ్వ బలాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. తన రాజ్య ప్రజల గృహాలను పసిడిమయం చేసారు. రాజ్య పటిష్టత కోసం అనేక పథకాలను అమలు చేసారు. ఇలా ప్రజలను ప్రకృతిని సంరక్షిస్తూ దేవ గణాన్ని సంతృప్తి పరిచారు. సుహోత్రుడు ప్రజలకు పంచిన సంపదలు వారి వారి కుటుంబాలకు రెండు తరాలకు మించి సరిపోతాయి. అలాంటి సుసంపన్న రాజ్యాన్ని కొడుకు హస్తి మహారాజు కు అప్పగించారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#56
హస్తి మహారాజు చూడ చూడ తండ్రికి మించిన తనయుడు లాగా కనపడుతున్నాడు. హస్తి మహారాజు ఉదారుడు. ఉన్నతుడు. ఉర్వీపతి. హస్తి మహారాజు చిన్నప్పుడే సాధు జంతువులతో ఆడుకున్నంత చనువుగా కౄర జంతువులతో కూడా ఆడుకునేవాడని ఇక్కడి వారంతా చెబుతున్నారు. పులుల మీద సింహాల మీద స్వారీ చేసిన హస్తి మహారాజు ఒకసారి జలచరమైన మొసలి మీద కూడా సంచరించాడట. ఇలాంటి మహోన్నతుల ఏలుబడిలో మందిరాలు ఇలా కాక మరెలా ఉంటాయి? అదిసరే, హస్తి మహారాజు నన్ను సన్మానిస్తున్నప్పుడు వారి సామంత రాజు నిశానుని ముఖమును గమనించావా?" సత్యధరని అడిగింది యశోధర. 



"గమనించలేదు. ఏం?.. నీ సన్మానం ను చూచి నిశానుడు
కళ్ళతో నిప్పులు చిమ్మాడా ? తనలో తాను కుళ్ళుకు న్నాడా?" అని యశోధర ను అడిగింది సత్యధర. 



"ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం, కుళ్ళుకోవడం వంటివి కొందరు రాజుల సహజ గుణం. వాటిని మనం అంత తీవ్రంగా తీసుకోరాదు. కానీ నేను నిశానుని ముఖం లోని వికారాలన్నీ గమనించాను. అతను హస్తి మహారాజు కు ఏదో ప్రమాదం తలపెట్టాలనే దుర్బుద్ధి తో ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. అతగాడు రాత్రి హస్తి మహా రాజు కు ఏదో అపాయం తలపెట్టేటట్లు ఉన్నాడని నా మనసు నాకు చెబుతుంది. " అని సత్యధరతో అంది యశో ధర. 



"అయితే మనమిప్పుడు ఏం చేద్దాం?" రాణి యశోధరను ప్రశ్నించింది సత్యధర. 



"హస్తి మహారాజు మాతృమూర్తి సువర్ణాదేవి మనకు అంతఃపురం లోని అన్ని మందిరాలను చూపించింది కదా ? మనం కొంత సమయం గడిచిన పిమ్మట హస్తి మహారాజు మందిరానికి వెళ్దాం" అంది యశోధర. 



"అలాగే" అంది సత్యధర. 



 కొంత సమయం గడిచిన పిమ్మట యశోధర మారు వేషంలో సత్యసేన తో హస్తి మహా రాజు మందిరం దగ్గరకు వెళ్ళింది. ఆద మరిచి నిద్ర పోతున్న హస్తి మహారాజు ను చంపడానికి సిద్దమైన నిశానుని యశోధర చూసింది. నిశానుని గుండెల మీదకు పదునైన బాకును విసిరింది. బాకు వలయాకారంగా తిరుగుతూ వెళ్ళి, నిశానుని గుండెను చీల్చుతూ, అతని గుండెల్లో దిగబడింది. బాకుకున్న కాలసర్ప విషం నిశానుని శరీరంలో చొరబడింది. ఒక కన్ను ఎర్రబడగ, మరో కన్ను పచ్చబడగ నిశానుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. 



హస్తి మహారాజు నిద్రలేచి జరిగిందంత తెలుసు కున్నాడు. నిశానుని కళేబరాన్ని, కన్నులను చూసాడు. మిక్కిలి సంతోషించాడు. యశోధరను తగిన రీతిలో సన్మానించాడు. 
 సువర్ణాదేవి, సుహోత్రుడు యశోధర తలిదండ్రులను కలిసారు. అనేకానేక విలువైన కానుకలను సమర్పించారు. యశోధరను తమ యింటి కోడలిని చేయమని ప్రార్థించారు. 



 యశోపిత వరుల చిత్ర పటాలున్న గదికి సవర్ణాదేవిని, సుహోత్రుని తీసుకువెళ్ళాడు. గదిలో అన్ని చిత్ర పటాల నడుమ ప్రత్యేక పూజలందు కుంటున్న హస్తి మహారాజు చిత్ర పటాన్ని సువర్ణాదేవి సుహోత్రుడు చూసారు. మిక్కిలి ఆనందపడ్డారు. యశోధర మనసులోని అభిప్రాయాన్ని గమనించారు. 



 యశోధర హస్తి మహారాజుల వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. యశోధర హస్తి మహారాజు వివాహం జరిగిన విధానం సమస్తం గమనించిన కొందరు వారిది, "బ్రాహ్మ" వివాహం అంటే మరికొందరు కాదు కాదు యశోధర తలిదండ్రులు యిచ్చిన గోవులతో గో పూజ చేయడం జరిగింది కావున వారిది "ఆర్ష" వివాహం అని అనేవారు. 



ఇంకొందరు అదేం కాదు కాదు వారి వివాహం లో ప్రాజాపత్యం ఉంది. ఆసురం ఉంది. నిజం చెప్పాలంటే వారిది గాంధర్వ వివాహం అనేవారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు యశోధర హస్తి మహా రాజుల వివాహం గురించి చెప్పుకునేవారు. 



యశోధర హస్తి మహారాజు కొంత కాలం హిమాలయాది పుణ్య ప్రదేశాలను సందర్శించారు. అక్కడి మహర్షుల, రాజర్షుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అటు పిమ్మట తమ తమ సాటి రాజుల సామంత రాజుల రాజ్యాలలో ఉన్న రాజధానులను, దేవళాలను, వింత కట్టడాలను సందర్శించారు. ఆయా రాజుల అతిథి మర్యాదలను వినయంతో స్వీకరించారు. ఆయా రాజులు చేసిన యజ్ఞయాగాదులలో పాలు పంచుకున్నారు. కొందరు సామంత రాజులకున్న సమస్యలను తీర్చారు. 
...
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#57
(25-01-2025, 01:16 PM)k3vv3 Wrote: జ్ఞాన స్వరూపిణి సరస్వతి మతినార మహారాజు మాటలను విని చిరు దరహాసం తో తన సమ్మతిని తెలిపింది. అంత సారస్వతి మతినార మహారాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . . పుణ్య దంపతులకు పుట్టిన కుమారుని పేరు త్రసుడు. త్రసుని మనుమడు దుష్యంత మహా రాజు.



                    శుభం భూయాత్ 

K3vv3 garu!!! చాలా చక్కగా విశదీకరిస్తున్నారు!!! బాగున్నదండి.


clps clps clps
Like Reply
#58
(06-01-2025, 10:08 AM)k3vv3 Wrote:  నహుషుడు శాప విముక్తుడయ్యాడని తెలిసి ప్రియంవద నహుషుని కలిసింది. ప్రియంవద నహుషులు ఇద్దరూ స్వర్గాన్ని చేరారు. 



 శుభం భూయాత్ 

Nice and Inormative, K3vv3 garu!!!

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#59
(07-02-2025, 01:11 PM)k3vv3 Wrote: యశోధర హస్తి మహారాజు కొంత కాలం హిమాలయాది పుణ్య ప్రదేశాలను సందర్శించారు. అక్కడి మహర్షుల, రాజర్షుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అటు పిమ్మట తమ తమ సాటి రాజుల సామంత రాజుల రాజ్యాలలో ఉన్న రాజధానులను, దేవళాలను, వింత కట్టడాలను సందర్శించారు. ఆయా రాజుల అతిథి మర్యాదలను వినయంతో స్వీకరించారు. ఆయా రాజులు చేసిన యజ్ఞయాగాదులలో పాలు పంచుకున్నారు. కొందరు సామంత రాజులకున్న సమస్యలను తీర్చారు. 
...

Nice to know!   Namaskar to the original authors and k3vv3 garu!!!

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#60
ధన్యవాదములు కేప్టెన్ గారు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: