Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
[font=var(--ricos-font-family,unset)] [/font]
"అవునమ్మా!.. నీకు ఆ హక్కు వుంది" నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ.
"ఆఁ.. దీని అబ్బకేమో మనమీద పంతం, పగ, దీనికేమో మన మీద.." లావణ్య ముగించకముందే..
"వల్లమాలిన ప్రేమ, అభిమానం, ఇదే కదా అత్తయా మీరు చెప్పాలనుకొన్నది!" కాటుక కళ్ళను చిత్రంగా త్రిప్పుతూ ఒక్కక్షణం ఈశ్వర్ ముఖంలోకి చూచి చెప్పింది దీప్తి చిరునవ్వుతో.
"బావా! నేను జోక్గా అనలేదు ఢిల్లీ టిక్కెట్ విషయం. నేను ఢిల్లీకి వెళ్ళాలి. నాకూ టికెట్ బుక్ చేయండి."
"నీకేం పనే ఢిల్లీలో!.." అడిగింది లావణ్య.
శార్వరి వచ్చి కాఫీ గ్లాసును అందించింది దీప్తికి.
సిప్ చేసి "శారూ!.. అమృతమే" నవ్వింది దీప్తి. "ఆ నాకేం పని అడిగావుగా అత్తయ్యా!.. ఢిల్లీలో. అక్కడ నాకో స్నేహితురాలు వుంది. దాని వివాహం అందుగ్గా వెళ్ళాలి."
"ఒంటరిగా వెళ్లాలనుకొన్నావా!"
"లేదే!.."
"మరి ఎవరు నీతో వస్తున్నారు?.."
"మీరంతా!.." గలగలా నవ్వింది దీప్తి.
ఆ మాటకు హరికృష్ణకు నవ్వు వచ్చింది ఆనందంగా నవ్వాడు.
లావణ్య ఆశ్చర్యంతో "ఎందుకండీ నవ్వుతున్నారు!.."
"ఆరోగ్యం కోసం లావణ్యా!.."
"కరెక్ట్!.. అత్తయ్యా!.. నవ్వు అనేది మనకు ఆ దేవుడిచ్చిన వరం. ఆనందకరమైన విషయాలను విన్నప్పుడు, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూచినప్పుడు, అయినవాళ్లందరూ ఒకచోట చేరినప్పుడు, సరదా కబుర్లతో నవ్వుకోవడం ఒంటికి ఎంతో మంచిది తెలుసా!.."
"అవును దీప్తీ!.. నీవు చెప్పింది నిజం" నవ్వుతూ చెప్పింది శార్వరి.
"అయితే నాన్నా!.. ఎల్లుండికి మనకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేస్తాను."
"ఆఁ.. దీప్తికి కూడా చెయ్యి" అన్నాడు హరికృష్ణ.
దీప్తి నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో తీక్షణతకు ఈశ్వర్ తట్టుకోలేక.. తల త్రిప్పుకొని తన గదికి వెళ్ళిపోయాడు.
"మామయ్యా!.."
"ఏమిటమ్మా!.."
"మీరంతా వాణి వదినను కలువబోతున్నారుగా!" అడిగింది దీప్తి.
అవునన్నట్లు తలాడించాడు హరికృష్ణ.
"ఇప్పుడు వాణి వదిన ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో తెలుగు వార్తల అనౌన్సర్. నిన్న రాత్రి నేను, అమ్మా వదిన చెప్పిన వార్తను వినాము" అమాయకంగా నవ్వుతూ చెప్పింది దీప్తి.
"ఆఁ.. మేమూ విన్నాము వదినా!.. అక్క వార్తలను చాలా బాగా చెప్పింది కదూ!.."
"అవును శారూ!.. చాలా బాగా చెప్పింది."
"అది ఎవరి కూతురు!.." గర్వంగా అంది లావణ్య.
"మామయ్యగారు శ్రీ శ్రీ.. తిరుమలగిరి హరికృష్ణగారి పెద్దకుమార్తె. మా వదినగారు" నవ్వుతూ నాటకీయంగా చెప్పింది దీప్తి.
హరికృష్ణ నవ్వాడు ఆనందంగా.
"దీపూ!.. నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ నాన్నతో చెప్పావా!" అడిగింది లావణ్య.
"అవసరమా అత్తయ్యా!.."
"అంటే చెప్పలేదా!.." అడిగింది శార్వరి.
"నా అత్తారింటికి వచ్చేదానికి నాకు ఆయన పర్మిషన్ కావాలా ఏంటి? అమ్మతో చెప్పా!.. వెళ్ళిరా అంది, అంతే వచ్చేశా!.."
ఆశ్చర్యంతో చూచింది లావణ్య.
దీప్తి లేచి లావణ్యను సమీపించి "అత్తయ్యా!.. నా అలంకారం ఎలా వుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు నీవు చెప్పిన మాటలను నేను మరువలేదు. ఎన్నటికీ మరువబోను"
లావణ్య పెదవులపై చిరునవ్వు.. ప్రీతిగా అభిమానంతో దీప్తి ముఖంలోకి చూచింది.
"దీపూ!.. చాలా అందంగా వున్నావే!.."
"ఆమె అంతా నీ పోలికేగా!.." నవ్వాడు హరికృష్ణ.
"శారూ!.. పద.. నా బావగారు ఏం చేస్తున్నారో చూద్దాం" శార్వరీ చేతిని తన చేతిలోకి తీసుకొంది. ఇరువురూ ఈశ్వర్ గదిలోకి ప్రవేశించారు.
"బావా!.. టికెట్లు బుకింగ్ అయిపోయిందా!"
"అయిపోయింది."
"నాకు బుక్ చేశావా లేదా!."
"తప్పదుగా!"
"అంటే!?"
"మా నాన్నగారు చెప్పారు."
"నేను చెబితే చేయవా?"
"ఎందుకు చేయడు వదినా. నీవు చెప్పినా, నాన్న చెప్పినా విషయం ఒక్కటేగా!
"శారూ!"
"ఏమిటొదినా!.."
"మీ అన్నయ్య మారిపోయాడే!"
"పరిస్థితులు వ్యక్తుల మనస్తత్వాలను మారుస్తాయి"
"పరిస్థితులకు తగిన రీతిగా మనస్సును మార్చుకొనేవారు ఊసరవెల్లి లాంటివారు. వారిని మనుషులని అనకూడదు. అన్ని పరిస్థితుల్లో సహనంతో శాంతంగా వుండేవారే అసలైన మనుషులు. స్వార్థం కన్నా పరమార్థం గొప్పది. మా మామయ్యలాగా!"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అంటే మా నాన్న మంచివాడా!.. చెడ్డవాడా!.. వదినా!"
"మీ నాన్న.. మా మామయ్య.. ఎంతో మంచివారు. వారి సుపుత్రుడైన ఈ నీ అన్నయ్యకు చెప్పు. ఆ తండ్రిలా మంచిపేరును తెచ్చుకోవాలని శారూ!"
"అదేదో నీవు చెబితే బాగుంటుందిగా!"
"ఏయ్ శారూ!.. నేను అభిమానంగా మాట్లాడితే అర్థం చేసుకోని మనిషే మీ అన్నయ్యా! ఐదేళ్ళ తర్వాత వచ్చానా! ప్రీతిగా దీపూ! ఎలా వున్నావ్? తిరిగి వచ్చావు నాకు చాలా సంతోషం. ముందు ఏం చేయాలనుకొంటున్నావు? నా సాయం ఏమైనా కావాలా? అని అడగవలసిన ఈ మనిషి, ఎవరో.. తనకు ఏమీకాని పరాయి మనిషిని చూచినట్లు ఆ చూపు, మూతి ముడుచుకోవడం న్యాయమా!.. మా అందరికంటే చిన్నదానివైనా నీవు చిన్నప్పటి నుంచి తెలివికలదానివి. నీవే న్యాయం చెప్పు. నా స్థానంలో నీవుంటే ఎలా ఫీలవుతావో ఆలోచించి చెప్పు!" రోషంగా అంది దీప్తి.
ఓరకంట దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్. దీప్తి ఎక్కిరించింది. అతని పెదవులపై చిరునవ్వు. కారణం ఆ ఫోజులో దీప్తి అతనికి చాలా అందంగా తోచింది.
"మామయ్య కారణంగా అన్నయ్య అలా మారిపోయాడు వదినా!.."
"నేనెవరు?.. చెప్పు!.."
"నా వదినవు."
"ఆయన ఎవరు?"
"నా అన్నయ్!"
"ఇద్దరం వేరేగా!.."
"అవును"
"అలాగే.. నేను వేరు.. మా నాన్న వేరు అనే ఆలోచన మీ అన్నయ్యగారికి అదే.." కుడిచేతిని ఈశ్వర్ వైపు చూపి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"వారికి రాదా!"
"అన్నయ్యా!.. నీవే వదినకు జవాబు చెప్పాలి!"
"ఏం చెప్పాలి"
"తను అడిగిన దానికి!"
"తన టిక్కెట్ను బుక్ చేశానని చెప్పు"
"చూచావా!.. నామీద మీ అన్నగారికి ఎంత అభిమానమో!.. ఆయన నాకు చెప్పవలసిన విషయాన్ని నీవు నాకు చెప్పాలట!.." వ్యంగ్యంగా ఈశ్వర్ ముఖంలోకి చురచురా చూస్తూ అంది దీప్తి.
"అన్నయ్యా!"
"ఏమిటమ్మా!.." విసుగ్గా అడిగాడు ఈశ్వర్.
"నాతో చెప్పిన మాట నీవు నేరుగా వదినతోనే చెప్పవచ్చుగా!"
"తనకు చెవుడా ఏంటి?" నవ్వాడు ఈశ్వర్.
"ఏయ్ శారూ!.. చూడు.. చూడు.. ఆ నవ్వులో ఎంత కపటం వుందో!.. శారూ!.. చెప్పు.. నేను ఒక నిర్ణయానికి అంత తేలికగా రాను. వచ్చాననుకో దాని సాధించేవరకూ నా పట్టువదలను వదలను."
"అలాగా వదినా!" అమాయకంగా అడిగింది శార్వరి.
"అవును.."
"అయితే ఇప్పుడు ఏ నిర్ణయంతో వున్నావ్?"
"అది సస్పెన్స్!" వాలుకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"కొద్దిరోజులు ఓపిక పట్టు అదేంటో నీకే తెలుస్తుంది. అప్పుడంటావ్.. వదినా ఆనాడు నీవు అన్నది నిజమే అని" నవ్వింది దీప్తి.
"ఏం చేస్తున్నార్రా!" లావణ్య వారి గదికి వచ్చింది.
"అమ్మా ఎల్లుండి సోమవారం మన ప్రయాణం టికెట్స్ బుక్ చేశాను."
"దీపూకు చేశావా"
దీప్తివంక చూస్తూ "ఆఁ.." అన్నాడు ఈశ్వర్.
"అత్తయ్యా!.. వాణి వదిన ఇంటి అడ్రస్ నా దగ్గర వుంది."
"అడ్రస్ నీకెలా దొరికింది?"
"నేను రామయోగి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను. మనం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాణి వదిన ఇంటికే పోవచ్చు" నవ్వింది దీప్తి.
"వదినా!.. మనలనందరినీ ఒక్కసారిగా చూచి అక్క!.." శార్వరి పూర్తిచేయకముందే..
"కలా.. నిజమా! అని ఉబ్బితబ్బిబై పోతుంది" గలగలా నవ్వింది దీప్తి. ఆమె స్వచ్ఛమైన నవ్వును చూచిన ఆ ముగ్గురు కూడా నవ్వారు.
"నేను బయలుదేరుతున్నానత్తయ్యా!"
"మంచిదిరా!. జాగ్రత్తగా వెళ్ళు" దీప్తి భుజంపై చెయ్యి వేసి చెప్పింది లావణ్య.
ఓరకంట ఈశ్వర్ను చూచి "శారూ! బై.." చెప్పి దీప్తి వరండాలోకి వచ్చింది.
హరికృష్ణకు చెప్పి.. వెళ్ళి తన కార్లో కూర్చొని ఇంటివైపుకు బయలుదేరింది.
====================================================================ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 12
హరికృష్ణ కార్లో పాలఫ్యాక్టరీకి బయలుదేరాడు. దార్లో సీతాపతి అతనికి కనిపించాడు. కారుని ఆపి సీతాపతిని రమ్మని చెయ్యి వూపాడు హరికృష్ణ.
బిక్కముఖంతో సీతాపతి... వారు కూర్చొని వున్న వైపుకు వచ్చి నిలబడ్డాడు.
"నమస్కారం మామయ్యా!" అన్నాడు.
"సీతా!... కారు ఎక్కు" చెప్పాడు హరికృష్ణ.
తిరిగివచ్చి డోర్ తెరచుకొని వారి ప్రక్కన కూర్చున్నాడు సీతాపతి.
’మామయ్య నన్ను ఎందుకు కార్ ఎక్కమన్నారో!.... శార్వరి తనతో నేను చెప్పిన మాటలు మామయ్య, అత్తయ్యలకు చెప్పిందా!... వారి ముఖం ఎంతో గంభీరంగా వుంది. మామయ్య చాలా గొప్ప వ్యక్తి. నా తండ్రిలా నీచప్రవృత్తి కలవాడు కాదు. నాకు ఏదో సందేశాన్ని ఇవ్వడానికే రమ్మన్నాడు. ఏం చెప్పబోతాడో ఏమో!’ భయంతో ఒదిగి కూర్చొని అనుకొన్నాడు సీతాపతి.
"నీవు బి.టెక్ చదువుతున్నావు కదూ!"
"అవును మామయ్యా."
"ఎన్నో సంవత్సరం?"
"ఫైనల్ ఇయర్!"
"అంటే వచ్చే మార్చికి బి.టెక్ కంప్లీట్ అవుతుందన్నమాట!"
"అవును"
"బి.టెక్ కాగానే ఎం.టెక్ చదవాలని వుందా లేదా!..."
"చదవాలని వుంది మామయ్యా!..."
తలాడించాడు హరికృష్ణ సాలోచనగా....
"సీతా!...."
"చెప్పండి మామయ్యా!"
"నీకు, శార్వరికి వయస్సులో వ్యత్యాసం ఎంతో నీకు తెలుసా!"
తెలీదన్నట్లు తలూపాడు సీతాపతి.
"మన రెండు కుటుంబాల మధ్యనా గత మూడు సంవత్సరాలుగా ఎలా వుందో నీకు తెలుసుగా!"
"నేను మీ నాన్నలాంటి వాణ్ణి కాను..."
"ఆ విషయం నాకు తెలుసు మామయ్యా! మీ మంచితనాన్ని గురించి అమ్మ అప్పుడప్పుడూ చెబుతూ వుంటుంది."
"నాది మంచితనమో, చెడ్డతనమో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు నా తండ్రి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఆ మార్గాన నన్ను నడిపించాడు. వారు వున్నంతవరకూ... వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఆ విధానాలు నచ్చినందున పాటిస్తున్నాను. నీకు నీ తండ్రి ఏమి నేర్పలేదా!"
తన తండ్రి తత్వాన్ని గురించి తల్లి ప్రణవి చెప్పగా కొన్ని తెలిశాయి. వాణి వివాహ విషయంలో ప్రజాపతి... తన రాజకీయ ప్రయోజనాల కోసం, వాణి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించడం తనకు తెలుసు. తన తండ్రి తత్వం ఇదే అని తెలిసిన తర్వాత అతని నుండి తాను నేర్చుకోవలసినది ఏదో తోచలేదు సీతాపతికి. మనస్సున తండ్రి మీద ద్వేషం... విద్యార్థి దశలో అతన్ని ఎదిరించి విమర్శించి ఎక్కడికి పోగలడు? ఏం చేయగలడు?..
హరికృష్ణ ప్రశ్నకు మౌనమే సీతాపతి వంతు అయింది. కారు పాలఫ్యాక్టరీ పోర్టికోలో ఆగింది.
హరికృష్ణ దిగాడు. దిగిన సీతాపతి వారి ముఖంలోకి చూచాడు. "రా!..." అన్నాడు హరికృష్ణ.
ముందు హరికృష్ణ, వెనకాల సీతాపతి. హరికృష్ణ ఆఫీస్ గదిలో ప్రవేశించారు. హరికృష్ణ తన స్థానంలో కూర్చున్నాడు. వారి రాకను గమనించిన అకౌంట్స్ మానేజర్ సుందరయ్య తలుపుతట్టి లోనికి వచ్చి విష్ చేశాడు.
"సుందరయ్యగారూ!... మిమ్మల్ని పదినిముషాల తర్వాత లోపలికి పిలుస్తాను" అన్నాడు హరికృష్ణ.
"సరే సార్!...." సుందరయ్య వెళ్ళిపోయాడు.
"సీతా!... చదువుమీద ధ్యాస వుంచు. చదువుకొనవలసిన వయస్సు నీది. నేడు వస్తున్న సినిమాలు.. వచ్చిన ఐఫోన్స్... వాట్సప్, గూగుల్ వీటన్నింటినీ చూచి మనం కూడా అందులో కనబడే వారిలాగానే తయారుకావాలనుకోవడం మంచి నిర్ణయమే!... కానీ... నీవు చూచించి మంచిదా!... చెడ్డదా అని ఆలోచించి... మంచిని నేర్చుకోవాలి. పాటించాలి. ఒకసారి చూచిన చెడ్డను మరోసారి చూడకూడదు. నీమీద మీ అమ్మానాన్నలకు ఏవేవో ఆశలు వుండవచ్చు.
అలాగే నాకు నా బిడ్డల విషయంలో కొన్ని ఆశలు వున్నాయి. కాబట్టి నీవు... శార్వరికి ఫోన్ చేయడం కాని, ల్యాప్టాప్లో వాట్సప్లో చాటింగ్ చేయడం గాని, ఇక మీదట ఎన్నడూ చేయకు. నేను చెప్పింది నీ మంచికేనని అర్థం చేసుకో. శార్వరి అమెరికాకు వెళ్ళాలని, తాను గొప్ప డాక్టర్ కావాలని ఆశపడుతూ వుంది. ఆ పిల్ల మనస్సును ప్రేమపేర కలుషితం చేయకు. నీ చర్యలను గురించి ఆమె నా భార్యకు చెబుతుంటే విన్నాను.
ఎటువంటి పరిస్థితులోనూ నేను నా బిడ్డను మీ ఇంటికి కోడలిగా చేయలేను. ఇది నా నిర్ణయం. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. బుద్ధిగా చదువుకో. మంచి పేరు సంపాదించుకో. నా బిడ్డను మరిచిపో! నీ మేలుకోరి ఈ విషయాలన్నీ నీకు చెప్పాను" ఎంతో సౌమ్యంగా హరికృష్ణ సాగించిన సంభాషణ ఆపాడు.
సీతాపతి ముఖం... శరీరానికి చెమట పట్టింది.
"ముఖం నిండా చెమట... తుడుచుకో" తన కుర్చీ వెనుక వున్న టవల్ను అందించాడు హరికృష్ణ సీతాపతికి.
టవల్ అందుకొన్నాడు సీతాపతి. ముఖం తుడుచుకొన్నాడు. జగ్లో వున్న నీటిని గ్లాసులో పోసి అందించాడు.
"తాగు" అన్నాడు హరికృష్ణ.
గ్లాసులోని నీళ్ళను గటగటా త్రాగాడు సీతాపతి.
"పాపం... మీ అమ్మ!... అమాయకురాలు. ఎంతో దైవభక్తి కలది. ఆమె మనస్సుకు కష్టం కలిగించేలా నడుచుకోకు."
తలాడించాడు సీతాపతి.
"కాఫీ... టీ త్రాగుతావా!..."
వద్దన్నట్లు తలాడించాడు సీతాపతి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"సరే వెళ్ళి కార్లో కూర్చో. డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర్లో దించుతాడు."
సీతాపతి మౌనంగా గదినుండి బయటికి నడిచాడు.
హరికృష్ణ డ్రైవర్ను పిలిచి సీతాపతిని డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు.
సీతాపతి కార్లో కూర్చున్నాడు. డ్రైవర్ రాములు కారును సమీపించి కూర్చొని...
"సీతయ్యబాబు!... బయలుదేరుదామా!..." అడిగాడు.
"ఆఁ...." హరికృష్ణ చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తున్న సీతాపతి యాంత్రికంగా పలికాడు.
అతనికళ్ళ ముందు ఒకవైపు తన తండ్రి ప్రజాపతి, మరోవైపు హరికృష్ణ నిలిచారు.
’నా తండ్రి... తన స్వార్థం కోసం... ఎవరినైనా వంచిస్తాడు. ఆయనలో వున్న స్వార్థానికి స్వపర భేదం లేదు. తన పంతం నెరవేరి తన వాంఛ తీరాలి. ఆవేశంతో ఏదైనా చేస్తాడు.’
’మామయ్య!... శాంత స్వరూపి. స్వార్థపు చింతనకు వారికి చాలాదూరం. ఎంతో బంధుప్రీతి. అందరూ అరమరికలు లేకుండా హాయిగా కలిసి ఒకటిగా వుండాలనే తత్వం. పరమార్థమే వారి స్వార్థం.
రెండు మూడు సంవత్సరాలుగా నాన్న మనస్తత్వంలో ఎంతో మార్పు. బంధుప్రీతి నశించింది. ధనదాహం ఎక్కువైంది. దయ ధర్మాన్ని మరిచాడు. ఇతరులను ఎవ్వరినీ లెక్కచేయడు. అందరూ తన మాటను గౌరవించి వారికి తలవంచాల్సిందే. వారి క్రింద పనిచేసేవారు బ్రతుకు తెరువుకోసం వారి దాసోహం పలుకుతారు. కాదంటే వారికి మనుగడ వుండదు.
కానీ... నేను అక్క... అమ్మ... వారి పెద్దరికాన్ని గౌరవించి, వారి మాటలను వింటూ తలలు దించుకొంటున్నామంటే, దానికి కారణం వారిమీద అభిమానం గౌరవం కాదు, వారు పెద్దవారైనందున వారిని ఎదిరించడం న్యాయం కాదనేదే కారణం. మామయ్య, నాన్నగారు తూర్పు పడమరలుగా వున్నారు. ఆ రెండు దిశలు కలవవు. కలవని దిశల్లో వున్న నేను, శార్వరి కలసి ఒకటై జీవితాన్ని సాగించడం అసాధ్యం. నేను మగవాణ్ణి దేనికైనా తెగించగలను. కానీ శార్వరి ఆడపిల్ల. తనకు తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం... ప్రేమ. ఆ ప్రేమ ముందు నాకు తనపై వున్న ప్రేమ ఓడిపోవలసిందే!... గెలవదు...
బెదిరించి, బలత్కారించి శార్వరి ప్రేమను పొందాలనుకోవడం అవివేకం. అలాంటి ప్రయత్నాలు చేస్తే అవి నాలోని స్వార్థానికి నిదర్శనాలవుతాయి. ఆ లక్షణాలను ఎవ్వరూ మెచ్చరు. మనిషైనవాడు తన చర్యలను పదిమంది మెచ్చేరీతిగా ప్రవర్తించాలి. అది మానవత్వం అవుతుంది. స్వార్థ అమానుషత్వానికి నిదర్శం. నేను మంచి మనిషిగా బ్రతకాలి. మంచిపేరును సంపాదించుకోవాలి.
నాకు శార్వరిపై వున్నప్రేమ నిజమైన ప్రేమ అయితే నేను ఆమె అభిప్రాయాన్ని ఆమోదించాలి, గౌరవించాలి. అప్పుడే నా ప్రేమ వ్యామోహం కాకుండా నిజమైన ప్రేమ అవుతుంది. మామయ్య చెప్పిన ప్రతి అక్షరం సత్యం. వారు నామేలు కోరి ఆ విధంగా చెప్పారు. వారి మాటలను పాటించాలి. ధ్యాసను చదువుపై లగ్నం చేయాలి. మంచి ఫలితాన్ని సాధించాలి’ అనుకొన్నాడు సీతాపతి.
రాములు వీధి మలుపులో కారు ఆపాడు.
"సీతయ్యబాబూ!.... మన ఇంటి దగ్గరకు వచ్చేశాము!"
ఆ పిలుపు విని తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు సీతాపతి. డోర్ తెరుచుకొని కారు దిగాడు.
"థాంక్యూ రాములన్న!"
"మంచిది బాబు!" చిరునవ్వుతో చెప్పాడు రాములు.
సీతాపతి తన ఇంటివైపుకు నడిచాడు. రాములు కారును ఫ్యాక్టరీ వైపుకు త్రిప్పాడు.
పరంజ్యోతి... ప్రజాపతి స్నేహితుడు. పాతిక సంవత్సరాల క్రిందట తన సోదరి లావణ్యను పరంజ్యోతికి ఇచ్చి వివాహం జరిపించాలనే నిర్ణయంతో వున్న ప్రజాపతి... తండ్రి కైలాసపతి నిర్ణయం వేరుగా వున్నందున.... వారిని ఎదిరించలేక తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక మౌనంగా వుండిపోవలసి వచ్చింది.
ప్రస్తుతంలో... పరంజ్యోతి కుమారుడు దివాక్ర్కు తన కూతురు దీప్తిని ఇచ్చి వివాహం చేయాలనేది అతని సంకల్పం. దివాకర్ చెన్నైలో చదివి, అమెరికా వెళ్ళి, నాలుగేళ్ళు అక్కడ పనిచేసి, ఎం.ఎస్ పూర్తిచేసి, చెన్నైకి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాడు.
పరంజ్యోతి హోటల్ వ్యాపారి. ప్రజాపతికి ఒకే కూతురని, ఎంతో ఆస్తి వుందని, దివాకర్కు దీప్తితో వివాహం జరిపిస్తే ప్రజాపతి ఆస్తిలో సగభాగం తన కొడుక్కి సంక్రమిస్తుందనే ఆశతో ప్రజాపతికి ఫోన్ చేశాడు.
"హలో!..."
"ఎవరూ!..." ప్రజాపతి మాటలు.
"నేనురా!... పరంజ్యోతిని... ఎలా వున్నావురా!" నవ్వుతూ అడిగాడు.
"ఓ!... పరం నీవా!... బాగున్నానురా!... నీవెలా వున్నావ్!..." అడిగాడు ప్రజాపతి.
"ఆఁ... బాగున్నానురా!... నిన్ను ఒకమాట అడగాలని ఫోన్ చేశాను" అన్నాడు పరంజ్యోతి.
"చెప్పరా!... విషయం ఏమిటో!...."
"మరేం లేదురా!... నేను మీ ఇంటికి అల్లుడికి కాలేకపోయాను. నా కొడుకు దివాకర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి వివాహం చేయాలని నిర్ణయించుకొన్నాను. నీవు నీ కూతురు దీప్తిని నా కోడలుగా చేయగలవా!..." అడిగాడు పరంజ్యోతి.
ప్రజాపతి ముఖంలో పున్నమి వెన్నెల విరిసింది. తన నిర్ణయాన్ని... తన హితుని నోట విన్నందుకు... పరమానందంతో.
"ఒరే!... పరం... నీవు అడగడం... నేను కాదనడమా!... చూడు నా కూతురు దీప్తి నీ కోడలేరా!. నేను చెన్నైకి వచ్చి మిమ్మల్ని మావూరికి వచ్చి... మా అమ్మాయిని చూచుకొనేదానికి పిలుస్తానురా!" ఆనందంగా చెప్పాడు ప్రజాపతి.
"ఒరే ప్రజా!... నన్ను పిలిచేదానికి నీవు చెన్నై రావాలా! నాకు నీమాట చాలు. నీవు రావాల్సిన అవసరం లేదు. నీవు నాకు ఎవరు? నా ప్రియమిత్రుడివి... మంచిరోజు చూచుకొని నేను మీ చెల్లెలు, దివాకర్ గూడూరు వస్తామురా! ఎప్పుడు వచ్చేదీ త్వరలో ఫోన్ చేస్తాను. సరేనా!" అన్నాడు పరంజ్యోతి.
"ఒరే! పరం!చాలా చాలా సంతోషంరా!" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు ప్రజాపతి.
ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చిన సీతాపతి... తండ్రి గదిలో ప్రవేశించబోయి ఆగి... వారు ఫోన్లో చేసిన సంభాషణనంతా విన్నాడు. వంటగదిని సమీపించి లోనికి చూచాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
తల్లి ప్రణవి సలహాలతో దీప్తి వంట చేస్తుంది. ప్రజాపతి దీప్తి విషయంలో తీసుకొన్న నిర్ణయం సీతపతికి నచ్చలేదు. తన అక్క వివాహం ఈశ్వర్తో జరగాలని, తన తండ్రి చేసిన తప్పు కారణం శతృత్వంతో విడిపోయిన వారి రెండు కుటుంబాలు తిరిగి కలవాలని, అందరూ పూర్వంలా ఆనందంగా వుండాలని సీతాపతి అభిలాష. తన తండ్రి తత్వం మారదని అతనికి తెలుసు. కానీ తన సంకల్పం నెరవేరాలని, దానికి తగిన అవకాశాలను, తన తండ్రి తత్వంలో మార్పును కలిగించాలని తన ఇష్టదైవం షిర్డీసాయి బాబాను తలచుకొని మనస్సున తన కోర్కె నెరవేరాలని కోరుకొన్నాడు.
ద్వారం వద్ద నిలబడి కళ్ళు మూసుకుని వున్న సీతాపతిని ప్రణవి చూచింది.
"సీతా!... ఏరా అలా నిలబడిపోయావ్!" అతన్ని సమీపించి తట్టి అడిగింది ప్రణవి.
"అమ్మా!.... నీకు రెండు విషయాలు చెప్పాలి."
"చెప్పు నాన్నా!"
"మొదటిది... నాన్నగారు అక్క వివాహాన్ని తన స్నేహితుడు పరంజ్యోతిగారి కొడుకు డాక్టర్ దివాక్ర్తో జరిపించే దానికి పరంజ్యోతితో మాట్లాడారు. అక్క వివాహం అతనితో జరుగకూడదు. ఆమె వివాహం ఈశ్వర్ బావతోనే జరగాలి. అక్కకు బావంటే ఎంతో ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు. నీకూ ఇష్టమేగా!..."
స్టవ్ అరుగు వైపు ముఖం మళ్ళించి వున్న దీప్తి వెనక్కి తిరిగి చూచింది.
"ఏందిరా సీతా నీవు అన్నది!..." ఆశ్చర్యంతో అడిగింది.
"నేను అమ్మకు చెప్పింది నిజం."
ప్రణవి ఆశ్చర్యంతో కొడుకు కూతురు ముఖాల్లోకి చూచింది.
"సీతా!.... గబగబా నీవు అన్న మాటల్లో నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదురా!.... కాస్త నిదనంగా వివరంగా చెప్పరా!..."
"అమ్మా నేను అచ్చతెలుగులోనే చెప్పాను. మళ్ళా చెబుతున్నాను జాగ్రత్తగా విను. తమ పతిదేవుడు అక్క వివాహాన్ని తన స్నేహితుడు పరంజ్యోతి కొడుకు దివాకర్తో జరిపించాలని నిర్ణయించుకొన్నారు. వారిని పిల్లను చూచుకొనేదానికి కూడా రమ్మన్నారు. ఇప్పుడు అర్థమయిందా!" కాస్త చిరాకుగానే చెప్పాడు సీతాపతి.
"ఏందిరా నీవన్నది!" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి అడిగింది ప్రణవి.
"నేను చెప్పింది యదార్థం అమ్మా!..."
దీప్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో కోపం. వేగంగా తండ్రిగారు వున్న గదివైపుకు రెండు అడుగులు వేసింది. ప్రణవి ఆమె చేతిని పట్టుకొని ఆపింది.
"దీపూ!... మీ నాన్న పరమ మూర్ఖుడు. ఇప్పుడు నీవు పోయి ఆ విషయాన్ని గురించి మాట్లాడితే నీ ఢిల్లీ ప్రయాణం సాగదు. ఈనాడు కాకపోయిన ఒకనాడు ఆ విషయాన్ని వారుగా మనతో చెప్పాలిగా!... వారు మాట ఇస్తే... నీ వివాహం ఆ దివాకర్తో అయిపోతుందా!.... మధ్య నేనున్నానుగా!.... ఆవేశపడకు. వారికైవారు ఆ విషయాన్ని మనతో చెప్పనీ. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వారి పగటి కలలు కల్లల్లే అవుతాయి. నా మాట నమ్ము"
దీప్తి ఆగిపోయి తల్లి ముఖంలోకి దీనంగా చూచింది.
"నా జీవితానికి సంబంధించిన నా వివాహ విషయంలో నా అభిప్రాయం వారికి అక్కరలేదా అమ్మా!.."
"ఎందుకే తల్లీ!... బాధపడతావ్. నీ ఈ తల్లికి నీ మనస్సులో ఏముందో తెలుసు. నీ కోర్కె తప్పక నెరవేరుతుంది" నవ్వుతూ చెప్పింది ప్రణవి.
"అక్కా!... అమ్మ చెప్పిన మాట జరిగి తీరుతుంది. నీకు అండగా ఈ నీ తమ్ముడు వున్నాడు. అమ్మ వుండగా నీవు బాధపడకక్కా. ఈశ్వర్ బావే నాకు కాబోయే బావ!!!... జరుగబోయేది అదే!!!" నవ్వాడు సీతాపతి.
తల్లి సోదరుడు ముఖాల్లోకి చూచి ఆనందంగా నవ్వి, సిగ్గుతో తలదించుకొంది దీప్తి.
"అక్కా!... బావ గుర్తుకు వచ్చాడా!" కొంటెగా కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ అడిగాడు సీతాపతి.
అందంగా నవ్వి కుకీంగ్ ప్లాట్ఫామ్ వైపుకు నడిచింది దీప్తి.
"రెండో విషయం ఏమిటి నాన్నా!" ఆప్యాయంగా అడిగింది ప్రణవి.
"అది నా స్వవిషయం... భవిష్యత్తుకు సంబంధించింది అమ్మా!..."
"అదేంటో నాకు తెలుసురా!... కష్టపడి చదివి ప్రయోజకుడిగా మారు. నీ ఆశయమూ తప్పక నెరవేరుతుంది" అంది ప్రణవి.
బానట్లో వంకాయ ముక్కలు వేసి వెనుతిరిగిన దీప్తి...
"సోదరా! ఏమిటి నీ ఆశయం... అమెరికా వెళ్లాలని ఉందా!..."
"వాడిని నేను అమెరికా పంపనే... బి.టెక్, ఎం.టెక్ మన దేశంలోనే పూర్తిచేస్తాడు."
"అమ్మా!... నీవు చెప్పిన మాటలకు, వాడికి నీవు ఇచ్చిన దీవెనకు సంబంధం లేనట్లుందే ఏమిటి విషయం! నాకు చెప్పకుండా దాస్తావా!... అది నీకు న్యాయమా తల్లీ!"
"వాడి చదువు పూర్తి కానీవే... అప్పుడు చెబుతాను" నవ్వింది ప్రణవి.
"అమ్మా!... నేను రేపు వైజాగ్ బయలుదేరుతాను. పరీక్షలు దగ్గరకొచ్చాయి. బాగా చదవాలి. గోల్డ్ మెడల్ సాధించాలి...:"
"అలాగే నాన్నా!..."
సీతాపతి స్నేహితుడు ప్రణవ్ వరండాలో ప్రవేశించాడు.
"సీతాపతి!..." పిలిచాడు.
అతని పిలుపు విని సీతాపతి వరండా వైపుకు నడిచాడు. ఆ ఇరువురికి మాధవయ్య ఎదురైనాడు.
"సీతా!... నాన్నగారున్నారా!"
"ఆఁ.... దండిగా వున్నారు" నవ్వాడు సీతాపతి.
సీతాపతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూచిన... మాధవయ్య ప్రజాపతి ఆఫీస్ గదివైపుకు నడిచాడు. మిత్రులిరువురూ వీధిలో ప్రవేశించారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
•
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
మాధవయ్యను చూచిన ప్రజాపతి... నవ్వుతూ... "రారా!.. మాధవా రా!... కూర్చో!" అన్నాడు.
"ఏరా ప్రజా!... ఆగమేఘాల మీద రమ్మన్నావ్!... ఏమిటి విషయం!...." చేతిలోని సెల్ను చూపుతూ... "ఇది ఎంత ఉపయోగమో ఒక్కోసారి అంత బాధాతరంగా వుందిరా. రాత్రి పదిగంటలప్పుడు ఊడిపోయింది... జారిపోయింది అని ఫోన్ కాల్స్... దీన్ని తీసికొన్నప్పటి నుంచీ సరిగా నిద్రకు నోచుకోలేదనుకో!..." సెల్ను చూస్తూ విరక్తిగా చెప్పాడు మాధవయ్య.
"ఒక ముఖ్యమైన విషయం. అందుకే వెంటనే రమ్మన్నాను" చిరునవ్వుతో చెప్పాడు ప్రజాపతి.
"ఏమిట్రా ఆ అతిముఖ్యమైన విషయం?..."
"మన దీపూ వివాహం."
"వరుడు ఎవరు?"
"ఊహించు."
"మన ఈశ్వరేనా!"
"ఛీ.. నీ నోట్లో ఎండ్రిన్ పోయాలిరా!"
"ఎండ్రిన్ అతి ప్రమాదకరమైనదిరా... చచ్చిపోతాను."
"మరోసారి వాడిపేరు ఎత్తావో... నిజంగా నీ గొంతులో ఎండ్రిన్ పోసి చంపుతాను" కసిగా చెప్పాడు ప్రజాపతి.
"సోదరా!... తప్పు... తప్పు..." చెంపలేసుకొంటూ "క్షమించు" అన్నాడు మాధవయ్య.
"వరుడు ఎవరో నీవు చెప్పలేవా!"
"చెప్పలేనురా!... నీవే చెప్పు... నేను వింటాను" దీనంగా అన్నాడు మాధవయ్య.
"నా మిత్రుడు పరంజ్యోతి కుమారుడు డాక్టర్ దివాకర్. వాడికై వాడు నాకు ఫోన్ చేసి నా కూతురిని అడిగాడు రా!.. దీపు చాలా అదృష్టవంతురాలు కదూ!..."
మాధవయ్య విచారంగా ప్రజాపతి ముఖంలోకి చూచాడు.
"ఏరా అలా చూస్తున్నావ్!..." సందేహంతో మాధవయ్య ముఖంలోకి చూచాడు ప్రజాపతి.
"నీ తండ్రి నీ చెల్లెలికి వ్రాసి ఇచ్చిన ఆస్తిని తిరిగి నీవు స్వాధీనం చేసుకోవాలని, ఇంకా చదువు పూర్తికాని సీతాపతికి నీ మేనకోడలు శార్వరిని చేసుకోవాలని నన్ను ఆ ఇంటికి రాయబారం పంపావు. నీ చెల్లెలు లావణ్య నన్ను బాగా సత్కరించి వెళ్ళిపొమ్మంది. ఆ సంఘటన నాకు నీకు అవమానకరమే...! ఈ జన్మలో నేను మరచిపోలేను. ఇప్పుడు దీప్తి వివాహ విషయంలో నీ స్వనిర్ణయంతో... ఆమె వివాహం ఆ దివాకర్తో చేయాలనుకోవడం అంత ఉచితం కాదని నా అభిప్రాయం. కారణం మన దీప్తి కూడా డాక్టర్. బాగా చదువుకొని మంచి లోకజ్ఞానం కల అమ్మాయి. ఆమె వివాహం ఆమె ఇష్టానుసారం చేయడం నీకు గౌరవప్రదం. కాదని నీ నిర్ణయంతో చేయాలనుకొంటే... నాడు నేను లావణ్య ఎదుట ఎలా అవమానం పాలయ్యానో... రేపు నీవు దీప్తి ఎదుట అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని నా ఆత్మ ఘోషిస్తూ ఉంది.
పెండ్లి అనేది నూరేళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసికొంటే వారి వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆనందంగా ఉంటుంది. మనం పెద్దవాళ్లం కదా అని వాళ్ళ ఇష్టా అయిష్టాలను తెలిసికోకుండా మన ఇష్టానుసారంగా బలవంతపు వివాహాన్ని జరిపిస్తే... వింటున్నాము.... చూస్తున్నాముగా... మూడు మాసాల లోపలే విడిపోయి విడాకులు కోరిన జంటలు నేటి సమాజంలో ఎన్నో!!! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొంటే ప్రయోజనం ఉండదని నీకూ తెలుసు. కనుక... దీప్తి వివాహం విషయంలో ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని... ఆమె కోరిన వ్యక్తితో ఆమె వివాహాన్ని జరిపిస్తే నీకు గౌరవం, ఆమెకు ఆనందం లభిస్తాయ్.
నీకంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి. అందరూ బాగుండాలని కోరుకునేవాణ్ణి. సదా మీ మేలు కోరేవాణ్ణి. ఆవేశంతో నిర్ణయం తీసుకోకు. నీ అర్థాంగిని... నీ కూతురును సంప్రదించు. వారి అభిప్రాయాలను తెలుసుకో. అప్పుడు ఓ నిర్ణయానికి రా. వాకిట్లో పెద్దమనుషులు కూర్చొని వున్నారు. ఓ జంటకు వివాహ ముహూర్తాన్ని నిర్ణయించి లగ్నపత్రిక వ్రాసి ఇవ్వాలి. నేను బయలుదేరుతున్నా!" కుర్చీ నుంచి లేచి మాధవయ్య గదినుంచి బయటికి నడిచాడు.
మాధవయ్య మాటలు ప్రజాపతి గాలి మేడలను కూల్చి వేశాయి. అతనికి మీద మనస్సున ఎంతో ఆగ్రహం కలిగింది. మనస్సులో సందేహం!....
దీప్తి.... దివాకర్ను వివాహం చేసుకొనేటందుకు తనమాట ప్రకారం ఒప్పుకొంటుందా!... కాదని అంటుందా!...
అర్థాంగి... ప్రణవి తన మాటలను సమర్థిస్తుందా... లేక కూతురు మాటలకు తలాడిస్తుందా!...
తనయుడు సీతాపతి... తన నిర్ణయాన్ని మెచ్చుకొంటాడా!... వ్యతిరేకిస్తాడా!....
తన నిర్ణయాన్ని విన్న హరికృష్ణ... లావణ్య... ఈశ్వర్ ఎలాంటి భావాలకు లోనౌతారు?..అన్నీ ప్రశ్నలే!.... జవాబుల కోసం ఆలోచన.. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకొన్నాడు ప్రజాపతి.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 828
Threads: 0
Likes Received: 1,297 in 733 posts
Likes Given: 3,329
Joined: Jun 2020
Reputation:
50
(30-01-2025, 11:51 AM)k3vv3 Wrote: తన నిర్ణయాన్ని విన్న హరికృష్ణ... లావణ్య... ఈశ్వర్ ఎలాంటి భావాలకు లోనౌతారు?..అన్నీ ప్రశ్నలే!.... జవాబుల కోసం ఆలోచన.. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకొన్నాడు ప్రజాపతి.
====================================================================
ఇంకా వుంది..
K3vv3 garu, Nice updates. Story is going on smoothly!!!
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 13
ఇంటినుండి బయలుదేరిన సీతాపతి.. మౌనంగా నడుస్తున్న ప్రణవ్ను చూచి..
"ఏరా మాటాడవ్!.. " అడిగాడు సీతాపతి.
"ఏం మాట్లాడాలి!.. "
"సరదాగా ఏదైనా మాట్లాడు.. " నవ్వాడు సీతాపతి.
"మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము?"
"ఎక్కడికా!"
"అడిగింది అదేగా!.. "
"హరికృష్ణ మామయ్యగారి ఇంటికి. "
"ఏమిటీ!.. " ఆశ్చర్యంగా అడిగాడు ప్రణవ్.
"అవును.. "
"ఎందుకు?.. శార్వరిని చూచేటందుకా!.. "
"కాదు.. "
"మరెందుకు?.. "
"మా అత్తయ్యను చూచేటందుకు.. "
"ఆమె నీతో మాట్లాడుతుందా?.. "
"తప్పక మాట్లాడుతుంది. "
"ఆమెతో ఏం చెబుతావ్!.. "
"ప్రక్కనే వుంటావుగా.. చెప్పేటప్పుడు విను.. "
"ఏ మాటకా మాట చెప్పాలిరా!.. "
"ఏమిటది?.. "
"నీకు చాలా ధైర్యంరా.. "
"ధైర్యే.. సాహసే.. లక్ష్మి అన్నారు కదా!.. " నవ్వాడు సీతాపతి.
"నీవు అన్న ఆ ’లక్ష్మి’ శార్వరీయే కదూ!"
"అవును"
"చూడాలని వుందా!"
"మాట్లాడాలని వుంది. సాయంత్రం బైజాగ్ వెళ్ళిపోతున్నారా!"
"నిజంగానా!.. "
"అవునురా!.. "
ఇరువురూ హరికృష్ణ ఇంటిని సమీపించారు.
"నేను బయట వుంటాను. నీవు లోనికి వెళ్ళి పని చూచుకొనిరా! అదే శార్వరిని చూచేపని.. "
"నీవూ నాతో రావాలి. "
"వద్దురా నేను బయట వుంటాను"
"రారా!.. " చేతిని పట్టుకొని లాగాడు సీతాపతి.
"నన్ను వదలరా!.. "
"వదలను.. "
ప్రణవ్ నిట్టుర్చి సీతాపతిని అనుసరించాడు.
అప్పుడు వరండాలోకి వచ్చిన శార్వరి లోనికి వస్తున్న ఆ ఇద్దరు మిత్రులను చూచి ఇంట్లోకి పెరుగెత్తింది.
"చూచావా!" అడిగాడు ప్రణవ్.
"ఆ.. చూచాను. "
"మర్యాద బలంగా వుంది" నవ్వాడు ప్రణవ్.
"నీ మాట నిజమేరా!"
ప్రణవ్ ఎంతో అయోమయంగా సీతాపతి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయాడు.
"ఒరే!.. నీకు అది మర్యాదనా!. "
"కాదు గౌరవం.. "
"గౌరవమా!"
"అవును.. నేను వస్తున్నట్లు అత్తయ్యతో చెప్పేదానికి వెళ్ళిందిరా.. ఇప్పుడు చూడు.. "
ప్రణవ్ ఆ ఇంటి సింహద్వారం వైపు చూచాడు.
లావణ్య వరండాలోకి వచ్చింది.
సీతాపతి, ప్రణవ్ వరండాను సమీపించారు.
"అత్తయ్యా!.. నమస్కారాలు" చేతులు జోడించాడు సీతాపతి.
లావణ్య.. వరండాలో వున్న కుర్చీలో కూర్చుంది.
"ఏరా దారి తప్పినట్లున్నావ్!"
సీతాపతి నవ్వుతూ.. "నేను మీ మేనల్లుడిని కదా అత్తయ్యా దారి ఎలా తప్పుతాను!.. ఎప్పుడూ సరైన దారిలోనే నడుస్తాను. సాయంత్రం వైజాగ్ వెళుతున్నాను. మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను. "
"మాటలు బాగా నేర్చావురా!.. నీవు ఇక్కడికి వస్తున్న విషయం మీ నాన్నకు తెలుసా!.. రా.. కూర్చో" అంది లావణ్య.
"నా ఇష్టానికి ఆయనకు తెలియడానికి.. ఏమిటి అత్తా సంబంధం.. నేను నాకు నచ్చిన మార్గంలో నడవడం తప్పు కాదు కదా అత్తయ్యా!.. ఇంట్లో మామయ్యగారు లేరా!"
"నెల్లూరికి వెళ్లారు.. రాక రాక వచ్చావ్.. ఏం తింటావ్!.. "
"మీ చేత్తో ఏది ఇచ్చినా తింటానత్తయ్యా!.. "
కుర్చీ నుండి లేచింది లావణ్య. "రారా లోపలికి.. ఒరేయ్ ప్రణవ్!.. నీవూరా" అంది ప్రీతిగా లావణ్య.
ముగ్గురూ హాల్లోకి నడిచారు. అంతవరకూ సింహద్వార ప్రక్కన వుండి వారి సంభాషణను వుంటున్న శార్వరి ఎడమవైపున వున్న తన గదిలోకి వేగంగా నడవడాన్ని ముగ్గురూ చూచారు.
"అత్తయ్యా!.. నేను సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతున్నా. బి. టెక్ ముగిశాకనే వస్తాను. ఫైనల్ ఇయర్ కదా!.. బాగా చదివి గోల్డ్ మెడల్ సాధిస్తాను. మామయ్య నాకు నయబోధ చేశారు. వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను ఎన్నటికీ మరిచిపోను. వారు.. మీరూ ఎప్పుడూ నా మేలు కోరేవారేగా!.. ఇకపై అనవసరంగా నేనుగా ఎవ్వరినీ డిస్టబ్ చెయ్యబోను" సౌమ్యంగా చెప్పాడు సీతాపతి.
శార్వరిని తలచుకొంటూ ఆశ్చర్యంతో చూచింది లావణ్య. ఆమెకు అతని మాటలు బాగా అర్థం అయినాయి. చివరిమాటలు చెప్పింది శార్వరిని ఉద్దేశించేని గ్రహించింది. పెదవులపై చిరునవ్వు.
"ఇద్దరూ కూర్చోండిరా.. "
సీతాపతి.. ప్రణవ్ మౌనంగా కూర్చున్నారు.
"శార్వరీ!.. " ఆమె వెళ్ళిన గదివైపు చూస్తూ పిలిచింది లావణ్య.
"ఏమ్మా!.. " లోనుంచే జవాబు.
"బయటికి రా!.. "
శార్వరీ ఆ మాట విని ఉలిక్కిపడింది. తల్లి తనను పిలుస్తుందని ఆమె ఊహించలేదు. మెల్లగా గది నుంచి బయటికి వచ్చింది. వస్తున్న శార్వరిని క్షణంసేపు చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు సీతాపతి.
సీతాపతి సోఫానుంచి లేచాడు. అతన్ని చూచి ప్రణవ్ కూడా లేచాడు.
"అత్తయ్యా!.. రావాలనుకొన్నాను. వచ్చాను.. చూచాను.. "
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
శార్వరివైపు చూస్తూ "చెప్పదలచుకొన్న మాటలను చెప్పాను. మీరంటే నాకు ఎంతో ప్రేమ.. అభిమానం. అవి నా జీవితాంతం నాలో ఉంటాయి. మన కుటుంబాల మధ్యన వున్న విభేదాలకు వాటికి సంబంధం లేదు. ఈ కుటుంబ సభ్యుల పట్ల నాకున్న అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు. వచ్చిన పని అయిపోయింది. ఇకనే బయలుదేరుతాను అత్తయ్యా!"
"నా ఇంటికి వచ్చి ఏమీ తినకుండానే వెళ్ళిపోతావా!.. ఇందాకనే కదా అన్నావ్ నేను ఏది ఇచ్చినా తింటానని!.. " కసిరినట్లు అడిగింది లావణ్య.
"నావల్ల ఎవరూ ఇబ్బంది పడటం నాకు నచ్చదత్తయ్యా!"
"ఏంటీ!.. ఇబ్బందా!"
"అవును!"
"ఎవరికి?"
"అదిగో.. " శార్వరి వైపు చేయి చూపించి "నీ ముద్దుల కూతురు.. నా మరదలు.. వారికి" నవ్వాడు సీతాపతి. లావణ్య, కూతురు అల్లుడిని చూచి నవ్వింది. శార్వరి సిగ్గుతో తలదించుకొంది.
ఆ క్షణంలో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. మదిలోని భావాలకు చెక్కిళ్ళ రంగు నిదర్శనం. కూతురి స్థితిని గమనించిన లావణ్య..
"శారూ!.. వంటగదికి వెళ్ళి ఉదయం చేశావే లడ్లు అవి ప్లేట్లలో పెట్టుకొనిరా!" చిరునవ్వుతో చెప్పింది.
శార్వరి వేగంగా వంటగదివైపుకు వెళ్ళింది.
"కూర్చోండిరా!.. " అంది లావణ్య.
ఇరువురు మిత్రులు ఒకరి ముఖాలొకరు చూచుకొంటూ కూర్చున్నారు. సీతాపతి పెదవులపైని చిరునవ్వు విజయగర్వాన్ని చాటుతూ వుంది.
దాన్ని చూచిన ప్రణవ్ ఆనందంగా నవ్వుకొన్నాడు.
’సీతా!.. నీవు సామాన్యుడివి కావు!!!’ అనుకొన్నాడు.
"సీతా!.. బి. టెక్ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావురా!.. "
"ఎం. టెక్ చేస్తానత్తయ్యా!"
"మరి పెండ్లి ఎప్పుడు చేసికొంటావ్!"
లావణ్య అడిగిన ఆ ప్రశ్నకు సీతాపతి ఆశ్చర్యపోయాడు. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
తన్నే లావణ్య చూస్తూ ఉందని గ్రహించిన సీతాపతి..
"అక్కయ్య పెళ్ళి.. నా చదువు పూర్తయ్యాక అత్తయ్యా!.. పిల్లని మీరే చూడాలి సుమా!" నవ్వాడు సీతాపతి.
అతని మాటలు.. వినయం.. అభిమానం.. నిర్భయం.. లావణ్యకు బాగా నచ్చాయి. మూడేళ్ళ తర్వాత సీతాపతి ఆ రోజు ఆ యింటికి వచ్చాడు. అతని మాటల ద్వారా అతను.. ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో లావణ్యకు అర్థం అయింది. అతనిపట్ల మనస్సులో అభిమానం.. చిరునవ్వుతో ప్రీతిగా సీతాపతి ముఖంలోకి చూచింది లావణ్య.
"వీడు.. నా అన్న ప్రజాపతి లాంటివాడు కాదు" అనుకొంది.
శార్వరి స్టీల్ ప్లేట్లో పది లడ్డు వుండలను పెట్టుకొని వారిని సమీపించింది.
చిరునవ్వుతో చూచాడు సీతాపతి శార్వరిని. ఇరువురి చూపులు క్షణం కలిశాయి. మరుక్షణంలో శార్వరి ముఖాన్ని ప్రక్కకు తిప్పింది. బెదిరిన లేడిపిల్లలా.
వారి చూపులను లావణ్య, ప్రణవ్ గమనించారు. ముసిముసి నవ్వులతో ప్రణవ్ సీతాపతి ముఖంలోకి చూచాడు.
సీతాపతి కన్నుకొట్టాడు.
"శారూ! ఇంట్లో ప్లేట్లు లేవా!" వెటకారంగా అడిగింది లావణ్య.
తొట్రుపాటుతో చూచింది తల్లిముఖంలోకి శార్వరి.
"వెళ్ళి రెండు చిన్న ప్లేట్లను తీసుకునిరా!"
తన చేతిలోని ప్లేటును టీపాయ్పై వుంచి వంట గదివైపుకు వేగంగా నడిచింది శార్వరి. ’నా చర్య అమ్మకు నచ్చలేదు’ అనుకొంది శార్వరి.
"ఫర్వాలేదు అత్తయ్యా. మేము తినబోయేది ప్లేట్లను కాదుగా!" వెళుతున్న శార్వరిని చూస్తూ అన్నాడు సీతాపతి.
పరుగున ఒక్కోప్లేట్లో ఐదు వుండలను వుంచి.. ఒక ప్లేటును ప్రణవ్కు అందించింది.
"థ్యాంక్యూ శార్వరీ!" ప్లేటును అందుకొని నవ్వుతూ చెప్పాడు ప్రణవ్.
రెండో ప్లేటును సీతాపతికి అందించింది. ప్లేటును అందుకొనే సమయంలో కావాలనే తన వ్రేళ్ళను శార్వరి వేళ్లకు తగిలేలా అందుకొన్నాడు సీతాపతి ఓరకంట ఆమె ముఖంలోకి చూస్తూ.
అతని ఆ చూపుల్లో ఎంతో అభిమానం.. ప్రేమ.. గమనించింది లావణ్య. పెదవులపై చిరునవ్వు.. శార్వరి ముఖంలో చిరుకోపం.
"వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా!.. "
"అలాగే" చెప్పి వెనుదిరిగింది శార్వరి.
"శారూ!.. ఆగు.. తిన్న తర్వాత.. "
"అత్తయ్యా!.. శారూ!.. " నవ్వుతూ హాల్లోకి ప్రవేశించిన దీప్తి గొంతు విని సీతాపతి చెప్పడం ఆపేసి ఆమె వైపుకు చూచాడు.
"సోదరా!.. తమరు ఇక్కడ వున్నారా!.. " నవ్వింది దీప్తి.
శార్వరి ఆగి నవ్వుతూ దీప్తి ముఖంలోకి చూచి ఆమెను సమీపించింది.
"రా వదినా.. కూర్చో" అంది శార్వరి దీప్తి చేతిని పట్టుకొని.
"రా దీపు.. రా!.. " చిరునవ్వుతో ఆహ్వానించింది లావణ్య. నవ్వుతూ దీప్తి లావణ్య పక్కన కూర్చుంది.
"అత్తయ్యా!.. నీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను. "
"ఏమిటో చెప్పు.. "
"ఆఁ.. అత్తయ్యా! లడ్లు సూపర్.. అక్కయ్య ఏదో రాచకార్యం పైన వచ్చినట్లుంది. ఇక నేను బయలుదేరుతాను" చేతిలోని ఖాళీప్లేటును టీపాయ్ పై వుంచి లేచి..
"అత్తయ్యా!.. నాకు మీ ఆశీర్వాదం కావాలి" వంగి లావణ్య పాదాలను తాకాడు సీతాపతి.
అతని తలపై తన కుడిచేతిని వుంచింది లావణ్య..
"ఓరేయ్ సీతా!.. నీ కోర్కె తప్పక నెరవేరుతుంది రా!.. బాగా చదువు" ప్రీతిగా నవ్వుతూ చెప్పింది లావణ్య.
దీప్తి.. శార్వరి.. ప్రణవ్ లావణ్య ముఖంలోకి ఆశ్చర్యంతో చూచారు.
"ధన్యవాదాలు అత్తయ్యా!" లేచి.. "ఆఁ శారూ!.. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి" శార్వరి ముఖంలోకి నవ్వుతూ చూస్తూ చెప్పాడు సీతాపతి.
శార్వరి వంటగదివైపుకు నడిచింది. కొన్ని క్షణాల్లో జగ్గు గ్లాసుతో వచ్చి గ్లాసును సీతాపతికి అందించి గ్లాసులో నీళ్ళను పోసింది.
గుటగుట నీటిని త్రాగి ప్రణవ్కు అందించాడు. నీటిని గ్లాసులో పోసింది శార్వరి.
ఖాళీ గ్లాసును టీపాయ్పై వుంచుతూ.. ప్రణవ్..
"పెద్దమ్మా!.. మీ మనస్సు ఎలాంటిదో.. మీరు చేసిన లడ్లు అంత బాగున్నాయ్!" నవ్వాడు.
"చేసింది నేను కాదురా నీ చెల్లి శారూ!"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అలాగా!.. " శార్వరీ ముఖంలోకి చూస్తూ అడిగాడు ప్రణవ్. అవునన్నట్లు చిరునవ్వుతో సగర్వంగా తలాడించింది శార్వరి.
"శారూ!.. నీతో ఓ మాట చెప్పాలి!" శార్వరిని సమీపించాడు సీతాపతి.
బెరుగ్గా బిక్కముఖంతో అతనివైపు చూచింది శార్వరి.
"బాగా చదువు. అత్తయ్యకు మామయ్యకు ఆనందం కలిగించేలా నడుచుకో. సరేనా!.. "
తలవంచుకొని మౌనంగా తలాడించింది శార్వరి.
"లడ్లు చాలా చాలా బాగున్నాయి" లావణ్య వైపు తిరిగి "అత్తయ్యా!.. వెళ్ళొస్తాను.. "
"మంచిదిరా!.. జాగ్రత్త" అంది లావణ్య.
క్షణంసేపు శార్వరి ముఖంలోకి చిరునవ్వుతో చూచి "పదరా ప్రణవ్!.. " అన్నాడు సీతాపతి.
ఇరువురు మిత్రులూ హాల్లో నుండి బయటికి నడిచారు.
"దీపు!.. నీ తమ్ముడు సీతాపతి.. " సాలోచనగా ఆగిపోయింది లావణ్య.
"చెప్పండత్తయ్యా!.. "
"గొప్ప వ్యక్తిత్వాన్ని అలవరచుకొన్నాడు. మూడేళ్ళ తర్వాత వాడి మాటలను విన్నాను. నాకు ఎంతో ఆనందం కలిగింది" శార్వరి ముఖంలోకి చూచింది లావణ్య.
శార్వరీ చూపులు, తల్లి చూపులతో కలిశాయి. క్షణంసేపు చూచి దృష్టిని దీప్తి వైపుకు మళ్ళించి..
"వదినా!.. ఏమిటి విశేషాలు!" నవ్వుతూ అడిగింది శార్వరి.
"శారూ!.. నేను మన వూర్లో ప్రాక్టీస్ ప్రారంభించదలచాను. ఆ విషయాన్ని గురించే నా అత్తయ్యా మామయ్యలతో మాట్లాడాలని వచ్చాను. అత్తయ్యా!.. నా అభిప్రాయానికి మీ సమాధానం!.. " లావణ్య దీప్తి ముఖంలోకి పరీక్షగా చూచింది.
"ఏం అత్తయ్యా అలా చూస్తున్నారు. నేను మీ దీపూనత్తయ్యా!.. నేనంటే మీకు ఎంత అభిమానమో నాకు తెలుసు. అందుకే నా నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏమిటని అడిగాను జవాబు చెప్పండి" చిరునవ్వుతో అడిగింది దీప్తి.
లావణ్య తన ప్రక్కన కూర్చొని వున్న దీప్తి భుజంపై చేయి వేసి "దీపూ!.. నీ నిర్ణయం ఎంతో ఆదర్శవంతమైంది. కానీ అందుకు మీ నాన్న అంగీకరించడు దీపూ!" విచారంగా చెప్పింది లావణ్య.
"నా నిర్ణయం నా జీవితానికి సంబంధించింది. నాకు ఆనందం కలిగించే పనిని చేసే హక్కు నాకు లేదా అత్తయ్యా!.. "
"తల్లీ!.. మీ నాన్న పరమ మూర్ఖుడు!" విచారంగా చెప్పింది లావణ్య.
"మీరు మామయ్య నాకు సాయం చేయరా అత్తయ్యా!"
"దీపు.. నాకు శార్వరి ఎంతో నీవూ అంతేనే!"
"మామయ్యగారు ఎప్పుడూ వస్తారత్తయ్యా!"
"ఈపాటికి నెల్లూరు నుండి బయలుదేరి వుంటారు. "
"భోజన సమయం కదా వదినా!.. నాన్న పదినిముషాల్లో వచ్చేస్తారు. ఈపూట నీవూ మాతో కలసి భోజనం చేస్తావా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శారూ.
"నా ముద్దుల మరదలా శారూ!.. నీవు అడగడం నేను కాదనడమూనా!.. అలాగే" నవ్వుతూ చెప్పింది దీప్తి. క్షణం తర్వాత "శారూ!.. మీ అన్నయ్య ఎక్కడా!.. "
"తనూ నెల్లూరికి వెళ్ళాడు. నాన్నతో అన్నయ్యా వస్తాడు" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
వీధిలో కారు హారన్ మ్రోగింది.
"అరుగో.. నాన్నా అన్నయ్య వస్తున్నారు. "
ముగ్గురూ లేచి వరండాలోకి వచ్చారు.
ఈశ్వర్ కారును పోర్టికోలో ఆపాడు. తండ్రి కొడుకులు కారు దిగారు.
"మామయ్యా!.. గుడ్ ఆఫ్టర్ నూన్!"
ఈశ్వర్ ముఖంలోకి చూచి..
"బావగారూ!.. మీకూనూ!.. " చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"గుడ్ ఆఫ్టర్నూన్ దీపూ.. ఎప్పుడొచ్చావ్!" అడిగాడు హరికృష్ణ.
"వచ్చి పావుగంట అయింది మామయ్యా!.. మీతో అత్తయ్యతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను" ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి.
క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి..
"అమ్మా!.. ఆకలి దంచేస్తుంది పద. "
"రండి లోపలికి.. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా వున్నాయ్"
"దీపూ.. పద భోజనం చేస్తూ మాట్లాడుకుందాం!" ప్రీతిగా చెప్పాడు హరికృష్ణ.
లావణ్య, శార్వరి, దీప్తి డైనింగ్ టేబుల్ను సమీపించారు.
హరికృష్ణశ్, ఈశ్వర్ తమ గదులకు వెళ్ళిఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు.
"అత్తయ్యా!.. మీరూ కూర్చోండి. నేను శార్వరి వడ్డిస్తాం"
లావణ్య భర్త ముఖంలోకి చూచింది చిరునవ్వుతో.
"రా కూర్చో!.. కోడలు వడ్డిస్తానంటూ వుంది కదా!"
లావణ్య హరికృష్ణ ప్రక్కన కూర్చుంది.
"శారూ.. వడ్డించు" అన్నాడు ఈశ్వర్.
"శారూ కాదు. దీపూ వడ్డించు అనాలి బావగారూ!.. నా పేరును మరిచిపోయారా!" క్రీగంట చూస్తూ చిలిపిగా అంది.
"అమ్మా!.. కూర ఏమిటి?.. "
"గుత్తివంకాయ కూర" వడ్డిస్తూ చెప్పింది దీప్తి.
శార్వరి అందరికీ అన్నం వడ్డించింది.
హరికృష్ణకు లావణ్యకు కూర, కొబ్బరి పచ్చడి, మినప వడియాలు వడ్డించింది దీప్తి.
"ఆఁ.. అన్ని వడ్డించారుగా.. మీరూ కూర్చోండి. దీపూ!.. అన్నింటిని టేబుల్ మధ్యకు జరిపి కూర్చోండి!" అన్నాడు హరికృష్ణ.
"అలాగే మామయ్యా!.. "
రెండు కంచాల్లో వడ్డించుకొని ఆ ముగ్గురికి ఎదురుగా దీప్తి, శార్వరి కూర్చొని తినడం ప్రారంభించారు. తనకు ఎదురుగా వున్న ఈశ్వర్ను చూచి..
"బావా!.. మరో గుత్తివంకాయ వేయనా!"
దీప్తి ముఖంలోకి క్షణంసేపు చూచిన ఈశ్వర్.
"వద్దు.. " ముక్తసరిగా చెప్పాడు.
"దీపూ!.. వాడికి ఆ కూరంటే ఎంతో ఇష్టం వడ్డించు. "
"అలాగే అత్తయ్యా!" గరిటతో మరో రెండు గుత్తివంకాయలు ఈశ్వర్ కంచంలో వేసింది దీప్తి.
"బావా!.. ఆహార వ్యవహారాల్లో మొహమాటం పడకూడదు. అది ఒంటికి ఇంటికి మంచిది కాదు. అవును కదా మామయ్యా!" దీర్ఘం తీసి అడిగింది దీప్తి.
హరికృష్ణ నవ్వుతూ "అవునమ్మా!" అన్నాడు.
"దీపూ!.. నాతో చెప్పిన విషయం మీ మామయ్యతో చెప్పు.. " అంది లావణ్య.
"ఏమిటమ్మా ఆ విషయం!" యాంత్రికంగ అడిగాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
దీప్తి నవ్వుతూ "నాకు సంబంధించిన విషయం.. స్వవిషయం!.. బావగారూ! మీ సాయం కూడా కావలసి వస్తుంది చేస్తారుగా!" చిరునవ్వుతో అడిగింది దీప్తి.
ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచాడు. తలను ప్రక్కకు తిప్పుకున్నాడు.
"ఇంతకూ విషయం ఏమిటి దీపూ!.. " అడిగాడు హరికృష్ణ.
దీప్తి లావణ్యకు చెప్పిన తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతా విన్న హరికృష్ణ..
"వాడు ఈ నీ నిర్ణయానికి అంగీకరించడు దీపూ!.. "
"నేనూ అదేమాటను చెప్పానండీ!" అంది లావణ్య.
"ఈ విషయంలో నా అభిప్రాయమూ అదే!" అన్నాడు ఈశ్వర్.
"వదిన నిర్ణయంలో తప్పేముంది అన్నయ్యా!.. హాస్పిటల్ను ఓపెన్ చేసి పేద పీడిత జనానికి వైద్య సహాయాన్ని అందించడం తప్పా అన్నయ్యా!.. మానవసేవే మాధవసేవ కదా!.. "
"మీకు ఒప్పే కావచ్చు. కానీ ఆ ప్రజాపతికి అది తప్పు అవుతుంది. అంగీకరించబోడు" తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఈశ్వర్.
"అమ్మా దీపూ!.. "
"చెప్పండి మామయ్యా!.. "
"వాడితో ఈ విషయాన్ని గురించి మాట్లాడావా!.. "
"మాట్లాడాను"
"ఏమన్నాడమ్మా!.. "
"చెన్నైలో నేను ప్రాక్టీసు ప్రారంభించాలట.. "
"అలాంటప్పుడు నీవు అనుకున్నది ఇక్కడ కుదరడం అసాధ్యం కదా అమ్మా!.. " సాలోచనగా చెప్పాడు హరికృష్ణ.
"అవును నాన్నా!.. మీరన్న మాట వాస్తవం!.. " అన్నాడు ఈశ్వర్.
దీప్తి దీనంగా హరికృష్ణ ముఖంలోకి, ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"అది నా స్వవిషయం కదా మామయ్యా!.. నాకు సంబంధించిన విషయంలో నాకు నచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకొనే హక్కు నాకు లేదా మామయ్యా!" దీనంగా అడిగింది దీప్తి.
హరికృష్ణ కొన్ని క్షణాలు పరీక్షగా దీప్తి ముఖంలోకి చూచాడు.
"ఏమండీ!.. దీపూ నిర్ణయం.. " లావణ్య పూర్తిచేయకముందే.
"మంచిది కాదని నేను ఎలా అనగలను లావణ్యా!.. " అన్నాడు హరికృష్ణ.
"అయితే దానికి మనం సాయం చేయలేమా!.. "
"అవును నాన్నా!.. వదినకు మనం ఆ విషయంలో సాయం చేయాలి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది శార్వరి.
ఈశ్వర్, శార్వరీ ముఖంలోకి తీక్షణంగా చూచాడు.
"శారూ!.. నీవు చిన్నపిల్లవు మాట్లాడకు. "
"ఎందుకురా దాన్ని దబాయిస్తావ్!.. నీవు పెద్దవాడివి. మంచీచెడ్డా తెలిసినవాడివి. లాయర్వి. దీపూకు అండగా నిలబడి మన వూర్లోనే దీపు క్లినిక్ పెట్టేలా చేయలేవా!" అడిగింది లావణ్య.
"చేయగలను అమ్మా.. కానీ!.. " ఆగిపోయాడు ఈశ్వర్.
"లావణ్య!.. నీకు దీపూ నిర్ణయం సమ్మతమా!.. " అడిగాడు హరికృష్ణ.
"ముందు మీలాగే సందేహించాను. కానీ.. ఇప్పుడు దీపూ నిర్ణయం సరైందని చెబుతున్నా.. నా తండ్రి నాకు ఇచ్చిన ఇల్లు ప్రక్కనే వుందిగా!.. అందులో దీపు హాస్పిటల్ను ఓపెన్ చేసేలా మీ తండ్రి కొడుకు చేయాలి. ఇది నా నిర్ణయం" తన అభిప్రాయాన్ని ఎంతో గంభీరంగా చెప్పింది లావణ్య.
ఆ మాటలను విన్న దీప్తి కుర్చీలో నుంచి లేచి ఆమె ప్రక్కకు వెళ్ళి తల వంచి ఆమె బుగ్గపై ముద్దుపెట్టి..
"మా అత్తయ్య బంగారు తల్లి!" ఆనందంగా పరవశంతో చెప్పింది దీప్తి.
ఆమె చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు.
"ఏమండీ!.. మీరు.. ఇంకా!.. " లావణ్య పూర్తి చేయకముందే..
"లావణ్యా!.. నీవు అనుకొన్నట్లుగానే జరుగుతుంది. ఈశ్వర్ ఫ్యాక్టరీ నుంచి ఓ అయిదారుగురిని పంపి ఆ ఇంటిని శుభ్రం చేయించి.. రంగులు వేయించాలి" అన్నాడు హరికృష్ణ.
"నాన్నా!.. " ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"మంచిని సమర్థించడం మానవత్వం అవుతుంది ఈశ్వర్. నా కోడలి నిర్ణయంలో, స్వార్థంలో పరమార్థముంది. ఈ విషయాన్ని విన్న వూరిజనం అంతా ఎంతగానో ఆనందిస్తారు. ఒక్క ఆ ప్రజపతి తప్ప. చూస్తాం వాడు ఏం చేస్తాడో!" హేళనగా నవ్వాడు.
"థాంక్యూ మామయ్యా!.. థాంక్స్ ఎలాట్!" సంతోషంగా చెప్పింది దీప్తి.
"అమ్మా!.. వాడు వూర్లో వున్నాడా!.. "
"లేరు మామయ్యా!.. చెన్నై వెళ్ళారు"
"హాస్పిటల్కు పేరు ఏం పెడతావమ్మా!"
"మా తాతయ్య నానమ్మల పేర్లు" దీప్తి పూర్తిచేయకముందే..
"ఏంటీ!.. మా అమ్మా నాన్నల పేర్లా!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.
"అవునత్తయ్యా!.. రుక్మిణి కైలాసపతి మెమోరియల్ హాస్పిటల్" అంది దీప్తి.
"దీపూ!.. చిన్నదానివైనా చాలాదూరం ఆలోచించావురా!.. యు ఆర్ రియల్లీ గ్రేట్" ఆనందంగా చెప్పింది లావణ్య.
"దీపూ!.. మీ అత్తయ్య అన్నమాట నిజం. నీవు హాస్పిటల్కు నిర్ణయించిన పేరు చాలా గొప్ప వ్యక్తుల పేర్లమ్మా. మా అత్తయ్యగారు.. మామగారు నా పాలిటి దేవతలు. మాకే కాదు. ఈ వూరి వారికందరికీ కూడా.. నీకు నా హృదయపూర్వక అభినందనలు తల్లీ. వారి ఆశీస్సులతో నీకోర్కె తప్పక నెరవేరుతుంది. నీవు ఎప్పుడూ ఆనందంగా వుంటావ్. డాక్టర్గా నీకు మంచిపేరు వస్తుందమ్మా!.. " ఆనందంగా చెప్పాడు హరికృష్ణ.
"దీప్తి!.. "
"ఏం బావా!.. "
"నీ నిర్ణయం నాకూ నచ్చింది" అన్నాడు చిరునవ్వుతో ఈశ్వర్.
"వదినా!.. "
"ఏం శారూ!.. "
"ఇప్పుడు నీకు మా అన్నయ్య మీది కోపం పోయిందా!.. " నవ్వింది శార్వరి.
"వారిమీద నాకు ఎప్పుడూ కోపం లేదే! ఇంతవరకూ వారికి నామీద వుండిందేమో!" ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ నవ్వింది దీప్తి.
ముసి ముసి నవ్వులతో దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్. నాలుగు కళ్ళూ కలిశాయి. మూగ భాష వాటి మధ్యన జరిగింది. అందరూ కుర్చీల నుంచి లేచారు. దీప్తి, శార్వరీ కంచాలను తీసి వంటగది సింక్లో పెట్టారు. డైనింగ్ టేబుల్ను క్లీన్ చేశారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అత్తయ్యా మామయ్యా! నేవెళ్ళొస్తాను" వారిరువురిని సమీపించి చెప్పింది దీప్తి.
"మంచిది దీపు" ఏకకంఠంతో హరికృష్ణ, లావణ్య ఒకేసారి అన్నాడు.
ఈశ్వర్కు శార్వరికి చెప్పి దీప్తి తన కారులో కుర్చొని స్టార్ట్ చేసింది. వరండాలో నిలబడి వున్న హరికృష్ణ, లావణ్యలు దీప్తి కారు వీధిలో ప్రవేశించేంత వరకూ పరీక్షగా ఆమెను చూస్తూ వుండిపోయారు.
"ఏమండీ!.. "
"చెప్పు లావణ్యా.. "
"దీపూ మనస్సు.. " లావణ్య పూర్తిచేయకముందే హరికృష్ణ.
"ఎంతో మంచి మనస్సు.. నీలాగే!" నవ్వాడు హరికృష్ణ.
"దీప్తిని మీరు నా కోడలిగా చేస్తారా!.. "
"చేయవలసింది నేను కాదు. ఆపైవారు.. వారు తలచుకొంటే కానిది లేనిది అంటూ ఏదీ వుండదుగా!.. "
"అవును.. "
"ప్రజాపతి దీప్తి నిర్ణయాన్ని.. "
"కాదన్నాడని దీపు చెప్పింది కదా అమ్మా!.. "
అప్పుడే వరండాలోకి వచ్చిన ఈశ్వర్, లావణ్య సందేహానికి జవాబు చెప్పాడు.
"అమ్మా!.. మీ అన్నయ్య ఏమనుకొన్నా.. తాతయ్య నీకు ఇచ్చిన ఆ ఇంట్లో దీపు హాస్పిటల్ పెడుతుందమ్మా. తన నిర్ణయం మంచిది. దానికి మీరు అంగీకరించారు. నాకూ నచ్చింది కాబట్టి.. మీ సోదరుడు ఈ విషయంలో ఏమీ చేయలేడమ్మా!.. " ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్.
హరికృష్ణ, లావణ్యలు పరీక్షగా ఈశ్వర్ ముఖంలోకి చూచారు.
"ఈ విషయంలో మీ సోదరుడు వ్యతిరేకిస్తే.. వారిని ఎదుర్కొనే దానికి నేను సిద్ధంగా వున్నాను. మంచిని ఆదరించడం మానవ ధర్మం కదా అమ్మా!.. " చిరునవ్వుతో చెప్పి లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
"లావణ్యా!.. విన్నావుగా నా కొడుకు నిర్ణయం!"
"వాడిది నా పోలిక.. నా కొడుకు" చిరునవ్వుతో చెప్పింది లావణ్య.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 828
Threads: 0
Likes Received: 1,297 in 733 posts
Likes Given: 3,329
Joined: Jun 2020
Reputation:
50
(07-02-2025, 01:04 PM)k3vv3 Wrote: "లావణ్యా!.. విన్నావుగా నా కొడుకు నిర్ణయం!"
"వాడిది నా పోలిక.. నా కొడుకు" చిరునవ్వుతో చెప్పింది లావణ్య.
====================================================================
ఇంకా వుంది..
Nice Story Andi, K3vv3 garu!!!.
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 14
ఆ సాయంత్రం.. సీతాపతి వైజాగ్ వెళ్ళిపోయాడు. ప్రజాపతి చెన్నైలో తన ప్రియురాలు- విడో నర్స్ నాగమణి గృహంలో, ఆమె యిచ్చే ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ, ఆనందంగా వున్నాడు. పదిరోజులకు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా ప్రజాపతి నర్స్ నాగమణి గృహాన్ని పావనం చేస్తున్నాడు. ముఫ్పై అయిదేళ్ళ ప్రాయంలో వున్న నాగమణి మంచి చూపరి. చక్కటి శరీర సౌష్టవం, ముఖంలో మంచి ఆకర్షణ వున్న నాగమణి.. కనుబొమల మధ్య చిన్న స్టిక్కర్ బొట్టు పెట్టుకొని చూపరులకు సుమంగళిగానే గోచరిస్తుంది. వారిరువురి పరిచయం ఐదేళ్ళ క్రిందట చెన్నైవైపు వెళ్ళే హౌరా ఎక్స్ ప్రెస్లో కలిగింది. ఆ పరిచయం.. ప్రణయంగా మారిపోయింది. ప్రజాపతి.. చెన్నైలో తన మిత్రుడు పరంజ్యోతిని కలిశాడు. అతని కుమారుడు డాక్టర్ దివాకర్ను కూడా చూచి ప్రీతిగా పలకరించి మాట్లాడాడు.
రెండు వారాల తర్వాత ఓ మంచిరోజును ఎన్నుకొని.. గూడూరుకు పిల్లను చూచేదానికి వస్తామని పరంజ్యోతి ప్రజాపతికి చెప్పాడు. వారు ఆనందంగా మిత్రుని కౌగలించుకొన్నారు. మరుదినం మధ్యాహ్నం భోజన సమయానికి ప్రజాపతి గూడూరు చేరాడు. భార్య ప్రణవిని పిలిచి.. పరంజ్యోతి చెప్పిన మాటలను ఆనందంగా చెప్పాడు.
పరంజ్యోతి గురించి తెలిసి వున్న ప్రణవి ప్రజాపతి చెప్పిన మాటలను మౌనంగా విన్నది. అతనితో వాదన వలన ప్రయోజనం వుండదని ఆమెకు బాగా తెలుసు. కనుక.. ఎత్తుకుపై ఎత్తు వేసి పరంజ్యోతి.. భార్య.. కొడుకు వచ్చేనాటికి ఏదో సాకును కల్పించి వారు రాకుండా చేయాలని నిర్ణయించుకొంది.
"ప్రణవీ!.. అమ్మాయి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు?" అడిగాడూ ప్రజాపతి.
"ఎల్లుండి!.." ముక్తసరిగా చెప్పింది ప్రణవి.
"దీప్తి ఎక్కడ?.."
"తన గదిలో వుంది."
"ఓసారి ఇలా రమ్మను."
ప్రణవి దీప్తి గదిలో ప్రవేశించి..
"దీపూ!.. మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు" చెప్పింది.
ల్యాప్టాప్లో ఢిల్లీలోని తన స్నేహితురాలికి మెసేజ్ పంపి దీప్తి ప్రజాపతిని సమీపించింది.
ఆమెను చూచి..
"రా దీపూ కూర్చో!" అన్నాడు ప్రజాపతి.
ప్రజాపతి ఎదురుగా హాల్లో వున్న సోఫాలో కూర్చుంది దీప్తి.
"ఎల్లుండేనా నీ ఢిల్లీ ప్రయాణం!"
"అవును.."
"తిరిగి వచ్చేది ఎప్పుడు?"
"ఒక వారం రోజుల తర్వాత.." నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది దీప్తి.
"వారం రోజుల్లో తప్పకుండా తిరిగి రావాలి. ఆ పిల్ల వుండిపొమ్మన్నదని అక్కడ వుండిపోకూడదు."
"పెండ్లికి వెళుతున్నాను. పెండ్లి ముగిసిన రెండోరోజు బయలుదేరి వచ్చేస్తాను. అక్కడ నాకేం పని?"
"దీపూ!.. నేను నీ తండ్రిని. నేను నీ విషయంలో ఏది చేసినా అది నీ మంచికే. నా కూతురు మహారాణిలా బ్రతకాలి."
"నాకు అలాంటి ఆశ లేదు నాన్నా!.. మామూలు మనిషిగా బ్రతికి పదిమంది చేత.. మంచి పిల్లననిపించుకోవాలి. అంతే"
"అలాగా!.. సరే.. ఇక నీవు వెళ్ళవచ్చు!"
దీప్తి ఒకసారి తండ్రి ముఖంలోకి పరీక్షగా చూచి.. తన గదిలోకి వెళ్ళిపోయింది.
అంతవరకూ వారి సంభాషణను వింటూ నిలబడి వున్న ప్రణవి మౌనంగా వెనుతిరిగింది. ఆమెను చూచిన ప్రజాపతి..
"ప్రణవీ!.. నేను నీకు చెప్పిన విషయాన్ని దీపుకు చెప్పు!" అన్నాడు.
"అలాగే.." క్లుప్తంగా జవాబు చెప్పి ప్రణవి దీప్తి గదిలోనికి వెళ్ళిపోయింది.
దీప్తి ప్రక్కన మంచంపై కుర్చుంది. దివాకర్ విషయంలో ప్రజాపతి తనకు చెప్పిన విషయాన్ని విపులంగా వివరించింది. చివరగా "దీపూ!.. నీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలుసు. ఈశ్వర్ నీకు అన్ని విధాలా తగినవాడు. అతనితోనే నీ వివాహం జరగాలి. నేను.. పరిస్థితులననుసరించి ఏం చెప్పినా విని.. నా నిర్ణయానుసారంగా నీవు నడుచుకోవాలి. ధైర్యంగా మీ నాన్నను ఎదిరించాలి. అర్థం అయిందా!.."
దీప్తి కొన్నిక్షణాలు తల్లి ముఖంలోకి పరీక్షగా చూచింది.
"ఏమిటే!.. అలా చూస్తున్నావ్!" అడిగింది ప్రణవి.
"అమ్మా!.. బావ!.." ఆగిపోయింది దీప్తి.
"నిన్ను ఏమన్నా అన్నాడా!.."
"లేదు.."
"మరేంటి?"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"నిన్న నాతో ప్రీతిగా మాట్లాడాడమ్మా!"
"అంటే!"
"నేను వచ్చినప్పటి నుంచీ నిన్న మాట్లాడినట్లుగా అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"దాని అర్థం!" అడిగింది ప్రణవి.
"ఆ మాటల్లో నామీద తనకున్న అభిమానం వ్యక్తమయిందమ్మా!.." మెల్లగా చెప్పింది దీప్తి.
"మీ అత్తామామలు ఏమన్నారు?.."
"వారిరువురికీ నేనంటే ఎంతో ప్రేమ.."
"అయితే.. ఇంకా సందేహం ఎందుకు? ఈశ్వర్ నీకు కాబోయే భర్త" నవ్వింది ప్రణవి.
"మరి నాన్నా!.." సందేహంతో తల్లి ముఖంలోకి చూచింది దీప్తి.
"మీ నాన్న అహంకారి, స్వార్థపరుడు. వారిని గురించి నీవు ఆలోచించి నీ బుర్రను పాడుచేసికోకు. వారందరితో కలిసి ఢిల్లీకి వెళుతున్నావు కదా!.. సమయం చూచి నీ నిర్ణయాన్ని ఈశ్వర్కు చెప్పు.. సరేనా!"
"అలాగేనమ్మా!"
"నేను మా వదిన లావణ్యతో మాట్లాడుతాను. ఆమెకు నేనంటే ఎంతో అభిమానం. నా కోర్కెను కాదనదు."
"మరి మామయ్య!."
"ఆయన ధర్మరాజు. మీ అత్తయ్య మాటను ఏనాడూ కాదనడు!" నవ్వింది ప్రణవి.
ప్రజాపతి ఆ గదిని సమీపించి గొంతు సవరించాడు.
దీప్తి.. ప్రణవి ఉలిక్కిపడి ద్వారం వైపు చూచారు. ప్రణవి మంచం దిగి ప్రజాపతిని సమీపించింది.
"ఏమండీ!.. ఏమన్నా కావాలా!.." అడిగింది ప్రణవి.
"అమ్మాయితో విషయం చెప్పావా!"
"చెప్పానండీ!"
"ఏమండి?"
"సిగ్గుతో మౌనంగా తల దించుకుంది"
"అంటే మౌనం అంగీకార సూచనేగా!"
అవునన్నట్లు ప్రణవి తలాడించింది.
ఐదు నిముషాల క్రిందట ప్రజాపతికి నాగమణి ఫోన్ చేసింది. తన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరానని చెప్పింది. ఆ కారణంగా ప్రజాపతి చెన్నైకి బయలుదేరాడు.
"అర్జంటు పనిమీద చెన్నై బయలుదేరుతున్నాను. వచ్చేదానికి రెండురోజులు పట్టవచ్చు జాగ్రత్త" చెప్పాడు ప్రజాపతి.
"మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి" అంది ప్రణవి.
ప్రజాపతి వేగంగా పోర్టికో వైపుకు నడిచాడు.
***
శివరామకృష్ణ వ్యాపారంలో భాగస్థుడు దండాయుధపాణి. నందిని పందిగా, పందిని నందిగా మార్చగల సమర్థుడు. ఎంతటివారినైనా తన నక్క వినయంతో, చమత్కారమైన మాటలతో.. ఆకట్టుకోగల ప్రజ్ఞాశాలి. అతనిలోని ఆ లక్షణాలు నచ్చినందున శివరామకృష్ణ అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకొన్నాడు ఐదు సంవత్సరాల క్రిందట.
నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఐదవ సంవత్సర ఆరంభం నుంచి ఆ దశ మారిపోయింది.
దానికి కారణం.. దండయుధపాణి చాకచక్యం.. అతనిలో దినదినాభివృద్ధిగా పెరిగిన స్వార్థం.
స్వార్థం.. ప్రతి ఒక్కరికి పైకి రావాలని వుంటుంది. శివరామకృష్ణ కొడుకులు చంద్రం, రాఘవ, వైశాలి, శారదల వివాహాలు జరిగాయి. కొడుకులిద్దరూ తల్లి, తండ్రి ప్రమేయం లేకుండా వారితో చదివిన గొప్ప ఇంటి అమ్మాయిలను వివాహం చేసుకొని అర్థాంగుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో స్థిరపడిపోయారు. కూతుళ్ళ వివాహం శివరామకృష్ణ ఇష్టానుసారంగానే జరిగాయి. వారూ తమ భర్తలతో ఒకరు బొంబాయిలో, మరొకరు చైన్నైలో వుంటున్నారు. కొడుకులు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి శివరామకృష్ణ ఇంట్లో చుట్టాలుగా నాలుగురోజులు ఉండి, సువిశాల భారతదేశంలోని ముఖ్యపట్టణాలైన కాశ్మీర్, ఊటి, కోడైకెనాల్, ననెటాల్ మొదలగు సుందర ప్రదేశాల్లో ఆనందంగా తన అర్థాంగులతో గడిపి విదేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు.
హరికృష్ణకు తాను ఇచ్చిన మాట ప్రకారం.. వాణిని తన కొడుకు చంద్రశేఖర్కు ఇల్లాలిగా చేయలేకపోయాడు. కారణం చంద్రశేఖర్ తన క్లాస్మేట్ దివ్య అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న కారణంగా వరించి అక్కడే వివాహం చేసుకొన్నాడు.
ఇక, .. రెండవవాడు రాఘవ.. ఆస్ట్రేలియాలో వుంటూ తన తోటి ఆఫీస్లో పనిచేసే ఇండియన్ క్రిస్టియన్ యువతి రోసిని ప్రేమించి వారి పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాలోని చర్చిలో వివాహం చేసుకొన్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
ఆవిధంగా ఎదిగి ప్రయోజకులైన కుమారులు ఇరువురూ.. తమ వివాహాలను తల్లీతండ్రి ప్రమేయం లేకుండా చేసుకొన్నారు.
తమ కుమారులు ఆ రీతిగా మారిపోతారని శివరామకృష్ణ - ఊర్మిళ వూహించలేదు. ఆ కారణంగా మగపిల్లల మీద ఆ దంపతులకు ఎలాంటి ఆశలూ మిగలలేదు.
ముఖ్యంగా చివరివాడు విష్ణు. జన్మతః అంధుడు. అతని గురించి పెద్దవారైన చంద్రశేఖర్, రాఘవలు పట్టించుకోకుండా విదేశాల్లో వున్నందున.. విష్ణును ఆ దేశాల్లో వుండే మంచి డాక్టర్లకు చూపించలేదని ఆ దంపతుల మనస్సున వున్న పెద్ద కొరత.
ఆర్థాంగుల మాటల ప్రకారం నడుచుకొనే ఆ అన్నదమ్ములు ఇండియాకు వచ్చినప్పుడు.. విష్ణు విషయాన్ని శివరామకృష్ణ ఊర్మిళలు ప్రస్తావిస్తే.. వినిపించుకొనే వారు కారు. వారి ఆ చర్య ఆ దంపతులకు ఎంతో బాధను కలిగిందేది. ఎదిగి స్వతంత్రులైన కొడుకులను గురించి తలచుకొని విచారపడేవారు.
కూతుళ్ళు అల్లుళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఓ వారంరోజులు వుండి వెళ్ళిపోయేవారు.
వయస్సు మీరిన తమని, గ్రుడ్డివాడైన విష్ణును ఎవరూ పట్టించుకోకుండా తయారైనందున ఏకాంతంలో తమ సంతతి గొప్ప గుణాలను తలచుకొని కన్నీరు కార్చేవారు.
శివరామకృష్ణ కుటుంబ పరిస్థితిని బాగా గ్రహించిన దండాయుధపాణి.. తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని సంవత్సరంలోపల కంపెనీ లాస్లో మునిగిపోయేలా చేసి క్రింది వారినందరినీ తన గుప్పెట్లో పెట్టుకొన్నాడు. నష్టపు తాలూకు ఋణాల పట్టిని శివరామకృష్ణ ముందు వుంచాడు.
కంపెనీ ఛైర్మన్ స్థానంలో వున్న శివరామకృష్ణ.. తనకు తానుగా పదవీ విరమణ చేసి కంపెనీ నుంచి బయటికి పోయేలా చేశాడు.
శివరామకృష్ణ కంపెనీలో తన భాగాన్ని దండాయుధపాణికి ఋణాలను తీర్చేదానికి అప్పగించి వట్టి చేతులతో కంపెనీ నుంచి బయటికి వచ్చాడు.
ఇరువురు వ్యక్తుల మధ్యన అది గొప్పదని చెప్పుకోతగినది మంచి స్నేహం.. శివరామకృష్ణ ఎంతగానో నమ్మిన దండాయుధపాణి అతన్ని మోసం చేశాడు. సంతతి వల్ల శాంతిలేని శివరామకృష్ణ కంపెనీ ఛైర్మన్గా తన బాధ్యతలను పర్యవేక్షణను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. అతనిలోని ఆ బలహీనతను దండాయుధపాణి.. తన సామర్థ్యాలతో సద్వినియోగం చేసుకొన్నాడు. శివరామకృష్ణను అనామకుడిగా మార్చేశాడు.
ఈ సన్నివేశం జరిగిన పదిరోజుల్లో మరో ఇరువురు మార్వాడీలు శివరామకృష్ణను కలుసుకొని.. మాకు కంపెనీ కోటిరూపాయలు బాకీ పత్రాల మీద మీరే సంతకం చేసి వున్నారు. ఎప్పుడు చెల్లుస్తారని నిలదీసి అడిగారు. వారి మాటలకు శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు. తనకంటూ వున్నది ఓ భవంతి. దాదాపు కోటిన్నర ఖరీదు చేసేది. వారితో ఎలాంటి వాదనను కొనసాగించకుండా.. శివరామకృష్ణ వారంరోజుల్లో చెల్లిస్తానని క్లుప్తంగా జవాబు చెప్పాడు.
మీరు చెల్లించకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఇంటిని వేలం వేయించి మా సొమ్మును మేము రాబట్టుకొంటామని బెదిరించి వెళ్ళిపోయారు. ’ఒకప్పుడు.. నన్ను కలిసికొనేటందుకు గంటల తరబడి నా వాకిట నిలబడినవారు.. నేడు నన్ను శాసించే స్థితికి ఎదిగారు. ఆ కారణంగానే తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంటిని అమ్మి వారి సొమ్మును వారికి ఇవ్వాలి. ఈ విశాఖపట్నం వదిలి నా వూరికి నా హరికృష్ణ వద్దకు వెళ్ళాలి. హరి నా బంధువు, ప్రాణస్నేహితుడు. మంచి మనసున్నవాడు. నా ఊర్మిళల శేష జీవితం ప్రశాంతంగా ఆ వూర్లో సాగే దానికి వాడు.. నా హరి..తన చేతిని నాకు అందిస్తాడు’ అనుకొన్నాడు శివరామకృష్ణ.
ఆరోజు కార్తీకమాసం తొలి సోమవారం. లావణ్య, ప్రణవి, శార్వరి, దీప్తి ఉపవాసం. నలుగురూ సాయంత్రం ఆరుగంటలకు శివాలయానికి వెళ్ళారు. ప్రమిదలతో జ్యోతులను వెలిగించారు. జగన్మాతాపితలను దర్శించారు. తమ తమ కోర్కెలను విన్నవించుకొన్నారు.
లావణ్య ’మాతా పితా.. రేపటి మా ఢిల్లీ ప్రయాణం ఆనందంగా సాగాలి. నా ఈశ్వర్కు దీప్తి భార్య కావాలి. శార్వరికి సీతాపతి కావాలి. దీప్తి ప్రారంభించాలనుకొన్న హాస్పిటల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభం కావాలి. చెడు స్నేహాలవల్ల నా అన్నయ్య ప్రజాపతి తత్వంలో వచ్చిన మార్పు.. వాడికి మాకు వున్న అభిప్రాయభేదాలు సమసిపోయి మా నాన్న అమ్మల హాయంలో మాదిరిగా మారెండు కుటుంబాలు ఏకం కావాలి. తమేవ కరుణా కటాక్షాన్ని మాపై చూపండి. నా కోర్కెలు తీరేలా చేయండి’ ఎంతో భక్తితో వేడుకొంది.
శార్వరి.. ’నా బావ సీతాపతి అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మారెండు కుటుంబాల పెద్దలు విరోధులుగా వున్నారు. నా నిర్ణయం ద్వారా ఆ పగ పెరగకూడదు. నా అభిప్రాయాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేను. అక్క వాణిలా సాహసించలేను. మీరే నాయందు దయచూపి నా కోర్కె తీరేలా చేయాలి. త్వరలో రానున్న పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించి అమ్మా నాన్నలకు ఆనందం కలిగించాలి. వారి ఆనందమే నా ఆనందం’ కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో జగన్మాతాపితలను ధ్యానించింది.
ప్రణవి.. ’తండ్రీ సర్వేశ్వరా!.. మాతా మహేశ్వరీ.. మావారిలోని రాక్షసతత్త్వాన్ని మార్చండి. మంచి మనిషిగా అందరి అభిమానాన్ని పొందేలా చేయండి. నా కూతురు ఈశ్వర్కు ఇల్లాలుగా, శార్వరి నా ఇంటి కోడలుగా అయ్యేలా చేయండి. నా బిడ్డల వివాహాలు వారు కోరుకున్న వారితో జరిపించే మనస్తత్వాన్ని మా వారికి ప్రసాదించండి. మావారి అవివేకంతో విడిపోయిన మా రెండు కుటుంబాలు మా పిల్లల హాయంలో కలిసేలా చూడండి. మీ తలపులకు ఈ సృష్టిలో అతీతం అన్నది ఏదీ లేదు. నా విన్నపాన్ని చిత్తగించండి. నా కోర్కెలను నెరవేర్చండి’ దీనాతిదీనంగా కన్నీటితో వేడుకొంది ప్రణవి.
దీప్తి..’తండ్రి విశ్వనాథా!.. మాతా అన్నపూర్ణమ్మా.. నేను సంకల్పించి హాస్పిటల్ ఈ నా గ్రామంలో వెలిసేలా చూడండి. పేదలకు వైద్యం చేయాలనే నా సంకల్పాన్ని నెరవేర్చండి. మా బావ ఈశ్వర్తో నా వివాహం.. మా నాన్నగారి సమ్మతితో జరిగేలా చూడండి. మా అత్తయ్య కుటుంబంపై మా నాన్న మనస్సులో వుండే ద్వేషాన్ని చంపి.. ఆ స్థానంలో అభిమానాన్ని నింపండి. నాన్న శేష జీవితంలో మంచి మనిషిగా మారి బ్రతికేలా చూడండి. ఈ నా కోర్కెలు సరైనవైతే.. మీరు తప్పక నెరవేరుస్తారని మీ మీద నాకు నమ్మకం’ భక్తి శ్రద్ధలతో జగన్మాతా పితలను ధ్యానించింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|