Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
లావణ్య, హరికృష్ణలు కైలాసపతిని ఒకసారి కన్నీటితో చూచి తలలు త్రిప్పుకొని ఇంటి సింహద్వారాన్ని దాటారు.
కైలాసపతి భోరున ఏడ్వసాగాడు చేతులతో తలను పట్టుకొని. మద్రాస్లో చదువుతున్న ప్రజాపతి పిల్లలు దీప్తి.... సీతాపతులు శలవుల కారణంగా ఇంటికి వచ్చారు.
ఇంట్లోని సభ్యుల మధ్యన జరిగిన సంభాషణనను విని.. ఏడుస్తూ ఓమూల కూర్చుని వున్నారు అక్కాతమ్ముడు, అమ్మా నాన్న, అత్తామామలు వెళ్ళిపోగానే కైలాసపతిని సమీపించి వారికి రెండువైపులా చేరి ’నానమ్మ చనిపోయిందిగా తాతయ్యా!’ అని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు.
కన్నీటితో తలాడిస్తూ వారిరువురినీ తన ముసలి హృదయానికి హత్తుకొని కన్నీరు కార్చాడు కైలాసపతి.
వీధిలో శివరామకృష్ణ హరికృష్ణకు, లావణ్యకు ఎదురైనాడు. హరికృష్ణను కౌగలించుకొని...
"ఏరా!... పెద్ద అమ్మ వెళ్ళిపోయిందా!..." భోరున ఏడ్చాడు.
అతను హరికృష్ణకు లావణ్యకు ఎంతో ఆత్మీయుడు. బాధలో వున్నవారికి ఆత్మీయులు కంటబడితే... అంతవరకూ వారు తమ హృదయంలో అణచిపెట్టుకొన్న ఆవేదన ఉప్పెనలా పొంగి బయటపడుతుంది. హరికృష్ణ, లావణ్యల విషయంలో అదే జరిగింది. నడివీధిలో ఒక ప్రక్కన కొన్ని నిముషాలు నిలబడిన వారు... వారి హృదయవేదనను పంచుకొన్నారు. ఒకరినొకరు ఓదార్చుకొన్నారు. మెల్లగా హరికృష్ణ ఇంటివైపుకు నడిచారు. అప్పటికి శివరామకృష్ణ ఆ వూరు వదలివెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు.
అతని పిల్లలు... చంద్రం వయస్సు పాతిక సంవత్సరాలు. బి.ఎస్సీ ఫస్ట్ క్లాసులో పాసై ఎం.ఎస్సీ చేసేటందుకు అమెరికా వెళ్ళి. ఎం.ఎస్ పూర్తికాగానే అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. రెండవవాడు రాఘవ. వయస్సు ఇరవై మూడు. కంప్యూటర్ ఇంజనీర్ ముగించి.. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. పెద్ద కూతురు వైశాలికి పాతిక సంవత్సరాలు. వివాహం అయింది. ఆమె బొంబాయిలో భర్తతో హాయిగా కాపురం చేస్తూ వుంది. చంద్రం, వైశాలీలు కవలలు. నాల్గవ సంతతి కూతురు శారద. వివాహం అయ్యి భర్తతో చెన్నైలో వుంది. ఐదవ సంతతి విష్ణు. జన్మతః అంధుడు. వయస్సు పదిహేడు సంవత్సరాలు. దీప్తి కన్నా రెండు నెలలు పెద్ద. హరికృష్ణ పిల్లలు దినకర్ ఇంజనీరింగ్ ముగించి అమెరికా వెళ్ళిపోయాడు. శివరామకృష్ణ పెద్దకొడుకు చంద్రం, దినకర్ల మధ్య వయస్సు తొమ్మిది నెలల వ్యత్యాసం. రెండవ సంతతి వాణి. వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. ఎం.ఎస్సీ చదువుతూ ఉంది. మూడవవాడు ఈశ్వర్. బి.ఎ ముగించి బి.ఎల్ చదువుతున్నాడు. నాల్గవ సంతతి శార్వరి. టెన్త్ చదువుతూ ఉంది. వయస్సు పదిహేను సంవత్సరాలు. ప్రజాపతి పిల్లలు... పెద్దకుమార్తె దీప్తి వయస్సు పదిహేడు. ఇంటర్ సెకండ్ ఇయర్. చివరివాడు సీతాపతి ప్లస్ వన్లో జాయిన్ అయినాడు వయస్సు పదహారు.
హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ ఇంటి వరండాలో ప్రవేశించారు. వాకిట వున్న వాణి, శివరామకృష్ణను చూచి నవ్వుతూ "మామయ్యా! బాగున్నారా!... అత్తయ్యా, విష్ణు బాగున్నారా!" ప్రీతితో పలకరించింది.
"అంతా బాగున్నారమ్మా!"
ముగ్గురూ కూర్చున్నారు. వారి ముఖ భంగిమలు గమనించిన వాణి గ్రాండ్ మదర్ రుక్మిణి హఠాత్ మరణం తమకంతా ఎంత బాధను కలిగించిందో అలాగే... శివరామకృష్ణ కూడా బాధపడుతున్నారని గ్రహించింది.
వారి చింతనను మార్చాలని... "మామయ్యా!.... మీకు కాఫీ అంటే చాలా ఇష్టంగా!.... రెండు నిముషాల్లో తీసుకొస్తాను" వంటగది వైపుకు పరుగెత్తింది వాణి.
"ఏరా హరీ!.... మీ ఇద్దరినీ చూస్తుంటే... పెదనాన్నగారింట్లో మీకు, ప్రజాపతి మధ్యన ఏదో గొడవ జరిగినట్లనిపిస్తుంది. నా ఊహ నిజమేనా!" మెల్లగా అడిగాడు శివరామకృష్ణ.
"అవును..." నిట్టూర్చి చెప్పాడు హరికృష్ణ.
"ఏం జరిగిందిరా!"
"అన్నయ్యా! వారి తత్వం మీకు తెలుసుగా!.... వారు చెప్పలేరు. నేను చెబుతాను వినండి."
ప్రజాపతి వచ్చిన తర్వాత జరిగిన సంభాషణనంతా విన్నంతా చెప్పింది లావణ్య.
అంతా విన్న శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు.
"వాడు అంత మాట అన్నాడా!"
"అవును..." ఖచ్చితంగా చెప్పింది లావణ్య.
"ఇక నన్ను చూస్తే ఏమంటాడో!"
"నేను చెప్పనా!" అడిగిండి లావణ్య.
"పెద్దతల్లి విచారింపుకు వచ్చావా!.... పెదనాన్నను అడిగి ఏదైనా లాక్కుపోవడానికి వచ్చావా!.... అని అడుగుతాడు!" కసిగా చెప్పింది లావణ్య.
"ఏందమ్మా నీవు అనేది!..." ఆశ్చర్యంతో అడిగాడు శివరామకృష్ణ.
"వాడు నిన్ను చూచిన వెంటనే అనబోయే మాటను నేను మీకు చెప్పాను. వాడు పూర్తిగా మారిపోయాడు. తన మన అయినవాళ్ళం అనే భావన వాడిలో నశించింది అన్నయ్యా!" విచారంగా చెప్పింది లావణ్య.
హరికృష్ణ లావణ్య ముఖంలోకి చూచి విరక్తిగా నవ్వాడు.
అతని ముఖ భంగిమను చూచిన శివరామకృష్ణ.
"ఏమిట్రా ఆ నవ్వు!...." ఆశ్చర్యంతో అడిగాడు.
"నీ చెల్లెలు చెప్పింది అక్షర సత్యం!...."
"అలాగా!"
"అవునురా!.... లావణ్య చెప్పినట్లుగా వాడు పూర్తిగా మారిపోయాడు. వాడు ఇప్పుడు మన చిన్ననాటి ప్రజాపతి కాదు" విచారంగా చెప్పాడు హరికృష్ణ.
వాణి... మూడు కాఫీ కప్పులతో వరండాలోకి ప్రవేశించింది. ముందు శివరామకృష్ణకు.... తర్వాత తల్లితండ్రికి అందించింది. శివరామకృష్ణ కాఫీని సిప్ చేశాడు.
"ఎలా వుంది మామయ్యా!.... బాగుందా....! చక్కెర సరిపోయిందా!" నవ్వుతూ అడిగింది వాణి.
"అమృతంలా వుందమ్మా!... ఇంత బాగా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా!"
"ఇందులో నా గొప్పతనం ఏమీలేదు మామయ్యా!... మా అమ్మగారి శిక్షణ అలాంటిది. అంటే... మీ ప్రశంసలు మా అమ్మకే చెందుతాయి" నవ్వుతూ చెప్పింది వాణి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"ఈశ్వర్, శార్వరీలు ఎక్కడ?"
"వాళ్ళు మొన్న అమ్మమ్మను చివరిసారిగా చూచేదానికి వచ్చారు. చూచారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈ ఉదయమే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు" చెప్పాడు హరికృష్ణ.
శివరామకృష్ణ కాఫీ త్రాగి కప్పును టీపాయ్ పై వుంచాడు. వాకిటివైపు చూచాడు.
కైలాసపతి, దీప్తి లోనికి రావడాన్ని ఆ నలుగురూ గమనించారు.
లావణ్య, వాణి వారిని చూచి పరుగున ఎదురువెళ్ళారు సమీపించారు.
"అత్తయ్యా! తాతయ్య మిమల్ని చూడాలని వచ్చారు" బుంగమూతితో చెప్పింది దీప్తి.
"నాన్నా!... ఏం నాన్నా!... మేము వచ్చి అరగంట కూడా కాలేదు... నీవు..."
"అక్కడ నాకు శాంతి లేదురా!... అందుకే వచ్చాను" విచారంగా చెప్పాడు కైలాసపతి.
తండ్రి చేతిని ప్రీతిగా తన చేతిలోనికి తీసుకొంది లావణ్య.
"తాతయ్యా!.... రండి" మరోచేతిని వాణి పట్టుకొంది.
హరికృష్ణ, శివరామకృష్ణ వారిని సమీపించారు.
శివరామకృష్ణ, కైలాసపతి భుజాలను పట్టుకొని....
"పెదనాన్నా!... పెదనాన్నా!... మా పెద్ద అమ్మ!..." బొంగురుపోయింది కంఠం మాటలు బయటికి రాలేదు.
"ఆఁ... తాను మహరాణిలా వెళ్ళిపోయిందిరా... వెళ్ళిపోయింది...." కన్నీరు కార్చాడు కైలాసపతి.
తనచేతిని వారి వీపు పైవుంచి మెల్లగా వరండా వరకూ నడిపించాడు శివరామకృష్ణ.
అందరూ వరండాలో ప్రవేశించారు.
"కూర్చోండి నాన్నా!..."
చేతిని పట్టుకొని కైలాసపతిని కుర్చీలో కూర్చునేలా చేసింది లావణ్య.
"ఆఁ..." నిట్టూర్చాడు కైలాసపతి.
"నాన్నా!..."
’ఏం’ అన్నట్లు తలాడించాడు కైలాసపతి.
"ఆయాసంగా వుందా!..." మోకాళ్ళపై వారి ఎదుట కూర్చుని దీక్షగా కైలాసపతి ముఖంలోకి చూస్తూ అడిగింది లావణ్య.
వారికి ఇరుప్రక్కల నిలబడిన హరికృష్ణ... శివరామకృష్ణ వారినే పరీక్షగా చూస్తున్నారు.
ఇక... పిల్లలు వాణి, దీప్తి విచారంగా వారందరినీ చూస్తూ నిలబడ్డారు.
" నాన్నా!... కొద్దిగా పాలు తాగుతావా!..." అడిగింది లావణ్య.
"అలాగే అమ్మా!..." మెల్లగా చెప్పాడు కైలాసపతి.
వెంటనే లేచింది లావణ్య.
"అమ్మా!... నీవు తాతయ్య దగ్గర కూర్చో... నేను వెళ్ళి తీసుకొస్తాను."
క్షణంసేపు కూతురు ముఖంలోకి చూచి ఆగిపోయింది లావణ్య.
వాణి, దీప్తి ఇంట్లోకి వెళ్ళారు.
"వదినా!..."
"ఏం దీపూ!..."
"నాయనమ్మ ఎలా చనిపోయింది?"
వాణి ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచింది.
"నాకు మాత్రం... ఏం తెలుసే... నేనూ వూర్లో లేనుగా!... అందరూ అనుకొంటున్నారు.... వయస్సు అయింది. వెళ్ళిపోయిందని" పాలను గ్లాసులో వంచుతూ చెప్పింది వాణి.
"కాదు..."
"మరేమిటి?..."
"మా నాన్నే కారణంగా!..."
"అంటే!..."
"మా నాన్న మంచివాడు కాదటగా... ఆ దిగులుతో నానమ్మ చనిపోయిందట" విచారంగా చెప్పింది దీప్తి.
"నీకు ఈ విషయం ఎవరు చెప్పారు?..."
"మా అమ్మ!..."
ఇరువురూ వరండాలోకి వచ్చారు. తన చేతిలోని పాలగ్లాసును తల్లిచేతికి అందించింది వాణి.
లావణ్య గ్లాసును కైలాసవతికి అందించింది.
"మెల్లగా తాగు నాన్నా!..."
కైలాసపతి గ్లాసును అందుకొన్నాడు.
పాలు త్రాగడం ప్రారంభించాడు.
అందరూ వారినే చూస్తున్నారు.
పాలు తాగిన గ్లాసును లావణ్య కైలాసపతి చేతినుండి అందుకొని వాణికి అందించింది. వాణి లోనికి వెళ్ళిపోయింది. దీప్తి ఆమెను అనుసరించింది.
"ఒరే!.... శివరామకృష్ణా!..."
"ఏం పెదనాన్నా!..."
"పిల్లలందరూ... నా కోడలు బాగున్నారా!..."
"మీ ఆశీర్వాద బలంతో అంతా బాగున్నారు పెదనాన్నా!..."
"కొడుకుల్ని అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపావట కదా!..."
"అవును పెదనాన్నా!... ఉద్యోగరీత్యా వెళ్ళారు"
"రాకపోకలు వున్నాయా!..."
"ఆఁ సంవత్సరానికి ఒకసారి వచ్చి... దాదాపు నెలరోజులు వుండి వెళుతుంటారు. ఇప్పటికి రెండు పర్యాయాలు వచ్చారు."
"వారి వివాహాన్ని గురించి ఏం ఆలోచన!..."
"పెద్దవాడికి మన వాణిని ఇచ్చి వివాహం జరపాలని నా కోర్కె పెదనాన్నా!..."
హరికృష్ణ, లావణ్యలు ఆశ్చర్యంతో శివరామకృష్ణ ముఖంలోకి చూచారు.
"అవునురా!... అమ్మా లావణ్యా!... అది నా మనస్సులోని మాట..." నవ్వాడు శివరామకృష్ణ.
"ఏమ్మా లావణ్యా! విన్నావుగా శివరాముడి కోర్కెను... మీ దంపతులు ఏమంటారు?..."
"మీ మాటను... వాడి మాటను మేము ఏనాడూ కాదనలేము కదా మామయ్యా!" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"నాన్నా!... వాణికి ఇంకా చదువు పూర్తికాలేదుగా... అయిన తర్వాత మా ఈ అన్నయ్య మాట మీద నిలబడితే... వాణి వారి కోడలే అవుతుంది నాన్నా!...."
"సమాజాన్ని చుట్టేసింది పాశ్చాత్య నవనాగరీకత... బంధుత్వాలు, బాంధవ్యాలు, విలువలు మారిపోతున్నాయి. ఎన్నో వింతలు వింటున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. ఏది ఏమైనా మనదంటూ మనకు మన పెద్దలు నేర్పిన మంచి సంస్కారాలను మరిచిపోకూడదు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో వింత కథనాలు, వివాహాలు జరిగిన కొద్దినెలల్లోనే విడాకులు. వాడు ఆ ప్రజాపతి మీ దారికి రాడు కాబట్టి మీ ఇద్దరైనా బంధుత్వాలను తెంచుకోకుండా... ఇచ్చి పుచ్చుకొనే భావంతో... మీ జీవిత కాలంలో కలిసిమెలసి ఉండాలనేది నా కోరిక... ఆ శుభకార్యాలను చూచేంత పొద్దు నాకులేదు" విచారంగా చెప్పాడు కైలాసపతి.
"పెదనాన్నా! ఏమిటా మాటలు! మీరు నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. మా పిల్లల పెండ్లి మీ ఆధ్వర్యంలోనే మీ ఎదుటనే జరుగుతుంది." అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అమ్మా!... కొందరి భావన ప్రకారం నేను ఇక్కడికి రావడమే తప్పు. నాకు అటువంటి మాటల మీద నమ్మకం లేదు. అందుకే వచ్చా!... మీ అందరి అభిమానం, మాటలు నాకు కొంత శాంతిని కలిగించాయి. ఇకనే బయలుదేరుతానమ్మా!... ఆ పిల్లని పిలువు!...." చెప్పాడు కైలాసపతి.
"మామయ్యా! లోకుల మాటలను మనం పట్టించుకోకూడదుగా!... మనమీద అభిమానం వుంటే మనం ఏం చేసినా ఆకాశానికి ఎత్తేస్తారు. మనం గిట్టకుంటే... విమర్శలు ప్రారంభిస్తారు. మీవరకూ..... మీ దృష్టిలో మీకు ఆ ఇల్లు ఎంతో ఈ ఇల్లూ అంతే మామయ్యా. మీరు ఇక్కడే వుండండి వెళ్ళవద్దు" అభిమానంతో చెప్పాడు హరికృష్ణ.
"అవును నాన్నా!.... మీరు అక్కడికి వెళ్ళవద్దు. ఇక్కడే వుండండి" ప్రీతిగా చెప్పింది లావణ్య.
"వద్దు తల్లీ!.... వద్దు... నన్ను వెళ్ళనీ!... అమ్మా దీపూ రారా!... ఇంటికి వెళదాం!..." కుర్చీ నుంచి లేచాడు కైలాసపతి.
వారి గొంతును విన్న దీప్తి వరండాలోకి వచ్చింది. అంతవరకూ వాణితో చదువుల విషయాన్ని గురించి మాట్లాడుతూ వుండింది.
"తాతయ్యా!.... పిలిచారా!..."
"అవున్రా... ఇంటికి పోదాం పద!..."
"హరీ!... నేనూ పెదనాన్నతో వెళ్ళి ప్రజాపతిని, ప్రణవిని పలకరించి వస్తాను" అన్నాడు శివరామకృష్ణ.
"సరే... వెళ్ళిరా!... వాడు ఏమన్నా అంటే ఆవేశపడకు!..."
శివరామకృష్ణ నవ్వి... "అలాగేరా!..."
"అన్నయ్యా!... త్వరగా వచ్చేయండి"
"సరే అమ్మా!...."
కైలాసపతి, దీప్తి, శివరామకృష్ణ వీధి గేటువైపుకు నడిచారు. వారి వెనకాలే హరికృష్ణ, లావణ్య వీధి గేటువరకూ వచ్చారు. "జాగ్రత్త నాన్నా" అంది లావణ్య.
అలాగే అన్నట్లు తలాడించాడు కైలాసపతి.
ఆ ముగ్గురూ వీధిలో ప్రవేశించారు. దారిన వెళుతున్న వారు... కైలాసపతిని చూచి నమస్కరించారు. శివరామకృష్ణ కుటుంబ విషయాలను పరామర్శించారు.
ఆ ముగ్గురూ వీధి మలుపు తిరిగే వరకూ వీధిగేటు వద్ద నిలబడి వుండిన హరికృష్ణ, లావణ్య, వాణి నిట్టూర్చి లోనికి నడిచారు.
పదినిముషాల్లో కైలాసపతి, శివరామకృష్ణ, దీప్తి కైలాసపతి నిలయంకి చేరారు.
ముగ్గురూ హాల్లో ప్రవేశించారు.
"అమ్మా!...." పిలిచింది దీప్తి.
"ఎవరు వచ్చారో చూద్దువుగాని రా!..." అంది.
ప్రణవి హాల్లోకి వచ్చింది. శివరామకృష్ణను చూచి భోరున ఏడ్చింది.
శివరామకృష్ణ.... కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సమాళించుకొని....
"వూరుకో అమ్మా!.... నిన్ను నీవే సమాళించుకోవాలి. ఈ మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన దానవు నీవే కదమ్మా!.... పిల్లలకు మామయ్యకు... మీవారికి వూరటను, శాంతిని నీ మంచిమాటల వలన కలిగించాలి. దైవాన్ని నిత్యం కొలిచేదానివి ఆ దైవం మీద ఎంతో నమ్మకం వున్నదానివి. నీవు దిగాలు పడిపోతే... వీరంతా ఏమౌతారో ఆలోచించమ్మా!...." మెల్లగా అనునయంగా చెప్పాడు. శివరామకృష్ణ. కైలాసపతి తన గదికి వెళ్ళిపోయాడు. మంచంపై పడుకొన్నాడు.
దీప్తి, సీతాపతి తల్లి వెనక చేరారు.
సమాళించుకొన్న ప్రణవి "కుర్చోండి బావగారూ!... అక్కా పిల్లలు అంతా బాగున్నారుగా!" అడిగింది.
అవునన్నట్లు తలాడించాడు శివరామకృష్ణ.
"మా తమ్ముడేడమ్మా?"
"మేడ పైన వారి గదిలో వున్నారు బావగారూ!"
"నేను వచ్చానని వాడికి చెబుతావా అమ్మా!"
"నేను చెబుతాను పెదనాన్నా!" పరుగున సీతాపతి మెట్లు ఎక్కాడు.
తల్లి వెనుక నిలబడి తననే చూస్తున్న దీప్తిని చూచాడు శివరామకృష్ణ.
దగ్గరకు రమ్మని చేతితో సౌంజ్ఞ చేశాడు.
"వెళ్ళు.... పిలిస్తున్నది మీ పెదనాన్నగారు!..." అంది ప్రణవి.
దీప్తి బెరుకు ముఖంతో శివరామకృష్ణను సమీపించింది.
ఆమె కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని...
"అమ్మా! ఏం చదువుతున్నావ్?"
"ఇంటర్ సెకండ్ ఇయర్"
"తర్వాత ఏం చేయాలనుకొంటున్నావ్!"
"డాక్టర్ చదవాలనుకొంటున్నాను"
"గుడ్.... నీవు తప్పక డాక్టర్వే అవుతావు... అమెరికా వెళతావు"
"ఆ విషయం మీకు ఎలా తెలుసు!..."
నవ్వి "తల్లీ! నీ ముఖం మా పెద్దమ్మ ముఖం... ముమ్ముర్తులా నీవు మా పెద్దమ్మవే!..."
"అందరూ నేను మా లావణ్య అత్తయ్యలా వుంటానని అంటారు. మరి మీరు!..."
"లావణ్య అత్తయ్య అమ్మగారెవరు!.. మీ నానీ!"
అవునన్నట్లు తలాడించింది దీప్తి అమాయకంగా.
"ఆఁ... నానీ పోలిక అత్తయ్య!... అత్తయ్య పోలిక నీవు!... మరి మొదటి స్థానం ఎవరిది?"
"మా నానీదే!"
"అందుకే అన్నాను. నీవు అంతా మా పెద్దమ్మవని!" నవ్వాడు శివరామకృష్ణ.
దీప్తి అందంగా నవ్వింది.
ఎంతో ఆవేదనతో అత్తగారి వియోగంతో బాధపడుతున్న ప్రణవి పెదవులపై చిరునవ్వు విరిసింది.
సీతాపతి మేడ దిగి వచ్చాడు.
"ఏడిరా మీ నాన్న!..." అడిగింది ప్రణవి.
"నిద్రపోతున్నాడు లేపాను, వస్తున్నాడమ్మా!"
ప్రజాపతి మెట్లు దిగసాగాడు.
శివరామకృష్ణ అతనికి ఎదురు నడిచాడు.
"ఏరా! దారితప్పి వచ్చినట్లున్నావ్?...." వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి.
"దారిని మరిచినవాడు... దారి తప్పటం సహజం. మరువని వాడు ఎన్నటికీ దారి తప్పడురా! నేను నా వూరిదారిని నా వాళ్ళను మరువలేదురా. ఇదిగో ప్రజా! అమ్మ వెళ్ళిపోయిందని హరి చెప్పగానే ఎంతగానో బాధపడ్డాను. దూరాన వున్నందున అంతిమ చూపులకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చాను. నావారైన మీ అందరినీ చూడాలని. పెదనాన్నకు వయసు మీరింది. వారిని జాగ్రత్తగా చూచుకోరా!... ప్రస్తుతంలో వారు ఎంతో బాధలో వున్నారు. వారికి ధైర్యం చెప్పి ఆసరగా నీవే కదరా నిలబడాలి. వారికి ఒంటరితనాన్ని కల్పించకు. రోజులో కొంత సమయం వారితో గడుపు... చిన్నవాడికి చెప్పడం నా ధర్మం చెప్పాను" ఎంతో అభిమానంతో చెప్పాడు శివరామకృష్ణ.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"ముగిసిందా!.... ఇంకా ఏమైనా ఉందా!" వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి.
"నేను నీకు చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పేశానురా!"
"సంతోషం!.... నాకు పని వుంది బయటికి వెళుతున్నాను...."
"ఇప్పుడే కదండి బావగారు వచ్చారు! కొంతసేపు వారితో...." ప్రణవి మాట పూర్తిచేయక మునుపే....
"నీవు మాట్లాడు!" ప్రణవి ముఖంలోకి తీక్షణంగా చూచి ప్రజాపతి వెళ్ళిపోయాడు.
అతనిలో మార్పును... మాటతీరును చూచిన శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు.
"ఆయన పూర్తిగా మారిపోయారు బావగారూ!" కన్నీటితో చెప్పింది ప్రణవి.
"అమ్మా!.... మనిషిలో మార్పు రావడం సహజం. దానికి ఎన్నో కారణాలు!... ఈ ఇంట్లో మా పెదతల్లి స్థానంలో వున్న నీవే నిగ్రహంతో అన్నింటినీ అందరినీ జాగ్రత్తగా చూచుకోవాలి. సహనం, శాంతం వాటిని రెండు కళ్ళులా భావించాలి. నీకు నీ పిల్లలకు వాడికి ఆ దేవుడు తప్పక మేలు చేస్తాడు." అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ.
"దీపూ! పద... తాతయ్య ఏం చేస్తున్నారో చూద్దాం" అన్నాడు శివరామకృష్ణ.
నలుగురూ కైలాసపతి గదిలో ప్రవేశించారు. వారు నిద్రపోతున్నారు. కళ్ళనుంచి కారిన కన్నీటి చారలు చెక్కిళ్ళపై కనిపిస్తున్నాయి.
"నిద్రపోతున్నారు... లేపవద్దు... పదండి" మెల్లగా చెప్పాడు శివరామకృష్ణ.
నలుగురూ వరండాలోకి వచ్చారు.
"అమ్మా దీపూ, బాబు సీతాపతీ బాగా చదవాలి. గొప్పవాళ్ళుగా కావాలి. అమ్మను, నాన్నను బాగా చూచుకోవాలి సరేనా!"
ఆ ఇరువురు పిల్లలు ’సరే’ అన్నట్లు తలలు ఆడించారు.
"అమ్మా ప్రణవీ! జాగ్రత్త... మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన బాధ్యత నీది"
అందరి ముఖాల్లోకి చూచి కనుసన్నతోనే వెళుతున్నానని చెప్పి... శివరామకృష్ణ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలోకి ప్రవేశించాడు.
హరికృష్ణ ఇంటికి చేరి... తనకు ప్రజాపతికి జరిగిన సంభాషణను వారికి వివరించాడు.
మరుదినం...
ఊరికి బయలుదేరాడు శివరామకృష్ణ.
"హరీ!... లావణ్యా!... పెదనాన్న ముందు వాణి విషయంలో నేను చెప్పింది ఒట్టిమాట కాదు. అది మా దంపతుల నిర్ణయం. మీరిరువురూ ఆలోచించుకోండి. మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ.
"అలాగే అన్నయ్యా!...." అంది లావణ్య.
దంపతులు ఇరువురూ స్టేషన్కు వచ్చి శివరామకృష్ణను రైలు ఎక్కించారు.
అతను ఎక్కిన రైలు వైజాగ్ వైపుకు బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 828
Threads: 0
Likes Received: 1,297 in 733 posts
Likes Given: 3,329
Joined: Jun 2020
Reputation:
50
(24-12-2024, 05:39 PM)k3vv3 Wrote:
అతను ఎక్కిన రైలు వైజాగ్ వైపుకు బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
K3vv3 garu!!! Very good story.
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 9
హరికృష్ణ కుటుంబంపై.. ద్వేషాన్ని పెంచుకొన్న ప్రజాపతి తల్లి రుక్మిణమ్మకు జరుపవలసిన రెండువారాల తర్వాతి కర్మ కార్యక్రమాన్ని తన ఇంట్లో జరిపితే హరికృష్ణ, శివరామకృష్ణలు వారి కుటుంబ సభ్యులు వస్తారని ఆ కార్యక్రమాలను కాశీలో జరుపాలని నిర్ణయించుకొన్నాడు. అదే ప్రకారం తన ప్రియురాలు నర్స్ నాగమణితో రెండురోజులు ముందుగా వారణాసికి చేరాడు.
ఆ వార్త విన్న హరికృష్ణ, లావణ్యలు ఆశ్చర్యపోయారు. ఆ పెద్దకర్మను కూడా గతించిన పండు ముత్తయిదువు రుక్మిణమ్మకు కొడుకు స్థానంలో నిలబడి, తన ఇల్లాలు లావణ్య ఇష్టానుసారంగా, హరికృష్ణ యధావిధిగా నిర్వహించాడు. సువర్ణదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, నవధాన్యదానాదులను ఆ దంపతులు ఎంతో శ్రద్ధతో చేశారు.
ప్రణవి, దీప్తి, సీతాపతులు, హరికృష్ణ పిల్లలు ఆ కార్యక్రమాలను ఆశ్చర్యంతో తిలకించారు.
కాశీలో ప్రజాపతి జరిపించిన తంతు తనవారెవ్వరూ ఆ కారణంగా తన ఇంటికి రాకూడదని...
కానీ..హరికృష్ణ నిర్వహించిన కార్యక్రమం... మనసావాచా కర్మణా తన అత్తగారి ఆత్మకు శాంతి కలగాలని!....
మహా ఇల్లాలు... సుమంగళి రుక్మిణమ్మగారికి అల్లుడు... కొడుకు.. ఒకేసారి స్వస్థలంలో... కాశీలో ఖర్మకాండలను నిర్వహించారనే ఘనత ఆ తల్లికి దక్కింది.
జననమరణాలు జీవిత ధర్మం... సత్యం... ’పుట్టుట... గిట్టుట కొరకే’ కాల చక్రపరిభ్రమణంలో... ఆయా సమయాల్లో అవి జీవుల విషయంలో క్రమం తప్పకుండా జరిగిపోతుంటాయి. నూతన విజ్ఞానానికి అతీతం మానవ నిర్మాణం... దాన్ని ఆపే శక్తి ఇంకా నూతన విజ్ఞానానికి రాలేదు.
అప్పటికి రుక్మిణమ్మగారు గతించి ఆరుమాసాలు. ఆ గత ఆరుమాసాల్లో భార్యా వియోగంతో... కొరకరాని కొయ్యగా తయారైన కొడుకు ప్రజాపతి తత్వరీత్యా... ఎంతో మనోవ్యధకు లోనైనాడు కైలాసపతి.
ఆరుమాసాల కాలంలో ప్రజాపతి తండ్రితో మాట్లాడింది ఐదుసార్లుమాత్రమే!
అతను వూర్లో లేని రోజుల్లో కైలాసపతి కూతురు లావణ్య ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ వున్న రెండు మూడు రోజులు హరికృష్ణ, లావణ్య, దివకర్, వాణి, ఈశ్వర్, శార్వరీల మధ్యన ఎంతో ఆనందంగా వుండేవాడు. కొడుకు రాబోతాడని తెలిసిన వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా నడుచుకొనే దానికి కారణం... కైలాసపతి కొడుకు ప్రజాపతికి భయపడికాదు, అతని ముఖంచూచి మాట్లాడేదానికి ఇష్టంలేక.
కోడలు ప్రణవి మామగారిని ఎంతో అభిమానంతో చూచేది. మనవరాలు దీప్తి, మనవడు సీతాపతి చదువు రీత్యా చెన్నైలో వుంటున్న కారణంగా ఆవులు, గేదెలను చూచుకొంటూ గతాన్ని తలపోసుకొంటూ జీవితాన్ని భారంగా గడిపాడు కైలాసపతి.
వారంరోజులు రానని ప్రజాపతి ప్రణవికి చెప్పి చెన్నై వెళ్ళిపోయాడు. కైలాసపతి తన కూతురు ఇంటికి చేరాడు. ఐదురోజులు ఆనంద నిలయంలో అల్లుడు, కూతురు, మనమలు, మనవరాండ్ర మధ్యన ఎంతో ఆనందంగా గడిపాడు.
ఆ ఆరవరోజు సోమవారం మనుమలు, మనవరాండ్రతో శివాలయానికి వెళ్ళాడు. ఆలయం చుట్టూ ఆరు ప్రదక్షిణాలు చేశాడు. గర్భగుడిలో ప్రవేశించి... సర్వేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ... ’తండ్రి!... కడతేర్చు!... కడతేర్చు!’ అన్నాడు. వారి శిరం దైవసన్నిధిలో నేలను త్రాకింది. ప్రక్కనే ప్రక్కనే వున్న పిల్లలు... అదేపని చేశారు. రెండు నిముషాల తర్వాత పిల్లలు పైకి లేచారు. ’తాతయ్యా!...’ అని పిలిచారు. ఆ తాత నుండి జవాబు లేదు. పరమజ్ఞాని... దయార్థహృదయుడు... బంధుప్రియుడు... కైలాసపతి గారి శకం ముగిసిపోయింది. వారి ఆత్మ వినువీధిలో తిరుగుతున్న రుక్మిణమ్మ ఆత్మను ఆనందంగా చేరింది.
పనిమనిషి రంగమ్మ... ప్రజాపతి ఆఫీస్ గదిని వూడ్చి క్రింద పడి వున్న ఇన్ల్యాండ్ లెటర్ను చేతికి తీసుకొని హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న ప్రణవి, దీప్తి, సీతాపతిలను సమీపించి "అమ్మా! ఈ జాబు అయ్యగారు టేబుల్ కింద వుందమ్మా!" ప్రణవికి అందించింది.
ఫ్రమ్ అడ్రస్ చూచి అది వాణి వ్రాసిన వుత్తరం అని గ్రహించి...
చింపుదామా వద్దా అని కొన్నిక్షణాలు ఆలోచనలో మునిగిపోయింది.
"ఈ రోజుల్లో ఎవరమ్మా ఉత్తరాలు వ్రాస్తున్నారు తలచుకొంటే... సెల్లో మాట్లాడుతున్నారుగా!" అంది దీప్తి.
"ఆ వుత్తరాన్ని వ్రాసింది వాణి దీపూ!"
"అలాగా!"
"అవును..."
"ఏం వ్రాసి వుంటుంది?"
"చింపి చూస్తేగా తెలిసేది!"
"వుత్తరం మీ నాన్నగారి పేరున వచ్చింది. చింపనా వద్దా అని ఆలోచిస్తున్నాను"
"వుత్తరం వ్రాసిన వాణి ఆయనకు ఎంత ముఖ్యమో మనకూ అంతేగా!... యిలా యివ్వు నేను విప్పి చదువుతాను" అంది దీప్తి.
ప్రణవి వుత్తరాన్ని దీప్తికి అందించింది.
వుత్తరాన్ని విప్పి దీప్తి చదవసాగింది.
"పూజ్యులు... గౌరవనీయులైన మామగారికి మీ వాణి నమస్కారములతో వ్రాయునది.
మామయ్యా!.... నేను గడచిన మూడు సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఫోన్ చేశాను. మీరు నా కాల్ను కట్ చేసేవారు! నాకు ఎంతో బాధగా అనిపించేది. ఒక్కసారి కూడా నాతో మాట్లాడేదానికి మీకు సమయం లేకపోయిందా!... లేక మీపట్ల... నేను.. ఏమైనా తప్పుచేశానా!... నాకు తెలిసినంత వరకూ నేను ఏ తప్పూ మీ విషయంలో చేయలేదు. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహాన్ని జరిపించారు. మీరు నాకు చేసిన మేలును నేను ఎన్నటికీ మరువలేదు.. మరువబోను..
అత్తయ్యా, సీతాపతి ఎలా వున్నారు. బాగున్నారని తలుస్తున్నా!... మా అమ్మా నాన్న ఈశ్వర్, శార్వరీలు బాగున్నారా మామయ్యా!... నేను వారి విషయంలో తప్పుచేసిన దాన్ని. వారు నను క్షమిస్తారనే ఆశ నాకు లేదు. మీరంతా నావారైనందున మీతో ఇరవై నాలుగు సంవత్సరాలు కలిసి మీలో ఒకదానిలా వుండి.. మీ అందరి ఆదరాభిమానాలను చూచిన నేను ఎన్నటికీ ఎవరినీ మరిచిపోలేను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
ప్రతిరోజూ నేను ఆ సర్వేశ్వరుణ్ణి ఏమని కోరుకుంటానో తెలుసా మామయ్యా!.... నావారంతా క్షేమంతా ఆనందంగా వుండాలని... రోజులు గడిచేకొద్ది... నా మనస్సులోని మాటను మీకు చెప్పి నేను చాలా పెద్ద తప్పుచేశాననిపిస్తూ వుంది మామయ్యా!... దానికి కారణం...నా స్వయం నిర్ణయం... మీరంతా నావారుగా ఉండీ కూడా నేను... ఎవరూ లేని ఏకాకికైనానని నాకు ఎంతో బాధ మామయ్యా!... కనీసం... మీరు నా ఈ ఉత్తరానికైనా... మీ అందరి క్షేమసమాచారాలతో నాలుగు పంక్తుల ఉత్తరాన్ని వ్రాయండి మామయ్యా. అది నాకు కొంత వూరట కలిగిస్తుందని నా ఆశ...
దీప్తి అమెరికాలోనే వుందిగా!.... అది మన దేశానికి ఎప్పుడు వస్తుంది మామయ్యా!... నాకు ఒకే ఆశ... దాని పెండ్లికి మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను. ఎవరి పలికినా పలకకపోయినా నేను అందరినీ చూడగలుగుతాను. దీప్తి పెండ్లి విషయాన్ని నాకు మీరు తప్పకుండా తెలియజేస్తారుగా మామయ్యా!... ప్లీజ్ తెలియజేయండి. అత్తయ్యకు నేనంటే ఎంతో ప్రాణం. అత్తయ్య ఎలా వుంది మామయ్యా. ఆమెకు దేవుని మీద ఎంతో నమ్మకం.... భక్తి... నా కోర్కె నెరవేరాలని నేనూ... అత్తయ్యలా పూజలు, పునస్కారాలూ, ధానదర్మాలు చేస్తున్నాను. ఆ దేవుడు... నన్ను కరుణించి నా మొర ఆలకిస్తాడనే నమ్మకంతో... మీ జాబుకోసం వేయికళ్ళతో ఎదురు చూచే మీ మేనకోడలు..."
’వాణి’
ఉత్తరాన్ని సాంతం చదివేసరికి... దీప్తి కళ్ళలో కన్నీరు... మెల్లగా తలను తిప్పి తల్లి ముఖంలోని చూచింది.
ప్రణవి నయనాల్లో అశ్రువులు... కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేని స్థితి.
సీతాపతి... అమ్మను, అక్కను చూచి... దీప్తి చేతిలోని వుత్తరాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు. అప్రయత్నంగా అతని దృష్టి ఉత్తరం ఆరంభంలో వున్న తేదీ మీద పడింది. ఆశ్చర్యపోయాడు.
"అక్కా!... ఈ వుత్తరం వచ్చి ఇప్పటికి తొమ్మిది నెలలు. వదిన వ్రాసిన తేదీని చూచావా!" ఆశ్చర్యంతో చెప్పాడు సీతాపతి.
"ఎప్పుడు వ్రాసిందిరా!" అడిగింది దీప్తి.
"పదహారు ఆరు రెండు వేల పదిహేను"
"ఏమిటీ తొమ్మిది నెలలైందా!"
"అవునమ్మా!...."
"అంటే వుత్తరాన్ని మీ నాన్నగారు!..."
"విప్పి చూడలేదమ్మా!" అన్నాడు సీతాపతి.
"దీపూ విన్నావా!"
"విన్నానమ్మా!... నాన్న ఎంతగా మారిపోయారనే దానికి ఈ వుత్తరమే సాక్షి" విచారంగా చెప్పింది దీప్తి. నిట్టూర్చి కళ్ళు మూసుకొంది.
"వచ్చిన ఉత్తరాన్ని విప్పి చదవలేదంటే.... నాన్నకు ఆ కుటుంబం వారిమీద ఎంత పగో!... నిజంగా నాన్న మారిపోయాడమ్మా!" మెల్లగా చెప్పాడు సీతాపతి.
"అవును నాన్నా!.... ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు!" అంది ప్రణవి.
"అక్కయ్యా!... ఏం ఆలోచిస్తున్నావు?..."
"విడిపోయిన మన రెండు కుటుంబాలు కలుస్తాయో లేదా అని..." అంది దీప్తి.
"తప్పకుండా కలుస్తాయి అక్కా!"
"ఎలారా!"
"మనం తలుచుకొంటే!"
ఆశ్చర్యంగా చూచారు సీతాపతి ముఖంలోకి దీప్తి, ప్రణవి.
"అవునమ్మా! సీతూ చెప్పింది నిజం!" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"బాలవాక్యం... బ్రహ్మవాక్యం... అదే జరిగితే నాకు ఎంతో ఆనందం" నవ్వుతూ చెప్పింది ప్రణవి.
"అమ్మా!...."
"ఏమిటి తల్లీ!..."
"నేను ఢిల్లీ వెళ్ళి వస్తాను"
"ఎందుకు?"
"వాణి వదినను చూచేదానికి"
"మీ నాన్నగారు ఒప్పుకోవాలిగా!"
"ఒప్పిస్తానమ్మా!"
"ఎలా!"
"అమ్మా!.... అక్క చిన్నప్పటి నుంచీ తాను తలచుకొన్నది సాధించని రోజు అంటూ వుందా!... ఆ నా తండ్రికి ఈ కూతురంటే చాలా చాలా ఇష్టం కదా!.... ఈమె ఏది కోరినా వారు కాదనరు!..." నవ్వాడు సీతాపతి.
"అయితే మీ నాన్నగారు రాగానే అడుగుతావా!"
"నిర్భయంగా అడుగుతా!..." అంది దీప్తి.
"వద్దు... అంటే!"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అనరు.... అనబోరు!... నా మాట నమ్మమ్మా!.." నవ్వింది దీప్తి.
"మరి ఆ ఉత్తరాన్ని ఏం చేయాలే... మీ నాన్నగారికి చూపిస్తావా!..." అమాయకంగా అడిగింది ప్రణవి.
"నా దగ్గర భద్రంగా వుంచుకొంటాను. నీవు భయపడకు మాతా!..." నాటకీయంగా చెప్పింది దీప్తి.
ముగ్గురూ ఆనందంగా నవ్వుకొన్నారు.
సీతాపతి స్నేహితుడు ప్రవీణ్... హితుడు వచ్చాడని చూచేదానికి వచ్చాడు. వరండాలో కూర్చొని వున్న సీతాపతి క్షణం తర్వాత లేచి స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. ఇరువురూ కూర్చున్నారు.
"ఏరా! ప్రవీణ్.... ఏమిటి విశేషాలు?..." అడిగాడు సీతాపతి.
"ఎందుకురా నవ్వుతున్నావ్?"
"అడగదలుచుకొన్నదేదో సూటిగా అడగవచ్చు కదరా!"
"అడిగినట్లే అనుకొని చెప్పు"
"శార్వరి వచ్చింది" చిరునవ్వుతో చెప్పాడు ప్రవీణ్.
"నీతో మాట్లాడిందా!"
"ఆఁ..."
"నన్ను గురించి అడిగిందా!"
"ఏమిటీ!..."
"నీ చెవులకు ఏమన్నా ప్రాబ్లమారా!" విసుగ్గా అడిగాడు సీతాపతి.
"ఇంతవరకూ అలాంటిదేమీ లేదు."
"అయితే నా ప్రశ్నకు జవాబు!.."
మళ్ళా నవ్వాడు ప్రవీణ్.
"ఏందిరా!... ఆ వెకిలి నవ్వు!..."
"అక్కా.... అమ్మా ఇంట్లో లేరా!..."
"మామిడితోటకు వెళ్లారు..."
"ఎందుకు?..."
"అక్క చూడాలంది."
"అవున్లే... ఐదేళ్ళ తర్వాత వచ్చిందిగా!..."
"మరి... నా ప్రశ్నకు జవాబు!..."
"శార్వరీ!..."
"ఏదైనా కబురు పంపిందా!..."
"తమరికి అంత సీన్ లేదు బావా!..."
"ఓసారి చూడాలిరా... మీ ఇల్లు వారి పక్క ఇల్లేగా... పోదామా!" ఆత్రంగా అడిగాడు సీతాపతి.
"పద..."
"ఎక్కడికి!..."
"శివాలయానికి..."
"అక్కడికి ఎందుకురా!..."
"నీవు చూడాలనే వారిని చూచేటందుకు... వారు అటు వెళ్ళారు. నేను ఇటు వచ్చాను."
"వా...వా... నిజంగా నీవు నా ప్రాణ స్నేహితుడివిరా!..." సింహద్వారం వైపు చూచి "రంగమ్మా!... నేను శివాలయం దాకా వెళ్ళిస్తాను. అమ్మ వస్తే చెప్పు..." కాస్త హెచ్చుస్థాయిలో చెప్పాడు సీతాపతి.
పరుగున హాల్లోకి వచ్చిన రంగమ్మను చూచి... "నేను చెప్పింది వినపడిందా!" అన్నాడు సీతాపతి.
"పడిందండే!..." నవ్వుతూ చెప్పింది రంగమ్మ.
మిత్రులిద్దరూ వీధిలో ప్రవేశించారు.
"ఒరేయ్ సీతూ!... నేనో మాట అడుగుతా నిజం చెప్పాలి!..."
"అడుగు..."
"నీవు వూరికి వస్తున్నట్లు శార్వరికి ఫోన్ చేశావా!"
"లేదు... తనే నాకు చేసింది..."
"అంటే మీ మధ్యన...."
"సెల్ఫోన్ సంభాషణ సాగుతూ వుంది..."
"అంటే!..."
"శార్వరి నాకు కాబోయే భార్యరా!... నీకు చెల్లెలు కదా!..." నవ్వాడు సీతాపతి.
"ఈడుజోడు బాగుంది. వావివరసలూ బాగున్నాయ్!.... మరి రెండు కుటుంబాల మధ్యనా!!!"
"సంబంధ బాంధవ్యాలు లేవు... అదేగా నీవనాలనుకొన్నది!"
"శార్వరి ఎవరు?"
"మీ అత్తయ్య కూతురు"
"నేనెలా వున్నాను?"
"ఆఁ..."
"చెప్పరా!... నేను ఎలా వున్నాను?..."
"హీరోలా వున్నావు..."
నవ్వాడు సీతాపతి.
"ఒరేయ్!.... నిజం చెబుతున్నా!... శార్వరికి నేనంటే ఇష్టం... నాకు శార్వరి అంటే ఎంతో ఇష్టం..."
"మీ ఇద్దరి మధ్యన మీ నాన్న వున్నారుగా! విలన్!... ప్రస్తుతంలో నిప్పులో ఉప్పేసినట్లుగా వుంది కదరా మీ రెండు కుటుంబాల మధ్యన... మీ పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా!..."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
సీతాపతి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
కొన్నిక్షణాల తర్వాత...
"అవును... నీవు అన్నమాట నిజమే!... కానీ కాలం... చాలా పవరైందిరో... మన సంకల్పం సరిగా వుండాలి... జరగవలసిన టైమ్కు అన్నీ సవ్యంగా జరుగుతాయి. నాకు ఆ నమ్మకం వుంది" చిరునవ్వుతో చెప్పాడు సీతాపతి.
ఇరువురూ శివాలయాన్ని సమీపించారు. లోనికి ప్రవేశించారు.
సీతాపతి... ప్రణవ్... కళ్ళు శార్వరిని వెదుకుతున్నాయి.
శార్వరి తన అమ్మా, నాన్న పేరున అర్చన చేయించి గుడిచుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించింది. ఆలయం నిండా జనం. శివలింగానికి నమస్కరించి సీతాపతి కూడా ఆలయ ప్రదక్షిణ ప్రారంభించాడు. మూడు చుట్లు పూర్తయినాయి.
స్వామిని దర్శించి ప్రదక్షిణను ముగించిన వారు ప్రహారీగోడ ప్రక్కన కూర్చుని వున్నారు తమ కుటుంబ సభ్యులతో.
శార్వరి... ఓ ప్రక్కన కూర్చొని కళ్ళు మూసుకొంది.
నాల్గవ ప్రదక్షిణను చేస్తూ ఇరువురు మిత్రులూ... శార్వరిని వెదుకుతూ తిరిగారు. గోడ ప్రక్కన కూర్చుని వున్న శార్వరిని ప్రవీణ్ చూచాడు.
నవ్వుతూ "ఒరేయ్ బావా!.... అదుగో మా చెల్లి..." అన్నాడు.
తొట్రుపాటుతో సీతాపతి ప్రవీణ్ చెప్పినవైపు చూచాడు. అతనికళ్ళల్లో ఎంతో ఆనందం.
మెల్లగా వెళ్ళి కొంచెం దూరంగా శార్వరి ప్రక్కన కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకొన్నాడు.
ప్రవీణ్... ఇరువురినీ చూస్తూ నిలబడ్డాడు.
కొన్ని నిముషాల తర్వాత శార్వరి కళ్ళు తెరిచి లేచింది. ఎదురుగా నిలబడి వున్న ప్రవీణ్ను చూచింది.
"ప్రవీణ్!... నీవెప్పుడొచ్చావ్!"
"నేను ఒక్కడినే రాలేదు" నవ్వాడు.
"మరి నీతో ఎవరొచ్చారు?"
ప్రవీణ్ చూపుడు వ్రేలితో సీతాపతిని చూపించాడు. శార్వరి సీతాపతిని చూచింది. పెదవులపై చిరునవ్వు.
సీతాపతి కళ్ళు తెరిచాడు. శార్వరి ముఖంలోకి చూచి నవ్వాడు.
శార్వరి సిగ్గుతో చిరునవ్వుతో తల దించుకొంది.
"వైజాగ్ నుంచి నీకోసం... చూడాలని వచ్చాను. ఎలా వున్నావ్ బావా అని అడగవా!" చిరునవ్వుతో అడిగాడు సీతాపతి.
"కళ్ళముందే వున్నావుగా!" మెల్లగా చెప్పింది శార్వరి.
"హైదరాబాద్కు ఎప్పుడు వెళతావ్!"
"వారంరోజుల తర్వాత..."
"రోజూ మనం కలిసికోగలమా!..."
"వీలుకాదు..."
"ఫోన్లో మాట్లాడొచ్చా!..."
"కుదరదు..."
"అయితే రేపు నన్ను వైజాగ్ వెళ్ళిపొమ్మంటావా!..."
"అది నీ ఇష్టం!..."
"నీకేం సంబంధం లేదా!..."
"ప్రస్తుతానికి లేదు.."
"తర్వాత...."
"దైవ నిర్ణయం... నేను హైదరాబాద్లో వుండేటప్పుడు అప్పుడప్పుడూ నీవు నాకు ఫోన్ చేసేవాడివి. నేను ఒంటరిగా వుంటే నీతో మాట్లాడేదాన్ని. అది కేవలం మనకున్న బంధుత్వరీత్యా!... నేటి మన రెండు కుటుంబాల మధ్యన వున్న సఖ్యత నీకు... నాకు బాగా తెలుసు. మా అమ్మనాన్నలు జరిగిన దానికి ఇప్పటికీ ఎంతగానో బాధపడుతున్నారు. మీ నాన్నగారు చేసిన చర్యకు నష్టపోయింది మేము. అవమానం పాలైనాము. నీ మనస్సున నాపట్ల వ్యామోహంతో కూడిన ఆశలను పెంచుకోకు. నీవు ఊహించినట్లు జరుగకపోవచ్చు. బంధుత్వాన్ని త్యజించాలనేది నా భావన కాదు. నా చర్యల వలన నా కుటుంబ సభ్యులు బాధపడకూడదనే నా అభిప్రాయం. మంచి మనస్సుతో అర్థం చేసికో.. బాగా చదువు... మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకో... జరుగబోయేది నా విషయంలో నా తల్లిదండ్రుల ఇష్టానుసారమే... నాకై నేను మా అక్కలా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోను. వెళుతున్నాను..." ఎంతో ఆవేశంతో చెప్పి శార్వరి వెళ్ళిపోయింది.
సీతాపతికి భ్రమ కమ్మినట్లయింది. నిశ్చేష్టుడై కొన్ని నిముషాలు నిలబడిపోయాడు. అతని వాలకాన్ని... చూచి ప్రవీణ్ కళ్లప్పగించాడు. కొన్నిక్షణాల తర్వాత...
"సీతూ.... శార్వరి వెళ్ళిపోయింది" మెల్లగా చెప్పాడు ప్రవీణ్.
"ప్రవీణ్!... శార్వరి మాటలు నీకు అర్థమైనాయా!..."
"అయినాయి బావా!..."
"ఏమర్థమయిందిరా!..."
"నిజం చెప్పనా!.... అబద్ధం చెప్పనా!..."
"నిజం చెప్పరా!...." కసరినట్లు అన్నాడు సీతాపతి.
"ప్రేమా... దోమా... అనే కబుర్లు నాకు చెప్పకు.. అలాంటి వాటిని నేను వినిపించుకోను. బుద్ధిగా చదువుకొని ప్రయోజకుడిగా తయారవ్వు..." అని హితోపదేశం చేసింది బావా నీకు" రెండు క్షణాలాగి "అవునూ నీకు చాలా బాధగా వుంది కదూ!..."
"లేదురా!.... నా కర్తవ్యం నాకు బాగా అర్థమయింది."
"అంటే?..."
"కొంతకాలానికి నీకే అర్థం అవుతుందిలే పద...." నిట్టుర్చి సీతాపతి ముందుకు నడిచాడు. ప్రవీణ్ అతన్ని అనుసరించాడు. వారికి మూడు వందల అడుగుల దూరంలో శార్వరి తన స్నేహితురాలు జ్యోతితో వెళుతూ వుంది.
సీతాపతి ఆమె వైపుకు పరుగెత్తాడు. రెండు నిముషాల్లో ఆమె ముందు నిలిచాడు. ప్రవీణ్ కూడా పరుగు ప్రారంభించాడు. శార్వరీ అతని ముఖంలో ఆశ్చర్యంతో చూచింది. ఆమె ముఖంలో అతని పట్ల అసహ్యత నిండుకుంది.
"ఒక ముఖ్యమైన మాట చెప్పాలని వచ్చాను. అలా చూడకు. తప్పుగా అనుకోకు"
"ఏమిటి?"
"వాణి వదిన మా నాన్నకు జాబు వ్రాసింది!..."
ఆశ్చర్యపోవడం శార్వరీ వంతు అయింది.
"ఎప్పుడు?"
"తొమ్మిది నెలల క్రింద!...."
"ఆఁ!..."
"అవును"
"ఏమని వ్రాసింది?..."
"పెండ్లి అయిన తర్వాత మనందరి క్షేమ సమాచారాలను తెలుసుకోవాలని మా నాన్నకు చాలాసార్లు ఫోన్ చేసిందట. కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆ కారణంగా చాలా ఆవేదనతో ఉత్తరం వ్రాసింది."
"నీవు చెప్పింది నిజమేనా!..."
"ఎవరి విషయంలోనూ... ఎవరితోనూ నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను శార్వరీ!..." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సీతాపతి.
కొన్నిక్షణాలు అతని ముఖంలోకి చూచి నిట్టూర్చి...
"థాంక్యూ!..." ముందుకు వేగంగా నడిచింది శార్వరి.
జ్యోతి ఆమెను అనుసరించింది. ప్రవిణ్ సీతాపతిని సమీపించాడు.
"బావా!.... మా చెల్లెమ్మ మహా ఘాటు కదూ!..." నవ్వాడు ప్రవీణ్.
"ఆఁ..... ఆఁ.... ముందేం జరుగుతుందో చూద్దాం పద..." అన్నాడు సీతాపతి. ఇరువురు నడక ప్రారంభించారు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 10
"ఎవరమ్మా మీరు...?" ఇంటి ముఖద్వారం తెరిచి అడిగాడు రామయోగి.
కొద్దిక్షణాల క్రిందట దీప్తి వారి ఇంటికి వెళ్ళి వరండాలోని కాలింగ్ బెల్ నొక్కింది.
"నా పేరు దీప్తి!... ప్రజాపతి గారి అమ్మాయిని!..."
"ఓ... నీవు దీప్తివా!..." ఆశ్చర్యంతో అడిగాడు రామయోగి.
"అవును అంకుల్... మీతో మాట్లాడాలని వచ్చాను."
"ఎంతగా మారిపోయావమ్మా... గడచిన ఐదేళ్ళలో... అమెరికాలో చదివావు కదా!..."
తలాడించింది చిరునవ్వుతో దీప్తి.
"కూర్చో అమ్మా!..."
కుర్చీలో కూర్చుంది దీప్తి.
రామయోగి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు.
"అడుగమ్మా!.... నీవు ఏమి అడగదలిచావో!" చిరునవ్వుతో చెప్పాడు రామయోగి.
"నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పనివుంది. మీ అబ్బాయి కళ్యాణ్ అడ్రస్ చెప్పండి అంకుల్!"
"ఎందుకమ్మా!...."
"మా వదిన వాణిని చూడాలి. చూచి చాలాకాలం అయిందిగా అంకుల్!..."
"ప్రస్తుతంలో మీ రెండు కుటుంబాలకు బద్ధ విరోధం కదమ్మా!..."
"మీరు అన్నమాట బహుశా మా రెండు కుటుంబాల పెద్దలకు వర్తిస్తుందో ఏమో!.... కానీ నాకు మాత్రం అందరం ఆనందంగా కలిసి బ్రతకాలనే కోరిక. మా వదిన... అదే మీ కోడలు వాణి చాలా మంచిది అంకుల్. తనకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకే ఒకసారి చూడాలనుకొంటున్నాను!" ఎంతో వందనంగా చెప్పింది దీప్తి.
"మీ నాన్నగారికి విషయం తెలుసా!..."
"వారు చెన్నై వెళ్ళి వున్నారు. రాగానే చెబుతాను..."
"వారు అంగీకరించకపోతే!..."
"మా నాన్న నా మాటను కాదనరు అంకుల్..."
"అలాగా!...."
"అవును!..."
"నీవు ఒక్కదానివే వెళుతున్నావా!... లేక మీ అత్తయ్యా వాళ్ళ ఇంటినుంచి నీతో ఎవరైనా వస్తున్నారా?..."
"ఆ ఇంటివారు ఎవరూ నాతో రావడం లేదు. ఢిల్లీలో నా స్నేహితురాలు వుంది. నేను ఢిల్లీ వెళ్లగానే వుండబోయేది ఆమె ఇంట్లోనే!..."
రామయోగి భార్య నిర్మల వరండాలోకి వచ్చింది దీప్తిని చూచి...
"ఎవరండీ ఈ అమ్మాయి?..." అడిగింది.
"మన ప్రజాపతిగారు కూతురు. అమెరికా నుంచి వచ్చింది"
అన్నాడు రామయోగి.
"నీపేరు దీప్తి కదూ!..."
"అవును ఆంటీ!..."
"మీ అమ్మగారు బాగున్నారా!.... తనకు నాకు మంచి స్నేహం" నవ్వుతూ చెప్పింది నిర్మల.
"అలాగా!... బాగున్నారండి..."
"మీ అమ్మది చాలా మంచి మనస్సు అమ్మాయ్!..."
చిరునవ్వు నవ్వి రామయోగి ముఖంలోకి చూచింది నిర్మల.
ఆ చూపుల్లోని భావాన్ని గ్రహించిన రామయోగి కుర్చీ నుంచి లేచి...
"రెండు నిమిషాల్లో వస్తానమ్మా!..."
"మంచిది అంకుల్"
రామయోగి లోనికి వెళ్ళిపోయాడు.
"పెళ్ళి ఎప్పుడు చేసుకొంటావ్?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది నిర్మల.
"మరో రెండేళ్ల తర్వాత"
"ఇప్పుడు నీ వయస్సెంత?"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
’ఏయ్!.... ముసలీ!.... నా వయస్సుతో నీకేం పనే!... మూసుకొని కుర్చీలో కూర్చోలేవా!... అధిక ప్రసంగం చేస్తున్నావ్!...’ అనుకొంది దీప్తి.
"మాట్లాడవేం?... నాకు ఎప్పుడు పెళ్ళయిందో తెలుసా!..."
’అబ్బా ఇది నన్ను వదిలేటట్లు లేదు. రామయోగీ! త్వరగా రావయ్యా!’ అనుకొని.
"ఎప్పుడయిందీ!..." దీర్ఘం తీస్తూ అడిగింది.
"పదిహేను ఏళ్ళకు..."
"అలాగా!...."
"అవునూ... ఇంతకూ నీ వయస్సెంతో చెప్పనేలేదు."
రామయోగి వరండాలోకి వచ్చాడు.
"ఈకాలం పిల్లలలాగే ఎవరినైనా లవ్వు గివ్వు చేశావా!..." నవ్వింది నిర్మల.
"అలాంటిదేమీ లేదు..." అంది దీప్తి.
తన చేతిలోని కాగితాన్ని దీప్తికి అందించాడు రామయోగి.
దీప్తి అందుకొంది.
"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు.
"ఓ వారంరోజుల లోపల..."
"అందులో మావాడి ఫోన్ నెంబర్ కూడా వ్రాశాను. ఫోన్ చేస్తే నీవు ఎక్కడ వున్నా మావాడు వచ్చి నిన్ను ఇంటికి తీసుకొని వెళతాడు. నేను వాడితో మాట్లాడుతాను" చెప్పాడు రామయోగి.
"ఎవరితోనండీ!..."
"మన అబ్బాయి కళ్యాణ్తో..."
"ఏం చెబుతావు?..." అడిగింది నిర్మల.
"తర్వాత చెబుతాను..." నవ్వాడు రామయోగి.
"అంకుల్!... థాంక్యూ! వెళ్ళిస్తాను...." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"మంచిదమ్మా!... వూరికి వెళ్ళేనాడు చెప్పు మా ఆవిడ ’ఆవకాయ’ పెట్టింది. కొంత నీచేతికి పార్శిల్ చేసి ఇస్తాను. మావాడికి ఇవ్వగలవా!..." అడిగాడు రామయోగి.
"తప్పకుండా అంకుల్!..." అంది దీప్తి.
వరండా మెట్లు దిగి తన కారువైపుకు నడిచింది.
శార్వరి... ఇంటికి చేరింది. ఆమె మనస్సు ఎంతో వ్యాకులంగా వుంది. సీతాపతి తన అక్క వాణిని గురించి చెప్పిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలా వద్దా అనేదే ఆమె సమస్య.
’నాన్నా!... దేనికీ తొందరపడరు. ఆవేశపడరు... ఆ విషయాన్ని వింటే బాధపడతారు. అమ్మ!....ఆవేశం ఎక్కువ... ఆక్కను ఎంతగానో అభిమానించి సాకింది. అక్క చేసిన పనికి ఎంతోకాలం బాధపడింది. ఇప్పుడిప్పుడే అక్క జ్ఞాపకాలకు దూరం అయినట్లుగా వుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని వారికి చెబితే... తప్పకుండా బాధపడతారు. అన్న ఈశ్వర్ సౌమ్యుడు. సహనం కలవాడు నాన్నలాగే. వాడితో విషయం చెబితే... ఆలోచించి ఏదో మంచి నిర్ణయం తీసుకొంటాడు.
అక్క చేసింది తప్పే!.... అంతమాత్రాన జీవితాంతం వరకూ ఆమెను వెలివేయడం తప్పు కదా!.... అక్క చేసింది నేరం ఎలా అవుతుంది?... తనకు నచ్చినవాడిని... తనంటే ఇష్టపడిన వాడిని వివాహం చేసికొంది. అలా జరిగివుండక పోవచ్చు. ప్రజాపతి మామయ్య విషయం తెలియగానే అమ్మానాన్నలకు చెప్పి వుంటే!.... తన రాజకీయ విజయానికి అక్కను అడ్డుపెట్టుకొని బంధుత్వాలను... కుటుంబ గౌరవాలను, రక్తసంబంధాన్ని మరిచిపోయి... నీచంగా ప్రవర్తించాడు. నా కుటుంబ సభ్యులందరికి ఎంతో ఆవేదనను కలిగించాడు. విషయం అమ్మా నాన్నలకు చెబితే... ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయి. కనుక విషయాన్ని చెప్పవలసింది ఈశ్వర్ అన్నయ్యకే!...’
అనేక విధాల ఆలోచించి శార్వరి చివరకు ఆ నిర్ణయానికి వచ్చింది. రాత్రి ఎనిమిదిన్నరకు నలుగురూ కలిసి భోజనం చేశారు. ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు. హరికృష్ణ, లావణ్యలు టీవీ ముందు కుర్చొని వస్తున్న పాత రుక్మిణీ కళ్యాణం సినిమాను చూడసాగారు.
శార్వరి... కొంతసేపు తన గదిలో వుండి మెల్లగా ఈశ్వర్ గదిలోనికి సమీపించి తలుపును తోసింది. లోన గడియ పెట్టనందున తలుపు తెరుచుకొంది. లోనికి చూచింది. ఈశ్వర్ ఆమెను చూచాడు.
"శారూ!.... పడుకోలేదా!..." అడిగాడు ఈశ్వర్.
"నిద్రరావడం లేదన్నయ్యా!..." అంటూ తలుపుమూసి అతన్ని సమీపించింది.
"రా.... కూర్చో!..."
శార్వరి మంచంపై కూర్చుంది.
ఆమె ముఖంలోకి చూచిన ఈశ్వర్కు... ఎప్పుడూ వికసితకమలంలా వుండే ఆమె ముఖంలో విచారం గోచరించింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"నా చెల్లి ముఖం అప్రసన్నంగా వుంది కారణం!..."
చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్.
"వుంది."
"ఏమిటది...?"
"నన్ను నీవు ఏమీ అనవు కదా!..."
"ఎందుకంటానమ్మా!.... నీవు నా ముద్దుల చెల్లెలివి కదా!"
"నేను ఒక విషయం విన్నాను...."
"ఏమిటో చెప్పు!..."
"శివాలయంలో సీతాపతి గాడు నన్ను కలిశాడు."
"సీతాపతా!..."
"అవును..."
"వాడు నీకన్నా పెద్దవాడు. ’గాడు’ అని అనడం తప్పుకదమ్మా!..."
"తప్పో ఒప్పో!... అసలు విషయం...!" ఆగిపోయింది శార్వరి.
"ఏమిటో చెప్పు శారూ!..."
"అక్క!..."
"ఎవరూ!"
"మన అక్క వాణి... ప్రజాపతి మామయ్యకు జాబు వ్రాసిందట."
తాను విన్న విషయాన్ని వివరంగా శార్వరి ఈశ్వర్కు చెప్పింది. చివరిగా "అన్నయ్యా!.... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే వారు బాధపడతారు కదా!... అందుకని నీకు చెప్పాను. అక్క ఎలా వుందో ఏమో...! సీతాపతి అక్కను గురించి చెప్పినప్పటి నుంచీ నాకు ఎంతో బాధగా వుంది. ఆలోచించి నీవే ఏదైనా చేయాలి అన్నయ్యా!..." దీనంగా చెప్పింది శార్వరి.
"అక్క మామయ్యకు తొమ్మిదినెలల క్రింద వ్రాసిందా ఉత్తరం!..." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"అవునట. ఆ వుత్తరాన్ని మామయ్య విప్పి చదవలేదట. ఈ రోజు పనిమనిషి ఇవ్వగా దీప్తి చదివిందట."
ఈశ్వర్ కొన్నిక్షణాలు శార్వరి ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పి శూన్యంలోకి... కిటికీ గుండా చూడసాగాడు. అతని మనస్సు నిండా తన అక్క వాణిని గురించిన ఆలొచనలే..
"మహారాణిలా ఈ యింట వుండిన వాణి అక్కయ్య.... తన వివాహ విషయంలో తాను తీసుకొన్న నిర్ణయం కారణంగా... తలిదండ్రులకు తోబుట్టువులకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ ఢిల్లీలో ఆ వ్యక్తితో ఆమె జీవితం ఎలా వుందో!... ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంతగానో బాధపడతారు. విషయం వారి చెవికి పోకూడదు’ అనుకొన్నాడు ఈశ్వర్.
"శారూ!... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పవద్దు..."
"అలాగే అన్నయ్యా!...." కొన్నిక్షణాల తర్వాత... "అన్నయ్యా!... నేను ఒక విషయం చెబితే తప్పుగా అనుకోవుగా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శార్వరి.
"అనుకోకురా!... చెప్పు..."
"నీవు... ఒకసారి..." ఆపింది శార్వరి... ఈశ్వర్ ఏమనుకొంటాడో అని.
"ఢిల్లీకి వెళ్ళి అక్కను చూచి వస్తే బాగుంటుంది. ఇదేగా నీవు చెప్పదలచుకొన్నది శారూ!"
"అవునన్నయ్యా!...."
వాణిని గురించిన ఆలోచనతో ఈశ్వర్... మౌనంగా వుండిపోయాడు.
"ఎప్పుడో జరిగినదాన్ని మనస్సున పెట్టుకొని జీవితాంతం అక్కను ద్వేషించడం వలన... మనమూ నేరం చేసినవాళ్ళమే అవుతాము కదా అన్నయ్యా!... అన్నిగుణాల్లోకి... క్షమాగుణం గొప్పదని మనం చదువుకొన్నాముగా!... మంచిని పాటించడం తప్పు కాదు కదా అన్నయ్యా!..." దీనంగా అడిగింది శార్వరి.
ఈశ్వర్ ఆమె ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచాడు.
అతని కళ్ళల్లో నీళ్ళు చుట్టుకొన్నాయి.
’నేను ఎత్తుకొని ఆడించి... మాటలు.. పాఠాలు నేర్పిన నా చెల్లి శార్వరిలో ఎంతటి ఉన్నత భావాలు!... ఎంత గొప్ప మనస్తత్వం!...’ అనుకొన్నాడు. లేచి ఆమెను సమీపించి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని "శారూ! నీకు అక్కని చూడాలని వుంది కదూ!..."
అవునన్నట్లు కన్నీటితో తలాడించింది శార్వరి. రెండు క్షణాల తర్వాత... "మరి నీకు!..." అడిగింది.
"నాకూ చూడాలని వుందిరా!... మనం ఢిల్లీకి వెళుతున్నాము."
"ఎప్పుడన్నయ్యా!..." ఆత్రంగా అడిగింది శార్వరి.
"నాలుగురోజుల్లో హైద్రాబాద్ వెళతాంగా!... అక్కడి నుంచి ఢిల్లీకి మనం పోదాం... అక్కను చూద్దాం!..."
"మరి అమ్మా నాన్నలతో!...."
"ఇప్పుడు ఏమీ చెప్పవద్దు.... మనం ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత... ఆలోచించి చెప్పే రీతిగా చెబుదాం. సరేనా!..."
"అలాగే అన్నయ్యా!... నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా వుందో తెలుసా!..."
"నీవు చెప్పక్కర్లేదమ్మా!.... నీ కళ్ళే చెబుతున్నాయ్!..." నవ్వాడు ఈశ్వర్.
"థాంక్స్ అన్నయ్యా!... వెళ్ళి పడుకొంటాను..." నవ్వుతూ చెప్పింది శార్వరి.
"మంచిదిరా!... వెళ్ళి.... పడుకో!...." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
శార్వరి ఆనందంగా నవ్వుకొంటూ గదినుండి బయటికి నడిచింది.
ప్రజాపతిగారు చెన్నై నుంచి తిరిగి వచ్చారు. ఉదయం అల్పాహారాన్ని సేవించి తన గదిలోకి ప్రవేశించారు. ఇరువురు వ్యక్తులు వారిని చూడాలని వచ్చారు. వాకిట ముందు నిలబడి వున్న వారిని దీప్తి చూచింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"వున్నారు... మీ పేర్లు!"
"సోమయ్య... చంద్రయ్య..."
"కూర్చోండి. నాన్నగారికి చెప్పి వస్తాను" లోనికి వెళ్ళింది దీప్తి.
"నాన్నా!.... మీకోసం సోమయ్య, చంద్రయ్య వచ్చారు."
"లోనికి రమ్మని చెప్పు"
దీప్తి ఆ గది నుండి బయటికి నడిచి వారిని లోనికి రమ్మని పిలిచింది.
ఇరువురూ... ప్రజాపతి గదిలో ప్రవేశించారు. వినయంగా నమస్కరించారు.
"ఆఁ... ఏందిరా!.... ఉదయాన్నే వచ్చారు!..." అడిగాడు ప్రజాపతి.
"అయ్యా!... మీరు మాకు ఓ సాయం చెయ్యాలి!" మెల్లగా చెప్పాడు సోమయ్య.
"ఏమిటది?"
"వీడు నా తమ్ముడు..."
"తెలుసు. మీకేం కావాలి?"
"ఈడి పిల్ల పెళ్ళీడుకొచ్చింది. పెండ్లి చేయాలనుకొంటున్నాము. తమరు..." ఆపేశాడు సోమయ్య.
"డబ్బు కావాలా!..."
"అవునయ్యా!...."
"ఎంత?..."
"ఓ యాభై వేలు..."
"యాభై వేలా!..."
"అవునయ్యా!.... ఆ మాత్రం కావాల!..."
"తిరిగి ఎప్పుడు ఇస్తావ్!..."
"ఓ రెండేళ్ళల్లో..." నసిగాడు సోమయ్య.
"వడ్డీరేటు ఎంతో తెలుసా!..."
"అయ్యా!..." ఆశ్చర్యంతో అన్నాడు సోమయ్య.
"మూడూ రూపాయలు... నూటికి నెలకు!..."
"తమరు మంచి మనస్సుతో సాయం చేయాలయ్యా!..."
ప్రాధేయపూర్వకంగా అడిగాడు సోమయ్య.
"చేస్తాను... వడ్డీరేటు మాత్రం అంతే... ఇష్టం అయితే సాయంత్రం రండి ప్రామిసరీ నోటు వ్రాసి వుంచుతాను. సంతకం చేసి డబ్బు తీసుకొని వెళుదువు గాని!..."
సోమయ్య, చంద్రయ్యలు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. చంద్రయ్య తలాడించాడు.
"సరే అయ్యా!... సాయంత్రం ఐదుగంటలకు వస్తాం..."
"కాదు... ఏడుగంటలకు రండి!..."
చేతులు జోడించి వారిరువురూ గదినుండి బయటికి నడిచారు. దీప్తి తండ్రిగారి గదిలోకి ప్రవేశించింది.
"నాన్నా!..."
లెడ్జర్ను చూస్తున్న ప్రజాపతి కూతురు పిలుపుకు తన ముఖంలోకి చూచాడు.
"ఈ లెక్కలు చూచుకొనేదానికి ఓ క్యాలిక్యులేటర్ కొనుక్కోవచ్చుగా!..."
ప్రజాపతి నవ్వు... "కష్టపడి నేర్చుకొన్న ఎక్కాలను మరచిపోతాం..." వెటకారంగా అన్నాడు.
దీప్తి... ఆశ్చర్యంతో ప్రజాపతి ముఖంలోకి చూచింది.
’ఈ నాన్న ఇంత పిసినారా!...’ అనుకొంది.
"అవునూ!.... ఎం.బి.బి.యస్, ఎం.ఎస్ అయిపోయె!... ముందు ఏం చేయాలనుకొంటున్నావ్!"
"మన వూర్లోనే హాస్పిటల్ ప్రారంభించాలనుకొంటున్నాను..."
"ఈ గూడూరులోనా!..."
"ఏం పెట్టకూడరా!..."
"పెడితే... నీ చుట్టూ తిరగబోయేది ఈగలు... దోమలు"
నవ్వాడు ప్రజాపతి.
కొన్ని క్షణాల తర్వాత....
"చూడు తల్లీ!... నేను నీ ప్రాక్టీస్కు చెన్నైలో ఏర్పాట్లు చేస్తున్నాను."
"చెన్నైయ్యా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"అవును..."
"నేను మన వూరిలోనే వుండి.... పేదలకు ఉచితంగా చికిత్సలు చేయాలనుకొంటున్నాను నాన్నా!.."
"ఏందీ!.... పేదలకు ఉచితంగా చికిత్సలా!...."
"అవును..."
"మరి నీమీద నేను పెట్టిన పెట్టుబడి సంగతి గురించి ఆలోచించావా!..."
"పెట్టుబడా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"అవును... నీ డాక్టర్ చదువుకి... నీ అమెరికా యాత్రకు... ఐదేళ్ళు అక్కడ వున్నదానికి... లక్షలు ఖర్చుపెట్టాను. డబ్బు లేకుంటే ఇవన్నీ జరిగి వుండేవా... నీవే చెప్పు..."
"నన్ను కన్న తండ్రిగా అది నీ ధర్మం కదా నాన్నా!..."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"ధర్మం... న్యాయం... నీతి... నిజాయితీ... అనుకొనేదానికి ఆనందంగా వుంటాయి. కానీ... అవేవీ కాసులను సంపాదించలేవు!... పొలంలో నారుపోసి నాటి... మందులు కొట్టి... రైతులు మంచి దిగుబడిని ఆశిస్తారు. పెట్టిన పెట్టుబడి కన్నా అధిక లాభం రావాలని కోరుకొంటారు. అలా పెట్టిన పెట్టుబడి తిరిగి లాభంతో వస్తే దాన్ని మరో పనికి ఉపయోగించుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మునిగిపోతే మనిషి దివాలైపోతాడు.
డబ్బు విలువ సంపాదించే వాడికే తెలుస్తుంది. ఖర్చు పెట్టే నీలాంటి వాళ్ళకు దాన్ని సంపాదించడం ఎంత కష్టమో... దాని విలువేంటో తెలీదు. మరోమాట! నేను నీ తండ్రిని... నీచేత ఏం చేయించాలో... ఎలా చేయించాలో నీకన్నా నాకు బాగా తెలుసు. ఈ మాటను మరిచిపోకు" వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
ప్రణవి అక్కడికి వచ్చింది. తలవంచుకొని మౌనంగా కూర్చొని వున్న దీప్తిని చూచింది.
"దీప్తిని ఏమన్నారండీ!..."
"నేను ఏమీ అనలా!... ఆమె భావి జీవితం ఎలా సాగాలో ఆ విషయం చెప్పా!...."
"నాన్నా!... నా భావిజీవితాన్ని గురించి నిర్ణయాలు తీసుకొనే అధికారం నాకు లేదా!..." రోషంతో అడిగింది దీప్తి.
"నీ నిర్ణయం... నాకు నచ్చితే అభ్యంతరం లేదు. నచ్చకపోతే... నా నిర్ణయమే నీ నిర్ణయం కావాలి. అదే నేను నీకు చెప్పింది!..."
"ఏం చెప్పారు?..." అడిగింది ప్రణవి.
"చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాలని చెప్పాను."
"చెన్నైలోనా!..."
"అవును... రకరకాల రోగులు వుండే స్థలం... పెద్దనగరం..."
దీప్తి దీనంగా తల్లి ముఖంలోకి చూచింది.
"అది సరేలే!... చూద్దాం... నీ ఢిల్లీ ప్రయాణాన్ని గురించి చెప్పావా అమ్మా!...."
"లేదమ్మా!...."
"ఏమండీ!... అమ్మాయి ఢిల్లీకి వెళుతుంది."
"ఎందుకు?..."
"ఆమె స్నేహితురాలి పెళ్ళి..."
"ఆ విషయం తను నాతో చెప్పలేదే!..." ఆశ్చర్యంతో అడిగాడు ప్రజాపతి.
"మన మధ్యన చాలా ఘాటైన సంభాషణ జరిగింది కదా నాన్నా!... ఆ విషయాన్ని మీకు నేను చెప్పేదానికి మీరు నాకు అవకాశం ఇవ్వలేదుగా!..." బుంగమూతితో చెప్పింది దీప్తి.
ముఖం చిట్లించి కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి.
కొన్ని క్షణాల తర్వాత....
"అమ్మా దీప్తీ! వెళ్ళితీరాలా!..."
"రాధ అమెరికాలో నా రూమ్మేట్ నాన్నా!... ఫోన్ చేసి ఎంతగానో బ్రతిమాలింది. నేను తన పెళ్ళికి వెళ్ళితే కదా!... అది నా పెళ్ళికి రాగలదు!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"సరే వెళ్ళిరా!..." అన్నాడు ప్రజాపతి.
"నాన్నగారు అనుమతించారుగా! ఇక పద... వారిని పని చేసికోనీ!..." అంది ప్రణవి.
"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు ప్రజాపతి.
"వచ్చే సోమవారం నాన్నా...." అంది దీప్తి.
"సరే!..." లెడ్జర్లోని పేజీలను చూడసాగాడు ప్రజాపతి.
దీప్తి, ప్రణవీలు ఆ గది నుంచి బయటికి వచ్చారు.
వారికి మాధవయ్య ఎదురైనాడు.
"అమ్మా!... దీప్తి నాన్న ఇంట్లో వున్నారా!..."
"ఆఁ... వున్నారు..."
మాధవయ్య ప్రజాపతి గదిలో ప్రవేశించాడు.
"ప్రజాపతీ!... నీకో శుభవార్త..." నవ్వారు మాధవయ్య.
"ఏమిటది!..." అడిగాడు ప్రజాపతి.
మాధవయ్య తలుపును మూసి వచ్చి ప్రజాపతికి ఎదురుగా కూర్చున్నాడు.
"అమోఘమైన సంబంధం ప్రజాపతి!" చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.
"ఆడనా!... మగనా!..."
"మనకు ముందు కావలసింది మొగపిల్లావాడే కదా!..."
"ఏ వూరు?.."
"చెన్నై..."
"పిల్లవాడు ఏం చేస్తున్నాడు?..."
"డాక్టర్... కోటీశ్వరులు. ఒకే కొడుకు. అతనికి ముందు ఆడపిల్ల. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. తండ్రికి పడవల మీద వ్యాపారం. ఎగుమతి దిగుమతి. మన దీప్తికి అన్నివిధాలా తగిన సంబంధం ప్రజాపతీ!..."
"వాళ్ళు మనవాళ్ళేనా!..."
"ఆ నిక్షేపంలా.... ఇంటిపేరు కంచర్ల.... అబ్బాయి పేరు వినోద్. తండ్రిగారి పేరు సాంబయ్య. అబ్బాయి వయస్సు ఇరవై ఎనిమిది" చంకకు తగిలించుకున్న గుడ్డ సంచిలో నించి ఓ ఫోటోను తీసి ప్రజాపతికి అందించాడు మాధవయ్య.
ఫొటోను పరిశీలనగా చూచాడు ప్రజాపతి.
"అబ్బాయ్ ఎలా వున్నాడు?..." నవ్వుతూ అడిగాడు మాధవయ్య.
"మన వివరాలను వారికి అందించావా!..."
"నీవు సరే... అంటే అదెంత పని!..."
"సరేరా మాధవా!... ప్రొసీడ్ అయిపో..."
"మన దీప్తికి... నీ భార్యామణికి ఫోటోను చూపిస్తావా?..."
“ఆ విషయం నాకు వదిలెయ్యి. వారిని కలిసి మాట్లాడి నెలరోజుల లోపల పెండ్లిచూపులు... నిశ్చితార్థం జరిగేటట్లు చూడు... సంచిలో నుంచి మరో కాగితాన్ని తీసి "ఇది అబ్బాయి జాతకం... నేను దీప్తికి అతనికి పొంతనాలు చూచాను. మన దీప్తి పులి... అతను మేక. మన అమ్మాయి మాటను ఏనాడూ కాదనలేడు" నవ్వాడు మాధవయ్య.
"సరే పద... ఫ్యాక్టరీ దాకా వెళ్ళిద్దాం."
ప్రజాపతి... మాధవయ్యలు గది నుండి బయటికి నడిచారు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,996 in 5,325 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 11
హరికృష్ణగారి ఇల్లు.. మధ్య హాలు.. టీవీలో.. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తా ప్రసారం.
అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోం చేస్తున్నారు. రాత్రి సమయం.
ఆకాశవాణి.. తెలుగులో వార్తలు చదువుతున్నది తిరుమలగిరి వాణి.
ఘనంగా వినబడ్డ ఆ మాటలను విని శార్వరి పరుగున టీవి ముందుకు వచ్చింది. తన అక్క వాణిని చూచింది.
"అమ్మా!.. వార్తలు చదువుతున్నది మా వాణీ అక్క.." సంతోషంతో బిగ్గరగా అరిచింది.
ఈశ్వర్.. లావణ్య.. వారి వెనకాల హరికృష్ణ టీవీ ముందుకు వచ్చారు
తెల్లచీర.. దానిపై క్రమంగా దూరం దూరంగా వరుసలుగా గులాబీపూలు, తెల్ల జాకెట్ బంగారు వర్ణపు అంచు, నొసటన సింధూరం, తలకు స్నానం చేసి కురులు, తల్లో మల్లెపూలు, గాలికి ముఖంపైన అందంగా కదిలాడే ముంగురులు, అప్సరసలా వున్న వాణి.. చిరునవ్వుతో అచ్చ తెలుగులో వార్తలు చదువుతూ వుంది.
అందరి ముఖాల్లో ఎంతో ఆనందం. లావణ్య, హరికృష్ణ ముఖంలోకి కన్నీటితో చూచింది. వారి వదనంలో చిరునవ్వు.. కళ్ళల్లో కన్నీరు. ఈశ్వర్.. శార్వరి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి కళ్ళల్లోనూ కన్నీరు.. ముఖాల్లో ఎంతో ఆనందం. అవి, ఆ క్షణాల్లో.. దుఃఖంతో వచ్చిన కన్నీరు కాదు. ఆనంద పరవశపు పన్నీరు. అందరూ ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. వారి పెదవులపై చిరునవ్వు.. ముఖాల్లో ఎంతో ఆనందం.
వార్తలు ముగిశాయి. టీవి స్క్రీన్ పైని వాణి అదృశ్యం అయింది. ముందు ఈశ్వర్, వెనకాల శార్వరి, లావణ్య, హరికృష్ణ డైనింగ్ టేబుల్ను సమీపించారు. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. వారి మనస్సుల్లో వాణిని గురించిన ఆలోచనలే!.. మనసుల్లో ఒకే రకమైన బాధ. వారి మధ్యన మాటలకు తావు లేని మనస్థితులు. ఏదో తిని ముందు లావణ్య, ఈశ్వర్, హరికృష్ణ, శార్వరి చేతులు కడుక్కొని వారి వారి గదులకు వెళ్ళిపోయారు.
ఈశ్వర్ ’నేను, శార్వరీ ఢిల్లీకి వెళ్ళి వాణిని చూచి వస్తామని చెబితే.. అమ్మా నాన్నా.. సంతోషిస్తారా!.. వాణి అక్కయ్య ఎంతో ఠీవిగా వార్తలు చదివింది!.. అంటే తనకు ఏ సమస్యలూ లేకుండా హాయిగా వుందన్న మాటేగా!.. ఆ బావ అక్కను బాగా చూచుకొంటున్నట్లేగా!.. మూడేళ్ళయింది. పిల్లలు కలిగారో లేదో!.. అంతా సవ్యంగా వుంటే ప్రజాపతి మామయ్యకు జాబు ఎందుకు వ్రాసినట్లు!.. భార్యభర్తల మధ్యన ఏమైనా సమస్యలా!.. ఏది ఏమైనా సరే.. అనుకొన్న ప్రకారం ఢిల్లీకి వెళ్ళి వాణి అక్కయ్యను తప్పక కలవాలి’ అనుకొన్నాడు ఈశ్వర్.
శార్వరి.. పడుకొంది గాని మనస్సుకు కొంత శాంతి కలగవచ్చు. ’హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరాలనుకొంటున్నాడో కనుక్కోవాలి’ మంచం దిగి.. శార్వరి ఈశ్వర్ గదిని సమీపించింది. తలుపును నెట్టబోయింది.
ఈశ్వర్ తలుపును తెరిచాడు. శార్వరిని చూచాడు.
"శారూ!.. ఏమ్మా!.. నిద్రపోలేదా!.." అడిగాడు.
"నిద్ర రావడం లేదు. నీతో మాట్లాడాలని వచ్చాను!.."
"అలాగా!.."
"అవును.."
"సరే, రా లోనికి.."
"నీవు ఎక్కడికి బయలుదేరావు?.."
"అమ్మానాన్నలు ఏం చేస్తున్నారో చూడాలని.."
"సరే పదా, చూచి వద్దాం.."
"ముందు వారి గదిలోనికి వెళ్ళకూడదు!.."
"ఆ విషయం నాకు తెలీదా!.. ద్వారం ముందు నిలబడితే.. వారి మాటలు వినిపిస్తాయిగా!.."
"అవునవును.. పద.." అన్నాడు ఈశ్వర్.
వారిరువురూ.. తల్లిదండ్రుల గదిని సమీపించారు.
"ఏమండీ!..
"ఏమిటి?.."
"ఒక్కమాట కూడా మాట్లాడరేం!.."
"ఏ విషయాన్ని గురించి లావణ్యా!.."
"అదే.. మన.."
"వాణీని గురించా!.."
"అవును.."
"ఏం మాట్లాడేది లావణ్యా!.."
"బిడ్డ బాగుంది కదూ!"
"ఆఁ.."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"అంత ముక్తసరిగా చెబుతారేం?.." చిరుకోపంతో అడిగింది లావణ్య.
"లావణ్యా! ఆమెకు ఏం తక్కువ!.. మనం ఏం తక్కువ చేశాము!.. మనమంటే ఎంతో అభిమానంగా వున్న ఆమె అలా ఎలా మారిపోయిందో.. మనకు ఒక్కమాట చెప్పకుండా తనకు నచ్చినవాడితో ఎలా వెళ్ళిపోగలిగిందో!.. తలుచుకొంటుంటే.. ఎదలో ఎంతో బాధ లావణ్యా!.. అందుకే కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ పడుకొన్నాను!.."
"నా మనఃస్థితీ మీలాగే వుందండీ!.. కన్నతల్లిని కదా!.. మూడేళ్ళ తర్వాత చూచేసరికి నాలో ఎంతో ఆవేదన.. అమ్మా!.. అమ్మా!.. అంటూ నా చుట్టూ తిరుగుతూ తనకు ఏం కావాలన్నా నన్ను అడిగి అది నాకు నచ్చితే తప్ప తానుగా తీసుకొన్నదంటూ ఏమీలేదు. అలాంటి పిల్ల తన జీవితానికి అతి ముఖ్యమైన విషయంలో మన సలహా సంప్రదింపూ లేకుండా.." హృదయ ఆవేదనతో లావణ్య చెప్పడం ఆపేసింది.
"నిన్ను అమ్మా!.. అమ్మా.. అని నీవు ఆమె తల్లివి కాబట్టి పిలిచింది కానీ నేను ఆమెను నా తల్లిగానే భావించాను లావణ్యా!.. ఆమె కోరింది ఏది నేను కాదన్నాను!..
అందరికంటే మిన్నగా వుండాలని.. నా శక్తి కొద్దీ ఆమె కోరిన రీతిగా.. తండ్రిగా నేను చేయవలసింది చేశాను. ఎంతో యోగ్యుడైన శివరామకృష్ణ పెద్ద కొడుకు చంద్రంతో ఆమె వివాహం జరిపించాలనుకొన్నాను. వాడితోనూ మాట్లాడాను. వాడూ సరేరా అన్నాడు. కానీ.. వాణి.. హుఁ.. ఈ తండ్రి తన భావిజీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దలేడని.. తనకై తాను తన ఇష్టానుసారంగా మనకు తలవంపులు కలిగేలా.. స్వనిర్ణయాన్ని తీసుకొంది. మనతో తనకు ఎలాంటి అవసరం లేదని వెళ్ళిపోయింది" నిట్టూర్చి తలదించుకొన్నాడు హరికృష్ణ.
భర్త మాట్లాడిన ప్రతి అక్షరం.. నగ్న సత్యం అయిన కారణంగా లావణ్య మారు పలుకలేకపోయింది. ఆవేదనతో కన్నీరు కార్చింది.
కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. కన్నీటిని తుడుచుకొని లావణ్య,
"ఏమండీ!.."
"చెప్పు లావణ్యా!.."
"మీరు వాణిని క్షమించలేరా!.."
"నీవు క్షమించగలవా!.."
"నేను దాని తల్లినండీ.. అది నా పెద్దబిడ్డ!.." బొంగురుపోయిన కంఠంతో చెప్పింది లావణ్య.
"ఆమె నీకు బిడ్డ.. నాకు తల్లి.. ఏ వ్యక్తి అయినా తన తల్లిని అసహ్యించుకొంటాడా లావణ్యా!.."
బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు హరికృష్ణ.
"అంటే మీరు నా బిడ్డను క్షమిస్తారు కదూ!.."
"ఆమె నా ముందుకు వస్తే తప్పకుండా క్షమిస్తాను.."
"మనం దాని ముందుకు వెళ్ళేదానికి మీకు అభ్యంతరమా!.." దీనంగా అడిగింది లావణ్య.
హరికృష్ణ ఆశ్చర్యంతో లావణ్య ముఖంలోకి చూచాడు.
"నాకు.. నా బిడ్డను చూడాలని వుందండి. తప్పుగా అడిగాననుకొంటే.. నన్ను క్షమించండి" దీనంగా చెప్పింది లావణ్య.
"ఢిల్లీకి వెళతావా!.."
"మీరు రారా!.."
"నాకు నా బిడ్డను చూడాలని వుందండీ.. అని అన్నావు కాని.. మనం వెళ్ళి మన బిడ్డను చూచి వద్దామండీ అని అనలేదు కదా!.."
"ఓ.. సారీ.. సారీ అండీ.. ఏదో ఆవేశంలో అలా అన్నాను.. మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళగలనండీ!..
"అంటే నీతో నన్నూ రమ్మంటావా!.."
"నేను చెప్పిన మాటకు అర్థం అదేకదండీ!.."
"సరే!.."
"ఆఁ.."
"సరే అన్నాను లావణ్య!.."
"దేనికి!!!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య
"నీవు అన్నదానికి!.. నీ కోరిక తీర్చేదానికి!" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
ద్వారం వెనుక నిలబడి వున్న ఈశ్వర్, శార్వరీలు అంతా విన్నారు. వారి ముఖాల్లో ఎంతో ఆనందం. ఈశ్వర్ చెల్లెలి చేతిని పట్టుకొన్నాడు. ఇరువురూ అతని గదిలో ప్రవేశించారు.
"శారూ!.. సర్వేశ్వరుడు దయామయుడు. మనం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఢిల్లీకి వెళితే.. ఆ విషయం ఏనాటికైనా వారికి తెలిస్తే.. మనలను ద్వేషిస్తారేమో అని నాకు భయం. మన నిర్ణయం మంచిదే అనేదానికి అమ్మా నాన్నల మాటలే సాక్ష్యం. ఇక మనం నిర్భయంగా ఢిల్లీకి వెళ్ళవచ్చు" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.
"వారి మాటలను బట్టీ అమ్మా నాన్నలు కూడ త్వరలో ఢిల్లీకి బయలుదేరబోతున్నారుగా అన్నయ్యా!.."
"అవునురా!.."
"అయితే మనం వెళ్ళే విషయం వారికి చెప్పవచ్చుగా!.."
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,494
Threads: 149
Likes Received: 8,167 in 1,680 posts
Likes Given: 4,739
Joined: Nov 2018
Reputation:
590
"ఆలోచిస్తా.. పొద్దుపోయిందిరా వెళ్ళి పడుకో!.."
"అలాగే అన్నయ్యా!.." సంతోషంగా శార్వరి గుడ్నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది.
మరుదినం ఉదయం.. హరికృష్ణ లావణ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వున్నారు. శార్వరి వారికి కాఫీ అందించింది.
"శారూ!.. అన్నయ్య ఎక్కడ?.." అడిగింది లావణ్య.
"పళ్ళు తోముకుంటున్నాడమ్మా!.. పిలవనా!.."
"ఆఁ.. పిలూ!.."
పెరటివైపు ద్వారాన్ని సమీపించింది శార్వరి.
"అన్నయ్యా!.. అమ్మ నిన్ను పిలుస్తుంది."
"ఆఁ.. వస్తున్నానని చెప్పు.."
శార్వరి తల్లిదండ్రులను సమీపించి.. "అన్నయ్య వస్తున్నాడమ్మా!.." చిరునవ్వుతో చెప్పింది.
ఆమె మనస్సులో తన తల్లితండ్రి.. వారి ఢిల్లీ ప్రయాణాన్ని గురించి మాట్లాడబోతారనే ఆలోచన.
ఈశ్వర్ వారిని సమీపించాడు.
"ఏం అమ్మా!.." తల్లి ప్రక్కన వున్న కుర్చీలో కుర్చుంటూ అడిగాడు.
హరికృష్ణ గొంతు సవరించాడు. ఈశ్వర్ తండ్రి ముఖంలోకి చూచాడు. లావణ్య భర్త ముఖంలోకి చూచింది. రెండు కాఫీ గ్లాసులతో శార్వరి వారిని సమీపించింది. ఒక గ్లాసును ఈశ్వర్కు అందించింది.
అన్నా చెల్లెళ్ళు కాఫీ సిప్ చేశారు.
"ఈశ్వర్!.." అన్నాడు హరికృష్ణ.
"ఏం నాన్నా!"
"నేనూ అమ్మా.. ఢిల్లీకి వెళ్ళాలనుకొంటున్నాము"
ఈశ్వర్, శార్వరీలు తండ్రి ముఖంలోకి చూచారు.
"అన్ని గుణాల్లోకి క్షమాగుణం చాలా గొప్పది ఈశ్వర్!” అన్నాడు హరికృష్ణ.
"మీరు చెప్పింది ఎవరి విషయంలో నాన్నా!" మెల్లగా అడిగాడు ఈశ్వర్.
"అందరి విషయంలో.. ’అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!..’ ఇది సుమతీ శతకపు సూక్తి.. చిన్న వయస్సులో చదివావు" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"అవును నాన్నా!.. మరి నా ప్రశ్నకు జవాబు!" అన్నాడు ఈశ్వర్.
"మీ అక్క వాణి విషయంలో" మెల్లగా చెప్పాడు హరికృష్ణ.
"అంటే!.."
"మీ అమ్మ, వాణిని చూడాలని నన్ను కోరింది. ఆమె కోర్కెను తీర్చడం నా ధర్మం ఈశ్వరా!.."
ఈశ్వర్ నవ్వుతూ.."చాలా మంచి నిర్ణయం నాన్నా!.. నేను శార్వరీ కూడా అక్కయ్యను చూడాలనుకొంటున్నాము. మీరు అంగీకరిస్తే మేమూ మీతో ఢిల్లీకి వస్తాము నాన్నా!.." చెప్పాడు ఈశ్వర్.
"అలాగా!.." ఆనందంగా అంది లావణ్య.
"చాలా సంతోషం అమ్మా!.."
"అయితే.. ఏమండీ!.. నలుగురం కలిసే వెళదాం.."
"సరే!.. ఈశ్వర్!.."
"నాన్నా!. ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేయనా!.."
"చెయ్యి!.."
"ఫ్లయిట!.." ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.
"అవునమ్మా!. రెండున్నర గంటల్లో ఢిల్లీకి చేరగలం" నవ్వాడు ఈశ్వర్.
"నాకూ ఓ టిక్కెట్ బుక్ చేయండి బావగారూ!" నవ్వుతూ వారిని సమీపించింది దీప్తి.
మూడు నిమిషాల ముందు అక్కడికి వచ్చింది దీప్తి. వారి సంభాషణనంతా విన్నది.
ఈశ్వర్ ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూచాడు.
"అత్తయ్యా!.. మామయ్యా!.. శుభోదయం" నవ్వుతూ చేతులు జోడించింది దీప్తి. క్షణం తర్వాత "ఏయ్!.. మరదలు పిల్లో! హాట్గా ఓ కాఫీ తీసుకురా!.. వెళ్ళు"
దీప్తి లావణ్యను సమీపించింది.
శార్వరి వంట గది వైపు వెళ్ళింది.
"నీవు ఎప్పుడు వచ్చావ్?" ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"వచ్చి వారం రోజులైంది చూచారుగా!.. మరిచిపోయారా!" వెటకారంగా నవ్వుతూ చెప్పింది దీప్తి.
హరికృష్ణ చిరునవ్వుతో, లావణ్య, ఈశ్వర్ ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచారు.
"దీప్తి!.. కూర్చో" చెప్పాడు హరికృష్ణ.
నీలంరంగు షిఫాన్ చీర.. మ్యాచింగ్ బ్లౌజ్, చక్కగా దువ్వి అల్లిన వాలుజడ, తల్లో మల్లెపూలు, నొసటన ఎర్రస్టిక్కర్ బొట్టు, ఎర్రని పెదవులపై చిరునవ్వు అప్సరసలా చూపరులకు కనిపించింది దీప్తి.
"ఏం ఉదయాన్నే వచ్చావ్?" అడిగింది లావణ్య.
"ఏం అత్తయ్యా! రాకూడదా?.. ఓ విషయాన్ని మరువకండి. ఇది మీ ఇల్లే కాదు. మామయ్యగారిది కూడా. నా మామగారి ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు కదా మామయ్యా!.." హరికృష్ణ ప్రక్కన కుర్చీలో కూర్చుంటూ అంది దీప్తి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|