03-12-2024, 05:05 PM
Good story
నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ
|
12-12-2024, 03:58 PM
దసరా టు దీపావళి
రచన: తాత మోహనకృష్ణ సుబ్బారావు చిన్ననాటి నుంచీ చాలా పొదుపు పాటించే మనిషి. ప్రతీ రూపాయి ఎంతో అలోచించి ఖర్చు చేస్తాడు. అతను చాలా జాగ్రత్త అని అనుకుంటాడు.. కానీ, చుట్టూ చూసే జనం మాత్రం పిసినారి అంటుంటారు. సుబ్బారావు ఇలాంటి మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇలాంటి మనిషికి పెళ్ళి చేద్దామని అనుకున్నారు తల్లిదండ్రులు. అమ్మాయి ఫోటో చూసి పెళ్ళిచూపులు అరేంజ్ చేసారు. పెళ్ళి చూపులలో.. కట్నం అడిగితే బాగుండదు అనుకుని.. ఒక ప్లాన్ వేసాడు సుబ్బారావు. పెళ్ళి ఖర్చు అంతా ఆడపెళ్ళివారిదే.. దానితో పాటు అమ్మాయికి ఒక పెద్ద వడ్డాణం చేయించాలనేది షరతు గా పెట్టాడు. పెళ్ళికూతురు నడుము కొలత ముందే చూసి.. బంగారం లెక్క వేసాడు సుబ్బారావు.. ఎంత కాదన్నా.. ఎక్కువే ఉంటుంది బంగారం. "ఈ వడ్డాణం.. మీరు కొంచం లూజు గా చేయించండి.. మీ అమ్మాయి వొళ్ళు చేసినా సరిపోతుంది" అని సుబ్బారావు అన్నాకా.. ఆడపెళ్ళి వారంతా చాలా ఆశ్చర్యపోయారు. అయినా తప్పక ఒప్పుకున్నారు కాబోయే మావగారు.. ఆడపెళ్ళి వారిదే కదా ఖర్చు మరి.. పెళ్ళి కార్డ్స్ ఊరంతా పంచేసాడు సుబ్బారావు.. ఎంతకాదన్నా.. కట్నం డబ్బులు బదులు చదివింపులు బాగానే కిట్టు బాటవుతాయని ప్లాన్ వేసాడు . అనవసరంగా.. ఒక గ్లాస్ మంచినీరు కుడా తాగని సుబ్బారావు.. పెళ్ళి లో అందరికీ కూల్ మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలని అడిగాడు మావగారిని. తన ప్యాంటు షర్టు కొలతలు తెచ్చి.. పెళ్ళివారి అందరికీ చాలా కాపీలు పంచాడు సుబ్బారావు.. "ఇది ఎందుకండీ! అని అడిగారు కాబోయే మావగారు" "ఏమీ లేదు! అందరూ.. ప్యాంటు షర్టు ముక్కలు పెట్టేస్తున్నారు.. కొలతలు ఇస్తే.. కుట్టించి పెడతారని.. నాకూ గ్రాండ్ గా ఉంటుందని.. " పెళ్లి గ్రాండ్ గా జరిగింది.. ఆడపెళ్ళివారికి తప్పదు కదా! ఎంతైనా.. ఎక్కడైనా మరి! పెళ్ళి కానుకల విషయం లో ముందే చాలా క్లారిటీ తో ఉన్నాడు సుబ్బారావు.. ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం అసైన్ చేసేసాడు గిఫ్ట్ కింద. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, డిష్‌వాషర్, కూలర్, ఇలా ఐటమ్స్ లిస్టు అందరినీ పంచుకోమన్నాడు. హనీమూన్ ట్రిప్ ఒకటి మిగిలింది. లక్కీ గా మావగారు.. టికెట్స్ ముందే బుక్ చేసేసారు. కూతురి కోసం చెయ్యాలి కదా మరి! హనీమూన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసారు కొత్త జంట.. ఎంతైనా ఫ్రీ యే కదా!.. బిల్ వర్రీ మాత్రం మావగారికి.. కొత్త పండక్కి అల్లుడుకి ఆహ్వానం వచ్చేసింది.. "అల్లుడుగారూ! మీరు అమ్మాయిని తీసుకుని ఈ దసరా పండక్కి ఒక వారం రోజులు సెలవు పెట్టి మా ఇంటికి రావాలి. ఇదే మా ఆహ్వానం!" "మావగారు! నేను ఆఫీస్ లో కొంచం బిజీ గా ఉన్నాను. అందులోనూ.. ఈ మధ్య అస్సలు ఖాళీ ఉండట్లేదు.. మీరే ఆ టికెట్స్ బుక్ చేసేయండి. నేనూ.. మీ అమ్మయీ పది రోజుల ముందే వచ్చేస్తాము. అంతగా పిలుస్తుంటే, ముందే రావాలనిపిస్తుంది మరి!" ఆ మాటలు విని మావగారు బిత్తరపోయాడు (ఇదేమిటి సెలవు ఉండదు.. ఒక రోజే వస్తారేమోననుకుంటే.. ముందే వస్తానంటాడేమిటి అల్లుడు?.. మనసులో అనుకున్నారు మవగారు) "ఏమండీ! అదేంటి అలా చెప్పారు? మీకు అన్ని రోజులు సెలవులు ఎక్కడ దొరుకుతాయి?" "అదేమిలేదే! 'వర్క్ ఫ్రొం అత్తారిల్లు' చేస్తాను. నాకు సెలవు పెట్టక్కర్లేదు.. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా!" "ఏమిటో.. ?" "మనం ఇంట్లో లేకపోతే, మనకి.. కరెంటు ఖర్చు మిగిలిందా! పాలు, కిరాణా.. అన్నీ ఆదా.. సెలవు పెట్టను కాబట్టి జీతం కుడా నష్టం లేదు.. టికెట్స్ ఎలాగో ఫ్రీ యే కదా!.. పైగా.. మీ అమ్మ ఎలాగో.. తీసుకుని వెళ్ళమని ఆవకాయలు ఒక అరడజను రకాలు.. ఆ పొడి.. ఈ పొడి అని ఇస్తుంది కదా!.. మనకి అంతా లాభమే కదా! మరి.. " "అలా మూతి విరవకే సుమిత్రా!.. ఈ ట్రిప్ లో ఎలా ఆనందంగా ఉండాలో ఆలోచించు!" "ఇన్ని పిసినారి బుద్ధులున్నా.. మా పుట్టింటికి ముందుగా తీసుకెళ్తున్నారు.. అదే హ్యాపీ నాకు!" "నీ ఆనందాన్ని డబల్ చేసే ఇంకో విషయం తర్వాత చెబుతాను !!!" "హమ్మయ్యా! నవ్వింది మా ఆవిడ!" "ఏమండీ! అయితే బ్యాగ్ సర్దేస్తాను" "ఒసేయ్ ! రెండు జతలే పెట్టు" "అదేంటి!" "పండుగ కదా! ఎలాగో నీకో అరడజను చీరలు.. నాకో మూడు జతలు పెడతారు.. అవి వేసేసుకుంటే సరిపోతుంది.. ఎక్కువైతే మళ్ళీ ఆ పోర్టర్ కు అనవసరంగా మొయ్యడానికి డబ్బులు తగలెయ్యాలి!" ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది.. ట్రైన్ లో బెర్త్ ఎక్కి కూర్చున్నారు సుబ్బారావు దంపతులు. మనము ఒక నాలుగు గంటల్లో మీ ఊరు వెళ్లిపోతాము కదా! ఈ రెండు బెర్తులు మనకి అవసరమా చెప్పు! పాపం ఆ అమ్మాయి చూడు.. నిల్చొని ఎంత కష్టపడుతుందో.. ఒక బెర్త్ ఇచ్చేద్దాము సుమిత్రా!.. మనం ఒకే బెర్త్ లో పడుకోవచ్చుగా.. "బాగుండదేమోనండి!" "కొత్తగా పెళ్లైంది గా.. ఏమీ అనుకోరు లే.. మనకీ బాగుంటుంది!" "ఆ అమ్మాయిని పిలిచి బెర్త్ ఇవ్వు శ్రీమతి.. " "ఇచ్చేసానండీ శ్రీవారు!" "అదేంటి.. డబ్బులు తీసుకున్నావు?" "మీకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాను, మీతో కాపురం చేసి. ఫ్రీ గా ఎందుకు ఇవ్వడం అని.. ఒక ఐదొందలు అడిగా.. ఇచ్చేసింది. "పాపం! ఆ అమ్మాయికి బాగా నిద్ర వస్తున్నట్టు ఉంది మరి! మొత్తానికి నా లైన్ లోకి వచ్చేస్తున్నావే సుమిత్రా డియర్!" అన్నాడు సుబ్బారావు "సుమిత్రా! ఆకలి వేస్తోందే! ఏమైనా తెచ్చావా ఇంటి నుంచి?" "సమోసా తింటారా?" "మళ్ళీ అదో ఖర్చు లేవే !" "మీరు ఏది కావాలంటే అది తినండి. నేను చూసుకుంటాను!" "ఇంక చుసుకో.. నా ఆర్డర్ లిస్టు.. " ఈలోపు సుమిత్ర ఫోన్ అందుకుంది. "నాన్నా! మేము బయల్దేరాము.. ఉదయానికి అక్కడ ఉంటాము.. నా ఫోన్ లో బ్యాలన్స్ లేదూ.. ఊ .. ఊ.. " "అయ్యో! ఎందుకు కష్టపడతావు తల్లీ! ఒక వెయ్యి వెయ్యనా?" "మా నాన్నకి నేన్నంటే ఎంత ప్రేమో.. ఉంటాను నాన్నా!" "నువ్వు సూపర్.. సుమిత్రా!" "ఏమనుకున్నారు.. అవును మరి.. ఆరు నెలలు సావాసం చేస్తే, వారు వీరు అవుతారంటారు.. ఇదేనేమో" "నువ్వు ఇంకా ముందే మారిపోయావు సుమిత్రా! నీలో ఇంత మార్పు వచ్చింది కనుకా.. ఆ విషయం చెప్పాల్సిందే మరి!" "చెప్పండి ప్లీజ్!!" "నీ సంతోషం కోసం.. ఈ దసరా ట్రిప్ దీపావళి వరకూ పొడిగించాలని నిర్ణయించుకున్నాను.. దీనికి నీ సపోర్ట్ కావాలి నాకు" "దానికేముందండీ! మా నాన్న ఎలాగో పైసా ఖర్చు చెయ్యడు.. నా కోసం అయితే, బాగా ఆలోచించి ఖర్చు చేస్తాడు.. ఇప్పుడు మన కోసం ఖర్చు చేయిస్తాను .. ఆయన మీకన్నా పిసినారి" "నేను పిసినారి కాదు.. జాగ్రత్త పడతాను అంతే!" "మీరు ఎలాగనుకుంటే, అలగేలెండి!" "మరి మీ ఇంట్లో ఏమిటి చెబుతావు?" "దసరా టు దీపావళి ఎన్నో రోజులు లేవు కదా.. అలాగ అక్కడ చుట్టు పక్క ప్రదేశాలు తిరిగితే సరి! అదీ మా నాన్న చేత స్పాన్సర్ చేయిస్తాను.. " "చూస్తూ ఉంటే.. మీ నాన్న తో చాలా చేయించుకునే లాగ ఉన్నవే!" "ఇప్పుడు మనిద్దరి కోసం మా నాన్న కు తప్పుదు!" "అయితే.. దసరా టు దీపావళి సంబరాలు స్టార్ట్! పైసా ఖర్చు లేకుండా!" ****
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
19-12-2024, 02:29 PM
'పందిట్లో పెళ్లవుతున్నది'
రచన: విజయా సుందర్ "పిల్ల చాలా బాగున్నది కదరా" తల్లి మాటకి రాజీవ ముక్తసరిగా, "ఆ.. బాగున్నదమ్మా"అన్నాడు. కొడుకు ఇంత ముక్తసరిగా మాట్లాడటం ఎరగని శాంత విస్తుపోయింది! తల్లి తాము చూసి వచ్చిన అమ్మాయి గురించి తన అభిప్రాయం చెప్పమంటే రాజీవ్, " అమ్మా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. కానీ.. మర్యాద అనే మాటకు అర్థం తెలియని దానిలా విసురుగా కూర్చుని, ‘మిస్టర్ రాజీవ్! నాకు ఇప్పుడ్డప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదీ ఇలా సంతలో పశువులా, ఓ ఎక్జిబిట్ లా అసలే ఇష్టం లేదు. మా నాన్న చాదస్తంతో.. ఎనీవే నేను ఆయన కూతుర్నే. నాకు మీ సంబంధం ఏ రకంగానూ నచ్చలేదని చెప్పేస్తాను’ అని వెళ్ళిపోయింది. “అమ్మా! ఇదా పద్ధతి ? అసలు నాకు ఏమి మాట్లాడటానికి ఇష్టమనిపించట్లేదు. నిష్కర్షగా చెప్పెయ్యండి వద్దని" అని రాజీవ్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న శాంత, భర్త రామనాథం నిస్పృహతో నిట్టూర్చారు! కాఫీ అడగడానికి వచ్చిన రాజీవ్, ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. "అదేమిటి నాన్నా అలా అయిపోయారు? ఆ అమ్మాయి మీ ప్రాణ స్నేహితుడి కూతురు.. ఆంతే కదా అంతమాత్రాన, నేను ఆ అమ్మాయిని కాదంటే ఇంతలా రియాక్ట్ అయ్యారేమిటీ?" అన్నాడు. "రాజూ! కొన్ని విషయాలు నిలుచున్న పళంగా తేల్చి చెప్పలేము నాన్నా! ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడు ఒక్కడే కాదురా.. నా ప్రాణదాత!" "ప్రాణదాతా?" శాంత రాజీవ్ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, "మీ నాన్న కి నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు షుగర్ పెరిగి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి! నా కిడ్నీ సూట్ కాలేదు. కొనడానికి ప్రయత్నం చేస్తే ఏవీ సూట్ కాలేదు. అప్పుడు తన ప్రాణ స్నేహితుడు గంగాధరం, "అరేయ్ ఏంట్రా అలా కృంగిపోతున్నావు? నువ్వు డిప్రెస్ అయితే ఈ సంసారానికి దిక్కెవరు? నాకు రెండు కిడ్నీలున్నాయి కదరా.. నీకొకటిస్తాను.. అంతే సింపుల్" అంటూ ఏదో రెండు ఆపిల్స్ ఉంటే ఒకటి ఇస్తానన్నంత తేలిగ్గా అన్నాడు. అన్నీ తానే నిర్ణయాలు తీసుకుని డాక్టర్ తో మాట్లాడి, తన కిడ్నీ మ్యాచ్ అయిందని తెలుసుకుని, అన్ని ఏర్పాట్లు చేసి, కిడ్నీ ట్రాన్సప్లాంట్ చేయించేశాడు. తన కుటుంబం నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా కేర్ చెయ్యలేదు. భార్య రెండేళ్లు పుట్టింట్లోనే ఉండి పోయింది. నాన్న తన వలన వాళ్లిద్దరూ విడిపోతున్నారని, ఆవిడ దగ్గరకు వెళ్లి, బతిమాలి, బామాలి పిల్లకోసమైనా తప్పదని ఇద్దర్నీ కలిపారు. తిరిగి వచ్చిందన్న మాటే గానీ, భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడిపోయింది. నాన్న తన వలననే అని బాధపడితే గంగాధరం, " నీ మొహం నీ వల్లనేమీ కాదురా. నేను చదువుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకున్నాను. వాళ్ళ నాన్న కష్టపడి పైకొచ్చే నన్ను మెచ్చి, ఆవిడ మెడలు వంచి మా పెళ్లి చేసాడుట. అది నాకు తెలియదు. అందుకని నేనెప్పటికీ ఆవిడకి రాంగ్ నెంబర్నే" అని ఓదార్చేవాడు. " తల్లి ముగించింది. రామనాథం, "ఈ మధ్య వాడు కూతురి గురించి బాధపడ్డాడు. చిన్నప్పుడు తన దగ్గరే ఎంతో మాలిమిగా ఉండే పిల్ల, పెద్దది అవుతున్నప్పట్నుండి తల్లి ప్రభావం పడుతున్నదనీ, తొందరగా పెళ్లి చేసి పంపాలని ఉన్నదనీ, మనలాంటి మంచి ఇంట్లో అయితే బాగుంటుందని తన మనసు విప్పి చెప్పాడు. అందుకే మేము ఆశపడ్డాము ఇలా వాడి రుణం తీర్చుకోవచ్చునని.. కొడుకు మనసులో మెదిలే ఆలోచనలు పసికట్టినట్లు ఆయన, "అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని కాదు.. అయినా ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పేస్తానన్నది కదా. చూద్దాం ఏం జరుగుతుందో?" అన్నాడు. *** రాజీవ్ ముఖకవళికలను బట్టి, తన కూతురి గురించి తెలిసిన గంగాధరం వాళ్ళు వెళ్ళగానే మిహిరను నిలదీసాడు. "అవును నేను చెప్పాను అతను నాకు నచ్చలేదని" నిర్లక్ష్యంగా చెప్తున్న మిహిరని చురచురా చూస్తూ, "ఆ అబ్బాయికి ఏమి లోపమున్నదని నచ్చలేదో చెప్పమ్మా" లేని సహనం తెచ్చుకుని అడిగాడు. "నాకు నచ్చలేదంతే. " " అంటే కేవలం నేను చెప్పిన సంబంధమని, అంతేనా?". మిహిర తల్లి రాధ, "దానికి నచ్చలేదంటే వినరేమిటీ? మీకెందుకంత పట్టుదల?" ఎన్నడూ రానంత కోపమొచ్చింది గంగాధరానికి, "నువ్వు నోర్ముయ్.. దాన్ని కూడా నీ లాగానే తయారు చేస్తున్నావు. పిల్లవాడు మేలిమి బంగారం. మిహీ బంగారు తల్లీ! నా మాట వినమ్మా.. నువ్వు చాలా సుఖఃపడతావు. "
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
19-12-2024, 02:32 PM
కూతురు మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తుంటే రామనాథం, ఆ అబ్బాయి గుణగణాలు ఇంకా వర్ణిస్తూ, "మీ అమ్మకి అంతస్థు సరిపోలేదుట.. అమ్మా నాకున్నదంతా నీదే కదా! ఇంకా ఎందుకు సంపద? అయినా వాళ్ళూ అంత లేని వాళ్లేమీ కాదు. ఆ అబ్బాయి మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ పోస్ట్ లో ఉన్నాడు! మీ అమ్మ రాక్షసి!. ఇల్లరికం రావాలంటుంది. అమ్మా నీకు తెలియదు.. ఆ జీవితం నరకం.. నేను అనుభవించాను పెళ్లి అయిన పదేళ్లు. " ఇంకా ఏవో చెప్తూనే ఉన్నారు ఆయన.. మిహిరకి వాస్తవం అప్పుడు గుర్తొచ్చింది. ' అమ్మో గీచి గీచి ఖర్చు పెడతారని చెప్పింది అమ్మ. అయినా ఈ నాన్న తక్కువవాడా అమ్మ ఎన్ని చెప్పింది ఈయన గురించి? అసలు ఎవరన్నా తన శరీరంలో భాగం ఇచ్చేస్తారా? అదీ భార్య ఇష్టానికి వ్యతిరేకంగా.. ఊహు.. నాకు అమ్మని బాధ పెట్టిన వాళ్లంటే అసహ్యం. నా నిర్ణయం సరి అయినదే' అని తలపోసి, "నాన్నా! నువ్వు అమ్మని అంతలా ఆడిపోసుకోవటం నాకు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చలేదని చెప్పేసెయ్యి వాళ్ళకి!" మిహిర మాటలు గంగాధరానికి ఆశనిపాతాలయ్యాయి!
ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడేమో, ఆఖరి అస్త్రం కూడా ఉపయోగించాడు. "మీ అమ్మ ఈ ఆస్తి తన తండ్రిది అనుకుంటున్నదేమో.. చాలా భ్రమలో ఉన్నదని చెప్పు. వాళ్ళ నాన్న మిగిల్చింది ఈ ఇల్లు మాత్రమే! ఈ ఆస్తంతా నా స్వార్జితం! నీ బాగు కోసమే ఈ సంబంధం చేసుకో మంటున్నాను. నువ్వు మొండికేస్తున్నావు. నేనూ మొండివాణ్ణే. ఈ ఆస్తిలో నీకు, మీ అమ్మకి ఎటువంటి హక్కు లేదని పత్రాలు తయారు చేయించేస్తాను. దీనికి తిరుగులేదు అంతే! ఇంకా ఏమిటి మీ అమ్మని బాధ పెట్టానంటున్నావు కదూ.. ఎవరు ఎవర్ని ఎలా బాధ పెట్టారో మీ అమ్మనే అడుగు. నా నోరు తెరిపించకు. మర్యాదగా నువ్వు ఈపెళ్ళికి ఒప్పుకోవడం ఒక్కటే నీకున్న ఛాయిస్!" ఆ తల్లి కూతుళ్లు మ్రాన్పడిపోయారు.. ఎంత మాత్రమూ ఊహించని ఈ మలుపుకి! అప్పుడే తన ఆలోచనల్ని అమలు చేయడం మొదలుపెట్టేసాడు గంగాధరం.. బీరువా తాళం చెవి తన దగ్గరే పెట్టుకున్నాడు. జాయింట్ అకౌంట్లు సింగిల్ ఆపరేషన్ చేసేసాడు.. హడలి పోయారు తల్లీ కూతుళ్లు! ** గంగాధరం, రామనాథంతో తన బాధనంతా చెప్పుకున్నాడు.. ఆయన తన కొడుకుని ఈ పెళ్లికి సుముఖుణ్ణి చెయ్యాలని బ్రతిమాలాడు.. "మిహిర. చెడ్డది మాత్రం కాదురా రామం.. నాకు నమ్మకముంది రాజు దాన్ని దారిలో పెట్టగలడని" స్నేహితుడి కన్నీళ్లు రామనాథాన్ని ఆలోచింపచేసాయి.. 'తన కూతురే ఇలా ఉంటే.. ' అంతే, "పెళ్లికి ముహూర్తాలు పెట్టించరా" అన్నాడు. *** రాజీవ్ తండ్రి మాటకి, ఋణవిముక్తికి, మీదు మిక్కిలి తనకి ఆ అమ్మాయిని చూడగానే కలిగిన గిలిగింత తలపులకి, ఆమెని తాను మార్చుకోగలనన్న ధైర్యానికి బద్ధుడై, పెళ్ళికొడుకు అయినాడు! వేద మంత్రాలు, పెళ్లి జరిగేటప్పుడు ఆ సాన్నిహిత్యం మిహిర అంతరంగాన అతని మీద ప్రేమ కలిగిస్తున్న ప్రతిసారి, తల్లి వాళ్ళ గురించి చెప్పే హీనోక్తులు మనసును ఎదురు తిరిగేట్లు చేస్తున్నాయి. దాంతో ఆమె ప్రవర్తన నలుగురూ చెవులు కొరుక్కునేట్లు ఉన్నది. తనదైన వ్యక్తిత్వంతో రాజీవ్, మిహిర ప్రవర్తనని అడుగడుగునా కమ్ముకుంటూ వస్తున్నాడు. శాంత, రామనాథంలు అన్నీ తెలిసిన వాళ్ళు కనక తమ ప్రేమతో మిహిరని శాంతపరుస్తున్నారు. అత్తగారిల్లంటే ఎంత విముఖాత ఉన్నా, అక్కడ ఉన్న మూడు రోజులూ రామనాథం, శాంతల అన్యోన్యత మిహిరని అబ్బురపరచింది! 'ఆంటీ ఎందుకు అంకుల్ పిలవగానే 'జీ హుజూర్ 'అన్నట్ల వెళ్తుంది అనుకున్నానో లేదో అంకుల్ అందరి ఎదురుకుండానే ఆంటీ కాళ్ళకి నూనె రాస్తున్నారు! నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను!. ఇంత పెద్ద వాళ్లయినా, ఇద్దరూ కలిసి కూర్చుని, హాసప్రతిహాసాలతో, ఒకరికొకరు సాయ చేసుకుంటూ.. ఇలా ఉంటారా భార్యా భర్తలంటే.. " తన తల్లిదండ్రుల దగ్గర ఎన్నడూ చూడని ఈ సన్నివేశాలు మిహిర హృదయంలో ఓ సున్నిత కోణాన్ని తట్టి లేపాయి! రాధ నిర్లక్ష్య వైఖరి తెలిసిన గంగాధరం, రాజీవ్ కోరినట్లు తమ ఇంట మూన్నిద్రలు లాంటి సాంప్రదాయాలని పక్కన పెట్టేసి, నూతన వధూవరులు హనీమూన్ కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. రాజీవ్ తన ఖర్చుతో, తన లైఫ్ స్టైల్ లో మాత్రమే భార్యతో ఊటీ, కోడైకెనాల్ వెళ్లడానికి డిసైడ్ అయ్యాడు! *** ఎంతో సతాయించాలని, తన తండ్రి మీద పగ, భర్త మీద తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు తల్లితో కలిసి వేసిన మిహిరకి, రాజీవ్ ప్రవర్తన అవకాశమే ఇవ్వలేదు. సుందర ప్రదేశాలన్నీ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఒక ప్రాణస్నేహితుడు లాగా తిప్పి చూపించాడు. ఒక్కటే మంచం మీద పడుకున్నా ఎటువంటి వికారమూ లేకుండానే ఉన్నాడు! మిహిర ఒకానొక చలిరాత్రి దగ్గరగా రాబోయినా, సున్నితంగా పక్కకి జరిగి లేచి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. ఆ రోజు మొదలు ప్రతీ రాత్రీ అంతే! మిహిర అహానికి అది పెద్ద దెబ్బ! ఉక్రోషంతో కసి, కోపంతో మిహిరని ఆందోళన, ఆవేదన, అనురాగం ముప్పిరిగొనగా రాజీవ్ స్థితప్రజ్ఞతతో, ఏమాత్రం కొరుకుడు పడకుండా నిలిచాడు! రామనాథం రోజూ కొడుక్కి మెసేజ్ చేసి విషయాలు తెలుసుకుంటున్నాడు. శాంతకి భర్త ద్వారా తెలుస్తున్నాయి. ఒకరోజు శాంత రాజీవ్ కి, "మరీ ఓవర్ డోస్ ఇవ్వద్దు.. వికటించగలదు" అని. మెసేజ్ చేసింది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
19-12-2024, 02:33 PM
ఫస్ట్ క్లాస్ కుపేలో రాజీవ్ నిద్రపోకుండా, అటు ఇటు మెదుల్తున్న భార్యని, "ఏమయ్యింది నా చిన్నీ" అన్నాడు.
అంత తలనెప్పిలోనూ ఉలిక్కిపడ్డది మిహిర, తన తండ్రి తనను మొన్న మొన్నటిదాకా ప్రేమతో పిలిచిన పిలుపు.. వివశురాలైపోయింది.. ప్రేమ కోసం వాచి పోయిన ఆ చిన్న ప్రాణం! తనను దగ్గరకు తీసుకుంటున్న రాజీవ్ ని చుట్టుకుపోయి బావురుమన్నది. ఏదో మాట్లాడుతున్న ఆమె పెదవులని తన పెదవులతో మూసేసాడు! ఆ రాత్రి వారి తొలిరేయి అయింది! ** కూతురి కోసం బెంగ పడి జ్వరం తెచ్చుకున్న తల్లిని చూడటానికి వచ్చినరోజునే పుట్టినింటికి వెళ్ళింది.. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటున్న మిహిరని ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్కర్లేదా?" రాత్రి అంత మార్దవంగా, సన్నిహితంగా మెసిలిన భర్త కరకు కంఠంలోని అధికార ధోరణికి కంగుతిన్నది మిహిర! ఒక్క నిమిషంలో ఆమెలోని ఆభిజాత్యం పడగ విప్పి "నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు" అన్నది. "ఇది పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్. ఈ ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఈ ఇంటి సభ్యులు పాటించి తీరాలి!" "షిట్! ఆఫ్ట్రాల్ నేను మా ఇంటికి వెళ్ళడానికి.. " "ఓకే నాకు ఇన్ఫర్మేషన్ అందింది. నువ్వు భోజనానికి వస్తావో రావో చెప్పి వెళ్ళాలి. మా ఇంట్లో మేము అనవసరంగా వేస్ట్ చెయ్యము" రాజీవ్ మాట లెక్కలేనట్లుగా వెళ్ళిపోయింది! తల్లి ఉద్బోధలు, రాజీవ్ తో గడిపిన మధురమైన కాలాన్ని మరుగున పడేసి, మిహిరలోని మూర్ఖత్వాన్ని తట్టి లేపింది. అత్తగారింట్లో ఎలా గొడవలు లేవదీయాలో, .. అదీ అవతలి వాళ్లదే తప్పనిపించేట్లు, తన భర్త చేసిన పెళ్లిని ఎలా తలక్రిందులు చేయాలో వైనవైనాలగా చెప్పింది. మిహిరలో ఉన్న ద్వంద్వ ప్రకృతి ఆమెని పూర్తిగా తల్లి మాట శిరోధార్యంగా తీసుకోనివ్వడం లేదు.. రాజీవ్ సాన్నిహిత్యం కోరుకుంటున్న మనసు, శరీరం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆ చిరాకంతా తల్లి మీదే చూపించి అన్నం తినకుండా వచ్చేసింది. సరిగ్గా బైట అడుగుపెట్టగానే బయటకు వెళ్లి వస్తున్న తండ్రీ కనపడ్డాడు. ఆయన చేసిన పెళ్లి అని ఆయన్ని నాలుగు దులిపేసింది.. అన్నింటికీ పర్మషన్ అడగాలని ఆంక్షలు విధిస్తున్నాడు రాజీవ్ అంటూ. అప్పుడే రాజీవ్ తో మాట్లాడి అంతా బాగుంటుందన్న ఆశాభావంతో ఉన్న గంగాధరం గారు చిన్నబోయారు! ** మిహిర అన్నం తినటానికి వచ్చి, డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండటం చూసి, అవాక్కయింది!. "నేను అన్నం తినాలి. అక్కడ ఏమీ లేవు" మిహిర విసురుగా అంది. అప్పడే ఆమెని చూస్తున్నట్లు రాజీవ్, " ఓ నువ్వు అన్నం తినాలా? మాకు తెలియదే నువ్వు భోజనానికి వస్తావని. అమ్మా వాళ్ళు పెళ్లికి వెళ్లారు. నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ లో భోజనం చేసేసాను. అదేమిటీ మీ అమ్మ అన్నం పెట్టలేదా?" మిహిర ఆకలికి.. కళ్ళు తిరిగినట్లై పడబోయింది. రాజీవ్ లోని మనిషి మేల్కొన్నాడు. గబగబా లేచొచ్చి మిహిరని మంచం మీద పడుకోబెట్టి, మారు మాట్లాడకుండా షర్ట్ వేసుకుని, దగ్గర్లో ఉన్న కర్రీ పాయింట్ లో అన్నం కూరలు తెచ్చి, గబగబా ప్లేట్ లో అన్నం కూరలు కలిపి నోట్లో పెట్టాడు. మిహిరలోని అహం బుసలు కొడుతున్నా, ఆకలి, రాజీవ్ ప్రేమ మారుమాట్లాడకుండా కలిపినవన్నీ తినేసేట్లు చేసింది. రాజీవ్ కి బాగా అర్థమయింది మిహిరలోని ద్వంద్వ ప్రవృత్తి! 'ఎలా కాపాడుకోను నా చిన్నిని, తల్లి అనే ఆ రాక్షసి నుండి? *** పసిపిల్లలాంటి మనసు ఒకవైపు తల్లి మాటలకి తాన తందాన అనే అహంకారి మిహిర మరోవైపు! తాను బాధపడుతూ, భర్తని, అత్తమామల్ని బాధ పెడుతూ, ఆఖరికి తల్లి మాట ప్రకారం భర్త దగ్గరకు వెళ్లక యాడాది గడిచిపోయింది. కొద్ధి రోజులు స్వేచ్ఛాజీవితాన్ని ఎంజాయ్ చేసింది. తోటి వాళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.. ఒంటరిగా పార్టీల కొచ్చే మిహిర మీద కన్నేసిన రాహుల్ ఆ రోజు ఇంట్లో దింపుతానని తీసుకు వెళ్లి, తన గెస్ట్ హౌస్ లో బలవంతం చేయబోతే, అదృష్టవశాత్తు ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ తమ ఇంట్లో డ్రైవర్ గా చేసిన అతను కావడం వలన, రాహుల్ తో కలియబడి రక్షించాడు!, బాధాతప్త హృదయంతో తల్లి దగ్గరకు వెళ్లబోయిన మిహిర తండ్రి గొంతు విని ఆగిపోయింది. గెస్ట్ హౌస్ వాచ్మెన్ ఫోన్ వలన విషయం తెలిసిన గంగాధరం మళ్లీ చరిత్ర పునరావృతమైతున్నదని గ్రహించి భార్యతో ఒక పుష్కరం తర్వాత ఏకాంతం ఏర్పరుచుకుని', "నీకు జరిగిన అన్యాయం నీ కూతురికి కూడా జరగబోయి, దేవుడి దయ వలన తప్పిపోయింది! నీకెంతమాత్రమన్నా ఆరోజు నా క్షమకు విలువ అనేది ఉంటే వెంటనే దానికి భర్త విలువ తెలియచెప్పి రేపటి కల్లా చీరె సారెతో నువ్వే దింపి రావాలి. ఇందుకు భిన్నంగా జరిగితే, నాకు ఎల్లుండి ఉదయం అనేది ఉండదు" విసవిసా బైటకు వచ్చిన గంగాధరం, కూతుర్ని అక్కడ చూసి, సిగ్గుతో చితికిపోయాడు! మిహిర, తన తండ్రి పాదాలు తాకి తనని క్షమించమన్నది. కూతుర్ని దగ్గరకు తీసుకొని భార్య దగ్గరకు వెళ్ళాడు. చూడు మిహిరా! ఇప్పుడు నువ్వు విన్నది ఇక్కడే మర్చిపోతానని నీకెంతో ఇష్టమైన మీ అమ్మ మీద ప్రమాణం చెయ్యి. ఇది కేవలం మా భార్యాభర్తలకి మాత్రమే సంబంధించింది! మిహిర తల్లి రాధ తన అర్థం లేని అహంకారం కూతురి జీవితాన్నే బలి తీసుకోబోవడంతో, భర్తని క్షమించమని కాళ్ళు పట్టుకున్నది. గంగాధరం భార్యని పొదువుకుని, "తానెప్పటికీ ఆమెకి బాసటగా నిలుస్తా" నన్నాడు. మిహిరకి తండ్రి ఔన్నత్యం, అన్నిటినీ మించి భార్యాభర్తల అనుబంధం యొక్క విలువ, వేదమంత్రాల సాక్షిగా పడ్డ మూడుముళ్ల శక్తి అవగతయింది! **** రాజీవ్ వివాహానికిచ్చే ఇచ్చే విలువ మూలంగా ఎంతమంది ఎన్నిసార్లు మళ్లీ పెళ్లి చేసుకోమన్నా, , "మిహిర నా భార్య.. మా బంధానికి గ్రహణం పట్టింది కానీ అది వీడిపోనిది! ఇది రాముడు ఏలిన రాజ్యం!" అనేవాడు. రాజీవ్ లాగా భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకుంటే మామిడాకులే గానీ విడాకులుండవు కదా! *** పందిట్లో పెళ్లవుతున్నది! మిహిర, రాజీవ్ దండలు మార్చుకుంటున్నారు.. కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవళ్ళు మనవరాళ్ల సమక్షంలో, షష్టిపూర్తి మహోత్సవంలో! సమాప్తము
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
20-12-2024, 06:37 AM
24-12-2024, 10:40 PM
ఆఖరి ఆకలి
రచన: పిట్ట గోపి ఈ సృష్టిలో ఆడ మగ, చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో శత్రువుగా ఉండేది ఏదైనా ఉందంటే అది ఆకలి మాత్రమే. ఆకలిని జయించటం దాదాపు ఏ మనిషికీ సాద్యం కాకపోవచ్చు. ఈరోజుల్లో అనేక మంది అవినీతి, దొంగతనాలు, దోపిడీలుతో ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేస్తూ.. చంపుకుంటూ సంపాదిస్తున్నారు అంటే.. !దానికి కారణం ఆకలే. ఎందుకంటే.. తాము బాగా సంపాదిస్తే... కానీ తమ వారసులుకు ఆకలి బాధలు, ఆర్థిక సమస్యలు తప్పవు. లేకపోతే వారి పరిస్థితి వేరేలా ఉంటే ఆకలితో అలమంటించాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే ఏం చేసైనా పెద్దగా ఆస్తులు, డబ్బు పోగేసుకుని తద్వారా భవిష్యత్ లో తమ వారిని ఆకలి కేకల నుండి తప్పించవచ్చని. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ సమాజంలో కూడా కొందరు ఆహారాన్ని వృధా చేయటం చూస్తూనే ఉంటాం. ఇక ధనవంతులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం రుచిగా లేకపోయినా తినే అహారం పై కోపాన్ని ప్రదర్శించి మరీ విసిరేసే సందర్భాలు లేకపోవు. మణి ధనవంతులు ఇంటిలో పుట్టి పెరిగాడు. వడవడిగా ఐదో తరగతిలోకి అడుగుపెట్టాడు. ఆఫీసు పనితో బిజీగా గడిపే ఈరోజుల్లోని తల్లిదండ్రులకు పిల్లలకు మంచి బుద్దులు నేర్పించటం ఎలా వస్తుంది.. ? పోనీ.. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఉంటే బాగున్ను కానీ.. ! ఏం చేస్తాం వాళ్ళకి దూరం పెట్టి భార్య పిల్లలతో మాత్రమే బతికే సమాజం అయిపోయింది. అయితే మణికి మాత్రం నాన్నమ్మ శారద రూపంలో మంచి విషయాలు చెప్పే మనిషి ఉంది. మణి నిజంగా చిన్నతనం నుండే చాలా పెంకితనంతో ఉండేవాడు. వాడు ఏది కావాలంటే అది తెచ్చి పెట్టాలి. లేదంటే వాడి అల్లరి అలాంటిది, ఇలాంటివి కాదు. ఏది పడితే అది విసిరేస్తు రచ్చరచ్చ చేస్తాడు. వాడి అల్లరికి తల్లిదండ్రులు మహేష్, శ్యామలలే సహనం కోల్పోతు.. మణి అసలు అల్లరి చేయకుండా ఏం కావాలంటే అది ఇచ్చేసే వాళ్ళు. మణికి పన్నెండేళ్ళు వచ్చినా ఎప్పుడు సరిగ్గా చేతులు పెట్టె బోజనం చేయడు. రుచిగా లేదని విసిరేస్తుంటాడు. అవన్నీ శారద ఓపిగ్గా ఓర్చుకుంటూ ఎప్పుడూ మణికి మంచి విషయాలు చెప్తు వాడిలో మంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంత చేస్తున్నా కూడా కన్న కొడుకు కానీ.. కోడలు శ్యామల కానీ ఏనాడూ శారదాకు గౌరవించలేదు. సరికాదా ఆమె ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం ఉండేది కాదు ఎలాగో నెట్టుకొస్తున్నారు. మణిని చూసుకుంటుంది అని కానీ.. ఇప్పుడు మణి తల్లిదండ్రులు ఆఫీసుకి వెళ్ళినా... అతడు మరి చిన్నపిల్లడేమి కాదు. అందుకే తల్లిని వదిలించుకునేందుకు వారికి ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఒక రోజు ఆదివారం మహేష్ శ్యామలలు ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు. ఇంట్లో మణి శారదాలు మాత్రమే ఉన్నారు. బోజనం పెడుతుంటే మణి రుచిగా లేదని అన్నాన్ని విసిరేశాడు. అన్నం చెల్లాచెదురుగా పడింది. శారదా మౌనంగా ఆ అన్నాన్ని ఊడ్చి మరలా పళ్లెంలో వేసి ఆ పళ్ళేన్ని, మణిని తీసుకుని బయటకు వచ్చింది. అలా కొంతదూరం వెళ్ళగా ఆకలితో పస్తులు ఉంటూ ఏ ఆధారం లేక రోడ్లపై బికారంగా తిరుగుతున్న పిల్లలకు ఇచ్చింది. ఆ అన్నాన్ని వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆత్రతగా అన్నం కడుపులోకి వెళ్ళగా ఆనందంతో వచ్చే కన్నీళ్ళని తుడుచుకుంటూ తింటున్నారు. మిగతాది గుడి ముందు ఉన్న బిచ్చగాళ్ళకి పెట్టగా వారు చేతులు జోడించి మరలా మణి తల పై చెయ్యి వేసి దీవించారు. ఈ రెండు సంఘటనలు మణిని తీవ్రంగా కలచివేశాయి. నాన్నమ్మ ఒక్క మాట కూడా అనకుండానే మణి తనలో తనకు తెలియకుండా తన మనసు కరిగిపోయింది. "బాబు మణి, ఏంటీ ఆలోచిస్తున్నావు. రుచిగా లేదని నువ్వు పారేసిన అన్నాన్ని వాళ్ళు ఎలా తిన్నార్రా... ? అన్ని ఉండి కూడా కావాల్సింది తినకుండా ఇలాంటి వంకలు పెడుతున్నాం. కానీ.. ! ఏమీ లేని వాళ్ళు చూడు రుచులతో పనే లేకుండా ఏది దొరికితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. అన్నం రుచిగా లేదని పారేసే మనం అది కూడా లేని ఇలాంటి అభాగ్యులను చూసైనా మారాలి. ఉన్నవాళ్ళు తిన్నది అరగక తిరుగుతుంటే.. లేనివాళ్ళు కడుపు నింపుకోటానికి తిరుగుతున్నారు. నీకు ఎక్కువ అయి పారేసే ఎంగిలి కూడు, ఏమీ లేనివారికి ఒక విందు భోజనంలా ఉంటుంది. ఇకనైనా పద్దతిగా అల్లరి చేయకుండా ఉండు. అలాగే ఆకలి అనే గమ్యంను చేరుకోవాలంటే అభాగ్యులు ఎంత కష్టపడుతున్నారో.. ఆలోచించు. ఆకలి అందరికీ శత్రువే. ఈరోజు నువ్వు పారేస్తే రేపు నీకు ఆ అన్నం దొరకకపోవచ్చు. పదా " అంటూ తీసుకుపోయింది. ఇంటికి వచ్చి అన్నం వేసిన పళ్లెం ముందు కూర్చుని "దేవుడా! ఎవరు పండిస్తే ఈ అన్నం నాకు దొరుకుతుందో వారి కుటుంబం ఆనందంగా ఉండేలా చూడు " అని ప్రార్ధించడం శారదకు తృప్తినిచ్చింది. అక్కడితో శారదా, మణీల బంధం సరి. అవును. శారద ఆ తర్వాత రోజు నుండి తమ ఇంట్లో లేదు. మణి అడిగితే బంధువులు ఇంటికి వెళ్ళింది అని చెప్పారు. అలా శారదను మణి మర్చిపోయాడు. ఇప్పుడు మణి పెద్దవాడు అయ్యాడు. చదువు కొనసాగిస్తున్నాడు. మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అంతేకాదు, తల్లిదండ్రుల సంపాదనలో కొంత ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా అన్నాన్ని పెడుతు వారి ఆకలి తీరుస్తున్నాడు. ఒకరోజు కాలేజీ క్యాంపు నుండి అందరూ విద్యార్థులుతో మణి ఒక వృద్దాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడకు వెళ్ళగా మణికి గుండె కలుక్కుమంది. అవును! బంధువుల దగ్గరకు వెళ్ళిందనుకున్న నాన్నమ్మ, విశాలమైన బంగ్లా లాంటి ఇళ్ళు, ఆస్తులు, కొడుకు, కోడలు మనుమడు ఇలా అందరూ ఉండే నాన్నమ్మ, ఏ ఆధారం లేని వాళ్ళకి నిలయమైన ఈ వృద్దాశ్రమంలో ఉండటంతో మణి కళ్ళలో కన్నీరు సముద్రాన్ని తలపించింది. ‘నాన్నమ్మా’ అంటూ శారదా ఒడిలో వాలిపోయి బిగ్గరగా ఏడ్చాడు. మణిని ఓదార్చటం శారదా, మరియు స్నేహితులు వల్ల సాద్యం కాలేదు. కొడుకు, కోడలు, మనుమడుతో.. ఉన్నంత కాలం సరదాగా గడిపాలని ఏ తల్లికి ఉండదు.. ! శారదకి వాళ్ళని వదిలే ఉండటం ఇష్టం లేకపోయినా కొడుకు కోడలే స్వయంగా ఇక్కడికి చేర్చటంతో ఇంట్లో తాను ఉండటం వారికి ఇష్టం లేనప్పుడు వారి ఇష్టానికి అనుగుణంగా నడుస్తు తన ఆనందాన్ని మనసులోనే సమాధి చేసుకుంటూ బతుకుతుంది శారదా. మణి వేరే ఆలోచన చేయకుండా నాన్నమ్మను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆఫీసు నుండి వచ్చిన తల్లిదండ్రులు శారదని చూసి షాక్ అయ్యారు. "అమ్మా.. నువ్వు ఎప్పుడు వచ్చావు".. ? ప్రశ్నించాడు మహేష్. లోపలి నుండి మణి వస్తు.. " ఈ రోజే నాన్న.. మీరు ఏ బంధువుల ఇంటికి నాన్నమ్మనీ తీసుకెళ్ళారో... ఆ బంధువుల ఇంటికి ఈరోజు నేను వెళ్ళాను. చాలా రోజులు అయింది కదా అందుకే తీసుకొచ్చా " అన్నాడు వెటకారం చేస్తూ ఆ మాటలకు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇంకా తేరుకోనే లేదు. "చూడండి, నాకు జన్మనిచ్చారు. కానీ.. ! నాకంటే ఎక్కువ సమయం మీరు ఆఫీసు పనికే కేటాయించారు. అన్ని తానై పాఠశాలలో కూడా నేర్పని ఎన్నో మంచి విషయాలను నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. అలాంటి నాన్నమ్మను, నన్ను దూరం చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రేపు నేను కూడా మీకు అలా చేస్తే మీరు ఎంత క్షోభ అనుభవిస్తారో.. నాన్నమ్మకు మీరంటే ఎంత ఇష్టం. అది మీకు తెలియని విషయం కాదు. తాను చివరి శ్వాస వరకు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేస్తే నేను ఊరుకోను. చివరగా ఒక్క మాట.. మిమ్మల్ని వదిలేసి ఉండలేని ఏ మనుషులనైనా నిర్ధాక్షిణ్యంగా వదిలివేయకండి" అన్నాడు. నాన్నమ్మ సహాయంతో, మనసు మార్చుకున్న తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడు మణికి ఒకటే ఆకలి. అది తన కంటికి ఏ ఒక్కరు ఆకలి బాధతో కనపడకూడదని. అది తన ఆఖరి ఆకలి కూడా.. అంటే చివరి శ్వాస వరకు ఈ ఆకలి తీరదన్న మాట. ****** ****** ****** ******
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
02-01-2025, 03:06 PM
ఆన్లైన్ బిర్యానీ
రచన: తాత మోహనకృష్ణ సుబ్బారావు కి చిన్నప్పటినుంచి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయం తనతోపాటు అలానే పెరుగుతూ వచ్చింది. అందుకే, హారర్ సినిమాలంటే, చాలా దూరంగా ఉంటాడు. అలాంటి మనిషికి పెళ్ళయింది. తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పెళ్ళాన్ని దగ్గరగా చూస్తే.. ఆ రోజు సుబ్బారావు కు గుండె దడే..! ఇద్దరు పిల్లలతో జీవితం హ్యాపీ గానే సాగిపోతుంది. ఒక రోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి భర్త దగ్గరకు వచ్చింది పెళ్ళాం.. "ఏమండీ! మా నాన్నకి ఒంట్లో బాగోలేదంట. నా గురించి కలవరిస్తున్నారు. నేను ఇప్పుడే బయల్దేరతానండి..ఇలా వెళ్లి, నాన్నను చూసి..అలా వచ్చేస్తాను. ఒక్క రోజు అడ్జస్ట్ చేసుకోండి. పిల్లల్ని మీరు చూసుకోలేరు..నాతో తీసుకెళ్తాను. ఇలాంటి పరిస్థితిలో 'నో' అని అనలేడు సుబ్బారావు. పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడచి ఒంటరిగా ఉన్నది లేదు. మా ఆవిడ ఊరు ఉదయం వెళ్లి.. సాయంత్రానికి వస్తే బాగుండేది. ఇలా సాయంత్రం బయల్దేరితే..రాత్రంతా నేను ఒక్కడినే ఇంట్లో ఉండాలా..? తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. అసలే మొన్న దెయ్యం కనిపించిందని ఆ రామారావు వీధిలో అందరికీ చెప్పాడు. పైగా, ఈ పండుగ టైం లో దొంగతనాలు ఎక్కువనీ... రాత్రి పూట జాగ్రతగా ఉండమని సెక్యూరిటీ ఆఫీసర్ల హెచ్చరిక ఉండనే ఉంది. ఇదంతా మరచిపోయి..కాసేపు టీవీ చూద్దాం అనుకున్నాడు సుబ్బారావు. అదే టైం లో, టీవీ లో క్రైమ్ ప్రోగ్రాం వస్తోంది. అందులో..ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్ పై దొంగలు దాడి చేసి..హత్య చేసి ఇల్లంతా దోచుకున్నారని చూపిస్తున్నారు. 'ఇదేదో నన్ను ఇబ్బంది పెట్టడానికే చెబుతునట్టు ఉంది' అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు. మరొక ఛానల్ లో..చనిపోయిన మనిషి దెయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు...అంతే..! భయమేసి టీవీ ఆపేసాడు. నా పెళ్ళాం అర్జెంటు గా వెళ్లిపోయింది. వంట కుడా ఏమీ చెయ్యలేదు. వెళ్తూ..తన పెళ్ళాం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు వచ్చింది. ఏం చేస్తాం...? ఆకలి ఆగదు కదా..! అనుకున్నాడు సుబ్బారావు. ఫోన్ తీసి..ఆన్లైన్ యాప్ లో తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేసాడు. అది కుడా ఫేమస్ హోటల్ నుంచి..ఆ హోటల్ చాలా దూరంగా ఉండడం చేత, డెలివరీ టైం ఒక గంటకు పైగానే చూపించింది. ఈ లోపు అలా వరండా లోకి వెళ్లి చూసాడు. చల్లటి గాలి వేస్తోంది. గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడ పై పడి..ముందుకు వెనక్కు కదులుతుంది. అసలే భయానికి కేర్ అఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు...దానిని చూసి భయపడి వెంటనే తలుపు వేసేసాడు. సోఫా లో కూర్చొని..ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపు మెల్లగా వాన మొదలైంది. చిన్న చినుకు గా మొదలైనది కాస్త పెద్దది అయ్యింది. అలా వాన లో సిటీ అంతా తడిసి ముద్దవుతున్నాది. ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు. బ్రేకింగ్ న్యూస్ లో సిటీ అంతా జలమయం..ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక చేసారని న్యూస్. ఆకలి వేస్తున్న సుబ్బారావు, నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి.. ట్రాకింగ్ చూసాడు. 'హమ్మయ్యా! నా ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యలేదు...దారిలో ఉంది..'.. ఇలా అనుకున్నాడో లేదో...ఆ కరెంటు కాస్తా పోయింది. ఒకేసారి ఇల్లంతా చీకటిమయం. ఫోన్ లో టార్చ్ వెయ్యడానికి కుస్తీ పడ్డాడు. మొత్తానికి వెలిగింది.. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్ గా కిచెన్ లో ఏదో చప్పుడు.. సుబ్బారావు గుండె జారింది..దొంగా? అని కంగారు పడుతూ..మెల్లగా వెళ్లి చూసాడు. పెరటి తలుపు తీసి ఉంది..మొదట్లో దొంగ అని భయపడ్డాడు..తర్వాత 'మియావ్' అని వినిపించడం తో...ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు. చాలాసేపు తర్వాత..కరెంటు వచ్చింది. అప్పుడే.. కాలింగ్ బెల్ మోగింది. బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీసాడు. ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకుని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. "సర్! పూర్తిగా తడిసిపోయాను..ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు. నాకు ఆకలి వేస్తోంది. నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయవచ్చా?" అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్ "ఒంటరిగా ఉండలేక...తోడు దొరికిందన్న ఆనందంలో...లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు" లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు..డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు.. సుబ్బారావు పార్సెల్ లో బిర్యానీ తింటున్నాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
02-01-2025, 03:10 PM
"సర్..ఇంట్లో ఒక్కరే ఉన్నారా?" అడిగాడు డెలివరీ బాయ్
"అవును.." "కొంచం మంచి నీళ్ళు ఇస్తారా సర్!.." కిచెన్ లోకి వెళ్లి సుబ్బారావు గ్లాసు తో నీళ్ళు తెచ్చాడు. హాల్ లోకి వచ్చి చూస్తే.. డెలివరీ బాయ్ లేడు. మొత్తం అంతా చూసాడు. ఎక్కడా లేదు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్ గా ఎక్కడకు వెళ్ళాడు? అని అనుకుంటుండగానే..భయానికి చెమటలు పట్టేసాయి సుబ్బారావు కు. సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్ పై అనుకోకుండా కూర్చున్నాడు...వెంటనే టీవీ ఆన్ అయ్యింది.. బ్రేకింగ్ న్యూస్...ఫుడ్ డెలివరీ బాయ్...వర్షం లో గల్లంతు..ఫుడ్ డెలివరీ కోసం వెళ్తుండగా ఘటన..అని అతని ఫోటో చూపించారు.. న్యూస్ చూసి సుబ్బారావు కు చెమటలు ఇంకా ఎక్కువ అయ్యాయి...చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే.. మరి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నది ఎవరు...?అతనే ఇతను కదా! కొంపదీసి దెయ్యం అయి వచ్చాడా..? తలచుకుంటూ...గజ గజ వణికిపోయాడు సుబ్బారావు. ఇంక జన్మలో ఆన్లైన్ లో బిర్యానీ తెప్పించనని డిసైడ్ చేసుకుని.. టీవీ ని ఆపేసాడు. ఈలోపు..సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది.. "ఏమండీ! ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? భోజనం చేసారా?" అని ప్రశ్నల వర్షం కురిపించింది "వచ్చింది...ఏదో చేసాను..." "ఏం తిన్నారు...బిర్యానీ యే కదా ..!" అంది భార్య "ఆ మాట ఎత్తకు...నాకు ఒణుకు వస్తుంది..." "మీకు ప్రతిదానికి భయమే...! ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది. నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను లెండి...కమ్మగా వండి పెడతాను.." పెళ్ళాం మాటలతో కొంచం రిలీఫ్ వచ్చినా..మరో పక్క డెలివరీ బాయ్ విషయంలో.. భయం ఇంకా పోలేదు సుబ్బారావు కు.. టీవీ న్యూస్ లో...ఆన్లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు.. తన అన్న డెలివరీ కోసం వెళ్లి చనిపోయాడని బాధపడుతున్నట్టు చూపిస్తున్నారు. "మేము ఇద్దరమూ ట్విన్స్..చూడడానికి ఒకేలాగ ఉంటాము. ఆన్లైన్ డెలివరీ చేస్తాము. నేను ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత..ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడకు వచ్చేసాను. ఈ రోజు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య..!" అని విలపిస్తున్నాడు..సుబ్బారావు కు బిర్యానీ డెలివరీ చేసిన బాయ్ ఈ విషయం తెలియక సుబ్బారావు..పాపం! రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు.. *****
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
« Next Oldest | Next Newest »
|