Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సంపూర్ణ తీర్థయాత్ర సమాప్తం
#1
సంపూర్ణ తీర్థయాత్ర సమాప్తం

[Image: image-2024-12-20-165501843.png]
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
[font=var(--ricos-font-family,unset)] [/font]



అబ్బాయ్! మనకు తెలిసిన టూర్ ఆపరేటర్స్ సంపూర్ణ తీర్థ యాత్రకి 16 రోజులు తీసుకొని వెళ్తారుట. ఒక్కొక్కరికి యాభై వేలు అవుతుంది. మామయ్య వాళ్ళు వెళ్తున్నారు, నేను అమ్మా కూడా వెళ్తాము కొడుకు శివరాం తో అన్నాడు మోహనరావు. 



“16 రోజుల యాత్ర ఏమిటి నాన్నా, మీవల్ల కాదు అన్నిరోజులు తిరగడం అన్నాడు కొడుకు. 



అదికాదు రా, ఆయోధ్య లో మూడు రోజులు, కాశీ లో తొమ్మిది రోజులు, యింకా ఏవో చూపిస్తారు, వంటవాళ్ళు కూడా వస్తున్నారు, మన యింట్లో వంటలా చేస్తారుట అన్నాడు ఫోన్లో కొడుకుతో. 



అమ్మకి గుళ్ళు చూడాలి అని ఉంటుంది, మీకు మాత్రం వాళ్ళు వండే వంటలు మీద ఆసక్తి అన్నాడు కొడుకు. 



అయినా అమ్మతో మాట్లాడి నేను చెప్పే అంతవరకు వాళ్ళకి వస్తాము అని చెప్పకండి. ఉన్నవాళ్ళు ఉండక ఏదోకటి ప్రాణం మీదకి తెస్తారు అంటూ ఫోన్ పెట్టేసాడు కొడుకు. 



భార్య రమణి వంక చూసి, చూసావా.. వాడు నీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడుట, మనం యాత్రకి వెళ్లాలా లేదా అని. మనం ఎక్కడికి వెళ్ళాలో వాడు చెప్పాలా? అన్నాడు మోహనరావు. 



అవును. చిన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని మనం చెప్పాము. యిప్పుడు మనం వృద్ధాప్యం లోకి వచ్చాము, పిల్లలు చెప్పింది మనం వినాలి అంది భార్య రమణి. 



ఆశ్చర్యం గా భార్య వంక చూసి, అసలు నువ్వేగా మీ తమ్ముడు వాళ్ళు యాత్రకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామా అని, యిప్పుడు యిలా అంటావేమిటి అన్నాడు. 



పిల్లలకి భయం, వయసులో మనం మూలపడితే, సెలవు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ మనల్ని తిప్పటం కష్టం అని. అయినా వాడు ఆఫీసుకి వెళ్లే టైం లో ఇటువంటివి చెప్పద్దు అంటే వినరు మీరు అంది. 



“..చూడు వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం యాత్రకి వెళ్దాం. మొన్న భక్తి టీవీలో చెప్పారుగా, ఒక్కసారి చక్రతీర్థం లో స్నానం చేస్తే వున్న పాపాలు పోతాయి, కాశీలో తొమ్మిది నిద్రలు చేస్తే మరు జన్మ వుండదు అని. తెలిసో తెలియకో చేసిన పాపాలు పోగుట్టుకుందాం అన్నాడు. 



తండ్రి మొండి పట్టు కొడుక్కి చెప్పి, మామయ్య వాళ్ళు కూడా వుంటారుగా, జాగ్రత్తగా వెళ్ళి వస్తాము అని చెప్పి ఒప్పించింది రమణి. 



నాలుగు రోజులు తరువాత తండ్రి అకౌంట్ కి లక్ష రూపాయలు పంపి, టూర్ వాళ్ళకి కట్టండి, ఆహారం విషయం లో జాగ్రత్తగా వుండండి, తినేసి హోటల్ లో పడుకోకుండా, గుళ్ళు అన్ని చూడండి అన్నాడు శివరాం. 



సరే జాగ్రత్తగా ఉంటాము లే, యాత్ర అయిన తరువాత వైష్ణవి దేవి యాత్ర కి నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు కొడుకుతో. 



ముందు యాత్ర జాగ్రత్తగా చేసుకుని రండి అన్నాడు. 



కొడుకు పర్మిషన్, డబ్బులు రావడంతో టూర్ అతనికి అడ్వాన్స్ యిచ్చి బట్టలు సద్దుకుని రెడీ అయ్యారు దంపతులు. 



రేపు ప్రయాణం అనగా కూతురు అడిగింది ట్రైన్ లో ముప్పై ఆరు గంటలు కూర్చొని వెళ్లే బదులు ఫ్లైట్ లో వెళ్ళండి. మాట అయినా వినండి నాన్న అంది. 



మోహనరావు కి కూడా ట్రైన్ లో అంతసేపు ప్రయాణం కష్టం అనిపించడం తో సరే ఫ్లైట్ టికెట్స్ పంపు, టూర్ అతనికి మేము డైరెక్టుగా అయోధ్య వస్తాము ఫ్లైట్ లో అని చెప్పేస్తాను అన్నాడు. 






అదేమిటి మీరు మాతో ట్రైన్ లో రావడం లేదా, అవును లెండి బావగారు డబ్బు వున్నవాళ్లు, ఫ్లైట్ లో వస్తారు. మేము ట్రైన్ లో వస్తాము. సరదాగా అందరితో గడపవచ్చు. యాత్ర అంటే ఒంటరిగా వెళ్ళి రావడం లో మజా వుండదు అన్నాడు మోహనరావు బావమరిది కృష్ణ. 



మీ దంపతులు కూడా ఫ్లైట్ లో రావచ్చుగా, ట్రైన్ లో ఎందుకు యిబ్బంది అన్నాడు బావమరిది తో. 



మాకు ట్రైన్ లో దూరం ప్రయాణాలు అలవాటే అండి” అని అనడం తో మోహనరావు దంపతులు ఒక రోజు లేట్ గా బయలుదేరి అయోధ్య లో టూర్ ఆపరేటర్ బుక్ చేసిన హోటల్ కి చేరుకున్నారు. 
ఏసీ వేసారా అంటున్న రమణి తో ఫ్యాన్ కూడా వెయ్యలేదు, ఫ్రీజ్ లో ఉన్నట్టు వుంది ఊరు అన్నాడు మోహనరావు. 



బావమరిది వాళ్ళు ఎక్కిన రైలు లో రిజర్వేషన్ వున్నా కొంతదూరం ప్రయాణం జరిగిన తరువాత ఎక్కడ నుంచి వచ్చారో అయ్యప్పలు, స్టూడెంట్స్ ఎక్కి బావమరిది కాలు పక్కకి జరిపి ఒక్కడు, ఆలా అందరి బెర్త్ లలో సెటిల్ అయిపోయారు. చచ్చి చెడి ట్రైన్ ఎనిమిది గంటల ఆలస్యం గా అయోధ్య చేరుకుందిట. 



బావగారుm మీరే కరెక్ట్, చచ్చినా రైలు ఎక్కకూడదు అంటూ ములుగుతున్న బావమరిది ని చూసి, అది సరే, టూర్ స్వామి అంటున్నాడు.. తెల్లారి నాలుగు గంటలకు బయలుదేరి సరయు నది స్నానం కి వెళ్ళాలిట. మేము రాలేము, నువ్వు వెళ్తే ఒక సీసాలో నీళ్లు తీసుకుని రా. నెత్తిన జల్లుకుంటామన్నాడు. 



అదేమిటి.. యింత దూరం వచ్చి, నదిలో స్నానం చెయ్యకపోతే ఎలా, సరయు నది స్నానం మహా పుణ్యం. నేను దగ్గర వుంటాను భయపడకుండా రండి అని బలవంతం చేసాడు. నా బదులు కూడా నువ్వు ములుగు, నేను రాలేను అని వెళ్ళలేదు. 



ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, మెలుకువ వచ్చేసరికి ఎనిమిది గంటలు అయ్యింది. 



మీ తమ్ముడు వాళ్ళు వెళ్లుంటారా స్నానానికి? అని అడిగాడు భార్యని. 
వాళ్ళు వెళ్తారు, మీ మొండితనం వల్ల నేను కూడా వెళ్ళలేదు. యాత్రలకు వచ్చినప్పుడు అందుట్లో కార్తీకమాసం నది స్నానం ఎంతో పుణ్యం అంది రమణి. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సరే పద, టిఫిన్ తిని వద్దాం అని ఫలహారశాల దగ్గరికి వెళ్ళాడు. 



టూర్ స్వామి, అదేమిటి అప్పుడే స్నానం చేసి వచ్చేసారా, మిగిలిన వాళ్ళు వస్తున్నారా అన్నాడు. 



మేము వెళ్ళలేదు అండి. మీరు మరీ ఉదయం నాలుగు యింటికి నది స్నానం అంటే ఎలా? యిప్పుడు కూడా ఎలా వణికిపోతున్నామో చూడండి అన్నాడు మోహనరావు. 



తీర్ధయాత్ర అంటే అంతే సార్, అయినా ఆరోగ్యం కూడా చూసుకోవాలి, కూర్చోండి. వాళ్ళు రాగానే పెసరట్టు ఉప్మా పెడ్తాము అన్నాడు. 



ముందు కొద్దిగా వేడి కాఫీ ఇవ్వండి అన్నాడు. 



అరగంట గడిచేసరికి నదికి వెళ్లిన వాళ్ళు రావడం మొదలుపెట్టారు. కొంతమంది దగ్గుతో, కొంతమంది వణుకు తో వచ్చి టిఫిన్ కోసం కూర్చున్నారు. 



తన పక్కన కూర్చున్న రమణ మాస్టర్ తో సార్! నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయా అన్నాడు మోహనరావు. 



దిగే అప్పుడు ప్రాణం పోతున్నంత చలి, తరువాత సద్దుకుంది, మీరు రాకపోవడం మంచిది అయ్యింది. టీవీ లో చెప్పినంతగా యిక్కడ కి వచ్చి చూస్తే నదులు శుభ్రం గా వుండవు అండి. పాకుడు పట్టిన మెట్లు, మురికి నీరు, అయినా పుణ్యం అంటారుగా తప్పదు. అన్నట్టు మీ బావమరిది మెట్టు జారి నీళ్లలో పడ్డాడు. మొత్తానికి బయటికి లాగాము అన్నాడు ఆయన. 



అయ్యో ఎలావుందో అనుకుంటూ లేచిన మోహనరావుకి భార్య భుజం మీద చెయ్యి వేసి కుంటూ కుంటూ వస్తున్న బావమరిది ని చూసి, లోపలికి అంతా దిగావా అన్నాడు మోహనరావు. 



లేదు బావగారు, ముందు ధైర్యంగా స్నానం చేద్దాం అనుకున్నాను కాని నీళ్లు షాక్ కొట్టే అంత చల్లగా ఉండటం తో మెట్లదగ్గర కూర్చొని స్నానం చేద్దాం అనుకుని జారి పడ్డాను అన్నాడు. 



పాపం కాలు వాచినట్టు గా కూడా వుంది. మీరైతే బయటకు వచ్చే వాళ్ళు కాదు అన్నయ్య గారు అంటున్న ఆవిడ వంక అసహ్యం గా చూసి పెసరట్టు చేదు అనిపించి రూమ్ లోకి వచ్చేసాడు. 



సాయంత్రం కాలుతో నడవడం కష్టం అని వీల్ చైర్ లో ఎక్కించి అయోధ్య బాలరాముడు ని చూసి వచ్చాము. యింకా సిమెంట్ పనిజరుగుతో ఉండటం తో ఒకటే దుమ్ము. లంగ్స్ లో కి వెళ్ళి అందరూ దగ్గులే దగ్గులు. 



మర్నాటి ఉదయం మళ్ళీ కొంతమంది ధీరులు సరయు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. టిఫిన్ తిన్నతరువాత బస్సు కాశీకి బయలుదేరింది. బస్సు స్టార్ట్ చెయ్యగానే పది మంది వరసగా తుమ్ములు, కొంతమంది దగ్గులు. ఒక చాదస్తం ఆయన బస్సు ఆపవయ్య బాబూ, తుమ్ము మంచిది కాదు అన్నాడు. అయితే బస్సు డ్రైవర్ కి తెలుగు రాకపోవడంతో రయ్యి మని బస్సు ముందుకు పోనిచ్చాడు. 



రాత్రికి కాశీ చేరుకున్నారు. టూర్ స్వామి అనౌన్స్మెంట్: రాత్రికి రెస్ట్ తీసుకోండి. తెల్లవారి జామున రెండు గంటలకు బయలుదేరి గంగా నది స్నానం తరువాత స్పర్శ దర్శనం ఉంటుంది. రాగలిగిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు వీలునిబట్టి గంగా స్నానం చేసుకుని విశ్వనాధుని దర్శనం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. 



మోహనరావు కి అతని భార్య కు, మొత్తం యాత్రకు వచ్చిన యాత్రికులకు జలుబు, దగ్గులతో విలవిల అడిపోతున్నారు. రేపు యాత్రలో ఆఖరి రోజు. యింతవరకు గంగా స్నానం వాళ్ళకి చివరి అవకాశం, రోజు మణికర్ణిక స్నానం. స్నానం చేస్తే పాప విముక్తులు అవుతారు అంటూ పెద్ద హడావిడి చేసాడు టూర్ స్వామి. 



ఏమండీ, నా మాట విని ఒక్కరోజు గంగా స్నానం చెయ్యండి. మళ్ళీ కాశీ రాగలమో లేదో అంటూ మోహనరావు ని బ్రతిమిలాడింది. 



సరేలే, గంగా స్నానం చెయ్యలేదు అంటే మా వాళ్ళు నవ్వుతారు, రోజు స్నానం చేసి దర్శనం కి వెళదాం, కార్తీకమాసం శివుడి దర్శనం మహా పాపనాశనం అంటారు అన్నాడు. 



అన్నట్టే పన్నెండు గంటలకల్లా గంగానది ఒడ్డుకు చేరుకున్నారు స్వామి వారి యాత్రికులు. రెండు పడవలు మాట్లాడి అందరిని నది లో వున్న మణికర్ణిక ఘాట్ కి తీసుకుని వెళ్ళి స్నానం చెయ్యమన్నాడు స్వామి. 



మోహనరావు నీళ్లలో కాలు పెట్టగానే గజేంద్రమోక్షం లో ఏనుగుని మొసలి పట్టుకున్నట్టుగా చల్లగా తగిలాయి నీళ్లు. 



యిదిగో రమణి, నేను చల్లని నీటిలో ములగలేను కాని నువ్వు స్నానం చేసి ఒక చెంబుడు నీళ్లు తీసుకుని రా, గట్టున కూర్చొని తల తడుపు కుంటాను అన్నాడు. 



భలే వారు మాస్టరు, స్నానం కి భయపడితే ఎలా? చూడండి ముందు నేను దిగి మూడు మునకలు వేస్తాను, మీరు కూడా అంతే చెయ్యండి అన్నాడు తిరుపతి నుంచి వచ్చిన యాత్రికుడు.



హుషారుగా నదిలోకి దిగి. మొదటి మునకకి చలి, రెండవ మునక నీళ్లు వేడిగా అయిపోయాయి అంతే యిప్పుడు మూడో మునక అని ములిగినవాడు బయటకు రాలేదు. దూరం నుంచి అతను చేతులు ఊపుతో చచ్చానురో ములిగిపోతున్నాను లాగండి అని అరిచాడు తిరుపతి యాత్రికుడు. పడవ వాళ్ళు దూకి నదిలో నుంచి బయటకు లాక్కుని వచ్చారు. 



హడావుడి లో మోహనరావు నెత్తి మీద నాలుగు చెంబుల గంగా నీళ్లు పోసింది రమణి. చలికి అలవాటైనట్టుంది మెల్లగా రెండు మెట్లు దిగి రెండు మునకలు మునిగి బయటకు వచ్చి భార్య వంక గర్వాంగా చూసాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#3
అందరు పొడి బట్టలు కట్టుకుని విశ్వనాధుని దర్శనం కోసం నుంచున్నారు. కోతులు అటు నుంచి యిటు, యిటు నుంచి అటు ఎగురుతో భక్తుల చేతిలోని ప్రసాదం బుట్టలు లాక్కుని పోతున్నాయి. 



తన ముందు నుంచున్న పెద్దాయన తో కార్తీకమాసం అయినా జనం ఎక్కువ లేరేమిటో అన్నాడు మోహనరావు. 



కార్తీకమాసం కాశీలో వాళ్ళకి వెళ్ళిపోయిందిట, యిప్పుడు మార్గశిరమాసం అన్నాడు. 



కొంపతీసావు. అయితే మేము కార్తీకమాసం స్నానం అనుకున్నాము, యింతోటీ దానికి యిక్కడికి వచ్చి ఫలితం లేకుండా పోతుందా అన్నాడు బావమరిది తో. 



మాకు నిన్ననే తెలిసింది. టూర్ ఆపరేటర్ మనకి విషయం చెప్పలేదు. ఏమైనా కాశీ రావడమే గొప్ప పుణ్యం అన్నాడు. 



యింతలో ఒక కోతి ఎగిరి మోహనరావు మీదకు దూకి మోహనరావు చేతిలోని ప్రసాదం బుట్ట లాక్కుంది. బుట్ట గట్టిగ పట్టుకోవడం తో కోతి మోహనరావు చెయ్యి కొరికి పారిపోయింది. ఈలోపు విశ్వనాథుని దర్శనం కూడా చూసి చూడనట్టుగా అయిపొయింది. 



బయటకు వచ్చి చూస్తే చేతి నుంచి రక్తం రావడం చూసి బయపడి మోహనరావు ని దగ్గరలో వున్న హాస్పిటల్ లో చూపించి ఇంజెక్షన్స్ ఇప్పించి రూమ్ కి తీసుకుని వచ్చాడు మోహనరావు బావమరిది. 



రమణి కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది మీ నాన్నకి జలుబు, దగ్గు, దానికి తోడు గుళ్లో కోతి కరిచింది అని. 



వద్దు అంటే వినకుండా బయలుదేరి వెళ్లారు. మీకు వయసు డబ్భై దాటింది అన్న సృహ కూడా లేకుండా పిల్లలు లాగా పరుగులు. యిప్పుడు నాకు చెప్పి ఉపయోగం ఏమిటి. ఫ్లైట్ టికెట్ పంపుతాను ఇమ్మీడియేట్ గా బయలుదేరి నా దగ్గరికి వచ్చేసేయండి. డాక్టర్ కి చూపిస్తాను. ఏమిటి.. నాన్న అలా పాడైపోయిన రేడియో సౌండ్ లా దగ్గుతున్నారు. ఏదో తెచ్చుకున్నాడు. కోతి కరవడం వల్ల అటు యిటు గెంతడం లేదుగా అని అన్నాడు. 



మొత్తానికి విమానం లో కొడుకు దగ్గరికి చేరుకున్నారు రమణి మోహనరావు లు. ఇంకేముంది ఎక్సరేలు బ్లాడ్ టెస్టులు మందులు రాసిచ్చి ప్రిస్క్రిప్షన్ మీద పెద్దగా రాసాడు "వృద్ధులు యాత్రకు అనర్హులు. తెగింపు ప్రమాదం అని. 



కార్తీకమాసం స్నానం పుణ్యం దక్కలేదు. కోతి తో కరిపించుకుని వచ్చాము అని కనిపించిన వాళ్లందరికీ చెప్తున్నాడు మోహనరావు. బహుశా కోతి కాటు వల్ల కాదు కదా, ఏమో.. 






శుభం 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#4
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: