Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - ప్రభ
#21
 అటు పిమ్మట వరాంగి సంయాతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ మహోత్సవం నకు అనేకమంది రాజులు మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, కొండ జాతి వారు సురులు నరులు నానావిధ కింపురుషాది జాతులవారు హాజరయ్యారు. విందు వినోదాలతో అందరూ సందడి సందడిగా గడిపారు. 



వరాంగి తన భర్త సంయాతి మనసును పరిపూర్ణంగా తెలుసుకుంది. భర్తలోని యతిత్వానికి ఉన్న శక్తిని, పరాక్రమానికి ఉన్న శక్తిని సుపథాన అంచనా వేసింది. భర్త నిమిత్తం తమ నివాస మందిరానికి కూతవేటు దూరంలోనే చక్కని ఆశ్రమం నిర్మింపచేసింది ఆశ్రమంలో గరుడ గజ తురగ ఖడ్గ త్రిభుజ చతురస్రాది వివిధ ఆకారాలలో యజ్ఞ వేదికల ను నిర్మింపచేసింది. 



ఋషులు, మహర్షులు, రాజర్షులు బ్రహ్మర్షులు అక్కడ అనునిత్యం ఏదో ఒక యజ్ఞం చేసుకునే అవకాశాలు కల్పించింది. యాగశాలల నడుమ సాధు జంతువులు యథేచ్ఛగా తిరిగే ఏర్పాట్లు చేయించింది. 



 వరాంగి ఖాళీ సమయంలో సాధు జంతువు లయిన జింకలు, కుందేళ్ళ వెనుక పరుగులు తీసేది. సంయాతి మహారాజు ధర్మపత్ని ఆటపాటలను చూసి మురిసిపోయేవాడు. 



 సంయాతి మహారాజు తన దగ్గరకు ధర్మం కోసం వచ్చిన వారిని వరాంగి ముందు నిలబెట్టేవాడు. వరాంగి ధర్మం కోసం వచ్చిన వారిని ముందు యథేచ్ఛగా మాట్లాడనిచ్చేది. వారి మాటలను అనుసరించి తీర్పు చెప్పేది. తీర్పు చెప్పడం కొంచం కష్టం అనుకున్నప్పుడు పంచభూతాల సహాయం తీసుకునేది. ఆపై పంచభూతాల సాక్ష్యం తో ధర్మం చెప్పేది. 



దానితో ప్రజలు అధర్మం చేయడానికి భయపడేవారు. అబద్దాలు చెప్పాలంటే గజగజ వణికిపోయేవారు. ఎప్పుడన్నా పరుల మాయలో పడి అసత్యం చెబితే మహారాణి వరాంగి ముందు తమ ప్రాణాలు పోతాయనే అనుకునేవారు. 
 ఒకనాడు యమధర్మరాజు మారువేషంలో వరాంగి తీర్పు చెప్పే ప్రాంతానికి వచ్చాడు. యమధర్మ రాజును చిత్ర గుప్తుడు అనుసరించాడు. 



 వరాంగి న్యాయం కోసం వచ్చిన భార్య భర్తల మాటలను వింది. అనంతరం "మీలో ఎవరిది న్యాయ మార్గం?" అని వారినే అడిగింది. 



భర్త, "నాదే న్యాయం న్యాయం న్యాయం ముమ్మాటికీ న్యాయం నేను వేరు కాపురం పెట్టడం ముమ్మాటికీ న్యాయం " అని తనను తాను సమర్థించుకున్నాడు. 



భార్య "నాదే న్యాయం. ఇంత కాలం నేనింత న్యాయంగా ఉండటానికి నా భర్తే కారణం. అయితే నా భర్త ధన వ్యామోహం లో పడి నా అత్త మామలు మంచివారు కారని అబద్దాలు చెప్పమంటున్నాడు. " అని అంది.
 
 భార్యాభర్తల మాటలను విన్న వరాంగి కొద్ది సేపు ఆలోచించింది. అంత వరాంగి "మీలో ఎవరు నిజం చెబుతున్నారో పంచభూతాలే నిర్ణయిస్తాయి. "అని పంచభూతాలను ఆశ్రయించింది. 



తనని తాను అతిగా సమర్థించుకున్న భర్తని అగ్ని దేవుడు వెంటనే చుట్టు ముట్టాడు. వెంటనే అతగాడు తనదే తప్పని పెద్దగా అరిచాడు. తన తప్పుకు శిక్ష గా వెయ్యి మందికి అన్నదానం చేస్తాను. వెయ్యి మంది విద్యార్థులకు విద్యాదానం చేయిస్తాను. వెయ్యి మంది ముత్తైదువు లకు పసుపు కుంకుమలు దానం చేస్తాను. వందమంది వృద్దులకు సంవత్సరం పాటు అన్నదానాదులు చేస్తాను. ". అని అతగాడు పెద్దగా అరిచి చెప్పిన పిమ్మట అగ్ని దేవుడు శాంతించాడు. 



అలాగే మరో భార్యాభర్తల విషయంలో జల దేవత భార్యని శిక్షించింది. వరాంగికి పంచభూతాలు వశమైన తీరు చూసి యమ ధర్మరాజు మిక్కిలి సంతోషించాడు. 



 క్రిమి అనే అసుర రాజు సంయాతి మీద యుద్దం ప్రకటించాడు. అప్పుడు వరాంగి వాలఖిల్యులులాంటి లక్ష మంది సైనికులను క్రిమి మీదకు పంపింది. వారి చిత్ర విచిత్ర విన్యాస సమరం ముందు క్రిమి అసుర శక్తులన్నీ నశించాయి. క్రిమి యమపురికి చేరుకున్నాడు. సంయాతి మహారాజు ను విజయం వరించింది. 



సందర్భంగా సంయాతి మహారాజు తన ధర్మపత్ని వరాంగిని పలు రీతుల్లో సన్మానించాడు. కొంత కాలం తర్వాత వరాంగి పండంటి మగ శిశువు కు జన్మనిచ్చింది. శిశువుకు వశిష్టాది మహర్షులు అహంయాతి అని పేరు పెట్టారు. 



శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#23
అశ్మకి

[font=var(--ricos-font-family,unset)][Image: image-2024-12-06-122141173.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

జనమేజయ మహారాజు ప్రతిష్టాన పురమును రాజధాని గా చేసుకుని జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అతని ధర్మపత్ని అనంత. పుణ్య దంపతులకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వరప్రసాదం తో ప్రాచీన్వంతుడు అనే సుపుత్రుడు కలిగాడు. తలిదండ్రుల ప్రేమాభిమానాల నడుమ అల్లారు ముద్దుగా పెరిగే ప్రాచీన్వంతుడు ఎల్లప్పుడూ తూర్పు దిక్కున ఉదయించే సూర్య భగవానుని చూస్తూ ధ్యానం చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే జ్ఞాన సముపార్జన చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆహారం స్వీకరించే వాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆటపాటలందు పాల్గొనేవాడు. తూర్పున ఉన్న హిమాలయ పర్వతాల ప్రత్యేకతల గురించే ఆలోచించేవాడు.
 
 చంద్ర వంశంనకు చెందిన ప్రాచీన్వంతుడు కుల గురువు వశిష్ట మహర్షి వద్ద తదితర మహర్షుల దగ్గర సమస్త విద్యలను అభ్యసించాడు. తూర్పు రాజ్యల గురించి సమస్తం తెలుసుకున్నాడు. తూర్పు ప్రాంతాలను పరిపాలించే రాజుల బలాలను, బలహీనతలను సమస్తం తెలుసుకున్నాడు. ప్రాచీన్వంతుడు సూర్యుడు ఉదయించే తూర్పు దేశాలన్నింటిని తన స్వశక్తి తో జయించాడు. ఆయా రాజ్యాల రాజుల వాస్తవ ఆలోచనల గురించి తెలుసుకున్నాడు. 



అలాగే కొందరి రాజుల మూర్కత్వం గురించి కూడ తెలుసుకున్నాడు. ప్రజోపయోగ కార్యక్రమాలు రూపొందించాడు. వాటిని అనుసరించమని ఆయా రాజ్యాల రాజులను ప్రాచీన్వంతుడు ఆదేశించాడు. రాజులందరూ ప్రాచీన్వంతుని ప్రజోపయోగ కార్యక్రమాలను అనుసరించడానికి మనసా వాచా కర్మణా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.
 
 జనమేజయ మహారాజు ఒక శుభ ముహూర్తాన తన కుమారుడు ప్రాచీన్వంతుని ప్రతిష్టాన పుర రాజుగ పట్టాభిషేకం చేసాడు. పట్టాభిషేక మహోత్సవం నకు రాజులు, రారాజులు, సామంత రాజులు తదితరులందరూ వచ్చారు. ప్రాచీన్వంతుని మనఃపూర్వకంగ అభినం దించారు. 



అనంత పుట్టింటికి, సంబంధించిన యాదవ మహారాజులు అందరూ ప్రాచీన్వంతుని పట్టాభిషేక మహో త్సవానికి వచ్చారు. అందులో అందరి దృష్టిలో అశ్మకి పడింది. 
[font=var(--ricos-font-family,unset)] [/font]
యాదవ మహారాజు కుమార్తె అశ్మకి పుట్టుక గురించి అనంతకు ఆమె పుట్టింటివారు అనేకానేక విషయాలు చెప్పారు. అనంత తల్లి అనంతతో, "అమ్మా అనంత. అశ్మకి నీ కోడలైతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 
 అశ్మకి తల్లి అశ్మకిని ప్రసవించలేక అనేక ఇబ్బందులు పడింది.. తొమ్మిది నెలలు నిండిన అశ్మకి తల్లి గర్భం నుండి భూమి మీదకు రాలేదు.. అప్పుడు అశ్మకి తల్లి మహర్షుల మాటలను అనుసరించి అనేక యజ్ఞయాగాదులను జరిపించింది. యాగాలప్పుడు నేను కూడా వారికి కావలసిన సహాయ సహకారాలు అందించాను. 
 అనంతరం అశ్మకి తల్లి వారి రాజ్యం లో కొండల దగ్గర ఉన్న కోయలగూడెం వెళ్ళింది. అశ్మకి తల్లి కోయలలో ఉన్న పెద్ద ముత్తైదువులు చెప్పిన పద్దతులన్నిటిని అనుసరించింది.. అయినా అశ్మకి, తల్లి గర్భం నుండి భూమి మీద పడలేదు. 



అనంతరం అశ్మకి తల్లి అనేకమంది మహర్షుల మాటలను అనుసరించి కొండ జాతి వారి దగ్గరకు వెళ్ళింది.. వారు అశ్మకి తల్లిని పరిశీలించి ఆమెను మహిమ గల రాళ్ళ నడుమ నాలుగు రో జులు ఉంచి అశ్మ పూజ చేసారు.. అప్పుడు అశ్మకి తల్లి అశ్మకికి జన్మనిచ్చింది. 



 అశ్మకి ని చూసిన అశ్మకి తండ్రి మహదానందం చెంది కొండ జాతి వారికి లక్ష ఆవులను దానం చేసాడు. గో క్షీరంతో రాజ్యం లోని సమస్త దేవతలకు అభిషేకం చేయించాడు.. ఆశ్మకి బారసాల వరకు అశ్మకిని ప్రతిరోజు క్షీరాభిషేకం చేయించాడు.. 



 అశ్మకి పెరిగి పెద్దయ్యింది. ఆమె కొండ రాళ్ళ ప్రత్యేకతలను బాగా చెబుతుంది. ఎలాంటి కొండరాళ్ళతో దేవుని విగ్రహాలను తయారు చేస్తారో అశ్మకి కి తెలిసి నట్లు మరొకరికి తెలియదు." అని చెప్పింది. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#24
తన తల్లి చెప్పిన మాటలను విన్న అనంత తన భర్త జనమేజయ మహారాజు కు అశ్మకి గురించి చెప్పింది. అశ్మకిని కోడలుగ చేసుకుంటే దక్షిణ ప్రాంత రాజ్యాలన్నీ మిత్ర రాజ్యాలు అవుతాయని అనంత, భర్త జనమేజయ మహారాజు తో అంది. 
అనంత జనమేజయ మహారాజు ఇద్దరూ అశ్మకిని తమ యింటి కోడలిని చేసుకోవాలనుకున్నారు. అశ్మకి చిత్ర పటం ను అనంత తన కొడుకు ప్రాచీన్వంతునికి చూపించింది. 


ప్రాచీన్వంతుడు అశ్మకి చిత్ర పటం చూసాడు. అశ్మకి రూపం తన మనసులో నింపుకున్నాడు. తలిదం డ్రుల మనసులోని ఆలోచనలను గ్రహించాడు. తన తల్లి అనంత ఆంతర్యాన్ని గ్రహించాడు. 

"నేను సూర్యుడు ఉదయించే తూర్పు ప్రాంతాలన్నిటిని జయించాను. ఇక జయించిన వాటిని సక్రమం గా, చక్కగా పరిపాలించాలంటే సాధ్యమైనంతవరకు యుద్దాలకు స్వస్తి చెప్పాలి. దక్షిణ ప్రాంత రాజ్యాలను మిత్రత్వం తో బంధుత్వంతో దగ్గరకు చేర్చుకోవాలి. అశ్మకి దక్షిణ ప్రాంత యాదవ రాజు కుమార్తె. ఆమెను వివాహం చేసుకుని దక్షిణ ప్రాంతాల వారితో బంధుత్వం పెట్టుకోవాలి. శత్రు భయం లేకుండా రాజ్యాన్ని పరిపా లించాలి. ఇదే తల్లిగారి సదాలోచన" అని అనుకున్న ప్రాచీన్వంతుడు తలిదండ్రులకు తన సమ్మతిని తెలిపా డు. 


అనంతరం ప్రాచీన్వంతుడు అశ్మిక అశ్మ కళను కళ్ళారా చూడాలనుకున్నాడు. మారు వేషంలో అశ్మకి రాజ్యానికి వెళ్ళాడు. కొండ రాళ్ళను పరిశీలిస్తున్న అశ్మకి ని చూసాడు.
 
 "మిత్రులారా! ప్రాంతాలలో కొండ రాళ్ళు దండిగా ఉంటాయో ఆయా ప్రాంతాలు పవిత్రంగా ఉంటాయి. 
వాటి వలన రాజ్యాలు కూడా సురక్షితంగా ఉంటాయి. 
[font=var(--ricos-font-family,unset)] [/font]
కొన్ని కొండరాళ్ళు పవిత్ర దైవాలుగా మలచడానికి అనుకూలంగ ఉంటాయి. మరికొన్ని కొండ రాళ్ళు గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇంకొన్ని కొండ రాళ్ళు రాజ్య రక్షణ చేస్తూ ఉంటాయి. మంచి నీటిని పుష్కలంగా ఇస్తాయి. సూర్య కిరణాల తేజంలో మరికొన్ని కొండ రాళ్ళు ధగధగ మెరుస్తుంటాయి. వాటి విలువ ఇంత అని చెప్పలేం. 

కొన్ని కొండ రాళ్ళ గుహలు మనుషులలోని మాలిన్యాన్ని కడిగివేసి మనుషులను మహనీయులుగ మలుస్తాయి. కొండల రాజు హిమవంతుని ప్రియ పుత్రిక పార్వతి మాత. మాత అనుగ్రహం ఉన్న వారికి కొండల ప్రత్యేకతలు బాగా తెలుస్తుంటాయి. మాత అనుగ్రహంతోనే నేను కొండల మూలాల గురించి చెప్ప గలుగుతున్నాను" అని అశ్మకి శిల్పులకు చెప్పే మాటలను ప్రాచీన్వంతుడు విన్నాడు. 

అశ్మకి పార్వతీ మాత అంశతో జన్మించిందని ప్రాచీ న్వంతుడు అనుకున్నాడు. అశ్మకి అశ్మ కళనంత గ్రహించాడు. అనంతరం పెద్దలందరి సమక్షంలో ప్రాచీన్వంతుడు అశ్మకిని మనువాడాడు. 

అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని అభ్యర్థనను అనుసరించి ప్రాచీన్వంతుని రాజ్యములోని కొండలన్నిటిని పరిశీలించింది. 

అంత తన భర్తతో " నాథ! మన రాజ్యం లో అనేకానేక మహోన్నత కొండలు ఉన్నాయి. ఇక్కడ చలిపులి ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను చలి నుండి కాపాడే కొండలు ఉన్నాయి. అమృతం లాంటి మంచినీరు ఇచ్చే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి. సూర్య కిరణాల ప్రభావంతో బంగారం లాగ మారే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి. 

సూర్య కిరణాల ప్రభావంతో మణులుగా మారే కొండలు కూడా ఉన్నాయి. మా యాదవ రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో వెండిగా మారతాయి. మన రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో బంగారం గా మారితే మరికొన్ని కొండలు మణులుగ మారతాయి. "అని అంది. 

అశ్మకి మాటలను విన్న ప్రాచీన్వంతుడు తన రాజ్యం ఎంత సుసంపన్నమైనదో గ్రహించాడు. ఇక తన రాజ్యంలో నిరుపేదలు ఉండకూడదు అని ధృఢ నిశ్చయానికి వచ్చాడు. 


అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని మాటలను అనుసరించి మిత్ర రాజ్యాలలోని కొండలను, ప్రాచీన్వంతుని సామంత రాజుల రాజ్యాలలోని కొండలను పరిశీలించింది. అందరి రాజుల, రారాజుల మన్ననలను పొందింది. 

ఆయా రాజ్యాలలోని ప్రజలందరు అశ్మకిని పార్వతీ మాత లా చూసారు. ప్రాచీన్వంతుడు "బంగారం మణుల నడుమ ప్రకాసించే పార్వతీ తేజం నా భార్య అశ్మకి " అని అనుకున్నాడు. 
[font=var(--ricos-font-family,unset)] [/font]
అశ్మకి ప్రాచీన్వంతుల కాలంలో నిరుపేదలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయారు. కొండలు కోనలు ప్రకృతి చక్క గా సశాస్త్రీయంగా సంరక్షించబడింది. 


శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#25
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#26
అనంత
[font=var(--ricos-font-family,unset)][Image: image-2024-12-17-135319700.png][/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని జనమేజయ మహారాజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యం లో నిరుపేదలు అనేవారు అసలు లేరని చెప్పడం అతిశయోక్తియే అవుతుంది కానీ విధాత రాతకు అనుకూలంగా అతని సుపరిపాలన సాగుతుందన్నది ముమ్మాటికి నిజం . నిరుపేదలను ఆదుకునే విషయం లో మాత్రం జనమేజయ మహారాజు అందరికంటే ముందుండేవాడు. అలా నిరుపేదల పాలిట ఆపద్భాందవుడు అయ్యాడు. 



 జనమేజయ మహారాజు తలిదండ్రులు కౌసల్య, పూరులు, కుల గురువు వశిష్ట మహర్షి జనమేజయ మహారాజుకు రాజ్య పరిపాలనా విషయంలో చేదోడువా దోడుగా ఉన్నారు. రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా ఉండటానికి తమ శక్తిమేర రాజుకు సహకరించారు. 



జనమేజయ మహారాజు మాతృమూర్తి కౌసల్య ప్రజలకు అప్పుడప్పుడు సంక్రమించే అనేక రకాల శారీరక రోగాలను సులభం గా నయం చేసేది. ప్రజల దేహాలను కలుషితం చేసే చెడు గాలులు తన రాజ్యానికి సోకకుండా కౌసల్య తన కుమారుడు జనమేజయ మహారాజుతో అనేక వాతావరణ కాలుష్య సంహార యాగాలను జరిపించింది. తల్లి మాటలను జవ దాటకుండా జనమేజయ మహారాజు అనేక వాతావరణ కాలుష్య సంహార యాగాలు జరిపించాడు. 



 జనమేయ మహారాజు తన తలిదండ్రులు కౌసల్య పూరుల సహకారం తో, కులగురువు వశిష్ట మహర్షి సహకారంతో మూడు అశ్వమేథ యాగాలు చేసాడు. ప్రతి అశ్వమేథ యాగం పూర్తి కాగానే అనేకమంది నిరుపేదలకు ధన సహాయం చేసాడు. గృహాలు లేని నిరుపేదలకు నూతన గృహాలు కట్టించి ఇచ్చాడు. 



 జనమేజయ మహారాజు అశ్వమేథ యాగ సందర్భంలో పర రాజ్య రాజులను సాధ్యమైనంత వరకు మంచి మాటల తోనే లొంగదీసుకున్నాడు. తన మాటలను మన్నించి లొంగిపోయిన రాజులను, వారి రాజ్యంలోని ప్రజలను జనమేజయ మహారాజు తన స్వంత బిడ్డల్లా చూసుకునేవాడు. 



 జనమేజయ మహారాజు తల్లి కౌసల్య వైద్య నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరరాజ్య రాజులు జనమేజయ మహారాజు ముందు తలవంచేవారు. కౌసల్య తన రాజ్య ప్రజలకే కాక తనని ఆహ్వానించిన పరరాజ్య ప్రజలకుకూడ తన వైద్య సేవలను అందించేది. దానితో జనమేజయ మహారాజు కీర్తి ప్రతిష్టలు సమస్త లోకాలకు ఎగబాకాయి. ఇలా జనమేజయ మహారాజు తన రాజ్యంలో ఆర్థిక బాధలు అనేవి లేకుండా చేసాడు. అలాగే జనమేజయ మహారాజు ప్రజలు సోమరిపోతులు కాకుండా చూసాడు. ప్రజల సామర్థ్యానుసారం వారికి తగిన పనులను కల్పించాడు. 



యదు వంశానికి చెందిన మాధవ మహారాజు అనేక పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ, ఒకసారి ప్రతిష్టానపురాన్ని సందర్శించాడు.. కౌసల్య పూరులు మాధవ మహారాజును తగిన విధంగా సత్కరించారు. కౌసల్య పూరులు, మాధవ మహారాజు వారి వారి గత సంబంధ బాంధవ్యాల గురించి ముచ్చటించుకున్నారు. ఋగ్వేదం లోని ఏడవ మండలంలో చర్చించబడిన పది రాజ్యాల సమరం గురించి చర్చించుకున్నారు. ప్రజల బాగోగులు కోరుకునే రాజులు శాంతి మార్గాన్నే అనుసరిస్తారు అనుకున్నారు. 



 అప్పుడే అక్కడకు వచ్చిన జనమేజయ మహారాజు మాధవ మహారాజు కు నమస్కరించాడు. పది రోజుల పాటు తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని మాధవ మహారాజును అభ్యర్థించాడు. అందుకు మాధవ మహారాజు సమ్మతించాడు. మాధవ మహారాజు జనమేజయ మహారాజు సుపరి పాలనను కనులార చూసాడు. 



 ఒకనాడు మాధవ మహారాజు కౌసల్య నిర్వహణ లో ఉన్న సురవాయుజ్ఞాన మందిరానికి వెళ్ళాడు. అక్కడి పరిశుద్ద ప్రాణవాయువు తగలగానే అతని శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అతని శరీరమంత రక్త సారలతో రక్తసిక్తమయ్యింది. కౌసల్య వెంటనే మాధవ మహారాజును ప్రత్యేక మందిరంలో ఉంచి వైద్యం చేసింది. నాలుగు రోజుల అనంతరం మాధవ మహారాజు శరీరం మీద రక్త సారలు తగ్గుముఖం పట్టాయి. 



 జనమేజయ మహారాజు మాధవ మహారాజుకు వచ్చిన అనారోగ్య సమస్యను తెలియచేస్తూ అతని కుమార్తె అనంతకు ప్రత్యేక చారుల ద్వారా వర్తమానం పంపాడు. అనంత వెంటనే తండ్రి దగ్గరకు వచ్చింది. 



 అనంత తండ్రి శరీరం మీద రక్త సారలు రావడానికి కారణం ఏమిటని కౌసల్యను అడిగింది. దానికి కౌసల్య, "అంతం లేని అందానికి నిలయమైన అనంత.. మీ రాజ్యంలో అనంత కోన ఉంది కదా? " అని అనంతను అడిగింది. 



" ఉంది. కోనలో నివసించే మానవుల ఆకారం అనంతశయుని ఆకారంలో ఉంటుంది. వారంటే మా తండ్రి గారికి మహా యిష్టం. మా రాజ్యం మీదకు శత్రురాజులు ఎవరన్నా అమానుషంగా దండయాత్ర చేస్తే, యుద్దంలో అనంత కోన మనుషులంతా ముందు ఉంటారు. అనంత కోనలోని ఒక్కొక్క మనిషి రమారమి నాలుగు వందల శత్రు సైన్యాన్ని సునాయాసంగా చంపి అవతల పారేస్తాడు. 



ఒకసారి అంతాసుర రాజు మా రాజ్యం మీదకు దండయాత్ర చేసాడు. అప్పుడు నేనూ యుద్దంలో పాల్గొన్నాను. అప్పుడు అనంత కోన వీరుల పరాక్రమం కళ్ళార చూసాను. వారి పరాక్రమం చూసి నేనుకూడ రథం మీదనే గిర్రున తిరిగి ఆకాశమంత ఎత్తులేచి కరవాలంతో దరిదాపు వెయ్యిమంది శత్రువుల తలలను నరికి అవతల పడేసాను. అంతాసురుని మీద విజయం సాధించాను. 



అనంత కోన వీరులతో యుద్దమంటే వివిధ సర్పాకార వీరులతో యుద్దం చేయడమే. కోన అభివృద్ధి కి మా తండ్రిగారు అనునిత్యం ఆలోచిస్తుంటా రు. కోన అభివృద్ధి విషయం లో తండ్రిగారు పదే పదే నా సలహా తీసుకుంటారు. కోనలోనే మా తల్లిగారు నాకు జన్మనిచ్చిందని మా తండ్రిగారు చెబుతుంటారు" కౌసల్య తో అంది అనంత.
 
"అనంత కోనలో జీవించేవారికి అక్కడి గాలి సరిపడుతుంది. నిజం చెప్పాలంటే అక్కడివారు ఎక్కువ కాలం మరొక చోట జీవించలేరు" అనంతతో అంది కౌసల్య. 



"మీరు చెప్పింది అక్షర సత్యం. అనంత కోనలో మనుషులు విందు వినోదాల నిమిత్తం మా రాజమందిరానికి వచ్చినప్పుడు వారు మా మందిరంలో నాలుగు రోజులు మించి ఉండరు. " అంది అనంత. 



"నిజం చెప్పాలంటే మీ తండ్రిగారి శరీరానికి కూడా అక్కడి గాలి సరిపడదు. అయితే మీ తండ్రి గారి శరీరానికి కొంత కాలం పాటు అన్ని వాతావరణాలలోని గాలులను తట్టుకునే సామర్థ్యం ఉంది. అలా మీ తండ్రిగారి శరీరం కొంత కాలం అక్కడి గాలిని తట్టుకుంది. 



 మా సురవాయు జ్ఞానమందిరంలో పరిపూర్ణ ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణవాయువు సురులకు సహితం సరిపోతుంది. ప్రాణవాయువు మనిషి శరీరతత్వాన్ని తెలియచేస్తుంది. అలాగే అప్పటివరకు ఆయా మనుషులు తమ శరీర తత్వానికి సరిపడని వాయువు ను ఎంత గ్రహించారన్న విషయాన్ని కూడా సురవాయు జ్ఞానమందిరం తెలియచేస్తుంది. అంతేగాక ఆయా మనుషుల్లో దాగివున్న రోగాలను కూడా సుర వాయు జ్ఞానమందిరం తెలియచేస్తుంది. అందుకే మేం మందిరానికి సురవాయు జ్ఞాన మందిరం అని పేరు పెట్టాము. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#27
 మీ తండ్రి గారు సురవాయు జ్ఞాన మందిరానికి రాగానే వారి రోగాలన్నీ బయటపడినవివారి శరీరమంత రక్త సారల మయం అయ్యిందినాకు తెలిసిన వైద్యం తో వారి రోగాలన్నిటిని నయం చేసానుఇక వారు ఎక్క డికి వెళ్ళినా వారిని అనారోగ్యం అంటుకోదు. " అని అనంత తో అంది కౌసల్య. 



 కౌసల్య మాటలను విన్న అనంత ఆనందపడిందికౌసల్య వైద్యం చేసే విధానం చూసి మహదానందం పొందిందిపదిరోజుల్లో మాధవ మహారాజు సంపూర్ణ ఆరో గ్యం తో పదుగురిలో తిరగసాగాడుఅంతే గాక అంతకు ముందుకంటే మహా వేగంగా కరవాలాన్ని తిప్పసాగాడు. 



 అనంతను చూసిన జనమేజయ మహారాజు అనంతను వివాహం చేసుకోవాలనుకున్నాడుఅనంత కూడా జనమేజయ మహారాజును ఇష్టపడిందిఇద్దరి ఇష్టాన్ని వారి వారి పెద్దలు గమనించారుకౌసల్య అనంతను తన మందిరానికి పిలిపించిందిఆమె మనసులోని మాట ను అనంతకు చెప్పిందిఅప్పుడు అనంత, "మీరు నాకు కాబోయే అత్తగారే కాదుమీరు నాకు అమ్మతో సమానంమీ సుపుత్రుడు జనమేజయ మహారాజు అంటే నాకు మహా ఇష్టంవారిని మనువాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదుఅయితే మీరు ముందుగ మా అనంత కోనకు రావాలిమీ వైద్యం తో అక్కడి వాతావరణం మార్చాలిమీ శిష్యరికం లో నేను మరింత ఎదగాలి తర్వాతే నా వివాహం. " అని అనంత కౌసల్య తో అంది. 



 అనంత మాటలను విన్న కౌసల్య, " రాజ్యాన్ని పరిపాలించే రాజైనరాణైన ముందుగా ప్రజల క్షేమం చూడాలి పిదప తమ క్షేమం గురించి ఆలోచించాలిప్రజలను ఆకలి మంటలకుఅనారోగ్యాలకు వదలేసి రాజూరాణులు విలాస మందిరాలలో విహరించకూడదుఅనంత.. ముందుగా ప్రజల గురించి ఆలోచిస్తున్న నువ్వు నాకు బాగా నచ్చావుమా చంద్రవంశానికి వన్నెతెచ్చే మహిళామణివి నువ్వే అని నా మనసు నాకు చెబుతుంది.. నీ కోరిక ప్రకారం ముందుగా అనంత కోన వాతావరణాన్ని మారుస్తాను తర్వాతనే నా సుపుత్రునితో నీ వివాహం జరిపిస్తాను. " అని అంది. 



 కౌసల్య అనంతతో అనంత కోన వెళ్ళిందిఅక్కడి వాతావరణమంతటిని నాలుగు రోజుల పాటు పరిశీలించిందిఅనంతం మహర్షుల సహాయంతో రకరకాల యజ్ఞయాగాదులను జరిపించిందిఅనంత కోన అమరులకు సహితం అమృతమయమైన ప్రాణవాయువు ఇచ్చే కోన అన్నట్లుగా కౌసల్య అనంత కోనను తీర్చిదిద్దిందికౌసల్య చేసే ప్రతి పనిలో కౌసల్యకు కుడి భుజం గా అనంత నిలిచింది. 



 తదనంతరం అనంత కోనలోనే అనంత జనమేజయ మహారాజుల వివాహం జరిగిందిఆపై అనంత తన అత్తగారైన కౌసల్య దగ్గర శరీర శాస్త్రానికి సంబంధించిన విద్యలన్నిటిని అభ్యసించిందిఅలాగే రకరకాల యజ్ఞయాగాదుల గురించి తెలుసుకుందియజ్ఞయాగాదుల వలన ప్రకృతి కి కలిగే మేలును కనులార చూసింది. 



అనంతరం అనంత తన భర్త జనమేజయ మహారాజు ను విశ్వజిత్ యాగమును చేయమని ప్రోత్సహించింది. జనమేజయ మహారాజు తన భార్య అనంత మాటలను అనుసరించి విశ్వజిత్ యాగం ప్రారంభించాడు. 



జనమేజయ మహారాజు భూమిలో వాటా తప్ప సమస్తాన్ని మునులకుఋషులకుమహర్షులకు నిరుపేదలకు దానం చేసాడుగోపాలురకు వెయ్యి ఆవులను దానం చేసాడువివిధ పుణ్య క్షేత్రాలలో ఆయా దేవతలకు గోక్షీరంతో అభిషేకాలు జరిపించాడుపవిత్ర గోఘృతం తో రకరకాల ప్రసాదాలు తయారుచేయించి ప్రజలందరికి పంచిపెట్టాడు. 



  తర్వాత జనమేజయ మహారాజు ఉదుంబ వృక్షం కింద నిషాదులతోవైశ్యులతో క్షత్రియులతో వశిష్టాది మహర్షులు చెప్పినంత కాలం వేద పురాణేతిహాసాలను వింటు కాలక్షేపం చేసాడుతన పూర్వీకుడు ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని ఎలా ప్రసన్నం చేసుకుంది అందరికి చెప్పాడు. 



విశ్వజిత్ యాగం మహోన్నతంగా పరిపూర్ణమైందిశ్రీ దత్తాత్రేయ స్వామి అనంత జనమేజయ మహారాజు లను కరుణించాడు. పుణ్య దంపతుల సుపుత్రుడు ప్రాచీన్వంతుడు[font=var(--ricos-font-family,unset)].[/font]

శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#28
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#29
కౌసల్య
 

[Image: image-2024-12-23-131158391.png]
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
[font=var(--ricos-font-family,unset)] [/font]
పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య. అప్పటికి సమాజంలో ఉన్న చతుర్వేదాల తేజస్సు ను ఔపాసన పట్టిన విదుషీ మణి. కౌసల్య, వేదాలను పఠించడానికి, వాటిని పదుగురికి చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. వేద మూల తేజాలను ప్రయోగ శాలలో నిరూపించడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయోగాలు కొన్ని ఫలించాయి. మంచి ఫలితాలనిచ్చాయి. వికటించిన ప్రయోగాలు కొన్ని కాల గర్భంలో కలిసిపోయాయి. కౌసల్య ఫలించిన మంచి వేద ఫలితాలతో సాధ్యమైనంత మేర ప్రజాభివృద్ది చేసింది. 



 వేద సృష్టి కర్తలలో కొందరు కౌసల్యకు బాగా తెలిసిన వారు ఉన్నారు.. వారితో కౌసల్య వేద మంత్రోచ్ఛారణ మాటున ఉన్న వధూ పీఠాది గణితం గురించి చర్చించింది. ఆయా మంత్రాలలో ఉన్న భావాల గురించి చర్చించింది. 



"కాలాన్ని బట్టి భావం ఉపయోగ పడవచ్చు. ఉపయోగ పడకపోవచ్చు. వధూపీఠాది గణితం మాత్రం సర్వకాల సర్వావస్థలయందు ఉపయోగ పడుతుంది" అని అనుకుంది. తన తండ్రి పుష్టి మహారాజు గురించి కూడా వేదాలలో ప్రస్తావించడడం ఆమెకు మహదానందం కలిగించింది. నిజం చెప్పాలంటే అప్పటికి వేదాలకు ఇంకా పూర్తి స్వరూపం రాలేదు. 



 ఋగ్వేదం ఏడవ మండలంలో పది రాజుల యుద్దం లో పురువంశం, తుర్వశ వంశం, ద్రుహ్యు వంశం, అనువంశం వారు ఉన్నారు. వారంతా అన్నదమ్ములు మరియు వారి వారి సంతానమే. అయినా పది దిక్కుల నుండి సైన్యమును నడిపి యుద్దం చేసారు. అప్పుడు పుష్టి మహారాజు వారందరిని శాంతింప చేసాడు. సాధ్యమైనంత వరకు అహింస మార్గానే సంచరించాలన్నాడు. అహింసను మించిన ఆయుధం మరొకటి లేదన్నాడు. 



ఒకనాడు పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య తన తండ్రి పుష్టి మహారాజును, " జనకా.. ఋగ్వేదం ఏడవ మండలంలో దశరజ్ఞ సమరం గురించి కొంత మాత్రమే చెప్పడం జరిగింది. అప్పుడసలేం జరిగింది?" అని అడిగింది. 



 కౌసల్య మాటలను విన్న పుష్టి మహారాజు, " అమ్మా కౌసల్య! యయాతి మహారాజు మహా శౌర్యవంతుడు. మహా విజ్ఞానవంతుడు. అతడు తన కోరికల మీద వ్యామోహం చావక, తన ముసలి శరీరాన్ని స్వీకరించి, యువ శరీరాన్ని తనకివ్వమని తన కొడుకులను అడిగాడు. అందుకు అతని పెద్ద కుమారులు ఎవరూ సమ్మతించలేదు. చివరివాడు రావుిష్ట పుత్రుడు పురు సమ్మతించాడు. 



 యయాతి పురు శరీరంతో కొంత కాలం గడిపాడు. అలా తన కోరికలన్నిటినీ తీర్చుకున్నాడు. అటు పిమ్మ పురు శరీరాన్ని పురుకు ఇచ్చేసాడు. అలా జీవశరీరాలను మార్చగల విజ్ఞాన సామర్థ్యం యయాతి మహారాజు కు ఉంది. 



అయితే యయాతి మహారాజు తన విజ్ఞానాన్ని మంచి కంటే తన కామ కోర్కెలు తీర్చుకోవడానికే అధికంగా వినియోగించాడు. చేసిన పాపం చెబితే పోతుందని కొందరు అంటారు. అది అవకాశ వాదులు, కామవ్యామోహ చరితులు చెప్పేమాట. కాల చక్రం లోని ధర్మ సూక్ష్మం ముందు రాజైన పేదైన అందరూ ఒకటే. యయాతి మహారాజు ముసలితనంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. వారి వలన వారి కుమార్తె మాధవి బలిపశువు కావల్సి వచ్చింది. 



యయాతి మహారాజు పురుకు తన ప్రధాన రాజ్యం ప్రతిష్టాన పురానికి రాజును చేసాడు. తను జయించిన చిన్న చిన్న రాజ్యాలను మిగతా పుత్రులకు ఇచ్చాడు. 



తన తండ్రికి తన యువ శరీరాన్నే ఇచ్చేసి తండ్రి వృద్ద శరీరాన్ని స్వీకరించిన పురు మహారాజు ఎందరో మహానుభావులైన మహారాజుల కంటే గొప్పవాడని చెప్పవచ్చును. పురు మహారాజు పేరు మీద పూరు వంశం ఏర్పడింది. నాటినుండి పురు పూరుడు అయ్యాడు. పూర వంశమే పౌర వంశం. అయితే అతని సోదరులకు పూరుని మీద అసూయా ద్వేషాలు ఏర్పడి పూరుని రాజ్యం స్వంతం చేసుకోవాలని పూరుని మీద యుద్దం ప్రకటించారు. 



 కొంతకాలం తన తండ్రి యయాతి కి తన శరీరం ఇవ్వడం వలన పూరుని దేహంలో పరాక్రమ తేజం కొంత అలసత్వానికి గురయ్యింది. అయినా పూరుడు సోదరులతో సమరం చేసాడు. పది దిక్కుల నుండి వచ్చిన సైన్యాన్ని చాలా వరకు చీల్చి చెండాడాడు. సుధాస్ మహారాజు వంటివారిని మట్టి కరిపించారు.. అయితే అతని తనువులోని తేజస్సు కొంచెం కొంచెం క్షీణించ సాగింది. అది గమనించిన సుధాస్ మహారాజు పూరుని మీద పలు అస్త్రాలను ప్రదర్శించాడు. 



అప్పుడు నేను అస్త్రాలను బూడిద పాలు చేసాను. తర్వాత నేను సోదరుల నడుమ సమరం ఆపాను. తండ్రి కోసం తన తేజం కొంత కోల్పోయిన పూరుని మీరు రాజ్యం కోసం హింసించరాదన్నాను. కాదు కూడదు అని మీరు పూరుని హింసిస్తే నరకంలో వారు ఎలాంటి శిక్షలకు గురవుతా రన్నది వారికి వివరించాను. 



నా మాటల మీద ఉన్న గౌరవంతో ముందుగా యదు మహారాజు యుద్దాన్ని విరమించుకున్నాడు. యదు మహారాజును చూసి మిగతావారు కూడా యుద్దాన్ని విరమించుకున్నారు. " అని జరిగిన సంగతులన్నీ కుమార్తె కౌసల్య కు పుష్టి మహా రాజు చెప్పాడు. 



"ఆరు రోజులలో మహీమండలాన్నంత జయించిన యయాతి మహారాజు గారి కుమార్తె గదా మాధవి ?" తండ్రి పుష్టి మహారాజును అడిగింది కౌసల్య. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#30
 "అవును. మాధవి యయాతి మహారాజు కుమార్తే.. ఆమె ప్రస్తుతం వన సంచారిణిగ విష్ణు సేవన కాలం గడుపుతుందని విన్నాను. పూరుడు చాల మంచి మహారాజు. గంధర్వ కాంతలను పరాభవించబోయిన రావణబ్రహ్మకు ఎదురునిలిచాడు. 



యుద్దంలో పూరుడు ఓడిపోయినప్పటికి గంధర్వ కాంతలను రక్షించాడు. అలాగే మాంధాత మహారాజు చేతిలో కూడా పూరుడు ఓడిపోయాడు. అయితే పుర రక్షణ చేయగలిగాడు. పూరుని మేథో సామర్థ్యం, సంకల్ప సామర్థ్యం మహోన్నతమైనవి. కాకపోతే తన తనువు కొంత కాలం తండ్రి దగ్గర ఉండటం వలన సమరంలో చిన్న చిన్న సమస్యలను కొన్ని సార్లు ఎదుర్కొనలేకపోతున్నాడు. ", కూతురితో అన్నాడు పుష్టి మహారాజు . 



"అలాంటి మంచి మహారాజులకు మనకు చేతనయినంత సహాయం చేస్తే బాగుంటుంది తండ్రిగారు. " పుష్టి మహారాజు తో అంది కౌసల్య. 



"చేయవలసిన అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం పౌష్టి. " కూతురుతో అన్నాడు పుష్టి మహారాజు. 



"పౌష్టి.. పుష్టి మహారాజు కుమార్తె పౌష్టి. పరోపకార విషయ చర్చలు వచ్చినప్పుడు తండ్రి గారు నన్ను కౌసల్య అని నా అసలు పేరుతో పిలవకుండా పౌష్టి అని పిలుస్తారు. ఏదేమైనా తండ్రిగారికి సాటి నా తండ్రిగారే. " అనుకుంది కౌసల్య. 



 కౌసల్య మునివాటికలకు వెళ్ళింది. అక్కడ అనేక మంది మునుల శరీరాలను పరిశీలించింది. తపస్సు చేసి చేసి క్షీణించిన మునుల శరీరాలను తన ఆకు పసరుల వైద్యం తో ఆయా తనువుల సామర్థ్యం పెంచింది. తమ తనువుకు పెరిగిన సామర్థ్యం చూసుకుని మునులు మురిసిపోయారు. కౌసల్యను పలు రీతుల్లో స్తుతించారు. నీ యిష్టం వచ్చిన వరాలను కోరుకోమన్నారు. 



అప్పుడు "సకాలంలో వర్షాలు పడేందుకు యాగాలు చేయండి. ప్రజలు రోగాల బారిన పడకుండా యాగాలు చేయండి. గోసంపద దినదినాభివృద్ధి చెందాలని యాగాలు చేయండి. అమలిన విజ్ఞానం, ప్రజోపయోగ విజ్ఞానం ప్రజలకు పుష్కలంగా రావాలని యాగాలు చేయండి" అని కౌసల్య ప్రజల కోసం మునులను వరాలను అడిగింది.. 



పూరు మహారాజు పరిపాలనలో ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించసాగారు. ప్రతిష్టాన పుర ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రజలంతా పూరుని త్యాగ గుణాలను పలురీతుల్లో  పొగడ సాగారు. 



పూరుని శరీరం కొంత కాలం తన తండ్రి యయాతి మహారాజు దగ్గర ఉండటంతో పూరుని మంచి మనసును వేనోళ్ళ ప్రశంసించిన మహారాజులే అతని తనువును దృష్టిలో పెట్టుకొని అతనికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
 
ఇది తెలిసిన పుష్టి మహారాజు పూరు మహారాజు ను తన అల్లుని గా చేసుకోవాలనుకున్నాడు. అంత పుష్టి మహారాజు తన కూతురు కౌసల్య తో మాట్లాడాడు. పూరునితో మాట్లాడాడు. కౌసల్య పూరుల సమ్మతితో పుష్టి మహారాజు ఇద్దరి పెళ్ళి జరిపించాడు. 



కౌసల్య తన భర్త పూరుని తనువులోని అణువణువును పరిశీలించింది. పూరుని అనేక ఆశ్రమాలు తిప్పింది. ఆయా ఆశ్రమాలలో ఉన్న దళాలతో భర్త శరీరానికి పుష్టిని పెంచింది. మునులతో వివిధ యాగాలు చేయించి భర్త శరీర తేజస్సును పెంచింది. 



పూరుని శరీరం యజ్ఞయాగాదుల తేజస్సుతో నవ సామర్థ్యం పొందింది. శతకోటి కవచకుండలాల సామర్థ్యం పూరుని శరీరానికి వచ్చింది. అంత పూరుడు మాంధాత మీద యుద్దం ప్రకటించాడు. మాంధాత పూరునితో యుద్దానికి సిద్దం సిద్దం అన్నాడు. పూరుడు దశ దిక్కులనుండి వచ్చిన మాంధాత సైన్యాన్ని మట్టి కరిపించాడు. అతని వక్ష స్థలాన్ని తాకి కొండల్లాంటి గదలు పిండి పిండి అయ్యాయి. అతని పిడి గుద్దులకు శత్రువుల తలలు మొండెములలోనికి చొరబడ్డాయి. పూరుడు మహా సంగ్రామం లో మాంధాత మహారాజు ను ఓడించాడు. 



యుద్దం లో ఓడిపోయిన మాంధాత మహారాజును పూరుడు తగిన విధంగా సత్కరించాడు. అనంతరం పూరుడు తన విజయ ఖడ్గాలలో ఒక విజయ ఖడ్గాన్ని మాంధాత మహారాజు కు బహుమతిగా ఇచ్చా డు. పూరుని మంచి మనసును గ్రహించిన మాంధాత మహారాజు పూరుని ముందు శిరస్సు వుంచాడు. మాంధాత మహారాజును సమరంలో ఓడించిన పూరుని పరాక్రమం గురించి సమస్త లోకాలు ముచ్చటించు కున్నాయి. తన ధర్మపత్ని కౌసల్య వలననే తనకంత పేరు వచ్చిందని పూరుడు సభా సాక్షి గా సమస్త లోకాలకు తెలియ చేసాడు. 



ఒకసారి పూరుని రాజ్యంలో ఒక సంవత్సరం పాటు వర్షాలు కురవలేదు. పూరుడు, "ఇందుకు కారణం ఏమిటి?" అని మహర్షులను అడిగాడు. 



 కొందరు మహర్షులు "రావుిష్ట పుత్ర !పూరు మహారాజ!మీ రాజ్యం లో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అందుకే వర్షాలు పడటం లేదు " అని అన్నారు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#31
మహర్షుల మాటలను విన్న కౌసల్య" మహర్షులారా! మీ మాటలు సమంజసంగా లేవు. మీ మాటలు, మీ ఆలోచనలు నిజం కాదు. శూద్ర తపం వలన వర్షాలు పడవనడం మీ తపోజ్ఞాన అవివేకం. నేను కులమత వర్గ విచక్షణారహితంగా మీ మీ కృశించిన శరీర సామర్థ్యాలను పెంచాను. మీరు పెరిగిన మీ శరీర సామర్థ్యాలను చూసుకుని అహంకారం ప్రదర్శిస్తున్నారు.. అహంకారంతోనే మీరు మనసు తప్పి, వచస్సు తప్పి, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. 



దానివలన వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దానితో సంవత్సరం నుండి సకాలంలో వర్షాలు పడటం లేదు. శూద్రుని తపస్సు వలననే ఇంకా ప్రకృతి లో పచ్చదనం తగ్గలేదు. కొంత కాలం పాటు మీరంతా యజ్ఞ యాగాదులను ఆపివేయండి. " అని మహర్షు లతో అంది. 



 పూరు మహారాజు కౌసల్య చెప్పినట్లు చెయ్యమని మహర్షులను ఆదేశించాడు. కౌసల్య తపో శక్తి గల వెయ్యి మంది శూద్రులతో యజ్ఞ యాగాదులను చేయించింది. వెంటనే వర్షాలు పడినవి. అంతకు ముందు ఎన్నడూ పండని రీతిలో పంటలు పది సంవత్సరాలకు సరిపడ పండాయి. మహర్షులు తమ తప్పులను తెలుసుకుని శూద్ర తపశ్శీలుర దగ్గర శిష్యరికం చేసారు. 



 "మహర్షులారా! కదిలే కాల తీరులో మానవ సంచారం గమనించి మాట్లాడండి. కాలం కులమత వర్గాలకు అతీతంగా సాగిపోతుంది. ఇప్పటివరకు వేద మంత్రాలను చెప్పినవారిలో, రాజ్యాలను పరిపాలించిన వారిలో, సర్వ కులాలవారూ ఉన్నారు. ఇది గమనించకుండా మీరు చెప్పే మాటలు కాల గమనం ముందు నిలబడవు. అది గుర్తు ఉంచుకోండి" అని మహర్షులతో కౌసల్య అంది. 



 పూరుడు తన భార్య కౌసల్య తో అనేక యజ్ఞయాగ శాలలను సందర్శించాడు. అక్కడి మునులందరిని కౌసల్య పూరులు తగిన విధంగా సత్కరించారు. 



 కౌసల్య పూరులు యాగవనం ను సందర్శిస్తున్నప్పు వారికి అక్కడ మాధవి కనపడింది. యోగిని అయిన సోదరి మాధవిని పూరుడు తగిన విధంగా సత్కరించాడు. మాధవి అభ్యర్థనను అనుసరించి కౌసల్య మునులతో యజ్ఞం చేయించి, మాధవి తనువును జింక తనువుగా మలచింది. 



మాధవి మునులకు, కౌసల్య పూరులకు నమస్కరించి జింక తనువుతో వనంలోకి వెళ్ళిపోయిం ది. కౌసల్యపూరుల సంతానం జనమేజయుడు, ఈశ్వరుడు, రౌద్రశ్వుడు మొదలైనవారు. 
 పూరుడు కౌసల్య చెప్పినట్లు ఇంద్ర దైవత యాగాదులను చేసి ఒకరోజు లో ప్రపంచం మొత్తాన్ని జయించాడు. తన రాజ్యంలోని వారందరికి గోదానం చేసాడు. 



 కౌసల్య రాజ్యంలోని వారందరి చేత గోపూజ చేయించింది. ఇంద్రపూజ చేయించింది. జల పూజ చేయించింది. కౌసల్య జల పూజకు మెచ్చిన సరస్వతీ నది జల దేవత రూపంలో కౌసల్య పూరులను ఆశీర్వదించింది. 



 కౌసల్య పూరులు తమ సంతానాన్ని చక్కగా పెంచారు. పూర వంశం పౌరులై వర్థిల్లారు. అటుపిమ్మట మహా సమర్థుడైన జనమేజయ రాజుని ప్రతిష్టాన పురానికి రాజును చేసారు. 

 కురుక్షేత్ర యుద్ద సమయంలో కౌరవులను అర్జునుడు చీల్చి చెండాడే దృశ్యాన్ని పూరు మహారాజు ఇంద్రునితో కలిసి ఆకాశంనుండి సందర్శించాడు.
 
 
శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#32
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#33
ప్రభ
[Image: image-2024-12-29-183646101.png]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



చంద్రవంశానికి చెందిన ఊర్వశీపురూరవుల పుత్రుడు ఆయువు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. 



అతని పట్టాభిషేక మహోత్సవానికి వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, మహారాజులతో పాటు రంభ, ఊర్వశి, మేనక వంటి సురలోక వాసులు కూడా హాజరయ్యారు. 



"చంద్రవంశానికి నువ్వు తీసుకువచ్చే కీర్తిప్రతిష్టలు చిర కాలం చరిత్రలో నిలిచిపోవాలని ఆయువును వశిష్ట మహర్షి దీవించాడు. 



 "ఇక ఆయు మహారాజే మా ఆయుష్షు పెంచే దాత విధాత కావాలి" అని రాజ్యంలోని పెద్దలందరూ ఆయు 
మహారాజు ను ప్రశంసించారు. 



 ఆయు మహారాజు అందరి ఆశీర్వాదాలను వినయంగా స్వీకరించాడు. అందరికి వారి వారికి తగిన రీతిలో విందు వినోదాలను ఏర్పాటు చేసాడు. 



తదనంతరం ఆయువు తన అంతఃపురం లో విశ్రాంతి తీసుకొనుచుండగా అతని తలిదండ్రులు ఊర్వశీ పురూరవులు ఆయు మహారాజు అంతః పురానికి వచ్చారు. ఆయు మహారాజు తలిదండ్రులైన ఊర్వశీపురూరవులకు నమస్కారం చేసాడు. 



"నాయన ఆయు, మీ తండ్రి పురూరవ మహారాజు మహా శౌర్యవంతుడు. వివిధ యజ్ఞ యాగాదులను నిర్వ హించడంలో కడుసమర్థుడు. అయితే వారు బలగర్వం తో బ్రాహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కున్నారు. నా మీద మితిమీరిన వ్యామోహంతో చెయ్యరాని తప్పు పనులు చేసారు. చివరికి తన తప్పు తను తెలుసుకున్నారు. ఉత్తమ మహారాజు గుణాలను వశిష్టాది మహర్షుల ద్వారా తెలుసుకున్నారు. 



 మీ తండ్రిగారు సనకసనందాదుల విశ్వరూపమును దర్శించి తన జన్మ ధన్యం చేసుకున్నారు. నువ్వు నీ తండ్రిగారు చేసిన పొరపాట్లను చేయమాకు. అలాగే వారు చేసిన గొప్ప గొప్ప పనులను విస్మరించకు. " అని తన కుమారుడైన ఆయువుకు ఊర్వశి చెప్పింది. 



 తల్లి ఊర్వశి మాటలను అనుసరించి ఆయు మహారాజు తన తండ్రి పురూరవుడు బలగర్వంతో స్వంతం చేసుకున్న బ్రాహ్మణ ధనాన్ని, సామంత రాజుల దగ్గర సంపాదించిన మొత్తం ధనాన్ని తన కుల గురువు వశిష్ట మహర్షి కి చూపించాడు. వశిష్ట మహర్షి ఆయు మహారాజు చూపించిన ధనాన్నంత చూసాడు. అంత వశిష్ట మహర్షి "ఆయు మహారాజ! బ్రాహ్మణ ధనాన్ని ఏం చేయదలచుకున్నావు?" అని ఆయు మహారాజును అడిగాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న ఆయు మహారాజు "కులాచార్య వశిష్ట మహర్షి! ఇందులో బ్రాహ్మణులకు చెందవలసిన ధనాన్నంత బ్రాహ్మణులకు మీరే పంచేయండి. మిగతా ధనంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేద్దాం. అన్నార్తులను ఆదుకుంటాం.. " అని అన్నాడు.
 
 ఆయు మహారాజు మాటలను అనుసరించి వశిష్ట మహర్షి ధర్మబద్ధంగా బ్రాహ్మణులకు ఇవ్వ వలసిన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసాడు. మిగతా ధనంతో ఆయు మహారాజు వశిష్ట మహర్షి తో అనేక యజ్ఞయాగాదులు చేయించాడు. గోసంపదను, పశుసంపదను, గొర్రెల సంపదను, మేకల సంపదను పెంచి పోషించాడు. తన రాజ్యంలోని రహదారులను బాగుచేయించాడు. నిరుపేదలను తగిన రీతిలో రక్షించాడు. 



 వశిష్ట మహర్షి ఆయు మహారాజు తో " ఆయు మహారాజ! నీ తండ్రి పురూరవుడు భూమిని పదమూడు ద్వీపాలను మహా శౌర్యంతో పరిపాలించాడు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నువ్వు నీ తండ్రి లోని మంచి గుణాలను తప్పకుండా స్వీకరించాలి. ప్రజలందరినీ కన్నతండ్రి వలే కాపాడాలి.. " అని అన్నాడు. 



 ఆయు మహారాజు వశిష్ట మహర్షి మాటలను విని "చిత్తం" అని అన్నాడు. అటుపిమ్మట అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయసాగాడు. 



 ఆయు మహారాజు చేసే పనులను చూసి సుర నర రాక్షసాది లోకాలలోని వారంత ఎంతో సంతోషించారు. 



"మహా శౌర్యం లో తండ్రిని మించిన తనయుడు ఆయు మహారాజు. తండ్రి లోని సుగుణాలను మాత్రమే తన స్వంతం చేసుకున్నాడు ఆయు మహారాజు" అని ఆయు మహారాజు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రజలంతా అనుకోసాగారు. 



 ఊర్వశీ పురూరవుల వృత్తాంతంను, పురూరవుని గుణగణాలను దృష్టి లో పెట్టుకొని ఆయువుకు తమ కుమార్తెను యిచ్చి పెళ్ళిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.. అది గ్రహించిన వశిష్ట మహర్షి, " మహారాజ ఆయు. నీ తండ్రి పురూరవుడు బ్రహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కుని చాలా పెద్ద పాపం చేసాడు. పెద్దలు చేసిన పాపం తప్పకుండా తమ పిల్లలు కొంత అనుభవించ వలసి ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసి చాలా పుణ్యాన్ని మూటకట్టు కున్నావు. అయినా నీ తండ్రి చేసిన పాపం నిన్ను కొంత పట్టి విడువకుంది. అందుకే నీ వివాహం ఆలస్యం అవు తుంది. నీ చిత్ర పటాలను నరసురకిన్నెర రాక్షసాది లోకాలకు పంపాను. అయినా ఫలితం దక్కలేదు. 



 ఇకపై నువ్వు శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం దినం లో నాలుగవ భాగం శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో ఉండు. త్వరలో నీకు వివాహం జరుగుతుంది. " అని అన్నాడు.
 
 వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని సేవించసాగాడు. " అనసూయ పుత్ర, అత్రి తనయ హరిః ఓం జై గురుదత్త.. 
కృపావతార!" అంటూ ఆయు మహారాజు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ కుక్కల పండగ చేసాడు. కుక్కల నడుమ చిరు దరహాసం తో సంచరించే శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆయు మహారాజు దర్శించాడు. స్వామి తేజం లోని వేద కాంతులను దర్శించాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#34
శ్రీ దత్తాత్రేయ స్వామి "ఆయు మహారాజ! నీకు త్వరలో వివాహం అవుతుంది. నీ ధర్మ పత్ని ఖగోళ శాస్త్ర నైపుణ్య సామర్థ్యంతో లోకానికి కాంతిని ఇస్తుంది. నీ వంశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. శ్రీదత్తాత్రేయ వరప్రసాది గా నీ కుమారుడు కీర్తిప్రతిష్టలు పొందుతాడు. " అని ఆయు మహారాజును శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వదించాడు. 



 స్వర్భానుని కుమార్తె ప్రభ. తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది. అమరత్వం కోసం ఖగోళ మండలంలో తపస్సు చేసింది. ఖగోళం లోని సప్త మహర్షులు, తదితర నక్షత్ర గణ దేవతలు, మహర్షులు, బ్రహ్మర్షులు, నరయక్షనాగ కిన్నెరాదుల తేజస్సులన్నిటిని ప్రభ చూసింది. ఆయా దివ్య తేజస్సుల మాటు ఉన్న అమర తేజస్సు ను చూడటానికి ప్రభ ప్రయత్నించింది. ఖగోళ తపో పీఠం పై ప్రకాశించే ప్రభను, ఆమె పట్టుదలను చూచి ఖగోళ వాసులందరూ వేనోళ్ళ ప్రశంసించారు. 



 ప్రభ తనువు మహా తేజంతో వెలిగిపోసాగింది. అయితే తేజస్సు లో ప్రభకు అమరత్వ తేజం ఆవంత కూడా కనపడలేదు. తన తపో దీక్షలోని లోపాలు ఏమిటి? అని ప్రభ ఆలోచించింది. 
 ఆపై ప్రభ ఖగోళ పీఠం మొత్తాన్ని ఒకసారి పరిశీలించింది. అక్కడి విజ్ఞాన తేజాన్ని ఔపాసన పట్టింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నపుడు వచ్చే శబ్ద స్వరూపమే " ఓంకారం" అని గ్రహించింది. ఖగోళం లోని మహా తేజస్సుకు మనసార నమస్కరించింది. అటు పిమ్మట భూమి మీద తపస్సు చేయాలనుకుంది. ప్రతి ష్టాన పుర సమీపంలో ఉన్న తపో వనంలో తపస్సు చేయసాగింది. 



 ఒకనాడు ప్రభ తపస్సు చేసే ప్రాంతానికి వశిష్ట మహర్షి వచ్చాడు. తపస్సులో ఉన్న ప్రభను చూసాడు. తన దివ్య దృష్టితో వశిష్ట మహర్షి ప్రభ వృత్తాంతం మొత్తం తెలుసుకున్నాడు. 



 కొంత సమయం అనంతరం వశిష్ట మహర్షి ని చూసిన ప్రభ మహర్షికి సాష్టాంగ పడి నమస్కారం చేసింది. వశిష్ట మహర్షి ప్రభను ఆశీర్వదించాడు.



అంత " మ్మా ప్రభ, విప్రచిట్టి సింహికల కుమారుడైన నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం తహతహలాడిన ఘనుడు. అయితే నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం కనికరం లేని అన్వేషణ అధికంగా చేసాడు. తనకు తపో ఫలితం త్వరగా రావాలని సూర్యచంద్రులనే మింగాలని చూసాడు. కరుణ లేని అన్వేషణ కసాయి అన్వేషణ. అందుకే నీ తండ్రి స్వర్భానుడు ఇంతవరకు అనుకున్నది సాధించలేక పోయాడు. 
నువ్వు కూడా అమరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నావు. మంచిది. అయితే నువ్వు నీ తండ్రిలా కాకుండా మంచి మార్గాన అమరత్వం కోసం ప్రయత్నించు. 



 ఊర్వశీ పురూరవుల పుత్రుడు ఆయు మహారాజు. తన తపోశక్తి తో శ్రీ దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసకున్నాడు. శ్రీదత్త కరుణాకటాక్ష వీక్షణల నడుమ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆయు మహారాజు కు ఇంకా వివాహం కాలేదు. అతనికి తగిన వధువువు నువ్వే అని నాకనిపిస్తుంది. 
 పుణ్య పురుషుడైన ఆయు మహారాజును నువ్వు వివాహం చేసుకుంటే నువ్వనుకున్న మార్గం సులభంగా సాధించే అవకాశం కూడా నిన్ను వరిస్తుంది " అని వశిష్ఠ మహర్షి ప్రభతో అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న ప్రభ వశిష్ట మహ ర్షినే పెద్దరికం వహించి తనను ఆయు మహారాజుకు ఇచ్చి వివాహం చేయమంది. ప్రభ మాటలను విన్న వశిష్ట మహర్షి స్వర్భానుడు తోనూ ఊర్వశీపురూరవుల తోనూ ఆయు మహారాజు తోనూ మాట్లాడాడు. అందరూ వశిష్ట మహర్షి ఆలోచనను సమర్థించారు. 



 ప్రభ ఆయు మహారాజు వివాహం సురనర కిన్నెర యక్షరాక్షసాదుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. 
 ప్రభ తన భర్త ఆయు మహారాజు పద్దతులను అనుసరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని సేవించసాగింది. 



శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో మైమరచిపోయింది. అలాగే తనకు తెలిసిన ఖగోళ విజ్ఞానం ను అభివృద్ధి చేయ సాగింది. 
 ఒకనాడు కాలనేమి అనువాడు తనకు పాలపుంతను కళ్ళార దగ్గర గా ఉండి చూడాలని ఉంది అని ఆయు మహారాజు తో అన్నాడు. ఆయు మహారాజు కాలనేమిని ప్రభకు పరిచయం చేసాడు. కాలనేమి మనసులోని కోరికను ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభకు చెప్పాడు. అప్పుడు ప్రభ భర్త విన్నపమును అనుసరించి తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో కాలనేమిని పాలపుంతకు పంపింది. 



కాలనేమి పాలపుంతను కళ్ళార చూసాడు. పాలపుంతలో ముదము మీర నడిచాడు. ప్రభ ఖగోళ విజ్ఞాన ప్రభను కళ్ళార చూసిన ఆయు మహా రాజు ఆమెను పలు విధాలుగా ప్రశంసించాడు. ప్రభ విజ్ఞానాభివృద్దికి కావలసిన ఏర్పాట్లన్నీ తానే దగ్గర ఉండి చేయించాడు. 



 తన విజ్ఞానం ను ప్రజలకు ఉపయోగపడేటట్లు చూడమని ఆయు మహారాజు ప్రభకు చెప్పాడు. ప్రభ అలాగేనని తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో ఆయు మహా రాజు రాజ్యంలోని ప్రజలందరూ అతివృష్టితో అనావృష్టి తో ఇబ్బంది పడకుండా చేసింది. సకాలం లో వర్షాలు పడేరీతిలో యజ్ఞ యాగాదుల ద్వారా ఖగోళ సామర్థ్యాన్ని పెంచింది. 



 ప్రభ తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం ను పదుగురికి ఉపయోగపడేటట్లు చేస్తూనే భర్త సహకారం తో దేవత లందరిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పద్దతులలో యజ్ఞయాగాదులను చేయసాగింది. భర్త చెప్పిన ట్టుగా తమో రహిత, రజో రహిత తపమును ఆచరించింది. 



 ప్రభ తపస్సు కు మెచ్చిన సనకసనందాదులు ప్రభ ముందు ప్రత్యక్షమయ్యారు. నిత్య బాలురైన సన కసనందాదులను చూచిన ప్రభ వారిని భక్తితో సనకస నందాదుల దండకంతో స్తుతించింది. 






 సనకసనందాదులు ప్రభకు అనేక ఖగోళ రహస్యాలను చెబుతూ, "ప్రభ, భక్తితో కూడిన మహా విజ్ఞానం మనిషి మేథస్సు ను అమృత తుల్యం చేస్తుంది. మనిషిని మనీషిగ మలుస్తుంది. భక్తిలేని మహా విజ్ఞానం జగతికి పలు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. భూమిని భూ కక్ష్య నుండి తప్పించిన హిరణ్యాక్షుడు మహా విజ్ఞానే.. పాతాళం పాలైన భూమిని మరలా తన కక్ష్యలో ప్రవేశపెట్టిన వరాహ మూర్తి శ్రీమహావిష్ణువు మహా విజ్ఞానే. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#35
అయితే ఒకరి జ్ఞానం మహికి కీడు చేస్తే, మరొకరి జ్ఞానం మహికి మేలు చేసింది. మహికి మేలు చేసే జ్ఞానమే మంచి జ్ఞానం. నువ్వు ఇప్పుడు మహా మంచిదైన విష్ణు జ్ఞానం వైపు పయనిస్తున్నావు. నీలో సురకళ దినదినాభివృద్ధి చెందుగాక!" అని ప్రభను ఆశీర్వదించారు. 



 సనకసనందాదుల ఆశీర్వాదాలను ప్రభ కడు వినయంగా స్వీకరించింది. 
 ప్రభ తన భర్త ఆయు మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కసారి "ఖగోళ విజ్ఞాన విషయంలో నేనే గొప్ప "అని అనుకునేది. అప్పుడు ప్రభను కొంచెం రజో గుణం ఆవరించేది. రజో గుణమే ఆమెలో కొంచెం అహంను పెంచేది. అప్పుడు ప్రభ భర్త ఆయు మహారాజు చెప్పే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను విని తనలోని రజో గుణాన్ని, అహాన్ని తొలగించుకునేది. 



 రాక్షస గుణం గల తన తండ్రి స్వర్భానుని ప్రభావం వలనే తనను అప్పుడప్పుడు రజో గుణం తనని ఆవరిస్తుందన్న సత్యాన్ని ప్రభ గమనించింది. అందుకే ఆమె ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచించే టప్పుడైన భర్త ఆయు మహారాజు అభిప్రాయ దిశగానే సంచరించేది. 



 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ తన అభి ప్రాయాలనే గౌరవిస్తుందని తెలిసినప్పటికీ ప్రతి విషయాన్ని ధర్మపత్ని ప్రభతో చర్చించేవాడు. ధర్మపత్ని ప్రభ అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చేవాడు. 



 ఆయు మహారాజు సోదరులు అమావసు, ధిమన, విశ్వాయు, ధృదాయు, శృతాయులు తన వదినగారు ప్రభలో లేశ మాత్రంగా ఉన్న రజో గుణాన్ని గ్రహించారు. 



రజో గుణం తో ముందుకు కదలాలనుకున్న తమని తమ వదిన ప్రభ సమర్థిస్తుందనుకున్నారు. 



 అమావసాదులు ముని వనంలో కాలం చేసిన తన తండ్రి పురూరవుని మరణానికి మునులే కారణం గా భావించారు. ముని సంహారానికి సిద్దమయ్యారు. విషయాన్ని ప్రభ కు చెప్పారు. 



అప్పుడు ప్రభ పద్మా సనం మీద ఆసీనురాలయ్యింది. తన భర్త ఆయు మహా రాజు ను తనువు మీదకు తెచ్చుకుంది. అంత "మీ తండ్రిగారు నా మామగారు అయిన పురూరవుల వారి మరణానికి కొంతమంది మునులు కారణం అని మీరు అనుకుంటున్నారు. నిజానికి పురూరవులవారి మరణానికి మునులు కారణం కాదు. మీ తండ్రి గారు మునివాడన కాలం చేయడం వలన కొందరు అలా అనుకుంటు న్నారు. 



 మీ తండ్రిగారు కొంత బ్రాహ్మణ ధనాన్ని మునివాడ లోని భూగృహంలో దాచి పెట్టారని కూడా కొందరు అను కుంటారు. ధనాన్ని తీసుకురావడానికి మీ తండ్రి గారు మునివాడకు వెళ్ళారని, అక్కడ మీ తండ్రిగారి దగ్గర ఉన్న ధనాన్ని అపహరించడానికి మునులు మీ తండ్రిగారిని కిరాతకంగా క్షుద్ర విద్య లతో చంపారని మరి కొందరు అంటారు. 



నిజానికి అదంతా అబద్దం. మీ తండ్రిగారు వయసు మళ్ళిన పిదప మునివాడన కాలం గడపాలనుకున్నారు. అలా మునివాడకు వెళ్ళారు. అక్కడ అనారోగ్యం తో కాలం చేసారు. అంతే. " అని ప్రభ తన మరుదులకు నచ్చ చెప్పింది. 



 ప్రభ మాటలను విన్న అమావసాదులు మునివాడ లో ఉన్న మునులను చంపాలన్న ఆలోచనకు స్వస్తి పలికారు. ముని సంహారానికి తన సోదరులు వెళుతున్నారని తెలిసిన ఆయు మహారాజు తన సోదరులకు అవసరమైతే కత్తితో బుద్ది చెప్పాలని అమవసాదుల దగ్గరకు వచ్చాడు.
 
 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ వలన తన సోదరులు మారిన విధానం కళ్ళార చూసి సోదరులను దగ్గరకు తీసుకున్నాడు. ధర్మపత్ని ని మనసారా అభినందించాడు. 



 ప్రభ ఆయు మహారాజులకు శ్రీ దత్తాత్రేయ స్వామి కరుణాకటాక్షాల వలన ఒక కుమారుడు కలిగాడు. పుణ్య దంపతులు తమ కుమారునికి నహుషుడు అని పేరు పెట్టారు. వారు నహుషుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసారు. ప్రభ ఆయు మహారాజు కు నహుషునితో పాటు వృద్దరావు, గయుడు, అనేనుడు అనే పేర్లు గల పుత్రు లు కూడా కలిగారు. 



 ప్రభ భర్త సహాయసహకారాలతో దేవతలందరిని ప్రసన్నం చేసుకుంది. తన తపో శక్తిని, ఖగోళ విజ్ఞాన శక్తి ని ప్రజలకు ధారపోసింది. తను పొందాలనుకున్న అమరత్వం పొందింది. 



[font=var(--ricos-font-family,unset)]  [/font] శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#36
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#37
మిత్రమా శ్రీ,


మీరు కేవలం ఇక్కడ వ్రాసిన కథలు మాత్రమే చదవడానికి వస్తున్నట్లు అనిపిస్తోంది

మిగిలిన విభాగాల్లో దాదాపు అన్ని కథలు చదివేవారు, ఈ మధ్య శీత కన్ను వేసారు!

ఎందుకో?
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)