Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
అటు పిమ్మట వరాంగి సంయాతి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ మహోత్సవం నకు అనేకమంది రాజులు మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, కొండ జాతి వారు సురులు నరులు నానావిధ కింపురుషాది జాతులవారు హాజరయ్యారు. విందు వినోదాలతో అందరూ సందడి సందడిగా గడిపారు.
వరాంగి తన భర్త సంయాతి మనసును పరిపూర్ణంగా తెలుసుకుంది. భర్తలోని యతిత్వానికి ఉన్న శక్తిని, పరాక్రమానికి ఉన్న శక్తిని సుపథాన అంచనా వేసింది. భర్త నిమిత్తం తమ నివాస మందిరానికి కూతవేటు దూరంలోనే చక్కని ఆశ్రమం నిర్మింపచేసింది ఆ ఆశ్రమంలో గరుడ గజ తురగ ఖడ్గ త్రిభుజ చతురస్రాది వివిధ ఆకారాలలో యజ్ఞ వేదికల ను నిర్మింపచేసింది.
ఋషులు, మహర్షులు, రాజర్షులు బ్రహ్మర్షులు అక్కడ అనునిత్యం ఏదో ఒక యజ్ఞం చేసుకునే అవకాశాలు కల్పించింది. ఆ యాగశాలల నడుమ సాధు జంతువులు యథేచ్ఛగా తిరిగే ఏర్పాట్లు చేయించింది.
వరాంగి ఖాళీ సమయంలో సాధు జంతువు లయిన జింకలు, కుందేళ్ళ వెనుక పరుగులు తీసేది. సంయాతి మహారాజు ధర్మపత్ని ఆటపాటలను చూసి మురిసిపోయేవాడు.
సంయాతి మహారాజు తన దగ్గరకు ధర్మం కోసం వచ్చిన వారిని వరాంగి ముందు నిలబెట్టేవాడు. వరాంగి ధర్మం కోసం వచ్చిన వారిని ముందు యథేచ్ఛగా మాట్లాడనిచ్చేది. వారి మాటలను అనుసరించి తీర్పు చెప్పేది. తీర్పు చెప్పడం కొంచం కష్టం అనుకున్నప్పుడు పంచభూతాల సహాయం తీసుకునేది. ఆపై పంచభూతాల సాక్ష్యం తో ధర్మం చెప్పేది.
దానితో ప్రజలు అధర్మం చేయడానికి భయపడేవారు. అబద్దాలు చెప్పాలంటే గజగజ వణికిపోయేవారు. ఎప్పుడన్నా పరుల మాయలో పడి అసత్యం చెబితే మహారాణి వరాంగి ముందు తమ ప్రాణాలు పోతాయనే అనుకునేవారు.
ఒకనాడు యమధర్మరాజు మారువేషంలో వరాంగి తీర్పు చెప్పే ప్రాంతానికి వచ్చాడు. యమధర్మ రాజును చిత్ర గుప్తుడు అనుసరించాడు.
వరాంగి న్యాయం కోసం వచ్చిన భార్య భర్తల మాటలను వింది. అనంతరం "మీలో ఎవరిది న్యాయ మార్గం?" అని వారినే అడిగింది.
భర్త, "నాదే న్యాయం న్యాయం న్యాయం ముమ్మాటికీ న్యాయం నేను వేరు కాపురం పెట్టడం ముమ్మాటికీ న్యాయం " అని తనను తాను సమర్థించుకున్నాడు.
భార్య "నాదే న్యాయం. ఇంత కాలం నేనింత న్యాయంగా ఉండటానికి నా భర్తే కారణం. అయితే నా భర్త ధన వ్యామోహం లో పడి నా అత్త మామలు మంచివారు కారని అబద్దాలు చెప్పమంటున్నాడు. " అని అంది.
భార్యాభర్తల మాటలను విన్న వరాంగి కొద్ది సేపు ఆలోచించింది. అంత వరాంగి "మీలో ఎవరు నిజం చెబుతున్నారో పంచభూతాలే నిర్ణయిస్తాయి. "అని పంచభూతాలను ఆశ్రయించింది.
తనని తాను అతిగా సమర్థించుకున్న భర్తని అగ్ని దేవుడు వెంటనే చుట్టు ముట్టాడు. వెంటనే అతగాడు తనదే తప్పని పెద్దగా అరిచాడు. తన తప్పుకు శిక్ష గా వెయ్యి మందికి అన్నదానం చేస్తాను. వెయ్యి మంది విద్యార్థులకు విద్యాదానం చేయిస్తాను. వెయ్యి మంది ముత్తైదువు లకు పసుపు కుంకుమలు దానం చేస్తాను. వందమంది వృద్దులకు సంవత్సరం పాటు అన్నదానాదులు చేస్తాను. ". అని అతగాడు పెద్దగా అరిచి చెప్పిన పిమ్మట అగ్ని దేవుడు శాంతించాడు.
అలాగే మరో భార్యాభర్తల విషయంలో జల దేవత భార్యని శిక్షించింది. వరాంగికి పంచభూతాలు వశమైన తీరు చూసి యమ ధర్మరాజు మిక్కిలి సంతోషించాడు.
క్రిమి అనే అసుర రాజు సంయాతి మీద యుద్దం ప్రకటించాడు. అప్పుడు వరాంగి వాలఖిల్యులులాంటి లక్ష మంది సైనికులను క్రిమి మీదకు పంపింది. వారి చిత్ర విచిత్ర విన్యాస సమరం ముందు క్రిమి అసుర శక్తులన్నీ నశించాయి. క్రిమి యమపురికి చేరుకున్నాడు. సంయాతి మహారాజు ను విజయం వరించింది.
ఆ సందర్భంగా సంయాతి మహారాజు తన ధర్మపత్ని వరాంగిని పలు రీతుల్లో సన్మానించాడు. కొంత కాలం తర్వాత వరాంగి పండంటి మగ శిశువు కు జన్మనిచ్చింది. ఆ శిశువుకు వశిష్టాది మహర్షులు అహంయాతి అని పేరు పెట్టారు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
06-12-2024, 12:23 PM
(This post was last modified: 06-12-2024, 12:24 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అశ్మకి
[font=var(--ricos-font-family,unset)][/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
జనమేజయ మహారాజు ప్రతిష్టాన పురమును రాజధాని గా చేసుకుని జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అతని ధర్మపత్ని అనంత. ఆ పుణ్య దంపతులకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వరప్రసాదం తో ప్రాచీన్వంతుడు అనే సుపుత్రుడు కలిగాడు. తలిదండ్రుల ప్రేమాభిమానాల నడుమ అల్లారు ముద్దుగా పెరిగే ప్రాచీన్వంతుడు ఎల్లప్పుడూ తూర్పు దిక్కున ఉదయించే సూర్య భగవానుని చూస్తూ ధ్యానం చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే జ్ఞాన సముపార్జన చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆహారం స్వీకరించే వాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆటపాటలందు పాల్గొనేవాడు. తూర్పున ఉన్న హిమాలయ పర్వతాల ప్రత్యేకతల గురించే ఆలోచించేవాడు.
చంద్ర వంశంనకు చెందిన ప్రాచీన్వంతుడు కుల గురువు వశిష్ట మహర్షి వద్ద తదితర మహర్షుల దగ్గర సమస్త విద్యలను అభ్యసించాడు. తూర్పు రాజ్యల గురించి సమస్తం తెలుసుకున్నాడు. తూర్పు ప్రాంతాలను పరిపాలించే రాజుల బలాలను, బలహీనతలను సమస్తం తెలుసుకున్నాడు. ప్రాచీన్వంతుడు సూర్యుడు ఉదయించే తూర్పు దేశాలన్నింటిని తన స్వశక్తి తో జయించాడు. ఆయా రాజ్యాల రాజుల వాస్తవ ఆలోచనల గురించి తెలుసుకున్నాడు.
అలాగే కొందరి రాజుల మూర్కత్వం గురించి కూడ తెలుసుకున్నాడు. ప్రజోపయోగ కార్యక్రమాలు రూపొందించాడు. వాటిని అనుసరించమని ఆయా రాజ్యాల రాజులను ప్రాచీన్వంతుడు ఆదేశించాడు. రాజులందరూ ప్రాచీన్వంతుని ప్రజోపయోగ కార్యక్రమాలను అనుసరించడానికి మనసా వాచా కర్మణా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.
జనమేజయ మహారాజు ఒక శుభ ముహూర్తాన తన కుమారుడు ప్రాచీన్వంతుని ప్రతిష్టాన పుర రాజుగ పట్టాభిషేకం చేసాడు. ఆ పట్టాభిషేక మహోత్సవం నకు రాజులు, రారాజులు, సామంత రాజులు తదితరులందరూ వచ్చారు. ప్రాచీన్వంతుని మనఃపూర్వకంగ అభినం దించారు.
అనంత పుట్టింటికి, సంబంధించిన యాదవ మహారాజులు అందరూ ప్రాచీన్వంతుని పట్టాభిషేక మహో త్సవానికి వచ్చారు. అందులో అందరి దృష్టిలో అశ్మకి పడింది.
[font=var(--ricos-font-family,unset)] [/font]
యాదవ మహారాజు కుమార్తె అశ్మకి పుట్టుక గురించి అనంతకు ఆమె పుట్టింటివారు అనేకానేక విషయాలు చెప్పారు. అనంత తల్లి అనంతతో, "అమ్మా అనంత. అశ్మకి నీ కోడలైతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
అశ్మకి తల్లి అశ్మకిని ప్రసవించలేక అనేక ఇబ్బందులు పడింది.. తొమ్మిది నెలలు నిండిన అశ్మకి తల్లి గర్భం నుండి భూమి మీదకు రాలేదు.. అప్పుడు అశ్మకి తల్లి మహర్షుల మాటలను అనుసరించి అనేక యజ్ఞయాగాదులను జరిపించింది. ఆ యాగాలప్పుడు నేను కూడా వారికి కావలసిన సహాయ సహకారాలు అందించాను.
అనంతరం అశ్మకి తల్లి వారి రాజ్యం లో కొండల దగ్గర ఉన్న కోయలగూడెం వెళ్ళింది. అశ్మకి తల్లి కోయలలో ఉన్న పెద్ద ముత్తైదువులు చెప్పిన పద్దతులన్నిటిని అనుసరించింది.. అయినా అశ్మకి, తల్లి గర్భం నుండి భూమి మీద పడలేదు.
అనంతరం అశ్మకి తల్లి అనేకమంది మహర్షుల మాటలను అనుసరించి కొండ జాతి వారి దగ్గరకు వెళ్ళింది.. వారు అశ్మకి తల్లిని పరిశీలించి ఆమెను మహిమ గల రాళ్ళ నడుమ నాలుగు రో జులు ఉంచి అశ్మ పూజ చేసారు.. అప్పుడు అశ్మకి తల్లి అశ్మకికి జన్మనిచ్చింది.
అశ్మకి ని చూసిన అశ్మకి తండ్రి మహదానందం చెంది కొండ జాతి వారికి లక్ష ఆవులను దానం చేసాడు. గో క్షీరంతో రాజ్యం లోని సమస్త దేవతలకు అభిషేకం చేయించాడు.. ఆశ్మకి బారసాల వరకు అశ్మకిని ప్రతిరోజు క్షీరాభిషేకం చేయించాడు..
అశ్మకి పెరిగి పెద్దయ్యింది. ఆమె కొండ రాళ్ళ ప్రత్యేకతలను బాగా చెబుతుంది. ఎలాంటి కొండరాళ్ళతో దేవుని విగ్రహాలను తయారు చేస్తారో అశ్మకి కి తెలిసి నట్లు మరొకరికి తెలియదు." అని చెప్పింది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
తన తల్లి చెప్పిన మాటలను విన్న అనంత తన భర్త జనమేజయ మహారాజు కు అశ్మకి గురించి చెప్పింది. అశ్మకిని కోడలుగ చేసుకుంటే దక్షిణ ప్రాంత రాజ్యాలన్నీ మిత్ర రాజ్యాలు అవుతాయని అనంత, భర్త జనమేజయ మహారాజు తో అంది.
అనంత జనమేజయ మహారాజు ఇద్దరూ అశ్మకిని తమ యింటి కోడలిని చేసుకోవాలనుకున్నారు. అశ్మకి చిత్ర పటం ను అనంత తన కొడుకు ప్రాచీన్వంతునికి చూపించింది.
ప్రాచీన్వంతుడు అశ్మకి చిత్ర పటం చూసాడు. అశ్మకి రూపం తన మనసులో నింపుకున్నాడు. తలిదం డ్రుల మనసులోని ఆలోచనలను గ్రహించాడు. తన తల్లి అనంత ఆంతర్యాన్ని గ్రహించాడు.
"నేను సూర్యుడు ఉదయించే తూర్పు ప్రాంతాలన్నిటిని జయించాను. ఇక జయించిన వాటిని సక్రమం గా, చక్కగా పరిపాలించాలంటే సాధ్యమైనంతవరకు యుద్దాలకు స్వస్తి చెప్పాలి. దక్షిణ ప్రాంత రాజ్యాలను మిత్రత్వం తో బంధుత్వంతో దగ్గరకు చేర్చుకోవాలి. అశ్మకి దక్షిణ ప్రాంత యాదవ రాజు కుమార్తె. ఆమెను వివాహం చేసుకుని దక్షిణ ప్రాంతాల వారితో బంధుత్వం పెట్టుకోవాలి. శత్రు భయం లేకుండా రాజ్యాన్ని పరిపా లించాలి. ఇదే తల్లిగారి సదాలోచన" అని అనుకున్న ప్రాచీన్వంతుడు తలిదండ్రులకు తన సమ్మతిని తెలిపా డు.
అనంతరం ప్రాచీన్వంతుడు అశ్మిక అశ్మ కళను కళ్ళారా చూడాలనుకున్నాడు. మారు వేషంలో అశ్మకి రాజ్యానికి వెళ్ళాడు. కొండ రాళ్ళను పరిశీలిస్తున్న అశ్మకి ని చూసాడు.
"మిత్రులారా! ఏ ప్రాంతాలలో కొండ రాళ్ళు దండిగా ఉంటాయో ఆయా ప్రాంతాలు పవిత్రంగా ఉంటాయి.
వాటి వలన రాజ్యాలు కూడా సురక్షితంగా ఉంటాయి.
[font=var(--ricos-font-family,unset)] [/font]
కొన్ని కొండరాళ్ళు పవిత్ర దైవాలుగా మలచడానికి అనుకూలంగ ఉంటాయి. మరికొన్ని కొండ రాళ్ళు గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇంకొన్ని కొండ రాళ్ళు రాజ్య రక్షణ చేస్తూ ఉంటాయి. మంచి నీటిని పుష్కలంగా ఇస్తాయి. సూర్య కిరణాల తేజంలో మరికొన్ని కొండ రాళ్ళు ధగధగ మెరుస్తుంటాయి. వాటి విలువ ఇంత అని చెప్పలేం.
కొన్ని కొండ రాళ్ళ గుహలు మనుషులలోని మాలిన్యాన్ని కడిగివేసి మనుషులను మహనీయులుగ మలుస్తాయి. కొండల రాజు హిమవంతుని ప్రియ పుత్రిక పార్వతి మాత. ఆ మాత అనుగ్రహం ఉన్న వారికి కొండల ప్రత్యేకతలు బాగా తెలుస్తుంటాయి. ఆ మాత అనుగ్రహంతోనే నేను ఈ కొండల మూలాల గురించి చెప్ప గలుగుతున్నాను" అని అశ్మకి శిల్పులకు చెప్పే మాటలను ప్రాచీన్వంతుడు విన్నాడు.
అశ్మకి పార్వతీ మాత అంశతో జన్మించిందని ప్రాచీ న్వంతుడు అనుకున్నాడు. అశ్మకి అశ్మ కళనంత గ్రహించాడు. అనంతరం పెద్దలందరి సమక్షంలో ప్రాచీన్వంతుడు అశ్మకిని మనువాడాడు.
అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని అభ్యర్థనను అనుసరించి ప్రాచీన్వంతుని రాజ్యములోని కొండలన్నిటిని పరిశీలించింది.
అంత తన భర్తతో " నాథ! మన రాజ్యం లో అనేకానేక మహోన్నత కొండలు ఉన్నాయి. ఇక్కడ చలిపులి ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను చలి నుండి కాపాడే కొండలు ఉన్నాయి. అమృతం లాంటి మంచినీరు ఇచ్చే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి. సూర్య కిరణాల ప్రభావంతో బంగారం లాగ మారే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి.
సూర్య కిరణాల ప్రభావంతో మణులుగా మారే కొండలు కూడా ఉన్నాయి. మా యాదవ రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో వెండిగా మారతాయి. మన రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో బంగారం గా మారితే మరికొన్ని కొండలు మణులుగ మారతాయి. "అని అంది.
అశ్మకి మాటలను విన్న ప్రాచీన్వంతుడు తన రాజ్యం ఎంత సుసంపన్నమైనదో గ్రహించాడు. ఇక తన రాజ్యంలో నిరుపేదలు ఉండకూడదు అని ధృఢ నిశ్చయానికి వచ్చాడు.
అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని మాటలను అనుసరించి మిత్ర రాజ్యాలలోని కొండలను, ప్రాచీన్వంతుని సామంత రాజుల రాజ్యాలలోని కొండలను పరిశీలించింది. అందరి రాజుల, రారాజుల మన్ననలను పొందింది.
ఆయా రాజ్యాలలోని ప్రజలందరు అశ్మకిని పార్వతీ మాత లా చూసారు. ప్రాచీన్వంతుడు "బంగారం మణుల నడుమ ప్రకాసించే పార్వతీ తేజం నా భార్య అశ్మకి " అని అనుకున్నాడు.
[font=var(--ricos-font-family,unset)] [/font]
అశ్మకి ప్రాచీన్వంతుల కాలంలో నిరుపేదలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయారు. కొండలు కోనలు ప్రకృతి చక్క గా సశాస్త్రీయంగా సంరక్షించబడింది.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
17-12-2024, 01:56 PM
(This post was last modified: 17-12-2024, 02:01 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అనంత
[font=var(--ricos-font-family,unset)][/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని జనమేజయ మహారాజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యం లో నిరుపేదలు అనేవారు అసలు లేరని చెప్పడం అతిశయోక్తియే అవుతుంది కానీ విధాత రాతకు అనుకూలంగా అతని సుపరిపాలన సాగుతుందన్నది ముమ్మాటికి నిజం . నిరుపేదలను ఆదుకునే విషయం లో మాత్రం జనమేజయ మహారాజు అందరికంటే ముందుండేవాడు. అలా నిరుపేదల పాలిట ఆపద్భాందవుడు అయ్యాడు.
జనమేజయ మహారాజు తలిదండ్రులు కౌసల్య, పూరులు, కుల గురువు వశిష్ట మహర్షి జనమేజయ మహారాజుకు రాజ్య పరిపాలనా విషయంలో చేదోడువా దోడుగా ఉన్నారు. రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా ఉండటానికి తమ శక్తిమేర రాజుకు సహకరించారు.
జనమేజయ మహారాజు మాతృమూర్తి కౌసల్య ప్రజలకు అప్పుడప్పుడు సంక్రమించే అనేక రకాల శారీరక రోగాలను సులభం గా నయం చేసేది. ప్రజల దేహాలను కలుషితం చేసే చెడు గాలులు తన రాజ్యానికి సోకకుండా కౌసల్య తన కుమారుడు జనమేజయ మహారాజుతో అనేక వాతావరణ కాలుష్య సంహార యాగాలను జరిపించింది. తల్లి మాటలను జవ దాటకుండా జనమేజయ మహారాజు అనేక వాతావరణ కాలుష్య సంహార యాగాలు జరిపించాడు.
జనమేయ మహారాజు తన తలిదండ్రులు కౌసల్య పూరుల సహకారం తో, కులగురువు వశిష్ట మహర్షి సహకారంతో మూడు అశ్వమేథ యాగాలు చేసాడు. ప్రతి అశ్వమేథ యాగం పూర్తి కాగానే అనేకమంది నిరుపేదలకు ధన సహాయం చేసాడు. గృహాలు లేని నిరుపేదలకు నూతన గృహాలు కట్టించి ఇచ్చాడు.
జనమేజయ మహారాజు అశ్వమేథ యాగ సందర్భంలో పర రాజ్య రాజులను సాధ్యమైనంత వరకు మంచి మాటల తోనే లొంగదీసుకున్నాడు. తన మాటలను మన్నించి లొంగిపోయిన రాజులను, వారి రాజ్యంలోని ప్రజలను జనమేజయ మహారాజు తన స్వంత బిడ్డల్లా చూసుకునేవాడు.
జనమేజయ మహారాజు తల్లి కౌసల్య వైద్య నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరరాజ్య రాజులు జనమేజయ మహారాజు ముందు తలవంచేవారు. కౌసల్య తన రాజ్య ప్రజలకే కాక తనని ఆహ్వానించిన పరరాజ్య ప్రజలకుకూడ తన వైద్య సేవలను అందించేది. దానితో జనమేజయ మహారాజు కీర్తి ప్రతిష్టలు సమస్త లోకాలకు ఎగబాకాయి. ఇలా జనమేజయ మహారాజు తన రాజ్యంలో ఆర్థిక బాధలు అనేవి లేకుండా చేసాడు. అలాగే జనమేజయ మహారాజు ప్రజలు సోమరిపోతులు కాకుండా చూసాడు. ప్రజల సామర్థ్యానుసారం వారికి తగిన పనులను కల్పించాడు.
యదు వంశానికి చెందిన మాధవ మహారాజు అనేక పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ, ఒకసారి ప్రతిష్టానపురాన్ని సందర్శించాడు.. కౌసల్య పూరులు మాధవ మహారాజును తగిన విధంగా సత్కరించారు. కౌసల్య పూరులు, మాధవ మహారాజు వారి వారి గత సంబంధ బాంధవ్యాల గురించి ముచ్చటించుకున్నారు. ఋగ్వేదం లోని ఏడవ మండలంలో చర్చించబడిన పది రాజ్యాల సమరం గురించి చర్చించుకున్నారు. ప్రజల బాగోగులు కోరుకునే రాజులు శాంతి మార్గాన్నే అనుసరిస్తారు అనుకున్నారు.
అప్పుడే అక్కడకు వచ్చిన జనమేజయ మహారాజు మాధవ మహారాజు కు నమస్కరించాడు. పది రోజుల పాటు తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని మాధవ మహారాజును అభ్యర్థించాడు. అందుకు మాధవ మహారాజు సమ్మతించాడు. మాధవ మహారాజు జనమేజయ మహారాజు సుపరి పాలనను కనులార చూసాడు.
ఒకనాడు మాధవ మహారాజు కౌసల్య నిర్వహణ లో ఉన్న సురవాయుజ్ఞాన మందిరానికి వెళ్ళాడు. అక్కడి పరిశుద్ద ప్రాణవాయువు తగలగానే అతని శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అతని శరీరమంత రక్త సారలతో రక్తసిక్తమయ్యింది. కౌసల్య వెంటనే మాధవ మహారాజును ప్రత్యేక మందిరంలో ఉంచి వైద్యం చేసింది. నాలుగు రోజుల అనంతరం మాధవ మహారాజు శరీరం మీద రక్త సారలు తగ్గుముఖం పట్టాయి.
జనమేజయ మహారాజు మాధవ మహారాజుకు వచ్చిన అనారోగ్య సమస్యను తెలియచేస్తూ అతని కుమార్తె అనంతకు ప్రత్యేక చారుల ద్వారా వర్తమానం పంపాడు. అనంత వెంటనే తండ్రి దగ్గరకు వచ్చింది.
అనంత తండ్రి శరీరం మీద రక్త సారలు రావడానికి కారణం ఏమిటని కౌసల్యను అడిగింది. దానికి కౌసల్య, "అంతం లేని అందానికి నిలయమైన అనంత.. మీ రాజ్యంలో అనంత కోన ఉంది కదా? " అని అనంతను అడిగింది.
" ఉంది. ఆ కోనలో నివసించే మానవుల ఆకారం అనంతశయుని ఆకారంలో ఉంటుంది. వారంటే మా తండ్రి గారికి మహా యిష్టం. మా రాజ్యం మీదకు శత్రురాజులు ఎవరన్నా అమానుషంగా దండయాత్ర చేస్తే, యుద్దంలో అనంత కోన మనుషులంతా ముందు ఉంటారు. అనంత కోనలోని ఒక్కొక్క మనిషి రమారమి నాలుగు వందల శత్రు సైన్యాన్ని సునాయాసంగా చంపి అవతల పారేస్తాడు.
ఒకసారి అంతాసుర రాజు మా రాజ్యం మీదకు దండయాత్ర చేసాడు. అప్పుడు నేనూ యుద్దంలో పాల్గొన్నాను. అప్పుడు అనంత కోన వీరుల పరాక్రమం కళ్ళార చూసాను. వారి పరాక్రమం చూసి నేనుకూడ రథం మీదనే గిర్రున తిరిగి ఆకాశమంత ఎత్తులేచి కరవాలంతో దరిదాపు వెయ్యిమంది శత్రువుల తలలను నరికి అవతల పడేసాను. అంతాసురుని మీద విజయం సాధించాను.
అనంత కోన వీరులతో యుద్దమంటే వివిధ సర్పాకార వీరులతో యుద్దం చేయడమే. ఆ కోన అభివృద్ధి కి మా తండ్రిగారు అనునిత్యం ఆలోచిస్తుంటా రు. ఆ కోన అభివృద్ధి విషయం లో తండ్రిగారు పదే పదే నా సలహా తీసుకుంటారు. ఆ కోనలోనే మా తల్లిగారు నాకు జన్మనిచ్చిందని మా తండ్రిగారు చెబుతుంటారు" కౌసల్య తో అంది అనంత.
"అనంత కోనలో జీవించేవారికి అక్కడి గాలి సరిపడుతుంది. నిజం చెప్పాలంటే అక్కడివారు ఎక్కువ కాలం మరొక చోట జీవించలేరు" అనంతతో అంది కౌసల్య.
"మీరు చెప్పింది అక్షర సత్యం. అనంత కోనలో మనుషులు విందు వినోదాల నిమిత్తం మా రాజమందిరానికి వచ్చినప్పుడు వారు మా మందిరంలో నాలుగు రోజులు మించి ఉండరు. " అంది అనంత.
"నిజం చెప్పాలంటే మీ తండ్రిగారి శరీరానికి కూడా అక్కడి గాలి సరిపడదు. అయితే మీ తండ్రి గారి శరీరానికి కొంత కాలం పాటు అన్ని వాతావరణాలలోని గాలులను తట్టుకునే సామర్థ్యం ఉంది. అలా మీ తండ్రిగారి శరీరం కొంత కాలం అక్కడి గాలిని తట్టుకుంది.
మా సురవాయు జ్ఞానమందిరంలో పరిపూర్ణ ప్రాణవాయువు ఉంటుంది. ఆ ప్రాణవాయువు సురులకు సహితం సరిపోతుంది. ఆ ప్రాణవాయువు మనిషి శరీరతత్వాన్ని తెలియచేస్తుంది. అలాగే అప్పటివరకు ఆయా మనుషులు తమ శరీర తత్వానికి సరిపడని వాయువు ను ఎంత గ్రహించారన్న విషయాన్ని కూడా సురవాయు జ్ఞానమందిరం తెలియచేస్తుంది. అంతేగాక ఆయా మనుషుల్లో దాగివున్న రోగాలను కూడా సుర వాయు జ్ఞానమందిరం తెలియచేస్తుంది. అందుకే మేం ఆ మందిరానికి సురవాయు జ్ఞాన మందిరం అని పేరు పెట్టాము.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
17-12-2024, 01:59 PM
(This post was last modified: 17-12-2024, 02:02 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ తండ్రి గారు సురవాయు జ్ఞాన మందిరానికి రాగానే వారి రోగాలన్నీ బయటపడినవి. వారి శరీరమంత రక్త సారల మయం అయ్యింది. నాకు తెలిసిన వైద్యం తో వారి రోగాలన్నిటిని నయం చేసాను. ఇక వారు ఎక్క డికి వెళ్ళినా వారిని అనారోగ్యం అంటుకోదు. " అని అనంత తో అంది కౌసల్య.
కౌసల్య మాటలను విన్న అనంత ఆనందపడింది. కౌసల్య వైద్యం చేసే విధానం చూసి మహదానందం పొందింది. పదిరోజుల్లో మాధవ మహారాజు సంపూర్ణ ఆరో గ్యం తో పదుగురిలో తిరగసాగాడు. అంతే గాక అంతకు ముందుకంటే మహా వేగంగా కరవాలాన్ని తిప్పసాగాడు.
అనంతను చూసిన జనమేజయ మహారాజు అనంతను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనంత కూడా జనమేజయ మహారాజును ఇష్టపడింది. ఇద్దరి ఇష్టాన్ని వారి వారి పెద్దలు గమనించారు. కౌసల్య అనంతను తన మందిరానికి పిలిపించింది. ఆమె మనసులోని మాట ను అనంతకు చెప్పింది. అప్పుడు అనంత, "మీరు నాకు కాబోయే అత్తగారే కాదు. మీరు నాకు అమ్మతో సమానం. మీ సుపుత్రుడు జనమేజయ మహారాజు అంటే నాకు మహా ఇష్టం. వారిని మనువాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీరు ముందుగ మా అనంత కోనకు రావాలి. మీ వైద్యం తో అక్కడి వాతావరణం మార్చాలి. మీ శిష్యరికం లో నేను మరింత ఎదగాలి. ఆ తర్వాతే నా వివాహం. " అని అనంత కౌసల్య తో అంది.
అనంత మాటలను విన్న కౌసల్య, " రాజ్యాన్ని పరిపాలించే రాజైన, రాణైన ముందుగా ప్రజల క్షేమం చూడాలి. ఆ పిదప తమ క్షేమం గురించి ఆలోచించాలి. ప్రజలను ఆకలి మంటలకు, అనారోగ్యాలకు వదలేసి రాజూరాణులు విలాస మందిరాలలో విహరించకూడదు. అనంత.. ముందుగా ప్రజల గురించి ఆలోచిస్తున్న నువ్వు నాకు బాగా నచ్చావు. మా చంద్రవంశానికి వన్నెతెచ్చే మహిళామణివి నువ్వే అని నా మనసు నాకు చెబుతుంది.. నీ కోరిక ప్రకారం ముందుగా అనంత కోన వాతావరణాన్ని మారుస్తాను. ఆ తర్వాతనే నా సుపుత్రునితో నీ వివాహం జరిపిస్తాను. " అని అంది.
కౌసల్య అనంతతో అనంత కోన వెళ్ళింది. అక్కడి వాతావరణమంతటిని నాలుగు రోజుల పాటు పరిశీలించింది. అనంతం మహర్షుల సహాయంతో రకరకాల యజ్ఞయాగాదులను జరిపించింది. అనంత కోన అమరులకు సహితం అమృతమయమైన ప్రాణవాయువు ఇచ్చే కోన అన్నట్లుగా కౌసల్య అనంత కోనను తీర్చిదిద్దింది. కౌసల్య చేసే ప్రతి పనిలో కౌసల్యకు కుడి భుజం గా అనంత నిలిచింది.
తదనంతరం అనంత కోనలోనే అనంత జనమేజయ మహారాజుల వివాహం జరిగింది. ఆపై అనంత తన అత్తగారైన కౌసల్య దగ్గర శరీర శాస్త్రానికి సంబంధించిన విద్యలన్నిటిని అభ్యసించింది. అలాగే రకరకాల యజ్ఞయాగాదుల గురించి తెలుసుకుంది. యజ్ఞయాగాదుల వలన ప్రకృతి కి కలిగే మేలును కనులార చూసింది.
అనంతరం అనంత తన భర్త జనమేజయ మహారాజు ను విశ్వజిత్ యాగమును చేయమని ప్రోత్సహించింది. జనమేజయ మహారాజు తన భార్య అనంత మాటలను అనుసరించి విశ్వజిత్ యాగం ప్రారంభించాడు.
జనమేజయ మహారాజు భూమిలో వాటా తప్ప సమస్తాన్ని మునులకు, ఋషులకు, మహర్షులకు నిరుపేదలకు దానం చేసాడు. గోపాలురకు వెయ్యి ఆవులను దానం చేసాడు. వివిధ పుణ్య క్షేత్రాలలో ఆయా దేవతలకు గోక్షీరంతో అభిషేకాలు జరిపించాడు. పవిత్ర గోఘృతం తో రకరకాల ప్రసాదాలు తయారుచేయించి ప్రజలందరికి పంచిపెట్టాడు.
ఆ తర్వాత జనమేజయ మహారాజు ఉదుంబ వృక్షం కింద నిషాదులతో, వైశ్యులతో క్షత్రియులతో వశిష్టాది మహర్షులు చెప్పినంత కాలం వేద పురాణేతిహాసాలను వింటు కాలక్షేపం చేసాడు. తన పూర్వీకుడు ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని ఎలా ప్రసన్నం చేసుకుంది అందరికి చెప్పాడు.
విశ్వజిత్ యాగం మహోన్నతంగా పరిపూర్ణమైంది. శ్రీ దత్తాత్రేయ స్వామి అనంత జనమేజయ మహారాజు లను కరుణించాడు.ఆ పుణ్య దంపతుల సుపుత్రుడు ప్రాచీన్వంతుడు[font=var(--ricos-font-family,unset)].[/font]
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
|