Posts: 11,393
Threads: 13
Likes Received: 50,069 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,069 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆబ్రోసెక్సువాలిటీ:
ఒకసారి అబ్బాయిలంటే ఆకర్షణ కలుగుతుంది, మరొకసారి అమ్మాయిలపై కోరిక పుడుతుంది‘ఒక్కోసారి నా భర్త మీద విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. ఆ మరుక్షణమే నా ఆకర్షణ మరొకరి వైపు మరలుతుంది. అందంగా ఉన్న అమ్మాయినో అబ్బాయినో చూసినప్పుడు వాళ్లతో శారీరకంగా దగ్గరవ్వాలని అనిపిస్తుంది. ఆ క్షణంలో చాలా సతమతమైపోతాను’దిల్లీకి చెందిన 38 ఏళ్ల జయంతి (పేరు మార్చాం) చెబుతున్న మాట ఇది. ఒక అంతర్జాతీయ సంస్థలో ఆమె పని చేస్తున్నారు.జయంతికి ఉన్న ఈ కండిషన్‌ను ఆబ్రోసెక్సువాలిటీ అంటారని ‘గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, ఆంధ్రా మెడికల్ కాలేజ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోగ్యనాథుడు చెప్పారు.
స్త్రీ, పురుషులు ఇద్దరిపైనా శారీరక ఆకర్షణ కలిగి ఉండటంతోపాటు అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటాన్ని వైద్య పరిభాషలో ఆబ్రోసెక్సువాలిటీ అంటారని డాక్టర్ ఆరోగ్యనాథుడు చెప్పారు.
‘‘ఈ లక్షణాలు ఉన్నవారు కొన్ని రోజులు పూర్తిగా పురుషుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ ఆకర్షణ కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఉండవచ్చు. ఆ వెంటనే వాళ్ల దృష్టి అమ్మాయిల వైపు మారొచ్చు" అని డాక్టర్ ఆరోగ్యనాథుడు తెలిపారు.ఇలా లైంగిక ఆకర్షణలు తరచూ మారుతూ ఉండటాన్ని ‘‘సెక్సువల్ ఫ్లూయిడిటీ’’ అని అంటారు.
ఆబ్రోసెక్సువాలిటీ అనేది కొత్త కాన్సెప్ట్.
"హే! చాాలా అందంగా కనిపిస్తున్నావ్. నీ లాంగ్ నెక్ బ్లౌజ్ చూస్తుంటే చాలా టెంప్టింగ్‌గా ఉంది. నేనే అబ్బాయినైతేనా " ఇలాంటి కామెంట్స్ స్నేహితురాళ్లు, బంధువులు, ఆఫీసులో మహిళా కొలీగ్స్ వంటి వారి నుంచి చాలా మంది మహిళలు వినే ఉండొచ్చు.కామెంట్స్ చేసింది సేమ్ జెండర్ వాళ్లే కాబట్టి, సాధారణంగా మహిళలు వాటిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కొందరు కాస్త ఇబ్బంది పడొచ్చు. అవతలి వాళ్లకు మీపై ఆకర్షణ ఉండడం దీనికి కారణం కావొచ్చు.ఇలాంటి పరిస్థితి అమ్మాయిలకు మాత్రమే ఎదురుకాదు. అబ్బాయిలు కూడా వేరే అబ్బాయిల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉండొచ్చు.ఇలాంటి ధోరణి తరచుగా కనిపిస్తుంటే మాత్రం, అవతలి వ్యక్తికి మీపై శారీరక ఆకర్షణ కలిగి ఉండొచ్చు. అలా అని ఇవి గే, లెస్బియన్‌ల లక్షణాలు కాదు.'ఆబ్రోసెక్సువాలిటీ' లక్షణాలు ఉన్నప్పుడు లైంగికత విషయంలో స్థిరత్వం ఉండదు. కొన్ని రోజులు పురుషుల పట్ల ఆకర్షితులైతే, మరి కొన్ని రోజులు వాళ్ల దృష్టి అంతా మహిళలపై ఉంటుంది.
"పెళ్లితో నా సమస్య తీరిపోతుందనుకున్నా"
సెక్సువల్ ఫ్లూయిడిటీ ఉన్న జయంతి.. పెళ్లికి ముందే తనకు అటువంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించానని చెప్పారు.
‘నేను అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరి పట్లా ఆకర్షితురాలినవుతున్నానని నాకు పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లితో ఆ సమస్య తీరిపోతుందనుకున్నా. కానీ నాలో కలిగే కోరికలకు పెళ్లి పరిష్కారం కాదని ఆ తరువాత అర్థమైంది’ అని జయంతి చెప్పారు.
ఒక అంతర్జాతీయ సంస్థలో ఆసియా-పసిఫిక్ డైవర్సిటీ కౌన్సెలర్‌గా పని చేస్తున్న సూర్యకాంతం రావి తన పరిశోధనలో భాగంగా జయంతితో మాట్లాడారు.
"జయంతికి పెళ్లికి ముందే తనలో ఉన్న లక్షణాలు తెలిశాయి. కానీ, ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇప్పటికీ ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పలేదు.
ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె పని చేయలేకపోయేవారు. కోపం వచ్చేది. అసహనానికి గురయ్యేవారు. పెళ్లి తన సమస్యకు పరిష్కారం అని అనుకున్నారు. కానీ పెళ్లి ఆమె సమస్యను తీర్చలేదు. భర్తతో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తన కుటుంబంలో ఇబ్బందులు రాకూడదనుకున్న ఆమె తన పరిస్థితిని ఎవరితోనూ చెప్పుకోలేదు.
జయంతికి వేరే వ్యక్తిపై ఆకర్షణ ఉన్నా భర్తతో దగ్గరగా ఉండాల్సివస్తే.. అలాంటి సమయంలో ఆ వేరొక వ్యక్తిని ఊహించుకుంటూ ఆనందం పొందుతుండేవారు’’ అని సూర్యకాంతం చెప్పారు
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,069 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
అమ్మాయిలు తాము ప్రాణంలా ప్రేమిస్తున్న అబ్బాయిలను కూడా ఒక్కోసారి దూరంగా పెడతారు. దూరంగా నిలిచి మాట్లాడేందుకే ఇష్టపడతారు. చేయి పట్టుకోడానికి కూడా అనుమతి ఇవ్వరు.
అలా అని ఆమె మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు ఆమె కళ్ళల్లో, చేతల్లో మీపై ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కానీ మీరు భౌతికంగా దగ్గరకు వస్తే మాత్రం దూరం జరుగుతుంది. ఆమె హృదయం మీతోనే ఉన్నా, శరీరకంగా మాత్రం దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఆమె మీకు చెప్పదు. కాబట్టి మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని కారణాలవల్లే మీ ప్రేయసి మీకు దూరం జరుగుతూ ఉంటుంది. వీటిని వెంటనే మార్చుకోండి.
గెడ్డం ఉన్నా…ముఖంపై కొంతమంది అబ్బాయిలు తెగ గెడ్డం పెంచుకుంటారు. చూడగానే రగ్‌డ్ లుక్ వస్తుంది. ఇది అబ్బాయిలకి ఇష్టంగా ఉండవచ్చు, కానీ అమ్మాయిలకు మాత్రం నచ్చదు. ముఖాన్ని తమ చేతులతో ముట్టుకోవాలంటే… ఆ ముఖం చాలా శుభ్రంగా ఉండాలని వారు కోరుకుంటారు. ముఖంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటే వారికి వారు దూరంగా జరుగుతారు. కాబట్టి కాస్త షేవ్ చేసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించండి.
నోటి శుభ్రత
దుర్వాసన వచ్చే అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. వారి బట్టలు పరిశుభ్రంగా లేకపోయినా, మాసిపోయినట్టు ఉన్నా, ఆ దుస్తులు నుండి వాసన వస్తున్నా అమ్మాయిలు ఇబ్బందిగా ఫీలవుతారు. మీకు దూరంగా జరుగుతూ ఉంటే ఓసారి మీ బట్టల వాసన మీరే చూసుకోండి.
అమ్మాయిలకి నీట్ గా ఉండే అబ్బాయిలను చూస్తే నచ్చుతుంది. మాసిన బట్టలతో కనిపిస్తే వారు మిమ్మల్ని ఇష్టపడరు. మట్టి పూసిన చెప్పులు, మాసిపోయిన షర్టులతో వాళ్ళ ముందుకు వెళ్ళకండి. వారు దూరంగా జరిగిపోతారు. వీలైనంతవరకు ఉతికిన దుస్తులను వేసుకొని వారి దగ్గరకు వెళ్ళండి.
మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తుంపర్లు వస్తున్నా, దుర్వాసన వేస్తున్నా కూడా వారు మీకు దూరంగా జరిగిపోతారు. కాబట్టి సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి తాగిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా చూసుకోండి. లేకపోతే మీ ప్రయోజనం దూరంగా నెట్టేయడం ఖాయం.
మీ స్నేహితుల ద్వారా మీ గురించి ఏమైనా నిజాలు ఆమెకు తెలిసినా కూడా ఆమె మిమ్మల్ని దూరం పెడుతుంది. కాబట్టి ప్రేమలో పడ్డాక సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. ఆమెను మోసం చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించకండి.
మీ ప్రేయసి కలిసినప్పుడు ఆమెలోని లోపాలను పదేపదే ఎత్తి చూపడానికి ప్రయత్నించవద్దు. అలాగే ముఖంపై జుట్టు, మొటిమలు వంటివి పెరగకుండా చూసుకోండి. అవి ఎక్కువగా ఉన్నా కూడా అమ్మాయిలకు నచ్చదు. అలాగే ఉద్యోగం, హోదా వంటివి కూడా అమ్మాయిలు చూస్తారు. టాలెంటెడ్ అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు. కాబట్టి మీలో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. మాట్లాడే తీరు, నడిచే తీరు ఏదైనా కూడా అమ్మాయిల్ని ఆకర్షించే విధంగా ఉండేలా చూసుకోండి.ఇక లైంగిక జీవితం విషయానికి వస్తే మీకు నచ్చినట్టు ప్రవర్తించడం కాదు, వారికి నచ్చినట్టు ప్రవర్తించేందుకు ప్రయత్నించండి. అది వారిలో ఇష్టమే పెంచుతుంది. ఉన్నంతలో వారితో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. అమ్మాయిలు నిజాయితీగా ఉండే అబ్బాయిని ఇష్టపడతారు. అబద్ధాలు చెప్పారని తెలిస్తే ఆ క్షణమే వదిలేస్తారు.
|