Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#21
" పిల్ల లేచిపోలేదు. మీ నాన్న పిల్లను అతని పేరు... కళ్యాణ్తో లేచిపోయేలా చేశారు. అతని తండ్రి రామయోగి మీ నాన్నగారికి మంచి స్నేహితుడు.



ఒకరికి తెలియకుండా ఒకరు ఎలక్షన్లో నిలబడాలనుకొన్నారు. ఇరువురూ నామినేషన్స్ వేశారు.
విషయం విన్న రామయోగి మీ నాన్నగారిని కలిశాడు. వారు మన కులం వారు కాదు. రామయోగి కులస్థులు చాలామంది వున్నారు. మీ నాన్న విత్‍‍డ్రా చేసుకొంటే... అతను తప్పక గెలిచేవాడు...
తన వద్దకు వచ్చి విషయాన్ని ప్రస్తావించిన రామయోగితో మీ నాన్న... తాను విత్డ్రా చేసికోనని నిర్మొహమాటంగా చెప్పాడు. రామయోగిని తనకు సపోర్టు చేయమన్నాడు. రామయోగి కొడుకు కళ్యాణ్, వాణి ఒకే కాలేజీలో చదివినవారు. కళ్యాణ్ మంచి అందగాడు. వాణి కన్నా ఒక సంవత్సరం సీనియర్. అతను వాణిని ప్రేమించాడు. ఎంతో తెలివైన కళ్యాణ్ వలలో వాణి పడిపోయింది. తనూ అతనిని ప్రేమించింది. వారిరువురూ కలిసి తిరగడాన్ని మీ నాన్నగారు చూచారు. వాణిని పిలిపించి విషయాన్ని అడిగాడు మీ తండ్రి. మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మామయ్యా!.... మీరే అమ్మా నాన్నలతో మాట్లాడి మా వివాహాన్ని జరిపించమని కోరింది వాణి.



అప్పటికి అందరం... బంధుప్రీతితో వున్నందున మీ నాన్నగారు హరికృష్ణ అన్నయ్య... మీ అత్త లావణ్యతో వాణి అభిప్రాయాన్ని చెప్పి... కాలం మారింది. మనం మన తత్త్వాలు మార్చుకొని... ఒకరిపట్ల ఒకరు ఎంతగానో ప్రేమ పెంచుకొన్న వాణి, కళ్యాణ్ వివాహానికి సమ్మతించండి అని చెప్పారు.



మీ మామయ్య, అత్తయ్యలు మీ నాన్నగారి మాటలను లెక్కచేయలేదు.



ఆవేశంలో మీ అత్త లావణ్య నీ బిడ్డ విషయంలో మేము నీకు అలాంటి సలహా ఇస్తే నీవు పాటిస్తావా!... సరి కులంగోత్రం లేని వాడికి నా కూతురుని ఇవ్వను. పిల్లకు మేనమామ అయ్యుండి మాతో అలాంటి మాటలు చెప్పేదానికి నీకు నోరెలా వచ్చింది!!... వెళ్ళిపో మా ముందు నుంచి వెళ్ళిపో! అని మీ తండ్రిని అసహ్యించుకొంది.



అవమానంతో మీ నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. వారి వాలకాన్ని చూచిన నేను విషయాన్ని గ్రహించాను. ప్రణవీ!... నా మాటలను జాగ్రత్తగా విను. క్షణం నుంచీ ఇంటికి... ఇంటికి రాకపోకలు జరుగకూడదు. మాటలను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకో! వీరావేశంతో నన్ను హెచ్చరించారు. కళ్యాణ్కు ఢిల్లీ ఆర్కలాజికల్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. మూడు వారాల్లో వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాలి.



రామయోగి... తన చెల్లెలి కూతురుతో కళ్యాణ్ వివాహం జరిపించి ఇరువురినీ ఢిల్లీ పంపాలని సంకల్పించి... తన నిర్ణయాన్ని కళ్యాణ్కు తెలియజేశాడు. కళ్యాణ్ తాను వాణిని ప్రేమించిన విషయాన్ని తండ్రికి చెప్పి... వివాహం అంటూ చేసుకొంటే నేను వాణినే చేసుకొంటాను. ఆమె తల్లిదండ్రులను కలసి మాట్లాడి ముహూర్తాలు పెట్టించండన్నాడు.



హరికృష్ణ అన్నయ్య.... రామయోగికి పెద్దగా పరిచయం లేదు. అతనికి బాగా సన్నిహితుడైన మీ నాన్నగారికి రామయోగి విషయాన్ని చెప్పి వాణీకి కళ్యాణ్కు వివాహం జరిగేలా చూడవలసిందిగా కోరారు. స్వార్థం... ఇంటివారు తనను అవమానించారనే ద్వేషంతో మీ నాన్నగారు రామయోగికి ఒక షరతు పెట్టారు.



నీవు ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా చేసుకొంటే.... నీ కొడుకు కళ్యాణ్కు, వాణికి వివాహం జరిగేలా చేయగలను. ఒకరోజు ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజెయ్యి!... అని చెప్పి రామయోగిని పంపించేశారు.



ఒక్కగానొక్క కొడుకు... మంచి ఉద్యోగం... అతడు వివాహం చేసుకోకుండా సన్యాసిగా మారడం ఇష్టం లేని రామయోగి ఎలక్షన్కు వేసిన నామినేషన్ను విత్డ్రా చేసుకొన్నారు. రెండవరోజు వచ్చి విషయాన్ని మీ నాన్నగారికి తెలియజేశాడు. మీ నాన్నగారికి ఎంతో ఆనందం.
వాణిని పిలిపించి...



చూడు వాణీ!... నేను నీ విషయాన్ని గురించి... మీ అమ్మానాన్నలతో మాట్లాడాను. కానీ వారు కళ్యాణ్తో నీ వివాహాన్ని జరిపించేదానికి అంగీకరించలేదు. నన్ను అవమానించారు. కానీ!. నీవు నీ నిర్ణయాన్ని నన్ను నీ తండ్రిగా భావించి చెప్పినందుకు... నేను నీ వివాహాన్ని నీవు ప్రేమించిన కళ్యాణ్తో జరిపిస్తాను. అతనికి ఇప్పుడు ఢిల్లీలో వుద్యోగం వచ్చింది. హాయిగా పెళ్ళి అయిన తర్వాత మీ ఇరువురూ ఢిల్లీకి వెళ్ళిపోండి. ఇక మీ అమ్మా నాన్నల విషయం అంటావా!... ఈనాటి కోపం... కలకాలం వుండబోదు. కాలం వారి మనస్తత్వాలను తప్పక త్వరలోనే మారుస్తుంది. మనస్సుకు నచ్చిన వాడితో సహజీవనం ఎంతో ఆనందంగా వుంటుందమ్మా. ఎం.ఎస్సీ వరకూ చదివినదానివి నీకెందుకమ్మా భయం. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా... నాకు ఫోన్ చేయ్యి నీవు నా మేనకోడలివి. నీవు ఆనందంగా జీవితం సాగించేలా చేయడం నా ధర్మం.... భయపడకు... బాధపడకు



రీతిగా... చెప్పి వాణిని తన వశం చేసుకొన్నాడు మీ తండ్రి. కన్న తల్లిదండ్రుల కన్నా మిన్నగా వాణి నీ నాన్నను నమ్మింది. మీ అత్తయ్యా, మామయ్యా శ్రీశైలం యాత్రకు వెళ్ళారు. సమయంలో రిజిష్ట్రార్ ఆఫీసులో వాణి, కళ్యాణ్లకు మీ నాన్నగారు వివాహం జరిపించారు. రెండు రోజుల తర్వాత వారితో కలిసి చెన్నై వెళ్ళి వారిని విమానంలో ఢిల్లీ పంపారు.



నాలుగురోజుల తర్వాత యాత్రనుండి తిరిగి వచ్చిన మీ అత్తయ్య మామలకు మాధవయ్య బావగారు వూర్లోలేని సమయంలో జరిగిన వాణి, కళ్యాణ్ వివాహాన్ని గురించి... వారు ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి తెలియజేశాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
వీర ఆవేశంతో మీ అత్తయ్య మన వాకిటికి వచ్చి... ఒరేయ్! ప్రజాపతీ!... రారా బయటికి. మా సమ్మతం లేకుండా నా కూతురి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించే హక్కు, అధికారం నీకు ఎక్కడిదిరా!... నీచుడా!... మేము నీకు ఏం అన్యాయం చేశామురా!... నా తండ్రి ఆస్థిలో నాకు అర్థభాగం ఇచ్చాడని మాతో పగతో... అన్నెపున్నెం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు కదరా!... దుర్మార్గుడా!.... నీదీ ఒక బ్రతుకేనా!... ఛీ...ఛీ..." కొట్టి ఎంత ఆవేశంతో వచ్చిందో అదే వేగంతో తిరిగి వెళ్ళిపోయింది మీ అత్తయ్య.



వరండాలో మాటలుడిగి... నేను మీ నాన్న చిత్తరువుల్లా నిలబడిపోయాము.



ఆనాటి ఒక సంఘటన... మన రెండు కుటుంబాల మధ్యన... పగ, ద్వేషాలను పెంచింది. ఇది జరిగి ఈనాటికి మూడు సంవత్సరాలు. గత ఐదారు ఏళ్ళుగా నేను మీ నాన్నగారి నిర్ణయాలతో ఏకీభవించలేకపోతున్నాను. దేవుడా!... ఆయనకు మంచి బుద్ధిని ఇవ్వు అని సర్వేశ్వరుణ్ణి ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఆడదాన్ని పరువుకలదాన్ని అంతకంటే నేను ఏమీ చేయలేను కదమ్మా!!" అని కన్నీటితో కథను ముగించింది ప్రణవి.



సూర్యరశ్మికి కరిగిన మంచులా... ప్రణవి చెప్పిన కథ మూలంగా దీప్తి మనస్సున వుండిన సందేహాలన్నీ తీరిపోయాయి. తన తండ్రి చర్య వలన... అత్తామామలు ఎంతగానో బాధపడ్డారని గ్రహించింది... బంధువులందరికీ... తల్లిదండ్రులకు దూరం అయిన వాణీ ప్రస్తుతం ఢిల్లీలో వ్యక్తితో ఎలా వుందో అనే సందేహం!...



"అమ్మా!... వాణి ఢిల్లీలో ఎలా వుందో నీకేమైనా తెలుసా!..."



"నాకేం తెలిదమ్మా!..."



"నాన్నగారికి తెలిసుంటుందా!..."



"ఏమో!..."



"నేను ఢిల్లీకి వెళ్ళిరానా!"



"ఎందుకు?"



"వాణిని చూచి వచ్చేదానికి!..."



"వాణిని ఎందుకు చూడాలనుకొంటున్నావు?"



"వాణి వదిన చాలా మంచిదికదమ్మా!..."



" ఇంట్లో వుండే వారంతా చాలామంచివారు. ఒక్క వాణియే కాదు!..." అంది ఆవేదనతో ప్రణవి.



"అమెరికాలో నేనుండే చోటికి పెద్దబావ దినకర్ నెలకు రెండుసార్లు వచ్చి నన్ను కలిసేవాడు. వాణి విషయాన్ని నాకు వారే చెప్పారు. నెలకొకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. నేను నిన్ను ఎత్తుకొని తిరిగేవాణ్ణి దీపూ!... అని చిన్ననాటి జ్ఞాపకాలను నాతో చెప్పేవాడు. అక్క... పద్మినీ, నన్ను సొంత చెల్లెలిలా చూచుకొనేది" సాలోచనగా చెప్పింది దీప్తి.



"దీపూ!... నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి!"



"నేను నీ కూతురునమ్మా!... అడుగు!..."



"నీకు మీ ఈశ్వర్ బావ అంటే ఇష్టమేనా!"



దీప్తి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది.



"ఏందే!... అలా చూస్తున్నావ్!... నా ప్రశ్నకు జవాబు చెప్పు!..." అంది ప్రణవి.



" ప్రశ్నను నీవు నన్ను ఎందుకు అడిగావ్?"



"బుద్ధిలేక!" వ్యంగ్యంగా అంది ప్రణవి రెండు క్షణాల తర్వాత "ఎక్కడికి పోతాయ్!... పాడు బుద్ధులు! ఎదుటి వాళ్లను అవహేళన చేయడం, మీ రక్తంలో వున్న సద్గుణం" నిష్టూరంగా అంది ప్రణవి.



దీప్తి తల్లిని సమీపించి ఆమె భుజాలపై తను చేతులు వుంచి ప్రణవి ముఖంలోకి సూటిగా చూస్తూ "మా అమ్మ చాలా చాలా మంచి అమ్మ!" నవ్వుతూ "నీవు చెప్పు నీకు ఇష్టమేనా!..."



"ఏమిటి?"



"అదే, నీవు నన్ను అడిగిన విషయం!..."



"అదా!... అదృష్టం ఉండాలి..."



"దేనికి!..."



"ఈశ్వర్కు ఇల్లాలు కావడానికి!..."



"ఏం ఆయన అంత గొప్పా!..." వెటకారంగా అడిగింది దీప్తి.



"అవును... చాలా గొప్ప. నీకు మీ పెద్ద బావ దినకర్ చెప్పాడో లేదో... ఈశ్వర్ను అమెరికాకు రమ్మని పోయినసారి సంవత్సరం క్రింద వచ్చినప్పుడు ఎంతగానో చెప్పాడట. దానికి ఈశ్వర్... "ఏమన్నాడు!..." ఆత్రంగా అడిగింది దీప్తి ప్రణవి పూర్తి చేయకముందే.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#23
"అన్నయ్యా!... అమ్మా నాన్న మన నలుగురినీ నాకు తెలిసినప్పటి నుంచీ ఎంతో గారాబంగా పెంచారు. మన ఇష్టానుసారం చదివించారు. నీవు అమెరికాకు వెళ్ళాలని ఆశపడ్డావు. మన కుటుంబానికి తగిన సంబంధాన్ని చూచి నీ కోరికపై వదినకు నీకు పెళ్ళి జరిపించి మిమ్మల్ని అమెరికాకు పంపారు. వాణి వారి ఆశలనన్నింటినీ కాల్చి భస్మం చేసి తన దారిన తను చూచుకొని మనకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోయింది. ఇక చెల్లి శార్వరి... మనందరి కంటే చిన్నది. మనలాగే బాగా చదవాలి. వాణి అక్కయ్యలా కాకుండా ఆమె వివాహం అమ్మా నాన్నల ఇష్టానుసారంగా జరగాలి. అమ్మా నాన్నలు... పెద్దవారవుతున్నారు. వారికి సాయంగా అండగా నేను వుండాలని నిర్ణయించుకున్నాను. శార్వరి చదువు పూర్తి అయ్యేవరకే నేను ఆమెకు తోడుగా హైదరాబాదులో వుంటాను. తర్వాత మన వూరికి వచ్చి నాన్నగారు నిర్వహించే పాలవ్యాపారాన్ని... ఫ్యాక్టరీని చూచుకొంటాను. మనకు రెండు వందల ఆవులకు పైగా వున్నాయి. గోవుల సంరక్షణ అంటే నాన్నకు అమ్మకు నాకు ఎంతో ఇష్టం. వారి ఆనందమే నా ఆనందం. మన వూర్లో వుండి అమ్మా నాన్నలను చూచుకొంటూ నాన్న చేస్తున్న వ్యాపారాన్ని సాగిస్తూ... నాన్నగారికి విశ్రాంతి నివ్వాలనేది నా నిర్ణయం. వాటినన్నింటినీ చూచుకొంటూ న్యాయవాది వృత్తిని సాగిస్తాను.
"అలా అన్నాడు ఈశ్వర్!..." అంది ప్రణవి.



"అమ్మా!.... విషయాలన్నీ నీకెలా తెలుసు?"



"మా వదిన చెప్పింది..."



"అంటే నీకు మీ వదినకు మధ్యన...."



"సఖ్యతే! ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు" నవ్వింది ప్రణవి. రెండు క్షణాల తర్వాత "ఆఁ ఇప్పుడు చెప్పు నా ప్రశ్నకు నీ జవాబు!" అడిగింది ప్రణవి.



"వెరీ సింపుల్ అమ్మా!..."



"ఎందే సింపుల్!..."



"అంటే!... నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.



"నిజంగానా!...."



"అవునమ్మా!..." గోముగా చెప్పింది దీప్తి.



తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని నొసటన ముద్దుపెట్టి... " నా బిడ్డ బంగారు!" ఆనందంగా చెప్పింది ప్రణవి.



దీప్తి నవ్వుతూ తల్లి ఒడిలో వాలిపోయింది.
దీప్తి తల నిమురుతూ....
"తల్లీ!...."



"ఏమ్మా!...."



"మీ నాన్నగారు సామాన్యులు కారు... వారు మన నిర్ణయానికి అంగీకరించరు. అప్పుడు ఏం చేస్తావు తల్లీ!..." విచారంగా అడిగింది ప్రణవి.



"నాన్నగారు నా మాటను కాదరనుకొంటానమ్మా!..."



"కాదంటే!..."



"నీవు నాకు అండగా వుంటావుగా!... నాన్నగారికి బెదిరిపోయి నీ నిర్ణయాన్ని మార్చుకోవు కదా!..."



"తల్లీ!.... వారి ముందు మాట్లాడి వారికి ఆవేశాన్ని పెంచకూడదని నా నిర్ణయం. ఇక నీ విషయంలో వారు ప్రస్తావించినా మనది మౌన ముద్రే. ఓటు నీకే!.. నా నిర్ణయం మారదు..." నవ్వుతూ చెప్పింది ప్రణవి.



"అమ్మా!...." సీతాపతి పిలుపు.



ఇరువురూ బెడ్రూం నుండి హాలువైపుకు నడిచారు.
"అమ్మా అసలు విషయం చెప్పలేదు!..."



"ఏమిటే!..."



"నాన్న ఎలక్షన్లో..."



"డిపాజిట్ పోగొట్టుకొన్నారు!..." వెటకారంగా నవ్వింది ప్రణవి.



దీప్తిని చూచిన సీతాపతి దగ్గరకు వచ్చి...
"అక్కా!... ఎంతగా మారిపోయావు..." ఆశ్చర్యంతో అడిగాడు.



"సీతూ!.... నీవు మాత్రం మారలేదా!... ఆరడుగుల అందగాడిలా మారిపోయావ్!..." ప్రీతిగా తమ్ముడి భుజంపై చెయ్యివేసి అతని ముఖంలోకి చూచింది దీప్తి.



"పెదబావా!... అక్కవాళ్ళు బాగున్నారా అక్కా!..."



"అంతా బాగున్నారు... ఎలా సాగుతోంది నీ బి.టెక్. చదువు వైజాక్లో!..."



"బాగుంది అక్కా!.... గోల్డుమెడల్ గెలవాలని ప్రయత్నిస్తున్నా!..."



"అమ్మా!.... నాన్నగారు ఏరి?" అడిగాడు సీతాపతి.



"చెన్నై వెళ్లారు వ్యాపార విషయంగా. రేపు తెల్లవారేసరికి దిగుతారు."



"అక్కా! దీపక్... నీతూలు ఎలా వున్నారు?"



"ఆఁ.... వాళ్ళకేం తక్కువ. ఇంట్లోవారు యువరాజా.... యువరాణి... నీతూ వుంది చూచావ్.... అది అంతా మన అత్తయ్యలాగేరా!.... భయం అనేది లేదు... మహా సాహసి" నవ్వింది దీప్తి.



"అమ్మా!.... మీరు భోం చేశారా!..."



"లేదురా..."



"నేను స్నానం చేసి వస్తానమ్మా!..... కలిసి భోం చేద్దాం. అక్కతో కూర్చుని భోంచేసి చాలాకాలం అయింది" సీతాపతి నవ్వి తన గదికి వెళ్ళిపోయాడు.



"అమ్మా!.... సీతూ ఎంతగా మారిపోయాడమ్మా!.... పెద్దమనిషిలా ఎంతో నీట్గా మాట్లాడుతున్నాడు?..."



"వాడిది నా పోలిక!..."



"మరి నేనూ!....." బుంగమూతితో అడిగింది దీప్తి.



"తల్లీ నీవూ నా పోలికేనే... పద.... వాడు ఎప్పుడు తినాడో ఏమో!... అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడదాం..."



తల్లీకూతుళ్ళు వంటగది వైపుకు నడిచారు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#24
(09-11-2024, 12:21 PM)k3vv3 Wrote: "తల్లీ నీవూ నా పోలికేనే... పద.... వాడు ఎప్పుడు తినాడో ఏమో!... అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడదాం..."



తల్లీకూతుళ్ళు వంటగది వైపుకు నడిచారు.
====================================================================
ఇంకా వుంది..

ఈ కధ చాలా బాగున్నది!!!, K3vv3 garu.

clps clps yourock yourock
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#25
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#26
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5




"హలో!...." మ్రోగిన సెల్ఫోన్ చేతికి తీసుకొని అడిగాడు హరికృష్ణ.
"హలో... హరీ!.... నేనురా!.... శివ..."
"ఒరేయ్!... శివా!... నీవా!.... గొంతు మారిందేం!...."
"అవునురా... వయస్సు అవుతూ వుందిగా!...."
"వస్తానని జాబు వ్రాశావు... ఎప్పుడు వస్తావ్?"
"అరగంటలో మన వూరి స్టేషన్లో దిగుతా!.... నేను ఒక్కడినే రావడం లేదు. మీ చెల్లెలు, విష్ణు.... నాతో వస్తానని బయలుదేరారు."
"అలాగా!... చాలా సంతోషం రా!.... నేను స్టేషన్కి వస్తాను."
"సరే కట్ చేస్తున్నా!..."
"అలాగే!..."
వంటింట్లో నుంచి వచ్చిన లావణ్య.
"ఎవరండీ ఫోన్ చేసింది!" అడిగింది.
"మీ అన్నయ్య శివ... ఊర్మిళా, విష్ణు మరో అరగంటలో వస్తున్నారట..."
"అలాగా!..."
"అవును లావణ్యా! నేను స్టేషన్కు వెళ్ళి వారిని పిలుచుకొస్తాను... వాడు వూరికి వచ్చిఎనిమిదేళ్ళయిందిగా!..."
"అవును... నాకూ పని పూర్తయింది. నేనూ వస్తానండి స్టేషన్కు..."
"అలాగే!.... ఆఁ... పిల్లలేరి?..."
"శివాలయానికి వెళ్ళారు. యీ పాటికి తిరిగి వస్తూ వుంటారు."
వీధి తలుపు తెరిచిన శబ్దం విని అటువైపు చూచింది లావణ్య.
ఈశ్వర్, శార్వరీలు నవ్వుకొంటూ లోనికి వచ్చారు.
"ఈశ్వర్!.... మీ శివ మామయ్య, అత్తయ్యలు వస్తున్నారు" చెప్పింది లావణ్య.
"ఎప్పుడమ్మా?..."
"మరో అరగంటలో!..." చెప్పాడు హరికృష్ణ.
"నేను నాన్న స్టేషన్కు వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసికొని వస్తాం. మీరు ఇంట్లో వుండండి."
"అలాగే అమ్మా!...." అంది శార్వరి.
"నాన్నా!.... నేను వెళ్ళిరానా!" అడిగాడు ఈశ్వర్.
"వద్దు నాన్నా!.... నేను వెళితేనే మీ మామయ్య ఆనందిస్తాడు. ఎనిమిదేళ్ళ తర్వాత వస్తున్నారు" అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
"వస్తున్నారు అంటే!" అడిగాడు ఈశ్వర్.
"మీ అత్తయ్య ఊర్మిళ, విష్ణు కూడా వస్తున్నారట. ఈశ్వర్!... అందువల్ల మేమిద్దరం స్టేషన్కు వెళ్ళి వారితో వస్తాం" చెప్పింది లావణ్య.
"అలాగే అమ్మా! వెళ్ళిరండి..."
"ఏమండి... ఇక మనం బయలుదేరుదామా!..."
" పద..."
భార్యాభర్తలు కార్లో కూర్చున్నారు. వరండా వరకూ వచ్చి ఈశ్వర్, శార్వరీలు టాటా చెప్పారు. హరికృష్ణ కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలో ప్రవేశిందింది.
"ఏమండీ!..."
"చెప్పు లావణ్యా!..."
"పాపం విష్ణు... వాడికి చూపు రాదు కదూ!..."
"రాదూ అని మనం నిర్ధారణగా ఎలా చెప్పగలం. దైవం తలచుకుంటే... కానిది... లేనిది... అనేవి వుంటాయా లావణ్యా!..."
"మీకు దైవం మీద చాలా నమ్మకం కదండీ!..."
"నీకు లేదా!...."
"రామ రామ ఎంతమాట!... లేదని ఎలా అనగలనండీ!..."
"అయితే... విష్ణుకు కళ్ళు రావాలి స్వామీ... వాడు మమ్మల్నందరినీ నీవు సృష్టించిన ప్రపంచంలోని అన్ని అందాలను చూచి ఆనందించాలని కోరుకో. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను సర్వేశ్వరుని అదే కోరుకుంటాను."
"మీ నమ్మకమే.... వాడికి శ్రీరామరక్ష కావాలి."
"నీవూ నాలా కోరితే... దేవుడు విష్ణును తప్పక కరుణిస్తాడు." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"తప్పక నిత్యం కోరుకుంటానండి. వారు వైజాగ్ వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు. అప్పటికి వాడి వయస్సు మూడేళ్ళు. అంటే విష్ణు వయస్సు ఇప్పుడు ఇరవై మూడు. శార్వ కన్నా మూడేళ్ళు పెద్దవాడు."
"అవును లెక్కల్లో నీవు జీనియస్ లావణ్యా!" నవ్వాడు హరికృష్ణ.
"మీరేగా నేర్పారు" చిరునవ్వుతో భర్త ముఖంలోకి చూచింది లావణ్య.
వారి కారు స్టేషన్ ఆవరణంలో ప్రవేశించింది. పార్కింగ్ స్థలంలో కారును ఆపి... రెండు ప్లాట్ఫాం టిక్కెట్లను కొన్నాడు హరికృష్ణ. ఇరువురూ స్టేషన్లో ప్రవేశించారు.
జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఐదుగంటలు ఆలస్యంగా వచ్చింది. అనౌన్స్ మెంటు విని హరికృష్ణ, లావణ్యలు ప్లాట్ఫాంను చేరారు. రైలు వచ్చి ఆగింది.
శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు కంపార్టుమెంటు నుండి దిగారు. ముగ్గురిని చూడగానే హరికృష్ణ లావణ్యలు నవ్వుతూ వారిని సమీపించారు. శివరామకృష్ణ చిరునవ్వుతో హరికృష్ణను కౌగలించుకొన్నాడు. లావణ్య ఊర్మిళ చేతులు పట్టుకొని... "వదినా!.... బాగున్నావా!..." ప్రీతిగా అడిగింది.
"సంవత్సరం రోజులుగా నిన్ను చూడాలనుకొన్న నా ప్రయత్నం... ఈనాటికి ఫలించిందిరా!..." నవ్వుతూ చెప్పాడు శివరామకృష్ణ.
చేతికర్ర సాయంతో విష్ణు హరికృష్ణను సమీపించాడు. ఆరు అడుగుల ఎత్తు... తెల్లని దేహచ్ఛాయ, గుండ్రటి ముఖం, ఒత్తైన జుట్టు అన్నీ ఎంతో గొప్పగా వున్నా దృష్టిలేని కారణంగా విష్ణు ఎవరినీ దేనినీ చూడలేని పరిస్థితి.
"మామయ్యా!.... అత్తయ్యా!.... బాగున్నారా!..." నవ్వుతూ అడిగాడు విష్ణు.
విష్ణు భుజంపై చెయ్యివేసి "మేమంతా బాగున్నాము. నీవూ వీళ్లతో రావడం నాకు ఎంతో సంతోషంరా!..." నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ.
"సరే... ఇక పదండి... వదినా!... అన్నయ్యా!.... ఇంటికి వెళ్ళి అన్ని విషయాలూ భోంచేస్తూ మాట్లాడుకొందాం" అంది లావణ్య.
"విష్ణు చేతిని పట్టుకొని... విష్ణు జాగ్రత్తగా నడు" అంది.
ఐదుగురూ స్టేషన్ బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నారు. పదిహేను నిముషాల్లో హరికృష్ణ కారును పోర్టికోలో ఆపాడు. అందరూ దిగారు.
వారి రాకకోసం... ఎదురు చూస్తున్న ఈశ్వర్, శార్వరీలు వారిని సమీపించారు. ఒకరినొకరు అభిమానపూర్వక పలకరింపులతో నవ్వుకొన్నారు.
ఈశ్వర్, విష్ణును సమీపించి అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని... "విష్ణూ!"
"ఎవరూ?..."
"నేనురా... ఈశ్వర్ని..."
"... బావా... మీరా!... గొంతు విని చాలాకాలం అయిందిగా! వెంటనే గుర్తుపట్టలేకపోయాను బావా!... సారీ!..."
"రా లోనికి వెళదాం..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#27
అందరూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ రెస్టు రూము వైపు వెళ్లాడు.
"బావా! ఊర్మిళా!... ముందు స్నానం చేయండి. ఎప్పుడు ఏం తిన్నారో ఏమో!.... భోజనం చేస్తూ మాట్లాడుకొందాం" అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!...." చెప్పాడు శివరామకృష్ణ.
"వదినా!.... నీకోడలు..." తన కూతురు శార్వరిని చూపి నవ్వుతూ చెప్పింది లావణ్య.
"నమస్తే అత్తయ్యా!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
"ఇలారా!..." పిలిచింది ఊర్మిళ.
శార్వరి ఆమెను సమీపించింది.
"శారూ!... ఎంతగా ఎదిగిపోయావే.. ఏం చదువుతున్నావ్!"
"బి.ఎస్సీ ఫైనల్ ఇయర్"
"ఎక్కడ?"
"హైదరాబాద్లో"
"ఈశ్వర్ ఉద్యోగమూ అక్కడేగా!"
"అవును అత్తయ్యా!...."
రెస్టురూమ్కు వెళ్ళి హీటర్ ఆన్ చేసి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"మామయ్యా!.... మీరు స్నానానికి రండి..."
"వెళ్ళరా... స్నానం చేసిరా!..." అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!..."
ఈశ్వర్ వెంట శివరామకృష్ణ రెస్టు రూమ్ వైపుకు నడిచాడు.
సోపు... టవల్ శివరామకృష్ణకు అందించి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"అత్తయ్యా!.... మీరూ రండి. నీళ్ళు కాగాయి. స్నానం చేద్దురుగాని!...." చెప్పింది శార్వరి.
ఊర్మిళ... శార్వరి వెనకాల ఆమె గదిలోనికి వెళ్ళింది.
ఈశ్వర్... విష్ణు ప్రక్కన కూర్చున్నాడు.
"విష్ణూ! మామయ్యగారు రావడంతోనే... నీవూ స్నానం చేస్తావుగా!"
"అవును బావా!..." కొన్ని క్షణాల తర్వాత అడిగాడు విష్ణు.
"బావా!"
"ఏమిటి విష్ణు"
"మీరు ప్రాక్టీస్ ప్రారంభించారుగా!..."
"... రెండేళ్ళయింది. శార్వరి హైదరాబాదులో చదువుతుందిగా అందువల్ల అక్కడ సీనియర్ లాయర్గారి వద్ద ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరో మూడునెలల్లో శార్వరి బి.ఎస్సీ పూర్తి అవుతుంది అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభిస్తాను."
"శార్వరి బి.ఎస్సీ తర్వాత ఏం చేయాలనుకొంటూవుంది."
"ఎం.బి.బి.యస్ చేయాలని తన వుద్దేశ్యం..."
"ఓహో తనకు డాక్టర్ కావాలనే ఆశ అన్నమాట."
"అవును విష్ణు"
"బావా!... మీ అన్నయ్య నా పెదబావగారు... యు.ఎస్లో వున్నారుగా!... అక్కడికి పోవచ్చుగా!..."
"అమ్మానాన్నలకు ఇష్టం లేదు. వారికి ఇష్టంకాని పనిని నేనూ, శారూ... చేయము విష్ణు."
"అవును మామయ్యా, అత్తయ్యా చాలా మంచివారు. వారిని మీరు విషయంలో ఎప్పుడూ నొప్పించకండి..."
"విష్ణు! ఎంత గొప్పగా మాట్లాడుతున్నావురా!..."
"అంతా మీరు నా చిన్నప్పుడు నాకు ఇచ్చిన శిక్షణ. మరిచిపోలేదు, పాటించాను. నా గురువులు మీరే!..." నవ్వాడు విష్ణు.
శార్వరి హాల్లోకి వచ్చింది.
"అరుగో మామయ్యగారు వచ్చారు. అన్నా!.... విష్ణును త్వరగా స్నానం చేసి రమ్మను" అంది శార్వరి.
"ఏం నీవే వాడికి చెప్పవచ్చుగా!" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
శార్వరి అన్నను సమీపించి తలను వంచి అతని చెవి దగ్గర వుంచి... "నీ కన్నా ఎత్తుగా ఎదిగాడు. అతనికి నేను ఏమని చెప్పాలి!..." అంది.
"చిన్నప్పుడు ఏమని పిలిచేదానివి!..."
"విష్ణు అని..."
"ఇప్పుడూ అలాగే పిలువు..." నవ్వాడు ఈశ్వర్.
"బావా! నా గురించి శార్వరి నీతో ఏదో చెబుతూ వుంది కదూ!..." అడిగాడు విష్ణు.
"అవునురా!..."
"ఏమడిగింది?"
శార్వరి తన చేతితో ఈశ్వర్ నోరు మూసింది.
కొన్ని క్షణాలు గడిచాయి.
"ఏం బావా!... ఏం మాట్లాడవు?" అడిగాడు విష్ణు.
"అమ్మ అన్నీ భోజనానికి సిద్ధం చేసింది. మీరు వెళ్ళి స్నానం చేస్తే అందరం కలిసి భోంచేయవచ్చు" అంది శార్వరి.
"అలాగా!.." అన్నాడు విష్ణు. క్షణం తర్వాత "శార్వరీ! బావ ఇక్కడ లేడా!...."
"ఆఁ ఇక్కడే వున్నారా!... పద స్నానం చేద్దువుగాని" శార్వరి చేతిని తన చేతితో ప్రక్కకు నెట్టి చెప్పాడు ఈశ్వర్.
విష్ణు లేచి నిలబడ్డాడు.
"శారూ!.... విష్ణును రెస్టురూమ్ దాకా తీసుకొని వెళ్ళు.. టవల్, సోప్ ఇచ్చిరా!" చెప్పాడు ఈశ్వర్.
విష్ణు నేలకు పూనిన కర్ర చివరను తన చేతిలోనికి తీసుకొంది. "జాగ్రత్తగా రండి" అంది శార్వరి.
విష్ణు ఆమెను అనుసరించాడు. ఇరువురూ ఈశ్వర్ రెస్టు రూమ్ను సమీపించారు.
చేతిలోని కర్రను వదలి శార్వరి రెస్టురూం తలుపును తెరిచింది. బకెట్లో వేడినీళ్ళు నింపింది. స్టీల్రాడ్ పై టవల్ను వుంచింది.
వాకిట నిలబడివున్న విష్ణును చూచింది. కళ్ళు లేవు... కానీ బాధ అతని ముఖంలో కనిపించలేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడి వున్నాడు.
"శార్వరీ!... ఇక నీవు వెళ్ళు... నేను చూచుకొంటాను."
"ఎలా?..."
"మనోనేత్రంతో....!" నవ్వాడు విష్ణు.
శార్వరి గదినుండి బయటికి వచ్చింది. కర్ర సాయంతో విష్ణు తడుతూ రెస్టురూంలోకి ప్రవేశించాడు.
"థ్యాంక్యూ శార్వరి!"
"నో...నో... నేనేం చేశానని!"
"గొప్పవారు ఇతరులకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు!"
"నేను మీరంటున్నంత గొప్పదాన్ని కాను. మీరు మా బంధువులు... మా ఇంటికి వచ్చారు. అన్నయ్య చెప్పాడు. వాడు చెప్పినట్లు చేశాను. అది నా ధర్మం. అంతే! మీరు నాకు ధన్యవాదాలు చెప్పవలసినంత విశేషమైన పనిని నేను ఏమీ చేయలేదు."
"ఓకే... ఓకే!.." నవ్వుతూ తలుపు మూసుకొన్నాడు విష్ణు.
తలుపు దగ్గరకు జరిగి... "బకెట్కు పైన గోడకున్న రాడ్పై టవల్ దానికింద... సోప్ కిట్లో సబ్బు వున్నాయి" చెప్పింది శార్వరి.
"చూచాను... అదే తాకి చూచాను" అన్నాడు విష్ణు.
శార్వరి తన అన్నయ్య దగ్గరకు వచ్చింది.
"పాపం అన్నయ్యా!..."
"ఏందిరా పాపం!..."
"విష్ణు విషయంలో!...."
ఈశ్వర్ నిట్టూర్చి... "వాడి విషయంలోనా!... అవును..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#28
ఈశ్వర్ నిట్టూర్చి... "వాడి విషయంలోనా!... అవును..."
"అతనికి చూపు వచ్చే ఆస్కారమే లేదా అన్నయ్యా!"
"మనకెలా తెలుస్తుందిరా!... వాణ్ణి మంచి డాక్టర్కు చూపించి సంప్రదించాలి"
"మనం పని చేయలేమా!.... ఆఁ... దీప్తి వదిన డాక్టరేగా!.... విషయంలో మనం ఆమె సలహా తీసుకొందామా!...."
"దాన్ని నేను అడగను!..."
"మరి నేను అడగనా!..."
"అది నీ ఇష్టం..."
"ఒరేయ్! అన్నయ్యా!... దీప్తి వదినంటే నీకెందుకు అంత చిరాకు!..."
"అబ్బా!...." అటూ ఇటూ తలాడించి.. "శారూ! నీతో నేను విషయాన్ని గురించి చర్చించదలచుకోలేదు. ఇక డాక్టర్ విషయమా నాకు వదిలై. నేను నీకు రేపు చెబుతాను. హూ ఈజ్ బెస్ట్ డాక్టర్ అనే విషయం!"
"ఎవరిని కనుక్కొంటావ్?"
"నాకు ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మంచి పరిచయం వుంది శారూ!... వారిని అడిగి కనుక్కొంటాను."
"అలాగా!"
"అవును"
విష్ణు స్నానం చేసి వచ్చాడు. ఈశ్వర్తో కలిసి అతని గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకున్నాడు.
అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. శార్వరి, లావణ్యలు భోజనాన్ని వడ్డించారు. సరదా కబుర్లతో హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు, ఈశ్వర్లు భోజనం చేశారు. హరికృష్ణ, శివరామకృష్ణాలు... హరికృష్ణ గదికి, ఈశ్వర్, విష్ణు ఈశ్వర్ గదికి వెళ్ళిపోయారు. ఊర్మిళ లావణ్యకు, శార్వరికి వడ్డించింది. అందరి భోజనాలు ముగిశాయి. ఆడవారు ముగ్గురూ శార్వరి గదికి వెళ్ళిపోయారు. ప్రయాణ బడలికతో శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు మంచాలపై వ్రాలి నిద్రపోయారు. ఇంటివారూ నిద్రకు ఉపక్రమించారు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#29
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#30
(21-11-2024, 01:08 PM)k3vv3 Wrote: ప్రయాణ బడలికతో శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు మంచాలపై వ్రాలి నిద్రపోయారు. ఇంటివారూ నిద్రకు ఉపక్రమించారు.
====================================================================
ఇంకా వుంది..

Nice story Ch CS Rao garu and K3vv3 garu!!!

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#31
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6



మిత్రులు... బంధువులు హరికృష్ణ, శివరామకృష్ణలు. శివరామకృష్ణగారి తల్లి హరికృష్ణగారి మేనత్త. పేరు శాంభవి. ఆమె బ్రతికి వున్నరోజుల్లో ఊరిజనం ఆమెను దేవతమ్మ అని పిలిచేవారు. కారణం... ఆమె తను... భర్త మహేశ్వర్... వారు తమ కుటుంబం మాత్రం బాగుండాలనే రకం కాదు. నా వూరు... నా వూరి జనం అంతా బాగుండాలని ఆశించేవారు. శాంభవి పేదలకు దానధర్మాలు చేసేది. ఎవరు ఏది అడిగినా లేదని ఆమె ఎన్నడూ తన జీవిత కాలంలో అనలేదు. అందుకే పేరు పెట్టారు వూరి జనం. ఆమె మేనమామ ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం, శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ బావమరుదులు.



మూడు కుటుంబాల ముందు తరం సభ్యులు... వూరిలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు. సంపన్నులు.



శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్. ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం. బంధుత్వాలకు అతీతంగా మంచి స్నేహితులు.



రోజుల్లో గూడూరు ప్రాంతంలో మైకా వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ప్రజాపతి తండ్రి కైలాసపతి వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. అతన్ని చూచి శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ వున్న భూమిలో మైకా పడుతుందని తానూ కైలాసపతి వలే (అన్నగారు) లక్షలు సంపాదించాలనే ఆశతో కొంత భూమిని అమ్మి, వుంచుకొన్న భూమిలో అబ్రకం పడుతుందని సొరంగాలు త్రవ్వించాడు. అబ్రకం పడింది కానీ... క్వాలిటీ లేనిదైంది. విదేశీయులు... తరం తక్కువగా వున్న అబ్రకాన్ని కొనలేదు. దళారులు నూరు రూపాయలు విలువగల సరుకును పది పదిహేనుకు కొనేవారు.



మహేశ్వర్కు పంతం పెరిగి శివరామకృష్ణ (తనయుడు) అర్థాంగి శాంభవి చెప్పిన మాటలను వినక... మూర్ఖంగా అప్పులు చేసి మంచి అబ్రకాన్ని తన భూమిలో నుంచి తీయాలని గోతులు (ఎంతో లోతుగా) త్రవ్వించాడు. ఫలితం శూన్యం. మనశ్శాంతి నశించింది. మందుకు అలవాటు పడ్డాడు. వ్యాపారం పూర్తి నష్టానికి గురైంది. మనిషి అనారోగ్యం పాలైనాడు. భర్త రీతిగా తయారైనందుకు ఎంతో మంచిపేరున్న శాంభవి కూడా మనోవేదనతో మంచం పట్టింది. భర్త అంటే గౌరవం, ప్రేమ. ఎదిరించలేదు, విమర్శించలేదు. హృదయంలో భర్త విషయం ఎంతో ఆవేదన.



సమయంలో కుటుంబ గౌరవాన్ని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన కుటుంబం మద్రాస్ నుంచి ఎం. పాసై వచ్చిన శివరామకృష్ణకు పిల్లనిస్తామంటూ గూడూరుకు వచ్చారు. కుటుంబ పరిస్థితి సరిగాలేదని తెలిసీ వారు తమ బిడ్డను యిచ్చేదానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం కాలేజీలో శివరామకృష్ణ... ఊర్మిళ కలిసి చదువుకొన్నారు. ప్రేమించుకొన్నారు, వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు.



శివరామకృష్ణను ఊర్మిళ.... తన తల్లితండ్రులకు పరిచయం చేసిన రోజున.
"అవును అబ్బాయ్!.... పేరు... వూరు... కులం... గోత్రం అంతా బాగానే వుంది. ఆస్తిపాస్తులు ఏమాత్రమో చెప్పు!" అడిగాడు ఊర్మిళ తాత వెంకటరమణ.



అబ్రకం వ్యామోహంతో తన తండ్రి చేసిన నిర్వాకాన్ని... కలిగిన నష్టాన్ని గురించి వివరంగా చెప్పాడు శివరామకృష్ణ.



"తిండికి గుడ్డకు కొరతలేదండీ!.... ఎం., బి.ఇడి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నామీద నాకు నమ్మకం వుంది. నా చూపు నాకంటే పేదవారి వైపే వుంటుంది కాని... మాకంటే గొప్పవారిపైన వుండదు. అది మంచిది కాదని మా తాతయ్యగారు చెబుతుండేవారు. మీ అమ్మాయికి కొరతా లేకుండా చూచుకోగలను. ఇద్దరం వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మీరు మంచి మనస్సుతో మా వివాహాన్ని జరిపించండి. నాకు మీరు ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వవద్దు" ఎంతో వినయంగా ఆత్మవిశ్వాసంతో శివరామకృష్ణ చెప్పాడు. అతని మాటల తీరు వెంకట రమణకు నచ్చింది.
ఊర్మిళ తండ్రి నాలుగేళ్ళ క్రితం... లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంకటరమణ... తనకు ముఖ్యులైన వారిని ఇరువురిని గూడూరుకు పంపించి శివరామకృష్ణ కుటుంబ వివరాలను సేకరించాడు. వ్యక్తులు మద్రాస్కు తిరిగి వెళ్ళి...



"అన్నా!.... కుటుంబం బ్రతికి చెడ్డవారే కానీ... చెడి బ్రతికిన వారు కాదన్నా. అబ్బాయ్... అమ్మా నాన్నలకు ఎంతో గొప్ప పేరుంది. వ్యాపారంలో నష్టపోయారు. అంతే ఎవరినీ మోసం చేయలేదు. అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీ గల మంచి కుటుంబం అన్నా!" చెప్పారు వారు.



వారి విశ్వాసనీయమైన మాటలు విని... వెంకటరమణగారు భార్య బాలమ్మా సమేతంగా గూడూరుకు వచ్చి మహేశ్వర్, శాంభవీలను కలసి తాము వచ్చిన విషయాన్ని వివరించారు.



తల్లి శాంభవికి శివరామకృష్ణ అంతకుముందే తన నిర్ణయాన్ని ఊర్మిళను గురించి చెప్పి వున్నందున దంపతులు శివరామకృష్ణ వివాహాన్ని ఊర్మిళతో జరిపించే దానికి అంగీకరించారు. రెండు నెలల తర్వాత శివరామకృష్ణ... ఊర్మిళల వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన మూడునెలల తర్వాత హరికృష్ణకు, లావణ్యకు కైలాసపతి వివాహాన్ని జరిపించారు.
వారి వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ప్రజాపతికి, ప్రణవికి వివాహం జరిగింది.
కైలాసపతి... శివరామకృష్ణకు, ఊర్మిళకు తనకు వున్న పలుకుబడితో హైకాలేజ్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పించాడు.



కోడలు ఇంటికి వచ్చినా... మహేశ్వర్ తన త్రాగుడు అలవాటును మానలేదు. భర్త వైఖరిలో మార్పులేనందుకు శాంభవి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చేది. మనోవ్యధతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కోడలి ఆదరాభిమానాలు, కొడుకు ప్రేమానాలురాగాలు, భర్త విషయంలో ఆమె హృదయం నిండా నిండిపోయిన ఆవేదనను తొలగించలేకపోయింది.
ఒకరోజు రాత్రి... శయనించిన శాంభవి... శాశ్వతంగా నిద్రపోయింది.



ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఊర్మిళ అత్త శాంభవి గదికి వెళ్ళింది. సాధారణంగా శాంభవి అందరికన్నా ముందులేచి... స్నానం చేసి... ఆరున్నర లోపల దీపారాధన వెలిగించి దైవానికి పాల నివేదన చేసి... పాలతో కాఫీ తయారుచేసి అందరికీ అందించేది మహాతల్లి.
కదలకుండా వెల్లికిలా పడుకొని కళ్ళు మూసుకొని వున్న శాంభవిని చూచి ఊర్మిళ ఆశ్చర్యపోయింది. తల వైపుకు నడిచి చేతిని ఆమె నొసటిపై వుంచింది. చల్లని స్పర్శకు ఆశ్చర్యపోయింది. "అత్తయ్యా!...." పిలిచింది ఒకటికి రెండుసార్లు.



శాంభవి నుండి జవాబు లేదు.
వేళ్ళను నాసికారంధ్రాల ముందు వుంచింది. ఊర్మిళకు విషయం అర్థం అయింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#32
"ఏమండీ!..." బిగ్గరగా అరిచింది.
పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరుగెత్తాడు.
అతన్ని చూచిన ఊర్మిళ....



"ఏమండి... ఏమండీ... అత్తయ్య... అత్తయ్య..." భోరున ఏడ్చింది.



శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూచాడు.



"అమ్మా!..." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు.



గదిలో... శాంభవి శాశ్వత నిద్రలో వుంది.
శివరామకృష్ణ, ఊర్మిళలు భోరున ఏడుస్తున్నారు.



గతరాత్రి తాగిన మైకంవదలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళల ఏడుపులు... అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూచాడు శివరామకృష్ణ.



"నాన్నా! అమ్మ చనిపోయింది నాన్నా!..." భోరున ఏడ్చాడు.



మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.



"శాంభవీ! నన్ను మన్నించు...నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చచ్చిపోయావు" ఆమె చేతిపై తన తలను ఆనించి భోరున ఏడవసాగాడు.



పనిమనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు... తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది.



కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూచారు. ఎంతో ప్రేమాభిమానాలతో వరసలతో ప్రీతిగా పలకరించే... శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు.



వార్త వూరంతా నిముషాల్లో పాకిపోయింది. వాడ... వూరిజనం అంతా అరగంటలో ఇంటిముందుకు చేరారు.



కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి... శాంభవిని దానిపైకి చేర్చారు. హరికృష్ణ వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, వూరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు. రోజు సాయంత్రం బంధుమిత్రులతో ఐదు గంటల ప్రాంతంలో శాంభవి... నలుగురు వాహకులతో... పసుపు కుంకుమలు... పూలతో జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా స్మశానం వైపు వూరేగింపుగా బయలుదేరింది.



దేవత... ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది అది అందరి నోటిమాట.



అందరి వదనాల్లో కన్నీరు... కారణం మహాతల్లి అందరినీ అభిమానించింది. ప్రేమించింది. సాయం చేసింది.
ఆరున్నర ప్రాంతంలో ఆమె యాతనా తనువు అగ్నికి ఆహుతైపోయింది.
లోకపు బాధలన్నింటి నుంచి విముక్తి పొందింది.



కొందరు మంచి మనుషులు బ్రతికి వున్నా... గతించినా... వారి చర్యల వలన ఇతరుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా వుంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి వున్నా సాటివారి మనసుల్లో చచ్చి వారి చిట్టాలోనే వుండిపోతారు. అదే మంచి.... చెడుకు వున్న వ్యత్యాసం.



మానవ జన్మ అపూర్వమైనది. మరుజన్మ వున్నదో లేదో!... సృష్టిలోని అన్ని ఎలా అశాశ్వతాలో మానవుల జీవిత గతీ అంతే... అందుకే అన్నారు పెద్దలు పుట్టుట గిట్టుట కొరకే అని శాంభవి మరణం ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణం అయింది. అయినవారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన మూడు మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#33
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#34
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 7



[font=var(--ricos-font-family,unset)] [/font]
మహేశ్వర్ మరణానంతరం... శివరామకృష్ణ, ఊర్మిళలు ఒంటరివారుగా మిగిలిపోయారు.
జగమే మంచిచెడ్డల కలయిక. కొందరు స్వార్థపరులు మహేశ్వర్ తమకు బాకీ అంటూ శివరామకృష్ణకు ఋణ వివరాలను వివరించారు. వారి మాటలను వేధింపులను భరించలేక... శివరామకృష్ణ మిగిలివున్న పొలాన్ని అమ్మి ఋణబాధల నుండి విముక్తి పొందాడు.
సమయంలో ఊర్మిళ గర్భవతి.



కుటుంబ స్థితి గమనించిన కైలాసపతి శివరామకృష్ణను తనవద్దకు పిలిపించుకొని తన నూనె ఫ్యాక్టరీలో పనిచేయవలసిందిగా చెప్పాడు.
"మీరు ఇప్పించిన ఉద్యోగం వుందికదా పెదనాన్నా! నా బ్రతుకు తెరువుకు అది చాలుగా!" అన్నాడు శివరామకృష్ణ.



"ఒరేయ్! నాకు ప్రజాపతి ఎంతో నీవూ అంతేరా!... దిగజారిన కుటుంబాన్ని నిలబెట్టాలనేది నా ప్రయత్నం. ఉద్యోగాన్ని వదలి ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరు. నా మాట విను" అనునయంగా చెప్పాడు కైలాసపతి.



"పెదనాన్నా! మీరు పెద్దమ్మా ఎంతో మంచివారు. మీకు బంధుత్వం, బాంధవ్యాల మీద ఎంతో గౌరవాభిమానాలు వున్నాయి. మీ మనస్సు చాలా మంచిది పెదనాన్నా!.... కానీ... నాకే... మన వూర్లో వుండాలని లేదు. మద్రాస్కు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఊర్మిళ తాతగారూ అదేమాట చెప్పారు. ఊర్మిళకూ వెళ్ళాలని ఉంది" చెప్పాడు శివరామకృష్ణ.



"నీవు నా మాటను ఎందుకు కాదంటున్నావో నాకు తెలుసురా!.... ప్రజాపతి తత్త్వానికి, నీ తత్త్వానికి వున్న భేదమే కదరా కారణం!... నా ఆస్థిని నేను నా కష్టంతో సంపాదించాను. దానిమీద సర్వహక్కులు నాకే ఉన్నాయి. వాడు నిన్ను ఏమీ అనబోడు. నేనున్నానుగా!... నా మాట విను."
"పెదనాన్నా! నన్ను మన్నించండి. నేను మీ సలహాను పాటించలేను. నేను నిర్ణయానికి వచ్చాను పెదనాన్నా!"



"అలాగే!... సరే!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... కానీ ఒక్కమాటను మాత్రం గుర్తుంచుకో, నా జీవితాంతం వరకూ నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా నన్ను అడుగుతానని నాకు మాట ఇవ్వు."



"అలాగే పెదనాన్నా!..."



"చూడు శివా!.... నా కోడలు మామూలు మనిషి కాదు. ఆమెను జాగ్రత్తగా చూచుకో!... మన చర్యల వలన మన ఇంటి ఆడవారు కన్నీరు కార్చరాదు. మీ నాన్న విషయంలో తప్పే జరిగింది. మహాతల్లి మా వదిన వెళ్ళిపోయింది. ఇంటికి కారుచీకట్లు క్రమ్ముకొన్నాయి" విచారంగా చెప్పాడు కైలాసపతి.



"అమ్మా!.... ఊర్మిళా!... దీన్ని నీ దగ్గర వుంచమ్మా!" లక్ష రూపాయల నోట్ల కట్టలను ఊర్మిళకు అందించాడు కైలాసపతి.



ఊర్మిళ భర్త ముఖంలోకి చూచింది. చిరునవ్వుతో శివరామకృష్ణ తలాడించాడు.



"అమ్మా!... నిండు నూరేళ్ళు మీరిరువురూ ఇలాంటి కనుసన్నలతోనే... ఏకాభిప్రాయంతో... సంసారాన్ని సాగించి...మంచి బిడ్డలకు జన్మనిచ్చి అన్యోన్యంగా ఆనందంగా వర్దిల్లాలి తల్లీ!...." హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు కైలాసపతి.



"ఎప్పుడురా మీ ప్రయాణం!..."



" ఇంటికి అమ్మేసి..."



"ఏమిటి!... ఇంటికి అమ్ముతావా!..."



"అన్నీ పోయాక... ఇది మాత్రం వుండి ఏం ప్రయోజనం పెదనాన్నా!" విరక్తిగా చెప్పాడు శివరామకృష్ణ.



"ఒరే!.... ఇది మీ అమ్మానాన్నల తీపిగురుతు. దీన్ని అమ్మకురా! రానున్న రోజుల్లో ఎవరికి ఎవరు ఏమౌతారో... బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్తసంబంధాలు ఎలా పరిణమించబోతాయో!... ఎక్కడెక్కడో తిరిగినా... ఏం చేసినా... నీవు పుట్టిన గడ్డ (ఇల్లు) మీద కాలు మోపితే... క్షణంలో నీకు కలగబోయే అనుభూతి... ఆనందం వేరుగా వుంటుందిరా!.... దీన్ని నీవు అమ్మేదానికి వీల్లేదు. వుంచుకో!... నీకేమైనా డబ్బు అవసరం అయితే ఎంతకావాలో చెప్పు... నేను, నీ పెదతండ్రిగా ఇస్తానురా!..." అనునయంగా చెప్పాడు కైలాసపతి.



"పెదనాన్నా!.... మీ కోడలి చేతికి డబ్బు ఇచ్చారుగా!.... ఇక వద్దు. మీ మాట ప్రకారమే ఇంటికి అమ్మను. మీరు దీన్ని చూచుకోండి. సంతోషమా పెదనాన్నా!..."



"నా మాటను విన్నందుకు చాలా సంతోషంరా!.... వెళ్ళబోయే రోజు నన్ను మీ పెద్దమ్మను కలవండి..."



"అలాగే పెదనాన్నా!..."



నిట్టూర్చి... వారివురి ముఖాల్లోకి క్షణంసేపు చూచి కైలాసపతి వెళ్ళిపోయాడు.
హరికృష్ణ... లావణ్యలు వచ్చారు.
"ఐదు నిముషాల ముందు పెదనాన్న వెళ్ళిపోయారురా!..."



"దూరాన్నుంచి చూచామురా!...." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.



లావణ్య, ఊర్మిళ దగ్గరకు వెళ్ళింది.



"వదినా!,.... ఎలా వున్నావ్!" ఉదరాన్ని చూచి చిరునవ్వుతో అడిగింది లావణ్య.



"నా సంగతి నీకు తెలిసిందేగా!... మరి నీ సంగతి?" అడిగింది ఊర్మిళ.



సిగ్గుతో తల దించుకొంది చిరునవ్వుతో లావణ్య.
"అంటే!..."



అవునన్నట్లు తలాడించింది లావణ్య.
"కంగ్రాచ్యులేషన్ లావణ్యా!..." నవ్వుతూ చెప్పింది ఊర్మిళ.



శివరామకృష్ణ తన నిర్ణయాన్ని కైలాసపతికి తనకు క్రిందటి గంటలో జరిగిన సంభాషణను హరికృష్ణకు వివరించాడు.



తొలుత.. హరికృష్ణ ప్రియ బంధువు దూరం అవుతున్నందుకు బాధపడ్డాడు. కానీ పరిస్థితుల రీత్యా వారిరువురూ ఊర్మిళ అమ్మగారింటికి మద్రాసు వెళ్ళడమే మంచిదని తోచింది హరికృష్ణకు.



"బావా!... నీ నిర్ణయాన్ని నేను... దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. పూలు అమ్మిన చోట వూరకట్టెలు అమ్మలేంగా!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... అంతా పైవాడు చూచుకొంటాడు. అక్కడ నీకు తప్పక మంచిజరుగుతుంది" చిరునవ్వుతో చెప్పాడూ హరికృష్ణ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#35
మిత్రులు... శివరామకృష్ణ తల్లి శాంభవీ మరణాన్ని గురించి తర్వాత మూడునెలల లోపే గతించిన తండ్రి మహేశ్వర్ను గురించి మాట్లాడుకొన్నారు. వారిరువురి జీవితాల్లో... మంచీ చెడూ ఉన్నాయి. అవి మనకు మన భావి జీవితాన్ని గడిపేటందుకు మార్గదర్శకాలవుతాయి. మనుషులు పోయారు. చరిత్ర మాత్రం మిగిలింది అనుకొన్నారు.



ఒక ఆగంతకుడు పరుగున వచ్చి... రుక్మిణమ్మగారు పడిపోయారు అనే వార్తను వారికిచెప్పి వెళ్ళిపోయాడు.



నలుగురూ కైలాసపతి ఇంటికి పరుగుతీశారు. వూరిలో శాంభవి తర్వాత రుక్మిణమ్మకు అంతే మంచిపేరు వుంది. వాకిట నిలబడి వున్న ప్రజాపతి వీరిని చూచి ముఖం చిట్లించి వేరే దిశకు తిరిగాడు.



ప్రణవి.... వారి సాదరంగా లోనికి ఆహ్వానించింది. స్థానిక వైద్యుడు రుక్మిణమ్మగారికి కాలు విరిగిందని తేల్చి చెప్పాడు. మాట కైలాసపతికి సమ్మెటదెబ్బలా తగిలింది. ఎంతో ఆవేదనకు గురి అయ్యారు.



శివరామకృష్ణ, హరికృష్ణ వారిని ఓదార్చారు.



"చీమకు కూడా కీడు చేయని రుక్మిణికి శిక్ష ఏమిటిరా!..." ఆవేదనతో కన్నీరు కార్చాడు కైలాసపతి.
"నాయనా!.... శివా.... హరీ!... నాకు అనిపిస్తూ వుంది. సమయం ఆసన్నమయింది. కాలు విరగడం అనేది ఒక మిష. వాడు... ప్రజాపతి మా కడుపున చెడబుట్టాడు. లావణ్యను తన మిత్రుడు పరంజ్యోతికి ఇచ్చి పెళ్ళిచేయలేదని వాడికి మామీద కక్ష, ద్వేషం. ఎక్కడ హరికృష్ణ!... ఎక్కడ పరంజ్యోతి!... రౌడీ వెధవ. వీడూ అదే... ప్రజాపతి అలాంటివాడే, కాబట్టి మా నిర్ణయం వాడికి నచ్చలేదు. లావణ్యకు హరికృష్ణకు దేవుడు వ్రాసిపెట్టాడు. వారి వివాహం జరిగింది. పడ్డ తర్వాత శివా... మీ పెదనాన్న... ఒరేయ్ హరి... మీ మామయ్యగారు... తల్లడిల్లిపోయారు. ప్రజాపతి వచ్చి చూచి మెట్లమీద జాగ్రత్తగా దిగాలని తెలియదా!... ఎక్కడో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ దిగితే యిలాగే అవుతుందని అన్నాడు నా నడతను ఆక్షేపించాడే కానీ... అమ్మా!.... పడ్డావు కదే... దెబ్బ తగిలింది కదే అని బాధతో కూడిన మంచిమాటను వాడు పలకలేకపోయాడు.



నేను వారూ... వాడిని, లావణ్యనూ ఒకేలాగ పెంచామురా!.... కానీ వాడి బయటి సహవాసం మంచిదికాని కారణంగా మానవత్వాన్ని వదలి... పెడసరంగా తయారైనాడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా!... కష్టకాలంలో నాకు ఆనందాన్ని ఇచ్చే అంశం ఏమిటో తెలుసారా!... నా కోడలు నెల తప్పింది. శివరామకృష్ణా... నీ భార్యా నా పెద్దకోడలు ఊర్మిళ... హరికృష్ణ ఇల్లాలు... నా కూతురు లావణ్య గర్భవతులైనారు. మన వంశాలకు వారసులను ఇవ్వబోతున్నారు. పుట్టేది ఆడో... మగో.... వారిని చూడాలనే ఆశ తప్ప ఇక నాకు ఆశా లేదురా!..." ఎంతో దీనంగా బాధతో చెప్పింది రుక్మిణి.



"అమ్మా!.... నీకేం కాదమ్మా!.... భయపడకు బాధపడకు. నీవు నీ మనవళ్ళను, మనుమరాళ్ళను తప్పక చూస్తావు. మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో అమ్మా!" తల్లి ప్రక్కన కూర్చొని ఆమె నుదిటిపై రేగిన తలవెంట్రుకలను సవరిస్తూ చెప్పింది లావణ్య. ఎప్పుడూ పార్వతీమాతలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తూ... వీధిలో నడిచేటప్పుడు ఇరుగు పొరుగు వారి క్షేమ సమాచారాలను విచారిస్తూ... వారికి కావలసిన సాయం చేస్తూ మరో శాంభవిగా (శివరామకృష్ణ తల్లి) పేరు తెచ్చుకొన్న రుక్మిణమ్మ... కదలలేని స్థితిలో మంచం పట్టింది.



"పెదనాన్నా!... పెద్దమ్మను పుత్తూరు తీసుకుని వెళ్ళి కట్టు కట్టించుకొని వద్దాం. ఏమంటావు!..." అన్నాడు శివరామకృష్ణ.



"అవును మామయ్యా!.... శివ చెప్పింది మంచి సలహా వెళ్ళివద్దాం" అన్నాడు హరికృష్ణ.
"సరేరా!... మీ ఇష్టం వచ్చినట్లు చేయండి" అన్నాడు కైలాసపతి.



శివరామకృష్ణ... హరికృష్ణ... లావణ్యలు రుక్మిణమ్మను పుత్తూరుకు తీసుకొని వెళ్ళారు. కట్టు కట్టించారు. మూడువారాల తర్వాత రావాలని వారు చెప్పారు.



"అయ్యా!... వీరు మా అత్తయ్యగారు. వయస్సులో పెద్దవారు... అంత దూరాన్నుంచి మరోసారి ఇక్కడికి ఆమెను మేము తీసుకొని రావడం కష్టతరం. మీరు చెప్పిన సమయానికి మేము మీ వద్దకు వస్తాము. మాయందు దయ వుంచి మీరు మాతో మా వూరికి వచ్చి వారికి కట్టుకట్టండి. మీకు ఇవ్వవలసిన సొమ్మును మీకు చెల్లిస్తాము. ఇప్పుడు వచ్చేటప్పుడే వారు ఎంతగానో కష్టపడ్డారు. రక్తసంబంధం కదా!.... ఆమె బాధను మేము చూడలేకపోతున్నాము. మాయందు దయ వుంచి మా విన్నపాన్ని చిత్తగించండి" ఎంతో వినయంతో రామకృష్ణ చెప్పిన మాటలను వారు సమ్మతించారు. రుక్మిణి... లావణ్య... హరికృష్ణ... శివరామకృష్ణ వూరికి తిరిగి వచ్చారు.



అనుకొన్న మాట ప్రకారం హరికృష్ణ పుత్తూరు వెళ్ళి వైద్యులతో తిరిగి వచ్చారు. మూడునెలల్లో... మరో రెండు కట్లు వారు రుక్మిణీకి కట్టారు. ఆమె బాధ తీరి... మెల్లగా చేతికర్ర సాయంతో రుక్మిణమ్మ నడవసాగింది. ఆమె కాలు విరిగిన నాటినుండి ఆమెకు స్థిమితం కలిగే వరకూ... లావణ్య, ప్రణవి ఆమెకు ఎంతో సాయం ఒకరు మారితే ఒకరు ఆమె ప్రక్కనే వుండేవారు.



అత్తగారి సేవలో అతిగా శ్రమించిన కారణంగా ప్రణవికి మూడవనెల ప్రారంభంలో గర్భస్రావం జరిగింది. వార్త రుక్మిణమ్మను కృంగదీసింది. కైలాసపతి, హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళకు బాధపడ్డారు. తన వదిన ప్రణవికి లావణ్య అండగా నిలబడింది.



నెలరోజుల తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళలు మద్రాస్కు వెళ్ళిపోయారు. వారు అక్కడికి చేరిన ఆరుమాసాలకు ఊర్మిళ కవల పిల్లలను కన్నది. ఆడ, మగ.



పిల్లలు నామకరణ మహోత్సవానికి కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు మద్రాసుకు వెళ్ళారు. వారిని చూచి శివరామకృష్ణ, ఊర్మిళలు ఎంతగానో సంతోషించారు. బిడ్డలకు వారు వైశాలి, చంద్రశేఖర్ అని నామకరణం చేశారు. ఊర్మిళ తాతగారు వెంకటరమణ అందరి బంధువుల విషయంలో ఎంతో ఆదరాభిమానాలతో వర్తించారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#36
కైలాసపతి మద్రాసుకు బయలుదేరే ముందు ప్రజాపతిని రమ్మని పిలిచాడు. ప్రజాపతి నేను రాను మీరు వెళ్ళిరండి అన్నాడు. ఊర్మిళ ప్రసవించిన మూడునెలలకు లావణ్య మొగ శిశువుకు జన్మనిచ్చింది. వారు బిడ్డకు దినకర్ అనే పేరు పెట్టారు.



ఐదు సంవత్సరాలు కుటుంబాల మధ్యన ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి.
అప్పటికి లావణ్య ముగ్గురు బిడ్డల తల్లి. దినకర్, వాణి, ఈశ్వర్. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగబోతున్నదనే విషయాన్ని విని.... విశాఖకు వెళ్ళి పరిసరాలను చూచి వచ్చిన శివరామకృష్ణ తన భార్యా బిడ్డలతో... వ్యాపారరీత్యా మద్రాస్ నుండి విశాఖపట్నం వెళ్ళిపోయాడు.
అప్పటికి వారికి నలుగురు సంతానం... చంద్రశేఖర్... రాఘవ... వైశాలి... శారద.



వారు వైజాగ్ వెళ్ళిన మరు సంవత్సరంలో చివరి ప్రసవంగా ఊర్మిళ విష్ణుకు జన్మనిచ్చింది. అతడు పుట్టుకతోనే గుడ్డివాడు.



ప్రజాపతికి తనకు ప్రణవి మూలంగా సంతానం కలుగనందుకు మరో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి తల్లిదండ్రులతో ప్రస్తావించాడు. కైలాసపతి, రుక్మిణమ్మలు అతని నిర్ణయాన్ని అంగీకరించలేదు.



కారణంగా ప్రజాపతి అడ్డదారుల్లో నడిచేవాడు. విషయాన్ని విన్న కైలాసపతి....



"సంతానప్రాప్తం అనేది దైవ నిర్ణయానుసారంగా జరిగేది. నా కోడలికి ఏం తక్కువరా! ఆమె వయస్సు ఎంత?... ఇకపై సంతానం కలుగబోదని నీవెలా నిర్ణయించగలవు. చెడు తిరుగుళ్ళు మాని ప్రణవితో సంసారం చెయ్యి. దైవాన్ని నమ్ము, ఆరాధించు. త్వరలో మీకు సంతానం కలుగుతుంది.
చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా విను. నీకు ఇద్దరు సంతానం కలిగే యోగం ఉంది. నా మాటను నమ్ము" అనునయంగా చెప్పాడు కైలాసపతి.



తన ప్రవర్తన... తండ్రి చెవికి సోకినందుకు తాత్కాలికంగా ప్రజాపతి తన అలవాట్లను మానుకొన్నాడు. ప్రణవి దరికి చేరాడు. దాదాపు తన వయస్సు వారే అయిన లావణ్యకు ముగ్గురు బిడ్డలు. ఊర్మిళకు నలుగురు సంతానం కలగడం, తనకు గర్భస్రావం తర్వాత మరో గర్భం రాకపోవడంతో... ఎక్కువ సమయం దైవ చింతనతో.... అత్తామామల సేవలతో కాలం గడిపేది ప్రణవి. ఆమె ఆవేదనను గమనించిన రుక్మిణమ్మ తల్లీ!... బాధపడకు. నీ పూజలు, వ్రతాలు, దీక్షలు తప్పక ఫలిస్తాయి అని ఎంతో ఆదరాభిమానాలతో చెప్పి ప్రణవిని ఓదార్చేది. ఆమె మొర దేవుడు ఆలకించాడు. ఊర్మిళకు ఐదవ గర్భం నిలబడిన మరుసటి నెలలో ప్రణవి గర్భం దాల్చింది. విష్ణు ఊర్మిళకు ఐదవ సంతతి. దీప్తి ప్రణవి మొదటి సంతతి. వారిరువురికి వయస్సులో తేడా మూడునెలలు. 



తొలిసారి తమ ఇంట ఆడబిడ్డ పుట్టినందుకు కైలాసపతి, రుక్మిణి, ప్రణవి, ప్రజాపతి ఎంతగానో సంతోషించారు. దీప్తి పుట్టిన పదిహేను నెలలకే ప్రణవి మగబిడ్డను ప్రసవించింది వాడి పేరే సీతాపతి.



సీతాపతి... పుట్టిన సంవత్సరం తర్వాత... లావణ్య నాల్గవ ప్రసవాన ఆడపిల్లను ప్రసవించింది. ఆమే శార్వరి.



రెండు సంవత్సరాల లోపలే ఆడ, మగ యిరువురు బిడ్డలు జన్మించినందుకు పెద్దవారు కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు ఎంతగానో సంతోషించారు. వ్యాపారాభివృద్ధిలో మునిగిపోయిన శివరామకృష్ణ కైలాసపతికి శుభాకాంక్షలతో జవాబు వ్రాశాడే కాని... కార్యాలకు రాలేకపోయాడు.
తనని నిర్లక్ష్యం చేశాడని ప్రజాపతి శివరామకృష్ణ మీద పంతం పెంచుకొన్నాడు. అనివార్య కారణాల వలన రాలేకపోయి వుండవచ్చు. వుత్తరం వ్రాశాడుగా! అన్న హరికృష్ణ మాటలు ప్రజాపతి చెవులకు ఈటెలవలె సోకాయి.



చిన్నప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. వీడు వాడి అభిమాని... అందుకే వాడిని సమర్థించి మాట్లాడుతున్నాడు. వీడికి నేనంటే గిట్టనట్లే. పైకి నటిస్తూ నవ్వుతూ నటిస్తాడు. నా చెల్లెలిని వీడికి కట్టబెట్టినందు వలన పెద్దవాళ్ళు బాధపడతారని వీడితో మాట్లాడవలసి వస్తూ వుంది. వాళ్ళు... అమ్మానాన్నలు, లేకుంటే... నాకు వీడితో మాట్లాడవలసిన అవసరం ఏముంది? అనుకొన్నాడు ప్రజాపతి.



పిల్లలు ఎదిగారు. స్కూళ్ళకు పోసాగారు. తరం పెద్దలుగా మిగిలిన కైలాసపతి, రుక్మిణమ్మలకు వయోభారం పెరిగింది. ఎంతో జ్ఞాని అయిన రుక్మిణమ్మ ఒకరోజు రాత్రి తన భర్తతో "ఏమండీ!... మనం వచ్చిన పనులన్నీ పూర్తయినాయి. నా ప్రస్తుతపు కోరిక ఏమిటో తెలుసా!"
"ఏమిటి రుక్మిణీ!..."



"మీ చేతుల్లో.... పైకి వెళ్ళిపోవాలనేది!..." విరక్తిగా నవ్వింది రుక్మిణమ్మ.



"అది నీ నిర్ణయం. కానీ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో!.."



"నా కోర్కెను తండ్రి మన్నిస్తాడని నాకు నమ్మకం..."



"నీవు వెళ్ళిపోతే... నేనూ నీ వెనకాలే వస్తాను రుక్మిణీ!"



చిరునవ్వు... అందులో వైరాగ్యం... గోచరించాయి రుక్మిణమ్మకు. 
"నేను మీకో మాట చెప్పాలి!"



"చెప్పు..."



"మీ శరీరతత్వం సవ్యంగా వున్నప్పుడే ఆస్థిని ప్రజాపతికి, లావణ్యకు సమానంగా పంచి వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఎవరి పత్రాలను వారికి ఇవ్వండి. మన తదనంతరం ప్రజాపతి అమ్మాయిని అల్లుణ్ణి గౌరవంగా చూచుకుంటాడనే నమ్మకం నాకు లేదు" విచారంగా చెప్పింది రుక్మిణమ్మ.
" ఏర్పాటన్నీ సవ్యంగా చేశాను" చిరునవ్వుతో చెప్పాడూ కైలాసపతి.



"అలాగా! మంచిపని చేశారు. రోజు నేను మీ మంచం మీదనే పడుకొంటానండి"



ప్రాధేయపూర్వకంగా అడిగింది రుక్మిణమ్మ.
"అమ్మాయిని పిలిపించనా!..."



" నిశిరాత్రిలో ఎందుకండీ!.... తెల్లవారి తనే వస్తుందిలే!....." వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి లేపి చెప్పింది రుక్మిణమ్మ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#37
తన చేతిలో రుక్మిణమ్మ చేతిని... నొసటిని తాకి చూచాడు కైలాసపతి.



బలవంతంగా కనురెప్పలను మరోమారు పైకెత్తి... తన చేత్తో కైలాసపతి చేతిని పట్టుకొని "ఏమండీ!... నా కథ ముగియబోతూ వుంది. మీరు... మీ...రు...జా...గ్ర...త్త!" పైకి లేచిన కళ్ళు క్రిందికి వాలిపోయాయి. ఆమె శరీరం చల్లగా మారిపోయింది. రుక్మిణమ్మ ఆశయం నెరవేరింది. తలను... చేతులను... కాళ్ళను మరోసారి ఆత్రంగా తాకి... విషయాన్ని గ్రహించిన కైలాసపతి...



"రుక్మిణీ!.... నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా!" భోరున ఏడుస్తూ తన తలను ఆమె తలకు చేర్చాడు కైలాసపతి.



సమయం... రాత్రి పన్నెండు గంటలు... ప్రజాపతి మద్రాస్ వెళ్ళి వున్నాడు.



తనలో తాను అరగంట ఏడ్చుకొని... మెల్లగా గదినుంచి లేచి బయటికి వచ్చి మిద్దెమీద ప్రణవి గది తలుపును తట్టాడు. తలుపు తెరిచిన.... ఆమెతో కన్నీటితో విషయాన్ని చెప్పాడు. ఇరువురూ... క్రింద రుక్మిణమ్మ (శవం) వున్న గదిలోకి ఏడుస్తూ వచ్చారు. ఆకస్మాత్తుగా... వూహించని దృశ్యాన్ని చూచిన ప్రణవి... తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఇంట తాను కాలుపెట్టిన నాటినుంచీ రుక్మిణమ్మ ఆమెను కూతురుగా చూచుకొందే కాని.. కోడలుగా ఏనాడూ చూడలేదు.



అమ్మా ప్రణవీ!.... అమ్మా!...అంటూ ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించేది. ప్రణవి చేస్తున్న పనులకు సాయంగా నిలచి తల్లిలా మంచి సలహాలను... తన జీవిత ఆశయాలను... ఒక స్త్రీ... కుటుంబాభివృద్ధికి ఎంత ముఖ్యమనే పలు విషయాలను కన్నతల్లిలా ప్రణవికి ఆమె చెప్పేది. విషయాలనన్నింటినీ గుర్తు చేసుకొని ప్రణవి భోరున ఏడ్వసాగింది.



లావణ్యకు ఒక దుస్వప్నం వచ్చింది. అందులో ఆమెకు రుక్మిణీ నిర్యాణమే గోచరించింది. ఉలిక్కిపడి నిద్రలేచింది. భర్తను తట్టింది. హరికృష్ణ గాబరాగా లేచి కూర్చున్నాడు.
"ఏం లావణ్యా!...."



"వెంటనే అమ్మను చూడాలండి. చెడ్డ కల వచ్చింది పదండి." ఆందోళనగా చెప్పింది లావణ్య.
తన భార్యతత్వం బాగా ఎరిగిన హరికృష్ణ విషయానికి ఏనాడు ఆమె ముఖంలో తను చూడని వేదనను చూచి మారుమాట్లాడకుండా మంచం దిగి....



"పద లావణ్యా!...." అన్నాడు. అతని మనస్సు ఏదో కీడును శంకిస్తూ వుంది.



పది నిముషాల్లో దంపతులు కైలాసపతి ఇంటికి రాత్రి రెండు గంటల ప్రాంతంలో చేరారు.
ఆత్రంగా తండ్రి కైలాసపతి.... ప్రణవి వున్న గదిని సమీపించారు. ఏడ్చి ఏడ్చి వారిరువురూ సొమ్మసిల్లి పోయారు.



"అమ్మా!....." అంటూ గదిలో ప్రవేశించింది లావణ్య.



ఆమె గొంతును విని... తలను పైకెత్తి కైలాసపతి, ప్రణవి... గదిలోనికి వచ్చిన లావణ్యను, హరికృష్ణను చూచారు.



విషయం అర్థమైన లావణ్య కన్నీటితో భోరున ఏడుస్తూ తల్లి తల చెంత చేరింది. హరికృష్ణ తనను అల్లుడిలా కాకుండా సొంత కొడుకులా ఎంతో ఆదరాభిమానాలతో చూచుకొనే తన అత్త రుక్మిణమ్మ... అచేతనంగా పడి వుండడాన్ని చూచి.. కన్నీరు కార్చాడు.



ముగ్గురికీ తాను ఏమి చెప్పినా వినిపించుకొనే స్థితిలో లేరని..మామగారి ప్రక్కన కూర్చున్నాడు. ఎంతో ఆవేదనను... వారికి పంచి... అతి భారంగా రాత్రి గడిచింది.



సమయం ఉదయం ఐదు గంటల ప్రాంతం... హరికృష్ణ లేచి ప్రజాపతికి, శివరామకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడేదానికి ప్రయత్నించాడు. ఇరువురూ ల్యాండ్లైన్ను ఎత్తలేదు.



నట్టింట చాపపరిచి... లావణ్య, ప్రణవీల సాయంతో రుక్మిణమ్మను పడుకోబెట్టారు.



పనిమనిషి.. చల్లమ్మ వచ్చి చూచింది. పరుగున వెళ్ళి ఇరుగు పొరుగు వారికి విషయాన్ని చెప్పింది.
అరగంటలోపల అందరూ ఇంట్లో ప్రవేశించారు. రుక్మిణమ్మను స్థితిలో చూచి కన్నీరు కార్చారు.
వర్తమానం పంపవలసిన వారికందరికీ మనుషులను పంపించి విషయాన్ని తెలియపరిచాడు హరికృష్ణ.



మధ్యాహ్నం... పన్నెండుగంటలకు కొందరు... రెండూ మూడు గంటల మధ్యన మరికొందరు... రావలసిన వారంతా వచ్చారు. గొప్ప పేరున్న ఇల్లాలు రుక్మిణమ్మ మరణం అందరికీ ఆవేదనను కలిగించింది. సాయంత్రం... అయిదు గంటలకు ఆమె అంతిమ యాత్రకు అన్ని సిద్ధం అయినాయి.
మధ్యన.... నాలుగు పర్యాయాలు... హరికృష్ణ ప్రజాపతికి, శివరామకృష్ణకు ఫోన్ చేశాడు. కానీ... వారు అతని కాల్స్ ను ఎత్తలేదు. ప్రజాపతి రాకకోసం అందరూ ఎదురు చూస్తున్నారు వస్తాడని.
శ్రీరంగంలో సానె ఇంట్లో ఆనందలహరిలో మునిగి తేలియాడుతున్న ప్రజాపతికి... తన తల్లి గతించిందనే వార్త తెలియలేదు. కారణం అతను అక్కడికి వెళ్ళిన విషయం అతనికి తప్ప వేరెవరికీ తెలియదు.



ప్రజాపతి రాని కారణంగా... హరికృష్ణ స్థానంలో వుండి... రుక్మిణమ్మకు చేయవలసిన అంతిమ సంస్కారాలను ఆవేదనతో... ఎంతో శ్రద్ధతో నిర్వర్తించాడు. అతనికి సాయంగా మాధవయ్య నిలిచాడు.



ఎవరికి తోడు ఎవరు ఎంతవరకో!... కన్నకొడుకు వున్నా అంతిమ సమయానికి... అతను తల్లికి ఏమికాని... ఏమీ చేయలేని వాడుగా ప్రజాపతి తన లోకంలో వుండిపోయాడు. హరికృష్ణ చేతుల మీదుగా పండు ముత్తయిదువు బండెడు పూలు... పసుపు కుంకులమతో స్మశానపు వైపుకు బంధుమిత్రులతో హరి జనంతో బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#38
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#39
(17-12-2024, 02:20 PM)k3vv3 Wrote: ఎవరికి తోడు ఎవరు ఎంతవరకో!... కన్నకొడుకు వున్నా అంతిమ సమయానికి... అతను తల్లికి ఏమికాని... ఏమీ చేయలేని వాడుగా ప్రజాపతి తన లోకంలో వుండిపోయాడు. హరికృష్ణ చేతుల మీదుగా పండు ముత్తయిదువు బండెడు పూలు... పసుపు కుంకులమతో స్మశానపు వైపుకు బంధుమిత్రులతో హరి జనంతో బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
=================

Super Story andi, K3vv3 garu!!!
clps clps clps
========================
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)