Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic కన్యాశుల్కం
#41
Nice update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
చాలా రోజుల తరువాత పునఃదర్శనం...బావుంది బ్రో. మొదటి గృహప్రవేశం, మన హీరో వాళ్ళింటివాళ్ళ రియాక్షన్ ఎలా వుండబోతోందో. స్వప్న ఫ్రెండ్ ఎందుకలా జాలిగా చూసింది, లేక మధు కే అలా అనిపించిందా. రెండు భావాల మద్య ఊగుతున్నట్లుంది మధు మనఃస్తితి...కానివ్వు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#43
Good update bro, please give regular basis
Like Reply
#44
GOOD UPDATE
Like Reply
#45
(20-05-2024, 06:12 AM)ramd420 Wrote: Update baagundi

(19-11-2024, 10:24 PM)sri7869 Wrote: Nice update

(19-11-2024, 10:59 PM)shekhadu Wrote: manchi concept bhayya. flow kuda super undi.
koncham quickly updates iste baguntadi

(20-11-2024, 05:00 AM)Iron man 0206 Wrote: Nice update

(20-11-2024, 01:25 PM)Uday Wrote: చాలా రోజుల తరువాత పునఃదర్శనం...బావుంది బ్రో. మొదటి గృహప్రవేశం, మన హీరో వాళ్ళింటివాళ్ళ రియాక్షన్ ఎలా వుండబోతోందో. స్వప్న ఫ్రెండ్ ఎందుకలా జాలిగా చూసింది, లేక మధు కే అలా అనిపించిందా. రెండు భావాల మద్య ఊగుతున్నట్లుంది మధు మనఃస్తితి...కానివ్వు

(20-11-2024, 02:10 PM)Vizzus009 Wrote: Good update bro, please give regular basis

(20-11-2024, 03:07 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank You for your Likes, Comments and Encouragement..

Chala mandi like pattinchukovaddu antaru... kaani mana kadha janalaki nachhindo ledo telusukovadaniki ade kada kolamanam..

bavuleni kadhani rastoo time waste chesukovadam enduku anipistundi okkosari..

nachhina valla kosamaina raddam anipistundi inkosari..

modalu pettina kadhalanni poorti cheyyalani nannu nenu motivate chesukuntoo...

mee andariki kooda marokkamaru Thankyou Somuch
[+] 2 users Like nareN 2's post
Like Reply
#46
మా అమ్మ వేసే దోశల వాసన కి గుర్తొచ్చింది.. ఇంతకీ విషయం మా అమ్మకి చెప్పలేదని..

నాన్న ఎప్పుడో ఆఫీస్ కి చెక్కేశారు.. సో టెన్షన్ లేకుండా.. మా అమ్మని పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టా..

నేను - అమ్మా నీకో విషయం చెప్పాలి..

అమ్మ-  చెప్పరా..

నేను - కాసేపట్లో మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది..

అమ్మ - ఐతే..

నేను - ఆ అమ్మాయి నేను ప్రేమించుకుందాం అనుకుంటున్నాం..

అమ్మ- అనుకుంటున్నారా..అంటే ప్రేమించుకోవట్లేదా..

నేను - ఇంకా లేదమ్మా.. ఒకళ్ళకి ఒకళ్ళం సెట్ అవుతామో లేదో చూసుకొని అప్పుడు ప్రేమించుకుంటాం..

అమ్మ - అలా పెళ్లి కదరా చేసుకుంటారు..

నేను - అదంతే అమ్మ తిక్కలది..

అమ్మ - మరి వేరే అమ్మాయిని చూసుకోవచ్చుగా..

నేను - నా సంగతి నీకు తెలుసు కదమ్మా....

అమ్మ - సర్లే మీకిద్దరికి ఇష్టమైతే మీకు నచ్చినట్టు ఏడవండి..

నేను - అది కాదమ్మా..

అమ్మ - ఇంకా సాగతీస్తావేంట్రా..

నేను - తను నేను కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాం..

అమ్మ - ఏంటి ప్రేమించుకోవడానికా..

నేను - అలాంటిదే అనుకో..

అమ్మ - రేయ్, ఏప్రిల్ కి ఇంకా 6  నెలలు ఉందిరా..

నేను - అమ్మ అర్ధం చేసుకోవే.. నువ్వే నాన్నకి ఎదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యాలి..

అమ్మ - రేయ్ మధు, నీకు అబద్ధాలు ఆడే అలవాటు లేకపోవడం నా దురదృష్టం.. నీ వంతు కూడా నేనే అబద్ధాలు ఆడాల్సి వస్తోంది..

నేను - థాంక్స్ అమ్మ..

అమ్మ - ఇంతకీ అమ్మాయి పేరేంట్రా..

నేను - స్వప్న..

అమ్మ - ఓరినీ.. ఒక్కడు మూవీ నుంచి ఆ పేరు పట్టుకు కూర్చున్నావ్.. పేరు కోసమే లవ్ చేస్తున్నావా..పిల్ల కూడా బావుంటుంది..

నేను - బావుంటుందా నా.. నా కన్నా బావుంటుంది..

అమ్మ - అవునులే ఎంతైనా కాకి లవర్ కాకికి ముద్దు...

నేను - ఏంటమ్మా.. కోడలిని పరిచయం చేస్తా అంటుంటే కాకి కోతి అనుకుంటూ..

అమ్మ - సర్లే చూసాక మాట్లాడుకుందాం..

నేను - సర్లే ఆకలేస్తోంది.. వడ్డించు..

అమ్మ - పిల్ల వచ్చాక ఇద్దరికీ కలిపి పెడతాలే..

నేను - లేదు నాకు పెట్టేసేయ్.. తాను తింటే తనతో పాటు మళ్ళి తింటాలే..

తిన్నది తిరగడం మొదలయ్యాక.. మెసేజ్ చేశా.. ఎక్కడ దాక వచ్చావ్..

ఇంకా రిప్లై రాలేదు కానీ.. తనకి ఏదైనా నిక్ నేమ్ పెట్టుకోవాలనిపించింది.. మళ్ళి నాకు అంత ఇష్టమైన పేరు ఉండగా ముద్దు పేర్లు ఎందుకులే అనుకుంటూ.. రీల్స్ చూసుకుంటున్న..

అనిల్ గాడు ఫోన్.. ఆఫీస్ కి వెళ్దామా అని.. ఇంతకీ అసలు విషయం వీడికి చెప్పలేదు కదా అనుకుంటూ.. షార్ట్కట్ లో విషయం చెప్పగానే.. నేనూ రానా లీవ్ పెట్టి అని అడిగాడు..

వీడు గాని వస్తే నాకు మొదటి రోజే బ్రేకప్ ఖాయం.. వద్దని బ్రతిమాలి.. మెస్సగెస్ ఓపెన్ చేస్తే.. విల్ రీచ్ బై 9.19 అని ఉంది.. ఇంకా 6 నిముషాలు..

360 సెకన్లు.. 100 వరకు లెక్క పెట్టాక లెక్క మర్చిపోయా..

ఈలోపు మా అమ్మ అత్త గారిలా రెడీ అయిపొయింది.. చుట్టూ చూసుకున్న.. ఎక్కడ కూర్చోపెడదాం అని.. హాల్ లోనా.. నా రూమ్ లోనా..

ఈలోపు కాల్.. లొకేషన్ లో ఉన్నా.. బయటకి రా అని..

కార్ వేసుకు వచ్చింది.. జీన్స్ అండ్ టాప్ వేసుకుంది.. ఎంత పధ్ధతి గా ఉండాలో అంత.. ఎంత అందంగా ఉండాలో అంత ఉంది..

మళ్ళీ 1st డే చూసిన స్వప్న లా..

స్వప్న - రా కార్ లో కూర్చో..

నేను - అదేంటి ఇంట్లో మాట్లాడదాం అన్నావ్ గా..

స్వప్న - ఆ విషయం చెప్దామనే.. రా కూర్చో...

నేను - చెప్పు ఏంటి విషయం..

స్వప్న - మా ఇంట్లో మన ప్రేమని ఒప్పుకోలేదు..

నేను - అదేంటి ఇద్దరం కలిసి వెళ్లి చెప్పాలి.. వన్ మంత్ కలిసి ఉండాలి అన్ని చెప్పావ్ కదా.. ఒప్పుకోకపోవడమేమిటి..

స్వప్న - అందుకే కదా..నీతో చెప్తున్నా..

నేను - హలో..వన్ సెకండ్..  ప్లాన్ చేసింది నువ్వే కదా.. ఒప్పుకోరు అని నీకు ముందు తెలీదా..

స్వప్న - ఇప్పుడు ప్రాబ్లెమ్ అది కాదు కదా.. ఎం చేద్దాం చెప్పు..

నేను - చెప్పాలా.. ఎం చెప్పమంటావ్.. నాకు లవర్ ఉందొ లేదో కూడా తెలియని కన్ఫ్యూషన్ లో నేను ఉన్నా..

స్వప్న - ఓహ్ ఐతే నా మీద లవ్వే లేదన్నమాట.. మా ఇంట్లో ప్రాబ్లెమ్ వస్తే నీకేం సంబంధం లేదన్నమాట..

నేను - ఇవన్నీ నేనెప్పుడన్నా..

స్వప్న - మరి సొల్యూషన్ చెప్పడం మానేసి సొల్లు చెపుతున్నావ్..

నేను - ఐతే వాళ్ళు వద్దన్నా నా దగ్గరకి వచ్చావ్ గా.. డైరెక్ట్ వెళ్లి పెళ్లి చేసుకుందాం పద..

స్వప్న - ఓకే.. దిగు..

నేను - అదేంటి పెళ్లొద్దా..

స్వప్న - అప్పుడేనా.. ఎదో సరదాగా నీతో ఆర్గుమెంట్ జరిగితే ఎలా ఉంటుందా అని ట్రై చేశా.. బావుంది.. పద మీ ఇంట్లో నీ సంగతి చెపుదాం..

నేను - ఇదిగో నన్ను ఇరికించే ప్లాన్స్ ఏమైనా ఉంటె ముందే చెప్పు..

స్వప్న - చెప్పి చేస్తే చప్పగా ఉంటుంది..ఎప్పుడు ఏమనిపిస్తే అది చేసుకుంటూ పోవడమే.. పద పద...

Xxxxx

మా అమ్మ సస్పెన్స్ సీరియల్ చూసినంత సీరియస్ గా ఎదురు చూస్తోంది లోపల..

స్వప్న - హాయ్ ఆంటీ.. నా పేరు స్వప్న..

అనుకుంటూ తన ప్రొఫషన్ హాబీస్ టేస్ట్స్.. అన్ని చెప్పేస్తోంది.. ఎక్కడైనా గ్యాప్ ఇస్తుందా అని మా అమ్మ చూస్తోంది..

స్వప్న - అది ఆంటీ నా గురించి.. మీకు నచ్చానా.. అంది.. భయంకరమైన వర్షం వెలిసాక ఉన్నంత ప్రశాంతం గా ఉంది ఇల్లు..

అమ్మ- నా సంగతి సరే.. మా అబ్బాయ్ నీకు నచ్చాడా..

స్వప్న - నచ్చడం ఏముంది ఆంటీ.. కలిసుంటే ఫ్రెండ్స్ అవుతాం.. తను నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పాడు.. అదేంటో చూద్దామనే కదా వన్ మంత్ కలిసి ఉందాం అనుకుంటున్నాం..

అమ్మ - అంటే నువ్వేం ఎక్సపెక్ట్ చేస్తున్నావ్..

స్వప్న - ఆమ్మో.. ఆంటీ.. అలా చెప్పేస్తే ఎలా.... ఈ వన్ మంత్ అంతా బ్లాంక్ పేపర్ ఆంటీ.. చూద్దాం మీ అబ్బాయ్ ఎం రాస్తాడో గీస్తాడో చూస్తాడో..

తన ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఐతే ప్లాన్స్ అన్ని తాను వేస్తుంది.. నేను ఫాలో అయిపోతే చాలు అనుకున్న..

బట్ ఇప్పుడు తాను కంప్లీట్ నా మీద వదిలేస్తా అంటోంది.. ఇంకోలా చెప్పాలంటే నేను ప్లాన్స్ వెయ్యక్కర్లేదు.. లవ్ చేస్తే చాలు..

నా ఆలోచనల్లో నేనుండగా.. మధు వెల్దామా అంటూ లేచింది స్వప్న..

అమ్మ దోశలు తింటావా అని అడిగింది స్వప్న ని.. ఎస్ చెప్తుందని నాకు తెలుసు..

ఎందుకంటే నేను ఎస్ మాన్.. తాను ఎస్ విమెన్.. తనని లవ్ చెయ్యడానికి నాకున్న త్రీ రీసన్స్ లో ఇది రెండోది.. మొదటిది మీకు తెలుసుగా. తన పేరు స్వప్న..

Xxxxx

అమ్మ కి బాయ్ చెప్పి కార్ ఎక్కగానే.. ఆంటీ కూడా కూల్ అబ్బా.. నీలా కాదు..అంది..

ఆర్గుమెంట్ శాంపిల్ ఇందాక అయిపొయింది కదా.. సో డిఫెండ్ చేసుకోకుండా.. థాంక్స్ అన్నా..

నేను - ఇంకేంటి అమ్మతో నీ గురించి చెప్పావ్ కానీ మీ ఫామిలీ గురించి ఎం చెప్పలేదు..

స్వప్న - ప్రస్తుతం రిలేషన్ నాతోనే కదా.. మన జర్నీ వాళ్ళ దాక వస్తే అప్పుడు చెప్తాలే..

నేను - నువ్వు మరీ లెక్కలేసుకుని మాట్లాడితే కష్టం కదా..

స్వప్న - ఇదంతా లవ్ చేసే ముందు కదా ఆలోచించాలి.. అమ్మాయి ఎలాంటిది.. నాతో ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడుతుంది.. నా ఫామిలీ తో కలుస్తుందా లేదా.. తన ఇష్టాఇష్టాలేంటి.. మ్యాచ్ అవుతున్నాయా లేదా..

లవ్ అంటూ ముందే మీదడిపోడం.. తర్వాత కొట్టుకు చావడం.. ఇలా ఐతే బావుంటుంది కదా..

నేను - నా ఉద్దేశం అది కాదు..

స్వప్న - అదే మధు.. అబ్బాయిలు చెడ్డవాళ్ళు అనట్లేదు..ఆలోచించరు అంటున్న..

నేను - సరే అలోచించి ఎం చెయ్యాలో కూడా చెప్పు మరి.. ప్రతీ మనిషిలో అట్ట్రాక్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది.. అబ్బాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ తో క్లోజ్ అవుతారు.. అబ్బాయిలు అమ్మాయిలు ఐతే దానికి లవ్ అని పేరు పెడతారు..

పేరు ఏదైనా ఉండే ఎమోషన్ ఒక్కటే..

స్వప్న - ఎమోషన్ ఒకటే ఉంటె పర్లేదు బాబు.. దానికి లస్ట్ ఆడ్ అయినప్పుడే కదా లవ్ అంటారు..

నేను - సీ.. అది పర్సన్ తో పర్సన్ మారుతూ ఉంటుంది.. ఒకడి ఇంటెన్షన్ అదే ఐతే.. 1st  నుంచి వాడి అప్రోచ్ లోనే డిఫరెన్స్ ఉంటుంది.. ఎవరి ఇంటెన్షన్ ఏంటి అనేది ఏమాత్రం తెలియదా ఏంటి..

స్వప్న - అందుకే కదా.. మనం మా ఇంటి దాక వెళ్తున్నాం..

నేను - ఏంటి టాపిక్ కట్ చేస్తున్నావ్..

స్వప్న - నీ మొహం లో తెలిసిపోతోంది.. నువ్వు సీరియస్ అవుతున్నావ్..

నేను - సీరియస్ అవ్వట్లేదు.. సీరియస్ గా ఆలోచిస్తున్న..

స్వప్న - ముందు మా పేరెంట్స్ గురించి ఆలోచించు.. వూళ్ళో అబ్బాయిల్ని తర్వాత డిఫెండ్ చేద్దువు గాని..

నేను - అదేంటి ఆల్రెడీ నువ్వు చెప్పి ఉంటావ్ గా..

స్వప్న - మధూ.. కూతుర్ని కాబట్టి తప్పక నేనేం చెప్పిన వింటారు.. నేను నీ దగ్గర హ్యాపీ గ ఉంటానని నమ్మకం నువ్వే కదా కలిగించాలి..

నేను (మనసులో) ఓరి నాయనో.. ఒక్కసారిగా లవ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఎంతో బెటర్ అనిపించింది..

ఐన ధైర్యం చేసి కుడి కాలు లోపల పెట్టా..
[+] 10 users Like nareN 2's post
Like Reply
#47
Excellent update
Like Reply
#48
shubham
[+] 1 user Likes shekhadu's post
Like Reply
#49
Good update
Like Reply
#50
GOOD UPDATE
Like Reply
#51
ఇంటరెస్టింగా వుందండి స్వప్న సరదాలు. ఇటువంటి అమ్మాయిని కనక పెళ్ళిచేసుకుంటే ఇంకో జీవతం వద్దనేటంత ప్రేమనిస్తుంది..మీరేమంటారు. మొత్తానికి ఒక నెల పాటు మనోడికి రాం భజనే ఏమంటే ఏమౌతుందో, ఏమంటుందోనని...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#52
bagundi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)