14-05-2024, 11:25 PM
Nice super update
Non-erotic కన్యాశుల్కం
|
14-05-2024, 11:31 PM
Different story
Kothaga chala crazy' gaa kuda undhi Swapana caracter ni oka anigil lo chusthu ardam kadhu Oka rendu mudu different angels lo chudali Appuday manaki oka clarity vasthundhi Story chala bagundhi bro
15-05-2024, 07:37 PM
(This post was last modified: 15-05-2024, 07:38 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-05-2024, 10:12 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది (14-05-2024, 11:10 PM)Sushma2000 Wrote: Variety concepts tho mammalni alaristunaru..thanks (14-05-2024, 11:25 PM)K.R.kishore Wrote: Nice super update (14-05-2024, 11:31 PM)SHREDDER Wrote: Different story Thank You Bro.. Ill try to elaborate her Characterization in upcoming Updates (15-05-2024, 03:58 AM)Iron man 0206 Wrote: Nice update Thank you All for supporting my Stories
17-05-2024, 12:26 PM
(This post was last modified: 17-05-2024, 12:27 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎంతైనా ఇది తెలివైందో తిక్కలదొ అర్ధం కాలేదు..
ఇంకొంచెం తెలుసుకోవాలి అనుకుని మళ్ళీ అనిల్ గాడి దగ్గరకి వెళ్ళా.. అనిల్ - పాప పెద్ద పతివ్రత లా ఉందిరా.. నీకు పనవ్వదు.. నేను - నాకు పనవ్వక్కర్లేదు పెళ్ళైతే చాలు.. అనిల్ - వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటారా.. నేను - ఓ పని చేద్దాం.. నిన్న తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.. అనిల్ - హ ఐడియా బావుంది.. వెళ్ళు.. నేను - పెద్దలు ఎం చెప్పారు అనిల్ - మావాళ్లు ఎం చెప్పిన నేను వినను కానీ మీ వాళ్ళు ఎం చెప్పారో చెప్పు నేను - బావిలోకి దిగేటప్పుడు నడుముకి తాడు కట్టుకు దిగాలి.. నువ్వే నా తాడు.. అనిల్ - నువ్వు దిగేది బావిలోకి కాదు ఊబి లోకి.. నీతో పాటు నేను కూడా పోతా.. నన్ను వొదిలెయ్.. నేను - రేయ్ వస్తావా రావా.. అనిల్ - సరే పద.. ఐస్ క్రీం షాప్ లో.. ముగ్గురం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి కూర్చున్నాం.. (ఇప్పటికే అమ్మాయిల పేర్లు ఎక్కువైపోయాయి సో దీని పేరు అడగకండి) ఫ్రెండ్ - మీకు చెప్పానని దానికి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది.. అనిల్ - చూసావేరా బెస్ట్ ఫ్రెండ్ భయపడుతోంది అంటే.. నీకు మెళ్ళో బెల్ట్ కట్టి ఆడించేస్తుంది.. ఫ్రెండ్ - హలో బాస్.. దాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు.. షీ ఇస్ వన్ ఇన్ ఏ మిలియన్.. అసలు దాని గురించి ఎం తెలుసనీ మాట్లాడుతున్నావ్.. అనిల్ - అది అడిగితేనే కదా నువ్వు మీదడిపోతున్నావ్.. ఫ్రెండ్ - చూడు మధు.. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటె ముందే కట్ చేసేసుకో.. ఇలా వంకరగా మాట్లాడితే దానికి నచ్చదు.. అనిల్ - మామా..మరీ ఐస్ పుల్లకి ఇచ్చే వేల్యూ కూడా ఇవ్వట్లేదురా.. కష్టం రా.. నేను - రేయ్ నువ్వు కాసేపాగు.. అసలు తన గురించి తెలుసుకొని.. ఫ్రెండ్ - ఆక్చువల్ గా అదో పెద్ద కదా.. అనిల్ - పర్లేదు లీవ్ పెట్టుకు వచ్చాం.. సాయంత్రం దాక టైం ఉంది.. చెప్పు.. ఫ్రెండ్ - మధు నీ ఫ్రెండ్ బా డిస్టర్బ్ చేస్తున్నాడు.. ఇలా ఐతే నే చెప్పను.. అనిల్ - లేదులే ఇంక చెయ్యను చెప్పు.. ఫ్రెండ్ - స్వప్న వాళ్ళ పిన్ని ది లవ్ మ్యారేజ్..ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు..మొదట్లో తన హస్బెండ్ బానే ఉండేవాడట.. లవ్ మ్యారేజ్ వల్ల కట్నం రాలేదని వాళ్ళ అత్తా వాళ్ళు రోజు వేధించేవారట.. 1st తనని సపోర్ట్ చేసిన హస్బెండ్ కూడా బిజినెస్ లో లాస్ అయ్యి డబ్బుల కోసం వాళ్ళ అమ్మ వాళ్లతో కలిసి డబ్బులు కోసం టార్చర్ పెడితే పెద్ద వాళ్ళని బాధ పెట్టలేక తాను సూసైడ్ చేసుకు చనిపోయింది.. నేను - సో స్వప్న కి కట్నం అన్నా ఆడవాళ్ళని తక్కువగా చూసే వాళ్ళన్నా నచ్చదన్నమాట.. ఫ్రెండ్ - అవును.. నేను - అంతా బానే ఉంది.. మరి ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఏంటి.. ఫ్రెండ్ - అదా.. అదంతా టైం పాస్ గాళ్లనీ దూరం పెట్టడానికి... అనిల్ - మరి సీరియస్ గాళ్లనీ.. ఫ్రెండ్ - లాస్ట్ ఇయర్ ఆ సరదా కూడా అయ్యింది.. 1st మొంత్ 2 .5 లక్షలు పే చేసి ఇద్దరు వచ్చారు లవ్ చెయ్యడానికి.. అనిల్ - వినడానికి కర్ణ కరంగా ఉంది.. (నా ఎక్స్ప్రెషన్ చూసి మూతి మీద వేలు వేసుకున్నాడు..) ఫ్రెండ్ - బాస్ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు నేను - తర్వాత ఏమైంది.. ఫ్రెండ్ - తను 1st మంత్ మొత్తం వాళ్ల చూపులు.. టైమింగ్.. మాటలు.. బిహేవియర్.. అన్ని ఒబెసర్వ్ చేస్తుంది.. నేను - అంటే.. ఫ్రెండ్ - అంటే ఆ వన్ మంత్ లో తనకి నచ్చిన లక్షణాలు నీలో కనపడకపోతే రిజైన్ చేసేస్తుంది.. అనిల్ - అంటే 2.5 గోవిందా గోవిందా నా.. ఫ్రెండ్ - హే ఆ మనీ అదేం తీసుకోదు.. 1st డే నే నీ చేతే ఏ ఆర్ఫనేజ్ కో ఓల్డ్ ఏజ్ హోమ్ కో డొనేట్ చేయించేస్తుంది.. నేను - మామ నేను ఫిక్స్ రా.. ట్రై చెయ్యాల్సిందే.. అనిల్ - ఆగరా నీ సీనియర్స్ ఇద్దరు ఉన్నారు కదా.. వాళ్ల కథ పూర్తవ్వాలి కదా.. ఫ్రెండ్ - లేదు.. ఒకడు 1 వీక్ కె ఫెయిల్ అయ్యాడు.. ఇంకొకడు 3rd టెస్ట్ దాకా వచ్చి 2 రోజులకి వాడే డ్రాప్ అయ్యాడు.. నేను - ఏంటది.. ఫ్రెండ్ - ఆఫీస్ కి లీవ్ పెట్టి వన్ మంత్ స్వప్న వాళ్ల ఇంట్లో వాళ్ల ఫామిలీ తో కలిపి ఉండాలి... నేను - ఓహో అది ఓకే ఐతే.. 4th టెస్ట్ ఆ? ఫ్రెండ్ - హ అప్పుడు తను మీ ఇంటికి వచ్చి మంత్ ఉంటుంది.. బట్ ముందుగా స్వప్న ఫామిలీ అంతా నిన్ను ఆక్సిప్టు చెయ్యాలి.. బి XXX హౌస్ లా 24 /7 నిన్ను 4 కెమెరాస్ ఒబ్సెర్వె చేస్తూ ఉంటాయి.. ఆ తర్వాత తను మీ ఇంటికి వచ్చి తను కూడా మీ వాళ్ళకి తను నచ్చితే.. అప్పుడు పెళ్లి.. నేను - మరి 5th టెస్ట్? ఫ్రెండ్ - అది నాకు కూడా తెలీదు.. నేను - ఎనీవే థాంక్స్ ఫ్రెండ్.. ఫ్రెండ్ - నువ్వు నిజమైతే నీకు అంతులేని ప్రేమ నిస్తుంది స్వప్న.. దాన్ని అందుకునే అర్హత నీకుందో లేదో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఎనీవే .. అల్ ద బెస్ట్..
17-05-2024, 04:12 PM
బ్రదర్ ఇదేనా అమ్మాయిల లేటెస్ట్ కాన్సెప్ట్, ఇదేదో బానే వుంది గాని అన్నీ నచ్చిన అలవాట్లే ఉండి, ఇద్దరూ ఒకేలా ఉంటే అందులో మజా వుంటుందా. కొన్ని అసమానతలు, కొన్ని వైరుధ్యభావాలు వుంటేనే కాదా చిన్నచిన్న అలకలు, గొడవలూ రావడం, మళ్ళీ కలిసిపోవడం...జీవితమంటేనే సర్దుకుపోవడమే కదా.
సరేలే నా సోదెందుకు గాని, కథా శిల్పం కొత్తగా బావుంది, అన్నీ మూసపోసినట్లు ఒకేలా వుంటే బోరుకొట్టేస్తుంది. పోతే "హరణూ" బ్రో కళ్ళ వర్ణన గురించి ఏదో అన్నట్లున్నారు, మామూలుగా కళ్ళను సూర్య చంద్రులతో పోలుస్తారు వర్ణించేటప్పుడు (అంటే ఒక కన్ను దయను చంద్రుడిలా చల్లగా, ఇంకో కన్ను అవసరమొస్తే మండే సూర్యుడిలా అగ్ని[b]ని వర్షించగలవని, బహుశా పార్వతి గురించి అన్నారనుకుంటా అలా) పొరబాటున అక్కడ "గ్రహణం" అని పడిపోయింది ఒక ఎక్స్ట్రా పదం, పరవాలేదు తొలగించుకోవచ్చు చదివేటప్పుడు.[/b] మీరు కొనసాగించండి, బావుంది కథ.
: :ఉదయ్
17-05-2024, 05:31 PM
(This post was last modified: 17-05-2024, 05:32 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-05-2024, 04:12 PM)Uday Wrote: బ్రదర్ ఇదేనా అమ్మాయిల లేటెస్ట్ కాన్సెప్ట్, ఇదేదో బానే వుంది గాని అన్నీ నచ్చిన అలవాట్లే ఉండి, ఇద్దరూ ఒకేలా ఉంటే అందులో మజా వుంటుందా. కొన్ని అసమానతలు, కొన్ని వైరుధ్యభావాలు వుంటేనే కాదా చిన్నచిన్న అలకలు, గొడవలూ రావడం, మళ్ళీ కలిసిపోవడం...జీవితమంటేనే సర్దుకుపోవడమే కదా. Thank you for your Review Bro.. Keep posting Your Views.. Ee kadhani simplify cheste Dating with Family laga.. Swapna enduku chestondi idanta anedi manaki mundu mundu telustundi.. ika Grahanal Vishayalaki vaste typing mistake emi ledu.. just madhu ki peddaga kavitvam raadu anthe.. tana uddesam lo swapna kallu ila unnay mari.. grahanam chuttu velugulaa
17-05-2024, 05:35 PM
(This post was last modified: 17-05-2024, 05:37 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-05-2024, 01:27 PM)sri7869 Wrote: Nice update (17-05-2024, 02:40 PM)Sushma2000 Wrote: Superb update (17-05-2024, 03:26 PM)Venrao Wrote: Superb line (17-05-2024, 03:27 PM)Vvrao19761976 Wrote: Nice update s (17-05-2024, 04:51 PM)Iron man 0206 Wrote: Nice update Sex Content lekapoyinaa ee kadhani aadaristunna mee andariki much much Thanks
17-05-2024, 06:08 PM
(17-05-2024, 05:31 PM)nareN 2 Wrote: Thank you for your Review Bro.. Keep posting Your Views.. సూపర్, కళ్ళలో కనుపాపలు పెద్దగా ఉంటే చాలా బావుంటాయి, మొహానికొక అమాయకత్వం/ముగ్దత్వం వస్తుంది. మధు ద్వారా మంచి పోలికని చెప్పించావు, ఎవరన్నారు మధుకి కవితలు రావని.. .
: :ఉదయ్
20-05-2024, 05:53 AM
(This post was last modified: 20-05-2024, 05:54 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
20-05-2024, 06:12 AM
Update baagundi
19-11-2024, 06:26 PM
(This post was last modified: 19-11-2024, 06:27 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
మధు (అంటే నేనే) - వినగా వినగా ఈ ప్లాన్స్ అన్ని జస్టిఫైడ్ గానే ఉన్నాయిరా..
అనిల్ - జస్టిస్ ఎవరికో జైలు ఎవరికో.. మధు (అంటే నేనే) - ట్రై చెయ్యొచ్చంటావా.. అనిల్ - అదేంట్రా ఇందాకటి దాగా ఊగావ్ గా.. నాకు ఆ పిల్లే కావాలి అని.. మధు (అంటే నేనే) - ఆ 5th టెస్ట్ ఏమై ఉంటుందంటావ్.. అనిల్ - HIV టెస్ట్ ఏమైనా చేయిస్తుందేమో.. నేను - ...... అనిల్ - ఆ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఏంట్రా.. నేను - మొహం పగలగొడితే నీ లవర్ నీతోనే ఉంటుందా వదిలేసి పోతుందా అని ఆలోచిస్తున్నా.. అనిల్ - నవ్వొచ్చే జోక్స్ వెయ్యరా.. నేను - నీకిది జోక్ లా ఉందా బె.. అనిల్ - ఇది కాదు.. మార్నింగ్ నుంచి నీ జీవితం లో జరిగేదంతా జోక్ లాగే ఉంది.. నేను - సరే లైట్ తీస్కో.. నేను వెళ్లి స్వప్న తో మాట్లాడుకుంటా.. అనిల్ - మామ అల్ ది బెస్ట్ చెప్పడానికి మనసొస్తలేదురా.. నేను - సరే బిల్ పే చేసి దొబ్బెయ్.. నైట్ 8 అయ్యింది.. ఒకేసారి ఇంత ఖర్చు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు.. అకౌంట్ లో 2 లక్షలే ఉన్నాయ్.. లవ్ చేసాక అప్పుల పాలు ఐనవాళ్ళని చూసా కానీ లవ్ స్టార్ట్ చెయ్యడానికే అప్పు చెయ్యాలా.. తను డీల్ చేసే పద్దతి హార్ష్ గా ఉంది కానీ.. కాన్సెప్ట్ పాతదే..లివింగ్ టుగెథెర్.. బట్ దాన్నే పద్ధతిగా పెద్దల సమక్షంలో.. ఓ సంగతి మర్చిపోయా.. అంతా ఓకే ఐన తర్వాత కూడా తను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎంత ఉంది దీనిలో.. మనవాళ్ళ మధ్య మన లైఫ్ బిస్కేట్ అయిపోవడం ఎంత మాత్రం బాగోదు.. సరే కన్ఫ్యూషన్ ఎందుకు..ఏదైతే అదే అవుతుంది అని 0402....... కి డయల్ చేశా.. 2024 లో కూడా ల్యాండ్ లైన్ వాడుతున్నారంటే వాళ్ళ ఫామిలీ ని ఓసారి నా ఇమాజినేషన్ క్రియేట్ చేసుకున్న.. 17 సెకన్ల తర్వాత.. హలో ఎవరు.. నేను - హలో నేను మధు మాట్లాడుతున్న..ఓసారి స్వప్న ని పిలుస్తారా.. అటునుంచి - స్వప్న ఇంకా రాలేదు.. ఈరోజు ఎదో పబ్ కి వెళ్లి వస్తా అంది.. 1 అవుతుందేమో.. నేను - తన మొబైల్ నెంబర్ ఇస్తారా.. అటునుంచి - తనే ఇవ్వలేదంటే తన నెంబర్ ఇవ్వడానికి నేనెవరిని.. ఫోన్ పెట్టేసి.. ఒక్కొక్కళ్ళు ఒక్కో అని ముత్యాల్లా ఉన్నారు.. ఇంతకీ ఇది ఏ పబ్ కి వెళ్లి ఉంటుందో.. నా శత్రువంటి మిత్రుడికి ఫోన్ చేద్దామా అని అలోచించి.. తర్వాత జరగబోయే డిస్కషన్ గుర్తొచ్చి ఫోన్ పక్కన పడేసా.. ఎరా భోజనం పెట్టనా అని అమ్మ అరిచింది హాల్ లోంచి.. తినాలని మనసుకు లేకపోయినా.. అమ్మ కోసం వెళ్లి కూర్చున్న.. అమ్మ ఎదో మాట్లాడుతోంది.. నా మైండ్ ఎదో ఆలోచిస్తోంది... మళ్ళీ పొద్దునే తనని చూసేది.. ఓకే చెప్తే ఏమంటుందో.. ఒక నెలలో తనని ఇంప్రెస్స్ చెయ్యాలంటే ఎక్కడెక్కడకి తీసుకు వెళ్లాలో.. అసలు ఇద్దరం లవర్స్ లా ఉంటామ.. ఫ్రెండ్స్ లా ఉంటామా.. అసలు ఉన్నదంతా తనకే ఇచ్చేస్తే ఈ నెల నా ఖర్చుల సంగతేంటో.. భోజనం ఎప్పుడైందో.. చెయ్యి ఎప్పుడు కడుక్కున్నానో.. ఎప్పుడు పడుకున్నానో.. కలలో కూడా తనే.. మెలకువ రాగానే అనిపించింది.. డ్రాప్ అయిపోతే.. హ.. డ్రాప్ అయిపోతే.. ఇంకో పిల్లని చూస్తాం.. లేదా ఇంట్లో వాళ్లే చూస్తారు.. పెళ్ళైపోతుంది.. లేదు.. స్వప్న.. బ్యూటీ విత్ మైండ్.. హార్ట్ కూడా చూడాలి.. మళ్ళీ పడుకున్నా.. నవ్వుకుంటూ.. xxxxx పొద్దున్నే..సేమ్ టైం.. సేమ్ పార్క్.. ఈరోజు నేనే పలకరించా.. హాయ్..అంటూ.. హాయ్ మధు.. ఏంటి ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నట్టున్నావ్... రాత్రంతా నిద్ర లేదులే.. మరి పద..జాగింగ్ చేస్తే..మత్తు వదులుతుందిగా.. పక్కన వాళ్ళ ఫ్రెండ్ అయోమయం గా చూస్తోంది.. స్వప్న నాతో అంత క్యాజువల్ గా మాట్లాడుతోంది ఏంటా అని.. కాఫీ కి పోదాం అన్నా.. వెళ్లి కూర్చున్నాక తనకంటే ముందే నేనే సర్వర్ ని పిలిచి ఆర్డర్ చేశా.. స్వప్న - హ చెప్పు ఏంటి విషయం.. రాత్రి కాల్ చేసావ్ ట.. నేను - నీకు శాలరీ ఇవ్వడానికి నాకు ఓకే.. బట్ నా శాలరీ 2 నే వస్తుంది.. అదే ఆలోచిస్తున్న.. స్వప్న - ఓహ్.. ఫిక్స్ అయ్యావా.. ఆల్రైట్.. 2 ఐన పర్లేదు లే.. ఈసారికి ఎడ్జెస్ట్ అవుతా.. ఐతే నీకు మన కండీషనల్ లవ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి.. నేను - హ చెప్పు.. స్వప్న - మనం 1st మీ ఇంటికి తర్వాత మా ఇంటికి వెళ్లి మన లవ్ సంగతి చెప్పాలి.. నేను - సరే.. స్వప్న - తర్వాత మన ఇద్దరం వన్ మంత్ ఒక రూమ్ తీసుకొని కలిసి ఉందాం.. అన్ని పనులు షేర్ చేసుకోవాలి.. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చెయ్యాలి.. ఒకళ్ళ కోసం ఒకళ్ళు మారకూడదు.. నేను - అదేంటి మనం లవర్స్ లా ఉంటామా స్ట్రేంజర్స్ లా ఉంటామా.. కలిసి ఉంటె కొన్ని విషయాలు కంప్రమైస్ అవ్వాల్సి వస్తుంది కదా.. స్వప్న - అదే.. ఆ విషయాలు మనకి ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దామనే కదా ఈ ట్రయిల్.. నేను - అర్ధం అయ్యింది.. స్వప్న - ఐతే వెళ్దామా.. నేను - అంతేనా ఇంకేం లేదా.. స్వప్న - అంటే నేను - అదే వన్ మంత్ తర్వాత ఓకే అనుకుంటే.. స్వప్న - హ ఓకే అనుకుంటే ఓకే నే కదా.. ఇంకేముంటుంది.. నేను - (మనసులో) అదేంటి వీళ్ళ ఫ్రెండ్ చాల ప్రాసెస్ చెప్పింది.. నేను - ఓకే.. 1st ఎక్కడకి వెళదాం.. స్వప్న - మీ ఇంటికే.. లొకేషన్ పెట్టు.. నేను రెడీ అయ్యి 1 అవర్ లో వస్తా.. అటునుంచి అటు మా ఇంటికి.. నేను - సరే.. ఇప్పటికైనా నెంబర్ చెప్తావా.. స్వప్న - (ఒక స్మైల్ ఇచ్చి) నోట్ చేస్కో.. 99........ తన ఫ్రెండ్ నాకేసి జాలిగా చూస్తూ జాగింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది.. దాని మొహం లే.. నిన్న అది చెప్పిన స్క్రీన్ ప్లే కి ఈరోజు జరుగుతున్నా సీన్ కి అసలు సంబంధమే లేదు.. లొకేషన్ షేర్ చేసి స్వప్న కి బాయ్ చెప్పి.. ఇంటికొచ్చి బాత్రూం లో దూరి.. షవర్ ఆన్ చేశా.. ఆహా ఎంత సుఖం గా ఉంది.... స్వాతి ముత్యపు ఝల్లులలో...
19-11-2024, 10:24 PM
Nice update
19-11-2024, 10:59 PM
manchi concept bhayya. flow kuda super undi.
koncham quickly updates iste baguntadi |
« Next Oldest | Next Newest »
|