Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - అనంత
#1
మితృలకోసం పౌరాణిక కథలు పొందుపరుస్తాను.

చదివి, కొన్ని గాథలు తెలుసుకోండి.

బుధవారం మొదటి కథ ఇల
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Novels - Grandhalu


మిత్రమా 

పౌరాణిక కథలు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3
వీటిని చిన్న కథలుగా ఇవ్వబోతున్నాను.

ఒక్కొక్కటి 5 నుండి 8 పేజీలు మాత్రమే. ఒక్కసారి ఒక్కో కథ ఇద్దామని ఆలోచన.

కనుక వీటిని గ్రంధాలుగా పరిగణణలోకి రావు.

ఒకవేళ మీరు మార్చుతానంటే అభ్యంతరం లేదు సరిత్ గారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
నేను పోస్టుచేశినవన్నీ రెండు సార్లు వస్తున్నాయి, చాలా సార్లు! ఎందుకో మరి?
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
Waiting sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
#6
ఇల

    
[font=var(--ricos-font-family,unset)][Image: image-2024-10-30-082904584.png]
[/font]


రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



సృష్టి ఆద్యంతాల కాల చక్రాన్ని వేద పురాణేతిహా సాలు సశాస్త్రీయంగా లెక్కగట్టాయి. వేద పురాణేతిహా సాల లెక్క ప్రకారం 14 మంది మనువుల పరిపాలనా కాలం బ్రహ్మ దేవునికి పరిపూర్ణ దినము. ఒక మనువు పరిపాలనా కాలాన్ని ఒక మన్వంతరం అని అంటారు. ప్రతి మన్వంతరం 71 మహా యుగాలుగా విభజింపబ డింది. 



 ఒక సత్య యుగం, ఒక త్రేతా యుగం, ఒక ద్వాపర యుగం, ఒక కలియుగంలను కలిపి ఒక మహా యుగం అని అంటారు. ప్రస్తుతం మనం ఏడవ మనువు వైవస్వత మనువు కాలంలో 28 కలియుగంలో ఉన్నాము. వివస్వత, సంజ్ఞ పుత్రుడు వైవస్వత మనువు. ఇతనికి సత్య వ్రతుడు, శ్రాద్దాదేవుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. 



 ఒకసారి సూర్య వంశానికి చెందిన వైవస్వత మనువు తన భార్య శ్రద్దాదేవితో కలిసి వేద సరస్వతీ మాత ను సందర్శించాడు. సమయంలో హంస వాహిని అయిన వేద సరస్వతీ మాత తన చేతిలోని కచ్ఛపి వీణను మైమరచి వాయిస్తుంది. వీణా నాదంలో ఉదాత్తాను దాత్తాల వాక్ దేవత లు మహదానందంతో వాగ్రూప నృత్యాలను చేస్తున్నారు. 



అందులో ఇడా అనే వాక్స్వ రూపం దేదీప్యమానంగా ప్రకాసిస్తూ మంత్రోక్తం గా నర్తించడం వైవస్వత మనువు తన భార్య శ్రద్దాదేవి కళ్ళారా చూసారు. మనసార మహదానందం పొందారు. దివ్య స్వరూపం వారి మనసులో అలా నిలిచి పోయింది. 



కొంత సమయానంతరం వేద సరస్వతీ మాత వీణను వాయించడం నెమ్మదిగా ఆపింది. ప్రశాంతంగా చుట్టూ ఉన్న ప్రకృతిని చూసింది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న వైవస్వత మనువు, శ్రద్దాదేవి ఆమె కంట పడ్డారు. వైవస్వత మను దంపతులను చూడగానే వేద సరస్వతీ వదనం వేద విజ్ఞాన తేజంతో మరింత వికసించింది. వేద సరస్వతీ మాత వైవస్వత మను దంపతులను "శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు" అని దీవించింది. 



"సంతాన లేమి కారణంగానే మేము మిమ్మల్ని
ప్రత్యేకంగా దర్శించుకోవటానికి వచ్చాం మాత. అడగ కుండానే మా మనసులను కనిపెట్టి వరాలిచ్చే తల్లి వేద సరస్వతీ మాతకు వేల వేల వందనాలు. "అని రెండు చేతులు జోడించి వేద సరస్వతీ మాతతో అన్నాడు వైవస్వత మనువు. 



 "వైవస్వత మను దంపతులార! కాల చక్ర ధర్మం ప్రకారం మీ సంతాన లేమికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నేడు కారణం అకారణంగానే తొలగిపోయింది. ఇక మీకు సంతానమే సంతానం" విజ్ఞాన చిరు దర హాసం తో అంది వేద సరస్వతీ మాత. ఆమె మాటల వెనుక ఓంకార శబ్ద స్వరాలు విజ్ఞానాత్మకంగా వినపడు తున్నాయి. 
"అకారణంగా తొలగి పోయిన కారణం ఏమిటి వేద సరస్వతీ మాత?" అని హంసవాహినిని అడిగింది శ్రద్దాదేవి. 



"మహోన్నత విజ్ఞాన దివ్య తేజోస్వరూపవిలాస విన్యాసం కారణం. మీరు నన్ను సందర్శించవలసిన సమయంలో సందర్శించారు. వాక్ దేవతలైన సరస్వతి, ఇడ, భారతులను మీరు సందర్శించిన పిమ్మటనే మీకు సంతాన ప్రాప్తి కలగాలన్నది మీ లలాట లిఖితం. అదే మీ సంతాన లేమికి ప్రధాన కారణం. 



 మీరు ఇప్పుడు నాలోని వేద దేవతా వాక్ ను సందర్శించారు. వాక్కులతో అనుబంధించబడిన వాక్ దేవత గురించి ఋగ్వేదం, జ్ఞాన ఋక్కులతో విజ్ఞానాత్మక వర్ణన చేసింది. అలాంటి వాక్ దేవతను మీరు ఇప్పుడు సందర్శించారు. వాక్ దేవతలో మిత్రావరుణులు, ఇంద్రాగ్నులు అనే దేవతలు ఉంటారు. మిత్రావరుణులు లింగ మార్పిడి విద్యలో మంచి నైపుణ్యం కల వారు. వాక్ దేవతలైన సరస్వతి, ఇడ, భారతిల సుస్వరూపమే వేద సరస్వతి. మీరు వేద సరస్వతిని సహితం సందర్శించారు. సరస్వతి, ఇడా, భారతులను కూడా సందర్శించారు. 



మీరు సరస్వతి, ఇడా, భారతులను సందర్శించిన వెంటనే మీ సంతాన లేమికి గల కారణం అలా అలా కనుమరుగై పోయింది. ఇక మీరు సౌందర్య సంతాన సాగర సందర్శనలో ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు చూస్తారు" అని విజ్ఞాన తేజో వికాసంతో సరస్వతీ మాత వైవస్వత మను దంపతులను ఆశీర్వదించింది. 
 "నమో వాక్ దేవి.. నమో ఇడ.. నమో సరస్వతి.. నమో వేదవతి.. నమో వాణి.. నమో శారద.. నమో పుస్తి.. నమో వాగీశ్వరి.. నమో వీణాపాణి.. నమో భారతి.. నమో అష్ట వాగ్దేవి స్వరూపిణి.. నమో వాసినీ.. నమో అరుణా.. నమో కామేశ్వరీ.. నమో కౌలినీ.. నమో జయినీ.. నమో మోదినీ.. నమో విమలా.. నమో సర్వేశ్వరీ.. " అంటూ మహా భక్తి భరిత హృదయాలతో వైవస్వత మను దంపతులు వేద సరస్వతిని ప్రా ర్థించారు. 



"శుద్ది చేయబడిన జ్ఞానం కు మీరు తలిదండ్రులు అవుతారు" అని వైవస్వత మను దంపతులను వేద సరస్వతీ మాత మరలా ఆశీర్వదించింది. 



 వేద సరస్వతీ మాత ఆశీర్వాదాలను తీసుకున్న వైవస్వత మను దంపతులు అగస్త్య మహర్షి దంపతులను కలిసారు. అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్ర, వైవస్వత మనువు ధర్మపత్ని శ్రద్దాదేవిని దగ్గరకు తీసుకొని శ్రద్దాదేవి ముఖాన్ని నిశితంగా పరిశీలించింది. 



"వాక్ దేవతా స్వరూపానికి తల్లివి కాబోతున్నావు. నీ జన్మ ధన్యం" అని లోపాముద్ర శ్రద్దాదేవి ని ఆశీర్వదించింది. 



"యాగాగ్నిన పునీతులుకండి. సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. " అని అగస్త్య మహర్షి వైవస్వత మను దంపతులను ఆశీర్వదించాడు. 



వైవస్వత మనువు అగస్త్య మహర్షి తో, "మహర్షోత్తమ! సంతాన ప్రాప్తి కి చేయవలసిన యాగం ఏమిటో మీరే సెలవివ్వండి. యాగం మీ ఆధ్వర్యంలోనే వశిష్టాది మహర్షుల నడమ జరగాలన్నది నా కోరిక. " అని అన్నాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#7
అగస్త్య మహర్షి, " వైవస్వత మను దంపతులార.. యాగానికి కావాల్సిన వస్తువులను మీ దంపతులే స్వయంగ సేకరించండి. యాగానికి కావాల్సిన ఏయే వస్తు వులను ఎలా సేకరించాలో మా ఋషులు మీకు దగ్గరుండి చెబుతారు. అలా చేయడం వలన సత్ఫలితాలు మెండుగా దండిగా ఉంటాయి" అని వైవస్వత మను దంపతులతో అన్నాడు. 



వైవస్వత మనువు అలాగేనన్నాడు. ఋషుల సహాయం తో వైవస్వత మను దంపతులు యాగానికి కావాల్సిన "హయ్యంగ వీనం, క్షీరం, యవలు, సమిధలు, కుశం, కాశం, యవం, ధూర్వం, విశ్వామిత్రం, ఉసీరం, గో ధూమం, కుందురం, వీహ్రి, ముంజం, జుహువులు, ఉప భృత్తులు, పవిత్ర జలం" వంటి వస్తువులన్నిటి మంత్రోక్తంగా సేకరించవలసినవి సేకరించారు. మంత్రోక్తంగా తయారు చేయవలసినవి తయారు చేసారు.. వారు యాగ వస్తువులను సేకరించేటప్పుడు వారి మనసులో వాక్ దేవత ఇడా నే మెదలసాగింది. 



యాగ తేజస్సులందు ప్రకాశించే మిత్రావరుణులు లింగ మార్పిడి విజ్ఞాన విద్యా చర్చలు చేసారు. సృష్టి లోని రసాయన దళ ప్రభావాల గురించి ఇద్దరూ చర్చించు కున్నారు. అలాగే లింగ మార్పిడి పై ఆసక్తి చూపించే వారి మనస్తత్వం గురించి చర్చించుకున్నారు. 



అగస్త్య మహర్షి మిత్రావరుణుల కృపను ప్రధానంగా 
చేసుకుని యాగం మొదలు పెట్టాడు. వశిష్టాది మహర్షు లు కూడా యాగ కార్యక్రమాదులను నిర్వహించడం లో భాగస్వాములు అయ్యారు.. 



అగస్త్య మహర్షి వైవస్వత మను దంపతుల వదనాన్ని పరిశీలించి అందుకు తగిన విధంగా యాగం చేయసాగాడు. యాగ సమయం లో అగస్త్య మహర్షి "వైవస్వత దంపతులారా! మీరు మగ సంతానాన్ని కోరుకుంటున్నారా? ఆడ సంతానాన్ని కోరుకుంటున్నారా?" అని వైవస్వత మను దంపతులను అడిగాడు. 



వైవస్వత మనువు రాజ్య పరిపాలనకు మగసంతానమే మేలు అన్న దృష్టితో "మగసంతానం కోరుకుంటున్నాం " అని అగస్త్య మహర్షి తో అన్నాడు. భర్త మనసు ను గమనించిన శ్రద్దాదేవి భర్త మాటను బలపరిచింది. 



యాగం నుండి వచ్చిన పొగలను వైవస్వత మను దంపతులు భక్తి శ్రద్ధలతో తనువు పులకించి పోయేటట్లు పీల్చారు



 కొంత కాలానికి శ్రద్దాదేవి నెల తప్పింది. పండంటి పసిపాపకు జన్మను ఇచ్చింది. పసి పాపను చూసిన వైవ స్వత మనువు, "మేం మగ సంతానాన్ని కోరితే ఆడ సంతానం కలిగిందేమిటి మహర్షి?" అని అగస్త్య మహర్షి ని అడిగాడు. 



 అగస్త్య మహర్షి తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించాడు. అంత, "వైవస్వత దంపతులారా! మీరు పుత్ర సంతానము ను కోరినప్పటికి మీ భార్యాభర్తల మనసు లో వాక్ దేవత ఇడా స్వరూపమే ఉంది. నేను యాగం చేస్తున్నప్పుడు కూడా మీ భార్యాభర్తల వదనాన వాక్ దేవత ఇడా స్వరూపమే ప్రకాశిస్తుంది.. అప్పుడు నేను కూడ అప్రయత్నంగా వాక్ దేవత ఇడా స్వరూప సంబంధ మంత్రోచ్ఛారణననే చేసాను. అందుకే మీకు ఆడ సంతానం కలిగింది. 



మనసులో ఒకటి పెట్టుకుని మరేదో అవసరం అనుకుంటూ మనసులోనిది కాకుండా మరొకటి కోరితే ఫలితం కూడా రెండు రకాలు గా ఉంటుంది. జరిగింది ఏదో కాల ధర్మానుసారం జరిగిపోయింది. మీరు పాపకు ఇల అని పేరు పెట్టండి. పాపలో పుంభావ సరస్వతి కూడా కనపడుతుంది. కాబట్టి కాల ధర్మానుసారం ఇల పురుషుడుగా కూడా మారతాడు" అని వైవస్వత మనువు తో అన్నాడు. 



 వైవస్వత మను దంపతులు అగస్త్య మహర్షి మాటలను శిరసావహించారు. వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఇల ను అల్లారు ముద్దుగా పెంచ సాగారు. ఇల కిలకిల నవ్వులు మిలమిల మెరిసే వేద విజ్ఞాన కళికలయ్యాయి. ఇల బుడిబుడి నడకలు విశ్వకంపనోద్భవ సుస్వరాలయ్యాయి. 



 ఇల ఓం అని మొదట పలికిన పిదపనే అమ్మ అత్త అనసాగింది. విశ్వ కంపనోద్భవ స్వరూపమే ఓం కారమని మాట్లాడటం మొదలు పెట్టింది. ఇల వాక్ శుద్ది ని చూచి వైవస్వత మనువే ఆశ్చర్యపోయాడు. కూతురైన ఇల దగ్గర వైవస్వత మనువు శిష్యరికం చేసాడు. వాక్ దేవత లా ప్రకాశించే ఇల, తండ్రి వైవస్వత మనువుకు అనేక పవిత్ర మంత్రములను బోధించింది. మంత్రముల మాటున ఉన్న ఉదాత్తానుదాత్త స్వర నిర్మాణముల గురించి చెప్పింది. స్వర నిర్మాణం మాటున ఉన్న మాత్రికాది గణిత నిర్మాణాల గురించి వివరించింది. గణితగుణగణ ధర్మాలు లేని కొన్ని అశుద్ద మంత్రాలు వేదాలలోకి ఎలా చొచ్చుకు వచ్చాయో చెప్పింది. 



ఇల తండ్రికి, అగస్త్య, వశిష్టాది మహర్షులకు అశ్వ మేథ యాగంలో ఉన్న మంత్రాల గణిత ధర్మాల గురించి చెప్పింది. అంత, "గణితధర్మమున్న మంత్ర భరితమైన యాగమైన హింసాభరితంగ ఉండదు. కొందరు పరి పూర్ణతలేని ఋషులు స్వల్ప సాధనతో గొప్ప గొప్ప యాగాలను జరిపిస్తారు. యాగం జరిపించాలంటే ఋషి కి కావల్సింది కేవలం మంత్రోచ్ఛారణ ఒకటే కాదు. మం త్రోచ్ఛారణలోని ఉదాత్తానుదాత్తాది స్వరాల నడుమన ఉన్న గణిత తేజం, సుర తేజ సౌందర్యం చూడగల నైపుణ్యం రావాలి. 



ఆపై తేజో భరిత హృదయం ఉండాలి. ఆయా దైవాంశలను నిక్షిప్తం చేసుకున్న గణితాత్మక, గు ణాత్మక మంత్రోచ్ఛారణ తెలిసి ఉండాలి. అది సరిగా అబ్బనివారు యాగాలను పలురకాల జీవ బలులకు పరిమితం చేస్తారు. అలా యాగం చేయించేవారిని భయ పూర్వక భక్తికి అలవాటు చేస్తారు
 వేదాలలో అశ్వమేధ యాగ స్వరూపం జీవ బలులతో కూడుకుని ఉంటుంది. నిజానికి వేద జ్ఞాన మూలం తెలిసినవారు బలిని సమర్థించరు. అశ్వ మేధ యాగం లో మంత్ర జలంతో శుద్ది చేయబడిన గుర్రం హయగ్రీవ స్వామి తో సమానం. అశ్వమేధ యాగం సందర్భాన అశ్వమును హింసించడమంటే విష్ణు మూర్తి ని హింసించినట్లే అవుతుంది." అంటూ ఇల అశ్వమేధ యాగం యొక్క గొప్పదనమును వివరించింది. అశ్వమేధ యాగం ప్రత్యేకతలను తెలియ చేసింది. 



 ఇల చెప్పిన వేద మూలాంశాలు అన్నిటినీ విన్న అగస్త్య మహర్షి, వశిష్ట మహర్షి "ఇల మగవాడైతే సశాస్త్రీయ అశ్వమేధ యాగాలు అనేకం జరుగుతాయి. వాటితో ప్రకృతి కాలుష్యం సమస్తం తొలగిపోతుంది. ఇలన పాడిపంటలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు అన్నపానీయాలకు అసలు కొదవ ఉండదు. "అని అనుకున్నారు.
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#8
 అశ్వమేధ యాగం యొక్క గొప్పదనమును తెలియ చేసిన ఇలను అగస్త్య మహర్షి, వశిష్ట మహర్షులు మిత్రావరుణుల సహాయం తో మగవానిగ మార్చారు.. మగవానిగ మారిన ఇలకు వశిష్ట మహర్షి యే సుద్యుమ్నుడు అనే పేరు పెట్టాడు. 



 వైవస్వత మను దంపతులు తమ కుమారుడైన సుద్యుమ్నుని చూసుకుని మహా మురిసిపోయారు. వైవస్వత మనువు ఇల సుద్యుమ్నునిగ మారిన రోజును పవిత్రరోజుగ భావించి సుద్యుమ్నునికి జన్మదిన వేడుకలను జరిపించారు. రాజ్యంలోని వీరులు, శూరులు, పరాక్రమవంతులు అందరూ సుద్యుమ్నుని జన్మదిన వేడుకలను ఘనంగ జరిపించసాగారు. 



 ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, వేదాంతులు, సరస్వతీ ఉపాసకులు, సరస్వతీ మాత భక్తులు అందరూ ఇల జన్మదిన వేడుకల ను యథావిధిగా జరుపుతూనే ఉన్నారు. ఇల జన్మదిన వేడుకలు వసంత పంచమి వేడుకల్లా ఉంటాయని వేడుకలను చూసిన వారందరూ అనుకునేవారు. 



నూనూగు మీసాల నూత్న యౌవన సుద్యుమ్నుని చూసిన ఋషికాంతలు సహితం మతితప్పి రతీ దేవి మాయలో పడ్డారు. సుద్యుమ్నుని కౌగిలిలో కరిగి పోవాలని కలల మీద కలలను కనసాగారు. 



 తన తనువులో వాక్ దేవత ఇడా తత్వమున్నదన్న సంగతిని గ్రహించిన సుద్యుమ్నుడు యుగ ధర్మానుసారం సశాస్త్రీయంగా అనేక అశ్వమేధ యాగాలను చేసాడు. తను చేసిన అశ్వ మేథ యాగాల నుండి వచ్చిన పొగ ప్రభావం తో ప్రకృతి మాత యుగ ధర్మానుసారం పరవసిస్తూ ప్రజలకు ప్రమోదాన్ని అందించసాగింది. అలా ప్రతిష్టాన పుర ప్రజల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఆనందంగా కొనసాగింది. 



 కైలాసం లో ఉండే పార్వతీ పరమేశ్వరులు లయ చక్ర స్థితిగతుల గురించి చర్చించుకున్నారు. సృష్టి స్థితులలోని వికాస విన్యాసం గురించి ముచ్చటించు కున్నారు. అనంతరం వన విహారం నిమిత్తం కుమార వనానికి వెళ్ళారు. గణపతి పుట్టుకను గుర్తు చేసుకు న్నారు. కుమార వనంలో ఉన్న శరవణ వనంలో కాసేపు ప్రశాంతంగా సంచరించారు. 



అక్కడ పార్వతీ పరమే శ్వరులకు కుమార స్వామి గుర్తుకు వచ్చాడు. ఇరువురు శరవణ వనంలో ఉన్న ప్రతి రెల్లు పువ్వులోని మాతృ తేజంను, మహా సౌందర్య మగువ తేజం ను సందర్శిం చారు. "ఒక్కొక్క నేల తీరు, ఒక్కొక్క ప్రాంతం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో అడుగు పెడితే గొడ్రాలు కూడ గంపెడు సంతానం తో కళకళలా డుతుంది. మరో ప్రాంతంలో అడుగు పెడితే సంతాన సిరి పుష్కలంగా ఉన్న పుణ్యవతి సహితం గొడ్రాలిగ చరిత్రకు ఎక్కుతుంది" అని పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారు. 



పార్వతీ మాత పరమశివునితో "నాథ, శరవణ వన అందం నానాటికి ద్విగుణీకృతం అవుతుంది. వనాన్ని చూస్తుంటే, మహర్షులు సహితం మన్మథుల య్యేటట్లు ఉన్నారు" అని అంది. 



పార్వతీ మాత మాటలను విన్న పరమశివుడు చిరుదరహాసం తో "దేవీ.. అలా అయితే మనుషుల సంఖ్య తగ్గి మన్మథుల సంఖ్య పెరుగుతుంది. శరవణ వనం కళే మారిపోతుంది. కాబట్టి శరవణ వనంలో నేను తప్ప మగవాడు అడుగు పెట్టిన మగువగా మారిపోతాడు. జన్మతో వచ్చిన జ్ఞానం ను తప్ప గతాన్ని మరిచి పోతాడు. మహా మహర్షుల ప్రభావం తో అతడు గతం ను గుర్తు చేసుకొనవచ్చును. చిత్రవిచిత్ర వరశక్తిని నేను శరవణ వనానికి ఇస్తున్నాను. " అని అన్నాడు. 
"శరవణ వనానికి మీరిచ్చిన వర శక్తి అమోఘం. " అని పరమశివునితో పార్వతీ మాత అంది. విషయం తెలిసిన ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు సురనర యక్షగందర్వకిన్నెర కింపురుషాదులైన మగవారు వనం వైపు కన్నెత్తి చూడటం కూడా మానేసారు. 



శరవణ వనం గురించి తెలిసిన కొందరు కుసంస్కార పండితులు శరవణ వనంలో సంచరించే పార్వతీ పరమేశ్వరుల నగ్న క్రీడలకు భంగం కలుగుతుంది అని పర మేశ్వరుడు శరవణ వనానికి వరశక్తిని ఇచ్చాడని ప్రచారం చేసారు. 



 కుసంస్కార పండితుల మీద పార్వతీ మాత ఆగ్రహించి వారిని భస్మం చేయాలనుకుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ మాతను శాంతింప చేసి, "దేవీ.. తమ పాండిత్యంతో పుడమిని వికాసవంతం చేసే పండితులే కాదు, పుడమిని విషతుల్యం చేయాలనుకునే పండితులుకూడ పుడమిన ఉంటారు. వారి ఉన్మాద చేష్టలు, ఉన్మాద మంత్రాలు కూడా వేదాలకు ఎక్కుతాయి. వాటిని గమనించి, వాటికి దూరంగా ఉన్నవాడే నిజమైన వేద పండితుడు. 



కామక్రోధాత్మక కథలు, పాండిత్యం యాగాలు ఎంత వేగంగా పుడతాయో అంత వేగంగా కనుమరుగై పోతాయి. అంతా కాల పురుషుడే చూసు కుంటాడు. " అని అన్నాడు. 



 అనేక అశ్వమేధ యాగాలు చేసిన సుద్యుమ్నుడు ఒకసారి విశ్వ సంచారం చేస్తూ పొగరుబోతు అయిన ఒక యక్షునితో యుద్దానికి సిద్దపడ్డాడు. సుద్యుమ్నుని ముందు యక్షుని మాయలు పనిచేయలేదు. అది గమనించిన యక్షుని భార్య తన భర్తను రక్షించుకోవడానికి జింక రూపం ధరించింది. జింక రూపంలో ఉన్న క్షుని భార్య సుద్యుమ్నుని ముందుకు వచ్చింది. యక్షు డు కాలికి బుద్ది చెప్పాడు.



సుద్యుమ్నుడు పలు రంగుల్లో ప్రకాసిస్తున్న జింకను పట్టుకోవాలని ప్రయత్నించాడు. జింక సుద్యు మ్నునికి దొరకకుండా కుమారవనం వైపుకు పరుగులు తీసింది. సుద్యుమ్నుడు జింకను తరుముకుంటూ అశ్వం మీదనే కుమార వనంలో ఉన్న శరవణ వనానికి వచ్చాడు. 



సుద్యుమ్నుడు అశ్వంతో శరవణ వనంలోకి ప్రవేశించి నంతనే ఇల గా మారిపోయాడు. అశ్వం తన మీద ఉన్న ఇలను చూసి పెద్దగా సకిలించింది. ఇల అశ్వం మీదనుండి కిందకు దిగింది. 



శరవణ వనం మొత్తం చూసింది. శరవణ వన శోభలో ప్రకాశిస్తున్న షణ్ముఖుని ఋగ్వేద సూక్తులతో స్తుతించింది. ఇల సూక్తులను విన్న అశ్వం ఆనందంతో హయ గ్రీవ నృత్యం చేసింది. 



ఇల కుమార వనం మొత్తం దర్శించింది. అక్కడి అర్థనారీశ్వర తేజాన్ని అవగతం చేసుకుంది. అశ్వం ఇలను అనుసరించింది. 



 ఇల అశ్వం మీద కుమార వనం నుండి చంద్ర వనం వచ్చింది. అక్కడ చంద్రుని కుమారుడు బుధుడు
తపస్సు చేసుకుంటున్నాడు. బుధుడు ఇలను చూసాడు. 

 ఇల అందమును చూడగానే బుధుని మనసులోని తపో తేజం కరిగి పోయింది. మన్మధుడు బుధుని ఆవహించాడు. అంత బుధుడు ఇల అశ్వము ముందు నిలబడ్డాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#9
"మానినీ మణి.. ఇలలో నీ అంత అందగత్తె మరొకరు లేరన్నది అక్షర సత్యం. ముఖ్యంగా నీ అందంలో జ్ఞాన తేజం జ్ఞానవంతంగ వెలుగుతుంది. నీలాంటి జ్ఞాన తేజ అందగత్తె ఇలలోనే కాదు పదునాలుగు లోకాలలో ఎక్కడా ఉండదన్నది నిజం నిజం నిజం. ఇంతకీ నీ పేరేమిటి?" అని బుధుడు ఇలను అడిగాడు. 



ఇల గుర్రం దిగి బుధుని ఆపాదమస్తకం ఒకసారి పరిశీలించింది. " తపోధన.. ప్రస్తుతం నా పేరేమిటో నాకే గుర్తు రావడం లేదు. నేనైతే ప్రదేశానికి చెందిన దానిని కాదు. నేనిక్కడకు ఎలా వచ్చానో నాకు అసలు జ్ఞాపకం రావడం లేదు. నన్నేదో మాయావలయం ఆవరించింది అని నాకు అనిపిస్తోంది. ఇంతకీ తమరెవరు?" అని ఇల బుధుని అడిగింది. 



"నా పేరు బుధుడు. తారాశశాంకాల తనయుడుని. నా తలిదండ్రుల వివాహ విధానం తలచుకుని ఇప్పటికీ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. నన్ను చూసి సహ్యం గాని రీతిలో నవ్వుకుంటున్నారు. వారి నవ్వును ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే నేను ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. అదిసరే నువ్వు కొంత కాలం ఇక్కడే ఉండు. ఇక్కడకు ఎందుకు వచ్చావో ఎలా వచ్చావో నెమ్మదిగా గుర్తు చేసుకో. " అని బుధుడు ఇలతో అన్నాడు. 



 ఇలకు బుధుని మాటలు నచ్చాయి. బుధునితో ఇల అలాగే అంది. బుధుడు ఇలకు ప్రత్యేక పర్ణశాలను ర్పాటు చేసాడు. 



ఇల తన గతాన్ని మరిచిపోయింది కానీ పుట్టుక తో వచ్చిన జ్ఞానంను మాత్రం మరిచిపోలేదు. ఇల పఠించే ఋగ్వేద మంత్రాల ఉదాత్తానుదాత్త స్వరాల గణిత చక్రాలు బుధుని మనసును ఆకర్షించాయి. ఇల ఖాళీ సమయంలో తన దగ్గర ఉన్న గుర్రం దగ్గరకు వెళ్ళి దానిని పరిశీలించేది. అలా తను అక్కడకు ఎలా వచ్చింది తెలుసుకోవడానికి ప్రయత్నించేది. 



 ఒకనాడు ప్రాంతంలో రాళ్ళ వర్షం కురిసింది. ఇల తన ఋగ్వేద పఠనంతో రాళ్ళ వర్షాన్ని ఆపగలిగింది. ఇల ఋగ్వేద పఠన ప్రభావం తో బుధుని తలమీద పడబోతున్న కొండరాయి ముక్కలు ముక్కలయ్యింది. అయితే ఆమె ఎంత ఆలోచించినా ఆమె గతం ఆమెకు గుర్తుకు రాలేదు. 



 ఇలా కొంత కాలం గడిచిపోయింది. ఇలాబుధులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అక్కడ ఉన్న మహర్షుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పురూరవుడు అని పేరు పెట్టారు. 
 ఒకనాడు వశిష్ట మహర్షి ఇలాబుధులు ఉన్న ప్రాంతమునకు వచ్చాడు. ఇల వశిష్ట మహర్షి ని గుర్తు పట్టింది. వశిష్ట మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. 



వశిష్ట మహర్షి బుధునికి ఇల ఎవరో సమస్తం వివరించి చెప్పాడు. వైవస్వత మను దంపతులను, అగస్త్యాది మహర్షులను అక్కడికి రప్పించాడు. 



అగస్త్య మహర్షి మిత్రావరుణుల సహకారంతో, పార్వతీపరమేశ్వరుల కృపతో ఇలను సుద్యుమ్నునిగ మార్చాడు. సుద్యుమ్నుడుగ మారిన ఇల బుధుని, తన కుమారుడు పురూరవుని గుర్తు పట్టలేక పోయింది. 



బుధుడు అగస్త్య మహర్షికి నమస్కారం చేసి, , " మహర్షోత్తమ! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో మీరే సెల వివ్వాలి. " అని అన్నాడు. 



బుధుని మాటలను విన్న అగస్త్య మహర్షి, " శశాంక పుత్ర బుధ! ఇల స్త్రీగానే పుట్టింది. ఆమె తనువు స్త్రీత్వం లోనే దేదీప్యమానంగా విజ్ఞానవంతంగ ప్రకాశిస్తుంది. ఆమె తలిదండ్రుల చిరుకోరిక కారణంగా ఇల సుద్యుమ్నుడుగా లింగ మార్పిడి కి గురయ్యింది. 



ఇల వాక్ దేవత ఇడా స్వరూపం. ఇడా స్వరూపంలో సరస్వతీ తేజం, పుంభావ సరస్వతీ తేజం రెండూ ఉంటాయి. అందుకే ఇల సుద్యుమ్నునిగా కూడా కొంత కాలం ఉండగలిగింది. 
ఇల ఇకపై ఇలగానే ఉం టుంది. చంద్రవంశ బీజ తేజంగా యశసిస్తుంది. " అని పార్వతీపరమేశ్వరులను పూజించి, మిత్రావరుణుల సహాయంతో అగస్త్య మహర్షి సుద్యుమ్నుని ఇల గా మార్చాడు. 



 ఇల అక్కడ ఉన్న వారందరిని చూసింది. అందరికి నమస్కరించింది. కుమారుని దగ్గరకు తీసుకుంది. బుధుని సమీపించింది.. 



అప్పుడే అక్కడకు వచ్చిన నారద మహర్షి ఇల కు నవాక్షర మంత్రం ను నేర్పాడు. ఇల నవాక్షర మంత్రాన్ని శాస్త్రోక్తంగా పఠించింది. అప్పుడు మిత్రవరుణ ఇంద్రాగ్నుల తేజం వధూపీఠ ద్వజం మీద వెలుగొందాయి. ఇల తేజంలో నిలిచి వాక్ దేవత ఇడా గా అందరికి దర్శనం ఇచ్చింది. ఆపై వాక్ దేవత ఇడా ఇల గా అందరి ముందు నిలిచింది. 



ఇల సరస్వతీ నది ఒడ్డున పవిత్ర ప్రదేశాన్ని ఎన్నుకుంది. అక్కడ నియమబద్ధంగా, ఆచార బద్దంగా అనేక యాగాలను మహర్షులతో చేయించింది. యాగంలో పా ల్గొన్న వారందరికీ తనే స్వయంగా భోజనం చేసి పెట్టింది. 



 ఒకనాడు యాగమునకు కావల్సిన నెయ్యి సకాలంలో మహర్షులకు అందలేదు. అప్పుడు ఇల వాక్ దేవత ఇడా గా మారి నెయ్యి కారుతున్న పాదాలతో గోబృందం నడుమ నిలబడింది . మహర్షులు ఋగ్వేద మంత్రోక్తులతో ఇడ పాదాల నుండి కారుతున్న నేతిని యాగం నిమిత్తం స్వీకరించారు . ఆపై "ఓం ఇల్లాయ నమః"అంటూ మహర్షులు ఇల ను స్తుతించారు. 



అలా ఇల ఘృతపది అయ్యింది. ఇల యాగాలు చేయించిన ప్రదేశాన్ని అందరూ ఇలా భూమి అని పిలవసాగా
రు. 

 వైవస్వత మను దంపతుల, మహర్షుల సూర్యచంద్రాది దేవతల ఆశీస్సులతో ఇలాబుధులు అన్యోన్యంగా జీవించారు. వారికి పురూరవునితో పాటు, ఉత్కళ, గయ, వినతాశ్వ అనే పేర్లుగల కుమారులు కూడా కలిగారు



                    శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#10
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#11
మాధవి
 
[font=var(--ricos-font-family,unset)][Image: image-2024-11-04-132354684.png][/font]
[font=var(--ricos-font-family,unset)] [/font]

విధిరాతను మించిన రాత సమస్త లోకాలలో మరొకటి లేదు. విధికి ఉన్నంత బలం మరి దేనికి లేదు. విధిరాత మీద రాళ్ళు రువ్వేవారి మాటలు కాల చక్రం ముందు వెలవెల పోతాయి. కాల చక్ర ధర్మం తెలుసు కోకుండా కారుకూతలు కూసేవారి మాటలు కాల గమనం లో కరిగిపోతాయి. కాలానికి ఉన్నంత అనుభవం అవని మీద అవతరించిన అవతార పురుషులకు కూడా లేదనడం మాత్రం అతిశయోక్తి కాదు. 



 భూమి మీద మహోన్నత తేజం తో అవతరించిన అవతార పురుషులు సహితం కాల ధర్మాన్ని అనుసరించారు. తమ వనవాసాన్ని ఘన వాసంగా భావించారు. ముని సందోహం నడుమ ప్రశాంతంగా జీవించారు. తాము చేయగలిగినంత పరోపకారం చేసారు. 



వారే మహా పురుషులు గా చరిత్రలో నిలిచిపోయారు. 



 వేద పురాణేతిహాసాల మూలాలు తెలుసుకోకుండా బ్రహ్మ కు సరస్వతీ దేవి ఏమౌతుంది? విష్ణుమూర్తి కి ఎందరు భార్యలు? మహా శివుడు గంగ దగ్గర ఎన్నాళ్ళు ఉంటాడు? పార్వతి దగ్గర ఎన్నాళ్ళు ఉంటాడు? వంటి చర్చలు చేసేవారు ఉన్నంతగా, వైవస్వత మన్వంతరం లో మనం ఇప్పుడు యుగంలో ఉన్నాం? ఇప్పటి వరకు ఎన్ని కృత త్రేతా ద్వాపర యుగాలు గడిచిపో యాయి? ఎన్ని కలి యుగాలు గడిచిపోయాయి? ఆయా యుగాలలో విజ్ఞానాత్మక సంఘటనలు ఏమిటి? అవి మనకు ఎంత వరకు ఉపయోగ పడతాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అని పరిశోధనా త్మకంగా ఆలోచించేవారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంత మంది ఉంటారంటే సమాధానం చెప్పడం కష్టమే గానీ మాధవి మాత్రం పరిశోధనాత్మకంగా ఆలోచిస్తుందన్నది నిజం. 



 మాధవి విజ్ఞానాత్మక ఆలోచనలనే చేస్తుంది. వేద పురాణేతిహాసాల లోని విజ్ఞాన తేజస్సునే గమనిస్తుంది. వేద పురాణేతిహాసాలను వక్ర దృష్టితో కాకుండ వాస్తవ దృష్టితో చూస్తుంది. అందలి వాస్తవ ధర్మాన్ని యుగ ధర్మాన్ని పదుగురికి పంచుతుంది. కుటిల ధర్మాల మాటున్న కుళ్ళును బహిర్గతం చేస్తుంది. 



విజ్ఞానాత్మక ఆలోచనలనే తన చెలికత్తెలతో పంచు కుంటుంది. అంతేగానీ వారికి వీరు ఏమౌతారు? వీరికి వారేమవుతారు? వారి ఇరువురు నడుమ ఉన్న అక్రమ సంబంధం ఏమిటి? వంటి ఆలోచనలను మాధవి ఏనాడు చెయ్యలేదు. ఎప్పుడన్నా ఎవరన్నా తన చెలికత్తెలు అలాంటి ఆలోచనలను పదుగురితో పంచు కోవాలని చూస్తే వారిని మృదువుగానే మందలిస్తుంది. 



" ఇలాంటి ఆలోచనలు చేస్తూ కట్టుకథలు అల్లడం చాలా సులభం. పదుగురుకి ఉపయోగ పడే ఆలోచనలు చేయడం చాలా కష్టం. పదుగురికి ఉపయోగ పడే పని ఎంత కష్టమైన ఇష్టపడి చేయాలి. మంచి యోచనల తోనే మెదడుకు పదును పెట్టాలి. " అని మాధవి తన చెలికత్తెలతో అంటుంది. 



 మాధవి యయాతి మహారాజు కుమార్తె. అందాని కి అర్థవంతమైన, పవిత్రమైన, సంప్రదాయ సిద్దమైన, విజ్ఞానవంతమైన నిర్వచనం చెప్పాలంటే మాధవిని చూపిస్తే చాలని ఆనాటి వారందరూ అనుకునేవారు. 



 యయాతి మహారాజు ఆరు రోజులలో మహీ మండలాన్నంత జయించిన ఘనుడు. "పరిపాలనా విషయంలో తన తండ్రి గొప్ప వాడే కానీ స్వంత కుటుంబ సంరక్షణ విషయంలో, బిడ్డల పెంపకం విష యంలో, తన తండ్రి అంత గొప్పవాడు కాదని" మాధవి ప్రగాఢంగా నమ్ముతుంది. 



 ఎక్కువ శాతం మనుషుల మనస్తత్వం మహా విచిత్రం గా ఉంటుందని చెప్పవచ్చు లేదా చెప్పకలేక పోవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా మాత్రం ఉండదు. ఏదన్నా ఒక విషయం లో ఒక మనిషికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తే చాలు. మనిషి ని అభిమానించే వారు మనిషి అన్ని విషయాల్లో మహాత్ముడు, మహానుభావుడు అని మనిషిని ఆకాశానికి ఎత్తేస్తారు. చివరికి మనిషి ఏదైనా పొరపాటు చేసినా పొరపాటు కూడా గొప్పదే అంటారు. 



మాధవి సత్యాన్ని తన తండ్రి యయాతి మహారాజు ను గమనిస్తూ తెలుసుకుంది. అయితే కాలం మాత్రం, మనిషి పొరపాటు ను ఏదో ఒక సమయంలో పొరపాటేనని సమాజానికి తెలియ చేస్తుంది. అని ధృడంగా నమ్మే మాధవి తన కోసం నిర్మించిన అందమైన పర్ణశాలలో ఆనందంగ జీవిస్తుంది. తన చెలికత్తెలతో ఆటపాటలతో కాలక్షేపం చేయాల్సిన సమయంలో, ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంది. జ్ఞాన సముపార్జన చెయ్యవలసిన సమయంలో, జ్ఞాన సముపార్జన చేస్తుంది. పర్ణశాల పనులు, తోట పనులు చేయవలసిన సమయంలో పర్ణశాల పనులు తోట పనులు చేస్తుంది. 



 మాధవికి రమారమి పదిమంది చెలికత్తెల వరకు ఉన్నారు. అందులో అరవింద, ఆత్రేయి, కళిక, అపర్ణలు చాలా ముఖ్యమైనవారు. మాధవి వారి దగ్గర మనసు విప్పి మాట్లాడుతుంది. 



 మాధవి తన చెలికత్తెలతో సరస్వతీ దృషద్వతి నదులకు వెళుతుంది. అక్కడ దృషద్వతి నదిలో గొంతు లోతు నీళ్ళలో ఉండి శ్రీ సూర్య నారాయణ మూర్తిని ధ్యానిస్తూ విజ్ఞానాత్మక ఆలోచనలను చేస్తుంది. మాధవి ఎక్కువగా దృషద్వతి నదిలో ధ్యానం చేయడం వలన కొందరు చెలికత్తెలు మాధవిని దృషద్వతి అనికూడా పిలిచేవారు. 



 రాణి వాసాన్ని ఆశించి భంగపడిన తన తల్లి మరణించిన పిదప మాధవి చెలికత్తెలతో పర్ణశాల లోనే ఉంటుంది. పర్ణశాలను వశిష్ట మహర్షి యే ప్రత్యేకంగా మాధవి కోసం రాజ సేవకులతో నిర్మింప చేసాడు. 



 యయాతి మహారాజు తన కుమార్తె మాధవి ఆలనాపాలనా చూసే బాధ్యతను వశిష్ట మహర్షి కి అప్పగించాడు. వశిష్ట మహర్షి తనకు అవకాశం చిక్కినప్పుడల్లా మాధవి ఉండే పర్ణశాలకు వచ్చి మాధవి యోగక్షేమాలు తెలుసుకుని వెళుతుంటాడు. మాధవికి కావలసినవన్నీ అంతఃపురం నుండి వశిష్ట మహర్షి యే పంపిస్తాడు. 



 కన్నతండ్రి కాకపోయినా పెంపుడు తండ్రిగా వశిష్ట మహర్షి చూపించే ఆదరాభిమానాలను మాధవి సవినయంగా స్వీకరిస్తుంది. అయితే వశిష్ట మహర్షి చెప్పే ధర్మాలను మాధవి గుడ్డిగా నమ్మదు. తన తండ్రి యయాతి మహారాజు చెప్పే "సమార్గ మాణః కామా నామంతం అంటే మంచి మార్గమున కామం అంతం చూడాలి" అనే ధర్మాన్ని వశిష్ట మహర్షి సమర్థిస్తాడు. మాధవి ధర్మాన్ని అసలు సమర్థించదు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#12
గుర్రాలు లాంటి కోరికలను తీర్చుకోవడానికి అవకాశం ఉంది కదా అని పరుల ను అధికారంతో కానీ అనుబంధాల తో కానీ హింసించ రాదు. ఇలాంటి యోచనలున్న రాజులను మనుషులు, మహర్షులు శిక్షించ లేక పోయిన, కాలం కఠినంగా శిక్షిస్తుంది. 



కాల ధర్మం వేరు, అదృష్ట బలంతో అహంకరించేవారి ధర్మం వేరు. " అని వశిష్ఠ మహర్షి కి మాధవి సవినయంగా వివరిస్తుంది. 



అంతేకాదు, కొందరు పని దొంగలు ధర్మ ప్రచారం పేరుతో ఆశ్రమాలు స్థాపించి, ఆధ్యాత్మికత పేరుతో జుగుప్స కలిగించే విధంగా లైంగిక కోరికలు ఎలా తీర్చుకుంటు న్నారో మాధవి వశిష్ట మహర్షి కి పేర్లతో సహా వివరించి చెప్పింది. 



 మాధవి మాటలను విన్న వశిష్ట మహర్షి యయాతి మహారాజు సహాయంతో అవకాశవాదుల ఆశ్రమాలు చాలా తొలగించాడు. అలాగే మాధవి మాటలను అనుసరించి దొంగ మహర్షులను అడవులలో వ్యవసాయం చేసేవారి దగ్గర వ్యవసాయ కూలీలు గా నియమించాడు. 



 మాధవి వశిష్ట మహర్షి చేసే మంచి పనులను, తన తండ్రి యయాతి మహారాజు ప్రజలకు చేసే మంచి పనులను సదా ప్రశంసించేది. అలాగే అప్పుడప్పుడు తమ విపరీత కోరికలను తీర్చుకోవడానికి కులాలను, సంప్రదాయాలను, ఆచారాలను ఎవరు అడ్డు పెట్టుకు న్నా వారిని తీవ్రంగా విమర్శించేది. 



 ఋషి సంక్షేమం, ధర్మ సంక్షేమం అంటూ తమ బిడ్డలను బలవంతంగా త్యాగం చేస్తే వారిని మోక్షం వరించదు. యుగ ధర్మానికి కట్టుబడ్డ మనిషినే మోక్షం వరిస్తుందని మాధవి ప్రజలకు చెప్పేది. 



 కొందరు స్త్రీలు " స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అంటారు కదమ్మా. అదెంత వరకు నిజం?" అంటే "అదంతా అవకాశవాద పండితులు, దొంగ ఋషులు కల్పించిన మాయా జాలం. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. దక్షుని తల్లి, జటిల వంటి వారు అనేక మంది ఉత్తములైన మగవారికి భార్యలు అయ్యారు. అది గమనించిన కొందరు స్వార్థ పరులు ఋషుల రూపంలో మగ సంతానం నిమిత్తం ఆడది ఎంతమందితోనైనా మగని అనుమతితో కాపురం చేయవచ్చని కుటిల ధర్మ పన్నాలు బోధిస్తున్నారు. 



వాటిని నమ్మకండి. కాలం నడిపించే యుగ ధర్మాన్ని అనుసరించండి. " అని మాధవి స్త్రీలకు చెప్పేది.. 
 యయాతి మహారాజు భార్యలు దేవయాని, రావుిష్ట లు మాధవిని అనేక పర్యాయాలు తమ తమ అంతః పురాలకు రమ్మని ఆహ్వానించారు. వారి ఆహ్వానం లో ఆత్మీయతకన్నా వారి స్వార్థమే ఎక్కువగా ఉందనే వాస్తవాన్ని గమనించిన మాధవి వారి ఆహ్వానాన్ని మృదువుగా తోసిపుచ్చింది. 



" నువ్వు అంతఃపురానికి వెళితే ఏమవుతుంది?", అని మాధవి చెలికత్తె కళిక ఒకసారి మాధవిని అడిగింది. 



అప్పుడు మాధవి కళికతో, " దేవయాని రావుిష్ట లు నన్ను ఆత్మీయతతో అంతఃపురానికి ఆహ్వానించడం లేదు. కచుని ప్రేమలో పడిన దేవయాని, కడకు నా తండ్రి యయాతి మహారాజు ను మనువాడింది. దేవయాని దగ్గర దాసీగ పని చేసిన రావుిష్ట కడకు నా తండ్రి యయాతి మహారాజు నే మనువాడింది. "అని అంది. 



" ఒకరు బ్రాహ్మణ కన్య. మరొకరు రాక్షస రాజు కుమార్తె. మీ తండ్రి యయాతి మహారాజు ఇద్దరిని మనువాడారు. కులాలను పాటించని రాజవంశాలు మాలాంటి సామాన్యులను కుల చట్రాలలో ఎందుకు బంధిస్తారు?
అంతేగాక యువరాణి చెలికత్తెలు రాజులకు భార్యలతో సమానం అంటారు. ఇదెంతవరకు న్యాయం?"
మాధవిని కళిక అడిగింది. 



 "స్వార్థ సంపాదన నిమిత్తం కొందరు అవకాశవాదులు ఇలాంటి ధర్మాలన్నిటిని ప్రచారం చేస్తుంటారు. బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చును కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడరాదన్నది ఈనాటి ధర్మాలలో ఒక ధర్మం. ఇలాంటి ధర్మాలను ఎవరెన్ని చెప్పినా కాలం మాత్రం విధిరాతను యుగ ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తుంది. 



 మా తండ్రి యయాతి మహారాజు గారు కుతంత్ర కుల ధర్మాన్ని అడ్డు పెట్టుకొనియే మా తల్లి గారిని పెళ్ళాడారు. ఆపై మా తల్లిగారిని అంతఃపురానికి దూరం చేసారు. అదేమంటే వరాలు శాపాలు అన్నారు. 



ఋషులతో రాజులతో సంసారం చేసిన వారికి, సంతానం కలిగినా, వారి కన్యత్వం చెడని వరాలు ఉన్నాయి అన్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. మా తల్లిగారు ఇలాంటి మాయధారి ధర్మాలను బాగా వంట పట్టించుకుంది. అందుకే ఆమె బతుకు పర్ణశాల కు పరిమితం అయ్యింది. " కళికతో అంది మాధవి. 



"పర్ణశాల లో ఉన్నా నీకేం తక్కువ మాధవి. కుటిల ధర్మాలను తోసి రాణనగల విజ్ఞాన ధర్మాన్ని ప్రయోగా త్మకంగా వంట పట్టించుకున్నావు. నిరంతరం నవీన విజ్ఞాన సాధనకై ఎక్కువగా ప్రయోగశాలలోనే ఉంటావు. శూద్రులు తో వ్యవసాయ యాగాలు చేయించి మంచి పేరు తెచ్చుకున్నావు" అని మాధవితో ఆమె చెలికత్తె అరవింద అంది. 



" విషయాలలో దైవలీల చాలా గొప్పది అంటాను. నేనింత విజ్ఞానవంతురాలిని కావడానికి పార్వతీ మాత కరుణా కటాక్షణలే కాదు. ఆమె అనుసరించిన సంతానో త్పత్తి మార్గమే నాకు మంచి ప్రేరణను ఇచ్చింది. వినాయకుని ఆమె సృష్టించిన విధానం చాలా చాలా విజ్ఞానాత్మకమైనది. అందులో వరాలు, శాపాలు, మంత్రాలు, తంత్రాలు మరేం లేవు. అదంత ప్రయోగ పూర్వకమైన విజ్ఞాన స్వరూపం. 
  తర్వాత దేవయాని తండ్రి శుక్రాచార్య తాతగారు సాధించిన మృత సంజీవని విద్య కూడా నాకు కొంత ప్రేరణను ఇచ్చింది. 



 నా విజ్ఞానాభివృద్ది కి మరి కొంచెం తోడ్పడి నన్ను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని దేవయాని రావుిష్ట లు చక్రం తిప్పాలనుకున్న ఆలోచన దురాలోచన అయిన ప్పటికీ శుక్రాచార్య తాతగారికి సంక్రమించిన మృత సంజీవని విద్య మాత్రం ఆక్షేపణీయమైనది కాదు. " చెలికత్తెలతో అంది మాధవి. 



"నిజమే మృతసంజీవనీ విద్య గొప్ప విద్యయే. విద్య అయినా సరైన వారి చేతుల్లో లేకుంటే దాని వలన సమాజానికి ప్రమోదం కంటే ప్రమాదమే అధికం అవుతుంది. 
 ఇక రోజుల్లో మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆడవారు అభ్యసించి ప్రదర్శించే వేద విద్యలకు, విజ్ఞాన శాస్త్ర విద్యలకు ఆదరణ తక్కువ కదా?" మాధవితో అంది ఆమె చెలికత్తె అరవింద. 



ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#13
(04-11-2024, 01:29 PM)k3vv3 Wrote: "నిజమే మృతసంజీవనీ విద్య గొప్ప విద్యయే. విద్య అయినా సరైన వారి చేతుల్లో లేకుంటే దాని వలన సమాజానికి ప్రమోదం కంటే ప్రమాదమే అధికం అవుతుంది. 
 ఇక రోజుల్లో మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆడవారు అభ్యసించి ప్రదర్శించే వేద విద్యలకు, విజ్ఞాన శాస్త్ర విద్యలకు ఆదరణ తక్కువ కదా?" మాధవితో అంది ఆమె చెలికత్తె అరవింద. 



ఇంకా ఉంది

Nice update, K3vv3 garu!!!
yourock yourock clps clps
Like Reply
#14
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#15
"అది కలుషిత సమమాజంలో కొందరు స్వార్థ పరులు ఆడుతున్న నాటకం. యుగ ధర్మం, కాల ధర్మం అందరినీ సమానంగనే చూస్తుంది. అనాచారం తో కూడిన పుత్రకామేష్టి యాగం లోని అశ్వ సంహారాల గురించి నేడు అనేకమంది మహిళలు గొంతెత్తి ఇది అశాస్త్రీయం అంటున్నారు. ఛాందస భావ జాలం గల వారు మగువల మాటలను తెగించిన మాటలు అంటున్నారు కానీ సమాజంలో సంచరించే సామాన్య జనం చాలా మంది మహిళల మార్గాన్నే అనుసరిస్తున్నారు. 



 సృ ష్టి కర్త బ్రహ్మ మగవాడే అయినప్పటికీ ఆడదైన పార్వతీ మాత సృష్టించిన వినాయకుడే ఆది పూజలను అందుకుంటున్నాడు. సమాజంలో రైతుల ధర్మపత్నులు, చేనేత కార్మికుల ధర్మపత్నులు, కమ్మరి, కుమ్మరి, కురుమ, చాకలి తదితర వర్ణాల ధర్మపత్నులు వారి వారి భర్తల తో పాటు కలిసి పనిపాటలు చేస్తున్నా రు. అలాంటి రోజుల్లో ఆడవారు గడపదాటేవారు కాదు అంటే అది వారి శ్రమను కించపరిచినట్లే అవుతుంది. అందుకే పండితుల, మహర్షుల రాతలు ఒకరకంగా ఉంటాయి. వాస్తవ ప్రపంచం మరో రకంగా ఉంటుంది అంటున్నాను. అది యుగ ధర్మానికి, కర్మ సిద్ధాంతం కు లోబడి ఉంటుంది. " తన చెలికత్తెలతో అంది మాధవి. 
 అది సరే మాధవి, నీ తండ్రి యయాతి మహారాజు నిన్నెప్పుడు అంతఃపురమునకు రమ్మనలేదా?" మాధవి ని ఆమె చెలికత్తె ఆత్రేయి అడిగింది. 



"నా మనస్తత్వం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. 
నేను యుగ ధర్మాన్ని అనుసరిస్తాను. పెద్దలను గౌరవిస్తాను. అలాగని పెద్దలు చెప్పిన మూఢ నమ్మకా లను అనుసరించను. 



 మా అమ్మ రాణివాసాన్ని కోరుకుంది. మూఢాచారాల ఫలితంగా ఆమె కోరిక నెరవేరలేదు. ఒకవేళ నా తండ్రి గారు నన్ను అంతఃపురానికి రమ్మంటే, నేను మా అమ్మ కోరికను ఎందుకు నెరవేర్చలేదని మా తండ్రిగారికి తప్పక అడుగుతాను. అది ఆయనకు బాగా తెలుసు. అప్పుడు ఆయన తనని తాను సమర్థించుకోవడానికి ఏదో ఒకటి సమాధానం చెబుతారు గానీ అతని భార్యలై దేవయాని, రావుిష్ట చేష్టలను బయటపెట్టరు. 



ఇక అసలు సిసలైన నిజాన్ని అసలు బయటపెట్టరు. కౌపీన సంరక్షణార్థం సన్యాసి సంసారి అయిన కథలు కోకొల్లలు గా చెబుతారు. వారికి కొందరు మహర్షులు, పండితులు చెప్పే విశాల నేత్రాలు గల అమ్మాయిల కథలే బాగా నచ్చుతాయి. అంగనల అంగాంగ వర్ణనలే నచ్చుతాయి. వాటిని నేను అసలు విశ్వసించను. అందుకే ఆయన నన్ను అంతఃపురానికి రా అనే సాహసం చేయలేరు. " చెలికత్తెలతో అంది మాధవి. 
 
"రాజులు అనేకమంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చంటారు కానీ అలా అనేకమంది స్త్రీలను వివాహాలు చేసుకున్న రాజుల అంతఃపుర జీవితం నాకు తెలిసీ అస్తవ్యస్తం గానే ఉందని కాలం చెబుతోంది. " మాధవితో ఆమె చెలికత్తె అరవింద అంది. 



"కాలం వాస్తవ విషయాలను తెలియచేస్తుంది. అవకాశ వాదులు ఉన్నత వర్గాల వారు చేసిన తప్పులను ఆచార సంప్రదాయాల పేరుతో, కర్మ సిద్ధాంతం పేరుతో ఒప్పు చేసేస్తారు. " చెలికత్తెలతో అంది మాధవి. 



"మాధవి, పార్వతీ దేవి ప్రసాదించిన కృత్రిమ సంతాన విజ్ఞాన బలంతో సంతాన లక్ష్మి ప్రసాదించిన ఆకృత సంతాన విజ్ఞాన బలంతో ప్రయోగాత్మక సంతాన విజ్ఞాన బలంతో నువ్వు ఇప్పటికే సంతానం లేని వారికి సంతానం ప్రసాదించావు. దరిదాపు పదిమంది ఋషికాంత లకు సంతానం ప్రసాదించినట్లు ఉన్నావు కదా?" మాధవిని ఆమె చెలికత్తె అరవింద అడిగింది. 



"పదికాదు మొత్తం పద్నాలుగు మందికి సంతానం ప్రసాదించాను. అందులో ఋషి కాంతలే కాదు. రాజ కాంతలు. హాలిక కాంతలు వంటివారు కూడా ఉన్నారు. 
కొందరు విజ్ఞాన శాస్త్ర బలం తెలియని కుసంస్కారులు బిడ్డలందరికీ నేనే తల్లిని అంటున్నారు. అలా నా జ్ఞాన బలాన్ని కించపరుస్తున్నారు. లోకానికి భయపడి జ్ఞానాన్ని చంపుకోకూడదు కదా?" చెలికత్తెలతో అంది మాధవి. 
"మీ తండ్రి యయాతి మహారాజు గారు నీ వివాహం గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా?" మాధవిని ఆమె చెలికత్తె ఆత్రేయి అడిగింది. 



"నా తండ్రి గారు తీరని కోరికలతో తన వృద్దాప్యం ను తన కొడుకులను తీసుకోమని అడుగుతున్నట్లు తెలిసింది. ఇంకా నా వివాహం గురించి ఏం ఆలోచిస్తా రు?" అంది మాధవి. 



"తన వృద్దాప్యం ను పరులకిచ్చి, వారి యౌవనాన్ని తీసుకునే ప్రక్రియ ఒకటి ఉన్నదా?"మాధవిని ఆమె చెలికత్తె అరవింద అడిగింది. 



"ఉంది. శుక్రాచార్య తాతగారికి మృత సంజీవని విద్య బాగా తెలుసు. మా తండ్రి యయాతి మహారాజు గారికి 
శరీర తత్వ శాస్త్రం బాగా తెలుసు. దానిని వారు దుర్విని యోగం చేసుకుంటున్నారు. తన స్వార్థానికి వాడుకుంటూ కన్న కొడుకులనే హింసిస్తున్నారు. 



 నేను దరిదాపు పదిరకాల పిండ సృష్టి విద్యలలో పరిపూర్ణత సాధించాను. వాటన్నిటినీ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తున్నాను. యుగ ధర్మాన్ని అనుసరించి ఎక్కడన్నా నా విద్యలు చెడ్డ వారికి ఉపయోగ పడుతున్నాయేమో కానీ నాకు తెలిసీ నా విద్యలు అధిక శాతం మంచి మనుషులకే ఉపయోగ పడుతున్నాయి. 
 ఇక నా వివాహ విషయంలో నా తండ్రి యయాతి మహారాజు గారి మాటలు అనుసరణీయం గా ఉంటే తప్పక స్వీకరిస్తాను." తన చెలికత్తెలతో అంది మాధవి. 
 మాధవి తన చెలికత్తెలను తన విజ్ఞాన ప్రయోగశాలకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న పిండా కృతులన్నిటి గురించి చక్కగా వివరించింది. అప్పుడే అక్కడకు వచ్చిన మహర్షులు మాధవి పిండ నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం చూసి అబ్బురపడ్డారు. కొందరు మహర్షులు ఇది సంప్రదాయ విరుద్ద జనన సృష్టి అన్నారు. మరికొందరు మహర్షులు మాధవి మార్గాన్ని సమర్ధించారు. పుత్రకామేష్టి యాగ రూపురేఖలను మార్చాలన్నారు. 



 ఒకనాడు యయాతి మహారాజు వశిష్ట మహర్షి తో కలిసి మాధవి దగ్గరకు వచ్చాడు. మాధవి ఇరువురకు సముచిత మర్యాదలు చేసింది. అనంతరం యయాతి మహారాజు మాధవి ముఖాన్ని ఒకసారి చూసాడు. " మాధవి, నాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. " అని అన్నాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#16
"అదేమిటి తండ్రిగారు?" అని యయాతి మహారాజు ను మాధవి అడిగింది. 



"విశ్వామిత్ర మహర్షి ప్రియ శిష్యుడు. అతని పేరు.. .. వశిష్ట మహర్షీ! వారి పేరేమిటి?" యయాతి మహారాజు వశిష్ట మహర్షి ముఖం చూస్తూ వశిష్ట మహర్షి ని అడిగాడు. 



"అసలు పేరు గాలవుడు. అతనిని మరో రెండు మూడు పేర్లతో పిలుస్తారు రాజ. అవి నాకూ సరిగా గుర్తులేదు. గాలవుని మిత్రుని పేరు సుపర్ణ. " యయాతి మహారాజు తో అన్నాడు వశిష్ట మహర్షి. 

".. గాలవుడు. నా దగ్గరకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి గురుదక్షిణ గా గాలవుని 800 గుర్రాలను అడిగాడట. " మాధవి ముఖం చూస్తూ అన్నాడు యయాతి మహారాజు. 



"800 గుర్రాలను ఏర్పాటు చేయడం మీకు పెద్ద సమస్య కాదు గదా తండ్రి. .. గాలవునికి 800 గుర్రాలు ఇచ్చి పంపండి. " తండ్రి తో అంది మాధవి. 



"గాలవుని విశ్వామిత్ర మహర్షి అడిగింది మామూలు గుర్రాలు కాదమ్మా. చంద్ర కిరణాలవలే ప్రకాశించే తెల్లని గుర్రాలు. వాటికి తప్పని సరిగా ఒక చెవి నలుపుగా ఉండాలట. అలాంటి గుర్రాలు 800 కాదుగదా ఒకటి కూడా మన దగ్గర లేవు. " మాధవితో వశిష్ట మహర్షి అన్నాడు. 



"ఒక చెవి నల్లగా ఉండి చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే గుర్రాలు విశ్వామిత్ర మహర్షి కి 800 కావాలా?
వాటిని ఆయన ఏం చేసుకుంటాడట? రాజైన విశ్వామి త్ర మహర్షి గోమాత కారణంగా రాజ్యాన్ని విసర్జించి ఋషిగా, మహర్షి గా, బ్రహ్మర్షి గా మహోన్నత స్థాయిన నిలిచారు. 



పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందించారు. అలాంటి మహర్షి ఒక చెవి నల్లగా ఉండి చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే గుర్రాలు 800 అడుగుతున్నాడంటే అందులో ఏదో అంతరార్థం ఉంది. 
 విశ్వామిత్ర మహర్షి అడిగిన గుర్రాలు సహజంగా వయసు పెరిగే కొద్దీ తేలికగా మారతాయి. 
వాటిని ఎక్కువగా పుత్రకామేష్టి యాగం లో ఉపయోగి స్తారు. అయితే విజ్ఞాన శాస్త్ర వికాస ఫలితంగా సంతానో త్పత్తి కి పుత్రకామేష్టి యాగం ను మించిన సశాస్త్రీయ మార్గాలు అనేకం వచ్చాయి. అదిసరే మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు?" యయాతి మహారాజు ను వశిష్ట మహర్షి ని అడిగింది మాధవి. 



 "మాధవి విశ్వామిత్ర మహర్షి అడిగిన గుర్రాలు ఇక్ష్వాకు రాజు హర్యశ్వుడు దగ్గర కొన్ని ఉన్నట్లు నాకు తెలిసింది. అయితే అతని వద్ద అలాంటి గుర్రాలు ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. హర్యశ్వునికి ధర్మ గుణం తప్ప అన్నీ ఉన్నాయని అధిక శాతం మంది అనుకుంటూ ఉంటారు. 



అలాంటి వారిని మెప్పించాలం టే నీలాంటి వారే సమర్థులని నా అభిప్రాయం. ఇదే విషయాన్ని గాలవునికి చెప్పాను. నువ్వు గాలవునితో వెళితే, అతని కోరిక తీరుతుంది అని నా అభిప్రాయం. " మాధవితో అన్నాడు యయాతి మహారాజు. 



 మాధవి తన తండ్రి యయాతి మహారాజు చెప్పిన మాటల గురించి కొంత సేపు ఆలోచించింది. అటు పిమ్మట అరణపు దాసి అరవింద తో కలిసి గాలవునితో గాలవుని వెనుక నడిచింది. 



 గాలవుడు ఇక్ష్వాకు రాజు హర్యశ్వుని దగ్గరకు వెళ్ళాడు. తన గురు దక్షిణ గురించి చెప్పాడు. గాలవుని మాటలను విన్న హర్యశ్వుడు, "విశ్వామిత్ర ప్రియశిష్యా. గాలవ! నేను సంతాన హీనుడుని. సంతానం నిమిత్తం అనేక యజ్ఞయాగాదులు చేసాను. అయి నా సంతానం ప్రాప్తించలేదు. 



 చివరికి పుత్రకామేష్టి యాగం నిమిత్తం ఒక చెవి నలుపు తో చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే 200 గుర్రాలను సేకరించగలిగాను. పుత్రకామేష్టి యాగం లో అలాంటి గుర్రాలను ఉపయోగిస్తే తప్పక మగ సంతానం కలుగుతుంది అని పుత్రకామేష్టి యాగం చేయించే మహర్షులు అనేక మంది నాకు చెప్పారు. అందుకే గుర్రాలను సేకరించాను. " అని గాలవునితో అన్నాడు. 



"విజ్ఞాన శాస్త్ర మార్గాన్ని అనుసరించి నీకు మగ సంతానం కలిగే మార్గం యయాతి మహారాజు కుమార్తె మాధవి చెబుతుంది. " అని హర్యశ్వునికి గాలవుడు మాధవిని చూపించాడు. 



"యయాతి మహారాజు కుమార్తె మాధవి గురించి ఇంతకు ముందే నాకు చాలా విషయాలు తెలుసు. సంతానోత్పత్తి విషయాల్లో ఆమె యాగ మార్గాలనే కాక ఏవేవో విజ్ఞాన శాస్త్ర మార్గాలు అనుసరిస్తుంది అని నాకు చాలా మంది చెప్పారు. సంతానోత్పత్తి విషయంలో నాకు మాధవి సహకరిస్తుందంటే 200 గుర్రాలు ఇవ్వ డానికి నేను సిద్దమే " అని గాలవునితో హర్యశ్వుడు అన్నాడు. 



హర్యశ్వుని మాటలకు మాధవి తన సమ్మతిని తెలపడంతో హర్యశ్వుడు గాలవునికి 200 గుర్రాలను ఇచ్చాడు. గాలవుడు మిగతా గుర్రాలను అన్వేషించే నిమిత్తం వెళుతూ మాధవిని హర్యశ్వుని దగ్గర ఉంచి వెళ్ళాడు. 



మాధవి అరవింద లకు హర్యశ్వుడు ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేసాడు. మాధవి హర్యశ్వుని తో, " రాజా! తలిదండ్రుల మంచి గుణాలలో కొన్ని మంచి గుణాలు తమ బిడ్డలకు సంప్రాప్తిస్తాయి. నీకు మంచి మగ సంతానం కావాలంటే నువ్వు ముందుగ ధర్మ గుణాన్ని పెంపొందించుకోవాలి. అటుపిమ్మట నేను చెప్పిన విజ్ఞాన మూలికలను ఏర్పాటు చేయాలి. " అని అంది. 



 హర్యశ్వుడు మాధవి చెప్పినట్లు చేయడానికి సంసిద్దుడయ్యాడు. మాధవి చెప్పినట్లు నిరుపేదల అభివృద్ధి నిమిత్తం తనవంతు సహాయం అందించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. యజ్ఞ యాగాదులతో పాటు విజ్ఞాన శాస్త్ర అభ్యాసాన్ని ప్రోత్సహించాడు. అందరూ యుగ ధర్మానికి అనుకూలంగా నడుచు కోవాలని ప్రజలకు నాటిక, నాటకం వంటి రకరకాల కళల ద్వారా తెలియచేసాడు.
 
 సంవత్సరం తిరిగే సరికల్లా మాధవి తన విజ్ఞాన శాస్త్ర బలంతో ఒక మగ శిశువును ఉత్పత్తి చేసింది. హర్యశ్వుడు శిశువును చూసి మహదానందం పొందాడు. 



 అనంతరం హర్యశ్వుడు మహర్షులు, పండితుల సమక్షంలో శిశువుకు " వసుమనస్" అని నామధేయం చేసాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#17
 గాలవుడు రమారమి సంవత్సర అనంతరం మాధవి దగ్గరకు వచ్చి, "నాకు కావలసిన గుర్రాలు కాశీరాజు దివోదాసు దగ్గర, భోజరాజు ఉశీనరుని దగ్గర రెండు వందలు రెండు వందల చొప్పున ఉన్నాయి " అని మాధవితో అన్నాడు. 



మాధవి హర్యశ్వుని దగ్గర సెలవు తీసుకుని కాశీరాజు దివోదాసు దగ్గర కు వెళ్ళింది. దివోదాసు దగ్గర ధనం తప్ప అన్నీ ఉన్నాయని గ్రహించింది. దివోదాసు తన ధనాన్నంత శివ భక్తు లకే వినియోగిస్తాడు అని తెలుసుకుంది. అంత తన విజ్ఞాన శాస్త్ర బలంతో దివో దాసు కు ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. దివోదాసు శిశువుకు ప్రతర్థన అనే పేరు పెట్టాడు. ‌ 



అటు పిమ్మట భోజరాజు దగ్గర కు వెళ్ళింది. భోజరాజు లో కాముకత్వం తక్కువ అని గమనించింది. అతని శరీరానికి తగిన మందులను ఇచ్చింది. అంత తన విజ్ఞాన శాస్త్ర బలంతో ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. భోజరాజు శిశువుకు శివి అని పేరు పెట్టాడు. 



 గాలవుడు మాధవిని, 600 గుర్రాలను విశ్వామిత్ర మహర్షి దగ్గరకు తీసుకొని వెళ్ళి జరిగిందంతా చెప్పా డు. మిగతా 200 గుర్రాల కోసం తనేం చేయాలని అడిగాడు. 



 విశ్వామిత్ర మహర్షి గుర్రాలన్నిటిని పరిశీలించాడు. మాధవి కొంత కాలం తన దగ్గర ఉంటుందని చెప్పి గాలవుని గురు దక్షిణ నుండి విముక్తి కలిగించాడు. 
"మాధవి, నీ విజ్ఞాన శాస్త్ర బలం గురించి విన్నాను. ముగ్గురు మహారాజులకు కలిగిన మగ సంతానం ను నేను కళ్ళార చూసి వచ్చాను.. పుత్రకామేష్టి యాగాదు పేరుతో జరిగే అశ్వ సంహారాదులను నిర్మూలించా లనే సదుద్దేశంతోనే నేను గాలవునితో పనంతా చేయించాను. " మాధవితో అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 



 విశ్వామిత్ర మహర్షి మాటలను విన్న మాధవి "బ్రహ్మర్షోత్తమ! మీ సదుద్దేశం సదా ప్రశంసనీయం. అయితే లోకం లో కొందరు నా విజ్ఞాన శాస్త్ర బలాన్ని గమనించరు. నేను ముగ్గురు రాజులతో కాపురం చేసి సంతానాన్ని కన్నాను అంటారు.. విషయం కొందరు ఋషులకు, పండితులకు తెలిస్తే వారు నేను ఎవరితో ఎలా కాపురం చేసాను అని ఊహించి మరీ వ్రాస్తారు. వారి ఊహలకు అశాస్త్రీయ సంప్రదాయాలనూ, అశా స్త్రీయ ధర్మాలను కలగలుపుతారు.



 అయితే ఎవరికో భయపడి పదుగురికి ఉపయోగపడే వైద్య విజ్ఞానాన్ని కాలమరుగు చేయరాదని నేను ముందడుగు వేసాను. మీరు గాలవుని ఒక చెవి నలుపు చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే 800 గుర్రాలను అడిగినప్పుడే ఇందులో ఏదో దేవ రహస్యం ఉందని గమనించాను. " అంది మాధవి. 



 'అలాంటి గుర్రాలు ముగ్గురు రాజుల దగ్గర 600 మాత్రమే గాలవునికి లభ్యమవుతాయి అని నాకు తెలుసు. " అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 
"మిగతా 200 గుర్రాలకు బదులు మీకు సంతానం కావాలి. అంతే గదా?" చిరునవ్వుతో విశ్వామిత్ర మహర్షి ని అడిగింది మాధవి. 



"నీవు ప్రసాదించే సంతానం వలననే నాకు మోక్షం లభిస్తుందని అనుకుంటున్నాను. ఇక నీ విజ్ఞాన శాస్త్ర బలాన్ని నేను కళ్ళార చూడాలి. అందులో కొంతలో కొంత నేను అవగాహన చేసుకోవాలి. " అని మాధవితో అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 



మాధవి తన విజ్ఞాన శాస్త్ర పథాన్ని ప్రయోగశాలలో విశ్వామిత్ర మహర్షి కి తెలియచేసింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, "మాధవి, నీ సంతానోత్పత్తి ప్రక్రియ అద్భుతం. అమోఘం. నేడు పుత్రకామేష్టి యాగం చేయించేవారు కొందరు చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశిస్తూ, ఒక చెవి నల్లగా ఉండి, అన్ని శుభ లక్షణాలు ఉన్న బలిష్టమైన గుర్రం తల తెగనరుకుతున్నారు. ఆపై అనేక జుగుప్సాకరమైన పనులతో పుత్రకామేష్టి యాగం పూర్తి చేస్తున్నారు. ఇలా యాగం పేరుతో మంచి అశ్వాలను సంహరించే విధానం ఇకపై ఉండకూడదు. , " అంటూ పుత్రకామేష్టి యాగం లో అశ్వాలను హింసించే విధానాన్ని విశ్వామిత్ర మహర్షి మాధవికి చెప్పాడు. 



మాధవి తన విజ్ఞాన శాస్త్ర బలాన్ని ఉపయోగించి విశ్వామిత్ర మహర్షి కి ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. విశ్వామిత్ర మహర్షి శిశువుకు అష్టకుడు అని పేరు పెట్టాడు. ఇక తనకు మోక్షం లభిస్తుందని సంతోషించాడు. 
 ఆపై విశ్వామిత్ర మహర్షి మాధవిని యయాతి మహారాజు కు అప్పగించాడు. యయాతి మహారాజు మాధవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేసాడు. స్వయంవరానికి ఇక్ష్వాకు రాజు, కాశీరాజు, బోజ రాజులు కూడ వచ్చారు. 
 మాధవి తన స్వయంవరాన్ని తిరస్కరించింది. 



"కామం అంటే కేవలం లైంగికం కాదు. ఎలాంటి కోరికైన కోరికే. సృష్టి చేయాలన్న భగవంతుని కోరిక కోరికే. అలాగే విజ్ఞాన శాస్త్ర బలంతో సృష్టి చేయాలన్న నా కోరిక కోరికే. నా కోరిక నెరవేరింది. నేనిక అవివాహిత గా విష్ణు సేవన ఉండిపోతాను" అని మాధవి తన తండ్రి యయాతి మహారాజు తో అంది. 



అడవిలో ప్రయోగ శాలతో కూడిన పర్ణ శాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడే జీవించసాగింది.
 
 ఒకసారి యయాతి మహారాజు కుమారుడు పూరుడు తన భార్య కౌసల్య తో కలిసి యాగ వనం వచ్చాడు. అక్కడ యోగిని అయిన తన సోదరి మాధవిని చూసాడు. మాధవిని పూరుడు తగిన విధంగా సత్కరించాడు. మాధవి అన్నా వదినల క్షేమసమాచారం అడిగింది. ముఖ్యంగా పూరుని శరీర తేజస్సు గురించి అడిగి తెలుసుకుంది. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#18
[font=var(--ricos-font-family,unset)] [/font]
 మాధవి పూరునితో " మన తండ్రి యయాతి మహా రాజు భౌతిక సుఖాన్వేషణకు ఇచ్చిన ప్రాధాన్యతను మరి దేనికీ ఇవ్వలేదు. తన సుఖం కోసం నీ శరీరాన్ని కూడా వాడుకున్నాడు. భౌతిక సుఖాన్వేషణ తప్పు కాదు. కానీ తన భౌతిక సుఖాన్వేషణ కోసం పరులను పలు రకాల ఆచారాల అనుబంధాల పేరుతో లొంగ తీసుకోవడం అమానుషం. నీ భార్య విజ్ఞాన బలం తో నువ్వు హైమావతి కుమారుడైన ప్రసేనజిత్తుని మనుమడు మాంధాత ను జయించ గలిగావు. "
అని అంది. 



 మాధవి మాటలను విన్న కౌసల్య, " మాధవి, గతం గతః. భగవంతుని చేతిలో మామగారు యయాతి మహారాజు గారు అలా మలచబడ్డారు. అంతే. ఇప్పుడు అందరం హాయిగా ఉన్నాం. అది చాలు" అని అంది. 



 మాధవి అభ్యర్థనను అనుసరించి కౌసల్య మునులతో యజ్ఞం చేయించింది. మాధవి తనువును జింక తనువుగ మలిచింది.



 మాధవి తన వదిన కౌసల్య కు తన సోదరుడు పూరునికి, మునులకు నమస్కరించింది. జింక తనువుతో విష్ణు సేవన వనాలలో ఆశ్రమ సంచారిణిగా జీవిస్తు విధాత ప్రసాదించిన ఆయుష్షు ను చక్కగా అనుభవించసాగింది. చెంగు చెంగున ఎగురుతూ ఆశ్ర మాలను పావనం చేసే లేడి అయిన యోగిని మాధవిని చూసిన మహర్షులందరూ రెండు చేతులు జోడించి నమస్కరించసాగారు. కొందరు మునులు లేడి అయిన యోగిని మాధవి చుట్టూ ప్రదర్శనలు చేయసాగారు. 



శుభం భూయాత్ 
 


[font=var(--ricos-font-family,unset)] [/font]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#19
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#20
వరాంగి


[Image: image-2024-11-26-130020347.png]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



దృషద్వాత దేశమును దృషద్వాత మహారాజు పరి పాలిస్తున్నాడు. దృషద్వతి సరస్వతీ నదుల పుణ్య జల ప్రభావంతో దృషద్వాత దేశము నిరంతరం సస్యశ్యా మలంగా ఉండేది. పవిత్ర పర్వతాల నుండి ఉద్భవించిన దృషద్వతి నదిలో స్నానాలు ఆచరించే 60 వేలమంది వాలఖిల్యులకు తదితర దేవతలకు దృషద్వాత దేశమును సందర్శిస్తేనే, వారి మనసు ప్రశాంతంగా ఉండేది.. 



దృషద్వాత దేశములో సుగంధ వాసనలు ఇచ్చే దృషదులు అనేకం ఉండేవి. దృషదుల సువాసన సుర లోక సుగంధ సుమ వాసన లకన్నా మిన్నగా ఉండేది. సువాసనలను ఆస్వాదించడానికి దేవతలు దృషద్వాత దేశమునకు తప్పక వచ్చేవారు. కౌశిక దృషద్వతి సంగమాన స్నానాలు ఆచరించి మరీ దృషద్వాత దేశమునకు వచ్చేవారు. 



 దృషద్వాత దేశమునకు వచ్చిన సురులను, యక్షులను, కిన్నెరులను, కింపురుషులను తదితరులు అందరినీ దృషద్వాత మహారాజు తగిన విధంగా సత్కరించి పంపేవాడు. అలాంటి మహోన్నత దృషద్వాత మహారాజు కు వరాంగి అనే కుమార్తె కలదు. 



ఆమె బుడిబుడి అడుగులు వేసే సమయంలోనే దృషద్వతీ నది దగ్గర ఉన్న యజ్ఞ వేదికల చుట్టూ కిలకిల నవ్వులతో పరుగులు తీసేది. 



వరాంగి చిన్నతనమునుండి దృషద్వతి సరస్వతీ నదులను క్రమం తప్పకుండా పూజించేది. రెండు నదులలో దిగి గొంతు లోతు నీళ్ళలో ఉండి " ఓం విష్ణు దేవాయ, ఓం మహేశ్వరాయ, ఓం బ్రహ్మ దేవాయ నమో నమః" అంటూ త్రిమూర్తులను పూజించేది. దృషద్వతీ నది కి వచ్చిన 60 వేలమంది వాలఖిల్యులను పలురీతులలో స్తుతించేది. 



అలాగే భూమి మీద వంటి కాలి మీద నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. యాగాగ్నులలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాయు దేవుని వలయంలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. తన శరీరమును తేలిక చేసుకుని ఆకాశ వలయాన నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాలఖిల్యుల వరప్రసాదాన వరాంగి తనువుకు మహా శక్తి వచ్చిందని అందరూ అనుకునేవారు. 



 వరాంగి ధ్యానాన్ని గమనించిన పంచభూతాలు ఆమె శరీరానికి దేనినైనా తట్టుకునే సామర్థ్యం ను, 
ఆమె తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే అలా ఉంచుకునే శక్తిని ప్రసాదించారు. వరాంగి కొంత కాలం వాలఖిల్యులు లాగా బొటనవేలంత ప్రమాణంలో మారి త్రిమూర్తులను ధ్యానిస్తూ తపస్సు చేసింది. 



 ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పరిపాలన చేసే ప్రాచీన్వంతునికి అశ్మకికి పుట్టిన సంయాతి యువరాజు సమస్త రాజోచిత విద్యలలో మహా నైపుణ్యం సంపాదించాడు. తల్లి అశ్మకి మాటలను అనుసరించి కొండకోనల సంరక్షణలో ప్రత్యేక శ్రద్దను ఉంచాడు. తన భక్తి శ్రద్ధలతో మహర్షుల బ్రహ్మర్షుల మన్ననలను పొందాడు. 



 ఒకనాడు వశిష్ట మహర్షి అశ్మకి ప్రాచీన్వంతులను కలిసి, "రాజ దంపతులార! మీ తనయుడు మరియు నా ప్రియ శిష్యుడు అయిన సంయాతి సమస్త యతి లక్షణాలతో సంయాతిగ విశిష్ట కీర్తిని ఆర్జిస్తున్నాడు. అంతేగాక కొండకోనల సంరక్షణ లో అతి, అంబల వంటి అసుర రాజులను ఓడించి ప్రజారక్షకుడుగ ప్రఖ్యాతిని ఆర్జించాడు. అలాంటి సంయాతి యువరాజు కు దృషద్వాత మహారాజు కుమార్తె శుభాంగి ని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
 
శుభాంగి సామాన్య మగువ కాదు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్న మహా మహిళ. అలాంటి మగువ సంయాతి ధర్మపత్ని అయితే అవని మీద అబద్దానికి పుట్టగతులు ఉండవు. అవని మీద అన్యాయం అవాక్కుగా మిగిలిపోతుంది. ఇక మహి పై అబద్దం బద్దకంలో పడి మరణిస్తుంది. " అని అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న రాజ దంపతులు మిక్కిలి సంతోషించారు. వశిష్ట మహర్షి నే పెళ్ళి పెద్దను చేసారు. రాజ దంపతుల విన్నపానుసారం వశిష్ట మహర్షి దృషద్వాత మహారాజు ను కలిసాడు. 



దృషద్వాత మహారాజు సంయాతిని అల్లుడు గా చేసుకోవడానికి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా తన అంగీకారాన్ని తెలిపాడు. అయితే తన కుమార్తె వరాంగి అభిప్రాయం కూడా తెలుసుకోవాలన్నాడు. 



అంత దృషద్వాత మహారాజు తన కుమార్తె వరాంగి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. సంయాతి గురించి చెప్పాడు. ముఖ్యంగా సంయాతి మాతృమూర్తి అశ్మకి కొండ కోనలను సంరక్షించే విధానం గురించి క్షుణ్ణంగా చెప్పాడు. అంతేగాక అశ్మకి తమకు దూరపు బంధువు కూడా అవుతుంది అని చెప్పాడు. 



 వరాంగి సంయాతి చిత్ర పటం చూసింది. అనంతరం తన అంగీకారాన్ని తెలిపింది. అలాగే సంయాతి కూడా వరాంగి చిత్ర పటం చూసి, వరాంగి గురించి పెద్దలు చెప్పిందంత విన్న పిదప తన అంగీకారం తెలిపాడు. 



 వశిష్ట మహర్షి ముందుగా మంచి శుభ ముహూర్తాన సంయాతికి పట్టాభిషేకం జరిపించాడు. సంయాతి పట్టాభిషేక మహోత్సవానికి దృషద్వాత మహారాజు తదితరులందరూ హాజరయ్యారు. వేడుకలకు వరాంగికూడ వచ్చింది. 



 వెయ్యి మంది అంగుష్టాకారులతో అవ్యక్తానంద నృత్యం చేయించింది. అగ్ని గుండాలలో, జల వలయాలలో, వాయు వలయాలలో, భూవలయాలలో, గగన వలయాలలో వివిధ వర్ణాల దేహధారులను ఉంచి నృత్యం చేయించింది. వరాంగి చేయించిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: