ప్రేక్షకులు కోరిక మేరకు వన్ లాస్ట్ ఎపిలాగ్
సెల్ఫ్ లవ్
సురభి "మా ఆయన ఎప్పటి నుండో.... బైక్ అడిగాడు, మా అత్తగారు ఎప్పటి నుండో పక్కింటి ఆంటీ గారి నక్లెస్ చూసి మాట్లాడేవారు... మా మామగారికి కాశి వెళ్లాలని కోరిక.... ఇన్ని రోజులు కూడా..... డబ్బు లేక అల్లాడిపోయాం.. దేవుడి దయ ఇవ్వాళా నేను కొన్న లాటరీ టికెట్ కి డబ్బులు గెలుచుకుంది" అంది.
ఆఫీస్ అక్క "నీ కోసం ఏం కొనుక్కుంటావ్...."
సురభి "నాకు ఏముంది లే అక్కా.... అయినా ఈ డబ్బు మా ఆయనకీ ఇస్తే నాకు ఎదో ఒకటి కొనిపెట్టడా ఏంటి?"
అక్క "సురభి.... సురభి.... సురభి.... జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో.... సెల్ఫ్ లవ్"
సురభి "అంటే..."
అక్క "నువ్వు మీ ఆయన, మీ అత్తమామలను ఇష్టపడుతున్నావ్.... వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని అడుగుతున్నావ్ కదా..."
సురభి ఏం మాట్లాడలేదు.
అక్క "సురభి నువ్వు జాబ్ చేస్తున్నావ్.... డబ్బులు అన్ని తీసుకొని మీ ఆయన చేతిలో పెట్టినా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు.... ఇప్పుడు ఈ పదిహేను కోట్లు ఇచ్చినా రెస్పెక్ట్ ఇస్తారని అనుకుంటున్నావా!"
సురభి "మా ఆయన మంచి వాడు..."
అక్క "ఛా... నిజంగానా...."
సురభి "నిజం..."
అక్క "సరే... ఒక గేం ఆడదాం... నేను గెలిస్తే నీకు లక్ష ఇస్తాను... నువ్వు గెలిస్తే నువ్వు లక్ష యివ్వు....."
సురభి "ఏంటి గేం..."
అక్క "ఈ లాటరీ టికెట్.... జిరాక్స్ తీసి మీ ఆయన కొన్న లాటరీ టికెట్ తో మారుద్దాం.... ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం...."
సురభి "మా ఆయన మంచి వాడు..."
సురభి చెప్పింది విని..... వరుణ్ మరియు అతని తల్లిదండ్రులకు కోపాలు వచ్చాయి అవి బాగా పెరిగిపోయాయి కాని గాలి బుడగలు పేలినట్టు పేలిపోయాయి.
వరుణ్ ముందుకు వచ్చి సురభిని హాగ్ చేసుకొని క్షమాపణ చెప్పాడు.
సురభి "ఏం వరుణ్.... నేను చామన ఛాయా..... మెక్ అప్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాను... పెళ్ళైన కొత్తల్లో ఏమన్నావ్..... నీ అందం ఎవరూ చూడకూడదు, నువ్వే చూడాలి అన్నావ్...." అంటూ అతని చొక్కా పట్టుకొని
వరుణ్, సురభి ముందు నిలబడి తల దించుకున్నాడు.
సురభి "ఏం అత్తయ్యా.... మీకు ఒంట్లో బాగోక పొతే... చిన్న పిల్లకు చేసినట్టు సేవలు చేశాను.... నన్ను చంపాలని ఎలా మాట్లాడారు"
వరుణ్ వాళ్ళ అమ్మ ఎదో చెప్పబోతు ఉంటే,
సురభి "నాకు తెలుసు... మీరు నన్నేం చంపాలని అనుకోలేదు.... కేవలం నేను వినేలా మాట్లాడుకున్నారు... నా మీద జాలి పడి రెండూ ఇళ్ళు, డబ్బు వచ్చేలా చేశారు..."
అంటూ ఏడుస్తూ కూర్చుంది....
ఓదార్చాలని అనిపిస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేకపోయారు.
సురభి "మీ ఇళ్ళు ఎవరికీ అమ్మలేదు... అక్కడ మీరే ఉండొచ్చు.... ఆ డబ్బు కూడా మీకే వచ్చేలా చేస్తాను... మీ అకౌంట్ లో కొంత ఎమౌంట్ వేసి నెల నెలా కొంత మొత్తం వచ్చేలా చేస్తాను... కానీ నేను రాను.... మీకు ఏమయినా అయినా నేను రానూ...." అంటూ ఏడుస్తుంది.
వరుణ్ ముందుకు వచ్చి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
సురభి విసురుగా తోసేస్తూ "దగ్గరకు రాకూ.... డబ్బు వచ్చే సరికి కొత్త పెళ్ళాం కావాలనిపించిందా..... నన్ను ఉంచుకుంటా అంటావా! అది నోరా పెంట కుప్ప... నిన్ను తిట్టడానికి నాకు బూతులు కూడా చేత గావు.... ఛీ..."
వరుణ్ "సారీ.... సురభి.... ఐ యామ్ సో సారీ.... ఉదయం నుండి సాయంత్రం వరకు అలిసిపోయి తో ఇంటికి వచ్చే జీవితాలు.... ఎంత కష్ట పడ్డా బ్రతుకు మార్చుకోలేని తనం.... ఒక్క సారిగా డబ్బు వచ్చే సరికి ఎదో... దయ్యం పట్టేసింది... విడాకులు ఇచ్చాక కూడా నువ్వు వెళ్ళాక నేను ఒక్క క్షణం ఉండలేక పోయాను, నా వల్ల కాలేదు... నీ కోసం వెతికాను... ఎక్కడెక్కడో నీ గురించి అడిగాను..... డబ్బు తీసుకొని నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను"
సురభి "నీ కోసం ప్రాణం ఇస్తాను... వరుణ్... నా కోసం నువ్వు కొంత సమయం వెచ్చిస్తే చాలు నీ కోసం పడి చస్తాను... నువ్వు తిట్టినా కొట్టినా నీ గురించి ఏ నాడు కూడా బయట పడలేదు... నా కోసం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేవా... నన్ను కూడా ఒక మనిషిగా గుర్తించలేవా! హ!!!"
వరుణ్ అతల దించుకున్నాడు.
సురభి "చెప్పూ.... వరుణ్... ఎందుకు?.... ఎందుకు?.... నేనంటే నీకు చిన్న చూపు...."
అప్పుడే ఇంట్లోకి వచ్చింది తన ఆఫీస్ అక్క...
అక్క "అది నీ తప్పే సురభి..."
అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు.
సురభి "నా తప్పా..."
అక్క "అవునూ.... ముమ్మాటికి నీ తప్పే..."
సురభి "నేనేం చేశాను" అని అనే లోపే... వరుణ్ "తన తప్పేం లేదు.... అసలు మీరు ఎవరూ?"
అక్క, వరుణ్ కి నమస్కారం చేసి సురభి ముందు నిలబడింది.
అక్క "మనకు మన పెద్ద వాళ్ళు సాయం చేసి తిరిగి తలుచుకోకూడదు అని నేర్పారు... మొగుడుకి, వాళ్ళ అమ్మానాన్నకి సేవలు చేయడం నీ బాధ్యత అన్నట్టు నేర్పారు... నువ్వు అది ఫాలో అయ్యావ్... ఏ నాడు కూడా వాళ్ళ నుండి మెచ్చుకోలు కోలుకోలేదు"
సురభి "హుమ్మ్" అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది.
అక్క "నువ్వే కాదు.... ఈ కాలం(అంటే పోయిన జనరేషన్ లేండి ఈ జనరేషన్ కాదు) ఆడోళ్ళు అందరూ అంతే..... నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నిన్ను మరొకరు ఎక్కువగా చూడాలి అనుకుంటే ఎలా.... నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో... అప్పుడే నీకు వేరే వాళ్ళు రీస్పెక్ట్ ఇస్తారు... నిన్ను నువ్వు ప్రేమించుకో... అప్పుడే నిన్ను ఇంకొకరు ప్రేమిస్తారు... అసలు నువ్వు ఒక రిలేషన్ లోకి సరిపోగలుగుతావు"
సురభి తల దించుకుంది.
వరుణ్ "నాదే తప్పు..... నేనే కరక్ట్ కాదు..... తను ఎప్పుడూ అందంగానే ఉంది.... నేనే తప్పుగా చూశాను.... నన్ను క్షమించు సురభి.... నేను నీకు కరక్ట్ కాదు.... ఇక నేను నీకు కనపడను...." అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
సురభి "ఎక్కడకు వెళ్తున్నావ్...?"
వరుణ్ "మనకు విడాకులు అయిపోయాయి.. సురభి... ఇక నీ జీవితం నీది.... నా జీవితం నాది...."
సురభి "ఎవరు చెప్పారు మనకు విడాకులు అయ్యాయి అని...."
వరుణ్ అనుమానంగా చూస్తూ ఉంటే....
సురభి నవ్వేసి "వాళ్ళను అక్క ఏర్పాటు చేసింది.... వాళ్ళంతా నాటకం వేసే వాళ్ళు" అంది.
వరుణ్ ఇంకా నమ్మలేక పోయాడు.
సురభి ముందుకు వచ్చి, వరుణ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది.
వరుణ్మ్, సురభిని చూస్తూ ఎమోషనల్ అయి "నువ్వు నా ఏంజెల్ వి" అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
సురభి పేరు మీద ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఫ్యామిలీ అందరూ అందులో పని చేస్తున్నారు.
వాళ్ళ మోటో ఒక్కటే.... సెల్ఫ్ లవ్..... సెల్ఫ్ రెస్పెక్ట్....
నిన్ను నువ్వు ఇష్టపడకుండా వేరే వాళ్ళు నిన్ను ఇష్టపడాలని అనుకోవడం నీ కల మాత్రమే అవుతుంది. ఒక వేళ అది నెరవేరినా నిలబడదు...
లవ్ అవర్ సెల్ఫ్..... లవ్ అవర్ పార్టనర్..... లవ్ అవర్ ఫ్యామిలీ..... లవ్ అవర్ పేరెంట్స్..... లవ్ అవర్ సొసైటీ.....
లవ్ యు ఆల్....
యువర్ 3శివరాం...
హార్ష్ ఎండింగ్ రాద్దాం అంటే నా చేయి రాలేదు. ఇది మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను.