Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
#21
Excellent update Siva bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice update
Like Reply
#23
Good start Shiva garu...
[+] 2 users Like Vizzus009's post
Like Reply
#24
ఇంతకు ముందు కూడా అన్నట్లు గుర్తు, మదుబాబు పోలికలు/శైలి ఎక్కువగా కనిపిస్తాయి మీ కథనం లో. గ్రామీణ నేపద్యంలో బావుంది కథ. ఆఖర్న జరిగినటువంటి సంఘటనే నా చిన్నప్పుడు మా ఊరి సినిమా హాల్లో జరిగింది శివరాత్రి జాగరణ కోసం వెళ్తే....కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#25
Nice updates
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#26
Very nice update, Siva garu. Thank you
[+] 1 user Likes Kamandalam's post
Like Reply
#27
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#28
Wow...great narration. Felt like watching a movie! Please keep writing
[+] 2 users Like Rohit009's post
Like Reply
#29
కొత్త upate లో అమ్మాయిగారు వచ్చారు బలే. 

చిన్న request sir, అప్డేట్ నీ పేరాగ్రాఫ్ లా విడగొట్టండి.. చదవడానికి ఇంకా వీలుగా ఉంటుంది.
Thankyou for update
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#30
3.1.సాహసం
“నాయనా , నేను కూడా  వస్తా ఈ సారి  పందుల వేటకు”
“అది చిన్న పిల్లలు  ఆడుకొనే అట కాదు” 
“అమ్మా , నాకు తెలుసులే , నేనేం  ఇంకా చిన్న పిల్లవాడిని కాదులే”
“నేను చెప్తే వింటావా ,మీ నాన్న  తీసాక పోతాను అంటే వెళ్ళు ,  అబ్బా కొడుకు ఇద్దరు వెళ్ళండి” .
“అవును శివా, నిన్న రాత్రి  సినిమాకు వెళ్ళినప్పుడు అక్కడ గొడవ పడ్డారా ఎవరితో నన్నా”
“గొడవ అంటే గొడవ కాదు నాన్నా,  మన మల్లేసు గాడు లేడు, అదే నాన్నా రాజా రెడ్డి మామ డ్రైవర్,    ఆయత్తా పిల్లలతో కలిసి  సినిమాకు వచ్చినారు ,   అక్కడ  తురకొల్ల పిల్లోల్లు  ఎదో కొట్లాట పెట్టుకొని అత్తా వాళ్ళను కారు ఎక్క నీకుండా అడ్డం పడ్డారు ,  గమ్మున పొండిరా అని చెప్పినా , కానీ పోకుండా  మీద మీదకు వచ్చినారు,  ఆడికీ  రెండు దెబ్బలు వేసారు , గమ్మున ఉండ మని చెప్పినా వినలేదు అందుకే  రెండు పీకినా , ఈలోపు నా తోడుగాళ్ళు    వచ్చి తలా రెండు ఎట్లు వేసినారు ,  సినిమా మానేజరు వచ్చి  వాళ్ళను బైటికి తరిమి నాడులే”
“మనకు గొడవ ఎందుకప్పా ,  వాళ్ళ దావన  వాళ్ళు పోతారులే,  గొడవకు పోకు ఇంక ముందు”
“పాపం అత్త  అక్కడ కూతుర్లతో  ఇబ్బంది పడుతూ ఉంటె అట్టా  ఎట్లా  చూత్తా ఉంటా నాన్నా, నా వళ్ళ కాదు”
“వాళ్ళు నీమీద పగ బట్టి  రేపు కాలీజీ కి వెళ్ళినప్పుడు మీద పడితే”
“తంతే  తన్నిచ్చు కుంటా , లేదంటే నేనే నాలుగు తన్ని వత్తా”
 
“సరేలే  బువ్వ  తిని కొద్ది సేపు పడుకో , నేను తెపుతా వెళ్ళేటప్పుడు”
“నీకు ఎవ్వరు చెప్పినారు” అంది మంగి
“ఇంకెవ్వరు , ఆ రాజా రెడ్డి మామే  ఎపమాని కింద కూచొని  అందరికీ చెప్తున్నాడు”
“మనోడు మంచి పనే చేసినాడు గదా ఎందుకు నువ్వు వాని మీద అరుత్తున్నావు”
“నేనేం అరవడం లేదు , ఆ ఉరోల్లు  ఈడు వంటిరిగా దొరికితే ఏమైనా చెత్తారు ఏమో అని భయం అంతే”
“ఆ మాటే  రాజి రెడ్డి అన్నతో అనక పోయావా”
“అది కూడా  అయ్యింది,  అప్పుడే  ఫోన్ చేసి  C.I  తో మాట్లాడాడు వాళ్ళు ఎవ్వరో కనుక్కో , ఇంకో సారి మా జోలికి  గానీ , మా ఉరి  వాళ్ళ జోలికి గాని వస్తే  వాళ్ళ జాతిని మొత్తం  ఆ టౌన్ లో లేకుండా చెత్తం  అని వార్నింగ్ ఇంచ్చిండు.   ఆ  C.I   భయపడుతూ , నేను చుసు కుంటా రెడ్డి  మీ వరకు రానీయను లే  అని చెప్పాడు మా ముందరే.”
“మరి ఇంకా  భయం ఎందుకు”
“నీకు తెలియదు , వాడికి మనం  ఇటువంటి వాటిలో తోడూ ఉన్నాము అని  తెలిస్తే వాడు  ఇంకా  చదువు చదవడు ఇలా గోడవలతో  సరిపోతుంది వాడి జీవితం , మనకు వద్దు అలాంటి జీవితం , వాడు చదువుకొని పెద్దోడు ఆవ్వాలి”
వాళ్ళ  నాయన  పడుకో అనంగానే  చాప మీద పడుకొని రగ్గు కప్పెసుకొన్నాడు,  వెంటనే నిద్ర పెట్టేసింది ,కొడుకు నిద్ర పోయాడు అని  రంగా అతని పెళ్ళాం  వాడి గురించి మాట్లాడు కొన్నారు.
ఊర్లో  అంతా సందడగా ఉంది ,  వయస్సుకు వచ్చిన వారు అందరు ఎదో ఒక ఆయుధం తీసుకొని , కొందరు డప్పులు  తీసుకొని రెడీ అయ్యారు,    రంగడు శివాను  లేపకుండా వెళదాం అనుకొన్నాడు ఊర్లో  వాళ్ళు  బయలు దేరగానే, కానీ  శివ ఓ  కునుకు తీసి  లేచి   అటక మీద  ఉన్న  బల్లెం ( ఈటె ) తీసుకొన్నాడు ,  దానికి తోడూ   శివా  15 ఏట  వాళ్ళ నాన్నతో స్పెషల్ గా  ఓ  గొడ్డలి  తయారు  చేయించుకొన్నాడు,   తన మేన మామ  మిలిటరీ నుంచి ఒక నెల సెలవుల కోసం వస్తూ ఉంటాడు , వచ్చినప్పుడల్లా   ఓ  రెండు వారాల పాటు మేనల్లుడిని తన దగ్గర పెట్టుకొని , తనకు తెలిసిన కొన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు.   అందులో ముఖ్యంగా  బాక్సింగ్  లో కొన్ని పట్లు ,  చేతిలో కత్తి ( కొడవలి, గొడ్డలి లాంటివి ) ఉంటె దాన్ని ఎలా వాడాలో  మామ  మిలటరీ కి వెళ్ళగానే  అప్ప్డుడప్పుడు  ప్రాక్టిసు చేస్తూ ఉంటాడు  వాళ్ళ నాన్నకు తెలీకుండా.   చిన్నప్పటి నుంచి తన  నాన్నతో కొలిమిలో పని చేస్తూ  సమ్మెట కొడుతూ ఉండడం వళ్ళ తన చేతుల్లో పవర్  తనకు తెలీనంతగా  పెరిగింది.   కానీ  దానిని ఎప్పుడూ  ఉపయోగించే  అవసరం రాలేదు.
ఉరి లోంచి  వాళ్ళ నాన్న  వచ్చే  సరికి తన ఆయుధాలతో ,   వాళ్ళ  నాన్న  అడివిలోకి ప్రత్యేకంగా చేయించిన చెప్పులతో( అడివిలో  ముల్లులు  చెప్పుల్లో దురకుండా  కింద గట్టి  చర్మంతో  తయారు చేయించాడు  కొడుకు మీద ప్రేమతో ) రెడీ గా ఉన్నాడు.
 “వాడు  పడుకోన్నాడా”
“ఎక్కడ పడుకొన్నాడు , నువ్వు ఊర్లోకి  వెళ్ళగానే  అటక మీద ఉన్నవి తీసు  వాటి దుమ్ము దులిపి రెడీ అయ్యాడు, తీసుకొని వెళ్ళండి,  అలవాటు అవుతుంది పెద్దాడు అవుతున్నాడుగా ”
“సరే లే , నా పక్కనే ఉండమని చెప్తాను”  అంటూ    కొడుకుని  కేకేశాడు.
“నేను రెడీ”  నాన్నా అంటూ   నడుం కి  గొడ్డలి చేతిలో బల్లెం , ఇంకో చేతిలో  చిన్న  టార్చ్ లైట్  తో ,     వంటి మీద పొడుగు నిక్కర ,  బనీను  బుజం మీద టవల్  ఇది శివా  అవతారం.
“యుద్దానికి  పోయే వాడిలాగా రెడీ అయ్యినావుగా, సరే పద అందరు  బయలు దేరారు” అంటూ  తను కూడా   సుర్లో ఉన్న  బల్లెం తీసుకొని బయలు దేరాడు.
ఉరిలోంచి అడివి లోకి పోవాలి అంటే ,  చుట్టూ పొలాల లోకి జంతువులూ  వెళ్ళకుండా  కంచే ఏర్పాటు చేశారు , దానినే  ఉరి బాషలో దొంక  అంటారు ,  ఆ దొంక   వీళ్ళ  కొలిమి  దగ్గర నుంచే మొదలు అవుతుంది.   ఊర్లోంచి  ఒక్కరొక్కరే  వచ్చి  ఆ కొలిమి దగ్గర  గుమి కూడారు,   దాదాపు  ఓ  25  మంది జమ కూడా గానే  , రాత్రి  10.30  అవుతూ ఉండగా  అందరు  కలిసి కట్టుగా  చేతిలో ఉన్న టార్చ్ లైట్స్ దారి చూపుతూ ఉండగా  అడివిలోకి బయలు దేరారు,
Like Reply
#31
3.2
సాదారణంగా   ఈ వేట  రెండు రకాలుగా ఉంటుంది , ఒకటి  పందులను  వేటాడం , రెండు వాటిని పంటలకు దూరంగా  తరిమేయడం,  రెండో  వేట  పంట  పొలం లో ఉన్నప్పుడు చేస్తారు,  రెండో టైపు వేటాడేటప్పుడు , కొండ కింద నుంచి డప్పులు  కొడుతూ ,  అడివిలోకి దూరంగా  తోలతారు పందులను, కానీ మొదట  రకం  వేటాడేటప్పుడు , మొదట కొండ మీదకు వెళ్లి అక్కడ నుంచి   పందులు ఎక్కడ కిందకు  దిగుతాయో  తెలుసుకొని ఆ జాగాల్లో  మనుషులను పెట్టి  ,  అప్పుడు పై నుంచి డప్పులు కొట్టు కొంటు  పందులను కిందకు  తోలుతారు ,    ఆ ప్రత్యేకమైన జాగాలో ఉన్న వాళ్ళు  వాటిని వేటాడాలి,   కొందరి దగ్గర  తుపాకులు ఉంటాయి , మరి కొందరు  చేతిలోని బల్లెలతో  వాటిని వేతాడతారు.   
ఈరోజు వేట   కొండ మీద నుంచి  కిందకు  జరుగుతుంది.   దారిలో నడుస్తూనే   ఎవ్వరు ఎక్కడ ఉండాలి అనేది  మాట్లాడేసుకొని   వారి ప్లేస్ దాగ్గరకు  రాగానే అక్కడే నిలబడి పోయారు ,  చివరగా డప్పులతో  ఉన్న వారు మాత్రమె   కొండ మీదకు  వెళ్లి   డప్పులు కొట్టు కొంటు  కిందకు రాసాగారు.   పూర్వ కాలం  యుద్ధం చేయడానికి   కొన్ని  వ్యూహాలు ఉండేవి  ,  మన  కురుక్షేతం లో   పద్మవ్యూహం, బాహు బలిలో  అదేదో ఉంటుంది చూడు అలాగా , ఇక్కడ  కుడా ఓ  పద్దతి ఉంటుంది   డప్పుల వాళ్ళు  అంతా  ఒకే చోట కాకుండా  తిరగ బడ్డ U ఆకారం లాగా  విడిపోయి ,  డప్పులు కొట్టు కొంటు  వాటిని  మిగిలిన వాళ్ళు ఉన్న ప్లేస్  లకు  వచ్చే విదంగా  నడుస్తూ ,  వాటిని బెదిరిస్తూ  వస్తారు, అప్పుడు అవి భయపడి ఓ దారిలో  పారిపోతూ ఉంటాయి  ఆ దారిలోనే  మిగిలిన వాళ్ళు  కాపు  కాసి  వాటిని చంపడానికి రెడీ గా ఉంటారు. 
అడివి పందులు , చాలా  కోపంగా ఉంటాయి , ఆ సమయం లో వాటికి  దొరికితే  ఇంకా అంటే సంగతులు.  వాటి కోరలు  కత్తుల్లా  మొహానికి రెండు వైపులా ఉంటాయి ,   తనకు ఎదురుగా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసేప్పుడు అవ్వి  తల కిందకు వంచి తన మొహాన్ని  అటు ఇటు  తిప్పుతాయి  ఆ కోరలు  పొరపాటున మనిషి శరీరం లో కి దిగబడ్డాయా దిగబడ్డ బాగం  ముక్కలు ముక్కలుగా  విడిపోయి  బయటకు వస్తుంది శరీరం లోంచి ,  అందుకే  వేట గాళ్ళు  పందులకు  అందకుండా   వాటిని వేటాడుతూ ఉంటారు.
శివా , రంగడు   వాళ్లకు తోడుగా  మరో    4   ఉన్నారు  వేళ్ళకు కేటాయించిన ప్లేస్  లో       అది కొండ  మీద నుంచి   కొండ  కిందకు  వర్షం  నీళ్ళు  వచ్చే దారి , దాన్నే  నారవ  అంటారు,    నారవకు  అటువైపు  ముగ్గురు ,  వాళ్ళకు  ఎదురుగా కొద్దిగా కింద వైపు  శివా , రంగా , బాల్  రెడ్డి   ఉన్నారు , బాల్ రెడ్డి చేతిలో  నాటు తుపాకి ఉంది,  దానికి తూటా  లోడ్ చేసి రెడీగా పట్టుకొని ఉన్నాడు ,  కొడితే మొదటి తూటా  తోనే పడగొట్టాలి  రెండో   తూటా లోడ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఈ లోపల  అవ్వి  అందకుండా పోతాయి, లేదా మీదకైనా వస్తాయి.
బాల్రెడ్డి  కి  45  ఉంటుంది వయస్సు ,  ఎన్నో పందులను చంపినా అనుభవం ఉంది. 
“ఎంది , రంగన్నా కొడుకును  కూడా  తెచ్చినావు ఈ తురి”
“ఎం లేదన్నా, వాడే  వద్దన్నా వస్తా వస్తా  అంటా  వెనక పడ్డాడు, ఇంక తప్పలేదు అందకే  రమ్మన్నా”
“ఇది ఊర్లో అడే  క్రికెట్ అట కాదు,  ఎమారామా   పందులు నంజు కుంటాయి , రోంత ఏరిక  గా ఉండు”
ఈలోగా  డప్పులతో పాటు కేకలు వెనబడాయి ఎగువ వైపు “రేయి   రెండు పెద్దవి ,  మూడు చిన్నవి” అంటూ  అరుస్తున్నారు.   వీళ్ళ కంటే  ముందు  రెండు చోట్ల మనుసులు ఉన్నారు ,   వీళ్ళ  కింద ఇంకో   గుంపు ఉంది. మొత్తం   4  గుంపులు.  పైన  తప్పోతే  కింద వాళ్ళు రెడీ గా ఉండాలి.  5  నిమిషాలకు   పైన కేకలు వినబడ్డ  “ఒకటి దొరికింది  మిగితావి తప్పిచ్చు కొన్నాయి”  అన్న అరుపు వినబడ్డది.
ఆ తరువాత  డప్పులు కేకలు   “అమ్మా,  కుమ్మేసింది రో” అంటూ  అరుపు , దాని వెంటనే “ డాం” అంటూ తుపాకి శబ్దం  “ఇంకోటి దొరికింది ,   మిగతావి  కిందకు వత్తాన్నాయి”
“శివా , నువ్వు బాల్రెడ్డి  అన్న వెనుక ఉండు , నేను  కొద్దిగా కింద ఉంటా” అంటూ రంగడు  వాళ్ళకు  కొద్దిగా కింద వైపుకు  వెళ్ళాడు. 
 బాల్రెడ్డి  కి వెనుక  , తన  ఎడం చేతిలోకి    బరిసేను తీసుకొని కుడి చేతిలోకి  నడుం  కు వేలాడుతున్న  గొడ్డలిని  తీసుకొన్నాడు.
“నేను ఉన్నాలేబ్బీ  , నీకు వాటిని ఉపయోగించే  అవసరం రానీయను లే”
“వత్తాన్నాయి,  సుసుకోండి” అంటూ వెనుక నుంచి కేకలు.
ఓ 8 కేజీల బరువు ఉన్న  గున్న ఒకటి మొదట అగుపించింది.   అది కనబడ  గానే బాల్ రెడ్డి  కొద్దిగా ముందుకు జరిగి   గన్  తో కాల్చాడు,   కాల్చాక   తన తప్పు తెలుసుకొన్నాడు,    దాని వెనుకే   రెండు పెద్దవి వస్తున్నాయి  ఎప్పుడైతే బాల్రెడ్డి ముందు వైపుకు వెళ్ళాడో  సరిగ్గా  వాటి దారికి దగ్గరగా జరిగాడు ,   తన  గన్ వెటుకు  ముందు వచ్చింది  పడిపోయింది , కానీ దాని వెనుక  ఉన్న  రెండింటి చూపు బాల్రెడ్డి  మీద  పడింది.   ఆ తొందరలో   తన  లుంగీ జారి పోవడం చూసుకోలేదు,   వెనక్కు  పరిగెత్త పోతూ ఉంటె  లుంగీ కాళ్ళకు అడ్డపడి  వెల్లకిలా పడ్డాడు.  ఒకటి బాల్రేద్ద్   కాలును   టార్గెట్ చేసింది , రెండోది  బాల్రెడ్డి  తల వైపుకు రాసాగింది.    బాల్రెడ్డి  తన ప్రాణం పొయ్యింది అనుకొన్నాడు,    ఆయన వెనుక ఉన్న శివా  గురించి మరిచి పోయాడు ,  తన తప్పు  సరిదిద్దుకోనెంతలో  వీటికి బలై  పోతానే అనుకొంటూ , కాళ్ళు పైకి  లాక్కోవడానికి  ట్రై చేయసాగాడు.   తనకు  ఆ అవసరం    లేకుండా    వెనుక నుంచి  క్యాటర్  పల్  లోంచి ఉడి పడ్డ రాయిలా ,    ఓ చేత్తో  గొడ్డలి  ఇంకో చేత్తో  బరిసేతో  బాల్రెడ్డి  దూకాడు శివ, దూకగానే తన రెండు చేతులకు పని చెప్పాడు  ,  కాళ్ళ మీద   తన  విసురుతున్న పెద్ద పంది  మీద   గొడ్డలి  తో   దాని మొహాన్ని  నరికేశాడు.   రెండో చేత్తో   గుడ్డిగా  తల వైపు  వెళుతున్న  దాని  డొక్కలో బల్లెం  గుచ్చాడు.    రంగన్న  ,పొలానికి  అవసరం అయ్యే పనిముట్లే  కాదు   తను తయారు చేసే ఆయుధాలు కూడా  ఎంత పదునుగా ఉంటాయో   ఆ బల్లెం  దిగిన  తీరు తెలుస్తుంది.    అది వచ్చిన ఫోర్సు కి  , శివా  చేతుల్లోని శక్తినంతా ఉపయోగించి దించాడు బల్లెన్ని   దాని  డొక్కలో దూరి    కింద  మట్టిలో  గూటం  కొట్టిన  మేకులా  నెలలో దిగింది బల్లెం , అయినా దాని బరువుకు   కింద నెలలో ఈడుస్తూ  బాల్రెడ్డి  చేతి  దగ్గరకు వచ్చింది  బల్లెం దిగిన పంది  ,  కానీ  అంతకంటే  ముందుకు కదల కుండా బల్లెన్ని  నెలలోకి  గుచ్చాడు శివ.   గొడ్డలి  దెబ్బకు  సగం తెగిన ముట్టేతో    వాళ్ళ నుంచి తప్పించు కొని ముందుకు పరిగెత్తింది    సగం  ముట్టే  కిందకు వేలాడుతూ ఉండగా.
“నాయనా , వత్తాంది  , దాని ముట్టే  తెగింది ,  చూడు” అంటూ శివా  గట్టిగా కేక వేశాడు  వాళ్ళ నాన్న కు వినబడేట్లు.    ఈ లోపల    నారవకు  ఆపక్కన్న ఉన్న  వాళ్ళు  కూడా  ఈ పక్కకు వచ్చి  వారి బల్లెలతో  దాన్ని నొక్కి పట్టారు, బాల్రెడ్డి   ఆ సందులో లేచి   లుంగీ  సర్దుకొని   తుపాకి లోడు చేసుకొని  కింద  వైపు  పరిగెత్తాడు.   కానీ  అక్కడి  కి వెళ్లి తను చేసింది ఎం లేదు , సగం  తెగిన ముట్టెతో  వచ్చిన  దాన్ని  తన బల్లెం  తో  నొక్కి పట్టి ఉంచాడు  రంగడు.   శివా రెడ్డి తోపాటు  వచ్చిన ఇంకో ఇద్దరు   వాళ్ళ బల్లెల  తో  గుచ్చి  దాన్ని  కింద పడేశారు.
మరో 5 నిమిషాలకు  అంతా   అక్కడ గుమి కూడారు.
“నీ కొడుకును  ఎందుకు తీసుకొని వచ్చావు అని  అన్నాను చూడు , నా మాటను వెనక్కు తీసుకొంటున్నా రా రంగా,   నా పాణం పొయ్యింది అనుకొన్నారా ,   యముని పాశానికి అడ్డం పడే  వాడిలా  నా ముందుకు  దుంకినాడు. పిల్లోడు  నా వెనుక ఉండు అని నేను ఎగతాలో చేసినాను కానీ ఆ పిల్లోడి  రెండు చేతులు పని చేసాయి ఒకే సారి లేదంటే నా కాలో లేదా గొంతో  పోయింది అనుకొన్నా ,  వాడేమ్మా  ఎంత ఉన్నాయో చూడు , ఈ మద్య కాలంలో  ఇంత పెద్ద దున్నలను  మన  వేటాడ లేదు.   బుల్లెట్ కూడా  దిగుతుందో లేదు అనేంత మందం  ఉంది దీని చెర్మం  ,  వీడు పొడిచిన పొడుపుకి  ఆ బల్లెం  భూమి లోకి ఎంత దిగబడిందో   అక్కడ చూడండి , అది వచ్చిన  తీరుకి  నా పానాలు పైనే  పోయినాయి ,  సాదారణమైన పోటు పొడిచినా  అది  నన్ను మాత్రం  నంజు కొనేది , వాడి బల్లెం  దాన్ని ముందుకు రాకుండా  ఆపింది,  ఏమో  అనుకొన్నారా నీ కొడుకుని మొన్న ఊర్లో  అంతా అంటూ ఉంటె  చెరువులో  ఈ పక్క నుంచి అపక్కకు  ఈదుకొని వచ్చినాడు అంటే , పిల్లగాడు  వయస్సు మీద ఉన్నాడు అనుకొన్నా , కానీ  ఇప్పుడు తెలుత్తాంది  వీడి భలం ఏమిటో  ,  ఒరే  శివా , నచ్చావురా ,  ఈ బాల్రెడ్డి  కి నచ్చేసావు”  అంటూ   ఎత్తేశాడు  శివాని.
Like Reply
#32
adbhutam shiva reddy garu
[+] 1 user Likes shekhadu's post
Like Reply
#33
సూపర్ అప్డేట్
Like Reply
#34
Excellent story
Like Reply
#35
Nice narration

Waiting for next update
Like Reply
#36
super bro
Like Reply
#37
(27-09-2024, 01:44 PM)Mottam Chadivi Ayipoyinaka ardham ayindi nenu ippatidaka chaduvutunnanu ani... chala baga rasaru....mottam leenam ayipoyela raasaru... Wrote: yourock
Like Reply
#38
super update
Like Reply
#39
Manchi cinema chupisthunnaru
Like Reply
#40
Excellent update bro
Like Reply




Users browsing this thread: chigopalakrishna, Munna2349, My name is devil king, prash426, sree2022, Vizzus009, 123 Guest(s)