Posts: 4,148
Threads: 7
Likes Received: 22,493 in 1,974 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
576
#Dasara - అశ్వహృదయం
అందరికీ వందనాలు, దసరాకు కథల పోటీ అనగానే కొద్దిగా ఉత్సాహం వచ్చింది , కానీ టైం కి అందించగలమా లేదా అనేది పెద్ద సమస్య, సమస్యను అలా పట్టుకొని కుచోంటే తీరదు కదా, మొదలు పెడితే ఆ తరువాత దాని అంతటా అదే ముందుకు సాగుతుంది అనే ఉద్దేశ్యం లో మొదలు పెట్టేశా.
కథ తొందరగా శృంగారం లోకి పోదు కొద్దిగా ఓపికగా చదువుతూ పొండి , కావలసిన నవరసాలు అన్నీ ఇంకులో రంగరించి పెన్నులో పోశా , ఆ ఇంకు టైం కి అనుగుణంగా ఎ రసం ఎక్కడ అవసరమో అక్కడ పెన్ను లోంచి జారి పేపర్ మీద పడుతూ ఉంటుంది చదువుతూ మీ అభిప్రాయలు రాస్తే కుసింత మాకు సంతోషం.
ఈ కథలోని పాత్రలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు, అన్నీ కల్పితాలు చదివి ఎంజాయ్ చెయ్యండి.
భాష కొద్దిగా పల్లెటురిది కొన్ని పదాలు అర్తం కాక పోవచ్చు అక్కడక్కడా వీలు ఉన్నంత వరకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
దసరా కథ
1 పరిచయం
2 పందెం
3 సాహసం
4 పొగడ్తలు
5 అనుకోని వరం
6 వరం – మొదటి బాగం
7 సరసం – నాంది
8 సరసం - ఇంకొద్దిగా
9 సరసం – అబ్యాసం
10 వరం - రెండవ బాగం
11 సహాయం – సఖి పరిచయం
12 సహాయం – కార్యాచరన
The following 24 users Like siva_reddy32's post:24 users Like siva_reddy32's post
• amarapremikuraalu, DasuLucky, kamadas69, Mohana69, Prasad@143, raghu1122, Ram 007, ramd420, ramkumar750521, Ramvar, RangeRover0801, Ravi9kumar, Sachin@10, Saikarthik, Sasi999, shekhadu, sri7869, stories1968, Storieslover, Sunil3070, Tik, Uppi9848, vv7687835, సోంబేరిసుబ్బన్న
Posts: 4,148
Threads: 7
Likes Received: 22,493 in 1,974 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
576
1. పరిచయం
“ఏందిరా పొద్దున్నే కొలిమి పెట్టినావు, అంత పని ఉంది ఏంటి?” అన్నాడు నాగన్న కొలిమి లోంచి నిప్పు తీసుకొని తన బీడీ వెలిగించు కొంటు.
“అవును మామా , వర్షాలు పడ్డాయి కదా అందుకే దుక్కి దున్నడానికి మడకలు కావాలిగా ఈ చుట్టూ పక్కల ఉన్నది మన కొలిమి ఒకటే కదా అందుకే మామా కొద్దిగా పని ఎక్కువ అయ్యింది” అన్నాడు రంగడు చేతిలోని సుత్తితో కాలిన ఇనుమును కావలసిన విధంగా సాగ దీస్తూ.
“ఒక్కడివే ఉన్నావు ఏంటి ? నా అల్లుడు ఎక్కడ , కాలజీ కి వెళ్ళాడా”
“లేదు మామా రెండు రోజుల నుంచి పంపలేదు, పని ఉంది నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడే సమ్మెట కొడుతున్నాడు, అలసి పోయాడు , అందుకే కొద్దిసేపు పడుకోమని నేను లేప లేదు.”
“కొడుకంటే వాడురా , మాకూ ఉన్నాడు ఎందుకు ఇంట్లో ఒక్క పని చేయరు , దానికి తోడూ దానికి డబ్బులు ఇవ్వు , దీనికి డబ్బులు ఇవ్వు అంటూ మా చేత కర్చు పెట్టిస్తు ఉంటారు, వీడు ఉన్నాడు నువ్వు కర్చుల కు ఇచ్చిన డబ్బులు కూడా మా చెల్లికి ఇస్తూ ఉంటాడు అంట”
“ఏమో మామా వీడు అందరి లా కాకుండా వేరుగానే అనిపిస్తున్నాడు”
“ఒరే రంగా అలాంటి కొడుకు ఉన్నందుకు గర్వ పడు బామర్ది, వాడికి ఎం కాదు , చూస్తూ ఉండు మంచి ఉద్వోగాలు సంపాదించి నిన్ను మా చెల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోంటాడు.”
“ఏమో మామ పాపం ఆ వయస్సు పిల్లలు సంతోషం గా ఉంటె నేను వాడిని ఇక్కడ సమ్మెటతో నా పని చేయించు కొంటున్నాను.”
“ఏంటి మామా , పొద్దున్నే మా నాయన మీద పడ్డావు?, ఎం నాయనా ఇంకా ఎంత పని ఉంది , ఈరోజు అయిపోతుందా రేపటి నుంచి నేను కాలేజీ కి వేల్లోచ్చా , నేను రెండు నిమిషాల్లో వస్తా మొహం కడుక్కొని నువ్వు కొలిమి వేడి చేసుకో” అంటూ తను లేచిన చాప , దిండు మడత పెట్టి అక్కడ ఉన్న అటక మీద పెట్టి బయట ఉన్న వేప చెట్టు దగ్గర కెళ్ళి దాన్ని నోట్లో వేసుకొని తోముకొని అక్కడ ఉన్న తొట్టి లోని నీటిని తీసుకొని మొహం కడుక్కొని తన బుజం మీద ఉన్న టవల్ తో తుడుచు కొంటు కొలిమి ఉన్న ప్లేస్ కి వచ్చాడు.
ఉరి చివర ఉన్న ఓ పెద్ద వేప చెట్టు కింద ఉంటుంది కొలిమి, అది ఓ 500 గడపలు ఉన్న ఓ చిన్న పల్లె, ఆ వేప చేట్టుకొని అనుకోని ఉన్న ఓ చిన్న బోద కొట్టం లో ఉంటారు ఆ కొలిమి నడుపుతున్న ఓనర్ రంగా, అతని బార్య మంగి అతని కొడుకు శివ.
“నాన్న ఇదిగో రాత్రి కలిపిన సద్దన్నం కొద్దిగా తిని ఆ తరువాత పని లోకి వెళ్ళు , నీకు మీ నాన్నకు ఓ సారి పనిలోకి దొరికితే ఆకలీ దప్పికా ఎం తెలీవు ” అంటు శివ వాళ్ళ అమ్మ ఓ ముంత తెచ్చి శివ చేతిలో పెట్టింది, ఇంకో చేతికి ఓ ఉల్లి పాయి , మిరప కాయ ఇస్తూ.
“నాయన తిన్నాడా అమ్మా”
“నువ్వు తింటూ ఉండు , మీ నాన్నకు కుడా తెత్తాండ” అంటూ ఇంట్లోకి వెళ్లి మరో ముంత తెచ్చి ఇచ్చింది రంగాకు.
“ఆన్నా , ఇంకో ముంత ఉంది నీకు కుడా తెస్తున్నా ఉండు” అంది నాగన్న వైపు చూస్తూ
“వద్దు తల్లీ , నేను పొద్దున్నే తిని వచ్చా ఇంట్లో” అన్నాడు నాగన్న.
వాళ్ళ అమ్మ ఇచ్చిన ముంతను రెండు నిమిషాల్లో కంప్లీట్ చెసి , ముంతను ఇంతకూ ముందు తను మొహం కడుక్కొన్న తొట్టి దగ్గరుకు వెళ్లి కడిగి వాళ్ళ అమ్మకు ఇచ్చాడు. వాళ్ళ నాన్న తన ముంత లోని అన్నం తింటూ ఉండగా శివ కొలిమి దగ్గరకు వచ్చి అందులోని కొద్దిగా బొగ్గులు సరిగా వేసి , అక్కడ ఉన్న గాలి కొట్టే తిత్తిని కొద్ది వేగంగా కదుపుతూ కొలిమిలో ఉన్న ఇనుమును, పట్టకర్రతో తిప్పుతూ దాన్ని పూర్తిగా వేడెక్కించాడు. ఈలోపున వాళ్ళ నాన్న తన చేతిలోని ముంతను ఖాళీ చేతి కొడుకు చేతిలోని పట్టకర్ర తీరుకొని ఆ ఇనుము ను తన చేతిలోకి తీసుకొని , “నువ్వు సమ్మేట తీసుకో నాన్న” అంటూ వేడెక్కిన ఇనుమును అక్కడున్న ఇనుప దిమ్మి మీద పెడుతూ దాన్ని అటు ఇటు తిప్పుతూ తన చేతిలోని చిన్న సుత్తితో కొడుతూ దానిని తనకు కావలసిన రీతిగా మలుచు కో సాగాడు. ఈ లోపున తన బుజం మీద ఉన్న టవల్ ని తలకి చుట్టుకొని , అక్కడున్న సమ్మెట తీసుకొని రంగా పెట్టిన ఇనుము మీద రిథమిక్ గా దెబ్బలు వెయ సాగాడు, అంతకు ముందు తన వంటి మీద ఉన్న టవల్ ఇపుడు తన తల మీదకు వెళ్ళడం వల్ల తన బనియన్ లోంచి ఉబికి బయటకు వస్తున్న కండలు , సమ్మెట కొడుతూ ఉన్నప్పుడల్లా శివా భుజాలు , అతని కండలు చూసి , “రంగా, అల్లుడు పెద్దోడు అవుతున్నాడు” అన్నాడు ఇంకో బీడీ వెలిగిస్తూ.
“ఇంటర్ రెండో సంవత్సరానికి పెద్దోడు ఎలా అవుతాడులే , వాడు అంతా మా నాయన శివన్న పోలిక , మా నాయన పొయే నాటికి కుడా , చాల ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయన ఆరడుగుల పైన ఉండే వాడు. వీడికే అదే పోలిక వచ్చింది, అందుకే అయన పేరు పెట్టుకొన్నా ” అన్నాడు సమ్మెటతో పలుగు గా తయారు అవుతున్న ఇనుము కమ్మీ మీద వెట్లు వేస్తున్న కొడుకును మురిపంగా చూస్తూ.
“వీడు కూడా , మీ నాన్న లాగా బాగా చదువుకుంటాడులే”
“మా నాయన ఎక్కువ చదువుకోలేదులె , ఆ కాలంతో SSLC చదువుకొన్నాడు , సర్కారోల్లు ఉద్యోగం ఇచ్చినా వద్దు అని కోలిం పనే చేసేవాడు, అప్పట్లో నో ఏవో కొత్త కోత్త పరికరాలు తయారు చేసేవాడు వ్యవసాయానికి అవసరం అయ్యేట్లు, వీన్ని ఈ పనిలోకి రావద్దు అంటున్న , టౌన్ కి వెళ్లి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి , ఈ గొడ్డు చాకిరీ నా తోనే ముగిసిపోవాలి” అన్నాడు.
“ఏందిరా రంగా , మొన్న తోనిక్కట్టెలు చేయమని ఇచ్చాను , చేసినావా” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజా రెడ్డి.
“రాత్రే అయ్యింది మామా పొద్దున్నే నేనే వచ్చి ఇద్దాము అనుకొన్నా , కాకా పొతే కొద్దిగా పని ఎక్కువ ఉంది, అదిగో ఆ గుంటక పక్కన పెట్టినా చూడు తీసుకో” అన్నాడు తన ద్యాస కొడుకు కొట్టే సమ్మెట మీద నుంచి మార్చ కుండా, ఆ సమ్మేటకు అనుగుణంగా పట్టకారుతో ఆ ఇనుప కమ్మీని తిప్పుతూ.
చేతిలోని తోనిక్కట్టెలు తీసుకొని వాటిని ఓ మారు చెక్ చేసి
“చుసినావురా నాగ్గా , ఈ తోనిక్కట్టేలతో చెండ్లో గడ్డి కాకుండా ఎవరినన్నా ఎసేయాలన్నా ఒక్క దెబ్బ చాలురా , ఒరే మా నాయన చెప్పేటోడు , ఇనుమ్మీద మీ నాయన చెయ్యి పడితే, గుడిలో వరాలిచ్చే దేవత లాగా అయన మాట ఇని , ఆయనకు కావలసినట్లు తయారు అయ్యేవంట పనిముట్లు, మీ నాయన చేసిన బలి కత్తి ఇప్పటికీ మా ఇంట్లో అటక మీద ఉంది, నువ్వు మీ నాయనకు ఎ మాత్రం తీసుపోవురా, ఏంటి నీ కొడుకును నీ లాగే తయారు చేత్తున్నావా ఎంది , మొన్న మా యమ్మి చదివే కాలేజీ లో చూసినా వీన్ని , కాలేజీ కి పోలేదా ఎంది” అన్నాడు.
“పని ఎక్కువగా ఉంది అని , నేనే పంపలేదు మామ , రేపట్నుంచి పోతాడులే”
“సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకొని పో”
“తీసుకొంటాలె , నీ దగ్గర ఎక్కడ పోతాయి డబ్బులు”
“వీనికి పని చేసేది వచ్చు డబ్బులు ఎలా అడగాలో కూడా తెలీదు , మొన్నటి సారి బండికి ఇరుసు పొతే ఎసిచ్చినావు దాని డబ్బులు కూడా తీసుకోలా , ఒరే అబ్బీ నువ్వన్నా వచ్చి తీసుకొని పో అవ్వీ ఇవ్వీ అన్నీ కలిపి” .
“అలాగే మామా” అన్న శివా వైపు చూస్తూ తోనిక్కట్టెలు తీసుకొని వెళ్ళాడు రాజా రెడ్డి.
The following 38 users Like siva_reddy32's post:38 users Like siva_reddy32's post
• aarya, AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, arkumar69, Babu143, CHIRANJEEVI 1, DasuLucky, Ghost Stories, gora, hrr8790029381, Iron man 0206, k3vv3, kamadas69, King1969, Mahesh12345, Manavaadu, murali1978, Naga raj, Nawin, Pinkymunna, Raaj.gt, Ram 007, ramd420, ramkumar750521, Ramvar, RangeRover0801, Ravi9kumar, Sabjan11, Sachin@10, Saikarthik, shekhadu, shoanj, sri7869, Storieslover, Uday, Uppi9848, సోంబేరిసుబ్బన్న
Posts: 324
Threads: 0
Likes Received: 156 in 118 posts
Likes Given: 1,174
Joined: Jan 2022
Reputation:
4
Posts: 4,148
Threads: 7
Likes Received: 22,493 in 1,974 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
576
వీళ్ళు పని చేసుకొంటూ ఉండగా, ఇంకో ఆరేడు మంది వచ్చారు , తమ పనిముట్లు తీసుకొని వాటిని మెరుగు పెట్టాలి అంటూ.
ఓపక్క పని చేస్తూనే వాళ్ళు ఇచ్చిన పనిముట్లు తీసుకొని వాళ్ళకు ఎప్పుడు వచ్చి తీసుకొని పోవాలో చెపుతూ వాళ్ళను పంపిచ్చాడు రంగాన్న.
చూస్తూ ఉండగా తన చేతిలోని ఇనుపు ముక్క తను అనుకొన్న రూపానికి రాగా త్రుపిగా దాని వైపు చూసి , కొలిమి లో ఉన్న ఇంకో ఇనుప ముక్కను తీసుకొని దాని రూపు రేకలు మార్చ దానికి పూనుకొన్నాడు.
రుద్రాపురం , రాయల సీమలో ఓ మారు మూల పల్లె , ఆ పల్లెకు పక్కనే ఓ పెద్ద అడివి , ఆ పల్లెకు ఓ రెండు కిలో మీటర్ల దూరం లో రైల్వే స్టేషన్ , ఓ 20 కిమీ దూరంలో ఓ తాలుకా హెడ్ క్వార్టర్. జిల్లాకు ఓ 150 కిమీ దూరంలో ఉంటుంది.
ఊర్లో హైస్చూల్ వరకు ఉంది , కానీ కాలేజీ కి వెళ్ళాలి అంటే పక్కన ఉన్న టౌన్ కు వెళ్ళాల్సిందే. ఆ ఊర్లో పొలాలు మంచి సారవంతమైనవి , పక్కనే అడివి ఉండడం వళ్ళ చిన్న చిన్న కుటుంబాలకు గొర్రెలు , మేకలు మేపుకొని ఉపాది పొందే వారు.
పక్కనే రైల్వే స్టేషన్ ఉండడం వళ్ళ కొండలో ఎండిన కట్టెలు తెచ్చి టౌన్ లో అమ్ముకోవడం కుడా ఒకప్పుడు ఉపాదిగా ఉండేది , కానీ ఆ అడివి ఫారెస్ట్ వాళ్ళ చేతికి వచ్చాక ఫారెస్ట్ వాళ్ళు కట్టెలు కొట్టే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు ఇంకో సారి ఎవరన్నా కట్టెలు కొట్టేది కనపడితే , స్టేషన్ లో వేస్తాము అని అప్పటి నుంచి ఎవ్వరు ఆ పని మాత్రం చేయలేదు.
ఆ కొండ లోపల ఓ శివుని గుడి ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టపడాలి , కానీ శివరాత్రి రోజు ఆ గుళ్ళో పూజలు బాగా జరుగుతాయి.
ఊర్లో నడవ గలిగిన వాళ్ళు అంతా అక్కడే ఉంటారు , కొద్ది దూరం ఎద్దుల బండ్లు వెళతాయి కానీ ఆ తరువాత నడవాల్సిందే.
ఆ కొండలో ఎలుగు బంట్లు , అడివి పందులు ఎక్కువ అందుకే ఒంటరిగా ఎవ్వరూ అడివి లోకి వెళ్లరు సాదారణంగా.
ఆ అడివికి ఉరికి మద్యలో ఓ చిన్న చెరువు , అడివిలోని వర్షపు నీళ్ళు అన్నీ అక్కడ చెరువులో నిలువ అవుతాయి , జిల్లాలో అన్ని చెరువులు ఎండి పోయినా ఇది మాత్రం ఎప్పుడు నిండి ఉంటుంది. కొండ లోంచి వచ్చే ఉట నీళ్ళే దానికి కారణం.
“పయటాల అయ్యింది , ఆపేసి వచ్చి అన్నం తినండి బిడ్డని పొద్దున్నుంచి సంపెత్తున్నావు” అంది రంగడి బార్య.
ఈ లోపున “ఒరే శివా , చేర్లోకి ఈతకు వెళుతున్నాము వత్తావా” అంటూ ఓ 5 మంది శివా వయసున్న పిల్లలు వచ్చారు కొలిమి దగ్గరికి.
“వెళ్లి తొందరగా రా నాన్న , నేను తిని రోంచేపు నడుం వాలుస్తా , పెద్దగా పని ఎం లేదులే , రెండు గుంటకలు మిగిలి పోయినాయి , నువ్వు వచ్చాక చేసుకోవచ్చులే” అంటూ కొలిమి అపేసి భార్యతో ఇంటికి వెళ్ళాడు.
శివా తన ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్ళాడు.
రంగడు కొద్దిగా చామన చాయగా ఉంటాడు , కానీ శివ అమ్మ తెల్లగా పాల మీగడ లోంచి అద్ది తీసినట్లు గా ఉంటుంది. రంగడు వయస్సులో ఉన్నప్పుడు , పక్కనే ఉన్న తాండాలో ఏవో పనిముట్లు ఇవ్వడానికి వెళ్లి , అక్కడ మంగతో లవ్ పడి ఊర్లో వాళ్ళను ఎదిరించి ఆమెను ఎత్తుకొని వచ్చాడు, అప్పడు శివా తాత , నా బిడ్డ మీద చెయ్యి పడితే ఉరు నంతా స్మశానం చేస్తానని పలుగు పట్టుకొని అడ్డ పడ్డాడు, శివా తాత అంటే అప్పట్లో కొద్దిగా భయం ఆ చుట్టుపక్కల అందరికీ , ఆయన్ని చూసి రంగన్ని వదిలేసారు.
శివ అమ్మ తెలుపే శివాకి వచ్చింది. 6.1 తో ఆ తెలుపుతూ, కస్టపడి పెంచిన బాడీతో ఫ్రెండ్స్ తో వెళుతూ ఉంటె, వాళ్ళే వేడిని ఏడిపించే వాళ్ళు “పిండి రాయి , పిండి రాయి” అని.
ఇప్పుడంటే రక రకాల paints వచ్చాయి కానీ పూర్వం గోడలకు సున్నం పుసేవాళ్ళు , ఆ సున్నం ఓ రకమైన రాతి లోంచి వచ్చేది.
ఆ రాతిని బట్టీల్లో పెట్టి రెండు మూడు రోజులీ వేడి చేసేవాళ్ళు ఆ తరువాత అదే రాయి సున్నం లాగా తాయారు అవుతుంది. చూడ దానికి గట్టిగా అగుపిస్తుంది , కానీ పట్టుకోగానే పొడి పొడి అయ్యి మన్ను లాగా విడిపోతుంది. శివ కుడా అంతే చూడ్డానికి పెద్ద పైల్మాన్ లాగా ఉంటాడు కానీ వాడితో మాట్లాడితే తెలుస్తుంది వాడు ఎలాంటి వాడో.
తన ఫ్రెండ్స్ మొత్తం 5 గురు శివా తో కలిపి , అందులో ఇద్దరు మాత్రం ఇప్పుడు తన క్లాసు లో చదువుతూ ఉన్నారు , మిగిలిన ఇద్దరు 10 తరగతి ఫెయిల్ అయ్యి ఇంటి పనులు చూసుకోంటు ఉన్నారు.
తనతో చదివే వాళ్ళు అది, చంద్రా ఫెయిల్ అయిన వాళ్ళు మోహన్ , రాము అందరికీ వ్యవసాయం ఉంది.
వీళ్ళల్లో చంద్రా వాళ్ళ నాన్న పెద్ద రైతు , మిగిలిన నలగారికీ వాడి కంటే తక్కువే , శివా వాళ్ళకు కూడా ఓ 3 ఎకారాలు ఉంది అడివికి అనుకోని , అది వాళ్ళ తాత తయారు చేసి పెట్టినాడు , దాన్నే ఆ తరువాత పట్టా గా వాళ్ళ నాన్న పేరు మీద రిజిస్టర్ చేసుకొన్నారు. ఆ పొలం లో పంట పెట్టిన దగ్గర నుంచి ఇంటికి తెచ్చేంత వరకు పోలంలో ఎవ్వరో ఒక్కరు ఉండాల్సిందే , లేకుంటే పంట అంతా అడివి జంతువుల కు సరిపోతుంది.
“ఏంట్రా, మీరు కూడా డుమ్మా కొట్టారు కాలేజీకి” అన్నాడు తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ.
“ఎక్కడరా , మొన్న వర్షం పడ్డదా రెండు రోజుల నుంచి కట్టిన గుంటక ఇప్పితే ఒట్టు , ఈరోజు అన్నీ దున్నే సరికి కొద్దిగా టైం దొరికింది” అన్నాడు చంద్రా
“నీకేం అయ్యిందిరా అదిగా, నువ్వు ఎందుకు వెల్ల లేదు”
“వాళ్ళు చెప్పేది నాకు ఎక్కదు, అక్కడికి పొయ్యి పీకేది ఏముంది అని వెళ్ళలేదులే , రేపు వెళదాం లో మీ నాయన పని అయిపొయింది అన్నాడుగా”.
The following 42 users Like siva_reddy32's post:42 users Like siva_reddy32's post
• aarya, AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, Babu143, Bbmmbb, DasuLucky, Ghost Stories, gora, Gova@123, hrr8790029381, Iron man 0206, k3vv3, kamadas69, Kamandalam, King1969, Mahesh12345, Manavaadu, Manjeera, Nawin, Pinkymunna, Prasad@143, Ram 007, ramd420, ramkumar750521, Ramvar, RangeRover0801, Rao2024, Rathnakar, Ravi9kumar, Sachin@10, Saikarthik, shekhadu, shoanj, sri7869, Storieslover, TheCaptain1983, Tik, Uday, Uppi9848, Vizzus009, సోంబేరిసుబ్బన్న
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
శివా రెడ్డి గారు రంగంలోకి దిగారంటే వారే విజేత,
తిరుగులేని మరువలేని కథని మనకు అందిస్తారు
ఇందులో ఎవరికీ సందేహం వలదు, కూడదు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,010
Threads: 156
Likes Received: 9,744 in 1,941 posts
Likes Given: 5,702
Joined: Nov 2018
Reputation:
680
శివా రెడ్డి గారు రంగంలోకి దిగారంటే వారే విజేత,
తిరుగులేని మరువలేని కథని మనకు అందిస్తారు
ఇందులో ఎవరికీ సందేహం వలదు, కూడదు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,127
Threads: 9
Likes Received: 2,603 in 2,049 posts
Likes Given: 9,500
Joined: Sep 2019
Reputation:
23
•
Posts: 5,338
Threads: 0
Likes Received: 4,443 in 3,330 posts
Likes Given: 16,859
Joined: Apr 2022
Reputation:
76
Excellent update bro meru new story start cheyatam challa bagundhi
Posts: 4,083
Threads: 0
Likes Received: 2,798 in 2,178 posts
Likes Given: 779
Joined: May 2021
Reputation:
30
Posts: 3,282
Threads: 0
Likes Received: 1,615 in 1,324 posts
Likes Given: 58
Joined: Jan 2019
Reputation:
19
Posts: 8,186
Threads: 1
Likes Received: 6,216 in 4,399 posts
Likes Given: 50,605
Joined: Nov 2018
Reputation:
107
Posts: 1,005
Threads: 9
Likes Received: 8,664 in 611 posts
Likes Given: 4,043
Joined: May 2019
Reputation:
1,046
25-09-2024, 11:25 PM
(This post was last modified: 25-09-2024, 11:27 PM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ ఆరంభం చాలా చక్కగా ఉంది సర్ , clp);
రంగా – మంగి - శివ
శివ - కాలేజీ – అదే కాలేజీలో రెడ్డి కూతురు
రంగా శివ కలిసి చేసిన తోనిక్కట్టే
అప్డేట్ చదివాక అందులో ఉన్న పాత్రలు , పనిముట్లు చదువుతుంటే (సరదాకి) జరగబోయే కథ అర్ధం అయినట్టుగా అనిపించి, :)
నాకు అర్ధం అయింది సరదాగా ఒక మాటలో – రంగా కొడుకు శివ / రెడ్డి కూతురు / మద్యలో తోనిక్కట్టే (బలి కత్తి ) ..॥
బహుశా రంగా – మంగి జీవితంలో జరిగినట్టుగా చరిత్ర మరలా పునరావృతం అవుతుందా [ History repeat it self ]
గమనిక - అంతా నా ఊహ మాత్రమే
Posts: 351
Threads: 5
Likes Received: 5,008 in 309 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
730
(25-09-2024, 11:25 PM)Ravi9kumar Wrote: కథ ఆరంభం చాలా చక్కగా ఉంది సర్ , clp);
రంగా – మంగి - శివ
శివ - కాలేజీ – అదే కాలేజీలో రెడ్డి కూతురు
రంగా శివ కలిసి చేసిన తోనిక్కట్టే
అప్డేట్ చదివాక అందులో ఉన్న పాత్రలు , పనిముట్లు చదువుతుంటే (సరదాకి) జరగబోయే కథ అర్ధం అయినట్టుగా అనిపించి, :)
నాకు అర్ధం అయింది సరదాగా ఒక మాటలో – రంగా కొడుకు శివ / రెడ్డి కూతురు / మద్యలో తోనిక్కట్టే (బలి కత్తి ) ..॥
బహుశా రంగా – మంగి జీవితంలో జరిగినట్టుగా చరిత్ర మరలా పునరావృతం అవుతుందా [ History repeat it self ]
గమనిక - అంతా నా ఊహ మాత్రమే
మీరు రిప్లై ఇస్తే చాలు sir
కథ చాలా బాగా అర్ధం అవుతుంది....
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,154 in 1,675 posts
Likes Given: 8,905
Joined: Jun 2019
Reputation:
22
•
Posts: 206
Threads: 0
Likes Received: 164 in 112 posts
Likes Given: 914
Joined: Mar 2022
Reputation:
5
chala rojula tarvata siva reddy gari nunchi kotha katha.
superb sir
nice start
•
Posts: 139
Threads: 0
Likes Received: 209 in 110 posts
Likes Given: 152
Joined: Aug 2024
Reputation:
1
Nice story
Waiting for next part
•
Posts: 979
Threads: 0
Likes Received: 1,468 in 853 posts
Likes Given: 3,747
Joined: Jun 2020
Reputation:
63
(25-09-2024, 05:50 PM)siva_reddy32 Wrote: “వాళ్ళు చెప్పేది నాకు ఎక్కదు, అక్కడికి పొయ్యి పీకేది ఏముంది అని వెళ్ళలేదులే , రేపు వెళదాం లో మీ నాయన పని అయిపొయింది అన్నాడుగా”.
Nice start to the new story, Siva Reddy garu!!!.
yr): yr):
•
Posts: 791
Threads: 0
Likes Received: 732 in 557 posts
Likes Given: 383
Joined: Jul 2021
Reputation:
15
Posts: 4,148
Threads: 7
Likes Received: 22,493 in 1,974 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
576
2. పందెం
“మీ కాలీజీ గొడవ ఆపుతారా , ఈరోజు ఈ మూల నుంచి ఆ మూలకు ఎవ్వరు ముందు వెళతారో చూద్దాం” అన్నాడు మబ్బోడు , రాము కు మేము పెట్టు కొన్న పేరు.
“ఏందిరా , వీడికి ఇప్పటికి వేలుకవ వచ్చింది , వచ్చీ రాగానే పందెం అంటాఉన్నాడు , ఎరా మబ్బు ఏమైనా కల కన్నావా ఎంది నిద్రలో” అన్నాడు అది నవ్వుతు.
“నీ యక్కా , ముందు పందెం గెలిచి ఆ తరువాత చెప్పు ఎవ్వరు మబ్బో” రాము.
“ ఒరే , ఈ పందేలు అవ్వీ ఎందుకు గానీ, రోంచేపు ఈత కొట్టి పోదాం పదండి” శివ
“లేదురా , పాపం వాడు మాట్లాడక మాట్లాడక ఓ మాట మాట్లాడితే అలా తీసేస్తే ఎలారా , ట్రై చేద్దాం” చంద్రా.
“నువ్వే చెప్పరా , ఎంది పందెం ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లి రావాలి” మోహన్.
“ఆపక్క తెల్ల రాయి ఉంది చూడు దాన్ని తాకి ఇక్కడికి రావాలి”
“ఒరే , ఆపక్క పోయ్యేదానికే పిత్తుల్లు ఆడతాయి , ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావడం కూడానా?”
“మీలో ఎ ఒక్కరూ ఈ పక్కకు వచ్చినా , రేపు రాత్రికి మీకు అందరికీ సినిమాకు నేను కర్చు పెట్టుకొని తీసుకొని పోతా, మద్యలో తినడానికి , డ్రింక్స్ కి అంతా నేను పెట్టుకుంటా అది పందెం , లేదంటే మీరు నన్ను తీసుకొని పొండి, నాకు కావాల్సిన వన్నీ కోనీయండి” అన్నాడు నవ్వుతు.
“ఓరి , ఈ డెబ్బ పెద్ద ఫిట్టింగ్ పెట్టడురా , వీడికి సినిమా ఎలాగైనా చుపించొచ్చు , మద్యలో వీడు తినే తిండికి మా నాయన ఓ ఎకరం ఎగవ చేను అమ్ము కోవల్ల , నేను డ్రాప్” అన్నాడు మోహన్.
“మీరు వత్తాంటే మీతో పాటు వచ్చినా గానీ, నావల్ల గాదు ఈ పందేలు” అన్నాడు చంద్రా.
“ఒరే అదిగా , నా దగ్గర డబ్బులు లేవు గానీ , నేను ట్రై చేస్తా , నువ్వు కూడా రా నాతొ పాటు చూద్దాం” అన్నాడు శివ లుంగీ తీసి అప్పుడే విప్పిన బనీన్ మీద పడేస్తూ.
“ఏందిరా శివా , జిమ్ గానీ వెళుతున్నావా ఏంది మాకు తెలీకుండా , ప్రబాస్ అన్న లాగా నీక్కూడా 6 పాక్స్ వస్తున్నాయి చూడు”.
“వాడికి ఎసుకోవడానికి సరిగ్గా చెప్పులు లేవు ఇంకా జిమ్ ఎం వెళతాడు, వాడి చేసే పని చూసినావా, పొద్దున్న ఎత్తిన సమ్మెట , మద్యలో బువ్వకే దించుతాడు ఆ తరువాత రాత్రి కే , అందుకే వాడి బాడీ అలా ఉంది” మోహన్ గాడు.
“వాడి అరిచెయ్యి చూడు ఎలా ఉందొ , మొన్న ఎప్పుడో ఊర్లో వేపమాని కింద పందేలు వేస్తుంటే ఈ అది గాడు రెచ్చ గొట్టాడు వీన్ని , టెంకాయ పగల కొట్టమని వీడు మొదలు పెట్టక ముందు చానా మంది ట్రై చేసి సచ్చారు ఓ టెంకాయిని పగల గొట్టే దానికి వీడు అలా దాని మీద చేయి వేశాడో లేదో అది పిచ్చిలు పిచ్చలు అయిపొయింది సుత్తితో కొట్టిన మాదిరి”.
“ఆరోజు నా చెయ్యి బాలేదు గానీ లేకుంటే నేనే గెలిచే వాడిని” అదిగాడు.
“సరేలే వాయి , ఇప్పుడు ఇది ఈది చుపిచ్చు , నీకు వీడితో ఎప్పుడు పోటీనే గదా” మోహన్.
“ఒరే పందేలు తరువాత , మొదట నీళ్ళల్లో దిగండి” అంటూ మోహన్ గాడు అరవ గానే అందరు ఒక్కరి తరువాత ఒక్కరం నీళ్ళల్లో దుకారు.
“చెప్పానా , మనకు చెప్పడు వాడు , చూడు వాడు ఈత కొట్టేది , వాడి చూపు అంతా ఆ తెల్ల రాయి మీదనే ఉంది , వోరే మబ్బు , మీ నాయన దగ్గర డబ్బులు కొట్టేసి రేపు రాత్రికి రెడీగా ఉండు , శివా గాడు ఈదుకొని వస్తాడు చూడు” రాము.
శివా, ఆది, మబ్బోడు అటువైపు గట్టుకు ఈద సాగారు , మిగిలిన ఇద్దరు అక్కడ అక్కడే ఈదుతూ , వాళ్ళ ఇద్దరినీ గమనించ సాగారు.
కొద్ది దూరం వెళ్ళాక , మబ్బోడు వెనక్కు మల్లాడు , మిగిలిన ఇద్దరు ఆ గట్టుకు ఈద సాగారు.
ఓ 30 నిమిషాలు పట్టింది , వాళ్ళు అటువైపు చేరే సరికి, ఆ చివర ఉన్న బండను తాకి శివా వెంటనే వెనక్కు ఈదడం మొదలు పెట్టాడు , అది ఓ నిమిషం పాటు అక్కడే కూచొని శివా ఈదడం చూసి వాడు కుడా నీళ్ళలో దిగి ఇటువైపు శివా వెనుక ఈదడం మొదలు పెట్టాడు.
మరో 20 నిమిషాలకు శివా ఇటువైపు వచ్చాడు , అది గాడు మద్యలో కొద్ది గా ఈది , తన వల్ల కాదు అనుకోని అటువైపు గట్టుకే ఈది , కట్ట మీద నుంచి నడుచుకొంటూ వీళ్ళు ఉన్న వైపు రాసాగాడు.
“మాకు తెలుసురా , ఇక్కడ ఈదే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నువ్వేరా, ఒరే మబ్బోడా ఎప్పుడన్నా పందెం కట్టే టప్పుడు , శివా గాడు లేనప్పుడు కట్టు , వాడు ఉన్నాడు అంటే నీ నోట్లో మట్టే” మోహన్.
“ఒరే ఊర్లో ఎవ్వరు ఇంత వరకు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళిన వాళ్ళే , తిరిగి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరంట , అప్పుడు ఎప్పుడో మన నాయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు శివా గాడి తాత ఈదాడు అని మా నాయన చెప్పినాడు , అందుకే పందెం కట్టినా , ఎవ్వరు ఈద లేనప్పుడు వీడు కూడా ఈదలేడని , కానీ ఈడు వీళ్ళ తాతను మించి పోయట్లు ఉన్నాడు, ఒరే దీంట్లో ఒక దాంట్లో నేనా , లేక అన్నింట్లో మీ తాత పోలికలు వచ్చినాయా నీకు ఏంది?” అన్నాడు మబ్బోడు.
“కోసింది చాల్లే గానీ , పదండి ఇంటికి పోదాము నాకు బాగా ఆకలి గా ఉంది” అన్నాడు శివా
బట్టలు కట్టుకొని అందరు ఇంటి దారి పట్టారు.
“రేయి రేపు రాత్రికి అందరు రెడీ గా ఉండండి , సెకండ్ షో కు వెళదాం టౌన్ కి”
“ఒరే సెకండ్ షో అంటే లేట్ అవుతుంది రా , మనకు రావడానికి ఎం దొరకవు.”
“నేను మా నాయన్ను అడిగి బైక్ తెస్తా , ఇంకో బైక్ ఉంటె ఎలాగో మేనేజ్ చేయచ్చు” అన్నాడు చంద్రా.
“రేపు గదా , ఎలాగో ఇంకో బైక్ సంపాదిద్దాములేరా, మీ రైతే రెడీగా ఉండండి”అన్నాడు మబ్బోడు.
“ఎంది రా ఇంత సేపు పోయినావు , ఆకలి వెయ్యాలా ?” అంది శివా అమ్మ ప్లేట్ లో రాగి ముద్దా, బెండకాయ పులుసు వెస్తూ
“బాగా ఆకలిగా ఉంది, మబ్బోడు చిన్న పందెం పెట్టినాడు, అందుకే లేట్ అయింది”
“ఎం పందెం నాయనా ? ఎం చేసినారు ఏంటి?”
“ఎం లేదు నాయనా చెరువులో ఈపక్కనంచి ఆపక్కకు వెళ్లి మళ్ళీ ఈ పక్కకు రావాలి”
“అబ్బో మీ పిల్ల నాయాళ్ళ వళ్ళ ఎం అవుతుంది , అప్పుడు ఎప్పుడో మా నాయన వయస్సులో ఉన్నప్పుడు ఓ సారి ఈదాడంట, ఆ తరువాత ఎవ్వరు ఆ పని చేయల్లేదు” దిండుకు అనుకోని కళ్ళు ముసుకొన్న రంగడు.
ముసి ముసిగా నవ్వుతు రాగి సంగటి ని చిన్న ముద్దలు గా చేసి పులుసులో దొర్లించి ఆ ముద్దలు నోట్లో వేసుకోంటున్న కొడుకును చూసి “ఎం మీ నాయన ఒకడేనా అంత పోటుగాడు , నా బిడ్డ తక్కువ ఎం కాదు” అంది శివా అమ్మ.
గప్పున లేచి సరిగ్గా కుచోంటు, “శివా , నిజంగా ఈదావా ? నిజమా , చెప్పు బిడ్డా , నిజంగా ఈదినావా ఏంది?” అంటూ పట్టి పట్టి అడగ సాగాడు.
“వాడి నవ్వు చూస్తే తెలీడం లేదు , ఈదాడో లేదో , అంత డౌట్ గా ఉంటె వాని తోడూ గాళ్ళను అడుగుపో చెపుతాడు , నా బిడ్డ మనసులో ఎం ఉందొ నాకు తెలుసు” అంటూ కుండ లోని పులుసు ను గరిటతో శివా ప్లేట్ లో వేస్తూ.
“నాకు నమ్మకం లేదు , ఉండు నేను కనుక్కొని వస్తా” అంటూ తను పడుకొన్న చోట నుంచి లేచి ఊర్లో కి వెళ్ళాడు.
శివ మాట్లాడ కుండా, అమ్మ పెట్టిన ముద్ద తిని చేతులు కడుక్కొని వాళ్ళ నాయన లేచి వెళ్ళిన చాప మీద పడుకొని “ అమ్మా నాన్న పనిలోకి వెళ్ళగానే లేపు , నేను రోంచేపు పడుకుంటా” అంటూ కునుకు తీశాడు.
The following 28 users Like siva_reddy32's post:28 users Like siva_reddy32's post
• AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, arkumar69, DasuLucky, hrr8790029381, Iron man 0206, k3vv3, kaibeen, kamadas69, Kamandalam, King1969, Mahesh12345, Manavaadu, Pinkymunna, prince1988, ramkumar750521, Ramvar, RangeRover0801, Ravi9kumar, Sachin@10, Saikarthik, Satya9, shoanj, sri7869, Uday, Uppi9848, సోంబేరిసుబ్బన్న
Posts: 4,148
Threads: 7
Likes Received: 22,493 in 1,974 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
576
ఉరి మద్యలో ఓ పెద్ద వేప మాను ఉంది ఆ వేప మానుకు వెనుక ఆ ఉరి గంగమ్మ గుడి ఉంటుంది , ఆ గుడి ముందు కుచుకోవడానికి బండలు వేసి ఉంచారు. సాదారణంగా ఊర్లో ప్రజలు ఆ బండల మీద కూచొని లోకాభి రామాయణం మాట్లాడుతూ ఉంటారు , ఊర్లో రాజకీయాల దగ్గర నుంచి ప్రపంచ ఆర్థిక పరిస్తితి వరకు అక్కడ చర్చలు జరుగుతూనే ఉంటాయి.
శివా నాన్న ఇంట్లోంచి బయలు దేరి అక్కడి కి వచ్చింది అందుకే.
“ఎరా రంగా ,నీకొడుకు చెరువు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లి వచ్చాడంటగా, ఏంట్రా మీ నాయన లాగా తయారు అవుతాడా ఏంటి ? కొంచెం జాగ్రతా గా చూసుకో రే”
“ఇంటికి వచ్చి వాళ్ళమ్మకు చెప్పాడు , నాకు నమ్మకం దొరక్క ఇక్కడ కొచ్చాను, నిజమా కాదో తెలుస్కోందాము అని”
“ఇప్పుడే చంద్రా చెప్పాడు , మబ్బోడు వాళ్లతో పందెం కట్టాడు అంట , వాడు అది గాడు ఉన్నాడుగా , వాడు అపక్కకు వెళ్ళాడు , ఈ పక్కకు రాలేక పోయాడంట, మీ వాడు పోయినప్పుడు ,30 నిమిషాలు పట్టింది అంట , వచ్చేటప్పుడు , 20 నిమిషాలకే వచ్చాడంట”
“నిజంగా ఈదాడంటావా అన్నా” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఒరే వాడు నీ కొడుకురా , వేరే వాళ్ళు ఎవరన్నా అబద్దం చెపుతారు ఏమో, వీడు అబద్దం చెప్పడని ఊర్లో ఎవరిని అడిగినా చెపుతారు”.
“అదే రా ,అంత నిజాయితీ గా ఉంటె ఎలా బతుకుతాడో అని భయంగా ఉంది”
“ఒరే, జీవితం అంతా నేర్పిస్తుంది లేరా , మంచికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది , నీ బిడ్డ వజ్రం రా , వాడికి ఎం కాదు , ధైర్యంగా ఉండు” అన్నాడు అక్కడ ఉన్న ఉరి కి పెద్దైన అప్పిరెడ్డి.
మరో 30 నిమిషాలు అక్కడ కూచొని వాళ్లతో మాట్లాడి, ఇంటికి వచ్చాడు.
శివ పడుకొని ఘాడమైన నిద్రలో ఉన్నాడు , తన భార్య ఇంట్లో పని చేసుకొంటూ ఉంది.
ఇంటికి వచ్చిన రంగడు , కొడుకును చూసి , కొడుకు కాళ్ళ దగ్గర కూచొని వాడి కాళ్ళు నొక్క సాగాడు.
“ఎంది , ఎప్పుడు లేనిది , వాడి కాళ్ళదగ్గర కూచొని వాడి కాళ్ళు నొక్కుతున్నావు”
“ఊర్లో నీ బిడ్డను గురించి ఎం మాట్లాడు కొంటున్నారో తెలుసా”
“ఎం మాట్లాడుతున్నారు ఏంటి”
“మా నాయన ఉడి పడ్డాడు అంట, మా నాయన ధైర్యం , మా నాయన చదువు , మా నాయన తెగింపు , అన్నీ మా నాయన్ని మించి పోయేలా ఉన్నాడు అంటున్నారు.”
“నీ కొడుకును తరువాత పోగుడుదువు గానీ , సాయంత్రం నీకు పని అప్పగించిన వాళ్ళు వస్తారు పనిముట్లు ఇవ్వమని అప్పుడు , వాళ్ళకు నీ కొడుకు గొప్ప గురించి చెపుతూ ఉండు సరిపోతుంది”.
వీల్ల మాటలకు అప్పుడే మెలుకవ వచ్చిన శివా “ఏంటి నాన్నా, నువ్వు కాళ్ళు పిసుకుతూ ఉన్నావు, లే పద , పని ఉంది అన్నావుగా, పద తోందరగా అవ్వకొడదాము , నాకు రేపటి నుంచి కాలేజీ ఉంటుంది” అంటూ వాళ్ళ నాన్నను లేపి కొలిమి దగ్గరకు వచ్చాడు.
ఇద్దరు కలిసి , సాయంత్రం వరకు కస్టపడి, ఇవ్వాల్సిన సామాన్ల అన్నిటిని తయారు చేశారు.
“రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళు , నేను అమ్మా చేసుకొంటాములే” అన్నాడు రంగడు.
“సరే నాన్నా, రేపు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి రెండో ఆటకు సినిమాకు వెళతాము”
“అంత రాత్రి ఎలా ఎనక్కు వత్తారు”
“వాళ్ళు బైక్ లో పోదాము అన్నారు లే బైక్ లోనే ఇంటికి వస్తాములే, నేను ఊర్లోకి పోతున్నా అన్నం తినే టైం కి వస్తా” అంటూ ఊర్లోకి వెళ్ళాడు.
ఊర్లో తన స్నేహితులని కలిసి శివ , వాళ్లతో రేపు ఎ టైం కి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకొని రాత్రి అన్నం తినే టైం కి ఇంటికి వచ్చి తిని నిద్రపోయాడు.
ఉదయం నిద్ర లేచి కాలేజీకి వెళతాడు తన స్నేహితులతో కలిసి. ఆ ఉరి నుంచి దాదాపు 15 నుంచి ఓ 20 మంది దాగా పక్కన ఉన్న టౌన్ కి రక రకాల చదువుల కోసం పోతూ ఉంటారు, కొందరు బుస్సులోను , మరి కొందరు అటో లోను , ఉన్న వాళ్ళు తమ స్వంత బైకు ల లోను వెళుతూ ఉంటారు.
శివా బస్సు పాస్ తీసుకొని బుస్స్ లో వెళుతూ వస్తు ఉంటాడు. ఆ రోజు బస్సులో చాల మంది మన వాణ్ణి చాలా మంది, స్పెషల్ గా చూస్తారు తను చేసిన ఘన కార్యం ఊర్లో అందరికే తెలుస్తుంది. వీడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకొంటూ పోతాడు. కొందరు తనకు కంగ్రాట్స్ చెపుతారు , మరి కొందరు వాళ్ళల్లో వాళ్ళే గోనుక్కొంటు ఉంటారు.
జీనియర్ కాలేజీలో పెద్దగా స్పోర్ట్ లేకపోయినా, సంవత్సరం చివర జరిగే పోటీల్లో శివ కుడా కొన్నింటిలో పాల్గొని తను పాల్గొన్న అన్నింటి లోనూ తప్పకుండా ఏదో ఒకటి ప్రైజ్ గెలుచుకొని వస్తు ఉంటాడు, సాదారణంగా రన్నింగ్ లోనే , లాంగ్ జంప్ , హై జంప్ లోను పాల్గోంటు ఉంటాడు.
ఆ రోజు కాలీజీ లో సర్కులర్ వచ్చింది , ఈ సంవత్సరం లో జరిగే స్పోర్ట్స్ మీట్ కు పాల్గొనే వాళ్ళు , పేర్లు ఇమ్మని మరో రెండు రోజులలో మాత్రమె టైం ఉంటుంది అని దాని సారాంశం.
శివా , తన ఫ్రెండ్స్ తో కలిసి తన పేరు కూడా ఇస్తాడు ఎప్పటి లాగే.
సాయంత్రం ఇంటికి రాగానే “నాన్నా , మీ మామ అదివారం ఉరికి రమ్మని చెప్పాడు, మనల్ని అందరినీ అక్కడ ఊర్లో గంగమ్మకు మొక్కు తీర్చు కొంటున్నారు దానికి యాటలు కొడుతూ ఉన్నారు , మనల్ని కూడా రమ్మన్నారు”
“నాన్న కూడా వస్తున్నాడా అమ్మా”
“ఏమో అడుగు” అంది పక్కనే ఉన్న మొగుణ్ణి చూస్తూ.
“నేను రాలేను లేరా , అమ్మా నువ్వు వెళ్ళండి, నాకు పనులు ఉన్నాయి లే, ఆదివారం ఉండి సోమవారం వచ్చేయండి, నీకూ కాలేజీ ఉంటుంది గా, పోయి అక్కడే ఉండి పోతారా ఏంటి”
“వచ్చేస్తాము లే, ఎందుకు ఉంటాము , మా తమ్ముడు రమ్మన్నాడని వెళుతున్నాము”
“సరే శుక్రవారం వెళ్ళండి, సోమవారం వచ్చేయండి”
“సరే నాన్నా” అంటూ శుక్రవారం వాళ్ళ అమ్మతో కలిసి తన మేన మామ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు.
మరుసటి రోజు యదా విధిగా కాలేజీకి వెళ్ళాడు.
ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి రెండు బైకుల రెండవ ఆటకు సినిమాకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే సరికి మొదటి అట సినిమా అప్పుడే వదిలి నట్లు ఉన్నారు, అంతా బయటకు వస్తూ ఉన్నారు. వెళ్ళు సరిగ్గా లోపలికి వెళ్ళే సరికి అక్కడ ఎదో గొడవ జరుగుతూ ఉంది. కారు పక్కన ఇద్దరు అమ్మాయిలూ , ఓ పెద్దావిడా నిలబడి ఉన్నారు , డ్రైవర్ ఎవరితో నో మాట్లాడుతూ ఉన్నాడు , కానీ అటువైపు వాళ్ళు 6 మంది వన్ని కొట్టడానికి వచ్చినట్లు ఉన్నారు. వాడు చెప్పేది వినకుండా వాడి మీద మీదకు వస్తు ఉన్నారు. చూస్తే ఆ డ్రైవర్ వీళ్ళ ఉరి వాడే , “ఒరే మల్లేసు ఏమైంది రా , ఎవరు వాళ్ళు ఎందుకు నీ మీదకు వత్తా ఉన్నారు” అంటూ ముందుకు దూకాడు డ్రైవర్ కు వాళ్ళ మధ్యకు.
“ఎ కౌన్ రే బీచ్ మే మారో సాలె కో” అంటూ శివా మీదకు రావడానికి ముందుకు వచ్చారు.
“శివా , వాళ్ళు కావాలనే గొడవ పెట్టు కొంటున్నారు , ఇందాక థియేటర్ లో అమ్మాయి గారి సీటు మీద కాళ్ళు పెట్టారు , దానికి వాళ్ళను మేనేజర్ తో చెప్పి వార్నింగ్ ఇప్పించారు అమ్మాయి గారు , అది మనసులో పెట్టుకొని , వాళ్ళ బైక్ లు తెచ్చి కారుకు అడ్డం పెట్టి , నేను కారుతో డాష్ ఇచ్చాను అని గొడవ పెడుతూ ఉన్నారు” అన్నాడు మల్లేసు శివా వెనుక నిలబడి.
“ అన్నా , అయ్యింది ఎదో అయ్యింది, పోనీయండి , వదిలేయండి”అన్నాడు శివ
“ఏందిరా వదిలేది” అంటూ మీద మీదకు రా సాగారు , వాళ్ళు 6 మంది ఉన్నారు , అది వాళ్ళ ఉరు అని ఓ ధీమా.
“కొట్లాట వద్దన్నా మీరు వెళ్ళండి, ఒరే మల్లేసు , నువ్వు సీట్లో కుచ్చో , అత్తా నువ్వు కార్లో కుచ్చో , మీరు కూడా అన్నాడు అమ్మాయిల వైపు చూస్తూ”
“ఏందిరా , వాళ్ళను వేల్లనిచ్చేది , ముందు వీడిని వెయ్యండి రా” అంటూ బాగా దిట్టంగా ఉన్నాడు శివా మీదకు చెయ్యి ఎత్తాడు.
“అన్నా , వద్దు ఆ తరువాత బాగుండదు” అన్నాడు చేతికి చెయ్యి అడ్డం పెడుతూ.
“సాలె , నాకే అడ్డం పెడతావా” అంటూ ఇంకా రెచ్చి పోతూ బైక్ లోంచి రాడ్డు తీసి శివా మీదకు రాబోయాడు.
“శివా , ఈ నా కొడుకులు చెపితే వినర్రా , ఎయ్యి నా కొడుకుల్ని” అన్నాడు వెనుకగా బైక్ లో వచ్చి అప్పుడే పార్క్ చేస్తున్న బైక్ లోంచి కిందకు దిగిన ఆది గాడు.
వాడు విసిన రాడ్డు కు ఎడం చెయ్యి అడ్డం పెట్టి కుడి చేత్తో వాడి గుబ మీద ఒక్కటి పీకాడు శివ , ఆ దెబ్బ కు వాడు అలాగే నెలకు కరుచుకొని పోయాడు , ఓ నిమిషానికి వాడి చెవి లోంచి రక్తం కార సాగింది. వాడు కింద పడక ముందే మరు ఇద్దరు మరో వైపు నుంచి శివాను కమ్ము కొన్నారు.
వాడి గుబ మీద ఇచ్చిన చేత్తో రెండో వాడి గడ్డం కింద లాగి మేచ్చేత్తో ఒక్కటి పీకాడు, వాడి కింద పళ్ళు , పై పెదవిలో ఇరుక్కొని పోగా వాడు కింద పడి పోర్ల సాగాడు. ఈ లోపల మబ్బోడు , అదిగాడు శివాకి తోడుగా వచ్చారు ముగ్గురు కలిసి మిగిలిన నలుగుర్ని రెండు నిమిషాల్లో పడుకో పెట్టారు. ఈ లోపల మేనేజర్ వచ్చాడు “ఎంది గొడవ అంటూ” .
కారు లోంచి మల్లేసు దిగి , అక్కడ వాళ్ళు అడ్డం వచ్చిన దగ్గర నుంచీ చెప్పాడు, వేళ్ళకు లోపలే బుద్ది వచ్చింది అనుకోన్నానే “మీరు మంచి పని చేశారు అబ్బాయిలు, వీళ్ళను , నేను చూసుకుంటా , మీరు వెళ్ళండి”
“వాళ్ళు ఇప్పుడే వచ్చారు సారూ , మా ఉరి వాళ్ళు , ఇక్కడ ఈ నా కొడుకులు అమ్మగారిని కారు ఎక్కనీ కుండా ఆడ్డం పడుతూ ఉంటె మా శివా వచ్చి నాలుగు పీకాడు” అంటూ మా గురించి చెప్పాడు.
అక్కడున్న watchమెన్ ని పిలిచి “వీళ్ళకు నేను చెప్పాను అని బాల్కనీ లో కుచో పెట్టు , ఈ నా కొడుకుల్ని పంపించి వస్తా , మీరు టికెట్ కొనద్దు , నా తరపున ఈ రోజు మీకు ఫ్రీ , ఇలాంటి వాళ్ళ వళ్ళ మా కస్టమర్స్ కి ఇబ్బంది కలగొద్దు , మీరు మంచి పని చేసినారు” అంటూ అక్కడున్న సిబ్బంది తో వాళ్ళను బైటకు నెట్టి వేయమని చెప్పాడు.
“శివా, నేను పోతున్నా, వాళ్లు ఏమన్నా సినిమా అయ్యాక వాళ్ళ వాళ్లతో వత్తారేమో జాగ్రత్తగా రెండి ఇంటికి” అంటూ మల్లేసు కారును ధియేటర్ బయటకు తిప్పాడు.
శివా తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్ళాడు. “ఒర్ మబ్బోడా , నీ డబ్బులు మిగిలిచ్చాడు శివా , వాటితో కావలసినవి కొనుక్కొని రాపో” అంటూ లోపలికి వెళ్ళగానే వాణ్ని బయటకు తరిమారు అందరు కలిసి. సినిమా చూసి , మబ్బోని జేబులు ఖాళీ చేయింది రాత్రి 2 కి ఇంటికి చేరుకొన్నారు.
మరుసటి రోజు లేట్ గా లేవడం వల్ల కాలేజీకి వెళ్ళలేక పోయాడు. వర్షాలు దండిగా కురవడం వల్ల అందరు పొలాలు రెడీ చేసుకొన్నారు విత్తనాలకు వేయడానికి. కానీ కొండ దగ్గర ఉండడం వల్ల పందుల బెడద ఎక్కువగా ఉంటుంది . పంటలు వేయడానికి ముందు ఊరంతా కలిసి డప్పులతో పందులను బెదిరిస్తూ, వాటి ని వేటాడతారు, రెండు నెలలకు ఓ సారి జరుగుతూ ఉంటుంది ఈ వేట పంటలుకోసి ఇంటికి చేర్చెంత వరకు. ఆ తరువాత తిరిగి పంటలు వేసేంత వరకు వాటి జోలికి వెళ్లరు.
The following 45 users Like siva_reddy32's post:45 users Like siva_reddy32's post
• aarya, AB-the Unicorn, ABC24, amarapremikuraalu, Anamikudu, arkumar69, Babu143, Bbmmbb, cherry8g, chigopalakrishna, Chytu14575, DasuLucky, gora, Gova@123, Iron man 0206, k3vv3, kaibeen, kamadas69, Kamandalam, King1969, Mahesh12345, Manavaadu, Mohana69, phanic, Pinkymunna, Ram 007, ramkumar750521, Ramvar, RangeRover0801, Ranjith62, Rao2024, Rathnakar, Ravi9kumar, Sachin@10, Saikarthik, shekhadu, shoanj, Speedy21, sri7869, TheCaptain1983, Uday, Uppi9848, Vizzus009, Vvrao19761976, సోంబేరిసుబ్బన్న
|