Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంగళ వాయిద్యాలు
#1
మంగళ వాయిద్యాలు 
(రచయిత పినిశెట్టి శ్రీనివాసరావు )
 
 
 
మంగళవారం.
ఉదయం ఎనిమిది గంటలు. ఫోను మ్రోగుతోంది,
  "హలో సార్ ! నేను గుడివాడ నుంచి గుర్నాధాన్ని. మీరు రావు గారేనా? ఈ వారం రమ్య వీక్లీ లో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది. సూపర్ "
                                                                
 "చుక్కల్లో సూర్యుడా, చంద్రుడా ? " అడిగాను.
"ఉండండి సార్ చెప్తాను" అని ఓ అర నిముషం తర్వాత "చంద్రుడంట సార్." అన్నాడు.
"అంట ఏవిటి? మీరు కథ చదవలేదా? మరి   బాగుందన్నారు. సూపర్ అన్నారు" అడిగాను.
"అంటే సార్ , కథలు మాఆవిడ చదువుతుంది సార్ . తను చెప్పిందే నేను మీకు చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు. నాది పాన్ షాపు. వార పత్రికలు కూడ అమ్ముతాం." అన్నాడు గుర్నాధం.
 
"సరే థాంక్సు" అని ఫోను పెట్టేయబోతుంటే, 
"సా ర్ , ఒక్క నిముషం... నా మిస్స్ స్ మీతో మాట్లాడుతుందట. తను పది పాసయ్యింది. మీలానే పత్రికలకు రాస్తుంది. మా ఫ్యామిలో మొత్తంలో తనొక్కటే సార్ పత్రికలకు రాసేది. మీరు తనని పొగడండి సార్ ." అన్నాడు.
 
ఏంటి పొగిడేది, వీడికేమైనా పిచ్చా? పొద్దున్నే ఇలాంటి కేసు తగిలిందేవిటి ? అనుకుంటుండగానే,
"సారూ నేను వెంకటలక్ష్మిని. మీకథ చాలా బాగుంది.కథలో చివరి వాక్యం, 'భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి' అని చాలా గొప్పగా చెప్పారు. నేను మీ ఫ్యాను అయిపోయాను సార్ " అంది.
కథ చదివి ఉండదు. ఆఖరి వాక్యం చదివి చెప్పేస్తోంది, అనుకుంటూ  మీరు కూడ రాస్తారటగా, ఏ పత్రికలకు? కథలా, కవితలా" అడిగాను.
"అంటేసార్ ఉత్తరాలు, జోక్స్ రాస్తుంటాను. ఇప్పటికి అన్ని పత్రికలకు కలిపి వెయ్యికి పైగానే రాసాను. మొన్న సంక్రాంతికి మా వాళ్ళు నాకు సన్మానం కూడ చేశారు. మీరు సహాయం చేస్తే కథలు కూడ రాస్తాను." అంది.
"అబ్బే నాకు వీలు కాదమ్మా " అన్నాను.
"చూడండి సార్ . ఎంకరేజ్ చేయండి సార్ .ఈ వారం పత్రికలో మీ కథ బాగుందని 'రమ్య' పత్రికకు ఉత్తరం రాస్తాను" అంది.
"సారీ, నాకు వీలుకాదు" అని కాల్ కట్ చేశాను. మళ్ళీ రింగైంది. ఎత్తలేదు. 
                          *******
స్నానం చేసొచ్చి టిఫిన్ చేద్దామనుకుంటుంటే  మొబైల్ మళ్ళీ రింగైంది. వెంకటలక్ష్మేమోనని చూశాను. కాదు వేరే నంబరు.
     "రావు గారేనా?" ఆడ గొంతు.
     "అవును, ఎవరు?" అడిగాను.
"నా పేరు మందారం. మాది పెద్దాపురం. రమ్యలో మీ కథ 'పక్కలో చంద్రుడు' సూపర్ . చాలా రొమాంటిక్ గా వుంది. మనదేవూరు? మిమ్మల్నొకసారి చూడాలని వుంది."
ఈ కేసేదో తేడాగా వుందనిపించింది.
"పక్కలో చంద్రుడు కాదు, చుక్కల్లో చంద్రుడు ..అవునా. సరే, కథ చదివి బాగున్నందుకు ధన్యవాదాలు. నాకో సందేహం. ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావంటే నీకు ఇంటిపని, వంట పని ఉండదా?" అని అడిగాను."
అవన్నీ మా హజ్బెండ్ చూసుకుంటారు. ఆయన నాకు బావే. నేను చాలా అందంగా ఉంటానని , పనిచేస్తే నా అందం తరిగి పోతుందని నన్నేపని చెయ్యనివ్వరు." అంది.
"కనీసం కాపురం చేయనిస్తారా? లేక 'షో కేస్ ' లో బొమ్మలా నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచి చూస్తూవుంటారా?" అడిగాను.
"ఛీ .. పోండి సార్...చిలిపి," అని, "ఆయన చేసిపెట్టింది తిని, పుస్తకాలు చదువుతూ, ఫోన్లు చేసుకోవటమే నా పని. పదింటికల్లా వంట పూర్తి చేసేసి , ఆయన పని చేసే 'మీసేవ' సెంటర్ కి వెళ్ళిపోతారు."అంది,
" అంటే ముందు 'నీసేవ' తర్వాత 'మీసేవ' అంతేనా?" అన్నాను.
"భలే చెప్పారు!" అని "ఇదిగోండి మా వారితో మాట్లాడండి. మీరు'జెంట్ ' కద సార్ .నేను జెంట్స్ తో మాట్లాడటం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు.
చెప్పానుకద సార్ , నేను చాలా అందంగా ఉంటానని. మా వారిని పొగడండి. ఖుష్ అయిపోతారు." అంది.
"ఈ పొగడడాలేమిటో! ఈరోజు అన్నీ ఇలాంటి కేసులే వస్తున్నాయి." అనుకుంటుండగానే, మందారం మొగుడు లైన్లో కొచ్చేశాడు.
 
".సార్ మీ వయసెంత?" అడిగాడు.
'డైరెక్టుగా ఇదేం ప్రశ్న?' వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడనుకుంటూ,
" నావయస్సు ఎనభై. గుండాపరేషన్ అయ్యింది. పక్షవాతం వచ్చింది. ఓ కిడ్నీ చెడింది. కళ్ళు సరిగ్గా కన్పడవు. వినికిడి కూడ తగ్గింది. నువ్వు వంట బాగా చేస్తావనుకుంటాను. నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే మీ(ఆవిడ) సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను నాయనా" అన్నాను ముసలాడిలా గొంతు మార్చి.
స్టవ్ మీద కూర మాడి పోతుందంటూ, అతను వెళ్ళి పోయాక మందారం లైన్లో కొచ్చింది.
"సార్ , నా మీద మాంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదూ? చెప్పానుగా నేను అందంగా ఉంటానని? మీ వాట్సప్ కి నా ఫొటోలు కొన్ని పంపిస్తాను." అంది,
"సారీ! నాకు వాట్సప్ సౌకర్యం లేదు."అని ఫోను ఆఫ్ చేశాను.
                      ************
 
నా ఆఫీసుకి టైమైపోతోంది.
"టిఫిన్ పట్రావోయ్ త్వరగా" అన్నాను నా శ్రీమతితో.
" ఊ... తినండి" అంటూ వేడివేడి ఉప్మా ప్లేట్లో పెట్టి తెచ్చింది.
" ఇంత వేడిగానా ఎలా తినను. ఫ్యాను వెయ్యచ్చుగా?" అన్నాను.
"సారీ ఫ్యాను తిరగదు. కరెంటు పోయింది." అంది కోపంగా.
స్పూనుతో వేడి ఉప్మా నోట్లో పెట్టుకున్నాను. సుర్రుమని నోరు కాలింది.అబ్బ! చంపేశావు కదే రాక్షసీ." అన్నాను.
"అవునవును...చక్కగా చేసి పెడ్తుంటే అలానే వుంటుంది. గంటలకొద్దీ ఆడ ఫ్యాన్సు తో మాట్లాడుతుంటే బాగుంటుంది. ఇంతోటి కథలకు ఫ్యాన్లు, పొద్దున్నే ఫోన్లు... తినండి తినండి" అంటూ విసురుగా వెళ్ళిపోయింది. 
ఉప్మానే కాదు, శ్రీమతి కూడ వేడిమీద ఉందనిపించింది.
                      ***********
ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని చచ్చీచెడీ, ఆఫీసుకి ఆలస్యంగా చేరాను.
అటెండెన్సు రిజిస్టరు లో నా పేరుకు ఎదురుగా 'లేటొచ్చావోయ్ "అని అర్ధం వచ్చేట్లు ఇంగ్లీషు అక్షరం  ' L' రాసుంది.
 
నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోను మ్రోగింది.
'హల్లో' అన్నాను.
"రావుేనా? నా పేరు కృష్ణమూర్తి. నైన్టీ నాటౌట్ . ఊరు ఏలూరు.  రమ్య లో 'చుక్కల్లో చంద్రుడు' కథ దివ్యంగా వుంది. నువ్వు మాంచి సరసుడవే. నీ వయసులో నేనూ అంతే. ఆర్టిస్టు కూడ నీ కథకు తగ్గ బొమ్మే వేశాడు. కథ నాకు తెగ నచ్చేసింది. నువ్విలాగే వారంవారం మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూపో. అవి చదువుతుంటే నా ఆయుష్షు పెరుగుతుంది. సెంచురీ కొట్టేస్తా" అన్నాడు పెద్దాయన.
నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న తరుణంలో ఎదురుగా మా 'బాస్ '
నా ఆనందం ఆవిరై పోయింది.
 
"లేట్ కమింగ్ . ఫోన్ టాకింగ్ . పనెప్పుడు? మళ్ళీ ఇలా చూశానో సస్పెండైపోతావు." వార్నింగిచ్చి వెళ్ళాడు బాసాసురుడు. బిక్క చచ్చి పోయి బిగుసుకుపోయాను.
"ఏంటి సార్ ,ఈ వారం పత్రికలో మీ కథ పడిందా?" అడిగాడు అటెండరు రాము.
"వీడికీ తెలిసిపోయిందా?'అనుకుని, సమాధానం చెప్పకుండా ఫైలు తెరిచాను.
                 ***********
 మళ్ళొచ్చింది మంగళవారం.
ఈ మధ్య ఎందుకో మంగళవారం భయం పట్టుకుంది. ఒక ప్రక్క కథబాగుందుంటూ పాఠకుల అభినందనలకు ఆనందన కలుగుతున్నా, 
 
కొందరి విచిత్ర ప్రవర్తన ఆందోళనకు గురిచేస్తోంది.
ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతోంది.
 
వెంకట లక్ష్మి ఫోను చేసింది...."సార్ ,మీ కథ బాగుందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీ లో వచ్చింది చూడండి.- అని.
పాన్ షాపతను, "సార్ , యాపారం డల్ గా వుందిఓ పది(వేలు)సర్దుతారా?" అని.
మందారం ఫోనుచేసి పెద్దాపురంలో అనాధాశ్రమం నడుపుతోందట... వీలైతే నన్ను ఓ చెయ్యి వేయమంది.
ఇక నైన్టీ నాటౌట్ ఫోను చేసి "ఈవారం నీ కథ కోసం చూశానోయ్ రావుా. రాలేదని తెలిసి నిరాశచెందాను.- అని. అంటే ఈయన సెంచురీ కొట్టటం కోసం నేను వారం వారం సరసం పండించాలి.
వీళ్ళంతా కథలు చదివి, చదవక నన్ను నిజంగానే అభినందిస్తున్నారా? ఆ వంకతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి నన్ను వాడుకుంటున్నారా?
వీళ్ళ మాయ మాటలు నమ్మి, నేను నా ఆఫీసు పని ప్రక్కనపెట్టి, కథల్రాసుకుంటూ కూర్చుంటే , నా ఉద్యోగం ఊడి, నేను
మందారం నడిపే అనాథాశ్రంలో చేరాల్సొస్తుంది.
ఏమో! ఈ మంగళవాయిద్యాలు నా ఒక్కడికేనా, నా తోటి రయితలకు కూడానా?
                  ******** సమాప్తం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: