Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊహించని ఉత్తరం
#1
ఊహించని ఉత్తరం
 
రచన: తాత మోహనకృష్ణ






"పోస్ట్! పోస్ట్! " అని పోస్ట్‌మాన్ ఇంటి దగ్గరకు వచ్చి కేక వేసాడు. మాయ తన గదిలోంచి బయటకు వచ్చి తలుపు తీసి పోస్ట్ తీసుకుంది. ఇది మురళీ నుంచి వచ్చిన ఉత్తరం. కానీ మురళీ చనిపోయి నెల అవుతుంది. అతను ఉత్తరం ఎలా పంపించగలడు? ఏం అర్ధం కావట్లేదు మాయకు. ఒక పక్క భయం తో చమటలు పడుతున్నాయి, ఇంకో పక్క మరొక భయం మనసును దహించి వేస్తున్నాది. 



వెంటనే, ఉత్తరం చించి అందులో విషయం చదువుతోంది.. 



“నా భార్య మాయ కు, చనిపోయిన నీ భర్త మురళీ వ్రాయునది.. 



ఈ ఉత్తరం నీకు చేరిన నాటికి, నేను చనిపోయి నెల రోజులు అవుతుంది. నా గురించి నీ గుండెల్లో ఈ పాటికే బాధంతా పోయి ఉంటుంది. నన్ను మరచిపోయి ఉంటావు. ఇప్పుడు మరో పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావా? నాకు ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? నాకు అన్నీ తెలుసు. నేను సూసైడ్ చేసుకోలేదని నీకు తెలుసు. 



ఈ లోకాన్ని, బంధువులని.. నేను సూసైడ్ చేసుకున్నానని బాగా నమ్మించావు.. అసలు జరిగిందేమిటో కూడా నాకు తెలుసు. ఇలా చేస్తే, నీకు ఏం వస్తుంది? నువ్వు దేని గురించి ఇదంతా చేసావో.. అది నీకు దక్కదు మాయా”. 



ఉత్తరం చదివిన తర్వాత.. మాయ కు తన గతం కళ్ళ ముందు కనిపించింది.. 



****



పద్మ, మాయ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చిన్ననాటి నుంచి మాయ.. తన జీవితం చాలా గొప్పగా ఉహించుకునేది. తండ్రి ఒక మాములు గుమాస్తా గా పనిచేసేవాడు. దానితోనే అమ్మాయినే చదివించేవాడు. పద్మ నాన్న కుడా చిన్న ఉద్యోగమే చేసేవాడు, కాని అదృష్టం కలిసి వచ్చి పద్మ నాన్న కు లాటరీ లో బోలెడంత డబ్బు కలిసి వచ్చింది. పద్మ పెద్ద భవంతి లో ఉండడం, మంచి బట్టలు వేసుకోవడం.. మంచి కాలేజీ లో చదవడం చూసిన మాయ కు చాలా అసూయ కలిగింది. తనకు లేని అదృష్టం గురించి బాధ పడింది. 



తన పెళ్ళి డబ్బున్న వాడితో చేసుకోవాలని డిసైడ్ చేసుకుని, అలాగే తండ్రికి చెప్పింది మాయ. పెళ్ళి కొడుకు ఎలా ఉన్నా, పర్వాలేదు కానీ.. బాగా ఆస్థి ఉన్నవాడిని చూడమని చెప్పింది. డబ్బున్న అల్లుడు వస్తాడని కూతురిని.. మురళీ కి ఇచ్చి పెళ్ళి చేసాడు. మాయ తన పంతం నెగ్గించుకుంది.. పెద్ద ఇల్లు, హోదా, నౌకర్లు, కార్లు, ఖరీదైన నగలు అన్నీ ఒక్క పెళ్ళితో తన వద్దకు వచ్చేసాయి. విలాసమైన జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది మాయ. 



నచ్చని మొగుడి తో కాపురం చెయ్యడం ఇష్టం లేక, ఏదో సాకుతో ఎప్పుడు మొగుడికి దూరంగానే ఉండేది. ఒక సంవత్సరం పాటు తాను దూరంగా ఉండాలని, జాతకం లో అలానే ఉన్నాదని, చెప్పి తప్పించుకుంది. అంతా మన మంచికే అనుకుని, మురళీ సరే అన్నాడు. 



కొంతకాలానికి మాయ కు పద్మ బయట కనిపించింది. పద్మ పెళ్ళి చేసుకుని, మొగుడితో సరదాగా ఉండడం చూసింది మాయ. తనకి జీవితంలో ఆ లోటు వెక్కిరించింది. ఇష్టం లేని మొగుడితో కాపురం చెయ్యడానికి మనసు ఒప్పుకోవట్లేదు. దానికి ఒక ప్లాన్ వేసింది. తన భర్త ని అడ్డు తొలగించుకుంటే, ఆస్తి తనదే కదా.. అప్పుడు నచ్చిన మనిషిని పెళ్ళి చేసుకోవడం తేలికని ఆలోచించింది. 



అనుకున్న తడవుగా, తన ప్లాన్ అమలు చేసింది. భర్త తినే ఆహారంలో అనుమానం రాకుండా, విషం కలిపి చంపేసింది. ఆ తర్వాత, సూసైడ్ చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది మాయ. పోస్ట్‌మార్టం లేకుండా, అంతా డబ్బుతో మేనేజ్ చేసింది! 



ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడం చేతనే.. మురళీ సూసైడ్ చేసుకున్నాడని.. అందరినీ నమ్మించింది మాయ.. 



****



ఇప్పుడు ఏం చెయ్యాలో అని.. మాయ ఆలోచనలో పడింది. ఈలోపు మర్నాడు ఇంకొక ఉత్తరం వచ్చింది. అందులో ఏముందో నని ఓపెన్ చేసి చదివింది మాయ. అదీ మురళీ దగ్గర నుంచే. 



"మాయా! నా ఆస్తి మొత్తం అనాధాశ్రమానికి చెందినట్టు వీలునామా రాసాను. త్వరలో లాయర్ నిన్ను కలుస్తారు”. 



మర్నాడు కాలింగ్ బెల్ మోగింది. లాయర్ విశ్వ అని పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, మాయ ను కలవడానికి ఇంటికి వచ్చాడు. 



"జరిగినదానికి సారీ మేడం! మురళీ గారు వ్రాసిన వీలునామా గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఆయన ఆస్తి మొత్తం అనాధాశ్రమానికి చెందాలని వ్రాసారు. మీరు ఈ ఇల్లు కుడా ఖాళీ చెయ్యాల్సి ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. 



ఆ ఉత్తరం ఎవరు పంపినట్టు? ఒక వేళ మురళీ బతికే ఉన్నాడా?... అవకాశమే లేదు.. నేనే దగ్గరుండి అన్నీ చేసాను. పోనీ, ఇంకెవరైనా పంపించారా ఈ ఉత్తరం అంటే? ఈ విషయం ఇంకెవరికి తెలియదు.. అయితే మురళీ ఆత్మ ఇదంతా చేస్తున్నాదా?



"హ.. హ.. హా.. అని పెద్ద నవ్వు తో.. అవును! నేనే.. నీ పని అయిపోయింది మాయ! ఎప్పటికైనా, నువ్వు నాకు చేసిన అన్యాయం బయటకు వస్తుంది. నువ్వు బతికినంతకాలం .. నరకయాతన అనుభవిస్తావు... నీకు సుఖం ఉండదు”. 



అంతా విన్న మాయ.. రోజూ భయపడుతూ బతకలేక.. జీవితం మీద విరక్తి తో ఒక రోజు సూసైడ్ చేసుకుంది. 



*******
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
(28-07-2024, 01:28 PM)k3vv3 Wrote: ఊహించని ఉత్తరం
 
రచన: తాత మోహనకృష్ణ



అంతా విన్న మాయ.. రోజూ భయపడుతూ బతకలేక.. జీవితం మీద విరక్తి తో ఒక రోజు సూసైడ్ చేసుకుంది. 



*******
Mohankrishna T wrote a good story...Who sent the letters to Maya, K3vv3 garu?
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#4
కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుందండి, ఎక్కడో ఏదో మిస్ అయినట్లుంది...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#5
k3vv3 గారు ఈ కథల్ని ఎక్కడ్నుంచి సేకరిస్తున్నారు? కథలు మంచి పట్టు లో ఉండగా ఆగిపోయి ముగిసిపోతున్నాయి!!?
Like Reply
#6
ఇది ఆ రచయిత సృష్టి

కొన్ని విషయాలను మన ఊహకే వదిలేస్తారు రచయితలు

వాటిని కేవలం ఊహించాలి అంతే!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: