Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇడ్లీ సాంబార్
#1
ఇడ్లీ సాంబార్

[Image: image-2024-07-20-162033670.png]


రచన: తాత మోహనకృష్ణ



"ఒరేయ్ సుబ్బారావు.. ! బయట తినడం ఎందుకు చెప్పరా..? టిఫిన్ కి మా ఇంటికి పదా.." అన్నాడు స్నేహితుడు అప్పారావు. 



"నేను రాను అప్పారావు.. వస్తే, మీ ఆవిడ 'టూ మినిట్స్' అని కిచెన్ లోకి వెళ్తుంది. నూడుల్స్ తెస్తుందో అని అనుకునే లోపే.. తెల్లటి ఉప్మా తెచ్చి పెడుతుంది.."



"ఉప్మా కుడా టిఫిన్ యే కదరా.. " అన్నాడు అప్పారావు.



"అసలు ఉప్మాని కనిపెట్టిన వాడిని షూట్ చేసేయాలంత కోపం వస్తుంది. తొందరగా అయిపోతుందని.. ఆడవాళ్లు చేసే ఈజీ టిఫిన్ ఇది. చెయ్యడానికి ఈజీ.. తినడానికి కష్టమైన టిఫిన్ రా.. ! పోపులో రవ్వ వేస్తే ఉప్మా అయిపోతుంది.. అది తిన్నాకా, కడుపు లో ఏదో లాగ అయిపోతుంది.. " అని ముఖం వంకర్లు తిప్పుతూ అన్నాడు సుబ్బారావు.



"అలాగైతే.. వారానికి ఐదు రోజులు మా ఇంట్లో ఉప్మా పండుగే.. ! ఏమైనా అంటే.. టైం లేదంటుంది మా ఆవిడ అనిత. మొన్న మా ఆవిడ ఉప్మా చేసి పెడితే.. మా బాస్ నాకు ప్రమోషన్ రద్దు చేసాడు తెలుసా.. ! ఎన్ని టిఫిన్స్ ఉన్నాయి రా.. పూరి, చపాతీ, దోశ, ఇడ్లీ, వడ.. ఇన్ని ఉంటుండగా మా ఆవిడకు టక్కున గుర్తొచ్చేది ఉప్మానే.. నా పరిస్థితి ఎవరితో చెప్పుకోను.. " అని తన బాధని వినిపించాడు అప్పారావు.



"మరి పండుగ రోజు స్పెషల్ గా ఏమిటి చేసుకుంటారో మీ ఇంట్లో?" అడిగాడు సుబ్బారావు.



"అది అడగకు రా !.. మాములు రోజుల్లో ప్లైన్ ఉప్మా.. పండుగ అయితే కొంచం స్పెషల్.. !"



"స్పెషల్ అంటున్నావు.. ఏమిటో వెరైటీ.. టిఫిన్.. " అడిగాడు సుబ్బారావు.



"ఉప్మానే.. కాస్త నెయ్యి తగిలిస్తుంది మా ఆవిడ అంతే.. ! సువాసనే మాకు స్పెషల్.. ! అంతే సుబ్బు.. !"



"పోనీలే.. అయితే, కిరాణా ఖర్చు మిగులుతుంది.. "



"ఏమిటి మిగిలేది.. ? ఉప్మా రవ్వ కి తక్కువే అవుతుంది.. కానీ మా ఆవిడ మేకప్ కోసం కిట్ కొంటుందా.. దానికి బ్యాలన్స్ లెక్క సరిపోతుంది. చెప్పడం మరచాను.. ఆదివారం.. మా పెళ్ళి రోజు. నిన్నూ, మీ ఆవిడను మాత్రమే.. టిఫిన్ కి పిలిచింది మా ఆవిడ.. తప్పక రావాలి" అన్నాడు అప్పారావు. 



"మమల్నే ఎందుకు.. ? పెళ్లిరోజు సెంటిమెంట్ చెప్పి ఇరికిస్తున్నావు కదరా!.. "



"మాకు బెస్ట్ ఫ్రెండ్స్ మీరే కదా.. అందుకే.. !"



ఆదివారం రానే వచ్చింది. అందరూ కలిసి హ్యాపీ గా పలకరించుకున్నారు.. 



"ఉండండి అన్నయ్యగారు.. ఇప్పుడే స్పెషల్ టిఫిన్ తెస్తాను.. " అంది అనిత.



"భాగ్యం.. ! రోజు స్పెషల్ టిఫిన్ తినబోతున్నాము.. ఎలా చెయ్యాలో తర్వాత అనితని అడిగి తెలుసుకో.. " అన్నాడు పెళ్ళాం తో సుబ్బారావు.



"ఆట్టే.. ఆమెను పొగడకండి.. ! ముందు టిఫిన్ ఏమిటో చూసి అప్పుడు మాట్లాడండి.. " అంది భాగ్యం. 



"టిఫిన్ రెడీ.. స్టార్ట్ చెయ్యండి.. !"



"ఏమిటో ఇది.. ?" అడిగాడు సుబ్బారావు. 



"ఉడ్లీ.. అదే.. ఉప్మాఇడ్లీ.. " అని టక్కున చెప్పింది అనిత.



"అంటే.. ?.. " అని దీర్ఘం తీసాడు సుబ్బారావు. 



"ఉప్మాని ఇడ్లీ లాగ ఆవిరి పట్టించడమే.. అంతే!" అని నవ్వుతూ చెప్పింది అనిత.



"థాంక్స్ అనిత.. ! నేను కుడా రోజూ మా ఆయనకి ఇదే చేసి పెడతాను.. చెయ్యడం నేర్పించవు.. ?" అంది భాగ్యం.



"ఒరేయ్ ఏమిటిరా ఇది.. ? స్పెషల్ అంటే.. ఎప్పుడూ ఇదే పదార్దమా.. ? చెప్పు అప్పారావు..” 



"నిజం చెప్పమంటావా.. ?. మా ఆవిడకి ఉప్మా ఒక్కటే చెయ్యడం వొచ్చు.. మిగిలినవి ఇంకా నేర్చుకోవాలి.. నిజం నాకూ మధ్యే తెలిసింది.. !" అని ఉన్న నిజం చెప్పాడు అప్పారావు. 



************
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఉడ్లీ బావుందండీ, ఇంతకీ రవ్వను ఉడకబెట్టి చేస్తారా లేక ఉప్మాను అనక ఉడకబెడతారా...ఏమో అనితనే అడగాలి Big Grin
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#3
Super excellent writing
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: