Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
15-06-2024, 02:58 PM
(This post was last modified: 19-12-2024, 02:26 PM by k3vv3. Edited 19 times in total. Edited 19 times in total.)
హాస్య కథలు
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
బదరీనాథ్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆ మధ్యే హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చాడు. ఆ మహా నగరంలో హఠాత్తుగా అద్దె ఇల్లు దొరకడమంటే అంత సులభం కాదు. అదీ - ఆఫీసుకు దగ్గరలో!... మొత్తానికి ఎలాగో కొలీగ్స్ సాయంతో ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఫ్లాట్ ఒకటి సంపాదించగలిగాడు, అద్దె కొంచెం ఎక్కువైనా.
కొత్త ఊరు. కొత్త సంసారం... ఆ ఏరియాకు చెందిన కుకింగ్ గ్యాస్ సప్లయ్ ఏజెన్సీ కి వెళ్లి రిజిష్టర్ చేసుకోబోతే, ఐ.డి. తో పాటు అడ్రెస్ ప్రూఫూ కావాలన్నారు. అదీ - అతని పేరులో!... అలాగే, బ్యాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్తే - అడ్రెస్ ప్రూఫ్ తో పాటు, అదే బ్రాంచ్ లో అకౌంట్ ఉన్న ఖాతాదారు చేత ఇంట్రడక్షన్ కూడా కావాలన్నారు.
కరెంట్ బిల్లు బిల్డర్ పేరులో ఉంది. అతను తన ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నట్లు ఇంటి ఓనర్ రాసిచ్చే లెటర్ కూడా చెల్లదట. ప్రభుత్వపరమైన గుర్తింపు కాగితమే కావాలట!
ఎవరో సలహా ఇవ్వడంతో, తన డిపార్ట్మెంట్ ఐ.డి. ని ఉపయోగించి గవర్నమెంట్ (బి.ఎస్.ఎన్.ఎల్) టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్నాడు బదరీనాథ్, వేయి రూపాయల డిపాజిట్ కట్టి, నిజానికి అతనికి సెల్ ఫోన్ ఉంది. ల్యాండ్ లైన్ అవసరం లేదు. ఐనా అడ్రెస్ ప్రూఫ్ కోసం కనెక్షన్ తీసుకోకతప్పలేదు.
దాంతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, గ్యాస్ ఏజెన్సీ లో పేరు నమోదు చేసుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్న బదరీనాథ్ - అసలు సమస్య ఆ తరువాతే ఆరంభమౌతుందని ఊహించలేదు, పాపం!
ముప్పయ్ ఐదేళ్ళ బదరీనాథ్ ది చిరు కుటుంబం - భార్య కమల, పదేళ్ళ కూతరు రాధిక, తల్లి లక్ష్మమ్మాను.
ఓ సారి ఫోన్ మ్రోగితే లక్ష్మమ్మ వెళ్లి రిసీవర్ తీసింది.
ఆమె 'హలో!" అనగానే - అటువైపు నుండి, "హాయ్, స్వీటీ! నిన్నటి నుంచి నీకోసం ట్రై చేస్తూంటే రెస్పాన్స్ లేదేమమ్మా?" అన్న మగ గొంతుక.
"ఏయ్, ఎవరు నువ్వు?" గట్టిగా అడిగింది లక్ష్మమ్మ.
"ఎంత అలిగితే మాత్రం? బాయ్ ఫ్రెండ్ నే తెలియనట్టు నటిస్తావా! నా సెల్ లో చార్జ్ ఐపోయింది డియర్! అందుకే ఇందులో," అన్నాడతను. "ఏయ్, స్వీటీ! సాయంత్రం లవర్స్ పార్క్ కు వెళ్దాం, రెడీగా ఉండు, అక్కడ ఐస్ క్రీమూ, నీ కోపం పోయేలా స్వీట్ నథింగ్సూ తో ఎంజాయ్ చేద్దాం. ఓకే?"
"ఎవడ్రా నువ్వు? ఎవరు కావాలి?" కోపంగా అంది ఆవిడ.
"నువ్వే, నువ్వే... నువ్వే కావాలి!" కొంటెగా అన్నాడు అతను. అంతలోనే, "మీవాళ్లెవరైనా పక్కనున్నారేమిటీ... తెలియనట్టు నటిస్తున్నావ్?... ఓకే! ఈవెనింగ్..." అంటూ, ఫోన్లో
ముద్దులు పెట్టాడు.
చటుక్కున రిసీవర్ పెట్టేసి, అప్రయత్నంగా బుగ్గ తుడుచుకుంది లక్ష్మమ్మ.
"దరిద్రపుగొట్టు వెధవ! నన్ను లవర్స్ పార్క్ కు రమ్మంటాడా! నాకు ముద్దులు కూడా పెడతాడా!!... బదిరీని రానియ్, సెక్యూరిటీ అధికారి కంప్లెయింట్ ఇప్పించి, ఆ పోకిరిగాడి తిక్క కుదుర్చుతాను..." అంటూ కోపంతో గింజుకుంటున్న అత్తగారి వంక తెల్లబోయి చూసి, "ఏమయిందత్తయ్యా?" అనడిగింది కమల.
ఆవిడ జరిగిందంతా చెప్పి, "నా వయసుక్కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతాడా! వాడికెంత ధైర్యం?" అంది మండిపడుతూ.
కమల నవ్వాపుకుంటూ, "టెలిఫోన్లో మీరు అతనికి కనిపించరు కదండీ? బహుశా అతను తన గర్ల్ ఫ్రెండ్ ఎవరికో చేస్తే... అది రాంగ్ నంబరుకు, మనకు వచ్చుంటుంది" అంది.
ఆవిడ "ఔనా!?" అంటూ విస్తుపోయి, "గర్ల్ ఫ్రెండ్ ఐతే మాత్రం... ఫోన్లో ఆ ముద్దులేమిటీ, అసహ్యంగా!' అంది.
'అది జెనెరేషన్ గ్యాప్!' అని అత్తగారితో అనబోయి ఊరుకుంది కమల.
సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక తల్లి ఆనాటి తన టెలిఫోన్ అనుభవం గురించి చెబుతూంటే... పడిపడి నవ్వారు బదరీనాథ్, రాధికలు.
"నాన్నమ్మా! తప్పకుండా అది తాతయ్యే అయుంటాడు!" అంటూ ఆవిడను రాధిక ఆట పట్టిస్తూంటే...
"తప్పు!" అంటూ కూతురి నెత్తి మీద మురిపెంగా చిన్న మొట్టికాయ వేసింది కమల.
బదరీనాథ్ ల్యాండ్ లైన్ కు రాంగ్ కాల్స్ విరివిగా వస్తూండేవి. వాటిలో తరచుగా వచ్చే కాల్ - రాష్ట్ర మంత్రి ఏడుకొండలు కోసం! రోజుకు అర డజను సార్లైనా అతని కోసం ఫోన్ చేస్తూంటారు, ఎవరెవరో. అది మంత్రి గారి నివాసం కాదనీ, రాంగ్ నంబరనీ చెప్పినా కొందరు నమ్మేవారు కాదు... తమ నంబరూ, మంత్రి గారి నంబరూ పక్క పక్క వయ్యుంటాయనుకునేవాడు బదరీనాథ్. అతని కాల్స్ తమకు వచ్చినట్టే, తమ కాల్స్ అతనికి వెళ్తున్నాయేమోనన్న అనుమానం కూడా కలిగేది. ఆ విషయమై ఒకటి రెండు సార్లు టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు పిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పులేదు.
ఓరోజు రాత్రి టీవీ లో న్యూస్ వాచ్ చేస్తూన్న బదరీనాథ్ కుటుంబాన్ని ఓ వార్త ఆశ్చర్యపరిచింది... ఆ రోజు ఉదయం మంత్రి ఏడుకొండలు తన పదవికి రాజీనామా చేసాడని తెలిసి అతని అభిమానులు, మద్దతుదారులూ అతని నివాసానికి ఊరేగింపుగా వెళ్లారు. అతను ఎట్టి పరిస్థితులలోనూ రిజైన చేయడానికి వీల్లేదంటూ నినాదాలు చేసారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ గొడవ చేసారు. అది కేవలం గాలి వార్త అని చెప్పినా వినిపించుకోలేదు.
మంత్రి గారింటి ఆడంగులే ఆ నిజం చెప్పారంటూ వక్కాణించారు. ఆ గుంపును చెదరగొట్టడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు లాఠీ ఛార్జ్ కూడా చేయవలసి వచ్చింది... తరువాత, మహేశ్వరం లో పర్యటిస్తున్న మంత్రి గారే స్వయంగా వచ్చి, అది అబద్ధపు వార్త అనీ, కిట్టనివారెవరో దానిని పుట్టించి ఉంటారనీ చెప్పాకగానీ, జనాలు కుదుటపడలేదు.
"మంత్రి గారి రాజీనామా నిజమే అయ్యుంటుంది. ముఖ్యమంత్రితో ఏ విషయం లోనో అభిప్రాయభేదం వచ్చుంటుంది. ఆవేశంతో రిజైన్ చేసేసి ఉంటాడు గురుడు. మద్దతుదారుల ఒత్తిడితో ఉపసంహరిచుకుని ఉంటాడు" వ్యాఖ్యానించాడు బదరీనాథ్.
"అంతే అయ్యుంటుంది. నిప్పు లేనిదే పొగరాదు కదా!" అంది లక్ష్మమ్మ.
"మంత్రి గారి రాజీనామా సంగతి ఆయన ఇంట్లోవాళ్ళే చెప్పారంటున్నారు కదా!" అంది కమల.
అంతలో ఏదో గుర్తుకు వచ్చిన రాధిక 'కెవ్వు' మని అరచింది.
త్రుళ్ళిపడ్డా రంతా.
భయపడ్డ అత్తగారు కంగారుగా గుండెల పైన ఊసుకుంటూంటే - కూతురి వంక కోపంగా చూసింది కమల.
"ఏమయిందే? ఎందుకలా గుండెలు అవిసిపోయేలా అరిచావ్?" అంది కోపంగా.
ఆ పిల్ల చెప్పింది ఆలకించి మొదట తెల్లబోయినా, ఆ తరువాత పడిపడి నవ్వారంతా.
ఆరోజు ఉదయం... ల్యాండ్ లైన్ మ్రోగింది. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడంతో, రాధిక వెళ్లి రిసీవర్ తీసింది.
"మంత్రి గారు ఉన్నారండీ?" అని అడిగారు ఎవరో అటువైపు నుండి.
రోజుకు పదిసార్లు వచ్చే మంత్రి గారి కాల్స్ తో విసుగెత్తిపోయి ఉన్నారు ఇంట్లో అందరూ. అందుకే కొంటెగా, "మంత్రి గారు లేరు. రిజైన్ చేసేసారు!" అని జవాబిచ్చి, ఫోన్ కట్ చేసేసింది ఆ పిల్ల.
ఆ తరువాత ఫోన్ మళ్ళా మళ్ళా రింగ్ ఐనా అట్టెండ్ అవ్వలేదు...
మంత్రి ఏడుకొండలు 'రాజీనామా' వార్తకు మూలం రాధిక అని గ్రహించేసరికి, ఓ పక్క "అలా చెప్పడం తప్పుకాదటే, దయ్యం!" అంటూ ఆ పిల్లను మురిపెంగా మందలిస్తూనే... మరో పక్క రాత్రంతా నవ్వలేక చచ్చింది బదరీనాథ్ కుటుంబం.
ఐతే -
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
టెలిఫోన్స్ - ముఖ్యంగా, ల్యాండ్ లైన్స్ - కేవలం నవ్వించే సన్నివేశాలకే దారితీస్తాయనుకున్న బదరీనాథ్ - అది ఎల్లప్పుడూ నిజం కాదనీ, ఏడ్పించగలవు కూడాననీ తెలుసుకోవడానికి అట్టే రోజులు పట్టలేదు. కొండొకసారి అది హార్ట్ ఎటాక్స్ కూడా తెప్పిస్తుందనడానికి తానే నిదర్శనం అయ్యాడు.
ఆ రోజు సాయంత్రం - ఆఫీసు నుండి వచ్చి, వాష్ చేసుకుని, సోఫాలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ వార్తా పత్రిక చదువుతున్నాడు బదరీనాథ్. ఓ కాగితం తెచ్చి తండ్రికి ఇచ్చింది రాధిక.
దాన్ని చూడగానే, 'అమ్మో!' అంటూ గుండె పట్టుకుని సోఫాలో ఒరిగిపోయాడు బదరీనాథ్.
లబో దిబో మంటూ డాక్టర్ కు ఫోన్ చేసింది కమల.
డాక్టర్ వచ్చి బదరీనాథ్ ను పరీక్షించాడు. "ఏదో పెద్ద షాకే తిన్నట్టున్నాడు. కరెంటు తీగ ఏదైనా పట్టుకున్నాడా?" అనడిగాడు.
"లేదు. ఈ టెలిఫోన్ బిల్లు ముట్టుకున్నాడు," అని జవాబు ఇచ్చింది రాధిక.
"అదీ సంగతి! అందుకే హార్ట్ ఎటాక్ వచ్చింది," అంటూ బదరీనాథ్ కు ఇంజెక్షన్ ఇచ్చాడు. దాంతో కొంతసేపటికి కళ్ళు తెరిచాడు బదరీనాథ్.
"పరవాలేదు. మైల్డ్ ఎటాకే. మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరయిపోతుంది" అంటూ మందులు రాసిచ్చాడు డాక్టర్. "ఎందుకైనా మంచిది... కొన్నాళ్ళపాటు టెలిఫోన్ బిల్లులూ, కరెంట్ బిల్లులూ అతనికి చూపించకండి".
కమలకు కొన్ని జాగ్రతలు చెప్పి... ఫీజు జేబులో వేసుకుని, మెడిసిన్ చెస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు అతను.
బదరీనాథ్ కోలుకునేసరికి వారం రోజులు పట్టింది.
భర్త పూర్తిగా కోలుకున్నట్టు నమ్మకం కలిగాక - ఎందుకైనా మంచిదని డాక్టర్ రాసిచ్చిన మందులవీ దగ్గర పెట్టుకుని, "ఏమిటండీ, ఈ దారుణం? రెండు నెలలకు యాభై వేల బిల్లేమిటి!? అన్ని కాల్స్ ల్యాండ్ లైన్ నుండి మనమెప్పుడు చేసాం?" అంది కమల ఆశ్చర్యము, ఆగ్రహమూ మిళితం కాగా.
బిల్లు తీసుకుని దానికి జతపరచియున్న కాల్స్ వివరాలను పరిశీలించిన బదరీనాథ్ నిశ్చేష్టుడయ్యాడు.
అర్థరాత్రి వేళ... ఇంటర్నేషనల్ కాల్స్... దుబాయ్, పాకిస్థాన్, సాల్మన్ ఐలెండ్స్, క్రిస్ట్మస్ ఐలెండ్స్ వగైరా దేశాలకు చేయబడినట్టు ఆ రికార్డ్ చెబుతోంది! వాటి కారణం గానే బిల్లు మొత్తం యాభై వేలు అయింది!!
అయోమయంలో పడిపోయాడు బదరీనాథ్. తాను కాని, తన కుటుంబం కాని ఇంటర్నేషనల్ కాల్స్ ఎన్నడూ చేయలేదు. కనీసం - అమెరికాకు కూడా. ఎందుకంటే, తన బంధుమిత్రులెవరూ విదేశాలలో లేరు. పుట్టంతా స్వదేశంలోనే ఉంది... పైగా, దుబాయ్, పాకిస్థాన్ లు తప్పిస్తే... సాల్మన్ ఐలెండ్స్, క్రిస్ట్మస్ ఐలెండ్స్ పేర్లు ఎప్పుడూ విననుకూడా లేదు.
అంతలోనే హఠాత్తుగా గుర్తుకు వచ్చింది అతనికి - తన ల్యాండ్ లైన్ కు అసలు ఐ.ఎస్.డి. ఫెసిలిటీయే లేదన్న విషయం!... నవ్వాలో ఏడవాలో తెలియలేదు అతనికి.
ఐతే అతని కుటుంబం మాత్రం ఏడ్చింది, ఆ టెలిఫోన్ బిల్లు మూలంగా... ఆరోగ్యంగా ఉన్న మనిషికి హార్ట్ ఎటాక్ వచ్చినందుకు!... టెలిఫోన్ బిల్లుకు డాక్టర్ బిల్లు కూడా తోడయినందుకు!!
బిల్లు తీసుకుని టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు వెళ్ళాడు బదరీనాథ్. జూనియర్ ఇంజనీర్ ను కలుసుకుని విషయం చెప్పాడు.
ముందుగా బిల్లు పేచేసి, ఆనక కంప్లెయింట్ రాసివ్వమన్నాడతను.
బదరీనాథ్ తెల్లబోయి, "చేయని కాల్స్ కు నేనెందుకు బిల్లు కట్టాలి?" అనడిగాడు.
అతను నవ్వి, "అదంతే. 'పే ఫస్ట్ - ప్రొటెస్ట్ లేటర్' అన్నది మా డిపార్ట్మెంట్ తంబ్ రూల్!" అన్నాడు.
ఆ రూల్ తన కేసుకు వర్తించదని అతనికి నచ్చజెప్పబోయాడు బదరీనాథ్. ఫలితం లేకపోయింది.
డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ (జి.ఎమ్) దగ్గరకు వెళ్ళాడు బద్రీనాథ్. తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
బదరీనాథ్ చెబుతూన్నది సానుభూతితో, సావధానంగా ఆలకించాడు జనరల్ మేనేజర్.
"ఎక్చేంజ్ లన్నీ కంప్యూటరైజ్డ్. పొరపాట్లకు ఆస్కారం లేదు. మీరో, మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఆ కాల్స్ ను చేసి మరచిపోయుంటారు," అన్నాడు కూల్ గా.
"కంప్యూటర్స్ ను ఆపరేట్ చేసేది మనుషులే. పొరపాటు ఎలాగో జరిగిపోయింది. అది మా దగ్గర మాత్రం కాదు" చికాకును అణుచుకుంటూ అన్నాడు బదరీనాథ్. "జరిగిన పొరపాటును సరిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను".
"సారీ సార్! మా జేయీ చెప్పింది నిజమే. మా సిస్టం ఎంతగా స్ట్రీమ్ లైన్ అయిందంటే... మొదట మీరు బిల్ పే చేస్తే తప్ప మీ కంప్లయింట్ ను యాక్సెప్ట్ చేయదు" అన్నాడు
జి.ఎమ్. పొలైట్ గా.
బదరీనాథ్ తెల్లబోయాడు. "బట్, వై షుడ్ ఐ వే?"
"మీ టెలిఫోన్ డిస్కనెక్ట్ అవకుండా ఉండడానికి" చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు జి.ఎమ్.
"దెన్, ఐ విల్ డిమాండ్ సి. బి. ఐ ఇంక్వైరీ!" కోపంగా అన్నాడు బదరీనాథ్.
అతని వంక జాలిగా చూసాడు జి.ఎమ్. బదరీనాథ్ కు వార్తా పత్రికలను చదివే అలవాటు లేదా అని అడిగాడు. రోజూ వాటితోనే ముఖం కడుగుతానని చెప్పాడు బదరీనాథ్, అలా ఎందుకు అడిగాడో అర్ధం కాక.
"మరైతే ఇటీవల దేశంలో జరుగుతున్న సంఘటనల గురించి మీకు తెలిసే ఉండాలే!" అన్నాడు జి.ఎమ్.
"ఏ సంఘటనలను గురించి మీరు మాట్లాడేది?"
"అదే - బాంబ్ బ్లాస్ట్స్... మొదట బోంబే లో, తరువాత డిల్లీ లో, ఆ మధ్య మన హైదరాబాద్ లో. రేపు ఎక్కడో!?" అన్నాడు జి.ఎమ్.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
"దేశంలో జరుగుతూన్న బాంబ్ బ్లాస్ట్స్ కూ, నా టెలిఫోన్ బిల్లుకూ ఏమిటి సంబంధం?" అయోమయంగా, అనుమానంగా చూసాడు బదరీనాథ్.
"ఉంది, సార్! బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ను మీరు ఎరుగుదురనుకుంటాను?" మందహాసం చేసాడతను.
"ఆఫ్ కోర్స్, మున్నాభాయ్ ని ఎరుగనివారు ఎవరుంటారు!?
అదంతా ఎక్కడకు దారి తీస్తోందో ఇంకా బోధపడడం లేదు బదరీనాథ్ కు.
"నౌ, లుక్, మై లెర్నెడ్ సార్! ఆ సూపర్ స్టార్ కు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందన్న అనుమానం సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎలా కలిగిందంటారు?"
అతని ప్రశ్నతో బదరీనాథ్ మస్తిష్కం అర్జెంట్ గా ఆలోచనల అగాధం లోకి జారిపోయింది... సంజయ్ దత్ ఇంట్లోని ల్యాండ్ లైన్ నుండి దుబాయ్ వంటి దేశాలకు చేయబడ్డ కొన్ని
ఫోన్ కాల్స్ ఆధారంగా... సెక్యూరిటీ ఆఫీసర్లు తీగ లాగితే డొంకంతా కదిలింది. దఫాలుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా వెళ్లివచ్చాడు అతను. ఆ కేసింకా ఓ కొలిక్కి రాలేదు...
'తన ఫోన్ బిల్లుకూ, సంజయ్ దత్ కేసుకూ సంబంధం ఏమిటో? అదంతా ఎక్కడకు దారి తీస్తున్నట్లో!?'... పజ్లింగ్ గా చూసాడు బదరీనాథ్.
"మీకు ఇంకా బోధపడలేదా?!" ఆశ్చర్యంగా అడిగాడు జి.ఎమ్. "ఐతే, మీకు బుర్రకు ఎక్కేలా చెప్పడం నా విద్యుక్త ధర్మం!"
బ్లాంక్ గా చూసాడు బదరీనాథ్.
"మీరు ఫోన్ బిల్ గురించి సి.బి.ఐ. దర్యాప్తును డిమాండ్ చేస్తానన్నారు. రైట్?" అన్నాడు జి.ఎమ్. "కాని, సి.బి.ఐ రంగం లోకి దిగితే ఏమౌతుందో తెలుసా?"
"ఏమౌతుంది?"
"మీ కప్ బోర్డ్ లో స్కెలెటెన్స్ ను సృష్టించగలదు ఆ ఏజెన్సీ..."
"వాడ్డూ యూ మీన్?"
"మీ కాల్స్ గమ్యం దుబాయ్, పాకిస్థాన్ వంటి దేశాలు అని మీరు విస్మరించకూడదు".
"బట్, ఆ కాల్స్ మేం చేయలేదు" గుర్తుచేశాడు బదరీనాథ్.
"అని మీరంటున్నారు. కాని, ఆ విషయంలో సి.బి.ఐ. ఆలోచనలు వేరేలా ఉండొచ్చును!" మందహాసం చేసాడు జి.ఎమ్. "దె కుడ్ ఈవెన్ ట్రేస్ యూ టు ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్..."
అదిరిపడ్డాడు బద్రీనాథ్. "ఇటీజ్ రిడిక్యులస్!" ప్రొటెస్ట్ చేసాడు. "నా ఫోన్ కు అసలు ఐ.ఎస్.డి. ఫెసిలిటీయే లేదు!"
"ఓహ్, దట్ కుడ్ స్పెల్ ఫరదర్ ట్రబుల్ ఫర్ యూ..." అన్నాడు జి.ఎమ్. "రెండు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఓ ఫేక్ టెలిఫోన్ ఎక్చేంజ్ రాకెట్ ను సెక్యూరిటీ ఆఫీసర్లు బర్స్ట్ చేసారు, గుర్తుందా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టం కలిగిస్తూ ప్రైవేట్ కంపెనీలకూ, బిజినెస్ మెన్ కూ రహస్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ ను తక్కువ రేటుకు కనెక్ట్ చేసేది ఆ ముఠా... మీరూ అలాగే ఏ దొంగ ఎక్చేంజ్ ద్వారానో అంతర్జాతీయ కాల్స్ ను చేస్తున్నట్లు సి.బి.ఐ. దర్యాప్తు లో తేలవచ్చును!"
హతశుడయ్యాడు బదరీనాథ్. హఠాత్తుగా జబ్బుపడ్డవాడిలా ఐపోయాడు.
"ఐతే నన్నిప్పుడు ఏం చేయమంటారు?" నిస్సహాయంగా అడిగాడు.
"నేనే కనుక మీ స్థానంలో ఉంటే గప్ చుప్ గా బిల్లు చెల్లించేసేవాణ్ణి!" సజెస్ట్ చేసాడతను.
"మై గాడ్! యాభై వేలు! అకారణంగా!!" ఉలికిపడ్డాడు బదరీనాథ్.
"ఇంక్వైరీ వరకు వెళ్తే... అది మరింత కాస్ట్లీ ఆఫైర్ కావచ్చును!"
"బట్, అంత సొమ్ము నేనెక్కన్నుంచి తేను?"
"దట్స్ యువర్ ప్రొబ్లెమ్!" తాపీగా అన్నాడు జి.ఎమ్. "యూ బెట్టర్ గెట్ ద హెల్ ఔటాఫ్ హియర్... బిఫోర్ ద సి.బి.ఐ. స్మెల్స్ ఎ ర్యాట్!"
మెసేజ్ మెదడులో సూటిగా నాటుకోవడంతో - చటుక్కున లేచి నిలుచున్నాడు బదరీనాథ్...
తక్షణమే ఆఫీసుకివ వెళ్లి ప్రావిడెంట్ ఫండ్ నుండి లోన్ కు అప్లై చేసాడు - జి.ఎమ్. సలహా ప్రకారం టెలిఫోన్ బిల్ ను 'గప్ చుప్ గా' పే చేసేయడం కోసమని...!!
విషయం ఆలకించిన బదరీనాథ్ కుటుంబం అవాక్కయింది.
కమల తేరుకుని, "ఏమండీ! ఇవాళ దినపత్రికలో చూసాను - ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా వ్యక్తిగత గుర్తింపు కార్డులను జారీ చేస్తోందట. అందులో చిరునామాతో పాటు అవసరమైన ఇతర వివరాలవీ ఉంటాయట. ఆ కార్డ్ అన్నిటికీ ఉపయోగిస్తుందట," అని చెప్పింది.
ఆమె పలుకులు బదరీనాథ్ చెవులలో అమృతం పోసాయి.
"నిజంగా? ఐతే ఇప్పుడే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు అప్లికేషన్ ఇచ్చేస్తాను, మన ల్యాండ్ లైన్ తీసేయమని!" అన్నాడు, హృదయాన్ని తేలికపరచుకోవడానికి ప్రయత్నిస్తూ.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
దొంగ గారి పెళ్ళి - సి. చంద్రయ్య
కూతురు కోరినదానికి నవ్వాలో, ఏడవాలో, నవ్వి ఏడవాలో, ఏడ్చి నవ్వాలో అర్థం కాలేదు భీముడికి. పన్నేండేళ్ల వయసున్నప్పుడు కూతురు 'అలీబాబా అరడజను దొంగలు ' కావాలంది. తీసుకొచ్చి సంతోషపెట్టాడు. తరువాత 'మంచిదొంగ ' కావాలంది. తీసుకొచ్చి తనూ సంతోషపడ్డాడు. ఆ తరువాత భలేదొంగ, గజదొంగ... ఇలా దొంగలకు సంబంధించిన సినిమాలను కూతురు అడగడం, భీముడు తెచ్చివ్వడం జరిగింది. ఇప్పుడు 'దొంగ మొగుడు ' కావాలంది. "సరేలే తల్లీ... రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తెస్తాలే" అన్నాడు భీముడు యధాలాపంగా. "తెచ్చేదేంటి డాడీ? తీసుకురావాలి. నేనడుగుతున్నది సినిమాలో దొంగమొగుడు కాదు డాడీ... నిజమైన దొంగమొగుడు"
ఈ మాటకు భీముడు సెకనులో అరవయ్యో వంతు సమయం షాక్ కు గురై వెంటనే తేరుకున్నాడు. దొంగ అంత వేగంగా తేరుకోవాలి. లేకపోతే దొరికిపోతాడు. తేరుకున్న తరువాత ఆలోచనలో పడ్డాడు. కాకి కడుపున కాకే పుడుతుంది. పిల్లి కడుపున పిల్లే పుడుతుంది. దొంగ కడుపున దొంగే పుడుతుందా?! కాకపోతే, ఈ దొంగ బుద్దులు ఎలా ఒంటబట్టాయి?
భీముడు ఒప్పుకున్నాడు. ఒప్పుకోక ఏంచేస్తాడు? ఒక్కగానొక్క కూతురాయె... పైగా తల్లిలేని బిడ్డాయె. తన కూతురికి చిన్నప్పటినుండీ కోరితే కొండమీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు దొంగమొగుడిని తీసుకురాలేడా?
భీముడు దొంగ సంబంధాల వేటలో పడ్డాడు. కానీ, అతడికి మొదటి అడుగే ఎలా వేయాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన దొంగలంతా తన ఈడువారే! వాళ్లకు మగపిల్లలున్నారో, లేదో తెలీదు. ఒకవేళ వున్నా ఆ పిల్లలు దొంగ వృత్తిలో దిగి వున్నారో, దిగుతారో తెలియదు. పైగా, ఏ దొంగనైనా నీ కొడుకు దొంగతనం చేస్తాడా అంటే చెప్పుచ్చుకుని దరువేయడా? ఈ ఆలోచనా క్రమంలో భీముడి మెదడులో ఓ నక్షత్రం తళుక్కున మెరిసి దారి చూపింది.
రైల్వేస్టేషన్ కెళ్లి 'దొంగలున్నారు జాగ్రత్త ' అని రాసివున్న బోర్డులో తన కూతురికి మ్యాచ్ అయ్యే దొంగబ్బాయి కోసం చూశాడు. కానీ, అక్కడున్న మొహాలు అతడికి నచ్చలేదు. కూతురు ఎంత దొంగమొగుదు కావాలంటే మాత్రం కొండముచ్చుల్లా వున్న దొంగ ముచ్చుల్ని ఎలా కట్టబెట్టగలడు? ఎంత దొంగైనా కన్నతండ్రే కదా! చివరకు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి కూడా వెళ్లి ఎంక్వైరీ చేశాడు.
తనకు నచ్చిన యువదొంగ దొరకలేదు, అయినా అతడు ఆగిపోలేదు. ఇంకో ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా పెన్ను, కాగితం తీసుకున్నాడు. తల పైకెత్తి తిరుగుతున్న సీలింగ్ ఫ్యానుకేసి చూసి రాయడం మొదలుపెట్టాడు.
'దొంగ కావలెను ' అని రాసి దానికింద అండర్ లైన్ చేశాడు... దానికింద...
అమ్మాయి పేరు : మనోహరి
రంగు : పట్టపగలు
వయసు : రెండు అర్థరాత్రులకు మూడు తక్కువ.
ఎత్తు : కిటికీకి ఎక్కువ, ద్వారానికి తక్కువ.
ఆస్తి : తండ్రి వయసంత.
వరుడికి వుండవలసిన లక్షణాలు...
రంగు : చిమ్మచీకటి (రాత్రుల్లో కనిపించకుండా వుండడానికి.)
చూపు : కత్తిలా ( బ్యాగులో ఏముందో తెలుసుకోవడానికి.)
వేళ్లు : కత్తెర్లాంటి (కత్తెర చేతిలో పెట్టుకు తిరిగితే ప్రమాదకరం.)
పళ్లు : బ్లేడులాంటి (బ్లేడుకు పదును తగ్గినప్పుడు ఉపయోగం.)
పైన తెలిపిన అమ్మాయికి, కింద తెలిపిన అర్హతలున్న యువదొంగలు తమ బయోడేటాను కింది అడ్రసుకు పంపగలరు. అని తన అడ్రసును రాశాడు. ఒకసారి తను రాసింది తిరిగి చదువుకున్నాడు. సంతృప్తిగా నవ్వుకున్నాడు. పత్రికలో యాడ్ ఇవ్వడానికి బయలుదేరాడు.
భీముడిచ్చిన ప్రకటన బాగానే పనిచేసింది. ఎప్పుడూ ఆ వీధి మొహం కూడా చూడని పోస్టుమాన్, ఓ పేద్ద సంచిని మోయలేక మోయలేక మోసుకుంటూ భీముడింటి లోగిలిలో పడేసి "నిద్రపోతున్నవాడిని లేపావు కదయ్యా... ఇంతకీ ఇన్ని కవర్లు వచ్చాయేంటి?" అని అడిగి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు. బయోడేటాలను సార్టవుట్ చేయడానికి దాదాపుగా నెలరోజులు పట్టింది. వచ్చిన అప్లికేషన్లలోనుండి తనకు మంచిదనిపించిన ఒకదానిని సెలెక్ట్ చేసి కూతురికి చూపించాడు. ఆమెకూ నచ్చింది. ఆ యువదొంగ అప్లికేషనులోని సెల్ నంబరుకి ఫోన్ చేసి "మీ ఇంటికి రేపొస్తున్నాం... మీకేమీ అభ్యంతరం లేదుగా!" అన్నాడు. "లేదు" అంది అవతల యువదొంగ గొంతు.
భీముడు, మనోహరి యువదొంగ ఇంటికెళ్లారు. యువదొంగ తల్లిదండ్రులు "రండి... రండి... మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రజలంతా క్షేమమేనా?" అని సాదరంగా ఆహ్వానిస్తూ అఓపలికి తీసుకెళ్లారు. ఈ పలకరింపు అర్థంగాక యువదొంగ సర్హ "అదేమిటి అలా అడుగుతున్నారు? ఎవరైనా అందరూ బావున్నారా? అని అడుగుతారు. కానీ, మీరు మాత్రం....." ఆర్థోక్తిలో ఆగిపోయింది. "ఒసే పిచ్చిమొహమా! దొంగలు ఎప్పుదు క్షేమంగా వుంటారు/ అహ... ఎప్పుడుంటారని? ప్రజలు క్షేమంగా వున్నప్పుడే కదా!" అని గీతోపదేశం చేసి "సరే, నువ్వెళ్లి కాఫీలు పట్టుకురా!" అన్నాడు.
"చిటికెలో తేనూ" అంటూ అఓపలికెళ్లి వెంటనే తిరిగి వచ్చింది కాఫీ ట్రేతో...
మనోహరి కాఫీ చప్పరిస్తూ "పాలు చాలా చిక్కగా వున్నాయి. ఇంత చిక్కని పాలంటే... రేటు చాలా ఎక్కువనుకుంటా..."
"నేనూ అదే అనుకుంటున్నా... ఏ కేటగిరీ పాలు కావాలి? పల పాలా? నీళ్ల పాలా? అని చెప్పి మరీ పోస్తున్న ఈరోజుల్లో... ఇంత చిక్కని పాలంటే..." భీముడికి కూడా అదే అనుమానం. ఈ తండ్రీ కూతుళ్ల అనుమానాలు చూసి యువదొంగ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కిసుక్కున నవ్వుకున్నారు.
"అడిగితే ఎవడు పోస్తాడు ఇంత చిక్కని పాలు? నేనే తెల్లవారు జామున వెళ్లి ఒక్కోరోజు ఒక్కో ఇంట్లో పాలు పితుక్కొచ్చుకుంటాను" మీసం మెలేశాడు యువదొంగ తండ్రి.
"మంచిపని చేశారు. నాకూ ఇలా చేయాలని వుంది. కానీ, పాలు పితకడం చేతగాక వెళ్లడం లేదు. ఇంతకీ అబ్బాయి....?" ప్రశ్నార్థకంగా యువదొంగ తండ్రివైపు చూశాడు భీముడు.
"కూల్ డ్రింక్స్ కొట్టుకొస్తానని వెళ్లాడు... వచ్చేస్తూ వుంటాడు" అన్నాడు యువదొంగ తండ్రి.సరిగ్గా అప్పుడే యువదొంగ ఖాళీ చేతులతో వచ్చాడు.
"కూల్ డ్రింక్స్ ఏవిరా?"
"వీలు పడలేదు డాడీ!"
"నా కడుపున చెడబుట్టావు కదురా... నా పరువును పుల్కాట్లో కలిపేశావు కదురా..." అంటూ మీటరెత్తు ఎగిరాడు. దొంగమొగుఛు కావాలనుకుంటే ఉత్త మొగుడు దొరికేలా వున్నాడనుకుని మనోహరి తండ్రి చెవిలో "కూల్ డ్రింక్ కూడా కొట్టుకురాలేని మొగుడు నాకొద్దు డాడీ" అని అనేసరికి ఆయన కూడా మనోహరి చెవిలో "నే మాట్లాడతాలే! నువ్వుండమ్మా" అన్నాడు.
ఈ గుసగుసలు గమనించిన యువదొంగ తండ్రి "మీరేమీ కంగారు పడకండి... ఈకాలంలో దొంగతనం చేయడం ఎంత కష్టమో దొంగలు... మీకు తెలియంది కాదు. కాలు బయట పెట్టిన ప్రతిసారీ కాసులతో రాలేం కదా!" అని సర్ది చెప్పబోతూంటే భీముడు "మీరు చెప్పిందీ నిజమే... కానీ, మా మనోహరి కోరికే... దొంగమొగుడు కావాలని... దాని కోసమేమా ప్రయత్నం." కూతురివైపు ప్రేమగా చూశాడు. మనోహరి తన తండ్రికి తనపైగల ప్రేమకు మురిసిపోతూ "సరేనండీ... మీరింతగా చెబుతున్నారు కాబట్టి... నాదో కండిషన్. ఇప్పుడు జరుగుతున్నది పరిచయ చూపులనుకుందాం. నేను మళ్లీ ఒకరోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను. అందులో నెగ్గితే ఓకే" అని గంట కొట్టింది. "పెళ్లిచూపుల్లో నెగ్గడమేంటి?" యువదొంగ, అతడి తల్లిదండ్రులు మూకుమ్మడిగా నోళ్లు తెరిచారు. "ముందు మీరు నోళ్లు మూసుకోండి. తరువాత ఏంచేయాలో చెబుతాను." అంది మనోహరి. భీముడు కూడా తన కూతురి మనసులో ఏముందో పసిగట్టలేకపోయాడు. అందరూ మనోహరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నారు. ఆమె నోట్లో నుండి ఏం మాటలు ఊడిపడతాయా... అని ఎదురు చూస్తున్నారు.
"నేను ఏదైనా ఒక ఇంటిని చూపిస్తాను. ఆ ఇంట్లో దొంగతనం... నా కళ్లముందే చేయాలి. పైగా, మనుషులున్న ఇంట్లో... అలా చేయగలిగితేనే పెళ్లిచూపులు విజయవంతం అయినట్టు" అని మనోహరి తేల్చేసరికి యువదొంగ రెండు కేజీల ఖంగు తిన్నాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 765
Threads: 0
Likes Received: 1,220 in 684 posts
Likes Given: 3,048
Joined: Jun 2020
Reputation:
41
(28-06-2024, 05:03 PM)k3vv3 Wrote: దొంగ గారి పెళ్ళి - సి. చంద్రయ్య
కూతురు కోరినదానికి నవ్వాలో, ఏడవాలో, నవ్వి ఏడవాలో, ఏడ్చి నవ్వాలో అర్థం కాలేదు భీముడికి. పన్నేండేళ్ల వయసున్నప్పుడు కూతురు 'అలీబాబా అరడజను దొంగలు ' కావాలంది. తీసుకొచ్చి సంతోషపెట్టాడు. తరువాత 'మంచిదొంగ ' కావాలంది. తీసుకొచ్చి తనూ సంతోషపడ్డాడు. ఆ తరువాత భలేదొంగ, గజదొంగ... ఇలా దొంగలకు సంబంధించిన సినిమాలను కూతురు అడగడం, భీముడు తెచ్చివ్వడం జరిగింది. ఇప్పుడు 'దొంగ మొగుడు ' కావాలంది. "సరేలే తల్లీ... రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తెస్తాలే" అన్నాడు భీముడు యధాలాపంగా. "తెచ్చేదేంటి డాడీ? తీసుకురావాలి. నేనడుగుతున్నది సినిమాలో దొంగమొగుడు కాదు డాడీ... నిజమైన దొంగమొగుడు"
ఈ మాటకు భీముడు సెకనులో అరవయ్యో వంతు సమయం షాక్ కు గురై వెంటనే తేరుకున్నాడు. దొంగ అంత వేగంగా తేరుకోవాలి. లేకపోతే దొరికిపోతాడు. తేరుకున్న తరువాత ఆలోచనలో పడ్డాడు. కాకి కడుపున కాకే పుడుతుంది. పిల్లి కడుపున పిల్లే పుడుతుంది. దొంగ కడుపున దొంగే పుడుతుందా?! కాకపోతే, ఈ దొంగ బుద్దులు ఎలా ఒంటబట్టాయి?
భీముడు ఒప్పుకున్నాడు. ఒప్పుకోక ఏంచేస్తాడు? ఒక్కగానొక్క కూతురాయె... పైగా తల్లిలేని బిడ్డాయె. తన కూతురికి చిన్నప్పటినుండీ కోరితే కొండమీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు దొంగమొగుడిని తీసుకురాలేడా?
భీముడు దొంగ సంబంధాల వేటలో పడ్డాడు. కానీ, అతడికి మొదటి అడుగే ఎలా వేయాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన దొంగలంతా తన ఈడువారే! వాళ్లకు మగపిల్లలున్నారో, లేదో తెలీదు. ఒకవేళ వున్నా ఆ పిల్లలు దొంగ వృత్తిలో దిగి వున్నారో, దిగుతారో తెలియదు. పైగా, ఏ దొంగనైనా నీ కొడుకు దొంగతనం చేస్తాడా అంటే చెప్పుచ్చుకుని దరువేయడా? ఈ ఆలోచనా క్రమంలో భీముడి మెదడులో ఓ నక్షత్రం తళుక్కున మెరిసి దారి చూపింది.
రైల్వేస్టేషన్ కెళ్లి 'దొంగలున్నారు జాగ్రత్త ' అని రాసివున్న బోర్డులో తన కూతురికి మ్యాచ్ అయ్యే దొంగబ్బాయి కోసం చూశాడు. కానీ, అక్కడున్న మొహాలు అతడికి నచ్చలేదు. కూతురు ఎంత దొంగమొగుదు కావాలంటే మాత్రం కొండముచ్చుల్లా వున్న దొంగ ముచ్చుల్ని ఎలా కట్టబెట్టగలడు? ఎంత దొంగైనా కన్నతండ్రే కదా! చివరకు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి కూడా వెళ్లి ఎంక్వైరీ చేశాడు.
తనకు నచ్చిన యువదొంగ దొరకలేదు, అయినా అతడు ఆగిపోలేదు. ఇంకో ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా పెన్ను, కాగితం తీసుకున్నాడు. తల పైకెత్తి తిరుగుతున్న సీలింగ్ ఫ్యానుకేసి చూసి రాయడం మొదలుపెట్టాడు.
'దొంగ కావలెను ' అని రాసి దానికింద అండర్ లైన్ చేశాడు... దానికింద...
అమ్మాయి పేరు : మనోహరి
రంగు : పట్టపగలు
వయసు : రెండు అర్థరాత్రులకు మూడు తక్కువ.
ఎత్తు : కిటికీకి ఎక్కువ, ద్వారానికి తక్కువ.
ఆస్తి : తండ్రి వయసంత.
వరుడికి వుండవలసిన లక్షణాలు...
రంగు : చిమ్మచీకటి (రాత్రుల్లో కనిపించకుండా వుండడానికి.)
చూపు : కత్తిలా ( బ్యాగులో ఏముందో తెలుసుకోవడానికి.)
వేళ్లు : కత్తెర్లాంటి (కత్తెర చేతిలో పెట్టుకు తిరిగితే ప్రమాదకరం.)
పళ్లు : బ్లేడులాంటి (బ్లేడుకు పదును తగ్గినప్పుడు ఉపయోగం.)
పైన తెలిపిన అమ్మాయికి, కింద తెలిపిన అర్హతలున్న యువదొంగలు తమ బయోడేటాను కింది అడ్రసుకు పంపగలరు. అని తన అడ్రసును రాశాడు. ఒకసారి తను రాసింది తిరిగి చదువుకున్నాడు. సంతృప్తిగా నవ్వుకున్నాడు. పత్రికలో యాడ్ ఇవ్వడానికి బయలుదేరాడు.
భీముడిచ్చిన ప్రకటన బాగానే పనిచేసింది. ఎప్పుడూ ఆ వీధి మొహం కూడా చూడని పోస్టుమాన్, ఓ పేద్ద సంచిని మోయలేక మోయలేక మోసుకుంటూ భీముడింటి లోగిలిలో పడేసి "నిద్రపోతున్నవాడిని లేపావు కదయ్యా... ఇంతకీ ఇన్ని కవర్లు వచ్చాయేంటి?" అని అడిగి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు. బయోడేటాలను సార్టవుట్ చేయడానికి దాదాపుగా నెలరోజులు పట్టింది. వచ్చిన అప్లికేషన్లలోనుండి తనకు మంచిదనిపించిన ఒకదానిని సెలెక్ట్ చేసి కూతురికి చూపించాడు. ఆమెకూ నచ్చింది. ఆ యువదొంగ అప్లికేషనులోని సెల్ నంబరుకి ఫోన్ చేసి "మీ ఇంటికి రేపొస్తున్నాం... మీకేమీ అభ్యంతరం లేదుగా!" అన్నాడు. "లేదు" అంది అవతల యువదొంగ గొంతు.
భీముడు, మనోహరి యువదొంగ ఇంటికెళ్లారు. యువదొంగ తల్లిదండ్రులు "రండి... రండి... మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రజలంతా క్షేమమేనా?" అని సాదరంగా ఆహ్వానిస్తూ అఓపలికి తీసుకెళ్లారు. ఈ పలకరింపు అర్థంగాక యువదొంగ సర్హ "అదేమిటి అలా అడుగుతున్నారు? ఎవరైనా అందరూ బావున్నారా? అని అడుగుతారు. కానీ, మీరు మాత్రం....." ఆర్థోక్తిలో ఆగిపోయింది. "ఒసే పిచ్చిమొహమా! దొంగలు ఎప్పుదు క్షేమంగా వుంటారు/ అహ... ఎప్పుడుంటారని? ప్రజలు క్షేమంగా వున్నప్పుడే కదా!" అని గీతోపదేశం చేసి "సరే, నువ్వెళ్లి కాఫీలు పట్టుకురా!" అన్నాడు.
"చిటికెలో తేనూ" అంటూ అఓపలికెళ్లి వెంటనే తిరిగి వచ్చింది కాఫీ ట్రేతో...
మనోహరి కాఫీ చప్పరిస్తూ "పాలు చాలా చిక్కగా వున్నాయి. ఇంత చిక్కని పాలంటే... రేటు చాలా ఎక్కువనుకుంటా..."
"నేనూ అదే అనుకుంటున్నా... ఏ కేటగిరీ పాలు కావాలి? పల పాలా? నీళ్ల పాలా? అని చెప్పి మరీ పోస్తున్న ఈరోజుల్లో... ఇంత చిక్కని పాలంటే..." భీముడికి కూడా అదే అనుమానం. ఈ తండ్రీ కూతుళ్ల అనుమానాలు చూసి యువదొంగ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కిసుక్కున నవ్వుకున్నారు.
"అడిగితే ఎవడు పోస్తాడు ఇంత చిక్కని పాలు? నేనే తెల్లవారు జామున వెళ్లి ఒక్కోరోజు ఒక్కో ఇంట్లో పాలు పితుక్కొచ్చుకుంటాను" మీసం మెలేశాడు యువదొంగ తండ్రి.
"మంచిపని చేశారు. నాకూ ఇలా చేయాలని వుంది. కానీ, పాలు పితకడం చేతగాక వెళ్లడం లేదు. ఇంతకీ అబ్బాయి....?" ప్రశ్నార్థకంగా యువదొంగ తండ్రివైపు చూశాడు భీముడు.
"కూల్ డ్రింక్స్ కొట్టుకొస్తానని వెళ్లాడు... వచ్చేస్తూ వుంటాడు" అన్నాడు యువదొంగ తండ్రి.సరిగ్గా అప్పుడే యువదొంగ ఖాళీ చేతులతో వచ్చాడు.
"కూల్ డ్రింక్స్ ఏవిరా?"
"వీలు పడలేదు డాడీ!"
"నా కడుపున చెడబుట్టావు కదురా... నా పరువును పుల్కాట్లో కలిపేశావు కదురా..." అంటూ మీటరెత్తు ఎగిరాడు. దొంగమొగుఛు కావాలనుకుంటే ఉత్త మొగుడు దొరికేలా వున్నాడనుకుని మనోహరి తండ్రి చెవిలో "కూల్ డ్రింక్ కూడా కొట్టుకురాలేని మొగుడు నాకొద్దు డాడీ" అని అనేసరికి ఆయన కూడా మనోహరి చెవిలో "నే మాట్లాడతాలే! నువ్వుండమ్మా" అన్నాడు.
ఈ గుసగుసలు గమనించిన యువదొంగ తండ్రి "మీరేమీ కంగారు పడకండి... ఈకాలంలో దొంగతనం చేయడం ఎంత కష్టమో దొంగలు... మీకు తెలియంది కాదు. కాలు బయట పెట్టిన ప్రతిసారీ కాసులతో రాలేం కదా!" అని సర్ది చెప్పబోతూంటే భీముడు "మీరు చెప్పిందీ నిజమే... కానీ, మా మనోహరి కోరికే... దొంగమొగుడు కావాలని... దాని కోసమేమా ప్రయత్నం." కూతురివైపు ప్రేమగా చూశాడు. మనోహరి తన తండ్రికి తనపైగల ప్రేమకు మురిసిపోతూ "సరేనండీ... మీరింతగా చెబుతున్నారు కాబట్టి... నాదో కండిషన్. ఇప్పుడు జరుగుతున్నది పరిచయ చూపులనుకుందాం. నేను మళ్లీ ఒకరోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను. అందులో నెగ్గితే ఓకే" అని గంట కొట్టింది. "పెళ్లిచూపుల్లో నెగ్గడమేంటి?" యువదొంగ, అతడి తల్లిదండ్రులు మూకుమ్మడిగా నోళ్లు తెరిచారు. "ముందు మీరు నోళ్లు మూసుకోండి. తరువాత ఏంచేయాలో చెబుతాను." అంది మనోహరి. భీముడు కూడా తన కూతురి మనసులో ఏముందో పసిగట్టలేకపోయాడు. అందరూ మనోహరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నారు. ఆమె నోట్లో నుండి ఏం మాటలు ఊడిపడతాయా... అని ఎదురు చూస్తున్నారు.
"నేను ఏదైనా ఒక ఇంటిని చూపిస్తాను. ఆ ఇంట్లో దొంగతనం... నా కళ్లముందే చేయాలి. పైగా, మనుషులున్న ఇంట్లో... అలా చేయగలిగితేనే పెళ్లిచూపులు విజయవంతం అయినట్టు" అని మనోహరి తేల్చేసరికి యువదొంగ రెండు కేజీల ఖంగు తిన్నాడు. K3vv3 garu! different concept. Nice one.
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
కథల్లేవూ - ప్రతాప వెంకట సుబ్బారాయుడు
నిర్మాతకి కథ వినిపించే మంచి అవకాశం దొరికింది రచయిత రాజుకి. అందుకే తెగ ఇదై పోతున్నాడు. ఆయనని కలుసుకోవాలన్నది అతని చిరకాల వాంఛ. ఆయనకి తన కథ నచ్చితే తన పంట పండినట్టే. ఆయన మెగా ప్రొడ్యూసర్ మరి. తన దగ్గర సెంటిమెంటుతో కూడినవి..ఆర్ధ్రతతో నిండి మనసుని పిండేసే మంచి కథలూ ఉన్నాయి.
ఆయన్ని కలిసే అవకాశం కోసం ఎన్నాళ్ళగానో ఎదురుచూశాడు. ఏ దేవుడి వరమో ఇన్నాళ్ళకి ఫలించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే తెగ ఇదై పోతున్నాడు. ఆయన రమ్మన్న హోటల్‍కి వెళ్ళి, రూములో ఇంద్రుడిలా ధగ ధగ లాడుతున్న నిర్మాతని చూసి ఎనాళ్ళుగానో తపస్సు చేస్తే ఎదుట నిలబడిన వేలుపులా తోచి వంగి వంగి నమస్కరించాడు.
"రావయ్యా..రా..మొత్తానికి నీ టైము బావుందయ్యా..అందుకే నా టైము సంపాదించగలిగావు..అది సరే గాని ముందు కథ చెప్పడం మొదలెట్టవయ్యా మన కాడ ఆట్టే టైము లేదు." అన్నాడు.
"అలాగేనండి..మరేమో ఓ ఊళ్ళో హీరో వుంటాడండి. అతను మామూలుగా జనంలో కలసిపోయి..
"ఏందయ్యా..మరీ ఇంత సప్పగా వుంది? కథంటే జనంచేత కతాకలి ఆడించాల..ఆఁ"
"ఇది వినండి..ఓ హీరో ఊళ్ళో అందర్లో డిఫరెంట్‍గా వుంటాడు. అతనికో చెల్లెలు వుంటుంది.."
"ఆగవయ్యా ఆగు..ఇదే ఇసయం మీద ఎన్ని సినిమాలు రాలేదు సెప్పు..కాస్త కొత్తగా ఏవన్నా వుంటే సెప్పవయ్యా మగడా.."
"మరండీ..ఒకావిడ హాస్పిటల్లో కొడుకుకోసం కుమిలిపోతూ వుంటుంది..కొడుకు తల్లికోసం తాపత్రయపడుతూ.."
"ఛత్ ఏం కథలయ్యా అయి..నాకే సిరాకు తెప్పిస్తున్నాయి..జనం సీట్లలో కూర్చోవాలా వద్దా?"
"పోనీ ఇది వినండి..హీరోకి సంగీతం అంటే ప్రాణం. కళలంటే కళ్ళు. అలాంటి అతను.."
"ఏవయ్యా! నేనేమన్నా అవార్డు సినిమా తీస్తానని ఏ ప్రెస్ మీట్లో నన్నా చెప్పానా? ఎందుకయ్యా బుర్ర తినేస్తున్నావు?.."
రాజుకి మనసంతా బాధగా వుంది. కథ పూర్తిగా చెప్పనిస్తే దాని పస తెలుస్తుంది. అసహనంగా మధ్యలో ఆపేస్తున్నాడు. ఎలా? రాక రాక వచ్చిన అవకాశం. చేజారిపోతోంది.
"సార్..మరి.."
"వద్దయ్యా..వద్దు..ఇంకోపాలి మంచి కతుంటే పట్రా అప్పుడు చూద్దాం..నా మూడ్ మొత్తం చెడిందయ్యా..వెళ్ళు.."అని బలవంతానా రాజుని పంపించేశాడు.
ఆ సంఘటన తర్వాత మూస కథలతో ఆయనవి మూడు సినిమాలు రిలీజయ్యాయి.
ప్రెస్ మీట్లో.."సార్ మీ సినిమాల్లో కొత్తదనమేం లేదని అంటున్నారు..ప్రేక్షకులు. దీనికి మీరేమంటారు?"ఆయన్ని అడిగాడు జర్నలిస్టు.
"కథలకి కరువొచ్చిందండి..మాకు మాత్రం కొత్తగా తియ్యాలని వుండదా? మంచి కథలు రాసేవాళ్ళు పత్రికలు దాటి రావడంలేదు..అన్నీ మేము సదవలేం కదా! ఇండస్ట్రీలో ఉన్నవాటితోటే మేము సినిమాలు తియ్యాల్సి వస్తోంది..రాడానికి రెడీగా వుంటే..వచ్చే కొత్త నీటిని ఆపడానికి మేమెవరమండి..ఆఁ"
టీ వీ లో ఆ ఇంటర్వ్యూ చూస్తూ బాధగా నిట్టూర్చాడు రాజు.
***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
బ్లెస్ మై రిక్షావాలా..! - రామదుర్గం మధుసూధనరావు
"బ్లెస్ మై పేరెంట్స్...బ్లెస్ మై టీచర్...బ్లెస్ మై రిక్షావాలా...'
కేవలం ఈ మాటలే నా స్థాయిని అమాంతం పెంచేశాయ్. నా నోటి వెంట వచ్చే ఈ మాటల కోసం చుట్టుపక్కల అమ్మలక్కలు... ఇంటికొచ్చే బంధువులు చెవులింతగ చేసుకుని వినేవారు. పాపం అమ్మ అయితే మనోడింక ఎక్కడిదాకా పోతాడో...అంటూ ఈస్ట్ మన్ కలర్ లో కలలు కంటూ తెగ మురిసి పోయేది. నేను కాన్వెంట్ చేరడమనేది ...మా ఇంటివాళ్లకు ఓ నవరసభరిత చిత్రం చూసి నంత గొప్ప అనుభూతి కల్గించిన విషయం. ప్రతి రోజూ కాన్వెంటుకు తీసుకెళ్లడానికి ఓ జట్కా రీతిలో ఉన్న రిక్షా ఉండేది. దానిపై సాయిబాబా కాన్వెంటు...అంటూ మిలమిల మెరిసే అక్షరాలుండేవి. యూనిఫాం నిక్కరు, షర్టు, టై కట్టుకుని, నల్ల షూలు వేసుకుని చిన్నసైజు ట్రంకుపెట్టెలాంటి తెల్లరంగు పెట్టెను ఊపుకొంటూ..ఎక్కడ్లేని వగలుపోతూ కాన్వెంటుకు వెళుతుంటే...చుట్టుపక్కల వాళ్లు అబ్బబ్బా...ఈడు సూడు కానుమెంటుకు ఎట్టా పోతుండాడో..మా దిస్టే తగల్తాదేమో...అక్కా మీ వోడికి సాయంత్రము రాగానే దిస్టి తీయండి... అంటూ ముచ్చటపడేవారు. ఈ మాటలు వింటున్న కొద్దీ అమ్మ కళ్లల్లో మెరుపులే కనిపించేవి.
ఆ రోజుల్లో కాన్వెంటు చదువు అంటే దుబారా కింద లెక్క! బాగా డబ్బున్నోళ్లు చేసే కొన్ని అతి పనుల్లో కాన్వెంటు పంపించేదొకటి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా మునిసిపల్ కాలేజీ ఇంటికి దగ్గరగా ఉంటే...ఎవుడు కాన్వెంటుకు పంపుతాడు? మధ్యతరగతి కంటే కాస్త దిగువన ఉన్న కుటుంబం మాది. అయినా నాన్న నన్ను కాన్వెంటుకు పంపే సాహసం ఎందుకు చేశారో మరి? కమానులో చుట్టుపక్కల పిల్లోళ్లు దగ్గర్లోని హావనపేట మునిసిపల్ కాలేజీకు వెళతుంటే...నేను మాత్రం టింగురంగా అంటూ సోగ్గాడిలా సాయిబాబా కాన్వెంటుకు వెళ్లేవాణ్ని. నన్ను కాన్వెంటుకు చేర్పించడంలో నాన్న ఆలోచనలేంటో నాకు తెలీదు. ఆ మాటకొస్తే ఇంట్లో ఎవరికి మాత్రం తెలుసు? అందరూ నన్ను ప్రత్యేకంగా చూడటం ...ఆ వయసులోనే నాకు తెలుస్తుండటంతో నాకు పండగలా ఉండేది.
కాన్వెంటు నుంచి ఇంటికి వచ్చిందే తడువు...పెట్టె పడేసి తుర్రుమంటూ వీధిలోకి పరిగెత్తేవాణ్ని. నా ఫ్రెండ్స్ అందరూ ఆటల్లో కేరింతలు కొడుతుంటే...నేను నా విద్యా ప్రదర్శన లో తలమునకలై పోయేవాణ్ని. కట్టలపై కూర్చొన్న కొందరు సరదా కోసం నన్ను పిలిచి... "ఒరేయ్...మీ కానుమెంటులో ఏం సెబుతారప్పా...' అనగానే నేను బుంగ మూతి పెట్టుకుం టూ "ఓ..చాలా..ప్రేయరు..రైములు..ఎ ఫర్ యాపిలు..' కళ్లు చక్రాల్లా తిప్పుతూ అంటుంటే..." అదంతా బేకులేదు గానీ...ఏదీ..అదేద్రా..బ్లెస్సు...అది చెప్పు...చెప్పరా రేయ్.. అంటూ తెగ బంగపోతుంటే...వారిని ఊరించి ఊరించి...నేను "బ్లెస్ మై పేరెంట్స్...' అంటూ అందుకో వడం...భలే మజాగా ఉండేది. కమానులో కాన్వెంటుకు వెళ్లేది నేనొక్కణ్ణే కావడంతో ...నాకు చాలా మర్యాదలు దక్కేవి. అంతా సజావుగా నడుస్తోంది అనుకుంటుంటే...ఓ అవాంతరం వచ్చి పడింది. అదీ నాకుగా నేను తెచ్చిపెట్టుకుందే! అంత పెద్ద అవాంతరమౌతుందని దేవుని తోడు నాకు తెలీదు. నాకెందుకు ఆ బుద్ది పుట్టిందో తెలియదుగానీ...ఓ రోజు మధ్యాహ్నం కాన్వెంటు లంచ్ కు వదలినపుడు...సక్కగా నడచుకుంటూ సాయిబాబానగర్ లోని చిట్టమ్మత్త ఇంటికెళ్లిపోయాను. ఆ వేళలో నన్ను చూసి అత్తమ్మ బిత్తరపోయింది. "ఇదేందిరా...ఇట్టా వచ్చేసినవ్..ఇంటికెళ్లలేదా?' అంటూ తెగ ఇదైపోయింది. పైగా అప్పట్లో వెంటనే సమాచారం అందించేందుకు ఫోన్లు లేవాయె. అమ్మనాన్నకంగారుపడిపోతారని అత్తమ్మకు తెలుసు. "ఎంత పని చేస్తివిరా...ఎవ్రుకి చెప్పకుండా వస్తే ఎలా?...' అని గొణుక్కొంటూ నన్ను ఎలాగోలా సాయంత్రానికల్లా జాగ్రత్తగా ఇంటికి చేర్చింది. ఇంక అక్కడ్నుంచి అసలు రాద్దాంతం సురూ...
నాన్నకు ఈ విషయం తెలీగానే ఒక్కసారిగా అగ్గిరాముడే అయ్యాడు. ఎందుకురా అట్లా వెళ్లావ్? దారి తప్పి ఏదైనా అయిఉంటే ఏంటి గతి? అంటూ అమ్మ పాపం తెగ బాధపడిపోయిం ది. నాన్నకు రెండురకాల కోపాలు ఒక్కసారిగా వచ్చాయి. ఒకటి నేను చెప్పా పెట్టకుండా దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉన్న చిట్టమ్మత్త ఇంటికి పోలోమంటూ వెళ్లడం...రెండోది ఆ కాన్వెంటువాళ్లు నన్నెలా వదిలేశారన్నది. నేరుగా కాన్వెంటుకు వెళ్లి వారిని నిలదీశారు... "ఆ చినపిలగాణ్ని ఎలా పడితే అలా వదిలేస్తారా? కనీసం చూసుకోరా? వాడికేమైనా అయితే ఎవరిది బాధ్యత?' ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించాడు. వారు ఏమాత్రం చలించక... మమ్మల్నేం చేయమంటారు సర్? లంచ్ టైంలో ఇంటికొస్తా డనుకుంటాం గానీ...ఎక్కడికో పోతాడని ఎలా తెలుస్తుంది?...అయినా ఇంత చిన్నోడికి ఇవేం పాడుబుద్ధులు? అంటూ విసుక్కున్నారు. నాన్న చేసేదేమీ లేక ఇంటికొచ్చారు. ఏరా బుద్దుందా నీకు...ఎవడు వెళ్లమ న్నాడ్రా? అంటూ భయంకరంగా తిట్టిపోశాడు. ఇంత రచ్చ అవుతున్నా...నాన్న ఎందుకు కోప్పడుతున్నాడో అమ్మెందుకు బాధ పడుతోందో ఎంత బుర్రగోక్కున్నా పిసరంత కూడా అర్థం కాలేదు. కాసేపు గోడకానుకుని కూర్చొన్నా...నాన్న ట్యూషన్ మొదలెట్టగానే... మెల్లగా నేను వీధిలోకి జారుకున్నా..
నేను ఎంత పెద్ద సాహసం చేశానో...నా ఫ్రెండ్స్ వద్ద గానీ తెలిసిరాలేదు. నన్ను చూడగానే చుట్టుముట్టేసి...రే రే బలే పోయిండావే...కాన్మెంటు గేటుకాడ ఎట్టా మిస్ కొట్టినావురా..హీరో అంటే నీవేరా నాయనా! ఒకే రీతిగా పొగుడుతుంటే...ఫరవాలేదు ఘనకార్యమే చేశానని సంబరపడిపోయాను. అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో రెండ్రోజులకుగానీ తెలిసిరాలేదు. ఇంక ఆ వెధవ కాన్వెంటు బంద్...అంటూ అక్క చదివే అర్ధగేరి బసవనగౌడ మునిసిపల్ కాలేజీకు చేర్పించాడు. అక్కడైతే నాపై అక్క కన్నేసి ఉంటుందని. విచిత్రమేమంటే ఇదే...ఆ కాలేజీ మా చిట్టమ్మత్త ఇంటికి ఆమడదూరంలో ఉంటుంది. నేను కొవ్వెక్కి ఏ దారిలో వెళ్లానో...ఆ దారే నాకు దిక్కయింది. రోజూ చచ్చినట్టు ఆ దారంటే కాలేజీకు వెళ్లాల్సి వచ్చంది. మరో మాట లేకుండా కాలేజీకు రెడీ అయిపోయాను. నిజానికి సోకుగా కాన్వెంటు వెళ్లాల్సింది పోయి మునిసిపల్ కాలేజీ దారి పట్టినందుకు కుమిలి కుమిలి ఏడ్వాల్సిన నేను ఏ మాత్రం సిగ్గులేకుండా అక్క వెంట సిద్ధమయ్యాను. అరె...కాలేజీ యూనిఫాం పోయిందే...బ్లెస్ మై టీచర్ అంటూ అడిగినోళ్లు...అడగనోళ్ల ముందు గొంతెత్తి పాడే ఛాన్స్ పోయిందే అన్న బాధ ఏమాత్రం కలగలేదు. కానీ కలగలేదు అనడం కన్నా అంతదూరం ఆలోచించే మెదడు లేకపోయిందనడమే సరి. అక్కకు మాత్రం తోడు దొరికానని సంతోషం.
రోజూ అక్కా నేనూ ఇంటి నుంచి కాలేజీకు నడచుకుంటూ వెళ్లేవాళ్లం. అక్కేమో... ఇంతేసి పేద్ద సంచి తగలించుకుని వచ్చేది. నాకు ఏదో చిన్న సంచి వెదికి మెళ్లో వేసి, ఇక పదరా సామీ...నీ బతుక్కిదే పదివేలు...అంటూ అమ్మ సాగనంపింది. దారిలో చిన్న మార్కెట్...కొంచెం ముందెళిత గోషాస్పత్రి. దాని కాంపౌండుకు ఆనుకుని ఓ పెద్ద ట్రాన్స ఫార్మర్. దాన్ని చూడగానే మళ్లీ బుర్ర పాదరసంలా మారిపోయింది. ఓ రోజు కాలేజీకు వెళ్లే ముందు ట్రాన్స్ ఫార్మర్ అంచున అమ్మ ఇచ్చిన పైస పెట్టాను. వచ్చేముందు అక్కతో అన్నా...మనం కాలేజీకెళ్లే ముందు పైసా ఉంచా...ఇప్పుడుందో లేదో చూద్దామని..వెళ్లి చూశాం. పైసా నిక్షేపంలా అక్కడే ఉంది. మాకు ఏదో పెద్ద నిధి కనుక్కొన్నంత ఆనందం వేసింది. అక్కకు ఇదో త్రిల్లింగ్ సినిమా అనిపించింది.పాపం ఇన్నాళ్లు అదే తోవలో కాలేజీ కెళుతున్నా... ఇలాంటి ఆలోచన రాలేదు. ఇక అప్పట్నుంచి రోజూ కాలేజీకెళ్లేటప్పుడు పైసలు పెట్టడం...వచ్చేముందు తీసుకురావడం ఓ పెద్ద ఆటలా మారింది. రోజులు గడుస్తున్న కొద్ది కొత్త అలవాట్లు వచ్చి చేరుకున్నాయి. కాలేజీ ఎదురుగా సాయిబాబా గుడి. మెట్లెక్కి వెళ్లాలి. రోజూ ఇంటికెళ్లేముందు గుడి వద్ద ఆగేవాళ్లం. అంటే మాకేదో భక్తి ముంచుకొచ్చిం దనుకుంటే పొరపాటే! గుడి రెండో మెట్టు వద్ద చప్పట్లు కొడితే ఝణ్..ఝణ్..అంటూ ఓ విచిత్ర శబ్దం వినిపించేది. మా కాలేజీ పిల్లలందరికీ ఈ విషయం తెలుసు. వారు రోజులో ఏదో ఓ సమయంలో అక్కడికెళ్లి చప్పట్లు కొట్టేవారు. కొన్ని సార్లు పూజారి పై నుంచి రేయ్.. వెళ్లండి... వెళ్లండీ... అంటూ కేకలేసేవారు. పాపం ఆ మానవుడి మాటలు వినేవారెవరు? ఆ చప్పట్ల జట్టులో నేనూ చేరాను. రోజూ క్రమం తప్పకుండా ఆ మెట్టు దగ్గర నిలబడి చప్పట్లు కొట్టేసి..హమ్మయ్య ఓ పనైంది...అని తృప్తిగా వచ్చేవాణ్ని. కాలేజ్లో ఏం చెప్పేవారో...నాకు ఎంత అబ్బిందో...అన్నఅవుటాఫ్ సిలబస్ ప్రశ్నల్ని , సందేహాల్ని పక్కన పెడితే...ప్రతి రోజూ ఠంచనుగా అక్కవెంట కాలేజీకు అంతదూరం హాయిగా నడుచుకుంటూ వెళ్లడం...ఏన్నో కబుర్లు...మరెన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను తెగ విసిగించడంతో కాలం సాగిపోతోంది.
ఓ రోజు నాన్న అక్కకు నాకు కొత్త బ్యాగులు కుట్టిస్తానని ప్రకటించాడు. పాపం పోనీలే కాన్వెంటు నుంచి కాలేజీకు మారాడని అనుకున్నాడేమో...ఏమైతేనేం ఆ మాట విన్న ప్పట్నుంచి నాకు కాలునిలువ లేదు. ఓ శుభముహూర్తాన ఖాకీ బట్ట కొని మా ఆస్థాన టైలర్ కు వేశాడు. అది మొదలు మనసులో ఒకటే ఆరాటం. సంచి ఎప్పుడొస్తుంది... రేపా...ఎల్లుండా..మర్నాడా...అక్కను రోజూ విసిగించి చంపేవాణ్ని. అక్కకూ లోలోన సంతోషం ఉన్నా...ఓ పట్టాన బైట పెట్టేది కాదు. నాకైతే రోజూ రాత్రి బ్యాగు గురించే కలలు. అమ్మ నన్ను ప్రేమగా పిలిచి..ఇదిగోరా...నీ బుజ్జి సంచి.. అంటూ నిగనిగలాడే కొత్త సంచిని మెళ్లో వేస్తున్నట్టు...అంగరాజ్యానికి అధిపతిగా చేస్తున్నా...పో ఇక ఏలుకో...ఇదిగో సంచి అంటూ నాన్న ఒకింత రాజసంతో విసిరినట్టు...చిత్తం ప్రభూ అంటూ వినయంగా అందుకుం టున్నట్టు..ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. బ్యాగు పుణ్యమా అని నా ఆలోచన మొత్తం దాని గురించే అయిపోయింది. ఇంటికొచ్చే దారి మారిపోయింది.
రోజూ బడి నుంచి వచ్చేటపుడు ఆ టైలరంగడి ముందునుంచే వచ్చేవాళ్లం. ఆ '' టైలర్ సాబ్...చాలా గంభీరంగా ఉండేవాడు. అసలు మాట్లాడేవాడు కాదు. మేం కాళ్లీడ్చుకుంటూ వెళ్లి అతని ముందు నిలుచుంటే...కనీసం తలెత్తి చూసేవాడు కాదు. ఈ యప్పకు ఎంత టెక్కురా నాయనా...అనుకునేవాళ్లం. కానీ ఆ కొత్త సంచి యావ వదిలితేగా! కాలేజీలో సారుని చూసినా టైలరుసాబే కనిపించేవాడు. సారు పాఠం చెబుతుంటే...వినబుద్ధేసేది కాదు. ఎపుడెపుడు సాయంకాలం అవుతుందా...ఆ టైలరు షాపు ముందు వాలిపోదామా అన్నట్టుండేవాణ్ని. ఎంత లేదన్నా కనీసం ఓ పాతిక సార్లయినా ఆ కొట్టుచుట్టూ తిరిగి ఉంటాం. కానీ ఆ టైలరప్పకు కనికరమే లేకపోయింది. పోయిన ప్రతిసారీ ఏదో చెప్పి పంపేవాడు. ఒక్కోసారి చూపుల్తోనే షో కేసులో బట్టను చూపి...ఇంక కుట్టేస్తా అనేవాడు. మరోసారి ఇదిగో తడుపుతున్నానంటూ చిన్న ఇనుపబకెట్లో సగం తడిసిన గుడ్డను చూపేవాడు. ఏదో మాయ చేసేవాడు కానీ ఎప్పుడూ కుట్టను అని మాత్రం చెప్పేవాడు కాదు. అసలు ఆ బ్యాగును తగిలించుకునే ఆదృష్టం ఈ భుజాలకుందో లేదో అనుకుని తెగ బాధపడే వాణ్ని.
ఈ కొత్త బ్యాగు ప్రహసనం కొనసాగుతుండగానే...మరో గ్రాచారం వచ్చి పడింది. కాన్వెంటులో అతివేషాలు వేసినందుకు దారుణంగా దెబ్బతిన్నామన్న కనీస జ్ఞానం లేకపాయె...అందుకే ఈ గ్రాచారం.కాలేజీకు పెద్ద గేటు ఉంది. తెరచిన గేటులోంచి బుద్ధిగా వెళ్లాలి కదా...ఉహూ...ఆ గేటుకు వేలాడుతూ...అలా తోసుకుంటూ లోనికి వెళ్లవాణ్ని. అలా సర్రుమంటూ వెళుతుంటే ఏదో మజా. నేనే కాదు... మా క్లాసులో అందరూ ఇట్టాగే వెళ్లేవారు. ఓ సారి ఈ సర్కసులో నా బొటనవేలు గేటు సందులో ఇరుక్కుపోయింది.ఇంక ఒకటే రక్తం. నొప్పితో గావుకేకలు పెడుతుంటే పాపం అక్క గాబరాపడిపోయింది. సాయంత్రం ఇంట్లో ఈ విషయంగా మళ్లీ చర్చ...రచ్చ. నిన్నేమో చెప్పాపెట్టకుండా వెళ్లాడు...ఇవాళ ఇలా వంటిపై తెచ్చుకున్నాడు. రేపేం చేస్తాడో...వీడితో ఎలా వేగను? రాన్రానూ మొండిఘటమవుతున్నాడు అని అమ్మ చుట్టుపక్కలోళ్లతో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఏం చేయాలో పాలుపోక నాన్న తలపట్టు కున్నాడు. వీణ్నేం చేయాలి? ఎక్కడేసినా ఏదో చేస్తున్నాడే...అనుకున్నాడేమో. ఇక లాభం లేదనుకుని నన్ను ఎత్తుకెళ్లి ఇంటివద్ద ఉన్న హావన్నపేట మునిసిపల్ కాలేజ్లో పడేశాడు.
హావన్నపేట కాలేజీ అనగానే ఎగిరిగంతేశాను. నిజానికైతే సిగ్గుతో చితికి పోవాలి. క్లాసులు పెరగాల్సింది పోయి స్కూళ్ల నెంబరు పెరుగుతోందని. ఇంతకూ నేనంత సంబరపడిపోవడానికి కారణం... కమాను ఫ్రెండ్స్ తోపాటు చుట్టుపక్కల గేరీ పిలగాళ్లు అదే కాలేజీలో ఉండటం. రోజూ ఏంచక్కా అందరితో కలిసి వెళ్లవచ్చు. అమ్మ కూడా.."పోనీలే కళ్లెదుటే తిరుగుతుంటాడు అనుకుందేమో...శాంతించింది. రఘు,చెంద్రి అందరూ నేను వారితోపాటే అని సంతోషించారు. రఘు..పోనీలేరా...ఈ స్కూలే బావుంటుంది. అంత దూరం పోతే ఏమొస్తుందీ...కాళ్లనొప్పులంతే! అని తేల్చేశాడు. హావన్నపేట కాలేజీ ఇంటికి చాలా దగ్గరవడంతో ఇంటర్వెల్ క్కూడా ఇంటికి పరిగెత్తుకొచ్చేవాణ్ని. అమ్మ చక్కెరో, బెల్లం ముక్కో ఇస్తే నిక్కరు జేబులో వేసుకోవడం మళ్లీ పరుగుతీయడం. కాలేజీ బ్యాగులో స్లేటు, బలపాలతోపాటు బొగరీ,గోలీలు వచ్చి చేరాయి.కాలేజీలో కిష్టప్ప సారు అంటే అందరికీ హడల్!
ఆయన క్లాసులోకి రావడం రావడంతోనే...అందరి వీపులపై దభ్..దభ్...అంటూ దెబ్బలు పడ్డాకే అటెండెన్స్ పిలిచేవాడు. నరసప్ప సారు చాలా నెమ్మది. నవ్వుతూ పాఠాలు చెప్పేవాడు. ఒకటోతరగతికి మేడమ్ ఉండేది. ఇంతలావు కళ్లద్దాలతో అందరినీ హడలెత్తించేది. ఓ సారి నా పక్కనున్నోడు "ఒరేయ్...టీచర్ ని సోడాబుడ్డీ అనరా...నీకు నిజంగ దయిర్యముంటే' అంటూ రెచ్చగొట్టాడు. తెంపరితనం తప్ప మరేం లేని నేను టీచర్ క్లాసులో ఉంటే...గాఠిగా..."సోడాబుడ్డీ' అంటూ అరిచేశా. మేడమ్ మొహం ఎర్రగా కంది పోయింది. బైటకు వచ్చి చొక్కా పట్టుకుని క్లాసులోకి లాక్కెళ్లింది. చెంపై లాగి ఇచ్చేసరికి...అది పూరీలా ఒక్కసారి పొంగింది. నాలుగు వేళ్ల వాతలు ఎర్రగా తేలాయి. సాయంత్రం కందిపోయిన చెంపతో ఇంటికెళ్లాను. నన్నలా చూడగానే అమ్మకు ఒక్కసారి ఆ టీచర్ పై కోపం తన్నుకొచ్చింది. "ఛీ..ఛీ ఏం మనిషి...చిన్నోణ్ని ఇలా కొట్టేస్తారా ఎవరైనా? దవడ చూడు ఎలా వాచిందో...చేతులు పడిపోనూ...' అంటూ టీచర్ ను దుమ్మెత్తి పోసింది. "ఇంతమంది పిల్లలుంటే...నా కొడుకే దొరికాడా కొట్టడానికి...' అంటూ చుట్టుపక్కలోళ్లతో అంటుంటే..."నీ కొడుకు చేసిన వెదవపని మాత్రం తక్కువా ఏంటి? అని చెప్పేవారు ఎవరూ లేరు కాబట్టి...దీనాతిదీనంగా మొహమేసుకుని అమ్మ కొంగు పట్టుకుని ఎక్కిళ్లు పెట్టాను.
అమ్మ చుట్టుపక్కలోళ్లతో చెప్పుకుందే గానీ ఈ విషయం నాన్నదాకా తీసుకెళ్లలేదు. ఆయనకు గానీ కోపం వస్తే ఈసారి ఎత్తుకెళ్లి ఏ చెరువులో విసిరేస్తాడో అని భయపడి ఉంటుంది. సాయిబాబా కాన్వెంటుతో అట్టహాసంగా మొదలైన నా కాలేజీ ముచ్చట...వినాయకుడి పెళ్లిలా...నిలకడలేని పిల్లి సంసారంలా పదహారిళ్లు తిరిగి...చివరికి హావన్నపేట మునిసిపల్ కాలేజీకు చేరుకుంది.
అమాయకత్వం....ఆటపాటలపై ఎక్కడలేని ఆరాటం...వీటి మధ్య కుంటినడకన చదువు . ఆ చదువుతో మెదడు కుదుళ్లు గట్టిపడ్డాయో లేవో చెప్పలేను కానీ...ఒక జీవితానికి సరిపడా ఆనందపు రంగుల్ని మాత్రం మనసు అక్కడే అద్దుకుంది. నాగరికత పౌడరు రాసుకునే అవసరం లేని స్వచ్ఛమైన సందర్భాలవి.అప్పట్లో మమ్మల్ని తన సుకుమారత్వంతో ప్రభావితం చేసిన నరసప్ప సారును తర్వాతర్వాత చాలా సార్లు కలుసుకున్నాను. ఉద్యోగంలో చేరిన తొల్నాళ్లలో సార్ ని కలిసినపుడు వద్ధాప్య ఛాయలు బాగా కనిపించేవి. వణుకుతున్న స్వరంతో..." ఏమప్పా బాగుండావా...వచ్చినపుడల్లా మాట్లాడిస్తుంటావు...సానా సంతోషం! మీకు మేమేం సెప్పిండామో గుర్తులేదు..కానీ మీరు పలకరిస్తుంటే ప్రాణానికి కుశాలంగా ఉంటుంది నాయనా! ' అంటుంటే కళ్లల్లో నీళ్లు చివ్వున చిమ్మేవి. మనసును మానవీయంగా మలచింది ఈ టీచర్లే కదా...వీరే జీవితంలో ఎదురుకాకుంటే...అంటూ మనసు కొద్దిగా బెంగపడుతుంటుంది కూడా!!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
పూర్ణారావు - పూతరేకులు - ఆదూరి హైమావతి.
పూర్ణారావు వీధి బళ్ళో సారీ ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వపాఠశాల వీధికి ఎదురుగా ఒక చిన్న వసారాలో ఉండటాన దాన్నంతా వీధిబడి అనిపిలుస్తారు అంతే. నేనేం చులకనచేయడం లేదు సుమండీ! మావాడు , నేనూ కూడా ఆబళ్ళో అప్పటికి ఐదోతగతి వెలగ బెడుతు న్నాం.
ఒకరోజు సాయంకాలం బళ్ళోనుంచీ వచ్చేసరికి వసారాలో వాళ్ల తాతతో పాటుగా కూర్చునున్న ముగ్గురిలో ఒకాయన పూర్ణారావును చూసి తన చేతిలో దాచుకునున్న సంచీలోంచీ ఒక పొట్లాం తీసి,
" ఇంద బాబూ ! పూర్ణా తిను. పూతరేకుల్లెండి కరణంగారూ! మా తోడల్లుడు విశాఖపట్టణం నుంచీ తెచ్చాడు. అక్కడి ప్రత్యేక తీపి వంటకం లేండి. చాలా బావుంటుంది రుచి" అంటూ వాళ్లతాతకు చెప్పి, వీడిచేతికి అందించాడు.
ఆ పొట్లాం అందుకుని ఛెంగున బామ్మ దగ్గరకెళ్ళాడు పూర్ణా. వాడికి తీపి వంటకాలంటే మాహా ఇష్టం. కిటీకీలోంచీ అంతా వింటున్న బామ్మ బానమ్మ "పూర్ణా! వాటి నలాగే పడమటి వాకిలినుంచీ, పట్టుకెళ్ళి మన రైతు రామయ్య పిల్లాడు కుమార్ కు ఇచ్చిరా! పాపం వాడు పొద్దుటినుంచీ ఏమైనా తిన్నాడోలేదో! వాడి అమ్మా నాయనా పొలం పనులకెళ్ళి ఇంకా వచ్చి ఉండరు. " అని హుకుం జారీ చేసింది ,మెల్లని గొంతుతోనే.
పూర్ణారావు ప్రాణం గిలగిలా కొట్టుకుంది. కొత్త కొత్త తీపి తినుబండా రాలు తినాలని వాడికి మహా ఉబలాటం. వాళ్ల బామ్మ ఏదీ పడనివ్వదు. తామిద్దరిదీ తీపి రక్తశరీరం కావటాన వాడికీ వస్తుందని ఆమెభయం.
వాడి ఆరోగ్యం ఏమైపోతుందోని ఆమె ఆవేదన, అమ్మా నాయనా దూరంగా ఉన్నారాయె! బళ్ళోకూడా వాడిమీద రైతురామన్న కొడుకు కుమారును నిఘాపెట్టింది.
"వెధవ , వాడికి తీపులంటే ఇష్టం ,ఏమన్నా తిండాడేమో చూస్తూ ఉండు కుమార్! నీకు తినను బొరుగులూ బెల్లం పెడతాను " అని లంచంకూడా ఏర్పాటు చేసిది. లంచం మరిపి తెల్లవారు దాటుకున్న దేశం కదా మనది.!
అందుకని పాపం పూర్ణకు బళ్ళోనూ , చాటుగా కూడా ఏమీ తినను పడట్లేదు. ఆరైతు రామన్న కొడుకు కుమార్ వెధవ రోజూ బళ్ళోకొస్తాడు. వాడికి చదువుకంటే పూర్ణా మీద నిఘా అంటే మహా ఇష్టం, ఎందుకంటే వాళ్ళబామ్మ రోజూ పెట్టే బొరుగులూ బెల్లం మహిమ.
ఐతే కుమార్ గాడు చదువు లోనూ మంచిగానే ఉంటాడు. మా అందరికీ వాడో ప్రతిపక్షం గాడు.వాడి మార్కులు చూసి మా అమ్మనాన్నలు మమ్మల్ని తిడుతుంటారు . నేనన్నీ నిశ్శబ్దంగా గమనించుకుంటూ ఉండేవాడిని.
ఒకకంట పంతుళ్లనూ, మరోకంట పూర్ణనూ చూస్తూ ఉంటాడు కుమార్ గాడు. అలా అలవాటై వాడికి పెద్ద సి ఐ డి ఉద్యోగం వచ్చింది చదువయ్యాక .
ప్రస్తుతానికి వద్దాం.
పూర్ణా అలా ఆ పూతరేకుల పొట్లం పట్టుకెళ్ళి కుమార్ గాడికిచ్చి దూ రం నుంచీ వాడు ఒక్కోపూతరేకూ తింటూ ' ఆహా ఏమి రుచి " అంటూ ఉంటే , ' ఓరినీ అదృష్టం చెడా!' అని మస్సులో తిట్టుకుంటూ చూస్తూ చూస్తూ ఇంటికొచ్చి స్నానం చేసి ఒక్కపూతరేకూ తిననివ్వని ,అసలది ఎలావుంటుదో, దానిరుచి ఎలావుంటుందో చూడనివ్వని బామ్మ మీద కోపంతో ఆమెకేసి చూడకుండా, మాట్లాడకుండా వెళ్ళి చదువుకోసాగాడు.
బామ్మ" వాడికి ఇష్టమైన బెండకాయ వేపుడు, పెసర అప్పడాలూ వేయించి వాడి దగ్గరకొచ్చి ఘుమ ఘుమాయిస్తున్న నేతితో ముద్దలు చేసి నోట్లో పెట్టబోగా ముఖం పక్కకు తిప్పేసుకుని , ముక్కుతో కమ్మని నేతి వాసన పీల్చుకున్నాడు.
మాది పక్కిల్లేకనుక నేనంతా మా కిటికీలోంచీ రహస్యంగా పూర్ణాను గమనిస్తూ ఉంటాను.
"మా బాబుగా! మా పూర్ణాగా , పూర్ణమంటే ఎంత కమ్మని వంటకం, ఏదీ ఒక్కమారు నోరుతెరూ మానాయనగా!" అంటూ బుజ్జగిస్తూ పెడుతుండగా ,మెల్లిగా ముద్దమీద ముద్ద లాగించి "ఏంటిబామ్మా! నన్ను ఒక్కటీ తిననివ్వక అన్నీ వాడికి ఇచ్చిరమ్మనావ్!" అన్నాడు.
"నాయనా! పూర్ణా! ఎవరుచేసారో, ఎన్నాళ్ళ క్రితం చేశారో , చేతులవీ బాగా కడుక్కుని చేశారో లేదో! మనకెలా తెలుస్తుంది నాయనా! నీ ఆరోగ్యం పాడైతే మేమేం చేయాలిచెప్పు. నీకోసమే నాయనా! పూత రేకులదేముంది ? ఎప్పుడైనా తినవచ్చు ఆరోగ్యం ముఖ్యం కదా!" అంటూ బుజ్జగిస్తూ పాలన్నం కడుపునిండాపెట్టేసింది.
" మరి కుమార్ గాడికెందుకు ఇవ్వమన్నావ్? వాడి ఆరోగ్యం పాడైతేనో? " మా పూర్ణాకు సందేహం ఉంచుకునే అలవాటే లేదు.
" వాళ్ళకు అరుగుతాయినాన్నా ! వాళ్లు బాగా కష్టం చేసే మనుషులు కదా!సరే గానీ ఇహ వెళ్లిపడుకో."అంటూ వాడిని మరిపించింది బామ్మ పూతరేకులనుంచీ.
మీకు అసలు ఉపోద్ఘాతం చెప్పకుండా కధలో కొచ్చేశానాయె. వాళ్ళిల్లూ మాఇల్లూ పక్కపక్కనే, కాంపౌండ్ వాలే అడ్దం.
పూర్ణారావు నేనూ చిన్ననాటినుండీ చెలికాళ్ళం లెండి. వాడి అమ్మ మహా తెలివైంది. పదోక్లాసులో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావటాన ఇంటర్ చదివేప్పుడే పోస్టల్ జాబ్ వచ్చింది. తాలుకాఫీసులో పనిచేసే వాళ్ళ నాన్న , ఆమె తెలివితేటలూ,పనిలో నేర్పరితనమూ విని , ఆమెను వివాహ మాడాడు, పెద్దల అనుమ్మతితోనే లేండి. అమ్మా,నాన్నా ఉద్యోగ పనులతో తీరికలేక కొట్టుమిట్టాడు తుండగా పెద్దల పోరుపడలేక వీడ్నికనేసి వాళ్లబామ్మా, తాతాగార్లకు అప్పగిం చేసి ,ఊపిరి పీల్చేసుకుని , హాయిగా ఉద్యోగాల పనుల్లోపడి పోయారు. మళ్ళా ఇంకోబిడ్దను కనే ,ఓపికా తీరికా లేక , ఏకైక వారసుడైన వజ్రం ముక్కలాండి పూర్ణారావును బామ్మా తాతా అపురూపంగా చూసుకోసా గారు.
అసలు విషయానికొస్తాను .నాకు చిన్న నాటి కబుర్లంటే మాహా ఇదిలేండి.
మరునాడు బళ్ళోకెళ్లగానే కుమార్ గాడు వచ్చి " పూర్నారావ్ పూర్నారావ్! అబ్బా! ఆపూతరేకులెంత బావున్నాయోయ్! నిజంగా అవి తినని జన్మ వృధా. రోజా రేకులకంటే మెత్తగా తియ్యగా వున్నాయి" అంటూ పురిపెట్టాడు.
అంతా వాడి చుట్టూ మూగారు " ఏంటి? ఏంటని?" . కుమార్ అంతా చెప్పి " పూర్ణారావు ఎంత మంచి వాడంటే పూతరేకులు తెచ్చి నాకు ఇచ్చాడు.నేను అదే తినడం పూతరేకులుట తియ్యగా వున్నాయి. --" అంటూ చెప్తుండగానే ,క్లాసులోకి పంతులుగారు వచ్చేశారు.
"ఏంట్రా ఆమాటలు ?" అంటూనూ.
కుమార్ గాడు ‘పూత ‘ అనిచిన్నగా అంటూ ‘రేకులు’ అని గట్టిగా అన్నాడు. ధర్మరాజు “'అశ్వత్థామ హతః,' అని పెద్దగా అని 'కుంజరః' అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికినట్లు , ఎందుకంటే పంతులుగారు 'ఎప్పుడూ నీకు తిండి ధ్యాసేనుట్రా?' అని నాలుగంటిస్తారని వాడి భయం.
"ఈరోజు పాఠమదేరా కుమార్ !" అంటూ’ గృహాల రకాలూ’ చెప్తూ' సిమెంటు రేకులు, యాస్ బెస్టాష్ రేకులు ' అంటూ పంతులు గారు చెప్పుకుపోయారు.కుమార్ వీపు భద్రంగా ఉంది ఆరోజుకు.
మా అందరి అదృష్టమాని మాకాలేజ్లో 6,7 తరగతులు వచ్చాయి. పై ఊరికి వెళ్లకుండా ఉండూర్లోనే 7వరకూ చదివాం. ఆతర్వాత మళ్ళా పదోక్లాస్ వరకూ వచ్చింది. ఆడుతూ పాడుతూ ఇంట్లోనే తింటూ తిరుగుతూ పదోక్లాస్ ఐందనిపించాం.ఆతర్వాత మేం ఇంటర్ కు పై ఊరికెళ్ళాల్సి వచ్చింది.
పూర్ణ మనస్సులో మాత్రం పూతరేకులు నిల్చిపోయాయి. అప్పుడప్పుడూ నాతో "ఒరే శివా! ఎప్పటికైనా పూత రేకులు కడుపారా తినాలిరా!"అనేవాడు పాపం.
ఎందుకంటే అప్పుడప్పు డూ కుమార్ పూతరేకుల ప్రస్తావన మా పూర్ణా వద్ద తెస్తూనే ఉన్నాడు. "పూర్ణారావ్! మళ్ళా ఎవ్వరూ మీకు పూతరేకులు ఇవ్వలేదేంట్రా! ఇస్తే మీ బామ్మ నాకు పంపిస్తారేమోనీ!" అని గెలికేవాడు. మా పూర్ణాకు ఉడుకు పుట్టేది.
" ఒరే శివా! ఎప్పటికైనా వీడి ముందే పూతరేకులు తినాలిరా! ఈ వెధవకు పెట్టకుండా" అనేవాడు.
ఇప్పుడు కాస్త ఎదిగాం కదా! ఇంటర్లో చేరాం, చదువుమీద ధ్యాస పెట్టాం.
పూర్ణారావు కాపలాకోసమో , రక్షణకోసమో, లేక దయతోనో కానీ కుమార్ నూ తానే ఫీజు కట్టించి మాతోపాటు ఇంటర్ లో చేర్పించింది,పూర్ణా బామ్మ . వారిది పేదలను ఆదుకునే స్వభావం అంతా చదువుకుని పైకి రావాలని వారి ఆశయం కూడా.
అంతా ఉదయాన్నే టిఫిన్ తినేసి బస్ లో కాలేజికెళ్ళేవాళ్ళం . మధ్యాహ్న భోజనం మా అందరికీ మా ఉరినుంచీ క్యారేజీలు వచ్చేవి. అంతా ఒక చోట కూర్చుని తినేసి క్లాసులకు వెళ్ళేవాళ్లం.
ఐతే అక్కడా కుమర్ నుమా పూర్ణా మీద నిఘాకు పెట్టనే పెట్టింది వాడి బామ్మ. బయట ఎక్కడా ఏమీ తినకుండా కట్టు బాటన్నమాట. ఎలాగో ఇంటర్ ఐపోయాక డిగ్రీలోకి వెళ్ళాం.
మా వాడు సులువని బి.కాం ఆపైన ఎం.కాం చేసేసి ఒక బ్యాంక్ లో మంచి ఉద్యోగం విజయవాడలో సంపాదించాడు.
నేనుబి.ఎస్సీ, ఆపైన ఎమ్మెస్సీ చేసేసి విజయ వాడలోనే ఒక కాలేజ్ లో లెక్చరరుగా చేరిపోయాను.మాపెద్దల నిర్ణయం మేరకు త్వరగా వివాహం కూడా చేసేసుకున్నాను.
కుమార్ డిగ్రీ అయ్యాక పోలీ స్ ఆఫీసయ్యాడు, అదీ సి.సి.డీ గా. వాడి వివాహమూ ఐంది.
మాముగ్గురిలోకీ మా పూర్ణా ఇంకే ఇంకా వివాహం కాలేదు. ముగ్గురం కలుసుకున్నప్పుడు నవ్వుకునేవారం మా బాల్య గురించీ చెప్పుకుంటూ. కుమార్ మాత్రం అప్పుడప్పుడూ "పూతరేకుల మాటేంటి పూర్ణారావ్? " అంటుండేవాడు.
ఐతే కధ ఇంకా పూర్తికాలేదండీ! అసలు కధ ఇక్కడే ఉంది.
మా తల్లిదండ్రులూ ఏకైక కుమారుడినైన నావద్ద కు విజయవాడకు వచ్చేశారు.పూర్ణా తల్లిదండ్రులూ రిటర్ మెంట్ ముందు విజయవాడ కు బదిలీ చేయించుకుని వచ్చేశారు. పూర్ణా తాత బామ్మకూడా వారిపొలాలన్నీ అమ్మేసుకుని పిల్లలతో ఈ వృధ్ధాప్యం లో హాయిగా గడపవచ్చని విజయవాడకు వచ్చేశారు. రైతు రామయ్య కూడా కుమార్ దగ్గరికి విజయవాడ వచ్చేశారు. సో అంతా విజయ వాడ వాస్తవ్యులమయ్యాం.
పూర్ణా బామ్మ నాకు రోజూ ఫో చేసి " ఏమయ్యా! శివా ! మీ ఇద్దరికీ వివాహాలయ్యాయి.మా మనవడి సంగతేంటీ? ఇదేనుటయ్యా స్నేహమంటే?మావాడిని పెళ్ళికాని ప్రసాద్ లా వుంచుతావా ఏంటయ్యా!!" అనసాగింది.
అదేదో నాతప్పైనట్లు. నేను నవ్వుకుని ఈమారు ఎలాగైనా మావాడిని ఒకింటివాడిని చేయాలని గట్టి నిర్ణయానికొచ్చాను.
ఎన్ని సంబంధాలు చూసినా ,పిల్ల చదువుకున్నదైనా , ఉద్యోగస్తు రాలైనా మావాడు నచ్చట్లేదు. వాడితో వాడి బామ్మ మొహమాటానికి ఒకటి రెండు సంబంధాలు చూడను పూర్ణాతో వెళ్ళిన నాకు చూచాయగా వాడి మనసు తెలిసొచ్చింది.
వాళ్ళ బామ్మా,తాతలకూ, అమ్మా ,నాన్నలకూ నచ్చిన ఒక లెక్చరర్ సంబంధం గురించీ చెప్పింది వాళ్లబామ్మ.
" పిల్ల బంగారు తల్లిరా శివా! కుటుంబ మర్యాదా బావుంది. సాంప్రదాయమైనవారు , జాతకాలూ కలిశాయి , ఎలాగైనా ఈసంబం ధం కుదిరేలా చూడునాయనా!" అంటూ బాధపడింది.
విచరించగా మా కాలేజీలో ఆ అమ్మాయి 'తెలుగు లెక్చరర్ 'గా ఉద్యోగం చేస్తున్నదని తెలుసుకుని ,నేను కాస్త పరిచయం చేసుకున్నాను, సహోద్యోగిగా.
ఒకరోజు మా కాలేజ్ లో ఒక బ్యాంక్ బ్రాంచ్ పెట్టారు పిల్లల సౌకర్యంకోసం.దాని ప్రారంభోత్సవానికి మా పూర్ణా వచ్చాడు బ్యాంక్ తరఫున. అందరికీ టిఫిన్ , కాఫీ ఏర్పటు చేయడంలో నేను కల్చరర్ క్లబ్ నిర్వహిస్తున్నందున ముందుకువచ్చి ఆ ఏర్పాట్లు చేసాను.
అతిధులందరికీ దగ్గరుంది తెలుగు లెక్చరర్ చిన్మయి పిల్లలచేత టిఫిన్ ,కాఫీలు అతిధులకు అందించడంలో నాకు సాయపడింది.
చేతికి టిఫిన్ ప్లేట్ రాగానే పక్కనే ఉన్న నేను" పూర్ణా ! ఇవేరా పూతరేకులు అంటే! రుచి చూడు "అన్నాను.వాడు అలవాటు ప్రకారం అటూ ఇటూ చూస్తుండగా " కుమార్ లేడు లేరా! ఇక్కడ. తినెయ్ " అన్నాను. సరదాగా నవ్వుకుంటూ తినేశాడు. నా ప్లేట్ లోది కూడా ఎవ్వరూ చూడకుండా వాడిప్లేట్లోకి మార్చేసి మెల్లిగా చెవిలో,
" తినేసెయ్ !హోం మేడట. ఆమె మాకాలేజ్ లో లెక్చరర్ , వాళ్ళింట్లో చేసినవిట, ఆమె కల్చరర్ క్లబ్ మెంబర్ ,నాతో పాటుగా ఇలాంటి ఫంగ్షన్ లో నాకు హెల్ప్ చేస్తుంటుంది. " అన్నాను.
వాడు మహదానందంగా తినేసి నాకేసి కృతజ్ఞతగా చూశాడు.
ఫంగ్షన్ ఐపోయి వెళ్ళిపోయాం.
ఆమర్నాడు ఆదివారం " పూర్ణా! అదేదో సంబంధం చెప్తున్నారు బామ్మగారు , వెళ్ళి చూడరాదుట్రా!పెద్ద వాళ్ళను, నిన్నింతకాలం సాకిన వాళ్లను బాధపెట్టకూడదురా! నేనూ నీకు తోడుగా వస్తాను పద" అని నేనే , ఒప్పించి వెంట బెట్టుకునివెళ్ళాను. మేమిద్దరమే వెళ్లాం.
వెళ్లగానే వారు చాలా మర్యాదగా ఆహ్వానించారు. లాంఛనంగా టిఫిన్ పెట్టారు. చూస్తే ప్లేట్లో పూతరేకులు. మా వాడు నాకేసి చూశాడు.
నేను కాస్త చొరవతీసుకుని " ఇవి విశాఖ లో పేరుమోసిన తీపిపిండివంట కదండీ ! కాకినాడ కాజా, విశాఖ పూతరేకూ అంటారు" అన్నాను కొద్దిగా తుంచి నోట్లో పెట్టుకుంటూ.
ఆయజమాని " మాది విశాఖపట్టణమేనండీ! మా ఇంట్లో ఇవి చేయడం ప్రత్యేకత. "అన్నాడు.
"ఎలాచేస్తారండీ !ఏదో తమాషాగా ఉన్నాయి " అన్నాను.
" ఒక పెద్ద ప్రత్యేకమైన కుండ ఉంటుందండీ!దానిమీద ఒక బట్టను ముందుగా దీనికోసమని తయారు చేసుకున్న, దోసె పిండి వంటి బియ్యపు పిండిలో ముంచి ఆబట్టను క్రింద బోర్లించి సెగమీద ఉంచిన కుండ మీద అద్దుతారు. వెంటనే అది పెద్ద అట్టులాగా ఊడి వస్తుంది. దాన్ని తీసి పరిచి దానిమీద నెయ్యి రాస్తూ పంచదార పొడి లేదా బెల్లపు పొడి చల్లుతూ మడతలు వేస్తారు. చిన్నతనంలో మా అమ్మగారితో పాటు నేనూ చేసేవాడిని సరదాగా. మాశ్రీమతీ, మా అమ్మాయీ కూడా చేయితిరిగిన పూతరేకుల తయారీ వాళ్ళు , చాలా బాగాచేస్తారు." అని చెప్పి, " బావున్నాయా!" అని అడిగాడు.
" నేను మావాడికేసి చూస్తూ కన్నుగీటి ," బావున్నా”యన్నాను.
కాఫీ అయ్యాక, ఆయజమాని లోపలకెళ్ళి , ఏదోమాట్లాడి వచ్చాడు. మరికాస్సేపటికి ,ఆయన శ్రీమతి అనుకుంటాను వారి అమ్మాయితో కలసి వచ్చింది. ఇద్దరూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. వారికి కనపడకుండా మావాడిని గిల్లాను , తలెత్తి చూడమని సైగచేస్తూ.
మావాడు తలెత్తి ఆమెకేసి చూస్తుండగా ,నేనూ అప్పుడే చూస్తున్నట్లు " ఓహ్ ! మీరా! చిన్మ్యై గారూ!" అన్నాను.ఇద్దరి చూపు లూ కలిశాయి,.నావికాదండీ! మా పూర్ణవీ, చిన్మ్యై వీ కలిశాయి. ఇహ చెప్పేదేముందీ!చూపులుకలిసిన శుభవేళ ఎందుకు మరి ఈ ఆలస్యం అన్నట్లు , మావాడు బయటికి రాగానే " ఒరే శివా! నాకు నచ్చేసిందిరా! ఎలాగైనా ఈ సంబంధం కుదర్చరా! పుణ్యముంటుంది." అన్నాడు.
రోగి కోరిందీ , వైద్యుడు చెప్పిందీ ఒకే పధ్యం ఐంది. మావాడు ఒకింటివాడయ్యాడు.వారి వివాహ విందులో పూతరేకులే ముందుగా వడ్డించిన వంటకం. ఐతే వంటవారి చేత చేయించారు లెండి, పెళ్ళికూతురి చేత కాదు.
చివరి మాటండీ! వారింట్లో ప్రతిరోజూ పూతరేకులే ఉపాహారమండీ! కచ్చ తీరాతింటున్నాడు పూర్ణారావు పూతరేకులను.
కావలిస్తే మీరూ వచ్చి తినవచ్చు.
****
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 765
Threads: 0
Likes Received: 1,220 in 684 posts
Likes Given: 3,048
Joined: Jun 2020
Reputation:
41
(24-07-2024, 09:36 PM)k3vv3 Wrote: పూర్ణారావు - పూతరేకులు - ఆదూరి హైమావతి.
మావాడు ఒకింటివాడయ్యాడు.వారి వివాహ విందులో పూతరేకులే ముందుగా వడ్డించిన వంటకం. ఐతే వంటవారి చేత చేయించారు లెండి, పెళ్ళికూతురి చేత కాదు.
చివరి మాటండీ! వారింట్లో ప్రతిరోజూ పూతరేకులే ఉపాహారమండీ! కచ్చ తీరాతింటున్నాడు పూర్ణారావు పూతరేకులను.
కావలిస్తే మీరూ వచ్చి తినవచ్చు.
**** Nice story...!!! K3vv3 garu.
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
అంతేలెండి, కుమార్ కూడా లేడుగా పితూరీలు చెప్పడాని, చివరాఖరుకు పూర్ణా పూతరేకులు ఒకటయ్యారు
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
తోటకూర - మల్లాది ఉష
తోటకూర మీద కథ ఏంటి అని ఆశ్చర్య పోకండి.నిజమే మా తోట కూర .ఆ రోజుల్లో ఊరంతా కథలు కథలు గా చెపు కునే వారు.పెద్డ మేడ వాళ్ల కథ విన్నారా? తోట కూర తిని పిచ్చెక్కిందిట.పాపం పెద్ద ఆవిడతో ఆడపిల్లలు ఉన్నరుట. ఈ విథంగా రకరకాల కథలు
2. అసలు జరిగిందేమిటంటే ,నేను ఇంటర్మీడియట్ చదువు తున్నరోజులు.మాఅమ్మ ,మా అన్నయ డిల్లి వెళారు. మాఅమ్మమ్మ మాకు కాపలా. మేము ఐదుగురు అక్కచెళ్లెళ్ళం.ఇంట్లో కూరలు లేవు ఎవరెయ్డినా తెండిరా అని అందరిని అడిగింది. అందరికి ఏదో కారణాలు,సాకులు.ఎవరికి వాళ్లం బిజీ పాపం.. ఆవిడ మాటలు ఎవ్వరం పట్టించు కోలేదు. ఇంతలో మా తోటమాలి వచ్చాడు వయస్సు లో పెద్దవాడు, వాడికి ఎవరూ లేరు, మా అమ్మ వాడికి పని ఇచ్చి డబ్బులిచ్చేది. మా తోట పని చేసే వాడు వాడు అమ్మమ్మ సమస్య తీర్చాడు .పెద్దమ్మ గారూ తోటలో తోటకూర ఉంది తేనా అని అడిగాడుట ఆవిడ సమస్య తీరింది.అమ్మమ్మ కూర చేసింది
మేమందరం బోజనానికి ఇంటికి వచ్చాము.వాళ్ళు గబగబా తిని వెళ్ళారు నాకు వెధవ అలవాటు నెమ్మదిగా తినేదాన్ని,మా అమ్మమ్మ నా కు కబుర్లు చెప్పుతూ అన్నం నోటో్్ల కుక్కేది , ఆ రోజు కూడా అదే చేసింది.నేను ఆ రోజు మినిస్టరు గారు వసు్తన్నారు కాలేజిలో పాట పాడాలి హడావిడి మరి అమ్మమ్మ వినకుండా గిన్న కాళి చేసి వదిలంది
4. ఇంకేముంది సోఫాలో కుార్చున్న దాన్ని అక్కడే తూలి పోయాను. మా అక్కలు విపరీతంగా నవ్వులట. అమ్మమ్మ తల తిరుగుతోంది అని మంచం మీద వాలి పోయ్దిుందిట చూసి మా అక్కలు పక్కింటికి వెళ్లి డాక్టరు కి ఫోను చేస్తామని వెాళ్ళారుట. పాపం ఆవిడికి వీళ్ల స్తితి చూసి నీళ్లిద్దామని వెళ్లేటప్పటికి వీళ్లు వాళ్ల ఇంట్లో పుస్తకా లు చింపి ఇంటికి వచ్చారుట.
5. ఇంతలో మా చెల్లెలు కాలేజీ నించి వచ్చిఇంట్లో అందరిని చూసి కంగారు పడి ముందు అద్దె కున్నవాళ్లకి చెప్పి ఊళ్లో ఉన్న మా బాబా్య్ గారి అబ్బాయ్య కి చెప్పిందిట. మా కింద అద్దెకున్న వాళ్లు వచ్చి వెండి సామాను బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి తాళం వేసి కూర్చున్నారుట
6. మా కజ్జిన్ వచ్చి అమ్మమ్మని ఆసుపత్రి కి ఎడ్మిట్ చేసి అమ్మకి ఫోను చేసారుట. వాళ్లు రైలు లో వచ్చేటప్పటికి రెండు రోజులు పట్టింది.నాకు మెలుకువ వచ్చింది కానీ చేతులూ కాళ్లు కదల్లేదు
7. అన్నయ్య మామయ్యకి ఫోను చేసాడు.మా మామయ్య లాయరు.సహజంగా వ్రుత్తి పరంగా లాయరు అవ్వటంతో ఏం తింటే ఇలా అయ్యంది అని ఆరా తీసారు. ఇలా ఎందుకయ్యిందని రిసర్చ్ చేసారు
8. మా పక్క మేడలో ఫార్మా కంపెనీ ఉండేది వాళ్లు మందులు ఎండ పెట్టేవారు. వాళ్ళ మందులు ఏమయ్యనా మా తోటలో పడ్డాయా? తోటకూర వేసిన చోట కలుపు మొక్కలు మొలిచాయా?అవి చూడకుండా మాలి కోసాడా?
9. మా మామయ్య రిసర్చలో తేలిందేమిటంటే తోట కూరలో ఉమ్మెత్తాకు కలిసిందిట.ఉమ్మెత్త ఆకు మెదడు మీద పని చేస్తుందట. శారీరిక ఆరోగ్యంలో మెదడు కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అది మా అందర్నీ రక రకాలుగా హింసించింది.
10. మా అమ్మమ్మ మైకం లోకి వెళ్లింది, నాకు రెండేళ్లు నరాల బలహీనతతో కాలి వేళ్లు మెలి తిరిగేవి నడవలేక పోయే దాన్ని.భగవంతుడి దయ వలన మా అక్కలు కోరుకున్నారు.ఉమ్మెత్త చాలా డేంజరండోయ్. మా మామయ్య చెప్పిన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఉమ్మెత్త ఇస్తారుట. ఇదండీ మా తోట కూరకధ
11. ఇదంతా చదివి తోటకూర తినటం మానలేదండోయ్ ఇవ్వాళ మా ఇంట్లో తోట కూర పులుసేనండోయ్.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
బాబాయి గారి భోషాణం - మల్లాది ఉష
మా బాబాయ్య రిటైర్ అయ్యారుట మా ఊరిలోసెటిల్ అవుతారుట అన్న వార్త విని చాలా ఆనందం అయ్యింది.
అప్పటికి మేము ఈ ఊరు వచ్చి పదిహేను ఏళ్ళు అయ్యింది.మాకు ఇద్దరు పిల్లలు.స్కూళ్ళకి వెళ్తున్నారు.మా వారు తన వ్యాపారంతో బిజీ.నాకురకరకాల స్నేహితు లతో కాలక్షేపం.జీవితం ఒక గాడిలో పడ్డట్టే.ఇలంటి సమయంలో వీరి కబురు రావటం బాగానేవుంది.చిన్నప్పట్నుంచి వాళ్ళంటే నాకువిపరీతమయ్నన ఆరాధన..వాళ్ళు దేశవిదేశాల్లో పెద్ద ఉద్యోగాలుచేసి బాగా జీవితం గడిపారు .రెండేళ్ళ ఓకసారి మా పుట్టింటికి వచ్చేవారు.చిన్నప్పుడే తండ్రిని పోగోట్టుక్కున్న నాకు వీళ్ళు మా ఇంట్లో ఉండడం చాలా ఆనందంగా ఉండేది. అమ్మ మంచివంటలు చేయ్యించేది.ఇంట్లో దర్జీ,కంసాలి,మాలిష్ వాడూ మొత్తానికి వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఒక పండగ లాఉండేది.ఇక మాకు అన్నీ ఫారెన్ బట్టలే..అలాటి వాళ్ళు మా సిటీలో సెటిల్ అవుతారంటే సంబరంగా ఉండదూ?
ఇక మన కధలోకివద్దాం.అప్పుడు మా అమ్మ ,అత్తగారు మా ఇంట్లో ఉండేవారు.ఇల్లంతూ బోలెడు సందడిగా ఉండేది.మా అమ్మ వాళ్ళ చెల్లెలు గురించి ఆవిడ భర్త గురించి చాలా గొప్పగా చెప్పేది మా అత్తగారు బోసినోటితో ఆశ్చర్యంగా వినేవారు.
ఆ మంచి రోజు రానే వచ్చింది..వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు.మాకు పదిహేను కిలోమీటర్ల దూరం.వాళ్ళకి అన్నీ కుదిరేవరకూ మాఇంటికి వచ్చిపోతుండేవాళ్ళు.వాళ్ళని గొప్పగా చూపించు కోటానికి చాలా పార్టీలు కూడాఇచ్చేదాన్ని.రోజులు సరదాగా గడిచిపోతున్నాయ్యి.
ఒక శనివారం పొద్దున్నే మాఇంటికి వచ్చారువీకెండ్ కదా అల్లుడుగారు ఇంట్లో వుంటారనివచ్చామమ్మా అన్నారు .మా వారు లేదండీ నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు.మా మనసులూ ఇళ్ళూ పెద్దవే కాబట్టి సంతోషంగా వప్పుకున్నాము.చాలా కబుర్లు చెప్పారు.విదేశాల్లో పార్టీలు ఎలా జరుగుతాయో ఎంత గ్రాండ్ గా చేస్తారో చెప్తుతున్నారు.మేమందరమూ నోళ్ళువెళ్ళబెట్టి విన్నాము.అలా సాయంత్రం అయ్యిందిమావారువచ్చారు.కాఫీలు తాగుతుండగా “అమ్మాయీ నీ కోసం వంద మందికి సరిపోయే డిన్నర్ సెట్ ఉంచాను వంద మందికి అవలీలగా భోజనాలు పెట్టోచ్చు చాలా బరువు గా ఉండటంతో తేలేక పోయాము.”అన్నారు.అంతె కాఫీ తో వేడివేడి పకోడీ రెడీ.ఆదివారం బ్రహ్మాండంగా వంటలతో మధ్యాహ్నం భోజనం పెట్టాము.మా అత్తగారు చాలా సాయంచేసారు.నాకు మనసులో కొరేల్,లెనోక్స్,పరుగుపరుగున వచ్చి ఇంట్లో పడ్డట్టు ఫీలింగ్.
ఆదివారం సాయంకాలం అనుకుంటా అందరం కూర్చున్నప్పుడు నెమ్మదిగా చెప్పారు మేము మా అబ్బాయ్యి దగ్గరకు వెళ్దామనుకుంటున్నాము ఇక్కడ సామాను అమ్మేసి వెళ్దామనుకుంటున్నామని ,అరే ఎందుకని అని అడిగితె ఇక్కడ వాతావరణం మాకు కుదరట్లేదు అన్నారు.నా ఉత్సాహం చూసి మావారు నా భుజంతట్టి ఆశపడకు వాళ్ళకి కావల్సిన సహాయం చెయ్యి అన్నారు.ఆ మాటలు చాలా చేదుగా అనింపించినాయ్.ఫోండీ మీరు ఎప్పుడూఅంతే అని విసుక్కున్నాను.
నీ సహాయం కావాలమ్మా అన్నారు.నీకు బోలెడుమంది స్నేహితులు ఉన్నారు కదా సామాను అమ్మాలనుకుంటున్నాము ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు కొంచెం అమ్మిపెట్టమ్మా అన్నారు.స్వతహాగా ఎవరయ్యినా సహాయం అడిగితే పులి అయ్యేనాకు అంతటి వాళ్ళు వచ్చిఅడిగితే “పులి” అయ్యా
మర్నాటిోనించి నా ప్రాజెక్టు మొదలు, రోజూ వాళ్ళింటికి వెళ్ళటం వస్తువులన్నీ తెరవటం వాటికి రేట్లు వెయ్యటం చిన్న స్లిప్స్ మీద రాయటం.ఇవ్వన్ని లిస్ట్ చేసిమొత్తానికి 50,వేలు వచ్చేట్టు చేసాను.మా స్నేహితులకు ఫోనులు చేసాను.
ఆదివారం తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు వరకూ సేల్.నిజం చెపొద్దుా కొన్ని వస్తువులు మీద నాకళ్ళుపడ్డాయ్యి.ఇంట్లో మావారికి చెప్పే వచ్చాను నచ్చినవి తీసుకుంటాను అని.అందుకని నాకు నచ్చినవాటికి నేను డబ్బు ఇచ్చేస్తాను బాబాయ్యి అన్నాను.ఎందుకమ్మా ఆ భోషాణం నీకే కదా అన్నారు.అప్పుడు నా మనస్సులో అమెరికాలో నార్డ్స్టామ్ మాల్ నడిచివస్తునట్టుగా మన గరుడామాల్ నాకు ఇచ్చేస్తునట్టుగాదాన్ని ఆశగా చూస్తుూ పని చేస్తున్నాను.మాఅత్తగారు ,మాఅమ్మ కొన్ని లిస్టులో వేసుకున్నారు.
ఆదివారం 9గంటలయ్యింది అక్కడ చుట్టుపక్కలవాళ్ళుమా స్నేహితులు ఒక్కొక్కళ్ళువస్తువులు చూసి కొంటున్నారు.నాకు నచ్చిన వస్తువులు వెళ్ళిపోతున్నాయ్యి.ఆ ట్రంకు చూస్తుంటే మళ్ళీ సంబాళించుకుంటున్నాను.ట్రంకుని చూస్తుంటే కళ్ళు టపటప లాడు తున్నాయ్యి.
ఇప్పటికి పాఠకులు ఉత్కంఠతో చదువుతున్నారని తెలుసు.ఆభోషాణంలో ఏముందా అనిమీరు అనుకుంటున్నారుకదా, మరి నేనేమనుకోవాలిీ!బాబాయ్యి నేను ఇంటికి వెళ్తాను పిల్లలు చూస్తూ వుంటారు కాలేజ్ నిం చి వచ్చివుంటారు అని టాక్సీ పిలిచాను ఆటో పట్టదుగా మరి.ఇంటికి వచ్చాను.అత్తగారు అమ్మ ఎదురు వచ్చారు భోషాణం చూ స్తూ .మేము పైావాటాలో ఉండేవాళ్ళం.ఎదురుకుండా బేకరీవాడి సహాయంతో పైకి చేరవేసాము.తర్వాత సమస్య తాళం ఎలా బద్దలకొట్టాలి?మా అత్తగారు రోకలిబండ తెచ్చి ఒక్కదెబ్బవేసారు.ఠం తాళంతెరుచుకుంది.
ఎవరయ్యినా ఏదన్నా ఊరికే తీసుకోవటం ఇష్టం లేని మావారు నిర్లప్తంగా పిచ్చివాళ్ళని చూసినట్టుగా చూసారు. పిల్లలు ఉత్సాహంగా చూస్తున్నారు.
పైనంతా పేపరు గడ్డి,గబగబా పీకాము మిగతాది పెద్దవాళ్ళు తీసారు.మనసులో అడుగున వెండి సామాను డిన్నర్ సెట్ కనిపిస్తోంది ప్రత్యక్షంగా పేపర్ ప్లేట్లు,పేపర్ గ్లాసులు.ప్లాస్టిక్ ఫోర్కులు, ప్లాస్టిక్ స్పూనులు.అక్కడక్కడ పురుగులు కూడా .మావారు పగలబడి నవ్వటం ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తుంది.
మరచి పోయానండోయ్యి ఇంతలో మా బాబాయ్యి గారి ఫ్రెండు ఫోను “అమ్మాయ్యి ఆ బూర్లుమూకుడు నాదే కొంచం ఇస్తావా”
అని మా అమ్మా ,అత్తగారు పళ్ళు నూరుకుంటూ నాకు సైగ చేసి ఇవ్వక్కర్లేదు,అని అమ్మ ఫోను లాక్కుని మాదగ్గర లేదుఎక్కడ పోయ్యిందో అని ఫోను పెట్టేసింది.
ఇదండీ భోషాణం కధ.దాని మీద కలలు కంటుూ నేను మహరాణి లాగా ఆటోలు ,టాక్సీలు.మాకు హోటల్ భోజనాలు.దీన్నే “దామూ యాక్ష” అంటారు.పాఠకులూ దీన్ని మీరే విడతీసుకోండి ప్లీజ్.
_____________________________***************_________________________
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,759 in 5,133 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
|