Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వరల్డ్ ఫేమస్ రైటర్
#1
వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 1



'వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ



"ఏమండీ! మీ సన్మానం ఏమైంది? క్రిందటి నెలలో అన్నారుగా.. ?" అడిగింది సావిత్రి
"ఏమో.. సావిత్రి! సారి ఆలస్యం అయ్యేలా ఉంది.. "
"మీరు అందరూ మెచ్చుకునేలాగ చాలా గొప్ప రచనలు చేస్తారుగా.. ! మరి ఎందుకు ఇంకా డిలే.. ?"
"అవుననుకో.. కానీ, ఎందుకో ఇంకా ఆలోచిస్తున్నారు 'మీ' పత్రిక వాళ్ళు. ఒకటి మటుకు నిజం.. 'మీ' పత్రిక వారు సన్మానిస్తే, నా దశ తిరిగినట్టే సావిత్రీ.. !"



******
ఆనందరావుకు చిన్నప్పటినుంచే సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. చిన్నతనం నుంచే కాలేజ్ లో చురుకుగా ఉండడం, ఫంక్షన్ల లో స్పీచ్ ఇవ్వడం చేసేవాడు. అలా పెద్దయ్యాక కాలేజీ లో కవితలు, కథలు, జోక్స్ అన్నీ రాసేవాడు. అమ్మాయిలు అతని కవితలు చాలా ఇష్టపడేవారు. కొంత మందైతే, అడిగి మరీ వారి మీద అందమైన కవితలు రాయించుకునే వారు. కాలేజీ లో జరిగే వివిధ కార్యక్రమాలకు పాటలు, గేయాలు రాయడం చేత అప్పట్లో మంచి పాపులర్ అయ్యాడు ఆనందరావు. ఇతని ప్రతిభ చూసి, చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకుని, ' లవ్ యు' కూడా చెప్పేశారు. కానీ, జీవితం లో సాధించాల్సినవి చాలా ఉన్నాయని.. ప్రేమలు వద్దని అమ్మాయిలకు దూరంగా ఉన్నాడు ఆనందరావు. 



తర్వాత, చదువులో బిజీ అయిపోయి.. తన రచనా టాలెంట్ ని పక్కకు పెట్టాడు. ఆనందరావు నాన్నగారు చాలా స్ట్రిక్ట్. చదువు మీద తప్పితే, వేరే వాటి మీద దృష్టి వద్దని ఎప్పుడూ అనేవారు. అయినా సరే, ఆనందరావు తనకి ఇష్టమైన కామిక్స్ పుస్తకం కోసం జోక్స్, కథలు రాసి పంపేవాడు. అలా పంపగా, ఒకరోజు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆనందరావు రచనలకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉందని మళ్ళీ బయటపడింది. ఉత్తరంలో ఇలా ఉంది.. 



నా పేరు దామిని. మీ రచనలు అన్నీ తప్పకుండా చదువుతాను. మీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం.. ఇష్టం అనేదానికన్నా పిచ్చి అంటే ఇంకా బాగుంటుంది. మార్కెట్ లోకి పుస్తకం వచ్చిన వెంటనే, మీ రచన కోసం చూసి వెంటనే చదివేస్తాను. మీరు రాసిన కథలు అన్నీ నాకు చాలా ఇష్టం. మా నాన్నగారికి మీ ఊరుకే ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను కాలేజీ లో జాయిన్ అవడానికి అక్కడికే వస్తున్నాను. అక్కడ మంచి కాలేజీ లు చూసి నాకు చెప్పగలరా.. ?. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను.. 



ఉత్తరం చదివిన తర్వాత.. అమ్మాయికి రిప్లై తర్వాత ఇవ్వొచ్చని ఉత్తరాన్ని అక్కడే వదిలేసాడు ఆనందరావు. లోపు అమ్మ అక్కడికి వచ్చి ఉత్తరం చదివింది. అబ్బాయి ఎక్కడ అమ్మాయి ధ్యాసలో పడి.. చదువు పాడుచేసుకుంటాడో అని.. ఉత్తరాన్ని చించి పారేసింది. తర్వాత ఆనందరావు ఉత్తరం కోసం ఎన్ని చోట్ల వెతికినా అది దొరకలేదు. తల్లిని అడిగినా.. సమాధానం చెప్పలేదు. ఇల్లు కూడా మారిపోయారు. తర్వాత కొన్ని రోజులకి ఉత్తరం గురించి మర్చిపోయాడు ఆనందరావు. 



తర్వాత.. లైఫ్ లో కొంచం సెటిల్ అయిన తర్వాత.. మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుని.. రచనలు మళ్ళీ మొదలుపెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు ఆనందరావు. ఇప్పట్లో అన్నీ ఆన్లైన్ పత్రికలే.. అని ఒక పేరున్న పత్రికకు మొదటి కథను పంపించాడు. మొదటి కథ ఆమోదం పొంది పత్రికలో అచ్చు వేసారు. ఆనందరావు చాలా ఆనందపడ్డాడు. అప్పటినుంచి ఇంక అడపా తడపా రచనలు చేస్తూనే ఉన్నాడు. అన్నీ ప్రచురణ అయ్యాయి. ఇప్పటికి ఒక వందకు పైగా రచనలు పంపాడు ఆనందరావు. 



ఆనందరావు శ్రీమతి సావిత్రి మంచి అమ్మాయి. ఇద్దరికీ పెళ్ళయి దాదాపు సంవత్సరం అయ్యింది. రచనలు చేయడం లో ఆనందరావు కు సలహాలు, సూచనలు ఇచ్చేది సావిత్రి. వారి పెళ్ళిచూపులలో కూడా కవి చమత్కారం చూపించాడు ఆనందరావు. 



*******



"ఒరేయ్ ఆనందు.. ! నువ్వు ఇలా కథలు, కవితలు రాస్తున్నావని చెబితే నీకు పిల్లని ఎవరు ఇవ్వరు. చేస్తున్న చిన్న ఉద్యోగమైనా సరే.. అదే చెప్పు. కథలు, కవితలు గురించి చెప్పకు.. " అంది తల్లి జానకి 



"నేను చూసుకుంటాను అమ్మా.. !" 



పెళ్ళిచూపుల రోజు.. 



"అమ్మాయి.. ! నీ పేరు ఏమిటి.. ?" అడిగింది జానకి
"సావిత్రి.. "
"వంటా.. వార్పూ ఎంతవరకు వచ్చు.. ?"
"మా అమ్మాయి గురించి గొప్పగా చెప్పకూడదు వదినగారు.. ! మా అమ్మాయికి అన్ని వంటలు చెయ్యడము వచ్చు. ఇప్పుడు మీరు తింటున్న స్వీట్స్ కూడా మా అమ్మాయి చేసినవే.. "



అమ్మాయిని, అబ్బాయిని అలా వొంటరిగా వరండా లో మాట్లడుకోమని పంపించారు.. 



"నేను నచ్చానా.. ?" అడిగింది సావిత్రి 
"మీకేమండి.. చందమామ వలే చక్కగా ఉన్నారు.. " అన్నాడు ఆనందరావు 
"నిజమా.. ?"
"మీ మాట కూడా మీరు చేసిన స్వీట్స్ వలే మధురముగా ఉన్నాయి.. "
"మీరు రచయితలా.. ? నా మీద కవిత్వం చెబుతున్నారు.. ?"
"ఎలా కనిపెట్టారు.. ?"
"నాకూ సాహిత్య మంటే మక్కువే.. నేనూ కథలు, కవిత్వాలు అన్నీ చదువుతాను.. " అంది సావిత్రి 
"ఇంతకీ.. ఎన్ని రచనలు చేసారేమిటి తమరు.. ?"
"ఏవో కొన్ని చేసాను లెండి.. పెద్ద పేరు ఏమీ లేదు లెండి ఇంకా.. " అన్నాడు ఆనందరావు
"మీరు గొప్పవారు అవుతారు లెండి.. "
" మాట.. నా చేయి పట్టుకుని.. చెప్పరాదు.. " అన్నాడు ఆనందరావు నవ్వుతూ
"చమత్కారులే.. నా కాబోయే శ్రీవారు.. "
"చెప్పకనే చెప్పారు నా కాబోయే శ్రీమతి గారు.. " అని ఇద్దరు నవ్వుకున్నారు.. 



తర్వాత ఇద్దరి పెళ్ళి గ్రాండ్ గా జరిగింది.. 



*******
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
"ఏమండీ.. ! మీరు రచనల కోసం ఇంత కష్టపడుతున్నారు కదా.. ! మీకు పారితోషకం ఏమీ రావట్లేదు.. కొంచం ఆలోచించండి.. !"
"నా ఆనందం కోసమే రచనలు చేస్తున్నాను సావిత్రి.. "
"అయినా సరే, మీరు చాలా సమయం వెచ్చించి రాస్తున్నారు.. మీరు రాసే కథలు తప్పులు లేకుండా చాలా నీట్ గా ఉంటాయి.. చాలామంది చేసే రచనలలో చాలా తప్పులు ఉంటున్నాయి.. అయినా వారికే గుర్తింపు ఎక్కువ వస్తోంది.. "
"సావిత్రీ.. ! రచన చేసినప్పుడు.. పర్ఫెక్ట్ గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం.. తొందరపడి ఏదో రాసేసి పంపించడం నాకు ఇష్టం లేదు. రోజు కాకపోతే, ఏదో రోజు నాకు గుర్తింపు వస్తుంది లే.. రేపటి నుంచి నవలలు కూడా మొదలుపెడుతున్నాను.. "
"అయినా మీకెందుకు ఇస్తారు లెండి పారితోషకం. నేను చూస్తూనే ఉన్నాను కదా.. ఎప్పుడూ కొంత మందికే బహుమతులు వస్తున్నాయి.. మీకు ఎప్పుడో ఒక్కసారి ఇచ్చారు అంతే.. ఒక బహుమతి.. "
"నువ్వు చెప్పింది నిజమే.. అన్నీ చోట్ల ఉన్న విధంగానే.. ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు.. ఏం చేస్తాం.. ? మన ప్రయత్నం మనం చెయ్యాలి.. ఎప్పటికైనా నన్ను గుర్తిస్తారన్న నమ్మకం నాకు ఉంది .. " అన్నాడు ఆనందరావు
"మీ నమ్మకం మీది. ఏదో రోజు మీరు వరల్డ్ ఫేమస్ రైటర్ కావాలన్నదే నా కోరిక"



******



ఏమండీ.. ! సన్మానం గురించి ఏమైనా తెలిసిందా.. ?
"క్రిందటి సంవత్సరం.. కొంత మంది రచయితలకు సన్మానం చేసారు.. మళ్ళీ ఊసే లేదు.. ఎందుకో.. ?"
"నెక్స్ట్ సన్మానం ప్రకటిస్తే, మొదటి పేరు మీదే ఉంటుంది.. నేను దాని కోసమే చూస్తున్నాను.. " అంది సావిత్రి 
"నా మీద నీకున్న నమ్మకానికి చాలా థాంక్స్ సావిత్రి.. "
"మీ కష్టం నాకే తెలుసు. రాత్రనకా.. పగలనకా.. ఐడియా వచ్చిన వెంటనే రాసేస్తున్నారు. మీ కష్టం ఊరికే పోదు.. మీ సన్మానానికి నేను కొత్త చీర కూడా రెడీ చేసుకున్నాను.. తెలుసా.. ?"
"అవునా.. ! అతి త్వరలో రోజు వస్తుంది సావిత్రి.. అప్పుడు ఆనందరావు గారి భార్యగా నీకూ చాలా గుర్తింపు వస్తుంది.. "
"నిజమేనండీ.. ! మీతో పాటు.. నాకూ గుర్తింపు, హోదా వస్తుంది మరి.. !"



====================================================================
ఇంకా వుంది.. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#3
Nice starting  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 2
'వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ
ఇక వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్దకథ చివరి భాగం చదవండి.. 



అనుకున్న కొన్ని రోజులకే.. 'మీ' పత్రికల వారు ఆనందరావు కు సన్మానం ప్రకటించారు. పెద్ద ఫంక్షన్ హాల్ లో ప్రముఖుల ముందు సన్మానం జరిగింది. సావిత్రి ఆనందానికి అవధులు లేవు. దామిని కుడా అక్కడకు వచ్చింది. అక్కడ సన్మానం లో ఆనందరావుని చూసిన దామిని చాలా ఆనందపడింది. 



"ఆనందరావు గారు.. ! మీ రచనలు చదివిన స్పూర్తి తో నేను కుడా చిన్న చిన్న రచనలు చేయడం మొదలు పెట్టాను.. "అంది దామిని 
"చాలా సంతోషం దామిని.. "
"మీరు నాకు ఒక మాట ఇవ్వాలి.. ఇక పైన మీరు నాకు గురువుగా ఉండి.. మీ సలహాలు, సూచనలు నాకు అందించాలి.. కాదనకండి.. మీరైనా చెప్పండి సావిత్రిగారు.. !"
"ఏమండీ.. ! ఒప్పుకోండి.. ఇది మీకు చాలా మంచిది కుడా.. "
"నువ్వు చెబుతున్నావు కాబట్టి.. ఓకే చేస్తున్నాను.. "
"చాలా థాంక్స్ గురుజీ.. " అంది దామిని 



కొన్ని రోజుల తర్వాత.. ఒక టీవీ ఛానల్ వారు ఆనందరావు ని ఇంటర్వ్యూ కి పిలిచారు.. 



ఇప్పుడు మనం ప్రముఖ రైటర్ ఆనందరావు గారిని ఇంటర్వ్యూ చేద్దాం.. 



"నమస్తే.. ! ఆనందరావు గారు.. ! రోజు మీరు ఒక ఫేమస్ రైటర్. మీకు మధ్య ఒక పత్రిక వారు సన్మానం కూడా చేశారు. ఎలా ఫీలవుతున్నారు?"
"చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను" అన్నాడు ఆనందరావు
"రచనలు చెయ్యడానికి మీకు స్పూర్తి ఎవరు.. ?"
"చిన్నప్పటినుంచి కథలు, కవితలు అంటే చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు చదివాను. వాటినుంచి ప్రేరణ పొంది, నేను కుడా రాయడం మొదలుపెట్టాను. పెళ్ళైన తర్వాత, ఇప్పుడు నా భార్య నాకు చాలా సపోర్ట్ ఇస్తోంది.. "
"అయితే, మీరు రచనలు టైం లో ఎక్కువగా చేస్తారు.. ?"
"కథ స్పురించిన వెంటనే రాయడం మొదలు పెడతాను. అది పగలైన, రాత్రైనా, అర్ధరాత్రైనా సరే.. "
"మీరు నిజంగా చాలా గ్రేట్.. ! మరి ఒక కథ గాని, నవల గాని రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది.. ?"
"గంటలో రాసిన కథలు ఎన్నో.. ఎక్కువ టైం తీసుకుని రాసిన కథలు కుడా చాలానే ఉన్నాయి. నవలలు అయితే, జాగ్రతగా కొంచం టైం తీసుకుని రాస్తాను.. "
"మా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మీరు ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ఆనందరావు గారు.. !?"
"నేను ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి.. అప్పుడు మళ్ళీ కలుద్దాం.. "



"అల్ ది బెస్ట్ ఆనందరావు గారు.. " మా ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున.. ఆనందరావు గారికి శుభాకాంక్షలు.. 



"హలో ఆనందరావు గారు.. ! మీ ఇంటర్వ్యూ చూసాను.. కంగ్రాట్స్ అండి.. మీరు మా ప్రత్రికలో ఒక మంచి వెబ్ సిరీస్ రాయాలి.. కాదనకండీ.. !"
"నేను రాయదలచుకోలేదు.. కృష్ణగారు.. "
"అదేమిటి అలాగనేసారు.. ?"
"గతం లో మీ పత్రికకు రాసిన కథలు, వెబ్ సిరీస్ కి మీరు చేసిన ప్రచారం జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. ఎంత సేపూ ఆడవారు రాసిన వాటికే తెగ పబ్లిసిటీ ఇస్తారు. వారికే సన్మానం కుడా చేస్తున్నారు.. మమల్ని అసలు పట్టించుకోలేదు.. "
"ఆడవారు రాసిన వాటికీ పబ్లిసిటీ ఎక్కువ చేస్తే, లేడీస్ సెంటిమెంట్ తో పత్రిక బాగా ఎదుగుతుందని.. అంతే.. ! మిమల్ని అవమానించాలని కాదు.. "
"నెక్స్ట్ సన్మానం మీదే.. ! ఎక్కువగా, తొందరగా, పర్ఫెక్ట్ గా వెబ్ సిరీస్ రాసేది మీరు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా పేరు కుడా వచ్చింది. కావాలంటే మీ కోసం బోలెడంత పబ్లిసిటీ చేస్తాను.. "
"నాకు ఇప్పుడు సన్మానం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్న రోజులు. నాకేమో ఒక్క సిటీ లోనే పేరు వచ్చింది.. "
"అయితే, ఏమిటి చెయ్యాలో చెప్పండి.. మీరు మాత్రం మా పత్రికకు మంచి వెబ్ సిరీస్ రాయాలి.. " అని అడిగారు కృష్ణగారు
"అలాగే రాస్తాను. కానీ.. దానిని పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిష్ చెయ్యాలి. అంటే, అన్ని భాషలలోకి అనువాదం చేసి అన్నీ చోట్ల రిలీజ్ చెయ్యాలి.. " అన్నాడు ఆనందరావు



"అలా చెయ్యాలంటే.. అనువదించడం లో బాషా ప్రావీణ్యం ఉన్నవారు కావాలి.. "
"మీరు ఏం చేస్తారో.. నాకు తెలియదు. కనీసం తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో నైనా పబ్లిష్ చెయ్యాలి అంతే.. ! నెక్స్ట్ టైం నా ఇంటర్వ్యూ అందరూ 'బీబీసీ' లో చూడాలి.. "



"అలాగే లెండి.. ముందు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చెయ్యండి.. " అన్నారు కృష్ణగారు



వెబ్ సిరీస్ పూర్తైన అనతి కాలంలోనే.. ఆనందరావు కు పేరు ప్రఖ్యాతలు బాగా వచ్చాయి. అంతా 'మీ' పత్రిక వారు చేసిన సన్మానం పుణ్యమేనని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు.. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
ఒకరోజు అనుకోకుండా.. ఎవరో ఆనందరావు ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారుఇంట్లో ఎవరూ లేకపోవడంతోఆనందరావు వెళ్లి తలుపు తీసాడువచ్చిన వారిని చూసిన తర్వాతఆనందరావు కు నోట మాట రాలేదు.. 



"లోపలి రావొచ్చా ఆనందరావు గారు.. ?" అని అవతలి నుంచి అడిగారు 
"ఎంత మాట.. రండి.. రండి.. కూర్చోండి.. "
"సమయానికి ఇంట్లో ఎవరూ లేరు.. ఏం తీసుకుంటారు.. ?" అని అడిగాడు ఆనందరావు 
"ఏం పర్వాలేదు.. ఇంతకీ నన్ను గుర్తు పట్టారా.. ?"
"ఎంతమాట.. మీరు ది గ్రేట్ డైరెక్టర్ నాగేంద్రమౌళి.. పాన్ ఇండియన్ డైరెక్టర్మీరు తీసిన సినిమాలతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియన్ స్టాయి లో గుర్తింపు వచ్చిందిమీకు నేను వీర అభిమానినిఅలాంటిది.. మీరే మా ఇంటికి రావడం అంటే.. అంతా నా అదృష్టం"
"ఇటుపక్క షూటింగ్ ఉంటేమిమల్ని కలిసి పోదామని వచ్చాను.. "
"అంతా నా అదృష్టం.. "
"మీరు రాసిన వెబ్ సిరీస్ చదివాను.. బాగా నచ్చింది.. నేను నెక్స్ట్ తీయబోయే పాన్ ఇండియా మూవీ కోసం మీరు ఒక కథ రాయాలి.. రాస్తారా.. ?"
"దేవుడే దిగివచ్చి వరం ఇస్తానంటేవద్దంటాన చెప్పండి.. తప్పకుండా.. " అన్నాడు ఆనందరావు 
"ఇదిగోండి అడ్వాన్సు.. కథ అయిపోగానే చెప్పండి.. "
"అలాగే నాగేంద్రమౌళి గారు.. "



ఆనందరావు  కథను చాలా బాగా రాసాడుఅతి తొందరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది..  తర్వాత రిలీజ్ అయిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందిఆనందరావు అనుకున్న దానికన్నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చిందిఇప్పుడు ఆనందరావు ఒక పాన్ ఇండియా రైటర్. 



అతి త్వరలోనేసినిమాలు వేరే దేశాలలో కుడా బాగా పాపులర్ అయి.. ఆనందరావు కథలకిస్క్రిప్ట్ రైటింగ్ కి చాలా ఫేమస్ అయ్యాడుప్రపంచం అంతా ఫేమస్ అయ్యాడుఅనతికాలంలోనే 'బీబీసీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆనందరావు. 



అంతా  'మీపత్రిక వారు అప్పట్లో చేసిన సన్మానం పుణ్యమేనని.. ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు.. 



==============================================================
 సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#6
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: