Thread Rating:
  • 5 Vote(s) - 4.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అపోకలిప్స్ : ఎండ్ ఆఫ్ ది వరల్డ్
#21
కథ, కథనం చక్కగా ఉన్నాయి, గానీ పాత్రల పేర్లవల్ల కొద్దిగా అయోమయం పాలవుతున్నారు పాఠక మిత్రులు.


వీటిని కొద్దిగా పట్టించుకోకపోతే భేషుగ్గా ఉంటుంది.

మన ఆలోచన పరిధి పెంచుకుంటే ఓహో!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని తెగ ఆసక్తిగా ఉంది...వాళ్ళ చావులంటే అన్నదమ్ములేగే....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#23
(14-05-2024, 02:17 PM)k3vv3 Wrote: కథ, కథనం చక్కగా ఉన్నాయి, గానీ పాత్రల పేర్లవల్ల కొద్దిగా అయోమయం పాలవుతున్నారు పాఠక మిత్రులు.


వీటిని కొద్దిగా పట్టించుకోకపోతే భేషుగ్గా ఉంటుంది.

మన ఆలోచన పరిధి పెంచుకుంటే ఓహో!

thank you k3vv3 garu and ika nundi ee names vishayam lo kuda jagrattha teesukuntanandi thank you for comment
[+] 3 users Like zenitsu_a34's post
Like Reply
#24
(16-05-2024, 04:58 PM)Uday Wrote: ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని తెగ ఆసక్తిగా ఉంది...వాళ్ళ చావులంటే అన్నదమ్ములేగే....కొనసాగించండి.

ee story ki hero aayane andi, aayana oka Indian and annadammulante makhradwa, markhadwa. thank you for comment andi uday garu
[+] 2 users Like zenitsu_a34's post
Like Reply
#25
ఢిల్లీ నగరంలో....

ఢిల్లీలో ఒక రద్దీ ప్రాంతం. ప్రొద్దున టైం తొమ్మిది అవుతుండడంతో ఆఫీస్ కి, కాలేజ్ కి కాలేజీకి వెళ్తున్నారు. అందరు వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా ట్రాఫిక్ మొదలై రోడ్డు మీద బండ్లన్నీ ఆగిపోతుంటాయి. అందరూ ఆశ్చర్యంతో వెహికల్స్ నుండి దిగి పైకి చూస్తుంటారు.
వారు ఆకాశం వైపు చూడగా వాళ్ళ ముందు కొద్ది మీటర్ల దూరంలో ఒక స్పేస్ షిప్ నిలబడుతుంది. అది చాలా పెద్ద స్పేస్ షిప్. జనాలంతా దాని వైపే తీక్షణంగా చూస్తుంటారు. కొంత మంది దాన్ని మొబైల్ తో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు.
ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అవ్వకుండా గాలిలోనే నిలబడి ఉంది. అందులో నుండి కొన్ని చిన్న చిన్న స్పేస్ షిప్స్ బయటకు వచ్చి జనాల మీద నుండి ఆ స్పేస్ షిప్ నుండి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఆ చిన్న స్పేస్ షిప్స్ అన్ని దిక్కుల్లో వెళ్లి ఆ స్పేస్ షిప్ చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక షీల్డ్ ని నిర్మిస్తాయి.
జనాలంతా అయోమయంగా ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తుంటారు. అప్పుడు ఆ పెద్ద స్పేస్ షిప్ నుండి నీలం రంగులో ఉన్న ఏలియన్స్ బయటకు వస్తాయి. ఆ ఏలియన్స్ చూడటానికి అందరూ ఒకేలా నీలం రంగులో ఉండి నల్లని మెరుస్తున్న కవచాలు ఆయుధాలను ధరించి ఉన్నారు.
అందులో ఒకడు చుట్టూ ఉన్న జనాలను చూస్తూ వాడి వెనక ఉన్న వాళ్ళతో ఏదో సైగ చెయ్యడంతో ఆ ఏలియన్స్ అంతా వారి ముందు ఉన్న జనాలని చంపడం ప్రారంభించారు.
అది చూస్తున్న మిగతా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుండి పారిపోతుంటారు. షీల్డ్ అడ్డంగా ఉండడం వలన ప్రజలు బయటకు వెళ్లలేకపోతారు. షీల్డ్ వద్ద ఉన్న జనాలను అక్కడే ఉన్న చిన్న స్పేస్ షిప్స్ లోని ఎలియెన్స్ చంపేస్తాయి. షీల్డ్ లోపలున్న భవనాలను, ఇళ్లను కూల్చేస్తు అల్లకల్లోలం చేస్తారు.
అలా దాదాపు ముప్పై నిమిషాలు జరిగిన నరమేధంలో వేల మందిని చంపేసి విధ్వంసాన్ని సృష్టిస్తారు. చుట్టూ రక్తంలో పడి ఉన్న శవాలు, కొన్ని శవాల నుండి బయటకి వచ్చిన అవయవాలు మాత్రమే ఉంటాయి. చివరిగా ఒక కుర్రాడు మిగిలి ఉంటాడు, తను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. 
అక్కడి నుండి లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎందుకో నొప్పిగా ఉండడంతో తన వెనక ఉన్న కాళ్ళని చూసుకుంటాడు. అందులో ఒక కాలు మీద బిల్డింగ్ పడడం వల్ల కట్ అయిపోయి ఉంటుంది.
తనకు ఏడుపు ఆగదు. తన కాలు కట్ అయిపోవడంతో పాకుతూ ఆ షీల్డ్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. తన కళ్ల వెంట నీరు ధారలుగా కారుతూ ఉంటుంది.
అలా ఏడుస్తూ తన మనసులో "నేను చావకూడదు నేను బాగా చదువుకోవాలి, పెద్దవాడినై మంచి ఉద్యోగంలో చేరాలి, మా అమ్మని, చెల్లిని బాగా చూసుకోవాలి" అనుకుంటూ గట్టిగ ఏడుస్తూ "నేను బ్రతకాలి నేను బ్రతకాలి నేను బ్ర...." అంటుండగానే తన శరీరం నుండి తన తల వేరవుతుంది.
మర్ఖద్వ ఆ కుర్రాడి తలను నరికి తన పక్కన ఉన్న సైన్యంతో "ఇంకా ఎవరైనా బ్రతికున్నారా" అని అడుగుతాడు.
"లేరు ప్రభు" అంటాడు అతనితో పాటే ఉన్న రాయిస్.
"షీల్డ్ లోపల అంతా వెతకండి ఎవరైనా దొరికితే చంపెయ్యండి" అంటూ రక్తంలో పడి ఉన్న అవయవాలని తొక్కుకుంటూ స్పేస్ షిప్ లోకి వెళ్తాడు.
మర్ఖద్వ తన గొడ్డలికి అంటిన రక్తాన్ని తుడుస్తూ "ఏం బార్బెరా నువ్వు చెప్పినట్టే ఆ శక్తివంతుడు ఉన్న చోటే ల్యాండ్ అయ్యాం కానీ ఇంకా ఎవరు రాలేదే" అని అడుగుతాడు మర్ఖద్వ.
బార్బెరా మర్ఖద్వ చేసిన ఊచకోతను చూస్తూ షాక్ లో ఉంటాడు. తన వల్లనే ఇదంతా జరిగింది అనే విషయాన్నీ జీర్ణించుకోలేక పోతున్నాడు బార్బెరా.
"ప్రభు అంతా సిద్ధం చేశాను ఇప్పుడు మీరు ఈ గ్రహంలో ఉన్నవాళ్ళతో మాట్లాడచ్చు, మీరు మాట్లాడేది అందరు వింటారు" అంటుంది కాస్సీ.
ప్రపంచంలో ఉన్న టీవీ చానెల్స్, మొబైల్స్, సిస్టమ్స్ అన్నిటిలో ఒక్కసారిగా గ్లిచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వాటి నుండి ఏవో సౌండ్స్ రావడం మొదలవుతాయి. ప్రపంచంలో ఉన్న దేశాధినేతలతో సహా వందల కోట్ల మంది తమ మొబైల్స్ లో టీవీల్లో ఏం జరుగుతోందో అర్థం కాక అలానే చూస్తుంటారు.
అప్పుడు మర్ఖద్వ గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ "పురుగుల్లారా వినండి ఇన్నాళ్లు మీరు విశ్వంలో ఒంటరి వాళ్ళం, శక్తివంతులమని అనుకుని ఉండచ్చు కానీ అది నిజం కాదు, మీ కన్నా శక్తివంతులం మేము, ఇప్పుడు మిమ్మల్ని వేటాడటానికి వచ్చాము, మీరు భయపడిన పారిపోయిన మిమ్మల్ని వదలము. ఇప్పుడు మీకున్న దారులు రెండు మాత్రమే మీలో ఉన్న శక్తివంతుడు ఎవరైనా ఈ షీల్డ్ ని దాటి నాతో పోటీ పడి నన్ను ఓడించండి, లేదా మీ మరణానికి సిద్ధం అవ్వండి మీకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది" అంటూ ముగిస్తాడు.
అది విని ప్రపంచంలో ఉన్న అందరు భయపడడం మొదలుపెడతారు. ఇండియాలో ఉన్న ఢిల్లీ లో గుర్తు తెలియని ఒక స్పేస్ షిప్ ల్యాండ్ అయిందని, అందులో నుండి వచ్చిన ఏలియన్స్ ఒక షీల్డ్ నిర్మించి అక్కడ ఉన్న ప్రజలను చంపేసారని ఏలియన్స్ ప్రజలని చంపుతున్న కొన్ని దృశ్యాలని ప్రసారం చేస్తారు, అన్ని సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.
షీల్డ్ లోపల చనిపోయిన వారి కుటుంబం షీల్డ్ వద్దకు వచ్చి రోదిస్తుంటారు. మీడియా కూడా అక్కడే ఉండడంతో వారి వద్దకు వెళ్తుంది. మీడియా వద్ద వాళ్ళ గోడును వెళ్లబోసుకుంటారు 
"నా కూతురు కాలేజికని బయల్దేరిన పిల్ల, తను నిన్ననే ఒక ఫుట్బాల్ టోర్న్మెంట్లో కప్ కూడా కొట్టింది ఈరోజు నా ఫ్రెండ్స్ కు ఈ కప్ చూపించాలి నాన్న అంటూ వెళ్ళింది కానీ ఇప్పుడు అక్కడ శవం అయి పడుంది అస్సలు ఈ గవర్నమెంట్, సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి మమ్మల్ని రక్షణగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదే కదా మరి వాళ్ళేం చేస్తున్నారు మిలిటరీ ఏం చేస్తుంది" అంటూ గుండె పగిలేలా రోదిస్తుంటాడు.
"నా కొడుకు అయ్యా వాడికి చదువంటే చాల ఇష్టం రెండేళ్లుగా నేను మంచాన పడడంతో వాడే ఇల్లు గడవడానికి చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది, ప్రభుత్వం మారడంతో మా బ్రతుకులు కూడా మారాయి మళ్ళీ వాడు కాలేజ్ కి వెళ్తున్నాడు, ఈ రోజు కూడా రేపటి సంవత్సరం నుండి చెల్లెల్ని కూడా కాలేజ్ లో చేర్పిద్దాం అమ్మ అంటూ బయల్దేరాడు ఇప్పుడు చూస్తే నా కొడుకు అందులోనే ఉన్నాడు వీళ్ళేమో అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అంటున్నారు" అంటూ తను కూడా రోదిస్తుంటుంది.
"ఈ సంఘటనకు సంబంధించి టీవీలో వేస్తుంటే చూసాను సర్, అందులో నా భార్య కొడుకుని దారుణంగా చంపేశారు, నా కొడుక్కి కేవలం రెండేళ్లు సర్ అయినా కొంచెం కూడా కనికరం లేకుండా చంపేశారు" అంటూ ఏడుస్తుంటాడు.
అలా అక్కడి వారిది ఒకొక్కరిది ఒక బాధ చెప్పుకుంటారు. అప్పుడే అక్కడికి మిలిటరీ సైన్యం వాళ్ళను అక్కడి నుండి పంపిస్తుంది
అప్పుడు అక్కడ ఉన్నవాళ్లలో ఒకరు "వాళ్ళని ఎలాగో కాపాడలేకపోయారు కనీసం వారి బాడీస్ నైనా మాకు అప్పగించండి సర్ మీ కాళ్ళు పట్టుకుంటాను సర్" అంటూ ఏడుస్తున్న బలవంతంగా వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తారు.
పీఎం ఆఫీస్ లో....
ఈ అనుకోని పరిణామంతో ఢిల్లీలో స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. దేశంలోని అగ్రనేతలు మరియు సైనికాధికారులు పీఎం ఆఫీసులో సమావేశమవుతారు. అందరి మొహాల్లో భయం, ఆందోళన కనపడుతుంటుంది.
ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్ మాట్లాడుతూ "మేజర్ జనరల్, ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి" అని అడగగా
"సర్, ఆ ఏలియన్ షీల్డ్ దాదాపు మూడు కిలోమీటర్ల రేడియస్ వరకు విస్తరించి ఉంది. షీల్డ్ చుట్టు పక్కల ఉన్న ప్రజలని ఖాళీ చేయించాం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇక షీల్డ్ లోపల ఉన్నవాళ్ళ విషయానికి వస్తే మేమంతా షీల్డ్ చుట్టూ తిరిగి చెక్ చేసాం ఎవరు బ్రతికిలేరు, దాదాపు పది వేల మంది దాక ఉంటారని అంచనా, అందరు చనిపోయారు" అని అంటాడు మేజర్ జనరల్ విక్రమ్ సింగ్.
"అస్సలు వాళ్ళు వచ్చే ముందే మనకు ఎందుకు తెలీలేదు, నిరంతరం సౌర కుటుంబాన్ని గమనిస్తున్న ఇస్రో సాటిలైట్స్ ఏమయ్యాయి" అని అడుగుతాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ గుప్త.
"సర్ మన ఇస్రో మాత్రమే కాదు నాసా సాటిలైట్స్  కూడా ఆ యూ.ఎఫ్.ఓ రావడాన్ని కనిపెట్టలేకపోయాయి, అది క్షణాల్లో భూమి మీదకి ప్రత్యక్షమైంది. దీనికి కారణం ఏంటో మనకు ఇంకా తెలీదు" అని అంటుంది డాక్టర్ అంజలి మెహతా. తను ఇస్రోలోనే ఫీజిసిస్ట్ గా అంతరిక్షంలోని వస్తువుల మీద పరిశోధన చేస్తుంటుంది.
"మరి ఆ షీల్డ్ సంగతి ఏంటి" అని అడుగుతాడు ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్
"సర్ ఆ షీల్డ్ పై ఎన్నో ఆయుధాల్ని ప్రయోగించాం కానీ దానికి ఒక గీత కూడా పడలేదు మేమింకా ప్రయత్నిస్తున్నాం ఆ షీల్డ్ గురించి మరింత తెలిస్తే లాభం ఉండచ్చు" అంటూ మేజర్ జనరల్ విక్రమ్ సింగ్, డాక్టర్ అంజలి మెహతా వైపు చూస్తూ అంటాడు.   
డాక్టర్ అంజలి మెహతా మాట్లాడుతూ "సర్ మేము ఆ షీల్డ్ గురించి పరిశోధనలు చేస్తున్నాం దాని గురించి ఇంకా మాకు ఏమి తెలీలేదు అది అస్సలు ఏ మూలకంతో తయారు అయ్యిందో తెలీదు మాకు ఇంకాస్త సమయం కావాలి" అని అంటుంది.
అప్పుడు అక్కడే ఉన్న జనరల్ అరుణ్ కుమార్(ఆయన ఆర్మీ స్టాఫ్ కి చీఫ్) మాట్లాడుతూ "సర్ మనకున్న ఒకే ఒక ఆప్షన్ న్యూక్లియర్ మిస్సైల్ మేబి అది వర్క్ అవ్వచ్చు కాబట్టి మీరు అనుమతిస్తే...." అని అంటుండంగా
ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్ ఎదో చెప్పబోతుంటే ఇండియన్ ఎంబసీ నుండి కాల్ వస్తుంది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యులైన దేశాల ప్రెసిడెంట్లు ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇండియాతో కాన్ఫరెన్స్ లోకి వస్తారు.
అమెరికా, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాలు అన్నీ ఇండియాకు సంతాపాన్ని తెలియజేస్తాయి. ఇది ఇండియా సమస్య మాత్రమే కాదని, ఇది మానవాళికి సమస్యగా గుర్తించి, ప్రపంచ ముప్పుగా పరిగణించి, ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండి, ఆ ఏలియన్స్ ని ఎదురుకోవాలని నిర్ణయిచుకుంటాయి.
అందుకోసం వివిధ దేశాలతో చర్చించి వారి వద్దనున్న అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు ఒక నైపుణ్యం ఉన్న వివిధ దేశాల సైనికులు ఉన్న ఒక సైనిక బృందాన్ని, ఆ బృందానికి నాయకుడిగా కల్నల్ డేవిడ్ ఆండర్సన్ ని నియమించి ఇండియాకు పంపిస్తాయి.  
 అలానే కొంతమంది ఖగోళ వస్తువుల మీద నైపుణ్యమున్న శాస్త్రవేత్తలని ఇండియా శాస్త్రవేత్తలతో టచ్ లో ఉండేలా చేస్తామని మీటింగ్ ని ముగిస్తారు.
వాళ్లంతా అక్కడి నుండి వెళ్ళిపోగానే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ గుప్త, పీఎంతో "ఆయనకు ఈ విషయం తెలుసా, మీరు చెప్పారా" అని అడుగుతాడు.
"ఇంకా చెప్పలేదు" అని అంటాడు పీఎం ఎస్.వి అరవింద్.  
"అస్సలు ఆయన ఎక్కడికి వెళ్లారు" అని పీఎం ని అడుగుతాడు.
పీఎం ఎస్.వి అరవింద్ ఏదో చెప్పబోతుంటే అక్కడికి వచ్చిన ఆఫీసర్ "సర్ ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు" అనడంతో పీఎం అక్కడి నుండి హోమ్ మినిస్టర్ ని చూస్తూ వెళ్ళిపోతాడు. 
షీల్డ్ వద్ద మేజర్ జనరల్ విక్రమ్ సింగ్ తో పాటు కల్నల్ డేవిడ్ ఆండర్సన్ మిలిటరీ క్యాంప్స్ ని ఏర్పాటు చేస్తారు. షీల్డ్ కి ఇంకొక వైపు ఉన్న మీడియా వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తారు. అక్కడ జరుగుతున్న ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేస్తారు.
షీల్డ్ మీద పరిశోధనలు చెయ్యడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ అంజలి మెహతాని నాయకురాలిగా నియమిస్తారు. తాను ఆ లోహం గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తుంటుంది.
ఆ షీల్డ్ మీద కల్నల్ డేవిడ్ ఆండర్సన్ మేజర్ విక్రమ్ సింగ్ కలిసి మిగతా దేశాల నుండి తీసుకొచ్చిన ఆయుధాలతో దాడి చేయిస్తారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. భూమి లోపల నుండి తవ్వి షీల్డ్ లోపలికి చొరబడాలని ప్రయత్నిస్తారు.
కానీ నిజానికి ఆ షీల్డ్ భూమి లోపలికి చొచ్చుకుపోయి ఒక పూర్తి గోళాకారంలో ఉంటుంది. అందువల్ల అది కూడా సాధ్యపడదు. మొదటి రోజు పూర్తవుతుంది. 
 శాస్త్రజ్ఞ బృందం ఎంత ప్రయత్నించినా ఆ లోహం గురించి దాని బలహీనతల గురించి తెలుసుకోలేక పోతారు. వాళ్లకు ఒక విషయం మాత్రం అర్థమైంది ఆ మూలకం భూమి మీద దొరకదని. అది ఒక కొత్త లోహం అని. 
కల్నల్ ఆండర్సన్ న్యూక్లియర్ మిస్సైల్ తో ఎటాక్ చేద్దాం అని చెప్తే, అందుకు విక్రమ్ సింగ్ వ్యతిరేకిస్తాడు. రెండో రోజు ముగుస్తుంది అన్న సమయంలో మిలిటరీ క్యాంపు ఉన్న చోటు షీల్డ్ ఓపెన్ అవుతుంది.
వెంటనే అందరూ అలర్ట్ అవుతారు. మర్ఖద్వ మొదటిసారి షీల్డ్ బయటకి వచ్చి, తనను తాను పరిచయం చేసుకుంటాడు. అతని పక్కన ఉన్న బార్బెరా వారి భాషనీ అనువదిస్తుంటాడు. బార్బెరా ఆంగ్లంలో మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం వేస్తుంది.
మర్ఖద్వ తాను ఇక్కడికి శక్తివంతుడి కోసం వచ్చానని చెబుతాడు. కానీ వారు ఇక్కడ అలంటి వారు ఎవరు లేరు అని వాదిస్తారు. బార్బెరా ఎంత చెప్పిన వినరు. ఇక్కడ కేవలం శక్తివంతమైన దళాలు, ఆయుధాలు మాత్రమే ఉంటాయని కావాలంటే వాటితో పోటీ పడి చూడామని అంటాడు కల్నల్ ఆండర్సన్.
మర్ఖద్వ కోపంతో అందుకు ఒప్పుకుంటాడు. కానీ పోటీ జరిగేటప్పుడు ప్రపంచమంతా అది చూడాలని అంటాడు. అందుకు కల్నల్, మేజర్ జనరల్ ఒప్పుకుంటారు. మూడవ రోజు పొద్దున షీల్డ్ ఓపెన్ అవుతుంది అని పోటీకి సిద్ధమవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు మర్ఖద్వ.
మూడో రోజు పొద్దున షీల్డ్ ఓపెన్ అవుతుంది. దాదాపు ఏడు వేల సైన్యాన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలతో, ఆర్మర్ మరియు జెట్స్ తో పంపిస్తారు. వారు లోపలికి వెళ్ళగానే షీల్డ్ క్లోజ్ అవుతుంది. మీడియా వారు షీల్డ్ బయటే ఉండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు.
మర్ఖద్వ తన గొడ్డలిని తీసుకుని తను ఒక్కడే వారి వైపు వెళ్తాడు. దాదాపు రెండు గంటలు జరిగిన యుద్ధంలో అందరిని చంపేస్తాడు మర్ఖద్వ. ఎన్ని ఆయుధాలు అతని పై ప్రయోగించిన ఫలితం ఉండదు. షీల్డ్ బయట ఉన్న వాళ్ళు శిలల్లా చూస్తుండిపోతారు.  
సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కుర్చీలో కూర్చుని పీఎం వైపు చూస్తుంటాడు. పీఎం దిగులుగా చేతితో తల పట్టుకుని కళ్ళని మూసేసి ఆలోచిస్తుంటాడు. ఏదో అలికిడి రావడంతో తన ముందున్న హోమ్ మినిస్టర్ ని చూస్తాడు. 
"నాకేం చెయ్యాలో తెలీట్లేదు ఆయనని కాంటాక్ట్ అవ్వడానికి కుదరట్లేదు, సిగ్నల్స్ దొరకడం లేదు" అని అంటాడు పీఎం.
"అస్సలు ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు" అని అడుగుతాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్
పీఎం ఏదో చెప్పబోతుంటే. హడావిడిగా ఢిల్లీ సీఎం అక్కడికి వచ్చి టేబుల్ మీద చేతులు వేసి పీఎం ని చూస్తూ "ఆయన ఎక్కడ ఉన్నాడు, కల్కి సర్ ఎక్కడ" అని భయం కలగలిసిన ఆత్రుతతో అడుగుతాడు.
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply
#26
ఢిల్లీ సీఎం వచ్చి కల్కి సర్ ఎక్కడ అని అడగడంతో, పీఎం వారి వైపు చూస్తూ " కొన్ని జబ్బుల్ని నయం చెయ్యడానికి కావాల్సిన హెర్బ్స్ కోసం హిమాలయాల్లోని సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు దాదాపు పది రోజులైంది, కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కానీ కుదరట్లేదు" అని అంటాడు.

ఆ విషయం విని వాళ్ళు అక్కడే కూలబడిపోతారు. హోమ్ మినిష్టర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ "ఒకవేళ ఆయనకు అక్కడ ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే..." అని తన ఆందోళనగా పీఎం వైపు చూస్తాడు.
"లేదు లేదు ఆయనకు ఏమి అలా జరిగి ఉండదు" అని పీఎం వారిని శాంతపరుస్తాడు.
స్పేస్ షిప్ లో....
మూడో రోజు గడువు ముగుస్తుండడంతో, మర్ఖద్వ తన సైన్యాన్ని ఎనిమిది దిక్కులకి పంపడానికి ఎనిమిది భాగాలుగా విభజిస్తాడు. అందులో ఒక భాగానికి రాయిస్ ని నాయకుడిగా నియమించి పశ్చిమ భాగం వైపు వెళ్ళమని చెప్తాడు.
మర్ఖద్వకు ఏదో గుర్తొచ్చి బార్బెరా వైపు చూస్తూ "ఈ గ్రహంలో ఎక్కడైనా ఒక చోటు నుండి ఇంకొక చోటుకి క్షణాల్లో ప్రయాణించే సాధనం లాంటిది ఉందా" అని అడుగుతాడు.
బార్బెరా సందేహంగా డ్రాగల్, కాస్సీ వైపు చూస్తూ "అలాంటిది ఏమి లేదు ప్రభు" అని అంటాడు.
"అలాంటిది ఇక్కడ లేదుగాని వాటిని ఇక్కడి వాళ్ళు టెలిపోర్టల్స్ అంటారు ప్రభు" అని అంటుంది కాస్సీ.
"ఆ సాధనం దేనికి ప్రభు" అని అడుగుతాడు రాయిస్.
"నాక్కూడా తెలీదు, నా అన్న వెళ్లిన ప్రతి గ్రహంలో దీనిని వెతికించేవాడు అందుకే అడిగాను" అని అంటాడు మర్ఖద్వ.
 "మూడు రోజుల గడువు తీరిపోయింది ఎలాంటి శక్తివంతుడు ఇక్కడికి రాలేదు" అంటాడు నిరాశపడుతూ మర్ఖద్వ. 
మర్ఖద్వ అనుచరుడు రాయిస్ మాట్లాడుతూ "ఇంకెక్కడ శక్తివంతుడు వాళ్ళు చెప్పారుగా అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఒకవేళ ఆ శక్తివంతుడు ఉన్న మిమ్మల్ని చూసి భయపడి దాక్కుని ఉంటాడు ప్రభు" అంటూ వెకిలిగా నవ్వుతుంటాడు.
మర్ఖద్వ కూడా చిన్నగా నవ్వి బార్బెరాతో "నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, నన్ను నిరాశపరిచావ్" అని అంటాడు. బార్బెరా ఏమి మాట్లాడడు.
మర్ఖద్వ "అయినా ఏం పర్లేదు నేనిక్కడ ఎవ్వరిని వదలను అందరిని చంపేసే మళ్ళీ నా గ్రహానికి వెళ్తాను" అని అంటాడు.
పీఎం ఆఫీస్ లో....
పీఎం ఆఫీస్ లో పీఎం, హోమ్ మినిస్టర్ ఆ రాత్రి కల్కిని కాంటాక్ట్ అవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ అక్కడే నిద్రపోతారు.
అర్థరాత్రి చప్పుడు అవ్వడంతో నిద్ర లేస్తారు. ఎదురుగా కల్కి నవ్వుతు సాధించానన్నట్టు తను తీసుకొచ్చిన మెడిసినల్ హెర్బ్స్ ని చూపిస్తాడు. కానీ వాళ్ళ మొహాల్లో ఆనందం కనపడకపోవడంతో వారిని ఏం జరిగింది అన్నట్టు సందేహంగా చూస్తాడు కల్కి.
వాళ్ళు విషయమంతా చెప్పి షీల్డ్ లోపల జరిగిన ఆ మారణకాండను కల్కికి చూపిస్తారు. అది చూసి కల్కి చలించిపోతాడు తన పిడికిలి బిగుసుకుంటాయి. తన కళ్ళల్లో బాధ, కోపం రెండు ఒకేసారి ప్రస్ఫూటిస్తుంటాయి. ఒక్కసారిగా కల్కి అక్కడి నుండి మాయమైపోతాడు.

మిలిటరీ క్యాంప్ లో....
"చుట్టు పక్కల ఉన్న సివిలియన్స్ అందరిని వెకేట్ చేయించండి అండ్ మీడియాను కూడా పంపించండి. మనం ఇక్కడి నుండే వారిని డిఫెండ్ చెయ్యడానికి ప్రయత్నిద్దాం" అని అంటాడు కల్నల్ డేవిడ్ ఆండర్సన్ 
 మేజర్ జనరల్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ "పారామిలటరీ ఫోర్సెస్ ఆ పనిలోనే ఉన్నారు. మరి మిగతా దేశాల సంగతి ఏంటి" అని అడగగా 
"అన్ని దేశాల వారికి సందేశం పంపించాం, అందరిని బంకర్లలోకి పంపిస్తున్నాం" అని అంటాడు కల్నల్ డేవిడ్ ఆండర్సన్.
"దీని నుండి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు" అని దిగులుతో అంటుండగా ఒక సోల్జర్ వచ్చి "సర్, షీల్డ్ లో ఎవరో స్పేస్ షిప్ వైపు వెళ్తున్నాడు" అనగానే వాళ్ళు బయటకి వచ్చి చూస్తారు. సోల్జర్స్ అందరు షీల్డ్ లోపల ఉన్న ఆ మనిషినే చూస్తుంటారు.
వాళ్ళు బైనాక్యూలర్స్ అందుకుని చూస్తే ఒకడు స్పేస్ షిప్ వైపు వెళ్తుంటాడు అప్పుడు మేజర్ జనరల్ మాట్లాడుతూ "ఇతనెలా లోపలికి వెళ్ళగలిగాడు" అని ఆశ్చర్యంగా ఆండర్సన్ వైపు చూస్తూ అంటాడు.
షీల్డ్ దగ్గర ఉన్న మీడియా....
మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. ఈ రాత్రి గడిస్తే ఏమవుతుందో అన్న భయం అందరి కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సోల్జర్స్ వాళ్ళని వెళ్లిపోవాలని చెప్తాడు. మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగగా నాకు తెలీదు అని సమాధానమిస్తారు.
ఆ సోల్జర్స్ వారిని త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పి అందరు అక్కడి నుండి వెళ్ళిపోగానే మీడియాలో ఒకడు "అయిపోయింది అంతా అయిపోయింది వీళ్ళు కూడా ఏం చెయ్యలేకపోతున్నారు. ఇక మానవ జాతి మొత్తాన్ని వాళ్ళు చంపేస్తారు" అని భయంతో ఏడుస్తూ ఉంటాడు.
అతని ఛానల్ సంబంధించిన క్రూ మెంబెర్స్ తనని ఓదారుస్తుంటారు. మిగతా వాళ్లంతా కెమెరాస్ ని అతని వైపే తిప్పి చూస్తుంటారు. ప్రపంచమంతా అతని బాధని చూస్తుంటుంది. నిజానికి వాళ్ళ మనసులో మెదులుతున్నది కూడా ఇదే.
అప్పుడే మీడియాలో ఒకరు షీల్డ్ వైపు తీక్షణంగా చూస్తూ తన పక్కన ఉన్న వాళ్ళతో "షీల్డ్ లోపల ఎవరో ఉన్నారు" అనగానే కెమెరాస్ అన్ని అటు వైపు షిఫ్ట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న వాళ్లంతా ఆ లైవ్ ని వీక్షిస్తుంటారు. చీకట్లో చాలా దూరంలో ఉండడం వలన వారెవ్వరికి అతని మొహం కనిపించదు అతను మనిషి అని మాత్రమే తెలుస్తుంది.
స్పేస్ షిప్ లో.... 
స్పేస్ షిప్ లో ఉన్న మర్ఖద్వ ఏదో ఆలోచిస్తుంటే రాయిస్ "ఏమైంది ప్రభు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు " అని అడుగుతాడు.
అందుకు మర్ఖద్వ "నా అన్న నా దగ్గర ఈ లోహం గురించి ఏదో విషయాన్నీ దాస్తున్నాడు అనిపిస్తోంది  ఈ పని అయిపోగానే అదేంటో కనుక్కోవాలి ఒకవేళ మా కంటే శక్తివంతులు ఉంటే వాళ్ళని వెతికి కనిపెట్టి చంపెయ్యాలి" అని అంటాడు.
మర్ఖద్వ సైనికులతో "తెల్లవారగానే బయలుదేరండి, ఈ గ్రహంలో ప్రతి మూల వెతకండి సముద్ర గర్భాల్లో, అడవుల్లో, నేలల్లో దాక్కున్న వెతికి వేటాడండి. ఈ గ్రహంలో ఉన్నవారందరిని చంపేసే మనం మళ్ళీ మన గ్రహానికి వెళ్ళాలి." అంటాడు ఆక్రోశంగా. సైనికులంతా మర్ఖద్వ పేరును కీర్తిస్తుంటారు.
బార్బెరా అక్కడ ఉండకుండా వేరే చోటుకి వెళ్లి మోకాలి మీద కూర్చుని "ఇదంతా నేనే చేశాను నా వల్లనే ఇప్పుడు ఈ గ్రహం అంతం అవ్వబోతోంది" అంటూ ఏడుస్తుంటాడు.
అప్పుడే ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ మర్ఖద్వ వద్దకు వచ్చి మర్ఖద్వతో "ప్రభు షీల్డ్ ని దాటి ఒకడు మన స్పేస్ షిప్ వైపే వస్తున్నాడు" అని అంటాడు.
"షీల్డ్ దాటాడా, అది అసాధ్యం ఇప్పటి వరకు ఏ గ్రహాలోను ఎవ్వరు దాన్ని దాటలేదు" అని అంటూ కంగారుగా రాయిస్ మర్ఖద్వ వైపు చూస్తే మర్ఖద్వ చిరునవ్వు నవ్వుతుంటాడు. రాయిస్ కు ఆశ్చర్యం వేస్తుంది.
స్పేస్ షిప్ లో ఉన్న వారంతా కిందకి ల్యాండ్ అయ్యి చూస్తారు. కల్కి ఆ స్పేస్ షిప్ వైపే నడుచుకుంటూ వస్తుంటాడు.
కల్కి ఆ శవాలని చూస్తూ స్పేస్ షిప్ వైపు నడుస్తూ ఉంటాడు. వాటిని చూస్తున్న కొద్దీ తనలో బాధ, కోపం ఇంకా ఎక్కువవుతుంది.
తను అలా నడుస్తూ ఉండగా తన ముందు ఉన్న శవాలలో ఒక శవం చేయి చాచి ఒక చిన్న బాబు వైపు ఉండడం చూస్తాడు. బహుశా తను ఆ బాబు తల్లి అయ్యుంటుంది అనుకుంటాడు. ఆ బాబు గుండె బయటికి వచ్చి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన కల్కికి కన్నీళ్లు ఆగవు.
కల్కి ఆ బాబుని ఎత్తుకుని తన తల్లి వద్దకు చేరుస్తాడు. కల్కి కన్నీళ్లు ఆపుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్లడం ప్రారంభిస్తాడు.
కల్కి ఎప్పుడైతే షీల్డ్ ని దాటాడో మర్ఖద్వకు అర్థమైంది తనే ఆ శక్తివంతుడు అని.
కల్కి మర్ఖద్వకు కాస్త దూరంలో ఉండగా మర్ఖద్వ తనను చూసి గర్వంతో నవ్వుతూ గట్టిగా "ఎట్టకేలకు నేననుకున్న రోజు వచ్చింది, ఇన్నాళ్ళకి నాతో సరిసమానంగా పోరాడగల శక్తివంతుడు దొరికాడు. మన మధ్య జరిగే ఈ యుద్ధం ఈ విశ్వంలోనే అత్యంత గొప్పదవుతుంది" అంటూ కల్కి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు.
కల్కి అవేమి పట్టించుకోకుండా స్పేస్ షిప్ వైపు నడుస్తుంటాడు. తనకు ఆ మాటలు అర్థం కాకపోయినా పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు కల్కికి కావాల్సింది తన వాళ్ళను చంపినందుకు ప్రతీకారం మాత్రమే.
మర్ఖద్వ అలానే కల్కి వైపు వచ్చి తన పిడికిలి బిగించి తను చేతి వేళ్ళకు వేసుకున్న ఆ లోహంతో కల్కి తలను కొట్టాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా కల్కి ఆ దాడి నుండి తప్పించుకుంటూ తన ఎడమ వైపుకు జరిగి తలను కుడి వైపుకు తిప్పుతాడు.
క్షణాల్లోనే కల్కి తన కాలితో మర్ఖద్వ మోకాలి వెనుక భాగాన కొట్టడంతో ఒంటి మోకాలి పై కూర్చుంటాడు. వెంటనే కల్కి తన కుడి చేయి నుండి ఒక మణి బయటకి వచ్చి దాని ద్వారా కత్తి తయారవుతుంది. కల్కి ఆ కత్తితో  "హర హర మహాదేవ" అంటూ కోపంతో మర్ఖద్వ మెడ వెనక భాగాన వేటు వేస్తుంటాడు.
బార్బెరా, కాస్సీ, డ్రాగల్ అక్కడ ఉన్న వాళ్లంతా కళ్ళార్పకుండా ఆత్రుతతో చూస్తుంటారు. మర్ఖద్వ శరీర దృఢత్వం తెలుసు కాబట్టి రాయిస్ కు ఆ వెయ్యి మంది సైన్యానికి మాత్రం ఎలాంటి దిగులు ఉండదు. షీల్డ్ బయట ఉన్న వాళ్ళు అక్కడ జరిగేది సరిగా కనిపించకపోయినా శిలలాగా ఉండిపోయి అలానే చూస్తుంటారు.
ఆ కత్తి వేటు పడగానే మర్ఖద్వ మెడ వెనక భాగాన్ని చీల్చుకుంటూ పోతుంది, తన తల శరీరం నుండి వేరయ్యి కింద పడుతుంది. ఒక్కసారిగా అందరు నోరెళ్ళబెట్టి షాక్ లో ఉండిపోతారు. ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా ఏలియన్ శరీరం కింద పడి ఉండడం చూసి షాక్ అవుతారు. 
అప్పటి వరకు రాయిస్ మర్ఖద్వను అమరుడు అనుకునేవాడు. తనను ఎవరు గాయపరచలేరు అనుకునేవాడు. కానీ ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతాడు. బార్బెరా కూడా అప్పటి వరకు మర్ఖద్వకు ఆ శక్తివంతుడు మధ్య గట్టి పోటీ జరుగుతుంది అనుకుంటాడు, కానీ ఒక్కసారిగా ఇంత సులువుగా అయిపోయేసరికి  షాక్ లో ఉండిపోతాడు.
కల్కి ఆ ఖడ్గాన్ని నేలకు ఆనిచ్చి ఆ ఖడ్గం పిడి భాగం మీద చేతులు వేసి తర్వాత ఎవరు అన్నట్టు వారి వైపు నిల్చుంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారికీ భయం మొదలవుతుంది. వెంటనే రాయిస్ కు ఒకానొక సందర్భంలో ఇక్కడ ప్రాణభిక్ష కోసం ఎలా అడుగుతారు అని అడగగా బార్బెరా చెప్పింది గుర్తుకు వచ్చి ప్రాణభిక్ష కోసం రెండు మోకాలి మీద కూర్చుని కల్కి ముందు తలను నేలకు ఆనిస్తాడు.
అది చూసి అక్కడ ఉన్న సైనికులు కూడా అలానే చేస్తారు. బార్బరా, డ్రాగల్, కాస్సీ మాత్రం కృతజ్ఞతభావంతో మోకరిల్లుతారు. ఆ దృశ్యాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మీడియా వాళ్ళు ఆ దృశ్యాన్ని కెమెరాలతో క్లిక్ మనిపించారు. 
అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను చంపిన ఆ రాక్షసుడిని చంపినందుకు ప్రజలు టీవీలో నుండే కల్కికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంకొంతమంది దేవుడే అతనిని పంపించాడనుకొని దేవుడికి మొక్కుతారు. 
 వాళ్ళు మోకరిల్లాక కల్కి ఆ కత్తిని వదిలేస్తాడు, ఆ కత్తి కింద పడి మాయమైపోతుంది. వెంటనే కల్కి మాయమవుతాడు. కల్కి మాయమైపోవడం చూసి వెళ్లిపోయాడనుకొని అందరు పైకి లేస్తారు. అప్పుడు అందులో ఉన్న ఒక సైనికుడు షీల్డ్ వైపు చూపిస్తూ పైకి చూపిస్తాడు.
కల్కి షీల్డ్ పైన ఒంటి మోకాలి మీద కూర్చుని ఒక గుద్దుతో ఆ షీల్డ్ ని గుద్దుతాడు. ఆ షీల్డ్ మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుండి మాయమైపోతాడు. అందరు మర్ఖద్వ శరీరాన్ని తీసుకుని వారి గ్రహానికి వెళ్ళిపోతారు.
పొద్దున అవ్వగానే అన్ని న్యూస్ పేపర్స్ లో అన్ని న్యూస్ చానెల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు. 
నిజానికి అప్పుడే వాళ్లలో ఒక భయం మొదలవుతుంది. మొదటిది విశ్వంలో వాళ్ళు ఒంటరి వాళ్ళం కాదు అని, తమలాంటి బుద్ధి జీవులు కూడా ఉన్నారని, వాళ్ళు తమ కంటే సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి చెందిన వారని,  తెలుస్తుంది. వాళ్ళు తలుచుకుంటే వారిని చంపెయ్యగలవు అని అర్థమవుతుంది.
రెండో భయం ఏంటంటే అంతటి అభివృద్ధి చెందిన ఏలియన్స్ ని కూడా సులువుగా ఓడించిన వాడు తమ మధ్యలోనే ఒక సామాన్యుడిగా తిరుగుతున్నాడన్న విషయం, అతనే దేశాలని మెల్లగా ఆక్రమించుకుంటున్నాడన్న విషయం వారిని ఇంకా భయపెడుతుంది.
కొన్ని దేశాల్లో ఆ conspiracy theory నిజమని తెలియడంతో ఆ శక్తివంతుడి గురించి మరింత తెలుసుకోవడం మొదలుపెడతాయి. వారి టేబుల్ మీద ఆ శక్తివంతుడి సంబంధించిన ఫైల్ కూడా చేరుతుంది. ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి దేశాలు.
లండన్ లోని ఒక నిర్జన ప్రదేశంలో.... 
మాఫియా డాన్ జార్జ్ లైన్ అతని కొడుకు ట్రెవర్ లైన్ తో ఒక అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో తమ ముందు ఒక రేడియో పెట్టుకుని వెయిట్ చేస్తుంటారు.
"డాడ్ మనం వచ్చి దాదాపు గంట అయింది, నాకు బోరింగ్ గా ఉంది అస్సలు మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అస్సలు మనం ఎవరిని కలవబోతున్నాం" అంటాడు ట్రెవర్ విసుగ్గా జార్జ్ వైపు చూస్తూ.
" చూడు ట్రెవర్ నువ్వు నా తర్వాత ఈ కుర్చీలో నా ప్లేస్ లో ఉండాల్సిన వాడివి నువ్వన్నీ నేర్చుకోవాలి అందులోను ఓపిక అనేది చాల అవసరం" తన కొడుకు భుజం మీద చేయి వేస్తూ అంటాడు జార్జ్.
"ఓకే డాడ్ నాకు అర్థమైంది కనీసం మనం ఎవరి కోసం ఇక్కడికి వచ్చామో అదైనా చెప్పండి" అంటాడు ఆతృతతో.
"సరే చెప్తాను కానీ మనం ఇక్కడికి వచ్చినట్టు నువ్వు ఎవరితో చెప్పకూడదు ఈవెన్ నీ ఫ్రెండ్స్ కూడా " అంటాడు జార్జ్. ట్రెవర్ సరే అంటూ తల ఊపుతాడు.
"నీకు తెలుసు మన బిజినెస్ ఈ మధ్య డల్ అయిపోయింది మనం మన పట్టును కోల్పోతున్నాం ఒక్కడివల్ల. వాడిని నేను ఇన్నాళ్లు అబద్ధం అనుకున్నాను. కానీ ఈ మధ్యనే తెలిసింది వాడు నిజమని" అని అంటుండగా ట్రెవర్ ఆపుతూ.
"ఆ conspiracy person, ఆ ఏలియన్ ని ఓడించిన వాడి గురించేనా డాడ్ నువ్వు మాట్లాడేది " అని అడుగుతాడు
"అవును వాడే మనం చేసే డ్రగ్ ట్రాఫికింగ్, అర్మ్స్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్నిట్లోనూ మన వాళ్ళని చంపేస్తూ వచ్చాడు. ఇప్పుడు వాడిని చంపేస్తే గానీ మనం మళ్ళీ పుంజుకోలేం. అందుకే వాడెవడో కనిపెట్టి వాడిని చంపేసే ఒక assassin ని మనం కలవబోతున్నాం" అని అంటాడు జార్జ్ కోపంతో.
"డాడ్ అతనొక సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరో అతన్నెలా మనం చంపించగలం. అస్సలు అతనిని చంపబోయేది ఎవరు" అని అడుగుతాడు ట్రెవర్
జార్జ్ తన కొడుకు వైపు చూస్తూ "బ్లాక్ డ్రాగన్ ఫ్లై" అని అంటాడు. తను ఆ పేరు చెప్పేటప్పుడు తన మొహం లో చిరునవ్వు కనపడుతుంది.
ట్రెవర్ ఆలోచిస్తూ "నేను తన గురించి చాలా సార్లు విన్నాను. తను ఇప్పటి వరకు చాల మందిని చంపింది. తనను ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. తను ఇప్పటికి మేల్ ఆర్ ఫిమేల్ అనేది ఎవరికీ తెలీదు. తనకు ఆ పేరు కూడా ఎలా వచ్చిందో తెలుసు. నిజానికి డ్రాగన్ ఫ్లై అనే పురుగు చాలా వేగంగా చాలా చురుకుగా వేటాడతుంది. అది ఎప్పటికి తన ఎరను మిస్ చెయ్యదు."
"అవును అందుకే తనకు బ్లాక్ డ్రాగన్ ఫ్లై అనే పేరు వచ్చింది. నిజానికి ఆ పేరు ఒకప్పటి ఈ కుర్చీలో కూర్చున్న విల్ఫ్రిడ్ ని చంపినందుకు వచ్చింది. ఆ పని చేయించింది కూడా నేనే. విల్ఫ్రిడ్ చనిపోయాక నాకు ఈ పోసిషన్ వచ్చింది"
"విల్ఫ్రిడ్ అంటే హుబెర్ట్ వాళ్ళ నాన్న కదా" అంటూ ఏదో ఆలోచిస్తూ "డాడ్ కాని ఆ డ్రాగన్ ఫ్లై ఈ మధ్య చనిపోయారు అని చెప్పడం విన్నాను"
"అవును తను కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు అందువలన చనిపోయింది అని అనుకున్నారు కానీ తను  బ్రతికే ఉన్నారని తెలిసింది"
"మీరు తనని ఎలా కాంటాక్ట్ అయ్యారు"
"డార్క్ వెబ్ లో తన వెబ్సైట్ ఒకటి ఉంది అందులో తనతో మాట్లాడాలనుకునేవాళ్ళు ఆ వెబ్సైటు లో తను కొన్ని కోఆర్డినెట్స్ పెడుతుంది ఆ కోఆర్డినెట్స్ తెలుసుకుని అక్కడికి వెళ్తే తను రేడియోలోని ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు కనెక్ట్ అవుతుంది తను రీసెంట్ గా కొత్త కో ఆర్డినెట్స్ పెట్టడంతో తను న్క బ్రతికే ఉన్నారని అర్థమైంది" 
"డాడ్ మరి వెబ్సైటు ఉంటె తన ఐపీ అడ్రెస్స్ ఎక్కడుందో తెలిసిపోతుంది కదా"
"నార్మల్ బ్రౌసర్ లో ఉండే వెబ్సైట్స్ తెలుస్తాయి కానీ డార్క్ వెబ్ లో ఉండే వెబ్సైట్స్ యొక్క ఐపీ అడ్రస్ ని ఎవరు కనుక్కోలేరు" అని అంటాడు. ట్రెవర్ మళ్ళీ ఏదో అడగబోతుంటే రేడియో నుండి సౌండ్ రావడం మొదలవుతుంది.
వెంటనే జార్జ్ ట్రెవర్ ని సైలెంట్ గా ఉండమని చెప్పి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ని చేంజ్ చేస్తుంటాడు. అప్పుడు బ్లాక్ డ్రాగన్ ఫ్లై కి కనెక్ట్ అవుతుంది.
"బ్లాక్ డ్రాగన్ ఫ్లై, మాట్లాడి చాలా కాలం అయింది ఎలా ఉన్నారు" అంటాడు జార్జ్.
"డైరెక్ట్ విషయానికి వచ్చేయండి" అని రకరకాల వాయిసెస్ చేంజ్ అవుతూ వినపడుతుంది.
"హలో డ్రాగన్ ఫ్లై మీ గురించి నేను చాలా విన్నాను నేను మీకు పెద్ద ఫ్యాన్. ఇంతకూ మీరు మగవారా లేక ఆడవారా" అని అడుగుతాడు ట్రెవర్ ఉండబట్టలేక.
"మీకు కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఉంది" అని మళ్ళీ రకరకాల వాయిసెస్ చేంజ్ అవుతూ వినపడుతుంది.
జార్జ్ ట్రెవర్ ని సైలెంట్ గా ఉండమని చెప్పి డీల్ మాట్లాడతాడు. యాభై వేల కోట్లకు డీల్ కుదురుతుంది.
"ఇంతకు మీరు తనని ఎప్పుడు చంపేస్తారు" అని అడుగుతాడు ట్రెవర్.
దానికి డ్రాగన్ ఫ్లై వెటకారంగా "రేపే అతను నా దగ్గరికి వచ్చి నేనే ఆ ఏలియన్ ని చంపేసింది, నేనే దేశాలని ఆక్రమించుకుంటున్నది  అని చెప్తాడు కదా ఆ మరుక్షణమే చంపేస్తా" అని సమాధానం వస్తుంది.
అప్పుడు జార్జ్ "ట్రెవర్ మనకే అతనెవరో ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పటివరకు అతను కేవలం ఒక ఇండియన్ అని మాత్రమే తెలుసు అంత మంది ఉన్న జనాభాలో అతనిని కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి మనం తనకు కాస్త టైం ఇవ్వాలి" అంటూ డ్రాగన్ ఫ్లై తో "వాడు అలానే మాట్లాడతాడు నువ్వేం పట్టించుకోకు ఎంత టైం అయినా తీసుకోండి కానీ పని త్వరగా పూర్తి అయ్యేలా చూడండి" అనగానే రేడియో డిస్కనెక్ట్ అయిపోతుంది. 
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply
#27
prelude (నా మాటల్లో....)

ఇదొక ఫిక్షనల్ స్టోరీ. హిందూ మైథాలజీని జత చేసి రాస్తున్నది. కల్కి ఒక సామాన్యమైన మనిషి. తన చిన్నప్పుడే తల్లి తండ్రులను కార్ ఆక్సిడెంట్ లో కోల్పోయి తన తాతయ్య దగ్గర ఉంటాడు. 
తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వలన తను పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ ఈ లోకాన్ని చూసే దృష్టి మారిపోతుంది. కలియుగం దాదాపు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. ఇప్పటి వరకు కేవలం అయిదు వేల సంవత్సరాలు మాత్రమే గడిచాయి ఇది మొదటి పాదం అంటారు. ఎక్కడ చూసినా మనుషుల్లో పెరిగిన స్వార్థం వలన యుద్ధాలు, గ్లోబల్ వార్మింగ్, ఆకలి చావులు, ఉగ్రవాదం పెరిగిపోతుంటాయి.  
కలియుగం చివరిలో కల్కి వచ్చేంత వరకు అస్సలు మనుషులు ఉంటారా అన్న సందేహం తనని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడే కల్కి వీటిని మార్చాలనుకుంటాడు. చెడ్డవాళ్ల వలనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళను చంపేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అని బలంగా నమ్ముతుంటాడు.
కానీ తనకు తెలుసు ఈ ప్రపంచాన్ని మార్చడం ఆంత తేలిక కాదని తెలుసు. తనకు ఖచ్చితంగా దేవుడి సాయం కావాలని అనుకుంటాడు. అందుకే దేవుడి కోసం అన్వేషించడం మొదలు పెడతాడు. అలా సాగిన తన ప్రయాణంలో తనకు శ్రీ కృష్ణుడి సాక్షాత్కారం లభిస్తుంది.
కల్కికి విశ్వకర్మ చేత తయారు చెయ్యబడిన ఒక మణిని ఇస్తాడు. అది ఒక నానో టెక్నాలజీ లాంటిది. దాని ద్వారా కల్కి కోరుకున్న ఆయుధం తయారవుతుంది. మళ్ళీ తను అనుకున్నపుడు ఆ ఆయుధం మాయమవుతుంది.
ఇదే కాక తనకు టెలిపోర్ట్ అయ్యే శక్తిని ఇస్తాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు తన దేహాన్ని వజ్రం లాగా దృఢంగా చేసే ఒక వ్రతం ఉంటుంది. నిజానికి ఆ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు కూడా చేసి తన శరీరాన్ని కూడా దృఢంగా మార్చుకుంటాడు. అందుకే ఆయన కూడా దుర్యోధనుడికి తన ప్రాణం తొడలో ఉన్నట్టే. శ్రీ కృష్ణుడికి తన కాలి బొటన వేలిలో ఉంటుంది.
ఆ విధంగా కల్కి కూడా తన శరీరాన్ని దృఢంగా మార్చుకుంటాడు. తనని ఏ ఆయుధాలు ఏమి చెయ్యలేవు.
ఇక కల్కి తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇండియాతో పాటు దాదాపు నలభై దేశాల్లో తన గవర్నమెంట్ ని తీసుకొస్తాడు. ఆ దేశాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. ఆకలి చవులు లేకుండా చేస్తాడు. వారికి విద్య, వైద్యం అందిస్తుంటాడు. డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ లాంటి వాటిని ఎన్నిటినో నాశనం చేస్తాడు.
అప్పుడే ఆ conspiracy theory మొదలవుతుంది. కానీ దాన్ని చాలా మంది నమ్మరు, కొట్టి పారేస్తారు. ఇంకొంతమంది నమ్మే వాళ్ళు కూడా ఉంటారు.
కల్కి మాత్రం తన పని తాను చేసుకుని వెళ్తుంటాడు. కల్కికి అధికారం మీద, పేరు ప్రఖ్యాతలు మీద ఆశ ఉండదు.తను తన పని పూర్తి చేసుకుని ఎవ్వరికి తెలీకుండానే వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే తనకొక సమస్య వస్తుంది ఎక్కడి నుండో ఒక ఏలియన్ వచ్చి మారణహోమం సృష్టిస్తాడు.
అప్పుడే మొట్టమొదటిసారి కల్కి ప్రపంచానికి పరిచయం అవుతాడు. తన ఉనికి ప్రపంచానికి తెలుస్తుంది.
కల్కి ఆ గ్రహాంతరవాసిని చంపాక అస్సలు సమస్యలు మొదలవుతాయి. అతనికి ఉన్న పవర్స్ వలన కల్కి ఎప్పటికైనా ప్రమాదమే అని ప్రపంచ దేశాలు నమ్ముతాయి.

కొన్ని దేశాలు ఈ విషయం మీదనే దృష్టి పెట్టడం మొదలుపెడతాయి. అలాంటి వాడి వలన ఎప్పటికైనా ప్రమాదమే అని అతను ఎవరో కనుక్కుని చంపెయ్యాలనుకుంటాయి. అందులో అమెరికా, చైనా కూడా ఒకటి. 
మాఫియా వాళ్ళు తమ బిజినెస్ నాశనం అవుతున్న దానికి కారణం ఆ శక్తివంతుడే అని అర్థం అవుతుంది. వాళ్ళు కూడా అతనిని చంపేస్తే గాని మళ్ళీ తాము మునుపటి స్థితికి రాలేము అని మాఫియా డాన్ ఒక assassinని కల్కిని చంపడానికి పంపిస్తాడు.
ఇంకో సమస్య మఖ్రద్వ రూపంలో మొదలవుతుంది తన తమ్ముడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోడానికి మొదటిసారి తన పూర్తి సైన్యంతో భూగ్రహాన్ని దాడి చెయ్యడానికి బయలుదేరుతాడు.
అలాగే ఒక ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ రోబోట్ కూడా భూమి మీద ఉన్న మనుషులని చంపడానికి సిద్ధపడుతుంది. 
ఇన్ని సమస్యలని కల్కి ఎలా పరిష్కరించాడు. ఎలా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అన్నదే ఈ కథ.
కల్కిని చంపడానికి వచ్చిన assassin హీరోయిన్. తను, కల్కి ఒకరినొకరు వారి గురించి తెలీకుండానే ప్రేమించుకోవడం. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఇద్దరు వారి గురించి ఒకేసారి బహిర్గతం చేసుకోవడం.
ఆ తర్వాత కల్కి ఎవరో ప్రపంచానికి తెలిసిపోవడం, కల్కి ప్రపంచ దేశాల మీద మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించడం, శ్రీ కృష్ణుడు తనకు శక్తులిచ్చేటప్పుడు వారి మధ్య సంభాషణ ఉంటుంది. 
అండ్ ఆ లోహం గురించిన కథ కూడా హిందూ మైథాలజీకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో ఇలా ఇప్పటి వరకు ఈ స్టోరీ మీద త్రీ పార్ట్స్ రెడీగా ఉన్నాయ్. కాకపోతే నాకు తెలుసు స్టోరీని సరిగ్గా రాయడంలేదని అర్థమవుతోంది. 
అందుకే ఈ స్టోరీని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థాంక్ యూ అండి ఇప్పటి వరకు స్టోరీని చదివి లైక్స్, కామెంట్స్ పెట్టినందుకు. గుడ్ బై. 
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply
#28
మీకు తృప్తిగా లేదేమో మీరనుకున్న వాటిని కథలో చెప్పలేకపోతునందుకు, నాకైతే బానే అనిపించింది. బ్లాక్ డ్రాగన్ ఫ్లై సుపారి తీసుకుంది కదా, మరి మీరు గుడ్బాయ్ చేప్పేస్తే ఎలాగండి...ప్లీజ్, కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#29
Super excellent update

Please continue
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)