Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
20-04-2024, 11:12 PM
(This post was last modified: 19-05-2024, 03:40 PM by zenitsu_a34. Edited 1 time in total. Edited 1 time in total.)
Chapter (1) Apocalypse: where it begins?
మాండ్వాకా అనే గ్రహంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాల్లో ఒకటైన మఖండ్వా అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పాలిస్తున్న హురువు అనబడే వంశస్థులు. ఆ వంశంలోని వారంతా మిగతా రాజ్యాల్ని ఆక్రమించాలని ఎన్నో యుద్ధాలు చేసేవారు ఆ యుద్ధాల వలన ఎంతో మంది చనిపోయారు. కానీ ఎవరు ఆ గ్రహాన్ని పూర్తిగా గెలవలేకపోయారు. అయినప్పటికీ ఆ వంశమంటే ఇప్పటికి మిగతా రాజ్యాల వారికీ భయం ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ గ్రహంలో ఉన్న మంత్రవాదులు ఆ గ్రహానికి ఆపద రాబోతోంది అని గుర్తించి ఆ గ్రహంలో ఉన్న ఖంగ్వ అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ప్రదోత్య ని కలిసి ఈ విషయం గురించి చెప్తారు. అప్పుడు ప్రదోత్య హురువు వంశం వల్లే ఆ ఆపద రావొచ్చు అనుకోని ఆ వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని భావించి అన్ని రాజ్యాలని కలుపుకుని మఖండ్వా రాజ్యం పై యుద్ధానికి వస్తారు. అప్పటికే మఖండ్వా రాజ్యాన్ని పాలిస్తున్న హురువు వంశంలో అందరు చనిపోయుంటారు వారి వంశంలో చివరిగా మిగిలింది ఇద్దరు మాత్రమే.
ఒకరు యుక్త వయసు కూడా రాణి మఖ్రద్వ ఇంకొకరు మాటలు కూడా సరిగా రాణి మరుఖండ్వా ఆ వంశం మొత్తం నాశనం అవ్వాలని మఖండ్వా పైకి యుద్ధానికి వస్తారు. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాణి, యువరాజులు తల్లి (తాను ప్రదోత్య చెల్లెలు కూడా) ఐన ప్రత్యోస్తి యుద్ధానికి వెళ్తుంది. హురువు రక్తం తన కడుపులో ఉందని తెలిసి ప్రత్యోస్తి ని చంపేస్తారు. ఇదంతా చూస్తున్న ప్రదోత్య కూడా ఏమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు ఆ గ్రహాన్ని రక్షించడం ముఖ్యం కాబట్టి.
మఖండ్వా రాజ్యపు సేనాధిపతి ఇద్దరు యువరాజులతో : యువరాజ, మీరు తమ్ముడు ఈ అడవి ద్వారా తప్పించుకోండి, నేను అంతలోపు ఈ సైన్యాన్ని అడ్డుకుంటాను, పరిగెత్తండి అంటూ తన మీద కి వస్తున్నా శత్రు సైన్యాన్ని తన సైన్యం తో అడ్డుకుంటాడు . యువరాజు మరియు ఇంకా మాటలు కూడా రాణి తన తమ్ముడిని ఎత్తుకొని అడవి లోకి పరిగెత్తుతాడు . అడవిలో చాల దూరం తన తమ్ముడిని ఎత్తుకొని పరిగెత్తి అలసిపోతారు మఖ్రద్వ . ఈ లోపు చీకటి పడుతుంది.
మఖండ్వా రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని సేనాధిపతిని సైన్యాన్ని బంధించి ఆ రోజు రాజులందరూ మంత్రవాదులతో సమావేశమవుతారు . ఆ సమావేశంలో మంత్రవాదులకు నాయకుడు మరియు శక్తివంతుడైన మాంత్రికుడు ఇలా అంటదు : ఈ గ్రహానికి ఆపద ఇంకా పొంచి ఉంది చేదు సంకేతాలు ఇంకా కనబడుతున్నాయి శవాలతో నిండిపోవడం నాకు ఇంకా కనబడుతోంది అని అంటదు . అప్పుడు మహారాజుల్లో ఒకరు ఖచ్చితంగా ఇది ఈ వంశం వాళ్ళ వల్లే అయ్యుంటుంది ఈ వంశం లో వారంతా చనిపోయారు, ఆ ఇద్దరినీ కూడా చంపెయ్యడానికి మన సైన్యాన్ని తూర్పు భాగం వైపున్న అడవుల వైపు పంపించాం వాళ్ళని రేపటిలోగా పట్టుకొని చంపేస్తారు అంటదు . ఆ తర్వాత మంత్రవాదుల్లో ఒకరు మనం వాళ్ళని మాత్రమే కాదు వారి పూర్వికులైన సమాధులని తవ్వి వాటిని కాల్చి బూడిద చెయ్యాలి అప్పుడు కానీ మనం ఈ ఆపద నుండి బయటపడలేం అని అంటారు అందుకు అందరు ఒప్పుకొని అందు కోసం వారి సమాధులని వెతికి కాల్చేయడం ప్రారంభిస్తారు.
హురువు వంశస్థుల సమాధులన్ని ఒకొక్కటిగా ఆ సమాధుల మీదున్న వారి విగ్రహాలని బట్టి వాటిని గుర్తించి తవ్వి కాల్చడం మొదలు పెడతారు . ప్రదోత్య మాత్రం తన చెల్లెల్ని గురించి బాధపడుతూ తన చెల్లెలి శవాన్ని కాల్చేస్తాడు.యువరాజు అడవిలో చాల దూరం పరిగెత్తి అలసిపోయి ఆ రోజు అడవిలోనే దిక్కు తోచని స్థితిలో ఎం చెయ్యాలో తేలిక ఉండిపోతాడు. ఆ రోజు అడవిలోనే తన తమ్ముడితో పాటు అక్కడే ఉన్న జంతువులని చంపి కడుపు నింపుకుంటారు ఇద్దరు. మరుఖండ్వా నిద్రపోతాడు కానీ మఖ్రద్వ తన తల్లి చివరిసారి తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు "మఖ్రద్వ నేనొకవేళ తిరిగి రాకపోతే బాధపడకు, తమ్ముడిని బాగా చూసుకో , ఇద్దరు కలిసే ఉండండి ఎం జరిగిన సరే హురువు వంశం మీతోనే అంతం అయిపోకూడదు " అని ఇద్దరు కొడుకుల మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అదే మఖ్రద్వ తన అమ్మ ను చుసిన చివరి చూపు . మఖ్రద్వ నిద్రలోకి జారుకుంటారు తెల్లవారుతుంది మఖ్రద్వకి మెలుకువ వస్తుంది .
తన తమ్ముడిని ఎత్తుకొని దగ్గరలో ఉండే నీటి కొలను లో నీళ్లు తాగుతుంటాడు ఆ సమయంలో పై నుండి ఒక గ్రహశకలం ఆ గ్రాహం పై పడుతూ ఉండటం నీటిలో చూస్తాడు . ఇటువైపు రాజులూ , ప్రజలు కూడా చూస్తుంటారు వాళ్ళు చివరి శవాన్ని అప్పుడే కాల్చేసి ఉంటారు. ఒక్కసారిగా అది దిశను మార్చుకుని మఖ్రద్వ తన మీదకి రావడం గమనిస్తాడు నిజానికి ఆ శకలం తమ పూర్వీకుడైన అతి భయఙ్కరమైన ఎలాంటి జాలి దయ లేని అతడి వంశస్థుడు సమాధి మీద పడాలి కానీ ఆ సమయానికే ఆ మహారాజులు మంత్రవాదులు కలిసి అతడి సమాధి ని తవ్వి ఆ శరీరాన్ని కాల్చేస్తారు . అందువల్ల ఆ గ్రహశకలం దిశా మార్చుకుని తన మీదకు వస్తుంది అక్కడి నుంచి పరిగెత్తి కొద్దీ దూరం వెళ్ళగానే ఆ గ్రహ శకలం నీటి కొలను మీద పడి నీరు మొత్తం ఇంకిపోతాయి .ఆ నీటి కొలను దగ్గరగా ఉండడం వలన తాను ఎగిరిపడి చెట్టుకు తగులుకుంటాడు .
తనకు తన తమ్ముడికి కొన్ని గాయాలు అవుతాయి . తన తమ్ముడి తల మీద కారుతున్న రక్తాన్ని తుడుస్తాడు. ఆలా తుడుస్తున్న తన చేతి మీద కూడా గాయం ఐ రక్తం కారుతుంటుంది అని తెలుసుకుంటాడు . అప్పుడు తాను ఆ నీటి కొలను వైపు చూస్తాడు అక్కడ పడిన ఆ గ్రహ శకలం దగ్గరకు వెళ్తే అందులో ఒక లోహం మెరుస్తూ ఉంటుంది. తన గాయమై రక్తం కారుతున్న చేతితోనే ఆ లోహాన్ని ముట్టుకుంటాడు .తన రక్తం ఆ మెరుస్తున్న లోహం పై పడగానే వెంటనే అతను, అతను ఎత్తుకున్న తన తమ్ముడు ఇద్దరు వేరే లోకానికి వెళ్లారు. వాళ్ళ శరీరాలు అక్కడే ఉన్న వాళ్ళ మైండ్ presence వేరే చోటు ఉంటుంది. యువరాజు చుట్టూ చూస్తుంటాడు తాను ఎక్కడున్నాడో తనకేమి అర్థమవ్వదు . ఆలా చూస్తుండగా తనకు దూరంగా ఒక సింహాసనం కనిపిస్తుంది . ఆ సింహాసనం నుండి ఒక రకమైన శబ్దం వినిపిస్తుంటుంది ఎవరో బాధ తో నొప్పి తట్టుకోలేక అరుస్తున్న శబ్దం అది. అది ఆ ఉన్న చోటంతా వ్యాపిస్తూ ఉంటుంది . ఆలా తాను ఆ సింహాసనాన్ని చూస్తుండగా వెనకనుండి ఒకరు : నువ్విప్పుడు మహాప్రభువు సింహాసనం ముందు ఉన్నావు, మోకరిల్లు అని ఒక ఆడగొంతు వినిపిస్తుంది తాను ఆలా చెప్పి అక్కడ నెల మీద కొడుతోంది అప్పుడు ఒక ప్రకంపన వాళ్ళ యువరాజు ఒంటి మోకాలి మీద కూర్చుంటాడు .
వెనక ఇద్దరు నడుచుకుంటూ యువరాజు పక్కనుంచి వెళ్లి ఎదురుగ మహాప్రభువు సింహాసనం ముందు ఉన్న ఎనిమిది సింహాసనాల్లో వారి వారి స్థానాల్లో కూర్చుంటారు . అందులో ఒకరు : మహాప్రభువు లోహం ఒక చిన్న పిల్లోడికి దక్కింది అని నిరాశపడతాడు. అప్పుడు అక్కడ ఉండే ఇంకొకరు ఏది ఏమైనా మనం చెయ్యాల్సిన పని మనం చెయ్యాలి అని చెప్పి ఆ యువరాజుతో ఈ లోహం నిన్ను ఎంచుకోవడం వాళ్ళ నువ్వు శక్తివంతుడివి అయ్యావ్ ఈ లోహాన్ని తాకడం వాళ్ళ నీ శరీరం కూడా ఈ లోహం లగే ధృద్ధమైనదిగా శక్తివంతంగా తయారయింది అని చెప్తుంది . ఈ లోహం తో నువ్వు ఆయుధాల్ని తయారు చేసుకోవచ్చు అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించవచ్చు అని చెప్తుంది .ఈ మాటలు అన్ని వింటున్న యువరాజుకు తనకు తెలియని భాషలో మాట్లాడుతున్న తనకు ఎలా అర్థమవుతోందో అర్థం కావడం లేదు . ఆలా అంత విన్న తరవాత తాను మల్లి తన గ్రహంలోకి వస్తాడు . తన ఒంటి మీద గాయాలన్ని నయమవుతాయి . ఆలా ఆ లోహంతో తాను ఒక ఖడ్గాన్ని తయారు చేసుకుంటాడు . అప్పుడే ఆ గ్రహశకలం పడిన చోటు తెలుసుకొని అక్కడికి వచ్చిన సైనికులు తనని చంపడానికి ప్రయత్నిస్తారు అప్పుడు యువరాజు అందరిని చంపేస్తాడు వాళ్ళతో పోరాడే తప్పుడు తన మీదకు ఎన్నో సార్లు ఆయుధాలు తగిలిన తనకు ఒక్క చిన్న గాయం కూడా
అవ్వదు . ఆలా తన తమ్ముడికి కూడా ఒక కవచాన్ని తయారు చేస్తాడు . ఆలా ఒక్కడే తన రాజ్యాన్ని తిరిగి దక్కిచుకోవడానికి తన రాజ్యానికి వెళ్తాడు.తన సేనాధిపతి తన సైన్యాన్ని తిరిగి విడిపిస్తాడు . ఆ లోహ ప్రభావం వాళ్ళ అతను ఇంతకూ ముందు కంటే క్రూరంగా మారుతుంటాడు...
Posts: 11,805
Threads: 0
Likes Received: 6,555 in 4,957 posts
Likes Given: 64,704
Joined: Feb 2022
Reputation:
86
Good starting
Posts: 2,158
Threads: 147
Likes Received: 7,119 in 1,372 posts
Likes Given: 4,035
Joined: Nov 2018
Reputation:
545
Dear Zenitsu
చేరిన వెంటనే ఓ కథ మొదలుపెట్టావు, సంతోషం. కథనం బాగుంది.
కథకు వీలైతే తెలుగులో పేరు పెట్టమని సూచన.
గ్రహాంతర కథ...ఆసక్తికరంగా ఉంది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,194
Threads: 0
Likes Received: 2,317 in 1,748 posts
Likes Given: 356
Joined: May 2021
Reputation:
25
Posts: 1,552
Threads: 2
Likes Received: 2,195 in 1,103 posts
Likes Given: 2,695
Joined: Nov 2018
Reputation:
45
INTERESTING STORY LINE. పెర్లే కొద్దిగా నాలుక తిరక్కుండా ఉన్నాయి. కొనసాగించండి
: :ఉదయ్
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(21-04-2024, 02:36 AM)sri7869 Wrote: Good starting
thank you sri7869 garu
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(21-04-2024, 06:42 PM)k3vv3 Wrote: Dear Zenitsu
చేరిన వెంటనే ఓ కథ మొదలుపెట్టావు, సంతోషం. కథనం బాగుంది.
కథకు వీలైతే తెలుగులో పేరు పెట్టమని సూచన.
గ్రహాంతర కథ...ఆసక్తికరంగా ఉంది.
thank you k3vv3 garu
tappakunda telugu peru pedtanandi
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(23-04-2024, 02:09 PM)BR0304 Wrote: Nice start
thank you andi BR0304 garu
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(23-04-2024, 07:46 PM)Uday Wrote: INTERESTING STORY LINE. పెర్లే కొద్దిగా నాలుక తిరక్కుండా ఉన్నాయి. కొనసాగించండి
thank you Uday garu
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
అలా సాగిన తన ప్రయాణంలో అందరి రాజులను మంత్రవాదులను తన రాజ్యానికి నాశనం చెయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ రాజుల భార్య పిల్లల్ని వారి బంధువుల్ని అందరిని ఎలాంటి జాలి లేకుండా ఊచకోత కోస్తాడు. ఆలా ఎన్నో ఏళ్ళు సాగిన యుద్ధాల్లో చివరికి తాను యుక్త వయసుకు వచ్చేసరికి అన్ని రాజ్యవంశాలను నాశనం చేసి అన్ని రాజ్యాలు తన రాజ్యంలో భాగం చేస్తాడు అలా ఆ గ్రహాన్ని ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలిస్తుంటాడు. ఇటువైపు తన తమ్ముడైన మరుఖండ్వాకి తమ కంటే బలవంతులు ఎవరు ఉండకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఒకసారి పోటీల్లో అందరిని ఒకడు ఓడిస్తాడు తనని అప్పటి వరకు ఎవరు ఓడించి ఉండరు ఆ గ్రాహంలోనే బలవంతుడు అనే పేరు అందువల్ల అతనితో పోటీకి దిగుతాడు మరుఖండ్వా అతనిని ఓడించి చంపేస్తాడు. ఆలా మరుఖండ్వా బలవంతులం అని చెప్పుకుని తిరిగే వాళ్ళందిరిని పోటీకి పిలిచి చంపేస్తుంటాడు. మరుఖండ్వాకి ఒకరు ఏడుస్తున్న, ఒకరిని హింసించి ప్రాణం పోయేటప్పుడు చూడటం అన్న చాలా ఇష్టం. ఈ విధంగా మరుఖండ్వా కూడా చాలా క్రూరంగా మారిపోతుంటాడు.మఖ్రద్వకి ఆ లోహం గురించి అతను చుసిన వాళ్ళ గురించి వెతకడం ప్రారంభిస్తాడు. అందుకోసం మఖ్రద్వ ఆ గ్రహంలో శాస్త్రజ్ఞులని ఏర్పాటు చేస్తాడు. వారు పరిశోధనలు చేస్తూ ఒక గ్రహాన్ని దాటి అంతరిక్షం లోకి ప్రయాణించే స్సెషిప్స్ని కనుక్కుంటారు అలా కొంతమందిని పంపించి వేరే గ్రహాల్లోని జీవరాసులని వెతకమని మఖ్రద్వ పంపిస్తుంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఒకానొక సమయంలో ఒక గ్రహంలో జీవం ఉందని వారికి తెలుస్తుంది.
క్లోత్రాస్ అని పిలవబడే ఆ గ్రహంలో అనుకున్న రూపానికి మారిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళు క్లోత్రసిస్ అని పిలుచుకుంటారు. వారిని బంధించి ఆ గ్రహాన్ని ఆక్రమించుకుంటారు. ఆ గ్రహానికి మహారాజును చంపేస్తారు. ఆ మహారాజుకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు. ఆ గ్రహంలో ఉండే యూత్ ని మొత్తం తమ గ్రహానికి తీసుకుని వెళ్తారు అందులో మహారాజు కొడుకు కూడా ఉంటాడు, ఆ గ్రహంలో ఉండే దివ్యంగులని, వాళ్ళు ఎలాంటి రూపానికి మారలేరు కాబట్టి వారి వాళ్ళ ఎలాంటి ఉపయోగం లేదని వారిని అందరిని చంపేస్తారు. అందులో మహారాజు కూతురు కూడా ఉంటుంది. రూపాన్ని మార్చుకునే వాళ్ళని ఒక టీంగా ఏర్పర్చి వాళ్ళ మీద ఎన్నో ప్రయోగాలు చేసి వాళ్ళు ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ లాగా మారేలా ట్రైనింగ్ ఇస్తారు. అలా వారిని ఒక టీంకి ముగ్గురు ఉండేలా చేసి వారిని అన్ని వైపులా జీవరాశుల్ని వెతకడానికి పంపిస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జీవరాశులు ఉండే గ్రహాల్ని కనిపెట్టి అక్కడ వారిలో ఒకరిగా కలిసిపోయి వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పంపించాలని, లేదంటే మీ వాళ్ళని చంపేస్తాం అని బెదిరిస్తారు. అలా వాళ్ళు స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు.
మరుఖండ్వాకి వేరే గ్రహంలో కూడా బలవంతులు ఉంటారని వాళ్ళని ఓడించాలనే బుద్ధి పుడుతుంది. అందుకు తన అన్నతో "అన్న వేరే గ్రహాన్ని ఆక్రమించే బాధ్యత నాకు ఇవ్వు అక్కడ ఉండే వాళ్లలో బలవంతులు ఉండచ్చు అందుకోసం నేను వస్తాను నేను వాళ్ళని ఓడిస్తాను " అని అంటాడు. కానీ మఖ్రద్వకు భయం తన తమ్ముడికి ఏమైనా అవుతుందేమో అని ఎందుకంటే ఆ లోహం తనకు లొంగింది కానీ తన తమ్ముడికి కాదు తనకేమైనా అవుతుందేమో అని అనుకుంటాడు కానీ తమ్ముడు అడిగేసరికి కాదనలేక పోతాడు. మరుఖండ్వా తన అన్నతో "అన్న భయపడకు నాకేమి కాదు మన కన్నా శక్తివంతులు మన కన్నా బలవంతులు ఈ విశ్వంలోనే లేరు ఒకవేళ ఉంటె వాళ్ళని చంపేస్తాను" అనగానే.మఖ్రద్వకి ఆ లోహం ఇచ్చిన వాళ్ళు గుర్తుకు వస్తారు ఈ విషయం తన తమ్ముడికి తెలిస్తే వాళ్ళను చంపడానికి వెతుక్కుంటూ వెళతాడని అది ప్రమాదమని ఈ విషయం మరుఖండ్వాకి చెప్పడు. మరుఖండ్వా ఈ మాట చెప్పేటప్పుడు తన అన్న మొహం మారిపోవడం గమనిస్తాడు తన అన్న ఏదో దాస్తున్నాడని అర్థం అవుతుంది. మఖ్రద్వ ఒప్పుకోవడంతో వేరే గ్రహాల్ని ఆక్రమించడానికి వెళ్తాడు. ఈ విధంగా 5 గ్రహాలని ఆక్రమించుకొని అందులో ఉండే బలవంతులని లేదా ఆ గ్రహానికి చెందిన రాజులను పోటీకి పిలిచి వారిని ఓడించి చంపేస్తాడు.
ఈ విధంగా 6 వ గ్రహం గురించి తెలుసుకుని వెళ్తారు. ఆ గ్రహం పేరు గ్జియం. ఆ గ్రహాన్ని అర్త్రిస్, జోర్, ఒఓనీల్ అనే ముగ్గురు అన్నదమ్ములు పరిపాలిస్తుంటారు. మఖ్రద్వ ఆక్రమించే ఏ గ్రహానికైనా వచ్చినప్పుడు అతని spaceship చుట్టూ ఒక వరిథాకారంలో షీల్డ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ షీల్డ్ కొన్ని కిలోమీటర్స్ వరకు చుట్టూ వ్యాపించి ఉంటుంది. అది తన దగ్గరున్న లోహంతో దాన్ని తయారు చేస్తాడు. ఆ షీల్డ్ దాటి లోపలికి వచ్చి వారితో యుద్ధం చేయమని 3 రోజుల సమయం ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఎవరు ఆ షీల్డ్ ని దాటి లోపలికి వచ్చి ఉండరు.అన్ని గ్రహాల్లో లాగానే ఇక్కడ కూడా అలానే చేస్తాడు. ఎన్ని ఆయుధాలు ప్రయోగించిన ఆ షీల్డ్ ని దాటలేకపోతారు. 3 రోజుల సమయం తర్వాత యుద్ధం మొదలవుతుంది అర్త్రిస్ సైన్యం అంత చనిపోతారు. యుద్ధం ఓడిపోతారు. ముగ్గురు అన్నదమ్ముల్ని బంధిస్తారు. మరుఖండ్వా వాళ్ళని పోటీకి పిలుస్తాడు. అయితే పోటీ రేపనగా, దానికి ముందు రోజు మఖ్రద్వ అన్నదమ్ముల వద్దకు వస్తాడు. తనతోపాటు క్లోత్రసిస్ ఒకడు భాషని translate చేయడం కోసం ఉంటాడు.
మఖ్రద్వ : రేపు జరగబోయే పోటీల్లో నా తమ్ముడి చేతుల్లో మీరు ఓడిపోవాలి, లేదంటే మీ గ్రహం మొత్తాన్ని నాశనం చేస్తా అని అంటాడు. దానిని క్లోత్రసిస్ ట్రాన్సలేట్ చేస్తాడు. వాళ్లకు అర్థమైన కూడా ముగ్గురు మౌనంగా ఉండిపోతారు. నిజానికి ఇంతకు ముందు మరుఖండ్వా తో పోటీ పడిన వాళ్ళందిరిని ఇలానే బెదిరించి ఓడిపోయేలా చేస్తాడు. ఈ విషయం మరుఖండ్వా కి తన అనుచరుడు ఐన రాయిస్ ద్వారా తెలుస్తుంది.
మరుఖండ్వా : నా అన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు తనకు నా మీద ఎందుకు నమ్మకం లేదో తెలీట్లేదు. నన్ను ఎందుకు ఒక చేతకానివాడిలా చూస్తున్నాడో తెలియట్లేదు. ఇన్నాళ్లు నేను ఓడించిన బలవంతులు అందరిని నేనే ఓడించాను అనుకున్న. నన్ను నేను బలవంతుణ్ణి అనుకునే వాడిని. కానీ ఇదంతా నా అన్న వలన అని బాధపడతాడు. కొద్దిసేపు తర్వాత తేరుకొని కోపంతో ముగ్గురు అన్నదమ్ముల్ని బంధించిన చోటు వెళ్తాడు.
వాళ్ళతో మరుఖండ్వా : రేపు జరగబోయే పోటీలో మీరు మీ పూర్తి బలాన్ని ఉపయోగించి నా మీద దాడి చెయ్యండి. మీరు ఒకవేళ నన్ను ఓడిస్తే ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతాం కానీ నా అన్న బెదిరించాడని కావాలని ఓడిపోతే మాత్రం మీ ప్రజలందరినీ చంపేస్తా అని అంటాడు.
అర్త్రిస్ : మేము దీనికి ఒప్పుకుంటున్నాం కానీ మాదొక షరతు.
మరుఖండ్వా : ఏమిటది
అర్త్రిస్ : మా పూర్వీకులకు తరతరాలుగా ఉన్న ఒక గొడ్డలి ఉంది దానిని పోటీకి అనుమతించాలి అని అంటాడు. మిగతా తమ్ముళ్ళిద్దరు అన్న వైపు ఆశ్చర్యంగా చూస్తారు. మరుఖండ్వా ఒప్పుకుంటాడు
మరుఖండ్వా వెళ్ళిపోయాక జోర్ తన అన్నతో : అన్న నువ్వేం మాట్లాడ్తున్నావో అర్థమవుతుందా ఆ గొడ్డలి పట్టుకున్న వాళ్ళు ఏమవుతారో నీకు తెలుసు కదా. ఆ ఆయుధం పట్టుకున్న వాళ్లకు గెలుపు ఖాయం కానీ దానికి బదులుగా వాళ్ళ ప్రాణం పోతుంది. ఇంతకూ ముందు ఆ గొడ్డలి తీసుకున్న మన పూర్వికులు ఏమయ్యారో నీకు తెలుసు కదా. దీనికి మేము అస్సలు ఒప్పుకోము.
ఒఓనీల్ తన అన్న జోర్ చెప్పినదానికి మద్దతు ఇస్తూ : అవును అన్న మేము దీనికి అస్సలు ఒప్పుకోము. అలా అయితే మనం ముందే ఆ షీల్డ్ ని ధ్వంసం చేయడానికి కూడా తీసుకోలేదు ఎందుకంటే మాకు మీ ప్రాణాలు ముఖ్యం అని అంటాడు.
అర్త్రిస్ : అదే మనం చేసిన తప్పు మనం ఆ ఆయుధాన్ని వాడుంటే ఇంత దూరం వచుండేదే కాదు ఇంత మంది ప్రాణాలు పోయేవే కాదు. ఇక అలా జరగకూడదు మన ప్రాణాలు పోయిన పర్లేదు మనం వాళ్ళని ఓడించడం కాదు ఇద్దరు అన్నదమ్ములని చంపెయ్యాలి. లేదంటే వీళ్ళ వల్ల ఇంకెంతోమంది ప్రాణాలు పోతాయి అని అంటాడు. అర్త్రిస్ మాటలకూ ఇద్దరు సరే అని అంటారు. కొద్దిసేపటికి మరుఖండ్వా భోజనం తీసుకుని వస్తాడు. మరుఖండ్వా అనుచరుడు రాయిస్ : తినండి స్వయంగా యువరాజే మీ కోసం వేటాడి తీసుకుని వచ్చాడు అని అంటాడు. మరుఖండ్వా : ఈ గ్రహంలో ఎక్కువ తినే ఆహరం ఇదే అని తెలిసింది అందుకే వేటాడి తీసుకు వచ్చాను కనిపించిన వాటిల్లో ఇదే బలిష్టంగా ఉంది. రేపు మీరు పోరాడటానికి బలం ఉండాలి కదా తినండి అని అంటాడు. మీకు ఇంకా ఏం కావాలన్నా సరే అడగండి నేను తెప్పిస్తాను కానీ రేపు జరిగే పోటీలో నన్ను ఓడించడానికి మీ శక్తినంతా ఉపయోగించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ముగ్గురు ఆ ఆహరం తినేస్తారు. ఆహరం తిని జోరు మరియు ఒఓనీల్ నిద్రపోతారు. అర్త్రిస్ మాత్రం ఆ రాత్రంతా ఎదో ఆలోచిస్తూ ఉండిపోతాడు.
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
పోటీ మొదలవుతూ ఉంటుంది చుట్టూ జనం ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముల్ని తీసుకుని వస్తారు. దూరం నుండి నలుగురు ఆ గొడ్డలిని లాక్కొని వస్తారు. అర్త్రిస్ ఆ గొడ్డలిని అందుకుంటాడు. అంత బరువున్న గొడ్డలిని అర్త్రిస్ మాత్రమే మోయగలడు. ఆ గొడ్డలిని చూడగానే ప్రజలంతా ఒక్కసారిగా గట్టిగ కేకలు వేయడం మొదలుపెడతారు.
మఖ్రద్వ తన పక్కనున్న ఒక క్లోత్రసిస్ తో అదేంటని అడుగుతాడు. అప్పుడు ఆ క్లోత్రసిస్ : ప్రభు, ఆ గొడ్డలి వాళ్ల పూర్వీకుల ది, ఆ గొడ్డలి అంతరిక్షం నుండి పడిన ఒక లోహం నుండి తయారు చేసారు అని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా మఖ్రద్వ కి భయం మొదలవుతుంది అది చూడటానికి తన దగ్గరున్న లోహం లాగా లేకపోయినా అంతరిక్షం నుండి అనగానే భయం మొదలవుతుంది వెంటనే మఖ్రద్వ అక్కడున్న క్లోత్రసిస్ తో : మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అరుస్తాడు. క్లోత్రసిస్ : క్షమించండి ప్రభు, మరుఖండ్వా యువరాజు కి చెప్తే నేను చూసుకుంటా అని చెప్పాడు. మఖ్రద్వ తన మనసులోనే " మరుఖండ్వా ఎంత పని చేసావ్ " అని అనుకుంటుండగా పోటీ మొదలవుతుంది.
అర్త్రిస్, జోర్, ఒఓనీల్ ముగ్గురు ఒకేసారి మరుఖండ్వా మీద దాడి చేస్తారు. ముగ్గురి దాడుల్ని తప్పించుకుంటాడు. మరుఖండ్వా వద్ద తన అన్న లోహంతో తయారు చేసిన కవచం మరియు చేతి వేళ్ళకి తొడుక్కుని ఒక ఆయుధం ఉంటుంది. ఇటువైపు మరుఖండ్వా కూడా దాడి చేస్తుంటే ముగ్గురు కూడా తప్పించుకుంటారు. ఇలా చాలాసేపు భీకరంగా పోరాడ్తుంటారు. అర్త్రిస్ గొడ్డలితో దాడి చేయబోయిన ప్రతిసారి ప్రజలు కేకలు వేస్తుంటారు కానీ ఆ దాడుల్ని మరుఖండ్వా తప్పించుకుంటాడు. అయితే ఒక్కసారిగా జోర్ మరియు ఒఓనీల్ మరుఖండ్వా ని మోకాలి మీద కూర్చోపెట్టి వెనకనుండి భుజాల్ని నేల మీదకి ఆనేల అదిమిపట్టుకుంటారు. తాను విడిపించుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ వాళ్ళు బలంగా పట్టుకోవడం వల్ల విఫలం అవుతాడు. ఇది చూసి వెంటనే మఖ్రద్వ సైనికుల్ని పోటీని ఆపమని పంపిస్తాడు. వాళ్ళు వస్తుండగా అర్త్రిస్ వెంటనే గొడ్డలి పైకి ఎత్తి ఒక్క ఉదుటన పైకి ఎగురుతాడు. ఒక్కసారిగా ప్రజలంతా అరుపులు కేకలతో ఆ చోటంతా ప్రతిధ్వనిస్తుంది ప్రతి ఒక్కరు వాడిని చంపెయ్ వదిలిపెట్టకు అని అరుస్తుంటారు. గాలిలో ఉన్న అర్త్రిస్ సరాసరి మరుఖండ్వా మీద వెనుకభాగాన గొడ్డలితో వేటు వేస్తాడు.
ఎప్పుడైతే ఆ గొడ్డలి మరుఖండ్వా చర్మానికి తగుల్తుందో వెంటనే ఆ గొడ్డలి తునాతునకలు అయిపోతుంది. అది చూసి ఒక్కసారిగా అందరు నిస్చేష్ఠులవుతారు. ప్రజలంతా ఇది చూసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొద్దిసేపు అర్త్రిస్ కి ఏమి అర్థం అవ్వదు. మఖ్రద్వ ఆలోచనలో పడిపోతాడు. నిజానికి ఆ లోహం వల్ల తనకే కాదు మరుఖండ్వా శరీరం కూడా దృఢమైంది. కానీ ఎలా ఆ రోజు కేవలం తన రక్తం ఆ లోహం పై పడటం వల్ల అది తనకు లొంగింది ఆ లోహం శక్తులన్నీ తనకు వచ్చాయి కానీ తన తమ్ముడికి ఎలా అని గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు అర్థం అవుతుంది తనకు నిజానికి ఆ రోజు తన రక్తం తో పాటు తన తమ్ముడి రక్తం కూడా తన చేతికి ఉంది. అంటే మరుఖండ్వా కూడా తన లాగే అనుకుంటుండగా. మరుఖండ్వా ఒక్కసారిగా పైకి లేస్తాడు జోర్ ని పక్కకి తోసి ఒఓనీల్ ని పట్టుకుని నేలకు అదిమి పెట్టి తన తలని గట్టిగ పట్టుకుంటాడు. ఒఓనీల్ తల పగిలిపోతుంది. మొహమంతా ఛిద్రమవుతుంది. ఒక్కసారిగా అర్త్రిస్, జోర్ ఇద్దరు షాక్ అవుతారు వారి కళ్ళ వెంట నీరు కారడం మొదలవుతుంది. కానీ జోర్ వెంటనే తేరుకుని మరుఖండ్వా వైపుకి దాడి చేస్తాడు. మరుఖండ్వా ఒక్క గుద్దు గుద్దుతాడు వెంటనే జోర్ ఎగిరి పడి గోడకు తగులుకుంటాడు. మరుఖండ్వా జోర్ వైపు వచ్చి తన తలను గోడకు అదిమి పిడి గుద్దులు గుద్దుతాడు. గోడతోపాటు తన తల కూడా పగిలిపోయి చనిపోతాడు. చివరిగా మిగిలింది అర్త్రిస్ మాత్రమే. మరుఖండ్వా తన వైపుకు వస్తుంటాడు. అర్త్రిస్ మాత్రం అలాగే ఉండిపోతాడు. తన కళ్ళకు ఇంకా తన తమ్ముల చావులు కనపడ్తున్నాయి. అర్త్రిస్ తన వైపు వస్తున్నా మరుఖండ్వా తో : నా ప్రజల్ని వదిలేయమని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. మరుఖండ్వా అర్త్రిస్ ని పిడికిలితో ఒక్కో చోట గుద్దుతాడు. ఎముకలు అన్ని విరిగిపోతాయి. అర్త్రిస్ కోన ఊపిరి తో ఉంటాడు. తనని ఒక మాంసం ముద్దా లాగా చుట్టి దూరంగా విసిరేస్తాడు. ఇది చుసిన ప్రజలంతా నిస్చేష్ఠులవుతారు. పోటీ ముగిసింది. అన్ని గ్రహాల్లో లాగానే ఇక్కడ కూడా ఒక వర్గాన్ని పక్కకి తీసి వాళ్ళని చంపేస్తారు. ఆ గ్రహంలో ఉండే విలువైన వస్తువులని తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ గ్రహం కూడా వాళ్ళ ఆధీనం లోకి వస్తుంది. మాండ్వాకా గ్రహానికి వచ్చిన తర్వాత మరుఖండ్వా అన్న తో మాట్లాడడు. ఇంకా తన అన్న మీద కోపం ఉంటుంది.
అయితే ఒకరోజు మరుఖండ్వా కి ఒక గ్రహం లొకేషన్ తెలుస్తుంది. అది పంపించింది ఒక క్లోత్రసిస్. అతను ఎవరో కాదు క్లోత్రాస్ మహారాజు కొడుకు బార్బెరా. మరుఖండ్వానే బార్బరా ని ఈ విశ్వంలో నే శక్తివంతుడిని వెతికి కనుక్కుని చెప్పమని పంపిస్తాడు. ఆ క్లోత్రసిస్ చెప్పిన దాన్నిబట్టి ఒక చోట ఒక శక్తివంతుడు ఉన్నాడని తెలుస్తుంది. వెంటనే తన అన్నకు చెప్పకుండా తన తో పాటు తన అనుచరుడు రాయిస్ ని మరియు నైపుణ్యం ఉన్న 100 సైన్యాన్ని తీసుకుని ఆ లొకేషన్ కి బయల్దేరతాడు. అయితే విషయం తెలుసుకున్న మఖ్రద్వ వాళ్ళు ఎక్కడున్నా వెతకండి అని కొంతమందిని పంపిస్తాడు. కొన్ని నెలల ప్రయాణం తర్వాత మరుఖండ్వా వాళ్ళు ఆ లొకేషన్ కి చేరుకుంటారు. బార్బెరా పంపించిన ఇన్ఫర్మేషన్ మరియు ఆ గ్రహం, దాని చుట్టూ ఉండే గ్రహాల hologram exact గా మ్యాచ్ అయ్యాయి. కొద్దిసేపటికి బార్బెరా ఆ గ్రహం నుండి మరుఖండ్వా వచ్చిన spaceship లోకి వెళ్తాడు.
మరుఖండ్వా : ధన్యవాదాలు క్లాత్రోసిస్ నా కోసం ఇంత కష్టపడినందుకు అని చెప్పి, నా అన్న నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు నేనెంటో తనకు చూపిస్తాను. ఈ గ్రహంలో ఉండే ఆ శక్తివంతుణ్ణి అంతం చేసి ఈ గ్రహం మొత్తాన్ని నాశనం చేస్తాను ఈ గ్రహంలో జీవించే ప్రతి ఒక్క జీవిని చంపేస్తాను. నేనేంటో నా బలం ఏంటో నా అన్నకు నిరూపిస్తాను అని తన దగ్గరున్న ఆ గ్రహం hologramని పట్టుకుని గట్టిగ నవ్వుతాడు.
రాయిస్ : ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ప్రభు. మీ శక్తి ఏమిటో అందరికి తెలిసే సమయం వచ్చింది ఈ గ్రహానికి పట్టే గతితో అది చూడబోతోంది. ఇంతకీ నాశనం అవ్వబోతున్న ఈ గ్రహం పేరేమిటి?
బార్బెరా : ఎర్త్
Posts: 11,805
Threads: 0
Likes Received: 6,555 in 4,957 posts
Likes Given: 64,704
Joined: Feb 2022
Reputation:
86
Nice update
Posts: 1,552
Threads: 2
Likes Received: 2,195 in 1,103 posts
Likes Given: 2,695
Joined: Nov 2018
Reputation:
45
సూపర్, ఇప్పుడు భూమి పైన యుద్దం మొదలౌతుందా
: :ఉదయ్
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(26-04-2024, 09:32 PM)sri7869 Wrote: Nice update
thank you for commenting
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
(29-04-2024, 09:21 AM)Uday Wrote: సూపర్, ఇప్పుడు భూమి పైన యుద్దం మొదలౌతుందా
thank you for comment
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
Chapter 2) the vengeance
ఇప్పటి వరకు మనం మఖ్రద్వ మరుఖండ్వా point of view లో ఈ స్టోరీ ని చూసాం. ఇప్పుడు బార్బెరా point of view లో చూద్దాం
ఒక అన్న తన చెల్లెల్ని తన భుజాల మీద మోసుకుంటూ పచ్చటి పచ్చికబైళ్ల మీద సంతోషంగా పరిగెడుతూ ఉంటాడు. తన చెల్లెలు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అన్న అలసిపోవడం వలన తన చెల్లెల్ని అక్కడే పచ్చ గడ్డి మీద కుర్చోపెడతాడు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. కొద్దిసేపటి తర్వాత తన చెల్లెలు అక్కడే తిరుగుతున్న ఒక కీటకాల గుంపుని చూస్తూ ఉంటుంది. అవి చాల అందంగా ఉంటాయి. తన అన్న అది గమనించి : బరోరి, అది కావాలా అని వేలు ని వాటి వైపు చూపిస్తాడు. బరోరి అవును అన్నట్టు తల ఊపుతుంది. వెంటనే తను అటువైపు వెళ్లి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అవి అంత సామాన్యంగా ఎవరికీ దొరకవు. ఎంతో కష్టపడి ఒక దాన్ని పట్టుకుని తన చెల్లెలి దగ్గరికి తీసుకుని వస్తాడు. బరోరి తన అన్న తన కోసం చేసిన కష్టానికి కేరింతలు కొడ్తుంది. బరోరి ఆ కీటకాన్ని అందుకొని దాని రెక్కలను చూస్తుంటుంది. చాల అందంగా ఉన్నాయ్ అవి, బహుశా ఆ క్లోత్రాస్ గ్రహంలో అందమైన కీటకాలు అవేనేమో. కొద్దిసేపు అలా దానిని పట్టుకోవడం వల్ల అది రెక్కలు ఆడిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని బాధ చూడలేక వెంటనే బరోరి దానిని వదిలేస్తుంది. వెంటనే తన అన్న : అరే ఏంటి బరోరి ఇలా చేసావ్ నేనెంతో కస్టపడి తెస్తే అని తన అసహనం వ్యక్తం చేస్తాడు అప్పటివరకు తన కష్టాన్నంతా వృథా చేసినందుకు. అప్పుడు బరోరి : క్షమించు అన్నయ్య దాని బాధ చూడలేక అయినా ఏ జీవికైనా దానికి ఇష్టమొచ్చిన చోటికి తిరగాలనే ఆశ ఉంటుంది మనం ఆ స్వేచ్ఛ దూరం చేయకూడదు కదా ఎలాగో నాకు ఆ స్వేచ్ఛ లేదు అని తన చచ్చుబడిపోయిన కాళ్ళ వైపు చూసుకుంటుంది. వెంటనే తన అన్న తనను కౌగిలించుకొని : ఇంకెప్పుడు అలా మాట్లాడకు నువ్వెక్కడికి వెళ్లాలన్న నేనే తీసుకుని వెళ్తాను సరేనా ఇంకెప్పుడు అలా తల్చుకుని బాధపడకు అని అంటాడు. అదే సమయంలో దూరంగా ఒక వస్తువు పైనుండి రావడం చూస్తాడు. ముందు అది ఒక ఉల్క అనుకుంటాడు కానీ అది దగ్గరికి వస్తున్నకొద్దీ నెమ్మదిగా రావడం మొదలవుతుంది…
బార్బెరా : ప్రొద్దున్నే అలారమ్ మోగడంతో నిద్ర లేచాను. ఈ గ్రహానికి వచ్చి దాదాపు రెండేళ్లయింది. అమెరికా లోని న్యూయార్క్ నగరం లో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పటినుండి ఇవే జ్ఞాపకాలు కలల రూపంలో వస్తున్నాయి. అలాగే లేచి ఆఫీస్ కి రెడీ అయ్యాను. నా రూమ్ లో నుండి బయటికి రాగానే
కాస్సీ : గుడ్ మార్నింగ్ యువరాజ
డ్రాగల్ : గుడ్ మార్నింగ్ యువరాజ అంటూ పలకరించారు.
ఇద్దరు నాతో పాటు ఈ గ్రహానికి వచ్చారు.
బార్బరా : మార్నింగ్ అని రెడీ అవుతున్నాను.
ఇద్దరు 8 నెలలుగా లివిన్ లో ఉన్నారు. వారికీ ప్రైవసీ కావాలని వేరే చోట ఉండమని నేనే పంపించాను. ప్రతిరోజు వచ్చి నాకు కావాల్సిన పనులు చేసిపెడ్తుంటారు.
కాస్సీ : యువరాజ మీకు శాండ్విచ్ చెయ్యమంటారా
బార్బెరా : చేయి కాస్సీ అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను
డ్రాగల్ : యువరాజ నిన్న ఉతికిన మీ బట్టలన్నీ డ్రై చేసి ఐరన్ కూడా చేసేసాను అని బట్టలని రూమ్ లో పెట్టడానికి వెళ్ళాడు.
అప్పుడే కాస్సీ శాండ్విచ్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నేను ఆ శాండ్విచ్ తింటూ డ్రాగల్ చెప్పినదానికి అవన్నీ నేనే చేసుకుంటాను అన్నాను అయినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు డ్రాగల్. ఆ తర్వాత వాళ్ళు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసారు.
నేను వెళ్తుండగా కాస్సీ : యువరాజ రేపు సండే కాబట్టి మేము బయటికి వెళ్లాలనుకుంటున్నాం మాకు అనుమతివ్వండి అని అడిగింది.
ఇంకా చాల సేపటినుండి ఉన్న కోపాన్ని ఆపుకోలేక : చూడండి మొదటిది మీరు నాకు ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు ఇక రెండోది ఇక్కడ మీరు స్వేచ్చాజీవులు మీరెక్కడికైనా వెళ్లొచ్చు దానికి నా అనుమతి అవసరం లేదు ఇంకా మూడోది నన్ను మీరు యువరాజ అని పిలవాల్సిన అవసరం లేదు ఇది మీకు చాల సార్లు చెప్పను ఇప్పుడు కూడా చెప్తున్నాను అని అరిచేసాను.
దానికి డ్రాగల్ : క్షమించండి యువరాజ మీ ఔదార్యానికి మేము కృతఙ్ఞులం కానీ మీరే మా క్లోత్రసిస్ కి ఎప్పటికైనా కాబోయే మహారాజు. మిమ్మల్ని మేము గౌరవించి తీరాలి అని ఎప్పటిలాగే వినయంగా సమాధానం ఇచ్చాడు.
వీళ్ళు మారరు అనుకుంటూ వెళ్లి టాక్సీ కోసం నిలబడ్డాను. పక్కనే డ్రాగల్ కూడా వచ్చి నిల్చున్నాడు. అతను కూడా నేను పనిచేసే ఆఫీస్ లోనే పనిచేస్తాడు. టాక్సీ ఆగింది డోర్ తీయబోతుంటే వెంటనే డ్రాగల్ కల్పించుకొని తానె డోర్ తీసాడు. చికాకుగా కార్ లో వెళ్లి కూర్చున్నాను. కిటికీ నుండి అక్కడి రద్దీ వాతావరణం చూస్తున్న ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నారు ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎన్నో గ్రహాలు చూసాను కానీ ఏ గ్రహంలోనూ ఇన్ని జాతులు ఇన్ని భాషలు, సంస్కృతులు నేను చూడలేదు. ఈలోపు ట్రాఫిక్ జాం అయింది.
డ్రాగల్ చికాకుగా : మళ్ళీ మొదలైంది మనం నడుచుకుంటూ పోయిన త్వరగా వెళ్లిపోవచ్చు అని అసహనం వ్యక్తం చేసాడు. తనకు ఈ గ్రహం అస్సలు నచ్చలేదు, ఎప్పుడెప్పుడు ఈ గ్రహం వదిలి వెళ్దామా అని ఎదురుచూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత మేము ఆఫీస్ కి వచ్చేసాం. ఒక డైలీ newspaper publishing కంపెనీలో పనిచేస్తున్నాం. నేను editor in chiefగా వర్క్ చేస్తున్న. ఆఫీస్ లోపలికి వెళ్తున్నప్పుడు
డ్రాగల్ : యువరాజ మీకొక విషయం చెప్పాలి. ఏమిటది అన్నట్టు చూసాను. డ్రాగల్ : నాకెందుకో క్రిస్టినా మేడం మిమ్మల్ని లవ్ చేస్తుందేమో అనిపిస్తోంది. తను ఆ కంపెనీ కి ఏకైక వారసురాలు అండ్ తానే ఇప్పుడు CEO తనెందుకు నన్ను ఇష్టపడుతుంది.
డ్రాగల్ : యువరాజ నేను చెప్పేది నిజం తను ఆఫీస్ లోపలికి వచ్చిన ప్రతిసారి మీ వైపే చూస్తూ ముందు మిమ్మల్నే విష్ చేస్తుంది. అయితే అన్నట్టు చూసాను. డ్రాగల్ : మీకింకా అర్థం కాలేదా, మనల్ని ఒకవేళ జనాలు ఉన్న రూమ్ లో పంపించారనుకోండి మనం ముందు వెతికేది మనకిష్టమైన వాళ్ళ కోసమే. కావాలంటే చూడండి ఇప్పుడు తను రాగానే ముందు మీ కోసమే చూస్తుంది. సరే అన్నట్టు నేను డ్రాగల్ తను రాగానే కనపడేట్టు ఉండకుండా ఒకవైపు నిలబడి ఉన్నాము. ఆరోజు ఫంక్షన్ ఉండటంతో అందరు అక్కడే ఉన్నారు. మేము వెయిట్ చేసిన ఒక 10 నిమిషాలకి తను ఆఫీస్ కి వచ్చింది. అందరు లేచి గుడ్ మార్నింగ్ చెబుతున్నారు. తను మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఆఫీస్ మొత్తం చూస్తోంది. వెంటనే నేను డ్రాగల్ తనకు కనపడేటట్టు కాస్త పక్కకి జరిగాము. అంతే తను వెంటనే నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చింది. డ్రాగల్ చూసారా అన్నట్టు నన్ను చూసి నవ్వుతున్నాడు. డ్రాగల్ చెప్పేది నిజమే నేను ఇన్నాళ్ల నుండి గమనించలేదు కానీ ఎలా ఎందుకు అని నాలోనే ప్రశ్నలు వేసుకున్నాను. ఈ రోజు ఫంక్షన్ ఉండడం వల్ల అందరు ఒకే చోట ఉన్నారు. ఫంక్షన్ ఎందుకంటే కంపెనీ no 1 పోసిషన్ కి వచ్చినందుకు. క్రిస్టినా కేక్ కట్ చేసి స్పీచ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేను నా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. మధ్యాన్నం క్రిస్టినా నా ఆఫీస్ రూమ్ కి వచ్చింది.
క్రిస్టినా : రాబర్ట్ (ఇక్కడ నా పేరు అదే) నువ్వు లంచ్ చేసావా?
బార్బెరా : ఇంకా లేదు క్రిస్టినా ఈరోజు బయటే తినాలి.
క్రిస్టినా : ఓకే నేను ఆర్డర్ చేశాను నా కేబిన్ కి వచ్చేయి కలిసి తిందాం.
బార్బెరా : ఒకే ఒక 5 minutes కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ చేస్కుని వచ్చేస్తాను అని అన్నాను ఒకే అంటూ తను వెళ్ళిపోయింది.
ఈ రెండేళ్లలో మేము ఫ్రెండ్స్ కూడా అయ్యాము కానీ మరీ అంత క్లోజ్ ఏం కాదు. నా వర్క్ పూర్తి చేసుకొని తన కేబిన్ కి వెళ్ళాను. ఇద్దరం తింటూ ఉండగా తనే సైలెన్స్ ని బ్రేక్ చేసింది
క్రిస్టినా : ఈరోజు నేను చాల హ్యాపీగా ఉన్నాను మా నాన్న ఇన్నాళ్ల కల నెరవేరింది. దీనికంతా నువ్వే రీసన్ ఈ కంపెనీ కోసం చాల కష్టపడ్డావ్.
రాబర్ట్ : అదేం కాదు నీ లీడర్షిప్ లోనే మేము ఇదంతా చేయగలిగాము.
క్రిస్టినా : అదేం కాదు అస్సలు రెండేళ్లలోనే editor in chief స్థాయికి వచ్చావ్ అంటేనే తెలుస్తుంది నీకెంత టాలెంట్ ఉందొ .సో ఇదంతా నీ వల్లనే.
అలా కొద్దిసేపు వాదించుకున్న తర్వాత.
రాబర్ట్ : మనం ఒకరికొకరం ఇలా క్రెడిట్ కోసం వాదించుకుంటూ ఈ కంపెనీ కోసం కష్టపడినా మిగతావాళ్ళ క్రెడిట్ ని కొట్టేస్తున్నామేమో అనగానే తను గట్టిగా నవ్వేసింది
క్రిస్టినా : సరే అయితే మనమంతా కలిసి ఇది సాధించాం ఒకే నా
రాబర్ట్ : నీ లీడర్షిప్ లో మనమంతా కలిసి ఇది చేసాం ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. నిజంగా క్రిస్టినా, sir ఉంటె నిన్ను చూసి చాల గర్వపడేవాడు.
క్రిస్టినా : yeah dad ఉంటే బాగుండేది ఈరోజుని ఇంకా బాగా సెలెబ్రేట్ చేసేవాడు ఇది ఆయన ఎన్నో ఏళ్ల కల అని మౌనంగా ఉండిపోయింది. క్రిస్టినా వల్ల నాన్న కొన్ని నెలల క్రితమే car accident లో చనిపోయాడు. ఇక ఆ తర్వాత మేము ఏమి మాట్లాడుకోలేదు లంచ్ అయినా తర్వాత నా రూమ్ కి వెళ్తూ తనతో ఈరోజు నువ్వు ఈ డ్రెస్సులో చాల బాగున్నావ్ అని అన్నాను. తను సిగ్గుపడుతూ thank you అని చెప్పింది. ఆ రోజు ఆఫీస్ అయిపోగానే నేను డ్రాగల్ ఒకేసారి బయటకి వచ్చాము.
డ్రాగల్ : యువరాజ అని నవ్వుతు చూసారా నేను చెప్పిందే జరిగింది తను మిమ్మల్ని ఇష్టపడుతోంది.
నిజమే ఈ రోజు తను ఎందుకో కొత్తగా కనపడుతోంది. ఇంటికి వెళ్లి freshup అయ్యాను. Night dinner కి ముగ్గురం కలిసాం.
డ్రాగల్ : యువరాజ ఈరోజు నాకు ఒక మెసేజ్ అందింది ఇప్పటి వరకు మొత్తం 6 గ్రహాలు ఆక్రమించుకున్నారు. ఎవ్వరు వాళ్ళని నిలువరించలేకపోయారు. మనం ఇక్కడికి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది ఇప్పటివరకు మనం ఎలాంటి శక్తివంతుడిని చూడలేదు.
కాస్సీ : అవును యువరాజ ఒకవేళ మనం వెతికేది శక్తివంతుడిని కాదేమో. ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేవలం శక్తివంతమైన దేశాలు మాత్రమే ఉన్నాయ్. ఒకవేళ ఆ మంత్రవాది మీతో చెప్పింది ఈ దేశాల గురించే ఏమో. America, russia, china ఇక్కడ ఉన్న మూడు శక్తివంతమైన దేశాలు. ఒకవేళ ఈ మూడు దేశాలు కలిస్తే మఖ్రధ్వని ఓడిస్తాయేమో.
డ్రాగల్ : ఈ మూడు కలవడమా అస్సలు జరిగే పని కాదు. russia, china కలుస్తాయేమో కానీ america వీటితో అస్సలు కలవదు.
కాస్సీ : కానీ ప్రాణం మీదకి వస్తే ఎవ్వరైనా ఒక్కటవుతారు కదా.
డ్రాగల్ : యువరాజ ఆ మంత్రవాది చెప్పిన గ్రహం ఇదే అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా
బార్బెరా : ఏమో తెలీదు నిజానికి ఆ మంత్రవాది మాట్లాడలేదు. మాండ్వాకా గ్రహంలో ఉండే మంత్రవాదులందరిని మఖ్రద్వ చంపేశాడన్నారు. చివరిగా మిగిలిన ఆ మంత్రవాదిని నాలుక కోసేసి ప్రాణాలతో వదిలేసాడు. అతను నాకు ఒక బొమ్మ వేసి చూపించాడు అంతే. ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అందులో మూడో గ్రహం అని చూపించాడు. అక్కడ జాతులు, సంస్కృతులు, భాషలు చాల ఉంటాయి అని చెప్పాడు. ఆ మంత్రవాదిని నేను నమ్మడానికి కారణం అతను నా గురించి అంత తెలుసన్నాడు నా లక్ష్యం ఏంటో కూడా చెప్పేసాడు. ఏదేమైనా కానీ మనం ఇంకొంత సమయం ఎదురు చూడటం తప్ప ఇంకేం చేయలేము అని అన్నాను. ఈలోపు మా dinner పూర్తయింది. ఇంకా ఆ రోజు జరిగిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. డ్రాగల్, కాస్సీ వాళ్ల అపార్ట్మెంట్ కి వెళ్లిపోయారు. ఇదే ఈరోజు జరిగిన ముఖ్యమైన సంగతులు అని చెప్పి తన డైరీని close చేసి నిద్రపోయాడు బార్బెరా.
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
ఆకాశం నుండి ఎదో వస్తుండడంతో బార్బెరా తన చెల్లిని ఎత్తుకుని దగ్గరికి వెళ్లారు అప్పటికే అక్కడ చాల మంది జనం గుమిగూడారు. ఆ వస్తువు చాల పెద్దదిగా ఉంది. అందులో నుండి కొంతమంది కిందికి వచ్చారు. వాళ్ళు చూడటానికి గ్రహాంతరవాసుల్లా ఉన్నారు. వాళ్ళేదో మాట్లాడుతున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు అక్కడి ప్రజలకు .కాసేపటికి అక్కడికి కొంతమంది సైనికులు వచ్చి వారిని మహారాజు జాబారా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వచ్చిన వాళ్ల భాష ఎవరికీ ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. కానీ మహారాజు కి ఒకటి మాత్రం అర్థమైంది వీరి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని. అందుకు జాబారా వాళ్ళు ఉండటానికి వసతి ఏర్పాటు చేసాడు. వాళ్ళు ఆ గ్రహం లోనే కొన్ని నెలల పాటు ఉండి అక్కడి భాష అక్కడి పరిస్థితుల్ని పూర్తిగా నేర్చుకుని తిరిగి వెళ్లిపోయారు. కొద్దీ రోజులకు వారు మళ్ళీ తిరిగి వచ్చారు కానీ ఈసారి వచ్చినవారు యుద్ధాన్ని కోరుకున్నారు. జాబారా అందుకు అంగీకరించలేదు అందుకు జాబారా ని చంపేసి పూర్తి గ్రహాన్ని ఆక్రమించుకున్నారు.ఆ తర్వాత వైకల్యం ఉన్నవారిని అందరిని చంపేశారు. అందులో బార్బెరా చెల్లెలు కూడా ఉంది. ఆ తర్వాత గ్రహం లో ఉన్న యుక్త వయసు వాళ్ళందిరిని తమ గ్రహానికి తీసుకుని వెళ్లారు. ఈ విధంగా బార్బెరా తన సొంత వాళ్ళని పోగొట్టుకున్నాడు. వారిని తన కళ్ళ ముందు చంపేస్తున్నా ఏమి చేయలేక పోయానని బాధ తనలో ఉంది.
అర్థరాత్రి suddenga కాల్ రావడంతో నిద్రలేస్తాడు బార్బెరా. చూస్తే ఆఫీస్ నుండి call వస్తుంది. మెయిన్ editors అందరికి ఆఫీస్ లో meeting ఉందని పిలుస్తారు. ఈ టైం లో మీటింగ్ ఏంటి అనుకుంటూ office కి వెళ్తాడు. బార్బెరా వెళ్లేసరికి క్రిస్టినా మీటింగ్ ఛాంబర్ లో మీటింగ్ స్టార్ట్ చేసి ఉంటుంది. బార్బెరా వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు.
క్రిస్టినా : ….Country ని పరిపాలిస్తున్న ఆ dictator ని ఎవరో చంపేశారు. ఒకే ఒక్క రోజులో ఆ Dictator Government పతనమై new government form అయింది. సో ఇప్పుడు మనం ఈ న్యూస్ ని front pageలో print చేస్తున్నాం సో దానికి కావాల్సిన వర్క్ అంత త్వరగా కంప్లీట్ చెయ్యండి. రేపు ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటుంది రేపు ఇదే అన్ని దేశాల్లో main news. సో మీరు front పేజీ లో రాయాల్సిన ఇంపార్టెంట్ మేటర్ Dictator వంశం గురించి వాళ్ల 3 generations వరకు ఆ దేశాన్ని ఎలా పరిపాలించారు అని అండ్ most important one ఆ dictator ని చంపింది ఎవరు. నేను mention చేసిన ఆ conspiracy theory రాయండి. మిగతా layout and desiging వర్క్ అంత రాబర్ట్ చెప్తాడు అని రాబర్ట్ వైపు చూసింది. రాబర్ట్(బార్బెరా) ఒకే అని తల ఊపాడు. క్రిస్టినా : ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చెయ్యండి మనకు ఎక్కువ టైం లేదు అని చెప్పి వెళ్తుంది. దాదాపు రెండు గంటలు editors వర్క్ చేసి రాబర్ట్ కు పంపిస్తే తను రాసిన కంటెంట్ ని సమీక్షించి అందులో ఉండే spelling and grammar mistakes ని చెక్ చేసి అంత ఓకే అనుకున్న తర్వాత publishing కి approve చేస్తాడు. పని అయిపోవడంతో తను కూడా ఇంటికి వెళ్తుంటాడు.
క్రిస్టినా : రాబర్ట్, ఇంటికే కదా నేను డ్రాప్ చేస్తాను car ఎక్కు అని అనగా రాబర్ట్ car ఎక్కుతాడు. అలా వెళ్తుండగా
రాబర్ట్ : క్రిస్టినా, నిన్ను ఒక విషయం అడగాలి.
క్రిస్టినా : చెప్పు రాబర్ట్
రాబర్ట్ : ఆ న్యూస్ గురించి డిటైల్డ్ గా చెప్పవా నేను కంటెంట్ ని కూడా సరిగ్గా చదవలేదు తొందర్లో జస్ట్ spelling and grammar మాత్రమే check చేసి పంపించేసాను అస్సలు విషయం ఏంటి.
క్రిస్టినా : ఆ Dictator వంశం లో మూడు generations ఆ దేశాన్ని పరిపాలించాయి అక్కడ అస్సలు ప్రజలకి, media కి ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఎవరైనా ఒక్కరు తప్పు చేసిన మిగతా వాళ్ల ఫామిలీ అందరిని కొన్ని తరాల వరకు jail punishment ఉండేది. అక్కడి ప్రజలకి బయట ప్రపంచానికి సంబంధం ఉండేది కాదు. అక్కడ ఉండే ప్రజలకి తినడానికి తిండి కూడా ఉండదు అయినా ఆ dictator ఆయుధాల పైనే ఎక్కువ ఖర్చు చేయడం లాంటివి చేసేవాడు. ఇన్ని అరాచకాలు చేస్తున్న ప్రపంచం లో ఎవ్వరు అతనిని ప్రశ్నించరు కారణం అతనికి china, russia support ఉండడం. అలాంటివాడిని ఈరోజు ఎవరో చంపేశారు అండ్ మిలిటరీ లో కూడా చాల మంది చనిపోయారు అని తెలిసింది, ఒక కొత్త గవర్నమెంట్ అక్కడ form అయింది. ఆశ్చర్యం ఏమిటంటే మిలిటరీ కూడా ఆ new government కి support గా ఉంది. ఆ dictator ఫామిలీ ఏమయ్యారో తెలీదు. అయితే పూర్తిగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామంటే ఇంకా ఆ దేశానికి ఎవ్వరిని allow చెయ్యట్లేదు. కానీ కొంత మంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఈ news నాకు తెలిసింది. అందుకే అప్పటికప్పుడు ప్రింటింగ్ ఆపేసాను.
రాబర్ట్ : ఒకే మరి ఆ conspiracy theory గురించి ఏంటి
క్రిస్టినా : ఈ మధ్య నేను గమనించిన విషయం ఏంటంటే గత 6 నెలలుగా ఇప్పటి వరకు 10 దేశాల్లో government change అయింది.అందులో అన్ని దేశాలు కూడా non developed countries ఒక్కటి తప్ప. అస్సలు ఇది coincidental గా జరిగిందా లేకపోతే ఏదైనా rebellion groups చేస్తున్నారా లేదంటే ఎవడో ఒకడు ఇదంతా చేస్తున్నాడా అని. ఒకవేళ rebellion group అయితే ఖచ్చితంగా ప్రపంచానికి తెలిసిపోతుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశాల్లో కొన్ని ప్రజాస్వామ్య దేశాలుగా ప్రకటించుకున్నాయి. సో అందుకే ఈ conspiracy theory గురించి mention చెయ్యమన్నాను.
రాబర్ట్ : ఒక్కటి తప్ప అన్నావ్ కదా ఆ ఒక్క దేశం ఏది.
క్రిస్టినా : అదే గవర్నమెంట్ change అయినా మొదటి దేశసం, ఇండియా. కొన్ని నెలల క్రితం ఆ దేశంలో ఉండే politicians అంతా చనిపోయారు అక్కడ కొత్తగా ఒక పార్టీ ruling లోకి వచ్చింది. అది చాల పెద్ద న్యూస్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ISIS terrorist group ఆ పొలిటిషన్స్ ని చంపింది మేమే అని ఒప్పుకున్నాయి.
రాబర్ట్ : మరి నువ్వేమనుకుంటున్నావ్ ఈ conspiracy theory ని నమ్ముతున్నావా.
క్రిస్టినా చిన్నగా నవ్వి : లేదు నేను నమ్మను. ఈ illuminati అని, world order అని, area 51
లో aliens ఉన్నాయ్ అని, repitilians అని, ఎలియెన్స్ మన మధ్యనే రూపాలు మార్చుకుని తిరుగుతున్నాయి అని ఇలాంటివన్నీ just మాట్లాడుకోటానికి బాగుంటాయి టైంపాస్ కి. నాకు వీటి మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ co incidence మాత్రమే.
ఈ లోపు ఇల్లు వచ్చేయడంతో రాబర్ట్ కార్ దిగి bye చెప్పి తన ఇంట్లోకి వస్తాడు. అప్పటికి 3 అవ్వడం తో వెళ్లి పడుకుందాం అని ట్రై చేస్తాడు కానీ తనకు నిద్ర రాదు. వీటి గురించే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ప్రొద్దున door bell మోగడంతో తలుపు తీస్తాడు.
కాస్సీ, డ్రాగల్ : good morning యువరాజ అంటూ విష్ చేస్తారు. వెంటనే వాళ్ళను కూర్చోబెట్టి విషయం అంతా చెప్తాడు.
డ్రాగల్ : అంటే మనం వెతుకుతున్న ఆ శక్తివంతుడే ఇదంతా చేస్తున్నాడా
కాస్సీ : అయితే మనం వచ్చింది కరెక్ట్ locationకే అనమాట, ఆ మాంత్రికుడు చెప్పింది నిజమే అంటూ ఆనందపడ్తుంది
డ్రాగల్ : యువరాజ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరుఖండ్వా కి మెసేజ్ పంపుదాం
బార్బెరా : లేదు డ్రాగల్, ఇది ఇంకా prove అవ్వలేదు. మనం తొందర పడితే ఈ గ్రహం మన వల్ల నాశనం అవుతుంది అది నాకు ఇష్టం లేదు. మనం వచ్చి రెండేళ్లు అయినా ఎందుకు వాళ్ళకి ఈ గ్రహం గురించి చెప్పలేదు తెలుసు కదా. మనం ఆ శక్తివంతుడు ఉన్నాడో లేడో తెలుసుకోవాలి అందుకు నా దగ్గర ఒక plan ఉంది అని బార్బెరా క్రిస్టినా కు call చేసి డిన్నర్ కి invite చేస్తాడు. బార్బెరా కాస్సీ, డ్రాగల్ తో : మీరు ఈ రోజు బయటికి వెళ్దాం అనుకున్నారు కదా cancel చేస్కోండి. కాస్సీ, డ్రాగల్ : ఓకే యువరాజ.
క్రిస్టినా ఆనందంతో వెంటనే తన bestfriend జెన్నిఫర్ కి call చేస్తుంది
క్రిస్టినా : హలో జెన్నీ ఈరోజు నేను చాల హ్యాపీ గా ఉన్నాను.
జెన్నిఫర్ : తెలుసులే కంపెనీ no 1 పోసిషన్ కి వెళ్ళింది అందుకే కదా.
క్రిస్టినా : అది మాత్రమే కాదు రాబర్ట్ నన్ను తన ఫామిలీ డిన్నర్ కి invite చేసాడు.
జెన్నిఫర్ : అయితే ఈరోజు తన famiy ముందే నీకు propose చేస్తాడేమో.
క్రిస్టినా : నిజంగా propose చేయడానికే invite చేసాడంటావా. అలా అయితే నువ్వు కూడా నాతో పాటు రా.
జెన్నిఫర్ : నేనెందుకు
క్రిస్టినా : ముందే తను propose చేస్తాడు అంటున్నవ్ నాకు భయంగా ఉంది సో నువ్వు కూడా ఉంటె నాకు ధైర్యంగా ఉంటుంది సో ప్లీజ్ నాతోపాటు రావా అయినా నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు.
జెన్నిఫర్ : ఓకే వస్తాను ఏడవకు. నా దగ్గర ఇప్పుడు car లేదు సో నన్ను వచ్చి పిక్ చేస్కో. ఓకే నాకు కొంచెం వర్క్ ఉంది సో bye.
క్రిస్టినా : ఓకే bye అని phone పెట్టేసి. ఎప్పుడెప్పుడు డిన్నర్ కి టైం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నైట్ అవ్వగానే క్రిస్టినా జెన్నిఫర్ ఇంటికి తనని పిక్ చేసుకోడానికి వెళ్తుంది. జెన్నిఫర్ car ఎక్కగానే
క్రిస్టినా : కొత్త black dress ఇందులో నేను ఎలా ఉన్నాను.
జెన్నిఫర్ : చాల బాగున్నావ్. నేను అబ్బాయిని అయ్యుంటే రాబర్ట్ ని సైడ్ చేసేసి నేనే పెళ్లి చేస్కునేదాన్ని.
క్రిస్టినా : shut up, అక్కడ కూడా ఇలాగె మాట్లాడావ్ అనుకో చంపుతా అని car ని start చేసి బయల్దేరతారు.దారిలో వెళ్తూ క్రిస్టినా : నిజంగానే propose చెయ్యడానికే పిలిచాడంటావా.
జెన్నిఫర్ : అయ్యుండొచ్చు ఒకవేళ ఫామిలీ ముందే propose చెయ్యాలి అనుకున్నాడేమో
క్రిస్టినా : నిన్న కూడా నన్ను ఫస్ట్ టైం పొగిడాడు
జెన్నిఫర్ : అవునా ఏమని
క్రిస్టినా : uncle ఉండుంటే నిన్ను చూసి చాల గర్వపడేవాడు అని ఆ తర్వాత ఈ dress లో చాల బాగున్నావ్ అని అన్నాడు
జెన్నిఫర్ : అయితే ఖచ్చితంగా నీకు ప్రొపొసె చెయ్యడానికే పిలిచి ఉంటాడు
క్రిస్టినా : అయితే ఈ లాస్ట్ three days నా లైఫ్ లో మోస్ట్ memorable days అవుతాయన్నమాట అని excite అవుతూ car స్పీడ్ పెంచుతుంది.
కాసేపటికి ఇద్దరు రాబర్ట్ ఇంటి ముందు ఆపుతారు. క్రిస్టినా car అద్దంలో అందంగా ఉన్నానో లేదొ అని చూసుకొని జెన్నిఫర్ తో పాటు కార్ దిగి రాబర్ట్ ఇంటి calling bell కొడుతుంది. రాబర్ట్ వచ్చి తలుపు తీస్తాడు తన ముందు ఉన్న క్రిస్టినా ను చూస్తూ అలాగే నిలబడిపోతాడు. క్రిస్టినా రాబర్ట్ తనను అలా చూస్తుంటే సిగ్గు పడుతూ ఉంటుంది. రాబర్ట్ కాసేపటికి తేరుకొని తన పక్కనే ఉన్న జెన్నిఫర్ ని చూసి రండి లోపలికి అని invite చేస్తాడు. రాబర్ట్ వెనకాలే డ్రాగల్, కాస్సీ ఉండడంతో వాళ్ళని పరిచయం చేస్తాడు.
Posts: 18
Threads: 2
Likes Received: 54 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2024
Reputation:
1
రాబర్ట్ డ్రాగల్ ని చూపిస్తూ : నీకు ఇతను తెలుసు అనుకుంటున్నా నీ కంపెనీ లోనే వర్క్ చేస్తాడు. అండ్ తను నా sister లాంటిది. నాకు సంబంధించినంత వరకు వీళ్ళే నా family. ఆ తర్వాత ఇద్దరినీ సోఫా మీద కూర్చోబెట్టి రాబర్ట్ టెన్షన్ తో ఉంటాడు. క్రిస్టినా అండ్ జెన్నిఫర్ ఇద్దరు అది చూసి నవ్వుకుంటారు. రాబర్ట్ propose చెయ్యడానికి tension పడుతున్నారు అనుకుంటారు.
రాబర్ట్ ఎదో చెప్పాలని ట్రై చేస్తూ : ఈరోజు newspaper చదివాను చాల బాగుంది మొత్తం అంతా నువ్వు mention చేసిన points ఉన్నాయ్.
క్రిస్టినా : yeah ఈరోజు extra copies కూడా అమ్ముడయ్యాయి అని అన్నారు. ఈ news గురించి అన్ని చానెల్స్ లో వేస్తున్నారు అండ్ నేను చెప్పిన conspiracy theory కొన్ని న్యూస్ చానెల్స్ లో చెప్తున్నారు.
రాబర్ట్ : మేము కూడా చూసాము అని అంటుండగా
కాస్సీ : డిన్నర్ రెడీ అని పిలవడం తో అందరు డిన్నర్ చెయ్యడానికి వెళ్తారు. రాబర్ట్ అలానే టెన్షన్ పడుతూ వాళ్లకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అందరి డిన్నర్ అయిపోతుంది క్రిస్టినా, జెన్నిఫర్ ఇద్దరు లేచి హాల్ లోకి వెళ్తుంటే.
రాబర్ట్ వాళ్ళను ఆపి : క్రిస్టినా నేను నీకు ఒక విషయం చెప్పాలి.
క్రిస్టినా వెనకాలే ఉన్న జెన్నిఫర్ మెల్లగా తన చెవి లో : propose చేస్తున్నాడనుకుంటా అని అంటుంది. క్రిస్టినా బయట మాములుగా ఉన్న లోపల మాత్రం సంబరపడిపోతూ ఉంటుంది. జెన్నిఫర్ ఏమో ఇన్నాళ్లకు తన ఫ్రెండ్ కోరుకున్న వాడే చివరికి తను పొందబోతోంది అని హ్యాపీ గా నవ్వుతుంటుంది. కానీ ఒక్కసారిగా వారి మొహం అంతా మారిపోయి తమ కళ్ళ ముందు జరిగేదాన్ని చూసి భయంతో కళ్ళు పెద్దవి అవుతాయి. ఎదురుగ ఉన్న బార్బెరా, డ్రాగల్, కాస్సీ తమ నిజ రూపాలకు మారి పోతారు. అది చూసి షాక్ లో క్రిస్టినా స్పృహ తప్పి పడిపోతుంది. జెన్నిఫర్ ఏమో గట్టిగా అరుచుకుంటూ బయటికి పారిపోవాలని ఇంటి తలుపు వరుకు వెళ్తుంది. కానీ తన ఫ్రెండ్ లోపలే ఉందని మళ్ళీ వచ్చి క్రిస్టినా చేయి పట్టుకుని "పద పద ఇప్పుడు పడుకున్నావేంటి " అంటూ తనను లాక్కెళ్తు ఉంటుంది. తను డోర్ వరకు వెళ్ళగానే డ్రాగల్, కాస్సీ డోర్ ని క్లోజ్ చేసి వారిని బయటికి వెళ్లకుండా ఆపేస్తారు.
జెన్నిఫర్ భయంతో : ఎవరైనా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని aliens kidnap చేస్తున్నాయి అని గట్టిగా అరుస్తుంటుంది.
కాస్సీ వెంటనే : అరవకు అరిచావంటే డ్రాగల్ ఇప్పుడే నిన్ను తినేస్తాడు. అస్సలే డ్రాగల్ కు మనుషుల మాంసం అంటే చాల ఇష్టం. అని అనగానే జెన్నిఫర్ వస్తున్నా ఏడుపు ని ఆపుకుని నోటి మీద చేతులు వేసుకుని silent గా అక్కడే కూర్చుంటుంది.
బార్బెరా : కాస్సీ, తను ఇప్పుడే భయపడుతోంది మీరింకా భయపెట్టకండి అని వాటర్ బాటిల్ ని జెన్నిఫర్ కి ఇస్తూ : భయపడకు మా వల్ల మీకు ఎలాంటి ఆపద ఉండదు క్రిస్టినా ని లేపు అని అంటాడు.
జెన్నిఫర్ క్రిస్టినా మొహం మీద కొన్ని నీళ్లు చెల్లుతుంది. క్రిస్టినా లేస్తుంది తన ముందు ఉన్న బార్బెరా ని చూసి తన కాలర్ పట్టుకుని ఏడుస్తూ '' రోబెర్ట్ని ఏం చేసావ్ నువ్వు తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ప్లీజ్ తనని వదిలేయ్" అని అంటుంది.
బార్బెరా గిల్టీ గా క్రిస్టినా కళ్ళల్లోకి చూస్తూ : క్రిస్టినా నేనే రోబెర్ట్ని. Iam sorry అని అంటాడు. క్రిస్టినా బార్బెరా కళ్ళు చూసి ఆ కళ్ళు రాబర్ట్ వే అని గుర్తుపట్టి తను రోబెర్ట్ అని అర్థమవుతుంది. బార్బెరా వాళ్ళను కూర్చోబెట్టి తన గురించి, తను ఆ గ్రహానికి వచ్చిన కారణం కూడా చెప్తాడు. తనకు జరిగింది తెలుసుకుని జెన్నిఫర్, క్రిస్టినా ఇద్దరు బాధపడతారు.
క్రిస్టినా : సో మీరు ఆ శక్తివంతుడు కోసం వచ్చారు అంటున్నారు కానీ మీకు నిజంగా ఇదే ఆ గ్రహమని తెలుసా ఎందుకంటే ఇక్కడ అలాంటివాళ్ళు ఎవరు లేరు నేను చెప్పిన conspiracy theory కూడా జస్ట్ నేను ఊహించి చెప్పింది మాత్రమే అది నిజం అవ్వకపోవచ్చు కదా
జెన్నిఫర్ : కరెక్ట్ గా చెప్పావ్ ఖచ్చితంగా ఆ మంత్రవాది చెప్పిన గ్రహం ఇది అయ్యుండదు. మీరే చూస్తున్నారుగా మేము ఇంకా పక్క గ్రహానికి కూడా వెళ్లలేకపోతున్నాం. మీరేమో చాల దూరం నుండి వస్తున్నారు అంటే అర్థం చేసుకోండి మీదెంత advanced technology అని.
కాస్సీ : మేమేం అది తెలుసుకోలేనంత పిచోల్లం కాదు. మేము మా జర్నీ లో ఎన్నో గ్రహాలని చూసాం కానీ ఈ గ్రహం మాత్రమే ఆ మంత్రవాది చెప్పినట్టు exact గా మ్యాచ్ అయింది.
బార్బెరా : చూడండి మేము వచ్చి రెండేళ్ళైనా కూడా ఈ గ్రహం గురించి వాళ్లకు చెప్పలేదు ఎందుకంటే మా వలన ఏ గ్రహం నాశనం అవ్వడం మాకు ఇష్టం లేదు. సో దయచేసి నన్ను నమ్మండి మాకు హెల్ప్ చెయ్యండి.
క్రిస్టినా : నేను నమ్ముతున్నాను రాబర్ట్ సారీ… బార్…బ్ర.
డ్రాగల్ : బార్బెరా
బార్బెరా : పర్లేదు రాబర్ట్ అనే పిలవచ్చు
క్రిస్టినా : yeah ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంతకీ నేను ఏమి చెయ్యాలి
బార్బెరా : సో నువ్వు first గవర్నమెంట్ చేంజ్ అయింది ఇండియా లో అన్నావ్ కదా సో ఆయన maybe ఇండియన్ అయ్యుండొచ్చు అండ్ ఆ ఇండియన్ ఆకలి చావులు ఉన్న చోటు మిలిటరీ లేదా dictatorship ఉన్న చోటు వాళ్ళను అంతం చేసి ఆయన తన గవర్నమెంట్ ని form చేస్తున్నాడు. అస్సలు ముందు నేను ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
క్రిస్టినా : ఏంటది
బార్బెరా : నువ్వు కొంతమందిని న్యూస్ కవర్ చెయ్యడానికి ఒక ప్లేస్ కి అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ activities ని కవర్ చెయ్యడానికి పంపిస్తున్నావ్ కదా. వాళ్ళ బదులుగా నేను వెళ్తాను ఆ న్యూస్ ని వరల్డ్ వైడ్ గా ఆయనకు తెలిసేలా spread అయితే ఆయన ఖచ్చితంగా దానిని ఆపడానికి వస్తాడు. అందుకు నేను ఆ చోటే కొన్ని రోజులు ఉండి వస్తాను. సో మీరు నాకు ఈ ఒక్క help చెయ్యండి ఈ news ఆయనకు తెలిసేలా వైరల్ అవ్వాలి అప్పుడే నేను ఆయనని కలవగలుగుతాను వీలైతే ఆయనకు నా పరిస్థితి వివరిస్తాను.
క్రిస్టినా : వద్దు బార్బెరా అది అస్సలే చాలా dangerous place అక్కడ సెక్యూరిటీ అధికారి లే ఇప్పటివరకు వెళ్లినవాళ్లెవరూ తిరిగి రాలేదు. అక్కడ వెళ్తున్న మనవాళ్లకే ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం అలాంటిది నువ్వక్కడికి వెళ్తానంటే వద్దు కావాలంటే మనం ఇంకొక ప్లాన్ ఆలోచిద్దాం
డ్రాగల్ : మీరు భయపడకండి, యువరాజు తో పాటు మేము కూడా వెళ్తాము ఆయనని కాపాడుకొనే భాద్యత మాది
బార్బెరా : నాతో ఎవరు రావడం లేదు నేనొక్కడినే వెళ్తాను.
కాస్సీ : యువరాజ మా మాట వినండి మేము కూడా వస్తాం
బార్బెరా : మీరు నా కోసం ఇప్పటికి చాలా చేసారు నిజానికి మనం వెళ్లిన గ్రహాల్లో ఎదో ఒక గ్రహాన్ని మరుఖండ్వాకు చూపించి మీరు వెళ్ళిపోయుండచ్చు కానీ నా కోసం నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు. కానీ ఇది నా లక్ష్యం నా ప్రతీకారం నేను మాత్రమే చెయ్యాల్సిన పని. మీరేం దిగులు పడకండి వాళ్ళ పతనాన్ని చూసే వరకు నేను చావను అని క్రిస్టినా దగ్గరకు వెళ్తాడు
బార్బెరా : క్రిస్టినా ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా thanks నాకు తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అందుకే నేను ముందే రెడీ అయ్యాను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. అండ్ నన్ను క్షమించు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కానీ నేను దానికి అర్హుడిని కాను. నా కళ్ళ ముందే నా తండ్రిని కాళ్ళు లేవని నా చెల్లెల్ని చంపేస్తుంటే ఒక చేతకాని వాడిలాగా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే ఇక మీదట ఎవ్వరు ఆ అన్నదమ్ముల వలన నాలాగా బాధపడకూడదు.
క్రిస్టినా : నాకు అర్థమైంది it's ok. all the best అని కళ్ళ వెంట వస్తున్నా నీరు ని ఆపుకుంటూ అంటుంది. బార్బెరా అక్కడ నుండి వెళ్ళిపోగానే క్రిస్టినా మోకాలి మీద కూర్చొని ఏడుస్తుంది.
జెన్నిఫర్ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది.
బార్బెరా ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడే ఐదు రోజులు మారు వేషంలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ జరిగే illegal activitiesని క్రిస్టినా కు పంపిస్తాడు. ఆ news అనుకున్నట్టుగానే viral చేస్తారు. ఆ తరవాత కొన్ని రోజులకు బార్బెరా తన ఇంటికి తిరిగి వస్తాడు
డ్రాగల్ తనని కౌగిలించుకొని : మిమ్మల్ని మళ్ళీ చూసినందుకు సంతోషం యువరాజ మీకు ఏమి జరగలేదు అని అంటాడు
కాస్సీ : యువరాజ ఆ శక్తివంతుడు ఉన్నది నిజమేనా మీరు ఆయన ని చూసారా ఆయనని కలుసుకున్నారు అని చాలా ఆసక్తి తో అడుగుతుంది.
బార్బెరా సంతోషంగా నవ్వుతాడు : చూసాను. ఆయన శక్తివంతుడు ఇప్పుడు ఆ చోటు ఎవ్వరు లేరు అందరిని ఆయన చంపేశాడు అక్కడ జరిగే అన్ని అక్రమాలను ఆయన ఆపేసాడు. కానీ నేను ఆయనని కలిసేలోగా మాయమైపోయాడు
డ్రాగల్ : మరి ఇప్పుడు ఎం చేద్దాం అని తన వైపు సందేహంగా చూస్తాడు. వెంటనే బార్బెరా గర్వంతో : కాస్సీ డ్రాగల్ మరుఖండ్వా కు మెసేజ్ పంపించండి. యుద్ధానికి నాంది పలుకుదాం అనగానే ఇద్దరు అలాగే యువరాజ అని సమాధానమిస్తారు. బార్బెరా : ఈరోజు నుండి వాళ్ళ చావులకి count down స్టార్ట్ అయింది….
-------- (chapter 2 ended) ----------
Posts: 11,805
Threads: 0
Likes Received: 6,555 in 4,957 posts
Likes Given: 64,704
Joined: Feb 2022
Reputation:
86
అప్డేట్ చాల బాగుంది
Posts: 2,158
Threads: 147
Likes Received: 7,119 in 1,372 posts
Likes Given: 4,035
Joined: Nov 2018
Reputation:
545
కథ, కథనం చక్కగా ఉన్నాయి, గానీ పాత్రల పేర్లవల్ల కొద్దిగా అయోమయం పాలవుతున్నారు పాఠక మిత్రులు.
వీటిని కొద్దిగా పట్టించుకోకపోతే భేషుగ్గా ఉంటుంది.
మన ఆలోచన పరిధి పెంచుకుంటే ఓహో!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|