Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
హైదరాబాద్ కథలు
- Swaroop Satya
భాగ్యనగరం..నేను పుట్టి పెరిగిన నగరం. అలనాటి సహనం, అమాయకత్వం వారసత్వంగా తెచ్చుకున్న జనం. ఎన్నో సంస్కృతుల పరిమళాలు తనలో కలుపుకుని వీచే పవనం. ఇప్పుడు ప్రపంచంతో పాటు పరుగెడుతున్న అలుపెరగని రేసుగుర్రం.
ఆకలి మంటల గరీబులు, అందలమెక్కిన నవాబులు... వీళ్ళిద్దరిమధ్యలో నలిగే మధ్యతరగతి షరీఫులు. అందరూ కలిస్తేనే ఈ సిటీకి జీవం.
ఈ పాత, కొత్త కలయికతో ఇక్కడ జరిగే కొన్ని పరిస్థితులను ఈ కథల్లో చెప్పడానికి ప్రయత్నించాను.
మీకు నచ్చుతాయని ఆశిస్తూ....
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
1. వెయ్యి నోటు
“రషీద్, లెవ్వు రా... పనికి పోవా...?”
“ఎన్ని సార్లు పిలవాలె? టైం అయింది లే.”
పక్క మీద బోర్లా పడుకున్న రషీద్ బద్ధకంగా కళ్ళు తెరిచిండు. సీలింగ్ ఫ్యాన్ కీచు కీచు మని శబ్దం చేస్తుంది. గోడ మీద ఉన్న గడియారం దిక్కు చూశిండు. నాలుగున్నర కొట్టింది. ఇంకో అర్ధ గంటల పనికి పోవాలె. ఈ ఫ్యాన్ లొల్లి ఎక్కువయ్యింది ఈ మధ్య. ఎల్లెకిల తిరిగి పైనున్న ఫ్యాన్ని చూశిండు. రెక్కల అంచులల్ల నల్లగా మురికి పట్టి మెల్లగా, ఊగుకుంట నడుస్తుంది. ఇది ఎప్పుడో ఇరిగి మీదపడ్తది అని రషీద్ చిన్నప్పట్నించి అంటానే ఉండు. ఇప్పుడు రషీద్ వయసు పదమూడు. ఆ ఫ్యాన్ వయసు ఇరవై. అటు పక్క ఇటు పక్క తమ్ముళ్ళు పండుకున్నరు. ముగ్గురికి కలిపి ఒకటే పెద్ద బొంత. మొన్నటి దాంక వీడు కూడా బాధ్యత లేకుండా తమ్ముళ్ళతో ఆదుకుంట తిరిగినోడే. ఈ మధ్యల్నే పన్ల చేరి బాగుపడ్తుండు. ఇట్ల వాళ్ళ అబ్బా అంటడు.
పిల్లల్ని లేపకుండ మెల్లగ లేచి ఇవతల రూంలకి ఒచ్చిండు. ఇద్దరు అక్కలు, చెల్లె ఇంకా లెవ్వలే. అమ్మీ మాత్రం లేసింది. వంట ఇంట్ల నించి సప్పుడు ఒస్తుంది. రైలు కంపార్ట్మెంట్ లెక్క మూడు రూంల ఇల్లు. పిల్లలందరూ పండుకుంటే ఇంక నడిసే జాగుండదు. అందుకే అమ్మీ అబ్బా వంటింట్లనే పండుకుంటరు. సప్పుడు చెయ్యకుండా కుర్తా పైజమా తీస్కోని మల్ల ఒచ్చేసిండు. బయటికి పొయ్యి జల్ది జల్ది మొహం కడుక్కుండు. ఇంకా చీకటి గానే ఉంది. గల్లీల ఎవ్వరు లెవ్వలే. అప్పుడప్పుడే అజాన్ మోగుతుంది పక్క గల్లీ మస్జిద్ నించి.
“అమ్మీ.. నేను పోతున్నా.”
“అరేయ్.. రషీద్ బేటా.. ఇయ్యాల మీ ఓనర్ని అడిగి ఐదు వందలు తీస్క రారా. ఇప్పటికే మూడు నెల్ల కిరాయి బాకీ ఉంది. మన రజియ మంచిదే కాని కిరాయితోనే బతికే ముసల్ది. మీ అబ్బా మూడు రోజుల నించి పత్తా లేడు. నా దెగ్గర ఐదు వందలు ఉన్నయి. నువ్వొక ఐదు వందలు తెస్తే కనీసం ఒక్క నెల కిరాయి అయినా కట్టొచ్చు.”
రషీద్ గానికి అర్ధం అయిపోయింది. ఇప్పుడు కాని ఆపకపోతే అమ్మీ జాన్ని ఆపుడు కష్టం. ఒక గంట మీద చెప్తది. ఆ చెప్పుడు చెప్పుడు ఏడుపు తోనే ముగుస్తది మల్ల. అబ్బాజాన్ బండి మీద పండ్లు అమ్ముతడు. అప్పుడప్పుడు ఇట్ల రెండు మూడు రోజులు ఇంటికి రాకుండా పోతడు. ఫికర్ జెయ్యనీకె ఏం లేదు. ఎట్ల పోయినోడు అట్లనే ఒచ్చేస్తడు.
ఇంట్ల ఇంతకు ముందు కష్టాలు ఉంటుండే కాని అక్క నెకాహ్ అయ్యి ఎల్లిపోయినంక జెర ఎక్కువయ్యింది. అప్పుడంటే అమ్మీ తో పాటు జంషీద్ ఆప కూడా అంట్లు కడగనీకె పోతుండే. ఇప్పుడు ఇంట్ల సంపాదించేటోళ్ళు ముగ్గురే ఐపోయిన్రు. చిన్నక్క ఫర్జానాని కలుపుకొని. తనకొచ్చే జీతమే ఐదొందలు నెలకి. అది ఎప్పుడో ఇచ్చేసిండు ఒస్మాన్ భాయ్. మల్ల అడుగుతే ఇస్తడా. కానీ అమ్మీ చెప్తే ఇనదు.
“పైసలు ఏ మూల దాచిపెట్టినా తీస్కపోతుండు మీ అబ్బా. ఇంట్ల జాగలు దొర్కుతలేవు. ఇంతమందిని ఏడికెల్లి సాకాలె.” ఇంకా సదువుతనే ఉంది అమ్మీ.
“సరే అమ్మీ. అడిగి చూస్తా.” అని అరుచుకుంటానే ఉరికిండు. ఏ మాటకి ఆ మాట. అమ్మీ ఎడుస్తే నచ్చదు రషీద్ కి. అందుకే అసుంటి టైంల ఇంట్ల ఉండడు. బయటికి ఉర్కుతడు.
* *
దిల్షాద్ కేఫ్ ల పని. పొద్దున్నే నాలుగు గంటలకు పోవాలె.. కప్పులు కడగాలే.టేబుల్లు తుడవాలే. ఒచ్చినోల్లకి చాయ్ ఇయ్యాలె. పని పెద్ద కష్టమేం అనిపించదు. ఒక పది పదకొండుకి ఇంటికి పోవొచ్చు. లేకుంటే అక్కడే పండుకోవచ్చు. మల్ల అయిదింటికి ఒచ్చేయ్యలె. రాత్రి అంతా అయ్యేవరకు పదయితది. రోజూ ఇదే పని. కాని రషీద్ కి ఇదేం కష్టం అనిపించదు. కేఫ్ మొత్తం మీద అందరితో నవ్వుకుంట మాట్లాడేది మనోడే. ఎప్పుడు ఏ కష్టం ఉన్నట్టు కనిపించడు. ఎంత పని చెప్పినా హాయిగా చేస్కపోవడం ఒక్కటే తెల్సు.
ఈ పన్ల కుదరకముందు అబ్బా ఒక మెకానిక్ షెడ్ ల పెట్టిన్చిండే. ఒక పది రోజులు పని చేశిండు కాని రషీద్ కి నచ్చలే. రోజంతా పనే ఉంటది. ఇక్కడైతే నలుగురు ఒచ్చే పొయ్యే చోటు. వాళ్ళందరి మాటలు వినడం సరదా. నాలుగు విషయాలు తెలుస్తయి. పని చేసినట్టే అనిపించదు. అందరి మాటలు ఇనుకుంట పని మర్చిపోతడు అని ఒస్మాన్ భాయ్ చాలా సార్లు తిట్టిండు కూడా.
· *
ఐదు నిముషాలు నడిచేసరికి కేఫ్ ఒచ్చేస్తది. మెయిన్ రోడ్డు పైన హనుమంతుని గుడి పక్కన. షెటర్లు అన్ని సగం సగం తెరిచి ఉన్నయి. లోపల్నించి లైట్ ఒస్తుంది. దబదబ లోపలికి ఉరికిండు. ఫెరోజ్ భాయ్, మల్లేష్ అన్న అప్పటికే ఒచ్చేశిన్రు. పని షురూ కూడా చేశిన్రు. మెల్లంగ పొయ్యి బట్ట తీస్కోని టేబుల్లు అన్ని సరిగ్గా పెట్టి సాఫ్ చెయ్యడం షురూ చేశిండు.
“ ఏం రా రషీద్. ఈ మధ్య రోజూ లేట్ ఐతుంది. నీకు బాగా....” తిట్టుడు మొదలు పెట్టిండు ఒస్మాన్ భాయ్.
“అట్ల ఏం లేదు భాయ్. మా అమ్మీ ....”
ఒస్మాన్ భాయ్ మాట వింటలేడు. పన్ల పని అందరినీ తిట్టేస్తే కాని కోపం తగ్గదు. ఎప్పుడు కోపం ఒచ్చినా అంతే.
“నువ్వొచ్చే దాంక ఆగాల్నా లేకుంటే నీ పని నేనే చెయ్యాల్నా. పిలిచి పనిస్తే ఇట్లనే ఉంటది రా. మీ అయ్యా ఇంట్ల కష్టం అయితుంది, పిల్లగాడు పని లేకుండా బేగర్దాగా తిరుగుతుండు, పెట్టుకో అంటే దయతలిచి పెట్టుకున్న కదా. ఇప్పుడు కడుపు నిండుతుంది కాబట్టి పని చెయ్యాల్నంటే బద్ధకంగనే ఉంటది. మల్ల ఎండితేకానీ మీకు పని విలువ తెల్వదు.”
ఇంక బూతులల్లకే దిగిండు. రషీద్ గాని ఇంట్ల అందరిని కలుపుకొని తిడ్తుండు.
“పోనీలే ఒస్మాన్ భాయ్. చిన్న పిల్లగాడు. ఒచ్చిండు కదా.” లోపలికి ఒస్త ఒస్త అన్నడు శబ్బీర్ భాయ్. మా కేఫ్ పక్కన పాన్ డబ్బా పెట్టుకుండు. “మొన్న మొన్ననే చేరిండు కదా నేర్చుకుంటడు లే.”
“అరే నీకు తెలవదు షబ్బీర్. పనిచ్చే దాక కాళ్ళు పట్టుకుంటరు. పనిచ్చినంక గల్ల పట్టుకుంటరు.”
షబ్బీర్ భాయ్ మంచోని లాగ అనిపిస్తడు. అప్పుడప్పుడు ఉత్తిగ మీఠపాన్ ఇయ్యమంటే ఇస్తడు. మంచిగ మాట్లాడ్తడు. అబ్బాకి ముందే తెల్సంట. అందుకనే అప్పుడప్పుడు ఇంటి విషయాలు అడిగుతుంటడు.
ఒస్మాన్ భాయ్ ఒక పది నిముషాలు తిట్టి అట్లనే బయటికి పోయిండు ఏదో పని మీద. ఈ లోపల చాయ్ గిన్నెలు కడిగేసి, టేబుల్లు తుడిచేసి, కుర్చీలన్ని సర్దేశిన. లోపల, బయట జాడు కొట్టేశిన. మెల్ల మెల్లగ జనాలు ఒస్తున్రు.
· *
హైదరాబాద్ ల కేఫ్ లకి అన్ని రకాల మంది ఒస్తరు. పైసాలున్నోల్లు, లేనోళ్ళు, పైసలు సంపాదించాలి అనుకునేటోళ్ళు, ఏ పని లేకుండా బేకార్ గా తిరిగేటోళ్ళు, పెద్ద పెద్ద కలలు కనేటోళ్ళు, దునియా మంది ఒస్తరు. వాళ్ళందరి మాటలు వినే రషీద్ గాడు తనకు తెలిసినవన్ని నేర్చుకునేది. చాలా మందిని గుర్తుపడతాడు. వాళ్ళు కూడా పేరు పెట్టి పిలుస్తరు. కాని కొత్త కొత్త మనుషులు ఒస్తేనే మజా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనిపిస్తది.
కేఫ్ నిండింది. 2 బై 4 చాయ్... ౩ బై 4 చాయ్... బిస్కిట్.....సమోసా.... టేబుల్ సాఫ్ చెయ్యి...కుప్పు సాసర్ల టంగ్ టంగ్ అని సప్పుడు, సిగరెట్ పొగ ఇవన్ని కలిసిపోయినయి. రషీద్ తన పనిల పడ్డడు.
టేబుల్ 1:
ఇస్త్రీ బట్టలు టక్ చేస్కొని, అద్దాలు పెట్టుకొని, జుట్టు నున్నగా దువుకున్నాయన ఒకాయన ఒచ్చి కూర్చుండు. రషీద్ ఒచ్చేప్పటికి ఫోన్ తీసి మాట్లాడుతుండు.
“ఆ..నేనోచ్చేశ్న...అదే దిల్షాద్ కేఫ్ ల ఉన్న. ఒస్తున్నవా..మంచిది.. ఈడనే ఉంటా.”
“రెండు చాయ్ తీస్కరా.. కుప్పులు నీట్ గా ఉండాలే. మంచిగ కడిగి తే” రషీద్ దిక్కు చూస్కుంట చెప్పిండు.
“సరే సాబ్.” అని ఉరికిండు రషీద్.
టేబుల్ 2 :
“అరేయ్ రషీద్. 2 బై 4 చాయ్ తేరా...” అని అరిచిండు శ్రీకాంత్ అన్న. కాలేజ్ ల చదువుకుంటరు. అప్పుడప్పుడు దోస్తులందరు ఒస్తరు. అందర్ల ఎక్కువ మాట్లేడేది శ్రీకాంత్ అన్ననే.
“ సరే అన్నా.” అనుకుంట పోయిండు రషీద్.
పెద్ద ట్రేల 6 కప్పులు. రెండు నిండగా. 4 సగం కన్న కొంచం ఎక్కువ నింపుకొని ఒచ్చిండు రషీద్.
రెండు ఫుల్ చాయ్ లు ముందు టేబుల్ మీద పెట్టిండు.
టేబుల్ 1:
అప్పటికే అక్కడ మల్లేష్ సేఠ్ ఒచ్చి ఉండు. ఈయన రషీద్ కి ఏర్కనే. అప్పుడప్పుడు ఒచ్చి పోతనే ఉంటాడు కేఫ్ కి.
“ఎక్కణ్ణుంచి సార్. ఏ ఊరు మీది.” అడిగిండు మల్లేష్.
“హైదరాబాద్ పక్కన్నే. ఇబ్రహింపట్నం. సిటీకి ఒచ్చి చాలా ఎండ్లయిపోయింది అనుకో.” చాయ్ కుప్పు చేతిలకి తీస్కున్నాడు ఇస్త్రీ బట్టలాయన.
“అచ్చా. ఆడనా. మా చిన్నాయనోల్లు అటు దిక్కే ఉంటరు. దండుమైలారంల. సరే చాయ్ తాగున్రి.” అని చేతులు ఎన్కకి పెట్టి సుకూన్ గ కూసుండు మల్లేష్ సేఠ్.
“ఎన్నేండ్లనుండి చేస్తున్రు ఈ కంపెనీల.” మల్ల అడిగిండు మల్లేష్.
“ఒక నాలుగయుదు ఏండ్లయితుంది.” జేబులనుంచి కార్డు తీసి ఇచ్చిండు ఇస్త్రీ బట్టలాయన.
“ ఇంతకుముందు ఇననట్టున్న సార్ మీ కంపెనీ గురించి. లేదు.” కార్డు సూడకుండనే అన్నడు మల్లేష్.
“అంటే. ఉంది కాని అంత పెద్దగా వ్యాపారం ఇంకా లేదు. చిన్న చిన్నగా చేస్కుంట ఒస్తున్నం.” అని బ్యాగ్ లనుంచి ఏవో పేపర్లు తీసి చూపెట్టిండు.
టేబుల్ 2:
“అరేయ్ రషీద్. చాయ్ చేతిల పట్టుకొని ఇయ్యవెంది రా.” గట్టిగ అరిచిండు ప్రశాంత్ అన్న.
దబదబ ఈ టేబుల్ కాడికి ఒచ్చి చాయ్ ఇచ్చిండు రషీద్.
ఏమన్న అనేలోపల్నే “బాగ కొవ్వు వట్టింది గదా. అట్లనే చేస్తం మేము.” కౌంటర్ ఎన్కనించి కోపంగ చూస్తుండు ఒస్మాన్ భాయ్.
గట్టిగ నవ్వి, “పోనీలే ఒస్మాన్ భాయ్. చిన్న పిల్లోడు.” అని చాయ్ తీస్కుండు.
“అయితే సినిమా దొబ్బిందా?” పక్కనున్న దోస్తుని అడిగిండు.
“అబ్బా.... సావగొట్టిండు రా బాబు. అదేందో వాని బాధ.” అన్నాడు ఒక దోస్తు.
“హౌల గాడు. ఒక్క నిమిషం కూసోలేకపోయినం థియేటర్ల. ఏం తిక్కరా అయ్యా ఆ డైరెక్టర్ గానికి. అంత స్లో సినిమా ఉంటే ఎవడు సూస్తడు రా ఇయ్యాల రేపు.”, ఇంకోడు.
“ఏం సినిమా పోయిన్రు అన్నా. తెలుగా హిందియా?” జోష్ తోటి అడిగిండు రషీద్.
“తెలుగేరా. దిమాఖ్ ఖరాబ్ అయ్యింది.”
“ఒక్క పాట సక్కగా లేదు. హీరోయిన్ని సరింగ చూపెట్టలేదు. కామెడీ కూడా లేదు. ఇన్ని రోజుల నించి ఊదరగొట్టి ఇదా తీసేది.”
“బానే ఉంది కద రా. నాకు నచ్చింది. థ్రిల్లర్ అది. దాంట్ల కామెడీ అది ఇది ఉంటె బోర్ కొడ్తది. ఇట్ల తియ్యడమే కరెక్ట్. ఆ ట్విస్ట్ మాత్రం నాకు మస్తు నచ్చింది. ఎప్పుడో కాని రావు ఇట్లాంటి సినిమాలు. ఎంత సేపు దమ దమ బాడుకోడమే కాదు కద.” అప్పట్నించి సప్పుడు చెయ్యకుండా కూర్చున్న ఆఖరోడు మాట్లాడిండు.
“ఒచ్చిండు చూడు బే. కథ ఎవనిక్కావాలే. మేమడిగినమా. మాకు కావాల్సింది మావోడిని మంచిగా చూపెట్టటం. కతర్నాక్ పాటలు ఉండాలి. ఒక రెండు మూడు ఫిట్లుండాలె. ఈ ఏడ్సుడు తుడ్సుడు ఎవడు చూస్తడు బే. అసలు ఒక్క కామెడీ సీన్ అన్నా ఉందార సరిగ్గా..మీకు అర్ధం అయితే చాలా. అందరికి అర్ధం కానక్ఖర్లేదా?”
“అట్లా కాదు రా. మీ ఓడు కూడా బాగా చేశిండు కదా. క్లైమాక్స్ ల చాలా బాగా అనిపించింది నాకు.”
“ఏం చేశిండు బే. ఎవడన్న హీరో అట్లా ఏడుస్తడారా? ఇదేమన్న తమిళ్ సినిమానా. తిక్క లేశింది నాకు వాడు ఏడ్వంగనే.”
తలకాయ మీద దం అని ఒక దెబ్బ పడ్డది రషీద్ కి.
“ఆడ పక్కన టేబుల్ మీద జనాలు ఒచ్చి కూసున్రు. వాళ్ళ సంగతి చూడకుండ, మల్ల ఈడ ముచ్చట్లు ఇంటున్నవా బే.” ఇంకో టేబుల్ దిక్కు సూపించి అడిగిండు ఒస్మాన్ భాయ్.
టేబుల్ ౩ :
అక్కడ అప్పటికే ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్రు. దెగ్గరికి పోయిండు. సలీమ్ భాయ్.. సలీం భాయ్ మంచిగ పెహల్వాన్ లాగా ఉంటడు. దూరం నించిన జల్ది గుర్తుపట్టెయ్యొచ్చు. ఇంకెవరో ఇద్దరు ఉన్నరు. ఒకాయన సలీంభాయ్ పక్కన ఉండు. ఇంకో ఆయన ఎదురుంగ ఉండు.
“ 2 బై ౩ చాయ్ తేరా.” గుర్తుపట్టనట్టే చెప్పిండు సలీంభాయ్, అస్సలు నవ్వకుండా.
టేబుల్ 1:
“చూడు సార్. అందరికి చెప్పేదే చెప్తున్నా. మా ఆఫీస్ ల నెలకి నాలుగయిదు సార్లయినా ఆర్డర్ చేస్తం. నువ్వు ఆర్డర్ కి వెయ్యి రూపాయలు కట్టేశెయ్. మిగితాది నేను చూస్కుంట.” సిగరెట్ పొగ ఒదులుకుంట అన్నాడు మల్లేష్.
“వెయ్యి రూపాయలంటే జెర ఎక్కువ మల్లేష్. కొంచం చూశి చెప్పు. మనం ముంగట కూడా ఇంకా చాల చెయ్యాలి. కలిసి పని చెయ్యాలె.” అని నసిగిండు ఇస్త్రీ బట్టలాయన.
“అదే సార్. అందుకే కదా చెప్తున్న. మీరు బాగుండాలె. మేమూ బాగుండాలె. అయినా ఇంత కర్రెక్టు ఇంత కాదు అని చేప్పనీకె నా చేతిల ఏముంటది. అయినా వెయ్యి రూపాయలంటే ఏముంది ఇయ్యాల రేపు. మీ కంపెనీ ఓల్లకి ఒచ్చే లాభం ముందు ఇదెంత. చిల్లర కూడా కాదు.”
“అది కరెక్టే అనుకో. కాని చూడు కొద్దిగా.” అని జేబులోంచి ఫోన్ తీశిండు ఇస్త్రి బట్టలాయన.
“సరే మల్ల. ఆలోచించుకోండి. వాళ్ళకి ఫోన్ చేసి అడిగి చెప్త అన్నా ఫరవాలేదు. బలవంతం ఏముంది ఇందుల.” అని లేవ్వబోయిండు మల్లేష్.
“అరే. అట్ల గుస్సా గాకు సేఠ్. ఫోన్ ఏం అక్ఖర్లే. అన్ని మాట్లాడుకొనే ఒచ్చిన మా కంపెనీ వాళ్ళతోని. సరే అయితే ఫిక్స్ మల్ల. మాకేం ప్రాబ్లం లేదు. ప్రతి ఆర్డర్ కి వెయ్యి ఇచ్చేస్తం. ఇట్లనే ఏడనన్న కలుద్దాం అప్పుడప్పుడు. ఇంకా ఎమన్నా ఉంటె కూడా చూడు.”
“ఆ.. బిల్కుల్. చెప్త. టచ్ ల ఉండన్రి.” నవ్విండు మల్లేష్.
అట్లనే పక్కన నిలవడ్డ రషీద్ ని అప్పుడు గమనించిన్రు ఇద్దరు. కప్పులు తీసి టేబుల్ సాఫ్ చేసిండు రషీద్.
“ ఏం చేస్తం మల్లేష్ సేఠ్. ఎంత కష్టపడ్డా ఏం రాదు. ఏదో జీతం కోసం చేశేటోల్లం. మీ పనే బెస్టు.” బ్యాగ్ తీస్కుంట అన్నడు ఇస్త్రీ బట్టలాయన.
“అరే. మాదేముంది సార్. మీ లెక్క ఇస్త్రీ బట్టలు టక్ చేస్కొని చేసే ఉద్యోగమా. ఏదో ప్యూన్ ని. ప్యూన్ లాగ ఉండాలె. మంచిగా సదువుకుంటే మంచి ఉద్యోగాలు ఒచ్చేటివి. సదువుకోలె. సరేలే కలుద్దాం మల్ల.” అని నమస్తే పెట్టిండు మల్లేష్.
ఇద్దరు బయల్దేరిన్రు.
రషీద్ కూడా ఒక్క నిమిషం మల్లేష్ దిక్కు చూసి కప్పులు కడగనీకె లోపలికి పోయిండు.
టేబుల్ 2
“పోనీ లేరా. ఊకే లొల్లి. సినిమాని సినిమాలాగా చూడు. మర్చిపో. రోజంతా ఏడుస్తవేంది బే. నీ సోమ్మేమో పోయినట్టు.” ప్రశాంత్ అన్న కొంచం కోపంగా అన్నడు.
“అరేయ్. వన్ ఇయర్ నించి ఎదురుచూస్తున్నాం. ఒక వారం నించి అయితే ఇదే పిచ్చి. వేరే పని ఏం లేనట్టు. మొత్తం ఆ సినిమా ముచ్చట్లతోనే గడిచిపోయింది. ఫీల్ అవ్వొద్దు అంటే ఎట్లా”
“ఎవడు చెయ్యమన్నడు అట్ల. పోయినమా, చూశ్నమా అన్నట్టుండాలె. పర్సనల్ అయితవేంది బే”
“ఫాన్స్ కి ఆ మాత్రం బాధ ఉండదా. ఇంటర్నల్ ఎగ్జామ్ కూడ డుమ్మా కొట్టిన దీని గురించి. మా అయ్యకి తెలిస్తే సంపేస్తడు.”
“ఎట్లా తెలుస్తది. పొద్దున్నించి రాత్రి దాంక షాప్ లనే ఉంటడు కదా.”
“అదే తెల్వదనుకో. కాని టికెట్ కోసం చాల కష్టపడ్డ రా బాబు. ఎప్పుడు ముందే బుక్ చేస్కుంట. ఈసారి మిస్ అయింది. మా ఫ్రెండ్ గాడు ఫ్యాన్ షో కి ఇప్పిస్త కూకట్ పల్లిల అన్నాడు. వాడు కూడా హాత్ ఇచ్చిండు. ఇంక గతి లేక వెయ్యి రూపాయలు పెట్టి బ్లాక్ ల కొన్న.”
“వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూశ్నవా?” ప్రశాంత్ అన్న నోరు తెరిచిండు.
“ప్రతి సారి ఏదో ఒకటి అరేంజ్ చేస్క్తుంట రా. ఈసారి కుదరలే.”
“అయితే మాత్రం. ఒక రెండు మూడు రోజులు ఆగుతే ప్రాణం పొతదా రా?”
“ఇంకా ఆ టైంల ఏం అర్ధం కాలే రా. చూడాలి అనిపించింది. చూశేశ్న.”
“కాని మరీ వెయ్యి రూపాయలు ఏంది బే. 10 సినిమాలు చూడొచ్చు. అన్ని పైసలు ఎక్కువయినయా?”
“అది కూడా మా షాప్ గల్లానించి తెచ్చిన. ఇప్పుడు మా అయ్యకి తెలిసిపొయ్యి ఉంటది. ఇంటికి పొయ్యి ఏం చెప్పాలె అని ఆలోచిస్తున్నా.” నవ్విండు దోస్తు.
“ఏమో రా భాయ్ మీ ఫాన్ల లొల్లి. నాకెప్పుడూ అర్ధo కాదు.” ఇంగ లేశిండు ప్రశాంత్ అన్న.
అప్పటిదాంక అక్కడే ఉండి వింటున్న రషీద్ టేబుల్ క్లీన్ చేశిండు.
టేబుల్ ౩:
రషీద్ చాయ్ ఇచ్చేశిండు. సలీం భాయ్ మెల్లగ చాయ్ కుప్పు తీస్కోని తాగకుండ ఎదురుంగ ఉన్నోడిని అడిగిండు, “ఏం పేరు రా నీది?”
“రమేష్ అన్నా.”
“ఆహా... ఏం చేస్తాడు రా మీ అయ్య?”
“గవర్నమెంట్ జాబ్ అన్నా. కండక్టర్.”
“మరి సక్కగ సడువుకోకుండా ఈ నకరాలు ఎందుకు రా మల్ల.” ఒక్కసారి గొంతు పెంచి అడిగిండు సలీం భాయ్.
“నేనేం చేశ్న అన్నా.” కొంచం భయపడుకుంటనే చెప్పిండు.
“మా ఓడు చెప్తుండు. పోరి ఎనక పడ్తున్నవంట?”
“ ఎనకపడుడు అట్ల ఏం లేదు అన్నా. ఆ పిల్లకి గుడ నేనంటే ఇష్టమే. ఆమేనే ఒస్తది కలుస్తది. మంచిగనే ఉంటది నాతోటి. నేనేం ఆ పిల్లని పరేషాన్ చేస్తలే.” కొంచం గట్టిగా చెప్పిండు ఈసారి.
“ఏం రా దేడ్ హుషియారి చేస్తున్నావా?ఒక్కటే చెప్తున్నా. ఆ పోరితో మాట్లాడుడు బంద్ చెయ్యి. అంతే”
“ఎందుకన్నా?”
“ఎందుకు గిందుకు. ఇసుంటి బక్వాస్ మాటలు మాట్లాడకు. ఆపెయ్యి అంటే ఆపెయ్యి.”
“ఆ పిల్లకి కూడా నేనంటే ఇష్టం అని చెప్తున్నా కదా”
“అంత అబద్ధం అన్నా. ఆ పిల్లకి నేనంటే ఇష్టం. వీడే మధ్యల ఒచ్చిండు.” సలీం భాయ్ పక్కనున్నోడు అన్నాడు.
“కాదన్నా. కావాలంటే ఆ పిల్లనే అడుగున్రి. వీడే మీకు ఏదేదో చెప్పిండు.”
“అరే హాట్... నేనేమన్నా పెళ్ళి చేస్తున్ననారా ఇక్కడ. ఒక్క కాన్ భైరి కొట్టిననా అంటే తెలుస్తది నువ్వెవరో పోరి ఎవరో. బంద్ చెయ్యి అంటే బంద్ చెయ్యి. మల్ల నీ గురించి వీని దెగ్గర ఇనిపియ్యొద్దు బిడ్డా.”
వాడు ఏం మాట్లడలే.
“సడువుకునే పిల్లగానివి నీకెందుకు రా ఇవన్ని. సమఝ్ అయ్యిందా? చల్ నడువు ఇంకా”
వాడు లేశి ఎల్లిపోయిండు.
“షుక్రియా సలీం భాయ్. వాడేదో సడువుకునేటోడు. నీతో చెప్పించే పని లేకుండే. కాని నేను రెండు మూడు సార్లు చెప్పి చూశ్న. ఇనలే. అందుకే నిన్ను అడిగిన.” పక్కనున్నోడు నవ్వుకుంటా చెప్పిండు.
“ఏం కాదు లే. భయపడ్డాడు ఇప్పుడు. ఆ పోరి జోలికి పోతే చెప్పు ఈసారి వేరేలాగా చెప్దాం.”
“అంత సీన్ లేదు లే. ఆ అవసరం పడదు. థాంక్స్ అన్నాసేల్” అని చెప్పి, వెయ్యి రూపాయలు తీసి సలీం భాయ్ కి ఇచ్చిండు.
ఆ పైసలు తీస్కొని జేబులో పెట్టుకుండు. రషీద్ ని గరెట్ తెమ్మని పంపించిండు.
· * *
రాత్రి అయ్యింది. కేఫ్ కూడా దాదాపు ఖాళీ అయ్యింది. రషీద్ కూడా బాగా అలిసిపొయ్యిండు. పొద్దున్నించి ఒస్మాన్ భాయ్ చేతిల నాలుగయిదు సార్లు తిట్లు కూడా పడ్డడు. గట్టిగా. పైనించి ఇయ్యాల కలెక్షన్ సరిగ్గా లేదని ఒస్మాన్ భాయ్ గుస్సా అయితుండు. లోపట పనేం లేదని రషీద్ కూడా జెర గాలి కోసం బయటికి ఒచ్చి మెట్ల మీద కూర్చుండు. సల్లగా గాలి ఒస్తుంది. హాయిగా ఉంది. షబ్బీర్ భాయ్ కూడా పాన్ డబ్బా బంద్ చేస్కుంటుండు.
“ఏం రా రషీద్. ఏం నడుస్తుంది?” పలకరించిండు షబ్బీర్ భాయ్.
“ఏం లేదు షబ్బీర్ భాయ్. అమ్మ రెండు మూడు వందలు ఉంటె అడుక్కొని రమ్మన్నది. అసలే ఒస్మాన్ భాయ్ కోపంగా ఉన్నడు. పొద్దున్నించి రెండు మూడు సార్లు తిట్టిండు కూడా. ఎట్ల అడగల్నో అర్ధం అయితలేదు. అదే ఆలోచిస్తున్నా”
“అయ్యో... లేవు బేటా నా దెగ్గర కూడా. ఇయ్యాల దందా సక్కగా కాలే. టీవీల మంచి సినిమా ఒచ్చినట్టుంది. ఎక్కువ మంది రాలే. అడిగి చూడు ఒస్మాన్ భాయ్ ని”
“అమ్మో.. ఒద్దులే. ఎట్లనో అట్ల అమ్మీకే సర్దిచెప్తా.”
“అరే. పరేషాన్ గాకు రా భాయ్. ఏమనదు మీ అమ్మీ. ఎదో ఒకటి అయితది. అన్నిటికీ దేవుడున్నాడు. పాన్ తింటావా?” అని పాన్ చుట్టి రషీద్ కి ఇచ్చిండు.
ఇంతలోకి ఒక పెద్ద ఎర్ర కారొచ్చి కేఫ్ ముందు ఆగింది. అది చూడంగనే ఒస్మాన్ భాయ్ లోపల్నించి ఉరుక్కుంట ఒచ్చిండు. అందులనించి నలుగురు దిగిన్రు. చూస్తే చానా డబ్బులున్నోల్ల లాగ ఉన్నారు.
“అరే అరే. నమస్తే సాబ్. ఎన్ని రోజులకి దయ కలిగింది మా పైన. అసలు మర్చేపోయ్యిన్రు మా కేఫ్ దిక్కు ఒచ్చుడు. ఎన్ని రోజులాయె దర్శనం లేక” అని ఎదురోచ్చిండు.
“ఏం లేదు ఒస్మాన్ భాయ్. కష్టం ఐపోయింది ఈ మధ్య. టైం ఉంటలేదు.”
“అంతే. ఎమ్మెల్యే సాబ్ కి టైం ఎక్కడ ఉంటది. కాని అప్పుడప్పుడు మా అసుంటి ఓల్లని కూడా పలకరిస్తున్దాలే.”
“అరే. ఎందుకు ఒస్మాన్ భాయ్ అట్ల పిలుస్తావ్. నీకు తెల్సు కదా. ఎమ్మెల్యే నేను కాదు. మా నాన్న.”
“ఇప్పుడు మీ నాన్ననే సాబ్. కాని నెక్స్ట్ ఎలక్షన్ కి మీరు అయిపోతారు. చెప్తున్నా కదా నేను. అది మాత్రం ఎవ్వరు ఆపలేరు.”
“అప్పటికి చూస్కుందాం ఒస్మాన్ భాయ్. కాని ఇప్పుడు పిల్వకు అట్ల. ఎవడయినా ఇంతే నవ్వుతాడు. నువ్వొక్కడివే అట్ల పిలుస్తవ్.”
“సరే చాయ్ తగుకుంట మాట్లాడుదురు రండి.” అని అందరినీ లోపలికి తీస్కపొయ్యిండు ఒస్మాన్ భాయ్.
ఈ సార వాళ్ళు ఎప్పుడయినా ఒక్కసారి ఒస్తుంటరు కేఫ్ కి. ఇదే టైంకి ఒస్తుంటరు. కొంచం సేపు ఉంది పోతరు. ఒచ్చినప్పుడు స్పెషల్ చాయ్ స్పెషల్ కప్పులల్ల తీస్కోని పోవాలె. రషీద్ కి తెల్సు కాబట్టి పనిల పడిపొయ్యిండు.
చాయ్ తీస్కొచ్చి ఇచ్చిండు అందరికి.
“ఏదేమయినా నీ చాయ్ టేస్ట్ ఎక్కడ రాదు భాయ్.” చాయ్ తగుకుంట అన్నాడు ఎమ్మెల్యే సాబ్.
“ఎదో మీ అభిమానం సాబ్. లేకపోతే ఎక్కడెక్కడో తిరిగేటోళ్ళు మీరు. గుర్తుపెట్టుకొని మరీ నా చాయ్ కోసం ఒస్తున్రంటే అది మీ గొప్పతనం.” సిగ్గుపడ్డడు ఒస్మాన్ భాయ్.
“ఇంకేం సంగతులు. దందా ఎట్లా నడుస్తుంది?”
“మీ దయ వాళ్ళ బానే ఉంది సాబ్. ఏదో చాయ్ పానికి నడిచిపోతుంది. సెక్యూరిటీ అధికారి ఓళ్ళు మాత్రం మరీ టైంకన్నా ముందే బంద్ జెయ్యమని లొల్లి జేస్తున్రు. మీరేమన్న చెప్పున్రి రాదు సాబ్.”
“ఆ.. ఈ మధ్య వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటున్రు ఒస్మాన్ భాయ్. ఏం చెయ్యలేం.”
“ఇంక సాబ్. పెద్ద సాబ్ మంచిగున్నరా?”
“ఆ బాగుండు. అడుగుతుంటడు అప్పుడప్పుడు మీ గురించి, కేఫ్ గురించి.”
“పెద్ద సాబ్ కేంది ఒస్మాన్ భాయ్. ఎప్పుడు ఎలక్షన్ అయినా గెలుచుడు ఖాయం. పబ్లిక్ ల కతర్నాక్ ఇమేజ్ ఉన్నది.” పక్కనున్న దోస్తు అన్నడు.
“అరే ఇయ్యాల రేపు అట్ల ఏం లేదు రా. పబ్లిక్ కూడా నీయత్ లేకుండా ఉన్నరు. ఎంత చేశినా ఒచ్చే ఎలక్షన్ కి మల్ల కొత్తనే. నీకు తెల్సా ఒస్మాన్ భాయ్. మన బస్తీకి ఎంత చేశ్నం కదా. అయినా మల్ల ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తే గాని ఎయ్యాలే ఎవ్వడు.” ఏమ్మేల్యే సాబ్ చెప్పిండు.
“వెయ్యి రూపాయలా? ఒక్క ఓటుకి. అదేంది సాబ్. మరీ దారుణం.” ఆశ్చర్యపోయిండు ఒస్మాన్ భాయ్.
“ఏం చేస్తం. తప్పుతలేదు. లేకపోతే ఎంత మంచిగ పని చేశినా ఎవ్వడు ఓటు ఎయ్యట్లేదు.”
ఇంక జెర సేపు అట్లనే మాట్లాడుకున్నరు రాజకీయాల గురించి. రషీద్ బయటికి పొయ్యి మెట్ల మీద కూసోని కునికి పాట్లు పడుతుండు. టైం అయిందని ఒస్మాన్ భాయ్ షెటర్లు సగం మూసేసిండు ఒస్మాన్ భాయ్.
తరవాత అందరు బయటికి ఒచ్చిన్రు. రషీద్ టేబుల్ క్లీన్ చేసి కప్పులు తియ్యనీకె పోయిండు. ఒస్మాన్ భాయ్ అందరికి నమస్తే పెట్టిండు. అందరు కారెక్కిన్రు. ఏదో గుర్తొచ్చి మల్ల దిగిండు ఎమ్మెల్యే సాబ్. జేబులోంచి పైసలు తీసి ఒస్మాన్ భాయ్ కి ఇయ్యబోయిండు. ఒస్మాన్ భాయ్ ఒద్దు అంటున్నట్టుంది. దూరం నించి కాబట్టి మాటలు వినిపిస్తలే రషీద్ కి. కాని చూస్తే అట్లనే ఉంది. మొత్తానికి మొహమాటం మీద పైసలు తీస్కుండు ఒస్మాన్ భాయ్. మల్ల కారెక్కినంక ఒస్మాన్ భాయ్ ఒచ్చేశిండు.
కాని ఇద్దరు చూస్కోనిది ఏందంటే ఒస్మాన్ భాయ్ కి పైసలు ఇచ్చి ఎక్కేలోపు చేతిలోంచి ఒక వెయ్యి రూపాయల నోటు జారి కింద పడిపోయింది. అది ఎవ్వరు చూస్కోలే. రషీద్ చూసిండు కేఫ్ లోపల్నించి. అరిచేలోపల కారు స్టార్ట్ అయిపోయింది. రషీద్ చేతిల ఎంగిలి కప్పులు ఉన్నాయి, కాని ఆ నోటు దిక్కు ఉరికే జోష్ ల అది పట్టించుకోలే. కారు మెల్లగ ముందుకు పోవడం శురు అయింది. ఒస్మాన్ భాయ్ మెట్లెక్కి ఇటు దిక్కు కేఫ్ లకి ఒస్తుండు. రషీద్ మెట్ల దాంక ఒచ్చేశిండు. కారు ముందుకు పొయ్యే గాలికి ఆ నోటు ఎగిరి టైరుకు అతుక్కుంది. చూస్తుండంగనే కారు, టైర్, నోటు మూడు ఎల్లిపోయినయి. మెట్ల మీదనుండి కింద పడ్డడు రషీద్.
తేరుకునేటప్పటికి రషీద్ కంట్ల నీళ్ళు. కింద ఇరిగిపోయిన కప్పు ముక్కలు ఉన్నయి. ఒస్మాన్ భాయ్ అరుస్తుండు.
“బద్మాష్. ఏమైంది రా. పిచ్చి పట్టిందా. ఏడికి ఉర్కుతున్నావ్. దీవానా గానివా. మీ అయ్య కడ్తడా ఈ కప్పుల పైసలు.”
“కాదు భాయ్. ఎమ్మెల్యే సాబ్ పైసలు పడిపోయినయి. తీస్కునే లోపల ఎగిరిపోయినయి.”
ఒస్మాన్ భాయ్ నమ్మలే. తిట్టిండు.
· * *
రషీద్ అంత సాఫ్ చేసేసి షెటర్ బంద్ చేసి తాళం ఏశిండు. ఒస్మాన్ భాయ్ కూడా బండి స్టార్ట్ చేశిండు. రషీద్ నమస్తే చెప్పి ఇంటికి పోనికే గల్లీలకి నడిచిండు.
నడుస్తుంటే పక్కనించి ఒస్మాన్ భాయ్ బండి ఒచ్చి ఆగింది.
“అరేయ్ ఇందాక బజార్ పోతే మీ అమ్మీ కనపడ్డది. పైసలు అడగమన్నదంట నిన్ను. మల్ల అడగకుండనే పోతున్నవ్ ఏంది బే. ఇంగో ఈ మూడొందలు తీస్కో. ఇంట్ల ఇచ్చేయ్యాలె. సరేనా. పొద్దున్న జల్ది రా.” అని పైసలు ఇచ్చేశి సర్ర్ అని బండి వెళ్లిపోయింది.
· * *
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
30-07-2023, 10:05 AM
(This post was last modified: 30-07-2023, 10:05 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
2. థాంక్స్ నాన్నా..
“ఏంటి రఘు. అంతా రెడీయా? ఎన్నింటికి ఫ్లైట్?” అడిగాడు తనతో పాటు పని చేసే కొలీగ్.
“రాత్రి తొమ్మిదికి. ఒక ఆరు గంటలకి ఇంటి నించి బయల్దేరితే సరిపోతుంది. ఇండియాకి వెళ్ళాలంటే ఎంత ఆనందంగా ఉంటదో ఈ ప్రయాణం అంత కష్టంగా ఉంటది.” చెప్పాడు రఘు.
“అవును ఈ మధ్య ఈ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ కూడా చాల టైం పడ్తుంది. మొత్తం ఇండియా వెళ్లేసరికి దాదాపు ౩౦ గంటలు పడుతుంది. నేను వెళ్ళడం కాస్త తగ్గించడానికి ఇది కూడా ఒక కారణం.”
“కానీ, అంత అలిసిపొయ్యి ఉంటామా..ఒక్క సారి ఇండియాలో అడుగుపెడితే చాలు అదంతా మరిచిపోతా నేను.” రఘు కళ్ళల్లో ఒక మెరుపు.
చిన్న నవ్వు నవ్వాడు కొలీగ్. “నేను ఇచ్చిన ప్యాకెట్ పెట్టుకున్నావ్ కదా? ఇండియాలో దిగగానే చెప్పు మా తమ్ముడు ఒచ్చి తీస్కుంటాడు. థాంక్స్ అగైన్. కొంచం బరువు ఎక్కువే, ఐనా తీసుకెళ్తున్నందుకు.”
“ఫరవాలేదు. ఆఫీస్ లో అందరి పాకెట్స్ కలిపి ఒక ౩౦ పౌండ్ల దాకా అయ్యింది. అయినా ప్లేస్ ఉందిలే లగ్గేజ్ లో.”
“మరి ఇంకా ఎందుకు ఉన్నావ్. ఆల్రెడీ ౩ అయ్యింది. లాగించేయ్ ఇంకా.”
“అదే అనుకుంటున్నా. ఇవ్వాళ అసలు పనే చెయ్యలేను. ఎంత సేపున్నా దండగే. ఉంటా మరి.” అని బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“ఓకే బాస్. హ్యాపీ జర్నీ. నా స్వీట్ ప్యాకెట్ మాత్రం తేవడం మర్చిపోకు.” అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు కొలీగ్.
8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చెయ్యడం అంటే పెద్ద కష్టమైనదేమి కాదు. ఐనా రోజూ ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఆనందం. అలాంటిది ఈ రోజు ఒక వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నెల రోజులకిగాని ఆఫీస్ మొహం చూడక్ఖర్లేదు. హాయిగా తన ఊళ్ళో, తన ఇంట్లో, తన వాళ్ళ మధ్యన ఉంటూ, వాళ్ళు పెట్టేవి తింటూ గడిపెయ్యొచ్చు. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది తెలిసిన వాళ్ళ ఎవ్వరింటికి వెళ్ళినా...
ఇండియాలో ఐటి ఉద్యోగం చేసే చాలా మంది కలలు కనే జీవితం రఘు దెగ్గర అప్పటికే ఉంది. అమెరికాలో చాలా మంచి ఉద్యోగం, ఆఫీస్ కి దెగ్గర్లోనే సొంత ఇల్లు. అందమైన, అర్ధం చేసుకునే భార్య, ఆరంకెల జీతం, తన భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇంకో ఆరంకెలు, మొత్తం కలిపి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే డబ్బు. వీటి వల్ల దొరకని సంతోషమేదన్నా ఉంటే అది కూడా ఇవ్వడానికి ఒక అయిదేళ్ళ కొడుకు. పేరు అద్విక్. ఇంటర్నెట్ లో వెతికి వెతికి ముద్దుగా పెట్టుకున్న పేరు అద్విక్.
· * *
“ ఏంటి ఇంకా ఇల్లంతా ఇలాగే ఉంది.” వాళ్ళావిడ తలుపు తియ్యగానే ఆశ్చర్యపోయాడు. ఇంకో రెండు గంటల్లో బయల్దేరే ఛాయలు ఎక్కడా లేవు.
“మరేం చెయ్యమంటావ్ . నాక్కూడా ఆఫీస్ నించి రావడం లేటయ్యింది. ఒచ్చినప్పట్నించి మీ పుత్రరత్నం చుక్కలు చూపిస్తున్నాడు.” విసుక్కుంది లక్ష్మి.
పుత్రరత్నం అనే మాట వాడిందంటే వీడు చాలా అల్లరి చేశాడన్నమాట. పాపం వాడు మాత్రం కావాలని చేస్తాడా.
“ఇంతకి ఏమయ్యింది.?”
“వాడి బొమ్మలన్నీ పెట్టాలంట పెట్టెలో. ఆ బాస్కెట్ బాల్ అయితే ఖచ్చితంగా పెట్టాలని అల్లరి చేస్తున్నాడు. అక్కడ దొరుకుతాయి అని చెప్పినా వినట్లేదు... నిన్న అంతా సర్దేద్దాం అని చెప్పినా వినలేదు నువ్వు... రోజూ వాడికి నేర్పే బాస్కెట్ బాల్ కదా నిన్న ఒక్క రోజు మానేస్తే ఏమయ్యేది. ఇప్పుడు చూడండి.”
“సరే సరే. నేను చెప్తా కదా. వాడి బొమ్మలు ఏం పెట్టకు. దండగ. కావాలంటే అక్కడ కొనిస్తా అని చెప్తా లే. వాడింక నిన్ను డిస్టర్బ్ చెయ్యడు. తొందరగా సర్దేయ్యి.” అని లోపలి వెళ్ళాడు.
“వాడు ఇటు పక్క రాడు అంటే మీరు చేసేదేంటో నాకు తెల్సు. అయినా అయిదేళ్ళు కూడా సరిగ్గా లేవు వాడికి అప్పుడే బాస్కెట్ బాల్ ఎందుకంటా. సరిగ్గా పట్టుకోవడమే రావట్లేదు వాడికి. ఇప్పుడు ఎమొస్తుందనీ. ఇంకో అయిదేళ్ళు ఆగు.” మాట్లాడుకుంటూ బట్టలన్నీ పెట్టెల్లో కుక్కేస్తుంది.
“వాడికిష్టం, నాకూ ఇష్టం. నీకెందుకే మధ్యలో కుళ్ళు.” అని కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళాడు.
“ముందు పని అంతా పూర్తి చెయ్యి. పెట్టెలు నీట్ గా సర్దు. మా అమ్మ ఎప్పుడూ అంటుంటది, మీరు ఇల్లు సరిగ్గా పెట్టుకోరు అని.” పక్క గది లోంచి కావాలనే అరిచాడు.
“ఒక్క అరగంట నా జోలికి రాకండి. ఆ తరవాత మీకు, మీ అమ్మగారికి, మీ పక్కింటి పిన్నిగారికి అందరికి నచ్చుతుంది.” అని పనిలో పడిపోయింది.
రఘు కూడా చిన్నప్పుడు బాస్కెట్ బాల్ ఆడింది లేదు. కొడుక్కి నేర్పుతూ తనూ నేర్చుకుంటున్నాడు. వాడికి ఇప్పుడే ఏమొస్తుంది. ఆ చిన్న చేతుల్లో బాల్ నిలబడితే అదే ఎక్కువ. దానికే చాలా ఆనందపడిపోతాడు. చాలా ఓపిగ్గా బాల్ ఎలా పట్టుకోవాలి, ఎలా పరుగెత్తాలి అన్నీ చెప్తాడు. ఆ మురిపెంలో ఎప్పుడు అరగంట అయ్యిందో తెలియలేదు.
“నేను రెడీ, పెట్టెలు రెడీ, ఇల్లు రెడీ, మీరిద్దరే మిగిలింది” అని పిలిచింది లక్ష్మి. ఇద్దరూ గబగబా స్నానం కానిచ్చారు. మొత్తానికి టైంకే బయల్దేరారు. కారెక్కగానే పడుకున్నాడు అద్విక్.
“అబ్బా. ఇప్పుడు 20 గంటలు ఫ్లైట్లో కూర్చోవాలా? అసలే వీపు నొప్పిగా ఉంది” అని నిట్టూర్చాడు రఘు.
“మరి ఎవరు ఆడమన్నారు. కాసేపు పడుకోవచ్చుగా. పెయిన్ కిల్లర్ ఇవ్వనా?” కంగారు పడింది లక్ష్మి.
“ఏమొద్దు. దీనికంటే పెద్ద కష్టం ఫ్లైట్లోనే ఉంటుందని భయం.”
“ఏంటి. ఏడ్చే పిల్లలా?” నవ్వింది లక్ష్మి.
అమెరికా నించి ఇండియా ఒచ్చే ఎవరికైనా తెలిసిన సంగతి ఏంటంటే ప్రతి సారి ఫ్లైట్ లో కనీసం ముగ్గురు పిల్లలైనా గట్టిగా ఏడుస్తుంటారు. వాళ్ళతోనే ప్రయాణం చెయ్యాలి. తప్పదు.
“పెళ్ళి కాకముందు గుర్తుందా లక్ష్మి? మనం అనుకునేవాళ్ళం, మనకు పిల్లలు పుట్టాక ఇలా చెయ్యకూడదు అని. కాని తప్పలేదు. పోయినసారి వెళ్ళినప్పుడు వీడు నరకం చూపించాడు.”
“ఇప్పుడు ఆ భయం లేదులే. కాస్త పెద్దవాడయ్యాడు.” అద్విక్ తల నిమురుతూ అంది లక్ష్మి.
“పైగా ఇక్కడ పిల్లల్ని గట్టిగా ఒక మాట కూడా అనలేం. నాకేమో ఓపిక తక్కువ.”
“అబ్బా.. వీలుంటే ఏదో అన్నట్టు. అసలు వాడు నీ మాట ఎప్పుడయినా వింటాడా. నువ్వే వాడు చెప్పిందల్లా చేస్తావు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకటి. నేనొక్కదాన్ని ఒకటి.” మూతి ముడుచుకుంది లక్ష్మి.
“కాని ఎందుకు వాడిని ఒక్క మాట కూడా అనవు ఎప్పుడూ. వాడికి కోపం ఒస్తుంది అని భయమా.” మెల్లిగా అడిగింది.
“అలా ఏం లేదు. మొన్ననే ఎప్పుడో కదా తిట్టాను.”
“ఛా. ఎప్పుడు స్వామీ. నాతో మాత్రం అలా ఉండరు. కేవలం వాడితోనే.”
“నీ బొంద.”
“హ్మ్... చిన్నప్పుడు మామయ్య అంటే నీకు భయంగా ఉండేదా. అందుకే అద్విక్ కి అలా అవ్వకూడదని అని అలా చేస్తున్నావా?” చాలా రోజులనించి మనసులో ఉన్న ప్రశ్నని బయటపెట్టింది.
“ఎందుకు. మా నాన్నతో బానే మాట్లాడతా కదా నేను. ఆ డౌట్ ఎందుకు ఒచ్చింది.?”
“ఊరికే అడుగుతున్నా.”
“అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నాన్న ఎప్పుడు నన్ను కొట్టడం అలాంటివి చెయ్యలేదు. కాని నాన్న అంటే ఆ భయం అలా ఉండేది అంతే. అప్పట్లో ఎక్కువ మంది అంతే కదా.”
లక్ష్మి ఏం మాట్లాడలేదు.
ఒక్క నిమిషం ఆగి, “ అది కూడా ఇప్పుడు లేదు కదా. ఒక వయసు ఒచ్చాక నాన్న కూడా ఫ్రీగా ఉండడం మొదలు పెట్టారు.” అన్నాడు.
కారు ప్రయాణం ఫ్లైట్ లోకి మారింది. టేక్ ఆఫ్ అవ్వగానే సరిగ్గా ఎవరో ముగ్గురు పిల్లలు రాగం అందుకున్నారు.
· * *
రఘు వాళ్ళ నాన్న రంగారావు. అమ్మ మీనాక్షి. రఘు చిన్నప్పుడు రంగారావుది క్లర్క్ జాబ్ అయినా గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పెద్దగా కష్టాలేం లేవు. అలాగని గొప్పగా సుఖపడ్డదీ లేదు. అమ్మ ఇంట్లోనే. మామూలుగా గడిచిపోయింది చిన్నతనం. రంగారావు రిటైర్ అయ్యేనాటికి గజెటెడ్ స్థాయికి ఒచ్చాడు. ఆయనకీ పెద్ద కోరికలేం లేవు. రఘు అమెరికా నించి పంపిన డబ్బుతో ఇక్కడ ఆస్తులు కొంటూ, అమ్ముతూ, ఇల్లు కట్టడం పని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆనందంగా.
ఇండియా ట్రిప్ చాల బాగా జరుగుతుంది. అద్విక్ కూడా ఈసారి అందరినీ గుర్తుపడుతున్నాడు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. ఇంట్లో వాళ్లకి, చుట్టాలకి దెగ్గరయ్యాడు.
ఒకరోజు ఇంట్లో అందరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా అద్విక్ దృష్టి హాల్ షెల్ఫ్ లోని ఒక షీల్డ్ మీద పడింది. పెద్ద షెల్ఫ్ మధ్యలో చాలా జాగ్రత్తగా అందంగా పెట్టుకున్న షీల్డ్ అది.
“తాతయ్యా ఏంటి ఇది.?”
“అదా. మీ నాన్నకి గుర్తుందేమో అడుగు?” అని రఘు వైపుకి పంపించాడు.
రఘు షీల్డ్ ని చూశాడు. ఇన్ని రోజుల నించి అక్కడే ఉన్నా గమనించలేదు.
“అది మళ్ళీ బయటికి తీశారా? ఎందుకు నాన్నా? అదేదో పెద్ద నోబెల్ ప్రైజ్ లాగ.”
“సరే అదేంటో చెప్పు డాడీ.” రఘు చెయ్యి లాగాడు అద్విక్.
“ఏం లేదు నాన్నా. చిన్నప్పుడు నాకు కాలేజ్ లో ఇచ్చారు అంతే.” అని ముగించాడు రఘు.
“అలా చిన్నగా అంటావే రా? అద్విక్, మీ నాన్న మాథెమాటిక్స్ లో మొత్తం కాలేజ్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ఒచ్చాడు. అందుకే ఇది ఇచ్చారు. కాలేజ్ ఫస్ట్ కి ఇచ్చే షీల్డ్ అది. ఆ రోజు నించి మీ డాడీ మారిపోయాడు. ఎంసెట్ ర్యాంక్, ఇంజనీరింగ్.. ఇలా అన్నిట్లో టాప్.” రంగారావు కళ్ళల్లో ఒక గర్వం.
“నిజమా డాడీ?” అద్విక్ కళ్ళు పెద్దవి చేస్కొని అడిగాడు.
“అదేమంత పెద్ద కాలేజ్ కాదమ్మా.” అని అద్విక్ ని దెగ్గర తీస్కున్నాడు.
తరవాత తండ్రితో, “నేను అమెరికా వెళ్ళేటప్పుడు దీన్ని అటక మీద పెట్టించాను. మళ్ళీ తీసారా? బాలేదు నాన్నా. పాతది. తీసెయ్యండి ప్లీజ్.”
“నీకది గొప్ప కాకపోవచ్చు రా. మాకు గొప్పే.” అన్నాడు రంగారావు రఘు వైపు ఆప్యాయంగా చూస్తూ...
రఘు ఏమీ మాట్లాడలేదు.
“అరేయ్. ఎవరైనా నీ జీవితంలో ఏం సాధించావు అని నన్ను అడిగితే నేను తడుముకోకుండా చూపించేది నిన్నే. చెప్పేది నీ గురించే.” అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు రంగారావు.
· * *
మరుసటిరోజు అద్విక్ రఘు చదువుకున్న కాలేజీ చూపించమని అల్లరి చెయ్యడంతో ముగ్గురు బయల్దేరారు. మామూలు బస్తీలో అతి మామూలు కాలేజీ. అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. సిటీలో కాలేజ్స్ అన్నీ కార్పొరేట్ అయిపొయ్యాయి. డొనేషన్ పెంచేసి సాఫ్ట్ వేర్ ఆఫీస్ లకి దీటుగా తాయారు చేశారు. కాని తను చదువుకున్న కాలేజీ అలాగే ఉండడం ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ అలాగే ఉంది కాని చాల పాతపడిపోయింది. చూస్తే పిల్లలు కూడా బాగా తగ్గినట్టున్నారు.
బయట రోడ్డు మీదే కారు పార్క్ చేసి లోపలి వెళ్ళారు. మానేజ్మెంట్ రూం ఎక్కడుందో సరాసరి అక్కడికే వెళ్ళాడు. ప్యూన్ ఉన్నాడు. గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు కాని గుర్తురాలేదు రఘుకి. వయసు మాత్రం ఎక్కువే ఉంది అతనికి.
“నేను ఇదే కాలేజ్లో చదువుకున్నానండి. పాసయ్యి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలయ్యింది. ఒకసారి చూద్దాం అనిపించి ఒచ్చాను. ప్రిన్సిపాల్ గారు రెడ్డిగారేనా ఇంకా?” సూటిగా పాయింటుకి ఒచ్చేశాడు.
“ఎక్కడ సార్. ఆయన పోయి అయిదేళ్ళయింది.”
“అయ్యో.” ఒక్కసారి మనసు కలుక్కుమని అనిపించింది. ప్రిన్సిపాల్ చేతిలో ఎన్ని సార్లో దెబ్బలు తిన్నాడు. ఒక్కసారి కూడా ఆయన మెచ్చుకున్న క్షణాలు లేవు. ఆయన ఒస్తున్నాడంటేనే పిల్లలందరికీ హడల్. ముందు కొట్టి తరవాత విషయం అడిగే టైపు. కాని ఎందుకో ఇప్పుడు బాధగా అనిపించింది.
“మరి ఇప్పుడు ఎవరు ప్రిన్సిపాల్?”
“ఆయన కూతురు ప్రజ్ఞా మేడమ్. ఆయన పోయినప్పటినించి మేడమే చూసుకుంటున్నారు. లోపలే ఉన్నారు, వెళ్లి కలవచ్చు” అని పంపించాడు.
ప్రిన్సిపాల్ రూం ముందుకెళ్ళి నిలబడ్డాడు. లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు.
లక్ష్మిని అద్విక్ ని పిలిచాడు.
“ఇదే రూం ముందు ఎన్ని సార్లు నిలబడ్డానో తెల్సా. క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం. మా టీచర్ కి తెలిసి పనిష్మెంట్ కోసం ఇక్కడే నిలబెట్టేది. మా ప్రిన్సిపాల్ ఒచ్చి వీర కొట్టుడు కొట్టేవారు.” ఇప్పుడు కూడా అక్కడ ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు.
“కాని ఇక్కడ వెయిట్ చేసినంత సేపు విచిత్రమైన పొసిషన్ ఉండేది. లోపల్లో పల భయం, బయటికి మాత్రం అందరం నవ్వేవాళ్ళం.”
ఇప్పుడు లోపలికి వెళ్ళి కొత్త ప్రిన్సిపాల్ ని చూడలనిపించలేదు రఘుకి. ప్యూన్ ని పిలిచాడు.
“నాకు మేడం గారిని డిస్టర్బ్ చేయాలని లేదు. ఊరికే కాలేజ్ చూస్తాం అంతే. వెళ్లి చెప్పి రా” అని పంపించాడు.
తను ఇద్దరిని తీస్కోని కాలేజ్ లోపలి నడిచాడు. చుట్టూ బిల్డింగు మూడు అంతస్థులది. అన్నీ క్లాసులు, మధ్యలో గ్రౌండు, ఒక వైపుకి స్టేజ్. అంతా అలాగే ఉంది. కాని సిమెంట్ స్టేజ్ పెచ్చులు ఊడిపోయి ఉంది. గోడలు కూడా పాడయిపోయాయి.
“ఇక్కడే మేము ఆడుకునే వాళ్ళం. పీటీ టైం అయితే ఇక్కడ... లేకపోతే పక్క గలీలో ఇంకో గ్రౌండ్ ఉండేది... అక్కడ...” ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడు.
“ఏం ఆడేవారు అంతగా.” రఘుని ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడలేదు కాబట్టి ఇంకా కనుక్కోవాలి అనిపించింది లక్ష్మికి.
“ఇంకేంటి..? క్రికెట్.... ఇక్కడ రా” అని గ్రౌండ్ లో ఒక చోటికి తీస్కెళ్ళాడు.
“ఇక్కడ చూడు. ఇక్కడే వికెట్లు పెట్టుకునే వాళ్ళం. చూస్తే ఇప్పటికి పిల్లలు ఇక్కడే ఆడుతున్నట్టునారు.” నిన్ననే గ్రౌండ్ కి ఒచ్చినట్టు సరిగ్గా అక్కడికే తీస్కెళ్ళాడు. నిజమే అనిపించింది.
“ఆ రోజులే వేరు. చాలా అల్లరి చేసేవాడిని. చెప్పా కదా నీకు ఇంతకుముందే” లక్ష్మిని అడిగాడు.
“చెప్పావనుకో. కాని ఇక్కడికొస్తే ఇంత ఎక్సైట్ అవుతావు అనుకోలేదు. తెలిసుంటే ఇంతకు ముందే తెచ్చేదాన్ని.”
“అలా ఏం లేదు. చిన్నప్పటి జ్ఞాపకాలు కదా. మరీ తీపెక్కువ.”
ఇంకా స్కూలంతా తిప్పాడు. తను చదువుకున్నప్పుడు ఉన్న టీచర్లు ఎవరూ ఇప్పుడు లేరని తెలిసింది. రిటైర్ అవ్వడమో, వేరే కాలేజ్ కి వెళ్లడమో చేశారు. ఒక అరగంట కాలేజ్లోనే గడిపారు.
కాసేపయ్యాక లక్ష్మి అడిగింది, “ఎంత సేపు నువ్వు అక్కడ క్రికెట్ ఆడింది, ఇక్కడ కప్పు గెలిచింది చెప్తావ్, సరిగ్గా క్లాసుకి వెళ్ళింది లేదా. అక్కడ మామయ్యనేమో ఇంట్లో నీకు మాథెమాటిక్స్ లో బోలెడు మార్కులు ఒచ్చాయని షీల్డులు దాచుకుంటున్నారు.” అని కొంటెగా అడిగింది.
“అదా..” ఒక్క క్షణం ఆగాడు. నవ్వు మెల్లిగా కరిగిపోయింది.
“అది తరవాత. నైంత్ క్లాసు నించి. అప్పట్నించి మన రూటే మారిపోయింది. చదువే చదువు. వేరే లోకం లేకుండా పోయింది.” ఒక పది సెకండ్లలో రఘు మొఖం నించి ఆనందం ఎగిరిపోయింది.
“నాన్న క్రికెట్ మానేయించారు. మాథెమాటిక్స్ ట్యూషన్ పెట్టించారు. ఇంక అదే పని.”
“మరీ అంత మార్పా. అంత సడన్ గా ఎలా ఒచ్చింది. బుల్బ్ వెలిగిందా?” కొంచెం నవ్విద్దాం అని ప్రయత్నించింది.
నవ్వాడు రఘు. “అలా అని కాదు. నాకే అనిపించింది. మనమా మిడిల్ క్లాస్ మనుషులం. చదువుకోకపోతే ఇక కష్టం. మనం కాని మన ఫ్యామిలీ కాని పైకి రావడం కష్టం.”
“కరెక్టే. కాని ఎయిట్త్ నించి నైన్త్ వెళ్ళేలోపు ఒక్కసారిగా అలా ఎలా మారిపోయావు?”
“చెప్పేవరకు ఒదిలిపెట్టవన్నమాట. సరే పద వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. దారిలో చెప్తా.”
ముగ్గురూ కారెక్కారు.
“ఓకే. చెప్పింక. ఏదో చెప్తా అన్నావ్.” ఉత్సాహంగా అడిగింది లక్ష్మి.
పెద్ద స్టొరీ స్క్రీన్ ప్లే ఊహించుకోకు. నాకు క్రికెట్ పిచ్చి కదా. రోజూ అదే పని. ఇంట్లో నేమో కంగారపడేవాళ్ళు. నేనేమౌతానో అని. ఒక రోజు మా కాలనీకి, పక్క కాలనీకి మ్యాచ్ జరిగింది. చివరిదాకా నాట్ అవుట్ ఉన్నట్టున్నా నేను. అదే మూడ్ లో హ్యాపీగా ఇంటికొచ్చాను. నాన్న అప్పుడే ఇంటికి ఒచ్చినట్టున్నారు. అలసిపోయి ఉన్నారు. సోఫా మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నారు. నేను ఆకలిగా ఉండి సరాసరి వంటింట్లోకి దూరాను. అమ్మ నా కోసమే ఎదురుచూస్తున్నట్టుంది.
“ఒచ్చావా.. నాన్న నీ గురించే అడుగుతున్నారు. మీ కాలేజ్ నించి లెటర్ ఒచ్చింది.” అని చెప్పింది అమ్మ.
మా మాటలకి లేచినట్టున్నారు నాన్న.
“రఘు.. ఇటు రా.” అని పిలిచారు.
లెటర్ తీసి చూపించారు. హాఫ్ ఇయర్లీ మార్కులు. చటుక్కున నాన్న చేతిలోంచి లాక్కొని చూశాను. తెలుగు 70, హిందీ 65, ఇంగ్లీషు 60 మాథెమాటిక్స్ 32, సైన్సు 55 సోషల్ 65. మ్యాథ్స్ లో ఫెయిల్.... నాన్న చిన్నప్పట్నించి మ్యాథ్స్ లో ఛాంపియన్.
నేనేమీ మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగి నాన్నే అన్నారు.
“ఎగ్జామ్స్ ముందు ఎన్ని సార్లు చెప్పానురా. ఒక దెగ్గర కూర్చొని చదివావా అసలు? నువ్వేం చిన్న పిల్లాడివా? బాధ్యత ఉండాలి కదా. మనమేం డబ్బున్నోళ్ళమా? రేపు నీ బతుకు నువ్వు బతకాలి. అది హ్యాపీగా బతకాలి అంటే ఇప్పుడు చదువుకోవాలి. వేరే దారి లేదు.”
నేనేదో చెప్పబోయాను. నాన్న వినలేదు.
“నిన్ను సంజాయిషీ అడగట్లేదు. ఇలా జరిగితే నీ జీవితం పాడయిపోతుంది అని చెప్తున్నా. ఆ పైన నీ ఇష్టం. ఒక్కటి గుర్తుంచుకో. నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఆస్తులేం లేవు. ఇప్పటికైనా ఆటల మీద శ్రద్ధ తగ్గించి చదువు మీద పెంచుకో.” అని అక్కడినించి వెళ్ళిపోయారు.
నాకు చాలా బాధేసింది. నాన్నెప్పుడూ నన్ను తిట్టలేదు. అప్పుడు కూడా నన్ను తిట్టినట్టు లేదు. కాని బాధపడ్డారు. అమ్మ కూడా అదే చెప్పింది. సరే కొంచం కష్టపడి చదువుదాం ఇక నించి అని అనుకున్నాను.
తరవాత కొన్ని రోజులకి మా గలీలో ప్రభాకర్ సార్ దెగ్గర నాకు మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించారు. ఆయనా బానే చెప్పేవారు. రోజూ కాలేజ్ అయిపోగానే ఇంటికి రావడం, ఇంటికి రాగానే ట్యూషన్ కి వెళ్ళడం. ఇదే సరిపోయింది. నెల దాటింది. క్రికెట్ ఆడలేదు. మనసు ఊరుకోలేదు. నాన్న రోజూ నేనేం చేస్తున్నానో అని కనిపెట్టుకుంటూనే ఉండేవారు.
ఒకరోజు మా కాలేజ్ నించి పక్క కాలేజ్ కి మ్యాచ్ ఆడుతున్నట్టు తెలిసింది. నన్ను సాయంత్రం గ్రౌండ్ కి రమ్మన్నారు మా టీం వాళ్ళు. ఆ ఒక్కరోజు వెళ్ళి, ఆది సెలెక్ట్ అయితే నెక్స్ట్ సండే వేరే కాలేజ్ వాళ్ళతో ఆడొచ్చు. సరే ఇంటికి వెళ్ళి ఈ ఒక్కరోజు ట్యూషన్ వెళ్ళను అని చెప్దాం అని అనుకున్నాను. నాన్న ఇంట్లో లేరు. ఏదో పని మీద బయటికి వెళ్లారంట. అమ్మ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. నా కోసమే ఎదురుచూస్తుంది. నేను రాగానే తినడానికి ఉన్నవన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ట్యూషన్ కి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు చెప్పే అవకాశం రాలేదు అని కాదు, సరే ఎలాగైనా బయటికి వెళ్తున్నారు కదా ఎందుకు లే అని ఊరుకున్నాను. తినేసి నా ఫేవరెట్ బ్యాట్ తీస్కొని బయలుదేరాను.
నెల రోజుల నించి ఆకలి పైన ఉన్నానేమో ఆరోజు చాలా బాగా ఆడాను. ఫోర్లు సిక్సులు హోరేత్తిపోయినయి. అదే ఊపు మీద ఊపు ఇంటికి ఒచ్చాను. అమ్మావాళ్ళు ఒచ్చేసినట్టున్నారు. ఇల్లంతా సైలెంట్ గా ఉంది. టీవీ చప్పుడు కూడా వినబట్లేదు. ఎందుకైనా మంచిది అని నా బ్యాట్ ని బయట డోర్ పక్కనే పెట్టి లోపలి వెళ్ళాను.
చూసేసరికి షాక్. ప్రభాకర్ సార్ ఉన్నారు. నాన్నతో మాట్లాడుతున్నారు. అప్పుడే వెళ్ళడానికి లేచారు. నన్ను చూసి ఏమీ అనలేదు. ఊరికే నవ్వి వెళ్ళిపోయారు అంతే.
నేను ట్యూషన్ కి రాలేదు అని చెప్పారో లేదో. నేను ఇంట్లో చెప్పాలో చెప్పకూడదో అర్ధం కాలేదు. చెప్పినా పెద్దగా ఏమనరు మా ఇంట్లో అని ఒక నమ్మకం. అయినా కొంచం భయం కూడా ఉండింది.
ఆయన వెళ్ళగానే నాన్న అడిగారు.
“నిన్న ఏదో టెస్ట్ పెట్టారంట కదా ప్రభాకర్ సార్.”
“అవును నాన్న. ఫస్ట్ ౩ చాప్టర్స్”
“మరి ఎన్ని మార్కులు ఒచ్చాయి?”
“అది... తెలీదు. ఇంకా ఇవ్వలేదు.”
టేబుల్ మీద ఉన్న పేపర్ తీసి ఇచ్చారు. 20 కి 5 మార్కులు ఒచ్చాయి.
“ట్యూషన్ కి వెళ్ళావా ఇవ్వాళ?”
ప్రభాకర్ సార్ నేను రాలేదు అని చెప్పారో లేదో అర్ధం కాలేదు. రిస్క్ ఎందుకు అని,
“లేదు నాన్న. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా. ఆయన బయాలజీ బాగా చెప్తారు. ఏవో డౌట్స్ ఉంటే మా ఫ్రిండ్స్ అందరినీ ఇవ్వాళ రమ్మన్నారు. అక్కడికే వెళ్ళాను. మ్యాథ్స్ తో పాటు సైన్స్ కూడా ఇంప్రూవ్ చేస్కోవాలి కదా.”అన్నాను.
“ఏం చేస్తున్నావు రా. నెలరోజుల నుంచీ ట్యూషన్ కి వెళ్తున్నావ్. మార్కులు మాత్రం పెరగట్లేదు. అసలు శ్రద్ధ పెట్టి చదువుతున్నావారా నువ్వు. ఎంతో కొంత మార్పు ఉంటుంది కదా నువ్వు ట్రై చేస్తే.”
“ట్రై చేస్తున్నా నాన్న నేను. ఈసారి చూడండి.”
ఒక్క క్షణం ఆగి చూసేసరికి. గేటు వేసావా అని నన్ను అడుగుతూ బయటికి వెళ్ళారు. అప్పుడే గుర్తొచ్చింది. బయట నా బ్యాట్ ఉంది. ఆయనే వెనకే పరుగెత్తాను. వెళ్ళి చూసేసరికి బ్యాట్ ఆయన చేతిలో ఉంది. చాలా కోపంగా ఉన్నారు. అంతకుముందు నాన్నని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.
“నీ రూంలో ఉండాల్సిన బ్యాట్ ఇక్కడేం చేస్తుంది?”
నాకేం చెప్పబుద్ది కాలేదు. ఇంకో అబద్ధం ఆడడానికి ధైర్యం చాలలేదు. అలాగే మౌనంగా నిల్చున్నాను.
“ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదా నీకు? మనమేంటో మన ఫ్యామిలీ ఏంటో, జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోలేని చిన్న పిల్లోడివి కాదు. నీకోసమే బ్రతుకుతున్నాం రా. మా బాధ అర్ధం చేస్కోవా? బర్త్ డే రోజు అడిగావని పొరపాటున కొనిచ్చాను రా ఈ బ్యాట్. ఆ డబ్బులు ఎలా ఒచ్చాయో ఆలోచించావా?” చాలా గట్టిగా అరిచారు.
“మీకు చెప్దాం అనుకున్నా నాన్న. ఇవ్వాళా ఇంపార్టెంట్ గేమ్ ఉండింది. ఇంటర్ కాలేజ్ గేమ్. దానికోసం.... కాని రేపటినించి వెళ్తా నాన్న ట్యూషన్ కి.” అని బతిమాలడానికి ప్రయత్నించాను.
· * *
ఇంత లోపు ఇల్లు ఒచ్చింది. గేటు తీసి కారు లోపల పార్క్ చేసాడు రఘు.
“సరే చెప్పు. ఏం అన్నారు మామయ్యా? ఆత్రుతగా అడిగింది లక్ష్మి.
“ ఏమంటారు. ఈ మెట్టు ఉంది చూశావా? ఇంటి డోర్ ముందు సరిగ్గా మూడో మెట్టు. ఇంకా గుర్తుంది. దీనికేసి బ్యాట్ ను గట్టిగా కొట్టారు.”
ఇంట్లో వాళ్ళు వింటారేమో అని చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు రఘు.
“ముందు రెండు సార్లు కొట్టగానే గట్టిగా శబ్దం ఒచ్చింది. ఇంకా అలాగే కొడుతూ పోయారు.మళ్ళీ మళ్ళీ.. చివరికి... రెండు ముక్కలైపోయింది.”
రఘు కళ్ళల్లో సన్నటి నీటి పొర.
“అంతే. నాన్నని అలా చూడడం అదే మొదటి సారి. ఇంకొక్కసారి అలా చూడొద్దు అనుకున్నా..... ఇప్పటివరకు బ్యాట్ కాని బాల్ కాని ముట్టుకోలేదు.”
ఒక్కసారి రఘు దెగ్గరకి ఒచ్చి హత్తుకుంది లక్ష్మి.
“సరేలే లోపలి వెళ్దాం పదా.” నిద్రపోతున్న అద్విక్ ని ఎత్తుకొని లోపలి వెళ్లారు ఇద్దరు.
* *
వెళ్ళేసరికి హాల్ లో కూర్చొని ఉన్నాడు రంగారావు. టివీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. లక్ష్మికి గుండెల్లో ఝల్లుమనింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో అని. అద్విక్ ని లోపల పడుకోబెట్టడానికి వెళ్ళింది.
రఘు నాన్న పక్కన కూర్చున్నాడు.
“కాలేజ్ చూసోచ్చాం నాన్నా.... మీకెప్పుడు చెప్పలేదు.... థాంక్స్ నాన్నా .... మీరు కాని నా క్రికెట్ మాన్పించక పోతే ఇవ్వాళ అమెరికాలో ఈ స్టేజిలో ఉండేవాడిని కాదు.” అని టీవీ ఛానల్ మార్చేశాడు రఘు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
1. ఉద్యోగం
అది ఆదివారం మధ్యాహ్నం... వారం మొత్తంలో ఎక్కువ మంది కస్టమర్లు ఒచ్చేది ఇప్పుడే.... సూపర్ మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. ఉన్న నాలుగు కౌంటర్లు ముందు లైన్లు పెరిగిపోయినయి. పదేండ్ల నించి కృష్ణవేణి ఇక్కడే పని చేస్తుంది. పప్పులు, రవ్వ, పిండి ఇలాంటివన్నీ జల్లెడ పట్టడం, ప్యాకింగ్ చెయ్యడం, తరవాత అవన్నీ సర్దడం, షాపు ఊడ్వటం, అవేమీ లేకుంటే కస్టమర్లకు సహాయం చెయ్యడం లాంటి పనులన్నీ చేస్తుండాలి.
ఒక రెండు నిమిషాలు ఖాళీ దొరికితే వెళ్ళి ఓనర్ తో మాట్లాడాలి అని ఎదురుచూస్తుంది కృష్ణవేణి. కష్టం మీద రెండు నిముషాలు కల్పించుకొని ఓనర్ రూంలోకి వెళ్ళింది.
“ఏంటి కృష్ణవేణి? అంత మంది కస్టమర్లు అక్కడ ఉంటే ఇటొచ్చావు?” బిల్ల్స్ ముందేసుకున్న ఓనర్ తల పైకి ఎత్తకుండానే అడిగాడు.
“నాకు హాఫ్ డే లీవ్ కావాలి సార్.” సమయం వృథా చెయ్యకుండా అడిగేసింది కృష్ణవేణి.
ఇప్పుడు తల ఎత్తాడు.
“అదేంటి. ఆదివారం రోజు. ఆరోగ్యం బానే ఉందా?”
“ఉంది సార్. కాని కొంచం పని ఉంది బయట. తప్పలేదు.”
“సరే. ఎప్పుడూ అడగవు కదా. ఎదో అవసరం ఉండే ఉంటుంది లే. ఊరికే సరే అన్నాను అని చెప్పకు వేరే స్టాఫ్ కి. మళ్ళా అందరూ ఆదివారం కావాలి అని అడగడం మొదలు పెడతారు.”
హమ్మయ్య అనుకుంటూ బయటికి నడిచింది కృష్ణవేణి.
“ఆ పప్పులు స్టాక్ నింపేసి వెళ్ళు. అసలే నిన్న ఒకటో తారీకు.” అని ముగించాడు మేనేజర్.
డబల్ ఫాస్ట్ గా పని చెయ్యడం మొదలు పెట్టింది కృష్ణవేణి. తను అంత హుషారుగా ఉండడం గమనించింది చంద్రకళ. ఇద్దరూ గత పది సంవత్సరాల నుంచి అక్కడే కలిసి పని చేస్తున్నారు. కష్టం సుఖం పంచుకోవడం అలవాటు. దాని వల్ల చనువు, సఖ్యత ఏర్పడ్డాయి. ఇద్దరిమధ్యా రహస్యాలు లేనంతగా.
“ఏంటే కృష్ణా? చాలా హుషారుగా చేస్తున్నావు పని.” అడిగింది చంద్రకళ.
“మధ్యాహ్నం నించి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాను ఓనర్ గారికి. అందుకే.”
చంద్రకళ ఇంకో ప్రశ్న అడగముందే ఏం చేయ్యబోతుందో కూడా చెప్పింది.
“మా అబ్బాయి బయటికి వెళ్దాం అని ఖచ్చితంగా ఒచ్చేయమన్నాడే. వారం నించి చెప్తున్నాడు. ఆదివారం రోజే వాడికి కుదురుతుంది.” కృష్ణవేణి గొంతులో ఆనందం.
“అంత స్పెషల్ ఏముంది?”
“వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి నెల అయింది కదా. జీతం ఒచ్చింది.”
“అవును కదా. అప్పుడే నెల అయిపోయిందా? జీతం రాగానే అమ్మ కోసమే ఆలోచిస్తున్నాడు. పాపం మంచోడు. ఫ్రెండ్స్ తో వెళ్ళకుండా.”
“నేనూ అదే అన్నా... ఈసారికి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళు నాన్నా అని. అస్సలు వినడే. ఒకటే పట్టు. అది కూడా ఇవ్వాళే వెళ్ళాలట.”
“నువ్వు ఇన్నేండ్లు పడ్డ కష్టం చూశాడు కదే వాడు... పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా వాడికోసమే తపించావు. ఇప్పుడు నీ వంతు వచ్చింది...ఇప్పుడన్నా సుఖపడు.”
కృష్ణవేణి కళ్ళల్లో నీళ్ళు. 20 ఏళ్ళ జీవితం గిర్రున కళ్ళముందు తిరిగింది.
* * *
20 ఏళ్ళ క్రితం ఇక్కడికి 5 నిమిషాలు దూరం కూడా లేని బస్టాప్ లో సూర్యాపేట నించి ఒక బస్సు ఒచ్చింది. క్రిష్ణవేణి, భర్త దామోదరం, కొడుకు సందీప్, సంచీలో ఇరవయి వేల రూపాయలు, కృష్ణవేణి గుండెల్లో ఎన్నో ఆశలు, అన్నీ ఆ బస్సులోనే హైదరాబాదుకి చేరాయి.
పెళ్ళైన మొదటి అయిదేళ్ళు కృష్ణవేణి కాపురం సూర్యాపేటలోనే జరిగింది. నలుగురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబంలో చిన్నవాడు దామోదరం. అన్నయ్యలు వ్యవసాయం చేస్తారు. ఇతన్ని కూడా రమ్మంటారు కాని ఒకరోజు వెళ్తే నాలుగు రోజులు వెళ్ళడు. ఊర్లో చిన్న చిన్న అప్పులు, బాధ్యత తెలియకుండా తిరగటం ఇలాంటి అల్లరి చిల్లర పనులు చేస్తూ ఉండేవాడు. పెళ్ళయినా, సందీప్ పుట్టినా ఏం మారలేదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకూ అన్నలు భరించారు. వాళ్ళు పొయ్యాక దామోదరం అన్నలకు బరువయ్యాడు. పైగా అప్పటికే సాయి పుట్టాడు. ఒక కుటుంబాన్ని మనం ఊరికే పోషిస్తున్నాం అని వాళ్ళకి అనిపించడం మొదలయ్యింది. ఈ విషయం ముందే పసిగట్టింది కృష్ణవేణి. ఆమెకి కోపం రాలేదు. వాళ్ళు అనుకునేది నిజమే కదా అని మొగుడికి పని మీద శ్రద్ధ పెట్టమని బ్రతిమాలేది. కాని అతను వినిపించుకునే వాడు కాదు.
ఇంట్లో రెండు మూడు చిన్న గొడవలు అయ్యేసరికి కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒచ్చింది. ఊళ్ళో పెద్దమనుషులంతా కలిసి దామోదరం ఆస్థి మీద హక్కు వదిలేసుకున్నందుకు గాను అన్నయ్యలల్తో ఓ యిరవై వేలు ఇప్పించారు. దామోదరం ఉన్న ఊళ్ళోనే ఉందాం అన్నాడు. కాని కృష్ణవేణికే సహించలేదు. తన తల్లిగారిల్లు విజయవాడలో. ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు రాజు. అక్కంటే అభిమానం. రాజు అందరినీ అక్కడికి రమ్మన్నా వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ దామోదరం బాధ్యత అంతా వాళ్ళ పైన వదిలేసి అల్లరి చిల్లరగా తిరుగుతాడు అని భయం వెసింది. హైదరాబాదు వెళ్లి ఎలాగో అలాగ బ్రతుకుదాం అన్నది. మొగుణ్ణి ఒప్పించింది. పొద్దు తిరగకుండా బస్సు ఎక్కారు. సిటీలో దిగేసరికి ఎక్కడ ఉండాలో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. కాని సిటీ హైదరాబాదు అన్నీ అదే నేర్పుతుంది అనే నమ్మకం మాత్రం ఉంది.
· * *
చంద్రకళ పిలుపుతో ఒక్కసారి ఈ లోకంలోకి ఒచ్చింది కృష్ణవేణి. అలోచనలోనే కందిపప్పు ప్యాక్ చేసేసింది. ప్యాకెట్ల మీద స్టికర్లు వేసి అంటిస్తుంది.
“ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారే మరి?” అడిగింది చంద్రకళ
“ట్యాంక్ బండ్ పక్కన థియేటర్ ఉందంట కదా, మంచిది. ఎప్పటినుంచో ఉండే అక్కడికి పోవాలని. మనకి ఎక్కడ కుదురుతుంది. కుదిరినా అక్కడ ఉండే రేట్లు మనం భరించలేం. అప్పుడెప్పుడో నువ్వు కూడా చెప్పావు కదా బాగుంటుంది అని. అక్కడికే తీసుకెళ్తా అన్నాడు సందీప్.”
“ఓ ప్రసాద్... పాతదే కదా. మేము చూసే చాలా ఏండ్లు ఐతుంది. అక్కడ ఖర్చు పెట్టకపోతే సరిపోయే. ఊరికే చూసి రాకపోయిన్రు ఎప్పుడయినా.”
“హ్ం.. ఎప్పుడూ కుదరలేదు అంతే.”
“కాని చాల బాగుంటదే. మాల్ అంటారంట. నా కొడుకు చెప్పిండు. ఆ మెట్లు ఉంటాయి చూడు. అవ్వే పైకి కిందికి పోతయి. ఎస్కలేటర్ అంటారంట. అది మొదలు అక్కడే చూశ్న. అక్కడనే ఎక్కినా. మస్తుంటది.”
ఎప్పటినుంచో కడుపులో దాచుకున్న భయం మేలుకున్నట్టు అనిపించింది కృష్ణవేణికి.
“అదంటే నాకు చాలా భయమే. మేము హైదరాబాదుకి ఒచ్చిన కొత్తల్లో మా ఆయన తీసుకెళ్ళారు. కాచిగూడలో మహేశ్వరి థియేటర్ కి. అక్కడ ఉండింది అది. ఇరవయిదు రూపాయల టికెట్టు కొంటేనే ఎక్కనిస్తా అన్నాడు వాడు. ఆయనకీ ఇలాంటివి అంటే సరదా కదా. ఒద్దని చెప్తున్నా కొన్నారు ఆయన. తీరా ఎక్కుదాం అనే సమయానికి నాకు చాల భయం వేసింది. వాళ్ళంతా చమటలు పట్టాయి. చివరికి ఎక్కకుండా మామూలు మెట్ల మీద వెళ్ళా. చాలా తిట్టారు ఆయన దానికి.”
ఈ మాటలు వినగానే చంద్రకళ మొఖంలో ఒక్కసారిగా నవ్వు మాయమయి కోపం ఒచ్చింది.
“మీ ఆయనకేంది? పూల రంగడు. అట్లాంటి సరదాలు ఉంటయి, ఇంకెట్లాంటి సరదాలైనా ఉంటయి. ఈసారి ఎన్ని రోజులయింది. మాట్లాడిండా మల్ల?” అడిగింది చంద్రకళ.
“లేదే. రెండేళ్ళయింది. ఎక్కడున్నాడో ఎమో మరి..? ఈసారి నేను కూడా కనుక్కోడానికి ప్రయత్నించలేదు.”
ఇద్దరి మధ్యా కొంచంసేపు నిశ్శబ్దం.
ఎంతైనా దామోదరాన్ని గురించి చంద్రకళ అలా మట్లాడడం నచ్చలేదు క్రిష్ణవేణికి. అందుకే తనే మాట మార్చింది.
“సరే కాని. ఆ ఎస్కలేటర్ ఏంటో అదంటే నాకు చాలా భయమే. ఇప్పుడు ఎట్లా. ఒద్దన్నా వినడు సందీప్. మొండోడు వాడు.”
“ఏం కాదులేవే. మరీ పల్లెటూరు దాన్లాగా.” నవ్వింది చంద్రకళ.
“ఏమో. చీర ఇరుక్కుపోతుందేమో దాంట్లో... లేకపోతే ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో పడిపోతే అందరూ చూస్తారు. నాకు భయం బాబు.”
“మరీ చాదస్తం నీది... ఏం కాదు... సరే చాలా సేపయ్యింది, స్టాక్ కూడా బానే నింపినం, ఇంక బయల్దేరు మరి.”
“సరేలే. ఉంటా మరి. ఈ నాలుగు ప్యాకెట్ల మీద ధర రాసెయ్యి.” అని చెప్పి మెల్లగా బయటికి ఒచ్చేసింది కృష్ణవేణి.
ఇంటికి వెళ్తున్న కృష్ణవేణిని ఆలోచనలు ముంచెత్తాయి. దామోదరం గుర్తొచ్చాడు. చూసి రెండేళ్ళయింది. కొడుక్కి ఉద్యోగం ఒచ్చిందని అతనికి చెప్పలేదు. చెప్పాలా? ఇంతకీ దామోదరం ఎలా ఉన్నాడో. ఒక్క క్షణం అతను చేసిన పనులన్నీ గుర్తొచ్చాయి.
* * *
కొత్తగా హైదరాబాదులో దిగగానే మలక్ పేటలో ఒక చిన్న ఇల్లు వెతుక్కొని దిగారు. రెండే గదులు. ఊళ్ళో పెద్ద ఇంట్లో ఉన్న వాళ్లకి ఇది ఇబ్బందిగానే అనిపించింది. కాని తప్పదు.
దామోదరానికి సహజంగా కలుపుగోలుతనం ఎక్కువ. తొందరగా స్నేహం చెయ్యడం అలవాటు. చుట్టుపక్కల వాళ్ళతో త్వరగానే సఖ్యత ఏర్పడింది. వారం తిరిగేసరికి కృష్ణవేణి తమ్ముడు రాజు ఒచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి బావకి ఏదో ఒక వ్యాపారం పెట్టించి వెళ్దామని. దామోదరం తనంతట తాను ఆ పని చెయ్యడు అని అతనికి నమ్మకం. రెండు రోజులు అయ్యాయి. రాజు చుట్టు పక్కల కనుక్కోవడం మొదలు పెట్టాడు. చిన్న కిరాణా షాపు పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అతనికి. అదయితే కృష్ణవేణి కూడా కూర్చోవచ్చు. దామోదరాన్ని కూడా కనిపెట్టుకున్నట్టు ఉంటుంది. మరునాడు మెల్లిగా ఇదే మాట కదిలించాడు.
“ఏంటి బావ. ఏమనుకుంటున్నారు మరి? ఏం చేద్దామని.?”అన్నాడు భోజనం చేసేటప్పుడు.
“మీ అక్కనే అడుగు. ఉన్న ఊరు ఒదిలి ఈ సిటీకి తెచ్చింది కదా. నా మాట వినకుండా” నిష్ఠూరంగా మాట్లాడాడు దామోదరం.
“ఇప్పుడు అవన్నీ అనుకొని ఏం లాభం లెండి. ఒచ్చేశారు కదా. ఎదో ఒకటి చేసి బతకాలి కదా. ఇది కొత్త మొదలు అనుకోండి.”
“సరే. అదేదో నువ్వు చెప్పు మరి. ఉపన్యాసం ఇవ్వకుండా.” అన్నాడు దామోదరం చిరాగ్గా.
“మీకు ఇష్టం లేకుండా నేను ఏమీ చేయ్యమనటం లేదు బావ. కాని చూస్తూ ఉంటే ఉన్న కాస్త డబ్బు ఇట్టే కరిగిపోతుంది. తరవాత బాధపడాలి.” దామోదరం విషయంలో రాజు ఎప్పుడు ఓపికగా ఉంటాడు. తన అక్క మొఖం చూసి.
భోజనం అయిపోయింది.
“ఈ పక్కింట్లో ఒకాయన ఉంటాడు. రామారావు. చాలా మంచివాడు. ఆయన దెగ్గర ఒక స్కీం ఉంది. మనం ఒక యాభై వేలు కట్టాలి. తరవాత ఒక ముగ్గురిని చేర్పించాలి. అంతే నెల నెలా డబ్బు ఒచ్చి పడుతుంది. మనమేం చెయ్యక్ఖర్లేదు.” కుర్చీలో హాయిగా తల వెనక్కి వాల్చి చెప్పాడు దామోదరం
“అవన్నీ నమ్మకండి బావ. ఏమీ చెయ్యకుండా ఊరికే డబ్బు ఎవరూ ఇవ్వరు. అక్క ఏమంటుంది?”
“మీ అక్కా. ఏమంటది. నేను అన్న ప్రతీ దానికి కాదు అంటది.”
కృష్ణవేణి పక్కన్నే మౌనంగా నిలబడి వింటుంది. ఈ మాటకి ఏమీ అనబుద్ధి కాలేదు ఆమెకి. రాజు ఒకసారి ఆమెని చూశాడు. చెప్పు అన్నట్లు సైగ చేసింది.
“అలా కాదు బావ. నేను చుట్టుపక్కల కనుక్కున్నాను. కృష్ణవేణితో మాట్లాడాను. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో సరుకులకి కూడా ఇబ్బంది కూడా ఉండదు. హోల్ సేల్ మార్కెట్ కూడా దెగ్గరే. మీరు అక్కడనించి తెచ్చుకోవచ్చు. కృష్ణవేణి కూడా మీకు సాయంగా ఉండొచ్చు.”
దామోదరం ఏమీ మాట్లాడలేదు. ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ రాజే మాట్లాడాడు.
“ఏమంటావు బావా. ఆ పని ఏదో చూడమంటావా నన్ను.”
“మీరు మీరు మాట్లాడుకున్నాక ఇంక నన్ను అడగడం ఎందుకు. సరే కానియ్యండి.” అని అక్కడనించి వెళ్ళిపోయాడు దామోదరం.
“ఈ ఒక్క సహాయం చేసి పెట్టు రా రాజు. చచ్చి నీ కడుపున పుడతా.” అన్నది కృష్ణవేణి.
“అదేం మాటక్కా. అసలు నేను మనూరికే రమ్మన్నా కదా. మీరే రానన్నారు. అక్కడయితే మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండొచ్చు.”
“నిజమే రా. కాని నాకు ఇష్టం లేదు. అప్పుడు నీ మీద పూర్తిగా ఆధారపడిపోతాం. ఆయనకి బాధ్యత రావాలనే కదా నా బాధ.” కృష్ణవేణి కంట్లో కన్నీరు.
ఆ రోజునించి రాజు అదే పనిలో పడిపోయాడు. ఒక చిన్న చోటు చూసి షాపు పెట్టించాడు. కృష్ణవేణి వాళ్ళ దెగ్గర ఉన్న డబ్బు చాలదు కాబట్టి తాను ఒక యిరవై వేలు కలిపాడు. అది అప్పా లేక ఊరికే ఇచ్చావా అని కూడా అడగలేదు దామోదరం.
సరుకులు అన్నీ కొనిచ్చి. ఏవి ఏ ధరకు అమ్మాలో చెప్పి, బావని షాపు జాగ్రత్తగా చూస్కోమని, కృష్ణవేణిని బావని చూస్కోమని మరీ మరీ చెప్పి బయల్దేరాడు.
రోజూ దామోదరంతో పాటు కృష్ణవేణి కూడా షాపుకి వెళ్ళింది. పని నేర్చుకుంది. షాపు కూడా మెల్లి మెల్లిగా పుంజుకుంది. కొంచం కొంచం కూడపెట్టడం కూడా మొదలు పెట్టారు.
సందీప్ ని కాలేజ్లో చేర్పించారు.
· * *
నాలుగేళ్ళ తరవాత ఒక రోజు. అదే ఇల్లు. అదే మనుషులు.
“సందీప్ ఎక్కడున్నాడక్కా?” అడిగాడు రాజు.
“ఇక్కడెందుకు అని ఆడుకొమ్మని బయటికి పంపాను రా.” కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది కృష్ణవేణి.
“ఇన్ని రోజులనించి నాకు ఎందుకు చెప్పలేదు. కొంచం ముందే చెప్తే బాగుండేది. ఇంత గొడవ అవ్వకుండా చూసుకునేవాడిని.”
కృష్ణవేణి ఏడుపు ఎక్కువయింది.
“నిన్ను ఏడిపించడానికి కాదక్కా. నేనోకిడిని ఉన్నాను సహాయం చెయ్యడానికి అని మరిచిపోకు ఎప్పుడైనా. బావేం చేస్తున్నాడు?”
“ఇప్పుడే పడుకున్నారు. దెబ్బలు బాగా తగిలాయి రా. వీపు మీద వాతలు కూడా పడ్డాయి.”
“అసలేం జరిగింది. ఎవరు వాళ్ళు? కోర్చోబెట్టి మాట్లాడుకోవాలి గాని ఇదేం పద్ధతి. అడిగేవాళ్ళు లేరనుకున్నారా?”
కాస్త ఊపిరి పీల్చుకొని కృష్ణవేణి చెప్పింది.
“అంతా నా ఖర్మ రా. ఒకాయన మాత్రం బాగా పరిచయం. షాపుకి ఒస్తూ పోతూ ఉండేవాడు. వాళ్ళకి మన దెగ్గర పద్దు కూడా ఉంది. నేనూ రోజూ షాపుకి ఒస్తూ పోతూ ఉన్నాను. ఆయన బావగారికి డబ్బు ఎప్పుడు ఇచ్చారో, ఎంత ఇచ్చారో అసలు తెలియనే తెలియదు. మిగితా ముగ్గురు అప్పులాళ్ళు ఉన్నారని కూడా నిన్న వాళ్ళు ఆయన్ని పట్టుకెళ్ళాకే తెలిసింది. నాకు ఏదీ చెప్పరు. గట్టిగా అడిగితే గొడవ. యిలా తీస్కెళ్ళి కొడతారని తెలిస్తే నీకెందుకు చెప్పను రా. నువ్వు కాకుండా మాకు మాత్రం ఎవరున్నారు. ఈ ఊరికి ఒచ్చాక అత్తగారింటితో పూర్తిగా తెగిపోయింది. అటు వైపైనా ఇటు వైపైనా మమ్మల్ని కాస్త కనిపెట్టుకు ఉండేది నువ్వొక్కడివే.”
“అది సరేలేవే. కాని బాగా నడుస్తున్న షాపు కదా అసలు అప్పు ఎందుకు చెయ్యవలసి ఒచ్చింది. అది కూడా అలాంటి మనుషుల దెగ్గర. ఈ మధ్య నడవట్లేదా, లేక ఎమన్నా అవసరం ఉండి అప్పు చేశారా?”
“షాపు బాగానే నడిచేదిరా. ఒక రెండు మూడేళ్ళు చేతిలో డబ్బులు ఆడేసరికి ఆయనకి ఈ పని మీద విసుగొచ్చినట్టుంది. నన్ను షాపులో కూర్చోబెట్టి ఆయన బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. సామాన్లు అయిపోతే నేను చెప్పేదాన్ని. అవ్వి తేవడానికి కూడా బద్ధకం. ఎంత మంది ఎన్ని సార్లు షాపుకి ఒచ్చి కావాల్సింది లేదని తిరిగి వెళ్ళిపోయారో చెప్పలేను. నాకు గుండెల్లో పిండేసినట్లుండేది అలా జరిగినప్పుడల్లా. చేజేతులా లక్ష్మిని తిప్పి పంపుతున్నట్టు అనిపిస్తుంది.”
“మరి ఈ అప్పేంటీ. ఎందుకు చేశారు తెలియదా నీకు?”
తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది కృష్ణవేణి.
“అదేంటక్కా. ఒక్క ఇంట్లోనే ఉంటున్నారా అసలు మీరు?”
ఈ అలికిడికి దామోదరం లేచినట్టున్నాడు. బయటికి ఒచ్చి రాజు పక్కన కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు.
“ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బావా.” మెల్లగా అడిగాడు రాజు.
“నాకేం అయిందయ్యా. బానే ఉన్నాను. సిటీలో ఇవన్నీ మామూలే. మీ అక్కే పెద్ద గొడవ చేసి నిన్ను పిలిపించింది.”
“అదేంటి బావా. వాళ్ళెవరో ఇంటి మీదికి ఒచ్చి నిన్ను తీస్కెళ్ళి కొట్టి పంపిస్తే అది భయపడదా?”
“ అదే చెప్తున్నా. అంత భయపడాల్సిన పని లేదు. నువ్వు హాయిగా ఊరికి వెళ్ళు.” అసలేమీ జరగనట్టే మాట్లాడాడు దామోదరం.
“మరి వాళ్ళు రేపు మళ్ళీ ఒస్తే? అదంతా ఎందుకు? అసలు అప్పెందుకు చేశావు? ఎంత చేశావు? అదంతా ఏం చేశావు?” కుండ బద్దలు కొట్టినట్టు అడిగేశాడు రాజు.
“అవసరం ఉండి తీస్కున్నానయ్యా. కుటుంబాన్ని పోషించే బాధ్యత లేదా నాకు. ఇంట్లోకి ఇవన్ని ఎట్లా తెస్తున్నా అనుకున్నావు. మీ అక్కకి ఖర్చు కాదా, మీ మేనల్లుడికి ఖర్చు కాదా?”
“దానికి షాపు ఉంది కదా బావా. ఇంకా డబ్బు అవసరం అయితే నన్ను అడగాల్సింది. రౌడీల్లాగా ఉన్నట్టున్నారు. వాళ్ళనెందుకు అడగడం?”
“అదెక్కడ నడుస్తుంది. నడిచినా మనింటి ఖర్చులకి అదేo సరిపోతుంది. అయినా అదేదో సరదా కోసం చేసింది కాదు. వేరే వ్యాపారం చేద్దామని తీస్కున్నాను.”
రాజుకి కోపం ముంచుకొస్తుంది. కాని మొదటినుంచి అక్క కోసం దామోదరంతో నిగ్రహంగా మాట్లాడడం అలవాటు.
“ఏంటది? ఆ వ్యాపారం?.”
“సరే చెప్తే కాని వదిలేట్లు లేరు మీ అక్కా తమ్ముళ్ళు. నేను తీస్కుంది అయిదు రూపాయల వడ్డీకి. కాని ఈ సిటీలో చాలా మంది ఇంకా ఎక్కువ వడ్డీకి తీస్కునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దెగ్గర తీస్కోని వాళ్ళకి ఇవ్వడమే మనం చేసేది. వీళ్ళ దెగ్గర తీస్కున్న డబ్బు వేరే వాళ్ళకి పది రూపాయల వడ్డీకి ఇచ్చాను. పని తక్కువ, లాభం ఎక్కువ. సంవత్సరం నుంచీ చేస్తున్నాను. ఈసారే కాస్త ఇబ్బంది ఒచ్చింది.”
ఆ మాట వినేసరికి ఇద్దరికీ మతి పోయింది. కృష్ణవేణి నోరు తెరిచింది. ఒక్క మాట తనతో చెప్పుంటే ఇదెంత పిచ్చి పనో భర్తకి చెప్పేదాన్ని కదా అనుకుంది. అందుకే చెప్పలేదు అని ఆమెకి అర్ధం అయ్యింది.
“ఎంత పని చేశావు బావ. ఎవరయినా అలాంటి వ్యాపారం చేస్తారా? పది రూపాయలు వడ్డీకి ఒప్పుకునేవాడు అసలు తిరిగి కడతాడా? కట్టకపోతే మనం అప్పుల్లో మునిగిపోమా?”
“రెండేళ్ళనుంచి చేస్తున్నాను. ఇప్పుడేదో కాస్త ఇబ్బంది అయిందని వ్యాపారమే తప్పంటే ఎలా?”
“సరేమరి రెండేళ్ళనుంచీ చేస్తే ఇప్పుడు అప్పులు ఎందుకు అయ్యాయి. సంపాదించలేదా ఇన్నాళ్ళు?” గొంతు పెంచాడు రాజు.
“ఈసారి నేను అప్పు ఇచ్చిన ఇద్దరిలో ఒకడు చచ్చాడు. ఇంకొకడు ఊరు వదిలి పారిపోయాడు.” చావు కబురు చల్లగా చెప్పాడు దామోదరం.
కృష్ణవేణి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
“ఇప్పుడేం చేస్తావు మరి?” తను సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా, ఊరికే ఒప్పుకోకబుద్ది కాలేదు రాజుకి.
“చూద్దాం. నా దెగ్గరైతే లేవని చెప్తాను. ఏం చేస్తారు తల తీసి మొలేస్తారా.”
దామోదరం ధైర్యం చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది.భార్య ఉంది, అయిదేళ్ళ కొడుకు ఉన్నాడు, ఇంత బాధ్యత లేకుండా ఈ మనిషి ఎలా ఉండగలడు. ఉన్నా అతనితో తన అక్క ఎలా కాపురం చేస్తుంది ఇన్నాళ్ళనుంచీ.
అదే కోపంలో లేచాడు.
“సరే మరి మీ వ్యాపారం మీరు చూస్కోండి.” అని గబగబా బయటికి వెళ్ళాడు.
ఆ వెంటనే కృష్ణవేణి వెళ్ళింది.
“ఒరేయ్ తమ్ముడు. ఇదొక్క సహాయం చేసి పెట్టరా. ఆయన నా మాట వినరు. ఈ గండం మాత్రం గట్టెక్కించు. ఆయన్ని ఎప్పుడు తీస్కెళ్ళి ఏం చేస్తారో అని నేను ఛస్తూ బతుకుతున్నాను.” అని రాజు చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళల్లోనుంచీ నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.
అక్కడే ఉన్న సందీప్ ఇది చూశాడు. రాజు కాని, కృష్ణవేణి కాని అది పట్టించుకునే పరిస్థితిలో లేరు.
“సరే అక్కా. నీ కోసం.” అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బావ పక్కన కూర్చున్నాడు.
“ఏమవుతే అది అవ్వుద్ది అని నువ్వు ఉన్నంత ధైర్యంగా మేము ఉండలేకపోతున్నాం బావా. చెప్పు. ఇప్పుడు ఈ పీడా పోవాలంటే ఎంత కట్టాలి వాళ్ళకి.” అని అనునయంగా అడిగాడు.
“నిన్ను నేను అడగలేదోయ్ బావ. మీ ఊరు వెళ్ళి హాయిగా నీ పని నువ్వు చేసుకో.” నవ్వుతూ అన్నాడు దామోదరం.
రాజు నిట్టూర్చాడు.
“అబ్బే. నువ్వు అడగలేదు బావా. నాకే డబ్బెక్కువయ్యి ఇస్తున్నా. చెప్పు ఎంత కట్టాలి.”
“ఒక రెండు లక్షలు మల్లయ్యకి. లక్షా యాభై గణేష్ కి. ఒక నలభై వేలు సింగ్ కి.” ఎప్పటినుంచో చెప్పాలి అనుకుని జ్ఞాపకం పెట్టుకున్నట్టు టకటకా చెప్పేశాడు.
“మరి ఒచ్చేవి ఎన్ని ఉన్నాయి దీంట్లో?”
“అవన్నీ కలుపుకునే చెప్పానోయ్. ఇప్పుడు తగ్గిన డబ్బు ఇది, అప్పు ఇది. ఇది కట్టేస్తే నన్ను ముట్టుకునే ధైర్యం ఎవ్వడికీ లేదు.”
రాజు నోరు తెరిచాడు. ఇంట్లో తెలియకుండా ఇంత అప్పు ఎలా చేశాడు. ఒక మాట గట్టిగా అనడానికి కూడా లేదు. బావగారు మరి...
ఒక్కసారి కృష్ణవేణిని చూశాడు. శక్తి కూడగట్టుకున్నాడు. చెప్పబోయేది వాళ్ళకు నచ్చదని తెలుసు.
“చూడక్కా. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నేను చెప్పేది ఇదే. ఆ డబ్బంతా నేను కడతా. బావ చేతికి ఇవ్వను. ఆ అప్పుల వాళ్ళను పిలిచి నేను స్వయంగా కడతా. ఈ షాపు మూసెయ్యండి. మీ వాలకం చూస్తే అందులో సరుకులు కూడా ఏమీ మిగిల్చినట్టు లేదు. నాతోపాటు మనూరికి వచ్చెయ్యండి. అక్కడ బావకి ఒక ఉద్యోగం చూస్తా. మంచిదే. సందీప్ ని కాలేజ్లో చేర్పిస్తా, వాడు జీవితాంతం ఎంత చదువుతానంటే అంతా నేనే చదివిస్తా. ఇదే చెప్తున్నా బావా... ఈ షరతులు అన్నిటికీ ఒప్పుకుంటేనే నేను డబ్బు ఇచ్చేది. నేను స్నానం చేసి, గంటలో బస్సు ఉంది, దానికి వెళ్ళిపోతాను. అంత లోపల మీ నిర్ణయం చెప్పండి.” అని లేచి పక్కనే ఉన్న సందీప్ తల నిమురుతూ వెళ్ళిపోయాడు. అతని గొంతులో కోపంకన్నా బాధే ఎక్కువ ధ్వనించింది కృష్ణవేణికి.
ఒక్కసారి కృష్ణవేణిని చూశాడు. శక్తి కూడగట్టుకున్నాడు. చెప్పబోయేది వాళ్ళకు నచ్చదని తెలుసు.
“నేను వెళ్తున్నా బావా. ఏం నిర్ణయించుకున్నారు మరి ఇద్దరూ?” అక్కని కూడా కలిపినట్టు అడిగాడు.
“అది నిర్ణయించేదేంటి? నాలుగు రూపాయలకోసం ఎవడికిందా ఊడిగం చేసే అవసరం లేదు నాకు. ఇల్లరికం వెళ్ళే అవసరం అంతకంటే లేదు.” అన్నాడు.
రాజు కృష్ణవేణికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు.
నాలుగు రోజులు గడిచాయి. కృష్ణవేణి భయం భయంగా ఉంది. ఒక్కసారి రాజుకి ఫోన్ చేద్దాం అనుకుంది. కాని అలాంటిదేమీ చెయ్యొద్దని దామోదరం చెప్పాడు.
ఇంకో రెండు రోజులు ఆగి ఒకతను ఒచ్చాడు. రాజు పంపించాడు అని చెప్పి అణా పైసలతో సహా మొత్తం డబ్బు దామోదరం చేతుల్లో పోసి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి ఆనందంగా తన తమ్ముడిని పొగిడింది. తన ఊరికి ఒకసారి వెళ్లి వద్దాం అంది. దామోదరం ఒప్పుకోక ఆగిపోయారు. ఒక సారి ఫోన్ చేసి మాట్లాడమంది. అతను ససేమిరా అన్నాడు.
గత్యంతరం లేక కృష్ణవేణే అతనికి తెలియకుండా తమ్ముడికి ఫోన్ చేసింది. తనని ఊరు వచ్చెయ్యమన్నాడు. ఆమె ఒచ్చేస్తే బావ కూడా కొన్ని రోజులకి ఒస్తాడని అతనికి తెలుసు. కాని అందుకు ఆమె రానన్నది. సందీప్ తో కాసేపు మాట్లాడి పెట్టేశాడు. ఆ తరవాత వాళ్ళ మధ్య అంతకు ముందున్న బంధం కాస్త పలుచబడింది. రాకపోకలు ఆగిపోయాయి. మాటలు కూడా తగ్గాయి. డబ్బు ఇచ్చాడని పొగరు వల్లే రాజు మాట్లాడడం మానేసాడని దామోదరం కొందరితో చెప్పాడు.
· * *
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
మరో అయిదేళ్ళ తరవాత మళ్ళీ అదే ఇల్లు, అదే మనుషులు.
రాజు అప్పుడే ఒచ్చాడు. అయిదేళ్ళ తరవాత అదే ఆ ఇంటికి రావటం. ఇల్లు పూర్తిగా కళ తప్పింది. అయిదేళ్ళ తరవాతే అయినా కృష్ణవేణిని చూస్తే ఇరవయ్యేళ్ళు అయినట్టుంది. అప్పుడే ముసలితనం వచ్చేసిందా అన్నట్టుంది. ఒక్క క్షణం గుండెల్లో కలుక్కుమంది. పైగా రెండు రోజులనుంచీ ఏడుస్తున్నట్టుంది, మొఖం అంతా పీక్కుపోయి, జుట్టు రేగిపోయి ఉంది. తన కళ్ళనుండి నీళ్ళు ఎప్పుడొచ్చాయో కూడా గమనించలేదు రాజు. ఏదో ముక్తసరిగా వచ్చి, అవసరమైన పని చూస్కొని వెళ్ళిపోదాం అనుకున్నవాడు అదంతా మరిచిపోయాడు. కృష్ణవేణిని దెగ్గర తీస్కున్నాడు.
“ఏంటక్కా ఇది. ఇలా అయిపోయావేంటి? అసలు ఇదంతా జరుగుతుంటే చెప్పొచ్చు కదా. నేనేం చచ్చాననుకున్నావా? చెప్పు. అసలు ఎమన్నా తిన్నావా మొన్నటినుంచి?”
కృష్ణవేణి ఏం మాట్లాడలేదు.
అటు ఇటు చూశాడు. సందీప్ టీవీ ముందు కూర్చున్నాడు. రాజుని చూసి దెగ్గరికి ఒచ్చాడు.
“సందీప్... బాగున్నావా రా?” అని సందీప్ ని దెగ్గరకి తీస్కున్నాడు.
“ఏమైయినా తిన్నావా సందీప్.?”
“లేదు మామయ్యా” . చిన్నప్పుడు ఎప్పుడో మామయ్యని చూసిన జ్ఞాపకం ఉంది వాడికి.
“ఇంద. ఈ డబ్బు తీస్కోని ఇడ్లి, దోసె తినిరా. వచ్చేటప్పుడు అమ్మకు కూడా తీస్కొని రా. సరేనా?” అని డబ్బిచ్చి పంపించాడు.
కృష్ణవేణి పక్కన కూర్చున్నాడు. కనకదుర్గ గుడి నుంచి తెచ్చిన ప్రసాదం తీసి ఇచ్చాడు.
“చెప్పక్కా. ఇంత జరుగుతుంటే నాకు చెప్పలేదేందుకు?”
కృష్ణవేణి కళ్ళు తుడుచుకుంది. ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు. కాని తప్పదు.
“ఏం చెప్పమంటావు రా. అప్పుడు నీ దెగ్గర డబ్బు తీసుకున్నందుకే సగం చచ్చాను. ఇంకోసారి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు.”
“పిచ్చిదానిలా మాట్లాడకు. డబ్బిచ్చాను అని నేను ఎప్పుడయినా అన్నానా? అసలు ఆ మాట ఎత్తానా? రక్త సంబంధం అక్కా. ఇలాంటప్పుడు కూడా ఆదుకోకుంటే ఇంకెందుకు?”
“సరే చెప్పు. బావకి ఏమయింది ఎందుకు ఇలా చేస్తున్నాడు?”
“అంతా నా ఖర్మ రా. ఏదో దుర్ముహూర్తంలో పుట్టుంటాను. లేదా పూర్వ జన్మలో ఏదో పాపం చేసుంటాను.”
“చేసింది బావ అయితే నిన్ను నువ్వు ఎందుకు అనుకుంటావు. సరే అసలు ఏమయిందో చెప్పు. ఇప్పుడేం చెయ్యాలో అలోచిద్దాం.”
కృష్ణవేణి కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
“పోయినసారి నువ్వు డబ్బు పంపినాక కొన్ని రోజులు బాగానే గడిచింది...ఒక సంవత్సరం దాకా... షాపుని కష్టపడి మళ్ళీ కాస్త నిలబెట్టాం. ఆయనకి తెలిసి కొంతా, తెలియకుండా కొంతా, నీకు ఇవ్వాలని డబ్బు కూడా దాచడం మొదలయ్యింది. ఇప్పటికయినా మా కష్టాలు తీరుతున్నాయని, ఆయన తిన్నగా ఉంటున్నారని సంతోషించాను. కాని లోలోపల గుబులుగా ఉండేది. అలవాటు లేని సుఖం కదా. కొన్ని రోజులకి నేను అనుకున్నదే నిజం అయింది. ఆ అప్పులాళ్ళు మళ్ళీ ఒచ్చారు. కనుక్కుంటే తెలిసింది కదా నువ్విచ్చిన డబ్బు మొత్తం ఆయన వాళ్లకి కట్టలేదంట. ఎంతో కొంత కట్టి మిగితాది మెల్ల మెల్లగా షాపు నిలబడ్డాక కడతాను అని చెప్పారంట. వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనుక్కుంటూనే ఉన్నారంట. ఈయనేమో ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని బండి లాక్కొచ్చారు.
ఆ గొడవ పెరిగి పెరిగి ఒకరోజు వాళ్ళంతా ఒచ్చి మా దెగ్గర ఉన్నదంతా లాక్కుపొయ్యారు. దాచుకున్న డబ్బుతో వేసిన చీటీలు, షాపులో సామాన్లు మొత్తం. ఆయనతో ఘర్షణ కూడా పడ్డారు. ఆ మరుసటిరోజు ఆయన నీకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పమన్నారు. కాని నేను చెయ్యలేదు. దానికే పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. ఓ నెల్లాళ్ళు ఎక్కడికెళ్ళారో తెలియదు.
నేనూ, వాడు ఎట్లా గడిపామో మాకే తెలుసు. ఒక్కదాన్నే రాత్రుళ్ళు ఎడ్చేదాన్ని. ఇంట్లో తిండి గింజలకు కూడా కష్టం అయిపోయింది. ఇక చేసేదేంలేక ఈ పక్కింట్లో ఒకావిడ చెప్తే ఓ సూపర్ మార్కెట్లో పని చెయ్యటానికి కుదురుకున్నాను. పప్పులు అవ్వీ శుభ్రం చేసి ప్యాక్ చెయ్యాలి. సందీప్ చిన్న పిల్లవాడు, కాలేజీ నుంచి ఒచ్చి ఒక్కడే ఉంటాడు. అదో బాధ.
నెల్లాళ్ళకు ఆయన ఒకసారి ఫోన్ చేశారు. ఎక్కడున్నారో చెప్పలేదు కాని, ఇంటికి రావొచ్చా? అప్పులవాళ్ళు ఒస్తున్నారా? అని అడిగారు. లేదని చెప్పాను. రెండు మూడు రోజలకు ఒచ్చారు.
ఒచ్చినరోజు నుంచి ఇంట్లో గొడవ. ఆయన ఏ ఉద్యోగం చెయ్యనని, వ్యాపారం చేస్తానని. నీ పేరు తియ్యలేదు కాని నిన్ను నేను అడగాలనే ఆయన అభిప్రాయo. నేనూ మొండిగానే ఉన్నాను. ఇక చేసేదేంలేక ఆయన కూడా మా సూపర్ మార్కెట్ పక్కన ఉన్న బట్టల షాపులో పనికి కుదిరారు.
కొన్ని రోజులు ఉండి, పని నేర్చుకొని, ఎవరితోనైనా పార్టనర్షిప్ లో మనమే ఒక షాపు పెట్టుకుందాం అని నాకు చెప్పారు. నేను అవేవి పట్టించుకోలేదు. ఆయన ఏదో ఒక పని చెయ్యడమే నాకు కావాల్సింది. ఆయన నాకిచ్చే డబ్బుతోనే ఇల్లు నడిపి నేను సంపాదించిన దానితో ఒక చీటీ వేశాను.
ఏదో ఒక దారిన పడ్డాం అనుకునేసరికి మళ్ళీ మొన్నే ఆయన బుర్రలో ఏం పుట్టిందో ఏమో, ఈ పని చేశారు. నా చీటీ డబ్బు కూడా పట్టుకుపోయారు.” అని ఆపేసింది కృష్ణవేణి.
రాజు మౌనంగా కూర్చుని విన్నాడు. అతని కోపం మాత్రం అతని కళ్ళల్లో కనిపిస్తుంది.
“అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా మరి?” కథ ఇంకా పూర్తి అవలేదు కదా అన్నట్టు అడిగాడు రాజు.
“ఎవరో ముదరష్టంది. ఆయన తోటే ఆ బట్టల షాపులో పని చేస్తుంది.”
“వాళ్ళిద్దరి మధ్యా పరిచయం ఉన్నట్టు నీకు తెలియదా?”
“అస్సలు తెలియదు రా. నాకు అనుమానమే రాలేదు. మామూలుగానే షాపుకి వెళ్లి వస్తుండేవారు.అదేo మాయ చేసిందో ఎప్పుడు వల్లో వేసుకుందో. ఇలా నన్ను, వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.”
“ఇంత జరిగాక ఈ మాట అంటున్నానని ఏమీ అనుకోకక్కా. మన బంగారం మంచిది కానప్పుడు పరాయి వాళ్ళని అనుకొని ఏమీ ప్రయోజనం లేదు. అదెవరో లేచిపోదాం అన్నదే అనుకో, ఈయనకి ఉండొద్దా? ఇప్పుడు సందీప్ కూడా చిన్నపిల్లవాడేo కాదు. వాడికీ రేపు ఇవన్నీ గుర్తుంటాయి. పెద్దయ్యాక వాడు తండ్రిని గౌరవంగా చూడగలడా?”
కొంచంతో పచ్చిగా మాట్లాడినందుకు రాజుకు సిగ్గుగా అనిపించింది.
ఈ ప్రశ్నలకి కృష్ణవేణి దెగ్గర సమాధానం లేకుండా పోయింది, ఏడుపు తప్ప.
“ఇంతకీ వెళ్ళేటప్పుడు ఏం తీస్కెళ్ళాడు?”
“మా చీటీ ఎత్తి మొత్తం డబ్బు తీస్కెళ్ళారు. వాళ్ళ షాపు ఓనర్ దెగ్గర పని ఉందని చెప్పి ఒక ఇరవయి వేలు అప్పు చేశారంట. ఆయనకి కూడా తెలియదు ఇంత జరుగుతుంది ఆయన షాపులోనే అని.”
“ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలిసిందా?”
“లేదు. అస్సలు తెలియదు.”
“సరే... నేను కనుక్కుంటాను. అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారో అర్ధం అవుతుంది.”
“అదేదో తెలుసుకోరా... చచ్చి నీ కడుపున పుడతాను. నలుగురి మధ్యలో తల ఎత్తుకోలేకున్నాను. అందరూ దీని గురించే అడుగుతున్నారు. మొగుడు ఒదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత చులకన..!”
ఒక వారం రోజులు రాజు హైదరాబాదులోనే ఉన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ గురించి వాకబు చెయ్యడం, ఎవరినో కనుక్కోవడం, వాళ్ళు ఎక్కడో ఉన్నారని చెబితే అక్కడికి వెళ్ళడం. ఇదే పని, కానీ దొరకలేదు.
ఇక తనకి కూడా విసుగు పుట్టింది. విజయవాడలో తన పనులు కూడా ఆగిపోయాయి. కాస్త గాలి మారుతుంది అని చెప్పి క్రిష్ణవేణిని, సందీప్ ని తీస్కొని ఊరు బయలుదేరాడు.
· * *
విజయవాడలో ఒక మూడు నాలుగు నెలలు ఉన్నారు కృష్ణవేణి వాళ్ళు. అక్కడ రాజు భార్య, పిల్లలు అందరు బాగానే ఉన్నారు కాని కృష్ణవేణికే ఇబ్బందిగా, అవమానంగా ఉండేది. వాళ్ళ కాపురంలో తను ఒక బరువుగా అనిపించింది. మళ్ళీ హైదరాబాదు ఒచ్చేసి అదే ఉద్యోగం చేద్దాం అనుకుంది. కాని మొగ తోడు లేకుండా ఒక్కతే ఎలా ఉండడం అన్న సందేహం ఆమెను పీడిస్తుంది.
ఒకసారి కొండ మీదికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాo అని సందీప్ ని తీసుకొని వెళ్ళింది. తన జీవితం, తన కొడుకు జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇంటికొచ్చి చూసేసరికి రాజు, దామోదరం ఎదురెదురుగా కూర్చున్నారు. అది చూడగానే కృష్ణవేణి మనసులో పిడుగు పడినట్టయ్యింది. అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది. లోపలికి వెళ్ళి తలుపు చాటునుంచి చూసింది.
“ఏం కృష్ణవేణి బాగున్నావా?” దామోదరం పలుకరించాడు.
ఆమెకి ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు. అలాగే మౌనంగా ఉండిపోయింది. అతను ఇంకో అయిదు నిముషాలు రాజుతో మాట్లాడి వెళ్ళిపోయాడు. తరవాత రాజు కృష్ణవేణి గదిలోకి ఒచ్చాడు.
“బావ మళ్ళీ ఇంటికి ఒస్తాను అంటున్నాడక్కా. నువ్వేమంటావ్?”
కృష్ణవేణికి ఏమనాలో అర్ధం కాలేదు. వెయ్యి ప్రశ్నలు మనస్సులో...కాని ఒక్కటే అడగగలిగింది. “ఆమె ఏమయింది?” అని.
“ఏమో. వాళ్ళిద్దరికి పడట్లేదంట. ఆవిడ వెళ్ళిపోయిందoట. మోసపోయాను, డబ్బంతా తీసుకుంది...అదీ ఇదీ అంటున్నాడు. ఇక ఆమెతో మాత్రం అతనికి సంబంధం ఉండదట. అది మాత్రo చెప్తున్నాడు.”
“ఒక్క మాట నిజం చెప్పు రాజు.. పొరపాటు చేశాను అనే పశ్చాత్తాపం ఆయనలో ఏమయినా కనపడిందా నీకు?”
ఒక్క సెకను ఆలోచించాడు రాజు.
“ప్చ్”,..“మరేమంటావ్ అక్కా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను విను. నాకు నువ్వు ఎప్పటికి బరువు కాదు. సందీప్ ని కూడా చదివిస్తా. ఆ బాధ్యత నాది. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక మార్గం చూపిస్తా. ఇక నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. తొందరేం లేదు” అని వెళ్ళిపోయాడు.
ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ఒచ్చాడు రాజు.
“బావ నీతో చెప్పొద్దు అన్నాడు...కాని నాకే దాచబుద్ధి కాలేదు... ఆవిడ తన జీవితం బావ వల్ల పాడయిపోయిందని, ఇక ఎలా బతకాలి అంటుందoట... అందుకోసమని ఒక యాభయి వేలు అడుగుతుందట. లేకపోతే సెక్యూరిటీ అధికారి కేసు పెడతాను అని బెదిరిస్తుందట”
“అయితే...” కృష్ణవేణికి తరవాత ఒచ్చే మాట అర్ధం అయింది. ఆయినా ఆపుకోలేక అడిగింది.
“అయితే ఆ డబ్బు నిన్ను ఇవ్వమంటున్నారా?” అడిగేసింది.
“అవును.”
“ఒకవేళ ఇవ్వకపోతే నన్ను తీసుకెళ్ళను అంటున్నారా?”
“ఇంచు మించుగా.”
కాని డబ్బు గురించి ఆలోచించొద్దని, తనకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు రాజు.
కృష్ణవేణికి చాలా తక్కువగా, హీనంగా అనిపించింది దామోదరం ప్రవర్తన. వెళ్ళకూడదు అనుకుంది. పొద్దున్న లేచి రాజుకి అదే విషయం చెబుదాం అనుకుంది.
కాని రాత్రి రాజు గదిలోంచి అతని భార్య గొంతు వినిపించింది. ఆ యాభై వేలేవో ఇచ్చేస్తే ఆమె వెళ్ళిపోతుందని. ఎలాగో వాళ్ళకి ఆస్తి పంపకాలు కాలేదు కాబట్టి దీనితో అదీ అయిపోతుందని. కృష్ణవేణి జీవితానికి ఒక మార్గం దొరుకుతుందని అన్నది ఆమె. రాజు గొంతు మాత్రం వినపడలేదు.
మర్నాడు ఉదయమే లేచి తన సామాన్లన్నీ సర్దుకుంది కృష్ణవేణి. రాజు దెగ్గరికి వెళ్ళింది.
“తమ్ముడూ. నేను వెళ్ళిపోతాను రా. ఆయన మీద నమ్మకంతో కాదు... వెళ్ళాలి కదా తప్పదు. ఈ ఒక్కసారి, చివరిసారిగా ఆ యాభయి వేలు ఇచ్చేయి. నేను సంతకం పెట్టేస్తాను. ఇక నాకు ఆస్తితో సంబంధం లేదు అని. ఏమీ అనుకోకు రా” అని తను చెప్పాలనుకున్నదంతా చెప్పేసింది.
“నీ ఇష్టం అక్కా. కాని ఇప్పుడు సంతకాల గోల ఎందుకు. నేను అడగలేదే.”
రాజు ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. సంతకం పెట్టేసింది. సాయిని తీసుకొని బయలు దేరింది. రాజు డబ్బులు తీసుకొని ఒక వారంలో ఒస్తాను అని చెప్పాడు. దామోదరానికి ఫోను చేసి వీళ్ళు ఒస్తున్నట్టు చెప్పాడు.
· * *
కృష్ణవేణి ఆలోచనల్లోంచి బయటికి ఒచ్చింది.. ఇరవయ్యేళ్ళు దాటినా ఇంకా ఆ సంఘటనలు మొన్న జరిగినట్టు గురతున్నాయి... ఇల్లు చేరింది. సందీప్ ఇంకా పడుకొని ఉన్నాడు. రాత్రంతా కాల్ సెంటర్ లో పని. నెల రోజులనుంచి ఉదయమే అతని నిద్ర. తన కష్టాల్లో సాయిని సరిగ్గా చదివించలేకపోయింది. గవర్నమెంట్ కాలేజీలో చదివి కూడా ఇంగ్లీషు బాగా మాట్లాడడం వలన అతనికి ఈ ఉద్యోగం ఒచ్చింది.
సందీప్ హైకాలేజీ అయ్యేనాటికి దామోదరం మళ్ళీ ఇంటి నుండి పోట్లాడి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి దాచుకున్న డబ్బు ఇవ్వను అనడమే అందుక్కారణం. ఈసారి కృష్ణవేణి ఎవరికీ చెప్పలేదు.
ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో సరిగ్గా తెలియదు. అప్పుడప్పుడు తనకు, సందీప్ కి ఫోను చేస్తుంటాడు. కాని ఒచ్చి వాళ్లతో ఉంటాను అని అనలేదు. ఆవిడ కూడా అడగలేదు.
ఈ మధ్య ఒక ఆరు నెలలుగా చెయ్యలేదు. సందీప్ కి ఉద్యోగం ఒచ్చింది అని చెబితే మళ్ళీ డబ్బు అడుగుతాడేమో అని భయం.
కొంచెంసేపు ఆగి సందీప్ ని లేపింది. బద్ధకించాడు. పాపం... జాలేసింది.
“కాసేపు పడుకో నాన్నా. ఇవ్వాళ బయటికి ఒద్దులే. తరవాత చూద్దాం. అరగంటలో వంట చేసేస్తా" అన్నది.
“ఒద్దమ్మా. నేను చెప్పాను కదా. ఇవ్వాళ వెళ్ళాల్సిందే. నువ్వు త్వరగా రెడీ అవు. అరగంటలో బయలుదేరాలి.” అని తొందరపెట్టాడు.
ఆటోలో ప్రసాద్ థియేటర్ చేరారు. మాల్ అంతా చాలా అందంగా ఉంది. కాని లోపలికి వెళ్ళగానే కృష్ణవేణికి ముందుగా కనిపించింది ఎస్కలేటర్. గుండె గడగడా కొట్టుకుంది.
“అరేయ్ సందీప్... మనం మెట్లమీది నుంచి వెళ్దాం రా. ఇదంటే నాకు చచ్చేంత భయం.” అంది సందీప్ చెయ్యి పట్టుకొని.
“నువ్వు మరీ చేస్తావమ్మా. నేను ఉన్నానుగా. నా చెయ్యి గట్టిగా పట్టుకో. కాని అంతకు ముందు మనం ఒకరిని కలవాలి. ఇటు రా.”
“ఎవరిని రా?”
“నువ్వు ఏమీ అనను అంటే చెప్తా అమ్మా.”
“చెప్పు రా. నువ్వు ఏం చేసినా నేను ఏమీ అనుకోను తెలుసు కదా.”
“నాన్నని రమ్మన్నానమ్మా.”
కృష్ణవేణికి మతిపోయింది. ఆలోచనలు అతి వేగంగా ఒక్కసారి తన్ను చుట్టుముట్టాయి. కొడుకు చేజారిపోతాడేమో అనేంత దాకా...
ఆమె ఏమీ మాట్లాడలేదు.
“తప్పుగా అనుకోకమ్మా. నాకు నాన్న కావాలని ఎప్పుడూ అనిపించలేదు. కాని చిన్నప్పటి నుంచీ నిన్ను చూస్తున్నాను. ఇంత కష్టపడ్డావు. నాన్న ఎప్పుడు ఒచ్చినా నువ్వు కాదనలేదు. ఇప్పుడయినా నిన్ను ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత కదా.”
ఆమె కళ్ళల్లో నీళ్ళు చూశాడు.
“నేను నాన్నతో మాట్లాడానమ్మా... ఆయన నిన్ను డబ్బు అడగరు. ఆయనకీ కావాల్సిన డబ్బు నెలకి నేనే ఇస్తాను అని చెప్పాను. నీతో గొడవ పడరు. నిన్ను ఏమీ అనరు. నువ్వు హాయిగా ఉంటే, మీరు కలిసుంటే నాకదే చాలు.”
కృష్ణవేణికి బాధేసింది. కాని తన కొడుకు తన గురించే ఆలోచిస్తున్నాడని, తన సుఖం దమోదరంతో ఉంటేనే అని అనుకుంటున్నాడని అర్ధం అయ్యింది. అది తన తప్పే. జీవితంలో మోసపోయిన ప్రతిసారీ తను దామోదరం చేసిన పని మరిచిపోయి మళ్ళి అతను కావాలనే చెప్పింది. బహుశా సందీప్ కి అదే గుర్తు ఉండి ఉంటుంది ఆ వయసు నుంచీ.
ఇంతలో దామోదరం కనిపించాడు. సందీప్ ఎదురు వెళ్లి అతన్ని తీసుకొచ్చాడు.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సందీప్ మాత్రం ఉత్సాహంగా ఉన్నాడు.
దామోదరం ఏదో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంచంసేపు అటూ ఇటూ తిరిగారు.. సందీప్ ఉద్యోగం గురించి అంతా కనుక్కున్నాడు దామోదరం... కృష్ణవేణికి మనసు మనసులో లేదు. ఏదో పెద్ద షాక్ తగిలినట్టుంది. సందీప్ రెండు మూడు సార్లు మాట్లాడించడానికి ప్రయత్నించాడు. కాని ఆమె పలుకలేదు.
ఒక పది నిముషాల తరవాత కృష్ణవేణి సందీప్ వైపు తిరిగి, “ మనం వెళ్ళిపోదాం పద. మనకి ఎవరూ అక్ఖర్లేదు. మనo కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా సుఖం ఒచ్చినప్పుడు ఒచ్చినవాళ్లు అసలే అక్ఖర్లేదు.” అన్నది...సందీప్ కి పూర్తిగా అర్ధమయ్యేలోపు చెయ్యి పట్టుకు లాక్కెళ్ళిపోయింది.సాయి కూడా మారు మాట్లాడకుండా ఒచ్చేశాడు.
ఆ వెంటనే భయం లేకుండా, సందీప్ చెయ్యి పట్టుకోకుండా ధైర్యంగానే ఎస్కలేటర్ ఎక్కింది... దిగింది....
· * *
ఒక రెండు రోజుల తరవాత సందీప్ దామోదరానికి ఫోను చేసి ఏం ఫరవాలేదని, అమ్మ తో మాట్లాడి మెల్లగా తండ్రి ఇంట్లోకి రావటానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం విన్నది. కాని దాని గురించి సందీప్ తో ఏమీ మాట్లాడలేదు.
కృష్ణవేణి ఉద్యోగం మానలేదు.....
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Your telugu narration & story script writing is fantastic sir
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ధన్యవాదములు మీ అభిమానానికి
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
19-08-2023, 04:39 PM
(This post was last modified: 20-08-2023, 05:06 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
4. మనోళ్ళు
సిటీకి ఒచ్చి రెండు నెలలు అయితాంది. ఊర్ల నడిపిన కారే గాని జెర సిటీ ట్రాఫిక్ ల చెయ్యి సాఫ్ గానీకె శంకరన్నని పక్కన కూసొవెట్టుకొని, ఆయన కార్ల రెండు రోజులు నడిపిన. అంత బానే ఉన్నది, పెద్ద కష్టం గాలే. ఎవరి దెగ్గరన్న డ్రైవర్ లెక్క కుదురుకునే ముంగల అక్కడక్కడ ఒకటి, రోజు రెండు రోజులు పొయ్యే పని ఉంటే చెప్తా అన్నడు శంకరన్న.
నిన్న ఫోను చేసి చెప్పిండు, కృష్ణమూర్తి సార్ అని ఉన్నడంట. వాళ్ళ పిల్లగాని పెండ్లికి ఒక రెండు వారాలు వాళ్ళింట్ల డ్రైవర్ లెక్క ఉండమన్నడు. రోజుకి అయిదు వందల రూపాలు బత్తా. సరేనని చెప్పిన.
పొద్దున్నే ఏడింటికి లేసి, దబ దబ స్నానం చేసి సార్ ఇంటికి ఒచ్చిన. దిల్షుఖ్నగర్ కోణార్క్ థియేటర్ ఎనకాల ఇల్లు.
ఇంకా పెండ్లి సందడి లేదు ఇంట్ల. పొయ్యేసరికి ముంగట డోర్ తెరిచే ఉన్నది. సార్ కొడుకనుకుంటా, సోఫా మీన కూర్చొని ఉన్నడు. ఏదో పని మీద ఉన్నట్టున్నడు,. కంప్యూటర్ పైన.
బయటనుండే పిలిచిన.
“నమస్తే సార్. నేను శీను.... డ్రైవర్ను. శంకరన్న పంపించిండు.. కృష్ణమూర్తి సార్ చెప్పిన్రంట.”
“ఓకే. లోపలికి రా.. కూర్చో” అన్నడు నా దిక్కు సరిగ్గ సూడకుండా.
లోపలికి పొయ్యి అట్లనే నిల్చున్న.
“కూర్చోవయ్యా” అన్నడు.
సార్ కూర్చున్న సోఫా ఒక్కటే ఉన్నది. చానా ఖరీదుంటది. పక్కన ప్లాస్టిక్ కుర్చీలసుంటివి ఏమీ లేవు. ఏడ కూసోవాల్నో అర్ధం కాలే.
ఏం అర్ధం కానట్టు నా దిక్కు చూశిండు ఆయన.
“ఏం పరవాలేదు సార్. నేను బయట ఉంట.” అని చెప్తున్న. అంతలోకే లోపల్నించి కృష్ణమూర్తి సార్ ఒచ్చిండు.
“ఆ నువ్వేనా శీనువి?”
“అవును సార్.”
“మంచిగ నడుపుతవా కారు.”
“ఆ.. నడిపిస్త సార్.”
“చూడు. మొన్ననే కొడుకు అమెరికా నుండి ఒచ్చిండు. సడన్ గ పెండ్లి కుదిరింది. రెండు వారలల్ల పెండ్లి. ముందు, తరవాత ఫంక్షన్లు ఉన్నయి. పని చానా ఉన్నదీ. ఏ టైంల అంటే ఆ టైంల రావాలె, ఏ ఊరు అంటే ఆ ఊరు పోవాలె. తిండి తిప్పలు అంతా ఈడనే. మొత్తం నెల అయినంక ఒకటే సారి సెటిల్ జేస్త. ఏమంటవు?” అని ఖుల్లం ఖుల్ల చెప్పేశిండు సార్.
“సరే సార్. మీ ఇష్టం.” అన్న.
“ఇంగో బండి తాళాలు. పొయ్యి తుడువు. ఇయ్యాలా రేపు హైదరాబాద్ అంతా తిరగాలే. పత్రికలు పంచేడిది ఉన్నది.” అని తాళాలు ఇచ్చిండు.
సరే మీ ఇష్టం అని చెప్పి బయటికి ఒచ్చేస్తున్నా.
“ఎక్కడ కూర్చోవాలో చెప్పకుండ కూర్చో కూర్చో అంటే వాడెక్కడ కూర్చుంటడు రా.” కృష్ణమూర్తి సార్ కొడుకిని అడిగిండు.
కారు కొత్తగా ఉన్నది. ఎక్కువ వాడనట్టున్నది. బకెట్ల నీళ్ళు తెచ్చి మంచిగ కడిగిన. బట్ట తెచ్చి సాఫ్ చేశ్న. ఇంతటికల్ల పిలిచిండు సార్.
“చాయ్ తాగు. పావు గంటల పోదాం.” అని చెప్పి లోపలికి ఎళ్ళిపోయిండు.
పనిమనిషి ఒచ్చి చాయ్ ఇచ్చింది. చిన్న సార్ ఇంకా ఆడనే కూసున్నడు.
మేడం ఒచ్చింది.
“చూడు బాబు. నువ్వేనా డ్రైవర్ వి. సిటీల చానా జాగ్రత్తగా నడపాలే. నాకస్సలే భయ్యం. సరేనా.” అని చెప్పి. నన్ను మాట్లాడనియ్యకుండానే జాగ్రత్తలన్నీ చెప్పింది.
“ఎందుకమ్మా ఇంత కష్టం. పెళ్ళికి ఇష్టం ఉన్నోళ్ళని, ఇష్టం లేనోళ్ళని ఎందుకు పిలవాలి. వందలమందిని పిలిచి ఇంత ఖర్చు పెట్టేకన్నా మనకు కావాల్సిన వాళ్ళని పిలిచి చిన్నగా చేస్కోవచ్చు కదా.” ఏందో కొత్తగ చెప్తుండు చిన్న సార్.
మేడం ఏమీ ఆనలే.
“అవేం మాటలు రా. ఈ అమెరికా బుద్ధులు ఈడ పనికిరావు. పెండ్లి అంటే నలుగురు రావాలె, తినాలె, పిల్లని పిల్లగాడిని ఆశీర్వదించాలె.” సార్ పత్రికలూ తీస్కోని ఒచ్చిండు.
“కాని మనకి అస్సలు ఇంపార్టెంట్ కాని వాళ్ళు. మనకు నచ్చని వాళ్ళు కూడా ఒచ్చి ఏం లాభo. వాళ్ళెంత చుట్టరికంలో దెగ్గరోళ్ళయినా కాని.”
“మనకి పడినా పడకున్నా, దెగ్గరోళ్ళు దెగ్గరోళ్ళె. అందరినీ పిలవొద్దు అంటడు వీడెక్కడోడే.!?. బజార్ల ఇజ్జత్ ఉంటదా?” సార్ పత్రికలన్నీ సంచిల పెట్టి మేడంకి ఇచ్చిండు.
“సరే పోనీలెండి. ఇంగ పోదాం పదండి. లేట్ అయితుంది. కార్ తియ్యవయ్యా.” అన్నది మేడం నన్ను చూసి.
* * *
రోడ్డెక్కినం.
“చూడు శీను. ఇయ్యాల ముఖ్యమైన చుట్టాలింట్లల్ల పంచేసేయ్యాల. ఇట్ల ఎనక నుంచి పద. ఓల్డ్ సిటీ నించి. ఆడ ఇచ్చేస్కోని మల్ల మెహదిపట్నం నించి బంజార హిల్స్ పొయ్యి అట్ల సిటీ చుట్టేసి ఒద్దాం.” అన్నడు సార్.
“సార్ ఏమనుకోకున్రి. నాకు సిటీల రూట్లు తెల్వయి. మొన్ననే ఒచ్చిన. మీరు చెప్పున్రి. ఎటంటే అటు తీస్కపోత.”
“సరే అట్లనే కాని. ఇంతకి ఎప్పుడొచ్చినవు? ఏ ఊరు?”
“జనగాం సార్ మాది. ఒచ్చి రెండు మూడు నెలలయితాంది.”
ఆదివారం పూట కాబట్టి ట్రాఫిక్ జెర తక్కువ ఉన్నది రోడ్డు మీన. ముందుగాల ఓల్డ్ సిటీ మీద పడ్డం.
పెండ్లి గురించి,వియ్యంకుల ఖర్చుల గురించి, చిన్న సార్ గురించి మాట్లాడుకుంటున్నరు సారోళ్ళు.
“ఈడ చాంద్రాయణగుట్టల ఒక ఇల్లు ఉంది ముందు ఆడికి పోదాం.” అన్నడు సార్.
“మనమొస్తున్నట్లు ఫోన్ చేశినవానే నిన్న?” మేడంని అడిగిండు.
“ఆ చేశ్న.” చెప్పింది మేడం.
“ఏమన్నరు?”
“ఏమంటరు. ఆదివారమే కదా. ఇంట్లనే ఉంటం రండి అన్నది.”
“ఎవరు? సునీత ఎత్తిందా? శేఖర్ లేకుండే పక్కన?”
“ఉండే. కాని ఏo మాట్లాడలే వాడు.”
“ఉండక ఏం చేస్తడు. అసలు వాడు ఏం చేస్తడో నాకిప్పటికీ అర్ధం కాదు. బేకార్ గాడు.”
“ఏదో ఒకటి చేసి సంసారం నడుపుతుండు కదా. తప్పు పని అయితే చేస్తలేడు కదా.”
“అబ్బా... నడుపుతుండు సంసారం. వానితో మొదలుపెట్టినోల్లు ఎక్కడున్నరు? వీడెక్కడ ఉన్నడు.” అని ఒక నిమిషం ఆపి, “శీను. ఆ ముంగట రైట్ తీస్కో. జెర ముందుకు పొయినంక చౌరస్తా ఒస్తది. అక్కడ లెఫ్ట్.” అని నాతో అని మల్ల మేడంతో “ఆ రోజోచ్చి పదివేలు తీస్కపోయిండు. ఇచ్చిండా ?” అన్నడు. జెర గట్టిగనే అన్నడు.
“లేదు.” అన్నది మేడం.
“వానితో పనిచేశేటోల్లకి పదివేలు సంపాదించుడు గంటసేపు పని. వీడు? ఆరునెల్లాయే. పది వేలు జమ చెయ్యలేకపోయిండు.”
“ఇస్తడు లెండి. తెల్సు కదా. వాడికేవో కొన్ని రూల్సు. దాని ప్రకారమే చేస్తడు ఏం చేసినా. పైకెల్లి సునీతకి బాగుంటలేదంట ఈ మధ్య.”
“ఎహే. చేతగాని మాటలు అవన్నీ.”
ఒక రెండు నిమిషాలు మేడం ఏం మాట్లాడలె. సార్ గూడ ఊకున్నడు.
“ఈ ఏరియా తెల్సా శీను నీకు?” అన్నడు నాతోని.
“తెల్వదు సార్.”
“ఓల్డ్ సిటీ. మేము ముందు ఈడనే ఉండేది. పెరిగిందంత ఈడనే.”
“అవునా సార్.”
“ఆ..ఆ పక్కన ఎర్ర బిల్డింగ్ దెగ్గర ఆపు. అదే ఇల్లు. అగో పిల్లలు బయటనే ఉన్నరు.”
ఉన్నది చిన్న రోడ్డు...అందులనే ఒక పక్కకు ఆపిన. సారోళ్ళు దిగి ఎల్లిపోయిన్రు.
ఒక పది ఇరవై నిమిషాలు ఐతదని అన్నరు... సరే ఆని అట్ల పక్క గల్లీలకి పొయిన. గోడ సాటుంగ మూత్రం పొయ్యి, పక్కన కేఫ్ ఉంటే ఒక చాయ్ జెప్పిన.
జెరాగి బండి దగ్గరికి పొయిన. అప్పటికే సారోల్లు బయిటికొచ్చి నాకోసం చూస్తున్నరు.
“ఏడికి పోయినవ్? నీ నెంబర్ కూడ లేదు మా దెగ్గర?” కోపంగా ఉన్నడు సార్. పక్కన మేడం కూడ అట్లనే ఉంది. ఆ ఇంటోల్లనుకుంట, వాళ్ళు కూడ బయిటికి ఒచ్చి నిలబడ్డరు.
“మీకు పది నిమిషాలు ఐతదన్నరు కదా అని చాయ్ తాగుదాం అని పోయిన సార్”
“తరవాత పోతం కదా చాయ్ కి. ఏడన్న ఉండమంటే ఆడనే ఉండాలే. అర్ధమయ్యిందా? బండి రివర్స్ చేస్కో తొందరగా.” అన్నడు.
ఆయింత గల్లీల రివర్స్ చేస్కునుడు కష్టమే. అట్లనే ముందు గల్లీకి పోదామా అని అడుగుదామనుకున్నా. ఎందుకులే అని అటు జేశి ఇటు జేశి యూ గొట్టిన.
కారెక్కినంక సప్పుడు జెయ్యక కూసున్నరు ఇద్దరు.
“ఎంతయినా కావల్సిన వాళ్ళు. అట్ల పెళ్ళి పిలుపుకని ఒచ్చి, కోపంతోటి బయిటికొస్తే వాళ్ళకి ఎట్లుంటది.” అన్నది మేడం. గొంతు జీరబోతుంది పాపం. ఏడుపొస్తున్నట్టుంది..
“రాదా మల్ల? అయినా నన్నంటవేంది?ఆ శేఖర్ గాడు అట్ల మాట్లాడుడు బాగుందా? నా ముంగట పుట్టినోడు. నాతోని మాట్లాడే పద్ధతి తెలుసా వానికి?”
“ఏదో వాడు చిన్నప్పటినించి అంతనే.ఒకలాగ ఉంటడు. ఇదేమన్నా కొత్తనా?. ఆడికి నేను, సునీత పోనియ్యండి అంటనే ఉన్నం ఇద్దరినీ.”
“ఎందుకు పోనియ్యాలే? నన్ను సూటి పోటి మాటలంటే? నేను పైసల కోసం ఒప్పుకున్నానా ఈ సంబంధానికి? ఎవడు చెప్పిండు వానికి? ఎదో పిలగాడు అమెరికాల ఉంటడు, పిల్ల మంచిది, నచ్చిందన్నడు అని నేను ఆలోచిస్తుంటే...”
“వాడట్ల అనలేదంటే. వాని సంగతి తెల్సు కదా. డొంక తిరుగుడు మాటలు రావు వానికి. మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ కదా అన్నడు అమ్మాయి వాళ్ళది. అంతే.”
“ఊకోవే. నాకు తెల్వదా. పైసాకి గతిలేదు కాని పొగరుకి మాత్రం తక్కువ లేదు.”
· * *
ఓల్డ్ సిటీల ఇంగొకటి, రెండు ఇండ్లల్ల తొందరగా పత్రికలు పంచేశిన్రు. ఆడికి మధ్యాహ్నమయ్యింది.
“ఈడినించి మెహదిపట్నం పోవాలె ఇప్పుడు. నేను చూపిస్తా పద. అక్కడ ఒక్క ఇంట్ల చెప్పినంక ఎక్కడన్నా తిందాం.” అన్నడు సార్.
“ జెర ఇక్కడనన్న ఏమనకున్రి ప్లీజ్" అన్నది మేడం.
జూపార్క్, జియా గుడా మీదంగ మెహదిపట్నం పోయినం. పొయ్యేసరికే గంటయ్యింది.
మంచి ఏరియా లాగానే ఉన్నది ఆడ, విజయ్ నగర్ కాలనీ అంట. సార్ వాళ్ళ చుట్టలోల్ల ఇల్లు కూడ బాగున్నది.
బండి ఒక చెట్టు కింద పెట్టిన, సార్, మేడం లోపలికి పోయిండ్రు. ఎండ బాగ ఉంది కాని చెట్టు గాలి సల్లగ కొడుతుంది. అద్దం కిందకి దించి ఒరిగిన. ఆకలయితుంది... కాని కన్ను మలిగింది.
“ఏయ్ శీను. లెవ్వు.” అరిచిండు సార్.
ఒక్కసారి లేశి సీట్ సక్కగా చేశ్న. కార్ స్టార్ట్ చేసి పక్కకి తీస్తున్న.
ఎంత సేపయ్యిందో నిద్ర పట్టి. అయినా పండుకుంటే ఇంత కోపం ఐతుండు ఎందుకో సారు.
“చెట్టు కింద పెట్టేటప్పుడు చూస్కోవద్దారా? నువ్వు పన్నవు. పిట్టలన్ని కారు ఖరాబ్ చేసినయి. ఇట్లనే తిరగాల్నా ఇయ్యాలంత?”
ఈ డ్రైవర్ పనిల ఇదే లొల్లి. బయట ఏదో అయితది. అదే మనసుల పెట్టుకొని కారెక్కుతరు. అది మనపైన తీస్తరు. ఆ కోపం మన వల్ల అని అనుకోవద్దు అని జెప్పిండు శంకరన్న. అసుంటిదేనేమో ఇది గూడ.
కాని నిజమే..కారు పైన రెట్టలు పడ్డయి.
“ఒక్క రెండు నిమిషాలల్ల తుడిచేస్త సార్.”
ఇనిపించుకోలె సార్. ఎక్కి డోర్ పెట్టుకున్రు. బయిటికి ఒచ్చిన ఇంట్లోల్లకి టాటా చెప్తుంది మేడం. సార్ మాత్రం అటు దిక్కు చూస్తలేడు. బండి తుడిచేసి కారు తీశ్న.
గల్లీ దాటింది.
“అన్ని సార్లు తినమంటే అంత ఖచ్చితంగా ఒద్దు అంటరేందండి? మొఖం ఒక లాగ పెట్టిన్రు వాళ్ళు.” అడిగింది మేడం.
“నాకు తినబుద్ధి కాలే ఆడ.”
మల్ల ఏదో అయ్యింది ఈ ఇంట్ల కూడా సార్ కి అనుకున్న.
“అదే ఎందుకు? వీళ్ళేమన్నరు మల్ల?” అడిగింది మేడం.
“అంటే ఏందే నేనే అందరితోని గొడవలు పెట్టుకుంటనా? నాకేం పట్టింది?”
“అట్ల కాదండి. నేను వంటింట్ల ఉంటిని. బయట మీ మొగోల్ల మధ్యన ఏమన్న మాటొచ్చిందా అని.”
“ఏముంటది. ఇట్లనే. వాడి సంగతి తెల్సు కదా. వాని కొడుకు గురించి గొప్పలు చెప్తుంటడు.”
“చెప్పుకోనియ్యండి వాడి కొడుకు వాడిష్టం. మనకేంది?”
“పిచ్చి దానా... నీకేం తెల్వదు. మనోడు కూడా వాని తోటోడే కద. ప్రతి విషయంల వాని కొడుకే గొప్ప అని చెప్పుకోవాలె అని తాపత్రయo.”
“ఇప్పుడేమన్నడు?” బాటిల్ తీసి సార్ కి నీళ్ళు ఇచ్చింది మేడం.
“ఏమంటడు? వాని కొడుకు ఇట్ల చెయ్యడoట. ఎవ్వరిని చూపిస్తే వాళ్ళని చేస్కుంటడంట. మొన్న ఫోన్ ల చెప్పిండంట. మీరెవ్వరినంటే వాళ్ళని చూడండి డాడీ, ముహూర్తం పెట్టి చెప్తే టికెట్ చూస్కొని, ఒచ్చి, పెళ్ళి చేస్కొని ఎల్లిపోతడoట. మనోడు ఏదో తప్పు చేసినట్టు. ఇదే వాని కొడుకు లవ్ మ్యారేజ్ చేస్కొని ఉంటే వాడు అదే గొప్ప అని చెప్పేటోడు.”
“మనోడు మాత్రం ఏం చేశిండు. మనం ఒప్పుకుంటేనే కదా పెళ్ళి చేసుకుంటుండు.” అన్నది మేడం. కొడుకుని అంటే మేడం కి కూడా కోపం ఒచ్చినట్టుంది.
“అదంతా వానికేందుకే? ఎదో ఒక మాట అనాలే. మనోనికంటే వాని కొడుకు గొప్ప అని చూపించుకోవాలే. అయినా వాడెంత హౌలే గాడే! ఈ కాలంల, అమెరికాల ఉండుకుంట, పిల్లని చూడనైనా చూడకుంట పెళ్ళి చేస్కుంట అనేటోడు.”
మేడం ఏమనలే.
“అసలు మనం వాణ్ణి కాని, వాని కొడుకుని గాని ఎప్పుడన్న ఏమన్న అన్నమా? అసలు వాని గురించే ఆలోచించం మనం. వాడే ఎప్పుడు మనోనితో కంపేర్ చేస్కుంటడు, ఏదో ఒకటి అంటడు. అందుకే అనేది, మనిషికి కుళ్ళు ఉండొద్దు అని. మనం ఎంత సుఖంగున్నా, పక్కనోడి సుఖం మాత్రం సైసదు.”
“సరే లెండి. ఆకలయితుంది. ఎక్కడన్న ఆపమని చెప్పండి.” అన్నది మేడం.
హమ్మయ్య అనుకున్న నేను.
“ఏం శీను తిందామా ఎక్కడన్నా?” అడిగిండు సార్.
“మీ ఇష్టం సార్.”
“చికెన్ మటన్ తింటవు కదా?”
“ఆ తింట సార్.”
“అయితే ఒక్క పని చెయ్యి. ఆ ముంగట పొయినంక మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఒస్తది. దాని కింద నుంచి లెఫ్ట్ తీస్కో. ముంగట పొయినంక ఎక్కడన్న ఆపు. సరేనా?”
“సరే సార్.”
ఈ ఒక్క సిగ్నల్ దాటనీకెనే అర్ధ గంట అయ్యింది. మొత్తానికి పొయినం.
ఒక హోటల్ కాడ ఆగినం. సావారితోని బైటికి పొయినప్పుడు మధ్యాహ్నం అన్నం తినొద్దు అన్నడు శంకరన్న, నిద్ర ఒస్తది అని. అందుకనే చపాతీలు తిన్న. సారోళ్ళు లోపల తిన్నరు.
జల్ది జల్ది తినేశి కొన్ని నీళ్ళు తీస్కోని కార్ పైన పడిన రెట్టలు తుడిచేశ్న.
నిద్ర ఒస్తదని జెర అటు ఇటు తిరిగిన. సారోళ్ళు మెల్లగ ఒచ్చిన్రు.
· * *
మల్ల రోడ్డెక్కినం. ఆడాడనే సారోల్ల దోస్తుల ఇండ్లు ఉన్నాయంట. అవన్నీ తిరిగేటప్పటికి రాత్రి ఏడు కొడ్తుంది. పొద్దున్నించి తిరిగిన్రు కదా సారోళ్ళు కూడా అలిసిపోయిన్రు. నేను గూడ అంతే.
“అలిసిపోయిన, ఇంక పోదాం పదండి. మల్ల రేపు చూస్కుందాం.” అన్నది మేడం.
“సరే, ఇంత దూరం ఒచ్చినం కదా. మల్ల రేపెల్లుండి ఇటు సైడు రామేమో. ఒక్కసారి మీ వెంకటేశ్వరావు అన్నోల్లని కనుక్కో. ఇంట్ల ఉన్నారో లేదో! అసలే వాళ్ళకి టైం ఉండదు.” అన్నడు సార్.
“వాళ్ళు లేకుంటే ఏందీ? ఇంటి నిండ పనోళ్ళు. కార్డు ఇచ్చేసి ఒచ్చేద్దాం. ఊకే వాళ్ళని ఇంట్ల ఉన్నావా అని అడిగి ఇబ్బంది పెట్టుడు ఎందుకు?” విసుక్కుంది మేడం.
“లే. ఉన్నప్పుడే పోదాం. ఒకసారి కలుద్దాం. మీ అన్న తో మాట్లాడ్తా. ఎమన్నా కొత్త బిజినెస్ ఎమన్నా పెట్టిండేమో తెలుస్తది. నాలుగు విషయాలు తెలుస్తయి.”
“ఆ అన్న...! మా సొంత అన్నదమ్ములతో మాట్లాడరు కాని పెదనాయన కొడుకుతోని ఏముంది?”
“వీళ్ళంటే పనికిరానోళ్ళు. కాని ఈయన వేరే కదా. ఓసారి ఫోన్ కొట్టి చూడు. ఇంట్ల ఉన్నరేమో.”
మేడం ఫోన్ చేశింది.
“ఆ అన్నయ్యా. బాగున్నరా... అవునన్నయ్యా... మొన్ననే ఒచ్చిండు అమెరికానించి. అదే పెండ్లి కుదిరింది. మీరు ఇంట్ల ఉన్నరేమో అని... ఆ మంచిదన్నయ్యా.... ఇక్కడనే ఉన్నం జెర సేపట్ల ఒస్తం.”
“ఉన్నారంట. పాండి పోదాం మరి.”
“చూశ్నవా. అనవసరంగ మిస్ అయితుండే.......చలో శీను. బంజారాహిల్స్ పోనీ... ఇందాక ఫ్లైఓవర్ కిందనించి ఒచ్చినం కదా. అక్కడినించే...”
“వేరే రూట్ ఏం లేదా సార్. ఆడ చానా ట్రాఫిక్ ఉంది.” అన్న నేను మెల్లగా.
“లేదు. ఎటునుంచి పోయినా అట్లనే ఉంటది పదా.” పొద్దున్నించి లేని జోష్ ఇప్పుడె ఒచ్చింది సార్ కు.
“అయ్యో పాపం. అలిసిపోయినట్టున్నడండి.. పొద్దున్నించి తిప్పుతున్నం.” మేడంకి అర్ధం అయ్యింది నా బాధ.
“ఎహే. వాళ్ళు డ్రైవర్లు.. అలవాటే ఉంటది.” నవ్విండు సార్.
నేను కూడా నవ్విన కొంచెం..
“పైనించి మన శీను ఊర్ల పుట్టి పెరిగినోడు. గట్టోడు... “
అందరం నవ్వినం.
ఈడినించి ఈడకు పోయినట్టే ఉంది, దానికే అర్ధ గంట పట్టింది. బంజారాహిల్స్ ఒచ్చినంక జెర తగ్గింది ట్రాఫిక్. కాని లోపల ఎక్కడనో ఉన్నది ఇల్లు. పెద్ద పెద్ద రోడ్లు. దూరంగ దూరంగ ఇండ్లు. మస్తున్నయి. తప్పిపొయ్యేటట్టే ఉన్నయి రోడ్లు. అన్నీ ఒకటే లెక్క.
ఒక పెద్దింటి ముందుకు ఆగినం. ముంగట గేటు దెగ్గర వాచ్ మాన్ కి చెప్పిండు సార్. ఆయన లోపలోల్లకి కనుక్కొని గేటు తీశిండు.
ఇంటి ముంగట జాగా... ఆడనే కారు పెట్టినం. సార్ వాళ్ళు దిగి లోపలి పోయిన్రు. ఈ ట్రాఫిక్ ల బేజార్ ఒచ్చింది, కాళ్ళు గుంజుతున్నయి. నేను గూడ దిగి అటు ఇటు నడుస్తున్న. సిగరెట్ ముట్టించ బుద్ధయ్యింది. ఇక్కడెందుకులే అని గేటు బయటికి పోతున్న..
“బాబు... డ్రైవర్..”ఇంట్ల పనాయిన లాగుండు, నన్ను పిలుస్తుండు.
“నువ్వేనా కృష్ణమూర్తి సారోల్లతో ఒచ్చింది?”
“అవును.”
“మరి అట్ల పోతున్నవు? తిందువు దా లోపలికి.” అని తీస్కపొయ్యిండు.
ఎనకనించి ఇంట్లకి తీస్కపోయిండు. లోపల మంచిగ చికెన్ కూరతోటి అన్నం పెట్టినరు. తినొద్దనుకున్న, కాని తినేశ్న కడుపునిండా...హాయిగా ఉండే.
సల్లగ గాలికి బయిటికి ఒచ్చి ఒక సిగరెట్ ముట్టించిన. కార్ అద్దాలు దించి కూర్చున్న. సుఖంగున్నది.
కొంచెం సేపాగి సారోళ్ళు ఒచ్చిన్రు.
“చలో శీను. ఇంక ఇంటికే... ఏడికి లేదు.” అనుకుంట ఎక్కిండు సార్.
“అవును. పొద్దున్నించి ఎండలో తిరిగినం. నాకు ఓపిక లేదు ఇంకా.” నిద్రొస్తున్న గొంతుతో అన్నది మేడం.
దెగ్గర దెగ్గర పది ఐతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది... తినేది లేకుండే.... నిద్రొస్తుంది బాగా... రేడియో పెట్టిన....సార్ సౌండ్ తగ్గియ్యమన్నడు.
“మీ అన్న ఏదో సాఫ్ట్వేర్ ల పైసలు పెడుతుండoట?”
“అవునా.” నిద్రల అన్నది మేడం.
“అడిగితే సక్కగా చెప్పలేదు. మనోడు కూడ చిన్న కంపెనీ పెట్టుకున్నా అన్నడు కదా అమెరికాల. ఏమన్నా హెల్ప్ ఐతదేమో అని అడుగుతుండే..” ఈసారి కోపం లేదు సార్ గొంతులో..
“హ్మ్.. అడిగితే.. చెయ్యనన్నడా?” సగం నిద్రల అడిగింది మేడం.
“అసలేమన్న చెప్తే కదా. నేనెన్ని సార్లు అడిగినా మాట మార్చేస్తుండు.”
మేడం ఏం ఆనలే.
“అమెరికాలనే ఏదో ప్రాజెక్ట్ అంట. చెయ్యడానికి మనుషులు వెతుకుతున్నం అదీ ఇదీ అన్నడు. మనోడు అదే చేస్తున్నడు. మనుషులు ఉన్నరు ఏవన్న ప్రాజెక్ట్లు ఎతుకుతున్నడు అన్జెప్పిన.”
“హ్మ్.”
“అసలు మాట వరసకైనా ఎవరు ఏంది అనో.. సరే చూస్త అనో చెప్పాలె.”
మేడం పడుకుంది.
“ఎవడన్న ఎదిగితే మనోళ్ళకి సాయం చెయ్యాలని చూడాలి శీను. కాని ఈ చుట్టాలున్నరు చూశ్నవా! ఎవడో మనకి తెల్వనోనికి, జీవితంలో ఎప్పుడు చూడనోనికి చేస్తరు.. పొరపాటున మనకి చేస్తే ఎక్కడ మనం ఎదిగిపోతమో అని భయం.”
మేడం పడుకుంది అని నాకు చెప్పుడు షురు చేశిండు సార్. నేనుట్టిగ ఇంటున్న. అసలే నిద్రొస్తుంది.
“అయినా వీళ్ళు పుట్టినప్పటినించే ఇంత పెద్దోళ్ళు ఏం కారు. మంచి సంబంధం దొరికింది. అత్తగారి ఆస్తి కలిసొచ్చింది. వాళ్ళ దోస్తులని కలుపుకొని ఏదో బిజినెస్ పెట్టిండు. అంతే దశ తిరిగిపోయింది. ఇప్పుడు చూడు. బంజారా హిల్సు, కార్లు, నౌకర్లు... అబ్బో”
నాకేం అనాలో అర్ధం కాలే. “అవును సార్. ఇల్లు చానా బాగున్నది.” అన్న.
“అబ్బా. పోనీ లెండి. మీరేమన్నరో ఆయన ఏమన్నడో.” మేడం లేచే ఉంది.
“సరే ఇప్పటి ముచ్చట కాదు కదా. మనం ఎన్ని సార్లు ఏదన్న బిజినెస్ చేద్దాం అన్నాపెద్ద పట్టించుకోడు. సరే... ఎవరికుండేది వాళ్లకుంటది. ఎల్లకాలం అందరు ఒకటే లాగ ఉండరు కదా.”
ఇంక ఎదో మాట్లాడుతుండు సార్. నేను పట్టించుకోలే. జాగ్రత్తగ నడుపుతున్న బండి.
కొంచం సేపటికి ఇద్దరు నిద్రపోయిన్రు. అబిడ్స్ దాంక ఒచ్చేశ్నం కాబట్టి నాకు రస్తా తెల్సు.
బ్యాంక్ స్ట్రీట్ దెగ్గర వన్ వే మీద పోతున్న. ముంగట బస్సోడు మెల్లగ పోతుండు. తిక్క లేశి ఓవర్ టేక్ చేద్దామని రైట్ సైడుకు కొట్టిన. ఒక్కసారిగ అవుతల నుంచి అప్పర్ లైట్లు ఏస్కొని బండొస్తుంది. సడన్ బ్రేక్ కొట్టిన...సరిపోదు..బండి రైట్ కు తిప్పిన... అయినా ఆ కారొచ్చి మా ఎనక డోర్ కి కొట్టింది. అటు సైడ్ సార్ కూర్చుండు. కారు గుద్దగానె గట్టిగ అరిసిండు.డోర్ లోపలికి ఒచ్చి కాలుకి కొట్టింది అని తరవాత తెలిసింది.
· * *
సార్ హాస్పిటల్ల ఉన్నడని చూద్దామని పొయిన మరుసటి రోజు. కాలు ఫ్రాక్చర్ అయ్యిందంట. నాకు చానా బాధగ అనిపించింది. అసలే పెండ్లిల్లు. ఎమన్నా అయ్యుంటే...? అమ్మో ఆలోచించనీకెనే భయమయితుంది.
నేను పొయ్యేటప్పటికే సార్ వాళ్ళ చుట్టాలందరూ ఉన్నరు. మొన్న ఓల్డ్ సిటీలోళ్ళు, మెహదిపట్నమోళ్ళు , బంజర హిల్స్ డబ్బున్నోళ్ళు...అందరు ఉన్నరు. వాళ్ళు వెళ్ళే దాంక ఆగుదాం అని బయటనే ఉన్న.
“ఏం చేస్తం లే బావా. అదృష్టం ఏందంటే పెద్ద దేబ్బలేం తగలలే. ఫ్రాక్చర్ తోనె సరిపోయింది. అదే ఇంకేమన్నయ్యుంటే..ఏదో పుణ్యం కాపాడింది.”
“అసలు ఆ కొత్త డ్రైవర్ని ఎందుకు పెట్టుకున్నరు? చెప్పుంటే నేనే ఎవరినన్నా పంపిస్తుండే కదా.”
“ఇంట్ల పెండ్లి పెట్టుకొని ఇట్ల అయితె ఎట్లనో! ఇప్పుడేం చెయ్యాలే?” మేడం గొంతు గుర్తుపట్టిన.
“అదేందక్కా అంత మాటంటవు? మేమందరం లేనప్పుడు ఆ మాట అనాలె.. ఎట్లైనా రేపో ఎల్లుండో మేమే ఒచ్చి పెండ్లి పనులు చూస్కునేటోళ్ళం. ఇప్పుడు ఏం అయ్యిందని? రెండు రోజులల్ల లేస్తడు బావ. మేము చూస్కుంటం కదా. నువ్వేం పరేషాన్ గాకు.”
ఇంకా జెర సేపుండి చుట్టాలందరూ వెళ్ళిపోయిన్రు. లోపలికి పోదాం అనుకున్న. ఇంకెవరన్న ఉన్నరేమో అని ఆగిన.
లోపల్నించి సార్ గొంతు ఇనపడ్డది.
“చూశ్నవానే.. అందరు ఒక్కసారి ఒచ్చి నేనున్న, నేనున్న అని ముందు నిలబడ్డరు. సరే ఏదో మధ్య మధ్యల మాటలు అనుకున్నా.. ఎంతైనా మనోళ్ళు మనోళ్ళే.”
“అవునండి. ఎన్నేoడ్లాయే...ఇట్ల అందరం మంచిగ మాట్లాడుకొని... ఎమన్నా అనుకున్నా.. చేశ్నా.... కష్టం ఒచ్చిందంటే ఎవ్వరు ఎనకాడరు. మంచిగ పెండ్లిలనే కలుస్తుండే. ఆ డ్రైవర్ గాని వల్ల ఈ హాస్పిటల్ల పడాల్సి ఒచ్చింది.”
ఇంకా ఎదో మాట్లాడుకుంటున్నరు. నాకింక అప్పుడు వాల్లని కలవబుద్ది కాలే. అక్కణ్ణించి ఒచ్చేశ్న.
· * *
ఒక వారం రోజులాగి సార్ ఇంటికొచ్చిండు అని తెలిసింది. సరే తిడితే తిట్టిన్రులే ఒక్కసారన్న కలవాలే అని ఇంటికి పొయిన.
సార్ కాలుకు పట్టీ ఉంది. కట్టె పట్టుకొని నడుస్తుండు. గుండెల కలుక్ మన్నది చూడంగనే. సార్ మంచోడు. ఒక్క మాట గూడ ఆనలే.
“పోనీ లేరా.. నువ్వేమన్న కావాలని చేశ్నవా..! అవుతలి సైడు నుంచి వాడొస్తే నువ్వేం చేస్తవు.” అని ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడిండు. మనసు అల్కగ అనిపించింది.
జెర సేపు ఉండి ఒచ్చేస్తుంటే మల్ల పిలిచిండు సార్.
“శీను. రేపు ఒకసారి శంకర్ ని రమ్మను, పనుంది. మేడం ని బాబుని బయటికి తీస్కపోవాలె.” అన్నడు.
సరే అని పోతున్న. అంతల మేడంతోని అంటుండు సార్ “మొన్న హాస్పిటల్ కి ఒచ్చినప్పుడు ఒకొక్కడు ఎంత మాట్లాడిండు. మేమే చూస్కుంటo అంతా. అసలు మీరు అక్షింతలు ఏస్తే చాలు... అది ఇది అని. ఇప్పుడేరి? మనమే ఫోన్ చేశి అడుక్కోవాలె. అది చేశి పెట్టున్రి ఇది చేశి పెట్టున్రి అని....సరే ఏం చేస్తం. మన పని మనం చేస్కోవాలె.”
· * *
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
5. జ్ఞాపకం
టేబుల్ మీద ఉన్న ఫోను బర్ర్ బర్ర్ మని మోగుతూ చప్పుడు చేస్తోంది, వైబ్రేషన్ మోడ్ లో.... కంప్యూటర్ స్క్రీన్ లో తలదూర్చేసి ఎదో చూస్తున్న మురళి దృష్టి మరలుస్తూ....నీరసంగా దాని వైపు చూశాడు. ఒక్కసారిగా చెయ్యాల్సిన పని గుర్తొచ్చింది.. ఉదయం ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మరీ మరీ చెప్పింది రమ్య, ఈ రోజు మధ్యాహ్నం నుంచే వచ్చేయమని. పనిలో పడి ఆ సంగతే మరిచిపోయాడు. ఇప్పుడు తనే ఫోన్ చేస్తోంది. టైం చూశాడు. మరీ అంత ఆలస్యం అవ్వలేదు.
"హలో...చూస్కున్నా టైం.. గుర్తుంది. ఇదిగో బయలుదేరుతున్నా.." అన్నాడు ఫోన్ ఎత్తి.
"ఛా..నీకు గుర్తుంది అంటే నేను నమ్మను..." కనిపెట్టేసింది రమ్య.
"ఓవరాక్షన్ ఆపి ముందు బయల్దేరు. నీ డ్రైవింగ్ స్పీడుకి నువ్వు ఇప్పుడు బయలుదేరితే అక్కడికి చేరేసరికి రేపవుతుంది." అనేసి, నవ్వి ఫోన్ పెట్టేసింది. పెళ్ళయి మూడు నెలలు అయ్యింది. అయినా రమ్య నవ్వు తనకి ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తుంటుంది.
మురళి కారు చాలా మెల్లిగా నడుపుతాడని, చూసి చూసి చాలా జగ్రత్తగా నడుపుతాడని, బాగా తడబడతాడని, భయపడతాడని తన ఫ్రెండ్స్ అందరూ వెక్కిరిస్తూంటారు. రెండు మూడు సార్లు రమ్య ఉన్నప్పుడుకూడా అలాగే అన్నారు. వాళ్ళతో రమ్య కూడా మాట కలిపి అవునవును అనడం మొదలు పెట్టింది. అది మురళికి నచ్చకపోయినా ఎమీ అనడు పాపం.
అసలు ఈరోజు రమ్య త్వరగా రమ్మన్నది హాస్పిటల్ కి వెళ్ళటానికి. ఈ మధ్య మురళికి నడుము నొప్పిగా ఉంటుంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల అనీ, ఏం ఫరవాలేదని మురళి చెప్పినా వినలేదు రమ్య. డాక్టర్ దెగ్గరికి వెళ్ళాల్సిందేనని పట్టు పట్టింది. తనే ఫొన్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకుంది. అబిడ్స్ లోని క్లినిక్ అది. చాలా పేరుంది కానీ గంటలు గంటలు వెయిట్ చెయ్యాలి. మీ టైంకి ముందొచ్చినా, తరవాత ఒచ్చినా, వెయిటింగ్ మాత్రం తప్పదు. అది తనకి చిరాకు. కాని ఏం చేస్తాడు, రమ్య వినట్లేదు. నిమిషాల్లో బయలుదేరాడు. తన పంథాలోనే కారు నడుపాడు, రమ్య మాటలు ఏం పట్టించుకోలేదు.
మిట్ట మధ్యాహ్నం సిటీలో గచ్చిబౌలి నుంచి అబిడ్స్ ఒచ్చేసరికి మురళి తల ప్రాణం తోకకి ఒచ్చింది. పార్కింగ్ దొరుకుతుందో లేదో అనుకుంటూ మెల్లిగా లోపలికి పోనిచ్చాడు. రమ్య అక్కడే నవ్వుతూ నిల్చుంది. "మొత్తానికి వచ్చావన్న మాట. రేపటి వరకు ఇక్కడే వెయిట్ చెయ్యాలేమో అనుకున్నా." అన్నది మురళి కారు దిగగానే.
"ఏడిశావు. నేను కాదు, మైకెల్ షూమాకర్ నడిపినా ఇదే టైం కి వచ్చేవాడు. హైదరాబాద్ ట్రాఫికా? మజాకా?"
"ఆయన సంగతి ఎందుకులే? మనం మాత్రం ట్రాఫిక్ ఉన్నా లేకున్నా ఒకేలా ఒస్తాం కదా!" అని నవ్వింది.
తను కూడా నవ్వి, రమ్య తలపైన ఒక్క మొట్టికాయ వేసాడు.
* * *
రిసెప్షన్ లో పేరు రాయించి కూర్చున్నారు. గంట దాటింది వాళ్ళకిచ్చిన అప్పాయింట్మెంట్ టైం దాటి. అయినా పిలవరు. "అసలు టైం పాటించనప్పుడు ఈ అప్పాయింట్మెంట్లు ఎందుకు? మనకేం పని లేదనుకున్నారా?" చిరాకు పడ్డాడు మురళి.
"తప్పదు మరి. చాలా పేరున్న డాక్టరు. అయినా వాళ్ళేం చేస్తారు పాపం? ఎవరో ఒకరు లేట్ అయినప్పుడు తరవాత వాళ్ళందరూ లేట్ అయిపోతారు." సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది రమ్య.
"మళ్ళీ ఎప్పుడయినా వద్దాం లే. ఇప్పుడు వెళ్ళిపోదాం ప్లీజ్?"
"నేనే ప్లీజ్ మురళి. కొంచెం సేపు చూద్దాం. మళ్ళీ ఎప్పటికయ్యేనో ఏమో!" అని అనునయించింది.
"మొండిదానా." అని నిట్టూర్చాడు.
"సరే. అంతవరకు ఏమన్నా చెప్పు,.. సరదాగా" అని మురళి భుజం పైన పడుకుంది.
"ఏం చెప్పను? నాకు బోరు కొడుతుంది. నువ్వే చెప్పు."
"సరే ఆగు. నాకు దాహంగా ఉంది. పక్కన ఏదన్నా షాపుంటే తాగటానికి ఏమన్నా తెస్తా." అని వెళ్ళాడు మురళి.
రెండు నిమిషాల తరువాత ఒక గొంతు వినపడింది.
"అమ్మా. ఈ ఫారం జెర నింపిస్తరా?" అని. ఒక ముసలాయన చేతిలో పేపర్, పెన్ పట్టుకొని అడుగుతున్నాడు. పంచెకట్టు, అదీ చూస్తే హైదరాబాద్ మనిషిలా లేడు.
"నింపుతా, ఇటియ్యి తాతా." అని తీస్కుంది రమ్య. తనకి కొత్తా, పాతా లేదు. అందరినీ చొరవతో కలిపేసుకుంటుంది. అందుకే ఈయనని కూడా తాతా అని వరస కలిపేసింది. అన్ని విషయాలు అడగటం మొదలుపెట్టింది.
"ఇంతకీ ఎక్కడినుంచి తాతా? హైదరాబాదు కాదా?"
"హయత్ నగరు. ఇప్పుడంత హైదరాబాదుల కలిసిపాయె." అని నవ్వాడు.
"అంత దూరం నించొచ్చావా? ఎవరినైనా తోడు తీసుకొని రావొద్దా?"
"ఒచ్చిండమ్మా నా మనుమడు. ఏదో పనుంటే నన్నీడ దింపి పొయ్యిండు. మల్లొస్తా అన్నడు జెర సేపట్ల."
ఓపిగ్గా ఫార్మ్లో వివరాలన్నీ నింపింది రమ్య.
"ఏమైంది తాతా నీకు?"
"ఏముంటదమ్మా? చూస్తున్నవు కదా. ఈ కుర్చీ ల కూలబడ్డ కదా. ఎవరన్న లేపుతేగాని లేవలేను. అగో ఆ సంక కర్రలు లేకుంటే నడువలేను. పోనీ అట్లనే కుంటి బతుకు బతుకుదామంటే, ఈ నడుం నొప్పి. ఊపిరి సలపనియ్యదు. అయిదేండ్లనించి డాక్టర్ల సుట్టు తిరుగుతున్న."
"అయ్యో. మరేమంటున్నరు డాక్టర్లు?"
"వాళ్ళేమంటరు? నా ఖర్మట్ల కాలవడ్డది. ఆపరేషన్ జేస్తే ప్రమాదముంది. అట్లనే భరించుకోమంటరు. పట్టీలు పెట్టినా, నూనె మాలిష్లు చేసినా, ఏం జేసినా నొప్పి మాత్రం తగ్గుతలేదు."
"ఏం జేస్తవు తాతా నువ్వు?"
" మా ఊర్లె చిన్న దుక్నం ఉన్నది. అందులనే కూసుంటున్న ఇరవైయ్యెండ్ల నించి. నా అదృష్టం బాగలేక ఇట్ల జరిగింది."
"ఏమైంది?"
ముసలాయన ఒకసారి గట్టిగా నిట్టూర్చి చెప్పాడు.
"అయిదేండ్ల కింద ఓరోజు దుక్నం బంజేశ్న... రాత్రి పది కొట్టంగ... నా సైకిల్ మీద పోతున్న. ఎప్పటిలెక్క అయితే గల్లీల నించే పోతుంటి, కాని మల్లేశంగాని చెల్లె పెండ్లికి గల్లీల పందిరేశింరు. అందరుర్రు ఆడ. మల్ల పట్టుకుంటే కూసొవెడ్తరు, తాగుకుంట పొద్దుగూకుతది. అసలే ఇది ఇంటికాడ జెరం తోని పండుకుంది. కొడుకు వేరయిపొయ్యి అప్పతికి ఆరు నెల్లు. అందుకనె మెయిన్ రోడ్డెక్కిన. పక్కపొంటి ఒస్తుంటె ఏక్ దమ్మున ఒక బండొచ్చి ఎనకంగల గుద్దింది. గుద్దెపట్టికె ఎగిరి కరెంట్ స్థంభం మీదికి పడ్డ. దెబ్బలు బానే తగిలినయ్. ఏదో ఫ్రాక్చర్ అన్నరు. ఎన్నుపూసల చిన్న బొక్కలు కదిలినయ్ అన్నరు. ఇగో... ఈ చెయ్యి కూడ ఇరిగిండె. కాని మల్ల అతుక్కుంది. అన్ని దెబ్బలు మానినయ్. ఈ ఎన్నుపూసొక్కటే సతాయిస్తనే ఉంది. వేలకువేలు ఖర్సయ్యింది. ఇంటిది పోయినేడాది పొయ్యింది. ఇంగ ఉన్నొక్కిల్లు అమ్మేశి నా కొడుకు దెగ్గరనే ఉంటున్న."
"అసలు గుద్దింది ఎవరో? ఏ కారో చూడలేదా ఎవ్వరూ?"
"లేదు బిడ్డా. పడంగనే ఏం సమజ్గాలే నాకు. నల్ల కారు. ఎవరో ఒకరిద్దరు ఒచ్చి నన్ను చూశింరు, ఏదో మాట్లాడిండ్రు, ఎల్లిపోయిండ్రు. అయ్యేం ఇనిపియ్యలే నాకు. ఇంగ రెండు నిమిషాలకి బేహోష్ అయిపోయిన. సుట్టు పక్కనోల్లు కూడ యెవ్వరు లేకుండె. అంతా నా ప్రాప్తం."
రమ్యకి ఏమనాలో అర్ధం కాలేదు. పాపం అనిపించింది. రిపోర్ట్స్ తీసి చూడడం మొదలు పెట్టింది.
డ్రింక్స్ తీసుకొని మురళి ఒచ్చాడు.
"మురళి, ఈ తాతయ్యని చూడు. ఎవరో ఎప్పుడో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారంట. పాపం అప్పటినించీ ఇలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారంట."
మురళి ఏం మాట్లాడలేదు. రమ్య కథంతా చెప్పేసింది. రిపోర్ట్స్ చూపించింది.
"మరిప్పుడు ఈ డాక్టరు ఏమంటున్నడు తాతా?" తనే అడిగింది.
"ఈయనొక్కడు ఆపరేషన్ చెయ్యొచ్చు అంటున్నడమ్మా. కాళ్ళు ఒచ్చినా, రాకపోయినా నొప్పి మాత్రం తగ్గుతది అన్నడు. కాని మస్తుగ పైసలు అయితయి. నాకా షాపు లేకపాయె ఇప్పుడు. కొడుకు కూడ ఎంతకని పెడ్తడు?"
"ఏంతవుతయంట తాతా?" మురళి అడిగాడు.
"అయిదారు లక్షలు అయితయంట బిడ్డా. నా మనుమడు ఈ రెండేండ్లల్ల ఓ మూడు లక్షలు జమ చేశిండు. వానికి నేనంటె పాపం శానా ఇది. కొలువు చేస్తడు. చెయ్యి, నోరు కట్టుకొని జమ చేశిండు బిడ్డ." ....తాత కళ్ళల్లో తడి.
రెండు నిమిషాలు నిశ్శబ్దం.
"తాతా. నువ్వు ఏమనుకోనంటే ఆ రెండు లక్షలు మేమిస్తం. తీసుకుంటావా?" మురళి సూటిగా అడిగాడు.
రమ్య నిర్ఘాంతపోయింది. వాళ్ళిద్దరిలో ఇలాంటి పనులు చేసేది రమ్య, వద్దని తిట్టేది మురళి. మనకున్న దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలని రమ్య అభిమతం. మురళి సరే అనేవాడే కానీ ఎప్పుడూ ఈ పని జరగలేదు. ఇప్పుడు ఇంత సడెన్ గా ఇంత అమౌంట్ కి కమిట్ అయ్యాడు.
తాతకి సహాయం చేస్తున్నందుకు రమ్యకి ఆనందంగానే ఉన్నా అంతకుమించి మురళిలో ఈ మార్పుకి ఆశ్చర్యం ఎక్కువగా ఉంది.
మురళి రమ్యవైపు చూశాడు.
"సారీ... నిన్నడగకుండా ఆఫర్ చేశాను. ఏమంటావు? ఓకె కదా. నువ్వూ అంటుంటావు కదా. ఎవరికైనా, ఏదైనా చెయాలి అని. మనం యుఎస్ ట్రిప్ కి సేవ్ చేసుకున్న డబ్బు ఉంది కదా. అది ఇచ్చేద్దాం. మళ్ళీ నాలుగయిదు నెలల్లో మన డబ్బు మనమ్ సేవ్ చేసుకోవచ్చు. ఏమంటావ్ చెప్పు?" అనునయంగా అడిగాడు.
రమ్య నోట మాట రాలేదు. ఇంత పెద్ద పని తనవల్ల కూడా అయ్యేది కాదు. తన మొగుడిపైన చాలా గర్వంగా అనిపించింది.
"ష్యూర్. ష్యూర్. పాపం తాత. అలాగే ఇచ్చేద్దాం. ఏం తాతా. సరిపోతుందా? హాస్పిటల్లో మేమే కట్టేస్తాం." అన్నది.
"ఒద్దమ్మా..మీరంత మాటన్నరు. అదే పదివేలు. ఏదో నా బతుకు ఇట్ల తగలబడ్డది. నాకోసం మీరు కష్టపడకుండ్రి బిడ్డా." అని చేతులు జోడించాడు.
రమ్య చటుక్కున తాత చేతులు పట్టుకుంది. " ఏం కాదు తాతా. మనిషికి మనిషే సాయం. ఉండు. మేమే డాక్టరుతో మాట్లాడతాం. ఆపరేషన్ ఎలాగో, ఎంతవుతుందో అన్నీ కనుక్కుంటాం. సరేనా?" అన్నది.
తాత చాలా ఇబ్బంది పడ్డాడు. ఏదో ఇక్కడ కలిసినందుకు కష్టం చెప్పుకున్నాను కానీ డబ్బొద్దు అన్నాడు. రమ్య ఒప్పుకోలేదు. మురళి మాత్రం ఏం మాట్లాడలేదు.
* * *
తాత నెంబర్ కానీ, తమ నెంబర్ కానీ ఇంకా రాలేదు.
తాత కోసం ఒకాయన ఒచ్చాడు.
"వీడే నా మనుమడమ్మా. సిటీల కొలువు చేస్తుండు."
"ఆరేయ్. ఈ సారోళ్ళు నా ఆపరేషన్ పైసలు కడ్తం అంటుండ్రురా" అని మనవడితో చెప్పాడు.
"అవునా.. చాలా సంతోషం సార్. మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. నేను అట్లిట్ల చేసి కొన్ని పైసలు జమ చేశ్న. మొన్ననే ఉద్యోగం పోయింది. తాత ఈ నొప్పి తట్టుకోలేకపోతుండు. అప్పిచ్చే నాథుడు కూడా లేడు. మీరు సహాయం చేస్తే అంతకంటే ఏముంటది సార్."
ఒకరి తరవాత ఒకరికి పిలుపొచ్చింది డాక్టర్ దెగ్గరినించి. మురళికి ఏం ప్రాబ్లెం లేదని, ఎక్సర్సైజ్ చెయ్యమని డాక్టర్ చెప్పాడు. తాత గురించి డాక్టర్ తో మొత్తం కనుక్కుంది రమ్య.
ఆ ఇచ్చేదేదో ఇవ్వాళే ఇచ్చేద్దాం అని పట్టుపట్టాడు మురళి. ఒక గంటలో హాస్పిటల్లో ఆపరేషన్ కి చెక్కు ఇవ్వడం జరిగిపోయింది.
అక్కడినుంచి బయలుదేరేసరికి రాత్రి అయ్యింది.
* * *
కారులో మురళి ఎమీ మాట్లాడలేదు.
" ఈరోజు నీ డెడికేషన్ చూసి నాకు ముచ్చటేసింది మురళి. తెలుసుకోగానే మాటిచ్చావు. ఆ మాట ఇవ్వాళే నిలబొట్టుకున్నావు కూడా."
కాస్సేపాగి మళ్ళీ తనే కదిపింది.
"చెప్పాలంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడేది నేను. కానీ తాత మాటలు వినగానే నువ్వు స్పందించావు చూడు. అంత గొప్పగా నేను ఆలోచించలేకపోయాను. నిజంగా నువ్వు గ్రేట్ మురళి."
మురళి ఏమీ మాట్లాడకపోయేసరికి తన ధోరణిలోకి ఒచ్చేసింది.
"ఓయ్. అప్పటినించి నిన్ను పొగుడుతుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు.పొగరా?"
మురళి నవ్వలేదు.
"ఏమైంది మురళి. ఎందుకలా ఉన్నావు? చెప్పు ప్లీజ్."
చాలా కష్టంగా మాట్లాడాడు మురళి.
"రమ్యా నీకో విషయం చెప్పాలి. అది నన్ను లోపల్లోపల తినేస్తుంది. అందుకే త్వరగా చెప్పేస్తా.
నీకు తెలుసు కదా, నేను కారు మెల్లిగా నడుపుతానని అందరూ వెక్కిరిస్తారు. దానికో కారణం ఉంది. నేను ఇంజినీరింగ్ అయ్యాక కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా కదా. అప్పట్లో ఒకరోజు రాత్రి రాజుగాడి కార్లో మేము ముగ్గురం ఫ్రెండ్స్ వాళ్ళ ఫాం హౌజ్ కి వెళుతున్నాం. నేనే నడుపుతున్నా కొత్త కారు. రాజుగాడు తొందర పెడుతున్నాడు. కొత్త కారు కదా 140 మీద వెళితే చూడాలనుంది అని నానిగాడు గొడవ చేస్తున్నాడు. ఆ తికమకలో కారుని పరిగెత్తించాను.. 140 రీచ్ అయ్యాం.
రోడ్డు మీద ఒక దెగ్గర సడెన్ గా ఒక ఎడ్లబండి కంపించింది. టెయిల్ లైట్లుండవు కదా, స్టిక్కర్లు కూడా లేవు. సో ముందునుంచీ కనిపించలేదు. ఒక్కసారిగా అది ఎదురుగా ఉందని కనిపించింది. బ్రేక్ వేస్తే సరిపోదు, గుద్దేస్తాం. బండి పక్కకి తిప్పేశా.....హమ్మయ్య అనుకుంటుండగానే అక్కడ వెళ్తున్న ఒక సైకిల్ ని గుద్దేశా.
బండి ఆగింది. అందరం దిగి సైకిల్ దెగ్గరికి పరిగెత్తాం. ఒక ముసలాయన పడిపోయి ఉన్నాడు. పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. చేతికి మాత్రం తగిలినట్టుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నాను. కానీ ఆయనకి ఏమీ జరగలేదు కదా, ఏం ఫరవాలేదు, ఎవరైనా ఒస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పి నన్ను అక్కడినుంచి తీస్కెళ్ళారు."
మురళి ఆపేశాడు.
ఆ తరవాత ప్రశ్న అడగటానికి రమ్యకి ధైర్యం సరిపోలేదు. కానీ ధైర్యం అంతా కూడగట్టుకొని మురళియే సమాధానం చెప్పాడు.
"ఆ ముసలాయన ఈయనే."
"మరి తాత నిన్ను గుర్తుపట్టలేదేంటి?"
"ఏమో గుర్తు లేదనుకుంటా? కానీ నాకు మాత్రం జ్ఞాపకం ఉంది. అది తాతే.."
* * *
తాతా మనవడు ఇంటికి బయలుదేరారు.
"పాపం. వాళ్ళెంత మంచోళ్ళు తాతా. నీకు ముందే తెల్సా? లేదంటే ఇక్కడనే కలిశినవా?"
" అవును. పెట్టే చెయ్యి పాపం. నా సంగతి చెప్పంగనే తన్లాడిపొయ్యింది బిడ్డ. ఆమెని ఇప్పుడే చూశుడు. ఆ సార్ ని మట్టుకు ఒక్కసారి చూశ్న జ్ఞాపకం ఉంది."
"చూశ్నవా? ఎక్కడ తాతా?"
"నాకు యాక్సిడెంట్ అయినప్పుడు."
* * *
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,284 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
చానా బావున్నాయి బ్రో మీ హైదరబాదు కథలు. తెలంగానా యాసతో పాత హైదరాబాదీ ఇరాని చాయ్ తాగినంత తృప్తిగా. కొనసాగించండి.
: :ఉదయ్
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
6. ముద్దు
"అరేయ్...అరేయ్...ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు." అని చెవిలో గొణుగుతున్నాడు హేమంత్.
అబ్బా... ఇప్పటికిది మూడోసారి. ఎందుకు అని మెల్లగా సైగ చేశాను.
"తిరిగి చూడు బే.... చెప్పింది విను." వాడి మొహం వెలిగిపోతుంది.
చూస్తే....ఆ....నోరు తెరుచుకుంది.
మిథున.... పేద్ద కళ్ళు.. పొడుగు జుట్టు...అలాగే వదిలేసింది...ముట్టుకుంటే మాసిపోయే రంగు..కోల ముఖం..చిన్ని గడ్డం...రెడ్ టాప్, డీప్.. నెక్, రెడ్ లిప్స్టిక్, లాంగ్ నెయిల్స్, రెడ్ నెయిల్ పాలిష్... నోట్లో పెన్ను పెట్టుకొని ఏదో ఆలోచిస్తుంది.... అద్దిరిపోయింది.
వారం రోజులనుంచి వెయిట్ చేస్తున్నా చూడాలని... ఊహించుకున్న దానికి ఏమీ తగ్గలేదు. ఇంకాస్త ఎక్కువ అందంగానే ఉంది. కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోవాలనుంది.
"చైతన్యా...టర్న్ అరౌండ్... ఫేస్ దిస్ సైడ్." అరుపు వినబడి చటుక్కున తిరిగాను. క్లాసంతా నవ్వారు. నాక్కూడా నవ్వొచ్చింది.
"నీయబ్బా. నీ వల్లే... నా పాటికి నేను క్లాసు వింటుంటే వెనక్కి చూడు, వెనక్కి చూడు అని సావగొట్టావు." అని హేమంత్ గాణ్ణి తిట్టాను.
"ఛా.. నేను చూడమన్నా..సొల్లు కార్చమనలేదు."
అసలు నాకు మిథున గురించి చెప్పిందే వీడు.
సెకెండ్ ఇయర్ ఇంజినీరింగ్ లోనే ముందుచూపుతో GRE కోచింగ్ జాయిన్ అయ్యాను. యుఎస్ వెళ్ళాలని కల. అక్కడే హేమంత్ ని కలిశా. మొదటిరోజే చెప్పాడు మిథున గురించి. క్లాసు మొత్తంలో కల్లా బెస్ట్ అని. నా దురదృష్టం....నేను జాయిన్ అయ్యి వారం అవుతుంది. మిథున క్లాసుకి రావటం లేదు.
బ్యాడ్ లక్... వేరే బ్యాచ్ లో జాయిన్ అయ్యిందేమో అన్నాడు హేమంత్. చాలా ఫీలయ్యాను. అస్సలు చూడనే చూడని అమ్మాయి రాలేదని ఫీల్ అవ్వడం నాకే నవ్వొచ్చింది.
కాని ఇవ్వాళ. మిథునని చూస్తే.. వావ్... ఈ క్లాసులో ఏంటి? మా కాలేజి మొత్తంలో, మా కాలనీ మొత్తంలో ఇంత మంచి అమ్మాయి లేదు.
రాత్రి వరకు మిథునే కళ్ళ ముందు తిరిగింది. పడుకోడానికి కళ్ళు మూసుకున్నప్పుడు, నిద్ర పట్టేంతవరకు కూడా.
* * *
"ప్రియతమా...ఓ ప్రియతమా... ఈ మౌనరాగాలనే పలికే హృదయం...నిన్ను చూడాలనీ..., తన మనసు విప్పాలనీ.. కలవరిస్తోందనీ... తెలుసా....?"
చిన్నప్పుడు విన్న పాట. చాలా ఇష్టమైన పాట. నా ఫేవరెట్ సింగర్ ఉషకన్నా ఎవరైనా బాగా పాడగలరు అంటే ఒప్పుకునేవాడిని కాదు. పైపెచ్చు గొడవపెట్టుకునేవాడిని. కాని ఇప్పుడు వింటుంటే..ఆహా..ఉష కంటే చాలా.. చాలా బాగా..
కోచింగ్ సెంటర్లో ఇంగ్లిష్ ట్రైనర్ రాలేదు. కొంత మంది అబ్బాయిలు అమ్మాయిలతో మాటలు కలిపి అంతాక్షరి, అంతాక్షరి అని గొడవ చేశారు. అటు కొంతమంది, ఇటు కొంతమంది పాడుతున్నారు. పక్కన తన ఫ్రెండు పాడవే, పాడవే అని బలంవంతం చేస్తే మిథున గొంతువిప్పింది.
అంతే..క్లాసంతా నిశ్శబ్దం...అందరూ వినడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా సంగీతం నేర్చుకున్న గొంతు...ఎన్ని సంవత్సరాలో..!
ఐ లవ్ యూ చెప్తోందనీ తెలుసా.....
ఎవ్వరూ ఆపకపోవడంతో పాట మొత్తం పాడేసింది...క్లాసంతా చప్పట్లు....ముందు నవ్వింది... తరవాత సిగ్గుపడింది.
నా ఫేవరెట్ సాంగ్ ఇంకా ఫేవరెట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాట వింటుంటే ఉష గొంతు వినిపించడం లేదు.
* * *
మొదటిసారి చూసి రెండు వారాలవుతుంది. ఇప్పటివరకు మాట్లాడటం కుదరలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించాను. కాని మాట పెగలలేదు. చిన్నప్పటినించీ అమ్మాయిలతో మాట్లాడి ఎరుగను. అందుకే ఇంకా కష్టం అనిపిస్తుంది. ఏమనాలి? ఎలా మాటలు కలపాలి? ఏమీ అర్ధం కావట్లేదు.
నేనూ, హేమంత్ కారిడార్లో నిలబడున్నాం. క్లాస్ మొదలవ్వడానికి టైముంది.
"అరేయ్ మిథునతో ఎప్పుడైనా మాట్లాడావా?" అని హేమంత్ ని అడిగాను.
"యా.. మాట్లాడిన..."
"అవునా..ఎప్పుడురా? ఏమని?"
"దాంట్ల అంత గొప్పేముంది? ఎక్సైట్ అయితున్నవ్?"
"కాదురా. నాకెప్పుడూ అలవాటు లేదు. చిన్నప్పటినించీ నాకు ఆడపిల్లలు ఫ్రెండ్స్ కూడా లేరు."
"పిచ్చోడా. అదేం పెద్ద బ్రహ్మ విద్యా? వాళ్ళేమన్న కరుస్తరా? అయినా మిథున నాకు పరిచయమయ్యిందిలే. నేను మాట్లాడిపిస్త."
"అమ్మయ్య.. థాంక్స్ రా బాబూ."
ఇంక మిథున ఈరోజు క్లాసుకి రావడమే బాకీ.
అలాగే వెయిట్ చేస్తున్నాం. ఇంతలో ఒక మంచి పూలవాసన నిండిన సెంట్ ఒచ్చింది.
"ఏంట్రా ఈ వాసన..అద్భుతంగా ఉంది.... హా.." అని వాడితో అన్నా..
నవ్వుతున్నాడు. అర్ధం కాలేదు.
"వర్సాచే...పర్ఫ్యూం నీకు నచ్చినట్టుంది." అని వెనుక నుంచి వినబడింది.
అది తన గొంతే...మిథున...మిథునే..
చాలా భయమేసింది. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాను.
మిథున నవ్వుతుంది.
"మిథునా..వీడు చైతన్య...నా ఫ్రెండ్. నిన్ను పరిచయం చేయించమని దిమాగ్ తింటుండు." అని నవ్వుకుంటూ చెప్పాడు హేమంత్.
"... అవునా. ఎందుకు..?"
నాకు సిగ్గేసింది. హేమంత్ గాడి మీద పిచ్చి కోపం ఒచ్చింది. కాని ఒక్క క్షణం నోట మాట రాలేదు.
"అది... అలా ఏం లేదు. నేను...నేనసలు అలా అనలేదు...వీడు... వీడే.."
ఇద్దరూ నన్ను చూసి నవ్వారు... సిగ్గులేకుండా..
* * *
కొన్ని రోజులకి కోచింగ్ అయిపోయింది. హేమంత్ గాడితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా, ఈ మధ్య కుదరట్లేదు. కాని మిథునతో మాత్రం రోజూ మాట్లాడుతున్నా. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది.
అసలిదంతా ఒక కలలా ఉంది. మిథునతో పరిచయం అయితే చాలు అనుకున్నా కాని, ఫ్రెండ్షిప్ చేస్తా అనుకోలేదు. తనలాంటి అమ్మయి అసలు నాలాంటోడితో మాట్లాడుతుందంటేనే చాలా గొప్ప. అంతకన్నా ఎక్కువ ఆశపడటం తప్పని తెలుసు...కాని నా మనసు నా మాట వినట్లేదు. అలా అని తనతో మనసులో ఉన్నది చెప్పటానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పాను. కాని తను ఏమనుకుంటుందో చెప్పదు. అన్నీ తనకు అర్ధం అవుతున్నట్టే ఉంటుంది..మళ్ళీ అర్ధం కానట్టే ఉంటుంది. పనికిరాని మాటలు మాత్రం గంటలకు గంటలు మాట్లాడుతుంది. ఇవ్వాళ ఏదో ఒకటి గట్టిగా అడిగేయాలనుకున్నా..
మిథునొస్తుంది. యెల్లో చుడీదార్లో.... అసలే బంగారంలాంటి రంగు...ఈ కలర్లో ఇంకా మెరిసిపోతుంది.హై హీల్స్...పెద్ద ఇయర్రింగ్స్..నుదుటి మీద పడుతున్న జుట్టు.. మెడ మాత్రం ఖాళీ. తన గొంతు మీద పుట్టుమచ్చ ఇంతవరకు గమనించలేదు. బ్యూటిఫుల్.
"సారీ. లేటయ్యిందోయ్. ఒచ్చి చాలా సేపయ్యిందా?"
"లేదు. ఇవ్వాళ చాలా బాగున్నావ్ మిథున. సూపర్."
కోచింగ్ అయిపోయాక మిథునని కలవడం ఇదే మొదటిసారి. తన ఫ్రెండ్ షాపింగ్ కి ఒస్తానని రాకపోవడం నాకు కలిసొచ్చింది. వస్తావా అని అడగ్గానే ఎగిరి గంతేశాను.
నేను, మిథునా...మేమిద్దరమే..ఆహా... మాల్లో తనతో తిరుగుతుంటే ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. ఎవరైనా చూస్తారేమో అని తను టెంషన్ పడుతుంటే, ఎవరన్నా చూస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నా..
కొంచెంసేపు అటూ ఇటూ తిరిగాక ఒక డిజైనర్ స్టోర్లోకి తీసుకెళ్ళింది.
"ఇక్కడైనా కొంటావా లేక ఊరికే చూడడమేనా?" అనడిగాను.
"ఏంటి? నాతో షాపింగంటే బోరొస్తుందా?" అని బుంగమూతి పెట్టింది.
"ఛీ ఛీ.అలాంటిదేమ్లేదు. ఏదన్నా కొనుక్కోవచ్చు కదా అని.... చాలా ఎంజాయ్ చేస్తున్నా నేను. నీలాంటి కత్తిలాంటి అమ్మాయి రమ్మంటే నరకానికయినా ఒస్తాను.. షాపింగెంత?"
"ఓవరాక్షన్ ఆపి ఏదన్నా డ్రెస్ నచ్చితే చెప్పు. అయినా ఇక్కడికొచ్చింది నేను కొనుక్కోడానికి కాదు, మా కజిన్ అక్కది ఎంగేజ్మెంట్. దాని డ్రెస్ ఇక్కడ ఉంది, తీస్కెళ్ళడానికి ఒచ్చాం."
"అయితే ఏంటి? నువ్వు కూడా ఒకటి కొనుక్కో."
"కొందామనే అనుకున్నా...కాని అంత సీన్ లేదని అర్ధమయ్యింది. చూశావు కదా రేట్లెలా ఉన్నాయో? స్పెషల్ అకేషన్ అయితే కొనచ్చేమో...ఊరికే సరదాకి ఇక్కడ కొనలేం."
తను చెప్పింది నిజమే...కాస్సేపక్కడుండి వాళ్ళక్క డ్రెస్ తీసేస్కొని బయటికొచ్చాం.
అక్కడొక పెద్ద ఫిష్ ట్యాంక్ ఉంది. దాని ముందుకు రాగానే సెల్ఫీ సెల్ఫీ అని నా పక్కకొచ్చింది...నా భుజం పట్టుకొని దెగ్గరగా ఒచ్చింది.
ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల ఇంతదెగ్గరగా ఒచ్చింది, నన్ను ముట్టుకుంది... అదికూడా మిథున..
"అబ్బా..నేను తీస్తే సరిగ్గా రావట్లేదు. ఇంత పొడవున్నావు నువ్వు. నువ్వే తీ." అని ఫోన్ నా చేతికిచ్చింది.
"ఏమైంది నీకు? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా? నవ్వూ.." అని రెండు చేతులతో నా చేతిని చుట్టుకుంది.
నా గుండె గడగడగడ కొట్టుకుంటోంది. నాకే వినపడుతోంది. తనకి కూడా వినిపిస్తోందో ఎంటో!
అదే సెంటు వాసన..... నాకు చమటలు పడుతున్నాయి. ఫోన్ కింద పడేసి మిథున వైపుకి తిరగాలని మనసు పీకేస్తుంది.
మూతి ముందుకు పెట్టి రెండు మూడు ఫోటోలు దిగింది.
సరిగ్గా సెల్ఫీలు దిగటం రాదని మళ్ళీ నన్ను తిట్టి ఫోన్ తీసేసుకుంది.
నేను కోలుకునేలోపు లేటవుతుంది అని చెప్పి ఇంటికెళ్ళిపోయింది.
ఉఫ్ఫ్...ఎంత మంచిరోజు..మిథునతో షాపింగ్ కి రానందుకు తన ఫ్రెండ్ ఎవరో తెలియకపోయినా మనసులో ఒకసారి మళ్ళీ తనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను.
* * *
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
"హలో.."
"ఓయ్ హీరో.. ఏం చేస్తున్నావు?"
"టీవీలో సినిమా చూస్తున్నా...". అబద్ధం చెప్పాను.
"ఏం మూవీ?"
"నువ్వు నేను."
"హేయ్...పాటలు బాగుంటాయ్. నాకు చాలా ఇష్టం."
"నాకు ఇంతకు ముందు అంత నచ్చేది కాదు. కాని ఇప్పుడు పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది.."
"ఎందుకు?"
"నీవల్లే. ఆరోజు కోచింగ్ సెంటర్లో పాట పాడావు కదా. అప్పటినించీ."
"ఓ..అదా..." నవ్వింది..
"మళ్ళీ పాడొచ్చు కదా.?"
"ఇప్పుడా. పనీ పాటా లేదా?"
"పనిలేదు. పాట కావాలి."
"అఖ్ఖర్లేదు. నాకు పనుంది."
"ఇంతకంటే పనా?"
"అవును."
"ఏం పని?"
"గుడికి."
"అబ్బా. తరవాత వెళ్ళొచ్చులే."
"కాదు ఇప్పుడే వెళ్ళాలి. అమ్మ తిడుతుంది."
"అబ్బా ప్లీజ్. కొంచెం సేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా."
"కష్టం చైతూ.. ఒక పని చెయ్యి. నువ్వు కూడా ఒస్తావా గుడికి?."
"ఇంతకీ దేవుడెందుకు గుర్తొచ్చాడివాళ అర్జెంటుగా?"
"అదీ..ఇవ్వాళా...ఇవ్వాళ నా బర్త్ డే.."
"ఓహ్.. అవునా..నాకు చెప్పలేదే...హ్యాపీ బర్త్ డే మిథునా.. రియలీ సారీ.. నాకు తెలియదు.. నిన్న మాట్లాడినప్పుడైనా ఒక్కసారి చెప్పాల్సింది."
"అదేమన్నా పెద్ద విశేషమా? బర్త్ డేనే కదా?"
"కాదా మరి. నాకు పెద్ద విశేషమే....అయ్యో నాకు ముందే తెలిస్తే బాగుండు. రాత్రే విష్ చేసేవాడిని..అనవసరంగా మిస్ అయ్యాను."
"అంత ఫీల్ అవ్వకు. సరే గుడికి రా మరి."
ఒక్క క్షణం ఆలోచించాను.
"ఒద్దు మిథునా..పనుంది. కాని సాయంత్రం మాత్రం ఖచ్చితంగా కలవాలి. ప్లీజ్.."
"ఏం పని. అంత ముఖ్యమా?"
"నిజంగానే చాలా ముఖ్యం. ప్లీజ్..సాయంత్రం కలవాలి.. ఎక్కడ చెప్పు?"
"కష్టం చైతూ...ఇంట్లోనే ఉంటా నేను బర్త్ డే రోజు. పార్టీలు కూడా ఏమీ ఉండవు."
"అలా అనకు.. నువ్వు కలుస్తున్నావు, అంతే..నీకు విషెస్ చెప్పొద్దా నేను? మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేస్తా.. ప్లేస్ డిసైడ్ చేసి చెప్పు సరేనా.. నేనింకేం వినను. బాయ్.." అని పెట్టేశాను.
ఈ సంగతి ముందే తెలిసుంటే బాగుండేది అని చాలా సార్లు అనుకున్నాను. సాయంత్రం మాత్రం మిథునని కలిసి నా మనసులో ఉన్నది చెప్పేయ్యాలి. ఏదన్నా గిఫ్ట్ కొనాలి. అందుకే గుడికి రానంది. అదేంటో నాకు అప్పుడే ఐడీయా ఒచ్చేసింది.
సాయంత్రం..ఆరున్నర..అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా పూర్తిగా కాదు.
ఇంటి ముందుకు వెళ్ళి ఫోన్ చెయ్యగానే బయటికి ఒచ్చి నన్ను నేరుగా మేడ మీదికి తీస్కెళ్ళింది.
ఇంట్లో వాళ్ళమ్మ మాత్రమే ఉన్నారంట. అయినా ఇంటికి వెళ్తే నేను చెప్పాలనుకున్నది చెప్పలేను కదా.. అందుకే రానన్నాను.
"ఏంటిది? నా కోసమేనా? ఇచ్చెయ్..ఇచ్చెయ్." అంది చేతిలో ఉన్న బ్యాగ్ చూసి.
"ఇస్తా..ఇస్తా.. ఇంటికొచ్చినోడికి మంచినీళ్ళన్నా ఇవ్వవా?"
"అబ్బా..ఆగు.. ఇప్పుడే తెస్తా." అని వెళ్ళిపోయింది.
ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా.. చెప్పాల్సింది ఒక వంద సార్లు అనుకున్నా...
మిథునా...నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ.. ఇంతే కదా. సింపుల్ గా ఉంది...సినిమా డైలాగ్స్ లేవు. ఒప్పుకుంటుంది... ఖచ్చితంగా ఒప్పుకుంటుంది... నాకున్న ధైర్యమంతా కూడగట్టుకున్నా..
ఒచ్చింది..
"ఇంక తే.. అసలేముంది దీంట్లో..?" అని ఆతృతగా నా చేతుల్లోంచి బ్యాగ్ లాక్కుంది.
"ఆ డిజైనర్ షాప్ బ్యాగ్ కదా ఇది?.. పిచ్చా చైతూ నీకు? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు? ఒద్దు చైతూ.. ఇది ఇచ్చేసి వేరేదేదైనా కొనివ్వు."
ఆ మిథునకి చాలా బాగా నచ్చిన డ్రెస్. అప్పుడే గుర్తు పెట్టుకున్నా.. ఎలాగోలాగ చేసి ఇవ్వాళ కొనేశా..
"ఏమొద్దు..అయినా గిఫ్ట్ అంటే గిఫ్టే.. చీప్, కాస్ట్లీ అని ఉండవు దాంట్లో... ఇంతకీ నీకు నచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఓపెన్ చేసి డ్రెస్ చూడు ముందు."
చూసి అశ్చర్యపోయింది.
"అదే డ్రెస్.. అదే.. ఆరోజు చూసింది ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావ్!"
ఇదే కరెక్ట్ టైం.. చెప్పెయ్యాలి..
"మిథునా.."
ఒక్క ఉదుటున ఒచ్చి నన్ను పట్టేసుకుంది. గట్టిగా..
ఓ నిమిషం ఇద్దరం మాట్లాడలేదు. ఇంకా అలాగే ఉన్నాం..
"పిచ్చి చైతూ నీకు.." అంది సన్నగా..
ఇప్పుడే చెప్పెయ్యాలి.
"మిథునా..నీకో విషయం చెప్పాలి" అన్నా కదలకుండా..
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
జవాబు లేదు.
మెల్లిగా నా ముందుకొచ్చి నా పెదాలపై ముద్దు పెట్టింది.
స్తబ్ధత....నా మనసు, బుద్ధి ఏమీ పని చెయ్యలేదు. తేరుకోలేదు. తిరిగి నేనే పెట్టాను ఈసారి...నింపాదిగా..
తరవాత తను సిగ్గుతో నా కళ్ళల్లోకి చూడలేకపొయ్యింది.
"ఒక పది నిమిషాలాగు.. ఈ డ్రెస్ వేసుకొని ఒచ్చి చూపిస్తాను." అని కిందికి పరుగెత్తింది.
ఆనందం... పుట్టి బుద్ధెరిగిన తరవాత ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు. ఎంత అదృష్టం!... నాదేనా?..నమ్మబుద్ధి కాలేదు.
ఫోన్ మోగింది...
హేమంత్ గాడు..
వీడికి చెప్పాలి.. కాని ఇప్పుడు కాదు.. కట్ చేశాను.
మళ్ళీ చేశాడు. మళ్ళీ కట్ చేశాను.. మధ్యాహ్నం నుంచీ ఇది అయిదోసారి. ఈ గొడవలో ఎత్తడం కుదరలేదు.
మెసేజ్ చేశాడు. "అర్జెంట్. అటెండ్ ద కాల్."
వెంటనే కాల్ బ్యాక్ చేశాను.
"నీ అయ్యా.. ఫోన్ కట్ చేస్తవేందిరా నువ్వు? మొత్తానికే మరిచిపొయినవా ఎట్ల?" అన్నాడు ఎత్తగానే.
"సారీ రా.. పనిలో ఉండి కుదరలే..ఏమైనా అర్జెంటా? రాత్రి ఫోన్ చెయ్యనా?...అప్పుడు నీకో సూపర్ న్యూస్ చెప్తా."
"నేనే నీకు చెప్తా దాని తాత లాంటి న్యూస్. అందుకనే చేశింది."
"అవునా...చెప్పు ఏంటి?"
"మిథున..మిథున పడ్డది నాకు.."
"వ్వాట్? ఏం చెప్తున్నావ్ నువ్వు?..జోకా?"
"జోక్ ఎందుకు చేస్తాబే?..ఇయ్యాల్నే చెప్పిన..ఒప్పుకుంది.. ఒప్పుకునుడేంది..ముద్దు గూడ పెట్టింది."
"ముద్దా..?"
"అవును బే. ఇంకా డీటెయిల్స్ కావాల్నా....ఇందాక కలిసినప్పుడూ............ "
ఒక పెద్ద భూకంపం ఒచ్చింది..వెయ్యి టన్నుల బరువున్న రాయి నా మీద పడింది. బుర్ర తిరిగిపోతుంది. ఫోన్ కట్ చేశాను.
నోరు తడారిపోయింది. అడుగులు తడబడుతున్నాయి..
భయమేసింది. ఎందుకో చాలా భయమేసింది...
ఆదరా బాదరాగా కిందికొచ్చాను..
బండి స్టార్ట్ చేసి పోనిచ్చాను.. వెనక్కి తిరిగి చూడలేదు.
ఇంటికెళ్ళేటప్పుడు కొత్తకార్డ్ కొని నా ఫోన్ నంబర్ మార్చేశాను.
మా అమ్మ
"మా అమ్మoటే నాకు చాలా ఇష్టం, చాలా మంచిది. చెప్పడానికి కొంచం టూ మచ్ గా ఉంటుంది కాని మా అమ్మంటే దేవతే... అంటే ఎవరికైనా వాళ్ళమ్మ దేవతలాగే అనిపిస్తుంది కాని నా విషయంలో ఇది నిజంగా నిజం."
ఇలాంటి మాటలు నేనెప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. కాని కొన్ని రోజుల నుంచి ప్రీతి చాలా దెగ్గరయ్యింది. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోబుద్ధవుతుంది. తను గురించి కూడా చాలా తెలిసింది. ఇద్దరం ఇంటికి దూరంగా ఉండటమో మరింకేంటో తెలియదు కాని ఒకరితో ఒకరికి చాలా చాలా తొందరగా స్నేహం ఏర్పడింది.. రోజూ గంటలు గంటలు ఫోన్ లో గడిచిపోతుంది.
నా పేరు భార్గవ్. నేను సెవెంత్ క్లాసులో ఉన్నప్పుడు ఈ ఊళ్ళో హాస్టల్ కి ఒచ్చాము నేను, మా తమ్ముడు. టెన్త్ క్లాసు వరకు పూర్తిగా బాయ్స్ కాలేజ్ అండ్ హాస్టల్ కావడంతో అమ్మాయిలతో అస్సలు పరిచయం లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఒచ్చాక ట్యూషన్ దెగ్గర ప్రీతి పరిచయం అయ్యింది. ముందు తనతో మాట్లాడాలని చాలా కోరికగా ఉండేది కాని దెగ్గరికెళ్తే నోరు పెగిలేది కాదు.
కాని ఒక కామన్ ఫ్రెండ్, శివగాడు, వాడి వల్ల రెండు మూడు సార్లు కలిశాం. ఎలాగోలాగ ధైర్యం చేసి పలకరించాను. తను చాలా కూల్. అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. నాకున్న సిగ్గు, భయం తనకు లేవు. అందరం కలిసినప్పుడు తనే సెంటరాఫ్ అట్రాక్షన్. అందరూ తన చుట్టూ చేరతారు. దీనికి కారణం తను అందంగా ఉండటమే అంటాడు శివగడు. కాని అదొక్కటే కాదు, తను ఎప్పుడూ హ్యాపీగా ఉండటం అని నేనంటాను. ప్రీతి చిరాకుపడ్డంకాని, విసుగ్గా ఉండడం కాని చాలా చాలా తక్కువ. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం అస్సలలా ఉండదు, అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మేమిద్దరమే ఉన్నప్పుడు, లేదా నాతో ఫోనులో ఉన్నప్పుడు మాత్రం ఏదైనా నచ్చని విషయం ఉంటే చెప్తుంది. చిరాకులు, కోపాలు ఎవరిమీదన్నా ఉంటే అప్పుడు నాకు మాత్రం చెప్తుంది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ఆలోచిస్తే... తన లైఫ్ కూడా అంత సింపుల్ గా, ఏ బాధా లేకుండా ఉంటుంది కాబట్టి ప్రీతి అలా ఉండగలుగుతుందేమో! ఎప్పుడూ కష్టం అనే మాట తెలియదు పాపం... అమాయకురాలు. తనలో నన్ను అట్రాక్ట్ చేసేది అదే. కాని నాకు అర్ధం కానిది ఏంటంటే తనకు నాలో ఏం నచ్చిందో అని. ఎప్పుడు అడిగినా మాట దాటేస్తుంది కాని చెప్పదు.
నేను జీవితంలో పెద్దగా కష్టపడలేదు కాని కష్టం అంటే ఏంటో తెలుసు.మా కష్టం అంతా కూడా మా అమ్మ పడుతుంది. అసలు మేమున్న పరిస్థితికి, మా ఫ్యామిలీకి, నేను, చిన్ను..అదే మా తమ్ముడు ఇంత మంచి కాలేజ్లో చదువుకుంటున్నాం అన్నా, ఇంత మంచి హాస్టల్లో ఉంటున్నాం అన్నా అదంతా మా అమ్మ గొప్పతనమే.
అందుకే ప్రీతి నా గురించి చెప్పమని బలవంతం చేసినప్పుడు నేను చెప్పిన మొదటి మాట ఇదే.
“కరెక్టే బాబూ. ఒప్పుకుంటున్నాను. మీ అమ్మ దేవతే. కాదంటే కొట్టు. కాని వేరే కూడా చెప్పు. ఎప్పుడూ ఇదొక్క ముక్క చెప్పి ఊరుకుంటావు. మీ నాన్న గురించి, వేరే ఫ్యామిలీ గురించి.” గట్టిగా అడుగుతుంది ఇవ్వాళ.
ఇష్టం లేకపోయినా ఇవ్వాళ తప్పేలా లేదు...
"ప్లీస్ భార్గవ్.."
"హ్మ్... మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే..."
· * *
మాది చిన్న ఫ్యామిలీ. అమ్మా, నాన్న, నేను తమ్ముడు. హైదరాబాదులో ఒక లోయర్ మిడిల్ క్లాసు అనుకోవచ్చు. నాన్నది ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ జాబ్, అమ్మ ఇంట్లోనే. నేను, నాన్న, చిన్ను ఒక టీం. అమ్మ ఎప్పుడూ ఒంటరిగానే మా అందరితో గొడవ పాడేది. పాపం అనిపించేది అప్పుడప్పుడూ. కాని నాన్నని కాదని అమ్మ పార్టీలో చేరటం మా వాల్ల అయ్యేది కూ కాదు. అయినా అమ్మకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. అమ్మకి కోపం ఒచ్చిందంటే మాతో పాటు నాన్న కూడా భయపడతాడు. అందుకే మా చదువు విషయాలు, ఇంటి విషయాలు అన్నీ అమ్మే చూసుకునేది. నాన్నతో ఓన్లీ సినిమాలు, షికార్లు అలాంటివి. ఒక్కరోజు కూడా నాన్న మమ్మల్ని తిట్టిoది నాకు గుర్తులేదు.
అమ్మ అందరినీ చూస్కోవాలి కాబట్టి అలా పైకి కోపంగా కనపడేది కాని మేమంటే చాలా ప్రేమ. ఒకసారి ఏమైందో తెల్సా.... మా నాన్నకి హై ఫీవర్ ఒచ్చింది, రెండు రోజులు లేవలేదు. అప్పుడు నేను సిక్స్త్ క్లాసులో ఉన్నా. ఆ రెండు రోజులు మా అమ్మ కళ్ళు మూయడం నేను చూడలేదు. తినడం కూడా చూడలేదు. రెండు రోజులు నాన్న పక్కనే కూర్చుంది. కదల్లేదు అక్కణ్ణుంచి. మా తిండి విషయం, కాలేజీ విషయం కూడా పట్టించుకోలేదు. మాకు చుట్టాలెవ్వరూ కూడా పెద్దగా లేరు. సో అమ్మ ఒక్కతే కష్టపడవలసి వచ్చింది.
అమ్మ సైడ్ వాళ్ళు ఎవరూ ఎప్పుడూ ఇంటికి రావడం చూడలేదు నేను. వాళ్ళది హైదరాబాదు కూడా కాదు. అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్ అంట. అందుకేనంట. నాన్నకి ఒక అక్కయ్య ఉండేవారంట. వాళ్ళెక్కడో నార్త్ ఇండియాలో సెటిల్ అయ్యారంట. ఏం చేసినా, ఏలా ఉన్నా మాకు మేమే. అందుకే అప్పుడప్పుడూ ఇబ్బంది అనిపించేది.
నాన్నకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. చాలా క్లోజ్. ఏదైనా అడగాలంటే నాన్న వాళ్ళనే అడిగేవారు. చలపతిరావు అంకుల్, చంద్రం అంకుల్. వీళ్ళు ఇంటికి బాగా ఒచ్చేవారు. మాతో కూడా సరదాగా మాట్లాడేవారు.
ఒకసారి ఇలాగే నాన్నకి ఒంట్లో బాగుండలేదు. రెండు రోజులు ఆగి నాన్నను హాస్పిటల్ కి తీస్కెళ్ళారు. అప్పుడు మేము చలపతిరావు అంకుల్ వాళ్ళింట్లోనే ఉన్నాం. అక్కడినించే కాలేజీకి. నాన్నకి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యిందని కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు.
తరవాత ఒక రోజు కాలేజీ నించి ఒచ్చేసరికి అందరూ ఉన్నారు. అమ్మ ఏడుస్తుంది. నాన్న అమ్మని ఓదారుస్తున్నారు. చలపతిరావు అంకుల్, చంద్రం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉన్నారు.. మమ్మల్ని చూసి లోపలికి తీస్కెళ్ళారు. మమ్మల్ని లోపలే ఉండమన్నారు. అమ్మా నాన్నకి మేము ఒచ్చినట్టు కూడా తెలియదు.
కాసేపాగి అమ్మ నన్ను పిలిచింది. నాన్న తన ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. ఏదో జరిగింది అని అర్ధం అయ్యింది కాని ఏం జరిగిందో ఊహించే ధైర్యం లేదు నాకు.
“చూడు నాన్నా.. తమ్ముడు ఇంకా చాలా చిన్నోడు. వాడికేం అర్ధo కాదు. సో నువ్వే వాడిని, అమ్మని జాగ్రత్తగా చూస్కోవాలి. సరేనా?” అన్నారు నాన్న. ఆయన కళ్ళల్లో నీళ్ళు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
కథ చాల బాగుంది
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
“ఇప్పుడేమైంది నాన్నా? నాకు చాలా భయంగా ఉంది.” అని నాన్నని గట్టిగా పట్టుకున్నాను.
అమ్మ పెద్దగా ఏడుస్తుంది.
“ఏం కాలేదు రా. కాని రేపేమన్నా జరగొచ్చు కదా. అందుకు చెప్తున్నా.” అని సర్దిచెప్పడానికి చూశారు నాన్న.
“అరేయ్. అసలే వాడు చిన్న కుర్రాడు. ఇలా భయపెట్టకండి వాడిని. అయినా డాక్టర్ ఏం చెప్పాడు. ఇప్పట్లో ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు కదా.” అన్నారు చలపతిరావంకుల్.
“అయినా ఈ రోజుల్లో పిల్లలతో ఇలాంటి విషయాలు దాచకూడదు.” అని నన్ను లేపి తనవైపుకు తిప్పుకున్నారు.
“చూడు భార్గవ్. నాన్నకు ఆరోగ్యం బాగా ఉండటo లేదని నీకు తెలుసు కదా. ఇవ్వాళే డాక్టర్ గారు చెప్పారు. నాన్నకి కాన్సర్ ఒచ్చిందట. ఇప్పుడేo భయం లేదు. కాని మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలి. నువ్వు పెద్దవాడివి కాబట్టి నీకు చెప్తున్నాం. అమ్మని, నాన్ననీ జాగ్రత్తగా చూస్కోవాలి.”
నాకేం అర్ధం కాలేదు. అమ్మ ఏడుపు తప్ప ఏమీ వినిపించడంలేదు. ఆ వయసులో నాకు కాన్సర్ వల్ల ఏమవుతుందో కూడా తెలియదు. నాకు తెలియకుండానే ఏడిచేశాను...చాలా... నాన్నని గట్టిగా పట్టుకున్నాను.
నాన్న ఏమనుకున్నారో ఏమో, “పిచ్చోడా! ఏం ఫరవాలేదు రా. చూడు ఇంట్లో పెద్ద వాడివి, నీకు ఇవన్నీ తెలియాలని చెప్తున్నాం. రేపటినించి ట్రీట్మెంట్ తీస్కుంటున్నా. నాకేం కాదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి.” అని చెప్పారు.
కాని అదంతా అబద్ధం అని తరవాత తెలిసింది.
ఆరోజు మొదలు మా ఇంట్లో కష్టాలు పెరిగాయి తప్ప తరగలేదు. నాన్న ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టారు. అమ్మా, నాన్నా హాస్పిటల్ కి తిరగడమే సరిపోయింది. నాన్న చాలా నీరసంగా అయిపోయారు. నాకు తెలిసి మాకు ఆస్తులేం లేవు. ఉన్నా కూడా అప్పుడు కరిగిపోయి ఉంటాయి. అమ్మకి ఉన్న కాస్త బంగారం కూడా అప్పుడు తీసేసింది. మెళ్ళో మంగళసూత్రం కూడా లేదు.
ఇల్లంతా నరకంలాగా ఉండేది. ఎప్పుడూ అల్లరి, కేకలు వినిపించే మా ఇంట్లో మొత్తం నిశ్శబ్దం కమ్మేసింది. చిన్నుగాడు అప్పుడు సెకండ్ క్లాస్. వాడికేం అర్ధం అయిందో కాని వాడు కూడా ఏదోలా అయిపోయాడు. నాన్నవాళ్ళక్క వాళ్ళు ఒకసారి ఒచ్చి చూసి వెళ్ళారు. అమ్మ సైడ్ వాళ్ళు అసలు రాలేదు అప్పుడు కూడా. మెల్లగా నాన్నకు జుట్టు ఊడిపోయింది. తినటం మానేశాడు. బక్కగా అయిపోయాడు. ఆయన బాధ చూస్తే ఇలా ఉండటం కంటే పోవడమే మంచిది అనిపించింది నాకు. కాని అమ్మతో అనలేదు.
ఆ రోజు కూడా రానే ఒచ్చింది. ఏడ్చి ఏడ్చి అమ్మ కళ్ళల్లో నీళ్ళు కూడా అయిపోయాయి. ఈ టైములో నాన్న గారి ఫ్రెండ్స్ ఒక్కరే మమ్మల్ని ఆదుకుంది. ముఖ్యంగా చలపతిరావు అంకుల్. పెద్దోళ్ళు ఎవరూ లేరు, అసలు ఏ పని ఎలా చెయ్యాలో తెలియదు, అమ్మ ఈ లోకంలో లేదు. అన్నీ ఆయనే చూసుకున్నారు. చనిపోయాక చెయ్యాల్సిన పనులన్నీ.
తరవాత ఒక రోజు అమ్మ నన్ను పిలిచింది.
“భార్గవా...మీ నాన్న మిమ్మల్ని చూసుకోమని బాధ్యత నా పైన వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా ముందున్న పని ఒక్కటే. మీ ఇద్దరినీ బాగా చదివించాలి. అంతే.. ఈ జీవితానికి ఇంకేం అక్ఖర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో..చలపతిరావంకుల్ నాకు నాన్న ఆఫీస్ లోనే చిన్న ఉద్యోగం ఇప్పించారు. కాని..”
అమ్మ ఏడిచింది.
“కాని ఉద్యోగానికి వెళ్తే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేను. మన దెగ్గరా డబ్బులు లేవు. నేను పని చేస్తే కాని మనకు పొట్ట గడవదు, నాకా పదో తరగతి దాటి చదువులేదు.దొరికిన ఈ పని వదిలిపెట్టలేను. జరిగినదంతా చూశాక మీరిక్కడ మనశ్శాంతిగా చదువుకోలేరు. అందుకే మీ ఇద్దరికోసం ఒక హాస్టల్ చూశాను. ఇక్కడ నా కష్టాలేవో నేను పడతాను. మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకోండి. సరేనా?” అని నన్ను దెగ్గరకు తీసుకుంది.
“ఒద్దమ్మా. అసలే నాన్న లేరు.. ఇప్పుడు మేము వెళ్ళిపోతే నువ్వొక్కదానివే అయిపోతావు. మేము ఇక్కడే చదువుకుంటాం. మా పని మేమే చేసుకుంటాం. నేను కావాలంటే సాయంత్రం ఏదన్నా చిన్న పని చేస్తా. కొన్ని డబ్బులొస్తాయి.” అని ఏడిచాను.
“అందుకేరా నేను ఒద్దనేది. మీరు చాలా మంచి కాలేజ్లో చదువుకోవాలి. చాలా బాగా చదువుకోవాలి. జీవితంలో పైకి రావాలి. ఈ కష్టాల వల్ల మీరెక్కడో ఆగిపోతే అది నేను భరించలేను. మీ నాన్న ఉన్నట్టే మిమ్మల్ని చూసుకోవాలి.”
అమ్మ నిశ్చయించుకున్న తరవాత ఆమెని ఎవ్వరూ ఆపలేరు. నన్నూ, తమ్ముణ్ణి హాస్టల్ కి పంపించేసింది. సెవెంత్ క్లాసులో ఈ ఊరికి ఒచ్చాను. లాస్ట్ ఇయర్ టెన్త్ అయిపోయిన తరవాత ఇంటికి ఒచ్చేస్తా అని అమ్మకి చెప్పాను. కాని అమ్మ ఒప్పుకోలేదు. అక్కడ ఒక్కతే కష్టపడుతుంది. నేను ఉద్యోగం చేసే వయసు ఒచ్చేవరకు రావద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. అక్కడుంటే చదువు పైన శ్రద్ధ పెట్టలేను అంటుంది. కరెక్టో కాదో తెలియదు కాని అమ్మ చెప్పింది కాబట్టి అలాగే ఉంటున్నాం.
· * *
పాపం ప్రీతి. ఇంత సీరియస్ గా నా గురించి చెప్తా అని ఊహించలేదనుకుంటా. ఏం మాట్లాడలేదు. సైలెంట్ గా అయిపొయింది.
“ఏయ్ పిల్లా...ఏంటి.. ఉన్నావా లేదా?”..ఒక నిమిషo ఆగి అన్నాను.
“సారీ భార్గవ్. మీ నాన్న గురించి తెలియక ఊరికే చెప్పు చెప్పు అని అన్నాను. అనవసరంగా గుర్తు తెచ్చుకున్నావు ఇదంతా. రియలీ సారీ..” తన గొంతులో తెలుస్తుంది పాపం ఏడుస్తుందనుకుంటా.
“ప్రీతీ.. పిచ్చా? ఏడవకు... అయ్యో నేను బానే ఉన్నా. నాకు గుర్తురావడం, రాకపోవడం ఏమీ ఉండదు. నాన్న ఎప్పుడూ నన్ను ఒదిలేసి వెళ్ళలేదు. ఇప్పుడేం నేను బాధపడట్లేదు. నువ్వు ఏడవకు..ప్లీజ్...”
“కాని మీ అమ్మ గ్రేట్ కదా. ఇన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక్కరే పాపం అది కూడా.”
“అందుకే నాకిక్కడ ఉండబుద్ధి కాదు. అమ్మేమో రానివ్వదు. సంవత్సరానికి రెండు సార్లు వెళ్తాం అంతే.”
“సమ్మర్ ఒస్తుంది కదా. ఇప్పుడు వెళ్తావా?”
“ఆ వెళ్తా... ఈసారయినా అమ్మ ఒప్పుకుంటే బాగుండు. అక్కడే ఎక్కడయినా కాలేజీలో చేరతా..”
“అవునా...”. ప్రీతి గొంతు డల్ గా అయిపోయింది.
“ఏయ్. అంత ఫీల్ అవ్వకులే...మా అమ్మ సంగతి తెలుసు నాకు... ప్రతిసారి నేను ఉండిపోతా అనడం, మా అమ్మ పంపించెయ్యడం మామూలే.”
“అసలే ఆంటీ దేవతా..” అంది నవ్వుతూ... నన్ను ఏడిపిస్తుంది అని అర్ధం అయ్యింది.
“పడతాయి నీకు..” అని ఫోను పెట్టేశాను.
రెండు వారాల తరవాత నేను, చిన్ను హైదరాబాద్ వెళ్లాం.
***
హైదరాబాద్ ఒస్తే ఎదో లోకంలోకి ఒచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మ చేతి వంట తింటూ, ఆ నెల రోజులు చాలా ఎంజాయ్ చేస్తాం. అమ్మ కూడా మాకోసం ఆ నెల రోజులు లీవ్ పెడుతుంది. ఏ పనీ పెట్టుకోదు. మాకు వండి పెట్టడం, అప్పుడప్పుడూ మేము ముగ్గురం సినిమాలకు అలా బయటికి వెళ్ళడం అంతే. ఇంకే పని ఉండదు. చిన్నుని నేను చూసుకుంటా, నువ్వెప్పుడయినా ఆఫీస్ కి వెళ్ళమ్మా అవసరం అయితే అని చెప్పినా వినదు అమ్మ. ఆరు నెలల ప్రెమంతా ఈ ఒక్క నెలలో చూపిస్తుంటుంది.
ఒక రోజు అందరం టీవీలో సినిమా చూస్తున్నాం.
“అమ్మా.. ఈ సినిమా అంటే ప్రీతికి ఎంత ఇష్టమో తెలుసా? మాటిమాటికీ ఈ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటుంది.” అని చెప్పా.
“ఇంతకీ ఏం నచ్చిందంట సినిమాలో?”
“లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం తనకి. కాని చిన్న పిల్ల లాంటిది. చాలా అమాయకురాలమ్మా.”
“చిన్న పిల్ల అంటే?”
“అంటే ఏదంటే అది నమ్మేస్తుంది. ఆ లవ్ స్టోరీలన్నీ నిజమని నమ్ముతుంది. ఇంకా చాలా ఉన్నాయిలే.”
“తను చిన్న పిల్లాంటే నువ్వు కాదా.”
“ఇంకా నేనేం చిన్న పిల్లోడినమ్మా. నీకలా అనిపిస్తా అంతే. కాని నేను ఇంకా అలా లేను. అందుకే నీకు సాయం చేస్తా అంటే ఒద్దంటావ్.”
అలా అనగానే అమ్మ మొహం అదోలా అయిపొయింది. బాధో, కోపమో అర్ధం కాలేదు.
“సరే సరే... కోపం తెచ్చుకోకమ్మా. ఊరికే అడిగాను. ఒదిలెయ్.” అన్నాను.
అంతలో చలపతిరావు అంకుల్ ఒచ్చారు. మేము హైదరాబాద్ ఒచ్చిన ప్రతిసారీ ఆయన ఒక రెండు మూడు సార్లు ఒస్తారు. మా గురించి కనుక్కొని కొంచం సేపు ఉండి వెళ్ళిపోతారు.
“నమస్తే అంకుల్. ఎలా ఉన్నారు.”
“బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావ్? బాగా చదువుకుంటున్నావా?”
“ బానే చదువుతున్నా అంకుల్.”
“ఇప్పుడేంటి ఇంటరా?”
“అవును.”
“నెక్స్ట్ ఏం చదవాలన్నా చదువుకో. మీ అమ్మకి ఇబ్బంది అవుతుంది అని మొహమాట పడకు. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. సరేనా?”
“సరే అంకుల్. ప్రతీసారీ మరిచిపోకుండా చెప్తారు మీరు.”
కాస్సేపు మాట్లాడుకున్నాం. అమ్మ టిఫిన్ చేసింది. అందరం తిన్నాం.
“అవునoకుల్.. ఆంటీ ఎలా ఉన్నారు. ప్రతీసారి మిమ్మల్నే కలుస్తాం. ఒకసారి అజయ్, అనీష్ లని కూడా కలవాలి.”
“బానే ఉన్నారు అందరూ” అని ముగించారు అంకుల్.
“ఓకే..మరి ఎప్పుడయినా ఇంటికి తీస్కెళ్ళoడి. చాలా రోజులయ్యింది.” అన్నా
“చూద్దాం లే.”
ఏమైందో.. అమ్మకి, ఆంటీకి గొడవేమన్నా అయ్యుంటుందేమో. అమ్మ అలాంటిది కాదే. పైగా ఎప్పుడు చెప్పలేదు కూడా. ఎందుకు లే అని మళ్ళీ అడక్కుండా ఓదిలేశా.
తరవాత అంకుల్ వెళ్ళిపోయారు.
కాస్సేపు టివి చూసి మేము పడుకోడానికి వెళ్ళాం. నేను హాల్లో పడుకున్నా, అమ్మా చిన్ను లోపల బెడ్ రూమ్ లో పడుకున్నారు.
నాకెందుకో నిద్ర పట్టలేదు. ప్రీతితో చాట్ చేస్కుంటూ కూర్చున్నాను. మధ్యలో బాత్రూంకి వెళ్దామని లేచి వెళ్ళాను. అమ్మ ఫోనులో మాట్లాడుతుంది, చిన్ను పడుకున్నాడు.
“ఈ టైంలో ఫోన్ చెయ్యకండి. ఇప్పుడు రావడం కూడా ఒద్దు ప్లీజ్. పిల్లలు పెద్దవుతున్నారు. భార్గవ్ ఇంకా చిన్నపిల్లోడు కాడు. వాడికి అన్నీ అర్ధం అవుతాయి. ఎలాగో ఇన్ని రోజులు అయిపోయాయి. ఇంకా పది రోజులు ఓపిక పట్టండి ప్లీజ్. పిల్లలు వెళ్ళిపోతారు.”
ఇంకా వినే ధైర్యం లేదు నాకు. పక్కకి ఒచ్చేశాను. మనసంతా పిచ్చి ప్రశ్నలతో నిండిపోయింది. వాటి నుంచి తప్పించుకోడానికి చాలా కష్టపడ్డాను.నిద్ర పట్టలేదు రాత్రంతా. ఏమై ఉంటుందో ఆలోచించడానికి కూడా భయం వేసింది.
పొద్దున్న లేవగానే ముందు అమ్మ ఫోన్ తీసుకొని రాత్రి మాట్లాడింది ఎవరితోనో చూసాను, నమ్మలేకపోయాను.
చలపతిరావంకుల్.
* * *
పొద్దున్న అమ్మ ఫోన్ చూసేటప్పుడు అమ్మ అక్కడే ఉంది. నేను కోపంగా ఫోన్ పక్కన పడేసి ఒచ్చాను. రాత్రి వరకు ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడెక్కడో తిరిగాను. ఫ్రెండ్సింటికి వెళ్దామనుకున్నా కానీ వెళ్ళబుద్ధి కాలేదు. కనిపించిన బస్సు ఎక్కాను, అది ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళాను. నాన్న గుర్తొచ్చారు బాగా...ఏడుస్తూనే ఉన్నాను... అమ్మ గురించి ఏమనుకోవాలో అర్ధం కాలేదు. చలపతిరావు అంకుల్ ఎందుకలా చేస్తాడు? అమ్మెందుకు అలా మాట్లాడింది? రోజంతా తిండి లేదు. హాస్టల్ కి వెళ్ళిపోదాం అనుకున్నాను.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ఇంక తప్పక రాత్రికి ఇంటికి చేరాను. అమ్మ గుమ్మo దెగ్గర కూర్చుంది. చాలా సేపు ఏడిచినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
“ఫోన్ కూడా తీసుకెళ్ళకుండా ఎక్కడికెళ్ళావ్ అన్నయ్యా? అమ్మ ఎంత కంగారుపడిందో తెల్సా?” అరిచాడు చిన్ను గాడు.
అమ్మ వైపు చూసాను. కాని అమ్మ నన్ను చూడలేదు. లేచి వెళ్ళిపోయింది. నాకు అన్నం పెట్టడానికి అన్నీ తెస్తుంది అని అర్ధం అయ్యింది.
“నాకు ఆకలిగా లేదు.” అని బెడ్ రూమ్ వైపు నడిచాను.
“కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించు. అన్నం మీద కాదు. నీకు దండం పెడతా. అన్నo తిను. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడినించి వెళ్ళిపోతాను. కాని నువ్వు తినను అనకు.” అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది.
నాకు తినబుద్ధి కాకున్నా మళ్ళీ అమ్మ గొడవ చేస్తుందని కొంచెం తిన్నాను. అమ్మ స్నానం అయ్యేలోపు పడుకున్నాను. కనీసం కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటించాను.
కాని పడుకునే ముందు ఒక పేపర్ తీసి ‘రేపు హాస్టల్ కి వెళ్తున్నాను.’ అని రాసి, దిండు పక్కన పెట్టి పడుకున్నాను.
అమ్మ ఏమనుకుందో కాని ఏమీ మాట్లాడలేదు. చిన్నుకి అన్నం పెట్టి పడుకోబెట్టింది. తను తిన్నట్టు శబ్దం మాత్రం రాలేదు. నేను మాత్రం దుప్పట్లోనుంచి కదలలేదు. కళ్ళు తెరవలేదు. లేచి అమ్మను తినమని చెప్పాలనిపించింది, కాని చెప్పలేదు.
అస్సలు నిద్ర పట్టలేదు. అటు ఇటు కదులుతూనే ఉన్నాను. అమ్మ బెడ్ రూమ్ నుంచి అలికిడి అవుతుంది. తను కూడా పడుకున్నట్టు లేదు.
లేచి కూర్చున్నాను. ఏడిచాను.... చాలా.
అర్ధరాత్రి అమ్మ నా బట్టలు సర్ది పెట్టింది. నేను ప్రతీసారీ తీసుకెళ్ళే పిండివంటలు కూడా. అన్ని సర్ది, పక్కన డబ్బులు కూడా పెట్టింది. నా చీటీ చూసిందన్నమాట. దుఃఖం ఇంకా ఎక్కువయ్యింది.
బెడ్ రూమ్ దెగ్గరికి వెళ్ళాను. డోర్ దెగ్గరే ఆగాను. లోపలి చూడలేదు.
“అమ్మా..... నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నావా?”
సమాధానం లేదు, ఏడుపు మాత్రం వినిపించింది.
ఎప్పుడు తెల్లారుతుంది అని ఎదురు చూస్తూ కూర్చున్నాను.
పొద్దున్నే ఆరింటికి బస్సు ఉంటుంది. లేచి స్నానం చేసాను. నేను వెళ్ళిపోతే చిన్ను ఎలా ఒస్తాడో అనిపించింది. వాడిని వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు, కానీ తప్పదు. ఇంకో పది రోజులు వాడు ఇక్కడే హాయిగా ఉంటాడు. కావాలంటే అమ్మ తీసుకొస్తుందిలే అనుకున్నాను.
నేను స్నానం చేసేవరకు అమ్మ లేచి టిఫిన్ చేసింది. అమ్మతో మాట్లాడకుండా ఇవన్నీ చేయించుకోవడం నచ్చలేదు నాకు. ఏదో తప్పు చేస్తున్నాననే భావన. మళ్ళీ అమ్మ చేసిన పని... ఇవన్నీ గుర్తొస్తున్నాయి మాటిమాటికీ.
“నాకు టిఫిన్ అక్ఖర్లేదు. బయట తింటా.” అని చెప్పి బాగ్ తీసుకొని ఒచ్చేశాను.
ఆరింటి బస్సు ఎక్కితే రాత్రికి దిగుతాను.ఎప్పుడూ రాత్రి బస్సు ఎక్కడమే అలవాటు. పొదున్నకల్లా దిగిపోవచ్చు. కాని ఇప్పుడు రాత్రి వరకు ఆగడం నా వల్ల కాదు. కాని ఇంట్లోంచి ఒచ్చేసినా తేడా ఏమీ లేదు. మనసంతా ఏదో మెలి పెట్టి తిప్పేస్తున్నట్టుగా ఉంది. ఈ ఫీలింగ్ ఎప్పుడు పోతుందో ఏమో! చచ్చిపోవాలనికూడా అనిపించింది. కనీసం అమ్మ పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పినా బాగుండేది. ఎక్కడో మూలలో ఆ ఆశ ఉండింది నాలో. కాని ఇప్పుడు అది కూడా లేదు. కోపమో, బాధో ఇంకేంటో తెలియదు.
అమ్మతో మాట్లాడకూడదు ఇంకా అనుకున్నా. కాని ఈ కాలేజీ, తిండీ, బట్ట అన్ని అమ్మ పెట్టేవే. అందుకే చావు గుర్తొచ్చింది. నాన్న గుర్తొచ్చారు. ఆయన ఉంటే ఎంత బాగుండేది. చివర్లో ట్రీట్మెంట్ వల్ల మనిషి మనిషిలో లేరు ఆయన, ఏమీ గుర్తుండకపోయేది, తడబడేవారు. కాని అలాగే ఉన్నా బాగుండు. పోకుండా.
ప్రీతికి ఫోన్ చేశాను, ఎత్తలేదు. ఎక్కడో చుట్టాలింట్లో ఉన్నా, మాట్లాడటం కుదరదు అని మెసేజ్ ఇచ్చింది. రాత్రికి ఒస్తున్నా, వీలైతే రేపు కలవమని రిప్లై చేశాను. చాలా హ్యాపీ, ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పింది. తనతో మాట్లాడినా కాస్త రిలీఫ్ గా ఉండేది. తన లోకంలోకి నన్ను లాక్కెళ్ళిపోయేది..
మధ్యలో లంచ్ కి బస్సాపారు. నేను దిగలేదు, తినలేదు.
డైరెక్ట్ గా రాత్రి ఊళ్ళో దిగి హాస్టల్ కి వెళ్ళాను. నా రూంలో ఎవ్వరూ లేరు. హాలిడేస్ ఉండగా ఇంకా ఎవరూ రారు కదా.
బెడ్ మీద పడ్డాను. ఆకలవుతుంది. ఇక్కడ తినాలనిపించలేదు. పక్కన హోటల్లో ఏమైనా తెచ్చుకుందాం అని లేచాను. జేబులో చూస్తే అమ్మ ఎప్పటికంటే ఎక్కువ డబ్బులే పెట్టింది. కాని దానితోపాటు ఒక కాగితం కూడా ఉంది. పొద్దున్నించి ఉందా? నేను గమనించనే లేదు.
అమ్మ రాసి పెట్టింది, ఉత్తరం.
‘భార్గవా,
ఈ రోజు ఎప్పుడో ఒకప్పుడు ఒస్తుందని నాకు తెలుసు. తెలిసినా ఇది ఎంత ఆలస్యంగా ఒస్తే అంత బాగుండు అని దాటవేస్తూ వచ్చాను. ఎందుకంటే ఈరోజు తరవాత నా జీవితం ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో ఉండదో నాకు అంతుబట్టేది కాదు. కాని నాకు దాని మీద చింత లేదు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి. నేను చెప్పేది వినాలంటే, విని అర్ధం చేసుకోవాలంటే నీ మనసు కూడా పెద్దది చేసుకోవాలి.
నా వయసు 18 ఉన్నప్పుడు నాకు పెళ్ళయ్యింది. ఆరోజు నుంచి మీ నాన్నే నాకు లోకo. వేరే అయినవాళ్ళెవరూ లేరు. మీరు పుట్టేవరకూ ఆయనే నా ప్రపంచం, తరవాత మీరిద్దరూ. ఇంకెవరూ అక్ఖరలేదనుకున్నాను. నీకు గుర్తుండే ఉంటుంది, మన చిన్న ప్రపంచం మనకెంత హాయిగా ఉండేదో. మీ నాన్న జీతం ఎంతుందో అంతలోనే మన ఇల్లు హాయిగా నడిచేది. ఎప్పుడయినా ఇబ్బందయినా అందులోనే సర్దుకునేవాళ్ళం. ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే మీ నాన్న ఉన్నప్పుడు దాచింది ఏమీ లేదు, ఆనందం తప్ప.
అలాంటి సమయంలో అనుకోకుండా ఆయన కాన్సర్ బారిన పడ్డారు. మీరింకా చిన్న పిల్లలు అప్పటికి,. ఒచ్చిన నాడే డాక్టర్ చెప్పారు ఒక సంవత్సరం కంటే మీ నాన్న ఎక్కువ ఉండే అవకాశం లేదు అని. అది వినగానే సగం చచ్చాను నేను. ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడ్డాం. మనది అనేది ఏదైనా విలువ ఉన్న వస్తువుంటే అదప్పుడు కరిగిపోయింది. డబ్బు ఎక్కడినించి ఒస్తుంది? తరవాత మనం ఎలా బతకాలి అని నేను ఏనాడు ఆలోచించలేదు. మీ నాన్న వీలయినన్ని రోజులు మనతో ఉండాలి. అదొక్కటే ఆలోచించాను అంతే.
అది తప్పో, ఒప్పో నాకు తెలియదు. నువ్వే చెప్పాలి. ఎంత కష్టపడ్డా ఆయన ఒక ఏడాదికి పోయారు. ముందే తెలుసు ..అయినా నేను తట్టుకోలేకపోయాను. మీకోసం తేరుకొని చూసేసరికి చేతిలో రూపాయి లేదు. ఒక నాలుగు లక్షలు అప్పు కూడా అయ్యింది. అదంతా చలపతిరావుగారు చూసుకున్నారు. మీ నాన్న పోయాక నాకు చెప్పారు ఆ డబ్బంతా ఆయనే కట్టారు అని. మీ చదువులు, అవసరాలు అన్నీ ముందున్నాయి.
నాకు భయం వేసింది. నేను హై కాలేజీ కూడా సరిగ్గా పాసు కాలేదు. నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఆ డబ్బు ఇవ్వకుండా ఆయనకు ఓ నమస్కారం పెట్టి, మిమ్మల్ని తీసుకొని ఏ ఊరికయినా వెళ్ళిపోదాం అనుకున్నా. కాని ఎక్కడికెళ్ళినా ఏ చిన్న పని చేసో బతకాలి. బతకోచ్చేమో.... కాని మీ భవిష్యత్తు? మిమ్మల్ని కూడా నాలా ఏదో సగం చదువులతో సరిపెడితే మీ నాన్నగారి కోరిక తీరదు అనిపించింది. మీరు కూడా నా వల్ల జీవితాంతం కష్టపడతారు అనిపించింది. మీరు పుట్టినప్పటినించి మీ నాన్న అనేది ఒక్కటే.. మీరు బాగా చదవాలని.... అదే నా చెవుల్లో మార్మోగింది. కాని ఎలా.... ? మిమ్మల్ని చదివించడానికి మార్గం ఏది. మాట్లాడడానికి కాని, ఒక సహాయం అడగడానికి కూడా ఎవరూ లేరు. ఒక్కదాన్ని నేను..
అలాంటి సమయంలో చలపతిరావుగారు ఒచ్చారు. తన బాకీ మొత్తం మాఫీ చేస్తా అన్నారు. మీరు జీవితంలో ఎంత చదువుతారో, ఒక మంచి జీవితానికి మీకేం అవసరం అవుతుందో ఆయనే చూసుకుంటా అన్నారు. అలా అని నోటు మీద రాసిచ్చారు. కాని నన్ను ఆయనతో ఉండమన్నారు.
ఈ విషయం రాయడానికి ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో ఆయన ఆ మాట అన్నప్పుడు అంతకు వెయ్యింతలు అనుభవించాను. ఆయన మంచివాడో, చెడ్డవాడో నాకు తెలియదు. కాని నా కళ్ళముందు మీరిద్దరే ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే చాలీ చాలని చదువుతో జీవితాంతం కష్టపడే మీరు, ఇంకో నిర్ణయం తీసుకుంటే కావాల్సింది చదువుకొని జీవితంలో స్థిరపడే మీరు. దీనికి నేను నా జీవితంలో నుంచీ ఒక పదేళ్ళు ఆహుతివ్వాలి.
కాని అది నన్ను బతికినన్నాళ్ళూ వెంటాడుతుంది. కొన్ని రోజులు ఉద్యోగం చేద్దామని ప్రయత్నించాను. మీరనుకున్నట్టు నాన్న గారి ఆఫీసులో నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఆయా పని. కాని నెల తిరిగేసరికి మీ కాలేజ్లో ఫీసు కట్టమని, కట్టకపోతే తీసేస్తామని చెప్పారు. నా ఆయా జీతం మీ ఫీసుకే సరిపోలేదు. ఆ రోజే చలపతిరావు దెగ్గర నోటు మీద రాయించుకున్నాను. కాని మీరు ఇక్కడుంటే నా విషం మీకు అంటుకుంటుంది అని మిమ్మల్ని హాస్టల్ కి పంపేసాను.
నేను చేసింది నీచమయిన పని అని నీకు అనిపించొచ్చు. అది నిజం, నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసినది క్షమించారాని నేరం. కాని దానికి నిన్ను నువ్వు శిక్షించుకోకు... నన్ను శిక్షించు..నాతో మాట్లాడకు, నన్ను తిట్టు, కాని నా గురించి ఎక్కువగా ఆలోచించకు. కేవలం చదువుకో. నువ్వు ఒక మంచి స్థితికి చేరుకున్నాక అప్పుడు కావాలంటే నన్ను నీతో తీసుకుపో. ఒద్దనుకుంటే ఇంకా మంచిది. నీ తమ్ముడిని బాగా చూసుకో. మీరిద్దరూ కలిసుండాలి ఎప్పటికీ. మీతో నేను లేకుంటే ఏమీ ఫరవాలేదు. నా గురించి నాకు పట్టింపు లేదు.
ఇది నువ్వు నన్ను అర్ధం చేసుకోవాలని కాదు. నీ దృష్టి నీ చదువు మీద, నీ జీవితం మీద మాత్రమే ఉండాలని. వేరే ఏ బాధా నిన్ను దారి తప్పించొద్దని. అదే మీ నాన్న ఆఖరి కోరిక. నా ఆఖరి కోరిక కూడా.
- అమ్మ.’
ఇది చదివాక నా మీద నాకే అసహ్యం వేసిoది. చదువుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ కావాలి అనిపించింది. కాని ఫోన్ చేసే ధైర్యం చెయ్యలేకపోయా. నేరుగా వెళ్లి అమ్మ కాళ్ళ మీద పడిపోవాలి.
టైం చూశా. రాత్రి బస్సు పట్టుకోవచ్చు. పొద్దున్నే హైదరాబాదులో దింపేస్తుంది.
· * *
బస్సెక్కాను. మనసు కొంచం ప్రశాంతంగా అనిపించింది. అమ్మని కలుస్తున్నాను అని అనుకుంటా. రాత్రి హాయిగా నిద్ర పట్టింది, అమ్మ నన్ను క్షమిస్తుంది అని నమ్మకమేమో!
పొద్దున్న లేచి ఫోన్ చూసుకున్నాను. అమ్మ దెగ్గర నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కాని కాల్ చెయ్యలేదు. నేను అమ్మని నేరుగా చూడాలి.
ప్రీతి దెగ్గరనుంచీ కాల్స్ ఉన్నాయి. మెసేజెస్ ఉన్నాయి. తనకు ఫోన్ చేశా.
“ఏయ్. ఇవ్వాళ కలుస్తా అన్నావ్ కదా. ఎప్పుడు? ఎక్కడ?” అంది ఫోన్ ఎత్తగానే.
“సారీ ప్రీతి. నేను హాస్టల్ కి ఒచ్చాను. కాని మళ్ళి హైదరాబాద్ వెళ్తున్నా. ఒచ్చేవారం కలుద్దాం.”
“అదేంటి.? ఎందుకొచ్చావ్? ఎందుకు వెళ్తున్నావ్?”
“ఊరికే”
“ఊరికే ఏంటి? పిచ్చా? అంత దూరం నుంచి ఒచ్చి మళ్ళి వెళ్ళడం ఏంటి?”
“ఒచ్చాను. కాని మా అమ్మకి సప్రైస్ ఇద్దాం అనిపించింది. అందుకే.”
“సప్రైసా.. ఎందుకు?”
“ఎందుకేంటి? ఎప్పుడూ చెప్తుంటా కదా అందుకే.”
“ఏం చెప్తుoటావ్?”
“అదే....మా అమ్మ దేవత.....నిజంగా”
***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
|