Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆత్మ
#1
ఆత్మ
-  Ch V Rami Reddy
 
ఆ రోజు పసిపాప నవ్వులా చాలా స్వఛ్ఛంగా ఉంది వాతవరణం. రామానాథం అప్పుడే కొత్త ఇంట్లోకి తన సామాను సర్ది అలసట తీర్చుకొవడం కోసం నడుం వాల్చాడు(సామాను అంటే భారిగా ఏమి వుండవు. ఒక నులకమంచం, మంచానికి తోడుగా తలగడ, రెండు దుప్పట్లు, కొన్ని వంటసామన్లు,ఇంచుమించు తన వయస్సులో సగం వయస్సు ఉన్న లుంగిలు,కొన్ని బట్టలు అంతే)
 
కాని ఆ సామను సర్దుడుకే అలసట వచ్చిందంటే కారణం తన వయసు...అవును మన హీరోగారి వయసు షష్ఠిపూర్తి పూర్తై పది సంవత్సరాలు అంటే రమరమీ 70 ఏళ్ళు. మరి ఆ వయసులో ఒంటరి అవడానికి కారణం లేక పోలేదు.
 
రామనాథం స్వతహగా మంచివాడు కావడంతో ప్రకృతి ధర్మం ప్రకారం భార్య గయ్యళిది దాపురించి మనవాడినీ సూటీపోటీ మాటలతో ఆడిపోసుకోనేది. దానికి కారణం ఉన్న ఆస్తీ అంత తన భర్త మంచితనంతో ఎక్కడ హరతీ చెస్తాడోననీ భయం పాపం ఆ ఇల్లాలికి. పిల్లలు పుడితే ఆమె మారుతుంది అనుకుంటే, పిల్లలు భార్య ఒకటై మరింత వేదించడం మొదలు పెట్టారు. భార్య దృష్ఠిలో బోట్టు పెట్టుకోవడానికి లైసెస్స్ లాగా, పిల్లల దృష్ఠిలో ఇంటీ పేరు వాడుకోవడానికి తప్ప తన వల్ల పైసా ఉపయెగం లేదని బతుకు నెట్టుకోస్తున్న తనకు ఈ జీవితం ఇలా అలవాటైపొయింది.
 
' ఇంతకు మించి ఏమీ ఉండదులే అనుకొన్న ప్రతీసారి తన జీవితంలో ఏదోక "ట్విస్ట్" పెడతాడు భగవంతుడు'.ఈసారి ఆ "ట్విస్ట్" అతని కోడళ్ళు..అత్తకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివినావాలాయే..వీళ్ళ తెలివితేటలన్ని రామనాథం మీద ప్రయోగించడంతో పాపం ముసలి ప్రాణం తట్టుకోలేక ప్రాణం తీసుకొవలనుకోని పురుగులమందు తాగడం, షరా మాములుగా ఆ మందు పనిచేయక పోవడంతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన ప్రాణపాయంనుంచి తప్పించుకొన్నాడు..ఇంకా తాను అక్కడ ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికీ మారిపోయాడు " ఒంటరిగా "
(ఎంటి సీరీయల్లో హీరోయిన్ల కన్న మనవాడికే ఎక్కువ కష్ఠాలు ఉన్నయనుకొంటునారా! ఇదెం చూసేరు..అసలు కథా ఇప్పుడే మెదలవుతుంది)
 
ప్రియురాలు వదిలెసిన ప్రియడు మాదిరి ఊరికి దూరంగా ఉంటుంది రామనాధం మారిన ఆ కొత్త ఇల్లు.అప్పుడప్పుడు ఊడిపోయె తలుపులు,ఎప్పుడు తెగిపడే కీటికిలు,ధన-పేద వంటి భేదం లేకుండా అందరి రక్తాన్ని క్యారేట్ జ్యూసులా తాగే దోమలతో "భలే సౌకర్యవంతంగా" ఉంది ఇల్లు.పడిన కష్ఠాలు చాలు అనుకొన్నయెమో ఒక్క దోమ కూడ రామనాథన్ని కుట్టె సాహసం చేయలేకపోతున్నాయి..
 
తన గతమంతా లీలగా గుర్తు చేసుకుంటు గాడ నిద్రలోకి జారాడు కళ్ళ నుండి కారుతున్న కన్నీటితోపాటుగా..
ఇంటిలో అలికిడి వినిపించడంతో ఉలిక్కి పడి లేచాడు.కళ్ళు నులుముకొని అటుఇటు చుసాడు.ఏవరు లేరు.పిల్లై ఉంటుందనుకొని మరల యథా స్దానంలో నిద్రకు ఉపక్రమించాడు.కళ్ళు మగతను పొందే వేళ లీలగా ఒక ఆకారం తనముందుకు వచ్చి నిలబడినట్టు అనిపించింది.లేచి చూస్తే ఏమీ లేదాయే.అప్పుడే జ్ఞాప్తికి వచ్చింది రామనాధానికి దెయ్యం అనే ఊహ.తన చిన్నతనంలో విన్నాడు ఊరి చివర ఇప్పుడు తను ఉన్న చోటనే స్మశానం ఉండేదని, కబ్జకోరుల కబంద హస్తల్లో ఆది కూడ కనుమరుగైదని.
కొంపతీసి ఆ వచ్చింది ద...య్య....మై....తే.....
 
కాసేపటికి తేరుకొని తనలో తాను నవ్వుకొని అయిన ఈ కాలంలో దెయ్యలు భూతాలు ఏంటి అంటు పిరికి సైనికుడిలా మేకపోతు గాంభీర్యం నటిస్తు తనకు తానే ధైర్యం చెప్పుకోని పడుకొవడానికి ప్రయత్నం చేస్తూన్నాడు..ఈసారి అదే రూపం. కళ్ళు తేరచి చూడగానే తన కళ్ళని తానే నమ్మలేక పొయడు. వర్షంలొ తడిసిన వడ్రంగి పిట్టలా తన చమటతో వళ్ళంతా తడిసింది. కాళ్ళు వణికాయ్.కళ్ళు తిరిగాయ్. గుండే వేగం పెరిగింది (ముసలిగుండే కదండి అనకండి)
ఎందుకంటే ఎదురుగా ఉన్నది నిజంగా "దె..య్య..మే"
 
 
ఆ రూపం తన దగ్గర రావడం చూస్తున్నా కదలక ఉండటం మినహ ఏమి చేయలేక పోతున్నాడు. దగ్గరకు వస్తున్న ఆ రూపాన్ని రెప్పార్పకుండా చూస్తున్నాడు. ఒక చిన్నపాపలా కనిపిస్తుంది ఆ రూపం రామనాథనికి. తెల్లని గౌనులో కరుణకరణ్ సినిమాలో హీరోయిన్లా వెలుగిపోతుంది. తన మనవరాలి వయస్సు ఉండవచ్చు. రామనాథం తననే చూస్తుడుడం చూసి ఆ పాప లేడి పిల్ల మాదిరి చెంగున పరుగు తీసి మాయమైపోయింది. రామనాథం ఆలాగే ఆ పాపను పట్టుకొడానికి పరుగు తీద్దం అనుకొని అతడి కాళ్ళు తన వయస్సు గుర్తు చెయడంతో తన ప్రయత్నం విరమించుకొన్నాడు.
 
అసలు ఆ పాప ఎవరు..ఇంత రాత్రి వేళ ఇక్కడెం చేస్తుంది మనిషేనా లేక...ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతునాడు రామనాథం. లాభం లేదు ఇల్లంత తిరిగైన ఈ మిస్టరీనీ ఛేదించాలనుకొని కంకణం కట్టుకొన్నాడు. నిజానికి రామనాథం ఉంటున్న ఆ కొత్త ఇల్లు పెద్దదే కాని ఎవరు పట్టించుకోక పోవడంతో భూత్ బంగ్లాల తయరయింది. రామనాథం ఇల్లు కలియతిరుగుతుండగా ఎక్కడినుండో మాటలు వినిపించసాగాయి. అక్కడ మాటలు వినిపించే గదిలొకి తొంగిచూడగానే రామనాథం కళ్ళు బైర్లు కమ్మడం మొదలైంది. దానికి కారణం ఇంట్లో మగదయ్యం, ఆడదయ్యం ఇందాక తాను చూసిన బుల్లిదెయ్యంతొ సహ మొత్తం మూడు దయ్యలున్నాయ్.
వాల్ల మాటలు చెవులు రిక్కించి వినసాగాడు.
 
తల్లి:- ఎక్కడికి పోయావే
పిల్ల:- ఆగదిలో ఒక తాతయ్య ఉంటే ఆడుకుందాం అని వెళ్ళా అమ్మ..
తల్లి:-చూసారా మీ సుపుత్రి..అప్పుడే అబద్దాలు కూడా మొదలు పెట్టింది.అన్ని మీ బుద్దులే..
తండ్రి:-సరిపొయింది..అది అబద్దం చెప్తే నన్ను అంటావ్ అని భార్యమణిని సుతారం మందలించి కుతురు వైపుకు తిరిగి చూడమ్మ మన ఇంట్లో మనం తప్ప ఇంకా ఎవరు లేరమ్మ.మమ్మికి అలా అబద్దం చెప్పవచ్చా?
పిల్ల‌:-లేదు డాడి నిజం!
 
ఈ సంభాషణ సాగుతు ఉండగా తలుపు చాటున వింటున్న రామనాథం తుళ్ళిపడి ముందుకు పడటం, ఇరుపక్షాలు సభాముఖంగా చూసుకొవడం, పాప 'నేను చెప్పిన తాత ఇతనే' అంటూ గంతులు వేయడం, హీరో గారు తన వయస్సు సైతం మరచి ఒక్క ఉదుటున మేల్ పి.టి.ఉషలా పరుగు లంకించి తన గదిలోకి దూరి తలుపు బిగించడం అంత క్షణకాలంలొ జరిగిపొయింది..
 
ఆ రోజు రాత్రి రామనాథానికి నిద్ర పడితే ఓట్టు. అసలు తాను ఉంటున్న ఇంట్లో దెయ్యలు ఉండటం ఎంటో, తనకే ఇలాంటి ఆఫర్లను ఏందుకు పెడతాడొ దేవుడు అనుకుంటు తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టలనుకొన్నడు.
ఉన్న వాటిలొ ఆ పిల్లదెయ్యం కొంచెం మంచిదానిలాగె ఉంది. మిగతా రెండు పెద్ద దెయ్యలతోనే అసలు ఇబ్బంది అంతా అని గ్రహించాడు. వీటిని తరమడానికి తను ఎంచుకొన్న దారే ఆపరేషన్ "ఎదురుదాడి"
 
 
ఇంకా ఆ తరువాత దయ్యాలకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. తన భార్య, పిల్లలు, కొడళ్ళు ఈ దుష్టత్రయం తనను పెట్టిన టార్చర్ వలన ఆ ఆంకంలో పి హెచ్ డి స్కాలర్ లెవల్లో తనకు అనుభవం వచ్చింది.
రాత్రి పగలు తేడా లేకుండా కర్ణభేరి పగిలేలా శబ్దాలు చేయడం, ఆ దెయ్యలు ఉంటున్న పరిసరాల్లో చెత్త పొయడం వంటివి చెసేవాడు. ఇంతా చేసినా కాని ఆ దెయ్యలు ఎప్పుడు కూడా రామనాథన్ని ఏమి అనేవి కావు. ఒక్కొసారి తనకే అనిపించేది నేనే ఎక్కువ చెస్తునన్నా అని, కాని తన అంతిమ లక్ష్యం వాళ్ళను తరమడమే కాబట్టి ఏమి పర్వలేదని తనను తాను సమర్దించుకునేవాడు.
 
కొన్ని రోజుల తర్వాత ఒక స్వామీజీ అటుగా వెళ్తూ ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగారు. అచ్చం సినీమాల్లో చూసినట్లుగానే మూర్తిభవించిన ముఖంతో, తాయత్తులు, శిష్యబృందంతో తేజోమయడిలా ఉన్నారు స్వామీజీ. ఒక్కసారిగా రామనాథంకు ప్రాణం లేచివచ్చినట్టయింది. చాలాకాలం తర్వాత మనుషుల్ని చూడటం, ఈరోజుతో ఆ దయ్యల పీడ వీరగడౌతుందన్న అనందం రామనాథంలో తాండవించింది. అయిన నా ఇంట్లో దెయ్యల్లున్నట్టు స్వామీజీకి ఎలా తెలిసిందొ,మన కష్టం చూడలేక ఆ భగవంతుడే స్వామీజీని పంపి ఉంటాడులే అనుకొని స్వామీజీకి స్వాగతం పలికడానికి వెళ్ళాడు రామనాథం. స్వామీజీ రామనాథంను కుశలప్రశ్న లు అడిగి ఏమైందొ తెలుసుకొన్నాడు. శిష్యులు మాత్రం కొత్తగా ఎగ్జిబీషన్ కు వచ్చిన పిల్లలా ఎమి అర్దంకానట్టుగా చూస్తూన్నారు. రామనాథం స్వామీజీకి పుస గుచ్చినట్టు అంత చెప్పాడు.
 
సాయంత్రం పూజా చేసి ఇంటికి శాంతి చేస్తే పీడ, గీడ లాంటివి పొతాయని భరొసా ఇచ్చి సాయంత్రం వరకు నువ్వు ఎట్టి పరిస్తితులలోను నీ గది దాటి బయటకు రావడానికి వీలులేదని చిన్నసైజు హెచ్చరిక లాంటిది చేసాడు స్వామీజీ. రామనాథం జీహూజుర్ అనడం మినహ తన మనసులో ఉన్న యక్షప్రశ్నలు ఏమి అడలేక పొయడు.
 
ఆ రోజు సాయంత్రం పూజకు కావల్సిన సామను, పెద్ద ముగ్గు (చంద్రముఖి సినిమాలో క్లైమక్స్ లొ వేసినా ముగ్గులాంటిది)శిష్యబృందం సమకూర్చగా స్వామీజీ పూజ మొదలైన కాసేపటికి తానే స్వయంగా రామనాథం గది దగ్గరకు వెళ్ళి రామనాథన్ని తన వెంటబెట్టుకొని తీసుకోచ్చాడు స్వామీజీ.
 
ఆ పూజగదిలొకి వస్తుంటే ఎదో అగ్నిగుండం దగ్గర ఉన్న మాదిరి చాలా వేడిగా అనిపించింది రామనాథానికి.
బహుశా హోమగుండం వల్ల అనిపించుంటుంది అనుకొన్నాడు మనస్సులో. ముగ్గులొ కుర్చోమని అజ్ఞాపించారు స్వామీజీ. రామనాథానికి నేను ముగ్గులో కుర్చొవడం ఎంటో అనుకుని మళ్ళి స్వామిజీ వైపు చూడగా, కుర్చోమని ఈసారి హెచ్చరింపుగా అనేసరికి ఒక్కసారిగా ముగ్గులోకి కూలబడ్డడు. ఒక పక్కన పూజలు జరుగుతున్న రామనాథం మనస్సు ఎందుకో కీడు శంకిస్తుంది, అక్కడ నుండి లేచీ వెల్లిపోదాం అనుకుంటునాడు కాని ఎవరో తనను పట్టుకొన్నట్టు పైకి లేవలేకపోతున్నాడు. చేస్తున్న పూజ పూర్తిచేసి తనను చూస్తూ ' చనిపోయిన వాడివి స్వర్గనికో, నరకానికొ పోక ఎందుకయ్య పాపం ఆ కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టావు ' అన్నాడు స్వామిజీ. ఒక్కసారిగా రామనాథం బుర్ర రంగులరాట్నం మాదిరి తిరిగి కింద ఉన్న భూమి కంపిచినట్టయింది. ఏమి అంటునాడు ఈయన నేను చనిపోయనంటున్నాడెంటి. నేను చనిపోయిన విషయం నాకే తెలియకుండా ఉండటమెంటి?
అంటే స్వామిజీ చెప్పినట్టు ఇప్పుడు తనోక " ఆత్మనా " ???????????????????????
 
 
నిర్జివుడిగా ఉన్న రామనాథంకు నోటి నుండి మాట రాలేదు. అసలు ఇది కలా నిజమా అన్న మీమాంసలో ఉన్నడు. అప్పుడు స్వామిజీనే కల్పించుకొని " చూడు రామనాథం నువ్వు ఆత్మహత్యప్రయత్నం చేసినరోజే నువ్వు చనిపోవడం జరిగింది. నువ్వింకా బ్రతికున్నవన్న భ్రమలో ఉండిపోవడంతో వేరే వాళ్ళను చూసి వారే ఆత్మలనుకుని నువ్వు భయపడి నీ భయంతో వాళ్ళను భయపెట్టేటప్పటికి వాళ్ళు నాకు కబురు పెట్టడం, నేను ఉదయం నీదగ్గరకు వద్దకు వచ్చి ఇక్కడ పరిస్తితి గమనించి ఇక్కడినుండి నీ ఇంటీకి వెళ్ళి అక్కడ నీ భార్య పిల్లలను కలుసుకొని అసలు విషయం తెలుసుకొన్న.
 
నువ్వు చనిపొయిన తరువాత నీ భార్య మంచాన పడింది. నీ కొడుకులు, కొడళ్ళు నీ విషయంలొ తాము చెసిన పనులకు ఎంతగానో భాద పడ్డారు. అయిన బ్రతికి ఉన్న మనిషిని మనిషిగా చూడని సమాజం చనిపొయిన తర్వత మాత్రమే అతని విలువ అర్దం చేసుకుంటుంది. నిన్ను కొల్పోయిన తర్వాత నీ విలువెంటో నీవాళ్ళకు తెలుసొచ్చింది " అంటూ తాను చెప్పడం చాలించాడు స్వామిజీ.
 
 
స్వామిజీ మాటలకు రామనాథం కంట్లో నీళ్ళు లావాలా పొంగి ప్రవహించసాగింది. తను ఆత్మగా ఉండంటం వలనే తన చుట్టు అన్ని దొమలు ఉన్న ఒక్కటి కూడ తనను కుట్టక పొవడం, తాను ఎన్ని వేషాలు వేసినా ఒక్కసారి కూడ ఆ ఇంట్లోవాళ్ళు ఎమి అనలేక పోవడం, స్వామిజీతో మాట్లడుతున్నప్పుడు శిష్యులు తనను వింతగా ఎందుకు చూసారో...వాటి తాత్పర్యం ఇప్పుడు బోధపడింది రామనాథంకు.
 
మరల స్వామిజీనే మాట్లాడుతు ' బతికున్న రోజులన్ని ఎంతొ భారంగా గడిపిన నువ్వు నీ చావు నీకు తెలియకుండా చనిపోయిన అదృష్టవంతుడవు. కాబట్టి ఇకపై నీ ఆత్మకు శాంతి కలుగుతుంది వెళ్ళు 'అన్నారు.
 
ఒక్కసారిగా తన బందకాలు తెగినట్టుగా ఉంది ఆ దిగ్బంధనం నుండి లేవగానే. ఆ ఇంటి వారి పట్ల తను ప్రవర్తించిన తీరుపై తనే పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఇంటి నుండి బయటకు వచ్చెసాడు. తన తరువాత మజీలికి అసన్నమవుతున్న సమయంలో మరల ఆ ఇంటి వైపు చూసాడు. ఇంద్రభవనంలా మెరిసిపోతూంది ఇల్లు. ఇప్పటి వరకు తన కళ్ళకు భూత్ బంగ్లాలా కనిపించిన ఆ ఇల్లు అలా ఉండటం చూసి తనలో తాను నవ్వుకొని చివరి ప్రయాణం ఆకాశం వైపుగా సాగించాడు.
 
స్వామిజీ ఆ ఇంట్లోవాళ్ళను పిలిచి ఆ ఆత్మ వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పి ఎవో తాయత్తులు ఇచ్చి అక్కడ నుండి బయలుదేరారు. మార్గంమద్యలొ శిష్యుల్లో ఒకతను స్వామిజీని ఇలా అడగసాగాడు. " స్వామి రామనాథం బతికున్ననాళ్ళు ఎన్నో భాదలు పడి ఇప్పుడు చనిపోయిన తరువాత సుఖం పోందబోతున్నాడు. రామనాథం బతికున్నప్పుడే వాళ్ళింట్లొ వాళ్ళు మారిపోయివుంటే కథ ఇంత దూరం వచ్చేదె కాదు. కాని నాకున్న సందేహం మీరు రామనాథన్ని పూజ మొదలయ్యె వరకు గడప దాటకూడదని ఎందుకన్నారో అర్దం కాలేదు అన్నాడు.
 
స్వామిజీ మద్యలొనే అందుకుంటు " మనుషుల కర్మ ఫలితాలు తమగత జన్మ పాపపుణ్యలపై ఆదారపడి వుంటాయి. ఒకరు ఈ భూమిపైనే రుణం తీర్చుకుంటారు. మరోకరు చనిపొయిన తర్వతా కూడ తీర్చలేరు. రామనాథనికి కూడ ఇంకా రుణం తీరలేదు.
 
(అర్దం కానట్టు చూసారు శిష్యులు)
 
నిజానికి నేను రామనాథం ఇంటికి వెళ్ళలేదు. ఊర్లో విచరణ చేయగా రామనాథం చనిపోయిన తర్వతా జరిగిన ఆస్తి పంపకాల్లో తల్లి కోడుకుల మద్య ఘర్షణ జరిగి రామనాథం భార్య మరణించింది. అ వార్త ఆ నోట ఈ నోట పడి రామనాదానికి తెలిసి తను ఆ ఇంటికి వెళ్తే తను ఆత్మ అనే నిజం తెలుస్తుంది. అది మరి ప్రమాదకరం.
 
అందుకే తనను బయటకు రావద్దని చెప్పి శాంతి పూజలు చెసి తన వారంతా మారిపోయరని అబద్దం చెప్పడం వల్ల తన ఆత్మ శాంతించింది.
 
అంతలోనె శిష్యులు " అంటే రామనాథం భార్య కూడ?"
అవునన్నట్టు తలూపాడు స్వామిజీ.చనిపొయిన తర్వతా కూడ కొంతమంది రుణం తీర్చలేరు అని అందుకె అన్న అన్నారు స్వామిజీ.
 
అప్పటి వరకు పసిపాప నవ్వులా చాలా స్వఛ్ఛంగా ఉన్న వాతవరణం. అమ్మ కొట్టిన పిల్లవాడి ముఖంలా ఎర్రగా మారి అల్లకల్లొలంగా తయరయింది.
ఏమిటి స్వామి ఈ వైపరిత్యం అని శిష్యులు అడుగాగ
అందుకు స్వామిజీ " బహుశా రామనాథంకు నిజం తెలిసుంటుంది " అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయారు.
 
**** సమాప్తం *****
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Wow..super story'Andi chala Baga rasaru...
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
#3
(05-07-2023, 05:50 PM)Deepika Wrote: Wow..super story'Andi chala Baga rasaru...

dhanyavaadaalu
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: