Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#21
తద్దినం!
(గోతెలుగు నుండి. వారికీ కృతజ్ఞలతో)

ఆ రోజు సోమయాజులు ఇంట్లో తద్దినం. డాబా మీద కొంతమంది పైకి చూస్తూ... కొంతమంది చుట్టుపక్కల చూస్తూ... కా... కా... అంటూ అరుస్తున్నారు.
ఎందుకంటే కాకుల కోసం.
పంతులు, సోమయాజి ఇంట్లోంచి ఓ అరటి ఆకులో పిండాలు తెచ్చి పిట్ట గోడ మీద పెట్టి తను కూడా అరవటం మొదలు పెట్టారు.
కాని కాకులు రావటం మాట అటుంచి... అసలు కను చూపు మేరలో కాకి అన్నదే కనిపించలేదు. చివరకి ఆడాళ్ళూ... మగాళ్ళూ ... కూడా కలిసి అరవటం మొదలు పెట్టారు.
పిల్లలకి ఏమీ అర్ధం కాక వాళ్ళూ కూడా గొంతు కలిపారు. కానీ వాళ్ళు గొంతులు కలిపింది కాకులకోసం కాదు... ఆకలేసి.
‘బామ్మా... కాకులు రావడం లేదే... ఆకలేస్తోంది... అన్నాడు సోమయాజి కొడుకు రామ సోమయాజులు.
‘కాకి ముట్టుకోకుండా ఎవరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు.’ అంది ఖరాఖండిగా బామ్మ.
అందరూ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు.
రెండు గంటలు దాటింది.
పంతులు గారు కూడా ఆకలితో నక నకలాడుతున్నారు.
‘పంతులుగారు కాకులు కాదుకదా... కాకి ఈక కూడా కనబడటంలేదు... ఏం చేద్దాం?' అడిగాడు సోమయాజి.
‘మీరేం కంగారు పడకండి. ఓ పావు గంటలో కాకి వస్తుంది.’ అన్నాడు పంతులు.
అందరూ ఆశ్చర్యంగా చూసారు.
రెండు గంటలైనా రాని కాకులు. ఓ పావు గంటలో ఎలా వస్తాయండి? అడిగాడు మరో పెద్ద మనిషి.
డబ్బులుంటే కొండమీద కోతి దిగి వస్తుంది. ఈ కాకి ఓ లెక్కా?, అన్నాడు పంతులు.
‘డబ్బులు చూపిస్తే కాకులు వస్తాయా? అడిగాడు ఓ పెద్ద మనిషి.
‘చూపిస్తే కాదు... ఇస్తే...’ సోమయాజి గారు ఓ అయిదువందలు అన్నాడు పంతులు.
‘పావుగంట లోనా’ అడిగాడు సోమయాజి.
‘అవునండి కాకపొతే ఓ అయిదొందలు అవుతుంది.' అన్నాడు పంతులు తాపీగా.
‘అయిదొందలే' అంది సోమయాజి భార్య సోమిదమ్మ.
‘అయిదొందలు కాదు అయిదు వేలయినా సరే కాకి ముట్టిన తర్వాతే అందరూ అన్నాలు ముట్టేది’ అంది బామ్మ
‘విన్నారుగా’ అన్నాడు పంతులు ఆనందంగా.
‘అబ్బా నువ్వుండవే అమ్మా... ఆవిడ మాటలేం పట్టించుకోకండి. అయిదొందలు ఖాయం చేసుకొని అర్జెంట్ గా కాకి చేత కబురు పంపి... కాకి ని రప్పించండి... ఆకలితో అందరూ నక నక లాడుతూ వున్నారు.’ అన్నాడు సోమయాజి.
పంతులు సెల్ ఫోన్ తీసి ఓ నంబర్ డయల్ చేసి. 'హలో... కాకి కామేశం... నేను పిండాల పంతులు కాశీపతి ని... అర్జెంట్ గా ఓ కాకి' అంటూ ఆగి సోమయాజితో ‘ఒకటా... రెండా...’ అంటూ అడిగాడు.
సోమయాజికి అర్ధం కాలేదు. ‘అంటే’ అన్నాడు.
‘ఒక కాకయితే అయిదొందలు. రెండయితే ఏడు వందల యాభై. రానూ పోనూ ఖర్చులు ఇవ్వాలట.’ అన్నాడు పంతులు.
‘ఒకటి చాల్లెండి' అన్నాడు సోమయాజి.
‘ఒకటి చాలు. వెంటనే తీసుకురా. పది నిముషాల్లో కాకితో సహా నువ్విక్కడ వుండాలి. ఆ... ఆ... ఇక్కడే.’ అంటూ సెల్ ఫోన్ ఆపి ‘ఇంకో పావుగంటలో కాకి వస్తుంది. ఈ లోగా వడ్డించమని చెప్పండి.’ అన్నాడు పంతులు.
‘కాకి ముట్టిన తర్వాతే వడ్డన' అంది బామ్మ.
‘అమ్మా ఇరవయ్ నిముషాల్లో కాకి ముట్టుకుంటుంది. నాది గ్యారంటీ... కాకపోతే కాకి విషయంలో నా కమీషను యాభై రూపాయలు కాదనకూడదు.’ అన్నాడు పంతులు.
అందరూ అరవటం మానేసి రోడ్ మీద చూస్తున్నారు. కాకి కోసం.
పది నిముషాల్లో ఆటో వచ్చి ఆగింది.
అందులోంచి చేతిలో ముసుగు వేసిన వస్తువుతో దిగాడు కామేశం.
అందరూ కామేశం చేతిలో వున్న దాన్ని చూస్తున్నారు.
‘అదిగో కాకి కామేశం వచ్చాడు... కాకీ వచ్చింది.' అన్నాడు పంతులు.
కామేశం లోపలికి వచ్చాడు.
‘ఏమిటి ఆలస్యం’ అడిగాడు కామేశం పంతులుని.
‘నాదేం లేదు నీదే ఆలస్యం' అన్నాడు పంతులు.
‘అయితే కానీ’ అంటూ ముసుగు తీసాడు. ఓ పెద్ద పంజరం. రెండు అరలున్నాయి. ఓ అర ఖాళీగా వుంది మరో అరలో కాకి వుంది.
అందరూ ఆశ్చర్యపోయారు.
కామేశం పంజరం తలుపు తీసాడు.
‘సోమయాజిగారు... ఆ పిండాల్ని పంజరంలో పెట్టండి.’ అన్నాడు పంతులు.
సోమయాజి అరటాకుతో సహా పిండాల్ని పంజరం మొదటి అరలో పెట్టాడు.
కామేశం పంజరం తలుపు మూసేసి. రెండో అర తలుపుని పైకి లాగాడు.
అందరూ అలాగే చూస్తున్నారు.
కాకి కామేశం వంక చూసింది.
కామేశం తల అడ్డంగా వూపాడు.
కాకి పిండాలు ముట్టుకోలేదు.
అందరూ ఆశ్చర్యపోయారు.
బామ్మకూడా చూస్తోంది.
‘బామ్మా... ఏమయింది... కాకి ముట్టుకోవడంలేదు.’ అడిగాడు రామ సోమయాజి
‘మీ తాతకి కోపం వచ్చిందిరా.’ అంది బామ్మ.
‘తాతయ్యా... త్వరగా తిను... మా అందరికి ఆకలేస్తోంది' అన్నాడు రామ సోమయాజి
‘ఏంటి పంతులుగారు ఏమయింది కాకి ముట్టుకోవడం లేదు' అడిగాడు సోమయాజి
‘మీ అమ్మ గారన్నట్టు మీ నాన్న గారికి నీ మీద కోపం వచ్చి వుంటుంది.’ అన్నాడు పంతులు.
‘నాన్నా... ఏంటిది... ఏమైంది. నీ కోసం అయిదొందలు ఖర్చు పెట్టి పిలిపించాను. ఇంకా ఏంటి? అన్నాడు కాకితో సోమయాజి. కామేశాన్ని చూసి ‘ఏమయింది కామేశం గారు' అడిగాడు సోమయాజి
‘మీ నాన్న గారికి తీరని కోరికలేమన్నా వున్నాయేమో’ అన్నాడు కామేశం.
‘అవునండి... మా నాన్న గారికి ఓ కోరిక వుంది. ఆయనకి సావిత్రిని పెళ్లి చేసుకోవాలని వుండేది. లవ్ లెటర్ కూడా రాసానని నాకోసారి చెప్పారు. అలా ఆయన కోరిక తీరలేదు’ అన్నాడు సోమయాజి.
‘ఆ విషయం నాకెప్పుడూ చెప్ప లేదే' అన్నారు బామ్మ గారు ఆశ్చర్యంగా.
‘బావుందమ్మా ఆయన లవ్ స్టోరీ మీకెందుకు చెబుతారు. చెబితే మట్టుకు మీరు వూరుకుంటారా... అందుకే అబ్బాయికి చెప్పి వుంటారు. ఏం సోమయాజి గారు’ అన్నాడు పంతులు.
‘నాన్నా... నీ కోరిక తీరేది కాదు. ఎందుకంటే నువ్వూ పోయావు. ఆ సావిత్రి కూడా చనిపోయింది.’ అన్నాడు సోమయాజి కాకితో
‘వాళ్ళిద్దరూ పైన కలుసుకునే వుంటారు... అది కాదు గాని ఇంకోటి ఏదయినా వుందేమో ఆలోచించండి.’ అన్నాడు కామేశం.
‘నాకు తెలిసి ఏమీ లేవు. నాన్నా నీకేమన్నా కోరికలుంటే నాకు గాని, అమ్మకి గాని కలలోకనిపించి చెప్పు తీరుస్తాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అందరూ ఆకలి తో కేకలు వేస్తున్నారు. తిను’ అన్నాడు సోమయాజి.
‘ఆ... ఈ ఎడ్జెస్ట్మెంటు బాగుంది. దోష నివారణార్ధం దక్షిణ ఇవ్వండి’ అన్నాడు కామేశం.
‘నాన్నా... కామేశం గారికి వెయ్యి రూపాయలు ఇస్తా తిను' అన్నాడు కాకితో సోమయాజి.
కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.
కామేశం తల అడ్డంగా వూపాడు.
కాకి పిండాలు ముట్టుకోలేదు.
‘దోషానికి సరిపోలేదేమో' అన్నాడు పంతులు’.
నాన్నా పదిహేను వందలు ఇస్తాను. తిను అన్నాడు సోమయాజి
కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.
కామేశం తల నిలువుగా వూపాడు.
ఆకలి మీద వున్న కాకి పిండాల్ని ఆబగా తినేసింది.
అందరూ ఆనంద పడ్డారు.
‘బామ్మా... తాతయ్య కోపం పోయిందే ... తినేసాడు' అన్నాడు రామ సోమయాజి బామ్మతో.
‘అవున్రా కన్నా’ అంది బామ్మ
‘కామేశం గారూ మీరు కూడా భోజనమే చేసి వెళ్ళండి' అన్నాడు సోమయాజి
‘అమ్మా ఇక బ్రాహ్మలకి వడ్డించండి' అన్నాడు పంతులు.
*****

బ్రాహ్మల భోజనాలు అయ్యాయి. మిగిలిన వాళ్ళు తింటున్నారు.
సోమయాజి పంతులుగారికి తాంబూలంలో అయిదువేల నూట పదహారులు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు.
‘అయ్యా మీ బోటి వాళ్ళు వుండబట్టి... ఇంకా ధర్మం నిలబడింది.’ అంటూ తీసుకుని దీవించి కాకి కమీషను యాభై ఇవ్వాలి.’ అన్నాడు పంతులు.
సోమయాజి పంతులుకి యాభై రూపాయలు ఇచ్చి,
‘కామేశం గారూ... ఇవిగో ఈ అయిదు వందలు ఈ కాకికి, ఈ పదిహేను వందలు మా నాన్న కోరికకి. ఈ రెండు వందలు మీ రాను పోను ఖర్చులు. ఈ మూడొందలు మీ సంభావన. అంటూ రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు సోమయాజి.
‘మహా ప్రసాదం’ అంటూ తీసుకున్నాడు కామేశం.
కాకిని పంజరం లో సర్దుకుంటున్నాడు కామేశం.
కామేశం ‘అయ్యా ఎవరి తద్దినాని కయినా కాకి కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి. ఇదిగో నా విజటింగు కార్డు’ అంటూ విజిటింగు కార్డు ఇచ్చాడు సోమయాజికి.
సోమయాజి చూసి చదివాడు. ‘కా కా సర్వీసెస్.’ అంటే అడిగాడు.
‘కా కా అంటే కానుపు నుంచి కాటి వరకు అంటే పురుడు, పుణ్యవచనం, బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాం, వడుగు, పెళ్లి, చావు, మాసికం, తద్దినం వరకు ఎం కావాల్నా సామానులతో సహా సప్లయి చేస్తాం.’ అన్నాడు కామేశం.
‘మీ పని బాగుందండి’ అన్నాడు సోమయాజి పదిహేను వందలూ గుర్తుకువచ్చి.
‘నాదే ముందండి... అంతా ఈ కాకిదే కాకిని నమ్ముకుని బతుకుతున్నా’. అన్నాడు కామేశం.
‘కాకిని నమ్ముకుని కాదు. కాకిని అమ్ముకుని బతుకుతున్నారు. అవునూ... కాకి కామేశం అంటే మీ ఇంటిపేరు కాకివారా? అడిగాడు సోమయాజి.
‘కాదండి బాబూ... కూటి కోసం కోటి విద్యలని మంత్రాలు రాని నాకు మా అన్నయ్య కో ఐడియా వచ్చి, ఖాళీ గా వున్న నాకు ఇలా ఓ పంజరం, నాలుగు కాకులు ఇచ్చాడు. దాంతో నాపేరు కాసుల కామేశ్వరరావు కాస్తా... కాకి కామేశంగా మారిపోయింది. అన్నాడు కామేశం.
‘బాగుందండి... బ్రతకడానికో బ్రతుకు తెరువు కావాలిగా. ఇంతకీ మీ అన్నయ్య ఎవరు? అడిగాడు సోమయాజి.
‘ఇంకెవరు... ఇంతవరకు మీ తండ్రి గారి తద్దినం పెట్టించిన ఆ కాసుల కాశీపతే’ అంటూ పంతుల్ని చూపించాడు.
‘అవునండి... వాడికి మంత్రాలు సరిగ్గా అబ్బలేదు. ఇదివరకు హైదరాబాద్ నిండా ఫుల్ గా చెట్లు వుండేవి. ఇప్పడు ఆ చెట్లు అన్నీ నరికి కాకులకి కూడా చోటు లేకుండా కనిపించిన ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టేశారు. దాంతో కాకులు వాలడానికి చెట్లెక్కడున్నాయి. ఎవడయినా పీనాసి వాడిని చూస్తే ఈ వెధవ ఎంగిలి చేత్తో కాని తోలడు... అనే వారు. అంటే కాకులు ఎంగిలి మెతుకులు తిని బతుకుతాయని కదా అర్ధం. మరి ఇప్పుడు వంటింట్లో మనం వాష్ బేసిన్ లో చెయ్యి కడగటం. దాంతో ఆ ఎంగిలి మెతుకులు కాస్తా డ్రైనేజి గోట్టాలలోకి పోయి అవికూడా వాటికి కరువయ్యాయి. దాంతో కాకులన్నీ సిటీ వదిలి పల్లెలకి పారిపోయాయి.
అందుకే తద్దినాలకి కాకులు దొరకటం లేదు. సిటీలో కాకులకి కరువొచ్చింది. కనబడకుండా పోయాయి’. అన్నాడు పంతులు.
అంతా విన్న బామ్మ గారు ‘ఇదిగో పంతులు పంజరం లో కాకిని పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు. ఇలా తద్దినాలు పెట్టించిన ప్రతీ చోట నాలుగు మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాకా... నీ పిండం తినడానికి నాలుగు కాకులయినా వస్తాయి.’ అన్నారు.
అందరూ నవ్వారు.
దాంతో పంతులు కళ్ళముందు కాకులు తిరిగాయి.

(చెట్లు నరికి ఇళ్ళూ... పెద్ద పెద్ద భవనాలు కట్టడంతో కొన్నాళ్ళకి పట్టాణాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారి సిటీల్లో ఏ పక్షులు కనబడవు. పక్షులని చూడాలంటే ఏ జూ పార్క్ కో... పచ్చదనం... పంట పోలాలు వుండే పల్లెలకో వెళ్ళాలి. అందుకని చెట్లని పెంచుదాం. పక్షులని కాపాడుదాం)
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
జీవితం
రచన:డబుర ధనలక్ష్మి


"రేయ్ నానా నీ కోసం అని చింత చిగురు పప్పు చేసి వడియాలు మజ్జిగ మిరపకాయలు వేయించా.కాస్త తిని పో నానా" అంటూ కొడుకు అవినాష్ ను బ్రతిమాలుతోంది అన్నపూర్ణ.
"తింటాను. అయితే ఒక కండీషన్. నాన్నతో  నేను బెంగుళూరుకు పోవడానికి ఒప్పిస్తేనే తింటాను . లేకపోతే ముద్ద ముట్టేది లేదంతే" అన్నాడు అవినాష్
అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న శంకర్రావు" ఏంటో తల్లీ కొడుకులు ఇద్దరూ తెగ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు .ఈ మధ్య నా కొడుక్కి నాన్న కంటే అమ్మ మీదే ప్రేమ ఎక్కువైంది అన్నాడు శంకర్రావు.
"లేదు నాన్న .
నువ్వంటేనే ఇష్టం.
నేనెప్పుడూ నాన్న బిడ్డనే  అంటూ తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు అవినాష్.
" నువ్వంటే నా ధైర్యం రా.
మా ఇద్దరి ప్రాణం నీలోనే ఉంది.
ఎదిగిన కొడుకు తండ్రికి భరోసా.
అందరూ ఏమంటున్నారో తెలుసా పాతికేళ్ళ వయసులో నేనెలా ఉన్నానో అచ్చం నువ్వు ఇప్పుడు అలానే ఉన్నావంట.
నువ్వు నా ప్రతిరూపం   నానా" అంటుండగా శంకర్రావు గుండె గర్వంగా ఉప్పొంగింది.
" మాటలతోనే కడుపు నింపుకుంటే ఎలా. కాళ్ళుచేతులు కడుక్కు రండి.భోజనం వడ్డిస్తాను.అంటూ అన్నం కూరలు వడ్డించేందుకు తయారైంది అన్నపూర్ణ.
@@@@@@
అసలే వేసవికాలం.
ఆరుబయట తలా ఒక మంచమేసుకుని  చీకటిలో ఆకాశంలో నక్షత్రాలు చూస్తు పడుకున్నారు శంకర్రావు అన్నపూర్ణ.
అవినాష్ మామిడితోట లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నామని చెప్పి వెళ్ళడంతో ఇద్దరే మిగిలారు.
" ఏం ఆలోచించారు. బాబును బెంగళూరు కు పంపే విషయం అంది అన్నపూర్ణ.
శంకర్రావు"  ఈ ఊరిలోనే ఏదైనా పని చూసుకోమంటే వాడూ వినడు .నువ్వూ వినవు. కళ్ళముందుంటాడుగా.
హాయిగా ఓ ప్రైవేటు కాలేజ్ పెట్టకోవచ్చు. కాలేజ్ పెట్టుకోవడానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. ఆ మాట తల్లీ కొడుకులు ఇద్దరూ వినరు.అన్నాడు.
అన్నపూర్ణ " ఇంజనీరింగ్ చదివినోడు .వాడి ఆశలు వేరు.
ఆశయాలు వేరు. " అంది.
శంకర్రావు. " బెంగళూరు లో ఫ్యాక్టరీ అంటే మాటలా. అంత డబ్బు ఎలా సర్దమంటావే. నేనేమైనా పెద్ద ఉద్యోగస్తుడినా. సాదా సీదా బట్టలు కుట్టే టైలర్ ని. అక్కడ కుట్టు మిషన్ పై " నా " కాళ్ళాడితేనే ఏ పూటకాపూట మన కడుపు నిండుతుంది.
ఉన్న కొద్ది పొలంలోనే ఇన్నాళ్ళు ఏ కష్టం లేకుండా బాబును చదివించి సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇక అది అమ్మితే భవిష్యత్తులో పరిస్థితులు ఎలా వస్తాయో అని నా అలోచన
ఇరవై  నాలుగేళ్ళొచ్చినా నా కొడుకు లో ఇంకా పసితనపు చేష్టలు పోలేదు.
ఎక్కడైనా పనికి కుదిరితే అంతో ఇంతో సంపాదన వస్తుంది.
అలా పనిచేయమంటే మనవాడికి చిన్నతనం గా ఉంటుందేమో అనిపిస్తాది.  నాకు కూడా వాణ్ణి పనికి పంపడానికి మనసొప్పదు" అంది
అన్నపూర్ణ" చాల్లే సంబడం. వాడే మైనా పని చేయనన్నాడా.
ఏ పనికి పంపినా ఒక్కరోజే. మరుసటి రోజుకు వాడు పనికి పోతాను నాన్నా అంటే వద్దంటావు.వాడు కష్టపడితే చూడలేవు.సిటీలో చదువుకున్నాడు.వచ్చేనెలలో వాడి స్నేహితుడు బెంగళూరు లో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడట. అందులో మనోడికి భాగస్వామ్యం ఇస్తున్నాడు. వచ్చే వారమే ప్రయాణం."
శంకర్రావు" ఉదయం చెప్పాడు. డబ్బులు కోసం కష్టపడకు నాన్నా. పెట్టుబడి నా స్నేహితునిదే. లాభాల్లో వాటా ఇస్తానన్నాడు."అన్నాడు. పొలం కూడా అమ్మవద్దన్నాడు"అన్నాడు
అన్నపూర్ణ" ఇప్పుడెళ్తే ఇక ఇప్పట్లో ఇంటికి రాడు. ఒక్కగానొక్క నలుసు. వాణ్ణి చూడకుండా ఉండడం కష్టమే"అంది.
శంకర్రావు"పిచ్చిదానా.రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవు. స్వేచ్చగా ఎగరాలి.అబ్బాయి కూడా అంతే. నీ ఏడుపుతో వాడి ఎదుగుదలకు సంకెళ్ళు వేయకు"అంటూ సున్నితంగా చెప్తున్నాడు కానీ తన కొడుకు దూరంగా వెళ్తాడంటే తనకు కూడా మనసులో దిగులే.
అవినాష్ తల్లిదండ్రుల పాదాలను మొక్కి లగేజ్ తో బతుకు వేటకు బెంగళూరుకు బయలుదేరాడు.
రెండువైపులా మది భారం.
వేళకు కడుపు నింపి ఎన్నో కబుర్లు చెప్పి బుజ్జగించే అమ్మ.
తన ఎదుగుదలకు మురిసిపోయి తన కష్టాన్నంతా కొడుకు నవ్వులో సంతోషం లో మర్చిపోయే నాన్న.
ఇంత కంటే గొప్ప ప్రేమ త్యాగం ఏ బంధం లో అయినా ఉండదేమో అనిపించగానే అవినాష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అవినాష్ బెంగళూరు చేరుకున్నాడు.
@@@@@@@

మొదట్లో అవినాష్  ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు .రాను రాను ఆ ఫోన్ మాట్లాడే సమయం కూడా తగ్గిపోయింది. నెల నెలా డబ్బు మాత్రం పంపేవాడు.
ఆరునెలల తర్వాత అవినాష్ ఫోన్ చేసి " అమ్మా కంపెనీ పని మీద దుబాయ్ వెళ్తున్నా. ఇక ఇప్పట్లో రాలేను.నువ్వు నాన్న జాగ్రత్త" అన్నాడు.
"ఒక్కసారి చూడాలిరా కన్నా.  నా కళ్ళారా నిన్ను చూసుకోవాలి. నీకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పెట్టా.  వడియాలు పెట్టా. మజ్జిగ మిరపకాయలు కూడా చేసి పెట్టుకున్నా. నువ్వొస్తే మన దేవరకు పొట్టేలు ఇద్దామని మొక్కుకున్నా. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే.
నిన్ను ఒకింటి వాడిని చెయ్యాలని ఆశ .మీ మామ కూతురు దీప్తి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొంది. నువ్వొప్పుకొంటే దీప్తితో నీ పెళ్ళి.నీకు నచ్చకపోతే మాత్రం బలవంతం చేయను.
మూడు వారాల కింద చానా చెడ్డ కల వచ్చింది. నువ్వు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు. అది కలని తెలియక ఎంతో భయపడి ఏడ్చేశా. ఒకటే గుండెదడ. నా బంగారు తండ్రికి ఏమైనా అయితే తట్టుకునేంత గుండె ధైర్యం ఈ పిచ్చి తల్లికి లేదు. ఆ రోజు నుంచి నా ఆరోగ్యం దెబ్బతింది.
నా మనసెందుకో నిన్ను చూడాలంటోంది.ఒక్కసారి వచ్చి పోరాదూ"అంది.
అవతలి వైపు కాల్ కట్ అయింది.
అన్నపూర్ణ మనసు బాధతో కదిలిపోయింది.
కాసేపటికి శంకర్రావు  తమ పొరుగింటి అబ్బాయి మొబైల్ లో అవినాష్ తో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ అన్నపూర్ణ చేతికిచ్చాడు.
అవినాష్ ను చూడగానే అన్నపూర్ణ లో సంతోషం.కొడుకుతో తృప్తిగా మాట్లాడింది.
ఆ రోజు రాత్రి అన్నపూర్ణ కు గుండెల్లో నొప్పి.ఒకటే గుండె దడ. మరునాటి ఉదయం అన్నపూర్ణ ఇక నిద్ర లేవలేదు. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది.
అన్నపూర్ణ మరణవార్త చెబుదామని ఎంత ప్రయత్నించినా శంకర్రావుకు అవినాష్ ఫోన్ కలవలేదు. ఎంత‌ ప్రయత్నించినా అవినాష్ అడ్రస్ కూడా దొరకలేదు.ఇక సమయం లేక శంకర్రావు తమ్ముడి కొడుకు చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి.
శంకర్రావు లో ఆశ్చర్యం.బాధ.
తన కొడుకు ఎందుకిలా చేశాడు.
ఎందుకిలా మారిపోయాడు.
అన్నపూర్ణ ను ఆఖరి చూపు గా చూసుకోలేక పోయాడు.
ఈ బాధ కాలం గడిచే కొద్దీ అవినాష్ పట్ల అసహ్యం లా మారింది.
కనీసం ఫోన్  కు కూడా దొరకట్లేదు.నెల నెలా డబ్బు మాత్రం పంపిస్తున్నాడు.ఇక ఆ డబ్బు కూడా తాకకూడదు అనుకున్నాడు.
అయినా ఎలాగోలా అవినాష్ అడ్రస్ సంపాదించాడు. "వాడు పంపిన డబ్బు వాడి మొహాన కొడతాను. "అనుకుంటూ బెంగళూరు కు వెళ్ళి ఫ్యాక్టరీ లో అడుగుపెట్టాడు. ఆఫీస్ లోకి వెళ్ళి అవినాష్ క్యాబిన్ లోకి వెళ్ళి కొడుకుని చూడగానే కుప్పకూలి పోయాడు శంకర్రావు.
కారణం అవినాష్ వీల్ చైర్ లో ఉన్నాడు.అవినాష్ కు మోకాళ్ళ వరకు రెండు కాళ్ళు లేవు.
ఇక శంకర్రావు ను ఆపడం అవినాష్ వల్ల కావడం లేదు.
శంకర్రావు గుండె చెరువైంది.కన్నీరు మున్నీరు గా తలకొట్టుకుంటు ఏడుస్తున్నాడు.
అవినాష్ " నాన్నా.ఏడవద్దు. నాకు మనవూరి నుండి వచ్చిన నెలకే ఆక్సిడెంట్ జరిగింది.అతి కష్టం మీద బతికా.ప్రమాదంలో కాళ్ళు నుజ్జయి తీసేసారు.
ఈ విషయం మీకు తెలియకూడదనే చెప్పలేదు.
ఎంతో ప్రేమించే మీరు నన్ను ఇలా చూస్తే తట్టుకోలేరు.  అందుకే మీ ముందుకు రాలేకపోయా
అమ్మ చాలా గుర్తొస్తోంది నాన్నా.  నా పరిస్థితి బాగుంటే నెలకో రెణ్ణెళ్ళకో ఓసారి మీకు ఎదురుగా వచ్చే వాణ్ణి.
నేను రాకపోవడమనే ఆలోచనే అమ్మ మనసును శరీరాన్ని
బలహీనం చేసింది. అమ్మ మనకు దూరమైంది. అమ్మ గుర్తుకు రాని రోజంటూ లేదు నాన్న. ఇక నన్ను వదిలి వెళ్ళకు నాన్నా
"అంటూ కన్నీటితో తండ్రిని హత్తుకున్నాడు అవినాష్.
జరగాల్సింది జరిగిపోయింది.విధిరాత.
ఎవరూ మార్చలేరు. అనుకుంటూ తండ్రీకొడుకులు మామూలు జీవితానికి అలవాటు పడ్డారు.  దీప అవినాష్ తో పెళ్ళికి ఒప్పుకోలేదు.
కృత్రిమ పాదాలతో అవినాష్ జీవితం మళ్ళీ మొదలైంది.  తన స్నేహితుని చెల్లికి తనలాగే రెండు కాళ్ళు లేవు. అమ్మాయి చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది.పైగా అవినాష్ ను ఇష్టపడుతోంది. ఇద్దరికీ పెళ్ళి కుదిరింది. శంకర్రావు ఇక అవినాష్ తోనే ఉండిపోయాడు.
జీవితం మళ్ళీ మొదలైంది.మూడు సంవత్సరాల తర్వాత  ఆ ఇంట్లో పుట్టిన చిన్నారి కీ "అన్నపూర్ణ" అని పేరు పెట్టుకున్నారు.
జీవితం లో సమస్యలు రాకూడదని ఆ భగవంతుని మొక్క కూడదేమో.
ఎలాంటి కష్టం ఎదురైనా తట్టుకుని నిలబడి ముందుకు సాగేలా ఆత్మవిశ్వాసం ను ఇవ్వమని ప్రార్థించాలి
జీవితాన్ని ఎంతలానో ఉన్నతంగా ఊహించుకుంటాం.ఒక్కోసారి అనుకోని అవాంతరాలతో చతికిలపడతాం. ఓడిపోతాం.
అసలు ధైర్యం అప్పుడే మనకు అవసరం.
ఇప్పట్లో ఎన్నో ఆత్మహత్య లు చూస్తున్నాం.వింటున్నాం.
చిన్న జీవితం.ఏదో ఒకరోజు చావు మనల్ని వెదుక్కుంటూ వస్తుంది.
సమస్యలకు భయపడో ఇంకే కారణాల వల్లనో మనం చావును వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు.
ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవితాన్ని మలచుకోవడమే ఉత్తమం.

సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#23
ఆస్తి 


వాళ్లిద్దరూ మంచి స్నేహితులు..
పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు..ఒకరు గోవింద్ ..ఇంకొకరు శ్రీనాథ్..
ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ కాలేజ్ టీచర్.
శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం... ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది...
జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు..
పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో...
గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?
ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధ పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు..
ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు... వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  
శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దాన ధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపద ను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి...  లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు.
ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...  లక్ష్మి కి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..??
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...
అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..
ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..
స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...
ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..
వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు కాలేజీ టీచర్ గా చేరి ఇప్పుడు ఒక కాలేజ్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..
రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..
ఆ రోజు మామూలు గా కాలేజ్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..
సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా కాలేజ్ కి వచ్చారు.
శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.
సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.
తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు కాలేజ్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...
సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..
అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ కాలేజ్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది...
ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..
ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..
మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..
పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...
ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు...
కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది సెక్యూరిటీ ఆఫీసర్లు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు..
జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు,
మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..
నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..
పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.
ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు...
అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే...
శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..
చివరగా గోవింద్ మాట్లాడాడు..
పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.
నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..
పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును..
ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...
ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...
భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....

నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .
శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను..
సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..
ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  అస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా...

????
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#24
ఉచిత_సలహా

ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,
"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .
"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.
"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.
"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు
నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#25
దధీచి త్యాగం
                  
స్వార్ధ బుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు ఆఖరికి అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని, నిస్వార్థంతో చేసిన స్వల్ప దానమైనా పది కాలాలపాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణ మహాబల సంపన్నుడైన వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు. వృత్రాసురుడు మహా భయంకరాకారంగల, మహా శక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతల పైన ద్వేషంతో తపస్సు చేసి కనీవినీ ఎరుగని విధంగా తయారైన కొత్త ఆయుధం, అది ఏ విధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరి ఏది తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజ సిద్ధమైన రాక్షస బలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగే వారెవరు లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అది చాలదన్నట్లు దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటబెట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. అత్యంత బలమైన, పొడవైన ఎముకలతో, అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. ఏనుగు, సింహం,పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయి అనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు."మీ ఆలోచన సరైనది కాదు. బలంతో పాటు తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి.భృగు మహర్షి కుమారుడు మహాతత్వ సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని దేవశిల్పి, దేవ గురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని" మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి.దేవేంద్రుడు దేవ గురువైన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకొని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసి సంతోషంతో అతిథి మర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్థంకాక సతమతం అవుతుండగా దధీచి మహర్షి వారిని గుచ్చి గుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు. ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెలిపాడు. అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు.లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి అవయవదానానికి ఆద్యుడయ్యాడు.అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైనదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#26
కథలు చాల బాగున్నాయి సర్, ఇంకా పోస్ట్ చేయగలరు
Like Reply
#27
శంకర నారాయణ డిక్షనరి కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ళ ముందు) తయారు చేశాడు.
చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్ళు ముక్కస్య ముక్కానువాదం చేసేవారు.
గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..
పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని
తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.
అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.
తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!
ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.
పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#28
వన్ సైడ్ లవ్

అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీసుకి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది.
‘రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండూ’ అనుకున్నాడు.
టైం ఎనిమిది దాటింది. తొమ్మిది గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. బెడ్ పక్కకు ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్వెజ్ ఎముకలూ చిందరవందరగా పడున్నాయి.
‘నా కొడుకులు తాగడం, వెళ్ళిపోవడం! ఇదంతా ఎవడు సర్దుతారు?’ అనుకున్నాడు.
తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురూ కలిసి శ్రీధర్ రూమ్ లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలు పెట్టాడు.
శ్రీధర్ కి ముప్పైమూడేళ్లు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడూ ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం. పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు.
కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్లైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయినీ చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీసుకి వెళ్ళడం, ఇంటికి రావడం, టి.వి చూడటం, మొబైల్ ఫోన్ తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడం, నెల జీతం రాగానే సగంజీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చుపెట్టుకోవడం - కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్ గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్ గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయీ నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు.

ఆఫీసుకి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్ గా అనిపించింది. ఇన్నిరోజులూ బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా, ఇంకేమార్పూ తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీస్, ఇల్లు - ఇల్లు, ఆఫీసు ఇంతేనా? ఎందుకో ఆఫీసుకి వెళ్ళబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడుకి తీసుకుని హెచ్ఆర్ కి కాల్ చేసి ఆరోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీకొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీకొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీపట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లాఫస్ట్ వచ్చాడు. అదే బి.టెక్ లో కూడా కంటిన్యూ అయ్యింది.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#29
తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాగ్జిమమ్ మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చినవాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూసాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు కానీ చిన్నప్పటినుండి అలావాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేసారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీం గర్ల్.

శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రావర్ట్ గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తనవల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు, దూరంనుండి చూసి సంతోషపడడం తప్ప. తన చదువు, తన పుస్తకాలు - అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండూ అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు చాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంక ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు.ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్ధమైంది.‘ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది’ అని బాధపడ్డాడు.

కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది, వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేసాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది.‘ఇంకా ఎన్ని రోజులు ఇలా... ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి. అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి’ అని నిర్ణయించుకున్నాడు.వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#30
అమ్మాయి బాగా చదువుకుంది. అందంగానే ఉంది. మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయనాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంతమంచి సంబంధం ఇంక దొరకదని చాలామంది చెప్పారు. ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి.

అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బి.టెక్ లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గానీ దగ్గరికెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు.
ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు.
“హాయ్! మీరు నన్ను గుర్తుపట్టారా?” అంది నవ్వుతూ.
“ఆ... ఆ...” అన్నాడు అయోమయంగా.
“ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ, యాక్చువల్ గా నేను బి.టెక్ లో మీ జూనియర్ ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేసాను. కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేదు” చెప్పుకుంటూ పోతుంది కీర్తన.
శ్రీధర్ కి అది కలో నిజమో అర్ధం కావట్లేదు.
‘ఛా... అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో..., అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో?’ అని తనను తానే తిట్టుకున్నాడు.
“ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్ గా అనిపించింది. అందులోనూ మన టీమ్ కి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా...” కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది.
“ఆ.. గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను” అన్నాడు శ్రీధర్ చిన్నగా.
“హమ్మయ్య ఇంక నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా, ఈ ఎన్విరాన్మెంట్ కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీమ్ లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులెండి. ఇంకా..., ఎలా ఉన్నారు?”
కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె మొఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు.
“ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు..., మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసానా?” అంది కీర్తన.
“ఆ..., అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి... కాఫీ?” నసిగాడు శ్రీధర్.
“హ్మ్.. కోల్డ్ కాఫీ”
శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#31
“హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ..., ఐ మీన్ యువర్ హజ్బెండ్, చిల్డ్రన్...” శ్రీధర్ మెల్లిగా అడిగాడు.
ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్ గా అయిపొయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది, “ఐ యాం డివోర్స్డ్, పిల్లలు లేరు”
అంతసేపూ ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్ కి ఏం అనాలో అర్ధం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చెయ్యాలనిపించలేదు. కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చెయ్యకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తననని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూసాడు. కీర్తన అప్పటికే అక్కడినుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది.

ఆరోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటిరోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆరోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్ కి వెళ్లి బైక్ స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంక లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీసాడు. ఇంతలో వెనకనుండి కీర్తన వచ్చి, “ఎనీ ప్రాబ్లం?” అంది.
“అవునండీ..., బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్ కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు” అన్నాడు శ్రీధర్.
“పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా..., అంటే..., నిన్న చూసాను”
“అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా..., మీకెందుకు అనవసరంగా శ్రమ”
“నాకేం శ్రమ లేదు. దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే”
“నాకేం ఇబ్బంది లేదు. మీకే ఇబ్బందేమో అని”
“నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులెండి”
“అయితే పదండి” అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్.
చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ - నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు - అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సప్ మెస్సేజ్ వచ్చింది.
“వేర్ ఆర్ యూ?”
“ఆన్ ది వే టు హోమ్” రిప్లై ఇచ్చాడు.
“వై లేట్?”
“హెవీ ఆఫీస్ వర్క్”
“ఆర్ యూ నాట్ డ్రైవింగ్?”
“యా మై బైక్ గాట్ ట్రబుల్”
“ఓహ్! ఇన్ క్యాబ్ ఆ?”
శ్రీధర్ కి ఇంక చాట్ చెయ్యాలనిపించలేదు.
“యా... మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో, కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్” అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేసాడు.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#32
కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.
“ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు?” అంది కీర్తన.
“ఆ... ఫ్రెండుతో”
“ఓహ్! అవునూ, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది” అంది కీర్తన.
“అంటే..., నాకింకా పెళ్లి కాలేదు” నసిగాడు శ్రీధర్.
“వాట్ ఇంకా పెళ్లి కాలేదా?”
“అదేంటండీ ఏదో తప్పు చేసాను అన్నట్లు అలా అన్నారు?”
“ఓహ్! సారీ జెనరల్గా ఈ ఏజ్ వరకూ అందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉంటారు కదా. అందుకే అలా అన్నా”
“అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే”
“మరెప్పుడు చేసుకుంటారు?”
“ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి”
“హే! కంగ్రాట్స్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చెయ్యాలి”
“ఆ.. అలాగే”
“నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుండి ఇలా అలవాటయిపోయింది లెండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు”
శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి, “నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా?” అన్నాడు.
“ఆ....”
“మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి” మొహమాటపడుతూ అన్నాడు.
“.... ఇబ్బందేం లేదులే. ఈపాటికి చాలా మందికే చెప్పాన్లే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేసారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేసారు ఇంకేం చేస్తాం”
“అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే..., పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా?”
“పెద్ద ప్రాబ్లం కాదా!? ఇవాళా రేపు ఎంత సిల్లీ రీజన్స్ కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే”
“అయినా మీ హజ్బెండ్ కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది”
“లవ్వా...” నవ్వింది.
“ఏమైంది?”
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#33
“లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేసారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేసారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టి.వి, ఏసి లాగ నేను కూడా ఒక వస్తువునే తనకి” బైక్ వేగం పెంచింది తను.
‘ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ’ అనుకున్నాడు మనసులో. ‘ఎంతోమంది కలల రాణిని, ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో తెలియదు’ ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది.
శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, “ఇక్కడ సైడుకి ఆపండి” అన్నాడు.
బైక్ దిగి థాంక్స్ చెప్పాడు.
“సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా?” నవ్వుతూ అంది కీర్తన.
“అదేం లేదు” అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ.
స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు.
“ఓకే బై, గుడ్ నైట్” బైక్ రివర్స్ చేస్తూ అంది తను.
“గుడ్ నైట్” కీర్తన వెళ్లిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు.
రాత్రంతా శ్రీధర్ కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.
‘ఇదేంటి తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరక్టేనా? అందరూ ఏం అనుకుంటారు? అందరి గురించి వదిలేసినా, దీప్తికి తెలిస్తే తన గురించి ఏం అనుకుంటుంది?’ ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
రోజులు గడుస్తున్నకొద్దీ శ్రీధర్ కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్దిచెప్పుకుందాం అనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీసుకి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధ పడాల్సివస్తుందని నిర్ణయించుకున్నాడు.
***
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#34
ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్ధం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. రెండు పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంట గదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటి పై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్ లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావొద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీసాడు.
కీర్తన అతని వైపు చూసి, “ఏం చేస్తున్నావ్?” అంది.
“ఏం లేదు నా ఏంజెల్ ని ఫోటో తీస్తున్నా” అన్నాడు శ్రీధర్.
“అబ్బో...” అంది తను టమాటాలు తరుగుతూ.
వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు.
“ఏంటండీ ఇదీ...” అంది ఆమె ఇబ్బంది పడుతూ.
“ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా?” అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
“ముందు ఎవరొచ్చారో చూసి రండి” అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది.
“లోపలికి రావొచ్చా...” అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు.
“ప్లీజ్ కమిన్” అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్.
కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది.
“తిను సురేష్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి” అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి.
“ఓహ్! కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం” అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
“దీప్తి చాలా మంచమ్మాయి కదండీ..., నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది” అంది కీర్తన.
“అవును” అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తుతెచ్చుకుంటూ.
***
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#35
పెళ్లి పదిరోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయైతే ఎంత రచ్చ చేసేదో తెలీదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్ధం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు.

ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్లవరకూ కొని క్యాబ్ లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్ తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబిఎ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్ కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ జెనరేషన్లో కూడా ఉంటారని అర్ధమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది.
“ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా?” అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి.
“లేదు” అన్నాడు శ్రీధర్.
“ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా?”
“ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది”
“ఆమె ఒప్పుకోకపోతే?”
“అదంతా నేను ఆలోచించలేదు” ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్.
“అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను” అంది దీప్తి కొంచెం గట్టిగా.
శ్రీధర్ భయంతో, “ఎందుకు?” అన్నాడు.
“ఎందుకో తర్వాత చెప్తా..., ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా?” అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు.

అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని, ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తీనే కాలేజీ రోజులనుంచి జరిగిందంతా కీర్తనకి అర్ధమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#36
“ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది?” అంది దీప్తి.
“కానీ నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా” అంది కీర్తన బాధ పడుతూ.
“పిల్లలు కాకపొతే ఏం? నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. లేదా వేరే విధంగా ట్రై చెయ్యండి తప్పేం లేదు” అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకుని.
కీర్తన కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్.
“నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?” అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి.
కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని, “కీర్తనా..., నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటా” అప్రయత్నంగా మాట్లాడేసాడు.
దీప్తి కీర్తన వైపు తిరిగి, “ఒక ఆడదాని మనసు ఆడదే అర్ధం చేసుకుంటుంది అంటారు. కానీ మగాడి మనసు కూడా ఆడది అర్ధం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చెయ్యడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్. ఆలోచించుకో” అంటూ లేచి “ఆల్ ద బెస్ట్” అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్ తో పెళ్ళికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకుతెచ్చుకున్న శ్రీధర్ దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, “ఇందాక ఎక్కడో ఆపాం” అంటూ కీర్తనని వాటేసుకున్నాడు.

***
కథా రచయిత వరుణ్ రావలకొల్లు
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#37
Nice super
Like Reply
#38
New stores రాయాలి ఆంటీ ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా uploud చేయాలి
Like Reply
#39
స్వప్నిక(ఒక వేశ్య కథ)
రచయిత: సత్య పవన్

ఆ రోజు ఆదివారం,అర్ధరాత్రి దాదాపు 11.30 గంటల కి పంజాగుట్ట పోలిస్ స్టేషన్ కి ఒక గుర్తుతెలియని వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది.
"హలో..సార్!
పంజాగుట్ట సెక్యూరిటీ అధికారి స్టేషనా..?"
"హా .. అవునయ్యా.. మీకు ఏ హెల్ప్ కావాలి!(కాల్ లిఫ్ట్ చేసిన ఓ సెక్యూరిటీ అధికారి అధికారి అన్నాడు)"
ఇక్కడ ఫలాన ఏరియా లో ఒక ఇంట్లో కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు సార్..!" అది ఆ ఫోన్ కాల్ సారాంశం.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆఫీసర్ యంత్రాంగం, హుటాహుటిన ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన అడ్రస్ కి చేరుకున్నారు.
వాళ్ళ రైడ్ లో భాగంగా, అక్కడ ఒక నిర్వాహకురాలు, ముగ్గురు విటులతో పాటు ఓ పాతికేళ్ల యువతి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లకి పట్టుబడ్డారు.
కొద్దిసేపటికే నిర్వాకురాలు, ముగ్గురు విటులు తమ తమ పలుకుబడి ఉపయోగించి ఎలాగోలా బెయిల్ పై బయట పడ్డారు. ఆ యువతిని మాత్రం
అక్కడే వదిలేశారు.
సాయం చే సేవాళ్ళు లేక, తను మాత్రం అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఆ రాత్రికి. దాంతో అక్కడ నైట్ డ్యూటీలోనున్న ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ యువతిని అనరాని మాటలు అని తనని దూషిస్తాడు.
చివరికి, ఆ యువతిది మొదటి తప్పుగా పరిగణించి, వాళ్ళ(సెక్యూరిటీ ఆఫీసర్ వారి) రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసి తెల్లారి ఉదయానికి తనని విడిచి పెడతాడు.
"ఇంకోసారి ఇలా తప్పు చేస్తూ దొరికావో...".అంటూ వెళ్ళిపోబోతున్న తనకి ఓ వార్నింగ్ ఇస్తాడు.
***
సరిగా నాలుగు వారాలా తర్వాత,అదే సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి అదే టైం కి (కొంచెం అటు ఇటు గా)మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది.
ఈ సారి కూడా అదే విషయం, "ఫలానా చోట కొంతమంది వ్యభిచారం నడిపిస్తున్నారని"
అంతకుముందు జరిగిన తరహాలోనే మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్లు తమ రైడ్
కొనసాగించారు..
ఈ సారి కూడా ఒక నిర్వాహకురాలు, నలుగురు విటులను, ఒక యువతిని పట్టుకున్నారు ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు.
ఈ సారి పట్టుబడిన నిర్వాహకురాలు, విటులవి కొత్త మొహాలు. కానీ, ఆ యువతి మాత్రం అంతకుముందు ఆవిడే!
అంతకుమునుపు వాళ్ళలానే... ఆ నిర్వాహకురాలు, విటులు బయట పడ్డారు.. కానీ,ఆ యువతిని మాత్రం బయటకి తీసుకొచ్చే వాళ్ళు లేరు.
తను మొదటి సారి దొరికినపుడు ఏ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడో..ఆరోజు కూడా అతనిదే డ్యూటీ,అప్పటికే పట్టరాని కోపంతో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఆ యువతిని చూసి తిట్టడం మొదలెట్టాడు.
"ఏ...మే..!
మొన్ననే కదే నీకు వార్నింగ్ ఇచ్చాను.
లం***!
బో** మొహం దానా...!
అయినా, ఏంటే..!ఈసారి ఇంకొకడిని అదనంగా పెంచావ్.
ఈ పని తప్ప మీకేం..వేరే పనంటూ ఉండదా...?
ఎంత మంది కాపురాలు కూలుస్తారే మీరు..?
తప్పు తనదే అవ్వడంతో ఆ యువతి ఏమి అనలేక,ముసుగు తగిలించుకున్న మొహంతో, బిత్తర చూపులు చూస్తూ అలానే ఉండిపోతుంది.
చివరికి మరుసటి రోజు సాయంత్రం వరకూ తనని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోయే సరికి, మళ్ళీ రికార్డ్స్ లో పేరు రాయించి విడిచి పెడతాడు ఆ రోజు డ్యూటీ లోనున్న మరొక సెక్యూరిటీ ఆఫీసర్ సలహాతో.
"ఏదైనా మంచి పని చేసుకుని, శుభ్రంగా బ్రతకండే...
సాటి ఆడదాని ఉసురు పోసుకుని సంపాదించే డబ్బుతో ఆ నాలుగు వేళ్ళు మీకు నోట్లోకి ఎలా వెళ్తాయే అసలు మీల్లాంటోల్లకి!."అంటూ తన కోపాన్ని ఆ యువతి పై ప్రదర్శిస్తాడు.
"ఇంకోక్కసారి ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ దొరికావో.. ఈ సారి కేసు బుక్ చేయించి కటకటాల వెనక్కి నెట్టేస్తా..!"
చమడాలు వలిచేస్తా... తస్మాత్ జాగ్రత..!"
అంటూ వార్నింగ్ ఇస్తాడు తనకి.
***
ఇది జరిగిన సరిగా మూడు వారాల తర్వాత, మళ్ళీ అదే స్టేషన్ కి వేరే ఫోన్ కాల్ వస్తుంది. మళ్ళీ అదే విషయం, "ఫలానా చోట కొంతమంది వ్యభిచారం నడిపిస్తున్నారని"
యధావిధిగానే, సెక్యూరిటీ ఆఫీసర్లు తమ రైడ్ లు కొనసాగించారు.
ఈ సారి కూడా ఒక నిర్వాహకురాలు, ఐదుగురు విటులను, ఒక యువతిని పట్టుకున్నారు.
ఈసారి కూడా నిర్వాహకురాలు, విటులు కొత్తవాళ్లే,
యువతి మాత్రం ఇంతకుమునుపు రెండుసార్లు పట్టుబడిన ఆవిడ!
ఎప్పటిలానే నిర్వాహకురాలు, విటులు తమ తమ పలుకుబడి ఉపయోగించి బయట పడతారు..
కానీ, ఆ యువతి మళ్ళీ బలైపోతుంది.
నైట్ డ్యూటీ కి వచ్చిన అదే సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి, ఈ సారి కూడా తనని చూస్తాడు.
తన కోపం కట్టలు తెంచుకుంటోంది.
"ఎన్నిసార్లు చెప్పాలే నీకు, మొన్న ముగ్గురు, తర్వాత నలుగురు, ఇప్పుడు అయిదుగురు.
చీరలు మార్చినంత తేలికగా ఎప్పటికప్పుడు నీ రంకు మొగుళ్లను మార్చుకుంటూ పోతున్నావ్...
ఎంతమందితో పడుకుంటావే రోజుకి ?
అసలు ఎన్నిసార్లు చెప్పాలే నీకు.. సిగ్గూ లజ్జా లేని లం***
అంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి లాకప్ లో పడేస్తాడు."
ఏమి చేయలేక, దీనస్థితిలో ఏడుస్తూ ఉండిపోతుంది ఆ యువతి.
అది చూసిన మరొక సెక్యూరిటీ ఆఫీసర్,
"ఎందుకే ఆ ఏడుపు..!,
పది మందితో కలిసి పడుకుని, వాళ్ళతో సుఖం పొందుతూ పైసలు సంపాదించినపుడనిపించలేదా నీకు?
ఆఖరికి కాళ్ళు,చేతులు లేనివాళ్లు కూడా... ఏదోక పని చేసుకుని బ్రతుకుతున్నారు.లేకుంటే,అడక్కు తిని అయినా తమ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.
మీరేంటే..! ఇలా ఒళ్ళమ్ముకుని బ్రతుకుతారు.
ఇలాంటి బ్రతుకు బ్రతకడానికి సిగ్గు లేదూ...?"
"అయినా.. నీ లాంటి లం** ముం** కి నీతులు చెప్పి, పోనీలే పాపమని రెండు సార్లు వదిలి తప్పు చేసాం.మాది బుద్ధి తక్కువ!.
తు...! నీ అవ్వ!
ఏం బ్రతుకే, దేంట్లో అయినా దూకి చావడం మేలు కదే.."
అంటూ ఇంకొక లేడీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్...
ఈసారి కూడా దీన్ని వదిలేస్తే, ఇది మళ్ళీ ఇంకెంతమంది కాపురాలు కూలుస్తాదో...
అంటూ ఇంకో పోలీసాయన..
అలా.. ఆ యువతిని పట్టుకుని నోటికొచ్చినట్టు, ఇష్టమొచ్చినట్టు దుర్భషలాడారు అక్కడున్న ఆ సెక్యూరిటీ ఆఫీసర్లంతా.
*****
మరుసటి రోజు ఉదయం,
సడెన్ విజిటింగ్ లో భాగంగా ఆ స్టేషన్ కి ఓ డీజీపీ వస్తారు. అక్కడున్న ఖైదీల వివరాలు ఒక్కొక్కటిగా అడుగుతూ... అందరినీ పరిశీలిస్తూ ఉంటారు.
ఆ సమయంలోనే అంతకముందు రాత్రి రైడింగ్ లో పట్టుబడిన ఆ యువతి తన కంట పడుతుంది.
ముసుగుండడం వల్ల తన మొహం ఆ డీజీపీ కి కనిపించదు.
ఆ యువతి ఒకత్తి తప్ప, ఇంకే మహిళా నేరస్తురాలు ఆ స్టేషన్లో లేకపోవడం గమినించిన ఆ డీజీపీ ...
"ఎవరావిడ..?
తనని ఏ కారణం పై అరెస్ట్ చేశారు.?"
అంటూ అక్కడున్న సెక్యూరిటీ అధికారి అధికారులని ప్రశ్నిస్తాడు.
రికార్డ్స్ లో తన పేరు "స్వప్నిక" అని ఉండడంతో..
" పేరు స్వప్నిక అని, వ్యభిచారం చేసిన నేరంలో తనని అరెస్ట్ చేశామని ఓ లేడీ సెక్యూరిటీ అధికారి చెప్పుకొచ్చింది."
స్వప్నిక అన్న పేరు విన్న డీజీపీ,
ఆ పేరు ఇదివరకెక్కడో ఓ గొప్ప సందర్భంలో విన్నట్టనిపిస్తుంది."ఆ ఆడపిల్ల ఒక్కరే తనకి తాను గా వ్యభిచారం చేసుకుందా ?
మిగితావాళ్లు ఎక్కడ?"
అని గంభీరంగా ప్రశ్నిస్తాడు ఆ డీజీపీ అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులను.
దానికి బదులుగా అక్కడున్న సెక్యూరిటీ ఒకరు మధ్యలో కలుగజేసుకుని,
"వాళ్ళు మొదటి సారి చేసిన తప్పుగా పరిగణించి బెయిల్ పై వదిలేసాము
సార్....
ఈవిడ ఇది మూడోసారి ఆ కేసు లో దొరకడం.
ఇంతకుముందు సర్ది చెప్పి రెండు సార్లు వదిలేసినా... ఇది దీని బుద్ధి మాత్రం మార్చుకోలేదు..." అని అంటుండగా
ఆ మాటలకు...వాటిని ఇక ఆపమన్నట్టు తన చెయ్యి అడ్డం పెట్టీ
స్వప్నికను తన దగ్గరకి పిలుస్తాడు ఆ డీజీపీ...
"చూడమ్మా... స్వప్నిక!
ఇలా చేయడం తప్పమ్మా..!
చూస్తుంటే చదువుకున్న దానిలా కనిపిస్తున్నావ్..!
ఇదంతా రేపు ఏ టీవీ లొనో, లేక న్యూస్ లోనో వచ్చి నీ తల్లిదండ్రులకి తెలిస్తే 
వాళ్లు ఏమైపోతారో ఒకసారి ఆలోచించావా?
డబ్బే కావాలనుకుంటే, సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి.
వెళ్ళు ...
ఇకనైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండు" అంటూ తనకి హితవు పలికాడు.
"సృష్టికి మూలమైన ఆడవాళ్ళని కటకటాల పాలు చేయడం సమాజహితం కాదని భావించి" తనని విడిచి పెట్టవల్సింది గా తన కింద అధికారులకి ఆదేశాలు ఇస్తారు.
దానికి కృతజ్ఞతగా "థ.. థ.. థాంక్స్ సర్!" (కొంచెం బెరుకైన స్వరంతో) అంటూ చెప్తూ వెళ్ళిపోతున్న స్వప్నిక, వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంటుంది ఆ డీజీపీ
కి.
వెంటనే, తేరుకున్న ఆ డీజీపీ!
"excuse me, ఒకసారి ఆగమ్మా..!" అంటూ తనని ఆపి, వెనకకు తిరిగి, తన మొహానికున్న ఆ ముసుగు తియ్యమంటారు.
అందుకు ఆమె నిరాకరిస్తుంది.
దాంతో, అక్కడున్న సెక్యూరిటీ అధికారి వాళ్ళలో ఒకరు..
"సార్.. అడుగుతుంటే!
ఎంత పొగరు నీకు,
ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళ పై, జాలి చూపిస్తే ఇలానే నెత్తినెక్కి కూర్చుంటారు సార్..!" అని అంటాడు (కొంచెం అతిగా ప్రవర్తిస్తూ..)
"హుం...ఇక చాళ్లే ఆపు" అంటాడు డీజీపీ సార్ భీంకరంగా.
ఇంతలో మొహమాటంగానే ముసుగు తీసిన ఆ స్వప్నిక, తను చేసిన తప్పుకు సిగ్గుతో తల దించుకుని నేల చూపులు చూస్తుండిపోతుంది.
తన మొహాన్ని చూసిన ఆ డీజీపీకి, తనని ఎక్కడో చూసినట్టనిపించి....
నువ్వు..! నువ్వు...!!
అంటూ తన దగ్గరకి వస్తాడు.
అప్పటికే, భయం.. భయంతోనున్న స్వప్నిక ఆయనికి దూరం జరుగుతుంది.
"ఏం భయపడకమ్మా..!" అని డీజీపీ స్వప్నిక కి దైర్యం చెప్పే ప్రయత్నంలో ఉంటుంటే,
"అదంతా నటన సార్...!" అంటూ ఒక సెక్యూరిటీ అధికారి అధికారి స్వప్నికని చూస్తూ
వెటకారించాడు.
దాంతో కోపోద్రిక్తుడైన ఆ డీజీపీ,
"Just shut up..."అంటూ ఆ సెక్యూరిటీ అధికారి అధికారి నోరు మూయిస్తాడు.
చివరికి తను ఎవరో గుర్తుపట్టిన డీజీపీ,
"పద.." అంటూ తనతో పాటే తన కార్లో అక్కడి నుండి తీసుకెళ్లి పోయాడు స్వప్నికని."
అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లతో  ఇదంతా అర్ధం కావడం లేదు కదూ!
స్వప్నిక ఎవరూ....?
ఆ డీజీపీ కి తను ఎలా తెలుసు?
అసలు తనని ఆ డీజీపీ ఎక్కడికి తీసుకెళ్ళాడు?
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#40
Last story is completed? Pl update
Like Reply




Users browsing this thread: