06-06-2023, 06:49 PM
గుడ్...గుడ్. కథ ఇప్పుడేఅ రసకందాయంలో పడుతోందన్నమాట. అన్నట్లు ఇలా మోసం చేసేవాళ్ళను ఒకాట ఆడుకుంటే బావుంటుందేమో...కనీసం ఊహలలోనన్నా.
: :ఉదయ్
"పార్ట్నర్"
|
06-06-2023, 06:49 PM
గుడ్...గుడ్. కథ ఇప్పుడేఅ రసకందాయంలో పడుతోందన్నమాట. అన్నట్లు ఇలా మోసం చేసేవాళ్ళను ఒకాట ఆడుకుంటే బావుంటుందేమో...కనీసం ఊహలలోనన్నా.
: :ఉదయ్
06-06-2023, 06:50 PM
Nice super update
06-06-2023, 10:26 PM
అప్డేట్ బాగుంది
07-06-2023, 12:26 AM
(06-06-2023, 06:49 PM)Uday Wrote: గుడ్...గుడ్. కథ ఇప్పుడేఅ రసకందాయంలో పడుతోందన్నమాట. అన్నట్లు ఇలా మోసం చేసేవాళ్ళను ఒకాట ఆడుకుంటే బావుంటుందేమో...కనీసం ఊహలలోనన్నా. ఇంకా పడలేదు. ఇంకో రెండు, మూడు భాగాల తరువాత పడుతుంది. అలానే ఇది మోసగాళ్ళు, అమాయకులు, ఇలాంటి కథ కాదు. మనస్తత్వాల కథ. ముందుకి పోతోంది అనుకున్నట్టే.
07-06-2023, 12:30 AM
ఆటో బార్ ముందు ఆగింది. పెద్ద బార్ అది. అంత పెద్ద బార్లోకి తనని రానిస్తారా అని అనుమానంగానే ఉంది శీనుకి.
లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఎదురయ్యాడు ఒక వెయిటర్. "నా పేరు శీను, ప్రైవేట్ రూం పార్టీ" అన్నాడు నెమ్మదిగా. "రండి, సార్ చెప్పారు, మీరొస్తారని"... అంటూ లోపలికి తీసుకెళ్ళాడు వెయిటర్. లోపలంతా చల్లగా ఉంది. చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇలాంటి చోట ఉన్నాడంటే మధు దగ్గర బాగా డబ్బులున్నట్టే, ఉన్న స్థితి గురించి చెప్పుకుని, చేతులు పట్టుకుంటే మధు ఆదుకుంటాడు అనుకున్నాడు శీను. రూం తలుపు తీసి శీనుని లోపలికి పంపించి వెళ్ళిపోయాడు వెయిటర్. లోపలికెళ్ళాడు శీను. లోపలంతా లైట్లతో బ్రహ్మాండంగా ఉంది. ఎదురుగా పెద్ద సోఫా మీద ఉన్నాడు మధు. శీనుని చూడాగానే నవ్వుతూ రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. చిన్నప్పుడు తెలిసిన మనిషయినా, కలిసి ఏళ్ళు గడవడంతో కొత్తగానే ఉంది శీనుకి. వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు శీను. "ఎన్నేళ్లయింది శీను నిన్ను చూసి. ఎలా ఉన్నావు" "అవును చాలా ఏళ్ళయింది మనం కలుసుకుని. అప్పట్లో ఎంత తిరిగామో కదా" "అవును శీను, కలిసి చాలా చేసాం" "నా పుట్టినరోజు నాడు మనం వాగుకి వెళ్ళడం, లోతుందని తెలీక నేను దిగడం, నువ్వు పైకి లేపడం. తరువాత మా ఇంటికి వెళ్ళడం, విషయం తెలిసి మా అమ్మ నన్ను తిట్టడం, నిన్ను మెచ్చుకుని పాయసం చేసిపెట్టడం. గుర్తున్నాయా ఇవ్వన్ని" "పాయసం చెయ్యడం గుర్తుంది, మీ నాన్న నిన్ను కొట్టాడు కూడా కదా అప్పుడు" నవ్వుతూ తలూపాడు మధు. "మన సీనియర్ మమత గుర్తుందా, నాకింకా గుర్తే. ఆ అమ్మాయిని చూడటం కోసం వాళ్ళింటి దగ్గర చెట్టు ఎక్కాం గుర్తుందా" "అవును ఆ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చాం. మనముందే చించేసింది. నాకు కోపం వచ్చి ఏదో అని పారిపోయాను అప్పుడు" "అన్నీ గుర్తున్నాయి అయితే నీకు. నన్ను మాత్రం గుర్తుపట్తలేదు నిన్న" నవ్వాడు శీను. "సరే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, పెళ్ళి, పిల్లలు, వివరాలు చెప్పు" "నీ లాగా తెలివిగలవాడిని కాదు కదా, అందుకే చదువు పెద్దగా అబ్బలేదు, ఇంటర్ వరకే చదివాను. ఆ పని, ఈ పని చేస్తూ, కొన్నేళ్ల క్రితమే ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకున్నాను. పెళ్ళి చేసుకోవాలి" "ఏదైనా సరే, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది"... మందు గ్లాస్ శీనుకి ఇస్తూ అన్నాడు మధు. "నీ సంగతేంటి. అమెరికా ఎప్పుడు వెళ్ళావు, అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటావా, ఉండంటం అక్కడేనా"... గ్లాస్ తీసుకుంటూ అడిగాడు శీను. "అక్కడే ఉండేది. ఏదో ఒక కంపెనీలో ఏదో పని. దానిదేముందిలే కానీ ఇదిగో ఈ చికెన్ ముక్క తిను బాగుంది" "ఈ మందు కూడా బాగుంది, ఏంటిది, ఎప్పుడూ తాగినట్టు లేదు" "ఇది స్కాచ్. బాగుంటుంది" "డబ్బున్నవాళ్ళు తాగేది ఇదేనా" "ఇప్పుడు డబ్బుల గురించి ఎందుకు. పాత ఫ్రెండ్స్ ఇన్నేళ్ళకి కలిసాం. ఎంజాయ్" "నీకు భార్యా, పిల్లలు" "ఉన్నారు. అమెరికాలో మన తెలుగమ్మాయే పరిచయం అయింది, పెళ్ళి చేసుకున్నాను. పిల్లలు అమెరికాలోనే పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి." "చాలా గొప్ప జీవితం అయితే నీది" "గొప్ప గిప్ప, ఏదైతే ఏంటి. నీ జీవితం నీకు బాగుంటే, నాది నాకు బాగుంటే చాలు కదా. అందరం హ్యాపి" "నా జీవితం ప్రస్తుతం బాలేదు, నిన్న నిన్ను కలిసినప్పుడు నేను అక్కడ ఉన్నది కూడా లాయర్ పని మీద వచ్చి. ఉన్న మాట చెప్పాలంటే ఇప్పుడు నిన్ను కలుద్దాం అనుకోవడం నా సమస్య చెప్పుకోవడం కోసం కూడా" "నువ్వు కూడా మిగతావాళ్ళ లానే ఉన్నావు అయితే. నన్ను నీ ఫ్రెండ్ లాగా కాకుండా డబ్బులున్నాయి, ఏదో ఒకటి చెప్తే, కొన్ని డబ్బులు రాల్తాయి అనుకుంటున్నావా ఏంటి. నాకు ఇండియా వచ్చాక ఇలాంటివాళ్ళే తగులుతున్నారు" "అలా ఏం లేదు, నేను అలా అనుకోవట్లేదు" "లేకపోతే, వచ్చీ పావుగంట కాలేదు, అప్పుడే సమస్య అన్నావు. అదీ ఇదీ అని ఏదో చెప్తావు. చివరికి కావల్సింది డబ్బులు. అంతేగా" "నేను అబద్దాలు చెప్పే రకం కాదు. నాకు డబ్బులు కావాలి, కానీ జల్సాలకి కాదు, తెలీక ఒకచోట ఇరుక్కుపోయాం. సమస్యలో, ఊహించని పరిస్థితిలో ఉన్నా కాబట్టే, వారం ముందు కూడా ఇలా లేను కాబట్టే, నీకు చెప్పుకుని, నీ సాయం అడుగుదాం అనుకున్నాను. నువ్వు నమ్మకపోతే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను" గ్లాస్ కింద పెట్టి నుంచుని అన్నాడు శీను. శీను వైపే చూస్తున్నాడు మధు.
07-06-2023, 06:58 AM
Good update
07-06-2023, 12:44 PM
ఈసారేంటో కొద్దిగా తొందర్లో రాసినట్లున్నారు. చిన్ననాటి స్నేహితులు మాట్లాడుకున్నట్లు లేదు అంటే స్క్రీన్ ప్లే సంభాషణలు చాలా పొడి పొడిగా ఉన్నాయి, స్నేహం, ఆప్యాయత కనపడలే, బహుశా శ్రీను తన పరేషాన్లో తనుండి మధుతో సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయాడేమో...కొనసాగించండి
: :ఉదయ్
07-06-2023, 01:09 PM
Superb update bro
07-06-2023, 07:50 PM
Nice update
07-06-2023, 08:04 PM
Good update
07-06-2023, 10:34 PM
(07-06-2023, 12:44 PM)Uday Wrote: ఈసారేంటో కొద్దిగా తొందర్లో రాసినట్లున్నారు. చిన్ననాటి స్నేహితులు మాట్లాడుకున్నట్లు లేదు అంటే స్క్రీన్ ప్లే సంభాషణలు చాలా పొడి పొడిగా ఉన్నాయి, స్నేహం, ఆప్యాయత కనపడలే, బహుశా శ్రీను తన పరేషాన్లో తనుండి మధుతో సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయాడేమో...కొనసాగించండి ఇంకా అసలు కథ మొదలవ్వలేదు. ఇంకా ప్రధాన పాత్రలు ఒకరినొకరు చూసుకోలేదు. వాళ్ళ మాటలే అసలు కథ. అందుకే సరిపడినంత, కథని ముందుకు తీసుకెళ్ళేంత మాత్రమే పెట్టా ఈ భాగంలో. ఇంకో ఒకటో, రెండో భాగాల తర్వాత అసలు విషయం ఉండేది. పునాదికే ఏళ్ళు పట్టి, కట్టడం ఇరవై ఏళ్ళు కట్టడానికి ఇదేమీ తాజ్ మహల్ కాదు కదా.
08-06-2023, 12:19 AM
బాగుంది
Continue చెయ్యండి
08-06-2023, 05:55 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
08-06-2023, 12:26 PM
(07-06-2023, 10:34 PM)earthman Wrote: ఇంకా అసలు కథ మొదలవ్వలేదు. ఇంకా ప్రధాన పాత్రలు ఒకరినొకరు చూసుకోలేదు. వాళ్ళ మాటలే అసలు కథ. అందుకే సరిపడినంత, కథని ముందుకు తీసుకెళ్ళేంత మాత్రమే పెట్టా ఈ భాగంలో. ఇంకో ఒకటో, రెండో భాగాల తర్వాత అసలు విషయం ఉండేది. అర్థమైంది, అదీ కరక్టే...కొనసాగించండి
: :ఉదయ్
09-06-2023, 07:19 AM
nice update
09-06-2023, 10:00 PM
శీను అలానే నుంచుని ఉన్నాడు.
శీనునే చూస్తున్నాడు మధు. "నన్ను నమ్మకపోతే నేను వెళ్ళిపోతాను, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నన్ను ఎవరు కాపాడితే వాళ్ళు కాపాడతారు. నిన్నటిదాకా నువ్వు నాకు గుర్తు కూడా లేవు, నిన్న నువ్వు కనిపిస్తావని, ఈ రోజు కలుద్దాం అని అంటావని, నేను వెంటనే ఒక అబద్దం రెడీ చేసుకుని వచ్చాను అనుకుంటున్నావా. నాకు అంత బుర్రే ఉంటే ఇలా ఎందుకు ఉంటాను. నిన్ను కలుస్తున్నవాళ్ళు అలాంటివాళేనేమో నేను మాత్రం కాదు. నువ్వు వద్దు, నీ స్కాచ్ వద్దు"... అంటూ గ్లాస్ కిందపెట్టేసి వెళ్ళిపోసాగాడు శీను. ఇదంతా చెప్తున్నప్పుడు శీను మొహంలో కోపం, బాధ కనిపించాయి మధుకి. తన వృత్తిలో ఇలాంటివి చాలా చూసుండటంతో, శీను నిజమే చెప్తున్నాడని అర్థం అయింది మధుకి. "శీనూ ఆగు. ఇలా రా"... పిలిచాడు మధు. వెనక్కి తిరిగాడు శీను. "నీ మాటలు నమ్ముతున్నా. కూర్చో. విషయం ఏంటో చెప్పు. నేను సాయం చేస్తానని మాత్రం మాటివ్వను. నువ్వు విషయం చెప్పు, నేను ఏం చెయ్యగలనో చూస్తాను" కూర్చున్నాడు కానీ మధు తనని పూర్తిగా నమ్ముతున్నాడో లేదో అనిపించింది శీనుకి. "నమ్ముతున్నాను అన్నాను అంటే నమ్ముతున్నాను అనే. ఇది తాగుతూ విషయం చెప్పు, వెయిటింగ్ నేను"... గ్లాస్ చేతికిస్తూ నవ్వుతూ అన్నాడు మధు. మామూలయ్యాడు శీను. విషయం మొత్తం చెప్పాడు. జాగ్రత్తగా విన్నాడు మధు. అమెరికాలో ఇలాంటివి ఎన్నో పెద్దవే తెలిసిన మధుకి విషయం మొత్తం చెప్పగానే అర్థమయింది. కొంత సాయం చేద్దామనుకున్నాడు. ఇంకా వివరాలు తెలుసుకుందామని... "అయితే వీళ్ళు నీకు చుట్టాలు" ఇంకో బాటిల్ ఓపెన్ చేసి గ్లాసుల్లో పోస్తూ అడిగాడు. "ఔను ఆ అమ్మాయి మా బాబాయి వరస అయ్యే ఆయన కూతురు" "ఔనా, మన కాలేజ్‌లో నీకు చెల్లెలు లేదు కదా" "వాళ్ళు అపుడు వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు. నువ్వు వెళ్ళాక మన ఊరు వచ్చారు, అందుకే నీకు తెలీదు. మన కాలేజ్‌లోనే చదువుకుంది. తెలివిగల అమ్మాయి, బియస్సి చేసింది, ఎమ్మెస్సి కూడా చేద్దాం అనుకుంది కాని ఇంకా చదివిస్తే పెద్ద సంబంధం తేవాలని, కట్నం ఇవ్వలేమని, తెలిసిన సంబంధం అని మురళికి ఇచ్చి చేసారు" "మీ చెల్లెలి పేరు" "సుజాత" "మరి తెలివిగలది అయితే భర్త ఇలా ఇరుక్కోకుండా ముందే అన్నీ చూడాలి కదా" "మేము ఎలాంటి పేపర్లు ఇంటికి తీసుకెళ్ళలేదు. మేము చెప్పిందే తనకి తెలుసు. మేమే మొత్తం తెలుసుకోలేదు. అలానే..." "ఆ అలానే" "మురళి కాస్త భయస్తుడు, చాలావాటికి భయపడుతూ ఉంటాడు. కాసేఫు చేద్దాం అని ఊగుతాడు, మళ్ళీ కాసేపాగి వామ్మో అని వదిలేస్తాడు. పిరికివాడు అని చెప్పుకోవచ్చు. అందుకే మొదటిసారి మురళి యూనిట్ కొనాలి అని అంత ఇదిగా అంటుంటే కాదనలేకపోయింది. మురళి ఆనందం కన్నా మా సుజాతకి ఇంకేదీ ఎక్కువ కాదు." "నువ్వేమీ ఎక్కువ చెప్పట్లేదు కదా" "లేదు మధు, నిజమే చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే..." "ఇంకేంటి" "ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బులు, అప్పుల గురించి కూడా కాదు నా భయం. మురళి గురించి" "ఎందుకు భయం" "అది అది" "చెప్పు, నాకు విషయం మొత్తం తెలిస్తే బాగుంటుంది" "నిన్న లాయర్ డబ్బులు రాకపోవచ్చు అన్నాడని బయటకి వచ్చాక ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు మురళి"... అని గ్లాసు మొత్తం గటగట తాగేసాడు శీను. "ఔనా" ఆశ్చర్యపోతూ అన్నాడు మధు. "ఔను మధు, అందుకే ఈ సమస్య నించి బయటపడకపోతే మాకు మురళి దక్కడేమో అని భయంగా ఉంది" "ఏదీ మురళి ఫొటో చూపించు, నాకు చూడాలనుంది" "ఫొటోస్ చాలా ఉన్నాయి మధు. నాలుగు రోజుల క్రితం యూనిట్ అడ్వాన్స్ ఇచ్చాక పండగొచ్చింది, అప్పుడు వాళ్ళింట్లోనే జరుపుకున్నాం. చూడు"... అంటూ ఫోన్ మధుకి ఇచ్చాడు శీను. మురళి ఫొటో చూసాడు మధు. ఫోన్ తిరిగి శీనుకి ఇచ్చేయబోయాడు. "ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి, చూడు. నేను బాత్రూంకెళ్ళొస్తా"... అంటూ కాస్త తూలుతూ బయటకి అడుగులు వేసాడు శీను. విషయం అర్ధమైంది మధుకి. ఈ మురళి చూడటానికి కూడా పిరికివాడిలానే ఉన్నాడు. కొంత సాయం చేద్దాం అనుకుంటూ తరువాతి ఫోటో చూసాడు. అంతే తాగింది మొత్తం దిగినట్టుగా అనిపించింది మధుకి.
09-06-2023, 10:41 PM
Story chala bagundhi earth man garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
09-06-2023, 10:42 PM
Nice super update
|
« Next Oldest | Next Newest »
|